హాసన్ గారికి -ఇవాళ పెన్షనర్స్ డే నుఘనంగా నిర్వహించినందుకు మీకు మీ కార్యవర్గానికి అభినందనలు .సీనియర్ సిటిజన్స్ కు సన్మానం కూడా ఘనంగా చేశారు సహకరించిన ప్రసాద్ మిగిలిన దాతలు సంఘానికి అభినందనలు నాకు కూడా అ భాగ్యం కలిగించి నందకు ధన్యవాదాలు .జమా ఖర్చులు పూర్తి వివరాలతో అందించి మార్గదర్శకం చేశారు .అది లేకపోవటం వలననే పాత సంఘం భ్రస్టు పట్టి పోయిందని గుర్తించారు సంతోషం ..స్పందన బాగా ఉంది ఉత్సాహంగా రిటైరీలు రావటం శుభ సూచకం అయితే వేదిక మీద బానర్ లో ,జ్ఞాపికలమీద ”పెన్షనర్స్ దినోత్సవ పితామహుడు ”ఆని రాయించారు .స్వాతంత్ర్య దినోత్సవలేకరిపబ్లిక్ దినోత్సవ లేక ఆంధ్ర రాష్ట్రావతరణ దినోత్సవ పితామహుడు నాకు తెసినంత వరకు ఎవరూ లేరు .పెద్దలను సంప్రద్దించి మార్పుచేయండి .పెన్షనర్స్ దినోత్సవ సంస్మరణీయుడు అనచ్చు .దినోత్సవానికి పితామహుడు పిత ఉండరు .మరొక్కమారు మీ అందరికి అభినందనలు -గబ్బిట దుర్గా ప్రసాద్ -17-12-24-ఉయ్యూరు


