పంచ రత్నాలు ,పంచామృతాలు
నిన్నమంగళ వారం సాయంత్రం గుడికి వెళ్ళే ముందు ఒక పార్సిల్ వస్తే చూడకుండానే గుడికి వెళ్ళి వచ్చి ,భోజనం తర్వాత మర్చి పోయి పడుకొని ఇవాళ ఉదయం చూశాను .అది హైదరాబాద్ నుంచి శ్రీ తురగా కృష్ణ కుమార్ పంపిన అయిదు పుస్తకాల పార్సిల్. ఆయనెవరో నాకు తెలీదు .ఎలా పంపారో అర్ధం కాలేదు .ప్రవీణ్ ఆని పిలువబడే శ్రీ తురగా కృష్ణ మోహన్ బాగా తెలుసు ఆయన రచనలూ ఇష్టంగా చదివిన వాడిని .నారాయణ రెడ్ది గారు సినీ రంగ ప్రవేశం చేసినప్పుడు ‘’సినీ కినారే సినారె ‘’అనే శీర్షికతో ఆంధ్ర పత్రికలోనో ప్రభలోనో రాసిన విషయం ఇప్పటికీ గుర్తు ఉంది సునిసిత హాస్యానికి కేరాఫ్ అడ్రస్ ప్రవీణ్ .ఆయన భార్య జానకీ రాణి గారు నిలువెత్తు భారతీయతకు దర్పణం .మచిలీ బందరులో జన్మించి కేంద్ర ప్రభుత్వోద్యోగం చేసి ,హైదరాబాద్ రేడియో కేంద్రం ప్రొడ్యూసర్ గా ,అసిస్టెంట్ స్టేషన్ డైరెక్టర్ గా పని చేశారు .బాలలకోసం ఎన్నో కార్యక్రమాలు చేబట్టిన విదుషీమణి .కృష్ణా జిల్లా రచయితల సంఘ కార్య క్రమాలకు వచ్చేవారు .మూడు నాలుగు సార్లు చూశాం నేనూ మా శ్రీమతీ ఆమెను .
ఇవాళ ఉదయం 7-30కి ,మళ్లీ 9-15కు తురగా కృష్ణ కుమార్ గారికి ఫోన్ చేసి పుస్తకాలు అందాయని చెప్పే ప్రయత్నం చేస్తే ఆయన లిఫ్ట్ చేయలేదు .యధా ప్రకారం ఉదయం 9-30 కు లైవ్ ప్రారంభించేముందు ఆయనకు మెసేజ్ పంపుతూ పుస్తకాలు అందాయని ,చాలా విలువైన పుస్తకాలుగా కనిపించాయని అంగీకరిస్తే ,వాటిని లైవ్ చేయాలని ఉందని రాసి ,లైవ్ మొదలు పెట్టాను .అయిదునిమిషాలలోనే ఆయనేనాకు ఫోన్చేసి మాట్లాడగా ,లైవ్ తాత్కాలికంగా ఆపేసి , నాగురించి ఎలా తెలుసు ఆని అడిగిత తాను రెగ్యులర్ గా నా ప్రోగ్రామ్స్ మన గుడి విషయాలు ఫాలో అవుతు౦టానని చెప్పగా ,సంతోషించగా మీ పుస్తకాలు లైవ్ చేయాలని ఉంది అనుమతిస్తే అనగా తప్పకుండా చేయమని చెప్పారు .అప్పుడు తురగా కృష్ణమోహన్ ,జానకీ రాణి గార్లు బంధువులా ఆని అడిగితె ,వారి గురించి తెలీదని చెప్పగా’’ అవాక్కయ్యా’’ను .తమది తణుకు దగ్గర గ్రామం అనీ ,తాతగారు శ్రీ తురగా కృష్ణమూర్తి గారు గొప్ప సాహిత్య జీవి అనీ ఆవారసత్వం తనకు వచ్చి ఈ మధ్యనే అంటే 2024 మార్చి లోనే ఈ పుస్తకాలు ప్రచురించానని అందులో ‘’వ్యాస రత్నాకరం’’ అనే పేరిట మూడు పుస్తకాలు ప్రసిద్ధి చెందిన సాహితీ మూర్తుల వ్యాసాలను ప్రచురించి తమ తాతగారికే అంకితం చేశానని చెప్పారు .ఇది రత్నాకరం కనుక తవ్విన కొద్దీ అనర్ఘ రత్నాలు బయటపడుతాయి వచ్చిన వాటిని పుస్తకాలుగా కుమార్ తెస్తారు ఆని పించింది .దీనికి ప్రేరణ ఉత్సాహం ప్రాచార్య శలాక రఘునాధ శర్మ ,గురు సహస్రావధాని డా .కడిమెళ్ళ వర ప్రసాదరావు ,ఆచార్య బేతవోలు రామ బ్రహ్మం వంటి వారున్నారనీ చెప్పారు .ఇందులో మిత్రుడు డా టేకు మళ్ళ వెంకటప్పయ్య రాసిన విలువైన వ్యాసాలు ఉండటం ఆనంద దాయకం ఆని చెప్పాను .మిగిలిన రెండు పుస్తకాలలో ఒకటి ‘’ప్రాచీనాంధ్ర సాహిత్యం లో శ్రీ విఘ్నేశ్వర స్తుతి పద్యాలు ‘’.దీని కూర్పు రచన శ్రీ జీడిగుంట విజయ సారధి .రెండవ పుస్తకం కడి మెళ్ళ వారి ‘’తప్పు కాదు!’’శతకం .ఈ పంచ రత్నాలు ,పంచామృతాలే .కొద్దికాలం లోనే వీటిని సరస భారతి ప్రత్యక్ష ప్రసారం లో వీక్షించగలరు .అప్పటిదాకా కాస్త ఓపిక పట్టమని మనవి.
కృష్ణకుమార్ ఇలానే సాహితీ సేవ కొనసాగించాలని కోరుతున్నాను .
మీ- గబ్బిట దుర్గా ప్రసాద్ -3-7-24-ఉయ్యూరు .

