రైటానరబుల్ ‘’శ్రీని వాస శాస్త్రి -61

రైటానరబుల్ ‘’శ్రీని వాస శాస్త్రి -61

 మాటలో శాస్త్రి పాటలో లాగా మాధుర్యం చిదింస్తాడు .He was the master of ‘’the other harmony of prose ‘’.పీస్  శివ స్వామి ,సిపి రామస్వామి అయ్యర్ లు అసూయ పడతారనికానీ లేకపోతె ప్రపంచానికి ఇంగ్లిష్  ప్రోజ్ లో  మాస్టర్ పీస్ లు అందించి ఉండేవాడు .ప్రపంచానికి. తనేదో సందేశం  ఇస్తున్నానని ఎప్పుడూ బడాయి కబుర్లు చెప్పలేదు శాస్త్రి .అప్పుడప్పుడు మాత్రమె రాసేవాడు .అవి అరుదైన మొదటి తరగతికి చెందినవిగా  గుర్తింపు పొందాయి వీటినే ‘’బెల్లెస్ లెటర్స్ అంటారు .ఆయన రాసిన జ్ఞాపకాలు స్కెచెస్ ఆణిముత్యాలు .ఇవి ‘’ఆదర్ హార్మని‘’గా ,’’ది ధంమ్బ్ నైల్ స్కెచెస్ ‘’ వచనాలుగా ముద్రణ పొందాయి . దాదాభాయ్ నౌరోజ్ తో మొదలుపెట్టి తేజ్ బహదూర్ ,సి,పి రామస్వామి అయ్యర్ తో ముగించాడు వీటిని .ఈ వ్యాసాలలో మేధా పటుత్వం అత్యున్నత స్థాయిలో ఉంటుంది .ఆయన రాసిన ఉత్తరాలు ‘’లెటర్స్ ‘’గా ముద్రణ పొందాయి .వక్తలు చాలామంది ఉన్నారుకాని శాస్త్రి అరుదైన లేఖక రచయిత అన్నాడు సిపి రామస్వామి అయ్యర్ .వాటిలో శాస్త్రి విద్వత్తు చురుకు తనం చెణుకులు విపరీతమైన ప్రశంసలు పొందాయి .గాంధీ ‘’మై ఎక్స్ పెరిమెంట్స్ విత్ ట్రూత్ ‘’కు  నెహ్రు ‘’ఆటో బయాగ్రఫీ ‘’కి ఎంత విలువున్నదో ‘’లెటర్స్ ఆఫ్ శ్రీనివాస శాస్త్రి ‘’కి అంతటి గౌరవం ,విలువ ఉంది.ఈ పుస్తక రచయితకు  ఒక స్నేహితుడు జాబు రాస్తూ –‘’శాస్త్రి లెటర్స్ తనివి తీరా ఆనందాన్నిఇస్తున్నాయి .ఆయనలోని అపార ప్రజ్ఞా,మేధస్సు అనుకంప ప్రపంచానికి చాటాయి .ఆయన వ్యక్తిత్వం వాదనాపటిమ ,సహిష్ణుత వ్యక్తం చేశాయి .

   జీవిత చరమ సంధ్యలో శాస్త్రి ‘’సర్ ఫిరోజ్ షా మెహతా అండ్ హిజ్ టైమ్స్ ‘’పై ప్రసంగాలు ఇచ్చాడు ఈ సంకలనం లో శాస్త్రి వివిధ వ్యక్తులతో పొందిన అనుభవం ,ఆనాటి సమస్యలపై అవగాహన ,పరిపూర్ణ ప్రజ్ఞా ద్యోతకమౌతాయి .ఇండియన్ సోషల్ రిఫార్మర్ కు చెందిన విమర్శకుడు కే.నటరాజన్ ‘’It is invaluable source book for future writers on the history of Indian politics in the last three quarters of this century ‘’అని మెచ్చాడు .అంత్యకాలం లో శాస్త్రి చాలాపవిత్రమైన , ఎన్నో ఏళ్ల నుంచో చేయాలనుకొన్న గొప్ప కార్యక్రమం నిర్వహించి జీవితం ధన్యం చేసుకొన్నాడు .అదే మద్రాస్ మైలాపూర్ కాలేజీలో ఆయన రామాయణం పై చేసిన ప్రసంగ పరంపర .దీన్ని ‘’Immortal product of  the human mind ‘’అన్నారు .మానవ స్వభావంలోని వివిధ కోణాలను ఈ ఉపన్యాసాలద్వారా ఆయన ఆవిష్కరించాడు .ప్రొఫెసర్ కే .శ్రీనివాస అయ్యంగార్ ఈ ఉపన్యాసాలు –‘’Constitute his major achievements  as a humanist ,as a scholar ,and as an artist in words who wielded the English language with such ease and sureness and sense of purpose.They reveal a Bradleyan   sweep and subtlety of analysis and an utter mastery of the material ‘’ అని కీర్తించాడు .

  శాస్త్రి రామాయణ ఉపన్యాసాలలో రామాయణ పాత్రలు అసలైన మానవులులా తమ స్వరూప స్వభావాలను ఎలా ప్రదర్శించారో మొదటి ఉపన్యాసంలోనే చెప్పాడు .తర్వాత జరిగిన మలుపులు వివరించాడు .మహర్షి వాల్మీకి మానవ స్వభావాలను కాచి వడబోసి మన ముందు ఉంచుతాడు .మనిషిలో ఉత్తమ విలువలను నాశనం కాని ఉత్తమ ధర్మాలను ఆపాత్రలద్వారా వ్యక్తం చేయించి మార్గదర్శనం చేశాడు. .షేక్స్పియర్ నాటక పాత్రలు లాగా  రామాయణంలోని రాముడిని సీతను  భావించలేదు .వారిలోని పవిత్రత ప్రతి ఘట్టం లోను దర్శి౦పజేశాడు .సీతా పరిత్యాగం లాంటి సందర్భాలను వివరిస్తున్నప్పుడు ఆయన నిజంగా కన్నీరు మున్నీరుగా విలపించేవాడు .ధర్మమే సర్వోత్క్రుష్టం అని నమ్మాడు .రామాయణ ప్రవచన పర౦పరల చివర యధావిధిగా శ్రీరామ పట్టాభి షేకం  చేయించేవాడు .ఆసందర్భంగా మాట్లాడుతూ ‘’మనకందరకు ఇప్పుడు రామ పట్టాభి షేకం జరిగినందుకు పరమానందంగా ఉంది..ఇది బాహ్యంగా మాత్రమె జరగటం కాదు .మన అంతరంగాల్లో సీతారాములకు పట్టాభి షేకం జరగాలి .ఆపవిత్ర జంట మన మన ఆలోచనలను ,జీవితాలను చక్కగా పాలన చేయాలి మనల్ని ఉత్తముల్ని చేయాలి .ప్రతి సందర్భంలోనూ వారిని గుర్తు చేసుకొంటే మనం దారి తప్పి ప్రవర్తిచం .ఇదేదో సెంటిమెంట్ గా చెప్పటం లెదు నిజమైన ఆత్మ భావన ఇది .సీతారాములపై రైటానరబుల్ శ్రీని వాస శాస్త్రికి ఉన్న విధేయత నివాళి ఆరాధన మహాత్మాగాంధీకి వారిపై ఉన్నదానికంటే తక్కువ ఏమీ కాదు .

                మహోన్నత మనీషి శాస్త్రి

నిరుపేద కుటుంబలో జన్మించిన శ్రీనివాస శాస్త్రి ఉత్తమ సంస్కారం  వివేచనా ,అత్యుత్తమ నడవడిక ,అపార మేధస్సు ఆర్జించిన మహానుభావుడు .ఆయన బాహ్య స్వరూపమే ఆయన అంతరంగాన్ని ఆవిష్కరిస్తుంది .ఆయన వస్త్రధారణలో పరిశుభ్రత ,హుందాతనం ,ఆకర్షణ గోచరిస్తాయి.ఇవన్నీ ఆయనను అత్యున్నత స్థాయికి చెందిన రాయబారిగా చేయటానికి తోడ్పడ్డాయి .రాజకీయ వేత్త ను చేశాయి –‘’To win the applause of listening senates’’ అయ్యాయి .ఆయన వ్యక్తిత్వం ప్రైవేట్ లోనూ పబ్లిక్ లోనూ ఒకే రక౦గా ఉండటం ప్రత్యేకత .ఆయన మంచి విధ్యుక్తధర్మం నిర్వహించిన తనయుడు తండ్రికి తల్లికి .బాబాయిలకు సోదరులకు ఆత్మీయుడు ,మనుమలను మనుమరాళ్ళను  బాగా ప్రేమించిన తాతయ్య .ఇంటి వ్యవహారాలలో చాలా ఉదాత్తంగా ఉన్న  గృహస్తు .’’క్రూర సముద్రాలు ‘’‘’ఆయనను ఆయన కుటుంబానికి అనేక సార్లు దూరం చేసినా వారందరిపై తరగని ప్రేమాభిమానాలు చూపిస్తూ తరచుగా యోగ క్షేమాలు తెలుసుకొంటూ వారి సంక్షేమాన్ని చూసిన ఇంటి పెద్ద .కుటుంబం లోని ప్రతి వారినుంచి హృదయ పూర్వకమైన ప్రేమాభిమానాలు పొందిన గొప్ప అదృష్ట వంతుడు శాస్త్రి .

    సశేషం

మీ-గబ్బిట దురాప్రసాద్ -13-8-23-ఉయ్యూరు .

Unknown's avatar

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in పుస్తకాలు, సమీక్ష and tagged . Bookmark the permalink.

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.