రైటానరబుల్ ‘’శ్రీని వాస శాస్త్రి –48
17-8-1932 న బ్రిటీష ప్రధాని రామ్సే మాక్దోనాల్ద్ ఒక కమ్యూనల్ అవార్డ్ ప్రకటిస్తూ కేంద్ర ,రాష్ట్ర సభలలో ముస్లిం లకు ,అణగారిన తరగతువారికి కొన్ని వెయిటేజీ లను ఇచ్చాడు .ఈ ప్రత్యెక నియోజక వర్గాలనుంచి వారు తమ వోటర్ జాబితాల ఆధారంగా ఎన్నికకావచ్చు .కేంద్ర స్థానాలకు కూడా వారు పోటీ చేయవచ్చు.దీన్ని రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ లో గాంధీ పూర్తిగా వ్యతిరేకించాడు .మార్చి 11న గాంధీ యరవాడ జైలునుంచి శామ్యుల్ హోర్స్ కు ఉత్తరం రాస్తూ హరిజనులకు ప్రత్యెక నియోజక వర్గాలు ఏర్పాటు చేస్తే తాను నిరాహార దీక్ష చేస్తానన్నాడు .అన్నట్లుగానే సెప్టెంబర్ 20న దీక్షమొదలు పెట్టాడు .గాంధీ అనుయాయులు ,విమర్శకులు కూడా ఆయన ప్రాణహాని జరుగుతుందేమోనని కలవర పడ్డారు .వీరంతాకలిసి దీనికి పరిష్కారం ఆలోచించారు .త్వరత్వరగా చర్చలు జరిపారు .దీనికే ప్రాధాన్యమిచ్చారు .ప్రభుత్వం కూడా రాజీ చర్చలకు సిద్ధమైంది .ఒక పరిష్కారం కుదిరి ముందు హరిజనులకు ప్రైమరి ఎన్నికలు జరిపి ,ఆతర్వాత హిందువులందరికి జనరల్ ఎలెక్షన్స్ జరపాలని నిర్ణయించారు దీన్నే పూనా ఒడంబడిక అంటారు .నిరాహార దీక్ష ప్రారంభించే ముందు గాంధి శ్రీని వాస శాస్త్రికి ఉత్తరం రాశాడు అందులో ఆయన మనోవ్యధ పూర్తిగా అర్ధమైంది .శాస్త్రిపై ఆయనకున్న గౌరవం ప్రేమ అభి వ్యక్తమయ్యాయి .శాస్త్రిని అత్యంత స్నేహితుడిగా సోదరునిగా భావించాడు మహాత్ముడు .-‘’ఇది మంగళవారం తెల్లవారు జాము .మూడు దాటింది టైం.ఇప్పుడే ఒక చిన్న ఉత్తరం గురుదేవ్ టాగూర్ కు రాశాను .నా మానస కల్లోల సమయాలలో ఎప్పుడూ నువ్వు నాతోనే ఉంటావు .నీ ఆలోచనలు నాకు బాగా అర్ధమయ్యాయి .నీపై నాకున్న గౌరవంనీకు బాగా తెలుసు .మనం ఉత్తర దక్షిణ ధృవాలుగా ఉన్న, లేక ఉన్నట్లు కనిపించినా ,మన హృదయాలు కలిసే ఉన్నాయి .నేను ఎక్కడున్నా నీతో ఏకీభవిస్తా .అది నాకు సంతోషమే .ఇప్పుడు నేను తీసుకొన్న నిర్ణయం నీకు చివరి విలువైన విషయం.ఈగాయానికి నువ్వే మందు కనిపెట్టాలి .నేను విభేదాలకారణంగా మాపెద్దన్నయ్యకు పద్నాలుగేళ్ళు దూరంగా ఉన్నాను .ప్రతి ఏడూ ఆయన నన్ను శపిస్తూ రిజిస్టర్డ్ పోస్ట్ లో ఉత్తరాలు రాసేవాడు .ఆ తిట్లకు ఆనందించే వాడిని నేను .ఆయన తిట్లు శాపనార్ధాలు నాకు ప్రేమతోకూడిన దీవెనలు వరాలు .చివరకు నేనే గెలిచాను .ఆయన మరణానికి ఆరునెలల ముందు నేనే రైట్ అనినిండు మనసుతో ఒప్పుకున్నాడు తనదే తప్పు అన్నాడు .అసలు కారణం అస్పృశ్యత విషయం మాత్రమె మా ఇద్దర్లో తప్పు ఎవరిదో నాకు తెలియదు .కానీ శాస్త్రీ !నువ్వు నాకు రక్తబందువైన సోదరుడివి .ఈ విపత్కర సమయంలో నువ్వు ఊరికే ఉండద్దు నన్ను శపించు తిట్టు .నెలక్రితం నీ ఆరోగ్యం వాకబు చేస్తూ నీకు ఉత్తరం రాశాను .నీ నుంచి నాకు జవాబు రాలేదు .నా ఉత్తరం నీకు చేరిందో లేదో నాకు తెలీదు ‘’అని ఆవేదన తెలియజేశాడు మహాత్మా . కోయంబత్తూరు మునిసిపాలిటి శాస్త్రి జన్మదినం రోజున గాంధీ దీక్ష మూడవ రోజున చేసిన పౌరసన్మానం లో శాస్త్రి –‘’ఈ ఆందోళన కాలం లో ప్రైవేట్ గాకానీ పబ్లిక్ గాకాని ఏ రకమైన విషయాలు జరగవు .అందరి హృదయాలు యరవాడ సెంట్రల్ జైలు వైపే ఆదుర్దాగా చూస్తున్నారు ఏమి ప్రళయం జరుగుతుందో అని .మహాత్ముని అనుయాయులందరూ చాలా తీవ్రంగా కలత చెంది ఉన్నారు –Mahatma ‘s life it would be needless to say ,is lived as few lives in history or fable have been lived .It is of supreme consequence to our kind ,and he has now risked it in cause dear to all of us .’’పూనా నుంచి వస్తున్న వార్తలు ఆయన ఆరోగ్యం పై ఆశాజనకంగా ఉన్నందుకు సంతోషంగా ఉంది ‘’అన్నాడు పూనా పాక్ట్ పూర్తవగానే గాంధీ దీక్ష విరమించాడు .సెప్టెంబర్ 25 న గాంధీకి ఇచ్చిన టెలిగ్రాం లో శాస్త్రి –‘’Million homes rejoice and bless your superb service performed in your superb style .I confess I trembled in doubt ,but the result indicates and establishes your indisputably the foremost ‘’untouchable ‘’and ‘’un approachable;;.అని రాసిపంపాడు .25-9-1932 న మహాదేవ దేశాయ్ తన డైరీలో –‘’బాపుచాలా సంతోషంగా ఉన్నారు శాస్త్రినుంచి టెలిగ్రాం వచ్చిన తర్వాత .శాస్స్త్రి టెలిగ్రాం అందిందని బాపు రిప్లై టెలిగ్రాం ఇచ్చారు ‘’ శాస్త్రి మూడవ రౌండ టేబుల్ సమావేశానికి వెళ్ళటానికి వీలుగా ఆరోగ్యం జాగ్రత్తగా కాపాడుకొంటున్నాడు –The last piece of service to my mother land ‘’అన్నాడు .లిబరల్ ఫెడరేషన్ శాస్త్రికి ప్రెసిడెంట్ షిప్ ఇవ్వాలని ఆలోచించగా మర్యాదగా తిరస్కరిస్తూ తన శక్తియుక్తులు ఆరోగ్యం అన్నీ రౌండ్ టేబుల్ కు ఖర్చు పెడతానన్నాడు .1933లో ఆక్స్ ఫర్డ్ లో రోడ్స్ మెమోరియల్ లెక్చర్ ఆహ్వాని౦పబడ్డాడు. సర్ రాబర్ట్ బౌడెన్,జెనరల్ స్మట్స్ ఫ్రొఫెసర్ ఐన్ స్టీన్ లు అంతకుముందు ఆరు లేక్చర్సిచ్చారు .అత్యున్నత మైన ఈ ఆహ్వానాన్ని శాస్త్రి సున్నితంగా తిరస్కరించాడు కొంత ఆరోగ్యం కారణంగా కొంత గురువు సిపి రామస్వామి అయ్యర్ చెప్పిన ‘’Sastri’s mis –trust ‘’కారణంగా .ఈ ఆహ్వానం మరి రెండు సార్లు రెన్యు చేసి వచ్చినా ,మళ్ళీ తిరస్కరించాడు .రైట్ ఆనరబుల్ హెచ్ ఏ ఎల్ ఫిషర్ కూడా శాస్త్రిని తన ఆరోగ్యం ‘’Conserving his energy for the work in connection with the making of a Constitution for India ‘’అందుకే ఆయన ఆరోగ్యం పై కలత చెందినా బ్రిటీష ప్రభుత్వం ఆయన్ను మూడవ రౌండ టేబుల్ కాన్ఫరెన్స్ లో పాల్గొనే ప్రతినిదులజాబితాలో నుంచి తొలగించింది .దీనికి రెండు వారాలక్రితం లార్డ్ విల్లింగ్టన్ శాస్త్రిని ప్రెసిడెంట్ ఆఫ్ కౌన్సిల్ ఆఫ్ స్టేట్ ‘’గా మాన్క్రీఫ్ స్మిత్ స్థానంలో ప్రకటించాడు .తనకు బ్రిటీష క్రౌన్ కింద ఇలాంటి పని చేయటం ఇష్టం గౌరవప్రదమే అంటూ రాసిన ఉత్తరంలో ఏమి రాశాడో రేపు తెలుసుకొందాం సశేషంమీ –గబ్బిట దుర్గాప్రసాద్ –29-7-23-ఉయ్యూరు

