నమో నమో నటరాజ -1
శ్రీ సి.వి శివరామ మూర్తి ఆంగ్లరచన ‘’Nataraja in art thought and literature ‘’అనే బృహద్గ్రంథానికి నా స్వేచ్చాను వాదంగా ‘’నమో నమో నట రాజ ‘’పేరిట సాహితీ బంధువులకు వినాయక చవితి పర్వదిన సందర్భంగా ధారా వాహిక గా అందజేస్తున్నాను .మనకు తెలియనివిషయాలు తెలుసుకోవటమే ఇందులో ముఖ్య ఉద్దేశ్యం .ఈ పుస్తకాన్ని న్యు ఢిల్లీ లోని నేషనల్ మ్యూజియం 1974లొ పండిత జవహర్లాల్ స్మృతి చిహ్నంగా ప్రచురించింది .
మహా కవి మేధావి విమర్శకుడు అప్పయ్య దీక్షితుల శ్లోకం –
‘’మౌళౌగంగా శశా౦కౌ,కరచరణ తలే కోమలా౦గా భుజంగా –వామే భాగే దయార్ద్ర హిమగిరి తనయా చందనం సర్వ గాత్రే –ఇదం శీతాం ప్రభూతాం తవ ‘’కనక సభా నాథ’’ వోఢుంక్వ శాక్తిస్ –చిత్తే నిర్వేద తప్తే యది భవతి నటే నిత్య వాసో మదీయే ‘’ .
భావం –నీ శిరసుపై చల్లని గంగాప్రవాహం శీతల చంద్రుడు ,నీ హస్తాలు పాదాలపై ,నాజూకైన చల్లని సర్పాలు ,నీ వామ భాగం లొ హిమగిరితనయ ,దయా శీకరాలు కురిపిస్తూ ,నీ శరీరమంతా చల్లని చందనం తో అలరారుతూ ‘’కనక సభా మధ్యమం ‘’లొ కొలువై ,ఇన్ని రకాల చల్లదనాన్ని భరిస్తూ ,నాహృదయంలో శాశ్వతంగా ఉండకపోతే నిరాశ జ్వాలల్లో మండిపోతాను .
సశేషం
శ్రీ వినాయక చవితి శుభా కాంక్షలతో
మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -17-9-23-ఉయ్యూరు

