రైటానరబుల్ ‘’శ్రీని వాస శాస్త్రి -34
21-2-1928 న శాస్త్రి కేప్ టౌన్ అగ్రిమెంట్ వార్షికోత్సవసభ కేప్ టౌన్ లోని నెల్సన్ హోటల్ లో జరిపాడు.జనరల్ స్మట్స్ ను ప్రత్యేకంగా ఆహ్వా నించాడు ,అతడు అగ్రిమెంట్ లో మార్పులు చేసినందుకు ,ఇండియాలో సైమన్ కమిషన్ ను బాయ్ కాట్ చేసినందుకు కోపంతో రాలేదు .కానీ అతని సౌతాఫ్రికన్ పార్టి వారోచ్చారు .పార్టీలకు అతీతంగా అగ్రిమెంట్ ఉన్నదని అందరూ సంతోషించారు .శాస్త్రి క్లుప్తంగా మాట్లాడి జనరల్ హీర్త్ జాగ్ ను డా మలాన్ ను అభినందించాడు –‘’ఈ మొత్తం కీర్తి ఇప్పుడున్న దక్షణాఫ్రికా ప్రభుత్వానికే దక్కుతుంది .నా దేశం నాప్రజలు ఇక్కడి ఇండియన్లు ఎంతో గొప్పగా ఈ అగ్రిమెంట్ ను స్వాగతిస్తున్నారు అభినందనలు తెలియ జేస్తున్నారు .మొదట్లో చాలా వ్యరికేతంతో ఉన్న వాటినీ చాలా హృదయ పూర్వకంగా విస్తృత ప్రయోజనాల దృష్ట్యా ఇక్కడి వారు మనస్పూర్తిగా అమలు పరచటానికి ముందుకు రావటం ముదావహం .వారందరికి మా కృతజ్ఞతలు ..’’అన్నాడు .తర్వాత ప్రైం మినిస్టర్ –‘’ఈ అగ్రిమెంట్ నాకూ నా ప్రజలకు గొప్ప గౌరవం తెచ్చి అందరికి మంచి సంతృప్తి కలిగించింది ‘’అన్నాడు డా మిలాన్ ‘’అనేక కోణాల దృష్ట్యా ఇది మహా ప్రయోజనకర అగ్రిమెంట్ .దీని సాధనలో శాస్త్రి పడిన మధనం ఫలించింది .ఆయన ప్రపంచ ప్రఖ్యాత గౌరవ నాయకుడే కాదు,ఆయన దానికి పూర్తిగా అర్హుడుకూడా ..ఈ అగ్రిమెంట్ సాధనలో మాత్రమేకాదు ఆయన వ్యక్తిగతంగానూ అంతటి గౌరవనీయవ్యక్తియే –‘’He is one of of the most out standing examples in the world of personal self sacrificing devotion to high personal and patriotic ideals .He is a most illustrious representative of Indian nation –is of utmost value to the two nations ..’’శాస్త్రి రాక దక్షిణాఫ్రికా ప్రజల కనువిప్పు కలిగించింది ,అసలైన భారతీయత అంటే ఏమిటో నిరూపించింది .స్మట్స్ దీన్ని పార్టీ సమస్యగా భావించి ఉండకుండా ఉంటే బాగుండేది ‘’అన్నాడు పాట్రిక్ డంకన్ .శాస్త్రి అద్భుత వక్త మహా విజ్ఞాన వేత్త ,దక్షిణాఫ్రికా ప్రజలకు ఆరాధ్య నాయకుడు .అన్నాడుకూడా .
దక్షిణాఫ్రికా పర్యటన ఏడాది గడువు పూర్తీ అవుతూ ఉండటంతో ,ఇక్కడి ఇండియన్ కమ్యూనిటి మహాత్మాగాంధీకి శాస్త్రిని మరికొంతకాలం ఇక్కడే ఉండేట్లు చేయమని అర్జెంట్ ఉత్తరాలు చాలా రాశారు .26-2-1928 న గాంధీ శాస్త్రి కి ఒక జాబు రాస్తూ –‘’అక్కడి నీ గడువు దగ్గరపడుతోందని అక్కడి మనవాళ్ళు వణికి పోతున్నట్లు నాకు తెలిసింది ,నాకూ అంతగానే వణుకు వస్తోంది కాళ్ళకు చెప్పులు లేకపోవటం వలన .అత్యవసరమైన నీ ఆరోగ్యం దృష్ట్యా ,ఇప్పుడు అక్కడినుంచి రావాల్సిన అవసరం అర్ధం చేసుకొన్నాను వారికి బాధ ,కష్టమూ అయినా నీ ఆరోగ్తం దృష్టిలో అవసరాం కూడా .’’No one else can successfully replace you at the present moment ‘’నువ్వు సాధించిన విషయం అమోఘం ఎవరూ పొందలేనిది .కానీ అంతగా వారి హృదయాలను గెలుచుకొన్న నీకు ప్రస్తుతం అక్కడినుంచి నువ్వురావటం నీకూ అక్కడి వారికీ శ్రేయస్కరం కాదు ‘’అని పొంగిపోయి రాశాడు బోసినవ్వులాయన .గాంధీ కోరిక తీర్చి మరొక ఆరునెలలు అక్కడే ఉన్నాడు శాస్త్రి ఇంతకు పూర్వం కంటే మరింత ఉత్సాహంతో శక్తితో దేశమంతా తిరిగి భారీ సభలు నిర్వహించి ప్రజా హృదయాలను మరింతగా తన వాగ్దారతో ఆకట్టుకొన్నాడు .South Africa bowed to the magic wand of Sastri ‘’అంటే మంత్ర ముగ్ధుల్ని చేశాడు .అంతా సవ్యంగా జరిగినట్లు చెప్పలేముకాని కొన్ని సభలలో ఆసియా వాసులకు వ్యతిరేకులైనవారు సభను భగ్నం చేసే ప్రయత్నాలు చేశారు .కానీ తొణకని బెదరని వ్యక్తిత్వంతో వారి ఆటలు సాగకుండా చేశాడు శాస్త్రి .ఆయన సహిష్ణుత గొప్ప ఫలితమిచ్చింది .ఒక సభలో అంతరాయం చేసిన ఒకడు సభ పూర్తీ అవగానే కన్నీళ్ళతో ఏడుస్తూ శాస్త్రిని క్షమించమని వేడుకొన్నాడు మేయర్ అధ్యక్షత న క్లేర్క్స్ డ్రాప్ సభలో యాంటి ఇండియన్ డిప్యూటి మేయర్ ,అతని స్నేహితులు లైట్లు ఆర్పేసి దుర్వాసన వెదజల్లే బాంబు –స్టి౦క్ బాంబు పేల్చారు .కంగారు పడవద్దనీ హాలులోనుంచి బయటికి రమ్మని కోరి శాస్త్రి ఆరుబయట మీటింగ్ జరిపి నవ్వుతూ-‘’I was going to speak when we changed our venue (నవ్వు )upon another phase of the agreement ‘’అంటూ నవ్వుల పువ్వులు పూయించి దుర్వాసననను పరిమళ భరితం చేశాడు .డిగ్నిఫైడ్ గా ,కలవరం చెందకుండా ఉండటం విశ్వవ్యాప్త ప్రశంసల జల్లు కురిసింది .జరిగిన దానికి మేయర్ క్షమాపణ చెప్పి పట్టణంలోని కొందరు ప్రముఖులే ఈ అలజడికి కారణమన్నాడు .ప్రభుత్వం వెంటనే తీవ్రంగా స్పందించి వాళ్ళను గుర్తిన్చిశాస్త్రికి ,భారత ప్రభుత్వానికి క్షమాపణ చెప్పించింది .శాస్త్రి భారత ప్రభుత్వానికి ఒక కేబుల్ పంపుతూ జరిగిన సంఘటనను మర్చిపోయి వాళ్ళను క్షమించమని కోరాడు .
దక్షిణాఫ్రికా రైటానరబుల్ శ్రీనివాస శాస్త్రిని ఒక మహర్షిగా నాయకుడిగా ఒక గురువుగా గౌరవించింది .ప్రొఫెసర్ బెల్ శాస్త్రి ఆధ్యాత్మిక విద్యా ప్రసంగాలు విని తన్మయుడై అభిమానియై ఫిలాసఫీ ,మతం ,కళ అన్నీ ఆయనకు వాచో విధేయాలు లు –అన్నిటిని రంగరించి గొప్పగా మాట్లాడే నేర్పున్నవాడు .ఒకప్పుడుఇవన్నీ ప్రాచీన గ్రీసు దేశం లో ఉండేవి దురదృష్టవశాత్తు ఇప్పుడు అవి పశ్చిమ యూరప్ లో కనిపించటమే లేదు’’అన్నాడు . బిల్ ప్రశంసను మహాత్మాగాంధీ ‘’యంగ్ ఇండియా ‘’పత్రికలో యధాతధంగా ప్రచురించి –These lectures are perhaps his greatest and most permanent contribution to the Indian cause in South Africa ‘’అని శ్లాఘించాడు .వీడ్కోలు పార్టీలలో పత్రికలన్నీ శాస్త్రి బహుముఖీన ప్రతిభను చాలా విశేషంగా ప్రచురించాయి .నటాల్ విట్నెస్ పత్రిక –‘’It is not too much to say that Sastri is one of the worlds ‘few statesmen ‘’అన్నది .కేప్ టౌన్ పత్రిక –Sasrti is among the greatest English speakers in the English tongue ,a natural orator with a most effective delivery .Slowly, with a sure choice of words ,his speeches drop upon the ear ,each sentence verbally perfect ‘’ అని అంటే, ది రాండ్ దిలి మెయిల్ ‘’Sastri amongst us has been a great intellectual and moral stimulus to this country and for that as well as for his great personal charm and distinguished statesmanship .He is a veritable store -hous of learning ‘’అని కీర్తించింది .
సశేషం
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -15-7-23-ఉయ్యూరు

