రైటానరబుల్ ‘’శ్రీని వాస శాస్త్రి -47
బ్రతికి ఉన్నంతకాలం శ్రీనివాస శాస్త్రి దక్షిణాఫ్రికాలోని ఇండియన్ల గురించి ,వారికి చేజారిపోతున్న అవకాశాలగురించితరచుగా జరిగే జాతులమధ్య తీవ్ర పోరాటాల గురించి ఆలోచిస్తూనే ఉన్నాడు .1943లో దక్షిణాఫ్రికా ప్రభుత్వం ఫీల్డ్ మార్షల్ స్మట్స్ తెచ్చిన విపరీతమైన బిల్లు వల్ల ట్రాన్స్ వాల్ నుంచి డర్బన్ నటాల్ వరకు ఉన్న ఇండియన్ల ఒనర్శిప్ లలో ఎదుర్కొన్న పరిస్థిత దారుణం.శాస్త్రి ,పూర్వపు ఏజెంట్ జనరల్స్ మహారాజా సింగ్ ,రాజా ఆలి లు స్మట్స్ కు ఒక అపీల్ పంపారు –‘’ప్రస్తుత ప్రపంచ సంఘర్షణ లో మిమ్మల్ని ఇండియా సీనియర్ మోస్ట్ బ్రిటీష స్టేట్స్ మన్ గా భావిస్తోంది .కనుక పెండింగ్ లో ఉన్న ఆబిల్లు ను ఉపసంహరించండి .నటాల్ ఇండియన్ల సమస్య ట్రాన్స్ వాల్ వాళ్ళ సమస్యకంటే భిన్నమైనది .1939 మధ్యంతర చట్టం నటాల్ దాకా వర్తించదు .మీకున్న కష్టాలు మాకు తెలిసినా ఆ బిల్లు ఆమోదం పొందితే బ్రిటీష కామన్ వెల్త్ లో ఉన్న ఇండియా ,ఇక్కడి ఇండియన్ల ఆశలు ఆవిరి అయిపోతాయి వారి భవిష్యత్తు చెల్లా చెదరై పోతుంది .సౌతాఫ్రికా మిత్రులముగా యుద్ధం తర్వాత ఒక సమావేశం ఏర్పాటు చేయండి ‘’కా నీ అక్కడి ఇండియన్ల దురదృష్టం వెన్నాడుతూనే ఉంది .రంగు వ్యతిరేకత మానవ హక్కుల మూలస్వభావానికే విరుద్ధం అన్నాడు శాస్త్రి .కనుక ఈ జాతి వ్యతిరేకతను నానాజాతి సమితి దృష్టికి తీసుకు వెళ్ళాలి .1946లో ఈ సమస్య ఐక్యరాజ్యసమితిలో చర్చకు వస్తే స్మట్స్ దక్షిణాఫ్రికాను సమర్ధించాడు .అప్పుడు దాదాపు జీవిత చరమాంకంలో ఉన్న శాస్త్రి హృదయాలను కదిలించే ఒక ప్రకటన చేశాడు .-‘’స్మట్స్ బహు విధ వేషాలు క్రూర నియంత్రణ ను అందరూ ఎండగట్టాలి అతడి ఒంటెద్దు పోకడ బహిర్గతం చేయాలి –‘’not only by the in habitants of British Isles but by all that progressive and up-ward looking in the world ‘’అంటూ ఆవేదన చెందాడు .
మూడవ రౌ.టే .కా.మరియు శ్వేత పత్రం
1932 ఫిబ్రవరి చివరలో శ్రీనివాస శాస్త్రి ఇండియాకు తిరిగి వచ్చాడు .మహాత్ముడు యరవాడ జైలు లో ఉన్నాడు .ఆయన్నుకలిసి విషయాలు చెబుదామనుకొంటే కుదరలేదు అందుకని .ఏప్రిల్ లో మద్రాస్ కార్పోరేషన్ శాస్స్త్రికి కెవి రెడ్డికి సన్మానం చేసినప్పుడు శాస్త్రి –‘’కొన్ని పనులు చక్కబెట్టి దక్షిణాఫ్రికా నుంచి వచ్చాను .రెండు సార్లు నా సహచరులు ఇండియా రాగానే మహాత్మాను కలిసి అక్కడి విషయాలు చెప్పమని ఉద్బోధ చేశారు .ఆయన ఒప్పుకుంటే మేము ధన్యులం .ఆయన నాకు మహా ఆరాధనీయుడు .ఆయనకు చెప్పకుండా నేను అక్కడి విషయాలు పబ్లిక్ కాని ప్రభుత్వానికి కానీ చెప్పాలనుకోవటం లెదు .ఆయన సౌతాఫ్రికాలో చేసినాద్భుతాలు అందరికి తెలుసు .ఆయన్ను చూడ లేకపోతున్నందుకు నేను ఎంత తపించి పోతున్నానో నాకు తెలుసు ‘’అన్నాడు
సహాయ నిరాకరణ మళ్ళీ మొదలు పెట్టటం శాస్త్రి వ్యతిరేకించాడు .గాంధీని ఎన్నో విధాలుగా ఉద్యమం మళ్ళీ మొదలు పెట్ట వద్దని నచ్చ చెప్పే ప్రయత్నం చేశాడు .చివరగా –‘’not to go back to the ‘’arid(శుష్క ) fields of non –cooperation’’అన్నాడు .ప్రభుత్వం పాటిస్తున్న కాఠిన్యాన్ని క్రూరత్వాన్నీ ఎండగట్టాడుకూడా .ప్రైం మినిస్టర్ రామ్సే మాక్ డోనాల్డ్ కు రెండు ఉత్తరాలు రాశాడు శాస్స్త్రి .అందులో పోలీసుల అనుష చర్యలను ఖండిస్తూ ఫెడరేషన్ విషయం వాయిదా వేయటం ఇండియా బంగారు భవిష్యత్తుకు విఘాతం అన్నాడు –‘’speed up speed up .The slowest machinery in the world is the Government of India reforming itself .Ordinances and lathis can only have a short day .during that short day the new order must be brought into being’’ అని ఘాటుగా మసాలా దట్టించి రాశాడు
1932 ప్రారంభం లో బ్రతిష్ ప్రభుత్వం ఇండియాకు మూడు స్పెషల్ ఎంక్వైరీ కమిటీలు పంపింది .అందులో ఒకటి స్వాతంత్రం కోసం ,రెండవది ఫెడరల్ నిర్మాణం ఫెడరల్ యూనిట్లమమధ్య ఆర్దికవిదానాలు.మూడవది .ఫెడరేషన్ లో రాజ సంస్థానాల ఆర్ధిక విషయాలు .1932 జూన్ 27న హౌస్ ఆఫ్ కామన్స్ లో శామ్యుల్ హోర్స్ ఒక ప్రకటన చేస్తూ రౌండ టేబుల్ పద్ధతిని పూర్తిగా మార్చేస్తూ కొత్తప్లాన్ గా సలహా సంఘాలను నియమిస్తున్నామని ,తర్వాత చర్చలు లండన్ లో జరగటానికి ఒక కమిటిని ఏర్పాటు చేయబోతున్నామని ‘’చెప్పాడు .ఈ కొత్త ప్లాన్ పై ఇండియాలో తీవ్ర వ్యతిరేకత వచ్చేసింది .ఆ కమిటీలో సభ్యులైన సప్రూ జయకర్ లు నిరసనగా రాజీనామా చేసి వైస్రాయ్ కి పంపారు .ఇండియాకు తీవ్రని ఆఘాతం జరిగిందని శాస్స్త్రి బాధ పడ్డాడు .కోదండ రావు కు జాబురాస్స్తూ –‘’ అంతా అయిపొయింది .డొమినియన్ స్టేటస్ కు దారి మూసుకుపోయింది ‘’అన్నాడు అభివృద్ధి కోరేవారంతా సప్రూ జయకర్ లను అనుసరించాలన్నాడు .లిబరల్ నాన్ కో ఆపరేషన్ ను మాత్రం సమర్ధించాడు .కొత్తప్లాన్ ను తిరస్కరిస్తూ మొదటి సంతకం పెట్టి ఇలా రాశాడు శాస్త్రి –‘’ప్రస్తుత పరిస్తితులలో తర్వాత చర్చలకు మన అందరి సహకారం కావాలి ‘’.ఆయన చెప్పిన లిబరల్ కో ఆపరేషన్ సత్ఫలితమిచ్చి రౌండ్ టేబుల్ ను ప్రభుత్వం పునరుద్ధరించింది .
సశేషం
మీ- గబ్బిట దుర్గాప్రసాద్ -28-7-23-ఉయ్యూరు

