శుభవార్త
భారత దేశ స్వాతంత్ర్యం కోసం జీవితాన్ని త్యాగం చేసి, స్వాతంత్ర్య సిద్ధికి మూల పురుషుడైన మహానుభావులలో ఒకరు ,తన అనర్గళ వాగ్ధాటితో సాటిలేని మేటి అనిపించుకోన్నవారు ,మహాత్మునికి ”బ్రదర్ అండ్ ఫ్రెండ్ ”ది రైటానరబుల్ వి .ఎస్.శ్రీనివాస శాస్త్రి గారి జీవితం పై తెలుగులో ఎవరూ పుస్తకం రాయలేదు .ఆయన శిష్యుడు ,ఆరాధకుడు శ్రీ టి.ఎన్ .జగదీశన్ ఇంగ్లీష్ లో రాసిన V.s.Srinivasa Sastri పుస్తకాన్ని భారతప్రభుత్వ పబ్లికేషన్ డివిజన్ ప్రచురించగా నేను ”రైటానరబుల్ శ్రీని వాస శాస్త్రి ” గా తెలుగులో స్వేచ్చానువాదం సరసభారతి బ్లాగ్ లో చేశాను . ఈ” డిజిటల్ పుస్తకాన్ని” శాస్త్రి గారి 155 వ జయంతి (సెప్టెంబర్ 22) సందర్భంగా అ మహనీయునికి భారత 76 వ స్వాతంత్ర్య దినోత్సవం 15-8-23న చంద్రునికో నూలుపోగుగా సరసభారతి ఆన్ లైన్ గా అంకితమిస్తోంది .
మీ -గబ్బిట దుర్గాప్రసాద్ -11-8-23-ఉయ్యూరు

