సరస్వతీ కటాక్షం తప్ప లక్ష్మీ కటాక్షం లేని ఇంట్లో పుట్టి ,రాత్రి పూట భోజనం ఎరగక, హార్వర్డ్ యూని వర్సిటి తొ సహా అన్ని పరీక్షలు డిస్టింక్షన్ లో పాసై ఫార్మసి కంపెనిలో కెన్యాలో లో నెలకు 25 వేల అత్యధిక జీతం తొ ప్రారంభించి రెండేళ్లలో 190 దేశాలలో బ్రాంచ్ లునెలకొల్పి ఇప్పుడు నెలకు కోటి రూపాయల జీతం తొ సియివో గా ఉన్న శ్రీ సర్వేపల్లి రాధాకృష్ణ గారి మనవడు డా .సుబ్రహ్మణ్య శర్మ-3(చివరిభాగం )
పాస్ పోర్ట్ వీసా టికెట్ అన్నీ ఏర్పాటు చేసి బొంబాయి నుంచి కెన్యాకు పంపారు శర్మగారిని .పెద్ద ఇల్లు ఇచ్చారు అందులో ఉంటూ ఆఫీస్ సెటప్ చేయాలి అన్నీ ఆయనే చూసుకోవాలి .ఇంటర్వ్యూలు చేయాలి .అప్పటికి ఆయనకు ఆ అనుభవమే లేదు .ఆక్కడి జనాల సరాసరి ఎత్తు కనీసం 6అడుగులు .ఒక్కడే కొడుకు ఇంటి బాధ్యతలు తీసుకోవాలి అలాంటి వాడు అంతదూరం వెళ్లటం అంటే తలిదండ్రులు జీర్ణించుకోలేక పోయారు కానీ డబ్బు అవసరం కనుక ఏడ్చి సర్దుకు పోయారు .కట్టుకోటానికి ఒక జత ఉతుక్కోతానికి ఒక జత తొ మాత్రమె కెన్యాకు వచ్చారు .రోజూ చాలా దూరం ప్రయాణం చేయాల్సి వచ్చేది .బ్రెడ్ తప్ప ఏదీ తినే వారు కాదు శర్మాజీ .అక్కడి వాళ్ళకు ఇంగ్లీష్ రాదు. ఈయనకు అక్కడి భాష తెలియదు .అంతా మూగ సంజ్ఞల ద్వారానే కమ్యూని కేషన్.జీతం మాత్రం నెలకు పాతిక వేలు అదొక్కటే ఆకర్షణ .
అక్కడి నుంచి పాకిస్తాన్ తప్ప ప్రపంచంలో అన్ని దేశాలు తిరిగారు శర్మగారు .ఒక చేత్తో బాగ పట్టుకోవట జై పరమేశ్వరా అంటూ పరిగెత్తటం.అలా 17ఏళ్లలో భూ ప్రపంచం అంతా చుట్టేశారు .కెన్యా మనుషులకు అలసట తెలీదు ఎంత పని అయినా ఇట్టే చేసి పారేసేవారు. వాళ్ళకూ డబ్బుకావాలి. చక్కగా ముట్టేది పనికి తగిన జీత౦ .అందుకే సంతోషంగా పని చేసే వారు .అక్కడ నల్లవాళ్ళకు నల్ల వారే పని ఇస్తారు .ఉండటానికి ఇళ్ళు లేవు వారికి .చెట్టు కిందే కాపురం .ఎప్పుడు ఎవడు వచ్చి చంపుతాడో అనే భయం తొ బతికారు శర్మగారు .ఆకలి తెలిసిన వాడు నొప్పి తెలిసిన వాడు ఎంత పనైనా చేయగలదు .అలా కష్ట పడ్డారు దేశం కాని దేశం లో .సాయంత్రం ఆరు దాటితే బయట తిరిగే అవకాశం లేదక్కడ .
‘’సన్ ఫార్మసి లో నేను ఒక సన్-అంటే కొడుకు ను ‘’అంటారు శర్మ .దానికి గ్లోబల్ వైస్ ప్రెసిడెంట్ అయ్యారు .ఇండియాలో అతి పెద్దకంపేని .తర్వాత ఫైజర్ అనే ప్రపంచం లో అతి పెద్దకంపేని సియివో అయ్యారు .అప్పుడే రెడ్డిస్ లాబ్ కళ్ళు తెరుస్తోంది గ్లాస్గో కంపెని ఎదిగింది .కనుక వరల్డ్ రాన్కింగ్ లో రెండు టాప్ కంపెనీలలో పని చేశారు .సన్ ఫార్మా ను ప్రపంచం అంతా190దేశాలలో రెండేళ్లలో వ్యాపింప జేశారు శర్మాజీ .రోజుకు సరాసరి 2000కిలోమీటర్లు ప్రయాణించారు .20లేక 30 సీటర్ల ఎయిర్ క్రాఫ్ట్ లలో ప్రయాణం .ఇక్కడ మన టెంపో లాగా .జీవితం మీద ఆశవదిలి ఆశయాల కోసం తిరిగిన రోజులు అవి అన్నారు శర్మగారు .ఇవాళ ఆయన జీతం నెలకు సుమారు కోటి రూపాయలు .ఎంత నిమ్నస్థాయి నుంచి ఎంత ఉన్నతస్థాయికి ఎదిగారో డా సుబ్రహ్మణ్య శర్మ గారి జీవితం అందరికి ఆదర్శ ప్రాయం .కష్టే ఫలీ అనేది ఆయనదీ మనదీ సిద్ధాంతం కావాలి .
మీ -గబ్బిట దుర్గాప్రసాద్ -14-7-25-ఉయ్యూరు

