మన మరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు-177

మన మరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు-177

· 177-రంగస్థల నటుడు ,వ్యాఖ్యాత ,ప్రజానాట్యమండలి కళాకారుడు ,ప్రపంచం ,రోజులు మారాయి ఫేం –వల్లం నరసింహారావు

· వల్లం నరసింహారావు సినిమా, రంగస్థల నటుడు, వ్యాఖ్యాత, ప్రజా కళాకారుడు. ఇతడు 2006, మార్చి 13వ తేదీన 79 ఏళ్ల వయసులో హైదరాబాదులో గుండెపోటుతో మరణించాడు[1]. ఇతడు ప్రజా నాట్యమండలి కళాకారుడిగా ఉద్యమంలో పాలు పంచుకున్నాడు. కృష్ణా జిల్లా,తిరువూరుకు చెందిన వల్లం నరసింహారావు 1952లో సినీరంగ ప్రవేశం చేశాడు. మా భూమి వంటి నాటకాల్లో నటించి ఈయన జైలు శిక్ష అనుభవించాడు. కులదైవం, ముద్దుబిడ్డ సినిమాల్లో ఈయన హీరోగా నటించాడు. ఇంకా పలు చిత్రాల్లో నటించాడు. నటుడు బి.పద్మనాభంతో కలిసి రేఖా అండ్ మురళి పతాకంపై పలు చోట్ల నాటకాలు ప్రదర్శించాడు.

సినిమాలు

  1. ప్రపంచం (1953)
  2. రోజులు మారాయి (1955)
  3. ముద్దు బిడ్డ (1956)
  4. ఎం.ఎల్.ఏ. (1957)
  5. ఎత్తుకు పైఎత్తు (1958)
  6. ముందడుగు (1958)
  7. కులదైవం (1960)
  8. అసాధ్యుడు – శ్రీశ్రీ వ్రాసిన అల్లూరి సీతారామరాజు నాటకానికి వ్యాఖ్యాత.
  9. నిలువు దోపిడి (1968)
  10. రణభేరి (1968)
  11. సంపూర్ణ రామాయణం (1971 )
  12. దేవుడు చేసిన పెళ్లి (1974)
  13. కొత్త కాపురం (1975)
  14. ఇది కథ కాదు (1979)
  15. యువతరం కదిలింది (1980)
  16. దారి తప్పిన మనిషి (1981)
  17. నాలుగు స్తంభాలాట (1982)
  18. భారతసింహం (1995)
  19. ధర్మచక్రం (1996)
  20. శ్రీరాములయ్య (1998)
  21. వెలుగునీడలు (1999)
  22. సూర్య పుత్రిక (1999)
  23. ఈతరం నెహ్రూ (2000)
  24. భద్రాచలం (2001)
  25. ఆయుధం (2003)
  26. సింహాద్రి (2003)
  27. ఆ నలుగురు (2004)
  28. లక్ష్మీనరసింహా (2004)
  29. శాంతి సందేశం (2004)
  30. సోగ్గాడి సరదాలు (2004)
  31. ప్లీజ్ నాకు పెళ్లైంది (2005)
  32. మేస్త్రీ (2005)
  33. నిన్న నేడు రేపు (2008)

నాటకాలు
మాభూమి
కాళహస్తి మహాత్మ్యం
శాంతి నివాసం
ఇన్‌స్పెక్టర్ జనరల్[2]
· ఈ వల్లం నరసింహారావు గారి అన్నకుమారుడి పేరుకూడా వల్లం నరసింహారావు .ఈయన మాకు 2017లో అమెరికాలోని షార్లెట్ నగరం లో ఆ దంపతుల 50వ వివాహ వార్షికోత్సవం నాడు పరిచయమయ్యారు .ఈయనకూడా నాటక కళాకారుడే .ఆయనతో నాటకాలలో నటించిన వారే .ప్రభుత్వ ఉద్యోగం చేసి రిటైరయ్యారు .ఇదొక యాక్సి డెంటల్ కోయింసి డెంట్.

అసలు వల్లం గారిని సుమారు 40ఏళ్ళక్రితం హైదరాబాద్ లో అనుపమ సంస్థ నిర్మాత దర్శకుడు కెబి తిలక్ మొదలైనవారితో చూశా .

·

· సశేషం

· మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -4-4-22-ఉయ్యూరు

Posted in సినిమా | Tagged | Leave a comment

మన మరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు-176

  మన మరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు-176

· 176-భరత కళాప్రపూర్ణ ,కళాసరస్వతి ,సంగీతనాటక అకాడెమి అవార్డీ,రహస్యం సినిమా ఫేం –కోరాడ నరసింహారావు

· కోరాడ నరసింహారావు (1936 – జనవరి 4, 2007) ప్రఖ్యాత కూచిపూడి నాట్యాచార్యుడు.

· పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులోని పవర్‌పేట వాస్తవ్యుడైన కోరాడ 1936[1] లో ఒక సామాన్య రైతు కుటుంబంలో జన్మించి, 12 ఏటనే పలు నాట్యరీతులను ఆకళింపు చేసుకున్నాడు. 1960లలో ప్యారిస్‌లో జరిగిన విశ్వ నాట్యోత్సవాలలో కోరాడ ప్రదర్శించిన కూచిపూడి దశావతారాల ప్రదర్శనకు ప్రపంచ ఉత్తమ పురుష నర్తకుడిగా బహుమతి పొంది జగద్విఖ్యాతుడయ్యాడు.

· కోరాడ నరసింహారావు భారత తొలి ప్రధాని పండిట్‌ జవహర్‌లాల్ నెహ్రూ వంటి ప్రముఖుల సమక్షంలో నాట్యం చేయడమే కాక 23 దేశాల్లో కూచిపూడి నాట్యాన్ని ప్రదర్శించాడు. భారతదేశ మొట్టమొదటి మిస్‌ ఇండియా ‘పద్మభూషణ్‌’ ఇంద్రాణి రెహమాన్, పద్మ విభూషణ్‌ యామిని కృష్ణమూర్తి, వైజయంతి మాల, రీటా చటర్జీ, గోపీకృష్ణ, హేమమాలిని, శాంతారామ్‌లకు కూచిపూడి నృత్యంలో శిక్షణ ఇచ్చాడు. గిరిజా కళ్యాణం, వేదాంతం రాఘవయ్య నిర్మించిన రహస్యం చిత్రాల్లో నటించారు. కోరాడ నరసింహారావును భరత కళాప్రపూర్ణ, కళాసరస్వతి లాంటి బిరుదులతో పాటు కేంద్ర, ర్రాష్ట ప్రభుత్వాలు అనేక సత్కారాలు, పురస్కారాలతో గౌరవించాయి. నాట్యరంగంలో ఆయన విశిష్ట సేవలకు గాను కేంద్ర సంగీత నాటక అకాడమీ 2005 లో అవార్డును రాష్ట్రపతి అబ్దుల్‌ కలాం చేతుల మీదుగా 2006 మార్చి 20వ తేదీన న్యూఢిల్లీలో అందుకున్నారు.

· మరణం
· కోరాడ తీవ్ర అస్వస్థతతో 2007 జనవరి 4 రాత్రి హైదరాబాదులో ఒక ప్రైవేట్‌ ఆసుపత్రిలో మరణించాడు. ఆయనకు కుమారుడు, కుమార్తె ఉన్నారు.

· సశేషం

· మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -4-4-22-ఉయ్యూరు

Posted in సినిమా | Tagged | Leave a comment

మన మరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు-174

• మన మరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు-174
• 174-జయ ,శోభనాచల సంస్థ , దక్ష యజ్ఞం,గొల్లభామ ,లక్షమ్మ నిర్మాత దర్శకుడు –మీర్జాపురం రాజా
• శోభనాచల పిక్చర్స్ తెలుగు చలనచిత్రరంగంలో అతిముఖ్యమైన నిర్మాణసంస్థల్లో ఒకటి. దీని అధినేత మీర్జాపురం రాజా వారు. మీర్జాపురం అంటే నూజివీడు .నూజివీడు రైల్వే స్టేషన్ పేరు మీర్జాపురం .అసలు పేరు మేకా రంగయ్యప్పారావు .ఇంతకముందు జయ ఫిలింస్ పతాకాన కొన్ని చిత్రాలు నిర్మించిన రాజా వారు 1941లో శోభనాచల సంస్థను స్థాపించారు. శోభనాచల సంస్థ నిర్మించిన తొలి చిత్రం దక్షయజ్ఞం (1941). గొల్లభామ (1947) చిత్రం శోభనాచల సంస్థకు ఎనలేని ఖ్యాతిని తెచ్చిపెట్టింది. 1947లో విడుదలైన చిత్రాలలో గొల్లభామనే ఆర్థికంగా పై చేయి సాధించింది. 1949లో వచ్చిన కీలుగుర్రం చిత్రానికి రాజా వారు దర్శకుడి, నిర్మాత. కీలుగుర్రం రాజా వారు దర్శకత్వం వహించిన తొలి చిత్రం. ఆ చిత్రం కూడా ఘన విజయం సాధించింది. 1950లో విడుదలైన లక్ష్మమ్మ చిత్రాన్ని ప్రతిభా వారి శ్రీ లక్ష్మమ్మ కథతో పోటీ పడి నిర్మించారు. ఈ పోటీలో లక్ష్మమ్మదే పై చేయి అయ్యింది. 1940లలో గొప్ప పేరు తెచ్చుకున్న శోభనాచల సంస్థ కొన్ని కారణాల వలన 1950ల ప్రథమార్థంలో మూతపడింది. శోభనాచల సంస్థ యాజమాన్యంలో మద్రాసులోని తేనాంపేట ప్రాంతంలోని శోభనాచల స్టూడియోలలో అనేక చిత్రాలు నిర్మితమయ్యాయి. 1949లో వాహినీ స్టూడియోస్ ప్రారంభంతో శోభనాచల స్టూడియోలలో చిత్రాల నిర్మాణం తగ్గిపోయింది. 1955లో శోభనాచల స్టూడియోల యాజమాన్యం మారింది, స్టూడియో పేరు వీనస్ స్టూడియోగా మార్చబడింది. దశాబ్ద కాలం పైగా పనిచేసిన వీనస్ స్టూడియో తర్వాత మూతపడింది.
చిత్ర సమాహారం
జయ ఫిలిమ్స్ చిత్రాలు
• జరాసంధ (1938)
• మహానంద (1939)
• భోజ కాళిదాసు (1940)
• జీవన జ్యోతి (1940)
శోభనాచల చిత్రాలు
• దక్షయజ్ఞం (1941)
• భీష్మ (1944)
• గొల్లభామ (1947)
• మదాలస (1948)
• కీలుగుర్రం (1949)
• లక్ష్మమ్మ (1950) (ఎం.ఆర్.ఏ. ప్రొడక్షన్స్తో కలిసి)
• తిలోత్తమ (సినిమా) (1951)
• ప్రజాసేవ (1952)
• సావాసం (1952)
• సశేషం
• మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -3-4-22
• మన మరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు-175
• 175-మీర్జాపురం రాణి ,గాయని ,నిర్మాత ,రామారావు రంగారావు ఘంట సాల,రమేష్ నాయుడు  లను తెలుగు తెరకు పరిచయం చేసిన అందాలనటి గొల్లభామ,లక్షమ్మ ఫేం,రఘుపతి వెంకయ్య అవార్డీ –కృష్ణ వేణి
• సి.కృష్ణవేణి లేదా (ఎం.కృష్ణవేణి) (జ.1924) అలనాటి తెలుగు సినిమా నటీమణి, గాయని, నిర్మాత
జీవిత చరిత్ర[మార్చు]
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని రాజమండ్రికి చెందిన కృష్ణవేణి సినిమాలలోకి రాక ముందు రంగస్థల నటిగా పనిచేసింది.1936లో సతీఅనసూయ /ధృవ చిత్రంతో బాలనటిగా సినీ రంగప్రవేశం చేసింది. ఆ తరువాత కథానాయకిగా తెలుగులో 15 చిత్రాలలో నటించింది. కొన్ని తమిళ, కన్నడ భాషా చిత్రాలలో కూడా కథానాయకిగా నటించింది.
కృష్ణవేణి తెలుగు సినిమా నిర్మాత,తనకంటే 29ఏళ్ళు పెద్ద అయిన  మీర్జాపురం రాజా (జన్మనామం:మేకా రంగయ్య)తో వివాహం జరిగింది.ఈమె కూడా స్వయంగా అనేక సినిమాలు నిర్మించింది. ఈమె తన సినిమాలలో తెలుగు సాంప్రదాయ విలువలకు అద్దంపట్టి జానపదగీతాలకు పెద్దపీట వేసింది. 1949 తెలుగులో సినిమా చరిత్రలో మైలురాయి అయినటువంటి మన దేశం చిత్రాన్ని నిర్మించి అందులో తెలుగు తెరకు నందమూరి తారక రామారావును, యస్వీ రంగారావును,నేపథ్యగాయకునిగా ఘంటసాల వెంకటేశ్వరరావును పరిచయం చేసింది.ఆ తరువాత సినిమాలలో అనేక గాయకులు నటులు, సంగీత దర్శకులను పరిచయం చేసింది. 1957 లో తీసిన దాంపత్యం సినిమాతో మరో సంగీత దర్శకుడు రమేష్ నాయుడును తెలుగు సినిమాకు పరిచయం చేసింది.
పురస్కారాలు
• తెలుగు సినిమా పరిశ్రమకు ఈమె చేసిన జీవితకాలపు కృషిగాను 2004లో ప్రతిష్ఠాత్మక రఘుపతి వెంకయ్య అవార్డు అందుకుంది.
కృష్ణవేణి నటించిన సినిమాలు
1. సతీ అనసూయ -ధ్రువ (1936)
2. మోహినీ రుక్మాంగద (1937)
3. కచ దేవయాని (1938)
4. మళ్ళీ పెళ్ళి (1939)
5. మహానంద (1939)
6. జీవనజ్యోతి (1940)
7. దక్షయజ్ఞం (1941)
8. భీష్మ (1944)
9. బ్రహ్మరథం (1947)
10. మదాలస (1948)
11. మన దేశం (1949)
12. గొల్లభామ (1947)
13. లక్ష్మమ్మ (1950)
నిర్మాతగా కృష్ణవేణి
కృష్ణవేణి నిర్వహించిన నిర్మాణ సంస్థలు
• భర్త స్థాపించిన సంస్థ – జయా పిక్చర్స్ ఆ తరువాతి కాలంలో దీన్ని శోభనాచల స్టూడియోస్ గా నామకరణం చేశారు.
• సొంత సంస్థ – తన కుమార్తె మేకా రాజ్యలక్ష్మీ అనురాధ పేరు మీదుగా ఎం.ఆర్.ఏ.ప్రొడక్షన్స్
కృష్ణవేణి నిర్మించిన సినిమాలు
• మన దేశం (1949)
• లక్ష్మమ్మ (1950)
• దాంపత్యం (1957)
• గొల్లభామ (1947)
• భక్త ప్రహ్లాద (1042)
• సశేషం
• మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -3-4-22-ఉయ్యూరు

Posted in సినిమా | Tagged | Leave a comment

ఓటుహక్కు కోసం పోరాడిన అమెరికన్ జర్నలిస్ట్ –మేరీ వైట్ ఓవింగ్టన్(వ్యాసం )-

ఓటుహక్కు కోసం పోరాడిన అమెరికన్ జర్నలిస్ట్ –మేరీ వైట్ ఓవింగ్టన్(వ్యాసం )- గబ్బిట దుర్గాప్రసాద్
01/04/2022 గబ్బిట దుర్గాప్రసాద్
11-4-1865న అమెరికాలోని న్యూయార్క్ వద్ద బ్రూక్లిన్ లో మేరీ వైట్ ఓవింగ్టన్ జన్మించింది .తలిదండ్రులు స్త్రీ హక్కులకోసం,బానిసత్వ నిర్మూలన కోసం పోరాడే యునిటరేనియన్ చర్చి కి సంబంధించిన వారు .పాకర్ కాలేజి ఇన్ ష్టిట్యూట్,రాడిక్లిఫ్ కాలేజి లో చదివి , 1890లో సివిల్ రైట్స్ ఉద్యమం లో పాల్గొని ,ఫ్రెడరిక్ డగ్లస్ ఉపన్యాసం న్యు యార్క్ లో విని ప్రేరణ పొంది ,1903లో సోషల్ రిఫార్మ్ క్లబ్ లో బుకర్ టి.వాషింగ్టన్ ప్రసంగం తో స్పూర్తి పొందింది .1894లో ఇడా బి.వెల్స్ ను కలిసి ,అతని అక్క చెల్లెళ్ళ పిల్లలకు క్రిస్మస్ గిఫ్ట్ లు అందించి ,వారి దయనీయ జీవితాలను చూసి కలత చెంది ,ఇడా తో కలిసి వారి నివాసాలను మెరుగు పరచటానికి కృషి చేసింది .1895లో బ్రూక్లిన్ లో ‘’గ్రీన్ పాయింట్ సెటిల్ మెంట్ ‘’ఏర్పరచి ,తర్వాత ఏడాది ఆప్రాజేక్ట్ హెడ్ అయింది .1904లో సాంఘిక విచారణ సంఘం అయిన గ్రీన్ విచ్ హౌస్ కమిటీ ఫెలో అయింది .తర్వాత అయిదేళ్ళు మాన్ హట్టన్ నల్లవారి ఉద్యోగాలు గృహ విషయాలపై అధ్యయనం చేసింది .ఆ సమయం లో డబ్లు బి.డ్యుబోస్ తో పరిచయమై ,ఇద్దరు ‘’నయాగర మూమెంట్’’ కు సంస్థాపక సభ్యులయ్యారు .

1905లో ఓవింగ్టన్ అమెరికన్ సోషలిస్ట్ పార్టీ లో చేరి ,విలియం మోరిస్ ప్రభావం తో ఫిలిప్ రాండాల్ఫ్ ,ఫ్లయోడ్ డెల్,మాక్స్ ఈస్ట్ మాన్ ,జాక్ లండన్ వంటి ప్రముఖులతో పరిచయం పెంచుకొన్నది .వీరంతా జాతి సమస్యలు క్లాస్ సమస్యల వంటివే అని అభిప్రాయ పడ్డారు .దిమాసేస్ ,న్యూయార్క్ ఈవెనింగ్ పోస్ట్ ,న్యూయార్క్ కాల్ ,పత్రికలలో ఈసమస్య లపై వ్యాసాలూ రాసింది .రే స్టానార్డ్ బెకర్ తో కలిసి పని చేసింది అతడు 1908లో రాసిన ‘’ఫాలోయింగ్ ది కలర్ లైన్ ‘’పుస్తకం చదివి ప్రభావితురాలైంది .

1908లో విలియం ఇంగ్లిష్ వాల్లింగ్ అనే సోషలిస్ట్ ది ఇండి పెండెంట్ పత్రిక లో రాసిన ‘’రేస్ వార్ ఇన్ ది నార్త్ ‘’చదివి ,నల్లజాతి నిలయాలైన అబ్రహాం లింకన్ ,స్ప్రింగ్ ఫీల్డ్ ,ఇల్లినాయిస్ లలో జరిగిన హత్యలు గృహదహనాలు బిజినెస్ లపై దాడులు తెలిసి అత్యున్నత సంఘం తో విచారణ జరిపించి వారికి తక్షణ న్యాయం జరిపించాలని కోరిన విషయాలన్నీ తెలుసుకొని ,తానుకూడా ఆర్టికల్స్ రాసి ,న్యూయార్క్ సిటిలో వాలింగ్ ను ఆయన ఇంట్లో హెన్రి మొసోవిజ్ బృందంతో వెళ్లి పరామర్శించి ,ఆఫ్రికన్ అమెరికన్ ల పౌర ,రాజకీయ హక్కులకోసం లింకన్ పుట్టిన రోజు 1909ఫిబ్రవరి 12న జాతీయ సమావేశం జరపాలని నిర్ణయించారు .

న్యూయార్క్ లో1909లో మే 31,జూన్ 1 న ‘’నేషనల్ నీగ్రో కమిటీ ‘’సమావేశం జరిగింది .తర్వాత ఏడాది అది ‘’నేషనల్ అసోసియేషన్ ఫర్ ది అడ్వాన్స్ మెంట్ ఆఫ్ కలర్డ్ పీపుల్ ‘’(NAACP)గా విస్త్రుతమైసమావేశం జరిపింది .ఓవింగ్టన్ ఎక్సి క్యూటివ్ సేక్రేటరిగా ,జోసేఫిన్ రాఫిన్ ,మేరి టాల్బర్ట్ ,జార్జి హెన్రి వైట్ మొదలైనవారు సభ్యులు .తర్వాత ఏడాది లండన్ లో జరిగిన ‘’యూనివర్సల్ రేసెస్ కాంగ్రెస్ ‘’లో పాల్గొన్నది .రిచేట్టా వాన్డాల్ఫ్ వాలెస్ ‘’చాలాకాలం ఈమె వద్ద సేక్రేటరి గా ఆ సంస్థకు పని చేసింది .

మహిళా ఓటింగ్ హక్కు ఉద్యమాలలో1921లో ఓవింగ్టన్ చురుకుగా పాల్గొని ,ఆలిస్ పాల్ కు ఒక ఉత్తరం రాస్తూ19వ అమెండ్ మెంట్ బిల్లు పాసైన సందర్భంగా జరిపే ‘’నేషనల్ వుమెన్స్ పార్టీ ‘’ఉత్సవాలలో నల్లజాతి మహిళలను కూడా ఆహ్వానించామని కోరింది .పాసిఫిస్ట్ అయిన ఓవింగ్టన్ మొదటి ప్రపంచయుద్ధం లో అమెరికా పాల్గొనటం పై వ్యతిరేకించింది .నల్లవారి పౌరహక్కులను సమర్ధిస్తున్న ‘’ది మెసెంజర్ ‘’పత్రికాధిపతి ఫిలిప్ రాండాల్ఫ్ ను సమర్ధించింది .

యుద్ధం తర్వాత ఓవింగ్టన్ NAACP) లో బోర్డ్ మెంబర్ ,ఎక్సిక్యూటివ్ సెక్రెటరి,చైర్మన్ గా పని చేసింది .మహిళలను చైతన్యం చేసి సంస్థలో చేర్పించింది .ఈ సంస్థ ఓటింగ్ హక్కు, జాతి వివక్షత ,విద్య ,ఉద్యోగం ,గృహాలు ,రవాణా విషయాలపై తీవ్ర పోరాటాలు చేసింది .దక్షిణ రాష్ట్రాలు చేసిన చాలా చట్టాలు రాజ్యాంగ విరుద్ధం అని సుప్రీం కోర్ట్ లో1915నుంచి 1923 వరకు కేసులు వేసి న్యాయం పొందారు .

1934జూన్ లో ఒవింగ్టన్ 14 వివిధ కాలేజి లలో ప్రసంగాలు చేసింది .తన సంస్థ నల్ల తెల్ల యువత ను సమానంగా చూస్తూ నల్లవారి హక్కులను కాపాడే ది అనీ తెల్లవారిలో కూడా నల్లవారి హక్కులపట్ల సానుభూతి తో ఉన్నవారున్నారని “They should know the power the race has gained” – Mary White Ovington[7] చెప్పింది.

బ్లాక్ మాన్హట్టన్ స్టేడి ,హాఫ్ ఎమాన్ ,స్టేటస్ ఆఫ్ నీగ్రో ఇన్ ది యునైటెడ్ స్టేట్స్ ,సోషలిజం అండ్ ఫెమినిస్ట్ మువ్ మెంట్ ,యాన్ ఆ౦థాలజి ఆఫ్ బ్లాక్ చిల్డ్రెన్ ,ది అప్ వర్డ్ పాత్ ,బయాగ్రఫికల్ స్కెచెస్ ఆఫ్ ఆఫ్రికన్ –అమెరికన్స్ ,పోర్త్రైట్స్ ఆఫ్ కలర్ ,పుస్తకాలతో పాటు తన జీవిత చరిత్ర ‘’రెమినిసేన్సెస్ ‘’రాసింది . తన అనారోగ్యం దృష్ట్యా తన పదవి నుంచి తప్పించమని మరీమరీ కోరేది . తప్పని సరి పరిస్థితులలో మేరీ వైట్ ఓవింగ్టన్ 1947లో 38 సంవత్సరాల నిర్విరామ సేవ చేసి తన సంస్థ బోర్డ్ మెంబర్ గా రిటైర్ అయింది . చివరి రోజులలో మాసా చూసేట్స్ లో తన అక్క చెల్లెళ్ళ వద్ద సుఖ జీవితం గడిపింది .అక్కడే న్యూటన్ హైలాన్డ్స్ లో 17-7-1951న 86ఏళ్ళ సార్ధక జీవనం గడిపి మేరీ వైట్ ఓవింగ్టన్ మరణించింది .బ్రూక్లిన్ లోని మిడిల్ స్కూల్ కు ఆమె పేరుపెట్టి గౌరవించారు .2009లో ఆమె గౌరవార్ధం పోస్టల్ స్టాంప్ విడుదల చేశారు .

-గబ్బిట దుర్గా ప్రసాద్

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

Posted in సమీక్ష | Leave a comment

మన మరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు-173 · 173-ఆలీబాబా అరవై దొంగలు ,కత్తికాంతారావు ,సూర్యవంశం సినీ డైలాగ్ ఫేం –మరుధూరి రాజా

మన మరుపు మరుధూరి రాజా తెలుగు సినీ సంభాషణల రచయిత, దర్శకుడు.[1] 200 కి పైగా సినిమాలకు సంభాషణలు రాశాడు. ఈయన సోదరుడు ఎం. వి. ఎస్. హరనాథ రావు కూడా నాటక, సినీ రచయిత.

వ్యక్తిగత వివరాలు
మరుధూరి రాజా గుంటూరులో జన్మించాడు. ఒంగోలు లో చదువుకున్నాడు. ఆయనకు ఐదుగురు సోదరులు. పెద్దన్నయ్య ఎం. వి. ఎస్. హరనాథ రావు కూడా నాటక, సినీ రచయిత. తండ్రి గుమాస్తాగా పనిచేసేవాడు. చిన్నప్పటి నుంచే నాటకాలు రాయడం, వేషాలు వేయడం, దర్శకత్వం చేయడం ఆయనకు అలవాటు. సినిమాల్లోకి రాకమునుపే 18 నాటకాలు రచించాడు.

కెరీర్
ఆయన దర్శకత్వం వహించిన శ్రమదేవోభవ అనే నాటకం రవీంద్రభారతి లో ప్రదర్శనను చూసిన జంధ్యాల ఆయన్ను మద్రాసుకు రమ్మని ఆహ్వానించాడు. దాంతో ఆయన జంధ్యాల దగ్గర శ్రీవారికి ప్రేమలేఖ, పుత్తడి బొమ్మ, రావూ గోపాలరావు సినిమాలకు సహాయ దర్శకుడిగా పనిచేశాడు. తరువాత ఈతరం ఫిలింస్ బ్యానర్ లో ప్రజాస్వామ్యం సినిమాకు సంభాషణల రచయితలుగా పనిచేస్తున్న పరుచూరి బ్రదర్స్ దగ్గర సహాయకుడిగా చేరాడు. తరువాత నవభారతం సినిమాతో సంభాషణల రచయితగా మారాడు. ఆ సినిమా విజయం సాధించడంతో ఆయన పోకూరి బాబూరావు, కె. రాఘవేంద్రరావు, ఈవీవీ, ఎస్వీ కృష్ణారెడ్డి, జి. నాగేశ్వరరెడ్డి లాంటి దర్శకులతో సుమారు 200 సినిమాలకు సంభాషణలు రాశాడు.

సినిమాలు
సంభాషణల రచయితగా
· 6 టీన్స్ (2001)

· ఇదే నా మొదటి ప్రేమలేఖ (2001)

· అమ్మాయి కోసం

· ఒక పెళ్ళాం ముద్దు రెండో పెళ్ళాం వద్దు (2004)

· ఆయుధం

· గౌరి (2004)

· ఆరోప్రాణం

· ఆలీబాబా అరడజను దొంగలు (1994)

· ఎగిరే పావురమా

· ఒంటరి పోరాటం

· కత్తి కాంతారావు

· కాంచనమాల కేబుల్ టి.వి.

· దేనికైనా రేడీ

· నవభారతం

· నువ్వు వస్తావని

· యజ్ఞం

· వీడెక్కడి మొగుడండీ?

· శుభాకాంక్షలు

· సిసింద్రీ

· సూర్య వంశం

· ఆరో ప్రాణం (1997)

· సశేషం

· మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -3-4-22-ఉయ్యూరు

Posted in సినిమా | Tagged | Leave a comment

మన మరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు-172

 మన మరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు-172

· 172-‘’ఈతరం ఫిలిమ్స్ ‘’స్థాపకుడు ,టి.కృష్ణ సహచరుడు ,నేటి భారతం ,రేపటిపౌరులు ,యజ్ఞం నిర్మాత –పోకూరి బాబూరావు

పోకూరి బాబురావు ఒక తెలుగు సినీ నిర్మాత. అతను సినిమా నిర్మాణ సంస్థ ఈతరం ఫిలిమ్స్ ను స్థాపించాడు.

జీవిత విశేషాలు
పోకూరి బాబూరావు ప్రకాశం జిల్లా లోని ఒంగోలుకు ఏడు కిలోమీటర్ల దూరంలో ఉన్న త్రోవగుంట గ్రామంలో శేషయ్య, నాగేశ్వరమ్మ దంపతులకు జన్మించాడు. అతనికి ఇద్దరు తమ్ముళ్ళు, ఒక చెల్లెలు ఉన్నారు. ఐదో తరగతి వరకూ స్వగ్రామంలోనే చదివాడు. అతనికి అతని తండ్రే స్పూర్తి. అతని తండ్రి సాధారణ రైతు స్థాయి నుంచి పెద్ద పొగాకు వ్యాపారిగా, థియేటర్ యజమానిగా, హోటల్ ప్రొప్రయిటరుగా అంచెలంచెలుగా ఎదిగాడు. బాబూరావు ఉన్నత విద్యకోసం ఒంగోలు పీవీఆర్ హైస్కూలులో చేరాడు. స్వగ్రామం నుండి ఒంగోలుకు రోజూ నడిచె వెళ్ళేవాడు. దారిలో అతని స్నేహితులతొ సినిమా చర్చలు ఎక్కువగా జరిగేవి. అక్కడ 10వ తరగతి పూర్తి చేసాడు.

నాటకాలపై ఆసక్తి
అతని తల్లి ఖాళీ సమయాలలో భక్తిగీతాలు, హిట్టయిన సినిమా పాటలు పాడేది. వాటిని శ్రద్ధగా వింటూ అతనూ గొంతు కలిపేవాడు. అలా అతని తల్లి నుంచి ఆ కళ అతనికి అబ్బింది. స్కూల్లో టీచర్లు అతనిచే పాటలు పాడించేవారు. అతని ఊళ్ళో సంక్రాంతికి నాటకాలు వేసేవారు. అతని మేనమామ వెంకటేశ్వర్లు నాటకాలలో నటించేవాడు. అతని ప్రేరణతో బాబూరావుకు నాటకాలలో వేషాలు వేయాలనే ఆసక్తి పెరిగింది. అతని పోరుకు తట్టుకోలేక అతని మామయ్య ఓసారి నాటకంలో పోస్ట్ మ్యాన్ పాత్ర ఇప్పించాడు.

అతను విజయవాడలో పి.యు.సి చదివాడు. ఒంగోలు లోని సి.ఎస్.ఆర్ శర్మ కాలేజీలో డిగ్రీ బీ.కాం చేసాడు. అక్కడ అతని క్లాస్ మేట్ టి.కృష్ణ. అతను ఎక్కువగా పాటలు బాగా పాడటం మూలాన కృష్ణకు అతనంటే అభిమానం ఏర్పడింది. టి. కృష్ణ కాలేజీ సాంస్కృతిక విభాగానికి కార్యదర్శిగా ఉండేవాడు. కాలేజీ వార్షికోత్సవంలో, వీడ్కోలు సభలలో నాటకాలు వేసేవారు. ఈ నాటకాలకు కృష్ణ దర్శకత్వం వహించేవాడు. బాబూరావు “సంభవామి యుగే యుగే” నాటకంలో చిన్న పాత్ర వేసాడు. కళాశాలలో ప్రతీ సంవత్సరం చివర్లో పాటల పోటీలు జరిగేవి. ప్రతీ యేడాది కృష్ణ ఉత్తమ గాయకునిగా ఎంపిక అయ్యేవాడు. ఒకసారి బాబూరావు కూడా ఉత్తమ గాయకునిగా ఎంపికయ్యాడు. కళాశాల, యూనివర్శిటీ స్థాయిలో కృష్ణ ఉత్తమ నతుడూ దర్శకుడిగా బహుమతులు సాధించేవాడు. ఒకసారి “పగ” అనే నాటకంలో ఉత్తమ నటునిగా బాబూరావు బహుమతి వచ్చింది. కృష్ణ కాలేజీ నుండి వెళ్ళాక బాబూరావు అతని స్థానంలో సాంస్కృతిక విభాగానికి కార్యదర్శి అయ్యాడు. అతనిలోని కళను గుర్తించి, దాన్ని పదిమందికీ పరిచయం చేసి, అతనికి ఒక గుర్తింపు తెచ్చింది కృష్ణ.[1]

కాలేజీ చదువు పూర్తయ్యాక కృష్ణ మద్రాసు వెళ్ళాడు. “తల్లీ కూతుళ్ళు” సినిమా తీస్తున్న దర్శకుడు గుత్తా రామిరెడ్డి దగ్గర అసిస్టెంటుంగా చేరాడు. ఉత్తరాల ద్వారా బాబూరావు కృష్ణతో స్నేహాన్ని కొససాగించాడు.

అతను ఏలూరు సీ ఆర్ ఆర్ కళాశాలలో ఎం.కాం చదివాడు. తరువాత నిడదవోలు ఆంధ్రాబ్యాంకులో ఉద్యోగంలో చేరాడు. తర్వాత అతనికి ఒంగోలు బదిలీ అయింది. అతను ఆంధ్రాబ్యాంకు ఎంప్లాయిస్ యూనియన్ వ్యవహారాల్లో పాల్గొనేవాడు. ఈ లోపు మద్రాసు వాతావరణం నచ్చక కృష్ణ తిరిగొచ్చాడు. కృష్ణ, అతనూ ప్రజా నాట్యమండలి ఒంగోలు వేదికలపై పాటలు పాడేవారు. ఆ క్రమంలో అతనికి నల్లూరు వెంకటేశ్వరరావు పరిచయమయ్యాడు. అప్పుడాయన “ప్రజా నాట్యమండలి” ప్రకాశం జిల్లా కార్యదర్శి. మాదాల రంగారావు, టి.కృష్ణ, బాబూరావు, వందేమాతరం శ్రీనివాస్ లు అంతా నల్లూరు వెంకటేశ్వరరావు శిష్యులే.

సినిమా రంగంలో
మాదాల రంగారావు ప్రారంభించిన యువతరం కదిలింది సినిమా ప్రొడక్షన్ వ్యవహారాల్లో అతను కృష్ణతో పాటు పాల్గొన్నాడు. వాళ్ళిద్దరూ చిన్న వేషాలు వేసేవారు. అతను బ్యాంకు ఉద్యోగానికి సెలవులు పెట్టి ఇవన్నీ చేసేవాడు. డబ్బింగ్, ఎడిటింగ్ కోసం మద్రాసు వెళ్ళి ఆయా దశలను పరిశీలించాడు. ఆ సినిమా సూపర్ హిట్ అయింది. తర్వాత ఎర్రమల్లెలు, విప్లవ శంఖం సినిమాలలో రంగారావు ఓ స్థాయికి చేరుకున్నాడు.

తానూ దర్శకుడు కావాలన్న తపన కృష్ణలో రోజు రోజుకూ పెరిగిపోయింది. ఇద్దరు మిత్రులూ చెరో లక్షా వేసి సినిమా తీయాలనుకున్నారు. ఈ విషయం అతని తండ్రితో చెబితే మొదట్లో కాదన్నా కృష్ణతో కలసి చేస్తున్నందున అంగీకరించాడు. “ఈ తరం పిలింస్” బ్యానర్ పెట్టి నేటి భారతం సినిమాను ప్రారంభించారు. వారు తెచ్చిన రెండు లక్షలూ రికార్డింగ్ కే సరిపోయాయి. ఈ దశలో తన తండ్రికి డబ్బు అడగడం ఇష్టం లేక తెలిసిన మిత్రుల దగ్గర చిన్న చిన్న మొత్తాల్లో అప్పుచేసి, మద్రాసు తీసుకువెళ్ళేవాడు. ఈ విషయం అతని తండ్రికి తెలిసి ఎవరినీ అడగవద్దనీ తానే ఇస్తాననీ ధైర్యాన్నిచ్చాడు. తండ్రి వద్ద పొగాకు వ్యాపారం చేస్తున్న అతని తమ్ముడు రామారావు అతనికి సహకరిస్తూ ఉండేవాడు. అతను నిర్మించిన నేటి భారతం పెద్ద విజయం సాధించింది. అతను బ్యాంకు ఉద్యోగి కాబట్టి అతని పేరు కాకుండా అతని తమ్ముడి పేరు వేశాడు. తర్వాత దేశంలో దొంగలు పడ్డారు, రేపటి పౌరులు వంటి చిత్రాలు హిట్ అయ్యాయి.

తర్వాత కొంత కాలానికి కృష్ణ కేన్సర్ తో మరణించాడు. అతను బతికి ఉన్నంత వరకు బాబూరావు అతని నీడనే ఎదిగాడు. అదే సమయంలో అతని తండ్రి కూడా మరణించాడు.

డిగ్రీ తరువాత 1973లో అతని పెళ్ళి జరిగింది. అతనికి ఇద్దరు పిల్లలు కలిగారు. రెండు సినిమాలు హిట్టయ్యే సరికి, ఈ మార్గంలో నడవవచ్చునన్న నమ్మకంతో బ్యాంకు ఉద్యోగానికి రాజీనామా చేసాడు.

అతను పరుచూరి బ్రదర్స్ దర్శకత్వంలో “ప్రజాస్వామ్యం” సినిమాను తీసాడు. ఈ చిత్రంలొ అతనికి పేరొచ్చింది. మరుదూరి రాజాను “ప్రజాస్వామ్యం” సినిమా సమయంలో పరుచూరి బ్రదర్స్ దగ్గర అసిస్టెంటు గా ఉంచాడు. అతని కథ, మాటలతో “నవభారతం” సినిమాను ప్రారంభించాడు. అది కూడా హిట్ అయింది. తరువాత భారతనారి, ఎర్ర మందారం, అన్న ఇలా అతని సినిమాల ప్రస్థానం మొదలయింది. [2]
టి.కృష్ణకు ఇద్దరు కుమారులు. పెద్దకుమారుడు ప్రేమ్‌చంద్ ను “అన్న” సినిమా సమయంలో డైరక్షన్ డిపార్టుమెంటులో చేర్చాడు. అమ్మాయి కాపురం సినిమా షూటింగ్ లో ప్రమాద వశాత్తూ ప్రేమ్‌చంద్ మరణించాడు. కృష్ణ రెండవ కుమారుడు తొట్టెంపూడి గోపీచంద్ సినిమారంగంలోకి ప్రవేశించాడు. కృష్ణ

మీద ఉన్న గౌరవంతో అత అతను యజ్ఞం సినిమాలో గోపీచంద్ ను హీరో గా పరిచయం చేసాడు.

అతను వామపక్ష భావాలతో సమాజ మార్పును కోరే సినిమాలు మాత్రమే తీయగలిగాడు. అతనికి ప్రేక్షకునిగా ఎంటర్‌టైన్‌మెంటు, ఆర్ట్ పిలింస్ అంటే యిష్టం. కామెడీ సినిమాలను కూడా ఎక్కువగా ఇష్టపడతాడు. కానీ అలాంటి సినిమాలు తీయలేదు.

అతనికి సినిమాలు చూడడం, కథల గురించి ఆలొచన చేయడం, షార్ట్ స్టోరీ పుస్తకాలు చదవడం అంటే యిష్టం. అతనిని “చిరస్మరణీయులు” సినిమా ఎంతో పభావితం చేసింది. ఇది “కయ్యూరు కామ్రేడ్స్” అనే మలయాళ నవలకు అనువాదం.

అతని సినిమాలకు ఎం.వి.ఎస్ హరనాథరావు, మరుదూరి రాజా ఎక్కువగా మాటలు రాసారు.

పురస్కారాలు
అతను నేటిభారతం, రేపటి పౌరులు, ప్రజాస్వామ్యం చిత్రాలకు నంది పురస్కారాలను స్వర్గీయ ఎన్.టి. రామారావు చేతుల మీదుగ తీసుకున్నాడు.

గాయకునిగా
అతను స్వరాజ్యం, ఎర్రమంద్రారం మొదలైన సినిమాలలో పాటలు పాడాడు.

నటునిగా
నిర్మాతగా నిలదొక్కుకున్న తరువాత టి.కృష్ణ మెమోరియల్ వాళ్ళు అతనిని విలన్ వేషం వేయమని కోరారు. కాదనలేక “నవయుగం” సినిమాలో నటించాడు. అందులో మంచి పేరొచ్చింది. ప్రేమ తపస్సు, రగులుతున్న భారతం సినిమాలలో నటించాడు. అవి ప్లాప్ అయ్యేసరికి నటనకు దూరమయ్యాడు.

వ్యక్తిగత జీవితం
అతని భార్య పేరు రమ. పిల్లలు ప్రశాంత్, ప్రవీణ్. ఇద్దరూ కంప్యూటర్ సైన్స్ లో ఎం.ఎస్ చేసారు. పెద్ద కుమారుడు అట్లాంతాలో సాఫ్టువేర్ ఇంజనీర్ గా పనిచేస్తున్నాడు.

నిర్మించిన సినిమాలు
· రణం

· ఇన్‌స్పెక్టర్ ప్రతాప్

· యజ్ఞం (2004 సినిమా)

· అమ్మాయి కోసం

· మాదాల రంగారావు

· భారతనారి

· ఎర్ర మందారం (సినిమా)

· మా ఆయన బంగారం

· ప్రజాస్వామ్యం (1987 సినిమా)

· అన్న (సినిమా)

· ఏం పిల్లో ఏం పిల్లడో

· యజ్ఞం (2004 సినిమా)

సశేషం

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -3-4-22-ఉయ్యూరు

Posted in సినిమా | Tagged | Leave a comment

మన మరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు-170

• మన మరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు-170
• 170-‘’నాటకం ‘’ రచయిత,నటుడు ,ఎం.ఎన్ .రాయ్ అనుచరుడు ,పెద్ద మనుషులు,గుండమ్మకధ డైలాగ్స్ ఫేం, కలం లో హాస్యం ,వ్యంగ్యం చిలికించిన ,కారుదిద్దినకాపురం దర్శకుడు –డి.వి.నరసరాజు
• డి.వి. నరసరాజు గా ప్రసిద్ధుడైన దాట్ల వెంకట నరసరాజు (జూలై 15, 1920 – ఆగష్టు 28, 2006) రంగస్థల, సినిమా నటుడు, రచయిత, దర్శకుడు.
జననం
1920 జూలై 15న గుంటూరు జిల్లా, సత్తెనపల్లి మండలంలోని తాళ్లూరులో జన్మించాడు.[1] ఇతను హేతువాది. నరసరావుపేట వాస్తవ్యుడు అయిన ఎం.ఎన్.రాయ్ అనుచరుడు. సినీ కథా రచయిత.ఈనాడు పత్రికలో కొంతకాలం పనిచేశాడు. డి.వి.నరసరాజు సినీ కథ, సంభాషణల రచయితగా సుప్రసిద్ధులు. ఆయన రచించిన సినిమాలలో హాస్యరసం తొణికిసలాడుతూ ప్రేక్షకుల్ని నవ్వించింది. ఆయన మౌలికంగా నాటక రంగం నుంచి సినిమాలలోకి వచ్చారు.
నరసరాజు గుంటూరులోని హిందూ ఉన్నతపాఠశాలలో విద్యాభ్యాసం పూర్తి చేసుకొని, హిందూ కళాశాలలో ఇంటర్ తర్వాత మద్రాసు లయోలా కళాశాల నుండి బి.ఏ పూర్తి చేశాడు. సినిమాలలోకి రాకముందు నాటక రచయితగా పేరుతెచ్చుకున్నాడు.[2] ఈ ఇల్లు అమ్మబడును, వాపసు నాటకం రాశాడు.[3]
నరసరాజు 1954లో పెద్దమనుషులు సినిమాతో రచయితగా సినీరంగప్రవేశం చేశాడు. ఆ సినిమా విజయవంతమవడంతో సినీ రచయితగా స్థిరపడ్డాడు. 1951లోపాతాళభైరవి సినిమా వందరోజుల ఉత్సవం సందర్భంగా ప్రదర్శించబడిన నరసరాజు నాటకం “నాటకం” చూసి దర్శకుడు కె.వి.రెడ్డి ఈయన్ను సినిమా రంగానికి పరిచయం చేశాడు.[4] గుండమ్మ కథ, భక్త ప్రహ్లాద, యమగోల, రంగులరాట్నం, మనసు మమత, దొంగరాముడు వంటి 92కు పైగా సినిమాలకు కథను, మాటలను సమకూర్చాడు. ఈయన దర్శకత్వం వహించిన కొన్ని సినిమాలలో కారు దిద్దిన కాపురం ఒకటి. చెవిలో పువ్వు చిత్రంలో ఒక చిన్న పాత్రను కూడా పోషించాడు. ఈయన చివరి సినిమా, రాజ, భూమిక ప్రధానపాత్రధారులుగా 2006లో విడుదలైన మాయాబజార్.
మరణం
2006 ఆగష్టు 28న హైదరాబాదులోని కేర్ ఆసుపత్రిలో మరణించాడు.[5] ఈయనకు ఒక కూతురు కవిత. సినీ నటుడు సుమన్ భార్య శిరీష నరసరాజు మనవరాలే.
సినిమా దర్శకుడిగా
సుప్రసిద్ధ రచయిత డి.వి.నరసరాజు గారు సినిమాలకు రాకముందు నాటకాల్లో నటించే వారు. కాని, అతి బలవంతం మీద రెండుమూడు సినిమాల్లో నటించారు. నరసరాజు గారు ఉషాకిరణ్ మూవీస్ వారి ‘కారు దిద్దిన కాపురం’ డైరెక్టు చేశారు. కథ తయారు చేసి, స్క్రీన్‌ప్లే సంభాషణలు రాసిన తర్వాత మొత్తం నిర్మాత రామోజీరావు గారికి వినిపించారు. ఆయనకు బాగా నచ్చింది. అప్పుడు వచ్చింది ప్రశ్న. ఎవరు దర్శకుడు? అని. ఒక్క నిమిషం ఆలోచించి, మీరే డైరక్టు చెయ్యండి. మొత్తం అంటే అందులోనే వుంది కదా- అంతా మీరే చేశారు అన్నారట రామోజీరావు. నరసరాజుగారు ఆఁ? అని ముందు ఆశ్చర్యపోయి, తర్వాత ‘అబ్బే’ అన్నారట. తర్వాత రామోజీరావు గారి బలవంతంతో అంగీకరించారు. ఒక మిట్టమధ్యాహ్నం విజయగార్డెన్స్‌లో ఆ సినిమా షూటింగ్ జరుగుతోంది. అప్పుడు రావి కొండలరావు అక్కడికి వెళ్లారు. వెళితే నరసరాజు గారు కనిపించలేదు. అడిగితే, కాస్త దూరంలో వున్న చెట్టు చూపించారు. నరసరాజు గారు చెట్టు నీడన నిలబడి ఉన్నారు. రావి కొండలరావు వెళ్లి అడిగారు షాట్స్ రాసి ఇచ్చేశానయ్యా- డైలాగ్స్ ఏంలేవు. అంచేత వాళ్లు తీసేయొచ్చు. నీడగా వుందని ఇలా నించున్నాను అన్నారాయన. హాయిగా ఏసి రూమ్‌లో కూచుని స్క్రిప్ట్ రాసుకునే మీకు ఇప్పుడు తెలిసి వచ్చినట్టుంది దర్శకత్వం అంటే అన్నారు రావి కొండలరావు ఆయనకున్న చనువుతో. ఆయన నవ్వి, అవుననుకో, కానీలే, ఇదొక అనుభవం. మళ్లీ డైరక్టు చేస్తానాయేం? అన్నారు నరసరాజు. అప్పుడే, పైన చెప్పిన విషయం చెప్పారు.
సినిమాలు
సినిమాలు
కథ లేదా మాటల రచయితగా
1. మనసు మమత (1990)
2. కారు దిద్దిన కాపురం (1986) దర్శకుడు కూడాను
3. వయ్యారి భామలు వగలమారి భర్తలు (1982)
4. యుగంధర్ (1979)
5. యమగోల (1975)
6. అమ్మ మనసు (1974)
7. ఇద్దరు అమ్మాయిలు (1972)
8. మూగనోము (1969)
9. బాంధవ్యాలు (1968)
10. భక్తప్రహ్లాద (1967)
11. చదరంగం (1967)
12. గృహలక్ష్మి (1967)
13. రామ్ ఔర్ శ్యామ్ (1967) కథ, స్క్రీన్ ప్లే
14. రంగుల రాట్నం (1966)
15. నాదీ ఆడజన్మే (1965)
16. రాముడు భీముడు (1964)
17. గుండమ్మ కథ (1962)
18. మన్ మౌజీ (1962)
19. మోహినీ రుక్మాంగద (1962)
20. రేణుకాదేవి మహాత్మ్యం (1960)
21. రాజమకుటం (1959)
22. దొంగరాముడు (1955)
23. పెద్దమనుషులు (1954)

భరద్వాజ చెప్పిన కబుర్లు
తెలుగు చలనచిత్ర పరిశ్రమలో తన రచనతో ఎన్నో మరపురాని చిత్రాలను అందించిన ప్రసిద్ధ రచయిత డి.వి. నరసరాజు గారి శతజయంతి నేడు(జూలై 15).. డి.వి. నరసరాజు గారి పూర్తి పేరు దాట్ల వెంకట నరసరాజు.. గుంటూరు జిల్లా కోసూరు మండలం తాళ్లూరులో 1920 జూలై 15న జన్మించారు.
నరసరాజు గారి శత జయంతి సందర్భంగా ఆయన గురించి పలు ఆసక్తికర విషయాలు, విశేషాలను తెలుసుకుందాం..
కె.వి.రెడ్డి విజయా బ్యానర్‌లో ‘పాతాళబైరవి’ తీసిన తర్వాత వాహినీకి పెద్దమనుషులు కమిట్ అయ్యారు. పింగళి విజయాలో రచయితగా జీతానికి చేరడంతో గత్యంతరం లేక చక్రపాణి అనుమతి కోరారు. ఆయన ఇవ్వలేదు. మీరు రచయితను ఇవ్వకపోతే నేను సినిమా తీయలేనా అని బెజవాడ నుంచి ఓ కొత్త రచయితను తీసుకువచ్చారు. ఆయన పేరు డి.వి.నరసరాజు.
ఈ నరసరాజుగారిని కె.వి.కి తగిలించింది గుడివాడ శరత్ టాకీసు యజమాని కాజా వెంకట్రామయ్య. ఇప్పుడు ఈ థియేటరు కొడాలి నాని ఆధ్వర్యంలో ఉందనుకోండి. ఇప్పుడు విజయవాడలో కలసిపోయిన ముత్యాలంపాడు గ్రామంలో తొలి గ్రాడ్యుయేట్ దాట్ల వెంకట నరసరాజు. మొదటి నుంచి సృజనాత్మక కళల మీదే నరసరాజు దృష్టి. ఉద్యోగాలు చేయాల్సిన లంపటాలు లేకపోవడం పైగా బాగా ఆస్తి, బంధువుల దన్ను ఉండడంతోనూ… నాటక రచయితగా జీవితాన్ని ప్రారంభించారు. ‘అంతర్వాణి, నాటకం’ లాంటి సూపర్ హిట్ నాటకాలు ఆయన ఖాతాలో ఉన్నాయి. అవి చూసే ‘పెద్దమనుషులు’ చిత్రం కోసం కె.వి. పికప్ చేశారు. కె.వి.నమ్మకాన్ని నిలబెట్టుకున్నారు నరసరాజు
కె.వి.రెడ్డి ఒకానొక సందర్భంలో విజయాధినేతలతో పొసగక బైటకు వచ్చారు. సరిగ్గా అప్పుడే.. దుక్కిపాటి మధుసూదనరావు గారు సినిమా చేయమని అడిగారు. అప్పుడు అన్నపూర్ణ కంపెనీకి కె.వి. చేసిన సినిమా ‘దొంగరాముడు’.
ఆ మూవీకీ డి.వి.నరసరాజునే రచయితగా తీసుకున్నారు. అందులో కూడా డి.వి.మార్క్ డైలాగులు పేల్తాయి. ముఖ్యంగా హీరో జైలు నుంచి విడుదలై హోటల్‌కి వెళ్లి పండితుల్ని బురిడీ కొట్టించే సీన్‌ అద్భుతంగా రాశారు. విజయా బ్యానర్‌లో కె.వి.రెడ్డి డైరక్ట్ చేసిన చిత్రాలకు మాత్రమే పింగళి నాగేంద్రరావు మాటలు రాసేవారు. మిగిలిన చిత్రాలకు ఎక్కువగా బయట రచయితలే రాసేవారు
• అలా ‘గుండమ్మ కథ’కు డి.వి.నరసరాజుతో సంభాషణలు రాయించుకున్నారు చక్రపాణి. స్క్రిప్ట్ వర్క్ ఎక్కువగా చక్రపాణే చేసుకునేవారు. ‘స్కేప్ గోట్’ అనే ఇంగ్లీష్ నవల ఆధారంగా నరసరాజు రాసుకున్న స్క్రిప్ట్ చాలా కాలం ఏ నిర్మాతా తీసుకోలేదు. బెజవాడ లక్ష్మీ టాకీసు ఓనరు మిద్దే జగన్నాథం లాంటి వారైతే.. అది సక్సెస్ కాదని నిరాశపరిచారు కూడా. అయితే విచిత్రంగా రామానాయుడు సురేష్ మూవీస్ ప్రారంభిస్తూ కథ కోసం నరసరాజును అప్రోచ్ అయ్యారు.
నరసరాజు తన దగ్గరున్న డబుల్ యాక్షన్ కథ చెప్పారు. నాయుడుగారు ఓకే అన్నారు.
• అలా రూపొందిన ‘రాముడు భీముడు’ సూపర్ డూపర్ హిట్ కొట్టింది. మాస్ సినిమాకు ఓ ట్రెండ్ సెట్టర్ అయ్యింది. విజయా, వాహినీ కాంపౌండ్ రైటర్ కావడంతో నరసరాజుగారితో ఎన్టీఆర్‌కు ఎక్కువ సాన్నిహిత్యం ఉండేది. తన స్వీయ నిర్మాణంలో తెరకెక్కిన సాంఘిక చిత్రాలకు ఎక్కువగా నరసరాజుకే స్క్రిప్ట్ బాధ్యతలు అప్పగించేవారు ఎన్టీఆర్
• అలా రూపుదిద్దుకున్న చిత్రాల్లో ‘కోడలు దిద్దిన కాపురం’ ఒకటి. ఆ సినిమా కథా చర్చలు జరిగే సయమంలో నిజంగా ఆడవాళ్లు ఇంత ఇబ్బంది పడతారా రాజుగారూ అని ఎన్టీఆర్ అడిగారట. నరసరాజు సుమారు ఓ గంటన్నర పైగా వివరించారట. అప్పట్నించీ ఎన్టీఆర్ వాళ్ల ఆవిడ బసవతారకంతో వ్యవహరించే తీరులో మార్పు వచ్చిందని సాక్షాత్తు నరసరాజుగారే చెప్పారు.
• ఆ తర్వాత అధికారంలోకి వచ్చాక ఆడపిల్లకూ పిత్రార్జితంలో హక్కు కల్పించడం దాకా నడిచింది. అలా నరసరాజు అంటే ఎన్టీఆర్ కు అపరిమితమైన గౌరవం…గురి కూడా.
• నరసరాజుగారు చాలా ఖచ్చితమైన మనిషి. స్క్రిప్ట్ చెప్పిన సమయానికి ఇచ్చేసేవారు. ఆత్రేయలా ఇబ్బందులు పెట్టేవారు కాదు.
ఆత్రేయకు అడ్వాన్స్ ఇచ్చి ఆయన రాయక పోవడం వల్ల ఇబ్బందులు పడుతున్న చాలా మంది నిర్మాతలకు నరసరాజు అభయం ఇచ్చి పని పూర్తి చేసేవారు. అలాంటి సినిమాల్లో ‘బడిపంతులు’ ఒకటి. బడిపంతులు డైలాగ్స్ కోసం డబ్బులు తీసుకున్న ఆత్రేయ రాయలేదు. ఫైనల్‌గా నరసరాజుగారే కంప్లీట్ చేయాల్సి వచ్చింది. అయితే డైలాగులు రాయకపోయినా ఆ మొత్తానికి ‘నీ నగుమోము’ అనే ఓ అజరామర గీతాన్ని రాసి ఇచ్చారు ఆత్రేయ.
• ఎవిఎమ్ చెట్టియార్‌కు కూడా నరసరాజుగారి మీద విపరీతమైన నమ్మకం ఉండేది. ‘భక్త ప్రహ్లాద’ సినిమా కోసం చిత్రపు నారాయణమూర్తి ఎమిఎమ్ అధినేతను అప్రోచ్ అయ్యారు. నరసరాజు స్క్రిప్ట్ రాస్తానంటే తీస్తాను అని చెట్టియార్ షరతు పెట్టారు.
• చిత్రపు నారాయణమూర్తి అప్పుడు తీవ్రమైన కష్టాల్లో ఉన్నారు. ఆయన పరిస్థితి చూసి సాధారణంగా పౌరాణికాలు పెద్దగా అంగీకరించని నరసరాజుగారు భక్త ప్రహ్లాదకు పనిచేశారు. ఎస్వీ రంగారావు కూడా డి.వి. గారి మాటే వినేవాడు. చిత్రపు నారాయణమూర్తి ఫ్లాపుల్లో ఉండడం వల్ల ఆయన మాట లెక్కచేసేవారు కాదు ఎస్వీఆర్. క్లైమాక్స్ సీన్ సరిగా రాకపోయే సరికి ఎస్వీఆర్‌ను మరో సారి సెట్స్‌కు రమ్మనడానికి ధైర్యం చాలలేదు. అందుకని డి.వి.నే ఆశ్రయించారు. నరసరాజు అనుకోకుండా ఎస్వీఆర్‌‌ను కలసి ఆ క్లైమాక్స్ ఏమిటండీ అలా ఉందీ… నాకు చూపించారు. మీరు బాగా డల్‌గా ఉన్నట్టు అనిపించింది. నాకెందుకులే అని ఊరుకున్నా.. మీరడిగితే రీషూట్ పెడతారు అనిచెప్పి వచ్చేశారు. అంతే.. పని అయిపోయింది. అంత లౌక్యంగా వ్యవహరించేవారు డి.వి.
• ఒక రచయితను అంగీకరించాలంటే చాలా ఆలోచించే బి.ఎన్.రెడ్డికి కూడా డి.వి.నరసరాజు అంటే ఇష్టం. బి.ఎన్. కు ప్రయోగాల మీద పెద్దగా మోజు ఉండేది కాదు. అందుకే పింగళి నాగేంద్రరావు గారి రచన నచ్చేది కాదు. పింగళి ‘గుణసుందరి కథ’కు రాసిన డైలాగులు బిఎన్ కు అస్సలు నచ్చలేదట. అయితే నరసరాజు మాత్రం బిఎన్ కు ‘రంగులరాట్నం, రాజమకుటం’ లాంటి సినిమాలకు పనిచేశారు. యమలోకపు గందరగోళంతో కూడిన బెంగాలీ సినిమా ‘జీవాంతమానుష’ రీమేక్ హక్కులు కొన్నారు పల్లవీ ప్రొడక్షన్స్ వెంకటరత్నం.
• నేరుగా తనకు సాన్నిహిత్యం ఉన్న ముళ్లపూడి దగ్గరకెళ్లి తెలుగులో రాయమన్నారు. అయ్యా అది పొలిటికల్ సెటైరికల్ డ్రామా… మనవల్ల కాదు… డి.వి.నరసరాజే దీనికి సమర్ధుడు.. అని చెప్పి రమణ గారే పంపారు. కథ నరసరాజు చేతిలో పడడంతో హీరో కూడా మారాడు. శోభన్ బాబు ప్లేస్ లో ఎన్టీఆర్ వచ్చారు. ‘యమగోల’ చేసి జనంతో ఈలలు కొట్టించుకున్నారు
• ఇక్కడ ఇంకో పిట్టకథ..నిజానికి వెంకటరత్నం ఎన్టీఆర్ దగ్గరకు పోయి ఇప్పుడు సినిమాలో ఉన్న ఎన్టీఆర్ కారక్టర్‌ను బాలకృష్ణతోనూ యముడు కారక్టర్ ఎన్టీఆర్‌తోనూ చేయించాలని తనకు ఉన్నట్టు చెప్పారు. అయితే ఎన్టీఆర్ దీనికి ఒప్పుకోలేదు.ఆ కారక్టర్‌కు బాలయ్య సరిపోడు. అది నేనే చేస్తాను. యముడుగా సత్యనారాయణను తీసుకుందాం అని సలహా చెప్పారు.
• అలా సత్యనారాయణను యముడుగా ప్రమోట్ చేసిన ఘనత ఎన్టీఆర్‌కే దక్కుతుంది. యమగోలలో చాలా పొలిటికల్ డైలాగులు పేల్చారు నరసరాజు. అప్పట్లో ఏదన్నా సినిమాలో డైలాగులు హిట్టైతే చాలు వాటిని ఎల్పీ రికార్డులుగా విడుదల చేసేవారు. ముఖ్యంగా ఎమర్జన్సీ మీద కాంగ్రెస్ పార్టీ మీద చాలా సెటైర్లు పేల్చారు నరసరాజు.
తెర మీద చెప్పేది ఎన్టీఆర్ కావడంతో ఆ తెర మీద చెప్పేది ఎన్టీఆర్ కావడంతో ఆ డైలాగ్స్‌కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ‘నాటకం’ అనే నాటకంతో రంగస్థలం మీద సంచలనం సృష్టించిన డి.వి.నరసరాజు తెర మీద కూడా రెండు సినిమాల్లో నటించారు. ఒక సినిమాకు దర్శకత్వం వహించారు.
నరసరాజుగారికి ఈనాడు రామోజీరావుతో బాగా సాన్నిహిత్యం ఉండేది. ఓ సారి రామోజీరావు మీకేమండీ ఎప్పుడూ తెల్లని మడత నలగని పంచె కట్టుకుని హాయిగా ఉంటారు… మా టెన్షన్లు ఏం చెప్పమంటారు అన్నాడట. అయ్యా మీరేమో మోసే గాడిదలు… మేం మేసే గాడిదలం అదీ తేడా అనేశార్ట నరసరాజు. రామోజీరావు కూడా సినిమాలకు సంబంధించి ఏవన్నా అనుమానాలుంటే నరసరాజు సలహా తీసుకునేవాడు
• ‘కారు దిద్దిన కాపురం’ సినిమా సరిగా రావడం లేదని నరసరాజుకే దర్శకత్వ బాధ్యతలు అప్పగించారు. ఆయన సినిమాను విజయతీరాలకు నడిపించారు.
• సినిమా పరిశ్రమలో నాన్ కాంట్రోవర్షియల్ పర్సన్ ఎవరైనా ఉంటే అది నిస్సందేహంగా నరసరాజుగారే. ఆయన ఎన్ని సినిమాలకు రాసినా నరసరాజు అనగానే గుర్తొచ్చే సినిమా మాత్రం ‘యమగోలే’.
-భరద్వాజ
• సశేషం
• రేపు శ్రీ శుభకృత్ ఉగాది శుభా కాంక్షలతో
• మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -1-4-22-ఉయ్యూరు

Posted in సినిమా | Tagged | Leave a comment

మన మరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు-171

• మన మరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు-171
• 171-కారుదిద్దిన కాపురం ఫేం –హాస్యనటి –మమత
ఆమె 1978లో తొలిసారిగా భూమి కోసం చిత్రంతో తెలుగు సినిమారంగంలోకి అడుగుపెట్టి, హాస్య నటిగా సినీ ప్రియులను అలరించిన నటీమణి మమత (55) చెన్నైలో మరణించారు. సోమవారం రాత్రి ఆమె తీవ్ర అస్వస్థతకు గురి కావడంతో చెన్నైలోని ఓ ప్రయివేటు ఆసుపత్రిలో చేరారు. అయితే ఆమెను కాపాడేందుకు వైద్యులు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు.
తెలుగు చిత్రాలతో పాటు దక్షిణాది భాషల చిత్రాలన్నింటా మమత హాస్యనటిగా రాణించారు. కారుదిద్దిన కాపురం చిత్రంలో మంచి నటన కనబరచి ప్రశంసలందుకున్న మమత, చెన్నైలోనే స్థిరనివాసం ఏర్పరుచుకున్నారు. దాదారు 250కు పైగా చిత్రాల్లో నటించిన మమత రాజబాబు, నాగేష్ మరియు అల్లు రామలింగయ్య వంటి ప్రముఖ హాస్యనటులందరి సరసనా నటించారు.
తెలుగు సినీ పరిశ్రమ హైదరాబాదుకు మారిన తర్వాత కూడా ఆమె చెన్నైలోనే ఉంటూ సినిమాలకు, సీరియళ్లకు డబ్బింగ్ చెబుతూ వస్తున్నారు. ఆమె గజదొంగ, చుట్టాలున్నారు జాగ్రత్త వంటి తెలుగు సినిమాల్లో నటించారు. ఆమె మృతికి చెన్నైలోని డబ్బింగ్ కళాకారులు సంతాపం ప్రకటించారు.
నటించిన చిత్రాలు:
• *భూమి కోసం
• *గజదొంగ,*
• *చుట్టాలున్నారు జాగ్రత్త
• ౧౯౯౪ : నిరీక్శే(కావేరి)
• ౧౯౮౯ : చలాకి మొగుడు చాదస్తపు పెళ్ళం
• ౧౯౮౬ : కారు దిద్దన కాపురం.
• ౧౯౮౫ : మహా శక్తిమాన్.
• ౧౯౮౧ : గడసరు అత్తః సోగోసరి కోడలు

•   సశేషం –
• మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -1-4-2ఉయ్యూరు

Posted in సినిమా | Leave a comment

మన మరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు-169

 మన మరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు-169

·         169-సహాయ సంగీత దర్శకురాలు ,రచయిత చలం తమ్ముడికూతురు –‘’తీయని వెన్నెల రేయి ,కాదుసుమా కలకాదుసుమా ‘’పాటల ఫేం –వక్కలంక సరళ

·       –వక్కలంక సరళ (1927 – 1999[1] తెలుగు సినిమా గాయని. కీలుగుర్రం సినిమాలోని ‘కాదు సుమా కల కాదు సుమా’ పాట పాడిన గాయనిగా ప్రసిద్ధి చెందింది. 1940వ దశకంలో జెమినీ స్టూడియో హిందీ విభాగంలో సహాయ సంగీత దర్శకురాలిగా పనిచేసింది.[2] ఈమె పూర్వీకులు అమలాపురానికి చెందిన బ్రాహ్మణులు, అయితే మద్రాసులో స్థిరపడ్డారు. సరళ తండ్రి గోపాలరావు, చలం (గుడిపాటి వెంకటాచలం) తమ్ముడు[3] సరళ 1927, ఆగష్టు 8 న మద్రాసులో సుందరమ్మ, గోపాలరావు దంపతులకు జన్మించింది. ఈమె తల్లి సుందరమ్మ కూడా గాత్ర సంగీత కళాకారిణే.

·         ఆమెకు అలనాటి సినీనటి అంజలీదేవికి మంచి స్నేహితురాలు. అంజలీదేవి మొదటిసినిమా బాలరాజులో ‘ఇది తీయని వెన్నెల రేయి’ పాటను సరళ పాడింది. అప్పటి నుంచీ వారు స్నేహితులయ్యారు. 1950ల్లో అంజలీదేవి ‘స్వప్నసుందరి‘ తీసిన తర్వాత నాకు గనుక కూతురు పుడితే కచ్చితగా ఇదే పేరు పెడతానని సరళ అంజలీదేవికి మాటిచ్చింది. అలా మాటిచ్చిన పదేళ్లకు పుట్టిన బిడ్డకు మాట ప్రకారం స్వప్నసుందరి అని పేరుపెట్టింది.[4] ఈమే కూచిపూడి నాట్యకళాకారిణి, పద్మభూషణ గ్రహీత స్వప్నసుందరి.

·         ఘంటసాలతో కలిసి సరళ, కాదు సుమా కల కాదు సుమా’ పాటతో సహా అనేక పాటలు పాడింది. ఈమెకు ఘంటసాలతో పెళ్ళికుదరబోయి, అనుకోని పరిస్థితుల్లో, ఘంటసాలకు మరో రంగూన్ ‘సరళ’తో ద్వితీయ వివాహం జరగింది.[5]

·         సరళ వివాహం అయ్యాక సినిమా రంగం నుంచి వైదొలగింది. ఆ రోజుల్లో దక్షిణ భారతదేశంలో పెళ్లవగానే సినిమాల్ని వదిలేసేవాళ్లు. ఈమెకు స్వప్నసుందరితో పాటు మరో కూతురు, ఒక కొడుకు పుట్టారు. 1979లో విడుదలైన గోరింటాకు సినిమాలో నటించిన వక్కలంక పద్మ కూడా సరళ కూతురే.[6]

·         సరళ కూతురు స్వప్నసుందరి ప్రతి సంవత్సరం తల్లి జ్ఞాపకార్ధం, ఆగష్టు 8న స్వరలహరి అనే కర్ణాటక సంగీత కచ్చేరిని నిర్వహిస్తుంది. ఈ కచ్చేరీలో యువ గాయనీగాయకులు సరళ స్వరపరచిన పాటలను ప్రముఖంగా పాడతారు.[1][7]

·         ఈమె ఆలపించిన తెలుగు సినిమా గీతాల జాబితా

విడుదల సం.సినిమా పేరుపాటఇతర గాయకులుసంగీత దర్శకుడురచయిత
1948బాలరాజుతీయనివెన్నెల రేయి ఎడబాయని వెన్నెల హాయీఘంటసాలసముద్రాల సీనియర్
1949కీలుగుర్రంఅహా ఓహో ఎంతానందంబాయెనహా ఊహాతీతముగాఘంటసాలతాపీ
1949కీలుగుర్రంకాదుసుమా కలకాదుసుమా అమృతపానమునుఘంటసాలఘంటసాలతాపీ
1949రక్షరేఖబిడియమా మనలో ప్రియతమా సఖా బిగువ చాలు నాతోఓగిరాల రామచంద్రరావుబలిజేపల్లి
1949లైలా మజ్నుఅనగనగా ఓ ఖాను ఆ ఖానుకో జనానాభానుమతిసి.ఆర్.సుబ్బరామన్సముద్రాల సీనియర్
1952సింగారిశుద్ధం చెయ్యండోయ్ తొలంచి శుద్ధం చెయ్యండోయ్తంగవేలు బృందంఎస్.వి.వెంకట్రామన్,
టి.కె.రామనాథన్
టి.ఎ.కళ్యాణం
1952మరదలు పెళ్ళిపిలిచే గోదావరోడ్డు నూరూరించే బందరు లడ్డుచిత్తూరు నాగయ్య,
టంగుటూరి సూర్యకుమారి
శ్రీశ్రీ
1953అమరకవిజి.రామనాధన్,
టి.కె.కుమారస్వామి

 

·          

·          

సారంగదేవ్ సరళగురించి రాసిన విశేషాలు

·         మన మధుర గాయకులు – వక్కలంక సరళ

·         అలనాటి మధుర గాయకుల మీద తెలుగు స్వతంత్ర వార పత్రికలో  ప్రచురితమైన వ్యాసాలను (ప్రెస్ అకాడమీ వారి సౌజన్యంతో) వెలికితీసి కొన్ని పాటలు జోడించి ఈ శీర్షిక ద్వారా 15 మంది గాయనీ గాయకుల వివరాలు వెలుగులోకి తేవటం జరిగింది. ఈ వ్యాసాలు వ్రాసిన “సారంగదేవ” రజని గారని శ్రీ పరుచూరి శ్రీనివాస్ గారు వ్రాసిన ఒక వ్యాసంలో చదవటం జరిగింది. ఈ మధుర గాయకులు అందరూ ఆకాశవాణి వారికి పాడటం జరిగింది. సినిమా పాటలు మినహాయిస్తే ఈ వ్యాసాల్లో పేర్కొన్న చాలా రేడియో కార్యక్రమాలు, గేయాలు లభించటం లేదు. ఆకాశవాణి వారి వద్ద కూడా ఉన్నాయో లేదో తెలియదు. చివరగా వక్కలంక సరళ గారి మీద వచ్చిన వ్యాసం చూడండి. ముందు ముందు, ఇతర గాయనీ గాయకుల మీద లభ్యమైన వ్యాసాలు, వివరాలు ఈ శీర్షిక ద్వారా అందించటానికి ప్రయత్నిస్తాను

·         కూచిపూడి ,భరతనాట్యం ,కొరియోగ్రాఫర్,గాయని,పద్మభూషణ్ -స్వప్నసుందరి

·         గాయని వక్కలంక సరళ కుమార్తె స్వప్నసుందరి కూచిపూడి భారత నాట్యాలలో అగ్రశ్రేణి కళా కారిణి .కొరియోగ్రాఫర్, గాయని .భారత ప్రభుత్వం చేత 2003లో ‘’పద్మభూషణ్’’ పురస్కార గ్రహీత .సాహిత్య కళాపరిషత్ ,సంగీత నాటకాకాడేమి పురస్కారగ్రహీతకూడా .’’ది వరల్డ్ ఆఫ్ కూచిపూడి డాన్స్ ‘’ట్రేసింగ్ ది రూట్స్ ఆఫ్ దిక్లాసికల్ డాన్స్ ‘’గ్రంథాల రచయిత్రి .ఢిల్లీ లో ‘’కూచిపూడి డాన్స్ సెంటర్ ‘’సంస్థాపకురాలు .మద్రాస్ లో జన్మించింది ఆంధ్రప్రదేశ్ లో ఢిల్లీ లలో ఉంటుంది .

·         తొమ్మిదవ ఏట నాయనమ్మ ప్రోత్సాహం తో కూచిపూడి భరతనాట్యం  నేర్చి,విశాఖపట్నం వెళ్లి నాట్యాచార్య పసుమర్తి సీతారామయ్య గారివద్ద శిక్షణ పొందింది .తండ్రికి ఢిల్లీ బదిలీ అయితే గురువుగారి ని తీసుకువెళ్ళి నృత్యం వదిలిపెట్టకుండా అభ్యసించింది .అప్పటిదాకా యామినీ కృష్ణమూర్తి విశేష ప్రాముఖ్యం పొంది ,వెనక్కి తగ్గాక స్వప్నసుందరికి అవకాశాలు వెన్నంటి వచ్ఛి 15వ ఏట మొదటి ప్రదర్శన ఇచ్చింది .నృత్యం తో పాటు విద్యా ,గాన సంబంధ విషయాలు చేర్చిన తోలి కళా కారిణి గా విఖ్యాతి చెందింది..విలాశీ నాట్యం మొదలైన పురాతన సంప్రదాయ నృత్యాలకు జీవంపోసింది .నృత్యంలో ఆమె చేసిన పరిశోధన అనితర సాధ్యమైంది .అతి చిన్న వయసులో పద్మభూషణ్ పొందిన అదృష్టవంతురాలు .ఆమె సృజనకు అవదులు లేవని పిస్తాయి  .

·           1977లోవ్యంగ్యాత్మక  ‘’కిస్సా కుర్సీ కా ‘’హిందీ సినిమాలో స్వప్నసుందరి అందులోను ఇందిరాగాంధీ ఎమర్జెన్సి కాలం లో ఈ సినిమాలో డాన్స్ చేసింది .సినిమాను నిషేధించింది ప్రభుత్వం .తర్వాత ఎప్పుడో విడుదలైంది .నిరంతర క్రియాశీలిగా ఉండటం స్వప్న సుందరికి అత్యంత ఇష్టం .ఆంధ్రుల అమ్మాయి విశ్వ వేదికపై కూచిపూడి భారతనాట్యాలకు   పట్టాభి షేకం చేస్తూ మనకు గర్వకారణం గా ఉంది .

·           మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -31-3-22-ఉయ్యూరు

·          

·         సశేషం

·         మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -31-3-22

Posted in సినిమా | Tagged | Leave a comment

మన మరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు-169

• మన మరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు-169
• 169-సహాయ సంగీత దర్శకురాలు ,రచయిత చలం తమ్ముడికూతురు –‘’తీయని వెన్నెల రేయి ,కాదుసుమా కలకాదుసుమా ‘’పాటల ఫేం –వక్కలంక సరళ
• క్కలంక సరళ (1927 – 1999) [1] తెలుగు సినిమా గాయని. కీలుగుర్రం సినిమాలోని ‘కాదు సుమా కల కాదు సుమా’ పాట పాడిన గాయనిగా ప్రసిద్ధి చెందింది. 1940వ దశకంలో జెమినీ స్టూడియో హిందీ విభాగంలో సహాయ సంగీత దర్శకురాలిగా పనిచేసింది.[2] ఈమె పూర్వీకులు అమలాపురానికి చెందిన బ్రాహ్మణులు, అయితే మద్రాసులో స్థిరపడ్డారు. సరళ తండ్రి గోపాలరావు, చలం (గుడిపాటి వెంకటాచలం) తమ్ముడు[3] సరళ 1927, ఆగష్టు 8 న మద్రాసులో సుందరమ్మ, గోపాలరావు దంపతులకు జన్మించింది. ఈమె తల్లి సుందరమ్మ కూడా గాత్ర సంగీత కళాకారిణే.
• ఆమెకు అలనాటి సినీనటి అంజలీదేవికి మంచి స్నేహితురాలు. అంజలీదేవి మొదటిసినిమా బాలరాజులో ‘ఇది తీయని వెన్నెల రేయి’ పాటను సరళ పాడింది. అప్పటి నుంచీ వారు స్నేహితులయ్యారు. 1950ల్లో అంజలీదేవి ‘స్వప్నసుందరి’ తీసిన తర్వాత నాకు గనుక కూతురు పుడితే కచ్చితగా ఇదే పేరు పెడతానని సరళ అంజలీదేవికి మాటిచ్చింది. అలా మాటిచ్చిన పదేళ్లకు పుట్టిన బిడ్డకు మాట ప్రకారం స్వప్నసుందరి అని పేరుపెట్టింది.[4] ఈమే కూచిపూడి నాట్యకళాకారిణి, పద్మభూషణ గ్రహీత స్వప్నసుందరి.
• ఘంటసాలతో కలిసి సరళ, కాదు సుమా కల కాదు సుమా’ పాటతో సహా అనేక పాటలు పాడింది. ఈమెకు ఘంటసాలతో పెళ్ళికుదరబోయి, అనుకోని పరిస్థితుల్లో, ఘంటసాలకు మరో రంగూన్ ‘సరళ’తో ద్వితీయ వివాహం జరగింది.[5]
• సరళ వివాహం అయ్యాక సినిమా రంగం నుంచి వైదొలగింది. ఆ రోజుల్లో దక్షిణ భారతదేశంలో పెళ్లవగానే సినిమాల్ని వదిలేసేవాళ్లు. ఈమెకు స్వప్నసుందరితో పాటు మరో కూతురు, ఒక కొడుకు పుట్టారు. 1979లో విడుదలైన గోరింటాకు సినిమాలో నటించిన వక్కలంక పద్మ కూడా సరళ కూతురే.[6]
• సరళ కూతురు స్వప్నసుందరి ప్రతి సంవత్సరం తల్లి జ్ఞాపకార్ధం, ఆగష్టు 8న స్వరలహరి అనే కర్ణాటక సంగీత కచ్చేరిని నిర్వహిస్తుంది. ఈ కచ్చేరీలో యువ గాయనీగాయకులు సరళ స్వరపరచిన పాటలను ప్రముఖంగా పాడతారు.[1][7]
• ఈమె ఆలపించిన తెలుగు సినిమా గీతాల జాబితా
విడుదల సం. సినిమా పేరు పాట ఇతర గాయకులు సంగీత దర్శకుడు రచయిత
1948 బాలరాజు
తీయనివెన్నెల రేయి ఎడబాయని వెన్నెల హాయీ ఘంటసాల
సముద్రాల సీనియర్
1949 కీలుగుర్రం
అహా ఓహో ఎంతానందంబాయెనహా ఊహాతీతముగా ఘంటసాల తాపీ
1949 కీలుగుర్రం కాదుసుమా కలకాదుసుమా అమృతపానమును ఘంటసాల ఘంటసాల తాపీ
1949 రక్షరేఖ
బిడియమా మనలో ప్రియతమా సఖా బిగువ చాలు నాతో ఓగిరాల రామచంద్రరావు బలిజేపల్లి
1949 లైలా మజ్ను
అనగనగా ఓ ఖాను ఆ ఖానుకో జనానా భానుమతి సి.ఆర్.సుబ్బరామన్
సముద్రాల సీనియర్
1952 సింగారి
శుద్ధం చెయ్యండోయ్ తొలంచి శుద్ధం చెయ్యండోయ్ తంగవేలు బృందం ఎస్.వి.వెంకట్రామన్,
టి.కె.రామనాథన్
టి.ఎ.కళ్యాణం
1952 మరదలు పెళ్ళి
పిలిచే గోదావరోడ్డు నూరూరించే బందరు లడ్డు చిత్తూరు నాగయ్య,
టంగుటూరి సూర్యకుమారి
శ్రీశ్రీ
1953 అమరకవి
జి.రామనాధన్,
టి.కె.కుమారస్వామి



సారంగదేవ్ సరళగురించి రాసిన విశేషాలు
• మన మధుర గాయకులు – వక్కలంక సరళ
• అలనాటి మధుర గాయకుల మీద తెలుగు స్వతంత్ర వార పత్రికలో  ప్రచురితమైన వ్యాసాలను (ప్రెస్ అకాడమీ వారి సౌజన్యంతో) వెలికితీసి కొన్ని పాటలు జోడించి ఈ శీర్షిక ద్వారా 15 మంది గాయనీ గాయకుల వివరాలు వెలుగులోకి తేవటం జరిగింది. ఈ వ్యాసాలు వ్రాసిన “సారంగదేవ” రజని గారని శ్రీ పరుచూరి శ్రీనివాస్ గారు వ్రాసిన ఒక వ్యాసంలో చదవటం జరిగింది. ఈ మధుర గాయకులు అందరూ ఆకాశవాణి వారికి పాడటం జరిగింది. సినిమా పాటలు మినహాయిస్తే ఈ వ్యాసాల్లో పేర్కొన్న చాలా రేడియో కార్యక్రమాలు, గేయాలు లభించటం లేదు. ఆకాశవాణి వారి వద్ద కూడా ఉన్నాయో లేదో తెలియదు. చివరగా వక్కలంక సరళ గారి మీద వచ్చిన వ్యాసం చూడండి. ముందు ముందు, ఇతర గాయనీ గాయకుల మీద లభ్యమైన వ్యాసాలు, వివరాలు ఈ శీర్షిక ద్వారా అందించటానికి ప్రయత్నిస్తాను
• సశేషం
• మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -31-3-22


Posted in రచనలు, సినిమా | Tagged | Leave a comment

మన మరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు-168

మన మరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు-168

· 168-‘’పగిలిన గోడలు’’ నాటకానికి ‘’బహు’’బహుమతులు పొంది,అతితక్కువకాలం లో అత్యధిక చిత్రాలలో నటించిన కరుడుకట్టిన విలన్ ,కారక్టర్ నటుడు –త్యాగరాజు

జీవిత విశేషాలు
ఇతడు 1941లో వరంగల్ జిల్లా హన్మకొండలోన టి.ఆర్‌.నారాయణస్వామి నాయుడు, యతిరాజమ్మ దంపతులకు జన్మించాడు. ఇతని పూర్తి పేరు పగడాల త్యాగరాజు నాయుడు. ఇతని విద్యాభ్యాసం వరంగల్‌, హైదరాబాదు నగరాల్లో జరిగింది. బాల్యం నుండే క్రీడలు, సాంస్కృతిక రంగాల్లో ఆసక్తి కనబరచి కాలేజీ రోజుల్లో క్రీడల్లో ఆల్‌రౌండర్‌గా పేరు పొందాడు. ఇంటర్‌ కాలేజీ క్రీడోత్సవాల్లో పాలు పంచుకుని చాలా బహుమతులు పొందడమే కాక కాలేజీ తరపున క్రికెట్‌ టీముకు కెప్టెన్‌గా వ్యవహరించేవాడు. క్రీడల పట్ల ఎంత శ్రద్ధాసక్తులు ఉండేవో నటన పట్ల కూడా ఇతనికి అంతే ఆసక్తి ఉండేది. మొదటిసారిగా పదేళ్ల వయసులో సికిందరాబాదు గవర్నమెంట్‌ హైస్కూల్‌లో చదువుతున్నప్పుడు పాఠశాల వార్షికోత్సవాల్లో ఒక నాటకంలో ఆడపిల్ల వేషం వేసి అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తాడు. ఈ నాటకాన్ని చూసిన అప్పటి హైదరాబాదు స్టేట్‌ ముఖ్యమంత్రి బూర్గుల రామకృష్ణారావు అభినందిస్తూ ప్రత్యేక బహుమతి అందజేశారు. తరువాత వరంగల్‌ కాలేజీలో చదువుతున్నప్పుడు చాలా నాటకాల్లో నటించి పేరు తెచ్చుకోవడమే గాక చాలా నాటకాలకు దర్శకత్వం వహించి జిల్లా స్థాయి నాటకాల్లో ఉత్తమ నటుడు అవార్డులందుకున్నాడు. కాలేజీలో చదివే రోజుల్లోనే నాటకాలంటే ఇతనికి ఒక వ్యసనంగా మారింది. తన మిత్రులతో కలిసి పగిలిన గోడలు అనే నాటకాన్ని అంతర్‌ విశ్వవిద్యాలయాల నాటకోత్సవాల్లో ప్రదర్శించాలనుకున్నాడు. కానీ ఇంతలో తనకు ఇవ్వవలసిన వేషం వేరొకరికి ఇచ్చి తనను తప్పించారు. అప్పటికే కాలేజీ సాంస్కృతిక విభాగానికి కన్వీనర్‌గా ఉన్న తనకు వేషం లేకపోవడమేమిటని అడగడంతో అదే నాటకంలో ఒక రిక్షావాడి వేషం ఇచ్చారు. ఆంధ్రా యూనివర్సిటీలో జరిగిన ఈ పోటీల్లో, వేంకటేశ్వర, ఉస్మానియా వర్సిటీలు కూడా పాల్గొన్నాయి. ఈ పోటీల్లో ఇతని ‘పగిలిన గోడలు’ నాటకానికి ఉత్తమ నాటకం, ఉత్తమ స్క్రిప్టు, ఉత్తమ నటుడు బహుమతులతో పాటు త్యాగరాజు పోషించిన రిక్షావాడి పాత్రకు ఉత్తమ సహాయనటుడి బహుమతి వచ్చింది. ఒక నాటకానికి అన్ని బహుమతులు రావడం ఆంధ్ర విశ్వవిద్యాలయ చరిత్రలో అదే మొదటిసారి. రిక్షావాడి పాత్ర పోషణను మెచ్చుకుంటూ ఆంధ్రా విశ్వవిద్యాలయం వైస్‌ ఛాన్స్‌లర్‌ టెలిగ్రాం ద్వారా అభినందనలు తెలిపితే, రిజిస్ట్రార్‌ కూర్మా వేణు గోపాలస్వామి నాయుడు ఏకంగా తమ యూనివర్సిటీలోనే ఎం.ఎ.చదవమని అడిగాడు. కానీ త్యాగరాజు మాత్రం ఆ ప్రతిపాదనను సున్నితంగానే తిరస్కరించి ఉస్మానియా విశ్వవిద్యాలయంలోనే ఎం.ఎ., ఎం.ఫిల్‌., ఎల్‌.ఎల్‌.బి. చేశాడు. త్యాగరాజు నాటకాల పట్ల ఉన్న ఆసక్తితో వరంగల్‌లో మిత్రులందరితో కలిసి కాకతీయ కళాసమితి అనే సంస్థను స్థాపించాడు. ఈ సంస్థ పక్షాన చాలా నాటకాలు వేశాడు[1].

సినిమా రంగం
నాటక రంగంలో త్యాగరాజు కృషిని, నటుడిగా ప్రదర్శించే ప్రతిభను గుర్తించి ఇతని స్నేహితులు సినిమాలలో ప్రయత్నించమని ప్రోత్సహించారు. మద్రాసు వెళ్లి దర్శకుడు ప్రత్యగాత్మను కలిసి సినిమాలలో నటించాలనే తన అభిలాషను వ్యక్తం చేశాడు. ప్రత్యగాత్మ తాను దర్శకత్వం వహించిన మంచి మనిషి చిత్రంలో విలన్‌గా అవకాశం ఇచ్చాడు. ఆవిధంగా ఇతనికి 1964లో తొలి సినిమా అదీ ఎన్.టి.ఆర్.తో కలిసి నటించే అవకాశం లభించింది. ఆ వెంటనే గుత్తా రామినీడు ‘పల్నాటి యుద్ధం’ (1966)లో వీరభద్రుడి వేషం, రంగుల రాట్నం (1967)లో వాణిశ్రీ తండ్రి వేషంతో నటుడిగా మంచి గుర్తింపు పొందాడు. ఆ తరువాత ఇతనికి పాతికేళ్లకు పైగా తన సినీజీవితంలో వెనక్కి తిరిగి చూసుకొనే అవసరమే కలుగలేదు. బందిపోటు దొంగ, పోలీస్‌ ఇన్‌స్పెక్టర్‌ వేషాలకు త్యాగరాజు పెట్టింది పేరుగా చలామణి అయ్యాడు. ప్రతినాయక పాత్రలో కరుడుగట్టిన విలన్‌ వేషాలు వేయడంలో తనకు తానే సాటి రాగలడనే పేరు తెచ్చుకున్న త్యాగరాజు ‘పాప కోసం’, ‘శ్రీ షిర్డీ సాయిబాబా మహత్యం’ వంటి చిత్రాల్లో సాత్విక పాతలు ధరించి ప్రేక్షకుల సానుభూతిని పొందాడు కూడా. ఇతడు కౌబాయ్, క్రైమ్‌ చిత్రాలతో పాటు జానపద, పౌరాణిక, సాంఘిక చిత్రాలలో తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషలలో మొత్తం 400 చిత్రాలకు పైగా నటించాడు[1].

నటించిన సినిమాలు
త్యాగరాజు నటించిన సినిమాల పాక్షిక జాబితా:

  1. ప్రేమ ఖైదీ (1991)
  2. వీరూ దాదా (హిందీ) (1990)
  3. అయ్యప్పస్వామి మహత్యం (1989)
  4. శ్రీరామచంద్రుడు (1989) – ఫణీంద్రరావు
  5. ఊరేగింపు (1988)
  6. నేనే రాజు – నేనే మంత్రి (1987)
  7. విశ్వనాథ నాయకుడు (1987)
  8. తాండ్ర పాపారాయుడు (1986)
  9. ధర్మపీఠం దద్దరిల్లింది (1986)
  10. పరశురాముడు (1986)
  11. శ్రీ షిర్డీ సాయిబాబా మహత్యం (1986)
  12. మేరా జవాబ్ (హిందీ) (1985)
  13. బాబులుగాడి దెబ్బ (1984)
  14. అమాయకుడు కాదు అసాధ్యుడు (1983)
  15. ఆంధ్రకేసరి (1983)
  16. ధర్మ పోరాటం (1983)
  17. పటాలం పాండు (1981)
  18. ధర్మం దారి తప్పితే (1980)
  19. మూగకు మాటొస్తే (1980)
  20. యముడు (1980)
  21. రామ్ రాబర్ట్ రహీమ్ (1980)
  22. శివమెత్తిన సత్యం (1980)
  23. సర్కస్ రాముడు (1980)
  24. సూపర్ మేన్ (1980)
  25. ఆడదంటే అలుసా (1979)
  26. గంగా భవానీ (1979)
  27. గంధర్వ కన్య (1979)
  28. పంచభూతాలు (1979)
  29. మూడు పువ్వులు ఆరు కాయలు (1979)
  30. రాముడే రావణుడైతే (1979)
  31. హేమా హేమీలు (1979)
  32. కరుణామయుడు (1978)
  33. కేడీ నంబర్ 1 (1978)
  34. దొంగల దోపిడీ (1978)
  35. పట్నవాసం (1978)
  36. ముగ్గురూ ముగ్గురే (1978)
  37. లాయర్ విశ్వనాథ్ (1978)
  38. చిల్లర దేవుళ్లు (1977)
  39. జడ్జిగారి కోడలు (1977)
  40. జీవిత నౌక (1977)
  41. మనవడి కోసం (1977)
  42. మనుషులు చేసిన దొంగలు (1977)
  43. ఇద్దరూ ఇద్దరే (1976)
  44. ఈ కాలపు పిల్లలు (1976)
  45. కొల్లేటి కాపురం (1976)
  46. దొరలు దొంగలు (1976)
  47. నా పేరే భగవాన్ (1976)
  48. నిజం నిద్రపోదు (1976)
  49. నేరం నాది కాదు ఆకలిది (1976)
  50. పాడవోయి భారతీయుడా (1976)
  51. భలే దొంగలు (1976)
  52. మా దైవం (1976)
  53. వేములవాడ భీమకవి (1976)
  54. సీతా కళ్యాణం (1976) – పరశురాముడు
  55. అందరూ మంచివారే (1975)
  56. అన్నదమ్ముల అనుబంధం (1975)
  57. ఆస్తికోసం (1975)
  58. నాకూ స్వతంత్రం వచ్చింది (1975)
  59. వయసొచ్చిన పిల్ల (1975)
  60. అల్లూరి సీతారామరాజు (1974) -బాస్టియన్
  61. కన్నవారి కలలు (1974)
  62. రామ్ రహీం (1974)
  63. ఒక నారి – వంద తుపాకులు (1973) – సర్దార్
  64. గాంధీ పుట్టిన దేశం (1973)
  65. జీవన తరంగాలు (1973)
  66. పంజరంలో పసిపాప (1973) – కిల్లర్
  67. మంచివాళ్ళకు మంచివాడు (1973)
  68. విచిత్ర వివాహం (1973)
  69. కలవారి కుటుంబం (1972)
  70. కొరడారాణి (1972)
  71. చిట్టి తల్లి (1972)
  72. నిజం నిరూపిస్తా (1972)
  73. పిల్లా? – పిడుగా? (1972)
  74. బుల్లెమ్మ బుల్లోడు (1972)
  75. భలే మోసగాడు (1972)
  76. మాయింటి వెలుగు (1972)
  77. మావూరి మొనగాళ్ళు(1972)
  78. రాజమహల్ (1972)
  79. శ్రీకృష్ణాంజనేయ యుద్ధం (1972) – నరకాసురుడు
  80. అడవి వీరులు (1971)
  81. అనూరాధ (1971)
  82. కత్తికి కంకణం (1971)
  83. కిలాడి బుల్లోడు (1971)
  84. జాతకరత్న మిడతంభొట్లు (1971)
  85. జేమ్స్ బాండ్ 777 (1971)
  86. దెబ్బకు ఠా దొంగల ముఠా (1971)
  87. నమ్మకద్రోహులు (1971) – రాజా
  88. మాస్టర్ కిలాడి (1971)
  89. మొనగాడొస్తున్నాడు జాగ్రత్త (1971)
  90. మోసగాళ్లకు మోసగాడు (1971)
  91. రివాల్వర్ రాణి (1971)
  92. విక్రమార్క విజయం (1971)
  93. శ్రీకృష్ణసత్య (1971)
  94. కథానాయిక మొల్ల (1970)
  95. కోడలు దిద్దిన కాపురం (1970)
  96. ఖడ్గవీర (1970)
  97. జన్మభూమి (1970)
  98. ద్రోహి (1970)
  99. పగ సాధిస్తా (1970)

100.మాయని మమత (1970)

101.రక్తసింధూరం (1970)

102.రౌడీరాణి (1970)

103.అగ్గి వీరుడు (1969)

104.కదలడు వదలడు (1969) -డిండిమ వర్మ

105.గండర గండడు (1969) – కాలకంఠుడు

106.గండికోట రహస్యం (1969)

107.టక్కరి దొంగ చక్కని చుక్క (1969) – ఇన్‌స్పెక్టర్ కామేశం

108.పంచకల్యాణి దొంగలరాణి(1969)

109.మహాబలుడు (1969)

110.ఎవరు మొనగాడు (1968)

111.దేవకన్య (1968)

112.పాప కోసం (1968) – కిష్టయ్య

113.బంగారు పంజరం (1968)

114.బందిపోటు దొంగలు (1968) – పాపన్న

115.భలే మొనగాడు (1968)

116.మంచి మిత్రులు (1968)

117.చిక్కడు దొరకడు (1967)

118.పట్టుకుంటే పదివేలు (1967)

119.మంచి కుటుంబం (1967)

120.రంగులరాట్నం (1967)

121.రక్తసింధూరం (1967)

122.పల్నాటి యుద్ధం (1966) – వీరభద్రుడు

123.హంతకులొస్తున్నారు జాగర్త (1966)

124.మంచి మనిషి (1964)

మరణం
అతి తక్కువ కాలంలో అత్యధిక చిత్రాలలో నటించిన త్యాగరాజు తన 51వ ఏట 1991 ఫిబ్రవరి 24న హైదరాబాదులోని అశోక్‌నగర్‌లో ఉన్న తన సోదరుని ఇంట్లో హఠాత్తుగా గుండెపోటు రావడంతో ఆసుపత్రికి తరలిస్తుండగానే మార్గమధ్యంలో మృతి చెందాడు[1].

హెచ్ .రమేష్ బాబు తెలియజేసిన విషయాలు –

· ఆర్టిస్టుగా ఎంతకాలం పరిశ్రమలో ఉన్నామనేదే ముఖ్యమని” ఒక సందర్భంలో చెప్పుకున్న త్యాగరాజు నిజంగా మంచి ఆర్టిస్టు. తెలుగు సినీ చరిత్రలో విలక్షణ విలన్‌గా త్యాగరాజు స్థానం సుస్థిరం.
కొత్త పెళ్లి కూతురి భయం

· కొత్త పెళ్లి కూతురి భయం
ఒకసారి ”మున్సబుగారి అల్లుడు” (1985) సినిమా అవుట్‌ డోర్‌ షఉటింగ్‌ జరుపుకుంటున్నప్పుడు ఆ చిత్ర దర్శక నిర్మాత విజరుబాబు స్నేహితుడి ఇంట్లో భోజన వసతులు ఏర్పాటు చేశారు. అందరినీ భోజనానికి ఇంటికి పిలిచినా ఆయన మన వాడిని మాత్రం ఇంటికి రానీయకుండా ఉన్నచోటనే ఉంచి ప్రత్యే కంగా భోజనాలు పంపేవాడు. ఇదేమిటి అనడిగితే ‘సినిమాల్లో మీరు చూపే విలనీ చూసి వాళ్ల అమ్మాయిలు వడ్డించడానికి భయపడుతున్నార’ట అన్నాడాయన. ప్రేక్షకులను అంతలా భయపెట్టే విలనీ వేషాలు వేశారాయన. అలాగే పెళ్లయిన కొత్తలో భార్యను వెంట పెట్టుకుని ”గాంధీ పుట్టిన దేశం” ప్రివ్యూకు వెళ్ళాడు రాజు. చాలా సంతోషంగా ప్రివ్యూ థియేటర్‌లోకి వెళ్లనైతే వెళ్ళారు గానీ తీరా లోపల ఆ చిత్రంలో త్యాగరాజు హీరోయిన్‌ను అత్యా చారం చేసే దృశ్యాలు చూసిన ఆ కొత్త పెళ్లి కూతురు త్యాగరాజును భయంతోనూ, ఆందోళనతోనూ చూసింది. ఇంటికి వచ్చే వరకూ, ఆ తరువాత కూడా ఆమె కొద్ది రోజులు త్యాగరాజును చూసి భయపడేది. అంతలా ఉండేది ఆయన సహజ నటన. ఆ తరువాత తానెప్పుడూ భార్యతో కలిసి తను నటించిన సినిమా చూడటానికి వెళ్ళలేదాయన. ఈ విషయాలన్నీ ఆయనే స్వయంగా చెప్పుకొన్నారొక వ్యాసంలో.
త్యాగరాజు సినిమాలు
ఇంకా త్యాగరాజు నటించిన సినిమాల్లో కొన్ని వరుసగా, ‘హంతకులొస్తున్నారు జాగ్రత్త’ (1966), ‘ఎవరు మొనగాడు’, ‘మంచి కుటుంబం’, ‘మంచి మిత్రులు’ (1968), ‘బందిపోటు దొంగలు’, ‘టక్కరి దొంగ చక్కని చుక్క’, ‘బంగారు పంజరం’ (1969), ‘రౌడీరాణి’, ‘మాయని మమత’, ‘కోడలు దిద్దిన కాపురం’, ‘కథానాయిక మొల్ల’, ‘పగ సాధిస్తా’, ‘కొల్లేటి కాపురం’, ‘పాడవోయి భారతీయుడా’ (1970), ‘పట్టుకుంటే పదివేలు’, ‘నమ్మక ద్రోహులు’, ‘అడవి వీరులు’ (1971), ‘రాజమహల్‌’, ‘అనురాధ’, ‘మాయింటి వెలుగు’, ‘బుల్లెమ్మ బుల్లోడు’, ‘కలవారి కుటుంబం’ (1972), ‘ఒకనారి వంద తుపాకులు’, ‘విచిత్ర వివాహం’, ‘జీవన తరంగాలు’, ‘పంజరంలో పసిపాప’ (1973), ‘కన్నవారి కలలు’ (1974), ‘అందరూ మంచివారే’, ‘వయసొచ్చిన పిల్ల’, ‘అన్నదమ్ముల అనుబంధం’, ‘నాకు స్వాతంత్య్రం వచ్చింది’ (1975), ‘వేములవాడ భీమకవి’, ‘నా పేరే భగవాన్‌’, ‘నేరం నాది కాదు ఆకలిది’, ‘ఇద్దరూ ఇద్దరే’, ‘మా దైవం’ (1976), ‘జడ్జిగారి కోడలు’, ‘చిల్లర దేవుళ్లు’, ‘జీవిత నౌక’ (1977), ‘లాయర్‌ విశ్వనాథ్‌’, ‘ముగ్గురూ ముగ్గురే’, ‘కె.డి.నెం.1’, ‘కరుణామయుడు’, ‘పట్నవాసం’ (1978), ‘మూడు పువ్వులు, ఆరు కాయలు’, ఆడదంటే అలుసా’ (1979), ‘యముడు’, ‘పరశురాముడు’, ‘సూపర్‌మెన్‌’, ‘రాం రాబర్ట్‌ రహీం’, ‘శివమెత్తిన సత్యం’, ‘సర్కస్‌ రాముడు’ (1980), ‘ధర్మ పోరాటం’, ‘ఆంధ్ర కేసరి’ (1983), ‘తాండ్ర పాపారాయుడు’, ‘ధర్మ పీఠం దద్దరిల్లింది’ (1986), ‘విశ్వనాథ నాయకుడు’, ‘నేనే రాజు నేనే మంత్రి’ (1987), ‘అయ్యప్పస్వామి మహత్మ్యం’ (1989) తెలుగు చిత్రాలు, ఇంకా తమిళ, మలయాళ, ‘మేరా జవాబ్‌’ (1985), ‘వీరూదాదా’ (1990) వంటి హిందీ మొత్తం కలిపి 400 సినిమాల్లో నటించాడు త్యాగరాజు. ఆయన కనిపించిన చివరి చిత్రం ‘ప్రేమఖైది’ (1991).
సెల్‌ : 94409 25814

  • హెచ్‌.రమేష్‌బాబు

· విల‌న్ క్యారెక్ట‌ర్ల‌లో ఉన్న‌త స్థాయిలో రాణించి, వాటిపై త‌న‌దైన ప్ర‌త్యేక ముద్ర వేసిన న‌టుడు త్యాగ‌రాజు. సినీ రంగంలో అడుగుపెట్టి తొలి సినిమాలోనే మ‌హాన‌టుడు నంద‌మూరి తార‌క‌రామారావును ఢీకొట్టే విల‌న్ పాత్ర‌ను చేసి, మెప్పించారాయ‌న‌. 1964లో వ‌చ్చిన ఆ సినిమా ‘మంచి మ‌నిషి’. ఆ త‌ర్వాత రెండున్న‌ర ద‌శాబ్దాల కెరీర్‌లో ఎన్నో సాంఘిక‌, జాన‌ప‌ద‌, పౌరాణిక‌, చారిత్ర‌క‌, కౌబాయ్ చిత్రాల్లో ప్రేక్ష‌కుల‌ను భ‌య‌పెట్టే ప్ర‌తినాయ‌క పాత్ర‌ల్లో గొప్ప‌గా రాణించి, వారి హృద‌యాల్లో చెర‌గ‌ని స్థానం సంపాదించారు.

· సశేషం

· మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -31-3-22-ఉయ్యూరు

Posted in సినిమా | Tagged | Leave a comment

శ్రీ శుభ కృత్ ఉగాది పంచాంగ శ్రవణం –సాహితీ బంధువులకు శ్రీ  శుభ కృత్ ఉగాది శుభా కాంక్షలు 

శ్రీ శుభ కృత్ ఉగాది పంచాంగ శ్రవణం 
–సాహితీ బంధువులకు శ్రీ  శుభ కృత్ ఉగాది శుభా కాంక్షలు 

 1-శ్రీ శుభ కృత్ ఉగాది పంచాంగ శ్రవణం ఉగాది రోజు 2-4-22 శనివారం ఉదయం 8-30గం.లకు శ్రీ సువర్చలాన్జనేయస్వామి దేవాలయం లోనూ ,

2-ఉదయం 11గం .లకు సరసభారతి ప్రత్యక్ష ప్రసారంగానూ 

3-సాయంత్రం 6గం.లకు గండిగుంట శ్రీ దత్త దేవాలయం లోనూ జరుగును 

4-సాయంత్రం 4గం లకు బృహదారణ్య కోపనిషత్  సరసభారతి ప్రత్యక్ష ప్రసారంగా జరుగుతుంది 

 గబ్బిట దుర్గాప్రసాద్ -31-3-22

Posted in సమయం - సందర్భం | Leave a comment

మన మరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు-167

· మన మరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు-167

· 167-విలనీ’’’ కి కొత్తర్ధం చెప్పిన ,’’అదే మామా మన తక్షణ కర్తవ్యమ్ ‘’ బాబులుగాడి దెబ్బ గోల్కొండ అబ్బా’డైలాగ్ ఫేం ,’’నాన్నగారు’’ పాత్రధారి –ఆర్ .నాగేశ్వరావు

ఆర్‌.నాగేశ్వరరావుగా ప్రసిద్ధుడైన తెలుగు సినిమా నటుని పూర్తి పేరు రాజనాల నాగేశ్వరరావు (1928 – 1959). విలన్‌ అంటే గళ్ళ పంచె, పెద్ద పెద్ద మీసాలు, బుగ్గ మీద ఒకటి రెండు కత్తి గాట్లు ఉన్న వ్యక్తులు మన కళ్ళ ముందు మెదులుతారు. అయితే అవేమీ అక్కరలేకుండా విలన్‌ పాత్రధారి కూడా హీరో తరహాలో సాత్వికంగా కనబడవచ్చని, అతనిలోని క్రూరత్వానికి, బయటకు కనిపించే ఆకారానికి సంబంధం లేదని ‘విలనీ’కి కొత్త అర్ధం చెప్పిన విలక్షణ నటుడు ఆర్‌.నాగేశ్వరరావు. “బాబులు గాడి దెబ్బంటే గోల్కొండ అబ్బా అనాలి” అంటూ ఆయన చెప్పిన డైలాగ్‌ అప్పట్లో అందరి నోటా వినిపించేది. అదే నోటితో ఆయన చెప్పిన “అదే మామా మన తక్షణ కర్తవ్యం” అంటూ పలికిన డైలాగ్‌ కూడా ఇప్పటికీ మరచిపోలేం. మొదటి డైలాగ్‌ అన్నపూర్ణా వారి దొంగరాముడు చిత్రంలోనిది కాగా, రెండవది విజయా వారి మాయాబజార్ చిత్రంలోనిది. కౄరమైన పాత్రలు పోషించడంలో ఆర్‌.నాగేశ్వరరావు తనదైన ఒక ప్రత్యేక ముద్ర వేసుకున్నారు. ఇల్లరికం, ఇంటిగుట్టు, ఇలవేల్పు, శభాష్‌ రాముడు వంటి పలు చిత్రాల్లో ఆయన నటించారు. విలన్‌ పాత్రలు వేయడంలో ఆయన ఎంత దిట్టో, వ్యక్తిగతంగా అంత వినయశీలి, సౌమ్యుడు. తక్కువ సమయంలో ఎక్కువ పేరు తెచ్చుకున్న ఆర్‌.నాగేశ్వరరావు ఒకసారి కోడంబాక్కం అడవుల్లో ఒంటరిగా వెళ్తున్నప్పుడు ఆయన జీపునకు అడ్డంగా ఒక పులి వచ్చి నిలబడింది. అది ఆయనపై దూకడానికి సిద్ధపడడంతో చాకచక్యంగా జీపు నడిపి జీపుతో పులిని ఢీకొని చంపేశారు. ఆ విధంగా మృత్యువుని జయించిన ఆయన కొద్దిరోజుల్లోనే క్షయవ్యాధి బారినపడి తన 33వ ఏటనే కన్నుమూశారు. అప్పటికే ఆయనకు భార్య, అయిదుగురు పిల్లలు ఉన్నారు. విధికి తలవంచిన మంచి నటుడుగా రాజనాల నాగేశ్వరరావు పరిశ్రమ గుండెల్లో పదిలంగా ఉండిపోతారు.

· పేరుతెచ్చిన సినిమాల జాబితా
దేవదాసు (1953)
కన్నతల్లి (1953) …. చలపతి
పరోపకారం (1953)
అగ్గి రాముడు (1954)
దొంగ రాముడు (1955) …. బాబులు
జయం మనదే (1956)
మాయా బజార్ (1957) …. దుశ్శాసనుడు
వినాయక చవితి (1957)
పెళ్ళినాటి ప్రమాణాలు (1958) …. భీమసేనా రావు కొడుకు
అప్పు చేసి పప్పు కూడు (1958) …. రామ్ సింగ్
ముందడుగు (1958)
ఇల్లరికం (1959) …. శేషగిరి
పెళ్ళిసందడి (1959)
· కూతురు సుహాసిన చెప్పిన విశేషాలు

· ఆరడుగుల ఆజానుబాహుడు.. కన్ను తిప్పుకోలేని వస్త్రధారణ..
అందంగా కనిపించే విలక్షణ విలన్‌… సూటు వేసుకుంటే నిజాం నవాబు..
‘భలే మామా భలే…’ ‘ఇదే మన తక్షణ కర్తవ్యం…’ ‘బాబులు గాడి దెబ్బ అంటే గోల్కొండ అబ్బ అనాలి..’
‘రారోయి మా ఇంటికీ! మావా! మాటున్నదీ! మంచి మాటున్నదీ!’
ఈ మాటలపాటల ప్రత్యేకతలతో తెలుగు సినీ ప్రేక్షకులకు చేరువయ్యారు…
కొద్ది సినిమాలలో నటించి, అతి కొద్దికాలం మాత్రమే జీవించి, తెలుగు సినీ పరిశ్రమలో అందమైన విలన్‌గా ముద్ర వేసుకున్న ఆర్‌. నాగేశ్వరరావు గురించి జ్ఞాపకాలుగా ఆర్ద్రమైన గుండెతో పంచుకున్నారు సింగపూర్‌లో నివాసం ఉంటున్న వారి పెద్ద కుమార్తె సుహాసిని..

· ‘నాన్న పోయేనాటికి నా వయసు ఎనిమిది సంవత్సరాలు. నాన్నకు మాసివ్‌ అటాక్‌ రావటం, మేడ మీద నుంచి ఆయనను కిందకు తీసుకు రావటం, అంబులెన్స్‌లో ఆసుపత్రికి తీసుకు వెళ్తుండగా దారిలోనే మరణించటం, ఇంటికి తీసుకువచ్చి హాలులో.. నిండైన విగ్రహంలాంటి నాన్నను పడుకోపెట్టడం.. పక్కనే అమ్మ కన్నీరుమున్నీరవ్వటం… నా మనసు ఆయన జ్ఞాపకాలలోకి పరుగులు తీస్తూనే ఉంటుంది.

· ఐస్‌క్రీమ్‌ చేసి పెట్టేవారు..
నాన్న సికింద్రాబాద్‌ జీరాలో పుట్టి పెరిగారు. నాన్న నాయనమ్మ కడుపులో ఉండగా తాతగారు పోయారు. అప్పటికే నాన్నకు ఒక అన్నయ్య ఉన్నారు. నాన్న వాళ్ల అన్నయ్య ఇంట్లోనే పెరిగారు. అది నాన్న సొంత ఇల్లే. నాన్న మంచి పొజిషన్‌కి వచ్చాక ఆ ఇల్లు వాళ్లకి ఇచ్చేశారు. నాన్న నవాబులతో దోస్తీగా ఉండేవారు. ఆయన మాట్లాడే భాషలో తెలంగాణ నవాబుల హిందీ ఉర్దూ మాండలికం ఉండేది. అమ్మ రత్నాబాయి గుంటూరు లో పుట్టి పెరిగింది. నాన్నగారిది మేనరికం. మేం ఐదుగురు పిల్లలం. మోహన్, తాతాజీ, సుహాసిని (నేను), శ్యామ్, చాందినీ. అన్నయ్యలు, తమ్ముడు గతించారు. నేను, చెల్లి మాత్రమే ఉన్నాం. నాన్న పోయేనాటికి చెల్లెలికి నాలుగేళ్లు, నాకు ఎనిమిది సంవత్సరాలు. అందరం హైదరాబాద్‌లోనే పుట్టి పెరిగాం. ప్రస్తుతం సింగపూర్‌లో ఉంటున్నాను

· రిక్షాలో వెళ్లమన్నారు..
అమ్మ వాళ్లందరూ తరచుగా భద్రాచలం వెళ్లేవారు. రైల్వే స్టేషన్‌ మా ఇంటికి దగ్గరే. కాని అందరూ పని పూర్తి చేసుకుని వెళ్లేసరికి ట్రైన్‌ టైమ్‌ అయిపోయేది. అందుకని నాన్న పరుగెత్తుకుంటూ, ఇంజన్‌ డ్రైవర్‌ దగ్గరకు వెళ్లి, రైలు ఆపించేవారట. బ్రిటిష్‌ టైమ్‌లో తాతయ్య (అమ్మవాళ్ల నాన్న) ట్రైన్‌ ఇంజిన్‌ డ్రైవర్‌గా ఉండేవారు. బహుశః అందుకే ఆపేవారేమో. ‘జీవితంలో కష్టపడటం నేర్చుకోవాలి, స్కూల్‌కి రిక్షాలో వెళ్లండి’ అని చెప్పేవారు నాన్న. సినిమాలలో ఎంత బిజీగా ఉన్నా, ప్రతి ఆదివారం స్వయంగా ఐస్‌క్రీమ్‌ తయారుచేసి పెట్టేవారు. అవకాశం ఉన్నప్పుడు బీచ్‌కి తీసుకెళ్లి, మాతో దాగుడు మూతలు ఆడేవారు.

· డ్రై ఫ్రూట్స్‌ తెచ్చేవారు..
మేం పొద్దున్నే నిద్ర లేచి హాల్‌లో కూర్చుని చదువుకుంటుంటే చూడటం ఇష్టం నాన్నకు. కారులో అన్నవరం తీసుకువెళ్లేవారు. నదీ తీర ప్రాంతంలో డ్రైవింగ్‌ చేయటం చాలా ఇష్టం. అక్కడ స్నేహితులందరితో కలిసి భోజనం చేసేవారు. ప్రతి వారం మద్రాస్‌ ప్యారిస్‌ కార్నర్‌ నుంచి స్వీట్స్, పూలు, కూరలు తెచ్చేవారు. ఆ రోజుల్లోనే అంటే 1955 ప్రాంతంలోనే అన్ని రకాల డ్రై ఫ్రూట్స్‌ తెచ్చేవారు. అమ్మ వంటలు బాగా చేసేది. నాన్న మంచి ఆహారం మితంగా తినేవారు. ప్రతిరోజూ రాత్రి పరాఠాలు, నాన్‌వెజ్‌ తినేవారు. హైదరాబాద్‌ స్టయిల్‌ ఆహారం ఇష్టపడేవారు. మీగడ పెరుగంటే చాలా ఇష్టం.

· అప్పుడు మేం ఉన్న మా ఇంటితో ఎప్పటికప్పుడు కొత్త అనుబంధం ఏర్పడుతూనే ఉంది. ఆ ప్రాంతానికి వెళ్లినప్పుడల్లా, అక్కడ నాన్నతో కలిసి పెరిగిన వాళ్లు, ‘‘మీ నాన్నతో కలిసి పెరిగాం. మేమంతా చనువుగా ఆయనను ‘నాగులు బావ’ అని పిలిచేవాళ్లం’’ అని చెబుతుంటే చాలా ఆనందంగా ఉంటుంది. ఎస్‌పి రోడ్‌లో ఇప్పటికీ పాత హార్డ్‌వేర్‌ దుకాణాలున్న ప్రాంతానికి వెళితే, ‘మిమ్మల్ని బాగా చూసినట్లు ఉంది. అచ్చం నాన్నగారిలా ఉన్నారు’ అంటూ, నాన్నను గుర్తు తెచ్చుకుంటారు. నాన్న నిండైన విగ్రహమే అందుకు కారణం. అమ్మ 90 సంవత్సరాలు వచ్చేవరకు జీవించింది. నాన్న గురించి అమ్మ చెప్పే మాటలు వింటూ పెరిగాను.

· —

· ఇప్పటికీ గుర్తుండిపోయింది…
నాన్న పోయిన రోజున ఆయనను తీసుకురావటం బాగా గుర్తుంది. గదిలో పడుకుని ఉండగా మాసివ్‌ అటాక్‌ వచ్చి అతి పిన్న వయసులోనే కన్నుమూశారు. ఆయనను చూడటానికి జనం తండోపతండాలుగా వచ్చారు. ఆ చేదు జ్ఞాపకం ఇంకా పచ్చిగానే ఉంది . నాన్న గురించి వింటూ, పెరగటం వల్ల, నాన్నలా ఉండాలనే భావన నాకు తెలియకుండానే అలవాటైపోయింది. ఆయన పర్సనాలిటీ నాకు వచ్చిందని గర్వపడతాను. నాన్న ఇప్పటికీ మా మనసులో, ఆలోచనలలో, చేతలలో సజీవంగానే ఉన్నారు. నాన్నకి అందమే కాదు, వ్యక్తిత్వం, అస్తిత్వం కూడా ఉన్నాయి. తల్లిదండ్రులతో ఉన్న బంధం మరచిపోవటం కష్టం.

· నాన్న వెరీ పర్టిక్యులర్‌
నాన్న ఆజానుబాహువు. అందమైనవారు. నాన్న స్టయిల్‌ని చాలామంది ఫాలో అయ్యేవారు. నవాబుల కంటె హుందాగా, గొప్పగా ఉండేవారు. నాన్న దగ్గర 300 సూట్లున్నాయి. షూస్‌ లెక్క చెప్పలేను. ఏ సూట్‌లో చూసినా ఎంతో కంఫర్టబుల్‌గా అనిపించేవారు. ఎస్‌వి రంగారావు అంకుల్‌ గృహప్రవేశానికి నాన్న హై కాలర్‌ (నెహ్రూ కాలర్‌) బ్లాక్‌ సూట్, ఎస్‌విఆర్‌ వైట్‌ సూట్, టోపీ ధరించారు. అతిథులందరికీ నాన్న విస్తళ్లు వేసి వడ్డించారు. అడ్డగీతల రా సిల్క్, బ్రైట్‌ ఎల్లో… హై కాలర్‌ స్వెటర్‌తో ఇంగ్లీషు దొరలా ఎంతో దర్పంగా, హుందాగా అనిపించేవారు. మా అందరికీ నాన్నే బట్టలు కొనేవారు. ఒకసారి నాకు అద్దాలు కుట్టిన నల్ల లంగా తీసుకువచ్చారు. అది నాకు బాగా గుర్తుండిపోయింది. ఇప్పటికీ అలాంటి లంగా కనిపిస్తే, ఆ రోజులు గుర్తుకు వస్తాయి. – సుహాసిని

· సశేషం

· మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -30-3-22-ఉయ్యూరు

Posted in సినిమా | Tagged | Leave a comment

  మన మరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు-166

  మన మరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు-166

·         166-పెళ్లి సందడి నిర్మాత ,బొబ్బిలియుద్ధం లో  వెంగళ రాయుడు  ,నిర్మాత ,దర్శకుడు ‘’అందాల రాణివే, నీవెంత జాణవే’’పాటఫేం –సి.సీతారాం

·         సమర్ధులైన దర్శకులు కఠినంగా చెబుతూ ఉంటే, బాగా నటించి రాణించగలవారిలో పద్మనాభాన్ని సీతారాంను, రామకోటిని చెప్పుకోవాలి.

·         సీతారాంకు కొంతకాలంగా హాస్య పాత్రలు లభించటమేలేదు. అతను వేశాడు కాబట్టి హాస్యం ఉందనుకోవలసి వస్తోంది. నిజానికి ఈ దుస్థితి, ఇటీవల దాదాపు అందరు హాస్య నటులకూ పట్టింది. 

·         హుషారుగా కబుర్లుచెబుతూ కుర్రకారు ప్రేమయణంమీద మూడు మైళ్లు షికారు తీసుకెళ్ళే “పెళ్లిసందడి” (రిపబ్లిక్‌ (ప్రొడక్షన్స్‌) ఆంధ్రలో1959 ఏప్రిల్‌ రెండునుండి సందడి చేస్తోంది. ఇందులోని పాత్రలలో చిన్నవాళ్లూ, పెద్దవాళ్లూ, వాళ్లలా నటించిన నటులలో పెద్దవాళ్లూ, చిన్నవాళ్లూ, దర్శక నిర్మాతలూ. రచయితా యావన్మందీ కూడా ఈసారి బేఖాతరీగా విహరించి హాస్యంచేసి రంజింపచేయడానికి వడికట్టి, దాదాపు అంతపనీ చేశారు. ఎటొచ్చి కొందరు ఆ పని చెప్పకుండా చేసి నవ్వించగలిగారు; మిగతా వారంతా కాసుకోమని వార్నింగు ఇచ్చారు. ఇస్తే ఇచ్చారుగాని మొత్తంమీద వాళ్లూ బాగానే నవ్వించగలిగారు. అందరికన్న ఎక్కువ నవ్వించగలినది మాటలు. సినీ అసందర్భాలన్నీ సమిష్టిగా ఒకచోట సందర్భపడ్డ ఈ చిత్రంలో గుర్నాధం అనే చిన్నవాడు తన పెళ్లిచూపులకు తన స్నేహితుని పంపి “ప్రాక్సీ? ఇచ్చి రమ్మనడం ముఖ్య విషయం. సముద్రాల జూనియర్‌కు సంభవించిన అసంభవమనిపించే ఈ తొలి ఊహ చుట్టూ మరికొన్ని అసంభవాలను, అపోహలను పేర్చి ఆయనా, దర్శకుడు యోగానంద్‌, నిర్మాత సీతారాం వాటికి తగ్గ మూటలు కూర్చి కథను కట్టారు. అసందర్భ ప్పిల్లడు గుర్నాధం వాలకాస్పీ అంతకో రీలు క్రితం బ్రహ్మాండమైన ఆస్తీ వేపకాయంత వెర్రి ఉన్న గుమ్మడినీ, అతని అన్నదమ్ముడు     

·           రమణారెడ్డినీ వాళ్ళ అపోహాపోహల తీరుతెన్నులనూ చూసేసరికి, మనకీ ఈ కధలో సాధ్యాసాధ్యాల గురించిన బెంగలు పోతాయి. డాన్సులూ రొమాన్సులూ అంటే ప్రాణం పెట్టే గుర్నాధం, ఒక దాన్సరుతో పెట్టుకున్న ఎంగేజిమెంటువల్ల తీరుబడిలేక గిలగిల్లాడుతూ ఉంటాడు. ఆ వేళకి అతని తండ్రి గంగాధరంగారు పొరుగూళ్ళో పెళ్లిసంబంధం చూసి పిల్లణ్ణి వెళ్ళి చూసి రమ్మంటాడు. అపుడు గుర్నాధం తన జర్నలిస్టు మిత్రుడు వాసును తన బదులు హాజరుకమ్మని పంపుతాడు. ఇలా “ప్రాక్సీ వెళ్లి మిత్రుడి తరపున గైరుహాజరినామా పలకబోయినందుకు వాసుకుపడ్డ జరిమానా (ప్రేమ కధలో జారిపడడం, అక్కడున్న ఇద్దరమ్మాయిలలోను పెద్ద చిన్నదాన్ని చూసి సరదాపడి డూయెట్‌ అందుకుంటాడు వాసు. ఆ పిల్ల రెండో చరణం అందుకోవడంతో ఒక జంట స్వయంవరణం పూర్తి అవుతుంది, అందువల్ల వాసు ఆ యింట్లో చిక్కడిపోతాడు. ఇటు, _వాసువచ్చేదాకా _ఇంటికెళ్ళకుండా అజ్ఞాతవాసంలో ఉండబోయిన గుర్నాధం, అక్కడ అలా ఉండలేక, ధైర్యంగా ఇవతల పడలేక అవస్థపడుతూ ఉంటాడు. అనూరాధగా అంజలీదేవి, నకిలీ పెళ్లీకొడుకు వాసుగా నాగేశ్వరరావూ కనిపించడంతో, అసలు పెళ్లికొడుకు గుర్నాధానికి (చలం), రెండో చిన్నది ప్రియంవద (సరోజాదేవి) మటుకే దక్కుతుందని మనం ముందే పసిగట్టినా, కథ ఈ చిక్కులు విప్పుకొని అడంగి చేరేవరకు, చూచి ఆనందించతగ్గ హాస్య సన్నివేశాలు ఎన్నో ఉన్నాయి. జర్నలిస్టుగా అభినయించిన స్థూలలబాల సరస్వతి, రమణారెడ్డి వివాహమాడుట వగైరాలు. ఈలోగా అనూరాధ జన్మవృత్తాంతం బయటపడడం కాస్తంత డ్రామా, మెలోడ్రామా, ఆ పైన ఆమె – కష్టదశలో పడే సినీ హీరోయిన్‌లందరూ తొక్కినదారిలోనే బయల్దేరి వూరూవాడా వదలి ఫోటోజెనిక్‌ అడవులలో తిరగడం, త్రాగుబోతులు ఆమెను చుట్టుముట్టడం, కొట్లాటలూ ఈలోగా హీరో వాసు కథ బయటపడడం వగైరా ఘట్టాలమీదుగా కథ జనరంజకంగా గమ్యస్థానం చేరుకొంటుంది, వెరసి మొత్తం నాలుగు పెళిళ్లూ ఫెళ్ళున జరుగుతాయి. నటీనటులందరూ ఎంత కథోచితంగా నటించినా మొత్తం మీద హాస్య నటన స్థాయి గర్వకారణంగా లేదు. చిన్న నటులంతా తమ పాత్రలను సమర్థంగా నిర్వహించారు గాని ముఖ్యపాత్రధారుల హాస్యనటన, హాస్యనటనకు ఉండతగ్గ అవధులను దాటిపోయింది. ఇది హాస్యము సుమీ అన్న తరహాలో హాలివుడ్‌ కమీడియన్‌లు కూడా ఈ మధ్యనే వదిలివేసిన హావభావాలతో మొదలై ముందుకు సాగి, హాస్య నటనమీద దర్శకునకు నటులకు గల చిన్నచూపును విశదంచేసింది. సి. ఎన్‌. ఆర్‌, రమణారెడ్డి, తొలిసారి హాస్యపాత్ర ధరించిన గుమ్మడి చెప్పుకోతగ్గ నటన ప్రదర్శించారు. హాస్యంపట్ల (ప్రేక్షకుల పట్ల దర్శకులకు మరికొంచెం గురి, గౌరవం ఉంటే, నాగేశ్వరరావు, చలం, బాలసరస్వతి బాగా రాణించేవారని, గుమ్మడి హాస్యనటనలో తన అజ్ఞాత ప్రజ్ఞను మరింత ప్రస్ఫుటంగా చూపగలిగే వాడనీ    

·         అనిపిస్తుంది. ఉన్నవారిలో అంజలీదేవి ధరించిన అనూరాధ అందంగా ఆహ్లాదకరంగా ఉంది. సరోజూదేవిని భరించిన ప్రియంవద గురించి చెప్పుకొనకపోవడం మంచిది. హాస్వేతరనటుడు అయినా తాగుబోతుగా ఆర్‌. నాగేశ్వరరావు ఒకడూ బాగా గుర్తుంటాడు. సంగీత దర్శకుడు ఘంటసాల చాలమంచి పాటలు వినిపించారు. నిండుగా ఉత్సాహవంతంగా ఉన్నాయి. జాగీర్టార్‌ ఛాయాగ్రహణం విశేషించి (ప్రశంసించవలసిన అంశాలలో ఒకటి. సరదాగా “చాలా సేపు కాలక్షేపం చెయ్యడానికి సకుటుంబంగా వెళ్లి చూడదగిన చిత్రం. ఈ సినిమా బాగా అడింది

·          

·           . నిర్మాత సీతారాం తరువాతి ప్రయత్నంగా “బొబ్బిలియుద్ధం” అనే చారిత్రాత్మక చిత్రం తీసి తనే దర్శకత్వం వహించారు. జమునకు జోడీగా ముఖ్యపాత్ర ధరించారు.   

·         బొబ్బిలి యుద్ధం సినిమాను సి. సీతారామ్ నిర్మించి దర్శకత్వం వహించారు. ఎన్.టి.ఆర్, ఎస్వీఆర్, భానుమతి, రాజనాల, ఎమ్.ఆర్.రాధా, జమున మొదలైన తారాగణంతో భారీగా నిర్మితమైనది. శ్రీకర కరుణాలవాల, మురిపించే అందాలే వంటి హిట్ గీతాలున్నాయి. శ్రీశ్రీ పాటలు, ఎస్.రాజేశ్వరరావు సంగీతం సినిమా విలువను పెంచాయి

రెండు ప్రధాన రాజవంశాలు, బొబ్బిలి, విజయనగరం ఇరుగుపొరుగు సంస్థానాలు. విజయనగర ప్రభువు విజయరామరాజు (రాజనాల) భార్య చంద్రాయమ్మ (జయంతి) కుమారునితో కలిసి బొబ్బిలిరాజు (రంగారావు నాయుడు (ఎన్.టి.ఆర్) రాణిమల్లమాంబ (భానుమతి)ల కుమారుడు వెంకటరాయల పుట్టినరోజు వేడుకలకు బొబ్బిలి వస్తాడు. ఆనాడు జరిగిన కుస్తీ పోటీల్లో, కోడిపందేల్లో, బలప్రదర్శనలో విజయనగరం వారిపై, బొబ్బిలివారు సాధించిన విజయాలకు, అసూయపడతాడు. రామరాజు వారినేవిధంగానైనా అణగద్రొక్కాలని సమయంకోసం ఎదురుచూస్తుంటాడు. రాజాం ప్రభువు తాండ్రపాపారాయుడు (యస్.వి.రంగారావు) బొబ్బిలికి అండ. అతని చెల్లెలు సుభద్ర(జమున)కు, రంగారావు నాయుడు, తమ్ముడు వెంగళరాయుడు (సీతారాం)కు వివాహం నిశ్చయిస్తారు. ఈలోపు ఫ్రెంచి గవర్నరు తరఫున బుస్సీ (ముక్కామల) కప్పాలు కట్టవలసినదిగా తాఖీదులు పంపుతాడు. తామెవరికి సామంతులు కామని, కప్పాలు కట్టమని బొబ్బిలిరాజులు తిరస్కరిస్తారు. ఈ అవకాశం తీసికొని విజయరామరాజు, బుస్సీ అనుచరుడు హైదర్‌జంగ్ (ఎం.ఆర్.రాధ) సహాయంతో బుస్సీకీ బొబ్బిలిపై చాడీలుచెప్పి, ఆ కోటను జయించి తనకిస్తే మొత్తం పరగణాల మాన్యంతానే చెల్లిస్తానంటాడు. వెంగళరాయుడు పెళ్ళి జరిగిన వెంటనే, బుస్సీ బొబ్బిలిపై దాడికి సిద్ధపడతాడు. రాజాం వైపునుంచి వచ్చే సైన్యాన్ని అటకాయిస్తానని అక్కడ విడిదిచేస్తాడు తాండ్ర పాపారాయుడు. కాని అడవి మార్గం గుండా బొబ్బిలిని ఆక్రమిస్తారు బుస్సీ సైనికులు. యుద్ధంలో బొబ్బిలి వీరులెందరో రంగారావునాయుడుతో సహా వీరమరణం పొందుతారు. తాండ్ర పాపారాయుడు బొబ్బిలి వచ్చి, విజయరామరాజును బాకుతో గుండెల్లో పొడిచి, చంపి, తానూ, ఆత్మత్యాగం చేసుకుంటాడు. ఇరు రాజ్యాల కుమారులు స్నేహంగా సాగుతుండగా కథ ముగుస్తుంది. చివరలో భారతదేశానికి స్వాతంత్య్రం సిద్ధించటం. ఆ స్వాతంత్య్ర వేడుకలు చూపటంతో చిత్రం పూర్తవుతుంది.

ఇంకా ఈ చిత్రంలో నరసారాయుడుగా ధూళిపాళ, అడిదం సూరకవిగా, కె.వి.యస్.శర్మ, దుబాసీ లక్ష్మయ్యగా సి.యస్.ఆర్, మొరాసిందొరగా (ప్రభాకర్‌రెడ్డి) హర్కొరులుగా (రాజ్‌బాబు, డా.శివరామకృష్ణయ్య) వరహాలుగా పద్మనాభం, వెంకటలక్ష్మిగా బాలసరస్వతి, చారులుగా బాలకృష్ణ, గీతాంజలి, మల్లయోధునిగా నెల్లూరు కాంతారావు నటించారు. తగిర్చి హనుమంతురావు నిర్మాతగా, దొప్పలపూడి వీరయ్యచౌదరి దర్శకుడిగా ఈ చిత్రం టైటిల్స్ లో కనబడుతుంది. వీరు ఇద్దరూ కంకటపాలెం వాస్తవ్యులు . పెళ్ళిసందడి’, ‘రక్తసింధూరం’ చిత్రాలు నిర్మించిన రిపబ్లిక్ ప్రొడక్షన్స్‌వారు నిర్మించిన చారిత్రాత్మక చిత్రం ‘‘బొబ్బిలియుద్ధం’’. 1964లో విడుదలయింది. ఈ చిత్రానికి మాటలు- గబ్బిట వెంకట్రావు, పర్యవేక్షణ సముద్రాల సీనియర్, నృత్యం- వెంపటి సత్యం, పసుమర్తి వేణుగోపాల్, ఫొటోగ్రఫీ- కమల్‌ఘోష్, కూర్పు- కందస్వామి, సంగీతం- యస్.రాజేశ్వరరావు, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం, నిర్మాత- సీతారాం. పాటలు- శ్రీశ్రీ, సి.నా.రె, కొసరాజు, ఆరుద్ర, సముద్రాల జూ., గబ్బిట వెంకటరావు.
‘బొబ్బిలియుద్ధం’ చిత్రంలో నటీనటులందరూ అఖండులు కావటంతో, ఎంతో సమర్ధవంతంగా పరిపూర్ణంగా నటించి, తమ పాత్రలకు న్యాయం చేశారు. వెంగళరాయుడుగా ఉద్రిక్తతను, ఆవేశాన్ని, పరాక్రమాన్ని సమపాళ్ళలో సీతారాం, తమ్ముని ఆవేశాన్ని అడ్డుకట్టవేసే సోదరునిగా, ప్రజాసంక్షేమంకోరే ప్రభువుగా, పరాక్రమవంతునిగా సామ, దాన, ధీర గంభీరంగా ఎన్.టి.ఆర్. ఆయా సన్నివేశాలకు వన్నెతెచ్చారు. తాండ్ర పాపారాయునిగా, యస్.వి.ఆర్. మల్లయుద్ధంలోనూ, విజయరామరాజును సంహరించే సమయంలో, ‘నీ పేరాశకిదే నా బహుమతి, ఒక్కొక్క ప్రాణానికి ఒక్కొక్కపోటు’ అంటూ అతని గుండెలపై కూర్చొని బాకుతో పొడుస్తూ చెప్పే డైలాగులు, తన్నుతాను పొడుచుకున్నాక ‘‘మాతృభూమికోసం, ఈనాడు వీరులు కార్చిన రక్తబిందువులు ఏనాటికైనా విదేశీపాలన అంతానికి కారణం కాకపోవు’’ దర్శకునిగా సీతారాంకు, రచయితగా గబ్బిటవారికి నటునిగా ఎస్.వి.రంగారావును అభినందించాల్సిందే. మరో పాత్ర ధర్మరాయుడుగా (బాలయ్య) సంధికోసం బుస్సీవద్దకు వెళ్ళిన సన్నివేశం, వీరోచితంగా సంభాషణలు పల్కటంలో, సైన్యాన్ని ఎదిరించి, తిరిగివచ్చి వెంగళరాయునిచే ఎగతాళికి, దాంతో ఆవేశానికి గురైన పాత్రను నటనలో బాలయ్య ఎంతో సంయమనాన్ని, వీరాన్ని ప్రదర్శించటం, గుర్తుండిపోయేలా చిత్రీకరణ మరో విశేషం.
ఇక ఈ చిత్ర గీతాలు పెళ్ళికి సిద్ధంచేసిన వంటకాలు, రుచితో ఊహల్లోకి వెళ్ళిన రంగారావునాయుడు తమ తొలి రేయిని స్మరిస్తూ చిత్రీకరించబడిన గీతం, ఎన్.టి.ఆర్, భానుమతిల అభినయంతో మనసును ఊయల లూగిస్తుంది. ‘‘ఊయల లూగినదోయి మనసే తీయని ఊహల తీవెలపైనా’’ (భానుమతి- సి.నా.రె) జమున, చెలికత్తెలపై చిత్రీకరించబడిన గీతం ‘‘ముత్యాల చెమ్మచెక్కా, రతనాలా చెమ్మచెక్క’’ సాంప్రదాయపు ఆటతో, పొడుపుకథలతో రమ్యంగా సాగింది. (పి.సుశీల బృందం- ఆరుద్ర) భానుమతిపై చిత్రీకరించిన భక్తిగీతం- ‘‘శ్రీకరకరుణాలవాల వేణుగోపాలా’’ (భానుమతి- సముద్రాల జూ.) గీతాంజలిపై చిత్రీకరించిన నృత్య గీతం ‘‘ఏమయా రామయా ఇలా రావయా’’ (స్వర్ణలత- బి.వసంత. వి.సత్యారావు- రచన కొసరాజు) యల్.విజయలక్ష్మిపై చిత్రీకరించిన జావళి ‘‘నినుచేర మనసాయెలా’’ (పి.సుశీల- శ్రీశ్రీ) రాజనాలపై చిత్రీకరించిన పద్యం ‘‘పర వీర రాజన్య భయద ప్రతాపుడు ఆరంగరాయ’’ (మాధవపెద్ది- గబ్బిట) బుస్సీ, హైదరుజంగులన్ (మాధవపెద్ది- గబ్బిట) యస్.వి.ఆర్.పై ‘‘చెల్లిలా నీ అన్న జీవించి యుండగా (మాధవపెద్ది- ఆరుద్ర) కె.వి.యస్.శర్మపై పద్యం ‘‘రాజు కళింకమూర్తి రతిరాజు శరీర విహీనుడు’’ (మాధవపెద్ది- అడిదం సూరకవి) అందాల నటి జమునతో జంటగా సీతారాం నటించిన ఈ చిత్రంలో వారిపై చిత్రీకరించిన గీతాలు, ఎంతో ముచ్చటగా, పరవళ్ళుత్రొక్కే సంగీతంతో కూడిన గీతం ‘‘అందాల రాణివే, నీవెంత జాణవే’’(పి.సుశీల, ఘంటసాల) వారిద్దరిపై చిత్రీకరించిన తొలిరేయి గీతం ‘‘సొగసుకీల్జెడదానా’’ వజ్రాల వంటి పలువరుస దానా అని వర్ణన జమునకు సరిపోయేలా సాకీ వ్రాయటం పాట ‘‘మురిపించే అందాలే అవి ననే్న చెందాలే’ (ఘంటసాల, పి.సుశీల) ఈ రెండూ గీతాలు శ్రీశ్రీ వ్రాయటం ముదావహం. చిత్ర ప్రారంభంలో గోపాలకుడు నాగయ్యపై చిత్రీకరించిన గీతం ‘‘సిరినేలు రాయుడా, శ్రీమన్నారాయణ’’ (ఆరుద్ర రచన ఈ గీతాన్ని చిత్ర సంగీత దర్శకులు యస్.రాజేశ్వరరావు, నాగయ్యకు ప్లేబాక్ పాడడం ఎన్న దగినది). చిత్ర సంగీత, సాహిత్యాలు ఈనాటికీ శ్రోతలను అలరిస్తూనే వున్నాయి.

అందాల రాణివే, నీవెంత జాణవే కవ్వించి సిగ్గుచెంద నీకు న్యాయమా
ఏమయ్య రామయ్యా ఇలా రావయ్యా

·         మురిపించే అందాలే అవి నన్నే చెందాలె నాదానవు నీవేలే నీవాడను నేనేలే
మురిపించే అందాలే అవి నన్నే చెందాలె నాదానవు నీవేలే నీవాడను నేనేలే

·           సశేషం

·         మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -30-3-22-ఉయ్యూరు

Posted in సినిమా | Tagged | Leave a comment

మన మరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు-164

మన మరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు-164

· 164-రామోజీ కుడిభుజం,కీరవాణి,సుధా చంద్రన్ లను పరిచయం చేసిన –అట్లూరి రామారావు

· నిన్నటి తరం సినీ ప్రముఖుడు, ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ ‘ఉషా కిరణ్ మూవీస్’లో సినీ నిర్మాణ బాధ్యతలను దీర్ఘకాలం పర్యవేక్షించిన అనుభవజ్ఞుడు అట్లూరి రామారావు కన్ను మూశారు. ఆయన వయసు 90 సంవత్సరాలు. శుక్రవారం ఉదయం హైదరాబాద్‌లో తుది శ్వాస విడిచిన ఆయనకు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. పల్లె జీవితపు స్వచ్ఛతకూ, అచ్చతెలుగు తనానికీ నిదర్శనంగా తెల్లటి పంచె, లాల్చీలోనే ఎప్పుడూ కనిపించే అట్లూరి క్రమశిక్షణ, సమయపాలన, పద్ధతిగా కార్యనిర్వహణకు మారుపేరు.
1925 జూన్ 26న ఆయన జన్మించారు. పత్రికాధి పతి రామోజీరావుదీ, అట్లూరిదీ ఒకే ఊరు. కృష్ణాజిల్లా గుడివాడ దగ్గరలోని పెదపారుపూడికి చెందిన ఆయన, రామోజీ ‘మార్గ దర్శి’ ఆరంభించిన తొలి నాళ్ళ నుంచి వెంట నిలిచిన సన్నిహితుల్లో ఒకరు. ‘ఉషాకిరణ్ మూవీస్’ పేరిట చిత్ర నిర్మాణా నికి విస్తరించినప్పటి నుంచి ఆ వ్యవహారాల్లో కుడిభుజంలా వ్యవహరించారు. ఆ సంస్థలో జంధ్యాల ‘శ్రీవారికి ప్రేమలేఖ’ (1984) మొదలు ‘మయూరి’, ‘ప్రతిఘటన’ (’85), ‘మౌనపోరాటం’(’89), ‘అశ్వని’ (’91) లాంటి హిట్ చిత్రాలు అట్లూరి చిత్ర నిర్మాణ నిర్వహణలో తయారైనవే. పత్రికావార్త ఆధారంగా నర్తకి సుధాచంద్రన్‌ను అన్వేషించి ‘మయూరి’ లాంటివి తీయడంలో అట్లూరిది ప్రధానపాత్ర. సంగీత దర్శకుడు కీరవాణిని పరిచయం చేయడంలోనూ ఆయన పాత్ర.

నిజానికి, అట్లూరి చదువుకున్నది కేవలం 5వ తరగతి వరకే. అయితే, ఆ రోజుల్లోని హిందీ భాషా ప్రచార ఉద్యమం వేడితో హిందీ చదివారు. అప్పట్లో గాంధీ గారిని కలవడమే కాక, హిందీ ప్రచారానికి చేసిన కృషికి గాంధీ నుంచి ప్రశంసాపత్రం అందుకున్నారు. కొంతకాలం హిందీ అధ్యాపకత్వం కూడా చేశారు. ప్రజా నాట్యమండలి సభ్యుడూ, కమ్యూనిస్టు పార్టీ కార్యకర్త అయిన పెరుమాళ్ళుతో స్నేహం చేసి, రంగస్థలంపై స్త్రీ పాత్రలు పోషించేవారు. దక్షిణ భారత హిందీ ప్రచారసభ వారు హిందీలోకి అనువదించిన తెలుగు నాటకాల్లో నటించారు.
‘మాభూమి’ తదితర ప్రయోజనాత్మక నాటకాల్లో నటించారు. తరువాత కాలంలో రామోజీ పిలుపు మేరకు ఆయన సంస్థలో చేరి, తొలుత వివిధ పత్రికల ప్రచురణ చూసేవారు. సినీ నిర్మాణబాధ్యతలు చేపట్టాక అడపాదడపా కొన్ని చిత్రాల్లో చిన్న చిన్న పాత్రలు ధరిస్తూ, నటనాభిరుచిని కొనసాగించారు. బ్లాక్ అండ్ వైట్ యుగంలోనే ఎన్టీఆర్ ‘కలసి ఉంటే కలదు సుఖం’ చిత్రంలో సబ్‌రిజిస్ట్రార్ పాత్రలో ఆయన కనిపించారు.
‘ప్రతిఘటన’లో గాంధేయవాది పాత్రలో, ‘మౌనపోరాటం’లో హీరో తండ్రి పాత్రలో ఆదర్శవాదిగా తెరపై మెరిశారు. ఆ మధ్య హీరో వేణుతో వచ్చిన ‘సదా మీ సేవలో’నూ నటించారు. మీద పడుతున్న వయసు కారణంగా 2000ల నుంచి క్రమంగా కార్యకలాపాలు తగ్గించుకున్నారు. అట్లూరి 6-2-2015న 90వయేటమరణి౦చారు.

·

165-N.A.T.సంస్థ స్థాపకుడు ,శ్రీకృష్ణావతారం ,మహామంత్రి తిమ్మరుసు ,రఫీని తెలుగు కు పరిచయం చేసిన సినీ నిర్మాత –అట్లూరి పుండరీకాక్షయ్య

· అట్లూరి పుండరీకాక్షయ్య (ఆగష్టు 19, 1925 – ఫిబ్రవరి 2, 2012), తెలుగు సినిమా నిర్మాత, రచయిత, నటుడు. ఎన్.టి.ఆర్ తో కలిసఎన్.టిి “నేషనల్ ఆర్ట్ థియేటర్” స్థాపించి నాటకాలు వేసిన అనుభవం ఆయనకుంది. మహామంత్రి తిమ్మరుసు, శ్రీకృష్ణావతారం, భలేతమ్ముడు, మనుషుల్లో దేవుడు, ఆరాధన లాంటి విజయవంతమైన చిత్రాలు నిర్మించాడు. మహమ్మద్ రఫీని తెలుగు శ్రోతలకు దగ్గరైంది ఈయన సినిమాల ద్వారానే. కర్తవ్యం సినిమాలో విలన్ గా నటుడిగా తెరమీదకు వచ్చాడు.

·

బాల్యం
ఆయన కృష్ణా జిల్లా కైకలూరు దగ్గరున్న మెకాసా కలవపూడిలో ఆగస్టు 19, 1925లో పుట్టాడు. ఐదవ తరగతి వరకు అక్కడే చదివాడు. తరువాత వాళ్ళ తండ్రి బెజవాడకు మకాం మార్చడంతో నాన్నకు సహాయంగా ఉండాలని 8వ తరగతితో చదువు ఆపేశాడు. ప్రహ్లాద సినిమాలో మొట్టమొదటిసారిగా నటించాడు. తరువాత వాళ్ళ మామయ్య రైస్ మిల్లులో అకౌంట్లను చూసే పనిలో కుదురుకుని అప్పుడప్పుడు నాటకాలు వేస్తుండేవాడు. అక్కడే ఎన్.టి.ఆర్తో పరిచయం ఏర్పడింది. తరువాత రామారావు సినిమాల్లో వేషాల కోసం మద్రాసుకు వెళ్ళడంతో ఆయన తమ్ముడు త్రివిక్రమరావుతో కలిసి నేషనల్ ఆర్ట్స్ నిర్వహించేవాడు.

సినిమా పరిచయం
1951 లో రామారావు పిలుపు మేరకు మద్రాసుకు వెళ్ళాడు. అప్పటికే రామారావు నటుడిగా నిలదొక్కుకొని ఉన్నాడు. ఈయన్ను తీసుకెళ్ళి చక్రపాణికి అప్పగించాడు. అలా విజయా సంస్థలో వంద రూపాయల జీతంతో పనిలో చేరాడు. ఒక రోజు రామారావు వచ్చి తను ఒక కంపెనీ ప్రారంభిస్తున్నాననీ, అందుకు ఆయన్ను ప్రొడక్షన్ కంట్రోలర్ గా ఉండమని కోరాడు.

త్రివిక్రమ రావు నిర్మాతగా నేషనల్ ఆర్ట్స్ బ్యానర్ పై పిచ్చి పుల్లయ్య అనే సినిమా ప్రారంభించారు. అందులో పుండరీకాక్షయ్య ఒక పాట కూడా పాడారు. తరువాత వహీదా రెహమాన్ కథానాయికగా జయసింహ అనే సినిమా తీశారు. ఆ తర్వాత రేచుక్క పగటి చుక్క, పాండురంగ మహాత్యం, సీతారామకళ్యాణం మొదలైన సినిమాలకు ప్రొడక్షన్ కంట్రోలర్ గా పనిచేశాడు. సీతారామకళ్యాణం విడుదల సమయంలో అనారోగ్యం పాలయ్యాడు. అదే సమయంలో ఆయన చదివిన అప్పాజీ నవలను సినిమాగా తీయాలనుకున్నారు. అలా ప్రారంభమైందే మహామంత్రి తిమ్మరుసు. ఈ సినిమా గుమ్మడికి బాగా పేరు తెచ్చిన చిత్రం. దీనికి కేంద్ర ప్రభుత్వ నుండి రజత పతకం కూడా లభించింది.

నటుడిగా
కర్తవ్యం సినిమా కోసం బయటకు చూడ్డానికి సౌమ్యంగా కనిపిస్తూ లోపల విలనీ ఆలోచనలుండే ఒక పాత్రను పరుచూరి బ్రదర్స్తో రాయించారు మోహన గాంధీ. ఆ వేషం వేయాల్సిందిగా ఏ.యం.రత్నం పుండరీకాక్షయ్యను కోరాడు. ఆయన మొదట్లో ఒప్పుకోకున్నా, తరువాత బలవంతంగా ఒప్పించారు. తరువాత మామా కోడలు, శివయ్య, పోలీస్ బ్రదర్స్, బ్రహ్మ మొదలైన 20 తెలుగు, 5 కన్నడ సినిమాల్లో నటించాడు.

సినిమాని కమర్షియల్ గా తీసినా జనానికి సందేశం ఇవ్వాలన్నది ఆయన పాలసీ. అయితే రామారావుని అర్జునుడిగా, నాగేశ్వరరావును కృష్ణుడిగా పెట్టి నరనారాయణ అను శ్రీకృష్ణార్జునులు అనే సినిమా తీయాలని ఉన్నా అది కలగానే మిగిలిపోయింది.

మరణం
పుండరీకాక్షయ్య చెన్నై లోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ 2012, ఫిబ్రవరి 2 గురువారం నాడు ఉదయం ఆరు గంటలకు కన్నుమూసారు

సశేషం

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -30-3-22-ఉయ్యూరు

Posted in సినిమా | Tagged | Leave a comment

మన మరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు-162

  మన మరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు-162

·         162-ఊరుమ్మడి బతుకులు సినీ ఫేం –సత్యేంద్ర కుమార్

·         సత్యేంద్రకుమార్ తెలుగు చలనచిత్ర నటుడు. ఇతడిని ఎం.బాలయ్య అన్నాతమ్ముల కథ చిత్రం ద్వారా కథానాయకుడిగా పరిచయం చేశాడు. ఇతడు నటించిన తెలుగు సినిమాల పాక్షిక జాబితా:

క్ర.సంసినిమా పేరువిడుదల సంవత్సరందర్శకుడుసహ నటులు
1అన్నాతమ్ముల కథ1975డి.ఎస్.ప్రకాశరావుఎం.బాలయ్య,చంద్రమోహన్ప్రభరోజారమణి
2మొనగాడు1976టి. కృష్ణశోభన్ బాబు,రాజబాబుప్రభమంజులరోజారమణి
3ఈనాటి బంధం ఏనాటిదో1977కె.ఎస్.ఆర్.దాస్కృష్ణ,ఎం.బాలయ్యజయప్రదఫటాఫట్ జయలక్ష్మి
4ఊరుమ్మడి బ్రతుకులు1977బి.ఎస్.నారాయణరాళ్లపల్లిమాధవి
5చలిచీమలు1978దేవదాస్ కనకాలరాళ్లపల్లినూతన్ ప్రసాద్ఎస్.పి.శైలజ
6ప్రేమ పగ1978బి.వి.ప్రసాద్మురళీమోహన్లతసత్యనారాయణ
7తుఫాన్ మెయిల్1978కె.ఎస్.రెడ్డినరసింహ రాజుగిరిబాబు, మంజుల, విజయ్ కుమార్
8చిలిపి కృష్ణుడు1978బోయిన సుబ్బారావుఅక్కినేని నాగేశ్వరరావువాణిశ్రీగుమ్మడిరావు గోపాలరావు
9కాలాంతకులు1978కె.విశ్వనాథ్శోభన్ బాబు, జయసుధకాంచనకాంతారావు
10ఛాయ1979హనుమాన్ ప్రసాద్నూతన్ ప్రసాద్, రూపఅన్నపూర్ణపి.ఎల్.నారాయణ
11కలియుగ మహాభారతం1979హనుమాన్ ప్రసాద్మాదాల రంగారావు, నరసింహ రాజు, వంకాయలమాధవి

·         మన మరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు-163

·         163-‘’మా ‘’వ్యవస్థాపక సభ్యుడు ,సినీకార్మిక సంఘ కోశాధికారి ,372సినిమాల హాస్యనటుడు –సారధి

·         సారథి ప్రముఖ హస్యనటుడు. ఇతని పూర్తి పేరు కడలి జయసారథి.

జననం

ఇతడు పశ్చిమగోదావరి జిల్లాపెనుగొండలో వీరదాసు, మహాలక్ష్మి దంపతులకు జన్మించాడు.

రంగస్థల ప్రస్థానం

1945లో తొలిసారి మొదటిసారి శకుంతల నాటకంలో భరతుడిగా నటించాడు. ఆ తరువాత సుమారు 50 సంవత్సరాలు నాటకరంగానికి సేవచేశాడు. ఋష్యేంద్రమణిస్థానం నరసింహారావురేలంగి వెంకట్రామయ్యబి.పద్మనాభం వంటి గొప్ప నటులతో కలిసి నాటకాలలో నటించాడు.

సినిమారంగ ప్రస్థానం

ఇతడు 1960లో సీతారామ కళ్యాణంతో వెండితెరకు పరిచయమయ్యాడు. ఆ చిత్రంలో నలకూబరునిగా నటించాడు. అనేక సినిమాలలో హాస్యపాత్రలు పోషించి ప్రేక్షకుల మెప్పు పొందాడు. ఇతడు దాదాపు 372 తెలుగు సినిమాలలో నటించాడు. తెలుగు చిత్రపరిశ్రమను మద్రాసు నుండి హైదరాబాదుకు తరలించడంలో క్రియాశీలకంగా వ్యవహరించాడు. మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) వ్యవస్థాపక సభ్యుడు. ఆంధ్రప్రదేశ్ సినీకార్మికుల సంస్థకు వ్యవస్థాపక కోశాధికారిగా ఉన్నాడు[1].

కుటుంబం

ఇతనికి అనూరాధతో వివాహం జరిగింది. వీరికి ఉదయ్‌కిరణ్, ప్రశాంత్ అనే ఇద్దరు కుమారులున్నారు.

సినిమా రంగం

నందమూరి తారకరామారావు దర్శకత్వంలో వెలువడిన సీతారామ కళ్యాణం సినిమాలో నలకూబరునిగా తొలిసారి చలనచిత్రంలో నటించాడు. ఇతడు నటించిన తెలుగు సినిమాల పాక్షిక జాబితా:

1.    సీతారామ కళ్యాణం (1961) – నలకూబరుడు

2.    పరమానందయ్య శిష్యుల కథ (1966) – శిష్యుడు

3.    ఈ కాలపు పిల్లలు (1976)

4.    భక్త కన్నప్ప (1976)

5.    అత్తవారిల్లు (1977)

6.    అమరదీపం (1977)

7.    ఇంద్రధనుస్సు (1978)

8.    చిరంజీవి రాంబాబు

9.    జగన్మోహిని (1978)

10.  మన ఊరి పాండవులు (1978)

11.  సొమ్మొకడిది సోకొకడిది (1978)

12.  కోతల రాయుడు (1979)

13.  గంధర్వ కన్య (1979)

14.  దశ తిరిగింది (1979)

15.  అమ్మాయికి మొగుడు మామకు యముడు (1980)

16.  నాయకుడు – వినాయకుడు (1980)

17.  మదన మంజరి (1980)

18.  మామా అల్లుళ్ళ సవాల్ (1980)

19.  బాబులుగాడి దెబ్బ (1984)

20.  మెరుపు దాడి (1984) – అంజి

21.  ఆస్తులు అంతస్తులు (1988)

22.  మామా కోడలు

సారధి తాత గారు కడలి వీరయ్య గారు ఆంధ్రదేశం లో ప్రఖ్యాత హరి కధకులు .కొంచెం పొట్ట ఉండేది బొద్దుగా ఉండేవారు కానీ వేదికపైకి వస్తే హరికధ చెప్పటం లో వీరంగమే వేసేవారు శ్రావ్యమైన స్వరం .బహుశా హరికధలు స్వయంగా రాసేవారని గుర్తు .మా ఉయ్యూరు లో ధనుర్మాసంలో సుమారు 40ఏళ్ళక్రితం వీరయ్యగారు వచ్చి కధాగానం చేయటం నేను స్వయంగా చూశాను గొప్ప అనుభవం అది .అలాంటి ఆయన మనవడు సారధి హాస్యాన్ని ఎంచుకొని ,రామారావు తీసిన సీతారామకల్యాణం లో మొదటి సారిగా నలకూబరుడుగా నటించి మెప్పించాడు .సినిమాలు తగ్గాయో లేక ఆయనే దూరంగా ఉన్నదో తెలీదు కానీ ఆయన ఎక్కడున్నాడో అని ఈ టివి వారు తమ ‘’అన్వేషణ’’ప్రోగ్రాం లో ఆయన్ను భీమవరం లో వెతికి ఆయనను పట్టుకొని చక్కని ఇంటర్వ్యు చేశారు .అందులో తన నటజీవితాన్ని సారధి చక్కగా ఆవిష్కరించాడు ఇప్పుడే ఆ ఇంటర్వ్యు చూసి వివరాలు రాశాను .

  భక్తకన్నప్ప లో పూజారిగా నటించినట్లు గుర్తు .మరీ వెకిలి తనం లేని హాస్యం పండించాడు సారధి .తనకంటూ ఒక ప్రత్యేకత సృష్టించుకొన్నాడు .ఇంతకంటే వివరాలు దొరకలేదు .

  సశేషం

మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -29-3-22-ఉయ్యూరు

Posted in సినిమా | Leave a comment

మరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు-162

• మన మరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు-162
• 162-ఊరుమ్మడి బతుకులు సినీ ఫేం –సత్యేంద్ర కుమార్
• సత్యేంద్రకుమార్ తెలుగు చలనచిత్ర నటుడు. ఇతడిని ఎం.బాలయ్య అన్నాతమ్ముల కథ చిత్రం ద్వారా కథానాయకుడిగా పరిచయం చేశాడు. ఇతడు నటించిన తెలుగు సినిమాల పాక్షిక జాబితా:
క్ర.సం సినిమా పేరు విడుదల సంవత్సరం దర్శకుడు సహ నటులు
1 అన్నాతమ్ముల కథ
1975 డి.ఎస్.ప్రకాశరావు ఎం.బాలయ్య,చంద్రమోహన్, ప్రభ, రోజారమణి
2 మొనగాడు
1976 టి. కృష్ణ
శోభన్ బాబు,రాజబాబు, ప్రభ, మంజుల, రోజారమణి
3 ఈనాటి బంధం ఏనాటిదో
1977 కె.ఎస్.ఆర్.దాస్
కృష్ణ,ఎం.బాలయ్య, జయప్రద, ఫటాఫట్ జయలక్ష్మి
4 ఊరుమ్మడి బ్రతుకులు
1977 బి.ఎస్.నారాయణ
రాళ్లపల్లి, మాధవి
5 చలిచీమలు
1978 దేవదాస్ కనకాల
రాళ్లపల్లి, నూతన్ ప్రసాద్, ఎస్.పి.శైలజ
6 ప్రేమ పగ
1978 బి.వి.ప్రసాద్
మురళీమోహన్, లత, సత్యనారాయణ
7 తుఫాన్ మెయిల్
1978 కె.ఎస్.రెడ్డి నరసింహ రాజు, గిరిబాబు, మంజుల, విజయ్ కుమార్
8 చిలిపి కృష్ణుడు
1978 బోయిన సుబ్బారావు
అక్కినేని నాగేశ్వరరావు, వాణిశ్రీ, గుమ్మడి, రావు గోపాలరావు
9 కాలాంతకులు
1978 కె.విశ్వనాథ్
శోభన్ బాబు, జయసుధ, కాంచన, కాంతారావు
10 ఛాయ
1979 హనుమాన్ ప్రసాద్ నూతన్ ప్రసాద్, రూప, అన్నపూర్ణ, పి.ఎల్.నారాయణ
11 కలియుగ మహాభారతం
1979 హనుమాన్ ప్రసాద్ మాదాల రంగారావు, నరసింహ రాజు, వంకాయల, మాధవి

• మన మరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు-163
• 163-‘’మా ‘’వ్యవస్థాపక సభ్యుడు ,సినీకార్మిక సంఘ కోశాధికారి ,372సినిమాల హాస్యనటుడు –సారధి
• సారథి ప్రముఖ హస్యనటుడు. ఇతని పూర్తి పేరు కడలి జయసారథి.
జననం
ఇతడు పశ్చిమగోదావరి జిల్లా, పెనుగొండలో వీరదాసు, మహాలక్ష్మి దంపతులకు జన్మించాడు.
రంగస్థల ప్రస్థానం
1945లో తొలిసారి మొదటిసారి శకుంతల నాటకంలో భరతుడిగా నటించాడు. ఆ తరువాత సుమారు 50 సంవత్సరాలు నాటకరంగానికి సేవచేశాడు. ఋష్యేంద్రమణి, స్థానం నరసింహారావు, రేలంగి వెంకట్రామయ్య, బి.పద్మనాభం వంటి గొప్ప నటులతో కలిసి నాటకాలలో నటించాడు.
సినిమారంగ ప్రస్థానం
ఇతడు 1960లో సీతారామ కళ్యాణంతో వెండితెరకు పరిచయమయ్యాడు. ఆ చిత్రంలో నలకూబరునిగా నటించాడు. అనేక సినిమాలలో హాస్యపాత్రలు పోషించి ప్రేక్షకుల మెప్పు పొందాడు. ఇతడు దాదాపు 372 తెలుగు సినిమాలలో నటించాడు. తెలుగు చిత్రపరిశ్రమను మద్రాసు నుండి హైదరాబాదుకు తరలించడంలో క్రియాశీలకంగా వ్యవహరించాడు. మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) వ్యవస్థాపక సభ్యుడు. ఆంధ్రప్రదేశ్ సినీకార్మికుల సంస్థకు వ్యవస్థాపక కోశాధికారిగా ఉన్నాడు[1].
కుటుంబం
ఇతనికి అనూరాధతో వివాహం జరిగింది. వీరికి ఉదయ్‌కిరణ్, ప్రశాంత్ అనే ఇద్దరు కుమారులున్నారు.
సినిమా రంగం
నందమూరి తారకరామారావు దర్శకత్వంలో వెలువడిన సీతారామ కళ్యాణం సినిమాలో నలకూబరునిగా తొలిసారి చలనచిత్రంలో నటించాడు. ఇతడు నటించిన తెలుగు సినిమాల పాక్షిక జాబితా:
1. సీతారామ కళ్యాణం (1961) – నలకూబరుడు
2. పరమానందయ్య శిష్యుల కథ (1966) – శిష్యుడు
3. ఈ కాలపు పిల్లలు (1976)
4. భక్త కన్నప్ప (1976)
5. అత్తవారిల్లు (1977)
6. అమరదీపం (1977)
7. ఇంద్రధనుస్సు (1978)
8. చిరంజీవి రాంబాబు
9. జగన్మోహిని (1978)
10. మన ఊరి పాండవులు (1978)
11. సొమ్మొకడిది సోకొకడిది (1978)
12. కోతల రాయుడు (1979)
13. గంధర్వ కన్య (1979)
14. దశ తిరిగింది (1979)
15. అమ్మాయికి మొగుడు మామకు యముడు (1980)
16. నాయకుడు – వినాయకుడు (1980)
17. మదన మంజరి (1980)
18. మామా అల్లుళ్ళ సవాల్ (1980)
19. బాబులుగాడి దెబ్బ (1984)
20. మెరుపు దాడి (1984) – అంజి
21. ఆస్తులు అంతస్తులు (1988)
22. మామా కోడలు
సారధి తాత గారు కడలి వీరయ్య గారు ఆంధ్రదేశం లో ప్రఖ్యాత హరి కధకులు .కొంచెం పొట్ట ఉండేది బొద్దుగా ఉండేవారు కానీ వేదికపైకి వస్తే హరికధ చెప్పటం లో వీరంగమే వేసేవారు శ్రావ్యమైన స్వరం .బహుశా హరికధలు స్వయంగా రాసేవారని గుర్తు .మా ఉయ్యూరు లో ధనుర్మాసంలో సుమారు 40ఏళ్ళక్రితం వీరయ్యగారు వచ్చి కధాగానం చేయటం నేను స్వయంగా చూశాను గొప్ప అనుభవం అది .అలాంటి ఆయన మనవడు సారధి హాస్యాన్ని ఎంచుకొని ,రామారావు తీసిన సీతారామకల్యాణం లో మొదటి సారిగా నలకూబరుడుగా నటించి మెప్పించాడు .సినిమాలు తగ్గాయో లేక ఆయనే దూరంగా ఉన్నదో తెలీదు కానీ ఆయన ఎక్కడున్నాడో అని ఈ టివి వారు తమ ‘’అన్వేషణ’’ప్రోగ్రాం లో ఆయన్ను భీమవరం లో వెతికి ఆయనను పట్టుకొని చక్కని ఇంటర్వ్యు చేశారు .అందులో తన నటజీవితాన్ని సారధి చక్కగా ఆవిష్కరించాడు ఇప్పుడే ఆ ఇంటర్వ్యు చూసి వివరాలు రాశాను .
  భక్తకన్నప్ప లో పూజారిగా నటించినట్లు గుర్తు .మరీ వెకిలి తనం లేని హాస్యం పండించాడు సారధి .తనకంటూ ఒక ప్రత్యేకత సృష్టించుకొన్నాడు .ఇంతకంటే వివరాలు దొరకలేదు .
  సశేషం
మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -29-3-22-ఉయ్యూరు
•         



Posted in సినిమా | Tagged | Leave a comment

కుక్కుటేశ్వర శతకం

కుక్కుటేశ్వర శతకం

పిఠాపురం అనే పాదగయా క్షేత్రం లో వెలసిన శ్రీ కుక్కుటేశ్వరస్వామిపై శ్రీ వక్క లంక శ్రీనివాసు కవి శతకం రాశారు .స్వామి కోరి రాయించి అంకితమివ్వమని కలలో చెబితే కవిగారు నెరవేర్చారు ..’’కువలయానందకర శర్వ కుక్కుటేశ ‘’అనేదిమకుటం .స్వభాను సంవత్సర చైత్ర శుద్ధ శుద్ధ అష్టమి కి శతకం పూర్తీ చేసి అంకితమిచ్చాడు కవి .

 ‘’సుగతి నొప్పారు గౌతమీ సురవరతట-పులినస్థిత’’పాదగయ ‘’పుణ్యమూర్తి

వందనము శూలి ,,భక్తాళి  వశ వినోద – కువలయానందకర శర్వ కుక్కుటేశ’’అనేది రెండవ పద్యం .క్రోధ తిమిరం మన్నూ మిన్నూ కానకుండా చేస్తోంది శరణు ఇవ్వు .పిఠాపురం లో నువ్వున్నావని మర్చేపోయాను క్షమించు .సర్వం నీకే ఇస్తా .శరణు .దక్షిణకాశి పీఠికాపురం లో వెలిశావు.కాలం పరిగెత్తిపోతోంది  .మాత రాజేశ్వరి మహిమ తో నీ పాద సంసేవనమివ్వు .’’ప్రధమేశ ‘’అని మొక్కితే అన్నీ తీరుస్తావు .’’భక్తజన భాగధేయ –సుభాగ్య చరిత –పాపజనులను క్షమ జూచే భవనాశుడవు ‘’.పిత్రువనం లో పాదగయ లో నీ మూర్తి బహు సుకీర్తి ‘’అన్నాడు .

  శివరాత్రినాడు జరిగే కోటి శతవ్రత పూజ చూసి తరిస్తాను .’’బేసికన్నుల ప్రొడ హో భేషు నీదు –చరితం ‘’ఇంత అని ఎవరూ తెలుసుకోలేరు .’’పునుకుల పేరు వదిలి –రావోయి మాతోడి విందు గుడియ ‘’అని ఆహ్వానించాడు .’’ఆరుత రుద్రాక్ష జపమాల అగ్రమునను –యాగవాటిక ,పాణినియతుల యష్టి –లింగరూపము ‘’ఇవే నీ లీల .’’హే ప్రపన్నార్తి హరా శంభు హేకృపాళో-పాహిమాం భక్తజనపాల పాహి శర్వ ‘’అని వేడుకొన్నాడు .సూనృత వాక్యం ఘనం అది సువ్రత ఫలం .అదే పరం ఏదీనీకంటే వేరు కానేకాదు .’’సచ్చి దంబోధి హంసవై సాగరమున –నిరత కేళిని దేలెడి నీలకంఠ’’మాపాపాలుమాన్పు ..అష్టమూర్తి ,రుద్రా గుణ భద్ర శాంతంపు రూపసి నువ్వు ‘’సూర్య శశినేత్ర-నీ అగ్ని నేత్రం తెరిచి ఇబ్బంది పెట్టకు .’’శంకరా పాహిమాం ‘’అంటే పొంగిపోయి రక్షిస్తావు .

  ‘’పాదగయ లో స్నానం చేసి శైవ వైష్ణవులందరూ వరుత నరిగినా వైష్ణవులు ఎందుకో నిన్ను ఎరగరు ?’’చంద్రునకు నూలుపోగు ‘’చందంగా రచన సాగించి ‘’గీతాల రత్నహారం ‘’సమర్పించాను అన్నాడు భక్తిగా కవి .మాసశివరాత్రి సోమవారం ఉపవాసంతో నిన్ను కొలిచే భక్తులకు కొదవ ఏమీ ఉండదు ‘’అని భరోసా ఇచ్చాడు .’’కుక్కుటాకార మామక కూర్మి మనము –వేగ నీ యందచిగిరించి విరుయునట్లు –వరము దయచేసి ,నీలోక వసతి నిమ్ము –కువలయానందకర ,శర్వ కుక్కుటేశ ‘’అని 104గీతం పాడి చివరిదైన 108లో ‘’భక్తితో ఈ కుక్కుటేశ్వర శతకం పఠించే వానికి ‘’ఇచ్చెదవు గాతవీ విమలపథము-కువలయానందకర ,శర్వ కుక్కుటేశ ‘’అనే పద్యంతో శతకం పూర్తి చేశాడు కవి .కింద గద్య లో భ్రమరాంబికా రామలింగేశ్వర రత్న పుత్రుడు భారద్వాజస గోత్రుడు సుజన విదేయుడు  శ్రీ వక్కలంక శ్రీనివాసరాయ ప్రణీతం ‘’అన్నాడు .

  గీతపద్య శతకం ఆద్యంతం భక్తి రసప్రవాహంగా నడిచింది సరళపదాలు.పాదగయ క్షేత్ర వైభవం ,స్వామి కున్న అపార కారుణ్య దృష్టి అన్నీ కవితలలో పొంగిపారాయి .ఈ శతకం గురించి ,కవి గురించి మన చరిత్ర కారులు ఎక్కడా చెప్పినట్లు నాకు తెలియదు .పుస్తకం ఏసంవత్సరం లో ప్రచురి౦పబడి౦దీ, వెల వివరాలు కనిపించలేదు ముందు పేజీలు  లభ్యం కానందున .

  మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -28-3-22-ఉయ్యూరు      

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

మన మరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు-161

 మన మరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు-161

· 161-మూడేళ్ళు హీరో కృష్ణకు 30సినిమాలలో పాడిన సింహాసనం లో ,’’ఆకాశామలో ఒకతార’’ఫేం –రాజ్ సీతా రాం

· సూపర్ స్టార్ కృష్ణ హీరోగా దూసుకుపోతూ 250 వ సినిమా వైపుకి అడుగులు వేస్తున్నారు. అయన సంవత్సరానికి 12 సినిమాలు చేస్తూ బిజీగా ఉండేవారు. కృష్ణకు,గాయకుడు బాల సుబ్రహ్మణ్యంనకు ఒక విషయంలో తేడా వచ్చింది. కృష్ణ నా సినిమాలకు పాడవలసిన అవసరం లేదని అనడంతో బాలు కూడా సరే అన్నారు. కృష్ణ జేసు దాసుతో వరుస సినిమాలకు పాటలు పాడించుకుంటున్నారు. ఇది 1985 నాటి మాట. అప్పుడు కొత్త గాయకుడికి ఒక బంపర్ ఛాన్స్ దొరికింది. అతని పేరు రాజ్ సీతారాం. రాజ్ సీతారాంతో కృష్ణ దాదాపుగా 30 సినిమాలకు పాటలు పాడించుకున్నారు. ఇప్పుడు శంకర్ మహదేవన్,ఉదిత్ నారాయణ్ ఎలా అయితే వైవిధ్యాన్ని చూపేవారో,అప్పట్లో రాజ్ సీతారాం గొంతు కృష్ణకు బాగా సెట్ అయింది.

·

· రాజ్ సీతారాం కృష్ణకు 1985 నుంచి 88 వరకు అంటే మూడు సంవత్సరాలు పాడగా వాటిలో 14 సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి. సూర్య చంద్ర,బ్రహ్మాస్త్రం,సింహాసనం,ఖైదీ రుద్రయ్య,తండ్రి కొడుకుల ఛాలెంజ్,దొంగోడొచ్చాడు,ముద్దాయి వంటి సినిమాలకు పాడాడు. ఇక ఆ తర్వాత కృష్ణ సినిమాల్లో అయన పాడటం ఆపేసారు. ఎందుకంటే రాజ్ సీతారాంకి పాటలు పాడటం ఒక హాబీ మాత్రమే.

·

· కృష్ణ సినిమాలకు పాటలు పాడకముందే శోభన్ బాబు సినిమా జగన్ లో ఒక పాట పాడారు. ఆ తర్వాత రాజ్ సీతారాంకి పెద్దగా సపోర్ట్ లేకపోవటం,కృష్ణ సినిమాలకు బాల సుబ్రహ్మణ్యంతో పాడించటానికి రాయబారాలు సక్సెస్ అవ్వటంతో ఆ తర్వాత కృష్ణ సినిమాలకు బాల సుబ్రహ్మణ్యం పాడటం వరుసగా జరిగిపోయింది.

·

· 1990 పత్రికల్లో బాలుని ఎన్టీఆర్,ANR, శోభన్ బాబు తిరస్కరిస్తే కృష్ణ ఆదరించారని చెప్పుతారు. అయన వారి మధ్య గ్యాప్ పెరిగింది. ఇప్పటికి పల్లెలలో రాజ్ సీతారాం పాడిన సింహాసనం పాటలు వినిపిస్తూనే ఉంటాయి. అయితే రాజ్ సీతారాం ఏమి చేస్తున్నారనే సందేహం కలుగుతుందా? ఆ తర్వాత రాజ్ సీతారాం Rural Management లో డిగ్రీ చేసారు. గుజరాత్‌లో ఈ కోర్సు తర్వాత, శ్రీరామ్ వెంచర్స్ గ్రూప్‌లో కొన్నాళ్లు పని చేశాడు. ఆ తర్వాత వీడియోకాన్ గ్రూపులో కూడా పని చేశాడంటారు. ఐతే యూఎస్ లో ఐవా ఫార్మా పిటిఈ లిమిటెడ్ అనే పెద్ద కంపెనీకి వైస్ ప్రెసిడెంట్‌గా పదవి నిర్వహిస్తున్నాడు. న్యూ జెర్సీ ప్రిన్స్‌టన్ ఏరియాలోని ఈ సంస్థ ప్రధాన కార్యాలయం చెన్నైలో ఉంది. జెనెరిక్ ఫార్మాలో ఇది కూడా లీడింగ్ కంపెనీ. రెండేళ్ల క్రితమే ఈ సంస్థకు అమెరికా నుంచి 30 మిలియన్ డాలర్ల భారీ ఫండింగ్ సమకూరింది. ఇంత పెద్ద కంపెనీకి ఉపాధ్యక్షుడిగా పెద్ద బాధ్యతలు నిర్వహిస్తున్న రాజ్ సీతారాం జగ్గీ వాసుదేవ్ నిర్వహించే ఈషా ఫౌండేషన్‌లో వలంటీర్ గా కూడ పని చేశాడు. పర్యావరణ హితం కోరుతూ జరిగే కార్యక్రమాల్లో విరివిగా పాల్గొంటుంటాడు రాజ్ సీతారాం.

· · గుజరాత్ లో శ్రీరామ్ వెంచర్స్ లో కొంతకాలం పనిచేసారు. ఆ తర్వాత కొంతకాలం VIDEOCON లో కూడా పనిచేసారు. ఆ తర్వాత US వెళ్లి సెటిల్ అయ్యారు. రాజ్ సీతారాం US లో పెద్ద కంపెనీకి వైస్ ప్రెసిడెంట్ గా పనిచేస్తున్నారు.

· సశేషం

· మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -28-3-22-ఉయ్యూరు

· ఆకాశంలో ఒక తార-రచన వేటూరి -గానం రాజ్ సీతారం ,సంగీతం -బప్పిలహరి

ఆకాశంలో ఒక తార
నాకోసమొచ్చింది ఈ వేళ
ఆకాశంలో ఒక తార
నాకోసమొచ్చింది ఈ వేళ

ఇలలో ఒక చందమామ
ఒడిలో పొంగింది ప్రేమ
ఇలలో ఒక చందమామ
ఒడిలో పొంగింది ప్రేమ

తార జాబిలి కలవని నాడు
ఏ వెన్నెలా లేదులే

ఆకాశంలో ఒక తార
నాకోసమొచ్చింది ఈ వేళ

అనురాగం అందంగా మెరిసింది
నీ కళ్ళలోన అందుకో నా లేతవలపే
నీ ముద్దుముంగిళ్ళలోన

అనురాగం అందంగా మెరిసింది
నీ కళ్ళలోన అందుకో నా లేతవలపే
నీ ముద్దుముంగిళ్ళలోన

కదిలే నీ ప్రాణశిల్పం
మదిలో కర్పూరదీపం
కదిలే నీ ప్రాణశిల్పం
మదిలో కర్పూరదీపం

నింగి నేల కలిసినచోట
ఏ వెలుతురూ రాదులే

ఆకాశంలో ఒక తార
నాకోసమొచ్చింది ఈ వేళ

ఎన్నాళ్లో ఈ విరహం వెన్నెల్లో
ఒక మందారం
నీ నవ్వే మల్లెపూలై నిండాలి
దోసిళ్ళలోన

ఎన్నాళ్లో ఈ విరహం వెన్నెల్లో
ఒక మందారం
నీ నవ్వే మల్లెపూలై నిండాలి
దోసిళ్ళలోన

ఎన్నాళ్లో ఈ విరహం వెన్నెల్లో
ఒక మందారం
నీ నవ్వే మల్లెపూలై నిండాలి
దోసిళ్ళలోన

అలలై నా సోయగాలు పాడాలి
యుగయుగాలు
అలలై నా సోయగాలు పాడాలి
యుగయుగాలు

వాగు వంక కలవని నాడు
ఏ వెల్లువ రాదులే

ఆకాశంలో ఒక తార
నాకోసమొచ్చింది ఈ వేళ

కాలంతో ఈ బంధం
ఈడల్లె పెంచింది నన్ను
అల్లుకోనా నీతోడై నీ లేత కౌగిళ్ళలోన

కాలంతో ఈ బంధం
ఈడల్లె పెంచింది నన్ను
అల్లుకోనా నీతోడై నీ లేత కౌగిళ్ళలోన

నీవే నా రాచపదవి
నీవే నా ప్రణయరాణివి
నీవే నా రాచపదవి
నీవే నా ప్రణయరాణివి

నీవు నేను కలవకపోతే
ప్రేమన్నదే లేదులే

ఆకాశంలో ఒక తార
నాకోసమొచ్చింది ఈ వేళ
తార జాబిలి కలవని నాడు
ఏ వెన్నెలా లేదులే

Posted in సినిమా | Tagged | Leave a comment

మన మరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు-160

మన మరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు-160

· 160-టిజి వెంకటేష్ కుమారుడు ఎ ఆర్ రహ్మాన్ మేనల్లుడు ‘’,ప్రేమ కదాచిత్రం ఫేం ‘’నటుడు ,సంగీత దర్శకుడు –జివి ప్రకాష్

· జి. వి. ప్రకాష్ భారతీయ సంగీత దర్శకుడు, గాయకుడు, నటుడు. ఎక్కువగా తమిళ సినిమాలకు సంగీతాన్ని సమకూర్చాడు. 2010 సంవత్సరం మొదట్లో వెలుగులోకి వచ్చాడు.[1] తర్వాత ఇతను సినీ నిర్మాణం, నటనా రంగంలోకి ప్రవేశించాడు. ఇతను ప్రఖ్యాత సంగీత దర్శకుడు ఎ. ఆర్. రెహ్మాన్ కు మేనల్లుడు. ఇతని భార్య సైంధవి గాయని. ముందుగా రెహమాన్ దగ్గర పలుచిత్రాలకు సంగీత విభాగంలో పనిచేశాడు. కొద్ది రోజులు హ్యారిస్ జయరాజ్ దగ్గర కూడా శిష్యరికం చేసి తరువాత సొంతంగా సంగీత దర్శకత్వం వహించడం ప్రారంభించాడు.

వ్యక్తిగత జీవితం
ప్రకాష్ తల్లి దండ్రులు జి. వెంకటేష్, ఏ. ఆర్. రిహానా. తల్లి ఏ. ఆర్. రెహ్మాన్ కు అక్క.[2] తల్లి రెహనాకు సంగీతం అంటే ఆసక్తి ఉండటంతో ప్రకాష్ ను నాలుగు సంవత్సరాల వయసు నుంచే శాస్త్రీయ సంగీతం నేర్చుకోవడానికి పంపించేది. ఆరేళ్ళకి పియానో క్లాసులో చేరాడు. అదే సమయంలో మేనమామ రెహమాన్ ప్రకాష్ కు పాటలు నేర్పించి సినిమాల్లో పాడించాడు. ప్రకాష్ ఏడో తరగతిలో ఉండగా తల్లిదండ్రులు విడిపోయారు. పిల్లలు తండ్రి దగ్గరే ఉండిపోయారు. తల్లి మాత్రం ఒంటరిగా ఉంటూ గాయనిగా తన కెరీర్ ప్రారంభించింది.[3]

జూన్ 27, 2013 న ప్రకాష్ గాయని సైంధవిని చెన్నై లోని మేయర్ రామనాథన్ చెట్టియార్ హాల్ వేదికపై వివాహం చేసుకున్నాడు. సైంధవి, ప్రకాష్ చెట్టినాడ్ విద్యాశ్రమంలో కలిసి చదువుకున్నారు.[4]

కెరీర్
సంగీత రంగం
ప్రకాష్ మొదటి సారిగా తన మేనమామ ఎ. ఆర్. రెహమాన్ సంగీత దర్శకత్వంలో వచ్చిన శంకర్ సినిమా జెంటిల్మేన్ కి సౌండ్ ట్రాక్ విభాగంలో పనిచేశాడు. ఇంకా రెహమాన్ ఇతర ప్రాజెక్టుల్లో కూడా పనిచేశాడు.[5] తర్వాత కొద్ది రోజులు హ్యారిస్ జయరాజ్ తో కలిసి పనిచేశాడు. అన్నియన్ (తెలుగులో అపరిచితుడు), ఉన్నాళే ఉన్నాళే అనే రెండు సినిమాల్లో పాటలు పాడాడు.

ప్రకాష్ మొదటిసారిగా ఎస్. శంకర్ నిర్మాణ సారథ్యంలో, వసంత బాలన్ దర్శకత్వంలో వచ్చిన వేయిల్ అనే తమిళ సినిమాతో సంగీత దర్శకుడిగా మారాడు. తరువాత ఎ. ఎల్. విజయ్ దర్శకత్వంలో వచ్చిన మదరాస పట్టణం అనే సినిమాకు ఇతను కూర్చిన సంగీతం కూడా ఆకట్టుకున్నది. సెల్వరాఘవన్ దర్శకత్వంలో వచ్చిన మయాక్కం ఎన్న అనే సినిమా ధనుష్ హీరోగా ప్రకాష్ కి మూడో సినిమా. ఈ సినిమా సంగీతం కూడా విమర్శకుల ప్రశంసలందుకుంది.

సినీ నిర్మాణ ౦ ]
ప్రకాష్ 2013 లో జి. వి. ప్రకాష్ కుమార్ ప్రొడక్షన్స్ పేరుతో స్వంతంగా ఓ నిర్మాణ సంస్థను స్థాపించాడు. ఈ సంస్థ మొట్టమొదటి సినిమా, బాలు మహేంద్ర దగ్గర సహాయకుడుగా పనిచేసిన విక్రం సుకుమారన్ దర్శకత్వంలో వచ్చిన మాదా యానై కూట్టం.[6][7]

నటుడిగా
2012 లో దర్శకుడు మురుగదాస్ ఇతన్ని చూసి తన సినిమాలో నటించమని అడిగాడు. కానీ కొన్ని కారణాల వల్ల ఆ ప్రాజెక్టు ప్రారంభం కాలేదు. తరువాత ప్రకాష్ మూడు సినిమాల్లో నటించడానికి అంగీకరించాడు. ఆడుకాలం నరేన్ దగ్గర నటనలో శిక్షణ పొందాడు.[8] తెలుగులో వచ్చిన ప్రేమకథా చిత్రమ్ సినిమాకు రీమేక్ అయిన డార్లింగ్ సినిమాలో నటించాడు.

తెలుగులో అనువాదమై ఆయన సినిమాలు
· ఒరేయ్ బామ్మర్థి

· బ్యాచిలర్

పురస్కారాలు
· 2010: సంవత్సరపు ఉత్తమ గీతం పూకల్ పూక్కం తరుణం (మదరాస పట్టణం సినిమా)

· 2011: ఆడుకాలం తమిళ సినిమాకు ఫిల్మ్ ఫేర్ దక్షిణాది ఉత్తమ సంగీత దర్శకుడి పురస్కారం

సశేషం
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -28-3-22-ఉయ్యూరు

Posted in సినిమా | Tagged | Leave a comment

మన మరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు-159 · 159-ఆంద్రా దిలీప్ కుమార్ ,హీరో ,సహాయనటుడు నిర్మాత మట్టిలో మాణిక్యం బొమ్మా బొరుసా ఫేం,-చలం

· 159-ఆంద్రా దిలీప్ కుమార్ ,హీరో ,సహాయనటుడు నిర్మాత మట్టిలో మాణిక్యం బొమ్మా బొరుసా ఫేం,-చలం

· చలం ఒక తెలుగు సినిమా నటుడు, నిర్మాత.[1] 100కి పైగా చిత్రాల్లో కథానాయకుడిగా, హాస్యనటుడిగా, సహాయనటుడిగా నటించాడు. ఇతని అసలు పేరు కోరాడ సూర్యాచలం. ఆంధ్రా దిలీప్ కుమార్ అని ఆంధ్రలోకం అభిమానాన్ని అందుకున్నాడు. ఇతడు రమణకుమారిని వివాహం చేసుకున్న తరువాత తన పేరును రమణాచలం అని మార్చుకొన్నాడు. దాసి సినిమా ద్వారా చలనచిత్ర రంగ ప్రవేశం చేశాడు. హీరోగానే కాక, రెండవ కథానాయకునిగా, హాస్యనటునిగా, సహాయ నటునిగా, చిత్ర నిర్మాతగా రాణించాడు. నటి శారదను వివాహం చేసుకున్నారు. తరువాత విడిపోయారు. చివరికాలంలో దాసరి నారాయణరావు ఈయనను ప్రోత్సహించాడు.

కెరీర్
1952లో లక్ష్మీరాజ్యం నిర్మించిన దాసి చిత్రంలో రెండవ కథానాయకుడిగా సినీ రంగంలో ప్రవేశించాడు చలం. ఈ చిత్రం విజయం సాధించింది. అవకాశాలు రావడం మొదలు పెట్టాయి. అమర్ నాథ్ నిర్మించిన నా చెల్లెలు చిత్రంలో రెండో కథానాయకుడిగా నటించాడు. బబ్రువాహన చిత్రంలో ఎన్. టి. ఆర్, కాంతారావు, ఎస్. వరలక్ష్మి, రాజసులోచన వంటి నటులతో టైటిల్ రోల్ (బబ్రువాహనుడు) పోషించాడు. సారంగధర చిత్రంలో ఎన్. టి. ఆర్, భానుమతి, రంగారావు తో కలిసి నటించాడు.

చిత్ర సమాహారం
· శ్రీ షిరిడి సాయిబాబా మహత్యం (1986)

· అల్లుల్లు వస్తున్నారు (1984)

· ప్రాణం ఖరీదు (1978)

· లంబాడోల్ల రాందాసు (1978)

· అన్నదమ్ముల సవాల్ (1978)

· అమ్మ మనసు (1974)

· బొమ్మా బొరుసా (1971)

· మట్టిలో మాణిక్యం (1971)

· మారిన మనిషి (1970)

· సంబరాల రాంబాబు (1970)

· సత్తెకాలపు సత్తెయ్య (1969)

· పూలరంగడు (1967)

· ప్రైవేటు మాస్టారు (1967)

· నవరాత్రి (1966)

· ఆత్మ గౌరవం (1965)

· ప్రేమించి చూడు (1965)

· బభ్రువాహన (1964)

· డాక్టర్ చక్రవర్తి (1964)

· పరువు ప్రతిష్ట (1963)

· సిరి సంపదలు (1962)

· తండ్రులు కొడుకులు (1961)

· వాగ్దానం (1961)

· పెళ్ళి మీద పెళ్ళి (1959)

· పెళ్ళి సందడి (1959)

· సారంగధర (1957)

· సంతానం (1955)

· వదినగారి గాజులు (1955)

· తోడుదొంగలు (1954)

· జాతక ఫలం (1954)

· దాసి (1952)

· నా చెల్లెలు (1952)

· మరి మరో ప్రముఖ హాస్య నటుడు ‘చలం’. ఈయన సైతం, అగ్ర హీరోల పక్కన కామెడీ పాత్రలు ప్రతిభావంతంగా పోషించి, అందమైన హాస్య నటుడుగా పేరుతెచ్చుకోవడం జరిగింది. (ఆంధ్రా దిలీప్‌కుమార్‌గా పేరుంది చలానికి) విజయవంతమైన చిత్రాలలో ఉత్తమ హాస్యనటుడిగా పేరుపొందిన చలం స్వంత చిత్ర నిర్మాణంలో చాలా చక్కని కుటుంబ కథా చిత్రాలతోబాటు, మంచి సందేశాత్మక చిత్రాలుకూడా నిర్మించడం, నిర్మాతగా ఆయనలోని అభిరుచిని తెలియచేస్తుంది.
ఒక పక్క హాస్యరసాన్ని పోషిస్తూనే, అదే పాత్రలో ఉద్వేగభరిత దృశ్యాలలో కూడా ప్రతిభావంతంగా నటించడం చలంలోని విశేషత! ఆయన నిర్మాణంలో వచ్చిన చిత్రాలను పరిశీలిస్తే ఈ విషయం అర్ధమవుతుంది. అయితే, హాస్యనటుడిగా ఎంత ప్రసిద్ధుడయినా, ‘కథానాయకుడి’ తరగతిలోకి చేరిన నటుడు చలం అని చెప్పుకుంటే తప్పులేదు.

· సాంఘిక జానపద పౌరాణిక చిత్రాలలో నటించాడు నారద వేషం కూడా వేసిన గుర్తు .మట్టిలో మానిక్యంగా భానుమతి కి ఇష్టమైన వాడుగా అద్భుతంగా నటించాడు .జమునను ‘’అని ఆమె ను ‘’కోకమ్మా’’అని ఆరాధిస్తూ ఉపాధ్యాయ వృత్తికి గౌరవం కలిగించాడు బొమ్మా బొరుసు లో ఎస్వరలక్షమి అల్లుడుగా ,జట్కాబండి నడిపే వాడుగా పదునైన హాస్యం పండించాడు సవాల్పై సవాల్ విసిరి తనదే గెలుపు అనిపించుకొన్నాడు ‘’చల్ రే బేతా’’ చల్ ‘’పాటలో కిర్రెక్కించాడు .భలే రాముడు లో అక్కినేని తో పోటీ పది నటించాడు సీస్ ఆర్ చిన్నకోడుకుగా తమాషాలు చేశాడు .1959పెళ్లి సందడిలో మళ్ళీ సీస్ ఆర్ కొడుకుగా అందాలు ప్రేమ ఒలకబోసి రక్తి కట్టించాడు ‘’.బైటోబైటో పెళ్ళికోడకా ‘’పాటలో ఊపేశాడు .సారంగధర లో మంత్రి సుబుద్ధిగా మంచి నటన ప్రదర్శించాడు.మలుపులు తిరిగే జాతకఫలం సినిమాలో రంగారావు కొడుకుగా బాగా చేశాడు .సముద్రాల రచనా దర్శకత్వం చేసిన బభ్రువాహన లో రామారావు సరసన నటించాడు .పామర్తి వెంకటేశ్వరావు సంగీతం కూర్చాడు .సంబరాలరామ్బాబులో నటన,పాటలతో సంబరాలే చేశాడు .చిరకాలం గుర్తుండే పాటలున్నాయి ఇందులో .ఇలా వైవిధ్యపాత్రాలలో నటించి తనకంటూ ఒక ప్రత్యెక ముద్ర చూపిన అల్లరి నవ్వుల అమాయక హీరో గలగలమాటాడే చలం .

· సశేషం

· మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -28-3-22-ఉయ్యూరు

Posted in సినిమా | Tagged | Leave a comment

మన మరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు-158 · 158-టివి ,సినిమా రచయితా నటుడు దర్శకుడు ,విలక్షణ వాచక ఫేం –ఓం కార్

మన మరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు-158

·         158-టివి ,సినిమా రచయితా నటుడు దర్శకుడు ,విలక్షణ వాచక ఫేం –ఓం కార్

·         పరిటాల ఓంకార్ ప్రముఖ రచయిత, టీవీ నటుడు. విజయవాడ దగ్గరలోని పెనమలూరు గ్రామంలో జన్మించారు. రేడియోలో వార్తలు చదవడంతో మొదలుపెట్టి, తరువాత పత్రికలలో శీర్షికా రచయితగా, టీవీ ధారావాహికలకు రచయితగా, చలనచిత్ర నటుడిగా, టీవీ ధారావాహికలలో కూడా నటించాడు. ఒక చిత్రానికి దర్శకత్వం కూడా వహించాడు.

·         టీవీ ధారావాహికలకు రచయితగా, నటుడిగా ఓంకార్ విశేషమైన పేరు సంపాదించాడు. సమకాలీన రాజకీయ, సామాజిక అంశాలను తన సీరియళ్ళలో చొప్పించి, ప్రజాదరణ పొందాడు. నటుడిగా తన విలక్షణమైన వాచికంతో ఆకట్టుకున్నాడు.

·         ఓంకార్ పోలీసు భార్యపందిరిమంచం వంటి చిత్రాలలో నటించాడు. స్వాతి వారపత్రికలో ఓంకారం పేరుతో వారం వారం శీర్షిక నిర్వహిస్తూ ఉంటాడు. స్వాతిలో సినీ తారల పుకార్ల వార్తల విభాగం కూడా ఆయన నిర్వహించేవాడు. ఇతను వ్రాసిన ఆల్ ఇన్ వన్ బహుళ ప్రచారం పొందింది.

సినిమాలు

రచయితగా

·         అన్న తమ్ముడు (1990)

·         పోలీసు భార్య (1990)

నటుడిగా

మరణ౦]

జనవరి 72007 న ‘కార్డియాక్ అరెస్ట్ ‘ తో చనిపోయారు.

·         కొడుకు ,కార్తీక దీపం డాక్టర్ బాబు ఫేం పరిటాల నిరుపం మాటలలో

·         ఏ సీరియల్‌ చూసినా ఆ కథనంలో ఇమిడిపోయేలా అనిపిస్తారు. భిన్నమైన పాత్రలతో అలరిస్తున్నారు. ఒకేలాంటి పాత్రలు చేస్తూ ఉంటే బోర్‌ అనిపించవచ్చు. కానీభిన్నమైన పాత్రల వల్ల పనిని ఎంజాయ్‌ చేస్తున్నాను. వాటి వల్ల మనల్ని మనం నిరూపించుకోవచ్చు’ అంటున్నారు టీవీ నటుడు నిరుపమ్‌ పరిటాల. పుష్కరకాలంగా సీరియల్స్‌ ద్వారా ఆకట్టుకుంటున్న నిరుపమ్‌ ప్రస్తుతం కుంకుమపువ్వుకార్తీకదీపంప్రేమ సీరియల్స్‌ ద్వారా తెలుగు ప్రేక్షకుల అభిమానాన్ని  పొందుతున్నారు. తన గురించి సాక్షితో పంచుకున్న కబుర్లు ఇవి..

·         ‘చంద్రముఖి సీరియల్‌ నా జీవితంలో ఓ మైలు రాయి అని చెప్పవచ్చు. అది కెరియర్‌ పరంగానూ, జీవితంలో నిలదొక్కునేలా చేసింది. 2007లో మొదలైన ఈ సీరియల్‌ ద్వారా బుల్లితెరకు పరిచయం అయ్యాను.
నాన్న నో చెప్పారు.. మా నాన్న ఓంకార్‌ పరిటాల. ఆయన నటుడు, రచయిత. నేను ఈ ఫీల్డ్‌కి రావడం నాన్నకి ఏ మాత్రం ఇష్టం లేదు. చదువుకునేటప్పుడు కెరియర్‌ అంటూ పెద్ద ఆలోచనలేవీ లేవు. సినిమాల్లోకి రావాలని ఉండేది. కానీ, సోర్స్‌ అంటూ ఏమీ లేదు. నాన్న మాత్రం ‘ముందు చదువుకో, తర్వాత ట్రై చేయవచ్చు’ అనేవారు. మాది విజయవాడ. నాన్న నటుడు కావడంతో నా చదువు అంతా చెన్నైలోనే సాగింది. ఇంజినీరింగ్‌ తర్వాత ఎంబీయే చేశాను. నేను సినిమాల్లోకి రావాలనే ఆలోచనతో చెన్నై నుంచి హైదరాబాద్‌కి షిఫ్ట్‌ అవ్వాలనుకున్నాం.

·         ఆ సమయంలోనే నాన్న చనిపోయారు. ఆ టైమ్‌లో రెండు విషయాలు ఆలోచించాను. ఒకటి ఉద్యోగం, రెండు సినిమా ఇండస్ట్రీ. ఆ సమయంలోనే నాన్న స్నేహితుల ద్వారా నాకు సీరియల్‌ అవకాశం వచ్చింది. ఇంకేమీ ఆలోచించకుండా ఓకే చెప్పాను. మొదట్లో నాన్న పేరు నన్ను ఎదుటివారు గుర్తించే వరకే ఉపయోగపడింది. ఆ తర్వాత పనిని బట్టే విలువ ఏర్పడింది. చిన్నప్పటి నుంచి మా నాన్నగారిని చూస్తూ పెరిగాను. తను ఈ ఫీల్డ్‌ వద్దనడానికి కారణం ‘ఒకనాడు బాగుంటుంది, మరోసారి అంత బాగుండకపోవచ్చు’ అనే ఉద్దేశంతోనే. అన్నింటికీ సిద్ధపడే రంగంలోకి దిగాను. ఇక్కడ బిహేవియర్, డిసిప్లిన్, డెడికేషన్‌తో ఉంటేనే రాణించడం సాధ్యం. కొంతమంది వైఫల్యాలు చూసి పాఠాలు నేర్చుకున్నా

·         భిన్న పాత్రలు
‘కుంకుమపువ్వు’ సీరియల్‌ చేస్తున్న సమయంలో ‘కార్తీక దీపం’ సీరియల్‌ డిస్కషన్స్‌ జరిగాయి. ఆ సీరియల్‌ ప్రొడ్యూసర్‌తో అప్పటికే ‘మూగమనసులు’ సీరియల్‌ చేసున్నాను. ఆ తర్వాత కూడా ఆ టీమ్‌తో టచ్‌లో ఉండేవాడిని. కార్తీక దీపం హీరో వెతుకులాటలో నా సలహా అడిగితే ఒకరిద్దరి పేర్లు కూడా చెప్పాను. వాళ్లతో ఆడిషన్స్‌ చేసినా క్లియర్‌ అవ్వలేదు. దీంతో నన్నే చేయమన్నారు. అప్పటివరకు వాళ్ల మనసులో నేను ఉన్నాను అనే విషయం నాకు తెలియదు. ‘అత్తారింటికి దారేది’ సీరియల్‌లో విలన్‌ రోల్‌ చేశాను. జనాలకు ఎప్పుడూ ఒకేలా కనిపించకూడదు.. ‘ఇలాగ కూడా మెప్పించగలడు నిరుపమ్‌..’ అనుకోవాలి. ఆ  ఆలోచనతో ఒప్పుకున్న పాత్ర అది. అందరూ బాగుంది అన్నారు కానీ, కొంతమంది నెగిటివ్‌ రోల్‌ వద్దులెండి అని చెప్పేవారు.

·         రచయితగా!
‘నెక్ట్స్‌ నువ్వే’ అనే సినిమాకి స్క్రిప్ట్‌ రాశాను. ఇప్పుడలాంటివేమీ లేవు. ఒక సీరియల్‌కి పది రోజుల షూటింగ్‌ షెడ్యూల్‌ ఉంటుంది. డబ్బింగ్స్‌ కూడా ఉంటాయి. ప్రస్తుతం ఈ పనుల్లోనే ఉన్నాను. మా ఆవిడ మంజుల కూడా ఇదే ఫీల్డ్‌. చంద్రముఖి సీరియల్‌లో ఇద్దరం కలిసి చేశాం. ప్రేమిం చి, పెద్దల అంగీకారంతో పెళ్లి చేసుకున్నాం.

·         సర్దుబాట్లు
మంజుల కూడా సీరియల్‌ నటి కావడంతో ఇండస్ట్రీలో వర్క్‌ ఎలా ఉంటుందో తనకు బాగా తెలుసు. తన పని వేరు, నా పని వేరు. ఇద్దరం మెచ్యూర్డ్‌గా ఉంటాం. ఎప్పుడైనా చిన్న చిన్న వాదనలు వచ్చినా అర్థం చేసుకుంటాం. తనకోసం టీవీ షోస్‌లో కపుల్‌ డ్యాన్స్‌కి అవకాశం ఉంటే, ప్రాక్టీస్‌ చేసి మరీ ఆ ప్రోగ్రామ్‌లో పాల్గొన్నాను. టైమ్‌కి సంబంధించి. కంప్లైంట్స్‌ ఉంటాయి మా ఇద్దరికి. ఏదో విధంగా సర్దిచెప్పుకుంటాను.  

·         ప్రొడక్షన్‌వైపుగా అడుగు
చంద్రముఖి నుంచి కార్తీక దీపం వరకు గ్రోత్‌ పరంగా చూసుకుంటూ ‘జీ తెలుగు’లో ఇప్పుడు ‘ప్రేమ’ సీరియల్‌తో ప్రొడక్షన్‌ వైపుగానూ వెళ్లాను. అనుకోకుండా వచ్చిన బాధ్యత ఇది. ఇందులో లీడ్‌ రోల్‌ కూడా చేస్తున్నాను. అన్నీ ప్లాన్‌ ప్రకారం చేసుకుంటూ వెళితే ఏదీ మిస్‌ చేసుకోలేం. రోజు మొత్తం ఈ ఇండస్ట్రీకి సంబంధించిన ఆలోచనలు, షెడ్యూల్‌.. ఉంటుంది కాబట్టి అన్నీ సాఫీగా సాగిపోతున్నాయి.
– నిర్మలారెడ్డి

   సుమారు 30ఏళ్ళ క్రితం పునాదిపాడు హైస్కూల్ హెడ్ మాస్టర్ ,రిటైరైన సందర్భ౦గా  మమ్మల్ని ఆహ్వానిస్తే వెళ్లాను .అక్కడ మొదటి సారీ చివర సారీ ఓంకార్ ను చూశాను మాతో వేదికపై .చక్కగా మాట్లాడాడు ఎక్కడా భేషజం లేదు సరదాగా నవ్విస్తూ మాట్లాడాడు ఆసభలో శ్రీమతి ప్రమీలారాణి  ,శ్రీ కోసూరు ఆదినారాయణ మొదలైన నాతొ పాటు పని చేసిన హెడ్ మాస్టర్లు కూడా ఉన్నారు డిన్నర్ కూడా చేసిన జ్ఞాపకం .మంచి విలక్షణ డైలాగ్ డెలివరీ తో తనదైన ప్రత్యేకత నిలుపుకొన్న నటుడు దర్శకుడు రచయిత ఓంకార్ .

సశేషం

మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -27-3-22-ఉయ్యూరు

Posted in సినిమా | Tagged | Leave a comment

గోపబందుదాస్ -9(చివరిభాగం )

గోపబందుదాస్ -9(చివరిభాగం )
‘’దేశం యొక్క మూలస్వరూపాన్ని అంతా ఒరిస్సాలోనే చూశాను ‘’అన్నాడు ఆనాడు గాంధీ వచ్చి చూసి .సమాజ్ పత్రిక సంపాదకుడిగా తనబాధ్యత ఏమిటో గోపబందు తెలియజేశాడు .రచయితరాసిన్దంతా ప్రచురించటం సాధ్యంకాకపోవచ్చు .సందర్భోచితం సముచితమైనవాటినే ప్రచురించాలి .దాస్ పై వేసిన దావా వీగిపోయింది .భద్రతా డిపాజిట్ కింద రెండు వేలు కట్టమన్న నోటీస్ ఆయనకు అందలేదు మళ్ళీ అరెస్ట్ చేసిరెండేళ్ళు ఖైదు విధించారు .హరిహర దాస్ బాధ్యతలు తీసుకొన్నాడు .సహాయ నిరాకరణలో కోర్టులని బహిష్కరించి దాస్ తనవాదన వినిపించలేదు. ఎక్స్పార్టీ తీర్మానం తో శిక్ష పడింది .
జైలునుంచి రాగానే పత్రిక సంపాదకత్వం చేబట్టి ,పత్రిక పలుకుబడి సాహసం పెరగాయి ప్రజలలోకి బాగా చొచ్చుకుపోయింది .17-6-1928 గోపబందు చనిపోవటానికి ముందే పత్రిక దాని ఆస్తిపాస్తులు లాహోర్ లోని సర్వెంట్స్ ఆఫ్ దిపీపుల్స్ సొసైటీకి రాసేశాడు .పత్రికలాభాలు సొసైటీ వారు తీసుకోకుండా జాగ్రత్త చేశాడు .లాభాలన్నీ సామాజిక రాజకీయ విద్యావిశాయాలకే ఖర్చుపెట్టాలని నిబంధన విధించాడు .అందుకే సమాజ్ పత్రిక అంతగా ప్రవర్ధమానమైన దని అందరూ చెబుతారు .వార్తాపత్రికకు పర్యాయపదమే సమాజ్ పత్రిక అయింది .తాజావార్తలు రోజూ ప్రజలకు అందించాలని దిన సంచికను రెండు పైసలకు అందిస్తూ డబుల్ క్రౌన్ సైజ్ లో రెండు శీట్లతో 6-4-1930నుంచి ప్రచురించారు .ఆయన భాషా శైలి అనితరసాధ్యం అట్టడుగు వర్గాలకు వార్తా చేరాలన్నదే ఆయన తపన .ఒరియా సాహిత్యరంగం లో ఒక వినూత్న వరవడికి శ్రీకారంచుట్టినవాడు గోపబందు దాస్ .ఇప్పుడు వార్తాపత్రిక అయింది .స్వంతభవనం ఉంది .
కాంగ్రెస్ సభ్యుడుగాగోపబందు ‘’తిలక్ స్వరాజ్య నిధి ‘’వసూలు చేసి అప్పగించాడు .ఉత్కళస్వాతంత్ర సేవాదళ్ ఏర్పరచాడు .రాష్ట్రాలుతిరిగి కరువు నిధి వసూలు చేస్సి ప్రజలనుఆదుకొన్నాదు .పీడిత రైతాంగం ఆయన నాయకత్వం లో విజ్రుం భిన్చింది 144 సెక్షన్ జారీచేశారు .ఆయన ఎక్కడా మాట్లాడకూడదని ఆంక్ష విధించారు .ఏకారణమూ దొరక్క స్వచ్చంద దళం ఏర్పాటు చేసినందుకు కటక్ జిల్లా మేజిష్ట్రేట్ వారంట్ జారీచేస్తే ‘’ఇన్నాళ్ళకు మీరు వచ్చారన్నమాట .దీనికోసమే చూస్తున్నా ‘’అన్నాడు .భద్రక్ లో ఉత్తర్వులు ఉల్లంఘిన్చినదుకు అరెస్ట్ చేసి రెండున్నర ఏళ్ళు జైలు విధించారు .కటక్ జైల్లోపెట్టారు .పేపర్లన్నీ పోలీస్ చర్యలపై విరుచుకు పడ్డాయి .నిరంజన్ పట్నాయక్ ‘’కనికాలో స్వచ్చంద న్యాయ విచారణ జరగాలి ‘’అని కోరాడు మరోకేసుపెడితే దానితో ప్రజలముందు ముఖం చూపించలేమని వెంటనే ఉప సంహరించుకున్నది ప్రభుత్వం .దావా రద్దుకాగానే ఆయన్ను 24-1-1923న ఆయన్ను హజారీబాగ్ జైలు కు మార్చారు .ఆయనతోబాటు దేశం లో పేరుపొందిన జాతీయనాయకులు కూడా అక్కడ ఉన్నారు .సంస్కృత గంధాలను అధ్యయనం చేశాడు .మహాభారతం మహా భాగవతమనే రెండు గ్రంధాలు రాశాడు .జైలులో రాసినవాటిలో ‘’బందీర్ ఆత్మకధ ,ధర్మపాద ,గోమాహాత్మ్యం ,నాచికేతోపాఖ్యానం ,కారాగార కవిత ఉన్నాయి .ఖైదీలను వార్డెన్ లనూ సంస్కరించాడు గోపబందు .బుధవారం మౌనవ్రతం పాటించేవాడు .అది తర్వాత జీవితాంతం పాటించాడు .గాంధీకి సోమవారం మౌనవ్రతం .1924జూన్ 26న హజారీబాగ్ జైలు నుంచి విముక్తుడయ్యాడు .
ఒరిస్సా రాష్ట్ర రాజకీయ సభ కటక్ లో జరిగితే గోపబందు , ప్రఫుల్ల చంద్ర రాయ్ హాజవగా జనల సంతోషానికి పట్టపగ్గాలులేవు .ఆయన్ను పొగడ్తలలో ముంచేశారు .సత్యవాది విద్యాలయం ఆర్ధిక సంక్షోభం లో కూరుకుపోతే ,1926లో మూసేయ్యాల్సి వచ్చింది .దీనికి సి ఎఫ్ ఆండ్రూస్ ‘’మీరు ఎంత వ్యధకు గురయ్యారో అర్ధం చేసుకొన్నాను .ఒకజాతీయ విద్యాసంస్థ స్థితి ఇలా అయింది .శాంతినికేతన్ ,గుజరాత్ విద్యాపీఠ్ మాత్రమె మిగిలాయి ‘’అని ఉత్తరం రాశాడు .
1926ఏప్రిల్ లో గవర్నర్ పూరీవస్స్తే ,ఎమర్ మఠాధిపతి వెయ్యి రూపాయలతో విన్దుఇస్తెప్రజలకు నచ్చక దాన్ని క్షామనివారణకు ఇస్తే బాగుండేదని నిరసన తెలిపితే గోపబందు మాట్లాడకుండా ప్రభుత్వం ని షేధించింది .1924లో వరపు వల్ల క్షామం వస్తే గాంధీ వచ్చి చూశాడు .1925లో వరదలు వస్తేగాంధీ ఆదేశం పై ఆండ్రూస్ కుండపోతు వర్షంలో వచ్చి చూసి చలించి ‘’తీరని నష్టం ‘’అని ,మరోగ్రామం లో పశువులపాకలో మకాం చేసి కొద్దిగా రొట్టేమాత్రమే లభిస్తే తిన్నాడు గోపబందుతో .వెంటనే గాంధీకి పూర్తీ వివరాలతో లేఖ రాశాడు వెళ్ళిపోతూ గోపబంధుని ఆప్యాయంగా కౌగలించుకొని ‘’కష్టాల్లోని ప్రజలకు భగవంతుడు మేలు చేస్తాడు .మిమ్మల్ని భగవంతుడు ఆశీర్వది౦చు గాక ‘’అన్నాడు .
1927లో దేశం లోని తూర్పు పశ్చిమ ప్రాంతాలలో ఎన్నడూ రాని వరదలు వచ్చి అంతులేని నష్టం కలిగించాయి .రైల్వే ట్రాక్స్ కొట్టుకుపోయాయి .సత్యవాదిలో ఉన్న గోబందుకు టెలిగ్రాం ద్వారా వార్తా చేరింది .కదిలే స్థితిలేదు లింగరాజ్ మిశ్రా బృందాన్ని పంపాడు ,జాజ్ పూర్ భద్రక్ డివిజన్లు ప్రత్యక్షనరకం అనుభవించాయి .పదికోట్ల నష్టం అని అంచనా .లార్డ్ ఇర్విన్ రావాల్సి ఉంది ఆయనా రాలేకపోయాడు .కాంగ్రెస్ అత్యవసర సమావేశం జరిపి గోపబందుద్వారా ప్రజలకు ధైర్య౦ కలిగించమని కోరితే అలానే చేసి శాశ్వత వరదనివారణ జరపాలి అని కోరాడు .
గోపబందు అన్న నారాయణ దాస్ 22-11-1927 చనిపోయాడు .భరించలేకపోయాడు దాస్ .1926లో పూరీలో ‘’జగన్నాథ వితంతు ఆశ్రమం ‘’స్థాపించి సేవ చేస్తున్నాడు .1928ఏప్రిల్ లో ప్రజాసేక సమాజ్ వార్షిక సభ లాహోర్ లో జరుగుతుంటే గోపబందు ,లింగ రాజ్ కలిసి వెళ్లి 22చేరి ,తిరుగు ప్రయాణం లో గోపబందు కొంచెం అస్వస్తత కు గురైతే 29న హౌరా స్టేషన్ లో లింగరాజ్ ప్రధమ చికిత్స చేసి.సాక్షీ గోపాల్ తీసుకు వెళ్ళే ఆలోచనలో ఉంటె ,కాదు బాలాసూర్ లో దించితే వరదబాధితులకు ఊరట కలిగిస్తానని చెప్పాడు .తానూ వెంటుండి అన్నీ చూపించి 13ఉదయం సాక్షీ గోపాల్ చేరారు .టైఫాయిడ్ వచ్చి కోలుకోవటానికి 25రోజులుపట్టింది .
కలకత్తా కార్మికుల కోరికపై 1928జూన్ 2బయల్దేరగా హౌరాస్తేషన్ లో అపూర్వ స్వాగతం ఇచ్చారు .అన్ని సౌకర్యాలూన్న చోట బస ఏర్పాటు చేస్తామని అంటే వద్దని ఒరియాకార్మికులు ఉండే ప్రేమ చ౦ద్ బోరల్ వీధిలో వారితో ఉంటానన్నాడు .చిన్నగదులలో గదికి 15మంది ఉన్నదానిలో ఉన్నాడు .అక్కడ కార్మిక సంఘాన్ని పటిష్టం చేశాడు .జూన్ 11సత్యవాది వచ్చాడు .జూన్ 12న బార్డోలిసత్యాగ్రహం లో వల్లభాయ్ సాధించిన విజయోత్సవాన్ని పూరీలో ఘనంగా జరిపి పాల్గొని ప్రసంగించాలనుకోన్నాడుకానీ జ్వర తీవ్రత వలన వెళ్ళ లేకపోయాడు .నీరసించిన ఆయన్ను చూడాటానికి వందలాది జనం వచ్చారు .వాళ్ళను చూసి ఆయనకళ్ళు చెమ్మగిల్లాయి .డాక్టర్ వస్తే చలించిపోతే ‘’నేను నా జబ్బుకోసం బాధ పడటం లేదు నాలో కవి హృదయం ఉంది .ఒక పద్యపాదం’’ఈ జీవన సాగరం మీద ఎన్నాళ్ళు ఈ పడవ నడపగలను ?దీన్ని నువ్వే కాచుకో .నా గుండె జారిపోతోంది ‘’ జ్ఞాపకం వచ్చి౦ది . అన్నాడు ఆయన్ను అందరూ ఊరడించారు .
మరణ శయ్యమీద ఉన్నా గోపబందు దేశాన్ని మరవలేదు. సమాజ్ పత్రికకు ,మిత్రులకు వ్యాసాలూ లేఖకుడిని పెట్టుకొని రాస్తూనే ఉన్నాడు .జూన్ 16ఆరోగ్యం విషమిస్తే సివిల్ సర్జన్ ను పిలిపించారు .ఆయన లేవకుండా చూడాలని జాగ్రత్తలు చెప్పాడు బంధు మిత్రులకు టెలిగ్రాములు వెళ్ళాయి .నీలకంఠ దాస్ రాగా చేతులుపట్టుకొని ‘’నన్ను వదిలి వెళ్ళకు ‘’అన్నాడు .అర్ధరాత్రికి గుండె మరీ బలహీనమైనది .ఆయన చుట్టూ అభిమానులే ఉన్నారు .లింగరాజ్ ఆస్తులవిషయం ఏమైనా రాయాలా అని అడిగితె ఆయనతోకాగితాలు పెన్నూ తెప్పించి ఆయనకుఇంగ్లీష్ లోడిక్టేషన్ చెప్పి నాలుగు అరఠావుల కాగితాలపై విల్లు రాయించి అన్ని ఏర్పాట్లు చేశాడు .సాయంత్రం 5-30కు అందరితో ‘’మీరంతా భద్రంగా ఉండండి .నాకాలం సమీపించింది .నన్ను పోనివ్వండి ‘’అన్నాడు దుఖం మింగుకొంటూ అందరూ భజన చేశారు. వారితో గోపబందు గొంత కలిపాడు .1928జూన్ 17 దేశభక్త ,’’ఆధునిక ఉత్కళ పిత ‘’గోపబంద్ దాస్ మరణించాడు .పూరీ రధోత్సవానికి ముందు రోజు అది. దీన్ని ‘’నవయౌవన దర్శన్ ‘’అంటారు అంటే పూరీలోని ముగ్గురు దేవతామూర్తులు నవయవ్వన శోభ దర్శించే వేళ అన్నమాట .
ఇంతటి విశిష్ట మూర్తిని గురించి రాసే అదృష్టం నాకు దక్కింది .
ఆధారం –శ్రీ రామచంద్రదాస్ రచనకు డా ఆర్. ఎస్ .సుదర్శనం తెలుగు అనువాదం ‘’గోపబందు దాస్ ‘’పుస్తకం .
మీ –గబ్బిటదుర్గాప్రసాద్ -27-3-22-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

మన మరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు-156

మన మరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు-156

·         156-రచయితా నటుడు నిర్మాత సీరియల్స్ డాక్యుమెంటరీల నిర్మాత ,ప్ర్రాణం ఖరీదు ,కమలమ్మకమతం నవల ఫేం –సి.ఎస్.రావు

·         సి.ఎస్.రావు (డిసెంబరు 20 , 1935 – ఏప్రిల్ 142020) (చింతపెంట సత్యనారాయణరావు) రచయితనటుడు, నిర్మాత. ఆయన సుదీర్ఘ కథలు, స్టేజి నాటకాలు, రేడియో నాటకాలు, నవలలు, టి.వి. సీరియళ్ళు, డాక్యుమెంటరీలు, సినిమా వ్యాసాలను రాసాడు.[1]

జీవిత విషయాలు

రావు 1935డిసెంబరు 20న ఆంధ్రప్రదేశ్ లోని ద్రాక్షారామంలో జన్మించాడు. నటనలో శిక్షణ కూడా అందించాడు. కొంతకాలంపాటు అర్థశాస్త్ర ఉపన్యాసకులుగా పనిచేశాడు. చిక్కడపల్లి గీతాంజలి స్కూల్ కరెస్పాండెంట్ గా పనిచేశాడు. రావుకు సూర్యమణితో వివాహం జరిగింది. వీరికి ఒక కుమార్తె, ఇద్దరు కుమారులు.

సాహిత్యరంగం

1954లో అగ్నిపర్వతం నవల రాశాడు. 80 కథలు, 8 దృశ్య నాటికలు, 2 నాటికలు, 20 రేడియో నాటకాలు రాయడంతోపాటు 4 సినిమాలకు కథ, 8 సినిమాలకు మాటలు అందించాడు. బుల్లితెర నాటకాలు, 8 ధారావాహికలకు కథలు రాశాడు.[2]

సినిమారంగం

ఎన్టీఆర్ నటించిన సరదా రాముడుసింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో ‘సొమ్మొకడిది సోకొకడిది‘ చిత్రాల్లో రావు నటించాడు.

1.   ఊరుమ్మడి బతుకులు

2.   కమలమ్మ కమతం

3.   ప్రాణం ఖరీదు

4.   కుక్క కాటుకు చెప్పుదెబ్బ

5.   తరం మారింది.

6.   నాయకుడు వినాయకుడు

7.   మల్లె మొగ్గలు

8.   యజ్ఞం

9.   దీక్ష

10. సొమ్మొకడిది సోకొకడిది (నటించారు)

11. సరదా రాముడు (నటించారు)

12. మట్టి మనుషులు (నటించారు)

కార్యక్రమాలు

1.   యేగూటి చిలక ఆ గూటి పలుకు (ఒకే ఎపిసోడ్ కార్యక్రమం)

2.   రాజశేఖర చరిత్ర

3.   భతృహరి జన్మ వృత్తాంతము

4.   రాజి బుజ్జి

5.   జాతక కథలు

6.   విక్రమార్క విజయం (సంభాషణలు మాత్రం)

7.   కళాపూర్ణోదయం (హిందీ సీరియల్ – నేషనల్ నెట్ వర్క్)

8.   ఆంధ్ర ప్రదేశ్ లో దేవాలయాలు (హిందీ సీరియల్ – నేషనల్ నెట్ వర్క్)

9.   కర్పూర వసంత రాయలు

10. మ్యూసిక్ అండ్ డాన్స్ ఇన్ ఎ.ప్ (50 సంవత్సరాల స్వాతంత్ర్య సీరియళ్ళు)

11. విష్ణు శర్మ ఇంగ్లీషు చదువు (హైదరాబాదు దూరదర్శన్)

సీరియళ్ళు

1.   మీరు ఆలోచించండి

2.   శిఖర దర్శనం (ఒక ఎపిసోడ్)

3.   మిత్రలాభం

4.   వరుడు కావాలి (13 ఎపిసోడ్లు)

5.   డామిడ్ కథ అడ్డం తిరిగింది.

6.   దృష్టి

7.   గణపతి

8.   విద్య

9.   మళ్ళీ తెలవారింది (స్క్రీన్ ప్లే మాత్రమే)

టెలివిజన్ నాటకాలు

1.   క్రెడిట్ కార్డు

2.   తీర్పు (20 విషయాల సూత్రంతో కూడిన నాటకం)

3.   కామమ్మ మొగుడు

4.   ఓరుమ్మడి బతుకులు

5.   కళ్ళు తెరవండ్రా

6.   పెరఫెక్ట్ వైఫ్

7.   రాధా మాధవీయం

8.   సెల్ గోల

9.   లవ్ పాఠాలు

10. కొత్త దంపతులు

11. మీరెలా అంటే అలాగే

12. పుణ్యభూమి (డైలాగులు మాత్రమే)

స్టేజీ నాటకాలు

1.   మళ్ళీ ఎప్పుడొస్తారు [3]

2.   విష్ణుశర్మ ఇంగ్లీషు చదువు [4][5]

3.   ఆధునిక తెలుగు సాహిత్యంలో హాస్యం [4]

4.   ఊరుమ్మడి బతుకులు[6]

మరణం

రావు అనారోగ్యంతో 2020ఏప్రిల్ 14న హైదరాబాదు మెట్టుగూడ రైల్వే ఆసుపత్రిలో మరణించాడు.[7]

Posted in సినిమా | Tagged | Leave a comment

మన మరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు-157

· 157-చిత్రం ,ఘర్షణ సినీ గేయరచయిత –కులశేఖర్

· కులశేఖర్ ఒక సినీ పాటల రచయిత.[1] సుమారు 100 సినిమాలకు పైగా గీత రచన చేశాడు.[2] ముఖ్యంగా దర్శకుడు తేజ, సంగీత దర్శకుడు ఆర్. పి. పట్నాయక్ దగ్గర అనేక విజయవంతమైన చిత్రాలకు పాటలు రాశాడు. చిత్రం, 10 క్లాస్, ఘర్షణ మొదలైనవి అతను పాటలు రాసిన కొన్ని సినిమాలు.

వ్యక్తిగత జీవితం
కులశేఖర్ స్వస్థలం సింహాచలం. తండ్రి మహామహోపాధ్యాయ టి.పి. శ్రీరామచంద్రాచార్యులు, తల్లి శ్రీమతి రంగనాయకమ్మ. చిన్నప్పటి నుంచి కులశేఖర్ కు సంగీత సాహిత్యాల మీద ఆసక్తి ఉండేది. చదువుకుంటున్న రోజుల్లో పాటలు రాసి బహుమతులు పొందాడు. చదువు తర్వాత ఈటీవీ గ్రూపులో విలేకరిగా పనిచేసాడు.

సినిమా రంగం
సిరివెన్నెల సీతారామశాస్త్రి దగ్గర శిష్యరికం చేస్తూ సినీ గీతాల రచనలో మెలకువలు తెలుసుకున్నాడు. తర్వాత తేజ దర్శకత్వంలో రామోజీరావు ఉషాకిరణ్ మూవీస్ పతాకంపై నిర్మించిన చిత్రం సినిమాతో గేయ రచయితగా పరిచయం అయ్యాడు. ఈ సినిమాలో అన్ని పాటలు ఆయనే రాశాడు. తర్వాత ఆర్. పి. పట్నాయక్, తేజ లతో కలిసి అనేక సినిమాలకు పనిచేశాడు.

వివాదాలు
2013 అక్టోబరు 24 న కాకినాడలో ఒక శ్రీబాలాత్రిపుర సుందరి అమ్మవారి శఠగోపాన్ని దొంగిలించినందుకుగాను పోలీసులు అతన్ని అరెస్టుచేసి ఆరునెలలు జైలు శిక్ష విధించారు.[3][4] తర్వాత అతని కేసును విచారించిన పోలీసులు మానసిక స్థితి సరిగా లేదని తెలియజేశారు. తర్వాత వైద్యం కోసం రాజమండ్రికి తరలించారు.[1]

హైదరాబాదులో ఉన్న అతని స్నేహితులు ఇచ్చిన సమాచారం ప్రకారం సుమారు 2008 లో అతను మెదడుకు సంబంధించిన వ్యాధి బారిన పడి జ్ఞాపకశక్తిని కోల్పోయాడు. ఆర్. పి. పట్నాయక్ కూడా కొన్ని సంవత్సరాల క్రితం ఓమూడు నాలుగు రోజులు వెళ్ళి వస్తాననీ చెప్పాడనీ, అతను ఎక్కడికి వెళుతున్నాడో అతనికే తెలీదని చెప్పాడు. ఇంకా అతని ఎరిగున్న వారు అతని తండ్రి మరణం గురించి అతనికి జ్ఞాపకం ఉండకపోవచ్చని తెలిపారు. హైదరాబాదులో ఉన్న కులశేఖర్ కుటుంబ సభ్యులు కూడా అతని గురించి పెద్దగా పట్టించుకోవడం లేదని అతని ఆప్తమిత్రుడొకరు దక్కన్ క్రానికల్ విలేకరికి తెలియజేశాడు. కులశేఖర్ భార్య ఓ ప్రైవేటు సంస్థలో ఉద్యోగం చేస్తూ ఇద్దరు పిల్లలను పోషిస్తోంది.

వైజాగ్ లో అతని సోదరులు ఉన్నా వారు ఇతని గురించి పట్టించుకోలేదు. హైదరాబాదులో కూడా అతనికి అప్పులు ఉన్నాయని అందుకనే అతన్ని ఎవరూ పట్టించుకోవడం లేదని స్నేహితులు తెలియజేశారు. గీత రచయితగా బిజీగా ఉన్నప్పుడే ప్రేమలేఖ రాశా అనే సినిమాకు దర్శకత్వం వహించాడు. ఆ సినిమా విడుదలకు చాలా ఆలస్యం కావడం వల్ల కూడా అతని మానసికంగా కుంగిపోయాడు.[3]

మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -26-3-22-ఉయ్యూరు

Posted in సినిమా | Tagged | Leave a comment

గోపబందుదాస్ -8

గోపబందుదాస్ -8

గాంధీతో కలిసి

ప్రతిజిల్లాలో కాంగ్రెస్ కమిటీ ఏర్పాటు చేస్తూ ,..సమాజ్ ‘’వారపత్రిక స్థాపించి సమాచారం అందిస్తూ ,సహాయ నిరాకరణ ఉద్యమాన్ని  విస్తృతంగా ప్రచారం చేశాడు గోపబంధు దాస్ .ఠానా కేంద్రం నుంచి పైస్థాయి వరకు కమిటీలు ఏర్పడ్డాయి ప్రజోత్సాహం విపరీతంగా ఉంది .అప్పుడే ఖిలాఫత్ ఉద్యమం మొదలైంది .జలియన్ వాలాబాగ్ దారుణాలపై నిరసన దేశమంతా తీవ్రమైనాయి .రాష్ట్రం నలుమూలల నుంచి వాలంటీర్ లను సేకరించి సహాయ నిరాకరణ లో పాల్గోనేట్లు చేశాడు దాస్ .ఉత్కళ సమ్మేళనం కూడా పెద్ద ఎత్తున ముందుకు దూకింది .జాతీయభావం వెల్లివిరిసింది. స్కూళ్ళు కాలేజీలు వదిలి యువత కదిలి వచ్చింది .హరికృష్ణ మెహతాబ్ నవ కృష్ణ చౌదరి ,జదుమణిమంగరాజ్ వంటి నాయకులు దూసుకు వచ్చారు .లాయర్లు వృత్తివదిలి ఉద్యమం  లో చేరారు .డిప్యూటీ కలెక్టర్ గోపబందు చౌదరి రాజీనామా చేసి ఉద్యమం లో చేరాడు .ప్రతిజిల్లాలో ఆశ్రమాలు స్థాపించి ఆశయాలు బోధించారు .జత్సింగ్ పూర్ లో ‘’అలకాశ్రమం ‘’ఏర్పరచి ప్రాణ కృష్ణ పధియారీ ,గోప నవ చౌదరి లతో కలిసి గోపబందు ‘’ఉత్కలస్వరాజ్య శిక్షా పరిషత్ —అంటే జాతీయ విద్యా పరిషత్ నెలకొల్పి ,చదువు మానేసి ఉద్యమం లో చేరినవారికి పాఠశాలలు పెట్టి మానేసిన చదువు పూర్తీ చేయించారు .దీనికోసం సత్యవాది స్కూల్ ను జాతీయ పాఠశాలగా మార్చాడు దాస్ .

 ఒరిస్సాలో గాంధీ

 నాగపూర్ కాంగ్రెస్ లోనే గోపబందు మహాత్ముడిని ఒకసారి ఒరిస్సా పర్యటన చేయమని కోరగా 23-3-1921న కటక్ వచ్చాడు గాంధి .గోపబందుకు సాయం రాగానే ప్రభుత్వం బెదిరి పోయింది .ఖత్జూరీ నది ఇసుకతిన్నెలపై గాంధీ కి స్వాగతం పలుకుతూ ‘’ మీరు ఎదురు చూస్తున్న గాంధీ ఇక్కడికే వచ్చారు .బుద్ధుడు కబీర్ ,శంకర రామానుజులు ఈ పవిత్ర గడ్డను పావనం చేశారు .మూడు వందల ఏళ్ళక్రితం చైతన్య ప్రభువు ఈ పవిత్ర ఇసుకతిన్నేలమీదనే  ప్రజలకు ప్రేమ సందేశం పంచాడు .ఇవాళ మరొక మహనీయుడు రాజకీయ ప్రేమ సూత్రాన్ని బోధించటానికి వచ్చాడు .ఆయన సందేశం విని దానిప్రకారం నడుద్దాం ‘’అన్నాడు . గోపబందు వెంటరాగా గాంధీ పూరీకి పాద యాత్ర చేశాడు .దారిలో సత్యవాది స్కూల్ సందర్శించి ,అక్కడి ఉపాధ్యాయ విద్యార్ధులకు కర్తవ్య బోధ చేసి ,తర్వాత బహిరంగ సభలోనూ మాట్లాడి ఒకరోజు ఇక్కడ గడిపాడు .మర్నాడు పూరీ వెళ్లగా  గోపబందు వ్యంగ్యాత్మకంగా ‘’ఆపండి సోదరులారా మీ చప్పట్లు .శాంతికి భంగం కలుగుతుందని ప్రభుత్వం అనుకొన్నది .ఆహి౦స  మన మార్గం .ముప్పైకోట్ల భారతీయులు ఒక్కసారి చపట్లు మోగిస్తే ,లక్షమంది బ్రిటిష్ వాళ్ళు అదృశ్యమై పోతారు .ఈమహాత్ముని వ్యక్తిత్వం దక్షిణ అమెరికాలో లోకానికి బాగా తెలిసింది .ఆమహ నీయుడే కైరా జిల్లాలో క్షామబాదితులను ఆదుకోన్నది.ఇకపూరీ జిల్లాగురించి ప్రత్యేకంగా చెప్పాలా?.ఆయన మానవుడు కాదు పురుషోత్తముడు .దైవ దూత .క్షామ నివారణకు ఇంకా పూర్తీ స్థాయి చర్యలు జరగలేదు .మనగవర్నార్ సరిగ్గా స్పందించ లేక పోయారప్పుడు .ఇప్పుడు మనఃరుదయాలకు ఏలిక ఈ గవర్నర్ మహాత్మాగాంధీ ఎలా ప్రవర్తించారో మీకు తెలుసు .పూరీకి రాకుండానే క్షామం ఇక్కడ ఉన్నట్లు ప్రకటించారు.ధనం  వర్షంగా కురిసింది దేశం అన్ని ప్రాంతాలనుంచి .ఈ ధారాపాతం ముందు ప్రభుత్వం విదిల్చిన మెతుకులు కొట్టుకుపోయాయి .పూరీ జనం పునరుజ్జీవులయ్యారు .మనప్రాణదాత మన హృదయనేత ఇక్కడ సశరీరంగా మన ముందున్నారు .ఇక్కడ వందలాది జనం క్షామం తోచావటం నేను ప్రత్యక్షం గా చూసి చలించిపోయాను .మనుష్యుల్ని ఇలాచంపిన పాపం ప్రభుత్వానిదే .మనం మహాత్ముని అనుసరించి సహాయ నిరాకరణ లో పాల్గొ౦దా౦.మహాత్మా గాంధీ జీ !కస్టాలు భరిస్తున్నా ,మా ఒరిస్సా ప్రజలు సహాకనిరాకరణలో పని చేసి ముందున్నారు .కష్టాలను భరించే శక్తి మాకున్నది .బుద్ధుని పవిత్ర దంతం ,కబీరు సమాధి రామానుజమఠం,నానక్ దివ్యగీతాలు ఇక్కడే పూరీలో ఉన్నాయి .గంగాయమునలు లాగా హిందూ-ముస్లిం ఐక్యత కోరాడు సంత్ కబీర్ ‘’అని దిశా నిర్దేశం చేశాక, గాంధీ ప్రసంగించాడు .

  తర్వాత బరంపురం వెళ్ళారు .అది గంజం జిల్లాలో ఉన్నా ,మద్రాస్ ప్రెసిడెన్సి లో  భాగమైన ఒరియా మాట్లాడే జనం ఎక్కువగా ఉన్న ప్రాంతం .ప్రజలు గాంధీకి ఘనస్వాగతం పలికారు .గోపబందు ప్రభావం ఏమిటో మహాత్ముడికి తెలిసింది .ఈ ఒరిస్సా పర్యటన తర్వాతే గాంధీ ‘’ప్రతి ఒరియా మనిషి తిండికి ,గుడ్డకు నోచుకోనేదాకా నేను పూర్తి ధోవతి కట్టను ‘’  అని ప్రతిజ్ఞ చేశాడని చెప్పుకొంటారు .

   సమాజ్ పత్రిక

ఒరియాభాషలో గౌరీ శంకర రాయ్ ప్రారంభించిన ‘’ఉత్కళ దీపిక ‘’అనే పత్రిక ఉంది .కటక్ ప్రింటింగ్ వారు ముద్రించేవారు ఇదొక్కటే అప్పటి పత్రిక .ఒక పత్రిక ప్రారంభించమని శశిభూషణ్ రధ్ తో గోపబందు చెప్పాడు .ఆయన ‘’ఆశ’’ పత్రిక పెట్టాడు .గోపబందు పెట్టిన పేరే అది .గోపబందు సంపాదకత్వం లో 1919వరకు అది సాక్షీ గోపాల్ నుంచి వెలువడేది .ప్రచురణ బరంపురం నుంచి జరిగేది .

  ఒక వార పత్రిక అవసరమని గుర్తించి శాసనమండలి సభ్యుడిగా వచ్చిన జీతం లో 16వందలు  మిగిల్చి జాగ్రత్త చేసి ఒకసారి సాక్షీగోపాల్ వచ్చి గుడిలో పడుకొంటే ఎవరో దొంగిలించేశారు .నిరాశపడకుండా పత్రిక నడపాల్సిందే అనుకొన్నాడు .పూరీకి చెందిన సత్యవాది త్రిపాఠీపత్రికా రచయితా సత్యవాది స్కూల్ టీచర్ కూడా .సత్యవాది ప్రెస్ మొదటి మేనేజర్ .ఈయనకు డబ్బు ఇచ్చిపంపిస్తే చేతి ముద్రణా యంత్రాన్ని  కొని సాక్షీ గోపాల్ కు తెచ్చాడు .సత్యవాది స్కూల్ దగ్గర పూరి ఇంట్లో దాన్ని నెలకొల్పారు .దీనితో సత్యవాది పత్రిక ముద్రణ జరిగేది .

  సమాజ్ పత్రిక అవసరం ఏమిటో దాస్ వివరించాడు .ప్రజల ఆశయాలకు దర్పణం ఆ పత్రిక అన్నాడు .ప్రతి శనివారం వెలువడేది .గ్రామీణ ప్రజల బాగోగులు అందులో వచ్చేవి .ప్రభుత్వ విదానాలలోలోసుగులు ప్రజలకు తెలిసేవి .భాష సామాన్యులకు అందుబాటులో ఉండేది .నాలుగు పెజీలపత్రిక .రాధానాథ రధ్ ను సంపాదకుడిని చేశాడు .సహాయ సంపాదకుడు హరిహర రధ్.పత్రికపై ఏదో అభియోగం మోపి ఒకసారి గోపబంద్ ను నెలరోజులు జైలులో పెట్టారు .

  సశేషం

మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -26-3-22-ఉయ్యూరు  

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

గోపబందుదాస్ -7

గోపబందుదాస్ -7

ఉప్పు తయారీ

సముద్రతీర రాష్ట్రం ఒరిస్సాలో గంజాం ,పూరీ ,కటక్ ,బాలాసూర్ జిల్లాలు బంగాళాఖాతం అంచున ఉన్నాయి .ఈప్రాంతప్రజలు హాయిగా ఉప్పు తయారు చేసుకొనేవారు .ఈస్ట్ ఇండియా కంపెని అధికారం లోకి వచ్చాక ఎక్సైజ్ సుంకం విధించి ఉప్పు తయారీకి ప్రభుత్వ అనుమతి కావాల్సివచ్చి ఆప్రాంతజనుల దరిద్రానికి దారితీసింది .అందరు వాడే ఉప్పు ధర ఆకాశానికి ఎక్కి౦ది .ఇది గ్రహించిన గోపబందు నిబంధనలు లేకుండా ఉప్పు తయారీకి ప్రజలకు హక్కు ఇవ్వాలని ఆందోళన ప్రారంభించాడు .రేవులలో ఉప్పు అంతర్జాతీయ వస్తువు .చిల్కా సరస్సు ,పారీకుడ్ ద్వీపం ఉప్పు తయారీకి ప్రసిద్ధి .ఇక్కడ దుర్భిక్షకారణం ఉప్పు తయారీలో హక్కు కోల్పోవటమే .శాసనమండలి లో గోపబందు ప్రభుత్వ అధీనం నుంచి ఉప్పు తయారీ తప్పించాలని తీర్మానం ప్రవేశపెట్టాడు .అంకెల వివరాలతో స్పష్టంగా ఉన్న తీర్మానం అది .ఫలితంగా చిల్కాలో ఉప్పు పరిశ్రమ పునరుద్ధరిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది .ఒక జాయింట్ స్టాక్ కంపెని పెట్టటానికి ప్రభుత్వం సర్వే చేయించింది .దాసు చెప్పటంవలన లెఫ్టినెంట్ గవర్నర్ స్వయంగా వచ్చి చూశాడు .ఆయనకూడా హామీ ఇచ్చాడు .1918లో యుద్ధం ముగియగానే లివర్ పూల్ నుంచి ఉప్పు దిగుమతి మళ్ళీ మొదలైంది .అక్కడ ఉప్పు తయారీ లాభదాయకం కాదని సర్వే నివేదికలు చెప్పాయి .కానీ 1931లో గాంధీ –ఇర్విన్ ఒప్పందం ప్రకారం తీరప్రజలు ఉప్పు తయారు చేసి ,తలమీదమోసుకు పోగలిగినంత ఉప్పు ఇతర ప్రాంతాలకు తీసుకు వెళ్లిఅమ్ముకోవచ్చు అనే హక్కు లభించి గోపబందు ఆశయం నెరవేరింది .

విద్యా సమస్య

1921లోసత్యవాది హైస్కూల్ జాతీయ పాఠశాల గా మారి,దాస్ ఆశయాలకు విఘాతం కలిగి మూసేయాల్సి వచ్చింది .శాసనమండలి లో స్కూళ్ళకు భవనాలు ,పరికరాల విషయం లో నిబంధనలు సదలించమని తీర్మానంప్రవేశపెట్టి ,పూర్వ గురుకుల విధానం వివరింఛి సత్యవాది బడి విజిటర్స్ బుక్ లో సర్ ఎడ్వర్డ్ ‘’ఆరుబయలు విద్యావిదాన౦ ఆరోగ్యదాయకం .గాలి లేని భవనాలలో విద్య క్షయ వ్యాధి వ్యాప్తికి కారణం అవుతుంది ‘’అని రాసిన వాక్యాన్నీ జతచేశాడు

గోపబందు కృషి ఫలితంగా కటక్ రేవంషా కాలేజిలో ఎం ఎ ఇంగ్లిష్ బి ఎల్ క్లాసులు ప్రారంభమయ్యాయి .కటక్ లో ఇంజనీరింగ్ ,పూరీలో సంస్కృత కాలేజీ ఏర్పాటు చేయించాడు ,హైస్కూల్ కాలేజీ విద్యార్ధులకు పది శాతం ఉపకార వేతనం పొందేట్లు చేశాడు .ప్రతి ఏడాదీ ఒక విద్యార్ధిని ఒరిస్సా నుంచి ఎంపిక చేసి ఇండియన్ సివిల్ సర్వీస్ పరీక్షకు లండన్ పంపాలని గట్టిగా కోరాడు .పూరీలోసురక్షిత నీరు పంపులద్వారా సరఫరా చేయాలనీ ,సహకార సంఘాలు రాష్ట్రమంతా ఏర్పాటు చేయాలని పట్టుబట్టాడు .ఒరిస్సా జిల్లబోర్డ్ చైర్మన్ పదవి అనధికార వ్యక్తికే దక్కాలని కృషి చేసి సఫలీ కృతుడయ్యాడు .శాసనమండలిలో రాజకీయ పార్టీ సభ్యుడిగాకంటే స్వతంత్రుడుగా వ్యవహరించి ఆదర్శ ప్రాయుడయ్యాడు .సింగ్ భం డిప్యూటీ కమీషనర్ స్కాట్ ‘’మీ ప్రసంగాలు ఇంగ్లాండ్ ప్రధాని ఎజె బాల్ఫార్ ప్రసంగాలులాగా స్పూర్తి దాయకాలు .కాంగ్రెస్ సభ్యులుగా మీరు మా ప్రభుత్వానికి వ్యతిరేకులైనా,,యూరోపియన్ ఆఫీసర్లమైన మేము మీవంటి నిష్కళంక దేశభక్తులను గౌరవిస్తాము ‘’అని కీర్తించాడు .

మాన్స్ ఫర్డ్ సంస్కరణలు 1921లో అమలుకు వచ్చాయి .1920కలకత్తా కాంగ్రెస్ సభలలో చిత్తరంజన్ దాస్ అధ్యక్షతలో సహాయనిరాకరణ సమర్ధించింది .గోపబందు స్థానం లో మధుసూదనదాస్ శాసనమండలి సభ్యుడయ్యాడు .

ఉత్కళ సమ్మేళనమహాసభ

ఒరిస్సా నాయకుడిగా గోపబందు జాతీయనాయకులు ఎందరితోనో సన్నిహిత సంబంధాలు ఉండేవి .1919ఈద్గా లో జరిగిన ఉత్కళ సమ్మేళనం లో గోపబందు అధ్యక్షుడుగా ఎన్నికయ్యాడు .తన అధ్యక్షోపన్యాసం లో ‘’ఉత్కళ ఒరియాలకు భేదం లేదు .అందరికీ చెందింది .ఒరిస్సా లో ప్రవహించే నది మహానది .ఒరిస్సాను స్పృశించే సముద్రం మహోదధి .ఒరిస్సాలోని పర్వతం మహేంద్రం .ఒరిస్సాస్వామి జగన్నాధుడు .ఒరిస్సా స్మశానవాటిక ‘’స్వర్గద్వారం ‘’.వీటన్నిటిలో మహత్వం కనిపిస్తుంది .జాతి దృష్టిలో రాజుకు ,పనివాడికి తేడాలేదు .ఒరిస్సా గ్రామ ప్రాంతాలలో చావిళ్ళు కు ప్రత్యేకత ఉంది మత సంఘపర న్యాయస్థానాలు అవి .స్త్రీలే కుటుంబ సౌభాగ్యం .మాతృభాషలో విద్యాబోధన జరగాలి .ఒరియావారు ఎక్కడున్నా వ్యక్తిత్వం వదులుకోరాదు .దూకాలి లేదా చావాలి అదే మన ధ్యేయం ప్రతి యుగం లోనూ సాధుపురుషులుఒరిస్సాకు వచ్చారు ,’’ఇంతటి ప్రబోధాత్మక ప్రసంగం చేసినా ఉత్కళ సమ్మెలన మహాసభ కాంగ్రెస్ లో విలీనం కావటానికి ఒప్పుకోలేదు .మరో సభలో చంద్ర శేఖర బెహరా చేసినప్రయత్నమూ కలిసిరాలేదు .అయినా గోపబందు అధైర్య పడలేదు .

1920సెప్టెంబర్ లో కలకత్తా లో జరిగిన ప్రత్యెక కాంగ్రెస్ సభలకు గోపబందు హాజరై ,సహాయనిరాకరణ తీర్మాననినికి అనుకూలంగా వ్యవహరించి .ఇక్కడికి రావటానికి నాలుగు రోజులముందు పూరీలో తన అధ్యక్షతన జిల్లా కాంగ్రెస్ మావేశం ఏర్పాటు చేశాడు .డిసెంబర్ నాగపూర్ సమావేశానికీ వెళ్ళాడు .భాషాప్రయుక్త రాష్ట్రాలు ఏర్పడాలని గాంధీకి వివరించి చెప్పి ఒప్పించాడు .దీన్ని తీర్మానం గా చేయించి ఆమోదింపజేశాడు .ఒరిస్సాకు తిరిగివచ్చి ఒరిస్సా రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ ఏర్పరచాడు . సింగ్ భం జిల్లా కమిటి దీనికి అనుబంధమైంది .1920డిసెంబర్ 30 చక్రధరపూర్ సమావేశం జరిగింది .జాతీయ కాంగ్రెస్ ఆశయాలను సమర్ధించింది .భారత్ లో ఒరిస్సా ఎలా భాగమో ,భారత జాతీయతలో ఒరియా జాతీయత అంతర్భాగం అని గోపబందు వివరించాడు .ఉత్కళ సమ్మెలన సభను భారత జాతీయోద్యమలో ఒక అంగంగా చెయ్యటానికి శాయశక్తులా గోపబందు కృషి చేశాడు .అప్పటినుంచి కాంగ్రెస్ వాది అయ్యాడు .

సశేషం

మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -25-3-22-ఉయ్యూరు

గబ్బిట దుర్గా ప్రసాద్

Posted in పుస్తకాలు, రచనలు, సమీక్ష | Tagged | Leave a comment

· మన మరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు-155

· 155-స్వాతంత్ర్య సమరయోధుడు నటుడు నిర్మాత ,దర్శకుడు నలదమయంతి ఫేం – కెంప రాజ్ ఉర్స్

· మన మరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు-155

· 155-స్వాతంత్ర్య సమరయోధుడు నటుడు నిర్మాత ,దర్శకుడు నలదమయంతి ఫేం – కెంప రాజ్ ఉర్స్

· 5-2-1917పుట్టి 18-5-1982 మరణించిన కెంపరాజ్ ఉర్స్ స్వాతంత్ర్య సమరయోధుడు నటుడు నిర్మాత ,దర్శకుడు.కన్నడ చిత్ర నిర్మాత దర్శకుడు .1940-50మధ్యకాలం లో ఆయన సినిమాలు ప్రేక్షకులను విపరీతంగా అలరించాయి .కన్నడ రాజకుమార్ తెరంగేట్రం చేయటానికి ముందే కెంపరాజ్ హీరోగా స్థిరపడ్డాడు .ఈతనిపెద్దన్న దేవరాజ్ ఉర్స్ కర్నాటక ముఖ్యమంత్రి,,.

· మైసూర్లోని కలహళ్లి లో పుట్టిన రాజ్ క్లాస్ మేట్ ను పెళ్ళాడి ముగ్గురు కూతుళ్ళకు జన్మ నిచ్చాడు .డాక్టర్ అవాలనుకొన్న కెంప రాజ్ ,గాంధీ ప్రభావంతో స్వాతంత్ర్య ఉద్యమం లో పాల్గొని జైలుకు వెళ్ళాడు .కన్నడ నాటక యజమాని గుబ్బి వీరన్న నుకలిసిఆయన నాటకాలలో వేషాలు వేశాడు .గుబ్బి వీరన్న స్వంతకంపేని గుబ్బి ఫిలిమ్స్ లో కెంపరాజ్ ను తొలిసారి పరిచయం చేసి జీవన నాటక 1942లో తీశాడు .దీనిలో శాంతాహుబ్లికర్ ఎం వి రాజమ్మ కూడా నటించారు .1947లో కృష్ణలీలలు లో కంసుడుగా నటించి పెద్ద విజయం సాధించాడు రాజ్ .1951లో రాజవిక్రమ ఒకే ధియేటర్ లో 25వారాలు ఆడి ఇంకా గొప్ప పేరు తెచ్చింది .ఆతర్వాత కన్నడ తెలుగు తమిళసినిమాలు చాలా డైరెక్ట్ చేశాడు .అందులో నలదమయంతి ఒకటి .కర్నాటక ఫిలిం డెవలప్ మెంట్ బోర్డ్ చైర్మన్ అయ్యాడు .తన జీవితచరిత్ర ‘’అరవై ఏళ్ళు ‘’రాసి 1973ప్రచురించాడు . నలదమయంతి సినిమా 1957లో విడుదలైంది .కెంపరాజ్ నలుడు భానుమతి దమయంతి .నాగయ్య ముక్కామల రేలంగి బిగోపాలం ,జయలక్ష్మి ఇతర నటులు .సంగీతం బి గోపాలం .రచన సముద్రాల జూనియర్ .నేపధ్యగానం ఘంటసాల భానుమతి,మాధవపెద్ది పిఠాపురం వగైరా .కెంపరాజ్ దర్శకత్వం .

పాటలు

  1. అరుభూమపధంబు తరణిమీరిన భోగి వంటలవాడగుచు (పద్యం) – మాధవపెద్ది
  2. అదిరెన్ నా కుడికన్ను నా కుడి భుజంభు అత్యంత (పద్యం) – పి. భానుమతి
  3. అతివా దాపగనేల నన్ వలచి నీకత్యంత సంతాప దుస్ధితి (పద్యం ) – ఘంటసాల
  4. అకటకటా దినమ్మును శతాధికతైర్దికఅర్దిక కోటికిన్ (పద్యం ) – ఘంటసాల
  5. అరయరానీ హరీ మాయ ఎరుగనెవరీ తరమయా – ఘంటసాల
  6. ఇంతి మా దమయంతి శ్రీమంతమిపుడు సంతోషమే పార – ఎన్.ఎల్.గానసరస్వతి బృందం
  7. ఇంతగలమా అహో ఇంతగలమా ఓహో ఇంతగలమా చెంచలా లతికరుహా – బి.గోపాలం, టి.కనకం
  8. ఈ వంతతోనే అంతమయేనా రవ్వంతే శాంతి – పి.భానుమతి
  9. ఈ వనిలో దయమాలినను ఎడబాయెనిల మనసాయెనయా ఇటు – పి. భానుమతి
  10. ఈ పాదదాసి మననేరదు మీ పదముల ఎడబాసి స్వామి – పి. భానుమతి

11 ఓహొ మోహన మాననమా విహరించు విహగమై వినువీధుల – పి. భానుమతి

  1. కనులు కాయలు కాయ కాచేవు వనిలోన కనికారమే లేని నను తలంచి (పద్యం ) – ఘంటసాల
  2. కలహంసి పలికిన అమరసందేశమేదో అనురాగపు అలలేవొ చెలరేగే – పి.భానుమతి
  3. ఘోరంభైన దవాగ్నికీలకెరయై ఘోషించు (పద్యం) – నాగయ్య
  4. చెలియరో నీ జీవితేశుని వలచి గొనుకొను సమయమే తొలగి నిలువక – పి. లీల, ఎన్.ఎల్.గానసరస్వతి
  5. చిన్నా సింగన్నా కునుకే రాదన్నా నిన్నే నమ్ముకున్నా నన్ను చూడుమన్నా- జిక్కి
  6. జాలి చూపవదేలరా ఈ బాల తాళగలేదు జాలి చూపవదేలరా – ఎం. ఎల్. వసంతకుమారి
  7. జీవనమే ఈ నవ జీవనమే హాయిలే పూవులును తావివలే కూరిమి మనేవారి – ఘంటసాల, పి. భానుమతి
  8. తారకావళీ తమ గతుల్ తప్పుగాక పొడుచుగావుట సూర్యుడు పడమటి (పద్యం ) – ఘంటసాల
  9. దెబ్బమీద దెబ్బ కడు దబ్బున ఏయి సుబ్బి – పిఠాపురం, ఎ.పి. కోమల
  10. నిత్యనావిచ్చితామర నీరజాక్షి బిరబిరా దిగిరా (పద్యం) – పిఠాపురం
  11. ప్రభో హే ప్రభో దరికొని దహియించు దావాగ్నికీలల కాలక నిలుచునే (పద్యం) – ఘంటసాల
  12. భువనైకమాతా గైకొమ్ము నాదు తుది నమస్కారము (పద్యం) – పి.భానుమతి
  13. భళిరే కంటిన్‌కంటి సప్తజలధిప్రావేష్టితా (పద్యం) – మాధవపెద్ది
  14. విచిత్రమే విధి లీల బలీయము కలి విలాసము – ఘంటసాల బృందం
  15. వీడా ప్రభూ బాహుకుడనువాడను నలుకొలుచు చుండువాడను (పద్యం ) – ఘంటసాల
  16. వరుణాలయ నివాసి కరుణా (పద్యం ) – ఘంటసాల
  17. వరుణది దేవుల వరియింపనను నాటి వలపైన తలపోయవా వనితా (పద్యం ) – ఘంటసాల
  18. హే గోవిందా హే ముకుందా శ్రీ వైకుంఠా నివాస సనాతనా జీవనమాల భూషణా – బి. గోపాలం
  19. హే భవానీ దయామయీ ఈ అపూర్వరూప (పద్యం) – పి. భానుమతి
  20. హే అగ్నిదేవా అమేయా కృపాపూరా పంచభూతా (పద్యం ) – ఘంటసాల
  21. హే మహేంద్రా శశినాధా ప్రేమసామ్రాజ్యా త్రిజగధభినాధ (పద్యం ) – ఘంటసాల సశేషం

మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -25-3-22-ఉయ్యూరు

Posted in సినిమా | Tagged | Leave a comment

మన మరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు -154

మన మరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు -154

· 154-ప్రభు దేవా తండ్రి ,సహస్రాధిక చిత్ర డాన్స్ డైరెక్టర్ –సుందరం మాష్టర్

· సుందరం మాస్టర్ గా పేరుగాంచిన శంకర్ మాంతప్పన్ మల్లప్ప ఒక ప్రముఖ నృత్య దర్శకుడు, నటుడు. అన్ని దక్షిణ భారతీయ భాషల్లో సుమారు 1200కి పైగా సినిమాలకు నృత్య దర్శకత్వం వహించాడు. ఎన్. టి. ఆర్, ఎ. ఎన్. ఆర్, ఎం. జి. ఆర్ తరం నుంచి చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ వరకు అందరి కథానాయకులతో పనిచేసిన అనుభవం ఆయనకుంది.[1] ఈయన కుమారులు ప్రభుదేవా, రాజు సుందరం, నాగేంద్ర ప్రసాద్ కూడా నృత్యదర్శకులు, నటులే.

బాల్యం
సుందరం మాస్టర్ కు పెద్దలు పెట్టిన పేరు శంకర్ మాంతప్పన్ మల్లప్ప. ఆయన స్వస్థలం మైసూరు. తల్లిదండ్రులు సుందర అని పిలిచేవారు. నృత్య దర్శకుడైన తర్వాత అది సుందరం మాస్టర్ గా మారింది. రెండో తరగతి దాకా చదువుకున్నాడు.

వృత్తి
మొదటగా చెన్నైలోని వాహినీ స్టూడియోస్ లో ఉన్న చందమామ ప్రెస్ లో వీలరుగా చేరాడు. సినిమాల్లోకి రావలనే తపనతో డ్యాన్సు నేర్చుకోవడం కోసం ఒక గురువు దగ్గర చేరాడు. ఆయన ఉద్యోగం చేసే పక్కనే సినిమా చిత్రీకరణలు జరుగుతూ ఉండేవి. అప్పుడప్పుడూ అక్కడికి వెళుతూ డ్యాన్సర్ల బృందంలో ఒకడిగా ఎన్నికయ్యాడు. 1962 ప్రాంతంలో గ్రూపు డ్యాన్సులు బాగా తగ్గిపోవడంతో ఈయనకు అవకాశాలు బాగా తగ్గిపోయాయి. అదే సమయంలో భారత్ చైనా యుద్ధం జరుగుతోంది. మిలిటరీలో ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. దాంతో మిలిటరీకి వెళ్ళాలనుకున్నాడు. అందుకోసం ఎంపిక కూడా అయ్యాడు. కానీ ఆ తర్వాత మళ్ళీ అవకాశాలు రావడం ప్రారంభం కావడంతో సైన్యంలో చేరే ప్రయత్నాన్ని విరమించుకున్నాడు.

ప్రముఖ హాస్యనటుడు నగేష్ ఈయనను దర్శకుడు కె. బాలచందర్ కు పరిచయం చేశాడు. తర్వాత తంగప్ప అనే మాస్టర్ దగ్గర సహాయకుడిగా చేరాడు. తర్వాత ఎన్. టి. ఆర్, ఎ. ఎన్. ఆర్, ఎం. జి. ఆర్ లతో పరిచయం ఏర్పడింది.

చిన్న కుమారుడు ప్రసాద్ హీరోగా మనసంతా నువ్వే సినిమాను కన్నడలో నిర్మించాడు. తర్వాత సినీ నిర్మాణం జోలికి వెళ్ళలేదు.

జెమినీ గణేషన్ సావిత్రి నటించిన తమిళ చిత్రం కొంజుమ్ సొలంగై తో డ్యాన్స్ మాస్టర్ తంగప్పన్ వద్ద అసిస్టెంట్ డ్యాన్సర్ గా సుందరం మాస్టారు కెరీర్ ప్రారంభించారు. 2000 సంవత్సరం వరకు ఆయన యాక్టీవ్ గా సినిమాలకు కొరియోగ్రఫీని అందించారు. ప్రస్తుతం కొంత

కాలంగా విశ్రాంతి తీసుకుంటున్నారు

National Film Awards

· He Won the National Film Award for Best Choreography for his work In the movie Thiruda Thiruda in 1993.

Filmfare Awards South

· Filmfare Lifetime Achievement Award – South (1999)

Nandi Awards[6]

· Best Choreographer – Geethanjali (1989)

· Best Choreographer – Jagadeka Veerudu Athiloka Sundari (1990)

Vijay Awards

· Vijay Award for Contribution to Tamil Cinema in 2010.

సశేషం

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -25-3-22-ఉయ్యూరు

Posted in సినిమా | Tagged | Leave a comment

· మన మరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు -153

· మన మరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు -153

· 153-శరత్ బాబు ,రా.వి..శాస్త్రి లనుతెరకు పరిచయం చేసిన 75బహుభాషా చిత్ర నిర్మాత –అట్లూరి పూర్ణచంద్రరావు

· అట్లూరి పూర్ణచంద్రరావు తెలుగు, హిందీ చలనచిత్రాల నిర్మాత, కమ్యూనిస్టు నాయకుడు.[1]

జీవిత విశేషాలు
ఇతడు కృష్ణాజిల్లా, గుడివాడ మండలం, చౌటుపల్లి గ్రామంలో 1925వ సంవత్సరం ఏప్రిల్ 4న జన్మించాడు[2]. ఇతనికి చదువు అబ్బలేదు. ఎస్.ఎస్.సి ఫెయిల్ అయిన తర్వాత ఇంటి నుండి పారిపోయి విజయవాడలో ఒక కాంట్రాక్టర్ వద్ద మూడు నెలలు పనిచేశాడు. తర్వాత గుడివాడలోని గౌరీశంకర్ టాకీసులో ప్రొజెక్టర్ ఆపరేటింగ్ అసిస్టెంట్‌గా, బుకింగ్ క్లర్క్‌గా ఆరు నెలలు పనిచేశాడు. తర్వాత విజయవాడలోని నవయుగ ఫిలిం డిస్ట్రిబ్యూటర్స్ కంపెనీలో ఐదు సంవత్సరాలు పనిచేశాడు. అదే సంస్థ గుంతకల్లు బ్రాంచి మేనేజరుగా కొంతకాలం పనిచేశాడు. తర్వాత మద్రాసుకు వెళ్లి బి.విఠలాచార్య, పి.పుల్లయ్యల వద్ద సహాయ దర్శకుడిగా పనిచేశాడు. తర్వాత మిత్రుల సలహాతో ప్రొడక్షన్ రంగంలోకి ప్రవేశించాడు. సినిమాలలో ప్రొడక్షన్ అసిస్టెంటుగా నాలుగు సంవత్సరాలు పనిచేసి మెళకువలు నేర్చుకున్నాడు.

సినీ నిర్మాణ రంగంలో
ఇతడు 1964లో మొట్టమొదటగా అగ్గిమీద గుగ్గిలం చిత్రాన్ని ప్రారంభించాడు. నవభారత్ ఫిలింస్ బ్యానర్‌పై నిర్మించిన ఈ చిత్రానికి పి.ఎస్.ప్రకాశరావు 50వేలు పెట్టుబడి పెట్టాడు. ఈ చిత్రం ప్రారంభం నుండి చివరివరకు పూర్ణచంద్రరావు చూసుకున్నా నిర్మాతగా ఇతని పేరు మొదటి ఐదు సినిమాలలో వేసుకోలేదు. ఇతడు తెలుగులో 35 సినిమాలు, హిందీలో 18 సినిమాలు, తమిళంలో 13 సినిమాలు, కన్నడ, బెంగాలీ, ఒరియా, మరాఠీ భాషలలో రెండేసి చిత్రాలు, భోజ్‌పురిలో ఒక చిత్రం నిర్మించాడు.

శరత్ బాబును సినీ నటుడిగా పరిచయం చేశాడు. రాచకొండ విశ్వనాథ శాస్త్రిని సినీ సంభాషణల రచయితగా వెండితెరకు పరిచయం చేశాడు.[1]

సినిమాల జాబితా

  1. అగ్గిమీద గుగ్గిలం
  2. అపాయంలో ఉపాయం
  3. ఉక్కుపిడుగు
  4. గజదొంగ గంగన్న
  5. మాతృదేవత
  6. రైతు కుటుంబం
  7. రౌడీరాణి
  8. పాపం పసివాడు
  9. ప్రేమ పుస్తకం
  10. వెంకీ
  11. లోక్ పరలోక్ (హిందీ)
  12. మాంగ్ భరో సజనా (హిందీ)
  13. ఏక్ హీ భూల్ (హిందీ)
  14. అంధాకానూన్ (హిందీ)
  15. ఆఖరీరాస్తా (హిందీ)
  16. చాల్‌భాజ్ (హిందీ)
  17. దిల్ (తమిళ)
  18. యూత్ (తమిళ)
  19. ఇడియట్ (హిందీ)

మరణం
కొంతకాలం కాలేయ క్యాన్సర్ తో బాధపడుతూ 2017, అక్టోబరు 29 న హైదరాబాదులోని ఓ ఆసుపత్రిలో ప్రాణాలు విడిచాడు.[3] ఈయన భార్య మరుద్వతి. వీరికి ఇరువురు కుమారులు ఉన్నారు.

ప్రముఖ సినీ నిర్మాత, కమ్యూనిస్టు నాయకుడు అట్లూరి పూర్ణచంద్రరావు (92) కన్నుమూశారు. మేడ్చల్ జిల్లా కాప్రా మండలం కమలానగర్ లో తన నివాసంలో ఆయన తుదిశ్వాస విడిచారు. పూర్ణచంద్రరావు మృతిపై పలువురు సినీ ప్రముఖులు, కమ్యూనిస్టు నాయకులు సంతాపం తెలిపారు. కాగా, కృష్ణా జిల్లా చవుటపల్లి గ్రామంలో పూర్ణచంద్రరావు జన్మించారు.

పదో తరగతి తప్పడంతో మనస్తాపం చెందిన ఆయన ఆత్మహత్య చేసుకుందామని విజయవాడ కృష్ణానది వద్దకు వెళ్లారు. అయితే, ఆ తర్వాత మనసు మార్చుకుని, ఓ కాంట్రాక్టర్ వద్ద పనిలో చేరారు. ఆ తర్వాత నవయుగ డిస్ట్రిబ్యూటర్స్ లో రిప్రజంటేటివ్ గా చేరారు. ఈ క్రమంలో గుంతకల్లు నవయుగ బ్రాంచ్ మేనేజర్ స్థాయికి ఎదిగారు. ఇక్కడ మేనేజర్ గా పనిచేస్తున్న సమయంలోనే దర్శకుడు తాతినేని ప్రకాశరావు వద్ద సహాయకుడిగా పని చేసేందుకు మద్రాసు వెళ్లారు.

ఈ క్రమంలో దర్శకులు విఠలాచార్య, పి. పుల్లయ్య దగ్గర పనిచేశారు. ‘దేవదాసు’ నిర్మాత డిఎల్ నారాయణ, ఎస్. భావనారాయణల ప్రోత్సాహంతో ప్రొడక్షన్ రంగంలోకి దిగారు. విజయవాడ నవభారత్ బుక్ హౌస్ ప్రకాశరావుని భాగస్వామిగా చేసుకుని ‘అగ్గిమీద గుగ్గిలం’ సినిమాకు ఆయన నిర్మాతగా అవతారమెత్తారు. ఆ తర్వాత ‘ఉక్కుపిడుగు’, ‘రౌడీరాణి’, ‘పాపం పసినవాడు’, ‘యమగోల’ వంటి చిత్రాలకు నిర్మాతగా వ్యవహరించారు. కేవలం, తెలుగులోనే కాకుండా ఇతర భాషాచిత్రాలకు కూడా ఆయన నిర్మాతగా వ్యవహరించారు.

సశేషం

మీ –గబ్బిట దుర్గాప్రసాద్-24-3-22-ఉయ్యూరు

Posted in సినిమా | Tagged | Leave a comment

గోపబందుదాస్ -6

గోపబందుదాస్ -6
సత్యవాది విద్యావిధానం లో సీనియర్ విద్యార్ధులకు శిక్షణ నిచ్చి జూనియర్ లకు సంస్కృతం నేర్పించేవారు .అందరు కలిసి పంక్తి భోజనం చేసేవారు .నీలకంఠ సార్ మీసం పెంచాడు చాన్దసానికి  వ్యతిరేకంగా ,విరుద్ధంగా .ఆయన్ని బ్రాహ్మణ్యం బహిష్కరిస్తే ‘’నా మీసం ‘’వ్యాసం రాసి ఉత్కళ సాహిత్య పత్రికలో ప్రచురించాడు .దాన్ని ఒరిస్సా భక్తకవి శ్రేష్టుడు రాయ్ బహదూర్ మెచ్చాడు .గోదావరీస్ ,హరిహరలు కూడా మీసాలు పెంచారు .వసతి గృహం లో మాదక ద్రవ్యాల వాడకం నిషిద్ధం .పాచికలు ,పేకాట ,పందెం ఒడ్డే ఆటలూ నిషిద్ధం .విద్యార్ధి లైన్గికప్రవర్తనలో దారితప్పితే ఒంటరిగా ఒక మట్టిగుడిసె లో ఉంచి ,ఒకపూట మాత్రమె తిండి పెట్టేవారు .ఆసమయం లో బ్రహ్మ చర్య నియమాలు బోధించేవారు .అతనిలోమార్పురాగానే మళ్ళీ అందరిలో కలిపేవారు .అల్లరి విద్యార్ధి మానిటర్ అయ్యేవాడు .మానిటర్లు స్నేహితులమీద పితూరీలు చెబితే ‘’మాడల్స్ ‘’అని పిలిపించి నిరసన తెలియ జేసేవారు .
‘’ అఖిరాస్’’ అనే శారీరక వ్యాయామం విద్యార్ధులకు నేర్పించేవారు .వాసుదేవ మహాపాత్రో దీనికి అధిపతి .క్రీడలు ,పరుగుపందాలు నేర్పారు .దినవారీ కార్యక్రమం పూర్తవగానే వ్యాయామం ఉండేది .చక్కని టైం టేబుల్ తో ఆసక్తికర విద్యాబోధన జరిపేవారు .భోజన సమయం లో రెండుగ్రూపులు ఏర్పరచి వారితో వడ్డన చేయించేవారు .తెల్లవారుజామునే అందరూ లేవాలి .ఒకేఒక పైసా విలువగల ప్రార్ధన పుస్తకం విద్యార్ధులందరి చేతా ఉండేట్లు చేసేవారు .ఇలాంటి క్రమశిక్షణలో విద్య నేర్చిన వారంతా ఆతర్వాత జీవితాలలో అత్యున్నతస్థాయి పదవులు పొందారు .
   శాసనమండలి సభ్యుడు
1912లో ఒరిస్సా-బీహార్ లను లెఫ్ట్ నెంట్ గవర్నర్ ఒక ప్రత్యెక రాష్ట్రం గా వ్యవస్థీకరించి ,శాసనమండలి ఏర్పాటు చేశాడు .అందులో అదనపు సభ్యులు కొందరు ఎన్నుకోబడిన సభ్యులు ఉండేవారు .పురపాలక సంస్థల నుంచి ఒకరు ఒరిస్సా నుంచి ఎన్నికయేవారు .గోపబంధు ను దీనికి పోటీచేయమని మధుసూదన రాయ్ సూచించాడు .ప్రజలకష్టాలు కోరికలు దీనివల్ల తీరవని దాస్ ఇష్టపడలేదు .కానీ మధుసూదన్ మాట సుగ్రీవాజ్ఞ .1917లో శాసనమండలి సభ్యుడుగా గోపబందు దాస్ ఎన్నికయ్యాడు .ఈయన దృష్టిలో నాలుగు లక్ష్యాలున్నాయి .చెదిరిపోయిన ఒరియా భాష మాట్లాడే వారిని ఒకే చోట చేర్చటం ,వరదలు క్షామాల నివారణకు శాశ్వత పరిష్కారం ,ఎక్సైజ్ సుంకం లేకుండా ఉప్పు తయారు చేసే హక్కు ఒరిస్సా వారికి కల్పించటం ,సత్యవాది విద్యావిధానం లో విద్యావ్యాప్తి .
  ఎం.ఎల్.సి  అవగానే ఒరియా భాషా ప్రాంతాల సమైక్యతా కోరుతూతీర్మానం ప్రవేశపెట్టాడు.సి౦ఘ్ భం వంటి బాగా వెనుకపడిన ప్రాంతాలలో తిరిగి అక్కడ ,దీనస్థితిలో ఉన్న ఒరియావారిలో ధైర్యం కలిగించి ,అక్కడ బడులు నెలకొల్పి దేశాభిమానం రగుల్కొల్పాడు .కార్య దీక్షాపరుడు పండిట్ గోదావరీస్ మిశ్రా ను చక్రధర్ పూర్ హైస్కూల్ హెడ్ మాస్టర్ ను చేశాడు .తానె కార్యదర్శి .పోరాహత్ ,ధూల్ భూ సబ్  డివిజన్లలో ఎన్నో ప్రాధమిక పాఠశాలలు నెలకొల్పాడు .తన సహచర వరిష్టుడు వాసుదేవ మహా పాత్రాను బాహారాగోరాలో మిడిల్ స్కూల్ స్థాపించే బాధ్యత అప్పగింఛి తర్వాత హైస్కూల్ చేయించాడు .ఒరియా జాతీయతను ప్రజలలో వ్యాపి౦ప జేయటానికి బహుమతి ప్రదానోత్సవ సభలు ఏర్పాటు చేయించి ,విద్యాలయాలను శ్రద్ధగా నడుపుకొంటూ ,కొత్తవాటిని స్వయం కృషితో ఏర్పాటు చేసుకోవాలని అధ్యక్షస్థానం నుంచి హితవు చెప్పేవాడు .మధ్య పరగణాలలలోని ఫూల్ జార్ ,అద్మాపూర్ చంద్రపూర్ ప్రాంతాలలో పర్యటించి ప్రజలను ఉత్తెజపరచాడు .ఒరియా ఉద్యమ నిర్వహణలో ఆయనకు రాధానాధ రథ్ తోడ్పడ్డాడు .మిడ్నాపూర్ లోని ఒరియా వారిని బెంగాల్ ప్రభుత్వం రాజద్రోహ నేరారోపణతో భయపెడుతుంటే అధికారులను లెక్క చెయ్యకుండా వెళ్లి వారిలో జాతి చైతన్యం కల్గించాడు .మద్రాస్ రాష్ట్రం లో జయపూర్ ,విశాఖ ప్రాంతాలలో పర్యటించి అక్కడి ఒరియవారిలొ ధైర్య స్తైర్యాలు కలిగించాడుశాసనమండలి సభ్యుడు గోపబందు దాస్స్ .
  ఒరిస్సాలోని మహానది ,కట్జూరి విరూపా ,బ్రాహ్మణి వైతరిణి ,ఖరశ్రోత  ,సాలంది ,సువర్ణ రేఖా నదులు  వరదలలో విపరీత నష్టాలను కలిగిస్తాయి .ప్రభుత్వం కంటి తుడుపుగా ఏదోతాత్కాలిక సాయాలు చేసి చేతులు దులుపుకోనేది .ప్రజలను శాశ్వతంగా ఆదుకోపోతే తన సభ్యత్వం వట్టి దండుగ అనుకొన్నాడు .
  1919లో పూరీ జిల్లాలో పెద్ద క్షామం వచ్చింది .పేపర్లద్వారా తెలుసుకొని ప్రభుత్వేతర సహాయాన్ని పెద్ద ఎత్తున సంఘటిత పరచగా ,దేశం నలుమూలలనుంచి ఆర్ధిక సాయం ఊహకు మించి వచ్చి చేరింది .ప్రభుత్వం మొద్దు నిద్రపోయింది .1920మార్చి 13న శాసన మండలిలో దాస్ క్షామ సమస్య ప్రస్తావన చేసి బడ్జెట్ లో చూపిన 19వేల రూపాయలు ఏమూలకూ చాలదనీ ,దాన్ని యాభై వేలకు పెంచమని గట్టిగా కోరాడు .రాష్ట్ర ప్రభుత్వం యాభై వేలు ఇస్తే కేంద్రం లక్షా యాభై వేలు ఇవ్వాలని నియమం .సుమారు ఈ రెండు లక్షలతో క్షామ నివారణకు కొంత ఉపశమనం కలిగించవచ్చునని గోపబందు భావన .క్షామపీడిత ప్రజలు తినటానికి ఏమీలేక తౌడు ,ఆకులు తింటున్న దయనీయ స్థితి  ఫోటోలలో బంధించి పై ఆఫీ పర్లకు ప్రభుత్వానికి కనువిప్పు కలిగించాడు .మండలిలో  కన్నీటితో వారి దైన్యాన్ని గురించి చెబుతుంటే అందరూ కన్నీరు మున్నీరుగా విలపించారు .ప్రభుత్వం ‘’లైట్ తీసుకొన్నది  ,ఒరిస్సా డివిజనల్ కమిషనర్ గ్రన్నింగ్ ‘’కష్టాలను గోరంతలు కొండంత చేయటం గోపబందుకు మామూలే .నేను ఆప్రాంతాలు తిరిగి చూశా పూరీ జిల్లాబోర్డ్ వైస్ చైర్మన్ రెండువేలమంది మాత్రమె బాధితులు అన్నాడు .కనుక బడ్జెట్ పెంచం ‘’అని గట్టిగా వాది౦చాడు.వెంటనే దాస్ లేచి ‘’ఆయన వారం క్రితం కారులో వెళ్లి ఎక్కడా దిగకుండా చూసి వచ్చాడు గ్రామసీమలలోకి వెళ్ళటానికి దార్లె లేవు .అవి ఆయన చూడనే లేదు .నేను నాలుగు సార్లు చూసొచ్చాను. రెండువందల యాభై గ్రామాలు దుర్భిక్షం లో ఉన్నాయి .ఇప్పటికైనా మేల్కొని జనం చావకుండా చూడండి. ఆ ప్రాంతాలలో ఏ ఒక్క మనిషి అన్నం లేక చనిపోయినా బాధ్యత నాదీ, ప్రభుత్వానిదీ అవుతుంది ‘’అని చెప్పి కూర్చున్నాడు
  గోపబంధు మాటలు లెఫ్టినెంట్ గవర్నర్ గేయిట్ హృదయాన్ని కదిలించింది 1920 ఏప్రిల్ 7న ఆప్రాంతాలు పర్యటిస్తూ గోపబంధునుకూడా తనతో తీసుకు వెళ్ళాడు ఈ విషయం అధికారులకు తెలీదు .ప్రజలు ఆకులుఅలములు తినటం స్వయంగా చూసి చలించిపోయాడు .స్త్రీల ఇత్తడి నగల్ని గ్రన్నింగ్ బంగారు నగలని అనుకకొన్నాడని గ్రహించాడు .ప్రక్కనే ఉన్న గోప బందుతో ‘’దురదృష్ట వశాత్తు ప్రభుత్వం తనకర్తవ్యాన్ని చేయలేకపోయి౦ద య్యా గోపబందూ ‘’అన్నాడు డగ్గుత్తికతో .ఇది తెలిసిన పూరీ జిల్లా మేజిష్ట్రేట్ చిరాకుతో ‘’ఈ జిల్లాలో రెండు గడ్డు సమస్యలు ఒకటి క్షామం రెండు గోపబందు ‘’అన్నాడట బాధితుల ప్రభుత్వసాయం కేవలం ఉపశమనమే శాశ్వత నివారణ జరగాలని భావించాడు దాస్ .
  శాసనమండలి లో వ్రజసుందర దాస్ తో కలిసి మండలిలో  వరద నివారణకు శాశ్వత పరిష్కారం కోసం తీర్మానం ప్రవేశపెట్టాడు .బాధ్యతారాహిత్య ప్రభుత్వం తీర్మానాన్ని అంగీకరించలేదు .కానీ 1922-23లో ప్రభుత్వం ఒక వరద నివారణ కమిటీ ఏర్పరచి సర్వే చేయించి 70వేలు ఖర్చు చేసింది .అది పోడిచేసిందిఏమీ  లేదు శూన్యం .1927లో వచ్చిన భీభత్స వరదలతర్వాత 1928లో నిపుణులకమిటీ వేస్తె ,హీరాకుడ్ డాం ఒరిస్సాలో నిర్మాణమైంది .అప్పటికే గోపబంధు యశః కాయుడయ్యాడు .
   సశేషం
మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -24-3-22-ఉయ్యూరు ఠ .

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

· మన మరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు -152

· మన మరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు -152

· 152-కంచుకోట ,నిలువుదోపిడి సినీ ఫేం దర్శకనిర్మాత -విశ్వశాంతి విశ్వేశ్వరరావు

యు. విశ్వేశ్వర రావు తెలుగు సినిమా నిర్మాత, దర్శకులు. యు.విశ్వేశ్వరరావు 20 మే 2021న చెన్నై లో కరోనాతో మరణించాడు. [1][2][3]

విశేషాలు
విశ్వేశ్వరరావు సంపన్నుల కుటుంబంలో జన్మించాడు. ఇతనికి మూడుసంవత్సరాల వయసు ఉన్నప్పుడే తండ్రి మరణించాడు. మేనమామ ఇతనిని చేరదీశాడు. ఇతనికి 8 సంవత్సరాల వయసు వచ్చేవరకు అక్షరాభ్యాసం జరగలేదు. మొదట్లో ఇతడు మూడు సంవత్సరాల తరువాత చదువు ఆగిపోయింది. వ్యవసాయం చూసుకునే వాడు. ఇతని బావ దావులూరి రామచంద్రరావు ఇతడిని బాగా చదివించాలని నిర్ణయించాడు. ఫలితంగా ఇతడు తన 14వ యేటనుండి ముదినేపల్లి, గుడివాడ, ఏలూరు, విజయనగరాలలో చదివి బి.ఎస్.సి.పట్టా సంపాదించాడు. తరువాత గుడివాడ హైస్కూలులో ఉపాధ్యాయుడిగా చేరాడు. తనకు చదువు చెప్పిన టీచర్ల సరసనే సహ ఉపాధ్యాయుడిగా పనిచేయడం అతనికి వింతగా అనిపించింది. సినిమా నిర్మాతలు అట్లూరి పూర్ణచంద్రరావు, పి.రాఘవరావు గుడివాడ స్కూలులో ఇతని శిష్యులు. తరువాత గుడివాడలో జనతా ట్యుటోరియల్ ఇన్‌స్టిట్యూట్ స్థాపించి కొంతకాలం నడిపాడు. ఇతడికి విదేశాలలో వెళ్ళి చదువుకోవాలనే ఆసక్తి ఉండేది. కాని అతని బావ ప్రోద్బలంలో సినిమా రంగంలోనికి అడుగు పెట్టాడు.

మొదట ఇతడు పి.పుల్లయ్య వద్ద దర్శకత్వ శాఖలో సహాయకుడిగా చేరాడు. కన్యాశుల్కం, జయభేరి చిత్రాలకు పుల్లయ్య వద్ద పనిచేశాడు. ఆ సమయంలో బాలనాగమ్మ సినిమాకు తమిళ డబ్బింగ్ హక్కులు కొని నిర్మాతగా మారాడు. ఆ చిత్రం విడుదలై అతడికి లాభాలు తీసుకువచ్చింది. దానితో అతడు విశ్వశాంతి అనే సంస్థను స్థాపించి 15 తమిళ, తెలుగు డబ్బింగ్ సినిమాలు నిర్మించాడు. డబ్బింగ్ చిత్రాల వల్ల వచ్చిన ఉత్సాహంతో కంచుకోట, నిలువు దోపిడి, పెత్తందార్లు, దేశోద్ధారకులు వంటి భారీ చిత్రాలను నేరుగా నిర్మించి నిర్మాతగా స్థానం సంపాదించుకున్నాడు.

వాణిజ్యపరంగా విజయవంతమైన చిత్రాలు తీసినా తన ఆశయాలను ప్రతిబింబించే చిత్రాలను నిర్మించాలనే ఉద్దేశంతో అటువంటి చిత్రాలకు దర్శకత్వం వహించేందుకు ఎవరూ ముందుకురారని తనే దర్శకుడిగా అవతారం ఎత్తాడు[4].

సినిమాలు
ఇతడు నిర్మించిన చిత్రాలు:

  1. కంచుకోట (1967)
  2. నిలువు దోపిడి (1968)
  3. పెత్తందార్లు (1970)
  4. దేశోద్ధారకులు (1973)

ఇతడు దర్శకత్వం వహించిన సినిమాలు:

  1. తీర్పు (1975)
  2. నగ్నసత్యం (1979)
  3. హరిశ్చెంద్రుడు (1981)
  4. కీర్తి కాంత కనకం (1983)

ప్రముఖ తెలుగు సినీ నిర్మాత, దర్శకుడు యూ. విశ్వేశ్వరరావు(92) చెన్నై లో కరోనా సోకి కన్నుమూశారు. ఎన్టీఆర్ కు ఆయన వియ్యంకుడు అవుతారు. విశ్వశాంతి విశ్వేశ్వరరావుగా పేరోందిన ఆయన పలు విజయవంతమైన చిత్రాలు నిర్మించారు. కృష్ణాజిల్లా గుడివాడకు చెందిన విశ్వేశ్వరరావు బీఎస్సీ వరకు చదువుకుని గుడివాడలో ఉపాధ్యాయుడిగా జీవితం ప్రారంభించారు.

తొలి రోజుల్లో ఆయన రంగస్థల నటుడు, నాటక రచయిత. విశ్వేశ్వరరావు మంచి గేయ రచయిత, కధకుడు కూడా. అతని బావ దావులూరి రామచంద్రరావు ప్రోద్భలంతో సినీరంగంలోకి ప్రవేశించిన విశ్వేశ్వరరావు తొలుత పి.పుల్లయ్యవద్ద దర్శకత్వ శాఖలో అసిస్టెంట్ గా చేరారు. కన్యాశుల్కం, జయభేరి చిత్రాలకు పుల్లయ్య వద్ద సహయ దర్శకుడిగా పనిచేశారు. ఆ సమయంలో బాలనాగమ్మ సినిమాకు తమిళ డబ్బింగ్ హక్కులు కొని నిర్మాతగా మారారు. ఆ చిత్రం విడుదలై నిర్నాతగా ఆయనకు లాభాలు తెచ్చి పెట్టింది.

ఆ ప్రోత్సాహంతో ఆయన విశ్వశాంతి అనే పేరుతో నిర్మాణ సంస్థను స్థాపించారు. తమిళ, తెలుగు భాషలలో 15 డబ్బింగ్ సినిమాలు నిర్మించారు. డబ్బింగ్ చిత్రాల వల్ల వచ్చిన ఉత్సాహంతో కంచుకోట, నిలువు దోపిడి, పెత్తందార్లు, దేశోద్ధారకులు వంటి భారీ చిత్రాలను నేరుగా నిర్మించి నిర్మాతగా స్థానం సంపాదించుకున్నారు.

వాణిజ్యపరంగా విజయవంతమైన చిత్రాలు తీసినా, తన ఆశయాలను ప్రతిబింబించే చిత్రాలను నిర్మించాలనే ఉద్దేశంతో అటువంటి చిత్రాలకు దర్శకత్వం వహించేందుకు ఎవరూ ముందుకు రారని తనే దర్శకుడిగా మారారు. ఆయన దర్శకత్వంలో వచ్చిన సినిమాలకు ఆయనే కథను సమకూర్చుకునే వారు. కంచుకోట, తీర్పు, పెత్తందార్లు, మార్పు, నగ్నసత్యం, హరిశ్చంద్రుడు వంటి 25 సినిమాలు నిర్మిoచారు.

‘దేశోద్థారకులు’ చిత్రంలో ‘ఆకలై అన్నమడిగితే పిచ్చోళ్లు అన్నారు నాయాళ్లు’ అనే పాటను ఆయనే రాశారు. ‘నగ్నసత్యం’, హరిశ్చందుడ్రు’ చిత్రాలకు ఆయన జాతీయ పురస్కారాలు అందుకోగా, ‘కీర్తి కాంతా కనకం’, ‘పెళ్లిళ్ల చదరంగం’ చిత్రాలకు గానూ రెండు నందులను సొంతం చేసుకున్నారు.

17వ నేషనల్‌ అవార్డ్‌ సెంట్రల్‌ జ్యూరీ మెంబర్‌గా ఉండడమే కాకుండా సౌతిండియన్‌ ఫిల్మ్‌ ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ కార్యదర్శిగా కూడా విశ్వేశ్వర రావు పనిచేశారు.

·

కుమార్తె శాంతిని ఎన్టీఆర్‌ కుమారుడు– కెమేరామ్యాన్‌ మోహనకృష్ణకు ఇచ్చి వివాహం చేశారు. అలా రామారావుకి విశ్వేశ్వర రావు వియ్యంకుడు అయ్యారు. 1986లో ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా ఎన్టీఆర్‌ ఉన్నప్పుడు హైదరాబాద్‌లో అంతర్జాతీయ చలన చిత్రోత్సవం జరిగింది. ఆ సమయంలో ఏపీ ఫిల్మ్‌ ఛాంబర్‌ అధ్యక్షుడిగా విశ్వేశ్వరరావు చేశారు. ఎఫ్‌డీసీ డైరెక్టర్‌ చైర్మన్‌తో పాటు సౌత్‌ ఇండియన్‌ ఫిల్మ్‌ ఛాంబర్‌లో అనేక పదవుల్లో తన సేవలు అందించారు. విశ్వేశ్వర రావుకి కుమార్తెలు మంజు, శాంతి, కుమారుడు ధనుంజయ్‌ ఉన్నారు. కుమారుడు అమెరికాలో ఉన్నారు. ఒక కుమార్తె హైదరాబాద్‌లో ఉన్నారు. ప్రస్తుతం కరోనా నేపథ్యంలో తండ్రి కడచూపునకు కూడా పిల్లలు చేరుకోలేని పరిస్థితి. దీంతో విశ్వేశ్వరరావు భౌతికకాయానికి గురువారం చెన్నైలో ఆయన మిత్రులే అంత్యక్రియలు నిర్వహించారు.
సశేషం

మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -24-3-22-ఉయ్యూరు

Posted in సినిమా | Tagged | Leave a comment

మన మరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు -151

మన మరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు -151

151- రెండు స్వర్ణ నందులు పొందిన ‘’చిలకమ్మ చెప్పింది ‘’సినీ దర్శకుడు,మన బందరు వాడు –ఈరంకి శర్మ
రజనీకాంత్, కమల్‌హాసన్, చిరంజీవి, వంటి వారితో సినిమాలు తెరకెక్కించిన దర్శకులు ఈరంకి శర్మ (93) శుక్రవారం మృతి చెందారు. చెన్నైలోని స్వగృహంలో తుదిశ్వాస విడిచారు. మచిలీపట్నంకి చెందిన ఈరంకి శర్మ తన తండ్రి చనిపోవడంతో చెన్నైకి వెళ్లారు. తన సోదరుడు దర్శకత్వం వహించిన ‘చిన్నమ్మ కథ’ సినిమాకి అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారాయన. వేదాంతం రాఘవయ్య, కె.బాలచందర్‌ సినిమాలకు అసోసియేట్‌ డైరెక్టర్‌గా చేశారు. తమిళ, తెలుగు, కన్నడ, మలయాళ చిత్రాలకు ఎడిటర్‌గానూ చేశారు.

1977లో రజనీకాంత్‌ నటించిన ‘చిలకమ్మ చెప్పింది’తో దర్శకునిగా మారారు. ఆ సినిమాకి బంగారు నంది అవార్డు అందుకున్నారు. ఆ తర్వాత తీసిన ‘నాలాగా ఎందరో’ చిత్రం కూడా బంగారు నంది గెల్చుకుంది. చిరంజీవి, మాధవిలతో ‘కుక్కకాటుకి చెప్పుదెబ్బ’ సినిమా తీశారు. ఆ తర్వాత ‘అగ్నిపుష్పం, సీతాదేవి’ వంటి చిత్రాలు తెరకెక్కించారు. తమిళ సినిమాలూ చేశారు. కన్నడ చిత్ర పరిశ్రమకి వెళ్లాక తెలుగు సినిమాలు తగ్గించేశారాయన. ఈరంకి శర్మకి ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు..

చిలకమ్మ చెప్పింది
ఇది 1977లో విడుదలైన ఒక తెలుగు చిత్రం. నిర్మాత చేగొండి హరిబాబు (రాజకీయనాయకులు చేగొండి హరిరామజోగయ్య), ఈరంకి శర్మ దర్శకత్వంలో ఈ చిత్రం నిర్మించారు. ఈ సినిమాకు మలయాళ సినిమా అడిమైకళ్ మాతృక

చిత్రకథ
సంగీత, లక్ష్మీకాంత్ అక్కాతమ్ముళ్ళు. మల్లి(శ్రీప్రియ) పేదమ్మాయి. పల్లెలో చిలక జ్యోస్యం వాడు చెప్పినట్టు తనకు చదువుకొన్న పెద్దింటి వరుడు వస్తాడని కలలు కంటుంది. సంగీత దగ్గర పని కోసం పల్లె నుండి పట్నం వస్తుంది. పేదవాడైన నారాయణరావు కూడా అక్కడే పనిచేస్తుంటాడు. అతడు కొంత చెవిటితనం కలిగి ఉంటాడు. మల్లిని అభిమానిస్తుంటాడు. రజనీకాంత్, లక్ష్మీకాంత్ కు స్నేహితుడు. పాలకొల్లు లాకుల ప్రభుత్వోద్యోగిగా వీరుంటున్న గ్రామానికి వస్తాడు. సంగీత పురుష ద్వేషి, సంగీతం టీచరు. ఆమె రజనీకాంత్ ను ‘కుర్రాడి’గా సంబోధిస్తుంది. అతనిపట్ల అయిష్టత ప్రదర్శిస్తుంది. మల్లి పెళ్ళి కాకుండానే గర్భవతి ఔతుంది. ఆమె లక్ష్మీకాంత్‌తో సంభందం కలిగి ఉండటం నారాయణరావు చూస్తాడు, అతడు చూసాడని వీళ్ళూ గమనిస్తారు, సంగీత రజనీకాంత్ ను దీనికి కారణం అనుకుంటుంది. ఆమెకు లోలోపల రజనీకాంత్ పట్ల ప్రేమ. రజనీకాంత్ మల్లి భాద్యతలను నారాయణరావుకు అప్పగించి అతడికి లాకులవద్ద ఉద్యోగం వేయించి బదిలీమీద వెల్లే తాను మళ్ళీ తను వచ్చేవరకూఅతడివద్దే ఉంచమని చెప్తాడు. బిడ్డపుట్తేవరకూ నారాయణరావు దగ్గర ఉన్న మల్లికి తనపై అతడి ప్రేమ తెలుస్తుంది. చివరకు బిడ్డ తండ్రిగా ఒప్పుకున్న లక్ష్మీకాంత్ మల్లిని తీసుకు వెళ్ళాలని వస్తే ఆమె ఒప్పుకోదు. తనకు పేదవాడైన నారాయణరావుతోనే జీవితం అని చెప్పి అతడితో పల్లెకు వెళ్ళీపోతుంది. సంగీత రజనీకాంత్‌ను క్షమించమని తనను పెళ్ళీచేసుకోమని కోరుతుంది.

చిత్ర విశేషాలు
· చిత్రం ఎక్కువ భాగం పశ్చిమగోదావరి జిల్లా లంకలకోడేరు గ్రామంలో చిత్రీకరించారు. గ్రామంలో ఉన్న ఎదురు ఎదురుగా కల రెండు మేడలను, ఉన్నతపాఠశాలను చిత్రీకరించారు.

అవార్డులు
పాటలు
· చిట్టి చిట్టి చేపల్లారా సెలయేటి పాపల్లారా, చిలకమ్మ చెప్పింది చల్లని మాట

· కుర్రాడనుకుని కునుకులుతీసే వెర్రిదానికీ పిలుపు (గానం: ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం)

· ఎందుకు నీకీ దాపరికము ఎన్నాల్లు దాస్తావు దాగని నిజము

నాలాగా ఎందఱో సినిమా
నాలాగ ఎందరో 1978, మే 8న విడుదలైన తెలుగు చలనచిత్రం. ఆర్.కె. ఆర్ట్ ప్రొడక్షన్స్ పతాకంపై కె. ప్రేమ్ రంజిత్ నిర్మాణ సారథ్యంలో ఈరంకి శర్మ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో జి. నారాయణరావు, రూప, హేమసుందర్, పి.ఎల్. నారాయణ ప్రధాన పాత్రల్లో నటించగా, ఎమ్మెస్. విశ్వనాధన్ సంగీతం అందించాడు.[1] 1978 నంది అవార్డులులో నంది ఉత్తమ చిత్రం, నంది ఉత్తమ నటుడు (హేమసుందర్) అవార్డులతో పాటు ఈ సినిమాలోని పాటలకు నంది ఉత్తమ నేపథ్య గాయకుడుగా ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యంకు తొలి నంది అవార్డును వచ్చింది.

నటవర్గం
· జి. నారాయణరావు

· రూప

· హేమసుందర్

· పి.ఎల్. నారాయణ

· పల్లవి

· వాణి

· జానకి

· సీతాలత

· జయ

· జయ సుజాత

· శ్రీలక్ష్మీదేవి

· కృష్ణవేణి

· సుజాత

· బేబి రాణి

· లక్ష్మీకాంత్

· విక్రంబాబు

· దాశరథి

· కోనేశ్వర శాస్త్రి

· బుర్రా సుబ్రహ్మణ్యం

· శ్రీహరి రావు

· విజి ప్రసాద్

· పి. వెంకటేశ్వరరావు

· ఎం.బి.కె.వి. ప్రసాదరావు

· ప్రదీప్ కుమార్

· ఎస్. ప్రసాద్

సాంకేతికవర్గం
· చిత్రానువాదం, దర్శకత్వం: ఈరంకి శర్మ

· నిర్మాత: కె. ప్రేమ్ రంజిత్

· కథ: గణేష్ పాత్రో

· సంగీతం: ఎమ్మెస్. విశ్వనాధన్

· ఛాయాగ్రహణం: బి.ఎస్. లోకనాథ్

· కూర్పు: ఎన్.ఆర్. కిట్టు

· నిర్మాణ సంస్థ: ఆర్.కె. ఆర్ట్ ప్రొడక్షన్స్

పాటలు
ఈ చిత్రానికి ఎమ్మెస్ స్వామినాథన్ సంగీతం అందించాడు.[2]

  1. అనుభవాలకు ఆదికావ్యం ఆడదాని జీవితం (ఆచార్య ఆత్రేయ)
  2. కళ్యాణిని కనులున్న మనసుకు కనిపించు రూపాన్ని (ఆచార్య ఆత్రేయ)
  3. బుల్లెమ్మ నీకళ్ళలో
  4. ఒకటా రెండా మూడా

అవార్డులు
1978 నంది అవార్డులు

  1. నంది ఉత్తమ చిత్రం
  2. నంది ఉత్తమ నటుడు – హేమసుందర్[3]
  3. నంది ఉత్తమ నేపథ్య గాయకుడు – ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం (మొదటి నంది)[4]

కుక్క కాటుకు చెప్పు దెబ్బ
వికీపీడియా నుండి

కుక్క కాటుకు చెప్పు దెబ్బ గోపీకృష్ణా ఇంటర్నేషనల్ బ్యానర్‌పై వెలువడిన తెలుగు సినిమా.

సాంకేతికవర్గం
· కథ: చివుకుల పురుషోత్తం

· మాటలు: సి.ఎస్.రావు

· దర్శకత్వం, స్క్రీన్ ప్లే: ఈరంకి శర్మ

· పాటలు: ఆత్రేయ

· సంగీతం: ఎం.ఎస్. విశ్వనాధన్

· ఛాయాగ్రహణం: రఘునాథరెడ్డి

· నిర్మాత: చలసాని గోపి

నటీనటులు
· మాధవి – పార్వతి

· చిరంజీవి – శేఖర్

· నారాయణరావు

· పల్లవి – కనకం

· హేమసుందర్

· పి.ఎల్.నారాయణ

· వంకాయల సత్యనారాయణ

· లక్ష్మీకాంత్

· రజని

· జానకి

పాటలు

  1. ఏమండీ ఏమనుకోకండి ఆకు చాటు మొగ్గను రేకు విడని పువ్వును – పి.సుశీల
  2. కన్నువంటిదీ ఆడదీ కన్నీరామెకు తప్పనిది తనవున – ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం
  3. యింత మంచోడివైతే బావా బావా బావ పనికి రావు – ఎల్.ఆర్.ఈశ్వరి, జి.ఆనంద్
  4. అందాల రాముడు సీతను కౌగిట పొదిగిన – ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, వాణి జయరాం
  5. హే బేబి కాని కాని కైపులోన తేలనీ ఇలాగే తేలి – ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, రమోలా

అగ్నిపుష్పం

1987, డిసెంబరు 12న విడుదలైన తెలుగు చలనచిత్రం.[1] జూపిటర్ ఫిల్మ్స్ పతాకంపై బోనం నరసింహరావు, సి. బుద్ధావతారం రాజు నిర్మించిన ఈ సినిమాకు ఈరంకి శర్మ దర్శకత్వం వహించాడు. ఇందులో శుభాకర్, రాజి, సీత నటించగా, ఎమ్.ఎస్.విశ్వనాధన్ సంగీతం అందించారు.[2

నటవర్గం
· శుభాకర్

· రాజి

· సీత

ఎమ్.ఎస్.విశ్వనాథన్

సాంకేతికవర్గం
· దర్శకత్వం: ఈరంకి శర్మ

· నిర్మాత: బోనం నరసింహరావు, సి. బుద్ధావతారం రాజు

· సంగీతం: ఎమ్.ఎస్.విశ్వనాధన్

· నిర్మాణ సంస్థ: జూపిటర్ ఫిల్మ్స్

· ఈరంకి శర్మ జీవిత విశేషాలు పెద్దగా తెలియ లేదు అందుకే ఆయన తీసిన గొప్ప సినిమాల గురించి వివరాలు అందించాను .

· సశేషం

· మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -24-3-22-ఉయ్యూరు

Posted in సినిమా | Tagged | Leave a comment

మన మరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు-150

మన మరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు-150
150-ప్రజానాట్యమండలి వ్యవస్థాపకుడు ,షాజహాన్ నాటక ఫేం ,జమున ,అల్లు లను వెండితెరకు పరిచయం చేసి,కళ ప్రజకు ,ప్రగతికి అని నినదించి తీసిన ‘’పుట్టిల్లు ‘’దర్శకుడు –గరికపాటి రాజారావు

గరికపాటి రాజారావు (ఫిబ్రవరి 5, 1915 – సెప్టెంబరు 8, 1963) తెలుగు సినిమా దర్శకుడు, నాటకరంగ ప్రముఖుడు, ఆంధ్ర ప్రజానాట్యమండలి వ్యవస్థాపకుడు.

ప్రజానాట్యమండలి సాంఘిక నాటకాలకు పెద్దపీట వేసింది. ఈ నాటక సంఘం ద్వారా అనేకమంది ప్రతిభావంతమైన కళాకారులు పరిచమయ్యారు. చెప్పికోదగిన వారిలో దేవిక, అల్లు రామలింగయ్య, సంగీత దర్శకులు మోహన్ దాస్, టి.చలపతిరావులు, నృత్యదర్శకుడు వేణుగోపాల్, రచయితలు సుంకర సత్యనారాయణ, వాసిరెడ్డి భాస్కరరావు, బుర్రకథ కళాకారుడు షేక్ నాజర్ ఉన్నారు.[1]

రాజారావు 1915 ఫిబ్రవరి 5వ తేదీన రాజమండ్రిలో గరికపాటి కోటయ్య, దేవరా రామలింగమ్మల దంపతులకు జన్మించాడు. చిన్నప్పుడే కాకినాడలోని ఆదిభట్ల నారాయణదాసు హరికథకు వెళ్లి, పాటకు తగిన తాళం వేసి తన ప్రతిభను నిరూపించుకుని అభినందనలు పొందాడు. చదువుకుంటున్న రోజుల్లో విచిత్ర వేషధారణలో ఆసక్తి చూపించిన రాజారావు, హరిశ్చంద్ర నాటకంలోనూ ఓ వేషం ధరించి పాఠశాల అధ్యాపకుల మెప్పు పొందాడు. తరువాత విజయనగరంలో మేనమామ సుబ్రహ్మణ్యం ఇంట చేరి ఎస్‌ఎస్‌ఎల్‌సి పూర్తి చేశారు. రాజారావుకు 15వ ఏటనే నాగేశ్వరమ్మతో వివాహం జరిగింది. తండ్రి ఉద్యోగం చేసిన సికిందరాబాదు లాలాగూడ వర్క్‌షాపులో చిన్న గుమాస్తాగా జీవనం సాగిస్తూ, పై ఉద్యోగి పీడన భరించలేక దానికి రాజీనామా చేసి 1937లో మద్రాసు చేరాడు. మద్రాసులో ఎల్‌.ఐ.యం చదువుతున్న రోజులో పుచ్చలపల్లి రామచంద్రారెడ్డి (పుచ్చలపల్లి సుందరయ్య సోదరుడు) డాక్టర్‌ రామదాసు ఈయనకు ప్రాణ స్నేహితులు. అలాంటి స్నేహ వాతావరణం యొక్క ప్రభావం వలన రాజారావు మార్క్సిస్ట్సు రాజకీయ ఉద్యమాలవైపు ఆకర్షితుడయ్యాడు[2]

మద్రాసలో చదువుతున్నప్పుడే సహ విద్యార్థులతో కలిసి గుళ్లపల్లి నారాయణమూర్తి రచించిన విడాకులు నాటకానికి దర్శకత్వం వహించాడు. మద్రాసులో రాజారావు దర్శకత్వంలో ప్రదర్శించిన షాజహాన్ నాటకం సంచలనాన్ని సృష్టించింది. షాజహాన్‌గా ఎస్‌విఆర్ సాంబశివరావు, జహనారాగా డాక్టర్ కొర్రపాటి గంగాధరరావు, ఔరంగజేబుగా రాజారావు అద్భుతంగా నటించి పలువురి ప్రశంసలు పొందారు. ఆ నాటకంలో రాజారావుకు సుప్రసిద్ధ నటుడు రూపశిల్పి దేవీప్రసాద్ రాయ్ చౌదరి మేకప్ చేయడం విశేషం. మద్రాసులో విద్యార్థులను సమీకరించి భమిడిపాటి బాగుబాగు, గాలి బాల సుందరరావు అపోహ వంటి నాటకాలను ప్రదర్శించారు.[3]

వృత్తి రీత్యా వైద్యుడైన రాజారావు ఉచితంగా వైద్యసేవలు అందించడానికి విజయవాడలోని పోరంకిలో ప్రజా వైద్యశాల నెలకొల్పి ఫీజులు తీసుకోకుండా మందులు కూడా తనే కొనుగోలు చేసి ఉచితంగా రోగులకు సేవ చేసేవాడు. కొంతకాలం రాజమండ్రిలోనూ ప్రజావైద్యశాల నిర్వహించాడు.[4]

రాజారావు 1953లో పుట్టిల్లు సినిమాను స్వయంగా నిర్మించి దర్శకత్యం వహించాడు. ఈ సినిమాలో ప్రముఖ నటీనటులు జమున, అల్లు రామలింగయ్యను వెండితెరకు పరిచయం చేశాడు. పుట్టిల్లు సినిమాలో వివిధ నటులు తమ నటనకు ప్రశంసలందుకున్నా ఈ సినిమా ఆర్థికంగా లాభించలేదు. దానితో రాజరావు ఆర్థికంగా దెబ్బతిని అప్పులపాలయ్యాడు. కానీ వృత్తిరీత్యా వైద్యుడైన రాజారావు సంఘసేవ మాత్రం ఆపలేదు. పేదవారికి ఉచితం వైద్యం చేస్తుండేవాడు.

ఆ తరువాత ఈయన 1962లో విడుదలైన ఆరాధన వంటి సినిమాల్లో చిన్నాచితక పాత్రలు కూడా పోషించాడు. ఆరాధనలో రాజశ్రీకి తండ్రి షావుకారు పాత్ర వేశాడు[5].

మరణం
జైభవానీ నాటకాన్ని ప్రదర్శించే సమయంలో గుండెపోటు రావడంతో తీవ్ర అస్వస్థులయ్యారు. అదే సమయంలో దేవుడుచేసిన మేలు చిత్రాన్ని నిర్మించినా ఆర్థిక కారణాలవల్ల ఆ చిత్రం విడుదల కాలేదు. మానసికంగా కుంగిపోయిన రాజారావు 1963 సెప్టెంబరు 8న మద్రాసులో మరణించారు.[6]

గరికపాటి రాజారావు (ఫిబ్రవరి 5, 1915 – సెప్టెంబరు 8, 1963) తెలుగు సినిమా దర్శకుడు, నాటకరంగ ప్రముఖుడు, ఆంధ్ర ప్రజానాట్యమండలి వ్యవస్థాపకుడు.

ప్రజానాట్యమండలి సాంఘిక నాటకాలకు పెద్దపీట వేసింది. ఈ నాటక సంఘం ద్వారా అనేకమంది ప్రతిభావంతమైన కళాకారులు పరిచమయ్యారు. చెప్పికోదగిన వారిలో దేవిక, అల్లు రామలింగయ్య, సంగీత దర్శకులు మోహన్ దాస్, టి.చలపతిరావులు, నృత్యదర్శకుడు వేణుగోపాల్, రచయితలు సుంకర సత్యనారాయణ, వాసిరెడ్డి భాస్కరరావు, బుర్రకథ కళాకారుడు షేక్ నాజర్ ఉన్నారు.[1]

రాజారావు 1915 ఫిబ్రవరి 5వ తేదీన రాజమండ్రిలో గరికపాటి కోటయ్య, దేవరా రామలింగమ్మల దంపతులకు జన్మించాడు. చిన్నప్పుడే కాకినాడలోని ఆదిభట్ల నారాయణదాసు హరికథకు వెళ్లి, పాటకు తగిన తాళం వేసి తన ప్రతిభను నిరూపించుకుని అభినందనలు పొందాడు. చదువుకుంటున్న రోజుల్లో విచిత్ర వేషధారణలో ఆసక్తి చూపించిన రాజారావు, హరిశ్చంద్ర నాటకంలోనూ ఓ వేషం ధరించి పాఠశాల అధ్యాపకుల మెప్పు పొందాడు. తరువాత విజయనగరంలో మేనమామ సుబ్రహ్మణ్యం ఇంట చేరి ఎస్‌ఎస్‌ఎల్‌సి పూర్తి చేశారు. రాజారావుకు 15వ ఏటనే నాగేశ్వరమ్మతో వివాహం జరిగింది. తండ్రి ఉద్యోగం చేసిన సికిందరాబాదు లాలాగూడ వర్క్‌షాపులో చిన్న గుమాస్తాగా జీవనం సాగిస్తూ, పై ఉద్యోగి పీడన భరించలేక దానికి రాజీనామా చేసి 1937లో మద్రాసు చేరాడు. మద్రాసులో ఎల్‌.ఐ.యం చదువుతున్న రోజులో పుచ్చలపల్లి రామచంద్రారెడ్డి (పుచ్చలపల్లి సుందరయ్య సోదరుడు) డాక్టర్‌ రామదాసు ఈయనకు ప్రాణ స్నేహితులు. అలాంటి స్నేహ వాతావరణం యొక్క ప్రభావం వలన రాజారావు మార్క్సిస్ట్సు రాజకీయ ఉద్యమాలవైపు ఆకర్షితుడయ్యాడు[2]

మద్రాసలో చదువుతున్నప్పుడే సహ విద్యార్థులతో కలిసి గుళ్లపల్లి నారాయణమూర్తి రచించిన విడాకులు నాటకానికి దర్శకత్వం వహించాడు. మద్రాసులో రాజారావు దర్శకత్వంలో ప్రదర్శించిన షాజహాన్ నాటకం సంచలనాన్ని సృష్టించింది. షాజహాన్‌గా ఎస్‌విఆర్ సాంబశివరావు, జహనారాగా డాక్టర్ కొర్రపాటి గంగాధరరావు, ఔరంగజేబుగా రాజారావు అద్భుతంగా నటించి పలువురి ప్రశంసలు పొందారు. ఆ నాటకంలో రాజారావుకు సుప్రసిద్ధ నటుడు రూపశిల్పి దేవీప్రసాద్ రాయ్ చౌదరి మేకప్ చేయడం విశేషం. మద్రాసులో విద్యార్థులను సమీకరించి భమిడిపాటి బాగుబాగు, గాలి బాల సుందరరావు అపోహ వంటి నాటకాలను ప్రదర్శించారు.[3]

వృత్తి రీత్యా వైద్యుడైన రాజారావు ఉచితంగా వైద్యసేవలు అందించడానికి విజయవాడలోని పోరంకిలో ప్రజా వైద్యశాల నెలకొల్పి ఫీజులు తీసుకోకుండా మందులు కూడా తనే కొనుగోలు చేసి ఉచితంగా రోగులకు సేవ చేసేవాడు. కొంతకాలం రాజమండ్రిలోనూ ప్రజావైద్యశాల నిర్వహించాడు.[4]

రాజారావు 1953లో పుట్టిల్లు సినిమాను స్వయంగా నిర్మించి దర్శకత్యం వహించాడు. ఈ సినిమాలో ప్రముఖ నటీనటులు జమున, అల్లు రామలింగయ్యను వెండితెరకు పరిచయం చేశాడు. పుట్టిల్లు సినిమాలో వివిధ నటులు తమ నటనకు ప్రశంసలందుకున్నా ఈ సినిమా ఆర్థికంగా లాభించలేదు. దానితో రాజరావు ఆర్థికంగా దెబ్బతిని అప్పులపాలయ్యాడు. కానీ వృత్తిరీత్యా వైద్యుడైన రాజారావు సంఘసేవ మాత్రం ఆపలేదు. పేదవారికి ఉచితం వైద్యం చేస్తుండేవాడు.

ఆ తరువాత ఈయన 1962లో విడుదలైన ఆరాధన వంటి సినిమాల్లో చిన్నాచితక పాత్రలు కూడా పోషించాడు. ఆరాధనలో రాజశ్రీకి తండ్రి షావుకారు పాత్ర వేశాడు[5].

మరణం
జైభవానీ నాటకాన్ని ప్రదర్శించే సమయంలో గుండెపోటు రావడంతో తీవ్ర అస్వస్థులయ్యారు. అదే సమయంలో దేవుడుచేసిన మేలు చిత్రాన్ని నిర్మించినా ఆర్థిక కారణాలవల్ల ఆ చిత్రం విడుదల కాలేదు. మానసికంగా కుంగిపోయిన రాజారావు 1963 సెప్టెంబరు 8న మద్రాసులో మరణించారు.[6]

డాక్టర్‌ గరికపాటి రాజారావు ఫిబ్రవరి 5, 1915న కృష్ణాజిల్లా పోరంకిలో జన్మించారు. దాదాపు అందరూ కొత్త నటీ నటులతో, కొత్త టెక్నీషియన్స్‌తో రాజా ప్రొడక్షన్స్‌ పతాకంపై ‘పుట్టిల్లు’అనే సినిమా తీసారు. కానీ హీరోయే విలన్‌ కావడం వలన ఆ చిత్రం ఆర్ధికంగా దెబ్బతింది. ఈ చిత్రంతోపాటు పొట్టి శ్రీరాములు డాక్యుమెంటరీని జత కలిపి విడుదల చేశారు. ఈ చిత్రం ద్వారా వెండితెరకు పరిచ యమైన వారిలో జమున, అల్లు రామలింగయ్య, సంగీత దర్శకుడు టి.చలపతిరావు, ప్రసిద్ద బుర్ర కథకుడు నాజర్, పబ్లిసిటీ ఆర్టిస్టు కీతా ముఖ్యులు. 1943లో పృథ్వీరాజ్‌ కపూర్, కేవీ, అబ్బాస్, హరి రవీంద్రనాథ్‌ చటోపాధ్యాయ తదితరులతో ఏర్పడిన కమిటీతో కలిసి రాజారావు కూడా అఖిల భారత ప్రజానాట్య మండలిని స్థాపించారు. వివిధ కళా సంస్థల్ని, కళాకారుల్ని ఒకే వేదికపైకి తెచ్చి ప్రజానాట్య మండలి స్థాపించారు.

దాదాపు పదేళ్లు బెజవాడలో ఉండి, డాక్టరుగా, యాక్టరుగా, నాటక సంఘాల ప్రజానాట్యమండలి ఆర్గనైజరుగా పనిచేశారు. మొగల్‌రాజపురంలోని కాట్రగడ్డ వారి ఆవరణలో ప్రారంభమైన ప్రజాశక్తి దినపత్రికలోని కార్మికులకు, కార్యకర్తలకు ఉచిత వైద్యం చేశారు. 1945 డిసెంబరు 30, 1946 జనవరి 1వ తేదీల్లో రాజమండ్రిలో జరిగిన ఆంధ్రరాష్ట్ర అభ్యుదయ రచయితల మహాసభల్లో ప్రజానాట్య మండలి తరపున బుర్ర కథలు, మొదలైన ప్రదర్శనలతో చక్కని కృషి చేశారు. 1946 జూన్‌లో రాష్ట్ర ట్రేడ్‌ యూనియన్ల మహాసభలు రాజమండ్రిలో జరిగినపుడు కోగంటి గోపాల కృష్ణయ్య తదితరులతో రూపొందించిన ప్రెస్‌వర్కరు, మున్సిపల్‌ వర్కరు నృత్య నాటికలను అద్భుతంగా ప్రదర్శించారు. 1945లో రాజమండ్రి వచ్చి లక్ష్మీవారపు పేట బుద్దుడు హాస్పిటల్‌ పక్కన ఉన్న పెంకు టింట్లో ఉండేవారు. వీరేశలింగం ఆర్ట్‌ థియేటర్‌ కూడా స్థాపించారు. రాజా ప్రొడక్షన్స్‌ స్టాపించి 1953లో ‘పుట్టినిల్లు’ సినిమా తీశారు. రాజారావు 9 సెప్టెంబరు 1963న కన్ను మూశారు. రాజరావు నటుడిగా ఆరాధన , బొబ్బిలి యుద్ధం చిత్రాలలో కనిపిస్తారు. రాజమండ్రి మున్సిపల్‌ కార్పొరేషన్‌ వారు ఆయన జ్ఞాపకార్థం దేవీచౌక్‌ నుంచి వెళ్ళే ఒక వీధికి ఆయన పేరు పెట్టారు. ఆ రోడ్డులోనే ఆయన శిష్యులు విగ్రహాన్ని కూడా నెలకొల్పారు. (నేడు గరికపాటి రాజారావు 104వ జయంతి)

కళ ప్రజల కోసం, ప్రగతి కోసం అంటూ.. వృత్తి రీత్యా వైద్యులు అయిన రాజారావు తన జీవితాన్ని సేవకే అంకితం చేసారు. వ్యక్తికి ఉన్న రోగాలను నయం చేయడానికి వైద్యుడు ఎంత అవసరమో సమాజ రుగ్మతలు రూపుమాపడానికి కళాకారుడు, కళాసైన్యం అవసరమని భావించి ప్రజానాట్యమండలిని స్థాపించారు. ప్రజల మధ్య కళారూపాలు ప్రదర్శిస్తూ.. ప్రజల నుండి నేర్చుకుంటూ ప్రజాకళా ఉద్యమాన్ని విస్తృతపరిచారు. ప్రజా ఉద్యమాన్ని ముందుకి నడిపారు. ఆ మహనీయునికి ప్రజానాట్యమండలి సంగారెడ్డి జిల్లా కమిటీ కళా నీరాజనాలు అర్పిస్తుంది.

గరికపాటి రాజారావు (ఫిబ్రవరి 5,1915 – 196?) తెలుగు సినిమా దర్శకుడు, నాటకరంగ ప్రముఖుడు, ఆంధ్ర ప్రజానాట్యమండలి వ్యవస్థాపకుడు. ప్రజానాట్యమండలి సాంఘీక నాటకాలకు పెద్దపీట వేసింది. ఈ నాటక సంఘం ద్వారా అనేకమంది ప్రతిభావంతమైన కళాకారులు పరిచమయ్యారు. చెప్పికోదగిన వారిలో దేవిక, అల్లు రామలింగయ్య, సంగీత దర్శకులు మోహన్ దాస్ మరియు టి.చలపతిరావులు, నృత్యదర్శకుడు వేణుగోపాల్, రచయితలు సుంకర సత్యనారాయణ మరియు వాసిరెడ్డి భాస్కరరావు మరియు బుర్రకథ కళాకారుడు షేక్ నాజర్ ఉన్నారు. రాజారావు 1953లో పుట్టిల్లు సినిమాను స్వయంగా నిర్మించి దర్శకత్యం వహించాడు. ఈ సినిమాలో ప్రముఖ నటీనటులు జమున మరియు అల్లు రామలింగయ్యను వెండితెరకు పరిచయం చేశాడు. పుట్టిల్లు సినిమాలో వివిధ నటులు తమ నటనకు ప్రశంసలందుకున్నా ఈ సినిమా ఆర్ధికంగా లాభించలేదు. దానితో రాజరావు ఆర్ధికంగా దెబ్బతిని అప్పులపాలయ్యాడు. కానీ వృత్తిరీత్యా వైద్యుడైన రాజారావు సంఘసేవ మాత్రం ఆపలేదు. పేదవారికి ఉచితం వైద్యం చేస్తుండేవాడు. ఆ తరువాత ఈయన 1962లో విడుదలైన ఆరాధన వంటి సినిమాల్లో చిన్నాచితక పాత్రలు కూడా పోషించాడు. ఆరాధనలో రాజశ్రీకి తండ్రి షావుకారు పాత్ర వేశాడు.

సశేషం

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -23-3-22-ఉయ్యూరు

Posted in సినిమా | Tagged | Leave a comment

మన మరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు-149

మన మరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు-149
149- విదేశీ వస్త్ర బహిష్కరణ ,సహాయ నిరాకరణ లలో పాల్గొన్న స్వాతంత్ర్య సమరయోధుడు ,ప్రజామిత్ర పత్రికాధిపతి ,ప్రగతిమార్గ చిత్రాలు మాలపిల్ల ,రైతుబిడ్డ దర్శకుడు –గూడవల్లి రామబ్రహ్మం

గూడవల్లి రామబ్రహ్మం (జూన్ 24, 1902 – అక్టోబర్ 1, 1946) ప్రఖ్యాత సినిమా దర్శకుడు, సంపాదకుడు. సినిమాకు పరమార్థం వినోదం మాత్రమే కాదు, అంతకు మించిన సామాజిక ప్రయోజనముందని మాలపిల్ల, రైతుబిడ్డ చిత్రాల ద్వారా చాటిన దార్శనికుడు.హేతువాది.

జీవిత విశేషాలు
1898 జూన్ 24న కృష్ణా జిల్లా, ఉంగుటూరు మండలములోని నందమూరు గ్రామంలో జన్మించాడు. తల్లిదండ్రులు గూడవల్లి వెంకయ్య – బాపమ్మల కలిగిన ఆరుగురు పిల్లలలో రామబ్రహ్మం చిన్నకొడుకు. తొలి తెలుగు జ్ఞానపీఠ్ అవార్డు గ్రహీత, కవి సామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ స్వగ్రామం కూడా నందమూరే. రామబ్రహ్మం చదువు ఇందుపల్లి, గుడివాడ, బందరు లలో సాగింది. అతనికి 18 ఏళ్ళ వయసులో (1920)లో ఇందుపల్లి గ్రామానికి చెందిన కోగంటి నాగయ్య కుమార్తె శారదాంబతో వివాహం జరిగింది. తర్వాత ఆయన చదువు మానేసి తన మామగారింట్లో విదేశీ వస్త్రాలను దహనం చేసి సహాయ నిరాకరణోద్యమంలో పాల్గొన్నాడు.

1924లో ఫ్రెండ్స్ అండ్ కో అనే పేరుతో ఒక స్టేషనరీ షాపు ప్రారంభించాడు. అయితే ఆ షాపు వ్యాపారానికి బదులుగా రచయితలు, కళాకారుల సమావేశాలకు, చర్చలకు ఒక మంచి కేంద్రంగా తయారయింది. దాంతో వ్యాపారం తగ్గిపోయి 1930లో మూసివేయవలసి వచ్చింది. ఆయన 1931లో అఖిలాంధ్ర రైతు మహాసభను ఆర్గనైజింగ్ కమిటీ అధ్యక్షుడి హోదాలో నిర్వహించాడు. 1934లో ఆంధ్ర నాటక పరిషత్ చతుర్థ సమావేశాలకు కార్యదర్శిగా ఎన్నికయ్యాడు. దీనికి నాట్యకళ ప్రపూర్ణ బళ్ళారి రాఘవ అధ్యక్షులు. ఆయన కమ్మ కుల చరిత్ర అనే పుస్తకం వ్రాశాడు. ఆ పుస్తకం వ్రాయడం కోసం కమ్మ కులం గురించి అవసరమైన సమాచారం సేకరించడానికి కడపకు వెళ్ళాడు. అక్కడ ఆయన గండికోట పట్ల ఆకర్షితుడై ఆ కోట గురించి పరిశోధన చేసి ‘గండికోట పతనం’ అనే నాటకం వ్రాశాడు. ఈ నాటకం అనేక నగరాల్లో ప్రదర్శించబడి మంచి ప్రజాదరణ పొందింది.

ప్రజామిత్ర
ఆయన మద్రాసు నుంచి ‘ప్రజామిత్ర’ వారపత్రికను పదేళ్ళ పాటు నడిపాడు. ఆ రోజుల్లో మద్రాసుకు వెళ్ళే తెలుగు రచయితలు, కళాకారులకు ప్రజామిత్ర ఆఫీసే సమావేశ ప్రదేశమైంది. అంతవరకు రాజకీయ పత్రికగా నడిచే ప్రజామిత్రను సంగీత, సాహిత్య, నాటక, చిత్రకళా వ్యాసాలతో ఒక అపురూపమైన పత్రికగా రామబ్రహ్మం తీర్చిదిద్దారు. ఆయన ప్రజామిత్ర లోనే కాక సమదర్శిని, వాది లాంటి ఇతర పత్రికల్లో కూడా ఆర్టికల్స్ వ్రాశాడు.

సముద్రాల రాఘవాచార్య, కుర్రా సుబ్బారావులు ఇతనికి సహాయపడుతుండేవారు. నార్ల వెంకటేశ్వరరావు గారు ఆంధ్రప్రభలో చేరక మునుపు 1937లో ఇతనికి సహాయ సంపాదకునిగా పనిచేశారు. ఆ తరువాత ఆండ్ర శేషగిరిరావు, ముద్దా విశ్వనాథం, బోయి భీమన్నలు కూడా పత్రికా సహాయ సంపాదకులుగా పనిచేశారు.

తాపీ ధర్మారావు, వేలూరి శివరామశాస్త్రి, త్రిపురనేని గోపీచంద్ మొదలైన వారు సాహిత్య వ్యాసాలు రాసేవారు. సంఘాన్ని నిష్కర్షగా విమర్శించి సంచలనం కలిగించే రచనలతో పత్రిక సాగించాలి. అపూర్వ విషయాలతో పత్రిక విజ్ఞాన సర్వస్వం అనిపించుకోవాలి అనే లక్ష్యాలతో రామబ్రహ్మం సమర్ధులైన రచయితల సహకారంతో పత్రికను నిర్వహించేవారు.

సినిమా జీవితం
ఆయన ఆసక్తి సినిమాల మీదకుమళ్ళాక ఆయన పత్రికారంగాన్ని వదిలి పెట్టి సారథిచిత్ర అనే చిత్ర నిర్మాణ సంస్థను స్థాపించాడు. ఆయన 1934లో తీసిన శ్రీ కృష్ణ లీలలు చిత్రంలో శ్రీకృష్ణుడి పాత్ర వేయించడం కోసం రామబ్రహ్మం, నిర్మాత పి.వి.దాసు కలిసి రాజేశ్వర రావు అనే నటుడిని బెంగుళూరు నుంచి తీసుకు వచ్చారు. తర్వాత 1936లో విడుదలైన ద్రౌపదీ వస్త్రాపహరణం సినిమాలో కూడా ఆయన పనిచేశాడు. ఈ అనుభవాలతో చిత్రనిర్మాణ కళ తనకు పట్టుబడిన తర్వాత, పౌరాణిక చిత్రాల జోరులో కొట్టుకుని పోతున్న జనం అభిరుచులను మార్చడానికి సాహసించి సఫలుడైన ధీశాలి గూడవల్లి. తెలుగు సినిమా చరిత్రలో ఒక మైలురాయిగా నిలిచిపోయిన చిత్రం మాలపిల్ల ఆయన తీసిన తదుపరి చిత్రం. సారథిచిత్ర బ్యానర్ మీద రామబ్రహ్మం నిర్మించి దర్శకత్వం వహించిన ఈ సినిమా 1938లో విడుదలైంది.

మాలపిల్ల
దక్షిణాది రాష్ట్రాల్లో బ్రాహ్మణేతరుల ఆత్మగౌరవ సంరక్షణ ఉద్యమంతో బాటు గాంధీజీ హరిజనోద్ధరణ ఉద్యమం కూడా జోరుగా సాగుతున్న నేపథ్యంలో రామబ్రహ్మం కుల వ్యవస్థకు వ్యతిరేకంగా మాలపిల్ల చిత్రాన్ని ఉన్నత ప్రమాణాలతో నిర్మించాడు. అసలు సిసలు సామాజిక ప్రయోజనం గల చిత్రంగా చరిత్ర పుటల్లో నిలిచిపోయిన చిత్రం మాలపిల్ల. జస్టిస్ పార్టీ వారి సమదర్శినితో బాటు ప్రజామిత్ర పత్రికకూ సంపాదకుడైన రామబ్రహ్మం పత్రికల కన్నా సినిమాయే శక్తివంతమైన ప్రచార సాధనమని గుర్తించి ఊపిరిపోసిన చిత్రమిది. ఆనాడు దేశాన్ని పట్టి ఊపేస్తున్న హరిజనోద్యమాన్ని రామబ్రహ్మం తన సినిమాకు ఇతివృత్తంగా తీసుకుని,గుడిపాటి వెంకటచలంతో కథారచన చేయించాడు. ఈ సినిమాకు తాపీ ధర్మారావు సంభాషణలు వ్రాశాడు.చలం, ధర్మారావు ఇద్దరూ ఆనాటి సమాజంలో చలామణి అవుతున్న అర్థం లేని ఆచారాలను అపహాస్యం చేసిన వారే. మాలపిల్ల చిత్రం లోని పాటలకు భావకవి బసవరాజు అప్పారావు కావ్యగౌరవం కల్పించాడు.ఇందరు ప్రముఖుల సౄజనాత్మక భాగస్వామ్యంతో తయారైన మాలపిల్ల తెలుగు నాట అఖండ విజయం సాధించింది. జస్టిస్ పార్టీ నేతృత్వంలో 1920వ దశాబ్దంలో బ్రాహ్మణేతరుల ఆత్మగౌరవ సంరక్షణ ఉద్యమం జోరుగా నడిచిన ఇతర దక్షిణాది రాష్ట్రాల్లో కూడా ఈ చిత్రం ఘన విజయం సాధించింది.

మాలపిల్ల చిత్రం కాంచనమాలను సూపర్ స్టార్ ను చేసింది. పౌరాణిక చిత్రాల జోరులో ప్రప్రథమంగా ఒక సమకాలీన సమస్యను ఇతివృత్తంగా తీసుకుని నిర్మించిన ఈ చిత్రం అప్పటి ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలోని తెలుగు భాషాప్రాంతాల్లోనే గాక ఇతర భాషా ప్రాంతాల్లో కూడా పెద్ద హిట్. నాటి గాయని, నటి సుందరమ్మతో కలిసి ఆమె పాడిన నల్లవాడే గొల్లపిల్లవాడే సూపర్ హిట్ అయింది. అప్పటికింకా భాషాదురభిమానం తలెత్తక పోవడంతో దక్షిణభారతమంతటా ఆ పాట జనం నాలుకలపై నర్తించింది.

ఆ నాటి సమాజంలో ఈ సినిమా తీవ్ర సంచలనం కలిగించింది. ఈ చిత్రానికి వ్యతిరేకంగా తెలుగునాట కరపత్రాల పంపిణీ జరిగింది. అప్పట్లో బెజవాడలో జరిగిన ఒక ‘నిరసన మహాసభ ‘ బ్రాహ్మణులు మాలపిల్లను చూడరాదని తీర్మానించింది. అయినా దొంగచాటుగా ఆ సినిమాను చూసి వచ్చిన యువబ్రాహ్మణులకు తల్లిదండ్రులు వీధిలోనే శుద్ధి స్నానం చేయించి గానీ ఇంట్లోకి రానిచ్చేవారు కాదు. రామబ్రహ్మం కూడా “మాలపిల్ల ను చూడడానికి వచ్చే పిలక బ్రాహ్మణులకు టికెట్లు ఉచితం” అంటూ అగ్రహారాలలో కరపత్రాలు పంచాడు. ఆయన తీసిన తదుపరి చిత్రం రైతుబిడ్డ

రైతుబిడ్డ
ప్రధాన వ్యాసం: రైతుబిడ్డ (1939 సినిమా)

మాలపిల్ల తర్వాత జమీందారీ వ్యవస్థకు వ్యతిరేకంగా రైతుబిడ్డ తీసి రామబ్రహ్మం తన సాహస ప్రవృత్తిని మళ్ళీ చాటుకున్నాడు. 1925 లో ఆవిర్భవించిన ఆంధ్ర రాష్ట్ర రైతు సంఘం ఛత్రం క్రింద జాగృతులైన సన్నకారు రైతులు తమ హక్కుల సాధనకు నడుం కట్టారు. 1937లో మద్రాసులో కాంగ్రెసు ప్రభుత్వం నియమించిన కమిటీ ఒకటి భూమికి యజమాని రైతేనని తీర్మానించింది. ఈ చారిత్రక నేపథ్యంలో రామబ్రహ్మం రైతుబిడ్డను నిర్మించాడు.

ఈ సినిమాకు రామబ్రహ్మం స్వయంగా కథ సమకూర్చగా త్రిపురనేని గోపీచంద్ మాటలు వ్రాశాడు. కొసరాజు పాటలు వ్రాయగా, జమీన్ రైతు ఉద్యమంలో నెల్లూరు వెంకట్రామానాయుడు వ్రాసిన గీతాలను కూడా ఈ సినిమాలో వాడుకున్నారు. సంగీత దర్శకుడు బి.నరసింహారావు.

ఈ సినిమాకు వ్యతిరేకత సనాతన వర్గాలకంటే బలంగా జమీందార్ల నుంచి ఎదురైంది. మాలపిల్లను ప్రభుత్వం నిషేధించలేదు. కానీ జమీందార్లు రైతుబిడ్డ సిన్మాను ప్రభుత్వం చేత నిషేధింపజేయగలిగారు. ఇంకో విచిత్రమేమిటంటే జమీందార్ల ఘాతుకాలను నిరసించిన ఈ సినిమాను నిర్మించినది ఒక జమీందారు. ఈ చిత్ర నిర్మాత అయిన చల్లపల్లి రాజా జమీందార్ల పార్టీ అయిన జస్టిస్ పార్టీలో ఒక వర్గానికి నాయకుడు. పార్టీలో ఆయన ప్రత్యర్థి వర్గానికి నాయకుడైన మీర్జాపురం రాజా ఈ చిత్రాన్ని తీవ్రంగా వ్యతిరేకించి, తిరోగమన ధోరణిలో అనేక జానపద, పౌరాణిక చిత్రాలను నిర్మించాడు.

రైతుబిడ్డ చిత్రాన్ని జమీందార్ల ఒత్తిడిపై బ్రిటిష్ ప్రభుత్వం నిషేధించినా ఆ చిత్రం ప్రతిబింబించిన స్ఫూర్తి కాలక్రమంలో విజయం సాధించింది. 1955లో విడుదలై ఘనవిజయం సాధించిన రోజులు మారాయి చిత్రాన్ని రైతుబిడ్డకు కొనసాగింపు అనుకోవచ్చు. ఇటువంటి చిత్రాల ద్వారా ప్రస్ఫుటంగా వ్యక్తమైన కోస్తా రైతాంగ చైతన్యం కాలక్రమంలో తెలుగుదేశం పార్టీ ఘన విజయానికి వెన్నుదన్నుగా నిలిచింది. కులవ్యవస్థ నిర్మూలన సందేశం ఇవ్వడం కోసం కూడా రామబ్రహ్మం నడుం కట్టాడు. పల్నాటి బ్రహ్మనాయుడు పాత్ర ద్వారా ఈ సందేశాన్ని ఇవ్వడానికి పల్నాటి యుద్ధం సినిమా తీశాడు.

తీసిన సినిమాలు
· మాలపిల్ల (1938) నిర్మాత, దర్శకుడు

· రైతుబిడ్డ (1939) రచయిత, దర్శకుడు

· ఇల్లాలు (1940) దర్శకుడు

· అపవాదు (1941) దర్శకుడు

· పత్ని (1942) దర్శకుడు

· పంతులమ్మ (1943) దర్శకుడు

· మాయలోకం (1945) దర్శకుడు

· పల్నాటి యుద్ధం (1947) దర్శకుడు

“రామబ్రహ్మం, బి.ఎన్.రెడ్డి తమకున్నలాంటి సంస్కృతే ప్రేక్షకులకు ఉన్నట్లుగా భావించేవారు తప్ప వారిని వెర్రివెంగళప్పలుగా చూడలేదు.” -కొడవటిగంటి కుటుంబరావు.

ఇతర వివరాలు
· రామబ్రహ్మం 1942-43, 1944-45 సంవత్సరాలలో రెండు సార్లు దక్షిణ భారత ఫిలిం వాణిజ్యమండలి అధ్యక్షునిగా ఎన్నికయ్యారు.

· రామబ్రహ్మానికి మధుమేహం వ్యాధి ఉంది. పల్నాటి యుద్ధం భారీ సినిమా నిర్మాణ సమయంలో (1946) హఠాత్తుగా అతనికి పక్షవాతం వచ్చింది. ఎన్ని మందులు వాడినా వ్యాధి తగ్గకుండా అక్టోబరు 1న కాలధర్మం చేశారు.

· విజయవాడలో ఈడ్పుగంటి లక్ష్మణరావు కార్యదర్శిగా, అక్కినేని నాగేశ్వరరావు గౌరవాద్యక్షునిగా ‘గూడవల్లి రామబ్రహ్మం సినీ కళాసాగర్’ అనే సంస్థను స్థాపించి సుమారు పది సంవత్సరాలు నాటక, సినీ రంగాలకు సేవచేశారు.

· తెనాలిలో రామబ్రహ్మం 30వ వర్ధంతి సందర్భంగా 1976 అక్టోబరులో ‘రామబ్రహ్మం సంస్మరణ సంఘం’ ఏర్పడి అతనితో సాన్నిహిత్యం ఉన్న ప్రముఖులతో విలువైన వ్యాసాలు రాయించి ‘స్మారక సంచిక’ను ప్రచురించారు.

· విజయవాడ గాంధీనగర్ లోని అలంకార్ సెంటర్ లో రామబ్రహ్మం కాంస్య విగ్రహాన్ని 1983లో అప్పటి ముఖ్యమంత్రి ఎన్.టి.రామారావు ఆవిష్కరించారు.

అక్కినేని జ్ఞాపకాలు

“పూజ్యులు, పితృతుల్యులు శ్రీ గూడవల్లి రామబ్రహ్మంగారు తీసిన ’మాయలోకం’ (1945)లో నేను రాకుమారుడిగా నటించాను. ఐతే, ఆ వేషం వుందని తెలిసి ప్రయత్నించడానికి వెళ్ళినపుడు నాకేమీ తెలీదు. నమస్కారం పెట్టాలన్న కనీససంస్కారం కూడా తెలియనివాడిని. నన్ను పంపిన ఘంటసాల బలరామయ్యగారిని ”ఎవడయ్యా వీడు?” అని అడిగితే, ”మీ వాడే” అన్నారాయన. అంటే ’మీ కులం వాడే’నని సూచన. “అందుకేనా అంత…” అన్నారు రామబ్రహ్మంగారు అంత పొగరు నాకుందన్నట్టు! ”పల్లెటూరివాడు, పద్ధతులు తెలియవు. కాని మంచి కుర్రాడు. వృద్ధిలోకి రావలసిన వాడు” అని నా గురించి పెద్దలు చెప్పడంతో – రామబ్రహ్మంగారు నాకు ఆ వేషం ఇచ్చారు. అలా ఆయన దగ్గర చేరాను. క్రమేణా నాపట్ల ఆయనకి వాత్సల్యం కలిగింది. ప్రేమగా చూశారు. నన్ను తన ఇంట్లోనే పెట్టుకున్నారు. నాకు ఏం కావాలో అది పెట్టారు. నేను కుర్రాడిని గనక, నా ప్రవర్తన మీద ఒక కన్ను వేసి వుంచేవారు. రామబ్రహ్మంగారు గొప్ప సంస్కారి. ఆయన చూపిన వాత్సల్యాభిమానాలే నాకు పాఠాలైనాయి. ఎన్నో విషయాలు నేర్చుకున్నాను; తెలుసుకున్నాను. ఆయన ’మాలపిల్ల’, ’రైతుబిడ్డ’ వంటి సంచలన చిత్రాలు తీసిన గొప్ప దర్శకుడు. నా అదృష్టం వల్ల నేను ఆయన పెంపకంలో వుంటూ ’మాయలోకం’, ’పల్నాటియుద్ధం’ చిత్రాల్లో నటించాను. పెద్దవారి ప్రోత్సాహం, పెంపకం, ఆదరణా లభించకపోతే ఏ వ్యక్తీ ఉన్నత స్థానం పొందలేడు. నేను ఎప్పుడూ ఆయన్ని దర్శకుడిగా చూడలేదు. తండ్రిగా చూశాను. నన్ను ఆయన కొడుకులా చూశారు. వారి ఆశీస్సులు, అభిమానాదరాలే నాకు రక్షగా ఎంతో నిలబడ్డాయి.

అటువంటి గొప్ప దర్శకుడి జీవితకథను వివరిస్తూ పుస్తకం రావడం ఎంతో సంతోషం. పుస్తకాన్ని వెలువరిస్తున్న రచయితను, ప్రచురణ కర్తలను అభినందిస్తున్నాను!” అక్కినేని నాగేశ్వరరావు

సశేషం

మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -23-3-22-ఉయ్యూరు

Posted in సినిమా | Tagged | Leave a comment

శతవసంతాల కవి ‘’సౌందర్యం లో నడుచు నామె ‘’ పై పలికిన కవితా కలకూజితం -3(చివరిభాగం

శతవసంతాల కవి ‘’సౌందర్యం లో నడుచు నామె ‘’ పై పలికిన కవితా కలకూజితం -3(చివరిభాగం )
‘’తనగానం ఎంత భయంకర సౌందర్యమో –అంత శ్రావ్యతాధిక్యత వలన మరణించే పక్షి ‘’చిత్రాన్ని కీట్స్ కవితా సంకలనం పై ముద్రించినందుకు మురిసిపోయిన ఇమేజిజం కవయిత్రి అమీ లో వెల్ అన్నమాటలివి .అలాగే అత్యంత భావ స్నిగ్ధ హృదయుడైన కీట్స్ మహాకవి తనకు తెలిసిందంతా కొద్దికాలం లోనే పాడి మరణించాడు .రాశికన్నా వాసి ముఖ్యమని రుజువు చేశాడు .కనుక ఆపక్షి బొమ్మ సంపుటిపై ముద్రించటం ఆప్ట్ అన్నదామె భావోద్రేకం తో .ఈమే’’పటిష్టమైన వసుధ లో ఐక్యం కావటం తనకు ఆనందం అని ప్రకటించింది మరో కవితలో.కీట్స్ పై ఆరాధన వెదజల్లుతూ మరొక కవితలో ‘’పరిపూర్ణ పరిపక్వ మేధనీది .కవితా బృహస్పతి .అవనీతల యవ్వనం లో తారాహారాలు వెదజల్లిన స్ఫటిక ద్వార సంరక్షకుడు అని ,అతనిగానం మునుముందుకు సాగిపోవాలని ఆసౌ౦దర్య విలసితకవిత్వం అనంతంగా వెల్లివిరియాలని మనస్పూర్తిగా ఆకాంక్షించింది .
తన పందెం గెలవలేని వాడు మగతనం ఉన్న మగాడు అనిపించుకోడు .పెరుగుదలలేక బతికి చనిపోతాడు .ఎండవాన చలి మంచు లోనే చేవకలకలప పెరుగుతుంది మనుష్యులూ అంతేఅంటాడు డగ్లాస్ మాల్కొచ్ .దీర్ఘ యాత్ర ముగిసిన తర్వాత ప్రశాంతమైన ముద్ర ,మధురస్వప్నాలు మాత్రమె అడిగాను అన్నాడు మాన్స్ ఫీల్డ్ వారధి జ్వరం కవితలో .మరోకవి వాఖేల్ లిండ్సే ‘’పూలతోటల్లో నందనవనాల్లో నడిచే బాలుడిని జ్ఞాపకం చేసుకొన్నాడు .తోటిపిల్లలతో హాయిగా అడిపాడుతాడు .శాశ్వత వాసంతికాద్భుత మధుర వనాన్వేషకుడు వాడు..అందమైన జీవితం లో ప్రేమా ,విశ్వాసాలే మనిషికి ముక్తి కలిగిస్తాయి అని చాటింది నాన్సీ టర్నర్ .
రెండుభాగాల ప్రసిద్ధ దీర్ఘ కవిత ‘’దిహైవే మాన్ ‘’లో ఆల్ఫ్రెడ్ నోయిస్ బందిపోటు వర్ణన అద్భుతంగా చేశాడు .సత్రపు యజమాని నళ్ళకళ్ళ కూతురు పై మనసు పారేసుకొన్నవాడు చంద్రకాంతిలో ఆమె కేశాలను ముద్దాడటం చూశాడు .చంద్రకాంతిలో తనకోసం చూడమని చెప్పి వాడు గుర్రమెక్కి వెళ్ళాడు .ఎంతకీ రాలేదు .నిరీక్షించి చీకటి లో చనిపోయింది .దౌడు తీశాడు హైవే పై కాల్చి పారేశారు అతడినీ .ఈ కవితలో ప్రేమ ,శౌర్యం, త్యాగం త్రివేణి గా సాగాయి .స్వచ్చమైన ప్రేమకు అద్దంపట్టింది .బెస్,హైవే మాన్ఇద్దరూ తమ వాగ్దానాలు నిలబెట్టుకొన్నారు .కానీ దుర్విధి ఇద్దర్నీ వేరు చేయటమే కాదు ,చంపబడ్డారు నిర్దాక్షిణ్యంగా .కానీ వారి ఆత్మలు మాత్రం స్వర్గం లో కలుసుకున్నాయి .ప్రేమ,ప్రేమ కోల్పోవటం, చావు ఇందులో అంశాలు .
‘’వచ్చింది అతి ఎక్కువగా ,పోయింది అతి ఎక్కువగా చూడు ‘’అని వేదాంతి మాటగా సారా టియస్ డేల్ కవితలో చెప్పింది .మరోకవితలో కాంతిలో కాంతి కరిగినట్లు తానూ కరిగిపోవాలనీ ,లోతైన ప్రేమలో ముంచేసి బధిరాంధురాలిని చేయమనీ కోరింది .ఒకరోజు సార్ధకం కావాలంటే ఒక తల్లి ముద్దు ,ఒకపాప ప్రార్ధన ,పుట్టెడు ప్రేమ ,ఒకసోదరభావం ఆశామంత్రం మిత్రుని ప్రోత్సాహం ఉండాల్సిందే అన్నాడు విలియం సెడ్జేర్.రూపర్ట్ బ్రూక్ ‘’వంటరులై నిర్ధనులై విశ్వాన్ని వదిలి పెట్టి ,ఆశించని ప్రశాంతత కు దూరమై పుత్రులుగా ఉండబోయేవారికి అమరత్వం కలిగించి ,వారసత్వాన్ని గౌరవాన్నీ కలిగించిన మృతులను అమరులన్నాడు .మనసు దాచగలిగినదానికన్నాఎత్తుగా పెరుగుతుంది .తారలను దూరంగా నిలబెట్టే అద్భుతం అదే అన్నాడు అమెరికన్ కవి కమింగ్స్ .ఎం ఎన్ రాయ్ ‘’జ్ఞాని ప్రవరుడు .నూతనమానవతా వాద జ్వాలతో జీవి౦చి ,కోట్లదిమానవుల మనస్సులలో విజ్ఞానకాంతి నింపాడు ‘’అని గొప్పగా కీర్తి౦చాడు తన గురువు ఫిలాసఫర్ గైడ్ మానవేంద్ర రాయ్ ని శ్రీ శ్రీ,ఆరుద్ర లాంటి వారెందరికో మార్గదర్శి అయిన డా అబ్బూరి రామకృష్ణారావు .చీకటిలో ఉన్నా ఆమె ఒకపాట లా మెదిలి ఇంకా మదిలో మెరుస్తూనే ఉంది జె.హెచ్ జోన్స్ కు .
లూయీ షిమాన్ కు ‘’జీవితం ఇంకా హాయిగా ఉంటుంది చూసిన మంచిని పొందగలిగితే అనిపించింది .మంచిగా ఆలోచించటం ఆనందకరం ,ఆరోగ్యం కూడా .తండ్రి ప్రేమలో ఉన్న ఒంటరితనం గాంభీర్యం తనకేమీ తెలియదన్నాడు రాబర్ట్ హైడన్.’’అనాక్రమిత పావనోన్నత –ప్రదేశం లో పాదాలుపెట్టి చేయి సాచి దైవ ముఖం తాకాడు ‘’కవీ ,పైలట్ జాన్ గిల్లిప్సి మాగీ .ఇతడే శోకిస్తూ ప్రేమిస్తూ నిద్రించిన ‘’అతడు’’ ను గుర్తుకు తెచ్చుకొన్నాడు .’’ఏది జరిగినా వంటరి కావు .ఎండకోసం వేచి ఉండు .మేఘాలు ఎప్పుడో ఒకప్పుడు పోక తప్పదు’’అని ధైర్యం చెప్పిన కవిత లీసా మార్క్ ది.’’నిరసన భావమే ఓటమి వంతు .చిత్తుగా ఓడి,తిరిగి పోరాడే వాడే నిజమైన రాజు .పరాజితులు జెండాలను ఎప్పటికీ విప్పరు. వీళ్ళకూ ప్రశంసా గీతాలు పాడతాను అంటాడు ఒక అజ్ఞాతకవి .ఈ సౌన్దర్యభరిత లోకాన్ని విడిచినా ,దైవంతో ఉన్నది ఒకటి ,దివ్యమైనది మరోటీ ఉన్నాయి అంటుంది స్వయం కృషితో కవయిత్రి అయినఆశావాదీ అమెరికన్ మహిళ హామాండ్ .మరోఅజ్ఞాతకవి ‘’జీవితం నాకేమీ రుణపడి లేదు .ప్రతికొత్తశ్వాస నూ ఆనందిస్తూ,జీవితాన్ని కౌగిలిస్తాను చావును లక్ష్యపెట్టను .పదేళ్ళు, కాని తొమ్మిది పదులు కానీ ప్రతిగడియను బ్రతికినంతకాలం కృతజ్ఞత తో స్వాగతిస్తాను ‘’అని జీవితానికి సార్ధకత కూర్చటం మన ధర్మమని ఎలుగెత్తి చెప్పిన కవితతో ఈ కవితా కలకూజితం ముగిసింది .
ఇలా అరవై కవితలను రాసిన అందరి కవులను గురించి స్ప్రుశించాను అంతే .తలస్పర్శ అంటారు అది నేను చేసింది .ప్రతికవితలో ఏదో ఒక విలక్షణత ,ఒక వైవిధ్యం ఒక తాత్వికత ,జీవిత దృక్పధం ,ప్రేమ శుద్ధ స్వచ్చ ప్రణయం ,కర్తవ్య౦,దైవీ భావం ,మానవత్వ వికసనం ,సౌందర్యం, దానికై ఆరాటం ,ఆరాధన ,ఆత్మ దర్శనం ,చావును లేక్కచేయకపోవటం, అది తప్పదు అన్న నిజం , దానికి దిగులు పడుతూ కూర్చోటం కన్నా ఎప్పుడూ అడుగు ముందుకు వేసే ఆలోచన ,ఆశ మిత్రప్రోత్సాహం ,గెలవాలి గెలిచితీరాలన్న దీక్ష ,జాతికి విజ్ఞాన వెలుగు నిచ్చిన వారికి కైమోడ్పు ,ఓడినా పోరాటం ఆపరాదనే సంకల్పం ,విపరీత భయంకర కాలం లోనూ సడలని విశ్వాసం ,బ్రతికి నేర్వటం బ్రతుకుతూ బ్రతికించటం వంటి జీవిత సౌందర్య విషయాలు స్పష్టంగా ,నిర్దుష్టంగా ,అంతర్వాహినిగా ఉన్నాయి .ఇన్ని గోప్పలక్షణాలున్నడా శర్మాజీ అందుకే వీటిని ఎన్నుకొని అనువదించి న్యాయం చేకూర్చి ఆ ఆంగ్లకవులకు తెలుగు మాగాణం లో ,గుండెల్లో గుడులు కట్టించారు ,నాకు ఆకవితల్లో లభించిన ఆణిముత్యాలను ఏరి మీ ముందు పోశాను .పుస్తకం చివర ప్రతికవినీ సంక్షిప్తంగా శర్మగారు పరిచయం చేసి ,వారిని మనవారిని చేశారు .అందులో ఆయనకుఅత్యంత ఇష్టుడైన కీట్స్ కవి వసంతునిపై సుదీర్ఘ వివరణ రాసి ,ఈ కవితా సంకలన శీర్షిక కే సార్ధక తెచ్చారు .
ఈ శతవసంత కవి డా రాచకొండ నరసింహ శర్మ ఎం డి.గారు నా లాంటి వారికి స్పూర్తి ప్రదాత .మరో సారి వారికి పాదాభి వందనం చేస్తూ ముగిస్తున్నాను .
మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -23-3-22-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

శతవసంతాల కవి ‘’సౌందర్యం లో నడుచు నామె ‘’ పై పలికిన కవితా కలకూజితం -2

శతవసంతాల కవి ‘’సౌందర్యం లో నడుచు నామె ‘’ పై పలికిన కవితా కలకూజితం -2
పూలు వచ్చే ఏడాదైనా పూస్తాయి దానికోసం కన్నీరు కార్చకు .సజ్జనుడికి సంతోషం కలిగించేది ఇలాంటి వెండి నాసికే అంటాడు కీట్స్ కవి .దేనికైనా సిద్ధమై ,సాధిస్తూ సాధిస్తూ శ్రమిస్తూ ముందుకు వెళ్లాలని నేచర్ పోయేట్ వర్డ్స్ వర్త్ అన్న విలువైనమాట .పోయి౦ది అనుకొన్న పాటఒక స్నేహితుని యెదలో పూర్తిగా చూసి సంతృప్తిచెందాడు ఆయనే .ఆశకంటే నిరాశ బలమైనదైనానా ‘’ఆశ స్ప్రింగ్ లాగా అజేయమై పైకి లేస్తుంది అని హామీ ఇస్తుంది షార్లెట్ బ్రాంటే .ఈమె సోదరి ఎమిలి బ్రాంటే వి అయిదు కవితలున్నాయి ‘’సంకెళ్ళు లేని స్వచ్చమైన హృదయాన్నీ ,చావు బతుకల్లో ఓదార్చే ధైర్యం ‘’కోరింది .శోకాన్ని మంచురూపం లో శిశిరం కురిపిస్తే ,పునర్జీవనంతో బతుకు ముడి పడిఉంది కనుక ముందుకు మునుముందుకె సాగిపోమ్మన్నది .తాను ఏడుస్తుంటే ‘’ఆమె ‘’పాడుతూ ,తాను వింటుంటే ఆపేస్తుంది .తన వేదనలకు శాంతి కలిగించ గలిగినా ఆమె మాత్రం ఆకాశం లోకి ఎగిరిపోయి తిరిగి రాలేదని బాధ పడింది కొరవడిన ఆశ గురించి .మెరుస్తున్న జ్యొతి ఎప్పుడూ ముందుకే ఉంటుంది కానీ పట్టుకొంటే ఆరిపోతుంది .తెలియని స్వప్నం లో లాగా త్రోవ చూపటం దానికున్న విలువ .ప్రాణం ,ప్రాణీ అదే .అనశ్వరమూ అదే. అదే ఆత్మ. ఇవి ఎమిలీ కవితాత్మ పంక్తులు .ఈమె ‘’ఉదరింగ్ హైట్స్’నవల విఖ్యాతమైనది .మగాడు రాశాడని లోకం అనుకొన్నది .విచ్చలవిడితనం తో వెర్రెక్కించింది .ఈ సోదరీత్రయం ముగ్గురూ కవిత్వం లో సిద్ధహస్తులే .
ఫోబ్ కేరి ‘’మహనీయ స్వచ్చమైన ఆత్మనే దర్శిస్తాను ‘’అని కోరుకొన్నది .పరిపూర్ణ మానవత దైవ సమాన ప్రమాణం పొందుతుందని నమ్మింది .స్వేచ్చదాత విశ్వాత్మ ప్రేమతో చేయి వేయన౦తకాలం అంధురాలుగా నిలబడ్డా నంటుంది .కడలిలో ఆఖరి అంగుళం పై కాలు పెట్టి అస్థిరమైన ఆ నడక కు అనుభవం అంటా రన్నది ఎమిలి డికిన్సన్ .’’నన్ను గుర్తుకు తెచ్చుకొని దుఖించటం కన్నా –చిరు నవ్వుతో నన్ను మర్చిపోవటం చాలమంచిది ‘’అని హితవు చెప్పింది క్రిష్టియానో రోసేట్టి .’’జీతానికి తగిన పని చేసినఆనందం తో నాకోసం పగలు ముగిసిన తర్వాత ఒక పాట పాడగలవా ?’’అని అభ్యర్ధించాడు ఆచార్య జోసెఫ్ మారిసన్ .’’ఓడిపోయినా పోరాడేవాడు నా కవల సోదరుడు’’అని అభినందించాడు జోసెఫ్ మిల్లర్ .రంగులు పులుముకున్న రాత్రి మేఘాన్ని చూసి ‘’తొందరగా తెల్లారు తుంది ‘’అని ఆశా గీతం పాడాడు ధామస్ హార్డీ .’’ప్రతి ఎదలో దాగి ఉండే మాట దయ ‘’అంటాడు ఒరేల్లీ .అన్నిట్నీ ‘’లైట్ తీస్కో ‘’అన్నట్లు ఎల్లియట్ కవి ‘’నవ్వేసి ఊరుకో వివేక శీలిగా ఉండాలనుకొంటే నవ్వు కన్నా మంచి మందు లేదు .కనుక నవ్వేసి ఊరుకో భయ్యా ‘’అని చిట్కా వైద్యం చెప్పాడు .ప్రముఖ కవి లూయీ స్టీవెన్సన్ స్వర్లోకశస్త్రవైద్యుడితో ‘’మొద్దుబారిన నా గుండె ను నిశితాగ్ర ఆనందం తో గుచ్ఛి తెలివి తెప్పించు .నా ప్రాణం పోకముందే మొనదీరిన బాకు వంటి బాధను ,ప్రాణాంతక పాపాన్నీ గుండెలో నిర్దాక్షిణ్యంగా గుచ్చు ‘’అని ప్రాధేయపడ్డాడు .జ్ఞానం పంచటానికి ముందు మనం జ్ఞానం ఆర్జించాలి .బతికి నేర్చుకోవాలి బతకటం నేర్చుకోవాలి .శాంతి విత్తనాలు చల్లు .నాటిన మర్రి విత్తనం మానై ,ఊడలు దిగి ఎందఱో సైనికులకు నీడ ఇచ్చి నట్లు సౌఖ్యం పంచు ‘’అన్నది సూటిగా వీలర్ విల్కాక్స్ కవయిత్రి .’’ఇవాళే నా రోజు రేపు ఎంతో ఆలస్యం ‘’తస్మాత్ జాగ్రత అని జాగృతి పల్కాడు ఎడ్విన్ మార్క్ హాం .సిడ్ని లిసాట్ ‘’తలుపు తెరవక పోవటం కంటే ,తలుపు నుంచే పంపేయటం హీనం ‘’అని చివాట్లు పెట్టాడు .
యోధుడైన తన భర్త చనిపోయి ఇంటికి తెస్తే ‘’ఏడు, లేకపోతె ప్రాణం వదులు ‘’అనిస్త్రీలు చెప్పినా ,అతని గొప్పతనాన్ని గానం చేసినా ,ముఖం పై కప్పినవస్త్రం తొలగించినా ,ఆమె యేడవనే లేదు .ముసలి నర్సు ఆమె శిశువును తెచ్చి మోకాలిపై ఉంచితే ఆమె వేసవిలో వరదలా కన్నీరు కార్చి ‘’నీ కోసమే బతుకుతాను బిడ్డా ‘’అని తెప్పరిల్లింది .చక్కని నాటకీయ కవిత్వం .ప్రబోదాత్మకం .కర్తవ్య బోధనం తో ఆల్ఫ్రెడ్ టెన్నిసన్ రాసిన కవిత ఇది .గుండె పట్లు కదిలిస్తుంది .అవకాశం చేత దీబ్బతిన్ననడుం వంగిన ముసలి కైజర్ కవి ‘’ఓడిపోయిన వారిలో నన్ను కలపవద్దు .మళ్ళీ శక్తి యుక్తులు కూడగట్టుకొని రేపు ప్రయత్నిస్తాను ‘’అని దీమాచాటి, ఆదర్శానికి దారి చూపాడు .పోరాటంవలన మనసు దిట్ట పడిఉత్సాహం ఇస్తుంది . పోరాటమే ఆశలకు ప్రాణం పోస్తుందని ,,సంశయ నివృత్తి చేసుకొని ,తనకోరికలకు పరిష్టితులు ప్రతికూలంగా ఉన్నా ,’’పోరాటమే నాలో కలిగిస్తుంది మనో బలం ,నేనింకా అపరాజితుడను ‘’అంటూ ఉత్సాహంకల్గిస్తాడు జీవిత పోరాటంలో .ఇతడి రెండు కవితలు రత్న మాణిక్యాలే .ఎడ్మండ్ వాన్స్ కుక్ కవి అదృష్టదేవత మన దగ్గర ఉండకపోవచ్చు .వీధిలో జనాలు మనల్ని వెక్కిరించచ్చు .దేన్నీ ఖాతరు చేయకుండా కొంచెమైన నువ్వుతో ముఖం వెలిగితే మనల్ని పట్టుకోనేవాడు ఉండడు. గెలుపుకు ఇదే విశ్వాసం కావాలని బోధ చేశాడు .అతడిదే మరో కవితలో ‘’గోడకు కొట్టిన బంతిలా మరింత ఎత్తుకు ఎగరాలి గోడకు కొట్టిన పిడకలా కాదు .ఎందుకు పోరాడాను ఎలా పోరాడాను అనే ఆలోచించు .నువ్వు చనిపోయావన్నది ముఖ్యం కాదు .ఎలా మృతి చెందావు అన్నదే లెక్కలోకి వస్తుంది ‘’అని పోరాట పటిమ బోధించాడు .జాన్ ఆపిల్టన్ కవి శాశ్వత అపజయం తో ఆత్మ నిందతో చనిపోబోతున్న నౌకా శిధిలాల మధ్య నైరాశ్యం అంచున పడిఉన్న భగ్న స్వాప్నికుని చూసి తాను భాగమైన ఆత్మను కనుగొని ,ఆత్మీయనురాగం ,సంపూర్ణాధికారంతో ‘’గెలవాలి నువ్వు ‘’అని చెవిలో చెప్పి ,తనభయాలను లోతుగుండేలో దాచుకొని ,కనిపెట్టిరక్షిస్తూ ‘’గెలుస్తావు గెల్చి తీర్తావు .’’అని ఉత్సాహపరచింది .పూలబాటలో నైనా ముళ్ళ దారిలో నైనా జీవనమార్గం లో నడుస్తూ చేయూతనిస్తూ ఉంటుంది పతాకం .అదే స్వర్ణ దండం .గెల్చిన మగవాళ్ళందరూ ఆమె సహాయం పొందినవారే .అందుకే ఆమె’’ అర్ధం చేసుకో గలిగిన వనిత ‘’అయింది జాన్ కవికీ ,శర్మగారికీ .
సశేషం
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -22-3-22-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Leave a comment

మన మరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు-148

మన మరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు-148
148-జన్మతః సంగీతం అబ్బిన సంగీత దర్శకుడు,మాలపిల్ల ఫేం –భీమవరపు నరసింహారావు

భీమవరపు నరసింహరావు (జనవరి 24, 1905 – సెప్టెంబర్ 7, 1976) తెలుగు సినిమా సంగీత దర్శకులు. ఈయన బి.ఎన్.ఆర్.గా అందరికి సుపరిచితుడు. ఈయన 8 సంత్సరాల వయసులోనే సంగీత కళ మొగ్గ తొడగడం మొదలైంది. ఈయనకు నాటకాల్లో నటించడం అన్నా, పాటలు పాడటం అన్నా చాలా మక్కువ. ఇతను ఏ గురుశుశ్రూష చేయలేదు. హార్మోనియం కూడా తనే స్వయంగా నేర్చుకొని అందులో ప్రావీణ్యం సంపాదించగలిగాడు. తెనాలిలోని శ్రీరామ విలాస సభ నాటకసంస్థలోసంగీత దర్శకుడిగా పనిచేశాడు.[1]ఈయన ధూమపాన ప్రియుడు. కేవలం సిగరెట్ల సంపాదన కోసం హార్మోనిస్ట్ గా థియేటర్ లో పనిచేయడం మొదలుపెట్టాడు.[ఆ

వనసరాగాలు
· పుట్టిన తేది : 1905 జనవరి 24

· జన్మస్థలం : గుంటూరు జిల్లా తెనాలి సమీపంలో కొలకలూరు.

· తల్లిదండ్రులు : కోటమ్మ, పుండారీకాక్ష శర్మ

· విద్యార్హత : ఎస్.ఎస్.ఎల్.సి

· తోబుట్టువులు :

o అన్నయ్యలు – పూర్ణయ్య, రామచంద్రరావు

o నలుగురు సోదరులు

· సంతానం :

o కొడుకు – బి.వెంకటేశ్వరరావు

o కూతురు – డాక్టర్ లీలావతి

· మొదటి సినిమా : సతీ తులసి (1936)

· ఆఖరి చిత్రం : అర్ధాంగి (1955)

· మరణం : 7 సెప్టంబర్ 1976.

చిత్రసమాహారం

  1. సతీ తులసి (1936)
  2. ద్రౌపదీ వస్త్రాపహరణం (1936)
  3. కనకతార (1937)
  4. మోహినీ రుక్మాంగద (1937)
  5. మాలపిల్ల (1938)
  6. భక్త తుకారమ్ (1938)
  7. రైతుబిడ్డ (1939)
  8. మీరాబాయి (1940)
  9. అపవాదు (1941) సశేషం

మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -22-3-22-ఉయ్యూరు

Posted in సినిమా | Tagged | Leave a comment

శతవసంతాల కవి ‘’సౌందర్యం లో నడుచు నామె ‘’ పై పలికిన కవితా కలకూజితం -1

Print allIn new window

శతవసంతాల కవి ‘’సౌందర్యం లో నడుచు నామె ‘’ పై పలికిన కవితా కలకూజితం -1

 డా.రాచకొండ నరసింహ శర్మ ఎం .డి .గారు 98వ వసంతం లో వెలువరించిన నాల్గవ ఆంగ్లకవితా అనువాద మే ‘’సౌందర్యం లో నడుచు నామె’’.60కవితల కర్పూర పరీమళాన్ని వెదజల్లే ఈ సంపుటిని తమ తల్లిగారు కీ శే.రాచకొండ సీతా రామలక్ష్మి గారికి ,తమ పిల్లల తల్లి డా రాచకొండ అన్నపూర్ణా దేవి గారికి అంకితమిచ్చారు .క్రీ .శ.1554నుంచి 1922వరకు ఉన్నకాలం లో పూర్వ సంపుటులలో లేని 30మంది కవులు ఇందులో ఉండటం విశేషం .ఇందులో తెలుగు కవి శ్రీ అబ్బూరి రామకృష్ణారావు గారికీ ,మరిద్దరు అజ్ఞాతకవులకు చోటు కల్పించారు .జ్ఞాన వయో వృద్ధ మూర్తి శర్మగారు ఆ కవులలో దర్శించిన కవితా సౌందర్యాన్ని ,వారిపై ఉన్న ఆరాధనా భావాన్ని వెల్లడించే కవితలు ఇందులో ఉన్నాయి .వారినీ ,వారి జీవితాలను, కవితా తత్వాలను అవగాహన చేసుకొని ,వారు చాటిన అవధులు లేని విశాల దృక్పధాలను లోతులు తరచి చేసిన అనువాద కవితలు .వందవసంతాల కవి శేఖరులు శర్మగారు దర్శించి ,ఆరాధించిన కవితా సౌందర్యమే ఇది .ఈ కవి పలికిన అనువాద కవితా కలకూజితాలే ఈ కవితా సౌందర్యమంతా.ఈ పుస్తకం నాకు శర్మగారు ఆప్యాయంగా పంపగా మార్చి 15 అందింది .నిన్ననే వారిని ఫోన్ లో పలకరించి,వారి అర్ధాంగి మరణానికి సంతాపం తెలియజేసి .పుస్తకాలు అందాయని చెప్పాను .అసలు పుస్తకాలు అందగానే అందినట్లు వారికి మెయిల్ రాశాను అనీ చెప్పాను .చదివారా అని నిన్న అడిగితె ‘’ఇంకా లేదండీ .’’అన్నాను .’’చదివి మీ అభి ప్రాయం రాయండి ‘’అన్నారు’’ అలానే’’ అన్నాను .ఇవాళ మధ్యాహ్నం పట్టుదలగా చదివి ,నా అభిప్రాయానికి పై శీర్షిక పెట్టి రాస్తున్నాను .

   శీర్షిక కవిత –లార్డ్ బైరన్ రాసిన ‘’షి వాక్స్ ఇన్ బ్యూటీ ‘’కి శర్మగారి అనువాద కవిత ‘’సౌందర్యం లో నాడుచునామె’’.కవికి ఆమె తారా విలసిత నిర్మలాకాశ నిశీధి ‘’లాగా ,చీకటి వెలుగుల్లో శ్రేష్టమైనదంతా కలిసి ఉంది .దైవం ఈయని నును లేత కాంతి ఆమె .ప్రశాంత మధుర భావనకు ఆమె నెలవు .మందహాసాలు జయప్రదాలు .పుణ్యకార్యాలు చేసిన కాలాన్ని గుర్తు చేస్తుంది .ఆమెది అమాయక ప్రేమ నిండిన హృదయం .అందుకే బైరన్ కూ శర్మగారికీ నచ్చిందామె. .వినిర్మల తేజో మూర్తి కనుక చదివే మనకూ నచ్చటమే కాదు ఆరాధనా కలుగుతుంది .సార్ధకమైన శీర్షిక .

స్టెల్లా కనుల భాష లో ఏ నిట్టూర్పు తస్కరించబడిందో లేక పుట్టకముందే మృతి చెందినదా అనే అనుమానం .ఓదార్చటానికే రాసినట్లుంది అని పిస్తుంది ఆష్ట్రోఫిల్ కు .ఎక్కువ నిజం తెలుసుకొని బాధ ఎక్కువగా పొందటం కన్నా ‘’అబద్ధానికే బద్ధుడనై ఉంటాను’’అని ఊరడిల్లాడు .అదీ వారిద్దరి మధ్యున్న అపురూప అనురాగం ,ప్రేమ .మనిషి ఒంటరి ద్వీపం కాదు అసలులో ఒక భాగమే .ఎవరిది ఏది పోయినా ,మనిషి చావైనా తనకు ఐరోపా తగ్గినట్లే,తనను తగ్గించినట్లే  అనిపించింది జాన్ డోన్నె కవికి .గంటలు మనకోసమే మోగుతున్నాయని గ్రహించమంటాడు  .ఇదే యూనివర్సల్ బ్రదర్ హుడ్ .మనం కోరే విశ్వ ప్రేమ .కూపర్ కవి  రేపు రేపు మాటలతో వంచి౦ప బడుతూ రేపటి దినాలెన్నో గడిపేశాడు .తరుగులేని ఆమె ప్రేమ ప్రవాహం మరువలేదు .తనకు జవాబు ‘’ఆ మాతృమందహాసమే .గొప్ప వంశాలలో పుట్టాననే గర్వం కంటే ‘’దివంగతులైన తలిదండ్రుల కొడుకు ‘’అనే గర్వం తనకుంది .తన నిరీక్షణ ఫలితంగా అమ్మ చిత్ర పటం కనిపించింది.కనుక కోల్పోయింది కొద్దికాలమే అనే సంతోషం .ఆమె లేకపోయినా ,ఆమె శక్తి తనను ఓదార్చ టానికి లభించిందని ఊరడిల్లిన హృదయం ఆ మాతృ ఆరాధకుడిది  .కలిసి ఉన్న జీవితంతో ఎప్పటికైనా వియోగం తప్పదు.కనుక గుడ్ బై అనొద్దు గుడ్ మార్నిగ్ అని శుభం గా పలకమంటుంది’’అన్నా బార్బౌల్ద్ .విలియం బ్లేక్ ప్రసిద్ధ కవిత ‘’దిలాంబ్ ‘’చిన్నతనం లో అందరం చదూకున్నాం ,పెద్దతనం లో పాఠాలు బోధించాం అందరం .గొర్రె కూన కు దాన్ని ఎవరు చేశారో కవి చెప్పాడు అర్ధమయేట్లు .ప్రభువే ‘తనను గోర్రెకూన అని పిలుచుకొంటాడు .మనమంతా ఆయన పేరు మీదనే పిలువబడుతాం .దైవ కృప దానిపైనే కాదు అందరిపైనా ఉండాలని కోరాడు కవి .ఈ భావాన్ని శర్మగారు బలీయంగా కవితానువాదంలో  వివరించి మూలానికే వన్నె తెచ్చారనిపించింది .

  షేక్స్పియర్ ఆరాధించిన మిల్టన్ కవి అవసరం ఎంతైనా ఉందని భావించాడు .మార్షీ భూమిగా ఉంది ఇంగ్లాండ్ .పురాతన ఆంగ్ల వారసత్వమంతా కొట్టుకుపోయిందని బాధపడ్డాడు .’’మాకు నీతి,స్వేచ్చా ,మంచి నడత ప్రసాదించు .నీ ఆత్మ తారా సదృశం గా సుదూరం లో ఉంది .తిరిగి వచ్చి మమ్మల్ని ఉద్ధరించు ‘’అని వేడుకొన్నాడు షేక్స్పియర్ .మిల్టన్ స్వరం నీరధిలా స్వేచ్చ గంభీరం .సామాన్య మార్గాలలో సంచరించి ,దైవత్వ భావనతో వెలిగి నిమ్నాతి నిమ్నవిధులనే ఎంచుకొన్న మహోన్నత కవి మిల్టన్ అని ఆంగ్ల నాటక పితామహుడు ఆరాధనతో స్తోత్రం చేశాడు .విలువలు పతనమై పోతున్న ఇంగ్లాండ్ ను ఉద్ధరించమని వేడుకొన్నాడు .అలాగే 20వ శతాబ్దం లో టీఎస్ ఇలియట్ కూడా ఇంగ్లాండ్ పతన సంస్కృతిపై క్షోబించి ‘’వేస్ట్ లాండ్ ‘’రాశాడు .

డ్యూటీ యెంత క్రూరమైనదో చెప్పే ‘’కాసబియాంక ‘’కవిత ఫెలిషియ  హామన్స్.రాసి కన్నీరు తెప్పించింది .’’ది బాయ్ ష్టుడ్ ఆన్ ది బర్నింగ్ డెక్ ‘’అనే కవితే ఇది .ఈ కవితలో ఆ దృశ్యాన్ని కనులముందు నిలిపారు ఒరిజినల్ కవీ ,అనువాద కవీనూ.’’కాలుతున్న పడవమీద తండ్రి ఆజ్ఞతో డ్యూటీ లో నిల్చున్న  ఆ బాలుడు తప్ప అందరూపారిపోయారు .అతడు పుట్టుకతోనే ప్రభంజనానికి పాలకుడు లా  ఉన్నాడు  వాడిలో వీరులరక్తం ప్రవహిస్తోంది .బాలుడైనా సేవా గర్వం ఉంది ముఖం లో .కింద తండ్రి కాలి చనిపోయాడు  .కానీ కదలటానికి ఆజ్ఞ లేదు .’’నా పని అయిపోయిందా నాన్నా ‘’అని అరుస్తున్నాడు .’’తండ్రి పని అయిపోయిందని’’ తెలీదు ఆలేత వాడికి .కర్రలుకాలి భయంకర శబ్దాలు చేస్తున్నాయికానీ తండ్రి నుంచి సమాధానం లేదు ఎన్ని సార్లు అరచినా .’’నేనిక్కడే ఉండాలా నాన్నా ‘’?చివరి సారి అతడి నోటిలో నుంచి వచ్చింది. మంటలు చుట్టు ముట్టాయి .జండా కాలిపోయింది పడవ దగ్ధమైంది చివరకి ఆమంటలు కసబియాన్కాను కాల్చేశాయి .బాలుడేక్కడ అని నావ తెరచాప ,చుక్కాని, జెండా, నావను చిద్రం చేసిన సముద్ర అలలను, గాలుల్నీ అడగమంటు౦ది  హృదయవిదారకంగా కవయిత్రి .’’అక్కడ నశించిన అన్నిట్లో –అత్యంత ఘనమైనది –విశ్వాసం నిండిన ఆ చిన్ని హృదయం ‘’అని ఫినిషింగ్ టచ్ ఇచ్చి సేవాధర్మం ఎంత కఠినమో తెలియ జేసే కవిత ఇది .

  సశేషం

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -21-3-22-ఉయ్యూరు 

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

మన మరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు-147 147-తెలుగు సినీ తోలి నేపధ్యగాయకుడు సంగీత దర్శకుడు ,గుణ సుందరి సంగీత ఫేం ,జాతీయ బహుమతిపొందిన మొదటి సంగీత దర్శకుడు –ఓగిరాల రామచంద్రరావు

మన మరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు-147
147-తెలుగు సినీ తోలి నేపధ్యగాయకుడు సంగీత దర్శకుడు ,గుణ సుందరి సంగీత ఫేం ,జాతీయ బహుమతిపొందిన మొదటి సంగీత దర్శకుడు –ఓగిరాల రామచంద్రరావు

ఓగిరాల రామచంద్రరావు (సెప్టెంబర్ 10, 1905 – జూలై 17, 1957) పాతతరం తెలుగు చలనచిత్ర సంగీతదర్శకుడు. వాహిని వారి చిత్రాలెన్నింటికో ఈయన సంగీతం అందించారు. ఓగిరాల తెలుగు చలనచిత్రరంగంలో మొట్టమొదటి నేపథ్యగాయకుడు, ఆయన మళ్ళీ పెళ్ళి (1939) చిత్రంలో వై.వి.రావుకి పాడారు. ఆయన శ్రీ వెంకటేశ్వర మహత్యం(1939) చిత్రంలో శివుని వేషం వేశారు.

జననం
ఓగిరాల 1905 సంవత్సరంలో సెప్టెంబర్ 10వ తేదీన బెజవాడలో జన్మించారు. ఆయన కుటుంబానికి మూలాలు కృష్ణా జిల్లా, మోపిదేవి మండలం, చిరువోలు గ్రామంలో ఉన్నాయి.

నటునిగా
ఓగిరాల వీలుకాని పరిస్థితుల్లో నటించవలసి వచ్చింది. శ్రీ వెంకటేశ్వర మహత్యం (1939) చిత్రంలో శివుని వేషధారి మెడలో పాము వేసుకోవడానికి నిరాకరించడంతో ఓగిరాల ఆ పాత్రను ధరించారు.

సంగీతం
సంగీత దర్శకునిగా ఓగిరాల దాదాపు ఇరవై చిత్రాలకు పనిచేశారు, ఆ చిత్రాలలో దాదాపు అన్నీ సంగీతపరంగా విజయం సాధించినవే.

వాహిని చిత్రాలు
వాహిని వారి చాలా చిత్రాలకు ఈయన పనిచేశారు. అందులో నాగయ్యగారికి సహాయకునిగా స్వర్గసీమ (1945), యోగి వేమన (1947) వంటి చిత్రాలకు పనిచేశారు. ఆ చిత్రాల పాటలలో ఓగిరాల ముద్ర స్పష్టంగా కనిపిస్తుంది. గుణసుందరి కథ (1949), పెద్దమనుషులు (1955) స్వతంత్రంగా ఆయన వాహిని వారికి పనిచేసిన చిత్రాలు, ఈ రెండు చిత్రాలకు ఆయనకు సహాయకునిగా, వాద్యనిర్వాహకునిగా అద్దేపల్లి రామారావు పని చేయడం విశేషం.

ఇతర చిత్రాలు
సంగీతదర్శకునిగా ఓగిరాలకు మొదటి చిత్రం మళ్ళీ పెళ్ళి (1939). నటి కాంచనమాలతో కలిసి ఆయన నా సుందర సురుచిర రూపా అనే పాట పాడారు. ఈ పాటను కాంచనమాల, వై.వి.రావు పైన చిత్రీకరించారు. చలనచిత్రరంగంలో బెజవాడ రాజారత్నం గాయనిగా స్థిరపడటానికి ఓగిరాల సంగీతం ముఖ్య కారణం. మళ్ళీ పెళ్ళి చిత్రంలో రాజారత్నంతో పాడించిన గోపాలుడే మన గోపాలుడే, చెలి కుంకుమమే పావనమే తదితర గీతాలు పాడించారు. ఆ పాటలన్నీ ఆ రోజులలో జనం నాలుకలపై నిత్యం నాట్యం చేస్తూ ఉండేవి. విశ్వమోహిని (1940) చిత్రంలో ఆయన రాజారత్నంతో పాడించిన ఈ పూపొదరింటా, భలే ఫేస్, మేళవింపగదే చెలియా వీణ వంటి పాటలు ఆయన సంగీతానికి ఒక గొప్ప ఉదాహరణ. 1940లో అటువంటి ఆహ్లాదకరమైన సంగీతంతో కూడిన పాటలు అందించిన ఘనత ఓగిరాలకే దక్కింది.

1941 నుండి ఓగిరాల, ఘంటసాల బలరామయ్య నిర్వహిస్తున్న ప్రతిభ పిక్చర్స్ చిత్రాలకు సంగీతం అందించడం మొదలు పెట్టారు. ఆయన సంగీతం అందించిన ప్రతిభ పిక్చర్స్ చిత్రాలు పార్వతీ కళ్యాణం (1941), గరుడ గర్వభంగం (1943), సీతారామ జననం (1944), ముగ్గురు మరాటీలు (1946). అక్కినేని నాగేశ్వరరావు రెండవ చిత్రం సీతారామ జననం (1944)లో, నాగేశ్వరరావుతో గురుబ్రహ్మ గురువిష్ణు శ్లోకం పాడించారు ఓగిరాల. ఘంటసాల బలరామయ్య తీసిన ముగ్గురు మరాటీలు (1946) చిత్రంలో అక్కినేని నాగేశ్వరరావు, టి.జి.కమలాదేవి చేత ఛల్ ఛలో వయ్యారి షికారి అనే యుగళగీతం పాడించారు. అదే చిత్రంలో కన్నాంబ చేత సతీ భాగ్యమే భాగ్యము, తీరుగదా ఆశ అనే రేండు పాటలు పాడించారు. ఈ చిత్రంలో బెజవాడ రాజారత్నం జీవనము యమునా జీవనము, రాటము భారతనారి కవచము అనే రెండు పాటలు పాడింది. ఈ చిత్రంలో జీవనము యమునా జీవనము పాట ప్రేక్షకాదరణ పొందింది, అది రాజారత్నం పాడిన పాట కావడం విశేషం.

1949లో హెచ్.ఆర్.పద్మనాభశాస్త్రితో కలిసి రక్షరేఖ చిత్రానికి సంగీతం అందించారు. అదే సంవత్సరం విడుదలైన వాహిని వారి గుణసుందరి కథ పెద్ద విజయం సాధించింది. 1950లో విడుదలైన పరమానందయ్య శిష్యులు చిత్రానికి సుసర్ల దక్షిణామూర్తితో కలిసి సంగీతం అందించారు, కానీ ఆ చిత్రం పరాజయం పొందింది. ఆ తర్వాత ఓగిరాల మాయా రంభ (1950), సతీ సక్కుబాయి (1954) చిత్రాలకు సంగీతం అందించారు. ఆ తర్వాత విడుదలైన పెద్ద మనుషులు (1954) చిత్రం గుణసుందరి కథ అంత విజయాన్ని సాధించింది. ఆ తర్వాత టి.వి.రాజుతో కలిసి శ్రీ గౌరీ మహత్యం (1956) చిత్రానికి సంగీతం అందించారు. భక్త రామదాసు (1964) చిత్రానికి ఓగిరాల, నాగయ్య, అశ్వత్థామ, హెచ్.ఆర్.పద్మనాభశాస్త్రితో కలిసి సంగీత శాఖలో పనిచేశారు. 1957లో ఆ చిత్ర నిర్మాణం ప్రారంభమైన కొన్ని రోజులకే ఓగిరాల అనారోగ్యంతో మరణించారు.

ముఖ్య చిత్రాలు
ఓగిరాల సంగీతం అందించిన చిత్రాలలో ముఖ్యంగా పేర్కొనవలసినవి గుణసుందరి కథ (1949), పెద్ద మనుషులు (1954). ఆ రెండూ వాహిని వారి చిత్రాలు కావడం, ఆ రెండిట్లో అద్దేపల్లి రామారావు ఓగిరాలకు సహాయకునిగా, వాద్యనిర్వాహకునిగా పనిచేయడం విశేషం. మరో విశేషం ఏమిటంటే ఆ రెండూ చిత్రాలకు నిర్మాత, దర్శకుడు కె.వి.రెడ్డి గారే, రెండిట్లో నాయిక శ్రీరంజని జూనియరే.

గుణసుందరి కథ చిత్రం విజయం సాధించడానికి ముఖ్య కారణాలలో ఓగిరాల సంగీతం ఒకటి. పి.లీల, టి.జి.కమలాదేవి, కస్తూరి శివరావు, శాంతకుమారి, మాలతి, ఘంటసాల తదితరులతో ఓగిరాల పాడించిన పాటలు విశేష జనాదరణ పొందాయి. ఈ చిత్రంలో పాటలన్నీ పింగళి నాగేంద్రరావు రాశారు. ఓగిరాల పి.లీల చేత పాడించినవన్నీ భక్తి పాటలే, వాటిలో శ్రీ తులసి ప్రియ తులసి పాట చాలా కాలం అందరి ఇళ్ళల్లో వినిపించేది, ఆ పాట పాడుతూ ప్రతీ స్త్రీ తులసి మాతను ఆరాధించేది. శాంతకుమారి, మాలతి కలిసి పాడిన కలకలా ఆ కోకిలేమో, చల్లని దొరవేలె చందమామ పాటలు ఎంతో ఆహ్లాదంగా ఉంటాయి. ఘంటసాల ఈ చిత్రంలో అమ్మా మహాలక్ష్మి దయచేయవమ్మా అనే నేపథ్యగీతం పాడారు. అలాగే కస్తూరి శివరావు, టి.జి.కమలాదేవి, వి.శివరాం పాడిన పాటలు కూడా పేరు పొందాయి.

పెద్ద మనుషుల చిత్రంలో రేలంగికి ఘంటసాల పాడిన నందామయా గురుడ నందామయా, శివశివ మూర్తివి గణనాథా బాగా జనాదరణ పొందాయి. ఆ రెండూ పాటలను కొసరాజు రాశారు. పి.లీల ఈ చిత్రంలో మూడు పాటలు పాడింది, ఆమె పాడిన నీ మీద ప్రాణాలు నిలిపింది రాధ పాట హిందీ చిత్రం అల్‌బేలాలోని పాటకు అనుకరణగా సంగీతం అందించారు, లీలనే పాడిన అంతభారమైతినా అంధురాలనే దేవ పాట మనస్స్సుకు హత్తుకునే విధంగా సంగీతం అందించారు. ఈ చిత్రం జాతీయ బహుమతి పొందిన మొట్టమొదటి తెలుగు చిత్రం. ఈ విధంగా జాతీయ బహుమతి పొందిన మొదటి తెలుగు చిత్రానికి సంగీతమందించిన వ్యక్తిగా ఓగిరాల కీర్తి పొందారు.

మరణం
1957 సంవత్సరంలో భక్త రామదాసు (1964) చిత్ర నిర్మాణ సమయంలో ఓగిరాల ఫ్లూ జ్వరం బారినపడ్డారు, అలా అనారోగ్యంతో కొన్ని రోజుల తర్వాత మద్రాసులో జూలై 17, 1957న కన్నుమూశారు. మరణించినప్పుడు ఆయన వయాస్సు కేవలం యాభై రెండేళ్ళే. ఓగిరాల అంటే ఏంతో అభిమానమున్న ఘంటసాల ఆయన అంతిమయాత్రలో పాల్గొని రెండు మైళ్ళు నడిచారు.

సంతాన
ఓగిరాలకు ఒక కుమారుడు, ఒక కుమార్తె. ఇద్దరూ తండ్రి ఓగిరాల వద్ద లలిత సంగీతం నేర్చుకున్నా ఆ రంగం వైపు చూడలేదు. ఓగిరాల కుమారుడు నరసింహమూర్తి కార్పొరేషన్ బ్యాంకులో ఉన్నత పదవి నుండి విరమణ పొందారు. నరసింహమూర్తి కొన్ని చిత్రాలలో బాలనటునిగా నటించారు. బ్రతుకుతెరువు (1953)లో సూర్యకాంతం కొడుకుగా, దొంగరాముడు (1955)లో చిన్ననాటి రాముడి స్నేహితునిగా, అప్పు చేసి పప్పు కూడు (1959)లో సూర్యకాంతం, రమణారెడ్డి కొడుకుగా నటించారు. అప్పు చేసి పప్పు కూడులో రేలంగి, నరసింహమూర్తి కలిసి పండించిన హాస్యం మరువలేనిది.

చిత్రసమాహా0
సంగీత దర్శకుడిగా
· మళ్ళీ పెళ్ళి (1939)

· విశ్వమోహిని (1940)

· పార్వతీ కళ్యాణం (1941)

· గరుడ గర్వభంగం(1943)

· సీతారామ జననం (1944)….. (ప్రభల సత్యనారాయణతో కలిసి)[1]

· స్వర్గసీమ (1945)….. (నాగయ్య, బాలాంత్రపు రజనీకాంతరావుతో కలిసి)

· ముగ్గురు మరాటీలు (1946)

· త్యాగయ్య (1946)….. (నాగయ్యతో కలిసి)

· యోగి వేమన (1947)….. (నాగయ్యతో కలిసి)

· గుణసుందరి కథ (1949)

· రక్షరేఖ (1949)….. (హెచ్.ఆర్.పద్మనాభశాస్త్రితో కలిసి)

· పరమానందయ్య శిష్యులు (1950)….. (సుసర్ల దక్షిణామూర్తితో కలిసి)

· మాయా రంభ (1950)

· రాజేశ్వరి (1952)

· సతి సక్కుబాయి (1954)

· పెద్దమనుషులు (1954)

· శ్రీ గౌరీ మహత్యం (1956)….. (టి.వి.రాజుతో కలిసి)

· భక్త రామదాసు (1964)…..చివరి చిత్రం (నాగయ్య, అశ్వత్థామ, హెచ్.ఆర్.పద్మనాభశాస్త్రితో కలిసి)

నటునిగా
· శ్రీ వెంకటేశ్వర మహత్యం

నేపథ్యగాయకుడిగా
· మళ్ళీ పెళ్ళి (1939) … వై.వి.రావుకి పాడారు

1940లో విడుదలైన జగదీశ్ పిక్చర్స్ వారి విశ్వమోహినిలో బెజవాడ రాజారత్నం చేత ఓగిరాల పాడించిన పాటలు చాల పేరుపొందాయి. “ఈ పూపొదరింటా” చాలా ప్రముఖంగా వినిపించగా, “”భలే ఫేస్ భలే ఫేస్”, “మేళవింపగదే చెలియా వీణ” పాటలు కూడా బాగానే పేరు సంపాదించాయి. 1941లో విడుదలైన ప్రతిభా పిక్చర్స్ వారి మొట్టమొదటి చిత్రం పార్వతీకళ్యాణంకు ఆయన తదుపరి చిత్రం. గరుడ గర్వభంగం (1943), సీతారామజననం (1944) ఆయన తదుపరి చిత్రాలు, ఈ రెండూ చిత్రాలు ప్రతిభా పిక్చర్స్ సంస్థ నిర్మించినవే. సీతారామజననం చిత్రానికి ఓగిరాల, ప్రభల సత్యనారాయణతో కలిసి పని చేశారు. ఈ చిత్రంలో అక్కినేని నాగేశ్వరరావుతో “గురు బ్రహ్మ గురు విష్ణు” శ్లోకాన్ని పాడించారు. ఆయన తదుపరి చిత్రం వాహినీ వారి స్వర్గసీమ (1945), ఈ చిత్రంలో నాగయ్య, బాలాంత్రపు రజనీకాంతరావుతో కలిసి పని చేశారు. ఈ చిత్రం పాటలన్నింటిలో ఆయన ముద్ర స్పష్టంగా కనిపిస్తుంది. సంగీతపరంగా స్వర్గసీమను విజయవంతం చేయడంలో ఆయన కృషి ఎంతో ఉంది. 1946లో విడుదలైన ప్రతిభా పిక్చర్స్ వారి ముగ్గురు మరాఠీలు సంగీతపరంగా విజయం సాధించింది. అక్కినేని నాగేశ్వరరావు, టి.జి.కమలాదేవి పాడిన “ఛల్ ఛలో వయ్యారీ షికారీ”, కన్నాంబ పాడిన “సతీ భాగ్యమే భాగ్యము”, “తీరుగదా ఆశా నేడు” మరియు బెజవాడ రాజారత్నం పాడిన “జీవనము యమునా జీవనము”, “రాటము భారతనారీ కవచము” తదితర పాటలు బాగా పేరు సంపాదించాయి. ఈ చిత్రంలో ముఖ్యంగా పేర్కోవలసిన పాట “జీవనము యమునా జీవనము”. ఈ విధంగా చూస్తే బెజవాడ రాజారత్నంకు గాయనిగా పేరు తెచ్చిపెట్టింది ఓగిరాల అని స్పష్టంగా తెలుస్తుంది. ఓగిరాల తదుపరి చిత్రాలు నాగయ్య గారి త్యాగయ్య (1946) మరియు వాహినీ వారి యోగి వేమన (1947). ఈ రెండూ చిత్రాలకు ఆయన నాగయ్య వద్ద సహాయకునిగా పనిచేశారు. యోగి వేమనలోని పాటలలో ఆయన ముద్ర స్పష్టంగా కనిపిస్తుంది. ఆయన తదుపరి చిత్రం రక్షరేఖ (1949)కు హెచ్.ఆర్.పద్మనాభశాస్త్రితో కలిసి పని చేశారు. 1949లో విడుదలైన వాహినీ వారి గుణసుందరి కథ అప్పట్లో అన్నీ రంగాలలో పెద్ద విజయం సాధించింది. 1950లో విడదలైన పరమానందయ్య శిష్యులు పరాజయం పొందినా పాటలు బాగానే పేరు సంపాదించాయి.

ఆయన తదుపరి చిత్రాలు మాయరంభ (1950), రాజేశ్వరి (1952), కుమారి (1952 – రాజేశ్వరి – తమిళం), సతీ సక్కుబాయి (1954). మాయరంభ లోని పాటలు, పద్యాలు ఓగిరాలకి బాగా పేరు తెచ్చిపెట్టాయి. ఈ చిత్రంలో నటి అంజలీదేవి చేత ఓగిరాల ఒక బృందగీతం పాడించారు. సతీ సక్కుబాయి చిత్రంలో ఎస్.వరలక్ష్మి పాడిన పాటలు బాగా ఉంటాయి. ఆయన తదుపరి చిత్రం వాహినీ వారి పెద్ద మనుషులు (1954). పెద్ద మనుషులు తరువాత టి.వి.రాజుతో కలిసి శ్రీ గౌరీ మహత్యం చిత్రానికి పని చేశారు. నాగయ్య గారు తీసిన భక్త రామదాసు (1964) ఆయన చివరి చిత్రం. ఈ చిత్రానికి ఓగిరాల నాగయ్య, అశ్వత్థామ, హెచ్.ఆర్.పద్మనాభశాస్త్రితో కలిసి పని చేశారు.

ఓగిరాల సంగీతం అందించిన చిత్రాలలో ముఖ్యంగా పేర్కొనవలసినవి గుణసుందరి కథ (1949) మరియు పెద్ద మనుషులు (1954). ఆ రెండూ వాహిని వారి చిత్రాలు కావడం, ఆ రెండిట్లో అద్దేపల్లి రామారావు ఓగిరాలకు సహాయకునిగా, వాద్యనిర్వాహకునిగా పనిచేయడం విశేషం. మరో విశేషం ఏమిటంటే ఆ రెండూ చిత్రాలకు నిర్మాత మరియు దర్శకుడు కె.వి.రెడ్డి గారే మరియు రెండిట్లో నాయిక శ్రీరంజని జూనియరే.

గుణసుందరి కథ చిత్రం విజయం సాధించడానికి ముఖ్య కారణాలలో ఓగిరాల సంగీతం ఒకటి. పి.లీల, టి.జి.కమలాదేవి, కస్తూరి శివరావు, శాంతకుమారి, మాలతి, ఘంటసాల తదితరులతో ఓగిరాల పాడించిన పాటలు బాగా జనాదరణ పొందాయి. ఈ చిత్రంలో పాటలన్నీ పింగళి నాగేంద్రరావు రాశారు. ఓగిరాల ఈ చిత్రంలో పి.లీల చేత పాడించిన ఒక్క “చిటి తాళం వేసెనంటే” మరియు “నాను సింగారినే మగనా” తప్ప మిగతావన్నీ భక్తి పాటలే, వాటిలో “శ్రీ తులసి ప్రియ తులసి” పాట చాలా కాలం అందరి ఇళ్ళల్లో వినిపించేది, ఆ పాట పాడుతూ ప్రతీ స్త్రీ తులసి మాతను ఆరాధించేది. శాంతకుమారి, మాలతి కలిసి పాడిన “కలకలా ఆ కోకిలేమో” మరియు “చల్లని దొరవేలె చందమామ” పాటలు ఎంతో ఆహ్లాదంగా ఉంటాయి. ఘంటసాల ఈ చిత్రంలో “అమ్మా మహాలక్ష్మి దయచేయవమ్మా” అనే నేపథ్యగీతం పాడారు. అలాగే కస్తూరి శివరావు, టి.జి.కమలాదేవి, వి.శివరాం పాడిన పాటలు కూడా పేరు పొందాయి.

పెద్ద మనుషుల చిత్రంలో రేలంగికి ఘంటసాల పాడిన “నందామయా గురుడ నందామయా” మరియు “శివశివ మూర్తివి గణనాథా” బాగా జనాదరణ పొందాయి. ఆ రెండూ పాటలను కొసరాజు రాశారు. పి.లీల ఈ చిత్రంలో మూడు పాటలు పాడింది, ఆమె పాడిన “నీ మీద ప్రాణాలు నిలిపింది రాధ” పాట హిందీ చిత్రం అల్‌బేలాలోని పాటకు అనుకరణగా సంగీతం అందించారు మరియు లీలనే పాడిన “అంతభారమైతినా అంధురాలనే దేవ” పాట మనస్స్సుకు హత్తుకునే విధంగా సంగీతం అందించారు. ఈ చిత్రం జాతీయ బహుమతి పొందిన మొట్టమొదటి తెలుగు చిత్రం. ఈ విధంగా జాతీయ బహుమతి పొందిన మొదటి తెలుగు చిత్రానికి సంగీతమందించిన వ్యక్తిగా ఓగిరాల కీర్తి పొందారు.

1905లో సెప్టెంబరు 10న బెజవాడలో ఓగిరాల జనార్దనశర్మ, సుబ్బమ్మ దంపతులకు జన్మించిన ఓగిరాల రామచంద్రరావు, 1957లో భక్త రామదాసు చిత్ర నిర్మాణ సమయంలో ఫ్లూ జ్వరం బారిన పడి జూన్ 17వ తేదీన మరణించారు. ఓగిరాల అంతిమయాత్రలో ఆయనంటే ఎంతో అభిమానమున్న ఘంటసాల సుమారు రెండు మైళ్ళు నడిచారు.

ఓగిరాల భార్య పేరు వరలక్ష్మి. వారికి ఒక కుమారుడు, ఒక కుమార్తె సంతానం. కుమారుడి పేరు నరసింహమూర్తి మరియు కుమార్తె పేరు కల్పకవల్లి. నరసింహమూర్తి కొన్ని చిత్రాలలో బాలనటునిగా నటించారు. బ్రతుకుతెరువు (1953)లో సూర్యకాంతం కొడుకుగా, దొంగరాముడు (1955)లో చిన్ననాటి రాముడి స్నేహితునిగా, అప్పు చేసి పప్పు కూడు (1959)లో సూర్యకాంతం, రమణారెడ్డి కొడుకుగా నటించారు. అప్పు చేసి పప్పు కూడులో రేలంగి, నరసింహమూర్తి కలిసి పండించిన హాస్యం మరువలేనిది.. ఆయన ఈ మధ్యే కార్పరేషన్ బ్యాంక్‌లో సీనియర్ ఉద్యోగిగా పదవీ విరమణ పొందారు. ఓగిరాలకు జాతకాలు చూసే అలవాటు ఉండేది. ఓగిరాల కొంతమంది ప్రముఖ నటుల జాతకాలు రాసిపెట్టుకున్నట్టు ఆయన కుమార్తె కల్పకవల్లి చెప్పారు.

సశేషం

· మీ –గబ్బిటదుర్గాప్రసాద్ -21-3-22-ఉయ్యూరు

Posted in సినిమా | Tagged | Leave a comment

మన మరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు-146

మన మరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు-146

146-‘’పితా ,అసలే విశాఖజనం ,ఇనుప ముక్కలతో కోడతారనిభయం ‘’డైలాగ్ ఫేం ,గొల్లపూడే ఫాన్ అయిన అదృష్టవంతుడైన విలక్షణ మాటల వాణీ   –పొట్టి ప్రసాద్

పొట్టి ప్రసాద్ అసలు పేరు కవివరపు ప్రసాదరావు. ఆయన భార్య రాజ్యలక్ష్మి. కుమారుడు జగన్నాథ రావు. మెదడు సంబంధిత వ్యాధితో మరణించాడు.

కెరీర్

పొట్టి ప్రసాద్ నాటకరంగం నుంచి వచ్చినవాడు. రంగస్థలంలో హాస్యం ఆయన ప్రత్యేకత. ఒకసారి మద్రాసులో కె. వెంకటేశ్వరరావు బృందంలో బెల్లంకొండ రామదాసు రాసిన ఆకాశరామన్న అనే నాటకంలో నటించడానికి వచ్చాడు. ఈ ప్రదర్శనను చక్రపాణి చూడటం తటస్థించింది. చక్రపాణి ఆయన చిరునామా తీసుకుని పంపేశారు. ఇవన్నీ మామూలనుకున్న ప్రసాద్ కు ఒక నెల రోజుల తర్వాత సినిమాలో అవకాశం వచ్చింది. అలా వచ్చిన అవకాశమే ఆయన మొదటి సినిమా అప్పుచేసి పప్పుకూడు. ఈ సినిమా తర్వాత కూడా నాటకాలు వేస్తూనే సినిమాల్లో అవకాశాల కోసం ప్రయత్నించాడు.[2]

చంటబ్బాయ్ సినిమాలో పత్రికా సంపాదకుడి పాత్ర, సాగర సంగమం లో పనివాడి పాత్ర, హై హై నాయక సినిమాలో అవధాని పాత్ర ఆయన పోషించిన కొన్ని ముఖ్యమైన పాత్రలు

నటించిన సినిమాలు

·         ఈనాటి బంధం ఏనాటిదో (1977)[3]

·         చంటబ్బాయ్

·         సాగర సంగమం

·         శ్రీవారికి ప్రేమలేఖ

·         రెండు రెళ్ళ ఆరు

·         ఇన్స్‌పెక్టర్ ప్రతాప్ (1988)

·         శుభలేఖ

·         కృష్ణ గారడీ (1986)

·         వివాహ భోజనంబు

·         హై హై నాయకా

·         మయూరి

·         చిరంజీవి రాంబాబు

·         రుద్రకాళి (1983)

·         చాణక్య చంద్రగుప్త

పేరు తెచ్చిన పాత్రలు[మార్చు]

·         చంటబ్బాయ్ సినిమాలో శ్రీలక్ష్మి రాసే కవితలు విని పిచ్చెక్కినట్లయిపోయే పత్రికా సంపాదకుడి పాత్ర

·         ఎలిజీలు – గొల్లపూడి మారుతి రావు

·         ====================

·         పొట్టి ప్రసాద్

·         ====================

·         పొట్టి ప్రసాద్ పేరులోనే ‘పొట్టి’ కాని నిజానికి చాలా పొడుగు. దాదాపు 40 సంవత్సరాల క్రిందటే అతనికి నాలాంటి ఫ్యాన్స్ ఎందరో ఉన్నారు. ‘అలనాడు-అంటే 1959లో విజయనగరంలో రాఘవ మెమోరియల్

·         ఉత్సవాలలో ‘ఆకాశరామన్న’ నాటకం చూస్తూ ఇద్దరి అఖండమయిన ప్రతిభ చూసి నిశ్చేష్టుడినయ్యాను. ఒకరు కె. వెంకటేశ్వరరావు, రెండో వ్యక్తి పొట్టి ప్రసాద్.

·         నిజజీవితంలో కూడా నాటకం లాగే మాట అనడంలో, తనదయిన బాణీలో చమత్కారాన్ని విసరడంలో నిష్ణాతుడు ప్రసాద్. ఆ రోజుల్లో మా లాంటి చిన్న నటులకి ఇద్దరు నటులంటే పెద్ద గ్లామర్ – పొట్టి ప్రసాద్, నిర్మలమ్మ.

·         చేతిలో చిన్న గుడ్డసంచీ (ఆ రోజుల్లో ముక్కుపొడుం అలవాటుందేమో గుర్తులేదు) సైకిలూ పూర్ణానందం సత్రం దగ్గర స్టాండు చేసి రసన సమాఖ్య వేపు మెట్లెక్కుతూంటే ఎప్పటికయినా పొట్టి ప్రసాద్ లాంటి నటులం అవుతామా అని మేం కలలు కనేవాళ్లం. ప్రసాద్ కి మరొక ఫాన్ బి.ఎన్.రెడ్డి గారు. కొత్తనీ, అభిరుచినీ ఆదరించి, పోషించే ఆయన ఆ రోజుల్లోనే ప్రసాద్ని మద్రాసుకి రప్పించి, “పూజాఫలం’లో పూర్తి హాస్య పాత్రని ఇచ్చారు. అయితే – స్టేజి నటనకీ, సినీ నటనకి తేడాలున్నాయేమో నాకు తెలీదు. లేకపోతే పొట్టి ప్రసాద్, సి.హెచ్. కృష్ణమూర్తి వంటివారు రాణించక పోవడానికి, నాగభూషణం, రావుగోపాలరావు, నేనూ, భరణీ రాణించడానికి కారణాలు అర్ధం కావు. ఏమయినా, ప్రసాద్ ఇంతకన్నా మంచి రాణింపు, అదృష్టం పొందవలసిన నటుడు. స్టేజిమీద అంత గొప్ప improvisation చెయ్యగల నటులు అరుదుగా ఉంటారు.

·         1958-59 లో ఢిల్లీ ఏషియన్ థియేటర్ ఇన్స్టిట్యూట్ కి కె. వెంకటేశ్వరరావు, ప్రసాద్ స్కాలర్ షిప్ మీద వెళ్లారు. సంవత్సరం చివరలో నటన మీద చిన్న ప్రదర్శన ఏర్పాటయింది. సాధూ సేన్ ప్రఖ్యాత నటుడు, శంభుమిత్రకి గురుతుల్యుడూ సభకి

·         అధ్యక్షుడు. ఒక్కొక్కరికి పది నిమిషాల టైము. తొమ్మిది నిమిషాలకే బెల్ మోగుతుంది. అది హెచ్చరిక. రెండోసారి మోగగానే ఆపెయ్యాలి. పొట్టి ప్రసాద్ లేచాడు. బొత్తిగా ఇంగ్లీషు రాదు. కాని అతను చేసే నటనికి అంతా విరగబడి నవ్వుతున్నారు. ఎనిమిదో నిమిషానికి అధ్యక్షుల టేబుల్ దగ్గరకి వచ్చి వార్నింగ్ బెల్’ తీసి జేబులో పడేసుకొన్నాడు. సాధూసేన్ ఒకటే నవ్వు. నాకీ ఉదంతం వెంకటేశ్వరరావే చెప్పాడు. ఇలాంటివి నాటక రంగం మీద కోకొల్లలు. రావికొండలరావు గారి నాటకాల్లో ప్రసాద్, కాకరాల, రాజబాబు అద్భుతంగా పోషించిన పాత్రలు నాకు తెలుసు. ఈ దేశంలో గొప్ప నటులు సినిమా రంగానికి చేరితే కాని రాణించని దరిద్రం తప్పని తరంలో పుట్టాడు ప్రసాద్. నాటకరంగంలో నటుడయినందుకే గర్వపడే ఏ బ్రిటన్ లోనో, అమెరికాలోనో ఉంటే ఓ గిల్ గుడ్ లాగ, ఓ లారెన్స్ అలీవియర్ లాగ, ఎలెక్ గిన్నిస్ లాగ, ఓ ఆంథోనీ హాప్ కిన్స్ లాగ తనదయిన ప్రతిభతో రాణించేవాడు.

·         అతన్ని ‘నువ్వు’ అనడం అతను నాకిచ్చిన చొరవ. నాకంటే పెద్దవాడు – అన్నిటా. సినీమా రంగంలో అతనికి అనుకొన్నంత కలిసిరాలేదు. చాలా కాలం

·         కిందట – స్వల్పంగా పక్షవాతం వచ్చి మాట కాస్త దెబ్బతింది. అది అతనికి ఒక చెడ్డ మలుపు. స్నేహితుల్ని చూస్తే కళ్ళనీళ్ళు తిప్పుకొనేవాడు. గొప్ప నటుడికి అది పెద్ద శాపం. క్రమంగా ఆరోగ్యం దెబ్బతింది. ఇవాళ ఉదయమే రాళ్ళపల్లి ఫోన్ చేసి “రాత్రి ప్రసాద్ పోయాడు బావా!” అంటూంటే అతని గొంతు బొంగురుపోయింది. ఒకనాటి అమెచ్యూర్ నాటక రంగాన్ని సుసంపన్నం చేసిన ఆఖరి యోధుడు పొట్టి ప్రసాద్. ఈ తరం సినీ ప్రేక్షకులు అతని పేరులో ‘పొట్టి’ నే చూస్తారేమో కాని మా తరం నటులం ప్రసాద్ ని చూడాలంటే – తలలు కాస్త ఎత్తాలి. తప్పదు.

·         సేకరణ – శర్మ గారు

·          సశేషం

·         మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -20-3-22-ఉయ్యూరు

Posted in సినిమా | Tagged | Leave a comment

మన మరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు-145 145-‘’కొడుకుపుట్టాల ‘’నాటిక ఫేం ,రుద్రవీణ ,మరోచరిత్ర ,సీ.రా, మనవరాలు ,సీతమ్మవాకిట్లో సంభాషణ ఫేం –గణేష్ పాత్రో

మన మరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు-145
145-‘’కొడుకుపుట్టాల ‘’నాటిక ఫేం ,రుద్రవీణ ,మరోచరిత్ర ,సీ.రా, మనవరాలు ,సీతమ్మవాకిట్లో సంభాషణ ఫేం –మాటల మాంత్రికుడు -గణేష్ పాత్రో
గణేష్ పాత్రో (జూన్ 22, 1945 – జనవరి 5, 2015) నాటక రచయిత, సినీ రచయిత.
జననం
ఈయన జూన్ 22, 1945లో జన్మించారు. ఈయన స్వస్థలం విజయనగరం జిల్లా, పార్వతీపురం.
విద్యార్థిజీవితం
గణేష్ పాత్రో తండ్రి, పార్వతీపురం దగ్గర ఒక చిన్న గ్రామానికి కరణంగా పనిచేసేవాడు. గణేష్ ప్రాథమిక విద్య అక్కడే సాగింది. ఆ గ్రామంలో ఉన్నత పాఠశాల లేనందున, పార్వతీపురంలో ఒక ఇల్లు కొని అందులో బామ్మతో పాటు గణేష్ ను ఉంచి చదివించాడు. తనపై పెద్ద నిఘా లేని సమయాన్ని ఆసరాగా తీసుకొని నాటకాలలో నటించడం ప్రారంభించాడు, పాఠశాల పుస్తకాలతో పాటు సాహిత్యాన్ని కూడా చదవటం ప్రారంభించాడు. ఆ తరువాత వెనువెంటనే కుటుంబం మొత్తం పార్వతీపురానికి మారింది. ఆ కాలంలోని రావిశాస్త్రి స్ఫూర్తితో స్థానిక విశాఖ మాండలికంలో ఛందోబద్ధ కవిత్వం వ్రాయటానికి ప్రయత్నించాడు కానీ అది సఫలం కాలేదు. పీ.యూ.సి పూర్తయిన తర్వాత పై చదువులకు ఆంధ్ర విశ్వవిద్యాలయంలో చేరాడు. అక్కడునుప్పడే విశ్వవిద్యాలయ సాంస్కృతిక సంఘానికి జాయింట్ సెక్రటరీగా నాటకాలు వ్రాయటం, వాటిని రంగస్థలంపై ప్రదర్శించడం ప్రారంభించాడు.[1]
నాటక, సినీరంగ జీవితం
కొడుకు పుట్టాల నాటికతో యావద్భారతదేశంలో కీర్తి లభించింది. ఆ నాటిక అన్ని భారతీయ భాషల్లోకి అనువాదమై, ఆకాశవాణి, దూరదర్శన్ లలో ప్రసారమైంది. 1970 ప్రాంతంలో రచన ప్రారంభించిన గణేష్ పాత్రో అయిదేళ్ళ కాలంలో ప్రథమ శ్రేణి నాటకకర్తగా పేరు తెచ్చుకున్నాడు. రచనలు చాలా తక్కువే అయినా, వ్రాసిన ప్రతి నాటికా, నాటకము రంగస్థలం మీద రక్తి కట్టి రసజ్ఞుల మెప్పుపొందింది. కథా వస్తువును పరిగ్రహించడంలో, కథనంలో, పాత్రచిత్రణలో, సన్నివేశాల మేళవింపులో, మాటల కూర్పులో నిత్య నూతన పరిమళాన్ని వెదజల్లిన ప్రతిభాశాలి గణేష్ పాత్రో. సంఘటనల ద్వారా సమస్యను శక్తివంతంగా ఆవిష్కరించటం ఈయన రచనా విధానంలో ప్రత్యేకత. మృత్యుంజయుడు, తెరచిరాజు, తరంగాలు, అసురసంధ్య నాటకాలూ, కొడుకు పుట్టాల, పావలా, లాభం, త్రివేణి, ఆగండి! కొంచెం ఆలోచించండి మొదలైన నాటికలు ఆంధ్ర ప్రేక్షకుల అభిమానాన్ని దోచుకున్న ఉత్తమ రచనలు.[2]
1970 నుండి 1990ల వరకు అనేక సినిమాలకు సంభాషణలు, కథను అందించాడు. పదిహేనేళ్ళ తర్వాత తిరిగి సినీరంగానికొచ్చి సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాకు సంభాషణలు సమకూర్చాడు.[3] “హలో గురూ ప్రేమకోసమేరా ఈ జీవితం” నిర్ణయం సినిమాలో పాట రాశాడు.
ఈయన సినీ సంభాషణలు సమకూర్చిన చిత్రాల్లో సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, నిర్ణయం, సీతారామయ్య గారి మనవరాలు, రుద్రవీణ, తలంబ్రాలు, ప్రేమించు పెళ్ళాడు, మయూరి, మనిషికో చరిత్ర, గుప్పెడు మనసు, ఇది కథ కాదు, మాపల్లెలో గోపాలుడు ఇలా పలు హిట్ చిత్రాలు ఉన్నాయి.[4]
రచయితగా పనిచేసినిన సినిమాల పాక్షిక జాబితా
· సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు (2013) (సంభాషణలు, శ్రీకాంత్ అడ్డాలతో కలిసి)
· 9 నెలలు (2001)
· నిర్ణయం (1991) (సంభాషణలు, పాటలు)
· సీతారామయ్య గారి మనవరాలు (1991)
· రుద్రవీణ (1988)
· గౌతమి (1987)
· తలంబ్రాలు (1986)
· ప్రేమించు పెళ్ళాడు (1985)
· మయూరి (1984)
· మనిషికో చరిత్ర (1984)
· గుప్పెడు మనసు (1979) (సంభాషణలు)
· ఇది కథ కాదు (1979)
· మరో చరిత్ర (1978)
· అత్తవారిల్లు (1976)
మరణం
కేన్సర్ వ్యాధితో బాధపడుతూ చెన్నైలోని ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్సపొందిన గణేష్ పాత్రలో 69 ఏళ్ళ వయసులో 2015, జనవరి 5 సోమవారం ఉదయం కన్నుమూశాడు.[5]
ఇతర వివరాలు
విజయనగరం జిల్లా పార్వతీపురంలోని బైపాస్‌ రోడ్డుకు గణేష్‌పాత్రో రోడ్డుగా నామకరణం చేయబడింది.[6]
కుటుంబ అనుబంధాలను ఎంతో హృద్యంగా అత్యంత సహజ సిద్ధంగా ఆవిష్కరించే ప్రత్యేక కథా రచయిత గణేష్ పాత్రో సోమవారం చెన్నైలో కన్నుమూశారు. 69 ఏళ్ల ఆయన కొంత కాలంగా క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్నారు. సోమవారం ఉదయం 8 గంటల సమయంలో చెన్నైలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో తుదిశ్వాస విడిచారు. బాల్యం నుంచి కథలు రాయడం, నాటకాల్లో నటించడం అలవరచుకున్న గణేష్ పాత్రో స్వగ్రామం విజయనగరం జిల్లా పార్వతీ పురంలో 1945 జూన్ 22న ఆదిలక్ష్మీనారాయణ పాత్రో, సూర్యకాంతం దంపతులకు ఆయన జన్మించారు. ఈ దంపతులకు 17 మంది సంతానంలో పెద్ద వాడు గణేష్‌పాత్రో.
ఈయన అసలు పేరు వేహ్రా సత్య గణ గంగ పోలీసు వెంకటరమణ మహా పాత్రో. బీఏ పట్టదారుడైన ఆయనకు ప్రఖ్యాత నటుడు అక్కినేని నాగేశ్వర రావు అంటే ఎంతో అభిమానం. ఆయన్ను స్ఫూర్తిగా తీసుకునే చిత్ర రంగంలోకి వచ్చారు. నాటకాలు రాయడం, నటించడంపై మక్కువ చూపించే గణేష్ పాత్రోకు ప్రముఖ రంగ స్థల నటుడు కుప్పిలి వెంకటేశ్వరరావు నటన కంటే రచనలపై దృష్టి సారించాలని సలహా ఇవ్వడంతో పలు కథలను రచించా రు. పావల, కొడుకు పుట్టాల, ఆలోచించండి వంటి పలు నాటకాలను ఆయన రచిం చారు. తొలి నాటకం కొడు కు పుట్టాలకు జాతీయ అవార్డు రావడం విశేషం. ఈ నాటకం పలు భాష ల్లో అనువాదం అయిం ది. రేడియోల్లోనూ ప్రసారం అయింది.
సినీ ప్రస్తానం
గణేష్ పాత్రో సినీ రంగ ప్రస్తానం 1965లో మొదలైంది. అక్కినేని నాగేశ్వరరావుకు వీరాభిమాని అయిన గణేష్ పాత్రో ఆయనలాగే నటించాలని ఆశపడే వారట. అయితే, ఆయన రాసిన పావల, కొడుకు పుట్టాల నాటకాల సమ్మేళనంతో మాకు స్వతంత్రం కావాలి అనే చిత్రాలను తెరకెక్కించారు. కృష్ణం రాజు, జయ ప్రద హీరో హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రాన్ని ప్రముఖ నటుడు ప్రభాకర్ రెడ్డి నిర్మించారు. అలా, కథా రచయితగా సినీ రంగంలోకి అడుగు పెట్టిన గణేష్‌పాత్రో 125కు పైగా చిత్రాలకు కథలు, మాటలను అందించారు.
బాలచందర్‌తో అనుబంధం
దివంగత ప్రఖ్యాత దర్శకుడు కే బాల చందర్‌తో గణేష్‌పాత్రో అనుబంధం విడదీయరానిది. ఆయన చేసిన ప్రతి చిత్రానికి తెలుగులో గణేష్‌పాత్రో సంభాషణలు అందించారు. వారి మధ్య మంచి సాన్నిహిత్యానికి ఇదొ క నిదర్శనం. బాలచందర్ దర్శకత్వం వహించిన మరో చరిత్ర, గుప్పెడు మనసు,ఆకలి రాజ్యం, రుద్ర వీణ, ఇది కథకాదు లాంటి పలు చిత్రాలు గణేష్‌పాత్రోకి మంచి పేరుతెచ్చి పెట్టాయి. బాలచందర్ అస్తమించిన వెళ్లిన రెండు వారాల్లోనే గణేష్‌పాత్రో కలం ఆగిపోవడం సినీరంగానికి తీరని లోటు.
కోడి రామకృష్ణతో 40 చిత్రాలు
సీనియర్ దర్శకుడు కోడి రామకృష్ణ, గణేష్‌పాత్రోల కలయికలో 40 చిత్రాలు తెరకెక్కడం విశే షం. ముఖ్యంగా భార్గవ ఆర్ట్స్ పిక్చర్స్ అధినేత దివంగత ఎస్ గోపాల్ రెడ్డికి ఆస్థాన రచయితగా గణేష్‌పాత్రో వ్యవహరించారు. అలాగే, ప్రముఖ దర్శకుడు క్రాంతికుమార్‌తో కలసి ప లు చిత్రాలకు పనిచేశారు. మనిషికో చరిత్ర, మయూరి, ప్రేమించి పెళ్లాడు, నాట్య మయూ రి, అత్తవారిళ్లు, స్వాతి, చిలకమ్మ చెప్పింది, వం టి ఎన్నో చిత్రాలు రచయితగా గణేష్‌పాత్రోకు కలికి తురాయిగా మిగిలాయి. మంచి సంభాషణలేగానీ, పంచ్ డైలాగులు రాయన న్న నిబద్ధతతో మానవత విలువలకు అద్దం పట్టే చిత్రాలను చేసిన గణేష్‌పాత్రో చివరి చిత్రం సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు కావడం విశేషం.
నంది అవార్డులు
గణేష్‌పాత్రో స్వాతి చిత్రానికి 1983లో, రుద్రవీణ చిత్రానికి గాను 1988లో ఉత్తమ నంది అవార్డులను అందుకున్నారు. మయూరి చిత్రానికి గాను ఉత్తమ స్క్రీన్ ప్లే రచయితగా నంది అవార్డును దక్కించుకున్నారు. 2009లో ఆయన అభిమానంగా ప్రేమించే అక్కినేని నాగేశ్వరరావు పురస్కారాన్ని, 2013లో మనసు కవి ఆత్రేయ బిరుదును అందుకున్నారు. గణేష్‌పాత్రోకు భార్య లక్ష్మికుమారి, కుమార్తెలు కనకమహాలక్ష్మి, సంయుక్త, కుమారుడు సీతారామ పాత్రో తదితరులు ఉన్నా రు. గణేష్‌పాత్రోకు తొలి రోజుల్లోనే దర్శకత్వ అవకాశం వచ్చినా, అని వార్య కారణాలతో తెరరూపం దాల్చ లేదు. కుటుంబ సభ్యులతో కలసి విశాఖ పట్నంలో నివశించాలన్న కోరిక ఆయనకు ఉన్నా, అది నెరవేరకుండానే అందరికీ దూరమయ్యారని కుటుంబ సభ్యులు పేర
మాటల రచయిత ‘గణేపాత్రో’ జయంతి స్పెషల్..
దేవుడు సర్వాంతర్యామి అని మనం అనుకుంటాం. కానీ.. అసలు సిసలు సర్వాంతర్యామి ఆకలి అని చెప్పిన మాటల మాంత్రికుడు
దేవుడు సర్వాంతర్యామి అని మనం అనుకుంటాం. కానీ.. అసలు సిసలు సర్వాంతర్యామి ఆకలి అని చెప్పిన మాటల మాంత్రికుడు.. విమానం మా నాన్న కూడా కొనగలరు తాతయ్యా.. కానీ దాన్ని నడిపే వాణ్ని కొనడం మన తరమా.. అంటూ గుండెల్ని పిండి చేసేలా పాత్రోచితంగా రాయగల నేర్పరి.. ఇన్నాళ్లూ మనం విడిపోయింది మృత్యు ఒడిలో కలవడానికా అంటూ చరిత్ర సృష్టించిన మరో చరిత్రను ఒక్క ముక్కలో ముగించి వినేవాడి కళ్లు చెమర్చేలా చేయగల రచయిత.. ఆయనే పాత్రోచిత సంభాషణలకు పెట్టింది పెన్నుగా పేరు తెచ్చుకున్న గణేష్ పాత్రో .. ఇవాళ గణేష్ పాత్రో జయంతి.
క్షణకాలం గుర్తుండే పంచ్ డైలాగులకన్నా.. కలకాలం గుర్తుండే మంచి డైలాగులతో మనపై ముద్రవేసిన గొప్ప రచయిత గణేష్ పాత్రో. ఆయన మాటలు రాసిన ఏ సినిమాలోనూ మాట సన్నివేశాన్ని డామినేట్ చేయదు.. ఎలివేట్ చేస్తుంది. సీరియస్ మాటలు రాయాలంటే గణేష్ పాత్రో కలం ఉరకలు వేస్తుంది. ఆకలిరాజ్యం పై అక్షరాలు ఎక్కుపెట్టిన పాత్రోనే.. మాటలతో రుద్రవీణలు వాయించారు..
వెండితెరకు రావడానికి ముందే గణేష్ పాత్రో తన నాటకాల, మాటల ద్వారా ఎన్నో స్టేజీలను దున్నేశారు. ఆయన మాటలతో అన్ని స్టేజీలు అదిరిపోయాయి. పావలా, కొడుకుపుట్టాలా, లాభం లాంటి నాటకాలు ఆ తర్వాతి కాలంలో సినిమాగానూ రూపుదిద్దుకున్నాయి. 1976లో కె. ప్రత్యగాత్మ దర్శకత్వం వహించిన ‘అత్త వారిల్లు’ చిత్రంతో సినీ మాటల రచయితగా తెలుగు ప్రేక్షకులకి పరిచయమయ్యారు. 1978లో వచ్చిన కె. బాలచందర్‌ సినిమా ‘మరోచరిత్ర’ ఆయన కెరీర్‌ని మలుపుతిప్పింది.
మరోచరిత్ర సినిమాతో శ్రీశ్రీకి అక్షర నైవేద్యం చేశాడు పాత్రో. శ్రీశ్రీ చెప్పినట్టు అంటూనే సన్నివేశానికి తగ్గట్టుగా తనమాటల సత్తా చూపించాడు. శ్రీశ్రీ విలువ మూడు రూపాయలు.. ఇక మనల్ని ఆదుకోవడానికి శ్రీశ్రీ కూడా లేడు అంటూ నాటి నిరుద్యోగం, కరవు పరిస్థితులను తన అక్షరాలతో కడిగిపారేశాడు పాత్రో.
మరోచరిత్రకు ముందే చిలకమ్మ చెప్పింది సినిమాతో బాలంచదర్ తో పరిచయమైంది పాత్రోకి. అందుకే ముందుగా ఆకలిరాజ్యం సినిమాకు ఆత్రేయతో రాయించాలనుకున్న బాలచందర్.. పాత్రో పాళీ పవర్ తెలుసుకుని ఆయన్ని రచయితగా తీసుకున్నాడు. ఇక ఆ తర్వాత ఈ ఇద్దరి కాంబినేషన్ లో వచ్చిన ఎన్నో చిత్రాలు.. తెలుగు ప్రేక్షకులను ఉర్రూతలూపాయి.. ఆ పరిచయమే పాత్రోని బాలచందర్ కు తెలుగుముఖంగా మార్చాయి.. అటు బాలచందర్ కూడా ఈయనపై ఉన్న ప్రేమతో ఆయన మాటలు రాయకపోయినా.. ఓ సినిమాకు ఆయన పేరునే మాటల రచయితగా వేశాడు..
బాలచందర్ కు తెలుగు ముఖంగా మారిన పాత్రోకి ఆయనకేం కావాలో తెలుసు. అలాగే తను చెప్పిన పాత్రలకు పాత్రో ఎలా రాస్తాడో బాలచందర్ కూ తెలుసు. అందుకే వీరి కాంబినేషన్ లో వచ్చిన సినిమాల్లో ఎక్కడా ఒక్కమాట కూడా ఎగస్ట్రా గా అనిపించదు. ఇంక డ్రామాకు ఎక్కువ ఆస్కారం ఉన్న గుప్పెడు మనసు, ఇది కథ కాదు, రుద్రవీణ .. లాంటి సినిమాల్లో ఎక్కడా మాటలు దృశ్యాన్ని డామినేట్ చేయవు.. అది బాలచందర్, పాత్రోల అర్థవంతమైన బంధానికి ప్రతీక..
బాలచందర్ తర్వాత గణేష్ పాత్రో పెన్ కి పర్ఫెక్ట్ గా సూట్ అయిన కథలు క్రాంతికుమార్ నుంచి వచ్చాయి. దీంతో ఆటోమేటిక్ గా ఈ ఇద్దరి బంధం ముదిరిపోయింది. వీరి కాంబినేషన్ లో వచ్చిన ఎన్నో సినిమాలు ప్రేక్షకులను కంటతడి పెట్టించాయి.. గుండె బరువెక్కించాయి. స్వాతి, మయూరి, సీతారామయ్యగారి మనవరాలు, 9నెలలు లాంటి సినిమాలతో పాత్రో తన పెన్ పవర్ చూపిస్తే, క్రాంతికుమార్ దర్శకుడిగా దమ్ము చూపించారు..
ముఖ్యంగా సీతారామయ్యగారి మనవరాలు సినిమాలో డైలాగులన్నీ సాధారణంగానే ఉన్నాయనిపిస్తాయి.. కానీ కథాగమనంతో పోల్చి చూసినప్పుడు పాత్రో సంభాషణల సత్తా ఏంటో అర్థం అవుతుంది. సన్నివేశానికి అనుగుణంగా మాటలు రాయడం అంటే పాత్రో తర్వాతే ఎవరైనా అనిపిస్తుంది.. ఈ సినిమా చూసిన తర్వాత.. ముఖ్యంగా రోహిణి హట్టంగడి చనిపోయిన తర్వాత అక్కినేని, మీనాల మధ్య వచ్చే సన్నివేశంలో పాత్రో మాటలు ప్రతిఒక్కరి గుండెల్ని పిండి చేస్తాయి..
కథకు పొంతన లేకుండా, పాత్రలకు సంబంధం లేకుండా రాసే రైటర్‌ కాదు ఆయన. ఒక క్యారెక్టర్‌కు ఒక మాట రాశాడంటే.. ఆ మాట సినిమా చూస్తున్న ప్రేక్షకుడి గుండెలోతుల్లోకి దూసుకెళ్లేది. కదిలించేది. నవ్వించేది. ఏడిపించేది. ఎంతటి విషయాన్నైనా వీలైనంత క్లుప్తంగా, సూటిగా, స్పష్టంగా చెప్పడం గణేష్‌పాత్రోకు వెన్నతోపెట్టిన విద్య. ఆయన పాత్రలతో మాట్లాడించే ప్రతీమాట కథతో మమేకం అయ్యుండేది. హీరోయిజాన్ని దృష్టిలో పెట్టుకుని ఏ రోజు రాయలేదు. అందుకే పాత్రో మాటలు పాత్రోచితంగానే మురిపిస్తాయి.
బాలచందర్ తో ఎక్కువ అనుబంధం ఉన్నా.. ఆయన సినిమాలతోనే ఎక్కువ ఫేమ్ అయినా .. తెలుగులో పాత్రో ఎక్కువగా మాటలు రాసింది కోడి రామృష్ణ చిత్రాలకు. వీరి కాంబినేషన్ లో దాదాపు 40 సినిమాలు వచ్చాయంటే ఆశ్చర్యం కలగక మానదు.. అలాగే భార్గవ్ ఆర్ట్స్ ప్రొడక్షన్స్ లో వచ్చిన అన్ని చిత్రాలకూ పాత్రోనే మాటలు రాశారు.. ఈ సినిమాల్లో అప్పుడప్పుడూ కాస్త బూతు ధ్వనించిందనే విమర్శలూ పాత్రో పాళీలో ఉన్నాయి.. అయినా మరీ హద్దు మీరిన సంభాషణలు మాత్రం ఏ సినిమాలోనూ కనిపించవు..
వందకు పైగా సినిమాలకు మాటలు రాసిన పాత్రో చాలా వరకూ సీరియస్ సినిమాలకే ఎక్కువగా మాటలు రాశారు. అప్పుడప్పుడూ సరదాలకు పోయినా ఎప్పుడూ హద్దు మీరలేదు.. అయితే ఒకే ఒక్క పాటతో తనలోని చిలిపితనాన్ని చిరకాలం చేశారు పాత్రో. నిర్ణయం సినిమాలోని హలోగురూ ప్రేమకోసమేరోయ్ జీవితం అనే టీజింగ్ సాంగ్‌ని అన్ని సీరియస్ సంభాషణలు రాసిన పాత్రో రాశారంటే ఆశ్చర్యం కలగక మానదు. ఒక్కటే రాసినా ఇప్పటికీ ఆ పాట ఒక్కసారైనా గుర్తుకు తెచ్చుకోని కుర్రాళ్లుంటారా ..?
సంభాషణా రచయితగా సన్నివేశానికి తగ్గట్టుగా ఎంతటి మాటలైనా రాసే పాత్రో రియల్ లైఫ్ లో మాత్రం చాలా సౌమ్యుడు. ఎవరినీ చేయి చాచి అడగడం తెలియని అమాయకుడు పాత్రో అంటాడు ఆత్రేయ. అందుకే ఓ దశలో సినిమా రంగంలో వస్తున్న విపరీత పోకడలు, మార్పులకు అనుగుణంగా తను మారలేక, మార్పును కాంక్షిస్తున్న వారిని అవకాశాలు అడగటం ఇష్టం లేక తన పెన్నునే కొంత కాలం పక్కన బెట్టారు.. క్రాంతికుమార్ డైరెక్షన్ లో వచ్చిన 9నెలలు తర్వాత పాత్రో దాదాపు పదిహేనేళ్లు సినిమా సంభాషణలకు దూరంగా ఉన్నారు.
దాదాపు వంద సినిమాలకు మాటలు రాసిన రచయిత కేవలం పరిశ్రమ పోకడలు నచ్చకే పదిహేనేళ్లు దూరంగా ఉన్నారంటే చిన్న విషయం కాదు.. కానీ కమర్షియల్ కాలిక్యుటేషన్స్ లో పడిపోయిన పరిశ్రమలో పాత్రో లాంటి ప్రతిభావంతమైన రచయితను పట్టించుకునేదెవరు.. అటు ఆయన కూడా ఎవరినీ తనకు అవకాశం ఇవ్వమని అడగలేదు. దీంతో ఇక పాత్రో పాళీలో ఇంకు ఖాళీ అయిపోయినట్టే అనుకుంటున్న టైమ్ లో శ్రీకాంత్ అడ్డాల మళ్లీ ఆయన కలంలో ఇంకు నింపి తన ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ చిత్రానికి మాటలు రాయించారు. అదే ఆయన చివరి చిత్రం కూడా.. అయితేనేం.. అందరూ నవ్వాలంటూ ఆయన రాసిన మాటలు ఎప్పటికీ మిగిలే ఉంటాయి కదా..
కుటుంబ వ్యవస్థలోని బంధాలు, ఆత్మీయతలకు గణేష్‌పాత్రో సంభాషణలు అద్దం పట్టాయి. ఇదికథకాదు, మరోచరిత్ర నుంచి సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు వరకు ఎన్నో చిత్రాల్ని తన మాటలతో విజయపథంలో నడిపించారు. తెలుగులో తను మొహమైన బాలచందర్ మరణించిన అతి కొద్దికాలానికే మిత్రుణ్ని వెదుక్కుంటూ వెళ్లిపోయిన పాత్రో మరణం తెలుగు సినిమాకి, తెలుగు సాహిత్యానికి తీరని లోటు..
గొల్లపూడి మారుతీ రావు కు పాత్రో రాసిన ఉత్తరం –
సరిగ్గా 19 రోజుల కిందట గణేష్‌ పాత్రో నాకో ఎస్సెమ్మెస్‌ పంపాడు.
‘డియర్‌ మారుతీ! (నన్ను ‘ఒరేయ్‌’ అని పిలిచే అతి తక్కువ మందిలో పాత్రో ఒకడు), నోటికి ఆపరేషన్‌ కోసం ఆసుపత్రిలో చేరాను. నువ్వు నా గురువువి. నువ్వెప్పుడూ గుంటూరు లంక పొగాకు చుట్ట కాల్చి ఆనందించడానికి వెనకాడలేదు. కాశ్మీరీ కిమామ్‌తో కలకత్తా పత్తాతో కట్టిన జర్దా కిళ్లీ సర్దాని కాదనలేదు. మంచీ చెడూ ఎప్పుడూ కలిసే వస్తాయి. చెడు అలవాటుని నువ్వు గుర్తించి దూరం చేసుకున్నప్పుడు దేవుడు నీకు వరమవుతాడు. చెడుని వదులుకోలేనినాడు నిన్ను తన దగ్గరికి తీసుకుంటాడు. ఈ విపర్యాయాన్ని నువ్వు నీ కొడుకులకు చెప్పు – పాత్రో”. ఇదీ అక్షరాలా ఆ సందేశం. నేను నిర్ఘాంతపోయాను. వెంటనే ఫోన్‌ చేశాను. మళ్లీ వెంటనే సమాధానం. ”ఓ నెలరోజులు మాట్లాడలేను. సారీ మారుతీ”. ఇక ఏం మాట్లాడాలో, ఎవరితో మాట్లాడాలో తెలీదు. పాత్రో భార్య లక్ష్మి నాకు చిన్నపిల్లగా తెలుసు. అతని మామ – నటరాజు కె.వేంకటేశ్వరరావూ నేను ”ఒరేయ్‌” అని పిలుచుకునేంత సన్నిహితులం. విలవిలలాడిపోయాను.
మరో ఆరు రోజుల తర్వాత కె.బాలచందర్‌ గారు కన్నుమూశారు. బాలచందర్‌కి ‘తెలుగు ముఖం’ పాత్రో. సందేశం కోసం నన్ను పలకరించిన వారందరికీ చెప్పాను. బాలచందర్‌గారి అన్ని చిత్రాలకీ రాసిన గణేష్‌ పాత్రో చాలా గొప్ప విషయాలు చెప్పగలడనీ- అతనే రాయగలడనీ. అయితే ఆ రెండు పనులూ చేసే స్థితిలో లేడు పాత్రో. విషాదానికి కలం కదలకపోవడం, కన్నీరు కార్చడానికి కళ్లు కలిసిరాకపోవడం దురదృష్టం.
ఈ పన్నెండు రోజులూ పాత్రో నా మనస్సులో కదులుతూనే ఉన్నాడు. ఉండబట్టలేక జనవరి రెండున ఒక మెసేజ్‌ పంపాను. ‘కోలుకుంటున్నావా?’ అని. అప్పటికి సమాధానాన్ని పంపే స్థితిలో లేడట పాత్రో. కేన్సర్‌ శరీరంలో చాలా భాగాలకి వ్యాపించింది. మాత్రలతో బాధనుంచి అతన్ని మభ్యపెడుతూ వచ్చారు.
దాదాపు 54 సంవత్సరాల కిందట నన్ను పరిచయం చేసుకోడానికి – మా తమ్ముడి ద్వారా ఎప్పుడు విశాఖపట్నం వచ్చినా స్టేషన్‌కి వచ్చేవాడు. అప్పుడు పోస్టల్‌ డిపార్టుమెంటులో ఉద్యోగం. అలా వచ్చిన వ్యక్తులు ఇద్దరు – గణేష్‌పాత్రో, కె.వివేకానంద మూర్తి. విశాఖలో రైలు దిగినప్పటినుంచి మళ్లీ రైలు ఎక్కేదాకా నాతోనే ఉండేవారు. వాక్యరచన, శిల్పం, ఉక్తి చమత్కృతి, సంభాషణ చాతుర్యం – అన్నీ ఇద్దరితో చర్చించేవాడిని. ఇద్దరూ జీవితమంతా గర్వంగా ‘నా గురువు’ అని చెప్పుకున్నారు. ఇద్దరూ నన్ను ఏకవచనతో పిలిచేంత సన్నిహితులయిపోయారు.
ఆంధ్ర నాటకకళా పరిషత్తు, విజయవాడ పోటీలలో (1970 సెప్టెంబరు 8) నా నాటిక ‘కళ్లు’కి దీటుగా గొప్ప రచన చేశాడు పాత్రో. పేరు ‘పావలా’. ఆనాడు ‘కళ్లు’ ఉత్తమ రచన కాగా, మిగతా బహుమతులనన్నింటినీ మేమిద్దరం పంచుకున్నాం. ‘పావలా’ నాటికను మిశ్రో అద్భుతంగా ప్రదర్శించాడు. సినీమా రంగంలో ఎన్నో గొప్ప చిత్రాలకు బాలచందర్‌గారికి ‘తెలుగు ముఖ’మయి నిలబడ్డాడు. కమల్‌హాసన్‌కి శ్రీశ్రీని అలవాటు చేశాడు. శ్రీశ్రీ కవితల్ని అలవోకగా చదువుతాడు కమల్‌. అతని ‘మరో చరిత్ర’, ‘ఆకలి రాజ్యం’ వంటి చిత్రాలు ఏ రచయితనయినా ఈర్ష్య పడేటట్టుచేసే గొప్ప చిత్రాలు. పాత్రో యింటినిండా నందుల పంట. సినీ నటుడిగా నేను నటించిన అన్ని గొప్ప పాత్రలనూ పాత్రోయే రాశాడు. ‘సంసారం ఒక చదరంగం’, ‘మనిషికో చరిత్ర’, ‘డబ్బు భలే జబ్బు’, ‘రామాయణంలో భాగవతం’, ‘పుణ్యస్త్రీ’, ‘పద్మావతీ కళ్యాణం’ – యిలాగ. రచయితగా పాత్రో నా శిష్యుడు. నటుడిగా వెండితెర మీద పాత్రో నా వూపిరి. కావాలని, పిలిచి ఆయా సినిమాలకు పాత్రోయే రాయాలని నేను పట్టుబట్టిన సందర్భాలున్నాయి. నాటకీయత, విసురూ, మాటల్లో పదునూ, తనదయిన భావ దారుఢ్యం- యిన్నిటిని సాధించగల రచయిత పాత్రో. తణుకులో ‘సీతారామయ్యగారి మనుమరాలు’ చూస్తూ మొదటి ఫ్రేమ్‌ నుంచీ కంటతడిపెడుతూనే ఉన్నాను. అప్పుడు పాత్రో తణుకులోనే ఉన్నాడు. రూంకి పిలిచి మరీ కావలించుకున్నాను. ఓ భయంకరమైన ఆపరేషన్‌ కలిసిరాకపోగా, చాలా యిబ్బందులతో జీవించాడు పాత్రో. సంవత్సరం కింద ప్రపంచ తెలుగు మహాసభలకు కౌలాలంపూర్‌ వెళ్లినప్పుడు ఇద్దరం ఒకే గదిలో గడిపాం. కౌలాలంపూర్‌లో నా పుట్టిన రోజు జరిపాడు. బాలచందర్‌గారిని ఎప్పుడు కలవాలన్నా మా రూటు పాత్రో ద్వారానే. పాత్రో అంటే అమితమైన గౌరవం, గురి, అభిమానం బాలచందర్‌గారికి. బాలచందర్‌గారి సాన్నిహిత్యం ఓ వ్యసనం. లభిస్తే దానినుంచి ఎవరూ తప్పుకోలేరు. బాలచందర్‌గారితో కలిసి పన్నెండో రోజునే నిష్క్రమించాడు పాత్రో. నాకే కాదు – నా భార్యని ‘శివానీ’ అని ఆత్మీయంగా పిలిచే రెండో మిత్రుడు (మొదటి మిత్రుడు బీ.వీ.రామారావు). నా పిల్లలకి సన్నిహితుడు. రొటీన్‌గా ‘మెలోడ్రామా’ని పూసుకుని, రాసుకుని తెరమీద వ్యాపారం చేసే చిల్లర వ్యాపారులలాగ కాక – కొత్తదనాన్నీ, కొత్త ధనాన్నీ, కొత్త నుడికారాన్నీ యివ్వగల గొప్ప దర్శకులు – బాలచందర్‌, క్రాంతికుమార్‌ వంటివారి సాంగత్యం లభించిన అదృష్టవంతుడు. ఆ సాంగత్యాన్ని సార్ధకం చేసిన ప్రతిభాశాలి. ‘మారుతీ’ అన్న పిలుపుని ఆప్యాయంగా పిలిచే అతి కొద్దిమందిలో నేను నష్టపోయిన ఆత్మీయుడు. తెలుగుమాటకి కవిత్వపు చెమ్కీని అద్ది కొత్తరకం కన్నీటికి కొత్త అర్థం చెప్పిన కవి. నాటకంలో, సినీమాలో అద్భుతమయిన టైమింగ్‌ని ఒడిసిపట్టుకున్న రచయిత – పాత్రో, తన జీవితానికి వచ్చేసరికి సెలవు తీసుకోడానికి – ఒకే ఒక్కసారి టైమింగ్‌ మిస్సయాడు! – గొల్లపూడి మారుతీరావు (రచయిత, నటుడు)
సశేషం
మీ –గబ్బిట దుర్గాప్రసాద్-20-3-22-ఉయ్యూరు
Posted in సినిమా | Tagged | Leave a comment

మన మరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు-144 144-ధర్మ దాత ,మల్లమ్మ కధ దర్శకుడు, ఎల్వి సోదరుడు,ఎడిటర్ ,సబ్ టైట్లింగ్ నిపుణుడు –అక్కినేని సంజీవి

మన మరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు-144
144-ధర్మ దాత ,మల్లమ్మ కధ దర్శకుడు, ఎల్వి సోదరుడు,ఎడిటర్ ,సబ్ టైట్లింగ్ నిపుణుడు –అక్కినేని సంజీవి

అక్కినేని సంజీవి సుప్రసిద్ధ తెలుగు సినిమా ఎడిటర్, దర్శకుడు.

జననం
అక్కినేని సంజీవరావు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో పశ్చమ గోదావరి జిల్లా సోమవరప్పాడు గ్రామంనందు అక్కినేని శ్రీరాములు, బసవమ్మ దంపతులకు జన్మించాడు.వీరి కుమారుడే జాతీయ పురస్కారాల్ని పొందిన ఎడిటర్ శ్రీకర్ ప్రసాద్. తెలుగు సినీనిర్మాత, దర్శకుడు, నటుడు, దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత ఎల్.వి. ప్రసాద్ గారు వీరికి స్వయాన అన్నగారే.

సినిమా రంగం
అక్కినేని సంజీవి అక్కాచెల్లెలు, ధర్మదాత, అత్తగారు కొత్తకోడలు, నాటకాలరాయుడు, మల్లమ్మ కథ లాంటి చిత్రాలకు దర్శకత్వం వహించారు. ఆయన అంతకుముందు ఎడిటింగ్ శాఖలో నిష్ణాతుడు. విదేశీ చలన చిత్రోత్సవాల్లో పాల్గొనే చిత్రాలకు మన తెలుగు చిత్రాల నిడివి ఎక్కువైనపుడు వాటిని అర్థవంతంగా కుదించి పంపించిన ఘనత సంజీవి గారిది. అంతేకాదు. అప్పట్లో మనకు కొత్తైన సబ్ టైట్లింగ్ ప్రక్రియను సరైన పరికరాలు లేకుండా మామూలు లాబరేటరీలో అత్యంత ప్రతిభావంతంగా రూపొందించి చిత్రోత్సవాలకు పంపించారు. ఆ తర్వాత చాలా కాలానికి గానీ సబ్ టైట్లింగ్ పరికరం మన దేశానికి రాలేదు. సంజీవి గారు అలా నిడివి కుదించి సబ్ టైట్లింగ్ చేసిన చిత్రాల్లో నమ్మినబంటు, అంతస్తులు, పదండి ముందుకు, సాక్షి లాంటి చిత్రాలు వున్నాయి.

చిత్ర సమాహారం
ఎడిటర్
· తయిళ్ళ పిళ్ళై (తమిళం, 1961) (ఎడిటర్)

· భార్యాభర్తలు (తెలుగు, 1961) (ఎడిటర్) [1]

· ఇరువార్ ఉల్లం (తమిళం, 1963) (ఎడిటర్)

· బంగారు గాజులు (తెలుగు, 1968) (ఎడిటర్)

· దత్తపుత్రుడు (1972) (ఎడిటర్)

· సతీ అనసూయ (ఒరియా, 1978) (ఎడిటర్)

· అష్టరాగ (ఒరియా, 1982) (ఎడిటర్)

· ము తుమే ఓ సే (ఒరియా, 1982) (ఎడిటర్)

· ఎస్.పి.భయంకర్ (తెలుగు, 1983) (ఎడిటర్)

· చక భౌరి (ఒరియా, 1985) (ఎడిటర్)

· మేరా ఘర్ మేరే బచ్చే (హిందీ, 1985) (ఎడిటర్)

· సహరి బఘా (ఒరియా, 1985) (ఎడిటర్)

· కెప్టెన్ నాగార్జున (తెలుగు, 1986) (ఎడిటర్)

· స్వాతి (హిందీ, 1986) (ఎడిటర్)

· తుండ బైడ (ఒరియా, 1987) (ఎడిటర్)

· జీతే హై షాన్ సే (హిందీ, 1988) (ఎడిటర్)

· ఖత్రోంకి ఖిలాడీ (హిందీ, 1988) (ఎడిటర్)

· సాగర్ గంగ (ఒరియా, 1994) (ఎడిటర్)

దర్శకత్వం
· అత్తగారు కొత్తకోడలు (తెలుగు, 1968) (దర్శకుడు)

· నాటకాల రాయుడు (తెలుగు, 1969) (దర్శకుడు)

· అక్కా చెల్లెలు (తెలుగు, 1970) (దర్శకుడు)

· ధర్మదాత (తెలుగు, 1970) (దర్శకుడు)

· సిసింద్రీ చిట్టిబాబు (తెలుగు, 1971) (దర్శకుడు)

· మల్లమ్మ కథ (తెలుగు, 1973) (దర్శకుడు)

· విశాలి (తెలుగు, 1973) (దర్శకుడు)

· మథురా విజయ (ఒరియా, 1979) (దర్శకుడు)

· రామ్ బలరామ్ (ఒరియా, 1980) (దర్శకుడు)

సశేషం
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -19-3-22-ఉయ్యూరు

Posted in సినిమా | Tagged | Leave a comment

మన మరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు-143

మన మరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు-143

143-అన్నమయ్య కీర్తనలు ‘’అదివో అల్లదివో ,తందనాన అహి ‘’ఫేం,రేడియో లో స్వరకర్త ,

 టిటిడి.ఆస్థాన విద్వాంసుడు  ,నాద కౌముది-మల్లిక్

 మల్లిక్ గా రేడియో శ్రోతలకు పరిచితులైన కందుల మల్లికార్జునరావు (1921-1996) లలిత సంగీత స్వరకర్త.

జీవిత విషయాలు

వీరు 1921లో మచిలీపట్నంలో జన్మించారు. మచిలీపట్నంలో క్రోవి సత్యనారాయణ వద్ద సంగీత విద్యాభ్యాసం గావించారు. 1942లో ఆకాశవాణి మదరాసు కేంద్రంలో లలిత సంగీత స్వరకర్తగా (కంపోజర్) చేరి ఆ తరువాత విజయవాడ కేంద్రానికి 1972లో బదిలీపై వచ్చారు.

రజనీకాంతరావు గారి పర్యవేక్షణలో మదరాసు కేంద్రంలో లలితసంగీత విభాగంలో పనిచేసి తర్వాత విజయవాడకు బదిలీ అయ్యారు. మదరాసుహైదరాబాదువిజయవాడ కేంద్రాలలో 38 సంవత్సరాలు అవిశ్రాంతంగా పనిచేసి, 1981లో పదవీ విరమణ చేశారు.

కళారంగం

లలిత సంగీత విభాగంలో సీనియర్ గ్రేడ్ మ్యూజిక్ కంపోజర్ గా పనిచేశారు. సినీరంగంలో కొంతకాలం పనిచేసి కీర్తి గడించారు. వెంపటి చినసత్యంగారితో కలిసి నృత్య నాటికలకు సంగీతం సమకూర్చారు. జానపద, లలిత సంగీత బాణీలలో తనదైన ముద్రవేసి పాడేవారు. స్వరపరచేవారు. లలిత సంగీతం ఆడిషన్ బోర్డు మెంబరుగా ఆకాశవాణికి సలహా సంప్రదింపులు అందించారు. భక్తిరంజని కార్యక్రమాలకు వీరు కొత్త ఒరవడి పెట్టారు.

అదిగో అల్లదిగో హరివాసము, తందనాన భళా తందనాన అన్నమయ్య కీర్తనలు వీరు పాడి శ్రోతలను మంత్రముగ్ధులను చేసేవారు.

డా.వెంపటి చిన సత్యంగారి బృందంలో ఎంతో కాలం గాత్రసహకారం అందించారు. నర్తకీమణులు రాజసులోచన,శోభానాయుడు,మంజుభార్గవి, చంద్రకళ, కొత్తపల్లి పద్మ, రత్నపాప మొదలగువారి నృత్యప్రదర్శనలకు గాత్రసహకారం అందించారు. శ్రీనివాస కల్యాణం, చండాలిక, శ్రీకృష్ణ పారిజాతం, మోహినీ భస్మాసుర, వాల్మీకి మొదలైన ఎన్నో నృత్య రూపకాలకు సంగీతం సమకూర్చారు.

మల్లిక్ బంగారుపాప, భాగ్యరేఖ, లవకుశ, వింధ్యరాణి, సంపూర్ణ రామాయణం, భక్త శబరి, జయభేరిచరణదాసి చిత్రాలలో పాడారు. తమిళ చలనచిత్రరంగంలో చంద్రలేఖ అనే తమిళచిత్రానికి తొలిసారిగా నేపథ్యగానం చేశారు.

1952 నుండి 1993 వరకు తిరుమల తిరుపతి దేవస్థానం ఆస్థాన విద్వాంసులుగా వ్యవహరించారు. ప్రతియేటా అన్నమాచార్య ఉత్సవాలలో పాల్గొన్నారు.

మల్లిక్ స్వరపరచిన పాటలు

1.    అదివో అల్లదివో శ్రీహరివాసము (అన్నమాచార్య కీర్తన) – మధ్యమావతిలో ఇప్పుడు ప్రచారంలో ఉన్నబాణీ.

2.    తందనాన ఆహి (అన్నమాచార్య కీర్తన) – బౌళిలో ఇప్పుడు ప్రచారంలో ఉన్న బాణీ

3.    గురుతెరిగిన దొంగ కూగూగు (అన్నమాచార్య కీర్తన) – మోహనలో ఇప్పుడు ప్రచారంలో ఉన్న బాణీ

4.    ఎవరేమన్నా ఏమనుకున్నా (ఆరుద్ర రచన)

బిరుదులు

1.    మధుర గాయకుడు

2.    నాదకౌముది

మరణం

1996 ఏప్రిల్ శనివారం 76వ ఏట విజయవాడలో మరణించారు.

సశేషం

మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -19-3-22-ఉయ్యూరు 

Posted in సినిమా | Tagged | Leave a comment

గోప బంధు దాస్ -5

గోప బంధు దాస్ -5

విద్యారంగం లో ప్రయోగాలు

పూరీజిల్లా సత్యవాది సాక్షీ గోపాల్ ప్రాంతం కొంత పట్టన లక్షణాలు కలిగి ఉంటుంది .రాయ్ బహాదర్ మధు సూదన రావు సూచన మేరకు విద్యా రంగం లో వినూత్న ప్రయోగం కోసం సాక్షీ గోపాల్  ను ఎన్నుకొన్నారు దాసు బృందం .సత్యవాది కూడా అనుకూలమైనదే .బ్రాహ్మణ అగ్రహారాల కేంద్రం .ఇక్కడి వైదికులలో సనాతన చాందసం  ఎక్కువ .సాక్షి గోపాల్ దాగ్గర రామచంద్రాపూర్ వాస్తవ్యుడు హరిహరదాస్ పూరీ సంస్కృత కాలేజి వ్యవస్థాపకుడు .ఈయనతో దాసు ,రావు లకు మంచి సంబంధం ఉంది. హరిహర్ యూరోపియన్ లతో బాగా సంబంధాలున్న ఆంగ్ల విద్యాధికుడు .చాన్దసాన్ని వ్యతిరేకించటానికి  నిలబడిన స్థిర చిత్తుడు.అక్కడ హరి దాస్ స్మృతులకు గౌరవం కలిపించి తాము అనుకొన్నది ఆచరణలో పెట్టవచ్చని సాక్షీ గోపాల్ నే ఎన్నుకొన్నారు .అప్పుడే రామచంద్ర పూర్ కు చెందిన గోపీనాధ దాసు ఒక మిడిల్ వెర్నాక్యులర్ స్కూల్ పెట్టటానికి సిద్ధపడుతున్నాడు .ఆ స్కూల్ ను సాక్షీ గోపాల్ లో పెట్టమని దాసు నచ్చ చెప్పాడు .19మంది విద్యార్దులతో ‘’సత్యవాది మిడిల్ ఇంగ్లిష్ స్కూల్ ‘’ను 12-8-1909న గోపబందు ప్రారంభించాడు .ఇది ఆయన బారిపాడా కు లాయర్ గా వెళ్ళటానికి ముందు జరిగింది .ఇదే తర్వాత సత్యవాదీ నికుంజ పాఠశాలా ఉద్యమానికి దారి తీసింది .

  దేవాలయ ఆవరణలో స్కూలు మొదలైంది సాక్షిగోపాల్ దేవాలయ ప్రాంగణం లో రెండు ఎకరాల భూమిని అద్దెకు ఇవ్వమని సేక్రేటరిగా ఆలయ సంఘాన్ని కోరాడు .అక్కడ దట్టంగా అందమైన వకుళ(పొగడ ) నికుంజం ఉంది.ఆ చెట్ల నీడలలో బడి తరగతులు నిర్వహించవచ్చు అనుకొన్నాడు .కానీ వాతావరణం అనిశ్చితం కనుక భవన నిర్మాణం ఆలోచించాడు .చందాలు వసూలు చేస్తూ చెట్లకింద తరగతులు నిర్వహింప జేశాడు .ప్రభుత్వం రికగ్నిషన్ ఇచ్చింది .11-10-1911న పండిట్ నీలకంఠ దాస్ వచ్చి చేరటంతో హైస్కూల్ గా మార్చే ప్రయత్నం జరిగింది .హైస్కూల్ పెట్టాలన్న గోపబందు కోరిక ఇలా నెరవేరింది .  

  పాఠశాల లక్ష్యాలు

ప్రాచీన గురుకుల విధానం లో విద్య నేర్పటం .రుసుము తక్కువ .వసతి గృహం ఏర్పాటు . అందులో నిరాడంబర జీవితం ,నిజాయితీ ఉపాధ్యాయుల నియామకం ,వృత్తి విద్యా బోధనా ,ఆధ్యాత్మిక ,నైతిక ప్రబోధం ,.ఇలాంటివి చాలాచోట్ల నిర్మించాలని ఆశయం .అన్నికులాల వారు వచ్చి చేరటం తో చాన్దసులకు ఆగ్రహం కలిగి ,హిందూత్వం భ్రష్టమౌతుందని భయపడి 22-3-1912న బడి పూరి గుడిసెలను తగల బెట్టించారు .దీనివలన అరుదైన పుస్తకాలు ,సుమారు ఐదువేల రూపాయల సామగ్రి దగ్ధమైనాయి .ఏమి చేయాలో తోచని పరిస్థితి ఏర్పడింది .గోపబందుకు వార్త తెలిసి వెంటనే సత్యవాదికి వచ్చి ,స్నేహితులకు ధైర్యం చెప్పి పక్కా గృహం లో పాఠశాల నిర్వహించాలని దైవ సంకల్పం అని చెప్పి నిధుల సేకరణకు పూనుకొన్నాడు .ఒక వినతిపత్రం పై అందరూ సంతకాలు చేశారు ఒరిస్సా అన్ని ప్రాంతాలనుంచి డబ్బు ధారాపాతం వచ్చి చేరింది .సంస్థానాలు కూడా దనం ఇచ్చాయి .బడి ఆగిపోకుండా జరుగుతూనే ఉంది .అగ్ని పెట్టిన ఆరుగంటలలో పోరుగూళ్ళకు  వెళ్లి కొబ్బరిమట్టలు పోగేసి తెచ్చి తాత్కాలిక  ఆశ్రయం కల్పించారు .తర్వాతకొద్ది రోజుల్లో ఇటుకలతో ఎబ్లాక్, బిబ్లాక్ నిర్మాణాలు జరిగాయి .1913లో శాశ్వత భవనం తయారయ్యాక ఈ రెండు బ్లాకులు భోజన గృహాలుయ్యాయి .

  ఆరుబయట చదువు

అగ్ని ప్రమాదం జరిగాక వచ్చి చూసిన గోపబందు ప్రాంగణం లో మర్రి వకుళ ,రావి కొమ్మలు దట్టంగా ఉన్న చోటు చూసి ‘’గుప్త బృందావనం ‘’అనీ ‘’రహస్య నికున్జమని ‘’పేరుపెట్టి ఆనీడలో తరగతులు నిర్వహింప జేశాడు .గోప బంధు ,నీలకంఠ ఆ స్థలాన్ని కొన్ని విభాగాలు చేసి ,ప్రతి విభాగం లో ఇటుక సున్నం తో ప్లాట్ ఫాం నిర్మించి దానిపై ఉపాధ్యాయుడు కూర్చుని బోధన చేసేట్లు ఏర్పాటు చేశారు .బ్లాక్ బోర్డ్ లను చెట్ల మొదట్లో కట్టించారు .విద్యార్ధులను ఆకుల చాపల మీద కూర్చో బెట్టారు .

  పునర్నిర్మాణం

1913మొదట్లో కొత్త భవన నిర్మాణం మొదలైంది.పునాదిలో రూపాయి అర్ధ ,పావలా,బేడ అణా నాణాలు వేశారు .పాఠశాలలో పని చేస్తున్న ఉపాధ్యాయుల పేర్లను కాగితం పై రాసి సీసాలో పెట్టి పాతిపెట్టించారు .విద్యార్ధులు చక్కగా సహకరించి తమ స్వప్న ఫలం పొందారు .1914కు సర్వాంగ సుందరంగా పాఠశాల భవనం పూర్తయింది .అగ్ని పునీతమై ఈ విద్యాలయం మళ్ళీ సర్వాంగ సుందరమై అభి వృద్ధి చెందింది .హరిహరదాస్ నీలగిరి వదిలి ,తర్వాత కటక్ లో పియర్ మెమరి అకాడమిలో ఉపాధ్యాయుడుగా పని చేసి ,మళ్ళీ ఇక్కడికి వచ్చి చేరాడు .1913లో తొమ్మిది ,పది తరగతులు ప్రారంభించారు .కలకత్తా యూని వర్సిటి నుంచి ఆర్ధిక శాస్త్రం ఎం ఎ పొందిన పండిట్ గోదావరీస్ మిశ్రా ఉపాధ్యాయుడుగా చేరాడు .నీలకంఠ ,మిశ్రాలు ప్రభుత్వ ఉద్యోగాలలో చేరితే అత్యున్నత పదవులు పొందేవారు .కానీ గోపబంధు ప్రేరణతో ,దేశాభిమానం తో ఈ విద్యాలయం లో చేరి సేవ లందించారు .వీరందరి నిబద్ధత విశిష్ట కృషి వలన సత్యవాది పాఠశాల అత్యంత వేగంగా అభి వృద్ధి చెంది ఆ నాటి ఒరిస్సాక్షీణ సంస్కృతి మధ్య ఒక విశిష్ట విద్వత్ కేంద్రంగా భాసిల్లింది .కీర్తి ప్రతిష్టలు వ్యాపించటంతో రాష్ట్రం నలుమూలలనుంచి విద్యార్ధులు వచ్చి చేరి వృద్ధి చెందారు .సాక్షీ గోపాల్ స్కూల్ అంటే మామూలు స్కూలు కాదు దేశాభిమానం ,మనోవికాసం జాతీయతా వ్యాపింపజేసే లక్ష్యశుద్ధి కల ఆదర్శ విద్యాకేంద్రం అని పేరుపొందింది  .

  సత్యవాది విద్యా విధానం

విద్యార్ధులు ఉపాధ్యాయులు కలిసి ఉంటారు .ప్రధానోపాధ్యాయుడు కుటుంబ యజమానిలా వ్యవహరిస్తాడు .య౦గ్ టీచర్స్ అన్నయ్యలుగా ఉంటారు .హెడ్ మాస్టర్ ఉపాధ్యాయులను ఒరవడి పెడతాడు .ఉపాధ్యాయుల విడిగా విశ్రాంతి గది లేదు .హెడ్ తో సహా అందరూ ఒకే గదిలో కూర్చునేవారు .ఉపాధ్యాయుడు ఇవాళ చెప్పిన పాఠాలపై మర్నాడు ప్రశ్నలు  వేసి పరీక్షిస్తాడు . వ్రాతపని చూస్తాడు మెరుగు పడటానికి సూచనలు చేస్తాడు ..వసతి గృహానికి వెళ్లి వెనుకబడిన విద్యార్ధులకు  మళ్ళీ బోధించి వాళ్ళను మిగిలినవారితో సమానం అయెట్లు శ్రద్ధ తీసుకొంటాడు  .గణిత బోధకుడు హరిహర దాస్ చేతిలో బెత్తం తో కర్ర చెప్పులతో హాస్టల్ లో తిరిగేవాడు .

  ప్రతి తరగతి వారూ ‘’తరగతి పత్రిక ‘’నిర్వహించేవారు .ప్రధానోపాధ్యాయుని ఆధ్వర్యం లో పాఠశాల పత్రిక నిర్వహించేవారు .దీనిలో ఉపాధ్యాయులు విద్యార్ధులు రచనలు చేసేవారు .ఆనాటి పదవ తరగతి పత్రికలలో ‘’వాణి’’కి ప్రత్యేకత ఉండేది .ఉపాధ్యాయ విద్యార్ధులు స్వీయాకవితా గానం చేసేవారు .ఒక విద్యా కుటుంబం అంటే ఇలా ఉండాలి అని ఆచరణలో చూపించారు .

 చర్చాసదస్సులు ప్రతి శనివారం జరిగేవి .దీనికి అందరూ హాజరవ్వాలి .రాష్ట్రం దేశం లో ప్రసిద్ధులైన వారిని ఆహ్వానించి ప్రసంగాలు చేయించి స్పూర్తి  కలి గించేవారు .సర్వ సమర్ధులను శక్తి వంతులను తయారు చేసే విద్యాలయంగా తీర్చిదిద్దారు .ప్రతిభావంతులను ఏరి తెచ్చి వారికి విద్యాలయ ఖర్చుతో ఉత్తమ విద్య అందించేవారు .విహార యాత్రలకు తీసుకువెళ్ళి వారిలో సంస్కృతీ వారసత్వం పై అవగాహన కల్పించేవారు .ప్రతిఏడాది కోణార్క ,ఖండగిరి లకు నడకమీద విహారయాత్రకు తీసుకు వెళ్ళేవారు .అక్కడే గుడారాలు వేసి ఆవరణ శుద్ధి చేసి భోజనాలు వండుకొని తినేవారు .ఐకమత్యం కలిసిఉండటం అలవాటు అయ్యేవి .ఇలాంటి యాత్రలవలన కృపాసిందు మిశ్ర ‘’కోణార్క ‘’అనే ప్రసిద్ధ చరిత్ర గ్రంధం ,కావ్యం రాశాడు .

 వసతి గృహాన్ని బ్లాకులుగా విభజించి ఒక్కొక్క బ్లాక్ ఒక్కొక్క ఉపాధ్యాయుని పర్యవేక్షణలో ఉంచేవారు .ప్రతి బ్లాక్ కు ఒక విద్యార్ధి మానీటర్ గా ఉండేవాడు .తర్వాత మూడుకు పెంచారు .తలిదండ్రులు పిల్లలకు పంపే డబ్బు హెడ్ మాస్టర్ పేరు మీద పంపెట్లు చేసి మితిమీరిన ఖర్చు జరుగకుండా అదుపు చేసేవారు .క్రమశిక్షణపై చర్చ జరిపేవారు .గడ్డు సమస్య లను పర్యవేక్షకుడు పరిష్కరిస్తాడు ఆయన పరిధి దాటితే హెడ్ మాస్టర్ మానిటర్ల సమావేశం లో పరిష్కరించి ‘’ఒక న్యాయస్థానం స్టేటస్ కల్పిస్తాడు .మిగిలిన విషయాలు తర్వాత తెలుసుకొందాం .

  సశేషం

మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -19-3-22-ఉయ్యూరు

Posted in సినిమా | Tagged | Leave a comment