మనమరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు-272

మనమరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు-272
272-సినీ ‘’విరోధి’’కి నంది ,’’షో’’కు జాతీయ పురస్కారం పొందిన టాలెంటెడ్ డైరెక్టర్ –నీలకంఠ
నీలకంఠ ఒక ప్రముఖ సినీ దర్శకుడు.[1] షో అనే సినిమాకు గాను జాతీయ పురస్కారాన్ని అందుకున్నాడు. [2] విరోధి అనే సినిమాకు నంది పురస్కారం లభించింది. మిస్సమ్మ, మిస్టర్ మేధావి, నందనవనం 120 కి.మీ ఆయన దర్శకత్వం వహించిన సినిమాలు.

జీవితం
నీలకంఠ స్వస్థలం కడప.[3] తండ్రి నీటిపారుదల శాఖలో ఇంజనీరుగా పనిచేసేవాడు. బడిలో ఉండగానే మార్గరెట్ అనే ఉపాధ్యాయురాలు స్ఫూర్తితో తరగతి పుస్తకాలు కాకుండా వేరే పుస్తకాలు చదవడం కూడా అలవాటైంది. అలా హాస్యకరమైన (కామిక్) పుస్తకాలు చదవడం అలవాటైంది. ఇనిబ్ బ్లెటెన్ అనే రచయిత వయసు వారీగా పుస్తకాలు ఉంటే వాటిని వరసగా చదివేశాడు. తర్వాత నేరము , ఉత్కంఠ కథలు, నవలలు చదవడం మొదలు పెట్టాడు. నెమ్మదిగా సినిమాలు చూడటం ప్రారంభమైంది.

విజయవాడలోని లయోలా పబ్లిక్ స్కూల్, ఆంధ్రా లయోలా కళాశాలలో చదువుకున్నాడు. నీలకంఠ అన్నయ్యకు చిత్రలేఖనం హాబీ. ఇద్దరూ కలిసి సినిమాలి చూసేవాళ్ళు. అతను నీలకంఠతో దర్శకుల గురించి మాట్లాడేవాడు. అలా పాఠశాల రోజులనుంచే సినిమా దర్శకత్వం పట్ల శ్రద్ధ ఆయన డిగ్రీ పూర్తి కాగానే చెన్నై వైపు నడిపించింది. పద్దెనిదో ఏటనే భారత్ పాక్ నేపథ్యంలో ఒక కథ రాశాడు. అది స్నేహితులు చదివి మెచ్చుకున్నారు. తనకు సినిమా వృత్తి అయితే బాగా సరిపోతుందనుకున్నాడు.[4] కె. బాలచందర్ స్ఫూర్తితో దర్శకుడు కావాలనుకున్నాడు.

కెరీర్
సినీ రంగంలోకి ప్రవేశించిన తర్వాత వల్లభనేని జనార్ధన్ దగ్గర కొన్ని సినిమాలకు సహాయకుడిగా పని చేశాడు. కృష్ణ హీరోగా భారతీరాజా దర్శకత్వంలో జమదగ్ని అనే సినిమాను మరికొంతమందితో కలిసి నిర్మించాడు. కానీ అది ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేదు. తర్వాత రేవతి కథానాయికగా తమిళంలో ప్రియాంక అనే సినిమాకు దర్శకత్వం వహించాడు. ఇది హిందీ సినిమా దామినికి పునర్నిర్మాణం. ఈ సినిమాకు రేవతికి ఉత్తమ నటిగా ఫిలిం ఫేర్ పురస్కారం లభించింది. ఈ సినిమా తర్వాత చాలా సినిమాలకు రీమేక్ చేయమంటూ అవకాశాలు వచ్చాయి కానీ రీమేక్ దర్శకుడనిపించుకోవడం ఇష్టం లేక వాటన్నింటినీ వదులుకున్నాడు. అలా మళ్ళీ అవకాశం కోసం ఏడేళ్ళు ఎదురు చూడాల్సి వచ్చింది.

తెలుగులో సొంతంగా కథతో ప్రయోగం చేయాలనుకున్నాడు. పరమహంస యోగానంద రాసిన ఒక యోగి ఆత్మకథ అనే పుస్తకం చదివి దాని స్ఫూర్తితో కేవలం రెండే పాత్రలతో ఒక కథ తయారు చేసుకున్నాడు. ఆ కథను అప్పటికే ఓ చిన్న సినిమా నిర్మించాలని ప్రయత్నిస్తున్న నటుడు కృష్ణ కుమార్తె మంజులకు వివరించాడు. ఆమెకు ఐడియా నచ్చి నిర్మించడానికి ఒప్పుకుంది. అలా తయారైందే షో సినిమా.

సినిమాలు
సంవత్సరం

చలన చిత్రం

పాత్ర

భాష

ఇతర వివరాలు

1994

ప్రియాంక

దర్శకుత్వం

తమిళం

హిందీ చిత్రం దామిని– లైట్నింగ్ కి పునఃనిర్మాణం

2002

షో

స్క్రీన్‌ప్లే, దర్శకుత్వం

తెలుగు

రెండు జాతీయ పురస్కారాలు గెలుపొందారు

2003

మిస్సమ్మ

స్క్రీన్‌ప్లే, దర్శకుత్వం

తెలుగు

నాలుగు నందీ పురస్కారాలు గెలుపొందారు

2005

సదా మీ సేవలో

స్క్రీన్‌ప్లే, దర్శకుత్వం

తెలుగు

2006

నందనవనం 120 కి.మీ.

స్క్రీన్‌ప్లే, దర్శకుత్వం

తెలుగు

2008

మిస్టర్ మేధావి

దర్శకుత్వం

తెలుగు

2009

ఈనాడు

సంభాషణలు

తెలుగు

2011

విరోధి

స్క్రీన్‌ప్లే, దర్శకుత్వం

తెలుగు

ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా – 2011 లో ప్రదర్శించబడింది

రెండు 2011 నందీ పురస్కారాలు గెలుపొందారు

మెల్బోర్న్ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ -2011 లో ప్రదర్శించబడింది[5]

2013

చమ్మక్ చల్లో

దర్శకుత్వం

తెలుగు

2014

మాయ[6]

స్క్రీన్‌ప్లే, దర్శకుత్వం

తెలుగు

[7]

2018

దటీస్ మహాలక్ష్మీ

దర్శకుత్వం

తెలుగు

హిందీ చిత్రం క్వీన్ యొక్క పునఃనిర్మాణం

2018

జామ్ జామ్

దర్శకుత్వం

మళయాళం

పురస్కారాలు
జాతీయ చలన చిత్ర పురస్కారాలు

· తెలుగులో ఉత్తమ జాతీయ చలన చిత్రం – 2002 – షో

· ఉత్తమ స్క్రీన్‌ప్లే కి గాను జాతీయ పురస్కారం– 2002 – షో

నందీ పురస్కారాలు

· ఉత్తమ స్క్రీన్‌ప్లే రైటర్‌కి గాను నందీ పురస్కారం – షో (2001)

· ఉత్తమ స్క్రీన్‌ప్లే రైటర్‌కి గాను నందీ పురస్కారం – మిస్సమ్మ (2003)

· ఉత్తమ సంభాషణ రచయితకుగాను నందీ పురస్కారం – విరోధి (2011)

సశేషం

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -2-5-22-ఉయ్యూరు

image.png

Posted in సినిమా | Tagged | Leave a comment

మనమరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు-271

మనమరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు-271
• 271- రంగస్థల, టీవి, సినిమా నటుడు, రచయిత, దర్శకుడు-ముదిలి సంజీవి
• సంజీవి ముదిలి రంగస్థల, టీవి, సినిమా నటుడు, రచయిత, దర్శకుడు.[1] 1965నుండి నాటకరంగంలో కృషిచేస్తున్న సంజీవి, సినీరంగంలో 50కిపైగా చిత్రాలకు నటుడిగా, రచయతగా పనిచేశాడు. ప్రజానాట్యమండలి కార్యక్రమాల్లో చురుకైన పాత్ర పోషించాడు.[2]
జననం
సంజీవి సెప్టెంబర్ 24న కృష్ణా జిల్లా, విజయవాడలో జన్మించాడు.[3]
రంగస్థల ప్రస్థానం

సంజీవి రాసిన త్రేతాగ్ని పుస్తక ఆవిష్కరణ
1965లో నటనాలయం నాటకంలోని చిట్టిబాబు పాత్ర ద్వారా నాటకరంగంలోకి అడుగుపెట్టిన సంజీవి నటుడిగా, రచయితగా, దర్శకుడిగా అనేక నాటక నాటికలకు పనిచేశాడు.[4] గురజాడ కళామందిరం అనే సంస్థను స్థాపించి, గత 40 ఏళ్ళుగా నాటక ప్రదర్శనలను ఇస్తున్నాడు.
నటించినవి
నాటకాలు

  1. సమాధానం కావాలి
  2. యుద్ధం
  3. ఈ చరిత్ర ఏ సిరాతో
  4. దేశం మోసపోయినప్పుడు
  5. మాస్టార్జీ
  6. యాచకులు
  7. శబ్దం
  8. మూక
    నాటికలు
  9. పగగం పగిలింది
  10. నీరుపోయి
  11. చరమాంకం
  12. శవాలపై జీవాలు
  13. ఊసరవల్లి
  14. మనకెందుకులే
  15. కదలిక
  16. సంచలనం
  17. డేకోయిట్లు
  18. రేపు
  19. వర్తమాన భూతం
  20. అయో (వ) ధ్య
  21. మనుధర్మం
  22. రాజ్యహింస
  23. నిజాయితి
  24. ఊరుమ్మడి బతుకులు
  25. క్విట్ ఇండియా
  26. అమూల్యం
  27. చెప్పుకింది పూలు
  28. ఓటు బాట
  29. గబ్బిలం
  30. అని తెలుస్తుంది
  31. వామపక్షం
    బహుమతులు
    నంది అవార్డులు
  32. ఉత్తమ నటుడు – నిజాయితి (నాటిక) – 2000
  33. ఉత్తమ నాటకం – మధురం
  34. ఉత్తమ రచన – శివరంజని
  35. నాలుగు అవార్డులు – గబ్బిలం (నాటిక)
  36. రెండు అవార్డులు (నంది నాటక పరిషత్తు – 2005)- అని తెలుస్తుంది (నాటిక)[5]
    ఆంధ్ర నాటక కళా పరిషత్తు
  37. ఉత్తమ బాల నటుడు – నటనాలయం (నాటకం), 1965, హైదరాబాదు.
  38. ఉత్తమ నాటకం, ఉత్తమ దర్శకుడు, ఉత్తమ నటుడు, ఉత్తమ రచన – ఈ చరిత్ర ఏ సిరాతో (నాటకం), విశాఖపట్టణం.
  39. ద్వితీయ ఉత్తమ నాటిక, ఉత్తమ దర్శకుడు, ఉత్తమ నటుడు – కదలిక (నాటకం), విశాఖపట్టణం.
    ఇతర అవార్డులు
  40. కళాసాగర్ అవార్డులు (1981 నుండి 84 వరకు, వరుసగా మూడుసార్లు)
  41. 62సార్లు ఉత్తమ రచయిత అవార్డులు
  42. 50సార్లు ఉత్తమ దర్శకుడు అవార్డులు
  43. 110సార్లు ఉత్తమ నటుడు అవార్డులు
    పురస్కారాలు
  44. మహాకవి గురజాడ స్మారక పురస్కారం, కళా విరించి – గుంటూరు
  45. పీపుల్స్ రైటర్ – జవ్వాది ట్రస్టు
  46. దాసరి ప్రతిభా పురస్కారం – 2018 ( ఫిలిం ఎనాలిటికల్ అండ్ అప్రిషియేషన్ సొసైటీ)[6]
    సినిమారంగ ప్రస్థానం
    నటనాలయం (నాటకం)లోని సంజీవి నటనను చూసి బి.ఎన్. రెడ్డి తన రంగులరాట్నం (1966) సినిమాలో బాలనటుడి వేషం ఇచ్చాడు. దాదాపు 50కిపైగా చిత్రాలకు నటుడిగా, రచయతగా పనిచేశాడు. సంజీవి రచనలో రాజశేఖర్ నటించిన ‘అన్న’ చిత్రం నాలుగు నంది అవార్డులు అందుకోవడమేకాకుండా, ఆస్కార్ అవార్డుకు కూడా నామినేట్ అయింది. దాసరి నారాయణరావు దర్శకత్వంలో విజయశాంతి నటించిన ఒసేయ్ రాములమ్మా చిత్ర రచనలో కూడా సంజీవి తన సహకరించాడు. ఈ చిత్రం అంతకుముందున్న బాక్సాఫీస్ రికార్డులను అధిగమించడమేకాకుండా రాష్ట్ర ప్రభుత్వం నుండి అనేక అవార్డులతోపాటూ ఉత్తమ నటి విభాగంలో జాతీయ అవార్డును గెలుచుకుంది. ఈయన రచయితగా చేసిన మరో సినిమా ఎర్రమందారం ఉత్తమ చిత్రం, ఉత్తమ నటుడు విభాగాల్లో రాష్ఱ్ర ప్రభుత్వ అవార్డులు, జాతీయ స్థాయిలో ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా భారత ప్రభుత్వ అవార్డు గెల్చుకుంది. ఎర్రసైన్యం, ఒరేయ్ రిక్షా, సమ్మక్క సారక్క వంటి చిత్రాలకు పనిచేసిన సంజీవి తమిళ సినిమా, కన్నడ సినిమా రంగంకు కూడా పనిచేశాడు. అంతేకాకుండా ఛాయా (1981), తెలుగోడు (2014) వంటి చిత్రాలకు దర్శకత్వం వహించాడు.
    సినిమాలు
    నటుడిగా
  47. 1966 – రంగులరాట్నం (బాలనటుడు)
  48. 1992 – హలో డార్లింగ్
  49. 1991 – కర్తవ్యం
  50. 1991 – ఎర్రమందారం
  51. 1989 – భారతనారి
  52. 1989 – అడవిలో అభిమన్యుడు
  53. 1989- మౌన పోరాటం
  54. 1988 – మహర్షి
  55. 2000 – అడవిచుక్క
  56. 2011- రాజన్న
    రచయితగా
  57. 2003 – అమ్ములు (కథ)
  58. 1997 – ఒసేయ్ రాములమ్మ (మాటలు)
  59. 1990 – అలజడి
  60. 2000 – అడవిచుక్క
    దర్శకత్వం
  61. 1981 – ఛాయా
  62. 1998 – తెలుగోడు
    టీవిరంగ ప్రస్థానం
  63. భరత నాట్యం
  64. అంతరంగాలు
  65. మాతృదేవత
  66. ప్రతిఘటన,
  67. నిన్నే పెళ్ళాడుతా
  68. సూర్యవంశం
  69. అపరాజిత
  70. పెళ్ళి
  71. కృష్ణవేణి
  72. మనసంతా నువ్వే
  73. కళ్యాణ తిలకం
  74. సీతమ్మ మాఅమ్మ
  75. బ్రహ్మముడి
  76. ఆరాధన
  77. శివరంజని
  78. గోరంత దీపం
  79. లక్ష్మీ కళ్యాణం
  80. మహలక్ష్మి
    పుస్తకాలు
    సంజీవి రాసిన త్రేతాగ్ని పుస్తకం 2021, ఆగస్టు 12న హైదరాబాదు రవీంద్రభారతిలోని పైడి జైరాజ్ ప్రివ్యూ థియేటర్ లో అవిష్కరణ జరిగింది. ఈ కార్యక్రమంలో తెలంగాణ ప్రభుత్వ సలహాదారులు డా. కె.వి. రమణాచారి, తెలంగాణ ప్రభుత్వ భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ, రంగస్థల నటులు, దర్శకులు ఆంధ్రప్రదేశ్ నాటక అకాడమీ మాజీ చైర్మన్ గుమ్మడి గోపాలకృష్ణ, దైవజ్ఞశర్మ, సినీ టివి దర్శకులు, నటులు నాగబాల సురేష్ కుమార్, సినీ నిర్మాత తుమ్మలపల్లి రామసత్యనారాయణ, లయన్ విజయ్ కుమార్ పాల్గొన్నారు.
    • సశేషం
    • మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -2-5-22ఉయ్యూరు —
Posted in సినిమా | Tagged | Leave a comment

నాటకరంగ వ్యవస్థాపకులు ,శారదా మనోవినోదినీ స్థాపకులు  ,ఆంధ్రనాటక కళాపరిషత్ సంస్థాపకులు ,ఆంధ్రనాటక కలోద్ధార బిరుదాంకితులు –పనారస గోవిందరావు

నాటకరంగ వ్యవస్థాపకులు ,శారదా మనోవినోదినీ స్థాపకులు  ,ఆంధ్రనాటక కళాపరిషత్ సంస్థాపకులు ,ఆంధ్రనాటక కలోద్ధార బిరుదాంకితులు –పనారస గోవిందరావు

వనారస గోవిందరావు రంగస్థల నటులు, నాటకరంగ వ్యవస్థాపకులు.

తొలిజీవితం

వనారస గోవిందరావు 1867లో గంపరామన్న, పకీరమ్మ దంపతులకు జన్మించారు. వీరి పెంపుడు తలిదండ్రులు సుంకమ్మ, వెంకోజీరావులు. గోవిందరావు అసలు పేరు పకీరప్ప. పెంపుడు తలిదండ్రులు పెట్టిన పేరు గోవిందప్ప. అదే గోవిందరావుగా మారింది.

ఆంధ్ర నాటక కళాపరిషత్తు వ్యవస్థాపక సభ్యులతో వనారస గోవిందరావు, 1929

రంగస్థల ప్రస్థానం

వెంకోజీరావు దగ్గర సంగీతం, ఫేడేలు, నంద్యాల జ్యోతి సుబ్బయ్య కంపెనీలో చేరి పాటలు నేర్చుకున్నారు. ఆ కంపెనీలో వేసిన మొదటివేషం సత్యహరిశ్చంద్రలోని విశ్యామిత్రుడు.

మద్రాసులో నాటకాలను చూసిన గోవిందరావు తను కూడా స్టేజి నాటకాలు వేయాలని అనుకొని, సురభి గ్రామంలో కీచకవధ నాటకం ప్రదర్శించారు. అందులో గోవిందరావు నకులుడి పాత్ర ధరించారు. తరువాత 1857లో ‘శ్రీ శారదా మనో వినోదినీ సభ’ అనే నాటక సమాజాన్ని స్థాపించి, స్టేజి నాటకాలు వేయడం ప్రారంభించారు. ఆ సభే నేటి సురభి కంపెనీలకు మాతృసంస్థ.

తరువాత కంపెనీని సంచాల నాటక రంగంగా రూపొందించి, సంచారానికి పనికివచ్చే రేకులు, విద్యుత్ దీపాలు, వైర్ వర్క్ సామాగ్రి సంపాదించి పెద్దఎత్తున్న వివిధ ప్రాంతాలలో నాటక ప్రదర్శనలు ఏర్పాటుచేశారు. రంగూన్ లో కూడా ప్రదర్శనలు ఇచ్చారు. స్త్రీలు నాటకాలలో నటించకూడదని అంటున్నకాలంలో తన భార్యాబిడ్డలను నాటకాలలో నటింపజేసి, సురభి నాటక సమాజాన్ని నాట్యశాస్త్ర విహిత సమాజంగా తీర్చిదిద్దారు.

1917లో భీమవరంలో అంకాదహనం నాటకంలో ఆంజనేయ పాత్రలో నటిస్తుండగా గోవిందరావు ధరించిన దుస్తులకు నిప్పంటుకొని దేహం కాలిపోయింది. నాటకాలలో నటించడానికి పనికిరాని పరిస్థితి ఏర్పడింది. అయినా కానీ సమాజాన్ని వదిలిపెట్టలేదు. హస్యం చేప్పేవారు. కాంతామణి నాటకంలో దొంగవేషం వేసి అద్భుతంగా నటించేవారు. అందుకే నాటక ప్రదర్శన కరపత్రాలలో ‘కంపెనీ ప్రొప్రెయిటర్ చే దొంగవేషం ధరింపబడును’ అని అచ్చు వేసేవారు.

1929నాటికే ఆంధ్రదేశంలో నాటకకళ క్షీణదశ ప్రారంభమైందని గ్రహించి దానిని సరైన మార్గంలో పెట్టడానికి పెద్దలతో కలిసి ఆంధ్ర నాటక కళా పరిషత్తు స్థాపించారు. ఆ సమయంలోనే ఆ పరిషత్తు ఆయనకు ‘ఆంధ్రనాటక కళోద్ధారక’ బిరుదుతో సన్మానించింది.

చివరిదశలో ఏలూరు దగ్గర పొలసనపల్లిలో స్థిరనివాసం ఏర్పరుచుకొని చాలా దానధర్మాలు చేశారు. ఆయన శిలా విగ్రహాన్ని కళాకారులు ఏలారులో ప్రతిష్ఠించారు.

ధరించిన పాత్రలు

విశ్వామిత్రుడునకులుడు, ఆంజనేయుడు, దొంగ, అర్జునుడు (సుభద్ర), రాజరాజ నరేంద్రుడు, హరిశ్చంద్రుడు, అనిరుద్ధుడు, రావణుడు, శ్రీరాముడు (సంపూర్ణ రామాయణం), విక్రమార్కుడు, బిల్వ మంగళుడు, జగన్మోహనుడు, హిరణ్యకశిపుడు, రుక్మాంగదుడు.

మరణం

జీవితాన్ని నాటకరంగానికి, నాటకోద్ధరణ కోసం ధారపోసిన వనారస 1953, డిసెంబర్ 19న మరణించారు.

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -2-5-22-ఉయ్యూరు 

Posted in సేకరణలు | Leave a comment

విశాఖ నటీమణులు

విశాఖ నటీమణులు

1- ఆకాశవాణి బిగ్రేడ్ ఆర్టిస్ట్ ,కృష్ణ వేష దారిణి,సత్యభామ చంద్రమతి ఫేం –రేకందార్ ఇందిరాదేవి

రేకందార్ ఇందిరాదేవి రంగస్థల నటి.

జననం
ఇందిరాదేవి, వనారస అబ్బాజీరావు, తిరుపతమ్మ దంపతులకు జన్మించింది.

రంగస్థల ప్రస్థానం
బాల్యంలోనే కృష్ణ లీలలో బాలకృష్ణుడుగా, కనక్తారాలో తారగా, భక్తప్రహ్లద లో ప్రహ్లదుడిగా నటించింది. చంద్రమతి, సత్యభామ, చింతామణి, సీత, లీలావతి మొదలగు స్త్రీ పాత్రలను అవలీలగా ప్రేక్షక జనరంజకంగా అభినయించింది. మాయాబజార్ లో, కురుక్షేత్రంలో శ్రీకృష్ణుని పాత్రను కూడా ధరించి ప్రశంసలందుకొన్నది. విజయవాడ ఆకాశవాణి కేంద్రంలో ‘బి’ హైగ్రేడ్ ఆర్టిస్ట్ గా అనేక శ్రవ్య నాటకాలలో నటించిన ఈమె ఎన్నో అవార్డులు – రివార్డులు, సత్కారాలు, సన్మానాలు అందుకుంది. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం పెన్షన్ పొందుతూ శేష జీవితాన్ని గడుపుతున్నది.

2-బహువిధ నాటక పాత్రధారిణి –రేకందార్ గుణవతి

రేకందార్ గుణవతి రంగస్థల నటి.

జననం
గుణవతి 1964, ఆగష్టు 22న విశాఖపట్టణం జిల్లా, నర్సింగరావుపల్లి లో శ్రీమతి వనారస సత్యనారాయణమ్మ, వనారస బాబూరావు దంపతులకు జన్మించింది.

రంగస్థల ప్రస్థానం
బాలపాత్రల ద్వారా రంగస్థలంపై అడుగుపెట్టింది.

సతీ అనసూయలో (గంగ, పార్వతి, అనసూయ) శ్రీకృష్ణ లీలలు లో (దేవకి, మాయపూతన), హరిశ్చంద్రలో (మాతంగ కన్య, కలహకంఠి), [[మాయాబజార్]] లో (కృష్ణుడు, సుభద్ర, సత్యభామ, శశిరేఖ), సావిత్రిలో (సావిత్రి), గుణసుందరిలో (హేమసుందరి), కాంతామతిలో (కాంచనమాల), పాతాళభైరవి లో (నళిని), బొబ్బిలియుద్ధం లో (చిన వెంకటరావు), బాలనాగమ్మ లో (మాణిక్యాలదేవి, లచ్చి, సంగు), భూకైలాస్ లో (పార్వతి), లవకుశ లో (భూదేవి, లచ్చి, కుశుడు), విక్రమార్కలో (ప్రమద), కనక్తారా లో (తార), భక్త ప్రహ్లదలో (లీలావతి), విశ్వనాథ విజయంలో (శ్రీకృష్ణ దేవరాయలు), శ్రీకృష్ణ తులాభారంలో (సత్యభామ), చింతామణి లో (చింతామణి), బ్రహ్మంగారి చరిత్రలో (వనకన్య, ఎరుకలసాని), రంగూన్ రౌడీ లో (అన్నపూర్ణ కుమారుడు-గిరికుమారి), చెంచులక్ష్మి లో (లీలావతి), ముగ్గురు మరాఠీలు (రుక్కురాణి-రఘు) మొదలైన పాత్రలలో నటించింది.

3-చిన్నతనం లోనే రంగస్థలాన్ని దున్నేసిన –రేకందార్ ప్రేమలత

రేకందార్ ప్రేమలత ప్రముఖ రంగస్థల నటి.

జననం
రేకందార్ ప్రేమలత 1957, ఆగష్టు 21 న శ్రీమతి వనారస భువనేశ్వరి, వనారస వెంకట్రావు దంపతులకు విశాఖపట్నం జిల్లా, రావికమతం మండలంలోని మేడివాడలో జన్మించింది.

రంగస్థల ప్రస్థానం
ఈవిడ పసిప్రాయంలోనే రంగస్థలంపై అడుగుపెట్టింది. ఐదు దశాబ్దాలకు పైబడిన రంగస్థల అనుభవం గడించి, అనేక పాత్రలను పోషించింది. గంగ, కృష్ణుడు, లవుడు, బాలవర్ధి, సంగు, వనకన్య, శశిరేఖ, శూర్పణఖ, ఊర్వశి, మాతంగ కన్య, రంభ, రాధాభాయి, పార్వతి, కనక సేనుడు, ఇందుమతి, చంద్రలేఖ, ప్రహ్లాదుడు, మన్మథుడు, అనసూయ, సావిత్రి పాత్రలు పోషించారు.

4-డిప్లొమా ఇన్ యాక్టింగ్ ,డైరెక్షన్ పొంది ,ఆకాశవాణి దూరదర్శన్ లో బిగ్రేడ్ ఆర్టిస్ట్ ,ఎన్నోనాతకాలలో వైవిధ్య పాత్ర పోషించిన –ఎం .హేమ

హేమ. ఎమ్ ప్రముఖ రంగస్థల నటి.

జననం[మార్చు]
వీరు 1977 డిశంబరు 19న శ్రీమతి మహాలక్ష్మి, డి.ఎమ్. నాయుడు దంపతులకు విశాఖపట్నంలో జన్మించారు.

రంగస్థల ప్రవేశం[మార్చు]
1995 సంవత్సరం తన గురువుగారైన ఎల్. సత్యానందం దర్శవత్వంలోని ‘బొమ్మలాట’ నాటకంతో తన రంగస్థల నటజీవితాన్ని ప్రారంభించారు. ఈవిడ ప్రజా నాట్యమండలి బృదంతో కలిసి రైలుబండి, లెట్ ఇట్‌బి వేకస్ట్, గారడి లాంటి వీధి నాటికలలో శతాధిక ప్రదర్శనల్లో పాల్గొన్నారు. ఎయిడ్స్, పల్స్ పోలియో, మలేరియా లాంటి వాటిమీద ప్రజలకు అవగాహన కల్పించే వీధి నాటకాల్లో పాత్రధారణ గావించారు.

రంగస్థల నటిగా దాదాపు 15 సంవత్సరాల అనుభవం గడించిన ఈవిడ పలు పరిషత్తులలో ఉత్తమ నటిగా, సహాయనటిగా, ప్రతినాయకిగా, శతాధిక బహుమతులను అందుకున్నారు. 2002లో కళాజగతి మాసపత్రికవారు కళాజగతి అవార్డును ప్రదానంచేశారు.

డిప్లమా ఇన్ యాక్టంగ్, డిప్లమా ఇన్ డైరెక్షన్ లో ఆంధ్రా యూనివర్సిటీలో ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణులయ్యారు. నాగపూర్ వర్క్ షాప్ లో 60రోజులు, నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామాలో ఒక ఏడాదిపాటు శిక్షణ పొందారు. ఆకాశవాణి, దూరదర్శన్ కేంద్రాల ఆడిషన్ లో ‘బి’ హైగ్రేడ్ స్థానాన్ని పొందారు.

రావూజీ, మందులు, అత్తిలి కృష్ణారావు, చలసాని కృష్ణప్రసాద్, ప్రసాదమూర్తి ముదనూరి, కృష్ణచైతన్య, మిశ్రో, కె.ఎస్.టి. శాయి, కె.జి.ఆర్. గాంధి, నాయుడు గోపి లాంటి ప్రముఖ దర్శకుల నాటకాల్లో నటించి నటనలోని మెళకువలను నేర్చుకున్నారు.

నటించినవి[మార్చు]

  1. అతనికోసం ఇతను
  2. మపకేయకే చందమామ
  3. పోస్టర్
  4. శ్రీకారం
  5. ఆరణి
  6. చదరంగం
  7. కుక్కపిల్ల దొరికింది
  8. హుళక్కి ఇచ్చుటలో వున్న హాయి
  9. భారతరత్న
  10. దర్పణం
  11. ఒంటెద్దు బండి
  12. అంబేద్కర్
  13. మబ్బుల్లో బొమ్మ
  14. కకావికలం
  15. మైదానం
  16. జీవన సంధ్య
  17. పండగొచ్చింది
  18. నిమజ్జనం
  19. అనంతరాగం
  20. పడమటిగాలి
  21. దిగేమ్
  22. వందేమాతరం
  23. సావిత్రి సవాల్
  24. అంతర్మథనం
  25. పెద్ద బాలశిక్ష
  26. అంతరాలు
  27. తులసీతీర్థం
  28. భరతవాక్యం
  29. మధ్యతరగతి మందహాసం
  30. కాబూలీవాలా
  31. మనోధర్మం
  32. అతిథి దేవుళ్లోస్తున్నారు జాగ్రత్త
  33. సిద్ధార్థ
  34. అద్దంలో చందమామ
  35. శాంతి యుద్ధం
  36. తలుపు
  37. ఇక్కడ కాసేపు ఆగుదాం
  38. పితృవనం
  39. మానవత్వానికి మరో కోణం
  40. లగాబుస్ లచ్చన్న
  41. కాలుష్యం
  42. పులుస్టాప్ కాదు కామా మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -2-5-22-ఉయ్యూరు
Posted in రచనలు | Leave a comment

కూచిపూడి నాట్యగురువు ,పరిశోధకా చార్య ‘’లాస్యప్రియ అకాడెమీ’’ స్థాపకురాలు ,సంగీత నాటక అకాడెమి అవార్డీ-డా.ఉమా రామారావు

కూచిపూడి నాట్యగురువు ,పరిశోధకా చార్య ‘’లాస్యప్రియ అకాడెమీ’’ స్థాపకురాలు ,సంగీత నాటక అకాడెమి అవార్డీ-డా.ఉమా రామారావు

శ్రీమతి డాక్టర్ ఉమా రామారావు కూచిపూడి నర్తకి, నృత్య దర్శకురాలు, పరిశోధకులు, ఆచార్యులు, రచయిత్రి. 1985 లో హైదరాబాదులో తాను స్థాపించిన లాస్యప్రియ డ్యాన్స్ అకాడమీకి నిర్దేశకులు కూడా. భారతదేశానికి చెందిన సంగీత, నృత్య, రూపక అకాడమీ 2003 లో ఉమా రామారావుని సంగీత్-నాటక్ అకాడమీ అవార్డుతో సత్కరించింది.

పుట్టు పూర్వోత్తరాలు
4-జూలై-1938 న “ఉమా మహేశ్వరి” డా. శ్రీ వి.వి. కృష్ణారావు, శ్రీమతి సౌభాగ్యం లకు విశాఖపట్టణంలో జన్మించింది. సాహిత్యం, సంగీతం, నృత్యాల యెడల అమితాసక్తిగల వేదపండితుల ఇంట జన్మించటం, వారందించిన స్ఫూర్తి, ప్రేరణలతో 5వ ఏటి నుండే ఆచార్య పి.వి.నరసింహా రావు, పద్మశ్రీ డా. నటరాజ రామకృష్ణ, బ్రహ్మశ్రీ వేదాంతం లక్ష్మీ నారాయణ శాస్త్రి, గురు పక్కీరిస్వామి పిళ్ళై, గురు సి.ఆర్. ఆచార్యల వద్ద కూచిపూడి, భరతనాట్యం, ఇతర సాంప్రదాయిక నృత్యరీతులని అభ్యసించటం ప్రారంభించింది. ఈ నృత్యరీతుల సైద్ధాంతిక, ఆచరణీయ కారకాలని అవపోసన పట్టినది.

తొలినాళ్ళలో సోదరి సుమతీ కౌశల్‌తో బాటు పలు సందర్భాలలో పలు ప్రదేశాల్లో గురువుల వ్యక్తిగత పర్యవేక్షణలో ప్రదర్శనలు చేసింది. 1953-55 లలో అప్పటి మద్రాసు ప్రభుత్వం నిర్వహించిన శాస్త్రీయ సంగీత, నృత్య పరీక్షలలో ఉత్తీర్ణురాలైనది. అటు పిమ్మట డా. నటరాజ రామకృష్ణ గారి ఆశీస్సులతో భావి తరాలకు ఈ సంప్రదాయాన్ని అందించేందుకు ఆచార్యుల వృత్తిని చేపట్టారు.

అర్థశాస్త్రంలో ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి పోస్టు-గ్రాడ్యుయేట్ పట్టాని పుచ్చుకొన్నారు.

ప్రదర్శనలు
పేరొందిన నాటి, నేటి రచయితల గీతాలకు పలు ఏకపాత్ర నృత్యాలను, నృత్య లక్షణాలను, నృత్య రూపకాలను, సాంప్రదాయికి యక్షగానాలను వినూత్న రీతిలో నృత్య దర్శకత్వం వహించటంతో ఉమా రామారావు ప్రసిద్ధికెక్కారు. శ్రీ త్యాగరాజ నౌకాచరిత్ర, ప్రహ్లాద భక్తి విజయం, షాహజీ రాజు శంకర, విష్ణు పల్లకీ సేవా ప్రబంధనాలు, విఘ్నేశ్వర కళ్యాణం, నారాయణ తీర్థుల సాధ్వి రుక్మిణి, మాతృభుతయ్యుల పారిజాతాపహరణం, కాకుటూరి పద్మావతి గారి మందాకిని, శివ కాత్యాయని వంటి సాంప్రదాయిక రూపకాలు, విశ్వదీపం, పంచనదీయం, సినారె వారి స్వరరాగనర్తనం, తెలుగు వెలుగులు, మేధ, కంప్యూటరు పై మేధావికాస్ వంటి నృత్య లక్షణాలు వారిలో నృత్య దర్శకత్వం లోని బహుముఖ పాటవాన్ని, పాండిత్యాన్ని బహిర్గతం చేసింది.

బోధనా వృత్తి
ఈ నేపథ్యంతో హైదరాబాదుకి చెందిన శ్రీ త్యాగరాజ ప్రభుత్వ సంగీత నృత్య కళాశాలలో సీనియర్ లెక్చరర్ గా 1969 నుండి 1988 వరకు భరతనాట్యంలో విద్యార్థులకు సర్టిఫికేట్, డిప్లొమా, డిగ్రీ కోర్సులను బోధించింది. తర్వాత పొట్టి శ్రీ రాములు తెలుగు విశ్వవిద్యాలయంలో అసోసియేట్ ప్రొఫెసర్ స్థాయిలో నృత్య విభాగానికి అధిపతిగా బాధ్యతలు చేపట్టారు.

నృత్యకళలో విద్యార్థుల పరిశోధన, ఇతర కార్యకలాపాలలో పర్యవేక్షణకై ‘షాహజీ రాజు యక్షగాన ప్రబంధాలు’ (షాహజీ 1684 నుండి 1712 వరకూ తంజావూరుని పరిపాలించిన ఒక మరాఠీ రాజు. ఈయన తెలుగు భాషలో ఇరవై యక్షగానాలని కూర్చారు.) అనే థీసిస్ ని తెలుగు విశ్వవిద్యాలయానికి సమర్పించి 1994 లో పీహెచ్ డీ పట్టాతో బాటు బంగారు పతకాన్ని కూడా అందుకొన్నారు.

తెలుగు విశ్వవిద్యాలయానికి నృత్య విభాగానికి అధిపతి అయిన డా. అలేఖ్య పుంజాల,[1] జ్యోతి లక్కరాజు, మాధురి కిషోర్, పద్మ చేబ్రోలు, పల్లవి కుమార్ లు వీరి ప్రియ శిష్యురాళ్ళే.

లాస్యప్రియ డ్యాన్స్ అకాడమీ
1985 లో లాస్యప్రియా డ్యాన్స్ అకాడమీని హైదరాబాదులో స్థాపించారు. ఈ కళాశాల కూచిపూడి, భరతనాట్యం లలోని నృత్య సాంప్రదాయలని సైద్ధాంతిక, ఆచరణీయ అంశాలపై శిక్షణనిస్తూ విద్యార్థులని రాష్ట్ర ప్రభుత్వ, విశ్వవిద్యాలయ స్థాయిలో పరీక్షలకి సిద్ధం చేస్తుంది. లాస్యప్రియ ఇందిరా గాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీకి అనుబంధ సంస్థ.

అవార్డులు , సత్కారాలు
నాట్యం పట్ల తమకున్న అంకిత భావానికి, నిబద్ధతకి, నాట్యానికి తామందించిన సేవలకి వారికి ఎన్నో అవార్డులు, సత్కారాలు లభించాయి. వాటిలో కొన్ని:

· ఆం. ప్ర ప్రభుత్వం నుండి కళా నీరాజనం, ఉత్తమ అధ్యాపకులు

· ఉత్తర అమెరికా అన్నమాచార్య మునీశ్వర సంస్థ నుండి శ్రీ కళాపూర్ణ

· పొట్టి శ్రీ రాములు తెలుగు విశ్వవిద్యాలయం, హైదరాబాదు నుండి ప్రతిభా పురస్కారం

· 26-అక్టోబరు-2004 లో సంగీత్-నాటక్ అకాడమీ అవార్డు

· మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -2-5-22-ఉయ్యూరు

Posted in సేకరణలు | Leave a comment

రాంగేయ రాఘవ -3చారిత్రిక దృష్టి

రాంగేయ రాఘవ -3
చారిత్రిక దృష్టి
రాఘవసృజనాత్మకంగా ‘’ముర్దోం కా టీలా’’నవలను అద్భుతకల్పనలతో రాశాడు .ఆర్యులు దురాక్రమణ దారులు గా ,ద్రావిడులు సర్వం కోల్పోయిన వారిగా చెప్పాడు .మొత్తం భారతీయ మానవ వికాసం దృష్ట్యా ఆయన పరిశీలించి చెప్పాడు .బానిసబతుకు వ్యతిరేకించాలని ఉద్బోధించాడు .’’ధూళి కణమా హిమాలయంగా మారిపో. నా ధమనుల్లో ద్రావిడ రక్తం కుతకుత ఉడుకుతోంది .సింహ గర్జనలతో వెంటాడి పోరాడు ‘’అంటాడు .మొహంజొదారో నేపధ్యం లో రాసిన నవల ఇది .కన్హైలాల్ హరప్పా నాగరకత నేపధ్యం లో రాశాడు .రెండిటిలోనూ వస్తువు ఒక్కటే ఆర్యుల దండయాత్ర .తనపాత్రలు చరిత్రలో ఏ దశలో ఉంటె ,అలాగే ఆలోచించి విధులు నిర్వహిస్తాయి ‘’అన్నాడు రాఘవ .చింతన ఆధారం గా కొత్త శిఖరాలు అందుకోవాలి ,పరిణామ క్రమం లో ప్రగతి చూపాలని చెప్పాడు .జ్ఞానాన్వేషణలో ఉదారబుద్ధి తిరస్కరిస్తే అంధకారం లో పడిపోతాం .రాగ ద్వేషాలకు అతీతంగా చారిత్రిక సంఘటనలు వ్యక్తులమీద శాస్త్రీయంగా వ్యాఖ్యానించాడు .సంస్కృతీ సంబంధ మైన ‘’అంతర్భుక్తి ‘’సిద్దాన్తానికే ఎక్కువ ప్రాదాన్యమిచ్చాడు .మనమంతా భారతీయులం ,మానవులం అని ఎలుగెత్తి చాటాడు .వేదాలలో యక్ష గాంధర్వ జైన పరంపరలో కూడా ఈ సిద్ధాంతం ఉంది .సంచార జాతులు ఆకలి దప్పులవల్ల నిరంతరం స్థాన చలనం లోఉండేవి .
రామగాధ వివరిస్తూ రామసుగ్రీవ సఖ్యం ఆర్య అనార్య పరస్పర ఆదాన ప్రదానంగా భావించాడు .దీనివల్ల జాతుల సమ్మేళనం జరుగుతుందన్నాడు .క్షత్రియులు బ్రాహ్మణులు ఇచ్చిపుచ్చుకొనే ధోరణిలో జీవితం సాగించారు .పౌరాణిక విశ్వాసాలు జాతుల పోరాటం గురిచి చెప్పేటప్పుడు ‘’టాటే౦’’ను ఆధారం చేసుకొన్నాడు .మహాయాత్రా రెండవ భాగం లోస్కంద గుప్తుడు కుభా నది అంటే కాబుల్ నది చేరి ప్రాణార్పణ చేసుకొంటూ మధురభూమికి నమస్కరిస్తాడు కారణం ఇక్కడే అన్యాయ అత్యాచారాలకు వ్యతిరేకంగా శ్రీ కృష్ణుడు కంసుడిని సంహరించాడు .ఇలా అన్యాయ ప్రతిఘటన రాఘవ ధ్యేయం .గుప్త రాజుల నీతి ప్రజాకల్యా ణ౦గా సాగింది అంటాడు .ప్రజల సుఖ దుఖాల దృష్టితో చరిత్ర పరిశోధన చేయాలన్నాడు .
నాగసేన –పతంజలి సంఘర్షణలో బౌద్ధ బ్రాహ్మణ సంఘర్షణ ఉందన్నాడు .బ్రాహ్మణులు స్వదేశీప్రేమికులుగా గెలిస్తే ,బౌద్ధులు విదేశీయులతోచేతులు కలిపి ఓడిపోయారుఅని వ్యాఖ్యానించాడు .స్వాతంత్ర్య కాంక్షతో మౌర్య చంద్రగుప్తుడు ,పుష్యమిత్రుడు స్కంద గుప్తుడు హర్షుడే కాక రాణాప్రతాప్ ,బహదూర్ షా జాఫర్ ,వాజిదలీ షా ప్రజాసంక్షేమం కోసం ఒక గొప్ప దేశనిర్మాణ౦ కోసం బలిదానం చేసిన మహా వీరులు అన్నాడు .భారతచరిత్ర బాహిరరూపాన్నే కాక ఆన్తర్యాన్నికూడా స్ప్రుసించాను.నిజానికి భారత చరిత్ర వాస్తవానికి దుర్లభమైనది .దాన్ని పరిశోదించటం కేవలం చరిత్రను మాత్రమె చెప్పటం కాదు’’ అన్నాడు .కేనోపనిషత్ వాక్యాన్ని ఉదాహరిస్తూ తన చారిత్రిక దృక్పధాన్ని వివరించాడు .బ్రహ్మజ్ఞాన పరిజ్ఞానం చాలా అల్పమైనదని ఉపనిషత్ కారుడు అన్నాడు అంటాడు .కానీ ఆ సత్యాన్ని తెలుసుకొని మననం చేయాలి అని స్పష్టంగా చెప్పాడు .
రాఘవ కావ్యాలలో మానవ కల్యాణం
రాఘవ సాధనా సంపత్తిలో అతడి కావ్య వైశిష్ట్యం ఉజ్వల సాహిత్య సౌందర్యం అన్నాడు ఒక విశ్లేషకుడు .జయశంకర ప్రసాద్ రాసిన ‘’కామాయినీ ‘’కి పోటీగా రాఘవ ‘’మేధావీ ‘’పద్య కావ్యం రాశాడు .ఇది మానవుడి మౌలిక చింతనా వేదన .తర్వాత సామాజిక స్పృహ ,సమకాలీన చైతన్యంతో’’పాంచాలి ‘’ఖండకావ్యం రాశాడు .నాజీ దురాక్రమణ ను తిప్పికొట్టిన రష్యా ప్రజల వీరోచిత పోరాటాన్ని ‘’అజేయ ఖాన్దహార్ ‘’కావ్యంగా రాశాడు .రష్యా సోషలిస్ట్ సమాజం మానవ విముక్తి దీపం లా వెలుగుతుంది .రష్యన్ల విజయాలు భారత దేశానికి ,సమస్త పీడిత మానవాళి కి సంబంధించిందని అంతర్జాతీయ దృష్టితో చెప్పాడు.చైనాలో ప్రజాపోరాటం నిర్ణయాత్మక దశకు ,భారత జాతీయోద్యమమం చివరి మలుపు కు తిరిగింది .రాఘవ దేశాలు సరిహద్దులు దాటి ఆలోచించాడు. సకల జీవన తత్వాలు ఒక్క చోటికితెచ్చి ఆకళింపు చేసుకొన్నాడు .మానవ జీవన శక్తి సత్యాన్ని చాటి చెప్పాడు .తత్వశాస్త్రం ఖగోళం చరిత్ర సాంఘిక రాజకీయాలన్నీ తనకావ్యం లో కలగలిసి పోయాయని చెప్పుకొన్నాడు .
మేధావి కావ్యం ప్రబంధంగా ఉంటుంది .మేధావి పాత్ర మానవ వినాశనానికి చింతిస్తుంది .వర్తమాన ప్రేరణకోసం పురాణ విషయాలు తెలిపాడు .పాంచాలి ఆత్మాభిమానమున్న స్త్రీ .ధర్మరాజు నుకొత్తగా ఆవిష్కరిస్తాడు .ధర్మాన్ని తనపై అమలు చేసుకోనిచూస్తేనే సత్య దర్శనం అవుతుందని యుధిష్ఠిరుడు అంటాడు .నిరంకుశత్వాన్ని వ్యతిరేకించాడు ధర్మరాజు ,మానవతా దార్శనికుడు ,.తన సోదరుల వీర విక్రమ పరాక్రమాలు తనకు పూర్తిగా తెలుసుననీ ,ఈ సంఘర్షణలో తాను చనిపోయినా ,తనధర్మానికి క్షతి ఏర్పడేదికాదు అంటాడు పా౦చాలితొ . ఆయన ఉన్నత వ్యక్తిత్వానికి ,బాధ్యతాయుత ధర్మనిర్వాహణ కు, యుగ కర్తవ్యానికి ఇవి మచ్చు తునకలు .జయద్రధుడు ద్రౌపది పై మోహ పరవశుడై వస్తే ‘’నేను కురుభూమిలో విజయ పతాకను నేను చక్రవర్తి మహిమా వైభవాన్ని .ఓరీ సేవకుడా నువ్వు నన్ను భరించగలవురా ఓరీ ఉన్మాదీ!నువ్వు మాతృహీనుడవా పాపీ !స్త్రీ గౌరవం తెలీని మూర్ఖుడా !నేను పవిత్రతను ,కులస్త్రీని ,మాతృ మూర్తిని .నువ్వా నాకు ఆశలు చూపేది ?.జీవితమే రణ రంగం .నేనుచేతులుమారే వస్తువును కాను ద్రోహీ ‘’అంటుంది .జయద్రదుడికి తగిన గుణ పాఠం చెప్పాలని పాండవ సోదరులు భావించినప్పుడు ద్రోపది ‘’ఏది చేస్తే ధర్మం గెలుస్తుందో ,అదే చేస్తాను .అపరాధిని వదిలి క్షమా గుణం చూపిస్తాను ‘’అని ధర్మరాజు తనను ఆవహించినట్లు ధర్మబద్ధంగా చెప్పింది పాంచాలి .అదీ రాఘవ కవిత్వ మహోత్రుష్టత .
సశేషం
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -1-5-22-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

మనమరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు-267

• మనమరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు-267
• 267-నాటక నట గాయక దర్శకుడు ,సినీ నారద ,మార్కండేయ ,మైరావణ ఫేం –త్రిపురారి భట్ల రామకృష్ణ శాస్త్రి
• త్రిపురారిభట్ల రామకృష్ణశాస్త్రి (ఏప్రిల్ 10, 1914 – మే 21, 1998) రంగస్థల, సినిమా నటుడు, గాయకుడు. రామకృష్ణశాస్త్రి 1920, 1930వ దశకాల్లో చెందిన గాయకుడు. ఈయన తెనాలి శ్రీరామ విలాస సభలో దర్శకుడిగా పనిచేశాడు.[1]
జననం
రామకృష్ణ శాస్త్రి 1914, ఏప్రిల్ 10వ తేదిన రాఘవయ్య, కామేశ్వరమ్మ దంపతులకు గుంటూరు జిల్లా తెనాలి తాలూకాలోని పెదరావూరు గ్రామంలో జన్మించాడు.
నాటకరంగం
వంశ పారంపర్యముగా వచ్చిన ‘తరంగ గానం’ను చిన్నవయసులోనే నేర్చుకన్నాడు. 9వ ఏట తెనాలి రామవిలాస సభలో బాలనటుడిగా చేరి అనేక నాటకాల్లో నటించాడు.[2] ఈయన కొన్ని గ్రామోఫోను రికార్డుల్లో కూడా పాడాడు. 1926లో గుంటూరులో బాలమిత్ర సభను ప్రారంభించి, బాలనటులతో ఒక బృందాన్ని తయారుచేసిన దంటు వెంకటకృష్ణయ్య ఆహ్వానం మేరకు రామకృష్ణ శాస్త్రి ఆ సమాజంలోకి చేరి ‘రోషనార’లో శివాజీ, ‘కృష్ణలీలలు’ లో యశోద, ‘రామదాసు’ లో రామదాసు పాత్రలు పోషించాడు. పువ్వుల సూరిబాబు, కళ్యాణి, నాగలింగం వంటి నటులు కూడా ఆ సంస్థలో ఉన్నారు.
నాటక సమాజాలు మూతపడిపోయినకాలంలో స్థానం నరసింహారావు, సి.యస్.ఆర్. ఆంజనేయులు లతో కలసి ఊరురా తిరిగి ‘తులాభారం’ నాటకంలో నారదుడుగా నటించి మెప్పించాడు. సినిమారంగంలో ఉంటూనే కలియుగ ఆంజనేయ బిరుదాంకితుడైన బేతా వెంకటరావు ‘రామాంజనేయ యుద్ధం నాటకంలో నారదుని పాత్రలో అనేక ప్రదర్శనలిచ్చాడు. ఇతర నాటక సమాజాలు ప్రదర్శించిన నాటకాలలో బిల్వమంగలుడు, శివయోగి, రామదాసు, కబీరు, నారదుడు పాత్రలలో నటించాడు.[3]
సినిమారంగ౦ ]
నారదుడిగా రామకృష్ణ శాస్త్రి నటనను చూసిన దర్శకుడు చిత్రపు నరసింహారావు 1937లో తాన దర్శకత్వం వహించిన ‘మోహిని రుక్మాంగద’ సినిమాలో నారద పాత్రకు శాస్త్రిని ఎంపిక చేశాడు. అలా దాదాపు 12 సినిమాలలో నటించాడు.[4]
నటించిన చిత్రాలు
• 1937: మోహిని రుక్మాంగద – నారదుడు
• 1938: భక్త మార్కండేయ
• 1940: మైరావణ
• 1941: దక్షయజ్ఞం
• 1942: ప్రహ్లాద
• 1942: సుమతి
• 1943: గరుడ గర్వభంగం
• మనమరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు-268
• 268-షూటింగ్ లో ఫస్ట్,షిప్ యార్డ్ ఉద్యోగి ,సినీసహాయనటుడు –వంకాయల సత్యనారాయణ మూర్తి
• వంకాయల సత్యనారాయణ ఒక తెలుగు నటుడు.[1] సహాయ నటుడిగా దాదాపు 180 తెలుగు సినిమాలలో నటించాడు.[2]
జీవిత విశేషాలు
ఈయన 1940 డిసెంబరు 28న విశాఖపట్నంలో జన్మించాడు. బి. కాం లో బంగారు పతకం సాధించాడు. 1960 లో షూటింగ్‌ పోటీలో భారతదేశంలోనే మొదటి స్థానం పొందాడు. చదువు, క్రీడల్లో ప్రతిభ ఆధారంగా ఆయనకు హిందుస్థాన్ షిప్ యార్డులో ఉద్యోగం వచ్చింది. 1970 లో నాటకరంగంలోకి ప్రవేశించాడు. 1976 లో నీడ లేని ఆడది సినిమాతో సినీరంగ ప్రవేశం చేశాడు. దాదాపు 180కి పైగా సినిమాల్లో ఎక్కువగా సహాయ నటుడి పాత్రలు పోషించాడు. సీతాకోక చిలుక, సూత్రధారులు, సీతామాలక్ష్మి, దొంగకోళ్ళు, ఊరికిచ్చిన మాట, విజేత, స్టేషన్ మాస్టర్, మావి చిగురు లాంటి సినిమాల్లో ఆయన చెప్పుకోదగ్గ పాత్రలు పోషించాడు. పలు టెలివిజన్ ధారావాహికల్లో కూడా కనిపించాడు. ఆయన చివరి సినిమా కారం దోసె.
ఆయన భార్య శకుంతల. వీరికి ఇద్దరు కుమార్తెలు.
సినిమాల జాబితా
ఈయన నటించిన తెలుగు సినిమాల పాక్షిక జాబితా:
1. అయినవాళ్ళు (1976)
2. అర్ధాంగి (1977)
3. సీతామాలక్ష్మి (1978)
4. కమలమ్మ కమతం (1979)
5. కుక్క కాటుకు చెప్పు దెబ్బ (1979)
6. మా ఊళ్ళో మహాశివుడు (1979)
7. రతీమన్మథ (1979)
8. ఊరికిచ్చిన మాట (1981)
9. శుభలేఖ (1982)
10. శివుడు శివుడు శివుడు (1983)
11. నవమోహిని (1984)
12. మంత్ర దండం (1985)
13. విజేత (1985)
14. ఊరేగింపు (1988)
15. జానకిరాముడు (1988)
16. మహారాజశ్రీ మాయగాడు (1988)
17. సూత్రధారులు (1990)
18. అత్తింట్లో అద్దెమొగుడు (1991)
19. ఆశయం (1993)
20. రుక్మిణి (1997)
21. కారందోశ (2016)[3]
ఇతర విశేషాలు
• 1958లో కొచ్చిన్‌లో ఎన్‌సిసి క్యాడెట్లకు జరిగిన పోటీలలో ఆలిండియా ఉత్తమ జూనియర్‌ క్యాడెట్‌గా నిలిచారు.
• 1958లో కొచ్చిన్‌లో ఎన్‌సిసి క్యాడెట్లకు జరిగిన పోటీలలో ఆలిండియా ఛాలెంజ్‌ బోట్‌ రోయర్‌ బహుమతిని గెలుచుకున్నారు.
• 1960లో ఢిల్లీ రిపబ్లిక్‌ డే కవాతులో పాల్గొన్నారు.
• 1960 ఆగస్టులో షూటింగ్‌ కాంపిటీషన్‌లో భారతదేశంలోనే మొదటి స్థానం పొందారు.
• బి.కాంలో బంగారు పతకం అందుకున్నారు.
• జిల్లాస్థాయి కందుకూరి పురస్కారం – ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, 30 ఏప్రిల్ 2017.[4]
మరణం
కొంతకాలంగా శ్వాస సంబంధిత వ్యాధితో బాధ పడుతున్న వంకాయల సత్యనారాయణమూర్తి 2018 మార్చి 12 న మరణించారు.[5][6]
• సీతామహాలక్ష్మి ,శ్రుతిలయలు సినిమాలలో చిరస్మరణీయ నటన ప్రదర్శించాడు .
• మనమరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు-269
• 269-భాషా పరిశోధకుడు ,వ్యావహారిక భాషోద్యమనాయకుడు ,ఆంద్ర విజ్ఞాన సర్వస్వం లో విలువైన వ్యాసరచయిత ,సాహిత్య అకాడెమి అవార్డీ,గిడుగు వారి పుత్రుడు ,రైతుబిడ్డ స్వర్గసీమ సినీ ఫేం –గిడుగు సీతాపతి
• గిడుగు వెంకట సీతాపతి (జనవరి 28, 1885 – ఏప్రిల్ 19, 1969) ప్రసిద్ధ భాషా పరిశోధకుడు. విజ్ఞాన సర్వస్వ నిర్మాత. పలు గేయాలను పిల్లలకోసం రాసిన సాహిత్యవేత్త. ఇతని బాలసాహిత్యంలో ప్రాచుర్యం పొందినది చిలకమ్మపెళ్ళి.
జననం
వీరు జనవరి 28, 1885 సంవత్సరంలో విశాఖపట్నం జిల్లా భీమునిపట్నంలో తెలుగు వ్యావహారిక భాషోద్యమ సారథి అయిన గిడుగు వెంకట రామమూర్తి దంపతులకు జన్మించారు.
మద్రాసు క్రైస్తవ కళాశాలలో చరిత్రలో పట్టభద్రులై కొంతకాలం పర్లాకిమిడిలో చరిత్రోపన్యాసకులుగా పనిచేశారు. వ్యావహారిక భాషోద్యమంలోను, సవర భాషోద్ధరణలోను తండ్రికి కుడిభుజంగా నిలిచి విశేషానుభవం గడించారు. రైతుబిడ్డ, స్వర్గసీమ, పల్నాటి యుద్ధం, భక్తిమాల వంటి కొన్ని చలనచిత్రాలలోను, కొన్ని నాటకాలలోను నటించారు.
1945లో మాగంటి బాపినీడు సంపాదకత్వంలో వెలువడిన ఆంధ్ర సర్వస్వముకు అనేక వ్యాసాలు రచించి విశేషంగా తోడ్పడ్డారు. 1949లో తెలుగు భాషా సమితి ఏర్పడినపుడు తెలుగు విజ్ఞాన సర్వస్వపు ప్రధాన సంగ్రాహకులుగా నియమితులయ్యారు. చరిత్ర-రాజనీతి సంపుటం సంపాదక వర్గంలో ప్రముఖపాత్ర వహించారు. సూర్యరాయాంధ్ర నిఘంటువుకు చివరిదశలో వీరు గౌరవ సంపాదకులుగా పనిచేశారు. కేంద్ర సాహిత్య అకాడమీ సంకలితం చేసిన భారతీయ గ్రంథసూచిలో తెలుగు విభాగానికి వీరు సంపాదకత్వం వహించారు.
వీరు రచించిన తెలుగు కావ్యాలలో ముఖ్యమైనవి: ‘భారతీ శతకము’, ‘సరస్వతీ విలాసము’, ‘కొద్ది మొర్ర’. వీరు రాసిన ‘బాలానందము’ వంటి బాల సాహిత్య రచనలు విశేష ప్రజాదరణ పొందాయి. వీరు బైబిల్ లోని మూడు సువార్తలను సవర భాషలోకి అనువదించారు. కేంద్ర సాహిత్య అకాడమీ వారి అభ్యర్ధనపై తెలుగు సాహిత్య చరిత్రను ఇంగ్లీషులోకి అనువదించారు. వీరు రచించిన ‘తెలుగులో ఛందోరీతులు’ అనే గ్రంథానికి ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ పురస్కారం లభించింది.
వీరి కుటుంబం ఆంధ్రాభిమానానికి ప్రసిద్ధికెక్కింది. పర్లాకిమిడి తాలూకాను ఒడిషా రాష్ట్రంలో చేర్చడానికి జరిగిన ప్రయత్నాన్ని వీరు, వీరి తండ్రి రామమూర్తి తీవ్రంగా ప్రతిఘటించారు. తెలుగువారి పక్షాన వాదించడానికి 1933లో వీరు లండన్ వెళ్ళి, శామ్యూల్ హోర్ మొదలైన వారి ఎదుట యుక్తిగా వాదించారు. అయినా 1936లో పర్లాకిమిడి తాలూకా ఒడిషా రాష్ట్రంలో భాగంగా ఏర్పడింది.
తండ్రి అనంతరం రాజమండ్రి చేరిన సీతాపతి రాజకీయాలలో పాల్గొని జిల్లా బోర్డు, మునిసిపల్ కౌన్సిల్, సెనేట్ మొదలగు సంస్థలలో సభ్యులుగాను, అధ్యక్షులుగాను పనిచేశారు.
వీరికి ఆంధ్రవిశ్వకళాపరిషత్ కళాప్రపూర్ణ ఇచ్చి గౌరవించింది. వీరి ఇంగ్లీషు రచనలలోని విశిష్టతను గుర్తించి వాషింగ్టన్ లోని అంతర్జాతీయ అకాడమీ వీరికి డి.లిట్. గౌరవం ఇచ్చింది.
మరణం
వీరు ఏప్రిల్ 19, 1969లో హైదరాబాదులో పరమపదించారు.
నటించిన సినిమాలు
• పల్నాటి యుద్ధం(1947) ……కొమ్మరాజు
• భక్తిమాల(1941) …..రామానుజాచారి
• రైతుబిడ్డ(1939) ….జమీందార్
• పంతులమ్మ(1943) …..గూడవల్లి రామభ్రహ్మం
• మాలపిల్ల(1938) ……..గూడవల్లి రామభ్రహ్మం
• మనమరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు-270
• 270-ఏకపాత్రాభినయ ,నాటక ఫేం ,నంది రఘుపతి వెంకయ్య అవార్డ్ గ్రహీత ,’’మా’’ప్రధాన కార్యదర్శి ,బట్టలసత్యం గా హాస్య సినీ గుర్తింపు .మాండలికం లో దిట్ట –మల్లికార్జున రావు
• మల్లికార్జునరావు (అక్టోబర్ 10, 1960 – జూన్ 24, 2008) తెలుగు సినీ, రంగ స్థల హాస్య నటులు.[1] ఆయన పూర్తి పేరు పీలా కాశీ మల్లికార్జునరావు. పాఠశాల దశనుంచే నాటకాల్లో నటించే వారు. 50 నుంచి 60 నాటకాలూ, ఏకపాత్రాభినయం పాత్రలూ ఆయనకు నటన మీద మంచి పట్టు లభించేదానికి దోహదపడ్డాయి.
తొలి జీవితం
భమిడిపాటి రాధాకృష్ణ రాసిన లెక్కలు తెచ్చిన చిక్కులు ఆయన తొలి నాటకం. ఆయన్ని రంగస్థలంపై నటుడిగా నిలబెట్టింది పలుకే బంగారమాయె. ఇందులో నిర్మాత వేషం మల్లికార్జునరావుకి ఎంతో గుర్తింపు నిచ్చింది. అనకాపల్లిలోనే ఎ.ఎమ్‌.వి.ఎమ్‌. ఆసుపత్రిలో కొన్నాళ్లు ఉద్యోగం చేశారు. అక్కడి ట్రేడ్‌ యూనియన్‌కి నాయకత్వం వహించారు. ఆయనకు భార్య, ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు.
సినీ ప్రస్థానం
దివంగత నటులు రావు గోపాలరావు సహకారంతో చిత్రసీమలోకి ప్రవేశించారు. 1972లో తులసి అనే చిత్రంలో చిన్నవేషం వేశారు. ఆ సమయంలోనే పార్వతీ పరమేశ్వరులు చిత్రానికి సహాయ దర్శకుడిగా పనిచేశారు. తరువాత నాగమల్లి లాంటి కొన్ని చిత్రాల్లో నటించారు. వంశీతో ఏర్పడ్డ పరిచయం ఆయన సినీజీవితాన్ని మలుపు తిప్పింది.
వంశీ మొదటిచిత్రం మంచు పల్లకీలో చిన్న పాత్ర పోషించారు. అన్వేషణలో పులిరాజుగా మల్లికార్జునరావు నటన చిత్రసీమను ఆకట్టుకొంది. అదే సమయంలో తన తండ్రి అస్వస్థతకు లోనైతే అనకాపల్లి వెళ్లడం వల్ల అవకాశాలు కోల్పోయారు. ‘లేడీస్‌ టైలర్‌’లో బట్టల సత్యం పాత్ర తరువాత వెనక్కి తిరిగి చూసుకోలేదు. 350కి పైగా సినిమాల్లో నటించారు. తమ్ముడు సినిమాకు ఉత్తమ సహాయ నటుడిగా రాష్ట్ర ప్రభుత్వ నంది అవార్డును పొందారు. ఏప్రిల్‌ ఒకటి విడుదల, కనకమాలక్ష్మి రికార్డింగ్‌ డ్యాన్స్‌ట్రూపు, హలో బ్రదర్, ఆలీబాబా అరడజను దొంగలు, ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు, బద్రి, ఔను వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు, ఎవడి గోల వాడిది, మా ఆయన సుందరయ్య (2001) లాంటి చిత్రాలు ఆయనకెంతో పేరు తీసుకొచ్చాయి. మల్లికార్జునరావు నటనలో తనకంటూ ఓ పంథాను ఏర్పరచుకొన్నారు. తొలినాళ్లలో రావుగోపాలరావు ప్రభావం ఉండేది. తన సంభాషణ శైలిలో ఉత్తరాంధ్ర యాసని మేళవించడంతో జనాన్ని సులభంగా ఆకట్టుకోగలిగారు. ఆ యాసనీ, మాండలికాన్నీ సాధికారికంగా మాట్లాడగలిగిన నటుడిగా గుర్తింపు పొందారు. అలాగే గ్రామీణ నేపథ్యం ఉన్న పాత్రలకు జీవంపోసే నటుల్లో ఆయన ముందుండే వారు. చివరిగా ఆయన నటించిన చిత్రం మహా నగరంలో.
నటించిన చిత్రాలు
• దాసన్నా (2010)
• అతడెవరు (2007)
• 143[2][3]
• ప్రేమించుకున్నాం పెళ్ళికి రండి (2004)
• 6 టీన్స్ (2001)
• ప్రేమసందడి (2001)
• సాంబయ్య (1999)
• పవిత్ర ప్రేమ (1998)
• ఆలీబాబా అరడజను దొంగలు (1994)
పురస్కారాలు
• తమ్ముడు సినిమాకు ఉత్తమ సహాయ నటుడిగా ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ నంది అవార్డు.[4]
• రఘుపతి వెంకయ్య బంగారు పతకం (ప్రముఖ నటుడు గుమ్మడి స్థాపించారు)
పదవులు
• తెలుగుదేశం పార్టీతో సాంస్కృతిక విభాగానికి రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా[1] ఆయనకు సన్నిహిత సంబంధాలున్నాయి.
• మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌కు ప్రధాన కార్యదర్శిగా మూడు సార్లు ఎంపికయ్యారు.
తుదిశ్వాస
57 సంవత్సరాల వయస్సులో మంగళవారం 24 జూన్, 2008 ఉదయం 10.30 ని.లకు రక్త కేన్సర్‌ (లుకేమియా) వ్యాధితో తుదిశ్వాస విడిచారు.[1]
మల్లికార్జునరావు కనిపిస్తే చాలు హాస్యం పొంగుతుంది .ఏపాత్రలోనైనా ఒదిగి జీవంపోశాడు .మామంచినటుడు మల్లికార్జునరావు .
  సశేషం
మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -1-5-22-ఉయ్యూరు

Posted in సినిమా | Tagged | Leave a comment

రాంగేయ రాఘవ -2

రాంగేయ రాఘవ -2
వ్యక్తిగతం-యుగసందర్భం
రా౦గేయరాఘవ పూర్వీకులు సుమారు రెండున్నర శతాబ్దాలకు పూర్వం దక్షిణ ఆర్కాడు నుంచి రాజస్థాన్ సరిహద్దు గ్రామాలైన వైర్,వారౌలీ జాగీరు క్షేత్రాలలో స్థిరపడ్డారు .ఆ వంశం లోనిశ్రీనివాసాచార్యుల పాండిత్యానికి మెచ్చి జైపూర్ మహారాజు ఒక జాగీరు ను ఇచ్ఛి ,రామాలయం కట్టించి ఆయన్ను అర్చకుడిగా నియమించాడు అంటే అగ్రహారీకుడుయ్యాడు .తమిళ సంస్కృత పండితుడు రంగా చార్యులు ఈ వంశం వాడే .ఈయనకు రాఘవ 17-1-1923న జన్మించాడు .తల్లి కనకవల్లి తమిళ సంస్కృతాలలో ,వ్రజభాషలో దిట్ట .ముగ్గురు సోదరుల్లో రాఘవ చివరి వాడు కనుక గారాబంగా పెరిగాడు .మేనత్త అక్కాజీ వ్రజభాషలో విదుషీ మణి.భర్త దేశికాచార్యులు వేద,వేదాంగాలలో అసమాన ప్రావీణ్య మున్నవాడు .శాస్త్ర చర్చల్లో అక్కాజీ కూడా పాల్గొనేది .ఇది రాఘవ పై గొప్ప ప్రభావం చూపింది .. రాఘవ అసలుపేరు ‘’తిరుమలైనంబాకం వీర రాఘవాచార్య ‘’.ఈపేరు స్కూలు, కాలేజీ రికార్డ్ లలో ఉంది .అతడి సన్నిహిత మిత్రుడు భరత్ భూషణ్ అగర్వాల్ సూచనతో తండ్రి పేరు కలిసి వచ్చేట్లు’’ రా౦గేయ్ రాఘవ్ ‘’గా మార్చుకొన్నాడు .తర్వాత రచనలన్నీ ఈ పేరుతోనే రాశాడు .ఇంగ్లీష్ మీడియం లోనే చదివాడు .ఆగ్రా విక్టోరియా స్కూల్ లో ప్రాధమిక విద్య ,,సెయింట్ జాన్స్ కాలేజిలోడిగ్రీ చదివాడు .1941లోతత్వ శాస్త్రం ఆర్ధిక శాస్త్రం ఇంగ్లీష్ సబ్జెక్ట్ లతో డిగ్రీ పొందాడు .అప్పుడే ఆర్ధిక శాస్త్ర పాఠాలు ఎగగొట్టి ‘’ఘరౌందా’’నవల రాశాడు .1943లో హిందీ లొఎమ్. ఎ .అయ్యాడు .ప్రొఫెసర్ హరిహర నాధ టాండన్ మార్గ దర్శకత్వం లో ‘’భారతీయ మధ్యయుగాలలో సంధికాల అధ్యయనం-గోరఖ్ నాధ యుగం ‘’ పై పరిశోధన చేసి ఆగ్రా యూనివర్సిటి నుంచి పిహెచ్ డి పొందాడు .పరిశోధన సామగ్రికోసం శాంతి నికేతన్ వెళ్లి అక్కడి ద్వివేదీ ‘’నాధ సంప్రదాయం ‘’పై రాసినా,అచ్చు వేయకపోవటం తో రాఘవకిచ్చాడు .అక్కడే అధ్యయనం చేసి కావాల్సిన విషయాలు తీసుకొన్నాడు రాఘవ .గొప్పలకోసం ఈ డిగ్రీని ప్రదర్శించలేదు రాఘవ .అది తాత్విక చిన్తనాధార గ్రంథం.
1937లో ‘’సాప్తాహిక్ విశ్వామిత్ర ‘’పత్రికలో రాఘవ మొదటి గీతం పడింది .ఇదేఅతడి భవిష్యత్తు నిర్ణయించింది సాహిత్య వ్యాసంగాన్ని జీవనాదారంగా ఎన్నుకోన్నాడు .ఆర్ధిక ఇబ్బందులెన్ని ఎదురైనా ఈ దారి వదలలేదు .రచయితగానే స్థిరపడాలనుకొని స్థిరపడ్డాడు .అన్ని ప్రక్రియలోనూ తనదైన ముద్ర వేశాడు .ఇది అంకిత భావంతోసాధించిన విజయం .’’సాహిత్యాకాశం లో రా౦గేయ రాఘవ ఉదయించటం ,అందరికి ఒక తోకచుక్క కాంతి కెరటం లా తోచింది ‘’అన్నాడు ఆయన ప్రొఫెసర్ ప్రకాశ చంద్ర .
రాఘవ ఉంటున్న గ్రామం వైర్ లో కరెంటు లేదు .వేసవి రాత్రులలో దోమతెరలలో లంటారు వెలిగించుకొని జాగారం చేస్తూ రచనలు చేసేవాడు .అందుకే పెళ్లి ఆలోచన రాలేదు . మేడమీద గుడ్డ పంఖాతాడుతో లాక్కొంటూ ఉక్కపోత నుండి తప్పించుకొనే వారు .రాఘవ అలాంటి తాడును కాలి వేళ్ళకు కట్టుకొని లాగుతూ ,బోర్లాపడుకొని రచనలు చేసేవాడు .రాఘవ 33వ ఏట తనకన్నా 14ఏళ్ళు చిన్నదైన సులోచనతో1956లో పెళ్లి జరిగింది .ఇదీ అంత తేలిగ్గా జరగలెదు.ఒకసారి ఒక అయ్యంగార్ల అమ్మాయిశకుంతల ను తనకోసం చూస్తె తన అన్నటిఎల్ఎన్ఆచార్య కు ఇప్పించి పెళ్లి చేయించాడు .అనేకసార్లు సులోచనతో మాట్లాడి తన రచనా వ్యాసంగానికి ఆమె అడ్డు పడదు అని హామీ పొందాకనే మెట్రిక్ చదివిన ఆమె ను పెళ్ళాడాడు .బొంబాయి మాతు౦గాలో వీరి వివాహం 7-5-1956న అతి సామాన్యంగా జరిగింది .ఆరేళ్ళ దాంపత్యం లో వీరిద్దరూ కలిసి ఉన్న కాలం చాలా తక్కువే .రాఘవ కోరిక ప్రకారం బొంబాయిలోనే ఉంటూ ఇంటర్ డిగ్రీ పూర్తీ చేసింది .ఇది ఆమె కు తర్వాతకాలం లో బాగా ఉపయోగపడింది .వీరిఏకైక సంతానం సీమంతిని వయసు రాఘవ తన 39వయేట మరణించే నాటికి కేవలం నాలుగేళ్ళు మాత్రమె .తల్లి కనకవల్లి తో రాఘవకు విడదీయరాని అనుబంధం .ఆమె కేన్సర్ తో 1959లో చనిపోయింది .
రాఘవ 1960లో జైపూర్ వచ్చేనాటికి ఆయన మెడమీద ఒక రాచపుండు ఏర్పడి అది ఆగ్రా వెళ్ళినా నయంకాక ,మళ్ళీ జయపూర్ వచ్చాక జర్మనీ డాక్టర్ హైలింగ్ అది కేన్సర్ అని తేల్చాడు .తర్వాత బాంబేలో టాటా హాస్పిటల్ లో రాఘవ చేరగా ,డాక్టర్ జస్సావాలా బ్లడ్ కాన్సర్ గా గుర్తించి ,చాలాజాగ్రత్తగా చికిత్సలు చేసినా ,12-8-1962మిట్ట మధ్యాహ్నం రచనా భాస్కరుడు రాఘవ అమాంతంగా అస్తమించాడు .క్వీన్స్ రోడ్ లో చందన్ వాడి స్మశాన వాటికలో వానపడుతుండగా అంత్యక్రియలు జరిపారు .
తక్కువకాలం లో ఎక్కువ రచనలు చేసిన అతికొద్దిమందిలో రాఘవ ఒకడు .రాఘవ 39నవలలు,వెయ్యేసి పేజీలున్న రెండుసంపుటాల ‘’మహాయాత్రా ‘’అనే బృహత్ రచన ,అ౦దులోఅపూర్వ గాధలు ,వాటి చారిత్రిక వివరణలు ,ఉన్నాయి ఆయనవి ముద్రితాలైన కథలు 30ఉన్నాయి .అజేయ్ ఖాన్దహార్ , మేధావి ,పాంచాలి కావ్యస్మృతులు ,చారిత్రిక నేపధ్యంలో రాసిన నాటకాలు ,బెంగాల్ కరువు పై రిపోర్ట్ ల సంకలనం ‘’తుఫానోం కే బీచ్ ‘’చారిత్రిక ,సామాజిక శాస్త్ర విశ్లేషణలు గ్రీకు నాటకాలు షేక్స్ పియర్ నాటకాలు గాల్స్ వర్త్ ,శూద్రక కాళిదాస విశాఖదత్త ల రచనానువాదాలు ప్రముఖంగా ఉన్నాయి .సాహిత్య విమర్శలో వివాదాస్పద రచనలు చేశాడు .జీవిత వేగం లో ఆయన ఎక్కడా కుదురుగా లేడు.రచనలు చేస్తూ అలసిపోతె,దేవకీ నందన నవలల ప్రస్తావన తెచ్చుకొని చదివి సేద తీరేవాడు మిత్రులకు సరదాగా నవ్వులాటకోసం ‘’మీ రా౦గేయ్ రాఘవ్ ‘’అని మొదలు పెట్టి రాసేవాడు .
సశేషం
మీ –గబ్బిటదుర్గా ప్రసాద్ -30-4-22-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

మనమరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు-266

• మనమరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు-266
• 266-చమ్రియా టాకీస్ డిస్ట్రిబ్యూషన్స్ అధినేత ,ఆంద్ర ,దక్షిణ భారత చలన చిత్రమండలి అధ్యక్షుడు ,శాంతినివాసం ,వీరాభిమన్యు వంటి హిట్ చిత్ర నిర్మాత –సుందర్లాల్ నహతా
• సుందర్ లాల్ నహతా చలనచిత్ర పంపిణీదారు, నిర్మాత[1].
వృత్తి
ఇతడు కలకత్తా విశ్వవిద్యాలయంలో బి.కాం.పట్టా పుచ్చుకుని 1941లో మద్రాసులో “చమ్రియా టాకీ డిస్ట్రిబ్యూటర్స్” అనే సంస్థకు మేనేజర్‌గా చేరాడు. ఆ సంస్థ యజమాని, ఈస్ట్ ఇండియా ఫిల్మ్‌ కంపెనీ అధినేత చమ్రియా ఇతని వ్యవహార నైపుణ్యాన్ని చూసి మెచ్చుకుని కొంత కాలానికే ఆ సంస్థలో భాగస్వామిగా చేర్చుకున్నాడు. యుద్ధం భయంవల్ల 1943లో చమ్రియా సంస్థ మద్రాసు నుండి విజయవాడకు తరలించబడి 1953 వరకు విజయవాడలోనే నడుపబడింది. ఆ సమయంలో సుందర్‌లాల్ తన సంస్థను చూసుకుంటూ తెలుగు చలనచిత్ర పరిశ్రమకు ఎంతో సహాయకారిగా ఉన్నాడు. తెలుగు చలనచిత్ర పరిశ్రమను వెలుగులోనికి తీసుకురావడానికి ఎంతో కృషి చేశాడు. ఆ సమయంలో ఆంధ్ర చలనచిత్ర వాణిజ్యమండలి అధ్యక్షుడిగా కూడా ఎన్నికైనాడు.
1950లో ఇతడు తారాచంద్ బర్జాత్యా తో కలిసి రాజశ్రీ పిక్చర్స్ అనే సంస్థను ప్రారంభించి అనేక సినిమాలను నిర్మించాడు. తరువాత ఇతడు శ్రీ ప్రొడక్షన్స్, రాజలక్ష్మి ప్రొడక్షన్స్, విజయలక్ష్మి పిక్చర్స్ వంటి సంస్థలను ప్రారంభించి తెలుగు, తమిళ చిత్రాలను నిర్మించాడు. ఇతని చిత్రాలన్నీ అఖండమైన విజయాన్ని సాధించాయి.
ఇతడు ఇండొనేషియా దేశం జకార్తాలో జరిగిన రెండవ ఆసియా-ఆఫ్రికా చలనచిత్రోత్సవంలో భారతదేశం తరఫున పాల్గొన్నాడు. 1968లో జర్మనీ ప్రభుత్వం ఆహ్వానంపై జర్మనీలో జరిగిన ఎగ్జిబిషన్‌కు హాజరయ్యాడు. ఇతడు దక్షిణ భారత చలనచిత్ర మండలికి కూడా అధ్యక్షుడిగా వ్యవహరించాడు[1].
సినిమాల జాబితా
నిర్మించిన సినిమాల జాబితా:
తెలుగు
• జయం మనదే (1956)
• సతీ అనసూయ (1957)
• మంచి మనసుకు మంచి రోజులు (1958)
• శభాష్ రాముడు (1959)
• అభిమానం (1960)
• శాంతి నివాసం (1960)
• రక్తసంబంధం (1962)
• బందిపోటు (1963)
• గుడిగంటలు (1964)
• వీరాభిమన్యు (1965)
• గూఢచారి 116 (1966)
• మరపురాని కథ (1967)
• ఆస్తులు అంతస్తులు (1969)
• కర్పూర హారతి (1969)
• మారిన మనిషి (1970)
• మొగుడా- పెళ్ళామా (1975)
• చేసిన బాసలు (1980)
• రహస్యగూఢచారి (1981)
హిందీ
• ఫర్జ్ (1967)
• జిగ్‌రీ దోస్త్ (1969)
• ప్యార్ కీ కహానీ (1971)
మలయాళ౦
• శాంతి నివాస్ (1962)
• కనకచిలంగ (1966)
కన్నడ
• వీరకేసరి (1963)
• నాటి మేటి నటుల్లో ఒకరైన టి.యల్. కాంతారావు పేరు చెప్పగానే ఆయన కత్తి పట్టి కదం తొక్కిన చిత్రాలు, నారద పాత్రతో అలరించిన వైనం గుర్తుకు వస్తాయి. సాంఘిక చిత్రాల్లోనూ కాంతారావు హీరోగా అలరించారు. రాజలక్ష్మి ప్రొడక్షన్స్ పతాకంపై సుందర్ లాల్ నహతా, డూండీ నిర్మించిన సాంఘిక చిత్రాలలోనూ కాంతారావు నటించి ఆకట్టుకున్నారు. సుందర్ లాల్ నహతా, డూండీ నిర్మించిన ‘ఖైదీ కన్నయ్య’ చిత్రంలో కాంతారావు హీరోగా నటించారు. 1962 మార్చి 1న విడుదలయిన ఈ చిత్రం జనాన్ని ఆకట్టుకుంది.
• కన్నయ్య బ్యాంకులో క్యాషియర్ గా పనిచేస్తుంటాడు. బ్యాంకు నుండి డబ్బు తీసుకు వస్తూండగా పాపారావు అనేవాడు కొట్టేస్తాడు. కన్నయ్య తల్లిలేని కొడుకును కూడా పాపారావు, అతని మిత్రుడు కిడ్నాప్ చేస్తారు. డబ్బు పోగొట్టిన నేరంపై కన్నయ్యను అరెస్ట్ చేస్తారు. జైలులో ఉండగా, తన కొడుకు చనిపోయాడని తెలుస్తుంది. అదే సమయంలో జైలర్ కొడుకు రవి అతనికి దగ్గరవుతాడు. దుర్గారాయుడు అనే దుర్మార్గుడు తాను జైలు నుండి తప్పించుకోవడానికి జైలర్ కొడుకు రవిని కిడ్నాప్ చేసి తీసుకుపోతాడు. రవిని వెదికి తెచ్చేందుకు కన్నయ్య కూడా తప్పించుకుంటాడు. రవికి తాను నేర్పిన పాట కారణంగా అతని జాడ తెలుసుకుంటాడు కన్నయ్య. చివరకు బాబును కన్నవారి చెంతకు చేరుస్తాడు. పాపారావు, దుర్గారాయుడును చట్టం శిక్షిస్తుంది. కన్నయ్య నిర్దోషి అని తేలుతుంది. తనను ప్రేమించిన మాధవిని కన్నయ్య పెళ్ళి చేసుకోవడంతో కథ ముగుస్తుంది.
• ఈ చిత్రంలో కాంతారావు, రేలంగి, గుమ్మడి, రాజనాల, కేవీయస్ శర్మ, బాలకృష్ణ, రాజసులోచన, గిరిజ, సంధ్య, మల్లీశ్వరి, రాజరత్నం తదితరులు నటించారు. ఈ సినిమాకు రాజన్ – నాగేంద్ర సంగీతం సమకూర్చారు. ఇందులోని పాటలన్నీ జి.కృష్ణమూర్తి కలం నుండి జాలువారాయి. “ఈ నిజం తెలుసుకో… మనిషిగా మసలుకో…”, “తియ తీయని తేనెమాటలతో…”, “యవ్వనం అది…”, “చోటెక్కడ చూసెదెప్పుడు…”, “అందాల కళ్ళు చూడు…”, “ప్రేమకు కానుక కావలెనా…” వంటి పాటలు అలరించాయి.
• హిందీలో విజయం సాధించిన ‘ఖైదీ నంబర్ 911’ సినిమా ఆధారంగా ‘ఖైదీ కన్నయ్య’ తెరకెక్కింది. ఈ సినిమాకు ప్రముఖ చిత్రకారుడు, తరువాతి రోజుల్లో దర్శకునిగా ఎంతో పేరు సంపాదించిన బాపు పబ్లిసిటీ డిజైనర్ గా పనిచేశారు. పలు కార్టూనులతో ఈ చిత్ర ప్రచారం సాగింది. దానిని అప్పట్లో వింతగా చెప్పుకున్నారు జనం. ‘ఖైదీ కన్నయ్య’ తెలుగులోనూ మంచి విజయం సాధించి, శతదినోత్సవం చూసింది.
• (2022 మార్చి 1న ‘ఖైదీ కన్నయ్య’కు    60 ఏళ్ళు)
•   సశేషం
• మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -30-4-22-ఉయ్యూరు



• —

Posted in సినిమా | Tagged | Leave a comment

మనమరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు-265

• మనమరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు-265
• 265-కనిపించని తెలుగు టాకీ గ్రాండ్ ఓల్డ్ మాన్ ,తోలి డిష్ట్రిబ్యూషన్ సంష్టాపకుడు ,మొదటి సినిమాస్స్కోప్ దియేటర్ నిర్మాత =పూర్ణా మంగరాజు ,కామరాజు
• లెజెండరీ శ్రీ సి. పుల్లయ్య తన వ్యాపార భాగస్వామి శ్రీ గ్రంధి కామరాజు మంగరాజుకు – ఈస్ట్ కోస్ట్‌లో బియ్యం-వ్యాపారంలో సంపన్నమైన వ్యాపారి, అప్పటి బర్మాలోని రంగూన్ వరకు – తన సినిమా నిర్మాణం కోసం మద్రాస్‌కు వెళ్లడానికి తన వాటా మొత్తాన్ని ఇచ్చాడు. /డైరెక్షన్ ప్రయత్నాలు 1927లో. ఆ తర్వాత 1925లో వారిద్దరూ ప్రారంభించిన ‘శ్రీకృష్ణ టూరింగ్ టాకీస్’కి ఏకైక యజమాని అయ్యారు. తర్వాత 1930లో శ్రీ జికె మంగరాజు పూర్తిస్థాయి పూర్ణ థియేటర్‌ని నిర్మించారు. వైజాగ్‌లో విద్యుద్దీకరణ సౌకర్యం ప్రవేశపెట్టిన వెంటనే, ప్రస్తుత పాత నగరంలో ప్రధాన రహదారిపై. మొదట్లో మూకీ సినిమాలు, వాటిలో ప్రముఖమైన భీష్మ ప్రతిజ్ఞ, నందనార్, గజేంద్ర మోక్షం వంటివి ప్రదర్శించబడ్డాయి.
• తదనంతరం, టాకీ సినిమా యుగం ప్రారంభమైనప్పుడు, అది ఉన్నత స్థాయికి అభివృద్ధి చెందడం ప్రారంభించింది. సినిమాల పట్ల అతని అభిరుచి కేవలం వాటిని ప్రదర్శించడం మాత్రమే కాకుండా ఫైనాన్సింగ్/పంపిణీలోకి కూడా వెళ్లింది. నిజానికి, 30వ దశకంలో తొలి తెలుగు టాకీ చిత్రం ‘భక్త ప్రహ్లాద’ను రూపొందించినప్పుడు ప్రముఖ అగ్రగామి మరియు దక్షిణ భారత సినీ దిగ్గజం శ్రీ హెచ్‌ఎమ్‌ రెడ్డికి దాదాపు 90% మేర ఆయనే ప్రధాన ఫైనాన్షియర్ అని తెలుసుకోవడం ఎంతగానో ఉర్రూతలూగిస్తోంది. . ఆ మేరకు శ్రీ మంగరాజు తెలుగు టాకీస్‌లో కనిపించని గ్రాండ్ ఓల్డ్ మ్యాన్ అని చెప్పుకోవచ్చు. అతను 1933లో తన స్వంత డిస్ట్రిబ్యూషన్ కంపెనీ “క్వాలిటీ పిక్చర్స్”ని స్థాపించాడు – ఇది 1945లో పూర్ణ పిక్చర్స్ అని పేరు మార్చబడింది – మరియు అనేక సినిమాలను కూడా పంపిణీ చేసింది.
• పూర్ణ సినిమా థియేటర్‌ని ఎప్పటికప్పుడు ఆధునీకరించాడు. 1949లో బాల్కనీని జోడించినప్పుడు, క్లాసిక్ “లైలా మజ్ను” అందులో ప్రదర్శించబడింది. బహుముఖ ప్రజ్ఞాశాలి భానుమతి మద్రాసు నుంచి వచ్చి పునరుద్ధరించిన థియేటర్‌ను ప్రారంభించారు. 1955లో సినిమా-స్కోప్ సౌకర్యాన్ని ఏర్పాటు చేసినప్పుడు, ఇది మొత్తం కోస్తా ఆంధ్ర ప్రాంతంలో మొదటి సినిమా థియేటర్‌గా మారింది. హాలీవుడ్‌కి చెందిన “ఫోర్స్ 10 ఫ్రమ్ నవరోన్” 1980లో పునరుద్ధరించబడిన తర్వాత మొదట ప్రదర్శించబడింది. ఇది 1993లో దాని ప్రస్తుత యజమాని శ్రీ రామయ్య ఆధ్వర్యంలో మరింత అప్‌గ్రేడ్ చేయబడింది మరియు ఆధునీకరించబడింది.
• స్వర్ణోత్సవ వేడుకలకు సిద్ధమవుతున్న ఊర్వశి థియేటర్స్‌ను పూర్ణ పిక్చర్స్

• 1970లో డిసెంబర్ 10న తన తాత జి.కె. తొలి  చిత్రాన్ని నిర్మించిన మంగరాజు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో చలనచిత్ర పంపిణీ వ్యవస్థను ప్రారంభించిన మొదటి వ్యక్తి కూడా, ఊర్వసి థియేటర్లు వాణిజ్యంలోని వైరుధ్యాలను అధిగమించాయని ఆయన చెప్పారు.
• గ్రంధి మంగరాజు (డిసెంబర్ 11, 1896 – ?) ప్రముఖ సినిమా పంపిణీదారులు, నిర్మాత.
• వీరు విశాఖపట్నంలో గ్రంథి కామరాజు, గౌరమ్మ దంపతులకు జన్మించారు. వీరి తండ్రి కామరాజు పెద్దాపురం నుండి విశాఖపట్నం వచ్చి వ్యాపారం చేసి అక్కడి ధనికులలో ఒకరుగా పేరుపొందారు.
• మంగరాజు విద్యాభ్యాసం తర్వాత ఇరవై ఏళ్ళకే సొంతగా వ్యాపారం ప్రారంభించారు. దయానంద సరస్వతి గారి వైదిక సిద్ధాంతాల పట్ల ఆకర్షింపబడి 1935 ప్రాంతంలో విశాఖపట్నంలో ఆర్య సమాజం స్థాపించారు.
• 1929లో చలనచిత్రరంగంలో ప్రవేశించి విశాఖపట్నంలో “పూర్ణా టాకీస్” సినిమా హాలును నిర్మించారు. 1937లో దశావతారములు చిత్రానికి నిర్మాణ బాధ్యతలు వహించారు. ఆ రోజుల్లోనే విజయవాడలో సినీ పంపిణీ సంస్థ “పూర్ణా పిక్చర్స్”ను ప్రారంభించారు. వీరు తొలిరోజుల్లో తెలుగు సినిమా అభివృద్ధిలో ఒక మూలస్తంభంగా నిలిచారు.
• వీరు ప్రజలలో భక్తిభావాన్ని పెంపొందించే నిమిత్తం యాత్రా బస్సు, రైలు సేవలను నడిపేవారు.
• సశేషం
• మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -29-4-22-ఉయ్యూరు

Posted in సినిమా | Tagged | Leave a comment

మనమరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు-264

• మనమరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు-264
• 264-ఆంధ్రాలో మొదటి ధియేటర్ మారుతిటాకీస్ నిర్మాత ,ఎన్నెన్నో మూకీ చిత్రాలు ఆడించిన –పోతిన శ్రీనివాసరావు

మూకీ సినిమాలు
వచ్చిన తొలిరోజుల్లో సినిమా (ప్రారంభానికి ముందు హాల్లో దీపాలు
ఆర్చితే, జనం “దీపాలు ఆర్బకండి బాబోయ్‌, మాకు భయం” అని అరిచే
వారట. కొన్నాళ్ళకి గాను అది సర్దుకోలేదు. అమెరికాలో మొదటిసారి
సినిమా చూసిన వాళ్లు, హీరోయిన్‌ క్టోజప్‌ రాగానే “దగా! మోసం! ఆవిడ
నడుమూ కాళ్లు ఏవీ?” అని గట్టిగా అరిచారట. అలాగే మన తెలుగు
సినిమా మాట నేర్చుకున్న కొత్తల్‌, ఒక పాత్ర పద్యం చదువుతూ వుంటే
ఇంకో పాత్ర ‘రియాక్షన్‌’ షాటు వేస్తే ఒప్పుకునే వారు కాదుట. పద్యమో,
పాటో పాడుతున్న పాత్రే కనిపించాలి!

ఈ మాటలు ఆంధ్రదేశంలో మొదట సినిమా థియేటరు కట్టించిన
పోతిన శ్రీనివాసరావు గారు చెప్పేవారు. ఆయన చాలా మూకీలు తెప్పించి,
ఆంధ్రలో ఆడించారు. “ఒక పౌరాణిక మూకీ చిత్రంలో భీముడికి మ
మీసం ఊడిపోతుంది. అది ఆ సినిమా తీసిన వాళ్లు గమనించలేదు కానీ,
(ప్రేక్షకులు గమనించారు. “మీసం ఊడీన భీముడు, మీసం జారిపోయిన
భీముడు” అని గోల చేశారు. ఊరంతా ప్రచారం కూడా చేశారు. “ఆ
(ప్రచారాన్ని ఖండిస్తూ, నేను ఇంకొక ప్రకటన చేయించాను. “ఇవాళ
ీముడికి మీసం ఊడదు. దయచేసి రండి” అని మేళతాళాలతో చెప్పించాను. నేను ఆపరేటరుతో చెప్పి మీసం ఊడిన భాగాన్ని కత్తిరించేసి అతికేయమన్నాను. అంతే! అది ఎవరికీ తెలియలేదు గనుక, అందరూ సంతోషించారు” అని చెప్పారు శ్రీనివాసరావు. ఐతే, ‘కదిలే బొమ్మ’ జనానికి వింత కలిగించినా, జనం ఎక్కువగా వచ్చేవారు కాదుట. ఎదురుగా పాత్రలు కనిపిస్తూ పాటలూ పద్యాలూ పాడుతున్న నాటకాలకే ఎగబడే వారుట.

“అంచేత మేము సినిమా మధ్యలో ఉచితంగా
సోడాలు, కిల్లీలూ ఇస్తామని ప్రకటనలు వేసే వాళ్లం. వాటికోసమైనా జనం వస్తారేమోనని. ఊళ్లో నాటక యు స్య లేకపోతే ళా వచ్చేవారు. మొత్తానికి మూకీ చిత్రాల ప్రదర్శన నష్టాలతోనే నడిచింది”
అని శ్రీనివాసరావు చెబుతూ వుండేవారు.
దాదాఫాల్కే కూడా ఇలాంటి అవస్థలే ఎదుర్కొన్నాడు. ‘లంకా దహనం’
తీసినప్పుడు “నిజంగానే లంకా దహనం కనిపిస్తుంది – రండి” అన్నట్టుగా
ప్రకటనలు చేయించాడు. హనుమంతుడు లంకను దహనం చేస్తున్న దృళ్యం
రాగానే, ప్రొజెక్టర్‌ ముందు ఎర్రని అద్దం ముక్క పెట్టి చూపించగానే, బొమ్మ
ఎర్రబారింది. నిజం గొనే మండుతున్న భ్రాంతి కలిగింది. మొదటి రోజున ప్రేక్షకుల్లో

సినిమాల్లో మొట్ట మొదటి కృష్ణ పాత్రధారి రఘురామయ్యే. పోతిన
శ్రీనివాసరావు తీసిన పృథ్వీ పుత్ర’ (1934లో కృష్ణుడు. మరికొన్ని చిత్రాల్లో
నారదుడు. కృష్ణ నారద పాత్రలు ఆరోజుల్లో ఆయనే ఎక్కువగా నటించారు.
జానపద చిత్రం ‘గొల్లభామ’లో హీరో. ఒకే ఒక్క సాంఘిక చిత్రం
‘పంతులమ్మ’లో నటించినట్టు జ్ఞాపకం. సినిమాల్లో నటిస్తున్నా నాటకాలు
వదల్లేదు. అయితే నాటకంలో ఏ పాత్ర ధరించినా సరే, నాటకాంతంలో..
రఘురామయ్య చేత ప్రేక్షకులు గోలా గగ్గోలూ పెట్టి ఈలపాట
పాడించుకునేవారు.
సశేషం
మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -29-4-22-ఉయ్యూరు
• —

Posted in సినిమా | Tagged | Leave a comment

మనమరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు-263

• మనమరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు-263
• 263-విజయవాడ ప్రెస్ మీట్లకు మార్గదర్శి ,ఫిలిం సొసైటీ ప్రెసిడెంట్ ,నిష్పక్షపాత విమర్శకు ఆద్యుడు ,నవయుగా ఫిలిమ్స్ జనరల్ మేనేజర్ –కాట్రగడ్డ నరసయ్య
• నరసయ్య సినిమాలపై విలువైన వ్యాఖ్యానాలకు పేరుగాంచారు. విజయవాడ ఫిలిం సొసైటీకి ప్రెసిడెంట్‌గా పనిచేసిన కాలంలో అద్భుతాలు చేశారు. అతను చలనచిత్ర పరిశ్రమకు చాలా ప్రయోజనం చేసాడు మరియు అతను ప్రచారంలో విప్లవాత్మక పోకడలను చేసాడు.

కాట్రగడ్డ నరసయ్య వ్యాఖ్యలు చాలా ఘాటుగా, సూటిగా ఉన్నాయి. నిజానికి నిర్మాతలు మరియు కళాకారులు నరసయ్య నుండి తన తీర్పు కోసం విడుదల తేదీకి కాల్స్ వచ్చేవారు. ఆ సంవత్సరంలో విడుదలైన చిత్రాల గురించి సంక్షిప్త సమాచారం ఇవ్వడానికి అతను సంవత్సరం చివరి రోజున ఒక సమావేశాన్ని నిర్వహించేవాడు.
. సినిమాలు ఉన్నంత వరకు నరసయ్య ఉంటారని, సినిమా విజయానికి ప్రచారమే ప్రాణమని నిరూపించారు. ఇంకా, 1993లోనే ‘రైతుబజార్’ ప్రారంభించడం వంటి సమాజహితం కోసం నరసయ్య కూడా కొన్ని ఆవిష్కరణలు చేశారని మోహనరామ్ అన్నారు. విజయవాడలో చాలా పెద్ద ఫంక్షన్ హాల్ కమ్ ఆడిటోరియం నిర్మించాడు. మహా మానవతావాది కాట్రగడ్డ నరసయ్యకు మోహనరామ్ నివాళులర్పించారు.

సినీ ప్రముఖుడు కాట్రగడ్డ నరసయ్య  విజయవాడలో కన్నుమూశారు

• వామపక్ష ఉద్యమం, రాజకీయ పరిణా మాలు, సినిమా, మీడియా రంగం వంటి వాటిపై వామపక్ష ఉద్యమం కళా సాహిత్య వాణిజ్య సామాజిక క్షేత్రంలో సుదీర్ఘ కాలం సేవలం దించిన చైతన్య వంతుడు దూరమైనారు. స్వతంత్ర పోరాటంతోనూ సామ్యవాద భావ జాలంతోనూ పెనవేసు కుపోయిన కాట్రగడ్డ కుటుంబంలో పాత తరంలో ఆఖరి ప్రతినిధి, కొత్త తరాలకు వారధిó అస్తమించారు. సినీ రాజకీయ వాణిజ్య దిగ్గజాలతో సాన్నిహిత్యం నెరిపిన పెద్దాయన లేకుండా పోయారు. వ్యక్తిగతంగా నాకు అత్యంత ఆప్తులొకరు కరువైనారు.
కాట్రగడ్డ నరసయ్యగారి కుటుంబం గురించి తెల్కపల్లి రవి
• వారి తండ్రి మధుసూదనరావు మాత్రమే గాక వారి నాయనమ్మలు, మేనత్తలు, బాబాయిలు, పెదనాన్నలు చాలామంది ఏదో ఒక సమయంలో జైలుకు వెళ్లినవవారే. మహిళలు తమ ఆభరణాలు ఉద్యమాలకు ఇచ్చిన వారే. సుందరయ్య వంటి హేమాహేమీలకు అన్నం పెట్టి అజ్ఞాతవాసంలో ఆశ్రయం ఇచ్చినవారే. విజయవాడలో ‘ప్రజాశక్తి నగర్‌’కు భూములు సమకూర్చిన పెద్ద కుటుంబమే గాక తర్వాత కాలంలోనూ భూరి హృదయంతో ఆదుకున్న వారెందరినో చూడగలం. వారందరిలోనూ ‘నవయుగ ఫిలింస్‌’ సంస్థాపకుడైన కాట్రగడ్డ శ్రీనివాసరావు, సారథ్యం వహించిన నరసయ్య జనానికి మరింత బాగా తెలుసు. వాస్తవంలో నరసయ్య విద్యార్థి ఉద్యమాలలో పాల్గొనడమే గాక అభ్యుదయ రచయితల తొలి శిబిరానికి హాజరైనారు. ప్రజా కళారూపాలనూ అధ్యయనం చేశారు. కొద్ది కాలం ఉద్యోగం చేసినా బెనారస్‌ విశ్వవిద్యాలయంలో చేరి చాలా మంది అభ్యుదయ వాదులతో పాటు చదువు భావాలు నేర్చుకున్నారు. నవయుగ ఫిలింస్‌ జనరల్‌ మేనేజర్‌గా ఎన్నెన్నో గొప్ప చిత్రాలను పంపిణీ చేయడమే గాక ప్రమోట్‌ చేయడంలో ప్రత్యేకత చూపించారు. ‘నమ్మిన బంటు, రోజులు మారాయి’ వంటి గొప్ప సంచలనాత్మక చిత్రాలను ప్రమోట్‌ చేయడంలో నరసయ్య ముద్ర చెరగనిది. ఈ చిత్రాల రూపశిల్పులూ అభ్యుదయ వాదులే. ‘నమ్మినబంటు’లో నటీనటులతో పోటీ పడి నటించిన ఎద్దు గురించి, ‘రోజులు మారాయి’లో ‘ఏరువాక సాగారో…’ పాట గురించి వూపెత్తిస్తే నాయక పాత్రధారి నాగేశ్వరరావుకు చిర్రెత్తి పేచీ పెట్టుకున్నారట. ఏరువాక పాట చూడ్డానికి కొండ మీద కనకదుర్గ కూడా వచ్చిందని ఆరోజుల్లో ఓ వదంతి బయిలుదేరితే అందరూ ఆ పాట రాగానే మరీ మరీ వెతికేవారట! రోజులు మారాయి చిత్ర రజతోత్సవాల్లోనే మొదటిసారి పబ్లిసిటీ రంగానికి షీల్డు ఇవ్వడం మొదలైందంటే అది ఆయన కృషి ఫలితమే.
నవయుగ సంస్థ విడుదల చేసే చిత్రాలన్నిటికీ ప్రచార బాధ్యతలు చూసిన నరసయ్య పత్రికలకు డిజైన్లు, క్యాప్షన్లు, బొమ్మలు ఇవన్నీ కొత్త తరహాలో చేయించేవారు. స్త్రీల కోసం ఎంబ్రాయిడరీలు, ధైర్య సాహసాలు పెంచే ఎన్‌సిసి వంటి పద్ధతులు, వాటిలో జొప్పించే వారు. మహిళా సంఘాల వారిని ప్రత్యేకంగా తీసుకుపోయి వారి అభిప్రాయాలు వేయించేవారు. ఒక సినిమాతో మొబైల్‌ లాండ్రీ పద్ధతిని వ్యాప్తి లోకి తెచ్చారు. విద్యార్థులు, యువతకు కూడా సామాజిక అంశాలపై పోటీలు పెట్టి చిత్ర ప్రచారంతో కలిపేసేవారు. ఆ రోజుల్లో మద్రాసు లోనే చిత్ర పరిశ్రమ వున్నా విజయవాడను ప్రెస్‌మీట్ల కేంద్రంగా చేయడంలో ఆయన పాత్ర ముఖ్యమైంది. వాటిలోనూ నగరంలోని రచయితలు, మేధావులను పాత్రికేయులను భాగస్వాములను చేసి అలరింపచేసేవారు. కొత్త ఏడాది వస్తుండగానే గడచిపోయిన ఏడాది చిత్రాల జాబితా, శత దినోత్సవాలు, నటీనటులు ధోరణులు అన్నిటితో సమగ్ర సమీక్ష రెండు మూడు దశాబ్దాల పాటు కొనసాగించారు. ఆయనది ఆ విషయంలో సాధికార పరిజ్ఞానం. మీడియా పట్ల ఆయన ప్రత్యేకాసక్తి అడ్వర్టయిజ్‌మెంట్లకే పరిమితం కాదు. ఇంగ్లీషు పుస్తకాలు, మ్యాగజైన్లు విపరీతంగా చదివే ఆయన వాటిలోని కొత్త పద్ధతులు ప్రవేశ పెట్టాలని వెంటపడుతుండేవారు. కాలానుగుణమైన మార్పులను పసిగట్టడంలో దిట్టగనక చిన్నవిగా రాయాలనేవారు. సినిమాలకు పేజీల తరబడి రంగుల ప్రకటనలు ఇస్తే ఖరీదు పెరిగి చిన్న పత్రికలకు అవకాశముండదని చిన్న ప్రకటనలనే క్యాంపైన్‌ చేపట్టారు. ‘చిన్న మనుషుల బతుకులు’ అంటూ రోజూ సామాన్యుల గురించి రాసేవారు.
సినిమా రంగంలో చిన్న సినిమాలు, ప్రగతిశీల చిత్రాలను, దర్శక నిర్మాతలను ప్రత్యేకంగా ప్రోత్సహించేవారు. వారిని పత్రికల కార్యాలయాలకు తీసుకువచ్చేవారు. ఎన్టీఆర్‌, ఏఎన్నార్‌ రామానాయుడు, ప్రత్యగాత్మ, మధుసూదనరావు వంటి పెద్దల నుంచి నాటికి నూతన నటులు సాయిచంద్‌, మాదాల రంగారావు వంటివారి వరకూ అందరితో కలసిపోతుండేవారు. ఔత్సాహికులకు అవకాశాలు రావడానికి సహకరించేవారు. చిత్రోత్సవాలకు తప్పక హాజరై ప్రజాశక్తికి వాటిపై ధారావాహికంగా రాసేవారు. తర్వాత కాలంలో ఆయన కుమార్తె సీత కూడా ఆ కృషి కొనసాగించారు. నవయుగ ఫిలింస్‌ తర్వాత మరో అరడజను ప్రముఖ పంపిణీ సంస్థలకూ సంచాలకుడుగా పనిచేశారు. విజయవాడ ఎగ్జిబిషన్‌ సొసైటీ పక్షాన వినూత్న కార్యక్రమాలు రూపకల్పన చేశారు. రైతుబజార్లకు ముందే కూరగాయలు వాటిలో విక్రయించేవారు. కళ్యాణమండపాల పేరు తీరు మార్చి మధు కళామండపం కట్టించిన నరసయ్య అది వున్నంత కాలం ప్రజాసంఘాలకు, పార్టీ సమావేశాలకు నామకార్థపు ఖర్చులతో ఇస్తుండేవారు. 2005లో సాహితీ స్రవంతి మొదటి సాహిత్యశాల అక్కడే అపురూపంగా జరిగింది. వెంటపడి మరీ పుస్తక ప్రదర్శనలు పెట్టించేవారు. మసాలా దినుసులు, మత్తు పదార్థాల బదులు వేడుకలలో ఆరోగ్యకరమైన ఫలాలు, పదార్థాలు ఇవ్వడం అలవాటు చేశారు. చిత్రకళా శిబిరాలు, కార్టూన్ల శిక్షణ వంటివి నడిపేవారు. మొగల్రాజపురంలో ఆయన ప్రాంగణం నగరంలో బొమ్మారెడ్డి, మిక్కిలినేని, పొన్నం వీరరాఘవయ్య వంటి పెద్దల గోష్టిగా వుండేది. వయసు పైబడినా ఆయన మాత్రం కొత్తదనం కోసమే పాకులాడేవారు గాని వెనక చూపు వుండేది కాదు. కమ్యూనిస్టు నాయకులతో నరసయ్యకు అత్యంత ప్రేమ, గౌరవం వున్నా విమర్శ చేయాలంటే వెనుకాడేవారు కాదు. విజయవాడలో ఆయన హాజరు కాని సినిమా, సాంస్కృతిక వేడుక వుండేది కాదు. హైదరాబాదులో పరిశ్రమ పెరిగిన మొదటి దశలో కొంత పాత్ర వహించినా తర్వాత వయోభారం, అనారోగ్యంతో ఇంటికే పరిమితమైనారు. ఆ కదలలేని స్థితిలో కూడా వామపక్ష ఉద్యమం రాజకీయ పరిణామాలు, సినిమా, మీడియా రంగంపై నాలాంటి వారితో, స్థానిక కార్యకర్తలతో నిరంతరం సంబంధాలు పాటించేవారు. నేను, వెంకట్రావు, వొరప్రసాద్‌ లాంటివాళ్లం వీలైనప్పుడల్లా నరసయ్య గారిని, ఆయన సతీమణి విజయలక్ష్మి గార్లను పరామర్శించి రావడం పరిపాటి. ఆయన బహుముఖ జ్ఞాపకాలు రాయించాలని చాలాసార్లు ప్రయత్నించాను గాని అన్నీ కలగాపులగమై కుదరలేదు. ఇప్పటికి రాసిన వాటిని పరిశీలించి ఒక రూపం ఇచ్చేందుకు ప్రయత్నించవలసి వుంది. ఆయన జీవితంలో ఇవి కొన్ని పార్శ్వాలు మాత్రమే. కడదాకా చైతన్యశీలిగా సామాజిక ఆసక్తికి ప్రతిరూపంగా జీవించిన కాట్రగడ్డ నరసయ్యకు ఇవే నా జోహార్లు.
– తెలకపల్లి రవి
• —
సశేషం
మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -29-4-22-ఉయ్యూరు

Posted in సినిమా | Tagged | Leave a comment

మనమరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు-262

• మనమరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు-262
• 262-కృష్ణ ను జేమ్స్ బాండ్ గా చూపిన సినీ నిర్మాత ,దర్శకుడు –డూండీ
• డూండీ తెలుగు సినిమా నిర్మాత, దర్శకుడు. ఆయన అసలు పేరు పోతిన డూండీశ్వరరావు. డూండీగా ఆయన సుప్రసిద్ధుడు. 70 కి పైగా సినిమాలు నిర్మించాడు. అభిమానవతి అనే ఒక చిత్రానికి దర్శకత్వం వహించాడు. తెలుగు తెరపై అనేక ప్రయోగాలు చేసిన నిర్మాతగా డూండీకి పేరుంది. ఈయన తండ్రి పోతిన శ్రీనివాసరావు మన రాష్ట్రంలో మొట్టమొదటి సినిమా హాల్‌ (విజయవాడ మారుతీ టాకీస్‌)ను నిర్మించాడు. 1956లో తన తొలి చిత్రంతో తెలుగు సినీ రంగంలో నిర్మాతగా అడుగిడిన డూండీ ‘బందిపోటు’, ‘రక్తసంబంధం’, ‘శాంతినివాసం’, ‘గూఢచారి 116’, ‘మరపురాని కథ’ భలేదొంగలు,దొంగలకు దొంగ,దొంగలవేట లాంటి చిత్రాలు నిర్మించారు. తెలుగు సినిమాలలో ఘట్టమనేని కృష్ణను జేమ్స్‌ బాండ్‌ రూపంలో చూపించిన నిర్మాత డూండీనే. 2005 నంది అవార్డుల ఎంపిక కమిటీకి సారథ్యం వహించిన డూండీ 2007 జనవరి 1 న మరణించాడు.
•   సశేషం
• మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -29-4-22-ఉయ్యూరు

Posted in సినిమా | Tagged | Leave a comment

అపరసరస్వతీ దేవి చేబ్రోలు సరస్వతి దేవి

అపరసరస్వతీ దేవి చేబ్రోలు సరస్వతి దేవి

చేబ్రోలు సరస్వతీదేవి
జననం [[]] 1900
పుల్లెల గ్రామం, నల్గొండ జిల్లా
నివాస ప్రాంతం నీలగిరి
భార్య / భర్త చేబ్రోలు రాజగోపాలం
తండ్రి రాజగోపాలనాయుడు
కవి కలహంసి బిరుదాంకితురాలైన చేబ్రోలు సరస్వతీదేవి తెలుగు కవయిత్రి. ఈమె రచించిన సరస్వతీ శతకము శ్రీపాద కృష్ణమూర్తిశాస్త్రి, చెళ్ళపిళ్ల వెంకటశాస్త్రి, చిలకమర్తి లక్ష్మీనరసింహం వంటి రచయితల మన్ననలు పొందినది. మద్రాసు విశ్వవిద్యాలయంలో ఇంటర్మీడియట్ క్లాసుకు పాఠ్యగ్రంథంగా ఎన్నుకొనబడింది. ఉత్తరకాండకు తొలిపలుకు రాస్తూ దివాకర్ల వేంకటావధాని ఆమె రచన ధారాళమై, భావనిర్భరమై, ఔచిత్య శోభితమై, నిర్దుష్టమై, అత్యంత హృద్యముగానున్నదని, మొల్ల, వెంగమాంబ కవితలతో సాటిగానున్నదని వ్రాసినారు.
ఈమె భర్త నూజివీడు జమీందారైన రాజా గోపాలమనాయుడు. ఈమెకు ముగ్గురు కుమారులు.
సరస్వతీదేవి సంస్కృతము, తెలుగు, ఇంగ్లీషు, హిందీ భాషలతో పాటు జ్యోతిషము కూడా అభ్యసించారు. ఈమె గురువు కందాడై కృష్ణమాచార్యులు, పంచకావ్యములు, నాటకాలంకారములు జ్ఞానసముపార్జన దృష్టితో బోధించేరని సుమిత్రాదేవి పేర్కొన్నారు.
ఈమె జటప్రోలు సంస్థానకవి వాజపేయాజుల రామసుబ్బరాయశాస్త్రి స్థాపించిన స్నేహలతా సంఘానికి ఉపాధ్యక్షురాలుగానూ, గృహలక్ష్మి మాసపత్రికకి ఉపసంపాదకురాలుగానూ పనిచేసింది.
సాహిత్యకృషి
సరస్వతీ రామాయణము
శ్రీ సరస్వతీశతకము
సత్యనారాయణ వ్రతకల్పము
ఆత్మోపదేశము
పతివ్రతాశతకము
పురస్కారాలు
గృహలక్ష్మి స్వర్ణకంకణం (1939)
మీ -గబ్బిట దుర్గా ప్రసాద్ -29-4-22-ఉయ్యూరు

Posted in సమీక్ష | Leave a comment

మనమరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు-259

మనమరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు-259

• 259-మూకీ చిత్ర ప్రదర్శకుడు ,టాకీ చిత్రనిర్మాత డైరెక్టర్ ,తొలిద్విపాత్రాభినయనం ప్రవేశపెట్టి ,జానపద చిత్రాన్ని పరిచయం చేసి ,చిత్ర కల్పనా యాక్టింగ్ స్కూల్ పెట్టిన –కాళ్ళకూరి సదాశివరావు
• కాళ్ళకూరి సదాశివరావు తెలుగులో జానపద చిత్ర నిర్మాణం ప్రారంభించిన వ్యక్తి. ఆ కాలంలో వరుసగా వస్తున్న పౌరాణిక సినిమాలకు భిన్నంగా ఒక కొత్త తరహా చిత్రాన్ని ప్రేక్షకులకు అందించాలన్న సంకల్పంతో తొలి జానపద చిత్రం గులేబకావళి కథ తీసాడు. 1939లో విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని అందించింది. పాటలు, పద్యాలకు భిన్నంగా ఆ సినిమాలో ఉన్న కత్తి యుద్ధాలు, పోరాటాలు, మంత్రాలు, మాయలు విశేషంగా ఆకట్టుకున్నాయి.
జీవిత విశేషాలు
అతను “చింతామణి” , “వరవిక్రయం”, “మధుసేవ” వంటి నాటకాలు రాసి జనాన్ని చైతన్యవంతుల్ని చేసిన మహాకవి కాళ్ళకూరి నారాయణరావు కుమారుడు సదాశివరావు. మూకీల కాలం నుండి అతనికి చిత్రపరిశ్రమతో సంబంధం ఉంది. అతను 1901 ఫిబ్రవరి 13న కాకినాడలో జన్మించాడు. నెల్లూరు లో జిల్లా బోర్డు విద్యా శాఖాధికారి కాళ్లకూరి దక్షిణామూర్తి అతని అన్నయ్య. కాకినాడలో పి.ఆర్ కళాశాలలో ఇంటర్మీడియట్ వరకు చదువుకున్నాడు. తరువాత హైదరాబాదు, మద్రాసు లలో బ్యాంకింగ్ కోర్స్ చదివారు. ఉద్యోగ వేటను ప్రారంభించి అతను రంగూన్‌లో సినిమా మెజిస్టిక్ అనే థియేటరుకు అసిస్టెంటుగా 1932లో ఉద్యోగంలో చేరి నాలుగు నెలల పాటు పనిచేసాడు. అక్కడి వాతావరణంలో ఇమడలేక కాకినాడ తిరిగి వచ్చేసాడు.[1]
చిత్ర పంపిణీ సంస్థ స్థాపన
చిత్తజల్లు పుల్లయ్య కు కాకినాడలో ఒక థియేటర్, ఒక టూరింగ్ టాకీసు ఉండేవి. రంగూను నుండి వచ్చిన తరువాత సదాశివరావు పుల్లయ్యను పరిచయం చేసుకొని అతని వద్ద అసిస్టెంటుగా చేరాడు. ఆ థియేటర్ల నిర్వహణా భాద్యతలను చూసుకొనేవాడు. ప్రదర్శనా రంగంలో అనుభవం పొందడంతో పుల్లయ్య ప్రోతసహంతో కొంతమంది మిత్రులనుకలుపుకొని “ఇంపీరియల్ పిక్చర్ ప్యాలస్” అనే థియేటరును ప్రారంభించాడు. ఆధాయం పెరిగే సరికి భాగస్వముల మధ్య విభేదాలు తలెత్తడంతో స్వంతంగా “కాకినాడ ఫిలిం ఎక్చేంజి” పేరుతో మరో పంపిణీ సంస్థను నెలకొల్పాడు.
చిత్ర రంగ ప్రవేశం
ఎనిమిదేళ్ల పాటు పంపిణీ, ప్రదర్శన రంగాలను కొనసాగించిన అతను ఎన్నో మూకీ చిత్రాలను తీసుకు వచ్చి తెలుగు ప్రేక్షకులకు ప్రదర్శించాడు. ప్రేక్షకులు ఎటువంటి సినిమాలు ఆదరిస్తారనే అవగాహన ఏర్పడింది. ఆ సమయంలో టాకీల నిర్మాణం ప్రారంభమైంది. చిత్ర నిర్మాణంపై ఆసక్తితో అతను కలకత్తా వెళ్ళి రాధాకిషన్ చమ్రియాను కలిసాడు. అతని సంకల్పం తెలిసిన రాధాకిషన్ మదన్ పిక్చర్స్ సంస్థను నెలకొల్పి సదాశివరావు దర్శకత్వంలో చింతామణి చిత్రాన్ని నిర్మించాడు. 1933లో విడుదలైన ఈ చిత్రంలో రామతిలకం, పులిపాటి తదితరులు నటించారు. తన తండ్రి రాసిన చింతామణి నాటకం ఆధారంగా తొలి సినిమా తీసాడు.
అతను తన సినిమాలకు స్వయంగా స్క్రిప్టు తయారుచేసుకొనేవాడు. “సతీ సులోచన” చిత్రంలో తొలిసారిగా ద్విపాత్రాభినయం అతను ప్రవేశపెట్టాడు. తొలి టాకీ సినిమా “భక్త ప్రహ్లాద” లో హిరణ్యకశిపునిగా నటించిన వి.వి.సుబ్బారావు ఈ చిత్రంలో రావణాసురునిగా, ఇందజిత్తుగా రెండు పాత్రలను పోషించాడు. అలాగే జానపద చిత్రాల్ని నిర్మించిన ఘనత కూడా అతనిదే.[1]
1940 లో చంద్రహాస సినిమాకు మొదటి సారిగా దర్శకత్వం వహించాడు. కానీ మధ్యలో కంపెనీ వారితో అబిప్రాయ భేదాలు ఏర్పడి ఆ సంస్థనుండి మధ్యలోనే తిరిగి వచ్చేశాడు.
సినిమాలు
• భక్త కుచేల (1935)
• లంకాదహనం (1936)
• సతీ సులోచన (1936)
• గులేబకావళి కథ (1939)
• చిరుతొండ నైనార్ (తమిళ సినిమా)
• చంద్రహాస (1940)
ఆర్మీలో నాలుగేళ్ళు
1942లో మద్రాసులో యుద్ద వాతావరణం నెలకొన్న రోజులలో ఆర్మీలోని వినోద శాఖలో చేరి సైనికులకు ఆహ్లాదాన్ని పంచాడు. అలాగే నాలుగేళ్ళు చిత్రరంగానికి దూరంగా ఉండి అర్మీలోనే కొనసాగాడు.
తిరిగి సినిమాలలోకి
యుద్దం ముగిసిన తరువాత 1946లో అతను నెల్లూరు వెళ్ళిపోయాడు. అతని అత్తవారు ఊరు కూడా అదే. అప్పటికి చిత్రరంగంలో మార్పులు చోటుచేసుకున్నాయి. అందుకే ఆ వాతావరణానికి ఇమడలేక మద్రాసు వదిలి నెల్లూరు చేరుకున్నాడు. ఆ ఊరి పెద్దల సహకారంతో మళ్ళీ సినిమా తీయాలనే నిర్ణయానికి వచ్చాడు. 1947లో సువర్ణలతా పిక్చర్స్ సంస్థను నెలకొల్పి “సువర్ణమాల” సినిమాను స్వీయ దర్శకత్వంలో నిర్మించాడు. ఆంధ్రా బ్యాంకు లో పనిచేసే సూర్యనారాయణ, బాలసరస్వతి ఇందులో నటించారు. ఈ సినిమా విజయవంతం కాకపోవడంతో చిత్ర నిర్మాణం కొనసాగించలేక పోయాడు. బయట సినిమాలకు అవకాశాలు రాకపోవడం, సొంతంగా చిత్ర నిర్మాణం చేపట్టే అవకాశం లేకపోవడంతో పబ్లిసిటీ ఆఫీసును ప్రారంభించాడు. దీనిని 1950 నుండి 1953 వరకు నడిపాడు. తరువాత ఆ సంస్థను కూడా మూసివేసాడు.
తరువాత హైదరాబాదులో “చిత్ర కల్పనాలయ” పేరుతో యాక్టింగ్ స్కూలును 1966లోప్రారంభించాడు.
కొంత కాలానికి హైదరాబాదులోనే మరణించాడు.
• మనమరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు-260
• 260-ప్రప్రధమ హార్మోనిస్ట్ ,,నటుడు ,ప్రయోక్త ,పాత సీతా కళ్యాణ మారీచుడు – కృత్తి వెంటి వెంకట సుబ్బారావు
• కృత్తివెంటి వెంకట సుబ్బారావు (1886 – 1958) ప్రముఖ రంగస్థల నటుడు, నాటక ప్రయోక్త, ప్రప్రథమ తెలుగు హార్మోనిస్టు.[1]
జననం
వెంకట సుబ్బారావు 1886లో బందరులో జన్మించాడు.
రంగస్థల ప్రస్థానం
తెలుగులో మొట్టమొదటి హర్మోనిస్టుగా పేరుగాంచిన వెంకట సుబ్బారావు బందరు ఇండియన్ డ్రమటిక్ కంపనీ, ఏలూను ప్రభాత్ కంపనీల నాటకాలలో నటించాడు. సుమారు 50 సంవత్సరాలపాటు తెలుగు, హిందీ నాటకాలలో స్త్రీ, పురుష పాత్రలు ధరించాడు.
నటించిన పాత్రలు
• ఆలీబాబా
• విశ్వామిత్రుడు
• కంసుడు
• వీరనాయకుడు
మరణం
ఈయన 1958లో ఏలూరులో మరణించాడు.
1934లో వచ్చిన సీతా కల్యాణం సినిమాలో శ్రీరాముడుగా మాస్టర్ కళ్యాన్ ,లక్ష్మణుడుగా నాగేశ్వరరావు ,గౌతముడుగా మాస్టర్ సూరిబాబు జనకుడుగా గోవిందరాజు వెంకటరామయ్య ,,రావణుడుగా తీగెల వెంకటేశ్వర్లు మారీచుడుగా కృత్తివెంటి వెంకట సుబ్బారావు ,కౌసల్యగా శ్రీహరి ,అహల్యగా కమలకుమారి నటించారు దర్శకుడు చిత్రపు నరసింహారావు .మ్యూజిక్ మాస్టర్ పెంచలయ్య .
261-సినీనటుడు ,సీతాకల్యాణం శ్రీ కృష్ణలీలలు దర్శక ఫేం –చిత్రపు నరసింహారావు
చిత్రపు నరసింహారావు తెలుగు దర్శకుడు, నటుడు.
సినిమాలు
1932 లో హెచ్. ఎం. రెడ్డి దర్శకత్వంలో విడుదలైన తొలి తెలుగు టాకీ చిత్రం భక్త ప్రహ్లాద సినిమాలో ఈయన నటించాడు.[1] ఘంటసాల బలరామయ్య నెల్లూరు జమీందారుల సహకారంతో శ్రీరామ ఫిలిమ్స్ ని స్థాపించాడు. ఈ సంస్థ ద్వారా మొదటి సారిగా 1936లో రూపుదిద్దుకున్న సతీ తులసి సినిమాకు చిత్రపు నరసింహారావు దర్శకత్వం వహించాడు.[2]
దర్శకత్వం
• సీతా కల్యాణం (1934)
• శ్రీ కృష్ణ లీలలు (1935)
• సతీ తులసి (1936)
• మోహినీ రుక్మాంగద (1937)[3]
• కృష్ణ జరాసంధ (1938)
• జయప్రద (1939)
• సశేషం
• మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -28-4-22-ఉయ్యూరు

Posted in సినిమా | Tagged | Leave a comment

రాంగేయ రాఘవ -1

రాంగేయ రాఘవ -1

రాంగేయ రాఘవ -1

అనే పుస్తకాన్ని హిందీలో మధురేశ్ రాస్తే ,తెలుగు అనువాదం జ్వాలాముఖి చేస్తే ,సాహిత్య అకాడెమి 1998లో ప్రచురించింది. వెల-25రూపాయలు .

 ముందుమాటలలో జ్వాలాముఖి చెప్పిన ముఖ్య విషయాలు .’’నలభైఏళ్లు కూడా జీవించని రాఘవ పాతికేళ్ళు రచనా వ్యాసంగం లో గడిపాడు .సాహిత్య వ్యాసంగానికి అడ్డు వస్తుందని వివాహం కూడా ఆలస్యంగా ,కాబోయే భార్య సాహిత్యోపజీవి సులోచనను 33ఏట పెళ్లి చేసుకొన్నాడు .ఆరేళ్ళ దాంపత్యంలో కూతురు సీమంతిని కి జన్మనిచ్చారు అదంపతులు .మెడ మీద పుట్టిన రాచపుండు బ్లడ్ కాన్సర్ కి దారితీసి రాఘవ అకస్మాత్తుగా మృత్యువు ఒడికి చేరాడు .

  ఎం ఎ పిహెచ్ డి అయినా ,ఉద్యోగాలు తలుపు తడుతూనే ఉన్నా ,రచనే జీవిత వృత్తిగా తీసుకొని అయినవారికీ కానివారికి దూరమయ్యాడు .పుంఖాను పుమ్ఖంగా రాసినా ప్రచురణ కర్తలు బాగుపడ్డారే తప్ప ఆయనకు కీర్తి తప్ప ఏదీ మిగల్లేదు .ఆర్ధికం కున్గాదీసినా కేన్సర్ కోతపెట్టినా ,జీవితావసరాలు గీ పెట్టినా ,ఉద్యోగం చేయలేదు రచన మానలేదు .ఉన్నవి అమ్ముకొని జీవిక సాగించాడు .

  రచనకు స్వేచ్చ ముఖ్యం అనేవాడు రాఘవ .సత్యాన్వేషణతో సాహిత్యం లో శాశ్వతత్వం సాధించాలని రాఘవ ఆలోచన .అభ్యుదయం ,మానవ వికాసం ,చారిత్రకదృష్టి సమసమాజం ,అంతఃకరుణ ,అన్యాయ ప్రతిఘటన,దోపిడీ నిర్మూలన అతని రచనలకు ప్రేరణ .హిందీలో మొట్టమొదటి సారిగా అంతర్జాతీయ దృష్టిని ప్రవేశపెట్టిన వాడు రాంగేయ రాఘవ .సామ్రాజ్యవాద వైఖరినీ ,ఫాసిజాన్నీ ,దాని వికృత చేష్టల్ని,దేశ విభజన విషాదాన్నీ  ఎండగట్టాడు .పరాధీనమానవుల్ని స్వార్ధ పరులు ఎలాదగా చేస్తారో చూపాడు .భారతీయ చారిత్రిక పరిణామాన్ని ,మనవ వికాసానికి నిల్చిన మైలురాళ్ళను ,పాత్రల్నిచూపిస్తూ ‘’గాధలు ‘’నాలుగు భాగాలుగా’’మహాయాత్ర ‘’గా  రాయాలనుకొని రెండు భాగాలు మాత్రమె రాయగలిగాడు .మానవ వికాస చింతన ,సత్యాన్వేషణ ఆయన ఆకాంక్ష.అతని ‘’అంతర్భుక్తి సిద్ధాంతం జ్ఞాన చక్షువు .

  పౌరాణిక పాత్రలైనద్రౌపది భీష్ముడు యుధిష్ఠిరుడు మొదలైన వారిని గొప్ప తర్కం తోఆవిష్కరిస్తూ వారు తమయుగ యదార్దాలలో ఉంటూ కూడా యుగాతీత౦ గా  వర్తి౦చారని చెప్పాడు .దీన్ని  విభేదించిన మైధిలీ శరణ గుప్తాకు జవాబురాస్తూ ‘’మనం స్థిరపడి పోయిన భావాలకు బందీలైతే సత్య సాక్షాత్కారం జరగదు ‘’అని సుదీర్ఘ లేఖ రాశాడు .ఈ లేఖ ‘’సాహిత్యలక్ష్య  లక్షణ వివరణ ‘’కు అత్యుత్తమ ఉదాహరణగా నిలిచి పోయింది .రామానుజా చార్య సంస్కరణాభి లాషనూ మహోత్తమంగా వివరించాడు రాఘవ .

  దేశాభిమానం లేకుండా వామాచారం పెరగటం వలన బౌద్ధం నశించింది అనీ ,జైనం ముందుకు సాగిందనీ అన్నాడు .క్షత్రియుల్ని గెలిచి భూమిని అంతా పరశురాముడు బ్రాహ్మణులకు ధారపోస్తే చివరికి ఆయనకు నిలవటానికి చోటే లేకుండా పోయిందన్నాడు .తర్వాత యుగాలలో బ్రాహ్మణ క్షత్రియులు కలిసి పోరాటం చేయాల్సి వచ్చింది అన్నాడు .ఋగ్వేదం రూపాంతరం చెంది సామవేదం అయి౦దన్నాడు .ఇంగ్లీష్ వారు విమర్శించి నందువలననే ‘’వాజిదలీషా’’అందరి దృష్టిలో పడి,సామ్రాజ్యవాదులకు వ్యతిరేకంగా భారతీయ సైన్యాన్ని సమీకరించిన ధీరుడు అని మెచ్చాడు రాఘవ..పతనమవుతున్న నవాబుల యుగం వాడు కావటం అతడి దురదృష్టం .అయినా అతడిని ప్రజలు విపరీతంగా ప్రేమించి ఆరాదించారు  ,ఆతర్వాత నాయకుడు లేకుండానే ప్రజలు బ్రిటిష్ వారిని ఎదిరించారని చారిత్రిక అర్ధం చెప్పాడు .కపాయి అక్బర్ ఏ విధంగానూ సమర్ధనీయుడు కాదు అని చారిత్రిక సత్య శోధన చేసి వివరించాడు రాఘవ .

 మేధావి రచయితా గా రాంగేయ రాఘవ హిందీ రచయితలలో అగ్రగామిగా ఉన్నాడు .అతడిలో తర్కం ,వివేకం తోపాటు అంతఃకరణ కనిపిస్తుంది .ప్రేం చంద్ తో సమానంగా ‘’గదల్ కధ రాశాడు .చారిత్రకరచనలో రాహుల్ సాంకృత్యాయన్ ,నవలా రచనలో యశ్పాల్ ,ప్రేమ చ౦ద్ లను ,కావ్య రచనలో జయశంకర ప్రసాద్’’నిరాలా ‘’ను ,సాహిత్య విమర్శలో రామ చంద్ర శుక్ల ,రాం విలాస్ శర్మలకు దీటైనవాడు రా౦గేయ రాఘవ .బెంగాల్ కరువును ప్రత్యక్షంగా వెళ్లి చూసి రాసిన ‘’తుఫానోం కే బీచ్ ‘’  ఆధునిక పత్రికారిపోర్టింగ్ కు శ్రీకారం .పోలీస్ కాల్పుల్ని నిరసిస్తూరాసిన   ‘యహ్ గ్వాలియర్ హై’’,అతడి కార్మికవర్గ స్నేహ భావానికి అద్దంపట్టింది .అరసం అనే ‘’ప్రగతి శీల అభ్యుదయ సంఘం ‘’తో రాఘవ సాహిత్యం పెనవేసుకు పోయింది .అతడు మనయుగం లో నిజాయితీ నిబద్ధత ఉన్న రచయిత ,మానవతా ప్రవక్త ,వికాస పరిశీలకుడు ,చరిత్రలో విజ్ఞాతా బాధ్యతలు తెలిసిన సంస్కారి .అ౦తటి  రచయిత నభూతో న భవిష్యతి ‘’అతని గురించి అతడి సాహిత్యం గురించి ప్రత్యక్షంగా తెలుసుకోవటానికి 1990 మే 31 న నేను రాఘవ కుటుంబాన్ని అంటే భార్య సులోచన కూతురు సీమంతిని అల్లుడు అశోక్ శాస్త్రిని ప్రత్యక్షంగా చూడటానికి జైపూర్ వెళ్లాను .రాఘవ జ్ఞాపకాలు ఇంకా వారిలో నిండి ఉన్నాయి సంతృప్తి కలిగింది .సులోచన జైపూర్ యూని వర్సిటిలో సోషియాలజీలెక్చరర్ , భర్త జ్ఞాపకాలను ‘’పునః ‘’రాసి భద్ర పరుస్తోంది .భర్త రాఘవపై ఆమె రాసిన వాటికి టివి లో సంభాషణలు రాస్తున్నాడు .కూతురు ఇంగ్లీష్ లెక్చరర్ ,.రాఘవ రాజస్థానీ వాడుకావటం, హిందీ వాడు కాకపోవటం తో హిందీ సాహిత్యంలో నిర్లక్ష్యానికి గురయ్యాడు .’’ద్రావిడ వాది ‘’అనే ముద్రకూడా వేశారు .నిజానికి రాఘవ తన యుగ పరిధుల్ని దాటి సత్యాన్ని సాక్షాత్కారి౦పజేసిన ‘’స్రష్ట ‘’.మార్గ దర్శకుడు .ఆకుటుంబం అంతా రాఘవ జ్ఞాపకాలతో జీవిస్తున్నారని తెలుసుకొని సంతృప్తి చెందాను ‘’   అన్నాడు జ్వాలాముఖి .

 సశేషం

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -27-4-22-ఉయ్యూరు 

Posted in పుస్తకాలు, సమీక్ష | Leave a comment

మనమరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు –257

• మనమరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు –257
• 257-సంగీత విద్వాంసుడు రసపుత్ర విజయ ‘’విమల ‘,రాదా కృష్ణ లో రాధ ’ఫేం,పారుపల్లి వారి తమ్ముడు ,సినీ రాముడు ,ధర్మరాజు ,జనకుడు –పారుపల్లి సుబ్బారావు
• పారుపల్లి సుబ్బారావు నాటకరంగ, సినిమారంగ కళాకారుడు, సంగీత విద్యాంసుడు. స్త్రీ పాత్రలకు పేరొందిన వాడు.[1]
సుబ్బారావు 1897లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కృష్ణా జిల్లా, ఘంటసాల మండలంలోని శ్రీకాకుళం గ్రామంలో లక్ష్మీనారాయణ, సీతమ్మ దంపతులకు 1906లో జన్మించాడు.

నట ప్రస్థాన౦
1908లో మొట్టమొదట బందరు బాలభారతి సంఘం రసపుత్ర విజయం నాటకంలో విమల పాత్రలో నటించాడు. తమ అన్న పారుపల్లి రామకృష్ణయ్య పంతులు (డా. మంగళంపల్లి బాలమురళీ కృష్ణ గురువు) దగ్గర సంగీతాన్ని నేర్చుకొని, మైలవరం కంపెనీలో అప్పటి సంగీత దర్శకుడు పాపట్ల కాంతయ్య (పరబ్రహ్మ పరమేశ్వర -ప్రార్థనా గీతానికి సంగీతాన్ని సమకూర్చిన) వద్ద మరాఠీ, పార్సీ సంప్రదాయ రీతుల్ని అభ్యసించాడు. ఆ తరువాత మద్రాస్ సుగుణ విలాస సభలోలోనూ, విజయవాడ మైలవరం కంపెనీలోనూ, ఏలూరు మోతే వారి కంపెనీలోనూ నటించి ఎంతో పేరు సంపాదించాడు. స్ఫురద్రూపం, చక్కని గాత్ర మాధుర్యంతో సాత్వికాభినయంలో మేటిగా, స్త్రీ పాత్రధారణకు పేరొందిన సుబ్బారావు పానుగంటి లక్ష్మీనరసింహారావు రచించిన రాధాకృష్ణలో రాధ వేషాన్ని చక్కగా ధరంచేవాడు
నటించిన పాత్రలు
• విమల (రసపుత్ర విజయం)
• రాముడు (లవకుశ)
• సావిత్రి
• లీలావతి
• రాధ
• సుకన్య
• కైక
• చంద్రమతి
• రుక్మిణి
• రత్నాంగి
• కమలాంబ
• దుర్యోధనుడు
• రామదాసు

సినిమాలు
1934లో ఈస్టిండియా కంపెనీ సి.పుల్లయ్య దర్శకత్వంలో తీసిన ‘లవకుశ’ చిత్రంలో శ్రీరాముని పాత్రలో నటించాడు.
• 1936: సతీ సులోచన (1936 సినిమా)
• ద్రౌపది మాన సంరక్షణము (ధర్మరాజు)[2]
• 1944: సీతారామ జననం (జనకుడు)[3]
• 1934లో సి పుల్లయ్య దర్శకత్వం లో వచ్చిన లవకుశ సినిమాలో రాముడు వేష దారి .మాస్టర్ భీమారావు లవుడు ,మాస్టర్ మల్లేశ్వరరావు కుశుడు ,పారుపల్లి సత్యనారాయణ వాల్మీకి ,సీనియర్ శ్రీరంజని సీత ,ఈమని వెంకటరామయ్య లక్ష్మణుడు .సంగెతం ప్రభల సత్యనారాయణ ,రచన  బలిజేపల్లి లక్ష్మీకాంతం
• మనమరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు –258
• 258-పాత లవకుశ సంగీతదర్శక ఫేం ,’’కల్లు మానండోయ్  ‘’పాట రచయిత-ప్రభల సత్యనారాయణ 
• ప్రభల సత్యనారాయణ పాతతరం తెలుగు సంగీతదర్శకులు. తెలుగులో ఘనవిజయం సాధించిన మొట్టమొదటి చిత్రం లవకుశ (1934)కు ఈయనే సంగీతదర్శకుడు. తరువాత వరవిక్రయము (సినిమా) కు సంగీతాన్నందించాడు. పూర్తిగా పిల్లలతో తీసిన అనసూయ (1936) చిత్రానికి కూడా ఈయనే సంగీతదర్శకుడు.[1]
• సీతారామ జననం సినిమాలో అక్కినేని నాగేశ్వరరావు రామునిగా నటించాడు; కానీ అతని గళం స్త్రీ గళంగా ఉండేది. అపుడు ప్రభల సత్యనారాయణ, ఓగిరాల రామచంద్రరావును కలసి సలహా తీసుకుని సరిదిద్దుకున్నట్లు అక్కినేని ఒక ఇంటర్వ్యూలో తెలిపాడు
చిత్రసమాహారం
• లవకుశ (1934) తమిళ చిత్రం
• అనసూయ (1936) తెలుగు చిత్రం
• గృహలక్ష్మి (1938) తెలుగు చిత్రం : ఇందులో రెండు పాటలు పాడాడు. అవి “కల్లుమానండోయి”, “లెండు భరత వీరుల్లారా” [4]
• వరవిక్రయము (సినిమా) (1939) హిందీ చిత్రం
• కాలచక్రం (1940) తెలుగు చిత్రం
• సీతారామ జననం (1944) తెలుగు చిత్రం[5]
•    సశేషం
• మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -27-4-22-ఉయ్యూరు

Posted in సినిమా | Tagged | Leave a comment

మనమరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు –256

మనమరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు –256

256-నటుడు ,గాయకుడు ,నాటక కృష్ణ ,భీష్మ పాత్రల ఫేం సినీ ,ద్రౌపది ,సావిత్రి నారడుడు వస్గిష్టుడు ఫేం,’పారుపల్లి వారి తమ్ముడు ,’గాన సరస్వతి ‘’-పారుపల్లి సత్యనారాయణ

జీవిత విశేషాలు
అతను కృష్ణా జిల్లా దివి తాలూకాలోని శ్రీకాకుళం లో లక్ష్మీనారాయణ, సీతమ్మ దంపతులకు 1906లో జన్మించాడు.

నాటకరంగం
అతను సావిత్రి (1933), లవకుశ (1934), శ్రీకృష్ణ లీలలు (1935) సినిమాలలో నటిస్తూ గానం చేసాడు. పృథ్వీపుత్ర, దశావతారాలు, భీష్మ, విరాటపర్వం, పాదుక మొదలైన చిత్రాలలో వివిధ పాత్రలలో నటించాడు. అతను తెనాలి కంపెనీలో చేరి ద్రౌపది, తులసి, అన్నపూర్ణ మొదలైన స్త్రీ పాత్రలు పోషించారు.

ఆ రోజుల్లో నాటకాలలో, చలనచిత్రాలలో అనేక పాత్రలు నటిస్తూ “సత్యనారాయణ గారు మా చిత్రంలో ఒక్క పది నిముషాలు కనపడినా చాలు … మా చిత్రానికి విలువ పెరుగుతుంది” అనుకునే స్థాయిలో అనేక చిత్రాలలో ప్రధాన పాత్రలు ధరించాడు. అతను వాల్మీకి వేషం వేసిన ఆనాటి ‘లవకుశ’ చిత్రం. విజయవాడ దుర్గాకళామందిరంలో ఒక ఏడాదిన్నర పైగా ఆడింది. ఆ చిత్రంలో అతను భాగీశ్వరిలో పాడిన “సాహసమేల ఈలీలా జానకి” అనే పాట, బేగడలో పాడిన “ఇది మన ఆశ్రమంబు” అనే పద్యం ఎంతో గుర్తింపు తెచ్చాయి. ఆ రోజుల్లో ఆయన అసంఖ్యాకంగా పాడిన పాటలు, పద్యాలు గ్రామ్ ఫోన్ రికార్డుల ద్వారా అలరించేవి. అతను నటించిన లవకుశ, దశావతారాలు, శ్రీకృష్ణలీలలు, బ్రహ్మరధం, 1944లో సీతారామ జననం (వశిష్టుడు)[1] లాంటి కొన్ని చలనచిత్రాలు ప్రజాదరణ పొందాయి.పుల్లయ్యగారి సతీ సావిత్రిలో నారద వేషం రక్తి కట్టించారు

అతని అన్నయ్య “గాయకసార్వభౌమ” పారుపల్లి రామకృష్ణయ్య పంతులు.

అతని మనుమడు పారుపల్లి సత్యనారాయణ కూడా గాయకుడు, శ్రీ శారదా అన్నమయ్య సంగీత విద్యాలయం వ్యవస్థాపకుడు. [2]

పాటలు
· సుజన జనావానా

· మధుసూదనా

· సత్యపాలనా ఘనా సాధుశీలుడే

· సాహసమేల

· మందం మందం (లవకుశ – 1934)

· ఈ చరణంబులే…[3]

· సశేషం

· మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -26-4-22-ఉయ్యూరు

Posted in సినిమా | Tagged | Leave a comment

మనమరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు –255

మనమరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు –255
255-కృష్ణ ,అర్జున శిశుపాల నాటక నతఫెం ,సతీ సావిత్రి సినీ సత్యవంతఫేం రంగభూషణ ,నాట్య విశారద -నిడుముక్కల సుబ్బారావు
నిడుముక్కల సుబ్బారావు (మార్చి 10, 1896 – ఏప్రిల్ 17,1968) రంగస్థల నటుడు, మైలవరం బాలభారతి నాటక సమా జననం
ఈయన 1896 మార్చి 10వ తేదీన విజయవాడలో జన్మించాడు.
రంగస్థల ప్రవేశం
మొట్టమొదట బందరు ‘చిత్రకళాభివర్దిని’ సామాజంలో బాలవేషాలలో నటించి తరువాత మైలవరం కంపెనీలో చేరి అఖండ ఖ్యాతి గడించాడు.
నటించిన పాత్రలు
శ్రీకృష్ణుడు, గయోపాఖ్యానంలో అర్జునుడు, శిశుపాలుడు, అశ్వనీదేవత (సుకన్య), భీష్మ, బబ్బిలి రంగారావు, జలంధరుడు, బిల్వమంగళుడు, ఖడ్గ నారాయణుడు, మన్మధుడు (అనసూయ), శ్రీరాముడు, భరతుడు, నారదుడు, గిరిరాజు (చండిక), క్రూరసేనుడు మొదలైనవి.
బిరుదులు
• రంగభూషణ
• నాట్య విశారద
మరణం
చివరి దశలో లారీ నడిపిస్తూ 1968, ఏప్రిల్ 17న మరణించాడు.
193౩ లో చిత్తజల్లు పుల్లయ్య దర్శకత్వం లో వచ్చిన సతీ సావిత్రి చిత్రం లో నిడుముక్కల సుబ్బారావు సత్యవంతుడు ,మిస్ రామతిలకం సావిత్రి గా నటించారు .నారదుడు పారుపల్లి సత్యనారాయణ ,యముడు వేమూరి గగ్గయ్య .చిత్రానువాదం మల్లాజోశ్యుల రమణ మూర్తి ..సత్యవంతుడుపాడిన ‘’ఈస్శ్వర సంకల్ప మేవ్వారేరుమ్గుడురు ఏరీతి ఎటులుండునో ?””’’పోయే నయ్యోఇపుడు ననుబాసి ‘’నా హృదయఫలకమున ఆ నాతి రూపు  ‘’,పాటలు బహుళ జనాదరణ పొందాయి .
  సశేషం
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -26-4-22-ఉయ్యూరు

Posted in సినిమా | Tagged | Leave a comment

మనమరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు –254

మనమరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు –254
254-రామదాసులో కమల ,చంద్రలేఖఫెం –జెమిని సరస్వతి
ఆమె అసలు పేరు సరస్వతి. కానీ జెమినీ స్టూడియోస్‌ నిర్మించిన చిత్రాల్లో నటించడంతో, జెమినీ స్టూడియో నిర్మించిన చంద్రలేఖ చిత్రంలో నటించడంతో ఆమెకి జెమినీ సరస్వతి అనే పేరు వచ్చింది. ఆ తర్వాత కాదల్‌ పడుత్తుమ్‌ పాడు చిత్రంతో నటిగా పరిచయం అయ్యారు. శివాజీ గణేషన్, రజినీకాంత్, కమలహాసన్‌ వంటి స్టార్స్ చిత్రాల్లో నటించారు. 400 చిత్రాల్లో, 1000 పైగా నాటకాల్లో ఆమె వివిధ పాత్రలతో అలరించారు. 1933లో కలకత్తా ఈస్ట్ ఇండియా కంపెని వారి ‘’రామదాసు ‘’సినిమాలో సరస్వతి రామదాసు భార్య కమల గా నటించారు .డైరెక్టర్ అక్తార్ నవాజ్ .ఆరణి సత్యనారాయణ రామ దాసు ఘంటసాల బలరామయ్యగారి ఒక సోదరుడు రాధాకృష్ణయ్య కబీరు ,మరో సోదరుడు ఘంటసాల శేషయ్య రాముడు గా నటించారు .తానేషా నెల్లూరు నాగరాజారావు ,ఆహామాక్ వంగర ,లక్ష్మణుడు ఎం ఎస్ రంగారావు ,సితారాబెగం రాం పాప .
సీనియర్‌ నటి జెమినీ సరస్వతి(94) కన్నుమూశారు. ఇటీవల శ్వాసకోస సంబంధిత సమస్యలతో బాధపడుతున్న ఆమె ఆనారోగ్యానికి గురయ్యారు. ఈ క్రమంలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం చెన్నైలో తుదిశ్వాస విడిచారు. తమిళనాడు కారైకుడికి చెందిన జెమినీ సరస్వతి 5వ తరగతి చదువుతున్న వయసులోనే నాట్యంపై ఆసక్తితో, సినిమాల్లో నటించాలనే ఆశతో చెన్నైకి వచ్చారు. చంద్రలేఖ చిత్రం ద్వారా డాన్సర్‌గా పరిచయమయ్యారు. .
వయసు మీద పడటంతో ప్రస్తుతం ఆమె కుటుంబ సభ్యులతో నివసిస్తున్నారు. ఈ క్రమంలో ఆమె అనారోగ్యానికి గురయి కన్నుమూశారు. జెమినీ సరస్వతి మృతి పట్ల తమిళ చిత్ర పరిశ్రమ సంతాపం తెలియజేస్తుంది. సరస్వతికి దక్షిణామూర్తి, సెల్వరాజ్‌ అనే ఇద్దరు కొడుకులు ఉన్నారు.
సీనియర్‌ నటి జెమినీ సరస్వతి(94) వ ఏట కన్నుమూశారు
సశేషం
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -26-4-22-ఉయ్యూరు

Posted in సినిమా | Leave a comment

మనమరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు -251

మనమరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు -251
251-నాటక నటన శిక్షణ ,ప్రదర్శన చేసి పివి రాసిన గొల్లరామప్ప ను నాటకీకరించి ,నాటక సిలబస్ రూపొందించుకొని ,అర్ధశతాబ్దం ,పుష్ప ,భీమ్లా నాయక సినీ ఫేం –అజయ్ మంకేనపల్లి
అజయ్ మంకెనపల్లి రంగస్థల, సినిమా నటుడు, నాటక రంగ గురువు. పౌరాణిక, సాంఘిక నాటకాల్లో నటించిన అజయ్ మంకెనపల్లి మధ సినిమా ద్వారా తెలుగు సినిమారంగంలోకి ప్రవేశించి,అర్థ శతాబ్దం,ఆకాశవాణి మొదలైన చిత్రాలలో నటించాడు.[1]
రంగస్థల ప్రస్థానం
అజయ్ క్రియేటివ్‌ థియేటర్‌ అనే సంస్థను 2016లో స్థాపించి నాటక రంగంలో శిక్షణా తరగతులు నిర్వహిస్తున్నారు. తానే స్వయంగా నాటకాలు రచించి దర్శకత్వం వహించి థియేటర్‌ అభివృద్ధికి కృషి చేస్తున్నారు. తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ సహకారంతో నాటకరంగంలో పరిశోధన చేస్తున్న అజయ్ మంకెనపల్లి, తెలంగాణ ప్రభుత్వ పాఠశాలలో పిల్లలకు నాటకాలలు శిక్షణనిస్తూ, మాజీ ప్రధాని పీవీ నరసింహారావు రచించిన గొల్ల రామవ్వ కథను నాటకీకరించి.. ఆ నాటకానికి దర్శకత్వం వహించి రెండు తెలుగు రాష్ట్రాల్లో పదికి పైగా ప్రదర్శనలు ఇచ్చారు. రఘుబాబు జాతీయ నాటకోత్సవాలలో గొల్ల రామవ్వ నాటకానికి ఉత్తమ ప్రతినాయకుడు , బెస్ట్‌ సపోర్టింగ్‌ క్యారెక్టర్‌గా రెండు అవార్డులు అందుకున్నారు. షేక్‌స్ఫియర్‌ నాటకాన్ని తెలుగులో నాటకీకరించి ప్రదర్శించారు. ఇప్పటివరకు 500 మందికి పైగా నేటి తరం నూతన నటీనటులకు శిక్షణ ఇచ్చి నటనపై ఆసక్తి పెరిగేలా చేస్తున్నారు. నాటకరంగం లోనే కాకుండా తనదైన ముద్రను సినిమారంగంలో ఉండేలా అనేక చిత్రాల్లో ప్రధాన పాత్రలు పోషిస్తూ తనకంటూ గుర్తింపు తెచ్చుకుంటున్నారు. ఇప్పటి వరకు ఆయన దాదాపు పది సినిమాల్లో గుర్తించదగ్గ పాత్రల్లో నటించారు.
తన క్రియేటివ్‌ థియేటర్‌[2]<nowiki> ద్వారా నటనపై ఆసక్తి ఉన్న ఎంతో మంది యువతి యువకులను నటులుగా తయారుచేస్తున్నాడు. నటన అంటే కేవలం అనుకరణ కాదని, అందులో జీవించడం ద్వారానే సహజంగా నటించగలరు అనే విషయాన్ని బలంగా నమ్మిన వ్యక్తి అజయ్. అదే తన క్రియేటివ్‌ థియేటర్‌ వర్క్‌ షాప్‌ ద్వారా కొత్త నటులకు నేర్పుతున్నారు. తన కంటూ ఒక సిలబస్‌ రూపొందించుకొని తనదైన ప్రత్యేక ముద్రను నాటక రంగంలో కనబరుస్తున్నారు. క్రియేటివ్‌ థియేటర్‌ ఇప్పటి వరకు మూడు వర్క్‌ షాప్‌లు నిర్వహించింది. క్రియేటివ్‌ థియేటర్‌ తయారుచేసిన నటులతోనే ప్రముఖ రచయిత్రి, కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీత మెర్సీ మార్గరెట్‌ రచించిన అసమర్ధుడు[3][4]నాటకం అజయ్ మంకెనపల్లి దర్శకత్వంలో నాటకం రూపొందించారు. అది ఇప్పటికే రెండు సార్లు రవీంద్రభారతిలో ప్రదర్శించబడింది. మెర్సీ రాసిన మరో నాటికం త్రిపుర శపథం కూడా అజయ్ మంకెనపల్లి దర్శకత్వంలో రవీంద్ర భారతిలో జనవరి 5న ప్రదర్శించబడింది.
నటించినవి
నాటకాలు:
1. గాడ్‌ మంకీ డెవిల్‌
2. ఏ మిడ్‌ సమ్మర్‌ నైట్స్‌ డ్రీమ్‌
3. ఆలోచన, 7 మార్పు
4. పలనాటి యుద్ధం
5. నిశ్శబ్దం
6. జ్యోతిరావు పూలే
7. నాయకురాలు
8. బతుకమ్మ
9. రజాకార్‌
10. నోటు భారతం
11. జయ జయహే తెలంగాణ
12. గొల్ల రామవ్వ
13. స్వక్షేత్రం
14. గాలి గోపురం
15. కాగితం పులి
16. గబ్బర్‌ సింగ్‌
17. జంబుద్వీపం
18. లోకా సమస్తా సుఖినోభవంతు
దర్శకత్వం వహించిన నాటకాలు
1. అసమర్ధుడు
2. త్రిపుర శపథం
3. గొల్ల రామవ్వ
4. గాడ్‌ మంకీ డెవిల్‌
5. ఏ మిడ్‌ సమ్మర్‌ నైట్స్‌ డ్రీమ్‌
6. నానాజాతి సమితి
7. ఆలోచన
8. మార్పు
నటించిన సినిమాలు
1. అర్ధ శతాబ్దం
2. ఆకాశవాణి
3. ఘోడా
4. పుష్ప
5. ఉస్తాద్‌
6. సైరా నరసింహారెడ్డి
7. మధ
8. భీమ్లా నాయక్‌
బహుమతులు
1. తెలుగు విశ్వవిద్యాలయం – రంగస్థల యువ పురస్కారం 2021-2022
2. జాతీయ రఘుబాబు నాటకోత్సవాల్లలో గొల్ల రామవ్వ నాటకానికి గాను ఉత్తమ నాయకుడు, బెస్ట్‌ సపోర్టింగ్‌ రోల్‌)
3. యూత్‌ అవార్డు 2021
4. సింగిడి యంగ్‌ డిస్టింగ్విష్డ్‌ అవార్డ్స్‌

252-రంగస్థల ,టివి దర్శకుడు ,నంది అవార్డ్ విన్నర్ ,బావాబా పన్నీరు ,చీకటి సూర్యులు ,రైతురాజ్యం ,బతుకమ్మ సినీ నటన ఫేం –అమరేంద్ర బొల్లం పల్లి
అమరేంద్ర. బి రంగస్థల, టీవీ నటుడు, దర్శకుడు, సినిమా నటుడు.[1]
జననం – విద్యాభ్యాసం
అమరేంద్ర 1952, ఆగష్టు 8 న బొల్లంపల్లి వేంకటహరి, ఆండాళమ్మ దంపతులకు హైదరాబాద్లో జన్మించాడు. బి.ఏ. వరకు చదువుకున్నాడు. పి.జి. డిప్లొమా ఇన్ థియేటర్ ఆర్ట్స్ లో చేరి నటన, దర్శకత్వంలో శిక్షణ పొందాడు.
వివాహం – పిల్లలు
కల్పనశ్రీతో 1977, జూన్ 7న అమరేంద్ర వివాహం జరిగింది. వారికి ఇద్దరు అమ్మాయిలు (స్పందన, భావన)
ఉద్యోగ జీవితం
వజీర్ సుల్లాన్ టొబాకో కంపనీలో సీనియర్ బ్లెండింగ్ అధికారిగా పనిచేసి, 1997లో స్వచ్ఛంద పదవీ విరమణ చేశాడు.
నాటకరంగ ప్రస్థానం
అమరేంద్ర, తన పెద్దన్నయ్య భాను ప్రకాష్ ప్రోత్సాహంతో పత్తర్ కే ఆన్సూ అనే హిందీ నాటకంలో నాటకరంగ ప్రవేశంచేశాడు.[2] వివిధ సంస్థలలో 4వేల వరకు నాటిక, నాటక ప్రదర్శనలు ఇచ్చాడు. మొదటిసారిగా ఎన్.ఆర్. నంది రాసిన వాన వెలిసింది నాటికకు దర్శకత్వం వహించాడు. 1972లో రవి ఆర్ట్స్ సంస్థ హైదరాబాద్ లో నిర్వహించిన నాటిక పోటీలలో ఉత్తమ దర్శకుడిగా బంగారు పతకం అందుకున్నాడు. అనేక నాటక పోటీలకు న్యాయ నిర్ణేతగా వ్యవహరించాడు.
1969లో ఆదర్శ యువభారతి అనే సంస్థను ప్రారంభించి, ఆ సంస్థ ఆధ్వర్యంలో నాటిక, నాటక ప్రదర్శనలు ఇస్తున్నాడు.
బహుమతులు
నంది బహుమతులు:
1. ఉత్తమ ప్రతినాయకుడు – నంది నాటక పరిషత్తు – 2016[3]
పురస్కారాలు – సత్కారాలు:
1. తెలంగాణ థియేటర్‌ రీసెర్చ్‌ సెంటర్‌ సత్కారం[4]
టీవిరంగ ప్రస్థానం
తూర్పు పడమర, మిస్టరీ, జీవన తీరాలు, ధరణికోట, ధూర్జటి, పోతన, ఫ్యాక్షన్ – ఫ్యాక్షన్, కాశీమజిలీ కథలు, ఊహల పల్లకి, మాయాబజార్, మంచుపర్వతం, ఉషోదయం, విధి, పద్మవ్యూహం, ఎండమావులు, అనురాగదార, ఓ అమ్మకథ, బుజ్జి – బజ్జిబాబు, కథా స్రవంతి, శ్రావణీ సుబ్రహ్మణ్యం వంటి దాదాపు 250 సీరియళ్లలో నటించాడు.
సినీరంగ ప్రస్థానం
అమరేంద్ర నటించిన ఆందమే ఆనందం నాటిక చూసిన జంధ్యాల విచిత్రప్రేమ సినిమాలో అమరేంద్రకు అవకాశం ఇచ్చాడు. ఆ తరువాత బావా బావా పన్నీరు, విషజ్వాల, చీకటి సూర్యులు, కూలన్న, రైతురాజ్యం, ఊరుమనదిరా, భీముడు, వేగుచుక్కలు, గంగమ్మ జాతర, వీరివీరి గుమ్మడి పండు, అమ్మమీద ఒట్టు, బతుకమ్మ, వీర తెలంగాణ, పోరు తెలంగాణ, రాజ్యాధికారం[5] మెదలైన సినిమాలలో నటించాడు.
253-రంగస్థల ,హరికధా కళాకారుడు ,నారద ,లక్ష్మణ ఫేం ,సక్కుబాయి లో శివయోగి ,ధర్మరాజు సినీ ఫేం,హరికధా కంఠీరవ  –చొప్పల్లి సూర్యనారాయణ భాగవతార్
చొప్పల్లి గా ప్రసిద్ధిచెందిన చొప్పల్లి సూర్యనారాయణ భాగవతార్ సుప్రసిద్ధ హరికథా కళాకారుడు, రంగస్థల, సినిమా నటుడు.[1]
ఈయన విజయనగరం జిల్లా లోని చొప్పల్లి గ్రామంలో సెప్టెంబరు 19 1905 తేదీన జన్మించాడు. వైణిక విద్వాంసుడైన చొప్పల్లి నరసింహం, సూరమాంబ ఈయన తల్లిదండ్రులు. ఆనాడు విజయనగరం మహారాజైన ఆనంద గజపతి నాటక సమాజంలో నటించి ప్రజల, ప్రభువుల మన్ననలు పొందినవాడు నరసింహం. తండ్రి ప్రోత్సాహం చొప్పల్లిని నటునిగా తీర్చిదిద్దాయి.
విజయనగరం మహారాజా కళాశాలలో ఎస్.ఎస్.ఎల్.సి. పాసయ్యాడు. తర్వాత శ్రీవాణీ విలాస్ అమెచ్యూర్ కంపెనీలో చేరి అనాసపురపు గోపాలరావు సరసన రసపుత్ర విజయం నాటకంలో వీరమాత పాత్ర పోషించి మొదటిసారిగా రంగస్థల ప్రవేశం చేశాడు. తర్వాత ప్రహ్లాదలో నారదుడు, లవకుశలో లక్ష్మణుడుగా పాత్రలు పోషించాడు. తర్వాత ప్రసిద్ధ నటులైన యడవల్లి, పారుపల్లి, ఆంజనేయులు మొదలైన వారితో కలిసి ద్రౌపదీ వస్త్రాపహరణం, గయోపాఖ్యానం, సక్కుబాయి మొదలైన నాటకాలలో నటించాడు. ముఖ్యంగా సక్కుబాయిలో శివయోగి, పాండవ నాటకంలో ధర్మరాజు పాత్రలు ఆయనకు అఖండమైన ప్రఖ్యాతిని చేకూర్చాయి.
చొప్పల్లి తొలినాటి చలనచిత్ర రంగంలో ప్రవేశించి సక్కుబాయి (1935) సినిమాలో శివయోగి పాత్రను, ద్రౌపదీ వస్త్రాపహరణం (1936) లో ధర్మరాజు పాత్రను, కచ దేవయాని (1938) లో శుక్రాచార్యుడుగా, రుక్మిణీ కళ్యాణంలో అగ్నిద్యోతనుడుగాను, మీరా బాయి (1940) లో రూపగోస్వామి మొదలైన పాత్రలు ధరించి కీర్తిని గడించాడు.
1929లో మద్రాసు ఆకాశవాణి కేంద్రంలో హరికథకుడిగా ప్రవేశించి అనేక హరికథ లను గానం చేశాడు. పండితుల చేత “హరికథా కంఠీరవ” అనే బిరుదును పొందారు.
   సశేషం
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -26-4-22-ఉయ్యూరు

Posted in సినిమా | Tagged | Leave a comment

మనమరపు వెనుక మన వెండి తెర మహానుభావులు –248

మనమరపు వెనుక మన వెండి తెర మహానుభావులు –248

248-తెలుగు నాటక రంగ రూప శిల్పి ,ఫణి,రాగరాగిణి నాటక ఫేం ,నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా విజిటింగ్ ఫాకల్టి,అగ్నిప్రవేశం ,స్టువర్ట్ పురం పోలీస్ స్టేషన్ సినీ ఫేం –అడబాల

అడబాల (ఫిబ్రవరి 9, 1936 – మార్చి 14, 2013) రంగస్థల నటుడు, రూపశిల్పి, లలిత కళా సమితిలో స్థాపక సభ్యుడు, రంగస్థల అధ్యాపకుడు.[1

ఈయన 1936, ఫిబ్రవరి 9 న తూర్పు గోదావరి జిల్లాలో జన్మించాడు. ఇతని తల్లిదండ్రులు సత్యమ్మ, వెంకన్ననాయుడు.

రంగస్థల ప్రస్థానం
నాటకరంగానికి రూపశిల్పిగా సుపరిచితులు. ఆ శాఖలో లోతుపాతులు కూలంకషంగా, శాస్త్రీయ పద్ధతులలో అధ్యయనం చేసి నైపుణ్యం సంపాదించాడు. జాతీయ స్థాయిలో నాటక విద్యాసంస్థల్లో విద్యార్థులకు ఆహార్యంలో మెళకువలు బోధించాడు. సీనియర్ మేకప్ ఆర్టిస్టులలో ఆడబాల ముఖ్యులు. ఈయన బి.ఏ పట్టభద్రుడు. డాక్టర్ గరికపాటి రాజారావు వద్ద నటనలోను, ఆదర్శ నాట్యమండలి, పాలకొల్లుకి చీఫ్ మేకప్ ఆర్టిస్టు అయిన మెషక్‌ వద్ద మేకప్‌లోనూ శిక్షణ పొందాడు.[2]

అడబాల బాల్యదశ నుండే నాటకాల్లో వేషాలు వేశాడు. విద్యార్థి దశలో భమిడిపాటి ఇప్పుడు అనే నాటికలో శానయ్య పాత్ర ధరించి శభాష్ అనిసించుకున్నాడు. 1940 నుంచీ పినిసెట్టి శ్రీరామమూర్తి నిర్వహించిన ఆదర్శ నాట్యమండలి పక్షాన ప్రదర్శించిన పల్లెపడుచు, అన్నాచెల్లెలు తదితర నాటకాల్లో పాల్గొన్నాడు. మద్రాస్లో రైల్వేశాఖ ఉద్యోగం కె. వేంకటేశ్వరరావు శిక్షణలో ర.స.న సమాఖ్యలో ఫణి, రాగరాగిణి వంటి ప్రతిష్ఠాత్మక నాటకాలలో పాల్గొన్నాడు. పలుచోట్ల ఉత్తమ నటుడిగానూ, హాస్య నటుడిగానూ బహుమతులు అందుకున్నాడు. 1966లో సికింద్రాబాద్ వచ్చిన అడబాల 1967లో ఆంధ్ర లలిత కళాసమితిని స్థాపించిన వ్యవస్థాపక సభ్యుడు. ఎ.ఆర్. కృష్ణ ఆధ్వర్యంలో చాలా నాటకాల్లో పాల్లొన్నాడు. అందులో ముఖ్యమైనది మాలపల్లి. నేరము- శిక్ష, కప్పలు, నీలా తెరలు, లేపాక్షి, ఆశ్రయం, అరణి, వీలునామా మొదలైన నాటకాలు, మానవుడు, పెళ్ళిచూపులు, పగ, అమ్మ, రాజీవం, రాతిమనిషి మొదలైన నాటికలు నటుడిగా అడబాలకు పేరు తెచ్చాయి. అడబాల కొన్ని టీవీ సీరియల్స్‌లో, అగ్నిప్రవేశం, స్టూవర్టుపురం పోలీసుస్టేషన్ మొదలైన చిత్రాల్లో కూడా నటించాడు. న్యూఢిల్లీలోని నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామాకి విజిటింగ్ ఫాకల్టీగా చేశాడు. ఉస్మానియా, హైదరాబాదు కేంద్రీయ విశ్వవిద్యాలయాల్లోని రంగస్థల కళల శాఖలో విజిటింగ్ లెక్చరర్ గా పనిచేశాడు. ఇతని శిక్షణలో అనేక మంది శిష్యులు ఆహార్యంలో నైపుణ్యం సంపాదించారు.

రూపశిల్పిగా
ఆదర్శ నాట్యమండలి నాటకాలకు అప్పట్లో మేకప్ చేస్తున్న మాస్టారు అడబాల అసక్తిని గమనించి, మేకప్ లో తొలి పాఠాలు నేర్పి ప్రోత్సహించాడు. ఆనాటి నుండి అటు నటన, ఇటు రూపశిల్పం రెండీంటినీ నిర్వహిస్తూ వచ్చాడు.

మరణం
ఈయన మార్చి 14, 2013న మరణించాడు.

249-చలం గారి తమ్ముడిభార్య ,బళ్ళారి రాఘవ పిలుపుతో సంప్రదాయం వదలి నాటక రంగ ప్రవేశం చేసి ,ప్రహ్లాద నాటక లీలావతి ఫేం,రాఘవతో కలిసి చంద్రగుప్త ,రామదాసు లలో నటించి ,రైతుబిడ్డ ,పెద్దమనుషులు సినీ ఫేం ,గాంధి డాక్యుమెంటరి వ్యాఖ్యాత –కొమ్మూరి పద్మావతీ దేవి

కొమ్మూరి పద్మావతీదేవి ( జూలై 7, 1908 – మే 9, 1970) తెలుగులో తొలితరం రంగస్థల నటి, కథా రచయిత్రి.

పద్మావతీదేవి చెన్నై లో 1908 జూలై 7 న సంఘసంస్కర్తల కుటుంబంలో జన్మించింది. ఈమె తల్లితండ్రులు సంఘసంస్కరణోద్యమంలో క్రియాశీలకంగా పనిచేస్తూ సంస్కరణ వివాహాం చేసుకున్నారు. వారి వివాహన్ని స్వయంగా కందుకూరి వీరేశలింగం పంతులు నిర్వహించారు. తల్లితండ్రులు పద్మావతిదేవికి చదువుతో పాటూ సంగీతం కూడా నేర్పించారు. పద్మావతిదేవికి 14 యేళ్ల వయసులో గుడిపాటి వెంకట చలం తమ్ముడు కొమ్మూరి వెంకటరామయ్యతో వివాహం జరిగింది. ఈమె కూమార్తె ఉషారాణి భాటియా కూడా రచయిత్రి.

తెలుగు నాటకరంగంలో మరో అధ్యాయానికి శ్రీకారం చుట్టిన బళ్ళారి రాఘవ రంగస్థలం పైకి సంసార స్త్రీలను ఆహ్వానించినప్పుడు ఈమె సంప్రదాయపు సంకెళ్ళను త్రెంచుకుని నాటకరంగం మీద కాలుపెట్టారు. ఈమె ప్రహ్లాద నాటకంలో లీలావతి పాత్ర పోషించేవారు. ఆమె రామదాసు, తప్పెవరిది, సరిపడని సంగతులు, చంద్రగుప్త, ఆ లోకం నుండి ఆహ్వానం మొదలైన నాటకాలలో రాఘవతో కలిసి సముచిత పాత్రలలో నటించారు. మహాత్మా గాంధీ డాక్యుమెంటరీ చిత్రంలో వ్యాఖ్యాతగా వ్యవహరించారు.

సినిమాల ప్రవేశంతో ద్రౌపదీ మానసంరక్షణం, రైతు బిడ్డ, సుమతి, పెద్ద మనుషులు చిత్రాలలో నటించారు. వీరు స్త్రీల సమస్యల మీద ఎన్నో రేడియో ప్రసంగాలు చేశారు.

మరణం
ఈమె చెన్నై లో 1970 మే 9 తేదీన పరమపదించారు.

250-ముదినేపల్లి పంచాయితీ ప్రెసిడెంట్ ,ఎక్సేల్సియర్ నాట్యమండలి ,నవభారత ,శ్యామల నాట్య మండలి స్థాపకుడు ,డైరెక్టర్ ,త్రిపురనేని వారి ‘’ఖూనీ ‘’నాటక ఫేం ,పల్లెటూరు ,పుట్టిల్లు ,పిచ్చిపుల్లయ్య సినీ ఫేం –కోడూరి అచ్చయ్య

కోడురి అచ్చయ్య చౌదరి ప్రముఖ రంగస్థల నటులు, దర్శకులు.

వీరు కృష్ణా జిల్లా గుడివాడ తాలూకా ముదినేపల్లిలో జన్మించారు. చిన్నతనం నుండి నాటకాలంటే సరదా పడి తీవ్రంగా కృషిచేశారు. వీరు నాటకరంగంలో ప్రవేశించేముందు కృష్ణాజిల్లా బోర్డు రాజకీయాలలో తనమునకలవుతూ వుండేవారు. ముదినేపల్లి పంచాయతీ బోర్డు అధ్యక్షునిగా సుమారు పన్నెండు సంవత్సరాలు వ్యవహరించారు.ముదినేపల్లిలో ఎక్సెల్షియర్ క్లబ్బును స్థాపించి దాని ఆధ్వర్యాన మూడేండ్లపాటు చెడుగుడు, బ్యాడ్‌మింటన్ పోటీలు నిర్వహించారు. అయితే గ్రామ రాజకీయాలతో విసుగు చెంది ఆయన ఆ రంగం నుండి తప్పుకుని తన దృష్టిని నాటకరంగంవైపు మళ్ళించారు[1].

నాటకరంగం
1939 ప్రాంతాలలో ఎక్సెల్షియర్ నాట్యమండలిని స్థాపించి తెలుగుతల్లి, ఆశాజ్యోతి, సత్యాన్వేషణం అనే సాంఘిక నాటకాలకు స్వయంగా దర్శకత్వం వహించి ఊరూరా ప్రదర్శింపచేశారు. అనేక షీల్డులు, ప్రశంసలు పొందారు. నిజానికి ఈయన బాల్యం నుండే నటునిగా పేరు పొందారు. తమ తొమ్మిదేళ్ల వయసులో వడాలి అగ్రహారం జగన్నాథస్వామి కళ్యాణోత్సవాలలో పెంజెండ్ర నాటక సమాజం వారు ప్రదర్శించిన కుశ లవ నాటకంలో రిహార్సల్ లేకనే లవుని పాత్రను అభినయించి సాటి నటబృందాన్ని ఆశ్చర్యచకితులను చేశారు. నాటక రచనలోని ప్రత్యక్షరం పూర్వాపరార్థాలు తెలుసుకుని పాత్ర స్వభావాన్ని అవగాహన చేసుకుని నాటకీయతలో పాత్రను సజీవంగా నిలపడం ఈయన ప్రత్యేకత. తాను స్థాపించిన ఎక్సెల్షియర్ నాట్యమండలిలో స్త్రీ పాత్రలు ధరించే అక్కినేని నాగేశ్వరరావు సినిమా రంగానికి వెళ్ళిపోవడంతో స్త్రీపాత్రలకు స్త్రీలను పెట్టుకుని నాటకాలాడడంలో వున్న సాధక బాధకాలను తట్టుకోలేమని భావించి ఆ నాట్యమండలినే రద్దు చేశారు. ఈయన కృష్ణాజిల్లా ప్రజా నాట్య మండలికి దర్శకుని బాధ్యతను నిర్వహించి మొదట సుంకర వాసిరెడ్డి రచించిన “ముందడుగు” నాటకాన్ని ప్రదర్శించారు. తర్వాత గుడివాడలో రావూరి రచించిన పరితాపం నాటకాన్ని తయారుచేసి ఆంధ్ర నాటక పరిషత్తులో ప్రదర్శించారు. ఈ సమయంలోనే మెరికల వంటి ఉత్తమ నటీనటులను ఈయన తీర్చిదిద్దారు. పెదపాలపర్రులో నవభారత నాట్యమండలి, గుడివాడలో శ్యామల నాట్యమండలులను వీరు స్థాపించారు. ఈ మండలులద్వారా అనేక సాంఘిక నాటకాలు ప్రదర్శించడమే కాక, త్రిపురనేని రామస్వామి చౌదరి గారి “ఖూనీ” నాటకాన్ని రంగస్థలిపై ప్రదర్శించి రక్తి కట్టించిన ఖ్యాతి దక్కించుకున్నారు. వీరు పిల్లల కోసం కొన్ని నాటికలు, పెత్తందారు, ధర్మచక్రం, విజయభేరి మొదలైన నాటకాలను స్వయంగా రచించారు.

సినిమా రంగం
వీరు చలనచిత్ర రంగంలో ప్రవేశించి పల్లెటూరు, పుట్టిల్లు, కన్నతల్లి, వయ్యారి భామ, లక్ష్మి, పరివర్తన, పిచ్చిపుల్లయ్య, బాల సన్యాసమ్మ కథ మొదలైన సినిమాలలో విభిన్నమైన పలు పాత్రలు ధరించారు. అయితే అక్కడి వాతావరణం నచ్చక సినిమా రంగంలో అన్ని అవకాశాలు వుండి కూడా, మిత్రులు బలవంతపెట్టినా ఆ రంగాన్ని విడిచిపెట్టి తిరిగి గుడివాడ వెళ్ళి అనేక నాటక సమాజాలకు దర్శకత్వం వహించారు.

సశేషం

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -25-4-22-ఉయ్యూరు

Posted in సినిమా | Tagged | Leave a comment

మనమరపు వెనుక మన వెండి తెర మహానుభావులు –247

మనమరపు వెనుక మన వెండి తెర మహానుభావులు –247
247-బెజవాడ రేడియో ప్రొడక్షన్ అసిస్టెంట్ ,బలిపీతం లో సినీ ప్రవేశం చేసి ,జంధ్యాలతో నాలుగుస్తంభాలాట ,ఆహానాపెల్లంటా,శ్రీవారికి ప్రేమలేఖలు వగైరాలలలో చొక్కాలు చి౦పుకొని తల గోడ కేసి కొట్టుకొని ,బ్రహ్మానందానికి ఆరగాఆరగా అరగుండు గీయించి,,వేలుతో సుత్తి కొట్టించుకొని ,శ్రీలక్ష్మి సంగీతం తో బాధపడినా బాలకృష్ణ అబ్బాయ్ కి   బాబాయ్ గా నవ్వించిన  –సుత్తి వీరభద్రరావు అనే మామిడిపల్లి వీరభద్రరావు
సుత్తి వీరభద్ర రావుగా ప్రసిద్ధిగాంచిన మామిడిపల్లి వీరభద్ర రావు (జూన్ 6, 1947 – జూన్ 30, 1988) తెలుగువారికి సుపరిచితమైన హాస్యనటుడు, రేడియో, నాటక కళాకారుడు.
బాల్యము
వీరభద్ర రావు తల్లిదండ్రులకు ఏకైక కుమారుడు, ప్రథమ సంతానం. అతనికి ఇద్దరు చెల్లెళ్ళు. స్వస్థలం గోదావరి జిల్లా. తండ్రి ఉద్యోగ నిమిత్తం విజయవాడకు తరలి వెళ్ళాడు. విజయవాడలో ఉన్న ఎస్.ఆర్.ఆర్ అండ్ సి.వి.ఆర్ కళాశాల నుండి పట్టభద్రుడయ్యాడు.
వృత్తి
చిన్నతనము నుంచి నాటక రంగం మీద వున్నా మక్కువతో, తండ్రి చూసిన ఉద్యోగావకాశాలను కాదనుకుని, నటుడిగా అటు నాటకాలలో, ఉద్యోగరీత్యా ఆకాశవాణిలో స్థిరపడ్డాడు. సరదాగా మిత్రుని దగ్గరకు వెళ్ళిన వీరభద్రరావుని మాదాల రంగారావు బలిపీఠం సినిమాతో చిత్రరంగ ప్రవేశం చేయించారు. మిత్రుడు, శ్రేయోభిలాషి జంధ్యాల దర్శకత్వములో వచ్చిన నాలుగు స్తంభాలాట చిత్రంతో చిత్రసీమలో స్థిరపడ్డాడు. 1988లో జంధ్యాల దర్శకత్వంలో వచ్చిన చూపులు కలసిన శుభవేళ చిత్రం ఆఖరి చిత్రం.
ఆకాశవాణి
ఆకాశవాణి నుండి ఎందరో కళాకారులు సినీ రంగానికి వెళ్ళి పేరు తెచ్చుకున్నారు. అలాంటివారిలో వీరభద్రరావు ఒకరు. అతనికి ‘ సుత్తి ‘ పదం పేరులో భాగమైంది. సినీరంగంలో చేరి 50కి పైగా చిత్రాలలో నటించాడు. ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో ప్రొడక్షన్ అసిస్టెంట్ గా చేరి రెండు దశాబ్దాలు నాటక విభాగంలో చాలాకాలం పనిచేశాడు. పనిచేసి 1980లో చిత్రపరిశ్రమలో చేరారు. 1988 జూన్ 30 న వీరభద్రరావు మదరాసులో కన్నుమూశారు.
చిత్రసీమ
ఇతడు నటించిన తెలుగు చిత్రాల పాక్షిక జాబితా:
1. నాలుగు స్తంభాలాట (1982)
2. మంత్రి గారి వియ్యంకుడు (1983)
3. మూడు ముళ్ళు (1983)
4. రెండుజెళ్ళ సీత (1983)
5. ఆనంద భైరవి (1984)
6. కాంచన గంగ (1984)
7. మెరుపు దాడి (1984)
8. శ్రీవారికి ప్రేమలేఖ (1984)
9. పుత్తడి బొమ్మ (1985)
10. స్వాతిముత్యం (1985)
11. చంటబ్బాయి (1986)
12. శాంతినివాసం (1986)
13. అహ! నా పెళ్ళంట! (1987)
14. రాక్షస సంహారం (1987)
15. చిన్ని కృష్ణుడు (1988)
16. చూపులు కలిసిన శుభవేళ (1988)
17. వివాహ భోజనంబు (1988)
మరణం
1988లో చూపులు కలసిన శుభవేళ చిత్రానికి హైదరాబాదు లోఒక పాటని చిత్రీకరిస్తున్నప్పుడు కాలు బెణికింది. మధుమేహంతో ఉన్న వీరభద్రరావు విశ్రాంతి తీసుకోవాలని డాక్టర్లు సూచించగా, చిత్రీకరణ పూర్తి అవ్వగానే విశ్రాంతి కోసం చెన్నైలోని ఒక ఆసుపత్రిలో చేరాడు. ఒక రాత్రి నిద్రకోసం ఇచ్చిన ఇంజక్షను వికటించి గుండెపోటు వచ్చింది. అవే అతని ఆఖరి క్షణాలు. అది 1988, జూన్ 30 తెల్లవారుఝామున జరిగింది.
సుత్తి గారబ్బాయి మామిడిపల్లి చక్రవర్తి చెప్పిన సుత్తిఅనే స్తుతి
అసలు మనం ఎవరం’… ‘తండ్రీ కొడుకులం’…‘కాదు భారతీయులం’.. ‘నీ నూనె నీ నూనే నా నూనె నా నూనే’… హైదరాబాద్, ముస్తాబాదు, సికిందరాబాదు’…‘నీ నవరంధ్రాల్లోను మైనం కూరతానురా తలకు మాసిన కుంకా’… ఇటువంటి అనేక హాస్య సంభాషణలతో తెలుగు చలన చిత్ర పరిశ్రమలో చిరస్థాయిగా నిలిచారు సుత్తి వీరభద్రరావు. ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో నాటక విభాగంలో హీరోగా నటించిన వీరభద్రరావు, జంధ్యాల మార్కు సినిమాలతో సుత్తి వీరభద్రరావుగా తెలుగు సినీ ప్రపంచంలో స్థిర పడి  పోయారు. వేలుతో కలిసి సుత్తి జంటగా ప్రేక్షకుల గుండెల్లో నేటికీ సుత్తి కొడుతూనే ఉన్నారు. నేడు(జూన్‌ 30)  సుత్తివీరభద్రరావు వర్థంతి. ఈ సందర్భంగా ఆయన కుమారుడు మామిడిపల్లి చక్రవర్తితో ఈ వారం సినీ పరివారం.
నాన్నగారికి మేం ఇద్దరు పిల్లలం. నేను, నా తరవాత చెల్లాయి విజయనాగలక్ష్మి. నా కంటె రెండేళ్లు చిన్నది. అమ్మ పేరు శేఖరి. నాన్నగారు 1971లో ఆలిండియా రేడియోలో చేరారు. నేను 1972లో పుట్టాను. నేను పుట్టాక నాన్నకు ప్రమోషన్‌ వచ్చిందని అందరితోనూ సంతోషంగా అనేవారట. మేం విజయవాడ కృష్ణలంకలో ఉండేవాళ్లం. సినిమాలలో నాన్న మామూలు వీరభద్రరావు నుంచి సుత్తి వీరభద్రరావు అయ్యాక అమ్మను అందరూ ‘సుత్తి ఆంటీ’ అని సరదాగా పిలిచేవారు. నాన్నకి సినిమా అవకాశాలు పెరగటంతో 1982లో ఆకాశవాణి ఉద్యోగం విడిచిపెట్టేసి  చెన్నై షిఫ్ట్‌ అయ్యాం. కాబట్టి ఎనిమిదో క్లాసు నుంచి చెన్నైలోనే నా చదువు కొనసాగింది. పదో తరగతిలో ఫస్ట్‌ క్లాసు వచ్చినందుకు నాన్న సంబరపడ్డారు.  నాన్న చనిపోయేనాటికి నేను ఇంటర్‌ సెకండియర్‌ చదువుతున్నాను. అమ్మ చాలా మొండి మనిషి. నాన్న మరణం తాలూకు బాధను దిగమింగి, ధైర్యంగా మమ్మల్ని ముందుకు నడిపించింది.
ఇద్దరిని పోగొట్టుకున్నాను
ఎమ్‌సెట్‌లో 3000 ర్యాంకు వచ్చినా మంచి కాలేజీలో సీటు రాలేదు. నాన్న కంప్యూటర్‌ సైన్స్‌ చదవమని చెప్పారు. అందులో సీటు రాకపోవటం తో, ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఉద్యోగం చేస్తూ,  నైట్‌ కాలేజీలో బీఎస్సీ ఫిజిక్స్‌ చదువుకున్నాను. నేను బీఎస్సీలో చేరినప్పుడు దగ్గరి బంధువులంతా ‘బోడి బీఎస్సీ’ అని వెటకారమాడారు. అటువంటి సంఘటనలు ఎదురైనప్పుడు ‘కొందరికి దూరంగా ఉంటేనే బాగుపడతాం’ అనిపించింది. కొద్దిగా స్థిరత్వం వచ్చాక, పై చదువుల కోసం అమెరికా వెళ్లి, అక్కడ పి.జి. డిప్లమా ఇన్‌ మేనేజ్‌మెంట్‌ చేసి, నిలదొక్కుకున్నాక, ఇండియా వచ్చేశాను. చెల్లి ఎమ్మెస్సీ మాథమేటిక్స్‌ చేశాక 2002లో వివాహం చేశాను. నా జీవితంలో త్వరగా నాన్నని పోగొట్టుకోవడం ఒక దురదృష్టమైతే, చెల్లిని పోగొట్టుకోవటం మరో బాధాకర సంఘటన. ఆమెకు బ్రెస్ట్‌ క్యాన్సరు వచ్చి కన్నుమూసింది. చెల్లెలికి ఒక కూతురు. పేరు తనుశ్రీ. పదో తరగతి చదువుతోంది.
బాధ్యతలు తీసుకున్నాను
నాన్న పోవడం వల్ల ఒక కొడుకు మీద బాధ్యతలన్నీ వచ్చి చేరతాయి. అందుకు నేను కూడా అతీతం కాదు. జీవితంలో ఒక్కో మెట్టు ఎదుగుతున్నప్పుడు నాన్నను మిస్‌ అయ్యాననే భావన కలుగుతూనే ఉంటుంది. అంతలోనే ఆయన వెంట ఉన్నట్టు భావించుకుంటాను. నా వివాహం జరిగాక, యు.కె వెళ్లి కొంతకాలం తరవాత వెనక్కు వచ్చి, 2008లో సొంత కంపెనీ ప్రారంభించాను. ప్రస్తుతం ‘ప్రొడక్ట్‌ సర్వీస్‌ మేనేజ్‌మెంట్‌’ చేస్తున్నాం.
విజయవాడలో…
విజయవాడలో ఉన్న రోజుల్లో నాన్న హనుమంతరాయ గ్రంథాలయంలో వేసే నాటకాలకు వెళ్లేవాడిని. కన్యాశుల్కం నాటకం చూసినట్టు గుర్తు. చెన్నైలో నాన్నతో గడిపిన నాలుగు సంవత్సరాలు నాకు గోల్డెన్‌ పీరియడ్‌. ఆ టైమ్‌లో సినిమా షూటింగులు, డబ్బింగులకు నాన్నతో వెళ్లేవాడిని.  శబరిమలకి వెళ్లినప్పుడు మా కారుకి ప్రమాదం జరిగింది. దేవుడి దయ వల్ల బయటపడ్డాం. అది నిజంగానే దేవుడి మహిమేనేమో అనిపిస్తుంది. నాన్నతో నాలుగు సార్లు శబరిమలకు వెళ్లడం మరచిపోలేని సంఘటన.
అందుకోసమే ఉండిపోయాం
నాన్న పోయేనాటికి నాన్నకు కొంతమంది సుమారు నాలుగు లక్షలు బాకీ ఉన్నారు. ఎవరెవరు ఇంతెంత ఇవ్వాలో నాన్న ఒక లిస్టు రాసి పెట్టారు. వాటిని తిరిగి రాబట్టుకోవటం కోసం చెన్నైలోనే ఉండిపోదాం అంది అమ్మ. నాలుగేళ్లు తిరిగితే మూడు లక్షలు తీసుకురాగలిగాను. పొద్దున్నే వెళ్లి నిర్మాతల దగ్గర నిలబడాల్సిందే. కొంతమంది నిర్మాతలు పరవాలేదు మరికొందరు ఇబ్బంది పెట్టారు.   ఆ అనుభవమే నా భవిష్యత్తుకు పునాది అనుకుంటాను. ఇదంతా చూసి, జంధ్యాలగారు బాధపడి, నిర్మాతల బదులు ఆయన ఇచ్చిన సందర్భాలూ ఉన్నాయి. అమ్మ స్నేహితులు సపోర్ట్‌గా నిలబడ్డారు.
దీపావళి నాన్నతోనే
నాన్న షూటింగుల్లో ఎంత బిజీగా ఉన్నా, దీపావళికి మాత్రం మాతోనే గడిపేవారు. ఉదయమంతా షూటింగ్‌లలో బిజీగా ఉన్నప్పటికీ, చీకటి పడకుండా ఇంటికి వచ్చేసేవారు. నాన్న నటించిన చిత్రాలలో ‘పుత్తడిబొమ్మ’ బాగా ఇష్టం. ఆ సినిమాలో పెళ్లిలో ఒక పద్యం చదువుతారు. చాలా నవ్వొస్తుంది. ఆ చిత్రానికి నాన్నకు అవార్డు కూడా వచ్చింది. ‘రెండు రెళ్లు ఆరు’, ‘బాబాయ్‌ అబ్బాయి’ చిత్రాలలో నాన్న తన పాత్రను ఇంప్రొవైజ్‌ చేశారు. ‘పడమటి సంధ్యారాగం’ చిత్రంలో నాన్న డబ్బింగ్‌ చెప్పిన విధానం బావుంటుంది. కళాకారుడు కష్టాలన్నీ మరచిపోయి, వేదిక మీద ఆనందం పొందుతాడు. ఆ తరవాత ఆ ఆనందం వారి మీద స్వారీ చేస్తుంది. అందువల్లే నాన్న ఆరోగ్యాన్ని అశ్రద్ధ చేసి ఉంటారు. ఏమైనప్పటికీ నాన్నను తలచుకోవటం నాకు ఆనందంగా ఉంది.
మా దగ్గరే ఉన్నారన్న భావన…
ఎన్నడూ బాధ్యతల నుంచి పారిపోలేదు. అమ్మ ఆశీర్వాదంతో ఇంటి బాధ్యతలన్నీ సక్రమంగా నెరవేర్చాను. నా భార్య పేరు కిరణ్మయి చావలి. తను ఆయుర్వేదిక్‌ డాక్టర్‌. మాకు ఒక అమ్మాయి. పేరు అనన్య. నాన్న సినిమాలు టీవీలో వస్తుంటే మా అమ్మాయికి చూపిస్తుంటాను. మేం ఆ సినిమాలు  చూస్తున్నంతసేపు నాన్న మా దగ్గరే ఉన్నారన్న భావన కలుగుతుంది. నా పుట్టినరోజు నాడు నాన్న సినిమా టీవీలో వస్తే నాన్న నన్ను ఆశీర్వదించినట్లు అనుభూతి చెందుతాను. నాకు క్రియేటివ్‌ ఫీల్డ్‌ మీద ఇంటరెస్ట్‌ ఉంది. అది బహుశ నాన్న ప్రభావం కావొచ్చు. కార్టూన్లు, స్కిట్స్‌ చేశాను. ఇది హాబీ మాత్రమే. ‘బాబాయ్‌ అబ్బాయ్‌’ చిత్ర షూటింగ్‌కి Ðð ళ్తున్నప్పుడు మొదటిసారి నాన్నతో విమానం ఎక్కాను. అది నా జీవితంలో మరచిపోలేని రోజు. ఆ చిత్రంలో నాన్న ‘సీతారామ సంగ్రామం’ ఘట్టంలో ఆడవేషం వేసి పాట పాడతారు. ఆ తరవాత నాన్నకి దండ వేయాలి. నన్ను వేయమన్నారు. ఆ దృశ్యం ఎప్పటికీ మరచిపోలేను.
– సంభాషణ: వైజయంతి పురాణపండ
ఫొటోలు: షేక్‌ రియాజ్, ఏలూరు
  సశేషం
మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -25-4-22-ఉయ్యూరు

Posted in సినిమా | Tagged | Leave a comment

ఆత్మ లింగ శతకం

ఆత్మ లింగ శతకం
‘’శ్రీ మదనంత సనాతన అచల బోధ సిద్ధాంత సద్గురు దత్తాత్రేయ పర౦ప రాచార్యులైన ఆకుల గురు మూర్తి యోగీంద్ర విరచిత ‘’ఆత్మ లింగ శతకం విజయనగర రామానుజ ముద్రాక్షర శాల లో ముద్రింపబడింది .125పద్యాల ఈశతకం ఎప్పుడు ముద్రి౦పబడిందో ,వెల ఎంతో తెలియదు .కవి గారి విశేషాలు లేవు..’’అఖిల జీవన సంగ ఆత్మలింగ ‘’అనేది మకుటం .అన్నీ గీత పద్యాలే .
‘’శ్రీ పరశివ నీదు శృంగారతత్వంబు –నీ మహీ తలంబు నెచ్చు గాను -నేను చెప్పబూన నేర్చితి నీ కృప –నఖిల జీవన సంగ యాత్మ లింగ ‘’అని కవి శతకం మొదలుపెట్టి ,తానేమీ శాస్తజ్నుడను ,పండితుడినికాదని ,వంకలు ఎంచకుండా ఆదరం గా చూడమని కోరాడు .మొదట జగములేక మూడు రేకుల చెట్టు –తుదనుకొమ్మలైదుతూగులాడి-కొమ్మకోమ్మలందు కోటి కాయలు గాచే ‘’అన్నాడు తాత్వికంగా .పత్రం పుష్పం ఫలం వేరు కూడా లేవు .అది వేత్తలకు కూడా తెలీని రహస్యం .మాయకు మూలం లేదు తెలియరాదుకూడా .మమత తో మద అహంకారాలుపుట్టాయి .పంచ వన్నెల పంజరం లో మంచి చిలుక మఠం తీర్చి ,మాణిక్యాలమాటల మూటలు పలుకుతుంది .ముక్తి కాంత చిక్కులు పెడుతుంది .అల్పమతులకు చిక్కదు.చూపు మనసులో పెట్టి చూడాలి .రెండుకొండలమధ్య రేవతి అనే చుక్క ,చుక్క మధ్యలో సుధపురం , పురం లో పురహరుడు కనిపిస్తాడు .
ధారణా దారి తెలిసిన యోగి ,మేరువు చేరి మేను మరచి ,తానుతాను అనే తలపే మర్చి ,పొతే మళ్ళీ జన్మించడు .’’తోలు కొండ దీని తొమ్మిది వందలు –గండుపులులు చుట్టూ గాచి యుండు –కొండ శిఖరమందు కోమలి యొకతుండు’’.అదికామరూపి దాన్ని కామించి ,కొండేక్కిపులుల వాత బడ్డారు ‘’అని అన్యాపదేశంగా చెప్పాడు .నల్లతామరాకు మధ్య రంధ్రం లో కుండలుపెట్టి పాము గుడ్లు పెట్టి –రెండు పిల్లల్ని ఈని రాత్రి పగలు అరుస్తోంది .అదే అఖిల వేదార్ధం .వాటం తెలిసి మాయ మాతను దాటాలి .విషయ గుణాలలో ఉన్నది విషమే .ఏదైనా ఏకాగ్ర చిత్తం తో చేస్తేనే చెల్లుబాటవుతుంది .తత్వ వేత్త అల్ప తలపు లేకుండా నిత్యం ఒకే రీతిగా నిజసమాధిలో ఉంటాడు .
కాయ సిద్ధికోరి ,గహనాలు చేరి ,వాయు భక్షణం చేస్తే ,మాయతనువు మట్టి పాలౌతుంది .’’బంటు లింద్రియములు పనులెల్ల జేయంగ –మనసు మంత్రిగాను ,మసలు చుండు –తననుతాను గన్న తత్వంబు తద్రూపు ‘’అంటాడు .ఆత్మజ్ఞానం అనే అగ్నిలో కాలితే తత్వవేత్త తనువూ భూ సమాధి తప్పక చేయాలి .యోగిది నిద్ర కాదు నిర్వికల్ప సమాధి .కఠిననమనస్కులకు ఆచలయోగం అంటుకోదు .తుదీ మొదలూ లేదు తుర్యమూ తానుకాదుఅదీ పరమాత్మ రూపం .’’తన్ను తానూ గనదు –తానేది గనబోడు-మూర్చ నొందబోదు –మూర్ఖులకందదు .జడలుపెంచి జపతపాలు చేసినా అందుకోలేరు .కారణం శివుడు ,కార్యం జీవుడు .
చివరగా ‘’మంగళము మీకు మహిప్రకాశ –మంగళంబు జేసి మరిమరి మ్రొక్కెద
అవని నా కవిత్వ మాచంద్ర తారార్క-మగు విధంబుగాను నార్య మీకు –సమర్పణంబు జేసి యానంద మొందితి’’అంటూ కవి అచల బోధతత్వాన్ని నింపిన ఈ ఆత్మ లింగ శతకాన్ని పూర్తీ చేశాడు .
గహనమైన వేదాంతాన్ని అరటిపండు వొలిచి చేతిలో పెట్టినట్లు రాసిన ఆకులగురుమూర్తి సత్కవి యోగీంద్రుడు ధన్యుడు .చదివి మనమూ ధన్యత చెందుతాం .ఈకవినీ, శతకాన్ని పరిచయం చేసే అదృష్టం నాకు దక్కింది .
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -24-4-22-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Leave a comment

మనమరపు వెనుక మన వెండి తెర మహానుభావులు –245

మనమరపు వెనుక మన వెండి తెర మహానుభావులు –245
245- నాటక సత్యభామ ఫేం ,రామదాసు తానీషా దేవదాసుధర్మన్న ,వస్త్రాపహరణ ,విదురుడు గా సినీ ఫేం-ఆరణి సత్యనారాయణ
ఆరణి సత్యనారాయణ (అరణి సత్యనారాయణ) (1898 నవంబరు 11 – 1969 జూలై 2) తెలుగు సినిమా, రంగస్థల నటుడు. తెలుగు సినిమా ప్రారంభ కాలంలో కొన్ని సినిమాలలో నటించాడు. [1
జీవిత విశేషాలు
అతను 1898లో గుంటూరు జిల్లా సంగడి గుంట గ్రామంలో జన్మించాడు. అతను 1912లో తన 14వ యేట గయోపాఖ్యానం నాటకంలో సత్యభామ పాత్రలో నటించాడు.
మూకీ సినిమాల కాలంలో తెలుగు సినిమా రంగంలోకి ప్రవేశించాడు. అతనిని 1921లో ఆర్.ఎస్.ప్రకాష్ చిత్రసీమకు పరిచయం చేసాడు. తరువాత అతను ఘంటసాల బలరామయ్య నిర్మించిన రామదాసు (1933) (‘దేవదాసు’లో ధర్మన్న పాత్రధారి) సినిమాలో నటించాడు. [2] అతను 1936లో సరస్వతి టాకీస్ నుండి వచ్చిన ద్రౌపది వస్త్రాపహరణం సినిమాలో నటించిన విదురుని పాత్రకు గుర్తింపు పొందాడు.
అతను కనకతార, బాలయోగిని, ధర్మాంగద, రత్నమాల, లైలా మజ్ను చిత్రాలలో వివిధ పాత్రలలో నటించాడు.
అతను వినోదా పిక్చర్స్ లో అకౌంటెంత్ గా చేరాడు. వినోదా పిక్చర్స్ సినిమాలైన దేవదాసు, శాంతి సినిమాలలో నటించాడు.
సినిమాలు

  1. రామదాసు (1933) …. తానీషా
  2. బాలయోగిని (1936/I)
  3. ద్రౌపది వస్త్రాపహరణం (1936) … విదురుడు
  4. కనకతార (1937)
  5. చంద్రిక (1940)
  6. రత్నమాల (1947)
  7. ధర్మాంగద(1949)
  8. లైలా మజ్ను(1949)
  9. శాంతి (1952)
  10. దేవదాసు (1953) …. ధర్మన్న
    సశేషం
    మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -24-4-22-ఉయ్యూరు
    మనమరపు వెనుక మన వెండి తెర మహానుభావులు –246
    246-నటుడు నిర్మాత ,విక్రమార్క్ విజయం ,రాజద్రోహి నిర్మాణ ఫేం –పింజల సుబ్బారావు
    పింజల సుబ్బారావు ప్రసిద్ధి చెందిన చలనచిత్ర నిర్మాత. ఇతని స్వస్థలం మచిలీపట్నం.

సినిమారంగం
1957లో ఇతడు సినిమాలలో నటించాలని మద్రాసు చేరుకున్నాడు. ఐదేళ్లపాటు పలు చిత్రాలలో చిన్నచిన్న వేషాలు వేశాడు. ఆ తర్వాత శ్రీకృష్ణా ఫిలిమ్స్ సంస్థలో ప్రొడక్షన్ అసిస్టెంట్‌గా చేరి రామాంజనేయ యుద్ధం, సతీ సుకన్య చిత్రాలకు పనిచేశాడు. తరువాత కొంతకాలం చిత్రాల క్రయవిక్రయాది వ్యాపారాలు చేశాడు. పిమ్మట చలనచిత్ర నిర్మాణరంగంలో ప్రవేశించాడు[1].
ఇతడు నిర్మించిన సినిమాలు:

  1. రాజద్రోహి
  2. హంతకులొస్తున్నారు జాగర్త
  3. రణభేరి
  4. పేదరాశి పెద్దమ్మ కథ
  5. లక్ష్మీ కటాక్షం
  6. సుగుణసుందరి కథ
  7. విక్రమార్క విజయం
  8. రౌడీలకు రౌడీలు
  9. పిల్లా? పిడుగా?
  10. సీతాకళ్యాణం
  11. సీతారామ వనవాసం
  12. అడవి మనుషులు
  13. లక్ష్మీపూజ
  14. మహాశక్తి
  15. త్రిలోక సుందరి
  16. రాణీ ఔర్ జాని (హిందీ)
  17. యే రిస్తీ నా తుహై (హిందీ)
    సశేషం
    మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -24-4-22
Posted in సినిమా | Tagged | Leave a comment

మనమరపు వెనుక మన వెండి తెర మహానుభావులు –242,243,244

మనమరపు వెనుక మన వెండి తెర మహానుభావులు –242,243,244
242,-243,244-నటన నాట్యాలతో నాలుగు భాషలలో అలరించిన ‘’ట్రావెంకూర్ సిస్టర్స్ ‘’-లలితా ,పద్మిని ,రాగిణి
ట్రావెన్‌కోర్ సిస్టర్స్ అంటే మలయాళం, తమిళం, తెలుగు, హిందీ మరియు కన్నడ చిత్రాలలో నటీమణులు, నృత్యకారులు మరియు ప్రదర్శకులు అయిన లలిత, పద్మిని మరియు రాగిణి ముగ్గురిని సూచిస్తుంది.
ట్రావెన్‌కోర్ సోదరీమణులు గురు గోపీనాథ్ మరియు గురు T. K. మహాలింగం పిళ్లై వద్ద నృత్యం నేర్చుకున్నారురాగిణి క్యాన్సర్‌తో 1976లో మరియు లలిత 1982లో మరణించారు. పద్మిని 2006లో మరణించారు. భారతీయ వార్తాపత్రికలలో డజన్ల కొద్దీ సినిమాలు మరియు కథనాలు మినహా వారికి సంబంధించిన కొన్ని పత్రాలు మిగిలి ఉన్నాయి. ట్రావెన్‌కోర్ సోదరీమణులు తిరువనంతపురంలోని పూజప్పురాలోని ‘మలయ కాటేజ్’ అనే ఉమ్మడి కుటుంబంలో పెరిగారు. ట్రావెన్‌కోర్ సోదరీమణులు ప్రముఖ అందాల సుందరి నారాయణి పిళ్లై కుంజమ్మకు మేనకోడళ్లు, ఆమె కందమఠానికి చెందిన కులీన భూస్వామి కేశవ పిళ్లైని వివాహం చేసుకోవడానికి అనుకూలంగా ట్రావెన్‌కోర్ రాజును తిరస్కరించింది మరియు ఆమె ద్వారా నటి సుకుమారి తల్లి సత్యభామ అమ్మ మరియు ట్రావెన్‌కోర్ రాజకుటుంబానికి సంబంధించినది. వీరికి ట్రావెన్‌కోర్ సోదరీమణులు అనే పేరు వచ్చింది. ఉదయ్ శంకర్ తాను చేయాలనుకుంటున్న డ్యాన్స్ ఆధారిత చిత్రంలో నటించడానికి సోదరీమణులను చెన్నై (అప్పటి మద్రాస్)కి పిలిచాడు. పద్మిని మరియు ఆమె సోదరీమణులు ప్రముఖ భారతీయ నృత్యకారుడు గురు గోపీనాథ్ శిష్యులు.
కుటుంబానికి మాతృస్వామ్య అధిపతి కార్త్యాయిని అమ్మ, వీరి భర్త చేరాలా అలియాస్ ‘పెనాంగ్ పద్మనాభ పిళ్లై’ లేదా P K పిళ్లైకి చెందిన పాలకున్నతు కృష్ణ పిళ్లై, వీరికి ఆరుగురు కుమారులు ఉన్నారు, వీరిలో సత్యపాలన్ నాయర్ (బేబీ) అనేక ప్రారంభ మలయాళ చిత్రాలకు ప్రముఖ నిర్మాత. మరో కుమారుడు రవీంద్రన్ నాయర్ కుమార్తె లతికా సురేష్ మలయాళ టీవీ కార్యక్రమాలకు ప్రముఖ నిర్మాత. వారు 1955 ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్‌లో ప్రదర్శించారు
13.
242-లలిత
ఈమె 1930, డిసెంబరు 12న కేరళ రాష్ట్రానికి చెందిన ట్రవన్కోర్ సంస్థానంలో తిరువనంతపురంలో గోపాలపిళ్లె, సరస్వతి అమ్మలకు జన్మించింది. ఈమె 1938లో అదిథన్ కనవు అనే తమిళ చిత్రంద్వరా సినిమా రంగప్రవేశం చేసింది. ఈమె తెలుగు, మళయాలం, తమిళ, హిందీ చిత్రాలలో నటించింది. ఈమె చెల్లెళ్లు పద్మిని, రాగిణులు కూడా నర్తకులుగా, సినీనటులుగా రాణించారు. ఈమె తన సోదరీమణులతో కలిసి వెంపటి చినసత్యం వద్ద కూచిపూడి నృత్యం నేర్చుకుంది[2]. ఈమె తన సోదరీమణులకంటే ముందుగా సినిమా రంగంలో ప్రవేశించింది. ఎక్కువగా మలయాళ సినిమాలలో నటించి వ్యాంపు పాత్రలలో ఎక్కువ పేరు సంపాదించింది. సినిమా నటి శోభన ఈమె మేనకోడలు. ఈమె 1983లో మృతి చెందింది
విడుదలైన సంవత్సరం సినిమా పేరు ఇతర నటులు దర్శకుడు
1943 పతిభక్తి
పి.ఎస్.శ్రీనివాసరావు, దాసరి సుబధ్ర పి.ఎస్.శ్రీనివాసరావు
1950 బీదలపాట్లు
చిత్తూరు నాగయ్య, పద్మిని
కె.రామనాథ్
1951 పెళ్లికూతురు
ఎన్.ఎస్.కృష్ణన్, పద్మిని ఎన్.ఎస్.కృష్ణన్
1952 కాంచన
కె.ఆర్.రామస్వామి, పద్మిని, ఎం.ఆర్.సంతానలక్ష్మి ఎస్.ఎమ్.శ్రీరాములు
1952 సింగారి
టి.ఆర్.రామచంద్రన్, పద్మిని, రాగిణి
1953 అమ్మలక్కలు
ఎన్.టి.రామారావు,పద్మిని,బి.ఆర్.పంతులు
డి.యోగానంద్
1953 ఒక తల్లి పిల్లలు
శ్రీరాం, టి.ఎస్.దొరైరాజ్, పద్మిని, పి.శాంతకుమారి ఎ.ఎస్.ఎ. స్వామి
1953 దేవదాసు
అక్కినేని నాగేశ్వరరావు, సావిత్రి
వేదాంతం రాఘవయ్య
1955 అంతా ఇంతే
శివాజీ గణేశన్, పద్మిని, రాగిణి
ఆర్.ఎం.కృష్ణస్వామి
1955 విజయగౌరి
ఎన్.టి. రామారావు,పద్మిని,రాగిణి డి.యోగానంద్
1960 శివగంగ వీరులు
ఎస్.వరలక్ష్మి,కమలా లక్ష్మణ్, ఎం.ఎన్.రాజం
1961 విప్లవ స్త్రీ
ఆనందన్, ఎం.ఆర్.రాధా,పండరీబాయి
ఎం.ఎ.తిరుముగం
దేవదాసు లో చంద్రముఖి పాత్రకు లలితా జీవం పోసి చిరస్థాయి తెచ్చింది .సానుభూతి పొందే పాత్ర .
243-పద్మిని
పద్మిని ప్రముఖ సినిమా నటి, నర్తకి. ఈమె భరతనాట్యంలో శిక్షణ తీసుకుంది. ఈమె, ఈమె సోదరీమణులు లలిత, రాగిణి ముగ్గురూ కలిసి ట్రావన్‌కోర్ సిస్టర్స్గా ప్రసిద్ధి చెందారు.
ఈమె 1932, జూన్ 12వ తేదీన జన్మించింది. ఈమె తొలిసారి తన 14వయేట కల్పన అనే హిందీ సినిమాలో నర్తకిగా నటించింది. తరువాత 30 సంవత్సరాలు తెలుగు, తమిళ, హిందీ, మళయాల భాషలలో సుమారు 250 సినిమాలలో నటించింది. ఈమె శివాజీ గణేశన్, ఎం.జి.రామచంద్రన్, ఎన్.టి.రామారావు, రాజ్‌ కపూర్, షమ్మీ కపూర్, ప్రేమ్‌ నజీర్, రాజ్‌కుమార్, జెమినీ గణేశన్ వంటి పెద్ద నటులతో కలిసి నటించింది. ఎక్కువగా శివాజీ గణేశన్‌తో 59 చిత్రాలలో నటించింది[1].
ఈమె అమెరికాలో స్థిరపడిన రామచంద్రన్ అనే డాక్టరును 1961లో వివాహం చేసుకుని తాత్కాలికంగా నటనకు విరామం ఇచ్చి కుటుంబ జీవితంపై, భరతనాట్యంపై దృష్టిని కేంద్రీకరించింది. 1977లో న్యూ జెర్సీలో శాస్త్రీయ నృత్యశిక్షణ కొరకు పద్మిని స్కూల్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ అనే పేరుతో ఒక డ్యాన్స్ స్కూలును ప్రారంభించింది. ప్రస్తుతం ఈ స్కూలు అమెరికాలోని భారత శాస్త్రీయ నృత్య శిక్షణా సంస్థలలో అతి పెద్దదిగా పేరుపొందింది. సినిమా నటి శోభన ఈమె మేనకోడలు.
ఈమె చెన్నై లోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ 2006, సెప్టెంబరు 24 తేదీన గుండెపోటుతో మరణించింది
14.
15.
విడుదలైన సంవత్సరం సినిమా పేరు ఇతర నటులు దర్శకుడు
1950 తిరుగుబాటు
సి.హెచ్. నారాయణరావు, శాంతకుమారి
పి.పుల్లయ్య
1950 బీదలపాట్లు
చిత్తూరు నాగయ్య, లలిత
కె.రామనాథ్
1951 ఆడ జన్మ
సి.హెచ్. నారాయణరావు, బి.ఎస్.సరోజ జి.ఆర్. రావు
1951 చంద్రవంక
కాంచన్, కనకం
1951 పెళ్లికూతురు
ఎన్.ఎస్.కృష్ణన్, లలిత ఎన్.ఎస్.కృష్ణన్
1952 కాంచన
కె.ఆర్.రామస్వామి, లలిత ఎస్.ఎం.శ్రీరాములు
1952 ధర్మ దేవత
శాంతకుమారి, రేలంగి వెంకట్రామయ్య
పి.పుల్లయ్య
1952 సింగారి
టి.ఆర్.రామచంద్రన్, లలిత, రాగిణి
1953 అమ్మలక్కలు
ఎన్.టి.రామారావు, లలిత
డి.యోగానంద్
1953 ఒక తల్లి పిల్లలు
టి.ఎస్.దొరైరాజు, లలిత ఎ.ఎన్.ఎ.స్వామి
1953 ప్రపంచం
చిత్తూరు నాగయ్య, జి.వరలక్ష్మి
ఎస్.ఎల్.రామచంద్రన్
1954 అమర సందేశం
అమర్‌నాథ్, శ్రీరంజని
ఆదుర్తి సుబ్బారావు
1955 అంతా ఇంతే
శివాజీ గణేషన్, లలిత, రాగిణి ఆర్.ఎం.కృష్ణస్వామి
1955 విజయగౌరి
ఎన్.టి.రామారావు, లలిత, రాగిణి డి.యోగానంద్
1956 అమరజీవి
శివాజీ గణేషన్, సావిత్రి
టి.ప్రకాశరావు
1956 సాహస వీరుడు
ఎం.జి.రామచంద్రన్, పి.భానుమతి డి.యోగానంద్
1958 వీరప్రతాప్
శివాజీ గణేశన్
టి.ప్రకాశరావు
1959 గొప్పింటి అమ్మాయి
శివాజీ గణేశన్, రాజసులోచన
1959 వీరపాండ్య కట్టబ్రహ్మన
శివాజీ గణేశన్, ఎస్.వరలక్ష్మి
బి.ఆర్.పంతులు
1960 దేసింగురాజు కథ
ఎం.జి.రామచంద్రన్, పి.భానుమతి
పి.ఆర్.రఘునాథ్
1961 అనుమానం
శివాజీ గణేశన్
కృష్ణన్ – పంజు
1961 కత్తిపట్టిన రైతు
ఎం.జి. రామచంద్రన్
ఎ.ఎస్.ఎ.స్వామి
1961 కన్యకా పరమేశ్వరీ మహత్మ్యం
శివాజీ గణేశన్
ఎ.ఎస్.ఎ.స్వామి
1961 మాయా మశ్చీంద్ర
నిరూపా రాయ్
బాబూభాయ్ మిస్త్రీ
1962 ఏకైక వీరుడు
ఎం.జి.రామచంద్రన్, అంజలీదేవి
నటేశన్
1962 స్త్రీ జీవితం
శివాజీ గణేశన్, రాగిణి
ఆర్.ఎస్.మణి
1963 రాణీ సంయుక్త
ఎం.జి.రామచంద్రన్, రాగిణి డి.యోగానంద్
1966 మోహినీ భస్మాసుర
ఎస్వీ.రంగారావు, కాంతారావు
బి.ఎ.సుబ్బారావు
1967 ముద్దు పాప
శివాజీ గణేశన్ కె.ఎస్.గోపాలకృష్ణ
1967 వసంత సేన
అక్కినేని నాగేశ్వరరావు
బి.ఎస్.రంగా
1968 విజయకోట వీరుడు
జెమినీ గణేశన్, వైజయంతిమాల
ఎస్.ఎస్.వాసన్
1969 రాజ్యకాంక్ష
జెమినీ గణేశన్, రాగిణి
జి.విశ్వనాథం
244-రాగిణి
భారతీయ సినిమానటి, నర్తకి. ఈమె ట్రావన్‌కోర్ సిస్టర్స్ గా ప్రసిద్ధి చెందిన లలిత, పద్మిని, రాగిణిలలో చివరి సోదరీమణి.
ఈమె 1937, మార్చి 27న కేరళ రాష్ట్రానికి చెందిన ట్రవన్కోర్ సంస్థానంలో తిరువనంతపురంలో గోపాలపిళ్లె, సరస్వతి అమ్మలకు జన్మించింది. ఈమె తెలుగు, మలయాళం, తమిళ, హిందీ చిత్రాలలో నటించింది. అనేక నాటకాలలో కూడా నటించింది. ఈమె అక్కలులలిత, పద్మినిలు కూడా నర్తకులుగా, సినీనటులుగా రాణించారు. ఈమె తన సోదరీమణులతో కలిసి వెంపటి చినసత్యం వద్ద కూచిపూడి నృత్యం నేర్చుకుంది[1]. సినిమా నటి శోభన ఈమె మేనకోడలు. ఈమె మాధవన్ థంపిని వివాహం చేసుకుంది. ఈ దంపతులకు లక్ష్మి, ప్రియ అనే కుమార్తెలు కలిగారు. ఈమె భర్త ఈమెను వదిలి 1974లో అమెరికా వెళ్ళాడు. కానీ ఈమె కేన్సర్‌ బారిన పడ్డ తరువాత తిరిగి వచ్చాడు. ఈమె బ్రెస్ట్ క్యాన్సర్‌తో బాధపడుతూ 1976లో మృతిచిందింది.12:26 22-04-2022
  విడుదలైన సంవత్సరంసినిమా పేరుఇతర నటులుదర్శకుడు1952సింగారిటి.ఆర్.రామచంద్రన్, లలిత, పద్మిని1955అంతా ఇంతేశివాజీ గణేశన్డి.యోగానంద్1957వరుడు కావాలిజగ్గయ్య, పి.భానుమతి,అమర్‌నాథ్పి.ఎస్.రామకృష్ణారావు1958పులి చేసిన పెళ్లిసత్యం, ముత్తయ్యపి.భాస్కరన్1961స్త్రీ జీవితంశివాజీ గణేశన్,పద్మినిపి.భాస్కరన్1963రాణీ సంయుక్తఎం.జి.రామచంద్రన్, పద్మినిడి.యోగానంద్1965చలాకీ పిల్లశ్రీరాం, టి.ఆర్.రామచంద్రన్, తంగవేలుకె. సోము1969రాజ్యకాంక్షజెమినీ గణేశన్, పద్మినిజి.విశ్వనాథం1974కోటివిద్యలు కూటికొరకేనగేష్, లక్ష్మికె.బాలచందర్
  సశేషం
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -22-4-22-ఉయ్యూరు

Posted in సినిమా | Tagged | Leave a comment

మనమరపు వెనుక మన వెండి తెర మహానుభావులు –241

1. మనమరపు వెనుక మన వెండి తెర మహానుభావులు –241
2. 241-చరిత్ర కారుడు నటుడు ,ఒకరోజు రాజు సినీ దర్శక ఫేం –ఆమంచర్ల గోపాలరావు
3. ఆమంచర్ల గోపాలరావు (1907 – 1969) స్వాతంత్ర్య సమరయోధులు, చరిత్రకారులు, చలనచిత్ర దర్శకులు.
4. వీరు సెప్టెంబరు 26 తేదీన కావలిలో జన్మించారు. బి.ఎ., బి.ఎల్. పట్టాలను పొందారు. వీరు 1921లో సహాయ నిరాకరణ ఉద్యమంలో ఖద్దరు విక్రయించి కార్యకర్తగా పనిచేశారు. 1930లో ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొని జైలు శిక్షను అనుభవించారు. 1942లో క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్నారు. 1952లో ఆంధ్రోద్యమంలో స్వామి సీతారాంలో కలిసి తీవ్రంగా కృషిచేశారు.బెజవాడ గోపాల రెడ్డ్ సమకాలికులు
5. గుంటూరు జిల్లా యూత్ లీగ్ నాయకత్వం వహించాడు .1952లో ప్రత్యెక ఆంద్ర ఉద్యమంలో పని చేశాడు
6.    మంచి రచయిత గోపాలరావు  మాట పట్టింపు, మల్లమ్మ ఉసురు, అపరాధి మొదలైన నాటికలను, హిరణ్య కశిపుడు, విశ్వంతర మొదలైన నాటకాలను రచించారు. కొన్ని హిందీ చలనచిత్రాలకు సహాయ దర్శకులుగా పనిచేశారు. తెలుగులో కాలచక్రం (1940), ఒక రోజు రాజు (1944) అనే చిత్రాలకు దర్శకత్వం వహించారు. కొన్ని సినిమాలకు కళా దర్శకులుగా పనిచేశారు. హిందీ సినిమాలకూ అసిస్టెంట్ డైరెక్టర్ గా చేశాడు
7. చిత్రకళలో ప్రత్యేకంగా ప్రకృతి దృశ్య చిత్రణ అంటే వీరికి ప్రత్యేకమైన అభిమానం అజంతా, ఎల్లోరా శిల్పాల గురించి అనేక వ్యాసాలు రాశారు. లేపాక్షి దేవాలయ కుడ్య చిత్ర సంపదను గూర్చి ఆంగ్లంలో ఒక గ్రంథాన్ని రచించారు.
8. ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో అసిస్టెంట్ ప్రొడ్యూసర్ గా’’కార్మికుల కార్యక్రమం లో  కొంతకాలం పనిచేశారు.
9. మరణం
10. వీరు 1969 ఫిబ్రవరి 7 తేదీన పరమపదించారు
11. సశేషం
12. మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -22-4-22-ఉయ్యూరు

Posted in సినిమా | Tagged | Leave a comment

కన్నడ సృజనాత్మక సాహిత్య సృష్టికర్త -పంజే మంగేష్ రావు -5(చివరిభాగం )

కన్నడ సృజనాత్మక సాహిత్య సృష్టికర్త -పంజే మంగేష్ రావు -5(చివరిభాగం )
పంజే రాసిన సముదాయం లో 14గద్యరచనలు ,కధలు ఉన్నాయి .పురాణ శ్రవణ స్వాతిశయం ,ఒక వైద్యుడు వైద్యం కోసం గ్రామాలకు వెళ్లి అందమైన వంటలక్క ను ఏర్పాటు చేయమని అడగటం అది బెడిసికొట్టటం .మోటుహాస్యం తోకూడా రాశాడు .భార్యపై అనుమాన పడ్డ భర్త కనువిప్పు ఆమె ఎలా కలిగించిందో ఒక కథ .విజయ నగర సామ్రాజ్యం లో జరిగిన ఒక కథ ,ఔరంగజేబు కాలం నాటి శైలిని కథ ,దుర్గావతి ,దీవగిరికి చెందిన వీరమతి వంటి వాటిలో సాహసం ,ప్రేమ అచంచల త్యాగం చూపాడు .చండికా రహస్య సమాజ లో దేవి చౌదరాణి గురించి చెప్పాడు .
  అబద్ధపు దినచర్య ఆయన ఇన్స్పెక్టర్ గా ఉన్న అనుభవాలు .ప్రభుత్వ అధికారులు పాములు జెర్రులు కొండ చిలువలు అని ఉపాధ్యాయ లోకం అనుకొంటుంది . ఇన్స్పెక్టర్ మాత్రం అపాయం లేని వాళ్ళు వాళ్ళ దృష్టిలో .నల్లజాతి వారిని అంటే హరిజనులను అభివృద్ధిలోకి తీసుకు రావాలని ఆయన దృక్పధం .రకరకాల ఉపాధ్యాయులు వారి బోధనా గురించి వివరించాడు .మంచి ఉపాధ్యాయులు , వారికి సమాజం ఇచ్చే గౌరవం కళ్ళకు కట్టించాడు .
  ప్రకీర్ణాలు
అక్షరాభ్యాస పుస్తకాలు రేఖా చిత్రాలు కథలు కూడాపంజే రాశాడు శిశుసాహిత్యం లో .వీటిని మాక్మిలన్ కంపెని  బాసెల్ మిషన్ బాలసాహిత్య మండలి ప్రచురించాయి .బాసెల్ వాళ్ళు కోరినట్లు ఆంగ్ల –కన్నడ నిఘంటువు పరిష్కరించి విస్తరించాడు .దీనిఆదాయంతో మంగుళూరు లోని గణపతి పాఠశాలలో జిల్లాస్థాయి శిశు సమ్మేళనం జరిపాడు .అప్పటికి ఇదే మొదటిది .కిట్టెల్ రాసిన కన్నడ –ఇంగ్లీష్ నిఘంటు పరిశోధనా చేసి వెయ్యి పదాలు అదనంగా చేర్చగలిగాడు .శబ్ద మణి దర్పణం కు చేసిన పరిష్కరణ అత్యుత్తమమైనది .
  ఉపాధ్యుడుగా ,ఇన్స్పెక్టర్ గా ఉన్నప్పుడు పంజే విద్యా విషయ పత్రిక ఒకటి నడిపాడు .ఉపాధ్యాయులకు విద్యా బోధనా గురించి ,సామాన్యులకు బడులలో విద్యా బోధన ఎలా జరుగుతుందో తెలుసుకోవటానికి వ్యాసాలూ రాసేవాడు రాయి౦చేవాడు .బోధన అంటే ఏమిటి అనే మొదటిపుస్తకాన్ని దక్షిణ కన్నడ జిల్లా ప్రాధమిక పాఠ శాలనుంచి ప్రచురించాడు .శిక్షణ కన్నా బోధన అనే పదం విస్త్రుతమైన్దికనుక ఆయనకు బాగా నచ్చినది .బెత్తాలవాడకం ఇష్టపడేవాడు కాదు .
  కవిత్వం
పంజే రాసిన గీతాలు శ్రవణానందంగా ఉంటాయి .సరళసుందర భాష ,రీతి ,అవసరమైతే నీతి ఉంటాయి .హృదయాలను కరిగించే గీతాలు రాశాడు .ఆయన ‘’దక్షిణపు గాలి ఆట’’ కు మించినది కన్నడ సాహిత్యం లో లేనే లేదు .హోలేయర హాడు ‘’అంటే మాలవారి గీతాలలో దీన జన స్థితినిని చూపేవి .మేము యాచకులం కాదు మాకు ఏవి కావాలో ఇవ్వాల్సిన బాధ్యత మీది. లేకపోతె మేమే లాక్కో వాల్సి వస్తుంది అంటూ వారిలో చైతన్యం చూపించాడు .దేశభక్తి రగుల్కొల్పే ప్రబోధ గీతాలెన్నో రాశాడు .
విద్యకు సరైన వాతావరణం కల్పించటం ,ప్రతిభను గుర్తించి ప్రోత్సహించటం ,విద్యారంగ వాతావరణాన్ని శుద్ధి చేయటం ,వ్యక్తిత్వ వికాసం కలిపించటం ,అందర్నీ సమానంగా చూసే సహృదయత ,బీదల దళితుల దీనుల ను ఉన్నత విద్యావంతులతో ,శిష్యులతో సమానంగా చూడటం ,సృజనాత్మక శక్తి పెంపొందించటం లో ఆనాడు మంగుళూరులో పంజే మంగేష్ రావు ,మైసూర్ లో టి ఎస్ . వెంకణ్ణయ్య ప్రాతస్మరణీయులుగా నిలిచారు .
  ఆధారం –వి సీతారామయ్య కన్నడ రచనకు శ్రీ ఆర్వియెస్ సుందరం గారి తెలుగు అనువాద పుస్తకం –పంజే మంగేష రావు .
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -23-4-22-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

కన్నడ సృజనాత్మక సాహిత్య సృష్టికర్త -పంజే మంగేష్ రావు -4

కన్నడ సృజనాత్మక సాహిత్య సృష్టికర్త -పంజే మంగేష్ రావు -4
కన్నడ సాహిత్య సమ్మెళన అధ్యక్షుడు
1929ను౦చి సాహిత్యకారులు పంజే ను కన్నడ సాహిత్య సమ్మెళన అధ్యక్షుడు
గా ఉండమని కోరుతూనే ఉన్నారు .చాలాకాలం ఒప్పుకోలేదు చివరకు మంగుళూరు వెళ్లి బ్రతిమాలి ఒప్పించారు .పాత హైదరాబాద్ రాష్ట్రం లోని రాయచూర్ లో జరిగిన సమావేశానికి ఆయన చేసిన అధ్యక్షోపన్యాసం అందర్నీ మెప్పించింది .ప్రాచీన మధ్యయుగ ఆధునిక కవితారీతుల్ని ఆయన గొప్పగా విశ్లేషించాడు .భవిష్యత్తు గురించి అందంగా ఆశగా భావించాడు .ధ్వని ,లయ గురించి సోదాహరణ ప్రసంగం చేశాడు .ధార్వాడ ,హైదరాబాద్ లలో ఆయన చేత ఉపన్యాసాలిప్పి౦చి స్పూర్తి కలిగించారు .ఆయన ఆంగ్లపాఠం చెబితే మరపురాని అనుభూతిగా ఉండేది .
చివరి రోజులు
తగినంత పెన్షన్ వస్తోందికనుక చివరి రోజులు హాయిగా గడిచాయి పిల్లలంతా సెటిలయ్యారు .పెద్దకొడుకు పని చేసే జంషెడ్ పూర్ ,చిన్నకొడుకు పని చేసే పాట్నా కూడా ఆయనకు నచ్చలేదు .హైదరాబాద్ లో రెండవ కొడుకు దగ్గర ఉండటానికి ఇష్టపడ్డాడు .ఇది పిల్లలకు అందుబాటులో ఉండే ప్రదేశం అని ఆయన అనుకొన్నాడు అలాగే 25-10-1937 న పంజే మరణించిన రోజు పిల్లలందరూ దగ్గరే ఉన్నారు .మాస్తి గారి తనకిష్టమైన పద్యాన్ని ఎప్పుడూ చదువుకొనేవాడు –దాని అర్ధం –ఇంక ఈవూరికి పగళ్ళు లేవు .తన రోజు దగ్గరైందని కళ్ళుమూసుకొని ,ఇంకనాకు చాలు అని చల్లబడింది .కన్నడాన్ని అమితంగా ప్రేమించే సారస్వత కొంక ణీయుడిని కన్నడ దేశం కోల్పోయింది .1974లోఫిబ్రవరి 8-9తేదీలలో పంజే శతజయంతి జరిపారు .ఆయన పుట్టిపెరిగిన బంత్వాల్ లో స్మారక ఫలకం నిర్మించారు .మంగుళూరు లోనూ ఘనంగా ఉత్సవాలు జరిపారు .ఆయనపై స్మారక సంపుటం ‘’తె౦కణ గాళి’’అంటే దక్షిణ గాలి ప్రచురించారు ‘ .
రచనా సర్వస్వం
చిన్నప్పుడే పంజే పత్రికలకు మారుపేర్లతో రాసేవాడు ‘’హరటమల్ల ‘’అంటే వదరుబోతు పేరుతోసారస్వత విమర్శన వ్యాసాలూ రాసేవాడు .ఇది అప్పటికి కొత్త సాహిత్య ప్రక్రియ .పానుగంటి వదరుబోతు వ్యాసాలూ మనకు గుర్తుకు వస్తాయి .సువాసిని పత్రికలో ఆయనవే ముఖ్య రచనలు .ఆయన పెట్టుకొన్న ‘’కవిశిష్య ‘’పేరు దేశమంతా మారుమోగింది .
ఆయన శతజయంతి సందర్భంగా వెలువడిన ఆయన రచనలు సాహిత్య విమర్శ,ప్రశంస ఉన్నవి .చారిత్రిక విశేషాలు శాసనాధారంగా రాసినవీ ఉన్నాయి .నాగరుల రాజధాని ని సంగీతపురమనీ ,భల్లాట పురం అనీ అనేవారట .సాళ్వదేవరాయలు ,విద్యానందుడు గురించి తెలియని విషయాలు తెలిపాడు .కన్నడ బయ్య నుంచి సంస్కృత ‘’భైర’’వచ్చిందన్నాడు .భారతేశ వైభవం పుస్తకం లో ఆడంబర శైలి కనిపిస్తుంది .సాళ్వరాసిన ‘’రసరత్నాకరం ‘’అలమ్కారగ్రంధం ,కోటీశ్వరుని ‘’జీవంధర షట్పది లో ఆనాటి భావ ధోరణలు వెలికి తీశాడు .ధన్యకుమార చరిత ‘’లో 1450నాటి రచయిత ఆదియప్ప గురించి రాశాడు .జైన వేమన్న ,పార్తీ సుబ్బా ,నందలికే లక్ష్మీ నారాయణప్ప యక్షగానాలు రాశారని వివరించాడు .భట్టాలకుని శబ్డాను శాసనం కు ముందుమాటగా బిలిగి లోని ఒకశాసనం ఉందన్నాడు .
కన్నడ సాహిత్యం లో రావాల్సిన మార్పుల్ని ‘’హాసదారి ‘’అంటే కొత్తమార్గం లో వివరించాడు .నారణప్ప కన్నడ భారతం ,లక్ష్మీశుని జైమిని భారతం సర్వజ్నుని ‘’ఓ నామ పధ్ధతి లో ఉన్న వయోజన విద్యా విజ్ఞానాలను తెలిపాడు .నారాయణప్ప భారతానికి నరసింహా చార్ తో,జైమిని భారతానికి శ్రీ కంఠయ్య తో కలిసి సంపాదకత్వం వహించాడు .కుమార వ్యాస భారతం భామిని షట్పది లో రాసిన వాటిలొఅత్యుత్తమమైన్ది .కృష్ణునిపై భక్తితో ‘’కృష్ణ రాయన చరిత ‘’అని పేరుపెట్టాడు .మనీషి అయిన శ్రీ కృష్ణ చరితం ఇది .మధ్యయుగ సాహిత్యం లో దీన్ని మించింది లేదు .అలాగే నందలికే లక్ష్మీ నారాయణ గురించికూడా పంజే విశిష్టంగా రాశాడు .రామాశ్వమేథ కూడా అలాంటి గొప్పరచనే .సాహిత్య విలువలున్న గద్య రచన .ఓనామ పద్ధతిలో సర్వజ్ఞుని త్రిపదలు పెద్దలకు పిన్నవారికీ ఎలా విద్యా విజ్ఞాన బోధకాలో మహా గొప్పగా వివరించాడు .
పదార్ధం అంటే ఏమిటి సరదారచన ..బీల్కోడు వ్యంగ్యరచన .పొగాకు గురించి గొప్పరచన చేశాడు .అక్బర్ సభలో కొందరుపోగాకు ని నిషేధించాలి అంటే బీర్బల్ ‘’దానికి ఒకటే శిక్ష .ఎప్పుడు పొగాకు కంటికి కనిపించినా ,దాని తలవైపు నిప్పు ముట్టించి ,అది కాలి పొగ ,నుసి అయ్యేదాకా మనం చూడాలి హుజూర్ ‘’అన్నాడట పాదు షాతో సహా అందరు కడుపు చక్కలయ్యేట్లు నవ్వకేం చేస్తారు .అదే పంజే రాసిన ‘ధూమ్రతత్వపు తత్వమసి ‘’ .అలాగే ‘’రైతి ‘’పదం ఎలా ఏర్పడుతుందో సరదాగా చెప్పాడు –‘’పెళ్లి అయిపోయి చాలారోజులైనా , అల్లుడి స్నేహితులు మామగారింట్లో తిష్ట వేస్తె ,పిల్లమేక తల్లి మేక పొదుగును అందుకోలేక ,దాని గడ్డం కింద ఉన్న పొదుగులుపట్టుకొని వేలాడినట్లు వర్ణమాల నేర్పించటానికి ‘’రైతి ‘’చెబుతారు అన్నాడు .టిబెట్ ను ‘’టాప్ హాట్ ‘’అనే దానినుంచి ,ఎవరెస్ట్ ను ఎవర్ అనేదానికి సూపర్లేటివ్’’ తమ’’ చేరిస్తే ఎవరెస్ట్ వచ్చినట్లు వస్తువులపెర్లు స్థల నామాలు ఎలా వస్తాయో సాధించి చూపించాడు .
సశేషం
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -22-4-22-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

మనమరపు వెనుక మన వెండి తెర మహానుభావులు –238

మనమరపు వెనుక మన వెండి తెర మహానుభావులు –238

238-పౌరాణికనాటక కర్త ,సినిమా సంభాషణ ,పాటల కర్త,రామాంజనేయ ,కృష్ణా౦జ నేయఫెం –తాండ్ర సుబ్రహ్మణ్యం

తాండ్ర సుబ్రహ్మణ్యం నాటక రచయిత, సినిమా రచయిత.

రచనలు

  1. పతితపావన (సాంఘిక నాటకం)
  2. కృష్ణగారడి[1] (పౌరాణిక నాటకం)
  3. జెండాపై కపిరాజు (నాటకం)
  4. సతీసులోచన (నాటకం)
  5. శ్రీరామాంజనేయ యుద్ధం (నాటకం)[2]
  6. శ్రీకృష్ణాంజనేయ యుద్ధం (నాటకం)[3]
  7. మహిషాసురమర్ధని (నాటకం)[4]
  8. భీమార్జున గర్వభంగం[5]
  9. శకుంతల

సినిమాలు

  1. పతిభక్తి
  2. భీమాంజనేయ యుద్ధం
  3. శ్రీకృష్ణాంజనేయ యుద్ధం
  4. పార్వతి విజయం
  5. నాగార్జున
  6. సతీ తులసి [6]
  7. మహారథి కర్ణ
  8. మనమరపు వెనుక మన వెండి తెర మహానుభావులు –239

239-చట్టానికి కళ్లులేవు సినీ ఫేం దర్శకుడు –ఎస్.ఎ.చంద్ర శేఖర్

ఎస్.ఎ.చంద్రశేఖర్ ఒక భారతీయ చలనచిత్ర దర్శకుడు, నిర్మాత, నటుడు, రచయిత. ఇతడు ముఖ్యంగా తమిళ చిత్రాలకు పనిచేశాడు.[3] ఇతడు సట్టం ఒరు ఇరుత్తరై (1981) అనే తమిళ సినిమాకు తొలిసారిగా దర్శకత్వం వహించాడు.[4] ఇతడు వేట్రి, నాన్ సిగప్పు మనిధన్, ముత్తం, సట్టం ఒరు ఇరుత్తరై వంటి అనేక విజయవంతమైన సినిమాలను తీశాడు.

వ్యక్తిగత జీవితం
ఎస్.ఎ.చంద్రశేఖర్ తమిళనాడు రాష్ట్రంలోని, రామేశ్వరం నగరంలోని “తంగచిమదం” అనే ప్రాంతానికి చెందినవాడు.[2] ఇతడు కర్ణాటక సంగీత కళాకారిణి శోభను వివాహం చేసుకున్నాడు. ఆమె కూడా కొన్ని సినిమాలకు దర్శకత్వం వహించింది. కొన్ని సినిమాలలో పాటలు పాడింది. కొన్ని సినిమాలకు కథను సమకూర్చింది. ఇతని కుమారుడు విజయ్ కూడా తమిళ సినిమా నటుడు, గాయకుడు.[5] ఇతని దర్శకత్వంలో వెలువడిన “నాలయ తీర్పు” అనే సినిమాతో విజయ్ వెండితెర జీవితాన్ని ప్రారంభించాడు. ఇతని కుమార్తె విద్య రెండేళ్ల వయసులోనే మరణించింది.[6] ఇతని సమీప బంధువులు ఎస్.ఎన్.సురేందర్ నేపథ్య గాయకుడిగా, విక్రాంత్ నటుడిగా సినిమాలలో పనిచేస్తున్నారు.

సినిమా రంగం
ఇతడు తమిళ, తెలుగు, కన్నడ, హిందీ భాషలలో 70కి పైగా సినిమాలకు దర్శకత్వం వహించాడు. నిర్మాతగా ఏడు చలన చిత్రాలను నిర్మించాడు. 17 తమిళ సినిమాలకు కథను అందించాడు. 44 సినిమాలకు స్క్రీన్‌ప్లే వ్రాశాడు. అంతే కాక 15 సినిమాలలో నటించాడు కూడా. ఇతడు తెలుగులో “చట్టానికి కళ్లులేవు”, “బలిదానం”, “పల్లెటూరి మొనగాడు”, “దేవాంతకుడు”, “దోపిడి దొంగలు”, “ఇంటికో రుద్రమ్మ” సినిమాలకు దర్శకత్వం వహించాడు. ఇతని సినిమాలలో విజయ కాంత్, విజయ్, రజనీకాంత్, చిరంజీవి, శోభన్ బాబు, విష్ణువర్ధన్, అంబరీష్, శంకర్ నాగ్, మిథున్ చక్రవర్తి, జితేంద్ర, ధనుష్ మొదలైన హీరోలు నటించారు. విజయశాంతి, రోహిణి, త్రిష, ముచ్చర్ల అరుణ, ఆరతి, మేఘనా నాయుడు, రాధిక, పూనమ్ కౌర్, రంభ, ప్రియాంక చోప్రా, అభిరామి, మీనా, సిమ్రాన్ మొదలైన నటీమణులు ఇతని సినిమాల్లో నటించారు. ఇతడు ఎక్కువగా విజయకాంత్, విజయ్‌లతో సినిమాలు తీశాడు. ఇతని కుమారుడు విజయ్ ఇతని దర్శకత్వంలో 16 పైచిలుకు సినిమాలలో నటించాడు. ఎస్. శంకర్, ఎం.రాజేష్, పొన్‌రామ్‌, రజినీ మురుగన్ తదితరులు ఇతని వద్ద సహాయకులుగా పనిచేసి ఆ తరువాత దర్శకులుగా రాణించారు.[7][8]

వివాదాలు
ఇతడు ఒక ఆడియో రిలీజింగ్ ఫంక్షన్‌లో వివాదాస్పద వ్యాఖ్యలు చేసి వార్తలకెక్కాడు. తిరుపతి దేవస్థానంలో ప్రజలు దేవునికి ముడుపుల పేరుతో లంచం ఇస్తున్నారని, భగవంతుడు భక్తుల కోరికలన్నీ తీర్చేటట్టయితే ఇక ఎవరూ చదువుకోవలసిన అవసరం లేదని ఇతడు చేసిన వ్యాఖ్యలు దుమారం లేపాయి. హిందు మున్నాని అనే సంస్థ ఇతని వ్యాఖ్యలు హిందువుల మనోభావాలను దెబ్బతీసేవిగా ఉన్నాయని, ఇతనిపై చర్యలు తీసుకోవాలని పోలీస్ కమీషనర్‌కు ఫిర్యాదు చేసింది. పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకోకపోవడంతో హిందూ మున్నాని హైకోర్టును ఆశ్రయించింది. హైకోర్ట్ న్యాయాధికారి ఇతనిపై కేసు నమోదు చేయవలసిందిగా పోలీసులను ఆదేశించాడు[9].

సశేషం

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -22-4-22-ఉయ్యూరు

  1. మనమరపు వెనుక మన వెండి తెర మహానుభావులు –240
  2. 240-చలన చిత్ర నటుడు రచయిత,దేవాంతకుడు ఫేం –తోటపల్లి మధు
  3. తోటపల్లి మధు తెలుగు చలనచిత్ర రచయిత, నటుడు. చిరంజీవి కథానాయకుడిగా 1984లో వచ్చిన దేవాంతకుడు చిత్రం ద్వారా రచయితగా తెలుగు చలనచిత్రరంగంలోకి అడుగుపెట్టాడు.[1][2]

జననం
మధు 1963, ఫిబ్రవరి 27న విజయవాడలో జన్మించాడు.

సినిమారంగ ప్రస్థానం
చిరంజీవి కథానాయకుడిగా 1984లో వచ్చిన దేవాంతకుడు చిత్రం ద్వారా 19 ఏళ్ల వయసులోనే రచయితగా తెలుగు చలనచిత్రరంగంలోకి అడుగుపెట్టిన మధు 190కి పైగా చిత్రాలకు కథ, మాటలు అందించాడు.[3] 45 సినిమాలలో విలన్ పాత్రలు పోషించాడు.

రచయితగా

  1. వెంకటా ఇన్ సంకట (2009)
  2. మహారథి – కథ, సంభాషణలు (2007)
  3. 123 (2002)
  4. హనుమాన్ జంక్షన్ – సంభాషణలు (2001)
  5. అంకుల్ – సంభాషణలు (2000)
  6. కృష్ణ బాబు – సంభాషణలు (1999)
  7. కంటే కూతుర్నే కను- సంభాషణలు (1998)
  8. పెళ్ళిపందిరి – సంభాషణలు (1997)
  9. మమా బాగున్నావా – సంభాషణలు (1997)
  10. రాయుడుగారు-నాయుడుగారు – సంభాషణలు (1996)
  11. రాముడొచ్చాడు – సంభాషణలు (1996)
  12. మాయా బజార్ – సంభాషణలు (1995)
  13. శుభమస్తు – సంభాషణలు (1995)
  14. రిక్షావోడు – సంభాషణలు (1995)
  15. అల్లరి పోలీస్ – సంభాషణలు (1994)
  16. బంగారు కుటుంబం – సంభాషణలు (1994)
  17. అల్లరి అల్లుడు – కథ, సంభాషణలు (1993)
  18. చిత్రం భళారే విచిత్రం – సంభాషణలు (1992)
  19. ప్రెసిడెంటు గారి పెళ్ళాం – సంభాషణలు (1992)
  20. మామగారు – సంభాషణలు (1991)
  21. కలికాలం – సంభాషణలు (1991)
  22. అంకుశం – సంభాషణలు (1990)
  23. భలే దంపతులు – సంభాషణలు (1989)
  24. సాక్షి – సంభాషణలు (1989)
  25. యముడికి మొగుడు – సంభాషణలు (1988)
  26. కొత్త పెళ్ళికూతురు – సంభాషణలు (1985)
  27. శ్రీ షిర్డీ సాయిబాబా మహత్యం – సంభాషణలు (1985)
  28. డాకు – సంభాషణలు (1984)
  29. దేవాంతకుడు – సంభాషణలు (1984)

నటుడిగా[మార్చు]
· సోడ గోలీసోడ (2018)

  1. నా లవ్ స్టోరీ (2018)
  2. యాత్ర (2019)
  3. గల్ఫ్ (2017)
  4. గౌతమ్ నంద (2017)
  5. పటేల్ సర్ (2017)
  6. సుప్రీమ్ (2016)
  7. శ్రీశ్రీ (2016)
  8. నాన్న నేను నా బాయ్‌ఫ్రెండ్స్ (2016)
  9. సినిమా చూపిస్త మావ (2015)
  10. మహారథి (2007)
  11. అల్లరి పిడుగు (2005)
  12. లక్ష్మీనరసింహా (2004)
  13. మాయా బజార్ (1995)

సశేషం

మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -22-4-22-ఉయ్యూరు

Posted in సినిమా | Tagged | Leave a comment

మల్ల మార్తాండ ,కలియుగ భీమ,ఇండియన్ హెర్క్యులస్  కోడి రామ మూర్తి నాయుడు

మల్ల మార్తాండ ,కలియుగ భీమ,ఇండియన్ హెర్క్యులస్  కోడి రామ మూర్తి నాయుడు

— కోడి రామ్మూర్తి నాయుడు (1882 – 1942) ఆంధ్రరాష్ట్రానికి చెందిన ప్రముఖ వస్తాదు, మల్లయోధులు.[1][2] ఇరవయ్యో శతాబ్దపు తొలి దశకాల్లో ప్రపంచ ఖ్యాతి గాంచిన తెలుగువారిలో అగ్రగణ్యులు. శ్రీకాకుళం జిల్లా వీరఘట్టంలో జన్మించారు.[3]

బాల్యము
తెలుగు దేశంలో ప్రఖ్యాత తెలగ వీర యోధ వంశాలలో కోడి వారి వంశం ఒకటి, ఈ వంశ పరంపరలోని శ్రీ కోడి వెంకన్న నాయుడు వీరి తండ్రి. చిన్నతనంలోనే తల్లిని కోల్పోయి, తండ్రి ప్రేరణతోవిజయనగరంలో తన పినతండ్రి కోడి నారాయణస్వామి దగ్గర పెరిగారు. అక్కడ ఒక వ్యాయామశాలలో చేరి దేహ ధారుడ్యాన్ని పెంచుకోవడంతో పాటు కుస్తీ కూడా నేర్చుకున్నారు. 21 సంవత్సరాల వయసులోనే ఇతడు ఛాతి పై 1 1/2 టన్నుల భారాన్ని మోసేవాడు. తరువాత 3 టన్నుల భారాన్ని కూడా మోయగలిగాడు. మద్రాసులో సైదాపేట కాలేజిలో ఒక సంవత్సరం వ్యాయామశాలలో శిక్షణ తీసుకుని విజయనగరానికి తిరిగి వచ్చి విజయనగరం శిక్షణ తర్వాత వ్యాయామోపాధ్యాయుడుగా సర్టిఫికేట్ అందుకుని, విజయనగరంలో తాను చదివిన హైస్కూలులో వ్యాయామ శిక్షకుడుగా చేరాడు.* విజయనగరం జిల్లా వెబ్ సైటులో కోడి రామ్మూర్తిని గురించిన వ్యాసం

సర్కస్ కంపెనీ
విజయనగరంలో పొట్టి పంతులు అనే మిత్రుని సహకారంతో సర్కస్ కంపెనీ నెలకొల్పాడు. తుని రాజాగారి నుండి సంపూర్ణ సహకారం లభించింది. రామమూర్తి సర్కస్ సంస్థ పలుచోట్ల ప్రదర్శనలిచ్చి మంచిపేరు తెచ్చుకున్నది. తెలుగు జిల్లాల్లో ప్రదర్శనల తర్వాత 1912లో మద్రాసు చేరాడు. పులులు, ఏనుగులు, గుర్రాలు, చైనా, జపాన్ కళాకారుల సహకారం ఆయనకు లభించాయి. రామమూర్తి ప్రదర్శనలు అందరినీ ఆకర్షించాయి. శరీరమునకు కట్టిన ఉక్కు గొలుసును, ఊపిరితిత్తులలో గాలిని పూరించుకుని ముక్కలుగా తుంచి వేశాడు. రెండు కార్లను రెండు భుజాలకు ఇనుప గొలుసులతో కట్టించుకునేవాడు. కార్లను శరవేగంగా నడపమనేవాడు. కార్లు కదలకుండా పోయేవి. ఛాతీ పై పెద్ద ఏనుగును ఎక్కించుకునేవాడు. 5 నిమిషాల పాటు, రొమ్ముపై ఏనుగును అలాగే ఉంచుకునేవాడు. తండోపతండాలుగా ప్రజలు వారి ప్రదర్శనలు చూచేవారు.

ప్రముఖులు ఇచ్చిన బిరుదులు[మార్చు]
పూనాలో లోకమాన్య తిలక్ గారి కోరిక మేరకు ప్రదర్శనలిచ్చాడు. తిలక్ రామమూర్తిగారికి మల్లమార్తాండ, మల్లరాజ తిలక్ బిరుదములిచ్చారు. విదేశాలలో భారత ప్రతిభను ప్రదర్శించమని ప్రోత్సహించాడు తిలక్.
హైదరాబాద్ లో ఆంధ్రభాషా నిలయం పెద్దలు ఘనసత్కారం చేసి జగదేకవీర బిరుదమిచ్చారు.
అప్పటి వైస్రాయి లార్డ్ మింటో, రామమూర్తిగారి ప్రదర్శనలను చూడాలని వచ్చాడు. రామమూర్తి అప్పట్లో ఆంజనేయ ఉపాసనలో వుండినందున పది నిమిషాలు వేచాడు. రామమూర్తి ప్రదర్శనలను చూచి ముగ్ధుడయ్యాడు. తానే పరీక్షించాలనుకుని తన కారును ఆపవలసిందని కోరాడు. కారులో కూర్చుని లార్డ్ మింటో కారును నడపసాగాడు. త్రాళ్ళతో కారును తన భుజాలకు కట్టుకున్నాడు. అంతే, కారు ఒక సెంటీమీటర్ కూడా కదలక పోయింది. ఈ సంఘటనతో వైస్రాయి ప్రశంసలను, దేశమంతటా గొప్ప పేరును సంపాదించాడు రామమూర్తి నాయుడు.
అలహాబాదులో అఖిల భారత కాంగ్రెస్ సభ జరిగింది. రామమూర్తి సర్కస్ అక్కడ ప్రదర్శనలిచ్చింది. జాతీయ నాయకులెందరో చూచి ఆనందించారు. పండిత మదనమోహన మాలవ్యా ఎంతగానో మెచ్చుకున్నారు. విదేశాలలో ప్రదర్శనలివ్వమని ప్రోత్సహించారు.
విదేశాలలో ప్రదర్శన
సర్కస్ కంపెనీ బాగా పెరిగింది. రామమూర్తిగారు 1600 మంది గల తన బృందంతో లండన్ వెళ్ళి ప్రదర్శనలిచ్చారు. సుప్రసిద్ధ మల్లుడైన గామా పహిల్వాన్ తమ్ముడు ఇమామ్‌ బక్షీ ఆ బృందంలో వుండేవాడు.

లండన్లో రాజదంపతులు జార్జిరాజు, రాణి మేరి, రామమూర్తిగారి ప్రదర్శనలను చూచి తన్మయులయ్యారు. రామమూర్తిగారిని తమ బక్కింగి హామ్‌ రాజభవనానికి ఆహ్వానించి, విందు ఇచ్చిన తర్వాత ‘ఇండియన్ హెర్కులస్’ బిరుదంతో సత్కరించారు. ఆ విధంగా బ్రిటిష్ రాజదంపతులచే, గౌరవింపబడిన భారతీయులలో మొదటి వాడు కోడి రామమూర్తి నాయుడు. రామమూర్తి గారు ఫ్రాన్స్, జర్మనీ, స్పెయిన్ దేశాలలో పలు ప్రదర్శనలిచ్చారు.

స్పెయిన్ దేశంలో ‘కోడె పోరాటం’ (బుల్ ఫైట్) చాలా ప్రసిద్ధమైంది. ఈ పోరాటం చాల భీకరంగా ఉంటుంది. రామమూర్తిగారిని ఆ పోరులో పాల్గొనమన్నారు. అట్టి పోరాటంలో ఏలాటి అనుభవంలేని రామమూర్తిగారు ‘ సరే ‘ అన్నారు. రామమూర్తిగారు రంగంలో దుకారు. దూసుకుని వస్తున్న కోడె కొమ్ములను పట్టుకుని క్షణాల్లో క్రింద పడవేశారు. కోడెచిత్తుగా పడిపోయింది. వేలాది ప్రేక్షకుల హర్షధ్వానాలతో స్టేడియం మార్మోగింది.

జపాన్, చైనా, బర్మాలలో రామమూర్తిగారి ప్రదర్శనలు ఎంతో వైభవంగా సాగాయి.

బర్మాలో వున్నపుడు రంగూన్లో ప్రదర్శనలిచ్చారు. అసూయగ్రస్తులు కొందరు రామమూర్తిగారిని చంపాలనుకున్నారు. ఎలాగో ఈ విషయం గ్రహించిన రామమూర్తిగారు ప్రదర్శనను ఆపి మరుసటి రోజే మాతృదేశం వచ్చారు. కోడి రామమూర్తిగారు కోట్లు గడించారు. అంత కంటే గొప్పగా దాన ధర్మాలకు, జాతీయోద్యమాలకు ఖర్చు చేశారు.

భారతదేశం అంతటా రామమూర్తిగారి పేరు ప్రతిధ్వనించింది. అమెరికా వెళ్ళాలనుకున్నారు. కాని వెళ్ళలేదు. ప్రతిరోజూ పత్రికల్లో రామమూర్తిగారి ప్రశంసలుండేవి. రామమూర్తి నాయుడుగారు పండిత మదన మోహన మాలవ్యాగారి అతిథిగా ఏడాదిపాటు బెనారస్ లో ఉన్నారు. ఆయన శాకాహారి. భారతదేశంలో అతి విశిష్టమైన వ్యాయామ విద్యాసంస్థను ప్రారంభించాలనుకున్నారు. కాని ఆ ప్రయత్నం ఫలించలేదు.

కీ.శే. మేడేపల్లి వరాహనరసింహస్వామిగారు రచించిన దానిని బట్టి రామమూర్తిగారు కాలిపై రాచపుండు లేచినందున కాలుతీసివేయవలసి వచ్చింది. సేకరించిన ధనం కరిగిపోయింది. శస్త్ర చికిత్స జరిగినప్పుడు ఎటువంటి మత్తుమందును (క్లోరోఫామ్‌) తీసుకోలేదు. ప్రాణాయామం చేసి నిబ్బరంగా వుండిపోయారు.

చివరిరోజులు బలంఘర్, పాట్నాలో కలవాండి (ఒరిస్సా) పరగణా ప్రభువు పోషణలో వుండి 16.1.1942 తేదీన కన్ను మూశారు నాయుడుగారు.[4] తెలుగువారే కాక భారతీయులందరూ గర్వించదగిన మహనీయుడు, దేశభక్తుడు, ‘కలియుగ భీమ’ కోడి రామమూర్తి నాయుడుగారు.

వరవిక్రయం, మధుసేవ వంటి గొప్ప సాంఘిక నాటకాలను రచించిన, విఖ్యాత నాటక కర్త కాళ్ళకూరి నారాయణరావుగారు, కోడి రామమూర్తిగారి ఆప్త మిత్రులు. నాయుడుగారిని ప్రశంసిస్తూ ” సాధు పథవర్తి సన్మిత్ర చక్రవర్తి రమ్యతరకీర్తి శ్రీ కోడి రామమూర్తి ” అన్నారు. మన పురాణాలలో బల శబ్దానికి భీముడు, ఆంజనేయుడు పర్యాయ శబ్దాలైనట్లు ఆంధ్ర ప్రదేశంలో ఇతడి పేరు బలానికి పర్యాయపదంగా పరిగణించబడింది. తన చివరి రోజుల్లో రామ్మూర్తి నాయుడు బలంఘీర్ పాట్నాలో కల్వండే పరగణా ప్రభువు పోషణలో జీవితం గడుపుతూ మరణించారు.

శ్రీకాకుళంలో స్థాపించిన కోడి రామమూర్తి విగ్రహం
బలప్రదర్శన విశేషాలు[మార్చు]
గట్టిగా ఊపిరి పీల్చుకుని కండలు బిగించి, తన ఛాతీకి చుట్టిన ఉక్కు తాళ్ళను తెంచేవారు.
ఛాతీ మీదకు ఏనుగును ఎక్కించుకుని ఐదు నిముషాల పాటు నిలిపేవారు.
రెండు కార్లను వాటికి కట్టిన తాళ్ళు రెండు చేతులుతో పట్టుకుని కదలకుండా ఆపేవారు.
ఒంటి చేత్తో రైల్ ఇంజను ఆపిన ఘనుడు.
బిరుదులు

కోడి రామమూర్తి విగ్రహం గురించిన సమాచారం
ఆనాటి ఇంగ్లండు పాలకులైన కింగ్ జార్జ్, క్వీన్ మేరీలు రామ్మూర్తి నాయుడి బల ప్రదర్శనకు అబ్బురపడి, ‘ఇండియన్ హెర్క్యులెస్’ అనే బిరుదును ప్రసాదించారు. ఇంకా కలియుగ భీమ, మల్ల మార్తాండ, జయవీర హనుమాన్, వీరకంఠీరవ వంటి బిరుదులను కూడా సొంతం చేసుకున్నరు.[5]

మీ -గబ్బిట దుర్గా ప్రసాద్ -22-4-22-ఉయ్యూరు

Posted in రచనలు | Leave a comment

కన్నడ సృజనాత్మక సాహిత్య సృష్టికర్త -పంజే మంగేష్ రావు -3

. కన్నడ సృజనాత్మక సాహిత్య సృష్టికర్త -పంజే మంగేష్ రావు -3
పాఠశాల పర్యవేక్షణాధికారి
ఉపసహాయ పర్యవేక్షణాధికారిగా పంజే ను దక్షిణ కన్నడ కాసర గోడ్ లో నియమించారు .ప్రస్తుతం ఇది కేరళ లో ఉంది .మూడు R లు బోధించటం లో దిట్ట కనుక ఈ పదవి దక్కింది .మంచి ఇంట్లో కాపురం పెట్టాడు .ఇన్స్పెక్టర్ ఆఫ్ స్కూల్స్ గా ఆయన బాగా పేరు పొందాడు .కొడుకులు మంచి విద్యలు నేర్చి ఉద్యోగాలలో స్థిరపడ్డారు .పెద్దకొడుకు ముకుంద భిలాయ్ లో రెండవవాడు గోపాల రావు హైదరాబాద్ లో అడ్వ కేట్ గా స్థిరపడ్డాడు .మూడవ వాడు రామారావు అనుకోకుండా బస్ యాక్సిడెంట్ లో చనిపోయాడు .కూతురు అనసూయ లండన్ లో సాహిత్యం లో డిగ్రీ పొందిన వాడిని పెళ్ళాడి బొంబాయిలో ఉంటోంది .చివరిపిల్ల శాంత రామేశ్వరరావు హైదరాబాద్ లో ఉంటోంది .
పర్యవేక్షణకు కాలినడకన లేక ఎడ్ల బండీలో వెళ్ళాల్సి వచ్చేది. వెంట ఒక వంటవాడు ,సేవకుడు ఉండేవారు .జానపద గేయాలు కధలు సామెతలు సేక రించాటానికి వాళ్ళు సాయం చేసేవారు .మద్రాస్ విద్యా శాఖ కు ఎజి బోర్న్ అనే విద్యా సంస్కర్త వచ్చి బోధనలో ప్రత్యక్ష విధానం ప్రవేశపెట్టాడు .ఇది బాగా నచ్చింది పంజే కు .దీనివల్ల ఉపాధ్యాయ విద్యార్ధులకు పని భారం తగ్గి ,నేర్చే కాలమూ తగ్గింది .
  కాసర గోడ్ మలేరియా ప్రాంతం .అయినా మారుమూల గ్రామ స్కూల్స్ ను పర్యవేక్షించిన ఉక్కుమనిషి .ఆయన కోసం బదులు ఆసక్తిగా ఎదురు చూసేవి .బోధనలో పాటలు డాన్సులు ,ఆటలు కధలు తో మంచి ఉత్సాహం కలిగించేవాడు .’’ఒక పర్యవేక్షణాదికారి అసంబద్ధపు దిన చర్య ‘’అనే పుస్తకం లో తన అనుభవాలు రాశాడు .రాయచూరు కన్నడ సాహిత్య పరిషత్ లో అధ్యక్ష ఉపన్యాసమిస్తూ ‘’సాహిత్య ,భాష ,గ్రామీణాభి వృద్ధి మొదలైనవి ఉపాధ్యాయుల చేతులలో ఉన్నాయి .వాళ్ళను సభ్యులుగా చేర్చాలి .వారి చొరవ వలన ప్రతి బడీ సాహిత్య పరిషత్ భవనం అవుతుంది .వారి వ్రాతప్రతులు కరదీపికలౌతాయి .గ్రామీణ యువ ఉపాధ్యాయులే  నా నిజమైన స్నేహితులు ‘’అన్నాడు .
  మళ్ళీ మంగుళూరు కు బదిలీ అయ్యాక ఆయన నూతన విధానాలకు మున్సిపాలిటి ,సమితి అధ్యక్షులు వగైరా ముఠా అడ్డు కట్ట వేశారు  .కానీ  ఆయన వచ్చాక ఆయన్ను ఆపగలిగే వారే లేకపోయారు .తర్వాత ట్రయినింగ్ స్కూల్ ప్రిన్సిపాల్ అయ్యాడు .తన కార్యదీక్షతో ఇందులో విప్లవాత్మకమార్పులు తెచ్చాడు .ఉపాధ్యాయుల్ని సేవకులుగా కాకుండా మనుషులుగా గౌరవించేవాడు .పెత్తందార్లు ,మొండివాళ్ళు ఆయన్ను జిల్లానుంచి తోలేసేదాకా నిద్రపోలేదు .పంజే అభి వృద్ధిపనులకు అడ్డగించటం పై అధికారులకు ఇష్టం లేదు .ఆయనవలననే విద్యా వ్యవస్థ కుసుమిస్తోందని నమ్మారు .ఐ యేట్స్ ఆయన్ను కొడగు జిల్లాకు బదిలీ చేశాడు .ఇక్కడా రాజీలేని తన నూత్న విద్యా బోధనా అమలు పరచాడు .తర్వాత మేర్కరా లో కేంద్ర ఉన్నత పాఠశాలకు ముఖ్యోపాధ్యాయుడయ్యాడు .ధోవతి ,కోటు ,తలపాగా వేషం లో ఉన్న పంజేను చూసి వాళ్ళు తేలికగా తీసుకొన్నారు  .క్రమంగా వాళ్ళే దారికొచ్చారు స్థానిక సంఘ సంస్థలలో సభ్యుడయ్యాడు .గౌరవ ప్రేమలకు పాత్రుడయ్యాడు ‘
కొడగుజిల్ల ముఖ్యపట్టణం మేర్కరా లో కాపురం పెట్టాడు .ఆర్ధిక ఇబ్బందులు లేవు .కాసర్గోడులో ఉన్నప్పుడు ‘’నాగర హావే ‘’-నాగుపామా అనే అపూర్వ మనోహర గీతాన్ని పిల్లలకోసం రాసి పాడి పాడించాడు .భారత స్వాతంత్ర్య కాంక్ష ఆయన గీతాలలో ఉంటుంది .హత్తరి హాడు అనే గీతం లో కొడగు వారి జాతీయ పర్వాన్ని ,సౌందర్యం ,ప్రజలగురించి వర్ణించాడు .ఎక్కడ పని చేసనా జానపద గీతాలు ఐతిహ్యాలు సేకరించటం ఆయన హాబీ .
పత్రిక ,ప్రచురణ రంగాలు
ఉన్నత పాఠశాల హెడ్ మాస్టర్ గా రిటై రై,మంగుళూరు లోని  కద్రిలో కాపురమున్నాడు .తర్వాత ఇదే సాహిత్య వేత్తలకు  పుణ్యస్థలమైంది .1927లో మంగుళూరులో కన్నడ సాహిత్య సమావేశాలు జరిగితే పంజే అండగా నిలిచాడు .బాసెల్ మిషన్ వాళ్ళు విద్యా విషయకపనులు ,ప్రచురణ చూసిపెట్టమని కోరితే చేశాడు .కన్నడ భాషా వ్యాకరణం ప్రచురించమని కోరితే అంగీకరించి చేశాడు దీనితో యూరోపియన్ విధానాలు ,అక్కడి బాలసాహిత్య విషయాలు తెలుసుకోవటానికి ఆయనకు బాగా తోడ్పడింది .1902లో ఆయన బావమరిది బెనెగల్ రామారావు ‘’సువాసిని ‘’వారపత్రిక సంపాదకుడు .ఈ రామారావు భారత రిజర్వ్ బాంక్ కు నాల్గవ గవర్నర్ .ఈయన సంతకం తోనే నోట్లు ముద్రి౦ప బడేవి  . సువాసిని లో  ముఖ్యరచనలు పంజే వే .బాలసాహిత్యం జానపద సాహిత్యం అభి వృద్ధికి ‘’చోదియాల్ బైల్ ‘’అనే సంస్థ ఏర్పడింది  ,గొప్ప బాలసాహిత్యం వచ్చింది .చారిత్రక శాసనవిషయాలపైనా రాశాడు .’’హరటే మల్ల ‘’పేరుతొ అప్పటికి కొత్తవైన రచనా చిత్రాలు ,పారడీలు ,వ్యంగ్య రచనలు రాశాడు .ఎన్ ఎం కామత్ ,శంకరయ్య మాస్తి వెంకటేశయ్య౦గార్ వగైరా మహా మహులతో పరిచయ మేర్పడింది  .
  సశేషం
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -21-4-22-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, రచనలు, సమీక్ష | Tagged | Leave a comment

మనమరపు వెనుక మన వెండి తెర మహానుభావులు –237

మనమరపు వెనుక మన వెండి తెర మహానుభావులు –237
237-మిస్టర్ ఆసియా ,మిస్టర్ హెర్క్యులస్ ,మిస్టర్ ఇండియా అయిన కసరత్తు వీరుడు ,పౌరాణిక ఆంజనేయుడు –అర్జా జనార్ధనరావు
అర్జా జనార్ధనరావు (డిసెంబర్ 21, 1926 – నవంబర్ 4, 2007) ప్రసిద్ధ తెలుగు నాటక, సినిమా నటుడు. ఇతడు ఎక్కువగా పౌరాణిక చిత్రాలలో హనుమంతుడు వేషంతో మంచిపేరు సంపాదించుకున్నాడు. హనుమ అనగానే గుర్తువచ్చే విదంగా ఆయన నటన ఉండేది.
జీవిత విశేషాలు
ఇతని స్వస్థలం కాకినాడ. అక్కడే బి.ఎ., బి.ఎస్.సి చదువుకున్నాడు. చదువుకొనే సమయంలోనే ఇతనికి నాటకరంగంలో కొంత అనుభవం కలిగింది. ఇతనికి చిన్నతనం నుండి ఆటలమీద, కసరత్తులు చేయడం మీద ఉత్సాహం ఉండేది. ఆ ఉత్సాహమే ఇతడిని మిస్టర్ ఆసియా, మిస్టర్ హెర్క్యులస్ (1954), మిస్టర్ ఇండియా (1955)గా ఎన్నిక చేసింది. ఇతడు శబ్దగ్రహణ శాఖలో డిప్లొమా చదివి కొన్నాళ్ళు శ్యామలా స్టుడియోలో రికార్డిస్ట్‌గా పనిచేశాడు.
నటించిన సినిమాలు
• లవకుశ (1963)
• శ్రీకృష్ణావతారం (1967)
• వీరాంజనేయ (1968)
• శ్రీ రామాంజనేయ యుద్ధం (1974)
• ముత్యాల ముగ్గు (1975)
• శంకరాభరణం (1979)
• త్యాగయ్య (1981)
• శ్రీ ఆంజనేయ చరిత్ర (1981)
• దేవాంతకుడు (1984)
డిటెక్టివ్ నవలా రచయిత విశ్వప్రసాద్ కథ, మాటలు సమకూర్చిన, 1969 జూలై 25న సినిమా విడుదలైన, కృష్ణ, గుమ్మడి, ఎస్వీ రంగారావు, వాణిశ్రీ లు ప్రధాన పాత్రధారులుగా ఉన్న జగత్ కిలాడీలు’ చిత్రంలో జనార్ద‌న‌ రావు భిన్నమైన పాత్రలో నటించారు. ఈ సందర్భంగా రామాంజనేయ యుద్ధం చిత్రంలో ఒక పాటను గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. జనార్ద‌న‌ రావు … ఆంజనేయ పాత్రలో లీనమై నటించగా, ఆ సన్నివేశంలో, ఆయన హావభా వాలు నాటి సినిమా ప్రియులు ఎన్నటికీ మరచి పోలేనివి. 1975లో పొట్లూరి వెంక‌ట‌ నా‌రా‌యణ, ఎన్‌.‌ఎస్‌.‌మూర్తి కలిసి శ్రీరా‌మాం‌జ‌నేయ యుద్ధం పేరుతో కలర్‌ సినిమా నిర్మిం‌చారు.‌ బాపు దర్శ‌కత్వం వహిం‌చిన సిని‌మాకు ముళ్ల‌పూడి వెంక‌ట‌ర‌మణ మాటలు రాయ‌కుండా ఉన్న అరు‌దైన సినిమా శ్రీ రామాం‌జ‌నేయ యుద్ధం.
బాపు−‌ఎన్టీ‌ఆర్‌ కాంబి‌నే‌ష‌న్‌లో వచ్చిన తొలి సినిమా శ్రీరా‌మాం‌జ‌నేయ యుద్ధం.‌ గతంలో గబ్బిట వెంక‌ట‌రావు రాసిన పద్య‌నా‌ట‌కం‌ లోని పద్యా‌లను యధా‌త‌ధంగా వాడ‌డంతో సంభా‌ష‌ణలు కూడా అతని చేత రాయిం‌చారు.‌ ఎన్టీ‌ఆర్‌ రాము‌డిగా, అర్జా జనా‌ర్ద‌న‌రావు ఆంజ‌నే‌యు‌డుగా, బి.‌సరో‌జ‌దేవి సీతగా, ధూళి‌పాళ్ల యయా‌తిగా నటిం‌చిన ఈ చిత్రా‌నికి కె.‌వి.‌మహ‌దే‌వన్‌ సంగీతం సమ‌కూ‌ర్చారు.‌ ఇందులో ఆంజ‌నే‌యుడు ఆల‌పించే రెండు ఆర్ధ్ర‌మైన పాట‌లను వినూ‌త్నంగా ఉంటుం‌దని రఘు‌రా‌మయ్య చేత పాడిం‌చారు.‌ వాటిలో మొద‌టిది ‘రామ నీల‌మేఘ శ్యామా కోదం‌డ‌రామా’ కాగా, రెండ‌వది ‘శరణు శర‌ణయా జాన‌కి‌రామా, కరు‌ణ‌ జూ‌పవా మారు‌తిపై సాకేత సార్వ‌భౌమా’ అనే పాట.‌ ఈ రెండవ పాటకు కె.‌వి.‌ మహ ‌దే‌వన్‌ ఒక హిందీ పాట బాణీని అను‌క‌రిం‌చడం వింతగా చెప్పు‌కు‌న్నారు.‌ అందుకు కారణం.‌.‌.‌మహ‌దే‌వన్‌ ఎప్పుడూ ముందుగా ఇచ్చే బాణీకి పాట స్వర‌ప‌ర‌చ‌ లేదు.‌ కవి రాసిన ఎటు‌వంటి పాట‌కైనా అద్భు‌తంగా బాణీలు కట్టటం మహ‌దే‌వన్‌ నైజం.‌ తద్భి‌న్నంగా ‘సాకేత సార్వ‌భౌమా’ పాటకు మహ‌దే‌వన్‌ అను‌క‌రిం‌చిన హిందీ పాట 1964లో రాజశ్రీ ప్రొడక్షన్స్‌ నిర్మాత తారా‌చంద్‌ బర‌జాత్యా సత్య‌న్‌బోస్‌ దర్శ‌క‌త్వంలో నిర్మిం‌చిన సూపర్‌ డూపర్‌ హిట్‌ చిత్రం ‘దోస్తీ’లో మహ‌మ్మద్‌ రఫీ పాడిన ‘చాహూంగా మై తుజ్హే సాంఝ్‌ సవేరే.‌.‌.‌ఫీర్‌ భి కభీ ఆబ్‌ నామ్‌ కో తేరే ఆవాజ్‌ మై న దూంగా’ మహ‌దే‌వన్‌ అను‌క‌రిం‌చడాన్ని విశేషంగా చెప్పుకుంటారు.
(నవంబర్ 4 అర్జా వర్ధంతి)
రామాంజనేయ యుద్ధం లో అర్జా ప్రతికదలిక మాట భక్తీ స్పోరకం .హావభావాలు చిరస్మరణీయం .రఘురామయ్య పాడిన రెండు పాటలు తెలుగుసినీ గీత చరిత్రలో చెరగని సంతకాలు ఆఫీల్ ఆయన పాడటం వల్లనే వచ్చింది బహుశా ఎవరూ అంత భావంతో పాడగలిగే వారు కాదేమో అలా పాడించే నేర్పు బాపుది.బాపు గారి ముత్యాలముగ్గు లోనూ అర్జా హనుమ పాత్ర మలుపులు తిప్పేదే .చిన్నారీ అంటూ ఆపిల్లను లాలించి బుజాలకు ఎత్తుకోవటం అద్భుతం .అల్లు కోతినే మరపించే మహా నటన ప్రదర్శించి హాట్సాఫ్ అనిపించాడు .శంకరాభరణం లో రౌడీ పాత్ర .సానుభూతికోల్పోయేది.బాపు త్యాగయ్య లో త్యాగూ కు చాలా సపోర్టివ్ పాత్ర .సీతారాములకు ‘’త్యాగ దర్శనం ‘’చేయించే పాత్ర సార్ధకం .
సశేషం
మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -21-4-22-ఉయ్యూరు

Posted in సినిమా | Tagged | Leave a comment

మనమరపు వెనుక మన వెండి తెర మహానుభావులు –236 •

  1. అనుజన్ముండటంచు సంతతము నాకానందసంజాత (పద్యం) – ఘంటసాల – రచన: తాండ్ర
  2. అనుపమ వీర సింహుడని ఆలులమందు ప్రశస్తి – పద్యం -మాధవపెద్ది
  3. అవశిష్ఠంబులు దీర్చి సర్వము పరిత్యాగము గావించి (పద్యం) – ఘంటసాల – రచన: తాండ్ర
  4. ఆలము సేయబూని నిటలాక్షుడు నన్నెదిరించు (పద్యం) – ఘంటసాల – రచన: తాండ్ర
  5. ఇటు ఇటు ఓ రాజా ఇటు ఎటు ఎటు ఓ రాజ ఎటు రారాదా – ఎల్.ఆర్.ఈశ్వరి – రచన: డా. సినారె
  6. కలన జయింపలేక బలగర్వమడంగియు చింత (పద్యం) – ఘంటసాల – రచన: తాండ్ర
  7. కలలన్ని ఫలియించె ఈనాడే తలపులు చిగురించె ఈ నాడే – పి.సుశీల – రచన: డా. సినారె
  8. కాళీచిత్తసరోజబంబహర గంగా శశాంక ప్రియా – వెంకట్రావు – రచన: తాండ్ర
  9. జపమేమి జేసెనో జనక మహారాజు కల్యాణరాముని కాళ్ళు (పద్యం) – ఘంటసాల – రచన:తాండ్ర
  10. జయ జయ జానకిరామ రఘుకుల సోమా పావన – ఘంటసాల,సరోజిని – రచన: రాజశ్రీ
  11. ధరణి శ్రీరామచంద్రుడే దైవమేని సీత భూజాత లోకమాత (పద్యం) – ఘంటసాల – రచన: తాండ్ర
  12. నేనే నేనే మధుగీతి నవరసపూరిత నవవిలాసవతి నేనే – పి.సుశీల,ఎల్.ఆర్.ఈశ్వరి – రచన: ఆరుద్ర
  13. పండెన్ దుష్టచతుష్ఠయంబునకు పాపంబు ఆపదలు (పద్యం) – ఘంటసాల – రచన: తాండ్ర
  14. పలికే రాగం పిలిచే భావం నేనేలే నింగిలోన నేలపైన నేనేలే – ఎల్.ఆర్.ఈశ్వరి – రచన: డా. సినారె
  15. ప్రాంచితకీర్తిశాలి యగు పాండునృపాలుడు నాదు తండ్రి (పద్యం) – మాధవపెద్ది – రచన:తాండ్ర
  16. రామనామ సుధా మధురాతి మధుర పావానాక్షరసేవ (పద్యం) – ఘంటసాల – రచన: తాండ్ర
  17. రామా రఘుకుల సోమా.. శ్రీరామ జయరామా నీలనీరద కోమల – ఘంటసాల- రచన: తాండ్ర
  18. వీరుడనే ధీరుడనే వినవే ఓ భామా ఔనన్నా కాదన్నా – పి. శ్రీరామ్ – రచన: రాజశ్రీ
  19. సిగలోన విరిసిన సౌగంధికా చెలికింత తొందర ఏల – ఘంటసాల,పి.సుశీల – రచన: డా. సినారె
  20. సిగలోన విరిసిన సౌగంధికా చెలిమికే నీవే ( బిట్ ) – ఘంటసాల,పి.సుశీల – రచన: డా. సినారె
  21. సురభామినీ సౌదామినీ కలహంస ఓలే ఇటురావే – ఘంటసాల – రచన: డా. సినారె
    సశేషం
    మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -21-4-22-ఉయ్యూరు

మనమరపు వెనుక మన వెండి తెర మహానుభావులు –236
236-వెయిట్ లిఫ్టింగ్ను అంతర్జాతీయ స్థాయికి చేర్చి ,9స్వర్ణ ,12జాతీయ అవార్డ్ లు పొంది ,ఆసియాక్రీడలలో రజతం పొంది ,హేల్సేంకి ,వార్సా ,మెల్బోర్న్ ,జకార్తా పోటీలలో ప్రధమ స్థానం పొంది ,భీమాంజనేయ యుద్ధం లో ఆంజనేయుడు గా నటించిన అర్జున అవార్డ్ గ్రహీత –కామినేని ఈశ్వర రావు
• జాతీయ వెయిట్ లిఫ్టింగ్ పోటీలలో, కృష్ణా జిల్లా ఖ్యాతిని అంతర్జాతీయ స్థాయికి తీసుకొని వెళ్ళిన ఘనత, అర్జున అవార్డు గ్రహీత శ్రీ కామినేని ఈశ్వరరావు గారికే దక్కుతుంది. భారతదేశంలోని అనేక నగరాలలో, భారత వెట్ లిఫ్టింగ్ ఫెడెరేషన్ ఆధ్వర్యంలో జరిగిన పోటీలలో 9 పసిడి పతకాలూ, భారతదేశంలో 12 జాతీయ రికార్డులను సాధించిన మొదటి భారతీయుడు శ్రీ ఈశ్వరరావు కావటం విశేషం.[మూలాలు తెలుపవలెను]
• వీరు భట్ల పెనుమర్రు గ్రామంలో 1926, ఆగస్టు-28వ తేదీన ఒక రైతు కుటుంబంలో జన్మించారు. వెయిట్ లిఫ్టింగ్ లో గోసాలలోని గురువు శ్రీ రంగదాసుగారి వద్ద, శిక్షణ పొందినారు. జాతీయ వెయిట్ లిఫ్టింగ్ పోటీలలో కోల్ కతా, చెన్నై, ముంబై, కొత్త డిల్లీ, జబల్ పూర్ మొదలగు నగరాలతో పాటు, విదేశాలలోని హెల్సింకీ (ఫిన్లెండు), వార్సా (పోలెండ్), మెల్బోర్న్ (ఆస్ట్రేలియా), జకార్తా (ఇండోనేషియా) మొదలగు చోట్ల జరిగిన పోటీలలో ప్రథమ స్థానంలో నిలిచారు. 1951లో కోల్ కతాలో జరిగిన అన్ని విభాగాలలోనూ, శరీర సౌష్టవ పోటీలలోనూ, పసిడి పతకాలు సాధించారు. 1963లో అప్పటి భారత రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి చేతుల మీదుగా “అర్జున” అవార్డు అందుకున్న తొలి భారతీయుడిగా నిలిచారు.
• ఎన్నో రికార్డులు:- 1951లో ఆసియా క్రీడలలో, ఇంతవరకూ ఏ భారతీయుడూ సాధించని రజత పతకాన్ని ఈయన వెయిట్ లిఫ్టింగులో సాధించారు. దేశంలో 12 జాతీయ రికార్డులు, ఆసియా ఖండంలో 4 రికార్డులు స్థాపించిన తొలి భారతీయుడు. ఈయన కృష్ణా జిల్లా క్రీడా సంఘానికి కార్యదర్శిగా పనిచేశినారు. వీరికి చలనచిత్ర రంగంలో గూడా ప్రవేశం ఉంది. “భీమాంజనేయ యుద్ధం” అను చిత్రంలో వీరి ప్రత్యర్థి శ్రీ దండమూడి రాజగోపాలరావుతో పోటీగా ఆంజనేయ పాత్ర ధరించి పలువురు ప్రశంసలు పొందినారు. వీరు 1977, నవంబరు-7న గుండెపోటుతో కన్నుమూశారు.
• కుటుంబ నేపథ్యం:- వీరి ఇద్దరు సంతానం. కుమారుడు డాక్టర్ కె.పిరావు, హాంగ్ కాంగ్ విశ్వవిద్యాలయంలో పనిచేస్తున్నారు. కుమార్తె శ్రీమతి వసుంధర, విజయవాడలో గృహిణిగా ఉన్నారు.
• యోధానుయోధులు:- గతంలో ఆంధ్రప్రదేశ్ లో, వెయిట్ లిఫ్టింగ్ అంటే కృష్ణాజిల్లా నే గుర్తుకు వచ్చేది. జిల్లాకు చెందిన శ్రీ కామినేని ఈశ్వరరావు, శ్రీ దండమూడి రాజగోపాలరావు వంటి యోధానుయోధులు, జిల్లాకు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఖ్యాతి తీసుకొని వచ్చారు. వీరితోపాటు బొబ్బా వెంకటేశ్వరరావు, ఎం.పి.రంగా, మాదు వెంకటేశ్వరరావు, సంపత్, రామస్వామి, అచ్యుతరావు వంటి ఎందరో వెయిట్ లిఫ్టర్లు 1945-70 మధ్య జిల్లాకు మంచిపేరు తీసుకొని వచ్చారు.
• మహాలక్ష్మీ మూవీస్ వారి భీమాంజనేయ యుద్ధం చిత్రానికి ఛాయాగ్రహణ దర్శకుడు వి.వి.రామచంద్ర. ఈ చిత్రంలో భీముని పాత్రను దండమూడి రాజగోపాల్, ఆంజనేయుని పాత్రను కామినేని ఈశ్వరరావు ధరించారు. ఇంకా ఈ చిత్రంలో ద్రౌపదిగా ఎస్.వరలక్ష్మి, నలకూబరునిగా కాంతారావు, రంభగా కాంచన, సౌదామినిగా రాజశ్రీ, మరియూ కైకాల సత్యనారాయణ, రమణారెడ్డి మొదలైనవారు నటించారు. ఈ చిత్రానికి తాండ్ర సుబ్రహ్మణ్యం కథను అందించగా, కె.వి.నాగేశ్వరరావు కళాదర్శకత్వం, టి.వి.రాజు సంగీతం నిర్వహించారు.
• చలం నారదుడిగా
• ఈ చిత్రంలో హాస్య నటుడు చలం నారదుడు పాత్రలో కనిపిస్తాడు. చలం ఈ పాత్ర వెయ్యటం అదే మొదటిసారి చివరిసారి కూడా!

పాటలు, పద్యాలు

  1. అనుజన్ముండటంచు సంతతము నాకానందసంజాత (పద్యం) – ఘంటసాల – రచన: తాండ్ర
  2. అనుపమ వీర సింహుడని ఆలులమందు ప్రశస్తి – పద్యం -మాధవపెద్ది
  3. అవశిష్ఠంబులు దీర్చి సర్వము పరిత్యాగము గావించి (పద్యం) – ఘంటసాల – రచన: తాండ్ర
  4. ఆలము సేయబూని నిటలాక్షుడు నన్నెదిరించు (పద్యం) – ఘంటసాల – రచన: తాండ్ర
  5. ఇటు ఇటు ఓ రాజా ఇటు ఎటు ఎటు ఓ రాజ ఎటు రారాదా – ఎల్.ఆర్.ఈశ్వరి – రచన: డా. సినారె
  6. కలన జయింపలేక బలగర్వమడంగియు చింత (పద్యం) – ఘంటసాల – రచన: తాండ్ర
  7. కలలన్ని ఫలియించె ఈనాడే తలపులు చిగురించె ఈ నాడే – పి.సుశీల – రచన: డా. సినారె
  8. కాళీచిత్తసరోజబంబహర గంగా శశాంక ప్రియా – వెంకట్రావు – రచన: తాండ్ర
  9. జపమేమి జేసెనో జనక మహారాజు కల్యాణరాముని కాళ్ళు (పద్యం) – ఘంటసాల – రచన:తాండ్ర
  10. జయ జయ జానకిరామ రఘుకుల సోమా పావన – ఘంటసాల,సరోజిని – రచన: రాజశ్రీ
  11. ధరణి శ్రీరామచంద్రుడే దైవమేని సీత భూజాత లోకమాత (పద్యం) – ఘంటసాల – రచన: తాండ్ర
  12. నేనే నేనే మధుగీతి నవరసపూరిత నవవిలాసవతి నేనే – పి.సుశీల,ఎల్.ఆర్.ఈశ్వరి – రచన: ఆరుద్ర
  13. పండెన్ దుష్టచతుష్ఠయంబునకు పాపంబు ఆపదలు (పద్యం) – ఘంటసాల – రచన: తాండ్ర
  14. పలికే రాగం పిలిచే భావం నేనేలే నింగిలోన నేలపైన నేనేలే – ఎల్.ఆర్.ఈశ్వరి – రచన: డా. సినారె
  15. ప్రాంచితకీర్తిశాలి యగు పాండునృపాలుడు నాదు తండ్రి (పద్యం) – మాధవపెద్ది – రచన:తాండ్ర
  16. రామనామ సుధా మధురాతి మధుర పావానాక్షరసేవ (పద్యం) – ఘంటసాల – రచన: తాండ్ర
  17. రామా రఘుకుల సోమా.. శ్రీరామ జయరామా నీలనీరద కోమల – ఘంటసాల- రచన: తాండ్ర
  18. వీరుడనే ధీరుడనే వినవే ఓ భామా ఔనన్నా కాదన్నా – పి. శ్రీరామ్ – రచన: రాజశ్రీ
  19. సిగలోన విరిసిన సౌగంధికా చెలికింత తొందర ఏల – ఘంటసాల,పి.సుశీల – రచన: డా. సినారె
  20. సిగలోన విరిసిన సౌగంధికా చెలిమికే నీవే ( బిట్ ) – ఘంటసాల,పి.సుశీల – రచన: డా. సినారె
  21. సురభామినీ సౌదామినీ కలహంస ఓలే ఇటురావే – ఘంటసాల – రచన: డా. సినారె
    సశేషం
    మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -21-4-22-ఉయ్యూరు
Posted in సినిమా | Tagged | Leave a comment

మనమరపు వెనుక మన వెండి తెర మహానుభావులు –235

మనమరపు వెనుక మన వెండి తెర మహానుభావులు –235
235-‘’ఇండియన్ టార్జాన్ ‘’ఆంధ్రా భీమ ‘’వెయిట్ లిఫ్టింగ్ చాంపియన్ ,నర్తన శాల భీముడు,మా గండిగుంట వాడు  –దండమూడి రామమోహనరావు
దండమూడి రాజగోపాలరావు (అక్టోబరు 16, 1916 – ఆగష్టు 6, 1981) భారతదేశానికి చెందిన వెయిట్‌లిఫ్టింగ్ క్రీడాకారుడు, “ఇండియన్ టార్జన్” అన్న బిరుదు పొందారు.తెలుగు రంగస్థల, సినిమా నటుడు. ఈయన 1951లో ఢిల్లీలో జరిగిన ప్రథమ ఆసియా క్రీడోత్సవాలలో వెయిట్‌ లిఫ్టింగ్ పురుషుల సూపర్ హెవీవెయిట్ (+105 కేజీలు) వర్గములో కాంస్య పతకాన్ని గెలుచుకున్నాడు.[1] ఈయన 1963లో విడుదలైన నర్తనశాల[2] సినిమాలోనూ, 1965లో విడుదలైన వీరాభిమన్యు సినిమాలోనూ, భీముని పాత్ర పోషించాడు.
రాజగోపాలరావు, కృష్ణా జిల్లా, గండిగుంట గ్రామంలో ఒక రైతు కుటుంబంలో జన్మించాడు. కోడి రామ్మూర్తి నాయుని స్ఫూర్తితో బరువులు ఎత్తటం ఒక వ్యాసంగంగా స్వీకరించాడు. కొంతకాలం బరువులెత్తడంలో శిష్ట్లా సోమయాజులు వద్ద శిక్షణ పొందాడు. ఆ తరువాత కొల్లి రంగదాసుతో పాటు సంచరిస్తూ అనేక రాష్ట్రాలు, దేశాలలో ప్రదర్శనలిచ్చాడు.
రాజగోపాలరావుకు అనసూయతో వివాహమైంది. వీరికి ఇద్దరు కుమార్తెలు, ముగ్గురు కుమారులు – ఝాన్సీ లక్ష్మీబాయి, పూర్ణచంద్రరావు, శ్యాంసుందర్, బసవరాజ్, విజయలక్ష్మి. రాజగోపాలరావు 1981, ఆగష్టు 6న మరణించాడు. ఈయన పేరు మీదుగా, విజయవాడలో మహాత్మాగాంధీ రోడ్డులో ఉన్న ఇండోర్ క్రీడా ప్రాంగణానికి “దండమూడి రాజగోపాలరావు ఇండోర్ స్టేడియం” అని నామకరణం చేశారు.[3] దీనిని అప్పటి ముఖ్యమంత్రి టి.అంజయ్య ప్రారంభించాడు.
ఆంధ్ర భీముడు…రాజగోపాలుడు
ఆటల పోటీల్లో అంతర్జాతీయ స్థాయికి ఎదిగిన కొద్దిమంది భారతీయుల్లో దండమూడి రాజగోపాలరావు ఒకరు. మనదేశం స్వాతంత్య్రం పొందిన తొలినాళ్లయిన 1948లోనే మిస్టర్‌ ఆసియాగా గెలిచి భారతజాతికి వన్నెతెచ్చిన ఘనుడాయన. సోమవారం ఆయన వర్ధంతి సందర్భంగా ప్రత్యేక కథనం. 
పెదపారుపూడి(పామర్రు): శరీర సౌష్టవ పోటీలో మిస్టర్‌ ఆసియా బిరుదును పొందిన తొలి ఆంధ్రుడే కాక తొలి భారతీయుడు దండమూడి రాజగోపాలరావు. ఆయన తొలి అంకంలో కొల్లి రామదాసు, సోమయాజులు తదితరుల వద్ద తర్ఫీదు పొంది 1938లో తొలిసారిగా పోటీల్లో పాల్గొని జిల్లా వెయిట్‌ లిఫ్టింగ్‌ చాంపియన్‌ కావడం ద్వారా శరీర సౌష్టవంపై దృష్టి పెంచారు. ఫలితంగా  1940లో మొదటిసారిగా రాష్ట్రస్థాయిలో చాంపియన్‌గా గెలుపొందారు. 1945లో జాతీయస్థాయిలో 320 పౌండ్ల బరువు ఎత్తి విజేతగా నిలిచారు. 1948లో జరిగిన ఆసియా శరీరసౌష్టవ పోటీల్లో గెలుపొంది మిస్టర్‌ ఆసియా బిరుదును సొంతం చేసుకున్నారు. 1945 నుంచి 1958 వరకు 13 ఏళ్లపాటు జాతీయ వెయిట్‌లిఫ్టింగ్‌ చాంపియన్‌గా గెలుపొందుతూ ఆంధ్రప్రదేశ్‌ కీర్తి పతాకాన్ని దశదిశలా ఇనుమడింపజేశారు.
1948లో జరిగిన కామన్‌వెల్త్‌ పోటీల్లో పాల్గొన్న తొలి ఆంధ్రుడు దండమూడి. రాష్ట్ర వెయిట్‌లిఫ్టింగ్‌ అసోసియేషన్‌కు అనేక సంవత్సరాలపాటు ఉపాధ్యక్షుడిగా కొనసాగారు.
వెయిట్‌ లిఫ్టింగ్‌లోనే కాక బలప్రదర్శనలో విశేష ప్రతిభ కనబర్చారు. చాతికి గొలుసులు చుట్టి గాలిపీల్చడం ద్వారా చాతిని పెంచి వాటిని తెంపడం లాంటి సాహసకృత్యాలను దండమూడి అనేకం చేశారు. వెయిట్‌ లిఫ్టింగ్‌లో అర్జున అవార్డు గ్రహీత కామినేని ఈశ్వరరావు దండమూడి శిష్యుడిగానే శరరీ సౌష్టవంపై ఆసక్తి పెంచుకున్నారు. ఇదిలా ఉండగా వీరాభిమన్యు, నర్తనశాల తదితర చిత్రాల్లో భీముడి పాత్రను పోషించిన దండమూడి ప్రజల మన్ననలను చూరగొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా పలు వ్యాయామశాలల ఏర్పాటుకు కృషిచేశారు. ఒలింపిక్‌ పోటీల అనంతరం విజయవాడలో ఉచిత వ్యాయామశాల నెలకొల్పారు. ప్రభుత్వం విజయవాడ మహాత్మాగాంధీ రోడ్డులో ఆయనకు ఇచ్చిన స్థలాన్ని మున్సిపల్‌ కార్పొరేషన్‌కు విరాళంగా ఇచ్చారు. దాంతో ఆయన పేరుతో కార్పొరేషన్‌ ఇండోర్‌ స్టేడియం నిర్మించింది. వెయిట్‌ లిఫ్టింగ్‌లో ఆయన ‘ఆంధ్రభీమ, ఇండియన్‌ టార్జాన్‌’, ఇండియన్‌ హెర్క్యులస్,  జాయింట్‌ ఆఫ్‌ ఇండియన్‌ బిరుదులను పొందారు. అంతటి ఘనకీర్తిని కూడగట్టుకున్న ఆయన ఉయ్యూరు మండలంలో గండిగుంటలో 1916 అక్టోబర్‌ 14న జన్మించారు. ఉయ్యూరులో విద్యాభ్యాసం పూర్తిచేసి తర్వాత పెదపారుపూడి మండలం వానపాములలో తన సోదరి రంగమ్మ ఇంట ఉండి జాస్తి బాపయ్య, శిష్ట్లా సోమయాజులు ప్రభతుల ప్రోత్సాహంతో వెయిట్‌లిఫ్టింగ్‌ సాధన ప్రారంభించారు. 1981 ఆగస్టు 6న విజయవాడ లబ్బీపేటలోని స్వగృహంలో తుదిశ్వాస విడిచారు.
కుటుంబ నేపధ్యం..
ఆయనకు ఐదుగురు సంతానం. వారిలో ముగ్గురు కుమారులు, ఇద్దరు కుమార్తెలు. రెండో కుమారుడు అమెరికాలో, పెద్ద చిన్న కుమారులు విజయవాడలో స్థిరపడ్డారు. కుమార్తె అట్లూరి ఝాన్సీరాణి వానపాముల లో ఉంటూ  కొన్ని సంవత్సరాల క్రితం మరణించింది. ప్రస్తుతం ఆయన కూతురు మనుమడు రాజాజీ ఉంటున్నారు. మరో కుమార్తె ఆయన స్వగ్రామమైన గండిగుంటలో నివాసముంటున్నారు.
  సశేషం
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -21-4-22-ఉయ్యూరు

Posted in సినిమా | Tagged | Leave a comment

మనమరపు వెనుక మన వెండి తెర మహానుభావులు –234

మనమరపు వెనుక మన వెండి తెర మహానుభావులు –234
234-తన కళ్ళ తోనే ప్రేక్షక హృదయాలను గెలిచి ,రియలిస్టిక్ ‘’కళ్ళు ‘’సినిమాతో అదే ఇంటిపేరుగా మారి ,పగలు ఉద్యోగం ,రాత్రి నాటకాలేస్తూ,పేద కళాకారులకు సాయం చేసిన –కొల్లూరి చిదంబరం  ,
ళ్ళు చిదంబరం (అక్టోబర్ 10, 1945 – అక్టోబరు 19, 2015) తెలుగు హాస్య నటుడు. ఈయన మొదట నాటకరంగంలో నటించి, ఎం.వి.రఘు కళ్ళు చిత్రం లోని గుడ్డివాని పాత్ర ద్వారా తెలుగు సినీ రంగానికి పరిచయం అయ్యాడు. ఏప్రిల్ ఒకటి విడుదల చిత్రంలో పాత టీవీలు అమ్మేవాడి పాత్ర పోషించాడు. చిన్న పాత్ర ఐనా దానిద్వారా మంచి గుర్తింపు పొందాడు.[1]
నేపథ్యము
కళ్లు చిదంబరం అసలు పేరు కొల్లూరి చిదంబరం. 1945, అక్టోబర్ 10 న విశాఖపట్నంలో జన్మించాడు. ఆయన కళ్లు చిత్రం ద్వారా తెలుగు సినిమాల్లో తెరంగేట్రం చేశాడు. తన మొదటి సినిమా పేరును తన ఇంటి పేరుగా మార్చుకుని కళ్లు చిదంబరంగా గుర్తింపు పొందాడు. ఆయన 300లకు పైగా సినిమాల్లో నటించాడు. కళ్లు, అమ్మోరు, చంటి, గోల్‌మాల్ గోవిందం (1992), మనీ, పెళ్ళిపెందిరి, పవిత్రబంధం, పెళ్ళి చేసుకుందాం (1997), ఆ ఒక్కటీ అడక్కు, ఏప్రిల్ 1 విడుదల, గోవిందా గోవిందా, అనగనగా ఒక రోజు, అదిరిందయ్యా చంద్రం, అడవిచుక్క (2000), తొలిపరిచయం, చంటిగాడు (2003), ఐతే ఏంటి (2004), అతడెవరు (2007) తదితర చిత్రాల్లో నటించాడు. ప్రత్యేకమైన పాత్రలు పోషించి గుర్తింపు పొందారు.
మరణ0
కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన విశాఖపట్నంలోని కేర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ 2015, అక్టోబరు 19 సోమవారం ఉదయం తుది శ్వాస విడిచారు[2].
కళ్లు లేని వాళ్ల ధీనావస్త ఎలా ఉంటుంది? అందునా పేదరికంలో ఉంటే ఇక వాళ్లకు దిక్కెవరు? అలాంటి  కొన్ని జీవితాల్లో ఎమోషన్‌ని అద్భుతంగా ఆవిష్కరించిన రియలిస్టిక్ సినిమా ‘కళు’్ల (1988). శివాజీ రాజా, ఎన్.జె.భిక్షు, రాజేశ్వరి, కళ్లు చిదంబరం కీలక పాత్రలు పోషించిన ఈ చిత్రానికి గ్రేట్ సినిమాటోగ్రాఫర్ ఎం.వి.రఘు దర్శకత్వం వహించారు. డి.విజయ్‌కుమార్ నిర్మించారు. ఈ ఏడాదితో 30 ఏళ్లు పూర్తి చేసుకుంది ఈ మేటి చిత్రరాజం.  ఇందులో శివాజీ రాజా నటనకు, గొల్లపూడి మారుతిరావు సంభాషణలకు చక్కని పేరొచ్చింది. ఈ సినిమాతోనే చిదంబరం కాస్తా ‘కళ్లు చిదంబరం’గా మారారు.
ఇండియన్ పనోరమ విభాగంలో ఈ సినిమా అప్పట్లో ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ ఆఫ్ ఇండియాలోనూ ప్రదర్శితమైంది. ఉత్తమ చిత్రంగా, ఉత్తమ తొలి చిత్ర దర్శకత్వం విభాగాల్లో నందులు దక్కాయి. ఉత్తమ దర్శకుడిగా రఘు ఫిలింఫేర్ అందుకున్నారు. ఈ సినిమా పాటలు, సంగీతం మరో అద్భుతం. “చీకటోళ్ల లోకంలో కొత్త పొద్దు పొడుపురా.. అమావాస్య లోగిలిలో దీపావళి జాతరా..!” అంటూ ఎస్.పి.బాలసుబ్రమణ్యం స్వీయ ఆలాపనలో స్వరపరిచిన పాట హైలైట్. సీతారామశాస్త్రి రాసిన ఈ మెలోడీ హైలైట్.
తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలామంది కామెడీ యాక్టర్స్ ఉన్నారు కానీ కొందరు మాత్రమే వల్ల అ హావభావాలతో, రూపురేఖలతో మనందరికీ బాగా గుర్తుండి పోతారు అలాంటి కమెడియన్ గా ఇండస్ట్రీలో ఒక వెలుగు వెలిగిన ఒక నటుడు ఎవరు అంటే అది కళ్ళు చిదంబరం గారు.ఆయన కళ్ళు అనే సినిమాతో ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు ఆ సినిమాలోని నటనకి నంది అవార్డు కూడా వచ్చింది ఆ తర్వాత చాలా సినిమాల్లో నటించారు అయితే మొదటి నుంచి కళ్ళు చిదంబరం గారికి నటన మీద ఎక్కువ ఇంట్రెస్ట్ ఉండడంతో తను పొద్దంతా జాబ్ చేస్తూ రాత్రి వేళల్లో నాటకాల్లో నటించేవారు చాలా రోజుల పాటు అలాగే చేయడంతో తన కళ్ళు అలా అయిపోయాయి అని ఆయన ఎప్పుడూ చెప్పుకొస్తూ ఉండేవారు కానీ ఆయన కళ్ళు అలా ఉండడం వల్లే సినిమాల్లో కమెడియన్ గా మంచి అవకాశాలు వచ్చాయి.
ఆయన తెలుగు సినిమాల్లో చేసిన కామెడీకి తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్నారు ఫలానా క్యారెక్టర్ ఉంది అంటే అది కళ్ళు చిదంబరం గారే చేయాలి అనేంతగా ఆయన నటనని చూపించి ఇండస్ట్రీలో మంచి పేరు సంపాదించారు.ఆయన తెలుగులో చాలా సినిమాల్లో నటించారు ముఖ్యంగా ఎస్.వి కృష్ణారెడ్డి, ఇ.వి.వి సత్యనారాయణ, రేలంగి నరసింహారావు, కోడి రామకృష్ణ గారి సినిమాల్లో ఎక్కువగా నటించారు.ముత్యాల సుబ్బయ్య దర్శకత్వంలో వచ్చిన పెళ్లి చేసుకుందాం సినిమా లో కూడా కళ్ళు చిదంబరం ఒక మంచి క్యారెక్టర్ చేసి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.

తనదైన కామెడీతో జనాలు అందరికీ చాలా దగ్గర అయిపోయాడు.అలాగే కోడి రామకృష్ణ దర్శకత్వంలో వచ్చిన అమ్మోరు సినిమా లో మంచి క్యారెక్టర్ పోషించి అందరి చేత శభాష్ అనిపించుకున్నాడు చివర్లో అయితే సౌందర్య రౌడీ చేతిలో ఇబ్బంది పడుతుంటే బొట్టు పెట్టమ్మా అనే డైలాగు చాలా ఫేమస్ అయిపోయింది.
ఆ ఒక్క సినిమాతో కళ్ళు చిదంబరం కొన్ని రోజులపాటు స్టార్ గా ఇండస్ట్రీలో గుర్తింపు పొందాడు.అయితే తను నటుడిగా నటిస్తూ సినిమాలో నాటకాల్లో వచ్చే డబ్బులతో పేద కళాకారులకు సహాయం చేసేవాడు తను మాత్రం తను చేస్తున్న ఉద్యోగానికి సంబంధించిన డబ్బు మాత్రమే తన జీవనానికి వాడుకొనేవాడని చెప్పేవాడు.అయితే ఆయన్ని ఇండస్ట్రీకి చెందిన చాలామంది చాలాసార్లు సన్మానించారు.ఇక కళ్ళు చిదంబరం చాలా మంది పేద కళాకారులకు కూడా తనకు తోచినంత సహాయం చేస్తారని చాలా మంది చెప్పుకుంటారు.
కళ్ళు చిదంబరం గారు 2015లో అనారోగ్యం కారణం వల్ల కన్నుమూసిన విషయం అందరికీ తెలిసిందే ఆయనకి ఇద్దరు కూతుళ్లు, ఇద్దరు కొడుకులు.కళ్ళు చిదంబరం ఇండస్ట్రీలో అందరితో చాలా కలివిడిగా ఉండేవాడు అని ఎవరితో ఎప్పుడు గొడవలు పెట్టుకునే వాడు కాదని అసలు కాంట్రవర్సీ లోనే నిలిచే వాడు కాదని ఇప్పటికీ చాలా మంది అంటుంటారు.

అయితే కళ్ళు చిదంబరం చనిపోయిన తర్వాత వాళ్ళ ఫ్యామిలీకి చెందిన ఆయన కొడుకులు ఎవరు ఇండస్ట్రీకి రాలేదు ఫ్యూచర్ లో వస్తే రావచ్చు ఏమో.ఇండస్ట్రీలో అప్పుడు చాలా మంది కామెడీ యాక్టర్స్ ఉన్నప్పటికీ తనకంటూ ఒక డిఫరెంట్ స్టైల్ తో జనాల్ని నవ్విస్తూ ఉండేవారు కన్ను డిఫరెంట్ గా ఉండడమే అతనికి ప్లస్ అయిందని ఆయన చాలాసార్లు ఇంటర్వ్యూలో చెప్పారు.బ్రహ్మానందం
  బ్రహ్మానందం లేక మల్లికార్జునరావు ?బాంక్ ఆఫీసర్ గా ఉన్న సినిమాలో లోన్ కోసం వచ్చి నియోజకవర్గ ప్రజలను,కాకపొతే ఇద్దరు భార్యలు ,చాలకపోతే ,పిల్లల్నీ  హామీ గా పెడతాను అనే సన్ని వేశం కడుపుబ్బా నవ్విస్తుంది .ఇలా ఎన్నెన్నో పాత్రలలో తనదైన ముద్ర వేసి చిరకాలం గుర్తుండిపోయే చిరస్మరణీయ నటన ప్రదర్శించాడు కళ్ళు తో పాటు డైలాగ్ డెలివరీ కూడా తమాషా గా ఉండటం తో ‘’డబుల్ ప్లస్ పాయింట్ ‘’అయింది.అందుకనే అడిగి మరీ కేరక్టర్ ఇచ్చేవారు ఇండష్ట్రీ లో  .మానవత్వమున్న మంచి నటుడు కళ్ళు చిదంబరం .
  సశేషం
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -21-4-22-ఉయ్యూరు

Posted in సినిమా | Tagged | Leave a comment

కన్నడ సృజనాత్మక సాహిత్య సృష్టికర్త -పంజే మంగేష్ రావు -2

కన్నడ సృజనాత్మక సాహిత్య సృష్టికర్త -పంజే మంగేష్ రావు -2
విద్యాభ్యాసం
బంట్వాల్ పట్టణలక్షణాలన్నీ ఉన్న పల్లె ప్రాంతం .అక్కడి సుమారు 40సారస్వత బ్రాహ్మణ కుటుంబాలలో పంజే కుటుంబం ముఖ్యమైంది .రామప్పయ్యగారి పిల్లలు దైవభక్తీ సరస సౌజన్యాలకు పేరుపొందారు .పెద్దన్న కృష్ణారావు అభిప్రాయాలు,అలవాట్లలో గంభీరుడు .మంగేష్ రెండవ వాడు .తమ్ముళ్ళు శివరావు ,శ్రీనివాసరావు ,రాఘవేంద్ర ,తండ్రి చనిపోయేనాటికి పసి బిడ్డ చిన్న తమ్ముడు అందరూ మెరికల్లాంటి వాళ్ళు .చుట్టుప్రక్కలవారితో కలుపు గోలుగా ఉండేవారు .పచ్చని వాతావరణం ,నేత్రావతి సోయగాలు వారిని ఆకర్షించేవి .పంజే కు చురుకు తక్కువ .ఈత బాగా వచ్చినా చిన్నతమ్ముడు మునిగిపోతుంటే రక్షించటానికి వెళ్లి తానె మునిగాడు ..శంకర్ కూడా దూకి మునిగిపోగా దారిలో వెళ్ళే వారొకరు చూసి అందర్నీ కాపాడాడు .పంజే దైవభక్తితో ఇంట్లో ,గుడిలో నేర్చిన మంత్రాలుచదువుతూ ఉండేవాడు .తల్లినుంచి మరాటీ ,కన్నడ భక్తీ గీతాలు,సూక్తులు నేర్చాడు .స్వరం బాగుండేది .హాస్యంగా మాట్లాడి అందర్నీ నవ్వించే వాడు .ఆశుకవిత్వం లో పంజే సోదరులు దిట్టలు .సమస్యా పూరణం లో ఘటికులు .
పంజే తనకు వచ్చిన చదువు ఇతరులకు సులభంగా బోధించేవాడు .ఆయన ముఖ్యోపాధ్యాయుడుగా ఉన్న స్కూల్ లో ఆయన స్నేహితులు అనుసరించేవారు .ఆయన కవితా ప్రయోగాలు చాలాకాలం అక్కడి వారు జ్ఞాపకం ఉంచుకొన్నారు .ఇంటిపనులలో తల్లికి సాయం చేసేవాడు .స్వామి రధోత్సవానికి స్నేహితుల్ని పోగు చేసి హడావిడి చేసేవాడు .
ఉన్నత విద్యకోసం మంగుళూరులో తల్లివైపు బంధువుల ఇంట్లో ఉన్నాడు .మంచి స్కాలర్షిప్ లు పొందాడు .ప్రైవేట్లు చెప్పి కావలసిన డబ్బు సంపాదించేవాడు .కాగితంతో సహా అన్నిటికి కటకట.ఒకే పేజీలో రెండు సార్లు రాసేవాడు .గీతకు గీతకు మధ్య ఇంకు మార్చి రాసేవాడు .తనదగ్గర లేనిపుస్తాకాలు ఇతరుల దగ్గర తెచ్చి చదివి ఇచ్చేసేవాడు .జ్ఞాపక శక్తి,ధారణా బాగా ఎక్కువ .1892లో దాయాదుల వ్యాజ్యాలతో కలత చెంది తండ్రి చనిపోయాడు .వార్త తెలిసి అప్పటికే చివరి పడవ వెళ్ళిపోగా నడుచుకుంటూ వెళ్లి తండ్రిని చివరి చూపు చూసి ఆశీర్వాదం పొందాడు .చనిపోతూ తండ్రి ‘’మద్య౦ ముట్ట వద్దు . నిర్మలంగా నిజాయితీగా జీవించు. అన్నదమ్ముల్నిఅక్క చెల్లెళ్ళను జాగ్రత్త గా చూసుకో ‘’అని హితవు చెప్పాడు .చివరిదాకా నిజాయితీగా వీటిని పాటించాడు .
పెద్దన్న మద్రాస్ లో చదివి డిగ్రీ పొంది ,పెళ్లి చేసుకొని బొంబాయి స్టేట్ లో ఉద్యోగం లో చేరాడు .క్షణం తీరిక ఉండేదికాదు అన్న కృష్ణారావు కు .1894లో పంజే ఒక ప్రసిద్ధ కన్నడ పండితుడి చెల్లెల్ని పెళ్ళాడి ,ఎఫ్ ఎ పాసై పై చదువు కు కుటుంబ పోషణకు ప్రయత్నాలు చేసి ,లెక్కలలో డిగ్రీ పొందాలని ఉన్నా ,మంగుళూరు లో ఉన్న ఒకే ఒక డిగ్రీ కాలేజి సెయింట్ ఎలోషియస్ కాలేజిలో కన్నడ చరిత్ర అర్ధ శాస్త్రాలతో తృప్తి పడాల్సి వచ్చింది .పూర్తిగా డిగ్రీ పొందకుండా నే రెండు పార్ట్లు పాసై ,ప్రభుత్వకాలేజిలో సహోపాధ్యాయుడుగా ఇంగ్లీష్ పరిజ్ఞానం ఉండటం వలన చేరి అందరికీ ఆశ్చర్యం కలిగించాడు .
ఉద్యోగం
పై ఉద్యోగానికి పంజే తో పోటీపడింది నందలికే లక్ష్మీ నారాయణప్ప తర్వాత కన్నడ సాహిత్యానికి గొప్ప సేవ చేసినవాడు .వీరిద్దరూ ఒకరికొకరు పోటీ అని తెలియదు .నందకిలే కు తనవలన అవకాశం పోయిందని తెలుసుకొని పంజే ఆయనకు ఒక తియ్యటి లేఖ రాస్తూ ‘’వడ్లు దంచే రోకలిని కన్నడ సాహిత్యాన్నీ బోధించటానికి ఎన్నుకున్నారు .నెమలి పింఛం తో తయారైన చిత్రకారుని కుంచెను చెవిలో గూలి తీసుకోవటానికి వదిలిపెట్టారు ‘’అని రాశాడు ఆతర్వాత ఇద్దరూ మంచి మిత్రులయ్యారు .అనేక వేదికలపై ఆయన్ను’’దక్షిణ కన్నడ జిల్లాలో నిజమైన కవి ‘’అని కీర్తించాడు .
పంజే జీతం నెలకు 20రూపాయలు .తల్లి పెద్దన్నయ్య దగ్గరకు ,ఒకసోదరుడు చదువుకోసం మద్రాస్ కు వెళ్ళగా పంజే ,భార్య,పిల్లలే మంగుళూరులో ఉన్నారు .వచ్చిన దానితోనే గుట్టుగా సంసారం లాగించేవాడు .కొంతకాలాని పంజే సోదరులిద్దరూ చనిపోయారు .కు౦గి పోయాడు కాని నిగ్రహించుకొన్నాడు .ఒక కవితాత్మక తత్వ గీతం రాశాడు .పంజే హెడ్మాస్టర్ అయి , జీతం మరో పది పెరిగి కొంత ఇబ్బంది తగ్గింది .ఉపాధ్యాయుడుగా స్థిర పడాలంటే ఎల్టి కావాలి అందుకని మద్రాస్ లో బంధువుల ఇంట్లో భార్యా ,పిల్లల్ని ఉంచి, తాను దక్షిణ కన్నడ విద్యార్ధి కూటం లో చేరి తొమ్మిదినెలలలో ట్రెయినింగ్ పూర్తయి ఎల్టి డిగ్రీ తీసుకొని మంగుళూరు చేరి ,ప్రభుత్వోద్యోగం లో స్థిరపడ్డాడు .
సశేషం
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -20-4-22-ఉయ్యూరు .

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

మనమరపు వెనుక మన వెండి తెర మహానుభావులు –233 233-అవ్వయ్యార్ తో సినీ ప్రవేశం చేసి 15వందల పలుభాషా చిత్రాలలో నటించి ,జాతీయఅవార్డ్ పొంది హాలీవుడ్ సినిమాలో నూ నటించి ,బక్క నరసింహం అని తమిళనాట ,జుట్టు నరసింహం అని తెలుగు నోట అనిపించుకొన్న –ఓమకుచ్చి నరసింహన్

మనమరపు వెనుక మన వెండి తెర మహానుభావులు –233

233-అవ్వయ్యార్ తో సినీ ప్రవేశం చేసి 15వందల పలుభాషా చిత్రాలలో నటించి ,జాతీయఅవార్డ్ పొంది హాలీవుడ్ సినిమాలో నూ నటించి ,బక్క నరసింహం అని తమిళనాట ,జుట్టు నరసింహం అని తెలుగు నోట అనిపించుకొన్న –ఓమకుచ్చి నరసింహన్

తెలుగు, తమిళ, మళయాల, కన్నడ మొదలైన 14 భారతీయ భాషలలో 1500 చలనచిత్రాలలో పనిచేశాడు. “ఇండియన్ సమ్మర్” అనే హాలీవుడ్ సినిమాలో కూడా నటించాడు. తెలుగు సినిమా రంగంలో “జుట్టు నరసింహం”గా స్థిరపడిన ఈ నటుడు తమిళ సినిమాలలో “ఓమకుచ్చి నరసింహన్”(బక్క నరసింహన్)గా సుపరిచితుడు.

ఇతడు తమిళనాడు రాష్ట్రం, కరూర్ జిల్లా, కట్టలై గ్రామంలో 1931లో జన్మించాడు. తన 13వ యేట అవ్వయార్ చిత్రంలో మొదటిసారి నటించాడు. చదువు పూర్తి చేసిన తరువాత కొంతకాలం జీవితభీమా సంస్థలో పనిచేశాడు. తర్వాత తన గురువు, నటుడు సురుళి రాజన్ ప్రోత్సాహంతో 1969లో తిరుకళ్యాణం అనే తమిళ సినిమాతో పునఃప్రవేశం చేశాడు. ఇతనికి భార్య సరస్వతి, కుమార్తెలు విజయలక్ష్మి, నిర్మల, కుమారుడు కామేశ్వరన్ ఉన్నారు. ఇతడు గొంతు కేన్సర్‌తో బాధపడుతూ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తన 78వ యేట 2009, మార్చి 11న మరణించాడు[1].

. ఏడాది కాలంగా గొంతు క్యాన్సర్‌తో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఈయన ఆరోగ్యం క్షీణించి బుధవారం రాత్రి తుదిశ్వాస విడిచారు. మంగమ్మగారి మనవడు వంటి చిత్రాల్లో కేవలం జుట్టుతోటే కామిడీ చేసిన ఆయన్ని మరిచిపోవటం కష్టమే. కొంతకాలం పాటు ఆయన పాత్ర లేకుండా రచయితలు సినిమా రాసేవారు కాదు. ఆ క్రమలంనే ఆయన సుమారు 1,500 తమిళం, తెలుగు, కన్నడ, మలయాళ చిత్రాను పూర్తి చేసారు. ‘జుట్టు’ నరసింహంగా ఇక్కడ మనవాళ్లు గుర్తుపెట్టుకుంటే తమిళంలో ‘ఓమకుచ్చి నరసింహన్‌’ (బక్క నరసింహం) గా అలరించారు. ఇక ఆయన భారతీయ భాషలే కాకుండా ‘ఇండియన్‌ సమ్మర్‌’ అనే హాలీవుడ్‌ సినిమాలోనూ నటించటం విశేషం. తమిళంలో ప్రముఖ దర్శకుడు విసు దర్శకత్వం వహించిన ‘సంసారం అదు మిన్సారం’ చిత్రంలో నటనకుగాను జాతీయ అవార్డు అందుకోవ డం విశేషం. . చదువు పూర్తయ్యాక ఎల్‌ఐసీలో కొంతకాలం ఉద్యోగం చేశారు. తన గురువు, నటుడు సురుళి రాజన్‌ ప్రోత్సాహంతో 1969లో ‘తిరు కళ్యాణం’ తమిళ చిత్రంతో పునఃప్రవేశం చేశారు.

నటించిన తెలుగు సినిమాలు
· మంగమ్మగారి మనవడు (1984)

· కాష్మోరా (1986)

· అత్తగారూ స్వాగతం (1986)

· మన్నెంలో మొనగాడు (1986)

· ముద్దుల కృష్ణయ్య (1986)

· కృష్ణ లీల (1987)

· చక్రవర్తి (1987)

· సంసారం ఒక చదరంగం (1987)

· జీవన జ్యోతి (1988)

· దొరవారింట్లో దొంగోడు (1988)

· మురళీకృష్ణుడు (1988)

· రక్తతిలకం (1988)

· స్టేషన్‌ మాస్టర్ (1988)

· బాల గోపాలుడు (1989)

· ముద్దుల మావయ్య (1989)

· ఇదేం పెళ్లాం బాబోయ్ (1990)

· జస్టిస్ రుద్రమ దేవి (1990)

· పోలీస్ భార్య (1990)

· విష్ణు (1990)

· బలరామకృష్ణులు (1992)

· మావూరి మహారాజు (1994)

· మాతో పెట్టుకోకు (1995)

· పవిత్ర బంధం (1996)

· ఒకే ఒక్కడు (1999)

· దేవి (1999)

· భలేవాడివి బాసు (2001)

సశేషం

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -20-4-22-ఉయ్యూరు

Posted in సినిమా | Tagged | Leave a comment

మనమరపు వెనుక మన వెండి తెర మహానుభావులు –232 -నటనకు ఊపిరులూది ,ఎందరోనటులను తీర్చి దిద్ది ,నటిస్తూనే ఊపిరి వదిలేసిన ధన్యమూర్తి,యాక్టింగ్ గురువు ,దర్శకుడు –దీవి శ్రీనివాస దీక్షితులు

మనమరపు వెనుక మన వెండి తెర మహానుభావులు –232

232-నటనకు ఊపిరులూది ,ఎందరోనటులను తీర్చి దిద్ది ,నటిస్తూనే ఊపిరి వదిలేసిన ధన్యమూర్తి,యాక్టింగ్ గురువు ,దర్శకుడు –దీవి శ్రీనివాస దీక్షితులు

దీవి శ్రీనివాస దీక్షితులు ప్రముఖ కమెడియన్, రైటర్ ఉత్తేజ్ బంధువైన డీఎస్‌ దీక్షితులు పూర్తి పేరు దీవి శ్రీనివాస దీక్షితులు. 1956లో దీవిహనుమంతాచార్యులు, సత్యవతమ్మ దంపతులకు గుంటూరు జిల్లా, రేపల్లెలో 1956, జులై 28 న జన్మించాడు. . నటుడిగా, యాక్టింగ్ గురుగా ఆయన ఇండస్ట్రీలో అందరికీ సుపరిచితమే.

‘మురారి’ సినిమాతో పాపులర్ మహేష్ బాబు హీరోగా వచ్చిన ‘మురారి’ చిత్రంలో పూజారి పాత్రలో నటించడంతో ఆయన ‘మురారి’ దీక్షితులుగా ఇండస్ట్రీలో పాపులర్ అయ్యారు. ఇంద్ర, ఠాగూర్‌, అతడు, వర్షం, పలు తెలుగు చిత్రాల్లో నటించారు. సంస్కత, తెలుగు భాషలలో రంగస్థల కళల్లో ఎం.ఏ. డిగ్రీలు పొందాడు. రంగస్థల నటుడిగా, అధ్యాపకుడిగా పేరు గడించాడు. రేపల్లెలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో లెక్చరరుగా పనిచేశాడు.

రంగస్థల ప్రస్థానం

నాటక రంగంలో సేవలు ఆంధ్రప్రదేశ్ థియేటర్ ఇన్‌స్టిట్యూట్‌లో డిప్లమా పూర్తి చేశారు. శకుంతలం, హరిశ్చంద్ర, కీలు బొమ్మలు లాంటి నాటకాల్లో నటించడంతో పాటు గోగ్రహణం, కొక్కొరొక్కో, వెయింటింగ్ ఫర్ గోడాట్ లాంటి నాటకాలకు దర్శకత్వం వహించారు.

ఆల్ ఇండియా రేడియోలో నటుడిగా పాల్గొన్నాడు. టి.వి.లో ఈయన నటించిన “ఆగమనం” సీరియల్ కు దాదాపు అన్ని నంది అవార్డులు లభించాయి. 2019లో మాటీవిలో వచ్చిన సిరిసిరిమువ్వలు ఈయన చివరి సీరియల్. ఎల్లమ్మ, మురారి, ఇంద్ర, ఠాగూర్, ప్రాణం, వర్షం, అతడు, గోపాల గోపాల బెండు అప్పారావు మొదలగు చిత్రాలలో నటించాడు

యాక్టింగ్ గురువుగా అక్కినేని యాక్టింగ్ ఇన్‌స్టిట్యూట్, రవీంద్ర భారతిలోని మీడియా యాక్టింగ్ సంస్థల్లో గురువుగా సేవలు అందించారు. తెలుగు సినీ ఇండస్ట్రీలో ఎంతో మంది ఆయన వద్ద నటనలో శిక్షణ తీసుకున్నారు.

ప్రముఖ తెలుగు సినీ, టీవీ, రంగస్థల నటుడు, యాక్టింగ్ గురు డీఎస్‌ దీక్షితులుదీక్షితులు 2019, ఫిబ్రవరి 18 సోమవారం సాయంత్రం నాచారంలోని రామకృష్ణ సినీ స్టూడియోస్‌లో ‘సిరిసిరి మువ్వలు’ సీరియల్ షూటింగులో నటిస్తూనే గుండెపోటుకు గురై మరణించాడు.[2][3][4]

మూలాలు

నాచారంలోని ఓ ఆసుపత్రికి దీక్షితులు తరలించారు. అయితే మర్గమధ్యంలోనే ఆయన మరణించినట్లు వైద్యులు ధృవీకరించారు. ఊహించని ఘటనతో ఒక్కసారిగా అంతా షాకయ్యారు.

ఈ విషయం తెలిసి హైదరాబాద్‌లోని దీక్షితులు నివాసానికి వేలాదిగా ఆయన శిష్యులు తరలి వస్తున్నారు. దీక్షితులు అంత్యక్రియలు తెనాలి పక్కన ఉన్న ఆయన స్వస్థలం కొల్కలూరులో దహన క్రియలు జరుగుతాయి.

ఊపిరి కూడా నటనకే అంకితం చేశారు ‘‘దీక్షితులు మాస్టారు మరణం ఎంతో బాధించింది. నేను నటిస్తూ నటిస్తూ పోవాలని ఉందని నాగేశ్వరరావు ఎప్పుడూ అనే వారు. అది వారి విషయంలో జరుగలేదు కానీ… దీక్షితులుగారి విషయంలో జరిగింది. దీక్షితులుగారు తన జీవితాన్ని, సంపాదనను, సర్వస్వాన్ని ఆఖరు ఊపిరి కూడా నటనకే అంకితం చేశారు. ఆయన మరణం బాధ కలిగించినా.. ఆయనకు నటనపట్ల ఉన్న అంకిత భావం ఆశ్చర్యం కలిగిస్తుంది.” అని సినీ గేయ రచయిత సుద్దాల అశోక్ తేజ అన్నారు.

అవార్డులు – పురస్కారాలు

  1. శ్రీ కృష్ణతులాభారం పద్యనాటకానికి దర్శకత్వం వహించి 1999 నంది నాటకోత్సవాలలో ఉత్తమ ప్రదర్శన, ఉత్తమ దర్శకుడు బహుమతులు
  2. పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం అవార్డు
  3. గరికపాటి రాజారావు మెమోరియల్ అవార్డు
  4. రాష్ట్ర ప్రభుత్వ ఉగాది పురస్కారం
  5. చైతన్య ఆర్ట్ థియేటర్ అవార్డు

సశేషం

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -20-4-22-ఉయ్యూరు

Posted in సినిమా | Tagged | Leave a comment

కన్నడ సృజనాత్మక సాహిత్య సృష్టికర్త -పంజే మంగేష్ రావు -1

కన్నడ సృజనాత్మక సాహిత్య సృష్టికర్త -పంజే మంగేష్ రావు -1

వి సీతారామయ్య కన్నడ రచనకు డా.ఆర్వీ ఎస్ సుందరం తెలుగు అనువాదం ‘’పంజేమంజేష్ రావు ‘’పుస్తకాన్ని కేంద్ర సాహిత్య అకాడెమి 1981లో ప్రచురించింది వెల-4రూపాయలు .

పంజే మంగేష్ రావు పుట్టిన దక్షిణ కన్నడ జిల్లా మద్రాస్ ప్రావిన్స్ లో ఉండేది .పాలన మైసూర్ దే అయినా ఆజ్ఞలన్నీ మద్రాస్ నుంచే వచ్చేవి .కేరళకూడా అప్పుడు అందులోదే .

 పంజే సారస్వత బ్రాహ్మణుడు .మాతృభాష కొంకణి .మంగుళూరు లో వ్యవహార భాష తుళు.ఇది గుర్తింపు పొందనికన్నడ భాష .కొంకణిలో రోమన్ కేధలిక్ ,ప్రోటష్టంట్ అనే క్రైస్తవ భాష ,ఉచ్చారణలో తేడాఉన్న గౌడ సారస్వత భాష ఉన్నాయి .దక్షిణ కన్నడ జిల్లాలో ఉడిపి వరకు శైవ వైష్ణవులలో తుళు వాడుకభాష .గౌడ సారస్వతులకు వ్యాపారం బాంకింగ్ పరిశ్రమ రవాణా ఉన్నాయి .వీరిమధ్య పెళ్ళిళ్ళు జరిగిన దాఖలా లేదు .మతపరంగా ద్వైతం ,అద్వైతం అవటం కూడా కారణం కావచ్చు .హవ్యక బ్రాహ్మణులు పాత కన్నడం సంస్కృతం లలో దిట్టలు .ఐకమత్యమూ లేదు. కన్నడం కూడా వీరిని కలిపి ఉంచలేక పోయింది .హవ్యకేతరులలో బుద్ధి సూక్ష్మత ,ఉత్సాహం ఎక్కువ .వీరు మలయాళీయులతో తమిళులతో పోటీ పడాల్సి వచ్చేది .అందరికి న్యాయ ,కేంద్రస్థానం మాత్రం మద్రాస్ .స్కూళ్ళల్లో  బోధన కన్నడం .దక్షిణ భారతం లో రెండు చివర్లలో అంటే పశ్చిమాన మంగుళూరు ,తూర్పున మద్రాస్ ల మధ్యలో బెంగుళూరు ఉంటుంది .

  సారస్వతులు అందగాళ్ళు తెలివి తేటలున్నచిన్న శాఖ .మేదాపర జ్ఞాన సంపాదనలో విశిష్టులు .శాంతి ,మానవతా దృక్పధం ఎక్కువ .సాహిత్య కళా వైజ్ఞానిక ,రాజకీయ ,పాలన వ్యవహారాలలో అఖండులు .వారిలో ఆత్మీయత బాగా ఎక్కువ ,దక్షిణ కన్నడ జిల్లాకు బయట  బాంబే ధార్వాడ  ,బెంగుళూరు మద్రాస్ లలో బాగా వ్యాపి౦చారు  .అవి ఉన్నత విద్యకు సంస్కృతికి కేంద్రాలుగా ఉండేవి .సారస్వతులకు తమిళ మళయాళ కొంకణి ,మరాటా కన్నడాలలో మంచి పరిచయం ఉంటుంది .మరాటీ మీద కొందరికి ఎక్కువ పక్షపాతం ఉండేది .

 తుంగ భద్రకు ఈవల అవతల ఉన్న కన్నడ సీమ  లో అప్పట్లో కన్నడానికి పెద్ద ప్రాముఖ్యత ,గౌరవం లేదు .శుద్ధ కన్నడ ప్రాంతం మైసూరు లోనూ ఇదే పరిస్థితి .1870నుంచి మైసూర్ పాలన మద్రాస్ కు చెందిన దివాన్ల చేతిలో నే ఉండేది .మైసూర్ వారు ఇంగ్లీష్ ను బాగా ఆదరించారు .1799వరకు ఈ రెండుప్రాంతాలు ముస్లిం పాలకుల అధీనం లో ఉండటం  వలన ఇస్లాం ప్రభావం కూడాఎక్కువె .కన్నడం పై అభిమానం మాత్రం లోపల్లోపల ఉండిపోయింది .బెంగాల్ మహారాష్ట్ర లలో వచ్చిన కొత్త భావనలు కన్నడ పండితులు ,సాహిత్యవేత్తలు జీర్ణించు కోవటం మొదలు పెట్టారు .తమకున్న ఇంగ్లీష్ పరిజ్ఞానం తో ప్రాంతీయ భాషలో సృజనాత్మక శక్తిని ఆధునిక విజ్ఞాన సాధనంగా మలచటానికి ప్రయత్నించారు. అదృష్ట వశాత్తు దక్షిణ కన్నడ జిల్లాలో పంజే వంటి వారు కన్నడ భాషాభి వృద్ధికి పాటుపడే మహనీయులను సమీకరించారు .వివేకి సృజన శీలి అయిన పంజే సృజనాత్మక సాహిత్య సృష్టికి నిర్విరామ కృషి చేశాడు .

 పుట్టుక

22-2-1874 న సాంస్కృతిక ధార్మిక సాంప్రదాయ మధ్యతరగతి కుటుంబలో పంజే జన్మించాడు .పుణ్యక్షేత్రమైన సుబ్రహ్మణ్యానికి దగ్గర పల్లెటూరు లో పుట్టాడు .తర్వాత కుటుంబం 30మైళ్ళ దూరం లో ఉన్న బంట్వాల్ కు వచ్చి స్థిరపడింది .ఇది దక్షిణకన్నడ౦లొ నేత్రావతీ నది ఒడ్డున ఉంది .తండ్రి రామప్పయ్య దైవ భక్తుడు .తల్లి శాంత ఆదర్శ గృహిణి .తండ్రి మరణం తర్వాత ఆమె నలుగురుకోడుకులు ,ఇద్దరు కూతుళ్ళను పెంచి పెద్ద చేసింది .పితృ సంబంధ వ్యాజ్యాలలో ఆస్తి హారతి కర్పూరం అయింది .దేవాలయ అర్చకుడైన తండ్రి సంపాదనే అందరికి ఆధారం .తన ఆభరణాలు అమ్మి పొదుపు చేసిన డబ్బు సాయంతో ఒక ఇల్లు కట్టించింది .చిన్న కుటీరాలు రెండుకట్టి అద్దెకిచ్చి ఆ అద్దె డబ్బుతో పిల్లల్ని చదివించింది .అందరి గౌరవం మన్ననలు పొందిన ఇల్లాలామే .విజ్ఞాన ఖని అయిన ఆమె వద్దకు అనేకులు సలహాలకోసం వచ్చేవారు .భర్త ధర్మబద్ధ జీవిటం గడిపి పేరు పొందాడు .ఇలాంటి చక్కని వాతావరణం లో పంజే పెరిగాడు .

  సశేషం

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -19-4-22-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

మనమరపు వెనుక మన వెండి తెర మహానుభావులు –231

మనమరపు వెనుక మన వెండి తెర మహానుభావులు –231

231-ఇద్దరమ్మాయిలు సినీ దర్శకుడు –పుట్టన్న

1970లో ఇద్దరు అమ్మాయిలు 1970లో విడుదలైన తెలుగు సినిమా. దీనికి కప్పు బిలుపు (1969) అనే కన్నడ సినిమా మాతృక. ఇందులో వాణిశ్రీ ద్విపాత్రాభినయం చేసి అక్కినేని నాగేశ్వరరావుశోభన్ బాబుల సరసన నటించింది.

వాణిశ్రీ ద్విపాత్రాభినయం నాగేశ్వరరావు శోభన్ బాబు హీరోలు .రంగారావు గుమ్మడి సూర్యకాంతం నాగయ్య అల్లు వగైరా ఇతర నటులు .కధ-ఆర్యాంబ పట్టాభి .సంభాషణలు నరసరాజు .సంగీతం మహదేవన్ .దాశరధి ,కొసరాజు పాటలు రాశారు తెలుగులో సూపర్ హిట్ సినిమా .డైలాగ్స్ బాగా పేలాయి రెండు విభిన్న పాత్రలలో వాణిశ్రీ నట విశ్వరూపం చూపింది .పాటలన్నీ బాగా పాప్యులర్ అయ్యాయి .ముఖ్యంగా దాశరధి రాసిన –‘’నా హృదయపు కోవెలలో ,నా బంగారు లోగిలిలో ‘’బాగా మెప్పుదలపొందింది .ఈ సినిమా నేను కనీసం నాలుగు సార్లు అయినా చూసి ఉంటాను .ఇంతకీ డైరెక్టర్ ఎవరో చెప్పలేదు .పుట్టన్న .అంటే ఎస్.ఆర్ .పుట్టన్న కనగల్ –కర్నాటక ప్రముఖ దర్శకుడు .

 పుట్టన్న 1-12-1933లో పుట్టి 5-6-1985న చనిపోయాడు .అసలుపేరు శుభ్ర వేష్టి రామస్వామయ్య సీతారామ శర్మ .కానీ ఎస్ ఆర్ పుట్టన్న కనగాల్ గా ప్రసిద్ధుడు .కన్నడ సినిమాను కదిలించిన గొప్ప దర్శకుడు .మైసూర్ రాష్ట్రం లో కనగాల్ అనే చిన్న గ్రామం లో పేద బ్రాహ్మణ కుటుంబం లో పుట్టాడు .పొట్టకోసం టీచర్ గా క్లీనర్ గా చిన్న చిన్న పనులు చేశాడు .వీటివలన దియేటర్ లకు సినిమాలకు దగ్గరయ్యాడు .ప్రముఖ దర్శకుడు బి ఆర్ పంతులు వద్ద కారు డ్రైవర్ గా చేరి అసిస్టెంట్ డైరెక్టర్ అయ్యాడు .మొదటిసినిమా1957లో వచ్చిన  రత్నగిరి రహస్యం .నాగలక్ష్మిని పెళ్ళాడి అయిదుగురు సంతానానికి తండ్రి అయ్యాడు .కానీ 1970 లో ఆరతి అనే ప్రముఖ నటిని ప్రేమించి పెళ్ళాడాడు .యశశ్వినికి జన్మనిచ్చి తర్వాత ఇద్దరూ వేరయ్యారు .

1981లో రంగనాయకి సినిమా డైరెక్ట్ చేసినా హిట్ కాకపోయినా క్లాసిక్ అనే పేరొచ్చింది .ఆరతి ని వదిలేశాక పనిలేకుండా ఏడాదిన్నర గడిపాడు .తర్వాత శుభ మంగళ ,ధర్మ సేరె అనే బ్లాక్ బస్తర్ సినిమాలకు డైరెక్ట్ చేశాడు తర్వాత తీసిన మానస సరోవర బాగా ఆడలేదు ,అమృతకలిగే రుణ ముక్తాలు కూడా ఆవరేజ్ అనిపించాయి ,గజ్జేపూజ ,శరపంజర .చారిత్రాత్మక ,పౌరాణిక చిత్రాల ను చాలాగోప్పగా డైరెక్ట్ చేసిన పుట్టన్న చరిత్ర సృష్టించాడు కన్నడ ఫిలిం అసోసియేషన్ కు మొట్టమొదటి  డైరెక్టర్ పుట్టణ్ణ.మూడు సార్లు కన్నడ ఫిలిం ఫేర్ అవార్డ్ లు పొందాడు పుట్టన్న.బెస్ట్ స్క్రీన్ ప్లే కు ,బెస్ట్ ఫీచర్ ఫిలిం కు ,రెండుసార్లు జాతీయ స్థాయి అవార్డ్ లు పొందాడు .

  సశేషం

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -19-4-22-ఉయ్యూరు

Posted in సినిమా | Leave a comment

మనమరపు వెనుక మన వెండి తెర మహానుభావులు –229

మనమరపు వెనుక మన వెండి తెర మహానుభావులు –229

229-ఇద్దరు ముఖ్యమంత్రులు అన్నాదురై ,కరుణానిధి లతో తమిళ సిని స్క్రిప్ట్ రాయించుకొని ,తెలుగులో లేతమనసులు హిట్ చిత్ర దర్శకజంట,కలైమామణి అవార్డ్ గ్రహీతలు –కృష్ణన్ –పంజు

ఆర్.కృష్ణన్ (1909–1997), ఎస్.పంజు (1915–1984), జంటగా కృష్ణన్ – పంజు పేరుతో పిలువబడే భారతీయ సినిమా దర్శకులు. ఈ జంట హిందీ, దక్షిణ భారతీయ భాషలలో 50 చిత్రాలకు పైగా దర్శకత్వం వహించారు.[1]దర్శకజంట,కలైమామణి అవార్డ్ గ్రహీతలు –కృష్ణన్ –పంజు

జీవిత విశేషాలు
ఆర్.కృష్ణన్ తమిళనాడు రాష్ట్ర రాజధాని చెన్నై పట్టణంలో 1909, జూలై 18న జన్మించాడు.[2] మొదట్లో ఇతడు కోయంబత్తూరులోని పక్షిరాజా స్టూడియో (అప్పట్లో కందన్ స్టూడియోగా పిలువబడేది) లో లాబొరేటరీ ఇన్‌ఛార్జిగా పనిచేశాడు.[3] ఇతని కుమారుడు కె.సుభాష్ కూడా చలనచిత్ర దర్శకుడుగా పనిచేశాడు[4].

ఎస్.పంజు అసలు పేరు పంచాపకేశన్. ఇతడు కుంభకోణం సమీపంలోణి ఉమయాల్ పురంలో 1915, జనవరి 24న జన్మించాడు.[2] ఇతడు దర్శకుడిగా మారడానికి పూర్వం పి.కె.రాజాశాండో వద్ద సహాయ ఎడిటర్‌గా, ఎల్లిస్ ఆర్. దంగన్ వద్ద సహాయ దర్శకునిగా పనిచేశాడు. ఇతడు పంజాబి పేరుతో కొన్ని సినిమాలకు ఎడిటర్‌గా పనిచేశాడు.[3][5][6]

వృత్తి
వీరిరువురూ కందన్ స్టూడియోలో పి.కె.రాజా శాండో దర్శకత్వం వహించిన మనునీధి చోళన్ (1942) అనే తమిళ సినిమాలో పనిచేశారు.[5] ఆ సమయంలో వీరిరువురూ మంచి మిత్రులుగా మారారు. వీరి పనితనాన్ని గమనించి రాజాశాండో తన తరువాతి ప్రాజెక్టు పూంపావై వీరికి ఆప్పజెప్పాడు. ఆ విధంగా పూంపావై (1944) దర్శకులుగా ఈ జంట మొదటి చిత్రం అయ్యింది.[7] 1947లో ఈ జంట పైతియక్కరన్ అనే సినిమాకు దర్శకులుగా పనిచేశారు.[8] 1949లో వీరు మిష్టర్ డీడ్స్ గోస్ టు టౌన్ అనే అమెరికన్ రొమాంటిక్ కామెడీ సినిమా ప్రేరణతో నల్లతంబి అనే సినిమాను తీశారు. ఆ సినిమాకు సి.ఎన్.అన్నాదురై స్క్రిప్ట్ వ్రాశాడు. ఇది అతని మొదటి సినిమా. తరువాతి కాలంలో ఇతడు తమిళనాడు ముఖ్యమంత్రిగా పనిచేశాడు.[9] 1952లో వీరు దర్శకత్వం వహించిన పరాశక్తి సినిమాకు తమిళనాడుకు మరో ముఖ్యమంత్రిగా పనిచేసిన ఎం.కరుణానిధి సంభాషణలు వ్రాశాడు.[10][11] వీరు భాభీ, షాదీ వంటి హిందీ సినిమాలు కుడా దర్శకత్వం వహించారు. వీరికి 1960లో కలైమామణి పురస్కారం లభించింది.[1]

మరణాలు
1984, ఏప్రిల్ 6వ తేదీన ఎస్.పంజు చెన్నైలో మరణించాడు.[8] పంజు మరణం తర్వాత కృష్ణన్ ఏ సినిమాను తీయలేదు. అతడు 1997, జూలై 15వ తేదీన మరణించాడు.[1

తెలుగులో లేతమనసులు ,కాశ్మీర్ బుల్లోడు ,హిందీలో భాభీ ,బర్ఖా ,బిందియ ,మన్ మౌజి సుహాగ్ సిందూర్ ,షాదీ లాడ్లా తమిళం లో పూమ్ పావై ,నల్లతంబి ,పరాశక్తి ,రక్త కన్నీర్ ,కులదైవం ,తిలకం ,అన్నై,చక్రవర్తి వంటి అనేక హిట్ సినిమాలకు దర్శకత్వం వహించారు

230-పుణ్యవతి దర్శకుడు –దాదా మిరాశి

దాదా మిరాశి దర్శకత్వం లో నరసరాజు స్క్రిప్ట్ రాయగా రామారావు ,కృష్ణకుమారి శోభన్ రంగారావు హరనాద్ వగైరా నటించగా ఘంటసాల సంగీతం లో 1967 లో వచ్చిన చిత్రం పుణ్యవతి .నారాయణ రెడ్డి పాటలు .ఎంత సొగసుగా ఉన్నావు ,మనసుపాడింది ,ఇంతేలే నిరుపేదలు ,ఉన్నావా ఓ దేవా ఘంటసాల సుశీల స్వరమాదుర్యం లో ఆనంద వర్షం లో తడిపేశాయి .విషాదం గూడుకట్టుకొన్న పాట ఘంటసాల గానం లో మరోలోకం లోకి తీసుకు వెడుతుంది .

తమిళం లో దాదా మిరాశి డైరెక్ట్ చేసిన ‘’రాజ వీటు పిళ్ళై’’తెలుగులో పూలపిల్లగా 1968లో విడుదలైంది .తిరుమలేశ్వర ప్రోడక్షన్స్ పై షణ్ముగం,చెంగల్ రాయుడు నిర్మించారు .జైశంకర్ ,జయలలిత ,జయభారతి ముఖ్యనటులు .మాటలు రాజశ్రీ .సంగీతం ఎం ఎస్ సుబ్బయ్యనాయుడు ,రాజారాం.

1967లో దాదా దర్శకత్వం లో నిర్దోషి వచ్చింది .రామారావు సావిత్రి అంజలి వగైరా నటులు .నారాయణ రెడ్డి పాటలు ఘంటసాల సంగీతం .’’మల్లిక లారా మాలిక లారా మౌనముగా ఉన్నారా –మాకధలే విన్నారా ‘’సూపర్ డూపర్ హిట్ సాంగ్ .చిన్నారి క్రుష్ణయ్యరారా ,మా కన్నుఅల్లో వెలుగు నీవేరా ‘’కూడా హిట్ సాంగ్

సశేషం

మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -17-4-22-ఉయ్యూరు

Posted in సినిమా | Tagged | Leave a comment

మనమరపు వెనుక మన వెండి తెర మహానుభావులు –229229-ఇద్దరు ముఖ్యమంత్రులు అన్నాదురై ,కరుణానిధి లతో తమిళ సిని స్క్రిప్ట్ రాయించుకొని ,తెలుగులో లేతమనసులు హిట్ చిత్ర దర్శకజంట,కలైమామణి అవార్డ్ గ్రహీతలు –కృష్ణన్ –పంజు 

మనమరపు వెనుక మన వెండి తెర మహానుభావులు –229
229-ఇద్దరు ముఖ్యమంత్రులు అన్నాదురై ,కరుణానిధి లతో తమిళ సిని స్క్రిప్ట్ రాయించుకొని ,తెలుగులో లేతమనసులు హిట్ చిత్ర దర్శకజంట,కలైమామణి అవార్డ్ గ్రహీతలు –కృష్ణన్ –పంజు 
ఆర్.కృష్ణన్ (1909–1997), ఎస్.పంజు (1915–1984), జంటగా కృష్ణన్ – పంజు పేరుతో పిలువబడే భారతీయ సినిమా దర్శకులు. ఈ జంట హిందీ, దక్షిణ భారతీయ భాషలలో 50 చిత్రాలకు పైగా దర్శకత్వం వహించారు.[1]దర్శకజంట,కలైమామణి అవార్డ్ గ్రహీతలు –కృష్ణన్ –పంజు 
జీవిత విశేషాలు
ఆర్.కృష్ణన్ తమిళనాడు రాష్ట్ర రాజధాని చెన్నై పట్టణంలో 1909, జూలై 18న జన్మించాడు.[2] మొదట్లో ఇతడు కోయంబత్తూరులోని పక్షిరాజా స్టూడియో (అప్పట్లో కందన్ స్టూడియోగా పిలువబడేది) లో లాబొరేటరీ ఇన్‌ఛార్జిగా పనిచేశాడు.[3] ఇతని కుమారుడు కె.సుభాష్ కూడా చలనచిత్ర దర్శకుడుగా పనిచేశాడు[4].
ఎస్.పంజు అసలు పేరు పంచాపకేశన్. ఇతడు కుంభకోణం సమీపంలోణి ఉమయాల్ పురంలో 1915, జనవరి 24న జన్మించాడు.[2] ఇతడు దర్శకుడిగా మారడానికి పూర్వం పి.కె.రాజాశాండో వద్ద సహాయ ఎడిటర్‌గా, ఎల్లిస్ ఆర్. దంగన్ వద్ద సహాయ దర్శకునిగా పనిచేశాడు. ఇతడు పంజాబి పేరుతో కొన్ని సినిమాలకు ఎడిటర్‌గా పనిచేశాడు.[3][5][6]
వృత్తి
వీరిరువురూ కందన్ స్టూడియోలో పి.కె.రాజా శాండో దర్శకత్వం వహించిన మనునీధి చోళన్ (1942) అనే తమిళ సినిమాలో పనిచేశారు.[5] ఆ సమయంలో వీరిరువురూ మంచి మిత్రులుగా మారారు. వీరి పనితనాన్ని గమనించి రాజాశాండో తన తరువాతి ప్రాజెక్టు పూంపావై వీరికి ఆప్పజెప్పాడు. ఆ విధంగా పూంపావై (1944) దర్శకులుగా ఈ జంట మొదటి చిత్రం అయ్యింది.[7] 1947లో ఈ జంట పైతియక్కరన్ అనే సినిమాకు దర్శకులుగా పనిచేశారు.[8] 1949లో వీరు మిష్టర్ డీడ్స్ గోస్ టు టౌన్ అనే అమెరికన్ రొమాంటిక్ కామెడీ సినిమా ప్రేరణతో నల్లతంబి అనే సినిమాను తీశారు. ఆ సినిమాకు సి.ఎన్.అన్నాదురై స్క్రిప్ట్ వ్రాశాడు. ఇది అతని మొదటి సినిమా. తరువాతి కాలంలో ఇతడు తమిళనాడు ముఖ్యమంత్రిగా పనిచేశాడు.[9] 1952లో వీరు దర్శకత్వం వహించిన పరాశక్తి సినిమాకు తమిళనాడుకు మరో ముఖ్యమంత్రిగా పనిచేసిన ఎం.కరుణానిధి సంభాషణలు వ్రాశాడు.[10][11] వీరు భాభీ, షాదీ వంటి హిందీ సినిమాలు కుడా దర్శకత్వం వహించారు. వీరికి 1960లో కలైమామణి పురస్కారం లభించింది.[1]
మరణాలు
1984, ఏప్రిల్ 6వ తేదీన ఎస్.పంజు చెన్నైలో మరణించాడు.[8] పంజు మరణం తర్వాత కృష్ణన్ ఏ సినిమాను తీయలేదు. అతడు 1997, జూలై 15వ తేదీన మరణించాడు.[1
తెలుగులో లేతమనసులు ,కాశ్మీర్ బుల్లోడు ,హిందీలో భాభీ ,బర్ఖా ,బిందియ ,మన్ మౌజి సుహాగ్ సిందూర్ ,షాదీ లాడ్లా తమిళం లో పూమ్ పావై ,నల్లతంబి ,పరాశక్తి ,రక్త కన్నీర్ ,కులదైవం ,తిలకం ,అన్నై,చక్రవర్తి వంటి అనేక హిట్ సినిమాలకు దర్శకత్వం వహించారు
230-పుణ్యవతి దర్శకుడు –దాదా మిరాశి
దాదా మిరాశి దర్శకత్వం లో నరసరాజు స్క్రిప్ట్ రాయగా రామారావు ,కృష్ణకుమారి శోభన్ రంగారావు హరనాద్  వగైరా నటించగా ఘంటసాల సంగీతం లో 1967 లో వచ్చిన చిత్రం పుణ్యవతి .నారాయణ రెడ్డి పాటలు .ఎంత సొగసుగా ఉన్నావు ,మనసుపాడింది ,ఇంతేలే నిరుపేదలు ,ఉన్నావా ఓ దేవా ఘంటసాల సుశీల స్వరమాదుర్యం లో  ఆనంద వర్షం లో  తడిపేశాయి .విషాదం గూడుకట్టుకొన్న పాట ఘంటసాల గానం లో మరోలోకం లోకి తీసుకు వెడుతుంది .
తమిళం లో దాదా మిరాశి డైరెక్ట్ చేసిన ‘’రాజ వీటు పిళ్ళై’’తెలుగులో పూలపిల్లగా 1968లో విడుదలైంది .తిరుమలేశ్వర ప్రోడక్షన్స్ పై షణ్ముగం,చెంగల్ రాయుడు నిర్మించారు .జైశంకర్ ,జయలలిత ,జయభారతి ముఖ్యనటులు .మాటలు రాజశ్రీ .సంగీతం ఎం ఎస్ సుబ్బయ్యనాయుడు ,రాజారాం.
1967లో దాదా దర్శకత్వం లో నిర్దోషి వచ్చింది .రామారావు సావిత్రి అంజలి వగైరా నటులు .నారాయణ రెడ్డి పాటలు ఘంటసాల సంగీతం .’’మల్లిక లారా మాలిక లారా మౌనముగా ఉన్నారా –మాకధలే విన్నారా ‘’సూపర్ డూపర్ హిట్ సాంగ్ .చిన్నారి క్రుష్ణయ్యరారా ,మా కన్నుఅల్లో వెలుగు నీవేరా ‘’కూడా హిట్ సాంగ్
సశేషం
మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -17-4-22-ఉయ్యూరు

Posted in సినిమా | Tagged | Leave a comment

మనమరపు వెనుక మన వెండి తెర మహానుభావులు –228 228- కావ్య శిల్పి ,రేడియో అనౌన్సర్ ,’’మానవుడు చిరంజీవి ‘’మూకాభినయ ఎక్స్పర్ట్ ,రణభేరి పంజరం లోపాప వంటి చిత్ర దర్శకుడు నిర్మాత ,కధారచయిత –టివి రామాయణ లఘు చిత్ర నిర్మాత -గిడుతూరి సూర్యం

మనమరపు వెనుక మన వెండి తెర మహానుభావులు –228

228- కావ్య శిల్పి ,రేడియో అనౌన్సర్ ,’’మానవుడు చిరంజీవి ‘’మూకాభినయ ఎక్స్పర్ట్ ,రణభేరి పంజరం లోపాప వంటి చిత్ర దర్శకుడు నిర్మాత ,కధారచయిత –టివి రామాయణ లఘు చిత్ర నిర్మాత -గిడుతూరి సూర్యం

గిడుతూరి సూర్యం (1920-1997) రచయిత, కవి, సినిమా దర్శకుడు, నిర్మాత, స్వాతంత్ర్యసమరయోధుడు, అభ్యుదయ మానవతావాది. పశ్చిమగోదావరి జిల్లాలో జన్మించాడు. ఆకాశవాణిలో అనౌన్సరుగా పనిచేస్తూ అనేక నాటికలు, నాటకాలు, సంగీత రూపకాలు రచించాడు. ఇతను రాసిన “మానవుడు చిరంజీవి” మూకాభినయ నాటికను రష్యా సినిమా బృందం చిత్రంగా చిత్రీకరించారు. గిడుతూరి సాహితీ పేరిట నాటకాలు, నాటికలు సంపుటాలుగా వెలువరించాడు.

సినిమా రంగం
రణభేరి, ఆస్తికోసం, కథానాయకురాలు, విక్రమార్క విజయం, పేదరాశి పెద్దమ్మ కథ, అమృతకలశం,నేను – నా దేశం, పంచ కళ్యాణి దొంగల రాణి, పంజరంలో పసిపాప, సంగీత లక్ష్మి, స్వామిద్రోహులు మొదలైన చిత్రాలకు దర్శకునిగా పనిచేశాడు. రాజేశ్వరి చిత్రానికి అనిసెట్టి సుబ్బారావుతో కలిసి పాటలను వ్రాశాడు. పంజరంలో పసిపాప, పంచ కళ్యాణి దొంగల రాణి సినిమాలకు కథ, చిత్రానువాదం సమకూర్చాడు. పంచ కళ్యాణి దొంగల రాణి చిత్రాన్ని నిర్మించాడు.

మనదేశంలో దూరదర్శన్ ప్రసారాలు ప్రారంభం కానున్న తొలిరోజులలో టి.వి కోసం భారతీయ నటులతో, రష్యన్ సాంకేతిక నిపుణులతో నలుపు తెలుపుల్లో మొట్టమొదటిసారిగా ‘రామాయణం’ లఘుచిత్రాన్ని నిర్మించాడు. ఇతడు మంచి చిత్రకారుడు కూడా. 1949లో ఇతడు హైదరాబాదు కుద్బీగూడలో పద్మశాలి ప్రింటింగ్ ప్రెస్‌ను స్థాపించాడు. ప్రగతి ప్రచురణాలయంలో అనువాదకునిగా కూడా కొంతకాలం పనిచేశాడు. ఇతని రచనలు సుజాత, తెలుగు స్వతంత్ర, ఆంధ్రప్రభ, ఆంధ్రపత్రిక, ఉదయిని, ఆనందవాణి తదితర పత్రికలలో ప్రచురితమయ్యాయి.

రచనలు

  1. చక్రఘోష (కావ్యం)
  2. నా విశ్వవిద్యాలయాలు (అనువాదం – మూలం:మాక్సిం గోర్కీ)
  3. అమృతమూర్తి
  4. శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీవారి దివ్యసూక్తులు
  5. అమ్మా (కథ)
  6. కుమారుడి మరణం (కథ)
  7. త్యాగమూర్తి (కథ)
  8. పతిత (కథ)
  9. రజ్జు సర్ప భ్రాంతి (కథ)
  10. లోకం పోకడ (కథ)
  11. మానవుడు చిరంజీవి (మూకాభినయ నాటకము)

సశేషం

మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -17-4-22-ఉయ్యూరు

Posted in సినిమా | Leave a comment

మనమరపు వెనుక మన వెండి తెర మహానుభావులు –227 227-హాస్య బ్రహ్మ గారబ్బాయి ,మహా హాస్య రచయిత.కీర్తి శేషులు ,దంత వేదాంతం నాటక సృష్టికర్త ,150సినిమాలకు కధలందించి , 6 వేల సంవత్సరాల కాలెండర్ రూపొందించిన గణితమేదావి ,జ్యోతిష్ శాస్త్ర వేత్త,దృశ్యకావ్య ధురీణ –భమిడిపాటి రాదా కృష్ణ

మనమరపు వెనుక మన వెండి తెర మహానుభావులు –227

227-హాస్య బ్రహ్మ గారబ్బాయి ,మహా హాస్య రచయిత.కీర్తి శేషులు ,దంత వేదాంతం నాటక సృష్టికర్త ,150సినిమాలకు కధలందించి ,

6 వేల సంవత్సరాల కాలెండర్ రూపొందించిన గణితమేదావి ,జ్యోతిష్ శాస్త్ర వేత్త,దృశ్యకావ్య ధురీణ –భమిడిపాటి రాదా కృష్ణ

భమిడిపాటి రాధాకృష్ణ బహుముఖ ప్రజ్ఞశాలి. భమిడిపాటి రాధాకృష్ణ 3 నాటకాలు, 6 నాటికలు రచించగా అవి కన్నడ, తమిళ, హిందీ భాషల్లోకి అనువాదమయ్యాయి. ఇదేమిటి, కీర్తిశేషులు, మనస్తత్వాలు, భజంత్రీలు, దంత వేదాంతం వంటి నాటికలు, నాటకాలు వ్రాశారు. రావుగోపాలరావు ‘కీర్తిశేషులు’ లోని ఒక పాత్రద్వారా మంచి పేరు తెచ్చుకుని సినీ పరిశ్రమలోనూ అడుగుపెట్టాడు.
· , నిర్మాత దుక్కిపాటి మధుసూదనరావు ప్రోద్బలంతో సినీ రంగంలోకి ప్రవేశించి 150 సినిమాలకు కథలందించారు. ఇందులో కె.విశ్వనాథ్‌ తొలి చిత్రమైన ఆత్మగౌరవం కూడా ఉంది. బ్రహ్మచారి, కథానాయకుడు, కీర్తిశేషులు, మరపురాని కథ, విచిత్ర కుటుంబం, పల్లెటూరి బావ, ఎదురులేని మనిషి, గోవుల గోపన్న, సీతారామ కళ్యాణం, నారీనారీ నడుమ మురారి, కాలేజీ బుల్లోడు వంటివితో సహా తెలుగు చిత్రాలకు కథలు వ్రాశారు ఎన్టీఆర్‌, ఏఎన్నార్‌ లకు ఆయన సన్నిహితుడు. 1994 తర్వాత క్రమంగా ఆయన సినిమా రంగానికి దూరమయ్యారు.

· తనకు ఎంతో ఇష్టమైన గణిత రంగంపై మక్కువ చూపారు. భమిడిపాటి రాధాకృష్ణ క్యాలెండర్‌ పేరిట క్రీస్తుపూర్వం 45 నుంచి క్రీస్తుశకం 5555 వరకు అంటే ఆరు వేల సంవత్సరాల క్యాలెండర్‌ రూపొందించారు. జ్యోతిషరంగంలో కూడా ఆయనకి పట్టు ఉంది. సంఖ్యాశాస్త్రపరంగానే కాకుండా చిన్నారుల నామకరణ సమయంలో బియ్యంలో రాసే అక్షరాలను బట్టి కూడా ఆయన జాతకాలు చెబుతారనే పేరుంది.

· ఆయన 79 సంవత్సరాల వయస్సులో రాజమండ్రిలో మరణించారు . ఆయనకు భార్య, ఐదుగురు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు.

సాహిత్య రచనలు
· భజంత్రీలు (నాటకం)

· దంత వేదాంతం (నాటకం)

· కీర్తిశేషులు (నాటకం)[2]

· మనస్థత్వాలు (నాటకం)

· తరం-అంతరం (నాటకం)

సినిమా రంగం

  1. ఆత్మ గౌరవం (1965) (డైలాగ్స్ రచయిత)
  2. మరపురాని కథ (1967)
  3. కథానాయకుడు (1969)
  4. అల్లుడే మేనల్లుడు(1970)
  5. ఆడజన్మ (1970)
  6. బొమ్మా బొరుసా (1971)
  7. రామరాజ్యం (1973)
  8. ఆడపిల్లల తండ్రి (1974)
  9. అల్లుడొచ్చాడు (1976)
  10. పొగరుబోతు (1976)
  11. మనిషి రోడ్డున పడ్డాడు (1976)
  12. సాహసవంతుడు (1978)
  13. షోకిల్లా రాయుడు (1979)
  14. నారి నారి నడుమ మురారి

అవార్డులు
· జంద్యాల మెమోరియల్ అవార్డ్. దృశ్యకావ్య ధురీణ బిరుదాంకితుడు .

·

కాలచక్రంతో పాటు గ్రహగతులనూ, జ్యోతిశ్శాస్త్రాన్నీ కూలంకషంగా అధ్యయనం చేసి అక్షరాలకూ, సంఖ్యలకూ బ్రహ్మముడులు వేస్తూ ఒక వ్యక్తి పేరులోంచి వారు పుట్టిన సమయాన్ని వెలికి తీసేందుకు తెలుగు భాషలోని 24 లక్షల 9 వేల 428 గుణింతాలతో కూడిన ఒక నిర్దిష్ట సూత్రం రూపొందించి దాని ఆధారంగా జాతకాలను అధ్యయనం చేస్తూ జ్యోతిశ్శాస్త్రంలో ఓ వినూత్న ధోరణిని ప్రవేశపెట్టి ఆ శాస్త్రం యొక్క విలువను ప్రపంచానికి అందిస్తూ ఎందరికో భవిష్యన్మార్గదర్శకం చేసింది ఒక ఆంధ్రుడేనంటే అది మనకు గర్వకారణం కదూ….

తప్పుల తడకలతో నడకలు సాగిస్తున్న ప్రపంచ కాలచక్రానికి గతులు సరిచేసే నిమిత్తం 45 బి.సి నుంచి 5,555 ఎ.డి వరకూ ఆంగ్ల క్యాలెండర్‌ను సరిదిద్ది భమిడిపాటి కేలెండర్‌ను రూపొందించిన మేటి విజ్ఞానవేత్త మన తెలుగుబిడ్డేనంటే ఈ ఘనతను మనం ఆస్వాదించవద్దూ ….

సూర్యుని చుట్టూ భూమి చేసే భ్రమణానికి పట్టే సమయం 365.25 రోజులనీ లేదా 365.2425 రోజులంటూ ప్రపంచం ఇప్పటి వరకూ నమ్ముతున్న సూత్రాలను తిరగరాసి, ఈ భ్రమణానికి 365.2422 రోజులు పడుతుందంటూ గణిత సూత్రాల ఆధారంగా నిరూపించి నిర్ధారించిన మహా శాస్త్రవేత్త, సాటిలేని ఈ జ్యోతిశ్శాస్త్ర ఘనాపాటి మన భమిడిపాటి రాధాకృష్ణ.

పుట్టిన తేదీ మరియు సమయంతో సహా ఒక జాతకాన్ని నలుగురైదుగురు జ్యోతిష్కులకిస్తే ఒకొక్కరూ ఒక్కో రకమైన అసంబద్ధ ఫలితాలను పేర్కొంటూ జ్యోతిశ్శాస్త్రంపై ప్రజల నమ్మకాన్ని వమ్ము చేసి తప్పుదోవ పట్టిస్తున్న తరుణమిది. ఈ నేపథ్యంలో పలువురు జ్యోతిష్య, పంచాంగ పండితుల బండారం బయటపెట్టడం ద్వారా ఈ శాస్త్రం కల్పితం కాదని, భాషా వ్యాకరణ, ఖగోళ, గణితశాస్త్ర సూత్రాలతో అనుసంధానమై నిర్దిష్ట ఫలితాలను నిక్కచ్చిగా అందించే విజ్ఞాన గని అని నిరూపించి తన వాస్తవిక దక్పథాన్ని నిరూపించుకున్న వ్యక్తిత్వం ఆయన సొంతం.

అటు నాటక – సినీరంగాల్లో మేటి రచయితగా సగానికి పైగా జీవితాన్ని సన్మాన, సత్కార్యాలతో గడిపిన శ్రీభమిడిపాటి రాధాకృష్ణ వ్యాకరణ, ఖగోళ, గణితశాస్త్రాలను అనుసంధానించి అధ్యయనం చేయడం ద్వారా జ్యోతిశ్శాస్త్ర మూలాలను మర్ధించి మేటి జ్యోతిశ్శాస్త్రవేత్తగా రాణించారు. విజ్ఞాన వీచిక అయిన శ్రీరాధాకృష్ణ అనుభవ గుళికలను ఎన్టీయార్‌, అమితాబ్‌బచ్చన్‌ వంటి వారితో సహా పలువురు విదేశీయులు సైతం అందుకొని అచ్చెరువొందారు. ఈ అపూర్వ విజ్ఞానవేత్త జీవిత విశేషాలను మీ కోసం అందించడం మా వంతు, ఆస్వాదించడం మీ వంతు.

పండిత పుత్ర
పండిత పుత్ర పరమ శుంఠ అన్న నానుడిని తిరగరాస్తూ అలనాటి హాస్యబ్రహ్మ శ్రీ భమిడిపాటి కామేశ్వరరావుగారి ఏకైక పుత్రులైన శ్రీ భమిడిపాటి రాధాకృష్ణ 14-11-1929 వ తేదీన రాజమండ్రిలో జన్మించారు. ఇక్కడి శ్రీ వీరేశలింగం ఉన్నత పాఠశాలలోను, తరువాత రాజమండ్రి ఆర్ట్స్ కళాశాలలోను విద్యాభాస్యం చేసి, 1949లో బీ.ఎస్సీ పట్టభద్రులయ్యారు. తండ్రి శ్రీ కామేశ్వరరావు ఖ్యాతిగాంచిన హాస్య రచయిత కాగా… వారి రచనాభినివేశాన్ని తన జీన్స్‌లోనూ జీర్ణించుకున్నారు. రాధాకృష్ణ.

వెయ్యికి పైగా ….
నాటక రంగం వరకూ చూస్తే …. రాసింది తక్కువే అయినా అన్నీ వాసికెక్కిన రచనలే కావడం శ్రీ రాధాకృష్ణలోని రచనా తృష్ణకు తార్కాణం. ఆయన మొదటి రచన భజంత్రీలు నాటిక. దీన్ని మొదటిసారిగా 25-2-1950 వ తేదీన రాజమండ్రిలో ఆర్ట్స్ కాలేజి పూర్వ విద్యార్థి వార్షికోత్సవ సందర్భంలో ప్రదర్శించారు. ప్రేక్షకుల ఆదారాభిమానాలు పుష్కలంగా లభించడంతో, ఆ ఉత్సాహంతోనే మనస్తత్వాలు, అంతా ఇంతే, దంత వేదాంతం, పెళ్ళి పందాలు, పేటెంటు మందు అనే ఆరు నాటికలు – ఇదేమిటి?, కీర్తిశేషులు, దైవ శాసనం అనే మూడు నాటకాలను రచించారు. ఇందులో 6 నాటికలు, 3 నాటకాలు ఆంధ్రదేశంలో అపూర్వ జనాదరణ పొందుతూ, ప్రతీ ఒక్కటీ వెయ్యి ప్రదర్శనలకి పైగా ప్రదర్శింపబడి నాటకరంగ ఖ్యాతిని ఇనుమడింప చేశాయి. ఇవిగాక తరం-అంతరం అనే మరో నాటిక కూడా వీరి కలం నుండి జాలువారింది.

అపురూప నాటకోత్సవం
1950 నుంచి 1970 వరకు ఆంధ్ర దేశంలో జరిగిన అనేక నాటిక నాటక పరిషత్తులలో, ఈ ఆరు నాటికలు, 3 నాటకాలు ఉత్తమ శ్రేణిలో ఎన్నో బహుమానాలు అందుకున్నాయి. దైవశాసనం నాటకం, గుడివాడలో జరిగిన 29వ ఆంధ్ర నాటక కళాపరిషత్తు మహాసభలో ఉత్తమ, రచన బహుమతిని పొందిన సందర్భాన్ని పురస్కరించుకుని, 28-1-1952న రాజమండ్రిలో జరిగిన సన్మానసభలో, ఆ సభకి అధ్యక్షత వహించిన శ్రీ అక్కినేని నాగేశ్వరరావు గారి ఆధ్వర్యాన, శ్రీ రాధాకృష్ణకి దృశ్య కావ్య ధురీణ అనే గౌరవ పురస్కారం జరిపారు. 1985లో జనవరి 12, 13, 14, 15 తేదీలలో రాజమహేంద్రవరంలో శ్రీ భమిడిపాటి రాధాకృష్ణ నాటకోత్సవం జరిపించి, శ్రీ రాధాకష్ణ రచించిన 3 నాటకాలు, 6 నాటికలు వరసగా ప్రదర్శించడం ద్వారా రాజమండ్రి మయూరి కళాసమితి వారు తెలుగు నాటకరంగ చరిత్రలో మరో కొత్త ప్రయోగానికి నాంది పలికారు.

సినీరంగంలో అగ్రతాంబూలం
ఆత్మగౌరవం చిత్ర సంభాషణల రచయితగా, తెలుగు సినీ రంగ ప్రవేశం చేసిన శ్రీ రాధాకష్ణకు లభించిన ప్రోత్సాహంతో మరో 150 చిత్రాలకు కథ, సంభాషణలు అందించారు. కథానాయకుడు, విచిత్ర కుటుంబం, బ్రహ్మచారి, ఎదురులేని మనిషి, గోవుల గోపన్న, సీతారామకళ్యాణం, బొమ్మాబొరుసా, నారీ నారీ నడుమ మురారి మొదలైనవి ప్రముఖ చిత్రాలలో కొన్ని మాత్రమే.

శ్రీ గుళ్ళ పూడి విజయకుమార్ చెప్పిన సంగతులు

ది భమిడిపాటి కేలెండర్‌
శ్రీ రాధాకృష్ణకి గణితశాస్త్రం అన్నా, ఆ శాస్త్ర పరిశోధనలన్నా చాలా మక్కువ. ఆ ఉత్సాహంతోనే, 45 ఆ.ఇ. నుంచి 5555 అ.ఈ వరకు రోజు వారి ఇంగ్లీషు కేలెండరును రూపొందించారు. ప్రస్తుతం వాడుకలో ఉన్న ఇంగ్లీషు కాలెండర్‌లో తప్పు ఉందని రుజువు చేసి, దానిని సరి చేసుకొనే విధానాన్ని సూచిస్తూ 1990లో ది భమిడిపాటి కేలెండర్‌ను ఆంగ్లంలో పుస్తక రూపంలో ప్రచురించారు. జపాన్‌ మరియు లండన్‌ వంటి విదేశాల్లో ఈ క్యాలెండర్‌ విడుదలై, విక్రయించబడి సంచలనం సష్టించింది. ప్రపంచంలో ఇటువంటి ప్రయత్నం ఇదే తొలిసారికాగా వీరి అపూర్వ కృషి విజ్ఞులు, విమర్శకుల మన్ననలందుకుంది. ఇది ఆంధ్రులందరకూ గర్వకారణం.

పేరులోనే ఉంది…
జ్యోతిష్య శాస్త్రంలో కూడా గణితశాస్త్రం ముఖ్యమైన స్థానాన్ని అందుకుందన్న విషయాన్ని తీవ్ర అధ్యయనం, పరిశోధనల పిమ్మట రుజువు చేసుకున్న తదుపరి శ్రీ రాధాకృష్ణ ఆ జ్యోతిష్య శాస్త్రంలో పరిశోధనలు జరిపి – పుట్టినప్పుడు తల్లిదండ్రులు పెట్టిన పేరులోంచి ఆ వ్యక్తి పుట్టిన సమయాన్ని గంటలు, నిమిషాల్లోనే గాక సెకన్లతో సహా శాస్త్రీయంగా తీసుకువచ్చారు. అపూర్వమైన ఈ కషిని, దేశ, విదేశాల్లో కూడా ప్రస్తుతించారు.

నిజం దిశగా…
జ్యోతిశ్శాస్త్రంలో పూర్వం నుంచీ ఉన్న ఆ శాస్త్ర గ్రంథాలైన సారావళి, బృహజ్జాతకం, పరాశర గ్రంథం, జాతక మార్తాండ, జాతక సర్వస్వం, జాతక చంద్రిక, కేరళీయం ఇత్యాది గ్రంథాల్లో నిర్దిష్ట అంశంపై పరస్పర విరుద్ధమైన ఫలితాలు పేర్కొనబడడం శ్రీ రాధాకృష్ణ గమనించారు. అనంతరం వాస్తవిక దక్పథంతో ఈ శాస్త్ర గ్రంథాల నిగ్గు తేల్చేందుకు 40 ఏళ్ల పైబడిన వారికి చెందిన 2,600 జాతకాలు, 72 మంది కవలల జాతకాలు సేకరించి పై గ్రంథాలు మరియు తన పరిశోధనల ప్రకారం అధ్యయనం చేసి నిర్దిష్ట ఫలితాలను చెబుతూ విశ్వసనీయ ప్రమాణాలకు నూరుశాతం చేరువగా జ్యోతిశ్శాస్త్రాన్ని తీసుకెళ్లారు. ఇది అపూర్వం.

అందుకున్న పురస్కారాలెన్నో…
నాటక – సినీ రంగాలకు తానందించిన విశిష్ట రచనలకు ఫలంగా రేలంగి ఆర్ట్స్‌ అకాడెమి, చాట్ల శ్రీరాములు ధియేటర్‌ ట్రస్టు (లైఫ్‌ అఛీవ్‌మెంట్‌ పురస్కారం), తెలుగు విశ్వ విద్యాలయం వంటి ఎన్నెన్నో సంస్థల నుంచి అత్యుత్తమ గౌరవాలను శ్రీరాధాకృష్ణ అందుకున్నారు. అలాగే రాష్ట్ర స్థాయిలో ఉత్తమ హాస్య రచయితగా మాజీ ముఖ్యమంత్రి ఎన్టీయార్ నుంచి పురస్కారం అందుకున్న శ్రీరాధాకృష్ణకు రాష్ట్ర ప్రజలు విశాఖలో కనకాభిషేకం చేసి నాటక – సినీ రంగాలను గౌరవించారు.

మరణాన్ని సైతం…
తన మరణాన్ని సూచించేలా అన్యాపదేశంగా సెప్టెంబర్ 4వ తేదీన గంట కోట్టేస్తానని ముందుగానే తన డైరీలో రాసుకున్న రాధాకృష్ణ రాతలు ఆయన నుదుటి మీద గీతలేనని ఎవరూ ఊహించలేకపోవడం గమనార్హం.

  • సశేషం

మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -17-4-22-ఉయ్యూరు

Posted in సినిమా | Tagged | Leave a comment