రైటానరబుల్ ‘’శ్రీని వాస శాస్త్రి -41
పండిత కు0జ్రు కు శాస్త్రి 3-7-1931 రాసిన ఉత్తరం లో –‘’ఇక్కడ ముఖ్యంగా ఒక ఫండ మెంటల్ స్టాండ్ పాయింట్ పై భేదాభిప్రాయాలున్నాయి .కొందరు పూర్తీ బాధ్య వహించాల్సి వస్తుందని దీన్ని పూర్తిగా తిరస్కరిస్తున్నారు.కాదనలేను సెటిల్ మెంట్ ఇవాళ చాలా అవసరం..దీనికోసం కాన్ఫరెన్స్ తీవ్రంగా కృషి చేస్తోంది .దీనిలో నేను పూర్తిగా పాల్గొని ఒక రూపు తెస్తాను .దీనికి మంచి సపోర్ట్ మాత్రం కావాలి .నన్ను అపార్ధం చేసుకోవద్దు .లోపాలు సరిచేయటానికి ఇంకా మనకు సమయముంది .స్కీం బాగా ఉపయోగ పడేట్లు చేసే అన్ని ప్రయత్నాలు చేస్తాం..మా శ్రమ ధారపోసి ఒకటి తయారు చేసినా అందులో లోతుగా చూస్తె కొన్ని దోషాలు కనిపించవచ్చు .అంతమాత్రాన పుట్టిన శిశువును కాలదన్ని పారిపోయినట్లు మనం ప్రవర్తించ కూడదు .’’అన్నాడు .కాన్ఫరెన్స్ లో చర్చలు జరుగుతూనే ఉన్నాయి .వింటర్ సీజన్ ప్రవేశించే దాకా ..మతం బూచి భయపెడుతూనే ఉంది .ప్రొఫెసర్ హరాల్డ్ లస్కి ఒక లెటర్ లో జస్టిస్ హోమ్స్ కు 10-1-1931న రాస్తూ-‘’ఇండియా వారి తీరు ప్రస్తుతం ఆశాజనకంగానే ఉంది ‘’అన్నాడు .ఫెడరల్ చట్ర నిర్మాణ కమిటికి లార్డ్ సంకి సర్వ సమర్ధుడు అని అందరూ భావించారు .ఈ నిర్మాణానికి సప్రూ ,శాస్త్రి గొప్ప సహాయం చేశారు తమకున్న ప్రతిభ తో ..చివరి రోజులన్నీ విందులతో ఉపన్యాసాలతో గడిచిపోయాయి .బ్రిటీష ఇండియన్ డెలిగేట లు ఇచ్చిన విందులో కద క్లైమాక్స్ కు చేరింది .ఈ ఫలితం ఎవరూ ఊహించనిది గా అందర్ని సంభ్రమాశ్చర్యాలకు గురి చేసింది .మహామహులంతా అంటే క్రీం ఆఫ్ ఇంటలిజెన్స్ అంతా అక్కడే ఉంది .మహాప్రవక్తసిసిరో వాగ్దోరణిలో శాస్త్రి అందర్ని మెప్పించాడు .Sastri’s name and fame stood higher than ever for wisdom eloquency and conciliation .ఎడ్వర్డ్ దాంప్సన్ఒక జాబును శాస్త్రికి 117-11-1930 న రాస్తూ ‘’మీరు సప్రూ ఇద్దరూ అద్భుత కృషి చేశారు మా వాళ్ళకంటే .మీ కృషి ముందు వాషింగ్టన్ కృషి తక్కువే అనిపిస్తుంది .’’Sastri I could reckon among the noblest men I have ever met ‘’జస్టిస్ హోమ్స్ అన్నాడు .
గాంధి –ఇర్విన్ ఒడంబడిక
బొంబాయికి శాస్త్రి సప్రూ బృందం తిరిగివచ్చిన రోజే తిరిగి వచ్చిన సమయంలోనే 6-2-1931పండిత మోతీలాల్ నెహ్రు అలహాబాద్ లో చనిపోయాడు .ఇది ఈ బృందానికి ఆశనిపాతమే అయింది .మహాత్ముడికి ఇర్విన్ కు మధ్యచక్కని ఒడంబడిక కుదర్చగలిగే సామర్ధ్యం మోతీలాల్ కె ఉందని శాస్త్రి భావించాడు .గాంధీ లేని రౌండ టేబుల్ కాన్ఫరెన్స్ ‘’హామ్లెట్ లేని ప్రిన్సాఫ్ డెన్మార్క్’’ లా ఉంటుందని శాస్స్త్రి భావించాడు .గాంధీ –ఇర్విన్ ఒడంబడిక కు జయకర్ సప్రులు విశేష కృషి చేశారు .
బొంబాయి నుంచి నేరుగా ఢిల్లీ వెళ్లి శాస్త్రి వైస్ రాయ్ కి లండన్ కాన్ఫరెన్స్ వివరాలన్నీ తెలియజేశాడు .కాంగ్రెస్ సహకారం కావాలంటే గాంధీని ఆహ్వానించాల్సిందే అని నచ్చ చెప్పాడు .ఇర్విన్ కు అనేక అపోహలు అనుమానాలు ఉన్నా శాస్త్రిమాటపై నమ్మకం తో గాంధీకి ఇష్టమైతే తనకూ ఇష్టమే అన్నాడు .శాస్త్రి సరాసరిఅలహాబాద్ వెళ్లి గాంధీతో కాంగ్రెస్ వర్కింగ్ కమిటి తో మాట్లాడాడు .ఆయన చెప్పింది అంతా శ్రద్ధగా విన్నారు అందరు .వెంటనే గాంధి ఇర్విన్ కు ఒక ఉత్తరం రాస్తూ ‘’నేను వైస్రాయి ఇర్విన్ నుకాకుండా ఇర్విన్ వ్యక్తిని కలుసు కోవాలను కొంటున్నాను ‘’అన్నాడు .శాస్స్త్రి ‘’there is some opening .For ,I believe the man is better than the VICEROY ‘’అని ముక్తాయింపు ఇచ్చాడు .
సశేషం
మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -22-7-23-

