శ్రీ పత్తిపాటి వారి పంచామృతాలు

శ్రీ పత్తిపాటి వారి పంచామృతాలు

15-3-26 సరసభారతి ఉగాది వేడుకలలో పాల్గొని , దత్తత్రేయశర్మ ,,’’కుర్రావధాని’’చి.యర్రం శెట్టి వారితో కలిసి మాఇంటికి వచ్చి ,సత్కరించి ,తాను రాసిన అయిదుఅమూల్య పుస్తకాలు అందించి ,సభలో  మా పురస్కారం గ్రహించారు నాకు అత్యంత ఇష్టుడైన కథారచయిత ,’’దామల చెరువు అయ్యవారు ‘’గాసుప్రసిద్ధులైన శ్రీ మధురాంతకం రాజారాం గారి దామలచెరువు నివాసి, ఆయన శిష్యుడుఅభినవ వేమన  శ్రీ పత్తిపాటి రమేష్ నాయుడు .ఆపుస్తకాలు –అమ్మ వచనకవిత్వం ,ఆటవెలదిపద్యాలు ,శతకరత్నావలి -3,నందమూరి శతకం ,తెలుగు భాషోద్యమ శతకం .

 అంతపెద్ద కవి కవిత్వాన్ని అంచనా వేయటం నా శక్తికి మించిన పని .స్థాలీ పులాకం గా నా భావాలు తెలియజేస్తాను.

 1-అమ్మ శతకం –తమతల్లి శ్రీమతి పద్మావతమ్మ గారిపై వచనకవిత్వం –అమ్మ కమ్మనిభావన –చల్లని దీవెన –తన ఆలనా పాలనా –తగ్గించు వేదన –అమ్మకు పోటీ దీటు ఏదీ లేదు ‘’.మనపలకరింపు అమ్మకు కాస్తంత ఉపశమనం .కలలోకూడా మాతృభాషకు లేదు పోటీ –నాన్న అనుభవ సారమే మనజీవిత సుఖ ప్రయాణం .కవి ప్రజాస్వామ్య పచ్చనిపోలం లో కలుపు పీకేస్తున్నాడు .చెట్టు తానై మానవాళికి ప్రాణవాయువు అందించాలన్న తపన .మేనమామ మేకల కాపరి గొప్పమాట ఇది .

2-నందమూరి శతకం –‘’నందమూరి వంశ నాయకుండు ‘’మకుటంతో రాసిన ఆటవెలదులు .’’అందమైన మోము –అజరామర చరిత –నవ్యరీతి నాయకుండు –తెలుగుగడ్డపై వెలిగే నీ నాయకుండు ‘’అనిప్రారంభించి ,మూడుప్రాంతాలముఖ్యమంత్రి ,ట్యాంకు బండపై మహామహుల విగ్రహాలు నిలిపినవిజ్ఞానశీలి ,-కలియుగ యుగపురుషుడు ,రాజకీయాలలో రారాజు ‘’

3-ద్విశతకం – మాతృభాష నీవు మంచిగా నేర్చిన-పలుకవచ్చు పరుల భాష –ఆంధ్రభాషలు నేర్చి –అన్యభాషలు నేర్వు’’అనే గొప్ప సూచన .సంస్కార మహిళలను వీధిలోకి లాగద్దు.ఆకలే అన్వేషణకు మెట్టు .కట్టుబాట్లకు కంచె వద్దు –మంచి చేసి బ్రతుకు మారుస్తుంది .మనిషి తప్పక మార్పు చెందాల్సిందే .’’నడవడి గలవాని –నారాయణుడు మెచ్చు –గుణములు గలవాని గురువు మెచ్చు – బుద్ధిమంతుని జూచి భువి తాను మెచ్చురా –పత్తిపాటిమాట పసిడి మూట ‘’లాంటి 209 ‘’ఆటవెలదుల’’తో రసరమ్యంగా ఆడుకొన్నాడు కవి .

4-శతకరత్నావలి -2.ఇవీ ‘’పత్తిపాటిమాట పసిడి మూట ‘మకుట ఆటవెలదులే .తెలుగుబాస పాయసం ,పాలు తేనె కన్నా తియ్యనిది తెలుగుకు మించింది లేదు .బంతీ,పారిజాతాలకన్నా వెలుగుని౦పెది  ..బతికున్నప్పుడు చుట్టాలను మిత్రులను చూడకపోయినా –చస్తే గొప్ప వి౦దుభోజనాలు ‘’అని ఎత్తి పొడుపు కష్టపడితెనేకన్నీటి విలువ తెలుస్తుంది .సంప్రదాయాలన్నీ శాసనాలే ‘’.లైట్ ‘’తీసుకోవద్దు .నీతులు చెప్పటం కాదు ఆత్మశుద్ధిగా ఆచరించాలి .మెరుగుపెడితేనే విలువపెరిగేది .నరుడుకూడా ఇలా నే మెరుగు దిద్దుకోవాలి ‘’వంటి సుభాషితాలు నిండుగా ఉన్నాయి అందుకే కవి’ అభినవ వేమన ‘’అయ్యాడు .

5-తెలుగు భాషోద్యమ శతకం –.’’తెలుగు వెలుగునింపు తెలుగు వీర’’మకుటంతో రాసిన ఆటవెలదులు’’. ‘’మాటలాడు భాష మనసులో నిల్పుమా ‘’అని ముందే తీయని హెచ్చరిక . బ్రౌను దొరకిష్టమైన భాష .జల్లికట్టు కన్నా తెలుగు భాష తక్కువదికాదు .తల్లి తెలుగు శిలకు మల్లెపూదండలు ‘’వేశాడు కవి .తలిదండ్రులు నేరిస్తే పిల్లలకూ తెలుగు వంటబడుతుంది .ఆష్ట్రేలియా ప్రభుత్వం తెలుగును ఆదరించి అమలు జేసింది .తేట తెలుగు లెస్స దేశ భాషలలో’’.తెలుగు చదివే వారే లేకపోతె చచ్చు పడిపోతుంది .పాలనా భాషగా రావాలని పట్టుబట్టాలి .జబ్బ చరిస్తే జబ్బు నయం కాదురా వెర్రినాగన్నా.

 ఇలా పద్య పంచామృతం పంచాడు అభినవ వేమన పత్తిపాటి రమేష్ నాయుడు .అయన ఎం ఎ బిఎడ్ . ఇంగ్లిష్ ,ఎకనామిక్స్ ,పొలిటికల్ సైన్స్ లలో ఎం ఏ .చిత్తూరు జిల్లా దామల చెరువు జన్మ స్థలం.ఐరాల మండలం మండలపరిషత్ ప్రాధమిక పాఠశాల సేకండరిగ్రేడ్ టీచర్ .భార్యశ్రీమతి  అరుణ .

మీ- గబ్బిట దుర్గాప్రసాద్ -25-3-26-ఉయ్యూరు 

Unknown's avatar

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in రచనలు. Bookmark the permalink.

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.