రైటానరబుల్ ‘’శ్రీని వాస శాస్త్రి -43

రైటానరబుల్ ‘’శ్రీని వాస శాస్త్రి -43

గాంధీ –ఇర్విన్ ఒడంబడిక ఆమోదం పొందినందుకు వైస్ రాయ్ ఇర్విన్ చాలా సంతోషిస్తూ –My Dear Sastri –I must write one line of thanks to  you for the part you have played in making this agreement with Mr.Gandhi possible .I can guess how great your part has been ,and believe me , I am VERY grateful-yours very sincerely –IRWIN.’’అన్నాడు మనస్సునిండా కృతజ్ఞతలు వర్షిస్తూ .

   రెండవ రౌండ టేబుల్ కాన్ఫరెన్స్

  శ్రీనివాస శాస్త్రి 18-4-1931 న మళ్ళీ ఇంగ్లాండ్ బయల్దేరి   ఈస్ట్ ఆఫ్రికన్ విషయాలపై పార్లమెంట్ లో బ్రిటీష కమిటి ముందు సాక్ష్యం ఇవ్వటానికి వెళ్లాడు  .అంతటే రెండో గుండ్ర బల్ల సమావేశానికి ముందే లండన్ లో ఉన్నాడన్నమాట .అక్కడ అనుకూల వాతావరణాన్ని కల్పిస్తూ మహాత్ముని సమావేశంలో పాల్గోనట౦ పై ఎంతటి విశిష్టత ఉందొ వివరించాడు .గా౦ధీకున్న నిగూఢ అవగాహన బ్రిటీష ప్రజలకు తేట తెల్లం చేసి చెప్పాడు .బిబి సి .లో ఒక సారి మాట్లాడుతూ ‘’బ్రిటీష ప్రభుత్వంపైనా మాటనిలకడలేని పాలసీలపైనా అపనమ్మకం కలిగింది గాంధీకి .బ్రిటీష్ ప్రభుత్వం పైన ఆయనకు ప్రజలకు ఉన్న గౌరవం తిరుగు లేనిది .మధ్యే మార్గం పై ఆయనకున్న నమ్మకం అపారం.ఆయన విజన్ అర్ధం చేసుకోవటం మహా కష్టం .మొదటి సమావేశం ఆయన లేకుండానే జరిగింది ఈ రెండవ  దానికి ఆయన ప్రత్యెక ఆకర్షణగా నిలుస్తారు .ఆయన వ్యక్తిత్వం ఏమిటో మాటలద్వారా ఆలోచనలద్వారా  క్రియలద్వారా ఇప్పుడు మీరు ప్రత్యక్షంగా చూస్తారు .You will see the tenderness and chivalry of his nature can be touched and how privations (ముఖ్యావసరాలు )of the flesh and wounds of the soul have left his reason without a cloud ‘’అని బోధించాడు రేడియో ద్వారా .

  ఈలోపు ఇండియా నుంచి గాంధి ఈ సమావేశానికి రావటం లేదని వార్త వచ్చి అందరూ కలవరం చెందారు .ఏప్రిల్ లో ఇర్విన్ పదవీ విరమణ చేయగా ఆస్థానం లో లార్డ్ విల్లింగ్టన్ వచ్చాడు .గాంధి ఇర్విన్ ఒడంబడిక లో విషయాలపై వివరణలో భేదాలు కలిగాయి .అందుకని గాంధి రాను అన్నాడు ,గాంధీని రమ్మని ఒక కేబుల్ పంపాడు శాస్త్రి .దీనికి సమాధానంగా గాంధి –‘’నీ కేబుల్ నా హృదయాన్ని చలిమ్పజేసింది .నిన్ను ఓదారుస్తూ ఒక ఉత్తరం రాశాను .కాన్ఫరెన్స్ కు రావటానికి నేను తప్పించుకోవటం లెదు .స్థానిక ప్రభుత్వాలు సెటిల్ మెంట్ ను కాళ్ళతో తోక్కేస్తున్నాయి .అణచి వేత ఉచ్చ స్థితి లో ఉంది .యంగ్ ఇండియా పత్రిక చదివితే నామనసు నీకు బాగా అర్ధం అవుతుంది .జరిగిన దానిలో పదో వంతు మాత్రమె అందులో రాశాను .ఇన్ని ఇబ్బందులమధ్య నేను ఇండియా విడిచి రావాలా ?అనేది ప్రశ్న  సిమ్లా విషయం లో ఆందోళనగా ఉన్నాను ‘’అని రాశాడు .

  గాంధీ రావటానికి మార్గం సుగమం చేయటానికి అన్ని విధాల ప్రయత్నాలు చేశాడు శాస్త్రి ఎట్టకేలకు గాంధి 29-8-1931 న లండన్ బయల్దేరాడు .సెప్టెంబర్ ఏడున జరిగే రెండవ రౌండ టేబుల్ సమావేశానికి గాంధీ ముందే లండన్ చేరాడు .సమావేశం ప్రారంభానికి రెండు వారాలముందే మాక్ డోనాల్డ్ తన తనలేబర్ పార్టీ మంత్రి వర్గ రాజీనామా ను రాజుకు సమర్పించాడు .అనేక ఆర్ధిక విషయాలు అతని రాజీనామాకు దారి తీశాయి .వెంటనే ఆయనను జాతీయ ప్రభుత్వం ఏర్పరచమని రాజు ఆదేశించాడు .అదృష్టవశాత్తు లార్డ్ సంకి అదే పదవిలో ఉండి పోయాడు .శామ్యుల్ హోర్స్ బదులు కన్సర్వేటివ్ పార్టీకి చెందిన  వేడ్జ్ వుడ్ బెన్ ఇండియాకు సెక్రెటరి ఆఫ్ స్టేట్ గా వచ్చాడు .ప్రతిపక్ష టోరీలు ఆయనకు చాలా అడ్డంకులు కల్పించారు ముఖ్యంగా చర్చిల్ .ఇండియన్ రౌండ్ టేబులర్స్ అతడిని  అనుమానంగా జాగ్రత్తగా గమనిస్తున్నారు ఒక కన్ను వేసే ఉంచారు .లండన్ రాగానే గాంధి శాస్త్రితో కలిసి మాక్ డోనాల్డ్ ను కలిసి మాట్లాడాడు .ఇద్దరి ప్రవర్తన విషయం లో హస్తి మశకాంతర భేదం ఉంది .అతడు చిక్కడు దొరకడు టైప్ . గాంధి దృఢ సంకల్పం ,నిష్కపటం ఉన్నవాడు .హోర్స్ నుకూడా శాస్త్రితో కలిపి కలిశాడు శాస్త్రి .పైకి గట్టిగా లొంగని  వాడిగా కనిపించినా అతడు సూటిగా నిర్మొహమాటంగా ఉంటాడు .అతనిలో గాంధీ ‘’ఆనేస్ట్ ఇంగ్లిష్ మాన్’’ను చూశాడు మహాత్ముడు .అతడితో గౌరవ సంభాషణ చేశాడు .

  సమావేశం మొదటి రోజు నుంచీ మత విషయం అన్నిటిని మించి ముందుకొచ్చింది .గాంధీ పాల్గొనటం ఆయనకు కానీ కాన్ఫరెన్స్ కుకానీ ఉల్లాసంగా అనిపించలేదు .ముస్లిం లకు లాగానే అణగారిన వర్గాలు కూడా ప్రత్యెక నియోజక వర్గాలను కోరటం గాంధీ కి భౌతిక గాయాన్ని కలిగించినట్లయింది .గాంధీ మనసు కూడా బాగాగాయమై, ఏ క్షణం లోనైనా సమావేశం నుంచి వెళ్లి పోతాడని శాస్త్రి భావించాడు .సర్వ శక్తులు ఒడ్డి ఆయన్ను సమావేశం నుండి వెళ్ళిపోకుండా ఉంచేందుకు అన్నివైపులనుంచి ప్రయత్నం చేశాడు తీవ్రగా .2-10-1931వెంకటరామ శాస్త్రికి ఉత్తరం రాస్తూ శాస్త్రి –‘’శకునాలు బాగాలేవు .గాంధీని వేధించారు ఆయన మహోన్నత వ్యక్తిత్వాన్ని కించ పరచారు .ప్రత్యేకతలను కాదనలేదు రాజీని ఒప్పుకోనూ లెడుతన మనసులో ఉన్నది అల్టి మేట౦ –కడపటి తీర్పుగా చెప్పేసి వెళ్లి పోవాలని గాంధీ అనుకొంటున్నాడు ‘’అన్నాడు . .సుహృద్భావ చర్చలకు శాస్త్రి ఎంతగానో ప్రయత్నించాడు .గాంధీ మాటలను పదే పడదే వివరించాడు కానీ ప్రయోజనం శూన్యం .గాంధి మూడు ముఖ్యమైన విషయాలు నొక్కి చెప్పగా వాటిని సవాలు చేశారు అక్కడి ప్రతినిధులు .ఆయన చెప్పినవాటిలో మొదటిది-కాంగ్రెస్ ఒక్కటే ఇండియాకు ప్రతినిధి .దీన్ని శాస్త్రి ఒప్పుకున్నా డిప్రేస్సేడ్ క్లాస్ ముస్లిమ్స్ ఒప్పుకోలేదు .రెండు –అణగారిన వారికి ప్రత్యెక నియోజక వర్గాలు ఏర్పరిస్తే హిందువు లలో విభజన వచ్చి ఒకరిపై ఒకరికి భేదభావన ఏర్పడి బలహీనమౌతారు .మూడు మహమ్మదీయులకు ప్రత్యెక నియోజక వర్గాలను రద్దు చేస్తే హిందూ ముస్లిం సఖ్యత పెరి జాతీయ ఐక్యతసాధ్యమౌతుంది .గాంధీ చెప్పినవాటికి మైనార్టీలకు  నచ్చక మరింత వాటాలకోసం బేరసారాలు సాగించారు .

  అనుకోకుండా అకస్మాత్తుగా ప్రధాని మధ్యవర్తిత్వం లో మైనారిటి కాన్ఫరెన్స్ జరిగింది .అందులో మాక్ డోనాల్డ్ అడిగాడు –‘’మీలో ప్రతిఒక్కరు కమిటీలోని ప్రతి మెంబర్ కూడా నన్ను మైనారిటి సమస్య పరిష్కరి౦చమని కాగితాలు రాసిసంతకాలు చేసిఇస్తారా ?నా నిర్ణయాన్ని శిరసవహిస్తారా ?ఇది మంచి పద్ధతిఅనుకుంటాను అన్నాడు .హిందువుల పక్షాన శాస్త్రి ఒప్పుకున్నాడు .మాక్ డోనాల్డ్ వెంటనే –నాకు ఒక వర్గ౦ ఒక  వ్యక్తికాదు ఈ కమిటి  సభ్యులంతా ఆ డిక్లరేషన్ పై సంతకాలు చేయాలి ‘’అన్నాడు కానీ ఈప్రయత్నం సఫలం కాలేదు .   ఇండియాకు డొమినియన్ ప్రతిపత్తికి మాత్రం అడ్డం గా మారింది ఈ విషయం .

  సశేషం

మీ-గబ్బిట దుర్గాప్రసాద్-24-7-23-ఉయ్యూరు  

Unknown's avatar

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in పుస్తకాలు, సమీక్ష and tagged . Bookmark the permalink.

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.