మనమరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు -107 107-ఆదుర్తికి వారసుడు ,సెంటిమెంట్ తెలుగు హిందీ చిత్రాల నిర్మాత,దర్శకుడు ,భార్యాభర్తల ఫేం-ప్రత్యగాత్మ

మనమరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు -107

107-ఆదుర్తికి వారసుడు ,సెంటిమెంట్ తెలుగు హిందీ చిత్రాల నిర్మాత,దర్శకుడు ,భార్యాభర్తల ఫేం-ప్రత్యగాత్మ

కె.ప్రత్యగాత్మగా ప్రసిద్ధిచెందిన కొల్లి ప్రత్యగాత్మ (అక్టోబర్ 31, 1925 – జూన్ 6, 2001) (ఆంగ్లం: Kotayya Pratyagatma) తెలుగు సినిమా దర్శకుడు. ఈయన 1925 అక్టోబర్ 31 న గుడివాడలో జన్మించాడు. చదువుకునే రోజుల్లోనే చేసిన జాతీయవాద ప్రదర్శనలకు గాను జె.జె.కళాశాల యొక్క బ్రిటీషు ప్రిన్సిపాలు ప్రత్యగాత్మను కళాశాల నుండి బహిష్కరించాడు. జర్నలిస్ట్‌గా వ్యవహరించి, సినీరంగంలోకి ప్రవేశించి, కథా రచయితగా, అసిస్టెంట్‌ డైరక్టర్‌గా పనిచేసి, దర్శకుడై, తరువాత చిత్ర నిర్మాతగానూ కొనసాగారు కె. ప్రత్యగాత్మ. హిందీ చిత్రాలకు దర్శకత్వం వహిస్తూ, నిర్మాతగానూ వ్యవహరించిన ఈయన బాలీవుడ్‌లో కె.పి. ఆత్మగా సుపరిచితులు

తొలి జీవితం
కృష్ణాజిల్లా గుడివాడ సమీపంలోని ముదునూరులో 1924వ సంవత్సరంలో కొల్లి కోటయ్య వర్మ, అన్నపూర్ణ దంపతులకు జన్మించిన ప్రత్యగాత్మ తొలుత కమ్యూనిస్ట్‌ ఉద్యమంలో పాలుపంచుకున్నారు. కమ్యూనిస్ట్‌ ఉద్యమంలో ఉన్న కారణంగా కొంతకాలం అండర్‌గ్రౌండ్‌లోనూ ఉన్నారు. ఈయన భార్య అన్నపూర్ణ కూడా ఉద్యమంలో పాల్గొన్నారు. తరువాత ఉద్యమంలో వచ్చిన మార్పుల కారణంగా ఉపాధి ఎంచుకునే దశలో జర్నలిస్ట్‌గా కెరీర్‌ ఎంపిక చేసుకుని ‘జ్వాల’ పత్రికను ఏప్రిల్‌ 1952లో ప్రారంభించి కొంతకాలం నిర్వహించారు. ‘ఉదయని’ పత్రికకు కూడా వ్యాసాలు రాసేవారు.

చలనచిత్రరంగ జీవితం
మద్రాసు చేరి, తాతినేని ప్రకాశరావు వద్ద కథా రచయితగా, సహాయదర్శకుడుగా పనిచేసారు. 1954లో తొలిసారి సమకూర్చిన కథ నిరుపేదలు చిత్రానికి. ఆ తరువాత జయం మనదే, ఇల్లరికం, చిత్రాలకు కథ సమకూర్చారు. పి.ఎ.పి వారు నిర్మించిన ఇల్లరికం చిత్రానికి సెకండ్‌ యూనిట్‌ డైరక్టర్‌గా 1959లో వ్యవహరించారు.

కృష్ణకుమారి, అక్కినేని ప్రధానపాత్రలు పోషించిన భార్యాభర్తలు చిత్రంతో 1961లో దర్శకుడుగా మారారు. ఇది ప్రసాద్‌ ఆర్ట్‌ పిక్చర్స్‌ పతాకాన నిర్మితమయింది. ఎ.వి.సుబ్బారావు ఈ చిత్ర నిర్మాత. తొలి చిత్రం ఘనవిజయం సాధించడంతో ఆ తరువాత అక్కినేని హీరోగా పలు చిత్రాలను రూపొందించారు ప్రత్యగాత్మ. భార్యాభర్తలు చిత్రంలో పాటలు కూడా హిట్‌. ఈ చిత్రానికిగాను రజిత కమలం దక్కింది కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్రపతి చేతులమీదుగా.

చక్కని కుటుంబ కథకు, సెంటిమెంట్లు జోడించడం, మంచి డ్రామా పండించగల నేర్పు, హిట్‌ అయ్యే పాటలను ఎంపిక చేయడం అనేవి ప్రత్యగాత్మలోని ప్రత్యేకతలు. సహజంగా ఉన్న ఊహాశక్తి, తాతినేని ప్రకాశరావు వద్ద చేరడంతో మరింత మెరుగులు దిద్దుకుంది. మంచి దర్శకుడుగా ఎదుగుతాడని తొలిదశలోనే తాతినేని ప్రకాశరావు, ఎ.వి.సుబ్బారావులతో పాటు అక్కినేని నాగేశ్వరరావు కూడా తలచారు. తొలి తలపులకు అనుగుణంగానే ఇటు తెలుగు చిత్రసీమలోనూ, అటు హిందీ చిత్రసీమలోనూ రాణించారు ప్రత్యగాత్మ. 1966లో సొంత సినీ నిర్మాణ సంస్థ ఆత్మ ఆర్ట్స్ ప్రారంభించాడు. కులగోత్రాలు, పునర్జన్మ, మనుషులు మమతలు, ఆదర్శకుటుంబం, శ్రీమంతుడు, పల్లెటూరి బావ అక్కినేని హీరోగా ప్రత్యగాత్మ దర్శకత్వంలో రూపొంది విజయం సాధించాయి. అమ్మకోసం, ముగ్గురు అమ్మాయిలు, మా వదిన, అత్తవారిల్లు, అల్లుడొచ్చాడు, గడుసు అమ్మాయి, కన్నవారి ఇల్లు, కమలమ్మ కమతం తదితర చిత్రాలు ప్రత్యగాత్మ రూపొందించినవే. 1980లో దర్శకత్వం వహించిన నాయకుడు – వినాయకుడు ఈయన చివరి చిత్రం.

హిందీ చిత్రాలు
కృష్ణంరాజును హీరోగా పరిచయం చేస్తూ ‘చిలకా గోరింక’ చిత్రం నిర్మించి, దర్శకత్వం వహించారు 1966లో. ఈ చిత్రం ఆశించిన విజయం సాధించలేదు. ఆ ఏడాదే హిందీ చిత్ర రంగంలోకి కె.పి. ఆత్మగా ప్రవేశించి ‘ఛోటా భాయి’ చిత్రానికి దర్శకత్వం వహించారు. ‘రాజా ఔర్‌ రంక్‌’ కి సంజీవ్ కుమార్ హీరోగా, ‘తమన్నా’ చిత్రాన్ని పూజాభట్‌, శరద్‌ కపూర్‌లతో, ‘ఎక్‌ నారి ఏక్‌ బ్రహ్మచారి’ చిత్రాన్ని జితేంద్ర, మంతాజ్‌లతో ‘బచ్‌పన్‌’ దో లడకియా! చిత్రాల్ని సంజీవ్ కుమార్ తో, మెహమాన్‌, చిత్రాన్ని బిశ్వజిత్‌తో రూపొందించారు.

కుటుంబ విశేషాలు
చక్కని చిత్రాలు డైరక్ట్‌ చేసిన కె. హేమాంబరధరరావు ఈయన సోదరుడే. హాస్య చిత్రాల దర్శకుడు కె.వాసు, ప్రత్యగాత్మ పెద్దకుమారుడు.

మరణం
చిత్ర పరిశ్రమల్లో వచ్చిన మార్పులు జీర్ణించుకోలేకనో, ఆరోగ్యం సహకరించకనో 1980 తర్వాత నుంచి దర్శకత్వంకి దూరమై జూన్ 6, 2001 వ సంవత్సరంలో హైదరాబాదులో స్వర్గస్తులయ్యారు. గొప్ప దర్శకుడుగా రాణిస్తారని ఆదుర్తిని స్ఫురింపచేసే లక్షణాలున్న వ్యక్తి అని అక్కినేని భావించేవారు.

పురస్కారాలు
ఈయన 1962లో భార్యాభర్తలు చిత్రానికి ఉత్తమ ప్రాంతీయ తెలుగు చిత్రముగా రజత కమలాన్ని అందుకున్నాడు.

చిత్ర సమాహారం
తెలుగు సినిమాలు
· భార్యాభర్తలు (1961)

· కులగోత్రాలు (1962)

· పునర్జన్మ (1963)

· మంచి మనిషి (1964)

· మనుషులు మమతలు (1965)

· చిలకా గోరింక (1966)

· మా వదిన (1967)

· ఆదర్శ కుటుంబం (1969)

· అమ్మకోసం (1970)

· మనసు మాంగల్యం (1970)

· శ్రీమంతుడు (1971)

· స్త్రీ (1973)

· పల్లెటూరి బావ (1973)

· దీక్ష (1974)

· ముగ్గురమ్మాయిలు (1974)

· అల్లుడొచ్చాడు (1976)

· అత్తవారిల్లు (1976)

· గడుసు అమ్మాయి (1977)

· కన్నవారి ఇల్లు (1978)

· మంచి మనసు (1978)

· కమలమ్మ కమతం (1979)

· నాయకుడు – వినాయకుడు (1980)

హిందీ సినిమాలు
ఈయన హిందిలో కె.పి.ఆత్మ పేరుతో కొన్ని సినిమాలకు దర్శకత్వం వహించాడు

· దో లడ్కియా (1976)

· మెహమాన్ (1973)

· ఏక్ నారీ ఏక్ బ్రహ్మచారీ (1971)

· బచ్‌పన్ (1970)

· తమన్నా (1969)

· రాజా ఔర్ రంక్ (1968)

· ఛోటాభాయి (1966)

· ఎందరో రచయితలు దర్శకులుగా రాణించి అలరించారు. వారిలో కె. ప్రత్యగాత్మ తనకంటూ ఓ ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు. అనేక జనరంజకమైన చిత్రాలకు దర్శకత్వం వహించిన కె.ప్రత్యగాత్మ, హిందీలో కె.పి.ఆత్మగానూ కొన్ని చిత్రాలు రూపొందించారు. తెలుగులో జయలలిత నటించిన తొలి చిత్రం, చివరి చిత్రం రెండూ ప్రత్యగాత్మ దర్శకత్వంలోనే రూపొందడం విశేషం! కుటుంబ కథా చిత్రాల దర్శకునిగా పేరొందిన ప్రత్యగాత్మ చివరి వరకూ అదే తీరున సాగారు.

· ప్రత్యగాత్మ ఇంటిపేరు కొల్లి. కానీ, ఆయన తండ్రి పేరు కోటయ్య వర్మ. అందువల్ల కొందరు కోటయ్య ప్రత్యగాత్మ అనీ పిలిచేవారు. కృష్ణా జిల్లా గుడివాడ సమీపంలోని ముదునూరులో 1925 అక్టోబర్ 31న ప్రత్యగాత్మ జన్మించారు. బాల్యం నుంచీ అభ్యుదయ భావాలతో సాగారు. కొన్నాళ్ళు కమ్యూనిస్ట్ ఉద్యమంలో పాలుపంచుకొని అండర్ గ్రౌండ్ లోనూ ఉన్నారు. ఆ ఉద్యమంలోనే అన్నపూర్ణ పరిచయం అయ్యారు. వారిద్దరూ పెళ్ళాడారు. కొంతకాలం ‘ఉదయని’ పత్రికలో వ్యాసాలు రాశారు. జర్నలిస్ట్ గానూ పనిచేశారు. మద్రాసు చేరుకుని, అక్కడ తాతినేని ప్రకాశరావు వద్ద కథారచయితగా, అసోసియేట్ గా పనిచేశారు. తొలుత ‘నిరుపేదలు’ చిత్రానికి కథ సమకూర్చారు. ఆ తరువాత ‘ఇల్లరికం’ చిత్రం కూడా ఆయన కథతోనే తెరకెక్కింది. అదే సినిమాకు సెకండ్ యూనిట్ డైరెక్టర్ గా పనిచేశారు. దాంతో ప్రసాద్ ఆర్ట్ పిక్చర్స్ అధినేత ఎ.వి.సుబ్బారావు ‘భార్యాభర్తలు’ చిత్రంతో ప్రత్యగాత్మను దర్శకునిగా పరిచయం చేశారు. ఏయన్నార్, కృష్ణకుమారి జంటగా నటించిన ఆ చిత్రం మంచి విజయం సాధించింది. ఆ యేడాది ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా రజత పతకం గెలుచుకుంది. తరువాత ప్రసాద్ ఆర్ట్ పిక్చర్స్ బ్యానర్ లోనే వరుసగా ఏయన్నార్ తో ‘కులగోత్రాలు’, ‘పునర్జన్మ’ వంటి చిత్రాలు తెరకెక్కించి అలరించారు. ఈ సంస్థ నిర్మించిన ‘మనుషులు-మమతలు’తోనే జయలలిత తెలుగు చిత్రసీమకు పరిచయం అయ్యారు. అందులో ఆమె స్విమ్ షూట్ ధరించడంతో ఆ చిత్రానికి ‘ఏ’ సర్టిఫికెట్ ఇచ్చారు. తెలుగులో తొలి ‘ఏ’ సర్టిఫికెట్ చిత్రంగా ‘మనుషులు-మమతలు’ నిలచింది.మనుషులు మమతలు సెంటి మెంట్ పండిన సినిమా .

· యన్టీఆర్ హీరోగా తెరకెక్కిన ‘మంచి మనసు’, ‘దీక్ష’ చిత్రాలకూ కె.ప్రత్యగాత్మ దర్శకత్వం వహించారు. ఈ రెండు చిత్రాలలోనూ జమున నాయిక కావడం విశేషం. కృష్ణంరాజును తన ‘చిలకా-గోరింకా’ చిత్రం ద్వారా హీరోగా పరిచయం చేశారు ప్రత్యగాత్మ. ఇదే సినిమాతో రమాప్రభను నటిగా నిలిపారు. ఏయన్నార్ రజతోత్సవ చిత్రంగా తెరకెక్కిన ‘ఆదర్శకుటుంబం’కు కూడా ప్రత్యగాత్మ దర్శకుడు. విశాఖ పట్నంలో చిత్రీకరణ జరుపుకున్న తొలి చిత్రంగా ప్రత్యగాత్మ ‘కులగోత్రాలు’ నిలచింది. ఏ.ఏ.కంబైన్స్ పతాకంపై ఏయన్నార్ సమర్పణలో కృష్ణంరాజు హీరోగా రూపొందిన ‘మంచిమనసు’ కూడా ప్రత్యగాత్మ నిర్దేశకత్వంలోనే రూపొందింది. ఆయన దర్శకత్వంలో రూపొందిన “అమ్మకోసం, శ్రీమంతుడు, పల్లెటూరి బావ, ముగ్గురమ్మాయిలు, అల్లుడొచ్చాడు, అత్తవారిల్లు, గడుసు అమ్మాయి, కమలమ్మ కమతం” వంటి చిత్రాలు అలరించాయి.

· కె.పి.ఆత్మ పేరుతో హిందీలో “దో లడ్కియా, మెహమాన్, ఏక్ నారీ ఏక్ బ్రహ్మచారి, బచ్ పన్, తమన్నా, రాజా ఔర్ రంక్, ఛోటా భాయి” వంటి హిందీ చిత్రాలకు దర్శకత్వం వహించారు. వాటిలో కొన్ని సిల్వర్ జూబ్లీ చూడడం విశేషం. ప్రముఖ దర్శకనిర్మాత కె.హేమాంబరధర రావు, ప్రత్యగాత్మకు సోదరుడే. ప్రత్యగాత్మ తనయుడు కె.వాసు కూడా దర్శకనిర్మాతగా సాగారు. ప్రత్యగాత్మ దర్శకత్వంలో రూపొందిన చివరి చిత్రం ‘నాయకుడు -వినాయకుడు’ కూడా ప్రసాద్ ఆర్ట్ పిక్చర్స్ పతాకంపైనే తెరకెక్కడం విశేషం. ఈ చిత్రం జయలలిత చివరి తెలుగు సినిమా కావడం మరింత విశేషం! తరువాత ప్రత్యగాత్మ సినిమాలకు దూరంగా జరిగారు. 2001 జూన్ 8న ప్రత్యగాత్మ తుదిశ్వాస విడిచారు.

భార్యాభర్తలు సినిమా సూపర్ డూపర్ హిట్ రాజేశ్వరరావు సంగీతం రసవాహినే ..కులగొత్రాలుఎన్ని సార్లైనా చూడాలని పిస్తుంది –అయ్యొయ్యో జేబులో డబ్బులు పోయెనే ‘’అనుకొంటూనే .రైలులో పాట మహాగొప్ప .పునర్జన్మ తెలుగు సినిమాకే పునర్జన్మ .మంచిమనిషిలో రామారావు జమున జోడీ ముచ్చట గా ఉంటె ‘’ఏమండోయ్ ఇటు చూడండి ‘’,అంతగా నను చూడకు ,రాననుకున్నావేమో పాటలు రసాలూరు రాజేశ్వరరావు బాణీలలో ఘంటసాల సుశీలమ్మల స్వర మాధుర్యం వర్ణనాతీతమే .పిబిశ్రీనివాస్ పాడిన ‘’ఓహో గులాబిబాలా ‘’యెదలో విషాదపు ముళ్ళు నాటుతుంది .కొసరాజు పాటలు గిలిగింతలుపెడతాయి పద్మనాభం నటనలో మాధవపెద్ది పిఠాపురం గొంతుకలలో ..పల్లెటూరి బావ నాగ్, లక్ష్మీ ల నటనా వినోదమే కృష్ణశాస్త్రి గారిపాటలు ఆణిముత్యాలు –‘’నేలతో నీడ అన్నది నన్ను తాకరాదనీ –నేడు ఒక భార్య భర్తతో అన్నదీ నన్ను తాకరాదనీ ‘’మంచి సందేశమిచ్చే పాట.ఇలా సెంటిమెంట్స్ ,ఎమోషన్స్ ఫామిలి టచ్ ,అన్నీ ఉన్న కుటుంబ కదా చిత్రాలు దర్శకత్వం చేసిన ప్రత్యగాత్మఅంటే ‘’అసలు సిసలైన నేను ‘’అనే ఆధ్యాత్మికార్ధం .

సశేషం

మీ- గబ్బిట దుర్గాప్రసాద్ -3-3-22-ఉయ్యూరు

Posted in సినిమా | Tagged | Leave a comment

మనమరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు -106

మనమరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు -106

106-మౌనపోరాటం కర్తవ్యమ్ ఫేం ,కమిట్ మెంట్ ,విజన్ ఉన్న నిర్మాతల దర్శకుడు –ఎ.మోహన గాంధి

నేపధ్యము
1947 లో విజయవాడలో జన్మించారు. అక్కడే యస్.ఆర్.ఆర్;సి.వి.ఆర్ కళాశాలలో బిఎస్సీ వరకు చదివారు. తదుపరి మణిపాల్ లో ఇంజనీరింగ్ విద్యలో చేరారు. ఆరోగ్యం సహకరించకపోవడంతో నాలుగు నెలలు తిరక్కుండానే చదువుకు

స్వస్థి చెప్పి విజయవాడ వచ్చేశారు. అప్పట్లో మణిపాల్ వెళ్ళేటప్పుడల్లా వీరి కజిన్ వెంకటరత్నంగారు తోడుగా వచ్చేవారు. ప్రయాణం మధ్యలో మద్రాసులో ఉదయం నుండి సాయంకాలం దాకా ఉండవలసి వచ్చేది. అప్పుడే వెంకటరత్నంగారు తన స్నేహితులు శోభన్ బాబు గారిని కలవడానికి గాంధీతో కలిసి వెళ్ళేవారు. అప్పుడే శోభన్ బాబుగారు హీరోగా తెలుగు చిత్రసీమలో నిలదొక్కుకుంటున్నారు.మోహన్ గాంధి 1968లో చదువు మానేసి విజయవాడ వచ్చేశాక తిరిగి కోలుకోవడానికి నాలుగైదు నెలలు పట్టింది. స్టేజీ నాటకాలు వేసిన అనుభవం ఉండటంతో సినిమాల పట్ల తన ఆసక్తిని వెంకటరత్నంగారికి చెప్పారు. వారు వెంటనే మోహన గాంధీని హీరో శోభన్ బాబుగారి దగ్గరికి తీసుకుని వెళ్ళారు. శోభన్ బాబుగారు వీరికి సినిమాల పట్ల గల ఆసక్తిని గమనించారు. మొదట ఎడిటింగ్ పట్ల తనకు ఆసక్తి ఉన్నదని శోభన్ బాబు గారితో చెప్పడంతో, ఎడిటింగ్ అంటే ఒక్క అంశానికే పరిమితమై పోతావు… దర్శకత్వ శాఖలో ప్రయత్నించు అని ఆయన సలహా ఇచ్చారు. తనకి చిత్రసీమలో ఎవరూ తెలియదని, మీరే రికమెండ్ చేయాలని గాంధీ అభ్యర్థించారు. అలాహీరో శోభన్ బాబుగారి ద్వారా తెలుగు చలన చిత్ర సీమలో 1967లో ప్రవేశించారు.

సినీ జీవితము
నాటకాల రాయుడు, పసిడి మనసులు, విచిత్ర దాంపత్యం, మానవుడు దానవుడు, దేవుడు చేసిన పెళ్ళి, అల్లుడొచ్చాడు, అత్తవారిల్లు, కమలమ్మ కమతం, జీవన్ ధారా, మై ఇంతకామ్ లూంగా,యస్.పి భయంకర్…మొదలగు చిత్రాలకు సహాయ దర్శకుడిగా పనిచేసారు. శ్రీఅక్కినేని సంజీవి, శ్రీపి.సుబ్రహమణ్యం,శ్రీ పి.సి.రెడ్డి, శ్రీప్రత్యగాత్మ, శ్రీ తాతినేని.రామారావు, శ్రీ వి.బి.రాజేంద్రప్రసాద్ మొదలైన వారి వద్ద దర్శకత్వ శాఖలో మెళకువలు గ్రహించి 1977లో తొలిసారి నిర్మాత

శ్రీ ఎ.వి.సుబ్బారావు నిర్మించిన ప్రసాద్ ఆర్ట్ పిక్చర్స్ వారి అర్ధాంగి చిత్రానికి దర్శకత్వం వహించారు.[1]

ఎ. మోహన గాంధీ దర్శకత్వంలో విజయశాంతి ప్రధాన పాత్రలో వచ్చిన కర్తవ్యం సినిమా, యమున, శారద నటించిన ఆడది సినిమా ఒకేరోజు విడుదలయ్యాయి.[2]

ఉత్తమ చిత్రంగా మౌనపోరాటం నంది అవార్దు పొందింది.

దర్శకత్వం వహించిన చిత్రాలు
తెలుగు[మార్చు]

  1. అర్ధాంగి
  2. రౌడీ
  3. టెర్రర్
  4. భలే మిత్రులు
  5. మంచి మనసులు
  6. ఆడపడుచు
  7. పూజకు పనికిరాని పువ్వు
  8. ప్రేమ సామ్రాట్
  9. ముద్దుల మనవడు
  10. న్యాయానికి సంకెళ్ళు
  11. చినబాబు
  12. వారసుడొచ్చాడు
  13. మౌనపోరాటం
  14. జడ్జిమెంట్
  15. కర్తవ్యం
  16. ఆడది (1990)[3]
  17. పీపుల్స్ ఎన్‌కౌంటర్ (1991)
  18. ఆశయం
  19. జగన్నాటకం
  20. ప్రాణదాత
  21. పోలీస్ బ్రదర్స్
  22. రౌడీ మొగుడు
  23. మొగుడు గారు
  24. మా ఆయన బంగారం
  25. సంభవం
  26. వైభవం
  27. కలవారి చెల్లెలు కనక మహాలక్ష్మి
  28. పరశురాం
  29. ప్రేమ దొంగ
  30. వైభవం

కన్నడం

  1. సర్కిల్ ఇనస్పెక్టర్
  2. చాముండి

ఏ తరహా కథ తన దగ్గరకు వచ్చినా దాన్ని ఆకళింపు చేసుకుని, విజయవంతమైన సినిమాగా మలచడానికి నూరు శాతం కృషి చేసే అరుదైన దర్శకులలో ఎ. మోహనగాంధీ ఒకరు. తెలుగు చిత్రసీమలో కమిట్ మెంట్ అనే పదానికి పర్యాయపదం ఆయన. అందుకే అగ్ర నిర్మాణ సంస్థలు ఆయన్ని తమ మనిషిగా భావించాయి. జయాపజయాలతో నిమిత్తం లేకుండా వరుసగా అవకాశాలు ఇస్తూ వచ్చాయి. నిజం చెప్పాలంటే మోహనగాంధీకి లభించిన విజయాలు మరో దర్శకుడికి దక్కి ఉంటే… ఇంకో స్థాయిలో ఉండేవారు. కానీ విజయానికి పొంగిపోకుండా, అపజయానికి కృంగిపోకుండా తన పని తాను చేసుకు వెళ్ళడమే మోహనగాంధీకి అలవాటు. 1947 జూలై 7న విజయవాడలో జన్మించిన అన్నే మోహన గాంధీ పుట్టినరోజు సందర్భంగా ఆయన సినీ ప్రయాణాన్ని తెలుసుకుందాం.

మురహరిరావు, రత్నమాణిక్యం దంపతుల కుమారుడైన మోహనగాంధీ విజయవాడ ఎస్.ఆర్.ఆర్. అండ్ సి.వి.ఆర్. కళాశాలలో బీఎస్సీ చదివారు. ఎన్టీఆర్ వంటి మహానటుడు చదివిన కళాశాల అది. నాటక రంగంలో కాస్తంత అనుభవం ఉన్న మోహనగాంధీ మనసు డిగ్రీ పూర్తి కాగానే సినిమాల మీదకు మళ్ళింది. అప్పటికే చిత్రసీమలో నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న శోభన్ బాబుకు తన బంధువు వెంకటరత్నంతో ఉన్న పరిచయాన్ని ఆధారం చేసుకుని చెన్నపట్నం చేరారు మోహనగాంధీ. 1967లో చెన్నయ్ వెళ్ళి, ప్రారంభంలో కొన్ని ఇబ్బందులు పడ్డా… ఆ తర్వాత దర్శకత్వశాఖలో కుదురుకున్నారు. అక్కినేని సంజీవి, పి. చంద్రశేఖర్ రెడ్డి, తాతినేని రామారావు, ప్రత్యగాత్మ, వి. బి. రాజేంద్ర ప్రసాద్‌ తదితరుల దగ్గర దర్శకత్వ శాఖలో పనిచేసి, ప్రావీణ్యం సంపాదించారు. కష్టపడే స్వభావం, ఏ విషయాన్ని అయిన వెంటనే గ్రహించగలిగే నేర్పుతో పాటు మంచితనం కారణంగా ప్రముఖ నిర్మాణ సంస్థ ప్రసాద్ ఆర్ట్ పిక్చర్స్ లోనే ‘అర్ధాంగి’ సినిమాతో దర్శకుడయ్యారు. ఫ్యామిలీ సెంటిమెంట్ తో తెరకెక్కిన ‘అర్థాంగి’ ఆశించిన స్థాయిలో విజయం సాధించపోయినా, నిర్మాతకు మాత్రం లాభాలనే తెచ్చిపెట్టింది. ఆ తర్వాత ‘టెర్రర్’ లాంటి మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ ను రూపొందించిన మోహనగాంధీ తాను ఏ కథకైనా న్యాయం చేస్తానని నిరూపించుకున్నారు. ఆయన తెరకెక్కించిన ‘మంచి మనసులు’ చిత్రంలోని ‘జాబిల్లి కోసం ఆకాశమల్లే… ‘ గీతం ఇప్పటికీ సంగీత ప్రియుల చెవుల్లో మారుమ్రోగుతూనే ఉంటుంది. ఉషాకిరణ్ మూవీస్ బ్యానర్ లో ‘పూజకు పనికిరాని పువ్వు’ చిత్రం చేసిన మోహన గాంధీ ఆ తర్వాత అదే బ్యానర్ లో రూపొందించిన ‘మౌనపోరాటం’తో ఘన విజయం అందుకున్నారు. నిజ జీవిత సంఘటన ఆధారంగా రూపుదిద్దుకున్న ఈ చిత్రం సామాజికాంశాల దర్శకుడిగా మోహన గాంధీకి ఎనలేని గుర్తింపును తెచ్చిపెట్టింది.

ఏ నిర్మాత కాస్తంత భిన్నమైన చిత్రాన్ని తీయాలని అనుకున్నా ఆ రోజుల్లో వారి మొదటి ప్రాధాన్యం మోహన గాంధీనే అంటే అతిశయోక్తి కాదు. మరీ ముఖ్యంగా లేడీ ఓరియంటెడ్ మూవీస్ కు మోహనగాంధీ చాలాకాలం పాటు కేరాఫ్ అడ్రస్ గా నిలిచిపోయారు. చిత్రం ఏమంటే విజయశాంతి నాయికగా ఆయన రూపొందించిన ‘కర్తవ్యం’, యమున హీరోయిన్ గా ఆయనే తెరకెక్కించిన ‘ఆడది’ సినిమా ఒకే రోజున విడుదలయ్యాయి. అందులో ‘కర్తవ్యం’ సినిమా ఘన విజయం సాధించడంతో పాటు మోహనగాంధీ ఖ్యాతిని పదింతలు పెంచేసింది. ఓ పక్క లేడీ ఓరియంటెండ్ చిత్రాలు చేస్తూనే అగ్ర కథానాయకులతో, అగ్ర నిర్మాణ సంస్థలతో సినిమాలు తీశారు మోహనగాంధీ. అక్కినేని నాగేశ్వరరావు, కృష్ణ, నాగార్జున, వెంకటేశ్, మోహన్ బాబు, రాజశేఖర్ తదితరులతో విజయవంతమైన చిత్రాలను రూపొందించారు. ఒకానొక సమయంలో భానుచందర్ – మోహనగాంధీ సక్సెస్ ఫుల్ కాంబినేషన్ గా పేరు తెచ్చుకున్నారు. నటీనటుల నుండి తనకు కావాల్సిన హావభావాలను స్వయంగా చూపించి మరి తెప్పించుకోవడం మోహన గాంధీ ప్రత్యేకత. ఆయన చూపే అభినయాన్ని అనుకరిస్తే చాలు తమ పని సులువు అయిపోతుందంటారు కొందరు నటీనటులు. తెలుగుతో పాటు కన్నడలోనూ పలు చిత్రాలు రూపొందించారు మోహనగాంధీ. అయితే ఇప్పుడు కథల కంటే కాంబినేషన్స్ కే నిర్మాతలు ప్రాధాన్యం ఇస్తుండటంతో ఆయన నిదానంగా చిత్రసీమకు దూరమయ్యారు. నాలుగు దశాబ్దాల సినీ ప్రయాణంలో ఆయన దాదాపు నలభై చిత్రాలను రూపొందించిన నిర్మాతల దర్శకుడాయన. ప్రస్తుతం విశ్రాంత జీవితాన్ని గడుపుతున్న మోహనగాంధీ తెలుగు సినీ రంగ దర్శకుల చరిత్రలో తనకంటూ ఓ పేజీని క్రియేట్ చేసుకోవడం విశేషం.

· ‘కర్తవ్యం’..1990 జూన్ 29న విడుద‌లైన ఈ సినిమా తెలుగు చ‌ల‌న చిత్ర సీమ‌కు స‌రికొత్త సూపర్‌స్టార్‌ని ప‌రిచ‌యం చేసింది.ఆ స్టార్ ఎవ‌రో కాదు విజ‌య‌శాంతి.సిన్సియ‌ర్ పోలీస్ ఆఫీస‌ర్ వైజ‌యంతీ ఐ పి ఎస్ గా విజ‌య‌శాంతి బాక్సాఫీస్ వ‌ద్ద నటవిశ్వరూపం చూపారు.‘లేడీ అమితాబ్’ అనే ఇమేజ్‌ను ఆమెకు క‌ట్టిన బెట్టిన ‘క‌ర్త‌వ్యం’ 1990 జూన్ 29న విడుదలై 2020 జూన్ 29 నాటికి 30 సంవత్సరాలు పూర్తిచేసుకుంటోంది.

· కెరీర్ ప్రారంభంలో ఎన్టీఆర్‌, ఎ.ఎన్‌.ఆర్‌లకు చెల్లెలుగా నటించిన విజయశాంతి ఆ తర్వాత తరం స్టార్ హీరోలైన కృష్ణ‌, శోభన్‌బాబు, కృష్ణంరాజులతో పాటు వారి త‌ర్వాత త‌రం అగ్ర క‌థానాయ‌కులైన చిరంజీవి, బాల‌కృష్ణ‌, నాగార్జున‌, వెంక‌టేశ్, మోహన్‌బాబు.. ఇలా అంద‌రితో జోడీ క‌ట్టారు. అయితే ఆమెను న‌టిగా మ‌రో కోణంలో ఆవిష్క‌రించింది మాత్రం ద‌ర్శ‌కుడు టి.కృష్ణ‌. విప్ల‌వ‌ భావ‌జాలాలుండే ఆయ‌న స‌మాజంలో జ‌రిగే త‌ప్పుల‌ను త‌న సినిమాల ద్వారా ప్ర‌శ్నించారు. ఆయ‌న తెర‌కెక్కించిన ‘నేటి భార‌తం, దేవాల‌యం, వందేమాత‌రం, ప్ర‌తిఘ‌ట‌న‌, రేప‌టి పౌరులు’ వంటి చిత్రాల‌తో విజ‌య‌శాంతిలోని సిసలైన న‌టిని తెలుగు చిత్ర‌సీమ‌కు ప‌రిచ‌యం చేశారు. అలా విజ‌య‌శాంతి ఒక వైపు అగ్ర క‌థానాయ‌కుల నాయ‌కిగానూ.. మ‌రోవైపు మ‌హిళ ప్రాధాన్యతా చిత్రాల్లో న‌టిస్తూ ప్రేక్ష‌కుల‌ను మెప్పించారు. ‘క‌ర్తవ్యం’ ఆమెకు యాక్ష‌న్ స్టార్ ఇమేజ్‌ను తెచ్చిపెట్టింది. స్టార్ హీరోల‌కు స‌మాన‌మైన మాస్ ఇమేజ్‌ను తెచ్చిపెట్టిన చిత్ర‌మిదే.

·

· లేడీ ఐపీయ‌స్ ఆఫీస‌ర్ కిర‌ణ్ బేడీ ప్రేర‌ణ‌తో సినిమా చేద్దామ‌ని డైరెక్ట‌ర్ మోహ‌న‌గాంధీ త‌న ఆలోచ‌న‌ను నిర్మాత ఎ.ఎం.ర‌త్నంకు చెప్పారు. ఆయ‌నకు న‌చ్చడంతో ప‌రుచూరి బ్ర‌ద‌ర్స్ క‌థ‌ను సిద్ధం చేశారు. ఓ న‌గ‌రంలో అన్యాయాలు, అక్ర‌మాలు చేసే రాజ‌కీయ నాయ‌కుడు ముద్దుకృష్ణ‌య్య‌కు, సిన్సియ‌ర్‌ పోలీస్ ఆఫీస‌ర్ వైజ‌యంతీకి మ‌ధ్య జ‌రిగే పోరాటమే ‘క‌ర్త‌వ్యం’. 1989 న‌వంబ‌ర్ 2న ఈ షూటింగ్ మొద‌లైంది. ముహూర్త‌పు స‌న్నివేశానికి ప్రేమ్ ‌చంద్‌ (టి.కృష్ణ పెద్ద కొడుకు,గోపిచంద్ అన్నయ్య) కెమెరా స్విచ్ఛాన్ చేయ‌గా, కిర‌ణ్ బేడీ క్లాప్ కొట్టారు. క్లైమాక్స్ మిన‌హా సినిమాను మ్ర‌దాస్‌, వైజాగ్‌ల్లో పూర్తి చేశారు. కొంత నష్టానికే నిర్మాత ఎ.ఎం.ర‌త్నం సినిమాను విడుద‌ల చేశారు. తొలి ఆట‌కే సినిమా హిట్ టాక్‌ను తెచ్చుకుంది. ఆ రోజుల్లో మూడు కోట్ల రూపాయ‌ల‌ను వ‌సూలు చేసి ట్రేడ్ వ‌ర్గాల‌ను ఆశ్చ‌ర్య‌ప‌రిచింది ‘కర్తవ్యం’.

విజ‌య‌శాంతికి లేడీ అమితాబ్ అనే ఇమేజ్‌తో పాటు జాతీయ ఉత్త‌మ‌న‌టిగా అవార్డును తెచ్చి పెట్టింది ‘క‌ర్త‌వ్యం’. అలాగే ఫిలింఫేర్, నంది అవార్డులను కూడా అందుకున్నారామె. త‌మిళంలో ‘వైజ‌యంతి ఐపీయ‌స్’ పేరుతో అనువాదమై ఘ‌న విజ‌యాన్ని సాధించింది. హిందీలోనూ ‘తేజ‌స్విని’ పేరుతో రీమేక్ అయ్యింది. హిందీలోనూ విజ‌య‌శాంతినే టైటిల్ రోల్ పోషించారు. అక్క‌డి ప్రేక్ష‌కుల‌ను కూడా బాగానే ఆక‌ట్టుకుంది.
1990 అక్టోబర్ 7న మద్రాసులోని విజయా మహాల్‌లో వంద రోజుల వేడుక‌ను చేశారు. ఈ వేడుక‌కి ఐపీయ‌స్ ఆఫీస‌ర్ కిర‌ణ్ బేడీతో పాటు నంద‌మూరి బాల‌కృష్ణ ముఖ్య అతిథులుగా విచ్చేశారు. విజయశాంతి కెరీర్లో అలాగే తెలుగు చిత్ర పరిశ్రమలో మహిళా ప్రాధాన్యమున్న చిత్రంగా ‘కర్తవ్యం’కు ఓ ప్రత్యేక స్థానం ఉంటుందనడంలో సందేహం లేదు.

సశేషం

మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -3-3-22-ఉయ్యూరు

Posted in సినిమా | Tagged | Leave a comment

డన్ శ్రామిక కల్ప వృక్షం, హోం టుపూర్ రూపకర్త, ‘’గ్రీన్ బెల్ట్’’ పద సృష్టికర్త –అక్టేవియా హిల్-(వ్యాసం)-గబ్బిట దుర్గాప్రసాద్

లండన్ శ్రామిక కల్ప వృక్షం, హోం టుపూర్ రూపకర్త, ‘’గ్రీన్ బెల్ట్’’ పద సృష్టికర్త –అక్టేవియా హిల్-(వ్యాసం)-గబ్బిట దుర్గాప్రసాద్

01/03/2022విహంగ మహిళా పత్రిక

3-12-1838న ఇంగ్లాండ్ లోని కేంబ్రిడ్జి బీచ్ లోని విస్బెక్ లో ఆక్టేవియా హిల్ జన్మించింది .తండ్రి జేమ్స్ హిల్ కారన్ మర్చంట్. తల్లి కరోలిన్ సౌత్ వుడ్ స్మిత్ తండ్రికి మూడవభార్య .తండ్రి సంతానం పదిమందిలో ఎనిమిదవ కూతురే హిల్ .తల్లి తండ్రిసానిటరి రిఫార్మర్ .కుటుంబాన్ని బాగానే తండ్రి పోషించాడుకానీ ,అప్పుల్లో కూరుకుపోయి ,దివాలాతీసి ,మతిస్థిమితం తప్పాడు.అప్పటినుంచి మాతామహుడు డా ధామస్ సౌత్ వుడ్ స్మిత్ కుటుంబాన్ని ఆదుకొన్నాడు .ఈయన గొప్ప రిఫార్మర్ .గనులలో బాలకార్మికులు ,పట్టణ బీదజనులను ఆదుకొనేవాడు .కూతురు కారోలీనా కు కూడా ఈ లక్షణాలు బాగా అబ్బాయి ..పేదల విద్య,ఆవాసాలకోసం ,పరిశుభ్రతకోసం పాటుపడేది .

తర్వాత వీరి కుటుంబం ఫించిలి అనే చిన్న ఊరిలో ఒక కాటేజీ లో ఉన్నారు .హెన్రి మేహ్యు రాసిన ‘’లండన్ లేబర్ అండ్ లండన్ పూర్ ‘’పుస్తకాన్ని చదివిన అక్టేవియా హిల్ అక్కడి మురికి వాడలలో ప్రజల జీవన పరిస్థితులు ఎంతదారుణ౦గా ఉన్నాయో అర్ధం చేసుకొన్నది . ఎఫ్.డి.మారిస్ అనే ఆంగ్లికన్ ప్రీస్ట్,రిఫార్మర్ అయిన ఫామిలి ఫ్రెండ్ ప్రభావం కూడా ఆమెపై ఉంది . లండన్ పేదప్రజల తరఫున ఆటవస్తువులు తయారు చేసి రాగ్గెడ్ స్కూల్ పిల్లలకు అందజేసేది .సెంట్రల్ లండన్ లోని బ్లూమ్స్ బరి వర్కింగ్ మెన్స్ కాలేజి లో వుమెన్ క్లాసులకు సెక్రేటరిగా పని చేసేది ,

బాధలలో ఉన్న జెంటిల్ వుమెన్ కు ఉద్యోగాలు కల్పించే ఒక కో ఆపరేటివ్ గిల్డ్ హిల్ ను 13వ ఏట గ్లాస్ పెయింటింగ్ క్లాస్ లకు శిక్షణ నివ్వటానికి తీసుకొన్నది .గిల్డ్ బాగా విస్తారమైన తర్వాత ఆమెను 14వ ఏట వర్క్ రూమ్ కు ఇన్చార్జిని చేశారు .మరుసటి సంవత్సరం ఆమె ఖాళీసమయలలో జాన్ రస్కిన్ దగ్గర కాపీయిస్ట్ గా పని చేసింది .గిల్డ్ ఇంచార్జి గా ఉండగా హిల్ కు అక్కడి పిల్లల దారుణ జీవితాలు మనసును కలచి వేసేవి .ఆమెకున్న ఆత్మ విశ్వాసం ఆమెను ‘’చారిటి ఆర్గనైజేషన్ సొసైటీ ‘’కి సన్నిహితురాలిని చేసింది. ఈ సంస్థ బీదవారి కష్టనష్టాలు గుర్తించి సేవలు అందిస్తూ చక్కని పర్యవేక్షణ చేస్తూ వారి అభివృద్ధికి తోడ్పడటం ఆమెకు బాగా నచ్చింది .పేదలకు సత్వరసాయం ,దానిపై మంచి పర్యవేక్షణ ఉంటేనే దాత్రుత్వం రాణిస్తుందని భావించింది . నచ్చిన విషయం పై స్పష్టంగా సూటిగా ఆకర్షణీయంగా మాట్లాడే నైపుణ్యం ఆమెది .

1830నుంచి వర్కింగ్ క్లాస్ వారిఇళ్ళ కోసం పార్లమెంట్ వివిధ సంస్థలు కృషి చేస్తూనే ఉన్నాయి .హిల్ కార్య క్షేత్రం లోకి ప్రవేశించగానే ‘’నమూనా ఇళ్ళ నిర్మాణ ఉద్యమం ‘’చేబట్టి వసతులతో గృహం నిర్మాణం చేయాలనే ఊపు తెచ్చింది .దీనికి ప్రభుత్వం చట్టం తెచ్చింది . అతిపేద ఉద్యోగులకు ,అన్ స్కిల్డ్ లేబర్ కు ఉపయోగ పడటంలో విఫలమైందని గ్రహించింది .యజమానులు అద్దెకున్న వారి అవసరాల ను ఉపేక్షిస్తున్నారని ,టేనేంట్ లు ఒత్తిడి తేలేక పోతూ ,అణగ ద్రోక్కబడుతున్నారని గ్రహించింది .తన అధీనం లో ఉన్నవారికి కొత్త ఇళ్ళు ఏర్పాటు చేయాలనుకొంటే వనరులకోరత కనిపించి ,చివరికి దీనికి పరిష్కారంగా తానే లాండ్ లార్డ్ అవ్వాలని నిర్ణయి౦చు కున్నది .

జాన్ రస్కిన్ కు కూడా కో ఆపరేటివ్ గిల్డ్ పై అభిమానం ఉంది . మానవత్వమున్న వ్యక్తిగా మురికి వాడలలోని దుర్భర దారిద్ర్యాన్ని గమనించి ఏదో చేయాలనిపించి౦ది .అప్పటికే తన కాపీయిస్ట్ హిల్ ఆ కార్యక్రమం లో ఉందని తెలుసుకొన్నాడు .1865లో తండ్రి నుంచి ఆయను వచ్చిన 750పౌండ్ల ధనాన్ని మేరిలేన్ బోన్ లోని పారడైజ్ ప్లేస్ లో ఆరు గదులున్న మూడు కాటేజీ లు కొన్నాడు .వీటి మేనేజి మెంట్ హిల్ కు అప్పగించాడు .వీటిపై సంవత్సరానికి అయిదు శాతం వడ్డీ వస్తే పెట్టుబడి పెట్టినవారికిసంతోషంగా ఉంటుంది అని హిల్ చెప్పింది .1866లో రస్కిన్ ఫ్రెష్ వేర్ ప్లేస్ లో మరొక అయిదు కాటేజీలు కొని వీటిపైనా మేనేజ్మెంట్ హిల్ కే అప్పగించాడు .వీటికి కావలసిన రిపేర్లు చేయించి ,పశువుల కొట్టాలను తీసేయించి,అక్కడ ప్లేగ్రౌండ్ ఏర్పాటు చేయించాడు .చెట్లు నాటించాడు . వీటిని అల్పాదాయ వర్గాలవారికి అద్దెలకిచ్చాడు .పెట్టుబడిపై అయిదు శాతం లాభం వచ్చింది .ఇంకా అధికంగా వచ్చిన డబ్బు ను ఆ ఇళ్ళ సౌకర్యాలకోసం ఖర్చుపెట్టాడు .అద్దేబకాయిలు లేకుండా మంచి వాళ్ళకే ఇచ్చాడు .ఖచ్చితమైన పధ్ధతి అవలంబించటం వలన ,హిల్ చాతుర్య నిర్వహణ వలన 1974కు 15 హౌసింగ్ స్కీమ్స్ ఏర్పరిచి 3వేలమందికి అద్దె కిచ్చి తను అనుకొన్నది సాధించి రస్కిన్ కిచ్చిన వాగ్దానం నిలబెట్టుకోన్నది .

బిల్డింగ్ లనే కాదు,అద్దెకున్నవారినీ సమర్ధంగా మేనేజ్ చేసి ,’’మునిసిపల్ సోషలిజం ,సబ్సిడీ గృహాలు ‘’విధానానికి నాంది పలికి విజయవంతం చేసింది .వారానికి ఒకసారి వెళ్లి అద్దె వసూలు చేసేది .ఈపని స్త్రీలు మాత్రమె సాంఘిక సేవా కార్యక్రంగా చేయాలనేది .క్రమంగా జీతాలు ఇచ్చి పని చేయించింది. సోమ మంగళ బుధ వారాలలో ఉదయం పూటమాత్రమే అద్దె వసూలు చేసేవారు .మధ్యాహ్నం పూట జమా ఖర్చులు చూసి ,కాంట్రాక్టర్ లను పిలిపించి రిపేర్లు చేయించేది .గురు ,శుక్రవారాలలో బాకీదారులపై దృష్టి పెట్టేవారు .కొత్తగా అద్దె కొచ్చే వారికి ,ఖాళీ చేసి వెళ్లి పోయేవారికీ సాయపడేవారు .హిల్ ఏర్పాటు చేసిన సహాయకులు పని సమయంలోకానీ పని అయిపోయాకకానీ అద్దె దారుల సంఘాన్ని ఏర్పరచి ,బడి లేని సమయాలలో పిల్లల క్లబ్ ,సొసైటీలు ఏర్పాటు చేయించేవారు .1859లో హిల్ ‘’సౌత్ వార్క్ డిటాచ్ మెంట్ ఆఫ్ ది ఆర్మీ కేడేట్ ఫోర్స్’’ను స్వతంత్ర సంస్థ గా మొట్ట మొదటిసారిగా ఏర్పరచి స్థానిక బాలురకు మిలిటరీ విధానం లో శిక్షణ ఇప్పించింది .డెర్బి షైర్ రెజిమెంట్ ఆఫీసర్ లను ఆహ్వానించి స్పూర్తికలిగించేది .దీనిఫలితం కేడేట్ల సంఖ్య 160కి పెరిగింది .పూర్ రిలీఫ్ ,బయటి సాయం వగైరాలు న్యాయం చేకూర్చవని భావించింది అందుకే ఆమె విధానాలలో స్వీయ బాధ్యత కలిగించింది .

1884లో ఎక్లేసియాస్టికల్ కమీషనర్స్ హిల్ పని తీరును గుర్తించి సౌత్ లండన్ లో తమకున్న స్లం ప్రాపర్టీస్ ను మేనేజ్ చేసి ,సంస్కరించే బాధ్యత అప్పగించారు .ఈ ప్రాంతం విపరీతమైన దరిద్రానికి ,దొంగతనాలకు ప్రసిద్ధి కెక్కింది.తన అకు౦ ఠిత దీక్షా దక్షతలతో హిల్ వాటిని మోడల్ ప్రాపర్టీస్ గా మార్చి ,పెట్టుబడులు పెట్టేవారికి గొప్ప ఉత్సాహం కలిగించింది .ఆమె పనితనాన్ని శ్లాఘిస్తూ అమెరికన్ అభిమాని ‘’ ruling over a little kingdom of three thousand loving subjects with an iron scepter twined with roses.”[1 అన్నాడు ఆమెకు ‘’ the life-enhancing virtues of pure earth, clean air and blue sky.” మహా ఇష్టం .’’ గ్రీన్ బెల్ట్ ‘’అనే పదాన్ని హిల్ మొదటిసారి ఉపయోగించి ఇవాళ అందరికీ ఆదర్శమైంది .ఈ దృక్పధం తోనే హాం స్టెడ్ హీత్ ,పార్లమెంట్ హిల్ ఫీల్డ్స్ ను పరిరక్షించి పర్యావరణాన్ని కాపాడటానికి తోడ్పడింది .అభి వృద్ధిపెరుతో ఇక్కడ కొత్త నిర్మాణాలేవీ చేయకుండా చూసింది .

1876 హిల్ పెద్దక్కమిరండా’’సౌందర్య వ్యాప్తికి ‘’ స్థాపించిన కైరీ సొసైటీ ట్రెజరర్ గా ఉన్నది .’’బ్రింగ్ బ్యూటీ ,హోం టు పూర్ ‘’అనే నినాదం తో ఓపెన్ స్పేస్ లలో పట్టణ పేదలకు లైబ్రరి, కళలు ,సంగీతం, ఉత్తమ గ్రంథాలు అందుబాటులోకి తెచ్చింది .ఈపధకం బాగా విస్తరించి ఆతర్వాత ‘’నేషనల్ ట్రస్ట్ ‘’గా మారింది .రస్కిన్ ,హిల్ ,రాబర్ట్ హంటర్ ‘’కామన్స్ ప్రిజర్వేషన్ సొసైటీ ‘’గా ఏర్పడి ఇంగ్లీష్ లేక్ డిస్ట్రిక్ట్ లో రైల్వే లైన్ నిర్మాణాన్ని ఆపుదల చేయించి అక్కడి అందాలను కాపాడారు .హిల్ సూచించిన ‘’నేషనల్ ట్రస్ట్ ‘’పేరు తో సహజ సౌందర్య ప్రదేశాలను చారిత్రిక ప్రదేశాలను రక్షించారు .ఓపెన్ స్పేస్ లను కాపాడి అక్కడ నిర్మాణాలు జరగకుండా చూశారు .డినాస్ఓలూ ప్రాపర్టి,మొదటి చారిత్రాత్మకమైనది .కట్టిన ప్రాపర్టి-ఆలఫ్రిస్టన్ క్లేర్జి హౌస్ ,మొదటినేచర్ రిజర్వ్ విక్కెన్ ఫెన్.

హిల్ ఇళ్ళ మేనేజి మెంట్ బాగా పెరిగింది .రస్కిన్ మెంటల్ గా దెబ్బతిని ఆమెను వ్యతిరేకించాడు .కానీ ఎక్లేస్టికల్ కమీషనర్స్ ఆమె సాయం కోరిమేనేజిమేంట్ అప్పగించి పేదలకు మేలు చేశారు .19వ శాతాబ్దంనాటికి హిల్ సేవకులు ఫ్రీ వర్కర్స్ కాదు బాగా శిక్షణ పొందిన జీతం తీసుకొనే వారుగా మారారు .ఈమెపధకాలు యూరప్ అమెరికాలలోనూ వ్యాపించాయి. Beatrice Webb said that she “first became aware of the meaning of the poverty of the poor,’’విక్టోరియా రాణి కూతురు ప్రిన్స్ ఆలిస్ లండన్ లోని హిల్ ప్రాపర్టీ లను జర్మనీలో ప్రవేశపెట్టింది .హిల్ అసిస్టెంట్ ,సెక్రెటరి అయిన మాడ్ జెఫ్రీ ఆతర్వాత కమీషనర్ ఆఫ్ క్రౌన్స్ లాండ్స్ అయి ,ఆక్టేవియా హిల్ హౌసింగ్ విధానం లో లండన్ లో హౌసింగ్ ఎస్టేట్స్ నిర్మించాడు .

1880నాటికి హిల్ 70వేల పౌండ్ల ప్రాపర్టీని మేనేజి మెంట్ చేసింది .ఈమె ప్రేరణతో లండన్ కౌంటీ కౌన్సిల్ 15లక్షల పౌడ్లతో 1901-02 బడ్జెట్ తో లండన్ పేదల ఇండ్ల పునర్నిర్మాణం చేబట్టింది .కానీ ఆమె స్త్రీలకు వోటింగ్ హక్కు అక్కర్లేదనీ ,ఒల్డేజి పెన్షన్ ఇస్తే మంచికన్నా చెడు ఎక్కువగా జరిగి ఆత్మ విశ్వాసం తగ్గి పోతుందని చెప్పింది .73 ఏళ్ళ వయసులో ఆక్టేవియా హిల్ 13-8-1912న మేరీ లేబోన్ లోని స్వగృహం లో మరణించింది .

1898లో ఆమె చిత్రపటాన్ని ఆమె ఆభిమానులు సమర్పించిన సందర్భం లో హిల్ – “When I am gone, I hope my friends will not try to carry out any special system, or to follow blindly in the track which I have trodden. New circumstances require various efforts, and it is the spirit, not the dead form, that should be perpetuated. … We shall leave them a few houses, purified and improved, a few new and better ones built, a certain amount of thoughtful and loving management, a few open spaces…” But, she said, more important would be “the quick eye to see, the true soul to measure, the large hope to grasp the mighty issues of the new and better days to come – greater ideals, greater hope, and patience to realize both.” అని గొప్ప సందేశమిచ్చింది .

ఇవి అందరూ ఆచరి౦చాల్సినవే .ఆమె స్థాపించి ‘’హోరేస్ స్ట్రీట్ ట్రస్ట్ ‘’ఆతర్వాత బాగా అభి వృద్ధి చెంది’’ఆక్టేవియా హౌసింగ్ ‘’గా మారింది .ఆమె స్థాపించిన ‘’ది సెటిల్ మెంట్ మువ్ మెంట్ ‘’ఆమెసహచరుడు సామ్యుల్ చేతిలో పెరిగి ఫస్ట్ యూనివర్సిటి ఫార్మేడ్ సెటిల్ మెంట్ గా రూపు దాల్చింది .ఇంగ్లాండ్ చర్చిలో ఆగస్ట్ 13న హిల్ సంస్మరణం జరుపుతారు .

-గబ్బిట దుర్గా ప్రసాద్

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

Posted in రచనలు | Leave a comment

మనమరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు -105

మనమరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు -105

మనమరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు -105

· 105-చెంచులక్ష్మి భీష్మ దర్శక ఫేం,రఘుపతి వెంకయ్య అవార్డీ,,ఫిలిం డెవలప్ మెంట్ కార్పోరేషన్ డైరెక్టర్ –బి.ఏ.సుబ్బారావు

· బి.ఎ.సుబ్బారావు తెలుగు సినిమా దర్శకుడు.

సినిమారంగం[మార్చు]
1937 నుండి 1940 వరకూ కలకత్తా లో ఉండి బెంగాళీ చిత్రాలు చేసారు. అక్కడనుండి మద్రాస్ వచ్చి “పల్లెటూరి పిల్ల” చిత్రాన్ని ప్రారంచారు. తరువాత ఎన్నో సినిమాలు చేసారు

సినిమాలు
దర్శకుడిగా:

  1. అమాయకురాలు (1972)
  2. సతీ అనసూయ (1971)
  3. దేవత (1965)
  4. భీష్మ (1962)
  5. సహోదరి (1959)
  6. చెంచులక్ష్మి (1958)
  7. రాణిరత్నప్రభ (1955)
  8. రాజు-పేద (1954)
  9. ఆడబ్రతుకు (1952)
  10. టింగురంగ (1952)
  11. పల్లెటూరిపిల్ల (1950)

నిర్మాతగా:

  1. భీష్మ (1962)
  2. ఇల్లరికం (1959)
  3. చెంచులక్ష్మి(1958)
  4. రాణిరత్నప్రభ (1955)

పురస్కారాలు

  1. రఘుపతి వెంకయ్య అవార్డు (1982)
  2. ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్‌ డైరక్టరు
  3. ఎంచుకున్న రంగంలో ఒకస్థాయి దాటివెళ్లిన సెలబ్రిటీల గురించి ఏ సమాచారం తెలిసినా అభిమానులకు ఒకింత అపురూపంగానే ఉంటుంది. అదే సనిమా రంగంలో అయితే, ఆ ఆర్థ్రత ఇంకొంచెం ఎక్కువే ఉండొచ్చు. ఒక్కోసారి అభిమాన నటుడో, నటో రొటీన్ లైఫ్‌లో ఏం చేస్తుంటుంది, వాళ్ల ఇష్టాయిష్టాలు, లేదూ సినియేతర చిత్రాలు, వాళ్లు వాడిన వస్తువులు, నివాసమున్న ప్రదేశాలు.. ఇలా చిన్న చిన్న అంశాలు కూడా అభిమానుల కంటికి గొప్పగాను, మనసుకు అపురూపంగానూ అనిపించక మానదు.
    తెలుగు సినిమారంగంలో ఉద్దండులు అనిపించుకుని, భౌతికంగా మన మధ్య లేకపోయినా, చిరస్మరణీయ కృషిని మనకు అందించి వెళ్లిపోయిన కొందరి విజిటింగ్ కార్డులు ఇవిగో ఇక్కడ. వృత్తిపరంగానూ, వ్యాపారపరంగానో ఈ విజిటింగ్ కార్డులు వాళ్లకు సర్వసాధారణమే కావొచ్చు. కానీ, అభిమానులకు ఇవీ అపురూపమే.
    సురేష్ ప్రొడక్షన్స్ సంస్థను స్థాపించి తెలుగు, తమిళ, హిందీసహా మొత్తం 14 భారతీయ భాషల్లో సినిమాలు నిర్మించి రికార్డు సృష్టించిన వ్యక్తి డి రామానాయుడు. హైదరాబాద్, విశాఖపట్నంలో సినిమా స్టూడియోలు నిర్మించి తెలుగు పరిశ్రమ విస్తరణకు, బలమైన పునాధులు వేళ్లూనుకోవడానికి కృషి చేసిన వ్యక్తి రామానాయుడు.
    ఇక సిరిసిరిమువ్వ, స్వాతిముత్యం, శంకరాభరణం, సాగరసంగమం వంటి కళాత్మక చిత్రాలను తెలుగు పరిశ్రమకు అందించిన నిర్మాత ఏడిద నాగేశ్వరరావు, పల్లెటూరిపిల్ల, చెంచులక్ష్మి, భీష్మ తదితర సూపర్ హిట్ చిత్రాల నిర్మాత, దర్శకుడు బిఏ సుబ్బారావు, ఒకే చిత్రం ప్రతిజ్ఞతో పరిచయమై, తర్వాత అదే ధోరణిలో ఒకరు హీరోగా మరొకరు విలన్ పాత్రల్లో పలు విజయాలు సాధించిన కాంతారావు, రాజనాల, రోజులుమారాయి చిత్రానికి ఎడిటర్‌గా పనిచేసి, తర్వాత అనుపమ ఫిలింస్ నిర్మాణ సంస్థ ప్రారంభించి పలు విజయవంతమైన చిత్రాలను అందించిన కెబితిలక్, అలాగే ఆదుర్తి సుబ్బారావు చిత్రాల్లో అధిక భాగం చిత్రాలకు ఎడిటర్‌గా పనిచేసిన అనుభవంతో దర్శకుడిగా మారి అపాయంలో ఉపాయం, ఖైదీబాబాయి, మంచి బాబాయి చిత్రాలకు దర్శకత్వం వహించిన టి.కృష్ణ, నాటక రంగంలో అపార అనుభవం గడించి సినిమాల్లోకి వచ్చాక తెలంగాణ శకుంతలగా పేరు తెచ్చుకున్న శకుంతల, నాటకరంగ అనుభవంతో పరిశ్రమకు వచ్చి ‘నీడలేని ఆడది’ చిత్రం ద్వారా పరిశ్రమకు పరిచయమై, బామ్మమాట బంగారుబాట చిత్రం షూటింగ్‌లో గాయపడి వికలాంగుడిగా మారిన నూతన్‌ప్రసాద్, తెలుగు సినిమా గీతానికి రసగుళికల్లాంటి బాణీలు అందించిన సంగీత దర్శకుడు సాలూరి రాజేశ్వరరావుల విజిటింగ్ కార్డులు ఇవి. తెలుగు పరిశ్రమకు తమవంతు కృషి చేసిన వెళ్లిపోయిన మహానుభావులను గుర్తు చేసే చిగురు కాగితాలు -ఈ విజిటింగ్ కార్డులు.
  4. 1945 నుంచి 1947 వరకు కాలేజీలో బియ్యే చదివే రోజుల్లో ఎన్టీయార్‌ గుంటూరు నుంచి రైల్లో విజయవాడ వెళ్లేవాడు. బండి తప్పిపోతే రైలు పట్టాల మీద నడుచుకుంటూ విజయవాడ వెళ్లిన సందర్భాలున్నాయి. అప్పుడు భార్య హరికేన్‌ లాంతరు పట్టుకుని యింటి దగ్గర వెయిట్‌ చేసేదిట. 1947లో ఎల్వీ ప్రసాద్‌గారు ‘శ్రీమతి’ అనే సినిమా ప్లాను చేస్తున్నారు – అల్టిమేట్‌ గా తీయలేదనుకోండి – విజయవాడ వస్తే రామారావుగార్ని ఎవరో పరిచయం చేశారు. సినిమాల్లో వేస్తావా అంటే గ్రాజువేషన్‌ అయిపోయింది కాబట్టి సరేనన్నాడు. ఆయన మద్రాసుకి రమ్మన్నారు. స్క్రీన్‌టెస్ట్‌లు చేయించారు. మళ్లీ పిలుస్తాం ప్రస్తుతానికి వెళ్లమన్నారు.
  5. ఈయన వెనక్కి వచ్చి నేషనల్‌ ఆర్ట్‌ థియేటర్‌ పేర నాటకాలు వేస్తూండేవారు. తర్వాత సినిమా నిర్మాణం ఎన్‌.ఏ.టి. పేర చేసేవారు కదా, దాని ఫుల్‌ ఫామే – నేషనల్‌ ఆర్ట్‌ థియేటర్‌. ఉద్యోగాలకై ప్రయత్నాలు కూడా చేస్తూండేవారు. సర్వీస్‌ కమీషన్‌కి పరీక్ష రాస్తే సబ్‌ రిజిస్ట్రార్‌ ఉద్యోగం వచ్చింది. జాబ్‌లో చేరుదామా లేదా అనుకుంటూండగానే జాబు వచ్చింది ఎల్వీ ప్రసాద్‌గారి వద్దనుండి. ‘శ్రీమతి ఆగిపోయింది, ‘మనదేశం’ తీస్తున్నాను. అందులో చిన్నవేషం వుంది. వచ్చి వేయండి’ అని. ‘హీరో అని చెప్పి చివరికి చిన్నవేషం వేయడమేమిటి?’ అనుకుని ఈయన సినిమా ఆశ వదిలేసి ఉద్యోగంలో చేరాడు. చేరాడే కానీ ఈయన దానిలో పని చేసినది 11 రోజులు మాత్రమే! దానికో కారణం వుంది.
  6. ఎన్టీయార్‌ది చిన్నప్పటినుండీ కష్టపడి పనిచేసే రైతు కుటుంబం. ఈయన చేరినదేమో అవినీతికి ఆలవాలమైన రిజిస్ట్రార్‌ ఆఫీసు. ఆఫీసులో చేరిన మొదటిరోజున ఈయన కోటు విప్పి కుర్చీకి తగిలించి పని చేసుకున్నాట్ట. సాయంత్రానికి కోటు జేబు బరువుగా వుందట. చూస్తే లంచం డబ్బు! ఆఫీసు బంట్రోతు ఆరోజు ట్రాన్సాక్షన్స్‌లో ప్రతి వాడి వాటా కోటులో పడేసి వెళ్లేవాట్ట. ఇది చూడగానే ఈయన గంగవెర్రులెత్తిపోయాడు. నాకు వద్దు పొమ్మన్నాడు. దెబ్బకి ఆఫీసులో కొలీగ్స్‌ అందరికీ శత్రువై పోయాడు. ఇలాటివాడు తమ మధ్య వుంటే ఎప్పటికైనా ప్రమాదమే అనుకున్నారు. ఇలాటి హోస్టయిల్‌ వాతావరణం ఆయనకు పడలేదు. పైగా ఓ కొలీగ్‌ ‘మేమందరం ధైర్యం చేయలేక ఇక్కడే పడి కొట్టుకుంటున్నాం. నీకు రూపం వుంది, సాహసం వుంది. సినిమా రంగానికి వెళ్లు’ అని నూరిపోశారు.
  7. అలా ఎందుకన్నారంటే అప్పుడే ఎన్టీయార్‌కి బిఏ సుబ్బారావు గారి వద్దనుండి ఉత్తరం వచ్చింది. ఆయన అప్పుడే పైకి వస్తున్న దర్శకుడు. ‘పల్లెటూరి పిల్ల’ సినిమా ప్లాను చేస్తూ ఎల్వీ ప్రసాద్‌గార్ని సలహా అడిగాట్ట. ఆయనేమో ఈయన్ని రికమెండ్‌ చేశారు. ‘మద్రాసు రండి’ అని బియే సుబ్బారావు ఉత్తరం రాశారు. చివరకి కొలీగ్‌ సలహా విని ఎన్టీయార్‌ మద్రాసు రైలెక్కారు. మద్రాసు వెళుతూనే ఎల్వీ ప్రసాద్‌ దగ్గరకు వెళ్లి ‘నాకు హీరో వేషం యివ్వలేదేం? నేను దానికి తగనా?’ అని నేరుగా అడిగేశారు. అదీ ఆయన స్టయిల్‌. జీవితమంతా ఆయన సమస్యలను ఎదుర్కోవడంలో అదే స్టయిల్‌ పాటించారు. దాపరికం లేదు. డైరక్టుగా తలపడడమే! ప్రసాద్‌గారు ‘కాలం కలిసిరాలేదు. ఈలోపున సుబ్బారావుగార్ని కలవండి’ అన్నారు.
  8. ఈయన స్టూడియోకి వెళ్లి సుబ్బారావుగార్ని కలిశారు. ఎన్టీయార్‌ని వస్తూండగానే దూరం నుండి చూసి సుబ్బారావు గారు ‘ఇతను నా సినిమా హీరో అయితే ఎంత బాగుణ్ను’ అనుకున్నారు. ఈయన దగ్గరకు వెళ్లి ‘నేను ఫలానా’ అనగానే ‘అయితే నువ్వే నా హీరోవి’ అన్నారు. మేకప్‌ టెస్ట్‌ లేదు, వాయిస్‌ టెస్టు లేదు, ఏమీ లేదు. వెయ్యినూట పదహార్లు అడ్వాన్సు యిచ్చి బుక్‌ చేసేసుకున్నారు. ఎల్వీ ప్రసాద్‌ మొత్తుకున్నారు. చాలా రిస్కు తీసుకుంటున్నావని హెచ్చరించారు. ‘పోనీ నా ‘మనదేశం’లో చిన్న వేషం యిచ్చి చూస్తా. ప్రేక్షకులు ఎలా రిసీవ్‌ చేసుకుంటారో తెలుస్తుంది’ అన్నారు. సుబ్బారావు గారు వింటేగా? అబ్బే అదేం అక్కరలేదు అన్నారు. కానీ ఎల్వీ ప్రసాద్‌గారు ఎన్టీయార్‌కి మనదేశంలో చిన్న వేషం యిచ్చారు. అదీ విలనిక్‌ వేషం. దేశభక్తులపై విరుచుకుపడే పోలీస్‌ ఇన్‌స్పెక్టర్‌ వేషం. తొలివేషం హీరోకాదే అనుకుంటూనే ఎల్వీ ప్రసాద్‌గారి మీద గౌరవం కొద్దీ ఎన్టీయార్‌ వేషం ఒప్పుకున్నారు. ఒప్పుకున్నాక ఆయన పాత్రలో జీవించేశాడు.
  9. పాత్రలో జీవించడం అనేది మామూలుగా చాలామంది విషయంలో అనేస్తాం కానీ ఆ ఎక్స్‌ప్రెషన్‌ ఎన్టీయార్‌ విషయంలో అతికినట్టుగా మరెవరి విషయంలోనూ నప్పదు. ఎయన్నార్‌ ఎప్పుడూ అంటారు – మనం పాత్రలో పూర్తిగా ఇన్‌వాల్వ్‌ అవకూడదు. లేకపోతే బాలన్స్‌ తప్పుతాం. పాత్రలో లీనమయినట్టు నటించాలి. మనం వేరేగా వుండి మన పాత్రను గమనించాలి. అని. కానీ ఎన్టీయార్‌ పద్ధతి అది కాదు. అది మొదటి సినిమాలోనే తెలిసింది. ఆయనది ఇన్‌స్పెక్టర్‌ వేషం అని చెప్పాను కదా, స్వాతంత్య్రవీరులపై లాఠీచార్జి చేయడం సీను. జూనియర్‌ ఆర్టిస్టులను కొంతమందిని తీసుకువచ్చి ‘వీళ్లు స్వాతంత్య్ర యోధులు’ అన్నారు. ‘యాక్షన్‌’ అనగానే ఈయన వాళ్ల మీద పడ్డాడు. నిజంగానే చితక్కొట్టేశాడు. వాళ్లు బాబోయ్‌ బాబోయ్‌ అన్నా వినలేదు. తరిమి తరిమి కొట్టాడు.
  10. వాళ్లు బెదిరిపోయి స్టూడియో గేటు దాకా పారిపోయినా ఈయన వెంట పడి మరీ కొట్టాడు. డైరక్టరుగారు తిట్టిపోశారు – ఏమిటయ్యా నిజంగానే కొట్టావ్‌! అని. ‘పోలీసులు నిజంగానే కొడతారు కదా సార్‌’ అని ఈయన జవాబు. జూనియర్‌ ఆర్టిస్టులు కాబట్టి ప్రతాపం చూపించాడు, అదే తనైతేనా? అని అనుకోవద్దు. ‘పల్లెటూరి పిల్ల’లో హీరో అని చెప్పాను కదా, అందులో అంజలిచేత చెంపదెబ్బ తినే సీను వుంది. ఆవిడ లాగి కొట్టినా డైరక్టరుగారు టేకు ఓకే చేయలేదు. మళ్లీ, మళ్లీ… తొమ్మిదిసార్లు కొడితే తప్ప టేకు ఓకే కాలేదు. మధ్యలో ఆవిడ ‘కొత్తబ్బాయండి, పాపం’ అన్నా ఎన్టీయార్‌ ‘ఏం ఫర్వాలే, కొట్టండి’ అని ఎంకరేజ్‌ చేశారు. చివరికి చెంప ఎర్రగా కందిపోయింది.
  11. ‘పల్లెటూరి పిల్ల’ సినిమాలో కోడె దూడతో పోట్లాడే దృశ్యం వుంది. డూప్‌ను పెడతానంటే వద్దని ఈయనే రంగంలోకి దిగాడు. ఎద్దు చూడబోతే బలిష్టమైన ఆస్ట్రేలియా గిత్త! శుబ్బరంగా ఎన్టీయార్‌ను ఎత్తి కుదేసింది. దెబ్బకి ఈయన కుడిచేతి మణికట్టు విరిగింది. ఆసుపత్రిలో కొన్నివారాలుండి చివరకు పుత్తూరు వైద్యంతో బాగు చేయించుకున్నారు. మళ్లీ కొన్నిరోజులకు తెల్లవారు ఝామున షూటింగ్‌ అయి నిర్మాత కారులో యింటికి వస్తూ వుంటే యాక్సిడెంటు అయి ఆ చేతికే దెబ్బ తగిలింది మళ్లీ. కట్టు కనబడకుండా ఫుల్‌హేండ్‌ చొక్కా వేసుకుని యాక్ట్‌ చేసేశాడీయన.
  12. ఇదంతా తొలిరోజుల మోజు అనుకోకండి. చివరిదాకా అలాగే వున్నాడాయన. స్టంటు సినిమాల్లో నిజంగానే పోట్లాడేవారు. విలన్లను పట్టుకు చావగొట్టేవారు, వాళ్ల చేతిలో దెబ్బలు తినేవారు. గులేబకావళి సినిమాలో పొట్టి కత్తులతో పోట్లాడినప్పుడు గీరుకు పోయేవిట. ‘కృష్ణావతారం’ సినిమా గురించి ఓ సంఘటన చెప్తారు. రాయబారం సీనులో ‘యుద్ధమంటూ జరిగితే భీమసేనుడు నీ తొడలు విరక్కొడతాడు చూసుకో’ అంటూ దుర్యోధనుణ్ని హెచ్చరిస్తూ పద్యం పాడే సీనులో ఎఫెక్టు కోసం చేతిలో వేణువు తొడమీద కొట్టుకుంటూ పద్యం పాడారు ఎన్టీయార్‌. అయితే గొడవేమిటంటే అది మామూలు చెక్క ఫ్లూటు కాదు. స్టీలుది. కొన్ని టేకులు తీసుకుని మొత్తంమీద సీను ఓకే చేయించుకుని మేకప్‌ తీసేసి బట్టలు మార్చుకుంటూ వుంటే అప్పుడు కనబడ్డాయి తొడమీద ఫ్లూట్‌ గీతలు. ఎర్రగా రక్త గడ్డకట్టేట్టు కొట్టేసుకున్నాడీయన. అది తెలియను కూడా తెలియలేదు పెద్దమనిషికి.
  13. భూకైలాస్‌ సినిమాలో వేసినప్పుడు రావణాసురుడు వేషం ఈయనది. రావణుడు తపస్సు చేస్తున్న సీను తీస్తూండగానే లంచ్‌ బ్రేక్‌ వచ్చింది. గడ్డాలూ, మీసాలూ పెరిగివుంటాయి, చుట్టూ మట్టితో కట్టిన పుట్ట. లంచ్‌కి లేస్తే ఈ పుట్టలన్నీ పాడయిపోతాయి. మళ్లీ కట్టాలి. ‘ఎందుకులెండి, మళ్లీ లేవడం, కట్టడం, ఈ పూటకు భోజనం మానేస్తాను’ అన్నాడీయన. డైరక్టరు నొచ్చుకుని నచ్చచెప్పబోయినా ఎన్టీయార్‌ వినలేదు. అసలు అంతకుముందు సినిమాల్లో రాజుల కిరీటాలంటూ అట్టకిరీటాలు పెట్టేవారు. ఈయన కాలం వచ్చేసరికి లోహపు కిరీటాలు వచ్చాయి. ఈయన కిరీటం పెట్టుకుని కూచుంటే లంచ్‌ టైములో కూడా తీసేవాడు కాదుట. మేకప్‌ చెదిరిపోతుందనేమో. ‘కర్ణ’ సినిమా తీసిన టైములో గంటల తరబడి కిరీటం పెట్టుకుని వుండడంతో నుదుటిమీద మచ్చ పడిపోయింది పాపం. ‘చిరంజీవులు’ సినిమాలో ఎన్టీయార్‌ది గుడ్డివాడి పాత్ర. ఆ ఎఫెక్టు రావడానికి కళ్లల్లో ఏవో పెట్టుకోమనేవారట. అవి పెట్టుకుంటే కళ్లు మంటలు. అయినా ఈయన కిమ్మనేవాడు కాదు. రోజుల తరబడి పెట్టుకుని కళ్లమంటలు భరించేవాడు, కళ్ల వెంబడి నీళ్లు కారినా డోంట్‌కేర్‌.
  14. ఈ ట్రెండ్‌ యౌవనంలోనే కాదు, ముసలితనంలో కూడా కంటిన్యూ అయింది. ‘చండశాసనుడు’ సినిమా తీసేనాటికి 1983 నాటిది. అంటే అప్పటికి ఈయనకు 60 యేళ్లు. ఆ సినిమా షూటింగు టైములో ఈయన ఛాతీమీదనుండి బండి వెళ్లిపోయింది. ఈయన చెక్కు చెదరలేదు. షూటింగు ఆపేయలేదు.పనిలో ఆయన రాక్షసుడు. కుయ్‌కయ్‌మనకుండా చేసేవాడు. చిక్కెక్కడంటే అందర్నీ అలాగే వుండమనేవాడు. వాళ్లంతా గొల్లుమనేవారు. వాళ్లంతా ఆయనలా తెల్లవారు ఝామున రెండు గంటలకూ లేవలేరు. సూర్యోదయం కాకుండానే అరకోడి కూర లాగించనూ లేరు. ఆయన బ్రహ్మాండంగా తినేవాడు. కావాలంటే రోజుల తరబడి అన్నం మానేసేవాడు. రావణుడి వేషం వేసేటప్పుడు రెండు పూటలా నాన్‌వెజ్‌ తీసుకునేవారు. రాముడి వేషం వేసినప్పుడు మొత్తం మానేసేవారు. లాజికల్‌గా ఆలోచిస్తే యిది అనవసరం. ఎందుకంటే ఒరిజినల్‌ రాముడు కూడా నాన్‌వెజిటేరియనే కదా. క్షత్రియుడు. యుద్ధం చేయవలసినవాడు. అందువల్ల నాన్‌ వెజ్‌ తినేవాడే. కానీ ఆయన వేషం కట్టినరోజుల్లో ఈయన నాన్‌వెజ్‌ ముట్టుకునేవాడు కాదు.
  15. ఎందుకలా అంటే రాముణ్ని ఊహించినప్పుడు మనకు క్షత్రియుడు, రాజు కనబడడు. ఒక దైవాంశ సంభూతుడు కనబడతాడు. ఆ ప్రసన్నత, దైవాంశ కనబడాలంటే సౌమ్యంగా వుండాలని ఎన్టీయార్‌ వూహ. అందుకే ఆ నియమనిష్ఠలు. అలాగే దుష్టపాత్రలు వేసినపుడు ఎన్టీయార్‌ విపరీతంగా తినేవారట. ఇంకో విషయం కూడా వుంది. ఛాతీ మీద వెంట్రుకలు లేకుండా తీసేసేవారు. కండలు తిరిగినట్టు కనబడకుండా, కేవలం బలిష్టంగా మాత్రం కనబడేట్లా ప్రాణాయామం చేసేవారుట. పళ్లు గారపట్టకూడదని కిళ్లీ వేసుకునేవారు కాదట. ఈ జాగ్రత్తల వలననే ఆయన మనకు దేవుడికి ప్రతిరూపంలా అనిపించి వుంటాడు. నార్త్‌ యిండియాలో వాళ్లు యిలాటి జాగ్రత్తలు తీసుకోలేదు. అందువల్ల వాళ్లు ఎంతబాగా నటించినా నటిస్తున్నారనే అనుకున్నాం తప్ప దేవుడు దిగి వచ్చాడని అనుకోలేక పోయాం.
  16. ఎన్టీయార్‌ని తెలుగువారు ఎప్పటికీ మర్చిపోలేనట్టు చేసినవి పౌరాణికాలే! ఆయన పౌరాణిక పాత్రల నిర్వహణ గురించి ‘న భూతో.. యిప్పట్లో న భవిష్యతి’ అని ధైర్యంగా చెప్పగలం. నాగేశ్వరరావుగారితో పోలిక వచ్చినపుడు నాగేశ్వరరావు వేసిన పాత్రలు ఆ తరువాత శోభన్‌బాబు వేశారు, తర్వాత నాగార్జున వేశారు, జగపతిబాబు వేశారు. ఏదో ఒక స్థాయిలో, ఎంతోకొంత దూరంలో నాగేశ్వరరావుగారి స్థానానికి చేరువగా వచ్చారు. కానీ ఎన్టీయార్‌ పౌరాణిక పాత్రల దగ్గరకి వచ్చేసరికి ఆయనలా ఒప్పించినవారు అరుదు. అరుదు అని ఎందుకంటున్నానంటే కాంతారావుగారూ కృష్ణుడు వేశారు, హరనాధ్‌ వేశారు. బాగానే వేశారు. ‘సంపూర్ణరామాయణం’లో శోభన్‌బాబూ వేసి నప్పించారు. రావణుడిగా, దుర్యోధనుడుగా, కీచకుడిగా ఎస్వీ రంగారావు గొప్పగా రాణించారు. అయితే ఎన్టీ రామారావు ఒక్కరే అన్ని రకాల పౌరాణిక పాత్రల్లోనూ నప్పారు.
  17. మొదటిభాగం కింద ఉన్న వ్యాఖ్యలు చూశాను. ఎన్టీయార్‌కు విపరీతంగా కులాభిమానం ఉన్నట్లు, సినిమాల్లో, రాజకీయాల్లో కులానికే ప్రాధాన్యత యిచ్చినట్లు కొందరు ఆరోపించారు. కులస్పృహ ఎక్కువై పోయిన యీ రోజుల్లో యిలాటి ఆరోపణలు విచ్చలవిడిగా చేస్తున్నారు, చాలామంది వాటిని నమ్ముతున్నారు కూడా. కాస్త నిదానించి ఆలోచిస్తే వీటిల్లో నిజానిజాలు బోధపడతాయి. ఎయన్నార్‌, ఎన్టీయార్‌ కలిసి తెలుగు సినీరంగాన్ని కమ్మమయం చేసేశారని, తక్కిన హీరోలందరినీ తొక్కేశారనీ కొందరు అనేస్తూంటారు. తర్వాతి రోజుల్లో వాళ్లు అగ్రహీరోలు కావచ్చు కానీ తొలి దినాల్లో తక్కిన హీరోలను తొక్కే స్థాయి కలవారు కాదు. పైగా అప్పట్లో నిర్మాతలు, దర్శకులదే పైచేయి. వాళ్లను శాసించే స్థితిలో హీరోలు ఉండేవారు కాదు.
  18. 1951-60 దశకంలోనే వీళ్లిద్దరూ కాక అనేకమంది హీరోలు ఉండేవారు. నాగయ్య, నారాయణరావు, రఘురామయ్య, రంజన్‌, రామశర్మ, రామచంద్ర కాశ్యప, అమరనాథ్‌, జగ్గయ్య, కాంతారావు, రమణమూర్తి, బాలయ్య, హరనాథ్‌, రామకృష్ణ, చలం…. వీరిలో కమ్మేతరులు అనేకమంది ఉన్నారు. వీళ్లందరి గురించి యీనాటి మీడియాలో ఎక్కువగా ప్రస్తావించరేం అనే దానికి సమాధానంగా, వీళ్లిద్దరూ హీరోలుగా వెలిగినంత ఎక్కువ కాలం వాళ్లు వెలగలేదు కాబట్టి అనుకోవాలి. సినిమాల్లో నిలదొక్కుకోవడానికి చాలా లక్షణాలు కలిగి ఉండాలి, బయటనుంచి చాలా అంశాలు కలిసి రావాలి. కులంతో నెగ్గుకు వద్దామంటే లాభం లేదు.
  19. ఇక ఎయన్నార్‌, ఎన్టీయార్లకు కులాభిమానం ఉన్నదీ లేనిదీ తేల్చాలంటే వాళ్లు డిక్టేట్‌ చేసే స్థితికి వచ్చాక వేసిన సినిమాల దర్శకులెవరు, నిర్మాతలెవరు, సహనటీనటులెవరు అనేది పరిశీలించాలి. ముఖ్యంగా వారి సొంత సినిమాల్లో సాంకేతికగణం (రచయితలు, గీతరచయితలు, సంగీతదర్శకులు, దర్శకులు, ఫోటోగ్రాఫర్లు వగైరా) ఎవరో చూస్తే కులాభిమానం ఉందో లేదో మనకే తెలిసిపోతుంది. లోకంలో ప్రతి చోటా ఉండేట్లుగానే సినీరంగంలోనూ ప్రతిభకు, పనితీరుకి పట్టం. మనం యిస్తున్న, లేదా యిస్తామని చెప్పిన మొత్తానికి మనం మెచ్చే విధంగా పనిచేసి పెడుతున్నాడా లేదా, మనిషిలో ప్రొఫెషనలిజం ఉందా లేదా అనేదే చూస్తారు.
  20. ఇక హీరోలు తమ పక్కన ఉన్నవారు టాలెంటు కలిగి వుండి, తమని డామినేట్‌ చేయకుండా ఉన్నారా లేదా అని చూసుకుంటారు. ఎన్టీయార్‌, ఎయన్నార్‌లది ఒకే కులమైనా, కొన్నేళ్లపాటు విపరీతంగా వ్యతిరేకించుకున్నారు కదా. ఎన్టీయార్‌-కృష్ణ విషయంలోనూ అంతేగా. కాంతారావైతే తనకు పోటీగా ఉండడు కాబట్టి ఆయన తన కులం కాకపోయినా, ఎన్టీయార్‌ బాగా ప్రోత్సహించారు. (కింది లింకు చూడండి) తర్వాతి రోజుల్లో సత్యనారాయణను అలాగే ప్రోత్సహించారు. గుమ్మడి ఎయన్నార్‌ గ్రూపు అనే భావంతో ఎన్టీయార్‌ ఆయన్ని దూరంగా పెట్టి ఎస్వీయార్‌కు ప్రాధాన్యత యిచ్చారు.
  21. సినీపరిశ్రమ విజయాన్ని ఆరాధించినట్లుగా, కులాన్ని ఆరాధించదు. బొత్తిగా తెలియనివాళ్ల కంటె ఎవరైనా బంధువుల లేదా స్నేహితుల ద్వారా వస్తే కొద్దిపాటి ఛాన్సు యిచ్చి పరీక్షిస్తారు. పనితీరు నచ్చకపోతే పంపించివేస్తారు. పనితీరు నచ్చినా, తెరమీద కనబడినపుడు ప్రేక్షకులు ఆదరించకపోతే సాగనంపుతారు లేదా వ్యక్తిగత సహాయకుడిగా ఉంచుకుంటారు. అంతే తప్ప, తన కులస్తుడు కదాని ప్రేక్షకుల మీద పదేపదే రుద్దుదామని చూడరు. ఇక ప్రేక్షకులు తామిచ్చిన టిక్కెట్టు డబ్బులు కిట్టుబాటు అయ్యాయా లేదా అనే చూస్తారు తప్ప నటుడిది సూర్యవంశమా, చంద్రవంశమా అనేది పట్టించుకోరు.
  22. తెలుగుసినిమా రంగంలో ఏ నటుడు ఏ కులంవాడో గతంలో తెలిసేది కాదు. ఇటీవలి కాలంలోనే దాని గొడవ ప్రారంభమైంది. దీనివలన లాభమేమిటో ఎవరికీ తెలియదు. డబ్బింగు సినిమాల వద్దకు వచ్చేసరికి కులప్రస్తావన లేకుండానే హిట్టవుతున్నాయి కదా. రజనీకాంత్‌, విజయకాంత్‌, కమలహాసన్‌, అర్జున్‌, విక్రమ్‌, సూర్య, విజయ్‌.. యిత్యాది అనేకమంది హీరోల కులాల గురించి సగటు తెలుగు ప్రేక్షకుడికి తెలుసా? పట్టించుకుంటున్నాడా? ఇక హీరోయిన్ల కులాల గురించి ఎప్పుడూ ప్రస్తావనకు రాదు, అయినా వాళ్లను చూడడానికి ప్రేక్షకులు ఎగబడటం లేదా? అందువలన, యీ కులాల కొట్లాట సోషల్‌ మీడియాకు మాత్రమే పరిమితమనుకోవాలి. సశేషం

మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -2-3-22-ఉయ్యూరు

Posted in సినిమా | Tagged | Leave a comment

మనమరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు -104

మనమరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు -104

104 నాటక,సినీ నటుడు రచయిత గాయకుడు కృష్ణ పాత్ర ఫేం గానకోకిల ,-ఎ.వి..సుబ్బారావు

ఆరాధ్యుల వెంకట సుబ్బారావు లేదా ఏ.వి.సుబ్బారావు తెలుగు రంగస్థల నటుడు, పద్య గాయకుడు.

జననం
1930లో గుంటూరు జిల్లా అనంతవరం (కొల్లూరు మండలం)లో జన్మించారు.

పద్యం కమ్మగా పాడేవాడు. వింటున్నవారు అందులో లీనమయ్యేవారు. పద్యాన్ని, సంభాషణలాగా అర్థమయ్యేలా చేస్తూ ప్రేక్షకుల్ని ఆనందసాగరంలో ఓలలాడించేవాడు. ముక్కామల రాఘవయ్య, వల్లూరి వెంకట్రామయ్య చౌదరి, కుప్పా సూర్యనారాయణ, వేమూరి సీతారామశాస్త్రి, గుళ్లపల్లి ఆదిశేషయ్య, హార్మోనిస్టు విష్ణుబొట్ల వెంకటేశ్వర్లు ఇతన్ని తీర్చిదిద్దారు.

శ్రీకృష్ణ రాయబారం, గయోపాఖ్యానం, కురుక్షేత్రం, శ్రీకృష్ణ తులాభారం, రామాంజనేయయుద్ధం, చింతామణి వంటి నాటకాల్లో ప్రధానపాత్రలకు వన్నెతెచ్చాడు. జంధ్యాల పాపయ్యశాస్త్రి గానకోకిల బిరుదుతో సత్కరించారు. ఏ.వి.సుబ్బారావు పద్యాలు గ్రామఫోను రికార్డులున్నాయి. ఆయన కుమారులు ముగ్గురు (ఆరాధ్యుల కోటేశ్వరరావు, ఆరాధ్యుల వెంకటేశ్వరరావు) రంగస్థల నటులుగానే జీవితాన్ని సాగిస్తున్నారు. సుబ్బారావుకు ఏడుగురు కుమార్తెలు ఉన్నారు. సాధారణ రైతు కుటుంబంలో జన్మించిన సుబ్బారావు పెద్దగా చదువుకోలేదు. పొలం పనులకు వెళుతుండేవాడు. 1960లో సుబ్బారావు శ్రీ పూర్ణశ్రీ నాట్యకళాసమితిని స్థాపించి 30 ఏళ్లపాటు నాటక ప్రదర్శనలిచ్చారు. ఈలపాట రఘురామయ్య, పీసపాటి నరసింహమూర్తి, షణ్ముఖి ఆంజనేయ రాజు వంటి హేమాహేమీలతో శ్రీకృష్ణుడి పాత్రను ఒకే వేదికపై పంచుకున్నారు. శ్రీకృష్ణుడిగా ఆయన నటనకు గుంటూరు డ్రస్ కంపెనీ అధినేత వెండి కిరీటాన్ని బహుమతిగా ఇచ్చారు. గయోపాఖ్యానంలో ఆయన వేసిన కృష్ణ పాత్రను, రామాంజనేయ యుద్ధంలో రామ పాత్రను, రాయబారంలో శ్రీ కృష్ణుని పాత్రను హెచ్ఎంవి గ్రామఫోను కంపెనీ రికార్డు చేసింది. భూలోకంలో యమలోకం, ముత్యాల పల్లకి సినిమాలలో ప్లేబ్యాక్ పద్యాలు పాడారు.

మరణం
26.12.2010 న తెనాలి నాజరుపేటలోని తన స్వగృహంలో మరణించారు

నటించిన సినిమాలు
· శ్రీ సీతారామ కళ్యాణం (1961)

· శ్రీ వేంకటేశ్వర మహాత్మ్యం (1960)

· జయభేరి (1959)

· చెంచు లక్ష్మి (1958)

· మాంగల్యబలం (1958)

· సారంగధర (1957)

· పెద్ద మనుషులు (1954)

· శ్రీ కాళహస్తీశ్వర మహత్యం (1954)

· పల్లెటూరి పిల్ల (1950)

· వింధ్యారాణి (1948)

· మదాలస (1948)

· వరవిక్రయం (1939)

· మోహినీ భస్మాసుర (1938)

· సశేషం

· మీ –గబ్బిట దుర్గాప్రసాద్-2-3-22-ఉయ్యూరు

Posted in సినిమా | Tagged | Leave a comment

మనమరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు -103

మనమరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు -103

103-నాటక ,సినీ నటుడు ,దక్షణభాషా  సినీ దర్శక నిర్మాత ,రచయిత,భూకైలాస్ ఫేం-పద్మశ్రీ ఆర్ .నాగేంద్రరావు  

28-6-1896 జన్మించి 2-9-1977న 81 ఏళ్ళ వయసులో మరణించిన ఆర్.నాగేంద్రరావు నాటక ,సినీ నటుడు ,దక్షణభాషా  సినీ దర్శక నిర్మాత ,రచయిత-పద్మశ్రీపురస్కార గ్రహీత .దక్షిణ భారత సినీ పరిశ్రమలో చాలా ప్రభావమున్న వ్యక్తి .1968లో ఆయన నటించిన హన్నేలే చిగ్రుడిగా సినిమాకు కర్ణాటక స్టేట్ అవార్డ్ పొందాడు .1976 భారత ప్రభుత్వం పద్మశ్రీ ప్రదానం చేసి గౌరవించింది .ఆయన రెండవకుమారుడు ఆర్ ఎన్ కే ప్రసాద్ సినిమాటోగ్రాఫర్ ,మూడక కుమారుడు ఆర్ ఎం జయగోపాల్ స్క్రిప్ట్ రైటర్  .చివరికొడుకు ఆర్ ఎస్ సుదర్శన్ నటుడు .

  8వ ఏటనే కన్నడ నాటకాలలో  నటిస్తూ నాగేంద్ర సీతా, చంద్రమతి ,డేస్డేమోనా స్త్రీ పాత్రలలో రాణించాడు .తర్వాత పురుష వేషాలలో కన్నడ తెలుగు రా ష్ట్రాలను దున్నేశాడు .1931లో వచ్చిన టాకీ యుగం లో బొంబాయికి వెళ్లి ,రాజా సాండో ‘’పారిజాత పుష్పహరణం, నారద ,కోవలన్ తమిళ సినిమాల లో నూ ,1933లో తెలుగు రామదాసు  సినిమాలో నటించాడు .బెంగుళూరు తిరిగి వచ్చి ‘’శ్రీ సాహిత్య సామ్రాజ్య నాటక మండలి ‘’స్థాపించి  సుబ్బయ్యనాయుడు అనే ప్రముఖ  కన్నడ నటుడితో నాటకాలు వేశాడు .బిజినెస్ మాగ్నెట్ చమన్ లాల్ దోనగాజ్ ను ఒప్పించి కన్నడ సినిమాను వై వి రావు అనే ఎరగుడిపాటి వరద రావు ను డైరెక్టర్ చేసి ,తాను  రావణ వేషంవేసి ,సంగీతం కూర్చి ,  కన్నడం లో మొదటి టాకీ ‘’సతీ సులోచన ‘’తీసి 1934 మార్చి 3వ రిలీజ్ చేశాడు .స్వంత దర్శకత్వం లో మొదటి సినిమా 1943లో సత్యహరిశ్చంద్ర నిర్మించి నటించి విడుదల చేశాడు .

  నాగేంద్రరావు రాసిన ‘’భూకైలాస్ ‘’నాటకం మూడు సార్లు తెరకెక్కి రికార్డ్ సృష్టించింది .రెండు సార్లు సుందర్ లాల్ నడకర్ని మూడోసారి కే శంకర్ తీశారు .ఇందులోనే కన్నడ రాజకుమార్ మొదటి సారిగా సినీఅరంగేట్ర౦  చేశాడు నారద పాత్ర పోషణతో .1951లో నాగేంద్రరావు స్వంత పిఎన్ ఆర్ పిక్చర్స్ సంస్థ స్థాపించి ‘’ప్రేమదా పుత్రి ‘’1957లో నిర్మించి,సపోర్టింగ్ రోల్ వేసి  డైరెక్ట్ చేశాడు.ఈ సినిమా అయిదవ జాతీయ ఫిలిం  అవార్డ్ లలో బెస్ట్ కన్నడ ఫీచర్ ఫిల్మ్ అవార్డ్ పొందింది .1964 దాకా ఈ సంస్థ ఉన్నది .తర్వాత తండ్రి పాత్రలలో స్థిరపడ్డాడు .

  1956లో విక్రం ప్రొడక్షన్ బానర్ పై బీస్ రంగా దర్శకత్వం లో వచ్చిన ‘’భక్త మార్కండేయ ‘’సినిమాలో నాగేంద్రరావు యముడు పాత్ర ధరించి బాగా మెప్పించాడు .అపూర్వ సహోదరులు ,ముగ్గురు కొడుకులు ,చండీ రాణి ,జాతకం ,నాగుల చవితి ,ప్రేమే దైవం ,గాలిమేడలు ,బంది పోటు,కలవారి కుటుంబం ,లలో నటించాడు నాగేంద్రరావు .

  సశేషం

మీ- గబ్బిట దుర్గా ప్రసాద్ -2-3-22-ఉయ్యూరు    

Posted in సినిమా | Tagged | Leave a comment

ఫాల్గుణ శుద్ధ ఏకాదశి నాడు సామూహిక సత్యనారాయణ వ్రతం

ఫాల్గుణ శుద్ధ ఏకాదశి నాడు సామూహిక సత్యనారాయణ వ్రతం
13-3-22 ఆదివారం ఫాల్గుణ శుద్ధ ఏకాదశి ఆదివారం శ్రీ సువర్చలాన్జనేయ దేవాలయం లో ఉదయం 9గం.లకు సామూహికంగా పాలు పొంగించటం .ఉదయం 9-30గం.లకు సామూహిక శ్రీ సత్యనారాయణ వ్రతం నిర్వ హించ బడును .ఎలాంటి రుసుము లేదు .పూజాద్రవ్యాలు ఎవరికీ వారే తీసుకొని రావాలి .ప్రసాదం ఆలయం తరఫునతయారుచేసి అందిస్తాము .
పాల్గొనే భక్తులు ముందుగా అర్చకస్వామి కి తెలియజేసి పేర్లు నమోదు చేసుకోవాలి
గబ్బిట దుర్గాప్రసాద్ -ఆలయ ధర్మకర్త -1-3-22

Posted in సమయం - సందర్భం | Leave a comment

మనమరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు -103

మనమరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు -103

103-‘’ ,,స్వాతంత్ర్య సమరయోదుడైన ‘’’అనుపమ ‘’నిర్మాత దర్శకుడు,బి.ఎన్.రెడ్డి అవార్డ్ గ్రహీత -కె.బి .తిలక్

కె.బి. తిలక్ (1926 – 2010) పూర్తి పేరు కొల్లిపర బాలగంగాధర్ తిలక్ వీరు స్వాతంత్య్ర సమరయోధుడు, దర్శకుడు, నిర్మాత.[1]

జననం
తిలక్ పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరులో కొల్లిపర వెంకటాద్రి సుబ్బమ్మ దంపతులకు 1926, జనవరి 14న జన్మించాడు. ఆయన తండ్రి వెంకటాద్రి స్వాతంత్య్ర సమరయోధుడు. ఏలూరులో చదివేటప్పుడు తిలక్ స్వాతంత్య్రోద్యమం పట్ల ఆకర్షితులయ్యాడు. చదువు వదిలి 16 ఏళ్ళ వయస్సులోనే క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొని 1942లో జైలుకి వెళ్లారు.

సినిరంగ ప్రవేశం
ముదిగొండ జగ్గన్నశాస్త్రి ప్రోత్సాహంతో ప్రజా నాట్యమండలిలో సభ్యునిగా చేరి అనేక నాటకాలను ప్రదర్శించాడు. మేనమామలు ఎల్.వి.ప్రసాద్, అక్కినేని సంజీవిల ప్రోత్సాహంతో తొలుత కొన్ని సినిమాలకు ఎడిటర్‌గా పనిచేసి, జ్యోతి సినిమాతో అనుకోకుండా దర్శకుడిగా మారాడు. తరువాత అనుపమ చిత్ర నిర్మాణ సంస్థను ఏర్పాటు చేశాడు. ఈ నిర్మాణ సంస్థద్వారా అభ్యుదయ భావాలతో అనేక చలన చిత్రాలు నిర్మించారు.

అభ్యుదయ భావాలతో సినిమాలు

  1. ముద్దుబిడ్డ (1956)
  2. ఎం.ఎల్.ఏ. (1957)
  3. అత్తా ఒకింటి కోడలే (1958)
  4. చిట్టి తమ్ముడు (1962)
  5. ఉయ్యాల జంపాల (1965)
  6. ఈడుజోడు (1967)
  7. పంతాలు పట్టింపులు (1968)
  8. ఛోటీ బహు, కంగన్ (1971)
  9. భూమి కోసం (1974)
  10. కొల్లేటి కాపురం (1976)
  11. ధర్మవడ్డీ (1982)

విశేషాలు
· 1974లో ‘భూమి కోసం ‘ సినిమాను నక్సలైట్ ఉద్యమంలో మరణించిన తన సోదరుడు కొల్లిపర రామనరసింహారావుకు అంకితమిచ్చాడు.

· జయప్రదను వెండితెరకు పరిచయం చేశాడు.

· యు.విశ్వేశ్వర రావు దర్శకత్వం వహించి, నిర్మించిన నగ్నసత్యం సినిమాలో ఒక పాత్ర ధరించాడు.

అవార్డులు, గుర్తింపులు
· 2008 సంవత్సరపు బి.ఎన్.రెడ్డి అవార్డు లభించింది.

మరణం
కె.బి. తిలక్ గారు 2010, సెప్టెంబరు 23న మరణించాడు.[2]

వామపక్ష భావాలకు తిలక్ పట్టం గట్టారు. ఎం.ఎల్.ఎ, అత్తా ఒకింటి కోడలే, ఉయ్యాల జంపాల, పంతాలు పట్టింపులు, చిట్టి తమ్ముడు, ధర్మవడ్డీ వంటి చిత్రాలకు ఆయన దర్శకత్వం వహించారు.

అనుపమ పిక్చర్స్ పతాకంపై భూమికోసం, ఎం.ఎల్.ఎ, ధర్మవడ్డీ, కొల్లేటి కాపురం వంటి ఆదర్శవంతమైన చిత్రాలను నిర్మించి దర్శకత్వం వహించిన కె.బి. తిలక్ సినిమా పరిశ్రమలో ప్రజానాట్యమండలి కెరటాన్ని ఎగురవేసి తాను నిర్మించిన చిత్రాల్లో ప్రజానాట్యమండలి వాణిని వినిపించిన సినిమా విప్లవకారుడని వారు పేర్కొన్నారు.

విలువలను వీడకుండా ఓ సంకల్పంతో సినిమాలు తెరకెక్కించినవారు అరుదుగా కనిపిస్తారు. అలాంటి వారిలో కొల్లిపర బాలగంగాధర తిలక్ ఒకరు. ఇలా అంటే ఎవరికీ తెలియదు కానీ, కె.బి.తిలక్ అనగానే సినీ అభిమానులు ఇట్టే గుర్తు పట్టేస్తారు. తన ప్రతి సినిమాలోనూ ఏదో ఓ వైవిధ్యం చూపించాలని తపించేవారు తిలక్. ఆ తపనే ఆయనను ప్రత్యేకంగా నిలిపింది.

కె.బి.తిలక్ 1926 జనవరి 14న పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరులో జన్మించారు. ప్రఖ్యాత దర్శకనిర్మాత ఎల్.వి.ప్రసాద్ స్వయాన అక్క కుమారుడే తిలక్. వీరి అక్కనే మళ్ళీ ఎల్వీ ప్రసాద్ వివాహమాడారు. అలా ఎల్వీ ప్రసాద్, తిలక్ కు మేనమామ, బావ కూడా అవుతారు. ప్రసాద్ స్ఫూర్తితోనే తిలక్ చిత్రసీమలో అడుగు పెట్టారు. అంతకు ముందు అభ్యుదయ భావాలతో తిరిగేవారు. ప్రజానాట్యమండలిలో చురుగ్గా పాల్గొనేవారు. కమ్యూనిస్టు పార్టీ కార్యకలాపాలలోనూ ఉత్సాహంగా పాల్గొని సాగేవారు. ఎల్.వి.ప్రసాద్ వద్ద కొన్ని చిత్రాలకు అసోసియేట్ గా పనిచేసిన తిలక్, 1956లో ‘ముద్దుబిడ్డ’ చిత్రాన్ని స్వీయ దర్శకత్వంలో నిర్మించారు. జగ్గయ్య, జమున నటించిన ఈ సినిమా మంచి పేరు సంపాదించి పెట్టింది. అప్పటికే యన్టీఆర్, ఏయన్నార్ టాప్ హీరోస్ గా సాగుతున్నందున్న తిలక్, తన మిత్రుడు జగ్గయ్యతోనే సినిమాలు తీస్తూ ఆయననూ ఓ ప్రముఖ కథానాయకునిగా నిలిపారు. జగ్గయ్య, సావిత్రితో తరువాత తిలక్ తీసిన ‘ఎమ్.ఎల్.ఏ.’ సైతం జనాన్ని ఆకట్టుకుంది. ‘అత్తా ఒకింటి కోడలే’ చిత్రాన్ని తమిళంలోనూ ‘మామియరుమ్ ఒరు వీట్టు మరుమగలే’ రూపొందించి, రెండు చోట్లా ఆదరణ సంపాదించారు. జగ్గయ్య హీరోగా, ఆరుద్ర రచన, పెండ్యాల సంగీతంతో సాగారు తిలక్. “ఈడు-జోడు, ఉయ్యాల-జంపాల, పంతాలు – పట్టింపులు” వంటి చిత్రాలు తెరకెక్కించారు. “ఛోటీ బహు, కంగన్” వంటి హిందీ చిత్రాలనూ రూపొందించారు.

తిలక్ రూపొందించిన ‘భూమికోసం’ చిత్రంతోనే జయప్రద పరిచయమయ్యారు. కృష్ణ, ప్రభ జంటగా తిలక్ తెరకెక్కించిన ‘కొల్లేటి కాపురం’ కూడా అలరించింది. ఆయన దర్శకత్వంలో రూపొందిన చివరి చిత్రం ‘ధర్మవడ్డీ’. సినిమా రంగంలో చోటు చేసుకున్న పరిణామాలు, అన్నిటా పెరిగిపోయిన వేగం ఆయనకు నచ్చలేదు. దాంతో 1982 తరువాత నుంచీ సినిమాలకు దూరంగా ఉన్నారాయన. 2008లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రప్రభుత్వం తిలక్ ను బి.యన్.రెడ్డి జాతీయ అవార్డుతో గౌరవించింది. 2010 సెప్టెంబర్ 23న తిలక్ కన్నుమూశారు. ఈ నాటికీ తిలక్ చిత్రాల్లోని కథావస్తువును, సంగీతసాహిత్యాలను అప్పటి సినీ ఫ్యాన్స్ నెమరువేసుకుంటూనే ఉన్నారు.

కేబి తిలక్ సుమారు నలభె ఏళ్లకు పూర్వం హైదరాబాద్ లో ఒక కార్యక్రమం నిర్వహిస్తే ,నేనూ మా బావమరది ఆనంద్ వెళ్లాం .తిలక్ రూపురేఖలకు అంకిత భావానికి ఫిదా అయ్యాం .ఆసభలో గద్దర్ ను, ఒక ముస్లిం కవయిత్రి మహీజాబెన్ ను కూడా చూసి మాట్లాడాం .విప్లవ వీరుడు కొండపల్లి సీతారామయ్య గారి భార్యశ్రీమతి కోటేశ్వరమ్మ కూడా ఆసభలో ఉన్నారు ఆమెతోనూ మాట్లాడాం .భేషజం లేని మనిషి తిలక్ .

తెలుగు చలన చిత్ర సీమకు అనుపమ కళాతిలకం.ఎం ఎల్ ఎ సినిమాలో ఆరుద్ర రాసిన ‘’గుండెల్లో గునపాలూ గుచ్చారే నీవాళ్ళూ ‘’అనే పాట విని కళ్ళ వెంబట నీరు కారింది నాకు .ముద్దుబిడ్డ ప్రతి సీన్ టచింగ్ గా ఉంటుంది .అత్తా ఒకింటి కోడలే ఒక శివరాత్రినాడు బెజవాడలో చూసిన జ్ఞాపకం .చాలా లైటర్ వీన్ లో తీసి ,నీతినీ బోధించాడు .జోడు గుళ్ళ పిస్తోలు ఠా-నేను ఆడీ తప్పని వాణ్ణి జీహా ‘’అని ఆరుద్ర రాసిన పాటకు జగ్గయ్య యాక్షన్ అదుర్స్ .ఈ సినిమా చాలాసార్లు చూశాను.చిట్టితమ్ములో రాజసులోచన కేవీస్ శర్మ లనటన హైలైట్ .’శర్మ ఆస్కార్ వైల్డ్ రాసిన కధలో సెల్ఫిష్ జెయింట్ లా అనిపిస్తాడు .’ఏస్కో నారాజా ‘’పాట సూపర్ .ఈడూ –జోడు ,ఉయ్యాల –జంపాల పెండ్యాల స్వరకల్పనలతో ,ఆరుద్ర గీతాలతో సంగీత ఊయలలే ఊగిస్తాయి .పంతాలు పట్టింపులు మరాటీ కధ .దానిలోనూ దీనిలోనూ కళారంజనిగా లీలా రంజని నటించింది .తాగు బోతు గుమ్మడిని చూడలేం .విషాదం నషాళానికి అంటి భయమేస్తుంది .భూమికోసం లో శ్రీ శ్రీ తోపాటు పీపుల్స్ వార్ గ్రూప్ స్థాపకుడు కళాసాగర్ అనే సత్యమూర్తి స్క్రిప్ట్ ,పాటలూ రాశాడు .జయప్రద మొదటి పరిచయం .పెండ్యాల మ్యూజిక్ లో ‘’ఎవరో వస్తారని ఏదో చేస్తారని ఎదురుచూసి ఎదురు చూసి మోసపోకుమా ‘’పాట ఆల్ టైం రికార్డ్ .అశోక్ కుమార్ కూడా నటించాడు .కొల్లేరు సరస్సుపై సాహసించి తిలక్ మొదటి సారిగా ‘’కొల్లేటికాపురం ‘’తీశాడు .ధర్మవడ్డీ లో జగ్గయ్య నటన అద్భుతం .తిలక్ అంటే ‘’అనుపమ ,జగ్గయ్య జమున ,పెండ్యాల ,ఆరుద్ర’’విడరాని బంధం గుర్తుకొస్తుంది .విలువలతో తీసిన చిత్రాలకు కేరాఫ్ కేబి తిలక్ .

సశేషం

మహాశివరాత్రి శుభాకాంక్షలతో

మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -1-3-22-ఉయ్యూరు

Posted in సినిమా | Tagged | Leave a comment

మనమరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు -102 102-తొలిలి జానపద చిత్రం గులేబకావళి నిర్మాత,యాక్టింగ్ స్కూల్ స్థాపకుడు – కాళ్ళకూరి సదాశివరావు

వర విక్రయం నాటకకర్త కాళ్ళకూరి నారాయణరావు గారి కుమారుడే సదాశివరావు

కాళ్ళకూరి సదాశివరావు తెలుగులో జానపద చిత్ర నిర్మాణం ప్రారంభించిన వ్యక్తి. ఆ కాలంలో వరుసగా వస్తున్న పౌరాణిక సినిమాలకు భిన్నంగా ఒక కొత్త తరహా చిత్రాన్ని ప్రేక్షకులకు అందించాలన్న సంకల్పంతో తొలి జానపద చిత్రం గులేబకావళి కథ తీసాడు. 1939లో విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని అందించింది. పాటలు, పద్యాలకు భిన్నంగా ఆ సినిమాలో ఉన్న కత్తి యుద్ధాలు, పోరాటాలు, మంత్రాలు, మాయలు విశేషంగా ఆకట్టుకున్నాయి.

జీవిత విశేషాలు
అతను “చింతామణి” , “వరవిక్రయం”, “మధుసేవ” వంటి నాటకాలు రాసి జనాన్ని చైతన్యవంతుల్ని చేసిన మహాకవి కాళ్ళకూరి నారాయణరావు కుమారుడు సదాశివరావు. మూకీల కాలం నుండి అతనికి చిత్రపరిశ్రమతో సంబంధం ఉంది. అతను 1901 ఫిబ్రవరి 13న కాకినాడలో జన్మించాడు. నెల్లూరు లో జిల్లా బోర్డు విద్యా శాఖాధికారి కాళ్లకూరి దక్షిణామూర్తి అతని అన్నయ్య. కాకినాడలో పి.ఆర్ కళాశాలలో ఇంటర్మీడియట్ వరకు చదువుకున్నాడు. తరువాత హైదరాబాదు, మద్రాసు లలో బ్యాంకింగ్ కోర్స్ చదివారు. ఉద్యోగ వేటను ప్రారంభించి అతను రంగూన్‌లో సినిమా మెజిస్టిక్ అనే థియేటరుకు అసిస్టెంటుగా 1932లో ఉద్యోగంలో చేరి నాలుగు నెలల పాటు పనిచేసాడు. అక్కడి వాతావరణంలో ఇమడలేక కాకినాడ తిరిగి వచ్చేసాడు.[1]

చిత్ర పంపిణీ సంస్థ స్థాపన
చిత్తజల్లు పుల్లయ్య కు కాకినాడలో ఒక థియేటర్, ఒక టూరింగ్ టాకీసు ఉండేవి. రంగూను నుండి వచ్చిన తరువాత సదాశివరావు పుల్లయ్యను పరిచయం చేసుకొని అతని వద్ద అసిస్టెంటుగా చేరాడు. ఆ థియేటర్ల నిర్వహణా భాద్యతలను చూసుకొనేవాడు. ప్రదర్శనా రంగంలో అనుభవం పొందడంతో పుల్లయ్య ప్రోతసహంతో కొంతమంది మిత్రులనుకలుపుకొని “ఇంపీరియల్ పిక్చర్ ప్యాలస్” అనే థియేటరును ప్రారంభించాడు. ఆధాయం పెరిగే సరికి భాగస్వముల మధ్య విభేదాలు తలెత్తడంతో స్వంతంగా “కాకినాడ ఫిలిం ఎక్చేంజి” పేరుతో మరో పంపిణీ సంస్థను నెలకొల్పాడు.

చిత్ర రంగ ప్రవేశం
ఎనిమిదేళ్ల పాటు పంపిణీ, ప్రదర్శన రంగాలను కొనసాగించిన అతను ఎన్నో మూకీ చిత్రాలను తీసుకు వచ్చి తెలుగు ప్రేక్షకులకు ప్రదర్శించాడు. ప్రేక్షకులు ఎటువంటి సినిమాలు ఆదరిస్తారనే అవగాహన ఏర్పడింది. ఆ సమయంలో టాకీల నిర్మాణం ప్రారంభమైంది. చిత్ర నిర్మాణంపై ఆసక్తితో అతను కలకత్తా వెళ్ళి రాధాకిషన్ చమ్రియాను కలిసాడు. అతని సంకల్పం తెలిసిన రాధాకిషన్ మదన్ పిక్చర్స్ సంస్థను నెలకొల్పి సదాశివరావు దర్శకత్వంలో చింతామణి చిత్రాన్ని నిర్మించాడు. 1933లో విడుదలైన ఈ చిత్రంలో రామతిలకం, పులిపాటి తదితరులు నటించారు. తన తండ్రి రాసిన చింతామణి నాటకం ఆధారంగా తొలి సినిమా తీసాడు.

అతను తన సినిమాలకు స్వయంగా స్క్రిప్టు తయారుచేసుకొనేవాడు. “సతీ సులోచన” చిత్రంలో తొలిసారిగా ద్విపాత్రాభినయం అతను ప్రవేశపెట్టాడు. తొలి టాకీ సినిమా “భక్త ప్రహ్లాద” లో హిరణ్యకశిపునిగా నటించిన వి.వి.సుబ్బారావు ఈ చిత్రంలో రావణాసురునిగా, ఇందజిత్తుగా రెండు పాత్రలను పోషించాడు. అలాగే జానపద చిత్రాల్ని నిర్మించిన ఘనత కూడా అతనిదే.[1]

1940 లో చంద్రహాస సినిమాకు మొదటి సారిగా దర్శకత్వం వహించాడు. కానీ మధ్యలో కంపెనీ వారితో అబిప్రాయ భేదాలు ఏర్పడి ఆ సంస్థనుండి మధ్యలోనే తిరిగి వచ్చేశాడు

సినిమాలు

· భక్త కుచేల (1935)

· లంకాదహనం (1936)

· సతీ సులోచన (1936)

· గులేబకావళి కథ (1939)

· చిరుతొండ నైనార్ (తమిళ సినిమా)

· చంద్రహాస (1940)

ఆర్మీలో నాలుగేళ్ళు
1942లో మద్రాసులో యుద్ద వాతావరణం నెలకొన్న రోజులలో ఆర్మీలోని వినోద శాఖలో చేరి సైనికులకు ఆహ్లాదాన్ని పంచాడు. అలాగే నాలుగేళ్ళు చిత్రరంగానికి దూరంగా ఉండి అర్మీలోనే కొనసాగాడు.

తిరిగి సినిమాలలోకి
యుద్దం ముగిసిన తరువాత 1946లో అతను నెల్లూరు వెళ్ళిపోయాడు. అతని అత్తవారు ఊరు కూడా అదే. అప్పటికి చిత్రరంగంలో మార్పులు చోటుచేసుకున్నాయి. అందుకే ఆ వాతావరణానికి ఇమడలేక మద్రాసు వదిలి నెల్లూరు చేరుకున్నాడు. ఆ ఊరి పెద్దల సహకారంతో మళ్ళీ సినిమా తీయాలనే నిర్ణయానికి వచ్చాడు. 1947లో సువర్ణలతా పిక్చర్స్ సంస్థను నెలకొల్పి “సువర్ణమాల” సినిమాను స్వీయ దర్శకత్వంలో నిర్మించాడు. ఆంధ్రా బ్యాంకు లో పనిచేసే సూర్యనారాయణ, బాలసరస్వతి ఇందులో నటించారు. ఈ సినిమా విజయవంతం కాకపోవడంతో చిత్ర నిర్మాణం కొనసాగించలేక పోయాడు. బయట సినిమాలకు అవకాశాలు రాకపోవడం, సొంతంగా చిత్ర నిర్మాణం చేపట్టే అవకాశం లేకపోవడంతో పబ్లిసిటీ ఆఫీసును ప్రారంభించాడు. దీనిని 1950 నుండి 1953 వరకు నడిపాడు. తరువాత ఆ సంస్థను కూడా మూసివేసాడు.

తండ్రి రాసిన మధుసేవ నాటక౦ రెండవ కూర్పు ను సదాశివరావు 1929లో ప్రచురించారు .

తరువాత హైదరాబాదులో “చిత్ర కల్పనాలయ” పేరుతో యాక్టింగ్ స్కూలును 1966లోప్రారంభించాడు.

కొంత కాలానికి హైదరాబాదులోనే మరణించాడు.

సశేషం

మహాశివరాత్రి శుభాకాంక్షలతో

మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -1-3-21-ఉయ్యూరు

Posted in సినిమా | Tagged | Leave a comment

మరాఠీ నవలా మార్గదర్శి – హరినారాయణ ఆప్టే-1

మరాఠీ నవలా మార్గదర్శి – హరినారాయణ ఆప్టే-1

ఎం.ఎ.కరందికర్ రాసిన దాన్ని శ్రీ మొదలి నాగభూషణ శర్మగారు ‘’ హరినారాయణ ఆప్టే ‘’గా తెలుగు అనువాదం చేయగా  నేషనల్ బుక్ ట్రస్ట్ 1973లో ముద్రించినది .వెల-రెండు రూపాయల పావలా .

‘’ మరాఠీ నవలా సాహిత్యం హరి నారాయణ ఆప్టే వల్లనే  సక్రమ మర్గాన నడిచింది.సాహిత్యజీవితపు తొలి రోజుల్లోనే మధ్యతరగతి ప్రజలగురించి జీవితాలగురించి రాశాడు .తర్వాత చారత్రక కాల్పనిక కధలు తీసుకొన్నాడు ‘’అన్నారు బివి కేస్కర్ .

             బాల్యం

మహారాష్ట్ర చిత్ పవన కుటుంబాలలో ఆప్టే ఒకటి .హరినారాయణ ఆప్టే తాతగారు మహారాష్ట్ర ఖాందేశ్ తాలూకా అధికారి .ఆయనకు ఇద్దరు కూతుళ్ళు ,నలుగురుకోడుకులు .అందులో నారాయణ్ కుమారుడే హరినారాయణ .కలవారి కుటుంబమే .తల్లి యాము లక్ష్మి .బయటకు వెళ్లి పై చదువులు చదివే స్తోమతలేక నారాయణ్ ఇండోర్ లో నెలకు పది రూపాయలకు చిన్న ఉద్యోగం లో చేరాడు .వదిలేసే నాటికి జీతం 30 రూపాయలు .ఇండోర్ లో ఉండగానే నారాయణ్ ,లక్ష్మీ దంపతులకు హరి నారాయణ్ 8-3-1864 మాఘ అమావాస్య నాడు జన్మించాడు .తర్వాత కుటుంబం పూనా చేరింది .పోస్టల్ డిపార్ట్ మెంట్ లో నారాయణ్ బొంబాయి లో 1867లో చేరి ,సోదరుడు మహాదేవ్కు  ఉపయోగపడటానికి బొంబాయి చేరాడు .అప్పుడే మహాదేవ బిఎ ఫస్ట్ క్లాస్  లో పాసయ్యాడు .మరుసటి ఏడాది మూడో బిడ్డను ప్రసవించి లక్ష్మి చనిపోయింది .ఆడపిల్ల కూడా రైలు ప్రమాదం లో చనిపోయింది .హరి బాగోగులు తాను  చూస్తానని లక్ష్మి మరణ శయ్య మీద ఉన్నప్పుడు మహాదేవ హామీ ఇచ్చి నిలబెట్టుకొన్నాడు .ఈ విషయాలను హరి తన నవలలలో చిత్రించాడు .

  తల్లి మరణం తర్వాత హరి నాయనమ్మ,పెత్తల్లి లకు బాగా మాలిమి అయ్యాడు .దీపావళి రోజున పోలీస్ ఆజ్ఞలకు వ్యతి రేకం గా టపాసులు కాల్చినందుకు హరి ని అరెస్ట్ చేస్తే పెదనాన్నే విడిపించాడు .చిలిపితనం తో అందర్నీ అనుకరించేవాడు హరి .1870లో తండ్రి  మళ్ళీ పెళ్లి చేసుకొన్నాడు సవతి తల్లి హరిని  అమిత ఆప్యాయంగా చూసేది .1871 అన్నా సాహెబ్ అనే మహాదేవ్’’ లా’’పాసై ,సబ్ జడ్జిగా పని చేశాడు .నాలుగేళ్ళతర్వాత బొంబాయి హైకోర్ట్ లో న్యాయవాదిగా చేరగా భార్య క్షయతో చనిపోయింది .భార్య పోవటం తో అతడు కుటుంబ బాధ్యత పట్టించుకోలేదు .

  తండ్రి బొంబాయి ఫణస్ వాడీ లో వేరే ఇల్లు చూసుకొని కాపురం మార్చాడు .కానీ బాంబే జీవితం ఖర్చుతో కూడినదని భావించి పూనాకు పంపాడు .పెత్తల్లి మరణానికి ముందే ఆమె ఒత్తిడితో హరి ఉపనయనం 1872లో జరిగింది .పొరుగింటి శ్రీమతి రాధాభాయి గోఖలే  నూతన వటువు చురుకు దానాన్ని చూసి ముచ్చటపడి ,తనకుమార్తె మధును అతనికిస్తానని చెప్పింది .ఆమె భర్త విశ్వనాధ గోఖలే పూనాలో న్యాయవాది .హరి అక్కడే చదువుతున్నాడు .బొంబాయిలో మూడవ తరగతి దాకా చదివి పూనాలో బిషప్ హై స్కూల్ లో చేరాడు .ఇక్కడ మరాటీ సంప్రదాయం వాతావరణం నచ్చాయి .ఉత్తమ ఉపాధ్యాయులు దేశభక్తులు,ఆదర్శ వాదులు  ఉన్నారు .విద్యార్ధులకు మార్గదర్శకం చేసేవారు .

  హరి తండ్రి 1880లో సతారాకు బదిలీఅయ్యాడు .అప్పటి ఆప్టే కుటుంబం లో హరే పెద్దవాడు .గారాబంగా పెరిగాడు కనుక  చిలిపితనం హద్దులు మీరేది .సంస్కృతం బోధించే ఉపాధ్యాయుడి బట్ట తల నిమిరితే తప్ప పాఠం వినేవాడు కాదు .శ్రద్ధగా చదివి రఘువంశం శాకుంతలం ,విక్రమోర్వశీయం నేర్చి స్వయంగానే సంస్కృత  ఉద్గ్రంధాలు చదివే విద్వత్తు సంపాదించాడు .మరాటీ సాహిత్యాన్నీ మధించాడు .మంచి పరిశీలనా శక్తి ఉండటం తో కధలు ,పద్యాలు రాసేవాడు అప్పుడే .ఐదవ తరగతి లోనే ‘’పూరీ హౌస్ ఫిటలి’’అంటే ఉత్సాహం పూర్తిగా మందగించింది కధ రాశాడు .నాట్య కధార్ణవ మాసపత్రిక ఉత్సాహంగా చదివే వాడు .అది అతని ఊహా శక్తిని ప్రేరేపించింది .మెడోస్ టేలర్ రాసిన ‘’పాండు ర౦గ్ హరి ‘’ఉద్గ్రంధాన్ని ‘’అనాధ పాండురంగ’’గా అనువదించాడు .తారా అనే గ్రందాన్నీ అనువాదం చేశాడు.అయితే ఈరెండూ అలభ్యాలు .

  1-1-1880న విష్ణు శాస్త్రి చివ్ లూణ్ కర్  ‘న్యు ఇంగ్లీష్ స్కూల్ ‘’స్థాపించాడు .ఆయనతో దక్కన్ కాలేజి గ్రాడ్యుయేట్స్ అయిన తిలక్ ,కరందికర్ ,భగత్ లు చేరారు .యువతకు జాతీయభావనతో కూడిన విద్య బోధించటమే వీరి లక్ష్యం .హరి కొందరు విద్యార్ధులతో కలిసి ఇందులో చేరాడు .మొదటి రోజున 150 మంది మాత్రమె విద్యార్ధులు .మహారాష్ట్ర చరిత్ర పరిశోధకుడు వాసుదేవ శాస్త్రి ఖరి ,ఇంగ్లీష్ భాషా బోధనా ప్రవీణ్ హరి కృష్ణ దామ్లె ,ప్రముఖ సంస్కృత పండితుడు ,పత్రికాధిపతి నన్ దర్గీ కర్ శాస్త్రి ,మాధవరాం నాం జోషీ లు అతి తక్కువ జీతాలతో పని చేశారు .ఆగస్ట్ లో మహా సంస్కృత పండిట్  వామన్ శివరాం ఆప్టే వచ్చి చేరాడు .మూడు నెలలలో మూడు వందలమంది విద్యార్ధులతో కళకళ లాడింది విద్యాకేంద్రం .ఆ రోజుల్లోనే హరినారాయణ్ ‘’నేను బ్రిటష్ ప్రభుత్వం లో పని చేయను ‘’అని ప్రతిజ్ఞ చేశాడు .స్వాతంత్ర్యం ,పాండిత్యం తో ఆస్కూల్ మెరిసిపోయింది .హరి మెట్రిక్ క్లాస్ కు రాగానే మిల్టన్ ,షేక్స్ పియర్ స్కాట్ షెల్లీ కీట్స్ జేన్ ఆస్టిన్,డికెన్స్ ధాకరే గ్రంధాలను ,మోలియర్ నాటకాలను అర్ధం చేసుకొనే స్థాయికి ఎదిగాడు .స్థాపకుడు విష్ణు శాస్త్రి 1882మార్చి 17 అకస్మాత్తుగా చనిపోతే ,వెంట స్మశానానికి వెళ్ళిన హరి ఉత్తేజితుడై ‘’’’శిష్యజన విలాపం ‘’అనే 89పద్యాల స్మృతి  గీతం  రాశాడు .అచ్చయిన రెండు రోజుల్లో వెయ్యికాపీలు అమ్ముడయాయి .దీనితో హరి పేరు విశేషంగా వ్యాప్తి చెందింది .

  తర్వాత అగార్కర్ ,తిలక్ లకు ‘’కొల్హాపూర్ దివాన్ బార్వే ‘’అనే అభియోగంతో 1882జులై 17న నాలుగు నెలలు కఠిన కారాగార వాస శిక్ష పడింది .వారి విడుదలకోసం హరి నిధిని వసూలు చేసి వారి పట్ల గౌరవం ప్రదర్శించాడు .చదువుకు భంగం కలిగింది మెట్రిక్ పరీక్షకు పంపలేదు .కానీ 1883లో పాసయ్యాడు హరి .

  సశేషం

రేపు శివరాత్రి శుభా కాంక్షలతో

మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -28-2-22-ఉయ్యూరు  

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

 మనమరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు -101వెనుక మన వెండి తెర మహానుభావులు -101

 మనమరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు -101

 101-ఎమ్జి ఆర్ నే మెప్పించిన కధకుడు ,మహా డబ్బింగ్ రైటర్ ,’’కురిసింది వానా ‘’ పాట ఫేం,సంగీత దర్శకుడు,సినీ డైరెక్టర్ –రాజశ్రీ

రాజశ్రీ అనే ఇందుకూరి రామకృష్ణం రాజు (ఆగష్టు 311934 – ఆగస్టు 141994తెలుగు సినిమా లలో అనువాద రచనలో ప్రముఖులు.

జననం

వీరు ఆగష్టు 311934 సంవత్సరం విజయనగరంలో జన్మించారు. వీరి తల్లిదండ్రులు ఇందుకూరి అప్పలరాజు, నారాయణమ్మ.

వీరు విజయనగరం మహారాజా కళాశాల నుంచి బి.ఎస్సీ. పట్టా పొందారు. వీరు తొలినుంచి నాటక సాహిత్యాభిలాషి. వీరి ‘వదిన’, ‘ఆంధ్రశ్రీ’ నాటకాలు రాఘవ స్మారక కళాపరిషత్తులో ఉత్తమ రచనలుగా ఎన్నుకోబడ్డాయి. విశాఖ జిల్లా బోర్డు కార్యాలయంలో స్టెనో టైపిస్టుగా కొంతకాలం పనిచేశారు.

చలనచిత్ర రంగానికి తరలి వెళ్ళి పినిశెట్టి శ్రీరామమూర్తిమానాపురం అప్పారావు వద్ద సహాయ దర్శకునిగా చేరారు. తరువాత తమిళ చిత్రసీమ వీరిని కథకునిగా పరిచయం చేసింది.

 సినీ రచయిత

రాజుశ్రీగా ప్రసిద్ధులైన ఇందుకూరి రామకృష్ణంరాజు ప్రముఖ సినీ రచయిత. 1934 ఆగష్టు 31 న విజయనగరంలో అప్పలరాజు, నారాయణమ్మలకు జన్మించాడు. ఈయన ఎక్కువగా అనువాద చిత్రాలకు మాటలు, పాటలు రాశాడు. బి.యస్సీ ఫిజిక్సు పూర్తి చేసి ఆ తర్వాత రెండు మూడేళ్ళు విజయనగరం తహసిల్దారు వద్ద పి.ఏ.గా చేసి, అక్కడ నచ్చక మద్రాసు వెళ్ళిపోయారు. అక్కడ ఎం.జి.ఆర్.ని కలిసి ఆయన కోసం రాసిన ఒక కథను వినిపించారు. అది ఎం.జి.ఆర్. గారికి నచ్చడంతో “తేడివంద మాప్పిళ్ళై”పేరుతో సినిమా తీశారు. అది విజయవంతం అయ్యింది. ఆ తర్వాత దాదాపు 10 వరకు తమిళ చిత్రాలకి కథ, స్క్రీన్ ప్లే అందించారు. సుమారు 1000 చిత్రాలకు రచన చేశారు. అంతే కాకుండా ఎం‌కన్న బాబుమామా కోడలుపెళ్ళిచేసి చూపిస్తాం , “పుదియ సంగమం” అనే తమిళ చిత్రానికి సంగీత దర్శకత్వం వహించారు. చదువు సంస్కారంనిజం నిద్రపోదు (1976), ఓ ప్రేమ కథ (1987) చిత్రాలకు దర్శకత్వం వహించారు. మణిరత్నం తెలుగులో నేరుగా దర్శకత్వం వహించిన ఒకే ఒక చిత్రం గీతాంజలికి మాటలు రాశారు. మట్టిలో మాణిక్యంబంగారు గాజులు చిత్రాలకు బంగారు నంది బహుమతులు అందుకున్నారు. రాజశ్రీ రచించిన చివరి చిత్రం ప్రేమికుడు1994 ఆగస్టు 14 న నిదురలోనే మరణించాడు.

అతని కుమారుడు రాజశ్రీ సుధాకర్ ఏవిఎమ్ వారి విక్రమ్ నటించిన జెమిని, సూర్య నటించిన వీడొక్కడే, లక్ష్మి గణపతి ఫిలిమ్స్ వారి అర్జున్ నటించిన సింగమలై వంటి కొన్ని తమిళ అనువాద చిత్రాలకు, మరి కొన్ని ఆంగ్ల అనువాద చిత్రాలకు మాటలూ,హృతిక్ రోషన్ నటించిన క్రిష్ , జోధా అక్బర్,ధూమ్-2, అబ్బాస్ మస్తాన్ దర్శకత్వంలో రేస్, వంటి ఎన్నో హిందీ అనువాద చిత్రాలకు మాటలు-పాటలు రాశాడు.

రాజశ్రీ 1934 ఆగస్టు 31న విజయనగరంలో జన్మించారు. మహారాజా కళాశాల నుండి బి.ఎస్సీ, పట్టా పుచ్చుకున్నారు. చదువుకొనే రోజుల నుంచీ శ్రీశ్రీ అంటే ఆయనకు ఎంతో అభిమానం. దాంతో కవితలు, పద్యాలు రాసేసి చుట్టూ ఉన్న వారిని అలరించేవారు. నాటికలు, నాటకాలు రాసి వాటికి దర్శకత్వం వహించి ఆకట్టుకొనేవారు. విజయనగరం తాసిల్దార్ కార్యాలయంలో కొంతకాలం టైపిస్ట్ గా పనిచేశారు. తమిళ సూపర్ స్టార్ ఎమ్‌జీఆర్ కోసం ఓ కథ రాసుకొని, మదరాసు వెళ్ళి దానిని వినిపించారు. ఆ కథ ఎమ్జీఆర్ కు బాగా నచ్చింది. అదే కథతో ఎమ్జీఆర్ ‘తేడీవంద మాప్పిళ్ళై’ సినిమా రూపొందింది. ఆ తరువాత ప్రముఖ తెలుగు రచయితలు పినిశెట్టి శ్రీరామమూర్తి, మానాపురం అప్పారావు దర్శకత్వం వహించిన చిత్రాలకు అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేశారు. తెలుగువారి తొలి అనువాద చిత్రం ‘ఆహుతి’కి శ్రీశ్రీ రచన అలరించింది. అప్పటి నుంచీ శ్రీశ్రీ ఓవైపు తన బాణీ పలికిస్తూనే, మరోవైపు డబ్బింగ్ రైటర్ గానూ మురిపించారు. శ్రీశ్రీ అభిమాని అయిన రామకృష్ణంరాజు చిత్రసీమలో తన పేరును రాజశ్రీగా మార్చుకున్నారు. కన్నాంబ, కడారు నాగభూషణం దంపతులు నిర్మించిన “ఆడపెత్తనం” చిత్రానికి శ్రీరామ్మూర్తి వద్ద పనిచేసిన రాజశ్రీ, తరువాత “అన్న-తమ్ముడు, పరువు-ప్రతిష్ఠ, శాంత, నిత్యకళ్యాణం పచ్చతోరణం, శ్రీకృష్ణమాయ” వంటి సినిమాలకు రచనలో పాలు పంచుకున్నారు. అదే సమయంలో పది తమిళ చిత్రాలకు కథ స్క్రీన్ ప్లే రాశారు. తెలుగులో చలం, దాసరి నారాయణరావు వంటివారు రాజశ్రీని పాటల రచయితగా బాగా ప్రోత్సహించారు. చలం నిర్మించిన “సంబరాల రాంబాబు, బుల్లెమ్మా-బుల్లోడు, దేవుడమ్మ, తులాభారం, రాముడే దేవుడు, ఊరికి ఉపకారి” వంటి చిత్రాలకు పాటలతో అలరించారు.

చలం పరభాషల్లో విజయవంతమైన చిత్రాలను తెలుగులో రీమేక్ చేసే సమయంలో రాజశ్రీతోనే రచన చేయించేవారు. అలా పలు భాషల చిత్రాలు చూస్తూ పట్టు సంపాదించారు. కొన్ని చిత్రాలను మన తెలుగు నిర్మాతలు డబ్బింగ్ చేసేవారు. దాంతో తెలుగు మాటలు, పాటలు రాజశ్రీ పలికించేవారు. అలా అనువాద చిత్రాలకు మాటలు, పాటలు అందించడంలో రాజశ్రీ బిజీ అయిపోయారు. దాదాపు వెయ్యిపైగా చిత్రాలకు రాజశ్రీ అనువాద రచన చేశారు. వాటితో పాటు అనేక తెలుగు చిత్రాలకు కథలు అందించారు, పాటలు రాశారు. మణిరత్నం, శంకర్ వంటి టాప్ డైరెక్టర్స్ తమ తెలుగు అనువాద చిత్రాలకు రాజశ్రీతోనే పాటలు మాటలు రాయించుకొనేవారు. మణిరత్నం తెరకెక్కించిన ఏకైక తెలుగు చిత్రం ‘గీతాంజలి’ చిత్రానికి ఆయనే రచన చేశారు. శంకర్ రూపొందించిన ‘ప్రేమికుడు’ చిత్రానికి రచన చేశాక, నిద్రలోనే రాజశ్రీ కన్నుమూశారు.

రాజశ్రీ నేడు మనమధ్య లేకపోయినా, ఆయన రాసిన అనేక పాటలు ఈ నాటికీ అలరిస్తూనే ఉన్నాయి. ‘మా దైవం’లోని “ఒకే కులం ఒకే మతం అందరు ఒకటే…” అనే పాట ఇప్పటికీ కులమతభేదాలకు అతీతంగా చర్చలు సాగే సమయంలో వినియోగిస్తూనే ఉన్నారు. “కురిసింది వానా… నా గుండెలోన…”, “యమునా తీరానా రాధ ఒడిలోన…”, “సింహాచలము మహాపుణ్యక్షేత్రము…”, “మళ్ళీ మళ్ళీ పాడాలి ఈ పాట…”, “నన్ను ఎవరో తాకిరి… “, “రాధకు నీవేరా ప్రాణం…”, “ఇదే నా మొదటి ప్రేమలేఖ…”, “ఇది పాట కానే కాదు…” వంటి పాటలు రాజశ్రీలోని కవిహృదయాన్ని మనముందు నిలుపుతూనే ఉంటాయి. పాటలు, మాటలు పలికించడంలోనే కాదు సంగీతం సమకూర్చడంలోనూ రాజశ్రీకి పట్టుంది. అది తెలిసిన కొందరు ఆయనతో స్వరకల్పన కూడా చేయించారు. “వెంకన్నబాబు, మామాకోడలు, పెళ్ళిచేసిచూపిస్తాం” వంటి చిత్రాలకు రాజశ్రీ సంగీతం అందించారు. ఇక “చదువు-సంస్కారం, నిజం నిద్రపోదు, ఓ ప్రేమ కథ” వంటి చిత్రాలకూ దర్శకత్వం వహించారు. రాజశ్రీ పేరు 

గుర్తుకు రాగానే ఈ నాటికీ ఆయన బహుముఖ ప్రజ్ఞను గుర్తు చేసుకొనేవారెందరో ఉన్నారు.

మహారాజ “రాజశ్రీ” – అంటూ భువనచంద్ర  చెప్పిన విషయాలు  

  చిత్ర పరిశ్రమ మహా విచిత్రమైనది. ఇక్కడ ఎవరూ ఎవరికీ చూసి నేర్చుకోవాల్సిందే. ‘సిలబస్సు” |… వుండదు…! పుస్తకాలూ వుండవు! సీనియర్స్‌ నడిచిన బాటలోనే జూనియర్స్‌ నడుస్తూ ‘అనుభవాల పాఠాలు” నేర్చుకోవాలి. “దేన్నీ నేర్పరు.

నేనీ ఇండస్ట్రీకి వచ్చిన కొత్తల్లో ఒక ‘వాన’ పాట రాసే ఛాన్సొచ్చింది! అదీ మెగాస్టార్‌ చిరంజీవికి! చిత్రం పేరు ‘గ్యాంగ్‌లీడర్‌’, సంగీతం బప్పీలహరి. ‘వానపాట’ అనుకోగానే నా మనసులో రెండు పాటలు మెదిలాయి. ఒకటి ఆత్రేయ గారి ‘చిటపట చినుకులు పడుతూ వుంటే” పాట…. రెండోది రాజశ్రీ గారి ‘కురిసింది వానా నాగుండెలోనా’ పాటా! ఆ రెంటినీ మనసులో నెమరు వేసుకున్న పది నిముషాల్లో “వానావానా వెల్లువాయే… కొండకోనా  తుళ్ళీపోయే” పాట వుట్టింది. 

తెలుగుపాట ఎన్నియుగాలు నిలిచి వుంటుందో అన్నియుగాలు పైన చెప్పిన రెండు పాటలూ “’వానపాట’కి పాఠ్య(గ్రంథాలుగా నిలిచిపోతాయి. పాటకి అంత “బలాన్ని” ఇచ్చే “కలం” రాజశ్రీ గారిది. సున్నితమైన పదాలు వాడుతూ…. ఆ పదాలకి ఒక లయ. ఒక వయ్యారం. కాన్త చిలిపిదనం. మరికాన్త జాణతనం అద్దటం రాజశ్రీగారికే చెల్లింది. పచ్చని చేలల్లో నడిచే పల్లె పడుచు లాంటిది రాజశ్రీపాట! చిరుగాలికి ఊగే చివురాకులాంటిది రాజశ్రీ మాట!! 1934 ఆగస్టు 31న పుట్టిన ఇందుకూరి రామకృష్ణంరాజుగారు బి.ఎస్‌.సి. ఫిజిక్స్‌ చేసి, ఆ తరువాత రెండు మూడేళ్ళు విజయనగరం తహసిల్దారు గారి వద్ద పి.ఎ.గా చేసి ఆ “సెక్రటరీత్వం’ నచ్చక మద్రాసు మెయిలెక్కి చెన్న పట్టణం చేరారు. ఆ రోజుల్లో ఎం.జి.ఆర్‌.తో మాట్టాడాలంటేనే దడ. మహామహులు కూడా చేతులు కట్టుకు నిలబడాల్సిందే. అట్టాంటిది మన “రాజశ్రీ” గారు డైరెక్టుగా ఎం.జి.ఆర్‌ని కలిసి ‘సార్‌… మీ కోసం నా దగ్గర ఒక కథ వుంది. వింటారా” అని అడగటం దుస్సాహసమే. ఆయన ‘రాజు’ గారి  ముచ్చటపడి … “చెప్ప’ మన్నారు. ‘విన్న’ 15 రోజులకే షూటింగ్‌ ప్రారంభమైంది. ఆ సినిమా పేరు “తేడివంద మాప్పిళ్ళ”. ఎం.జి.ఆర్‌ డబుల్‌ రోల్‌ పోషించిన సినిమా అది. అది విజయవంతం కాగానే ‘రాజశ్రీ’ గారి స్టోరీ తోనే మరో ఎం.జి.ఆర్‌. సినిమా “నినైల్‌ నిండ్రగళ్‌’ (“జ్ఞాపకాల్లో నిలిచిన దానా” అని అర్థం) మొదలైంది. కానీ మధ్యలో ఆగింది. ఆ రెండో సినిమా డైరెక్టర్‌ శ్రీ కె.బాలచందర్‌. సినిమా ఆగినా, కె.బాలచందర్‌ రాజశ్రీగార్ల పరిచయం మాత్రం అంతటితో ఆగలా. ఆల్‌మోస్ట్‌ చివరి వరకు కొనసాగుతూనే వచ్చింది. ఆ రెండు గాక ‘కాదల్‌ పరవై, ‘పాయ్‌సాల్లాదే’ ‘ఎన్‌తంగై’ ఆదిగా అనేక తమిళ చిత్రాలకి తెలుగు “రాజశ్రీ” గారు 

కథా స్కీన్‌ ప్లే అందించటం మనకి గర్వకారణం. 50 నుంచి 60 చిత్రాల వరకు ‘కథా – స్కీన్‌ ప్లే అందించారు. కళాకారులకు లలిత కళలకు నిలయమైన “విజయనగరం’లో శ్రీ, ఇందుకూరి గురవరాజు నారాయణమ్మ గారలకు పుట్టిన రాజశ్రీ గారు సుమారు 1000 డబ్బింగ్‌ చిత్రాలకు మాటలు పాటలు వ్రాశారు. ‘్టైయిట్‌ చిత్రాలు కనీసం 200 వుంటాయి. “ఎంకన్నబాబు’… “మామా కోడలు, “పెళ్ళిచేసి చూపిస్తాం…” వంటి తెలుగు సినిమాలకే గాక ‘పుదియ సంగమం (ప్రభు – సుహాసిని) అనే తమిళ చిత్రానికి కూడా నంగీత దర్శకత్వం వహించారు. పుట్టిన సంవత్సరం లోపే తండ్రిని పోగొట్టుకున్న రాజశ్ర్రీగారు… తండ్రిగా తన సంతానానికి ఏ లోటూ రాకుండా పెంచారు. వారి తనయుడు, ప్రస్తుతం ఇంగ్లీష్‌ నుంచి తెలుగు ‘డబ్బింగ్స్‌’లో యమా బిజీగా వున్న రాజశ్రీ సుధాకర్‌ మాటల్లో చెప్పాలంటే  “నాన్నగారు కోపంగా వుండటం ఏనాడూ వేము చూడలేదు. వర్క్‌ అయిపోగానే సాయంకాలం ఇంటికొచ్చేటప్పుడు మా కోసం మాకిషస్టమైన వస్తువులూ తినుబండారాలు తెచ్చేవారు. అంతే కాదు… చాలామంది నాన్నగారి దగ్గరికి సహాయం” చెయ్యమంటూ వచ్చేవాళ్లు, జేబులో ఎంత వుంటే ‘అంతా’ ఇచ్చేవారాయన వాళ్ళకి. ఎవరు అడిగినా ‘లేదు’ అని చెప్పడం ఆయనకి అలవాటు లేదు. హి వజ్‌ ఎ వెరీగుడ్‌ ఫాదర్‌. వెరీగుడ్‌ హ్యూమన్‌ బీయింగ్‌”. రాజశ్రీ గారితో ఎన్నో చిత్రాల అనుబంధం వున్న శ్రీరామకృష్ణగారు (డైరెక్టర్‌ మరియు డైలాగ్‌ రైటర్‌ “రాజశ్రీ గారు డబ్బింగ్‌లో ఒక కొత్త వరవడిని సృష్టించారు. మనిషిగానూ రైటర్‌గాను ఆయన మహోన్నతుడు. మృదున్వభావి. స్నేహశీలి… గొప్ప మనిషి” అంటారు. 

మనిషి “’మంచితనం’ “చావు’లో ‘తెలుస్తుందంటారు పెద్దలు. ఎప్పుడూ వైట్‌  మరియు వైట్‌లో కనిపించే రాజశ్రీ, గారిది సునాయాస మరణం. “ప్రేమికుడు” పూర్తి చేసి మధ్యాహ్నం ఇంటికొచ్చి మరుసటి రోజు మొదలు పెట్టాల్సిన “డ్యూయెట్‌ సినిమా పాటలు ట్రాన్స్‌లేట్‌ చెయ్యమని సుధాకర్‌కి చెప్పి భోజనం చేసి కాసేపు కునుకుతీద్దామని పడుకున్న రాజశ్రీ, గారు ‘నిద్రలోనే’ ‘సిద్ధి’ పొందారు. అంతకన్నా “మనిషి నిర్మలత్వానికి’ బుజువేముంటుంది? 

రాజశ్రీగారి మొదటి డబ్బింగ్‌ సినిమా ‘మూఢ నమ్మకాలు”. చివరి సినిమా ‘ప్రేమికుడు’. సూపర్‌ హిట్‌ ఫిలిమ్‌… బులైమ్మబుల్లోడు, మట్టిలో మాణిక్యం, దూడూ బసవన్న తోటరాముడు మొదలగునవి. సూపర్‌హిట్‌సాంగ్స్‌… “కురిసింది వానా నాగుండెలోన’, ‘ఓ బంగరు వన్నెల చిలకా, ‘ఇడ్లీపాపా…. ఇడ్లీ పాపా”నీపాపంపండేను నేడు’ ‘అమ్మ అన్నది ఒక కమ్మని మాట’ మొదలగునవి… ఇక సూపర్‌హిట్‌ డబ్బింగ్‌ పాటలకి లెక్కేలేదు. ఎ.ఎం.రత్నంగారు రాజశ్రీ గార్ల కాంబినేషనంటే సూపర్‌ హిట్టే! . దర్శకత్వం వహించిన చిత్రాలు ‘చదువు సంస్కారం’,. రాజశ్రీగారి చిత్రాలు – మట్టిలో మాణిక్యం – బంగారు. గాజులు.” / ఇవిగాక ఎన్నో, సన్మానాలు, కళాసాగర్‌ ఎవార్డులు వారిని వరించాయి. వారు సంగీత దర్శకత్వం వహించిన “ఎంకన్న బాబు, “మామా కోడలు’ చిత్రాల్లో పాట వ్రాసే అవకాశం రావడం నా అదృష్టం. “హి ఈజ్‌. ఆల్వేస్‌ దేర్‌ అప్‌ ఎబౌవ్‌ ది స్కై. స్మయిలింగ్‌ లైక్‌ ఎ ఫ్లవర్‌ అన్న జేమ్స్‌, ఐర్ధాండ్‌ కవిత రాజశ్రీ గార్ని తల్చుకున్నప్పుడల్లా నాకు గుర్తు వస్తూనే వుంటుంది. 

   400కు పైగా డ‌బ్బింగ్ సినిమాల‌కు ఆయ‌న ర‌చ‌న చేశారు. ఆయ‌న ఎక్కువ‌గా త‌మిళం, క‌న్న‌డం నుంచి తెలుగులోకి డ‌బ్ చేసిన చిత్రాల‌కు డైలాగ్స్, సాంగ్స్‌ రాశారు. సాధార‌ణంగా స్ట్రయిట్ సినిమాల ర‌చ‌న‌తో పోల్చుకుంటే, డ‌బ్బింగ్ సినిమాల‌కు ర‌చ‌న చేయ‌డం ఈజీ అనే అభిప్రాయం చాలా మందికి ఉంటుంది. కానీ డ‌బ్బింగ్ సినిమాకు డైలాగ్స్ రాయ‌డం ఎంత క్లిష్ట‌మైన ప‌నో ఒక‌సారి రాజ‌శ్రీ చెప్పారు.

ముక్తా ఫిలిమ్స్ వారి ‘వెళ్లితిరై’ ఆధారంగా వ‌చ్చిన ‘మూఢ‌న‌మ్మ‌కాలు’ ఆయ‌న తొలి చిత్రం. “డ‌బ్బింగ్ ర‌చ‌యిత‌ల‌కు కొన్ని ఇబ్బందులు ఎదుర‌వుతుంటాయి. ఒక ర‌కంగా చెప్పాలంటే త‌ల‌నెప్పి ర‌చ‌న ఇది. ఎందుకంటే తెర‌మీద న‌టీన‌టుల పెద‌వుల క‌ద‌లిక‌కు త‌గ్గ‌ట్టు ఒరిజిన‌ల్ డైలాగ్‌కు న్యాయం చేస్తూ తెలుగులో సంభాష‌ణ‌లు రాయాలి. సంభాష‌ణ‌ల భావం చెప్ప‌గ‌లం. పెదాల క‌ద‌లిక‌కు స‌రిపోయేలా ఎలోగో చేయ‌గ‌లం. కానీ అదే పాట అయిన‌ప్పుడు చాలా క‌ష్టం.” అంటూ ఆయ‌న ఓ ఉదాహ‌ర‌ణ చెప్పుకొచ్చారు.

ఒక త‌మిళ చిత్రం తెలుగులోకి డ‌బ్ చేస్తున్నాం. అందులో హీరోయిన్ జ‌య‌ల‌లిత‌. హీరోకి పొడుపు క‌థ‌ల్ని వేస్తూ పాట పాడుతుంది. హీరో ఆ పొడుపు విప్పాలి. అక్కాళె వొరువ‌న్‌అప్పావై ఒరితియుమ్‘. హీరో విడ‌గొట్టి చెపుతాడు. అ కాళై ఒరువ‌న్‌అ పావై ఒరువ‌న్‘ అని. హీరోయిన్ క‌లిపి చెప్పిన మాట‌ని విడ‌గొట్ట‌డంతో అర్థం మారింది. కాళై అంటే మ‌గ‌. పావై అంటే ఆడ‌. ఈ చ‌ర‌ణాల‌ప్పుడు తెర‌మీద క్లోజ్ షాట్‌లో వీళ్లుంటారు. క‌చ్చితంగా పెదాల క‌ద‌లిక‌కు త‌గ్గ‌ట్టు పాట రాయాలి. ఎలాఎంత ఆలోచించినా ఏం తోచ‌లేదు. నాకు అది మొద‌టి చిత్రం. అప్ప‌టికే ఎంతో అనుభ‌వంపేరుగ‌ల ర‌చ‌యిత అనిశెట్టిగారిని ఆ పాదం వ‌ర‌కు రాసిపెట్ట‌మ‌ని అడిగాను. ఆయ‌న చాలాసేపు ఆలోచించి పెద‌వి విరిచి వెళ్లిపోయారు. త‌మిళానికి స‌రైన అర్థం అక్క‌య్య మొన‌గాడుఅమ్మ‌కు జ‌త‌గాడు‘ అని. దాన్ని నేను ఇలా రాశాను – అక్క‌కు అయ్య మొన‌గాడుఅమ్మ‌కు జ‌త‌గాడు‘ అని.”

చిత్రసమాహారం

కొన్ని ముఖ్యమైన చిత్రాలు

·         శ్రీ సింహాచల క్షేత్ర మహిమ (1965)

·         పెళ్ళి పందిరి (1966)

·         పెళ్ళి రోజు (1968) (గీతరచన)

·         బంగారు గాజులు (1968) (కథా రచన)

·         సత్తెకాలపు సత్తెయ్య (1969)

·         సంబరాల రాంబాబు (1970)

·         మట్టిలో మాణిక్యం (1971)

·         బుల్లెమ్మ బుల్లోడు (1971) (గీతరచన)

·         దేవుడమ్మ (1973)

·         తులాభారం (1974)

·         చదువు సంస్కారం (1975) (కథ, మాటలు, పాటలు, చిత్రానువాదం, దర్శకత్వం)

·         అర్జున గర్వభంగం (1979) (మాటలు, పాటలు) (అనువాదం – కన్నడ)

·         స్వయంవరం (1982)

·         ఖైదీ (1983)

·         డార్లింగ్ Darling డార్లింగ్ (1983)

·         ప్రేమసాగరం (1983) (అనువాదం – తమిళం)

·         మౌన రాగం (1986) (అనువాదం – తమిళం)

·         నాయకుడు (1987) (అనువాదం – తమిళం)

·         విచిత్ర సోదరులు (1989) (అనువాదం – తమిళం)

·         ప్రేమ పావురాలు (1989) (అనువాదం – హిందీ)

·         గీతాంజలి (1989)

·         చిలిపి సంసారం (1990) (అనువాదం – తమిళం)

·         దళపతి (1992) (అనువాదం – తమిళం)

·         జంటిల్ మేన్ (1993) (అనువాదం – తమిళం)

·         ప్రేమికుడు (1994) (అనువాదం – తమిళం)

·         మైఖేల్ మదన కామరాజు (అనువాదం – తమిళం)

·         ఘర్షణ (పాతది) (అనువాదం – తమిళం)

·         వైశాలి ( అనువాదం- మళయాళం)

·         ఆడదాని అదృష్టం (మాటలు)

·         పరువు ప్రతిష్ట

·         కన్నవారి కలలు

·         బంగారు గాజులు

కొన్ని ఆణిముత్యాలు

·         కురిసింది వాన నా గుండెలోన… – బుల్లెమ్మ బుల్లోడు

·         యమునాతీరాన రాధ మదిలోన… – గౌరవం-అనువాదం

·         సింహాచలము మహా పుణ్య క్షేత్రము… – సింహాచల క్షేత్రమహిమ

·         మళ్ళీ మళ్ళీ పాడాలి ఈ పాట… – మట్టిలో మాణిక్యం

·         నన్ను ఎవరో తాకిరికన్ను ఎవరో కలిపిరి… సత్తెకాలపు సత్తెయ్య

·         మామా చందమామ విన రావా… సంబరాల రాంబాబు

·         ఎక్కడో దూరాన కూర్చున్నావు… దేవుడమ్మ

·         నిన్ను తలచి మైమరచా… – విచిత్ర సోదరులు

·         మధువొలకబొసే ఈ ఛిలిపి కళ్ళు– కన్నవారి కలలు

·         రాధకు నీవేర ప్రాణం – తులాభారం

·         నీ నీడగా నన్ను కదలాడనీ

·         ఇదే నా మొదటి ప్రేమ లేఖ –స్వప్న

·         ఒకే కులం ఒకే మతం అందరు ఒకటే –మాదైవం

·         ఇది పాట కానే కాదుతలంబ్రాలు

  సశేషం

రేపు మహాశివరాత్రి శుభా కాంక్షలతో

మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -28-2-22-ఉయ్యూరు

Posted in సినిమా | Tagged | Leave a comment

మన మరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు-100 · 100-సంగీత నాటక అకాడెమి ఫెలోషిప్ పొందిన ,సుబ్బిశెట్టి ,భవానీ శంకర ,నక్షత్రక ఫేం ,రెండుసార్లు గజాహోరణ పొందిన –పులిపాటి వెంకటేశ్వర్లు

పులిపాటి వెంకటేశ్వర్లు తెలుగు రంగస్థల నటుడు, తొలితరం చలనచిత్ర నటుడు, ఆంధ్రనాటక కళాపరిషత్తు, ఆంధ్రప్రదేశ్ సంగీత నాటక అకాడమీ సభ్యులు

జననం
ఈయన గుంటూరు జిల్లా, తెనాలిలో 1890, సెప్టెంబర్ 15 న జన్మించారు.

రంగస్థల ప్రవేశం
పులిపాటి వెంకటేశ్వర్లు పాడగా రికార్డులుగా విడుదలైన సుబ్బిశెట్టి పద్యాలు

పాఠశాలలో చదువుతున్నప్పుడే 11వ ఏట రంగస్థలం పై ప్రవేశించారు. పద్య నాటకం పట్ల అభిమానం ఏర్పరుచున్న పులిపాటి తెనాలి రామ విలాస సభలో సభ్యుడిగా చేరారు. స్థానం నరసింహారావు, బందా కనకలింగేశ్వర రావు, బళ్ళారి రాఘవ, ఉప్పాల వెంకటరత్తయ్య వంటి మహామహుల సరసన మద్రాసు, మైసూరు, మహారాష్ట్ర, బెంగాల్ వంటి ప్రాంతాల్లో ప్రదర్శనలనిచ్చారు.

నటులు రాగానికి ప్రాధాన్యతనిస్తూ ప్రదర్శనలు జరుగుతున్న నాటకాలలో అర్జునుడు, నక్షత్రకుడు, భవానీ శంకరుడు, సుబుద్ధి, చెకుముకి శాస్త్రి, వెంగళరాయడు, భరతుడు, నారదుడు పాత్రలను పోషించడమే కాక, 1932లో సినిమా రంగంలో ప్రవేశించి చింతామణిలో భవానీ శంకరుడు, హరిశ్చంద్రలో నక్షత్రకుడు, సారంగధరలో సుబుద్ధి, పాశుపతాస్త్రంలో నారదుడుగా నటించారు. మోహినీ రుక్మాంగద, సతీ తులసి, చంద్రహాస, తల్లిప్రేమ, విష్ణుమాయ చిత్రాల్లో వివిధ పాత్రలు పోషించారు. ఈయన మొత్తం పన్నెండు సినిమాలలో నటించాడు.

పులిపాటి వెంకటేశ్వర్లుకు రెండుసార్లు గజారోహణ సన్మానం జరిగింది. 1960లో సంగీత నాటక అకాడమీ ఫెలోషిప్ లభించింది.

1972 లో పులిపాటి మరణించారు .

సశేషం

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -28-2-22-ఉయ్యూరు

· మనవి –సరదాగా మొదలుపెట్టిన ‘’ మన మరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు’’ ఇవాల్టితో 100 మంది మహానుభావుల గురించి రాయగలిగాను .చదివి ఎందరో ఆనందిస్తూ అభినందిస్తున్నారు .దొరికిన విశేషాలన్నీ పొందు పరిచి సుసంపన్నం చేసే ప్రయత్నం చేస్తున్నాను .ఇంకా ఎందఱో మహాను భావులున్నారు .వారిని గురించి కూడా రాస్తాను .

· రేపు మహాశివరాత్రి శుభా కాంక్షలతో

· మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -28-2-22-ఉయ్యూరు
·

Posted in సినిమా | Tagged | Leave a comment

· మన మరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు-99

· మన మరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు-99

·

99- నటనా వైదుష్యానికి పరాకాష్ట ,పానుగంటి వారి’’ రాధ ఫేం’’- పారుపల్లి సుబ్బారావు

పారుపల్లి సుబ్బారావు నాటకరంగ, సినిమారంగ కళాకారుడు, సంగీత విద్యాంసుడు. స్త్రీ పాత్రలకు పేరొందిన వాడు.[1]

జీవిత విషయాలు
సుబ్బారావు 1897లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కృష్ణా జిల్లా, ఘంటసాల మండలంలోని శ్రీకాకుళం గ్రామంలో జన్మించాడు.

నట ప్రస్థానం
1908లో మొట్టమొదట బందరు బాలభారతి సంఘం రసపుత్ర విజయం నాటకంలో విమల పాత్రలో నటించాడు. తమ అన్న పారుపల్లి రామకృష్ణయ్య పంతులు (డా. మంగళంపల్లి బాలమురళీ కృష్ణ గురువు) దగ్గర సంగీతాన్ని నేర్చుకొని, మైలవరం కంపెనీలో అప్పటి సంగీత దర్శకుడు పాపట్ల కాంతయ్య (పరబ్రహ్మ పరమేశ్వర -ప్రార్థనా గీతానికి సంగీతాన్ని సమకూర్చిన) వద్ద మరాఠీ, పార్సీ సంప్రదాయ రీతుల్ని అభ్యసించాడు. ఆ తరువాత మద్రాస్ సుగుణ విలాస సభలోలోనూ, విజయవాడ మైలవరం కంపెనీలోనూ, ఏలూరు మోతే వారి కంపెనీలోనూ నటించి ఎంతో పేరు సంపాదించాడు. స్ఫురద్రూపం, చక్కని గాత్ర మాధుర్యంతో సాత్వికాభినయంలో మేటిగా, స్త్రీ పాత్రధారణకు పేరొందిన సుబ్బారావు పానుగంటి లక్ష్మీనరసింహారావు రచించిన రాధాకృష్ణలో రాధ వేషాన్ని చక్కగా ధరంచేవాడు

నటించిన పాత్రలు
· విమల (రసపుత్ర విజయం)

· రాముడు (లవకుశ)

· సావిత్రి

· లీలావతి

· రాధ

· సుకన్య

· కైక

· చంద్రమతి

· రుక్మిణి

· రత్నాంగి

· కమలాంబ

· దుర్యోధనుడు

· రామదాసు

సీతారామ జననం

సినిమాలు
1934లో ఈస్టిండియా కంపెనీ సి.పుల్లయ్య దర్శకత్వంలో తీసిన ‘లవకుశ’ చిత్రంలో శ్రీరాముని పాత్రలో నటించాడు.

· 1936: సతీ సులోచన (1936 సినిమా)

· ద్రౌపది మాన సంరక్షణము (ధర్మరాజు)[2]

· 1944: సీతారామ జననం (జనకుడు)[3]

· నట ప్రస్థానం

· 1908లో మొట్టమొదట బందరు బాలభారతి సంఘం రసపుత్ర విజయం నాటకంలో విమల పాత్రలో నటించాడు. స్ఫురద్రూపం, చక్కని గాత్ర మాధుర్యం కలిగిన వ్యక్తి. తమ అన్న పారుపల్లి రామకృష్ణయ్య పంతులు (డా. మంగళంపల్లి బాలమురళీ కృష్ణ గురువు) సంగీతాన్ని నేర్చుకొని, మైలవరం కంపెనీలో నాటి ప్రసిద్ధ సంగీత దర్శకుడు (పరబ్రహ్మ పరమేశ్వర -ప్రార్థనా గీతానికి సంగీతాన్ని సమకూర్చిన వారు) పాపట్ల కాంతయ్య వద్ద మరాఠీ, పార్సీ సంప్రదాయ రీతుల్ని అభ్యసించాడు. ఆ తరువాత మద్రాస్ సుగుణ విలాస సభలోలోను, విజయవాడ మైలవరం కంపెనీలోనూ, ఏలూరు మోతే వారి కంపెనీలోనూ నటించి ఎంతో ఖ్యాతి గడించాడు. సాత్వికాభినయంలో మేటి. స్త్రీ పాత్రధారణకు ప్రసిద్ధి. పానుగంటి లక్ష్మీనరసింహారావు రచించిన రాధాకృష్ణలో రాధ వేషం ఈయన నటనా వైదుష్యానికి పరాకాష్ఠ.

· సశేషం

· మీ- గబ్బిట దుర్గాప్రసాద్ -28-2-22-ఉయ్యూరు

Posted in సినిమా | Tagged | Leave a comment

మన మరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు-98

  మన మరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు-98

· 98-భారత లక్ష్మీ ఫిలిమ్స్ అధినేత ,చలన చిత్ర తొలికృష్ణ,స్త్రీ వేషధారి ,మధురగాయకుడు –తుంగల చలపతి రావు

· కృష్ణా జిల్లా శ్రీకాకుళం లో తుంగల చలపతి రావు జన్మించారు . తుంగల చలపతిరావు, రంగస్థల నటుడు, తొలితరం తెలుగు సినిమా నటుడు. ఈయన, కపిలవాయి రామనాథశాస్త్రి, జొన్నవిత్తుల శేషగిరిరావు, దైతా గోపాలంలతో కలిసి బెజవాడ నాట్యమండలి పేరు మీద నాటకాలు వేసేవారు.[1][2]

కళాప్రస్థానం
1935లో చలపతిరావు, దాసరి కోటిరత్నం, బి.వి.రామానందంలతో కలిసి ‘ భారత లక్ష్మి ఫిలిమ్స్ ‘ పేరుతో చిత్ర నిర్మాణ సంస్థ ప్రారంభించి కలకత్తాలో సతీ సక్కుబాయి అనే చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమాలో కోటిరత్నం సక్కుబాయిగా, చలపతిరావు కృష్ణునిగా నటించారు.[3] తెలుగు చలనచిత్రాలలో మొట్టమొదటి కృష్ణుని వేసిన తొలినటుల్లో చలపతిరావు ఒకడు. నాటకాల్లో దాసరి కోటిరత్నం పురుషపాత్రలు వేస్తే ఆమెకు జంటగా తుంగల చలపతిరావు స్త్రీ పాత్రలు వేసేవారట. ఈయన రంగస్థలంపై మంచి గాయకుడుగా కూడా పేరుతెచ్చుకున్నాడు.

దివిసీమలోని శ్రీకాకుళంలో జన్మించిన తుంగల చలపతిరావు దైతాగోపాలం దర్శకత్వంలో ‘సక్కుబాయి’ పాత్రలో శిక్షణ పొంది ఆ ఒక్క పాత్రలోనే అసామాన్య ఖ్యాతి గడించారు. 1935లో బి.వి.రామానందం ‘సతీ సక్కుబాయి’ని సినిమాగా తీయాలని ఆ నాటక సమాజాన్నంతా కలకత్తా తీసికొని వెళ్ళారు. ఆ చలన చిత్రంలో తుంగల చలపతిరావు కృష్ణుడుగాను, నాటకాల్లో కృష్ణుడు వేషం వేసే డి. కోటిరత్నం సక్కుబాయిగాను నటించారు. 1938లో సి. పుల్లయ్య తీసిన ‘మోహినీ భస్మాసుర’ చలన చిత్రంలో నారదుడుగా నటించారు. అలా చలనచిత్రాలలో నటిస్తూ మరోప్రక్క సక్కుబాయి నాటకాన్ని ఏ.వి.సుబ్బారావు, రేలంగి, కె. శివరావు, దాసరి కోటిరత్నం ప్రభృతులతో కలిసి ప్రదర్శించేవారు. వరవిక్రయం, పాండురంగ విఠల్‌ చిత్రాలలో పనిచేశారు.

మరణం
ఆయన 35 సంవత్సరాలైనా నిండకుండానే 1942, మార్చి 29న గుంటూరుజిల్లా మంగళగిరిలో నటిస్తూ సక్కుబాయి పాత్రలో భక్తి తన్మయంతో పాండురంగనిలో ఐక్యమయ్యే సన్నివేశంలో ఆయన కూడా ఐక్యమైపోయారు.

· సశేషం

· మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -27-2-22-ఉయ్యూరు

Posted in సినిమా | Tagged | Leave a comment

శ్రీ తిన్నెలపూడి వేణుగోపాల శతకం

శ్రీ తిన్నెలపూడి వేణుగోపాల శతకం

వాకాడు  వాస్తవ్యులు  జూటూరు లక్ష్మీ నరసింహయ్య రచించగా కావలిలోని వాయునందన ప్రెస్ లో 1931లో ప్రచురింపబడింది .వెల బేడ.అంటే రెండు అణాలు .విజ్ఞప్తి లో కవి కూడలి గ్రామ సమీపం లో వేదికాపురి అనే పేరున్న తిన్నెలపూడి గ్రామం లో భక్తీ విద్యా వినయ సౌశీల్య సుహృద్భావ గౌరవాదులున్న శ్రీ కోటమ రెడ్డి చెంచు రాఘవరెడ్డి గారు  శ్రీ వేణు గోపాల మందిరం కట్టింఛి స్వామికి సకల విధ పూజలు జరిపిస్తూ  ఆ క్రితం ఏడాది స్వామి కళ్యాణోత్సవానికి ఆహ్వానించగా కవి గారు వెళ్లి ,ఆఉత్సవ వైభవం చూస్తూ ఉండగా మనసులో ‘’వేణుగోపాలుడు కృష్ణమూర్తి మము బాలన సేయు దయా౦తరంగుడై ‘’ అనే మకుటం ఆశువుగా స్ఫురించి వెంటనే రెండు పద్యాలు జాలువారాయి .రెడ్డి గారు విని  ఆ మకుటంతో శతకం రాయమని కోరగా ,స్వామి అనుగ్రహం తో రాసి నాయుడి పేట వాస్తవ్యులు ఉభయ బాషా పాండితీ ధురీణులు,’’శ్రీ సోమశైలం ‘’మొదలగు గ్రంధకర్తలు బ్రహ్మశ్రీ ఉత్పల నరసింహ శాస్త్రి గారు ,ఆయనసోదరులు శ్రీ కృష్ణ శాస్త్రి గారు కొన్ని పద్యాలు సవరించారు .తర్వాత గూడూరు హైస్కూల్ ప్రధాన తెలుగు పండితులు ,ఉభయ భాషా వేద,వేదాంత విదులు ,లక్ష్మీ కటాక్షం మొదలైన గ్రంథకర్తలు ఆమూలాగ్రం సవరించి ముద్రణ కు అనుమతిచ్చారు .శ్రీ పైడిపాటి సుబ్బయ్యగారు కొన్ని సవరణలు చేశారు .రెడ్డిగారు స్వంతఖర్చుతో శతకం ముద్రించి అందించారు అని తెలియ జేశారు .ఉభయ వేదాంత శ్రీ కా౦డూర్ కృష్ణమాచార్యులు అభిప్రాయం తెలియజేస్తూ ‘’భాగవత కథాబోధనంగా శతకం ఉంది .శతకం లకార ప్రాస తో రాయాల్సి వచ్చినందువలన పునరుక్తులున్నా ,శ్రవణానదకం గా ,రసజ్ఞా హృదయ రంజకం గా శతకం ఉంది ‘’అని శ్లాఘించారు .

  కవిగారు శతకాన్నిఉత్పల మాలగా అల్లి, వేణు గోపాలుని  అలంకరించారు .మొదటి పద్యం –

‘’శ్రీ లలనా మనోహరుడు ,సేవక నేత్ర చకోర చంద్రుడా –పాలిత సర్వలోకు డఘుపంక్తి విభేదకుం డాశ్రితాలికిన్

శ్రీల నొసంగువాడు ,శుభ శీలుడు తిన్నెలపూడి వేణు గో –పాలుడు కృష్ణమూర్తి మము బాలన సేయు దయాంత రంగుడై’’అని రాశారు .తర్వాత ఉత్పలలు సువాసనలు వెదజల్లుతూ పరిగెత్తాయి .బాలుడు చిన్నికృష్ణుడు శుభంకరుడంచిత బర్హి బర్హ సంకీలిత మౌళి ‘’అన్నారు కాల గళార్చితుడు,సహితి కంఠ శరాసన భంజనుండు ,శంపాలతికాభ చేలుడు ‘’అనికీర్తించారు .లీలతో జగాలని తిప్పుతూ మాయకు దూరుడై ఉంటాడనీ ,’’శీలి ,సుగంధ పాత్ర తులసీ నవ పత్ర విరాజ మాన సన్మాలి ,కలాప మౌళి అనీ ,మకరిపాదం పట్టి లాగుతుంటే ‘’గోలుకోనంగ లేను నిను గోరితి మురారి ‘’అని వేడుకొన్న ‘’శు౦డాలం’’  ను రక్షించాడు .’’బాలశిఖామణీ దనుజబాధలకోర్వలేకున్నాము ‘’.అని ప్రార్ధించిన దేవతలను కాపాడాడు స్వామి .

 స్వామిముగ్ధమోహన  రూపాన్నివర్ణిస్తూ –

‘’చాల విశాలమౌ నురము ,శాంత శుభాకృతి బద్మ నేత్రముల్ –బాలకరీంద్ర యానము ,శివంబగు భావము ,నీశ్వరత్వమున్

వ్యాళ శయానమున్ గరుడ యానము గల్గి న యట్టి ‘’వాడు వేణుగోపాలుడు .  బాలిక యోగమాయ ను చూసి బాలిశుడైన కంసుడు కాళ్ళూ చేతులు పట్టి ,కళ్ళల్లో నిప్పులు రాలుస్తూ నేలకు లాగితే, పైకెగసే నేర్పు చెప్పిన నేర్పుగాడు .’’బాలుడటంచు ముద్దులిడు భామల బట్టుచు మోవినోక్కి ,కేంగేలులన్ జెక్కులన్నిమిరి  గేలి చేసే చిలిపి కృష్ణయ్య .దూడలు పాలకు ఏడుస్తుంటే ఆవులదగ్గరకు దూడల్ని తోలి ఆడుతూ పాడుతూ వెళ్ళే గోపాలుడు కన్నయ్య .బ్రహ్మ చేసిన తప్పిదానికి ‘’బాలక ,వత్స రూపముల దాల్చి న విశ్వమయుడు ‘’.అత్తమామల్ని పిల్లని వదిలేసి అర్ధరాత్రిలో వేణునాదానికి ఆకర్షితులై రావటం బాగుందా ‘’అనే బోధగురువు స్వామి .మీ మనస్సంతాభక్తితో నిండింది కదా ఇంకా చాలదా అని కొంటె ప్రశ్న వేసినవాడు .’’సాలము నెక్కి తద్వసన జాలము దాచిన దన్ను జూచి యా –బాలికలెల్ల సిగ్గువడి ,వారి తరంగల ను౦ డలేక –దత్సాలము జేర వల్వలనోసంగి మమత్వము బాపు వేణుగోపాలుడు  కేవలతత్వాన్ని బోధించాడు .121వ పద్యం లో తప్పులుంటే క్షమించమని చెప్పి ,122వ పద్యం లో ధర్మకర్త కోటమ రెడ్డి రాఘవరెడ్డి గారిని యశస్సుతో కాపాడమని వేడాడు వేణుగోపాలుని .

  చివరి 124వ పద్యం లో –

‘’మూలము బ్రహ్మమంచు దలపోసెడు జూటురు పద్మనాభ స –చ్ఛీలి కుమార లక్ష్మీ నరసింహ ధరామారు నెల్ల వేళలన్

శ్రీల నొసంగి బ్రోచు, శుభ చిత్తుడు,సద్గుణమూర్తి వేణు గో-పాలుడు కృష్ణమూర్తి మము బాలన సేయు దయాంత రంగుడై’’అని ముగించారు కవి .

   ఇంతకంటే కవి ఏమీ తనగురించి చెప్పుకోలేదు .కవిత్వం ద్రాక్షాపాకం .బాలకృష్ణ లీలా విలాసంగా భాగవత ధర్మాను గుణంగా శతకం రాశారు కవి .కవిపేరు, శతకం పేరు మన వాళ్ళు ఎక్కడా పేర్కొనక పోవటం ఆశ్చర్యమే .గొప్ప భక్తి శతకం ఇది .కవినీ, శతకాన్నీ పరిచయం చేసే భాగ్యం నాకు దక్కింది .  మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -27-2-22-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

మన మరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు-97

మన మరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు-97

· 97-స్వరబ్రహ్మ ,సంగీత దర్శకుడు ,వాగ్గేయకారుడు ,వేములవాడ దేవాలయ ఆస్థానపండితుడు –పాపట్ల కాంతయ్య

· పాపట్ల కాంతయ్య నాటక కవి, హిందుస్తానీ సంగీత వాద్వాంసుడు, వాగ్గేయకారుడు. స్వరసింహ బిరుదాంకితుడైన కాంతయ్య జగ్గయ్యపేటలో 1880లో జన్మించారు. 20వ శతాబ్దపు తొలి దశకాల్లో చందాల కేశవదాసు, బలిజేపల్లి లక్ష్మీకాంతకవి, దైతా గోపాలం వంటి కవులతో పాటు పాపట్ల కాంతయ్య నాటక కవిగా ప్రసిద్ధిచెందాడు. ద్రౌపదీ మానసంరక్షణం (1936) వంటి కొన్ని తొలినాటి సినిమాలకు పాటల సృష్టికల్పన కూడా చేశారు. ఈ పాటలన్నీ గ్రాంధిక భాషా గుబాళింపులతో నిండి, వాటి స్వరగతులు కీర్తనా పద్ధతిలోగానీ మరాఠీ నాటక మెట్లతోగానీ వుండేవి.[1]

· రాజమండ్రి గున్నేశ్వరరావు ఈయనను మొట్టమొదటిసారిగా ఆంధ్రదేశానికి పరిచయం చేశారు. చింతామణి నాటక సమాజాలకు కాంతయ్య పాటలు రాశారు. అనంతరం మైలవరం కంపెనీలో వాగ్గేయకారుడిగా చేరి ప్రహ్లద, శాకుంతల, సావిత్రి మొదలయిన నాటకాలకు పాటలురాసి చాలా పేరు తెచ్చుకున్నారు.

· నేటికీ వృత్తి నాటక సమాజాల వారు పాడే ప్రార్థనా గీతం ’పరబ్రహ్మ పరమేశ్వర‘ ఈయన స్వరపరచినదే. వేములవాడ దేవాలయ ఆస్థాన పండితుడిగా ఆమరణాంతం వ్యవహరించారు.

· సశేషం

· మీ – గబ్బిట దుర్గాప్రసాద్ -27-2-22-ఉయ్యూరు

Posted in సినిమా | Tagged | Leave a comment

మన మరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు-97

• మన మరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు-97
• 97-స్వరబ్రహ్మ ,సంగీత దర్శకుడు ,వాగ్గేయకారుడు ,వేములవాడ దేవాలయ ఆస్థానపండితుడు –పాపట్ల కాంతయ్య
• పాపట్ల కాంతయ్య నాటక కవి, హిందుస్తానీ సంగీత వాద్వాంసుడు, వాగ్గేయకారుడు. స్వరసింహ బిరుదాంకితుడైన కాంతయ్య జగ్గయ్యపేటలో 1880లో జన్మించారు. 20వ శతాబ్దపు తొలి దశకాల్లో చందాల కేశవదాసు, బలిజేపల్లి లక్ష్మీకాంతకవి, దైతా గోపాలం వంటి కవులతో పాటు పాపట్ల కాంతయ్య నాటక కవిగా ప్రసిద్ధిచెందాడు. ద్రౌపదీ మానసంరక్షణం (1936) వంటి కొన్ని తొలినాటి సినిమాలకు పాటల సృష్టికల్పన కూడా చేశారు. ఈ పాటలన్నీ గ్రాంధిక భాషా గుబాళింపులతో నిండి, వాటి స్వరగతులు కీర్తనా పద్ధతిలోగానీ మరాఠీ నాటక మెట్లతోగానీ వుండేవి.[1]
• రాజమండ్రి గున్నేశ్వరరావు ఈయనను మొట్టమొదటిసారిగా ఆంధ్రదేశానికి పరిచయం చేశారు. చింతామణి నాటక సమాజాలకు కాంతయ్య పాటలు రాశారు. అనంతరం మైలవరం కంపెనీలో వాగ్గేయకారుడిగా చేరి ప్రహ్లద, శాకుంతల, సావిత్రి మొదలయిన నాటకాలకు పాటలురాసి చాలా పేరు తెచ్చుకున్నారు.
• నేటికీ వృత్తి నాటక సమాజాల వారు పాడే ప్రార్థనా గీతం ’పరబ్రహ్మ పరమేశ్వర‘ ఈయన స్వరపరచినదే. వేములవాడ దేవాలయ ఆస్థాన పండితుడిగా ఆమరణాంతం వ్యవహరించారు.
• సశేషం
• మీ – గబ్బిట దుర్గాప్రసాద్ -27-2-22-ఉయ్యూరు

Posted in సినిమా | Tagged | Leave a comment

మన మరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు-96


· 96-అక్కినేని ,ఘంటసాల లను తెలుగు సినిమాకు పరిచయం చేసిన వాయువేగ నిర్మాత , దర్శకుడు -ఘంటసాల బలరామయ్య

జీవిత విషయాలు
ఘంటసాల బలరామయ్య 1906, జూలై 5న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, నెల్లూరు జిల్లా, నెల్లూరు మండలంలోని పొట్టెపాలెం గ్రామంలో జన్మించాడు. ఇతని మనుమడు ఎస్.ఎస్. తమన్ సంగీత దర్శకుడిగా రాణిస్తున్నాడు.[2]

సినిమారంగం
నాటకరంగంలో ప్రసిద్ధులైన వీరి సోదరులు రాధాకృష్ణయ్య గారి ప్రోత్సాహంతో వీరికి రంగస్థల అనుభవం కలిగింది. అన్నదమ్ములిద్దరూ 1933లో కలకత్తా వెళ్ళి చిత్రరంగంలో అడుగుపెట్టారు. వీరు శ్రీరామా ఫిల్మ్స్, కుబేరా పిక్చర్స్ అనే కంపెనీలు పెట్టి 1936లో సతీ తులసి, 1938లో మార్కండేయ, 1940లో మైరావణ చిత్రాల్ని నిర్మించారు. 1940లో ప్రతిభా పిక్చర్స్ సంస్థను నెలకొల్పి పార్వతీ కళ్యాణం సినిమాను స్వీయ దర్శకత్వంలో నిర్మించారు. తరువాతి కాలంలో చిత్ర నిర్మాణం, దర్శకత్వం రెండు నిర్వహిస్తూ గరుడ గర్వభంగం (1943), సీతారామ జననం (1944), ముగ్గురు మరాఠీలు (1946), బాలరాజు (1948), శ్రీ లక్ష్మమ్మ కథ, స్వప్న సుందరి, చిన్న కోడలు (1952) మొదలైనవి తయారుచేశారు.

1944లో నిర్మించిన సీతారామ జననం చిత్రం ద్వారా వీరు అక్కినేని నాగేశ్వరరావు, అమర గాయకుడు ఘంటసాల వెంకటేశ్వరరావు లను తెలుగు చిత్రసీమకు పరిచయం చేశారు.[3] 1948లో నిర్మించిన బాలరాజు సినిమా సాటిలేని విజయాన్ని వీరికి అందించింది. తోటివారిలో పోటీపడి శ్రీ లక్ష్మమ్మ కథ చిత్రాన్ని కేవలం 19 రోజులలో నిర్మించి విడుదల చేశారు. వీరు అందరూ అభివృద్ధి చెందాలని, సుఖంగా జీవించాలని కోరుకొనేవారు. ఎన్నో సామాజిక అభివృద్ధి కార్యక్రమాలలో వీరు పాల్గొన్నారు.

· తెలుగు సినీ రంగానికి వెలలేని సేవలందించిన వీరు 1953, అక్టోబరు 29 అర్థరాత్రిన గుండెపోటుతో పరమపదించారు. ఆ సమయంలో ఆయన రేచుక్క చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఆ చిత్రాన్ని పి.పుల్లయ్య పూర్తిచేశారు.

· 1944లో నిర్మించిన సీతారామ జననం చిత్రం ద్వారా వీరు అక్కినేని నాగేశ్వరరావు, అమర గాయకుడు ఘంటసాల వెంకటేశ్వరరావులను తెలుగు చిత్రసీమకు పరిచయం చేశారు. 1948లో నిర్మించిన బాలరాజు సినిమా సాటిలేని విజయాన్ని వీరికి అందించింది. తోటివారితో పోటీపడి శ్రీ లక్ష్మమ్మ కథ చిత్రాన్ని కేవలం 19 రోజులలో నిర్మించి విడుదల చేశారు.వీరు అందరూ అభివృద్ధి చెందాలని, సుఖంగా జీవించాలని కోరుకొనేవారు. ఎన్నో సామాజిక అభివృద్ధి కార్యక్రమాలలో వీరు పాల్గొన్నారు. తెలుగు సినీ రంగానికి వెలలేని సేవలందించిన వీరు అక్టోబర్ 29, 1953 అర్థరాత్రిన గుండెపోటుతో పరమపదించారు. ఆ సమయంలో ఆయన రేచుక్క చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఆ చిత్రాన్ని పి.పుల్లయ్య పూర్తిచేశారు. ప్రముఖ సంగీత దర్శకుడు ఘంటశాల సాయి శ్రీనివాస్ (ఎస్. థమన్) వీరి మనుమడు.

· నిర్మించిన సినిమాలలో చిన్నకోడలు తప్ప ,మిగిలినవన్నీ పౌరాణికాలు ,జానపదాలు .బాలరాజుఅనేక చోట్ల శతదినోత్సవాలు చేసుకొన్నది కొన్ని చోట్ల సంవత్సరం కూడా ఆడి రికార్డ్ సృష్టించింది .శ్రీ లక్ష్మమ్మ సినిమాను పోటీపడి 19 రోజుల్లో నిర్మించి విడుదలచేసి మరో రికార్డ్ స్థాపించారు .సినిమాకు పనికొచ్చే వారిని గుర్తించటం లో ఈయన మహా సిద్ధహస్తులు .చాలాసామజిక సంస్థలకు ఆర్దిక పుష్టి కల్గించిన వితరణ శీలి

· నుమడు ఎస్.ఎస్. తమన్ సంగీత దర్శకుడిగా రాణిస్తున్నాడు.
నాటకరంగంలో ప్రసిద్ధులైన వీరి సోదరులు రాధాకృష్ణయ్య గారి ప్రోత్సాహంతో వీరికి రంగస్థల అనుభవం కలిగింది. అన్నదమ్ములిద్దరూ 1933లో కలకత్తా వెళ్ళి చిత్రరంగంలో అడుగుపెట్టారు. వీరు శ్రీరామా ఫిల్మ్స్, కుబేరా పిక్చర్స్ అనే కంపెనీలు పెట్టి 1936లో సతీ తులసి, 1938లో మార్కండేయ, 1940లో మైరావణ చిత్రాల్ని నిర్మించారు. 1940లో ప్రతిభా పిక్చర్స్ సంస్థను నెలకొల్పి పార్వతీ కళ్యాణం సినిమాను స్వీయ దర్శకత్వంలో నిర్మించారు. తరువాతి కాలంలో చిత్ర నిర్మాణం, దర్శకత్వం రెండు నిర్వహిస్తూ గరుడ గర్వభంగం (1943), సీతారామ జననం (1944), ముగ్గురు మరాఠీలు (1946), బాలరాజు (1948), శ్రీ లక్ష్మమ్మ కథ, స్వప్న సుందరి, చిన్న కోడలు (1952) మొదలైనవి తయారుచేశారు.
1944లో నిర్మించిన సీతారామ జననం చిత్రం ద్వారా వీరు అక్కినేని నాగేశ్వరరావు, అమర గాయకుడు ఘంటసాల వెంకటేశ్వరరావు లను తెలుగు చిత్రసీమకు పరిచయం చేశారు.
లెజెండ్స్ సృష్టించిన లెజెండ్

·

· నేటి ఇతిహాసాల జీవితాలు ఎల్లప్పుడూ నైపుణ్యం కలిగిన చేతితో చెక్కబడి ఉంటాయి, వారు ప్రతిభను గుర్తించి, వారు ప్రసిద్ధ వ్యక్తులుగా మారారు. అటువంటి మాస్టర్‌ఫుల్ హస్తం ఘంటసాల బలరామయ్య, ANR, KV మహదేవన్‌లను తన ప్రొడక్షన్‌ల ద్వారా వారికి పెద్ద బ్రేక్‌లు ఇచ్చి వెలుగులోకి తెచ్చినందుకు బాగా గుర్తుండిపోతుంది.

·

· తండ్రి మరణానంతరం అన్నయ్య ఘంటసాల సూర్య రామయ్య సంరక్షణలో పెరిగాడు. అతను కో-ఆపరేటివ్ ఇన్‌స్పెక్టర్‌గా శిక్షణ పొందాడు, అయితే అతను తన ఇతర సోదరుడు, ఆనాటి ప్రముఖ రంగస్థల కళాకారుడు ఘంటసాల రాధా కృష్ణయ్య మార్గాన్ని ఎంచుకున్నాడు మరియు రంగస్థల నటుడిగా మారాడు. అతను మంచి గాయకుడు కూడా మరియు అతని గాన ప్రతిభ ప్రేక్షకులను మంత్రముగ్దులను చేయడానికి సహాయపడింది. అతని థియేటర్ కెరీర్ దాదాపు రెండు సంవత్సరాలు కొనసాగింది మరియు వివిధ పాత్రలను పోషించింది.

·

· ఆ రోజుల్లో చాలా సినిమాలు కలకత్తా మరియు బొంబాయిలో జరిగాయి మరియు నటీనటులను థియేటర్ నుండి ఒప్పందం కుదుర్చుకున్నారు మరియు అన్ని మౌలిక సదుపాయాలు ఈ నగరాల్లోనే ఉన్నందున సినిమా చేయడానికి ఈ నగరాలకు తీసుకెళ్లారు. అలాగే 1933లో ఘంటసాల బలరామయ్య మరియు అతని సోదరుడు ఘంటసాల రాధా కృష్ణయ్య “రామదాసు”లో నటించడానికి ఒప్పందం చేసుకున్నారు. కానీ ఘంటసాల బలరామయ్య ఆ సినిమాలో నటించలేదు కానీ ఫిల్మ్ మేకింగ్ ట్రెండ్స్‌ని గమనించి మళ్లీ నెల్లూరు వచ్చి తన స్నేహితుల సహాయంతో “శ్రీరామ చిత్రాలను స్థాపించి 1936లో “సతీ తులసి” నిర్మించారు. సినిమా విడుదలైన తర్వాత. అతను “కుబేర పిక్చర్స్” స్థాపించడానికి వెంకు రెడ్డితో భాగస్వామి అయ్యాడు మరియు తరువాత “కుబేర స్టూడియో”ని నిర్మించాడు.

·

· కుబేర పిక్చర్స్ ద్వారా మొదటి చిత్రం “భక్త మార్కండేయ” మరియు 1940 లో “మైరావణ” తర్వాత, ఘంటసాల బలరామయ్య మరియు అతని భాగస్వామి మధ్య విభేదాల కారణంగా కుబేరుడి నుండి బయటకు వచ్చారు.

·

· ధైర్యవంతుడు మరియు సవాలు ఎదురైనప్పుడు తక్కువ చేయని వ్యక్తి, ఘంటసాల బలరామయ్య, పి పుల్లయ్య సహాయంతో 1941 సంవత్సరంలో ప్రతిభా ఫిలింస్ స్థాపించారు. మరియు మొదటి ప్రయత్నంగా “పార్వతీ కళ్యాణం” నిర్మించారు.

·

· ఆ సమయంలో, రెండవ ప్రపంచ యుద్ధం భారతదేశానికి వ్యాపించింది మరియు బాంబు దాడులకు భయపడి, చిత్రీకరణ ప్రక్రియ వెనుక సీటును తీసుకుంది మరియు చాలా స్టూడియోలు మూసివేయబడ్డాయి. యుద్ధం ముగిసిన తరువాత, సినిమా నిర్మాణం మళ్లీ జ్వరపీడితతో ప్రారంభమైంది మరియు ఘంటసాల బలరామయ్య తన ప్రతిభా చిత్రాలతో కొత్త ప్రారంభం చేసి 1943లో “గరుడ గర్వభంగం”తో ప్రారంభించాడు. 1944లో అతను “శ్రీ సీతా రామ జననం” చిత్రాన్ని నిర్మించాడు. అక్కినేని నాగేశ్వరరావు.

·

· నిర్మాతగా, దర్శకుడిగా ఇతర సినిమాలు చేశాడు. నిర్మాతగా, అతను తన చిత్రాలకు కమర్షియల్‌గా ఎలాంటి వైఫల్యాన్ని ఎదుర్కోలేదు. అతను బెంచ్ మార్క్ అని పిలవబడే ఏ సినిమాని ఎప్పుడూ చేయలేదని విమర్శకులు వాదించవచ్చు, అయితే అతను క్లాస్ మరియు మాస్ అనే తేడా లేకుండా మరియు ఎల్లప్పుడూ ఆకర్షించే చిత్రాలను రూపొందించే వ్యక్తి.

·

· అతని క్రింద పనిచేసిన సాంకేతిక నిపుణులు ఎల్లప్పుడూ అతనిని గొప్ప ఆత్మగా పరిగణిస్తారు మరియు స్వార్థపూరిత వాతావరణంలో స్వీయ తక్కువ వ్యక్తిగా కీర్తిస్తారు. స్వర్ణయుగానికి చెందిన వ్యక్తిగా తమకు స్వేచ్ఛను, పని చేసేందుకు ప్రేరణనిచ్చారని వారు గుర్తు చేసుకున్నారు.

·

·

· ఒక వ్యక్తిని చూడగానే మంచి నటునిగా ఎదిగగల లక్షణాలు ఉన్నాయని నిర్ణయించడంలో సిద్ధహస్తులు ఘంటసాల బలరామయ్య. అలా ఆయన తీసుకున్న నిర్ణయంతో తెలుగు సినిమా ప్రపంచం ఒక గొప్ప మహా నటుడిని పొంద గలిగిన నేపథ్యం మరువ లేనిది. ఆయనే నట సామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు.

· 1947లో బలరామయ్య ఒక రైల్వే ప్లాటిఫారం మీద కనిపించిన వ్యక్తిని చూసి చూడగానే ఆయనకు చిత్ర సీమలో బంగారు భవిష్యత్తు ఉందని ఊహించి, అందించిన ప్రోత్సాహం అక్కినేని జీవితాన్ని మలుపు తిప్పిన క్రమం అది. తెలుగు చలన చిత్ర చరిత్రలో ఒక సువర్ణ అధ్యాయాన్ని లిఖించి చిరస్మరణీయ సంఘటనగా నిలిచి పోయింది. అలా అక్కినేని నాగేశ్వర రావు వంటి మహా నటుడి, నట జీవితానికి పునాది వేసిన వ్యక్తి ఘంటసాల బలరామయ్య. అక్కినేని నాగేశ్వరరావు క “సీతారామ జననం” (1944), ద్వారా తెరయోగం కలిగించడమే కాకుండా, ఎ.యన్.ఆర్ .కు వెంటనే రెండవ చిత్రం రావాలని పని గట్టు కొని వేరొక దర్శకుని చుట్టూ తిరిగిన సహృదయులు ఆయన.

ఘంటసాల బలరామయ్య. సంగీత దర్శకుడు / సిని నిర్మాత . స్టేజి పాటలు పాడే ప్రతిభ తో సిని రంగము లో చేరిఅత్యంత ప్రతిభావంతుడైన అక్కినేని నాగేశ్వరరావు కు ” సీతారామ జననం ” (1944), ద్వారా తెరయోగంకలిగించిన ప్రతిభా పిక్చర్ అధినేత .
ఎ.యన్.ఆర్ .కు వెంటనే రెండవ చిత్రం రావాలని తమ పనిగట్టుకొని వేరొక దర్శకుని చుట్టూ తిరిగినసహృదయుడు . సీతారామజననం’ లోనే -ఘంటసాల వెంకటేశ్వరరావు కు చిల్లర వేషాలు ఇచ్చి , ” బలరు” లోఅసోసియేట్ మ్యూజిక్ డైరెక్టర్ గా ఆయన స్థాయిని పెంచిన ఉన్నతుడు . పోటీ తప్పనందున “శ్రీ లక్ష్మమ్మ కధ ” ను (1950) , ఇదే ఇదు వారాలలో తీసిన వాయువేగ దర్శకుడు .
దర్శకుడు గా :

చిన్న కొడుకు – 1952
సీతారామ జననం -1942,
గరుడ గర్వభంగం -1943 ,
పార్వతీ కళ్యాణం -1941 ,
బాలరాజు -1948,
శ్రీ లక్ష్మమ్మ కధ -1950,
స్వప్న సుందరి -1950,
“ముగ్గురు మరాటీలు”-1946
నిర్మాత గా :

స్వప్న సుందరి -1950,
గరుడ గర్వభంగం -1943 ,
పార్వతీ కళ్యాణం -1941 ,
మహిరావణ – 1940 ,
మార్కండేయ _1938 ,
నటుడు గా :

రామదాసు -1933
సతి తులసి – 1936
·

· సశేషం

Posted in సినిమా | Tagged | Leave a comment

మన మరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు-95

మన మరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు-95

· 95-తోలి ద్విపాత్రాభినయం చేసి ,మూడుపేర్లతో ప్రసిద్ధమైన హీరోయిన్-నాగరజకుమారి

మద్దెల నగరాజకుమారి
మద్దెల నగరాజకుమారి అలనాటి ప్రముఖ తెలుగు చలనచిత్ర నటీమణి. ఈవిడ కుమారిగా పేరుతెచ్చుకున్నారు.[1] తెలుగు చలనచిత్రాలలో ఒకే నటుడు రెండు పాత్రలను పోషించే విధానం సతీ సులోచన (1935)తో ప్రారంభమైంది. ఆ చిత్రంలో ‘మునిపల్లె సుబ్బయ్య’గా ప్రఖ్యాతి పొందిన వి.వి.సుబ్బారావు రావణుడు, ఇంద్రజిత్ పాత్రలను పోషించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఇక నటిమణుల్లో ద్విపాత్రాభినయం చేసిన తొలి నటి కుమారి. నగరాజకుమారి, రాజకుమారి, కుమారి ఇలా మూడు పేర్లతో గుర్తింపు తెచ్చుకున్న నటి ఆమె. తక్కువ చిత్రాలలో నటించినప్పటికీ తన నటనతో ఎంతో మంది ప్రేక్షకులను ఆకట్టుకున్న నటి ఆమె.

ఈమె తండ్రి వెంకటేశ్వర రావు తల్లి రామమణి.1921లో గుంటూరు జిల్లా తెనాలిలో జన్మించింది .1937నుంచి 1954వరకు నటించింది ,3-3-2008 న బెఅవాడలో 87 వయసులో మహా ప్రస్థానం చెందింది .
ఎందరో కళాకారులను చలనచిత్రరంగానికి అందించిన తెనాలిలో 1921లో జన్మించిన మద్దెల నగరాజకుమారికి చిన్నతనం నుండి నటన అంటే ఆసక్తి. అయితే తల్లిదండ్రుల చాటుపిల్ల కావడంతో వారి అభీష్టానికి విరుద్ధంగా ప్రవర్తించలేకపోయారు. అదీగాక ఆ రోజులలో సినిమాలలో నటిస్తే అందం కరిగిపోతుందని, ఎక్కువ కాలం బతకరని అపోహలు ఉండేవి. అందుకే నాజూకుగా, ఎంతో ఆకర్షనీయంగా కనిపించే నగరాజకుమారికి అవకాశాలు ఎక్కువ సంఖ్యలోనే వచ్చినా ఆమె తల్లి అంగీకరించలేదు. ‘శ్రీకృష్ణతులాభారం’, ‘సీతాకళ్యాణం’ తదితర చిత్రాలలో అవకాశాలు ఆమెను వెతుక్కుంటూ వచ్చినా ఈ కారణం వల్లే ఆమె తల్లి అంగీకరించలేదు. అయితే కూతురికి సంగీతం నేర్పించి, ఇంట్లో తిరుగుతూ కమ్మని స్వరంతో నగరాజకుమారి హాయిగా అలా పాడుతుంటే విని ఎంతో ఆనందించేది ఆమె తల్లి. కూతురు కళ్ళ ముందు అలా కనిపిస్తే చాలుననుకునేదామె.

తొలి సినిమా
ఇదిలా ఉంటె పువ్వుల అంజయ్య రూపంలో సినిమాలలో నటించే అవకాశం నగరాజకుమారిని వెదుక్కుంటూ వచ్చింది. ఆయన కన్నాంబ నాటక సమాజంలో వయోలినిస్టుగా పనిచేస్తుండేవారు. పూర్ణా యాత్రా స్పెషల్ నిర్వహించే జి.కె.మంగరాజు క్వాలిటి పిక్చర్స్ పతాకంపై ఆ రోజులలోనే దశావతారాలు (1937) చిత్ర నిర్మాణాన్ని ప్రారంభించాడు. నటీనటుల ఎంపిక కోసం బెజవాడ (ఈ నాటి విజయవాడ) వచ్చారు. అంజయ్య నగరాజకుమారికి దూరపుబంధువు కావడంతో ఆమె తల్లిని ఒప్పించి ఇంటర్వ్యూ నిమిత్తం బెజవాడకు పంపించారు. నగరాజకుమారిని చూసీచూడగానే ఎంపిక చేయడమే కాకుండా మూడు పాత్రలను ఆమెకి ఇచ్చారు. ఆచిత్రంలో సీత, లక్ష్మీ, యశోధర పాత్రలను రాజకుమారి పోషించారు. కలకత్తాలో ఈ చిత్రం నిర్మితమైంది. ఈ చిత్రం విజయవంతమవడంతో మరిన్ని అవకాశాలు ఆమెని వరించాయి.

అమ్మతో హీరోయిన్
రెండవ చిత్రంలోనే రాజకుమారికి నాయిక అవకాశం లభించింది. అది కలకత్తాలో నిరంజన్ పాల్ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న అమ్మ చిత్రం. 1939లో విడుదలైన ఈ చిత్రంలో రాజకుమారి పాడిన వికసిత సుమములకున్ అనే పాట, నాయకుడు సుబ్బారావుతో కలిసి పాడిన నిరీక్షించవా నాకై యుగళగీతం ఆనాటి ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. 1939లోనె విడుదలైన ఉష చిత్రంలో చిత్రలేఖగా నటించింది. ఉష, అనిరుద్ధులను తన మంత్రశక్తితో ఒకటిగా చేసే కీలకమైన పాత్ర అది. అయితే ఈ రెండు చిత్రాలు ఆర్థికంగా విజయం సాధించకపోవడంతో రాజకుమారికి సరైన బ్రేక్ లభించలేదు.

సుమంగళితో గుర్తింపు
రాజకుమారి నటజీవితాన్ని మలుపు తిప్పిన చిత్రం సుమంగళి. 1940లో విడుదలైన ఈ చిత్రం నుండి ఆమె కుమారిగా గుర్తింపు పొందింది. వాహిని సంస్థలో మూడు చిత్రాలలో నటించడానికి ఆమె ఒప్పందం కుదుర్చుకుంది. ఆ ప్రకారం 1941లో విడుదలయిన దేవత చిత్రంలో నాయికగా కుమారి నటించింది. ఈ చిత్రంలో ఆమెది అమాయకురాలైన పనిమనిషి వేషం. అప్పటికే నటులుగా, గాయకులుగా పేరు తెచ్చుకున్న నాగయ్య, టంగుటూరి సూర్యకుమారిలకు దీటుగా నిలబడి నటించి పేరు తెచ్చుకున్నారు. అమ్మ, సుమంగళి, దేవత చిత్రాల వరకూ తన పాటలు తనే పాడుకునా కుమారి ఆ తర్వాత మాత్రం నేపథ్యగాయకుల ఈదే ఆధారపడ్డారు.

చేజారిన వేషం
ఒప్పందం ప్రకారం వాహిని వారి నాలుగవ చిత్రం, దర్శకుడు కె.వి.రెడ్డి తొలి చిత్రం భక్త పోతన (1942)లో కుమారి నటించాల్సి ఉంది. అయితే అదే సమయంలో ‘తులసీదాసు’ చిత్రం షూటింగు నిమిత్తం వాహినీ వారి అనుమతితో కుమారి బొంబాయి వెళ్ళడంతో భక్త పోతనలో అవకాశం చేజారింది. తులసీదాసు చిత్రం కోసం ఆరు నేలలు బొంబాయిలోనే కుమారి ఉండిపోవాల్సి వచ్చింది. ఈ చిత్రానికి నాయకుడు కె.ఎస్.ప్రకాశరావు, దర్శకుడు రమణారావు. ఆరు నెలలు అక్కడే ఉన్నా షూటింగు సజావుగా సాగక ఆగిపోవడం కుమారిని మానసికంగా కుంగదీసింది. ఈ తప్పటడుగు పడకుండా ఉంటే ఆమె కెరీర్ మరోలా ఉండేది.

అయిదేళ్ళ విరామం
ఆ తర్వాత నటిగా ఆమెకు అయిదేళ్ళ విరామం వచ్చింది. వ్యక్తిగత కారణాల వల్ల కుమారి నటనకు దూరమయ్యారు. ముగ్గురు మరాఠీలు (1946) చిత్రంతో చలనచిత్రరంగంలో తిరిగి అడుగుపెట్టారు. ఈ చిత్రం విజయవంతమైనా కుమారి కెరీర్‌కు లాభంచేకూరలేదు. ఆ తర్వాత ఆమె ‘శివగంగ’ చిత్రంలో నటించారు. సి.ఎస్.ఆర్. దర్శకత్వంలో ప్రారంభమైన ఈ చిత్రం అర్ధాంతరంగా ఆగిపోవడంతో కుమారి కెరీర్‌కు మళ్ళీ తెర పడింది.

మాయపిల్లలో ద్విపాత్రాభినయం
మరో నాలుగేళ్ళు తెర వెనకున్న కుమారికి మాయపిల్ల (1951) చిత్రంతో మంచి అవకాశం లభించింది. ఇందులో దొంగల రాణి ‘మాయపిల్ల’ (అసలు పేరు ఆశ) గా, రూపగా ఆమె ద్విపాత్రాభినయం చేశారు. ఈ చిత్రం కోసం ఆమె పడిన శారీరక కష్టం అంతాఇంతా కాదు. కత్తి యుద్ధాలు, కొండచిలువతో యుద్ధం ఇలాంటివి చాలా చేశారు. ఆ రెండు పాత్రల కోసం ఆమె వాడిన దుస్తులు ఆ రోజులలో కుర్రకారుని వెర్రెత్తించాయి. 1951లో విడుదలైన ఈ చిత్రం దర్శకుడు రఘుపతి సూర్య ప్రకాశ్‌ కు చివరి చిత్రం కావడం గమనార్హం. కుమారి ఇంత కష్టపడినా ఈ చిత్రం మాత్రం విజయం సాధించలేదు.

చివరి అవకాశాలు
అదే ఏడాది విడుదలైన మరో చిత్రం ఆకాశరాజులో కూడా కుమారి నాయికగా నటించారు. విశ్వనాథ సత్యనారాయణ రచన చేసిన ఈ జానపద చిత్రం కూడా విజయవంతం కాలేదు. ఒప్పందం ప్రకారం భక్త పోతన చిత్రంలో నటించలేదు కనుక 10 ఏళ్ళ అనంతరం వాహినీ సంస్థ నిర్మించిన మల్లీశ్వరి (1951) చిత్రంలో కుమారి ఒక పాత్రను పోషించాల్సి వచ్చింది. ఇందులో ఆమె మహారాణిగా కనిపిస్తుంది, అదీ కొద్దిసేపే. ఆ తర్వాత పెంపుడు కొడుకు (1953 తెలుగు, తమిళం) చిత్రంలోనూ, కాళహస్తి మహాత్యం (1954) చిత్రంలోనూ ఆమె నటించారు. కాళహస్తి మహాత్యం చిత్రంలో పి.సుశీల తన మొదటి పాటలలో ఒకటైన శ్రీ పార్వతీదేవి చేకోవె శైలకుమారి కుమారికి పాడటం విశేషం. ఆ తర్వాత వేషాలు కరువవడంతో కుమారి చిత్రరంగానికి శాశ్వతంగా దూరమయ్యారు.

చివరి రోజులు
తనయుడు గంగాధర్ చదువు పూర్తి కావడంతో 1958లో విజయవాడకు తరలి వెళ్ళారు. 50 ఏళ్ళ పాటు అక్కడే గడిపిన కుమారి తన 87వ ఏట మార్చి 3, 2008న కన్నుమూశారు.

. సశేషం

మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -26-2-22-ఉయ్యూరు

Posted in సినిమా | Tagged | Leave a comment

పెదకాకాని మల్లేశ్వర క్షేత్ర మహాత్మ్యం -2(చివరిభాగం )

పెదకాకాని మల్లేశ్వర క్షేత్ర మహాత్మ్యం -2(చివరిభాగం )

కృష్ణ దేవరాయలు 1440లో ఆంద్ర పర్యటనకు వచ్చి బెజవాడ కృష్ణలో స్నానించి కనక దుర్గా దేవి ని దర్శించి ,మల్లికార్జునుని సేవించి ,సీతానగరం లో మారుతిని దర్శించి ,భోజనాలు చేసి విశ్రమించి ,పండు వెన్నెలలో పయనించి మంగళగిరి చేరి ,రెండురోజులు ఉండిపానకాలస్వామి దర్శనం చేసి ,అంతః పురానికి వెడుతుంటే ‘’చిట్టరసు’’అనే మంత్రి తనగ్రామమైన కాకాని లో రాయలను ఉండేట్లు చేసి కాకాని క్షేత్రమహాత్మ్యం చెప్పాడు .ప్రజలూ విన్నవించారు .రాయలు విని కావలసిన డబ్బు ఇచ్చి శివాలయం నిర్మించమని కోరాడు. మంత్రి తనకు కొడుకు పుడితే రాయల పేరే పెట్టుకొంటానని అనుమతి కోరగా సరే అన్నాడు రాయలు .

వెంటనే ఆలయనిర్మాణం ప్రారంభించాడు చిట్టరు మంత్రి శివలింగం ప్రతిష్టించాడు .రాయలకు సదాశివరాయలు అనే కొడుకు పుట్టాడు ఆ సంబరంతో కాకాని విషయం ఉపెక్ష జరిగంది .తిమ్మరుసును మంత్రి పదవి నుంచి తొలగించి తానె మంత్రిగా ఆరేళ్ళ కొడుకు సదాశివరాయలకు పట్టాభి షేకం చేసి పాలిస్తున్నాడు.హఠాత్తుగా బాల సదాశివరాయలు చనిపోయాడు .

‘’త్రేతాయాం దండ కారణ్యే స్థితం –కృష్ణా నదీ తటే –శ్రీ మల్లేశ్వర సుక్షేత్రం కాకాసుర ప్రతిష్టితం ‘’

కాకానినాధ కరుణా రస పూర్ణ సింధో
భక్తారి భంజన నిరంజన దేవ బంధు
దేవేంద్ర మౌళిమణి మండిత పాద యుగ్మ
శ్రీ మల్లికేశ్వర పరాత్పరవై నమస్తే

శ్రీరామచంద్రుడు, ఇంకా అనేక పురాణ పురుషులేగాక, శ్రీకృష్ణదేవరాయలు కూడా పూజించి మొక్కులు తీర్చుకున్న కాకాని క్షేత్రం గుంటూరు జిల్లాలో వున్నది. ఇక్కడవున్న మల్లికార్జునుని, భ్రమరాంబను శ్రీశైలంలో నెలవైన మల్లికార్జనుడు, భ్రమరాంబల అంశలంటారు. దీనికి నిదర్శనముగా శ్రీశైల స్ధల పురాణములో శ్రీ మల్లికార్జునుని అంశావతారములను వివరించేటప్పుడు కాకానియొక్క ప్రశస్తి కూడా చేయబడింది.

ప్రాచీన క్షేత్రమంటేనే అనేక గాధలుంటాయికదా. మరి ఈ క్షేత్రానికి సంబంధించి ప్రచారంలో వున్న కొన్ని గాధలు తెలుసుకుందామా?

ఇంద్రకీలాద్రికి (విజయవాడలో కనకదుర్గమ్మ కొలువైన కొండ) గర్చపురికి (గుంటూరు) మధ్యగల ఒక సుందర వనంలో పూర్వం ఒక సిధ్ధయోగి చాలాకాలం పరమేశ్వరునిగూర్చి తపస్సు చేయగా, పరమేశ్వరుడు ప్రత్యక్షమయ్యాడు. సిధ్ధయోగి పరమేశ్వరుని ఆ స్ధలమందే వుండి భక్తులను బ్రోవమని కోరుకున్నాడు. పరమేశ్వరుడు ప్రసన్నుడై స్వయంభువుగా వెలిశాడు.

ఒకసారి పరమేశ్వరుడు కొందరు మునులు వెంటరాగా మంగళాద్రి (నేటి మంగళగిరి) నుండి ప్రయాణించుచూ, మంగళాద్రికి గర్తపురికి (నేటి గుంటూరు) మధ్యగల ఒక సుందర వనాన్ని చూసి కొంతకాలం అక్కడ వున్నారు. అదే ప్రస్తుతం కాకాని. మునీశ్వరులు ఈశ్వరుని సేవించుచుండగా స్వామివారు భక్తులను కాపాడుతూ అక్కడ సంతోషముగా వుండసాగిరి. ఆ వనము క్రమముగా ఒక గ్రామముగా ఏర్పడినది. సిధ్ధయోగులు చాలామంది ఇక్కడ స్వామిని బిల్వార్చనలతో, నృత్యగీతాలతో సేవించి స్వామి కృపా కటాక్షాలు పొందారు. అందుకే ఈ ప్రదేశానికి సిధ్ధయోగ సమాజమనే పేరుకూడా వుంది. ఇప్పటికీ భక్తులు పర్వదినాలలో ప్రభలు కట్టి మేళతాళాలతో, నృత్యగీతాలతో స్వామిని సేవించటానికొస్తారు.

పరమేశ్వరుడు ఇక్కడే వుండిపోవటంవల్ల భ్రమరాంబిక దిగులుతో స్వామిని వెతకటానికి తన చెలికత్తెలను పంపింది. వారు ఇక్కడ స్వామిని చూసి దేవి వార్తలు తెలియజేశారు. ఈశ్వరుడు కూడా తన స్ధానానికి చేరుకోవాలని నిర్ణయించుకుని, తన భక్తాగ్రేసరులకు ఇచ్చిన మాట ప్రకారం వారిని కాపాడటానికి ఇక్కడ లింగరూపంలో స్వయంభువుగా వెలిశాడు. తర్వాతకాలంలో భరద్వాజ మహర్షి అనేక తీర్ధాలను సేవిస్తూ ఇక్కడికివచ్చి ఇక్కడవున్న శివలింగాన్నిచూసి పూజలు చేశాడు. ఈశ్వర సంకల్పంవల్ల ఆయనకు అక్కడ ఒక యజ్ఞం చేయాలనిపించింది. వెంటనే అనేక ఋషిపుంగవులను ఆహ్వానించి, యజ్ఞశాలలను నిర్మించి యజ్ఞాన్ని మొదలుపెట్టాడు.

యజ్ఞంలో యజ్ఞకుండంలో అగ్ని ప్రజ్వలింపచేసి అందులో దేవతలకు ఆహుతులను సమర్పిస్తారు. భరద్వాజుడు అలా ఆహుతులను సమర్పిస్తున్న సమయంలో ఒక కాకి అక్కడికి వచ్చి దేవతలకు సమర్పిస్తున్న ఆహుతులను తాను తినసాగింది. యజ్ఞం భగ్నమవుతుందనే వేదనతో భరద్వాజ మహర్షి ఆ కాకిని వారించబోయాడు.

అప్పుడా కాకి మనుష్య భాషలో ఇలా చెప్పింది, “ఓ మహర్షీ, నేను కాకాసురుడనే రాక్షసుడను. బ్రహ్మ ఇచ్చిన వరంచేత దేవతలకిచ్చేటటువంటి హవిస్సులను నేను భక్షించవచ్చు. నువ్వు నన్నెందుకు వారిస్తున్నావు? నీ యజ్ఞం సఫలం కావాలంటే నేనొక ఉపాయం చెబుతాను. నువ్వు పవిత్ర జలాలతో పవమాన, అఘమర్షణ సూక్తాలు చదువుతూ అభిషేకించిన నీరు నా మీదజల్లు. పూర్వం ఒక ఋషి ఇచ్చిన శాపంవల్ల నేనీ రూపంలో వున్నాను. మీ అభిషేక జలంతో నాకు శాపం తొలగి మోక్షం వస్తుంది. మీకు ఆటంకం లేకుండా యజ్ఞం పూర్తవుతుంది.”

భరద్వాజ మహర్షి ఆ విధంగా చెయ్యగానే ఆ కాకి శాపం తొలగి భరద్వాజ మహర్షిని శ్లాఘించి, మహాశివుని మల్లెపూవులతో పూజించి తన స్వస్ధానానికి వెళ్ళిపోయాడు. మల్లెపూవులతో పూజింపబడటంచేతకూడా ఈ స్వామికి మల్లికార్జునుడు అనే నామం స్ధిరపడింది. ఈ క్షేత్రానికి కాకాని అనే పేరొచ్చింది. తర్వాత గ్రామ విస్తీర్ణంతో మొదటనుంచీ వున్న ఈ ప్రాంతం పెదకాకానిగా, విస్తరింపబడినప్రాంతం చినకాకానిగా పిలువబడుతున్నాయి.

శ్రీరామచంద్రుడు ఈ క్షేత్రాన్ని దర్శించి ఇక్కడ శివుడికి కోటి పత్రి పూజ చేశాడని చెబుతారు.ఈ క్షేత్రంగురించి ఇంకొక కధ పార్వతీ పరమేశ్వరులు గగనయానం చేస్తూ కాకాని క్షేత్రం దర్శించారు. ఇక్కడ మహాభక్తుడైన కాకాసురుడు మొదట గోమయలింగం ప్రతిష్టించి, పూజించి, తరించినచోటుగా గ్రహించి, ఆ చోటునాకర్షించి ప్రజలను రక్షించటానికి ఆ లింగమునందావిర్భూతుడై వున్నట్లుగా చెప్పబడుతుంది.

విశేషములు

అగస్త్య మహర్షి తన దక్షిణదేశ యాత్రలో విజయవాడలోని కనకదుర్గమ్మని దర్శించి, గర్చపురికి శిష్యులతోసహా కాలినడకన వెళ్తూ దోవలో ఈ క్షేత్రాన్ని దర్శించాడు. స్వామిని సేవించిన తర్వాత ఆయనకి ఇక్కడ సుబ్రహ్మణ్యేశ్వరుని దర్శనమయింది. ఇక్కడ భ్రమరాంబా మల్లికార్జునులతోపాటు సుబ్రహ్మణ్యేశ్వరుడు కూడా కొలువై వున్నాడు. అందకనే భక్తులు తమ పిల్లలకు చెవులు కుట్టించటం, నాగ ప్రతిష్ట చెయ్యటం వగైరాలు ఇక్కడ చేస్తారు.
శ్రీకృష్ణదేవరాయని ఆస్ధానమునగల మంత్రి రెంటూరి చిట్టరుసుది ఈ గ్రామమని చెబుతారు. ఒకసారి రాయలు ఈ ప్రాంతానికి

వచ్చినప్పుడ మంత్రి కోరికమీద ఇక్కడ బస చేశాడు. అప్పుడు ఇక్కడి ప్రజలు ఇక్కడి విశేషములను తెలిపి, ఆలయము జీర్ణావస్ధలోనుండుటవల్ల పునర్నిర్మించవలసినదిగా కోరారు. రాయలు తన మంత్రి చిట్టరుసుకి కావలసిన ధనమిచ్చి ఆలయ పునర్మిర్మాణానికి ఆనతినిచ్చాడు. తానుకూడా మనసులో తనకి పుత్రుడు కలిగితే స్వామి పేరు పెట్టుకుంటానని మొక్కుకున్నాడు. తర్వాత రాయలుకి పుత్రుడు కలగటం, అతనికి సదాశివ రాయలు అని పేరు పెట్టటం జరిగింది. ఈ విషయము శ్రీకృష్ణదేవరాయలు కుమార్తె మోహనాంగి రచించిన ‘మారిచీ పరిణయంబు’ అనే కావ్యములో వ్రాయబడ్డది. శాసనము ద్వారాకూడా తెలియుచున్నది.

ఈ దేవాలయ ప్రాంగణంలో రాహు-కేతు గ్రహ మండపంలో గ్రహ పూజలు జరుగుతాయి. సర్పదోషమున్నవారు ఇక్కడ ప్రత్యేక పూజలు చేయించుకుంటారు.

తర్వాత చాలాకాలానికి క్రీ.శ. 1911లో కాకాని వాస్తవ్యులైన కొల్లిపర వెంకటరత్నంగారు ఈ ఆలయాన్ని పునరుధ్ధరించి, పునఃప్రతిష్ట చేశారు.

ఈ ఆలయంలో ఇంకా విఘ్నేశ్వరుడు, భద్రకాళి, వీరభద్రులు, పెద్ద నందీశ్వరుడు, శివతాండవమూర్తి, మహిషాసురమర్ధని, సుబ్రహ్మణ్యస్వామి వగైరా దేవతామూర్తులని, కళ్యాణ మండపాన్ని చూడవచ్చు.

సంతానములేనివారు, రోగగ్రస్తులు ఒక మండలంరోజులు దీక్షతో రోజూ స్వామికి 108 ప్రదక్షిణలు చేస్తే వారి కష్టాలు తొలిగి కోరికలు నెరవేరుతాయని భక్తుల నమ్మకం. శివక్షేత్రమైనా సత్యన్నారాయణ వ్రతాలు, ఉపనయనాలు, వివాహాలు జరుగుతాయి. ఇక్కడ వాహన పూజలు విశేషంగా జరుగుతాయి.

పాలపొంగలి నివేదన ఇక్కడ ప్రత్యేకత. పరవడి దినాలలో భక్తులు ఇక్కడే పాలపొంగలి వండి స్వామికి నివేదన చేసి తాము ప్రసాదం తీసుకుంటారు. ఆ సమయాల్లో భక్తుల రద్దీ చాలా ఎక్కువగా వుంటుంది.

రవాణా సౌకర్యం

5వ నెంబరు రహదారి సమీపంలో, గుంటూరుకి 7 కి.మీ. ల దూరంలో గుంటూరు – విజయవాడ మధ్య వుండటంవల్ల గుంటూరు, మంగళగిరి, విజయవాడనుంచి బస్సు సౌకర్యం బాగా వున్నది.

వసతి

దేవస్ధానంవారు భక్తుల సౌకర్యార్ధం వసతి, భోజన సౌకర్యాలు కల్పించారు. సమీపంలోనే గుంటూరు, విజయవాడలలో వుండి కూడా ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకుని వెళ్ళచ్చు.

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -26-2-22-ఉయ్యూరు

Posted in సినిమా | Tagged | Leave a comment

మన మరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు-93 · 93-పాతాళభైరవి ఇందు ఫేం ,గాయని –మాలతి

కె.మాలతి తెలుగు చలనచిత్ర నటీమణి, గాయని.కె.మాలతి 1926లో ఏలూరులో జన్మించింది. [1]

· మాలతి నటించిన తొలి చిత్రం భక్త పోతన ఈమెకు మంచి పేరు తెచ్చింది. అందులో శ్రీనాథుని కూతురిగా నటించింది. పాతాళ భైరవి చిత్రంలో ఇందుమతి పాత్ర ఈమె నటించిన పెద్ద పాత్రలలో ప్రముఖమైనది. ఆమె మంచి గాయని కూడా, అప్పట్లో నటులందరూ తమకు తామే పాటలు పాడుకునేవారు. గాయనిగా ఆమె చివరి చిత్రం వాహినీ వారిగుణసుందరి కథ(1949), అందులో శాంతకుమారితో కలిసి కలకలా ఆ కోకిలేమో పలుకరించే వింటివా, చల్లని దొరవేలే చందమామ పాటలు పాడింది. 1951లో విజయా వారి పాతాళ భైరవిలో ఆమెకు పి.లీల పాటలు పాడింది, ఆ పాటలన్నీ చాలా ప్రసిద్ధి పొందాయి. తర్వాత కాళహస్తి మహత్యం (1954)లో కన్నడ కంఠీరవ రాజ్‌కుమార్తో నటించింది. బహుశా నాయికగా అదే ఆమెకు చివరి చిత్రం. తరువాత సహాయనటిగా కొన్ని చిత్రాలలో నటించింది. ఈవిడ నటించిన చివరి చిత్రం ఎన్.టి.రామారావు తీసిన శ్రీతిరుపతి వెంకటేశ్వర కళ్యాణం.

చిత్ర సమాహారం[మార్చు]
· సుమంగళి (1940)

· భక్త పోతన (1942)

· భాగ్యలక్ష్మి (1943)

· మాయా మచ్ఛీంద్ర (1945)

· గుణసుందరి కథ (1949)

· పాతాళ భైరవి (1951)

· పేరంటాలు (1951)

· అగ్నిపరీక్ష (1951)

· కాళహస్తి మహాత్యం (1954)

· అల్లావుద్దీన్ అద్భుతదీపం (1957)

· శ్రీకృష్ణమాయ (1958)

· పతిభక్తి (1958)

· అన్నా తమ్ముడు (1958)

· దైవబలం (1959)

· పెళ్ళికానుక (1960)

· ఇంటికి దీపం ఇల్లాలే (1961)

· ఆమె ఎవరు? (1966)

· శ్రీ శ్రీ శ్రీ మర్యాద రామన్న (1967)

· పూలరంగడు (1967)

· శ్రీరామకథ (1968)

· ఆడజన్మ (1970)

· శ్రీ తిరుపతి వెంకటేశ్వర కళ్యాణం (1979)……చివరి చిత్రం

· వాహిని సంస్థ తమ రెండో చిత్రంగా ‘సుమంగళి’ (1940) తీసింది. బి.ఎన్‌.రెడ్డి దర్శకుడు. కె. రామనాథ్‌ ఛాయాగ్రహకుడు. ఈ సినిమాలోనే మాలతి ‘వస్తాడే మా బావ’ పాట పాడుతుంది. ఈ పాట చాలా ప్రసిద్ధి పొందింది. మాలతి సొంతంగా పాడింది. గ్రామఫోన్‌ రికార్డులో కూడా ఆమెదే కంఠం. ఈ పాటలని, చిత్రంలో ఆమె మేడ మెట్ల మీద నిలబడి, కొంత పాడి మెట్లు దిగుతూ పాడుతుంది. మేడపైన నిలబడి పాడుతున్నప్పుడు, నేల మీద వున్న కెమెరాకి ఆమె అందదు. ఈ రోజుల్లో వున్నట్లు అప్పుడు క్రేన్‌లు లేవు. అది వేసిన సెట్టు. 20, 25 అడుగుల ఎత్తులో మేడ మెట్ల పైభాగం వుంటుంది. అక్కడ ఆమెకి క్లోజ్‌ షాటు తియ్యాలి. ఆ ఎత్తుకి సరిపడా, నాలుగైదు టేబుళ్ళు ఒక దాని మీద ఒకటి పేర్చి, దాని మీద స్టూలు, మళ్లీ చిన్నాపెద్దా టేబుళ్ళూ నిలబెట్టి, దానిపైన రామ్‌నాథ్‌ ఆపైకి ఎక్కి షాటు తీశారు! ఈ షాటు తీస్తున్న ‘వర్కింగ్‌ స్టిల్‌’ ఆనాడు తెలుగు సినిమా పత్రికలో అచ్చయితే, చూసిన జ్ఞాపకం బాగా వుంది. ”అసలా టేబుళ్ళు కదలకుండా ఎలా వున్నాయి? అంతపైకి ఎలా ఎక్కగలిగారు?” అన్న ప్రశ్న నాలాంటివాళ్లకి కలిగింది

·

· కె.మాలతి తెలుగు చలనచిత్ర నటీమణి, గాయని. కె.మాలతి 1926లో ఏలూరులో జన్మించింది. మాలతి నటించిన తొలి చిత్రం భక్త పోతన ఈమెకు మంచి పేరు తెచ్చింది. అందులో శ్రీనాథుని కూతురిగా నటించింది. పాతాళ భైరవి చిత్రంలో ఇందుమతి పాత్ర ఈమె నటించిన పెద్ద పాత్రలలో ప్రముఖమైనది. ఆమె మంచి గాయని కూడా, అప్పట్లో నటులందరూ తమకు తామే పాటలు పాడుకునేవారు. గాయనిగా ఆమె చివరి చిత్రం వాహినీ వారిగుణసుందరి కథ (1949), అందులో శాంతకుమారితో కలిసి కలకలా ఆ కోకిలేమో పలుకరించే వింటివా, చల్లని దొరవేలే చందమామ పాటలు పాడింది. 1951లో విజయా వారి పాతాళ భైరవిలో ఆమెకు పి.లీల పాటలు పాడింది, ఆ పాటలన్నీ చాలా ప్రసిద్ధి పొందాయి. తర్వాత శ్రీ కాళహస్తి మహత్యం (1954)లో కన్నడ కంఠీరవ రాజ్‌కుమార్ తో నటించింది.

· బహుశా నాయికగా అదే ఆమెకు చివరి చిత్రం. తరువాత సహాయనటిగా కొన్ని చిత్రాలలో నటించింది. ఈవిడ నటించిన చివరి చిత్రం ఎన్.టి.రామారావు తీసిన శ్రీ తిరుపతి వెంకటేశ్వర కళ్యాణం.

· పాతాళ భైరవి 1951లో విడుదలై అత్యంత ప్రజాదరణ పొందిన జానపద చిత్ర రాజము. యన్.టి.ఆర్ యుక్తవయస్సు, ప్రతిభ, నేపాళ మాంత్రికునిగా యస్.వి. రంగారావు నటనా చాతుర్యము, కె.వి. రెడ్డి దర్శకత్వం, పింగళి నాగేంద్రరావు సంభాషణలు, ఘంటసాల పాటలు దీనిని చరిత్రలో చిరస్థాయిగా నిలిపాయి. అప్పటిలో 28 కేంద్రాలలో శతదినోత్సవం పూర్తి చేసుకొన్న సినిమా ఇది. తమిళంలో కూడా విడుదలైంది. ఈ శతదినోత్సవం వేడుకలకు మాలతి హాజరై అందరి మన్ననలను పొందారు.1965 వరకూ చిన్న పాత్ర లను కూడా వేశారు. ఎన్టీఆర్ సరసన హీరోయిన్ గా నటించి, అదే ఎన్టీఆర్ సరసన అక్కగా, వదినగా తల్లిగా నటించారు.ఎఎన్ఆర్ కు సోదరిగా, తల్లిగా కూడా నటించారు. 1969లో తన మకాం హైదరాబాద్ కు మార్చారు. కాచిగూడలో ఒక మురికి వాడలో నివశించారు.

· అక్కడ అద్దె చెల్లించలేని స్థితిలో ప్రభాస్ ధియేటర్ వెనుక గోడను ఆనుకుని ఒక రేకులు షెడ్ వేసుకొని పిలిపించారు.అపుడే తెలుగు చిత్రపరిశ్రమ మద్రాసు నుండి హైదరాబాద్ కు తరలి వస్తున్న రోజులు.హైదరాబాద్ సారధీ స్టూడియో కు ప్రతీ రోజూ వెళ్ళి వచ్చినా వేషాలు ఉండేవి కావు.తాను పాతాళ భైరవి హీరో యిన్ మాలతి అని ఎవ్వరికీ చెప్పలేదు. భర్త చనిపోయాడు. సంతతి లేదు. కడుపారా తిండిలేక కాచిగూడలో దేవాలయానికి వెళ్ళి పూజారి ఇచ్చే ఫలహారాలతో జీవిస్తూ ఉండేవారు. అక్కడ దేవాలయం లో ఒక మహిళతో మాట్లాడుతూ ఉండేవారు. 1979 నవంబర్ 22న హైదరాబాద్ లో గాలివానకు అర్థరాత్రి ప్రభాస్ థియేటర్ గోడ కూలి మాలతి మరణించారు. 23న కూడా ఆమె మృతదేహం అక్కడే శిథిలాల వద్ద కూరుకుపోయింది.

· ఇదిలా ఉండగా రోజూ గుడికి వచ్చే మాలతి గత రెండు రోజులుగా రాకపోవడంతో పూజారి, ఆమె స్నేహితురాలు ఆరా తీశారు. ఆమె స్నేహితురాలు థియేటర్ వెనుక శిధిలాలను ఇరుగు పొరుగు వారి సాయంతో వెతికి తీయగా మాలతి మృతదేహం, ఒక టంకుపెట్టె బయటపడింది. ఆ టంకుపెట్టెలో పాతాళ భైరవి ఫోటో లు, షీల్డ్ లు కనపడడంతో అందరూ ఆశ్చర్యపోయారు. ఆమె డైరీలో తాను నటించిన చిత్రాలు వివరాలు, పడిన కష్టాలు, మోసపోయిన విధం ఉండడంతో అక్కడ ఉన్నవారు కళ్ళనీళ్ళు పెట్టుకున్నారు. అందరూ చందాలు వేసుకొని మాలతి అంత్యక్రియలు జరిపారు. ఇంత జరిగినా అప్ఫటి థియేటర్ యాజమాన్యం స్పందించక పోవడం విశేషం. నాడు అగ్రహీరోలు గానీ ఆమెతో నటించిన వారెవ్వరూ ఆమె మృతదేహం వంక పట్టించుకో లేదు. సినిమా థియేటర్ కు మాలతి పేరు పెట్టమని ఫిలిం జర్నలిస్టులందరూ అప్పటి యాజమాన్యానికి వివరించినప్పటికీ ఫలితం లేదు.

· సశేషం

· మీ గబ్బిట దుర్గాప్రసాద్ -25-2-22-ఉయ్యూరు

Posted in సినిమా | Tagged | Leave a comment

మన మరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు-94 · 94-నటశేఖర ,హిరణ్యకశిప ఫేం తోలి డబల్ రోల్ యాక్టర్ –మునిపల్లె సుబ్బయ్య

మునిపల్లె సుబ్బయ్య తొలి తెలుగు సినిమా కథానాయకుడు, సుప్రసిద్ధ రంగస్థల నటుడు. ఈయన అసలు పేరు వల్లూరి వెంకట సుబ్బారావు. గుంటూరు జిల్లా, మునిపల్లె గ్రామంలో జన్మించడం వలన ఆ తర్వాత మునిపల్లె సుబ్బయ్య, మునిపల్లె వెంకట సుబ్బయ్యగా వ్యవహరించబడ్డాడు.[1] ఈయన వెంకటగిరి రాజా వారిచే “నటశేఖర” బిరుదు పొందాడు. అప్పట్లో సురభి సమాజంలో అత్యధిక పారితోషకం తీసుకునే నటుడు సుబ్బయ్యనే.

· 1929లో తండ్రి చనిపోవడంతో సుబ్బయ్య స్వగ్రామమైన మునిపల్లెకు తిరిగివచ్చాడు. హెచ్.ఎం.రెడ్డి కోరిక మేరకు దొరస్వామి నాయుడు (భక్తప్రహ్లాద సినిమాలో ఇంద్రుడు పాత్రధారి) మునిపల్లె వెళ్ళి సుబ్బయ్యను బొంబాయికి తీసుకుని వచ్చాడు.[2]

· 1931లో హెచ్.ఎమ్.రెడ్డి రూపొందించిన తొలి టాకీ చిత్రం భక్త ప్రహ్లాదలో హిరణ్యకశపునిగా నటించి మునిపల్లె వెంకటసుబ్బయ్య చరిత్ర సృష్టించాడు. ఈయన తొలి తెలుగు కథానాయకుడే కాక, తెలుగు సినిమాలలో తొలిసారిగా ద్విపాత్రాభినయం చేసిన ఘనత కూడా సాధించాడు. 1936లో రూపొందిన సతీ సులోచన అనే చిత్రంలో రావణబ్రహ్మగా, ఇంద్రజిత్‌గా అలరించి ఓ కొత్త ప్రక్రియకు నాంది పలికాడు.[3] ఆ తరువాత ద్రౌపదీ మానసంరక్షణం, సతీ సావిత్రి తదితర చిత్రాల్లో నటించాడు సుబ్బయ్య. హెచ్‌.ఎం.రెడ్డి దర్శకత్వంలో రూపొందిన ‘సతీ సావిత్రి’లో సుబ్బయ్య యమధర్మ రాజు పాత్రను పోషించాడు.

· భక్తప్రహ్లాద తెలుగులో నిర్మిచిన తొలి టాకీ చిత్రము. హెచ్.ఎం.రెడ్డి నిర్మించిన ఈ చిత్రము సెప్టెంబర్ 15, 1931న విడుదలైనది. హిందీలో తొలి టాకీ తీసిన అర్దేషిర్‌ ఇరానీ తెలుగులోనూ, తమిళంలోనూ కూడా చిత్రాలు తియ్యాలనుకొని ఆ భాద్యతలను హెచ్‌.ఎమ్‌.రెడ్డి తెలుగువాడు గనక ‘భక్తప్రహ్లాద’ని , తమిళ ‘కాళిదాసు’ని తీయవాల్సిందింగా అప్పజెప్పారు.

· అప్పట్లో ధర్మవరం రామకృష్ణమాచార్యులు రచించిన “భక్త ప్రహ్లాద” నాటకాన్ని సురభి నాటక సమాజం వారు వేస్తుండేవారు. ఆ నాటకసమాజంవారిని బొంబాయి పిలిపించి, వారితో చర్చించి, సినిమా ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు. ఈ చిత్రాన్ని బొంబాయిలోని కృష్ణామూ వీటోన్ స్టూడియోలో తీశారు. అప్పుడు ఈ చిత్ర నిర్మాణ వ్యయం 20వేల రూపాయలు. చిత్రం బాగా విజయవంతమయ్యింది.

· భక్త ప్రహ్లాద సినిమాలో హిరణ్యకశిపునిగా మునిపల్లె సుబ్బయ్య, హిరణ్యకశిపుని భార్య లీలావతిగా సురభి కమలాబాయి నటించారు. సినిమాలో ప్రధానపాత్ర అయిన ప్రహ్లాదుని పాత్రను కృష్ణాజిరావు సింధే ధరించారు. ఇంద్రునిగా దొరస్వామినాయుడు, బ్రహ్మగానూ, చండామార్కుల్లో ఒకనిగానూ చిత్రపు నరసింహారావు నటించారు. ప్రహ్లాదుని సహాధ్యాయి అయిన ఓ మొద్దబ్బాయిగా తర్వాతికాలంలో దర్శకునిగా మారిన ఎల్.వి.ప్రసాద్ నటించారు. ఎల్.వి.ప్రసాద్ మొట్టమొదటి తమిళ టాకీ ”కాళిదాసు”లో కూడా నటించారు.

· సినిమాలో సంగీత దర్శకులు లేకున్నా అప్పట్లో స్టేజి మీద పాడే వరసల్లో కొన్ని పద్యాల వంటి పాటలు రాసారు అవి
1 తనయా ఇటులనే తగదురా బలుకా – కమలాబాయి
2 పరితాప భారంబు భరియింప తరమా – రచన: కేసవదాసు – గానం: కమలాబాయి
3 భీకరమగు నా ప్రతాపంబునకు – సుబ్బయ్య

· సినిమా సంబంద విశేషాలు

  • ఈ చిత్రంలో లీలావతిగా నటించిన సురభి కమలాబాయికి మొదట 500 రూపాయలు పారితోషికంగా నిర్ణయించారు. కాని ఆమె నటనను హర్షించి నిర్మాత వెయ్యినూటపదహార్లు బహూకరించి రైలు ఖర్చులు కూడా ఇచ్చారు.

· * ఇందులో ప్రహ్లాదుని పాత్ర పోషించిన కృష్ణారావుకు 400 రూపాయలు పారితోషికం. ఈ తెలుగు టాకీ హీరో అప్పటి వయసు 9 సంవత్సరాలు. తరువాత ఈయన కిరాణా కొట్టు నడుపుకున్నాడు. ఆర్ధికంగా చాలా ఇబ్బందులు పడ్డాడు.
2001లో సినీ ఆర్టిస్టుల సంఘం ఈయనను సన్మానించి కొంత ఆర్ధిక సహాయం అందజేశారు.

· * 1929 లో మనదేశంలో విడుదలైన తొలి టాకీ చిత్రం యూనివర్సల్ వారి ‘ది మెలోడీ ఆఫ్ లవ్’ అది విపరీతంగా ఆకర్షించడంతో, భారతీయ చిత్ర నిర్మాతలు తామూ శబ్ద చిత్రాలు తియ్యాలని ఉత్సాహ పడ్డారు. ‘ఆలంఆరా’ తిసిన “ఆర్దేషిర్ ఇరానీ” యే తెలుగు ‘భక్త ప్రహ్లాద’ కూడా తీశారు. అప్పుడు సంగీత దర్శకులు అంటూ లేరు. ఉన్న వరసల్నే, వాడుకున్నారు. హెచ్. ఆర్. పద్మనాభ శాస్త్రి హార్మొనీ వాయిస్తూ అందరికీ పాట, పద్యం నేర్పారు. ‘భక్త ప్రహ్లాద’ లో 40 పాటలున్నాయి. పద్యాలు ఉన్నాయి. బొమ్మ సరిగా కనిపించక పోయినా, చాలా చోట్ల మాట వినిపించకపోయినా, ప్రేక్షకులు మాత్రం విరగ బడి చూశారు. ఈ రోజుల లెక్కల్లో అది ఆనాడు ‘సూపర్ డూపర్ హిట్ సినిమ.బ్లాక్ మార్కెట్ వ్యవహారం ఇవాళ్టిది కాదు. ‘భక్త ప్రహ్లాద” సమయంలోనే వుంది. నాలుగు అణాల టిక్కట్లను, నాలుగు రూపాయలకి ‘ఆలంఆరా’ కి కొన్నట్టే, “భక్త ప్రహ్లాద” కీ కొన్నారు.

· సశేషం

· మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -26-2-22-ఉయ్యూరు

Posted in సినిమా | Tagged | Leave a comment

పెదకాకాని మల్లేశ్వర క్షేత్ర మహాత్మ్యం

పెదకాకాని మల్లేశ్వర  క్షేత్ర మహాత్మ్యం

పెదకాకాని మలేశ్వర  క్షేత్ర మహాత్మ్యం  ను దేశభక్త విజయధ్వజి ,దేశ హిత ప్రబోధక , ఓలేటి సుబ్రహ్మణ్య శర్మ  గారు స్థలపురాణ౦గా రచించగా ,గుంటూరు విజయలక్ష్మీ పవర్ ప్రెస్ లో 1960లో ప్రచురించారు వెల-కేవలం 75నయాపైసలు .తెనాలి   అడ్వోకేట్ ఆవుల గోపాల కృష్ణమూర్తి గారు పరిచయ వాక్యాలు రాస్తూ శర్మగారి రచనలలో చారిత్రిక,సాంఘిక ,పౌరాణిక పరిశీలనలు ఉంటాయని ఆయన్ను బాగా ప్రోత్సహించమని కోరారు .ప్రచురణ బాధ్యత దేవస్థానం వహించింది .

  విజయనగర ప్రభువు శ్రీ కృష్ణ దేవరాయలు ఇక్కడికి 1518లో రాకపూర్వం ,ఇప్పుడు మల్లేశ్వర స్వామి మూల విరాట్ ఉన్న చోట ,శివ భక్తాగ్రేసరుడైన ఒక మహా భక్తుని సమాధి ఉండేది .దానినే శివస్వరూపంగా ఆరాధించేవారు .ఒకసారి పార్వతీ పరమేశ్వరులు  ఆకాశ విహారం చేస్తూ ,ఇక్కడ తనభక్త సమాధిని తన పేర పూజించటం గమనించి కిందికి దిగి వచ్చి ‘’శ్రీ మల్లేశ్వర స్వామి ‘’గా వెలసినట్లు ప్రతీతి .తర్వాత కధలోకి వెళ్ళారు

శ్లోకం –కాకాని నాధ కరుణా రస పూర్ణ సింధో –భక్తార్తి భంజన ,నిరంజన దీన బంధో

దేవేంద్ర మౌళి మణి మండిత పాదయుగ్మ –శ్రీ మల్లికేశ్వర పరాత్పరవై నమస్తే ‘’అని స్వామిని స్తుతించి స్కాంద పురాణం లో ఉన్న ఈ క్షేత్ర మహాత్మ్యాన్ని వివరించారు .శివుడు శ్రీశైలం లో మల్లికార్జునుడుగా కాకానిలో మల్లెశ్వరస్వామిగా అర్చింపబడుతున్నాడు .పూర్వం అనేక పాపాలు చేసిన ఒక బ్రాహ్మణుడు మల్లెశ్వరస్వామిని దర్శించి పాపాలు పోగొట్టుకొని పిశాచత్వం నుంచి విముక్తి పొందినట్లుపద్మ పురాణం లో ఉంది .స్కాంద పురాణం లో ఈ లింగాన్ని దర్శించి ,పూజించి తరించిన వారి చరిత్రలెన్నో ఉన్నాయి .ఇక్కడి స్వామి గంగా సమేత మల్లేశ్వరుడు .పూజలు ఉత్సవాలు ఈపేరుతోనే జరుగుతాయి .శివరాత్రి ఉత్సవాలు అయిదు రోజులు మహా వైభవంగా నిర్వహిస్తారు .

  ఒక సారి కైలాసం  లో శివ పార్వతులలో అందమైన వారు ఎవరు అనే చర్చ జరిగి,సభాసదులను తేల్చమన్నారు .విశ్వకర్మను వారికి మేకప్ చేయమని కోరితే అద్భతంగా వారి సోయగాన్ని తీర్చి దిద్దాడు .దంపతులు అద్దం లో చూసుకొని ముచ్చటపడి విశ్వకర్మను సత్కరించాలను కొని పిలిపించి ఏం కావాలో కోరుకొనమని శివుడు అన్నాడు .విశ్వకర్మ తాను కల్పించలేనిది లోకం లో ఉండదు .నీకేం కావాలో కోరుకో అన్నాడు .దరిద్ర దేవత ను వరిన్చమన్నాడు .పేరు చెప్పమంటే వరించమని చెప్పావు నీ సౌందర్య గర్వం ఇది .కనుక లింగాకృతి పొందు అన్నాడు విశ్వకర్మ .పార్వతి ప్రార్ధిస్తే భిక్షాపాత్ర విభూతి ధారణా కపాలమాల తో వర్ధిల్లి లోకాలకు దారిద్ర్య విచ్చిత్తి చేయి .విశ్వ సృట్ పేరుతొ పిలువబడుతావు ‘’అన్నాడు .కనక ఈ మల్లెశ్వరుడే బ్రహ్మ  విష్ణువు వులకంటే అధిక మహిమాన్వితుడుగా పేర్కొనబడ్డాడు .

  సశేషం

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -25-2-22-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

మన మరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు-92

మన మరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు-92

· 92-తోలి సినీ గీతరచయిత ,నటుడు ,గాయకుడు ,శతావధాని ,’’పరాబ్రహ్మ పరమేశ్వర ‘’పాట ఫేం ,సినీవాచస్పతి,ఆంద్ర సూత –చందాల కేశవదాసు -4(చివరిభాగం )

· ఎం. పురుషోత్తమాచార్య కేశవ దాసు గారి గురించి చెప్పిన విషయాలు –

“బలే మంచి చౌక బేరము” పాట వినగానే మనస్సు ఆనందంతో గంతులు వేయడం ప్రతి తెలుగువాడికి అనుభవంలో ఉన్నదే. “పరాబ్రహ్మ పరమేశ్వర’ అని వినపడగానే రంగస్థల స్వరూపం, భగవంతుని త్రిమూర్త్యా త్మికత,నట రాజ తాండవ భంగిమ చప్పున గుర్తుకు వచ్చి మేను పులకరించడం ఆంధ్రులు చేసుకున్న అదృష్టం. ఈ అనుభూతులకు, ఆ పాటల నృష్టికర్త పేరు తెలుసుకోవాలను కోవడానికి సంబంధం అంతగా లేకున్నా ఆ రచయిత ఎవరో తెలుసుకోవాలని కుతూహల పడడం ఒక సంస్కార విశేషంగా పెద్దలు చెబుతారు… పై రెండు పాటలను రచించిన వారు ఖమ్మం జిల్దా వాస్తవ్యులైన మహాకవి అష్టావధాని, హరికథా భాగవతార్‌, నాటక కర్త అయిన శ్రీచందాల కేశవదాసు గారు. వాటిని స్వరపరచినవారు దాసుగారి గురువు గారైన శ్రీ పాపట్ల లక్ష్మీక్రాంతయ్య గారు. వీరిద్దరూ కలిసి యాదగిరి గుట్ట (బ్రహ్మోత్సవాలలో ధార్మిక సంగీత సాహిత్య కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు.

18,19 శతాబ్దాల మధ్య గుంటూరు జిల్తా తెనాలి తాలుకా ‘చందవోలు’ గ్రామం నుంచి ఖమ్మం జిల్లా గంగదేవిపాడుకు వలసవచ్చిన ఒక వైద్య కుటుంబ సభ్యులను ప్రజలందరూ చందోలు వారని నంభావించారు. అదే కాలక్రమంలో “చందాల’ వారయింది. ఆ కుటుంబంలో పాపమ్మ, లక్ష్మీనారాయణ అనే పుణ్యదంపతులకు 1876 జూన్‌ 20న కేశవదాసు జన్నించారు. చిన్న తనంలోనే తండ్రి మరణించగా అన్నగారయిన వెంకట్రామయ్య గారే కేశవదాసును పెంచి పెద్ద చేశారు. తమ్మునికి ఉపాననా విద్యను, రామనామ మంత్రాన్ని ఉపదేశించారు. తన లాగా ఆజన్మ బ్రహ్మచారి కావద్దని, గృహస్థ జీవితం. గడుపుతూ ధార్మిక కార్యక్రమాలు చేవట్టవముని బోధించాడు. కేశవదాసు ఆ మాటలను తు.చ. తప్పకుండా పాటించారు. కేశవదాసు, చిట్టెమ్మ దంపతులకు జన్మించిన పెద్దకొడుకు కృష్ణమూర్తి బదాచలంలో ఉపాధ్యాయుడు. ఆయన ‘పేరు సీతారామయ్య. ఇప్పటికి వీరిద్దరూ కీర్తి శషులయ్యారు. మూడవ సంతానమైన ఆండాళు గారి భర్త శ్రీగంధం నరసయ్యగారు, రిటైర్డ్‌ ఎం.ఇ.వో. వీరి కుటుంబం ఇప్పుడు నల్లగొండ జిల్లా మునగాల గ్రామంలో ఉన్నది. నల్లగొండ జిల్లా కోదాడకు దగ్గరగా ఉన్న తమ్మర గ్రామంలోనీ శ్రీ శ్రీ సీతారామ చంద్రస్వామి దేవాలయం మీద, ఆ దేవుని మోదా దాసుగారికి విపరీతమైన భక్తి కుదిరింది. తాను సంగీత సాహిత్య కార్యక్రమాలద్వారా సంపాదించుకున్న ఆస్తినంతా ఈ దేవాలయ నిర్మాణానికి, సేవలకు, సప్తాహాలకు వినియోగించారు.

నటుడిగా, దర్శకుడిగా ఎదిగారు. కనకతార, బలిబంధనం, నాగదాసు చరిత్ర, విరాటపర్వం, క్రేశవశతకం మొదలైన రచనలను 40కి పైగా చేశారు. ఆయనకు బాగా పేరు తెచ్చి పెట్టిన నాటకం కనకతార. ఇది మన రాష్ట్రంలోనే కాక ఇతర రాష్ట్రాలలోనూ, ఇతర దేశాలలోనూ వెయ్యికి పైగా ప్రదర్శనలివ్వబడింది. నటసామ్రాట్‌ అక్కినేని నాగేశ్వరరావు గారు, వుట్టపర్తి సత్యసాయి బాబా వారు తమ చిన్నతనంలో, త్రూ నాటకాలలోని తారపాత్రను పోషించడం చెప్పుకోదగ్గ గొప్పవిశేషం.

1931లో దాసుగారు మద్రాసుకు వెళ్ళి హెచ్‌.ఎం. రెడ్డిగారి దర్శకత్వంలో తయారైన మొట్టమొదటి తెలుగు టాకీ ‘భక్త ప్రహ్లాద’ కోసం క పేరతావభోరంటు. “ తనయా ళన “భీకరంబగునా””అనే మూడు పాటలు రాశారు. సోవురాజు రామానుజరావు గారి ‘సతీసక్కుబాయి’ నాటకం కోసం ఆయన రాసిన “గజ్జెలందియలు’, “రాదేలా కరుణ), వంటి

అయిదు పాటలను “నతీనక్కుబాయి” సినిమాలో ఉపయోగించుకున్నారు. అదేవిధంగా శ్రీ ముత్తరాజు నుబ్బారావుగారి శ్రీకృష్ణ తులాభారం నాటకం కోసం ఆయన రాసిన పాటల్లో ‘బలే మంచి చౌక బేరమూ”, మునివరా తుద కిట్లు, కొట్టుకొట్టండి, అనే పాటలను సినిమాల్లో వాడుకున్నారు. దానరి కోటిరత్నం నటించిన “నతీ అనసూయ” (1935) సినిమాకు దాసుగారు మాటలు, పాటలతో సహా పూర్తి ప్రిప్పను రచించారు. 1936లో కాళ్ళకూరి సదాశివరావు గారి దర్శకత్వంలో విడుదలైన “లంకా దహనం” సినిమాకు కూడా ఆయన స్త్రిప్ట వ్రాశారు. ఆయన గారి ‘కనకతార’ నాటకంలోని రెండు పద్యాలు, రెండు పాటలు ఉపయోగించుకుంటూ, ఆయన కథనే అనుసరిస్తూ 1937లో ‘కనకతార’ సినిమాను “సరస్వతీ టాకీసు *” వారు తీశారు. పానుగంటి వారి “రాధాకృష్ణు నాటకం కోసం దాసుగారు రాసిన పాటలను కొన్నిటిని 1939లో లక్ష్మీసినీ టోన్‌ వారు. తీసిన “రాధాకృష్ణ” సినిమాలో ఉపయోగించుకున్నారు. ఇందులో స్థానం నరసింహా రావుగారు “రాధ” గా అభినయించారు. ఇవే గాక కేశవదాసుగారు సామాన్యప్రజల కోనం వేలు కొలువు పాటలు,ువుంగళ హారతులు, జోలపాటలు, హెచ్చరికలు, మొదలైనవెన్నో రచించారు. 1948లో రజాకార్ల అకృత్యాలకు అట్టుడికిపోయిన తెలంగాణలో భాగమైన జక్కేపల్లి గ్రామంలోని దాసుగారి ఇంటిని దుండగులు దోచుకున్నారు. ఆ దుష్కార్యంలో ఆయనగారి ఆస్తిపాస్తులతో పాటు రచనా సంపదకూడా అగ్నికి ఆహుతి అయ్యాయి. వెంటనే దాసుగారు ఆ వూరి నుండి ఖమ్మం పట్టణానికి మకాం మార్చారు. శిష్యుల, అభిమానుల కోరిక మేరకు 1950లో నాయకన్‌

గూడెం చేరారు. ఎక్కువ నమయాన్ని జవతపాలలోనూ,యోగధ్యానం లోనూ గడిపేస్తూ ఉండిపోయారు. అప్పుడు కూడా అడపాదడపా అష్టావధానాలు చేస్తూనే వున్నారు. బొర్రా కోటయ్య చౌదరి గారి “భారత కర్మాగారము” అనే నాటకాన్ని, సందడి రామదాసుగారి మాధవశతకాన్ని పరిష్కరించి వారిద్దరి రచనా వ్యానంగాన్ని ఎంతగానో ప్రోత్సహించారు. ఆయన క్రమక్రమంగా ఉపాసనాధ్యాన స్థితిలో తాదాత్మ్యం చెందుతూ విజయనామ నంవత్సర వైశాఖి ళుద్ధవంచమి అంటే 14-6-1956నాడు పరమపదం చేరుకున్నారు. తెలుగు సాహితీ రంగానికి, సామాజిక రంగానికి, తెలుగు నీనివూ రంగానికీ కేశవదాసుగారు చేసిన సేవలు వెలకట్టలేని పెన్నిధులు.

పరాబ్రహ్మ

చందాల కేశవదాసుగారి పాటల్లో ప్రధానంగా చెప్పుకోవలసిన ప్రసిద్ధమైనది, నాటక ప్రదర్శనారంభ సమయ ప్రార్థనా పూర్వకమైనది – అయిన ఒక భక్తి గీతం.

కళ్యాణిరాగం-రూపకతాళం

పరాబ్రహ్మ పరమేశ్వర

పురుష్తోత్రను సదానంద

పరంజ్యోతి పరాత్పర

పరాబ్రహ్మ ఇకెన్నటికిని దొరుకబోదు’’ మరి చందాల కేశవదాసుగారి పాటల్లో ప్రధానంగా చెప్పుకోవలసిన సదమలోత్తులనిది మరిమరిని ప్రసిద్ధమైనది, నాటక ప్రదర్శనారంభ సమయ ప్రార్థనా శ్రయము తప్పకను తెలిపితిగా పూర్వకమైనది – అయిన ఒక భక్తి గీతం.

ఆయన కేవలం ఆధ్యాత్మిక కార్యక్రమాలకే పరిమితం కాలేదు. ఆనాటి స్వాతంత్ర్య సమరాన్ని ప్రశంసిస్తూ జయతు జై అనే పాట రాసి ఎస్‌.రాజేశ్వరరావు, ఆకుల నరసింహారావు గారల చేత పాడించి రికార్డు చేయించారు. హుజూర్‌ నగర్‌, జగ్గయ్యపేట, తమ్మర, తిరువూరు, కందిబండ మొదలైన చోట్లలో అష్టావధానాలు చేసి సెబాసనిపించుకున్నారు. పోలంపల్లి, దబ్బాకుపల్లి, జక్కేపల్లి, ఖమ్మం, కోదాడ మొదలైన ప్రాంతాలలో హరికథాగానం

కేశవదాసు ప్రాథమిక విద్యను తండ్రి వద్ద నేర్చుకున్నాడు. కాగా చిన్నతనాననే ఆయన మరణించడంతో తన అన్నగారైన వెంకటరామయ్య పోషణలో పెరిగారు. వెంకటరామయ్య బ్రహ్మచర్యం పాటిస్తూ ఆధ్యాత్మిక చింతనలో గడిపేవారు. ఆయన ఉపాధ్యాయునిగా పని చేసేవారు. అన్నగారి వద్దనే ఛందస్సు, అవధానం వంటి వివిధ ప్రక్రియల్లో ప్రవేశం పొందారు. అమరకోశాన్ని కంఠస్థం చేశారు. అన్నగారి వీధి బడిని తాను నడుపుతూ అందులోని విద్యార్థులనే పృచ్ఛకులుగా నియమించుకుని సమస్యాపూరణం వంటి వివిధ రంగాలతో అష్టావధానాన్ని సాధన చేసి తనను తాను తీర్చిదిద్దుకున్నారు. సిరిపురంలో జమీందారు పిల్లలకు కొంత కాలం చదువు కూడా చెప్పారాయన.
కేశవదాసు మొదటిసారి అష్టావధాన ప్రక్రియను భద్రాచలంలో ప్రదర్శించారు. ఆ తర్వాత హుజూర్‌నగర్‌, జగ్గయ్యపేట, తమ్మర, తిరువూరు, కందిబండ మొదలైన చోట్ల అష్టావధానాలు చేసి పండితులతో ప్రశంసలందుకున్నారు. ఇక హరికథలు చెప్పడంలో కేశవదాసుది ఎదురులేని ప్రావీణ్యం. పొలంపల్లి, దుబ్బాకుపల్లి, ఖమ్మం, జక్కేపల్లి, కోదాడ, తమ్మర వంటి లెక్కలేనన్ని చోట్ల హరికథలు చెప్పి కీర్తి, ధనం సంపాదించారు. అష్టావధానిగా, హరిదాసుగా నాటి తెలుగు సమాజంలో కేశవదాసుది ఒక ప్రత్యేక స్థానముండేది. ఒకసారి కృష్ణా జిల్లాలో పర్యటిస్తున్న సందర్భంలో జగ్గయ్యపేటలో లక్ష్మీకాంతయ్య ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అష్టావధానం చేశారు. అందులో ఆయన సాహితీ పాండిత్యాన్ని, భాషామార్దవాన్ని, భావసౌందర్యాన్ని, ధారాశుద్ధిని మెచ్చుకుని తమ నాటక సమాజంలో చేరి రచయితగా, నటునిగా పని చేయవలసిందిగా కోరారు లక్ష్మీకాంతయ్య.

అక్కడ్నించి వారి జీవనశైలి అనేక మలుపులు తిరుగుతూ వచ్చింది. రచయితగా, నటునిగా, దర్శకునిగా పరిణతిచెంది ‘కనక్తార’ (1911), ‘బలిబంధనం’ (1935) తదితర నాటకాలు రాశారు. ఇంకా కేశవదాసు ‘రుక్మాంగద’, ‘పాదుకా పట్టాభిషేకం’, ‘సీతా కళ్యాణం’, ‘భక్త అంబరీష’ తదితర నాటకాలను కూడా రాసినట్లు ఆంధ్ర నాటకరంగ చరిత్రలో మిక్కిలినేని రాధాకృష్ణమూర్తి పేర్కొన్నారు. కాగా ఈ రచనలేవీ అందుబాటులో లేకపోవడం దురదృష్టకరం.
కాగా, నాటక రంగంలో చందాల కేశవదాసు ఎదురులేని పేరు ప్రఖ్యాతులతో ఒక వెలుగు వెలిగిపోతున్న సమయంలో సినిమా రంగం ఆహ్వానం పలికింది. అప్పటి దాకా భారతదేశమంతటా మూగ సినిమాలు ఆడేవి. 1931 మార్చి 15న దేశంలో తొలిసారిగా ‘ఆలం ఆరా’ అనే మాటలతో కూడిన సినిమా వచ్చింది. ఇదే తొలి భారతీయ టాకీ. అదే యేడాది తెలుగులో కూడా టాకీ చిత్రం తీయాలనుకుని ”భక్త ప్రహ్లాద” చిత్రం (1931-32)న ప్రారంభించారు. ఆ చిత్రంలో పాటలు రాయడానికి మన చందాల కేశవదాసును ఆహ్వానించడంతో ఆయన సినీ జీవితం మొదలైంది. ఈ చిత్ర దర్శకుడు హెచ్‌.ఎం.రెడ్డి. ఈయన కూడా హైదరాబాదుకు చెందిన వాడేనన్న వాదనలున్నవి. ఈయన హైదరాబాదు సంస్థానంలో పోలీస్‌ ఇన్‌స్పెక్టర్‌గా పని చేశారు. హైదరాబాదులో ప్లేగు వ్యాధి వచ్చినప్పుడు ఆయన కుటుంబం బెంగుళూరుకు వలస వెళ్లింది. ఈ చిత్రంలో ప్రహ్లాదునిగా కృష్ణాజిరావు షిండే, హిరణ్యకశ్యపునిగా మునిపల్లె సుబ్బయ్య, లీలావతిగా సురభి కమలాబాయి నటించారు. ఈ చిత్రంలో ఈమె పాడిన ”పరితాప భారంబు భరియింప తరమా” పాటనే చందాల కేశవదాసు సినిమాకు రాసిన తొలిపాట. ఇదేగాక ఈమెనే పాడిన ”తనయా ఇటులన్‌ తగుపలుకు”, మునిపల్లె సుబ్బయ్య పాడిన ”భీకరమగు నా ప్రతాపంబునకు భీతిలేక ఇటు చేసెదవా” రెండు పాటలు కూడా చందాల వారు రాశారు. అయితే చిత్రంలో రంభ పాడిన ”వింతాయెన్‌ వినన్‌ సంతసమాయెనుగా దేవేంద్రా” అనే పాట కూడా వొకటుంది. ఇది ధర్మవరం వారు ”భక్త ప్రహ్లాద” నాటకం రాసినపుడే రాయగా ఈ పాటను నాటకాన్ని సినిమాగా తీసినపుడు కూడా అట్లానే ఉంచేశారు. దీంతో తొలి సినిమా పాట రచయిత కూడా ధర్మవరం వారేననే వాదన ఒకటి ప్రారంభించారు ఆ మధ్య. కనీసం ధర్మవరం వారి పాటను తొలి సినిమా పాటగా, చందాల వారిని తొలి తెలుగు సినీ కవిగా పరిగణించాలని రాశారు కూడా. కానీ కేవలం సినిమా కోసం రాసిన పాటనే సినిమా పాటగా భావించాల్సి ఉంటుంది గనుక చందాల కేశవదాసు గారే తొలి తెలుగు సినీ కవిగా చరిత్ర కెక్కారు. అందుకే ఆయన తెలుగు సినిమా వాచస్పతిగా చరిత్రకెక్కారు.
‘భక్త ప్రహ్లాద’ (1931-32) తరువాత కేశవదాసు గారు రచయితగా పని చేసిన సినిమా ‘సతీసక్కుబాయి’ (1935). భారతలక్ష్మీ ఫిలింస్‌ వారి ఈ చిత్రంలో ‘కృష్ణా పోబోకురా’, ‘రాదేల కరుణా’, ‘ఆటలాడు కోరా’, ‘పాలుమీగడ పలుమార్లు భుజియించి’, ‘పాషాణ మెటులైతివో’, ‘జాగేలా కావగ రారుగా’ పాటలు రాశారాయన. చిత్రంలోని శ్రీకృష్ణుని పాత్రధారి తుంగల చలపతిరావు, సక్కుబాయి పాత్రధారిణి దాసరి కోటిరత్నం ఈ పాటలు పాడారు. ఆ రోజుల్లో ప్లే బ్యాక్‌ పద్ధతి లేదు. నటీనటులు ఎవరి పాటలు వారే పాడుకునేవారు. 1935లోనే సి.పుల్లయ్య దర్శకత్వంలో వచ్చిన కాశీ ఫిలింస్‌ వారి ”శ్రీకృష్ణ తులాభారం’తో కేశవదాసు సినీ కవిగా ఉన్నత స్థానానికి చేరుకున్నారు. ఈ చిత్రంలో రాసినవి మూడు పాటలు. అవి ”భలే మంచి చౌకబేరము”,”మునివరా తుదికిట్లు నానున్‌ మోసగింతువా”, ”కొట్టు కొట్టండి బుర్ర పగలు గొట్టండి”. వీటిలో ”భలే మంచి చౌకబేరము” పాట బహుళ జనాదరణ పొందింది. అయితే ఈ మూడు పాటలను ఆ తరువాత మరో రెండుసార్లు ”శ్రీకృష్ణ తులాభారం” చిత్రాన్ని 1955, 1966ల్లో నిర్మించినపుడు కూడా వాడుకున్నారు. అది మన కేశవదాసు గారి కవితా వైభవానికి నిదర్శనం. 1966లో డి.రామానాయుడు తీసిన చిత్రంలో దాసుగారి పాటలు వాడుకుని వారి పేరును సినిమాలో గాని, పాటల పుస్తకంలో గాని వేయలేదు. ఇది గమనించిన వారి కుటుంబ సభ్యులు 1970లో ఖమ్మం కోర్టులో కేసు వేయగా దిగివచ్చిన నిర్మాతలు సినిమా టైటిల్స్‌లో ఆయన పేరు వేశారు.
కేశవదాసు గారు 1935లో మూడు సినిమాలకు రచయితగా పని చేశారు. ఆ మూడో సినిమా ”సతీ అనసూయ” ఈ సినిమాకు స్క్రిప్టుతో సహా మాటలు, పాటలు రాశారాయన. అలా కేశవదాసు పూర్తి స్థాయిలో రచయితగా పని చేసిన చిత్రం ఇది. ఈ సినిమా పాటల పుస్తకంలో ”అనసూయ” స్క్రిప్టు పట్టుకుని ఉన్న దాసుగారి ఫొటోను ప్రచురించడం విశేషం. అలాంటి సందర్భం సినీ చరిత్రలో ‘నభూతో న భవిష్యతి’గా చెప్పుకోవచ్చు. ”దేవుని దయ ఉంది ఐలెసో”, ”ప్రహ్లాదుగావ స్తంభమునందు నృహరివై”, ”మాత”యని మాట విని, ”కురుతే గంగా సాగర గమనం” వంటి పాటలు సతీ అనసూయలో దాసుగారు రాసినవే.
ఆ తరువాత దాసుగారికి సినిమా అవకాశాలు వరుస కట్టినవి. 1936లో ”లంకా దహనం” చిత్రానికి పని చేశారు. వాస్తవానికి రంగ స్థలంపై ఆయనకు ఎనలేని పేరు ప్రఖ్యాతులు తెచ్చిన ”కనక్తార’ నాటకం విజయం వల్లనే చందాల వారికి సినిమా అవకాశాలు వెదుక్కుంటూ వచ్చినవి. ”ద్రౌపదీ వస్త్రాపహరణం” తీసిన సరస్వతీ టాకీస్‌ వారు కనక్తార సినిమాను హెచ్‌.వి.బాబు దర్శకత్వంలో నిర్మించారు. దొమ్మేటి సూర్యనారాయణ, కన్నాంబ, ఆరణి సత్యనారాయణ, కడారు నాగభూషణం, గంగారత్నం ప్రధాన పాత్రధారులు. రంగస్థలంపై ‘కనక్తార’గా చెలామణి అయినా నాటకం వెండి తెర మీదికి వచ్చేసరికి ”కనకతార” అయింది. ”దప్పిచే నాలుక తడిపొడి లేక” పద్యం, ”ఎంత బాగుండది సక్కని గుంటారాయే నా”, ”యేంటి అబ్బో నా వొల్లు మంటెత్తుతాది” పాటలు బహుళ జనాదరణ పొందినవి. ఇదే సినిమాను 1956లో మరోసారి తీసినపుడు కూడా దాసుగారి పాటలను యధాతథంగా వాడుకున్నారు. ఆ తరువాత ‘రాధాకృష్ణ’ (1939)లో గతంలో దాసుగారు రాసిన ‘రాధాకృష్ణ’ నాటకంలోని కొన్ని పాటలు వాడుకున్నారు. ఇంకా ‘లంకా దహనం’ (1936), బాలరాజు (1948) చిత్రాలకు పాటలు రాశారాయన.
సినిమాలకు దూరమైన తరువాత కలకత్తా నుండి తిరిగివచ్చి జక్కేపల్లిలో హరికథలు చెప్పనారంభించారు. కాని సినిమా రంగంలోకి వెళ్లి రావడం వల్ల అవకాశాలు ఎక్కువగా రాలేదు. ఇంతలో తెలంగాణ ప్రాంతంలో నిజాం వ్యతిరేక ఉద్యమం తీవ్ర రూపు దాల్చుకున్నది. 1947లో భారతదేశానికి స్వాతంత్య్రం రావడంతో హైదరాబాదు సంస్థానాన్ని కూడా ఇండియన్‌ యూనియన్‌లో విలీనం చేయాలనే డిమాండ్‌ వచ్చింది. నిజాం పాలనలో దోపిడీపీడనలకు వ్యతిరేకంఆ ఉద్యమాలు ఉధృతమయ్యాయి. ఈ పోరాటాల్ని అణచి వేయడానికి రజాకార్లతో ప్రజలపై దాడులు చేయించాడు నిజాం నవాబు. ఆ రజాకార్లు జక్కేపల్లిలో కేశవదాసు ఇంటిపై దాడి చేసి ధ్వంసం చేశారు. ఆ దాడిలో ఆయన ఆస్తిపాస్తులు, ధనమే గాక అంతకన్న విలువైన ఆయన సాహిత్య సంపద కూడా నాశనమైనది. ఆ తరువాత జక్కేపల్లి నుండి ఖమ్మంకి తన మకాంను మార్చారాయన. ఇది జరిగింది 1948 చివరి నాటికి. అటు నుండి కొడుకు కృష్ణమూర్తి వైద్య వృత్తి నిమిత్తం వారి కాపురం 1950లో నాయకన్‌గూడెంకు మారింది. కేశవదాసు గారు చివరి రోజులను నాయకన్‌ గూడెంలోనే గడుపుతూ అక్కడే 1956 మే 14న చివరి శ్వాస విడిచారు.
కేశవదాసు గారి రచనలో ప్రామాణికతలు సార్వకాలీనతలను చాటుతాయి. తొలి చిత్రం ” భక్త ప్రహ్లాద” (1931-32)కు రాసిన పాటలు, 1942లో తీసిన ”భక్త ప్రహ్లాద”లోనూ వాడుకున్నారు. ”శ్రీకృష్ణ తులాభారం” (1935)లో రాసిన పాటలు ఆ తరువాత 1956, 1966లోనూ, ”కనకతారకు” రాసిన కథ, పాటలు 1937, 1956లోనూ యధాతథంగా వినియోగించుకోవడం కేశవదాసు గారి రచన విశిష్టతకు నిదర్శనం.
వ్యక్తిగా కూడా ఉన్నతమైన విలువలు, ఆదర్శాలకు కట్టుబడి జీవించాడు. ఏనాడూ కుల వివక్షను పాటించని వారాయన. హెచ్చు తగ్గులు మన సంస్కారాన్ని బట్టిగాని, కులాన్ని బట్టికాదనే వారు. ఎవరైనా దీనిని వ్యతిరేకిస్తే వాదించి మెప్పించేవారు. జక్కేపల్లికి దగ్గరలో ఉన్న రాజపేటకు చెందిన వెంకయ్య అనే దళితుడు దాసుగారి హరికథలు విని మురిసి పోయేవారు. ఆయన వీరాభిమాని. ఇదంతా గమనించిన దాసుగారు ఒకనాడు అతని బీదరికాన్ని చూసి తరచూ తన ఇంటిలో భోజనం పెట్టించి పక్కనే కూర్చుని విసనకర్రతో గాలి విసిరేవారు. ఈ వొక్క సంఘటన కేశవదాసు గారి వ్యక్తిత్వం ఎంత గొప్పదో తేట తెల్లం చేస్తుంది. ఆయన జాతీయవాదిగా పలు దేశభక్తి రచనలు చేశారు. వాటిలో కొన్నింటిని బెంగుళూరులోని గ్రామ ఫోను కంపెనీ వారు రికార్డులుగా విడుదల చేసింది. మోతీలాల్‌ స్మృతిలో రాసిన పాటలు వాటిలో కొన్ని. ఇవి మాత్రమే గాదు. కేశవదాసు గారి సాహిత్య జీవితంలో శాశ్వతంగా నిలిచిపోదగినది వొకటుంది. అదే తెలుగు సమాజంలో ఏ నాటకానికైనా ప్రారంభానికి ముందు పాడే ‘పరబ్రహ్మ పరమేశ్వర – భళిరా హరి మహిమం బెరుగగ బ్రహ్మాదులు తరమా’ అనే ప్రసిద్ధ కీర్తన. ఈ కీర్తన మన చందాల వారి కలం నుండి జాలు వారినదే. తన అర శతాబ్ద కాలంలో చేసిన సాహిత్య సేవలకు గుర్తింపుగా ‘కలియుగ దశరథ’, ‘నటకావతంస’, ‘ఆంధ్రసూత’ వంటి బిరుదులతో సత్కారాలు పొందారు.
బహుముఖ సాహితీ ప్రాజ్ఞుడుగా చందాల కేశవదాసు తెలంగాణ సాహితీ చరిత్రలో ఒక ధ్రువతారగా నిలిచిపోయారు. నూతన తెలంగాణ రాష్ట్రంలో ఆయన స్మారకార్థం రాష్ట్ర ప్రభుత్వం, ప్రసిద్ధ సాహిత్య సంస్థలు విస్తృతమైన కార్యక్రమాలు చేపట్టడమేగాక ఆయన విగ్రహాన్ని రాచకొండలో నిర్మించబోయే ఫిలింసిటీలో ఏర్పాటు చేయాలి. అదే కేశవదాసు గారికి నిజమైన నివాళి కాగలదు.

  • నహెచ్‌.రమేష్‌బాబు
    9440 925 814

సశేషం

మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -25-2-22-ఉయ్యూరు

Posted in సినిమా | Tagged | Leave a comment

  మన మరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు-92

  మన మరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు-92

·         92-తోలి సినీ గీతరచయిత ,నటుడు ,గాయకుడు ,శతావధాని ,’’పరాబ్రహ్మ పరమేశ్వర ‘’పాట ఫేం ,సినీవాచస్పతి,ఆంద్ర సూత  –చందాల కేశవదాసు -3

అనుయాయులు, శిష్యులు

1950-51 లో బేతవోలు వాస్తవ్యులైన ముడుంబై వేంకటాచార్య గారికి కేశవదాసు ఓ హరికథలో పరిచయం అయ్యారు. ఆచార్యులు వైద్యవృత్తిపై తనకున్న ఆశక్తి వలన దాసుగారి కుమారుడు కృష్ణమూర్తి డాక్టరని తెలుసుకుని ఆయన దగ్గర కాంపౌండర్ గా నాయకన్ గూడెం వచ్చి చేరారు. ఆయన ఒకనాడు ద్రాక్షరసం అనుకుని హైడ్రో క్లోరైడ్ త్రాగితే అయి విషంగా వికటించింది. దాంతో దాసుగారు స్వయంగా ఖమ్మం వెళుతున్న నైటు హాల్టు బస్సును వెనక్కి మళ్ళించి ఆయన్ని సూర్యపేట తీసుకు వెళ్ళి మద్రాసు నుంచి ‘ప్రోనట్’ అనే ఇంజక్షన్ తెప్పించి డా.శర్మగారితో వైద్యం చేయించి బ్రతికించారట. ఇద్దరు శిష్యులు తమ పుస్తకాలను దాసు గారివద్ద పరిష్కరింప జేసుకున్నారు వారు. బొర్రా కోటయ్య చౌదరీ అనే మాజీ కస్టమ్స్ అధికారి ‘భారత కర్మాగారము’ అనే సాంఘిక నాటకాన్ని రచించి దాన్ని దాసుగారితో పరిష్కరింప జేసుకున్నారు. దాసుగారి లాగానే దాన్ని రామాంకితం చేసారు. దబ్బాకుపల్లి డా చింతాల సుబ్బారావు రెండవ వారు ఆయన మాధవ శతకమును పరిష్కరింపజేసుకున్నారు.

వివాదాలు

1. శ్రీకృష్ణతులాభారం నాటకానికి చందాల కేశవదాసు 22 పాటలు రాశారు. ఈ పాటలతో నాటకాన్ని ‘మైలవరం బాలభారతి నాటక సమాజం’ వారు చాలాసార్లు ప్రదర్శించారు. ఈ పాటల్లో బలే మంచి చౌక బేరము, మునివరా, కొట్టు కొట్టండిరా అనే మూడు పాటలే సినిమాల్లోకి ఎక్కాయి. (పైడిపాల రాసినట్లుగా) 1935, 55, 66 సంవత్సరాల్లో తీసిన మూడు సినిమాల్లోనూ ఈ మూడు పాటలున్నాయి. కేశవదాసు కుమారులు కృష్ణమూర్తి… రామానాయుడు మీద ఖమ్మం కోర్టులో కేసు గెలిచిన ఫలితంగా 1966లో సురేశ్ ప్రొడక్షన్స్ వారు తీసిన ‘శ్రీకృష్ణ తులాభారం’ సినిమా టైటిల్స్‌లో కేశవదాసు పేరు చేర్చడం జరిగింది.[5]

2. పానుగంటి లక్ష్మీనరసింహారావు రాసిన ‘రాధాకృష్ణ’ నాటకానికి కేశవదాసు 21 పాటలు రాశారు. అయితే, మొదట కవిగారు పాటలు చేర్చడానికి ఒప్పుకోలేదు. కాని మైలవరం బాలభారతి నాటక సమాజం పెద్దలు ఆయన్ని ఒప్పించారు. భక్తిగీతాలు మాత్రమే రాయాలని కవిగారు షరతు పెట్టి కేశవదాసుగారి పాటలతో నాటకాన్ని ప్రదర్శించడానికి ఒప్పుకున్నారు. ఈ పాటలను 1929లో కురుకూరి సుబ్బారావు అచ్చువేశారు.[5]

3. సురభి నాటకంలోని మూడు పాటల్ని సినిమాలోకి ఎక్కించారని ‘ముక్తకంఠం’తో చెప్పిన పెద్దలు గౌరవనీయులు- వారి మాట శిరోధార్యమే. కాని నాటకం నుండి సినిమాకెక్కాయా? సినిమా నుండి నాటకంలోకి దిగినాయా? అనే సందేహానిక్కూడా ఆస్కారం ఉంది. ఎందుకంటే దాసు గారిపై పరిశోదన చేసిన డా॥ఎం.పురుషోత్తమాచార్య తండ్రిగారు వెంకట నరసింహాచార్యులు దాసుగారి సమకాలికులు. జగ్గయ్యపేటలో ఒక హరికథాగానంలో ఉండగా హెచ్.ఎం.రెడ్డిగారి నుండి పిలుపు వచ్చిందనీ, తాను వెళ్లి ‘ప్రహ్లాద’ సినిమాకు పాటలు రాసి వచ్చాననీ దాసుగారు చెప్పినట్లు తెలియజేసారు.[5]

జక్కేపల్లి ఇంటిపై రజాకార్ల దాడి

1946లో విసునూరి దేశ్ ముఖ్ రామచంద్రారెడ్డి తన మనుషులతో దొడ్డి కొమురయ్యను చంపించగా మొదటి సాయుధపోరాటం ప్రారంభం అయ్యింది. 1947 లో అప్పటి నైజాం రాష్ట్రం అంతా 8 నిజాం ఉస్మానలీ పాలనలోకి వచ్చింది.అజాద్ హైద్రాబాద్ నినాదంతో ఆయన ఇత్తేహాద్ ఉల్ ముస్లిమీన్ నాయకుడు కాశిం రజ్వీ నాయకత్వాన ‘రజాకార్’ సైన్యం ఏర్పాటు చేసాడు. చివరకు రజాకార్ దళాల చేతిలో కీలుబొమ్మగా మారి వారినుంచి తన అధికారం కాపాడుకునేందుకు వారిని గ్రామాలపై దోపిడీలకు ఉసిగొల్పాడు. దీన్ని వ్యతిరేఖించిన స్టేట్ కాంగ్రెస్, కమ్యూనిస్టు పార్టీ, ఆంద్రమహాసభ సంఘలు సమైఖ్యంగా సత్యాగ్రహపు పోరాటాలకు పిలుపునిచ్చాయి. అదే పిలుపులో బాగంగా రజాకార్ దళాల అకృత్యాలకు నిరసన గళం వినిపించారు దాసుగారు సైతం. ఈ వ్యతిరేఖను సహించలేని రజాకార్లు మరింత సైన్యాన్ని జతచేసుకుని ముమ్మరంగా దాడులను చేయడం మొదలేసింది. అందులో బాగంగానే 1948 జూలైలో రజాకార్లు జక్కేపల్లిలో ప్రవేశించి భీభత్సం సృస్టించారు. కేశవదాసు ఇంటిని దోచుకున్నారు. ఆయన రచనా సంపద, వస్తు సామగ్రి, ఆస్తిపాస్తులు ధన దాన్యాలు దోపిడీకి గురయ్యాయి. ఆ సంవత్సరం చివర్లో తన పొలాలను నమ్మకస్తులకు అప్పగించి దాసు గారు కుటుంబంతో సహా జక్కేపల్లి నుంచి ఖమ్మం చేరారు. కానీ కృష్ణమూర్తి గారి వైద్య వృత్తి సాధనకు ఖమ్మం కంటే ఏదైనా గ్రామీణ ప్రాంతం బావుంటుందని ఓ రెండేళ్ళ అనుభవంలో గ్రహించి 1950లో నాయకన్ గూడెం చేరారు.

మరణం

1950లో నాయకన్‌గూడెంకు మారింది. కేశవదాసు గారు చివరి రోజులను నాయకన్‌ గూడెంలోనే గడుపుతూ అక్కడే 1956 మే 14న అంటే దుర్ముఖ నామ సంవత్సర వైశాఖ శుద్ధ పంచమి నాడు చివరి శ్వాస విడిచారు.[3]

చివరిగా తమ్మర దర్శనం

1956 ఏప్రిల్ లో మనసుకి ఊరటకావాలంటే గతంలో వెళ్ళినట్లే తమ్మర సీతారామచంద్రుని దర్శనం కోసం వెళ్ళారట. కానీ మునుపటి ఉత్సాహం వారిలో లేదు ఎందు కంటే అక్కడ ఎప్పటిలా తన చిన్ననాటి స్నేహితులు నరసింహాచార్యులు, హనుమచ్ఛాస్త్రి, పాపట్ల లక్ష్మీకాంతయ్య మొదలైన వారు కనిపించలేదు. వారు అప్పటికే పరమపదించారు. అంతా శూన్యంగా అనిపిస్తుంటే అలా గోడకు చేరగిల పడి అప్పటి దేవాలయ ధర్మకర్తలలో ఒకరైన నారపరాజు నారాయణ రావు గారితో నిర్వేదంగా అంపశయ్యమీద స్వయం మరణాన్ని కోరుకున్న భీష్ముడిలా ఇలా అన్నారట. ఇప్పటికే 80, 90 ఏళ్ళు వచ్చేశాయి. నేను తెలిసిన వాళ్ళు, నాకు తెలిసిన వాళ్ళు గతించి పోయారు. చేయాల్సిన చేయగల పనులన్నీ భగవంతుడి దయమేరకు కుదిరినంతా చక్కబెట్టేశాను. పిల్లలను పెంచి ప్రయోజకులను చేసాను. ఇహ ఉండి ఎందుకు ఒక్కణ్ణి ఏకాకిని ప్రయాణానికి సిద్దమవుతాను అన్నారట తమ్మరనుంచి తిరిగి వచ్చిన తర్వాత ఉపాసనాధ్యాన లక్షణాలు మరింతగా పెరిగాయట, ఆహార తీసుకోవడం బాగా తగ్గించారట. ఎప్పటిలాగానే మే 14న రామనామ స్మరణతో నిద్రలేచిన దాసుగారు స్నానాదికాలు ముగించుకుని నిలువు నామాలు పెట్టుకుని ఆరోజు కొడుకు కృష్ణమూర్తిని ఎక్కడికీ వెళ్ళవద్దని ఆదేశించారట. నవ్వుముఖంతో ప్రశాంతమైన వదనంతో ఇంట్లోవారందరినీ, ఇంటినీ ఒకసారి కలియజూసి కన్నులు మూసుకుని ధ్యానంలోకి జారిపోయారట. అలా ధ్యానం చూస్తుండగానే దీర్ఘ నిద్రయై వారికి ఇష్టమైన తమ్మర రామునిలో లీనంమై పోయిందని కుటుంబ సభ్యులు కళ్ళకు కట్టినట్లు చెప్తున్నారు.

Posted in సినిమా | Tagged | Leave a comment

మన మరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు-92

మన మరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు-92

92-తోలి సినీ గీతరచయిత ,నటుడు ,గాయకుడు ,శతావధాని ,’’పరాబ్రహ్మ పరమేశ్వర ‘’పాట ఫేం ,సినీవాచస్పతి,ఆంద్ర సూత,కలియుగ దశరధ   –చందాల కేశవదాసు -2

ఉన్నత వ్యక్తిత్వం

వ్యక్తిగా కూడా ఉన్నతమైన విలువలు, ఆదర్శాలకు కట్టుబడి జీవించాడు. ఏనాడూ కుల వివక్షను పాటించని వారాయన. హెచ్చు తగ్గులు మన సంస్కారాన్ని బట్టిగాని, కులాన్ని బట్టికాదనే వారు. ఎవరైనా దీనిని వ్యతిరేకిస్తే వాదించి మెప్పించేవారు. జక్కేపల్లికి దగ్గరలో ఉన్న రాజపేటకు చెందిన వెంకయ్య అనే దళితుడు దాసుగారి హరికథలు విని మురిసి పోయేవారు. ఆయన వీరాభిమాని. ఇదంతా గమనించిన దాసుగారు ఒకనాడు అతని బీదరికాన్ని చూసి తరచూ తన ఇంటిలో భోజనం పెట్టించి పక్కనే కూర్చుని విసనకర్రతో గాలి విసిరేవారు. ఈ వొక్క సంఘటన కేశవదాసు గారి వ్యక్తిత్వం ఎంత గొప్పదో తేట తెల్లం చేస్తుంది. ఆయన జాతీయవాదిగా పలు దేశభక్తి రచనలు చేశారు. వాటిలో కొన్నింటిని బెంగుళూరులోని గ్రామ ఫోను కంపెనీ వారు రికార్డులుగా విడుదల చేసింది.

హరికథా భాగవతార్ గా

హరికథలు చెప్పడంలో కేశవదాసుది ఎదురులేని ప్రావీణ్యం. పొలంపల్లి, దుబ్బాకుపల్లి, ఖమ్మం, జక్కేపల్లి, కోదాడ, తమ్మర వంటి లెక్కలేనన్ని చోట్ల హరికథలు చెప్పి కీర్తి, ధనం సంపాదించారు. అష్టావధానిగా, హరిదాసుగా నాటి తెలుగు సమాజంలో కేశవదాసుది ఒక ప్రత్యేక స్థానముండేది. ఒకసారి కృష్ణా జిల్లాలో పర్యటిస్తున్న సందర్భంలో జగ్గయ్యపేటలో లక్ష్మీకాంతయ్య ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అష్టావధానం చేశారు. అందులో ఆయన సాహితీ పాండిత్యాన్ని, భాషామార్దవాన్ని, భావసౌందర్యాన్ని, ధారాశుద్ధిని మెచ్చుకుని తమ నాటక సమాజంలో చేరి రచయితగా, నటునిగా పని చేయవలసిందిగా కోరారు లక్ష్మీకాంతయ్య. దాసుగారికి సంగీతం ఆరో ప్రాణం. పాపట్ల లక్ష్మీకాంతయ్య గారి సంగీత విద్యాప్రేరణతో ఆయన తనలోని సంగీతాభిరుచిని మెరుగుపరచుకున్నారు. ముఖ్యంగా లయశాస్త్రంపై ఎక్కువ దృష్టిపెట్టి ఎన్నో ప్రయోగాలు చేయడం వల్ల ఆయనను ‘లయబ్రహ్మ’ అనే బిరుదు అందుకున్నారు. జగ్గయ్య పేటలో జరిగిన హరికథా గానానికి ప్రముఖ వయోలిన్ విద్వాంసులు ద్వారం వెంకటస్వామి నాయుడు గారు వయోలిన్ సహకారం అందించడం బట్టి చూస్తే దాసుగారి సంగీత వైదుష్యం హరికథా గాన ప్రతిభ ఎంతటిదో సులభంగా అర్ధం చేసుకోవచ్చు. సంగీత విద్వాంసులు హుజూర్ నగర్ నివాసులైన యం వి యన్ ఆచార్య గారి స్వీయ పరిశీలన ప్రకారం దాసుగారి హరికథా గానంలో వారి గొంతులో ఒక పల్చటి బొంగురు లాంటి జీర వచ్చేదట అది కూడా వారి కథకు లోపంలా కాక ప్రత్యేక అందంలా అనిపించేదని అంటారు.

అష్టావధానిగా శతావధానిగా

కేశవదాసు ప్రాథమిక విద్యను తండ్రి వద్ద నేర్చుకున్నాడు. కాగా చిన్నతనాననే ఆయన మరణించడంతో తన అన్నగారైన వెంకటరామయ్య పోషణలో పెరిగారు. వెంకటరామయ్య బ్రహ్మచర్యం పాటిస్తూ ఆధ్యాత్మిక చింతనలో గడిపేవారు. ఆయన ఉపాధ్యాయునిగా పని చేసేవారు. అన్నగారి వద్దనే ఛందస్సు, అవధానం వంటి వివిధ ప్రక్రియల్లో ప్రవేశం పొందారు. అమరకోశాన్ని కంఠస్థం చేశారు. అన్నగారి వీధి బడిని తాను నడుపుతూ అందులోని విద్యార్థులనే పృచ్ఛకులుగా నియమించుకుని సమస్యాపూరణం వంటి వివిధ రంగాలతో అష్టావధానాన్ని సాధన చేసి తనను తాను తీర్చిదిద్దుకున్నారు. సిరిపురంలో జమీందారు పిల్లలకు కొంత కాలం చదువు కూడా చెప్పారాయన. వారినే వృచ్ఛకులుగా చేసుకుని తన అవధాన విద్యనూ సాధన చేసారు. కేశవదాసు మొదటిసారి అష్టావధాన ప్రక్రియను భద్రాచలంలో ప్రదర్శించారు. ఆ తర్వాత హుజూర్‌నగర్‌, జగ్గయ్యపేట, తమ్మర, తిరువూరు, కందిబండ మొదలైన చోట్ల అష్టావధానాలు చేసి పండితులతో ప్రశంసలందుకున్నారు.

భాగవత సప్తాహ నిర్వాహకునిగా

సప్త అంటే ఏడు అని అర్ధం సప్తాహము అంటే ఏడురోజులు నిర్వహించేది. బాగవత సప్తాహము బాగవత సంభందిత అంశాలతో ఏడు రోజులు నిర్వహిస్తారు. సప్తాహ్వః అని నిఘంటు ప్రకారం ఏడాకుల పొన్న చెట్టును కూడా పిలుస్తారు. ఏడురోజులనే ఎన్నుకోవడం వెనక తాత్త్విక కారణం ఏమిటంటే మనిషి ఎన్ని సంవత్సరములు బ్రతికినా అతడు బ్రతికినది ఆది, సోమ, మంగళ, బుధ, గురు, శుక్ర, శని – ఇంతకన్నా ఇక రోజులు లేవు. ఎనిమిదవ రోజు యికలేదు. ఎప్పుడు మరణిస్తాడు? ఈ ఏడు రోజులలోనే మరణిస్తాడు. ఎంత గొప్పవాడయినా వాడు పోవడానికి ఎనిమిదవ రోజు ఉండదు. ఎవ్వరయినా ఆ ఏడురోజులలోనే వెళ్లిపోవాలి. ఆ ఏడూ రోజులలోనే పుట్టాలి. ఆ ఏడురోజులలోనే ఉండాలి. ఆ ఏడు రోజులలోనే తిరగాలి. కాబట్టి భాగవత సప్తాహము ఏడు రోజులుగా నిర్వహిస్తారని ఒక వివరణ.

భాగవతమును శుకబ్రహ్మ పరీక్షన్మహారాజుగారికి ఏడురోజులు చెప్పారు. శ్రీ మద్భాగవత పఠన సప్తాహ సంప్రదాయం ప్రథమంగా పరీక్షిత్తునకు శ్రీ శుకమహర్షి వినిపింపచేయడంతో మొదలైంది. శ్రీకృష్ణుని నిర్యాణం తరువాత ముప్పది సంవత్సరాలకు కలియుగ ప్రవేశం జరుగుతుంది. భాద్రపద శుద్ధ నవమి నుండి పౌర్ణమి వరకు భాగవత సప్తాహంజరుపబడింది. దీనిఫలితంగా పరీక్షిత్తునకు మోక్షం లభించింది.అటువంటి బాగవత సప్తాహాలను కేశవదాసు గారు స్వయంగా భాద్యత తీసుకుని నిర్వహించే వారు.

శ్రీ శుకుడు నారదమహర్షి తో భాగవత సప్తాహ మహిమను తెలియజేసే రెండు విషయాలను గురించి తెలుసుకుందాం.

తుంగభద్రా నదీతీరంలో ఒక గ్రామంలో ఆత్మదేవుడు దుందులి అనే బ్రాహ్మణ దంపతులుండేవారు. వారికి సంతానం లేదు. ఒకరోజు ఒక సన్యాసి వచ్చి ఆత్మదేవునికి ఒక పండు ఇచ్చి, దానిని భార్య చేత తినిపించమని చెప్పి వెళ్లాడు. కాని దుందులి ప్రసవ వేదన బాధలకు భయపడి ఆ పండును తినలేదు. అపుడే గర్భంతో వున్న ఆమె సోదరి అక్కడికి వచ్చింది. అక్కకు సాయంగా ఉండాలనే తలంపుతో చెల్లెలు అక్కతో ఒక మాట చెప్పింది. ‘‘నాకు పుట్టబోయే బిడ్డ నీకు పుట్టినట్లుగా ప్రకటించి, నేను నీకు సహాయంగా ఉంటూ బిడ్డను కొన్ని సంవత్సరాలు సాకుతాను. ప్రతిఫలంగా మాకు కొంత ధన సహాయం చెయ్యి’’ అదేవిధంగా అక్క చెల్లెళ్లు ఇద్దరూ రహస్య అవగాహనకు వచ్చారు. దుందులి ఆ పండును ఆవుకు తినిపించి, తాను గర్భిణిగా నటిస్తూ వచ్చింది. చెల్లెలి కుమారునిగా ప్రకటించి సాకుతూ వచ్చింది. ఆ బిడ్డడి పేరు దుంధుకారుడు. సరిగ్గా అదే సమయం పండు తిన్న ఆవు మనుష్య శరీరంతోను, ఆవు చెవులతోను ఒక మగబిడ్డను కన్నది. దానికి గోకర్ణుడు అని పేరు పెట్టారు. ఆత్మదేవుడు ఇద్దరినీ సమానప్రేమతో పెంచాడు. గోకర్ణుడు సకల విద్యాశాస్త్రాలను బుద్ధితో అభ్యసించాడు. దుంధుకారుడు మాత్రం దుష్టుడై, ఆస్తిని ధ్వంసం చేసి ఇంటినుండి పారిపోయాడు. వీనిని గురించి దుఃఖించి తల్లిదండ్రులను మరణించారు. గోకర్ణుడు తీర్థయాత్రలకు వెళ్లిపోయాడు. తిరిగి వచ్చి ఇంటిలో నిద్రిస్తుండగా ఒక ప్రేతం భయంకరంగా కనిపించింది. గోకర్ణుడు మంత్రజలాన్ని ఆ ప్రేతంపై చల్లగా అది ఇలా అంటుంది. ‘‘అన్నయ్యా! నేను దుంధుకారుడను. నా దుస్థితి చూడు. మీరు ఎన్ని నీతులు చెప్పినా నేను వినలేదు. నాకు సద్గతి మార్గం చూపవా’’ అందుకు గోకర్ణుడు ‘‘తమ్ముడూ! నేను వెళ్లిన పుణ్యస్థలాల్లో నీ గురించి తర్పణలు విడిచాను. గయలో శ్రాద్ధం కూడా చేశా. ఐనా నీలో మార్పు రాలేదంటే ఆశ్చర్యంగా ఉంది’’ అని తమ్ముడితో అన్నాడు. ‘‘గయలో శ్రాద్ధం చేసినా నాకు విముక్తి రాలేదంటే నేను ఎంత పాపినో, నాకు నిష్కృతి లేదు’’ అంటూ అన్న ఎదుట విలపించాడు దుంధుకారుడు. ఒక నెల తరువాత చెప్తాను అని చెప్పి, గోకర్ణుడు సూర్యజపం ప్రారంభించాడు. సూర్యభగవానుడు కరుణించి భాగవత సప్తాహం చేయమని చెప్తాడు. అదేవిధంగా గోకర్ణుడు భాగవత సప్తాహాన్ని ప్రారంభించాడు. ఒక సద్బ్రాహ్మణుని ముఖ్యశ్రోతగా నియమించి, గోకర్ణుడు భాగవత పఠనాన్ని మొదలు పెట్టాడు. దుంధుకారుని ప్రేతం అక్కడ వున్న ఒక వెదురు చెట్టులో ప్రవేశించి దీక్షతో వినడం ప్రారంభించింది. ఆ చెట్టుకు ఏడు కణుపులు వున్నాయి. ఒక్కోరోజు శ్రవణం అవగానే ఒక్కొక్క కణుపు పెద్ద శబ్దంతో ప్రేలిపోసాగింది. ఏడవ శ్రవణంతో సంపూర్ణమైనందున ఏడవ కణుపు కూడా ప్రేలిపోయింది. దానిలో నుండి అత్యంత మనోహరుడు పీతాంబరిధారియై సాక్షాత్తూ శ్రీకృష్ణుని వలె దివ్య తేజస్సుతో మనుష్యరూపంతో వెలుపలికి వచ్చాడు. గోకర్ణుని పాదాలకు నమస్కరించాడు. ప్రేత రూపాన్ని దూరం చేసి తనను రక్షించినందుకు అన్నయ్యకు కృతజ్ఞతలు చెప్పుకున్నాడు. ఇంతలో వైకుంఠం నుండి విమానం ఒకటి వచ్చి, దేవదూతలు దుంధుకారుని ఆహ్వానించి, విమానంలో కూర్చోమన్నారు. అపుడు గోకర్ణుడు విష్ణుదూతలను ఇలా అడిగాడు. ‘‘ఓ దివ్యదూతలారా! ఇంతమంది విష్ణుపురాణం శ్రవణం చేస్తే ఈ ఒక్కరినే ఎందుకు ఆహ్వానిస్తున్నారు.?’’ అందుకు వారు ‘‘ఓ పుణ్యాత్ముడా! నీ ప్రశ్నబాగుంది. కాని వినటం మాత్రమే చాలదు. ఇంతమందిలో ఎందరు మనఃప్రాణాలను కేంద్రీకరించి విన్నారో చెప్పగలవా? శ్రవణమే కాదు, మననం కూడా చేయాలి. శ్రీకృష్ణ లీలాతత్త్వంలో ఏకమవ్వాలి. ఈప్రేతం అలా చేసి ప్రేతవిముక్తినే కాదు వైకుంఠ ప్రాప్తిని సాధించింది. అన్యధా శరణం నాస్తి త్వమేవ శరణం మమ అని ఆత్మార్పణ చేసుకోవాలి. ఇంకొక భాగవత సప్తాహం చేయండి. అపుడు దీక్షతో నీ వలె శ్రద్ధ్భాక్తులున్నవారు వైకుంఠప్రాప్తిని పొందగలరు’’ అని సమాధానం చెప్పారు. గోకర్ణుడు విష్ణుదూతల మాట విని మళ్లీ సప్తాహం చేశాడు. ఈసారి సాక్షాత్తు శ్రీహరియే అవధరించి, గోకర్ణునితోపాటు శ్రద్ధాసక్తులతో వినిన వారినందరిని శ్రీకృష్ణ స్వరూపులుగా మార్చి, తనతోనే వైకుంఠానికి తీసికొని వెళ్లాడు. ఓసారి అపార కృపావత్సలుడైన శ్రీమన్నారాయణుడు కలియుగంలో భాగవత సప్తాహ శ్రవణం చేసిన వారందరి హృదయాల్లోనూ నేను నివసించేటట్లు వరాన్ని ప్రసాదిం చాడు.

రంగస్థల నటుడిగా

మైలవరం కంపెనీ వారి బాలభారతి సమాజం పక్షాన నాటక ప్రదర్శనకోసం ఈయన జగ్గయ్యపేట, విజయవాడ, గుంటూరు, తెనాలి మొదలైన ప్రాంతాలు తిరిగారు.

స్వాతంత్రోద్యమంలో

1930-33 మధ్య మనదేశంలో స్వాతంత్రోద్యమం ముమ్మరంగా సాగుతున్నకాలం. సమకాలీన పరిస్థితులకు స్పందించడం కవుల విధి ముఖ్యంగా సామాజిక బావాలు అధికంగా గల దాసు గారు అందుకు తగినట్లు గానే తన మేధా శక్తితో ఉద్యమాన్ని కొన్ని దశలుగా విభజించి అసింహా పద్దతిలో పోరాటం నడుపుతున్న గాంధీగారి విధానాలకు ముగ్ధుడై గాంధీని తన రచనలతో ప్రశంసించకుండా వుండలేక పోయారు. ‘‘జయతు జై’’ అంటూ పాట రాయడమే కాక దానిని ఆకుల నరసింహారావు, యస్ రాజేశ్వర రావులతో పాడించి బెంగుళూరులో స్వంత ఖర్చులతో రికార్డు చేయించి ఉద్యమానికి దోహదకారి అయ్యేలా దానిని విడుదల చేసారు. అనేక స్థానిక పోరాటాలలో ఆయన ప్రత్యక్షంగా పరోక్షంగా పాల్గొన్నారు. తన ప్రాంతంలో నిరంతర స్పూర్తిని నింపడంలో ముఖ్య భూమిక పోషించే వారు.

కులవ్యవస్థలో ఆధిపత్య దోరణిని అణచివేత దోరణులను దుయ్యబట్టే వారు తన చర్యల ద్వారా కూడా వాటిని ఆక్షేపించేవారు. జక్కేపల్లి దగ్గరున్నరాజుపేటకు చెందిన వెంకయ్య అనే హరిజనుడు దాసుగారి హరికథలను విని మురిసిపోయేవాడట. ఆయన బీదరికాన్ని చూసి చలించి పోయి ఆయనను ఇంటికి పిలిచి పక్కన కూర్చుని భొజనం పెట్టంచడమే కాకుండా విసనకర్రతో విసిరే వారట.

అన్నగారి వెంకట్రామయ్య నుంచి పొందిన ఆధ్యాత్మిక గుణాలను ధ్యానం తపస్సు ఉపాసనలను గాంధిపద్దతిలో మేళవించి తన సేవా గుణాన్ని జోడించి ప్రజల్లో జాతీయ భావం పెంపొందేందుకు వీలుగా తన జీవితం మొత్తాన్ని మలచుకోవడమే కాదు. వందలాది సప్తాహ కార్యక్రమాల్లో అదే పద్దతిలో జాతీయ భావాన్ని ఉద్భోదించేలా మాట్లాడేవారట.

గుప్త దాతగా

·         తన ఇంటి నిర్మాణం కోసం దాచుకున్న కలపను సీతారామచంద్రస్వామి రథగోపుర నిర్మాణానికి వాడారు.

·         తమ్మరలో గాలిగోపురం, ధ్వజస్తంభం పనులు డబ్బులేక ఆగిపోతే ఇంటికి మనిషిని పంపించి బార్యచేతి బంగారు గాజులు తెప్పించి అమ్మారు.

·         జగ్గయ్య పేటలో సప్తాహం పూర్తయిన తర్వాత పండిత సత్కారాలకు డబ్బు సరిపోకపోతే తన చేతి బంగారు కంకణాన్ని అమ్మారు.

·         నల్గొండ జిల్లా హుజూ‌ర్‌న‌గర్‌ దగ్గర్లో వున్న సీతా‌రా‌మ‌చం‌ద్రస్వామి ఆల‌యా‌నికి గాలి‌గో‌పురం నిర్మిం‌చారు.‌

·         ఒంటి‌మి‌ట్ట‌లోని కోదం‌డ‌రా‌మ‌స్వామి ఆల‌యాన్ని జీర్ణో‌ద్ద‌రణ కావిం‌చారు.

·         ఆరోజులలో భద్రాచలం శ్రీరాముడ్ని దర్శించుకునేందుకు తిరువూరు మార్గం నుండి వేళ్లే భక్తులకు తిరువూరులో సత్రాలు ఏర్పాటుచేశారు. వీటిల్లో భక్తులకు ఉచిత అన్న దానం చేశారు. దీనికి సంబంధించిన ఖర్చులను కేశవదాసు భరించేవారు.

·         తిరువూరు సత్యనారాయణ స్వామి ఆలయం ఎదురుగా ఆర్ టి సి బస్టాండు ప్రహారీ గోడను ఆనుకుని ప్రస్తుతం వున్న దాసుగారి బావి అని పిలవబడుతున్న బావి అప్పట్లో భద్రాచలం వెళ్లే యాత్రికుల సౌకర్యంతోపాటు గ్రామ నీటి అవసరాలకు కూడా ఉపయోగపడాలని తవ్వించినదే.

·         కోదాడ మండలం తమ్మరలో సీతారామచంద్రస్వామి ఆలయానికి గాలిగోపురం నిర్మించారు. ఆలయానికి సంభందించిన వింజామరలల వంటి అనేక వస్తువులు అవసరమైన మరమత్తులు, అదనపు హంగులకు సాయపడ్డారు

·         కనక్తార పినిమా పనులు పూర్తికాగానే కలకత్తానుంచి తిరిగి వస్తుండగా నిర్మాత దాసుగారి చేతిలో 600 రూపాయిలు పెట్టారట వెంటనే దాసు గారు ఆ డబ్బుతో తమ్మర స్వామికి రెండు చామరాలు (విసనకర్రలు) ఞక భూచక్ర గొడుగు కొని తీసుకు వచ్చి స్వామికి సమర్పించినాకనే అప్పటి వారి నివాసం జక్కేపల్లికి వెళ్ళారట

·         పోలంపల్లిలో కనక్తార నాటకం వేయించగా వచ్చిన పదివేల రూపాయిలను అక్కడి గ్రంధాలయానికి పుస్తకాలు బీరువాలు కోసం వినియోగించారు.

యోగ సాధన

కేశవదాసు చిన్నప్పటినుంచే ఆధ్యాత్మిక గోష్టుల పట్ల చాలా శ్రధ్ద చూపే వాడు, ప్రాధమిక విద్య అంతా తండ్రి దగ్గరే పూర్తి చేసుకున్నప్పటికీ, తండ్రి లక్ష్మీనారాయణ దాసు గారి చిన్నతనంల లోనే దూరం కావడంతో అన్న వెంకట్రామయ్య దగ్గర పెరిగాడు. వెంకట్రామయ్య ఉపాధ్యాయునిగా పనిచేస్తూనే ఉపాసనా విధ్యను సాధన చేసే వారు. బ్రహ్మచర్య వ్రతావలంబకులు తమ్ముడు దాసుకు ఉపాసన విద్యను, రామనామ మంత్రాన్నీ ఉపదేశించింది వెంకట్రామయ్య గారే. కానీ తమ్ముడిని తనలా ఆజన్మ బ్రహ్మచారిగా వుండకుండా వివాహమాడి వంశోధ్ధారణ చేయమని ఆదేశించారు. హరికథకులు కృష్ణాజిల్లా వత్సవాయి మండలం పోలంపల్లి గ్రామం లోని ఒక యోగి పుంగవులు శ్రీ నాగ దాసు గారి ఆద్యాత్మిక జీవితాన్ని అద్యయనం చేసి వారిపై నాగదాసు గారి గురించి హరికథ కూడా వీరు రాశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం పట్టణ సమీపంలోని సుజాత నగర్ బస్ స్టేజీ దాటిన తర్వాత వచ్చే కొండగుహలన్నింటినీ తిరిగి అంకమ్మ విగ్రహం చెక్కి కొంతకాలం సాధన చేసారు. దానికి పసుపు గుడ్డ చుట్టి స్టేజికి సమీపంలో ఒ గుడికట్టి అందులో విగ్రహాన్ని స్థాపించారు. అదే అంకమ్మ గుడి అది ఇప్పటికీ వుంది.

రచనలు

ముద్రితాలు

ఈ పుస్తకములు ముద్రణకు నోచుకున్నవి కానీ ప్రతులు బొత్తిగా అరుదైపోయినవి స్వల్పంగా అక్కడక్కడా దాచబడిన ప్రతులను పూర్తిస్థాయిలో అందుబాటులోకి తీసుకు వచ్చే ప్రయత్నం చేయవలసి వుంది

·         కేశవ శతకం

·         కనకతార – (1926) నాటకం

·         కనక్తార పాటలు

·         బలి బంధనం – (1935) ఆరు అంకముల నాటకం

·         శ్రీరామ నామామృత గేయము (1922) [4]

·         సీతాకళ్యాణం

·         రుక్మాంగద

·         మేలుకొలుపులు

·         జోలపాటలు

·         సత్యభామా పరిణయం (హరికథ)

·         సీతా కల్యాణం (హరికథ)

·         రుక్మాంగద (హరికథ)

·         నాగదాసు చరిత్ర (హరికథ)

·         శ్రీరామ దండకము

·         పంచరత్నాలు

·         మోతీలాల్ స్మృతి పద్యము

·         శ్రీరామ స్తవ రాజము

·         పండితాభిప్రాయములు (సతి సక్కుబాయి)

·         రాధాకృష్న పాటలు

·         శ్రీకృష్ణ తులాభారము నాటకము నందలి కీర్తనలు

·         గాంధీ ప్రశంసా గీతము

·         మోతీలాల్ స్మృతి గీతము

·         సతీ సక్కుభాయి సినిమా పాటలు

·         శ్రీకృష్ణ తులాభారము సినిమా పాటలు

·         సతీ అనసూయ సినిమా రచన

·         ముందుమాటలు (బలిబంధనము, నాగదాసు చరిత్ర, సతీ సక్కుభాయి నాటకం)

అముద్రితాలు

ఈ రచనలు రాతప్రతులుగా వేర్వేరు వ్యక్తుల వద్ద అందుబాటులో వున్నవి వీటిని ముద్రణలోకి లేదా కనీసం ఎలక్ట్రానిక్ ప్రతులుగా అందుబాటులోనికి తేలవలసి వున్నది.

·         పంచముఖ ఆంజనేయ దండకము

·         అష్టావధాన పద్యాలు

·         పాపట్ల కాంతయ్య గారి స్మృతి పద్యాలు

·         మంగళహారతులు

·         జోల పాటలు

·         హెచ్చరికలు

·         మేలు కొలుపులు

·         ఇతరమైన పాటలు

·         భక్త ప్రహ్లాద సినిమా పాటలు

·         కనక్తార సినిమా పాటలు,పద్యాలు

·         విరాట పర్వము (హరికథ)

అలభ్యాలు

ఆనోట ఈనోట విన్నవి, వివిధ సందర్బాలలో ప్రస్తావించబడినవి అయిన కొన్ని రచనలు తెలియవస్తున్నాయి కానీ వీటిప్రతులను వెదికి సంపాదించి సాహితీలోకానికి అందుబాటులోనికి తీసుకురావలసిన అవసరం వున్నది.

·         వీరరాఘవ శతకము

·         రుక్మాంగద నాటకము

·         పాదుకా పట్టాభిషేకము నాటకము

·         లంకాదహనము నాటకము

·         సతీ తులసి నాటకము

·         సీతాకళ్ళాణ నాటకము పాటలు

·         భక్త అంభరీష హరికథ

·         సీతాకళ్యాణము హరికథ

·         లవకుశ హరికథ

·         లంకాదహనం సినిమా రచన

·         కనక్తార సినిమా రచన

·         దేశమాత దిగులేల దేశభక్తి గీతము

సినిమా పాటలు

·         భక్త ప్రహ్లాద

·         కనకతార

·         రాధాకృష్ణ

·         తులాభారము

·         సతీ సక్కుబాయి

·         లంకాదహనం

బిరుదులు

·         ఆంధ్రసూత

·         కలియుగ దశరథ

·         నటనా వతంస

·           సశేషం

·         మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -25-2-22-ఉయ్యూరు —

Posted in సినిమా | Tagged | Leave a comment

మన మరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు-92

మన మరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు-92

92-తోలి సినీ గీతరచయిత ,నటుడు ,గాయకుడు ,శతావధాని ,’’పరాబ్రహ్మ పరమేశ్వర ‘’పాట ఫేం ,సినీవాచస్పతి –చందాల కేశవదాసు

చందాల కేశవదాసు (జూన్ 201876 – మే 141956) తొలి తెలుగు నాటక కర్త, తొలి సినీ గీత రచయిత, కవి[1], నటుడు, గాయకుడు, హరికథా కళాకారుడు, అష్టావధాని, శతావధాని. నాటకాల్లో మొదట పాడే పరబ్రహ్మ పరమేశ్వర అనే గొప్ప కీర్తనను, ఆంధ్రదేశమంతటిని ఉర్రుతలూగించిన భలే మంచి చౌక బేరము పోయినన్ దొరుకదు అనే పాటను రాసినది ఈయనే. తెలుగులో మొదటి శబ్ద చిత్రం భక్త ప్రహ్లాదకు ఈయన పాటలు రాశాడు. ఈయన ఖమ్మం జిల్లా కూసుమంచి మండలంలోని జక్కేపల్లి లో జూన్ 201876 చందాల లక్ష్మీనారాయణ, పాపమ్మ దంపతులకు జన్మించారు ఖమ్మం జిల్లా కూసుమంచి మండలంలోని నాయకన్ గూడెం లో మే 141956 న మరణించాడు

బాల్యం, విద్యాభ్యాసం

కేశవదాసు ఖమ్మం జిల్లా కూసుమంచి మండలంలోని జక్కేపల్లి లో 1876 జూన్ 20వ తేదీన చందాల లక్ష్మీనారాయణ, పాపమ్మ దంపతులకు రెండవ కుమారుడిగా జన్మించాడు.[2] [3] కేశవదాసు తాత చందాల శ్రీనివాసులు ఖమ్మం జిల్లా గంగిదేవిపాడుకు చెందిన వారు. ఆయన అక్కడే వైద్యవృత్తిని చేసేవారు. ఆయన ఏకైక కుమారుడు లక్ష్మీనారాయణ కూడా వైద్యవృత్తితో పాటు వ్యవసాయం కూడా చేసేవారు. ఆ తరువాత తన నివాసాన్ని జక్కేపల్లికి మార్చారాయన, చందాల లక్ష్మీనారాయణ, పాపమ్మ దంపతులకు ఇద్దరు మగ సంతానం మొదట వెంకటరామయ్య తర్వాత కేశవదాసు జన్మించారు. వెంకటరామయ్య వివాహం చేసుకోకుండా బ్రహ్మచర్య జీవనం యోగమార్గంలో గడిపారు. తండ్రి చిన్నతనంలోనే మరణించడంతో అన్న వెంకటరమణయోగి నిర్వహణలోని వీధిబడిలోనే కేశవదాసు విద్యనభ్యసించాడు. ఛందస్సు, అవధానాధి ప్రక్రియలు నేర్చుకున్నాడు.విద్యాభ్యాసానంతరం తను చదువుకున్న వీధి బడి నడుపుతూ అవధానాది ప్రక్రియలలో నేర్పు సాధించాడు.

వంశనామం

18, 19 శతాబ్దాల మధ్య గుంటూరు జిల్లా తెనాలి తాలూకాలోని `చందవోలు’ గ్రామం పేరు ప్రజల నోళ్ళలో నలిగి వాడుకలో `చందోలు’ గా మారింది. దీనిని పూర్వం `ధనదపురం’ గా పిలిచే వారు. ఙది 11వ శతాబ్దంలో వెలనాటి ఛోళులకు రాజధానిగా వుండేది. వీళ్ళు వేంగిని కాపాడిన సామంతులు. వీరు తదనంతరం వివిధ కారణాలతో చెదిరి వేర్వేరుగా స్థిరపడ్డారు. ఆంగ్లేయుల పాలన ముమ్మరంగా సాగుతున్న రోజుల్లో, ఇటు నైజాం నవాబు స్వతంత్ర రాజుగా వ్యవహరిస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో సంస్థానాధీశుల బాధలు వున్నాయి అటువంటి సమయంలో చందవోలు గ్రామంలోని తెలగ వంశీయులలో వైద్య వృత్తిని సాగిస్తున్న ‘శ్రీనివాసులు’ అనే ముఖ్యుడు చందవోలు గ్రామం నుంచి అనేక ఇబ్బందులు పడి అప్పటి ఉమ్మడి ఖమ్మంజిల్లా ఇప్పటి భద్రాద్రి జిల్లాకు చెందిన ‘గంగదేవిపాడు’ కు చేరుకున్నారు. ఆయుర్వేద వైద్య వృత్తిలో జీవనం సాగిస్తూ పేదలకు ఉచితంగా ఉదారంగా వైద్యం చేసే వారట. ఆ ఊరి వారి వీరిని సులభంగా గుర్తించేందుకు ‘చందోలు వారని’ పిలిచే వారు కాల క్రమంలో అది ‘చందాల’ వారుగా స్థిరపడిపోయింది అని చెప్తారు.

వివాహం

దాసుగారు వైవాహిక జీవితంలో అనేక ఇబ్బందులు ఒడిదుడుకులు ఎదుర్కున్నారు. సంతానం లేదని రెండవ వివాహం చేసుకున్నారు. కానీ కొద్ది కాలంలోనే ఇద్దరు భార్యలు మరణించడంతో శిష్యులు అభిమానుల వత్తిడితో మరో రెండు వివాహాలు చేసుకున్నారు. దురదృష్ణం వెంటాడినట్లు వారిద్దరు కూడా దూరం అవ్వడంతో తనకు ఇక వివాహం వద్దు అనుకుంటున్న దశలో చివరకు పలువురు ఒప్పించి కృష్ణాజిల్లా తిరువూరు పట్టణానికి చెందిన కాబోలు రామయ్య గారి కుమార్తె కాబోలు చిట్టెమ్మను వివాహం చేసారు. అంటే చిట్టెమ్మ గారు వీరికి లెక్క ప్రకారం ఐదవ భార్య అన్నమాట.మొదటి నలుగురి గురించి వారి పెద్ద కుమారుడు కృష్ణమూర్తిగారి సతీమణి వెంకట నర్సమ్మగారు అందించిన సమాచారం ప్రకారం. తమ్మర కడియాల నారాయణ గారి అక్క లక్ష్మమ్మ దాసుగారి మొదటి భార్య, నడిగూడెం దగ్గరి సిరిపురం అమ్మాయి రెండవ భార్య, ఖమ్మం గాడేపల్లి వెంకటప్పయ్య గారి వదిన మూడవ భార్య, తిరువూరు మొండి జగ్గయ్య గారి మరదలు నాలుగవ భార్య.

అత్తవారిల్లు కావడం వల్లనే కాక సప్తహ కార్యక్రమ నిర్వహణకు కూడా ఆయన పలుమార్లు తిరువూరు గ్రామాన్ని సందర్శించారు. తిరువూరుతో విడదీయలేని సంబంధం కేశవదాసు గారికి ఉంది. ఈ ప్రాంత ఆడపడుచును వివాహమాడిన ఆయనం సొంత ఖర్చులతో తిరువూరు పట్టణ ప్రజల దాహార్తిని తీర్చేందుకు నిర్మించిన బావి దాసు పేరుతో నేటికీ పిలవబడుతుండటం విశేషం. ఆరోజులలో భద్రాచలం శ్రీరాముడ్ని దర్శించుకునేందుకు తిరువూరు మార్గం నుండి వేళ్లే భక్తులకు తిరువూరులో సత్రాలు ఏర్పాటుచేశారు. వీటిల్లో భక్తులకు ఉచిత అన్న దానం చేశారు. దీనికి సంబంధించిన ఖర్చులను కేశవదాసు భరించేవారు వీరికిు తిరువూరు, గంపల గూడెం ప్రాంతాల్లో విస్తృతమైన పరిచయాలున్నాయి. ఆయన ఆరోజుల్లో పాటలు పాడటంతో పాటు అష్టావధానంశతావధానం చేసేవారు. పలు దేవాలయాలకు గాలి గోపురాలు కూడా నిర్మించారు. పలు గ్రంథాలలో ఉన్న అర్ధంకాని విషయాలను సులభరీతిలో బోధించేవారు. ఆయన చేసిన సేవల కు తిరువూరు సంస్థానం వారు ఘనంగా సత్కరించారు. 1933- 1935 ప్రాంతాల్లో తిరువూరు, తదితర ప్రాంతాల్లో స్వాతంత్య్ర ఉద్యమం బలంగా ఉండేది. దాసు తన గీతాలతో ప్రజల్లో దేశభక్తిని, చైతన్యాన్ని నింపేవారు.

సంతానం

·         కేశవదాసు గారి మూడవ భార్య సంతానంగా రామకవి అనే ఆయన జన్మించారు. రామకవి గారికి ఛక్రధరరావు, చిట్టెమ్మ, సీతమ్మ కేదారి అనే నలుగురు పిల్లలు.

·         కేశవదాసు చిట్టెమ్మ దంపతులకు ఇద్దరు మగపిల్లలు, ఒక ఆడపిల్ల కృష్ణమూర్తి, సీతారామయ్య, ఆండాళ్ళు అనే ముగ్గురు పిల్లలు జన్మించారు.

·         పెద్దవాడైన కృష్ణమూర్తి ముత్తాత శ్రీనివాసరావుగారి లాగా వైద్య వృత్తిని మార్గంగా ఎంచుకున్నారు. వైద్య విద్యను అభ్యసించి ఆర్ ఎం పి డాక్టరుగా స్థిరపడ్డారు. ఈయన తండ్రి రచనలు, సేవాకార్యక్రమాల పట్ల పెద్దగా ఆసక్తి చూపలేదు. వృత్తి కీర్తి సంపాదనలో మునిగిపోయారు. ఈయనకు వారి దగ్గరి బందువుల అమ్మాయి వెంకటనర్సమ్మ గారితో వివాహం అయినది. వీరికి శ్రీనివాస రావు, కేశవదాసు, ఉష, శ్రీదేవి అనే నలుగురు పిల్లలు

·         రెండవ కొడుకు సీతారామయ్య భద్రాచలంలో ఉపాధ్యాయునిగా పనిచేసేవారు. వీరికి సక్కుబాయి అనే ఆవిడతో వివాహం అయినది.వీరికి వెంకట కేశవరావు, సత్యనారాయణ, రామ మోహన్, పద్మ అనే నలుగురు పిల్లలు,

·         మూడవ వారు ఆడపిల్ల పేరు ఆండాళ్ళు. కేశవదాసుగారు మునగాల వెళ్ళినప్పుడు గంధం నర్సయ్య అనే కుర్రవాడి బుర్రకథా గానాన్ని ముగ్ధులై అతని గురించి వాకబు చేస్తే ఆయన రేపాల కాంగ్రెసు ఉద్యమ క్యాంపు కార్యదర్శ అని కూడా తెలుసుకుంటారు. దేపాలలో జనతా కళా మండలి సంస్థ సభ్యుడిగా నర్సయ్య గారి నటనకు అభినందించి 1955లో తన కూతురైన ఆండాళును గంధం నర్సయ్య గారికి ఇచ్చి సాలంకృత కన్యాదానం చేసారట. గంధం దంపతులకు పద్మజ, సత్యనారాయణ, నీరజ, శ్రీనివాస్, శైలజ, శేషగిరిధర్ అనే ఆరుగురు సంతానం

కళారంగంలో ప్రవేశం

అష్టావధానాలు చేస్తూ దేశాటన చేస్తున్న కాలంలో సుప్రసిద్ధ వాగ్గేయకారుడు పాపట్ల కాంతయ్య గారితో స్నేహం కుదిరింది. దాసు ప్రతిభా సంపత్తికి మెచ్చి కాంతయ్య ఈయనకు సంగీతంలోని మెలకువలు తెలియజేశాడు. గేయరచనలో, సంగీతం కూర్పులో, హరికథనంలో, రచనలో కేశవదాసు ఆరితేరాడు. కాంతయ్యనాటక సమాజంలోచేరి కవిగా, నటుడిగా పేరుగాంచాడు. ఈయన సేవకుడు వేషం నుంచి రాజు వేషం వరకు ఏ వేషమైనా వేసి మెప్పించగల సమర్థుడు. మైలవరం కంపెనీకి శ్రీకృష్ణ తులాభారం, రాధా కృష్ణ నాటకాలకు పాటలు రాసిచ్చాడు. ఆంధ్రదేశమంతటిని ఉర్రుతలూగించిన ‘భలే మంచి చౌక బేరము పోయినన్ దొరుకదు’, అని శ్రీకృష్ణ తులాభారం సినిమాకు వన్నెతెచ్చిన గీతం కేశవదాసు రాసిందే. నాటకాల్లో మొదట పాడే ‘పరబ్రహ్మ పరమేశ్వర’ అనే సుప్రసిద్ధ కీర్తన కేశవదాసుదే. ఈ ప్రార్థనా గీతాన్ని స్వరపరచిన ఖ్యాతి పాపట్ల కాంతయ్యకు దక్కింది. భక్త ప్రహ్లాద, కనకతార వంటి చిత్రాలకు కేశవదాసు మాటలు, పాటలు వ్రాశాడు. కొంతకాలం నాటకరంగానికి స్వస్తిచెప్పి తెలంగాణా అంతటా హరికథలు చెప్పాడు. ఈయన విధిగా ప్రతిరోజు ఒక పాట, మూడు పద్యాలు చొప్పున కొన్ని సంవత్సరాలు రచన సాగించాడు. పాటలలో భక్తి భావం, సరళత్వం తొణకిసలాడుతుంటాయి.

1930-33ల మధ్య కేశవదాసు వ్రాసిన జాతీయ గీతాలను సినీ గాయకుడు సాలూరు రాజేశ్వరరావు, అముల నరసింహారావులు పాడగా బెంగుళూరులో రికార్డు చేశారు. ఈయన అనేక సినిమా స్క్రిప్టులతో పాటుగా, కేశవ శతకం, బలి బంధనం, సీతాకళ్యాణంరుక్మాంగద, మేలుకొలుపులు, జోలపాటలు మొదలైన రచనలు చేశాడు. ఈయన ఆధ్వర్యంలో బాల భారత్ సమాజం వారు అనేక నాటకాలను ప్రదర్శించేవారు. “కనక తార”, “లంకాదహనం” వంటి నాటకాలను సినిమాలుగా కూడా తీసారు. తన కళా ప్రదర్శనల ద్వారా పొందిన బంగారు కంకణాలను, పతకాలను దాచుకోకుండా సత్కార్యాలకోసం ఖర్చుచేసి మార్గదర్శకంగా నిలిచాడు. హరికథా గానంతో వచ్చిన డబ్బుతో భద్రాచలంలో భక్తుల సౌకర్యార్థం బావి త్రవ్వించి, భోజన, విశ్రాంతి ఏర్పాట్లు చేశారు. కోదాడ మండలం తమ్మరలో సీతారామచంద్రస్వామి ఆలయానికి గాలిగోపురం నిర్మింపజేశాడు.

నాటక రంగం

తెలుగు సమాజంలో ఏ నాటకానికైనా ప్రారంభానికి ముందు పాడే ‘పరబ్రహ్మ పరమేశ్వర – భళిరా హరి మహిమం బెరుగగ బ్రహ్మాదులు తరమా’ అనే ప్రసిద్ధ కీర్తన. ఈ కీర్తన మన చందాల వారి కలం నుండి జాలు వారినదే.

“”పరాబ్రహ్మ పరమేశ్వర పురుషోత్తమ సదానంద పరంజ్యోతి పరాత్పర పతితపావన స్వప్రాకాశ || పరా||

వరదాయక సకలలోక వాంచిత ఫలనా ప్రమేయ పాహీ – పాహీ – మాం – పాహీ || పరా||””

సినిమా రంగంలోకి ప్రవేశం

నాటక రంగంలో చందాల కేశవదాసు మంచి పేరుతో ఒక వెలుగు వెలిగిపోతున్న సమయంలో సినిమా రంగం ఆహ్వానం పలికింది. అప్పటి దాకా భారతదేశమంతటా మూగ సినిమాలు ఆడేవి. 1931 మార్చి 15న దేశంలో తొలిసారిగా ‘ఆలం ఆరా’ అనే మాటలతో కూడిన సినిమా వచ్చింది. ఇదే తొలి భారతీయ టాకీ. అదే యేడాది తెలుగులో కూడా టాకీ చిత్రం తీయాలనుకుని భక్త ప్రహ్లాద చిత్రం (1931-32)న ప్రారంభించారు. ఆ చిత్రంలో పాటలు రాయడానికి మన చందాల కేశవదాసును ఆహ్వానించడంతో ఆయన సినీ జీవితం మొదలైంది.

భక్త ప్రహ్లాద (1931, 1942)

ఈ చిత్రంలో ప్రహ్లాదునిగా కృష్ణాజిరావు షిండే, హిరణ్యకశ్యపునిగా మునిపల్లె సుబ్బయ్య, లీలావతిగా సురభి కమలాబాయి నటించారు. ఈ చిత్రంలో ఈమె పాడిన పరితాప భారంబు భరియింప తరమా పాటనే చందాల కేశవదాసు సినిమాకు రాసిన తొలిపాట. ఇదేగాక ఈమెనే పాడిన తనయా ఇటులన్‌ తగుపలుకు, మునిపల్లె సుబ్బయ్య పాడిన భీకరమగు నా ప్రతాపంబునకు భీతిలేక ఇటు చేసెదవా రెండు పాటలు కూడా చందాల వారు రాశారు. అయితే చిత్రంలో రంభ పాడిన వింతాయెన్‌ వినన్‌ సంతసమాయెనుగా దేవేంద్రా అనే పాట కూడా వొకటుంది. ఇది ధర్మవరం వారు భక్త ప్రహ్లాద నాటకం రాసినపుడే రాయగా ఈ పాటను నాటకాన్ని సినిమాగా తీసినపుడు కూడా అట్లానే ఉంచేశారు. దీంతో తొలి సినిమా పాట రచయిత కూడా ధర్మవరం వారేననే వాదన ఒకటి ప్రారంభించారు ఆ మధ్య. కనీసం ధర్మవరం వారి పాటను తొలి సినిమా పాటగా, చందాల వారిని తొలి తెలుగు సినీ కవిగా పరిగణించాలని రాశారు కూడా. కానీ కేవలం సినిమా కోసం రాసిన పాటనే సినిమా పాటగా భావించాల్సి ఉంటుంది గనుక చందాల కేశవదాసు గారే తొలి తెలుగు సినీ కవిగా చరిత్ర కెక్కారు. తొలి చిత్రం భక్త ప్రహ్లాద (1931-32)కు రాసిన పాటలు, 1942లో తీసిన భక్త ప్రహ్లాదలోనూ వాడుకున్నారు. శ్రీకృష్ణ తులాభారం (1935)లో రాసిన పాటలు ఆ తరువాత 1956, 1966లోనూ అందుకే ఆయన తెలుగు సినిమా వాచస్పతిగా చరిత్రకెక్కారు.

మొదటి పాట

చందాల కేశవదాసు గారు భక్తప్రహ్లాద సినిమా కోసం మూడు పాటలు రాసారు మరి వీటిలో ఏది తొలి గీతం అనేది కూడా ప్రధానంగా వేసే ప్రశ్న అయితే సినిమాలో కథ ప్రకారం కాకుండా పాట రాసిన చరిత్ర ప్రకారం చూస్తే మొదటి పాట ‘‘ పరితాప భారంబు భరియింప తరమా’’ అనేది.

ఈ పూర్తి పాట ఇలా వుంటుంది కానడరాగం ఆదితాళం లో సాగుతుంది ఈ పాట

పరితాప భారంబు భరియింప తరమాకటకట నే విధి గడువంగ జాలుడు
పతి ఆజ్ఞను దాట గలనా
పుత్రుని కాపాడ గలనా …..పరి
1. ఈ విషము నేనెటులను
తనయుని ద్రావింపగలను?
ధర్మమును కాపాడుదునా?
తనయుని కావగగలనా? …. పరి!
— చందాల కేశవ

సతీ సక్కుభాయి (1935, 1954)

‘భక్త ప్రహ్లాద’ (1931-32) తరువాత కేశవదాసు గారు రచయితగా పని చేసిన సినిమా ‘సతీసక్కుబాయి’ (1935). భారతలక్ష్మీ ఫిలింస్‌ వారి ఈ చిత్రంలో ‘కృష్ణా పోబోకురా’, ‘రాదేల కరుణా’, ‘ఆటలాడు కోరా’, ‘పాలుమీగడ పలుమార్లు భుజియించి’, ‘పాషాణ మెటులైతివో’, ‘జాగేలా కావగ రారుగా’ పాటలు రాశారాయన. చిత్రంలోని శ్రీకృష్ణుని పాత్రధారి తుంగల చలపతిరావు, సక్కుబాయి పాత్రధారిణి దాసరి కోటిరత్నం ఈ పాటలు పాడారు. ఆ రోజుల్లో ప్లే బ్యాక్‌ పద్ధతి లేదు. నటీనటులు ఎవరి పాటలు వారే పాడుకునేవారు.

‘సతీ సక్కు‌బాయి’ మహా‌రా‌ష్ట్రా‌నికి చెందిన భక్తు‌రాలి కథ.‌ రంగ‌స్థలం నాట‌కంగా ప్రసి‌ద్ధి‌కె‌క్క‌డంతో 1935లో సినిమా తీశారు.‌ భారత్‌ లక్ష్మీ పిక్చర్స్‌ పేరిట చారు‌రాయ్‌ దర్శ‌క‌త్వంలో కల‌క‌త్తాలో నిర్మిం‌చారు.‌ చిల‌క‌మర్తి లక్ష్మి‌న‌ర‌సింహం పంతులు, సిని‌మాకి మాటలు, పాటలూ రాశారు.‌ కొన్ని పాటలు చందాల కేశ‌వ‌దాసు రాశారు.‌ ‘కృషాల‌పో‌బో‌కుమా, రాదేలా కరుణ, ఆట‌లా‌డు‌కోరా, పాలు మీగడ వెన్న పలు‌మార్లు భుజి‌యించి పాషా‌ణ‌మె‌టు‌లైతివో’, ‘జాగేలా కాన‌రా‌రుగా’ − పాటలు చందాల రాసి‌నవి.‌ ‘సక్కు‌బాయి’ (1935)లో పురు‌షుడే స్త్రీ పాత్ర ధరిం‌చడంమరో విశేషం! సూర‌వ‌రపు వెంక‌టే‌శ్వర్లు రంగస్థలం‌మీద ‘సక్కు‌బాయి’లో అత్త పాత్ర ధరించి ప్రసి‌ద్ది‌పొం‌ద‌డంతో ఆయన చేతనే సిని‌మాలో అత్త పాత్ర ధరిం‌ప‌జే‌శారు! నాట‌కాల్లో పురు‌షులు స్త్రీ పాత్రలు ధరిం‌చడం, స్త్రీలు పురు‌ష‌పా‌త్రలు ధరిం‌చడం వుండేది.‌ అయితే, సక్కు‌బాయి తర్వాత కాబోలు స్త్రీ పాత్రలు స్త్రీలే ధరిం‌చాలిగాని, పురు‌షులు వెయ్య‌రాదు’ అన్న నిబం‌ధన విధిం‌చారు ప్రభుత్వం, సెన్సా‌ర్‌వారూ.‌ మారు‌వే‌షాలు వేసు‌కుని, స్త్రీలు పురు‌ష‌పా‌త్రల్లోనూ, పురు‌షులు స్త్రీ పాత్రల్లోనూ కని‌పిం‌చ‌వచ్చు అది వేరు.‌

శ్రీకృష్ణ తులాభారం (1935, 1955, 1966)

మరింగంటి వెంకట నరసింహాచార్య కవి (క్రీ.శ. 1770) తన బహురచనలలో నొకటిగా ఈ కథను సుమారు 1040 ద్విపదలలో రచించారు. ప్రబంధకవితేతరులైన జానపద- గ్రామీణ జనులు చదివి-చదివించుకొని ఆనందించే విధంగా దీన్ని రచించటం ఒక విశేషం సుప్రసిద్ధమైన పారిజాతాపహరణ ప్రబంధంలో ‘పుణ్యక వ్రతము’ పేర ఈ కథ (54-90 పద్యాలు) కలదు. కాని దానిలో తులాభార ప్రసక్తిలేదు..శ్రీ కృష్ణ‌తు‌లా‌భారం’ ముత్త‌రాజు సుబ్బా‌రావు రాసిన రంగ‌స్థల నాటకం.‌ ఇది భారత, భాగ‌వ‌తాల్లో లేని కవ్పిత కథ.‌ అంతకు ముందు ఎవరు కల్పిం‌చారో గాని, ముత్త‌రాజు సుబ్బా‌రావు నాటకం బాగా మంచిపేరు పొందింది.‌ దాంతో తొలి‌సా‌రిగా చిత్ర రూపం దాల్చి 1935లో విడు‌ద‌లైంది.‌ ముఖర్జీ, రాజా‌రామ్‌ అనే వారు దర్శ‌కత్వం వహిం‌చారు.‌ జయ‌సింగ్‌ అనే ఆయన కృష్ణుడు, ఋష్యేం‌ద్రమణి సత్య‌భామ, కపి‌ల‌వాయి రామ‌నా‌థ‌శాస్త్రి నార‌దుడు.‌ విశేషం ఏమి‌టంటే, ఋష్యేం‌ద్రమణి, కాంచ‌న‌మాల, రేలంగి, లక్ష్మీ‌రాజ్యం వంటి నటు‌లకు ఇదే తొలి‌చిత్రం! 1955లో రాజ‌రా‌జే‌శ్వరీ వారు ఇదే చిత్రం తీశారు.‌ సి.‌ఎస్‌.‌రావు దర్శ‌కుడు కాగా, రఘు‌రా‌మయ్య కృష్ణుడు, సూరి‌బాబు నార‌దుడు, ఎస్‌.‌వర‌లక్ష్మి సత్య‌భామ.‌ ఇదీ బాగానే నడి‌చింది.‌ 1966లో డి.‌రామా‌నా‌యుడు సురేష్‌ పతాకం కింద మళ్లీ ‘శ్రీ కృష్ణ తులా‌భారం’ తీశారు.‌ రామా‌రావు కృష్ణుడు, కాంతా‌రావు నార‌దుడు, జమున సత్య‌భామ, కమ‌లా‌కర రామే‌శ్వ‌ర‌రావు దర్శ‌కుడు. 1935లోనే సి.పుల్లయ్య దర్శకత్వంలో వచ్చిన కాశీ ఫిలింస్‌ వారి శ్రీకృష్ణ తులాభారంతో కేశవదాసు సినీ కవిగా ఉన్నత స్థానానికి చేరుకున్నారు. ఈ చిత్రంలో రాసినవి మూడు పాటలు. అవి భలే మంచి చౌకబేరము,మునివరా తుదికిట్లు నానున్‌ మోసగింతువాకొట్టు కొట్టండి బుర్ర పగలు గొట్టండివీటిలో భలే మంచి చౌకబేరము పాట బహుళ జనాదరణ పొందింది. అయితే ఈ మూడు పాటలను ఆ తరువాత మరో రెండుసార్లు శ్రీకృష్ణ తులాభారం చిత్రాన్ని 1955, 1966ల్లో నిర్మించినపుడు కూడా వాడుకున్నారు. అది కేశవదాసు గారి కవితా వైభవానికి నిదర్శనం. 1966లో డి.రామానాయుడు తీసిన చిత్రంలో దాసుగారి పాటలు వాడుకుని వారి పేరును సినిమాలో గానిపాటల పుస్తకంలో గాని వేయలేదు. ఇది గమనించిన వారి కుటుంబ సభ్యులు 1970లో ఖమ్మం కోర్టులో కేసు వేయగా దిగివచ్చిన నిర్మాతలు సినిమా టైటిల్స్‌లో ఆయన పేరు వేశారు.

పారిజాతాపహరణ ప్రబంధంలోని కథను – తిమ్మనకవి సంస్కృత హరివంశాధారంగా గ్రహించి సంక్షేపించినా ‘తులాభార’ ప్రసక్తిలేదు. ప్రస్తుత ద్విపద కృతి కర్త కొంత వరకు ముక్కుతిమ్మన కృతిని అనుకరించినా వర్ణనలు – కల్పనలతో కథను పెంచి ‘తులాభారము’ను వేయించినాడు. పారిజాతాపహరణంలోని కొన్ని సన్నివేశాలను మార్చి ఔచిత్యం పాటించిన ద్విపద కావ్యకర్త కథాకథనంలో శ్రద్ధకన్పరచినాడు – ఈయన మార్పుల్లో నారదుడు విచ్చేసి ఏకాంతంలో వున్న సత్యభామకే తులాభారం విషయం వివరిస్తాడు. చైత్రమాసం బదులు – ఈ వ్రతాన్ని మార్గశిర శుద్ధ ఏకాదశినాడు మాత్రమే చేయవలెనని – మార్గశీర్ష ప్రాముఖ్యాన్ని తెల్పుతాడు. మహర్షి ఆనతి ప్రకారం మార్గశీర్షంలో సత్యభామ వ్రతాన్ని చేస్తే – నారదుడే అష్టదిక్పాలకులకు పతిదాన వ్రత విశేషాలను చెప్పి ఆహ్వానిస్తే వీరితో పాటు మునిజనం, బ్రాహ్మణ బృందం విచ్చేస్తుంది. ఒక వైపు కౌరవులు వస్తే శ్రీ కృష్ణుడేవారికి తగిన పనులప్పగిస్తాడు (రాజసూయయాగంలోవలె) వీరే గాక – కుబ్జ. ద్రౌపది, రాధ, ప్రద్యుమ్నుడు, సాత్యకి విచ్చేసి వ్రత సంబంధ కార్యాలను చేస్తారు. ఇట్లా వీరి వర్ణన కార్యక్రమాలు మొదలగు వాటితో కథ పెరిగింది. పతిదానవ్రత సమయానికి ‘రుక్మిణి’ రాకపోవటం సవతులకయ్యమే ప్రధానమని రేవతీ ద్రౌపదులు భాషించుకోవటం జానపదుల యధార్థకథనంవలె కలదు.

సతీ అనసూయ (1935]

1935లో అరోరా ఫిలిమ్స్‌ ఆరోరా ఫిలిమ్స్‌ వారు ‘అన‌సూయ’ చిత్రాన్ని కోల్‌క‌త్తాలో తీశారు.‌ ఈ సిని‌మాకి మాటలు, పాటలు, పద్యాలూ అన్నీ కేశ‌వ‌దాసే రాశారు.‌ ఈ సినిమా విశేషం ఏమి‌టంటే, తొలి‌సా‌రిగా ఒక మహిళ చిత్రని‌ర్మా‌తగా రావడం.‌ ఆమె దాసరి కోటి‌రత్నం.‌ ఆమే అన‌సూయ పాత్రధా‌రణి కూడా.‌ అయితే, ఈ సినిమా బాగా నడవ లేదు.‌ 1936లో సి.‌పుల్లయ్య బాల‌లతో తీసిన ‘అన‌సూయ’ మాత్రం బాగా నడి‌చింది.‌ ఈ సిని‌మాతో పాటు ‘ధ్రువ‌వి‌జయం’ కూడా విడు‌దల చేశారు.‌ కేశవదాసు గారు 1935లో మూడు సినిమాలకు రచయితగా పని చేశారు. ఆ మూడో సినిమా సతీ అనసూయ ఈ సినిమాకు స్క్రిప్టుతో సహా మాటలు, పాటలు రాశారాయన. అలా కేశవదాసు పూర్తి స్థాయిలో రచయితగా పని చేసిన చిత్రం ఇది. ఈ సినిమా పాటల పుస్తకంలో అనసూయ స్క్రిప్టు పట్టుకుని ఉన్న దాసుగారి ఫొటోను ప్రచురించడం విశేషం. అలాంటి సందర్భం సినీ చరిత్రలో ‘నభూతో న భవిష్యతి’గా చెప్పుకోవచ్చు. దేవుని దయ ఉంది ఐలెసోప్రహ్లాదుగావ స్తంభమునందు నృహరివైమాతయని మాట విని, కురుతే గంగా సాగర గమనం వంటి పాటలు సతీ అనసూయలో దాసుగారు రాసినవే. ఆ తరువాత దాసుగారికి సినిమా అవకాశాలు వరుస కట్టినవి.

లంకా దహనం (1936]

చందాల కేశ‌వ‌దాసు ‘లంకా‌ద‌హనం’ సిని‌మాకి కూడా మాటలు, పాటలు, పద్యాలూ రాశారు.‌ ఇది 1936లో వచ్చించి.‌ రాధా ఫిలిం కంపెనీ పేరిట కాళ్ల‌కూరి సదా‌శి‌వ‌రావు దర్శ‌కత్వం వహిం‌చారు.‌ నటే‌శన్‌ అనే ఆయన హను‌మం‌తు‌డిగా నటిం‌చారు.‌ ఈ సిని‌మాలో వింతగా కని‌పిం‌చిన విషయం ఏమి‌టంటే −‌ హను‌మం‌తుడు చెట్టు‌కింద కూచుని ‘ఎపుడు కృపా‌క‌లు‌గునో’’ అన్న త్యాగ‌రా‌జ‌కీ‌ర్తన పాడడం.‌ ఈ సినిమా సరిగా ఆడక పోవడం వల్లా పాటల పుస్తకం లేక‌పో‌వ‌డం‌వల్లా ఇతర నటుల వివ‌రాలు తెలి‌య‌రా‌లేదు.‌

కనక తార (1937, 1956)

‘ద్రౌపదీ వస్త్రాపహరణం తీసిన సరస్వతీ టాకీస్‌ వారు కనక్తార సినిమాను హెచ్‌.వి.బాబు దర్శకత్వంలో నిర్మించారు. దొమ్మేటి సూర్యనారాయణకన్నాంబఆరణి సత్యనారాయణకడారు నాగభూషణంగంగారత్నం ప్రధాన పాత్రధారులు. రంగస్థలంపై కనక్తారగా చెలామణి అయినా నాటకం వెండి తెర మీదికి వచ్చేసరికి కనకతార అయింది. దప్పిచే నాలుక తడిపొడి లేక పద్యంఎంత బాగుండది సక్కని గుంటారాయే నాయేంటి అబ్బో నా వొల్లు మంటెత్తుతాది పాటలు బహుళ జనాదరణ పొందినవి. ఇదే సినిమాను 1956లో మరోసారి తీసినపుడు కూడా దాసుగారి పాటలను యధాతథంగా వాడుకున్నారు. కనకతారకు రాసిన కథపాటలు 1937, 1956లోనూ యధాతథంగా ఈ సినిమాల్లో వినియోగించుకున్నారు

రాధాకృష్ణ (1939)

1939లో లక్ష్మీ్ సినీ టోన్ సంస్థ వారు స్థానం నరసింహ రావు గారినే రాధగా పెట్టి ఈ సినిమా తీసారు. రాధాకృష్ణ నాటకం కోసం దాసుగారు రాసిన 22 పాటల నుంచి కొన్ని పాటలను ఈ చిత్రం కోసం వాడుకున్నారు.

బాలరాజు (1948)

1948 లో భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాతి సినిమాగా ప్రతిభా బ్యానర్ మీద ఈ సినిమా తీసారు. ఘంటసాల బలరామయ్య దర్శకత్వం, అక్కినేని నాగేశ్వరరావు, శ్రీస్ వరలక్ష్మీ్ కస్తూరి శివరావు ముఖ్యపాత్రలు ధరించారు.

  సశేషం

మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -24-2-22-ఉయ్యూరు

Posted in సినిమా | Tagged | Leave a comment

త్యాగ ధనుడు శ్రీ నల్లపాటి హనుమంతరావు-7

త్యాగ ధనుడు శ్రీ నల్లపాటి హనుమంతరావు-7

పార్ధ సారధి గారు భారతి పత్రికలో రాసిన వ్యాసానికి కొనసాగింపుగా ‘’అవధాని గారూ !నాకో కథ జ్ఞాపకం వస్తోంది .పూర్వం అదే వూరిలో ఏక గర్భ జనిత అన్నా చెల్లెలు పసితనం లో కృష్ణ వరదలో కొట్టుకుపోయారు .వాళ్ళను ఎవరో పెంచి పెద్ద చేశారు .కొన్నేళ్ళకు ఈ అన్నా చెల్లెలికి పెళ్ళి అయింది. పెళ్లి తర్వాత వాళ్ళిద్దరూ ఒకే తలిదండ్రులకు పుట్టిన బిడ్డలని తెలిసింది .అన్నిశాస్త్రాలు తెలిసిన ఒక పండితుడు ‘’ఆ ఇద్దరికీ  నల్ల బట్టలు కట్టి  కృష్ణలో లో పడేస్తే పాపపరిహారం అవుతుందని ఉపాయం చెబితే అలానే చేశారు .దైవ ప్రార్ధన చేస్తూ వాళ్ళు వాలు గా కొట్టుకు పోయి ఒక వూరిలో తేలేసరికి బట్టలు తెల్లబడ్డాయట. ఆవూరి పేరే వెల్లటూరు .ఇలాంటి గొప్ప ఉపాయం మీ పండితులెవరైనా చేసి ,ప్రజలమన్ననలు పొంది మహోత్కృష్ట ఉపకారం చేయచ్చు కదా ‘’అన్నాను .నామాటలు విని పెదవులు చప్పరించి నాతో లాభం లేదనుకొని తనదారిన తాను పోయాడు ..నేను కృష్ణాశ్రమం చేరేసరికి మధ్యాహ్నం రెండు అయింది .దాన్ని స్థాపించింది నల్లపాటి హనుమంతరావు గారనీ వారికిప్పుడు 35ఏళ్ళు అని తెలిసింది .గుంటూరుతాలూకా ఆరువేల నియోగి బ్రాహ్మణుడు .మెట్రిక్ పాసై ,అసహయోద్యమం రాకముందే అంటే 1916నుంచే అధోగతిలో ఉన్న పంచముల్ని అభి వృద్ధి లోకి తెస్తున్నారు .దేశం లో పెద్ద పెద్ద పండితులు కూడా మాల వాళ్ళను  తాకితే తమ కులగోత్రాలు మంటలో కలిసి పోతాయని భావించే కాలం లో ఈయన పంచములను అక్కున చేర్చుకొని ‘’శ్రీ కృష్ణాశ్రమం స్థాపించి వారివిద్యా ఆరోగ్యం  బాగోగులకు గొప్ప సేవ చేస్తున్నారు .ఆయన ఉద్దేశాన్ని ఆమోదించేవారు ఆకాలం లో ఎక్కువ మంది లేకపోయినా ,ఎంతో శ్రమించి ఆశ్రమం నిర్వహిస్తున్నారు .కొందరు బుద్ధిమంతులు ఈ హరిజన సేవకుడిని ‘’మాలవాడు ‘’అన్న సందర్భాలూ ఉన్నాయి .ఆంద్ర రత్న శ్రీ దుగ్గిరాల గోపాలకృష్ణయ్యగారు వీరికి ‘’’’మాల మాదిగోద్ధారక ‘’బిరుదునిచ్చారు .వీరు సంఘ ,కుల బహిష్కారం కూడా ఎదుర్కొన్నారు .ఇలాంటివి ఎన్ని కష్టాలు మీద పడినా చెదరని గుండె ధైర్యంతో శాంతంగా చిరునవ్వుతో ముందుకు మును ముందుకే సాగుతున్నారు .ఆశ్రమం లోనే ఉంటూ విద్యార్ధుల సత్ప్రవర్తనకు బాటలు వేస్తున్నారు .పిల్లలకు భక్తీ శాంతం ప్రేమ దేశభక్తి కలిగిస్తున్నారు .చాలామంది స్వలాభం కోసం ఇలాంటి పని చేస్తారు. వీరు దేనినీ అపేక్షించకుండా నిస్వార్ధంగా సేవ చే స్తున్నారు .ఆంధ్రలో అసహాయోద్యమం ప్రారంభం కావటానికి రెండేళ్లకు ముందే రావు గారుఈ ఆశ్రమ౦ స్థాపి౦చి ఆదర్శ ప్రాయులయ్యారు .1920లో వచ్చిన అసహాయోద్యమం తర్వాత ఈ సంస్థ మరింతగా అభి వృద్ధి చెందింది .ఇలాంటి మానవ సేవ ,దేశ సేవ చేస్తున్న హనుమంతరావు గారికి  తగినంత ప్రసిద్ధి రాలేదు .

  అంటరాని తనం  సహజ మానవీయతకు విరుద్ధమైన దురాచారమే .పవిత్రమైన పచ్చని పంట పోలాలమధ్య కృష్ణ కాలువ వెంబడి ఈ ఆశ్రమం మనోహరంగాపూర్వపు రుష్యాశ్రమం గా  ఉంది .ఆశ్రమ బాలురు నిమ్నజాతి వారుగా కనిపించరు .వారి నిత్య దిన చర్య మహా శ్రోత్రియుల ఇళ్ళలో జరిగెట్లుగా ఉండి నన్ను ఆశ్చర్యపరచింది .30మందిబాలురకు ఉచితంగా భోజన వసతి కలిపిస్తున్నారు .

   ఆశ్రమ ఉద్దేశ్యాలు –పంచములకు భోజనవసతి కల్పించి వృత్తిపనులు ఉచితంగా నేర్పటం ,ఇతరగ్రామాలలో విద్యాలయాలు ఏర్పాటు చేయటం ,పంచములపై లోకం లో ఉన్న దురభిప్రాయాలను తొలగించటం ,పంచములు మతా౦తరులు కాకుండా కాపాడటం .

  తిలక్ నిధినుంచి ,గుంటూరుజిల్లా కాంగ్రెస్ నుంచి మిగిలిన వదాన్యులనుంచి సంస్థకు విరాళాలు అందుతున్నాయి .ఈ ఆశ్రమానికి అన్నివిదాలాసాయం చేసి ,ప్రోత్సహించి వృద్ధి లోకి తేవాల్సిన బాధ్యత ఆంద్ర ప్రజలపై ఉంది ‘’ భారతి -1925 ఏప్రిల్ సంచిక .

   1926లో ఈ ఆశ్రమం పెదపాలెం నుంచి గుంటూరులో కొన్న స్థలం లోకి రావు గారు మార్చారు .పాలెం మారుమూల పల్లె అవటం రవాణా సదుపాయం లేకపోవటం హైస్కూల్ అందు బాటులో లేకపోవటం వలన విద్యార్ధుల స౦ఖ్య పెద్దగా పెరగలేదు .గుంటూరు కృష్ణాశ్రమంలో 100మందికి బోర్డింగ్ కలిపించారు .10మంది ఉపాధ్యాయులున్నారు .బయటనుంచి మరో వందమంది వచ్చి చదువుతూ సంఖ్యను 200కు పెంచారు .ప్రభుత్వం బోర్డింగ్ గ్రాంట్ కింద నాలుగు వేలు ,టీచింగ్ గ్రాంట్ కింద 12వందల రూపాయలు ప్రతి సంవత్సరం ఇస్తున్నారు .ఇవి ఏమూలకూ చాలక రావు గారు సుమారు 6వేలరూపాయలు చందాల రూపం లో తిరిగి వసూలు చేసి నడుపుతున్నారు .తర్వాత గ్రాంటు పెంచటానికి జిల్లా లేబరాఫేసర్ మంచి సహాయ సహకారాలు అందించారు .

  రావు గారికి అనేక సహాయ సహకారాలు అందిస్తున్న కోటలక్ష్మయ్య నాయుడు గారు చనిపోయారు .అప్పటికి వారి బాకీ తీరలేదు .కానీ నాయుడు గారు ధర్మకార్యాలకు ఒక లక్ష ,ముఖ్య స్నేహితులకు బంధువులకు కొంత ధనంచెందేట్లు ఆత్మబంధువులను ఎక్సి క్యూటర్స్ గా ఏర్పాటు చేస్తూ విల్లు రాశారు .ఎక్సి క్యూటర్లమధ్య భేదాలు ఏర్పడి కోర్టుకెక్కారు .మద్రాస్ హైకోర్ట్ రిసీవర్ ను నియమిస్తే ఆయన వీరిపై 5,600 రూపాయలకు  వ్యాజ్యం వేసి డిక్రీ పొందాడు.రావుగారు మద్రాస్ వెళ్లి నాయుడుగారి అల్లుడు ,రిసీవర్ లతో మాట్లాడితే వారు ‘’భయం వద్దు .ధర్మకార్యాలకు కేటా ఇంచిన డబ్బు కింద మీ బాకీ రద్దు చేసి ,ఆశ్రమం ,భూమి మీకే చెందేట్లుగా చేస్తాం ‘’అని హామీ ఇచ్చారు .ఈలోగా రావుగారు కొండా వారితో సంప్రదించి ఆయనతోకలిసి కాశీనాధుని నాగేశ్వరరావు పంతులుగారిని కలశారు .అ౦దరూకలిసి సీనియర్ వకీలు దొరస్వామి అయ్యర్ తో ఒకపరిష్కారం కుదిర్చారు .గుంటూరు ఆశ్రమానికి పది వేలు కిమ్మతుకట్టి ,దాన్ని నాయుడుగారి ధర్మకార్యాల డబ్బు నుంచి ధర్మంగా ఇచ్చేట్లుచేసి   ఆశ్రమ స్థలం ఆశ్రమానికే ఉండేట్లు మహోపకారం చేశారు .

రావుగారు గుంటూరు బ్రాడీ పేటచివర్లో 1200గజాల స్థలం చాలా చౌకగా కొని,కో ఆపరేటివ్ సొసైటీ లో లోన్ తీసుకొని స్వంత ఇంటిని నిర్మించుకొన్నారు .16భాషలలో పండితుడైన తల్లావఝల శివ శంకర శాస్త్రి భట్టాచార్యుల వారు మంగళగిరి దగ్గర కాజ గ్రామం లో ఉండేవారు .ఆయన తరచుగా మంగళగిరి రావటం వలన ఇద్దరూ కలిసి కాంగ్రెస్ లో పనిచేశారు .వీరికోరికపై వీరిని కృష్ణాశ్రమం లో ఉపాధ్యాయునిగా నియమించారు రావుగారు . ఆతర్వాత ఏవేవో కారణాలలు చూపిస్తూ రావుగారిపై నిధులు దుర్వినియోగం చేస్తున్నారని గోబెల్స్ ప్రచారం సాగింది .రావుగారు మస్తాపం చెందగా ,ఆశ్రమకమిటీ అధ్యక్షులు ఉన్నవవారు రావుగారు తీసుకొంటున్న ఆనరోరియం కు కమిటీ తీర్మానం ఆమోదమూ ఉన్నాయా అని అడిగితె లేదు వెంకటప్పయ్య గారికి చెప్పిచేశాను అనగా ,ఉన్నవ వారు తీర్మానం రాయించి కమిటీలో ఏకగ్రీవంగా పాస్ చేయించి,వాడిన మొత్తాన్ని రాటిఫై చేయించారు .అప్పటినుంచి లెక్కలన్నీ ఆడిట్ చేయించటం ప్రారంభించారు .

  సశేషం

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -2-1-22-ఉయ్యూరు   

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

ఆధునిక గుజరాత్ కవిత్వ కోట –నానాలాల్ -5(చివరిభాగం )

చారిత్రకనాటకాలు  జహంగీర్-నూర్జహాన్ ,షహన్షా అక్బర్  రాశాడు నానాలాల్ .చరిత్ర ,సత్యాలనుకవిత్వానికి  సమన్వయపరచటమే లక్ష్యంగా రాశాడు .ఆ ప్రేమ జంటపై గొప్ప సానుభూతి తో రాశాడు .ఈ అపూర్వ రూపకాలు వర్ణ విన్యాసం చిత్రి౦చె తూలికా ప్రయత్నమన్నాడు .మహాపురుషుల ఆత్మావిష్కరణం ,వారు జీవించిన కాల స్వరూపం చిత్రించటం తన లక్ష్యమన్నాడు .టెన్నిసన్ రాసిన ‘’అక్బర్ డ్రీం ‘’,ప్లోరాస్టేల్ రాసిన ‘’స్వాప్నిక రాకుమారుడు ‘’నానాలాల్ కు ప్రేరణ .నానాలాల్ చిత్రించిన అక్బర్ వివిధ సంస్కృతులు ,మతాల కళాసాహిత్యాల జాతుల సంశ్లేషణావైభవం .సంఘమిత్ర రూపకం లో పద్యభాగాలన్నీ సంస్కృత ఛందస్సులో రాశాడు .మహేంద్ర ,సంఘ మిత్ర శ్రీ లంకకు బౌద్ధ ధర్మ ప్రచారానికి వెళ్ళటం ఇతి వృత్తం .నాటకం అంతా అశోకుడే కనిపిస్తాడు .

  పౌరాణిక  నాటకాలు

  రాజర్షి భరత్ లో పౌరాణికానికే  మొగ్గు చూపాడు .1927లో రాసిన ‘’విశ్వ గీత ‘’ ఏ వర్గానికీ చెందని నాటకం .కాలస్థల వస్తు ఐక్యాన్నియూరోపియన్లు  పాటించి రాశారు  అన్నాడు. తానుమాత్రం ‘’రసైక్యం ఒక్కటే ఐక్యం ‘’ అనే భావంతో రాశానన్నాడు .కవి భావనా సమృద్ధికి ,జీవిత నైతిక విలువలపట్ల  ఆందోళనకు నిదర్శనం ఇందులో కనిపిస్తుంది .

  ప్రేమ భక్తీ

 నానాలాల్ కు ప్రేమ, భక్తీ ఆదర్శం .భజనల్లో ,హరి సంహిత లో దీన్ని ప్రదర్శించాడు .ఇంటి దగ్గర భజన గీతాలు తంబూరా పట్టుకొని పాడేవాడు కాని తనకు పాడటం రాదనే చెప్పేవాడు .రాజ్ కోట ప్రభుత్వాధికారిగా ఉన్నప్పుడు ప్రేమానందుని ‘’మామేరు ‘’గానం చేశాడు .ఏడాది తర్వాత డాకోర్ దేవాలయం లో తన హరి సంహిత లోని కొన్ని భాగాలు గానం చేశాడు .స్వామి నారాయణ సంప్రదాయం లో పెరిగిన వాడు నానాలాల్ .ఈ శాఖను శ్రీసహజానంద గుజరాత్ లో ప్రారంభించారు ఈయన్నే జీ మహారాజ్ అని గౌరవంగా సంబోధిస్తారు .ఈయన బోధనా తత్త్వం నానాలాల్ కు చాలా ఇష్టం .మతవిషయం లో సమన్వయ మార్గం నాది అన్నాడు ,-‘’-ఆయన ఉన్నాడు సమస్తచరాచరాలలో –నాచుట్టూ ప్రభువు ఉచ్చ్వాస నిస్వాసాలు లాగా నా అస్తిత్వం లోనే ఉన్నాడు.నా నాలుక విరాట్ విరాట్ అని తపిస్తుంది  .ఔజ్వల్యంతో మిరుమిట్లు గొలుపుతూ ఉంటుంది –విరాట్ విశ్వ డోల ‘’అనే గీతం రాశాడు .విలియం బ్లేక్ కవితాచాయలుంటాయి .

  ముగింపు

తాను  యెంతో అభినివేశంతో రూపొందించి ప్రచారం చేసిన ‘’నవకవిత ‘’ఆశించినంతగా ముందుకు పోనందుకు కొంచెం బాధపడ్డాడు నానాలాల్ .విశ్వ జనీన ఉన్నత ప్రమాణాలనే ఆయన పాటించాడు వ్యాప్తి చేశాడు .పునరుజ్జీవన సందేశాన్ని అందించటం ,కవిత్వం లో విశ్వస్థాయి  అందుకోవటమే తన ధ్యేయంగా భావించాడు .మాధ్యమిక విద్య నేర్చే విద్యార్ధులకు మంచి శరీరబలం  ఉండాలని బోధించాడు .’’భారత దేశపు కవితగా ,చరిత్రగా జీవి౦చటమేతన ఆదర్శం’’ అన్నాడు .ప్రాచ్య పాశ్చాత్య మేలిమిని స్వీకరించాడు .ఆయన వేదాన్తిమాత్రం కాదు .స్త్రీపురుషులమధ్య పరస్పర మర్యాద ,స్నేహ సౌహార్దాలు ,సమాన దృష్టి ,ఉన్నత మానవీయ దర్శనం ,సత్య సౌందర్యాలను పాటించటం  నానాలాల్ రచనలలో కనిపిస్తాయి .’’కలలు అమ్ముకొనే బేహారి కవి ‘’అన్నాడు .’’వివాహం అంటే దివ్య వ్యక్తిత్వం లోకి అడుగు పెట్టటమే  ‘’అని ఉన్నత నిర్వచనం చెప్పాడు .కవిత్వంలో పవిత్రత పాటించాడు .’’కవిధర్మ వసంత ధర్మ౦’’అని గొప్పగా అన్నాడు .ఆధునిక గుజరాతీ సాహిత్యం లో నానాలాల్ రచనలు సర్వ శ్రేష్టాలు .’’గుజరాత్ గీతి కవితా ప్రభువు ‘’‘’.1946లో 69వ ఏటమహాకవి  నానాలాల్ అమరుడయ్యాడు .

  ఆధారం –మొదటి ఎపిసోడ్ లోనే చెప్పినట్లు యు ఎం.మనియార్ రచించిన దాన్ని డా అక్కిరాజు రమాపతి రావు గారు తెలుగు అనువాదం చేసిన ‘’నానాలాల్ ‘’పుస్తకం .

  మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -24-2-22-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

మన మరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు-91

మన మరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు-91
91- గ్రామఫోన్ రికార్డు లలో రికార్డ్ స్థాపించిన రంగమార్తాండ,నాటకరంగ ధ్రువతార –కపిలవాయి—2
మిక్కిలినేని గా సుపరిచితులైన మిక్కిలినేని రాధాకృష్ణమూర్తి (ఆయన నాటకాలపై మక్కువతో రంగస్థలం వైపు మళ్లారు. జానపద కళారూపాలతో ప్రభావితులై కపిలవాయి రామనాథశాస్త్రి శిష్యులైనారు

మదానులో ఒక నాటక ప్రదర్శనకి వెళ్ళి తండ్రి ఒళ్ళో కూర్చుని వేదిక మీద నటిస్తూ పాడుతున్న వారిని చూసి తనూ పాడుతానని మారాం చేశారు చిన్నారి బాలసరస్వతి. ఆ పాపకప్పుడు వయసు కేవలం నాలుగేళ్ళు. అదే వరుసలో కూర్చుని వున్న కపిలవాయి రామనాథశాస్త్రి ఆ చిన్నారిలో వున్న వుత్సాహం చూసి ముచ్చటపడి ఆయనే ఎత్తుకుని స్టేజిమీదకి తీసుకెళ్ళి పాట బాలసరస్వతీదేవి కపిలవాయి రామనాథశాస్తి రికార్డులు ఎంత ఇష్టంగా వినేవారో అంత ఆనక్తితోనూ జె.ఎల్‌.రనడే, బాలగంధర్వ, కె.ఎల్‌:సైగల్‌ రికార్డులను విని, పాడుకుంటూ వుండేవారు. పాడించారు. నదురు బెదురు లేకుండా ‘నమస్తే మత్రాణనాథా’ అనే పాట గొంతెత్తి పాడటం చూసి, విని అందరూ ఆశ్చర్యచకితులయ్యారు.

శ్రీ శ్రీ – . కపిలవాయి రామనాథశాస్త్రి పాడిన ‘బలే మంచి చౌక బేరమూ’ అనే గ్రామఫోను రికార్డు వింటూ సిగరెట్టు కాలుస్తున్నాడు. వాడికి సంగీతమంటే చెడ్డ సరదా. ముఖ్యంగా కపిలవాయిని మించిన గాయకుడు ప్రపంచంలో లేడని నా అభిప్రాయం.

చాలా సంవత్సరాల క్రిందట రేడియోలో “సజీవ స్వరాలు” శీర్షికన పాత “gramophone songs” గ్రాంఫోన్ పాటలను ప్రసారం చేయటం జరిగింది. నా దగ్గరవున్న “telugu radio recordings” రేడియో రికార్డింగ్స్ నుంచి “kapilavai ramanadha sastry” కపిలవాయి రామనాధ శాస్త్రి గారి “భలేమంచి చౌకబేరము” “bhale manchi chowka beramu” పాటను పోస్ట్ చేస్తున్నాను. ఈ పాటతో పాటు నే సేకరించిన గ్రాంఫోన్ పాటల పుస్తకాన్నుండి ఆ పాట సాహిత్యాన్ని కూడా పోస్ట్ చేస్తున్నాను. తెలిసినంతవరకు ఈ పాట అంతర్జాలములో (Internet) లభ్యం అవటం లేదు. “sri krishna tulabharam” శ్రీకృష్ణ తులాభారం సినిమాలో ఘంటసాల గారు పాడిన ఇదే పాట మనందరకు బాగా పరిచయం. కపిలవాయి రామనాధ శాస్త్రి గారి గురించిన చాలా వివరాలు మిక్కిలినేని రాధాకృష్ణ మూర్తి గారి “నటరత్నాలు” పుస్తకంలో దొరుకుతాయి. మనకు లభ్యమవుతున్న ఆయన పాడిన పాటలలో ఇది చాలా మధురమైన పాట.

https://www.youtube.com/watch?time_continue=2&v=fVxGuzopFio&feature=emb_logo
సశేషం
మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -24-2-22-ఉయ్యూరు


Posted in సినిమా | Tagged | Leave a comment

మన మరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు-91

మన మరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు-91

91-గ్రామఫోన్ రికార్డు లలో రికార్డ్ స్థాపించిన రంగమార్తాండ,నాటకరంగ ధ్రువతార –కపిలవాయి

ప్రసిద్ధ రంగస్థల నటులు, గాయకులైన కపిలవాయి రామనాథశాస్త్రి గారు 1890 1890 కృష్ణా జిల్లా విజయవాడ తాలూకా మంతెనలో జన్మించారు.
రంగస్థల ప్రస్థానం
వీరు చిన్నతనంలోనే మైలవరం నాటక కంపెనీలో ప్రవేశించి దానికి ఉజ్వల చరిత్ర సంపాదించారు. యడవల్లి సూర్యనారాయణ గారి ఆధ్వర్యంలో నటనలోను, పద్యపఠనంలోనూ మెరుగులు దిద్దుకున్నారు. రంగస్థల ప్రపంచంలోనే ఒక క్రొత్త మార్పు తెచ్చినవారుగా వీరు ప్రఖ్యాతిపొందారు. వీరి నటన, గాయక శైలి ఎందరినో ప్రభావితుల్ని చేసింది. వీరిలాగా పాడాలని చాలామంది నటులు, నటీమణులు ఆరాటపడేవారు. పద్యంలోని భావం చెడకుండా ప్రతి అక్షరాన్ని చివరకు పూర్ణానుస్వారాన్ని సైతం స్పష్టంగా పలికి సంగీత మాధురిని దానికి జతకూర్చేవారు. వీరి శ్రావ్యమైన కంఠధ్వని తోడై వీరి గానం ప్రజలను అత్యద్భుత రీతిలో ఆకట్టుకొనేది. ఆనాడు ఈయనకు ఈనాటి సినిమా తారలకున్నంత అభిమానులు ఉండేవారు. ఈయన పద్యం పాడితే వన్స్ మోర్ కొట్టి మళ్లీ మళ్లీ పాడించుకునేవారు. ఒకే రాత్రి రెండు పట్టణాలలో ప్రదర్శించే నాటకాలలో పాత్రలు ధరించిన రోజులు ఉన్నాయి. ఈయన నాటకానికి జనాలు తండోపతండాలుగా వచ్చేవారు. మైలవరం కంపెనీ మూతపడిన తర్వాత కిరాయి నాటకాలలో నటించారు.

ఈయన స్వరంతో వెలువడినన్ని గ్రామఫోన్ రికార్డులు ఆ రోజుల్లో ఏ నటుడు ఇవ్వలేదు. ఈ రికార్డులు ఆ రోజుల్లో కొన్ని వేలు అమ్ముడుపోయాయి. పెళ్ళిళ్లలోనూ, ఇతర శుభకార్యాలలోనూ కపిలవాయి రికార్డులనే విరివిగా పెట్టేవారు. ఇవి తమిళనాడు, మైసూర్ రాష్ట్రాలలో కూడా ప్రజాదరణపొందాయి. అతి తక్కువకాలంలో ఆంధ్రదేశమంతటా చాలా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు. రెండు చేతులా సంపాదించాడు కానీ, సంపాదనంతా దురభ్యాసాలకు ఖర్చు చేశాడు.

ధరించిన పాత్రలు
· సారంగధరలో సారంగధరుడు

· రామదాసులో రామదాసు

· చింతామణిలో భవానీ శంకరుడు

· పాదుకలో రాముడు

· గయోపాఖ్యానంలో అర్జునుడు

· శ్రీకృష్ణతులాభారంలో నారదుడు

· సావిత్రిలో సత్యవంతుడు

· విప్రనారాయణలో విప్రనారాయణుడు మొదలైనవి.

టాకీ చిత్రాలు వచ్చిన తర్వాత సక్కుబాయి, కృష్ణ తులాభారం (నారదుడిగా, 1935) వంటి కొన్ని తెలుగు సినిమాలలో కూడా నటించారు.

బిరుదులు
· రంగమార్తాండ

మరణము
తెలుగు నాటకరంగంలో ధ్రువతారగా వెలిగిన శాస్త్రి ధనార్జన బాగా చేసినా అవసానదశలో దుర్భర దారిద్ర్యాన్ని అనుభవించారు. అతి తక్కువ వయస్సులో అజరామరమైన కీర్తి ప్రతిష్ఠలు సంపాదించిన శాస్త్రి 1935, అక్టోబరు 1వ తేదీన విజయవాడలో పక్షవాతంతో మరణించారు[1].

కృష్ణ తులాభారం 1935లో విడుదలైన తెలుగు చలనచిత్రం. సి.పుల్లయ్య దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో కపిలవాయి రామనాధశాస్త్రి, కాంచనమాల, లక్ష్మీరాజ్యం, రేలంగి వెంకటరమణయ్య, ఋష్యేంద్రమణి నటించారు. ఈ సినిమాతో కేశవదాసు సినీ కవిగా ఉన్నత స్థానానికి చేరుకున్నాడు. ఈ చిత్రంలో భలే మంచి చౌకబేరము,మునివరా తుదికిట్లు నానున్‌ మోసగింతువా, కొట్టు కొట్టండి బుర్ర పగలు గొట్టండి అనే మూడు పాటలు రాశాడు. వీటిలో భలే మంచి చౌకబేరము పాట బహుళ జనాదరణ పొందింది. ఈ మూడు పాటలను ఆ తరువాత మరో రెండుసార్లు శ్రీకృష్ణ తులాభారం (1955), శ్రీకృష్ణ తులాభారం (1966) నిర్మించినపుడు కూడా వాడుకున్నారు
సశేషం

మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -24-2-22-ఉయ్యూరు

Posted in సినిమా | Tagged | Leave a comment

మన మరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు-88

మన మరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు-88

88-పాత రామదాసు , దేవదాసులో ధర్మన్నఫేం – ఆరణిసత్యనారాయణ

ఆరణి సత్యనారాయణ (1898 నవంబరు 11 – 1969 జూలై 2) తెలుగు సినిమా, రంగస్థల నటుడు. తెలుగు సినిమా ప్రారంభ కాలంలో కొన్ని సినిమాలలో నటించాడు. [-

జీవిత విశేషాలు
1898లో గుంటూరు జిల్లా సంగడి గుంట గ్రామంలో జన్మించాడు. అతను 1912లో తన 14వ యేట గయోపాఖ్యానం నాటకంలో సత్యభామ పాత్రలో నటించాడు.
మూకీ సినిమాల కాలంలో తెలుగు సినిమా రంగంలోకి ప్రవేశించాడు. 1921లో ఆర్.ఎస్.ప్రకాష్ చిత్రసీమకు పరిచయం చేసాడు. తరువాత అతను ఘంటసాల బలరామయ్య నిర్మించిన రామదాసు (1933) (‘దేవదాసు’లో ధర్మన్న పాత్రధారి) సినిమాలో నటించాడు. [2] 1936లో సరస్వతి టాకీస్ నుండి వచ్చిన ద్రౌపది వస్త్రాపహరణం సినిమాలో నటించిన విదురుని పాత్రకు గుర్తింపు పొందాడు.

కనకతార, బాలయోగిని, ధర్మాంగద, రత్నమాల, లైలా మజ్ను చిత్రాలలో వివిధ పాత్రలలో నటించాడు.

వినోదా పిక్చర్స్ లో అకౌంటెంట్ గా చేరాడు. వినోదా పిక్చర్స్ సినిమాలైన దేవదాసు, శాంతి సినిమాలలో నటించాడు.

సినిమాలు

  1. రామదాసు (1933) …. తానీషా
  2. బాలయోగిని (1936/I)
  3. ద్రౌపది వస్త్రాపహరణం (1936) … విదురుడు
  4. కనకతార (1937)
  5. చంద్రిక (1940)
  6. రత్నమాల (1947)
  7. ధర్మాంగద(1949)
  8. లైలా మజ్ను(1949)
  9. శాంతి (1952)
  10. దేవదాసు (1953) …. ధర్మన్న

89-ఆంద్ర నాటక రంగోద్ధారక –నెల్లూరు నాగరాజారావు

తెలుగులో రెండవ టాకీ చిత్రం శ్రీ పాదుకా పట్టాభి షేకం లో ఆంద్ర నాటక రంగోద్ధారక నెల్లూరు నాగరాజారావు నటించారు .శ్రీరాముడుగా శ్రీ యడవల్లి సూర్యనారాయణ ,సీతగా సురభి కమలాబాయి ,లక్ష్మణుడుగా నాగరాజారావు నటించారు .దర్శకుడు సర్వోత్తమ బాదామి .రైతు బిడ్డ సినిమాలోనూ నటించారు .రామదాసులో తానీషాగా నటించారు .రామదాసుగా ఆరణి అద్భుతంగా నటించారు .1934లో వచ్చిన వేల్ పిక్చర్స్ వారి సీతాకల్యాణం సినిమాలో దశరధుడుగా నాగరాజారావు నటించారు. మాధవ పెద్ది విశ్వామిత్రుడు .

             1913లో నెల్లూరులో శ్రీ వేదం వెంకటరాయ శాస్త్రి గారి శిష్యుడు రాయప్రోలు సుబ్రహ్మణ్యం ఒక నాటక సమాజం స్థాపించి విమల ,మదాలస నాటకాలు ప్రదర్శించాడు .తర్వాత జ్ఞానోదయ నాటకమండలి స్థాపించి,,ధర్మవరం వారి ప్రహ్లాద ,లవకుశ కృష్ణ లీలలు ప్రదర్శించారు .వీటిలో  నాగరాజారావు ,శ్రీనివాసాచారి ,కాశీ చంచు మొదలైనవారు నటించారు .ప్రోగ్రెసివ్ ఆర్ట్ దియేటర్ లోనూ పనిచేశారు  .

90-నాటక లక్షణ పండిట్ ,దాక్షిణాత్య ఔత్తరాహిక సంగీత బాణీల నిష్ణాత , పృధ్వీరాజ్ ,అర్జున ,సత్యవంత ఫేం,నాట్యాచార్య –యడవల్లి సూర్యనారాయణ

సూర్యనారాయణ ప్రముఖ తెలుగు రంగస్థల నటుడు, తొలితరం తెలుగు సినిమా నటుడు. మైలవరం బాలభారతీ సమాజంలో నాయక పాత్రధారి.

జననం
అయిన 1888లో గుంటూరు లో జన్మించాడు.

విద్య
మెట్రిక్యులేషన్ వరకు గుంటూరులోనే చదువుకోవడం వల్ల ఇంగ్లీషులో అభినివేశం ఏర్పడింది. పండితవంశంలో జన్మించడం వల్ల సంస్కృతాంధ్ర విషయాలలో పట్టుసాధించాడు. సంస్కృత నాటక అనువాదాలు ప్రదర్శించేటపుడు తెలుగు పద్యంతోపాటు మూల సంస్కృత శ్లోకం కూడా పాడడానికి ఒరవడి పెట్టింది ఈయనే. విద్యార్థి దశలోనే మృదుమధురంగా పాడుతూ, విద్యార్థి సోదరులను ఆకర్షించగలిగాడు. హరిప్రసాదరావు, బలిజేపల్లి లక్ష్మీకాంతం ల నట, సాహిత్య, సంగీత ప్రభావం ఈయన మీద పడింది.

రంగస్థల ప్రస్థానం
ఈయన 1912లో గుంటూరులో స్థాపించబడిన అమెచ్యూర్ డ్రమాటిక్ క్లబ్ (ఔత్సాహిక నాటక సంఘం) వ్యవస్థాపకుడు. దీనిని 1915 వరకు నడిపాడు. కపిలవాయి రామనాధశాస్త్రికి పద్యాలు పాడటంలో శిక్షణ ఇచ్చింది ఈయనే.[1] 1913లో విజయవాడలో గయోపాఖ్యానం పంచమాంకం ప్రదర్శన పోటీలలో అర్జునుడు పాత్రకు ద్వితీయ బహుమతి గెల్చుకోవడంతో ఈయన కీర్తి గుంటూరు సరిహద్దులు దాటి మైలవరం రాజా దృష్టిలో పడింది. రాజా ఆహ్వానం మేరకు మైలవరం కంపెనీలో చేరి వివిధ పాత్రలలో నటించడంతో ఆయన కీర్తి నలుదిశలా వ్యాపించింది. మైలవరం కంపెనీగా ప్రసిద్ధి చెందిన బాల భారతీ నాటక సంఘం మైలవరం నుండి విజయవాడకు మారిన తర్వాత యడవల్లి సూర్యనారాయణ అందులో కథానాయకుడిగా చేరాడు. అక్కడే ఉప్పులూరి సంజీవరావు, దైతా గోపాలం మొదలైనవారితో కలిసిపనిచేశాడు. హరిప్రసాదరావు ధరించిన పాత్రలనే ఎక్కువగా నటించి పేరు పొందాడు.

ఈయన నాటక లక్షణ పండితుడు. దాక్షిణాత్య ఔత్తరాహిక సంగీత బాణీలలో నిష్ణాతుడు. అనేకమంది యువనటులను తీరచిదిద్దిన నాట్యాచార్యుడు. నటనే జీవితంగా భావించడమే కాక వృత్తిగా స్వీకరించి, నటులకు అసమాన గౌరవం తెచ్చిపెట్టిన కళారాధకుడు.

ఈయన సత్యవంతుడు, దుష్యంతుడు, దుర్యోధనుడు పాత్రలు ధరిస్తున్నాడంటే నాటుగు రోజుల ముందుగానే టికెట్లు అమ్ముడుపోయేవి. నటుడి సామర్ధ్యానికి గీటురాయిగా పరిణమించిన మయసభలో దుర్యోధనుని దృశ్యం ఈయన రాయించుకున్నదే. సత్యవంతుడిగా ‘పోయేనయ్యో ననుబాసి…’ మొదలయిన పాటలు ఆనాటి శ్రోతల చెవులలో నేటికీ గింగురుమంటూంటాయి. మైలవరం కంపెనీ దెబ్బతిన్న తర్వాత ఏలూరు మోతే కంపెనీలో చేరి కొంతకాలం నటించాడు.

పృథ్వీరాజు వేషంలో నిజం గుర్రం ఉక్కి వచ్చి, సంయుక్త వేషధారిని గుర్రం మీద కూర్చోపెట్టుకొని నిష్క్రమించేవారు. ఇదంతా క్షణంలో జరిగిపోయేది. సత్యవంతుడి వేషానికి ఈయనకు వెండి గొడ్డలి, వెండితాడు బహుబతిగా లభించాయి. విజయనగరంలో రత్నఖచిత కిరీటం, వెండి కత్తి బహుకరించారు. బంగారు పతకాలు, సన్మానాలు చాలా జరిగాయి. 1932 ప్రాంతంలో సినిమారంగంలోకి ప్రవేశించి దుష్యంతుడు, రావణుడు పాత్రలలో నటించి మెప్పుపొందాడు.

నటించిన పాత్రలు
సత్యవంతుడు, యముడు, అర్జునుడు (గయోపాఖ్యానం), శ్రీ కృష్ణుడు (తులాభారం), దుర్యోధనుడు, సారంగధరుడు, దుష్యంతుడు, వత్సరాజు, పృథ్వీరాజు, నలుడు, విజయరామరాజు, శ్రీరాముడు, రామదాసు.

మరణం
యడవల్లి సూర్యనారాయణ 1939లో మరణించారు.

చిత్రమాలిక
· పాదుకా పట్టాభిషేకం (1932 సినిమా)

· శకుంతల (సినిమా)

· సీతాకళ్యాణం (సినిమా)

· ద్రౌపదీ వస్త్రాపహర

సశేషం

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -23-2-22-ఉయ్యూరు

Posted in సినిమా | Tagged | Leave a comment

మరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు-87

మన మరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు-87

87-రంగూన్ రౌడి ,భీమ ఫేం ,గగ్గయ్యకు సరిజోడి –దొమ్మేటి

దొమ్మేటి గా పిలువబడే దొమ్మేటి సూర్యనారాయణ తామస పాత్ర ధరించటం లో వేమూరి గగ్గయ్యకు సమ ఉజ్జీ ..

తూర్పు గోదావరి జిల్లాలోని బోడసకుర్రు గ్రామంలో జన్మించారు. దొమ్మేటి వారి కుటుంబం రంగూన్ వెళ్ళి వ్యాపారంలో ప్రఖ్యాతి గడించారు. సూర్యనారాయణ గారు ఆంధ్ర దేశంలోనే కాకుండా బర్మాలో కూడా తెలుగు నాటకాలను విస్తృతంగా ప్రదర్శించి అఖండమైన ప్రఖ్యాతి తెచ్చిపెట్టింది.

రంగూన్ రౌడి నాటకపు పతాక సన్నివేశంలో తాను చేసిన హత్యానేరాన్ని తన భార్య నెత్తినేసుకుని ఉరిశిక్ష అనుభవించే సందర్భంలో రౌడీ పాత్ర పడే పశ్చాత్తాప సన్నివేశాన్ని ఎంతో హృదయ విదారకంగా, ఉదాత్తంగా నటించేవారు. చివరకు తాను చేసిన పాపానికి నిష్కృతి లేదని రొమ్ములు బాదుకుని, రక్తం కక్కుకుని చనిపోయే ఘట్టం అతి సమర్ధవంతంగా పోషించేవారు.

తెలుగు చలనచిత్ర రంగంలో ప్రవేశించి కొన్ని సరస్వతీ టాకీసు వారు నిర్మించిన ద్రౌపదీ వస్త్రాపహరణం (1936) లో భీమునిగా ధరించిన పాత్ర మరువలేనిది. ఆ తర్వాత కనకతార (1937) చిత్రంలో ధరించిన క్రూరసేనుడి పాత్ర చాలా విశిష్టమైనది. ఆనాడు అలాంటి తామస పాత్రలు ధరించడంలో వేమూరి గగ్గయ్య గారితో సమవుజ్జీగా కీర్తినార్జించారు.

సశేషం

మీ గబ్బిట దుర్గాప్రసాద్ -23-2-22-ఉయ్యూరు

Posted in సినిమా | Tagged | Leave a comment

మన మరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు-86 86-చైల్డ్ ప్రాజెడి,అర్ధాంగి సంగీతదర్శకుడు – బి.ఎన్.ఆర్ 

మన మరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు-86

86-చైల్డ్ ప్రాజెడి,అర్ధాంగి సంగీతదర్శకుడు,తెలుగుపాటల పాలవెల్లి – బి.ఎన్.ఆర్ .

భీమవరపు నరసింహరావు (జనవరి 24, 1905 – సెప్టెంబర్ 7, 1976) తెలుగు సినిమా సంగీత దర్శకులు. ఈయన బి.ఎన్.ఆర్.గా అందరికి సుపరిచితుడు. ఈయన 8 సంత్సరాల వయసులోనే సంగీత కళ మొగ్గ తొడగడం మొదలైంది. ఈయనకు నాటకాల్లో నటించడం అన్నా, పాటలు పాడటం అన్నా చాలా మక్కువ. ఇతను ఏ గురుశుశ్రూష చేయలేదు. హార్మోనియం కూడా తనే స్వయంగా నేర్చుకొని అందులో ప్రావీణ్యం సంపాదించగలిగాడు. తెనాలిలోని శ్రీరామ విలాస సభ నాటకసంస్థలోసంగీత దర్శకుడిగా పనిచేశాడు.[1]ఈయన ధూమపాన ప్రియుడు. కేవలం సిగరెట్ల సంపాదన కోసం హార్మోనిస్ట్ గా థియేటర్ లో పనిచేయడం మొదలుపెట్టాడ

జీవనసరాగాలు[మార్చు]
· పుట్టిన తేది : 1905 జనవరి 24

· జన్మస్థలం : గుంటూరు జిల్లా తెనాలి సమీపంలో కొలకలూరు.

· తల్లిదండ్రులు : కోటమ్మ, పుండారీకాక్ష శర్మ

· విద్యార్హత : ఎస్.ఎస్.ఎల్.సి

· తోబుట్టువులు :

o అన్నయ్యలు – పూర్ణయ్య, రామచంద్రరావు

o నలుగురు సోదరులు

· సంతానం :

o కొడుకు – బి.వెంకటేశ్వరరావు

o కూతురు – డాక్టర్ లీలావతి

· మొదటి సినిమా : సతీ తులసి (1936)

· ఆఖరి చిత్రం : అర్ధాంగి (1955)

· మరణం : 7 సెప్టంబర్ 1976.

చిత్రసమాహారం

  1. సతీ తులసి (1936)
  2. ద్రౌపదీ వస్త్రాపహరణం (1936)
  3. కనకతార (1937)
  4. మోహినీ రుక్మాంగద (1937)
  5. మాలపిల్ల (1938)
  6. భక్త తుకారమ్ (1938)
  7. రైతుబిడ్డ (1939)
  8. మీరాబాయి (1940)
  9. అపవాదు (1941) సశేషం

మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -23-2-22-ఉయ్యూరు

Posted in సినిమా | Tagged | Leave a comment

మన మరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు-85

మన మరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు-85

85-మూకీ యుగ హీరోయిన్ ,గాయని –జయమ్మ

బి.జయమ్మ/ గుబ్బి జయమ్మ (1915 – 1988) ప్రముఖ కన్నడ సినిమా, రంగస్థల నటీమణి. కన్నడ రంగస్థల ప్రముఖుడైన గుబ్బి వీరన్న నాలుగవ భార్య[1]. జయమ్మ, బి.ఎన్.రెడ్డి దర్శకత్వము వహించిన స్వర్గసీమతో తెలుగు సినిమా రంగములో ప్రవేశించింది. స్వర్గసీమలో భర్తచే నిర్లక్ష్యం చేయబడిన భార్య, కళ్యాణి పాత్రను పోషించింది.

జయమ్మ 1915లో కర్ణాటకలోని చిక్‌మగళూరులో జన్మించింది. చిన్నతనం నుండి నటనపై ఆసక్తి కనబరిచిన జయమ్మ చిన్నతనంలోనే తండ్రి మరణించడంతో జీవనోపాధికై తొమ్మిదవ యేటనే నటించడం ప్రారంభించింది.[2] జయమ్మ 1924లో రసిక జనానంద నాటక సభ నిర్వహించిన సీతాకళ్యాణంలో మూగ సీత పాత్రనుపోషించింది. ఆ తరువాత జయమ్మ బాలు బసవె గౌడ నాటక కంపెనీలో చేరింది. ఆ తరువాత 1928లో గుబ్బి వీరన్న కంపెనీలో చేరి తన జీవితాన్ని ఆ కంపెనీకి అంకితం చేసింది. గుబ్బి వీరన్న కంపెనీలో ప్రధాన కథానాయకిగా ఎదిగి 1931లో వీరన్నను వివాహమాడింది. భక్త ప్రహ్లాద, దేవదాసి, సదారమే నాటకాలలో ఈమె పోషించిన కథానాయకి పాత్రలు ఈమెకు మంచి పేరు తెచ్చిపెట్టాయి. గుబ్బి కంపెనీ 1934లో నిర్మించిన మహానాటకము కురుక్షేత్రలో ద్రౌపది పాత్ర పోషించింది. జయమ్మ హిందుస్తానీ, కర్ణాటక సంగీతము శిక్షణ పొందింది. ఈమె మంచి కథక్ నృత్యకారిణి కూడా.

జయమ్మ మూకీ సినిమా యుగంలో కథానాయకిగా ప్రాచుర్యం పొందింది. 1931లో రాఫెల్ అల్గియాట్ అనే బెల్జియం దేశీయుడు దర్శకత్వం వహించిన మూకీ చిత్రం హిజ్ లవ్ అఫైర్, 1932లో గుబ్బివీరన్నతో కలిసి వై.వి.రావు దర్శకత్వం వహించిన హరి మాయ అనే మూకీ చిత్రంలో నటించింది. 1940లలో తెలుగు సినిమా రంగములో కూడా బాగా పేరుతెచ్చుకున్న జయమ్మకు కన్నడ సినిమా రంగములో అంతకంటే పెద్ద పేరు ఉంది. 1945లో ఈమె కథానాయకిగా నటించిన కన్నడ చిత్రం హేమారెడ్డి మల్లమ్మలో ఈమె నటన చిరస్థాయిగా నిలచిపోయింది. జయమ్మ తెలుగులో స్వర్గసీమ, త్యాగయ్య, గుళేబకావళి కథ, బ్రహ్మరధం మొదలైన నాలుగు సినిమాల్లో నటించింది. ఈమె మంచి గాయని కూడా. స్వర్గసీమలో కొన్ని పాటలు పాడింది.

1947లో మహాత్మా గాంధీని కలుసుకున్న తర్వాత జయమ్మ తన జీవితాన్ని సమాజసేవకు అంకితం చెయ్యాలని నిర్ణయించుకున్నది. 1970లో ముక్తి సినిమా వరకు అడపాదడపా కొన్ని సినిమాలలో నటించినా ప్రధాన లక్ష్యం సమాజసేవనే. ఈమె చివరి సినిమా ముక్తిలో తల్లిపాత్రలో నటించింది. జయమ్మ కన్నడ మహిళా సంఘం అధ్యక్షురాలిగా పనిచేసింది. కర్ణాటక రాష్ట్ర విధానమండలికి నియమితురాలై వృద్ధ నాటక కళాకారుల సంక్షేమానికై కృషిచేసింది. ఈమె 1988, డిసెంబర్ 20న బెంగుళూరులో స్వర్గస్తురాలయ్యింది.[3]

చిత్ర సమాహారం
· మంత్ర దండం

· బ్రహ్మరధం

· త్యాగయ్య

· స్వర్గసీమ

· భక్త పోతన

· లవంగి

సశేషం

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -23-2-22-ఉయ్యూరు

Posted in సినిమా | Tagged | Leave a comment

ఆధునిక గుజరాత్ కవిత్వ కోట –నానాలాల్ -4

ఆధునిక గుజరాత్ కవిత్వ కోట –నానాలాల్ -4

 పై గీతాన్ని 1909లో నానాలాల్ రాశాడు .అందులో చివరి మాట ‘’సత్యమేవ జయతే ‘’అనేది భారత దేశ అధికార ముద్ర అంటే సీల్ లో స్థానం పొందింది .

  వైయక్తిక గీతాలు  

 గురువు కాశీరాం దవే ,మిత్రుడు అమృతలాల్ పధియార్,తండ్రి దలపతి రాం ,ఇల్లాలు మానెక్ బాయ్ గురించి రాసిన గీతాలన్నీ ఇందులో చేరాయి .తండ్రిపై రాసిన ‘’పితృతర్పణం ‘’ఎలిజీ కాని నివాళి.భార్య పట్ల అనురాగ ,ప్రేమానురాగాలను వ్యక్తం చేస్తూ రాశాడు .భార్యాభర్తలమధ్య ఆనంద సౌన్దర్యాలమధ్య ఆకర్షణలకుచోటు లేదు అంటాడు .

   ప్రేమ గీతాలు

విశ్వ జనీన ప్రేమను వ్యక్తం చేసే గీతాలివి .పరమప్రేమ పరమబ్రహ్మ అన్నదే సందేశం .జయ ,జయంత్ రూపకం లో ప్రేమికుల సమాగమం లో పారవశ్యాన్ని వర్ణించాడు .ఏ స్థాయిలో ఉన్నా స్త్రీ స్వతంత్రురాలుగా ఉండాలి అని అభిప్రాయపడ్డాడు ..సత్యమైన ప్రేమకు అసత్యమైన దానికీ తేడా తెలియాలి ..’’కృష్ణ దేవుని వేణు గీతంలా నర్తిస్తూ – బృందావనం నుంచి యమునకదిలివస్తున్నది –ఈ నది ఒడ్డునే సౌందర్య పుష్పం వికసించింది ‘’.సూర్యుడు ఉదయిస్తాడు అస్తమిస్తాడు –యమునాజలాలు వస్తూంటాయి ,పోతూంటాయి –కానీ తాజ్ ఆహ్లాద మధుర ప్రేమ జ్వాల –ప్రేమ దీపంగా ప్రకాశిస్తుంది .వెన్నెల కుప్పలా తాజ్ నిలిచింది .

   వీర గీతాలు

మధ్యయుగ రాజపుత్ర సాహసాన్ని వర్ణిస్తూ కవితలు రాశాడు .’’శంఖాల భేరీల నినాదం తో –నా ప్రభువు ఘనవిజయ రణ కేతనం ఎత్తబడింది ‘’అని రాణి అంటుంది .

  ప్రకృతి గీతాలు

అన్నిరకాల ఋతువులు పశుపక్షాదులను గొప్ప అనుభవంతో వర్ణించాడు నానాలాల్ .గిర్నార్ శిఖరాన్ని కాలపు  గంభీరాకృతి అన్నాడు .గుజరాత్ కవులు సముద్రాన్ని పెద్దగా పట్టించుకోలేదు. నానాలాల్ సాగర గీతాలు చాలారాశాడు –వెండి కెరటాల్లా బంగారు కెరటాల్లా ఊగేట్లు రారండి ‘’అన్నాడు .’’ఇక్కడ భూమి సముద్రాన్ని కలుసుకొంటున్నది –భూమినీ సముద్రాన్నీ చంద్రుడు ధవళ కాంతితో పూత పూస్తున్నాడు  ‘’

   మహాకావ్యం

1926-40కాలం లో తన కురుక్షేత్రమహాకావ్యం లోని 12 ఆశ్వాసాలు రాశాడు .’’భావ కవితా వేణువు ను అవతలుంచి మహా కావ్య భేరీ ‘’చేతబట్టాడు .అంతకు ముందు కొందరు కవులు ప్రయత్నించినా లక్ష్య శుద్ధి లేని కావ్యాలయ్యాయి .ఇలియడ్, షా నామా ,రామాయణ భారతభాగవతాలు సకల లోకకావ్యాలు అన్నాడు .తనకావ్యం మిల్టన్ మహాకవి ‘’పారడైజ్ లాస్ట్ ‘’లాంటిదని చెప్పాడు .మహాకావ్యమంటే మహాపురుషుల మహావీరుల అద్భుత సాహస పరాక్రమ ప్రదర్శనల మహా గాధ’’అని ఉపోద్ఘాతం లో చెప్పుకొన్నాడు .10.703 చరణాలతో ,12ఆశ్వాసాలుగా రాశాడు  .ప్రతి ఆశ్వాసం లో సంక్షిప్తంగా కధ చెప్పాడు మిల్టన్ లాగా .మొదటి ఆశ్వాసం పేరు ‘’యుగాంతరం ‘’..రెండులో శ్రీ కృష్ణ రాయబారం ,మూడులో ‘’నిశ్చయం ‘’గా యుద్ధం చేయాలనుకోవటం ,నాలుగులో కురుక్షేత్ర సంగ్రామమ ,తర్వాత కృష్ణుడు చక్రం చేబట్టటం ,భీష్మ పతనం ,7పద్మ వ్యూహం ,8భ్రాంత సాయంతనం ,9లో అన్నదమ్ముల యుద్ధం ,10’’కాలఘంట ‘’11శరతల్పం ,12మహా చక్రం .’’మహాచక్రం కళ్ళు మిరుమిట్లు గొలిపే కాంతితో దూసుకు వచ్చింది –దాని ప్రతిధ్వనులు విశ్వాన్తరాళమంతా ఆక్రమించాయి .-రసాతలం కన్నా దిగువ స్థానం నుంచి ప్రభవించి అదృశ్యమైంది –పవిత్ర హోమాగ్ని నిట్టనిలువుగా వ్యాపించినట్లుంది –స్వర్గలోకపు ఊర్ధ్వోర్ధ్వ స్థానాలకు సాగింది ‘’అని వర్ణించాడు .వ్యాసమహర్షి ప్రత్యక్షమై  పశ్చాత్తప్తహృదయంతో ఉన్న పాండవులకు జ్ఞానోప దేశం చేస్తున్నాడు-‘’ధర్మరాజా !కురుక్షేత్ర సంగ్రామం –నీ హృదయాన్ని పశ్చాత్తాపం లో ముంచేసింది –ఈ చక్రం విశ్వ సృష్టి లయాత్మకం .-అణువులు అమాంతంగా శిలలుగా ,శిలలు పర్వతాలుగా పరివర్తన చెందే దృశ్యం –రాళ్ళు రజో రేణువులుగా మార్తున్నాయి చూడు –ఇది చక్రం –విశ్వలయాత్మకం –జననమరణాలకు ఆవల ఆనంద లోకం ఉంది దర్శించు ‘’అన్నాడు .ఈకావ్యానికి భరత వాక్యం మహాప్రస్థానం .

  రూపక రచన

1909-43మధ్య నానాలాల్ 12నాటకాలు రాశాడు .విషయాలను చరిత్ర ,పురాణాలనుంచి ,మరికొన్ని స్వయంగా కూర్చాడు .ప్రపంచాన్ని సంస్కార వంతం చేయటమే ఆయన రూపకాల ఉద్దేశ్యం .దాదాపు ఇవి సంగీత రూపకాలుగా ఉంటాయి .షెల్లీ ‘’ప్రోమిడియాన్ అండ్ బౌండ్ ‘’గోధే’’’’ఫాస్ట్’’లను౦చి కూడా ఇతి వృత్తాలను తీసుకొన్నాడు .బెర్నార్డ్ షాను కాచి వడపోసినట్లు అనిపిస్తాడు .టెన్నిసన్ భావాలను రూపకాలలో పొందు పరచాడు .షెల్లీ లాగా స్వాప్నిక జగత్తులో విహరిస్తాడు .సౌందర్యం కాల్పనికత ఆదర్శ లోకం ఇద్దరి లక్ష్యాలు .ఉదాత్తత ఆదర్శ ఉద్బోధనం లతో సాగుతాయి .19వ శతాబ్దిలో ఇంగ్లాండ్ లో కావ్యరూపకం ,-పోయెటిక్ ప్లే,క్లోసేట్ ప్లే అనే రచనలను పోలి షెల్లీ టెన్నిసన్ లు రాశారు .ఆప్రయత్నమే చేశాడు నానాలాల్ .సాంఘిక పౌరాణిక చారిత్రిక రూపకాలు రాశాడు .

  సశేషం

మీ- గబ్బిట దుర్గాప్రసాద్ -22-2-22-ఉయ్యూరు–


Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

మన మరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు-84

మన మరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు-84

84-తెలుగు సినీ తొలి హాస్య హీరో, బారిష్టర్ పార్వతీశం,చాకలి తిప్పడు ఫేం,తెలుగు,తమిళ మొదటి హాస్య నట దర్శకుడు –లంక సత్యం -2

1968లో ఒక రాత్రివేళ…

మద్రాసు సెంట్రల్‌ స్టేషను కిటకిటలాడుతున్నవేళ. ఆ రద్దీలో పెద్ద పెద్దలైట్లు, కెమెరా, ట్రాలీ మూవ్‌మెంట్ట్లూ, సినిమా షూటింగు. సినిమా పేరు “సర్కార్‌

ఎక్స్‌ప్రెస్‌”. ప్లాట్‌ఫాం మీద ఆగివున్న

రైల్లోనూ, రైలు దగ్గరా షూటింగు.

విపరీతమైన జనం. కెమెరా ముందు జనం,

రైలు పెట్టె దగ్గర జనం. ఎవరూ కదలరు.

కేకలు, గోలా, పోలీసులూ, (ప్రొడక్షన్‌

వాళ్ళూ జనాన్ని పక్కకి నెడుతున్నారు. ఓ

పక్క. నెడుతూవుంటే, ఇంకో పక్కనుంచి

తోసుకొస్తున్నారు. సముద్రంలో ఓ కెరటం

పడిపోతే, ఇంకో కెరటం లేచినట్టు.

“పిన్నాడి పోంగయ్య – ఏం మేలమేల

వర్రింగె” అని పోలీసులు, ఓ

యు. కూడా వెనక్కి నెట్టేశారు.

“ఓర్నాయనో, నేని సినిమా డైరక్టర్షయ్యా

బాబూ, నన్ను తోసేస్తున్నారేమిటి?” అని

ముందుకు తోసుకొస్తున్నాయనే లంక

సత్యం. “మీరు సినిమా డైరక్టర్హా లేరు. ఈ

(డ్రస్‌లో వుంటే మాకేం తెలుస్తుంది?”

అన్నాడో పోలీసు తమిళంలో. “తెల్లపంచె,

తెల్ల జుబ్బా వేసుకోవడం నేరంలావుందే!

గొప్ప జోకు. డైరక్టర్నీ పొమ్మన్నారు

పోలీసులు” అన్నారు సత్యం గారు. సర్కార్‌

ఎక్స్‌ప్రెస్‌” సినిమాకి ఆధారం మలయాళ

చిత్రం. ఆ చిత్రానికి దర్శకుడైన

కృష్ణనాయరే, తెలుగు కీ డైరక్టరు-సత్యానికి.

అసలు సత్యానికొస్తే – లంక సత్యమే చెశారు

అంతా. అలా ఆ రాత్రి నెట్టుకుంటూ,

తోసుకుంటూ గోలాకేకల మధ్య

జరిగిపోయింది షూటింగు. అప్పట్లో

సెంట్రల్‌లో షూటింగ్‌ చేసుకోడానికి,

ఎక్కువ మొత్తంలో డిపాజిట్టు కట్టించుకుని

అనుమతి ఇచ్చేవారు. చాలా కాలంగా ఇవ్వడం లేదు. ఆ విధంగా – చేతిలో సిగరెట్టుతో,

నెమ్మదిగా కబుర్లు చెబుతూ, ‘సింపులోగా

వుండేవారు లంక సత్యం. 1940లో

మొక్కపాటి నరసింహ శాస్త్రి గారి నవల

“బారిష్టర్‌ పార్వతీశం” సినిమాగా వచ్చింది.

అంతకుముందు చిన్ల చిన్న హాస్య

సినిమాలు వచ్చినా, పూర్తి హాస్యచిత్రంగా

తొలిసారి వచ్చిన సినిమా పార్వతీశమే. ఆ

పార్వతీశం పాత్రధారి లంక సత్యం. అంచేత

ఆయనే తొలి హాస్య హీర్రో “నేనేదో స్టేజి మీద ఆడవేషాలు

వేశానుగాని, హాస్య పాత్ర ఏనాడూ

వెయ్యలేదు. సినిమా మీద మోజు పెరిగి

బొంబాయి పారిపోయి, దర్శకత్వ శాఖలో

పనిచేశాను. 1939లో వచ్చిన “అమ్మకి

నేను సహకార దర్శకుణ్ణి – డైరక్టరు

నిరంజన్‌పాల్‌కి తెలుగు రాదు గనక. ఆ

సినిమాలో – చెప్పాలంటే ‘ఏడుపు గొట్టు”

వేషం వేశాను. “అమ్మ” -“అమ్మ!”

అనిపించలేదు – “అమ్మో” అని

పడిపోయింది. పాల్‌గారు “నువ్వు మెడ్రాస్‌

పోరా. ప్రకాష్‌ దగ్గర చేరు” అని ఉత్తరం

ఇస్తే ఆర్‌.ఎస్‌. (ప్రకాష్‌ దగ్గర చేరాను. –

సహకార దర్శకుడిగానే. నాకు సరదాగా,

నవ్విస్తూ మాట్టాడ్డ వ్విస్తూ మాట్టాడ్డం

సరదా. జోకులు

చెప్పడం సరదా. ఆ

సరదా చూసి

పార్యతీశం వేషం

నాచెత వేయించాలని

‘ప్రకాష్‌గారు సరదా

పడ్డారు. నావల్ల

కాదన్నాను. నాకు

హాస్యం రాదు

మొ(ర్రోమన్నాను.

“నేనున్నాను వెయ్యి’

అన్నారాయన. వేశాను. ఆయనే

అంతా చేసి

చూపించేవారు. నేను అలాగే చేశాను. ఆ

విధంగా నేను హాస్య పాత్రధారిగా తయారు

చెయ్యబడ్డాను”. అని సతంగారు

చెప్పారోసారి. ఐతే ‘పార్వతీశం’ సినిమా,

అప్పుడొచ్చే పౌరాణికాలంత పెద్ద నిడివి గల

సినిమా కాదు. అంత నిడివి వుంటే గాని,

ప్రేక్షకులకి సయించదు. అంచేత, ‘బొండాం

పెళ్ళి’ చదువుకున్న భార్య’ అన్న మరో

రెండు చిన్న సినిమాలు కలిపి, విడుదల

చేశారు.

“ఆ సినిమా అయిన తర్వాత నన్నుచూసి – కామిక్‌ యాక్టర్రో –

అనేవాళ్ళు, అప్పుడు కామిక్కేక్టర్లనే

అనేవాళ్ళు – హాస్యం చేసినవాళ్ళని.

హేళనగా కూడా అనేవాళ్ళు. శివరావు,

రేలంగి వచ్చిన తర్వాతనే హాస్య నటులకి

విలువ, విశిష్టతా పెరిగాయి” అని చెప్పారు

సత్యంగారు. ఆయనకింకో రికార్డు కూడా

వుంది. హాస్య నటుల్లో కొందరు

డైరక్టర్లయ్యారు. ,వాళ్ళలో మొదటివాడు

కూడా ఆయనే. 1947లో వచ్చిన జెమిని

వారి ‘జీవన్ముక్తి’కి ఆయనే డైరక్టరు.

అందులో వేషం వేశారు, హాస్యమే చేశారు.

ఆయనకి మంచిపేరు తెచ్చిన సినిమా “బాల

నాగమ్మ. అందులో చాకలి తిప్పడుకి

మంచి రెస్సాన్స్‌ వచ్చింది. బాగా

ఆకర్షించింది. ఇంకో విశేషం చెప్పేవారు

సత్యంగారు. “జోక్‌లా వుంటుంది –

వినడానికి. జెమినివారు ‘మదన కామరాజు”

అని తమిళంలో తీశారు. ఆ తమిళ

సినిమాలో నేనూ సూరిబాబూ కలిసి తెలుగు

పాట పొడాం – నటిస్తూ. “ఏం పిల్లో సింకిరి

బొంకిరిగున్నావు” అన్న పాట అది” మాయలోకం, మాయపిల్ల, ఇద్దరు మిత్రులు,

జగదేక వీరుని కథ, గులే బకావళి కథ,

రహస్యం మొదలైన సినిమాల్లో సత్యం హాస్య

పొత్రలు ధరించారు.

“కొంత కాలానికి నా అసలు

పళ్ళుపోయి, డబ్బు పెట్టి కొనుక్కున్న

పళ్ళొచ్చాయి. అప్పుడు డాక్టరుగారు

“జాగ్రత్తగా వాడకోండి పళ్ళు” అన్నారు.

“ఎందుకు వాడుకోనూ! అవంటే ఉచితంగా

వచ్చాయి. ఇవి డబ్బుపోసి కొన్నవి కదా”

అని జోక్‌ చేశాను. ఆయనా నవ్వారు. ఈ

పళ్ళని కూడా ఓ సినిమా వాడుకుంది. “ఇద్దరు మిత్రులు’లో చిన్నవేషం. “పళ్ళు

రాలగొడతాను జాగ్రత్త” అని అక్కినేని

నాగేశ్వరరావు అంటారు నన్ను. వెంటనే

కట్టుడు పళ్ళుతీసేసి – “ఏదీ, ఎలా

రాలగొడతావో రాలగొట్టు”

అంటానన్నమాట. మంచి జోకు”.

రాలగొట్టమనే సన్నివేశంలో రమణారెడ్డి, అక్కినేని నాగేశ్వరరావుతో – లంక సత్యం

సత్యంగారు – ఆయనే, చెపి నట్టు అటు

యస నయము

డైరక్టరూ కాదు, ఇటు హాస్య నటుడూ కాదు.

‘మోహిని కీలు గుర్రం” (తమిళం నుంచి డబ్‌

అయిన తెలుగు చిత్రం పేరిది) “బెంగుళూరు

మెయిలు” (కన్నడం) చిత్రాలు ఆయన డైరక్టు

చేశారు. “దాంతో ఎందులోనూ స్థిర పడలేక ఏదీ

కాకుండా – అంటే పూర్తిగా – అయి పోయాను”

అన్నారాయన.

ఈ హాస్య నటుడి జీవితంలోనూ

విషాదాంతం అన్నంత వింత సంఘటన

జరిగింది. కొన్నేళ్ళ (క్రితం కాజీపేట దగ్గర

వంతెన మీదనుంచి రైలు పడిపోయి, చాలామంది

ఘోరమరణం పొందారు. ఆ ప్రమాదంలో సత్యం

గారు మరణించినట్టుగా వార్త వచ్చింది. పత్రికల్లో

మృతుల పేర్లలో ఆయన పేరూ వుంది. అది

చూసి బంధుమిత్రులు శోకం పట్టలేకపోయారు.

ఐతే ఆ మర్నాడు ఆయన ఆనందంగా

నవ్వుకుంటూ విజయవాడ చేరుకున్నారు.

జరిగిందేమిటి? సత్యం గారు విజయవాడ

వెళ్ళాలని ఆ మెడ్రాసుబండి ఎక్కారు

హైద్రాబాదులో. అప్పుడు ఒకటో తరగతి

(ప్రయాణికుల పేర్లే రైల్వేవారి దగ్గర వుండేవి.

బండి బయలళ్టేరిన తర్వాత, ఘటకేశ్వర్‌

అనేవూళ్ళో కాబోలు సత్యం గారి మిత్రులు

ఆయన పరిస్థితి చూసి, అక్కడ దింపేసి

తీసుకెళ్ళారు. ఆయన “అతినిషా”లో వున్నారు.

ఆ సంగతి ఎవరికీ తెలీదు. ఆ రాత్రి రైలు

(ప్రమాదం జర ేర్ల ప్రకారం లంక సత్యం

కూడా మరణించినట్టుగా వార్త రావడం

జరిగాయి! ఆ సంఘటన తర్వాత,

మృత్యుంజయుడనీ, సత్యం జయుడనీ మిత్రులు

ఆయన్ని అభినందించారు. “దాన్నే దైవలీల

అంటాం. ఆయువుంది గనక, దేవుడే నన్ను అలా

తప్పించాడు. ఆయువు లేనప్పుడు నేనింకా

వుంటానన్నా, దేవుడు ఉండనీయడు” అన్నారు

సత్యంగారు – నవ్వుతూ. వేసినవి తక్కువ

పాత్రలే కావచ్చు, అవి గుర్తుండే పాత్రలు.

బారిస్టర్లు ఇవాళ లేకపోయినా సత్యంగారు

లేకపోయినా, ‘పార్వతీశం’ సినిమా ప్రింటు

దొరక్కపోయినా, ‘పార్వతీశం’ చదివినప్పుడు

మాత్రం ఆ తొలి హాస్య హీరో గుర్తురాక మానరు.

సశేషం

తెలుగు భాషా దినోత్సవ శుభాకాంక్షలు

మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -21-2-22 –ఉయ్యూరు

Posted in సినిమా | Tagged | Leave a comment

ఆధునిక గుజరాత్ కవిత్వ కోట –నానాలాల్ -3

ఆధునిక గుజరాత్ కవిత్వ కోట –నానాలాల్ -3

వసంతోత్సవ కావ్యం –ఇది కధనాత్మకకావ్యం .వసంత వర్ణన యదార్ధంగా ప్రతీకాత్మకం గా చేశాడు .టెన్నిసన్ ‘’ఇనోక్ ఆర్డెన్’’స్పూర్తితో  రాసినకావ్యం ,అందులో దుఖం ఉంటె ఇందులో ఆహ్లాద ఉల్లాసాలున్నాయి .’’కొత్త ఆశల్ని చిగురిమ్పజేయటం నవజీవనం ప్రసారం చేయటం ,ఉన్నత ఆదర్శాలాతో మానవుల్ని ప్రభావితం చేయటం కవి లక్ష్యం’’అంటాడు నానాలాల్ .షెల్లీ వసంతరుతువును ‘’స్వాప్నిక వసుధా జగతికిసుషిర వాద్య ప్రబోధం ‘’అన్నాడు .పచ్చని మైదానాలు పర్వతాలు జీవకాన్తులతో రంగులతో నింపుతుంది అన్నాడు .నానాలాల్ ‘’వసంతం పునరుజ్జీవన ప్రతీక ,హేమంతంలో జడమైన ప్రకృతికి త్వరగా నూతనోత్సాహాన్నిస్తుంది వసంతం ‘’అన్నాడు .డిగ్రీ చదివేటప్పుడే మనకవి ‘’విశ్వ వ్యవస్థలో ప్రేమ వివాహ ప్రయోజనం ‘’వ్యాసం రాశాడు .ఆయనది సంకుచిత ప్రయోజనం కాదు విశ్వజనీనమైనది .

 దోలన్ శైలి

 శతాబ్దాల క్రితం చందోసంకెలలు వేసుకోన్నాం ..ఇవి స్వేచ్చా భావ ప్రకటనకు అడ్డు వస్తున్నాయి .కనుక బంధ విముక్తి చేయాలనుకొన్నాడు నానాలాల్ .దీనికి అనుగుణంగా లయాత్మక ‘’దోలన్ శైలి ‘’ఎన్నుకొన్నాడు .’’ఇరవై ఒక్క ఏళ్ళ కుర్రకవి 22 శతాబ్దాల పాతకాలపు పాలనాధికారం పై చేసినతిరుగుబాటు ‘’గా చెప్పుకొన్నాడు .పూర్తిగా  ఛందస్సు  నుంచి కవిత్వం విడివడటం నానాలాల్ తోనే ప్రారంభమైంది .సంగీత లయను  నియమ బద్ధంగా అనుసరించాడు .నర్మద్ కవి అడుగుజాడలలో ‘’గ్రాండ్ మీటర్ ‘’ను సృష్టించటానికి ఎంతో శ్రమపడ్డాడు .ఇది సాధించి కొలంబస్ పొందిన ఆనందాన్ని పొందాను అన్నాడు .పద్యాన్ని కవిత్వాన్ని అవినా భావ సంబంధం ఉన్నవి గా చూడలేదు .పద్యనియమాలను వచన నియమాలనూ చేది౦చేశాడు .

  గుజరాత్, భారత దేశాలపై కవితలు

1903,08,35 సంవత్సరాలలో నానాలాల్ తనగీతాలను ‘’కేత లంక్ కవ్యో’’అంటే ‘’కొన్ని కవితలు’’పెరుతో మూడు సంపుటులుగా ముద్రించాడు .ఇవి ఆతర్వాత చాలాసార్లు పునర్ముద్రణ పొందాయి .కవిగా ఎంతటి పేరు పొందాడో దీన్ని బట్టి తెలుస్తుంది ..పాటల సంపుటాలు రాసలు భక్తి గీతాలు ,వ్యక్తి గీతాలకు లెక్కే లేదు .’’చిత్ర దర్శన్ ‘’అనే చిత్రగీతాలూ రాశాడు .కవితారచనలో ఒక అ౦తర్జాతీయ సంప్రదాయం ,ఆదర్శం  అవలంబించినా ఆయన దృష్టి గుజరాత్ పైన కూడా వ్యాపించింది .సౌరాష్ట్ర ప్రకృతి సౌందర్యం జీవితం సంస్కృతీ లపై అసంఖ్యాక కవితలు రాశాడు .ఇలా రాసిన వాళ్ళు అంతకు ముందు పెద్దగా లేరనే చెప్పాలి .వీటన్నిటిలో ప్రేమ భక్తీ దేశభక్తి శౌర్యం ఆనందం ఉల్లాసం విశ్వజనీనమైనవే .గుజరాత్ గురించి కీర్తన రూపం లో రాశాడు .గుజరాత్ సుందర ఉజ్వల రూప పట చిత్రణ చేశాడు .-‘’భౌతిక దృష్టికి సులభమే –భారత దేశపు రాయీ రప్పల పొరలూ కశ్మలాలు దర్శించట –నగల నాణ్యత తెలిసిన బేహారి మాత్రమె విలువకట్టటం లాంటిది –ముత్యపు చిప్పను తొలుచుకొని పోగల చూపుమాత్రమే దాని ఉనికిని తెలియజేయగలదు –సూర్యుడిలోనూ మచ్చలున్నాయి –అయినా ఉజ్వల నభో మణి ని  చీకటి కమ్మి వేయగలదా ?‘’అని ప్రశ్నించాడు కవిత్వంలో .-‘’ప్రాచీన గ్రీస్ ,రోమ్,ఈజిప్ట్ ,బాబిలోనుల పెద్దక్కగారు భారత దేశం –యుగయుగాలుగా కొల్లగొట్టినా,బాధించినా   సుసంపన్నం –ప్రతియుగంలోనూ బాధించి వేధించారు –అయినాచిరంజీవి –సర్వలోక నాధుడే సృష్టించాడు –ప్రపంచ ఆధ్యాత్మికతను పెంపొందిం చేందుకు –సత్యమొక్కటే జయిస్తుంది –అని చాటటానికి భారత దేశం ఇంకా సజీవంగా ఉంది ‘’అని ఎలుగెత్తి చాటాడు నానాలాల్ కవి .

   సశేషం

మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -20-2-22-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

మన మరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు-84

బారిష్టరు పార్వతీశం
మన మరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు-84

84-తెలుగు సినీ తొలి హాస్య హీరో, బారిష్టర్ పార్వతీశం,చాకలి తిప్పడు ఫేం,తెలుగు,తమిళ మొదటి హాస్య నట దర్శకుడు –లంక సత్యం

లంక సత్యం 4-8-1915 న జన్మించాడు . తెలుగులోనే కాకుండా తమిళంలో కూడా నటించాడు. ఈయన కొన్ని తెలుగు, తమిళ చిత్రాలకు దర్శకత్వం కూడా వహించాడు.కామిక్ యాక్టర్ అనే చులకన గా ఉండే పేరును ‘’కమెడియన్ ‘’గా మార్చిన తోలి హాస్యనటుడు లంక సత్యం .

నేపధ్యము
లంక సత్యం చిన్ననాటి నుంచి నాటకాల్లో వేషాలు వేసేవారు. ఆడవేషాలూ వేశారు. పాటపాడడం వచ్చును గనుక, హబ్బిన్స్ గ్రామఫోన్ కంపెనీలో చేరారు. తర్వాత, సినిమా మీద ఆసక్తి కలిగింది. 1935లో బొంబాయి వెళ్లి సినిమా ప్రయత్నాలు చేశారు. నిరంజన్‌పాల్ అనే ఆయన దగ్గర దర్శకత్వంలో ఉద్యోగం చేశారు. మూడేళ్లపాటు నిరంజన్‌పాల్ తెలుగు సినిమా’’ అమ్మ ‘’(1939) తీస్తే – ఆ సినిమాకి ముఖ్య సహాయకుడిగా సత్యం పనిచేశారు. ఒక విషాద పాత్ర కూడా వేశారు. ఇది రష్యారచయిత మాక్సిం బోర్ నవల’’ది మదర్ ‘’ ఆధారంగా తీసిన తెలుగు సినిమా .అఇందులో సత్యం అభ్యుదయ భావాలను తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేసి విజయం సాధించారు .వ్యక్తిగా సరదా అయిన మనిషి సత్యం..అందర్నీ నవ్విస్తూ హుషారుగా ఉండేవాడు .అప్పుడు యుద్ధం వచ్చింది. ఆ దెబ్బకి సత్యం బొంబాయి నుంచి మద్రాసు వచ్చేశారు. నిరంజన్‌పాల్ ఇచ్చిన ఉత్తరంతో సత్యం ఆర్.ఎస్.ప్రకాష్ దగ్గర సహాయకుడిగా కుదిరారు. అప్పుడే ఆయన బారిష్టర్ పార్వతీశం మొదలెడుతూ, పార్వతీశం పాత్రధారికోసం వెతకడం ఆరంభించారు.

అప్పట్లో వేటూరి పరబ్రహ్మశాస్త్రి , పురాణ చిత్రాల్లో ఎక్కడైనా హాస్యపాత్రల్లాంటివి వస్తే వేసేవారు. ఆయన తప్ప హాస్యనటులు లేరు. ఆయన చేత, పార్వతీశం పాత్ర చేయిద్దామనుకుంటే, ఆయన వయసు పెద్దదని వూరుకున్నారు. నేను మామూలు మాటల్లో ఏదో చెప్పి నవ్వించేవాడిని గాని, హాస్యం రాదు. చివరికి ప్రకాష్‌గారు నన్నే వెయ్యమన్నారు. ‘నాకు రాదు చెయ్యలేను మొర్రో ‘ అని మొత్తుకున్నా ఆయన వినలేదు. బలవంతంచేసి చేయించారు. ప్రకాష్‌గారు ఎలా నటిస్తే అలా నటించాను. ఐతే, పాత్రపరంగా హాస్యం వుంది గనక, అది నాకు సహకరించింది అని చెప్పేవారు సత్యం.1940లో విడుదలైన ఈ సినిమా లో బలవంతంగా సత్యం హాస్య పాత్ర పార్వతీశం గా నటించాడు .

సత్యానికి జెమిని సంస్థలో అవకాశం వచ్చింది. ‘జీవన్ముక్తి ‘ (1942) డైరక్టు చేశారు. అందులోనూ, తమిళ చిత్రం ‘మదనకామరాజు ‘ లోనూ లంక సత్యం నటించారు. మదనకామరాజులో ఓ తెలుగు పాట పెట్టారు. పి. సూరిబాబు, నేనూ ఏం పిల్లో సింకిరి బొంకిరి గున్నావు అన్న పాట పాడుతూ నటించాం అని ఒక విశేషం చెప్పారు సత్యం.

సత్యానికి మంచి గుర్తింపు, పేరూ తెచ్చిన సినిమా బాలనాగమ్మ ఇందులో ఆయన చాకలి తిప్పడు వేషం వేసి, బాగా నవ్వించారు. పాట కూడా పాడారు దాంతో హాస్యపాత్రలు బాగా వచ్చాయి. గూడవల్లి రామబ్రహ్మం మాయలోకం (1945) తీసినప్పుడు సత్యంగారు సహాయ దర్శకుడిగా పనిచేస్తూ కాంభోజరాజు కొడుకుగా వేశారు. ఒక పక్క వేషాలు వేస్తూ చిత్రాలు కూడా దర్శకత్వం వహించారు సత్యం.జూపిటర్ వారి ‘’మోహినీ –కీలుగుఱ్ఱం ‘’అనే తమిళ సినిమా డైరెక్ట్ చేశాడు సత్యం

‘సర్కార్ ఎక్స్‌ప్రెస్ ‘ (1968) సినిమా లంక సత్యంగారు డైరెక్టు చేసినప్పుడు, అందులో నేను నటించాను. అప్పుడు నేను ఆనాటి విషయాలన్నీ అడిగి తెలుసుకున్నాను. ‘సర్కార్ ఎక్స్‌ప్రెస్ ‘ నే ‘బెంగళూర్ మెయిల్ ‘ పేరుతో కన్నడంలో తీస్తే అదీ సత్యంగారే డైరెక్టు చేశారు. కధాగమనం ,హాస్య సన్నీ వేషాల దృష్ట్యా ఈ సినిమా గొప్ప విజయం సాధించింది ఎన్.టి.ఆర్. తీసిన గులేబకావళి కథ, విజయావారి జగదేక వీరునికథ, రహస్యం (1967) మొదలైన చిత్రాల్లో సత్యంగారు హాస్య పాత్రలు చేశారు.

మొదటి రోజుల్లో హాస్యం చేసిన వాళ్ళని ‘కామిక్ యాక్టర్స్’ అనేవాళ్లు – చులకనగా. తర్వాత నుంచి మంచి హాస్యనటులు రావడంతో, హాస్యానికి ప్రాధాన్యత పెరిగింది. కమేడియన్స్ అని పేరుపొందారు. సినిమాల్లో హాస్యానికి పెద్ద పీట వేశారు. శివరావు, రేలంగి వంటి వాళ్లు వచ్చిన తర్వాత, మంచి హాస్య పాత్రలు వచ్చాయి. తర్వాత ఎందరో హాస్యనటులు వచ్చి, సినిమా హాస్యానికి విలువ పెంచారు అని చెప్పారొక సారి సత్యంగారు.

కొన్నేళ్ల క్రితం కాజీపేట దగ్గర రైలు ప్రమాదం జరిగి, చాలామంది మరణించారు. అప్పట్లో మొదటి తరగతి వుండేది. ఆ క్లాసులో ప్రయాణించిన లంకసత్యం కూడా మరణించినట్లు పత్రికలో పేరు వచ్చింది. కానీ, ఆయన హైదరాబాద్‌లో రైలెక్కి, ఘటకేసర్‌లో మిత్రుల బలవంతంతో దిగిపోయారు. ఈ సంగతి తెలియదు.

పోయిన వాడిని తిరిగి వచ్చేసరికి – బంధువులకీ, మిత్రులకీ కలిగిన ఆనందం – ఎప్పుడూ చూడలేదు. నాకింకా ఈ భూమ్మీద నూకలు చెల్లిపోలేదు కాబోలు – దేవుడు నన్ను బతికించాడూ’ అని చెప్పారు సత్యం – ఆ సందర్భంలో.

బారిష్టరు పార్వతీశం
తెలుగులో మొదటిసారిగా వచ్చిన హాస్యచిత్రం 1940 నాటి బారిష్టరు పార్వతీశం. మొక్కపాటి నరసింహశాస్త్రిగారు రాసిన నవల ఆధారంగా ఈ సినిమా తీశారు. ఏమీ తెలియని ఒక పల్లెటూరి యువకుడు, ఓడలో బయల్దేరి లండన్ వెళ్లడం కథ. దారంతా అతని చేష్టలు నవ్విస్తాయి. ఈ పాత్ర ధరించి నవ్వించినది – లంక సత్యం. మోడ్రన్ యునైటెడ్ ఆర్టిస్ట్స్, కంపెనీ పేరు మీద ఆర్.ఎస్. ప్రకాష్ ఈ సినిమా దర్శకత్వం వహించాడు. తెలుగువారిలో మొదటి మూకీ నిర్మించిన రఘుపతి వెంకయ్యగారి కుమారుడు ప్రకాష్. ఐతే, ఈ సినిమా నిడివి – అంటే, ఆ రోజుల్లో సినిమా మూడుగంటలైనా నడవాలి – చాలనందువల్ల ఇంకో రెండు చిన్న హాస్య సినిమాలు కలిపి విడుదల చేశారు. అవి బొండాం పెళ్ళి, చదువుకున్న భార్య. ఈ సినిమాలకు హెచ్.ఎమ్.రెడ్డి దర్శకత్వం వహిస్తే ఎల్.వి.ప్రసాద్ నటించారు. తర్వాత ప్రఖ్యాత నటిగా రాణించిన జి. వరలక్ష్మికికి బారిష్టరు పార్వతీశం తొలి సినిమా.’’హాస్య పాత్రలద్వారా సున్నితమైన హాస్యం ప్రవేశ పెట్టాలని సత్యం భావించేవారు .హాస్యం పండిస్తూ ,దర్శకత్వం చేయటం రెండు పడవలమీద కాళ్ళు పెట్టి స్థిర పడలేకపోయాడు .హుందా గల వ్యక్తిత్వంతో దర్శకత్వ బాధ్యతలు చేబట్టిన మొదటి తరం హాస్యనటుడు లంక సత్యం ‘’అని కీర్తించారు మా.గోఖలే .

చిత్రసమాహారం
నటుడిగా
· బారిష్టరు పార్వతీశం (1940)

· బాలనాగమ్మ (1942)

· చెంచులక్ష్మి (1943)

· మోహిని (తమిళం:மோகினி) (1948)

· మాయలోకం (1945)

· మాయపిల్ల (1951)

· రోహిణి (తమిళం:ரோகிணி) (1953)

· మరుమలర్చి (తమిళం:மறுமலர்ச்சி) (1956)

· శ్రీ వెంకటేశ్వర మహత్యం (1960)

· గులేబకావళి కథ (1962)

· శ్రీ సత్యనారాయణ మహత్మ్యం (1964)

· రహస్యం (1967)

దర్శకుడిగా]
· భక్త తులసీదాస్ (1946)

· చంపకవల్లి (తమిళం:செண்பகவல்லி) (1948)

మోహిని (తమిళం:மோகினி) (1948)
మరుమలర్చి (తమిళం:மறுமலர்ச்சி) (1956)
సశేషం

మీ- గబ్బిట దుర్గాప్రసాద్ -20-2-22-ఉయ్యూరు

Posted in సినిమా | Tagged | Leave a comment

మన మరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు-83

మన మరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు-83

83-తెలుగు సినీ తొలి నృత్య దర్శకుడు –వెంపటి సత్యం

కృష్ణాజిల్లా కూచిపూడిలో జన్మించిన వెంపటి సత్యం అనే పెద్ద సత్యం ను ఆయన కుటుంబం వారు నాట్యకళ అన్నం పెట్టదని ,ఆయన్ను దూరంగా ఉంచి మామూలు విద్య చెప్పించారు .కానీ సత్యం దాన్ని కొనసాగించలేదు .15వ ఏటనే నృత్యం నేర్చుకోవట౦ మొదలు పెట్టారు .ఏకాగ్రతతో నేర్చి ప్రతిభ కనబరచారు .వేదాంతం రాఘవయ్య ,వేదాంతం జగనన్నాద శర్మ వంటి వారితోకలిసి కూచిపూడి యక్షగానాలలో పాల్గొన్నారు .కానీ ఆ విద్య కడుపు ని౦పలేక పోయింది .

  సత్యంగారు బందరు వెళ్లి అడివి బాపిరాజు గారి వద్ద చిత్రలేఖనం లో తర్ఫీదు పొందారు .తిండికి లేకుండా వారాలకు వారాలు ఉపవాసలున్నారు .వీరిలోని నాట్య ప్రతిభ గుర్తించిన బాపిరాజు గారు ‘’నువ్వు చిత్రకళ లో కంటే నాట్య కళ లోనే బాగా రాణిస్తావు బాబూ ‘’అని చెప్పి బలవంతంగా పంపించేశారు .

  1940లో బాపిరాజు గారు ‘’మీరాబాయి ‘’చిత్రానికి కళా దర్శకత్వం వహించారు .శిష్యుడు వెంపటి పెద్ద సత్యం గారికిఆసినిమాలో నృత్యం చేసే అవకాశం కల్పించారు బాపిరాజు .కానీ తర్వాత అవకాశాలు రాక ఎదురుచూపులు తప్పలేదు .నృత్య నాటికలలో పాల్గొంటూ వచ్చిన దానితో జీవించారు .ఇవి బాగా క్లిక్ అయి 1941లో సినీ నృత్య దర్శకత్వానికి అవకాశం లభించింది .భక్తిమాల అనే సినిమాలో మొదటి సారిగా సత్యంగారు నృత్య దర్శకులుగా స్థానం పొంది రికార్డ్ సృష్టించారు .అంతకు పూర్వం నాట్యం చేయాల్సిన పాత్రధారులు ఎవరికీ వారే స్వంతంగా నాట్యం తయారు చేసుకొనే వారు .డైరెక్టర్ ఉండే వాడు కాదు .సత్యంగారితోనే డైరెక్టర్ హోదా నాట్యానికి కలిగింది అదీ ఆయన గొప్పతనం .ఇలా చిన్న స్థాయిలో డాన్స్ డైరెక్టర్ గా ప్రారంభమైన సత్యం గారి జీవితంఎంతో ఎత్తుకు ఎదిగింది .

   సత్యం గారుఎందరో నటులకు,నృత్య దర్శకులకు మార్గదర్శి అయ్యారు .సన్ని వేశాలలో తనదైన భావాలను డైరక్టర్ కు చెప్పి ఒప్పించి చొప్పించే వారు .నిరంతర కృషితో 300కు పైగా సినిమాలకు నృత్య దర్శకులయ్యారు సత్యం గారు .భారత నాట్యం తోపాటు ,కధక్,ఒడిస్సీ నృత్యాలు కూడా చేయించారు .హిందీ ,తమిళ ,కన్నడ సినిమాలకూ డాన్స్ డైక్క్షన్ చేశారు .స్వయం కృషితో చిత్ర రంగం లోఎదిగిన మహా నృత్యదర్శకులు సత్యంగారు .చిరస్థాయిగా ప్రేక్షకుల మనసులో నిలిచిపోయారు .

  సత్య నృత్యదర్శకత్వం వహించిన సూపర్ డూపర్ హిట్ చిత్రాలలో1957- సువర్ణ సుందరి ,1963 నర్తన శాల,1966 శ్రీ కృష్ణ పాండవీయం వంటివి ఎన్నో ఉన్నాయి .ఎల్ విజలక్ష్మి రాజసులోచన ,గీతాంజలి మొదలైన వారిని తెలుగు చిత్రాలలో ప్రవేశ పెట్టిన ఘనత సత్యం గారిదే .ఎన్టి రామారావు ప్రతిభకు గీటురాయి అయిన నర్తన శాలలో బృహన్నలపాత్రకు ఆయన కల్పించిన నృత్యం చిరస్మరణీయం .రామారావు గారికి ఎన్నో రాత్రులు ,పగళ్ళు నృత్యం నేర్పించి నటి౦పజేసి కీర్తి ప్రతిష్టలు సాధించిపెట్టారు సత్యం .కేవలం శాస్త్రీయ నృత్యాలు సినిమాలలో పెద్దగా  రాణిం చవనీ , మారుతున్న అభిరుచులు కాలాన్ని బట్టి నృత్యాలలోనూ మార్పులు రావాలని సత్యం కోరేవారు .అని ప్రముఖ చిత్రకారుడు కధకుడు మా. గోఖలే అంటే మాధవపెద్ది గోఖలే చెప్పారు .సత్యంగారు శ్రీ వెంకటేశ్వర మహాత్మ్యం లో శివుడు గా నటించారు .

తన బృహన్నల పాత్రసృష్టికి అయిదుగురు బ్రహ్మలున్నారు అని నందమూరి అభిప్రాయం 

image.png

సత్యం గారు నృత్యదర్శకత్వం చేసిన కొన్ని ముఖ్య చిత్రాలు 

·         Chhoti Bahu (1971)

·         భక్త ప్రహ్లాద (1967)

·         నర్తనశాల (1963)

·         శ్రీ సీతారామ కళ్యాణం (1961)

·         శ్రీ వేంకటేశ్వర మహత్మ్యం (1960)

·         జయభేరి (1959)

·         సువర్ణ సుందరి (1957)

·         భాగ్యరేఖ (1957)

·         పాండురంగ మహత్యం (1957)

·         చరణదాసి (1956)

ఇంతటి గొప్ప నృత్య దర్శకుడి పై గూగుల్ లో ఒక్క వాక్యమే కనిపించటం ఆశ్చర్యం .

  సశేషం

మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -20-2-22-ఉయ్యూరు

Posted in సినిమా | Tagged | Leave a comment

ఆధునిక గుజరాత్ కవిత్వ కోట –నానాలాల్ -2

ఆధునిక గుజరాత్ కవిత్వ కోట –నానాలాల్ -2

నానాలాల్ తండ్రి దలపత్ రాం పాతకోత్తకవిత్వ వారధి .కవిరాజు బిరుదున్నవాడు .పూర్వకాల సంస్కృత పాండిత్యం ,వ్రజభాష ,మధ్యయుగ గుజరాతీ కవిత అలంకార ఛందస్శాస్త్రాలలో నిధి .శిష్టాచారాలతో పెరిగినవాడు .నూతనకవితా వికాసంతోనూ కొంత పరిచయమున్నది .సమకాలీనకవి నర్మద్ లాగా సంఘ సంస్కరణ అవసరం గుర్తించినవాడు .నర్మాద్ తనభావాలను తర్వాత మార్చుకోన్నాడుకానీ దలపత్ మారలేదు .అన్నీ పద్యం లోనే చెప్పాడు .శ్రోతల్ని కవిత్వంతో ఆనదింప జేశాడు .బొమ్బాయినగరం లోని దర్జీలు ,పార్శీలు,ఇతర ప్రముఖులపై  పై ఆయన ‘’గర్భీలు ‘’రాశాడు .పిప్పల వృక్షాన్ని గురించి రాసిన బపానీ పిప్పర్ లో గ్రీష్మర్తు వర్ణన ఉంది .ఇది నవ్యసృష్టి .తర్వాత అగ్నిమాపక దళం ,విదేశీయానం ,నల్లులు ఎలుకలు పొగాకు చెప్పులుకుట్టేరాయి ,ఎగ మొండికేసిన దున్న ,కుర్చీ లపైనా కవితలల్లాడు .అరిష్టోఫేన్ రూపకాలు  ధోరణి లో మొదాంత నాటకాలు రాశాడు .మొట్టమొదటి స్మృతిగీతం రాశాడు విజ్ఞానబోదనలో హాస్య ధోరణిలో వీటికి మించినవి లేవు .

  సంలీనతా యుగం

1852నుంచి గుజరాత్ కవిత్వం లో కొత్తమార్గామేర్పడింది .దేశంలోని పునరుజ్జీవ ఉద్యమం మొదటిదశ్శలోనే గుజరాత్ లో నవీన కవితోద్యమం మొదలైంది .పాశ్చాత్య ధోరణిపై పూర్తీ అనుకరణ ,ఆకర్షణతో కవిత్వాలు రాశారుకవులు .తర్వాత విచాక్షణాత్మక దశలో  ప్రాతయ పాశ్చాత్య మేలికలయికలతో ,కొత్త పాతలకలయికతో కవిత్వం రాశారు .ఈమార్పు సాహిత్య సాన్ఘికాది విషయాలలోనూ వచ్చింది .దీన్ని దలపతిరాం నర్మాద్ ,,నరసింహారావు దివితియ ,కాంత్ ,కలాపి మార్గదర్శనం చేశారు .వచనం లో గోవర్ధనరావు త్రిపాఠీ,రచనలలో ఆయన విశిష్టరచన ‘’సరస్వతీ చంద్ర ‘’లో అపూర్వ సాంస్కృతిక సమ్మేళనం కనిపిస్తుంది .ఈబాధ్యతను నానాలాల్ భుజాలపైకి ఎత్తుకోన్నాడు .

 19వ శతాబ్ది చివర ,20వ శతాబ్ది మొదట్లో గుజరాత్ జీవితం సాహిత్యాలలో ‘’సంలీనత ‘’రాజ్యమేలింది .’’అన్ని దిక్కుల్నుంచి సర్వ సద్భావాలు మమ్మల్ని సమీపించుగాక ‘’అనే వేదస్తుతి మళ్ళీ స్మరణీయం అయింది .దీనికి తోడూ గాంధీ చెప్పిన ‘’సమస్త దేశ సంస్కృతులు నా ఇంటి చుట్టూ ఎటువంటి అడ్డంకి లేకుండా స్వేచ్చగా వీచటమే నేను ఆశిస్తాను.ఏ గాలీ నాపాదాలను తొట్రుపడజేసి ,నేను కొట్టుకుపోవటం మాత్రం నేను సహించను.’’ కూడా చేర్చుకొన్నారు .నానాలాల్ తో సహా కవులంతా ఈ దృక్పధాన్నే పాటించారు .ఇదే వశీకరణ వాగ్ నినాదం.ఈ రకమైన సంలీనతా తత్వాన్ని కవితలో పాటలలోరూపకాలలో రాగభరిత౦ గా ,లయాత్మకంగా  వ్యవస్ధీ కరించిన వారిలో మన నానాలాల్ అగ్రగణ్యుడు  .

  పద్య కృతులు

శత సంపుట రచయిత నానాలాల్  లయాత్మక శైలిలోవైవిధ్యం తో  గద్య ,పద్య కృతులు అల్లాడు .కధనాత్మకకావ్యాలైన వసంతోత్సవ ,ద్వారికా ప్రళయ  ,పాటలు భావగీతాలు ,రాసలీలలు చాలా సంపుటాలు గా రాశాడు .వీటిలో విస్తృత మహాకావ్యం ‘’కురుక్షేత్ర ‘’12భాగాలు .ఇందుకుమార్ ,జయజయంత్ ,జహంగీర్ ,నూర్జహాన్ ,షహంషా అక్బర్ ,విశ్వగీత మొదలైన నాటకాలు 12పైగా రాశాడు .నవలలుగా ఉష ,సారధి రాశాడు .పంఖాడి వంటి కధలు,ఉద్బోధన్ ,సంసార మంధన్ పేర్లతో 8సంపుటాలుగా బహిరంగ ఉపన్యాసాలు ,సాహితీ విమర్శలు ,కవీశ్వర్ దలపతిరాం ‘’పేరిట తండ్రి జీవిత చరిత్ర నాలుగు భాగాలుగా రాశాడు .శకుంతల ,మేఘదూత ,భగవద్గీత అను వాదాలు చేశాడు .సుదీర్ఘమైన తన అర్ధ శతాబ్ది సాహిత్య జీవితాన్ని ‘’హరి సంహిత ‘’అనే అసంపూర్ణ కావ్యం పరి సమాప్తి చేశాడు నానాలాల్ .తన సాహిత్య జీవితాన్ని ‘’హరిలీలామృతం ‘’అనే దీర్ఘ కావ్యం తో సమాప్తి చేసి ధన్యుడయ్యాడు .

 సశేషం

మీ-గబ్బిటదుర్గాప్రసాద్ -19-2-22-ఉయ్యూరు —

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

మన మరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు -82- 82-ఇంటిపేరు లలితమైన పువ్వుల స్వరంమాత్రం కంచు నారద ఫేం,కళావిశారద ,గానగంధర్వ –సూరిబాబు -2

మన మరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు -82-

82-ఇంటిపేరు లలితమైన పువ్వుల  స్వరంమాత్రం కంచు  నారద ఫేం,కళావిశారద ,గానగంధర్వ –సూరిబాబు -2

 సూరిబాబుది ఒక విలక్షణమైన స్వరం. ఆయన పద్యం పాడితే కంచు మ్రోగినట్లుగా మైక్ లేకపోయినా చాలా దూరానికి స్పష్టంగా వినిపించేది. పి. పుల్లయ్య దర్శక నిర్మాణంలో 1960 లో వచ్చిన ‘ శ్రీ వెంకటేశ్వర మహాత్మ్యం ‘ చిత్రంలో ఆయన పాడిన పాటను తెలుగు భాషోద్యమానికి కృషి చేస్తున్న స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ శ్రీ ఎన్. రహమతుల్లా గారు తమ వ్యాఖ్యలో గుర్తుచేశారు……

నేను చిన్నప్పుడు ఎన్టీఆర్ నటించిన “వేంకటేశ్వర మహత్యం” సినిమా చూశాను.అందులో నారదుడిగా నటించిన పి.సూరిబాబు వెంకటేశ్వరుని విగ్రహం ముందు నిలబడి”కళ్ళుతెరవరా నరుడా” అనే పాట అద్భుతంగా పాడుతాడు.ఆ పాట దొరుకుతుందేమో అని చాలా చోట్ల ప్రయత్నించాను.సినిమాలో పాటలు ఎక్కువయ్యాయని ఈ పాటను తీసేశారని కొందరు చెప్పారు.విఏకే రంగారావు గారి దగ్గరకూడా ఈ పాట లేదు.ఇలాంటి పాటలను ఎక్కడో ఒకచోట భద్రపరచాలిగానీ పూర్తిగా తీసెయ్యటం వలన అమూల్యమైన తెలుగు సినీ సాహిత్యం,సంగీతం ఎవరికీ దొరకకుండా పోతోందని నా బాధ. 

కంచులా మ్రోగే కంఠస్వరంతో, కఠినంగా అనిపించే పద్యాలను పామరులకు సైతం అర్థమయ్యేలాగా సుస్పష్టమైన ఉచ్చారణతో పాడి అటు రంగస్థలాన్ని, ఇటు తెలుగు చిత్ర రంగాన్ని సుసంపన్నం చేసిన నటుడు పువ్వుల సూరిబాబు.

పువ్వు పుట్టగానే పరిమళించిందట. అలా సూరిబాబు ఆరేళ్ళ వయసులోనే బొబ్బిలి యుద్ధం నాటకంలో చిన రంగారావు పాత్ర పోషించాడు. దాంతో నాటకాల మీద మోజు బయిల్దేరింది. ఆది ఆయనతో బాటు పెరిగి పెద్దదై చదువును వదిలిపెట్టేలా చేసింది. అంతేకాదు… స్వగ్రామం కృష్ణా జిల్లా గుడివాడ తాలూకా బొమ్ములూరు గ్రామం వదలి పోయేలా చేసింది. అక్కడనుంచి పారిపోయిన సూరిబాబు ఎక్కడో వున్న గద్వాల్ లో తేలాడు. అక్కడ వున్న గద్వాల్ సంస్థానం వారి నాటక సమాజంలో జేరాడు. రామదాసు నాటకంలో రాముడు, కృష్ణలీలలులో బాలకృష్ణుడు లాంటి వేషాలు వేసాడు. కొంతకాలానికి అక్కడనుంచి గుంటూరు వచ్చి దంటు వెంకట కృష్ణయ్య గారి సమాజంలో జేరాడు. అప్పట్లో ప్రముఖ నటుడు కొప్పరపు సుబ్బారావు గారి శిష్యరికం చేసి సుశిక్షుతుడైన నటుడిగా తయారయ్యారు సూరిబాబు.

అనంతరం గుడివాడలో స్వంతంగా నాటక సమాజాన్ని నెలకొల్పి అత్యున్నత సాంకేతిక విలువలతో నాటకాలు ప్రదర్శించారు. అయితే నష్టాలు రావడంతో దాన్ని మూసేసి 1936 లో తెనాలి జేరుకున్నారు.  అక్కడ కూడా అనేక నాటకాలు ప్రదర్శించారు. ఆ సమయంలోనే ద్రౌపదీ వస్త్రాపహరణం తో చిత్రసీమలో ప్రవేశించారు. మాలపిల్ల చిత్రంలో ఆయన పాడిన ‘కొల్లాయి కట్టితేనేమి మా గాంధీ….’ పాట వాడ వాడలా మార్మోగింది. చాలా చిత్రాల్లో నటించడమే కాక తన పాటలు, పద్యాలు తానే పాడుకున్నారు. అంతేకాదు పాటలను, ముఖ్యంగా పద్యాలను స్వరపరచడానికి సంగీత దర్శకులు సూరిబాబు గారి సహకారం తీసుకునేవారు. అలా మహాకవి కాళిదాసు చిత్రంలోని మాణిక్య వీణాం……. శ్లోకం స్వరకల్పనలో ఈయన హస్తం కూడా వుంది.

సూరిబాబు గారు తన భార్య రాజేశ్వరి గారి పేరు మీద రాజరాజేశ్వరి నాట్య మండలిని స్థాపించి ఎన్నో నాటకాలు ప్రదర్శించారు. ముఖ్యంగా కొప్పరపు సుబ్బారావు గారు రచించిన ‘ తారాశశాంకం ‘ నాటకం వారికి ఎంతో పేరు తెచ్చింది. ఆయన రంగస్థలం మీద రామదాసు, రాముడు, చినరంగారావు, ధర్మారాయుడు, రంగారావు, గజేంద్రుడు, తక్షకుడు, కశ్యపుడు, నారదుడు, కంసుడు, ధర్మరాజు, భీముడు, అర్జునుడు, ధృతరాష్ట్రుడు, భీష్ముడు, విప్రనారాయణుడు, బిల్వమంగళుడు, భవానీ శంకరుడు, రారాజు, సుబుద్ధి లాంటి ఎన్నో వైవిధ్యమున్న పాత్రలు పోషించారు.

కళ్ళు తెరువరా నరుడా

కళ్ళు తెరువరా నరుడా
నీ ఖర్మ తెలియరా [[కళ్ళు]]
కలిమిలేములకు కష్టసుఖాలకు
కారణమొకటేరా నీ ఖర్మే మూలమురా[[కళ్ళు]]
వేపనువిత్తి ద్రాక్షకోసమై
వేడుక పడుట వెర్రికదా
కాలికి రాయి తగులుటకన్న
రాయికి కాలే తగులునురా [[కళ్ళు]]
కమలనాభుని పదకమలములే
కలుష జలధికీ సేతువురా
కలిమాయలలో కలతజెందినా
ధరణికి అదియే తారకమగురా [[కళ్ళు]]

  సశేషం

మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -19-2-22-ఉయ్యూరు

 .

Posted in సినిమా | Tagged | Leave a comment

మనమరుపు వెనుక మన వెండితెర మహానుభావులు -81 81-నాట్య కళాగురుమూర్తి –పసుమర్తి

మనమరుపు వెనుక మన వెండితెర మహానుభావులు -81

81-నాట్య కళాగురుమూర్తి –పసుమర్తి

పసుమర్తి కృష్ణమూర్తి (1925 నవంబరు 12 – 2004 ఆగష్టు 8) ప్రముఖ తెలుగు సినిమా నృత్య దర్శకులు. మానసోల్లాసం, ఆహ్లాదం, ఆనందం, హాయీ కలిగిస్తూ కనుల పండుగగా అనిపించే నాట్యాలను తెర మీద ఆవిష్కరించాడు పసుమర్తి కృష్ణమూర్తి. ఏ గందరగోళం లేకుండా, మనోహరంగా రూపొందించాడు. ఆయన చిత్ర నృత్యాలలో అభినయం, ఆంగికం, ముఖభావాలూ అన్నీ ఎంతో ఆకర్షణీయంగా కనిపిస్తాయి. మల్లీశ్వరి (1951), పాతాళ భైరవి (1951) మిస్సమ్మ (1955), మాయాబజార్ (1957), శ్రీకృష్ణార్జున యుద్ధము (1963) వంటి సుప్రసిధ్ధ చిత్రాలలోని నృత్యాల రూపశిల్పి కృష్ణమూర్తి.తండ్రి రామయ్య తల్లి ఆదిలక్ష్మి

తొలి జీవితం
ఆయన ఆరో ఏట నుంచే నాట్యాభ్యాసం ప్రారంభించారు. చదువులో వెనుకబడితే, దాన్ని మళ్లీ పట్టుకుని ఇంటి దగ్గరే తెలుగు, సంస్కృతం నేర్చుకున్నారు. దరువులు, కీర్తనలు నోటిపాఠంగా నేర్చుకుని యక్షగానాల్లో ప్రహ్లాదుడు, లోహితుడు, లవుడు, కుశుడు వంటి బాలపాత్రలు అభినయించేవారు. సంగీతం వేరేగా అభ్యసుంచకపోయినా, నాట్యంతో పాటే అదీ అలవడింది. కూచిపూడి నాట్య నీష్ణాతులు ‘పద్మశ్రీ’ స్వీకర్త – చింతా కృష్ణమూర్తి పసుమర్తికి మేనమామ. ఆయన శిష్యరికంలో మరింత శిక్షణపొంది, ఒక్కడే స్త్రీ పాత్ర ధరించి అష్టపది, జావళి, తరంగాలతో ప్రదర్శనలు ఇచ్చేవారు కృష్ణమూర్తి. అలా నాలుగైదేళ్లు గడిచాక, వేదాంతం రాఘవయ్య, వెంపటి పెదసత్యం, పసుమర్తి కృష్ణమూర్తి ముగ్గురూ కలిసి నృత్యనాటికలు తయారుచేసి, జానపద నృత్యాలు కూడా కలిపి ప్రదర్శనలు ఇస్తే గొప్ప ప్రజాదరణ కలిగింది. కర్ణాటకాంధ్రలోని ముఖ్యపట్టణాలలో పెక్కు ప్రదర్శనలు ఇచ్చారు. ఒక నాలుగేళ్ల కాలంలో, వేదాంతంవారు, వెంపటివారు సినిమారంగానికి వెళ్లిపోతే, పసుమర్తివారే బృందాల్ని తయారుచేసి, జనరంజకంగా ప్రదర్శనలు ఇవ్వసాగరు.

చలనచిత్రరంగ ప్రవేశం
ఒకసారి బెజవాడలో జరిగిన ప్రదర్శనలో స్త్రీ పాత్రలో ఉన్న కృష్ణమూర్తి నాట్యం చూసి, అబ్బురపడిన రంగస్థలనటుడు సూరిబాబు రాజరాజేశ్వరివారు నిర్మించబోయే భక్త తులసీదాసు (1946) చిత్రంలోని నాట్యదృశ్యానికి రూపం కల్పించమని అడిగారు. కృష్ణమూర్తి సంతోషించారు. ఆ చిత్రం సేలంలో నిర్మించారు. ఆ చిత్రంలో పిల్లలు వేసే నృత్యనాటిక ఉంది. ఆ చిత్ర సంగీతదర్శకుడు భీమవరపు నరసింహారావు అప్పటికే ఆ పాటను రికార్డు చేశారు. ఆ పాట విని, తాళగతిని, భావాన్నీ గ్రహించి కృష్ణమూర్తి నాట్యం రూపొందించారు. సీతారామ లక్ష్మణులు వనవాసంలో ఉండడం, మాయలేడి రావటం, రావణుడు సీతను ఎత్తుకెళ్లడం – అందులోని ఇతివృత్తం. దానికి తగ్గట్టుగా కూచిపూడి శైలిలో ఆంగికాభినయాలను కూర్చి, సినిమా టెక్నిక్‌ని తెలుసుకుంటూ, చిత్రీకరణకు సహాయపడ్డారు. అప్పుడు కృష్ణమూర్తి వయస్సు ఇరవై సంవత్సరాలు. భక్త తులసీదాసు చిత్రానికి డైరెక్టరు లంక సత్యం, తర్వాత లంక సత్యమే డైరెక్టు చేసిన చంపకవల్లి అనే తమిళ చిత్రంలో పనిచేసే అవకాశం వచ్చింది ఆయనకి. అందులోనూ ఒక నృత్యనాటిక, ఇంద్రసభలో రంభ, ఊర్వశుల నాట్యాలూ ఉన్నాయి. కృష్ణమూర్తికి మంచిపేరు వచ్చినా వెనువెంటనే అవకాశాలు రాలేదు. ఆయన మద్రాసులోనే మకాం పెట్టి, ఓ పక్క సినిమా ప్రయత్నాలు చేస్తూ, ఓ పక్క డ్యాన్సు ట్యూషన్లు చెబుతూ కాలక్షేపం చేశారు.

గుణసుందరి కథ సంగతులు
అప్పట్లో లంక సత్యం దగ్గర ప్రముఖ దర్శకుడు డి.యోగానంద్ సహాయకుడిగా ఉండేవారు. ఆయన కృష్ణమూర్తిని ఓగిరాల రామచంద్రరావుకి పరిచయం చెయ్యడం, ఆయన కె.వి.రెడ్డికి పరిచయం చేయడం జరిగాయి. ఓగిరాల వాహిని వారి గుణసుందరి కథ (1949)కి సంగీతదర్శకుడు. కె.వి.రెడ్డి పసుమర్తి నాట్య లక్షణాలు, శక్తి సామర్థ్యాలు తెలుసుకుని, ‘గుణసుందరి కథ’కి నాట్యదర్శకుడిగా నియమించారు. అదే గొప్ప ప్రవేశం, పరిచయం. గుణసుందరి కథలో రకరకాల నాట్యాలున్నాయి. వాటిని కృష్ణమూర్తి అతినైపుణ్యంతో నిర్వహించారు. వయసు మీరినట్టు కనిపించిన శాంతకుమారి, కె.మాలతికి, సున్నితమైన మూవ్‌మెంట్స్ కూర్చి కలకలా ఆ కోకిలేమో పాటని రక్తి కట్టించారు. చిటి తాళం వేస్తానంటే అని శివరావు చేసిన నాట్యం ఇంకోరకం. ఈ వనిలో కోయిలనై అని, జూనియర్ లక్ష్మీరాజ్యం చేసిన అభినయం ఇంకోరకం. ఎరుకల నాట్యంలో కృష్ణమూర్తే స్వయంగా పాల్గొని, నాట్యం చేశారు. ఇక్కడో విశేషం. ఆ పాత్రని గౌరీపతిశాస్త్రి నిర్వహించారు. కాని, నాట్యంలో కృష్ణమూర్తి నటించారు. తేడా తెలియనివ్వకుండా చిత్రీకరించినా, పరిశీలిస్తే తెలుస్తుంది. ఇంకో విశేషం కూడా ఉంది. ఇందులో రేలంగి, గోబేరు సుబ్బారావు కలిసి, అదియే ఎదురై వచ్చేదాకా పాట పాడుతారు. రేలంగికి రేలంగే పాడగా, సుబ్బారావుకి పసుమర్తి పాడారు.

మిగతా సినిమా జీవితం
గుణసుందరి కథ జానపద చిత్రాల ధోరణిని మార్చింది. కథ, కథాగమనం, వినోదం, సంగీతాలతో పాటు టెక్నికల్‌గా కూడా నూతనత్వం చూపించింది. చిత్రం ఘనవిజయం సాధించడంతో, అందరికి ఖ్యాతి లభించినట్టు – కృష్ణమూర్తికి కూడా లభించింది. పరిశ్రమకి ఒక మంచి నాట్యదర్శకుడు లభించాడు. పి.పుల్లయ్య తీసిన తిరుగుబాటు (1950) చిత్రానికి కృష్ణమూర్తి పనిచేసిన తరువాత, విజయా సంస్థ ఆరంభం కావడంతో, అక్కడ చేరి ఉమా చండీ గౌరీ శంకరుల కథ (1968) వరకూ నాట్యదర్శకుడిగా పనిచేశారు – కొన్ని ఇతర చిత్రాలకు చేస్తూనే.

ప్రసిద్ధి చెందిన నాట్య రూపకాలు
సినిమాల్లో అప్పుడప్పుడు కనిపించే నాట్య రూపకాలు చరిత్రలో నిలిచిపోయే రీతిలో ఉంటాయి. అలాచూస్తే మల్లీశ్వరిలో ఉషాపరిణయం యక్షగానం, మాయాబజార్లో మోహినీ భస్మాసుర ముఖాభినయం, పెళ్ళి చేసి చూడు (1952)లో ఊర్వశి, అర్జునుడు స్వప్నదృశ్యం లాంటివి కొన్ని. (రహస్యంలో గిరిజా కల్యాణం ఇంకొక ఉదాహరణ.) మల్లీశ్వరిలో ఉషాపరిణయం సంగీత, సాహిత్య, నాట్యమయమై కళాశోభితంగా కనిపిస్తుంది. ఈ నాట్యరూపకం రూపొందే ముందు, రచయిత కృష్ణశాస్త్రి, సంగీత దర్శకుడు రాజేశ్వరరావు, నాట్యదర్శకుడు కృష్ణమూర్తి నెల రోజులకు పైగా చర్చలు చేసిన తర్వాత, కృష్ణమూర్తి డాన్స్ కంపోజింగ్‌కి, రిహార్సల్స్‌కి ఇంకో నెలరోజులు పట్టింది. అంతటి కృషితో సాధించినది గనకే, ఆ రూపకానికి అంతటి పేరు. మాయాబజార్లోని మోహిని భస్మాసుర – కథకళి శైలిలో రూపొందించారు. సాహిత్యం లేకుండా వాద్య గోష్ఠితోనే సాగి, అధ్బుతంగా అలరించింది ఆ నాట్యం. పాతాళ భైరవిలోని మాయామహల్లో జరిగే నాట్యప్రదర్శనలు, మాయాబజార్‌లోని పెళ్ళి కుమారా రావయ్యా ఆహ్వాన గీతం, నాట్యాలూ మహా అధ్భుతం. ఈ నాట్యాలు పసుమర్తివారి శ్రమకి గీటురాళ్లు.

హాస్య నాట్య రూపకాలు
కృష్ణమూర్తి లో ఉన్న ఇంకో ప్రజ్ఞ – హాస్య నటులైతే ఆ ధోరణిలో కంపోజ్ చేయడం. పాతాళ భైరవిలో రేలంగి పాడిన వినవే బాలా; శ్రీ కృష్ణార్జున యుద్ధంలో అంచెలంచెల దానికి ఉదాహరణలు. ఈ పాటలో అల్లు రామలింగయ్య కదలికలు కడుపుబ్బ నవ్విస్తాయి. మాయాబజార్‌లో సుందరి నీవంటి దివ్య స్వరూపమూ పాట కూడా అటువంటిదే.

ఇతర విశేషాలు
ఆయన పనిచేసిన దాదాపు 200 చిత్రాల్లో దక్షిణ భాషా చిత్రాలున్నాయి; సాంఘికాలు, చరిత్రకాలు, పురాణాలూ అన్నీ ఉన్నాయి. ఆయన చివరి చిత్రం భైరవద్వీపం (1994), ఆ చిత్రంలో శ్రీతుంబర నారద పాటలో కనిపించే నాట్యవిన్యాసాలు కృష్ణమూర్తి సృష్టించారు.

ముఖ్య చిత్రాలు
· 1973 – అందాల రాముడు

· 1967 – సాక్షి

· 1964 – బబ్రువాహన

· 1963 – చదువుకున్న అమ్మాయిలు

· 1963 – శ్రీ కృష్ణార్జున యుద్ధం

· 1962 – దక్షయజ్ఞం

· 1961 – భార్యాభర్తలు

· 1961 – జగదేకవీరుని కథ

· 1958 – అప్పుచేసి పప్పుకూడు

· 1957 – మయాబజార్

· 1957 – సారంగధర

· 1955 – మిస్సమ్మ

· 1954 – పెద్దమనుషులు

· 1953 – కన్నతల్లి

· 1950 – షావుకారు

· 1949 – గుణసుందరి కథ

డా రచన: శారదాప్రసాద్

పసుమర్తి కృష్ణమూర్తి ప్రముఖ తెలుగు సినిమా నృత్య దర్శకులు. మానసోల్లాసం, ఆహ్లాదం, ఆనందం, హాయీ కలిగిస్తూ కనులపండువ కనిపించే కొన్ని నాట్యాలు తెర మీద చూస్తూవుంటే పసుమర్తి కృష్ణమూర్తి గారు గుర్తుకొస్తారు. ఆయన చిత్ర నృత్యాలలో అభినయం, ఆంగికం, ముఖభావాలూ అన్నీ ఎంతో ఆకర్షణీయంగా కనిపిస్తాయి. మల్లీశ్వరి (1951), పాతాళ భైరవి (1951) మిస్సమ్మ (1955), మాయాబజార్ (1957), శ్రీకృష్ణార్జున యుద్ధము (1963) వంటి సుప్రసిధ్ధ చిత్రాలలో మనం చూస్తున్న నృత్యాలకు రూపశిల్పి కృష్ణమూర్తి గారు. ఆయన ఆరో ఏట నుంచే నాట్యాభ్యాసం ప్రారంభించారు. దరువులు, కీర్తనలు నోటిపాఠంగా నేచుకుని యక్షగానాల్లో ప్రహ్లాదుడు, లోహితుడు, లవుడు, కుశుడు వంటి బాలపాత్రలు అభినయించేవారు. సంగీతం వేరేగా అభ్యసించకపోయినా, నాట్యంతో పాటే అదీ అలవడింది. కూచిపూడి నాట్య నీష్ణాతులు ‘పద్మశ్రీ’ స్వీకర్త – చింతా కృష్ణమూర్తి గారు పసుమర్తికి మేనమామ. వేదాంతం రాఘవయ్య, వెంపటి పెదసత్యం, పసుమర్తి కృష్ణమూర్తి ముగ్గురూ కలిసి నృత్యనాటికలు తయారుచేసి, జానపద నృత్యాలు కూడా కలిపి ప్రదర్శనలు ఇస్తే గొప్ప ప్రజాదరణ కలిగింది. కర్ణాటకాంధ్రలోని ముఖ్యపట్టణాలలో పెక్కు ప్రదర్శనలు ఇచ్చారు. ఒక నాలుగేళ్ల కాలంలో, వేదాంతంవారు, వెంపటివారు సినిమారంగానికి వెళ్లిపోతే, పసుమర్తివారే బృందాల్ని తయారుచేసి, జనరంజకంగా ప్రదర్శనలు ఇవ్వసాగారు.
ఒకసారి బెజవాడలో జరిగిన ప్రదర్శనలో స్త్రీ పాత్రలో ఉన్న కృష్ణమూర్తి గారి నాట్యం చూసి, అబ్బురపడిన రంగస్థల నటుడు సూరిబాబు రాజరాజేశ్వరి వారు నిర్మించబోయే భక్త తులసీదాసు (1946) చిత్రంలోని నాట్యదృశ్యానికి రూపం కల్పించమని అడిగారు. ఆ చిత్రంలో పిల్లలు వేసే నృత్యనాటిక ఉంది. సీతారామ లక్ష్మణులు వనవాసంలో ఉండడం, మాయలేడి రావటం, రావణుడు సీతను ఎత్తుకెళ్లడం – అందులోని ఇతివృత్తం. దానికి తగ్గట్టుగా కూచిపూడి శైలిలో ఆంగికాభినయాలను కూర్చి, సినిమా టెక్నిక్‌ని తెలుసుకుంటూ, చిత్రీకరణకు సహాయపడ్డారు. భక్త తులసీదాసు చిత్రానికి డైరెక్టరు లంక సత్యం, తర్వాత లంక సత్యమే డైరెక్టు చేసిన చంపకవల్లి అనే తమిళ చిత్రంలో పనిచేసే అవకాశం వచ్చింది ఆయనకి. అందులోనూ ఒక నృత్యనాటిక, ఇంద్రసభలో రంభ, ఊర్వశుల నాట్యాలు ఉన్నాయి. కె. వి. రెడ్డి గారు పసుమర్తి గారి నాట్య లక్షణాలు, శక్తి సామర్థ్యాలు తెలుసుకుని, ‘గుణసుందరి కథ’కి నాట్యదర్శకుడిగా నియమించారు. అదే గొప్ప ప్రవేశం, పరిచయం. గుణసుందరి కథలో రకరకాల నాట్యాలున్నాయి. వాటిని కృష్ణమూర్తి అతి నైపుణ్యంతో రచించారు . గుణసుందరి కథ చిత్రం ఘనవిజయం సాధించడంతో , అందరికి ఖ్యాతి లభించినట్టు – కృష్ణమూర్తి గారికి కూడ ఖ్యాతి లభించింది. పి. పుల్లయ్య తీసిన తిరుగుబాటు (1950) చిత్రానికి కృష్ణమూర్తిగారు పని చేసారు. విజయ సంస్థ ప్రారంభించిన తొలి చిత్రం ‘షావుకారు’ నుంచి చివరి చిత్రం ‘శ్రీ రాజేశ్వరి విలాస్ కాఫీ క్లబ్ ’ వరకు ప్రతి చిత్రానికీ పనిచేసిన నృత్య దర్శకుడు పసుమర్తి కృష్ణమూర్తి. మల్లీశ్వరిలో ఉషాపరిణయం యక్షగానం, మాయాబజార్లో మోహినీ భస్మాసుర ముఖాభినయం, పెళ్ళి చేసి చూడు (1952)లో ఊర్వశి, అర్జునుడు స్వప్నదృశ్యం లాంటివి కొన్ని నాట్యాలు మన మనస్సులో నిలిచిపోయాయి. రహస్యంలో గిరిజా కల్యాణం ఇంకొక ఉదాహరణ. మల్లీశ్వరిలో ఉషాపరిణయం సంగీత, సాహిత్య, నాట్యమయమై కనిపిస్తుంది. ఈ నాట్యరూపకం రూపొందే ముందు, రచయిత కృష్ణశాస్త్రిగారు, సంగీత దర్శకుడు రాజేశ్వరరావుగారు, నాట్యదర్శకుడు కృష్ణమూర్తిగారు నెల రోజులకు పైగా చర్చలు చేసిన తర్వాత, కృష్ణమూర్తిగారు డాన్స్ కంపోజింగ్‌కి, రిహార్సల్స్‌కి ఇంకో నెలరోజులు పట్టింది.

సశేషం

మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -19-2-22-ఉయ్యూరు

రచన: శారదాప్రసాద్

పసుమర్తి కృష్ణమూర్తి ప్రముఖ తెలుగు సినిమా నృత్య దర్శకులు. మానసోల్లాసం, ఆహ్లాదం, ఆనందం, హాయీ కలిగిస్తూ కనులపండువ కనిపించే కొన్ని నాట్యాలు తెర మీద చూస్తూవుంటే పసుమర్తి కృష్ణమూర్తి గారు గుర్తుకొస్తారు. ఆయన చిత్ర నృత్యాలలో అభినయం, ఆంగికం, ముఖభావాలూ అన్నీ ఎంతో ఆకర్షణీయంగా కనిపిస్తాయి. మల్లీశ్వరి (1951), పాతాళ భైరవి (1951) మిస్సమ్మ (1955), మాయాబజార్ (1957), శ్రీకృష్ణార్జున యుద్ధము (1963) వంటి సుప్రసిధ్ధ చిత్రాలలో మనం చూస్తున్న నృత్యాలకు రూపశిల్పి కృష్ణమూర్తి గారు. ఆయన ఆరో ఏట నుంచే నాట్యాభ్యాసం ప్రారంభించారు. దరువులు, కీర్తనలు నోటిపాఠంగా నేచుకుని యక్షగానాల్లో ప్రహ్లాదుడు, లోహితుడు, లవుడు, కుశుడు వంటి బాలపాత్రలు అభినయించేవారు. సంగీతం వేరేగా అభ్యసించకపోయినా, నాట్యంతో పాటే అదీ అలవడింది. కూచిపూడి నాట్య నీష్ణాతులు ‘పద్మశ్రీ’ స్వీకర్త – చింతా కృష్ణమూర్తి గారు పసుమర్తికి మేనమామ. వేదాంతం రాఘవయ్య, వెంపటి పెదసత్యం, పసుమర్తి కృష్ణమూర్తి ముగ్గురూ కలిసి నృత్యనాటికలు తయారుచేసి, జానపద నృత్యాలు కూడా కలిపి ప్రదర్శనలు ఇస్తే గొప్ప ప్రజాదరణ కలిగింది. కర్ణాటకాంధ్రలోని ముఖ్యపట్టణాలలో పెక్కు ప్రదర్శనలు ఇచ్చారు. ఒక నాలుగేళ్ల కాలంలో, వేదాంతంవారు, వెంపటివారు సినిమారంగానికి వెళ్లిపోతే, పసుమర్తివారే బృందాల్ని తయారుచేసి, జనరంజకంగా ప్రదర్శనలు ఇవ్వసాగారు.
ఒకసారి బెజవాడలో జరిగిన ప్రదర్శనలో స్త్రీ పాత్రలో ఉన్న కృష్ణమూర్తి గారి నాట్యం చూసి, అబ్బురపడిన రంగస్థల నటుడు సూరిబాబు రాజరాజేశ్వరి వారు నిర్మించబోయే భక్త తులసీదాసు (1946) చిత్రంలోని నాట్యదృశ్యానికి రూపం కల్పించమని అడిగారు. ఆ చిత్రంలో పిల్లలు వేసే నృత్యనాటిక ఉంది. సీతారామ లక్ష్మణులు వనవాసంలో ఉండడం, మాయలేడి రావటం, రావణుడు సీతను ఎత్తుకెళ్లడం – అందులోని ఇతివృత్తం. దానికి తగ్గట్టుగా కూచిపూడి శైలిలో ఆంగికాభినయాలను కూర్చి, సినిమా టెక్నిక్‌ని తెలుసుకుంటూ, చిత్రీకరణకు సహాయపడ్డారు. భక్త తులసీదాసు చిత్రానికి డైరెక్టరు లంక సత్యం, తర్వాత లంక సత్యమే డైరెక్టు చేసిన చంపకవల్లి అనే తమిళ చిత్రంలో పనిచేసే అవకాశం వచ్చింది ఆయనకి. అందులోనూ ఒక నృత్యనాటిక, ఇంద్రసభలో రంభ, ఊర్వశుల నాట్యాలు ఉన్నాయి. కె. వి. రెడ్డి గారు పసుమర్తి గారి నాట్య లక్షణాలు, శక్తి సామర్థ్యాలు తెలుసుకుని, ‘గుణసుందరి కథ’కి నాట్యదర్శకుడిగా నియమించారు. అదే గొప్ప ప్రవేశం, పరిచయం. గుణసుందరి కథలో రకరకాల నాట్యాలున్నాయి. వాటిని కృష్ణమూర్తి అతి నైపుణ్యంతో రచించారు . గుణసుందరి కథ చిత్రం ఘనవిజయం సాధించడంతో , అందరికి ఖ్యాతి లభించినట్టు – కృష్ణమూర్తి గారికి కూడ ఖ్యాతి లభించింది. పి. పుల్లయ్య తీసిన తిరుగుబాటు (1950) చిత్రానికి కృష్ణమూర్తిగారు పని చేసారు. విజయ సంస్థ ప్రారంభించిన తొలి చిత్రం ‘షావుకారు’ నుంచి చివరి చిత్రం ‘శ్రీ రాజేశ్వరి విలాస్ కాఫీ క్లబ్ ’ వరకు ప్రతి చిత్రానికీ పనిచేసిన నృత్య దర్శకుడు పసుమర్తి కృష్ణమూర్తి. మల్లీశ్వరిలో ఉషాపరిణయం యక్షగానం, మాయాబజార్లో మోహినీ భస్మాసుర ముఖాభినయం, పెళ్ళి చేసి చూడు (1952)లో ఊర్వశి, అర్జునుడు స్వప్నదృశ్యం లాంటివి కొన్ని నాట్యాలు మన మనస్సులో నిలిచిపోయాయి. రహస్యంలో గిరిజా కల్యాణం ఇంకొక ఉదాహరణ. మల్లీశ్వరిలో ఉషాపరిణయం సంగీత, సాహిత్య, నాట్యమయమై కనిపిస్తుంది. ఈ నాట్యరూపకం రూపొందే ముందు, రచయిత కృష్ణశాస్త్రిగారు, సంగీత దర్శకుడు రాజేశ్వరరావుగారు, నాట్యదర్శకుడు కృష్ణమూర్తిగారు నెల రోజులకు పైగా చర్చలు చేసిన తర్వాత, కృష్ణమూర్తిగారు డాన్స్ కంపోజింగ్‌కి, రిహార్సల్స్‌కి ఇంకో నెలరోజులు పట్టింది.

రచన: శారదాప్రసాద్

పసుమర్తి కృష్ణమూర్తి ప్రముఖ తెలుగు సినిమా నృత్య దర్శకులు. మానసోల్లాసం, ఆహ్లాదం, ఆనందం, హాయీ కలిగిస్తూ కనులపండువ కనిపించే కొన్ని నాట్యాలు తెర మీద చూస్తూవుంటే పసుమర్తి కృష్ణమూర్తి గారు గుర్తుకొస్తారు. ఆయన చిత్ర నృత్యాలలో అభినయం, ఆంగికం, ముఖభావాలూ అన్నీ ఎంతో ఆకర్షణీయంగా కనిపిస్తాయి. మల్లీశ్వరి (1951), పాతాళ భైరవి (1951) మిస్సమ్మ (1955), మాయాబజార్ (1957), శ్రీకృష్ణార్జున యుద్ధము (1963) వంటి సుప్రసిధ్ధ చిత్రాలలో మనం చూస్తున్న నృత్యాలకు రూపశిల్పి కృష్ణమూర్తి గారు. ఆయన ఆరో ఏట నుంచే నాట్యాభ్యాసం ప్రారంభించారు. దరువులు, కీర్తనలు నోటిపాఠంగా నేచుకుని యక్షగానాల్లో ప్రహ్లాదుడు, లోహితుడు, లవుడు, కుశుడు వంటి బాలపాత్రలు అభినయించేవారు. సంగీతం వేరేగా అభ్యసించకపోయినా, నాట్యంతో పాటే అదీ అలవడింది. కూచిపూడి నాట్య నీష్ణాతులు ‘పద్మశ్రీ’ స్వీకర్త – చింతా కృష్ణమూర్తి గారు పసుమర్తికి మేనమామ. వేదాంతం రాఘవయ్య, వెంపటి పెదసత్యం, పసుమర్తి కృష్ణమూర్తి ముగ్గురూ కలిసి నృత్యనాటికలు తయారుచేసి, జానపద నృత్యాలు కూడా కలిపి ప్రదర్శనలు ఇస్తే గొప్ప ప్రజాదరణ కలిగింది. కర్ణాటకాంధ్రలోని ముఖ్యపట్టణాలలో పెక్కు ప్రదర్శనలు ఇచ్చారు. ఒక నాలుగేళ్ల కాలంలో, వేదాంతంవారు, వెంపటివారు సినిమారంగానికి వెళ్లిపోతే, పసుమర్తివారే బృందాల్ని తయారుచేసి, జనరంజకంగా ప్రదర్శనలు ఇవ్వసాగారు.
ఒకసారి బెజవాడలో జరిగిన ప్రదర్శనలో స్త్రీ పాత్రలో ఉన్న కృష్ణమూర్తి గారి నాట్యం చూసి, అబ్బురపడిన రంగస్థల నటుడు సూరిబాబు రాజరాజేశ్వరి వారు నిర్మించబోయే భక్త తులసీదాసు (1946) చిత్రంలోని నాట్యదృశ్యానికి రూపం కల్పించమని అడిగారు. ఆ చిత్రంలో పిల్లలు వేసే నృత్యనాటిక ఉంది. సీతారామ లక్ష్మణులు వనవాసంలో ఉండడం, మాయలేడి రావటం, రావణుడు సీతను ఎత్తుకెళ్లడం – అందులోని ఇతివృత్తం. దానికి తగ్గట్టుగా కూచిపూడి శైలిలో ఆంగికాభినయాలను కూర్చి, సినిమా టెక్నిక్‌ని తెలుసుకుంటూ, చిత్రీకరణకు సహాయపడ్డారు. భక్త తులసీదాసు చిత్రానికి డైరెక్టరు లంక సత్యం, తర్వాత లంక సత్యమే డైరెక్టు చేసిన చంపకవల్లి అనే తమిళ చిత్రంలో పనిచేసే అవకాశం వచ్చింది ఆయనకి. అందులోనూ ఒక నృత్యనాటిక, ఇంద్రసభలో రంభ, ఊర్వశుల నాట్యాలు ఉన్నాయి. కె. వి. రెడ్డి గారు పసుమర్తి గారి నాట్య లక్షణాలు, శక్తి సామర్థ్యాలు తెలుసుకుని, ‘గుణసుందరి కథ’కి నాట్యదర్శకుడిగా నియమించారు. అదే గొప్ప ప్రవేశం, పరిచయం. గుణసుందరి కథలో రకరకాల నాట్యాలున్నాయి. వాటిని కృష్ణమూర్తి అతి నైపుణ్యంతో రచించారు . గుణసుందరి కథ చిత్రం ఘనవిజయం సాధించడంతో , అందరికి ఖ్యాతి లభించినట్టు – కృష్ణమూర్తి గారికి కూడ ఖ్యాతి లభించింది. పి. పుల్లయ్య తీసిన తిరుగుబాటు (1950) చిత్రానికి కృష్ణమూర్తిగారు పని చేసారు. విజయ సంస్థ ప్రారంభించిన తొలి చిత్రం ‘షావుకారు’ నుంచి చివరి చిత్రం ‘శ్రీ రాజేశ్వరి విలాస్ కాఫీ క్లబ్ ’ వరకు ప్రతి చిత్రానికీ పనిచేసిన నృత్య దర్శకుడు పసుమర్తి కృష్ణమూర్తి. మల్లీశ్వరిలో ఉషాపరిణయం యక్షగానం, మాయాబజార్లో మోహినీ భస్మాసుర ముఖాభినయం, పెళ్ళి చేసి చూడు (1952)లో ఊర్వశి, అర్జునుడు స్వప్నదృశ్యం లాంటివి కొన్ని నాట్యాలు మన మనస్సులో నిలిచిపోయాయి. రహస్యంలో గిరిజా కల్యాణం ఇంకొక ఉదాహరణ. మల్లీశ్వరిలో ఉషాపరిణయం సంగీత, సాహిత్య, నాట్యమయమై కనిపిస్తుంది. ఈ నాట్యరూపకం రూపొందే ముందు, రచయిత కృష్ణశాస్త్రిగారు, సంగీత దర్శకుడు రాజేశ్వరరావుగారు, నాట్యదర్శకుడు కృష్ణమూర్తిగారు నెల రోజులకు పైగా చర్చలు చేసిన తర్వాత, కృష్ణమూర్తిగారు డాన్స్ కంపోజింగ్‌కి, రిహార్సల్స్‌కి ఇంకో నెలరోజులు పట్టింది.

Posted in సినిమా | Tagged | Leave a comment

మన మరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు -82 82-ఇంటిపేరు లలితమైన పువ్వుల స్వరంమాత్రం కంచు నారద ఫేం,కళావిశారద ,గానగంధర్వ –సూరిబాబు

మన మరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు -82

82-ఇంటిపేరు లలితమైన పువ్వుల స్వరంమాత్రం కంచు నారద ఫేం,కళావిశారద ,గానగంధర్వ –సూరిబాబు

పి.సూరిబాబు లేదా పువ్వుల సూరిబాబు (ఫిబ్రవరి 22, 1915 – ఫిబ్రవరి 12, 1968) సుప్రసిద్ధ తెలుగు రంగస్థల, సినిమా నతొలి రోజులు
వీరు ఫిబ్రవరి 22, 1915 సంవత్సరంలో గుడివాడ తాలూకా బొమ్ములూరు గ్రామంలో జన్మించారు. చిన్నతనంలోనే మేనమామ హనుమాన్లు గారి వద్ద సంగీతం నేర్చుకున్నారు. నాటకాల మీద మోజుతో గద్వాల పారిపోయి, సంస్థానపు నాటక సమాజంలో చేరి పాత్రలు పోషించి తిరిగివచ్చారు.

ఆనాడు గుంటూరులో దంటు వెంకటకృష్ణయ్య “బాలమిత్ర సభ” పేరుతో చిన్నపిల్లల నాటక సమాజాన్ని నడుపుతున్నారు. అందులో కొప్పరపు సుబ్బారావు గారు నాటక ప్రయోక్తగా, సంగీత దర్శకులుగా శిక్షణ ఇస్తున్నారు. సూరిబాబు ఈ సభలో చేరి వివిధ వేషాలు పోషించి అనతికాలంలోనే అగ్రశ్రేణి నటుడిగా పేరుపొందారు. ఆనాటి నాటక సమాజాల వారు సూరిబాబు కోసం పోటీపడేవారు.

నాటక సమాజం
సూరిబాబు 1931 సంవత్సరంలో బాలకృష్ణ నాటక సమాజాన్ని గుడివాడలో స్థాపించి భక్త విజయం, మాయా మధుసూదన నాటకాలను పెద్ద ఎత్తున ప్రదర్శించారు. నష్టాలతో సమాజం మూతపడింది. 1936లో తెనాలి చేరి సత్యనారాయణ నాట్యమండలి పేరుతో నాటకాలను ప్రదర్శించారు.

1944 సంవత్సరంలో నటీమణి రాజరాజేశ్వరిని వివాహం చేసుకొని ఆమె పేరుమీద రాజరాజేశ్వరి నాట్యమండలిని స్థాపించి కొప్పరపు సుబ్బారావు గారితో “తారా శశాంకం” నాటకాన్ని వ్రాయించి తానే దర్శకత్వం వహించి చనిపోయేవరకు 15 వందలకు పైగా నాటకాలు ఆంధ్రదేశమంతా ప్రదర్శించారు. ఇది కాక భూకైలాస్, కురుక్షేత్రం, విప్రనారాయణ, తులాభారం మొదలైన పౌరాణిక నాటకాలను భారతదేశమంతా ప్రదర్శించి అఖండమైన కీర్తి ప్రతిష్ఠలు సంపాదించారు

జెమినీ వారి జీవన్ముక్తి సినిమాలో పి.సూరిబాబు పాడిన వెలిగింపుమా నాలో జ్యోతి పాట

వీరు చాలా విభిన్నమైన పాత్రలను పోషించారు. వాటిలో నారదుడు, కంసుడు, ధర్మరాజు, విప్రనారాయణ, బిల్వమంగళుడు, భవానీశంకరుడు, రాజరాజు, సుబుద్ధి, రామదాసు, చినరంగారావు, ధర్మారాయుడు మొదలైనవి ముఖ్యమైనవి. ఎన్ని నాటకాలాడినా, ఆయన గాత్రం కంచు గంటలా మారుమ్రోగేది. మైక్ లేకపోయినా ఒక ఫర్లాంగు దూరం వరకు పద్య పఠనము, వాచిన విధానము క్లియర్ గా వినపడేవి. పద్యాన్ని భావయుక్తంగా విరిచి పాడడంతో ప్రేక్షకులను అవలీలగా ఆకట్టుకొనేవారు.

1946లో మైసూరు మహారాజావారి దర్బారులో వీరి నాటకాలను ప్రదర్శించి సన్మానం పొందారు. 1957లో తెనాలిలో సూరిబాబుకి గజారోహణం, గండపెండేరం మొదలైన సన్మానాలు జరిపి కళావిశారద, గాన గంధర్వ మొదలైన బిరుదులు అందుకున్నారు.

భారతదేశమంతా అపార ఆదరాభిమానాలను సంపాదించిన సూరిబాబు ఫిబ్రవరి 12, 1968 న స్వర్గస్తులైనారు.

సినీ ప్రస్థానం
· దక్షయజ్ఞం (1962) (నటుడు, గాయకుడు)

· ఉషా పరిణయం (1961)

· శ్రీ వేంకటేశ్వర మహత్మ్యం (1960) (నటుడు, గాయకుడు)

· కృష్ణ లీలలు (1959) (నటుడు)

· సతీ సావిత్రి (1957) (నటుడు)

· శ్రీకృష్ణ తులాభారం (1955) (నటుడు)

· జీవన ముక్తి (1942)

· తారా శశాంకం (1941) (నటుడు, గాయకుడు)

· రైతు బిడ్డ (1939) (నటుడు)

· మాలపిల్ల (1938) (నటుడు, గాయకుడు)

· కనకతార (1937)

కంచులా మ్రోగే కంఠస్వరంతో, కఠినంగా అనిపించే పద్యాలను పామరులకు సైతం అర్థమయ్యేలాగా సుస్పష్టమైన ఉచ్చారణతో పాడి అటు రంగస్థలాన్ని, ఇటు తెలుగు చిత్ర రంగాన్ని సుసంపన్నం చేసిన నటుడు పువ్వుల సూరిబాబు.

ఆనాడు గుంటూరులో దంటు వెంకటకృష్ణయ్య “బాలమిత్ర సభ” పేరుతో చిన్నపిల్లల నాటక సమాజాన్ని నడుపుతున్నారు. అందులో కొప్పరపు సుబ్బారావు గారు నాటక ప్రయోక్తగా, సంగీత దర్శకులుగా శిక్షణ ఇస్తున్నారు. సూరిబాబు ఈ సభలో చేరి వివిధ వేషాలు పోషించి అనతికాలంలోనే అగ్రశ్రేణి నటుడిగా పేరుపొందారు. ఆనాటి నాటక సమాజాల వారు సూరిబాబు కోసం పోటీపడేవారు.

సూరిబాబు 1931 సంవత్సరంలో బాలకృష్ణ నాటక సమాజాన్ని గుడివాడలో స్థాపించి భక్త విజయం, మాయా మధుసూదన నాటకాలను పెద్ద ఎత్తున ప్రదర్శించారు. నష్టాలతో సమాజం మూతపడింది. 1936లో తెనాలి చేరి సత్యనారాయణ నాట్యమండలి పేరుతో నాటకాలను ప్రదర్శించారు.

1944 సంవత్సరంలో నటీమణి రాజరాజేశ్వరిని వివాహం చేసుకొని ఆమె పేరుమీద రాజరాజేశ్వరి నాట్యమండలిని స్థాపించి కొప్పరపు సుబ్బారావు గారితో “తారా శశాంకం” నాటకాన్ని వ్రాయించి తానే దర్శకత్వం వహించి చనిపోయేవరకు 15 వందలకు పైగా నాటకాలు ఆంధ్రదేశమంతా ప్రదర్శించారు. ఇది కాక భూకైలాస్, కురుక్షేత్రం, విప్రనారాయణ, తులాభారం మొదలైన పౌరాణిక నాటకాలను భారతదేశమంతా ప్రదర్శించి అఖండమైన కీర్తి ప్రతిష్టలు సంపాదించారు.

వీరు చాలా విభిన్నమైన పాత్రలను పోషించారు. వాటిలో నారదుడు, కంసుడు, ధర్మరాజు, విప్రనారాయణ, బిల్వమంగళుడు, భవానీశంకరుడు, రాజరాజు, సుబుద్ధి, రామదాసు, చినరంగారావు, ధర్మారాయుడు మొదలైనవి ముఖ్యమైనవి. ఎన్ని నాటకాలాడినా, ఆయన గాత్రం కంచు గంటలా మారుమ్రోగేది. మైక్ లేకపోయినా ఒక ఫర్లాంగు దూరం వరకు పద్య పఠనము, వాచిన విధానము స్పష్టంగా వినపడేవి. పద్యాన్ని భావయుక్తంగా విరిచి పాడడంతో ప్రేక్షకులను అవలీలగా ఆకట్టుకొనేవారు.

1946లో మైసూరు మహారాజావారి దర్బారులో వీరి నాటకాలను ప్రదర్శించి సన్మానం పొందారు. 1957లో తెనాలిలో సూరిబాబుకి గజారోహణం, గండపెండేరం మొదలైన సన్మానాలు జరిపి కళావిశారద, గాన గంధర్వ మొదలైన బిరుదులు అందుకున్నారు.

ద్రౌపదీ వస్త్రాపహరణం తో చిత్రసీమలో ప్రవేశించారు. మాలపిల్ల చిత్రంలో ఆయన పాడిన ‘కొల్లాయి కట్టితేనేమి మా గాంధీ….’ పాట వాడ వాడలా మార్మోగింది. చాలా చిత్రాల్లో నటించడమే కాక తన పాటలు, పద్యాలు తానే పాడుకున్నారు. అంతేకాదు పాటలను, ముఖ్యంగా పద్యాలను స్వరపరచడానికి సంగీత దర్శకులు సూరిబాబు గారి సహకారం తీసుకునేవారు. అలా మహాకవి కాళిదాసు చిత్రంలోని మాణిక్య వీణాం……. శ్లోకం స్వరకల్పనలో ఈయన హస్తం కూడా వుంది.

తెనాలిలో సత్యనారాయణ నాట్యమండలి ప్రారంభించి కొన్ని నాటకాలు ప్రదర్శించారు .కలకత్తా బొంబాయి మైసూర్ బెంగుళూర్

లలోనూ నాటాకాలు ప్రదర్శించి దేశవ్యాప్తకీర్తి నార్జించారు .రామదాసు లో రామా దాసు బొబ్బిలియుద్ధంలో ధర్మారాయుడు ,రంగారావు ,

భక్త విజయం లో గజేంద్రుడు ,తక్షకుడు ,కశ్యపుడు ,ఉత్తానపాదుడు ,నారదుడు ,మాయా మధు సూడాన లో కంసుడు ,కురుక్షేత్రం లో ధర్మరాజు

భీముడు ,అర్జునుడు ,ద్రుత రాష్ట్రుడు ,అశ్వత్ధామ ,భీష్ముడు ,విప్రనారాయణలో విప్రనారాయణుడు ,చింతామణిలో బిల్వ మంగళుడు ,

భవానీ శకరుడు ,సారంగధరలో రాజరాజు ,సుబుద్ధి పాత్రలు పోషించి ఆ పాత్రలు ఆయనకోసమే ఉన్నాయా అన్నట్లు నటించి చిరస్మరణీయం చేశారు

కంచు గంట వంటి గాత్రం స్పష్టమైన నిర్దుష్ట వాచికం ,చక్కని అభినయం సూరిబాబు సొత్తు .

1946లో మైసూర్ మహారాజ దర్బార్ లో నాటకాలు ప్రదర్శించి సన్మానాలు పొందారు .1957లో గజారోహణం గండపెండేరం అందుకొన్నారు .కళా విశారద ,గాన గ౦ధర్వ బిరుదాంకితులు .డా సర్వేపల్లి రాదా కృష్ణన్ ,పృధ్వీ రాజ్ కపూర్ లు సూరిబాబు నటనను బాగా మెచ్చుకొన్నారు .పోట్టివాడైనా గట్టివాడనే సామెత రుజువు చేసుకొన్నారు సూరిబాబు .

సశేషం

మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -19-2-22-ఉయ్యూరు

Posted in సినిమా | Tagged | Leave a comment

మన మరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు -79 79- డాన్స్ మాస్టర్ –ముక్కు రాజు80-అయిదు భాషల డాన్స్ మాస్టర్ ,,ముగ్గురు ముఖ్యమంత్రుల కొరియోగ్రాఫర్ ,విధి వంచితుడు –సలీం

మన మరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు -79

79- డాన్స్ మాస్టర్ –ముక్కు రాజు

ముక్కు రాజు గా ప్రసిద్ధిచెందిన సాగిరాజు రాజంరాజు (1931 – జూలై 31, 2014) తెలుగు సినిమా నటుడు, డాన్స్ మాస్టర్

జీవిత విశేషాలు
వీరు పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం దగ్గర కుముదవల్లిలో 1931లో ఒక వ్యవసాయ కుటుంబంలో జన్మించారు. తండ్రి బాపిరాజు, తల్లి సత్యవతమ్మ. 1941లో క్విట్ ఇండియా ఉద్యమ సందర్భంగా ఈ ఇంగ్లీషు చదువులు మాకొద్దు అంటూ, పుస్తకాలు విసిరేసి చదువు మానేశారు.[2]. ఈయనకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు.

సినిమా ప్రస్థానం
1955లో కె.వి.రెడ్డి దర్శకత్వం వహించిన మాయాబజార్ చిత్రంలోని “మోహినీ భస్మాసుర డాన్స్ డ్రామా”తో సినిమాలలో ప్రవేశించాడు. వివిధ భాషలలో దాదాపు 500 చిత్రాలలో నటించిన వీరు 200 చిత్రాలకు డాన్స్ మాస్టార్ గా, చాలా సినిమాలకు ఫైటర్ గా పనిచేశాడు. మాజీ ముఖ్యమంత్రి మహా నటుడు ఎన్టీఆర్‌ కు తొలిరోజుల్లో వ్యక్తిగత డాన్స్ మాస్టర్. మెగాస్టార్ చిరంజీవి చిత్రరంగ ప్రవేశం కొత్తలో ప్రాణం ఖరీదు, పునాది రాళ్ళు, మనవూరి పాండవులు చిత్రాలకు డాన్స్ మాస్టర్‌గా వ్యవహరించాడు. ఆర్.నారాయణమూర్తి నిర్మించి, నటించిన ఎర్రసైన్యం, అడవి దివిటీలు లాంటి దాదాపు అన్ని చిత్రాలకు నృత్య రూపకల్పనతో పాటు డప్పు పట్టి నటించాడు.[3] “1940 లో ఒక గ్రామం” చిత్రంలో ముక్కురాజు నటనకు ఉత్తమ సహాయ నటునిగా నంది అవార్డు లభించింది[4][5]. టి.వి.నంది పురస్కారాలకమిటీలో 2000 సంవత్సరానికి సభ్యులుగా ఉన్నాడు. హైదరాబాద్ లో నృత్య దర్శకుల సంఘాన్ని ఏర్పాటు చేశాడు.

నటించిన చిత్రాలు
· జీవనవేదం (1993)

· ఆంటీ (1995)

· తెలుగోడు (1998)

· పాపే నా ప్రాణం (2000)

· అడవిచుక్క (2000)

· విజయం (2003)

· నాగప్రతిష్ఠ (2003)

మరణం
2014, జూలై 31వ తేదీ గురువారం తెల్లవారుఝామున ముక్కురాజు కన్నుమూశారు.

సాక్షి పత్రిక కధనం

ప్రముఖ సినీ నృత్యకళాకారుడు, నృత్య దర్శకుడు, నటుడు… సాగిరాజు రాజంరాజు అలియాస్ ముక్కురాజు(83) గురువారం తెల్లవారుజామున పశ్చిమగోదావరి జిల్లా పాలకోడేరు మండలం కుముదవల్లిలో కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారాయన. ముక్కురాజుకి ఒక కుమారుడు, ఇద్దరు కుమార్తెలు. నృత్య దర్శకుడు శివసుబ్రమణ్యం, ఎడిటర్ భూపతి కృష్ణంరాజు… ముక్కురాజుకు బావమరుదులే. స్వాతంత్య్రోద్యమంలో చురుకైన పాత్ర పోషించారు ముక్కురాజు.

1941 క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొని… ఇంగ్లిష్ చదువులు మాకొద్దంటూ.. ఆంగ్ల పుస్తకాలను బహిష్కరించిన చరిత్ర ముక్కురాజుది. సినీ స్వర్ణయుగంలో నృత్య కళాకారునిగా ముక్కురాజు ఓ వెలుగు వెలిగారు. ‘మాయాబజార్’(1955)లోని మోహినీ భస్మాసుర నృత్యరూపకంతో తెరకు పరిచయమయ్యారాయన. దాదాపు అయిదొందల చిత్రాల్లో తన నృత్యాలతో అలరించారు. రెండొందల పైచిలుకు చిత్రాలకు నృత్య దర్శకునిగా పనిచేశారు. ముక్కురాజు నర్తించిన ప్రత్యేకగీతాలు ఆ రోజుల్లో చాలానే ఉన్నాయి.

‘వెలుగునీడలు’(1964) చిత్రంలోని ‘పాడవోయి భారతీయుడా..’ పాటలో ముక్కురాజు నృత్యాభినయాన్ని తేలిగ్గా మరచిపోలేం. ముక్కురాజు కెరీర్‌లో తలమానికం ‘దక్షయజ్ఞం’(1962). ఆ సినిమా పతాక సన్నివేశంలో శివుని పాత్ర పోషించిన ఎన్టీఆర్ చేసిన ప్రళయతాండవం రూపకల్పనలో ముక్కురాజు పాత్ర చాలానే ఉంది. క్లోజప్‌లో ఎన్టీఆర్ కనిపించినా.. దూరం నుంచి ఆ నృత్యాన్ని అభినయించింది ముక్కురాజే. ఎన్టీఆర్‌కి తొలి రోజుల్లో వ్యక్తిగత నృత్య దర్శకునిగా వ్యవహరించారాయన. అలాగే.. చిరంజీవి ‘ప్రాణం ఖరీదు’(1978), పునాదిరాళ్లు(1979), మనవూరి పాండవులు(1978) చిత్రాలకు నృత్య దర్శకునిగా పనిచేశారు. 80ల్లో కూడా పలు చిత్రాలకు నృత్యాలను సమకూర్చిన ముక్కురాజును నటునిగా ప్రోత్సహించినవారిలో ఆర్.నారాయణమూర్తిని ప్రముఖంగా చెప్పుకోవాలి.

నారాయణమూర్తి రూపొందించిన దాదాపు ప్రతి సినిమాలో ముక్కురాజు ఉండేవారు. ముఖ్యంగా ‘ఎర్రసైన్యం’(1994)లో ఆయన నటన ప్రేక్షకులను ఆకట్టుకుంది. అలాగే ‘1940లో ఓ గ్రామం’(2008) చిత్రంలో ముక్కురాజు నటనకు ఉత్తమ సహాయ నటునిగా నంది అవార్డు లభించింది. ‘చండాలిక నృత్యరూపకాన్ని’ ప్రముఖ నృత్య దర్శకులతో కలిసి దేశవ్యాప్తంగా ప్రదర్శనలిచ్చారు ముక్కురాజు. హైదరాబాద్‌లో నృత్య దర్శకుల సంఘం ఏర్పాటు చేసింది కూడా ఆయనే. గత కొంతకాలంగా వృద్ధాప్యం కారణంగా తెరపై అంతగా కనిపించలేదాయన. ముక్కురాజు మరణం పట్ల తెలుగు చలనచిత్ర నటీనటుల సంఘం తీవ్ర సంతాపాన్ని వెలిబుచ్చింది. పశ్చిమగోదావరి జిల్లా చెరుకువాడలో శుక్రవారం ఆయన అంత్యక్రియలు జరుగనున్నాయి.
సీనియర్ నటుడు సాగిరాజు రాజంరాజు (ముక్కు రాజు) మరణించారు. గత కొంత కాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. రాజంరాజు (ముక్కు రాజు) 1000కి పైగా సినిమాల్లో ఆయన నటించారు. కొరియోగ్రాఫర్ గా సినీ రంగంలో ప్రవేశించిన ఆయన, పలు చిత్రాలలో అనేక పాత్రలు పోషించారు. పశ్చిమగోదావరి జిల్లా భీవరం దగ్గర కుముదపల్లిలో 1931లో ఒక వ్యవసాయ కుటుంబంలో ముక్కురాజు జన్మించారు. తండ్రి బాపిరాజు, తల్లి సత్యవతమ్మ. 1941 క్విట్ ఇండియా ఉద్యమం సందర్భంగా ఈ ఇంగ్లీష్ చదువులు మాకొద్దు అంటూ పుస్తకాలు విసిరేసి చదువు మానేసారు. అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన గురువారం ఉదయం పాలకొండి మండలం కుమటి గ్రామంలో తుదిశ్వాస విడిచారు. ముక్కురాజు అసలుపేటు సాయిరాజు రాజంరాజు. 2010లో వచ్చిన ‘1940లో ఓ గ్రామం’ అనే చిత్రంలో నటించిన ముక్కురాజుకు జాతీయ స్థాయి అవార్డు లభించింది. 2013 ముక్కురాజు చివరి సారిగా ‘మధసింహం’ అనే చిత్రంలో నటించారు. ఆర్. నారాయణమూర్తి తీసే సినిమాల్లో దాదాపు ప్రతి దాంట్లోనూ ముక్కురాజు కనిపించే వారు. ముక్కురాజు మృతికి పలువురు సినీ ప్రముఖులు సంతాపం ప్రకటించారు. ఆయన స్వస్థలమైన పశ్చిమగోదావరి జిల్లా ఉండి మండలం చెరుకువాడలో శుక్రవారం నాడు ముక్కురాజు అంత్యక్రియలు జరుగుతాయి. 200 సినిమాలకు డాన్స్ మాస్టర్ గా పని చేసారు. నందమూరి తారక రామారావుకు వ్యక్తిగత డాన్స్ మాస్టర్‌గా కూడా పని చేసారు. చిరంజీవి ప్రాణం ఖరీదు, పునాది రాళ్లు, మనవూరి పాండవులు చిత్రాలకు డాన్స్ మాస్టర్ గా పని చేసారు.

హైదరాబాద్: టాలీవుడ్ ప్రముఖ నటుడు, డాన్స్ మాస్టర్ ముక్కు రాజు కన్ను మూసారు. కొంతకాలంలో అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన గురువారం ఉదయం పాలకొండి మండలం కుమటి గ్రామంలో తుదిశ్వాస విడిచారు. ముక్కురాజు అసలుపేటు సాయిరాజు రాజంరాజు. దాదాపు 600 సినిమాల్లో ముక్కురాజు నటించారు. అనారోగ్యంతో ఉన్నప్పటికీ ముక్కురాజు సినిమాలు చేస్తునే ఉన్నారు. 2010లో వచ్చిన ‘1940లో ఓ గ్రామం’ అనే చిత్రంలో నటించిన ముక్కురాజుకు జాతీయ స్థాయి అవార్డు లభించింది. 2013 ముక్కురాజు చివరి సారిగా ‘మధసింహం’ అనే చిత్రంలో నటించారు. పశ్చిమగోదావరి జిల్లా భీవరం దగ్గర కుముదపల్లిలో 1931లో ఒక వ్యవసాయ కుటుంబంలో ముక్కురాజు జన్మించారు. తండ్ిర బాపిరాజు, తల్లి సత్యవతమ్మ. 1941 క్విట్ ఇండియా ఉద్యమం సందర్భంగా ఈ ఇంగ్లీష్ చదువులు మాకొద్దు అంటూ పుస్తకాలు విసిరేసి చదువు మానేసారు.

1955లో కెవీ రెడ్డి దర్శకత్వంలో మాయాబజార్ సినిమాలో మోహినీ భస్మాసుర డాన్స్ డ్రామాతో సినీరంగంలోకి ఎంట్రీ ఇచ్చారు. ఇప్పటి వరకు ఆయన దాదాపు 600 చిత్రాల్లో నటించారు. 200 సినిమాలకు డాన్స్ మాస్టర్ గా పని చేసారు. నందమూరి తారక రామారావుకు వ్యక్తిగత డాన్స్ మాస్టర్‌గా కూడా పని చేసారు. చిరంజీవి ప్రాణం ఖరీదు, పునాది రాళ్లు, మనవూరి పాండవులు చిత్రాలకు డాన్స్ మాస్టర్ గా పని చేసారు. ఆర్ నారాయణ మూర్తి సినిమాల్లో ముక్కురాజుకు తప్పకుండా ఒక పాత్ర ఉండేది. ముక్కురాజు భార్య, ఇద్దరు కుమార్తె, ఒక కుమారుడు ఉన్నారు. శుక్రవారం ఉండి మండలం చెరుకువాడలో ముక్కురాజు అంత్యక్రియలుజరిగాయి.

80-అయిదు భాషల డాన్స్ మాస్టర్ ,,ముగ్గురు ముఖ్యమంత్రుల కొరియోగ్రాఫర్ ,విధి వంచితుడు –సలీం

ఆ రోజుల్లో డాన్స్ మాస్టర్ సలీమ్ పేరు తెరపై కనిపించగానే థియేటర్లలో ఈలలు మారుమోగి పోయేవి. తెలుగువాడు కాకపోయినా సలీమ్ తెలుగు చిత్రసీమలోని అగ్రశ్రేణి కథానాయకులందరికీ నృత్యరీతులు సమకూర్చి అలరించారు. తెలుగు, తమిళ, కన్నడ, మళయాళ, హిందీ భాషల్లో కలిపి దాదాపు 300 పైచిలుకు చిత్రాలకు సలీమ్ డాన్స్ కంపోజ్ చేశారు. మళయాళ సీమలో కన్ను తెరచిన సలీమ్ బాల్యం నుంచీ పచ్చని పొలాల మధ్య చిందులు వేస్తూ గడిపాడు. అతని డాన్సుల్లో ఈజ్ ను గమనించిన కొందరు స్థానికులు చిత్రసీమకు వెళ్ళి ఎవరి దగ్గరనైనా అసిస్టెంట్ గా పనిచేయమని సలహా ఇచ్చారు. దాంతో చెన్నపట్టణం చేరిన సలీమ్, నాటి మేటి నృత్య దర్శకుల వద్ద సహాయకునిగా పనిచేశారు. పసుమర్తి కృష్ణమూర్తి, వెంపటి చినసత్యం వద్ద శాస్త్రీయ నృత్యంలో మెలకువలు తెలుసుకున్నారు సలీమ్. ఆ తరువాత తంగప్పన్, హీరాలాల్ వంటి నృత్య దర్శకుల వద్ద పనిచేశారు. 1965లో ఎమ్జీఆర్ హీరోగా రూపొందిన ‘పోర్ సిలై’ చిత్రం ద్వారా సలీమ్ సోలోగా డాన్స్ కొరియోగ్రాఫర్ కాగలిగారు. ఆ తరువాత నుంచీ ఎమ్జీఆర్ ప్రోత్సాహంతో పలు చిత్రాలకు నృత్య దర్శకునిగా పనిచేశారు.

తెలుగులో యన్టీఆర్ హీరోగా పీతాంబరం ‘అన్నదమ్ముల అనుబంధం’ నిర్మించారు. ఆ చిత్రానికి సలీమ్ నృత్యరీతులు సమకూర్చారు. ఆ చిత్రంలోని “ఐ లవ్ యూ సోనీ…” పాటలో సలీమ్ కనిపిస్తారు కూడా. ఆ తరువాత యన్టీఆర్ నటించిన అనేక చిత్రాలకు సలీమ్ నృత్యరీతులు సమకూర్చారు. ముఖ్యంగా ‘అడవిరాముడు’లో “ఆరేసుకోబోయి పారేసుకున్నాను…” పాటలో యన్టీఆర్ ఇమేజ్ ను, పర్సనాలిటీని దృష్టిలో పెట్టుకొని సలీమ్ డాన్స్ కంపోజ్ చేయించిన తీరు అందరినీ ఆకట్టుకుంది. యన్టీఆర్ ‘వేటగాడు’ లోనూ సలీమ్ ఆరంభంలోనే కనిపిస్తారు. “కొండమీన చందమామ…” పాటలో నర్తించేది సలీమ్ మాస్టరే! య‌న్టీఆర్ సూప‌ర్ హిట్ మూవీస్ అడ‌విరాముడు, డ్రైవ‌ర్ రాముడు, వేట‌గాడు, స‌ర్దార్ పాపారాయుడు, గ‌జ‌దొంగ‌, కొండ‌వీటి సింహం, జ‌స్టిస్ చౌద‌రి, బొబ్బిలిపులి వంటి చిత్రాల‌లోని హిట్ సాంగ్స్ అన్నీ కూడా స‌లీమ్ డాన్స్ తో కంపోజ్ అయిన‌వే! ఇక ఏయ‌న్నార్ ఆల్ టైమ్ హిట్ ప్రేమాభిషేకంలోని పాట‌ల్లోనూ స‌లీమ్ మాస్ట‌ర్ డైరెక్ష‌న్ క‌నిపిస్తుంది.

య‌న్టీఆర్, ఏయన్నార్, కృష్ణ, శోభన్ బాబు, కృష్ణంరాజు, చంద్రమోహన్, మురళీమోహన్ వంటి హీరోలందరికీ వారి బాడీ లాంగ్వేజ్ ను బట్టి స్టెప్స్ వేయించి మురిపించారు సలీమ్. ఇక ‘అన్నదమ్ముల అనుబంధం’లోనే బాలకృష్ణతో డాన్స్ చేయించిన సలీమ్ మాస్టర్ వద్దే బాలయ్య చిత్రసీమలో అడుగుపెట్టే సమయంలో నృత్య భంగిమలను అభ్యాసం చేశారు. ఆ తరువాత అనేక చిత్రాలలో బాలయ్యకు సలీమ్ మాస్టర్ డాన్స్ కంపోజ్ చేశారు. చిరంజీవిని స్టార్ గా నిలిపిన ‘ఖైదీ’లో కూడా సలీమ్ మాస్టర్ పనితనంతోనే అందులోని పాటలు జనానికి నయనానందం పంచాయి. ఇలా నాలుగు తరాల హీరోలకు నృత్యరీతులు సమకూర్చి తనకు తానే సాటి అనిపించుకున్నారు సలీమ్ మాస్టర్.

ఈ రోజున ఎంతోమంది నృత్య దర్శకులుగా రాణిస్తున్న వారి గురువులకే గురువు సలీమ్ మాస్టర్. ఆయన వద్ద శిష్యరికం చేసిన శివశంకర్, శివ-సుబ్రహ్మణ్యం వంటి వారు తరువాతి రోజుల్లో గురువుకు తగ్గ శిష్యులు అనిపించుకున్నారు. డాన్స్ కొరియోగ్రాఫర్ గా తిరుగులేని విధంగా సాగిన సలీమ్ చెన్నైలో ఓ అందమైన నివాసాన్ని ఏర్పరచుకున్నారు. ఆ ఇంటిని యన్టీఆర్ చేతులు మీదుగానే ప్రారంభించారు. అలాగే ఓ షాపింగ్ కాంప్లెక్స్ నూ కట్టారు. అందులో ఇద్దరు సోదరులు హార్డ్ వేర్ బిజినెస్ చేసేవారు. వారికి ఆ షాప్ కలిసొచ్చింది. సలీమ్ కొన్ని కారణాల వల్ల వారిని ఖాళీ చేయమన్నారు. వారు ఖాళీ చేయడానికి నిరాకరించారు. కోర్టు నోటీసులు ఇచ్చినా, ఖాళీ చేయకపోవడంతో ఆ సోదరుల మీదకు సలీమ్ మందితో వెళ్ళి దాడి చేశారు. ఆ దాడిలో ఆ అన్నదమ్ములు తీవ్రంగా గాయపడి, ఆసుపత్రికి చేర్చేలోపు కన్నుమూశారు. ఆ కేసులో సలీమ్ తో పాటు 15 మందిని అరెస్ట్ చేశారు. చిత్రసీమలో తిరుగులేని కొరియోగ్రాఫర్ గా బతికిన సలీమ్, జైలులో ఉన్నప్పుడే తాగుడుకు బానిసయ్యారు. ఆ తరువాత బెయిల్ పై బయటకు వచ్చి, విపరీతమైన తాగుడుతో తడిసిముద్దయ్యారు. కుటుంబసభ్యులు సైతం అసహ్యించుకొని గెంటేశారు. చివరకు హైదరాబాద్ చేరి కృష్ణానగర్ లో ఓ చిన్న గదిలో ఉండేవారు. మళ్ళీ చెన్నైకి వెళ్ళి అక్కడే ఆయన కన్నుమూశారు.

ఏది ఏమైనా తెలుగు చిత్ర‌సీమ‌లో స‌లీమ్ మాస్ట‌ర్ బాణీ ప్ర‌త్యేక‌మైన‌ది. ఆ తీరున సూప‌ర్ స్టార్ డ‌మ్ చూసిన డాన్స్ మాస్ట‌ర్ మ‌రొక‌రు కాన‌రారు. ఆయ‌న కంటే ముందు ఎంతోమంది గొప్ప నృత్య‌ద‌ర్శ‌కులు ఉన్నారు. కానీ, ఈ స్థాయిలో స్టార్ డ‌మ్ చూసిన వారు లేరు.

తెలుగు తమిళ అగ్రస్శ్రేని హీరోలు హీరోయిన్ లు సలీం మాస్టారు కోరియోగ్రఫీ తమకు చేయాలని కోరేవారు .మద్రాస్ టి నగర్లో నార్త్ ఉస్మాన్ రోడ్ లో ఉండేవాడు .అక్కడే ఒక బిల్డింగ్ కొని హార్డ్ వేర్ షాప్ కు అద్దె కిచ్చాడు అదే ఆయన పతనానికి దారి తీసింది . కదక్ నాట్యాచార్యుడు గోపీ కృష్ణ శిష్యుడు సలీం మాస్టార్ ,నటీ నటుల బాడీ లాంగ్వేజ్ బట్టి డాన్స్ కూర్చటం ఆయన ప్రత్యేకత .ముగ్గురు ముఖ్యమంత్రులు ఎమ్జి ఆర్ ఏంటి ఆర్ జయలలిత లకు కోరియోగ్రఫీ చేసిన ఘనత ఆయనది .సలీం కొడుకు పుట్టిన రోజు ప౦ డుగకఈ ముగ్గురు సి ఎం లు హాజరయ్యారంటే అవాక్కైపోతాం .పకడ్బందీ అయిన బందోబస్తు ,రోడ్లన్నీ బ్లాక్ .మధ్య కొడుకు పుట్టిన రోజు అంగరంగ వైభవం జరిపాడు సలీం భాయ్ .కాఫీ ,టీ,మంచి నీళ్ళల్లో మూలికల పొడి కలిపి తాగేవారు తాగించేవారు .రంగు వేరే అయినా రుచికరంగా ఆరోగ్యంగా ఉండేది .అడవి రాముడు షూటింగ్ సమయం లో తమకు ఏర్పాటు చేసిన భోజనం కాదని మైసూర్ తీసుకొని వెళ్లి అక్కడ పేదరాశి పెద్దమ్మ లాంటి హోటల్ లో భోజనాలు తిపించేవాడు పత్రికా విలేకరులకు అ భోజనం అచ్చంగా మన ఇంటి భోజనం లాగా ఉండేదని వారు సలీం ను మెచ్చుకొనేవారు .జీవితం లో ప్రతిదీ ఒకప్రత్యేకటగా చూడాలని ఆయన ఫిలాసఫీ .

ముగ్గురు ముఖ్య మంత్రులతో డాన్స్ ఆడించిన సలీం మాస్టారిని విధి వక్రించిఒక ఆటాడిం చింది .ఆయన అద్దెకిచ్చిన హార్డ్ వేర్ షాప్ ఓనర్ అద్దె చాలా బాకీ ఉండటం తో ఒక రోజు అడగటానికి మందీ మార్బల౦ తో వెళ్ళగా ఇద్దరిమధ్య తీవ్ర వాగ్వివాదం జరిగి అతడు అలీం ను ఏదో అనరాని మాట అంటే తీవ్రకకోపం తో అక్కడే ఉన్న ఇనుప సుత్తి అతడిపై విసిరేయగా అది ఆయన తలకు తగిలి కుప్ప కూలిపోయి చనిపోయాడు .ఇంతలో పోలీసులు వచ్ఛి అరెస్ట్ చేసి హత్యానేరం మీద జైలులో పెట్టారు .ఎన్ని రకాల ప్రయత్నాలు చేసినా విడుదలకాలేకపోయాడు .పెద్ద శిక్షే పడింది .ఎవ్వరూ సాయం చేయటానికి ముందుకు రాలేదు .మొత్తం మీద విడుదలయ్యాడు .ఈలోపు బంధువులు ,మిత్రులు దొరికింది దొరికినట్లు ఆస్తి అంతా దోచేశారు .అడిగితె మొహం చాటేసేవారు. క్రిమినల్ అనే ముద్ర వెంటాడుతోంది .చిత్ర పరిశ్రమకూడా చేతు లెత్తేసింది .పోపొట్ట గడవ టానికి చేతిలో చిల్లి గవ్వలేదుపాపం.

మద్రాస్ వదిలి , హైదరాబాద్ చేరాడు సలీం భాయ్ ఇక్కడా అదే పరిస్థతి ఎదురైంది .మళ్ళీ మద్రాస్ వెళ్లి చిన్న గదిలో అద్దెకు ఉంటూ ‘’ఇక్కడ డాన్స్ నేర్పబడును ‘’అని బోర్డ్ పెట్టుకొని వచ్చిన వారికి నేర్పే ప్రయత్నం చేశాడు .ఎవరూ రాకపోయేసరికి అద్దె చెల్లించటం కష్టమై మూసేశాడు. ఆయన దీనస్థితికి జాలిపడినా ఎవరూ ముందుకు వచ్చి సాయం చేసేవారు కాదు .వాళ్ళను చూసి తనలో తాను కుమిలి పోయేవాడు .బాధలు మర్చిపోవటానికి మందుకు బానిసయ్యాడు .పిచ్చివాడిలా రోడ్లు పట్టుకు తిరిగేవాడు .క్షణికావేశం లో చేసిన పని ఆయనను పతనావస్థకు తెచ్చింది ఇదే అందరికి గునపాఠం .

సశేషం

మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -18-2-22-ఉయ్యూరు

Posted in సినిమా | Tagged | Leave a comment