రైటానరబుల్ ‘’శ్రీని వాస శాస్త్రి -46

రైటానరబుల్ ‘’శ్రీని వాస శాస్త్రి -46

రెండవ కేప్ టౌన్ కాన్ఫరెన్స్ కు ఇండియన్ డెలిగేషన్ కు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కు ఓవర్ సీస్ ఇన్ చార్జిసర్ ఫాజిల్ ఇ హుస్సేన్ ,జాఫ్రికార్బేట్ ,సర్ డార్సి లిండ్సే ,సరోజినీ నాయుడు కెవి రెడ్డి ,శ్రీనివాస శాస్త్రి సభ్యులు .బి ఎస్ బాజ్ పాయ్ సెక్రెటరి.వీరి పని అత్యంత కష్టసాధ్యమైనది సౌతాఫ్రికాలోని కొందరు ఇండియన్లు మహాత్మాగాంధీ సమయంలో సహాయ నిరాకరణ లో పాల్గొన్న వారున్నారు .వీరుఅక్కడి ఇండియన్ లకు వ్యతిరేకమైనచట్టాలన్నీ రద్దు చేయాలని ఇ౦ప్లీడ్ చేసినవారే .ఈపని సాధించలేక పొతే డెలిగేషన్ ను ఇండియాకు తిరిగి  వెళ్ళిపోమ్మన్నారు .అక్కడి ప్రభుత్వమేమో వీళ్ళని ఉన్న చోట్లు ఖాళీచేసి స్పెషల్ లోకేషన్స్ కు వెళ్ళమని ఒత్తిడి చేస్తోంది .అక్కడి న్యాయమంత్రి’’ పె’’రు ఇండియన్ లకు పూర్తీ వ్యతిరేకంగా ,శత్రువులా ఉన్నాడు .అసలు సమస్యపై పట్టుదలతో దుర్మార్గంగా వ్యవహరిస్తున్నాడు .ప్రభావం బాగా చూపుతున్నాడు .అదృష్టవశాత్తు ప్రధాని హీర్త్ రోజ్ ,ఇంటీరియల్ మంత్రి , మన శస్త్రి ప్రభావం ఇరువైపులవారిపై అధికంగా ఉంది .పీతకష్టాలు పీతలవిలా అక్కడ ఎవరి కష్టాలు వారివి .శాస్త్రికి అక్కడి ఇండియన్ల కష్టాలు మనసుకుచాలా బాధ కలిగించి అత్యంత సానుభూతితో ఉన్నాడు .ఇండియన్ల ఆస్తి యాజమాన్యం వ్యాపారం ముఖ్యంగా పరిష్కరించి మనవారికి ఊరట కలిగించాలి .ఇండియన్లకు అనుకూలంగా ఏదైనా చట్టం తెస్తే పార్లమెంట్ ఆమోదిస్తుందనే గ్యారంటి లేదని ఇండియన్ డేలిగేషన్ వారు చెప్పారు,కనుక రెడ్రేస్ అంటే విరుగుడు పాలనా విధానంలో ఆలోచించాలి,సాధించాలి .అనుకోకుండా ఒకప్రోసీజర్ దొరికింది .మైనింగ్ కమీషనర్ ఇండియన్ లకు అనుకూలంగా ,ప్రస్తుతం వారు ఉంటున్న స్థలాలో ఉండ వచ్చునని ,భావిష్యత్తులోకూడా వారికి అనుకూలంగా ఆర్డర్లు ఇవ్వవచ్చునని అనుకొన్నారు .అక్కడి మన వాళ్లకు ఇది ఇష్టం కాకపోవచ్చుఎందుకంటే కమీషనర్ దయా దాక్షిణ్యాల పై  ఇదంతా ఆధార పడి ఉంటుంది .ప్రస్తుత పరిస్థితులలో ఇంతకంటే మంచి పరిష్కారం సాధ్యం అయ్యేట్లు లేదుకనుక దీన్ని  మన డెలిగేషన్ ఆమోదించింది .  

అలాగే కేప్ టౌన్ అగ్రిమెంట్ రెన్యు విషయంలో కూడా చిక్కులున్నాయి..భారతీయ బృందం ‘’అప్ లిఫ్ట్ క్లాజ్ ‘’ కు అధిక విలువనిచ్చింది .దీనిప్రకారం ప్రభుత్వం ఇ౦డియన్ లను తమ వారితో సమానంగా గౌరవిస్తూ ,విద్య మొదలైన  విషయాలలో వారి అభ్యున్నతికి అన్నివిధాల చర్యలు తప్పక  తీసుకోవాలి .ఇందులో తెల్లవారికి స్వదేశానికి అపంపటం అనే –రిపాట్రి  ఏషన్ ఉన్నది.దీనిప్రకారం ఇక్కడ సాయమొందుతున్న  ఇండియన్లు స్వదేశానికి వెళ్లిపోవాలి వారి పట్టుదల దీనిమీదనే పెట్టారు .మొదటి మూడేళ్ళు ఈ స్కీం బాగానే పని చేసింది .చివరి రెండేళ్లలో ఇండియాకు వెళ్ళే వారి సంఖ్య బాగా తగ్గిపోయింది .మొదటి దశలో ఇండియాలో పుట్టిన వారుకానీ ,లేక ఇండియాతో ఎక్కువ సంబందాలున్నవారుకానీ చాలా తక్కువమంది మాత్రమె వెళ్ళిపోయారు .ఇక్కడికి వచ్చిన వారు ఇక్కడ పరిస్థితులు ఆశాజనకంగా ఉన్నాయని ఎవరూ రిపోర్ట్ ఇవ్వలేదు .కనుక ఇక్కడి వారిని త్వరగా ఇండియా పంపిస్తే తప్ప అగ్రిమెంట్ రెన్యువల్  సాధ్యం కాదని తెల్లవారు పట్టు బట్టారు .దీని నుంచి బయట పడటానికి ఈ డెలిగేషన్ ఒక పరిష్కారం ఆలోచించింది .వాళ్ళను ఇండియా నే కాకుండా  బ్రెజిల్ బ్రిటీష్ గయానా టాంన్జన్యికా మొదలైన ఇతర దేశాలకు పంపించటం అనే క్లాజ్ పెట్టింది.ఇండియన్లు ఆమోదించటానికి వీలుగా ‘’కాలని జేషన్’’అనే పదం చేర్చింది .ఇందరి ఇన్ని ప్రయత్నాలవలన రెన్యువల్ జరిగింది ,ఒనర్షిప్ హక్కు లభించి ఒకరకంగా అందరికి సంతృప్తినిచ్చింది .

  సశేషం

మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -27-7-23-ఉయ్యూరు      

Unknown's avatar

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in పుస్తకాలు, సమీక్ష. Bookmark the permalink.

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.