రైటానరబుల్ ‘’శ్రీని వాస శాస్త్రి -35

రైటానరబుల్ ‘’శ్రీని వాస శాస్త్రి -35

 ప్రముఖ పత్రికలు  రాసినట్లే నటాల్ అడ్వైజర్ పత్రిక –ఇది మిస్టర్ శాస్త్రి గారి రాజ్యపాలన అనిపించింది –రీన్ ఆఫ్ శాస్త్రి .ప్రభుత్వాలు ముఖ్యంగా బ్రిటీష ప్రభుత్వాలు విషయాలను ప్రభావితం చేయలేకపోయాయి .కానీ శాస్త్రి స్వరం ఈ ప్రాంతపు మొదటి ఏజెంట్ గా జీనియస్ గా ఎక్కడ కొట్టాలో అక్కడ కొట్టి మొనగాడనిపించాడు .ఆయన ప్రతిభను పొగడటానికి మాటలు లేవు .ఆయన ఇక్కడ ఉన్నకాలం లో ‘’the great man of South Africa ,the ablest orator ,the shrewdest diplomat ,the most accomplished interpreter  of civilization of India that we have ever had in our midst ‘’ అని రాస్తే ,ది ప్రిటోరియా న్యూస్ –it is a curious  thing that the two best English speakers are not English men ,one is a Dutch man Hofmayr ,and the other is an INDIAN –Right Hounarable Srnivsa  Sastri .Hofmeyr has the easier style –he is fast and free.while Mr .Sastri is slow and deliberate but Shastri has the ASQUITHIAN gift of compression which goes along with the choice of the inevitable world .’’ అని ఆకాశానికి ఎత్తేసింది .

  అదనంగా ఉన్న ఆరునెలల తర్వాత శాస్స్త్రి ఇండియాకు తిరిగి వెళ్ళే ఆలోచనలో ఉంటే మహమ్మద్ హబీబుల్లా  ,ఆయనకు అత్యంత ఉచితమనైన సత్కారం చేయాలనుకొని K.C.S.I అందించాలని భావించి చూచాయగా శాస్త్రి చెవిన వేయగా శాస్త్రి మర్యాదగా తిరస్కరించాడు .30-9-1928 న శాస్స్త్రి ఆయనకు ఒక ఉత్తరం రాస్తూ –నేనిక్కడ చేసిన సేవకు మీరూ వైస్ రాయ్ చూపిన ఆడరమే నాకు గొప్ప మన్నన .మీరు నాకు అందజేయలనుకోన్నది నా అతిసాధారణ జీవితానికి చాలా పెద్దది అతి విలువైనది .నా సేవలతో నేను అజ్ఞాతంగానే ఉండాలనుకొంటాను ,కనుక నన్ను అపార్ధం చేసుకోరని పూర్తిగా నమ్ముతున్నాను ‘’అని చెప్పాడు .అక్కడున్న చివరి నెలలలో శాస్త్రి తానూ చేసిన పనులణను ఏకీకృతం-కన్సాలిదేట్ చేశాడు .అది ఇండియన్ లమధ్య అత్యంత ప్రశాంతమైన కాలం ,వారికీ ,యూరోపియన్లకు మధ్య  స్నేహ సంబంధాలు చిగురిస్తున్న తరుణం .అంతటి సుహృద్భావ ప్రశాంత వాతావరణంలో శాస్త్రి 1929 జనవరిలో ఇండియాకు తాను  ఒక రాయబారిగా  సాధించిన విజయ గౌరవాలను తలచుకొంటూ ఇండియా కు తిరిగి వచ్చాడు .

  శాస్త్రి అంబాసడర్షిప్ ను గుర్తుకు తెచ్చుకొంటూ హాఫ్ మేయర్ –ఆయన ఒక కొత్త విధానం ప్రవేశపెట్టి దక్షిణాఫ్రికా ప్రజలందరి మనసులను ఆక్రమించాడు .ఆయన భారత దేశాన్ని ఆవిష్కరించి చూపిన దార్శనికుడైన మహా వక్త .మాకు ఇండియా గురించి అక్కడి ఉత్క్రుష్టసంస్కృతి గురింఛి  ఆయన చెప్పేదాకా మాకేమీ తెలియదని మేము చెప్పటానికి సిగ్గు పడుతున్నాం.

 సశేషం

మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -16-7-23 –ఉయ్యూరు

Unknown's avatar

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in పుస్తకాలు, సమీక్ష and tagged . Bookmark the permalink.

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.