ఆంధ్ర కవితా విశారద ,కవిజన తిలక శ్రీమాన్ నల్ల౦తి ఘళ్ చక్రవర్తుల ఠంయాల లక్ష్మీ నృసింహా చార్య కవినాధుని –ముకుంద శతకం
దీనిని వరంగల్ శ్రీ వేంకటేశ్వర భక్తసమాజం ద్రవ్యసాయంతో శ్రీమాన్ ప్రతాపం రామానుజా చార్యుల వారి శ్రీ వేంకటేశ్వర ముద్రాక్షర శాలలో 1928లో ముద్రించారు .వెల –రెండు అణాలు .
విజ్ఞాపనలో అల్పజ్ఞులకోసం కవి గారు ఈశతకం రాశారని ఇది కాక కొన్ని ప్రబంధాలుకూడా రాశారని.ఈ శతకం లో శ్రీకృష్ణాస్టోత్తర నామాలు పొందు పరచటం విశేషమని చెప్పారు. కవి గారిఇతర రచనలు-శుద్ధాంధ్ర నిర్గావ్య నిర్యోష్ట్య కేకయ రాజ నందన చరిత్ర ,అచ్చ తెనుగు కృష్ణాకుబ్జా విలాసం ,నిర్యోష్ట్య కౌంతేయ చరిత్ర ,నిర్వచన శుభాన్గీకల్యాణ౦ , ,యోగ భూషణోపాఖ్యానం మొదలైనవి అని విద్వాన్ ఇర్కమేటి ఆఫ్ శ్రీ వైష్ణవ శ్రీ ప్రతాప రంగాచార్యులు తెలియజేశారు .ఈ కంద శతకమకుటం –‘’వేల్పు గొండ ముకుందా ‘’
మొదటిపద్యం –‘’శ్రీ కమలాకుచయుగబా-హ్లీకా గురు చందనాది లిప్త రుచిర.వ-క్షాకలిత లోకనాయక –(శ్రీ కృష్ణా )వేల్పు గొండ సీమ ముకుందా ‘’.తర్వాత ‘’న్యగ్రోధ పత్రశయన స-మగ్ర కుశల గుణ సమూహమధితారి మహా-విగ్రహ లీలామానుష –శ్రీ వేల్పుగొండ వేశ్మ ముకుందా . అలాగే ‘’గ్లౌ బింబ సమముఖ విలాసా ,నాగాధిరాజ శయనా ,నాగాశన వాహ,చంద్రాతప వజ్రశరా,హత రిపు గుల్మా ,భాస్కర సమ జాజ్వల్యా ,హర్యక్ష శౌర్య సురగిరి ధైర్య ,మా స్త్రీ మణి హృద్ధర ,ఉద్ధవ బోధనాచార్య ,విఘ్నాధిప నుతపాదా,వ్రజజన పాలక ,వ్యుష్ట(సూర్య )కర తేజా,విశుష్మ భుజారిహ ,శ్రియాముష్మక కారణ,పంచ జన పంచ వదనా (నారసింహ ),ప్రీహవ్యవాహ తేజా ,అంటూ ముకుంద నామాలు చక్కగా ,కొన్ని కొత్తగా కందాల్లో అందం గా పలికారు భక్తకవి ఆచార్యశ్రీ .చివరి నూటపదకొండవ మత్తేభ పద్యం లో ‘’జలజాక్షి ద్విరదాబ్జ సంఖ్య గత శాలివాహప్లవంగ ల సన్మాధవ శుద్ధ షష్టి నాడు ‘’కవి స్వామికి అ౦కిత మిచ్చానని చెప్పుకొన్నారు .
ఇంతకు ముందు విననిపేరు కవిగారిది .కొత్తగా ఉంది-నల్ల౦తి ఘళ్ చక్రవర్తుల ఠంయాల లక్ష్మీ నృసింహా చార్య .ఆయన రాసిన రచనలు మహాపండితుడని తెలియ జేస్తున్నాయి .కొంచెం కృతకంగాఉందని పించింది కవిత్వం .ఏమైనా ఒకకొత్తకవిని కొత్తశతకాన్ని పరిచయం చేసే అదృష్టం నాకు దక్కింది .
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -17-8-23-ఉయ్యూరు

