రైటానరబుల్ ‘’శ్రీని వాస శాస్త్రి -38
ఇండియన్ లేబర్ కమిషన్ ప్రతినిధిగా లండన్ లో1930 ప్రారంభంలో ఉన్న శాస్త్రి సైమన్ కమీషన్ ప్రతిపాదనలను తిరస్కరిస్తూ అక్కడి పబ్లిక్ కు విషయాలు వివరిస్తూ అందిన ప్రతిచోటా ఉపన్యాసాలలో రాతల్లో తెలియబర్చాడు .కాంగ్రెస్ మాటవిని డొమినియన్ స్టేటస్ కు అంగీకరించమని బోధించాడు .ఆకమిషన్ వలన ఇండియాకు డోమినికల్ హోదా రాదనీ గట్టిగా వాదించి చెప్పాడు .లండన్ లోని ఈస్ట్ ఇండియా అసోసియేషన్ పత్రికలో ‘’డొమినియన్ స్టేటస్ అనేది మాటిమాటికీ మారుతున్నా ,దాని అవసరాన్ని అందరూ గుర్తించారు అది ఇండియాకు తప్పని సరి అని అభిప్రాయపడ్డారు .దానివల్లనే కామన్ వెల్త్ బంధాలు దృఢమౌతాయని విశ్వ సి౦చారు.జాతి విద్వేషం నశించాలని అందరూ కోరారు ‘’అన్నాడు .ఇది చాలామందిని కదిలించి ,అక్కడి రైట్ పార్టీలు దాన్ని ఒక ఆయుధంగా ప్రతిపక్షాలపై తీవ్రంగా ప్రయోగించాయి .శాస్త్రిని బాగా గౌరవించే రాజు అతని భావాలను అర్ధం చేసుకొని సానుభూతి చూపాడు .ఈ విషయం పై శాస్త్రి తన సోదరుడికి ఉత్తరం రాస్తూ –‘’నిన్న జరిగిన గార్డెన్ పార్టి లో నన్ను అక్కడి రాజ ప్రతినిదులందరికి పరిచయం చేశారు .రాజు గారు నాతొ మాట్లాడుతూ ‘’I have been reading your recent speech’’అన్నారు .ఆయన సంతోషించారని అనిపించింది ‘’అని రాశాడు .
లండన్లోని ‘’బిగ్ బిగ్స్’’ ల అభిప్రాయాన్ని డొమినియన్ స్టేటస్ కు అనుకూలంగా మార్చాడు శాస్త్రి .అందుకే అక్కడి గొప్ప ప్రభావం చూపే ‘’మాంచెస్టర్ గార్డియన్’’పత్రిక పూర్తిగా డొమినియన్ స్టేటస్ ను సమర్ధించింది .శాస్త్ర కి ప్రస్తుతం R.T.C. అంటే’’గుండ్రబల్ల సమావేశం’’ పై ఆశ ఎక్కువగా ఉంది .దాన్ని తృణీకరించినా , ముక్కలు చేసినా మన గమ్యం చాలా దూరం పెరిగిపోతుంది .అయినా R.T.C.లో సీట్ కోసం చాలా జాగ్రత్తగానే ఉన్నాడు .అందులో మెంబర్ గా స్థానం పొందగానే తనమిత్రుడు వెంకటరామ శాస్త్రికి జాబురాస్తూ –‘’ఇప్పుడు మనకు జరుగబోయే అధ్వాన్నం గురించి భయపడాలి .నా ఆయుధాలన్నీ అయిపోయాయి .పేరు ప్రఖ్యాతులు కొంత ఉపయోగ పడవచ్చు .అడదిపోతే తల తిరిగినంత పని అవుతుంది ‘’అన్నాడు ..ఒక వారం తర్వాత మళ్ళీ సోదరుడికి –‘’ఈ కాన్ఫరెన్స్ ఇండియన్ రాజకీయ దౌత్యానికి పరాకాష్ట .ప్రతినిధుల సహనానికి ,శక్తికి పరీక్ష .అత్యధిక అసాధారణ పరిస్థితు లలో చిన్న ఆశమాత్రమే ‘’అని రాశాడు .15-10-1930 న ఒక మిత్రుడికి ‘’నీలానే నాకూ రౌండ్ టేబుల్ పై ఎక్కువ ఆశలేదు .కానీ పూర్తీ విశ్వాసంతో పాల్గోనాలి .అదే మా గురు గోఖలే గారి అంతరార్ధం –ఆయన అంటారూ –We must serve through our failures ,more fortune people may serve through their success ‘’అని .ఇండియాకు ముఖ్య శత్రువు బ్రిటీష వారి మొండి పట్టుదల .వాళ్ళకూ ఇండియాలోని మతవాదులకు పెద్ద తేడా లెదు .’’అని రాశాడు .
ఇండియన్ రౌండ టేబుల్ కాన్ఫరెన్స్ లో ‘’సైమన్ శిశువు ‘’ను పూర్తిగా విడిచిపెట్టేశారు.సర్ జాన్ కాన్ఫరెన్స్ లో మెంబర్ కూడా కాదు .అయిదవ జార్జిరాజు ఆ సమావేశం ను 12-11-1930 న జేమ్స్ పాలెస్ లో ప్రారంభించాడు .ఆయన వెళ్ళాక శ్రీనివాస శాస్త్రి ఆశావహమైన ప్రసంగం చేశాడు .కాన్ఫరెన్స్ ముఖ్యోద్దేశ్యాన్ని స్పష్టంగా వివరించాడు .-‘’చక్రవర్తి ధరించే కిరీటం శక్తికి ఐకమత్యానికి చిహ్నం .మన హృదయాలను ఆకర్షించి సమ్మతిని గౌరవంగా సమర్పించే నివాళి .అంతకంటే విశిష్టమైనది .కామన్ వెల్త్ లోని వివిధ జాతుల ప్రజలమధ్య న్యాయ,స్వేచ్చ సమానత్వత్రివేణీ సంగమం .విధేయత దీనికి అతి ముఖ్యం .అది దెబ్బతింటే ఎక్కడైనా వివిధ జాతులమధ్య అన్యాయం అసమానత అనవసర నిషేధాలు పెరిగిపోతాయి .ఇండియా అంటే ఆసక్తికల అన్ని పార్టీ లసమావేశం ఇది .రాజ్యాంగ బద్ధంగా ఇండియా భవిష్యత్తును తీర్చి దిద్దగలగటానికి ఇది ముఖ్య వేదిక .ధైర్యంగా మనసు విప్పి మాట్లాడుకోవాలి మనం..దానితో పాటు నియంత్రణ అంటే మోడరేషన్,సహనం ,విభిన్న భావాలను అర్ధం చేసుకోవటం అవసరం ,అన్నిటికంటే ముఖ్యం భారత దేశ స్వప్నం మనమనస్సులో ప్రకాశించాలి .ఇండియా బలం భవిష్యత్తు అభ్యుదయం సంక్షేమం సార్వభౌమిక అధికారం లను మనం మన్నించాలి .ఇప్పటికే అనేక భావాలు వినే ఉన్నారు మీరు మీ అసామాన్య వ్యక్తిత్వం తో , విషయాలను బాగా చర్చించి ఇండియా ఆశలకు సంక్షేమానికి అనుగుణంగా నిర్ణయం తీసుకొని ఈ గుండ్రబల్ల సమావేశం చరిత్ర లో ప్రముఖ స్థానం సంపాదించాలి –What ever its exact physical shape,may be hereafter remembered in history as the table of rounded wisdom and statesman ship ‘’అని ముగించాడు శాస్త్రి నిర్మొహమాటంగా ,ఆశావహంగా .
సశేషం
మీ- గబ్బిట దుర్గా ప్రసాద్ -19-7-23-ఉయ్యూరు ..

