రైటానరబుల్ ‘’శ్రీని వాస శాస్త్రి -32
అట్టహాసంగా జరిగిన వీడ్కోలు సభల తర్వాత శాస్త్రి బొంబాయి కి 1927జూన్ ఎనిమిది చేరి ,దేలగోవా బే 27చేరాడు. మూడు వారాల ప్రయాణంలో తన మిషన్ విషయమై కూలంకషంగా మూలాలకు వెళ్లి ఆలోచించాడు .ఇండియా కు తిరిగి వచ్చాక ఎంపిక చేయబడిన కొందరి సమక్షంలో శాస్త్రి –‘’సముద్ర ప్రయాణం ఎంతో లోతుగా ఆలోచించటానికి బాగా తోడ్పడటం ఆశ్చర్యంగా ఉంది.’’అని చెప్పాడు .చర్చల సరళి ఎలా ఉండాలన్న దానిపై చాలా మననం చేశాడు .ప్రేమనిచ్చి ప్రేమ పొందాలనుకొన్నాడు .తన వ్యక్తిత్వం తన మిషన్ కు అడ్డు రాకూడదు అనుకొన్నాడు .భారత రాయబారిగా తన తీరు తెన్నులు ఉంటూ అందరి సహకారం పొందాలి .ఓపిక ప్రశాంతత తోనే కార్యసాధన కావాలి –‘’do not return an angry word for an angry word ,try to see the better side of things and while ‘’అన్నట్లు కార్యసాధకుడుగా తానూ ఉండాలని భావించాడు .భ ర్త్రుహరి చెప్పినట్లు అవతలివారి తప్పులను మర్చిపోయి ,దాన్నిగురించి ఎప్పుడూ మాట్లాడకుండా ,తనగురించి వ్యతిరేకంగా చెప్పినా సరే సంయమనం తో వర్తించాలి అనుకొన్నాడు .ఇవన్నీ శాస్త్రిలో ఉన్న సహజ లక్షణాలే .వీటిని మరింతగా ప్రస్ఫుటంగా ప్రదర్శించి భారతీయ పురాతన నాగరకత ను ప్రదర్శించి కార్య సాధకుడవాలి అని నిశ్చయించుకొన్నాడు .
దక్షిణాఫ్రికాలో జాతుల మధ్య పక్షపాతం పాతుకు పోయింది .కేప్ ప్రావిన్స్ ను సేసిల్ రోడ్స్ పాలసి ప్రకారం పాలిమ్పబడుతోంది .భారతీయులకు పెద్దగా ఇబ్బందులు లేవు.ట్రాన్స్ వాల్ లో తెల్లజాతి గర్వం రాజ్యమేలుతోంది ,నల్లజాతి పై తీవ్రమైన చులకన భావం ఉండటంతో ఇండియన్లు విపరీతంగా బాధలు అనుభవిస్తున్నారు .ఇక్కడ నల్లజాతి వారు ఫుట్ పాత్ లపై నడిచే హక్కు లేదు ,ట్రాములలో ఎక్కరాదు.పోస్టాఫీస్ లలో తెల్లవారికి నల్లవారికి వేర్వేరు కౌంటర్లు ఉంటాయి .గోల్డ్ లా,టౌన్ షిప్ లా అనుసరించి ఇండియన్లకు భూమి హక్కులేదు .గోల్డ్ ఏరియాలో నివసించే హక్కు కూడా లేదు .నటాల్ లో ఇంత దారుణంగా లేదు పరిస్థితి .చిన్నదే అయినా ఆ రాష్ట్రంలో ఇండియన్ జనాభా బాగా ఎక్కువే .1870లోనే ఇక్కడికి ఇండియన్లు లేబర్ గా పని చేయటానికి ఇండియానుంచి మొట్టమొదటగా వచ్చారు .వారు వచ్చేనాటికి నటాల్ అంతా అడవి .కీకారణ్యం ,చిత్తడి నేల మలేరియా ప్రాంతం..ఇక్కడికే బానిసలుగా వచ్చి దీన్ని బృందావనం చేశారు ఇండియన్స్ .ఇక్కడిఇండియన్లు భూములు కొనుక్కున్నారు యజమానులయ్యారు .కొందరు చాల భూమిని కొని హక్కుదారులయ్యారు .కానీ ఇండియన్ లకు ఇక్కడి రైళ్ళలో ట్రాములలో ప్రయాణించే హక్కు లేదు .ఇది చట్టంలో లేకపోయినా ఆచరణలో అమలుగా ఉంది .పిల్లలకు విద్య సంస్థలలో అసమానత ఉంది .
ఇన్ని వైరుధ్యాలున్న సౌతాఫ్రికాలో ,కేప్ టౌన్ అగ్రిమెంట్ ఒక్కటే ఆశావహంగా కనిపించింది శ్రీనివాస శాస్త్రికి .కొత్త డిప్లమసితో చాకచక్యంతో సమస్యలకు ఆశావహమైన ఫలితాలు సాధించాలని నిర్ణయించుకొన్నాడు శాస్త్రి .ఆదిలోనే హంసపాదు అన్నట్లు శాస్త్రికి అక్కడ వెళ్ళగానే హోటల్స్ లో వసతి సౌకర్యం లభించలేదు ..కొద్దికాలం లోనే ఆయన ప్రతిభ వ్యక్తిత్వాలవల్ల ఈ ఇబ్బంది తీరిపోయింది .ప్రిటోరియాలో మొదట ప్రసంగిస్తూ శాస్త్రి –‘’అగ్రిమెంట్ ఒక మంచి రాజీ అని ‘’అది మన రాజకీయ అభివృద్ధికి ఆత్మ లాంటిది’’ అన్నాడు .భారతీయులను సత్యమార్గంలో నడవమని ,విశ్వాసంతో ప్రవర్తించమని కోరాడు .జోహాన్స్ బర్గ్ లో మేయర్ ఇచ్చిన విందు సమావేశంలో దక్షిణాఫ్రికాలోని యూరోపియన్లు తమ సోదర ఇండియన్ లపై ఆత్మ సాక్షిగా ,మనస్సాక్షిగా ప్రవర్తిన్చేట్లు మారాలని కోరాడు .ఈ భావం దక్షిణాఫ్రికా డొమినియన్ లో అంతటా వ్యాపించెట్లు చేయటంలో వాళ్ళకున్న ఇబ్బందులు తనకు తెలుసు అన్నాడు .నటాల్ విట్నెస్ పేపర్ లో –‘’we plead for forbearance and charity ,even where we do not command friendship and co operation ‘’అని రాశాడు .డర్బన్ లో విశేష జన సమూహం లో మాట్లాడుతూ తానూ నూటికి నూరుశాతం ఒప్పందానికి కట్టుబడి ఉండటానికే వచ్చాను అని హామీ ఇచ్చాడు .దీనితర్వాత చాలా చోట్ల ప్రసంగించమని ఆయనపై వత్తిడి తెచ్చారు అక్కడి వాళ్ళు .ఎందఱో స్నేహితుల్ని సంపాదించుకొన్నాడు .గవర్నర్ జనరల్ ఆఫ్ ఎత్లోన్,ప్రధాని హీర్త్ జాగ్ హాఫ్మేయర్ ,మలాన్ లు ఈ స్నేహితులలో ముఖ్యులు .జడ్జీలు బిషప్పులు ఎడిటర్లు రచయితలూ ,పౌరులు అందారూ ఆయనకు అత్యంత సన్నిహితులయ్యారు He became a beloved and honoured patriarch ‘’.
సింహ సద్రుశుడు శాస్త్రి ప్రతిరోజూ అనెకసమస్యల ను పరిష్కరించాడు .ఎక్కడ మాట్లాడినా ‘’Up lift clause of the Cape Town agreement ,’’ అనే మాటను హైలైట్ చేసేవాడు .ఆయన ప్రాధమిక దృష్టి అంతా విద్యమీదనే కేంద్రీకరించాడు .నటాల్ లో దారుణంగా ఉన్న విద్యా వ్యవస్థలో లోపాలను గుర్తించి సరి చేయటానికి యూనియన్ ప్రభుత్వం ఒక ఎంక్వైరీ కమిషన్ ను ఏర్పాటు చేసింది .దాన్ని తిరస్కరించింది నటాల్ అడ్మిణి స్ట్రేషన్ ..శాస్త్రి డా మలాన్ కలవటానికి వెళ్ళినప్పుడు ఆయన నిస్సహాయత ప్రకటించాడు .శాస్త్రిని ప్రసంగాలతో విషయాలను ప్రజా దృష్టికి తీసుకు వెళ్ళమని ,ఇండియన్ వ్యతిరేకుల మనసుమార్చే ప్రయత్నం చేయమని కోరాడు .శాస్త్రి వెంటనే గవర్నర్ జనరల్ ఎరల్ ఆఫ్ ఎత్లోన్ నుకలిసి మాట్లాడగా ఆయన చాలా సహాయకారిగా మాట్లాడాడు .ఒక విందు ఏర్పాటు చేసి నటాల్ అడ్మిని స్ట్రేటర్, జార్జ్ ప్లోమాన్ నుకూడా ఆహ్వానించాడు .విందు అయ్యాక ఈముగ్గురు ఇండియన్ సమస్యపై కూర్చుని మాట్లాడుకొన్నారు .ప్లోమాన్ సేవలను మెచ్చుకొంటూ గవర్నర్ జనరల్ ఎడ్యుకేషన్ కమిషన్ ఏర్పాటు చెప్పాడు .మిగిలిన పనిని శాస్త్రిని చెయ్యమన్నాడు .ఆశ్చర్యకరంగా అతడు కమిషన్ వేయటానికి సిద్ధపడ్డాడు .మధ్యలో కొన్ని అవాంతరాలు వచ్చినా 22-9-1927 న శాస్త్రి పుట్టిన రోజు కానుకగా ఎడ్యుకేషన్ కమిషన్ ప్రకటించబడింది .కానీ అందులో ఉన్న సభ్యులను ప్రకటించగానే నిరాశ పడ్డారు .విద్యా వేత్తలైన డాక్టర్ కిచ్లు ,మిస్ గార్దాన్ అందులో మెంబర్స్ గా నియమించినదుకు కొంచెం ఉపశమనం కలిగింది .వీళ్ళిద్దరూ తీవ్ర కృషి చేసి అన్ని విషయాలు సాకల్యంగా తెలుసుకొని ఇండియన్ లకోసం నటాల్ అడ్మినిస్ట్రేషన్ చేసింది శూన్యం అని తేల్చి చెప్పారు .పైగా ఇండియన్ ఎడ్యుకేషన్ కోసం కేటాయించిన సబ్సిడి డబ్బును యూరోపియన్ ఎడ్యుకేషన్ కు మరలించారని ఎత్తి చూపించారు .
సశేషం
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -13-7-23- ఉయ్యూరు

