శ్రీ శంభుని మూర్తిగారి 12 వ రోజు కార్యక్రమం
మా పెద్ద తోడల్లుడు గారు స్వర్గీయ శంభుని శ్రీ రామచంద్ర మూర్తిగారి 12 వ రోజు కార్యకరామానికి ఈ రోజు ఖమ్మంవెళ్ళటానికి ఉదయం 5 గంటలకే లేచి స్నానసంధ్య పూజాదికాలు పూర్తీ చేసి మా కోడలు రాణి పంపిన ఇడ్లీలు తిని,నేను కలిపిన కాఫీ రెండు సార్లు తాగి ,దారిలో ఆకలైతే ఉంటుందని మా ఆవిడ చేసిన ఉప్మా హాట్ పాక్ లో పెట్టుకొని మేమిద్దరం, మామూడవ కోడలు రాణి కారులోఉయ్యూరు నుంచి ఉదయమ7-30 కు బయల్దేరి బెజవాడ లబ్బీపేట స్టేట్ బాంక్ కాలనీ లో ఉన్న మా వదిన గారు (–మా ఆవిడరెండవ అక్కగారు) జానకిగారిని కార్లో ఎక్కించుకొని ,వాళ్ళిచ్చిన కాఫీ తాగి ,సత్యనారాయణపురం వెళ్లి సుమారుపదిరోజులక్రితం లైట్ హార్ట్ ఎటాక్ వచ్చి స్టెంట్ వేయించుకొని ,ఇంటివద్ద కోలుకుంటున్న కృష్ణా జిల్లా రచయితల సంఘం ప్రధాన కార్య దర్శి డా శ్రీ పూర్ణచంద్ గారింటికి వెళ్లి పరామర్శించి ,పళ్ళు ఇచ్చి ,మళ్ళీ అక్కడ ఆయన శ్రీమతి గారిచ్చిన కాఫీ తాగి ,మా ఆవిడకు మా కోడలుకు ఆవిడ పెట్టిన జాకెట్ పండ్లు తీసుకొని ,పూర్ణ చ౦ద్ దంపతులు ‘’ఇవాళ శ్రావణ శనివారం ఆదిదంపతులు మా ఇంటికి రావటం మా అదృష్టం ‘’అంటూ ఇద్దరూ మా పాదాలు తాకి నమస్కరిస్తే అక్షింతలతో ఆశీర్వదించి ,ఆరోగ్యం జాగ్రత్త అని చెప్పి , పూర్ణచంద్ రాసినా ఇంకా ఆవిష్కరణ జరగని ‘’తెలుగు కోసం ‘’పుస్తకం ఆప్యాయంగా నాకు అందిస్తే పుచ్చుకొని అక్కడినుంచి 9-30 కు మళ్ళీ బయల్దేరి కొంగరమల్లయ్యగట్టు దగ్గరున్న గట్టు భీమవరం,ముండ్లపాడు, పెనునుగంచిప్రోలు, మక్కపేట ,లింగాల ,వత్సవాయి చేరి ,అక్కడ నేను మొదటిసారిగా సైన్స్ మాస్టర్ నుండి హెడ్ మాస్టర్ ప్రమోషన్ పొంది 1978 నుండి సుమారు ఏడాది పని చేసిన వత్సవాయి స్కూల్ వాళ్లకు చూపించి, అక్కడ కనేను శ్రీ పుల్లయ్యనాయుడు దంపతులింట్లో ఒక చిన్న దిలో అద్దెకు౦టూ వంట చేసుకొని తిన్న గదిని చూపించి నాయుడు దంపతులు నాకు సహకరించిన విషయాలు వీళ్ళకు తెలియజేసి , ఎప్పుడు ఖమ్మ వెళ్ళినా తిరుగు ప్రయాణం లో పుల్లయ్య దంపతుల ఇంటివద్ద పది నిమిషాలు ఆగి ,ఆ దంపతులు మాకు ఆప్యాయంగా ఇచ్చే స్ప్రైట్ తాగి వచ్చేవాళ్ళం -ఈ సారి మేం ఫ్రైట్ బాటిల్ కొని వాళ్ళకిచ్చి ,మేమూ తాగి సరసభారతి పుస్తకాలు ,పళ్ళు ,ఆ దంపతుల చేతిలో పెట్టి,బిటెక్ పాసి బొంబాయిలో ఉద్యోగం చేస్తున్న వాళ్ల అబ్బాయికి పెళ్ళిసంబంధం ఖాయమైనదని విని సంతోషించి ,ఉదయం 11 గంటలకు అక్కడినుంచి బయల్దేరి బోనకల్లు ,ముష్టి కుంట మీదుగా ఖమ్మం మధ్యాహ్నం 12 -30 చేరి అప్పటికే అన్ని కార్యక్రమాలు అయి, మాసికంమొదలు పెడుతున్నారని తెలుసుకొని ఇచ్చిన కాఫీ పుచ్చుకొని అప్పటికే హైదరాబాద్ నుంచి వచ్చిన మా బావమరది రుక్మిణి దంపతులతో కబుర్లు చెప్పి కాసేపు విశ్రాంతిగా కుర్చీలలో చేరబడ్డా౦ .
భోక్తలు భోజనాలు చేస్తుండగా ఆ పెద్ద వదినగారు అంటే మా శ్రీమతి పెద్దక్కగారిని చూసి ,పైన డాబా పై ఏర్పాటు చేసిన భోజనాలకు ఉపక్రమించాం . మూర్తిగారి కూతురు మంజుల మామాగారు ,బావగార్లు ఆడపడుచులు ,మూర్తిగారి కొడుకు సూర్యం బామ్మర్దులు , బాబాయి కొడుకు, కూతుళ్ళు , యజ్ఞశ్రీ మా నాల్గవ తోడల్లుడు స్వర్గీయ దక్షిణామూర్తి గారి కూతుళ్ళు మాధవి ,పద్మజ ,సూర్యం కొడుకు మామగారు అత్తగారు మా ఆవిడ మేనమామ కొడుకు చలపతి ,మా ఆవిడ చెల్లెలు స్వర్గీయ దుర్గ కూతురు ,మాఆవిడ మేనమామకొడుకు శ్రీనివాస్ ,అతని తమ్ముడు శివయ్య దంపతులు ,మూర్తిగారి స్నేహితులు అందరూ వచ్చారు .భోజనాలు అందరివీ అయ్యేసారికి మధ్యాహ్నం 3-15 అయింది . వంటలు బాగున్నాయో లేదోకాని నాకేమీ సహించక ‘’కతికా’’.
సాయంత్రం 4 గంటలకు ఆనంద్ దంపతులుముందే బుక్ చేసుకున్న హైదరాబాద్ బస్ లో వెళ్ళిపోయారు .బ్రహ్మగారు 4-15 కు ఆశీర్వచన కార్యక్రమం మొదలు పెట్టారు వేద పనసలతో ఆశీర్వచనం బాగానే జరిపించారు సూర్యానికి .ఆయన మామూలుగా వేదాంత ధోరణిలో పుతృనికిఉన్న మూడు రుణాలు, వాటిని ఎలా తీర్చుకోవాలో వివరించారు .ఆయనే బంధువులేవరైనా మాట్లాడండి అంటే నేను మంజుల మామగారిని నాలుగు మాటలు చెప్పమన్నారు .ఆయ చెప్పలేనంటే ఆయన కొడుకు, నాకు సాహితీ మిత్రుడు అందరి తరఫునా నన్ను మాట్లాడమని కోరారు .నేను ‘’మా పెద్దతోడల్లుడు శ్రీరామచంద్ర మూర్తిగారు సాక్షాత్తు ఆ శ్రీరాముని సద్గుణాలన్నీ మూర్తీభవించిన సహృదయులు .ఆనందంగా జీవించారు .సంతృప్తి తో సార్ధక జీవితం గడిపారు .మునిమనవలలను కూడా చూసి పరమసంతోషం చెందారు .ఆయనకుమారుడు సూర్య౦, కోడలు స్వర్ణ చాలాబాధ్యతగా ఆయన్ను కనిపెట్టుకొని ఉన్నారు .ఎంతటి ఖర్చుకైనా వెనకాడక వైద్యం చేయించారు .ఆయనా కొడుకు సేవలకు మురిశారు .కూతురు మంజుల అన్నకు సహకారిగా ఉంటూ, తలిదండ్రులను చూసుకొన్నది .మూర్తి గారి అల్లుడు సత్యనారాయణ ఉత్తమోత్తముడు .అలాంటి అల్లుడు మూర్తి దంపతులకు లభించటం వాళ్ల అదృష్టం .ఈ 12 రోజులు ఇక్కడే ఉండి బావమరది సూర్యానికి అండగా నిలిచి కార్యక్రమాలను చక్కగా దగ్గరుండి జరిపించాడు .మావదిన గారు భర్త మూర్తిగారికి తానేస్వయంగా వండి వడ్డించి ఆయన కు తృప్తిగా భోజనం పెట్టాలనే తపనతో ఖమ్మం లోనే ఉండిపోయారిద్దరూ .మూర్తిగారు ఆఖరి క్షణాలు స్వంత ఇంటిలో గడవటం, ఇక్కడేఆఖరి శ్వాస విడవటం ఆయన మంచి మనసుకు అద్దం పట్టే విషయం .దినవారాలను సూర్యం చాలా నిబద్ధతతో నిర్వహించాడు .తండ్రిబాధ్యతను అన్నా చెల్లెలు ఎలా నిర్వహించారో, ఇప్పుడు అమ్మబాధ్యతనూ అలాగే చేబ తారనటానికి ఏ మాత్రం సందేహం లేదు. వాళ్ళిద్దరూ , వీళ్లిద్దరికి కను రెప్పలు .’’అని ముగించాను .మధ్యలోనే టీలు ఇస్తే తాగాం .
సాయంత్రం 5-30 కు మేం నలుగురం కారులో బయల్దేరి బెజవాడలోజానకిగారిని ఇంటివద్ద దింపేసి ,ఇంటికి ఉయ్యూరు తిరిగి వచ్చేసరికి రాత్రి 9-30 అయింది .పొద్దున్న ఉప్మాను చెరికొంచెం తిని, మజ్జిగ తాగి ఇది ‘’కొట్టి’’రాత్రి 11-25 కు పూర్తి చేసి, పడక సీనుకు రెడీ అవుతున్నా .
మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -8-9-18 –ఉయ్యూరు
—
