రైటానరబుల్ ‘’శ్రీని వాస శాస్త్రి -39
సెక్రెటరి ఆఫ్ స్టేట్ వేడ్జ్ వుడ్ బెన్ సమావేశానికి ఎజెండా తయారు చేయలేదు .కారణం ఇండియన్ లకు ఫ్రీ హాండ్ ఇవ్వాలనే అభిప్రాయంతోనే .బెన్ తో ఒక రోజు ప్రైవేట్ లంచ్ అయ్యాక శాస్త్రి 13-11-1930 న ఒక ఉత్తరం రాస్తూ –‘’బెన్ కు ఐడియాలున్నట్లు లెదు .విషయాలన్నీ మనకు ,కాన్ఫరెన్స్ కే వదిలేయాలని చూస్తున్నాడు .మనకు వ్యవస్తలేదు కనుక ఇదిమనకు ఇబ్బందే కలిగిస్తుంది .కనుక నాకున్న ఐడియాలు చెప్పి సలహాలు ఇవ్వాలనుకొంటున్నాను .దేన్నీదాచుకోకుండా స్వేచ్చగా ఆయనకు చెప్తాను . ఆయన స్నేహ స్పూర్తి నాకు ఆశా జనకంగా ఉంది .కానీ అతనికి మాంటేగ్ కున్న సమర్ధత లేకపోవటం విచారకరం ‘’అని చెప్పాడు
బొంబాయి నుంచి రౌండ టేబుల్ కాన్ఫరెన్స్ కు బయల్దేరిన ప్రతినిధి వర్గానికి’’ సీ చేంజ్’’ –అంటే గణనీయమైన మార్పు కనిపించింది .ఫెడరల్ సెటప్ అనే భావంతోనే వారు వస్తున్నారు .కన్జర్వేటివ్ డెలిగేట్ సర్ సామ్యుల్ హార్స్ ,తర్వాత ఇండియాలో సెక్రెటరి ఆఫ్ స్టేట్ అయ్యాడు .ఇప్పుడు ఈ సమావేశం లో కృషి చేస్తున్నాడు .ఆయన అన్నమాటలు-‘’డెలిగేట్ల ఇండియానుంచి ఇంగ్లాండ్ ప్రయాణం సమయంలో ఇక్కడ పరిస్థితిలో చాలా మార్పు వచ్చింది .ఎవరో ఒకాయన ఆయన ఎవరో తెలీదుకాని ‘’ఆల్ ఇందడియఫెడరేషన్’’అనే సూచన చేసినట్లు తెలుస్తోంది .అది గాలిమాటకాదు.అది భారత రాజ్యాంగం ఆధారంగా అత్యవసరంగా వెంటనే ఏర్పడాలి .లిబరల్స్ రాజులు హిందువులు ముస్లిం లు ,సిక్కులు అస్పృశ్యులు అభావ ప్రభావంలో పడి ఊగిపోయారు .వాళ్ళు లండన్ లో కాలుపెట్టేసరికి ప్రొవిన్షియల్ అటానమి అనే సైమన్ కమిషన్ సిద్ధాంత రీత్యా మంచిదే అయినా ,కేంద్రంలో యేదోరకమైన బాధ్యత లేకపోతె ఆచరణ సాధ్యం కాదు అనిపించింది ‘’అన్నాడు .
లండన్ చేరిన డేలిగేట్లను శ్రీనివాస శాస్త్రి కలిసి ఇద్దరు ముగ్గురు వంతున ఇంటర్వ్యు చేశాడు .దీనిపై 24-10-1930 న సోదరుడికి ఉత్తరం రాస్తూ –‘’సప్రూ జయకర్ లు ముస్లిం లతో అప్పటికే మాట్లాడి ,పూర్తిగా డిమాండ్ అంతటికి లొంగిపోయి సెటిల్ మెంట్ కోసం ఆశగా ఉన్నారు .యువరాజుకూడా వాళ్ళతో మాట్లాడాడు .హైదరి ,మీర్జా ,హస్కర్లాంటి వారు ప్రక్కలకు లాగుతున్నా ,వారందరికి ఫెడరేషన్ ,కిరీటంతో సాన్నిహిత్యం కావాలి .ఫెడరేషన్ భావమే జయిస్తుందని నా భయం .నెహ్రు అధ్యక్షత న ఏర్పడిన రాజ్యాంగ సిద్ధాంతాలను తయారు చేసే కమిటి పని ఇప్పుడు ఏమౌతుందో ?ఆ అగ్రిమెంట్ వస్తే దేశంలోని రాజులకు ముసల్మాన్లకు లొంగి పోవటమే అవుతుంది .ఇది డొమినియన్ స్టేటస్ ను మరింత దూరం చేస్తుంది .కానినాకు మాత్రం ఏం జరుగుతుందో అర్ధం కావటం లెదు ‘’అని రాశాడు .
సశేషం
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -20-7-23-ఉయ్యూరు
