కేసరి గారి ‘’గృహ లక్ష్మి స్వర్ణ కంకణ ‘’‘’పురస్కారం పొందినకవయిత్రి –కవితా విశారద శ్రీమతి గుడిపూడి ఇందుమతీదేవి
1889లో గుంటూరు లో శ్రీ మతుకు మల్లి నారా హర్యాక్ష శాస్త్రి ,శ్రీమతి అనంత లక్ష్మి దంపతులకు జన్మించింది ఇందుమతీ దేవి
విజయవాడలో శ్రీ గుడిపూడి రామారావు గారిని వివాహమాడి స్థిరపడింది .పడవ ఏటనే కవితలు రాయటం ప్రారంభించింది .నీతి తారావళి ,తరుణీ శతకం,సీతారాముల పాటలు ,మంగళాద్రి శతకం ,రాజేశ్వరి శతకం ,అంబరీష విజయం మొదాలైనవి పట్టు విడవకుండా రాసి మంచి ప్రసిద్ధి పొందింది .ఆమె రచనలు నీతి బోధించేవిగా ,ప్రబోదాత్మకంగా నైతిక విలువలు పెంచేవిగా ఉంటాయని ప్రముఖ బాలసాహిత్య కర్త గ్రంధాలయ ఉద్యమ నాయకులు శ్రీ వెలగా వెంకటప్పయ్య రాశారు .
అన్నవరం జమీందారు శ్రీ మంత్రి ప్రగడ భుజంగరావు గారు ఇందుమతీ దేవిని ఆహ్వాని౦చి ఆస్థానం లో ఘన సన్మానం చేశారు .తర్వాత ప్రసిద్ధ పత్రికా సంపాదకులు శ్రీ కె.ఎన్ . కేసరి తాము స్థాపించి అందజేస్తున్న గృహలక్ష్మి స్వర్ణ కంకణం ణు ఇందుమతీదేవికి అందించి సత్కరించారు .
ఇందుమతీ దేవికి కవితా విశారద ,మధుర కవయిత్రి బిరుదులూ లభించాయి .1960ఆగస్ట్ 16న విజయవాడలో ఇందుమతీదీవి షష్టి పూర్తి మహోత్సవం శ్రీమతి చుండూరు కనకలక్ష్మమ్మ గారి అధ్యక్షతన కన్నుల పండువుగా జరిగినట్లు వెలగా చెప్పారు .సన్మాన సంచిక కూడా ప్రచురించారు .
ఇంతకంటే వివరాలు దొరకలేదు ఆమె ఎప్పుడు చనిపోయారో కూడా తెలియదు .
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -24-9-24-ఉయ్యూరు .

