Category Archives: వార్తా పత్రికలో

నవ్య వీక్లీ తాజా (12-3-2014) సంచిక- ‘లంకె బిందెలు’, ‘సరదాగా మరికాసేపు’ పుస్తకాల గురించిన సమీక్ష గబ్బిట కృష్ణ మోహన్

నవ్య వీక్లీ తాజా (12-3-2014) సంచికలో ‘లంకె బిందెలు’, ‘సరదాగా మరికాసేపు’ పుస్తకాల గురించిన సమీక్ష attachment లో వున్నది, చూడగలరు. గబ్బిట కృష్ణ మోహన్ book review    

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

అ. అ. విభో ఫౌండేషన్ తెలుగు జాతికి కొండంత అండ -అంటున్న జి.వి.ఎల్.యెన్ మూర్తి –

  అప్పాజోస్యుల విష్ణుభొట్ల ఫౌండేషన్ సంస్థ రాష్ట్రంలోనే కాక, దేశ విదేశాల్లో కూడా తెలుగు భాషా వికాసానికి ఎంతో కృషి చేస్తోంది. అనేక తెలుగు సాంస్కృతిక సంస్థలకు మార్గదర్శకంగా నిలుస్తోంది. తెలుగు నేలపై సన్మానాల కంపెనీలు, ఊకదంపుడు పొగడ్తలు పెరిగిపోతున్న రోజుల్లో అమెరికాకు చెందిన నలుగురు మిత్రులు తమ సంపాదన నుంచి తెలుగు వికాసం కోసం … Continue reading

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

ఆ కవిత చదవగానే భోరున ఏడ్చింది..

ఆ కవిత చదవగానే భోరున ఏడ్చింది.. ఆరడుగుల అందం..ఆకట్టుకునే కంచు కంఠం.. ఉరకలెత్తే భావుకత్వం.. మూర్తీభవించిన నటనా చాతుర్యం.. ఇవన్నీ కలిపితే నటుడు రంగనాథ్ అవుతారు. నాలుగు దశాబ్దాలుగా తెలుగువాళ్లను అలరిస్తున్న ఆయనలోని బహుముఖ కోణాలను ఆవిష్కరించారు ‘ఓపెన్‌హార్ట్ విత్ ఆర్కే’లో వేమూరి రాధాకృష్ణ. ఎబీఎన్‌లో ప్రసారమైన ఆ ఇంటర్వ్యూ ‘నవ్య’ పాఠకుల కోసం.. ఆర్కే … Continue reading

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

యార్ల గడ్డ హరిశ్చంద్ర ప్రసాద్ యాత్రానుభావాలు -మరియు ఆనాటి గయ్యాళి పాత్ర దారి,

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

దశావతారాలలో

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

సోదరి నివేదిత -శ్రీ రామ కృష్ణ ప్రభ

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

‘సొన’ సొంపులు మాయం! (ఆవరణం)- వెన్నెలకంటి రామారావు

  భూగోళం ఒక లక్ష సంవత్సరాల క్రితం తీవ్రంగా వేడెక్కింది. దాంతో సముద్రాలు భూ ఉపరితలంపైకి చొచ్చుకు వచ్చాయి. ఆ తర్వాత ఏర్పడిన ‘మంచు యుగం'(గ్లేషియేషన్)లో భూ తాపంతో ఉప్పొంగిన సముద్ర మట్టాలు తిరిగి యథాస్థితికి చేరుకున్నాయి. ఆ సమయంలో బయటపడ్డ భూభాగంలో తక్కువ ఉప్పదనం గల నీటితో సహా, విలువైన సాగర అవక్షేపాలు, అత్యంత … Continue reading

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

రాయలసీమ సాంస్కృతిక రాయబారి-శశిశ్రీ

  కన్నడం మాతృభాష అయినా తెలుగు భాష కోసం 70 వసంతాల జీవితకాల అంకిత సేవలందించిన మహానుభావుడు, భాషోద్ధారకుడు, బహుభాషావేత్త, వ్యవస్థీకృత వ్యక్తిత్వ సంపన్నుడు డాక్టర్ జానమద్ది హనుమఛ్ఛాస్త్రి. అనంతపురం జిల్లా, రాయదుర్గంలో 1926 సెప్టెంబర్ 5న జన్మించారు. జానకమ్మ, సుబ్రమణ్యశాస్త్రి తల్లిదండ్రులు. ఆంగ్లంలోను, తెలుగులోను రెండు పీజీలు చేశారు. తొలుత విద్యాశాఖలో అధ్యాపకునిగా, స్కూళ్ళ … Continue reading

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

నాకూ సంబురం లేదు- కంచ ఐలయ్య

  దేశానికి స్వాతంత్య్రం వచ్చిననాడు గాంధీ, అంబేద్కర్, నెహ్రూ ఎవరూ గుర్రాలు, ఒంటెల్ని ఎక్కి ఊరేగి సంబురాలు జరుపలేదు. ఫిబ్రవరి 26న హైదరాబాద్‌లో ఫ్యూఢలిజం ఎంత పూనకంతో ఎగిరిందో మనమంతా చూశాం. ప్రజలు కోరుకునే నాయకులెవరూ ఇటువంటి సంబురాలు చెయ్యరు. కనుకనే తెలంగాణ జాగ్రత్తగా ఉండాల్సిన అవసరముంది. ఆంధ్రప్రదేశ్ రెండుగా విడిపోయింది. తెలంగాణలో పై వర్గాలు … Continue reading

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

కాకతీయుల కళాభిరుచి కూసుమంచి

  ఖమ్మం పట్టణానికి 20 కి.మీ. దూరంలో ఉన్న కూసుమంచిలో ఉన్న శివాలయానికి 800 ఏళ్ల చరిత్ర ఉంది. తనకు అనేక విజయాలను కట్టబెట్టిన సదాశివుడి పట్ల కృతజ్ఞతాపూర్వకంగా వెయ్యి శివాలయాల నిర్మాణం చేపట్టాడట కాకతీయ ప్రభువైన గణపతిదేవుడు. అందులో భాగంగానే క్రీస్తుశకం 1162 ప్రాంతంలో కూసుమంచిలో ఈ ఆలయ నిర్మాణం జరిగింది. ఆయన కాలంలో … Continue reading

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

జీవితాన్ని ప్రవాహమే నడిపిస్తుంది అంటున్న జొన్న విత్తుల

  సినీగీత రచయితగానే ఎక్కువ మందికి తెలిసిన జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు రచనా ఖాతాలో 12 శతకాలు కూడా ఉన్నాయన్న విషయం ఎక్కువమందికి తెలియకపోవచ్చు. ‘నైమిశ వేంకటేశ శతకం’, ‘శ్రీరామలింగేశ్వర శతకం’ భక్తి ప్రధానాలైతే, ‘సింగరేణి శతకం’, ‘బతుకమ్మ శతకం’ తెలంగాణ హృదయ ఘోషనూ, సంస్కృతినీ ప్రతిబింబిస్తాయి. సినీగీతాల్లో ‘అందరి బంధువయా- భద్రాచల రామయ్యా’, ‘జగదానంద కారకా- … Continue reading

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

పరశురామేశ్వరుడు కేరాఫ్ గుడిమల్లం

        శివరాత్రి రోజు యావత్ భారతదేశం ‘హరోం హరహర… శంభోశంకరా..’ అంటూ శివనామ స్మరణతో మారుమోగిపోతుంది. హిమాలయాల్లోని కేదారనాథ్ మొదలు దక్షిణపు అంచునున్న రామేశ్వరం వరకూ దేశం నలుమూలలా ఉన్న పన్నెండు జ్యోతిర్లింగ క్షేత్రాల్లో అభిషేకాలు జోరందుకుంటాయి. మన రాష్ట్రంలో ప్రసిద్ధ శైవక్షేత్రాలయిన శ్రీశైలం, శ్రీకాళహస్తి, వేములవాడ వంటి ఆలయాల్లోనైతే భక్తుల … Continue reading

Posted in వార్తా పత్రికలో | Tagged | 1 Comment

శివ శంభో అని నినదిస్తున్న శివాలయాలు

  శివరాత్రి ప్రత్యేక కథనాలు మహాశివరాత్రి నాడు కళకళలాడని శైవక్షేత్రాలుంటాయా? శ్రీశైలం వైపు తిరిగి ఓం నమశ్శివాయ అనని శివభక్తులుంటారా! ఆ మల్లికార్జునుడితో పాటు శివరాత్రి నాడు పూజలందుకునే మరి కొన్ని ప్రసిద్ధ శివాలయాల గురించి, వనదుర్గ మాతకు జరిపే జాతర గురించే ఈ కథనాలు.. ఏడుపాయలుగా ఎందుకు… ద్వాపర యుగాంతంలో పాండవ వంశంలో చిట్టచివరి … Continue reading

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

పులిపై స్వారీ ప్రమాదకరం!

పులిపై స్వారీ ప్రమాదకరం! ముదిగొండ శివప్రసాద్ ఫోన్: 040-27425668 ఒక దేశం లేదా జాతి తన అస్తిత్వాన్ని ఒక సాంస్కృతిక సమానత్వంవల్ల కాపాడుకుంటుంది. సమాన సంస్కృ తి ఆ జాతి మూలాలను మూల్యాలను పరిరక్షిస్తుం ది. ఒక్కొక్కప్పుడు ఒక జాతి లేదా రాష్ట్రం డెమోగ్రఫీ మార్పువల్ల తన అస్తిత్వాన్ని ప్రాణశక్తి(విరాట్)ను కోల్పోతుంది. ఉదాహరణకు బంగ్లాదేశ్ నుండి … Continue reading

Posted in వార్తా పత్రికలో | Tagged | 2 Comments

శివ రాత్రి -ప్రత్యేకం –

Posted in వార్తా పత్రికలో, సేకరణలు | Tagged , | Leave a comment

సీకుంతలక్కయ్యా.. సినయ్యగారికి ఫోన్లు? సినీ మాటల రచయిత చింతపల్లి రమణ- మాటల పోగు

లను విడివిడిగా గిన్నెల్లో పోసి.. నీకు ఏదంటే ఇష్టం? అని అడిగితే- గబగబా వాటన్నిటినీ ఒక పెద్ద గిన్నెలో పోసి కలిపి ‘ఇదంటే ఇష్టం’ అనే రకం చింతపల్లి రమణ. లేకపోతే ఆయన ‘నవరస మాటకారి’ అయ్యుండేవారు కాదేమో! జనం నోళ్లలో నానే భాషనే ఏరుకుని.. ఆ మాటలకు చక్కెర పూత పూసి.. సినిమా గొంతుగా … Continue reading

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

‘జీవననాదాన్ని పలికిన అభినయ వేదం- అక్కినేని’ అన్న కె బి లక్ష్మి -తెలుగు విద్యార్ధి-

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

దొరసాని -దాసీ ఇద్దరూ సున్నాలే

  ఒకప్పుడు ఆంధ్రదేశంలో విజయనగరం తర్వాత వెంకటగిరి అతి పెద్ద జమీందారి. 1900 సంవత్సరం నాటికి ఈ జమీందారి రాబడి సాలుకు 15 లక్షల రూపాయలంటే అది ఎంత పెద్దదో అర్థం చేసుకోవచ్చు. ఈ జమీందారీని వెలుగోటి వంశస్తులు దాదాపు మూడు శతాబ్దాలు పాలించారు. ఆ సమయంలో ఈ జమీందారీలో అనేక మార్పులు వచ్చాయి. ఆ … Continue reading

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

అడుగడుగునా అగ్ని పరీక్షలే

  సాగిపోవాలనుకుంటే సంఘర్షణ గానీ, ఆగిపోవాలనుకుంటే ఏముంది? డాక్టర్ తొడసం చందు ఆగిపోవాలనుకోలేదు కాబట్టి సాగిపోవడానికి అవసరమైన ఘర్షణంతా పడ్డాడు. ఊరి పొలిమేరలు దాటడమే గగనమైపోయి, మూడో తరగతిలోనే చదువు ఆగిపోయి ఎక్కడో పశువుల కాపరిగా ముగిసిపోవాల్సిన జీవితం జిల్లా మెడికల్ ఆఫీసర్ స్థాయికి రావడం ఆశ్చర్యమే కదా మరి! తాను ఒక స్థానానికి చేరుకోవడమే … Continue reading

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

ఏ జీవితమూ ఒక ఓటమితో ఆగి పోదు అని భరోసా ఇస్తున్న సినీ రచయితా మరుధూరి రాజా-

  ‘మనసు సున్నితం.. రాత నవరసభరితం’ డైలాగ్‌రైటర్ మరుధూరి రాజా మీద మనమొక డైలాగు వేయాలనుకుంటే దీన్ని వేయవచ్చునేమో! ఆయనతో కాసేపు మాట్లాడినా, ఆయన రాసిన సినిమాలను చూసినా ఇదే అభిప్రాయం కలుగుతుంది. అన్ని వర్గాల ప్రేక్షకుల మనసెరిగి రాయకపోతే – ముప్పయి ఏళ్లపాటు రెండొందల సినిమాలకు రాసుండేవారు కాదేమో! ‘నవభారతం’ నుంచి ఈ మధ్యే … Continue reading

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

ఉత్తరాంధ్ర తన కదా ఏమిటి /అని ప్రశ్నిస్తొన్దన్న బమ్మిడి జగదీశ్వర రావు

తన ‘కథే’ మిటంటున్న ఉత్తరాంధ్ర – బమ్మిడి జగదీశ్వరరావు \ ‘ప్రాంతీయ అస్తిత్వం’ కేంద్రంగా చూసినప్పుడు ఉత్తరాంధ్రలో ప్రాంతీయ అస్తిత్వ ఉద్యమాల స్పృహ లేదనే చెప్పాలి. అయితే ‘ప్రత్యేక తెలంగాణ’ పోరాటాలు ఈ పది పన్నెండేళ్ళుగా ఉధృతమవుతూ రావడం ఉత్తరాంధ్రకూ ఉత్తరాంధ్ర కథకులకూ ప్రేరణగా మారింది. దాంతో అస్తిత్వ స్పృహ యిప్పుడిప్పుడే మొదలై ఆ దిశగా … Continue reading

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

హైదరాబాద్ పై సరోజినీ నాయుడు కవితలు

  భారతదేశంలో ఏ మూలకు వెళ్లినా ఇద్దరు కవుల పేర్లు ప్రతి విద్యా వంతునికి తెలుసు. వారిలో ఒకరు రవీంద్రుడు. మరొకరు సరో జినీనాయుడు. ఇంగ్లీషు పాఠ్యాంశంలో భాగంగా ఆమె కవితను ఏదో ఒక తరగతిలో ప్రతి విద్యార్థి చదవడం అనివార్యం. ఆధునిక భారతీయ ఆంగ్ల కవితకు హైదరాబాద్ నగరం వేదికన్నది ఇప్పటి తరానికి తెలియకపోవచ్చు. … Continue reading

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

అవార్డులు తీసుకోవటం తన బాల హీనత అంటున్న కవి శివా రెడ్డి

  ఆఫ్ ది రికార్డ్ కవులు ‘హీరో’లు కాకపోవచ్చు… కానీ వారిలో హీరోయిజానికి మించినదేదో ఉంటుంది.. సాహిత్యకారుడు ‘సెలబ్రిటీ’ స్టేటస్ పొందకపోవచ్చు.. కానీ వారిలో సెలబ్రిటీల్లో కనిపించని చరిష్మా ఏదో ఉంటుంది.. ఏ ఉత్ప్రేరకం వాళ్లని అలా తయారు చేస్తుందో ‘ఆఫ్ ద రికార్డ్’ మనకు తెలుపుతుంది.. ‘వివిధ’ పాఠకుల కోసం మొదటగా కె.శివారెడ్డితో ముఖాముఖి.. … Continue reading

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

అపరాధ భావన లేదు..బాధే ఉందిఅంటున్న నటి షకీలా

  చాలా మందికి షకీలా ఒక శృంగార దేవత. ఆమెది ఒక్క సీను ఉన్నా చాలు సినిమా హిట్. ఒకప్పుడు హీరోయిన్ల కన్నా ఆమెకే ఎక్కువ రెమ్యూనరేషన్ ఇచ్చేవారు. అలాంటి షకీలా గతమేమిటి? చిన్నప్పుడు సూళ్లూరుపేట దగ్గర కోటలో పెరిగిన ఆమె మలయాళం సినీ పరిశ్రమకు ఎలా వెళ్లింది? కోట్ల మంది పురుషుల కలలరాణి అయిన … Continue reading

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

స్టేట్ లీడర్ పక్ష పత్రికలో ఆచార్య పింగళి లక్ష్మీకాంతం కు సాహితీ నీరాజనం

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

జీవితాన్ని చదివాను అన్న కొలక లూరి ఇనాక్

కవి, కథకులు, నవలాకారులు, నాటక రచయిత, విమర్శకులు, వినూత్న పరిశోధకులు ఆచార్య కొలకలూరి ఇనాక్. సమాజంలోని అట్టడుగు వర్గంలోంచి ప్రభవించిన ఇనాక్ సమాజంలోని చీకటి కోణాల్ని తన రచనల ద్వారా బలంగా వ్యక్తీకరించారు. ఈ సాహితీ స్రష్టకు పద్మశ్రీ పురస్కారం లభించిన సందర్భంగా ‘వివిధ’ పాఠకుల కోసం ఆయనతో విపులమైన ఇంటర్వ్యూ.. ఇనాక్ గారూ! మీకు … Continue reading

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

పద్మ పురస్కారాలు కళ తప్పుతున్నాయి

పద్మ అవార్డులకు అనర్హులను ఎంపిక చేయడం జరుగుతోంది. ఫలితంగా ప్రతి ఏటా వీటిని తిరస్కరించే వారి సంఖ్య పెరుగుతోంది. ప్రతిష్ఠాత్మకమైన పద్మ పురస్కారాలు కళ తప్పుతున్నాయి. భారతదేశ కీర్తిప్రతిష్టలు, వైభవం, ఉత్తేజాలను గుర్తు చేసే ఈ పురస్కారాలు ప్రస్తుతం వెలా తెలా పోతున్నాయి. విద్య, శాస్త్ర విజ్ఞానం, సాంకేతిక పరిజ్ఞానం, సాహిత్యం, కళలు, క్రీడలు, వైద్యం, … Continue reading

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

ఆనాటి గయ్యాళి చాయాదేవే -ఇవాల్టి వెండి తెర బంగారం-ఆంద్ర జ్యోతి

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

హోమం తో పంటలు క్షేమం అంటున్న రైతు చలసాని దత్

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

ఏం చదువుకున్నానంటే…జీవితం చదువుకున్నాను -సత్యానంద్ -ఆంద్ర జ్యోతి

  కళ్లు తిప్పుకోలేని అందం, ఖరీదైన దుస్తులు, భారీ సెట్టింగులు, అద్భుతమైన నటన.. ఇవన్నీ కుదిరినంత మాత్రాన సినిమా హిట్ అవుతుందా? నటుల ‘ఇమేజ్’ పెరుగుతుందా? పెరగదు. ఇంకా ఏదో కావాలి. అదే పవర్‌ఫుల్ ‘డైలాగ్’. ఒక పంచ్ మాట. అది పడితేనే నటులకు కిక్ వస్తుంది. స్టార్ ఇమేజ్ ఏర్పడుతుంది. అలాంటి మాటల్ని రాస్తూ.. … Continue reading

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

శివరూపం ..శివ రాత్రి అంటే

Posted in వార్తా పత్రికలో | Tagged | 1 Comment

ఈసురోమని మనుషులుంటే …..

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

ధర్మ స్వరూపుడు భీష్మాచార్యుదు

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

నీతి నిలబడితేనే మనం నిలబడతాంఅంటున్న కృష్ణా జిల్లా మాజీ ఐ ఏ.ఎస్ అధికారి కాకి మాధవరావు

  వ్యవస్థలో మార్పు కోసం శ్రమించే వారిని వ్యక్తులుగా విడదీసి అశక్తులుగా నిలబెట్టాలని చూస్తుంది సమాజంలోని ఒక వర్గం. అదే పనిగా కుతంత్రాలు చేస్తూ, కుంగదీయాలని కూడా చూస్తుంది. వాటిని ఎదిరించే దిశగా అడుగులు వేయలేకపోతే ఎవరైనా నిలువునా కూలిపోవాల్సి వస్తుంది. ఎన్నో అవరోధాల్ని అడుగడుగునా ఎదుర్కొంటూ నీతికీ నిబద్ధతకూ మారుపేరుగా నిలిచిన సీనియర్ ఐఏఎస్ … Continue reading

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

నేత్రావధానం చేస్తున్న ఏడవ తరగతి విద్యార్ధినులు

నేత్రావధానం చేస్తున్న ఏడవ తరగతి విద్యార్ధినులు     కళ్లతో భావాలను పలికి ంచడం ఎంత గొప్పగా ఉంటుంది? దాన్నే మరో మెట్టు పైకి తీసుకెళితే ఏమవుతుంది? నేత్రావధానమవుతుంది. దాన్ని ఏడో తరగతి చదివే ఇద్దరు నిరుపేద విద్యార్థినులు చేస్తే….? అది వారి ప్రతిభకు అద్దమవుతుంది, పదిమంది ప్రశంసలకు అర్హమవుతుంది. అవధాన విద్యే అంతరించిపోతోందనుకుంటే, అందులో … Continue reading

Posted in వార్తా పత్రికలో | Tagged | 1 Comment

కన్యాశుల్కంనాటకం ఆరోస్సారి-8 గంటల పాటు

  ‘తాంబూలాలిచ్చేశాను తన్నుకు చావండి’ ‘పొగతాగనివాడు దున్నపోతై పుట్టున్…’ ‘బుద్ధికి అసాధ్యం ఉందేమోగానీ, డబ్బుకి అసాధ్యం లేదు’ ‘డామిట్ కథ అడ్డం తిరిగింది..’ వీటిలో ఒక వాక్యమైనా తెలియని తెలుగువాళ్లుండరేమో! అంతలా జనంలోకి వచ్చేశాయి ‘కన్యాశుల్యం’ డైలాగులు. గురజాడ 150 ఏళ్ల జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని, ఆయన రాసిన ఈ ప్రసిద్ధ నాటకాన్ని వచ్చే ఆదివారం … Continue reading

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

ముంబాయ్ లో తెలుగు మయసభ

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

ఎదిరించకపోతే అన్యాయాలదే రాజ్యం

  సాఫీగా సాగిపోయే మార్గాన్ని ఎంచుకునేందుకు అనువైౖన జీవన నేపథ్యం ఆయనది. అయినా నిరంతరం పోరాట మార్గాన్నే ఎందుకు ఎంచుకున్నట్లు? ఏ చిన్న బాధకైనా కన్నీటి పర్యంతమైపోయే బొజ్జా తారకం అనుక్షణం తీవ్రమైన సంఘర్షణకు గురిచేసే మార్గంలో ఎందుకు నడిచినట్లు? కులపోరాటాల్ని, వర్గపోరాటాల్ని సమన్వయ పరచనిదే భారతదేశంలో ఏమీ సాధించలేమని నొక్కి పలికే ఆయన అనేక … Continue reading

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

శ్రీ లంకలో మన దేవుళ్ళు

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

తెలుగు నేల పై ఓల్గా నవలా ప్రవాహం

సామాజికంగా స్త్రీలను అన్ని రకాల జ్ఞానాలకు దూరంగా ఉంచే పని పురుష స్వామ్యం రకరకాల రూపాలతో చేస్తూ వుంటుంది. వాళ్లకు స్వశరీర జ్ఞానం కూడా లేకుండా చేయటం పురుష స్వామ్యానికి అత్యంత అవసరం. విషయ జ్ఞానం ఉన్న స్త్రీలు అఘాయిత్యాలకు ఒడిగడతారేమోనని పితృస్వామ్యానికి భయం. ఈ విషయాలను గురించి ఓల్గా చాలా లోతుగా చర్చించారు. ల్గా … Continue reading

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

వ్రత ఫలంగా పరమపదం– పండుగ చెప్పిన పరమార్ధం

  ఈ ముప్ఫయ్యవ పాశురంలో ఈ ధనుర్మాస వ్రతం చేసేవారికి కలిగే ఫలశ్రుతిని వివరించి చెప్పారు. వంగక్కడల్ కడైన్ద మాదవనై క్కేశవనై త్తింగళ్ తిరుముగత్తు చ్చేయిళైయార్ శెన్రిరైఞ్చ అంగప్పరైకొణ్డవాత్తయ్ యణిపుదునై పెంగమలత్తర్డెరియల్ పట్టరు పిరాన్ కోదైశొన్న శంగత్తమిల్‌మాలై ముప్పదుమ్ తప్పామే ఇంగిప్పరిశురైప్పా రీరిరణ్డు మాల్వరైత్తోళ్ శెంగిణ్ తిరుముగత్తుచ్చెల్వత్తిరుమాలాల్ ఎంగుమ్ తిరువరుళ్‌పెత్తిమ్బరువరెమ్బావాయ్!! ఆండాళ్ తల్లి ఈ ధనుర్మాస … Continue reading

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

నట సువర్ణ సుందరి అంజలీ దేవి

  గుండెపోటుతో కన్నుమూత ఎల్లుండి చెన్నైలో అంత్యక్రియలు లవకుశలో సీతాదేవి పాత్రతో ఘనకీర్తి సనీ,రాజకీయ ప్రముఖుల సంతాపం చెన్నై, కాకినాడ, హైదరాబాద్, జనవరి 13 (ఆంధ్రజ్యోతి): తెలుగు సినీ స్వర్ణయుగానికి చెందిన మరో ద్రువతార దివికేగింది. తెలుగువారి సీతమ్మ తల్లిగా పేరొందిన అలనాటి మేటి నటి.. అంజలీదేవి ఇక లేరు! సోమవారం మధ్యాహ్నం 2 గంటల … Continue reading

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

మా గిర్మాజీపేట ఎప్పటికీ మాజీ కాదు-మాడ భూషి శ్రీధర్-ఆంధ్ర జ్యోతి

  వార్తల కోసం వీధులన్నీ కలయ తిరిగిన రోజుల నుంచి అదే వీధుల్లో వీఐపీగా అధికారిక వాహనాల్లో తిరిగే స్థాయికి ఎదిగిన వ్యక్తి మాడభూషి శ్రీధర్. పాత్రికేయుడిగా, నల్సార్ లా యూనివర్శిటీ అధ్యాపకుడిగా సుపరిచితుడైన ఆయన ప్రస్తుతం ఢిల్లీలో కేంద్ర సమాచార శాఖ కమిషనర్‌గా పనిచేస్తున్నారు. యువకుడిగానే ‘జనధర్మ’, ‘వరంగల్ వాణి’ పత్రికలు నిర్వహించి జనంలో … Continue reading

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

విప్లవం, వికాసం, విజ్ఞానం..!

నేడు వివేకానందుడి 150వ జయంతి వివేకానంద ఒక చైతన్య స్ఫూర్తి. ఆధ్యాత్మిక దీప్తి. విజ్ఞాన ప్రదీప్తి. అంతేకాదు… ఆయన ‘విప్లవ స్ఫూర్తి!’ వినడానికి ఆశ్చర్యంగా ఉన్న ఇది నిజం. వివేకానందుడిలో విప్లవ కోణమూ ఉండటం నిజంగా నిజం. ఒకవైపు ఆధ్యాత్మికతను, మరోవైపు హేతుబద్ధతను తన తల్లిదండ్రుల నుంచి జన్మతః అందుకున్న మహనీయుడు వివేకానందుడు. బ్రిటిష్ ఇండియా … Continue reading

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

ఆమె ముఖ వైవిధ్యం అనంతం – ఫవాద్ త మ్‌కానత్

  అక్షరాల్ని అందంగా రాయడంతో మొదలైన కళా దృష్టి ఆయన్నొక చిత్రకారుడిగా తీర్చిదిద్దింది. ఆ తర్వాత స్త్రీ ముఖ వైవిధ్యాల్ని చిత్రించే దిశగా ఆయన ప్రయాణం సాగిపోయింది. పుట్ట్టి పెరిగిన హైదరాబాద్ ఆయనకు మినీ వరల్డ్‌గా కనిపించి ఏళ్ల పర్యంతం ఆ నగర సంస్కృతిని ప్రతిఫలించే పెయింటింగ్స్‌నే వేసేలా చేసింది. దేశదేశాల్లో అపారమైన పేరు ప్రతిష్టలు … Continue reading

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment