రైటానరబుల్ ‘’శ్రీని వాస శాస్త్రి -44

రైటానరబుల్ ‘’శ్రీని వాస శాస్త్రి -44

 మహాత్మునితో సహా చాలా మంది డెలిగేట్లు మాండేట్ అంటే విధి లేక ఆదేశాలతో హాజరయ్యారని శాస్త్రి చెప్పాడు .అది కాన్ఫరెన్స్ పై తీవ్ర ప్రభావం చూపింది .అందుకే కాన్ఫరెన్స్ జాతీయత మూల జీవితంలోకి బ్రిటీష్మూల సిద్దాన్తాలలోకి వెళ్ళింది .రాజీ కావాలంటే అందరూ కలిసి ఆలోచించాలి .ఈరకమైన రాజీ మన ముఖ్య నాయకులలో మనస్పూర్తిగా లేనందుకు శాస్త్రి బాధ పడ్డాడు .ఇందులో గాంధీ పాత్రను చెబుతూ ‘’మైనారిటీలమీద, రిజర్వేషన్లమీద గాంధీకి నిజమైన దృక్పధం ఉంటే అలా ప్రవర్తిన్చేవాడుకాడు .ఊహ సంతోషం కలిగించదు ,He preferred to be Congress mandatory .సిద్ధాంతాలు ఆదర్శం కోసం పోరాటాలు ,ప్రాపగాండా ఇవన్నీ చెప్పటానికి బాగానే ఉంటాయి .ఒక సారి ఆందోళన ప్రారంభమైతే ఎక్కడిదాకాపోతుందో తెలీదు .ప్రజల బాధలు కష్టనిస్టూ రాలు మనం తీర్చలేక పోవచ్చు ..కాన్ఫరెన్స్లో శాస్త్రిచాలా చలాకీ పాత్రనే నిర్వహించాడు .ఆయన భావ స్పష్టత దాన్ని వ్యక్తపరచే విధానానికి అందరూ ఫిదా అయ్యారు .ఫెడరేషన్ స్ట్రక్టర్ కమిటీ మీటింగ్ లో ,ఇంగ్లిష్ లో మాస్టరీ వక్తనిపించుకొన్న చైర్మన్ లార్డ్ సంకి ని అప్రతిభుడిని చేశాడు శాస్త్రి .అతడు అందరి మంచికోసం నేను నా భావాలను వదులుకోలేను .నాప్రణాలిక మార్చుకొంటాకానీ భావ త్యాగం చేయలేను అన్నాడు .శామ్యుల్ హోర్స్ –‘’ వాళ్ళు అందరి క్షేమం కోసం వ్యక్తిగత కోరికలను నష్టపోతారనుకోవాటం మీ ఉద్దేశ్యమా ?’’అని అడిగితె శాస్త్రి –అవును అన్నాడు .చైర్మన్ –శాస్త్రి చెప్పింది రైట్ .ఆయన అప్పుడప్పుడు నాకు మంచి ఇంగ్లిష్ ఎలా మాట్లాడాలో చెబుతూ ఉంటాడు .’’అన్నాడు . అంటేశాస్త్రికి ఇంగ్లీష్ భాషా నుడికారం ఉచ్చారణ పై ఎంత లోతైనన అవగాహన ఉందొ మనకు అర్ధమౌతోంది .

  1-12-1931మధ్యాహ్నం రెండు గంటలకు శ్రీనివాస శాస్త్రి చిరస్మరణీయ ప్రసంగం చేశాడు గుండ్రబల్ల సమావేశంలో ..అందులో  మొదటిభాగం  ప్రధాని రామ్సే మాక్ డోనాల్డ్ గురించి ,తర్వాత భాగం మహాత్మా గాంధీ గురించి చెప్పి ఇరువైపులా సమాన స్నేహాన్ని ప్రకటించాడు .ప్రధానిని ‘’చిల్లర దేవుళ్ళ’’ సలహాలు వినద్దని ,ఫెడరేషన్ పై’’మనమందరం పూర్తీ హృదయాలు పెట్టి ‘’ ఇప్పటిదాకాసాధించిన దాన్ని వెనక్కి మరల్చే ప్రయత్నం చేయద్దని కోరాడు .తర్వాత ఇండియాలో తిరుగుబాటు మూల కారణం వివరించాడు .మేముకోరేది భౌతిక కీర్తి ప్రతిష్టలుకాదు .ఈ సామ్రాజ్యం మాదికూడా అనే భావనతోనే.కనుక ప్రదానిగారూ –‘’ The time has come for you to take  one long step from which there shall be no returning ‘’అన్నాడు .పరిరక్షణలు  కొన్ని ప్రస్తుతం అవసరమే కానీ ముందు మేము మా రాజ్యంగం పై నిలబడాలి అంతకంటే సేఫ్ గార్డ్ కాని రిజర్వేషన్ కానీ లేదు .దాన్ని మీరు ఏ పేరు తో పిలిచినా మాకు అభ్యంతరం లెదు .అది మాత్రం పూర్తిగా ఇండియాకు ఆసక్తికరంగా ఉండాల్సిందే .పరిరక్షణలన్నీ మారాజ్య౦ లో  పొందుపరచి ఎవరికీ ఇబ్బంది లేకుండా చేస్తాం .నేను రెండు సూచనలు చేస్తున్నాను మీకు –మొదటిది  –మీరు విధించే పరిమితులన్నీ రాజ్యాంగంలో చాప్టర్ గా చేర్చండి. మేము వాటిపై మా చట్ట సభలలో చర్చించి మంచి నిర్ణయం చేస్తాం .దీనికోసం మేము ఇంపీరియల్ పార్లమెంట్ మెట్లు ఎక్కాల్సిన పని ఉండదు .మేమే రివిజన్, మాడిఫికేషణ్ చేస్తాం .రాజ్యా౦గ అడ్వాన్స్  మెంట్ కోసం మళ్ళీ మేము ఇక్కడికి రాకుండా చూడండి .రెండవ సూచన-ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్ లో ఒక క్లాజు చేర్చండి .మీరు నియమించిన వైస్రాయ్ లు ఇండియా రాజ్యాంగం కేబినేట్ నిర్ణయం ప్రకారమే నడవాలి.పరిరక్షణలకు అడ్డం చెప్పరాదు .అవన్నీ ఇండియా ఇంటరెస్ట్ తోనే జరగాలి .ప్రధానిని ఉద్దేశించి ప్రత్యేకమైన Exhortaion ‘’-ప్రబోధం అనే అర్ధం వచ్చే మాటఅనే  ను ఉపయోగించి,తర్వాత జరిగే కాన్ఫరెన్స్ లు ‘’Un enthusiastic ,dry as dust bureacracy ‘’కి మాత్రం అప్పగించవద్దు .దానికి కారణం –In the long corridors and haunts of the India office and of the great secretariat that we have built in New Delhi there are many dark places where these beautiful  and moving ideals are apt to be strangled ,or at least they will be delayed until they have no further significance to those they have been deeply interested in them ‘’అని కుండ బద్దలుకొట్టి నిజపరిస్థితి విడమర్చి చెప్పాడు శాస్త్రి .ఘనత వహించిన ప్రదానిగారూ మరో ముఖ్యవిషయం –ఇలాంటి కమిషన్లు ముఖ్యమైన కమిటీలు వేసి వారికి ముఖ్య బాధ్యతలు అప్పగించే టప్పుడు ,ఈ  సంవత్సరం చేసినట్లే నియమించండి మహాత్మాగాంధీని ఆయన అనుయాయులను ఆహ్వానించండి .ఆయనకు నిస్పృహకల్గించి మళ్ళీ నాన్ కోఆపరేషన్ ఉద్యమం చేబట్టే పరిస్థితి రాకుండా చూడండి ‘’అని మైడెన్ స్పీచ్ ని ఎండేన్ గా ఇచ్చాడు .గాంధీకి శాస్త్రి ఏం  విన్నవి౦ఛాడో రేపు  తెలుసుకొందాం .  

  సశేషం

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -25-7-23- ఉయ్యూరు

Unknown's avatar

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in పుస్తకాలు, సమీక్ష and tagged . Bookmark the permalink.

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.