రైటానరబుల్ ‘’శ్రీని వాస శాస్త్రి -49

రైటానరబుల్ ‘’శ్రీని వాస శాస్త్రి -49

శాస్త్రిరాసిన ఒక ఉత్తరం లో –‘ఈ  ఆఫీసులో ముఖ్యమైన ఆకర్షణ ,సామాన్య ప్రజల దృష్టిలో తేలిక,సుఖవంతమైన గౌరవం .నవంబర్ లోవిల్లింగ్టన్ శాస్త్రికి  రాసిన  జాబులో –‘’మా మేనేజింగ్ కమిటీ అందులోని మెంబర్ ను చేర్చటానికి తీసేయ్యతానికి అధికారం పూర్తిగా ఉంది .వచ్చే సమావేశంలో మీ భావాలేమితో స్పష్టంగా చెప్పమని నిర్మొహమాటంగా అడుగుతున్నాను ,నేనూ మీ ఆరోగ్య విషయం లో ఆందోళనగా ఉన్నాం .అదీకాక ఇంకాప్రభావ శీలురను చేర్చుకొని వారిద్వారా సలహాలు పొందాలని అనుకొంటున్నాం . ఆ సమావేశానికి రెండు వారాలముందే మీరు ,రామస్వామి గారు ఇక్కడికి వచ్చి మీ సలహాలివ్వండి .మీరు ఉంటే నాకు దండి .మీ అభిప్రాయం ఏమిటో తెలియజేయండి ‘’విల్లీ తనకు కావాల్సిందే నేర్పుగా చేసేశాడు .దీనికి శాస్త్రి సూటిగా –‘’నాకు తెలిసిన సమాచారం ప్రకారం మెంబర్ల ఫైనల్ లిస్టు తయారైపోయింది .సభ్యుల సంఖ్య గణనీయంగా తగ్గించటానికి మీరు  నిర్ణయి౦చారుకనుక నాకు స్థానం కల్పించటం మీకు అసాధ్యమౌతుంది .నేను నిరాశపడిన మాట వాస్తవమే.న దేశానికి సేవ చేయాలనే నేను అనుకొంటున్నాను .నా ఆరోగ్యమూ బలహీనంగానే ఉంది .ఇంగ్లిష్ వాతావరణలో కొంత కుదుట పడవచ్చు .భగవంతుడు ఎవరి చేత ఎలాంటి సేవ చేయిస్తాడో ఎవరమూ ఊహించలేము ‘’అన్నాడు .వైస్రాయ్ కి రాస్తూఆయన కోరితే సహాయ పడటానికి సిద్ధమే ,ఈసంక్లిష్ట సున్నితమైన విషయంపై కొన్ని నియమాలకు కట్టుబడి ఉన్న గాంధీతో ఒకపరిష్కారానికి ప్రయత్నం చేసి ఒప్పిస్తాను .’’అన్నాడు  

  టోరి ప్రభుత్వం శాస్త్రి చింతామణి సేతల్వాడ్  బికనీర్ భోపాల్ మహారాజు మొదలైన వారిని వారు మొండిఘటాలని తమమాట వినరని కావాలనే లిస్టు లో తప్పించింది.చిక్కడు దొరకడు  అయిన జిన్నాను తప్పించింది  ,ఇంగ్లాండ్ లోని ప్రోగ్రెసివ్ వ్యక్తులకు శాస్త్రిని తప్పించటం నచ్చక నిరాశ చెందారు .14-10-1931మాంచెస్టర్ గార్డియన్ పత్రిక దీనిపై స్పందించి –‘’ఇది ఇంగ్లండ్లోని అనేకులకు లిబరల్స్ కు చాలా కలవరపరచే విషయం .’His wisdom and suavity (సునిశిత్వం )not to speak of his unsurpassed eloquence have been so great a part of previous Round Table Conferences ‘’అని శాస్త్రి రాక ఎంత అవసరమో చెప్పింది .సెలెక్ట్ కమిటి ఆఫ్ పార్లమెంట్ ముందు శాస్త్రి సాక్ష్యంచెప్పటానికి లండన్ కు ఆహ్వాని౦చ కపోవటం పై దిస్పెక్టేటర్ పత్రిక 28-4-1933 న –‘’శాస్త్రిని ఎందుకు ఇండియన్ లిస్టు లోనుంచి తప్పించారో కారణం చెప్పాలి .పద్నాలుగు ఏళ్ళ క్రితం  మాంటేగ్ ను ప్రపోజల్స్ పై డ్రాఫ్ట్ తయారు చేస్తుంటే నేను అడిగాను –‘’What Indian public man he regarded as the ablest and most effective co-operator  with this country ?’’Sastri ‘’he said without a moment’s hesitation .There is no man in all India whose counsel and cooperation the select committee would seek with greater advantage .Mr.Sastri had been assiduously and successfully husbanding his strength to enable him to discharge what might have been the crowning task of his long career of public service .It is both foolish and unjust thus to disregard him ‘’అని ప్తభుత్వానికి గడ్డిపెట్టింది

  మూడవ గుండ్ర బల్ల సమావేశ వాతావరణం  ఆశను హత్య చేసి కఠినంగా కన్జర్వేటివ్ గా మారిపోయింది .కన్జర్వేటివ్ ప్రభుత్వం వెంటనే ఇచ్చే ప్తోవిన్షియల్ అటానమి ని దూరం నెట్టి ఫెడరేషన్ ను వాయిదా వేసే ఆలోచనలో ఉంది .ఇండియా మహారాజులు ఫెడరేషన్ ను సమర్ధిస్తున్నారు .తేజ బహదూర్ సప్రూ ఇలాంటి ప్రగతి వ్యతిరేకులపి విరుచుకు పడ్డాడు .అత్యవసరంగా ఫెడరేషన్ ఏర్పాటు చేసి రాజులకు ప్రత్యెక రాజ్యాంగ కల్పించామన్నాడు .1933 లో శాస్త్రి గాంధీ తో నిత్యం సంబంధం తో ఉన్నాడు .సహాయనిరాకరణ ఆపమని కోరుతూనే ఉన్నాడు .గాంధి పూనాలోని యరవాడ జైలులో ఉన్నాడు పూనా సర్వెంట్స్ ఆఫ్ ఇండియాకు కేంద్రస్థానం కనుక మహాత్ముని కలవటం తేలిక .22-6-1933 శాస్త్రి వెంకటరామ శాస్త్రికి జాబురాస్తూ –‘’ఇవాళమహాత్ముడు చాలా సేపునాతో మాట్లాడారు .మహాదేవ దేశాయ్ అతని మేనల్లుడు కూడా ఉన్నారు .రెండు వారాలలో విల్లింగ్టన్ కు తానూ లెటర్ రాస్తానని ,హార్స్ ,ఇర్విన్ లను అతనికి సరైనా సలహ ఇవ్వమని  చెప్పమని నాకు చెప్పారు .విల్లింగ్టన్ పూర్తిగా తిరస్కరించక పోవచ్చు .ఈ విషయం రహస్యంగా ఉంచు మహాత్ముడు క్రమంగా కోలుకొంటున్నారు ‘’అని తెలియజేశాడు శాస్త్రి .అదే రోజు శాస్త్రి శామ్యుల్ హోర్స్ కు జాబురాశాడు  -‘’మహాత్ముడు కోలుకొంటున్నారు ఆరోగ్యం  కుదుట బడ్డాక  వైశ్రాయికతో ఇంటర్వ్యు కోసం  ఉత్తరం రాస్తారు.సమాధానం బహుశానిరాశ కలిగిస్తుందేమో నని భయంగా ఉంది .అలా జరిగితే దురదృష్టమే .ఇంటర్వ్యు జరిగితుందరికి మంచి జరుగుతుందని నమ్ముతున్నాం .ఇప్పుడున్న ప్రత్యెక క్లిష్ట అస్పష్ట పరిస్థితులలో గాంధీ –వైస్రాయ్ ల సమావేశం పూర్తీ స్వేచ్చావాతావరాణ౦న్ తో జరిగితే తర్వాత ఆమోదయోగ్యమైన సెటిల్ మెంట్ జరిగే వీలు౦టు౦ది .’’అనిరాశాడు

   సశేషం

మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -30-7-23-ఉయ్యూరు  

Unknown's avatar

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in పుస్తకాలు, సమీక్ష and tagged . Bookmark the permalink.

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.