Category Archives: సమయం – సందర్భం

సమయం – సందర్భం

మా తమలపాకు పందిరిలో తామరాకు లాంటి తమలపాకులు

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

సింగపూర్ నుంచి శ్రీ శశిధర్ ఫోన్

సాహితీ బంధువులకు శుభ కామనలు -ఈ రోజు మధ్యాహ్నం 2- 30 కి సింగపూర్ నుంచి శ్రీ శశిధర్ (శశికుమార్ )ఫోన్ చేసి ఎంతో ఆత్మీయంగా మాట్లాడారు .ఆయన తెలంగాణా కరీం నగర్ కు చెందిన సాఫ్ట్ వేర్ ఉద్యోగి .మన సరసభారతి బ్లాగులను గత మూడేళ్లు గా రెగ్యులర్ చదువుతున్నాననీ ,చాలా ఆసక్తికరంగా ,ఉత్తేజంగా … Continue reading

Posted in సమయం - సందర్భం | 1 Comment

అది (ఏనాది )భిక్షు

మా చిన్నతనాలలో ఎప్పుడో ఇళ్లకు భిక్షానికి వచ్చే ఏనాది  (ఆది )భిక్షువు ఇవాళ మళ్ళీ గుమ్మం  లోకి భిక్షకు వస్తే తీసిన ఫోటో -దుర్గాప్రసాద్  

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

మా ఇంట్లో వినాయక చవితి పూజలో తాతా ,మనవరాలు రమ్య

మా ఇంట్లో వినాయక చవితి పూజలో తాతా ,మనవరాలు రమ్య https://photos.google.com/share/AF1QipNCDS0LzXpfPieAiLVrKXVW78clVsCDAOVUlkqwiW_IGvunaGpTvINZAJrvq4Imlg?key=RkpzYTZKSkNRWF9jQ0d2Y2traUY0cnNRRlNGeTlB  

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

వినాయక చవితి శుభా కాంక్షలు 

  వినాయక చవితి శుభా కాంక్షలు  వినాయకునిపై రెండు విచిత్ర పద్యాలు భట్టుమూర్తి అనే రామ రాజభూషణుడు వినాయకుని స్తుతిస్తూ ఒక తమాషా పద్యం చెప్పాడు .దాని చమత్కారం అనుభవిద్దాం – ‘’దంతా ఘట్టిత రాజతాచల చలద్గౌరీ స్వయం గ్రాహమున్ –గంతు ద్వేషికి గూర్చి ,శైలజకు దద్గంగా ఝరీ చ్ఛాంతి న త్యంతా మోదము మున్నుగా … Continue reading

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

శ్రీ శంభుని మూర్తిగారి 12 వ రోజు కార్యక్రమం  

శ్రీ శంభుని మూర్తిగారి 12 వ రోజు కార్యక్రమం మా పెద్ద తోడల్లుడు గారు స్వర్గీయ శంభుని శ్రీ రామచంద్ర మూర్తిగారి 12 వ రోజు కార్యకరామానికి ఈ రోజు ఖమ్మంవెళ్ళటానికి  ఉదయం 5 గంటలకే లేచి స్నానసంధ్య పూజాదికాలు పూర్తీ చేసి మా కోడలు రాణి పంపిన ఇడ్లీలు తిని,నేను కలిపిన కాఫీ రెండు … Continue reading

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు 

ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు  సెప్టెంబర్ 5 బుధవారం భారత మాజీ రాష్ట్ర పతి ,మహాతత్వవేత్త   డా సర్వేపల్లి రాధాకృష్ణ  జయంతి గా జరిగే ఉపాధ్యాయ దినోత్సవ ,శ్రీ కోట సూర్యనారాయణ శాస్త్రి గురు వరేణ్యుల గురు పూజోత్సవ శుభా కాంక్షలు -దుర్గాప్రసాద్ 

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

బ్రహ్మశ్రీ కోట గురువరేణ్యుల గురు పూజా మహోత్సవ ఆహ్వానం

 బ్రహ్మశ్రీ  కోట గురువరేణ్యుల గురు పూజా మహోత్సవ ఆహ్వానం -సెప్టెంబర్ 5 ఉపాధ్యాయ దినోత్సవాన్ని సుమారు 7 దశాబ్దాల క్రితం శ్రీ మైనేనిగారికి, నాకు ప్రాధమిక విద్య బోధించిన  ”స్వర్గీయ బ్రహ్మశ్రీ కోట సూర్య నారాయణ శాస్త్రి గురువరేణ్యులగురుపూజోత్సవం ”గా 5-9-18 బుధవారం ఉదయం 10  గంటలకు స్థానిక అమరవాణి  హైస్కూల్ లో సరసభారతి ,132 వ కార్యక్రమంగా  ఆపాఠశాలతో కలిసి సంయుక్తంగా నిర్వహిస్తున్నాము ..గురుపుత్రులు ,,ప్రముఖ అతిధులు పాల్గొనే ఈ … Continue reading

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

3-9-18 సోమవారం సాయంత్రం శ్రీ సువర్చ లాంజనేయ స్వామి దేవాలయం లో శ్రీ కృష్ణ జన్మాష్టమి ,డా .శ్రీ వేదాంతం శ్రీధరా చార్యులు గారిచే శ్రీ కృష్ణ లీలలు ప్రసంగం

3-9-18 సోమవారం సాయంత్రం శ్రీ సువర్చ లాంజనేయ స్వామి దేవాలయం లో శ్రీ కృష్ణ జన్మాష్టమి ,డా .శ్రీ వేదాంతం శ్రీధరా చార్యులు గారిచే శ్రీ కృష్ణ లీలలు ప్రసంగం https://photos.google.com/share/AF1QipMlJqFo9lsb3MokrzrajIa7n1zn1IQngbmJbXnlqSHJZXYzUVbuHanTJyKtdVEsJw?key=SXFTVGkya3hQbXQwVWtiS2ZSMmNoM1hEbGZvZDBn  

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

కృష్ణం వందే జగద్గురుమ్

” రాధనురా ప్రభూ ,నిరపరాధనురా ,అనురాగ భావనారాధన మగ్న మానసనురా ”’   ”ఏది మరొక్కమారు హృదయేశ్వర గుండెలు పుల్కరించగా ఊదగదోయి  యుష్మదీయ వేణు నాద  రసోదయ  రాగ డోలికలతో  జగమ్ము విస్మయమ్ముగ నిదురించే -కాంక్ష ”మర్రాకయి తేలేరా ప్రభూ ,రమ్ము ఒక్క క్షణమ్మేని  నిదురింతువుగానిరమ్ము  తెరచి యుంచితి నా హృదయ కుటీరమ్ము తలుపు ”అని రాధ ఆనందమయ గాధను … Continue reading

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

గురుగీత గ్రంథావిష్కరణ

        గురుగీత గ్రంథావిష్కరణ శ్రీ మతి జ్యోష్యులా శ్యామలాదేవి గారి తండ్రిగారు బ్రహ్మశ్రీ తాడేపల్లి సుబ్రహ్మణ్య శాస్త్రి (స్వామీ ప్రాణవానంద భారతే కుమార్ )గారి శతజయంతి కుటుంభవేడుకల సందర్భంగా స్థానిక రోటరీ క్లబ్ ఆడి టోరియం  జరిగిన ”గురుగీత ”గ్రంథావిష్కరణ -2-9-18 ఆదివారం ఉదయం 2-9-18 ఆదివారం ఉదయం బ్రహ్మశ్రీ తాడేపల్లి వెంకట సుబ్రహ్మణ్య … Continue reading

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

వ్యావహారిక భాషోద్యమ సారధి శ్రీ గిడుగు వెంకట రామ మూర్తి పంతులు (29-8-1863 -22-1-1940

శ్రీ గిడుగు రామమూర్తి గారి జయ౦తి (155) తెలుగు  భాషా దినోత్సవం గా సరసభారతి,స్థానిక రోటరీ క్లబ్ సంయుక్తంగా 29-8-18 బుధవారం నిర్వహించిన సభలో నేను మాట్లాడిన నాలుగు మాటలకు  పరిపూర్ణత కోసం అదన౦గా మరో పదిమాటలు కలిపి మీకోసం  –  వ్యావహారిక భాషోద్యమ సారధి శ్రీ గిడుగు వెంకట రామ మూర్తి పంతులు (29-8-1863 … Continue reading

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

ఆ” రుద్రునికి ”ఇంకో రుద్రం ” – ఆరుద్ర జయంతి సందర్భంగా

ఆ” రుద్రునికి ”ఇంకో రుద్రం ” —————————————————————– కవన రుద్రుడు ,నిత్య ప్రయోగ శీలి ,బహుముఖ ప్రజ్ఞా శాలి అయిదు దశాబ్దాలు సాహిత్య క్షేత్రాన్ని సుసంపన్నం చేసి ,73  మూడవ ఏట అలసి ,సొలసి ,దీర్ఘ నిద్ర లోకి జారు కున్న వాడు ఆరుద్ర అనే భాగవతుల సదా శివ శంకర శాస్త్రి .7+3==10    సంఖ్యా శాస్త్రం  లో. వందా పూర్తి అయినట్లే . శ్రీ రంగం శ్రీని వాస రావు వైష్ణవ … Continue reading

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

హరి కృష్ణ –ఒక పరిచయం

హరి కృష్ణ –ఒక పరిచయం అప్పుడు నేను పామర్రు హై స్కూల్ లో సైన్స్ మాస్టర్ గా పని చేస్తున్నాను .అవి ఎన్టి ఆర్ కొత్తగా తెలుగు దేశం పార్టీ పెట్టి  ఊరూరా ప్రచారం చేస్తున్న రోజులు .ఒక రోజు హరి కృష్ణ మా స్కూల్ కు మందీమార్బలంతో వచ్చి స్టాఫ్ నందర్నీ స్వయంగా కలిసి,నమస్కారం చేస్తూ  తెలుగు … Continue reading

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

అపర శ్రీరామ చంద్ర మూర్తి శ్రీ శంభుని శ్రీ రామచంద్ర మూర్తి గారి అస్తమయం

అపర శ్రీరామ చంద్ర మూర్తి శ్రీ శంభుని శ్రీ రామచంద్ర మూర్తి గారి అస్తమయం మా పెద్ద తోడల్లుడుగారు శ్రీ శంభుని శ్రీరామ చంద్ర మూర్తిగారు 90  ఏళ్ళ వయసులో ఖమ్మం లోని స్వగృహం లో 28-8-18 మంగళవారం రాత్రి 7-30 గం.లకు మరణించారు .సుమారు మూడేళ్ళ నుంచి మూత్రపిండాల బాధతో  హార్ట్ ఎటాక్ తో … Continue reading

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

“24-8-18 శుక్రవారం మా ఇంట్లో వరలక్ష్మీ వ్రతం ”

https://photos.google.com/share/AF1QipOT4FWAWgHRbQ0jywZpfEcye0ed4NZ_3-IRK14T-vLt6zcafKjqa6g4C5moRuARCA?key=dTI2bllpUlA2cDBuZUU5TmZkXzVZeFlxVjBjOXJR

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

శ్రీ ముత్తేవి సీతారాం గారికి సద్గురు శివానంద మూర్తి పురస్కారం

కృష్ణాష్టమి సందర్భం గా హైదరాబాద్  సనాతన ధర్మ చారిటబుల్ ట్రస్ట్ 2-9-18 ఆదివారం ఉదయం -పెదముత్తేవి ముముక్షు  పీఠాధిపతులు శ్రీ శ్రీ ముత్తేవి సీతారాం గారికి సద్గురు శివానంద మూర్తి స్మారక పురస్కారం అందజేస్తున్నారు

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

వరలక్ష్మీ వ్రత శుభాకాంక్షలు 

 వరలక్ష్మీ వ్రత శుభాకాంక్షలు సాహితీ బంధువులకు 24-8-18 శుక్రవారం శ్రావణ  వరలక్ష్మి  వ్రత శుభాకాంక్షలు -దుర్గాప్రసాద్ —  

Posted in సమయం - సందర్భం | Leave a comment

ప్రముఖ జర్నలిస్ట్ కులదీప్ నయ్యర్ కన్ను మూత

ప్రముఖ జర్నలిస్ట్ కులదీప్ నయ్యర్ కన్ను మూత న్యూఢిల్లీ: ప్రముఖ జర్నలిస్ట్ కులదీప్ నయ్యర్ బుధవారం రాత్రి కన్నుమూశారు. ఆయన వయస్సు 95. ఢిల్లీలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. కులదీప్ నయ్యర్ 14 ఆగస్ట్ 1923లో పాకిస్తాన్‌లోని సియాల్కోటలో జన్మించారు. కులదీప్ ఉర్దూలో జర్నలిస్టుగా తన కెరీర్ ప్రారంభించారు. ది స్టేట్స్‌మెన్‌లో … Continue reading

Posted in సమయం - సందర్భం | Tagged | 1 Comment

శ్రీకృష్ణాష్టమి ప్రత్యే క కార్యక్రమం

3-9-18 సోమవారం శ్రావణ బహుళ అష్టమి శ్రీకృష్ణాష్టమి ,శ్రీ కృష్ణ జయంతి సందర్భం గా ఉయ్యూరు శ్రీ సువర్చలాన్జనేయస్వామి దేవాలయం లో ఉదయం శ్రీ విష్ణు సహస్రనామ శ్రీ కృష్ణఅష్టోత్తర పూజ ,విష్ణుసహస్ర నామపారాయణ ,సాయంత్రం ఆలయం అంతా బాలకృష్ణుని పాద ముద్రలతో అలంకారం , శ్రీ కృష్ణ  అష్టోత్తర పూజ ,అనంతరం డా శ్రీ వేదాంతం … Continue reading

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

 ‘’కథా వేద గిరి శృంగం’’ డా.రాంబాబు

 ‘’కథా వేద గిరి శృంగం’’ డా.రాంబాబు            ఆయనకు తెలుగుకథానిక ప్రాణం, తనువూ, మనసు ,ధ్యాస ,ఊపిరి   ఉచ్చ్వాస నిశ్వాసం .దాని కోసం జీవిత౦  త్యాగం చేసిన త్యాగమూర్తి .1910 లో గురజాడ రాసిన  తొలి తెలుగు కధానిక’దిద్దుబాటు ‘’  కు శతవత్సరాలు నిండిన సందర్భంగా తెలుగు కధానిక ను తానొక్కడే పల్లకీలో మోసి ,ఊరూరా తిప్పి ,సభలు సమావేశాలు ఏర్పరచి ప్రభుత్వాన్నీ … Continue reading

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

గురుపూర్ణమి -జూన్ -జులై తెలుగు విద్యార్థిలో నా వ్యాసం

గురుపూర్ణమి -జూన్ -జులై తెలుగు విద్యార్థిలో నా వ్యాసం

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

  శ్రావణమాస విశిష్టత

  శ్రావణమాస విశిష్టత    శ్రావణ శుక్రవార వరలక్ష్మీ పూజ శూన్యమాస మైన తర్వాత వచ్చే శ్రావణమాసం కోసం పెళ్లీడు పిల్లలు ,పెళ్ళైన కొత్త దంపతులు ఆత్రంగా ఎదురు చూస్తుంటారు .శ్రవణా నక్షత్రం పౌర్ణమి నాడు వచ్చేదికనుక శ్రావణం .  మండే ఎండాకాలమైన గ్రీష్మ ఋతువు ,వెళ్లి  చల్లబరచే వర్ష ఋతువు ప్రవేశించి ఉపశమనం కలిగిస్తుంది .పంటలు వేసేకాలం .భూమి ఆకుపచ్చ … Continue reading

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

రోకలి బ0డ పురుగుల బహు  సంతానం 

మా దొడ్లో వర్షాకాలం లో రోకలి  బండ పురుగులు ఎక్కువ .అవి ఒకే సారి చాలా పిల్లలను ప్రసవిస్తాయి  పది నిమిషాల తర్వాత  అవన్నీకలిసి సామూహికంగా  గున గున నడుచు కొంటూ వెళ్లి పోతాయి .ఎక్కడికి పోతాయో తెలీదు .ఇవాళ మా అదొడ్లో అలాంటి రెండు రోకలి  బండ పురుగులు  ఇప్పుడే కన్న వాటి  సంతానం   నా కెమెరాకు చిక్కాయి … Continue reading

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

29-7-18 ఆదివారం ఉదయం మా ఇంట్లో స్వర్గీయ ఆర్ .ఎస్ .కే.మూర్తి గారి కోడలు డా .శ్రీమతి తుమ్మలపల్లి వాణీ కుమారి గారు

29-7-18 ఆదివారం ఉదయం మా ఇంట్లో స్వర్గీయ ఆర్ .ఎస్ .కే.మూర్తి గారి కోడలు డా .శ్రీమతి తుమ్మలపల్లి వాణీ కుమారి గారు https://photos.google.com/share/AF1QipOruneWiC_SdGKtEHzjngrhI7-EZ-984wXfooTK8jpzsWKB6zGeA9KA9xv0h64zTQ?key=QTBHRFVTR01HcHZqaHJWT0wwYXRGWkZpNGlwamVR

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

27-7-18 శుక్రవారం గురు పౌర్ణమి వ్యాస జయంతి సందర్భంగా సారస భారతి 128 వ కార్యక్రమం

27-7-18 శుక్రవారం గురు పౌర్ణమి వ్యాస జయంతి సందర్భంగా సారస భారతి 128 వ కార్యక్రమంగా ఉదయం శ్రీ సువర్చాలాంజ నేయస్వామి దేవాలయం లో వ్యాసపూజ ,విష్ణు సహస్రనామ,శ్రీ కృష్ణ, లక్ష్మీఅష్టోత్తర పూజ జరిపి ,కుమారి బిందు దత్తశ్రీ చేత భగవద్గీత పారాయణ ,ప్రవచనం చేయించి ఆన్ లైన్ లో ఆమె భగవద్గీత నేర్పుతున్నందుకు ”ఆన్ … Continue reading

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

గురు పూర్ణిమ –వ్యాసజయంతి

గురు పూర్ణిమ –వ్యాసజయంతి   వ్యాస అష్టోత్తర స్తోత్రం ‘’1-వేద వ్యాసో విష్ణు రూపః పరాశరార్యాస్తపోనిదిః -సత్య సందః ప్రశాంతస్య సత్య వాదీ సుతః 2-కృష్ణ ద్వైపాయనో దాంతో బాదరాయణ  సంజ్ఞితః -బ్రహ్మ సూత్ర ప్రథితవాన్ భగవాన్ జ్ఞాన భాస్కరః 3-సర్వ వేదాంత తత్వజ్ఞః సర్వేజనా వేద మూర్తిమాన్-వేద శాఖావ్యసన కృత కృత్యో మహా మునిః … Continue reading

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

శ్రీ ,పతి ‘’శయన’’సల్లాపాలు

శ్రీ ,పతి ‘’శయన’’సల్లాపాలు స్వామీ ! ఏమీ ! నాధా! ఏమిటి బాధ ? తమరు ఈ రాత్రినుంచి శయ్యాక్రా౦తు లవుతారు కదా ! అవును ఇదేమీ కొత్తకాదే.ప్రతి ఏడూ జరిగే ముచ్చటే గా ! మీకు ముచ్చటే .మాకు చెమటలు పోస్తాయి ఆ నాలుగు నెలలూ దేనికి ? ఎవరైనా అధికారి ఊరికి వెడితే … Continue reading

Posted in సమయం - సందర్భం | Tagged | 2 Comments

విష్ణు సహస్రనామ పారాయణ

విష్ణు సహస్రనామ పారాయణ   23-7-18 సోమవారం సాయంత్రం తొలి ఏకాదశి సందర్భంగా ఉయ్యూరు శ్రీ సువర్చలాన్జనేయ స్వామి దేవాలయం లో మహిళామణులచే శ్రీ విష్ణు సహస్ర నామ పారాయణ దృశ్యాలు  

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

“23-7-18 సోమవారం సాయంత్రం తొలి ఏకాదశి సందర్భంగా ఉయ్యూరు శ్రీ సువర్చలాన్జనేయ స్వామి దేవాలయం లో మహిళామణులచే శ్రీ విష్ణు సహస్ర నామ పారాయణ దృశ్యాలు

“23-7-18 సోమవారం సాయంత్రం తొలి ఏకాదశి సందర్భంగా ఉయ్యూరు శ్రీ సువర్చలాన్జనేయ స్వామి దేవాలయం లో మహిళామణులచే శ్రీ విష్ణు సహస్ర నామ పారాయణ దృశ్యాలు https://photos.google.com/share/AF1QipNi-6y5F6FQ5YRm4lP1XUTsG5829nudYd0IaTufjwpe20GFs4GFkgKTyo2tX5iiyQ?key=WndnZUdnN2NvZ3dia0xUMDJNVHU1eUg2RUw0M1Jn

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

తొలి ఏకాదశి (శయన ఏకాదశి )

తొలి ఏకాదశి (శయన ఏకాదశి ) ప్రతినెలా రెండు సార్లు ఏకాదశి వస్తుంది .కాని కొన్ని ఏకాదశి తిదులకే ప్రత్యేక గుర్తింపు ఉండి.  .అందులో మొదటిది ఆషాఢ శుద్ధ ఏకాదశి .దీనినే ప్రధమ ,లేక తొలి ఏకాదశి అంటారు .శ్రీ మహా విష్ణువు ఈ రోజు క్షీర సాగరం పై శేష తల్పం పైన యోగ నిద్రకు … Continue reading

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

   జుమ్లా ఫిదా

జుమ్లా ఫిదా ‘’కన్నుకొట్టరోయ్  కౌగిలించరోయ్ ‘’అనే సినీ పాట వినే ఉంటారు అందరూ .నిన్న లోక్ సభలో ‘’నీట్ షేవెన్’’ రాహుల్ ,మోడీ జుమ్లాకు ఫిదా అయి  మాట్లాడేమాటలు  అమాంతం ఆపేసి  కాసేపు మోడీ వెచ్చని కౌగిలి ఆనందాన్ని గడ్డం గుచ్చుకున్నా  అనుభవించి ,పెద్దాయనను ‘’పప్పు ‘’చేశాను చూడండి అని కన్నుగొట్టి రెచ్చగొట్టి,సాటి ఎంపీలతో , బయటి స్టార్లతోకూడా కన్ను కొట్టించుకొని’’ లవర్ … Continue reading

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

1-7-18శనివారం ఆషాఢ శుద్దనవమి ఉదయం ఉయ్యూరు శ్రీ సువర్చలాన్జనేయ స్వామి ఆలయం లో అత్యంత వైభవం గా జరిగిన”శాకంభరీ పూజ ”చిత్రాలు

1-7-18శనివారం ఆషాఢ శుద్దనవమి ఉదయం ఉయ్యూరు శ్రీ సువర్చలాన్జనేయ స్వామి ఆలయం లో అత్యంత వైభవం గా జరిగిన”శాకంభరీ పూజ ”చిత్రాలు https://photos.google.com/share/AF1QipPaUmrifwbsoD3DUX69DL-AbXUyykdC6yDY9MLDuEUUwdEhR0d38cb9d_pKvtE_Kg?key=emh1MlU3RUNzSlBBejZMYjVCMk0yNm1pWXBqMTdn

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

శాకంభరి పూజ ఉయ్యూరు శ్రీ సువర్చలా0జనేయ స్వామి దేవాలయం లో ఆషాఢ మాస ప్రత్యేక కార్యక్రమాలు

           శాకంభరి పూజ శాకంభరి దేవి ఎవరు ?ఆపేరుకు అర్ధమేమిటి? శాకంభరీ దేవి పార్వతీ దేవి అవతారం .మహాకాలుని అర్ధాంగి .పచ్చదనానికి దివ్య మాత. శాకాహారమైన ప్రతి వస్తువు ఆమె దివ్య  ప్రసాదమే  .కరువు కాటకాలలో ఆది పరాశక్తి శాకంభరీ దేవిగా అవతారం దాల్చి భూమిపైకి వచ్చిఅన్నార్తులకు  శాకాహారాన్ని సమృద్ధిగా లభించేట్లు చేస్తుంది .శాకాలను భరించేది ,ధరించేది కనుక శాకంభరి అంటారు … Continue reading

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

ఉయ్యూరు శ్రీ సువర్చలా0జ నేయ  స్వామి దేవాలయం లో ఆషాఢ మాస ప్రత్యేక కార్యక్రమాలు  

ఉయ్యూరు శ్రీ సువర్చలా0జ నేయ  స్వామి దేవాలయం లో ఆషాఢ మాస ప్రత్యేక కార్యక్రమాలు  ఉయ్యూరు  రావి చెట్టు బజారు లో వేంచేసి యున్న శ్రీ సువర్చలాంజనేయ స్వామి దేవాలయం లో – 1- 21- 7-18 శనివారం -ఉదయం -9 గం .లకు శాకాంబరీ పూజ 2-23-7-18 సోమవారం- తొలి ఏకాదశి సందర్భంగా- సాయంత్రం 6-30గం … Continue reading

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

శ్రీ వాణీ సమార్చనలో శ్రీమతి వాణీ కుమారి

శ్రీ వాణీ సమార్చనలో శ్రీమతి వాణీ కుమారి తండ్రి గారి ఇంటిపేరు తుమ్మలపల్లి .తుమ్మలపల్లి వారిలో కవులు రచయితలూ ,చరిత్ర ,రాజకీయ ,వాణిజ్య ,కళా ,సాంస్కృతిక రంగాలలో లబ్ధ ప్రతి స్టులు. అందులో శ్రీ తుమ్మలపల్లి రామ లింగేశ్వరరావు ముఖ్యంగా పేర్కొన దగిన మహారచయిత ఆధ్యాత్మిక విషయ వివేకి .శ్రీ శృంగేరి పీఠాధిపతుల ఆశీస్సులు పుష్కలంగా … Continue reading

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

8-7-18 సాహిత్యాదివారం 

8-7-18 సాహిత్యాదివారం హైదరాబాద్ లో 8-7-18 ఆదివారం చక్కని సాహిత్యాదివారం గా గడిచింది . బహుశా కిందటి మంగళవారంఅనుకొంటా  నేను ఉయ్యూరులో ఉన్నప్పుడు మధ్యాహ్నం 2 గంటలకు హైదరాబాద్ నుండి శ్రీమతి వాణీ కుమారి గారు ఫోన్ చేసి తాను  సరసభారతి బ్లాగు ను నిత్యం చదువుతానని , అమెరికాలో షార్లెట్ లో ఉన్న మామనవాళ్లు … Continue reading

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

పుల్లూరు హైస్కూల్ 1989-90 బాచ్ తో ఇప్పుడు ,అప్పుడు ఫోటోలు

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

మూగ బోయిన వేయి గొంతుక” మాధవ వేణు ”జ్యోతి-20-6-18

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

1989-90 బాచ్ పుల్లూరు విద్యార్థుల ఆత్మీయ కలయిక -పేపర్ వార్తలు

1989-90 బాచ్ పుల్లూరు విద్యార్థుల ఆత్మీయ కలయిక -పేపర్ వార్తలు        

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

 పుల్లూరు పూర్వ విద్యార్థుల సంబురాలు 

పుల్లూరు పూర్వ విద్యార్థుల సంబురాలు 1989-90 బాచ్ పదవ తరగతి పుల్లూరు అంటే మైలవరం దగ్గరున్న చిలుకూరివారి గూడెం హై స్కూల్    పూర్వ విద్యార్థుల అపూర్వ సమ్మేళనం రేపు 17-6-18 ఆదివారం జరుగుతుందని ,అప్పటి హెడ్ మాస్టర్ ను నేనే కనుక నన్నూ  మా శ్రీమతినీ ,అప్పటి ఉపాధ్యాయులను ఆహ్వానించారు .మేమిద్దరం రేపు ఉదయం బయల్దేరి … Continue reading

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

ఫ్రస్త్రేటేడ్ ఉమన్ శాడిజం గా మారిందా ?

ఫ్రస్త్రేటేడ్ ఉమన్ శాడిజం గా మారిందా ?  బాలనటి గా తన సహజ నటనను ప్రదర్శించి సుమారు రెండేళ్లనుంచి ”ఫ్రేస్ట్రేటెడ్  వుమన్ ”సీరియల్ ను ఎంతో ఆకర్షణీయంగా నటించి తీస్తూ ప్రజలకు మరింత దగ్గరయింది .ఆహావభావాలు, డైలాగ్ డెలివరీ అనితర సాధ్యం అనిపిస్తాయి .తీసుకున్న సమస్యలన్నీ అర్ధవంతమై  వాటిని తీసిన విధానమూ ఉత్కృష్టంగా నే ఉన్నాయి … Continue reading

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

పైసా పండగ

పైసా పండగ ‘’నాన్నా !పెట్రోల్ ధర పైసా తగ్గించారట కదా ?’’ ‘’అవునమ్మా .మీరు వెంటనే వేసవి సెలవులకు ఇండియా వచ్చేయండి హాయిగా రెంటల్ కారు లో మీరూ పిల్లలూ దేశమంతా తిరిగి చూడచ్చు .మీ అమ్మ ఊరగాయలు , పిల్లలకు మామిడి తాండ్ర రెడీ చేసింది వచ్చేయండి వచ్చేయండి. పిల్లలకు కూడా సెలవలేగా .హాయిగా … Continue reading

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

బాపు గారి తమ్ముడుశ్రీ శంకర్ గారు స్వయంగా చిత్రించి ఆత్మీయంగా నాకు పంపిన ప్రముఖ కదా రచయిత శ్రీ పెద్దిభొట్ల సుబ్బరామయ్య ,నవలారాజ్ఞి శ్రీమతి యద్దనపూడి సులోచనారాణి గార్ల చిత్రాలు

బాపు గారి తమ్ముడుశ్రీ  శంకర్ గారు స్వయంగా చిత్రించి ఆత్మీయంగా నాకు పంపిన ప్రముఖ కదా రచయిత శ్రీ పెద్దిభొట్ల సుబ్బరామయ్య ,నవలారాజ్ఞి శ్రీమతి యద్దనపూడి సులోచనారాణి గార్ల చిత్రాలు -మీకోసం -దుర్గాప్రసాద్ 

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

    క్విజ్జో క్విజ్జు

    క్విజ్జో క్విజ్జు 1-మాటల్లోనే  మరుగు దొడ్డి ? 2-బ్యాంక్ నోట్ల నూడ్చే చీపిరికట్ట ? 3 –ఎన్నికల ప్రచార సమయం లో తప్ప దేశం లో కనిపించని వాడు 4-గంగ కాలుష్యం శుద్ధి చేస్తున్నట్లు నటించే నట చక్రవర్తి ? 5-మెజార్టీ లేకపోయినా ముఖ్య మంత్రిని అందలం ఎక్కించే నేర్పున్నవాడు ? 6-చాయ్ వాలానని గుర్తు … Continue reading

Posted in సమయం - సందర్భం | Tagged | 2 Comments