మళ్ళీ కెన్యా పోయింది
రైటానరబుల్ ‘’శ్రీని వాస శాస్త్రి -36
మళ్ళీ కెన్యా పోయింది
ఇండియాకు తిరుగి రావటానికి కొన్ని నెలల ముందు శ్రీనివాస శాస్త్రి మహాత్మా గాంధీకి ఒక ఉత్తరం రాస్తూ –‘’నాకు తిరిగి రావాలనే ఆదుర్దా ఎక్కువైంది .కానీ డోలా౦దోళనలో ఉన్నాను .అక్కడ ఇండియాకు నావసరం లెదు ఇక్కడ అవసరం ఎక్కువ .నా బాధలు కష్టాలతో మిమ్మల్ని ఇబ్బంది పెట్టలేను .మైనారిటీల మధ్య చాలాకాలం ఉండి పోవటంతో ,నన్ను అపార్ధం చేసుకొని దూషిస్తారేమో ? ఇక్కడి పేరుప్రఖ్యాతులు,ప్రజాదరణ వదిలేస్తేనేను నీటిలోంచి బయట పడ్డ చేపలాగా నా పరిస్థితి ఉంటుందేమో అనే భయమెక్కువగా ఉంది.మూలం లోనే ఏదో తేడా కొడుతోన్దనిపిస్తోంది .నా వివేకం జాగరూకత నన్ను హెచ్చరిస్తున్నాయి .’’I am impelled to seek betimes the safety of my natural environment(hot water )and be take my self to my usual occupation(ploughing the sands of the sea’’.అని బాధపడ్డాడు .శాస్త్రి ఊహించిన దానికంటే ఎక్కువగా కీడు జరిగింది .సౌతాఫ్రికాలో విజయం సాధిస్తే కెన్యా విషయం లోవెంటనే అపజయం పాలయ్యాడు.
ఇండియాకు తిరిగి రాగానే శాస్త్రి అన్నామలై యూని వర్సిటి వైస్ చాన్సలర్ గా చేరాడు .దీన్ని శాస్త్రి ముఖ్య స్నేహితుడు ఆరాధకుడు రాజా అన్నామలై చెట్టియార్ స్థాపించాడు .కానీ చేరిన కొద్దికాలానికే ఇండియా ప్రభుత్వ ప్రతినిధిగా కెన్యా వెళ్ళాల్సి వచ్చింది .అక్కడి కెన్యా ఉగాండా తా౦జనీక లమధ్య సామరస్యం సాధించటానికి హిల్టర్ –యంగ్ కమిషన్ టో చర్చలు జరపటానికి పంపబడ్డాడు .ఆకమిషన్ కామన్ రోల్ అండ్ సివిలైజేషన్ వోటు ను యూరోపియన్ జాతి ఒప్పుకొంటేనే అనే కండిషన్ మీద ప్రతిపాదించ బోతోంది .తనకు పూర్తీ స్వేచ్చ కావాలని శాస్త్రి కామన్ రోల్ విషయం లో పట్టు బట్టాడు .కానీ శామ్యుల్ విల్సన్ కు కాలనీల సెక్రెటరి ఆఫ్ స్టేట్ కల్నల్ ఆమ్రే దానిపై చర్చి౦చవద్దని రహస్యంగా చెవిలో చెప్పాడు .ఈవిషయంపై గాంధీకి ఒక సుదీర్ఘ ఉత్తరం 27-7-1929నరాస్తూ అక్కడి ఇబ్బందులు పూర్తిగా వివరించాడు –సారాంశం-‘’కిందటి మే లో నేనిక్కడి నుంచి వచ్చేముందు కామన్ రోల్ విషయమై నాకు పూర్తీ స్వేచ్చ ఇచ్చారు .ఆమ్రే ముందే చెప్పిఉంటే విల్సన్ దానికి వ్యతిరేకంగా చేసి ఉ౦డే వాడుకాడు .విల్సన్ దీన్ని రహస్యంగా తన యూరోపియన్ జాతికి ఇండియన్ జాతులకంటే ముందే లీక్ చేసి బయట పెట్టాడు .ఇది తెల్లవారికి ఆమోదం సంతోషం కలిగించావచ్చుకానీ మన వాళ్ళ ఆశలపై నీళ్ళు చల్లినట్లే .ఈ విషయం ఇండియా ప్రభుత్వానికి తెలిస్తే ఆమ్రే తమల్ని ఎంత మోసం చేశాడో తెలుస్తుంది ‘’.
ఇండియా ప్రభుత్వం దీనిపై ప్రొటెస్ట్ చేసినా , శాస్త్రి పని అంత ‘’వీజీకాదు ‘’.యూరోపియన్లు వాళ్ళ వోటుహక్కు విషయంలో మతపరమైనదిగా ఉండటం లో పట్టనట్లే ఉన్నారు .ఇండియన్లు ఇది తర్వాత సంప్రదింపులకు నాంది అనుకొని వారూ అలానే ఉన్నారు .ఈ సమస్య శాస్త్రికి చాలా కష్టసాధ్యం ,అసాధ్యం గా ఉన్నది .ఇక్కడి ఇండియన్లు శాస్త్రి విషయంలో నమ్మకంగా విదేయులుగానే ఉన్నారు .ఈ విషయం గాంధీకి తెలియజేస్తూ శాస్త్రి –‘’కష్టమైన పనిని అసాధ్యం చేయటంలో ఇండియన్ కమ్యూనిటి నన్ను మొదట్నించీ అనుమానిస్తోంది .చాలా సార్లు వాళ్ళ అపోహలు పోగొట్టి విశ్వాసం కలిగించాను .కానీ ఫలితం ఎండమావి గానే ఉంది .తనపై అపనమ్మకానికి కారణాలు తానూ రాజకీయాలలో తటస్తుడను ,సర్వెంట్ ఆఫ్ ఇండియా వాడినీ ,భారత ప్రభుత్వ దూత అవటం .ఇవన్నీ నేను వారితో ఇచ్చిపుచ్చుకొనే ధోరణిలో మాట్లాడినప్పుడు,శాసన సభలలో ,స్థానిక సంస్థలలో ప్రవేశం అప్పుడు బయట పడ్డాయి .ఏముంది ఇవ్వటానికి అని అడిగారు నన్ను .ఇవ్వాల్సింది అంతా మొత్తం ఊడ్చేసి ఇచ్చేశాం గా .కనుక ఇక రాజీకానీ ,రాయితీకానీ లేనేలేదు .కామన్ వోటుహక్కుతోనే వారు ఎన్నికలో నిలబడి గెలిచారు .అప్పటిదాకా వారి పాలిసీ N.C.O అంతే నాన్ కో ఆపరేషన్ .కదా .నా ప్రసంగాలలో డిఫెన్స్ నే చూశారు .కానీ చిన్న చిన్న వాటికోసం మీకు ఇబ్బంది కలిగించను ..నైరోబిలో,మోమ్బాసాలో నేను నేను డిఫెన్స్ లో పడ్డాను .అది చాలా అవమానకరం .కానీ నా ఓర్పు ,స్వభావం వలన నేను నేరస్తునికాను అని బయట పడ్డాను .’’It was a negative benefit though I have never the confidence or the backing of our country men .’’దీనికి లోలోపల నేను చాలా కుమిలిపోయాను .ఇదంతా నేను మనస్పూర్తిగా తెలియజేస్తున్నాను .not much have been observed in my behavior .’’అంటూ బాధా తప్త హృదయంతో మహాత్మునికి తన ఆత్మఘోష నివేదించాడు శాస్త్రి .
తెల్లవారి గర్వంగా భాసించే లార్డ్ డేలామేరే మొదలైన యూరోపియన్ నాయకులతో శాస్త్రి మాట్లాడాడు .వాళ్ళు చాలా మర్యాదగా గౌరవంగా నిర్మొహమాటంగా మాట్లాడారు .కానీ ఆమ్రే కొట్టిన చీకటి దెబ్బ అసలైన చర్చలకు దారివ్వలేదు .అనారోగ్యంతో నే శాస్త్రి చాలాచోట్ల అనేక ప్రసంగాలు చేశాడు .యూరోపియన్లను స్నేహహస్తం చాచమని కోరాడు .ఇండియన్లతో గౌరవప్రదమైన రాజీకి రమ్మని అర్ధించాడు .తమ మనస్సులను వెనుకకు మరల్చుకోలేని వారితోనే ఇలా మాట్లాడాడు .మోమ్బాసాలో ఆయన ప్రసంగం ఉదాహరణ –‘’మిత్రులారా మా వారి విషయం లో ఉదారంగా ఉండమని మీ గుండె తలుపులు తెరచి మమ్మల్ని ఆహ్వానించి మిత్రత్వం చూపమని కోరుతున్నాను .మేమంతా మోడరేట్ మనుషులం .మాకోరికలు సమంజసమైనవి న్యాయబద్ధమైనవి గౌరవ ప్రదమైనవి .భారత రాజకీయాలలో నేను తటస్తుడనని ఇక్కడి పత్రిక నన్ను ఆక్షేపించింది .ఇక్కడ మీలో మోడరేట్ వారు అందరూ రండి .నాతోపాటు నేరస్స్తులైన వీరందరి కి నాది ఒక విన్నపం ‘’ మంచికి సాక్షిగా మీ తలలు అవమానంతో వంచండి .మధ్యస్తులు తటస్తులు మోడరేట్ లు అని సిగ్గుపడకండి .ఏదైనా ప్రజాసమస్య వస్తే మోడరేట్ లు పూర్తిగా హృదయపూర్వకంగా సమస్యా పరిష్కారం చేస్తారు .నన్ను నమ్మండి ‘’అని తన తటస్థ స్వభావం ఎలా మేలు చేస్తుందో విస్తృత విషయాలవిషయాలలో వివరించి వారి మనసులు గెలిచాడు శాస్త్రి.
సశేషం
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -17-7-23-ఉయ్యూరు

