శ్రీ సువర్చలా౦జనేయస్వామి దేవాలయం లో ధనుర్మాస ఉత్సవాలు
17-12-24 శ్రీ క్రోధినామ సంవత్సర మార్గశిర బహుళ విదియ మంగళవారం (తెల్లవారితే మంగళ వారం )నుంచి 13-1-2025 భోగి సోమవారం వరకు ధనుర్మాస సందర్భంగా ఉయ్యూరు లోని శ్రీ సువర్చలా౦జనేయ స్వామి వారి దేవాలయంలో ప్రతి రోజూ ఉదయం 5గం .లకు సుప్రభాత సేవ ,గోదాదేవి’’ తిరుప్పావై’’ ,కులశేఖర ఆళ్వారుల’’ముకుందమాల ‘’పఠనం ,శ్రీ సుందర కాండ పారాయణం ,ఉదయం 5-30గం లకు శ్రీ సువర్చలా౦జనేయ స్వామి వారలకు ,అష్టోత్తర సహస్రనామార్చన ,శ్రీ గోదా, రంగనాథ స్వామి వారలకు అష్టోత్తర పూజ,.ఉదయం 6-30గం లకు నైవేద్యం ,హారతి ,మంత్రపుష్పం , తీర్ధ ప్రసాద వినియోగం జరుగును .భక్తులందరూ పాల్గొని తరించ ప్రార్ధన.
ప్రత్యేక కార్యక్రమాలు
1-1-2025 -బుధవారం –నూతన ఆంగ్ల సంవత్సరాది సందర్భంగా స్వామి వారలకు ఉదయం 5-30గం లకు ‘’లడ్డూ లతో ‘’ప్రత్యేక పూజ ,అనంతరం భక్తులకు లడ్డు ప్రసాద వినియోగం .
9-1-25- గురువారం –ఉదయం 5-30గం లకు స్వామివార్లకు –‘’అరిసెలతో’’ ప్రత్యేకపూజ ,ప్రసాద వినియోగం .
10-1-2025-శుక్రవారం –వైకు౦ఠ ఏకాదశి (ముక్కోటి ఎకాదశి )సందర్భంగా ఉదయం 4 గం .లకు స్వామి వారలకు ప్రత్యేకపూజ ,ఉదయం 5గం లకు’’ ఉత్తరద్వార దర్శనం’’ .
11-1-25 –శనివారం –ఉదయం -5-30 -శ్రీ ఆంజనేయస్వామి ‘’మూల విరాట్’’ కు ‘’వెన్నతో అభిషేకం’’.
13-1-25-సోమవారం –భోగి పండుగ –ఉదయం 5-30గం లకు –స్వామివార్లకు ‘’శాకంబరీ పూజ ‘’(వివిధ కాయగూరలతో పూజ )
ఉదయం -9-30 గం లకు –శ్రీసువర్చలా౦జనేయ ,శ్రీగోదా రంగనాథ స్వామి వారలకు ‘’ శాంతి కళ్యాణ మహోత్సవం’’ .
14-1-25-మంగళవారం –మకర సంక్రాంతి
15-1-25-బుధవారం –కనుమ పండుగ
గబ్బిట దుర్గాప్రసాద్ –ఆలయ ధర్మకర్త
మరియు భక్త బృందం
15-12-24 –ఉయ్యూరు .
