సుందర కాండ లో హనుమ బహుముఖీన వ్యక్తిత్వం-29

సుందర కాండ లో హనుమ బహుముఖీన వ్యక్తిత్వం-29

తెల్లని వస్త్రాలు మెరుపుల సమూహం లాంటి పింగళ వర్ణం కల ఆ హనుమను చూసి మొదట భయపడిన సీత ,చాలా వినయంగా ప్రియవచనాలు పలుకుతూ అశోక పుష్ప కాంతి కలవాడై మేలిమి బంగారంలా  ప్రకాశి౦చె కళ్ళతో ఉన్న హనుమను దర్శించింది  .అతడి భయంకర వానర రూపం చూసి భయపడి ,చూడరానిదేదో చూశానే అనుకొన్నది .తెప్పరిల్లి రామ లక్ష్మణస్మరణ చేసి నెమ్మదిగా ఏడ్చింది .తానూ చూసింది కల అని భావించింది .మళ్ళీ మరోసారి కపి వరాఖ్యుని తేరి పారచూసి ,తెలివి తప్పినట్లు పడిపోయింది .మళ్ళీ తెప్పరిల్లి కోతి కలలో కనిపిస్తే  అనిష్టం అ౦టారుపెద్దలు. తనవలన రామ సోదరులకు,తనతండ్రి కి  ఆపత్తు ఏమీ రాలేదు కదా అనుకోని ,శుభం కలగాలని కోరుకొన్నది .అంటే ఆపత్తు తనకోచ్చినా పరవాలేదు తనవారికి రాకూడదు అన్నదొడ్డ  భావం సీతామాతది.

  అసలు తనకు కల రావటం ఏమిటి ?నిద్ర పోయే వారికే కదా కలలు వచ్చేది. రామవిరహంతో తానెప్పుడూ నిద్రే పోలేదు కదా .తనకు  కల రావటం అసంభవం  తనరాముడినే ప్రతిక్షణం తలచుకొంటూ ,మనో నేత్రాలతో చూస్తూ తానె రాముడిని తలుస్తూ ఉంటె ,ఆయనననే స్మరిస్తున్నాను కదా అనుకొన్నది .-స్వప్నోహి నాయం నహి మే స్తి నిద్రా –శోకేన దుఖేన చ పీడితాయాః-సుఖం హాయ్ మే నాస్తి యతోస్మి హీనా –తేనే౦దు పూర్ణ ప్రతిమాననేన ‘’

ఈ రామనామం పలికేది తన అభిలాష మాత్రమె అను కొన్నది .మళ్ళీ ఆలోచించి అదీ కాదు అనుకోని తనమనసుకు రూపం లేదుకదా అని భావించి ,పైన చెట్టు ఆకులమధ్య కూర్చున్న వానరం తనకి స్పష్టంగా కనిపిస్తోంది ,అతనిమాటలు వినిపిస్తున్నాయి కదా అని ఊరడిల్లి౦ది

‘’రామేతి రామేతి సదివ బుద్ధ్యా –విచి౦త్య వాచాబృవతీ తమేవ –తస్యాను రూపాం చ కథా తమర్ధ –మేవం ప్రపశ్యామి తథా శృనోతి’’

‘’అహం హితస్యాద్య మనోభవేన –సంపీడితా తద్గత సర్వభావా –విచింతయంతీ సతతం తమేవ  –తథైవ పశ్యామితథా శృణోమి’’

‘’మనో రథః స్యాదితిచింతయామి –తథాఫై బుధ్యా చ వితర్కయామి –కిం కారణం తస్య హి నాస్తి రూపం –సువ్యక్త రూపశ్చ వదత్యయం మాం’’

 ,ఇక చేయాల్సింది అంతా దేవతలకే అప్పచెప్పాలి. తాను  నిమిత్తమాత్రురాలను అనే ఎరుక కలిగి బ్రహ్మ దేవేంద్ర అగ్ని దేవతలకు నమస్కరించి ఆ వానరుడు పలికింది అంతా యదార్ధమవుగాక ,కల కాకుండు గాక అని గాఢంగా మనసులో భావించింది సీతాదేవి .-‘’నమోస్తు వాచాస్పతయే స వజ్రిణే-స్వయంభువే చైవ హుతాశనాయచ –అనేన చోక్తం యదిదం మమాగ్రతో –వనౌకసా తచ్చ తథాస్తు నాన్యథా’’

ఇది 14శ్లోకాల 32వ సర్గ .

ఇందులో తనకు కలలు రాకపోవటానికి చక్కని కారణాలు పేర్కొనటం విశేషం . ‘’ఈ రామ ‘’మనసంతా ‘’ఆరామ ‘’మయమే ఐతే ,ఆయనుస్మరించని క్షణమే లేకపోతె ఆమె ఉచ్చ్వాస నిస్వాసాలలో రామ శబ్దమే వినిపిస్తుంటే ఇక రాముడు బయట ఎక్కడున్నాడు ?మనసులో స్థిరంగా కొలువై ఉన్నాడు .కానీ మనసులోని తనరామ రూపం భావి౦చటానికే ఉపయుక్తం. అసలురాముడు భౌతికంగా ఇక్కడికి రావాలి ఆమె దుఖానికి ఉపశమనం కల్గించి రావణ దర్ప వినాశనం చేయాలి అప్పుడే తనకూ లోకానికి శాంతి .

   సశేషం

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -18-5-20-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

ప్రపంచ దేశాల సారస్వతం 80 సాన్ మెరినో దేశ సాహిత్యం

ప్రపంచ దేశాల సారస్వతం

80 సాన్ మెరినో  దేశ సాహిత్యం

  సాన్ మెరినో పర్వతమయమై ఉత్తర ఇటలి చేత పరి వేష్టించి ఉన్న చిన్న దేశం .అతిప్రాచీన రిపబ్లిక్ దేశం .చారిత్రాత్మక సంస్కృతికి నిలయం .రాజధాని పేరు కూడా సాన్ మెరినోమధ్యయుగ గోడలతో ఉంటుంది .జనాభా 34వేలు మాత్రమె .కరెన్సీ –యూరో ,19వ శతాబ్దిలో ఇటలి ఐక్యతా ఉద్యమం లో ఈ దేశం నాయకుడు గారిబాల్డి తో సహా శరణార్ధులకు వసతికల్పించినందుకు 1862లో స్వతంత్రం పొంది రిపబ్లిక్ అయింది .ఇటాలియన్ భాష మాట్లాడుతారు .

 సాన్ మెరినో సాహిత్య౦ ఇటాలియన్ భాషలో ఉంటుంది .ఈ దేశం చుట్టూ ఉన్న దేశాలు ఈ దేశ సంస్కృతిని పీల్చేశాయి .అందుకే ఇటాలియన్ సంస్కృతీ భాష మిగిలాయి .మిరలీనా ఏర్కోలని –సమ్మరినీస్ కవి తనకవితా సంపుటి పర్నాసస్ లండన్ లో ప్రింట్ చేసింది .రెండు నవలలు రాసి౦ది కాని అనువాదం పొందలేదు .ఒకదానికి ఇంగ్లిష్ అనువాదం తెచ్చే ప్రయత్నం లో ఉన్నది .కార్లో లుకారేల్లి ఈ రిపబ్లిక్ లో ఉన్నాడు .పాల్ అనే కనడియన్ బ్లాగ్ నిర్వాహకుడు ఈ దేశ కథను తన బ్లాగ్ లో పొందుపరచాడు .సాన్ మెరీనా యూనివర్సిటి లో చదివే టినాచెప్పిన దానిప్రకారం ఈ దేశ చరిత్రను ఇటాలియన్ లో గుసేప్ రోస్సి రాస్తే తర్వాత ఇంగ్లిష్ అనువాదం వచ్చింది .1970లో ప్రచురింపబడిన కరపత్రం లో ఈ దేశ చరిత్ర కొంత కనబడింది .ఈ విషయాలన్నీ బ్రిటన్ కు చెందినఆన్ మోర్గాన్ తెలియ జేసింది .

  ఈ దేశాన్ని గురించి 7పుస్తకాలలో ఉన్నది -1-ట్రావెల్ జర్నల్-ఇ.లాకేన్  2-ఏ ఫ్రీక్ ఆఫ్ ఫ్రీడం –జేమ్స్ ధియో డేర్ బెంట్ 3-ది రిపబ్లిక్ ఆఫ్ సాన్ మెరినో –కార్లో డీ బ్రూక్ 4-ది గ్లాడియేటర్-హారీ తర్తెల్ డోవ్5-సబ్లిమినల్ -2-కి నివిన్ 6-ఫ్రం రోమ్ టు సాన్ మెరినో-ఆలివర్ నాక్స్7-స్మోక్ ఇంటు ఫ్లేం-జేన్ ఆర్బర్ .

  ఇంతకంటే ఈ దేశ సాహిత్య వివరాలు తెలియలేదు .

81-సెర్బియా దేశ సాహిత్యం

సెర్బియా రిపబ్లిక్ దేశం సెంట్రల్-సౌత్ ఈస్ట్ యూరప్ క్రాస్ రోడ్స్ లో ఉంటుంది .రాజధాని-బెల్గ్రేడ్ .కరెన్సీ –సెర్బియన్ దీనార్ .అనేక మైనారిటీలున్న దేశం .సేఫ్ కంట్రీ.ఆరబ్ సంస్కృతీ ఎక్కువ .2003లో రిపబ్లిక్ అయింది .క్రిస్టియన్ మతం .70లక్షల జనాభా .

  సెర్బియన్ సాహిత్యం అంటే బాల్కన్ ప్రజలసాహిత్యమే .12వ శతాబ్దిలో మతరచనలతో ప్రారంభమైంది  .ఓల్డ్ చర్చ్ స్లావానిక్ సాహిత్యం బైజాంటిన్ మోడల్ లో వచ్చింది .సిరిల్ మేదోడియస్ వాళ్ళస్లావ్ మతాధికారులు ,  శిష్యులు దీనికి ఆద్యులు .కర్మకాండలకు చెందిన హగియోగ్రఫీ ,హోమేలిటిక్స్,హిమ్నోగ్రఫీ లు వచనం అలంకార ,కవిత్వ శాస్త్రాలు .సెయింట్ సావా 12వ శతాబ్దిలో మతరచనలు తీర్చిదిద్దాడు .మొదటినుంచి మౌఖిక సాహిత్యమే తరతరాలుగా వచ్చింది .14వ శతాబ్ది కొసొవో యుద్ధం ,విశేషాలతో సెర్బియన్ ఎపిక్ కవిత్వం వచ్చింది .తర్వాత నాటకం వచనం కూడా వచ్చాయి .

  తర్వాత బోరోకి ,క్లాసిసిజాలు వచ్చాయి వాస్తిజి 3,మొదలైనవారు ఇన్దులొఘనులు .1848లో రోమా౦టిజం, రియలిజం వచ్చి డేస్తేజి ఒబ్రడోవిక్ బాగా రాశాడు .సెర్బియన్ స్వతంత్ర ఉద్యమం వచ్చి ,రిపబ్లిక్ అయ్యాక అసలైన సెర్బియన్ సాహిత్యానికి బీజావాపన జరిగింది .పెటార్-2రాసిన ‘’మౌంటేన్ రీత్ ‘’సెర్బియా సాహిత్యం లో ఎపిక్ గౌరవం పొందింది .దీనిలో లయతోకూడిన జానపద గీతాలూ ఉన్నాయి .వాన్ గోధేజానపద గీతాల సంకలన కర్తగా ,ఎపిక్స్ కవిగా పేరుపొందాడు .వుక్ కరాడ్ జికి సెర్బియన్ ఫైలాలజిస్ట్ .డూరో డాన్సిసి తోకలిసి ఆధునిక సెర్బియన్ భాషా నిర్మాణం చేశాడు .

  20వ శతాబ్దిలో ఆధునిక సాహిత్యంవచ్చింది .సింబాలిజం తో సైకలాజికల్ నవలా రచనలు వచ్చాయి. జొవాన్ డుసిసి ,మిలాన్ రాకిక్ దీనిలో నిష్ణాతులు .అలెక్సాసా౦టిక్ విషాదాత్మక కవిత్వం అల్లాడు .మిలూటిన్ బోజిక్ ,మిలాన్ కర్సిన్ డానికామార్కొవిక్ వంటి వారెందరో ఉన్నారు .వచనం పచనం చేసినవారు –స్వెటోజర్ కోరోవిక్ ,వేజికో మాలిసేవిక్ ,బోరిసావ్ స్టాంకోవిక్ వంటి వారు చాలామ౦చి నాటక రచయితలున్నారు ఇంప్యూర్ బ్లడ్ నాటకం రాసిన బోరిసావ్ అత్యంత పేరు ప్రతిష్టలు పొందాడు ఈనాటకం జనం నోళ్ళలో బాగా నానింది .పెటార్ కోకిక్ హై లిరికల్ ప్రోజ్  రాశాడు .మిలూటిన్ ఉస్కకోవిక్,వేలిమిర్ రాజిక్ పెట్కోవిక్ డిస్ కూడా ముఖ్యరచనలు చేశారు .గోర్డానా కూయిక్ .స్వెత్లానా వేల్మేర్ ,లు ఈనాటి ఫేమస్ మహిళా నవలాకారిణులు.అన్ని ప్రక్రియలలో ఇవాళ సెర్బియన్ సాహిత్యం వర్ధిల్లుతోంది .మిలోరాడ్ పావిక్ .కఝార్స్ నిఘంటువు కూర్చి ఎంతో పేరుప్రఖ్యాతులు పొందాడు .

  సశేషం

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -18-5-20-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

ప్రపంచ దేశాల సారస్వతం 79-రొమేనియా దేశ సాహిత్యం

ప్రపంచ దేశాల సారస్వతం

79-రొమేనియా దేశ సాహిత్యం

రొమేనియా ఆగ్నేయ ఐరోపాలో కార్పాడియన్ పర్వత శ్రేణి సమీపం లో ఉన్న దేశం .డ్రాకులా లెజెండ్ కు ఆవాసభూమి .రాజధాని –బుఖారెస్ట్ .కరెన్సీ-రొమేనియా లేయు .అధికార భాష రొమేనియన్ .అత్యధిక మానవాభి వృద్ధి ఉన్న దేశం .యాత్రకు ప్రమాదం లేదు .ముఖ్యమతం క్రైస్తవం . .జనాభా సుమారు 2కోట్లు .

  రొమేనియన్ సాహిత్యం  16వ శతాబ్ది వరకు స్లావోనిక్ భాషలో ఉంటుంది .రొమేనియన్ భాషలో మొదట రాయబడిన గ్రంథం ప్రశ్నోత్తర రూపం లో డీకన్ కోరేసిఅనేపేరుతో ప్రొటెస్టెంట్ మతానికి చెందినది .1559లో ఫిలిప్ మోల్డో వెనుల్ ముద్రించాడు .1673లోరొమేనియన్ లో మొదటి చందోరూప సాల్టర్ .వచ్చింది .17వశతాబ్దిదాకా బైబిల్ పూర్తి అనువాదం రాలేదు .యూరోపియన్ హ్యూమనిజం పోలాండ్ నుంచి ఇక్కడికి చేరింది .మిరాన్ కోస్టిన్ మోల్డావియ చరిత్ర రాశాడు .18వ శతాబ్దిలొఅట్టోమన్ సామ్రాజ్యం చేత ఈదేశం  అణగ ద్రోక్కబడింది.గ్రీకు ప్రభావం పెరిగింది .అలేకు వకారేస్కు ప్రేమ గీతాలు రాశాడు .తండ్రి లేనా చిటా రొమేనియన్ గ్రామర్ రాస్తే .కొడుకు లంకు మహాకవిగా గుర్తింపు పొందాడు .ఆంటన్ పాన్ హ్యూమన్ కామెడి ,జానపదం పండి౦చాడు.తర్వాతి తరం కవులు ఘేర్ఘే అనాఖి ఇయాన్ బుడాల్ డేలాను ,డోనికు గెలేస్కు ‘’యూరోపియన్ ఇల్ల్యూమినిజం ‘’కవిత్వం అల్లారు .

  జాతీయ ఉద్యమం ప్రారంభమై కవులు రచయితలూ విప్లవ వాదులతో చేతులు కలిపారు .స్కోలా ఆర్దేలీనా రోమానిక్ అస్తిత్వ వాదం మేల్కొల్పి ,ఆభాషా విద్యాలయ స్థాపనకు తోడ్పడ్డాడు .బుఖారెస్ట్ లో నేషనల్ ధియేటర్ ఏర్పడింది. అసిలి అలేక్జాన్డ్రి.మిహై ఏమినేస్కు లు రొమేనియా సాహిత్యాన్ని ఆదేశ కవిత్వంతో ముంచెత్తారు.జానపద సాహిత్య సంపుటులు వెలువరించారు .1863లో లిటరరీ సర్కిల్ ఏర్పడి ఆ దేశ సాహిత్యానికి వెన్నెముకగా కవులు రచయితలూ నిలబడ్డారు .ఇయాన్ లూకా కారగిగేల్ అద్భుత కామెడీలు రాశాడు .ఇయాన్ క్రియాంగా సంప్రదాయ కధలు రాశాడు .జార్జి కాస్బుక్ కవి అనువాదకుడు టీచర్ జర్నలిస్ట్ పల్లె జీవన సౌందర్యాన్ని వర్ణించాడు .అలాగే అలేకు రుస్సో ,  లోన్ స్లావికి ,హస్డేయు వంటి చాలామంది ఈతరం రచయితలున్నారు

   1918లో జాతీయ సమైక్యత ఏర్పడి సాహిత్యానికి స్వర్ణయుగం తెచ్చింది .రొమేనియన్ నవల ఆవిర్భావమైంది .లివియు రెబ్రేనుస్రాస్కోలా 1932లో ది అప్రైజింగ్ నవల రైతు తిరుగు బాటుకు దారిచూపింది .ఫారేస్ట్ ఆఫ్ దిహాన్గ్ద్ నవల ఆదేశం మొదటి ప్రపంచయుద్ధం లో పాల్గొనటానికి ప్రోత్సహించింది. ఆధునిక నవల –హార్టేసియా పపడట్, బెంగేస్కు రాసిన ‘’బాచ్ కన్సేర్ట్ ‘’.కామిల్ పెట్రేస్కు-ది లాస్ట్ నైట్ ఆఫ్ లవ్ ,ది ఫస్ట్ నైట్ ఆఫ్ వార్ రాశాడు .జార్జ్ కోలేనేస్కు నాటక నవలా రచయిత ,కవి ,క్రిటిక్ ,జర్నలిస్ట్ సాధికార మోనోగ్రాఫ్ ను ఎమేనేస్కు ,క్రిఎంగా లపై రాశాడు .వెయ్యిపెజీల రొమేనియన్ సాహిత్య చరిత్ర రాసి మహోపకారం చేశాడు .మిహైల్ సాడోవినా రియలిస్ట్ రైటర్ .అనేక కాలాల మాల్డోవాచరిత్రరాశాడు .ఎమేనేస్కు తర్వాత మళ్ళీ 50ఏళ్ళకు టుడర్ అర్గేజి కవిఆధునిక  రొమేనియన్ కవిత్వం రాసి మార్గ దర్శకుడయ్యాడు.లుసియన్ బ్లాగా –కాంప్లెక్స్ ఫిలసాఫిక్ సిస్టం లో రచనలుచేశాడు ఇప్పటికీ ఇదేమిటో అర్ధంకాక బుర్రలు బద్దల కొట్టుకొంటున్నారు .మిర్సియా ఎలేడే ను  గ్రేటెస్ట్ హిస్టోరియన్ అంటారు .మిస్టిక్ నవలలు రాశాడు .

  ట్రిస్టాన్ జారా డాడాయిజం కారకుడు .ఆభాషలో ‘’అవును అవును’’ అన్నదానికి సంకేతమే డాడాయిజం.తర్వాత దీన్ని వదిలేసి సర్రియలిజం,మార్క్సిజం  ను కావలించుకొని రచనలు చేశాడు .దీనితో ఈ దేశం పాశ్చాత్య సంస్కృతికి కవాటాలు తెరిచినట్లయింది .డాడాయిజం సర్రయిలిజం లు  అవంట్ గార్డే అంటేవిప్లవాత్మక అత్యాధునిక కవిత్వానికి తెరలేపింది .ఈ ధోరణి లో రాసినకవులలో ఇయాన్ మినిలేస్కు ,ఘేరాసిం లూకా,ఉర్ముజ్,గెలలు నౌమ్ మొదలైనవారు .జార్జి బకోవియా సింబలిస్ట్ కవి స్థానిక సింబాలిక్ ఉద్యమానికి దోహదపడ్డాడు .ఇతనికవిత్వం ఇక్కడి రోమానియన్ మోడర్నిజానికి పూర్వగామి అంటారు .వాసిల్ వోకిలేస్కు కవి నాటక కథాకర్త ,ఫిజిషియన్.సెజెర్పెట్రేస్కు అన్నిటితోపాటు బాలసాహిత్యంకూడా రాశాడు .ఇతని ‘’ఫ్రార్ ది పోలార్ బేర్’’ అనేది సర్కస్ జంతువు గురించి .ఎలెన ఫెరాగో కూడా బాలలకోసం రాశాడు .

  కమ్యూనిస్ట్ కాలం లో మారిన్ ప్రేడ పోస్ట్ వార్ రొమాంటిక్ నావలిస్ట్ .అతని మొరోమేటే ఫామిలి నవల యుద్ధం ముందు ఆతర్వాత కమ్యూనిస్ట్ కాలం లో ఇబ్బందులుపడిన రైతు కుటుంబ గాధ.కమ్యూనిస్ట్ క్రూర పాలనపై రాసిన నవల ‘’ది మోస్ట్ బిలవ్డ్ఆఫ్  ఎర్త్ లింగ్స్ ‘’.జహారిన స్టంకు 1948లో ప్రసిద్ధ ‘’బేర్ ఫుట్’’నవల రాశాడు .ఆధునిక కవులు –నికితా స్టెనెస్కు,మారిన్ సోరెకస్,లేనాయిడ్డిమోవ్.

  సమకాలీన రచయితలలో కొందరు –గేబ్రిలా ఆడామెన్ స్టావ్ , స్టీఫెన్ అగోపియాన్,గ్రిడ్మోడార్సియ,ఇయాన్ స్ట్రాటన్,డోనియా రుస్టి.

  సశేషం

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -18-5-20-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

సుందర కాండ లో హనుమ బహుముఖీన వ్యక్తిత్వం-29

సుందర కాండ లో హనుమ బహుముఖీన వ్యక్తిత్వం-29

దుఃఖ భారం తో ఉన్న సీతాదేవి ఎడమకన్ను చేప చేత కొట్టబడిన కమలం,ఎడమ భుజం   ఎడమ తొడకూడా బాగా  అదిరి రాముడు ఆమె ముందే ఉన్నాడు అని సూచించాయి . –

‘’తస్యాశ్శుభం వామ మరాళ పక్ష్మ-రాజీవృతం ,కృష్ణ విశాల శుక్లం –ప్రాస్పంద తైకం నయనం సు కేశ్యా-మీనాహతం పద్మమి వాభి తామ్రం’’

‘’భుజశ్చచార్వంచిత పీన వృత్తః-పరార్ధ్య కాలాగరు చందనార్హః –అనుత్తమే నాధ్యుషితః ప్రియేణ-చిరేణ వామ స్సమవేపతా శు ‘’

గజేంద్ర హస్త ప్రతిమశ్చ పీన –స్తయోర్ద్వాయో స్సంహతయా స్సుజాతః-ప్రస్పంద మానః పునరూరు రస్యా –రామం పురస్తాత్ స్థిత మాచ  చక్ష్యే’’

  ఆమె చీర కొంచెం జారింది .’’అన్నీ మంచి శకునములే శ్రీ రామదర్శన  లాభ శూచనలే ‘’అని పించింది మనసుకు .వేసవి ప్రతాపానికి వాడిన చిన్న మొలక తొలకరి వర్షం తో తెప్పరిల్లి ఆకులు తొడిగినట్లు ఉన్నది .ఆకులు అంటే ఆమె ఆశలు మారాకులు తొడిగాయి అన్నమాట .ఆమె ముఖం రాహువు చే కబళింప బడిన చంద్రుడు మళ్ళీ బయటికి వచ్చినంత ప్రకాశ మానం గా ఉన్నది .శుభ సూచనలతో మనసు తెప్పరిల్లి ఆశలమోసులు తొడిగి  ఆనంద పారవశ్యం తో చంద్రోదయం తో శోభిల్లిన శుక్లపక్ష రాత్రిలా కనబడింది .

  ఇది ఎనిమిదే శ్లోకాలున్న 29 వ సర్గ .

  చెట్టుపై ఆకులమాటున ఎవరికీ కనిపించకుండా ఉన్న హనుమ ,ఇప్పటి దాకా జరిగిన సర్వ విషయాలు ప్రత్యక్షం గా చూసి ,సీతా శోకానికి కలత చెంది ,రహస్యం గా తాను లంకలో చూసిన విషయాలు, రావణ దర్పం అన్నీ గుర్తు చేసుకొని ,సీతా దేవి దుఖం మా౦చకుండా కిష్కింధకు  వెళ్ళ రాదు అనుకొన్నాడు  .సీతా దర్శన శుభవార్త రామ చంద్రునికి నివేదించి ఆయన దుఖం పోగొట్టాలి అని నిశ్చయించాడు .ఆ రాత్రి ఆమెను ఊరడి౦చకపోతే మర్నాడు ఉదయానికి ఆమె బతికి ఉంటుందో లేదో అని సందేహించాడు .సీతా సందేశం ఏమిటి అని రాముడు అడిగితె నా దగ్గర సమాధానం ఉండదు కదా .ఆమెను చూసి,చెప్పిన మాటలు విని ఆయనకు చెప్పకపోతే ఒక్క చూపుతో నన్ను కాల్చి మసి చేస్తాడు .సీతను వోదార్చకుండా ,కిష్కింధకు వెళ్లి సుగ్రీవుడిని  స సైన్యంగా ఇక్కడికి తెస్తే ప్రయోజనం లేదు ,కనుక ఇక్కడే ఉండి,రాక్షసులు చాటు అయినప్పుడు ఆమెతో మాట్లాడి ఓదారుస్తాను ‘’అని ఒక నిర్ణయానికి వచ్చాడు హనుమ .

   ఇంతవరకు బానే ఉంది మరి ఆమెతో మాట్లాడటం ఎలా అనే సందేహం వచ్చింది .తాను  అతి చిన్న కోతిగా ఉన్నాడు .మానవులు మాట్లాడే సుసంస్కృత భాషలో మాట్లాడాలి .అలాకాక బ్రాహ్మణ భాష లో మాట్లాడితే నన్ను రావణుడు అని సందేహింఛి భయపడవచ్చు .ఒక వేళ నేను అలామాట్లాడినా కోతి  ఏమిటి సంస్కృతం ఏమిటి అని కూడా అనుకోవచ్చు .కనుక ఇవన్నీ కుదరదు మానవ భాషలో అర్ధవంతం గా మాట్లాడితే ఇబ్బంది ఉండదు .కాక సంస్కృతం లో మాటాడితే ,నా రూపం భాష లకు మరింత భయపడి ,మారు వేషం లో ఉన్న రావణుడు అనుకొని భయంతో గట్టిగా అరవ వచ్చు అప్పుడు కావలి రాక్షస స్త్రీలు పరిగెత్తుకొచ్చి పెద్దచెట్ల మొదళ్ళతో నన్ను పచ్చడి చేయచ్చు .అప్రయత్నాలు తప్పించుకోవటానికి నేను అటూ ఇటూ పరిగెత్తితే ,వాళ్లకు అనుమానం మరీ ఎక్కువై ,నా వెంటపడి తరిమి ,నా వికృత రూపం చూసి మరింత భయం తో రావణ గృహ కావలి వారిని పిలిపిస్తే వాళ్ళంతా వివిధ ఆయుధాలతో నాపైకి దాడికి వస్తే ,నేను వాళ్ళను ఎదిరించగలనుకాని అలసి పోయి  సముద్ర లంఘనం తో అవతలి ఒడ్డుకు చేరలేనేమో .అప్పుడు నాకంటే వేగంగా నాపై దూకి నన్ను పట్టుకొని హింసి౦చి బంధిస్తే అసలు నేను వచ్చిన పని హుళక్కి అవుతుంది .నామీద కోపం సీత మీద చూపించి ఆమెను చంపేస్తారుకూడా .మా రాజు ,రాముడు నాకు అప్పగించిన పని భ్రస్ట  మైపోతుంది .నన్ను ఇక్కడ చంపేస్తే రాముడికి సీత విషయం చెప్పే వారెవరూ ఉండరు .నేను చనిపోతే నూరు యోజనాల సముద్రాన్ని దాటి రాముడి దగ్గరకు చేరేవాడు లేనేలేడు .అనుమానం వచ్చిన చోట అనాలోచితం గా ఏపనీ చేయరాదు .యజమాని ఏది కర్తవ్యమో ఏది కాదో మంత్రులతో ఆలోచించి దూతను పంపితే వాడు తామే వాళ్ళకంటే తెలివి గలవారమని భావించి ఆ దూత  కృత్యాన్ని చెడ గొట్టే బుద్ధి హీనులు ఉంటారు .కనుక స్వామికార్యం స్వకార్యం సఫలం అవ్వాలి .అందుకే శ్రీరాముని కీర్తిస్తూ ,ఆయనపైనే మనసు పెట్టుకొని ఉన్న సీత భయపడకుండా చేస్తా .ఇది ఉభయ తారకం .అని నిశ్చయించి ,ఇక ఆలస్యం చేయరాదని భావించి –

‘’ఇక్ష్వాకూణా౦ వరిష్ఠస్య రామస్య విదితాత్మనః –శుభాని ధర్మయుక్తాని వచనాని సమర్పయన్

‘’’’శ్రావ ఇష్యామి సర్వాణి మధురాం ప్రబ్రువన్ గిరిం –శ్రద్ధాస్యతి యథా హీయం తథా సర్వ౦  సమాదధే

‘’ఇతి స బహువిధం మహాను భావో –జగతి పాతేః ప్రమదా మవేక్ష్య మాణః-మధుర మవితథం జగాద వాక్యం –ద్రుమ విటపాంతరమాస్థితో హనూమాన్ ‘’

ఇది 44శోకాల 30 వ సర్గ

‘’రాజా దశరథో నామ రథ కుంజర వాజిమాన్ –పుణ్య శీలో మహాకీర్తి ర్రుజు రాసీ న్మహాయశాః’’

రాజర్షీణా౦ గుణ శ్రేష్ట స్తపసా చర్షిభిస్సమః –చక్రవర్తి కులే జాతః పురందర సమో బలే ‘

‘’అహింసా రతి రక్షుద్రో  ఘ్రుణీ సత్య పరాక్రమః –ముఖ్యే శ్చేక్ష్వాకువంశస్య లక్ష్మీ వాన్ లక్ష్మి వర్ధనః

‘’పార్ధివ వ్యంజనైర్యుక్తం పృథుశ్రీః పార్ధి వర్షభః –పృధివ్యాం చతురంతాయాం విశ్రుత స్సుఖద స్సుఖీ- ‘’తస్య పుత్రః ప్రియో జ్యేష్ఠ స్సర్వ ధను ష్మతాం –

రక్షితా స్వస్య ధర్మస్య స్వజనస్య చ రక్షితా -రక్షితా జీవలోకస్య ధర్మస్య చ పరంతపః

‘’తస్య సత్యాభి సంధస్య వృద్ధస్య వచనా  త్పితుః-సభార్యస్య హ భ్రాత్రా వీరః ప్రవ్రాజితో వనం ‘’

అని మొదలుపెట్టి ఏకబిగిన 13శ్లోకాలు చెప్పేశాడు .

’’రాజా దశరథో నామ ‘’మొదలైనవి మరి రెండుమూడు చోట్ల హనుమ పలుకుతాడు ‘

ఈ శ్లోకాలలో ఇక్ష్వాకు వంశం లో మహా బలపరాక్రమ సంపన్నుడైన దశరథ మహారాజు అయోధ్యా పాలకుడు,అహింసా ఉదాత్తత దయ పరాక్రమం కలవాడు .సుఖాలు అనుభవిస్తూ సుఖాలు కలిగిస్తాడు .ఆయనపెద్ద కొడుకు రాముడు సర్వ విద్యాపార౦గ తుడు జనహితుడు .సత్యప్రతిజ్ఞ తో వృద్ధుడైన తండ్రి మాట విని భార్య సీత తమ్ముడు  లక్ష్మణుడి తో అరణ్యాలకు

వెళ్ళాడు .అక్కడ మునులకోరికపై ఎందరో రాక్షసులను సంహరించి మునుల తపస్సుకు ఇబ్బంది కలుగకుండా చేశాడు .జనస్థానం లో ఖరదూషణాదిరాక్షసులను చంపగా ,రావణుడికికోపం వచ్చి ,మాయామృగ రూపం తో మారీచుని పంపి ,రాముడిని మోసపుచ్చి సీతాపహరణం చేయగా ,రాముడు ఆమె కోసం వెదుకుతూ సుగ్రీవ వానరరాజు మైత్రి పొంది ,అతని అన్న వాలిని చంపి ఆరాజ్యం సుగ్రీవుడికి అప్పగించగా ,సుగ్రీవాజ్ఞ చేత వేలాది  వానరులు అన్నిదిక్కులా సీతకోసం పంపబడ్డారు .సంపాతి చెప్పిన మాటలు విని నేను శతయోజన విస్తీర్ణ సముద్రాన్ని దాటి ,నాకు చెప్పిన లక్షణాలను బట్టి సీతా దేవిని చూసి గుర్తించాను ‘’అని ఏకబిగిని అప్పటిదాకా జరిగిన సీతా రామ   వృత్తాంతం ఏకరువు పెట్టి ఊరుకున్నాడు .

  ఆ కమ్మని మధురవాక్కులు విన్న సీత ఆశ్చర్యపడి ,ఒకసారి మొహం పైకెత్తి శింశుప చెట్టు కొమ్మలవైపు చూసి ,ఆన౦దించింది .క్రూర రాక్షసులకు కనపడకుండా ఇక్కడికి రాగలిగినందుకు అతని బుద్ధిని మెచ్చింది .పైకి ,కిందికి అన్ని దిక్కులూ చూసి మహా బుద్ధిమాన్ అనుకోని స్వతంత్రం లేని దూత ,స్వజాతి రాజు సుగ్రీవుని మంత్రి హనుమ ఉదయిస్తున్న సూర్యుడి లాగా ఆమెకు కనిపించాడు –

‘’సా తిర్యగూర్ధ్వం చ తథాప్యధస్తా –న్నిరీక్ష మాణా తమ చింత్య బుద్ధిం –దదర్శ పింగాదిపతే రమాత్యం –వాతాత్మజం సూర్య మివోదయస్థం’’

ఇది 19 సర్గల 31వ సర్గ

అమ్మయ్య 30సర్గల కాలం దాటి 31వ సర్గ లో హనుమ నిశ్చయ బుద్ధితో సీతా మాతదర్శనం చేసి ధన్యుడయ్యాడు .అసలు’’ హనుమ మార్గశిర శుద్ధ త్రయోదశి ‘’నాడు  సీతా అమ్మవారిని చూశాడు .ఇవాళ వైశాఖ బహుళ దశమి శ్రీ హనుమ జ్జయంతి పర్వదినం నాడు హాయిగా సీతా దర్శనం చేయించాను అదొక సంతృప్తి .

  ఏమి చెప్పాలి ఎలా చెప్పాలి ఏ విధంగా మాట్లాడాలని వితర్కి౦చు కొని హనుమ హరినామ స్మరణ అనే  శ్రీరామ చరిత్రను తెలియ జేసి ,తన బుద్ధిని చాటి ఆమె మనసుకూ బుద్ధి మంతుడు అనే మార్కులు మొదటి సారే కొట్టేశాడు .అదీ  ఆయన వ్యక్తిత్వం .ఇలా మాట్లాడకుండా ఇంకో రకంగా మాట్లాడితే రసాభాస అయ్యేది .కార్యసాధకుడికి ఉండాల్సిన సర్వ లక్షణాలు హనుమలో మనం దర్శిస్తాం .

  సశేషం

శ్రీ హనుమజ్జయంతి శుభాకాంక్షలతో

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -17-5-20-ఉయ్యూరు .

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

సుందర కాండ లో హనుమ బహుముఖీన వ్యక్తిత్వం-28

సుందర కాండ లో హనుమ బహుముఖీన వ్యక్తిత్వం-28

‘’రాక్షసులు నన్ను ఇలా   బాధ పెడుతున్నా పాపం చేశానేమో బతుకు తున్నాను .నేను ఆత్మహత్య చేసుకొంటే దోషం ఏమీ లేదు .రావణుడి చేతిలో చావు ఎలాగైనా తప్పదు.దానికంటే ఆత్మహత్య మేలే కదా .వాడు ఇచ్చిన రెండు నెలల గడువు లోపు రాముడు ఇక్కడికి రాకపోతే ఈ అయోగ్యుడు కడుపు లోనుంచి బయటికి రాని శిశువును శస్త్ర చికిత్సతో మృత శిశువును తీయటానికి దాన్ని ముక్కలు ముక్కలుగా చేసినట్లు  ,వాడి అయిన ఆయుధాలతో రాక్షసరాజు నా అవయవాలు ముక్కలు ముక్కలు చేస్తాడు .రామా ,లక్ష్మణా అత్తా కౌసల్యా సుమిత్రా సముద్రంలోసుడిగాలికిచిక్కిన ఓడలాగా దుఖాలు అనుభవిస్తున్నాను .రామ సోదరులు నాకారణంగా లేడి రూపంలో ఉన్న దుష్ట ప్రాణి చేత చంపబడ్డారేమో .యముడే అప్పుడు లేడి గా  వచ్చి  నన్ను ప్రలోభపెట్టగా సోదరులను పంపాను .రామా నన్ను రాక్షసులు చంపుతారని నీకు తెలీదు కదా .రాక్షసుల తీవ్రమైన మాటలు, భూశయనం, ,నువ్వే రక్షకుడవని నమ్మి నియమాలతో జీవించటం అనే ఈ వ్రతం అంతాకృతఘ్నులకు చేసిన ఉపకారం లా వ్యర్ధమయిందా.నా ధర్మాచరణ ,ఏకపత్నీ వ్రతం నిష్ప్రయోజనం  నిరర్ధకం అయ్యాయి .వనవాస కాలం తీరి అయోధ్యలో వలచినస్త్రీలను పెళ్ళాడి నువ్వు సుఖిస్తావు .కాని నేనిక్కడ ఏ ఫలితమూ దక్కక ఉపవాసాలతో క్రుంగి కృశించి చనిపోతా .లేకపోతె విషం తాగి వాడి ఆయుధం ఉపయోగించి ఆత్మహత్య చేసుకొంటా .నాకు విషంకాని ఆయుధం కాని ఇచ్చే వారే లేరిక్కడ ‘’అనుకొంటూ శింశుప చేరి తనపొడవైన జడతో ఉరి పోసుకోవటానికి సిద్ధపడింది సీతాదేవి .కొమ్మను గట్టిగా పట్టుకొని ‘’ఈ కొమ్మ’’సీతమ్మ  తన వంశాన్ని స్మరిస్తూ ఆత్మహత్యా ప్రయత్నం లో ఉండగా శుభ సూచనలు ,శుభ శకునాలు కనిపించాయి .

‘’ఉపస్తితా సా మృదు సర్వ గాత్రీ –శాఖాం గృహీత్వా థ నగస్య తస్య –తస్యాస్తూ రామం ప్రవిచింత యంత్యా –రామానుజం స్వం చ కులం శుభా౦ గ్యాః’’

‘’శోకా  నిమిత్తాని తథా బహూని –ధైర్యార్దితాని  ప్రవరాణి లోకే –ప్రాదుర్నిమిత్తాని తదాబభూవుః-పురాపి సిద్దా న్యుపలక్షితాని’’

ఇది 20 శ్లోకాల 28వ సర్గ .అన్ని ప్రయత్నాలూ ,అన్ని ఆశలూ విఫలమైతే చివరికి ఆత్మహత్యకు పూనుకోవటం లోక రివాజు .అవతలివారికి ఎన్నో చెప్పగలరు కాని తమ దగ్గరకు వచ్చేసరికి అవి అన్నీ మర్చిపోయి ఇదే రకంగా ప్రవర్తిస్తారు మానవులు .సీతకూడా మానవ మాత్ర స్త్రీయే .కనుక చివరగా ఆప్రయత్నం చేసింది .తన ఆత్మహత్యను తన కారణాలతో సమర్ది౦చు కొన్నదికూడా .ఇదే లోక సహజ విషయమే .అలా సమర్ధించుకొని ఆత్మను సంతృప్తి పరచుకోలేకపోతే ,ఆప్రయత్నం చేసే ధైర్యం రాదు కదా .ఇది వరకే చెప్పుకు న్నట్లు క్లైమాక్స్ లో సుభ శకునాలు శుభ సూచనలు కనిపించి ఆ ప్రయత్నానికి బ్రేక్ పడుతుంది అలాగే   ఇప్పుడు సీత విషయం లోనూ జరిగింది .మానవ మనసులోని ఆంతర్యాలను ,ముఖ్యంగా స్త్రీ హృదయపులోపలి పొరల్ని  మహా కవులు చక్కగా ఆవిష్కరిస్తారు .వాల్మీకి మహర్షి కవీ, క్రాంత దర్శి కనుక ఇలా ముగించాడు .

   సశేషం

మీ-గబ్బిటదుర్గాప్రసాద్ -16-5-20-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

ప్రపంచ దేశాల సారస్వతం 77-మొనాకో దేశ సాహిత్యం

ప్రపంచ దేశాల సారస్వతం

77-మొనాకో దేశ సాహిత్యం

మొనాకో దేశం ప్రిన్సిపాలిటి  ’సావరిన్ సిటీ స్టేట్ పశ్చిమ యూరప్ లో మూడు వైపులా ఫ్రాన్స్ సరిహద్దు మిగిలినభాగం మధ్యధర సముద్ర తీరం  లో ఉన్నది . కరెన్సీ –యూరో .భవ్య జీవన విధానానికి భేషైన దేశం .ఇన్కం టాక్స్ నామమాత్రమే .అందుకే వందకు పైగా దేశాలు దీనితో సంబంధాలు కలిగి ఉన్నాయి .ఇక్కడి ప్రజలు ప్రపంచం లోనే అత్యధిక ధనవంతులు .మూడో వంతు జనం మిలియనీర్లె .జిడిపి -165,420 డాలర్లు .ప్రపంచం లో రెండో స్థానం .

  మొనాకో సాహిత్యం ను అక్కడి రచయితలు – ఫ్రెంచ్ ,ఇటాలియన్ ,మొనేగాస్క్ భాషలలో రాశారు .లూయీ నోటరి ఒక్కడే ఫ్రెంచ్ ,మొనేగాస్క్ భాషల్లో రాసి ఆదేశ సాహిత్యానికి ప్రేరణ కలిగించాడు .ఇతడు రాసిన లిరిక్స్ లో ఒకటి జాతీయ గీతంగా గౌరవి౦ప బడింది .అప్పటిదాకా మాట్లాడే భాషగా ఉన్న ఆదేశభాష ఇతనితో వ్రాతభాషగా రూపు దాల్చింది .లూయీ ఫ్రోల్లా ‘’పీస్ డిరెసిస్టన్స్’’ అనే మొదటి వ్యాకరణం రాశాడు .ఫ్రెంచ్- మొనేగాస్కో  నిఘంటువు కూర్చాడు .స్థానిక రచయితలు తక్కువే .ఈ దేశ నేపధ్యంగా చాలామంది రాశారు .ప్రతి ఏడాది సాహిత్య బహుమతులు ఇస్తున్నారు .కాని ఏ పుస్తకమూ పబ్లిష్ కాకపోవటం ఆశ్చర్యమే .

  కొందరు ప్రముఖ రచయితలు –రిచర్డ్ మొనాకో ‘’నైట్స్ టేల్స్’’,ఫైనల్ క్వెస్ట్ రాశాడు .ఇవి పులిట్జర్ ప్రైజ్ కి నామినేట్ అయ్యాయి .ఎరిక్ రాబర్ట్ మోర్స్ –మొనాకో నవల రాశాడు .డఫ్నే డు మారియర్ –రెబెక్కా ,డోనాల్డ్ స్పోటో-హై సొసైటి,గ్రాహం గ్రీన్ –లూజర్ టేక్స్ ఆల్ ,క్రిస్టియాన డి మాస్టి-పాలస్ ,మైలైఫ్ ఇన్ ది రాయల్ ఫామిలి ,జియార్జియో ఫెలేట్టి-ఐవో ఉక్కిడో,అన్ని ఎడ్వర్డ్స్ –ది గ్రిమాల్డిస్ఆఫ్ మొనాకో ,లూయీ మాస్టర్స్ –ది బన్నీ అండ్ ది బిలియనీర్  వగైరా .

 గ్రిమాల్డి రాజకుటుంబం శతాబ్దాలపాటు పాలించి కళలు ,వాటి సంబంధిత విషయాలను ప్రోత్సహించింది .’’ఇంటర్నేషనల్  కాంటే౦పరరి  ఆర్ట్ ప్రైజ్ ‘’ఏర్పాటు చేసి నిపుణులకు ఇస్తోంది ,దేశం చిన్నదేకాని వీధులన్నీ దియేటర్ల ,మ్యూజియంలతో నిండి ఉంటాయి .మొనాకో ఫైన్ ఆర్ట్స్ ,మొనాకో మోడరన్ ఆర్ట్స్ లతో గాలరీలు నిండుగా ఉంటాయి

78-మా౦టెంగ్రో దేశ సాహిత్యం

మా౦టెంగ్రో దేశ౦ బాల్కన్ కంట్రీ.ఎగుడు దిగుడు పర్వత మయం .అడ్రియాటిక్ తీరంలో చిన్న బీచెస్ ఉంటాయి .రాజధాని –పొడిగోరికా .కరెన్సీ-యూరో .నేరాలుఎక్కువేకాని పటిష్టపోలీస్ భద్రతఉంది .కవి లార్డ్ బైరన్ దీన్ని ‘At the birth of the planet the most beautiful encounter between land and sea must have been on the Montenegrin  అని వర్ణించాడు .గొప్ప టూరిస్ట్ స్పాట్ .ప్రజలు ఇంగ్లిష్ బాగా మాట్లాడుతారు .క్రిస్టియానిటి మతస్తులు .జనాభా- 628,021 .జనాభాలో 20శాతం ముస్లిమ్స్ .,సేర్బులు అల్బెనియలు రోమాలు ఎక్కువగా ఉంటారు

  మా౦టేగ్రోనియన్ సాహిత్యం అక్కడి విభిన్నభాషలలో ఉంటుంది .దేశభాష సౌత్ స్లావిక్ భాషాజన్యం .2006లో దేశం స్వాతంత్రం పొందాక సాంస్కృతిక కేంద్రంగా వర్ధిల్లింది .పావ్లె గోరోనోవికి రచయిత ఆ దేశానికి ఆపేరు రావటానికి కారణం దట్టమైన నల్లని అరణ్యాలు .దేశంలో సగం అడవులే .ప్రపంచంలో మొదటి ప్రభుత్వ ప్రింటింగ్ ప్రెస్ యీ దేశంలోనే వచ్చింది .మా౦క్స్ దీన్ని నిర్వహించారు అని రాశాడు. ప్రకృతికవిగా గుర్తింపబడ్డాడు .వాట్ బుక్స్ స్మెల్ లైక్ లో తీవ్ర నాస్టాల్జియా ఉంటుంది .ఇతని మరో పుస్తకం –ఆర్నమెంట్స్ ఆఫ్ ది నైట్ -1997..మూడవది –బుక్ ఆఫ్ అపారిషన్స్- 2002.

  టాంజా బాకిక్ –15వ ఏట మొదటి అయిదు భాగాల కవితా సంపుటి రాసి వెలువరించింది .కవిత్వంలో వైవిధ్యం ఉంటుంది .ఎన్నోపుస్తకాలకు ముందుమాటలు రాసింది. చాలావాటికి సంపాదకత్వం వహించింది .సైంటిఫిక్ పేపర్స్ రాసింది .మెటాఫిజికల్ ,రొమాంటిక్ కవుల సాహిత్యాన్ని అనువాదం చేసింది .ఆమె ఇమేజరీ మహా ఉన్నతం .ఆమె కవిత –సీడ్ అండ్ అదర్ పోయెమ్స్ -2012లో ‘A Black lace
On the white wall –
The ocean’s scent
The light is still
Falling on us,
Announcing,
The presence of the day’

కవిత హైలైట్ అంటారు .2008లో ఆమె రాసిన వ్యాసం –టు బి ఎ రైటర్ ఇన్ మంటే నెగ్రో’’లో ఆమెకూ ,జాతీయ సాహిత్యానికి ఉన్న అమూల్య బంధం తెలుస్తుంది .ఆమె ప్రతి రచన హృదయాన్ని తాకి ప్రభావితం చేస్తుంది .

  ఒగ్నేజేన్ సాఫిక్ –పోడిగోర్సికాలో 1977లో పుట్టి ,ఫిలాసఫిలో గ్రాడ్యుయేట్ అయి ,2005లో మొదటి నవల ‘’హాన్సేన్స్ చిల్డ్ర న్ ‘’ తో ప్రసిద్ధుడయ్యాడు. ట్రాజిక్ ,సర్రియల్ రచనలేకాక షార్ట్ స్టోరీస్ తోనూ ప్రఖ్యాతుడయ్యాడు .రోమానియన్ ఓవిడ్ ఫెస్టివల్ ప్రైజ్ ,మేసాసేలిమోనిక్ ప్రైజ్ లు అందుకున్నాడు .మైక్రో బాక్టీరియం లేపేరే ను 1873లో వేరు చేశాక లెప్రసీ అదుపులోకి వచ్చింది .లేప్రసితోబాధపడే పిల్లల దయనీయ గాథలను తన కథలలో చిత్రించాడు .అతని ‘’ఆఫ్టర్మత్ ఆఫ్ దిక్లోత్స్ ఆఫ్ టెక్ష్ట్స్’’కత అప్పటికే చితికిపోయిన  వివాహ బంధ ఆత్మహత్యలతో ఉన్న కుటుంబంలో పుట్టిన వాడి ది.

  సశేషం

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -16-5-20-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

ప్రపంచ దేశాల సారస్వతం 75-మాల్టా దేశ సాహిత్యం

ప్రపంచ దేశాల సారస్వతం

75-మాల్టా దేశ సాహిత్యం

మాల్టా దేశం ఆర్చిపిలగో  సెంట్రల్ మెడిటరేనియన్ లో సిసిలి ,ఉత్తర ఆఫ్రికా మధ్య ఉంది .రోమాన్స్ ,మూర్స్ ,క్రీ.పూ 4 వేలఏళ్ళ క్రిందటి ఫ్రెంచ్ ,బ్రిటిష్ సెయింట్ జాన్ యోధుల అనేక చారిత్రాత్మక కట్టడాలు ,దేవాలయాలున్న దేశం .ఆనాటి పెద్దపెద్ద హాల్స్ ,బరియల్ చేమ్బర్స్ చూస్తె  దిమ్మ తిరిగిపోతుంది  .రాజధాని –వాలెట్టా .కరెన్సీ-యూరో .జనాభా -5లక్షలు .భయం లేకు౦డాహాయిగా సందర్శించతగిన దేశం.అత్యంత సంపన్న దేశాలలో ఒకటి .ఖర్చు తక్కువ .ఎలెక్ట్రానిక్స్ ,ఫార్మస్యూటికల్స్ ఉత్పత్తి తో గొప్ప ఆదాయం వస్తుంది .

  మాల్టా సాహిత్యాన్ని మాల్టీస్ సాహిత్యం అంటారు .11వ శతాబ్దం చివర్లో సిసిలిరాజు కౌంట్ రోజర్ 1 ఆరబ్ పాలనకు స్వస్తి చెప్పిన తర్వాత కొద్దిగా సాహిత్య జిజ్ఞాస పెరిగింది .శతాబ్దాలుగా వస్తున్నా మాల్టేస్ భాషకు అవరోదాలుకలిగి  లాటిన్ ను తలకెత్తుకొన్నారు.సెయింట్ జాన్ పాలనలో ఫ్రెంచ్ ,ఇటాలియన్ లకే ప్రాముఖ్యం .బ్రిటిష్ కాలని ప్రభుత్వం లో ఇంగ్లిష్ పెత్తనం చేసింది .1936లో మాల్టేస్ భాష అధికార భాషగా గుర్తింపు పొందింది . మాట్లాడేభాషను వ్రాతభాషగా మైకేల్ ఆంటన్ వస్సాలి19వ శతాబ్దిలో మార్పు చెందించాడు .

  చరిత్ర పూర్వకాలం నున్చిఈ  దేశ సంస్కృతిని ‘’డిగ్లోస్సియ ‘’ఆటంకపరుస్తూనే ఉన్నది.శతాబ్దాలుగా ఈదేశభాష ‘’వంటింటి ,వర్క షాప్ భాష ‘’గా ముద్ర వేసి,చదువులో పాలనలో రాజకీయంగా  న్యాయస్థానాలలో ఇటాలియన్ భాషకే ప్రాముఖ్యమిచ్చారు .అందుకే ఈ దేశీయులుకూడా20వ శతాబ్ది వరకు  అదే భాషలో రాసేవారు గత్యంతరం లేక  .

మాల్టేస్ భా షలో ఉన్న అతి ప్రాచీన రచన పెట్రు కాస్గరో కవిత ‘’2కాన్టినా-1470-1485.తర్వాత గియాన్ ఫ్రాన్సేస్కో బోనమికో తన గ్రాండ్ మాస్టర్ నికోలస్ కోటోనర్ ను పొగుడుతూ1672లో  రాసిన ‘’మేజ్జుగి బ్లేర్ ఉ జహార్ ‘’అంటే మే చంద్రుడు ఆరంజ్ పూల వికాసం తో వచ్చాడు . లార్డ్స్ ప్రేయర్ కు అనువాదం 1780లో జోహేన్నెస్హీన్రిచ్ మాలు రాశాడు .ఐ యాం టాకింగ్ టు యు మాల్టా గేయాన్ని 1749లో అజ్ఞాతకవి రాశాడు .ఇది బానిసల కుట్రకు సంబంధించింది .1752లో డాన్ ఫ్రాన్సేస్కో  టీచింగ్స్ ప్రచురింప బడ్డాయి .తర్వాత బర్లుస్కు కవితలు గా ‘’మారేజ్ ఇన్ దిమాల్టీస్ స్టైల్ ‘’మొదలైనవి డన్ ఫెలిక్  డిమార్కోరాశాడు A child of the Romantic movement, Maltese patriot Mikiel Anton Vassalli (1764–1829) hailed the emergence of literary Maltese as “one of the ancient patrimonies…of the new emerging nation” and saw this nascent trend as: (1) the affirmation of the singular and collective identity, and (2) the cultivation and diffusion of the national speech medium as the most sacred component in the definition of the patria and as the most effective justification both for a dominated community’s claim to be a nation and for the subsequent struggle against foreign rulers.

   తర్వాత ఫ్రెంచ్ ఆక్రమణలో దేశం ఉండగా ‘’ఓడ్ టు ది ట్రయంఫ్ ఆఫ్ లిబర్టి ‘’ను సిటిజన్ లా కోరేట్టేరీ ని రాసి బాస్టేల్లి డే న పబ్లిష్ చేశాడు .మాల్టేస్ భాషలో ఎపిక్ పోయెం ‘’ది టర్కిష్ కారవెల్’’ను వాసిల్లి రాసి 1842లో ముద్రించాడు .లెజెండ్స్ అండ్ జోక్స్ కూడా రాశాడు .ఆదేశ భాష లో మొదటి చరిత్రపుస్తక౦ ‘’పీపుల్స్ హిస్టరీ ఆఫ్ మాల్టా ‘’ ఆయనే1862లో  రాశాడు.1863లో ఆ భాషలో మొదటి నవల ‘’ది లవ్ ఆఫ్ ఎ టిరంట్’’గుసేప్పీ ఫోలేరియో డీ లూనా ఆన్టన్ 1889లో రాశాడు

కొందరు ముఖ్య మల్టేస్ రచయితలు-క్లేర్ అజ్జో పార్డి,జాన్ బెనేల్లో ,డేనియల్ మస్సా ,రోజర్ బుఫ్ఫా ,విక్టర్ ఫెనేక్ ,గార్గ్ పిసాని ,త్రేవోర్ జెహ్రా మొదలైనవారు

76-మాల్డోవా దేశ సాహిత్యం

మాల్డోవా తూర్పు ఐరోపాలో ఉన్న దేశం .రాకీహిల్స్ ఫారేస్ట్స్ ,వైన్ యార్డ్స్ కు ప్రసిద్ధి ప్రపంచ ప్రసిద్ధ సెల్లార్ లకు నిలయం .రాజధాని –సిసునవు .కరెన్సీ –మల్డో వియన్ లేయు .జనాభా 36లక్షలు. అధికారభాష రొమేనియన్ .స్వంత కాళ్ళమీద నిలబడుతున్న దేశం .ప్రయాణం కష్టం .బోర్ కొట్టేదేశం .అద్భుతనాణ్య మైన వైన్ కి కేంద్రం .దేశ సంస్కృతిలోనే ఆనందం సంతోషాలు లేవు .నిరాశ రాజ్యమేలే దేశం .బీదాతిబీద దేశం .

  మాల్డోవా సాహిత్యం లో 10,11శతాబ్దాలనాటి గొప్ప జానపద గీతాలు,ఫైరీ టేల్స్,కుటుంబ కర్మకాండ కవిత్వం కు  ప్రసిద్ధం .సామెతలు నుడులు నానుడులూ ఎక్కువ .మియోరిటా అ దేశ ఎపిక్ లిరిక్ .మధ్యయుగాలలో ‘’ది లైఫ్ ఆఫ్ సేయి౦ట్ జాన్ ,న్యు ప్రీచిన్గ్స్ ఆఫ్ గ్రెగరీ సంబాక్ రాసిన క్రానికల్స్ .15వ శతాబ్ది ఉత్తరార్ధం లో దేశ చరిత్రలు ఆభాషలో వచ్చాయి .16వ శతాబ్దంలోనూ క్రానికల్స్ వల్లనే చరిత్ర తెలిసింది .14నుంచి 18శాతాబ్దిదాకా రాజులు,వారిగగొప్పలు స్మృతిచిహ్నాలు అన్నీ వచ్చాయి .గ్రిగేర్ యురోకి ,మిరాన్ కోస్టిన్,ఇయాన్ నుకుల్సి ల క్రానికల్స్ ది బెస్ట్ అనిపించుకోన్నాయి .డిమిత్రి కాన్టిమేర్ టర్కుల చరిత్రసమగ్రంగా రాశాడు .

  ఘేర్గే సిన్కాయ్ ,పెట్రు మేజర్ లుజాతీయభావానికి దోహద పడ్డారు .మిడీవల్ నేషనల్  మ్యూజికల్ స్టైల్ ‘’డోనియా ‘’ప్రాచుర్యం పొందింది .లేనాచితావకారేస్కు ,కొడుకు అలుకు వచారిస్కు లు ప్రాచీన గ్రీక్ శైలిలో లవ్ సాంగ్స్ రాశారు .దీనిలో దిమాపింగ్ డవ్ ప్రసిద్ధమైంది .19వ శతాబ్దిలో మొదటి న్యూస్ పేపెర్ ‘’రోమానియన్ బీ ‘’ని ఘియోర్గే అసాచి1829లో  స్థాపించగా అందులో రాసి అలేకు దోనిసి , అలేకు రుస్సో ,మిహలి కోగాల్సినావు లుబాగా పాప్యులర్ అయ్యారు . లిటరరీ  డేసియ జర్నల్  హిస్టారికల్ జర్నల్ పెట్టి కోగాల్సినావు చాలామందికి ప్రోత్సాహం కల్పించాడు .ఆధునిక వచనానికి నేగ్రుజ్జి సంస్థాపకుడు .తర్వాత దేశం వదిలి పుష్కిన్ ప్రభావానికి లోనయ్యాడు .జాతీయ ఉద్యమనాయకకవి నాటకకారుడు వసిలే అలేక్సాన్డ్రి మాల్డోవా –వలాచియా ఐక్యత కోసం కృషి చేశాడు .1848విప్లవం లో పాల్గొన్నాడు .ఎలెనా సేవస్టోస్-మాల్దోవాసాన్గ్స్ రాసి ప్రచురించింది .

  యుద్ధానంతర కాలం లో అనేక సాహిత్యప్రక్రియలలో  రచనలు వచ్చాయి .స్పీకింగ్ టు చిల్డ్రన్ ,స్టోరిఆఫ్ ఫోర్ బాన్షిస్,సాంగ్ ఆఫ్ ది డాన్.ఇయాన్ డ్రుటారాసిన ‘’లీవ్స్ ఆఫ్ సారో ‘’వ్లాడిమిర్బెసేలీగా బ్రోకెన్ ఫ్లైట్ ,అనడనా  స్లాలార్ రాసిన పీపుల్ అండ్ డేస్టినీస్1958.ఫ్లైట్ లెస్ బర్డ్స్ ,దిబిట్టర్ నెస్ ఆఫ్ లవ్,చిల్ద్రెన్ అండ్ ఆపిల్స్ ,బర్డ్స్ ఆఫ్ అవర్ యూత్ వంటివి చెప్పుకో దగ్గవి డ్రుటా రాసిన ‘’బాలడ్స్ ఆఫ్ ది స్టేప్పీస్,బుకోవో కవితా సంపుటి ప్రెసెంట్ డే,ఫ్యూచర్ డే,లుపాన్ రచన లాస్ ఆఫ్ హాస్పిటాలిటి,డామియన్ సాసిన -రూట్స్  ,విక్టర్  టేలేకువా – డీర్ఐలాండ్ ,1966అన్నీ లేటెస్ట్ రచనలే .

  ఆధునికంగా నికోలే పోపా –దిప్లేన్ స్మేల్స్ఆఫ్  ఫిష్ నవల పోస్ట్ మోడరన్ సింబాలిక్ రచన .తన దేశప్రజలు పడిన కస్టాలు కన్నీళ్లు పోయిజీవిస్తున్న  ప్రశాన్తజీవనంఉంది. డుమిట్రు  క్రుడు రచన –మాసకర్ ఇన్ జార్జియా –ఐరానిక్ రిఫ్లెక్షన్ ఆన్ అన్ చేంజింగ్ నేచర్ ఆఫ్ హిస్ కంట్రీ.

   సశేషం

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -16-5-20-ఉయ్యూరు

  ’

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

ప్రపంచ దేశాల సారస్వతం 73-లక్సెం బర్గ్ దేశ సాహిత్యం

ప్రపంచ దేశాల సారస్వతం

73-లక్సెం బర్గ్ దేశ సాహిత్యం

యూరప్ లో బెల్జియం ఫ్రాన్స్ జర్మనీలమధ్య లక్సెం బర్గ్ చిన్న దేశం ,దట్టమైన అడవులున్న గ్రామీణ వాతావరణం .రాజధాని లక్సెం బర్గ్ సిటి .జనాభా 6లక్షలు .కరెన్సీ యూరో .అత్యధిక జిడిపి ఉన్న ధనిక దేశం .ప్రాచీన కోటలు మాన్యుమెంట్లు ఉన్న యాత్రాస్థలం .నల్లబంగారం అంటే బొగ్గు గనులు ఇక్కడి అధికాదాయానికి కారణం .న్యూయార్క్ లండన్ పారిస్ లకంటే జీవనవ్యయం తక్కువ .సేఫెస్ట్ ప్లేస్.హత్యలు తక్కువ .

  లక్సెం బెర్గ్ సాహిత్యం ‘’కోరియాస్ మరీండ లేనిస్ ‘’అనే 14శతాబ్ది ఆరంభపు వ్రాత ప్రతి తో మొదలు .ఇది యోలండా ఆఫ్  వయాండేన్ కథ.ఈ ప్రతి 1999 నవంబర్ లో వెలుగు చూసింది .దీన్ని బ్రదర్ హెర్మన్ వాన్ వెల్డె౦జ్ ,1283లో యోలండా అనే ఆమె మరణం తర్వాత రాశాడు .దీనిలో 5,963 రైమింగ్ కప్లేట్లున్నాయి.ఈమె సన్యాసినుల అధికారిణి .

   19వ శతాబ్దం లోదేశం స్థిరరూపంపొందాక సాహిత్యం వచ్చింది .1829లో లక్సెంబర్గిష్ భాషలో ఆంటోని మేయర్ తనకవితా సంపుటి ‘’ఎ స్టెప్ అప్ టు లక్సెం బర్గ్ పమాస్సేస్ ‘’ప్రచురించాడు .ఇందులో 12కవితలున్నాయి .ప్రేయసి, రాత్రి మొదలైన వాటి వర్ణన ఉంది .ఇనానిమేట్ ఆబ్జెక్ట్ లతో ఫ్రెంచ్ విప్లవాన్ని అడ్డుకొన్న అరిస్టాక్రసి వైఫల్యాన్ని ఎత్తి చూపాడు .లీగ్ యూనివర్సిటిలో ఉంటూ గణితం బోధిస్తూ చాలా రచనలు చేశాడు .

  తర్వాత తరం రచయితలను క్లాసిక్ రచయితలన్నారు .ఎడ్మండ్ డీ లా ఫా౦ టిన్-1823-91 ‘’డిక్స్’’కలం పేరుతొ నాటకరచన బాగా చేశాడు .అతడి కామెడి ‘’డీ షోలిట్సోసిన్ ‘’1855లో లక్సెం బర్గ్ మొదటి సారి ప్రదర్శన జరిగింది .దీని తర్వాత మరిమూడు ప్రసిద్ధ నాటకాలు ,కొన్నికవితలు మరికొన్ని వచనరచనలు రాశాడు .ఇతడి సమకాలీనుడు మైకేల్లెన్జ్ కవి రాసిన ‘’ఆన్స్ హేమేక్ట్ ‘’ఆ దేశ జాతీయగీతం అయింది భాషా వ్యాప్తికీ బాగా కృషి చేశాడు .మైకేల్ రోడాంగి-1827-1876  ఆ దేశ జాతీయ ఎపిక్ ‘’రినేర్ట్ ఆడ్డడీ ఫస్ అం ఫ్రాక్ అన్ ఎమానస్ గ్రిసిస్ట్  ‘’సింపుల్ గా రీనేట్ ది ఫాక్స్ ‘’1872లో పబ్లిష్ చేశాడు .ఇది సెటైరికల్ రచన .స్థానికప్రజల అంతరాన్తరాలను శోధించి రాసిన మహాకావ్యం .ఫీలిక్స్ తైయస్-1830-55 ఫ్రెంచ్ భాషలో ‘’మార్క్ బ్రూనో ప్రాఫిల్  డర్టిస్టే మొదటి నవల రాశాడు .

  20వ శతాబ్దిలో బాట్టీ వెబర్ 1860-1940 జర్నలిస్ట్ చిన్నకదల రచయిత.అతని ‘’కాలెండర్ చి౦పెయ్యండి ‘’అనే డైలీకాలం 1913నుంచి 40దాకా27ఏళ్ళు ‘’లక్సెం బర్గ్ జీ టుంగ్ ‘’ లో  సుదీర్ఘంగాస్థానిక సంస్కృతీ విశేషాలను అత్యంత ఉత్కంఠ తో రాశాడు  ,నికోలస్ వెల్టర్-1871-1951 దేశీయ సమస్యలను జర్మన్ భాష నాటకాలలో  రాశాడు .వీటిలో డీ సోహినే డెస్ ఒసింగ్స్ ప్రసిద్ధం .ఆదేశ చరిత్ర కూడా రాసిన మొదటివాడు ..రెం.ప్ర.యు.తర్వాత అనిసె కోల్త్జ్ ఫైరీ టేల్స్ ను రెండు భాషల్లో రాసింది .1970లో భర్త నాజీల హింసకు మరణి౦చాక  ఫ్రెంచ్ భాషలోనే కవిత్వం రాసింది  .ఈమె రచనలు పలుభాషలలోకి అనువాదం పొంది ఆమెకు 1988లో ప్రిక్స్ గుల్లెయం  అవార్డ్  వచ్చింది.ఈమె రచనలు ఎందరినో ప్రభావితం చేసి ఆ దేశ సమకాలీన రచయితలలో సాటి లేని మేటి అని పించింది .జీన్ పొర్తంటే కవి నావలిస్ట్ ,నాటక,కథా స్క్రీన్ ప్లే రచయిత  .ఈ దేశ సాహిత్యాన్ని ఫ్రెంచ్ లోకి అనువదించాడు .జీన్ క్రయర్ ‘’హీర్జెంస్ లస్ట్ స్పీలే ‘’కవితా సంపుటికి చాలా ప్రైజులుపొందాడు .గే రేవేనింగ్ ,రోజర్ మాన్దర్స్ షెల్డ్ స్థానిక భాషలో నవలలురాశారు వీధులు ఊడిచే వారి గురించి ,కుటుంబ సమస్యలుగురించి ,నిత్యజీవిత సమస్యలగురించి విశ్లేషణాత్మక నవలలు రాశారు  .మాండర్ షీల్డ్ చైల్డ్ హుడ్ ట్రయాలజి రాసి 1988లో ముద్రించాడు .ఇందులూకటి అతని ఆటో బయాగ్రఫి 3వేలకాపీలు అమ్ముడయింది .దీనితో కాకపుట్టి గొప్పనవలలు రాశారు .నీకో హేల్మింజర్ ,జీన్ మైకేల్ ట్రెనిన్ జార్జ్ ఆస్మార్ ,జొసీ బృవాన్ లు చాలా నవలలు రాశారు ఆ దేశభాషలో .ఆ దేశం రెండు ప్రైజులు -1-సేర్వాయిస్ ప్రైజ్ 2-బాట్టీ వేబెర్ ప్రైజ్ లను అందిస్తోంది ప్రతిభా రచయితలకు

74-నార్త్ మాసిడోనియా సాహిత్యం

రిపబ్లిక్ ఆఫ్ నార్త్ మాసిడోనియా బాల్కన్ పెనిన్సులలో ఆగ్నేయ యూరప్ లో ఉన్న దేశం .రాజధాని-స్కోప్జే .కరెన్సీ –మాసిడోనియన్ డెనార్.20లక్షలజనాభా .మూడవవంతు ప్రజలు పేదవారు .రాజకీయ కక్షా కార్పణ్యాలు ,నిరుద్యోగం దీనికి ముఖ్యకారణం .

మాసిడోనియన్ సాహిత్యం ఆర్కిడ్ లిటరరీ స్కూల్ తో ప్రారంభం .ఆభాషలో మొదటి రచనలు మతసంబంధమైనవే .ఆ భాషను అధికారికంగా రిపబ్లిక్ అయ్యేదాకా గుర్తింపబడలేదు .సాహిత్య పత్రిక వర్దార్ 1950లో పుట్టి సాహిత్యాన్నికాపుకాసింది .మొ .ప్ర .యు .తర్వాత కోస్టా రేసిన్ కవిత్వం మాత్రమె రాసి ,సాహిత్య పత్రికలద్వారా వ్యాప్తి చేశాడు .ఇతడి’’బెల్లి ముర్గి అంటే  ‘’వైట్ డాన్స్’’జానపద కవితలు నిషేధానికి గురైంది.కోడె నెడల్కో విస్కీ తనరచనలు స్థానిక ఒత్తిడులఫలిటంగా ఇతర దేశాలలో ముద్రించాడు  .ఈ దేశ సాహిత్యం 1-ఓల్డ్ మాసిడోనియన్ లిటరేచర్ -8-18శతాబ్దాలు 2-న్యు మాసి డోనియన్ లిటరేచర్ -1802-1944 3-మోడరన్ మాసిడోనియన్ లిటరేచర్-1944నుండి ఇప్పటివరకు గా విభజించారు .

  ఆధునిక సాహిత్యం రెం.ప్ర.యు.తర్వాత  బ్లేజ్ కేనేస్కి మొదలైనవారు ఆ భాషను అధికార భాష చేయటానికి స్థాయి పెంచారు .ఆకో సోపోవ్ ,స్లావ్కో జనేవిస్కి గానే తోడోర విస్కీ  ఆభాషలో గొప్పకవిత్వం రాశారు .సెలో జాడ్ మొదటిసారిగా వచనప్రక్రియలో నవల ది విలేజ్ బియాండ్ ది యాష్ ట్రీమొదలైన’’సైకిల్ ఆఫ్ సిక్స్ నావేల్స్ ‘’నవలలు రాశాడు .ప్లేవార్ వాసిల్ ఇలిజోస్కి నాటకాలు రాశాడు .కోలే కాసూల్ గోరన్ స్టేఫెనో విస్కీ మొదలైనవారు నవలలురాశారు .కాలే ఐడియలిజం వైఫల్యం నవలాకారుడు .అతనినాటకం ‘’క్రిమిలా అంటే నల్లవస్తువులు -1960 లో 20శతాబ్ది ప్రారంభం లో ఇమ్రో లీడర్ హత్యపై రాసింది .ప్రోజ్ రైటర్స్ లో జీవకో కిన్గో -పాస్కో విలిజా కథా సంపుటి మనో వీధిలో సంప్రదాయం ,విప్లవభావాల సంఘర్షణ ప్రత్యేకత .బాల్య దురదృష్టం కూడా ఉంటుంది. వ్లాడా ఉరోసవిక్ –డ్రీమర్ అండ్ ది ఎంప్టి నెస్,జొవాన్ పావ్లోస్కి –ప్రోస్ట్రేట్ గ్లాండ్ జూస్-1991 గొప్ప రచనలు .

  ,సశేషం

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -15-5-20-ఉయ్యూరు

  ’

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

ప్రపంచదేశాలసారస్వతం71 – లీ చెస్టీన్ సాహిత్యం

ప్రపంచదేశాలసారస్వతం71 – లీ చెస్టీన్  సాహిత్యం

జర్మన్ భాష మాట్లాడే  లీ చెస్టీన్ 25కిలోమీటర్ల పొడవైన ప్రిన్సిపాలిటిఅనబడే అతి చిన్న దేశం . ఆస్ట్రియా-స్విట్జ ర్లాండ్ల మధ్య ఉంటుంది .మధ్యయుగ రాజభవనాలు ఆల్పైన్ పర్వత శ్రేణులు దీని ఆకర్షణ .రాజధాని వాడుజ్ .జనాభా 39వేలు .కరెన్సీ –స్విస్ ఫ్రాంక్ .

 ఈ దేశ సాహిత్యం జర్మన్ భాషలోనే ఉన్నది .ఇక్కడి రచయితలు ఒంటరి రితనం ఫీలవుతారు .గ్రూప్ ఆఫ్ రైటర్స్ కనిపించరు .సీగ్లిండే సోహిఅనే రచయత్రి ట్రేడ్ పాలిసి ఆఫ్ ది యూరోపియన్ యూనియన్ ,రిలక్ట౦ట్ యూరోపియన్స్ వంటి 7పుస్తకాలురాసిన  ఎకనామిక్ మేధావి .ఇరెన్ నిగ్గ్ యాత్రికురాలు, జర్నలిస్ట్ మొదటిపుస్తకం –ఫీబెర్ జీట్ ను 1988లో రెండవది –మాన్ వోర్తర్ సిచ్ డైఓర్తే సేల్బిస్ట్ 2006లో రాసింది .యూరోపియన్ యూనియన్ ప్రైజ్ పొందింది .చిన్న చిన్నవి చాలారాసింది .ఆర్మిన్ ఓహ్రి-2014లో తన ‘’డార్క్ మ్యూజ్ ‘’అనే క్రైం ఫిక్షన్ కు  యూరోపియన్ యూనియన్ ప్రైజ్ గెల్చిన రచయిత .ఇతరరచనలు-డాస్నచ్టిక్ ఓక్ ,డై ఎన్దోఫంగ్ ఏర్జాహ్లుంగ్ ,ప్రొఫెసర్ హార్పర్స్ ఎక్ష్పెడిషన్ మొదలైన 10పుస్తకాలు .హాన్స్ జోర్గ్ రీయిన్ బర్గర్ –సైన్స్ హిస్టోరియన్ .బెర్లిన్ లో మాక్స్ ప్లాంక్ ఇన్ స్టి ట్యూట్ ఫర్ ది హిస్టరీ ఆఫ్ సైన్స్ ‘’కు డైరెక్టర్.హిస్టరీ అండ్ ఎపిస్టమాలజి ఆఫ్ ది ఎక్స్పెరిమెంట్,ది హిస్టరీ ఆఫ్ న్యూక్లియర్ బయాలజీ ,ప్రోటీన్ బయో సింథసిస్ రాశాడు కవిత్వం ఎన్నో సాహిత్యవ్యాసాలురాశాడు ,కోజిటో అవార్డ్ , దడిస్టిన్గ్విషడ్ లెక్చరర్ అవార్డ్ వంటివి చాలా అందుకొన్నాడు .ఈ దేశం పైనా ఇక్కడి విశేషాలమీదా 35దాకా పుస్తకాలొచ్చాయి .ఇంతకంటే నాకు ఏమీ దొరకలేదు .

72-లిథూనియా దేశ సాహిత్యం

లిధూనియారిపబ్లిక్ దేశం యూరప్ లోబాల్టిక్ ప్రాంతంలో ఉంటుంది .బాల్టిక్ దేశాలలో ఇదీ ఒకటి .తూర్పున స్వీడెన్ ,డెన్మార్క్ ఉంటాయి .రాజధాని –వినియస్ .కరెన్సీ-యూరో .జనాభా 28లక్షలు .భాష లిధూనియన్.

  లిధూనియన్ పూర్వ సాహిత్యం లాటిన్ లో రచింపబడి ఉన్నది .దీనికి కారణం రాజు మిండాగస్.జేడిమనాస్ అక్షరాలవాడకం ఇక్కడ మరో వింత .లాటిన్ లో రాసిన మొదటి ఈదేశరచయిత నికోలస్ హస్సోవినాస్ కవి 1440-1533రాసిన కామేన్ డీస్టాతురాలో ఆదేశ లాండ్ స్కేప్ వర్ణన ,ఆచారాలు రాజకీయాలు ,పాగనిజం క్రిస్టియానిటి తగాదాలు ఉంటాయి .ఇది 1523ప్రచురణ .జోఎన్నేస్ విసిలియాస్ -1485-1560’’ప్రష్యన్ వార్ ‘’అనే గొప్ప కవిత్వం రాశాడు .మైకులో లిటూనస్ ‘’ది కస్టమ్స్ ఆఫ్  తార్తార్స్’’ను 16శాతాబ్దిమధ్యలో రాశాడు .ఇది 1615లో ప్రచురితం .స్పెయిన్ లో పుట్టినలాయర్ కవి పెట్రస్ రాయ్ సుయస్ 1505-1571-సాంస్కృతిక రంగం లో ప్రసిద్ధుడు .అన్గిస్టినస్ రోటు౦ డస్ ఈ దేశ చరిత్ర లాటిన్ లో రాశాడు .రాడ్ వాన్స్ హ్యూమనిస్ట్ కవి ఆ దేశ జాతీయ ఎపిక్ ‘’రడివిలియస్’’1588లో రాశాడు .బోలేరాస్ లారంటి యస్ కవి స్వీడెన్ పై తన  దేశం గెలిచిన చారిత్రిక సంఘటన1650లో  రాసి తన దేశ జవాన్లకు అంకితమిచ్చాడు .మధియస్సర్బీవియస్ తన ‘’త్రీ బుక్స్ ఆఫ్ లిరిక్స్’’1625లో పబ్లిష్ చేశాడు .అతని గాడ్స్ ఆఫ్ ది నేషన్స్ లో  రోమన్ దేవతలను తనదేశ మైదాలజి దేవతలను వర్ణించాడు .

   17వ శతాబ్దిలో స్కాలర్స్ కూడా లాటిన్ లోనే రాశారు .విజూకాస్ 20కిపైగా పుస్తకాలు రాశాడు .లిదూనియన్ స్కాలర్స్ అబ్రమాస్ కుల్వేరేటిస్ స్టాన్సిస్లోవాస్ రేపోలియనిస్ లిధూనియన్ భాషలో రాసిన ప్రధములు .క్రిస్టి జోన్స్ డొనేలాటిస్1714-1780 అసలైన లిధూనియన్ కవిత్వం ‘’హెక్సా మిటర్ మెటాయ్’’అంటే సీజన్స్ రాసి ఆదేశ కవిత్వానికి నాందిపలికాడు .జర్గిస్ పబ్రేజా 1771-1849 కవి ఫిజిషియన్ బోటనిస్ట్ బాటనిపై ఎన్సైక్లోపీడియా రాశాడు .ఆభాష లో బాటని టెర్మినాలజి రాశాడు .250స్వీయ సేర్మన్స్,డైరి ‘’రిజ్టా’’అంటే డిటేర్మి నేషన్స్ రాశాడు .సిమోనాస్ డకాంటస్-1793-1864 దేశీయ సాహిత్యం సంస్కృతీ ,ఆచారవ్యవహారాలు పూర్తిగా పాటింపబడిన  ఆకాలాన్ని ‘’గోల్డెన్ ఏజ్’’ అన్నాడు .ఆదేశ చరిత్రను ఆభాషలోనే రాశాడు 1857లో మిఖాల్ బాలన్స్కి ‘’ We should lift up the Lithuanian language, wrest away from scorn that language which has the Sanskrit greatness, the Latin force, the Greek refinement, and the Italian melodiousness.”

అని ఎలుగెత్తి చాటాడు .ఆదేశ భాష ,ప్రకృతి ని వర్ణిస్తూ ‘’అనిక్సిస్ సిలేసిస్ ‘’అంటే పైన్వుడ్ అరణ్యాలు రాసి మురిశాడు అంటానాబరనాస్కస్.ఇదే ఆభాషలో అత్యుత్తమ కవిత్వం అన్నారు ,గణిత శాస్త్రవేత్తకూడా కనుక ఆ భాషలో ఎన్నో గణిత పదాలను సృష్టించాడు .వాస్కో వాస్ బిర్జిస్కా -1884-1965లో  3భాగాల మాన్యుమెంట్ ఎన్సైక్లో పీడియక్ బయాగ్రఫీస్  ,బిబ్లియోగ్రఫీస్ ,బయో బిబ్లిగ్రఫీస్ ఆఫ్ లిధూనియన్ రైటర్స్ 1475నుంచి 1865వరకు ఆభాషలో రాసిన 370మంది ప్రముఖ రచయితల వివరాలన్నీ అందుబాటులోకి తెచ్చి చిరస్మరణీయ భాషా సేవ చేశాడు.

  20వ శతాబ్దంలో మైరోనియాస్ క్లాసిక్ కవి .డ్రమాటిక్ లిరిక్ తోపాటు రొమాంటిక్ కవిత్వమూ రాశాడు .ఆయన్ను ‘’పోయేట్ ప్రాఫెట్ ఆఫ్ లిధూనియన్ నేషనల్ రివైవల్ ‘’అంటారు గౌరవంగా .ఆధునిక కవిత్వానికి శంకుస్థాపన చేశాడుకూడా .ఆదేశ ప్రకృతి,సంస్కృతిలకు పరవశుడై అద్భుత కవిత్వం రాశాడు .1895లో వచ్చిన అతని ‘’వాయిసెస్ ఆఫ్ స్ప్రింగ్ ‘’అతని కీర్తికిరీటంలో కలికితురాయి .విన్కాస్ క్రెవి  మైఖే విషస్ నవల నాటక కారుడు .అతని గొప్పరచనలలో ఓల్డ్ ఫోక్ టేల్స్ ఆఫ్ డైన్వా,స్క్రిగిల్లా ,ది  డెత్ ఆఫ్  మండగస్ఉన్నాయి .పెట్రాస్ వాసినియుస్ ఏడాదికి ఒకనాటకం వంతున పదేళ్ళు 10నాటాకాలు రాశాడు .సర్జిస్ సవక్కిస్  విత్ అండ్ ఐరనీ తో చాలా కధలురాశాడు .జేమలైట్ స్వయంగా చదువుకొని  ఆ దేశ గ్రామీణ జీవితంపై అనేక కధలురాశాడు .వైడునస్-ఫిలాసఫర్ రచయిత .దేశీయతను నిలబెట్టే రచనలెన్నో చేశాడు .1940లో నోబెల్ కు నామినేట్ అయ్యాడు .అస్కరాస్ మిలేషియస్   ఆదేశపు 26పాటలురాశాడు ,టేల్స్ స్టోరీస్ కూడా రాశాడు .ఇతనిమిస్టిసిజం పై స్వీడెన్ బోర్గ్ ప్రభావం ఉన్నది .బాలిస్ సృయోగా  డ్రామా హిస్టరీ మైదాలజి రాశాడు.లేమాసిమోనటైల్  రాసిన ‘’ది ఫేట్ ఆఫ్ సిమోనియ ఫ్రం అక్టూజియా’’ విశ్లేషకులమన్ననలు పొంది ఆమెపేరు విఖ్యాతమైంది .

   21వ శతాబ్దిలో అల్విడాస్ సేపికాస్ కవి నాటక నవలాకర్త .అతని ‘’ఇన్ ది షాడో ఆఫ్ వుల్వ్స్’’6పునర్ముద్రణలు పొంది ప్రైజులు అందుకొని పలుభాషలలో అనువాదం పొందింది .అగ్రే జగ్రకలేట్ కవయిత్రి వ్యాసకర్త క్రిటిక్ .ఆమె మొదటి కవితా సంపుటి ‘’ఐ యాం గెటింగ్ మారీడ్ ‘’ 2003లో ,రెండవది ఆల్ ది ట్రూత్ అబౌట్ ఆలీసా అండ్ మ  మిలర్ 2008లో పబ్లిష్ అయ్యాయి .గబిజా గ్రుసైట్ మొదటినవల ‘’అన్ ఫుల్ ఫిల్డ్’,రెండవది మిస్టర్ కోల్డర్’’బాగా పాప్యులర్ అయ్యాయి .లిధూనియన్ సాహిత్యం ఒకబంగారు గని .తవ్విన కొద్దీ అమూల్యాలు లభిస్తాయి .

  సశేషం

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -15-5-20-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

సుందర కాండ లో హనుమ బహుముఖీన వ్యక్తిత్వం-26

సుందర కాండ లో హనుమ బహుముఖీన వ్యక్తిత్వం-26

‘’నాకు తెలియకుండా రావణుడు నన్ను ఇక్కడికి తెచ్చాడు .రాక్షసస్త్రీలు పెట్టె హింసలు భరించలేక పోతున్నాను .ఇక్కడి ఈ లంకా వైభవంతో నాకేం పని ?నాగుండె రాయి అయిపోయిందా లేక జరామరణాలు లేనిదా అర్ధం కావటం లేదు .ఎంతత ఏడ్చినా బద్దలు అవటం లేదు .రామవిరహం సహిస్తూ బతకటం నాకు నింద అవుతుంది .నా ప్రభువు ,పతి రాముడు లేని నాకు ఈ జీవితం ఎందుకు .రాక్షసుల్లారా నన్ను చీల్చండి చంపండి తినేయ్యండి .ఎలాగైనా ప్రాణాలు వదలాల్సిందే. ఈ దుఖం ఇక భరించలేను .రావణ రాక్షసుడిని ఎడమకాలితోనైనా తాకను .అలాంటి నేను వాడిని కామిస్తానా ?నన్ను ముక్కలు చేసినా ,అగ్నిలో పడేసికాల్చినా రావణుడిని మాటవినను .నా రాముడు కైకేయి లాంటి దోషవతులలోనూ మంచినే చూసే ప్రాజ్ఞుడు .’’ఖ్యాతః ప్రాజ్ఞః క్రుతజ్ఞశ్చసాను క్రోశశ్చ రాఘవః –సద్వ్రుత్తో నిరనుక్రోశ శ్శంకేమద్భాగ్య సంక్షయాత్ ‘’  అపకారం చేసినవాడికైనా ఉపకారమే చేస్తాడు,తనకు చిన్న ఉపకారం చేసినవారికైనా వారి దుఃఖ సమయంలో గొప్పగా అదుకొనెఉదారుడు.అలాంటి దయామయుడు నాపై దయ ఎందుకు చూపటం లేదో అర్ధం కావటం లేదు. నాకు అదృష్టం తగ్గిందేమో .నన్ను రావణుడు ఇక్కడికి తెచ్చాడని రాముడికి తెలిసి ఉండదు. తెలిసి ఉంటె ఈపాటికి వచ్చేసేవాడు .నా సంగతి తెలిసిన జటాయువునుకూడా రావణుడు యుద్ధంలో చ౦పాడు .లంకారాజ్య మార్గాలలో రామలక్ష్మణులు ఇక్కడికి వచ్చి కాల్చిన రాక్షసుల చితులనుంచి పైకి ఎగసిన పొగ క్రమ్మి గ్రద్దలు తిరుగుతూ లంక త్వరలోనే శ్మశానం అవుతుంది .త్వరలో నా కోరిక నెరవేరుతుంది ఇక్కడ కనిపించే అశుభాలు ఆవిషయాన్ని సూచిస్తున్నాయి

  పాప రావణుడు చస్తే మహా తేజస్సున్న లంక  తేజో విహీనమై స౦పదలన్నీ నశించి పతి చనిపోయిన పడతి లాగా ఉంటుంది .ఇంటింటా రాక్షస స్త్రీల రోదనం  భరింప రానిదౌతుంది .నేను ఇక్కడ ఉన్నానని రాముడికి తెలిస్తే రామబాణం లంకను భస్మం చేస్తుంది .వాడు ఇచ్చిన 2నెలలగడువే ఉన్నదిమిగిలి .ఎవరైనా విషమిచ్చి పుణ్యం కట్టుకొంటే బాగుండును .నా విషయం తెలీక సోదరులు కాయ దుంపలు తింటూముని వృత్తిలో ఉంటూ  ఆయుధాలు వదిలేశారా .?ప్రియమైన దాని వలన ప్రియమే కలుగుతుంది అప్రియమైనదానివలన సుఖం కలుగక దుఖమే కలుగుతుంది .ప్రియాప్రియ ద్వంద్వాలకు అతీతుడైన మహాత్ముడగు రాముడికి నమస్కారం .నేను రామునికి ప్రియపరురాలను. రాముడిని వదిలి జీవించలేను. ప్రాణాలు వదిలేస్తా ‘’అని దుఖపడింది .-‘’ప్రియా న్న సంభవే ద్దుఖ మప్రియాదధికం  భయం –తాభ్యాం హి యేవియుజ్యన్తే నమస్తేషాం మహాత్మనాం’

సాహం త్యక్తా ప్రియార్హేణ రామేనా విదితాత్మనా –ప్రాణా౦ స్తక్ష్యామి పాపస్య రావణస్య గతావశం ‘’‘’

ఇది 51శ్లోకాల 26వ సర్గ .

ముందుగా రాముడు వస్తాడని ,రావాలని కోరుకున్న సీతకు సెకండ్ థాట్స్ వచ్చి ,అసలు తాను ఎక్కడ ఉన్నానో ఆయనకు తెలిసిందో లేదో అనుకోని తనవిషయం చెప్పటానికి మిగిలిన ఒకే ఒకడు జటాయువు కూడా తనకోసం రావణుడితో తీవ్ర యద్ధం చేసి చనిపోయాడు కనుక రాముడికి తన విషయం చెప్పటానికి ఎవరూ మిగల్లేదు అని అర్ధం చేసుకొన్నది .ఆయనకు తానిక్కడ ఉన్న విషయం తెలిస్తే ఆఘమేఘాల మీద రాకుండా ఉంటాడా అని ఊరట పొందింది .వస్తే ఏం జరుగుతుందో ముందే చెప్పింది సర్వరాక్షస హననం లంకాదహనం  .ఆడవారికి దుఖంబాగావస్తే అది కలిగించిన ఎదుటి వారిని తిట్టటం ,శాపనార్ధాలు పెట్టటం సహజం .ఎంతైనా సీత స్త్రీయే కదా.ఆలక్షణం ఎక్కడికి పోతుంది ?రాక్షస్త్రీల మా౦గల్యాలు మాడిభస్మం అవ్వాలనుకున్నది .లంక బూడిదకావాలని కోరింది . భార్తలను కోల్పోయిన రాక్షస స్త్రీల రోదన లంక అంతా ప్రతిధ్వనించాలని తనకు జరిగిన అవమానానికి ఇదే ప్రతీకారమనీ భావించింది. ఇది అతి సహజం .అయితే అంతకు ముందు రామునిఉదార హృదయం చెప్పింది .తప్పు చేశానని రావణుడు ఒప్పుకొంటె ఆయన దయామయుడు కనుక అన్నీ మర్చిపోయి క్షమించి లంకను కాపాడుతాడు అని చెప్పింది అన్న సంగతి మనం మరువరాదు మహాశయులారా.

   సశేషం

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -14-5-20-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

ప్రపంచ దేశాలసారస్వతం 70-   లాట్వియా దేశ సాహిత్యం

ప్రపంచ దేశాలసారస్వతం

70-   లాట్వియా దేశ సాహిత్యం

లాట్వియా దేశం బాల్టిక్ సీ పై లిదువేనియా ఎస్టేనియా దేశాలమధ్య ఉన్నది .వైల్డ్ బీచెస్ ,దట్టమైన అరణ్యాల దేశం .రాజధాని వుడెన్,నోవియు ఆర్కి టేక్చర్ కు ప్రసిద్ధమైన రిగా..కరెన్సీ –యూరో .జనాభా 19లక్షలు .అతి బీద దేశం .అధికార భాష లాట్వియన్ .

లాట్వియా దేశ సాహిత్యాన్ని లాట్వియన్ సాహిత్యం అంటారు .లాట్వియన్ భాషలో పాటలు తరతరాలుగా వ్యాప్తి చెందాయి .19శతాబ్ది ముందు కొందరు రచయితలు  రాయటం మొదలు పెట్టారు .గోథార్డ్ ఫ్రీద్రిక్  స్టెండర్  వంటి వారు కవిత్వం, వచనం రాశారు .అసలైన ఆదేశ సాహిత్యం 19వ శతాబ్దిలో జురిస్ అలునాస్ పాటలపుస్తకం తో ప్రారంభమైంది .లాట్విన్ భాష  రైతు భాష అని బాల్టిక్ –జర్మన్ మేధావులు తక్కువగా భావిస్తే కాదు అద్భుతవాహిక అని తన రచనలతో నిరూపించాడు .1856లో ఈపుస్తకం ముద్రణ పొందింది .అదే ఏడాది చార్లెస్ బాడలేర్  ‘’లెస్ ఫ్లుఎర్స్ డు మాయ్’’ అంటే ది ఫ్లవర్స్ ఆఫ్ ఈవిల్స్కవితా సంపుటి  ‘’రాసి ఆధునిక యూరప్ కవిత్వానికి నాంది పలికాడు .ఎందరినో ప్రభావితం చేశాడు .ఆ దేశ ఎపిక్ ‘’లాక్ ప్లేసిస్ ‘’1888లో ఆన్డ్రేజేర్స్ పంపర్స్ రాశాడు .

   20వ శతాబ్దిలో దేశానికి జర్మన్, రష్యన్ సంబందాలేర్పడటం వలన  సింబాలిజం ,డేక డేన్స్.సోషలిజం మార్క్సిజం ఉద్యమాలు ఉవ్వెత్తున వచ్చి 1905రివల్యూషన్ లో దేశం ఓడిపోవటంతో అండర్ గ్రౌండ్ చేరాయి .జారిస్ట్ ప్రతీకార తీవ్రత తో లాట్వియానుంచి మొదటి బాచ్ మేధావులు వలసపోయారు .రైనిస్ కవి ,నాటకరచయిత అనువాదకుడు ,రాజకీయనాయకుడు ఆ శతాబ్దాన్ని ‘’ఫైర్అండ్ నైట్ ‘’-1905,ఇండులిస్ అండ్ ఆర్జా-1921 నాటకాలతో ,మలుపుతిప్పి  చాలామంది యితలపై ప్రభావం చూపాడు .అతనిస్థానిక సింబాలిజం ఆదేశ జాతీయ ఉద్యమానికి దారి తీసింది .అతడే ఆదేశం రష్యా సామ్రాజ్యంలో  భాగంగా ఉండరాదని ,వేరుపడి రిపబ్లిక్ దేశం అవ్వాలని కోరాడు .అస్పాజియా అనే స్త్రీవాద రచయిత్రిని పెళ్ళాడి ,దేశ బహిష్కారం తో ఇన్నర్ రష్యాకు ,ఆతర్వాత స్విట్జర్ లాండ్ కు చేరి మళ్ళీ లాట్వియా స్వాతంత్ర్యం పొందాక తిరిగి వచ్చారు .భార్య సోషల్ డెమాక్రటిక్ వర్కర్స్ పార్టీలో చేరి ,పార్లమెంట్ లో అని  సెషన్లలో  1920-34వరకు పాల్గొన్నది

  విక్టార్ ఎజిలిటిస్ రష్యన్ సింబాలిజం కు ఆకర్షితుడై డేకడేన్స్ ఉద్యమం నడిపాడు .చాలా తీవ్రంగా మోడర్నిస్ట్ పోయేటిక్స్ రాసి ,తర్వాత దేశభక్త చారిత్రిక ఫిక్షన్ రచయిత అయ్యాడు .రిపబ్లిక్ లాట్వియాలో అలేగ్జాండర్ కాక్స్ రిగానగర పేదరికం వ్యభిచారం లపై అంతకు ముందు ఎవరూ రాయని గొప్ప కవిత్వం రాశాడు .అతని ఎపిక్ పొయెం’’ముజిబస్ స్కార్టీ’’ ఆదేశ రైఫిల్ వీరులకు అంకితమిచ్చాడు .ఆ దేశం సోవియట్ లో భాగంగా ఉండగా అతని రచనలు రాజకీయ వ్యతిరేకమని దాడి చేస్తే ఆరోగ్యం దెబ్బతిని గుండెపోటుతో 8-2-1950న చనిపోయాడు .జర్మని  స్వాధీనం చేసుకోన్నాక ఎరిక్ ఆడం సన్వాలిస్ సేంద్రింస్ పుస్తకాలు ముద్రించటం మొదలెట్టి తర్వాత ఇతరదేశాలకు వలసపోయారు .1991లో దేశం స్వతంత్రం పొందాక మళ్ళీ వచ్చి రాసినవారిలో మార్గారిటా గుర్మేన్ ,రాబర్ట్ మాక్స్ జానిస్ సోడుమ్స్ ఉన్నారు .

  రెండవ ప్రప౦చయుద్ధం తర్వాత కొందరు పడమటి దేశాలకు వెళ్ళిపోయారు కొందరు లేబర్ కాంప్ లకు తరలి౦ప బడ్డారు ‘కృశ్చెవ్ వచ్చి స్టాలిన్ దురంతాలు బయట పెట్టాక 56వ జనరేషన్ సాహిత్యావిర్భావం జరిగి ఒజర్స్ వాసిటిస్,విజ్మా బెలేస్వికా ,ఇమాన్స్ జేల్డోని సాహిత్యానికి కొత్త ఊపిరులూదారు .అన్నా రాన్కేన్,ఆస్కార్స్ సీక్ సైట్స్,ఇంగ్రిడా టరౌడా మొదలైనవారు రెండు మూడు భాషలలో రాస్తున్నారు. కల్చర్ సెంటర్ ఆఫ్ లాట్ గేల్ అనేక పుస్తకాలు ప్రచురిస్తోంది .కవి నావలిస్ట్ ,డ్రమటిస్ట్ ఇంగా ఎబెలి ,కవులు ఎద్విన్స్ రౌప్స్ ,పీటరిస్ డ్రాగన్స్,లియానాలాంగా అన్నా ఔజ్న,వచనరచనలో పాలిస్ బాంకో విస్కీ ,జాన్స్ ఈన్ ఫీల్డ్స్ ,నారా ఇక్స్టేనా వంటి కొత్తతరం రచయితలు  స్వేచ్చగా లాట్వియా సాహిత్యాన్ని ఘనంగా పండిస్తున్నారు .

   సశేషం

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -14-5-20-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

హనుమజ్జయంతి ఆహ్వానం

Posted in దేవాలయం | Tagged | Leave a comment

ప్రపంచ దేశాలసారస్వతం 69- కోసోవో దేశ సాహిత్యం

ప్రపంచ దేశాలసారస్వతం

69- కోసోవో దేశ సాహిత్యం

దక్షిణ యూరప్ లోని కొసొవో రిపబ్లిక్ దేశం .రాజధాని ప్రిస్టిన.కరెన్సీ-యూరో .బోస్నియన్ టర్కిష్ ,రోమాని ఇక్కడి భాషలు. అధికారభాషలు అల్బేనియన్ ,సెర్బియన్ .జనాభా సుమారు 18న్నర లక్షలు .రెండవ పరపంచయుద్ధం తర్వాత కొన్ని ప్రత్యేక పరిస్థితులలో  సెర్బియా ఆక్రమించాక స్కూలు పరీక్షలన్నీ సెర్బియన్ భాషలోనే జరపాల్సి వచ్చింది.అల్బేనియన్ భాష చదువు ముద్రణ అన్నీ అణగ దొక్కారు .కాని 1940లో అండర్ గ్రౌండ్ సాహిత్యం మాత్రం ప్రవహించింది .అలేగ్జాండర్ రాంకో విక్ అల్బెనియన్ లో    రాసి ప్రచురించాడు .అల్బేనియన్ భాషలో దినపత్రిక ‘’రిలిండ్జా’’ సీక్రెట్ పోలిస్ సహకారం తో స్థాపించి  నడిపాడు .పూర్తి అల్బేనియన్ భాష సంస్కృతీ సదుపాయాలూ 1974యుగోస్లావ్ రాజ్యాంగ సవరణవలన లభించి కొసొవో అల్బేనియన్ సాహిత్య సంస్కృతులు పరిఢవిల్లాయి

  కొసొవో లోని పూర్వ సెర్బియన్ రచయితలలో 20వ శతాబ్దికి చెందిన నవలాకారుడు ఉకాసిన్ ఫిల్పోవిక్ ,కవులు – డార్నికా జేర్విక్ ,,పీటర్సారిక్ ,రడోసావ్ సోజ్ఞావిక్ ,కధారచయిత లజార్ ఉక్కో విక్.

అట్టో వాన్ కాలం లో –పిజెటర్ బొగ్దాని,చరిత్రకారుడు సెలాల్జేడ్ సాలిహా సేలిబి ,హాస్యాత్మక అట్టో వాన్-టర్కిష్ కవి ప్రిస్టినసి మేసిహి ,బయ గ్రాఫర్ , అనువాదకుడు ఆశిక్ సేలిబి ,బెజ్టేహింగ్ ఉద్యమకవి తాహిర్ ఎఫెండిజకోవ .

  రెండవ ప్రపంచయుద్ధం తర్వాతకవి  ఎసాద్ మేకులి సాహిత్యపత్రిక జేటా యి రే ను 1949లో స్థాపించి సాహితీ సేవ చేస్తే ,ఆడెం డేమసి 28ఏళ్ళుయుగోస్లేవియన్ ప్రభుత్వంలో  రాజకీయ ఖైదీగా ఉంటూనే పై మాగజైన్ నిర్వహణకు సాయపడ్డాడు .దాన్ని ఒకపుస్తకంగా జిఫైల్ నెడర్మేల్ రాసిన ఎ ఫ్లూట్ ఇన్ ది మౌన్టేన్స్ ,సాంగ్ ఆఫ్ ది లోలాండ్ పాశ్చర్ రచనలతో మహా విద్యావేత్త మార్టిన్ కమాజ్  పబ్లిష్ చేశాడు .వచనరచనలో అంటాన్ పషుకు,రెక్స్ హెప్క్వోస్జా ముఖ్యులు .రెక్స్ రాసినరాజకీయనవల –డెత్ కమ్స్ ఫ్రం సచ్ ఐస్ ఉత్తమం .నజ్మి రేహ్మని. టేకి డేర్విషి నవలలురాశారు .సృజనాత్మక ,ప్రయోగాత్మక కవులుగా డిన్మెహమేటి,బెసిం కోక్షి ,రహ్మాన్ డేడజ్,ఆలి పొడ్రిమాజ,ఎక్రేం బాషా ,సబ్రి హమిటి,అశ్రి కప్రికి ప్రసిద్ధి చెందారు

  యుద్ధం జాతి స్వాతంత్ర్యం కోసం ఉద్యమించినకవి ఈసాద్ మేకులి .ఇతని ‘’పేర్ టి’’ఎందరో రచయితలకు ప్రేరణగా నిలిచింది. రూసా రమడాని న్యూరోసిస్ అంటే సమ్మరి ఆఫ్ పోయెట్రి రాశాడు .అలీ పోడ్రిమేన్జా ‘’లుం లుమీ ‘’లో 20వ శతాబ్దిలోని 8వ దశకం ఈ దేశ వచనరచనను  సంప్రదాయ ,ఆధునిక అనే రెండుమార్గాలను ఏర్పరచింది అన్నాడు .సాంప్రదాయం లోరోమాన్టిజం వస్తే ఆధునికం లో ఐరోపా ఆధునిక భావ ధారా వచ్చింది .ఆంటన్ పషుకు సింబాలిక్ రచనకు ఆద్యుడు .రోమన్ డబుల్ కోడ్  ప్రోజ్ రాశాడు  రేస్జ్ హెప్కోస్జా .కొసొవో సాహిత్య విమర్శలో నిష్ణాతులు రెక్స్ హెప్, కోస్జా ఇబ్రహీం, రుగోవా శబ్రి హమిటి త్రయం .అల్బేనియన్ సాంగ్స్ రిడిల్స్ టేల్స లను ఎపిక్ క్రియేషన్స్ ,లిరికల్ క్రియేషన్స్ గా విభజించారు .

ప్రముఖపుస్తకాలు , రచయితల–కిస్సాని జుగోస్లేవియా –పెయిజ్ తిం స్టాతోవికి,ది డే ఆఫ్ దిపెలికాన్ –కేధరిన్ పాటర్సన్ ,కొసొవో ఏ షార్ట్ హిస్టరీ –నాయిల్ మాల్కం ,దిహెమింగ్వే బుక్ క్లబ్ –పాలాహన్ట్లి,హౌ టుబి కోసోవాన్ బ్రైడ్-నవోమిహామిల్

  సశేషం

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -14-5-20-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

సుందర కాండ లో హనుమ బహుముఖీన వ్యక్తిత్వం-25

సుందర కాండ లో హనుమ బహుముఖీన వ్యక్తిత్వం-25

రాక్షస స్త్రీల భీకరకఠినోక్తుల చేత కలత చెందిన సీతాదేవి భయకంపిత గద్గద స్వరంతో ‘’ నేను మానవ స్త్రీని రాక్షసుడికి భార్య కానేరను .కావాలంటే నన్ను చంపి తినేయ్యండి ‘’అని కఠినంగా చెప్పింది .కన్నీరు మున్నీరుగా కారుస్తుంటే ఒళ్ళంతా తడిసిపోయింది. వణికే ఆమె పొడవైన వెడల్పైన జడ కదిలి  పాకిపోయే పాములాగా కనిపించింది .’’హా రామా హా లక్ష్మణా అత్తగారూ కౌసల్యా సుమిత్రా ‘’అని రోదించింది .ఎవరికైనా అకాల మృత్యువు దుర్లభం ఇన్నిబాధలుపడుతున్నా నాప్రాణం పోవటం లేదు .ఏదైనా కొద్దిపుణ్యం చేసుకొని ఉంటె నేను సముద్రమధ్య౦ లో సరుకు తో నిండిన ఓడ పెద్దగాలికి ఊగినట్లు ఊగిపోయి అనాధగా చనిపోతాను .నా రామ  దర్శనం ధన్యులైనవారికే దక్కుతుంది .పూర్వ జన్మలో నే జేసిన పాపానికి ఫలం ఇక్కడ అనుభవిస్తున్నాను .భర్త అనుమతిలేకుండా ప్రాణాలు ఎలా విడవగలను అనుకొన్నది .

ఇందులో ‘’హా రామేతిచ దుఖార్తా హా పునర్లలక్ష్మణేతి చ –హా శ్వశ్రు మమ కౌసల్యా హా సుమిత్రేతి భామినీ ‘’

శ్లోకం లోక ప్రసిద్ధం .తానూ రామభార్యనే కాని అన్యులకు కాదు అని తెగేసి చెప్పింది అన్ని బాధలు అనుభవిస్తున్నా,. వాళ్ళు తనని చంపెసితినేస్తారని తెలిసినా.అదీ సీతా సాధ్వి మనో నిబ్బరం అంటే .ఉడత ఊపులకు జడిసేదికాదు ,నిశ్చయ మనో రధం ఆమెది .

 ఇది 20 శ్లోకాల  25వ సర్గ.

సశేషం

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -13-5-20-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

ప్రపంచ దేశాలసారస్వతం 68-ఎస్టోనియా దేశ సాహిత్యం

ప్రపంచ దేశాలసారస్వతం

68-ఎస్టోనియా దేశ సాహిత్యం

ఎస్టోనియా దేశం ఉత్తర యూరప్ లో బాల్టిక్ సముద్రం ,గల్ఫ్ ఆఫ్ ఫిన్ లాండ్ దగ్గర 1500 దీవులతో ఉన్నది .ప్రాచీన అరణ్యాలు ,ఎన్నో సరస్సులతో ఆకర్షణీయం .రాజధాని టాల్లిన్.కరెన్సీ-యూరో .జనాభా 13లక్షలు .

   ఎస్టోనియా దేశ సాహిత్యాన్ని ఎస్టోనియన్ సాహిత్యం అంటారు .13వ శతాబ్దినుంచి 1918వరకు జర్మని స్వీడెన్ ,రష్యా దేశాలతో ఉత్తర క్రూసేడ్ యుద్దాలతర్వాత మాత్రమె సాహిత్యం వర్ధిల్లింది .13వ శతాబ్దపు క్రానికల్స్ లో దేశం పేరు వాక్యాలముక్కలు కనిపించాయి .మొదటి రాతపుస్తకం వాన్రాడ్ ,కోయిల్ లు లూధరన్ కేటకిజం కు1535లో  జర్మన్ –ఎస్టోనియన్ భాషాను వాదం .ప్రీస్ట్ లకోసం ఎస్టోనియన్ గ్రామర్  జర్మన్ భాషలో1637లో  ప్రింట్ అయింది .1686లో న్యు టెస్టమెంట్ దక్షిణ ఎస్టోనియన్ భాషలోకి అనువాదమైంది .అంటన్  టోర్ హెల్లి రెండుమా౦డలికాలను కలిపి ఎస్టోనియన్ భాషగా మార్చాక సాహిత్యాభి వృద్ధి వేగంగా జరిగింది .

  మొదట్లో సిలబిక్ క్వాంటిటి తో జానపద గీతాలు వచ్చాయి .ఈకాలంలో జాతీయ ఎపిక్ ‘’కేలివిపోయేగ్’’అంటే కలేవ్ కుమారులు ను ఫెడ్రిక్ రీన్ హోల్డ్ క్రెజువాల్డ్-1803-1882 రాశాడు .గుస్టావ్ సూట్ రాసిన బాలడ్’’లాప్సే సుండ్ ‘’అంటే శిశు జననం ,విలెం గ్రీన్ హాల్-రిడాలా -1885-1942 కవిత టూమస్ జా మైఅంటే టూమాస్ మరియు మాయా ,ఆగస్ట్ అన్నిస్ట్ -1899-1972 రాసిన మూడు కవితలు వచ్చాయి .20వ శతాబ్ది చివరిభాగం లో జానపదం కదను తొక్కింది .వేల్జో టార్మిస్ ఇందులో ప్రసిద్ధుడు .

  19,20శతాబ్దాలలో జుహాన్ లివ్ కవి-1864-1913ఒకతరాన్ని ప్రభావితం చేశాడు .ఇతని సమకాలికుడు ఎడ్వర్డ్ విల్డే-1865-1930 వచనరచనలో రియలిస్టిక్ మార్గగామి  .1905లో ‘’నూర్ ఎస్టి’’అంటే య౦గ్ ఎస్టోనియా ఏర్పడి గుస్టావ్ సూట్స్ ,విల్లెం గ్రంధాల్ రిడాలా, భాషా  సంస్కర్త ,జోహాన్నెస్ ఆవిస్ కలిసి సాహిత్యానికి కొత్త దిశా నిర్దేశం చేసి గొప్పరచనలు చేసి యువతకు మార్గదర్శనం చేశారు .వీరిరచనలకు ఇప్పటికీ క్రేజ్ ఉంది .జోన్ ఓక్స్ ,ఆస్కార్ లట్స్లూ గుర్తించదగిన రచయితలే .ఎర్నెస్ట్ ఎన్నో 1875-1934 రాసిన కవిత్వం బాగా ప్రాచుర్యం పొందింది .1917లో ‘’సియురు ‘’ఉద్యమం వచ్చి ,ఆగస్ట్ గైలిట్ ,ఫ్రెడరిక్ టుగ్లాస్,జొహన్నెస్ సేమ్పార్ ,ఆర్టూర్ ఎడిసన్ ,ఆగస్ట్ అలీ ,హెన్రిక్ సనాపు ,పీట్ ఆరెన్ ,అట్టో కృస్టేన్,మేరీ అండర్ లు సియర్రు కవులుగా ప్రసిద్ధమయ్యారు .ఎస్టోనియన్ లిటరేచర్ అనే మేగజైన్ కూడా1906లో  వచ్చింది .1922లో ‘’లూమింగ్ ‘’అంటే క్రియేషన్ అనే సాహిత్యపత్రిక వచ్చి  గొప్ప సేవ చేసింది

  రెండు ప్రపంచయుద్దాల మధ్య వచనరచన వచ్చి రియలిజం ను బుజాన వేసుకొన్నది .ఆ౦ టన్ హాన్సెన్ టమసరే 5భాగాల ఎపిక్ నవల –ట్రూత్ అండ్ జస్టిస్ రాశాడు .ఇదే ఈభాషలో అత్యుత్తమ రచనగా భావిస్తారు.ఆగస్ట్ మాలిక్ ,కార్ల్ రిస్టివికి,ఆగస్స్ట్ గల్లిట్ లు సిర్రు గ్రూప్ లో మర్చిపోలేని రొమాంటిక్ రచయితలు .ఆన్ట్స్ ఒరాస్ కవి ,రచయితా కూడా .కవిత్వ గ్రూపు ఏర్పడి చిరస్మరణీయ రచనలు చేశారు .యుద్ధానంతరం రచయితలు  ఇతర దేశాలకు బలవంతంగా పంపబడ్డారు .1945’’లో ‘’ఎస్టేనియన్ రైటర్స్ యూనియన్ ఇన్ ఎక్సైల్ ‘’స్టాక్ హోమ్ లో ఏర్పడి ,1950  బెన్రాడ్ కాన్గ్రో కల్చరల్ మేగజైన్ ‘’టుల్ముల్డ్ ‘’ ఏర్పరచి పుస్తక ప్రచురణ చేసి .ప్రవాస రచయితలకు అండగా నిలిచాడు .ఇల్మార్ లాబెన్ అనే సర్రియలిస్టిక్ కవి -1921-2000ఇప్పుడున్న మోడర్నిస్ట్ కవి .కన్జర్వేటివ్ రైటర్ కార్ల్ రిస్టికివి’’దినైట్ ఆఫ్ ది సోల్స్ ‘’నవలరాశాడు .అర్వేడ్ విరాల్డే-సెవెన్  డేస్ ఆఫ్  ట్రయల్ రాశాడు .ఇమార్ జాక్స్ ఆధునిక  టెక్నిక్ లతో  లతో నవలలు రాశాడు

  21వ శతాబ్దం ఎస్టేనియన్ సాహిత్యానికి మంచికాలం .నూతనోత్సాహంతో కవులు జుర్జెన్ రుసేట్టి ,ఇవార్ స్లిడ్ ,విమ్బెర్గ్ ,క్రిస్టినా ఎహిన్ మొ దలైన  రచయితలు సృజనతో విజ్ఞానం తో  అంతర్జాతీయ అవగాహనతో సాహిత్య సృష్టి చేశారు .వీరిలో రుసేట్టి ‘’బీట్ లైక్ పెర్సనాలిటి.విమ్బెర్గ్ చైల్డ్ లైక్ భాష.శైలి తో  ‘’ ఎహిన్ పూర్తి సంప్రదాయబద్ధంగా వైవిధ్యంగా రాశారు .రీన్ రాడ్ రాసిన వచనరచనలు దేశ విదేశాలలో చాలా బహుమతులుపొందాయి .అతని ‘’రి కన్స్ట్రక్షన్ ‘’దిబ్రదర్ ,దిమాన్ హు స్పోక్ స్కేకిష్ ‘’చాలా ప్రసిద్ధాలు .ఇండ్రేక్  హర్గ్  ల సైన్స్ ఫిక్షన్ ఫాంటసి ,క్రైంమున్నగు ప్రక్రియల్లో మేటి .ఈయువ కెరటం రచన ‘’ఇండి పెండేన్స్ డే’’కొత్త జనరేషన్ కు స్పూర్తి .2008లో ‘’అవుట్ ఆఫ్ కంట్రోల్ ‘’నవలారచయిత బ్రెట్ ఎస్టేన్ ఎల్లిస్ ,పీటర్ హేల్మ్స్ రెండవనవల’’ సెప్టెంబర్ ‘’-2009 విమర్శక విశ్లేషకుల ప్రశంసలు పొందాయి .ఇలా ఎస్టేల్లన్ సాహిత్యం దినదిన ప్రవర్ధమానమౌతూనే ఉన్నది .

  సశేషం

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -13-5-20-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

సుందర కాండ లో హనుమ బహుముఖీన వ్యక్తిత్వం-24

సుందర కాండ లో హనుమ బహుముఖీన వ్యక్తిత్వం-24

రాక్షసరాజు వెళ్ళిపోగానే అక్కడి కావలి రాక్షసాంగనలు సీత దగ్గరకొచ్చి కోపంతోకూడిన కఠినమైన మాటలతో ‘’రావణుడు పులస్యబ్రహ్మ వంశం వాడు .నువ్వు అతనిభార్యవైతే నీకు గౌరవం ఎక్కువౌతుంది .ఏకజట’’మరీచి అత్రి ,అంగిరసుడు ,పులస్యుడు ,పులహుడు ,క్రతువు అనే నలుగురు ప్రజాపతులలో పులస్యుడు బ్రహ్మమానస పుత్రుడు .అతడి మనో సంకల్పంతో తేజశ్శాలి విశ్రవసు మహర్షి పుట్టాడు .అతడికొడుకే రావణుడు అంటే పులస్యునిమనుమడు పౌలస్యుడు .అందుకే నామాటవిని ఆ వైభవాన్ని వదులుకోకు ‘’అన్నది .పిల్లికళ్ళ హరిజట’’33కోట్ల దేవతలు ,దేవేంద్రునికూడా జయించినవాడు రావణుడు .అతని భార్యవు కా .’’ప్రఘస ‘’మహా తేజశ్శాలి వీర శూర ధీర రావణుడిని ఎందుకు కాదంటావు .ప్రియ భార్య మండోదరినికూడా విడిచి నిన్నేలుకొంటాడు మాస్వామి ‘’అనగా ‘’వికట ‘వికటాట్టహాసంతో ‘’సకల దేవ గంధర్వ యక్ష కిన్నెర కి౦పురుషాదులను జయించిన రావణుడు నీ దగ్గరకు కాళ్ళ బేరానికి వస్తేచులకన చేశావు .భార్యవై సకల సుఖాలు అనుభవించు’’అనగా ,దుర్ముఖి ‘’సూర్యుడుకూడా రావణభయంతో తీక్ష్ణ మైన ఎండ కాయడు,వాయువు వేగంగా వీచడు .అలాంటి రావణుడి పక్షాన ఎందుకు చేరవు ‘’అన్నది. ఇలా రావణుడి ఆజ్ఞ పాటించి వారంతా మాటలతో అతడి పరాక్రమాదులు వంశ ప్రతిష్టాదులు పొగడి సీతను అతడి భార్య కావలసినదని  తీవ్రంగానే చెప్పి భ్రుత్య ధర్మం నిర్వర్తించారు .

ఇది 23శోకాల 23వ సర్గ

 పై సర్గలో రాక్షస స్త్రీలు రావణుడు చెప్పిన సామ వచనాలతో హితవు చెప్పారు .ఇప్పుడు సెకండ్ డిగ్రీ ప్రయోగానికి సిద్ధమయ్యారు .అంతాసామూహికంగా ‘’మానవ స్త్రీవికనుక మానవుడైన రాముడినే కోరుతున్నావు .మనసు త్రిప్పుకో లేకపోతె బతకలేవు .కస్టాల అధ్యాయం ముగించుకొ .సుఖాల అధ్యాయం ప్రారంభించు .రాజ్యహీనుడు ,దుఖార్తుడు రాముడు చేయగలిగింది వీసం కూడా ఉ౦డదు .’’అని కోరస్ గా భయపెడితే సీత కన్నీరు మున్నీరుగా ఏడుస్తూ ‘’మీరంతా నన్ను జనని౦దితాలైన మాటలతో బాధపెడుతున్నారు ఇవి పాపపు మాటలని అనిపించటం లేదా ?మానవస్త్రీ రాక్షసభార్య అవటం లోక విరుద్ధం .మీరంతా కలిసి నన్ను తినేసినా మీ మాట విననే వినను .దీనుడే కాని రాజ్య హీనుడేకానీ ,పతి యే నాకు ప్రత్యక్ష దైవం .అతని యందె నా అనురాగం శాశ్వతం. శచీ దేవి ఇంద్రుని ,అరుంధతి వసిస్టుని ,రోహిణి చంద్రుని ,లోపాముద్ర అగస్త్యుని ,సుకన్య చ్యవన మహర్షి ని సావిత్రి సత్యవంతుని శ్రీమతి కపిలుని ,దమయంతి సౌదసుని, కేశిని సగరుని ,దమయంతి నలుని  అను వర్తించినట్లే ,నేను ఇక్ష్వాకు వంశ్య శ్రేష్టుడైన శ్రీరాముని అనుసారిస్తాను ‘’అని దిమ్మ తిరిగే సమాధానం చెబితే దిమ్మతిరిగి బొమ్మ కనిపించింది వాళ్లకు .వాళ్ళు చెప్పింది రావణుడి తండ్రి తాత గురించి మాత్రమె.కానీ    సీత పురాణ పురుషుల నందర్నీ తెచ్చి వారి ధర్మపత్నులతో సహా వరుసలో నిలబెట్టింది ‘’.

ఈ సర్గలో మహర్షి సీతాదేవి చేత చెప్పించిన –‘’దీనోవా ,రాజ్యహీనోవా ,యోమే భర్తా స మే గురుః-  తమ్ నిత్యం అనురక్తాస్మి యథా సూర్యం సువర్చలా ‘’అనేది లోకం లో ప్రతివ్రతా ధర్మం గురించి చెప్పేటప్పుడు అందరూ ఉదహరించే ముఖ్యశ్లోకం .అందుకే సీత అంత గొప్ప పతివ్రతగా గుర్తింపు పొందింది ,నిజానికి ఆవిడ పొందిన సుఖం తక్కువ. జీవితమంతా కష్టాలే .కాని సుఖ దుఖాలలో ఆమె మనసు రామవశమే .ఆయనకూ అంతే.అందుకే ఆదర్శ దంపతులు అంటాం .

ఇదొక మొండిఘటం మాటలతో లొంగదు ‘’ అని తీర్మానించి మళ్ళీ వికృత వికార భయంకర చేష్టలతో మీద పడుతూ చివరికి సత్యాన్ని వాళ్ళే వాళ్ళ మాటలతో’’ఛీ ఛీ ఈమె రాక్షసరాజు రావణునికి ఏ విదంగానూ తగింది కాదు ‘’అని అన్నారు .’’నేయ మర్హతి భర్తారం రావణం రాక్షసాధిపం .వాల్లమనసుల్లో ఉన్న అసలు విషయం ‘’నక్కకూ నాగలోకానికీ సాపత్యమా .పావని సీత పాపి రావణుడి భార్య అవటం లోక విరుద్ధం ‘’అని అనిపించి ఉండచ్చు నని నా ఊహ .‘’పాపం హనుమ శింశుప పైనే దాక్కొని గుడ్లనీరు కుక్కుకొంటూ ప్రేక్షకపాత్ర వహిస్తున్నాడు .సీతకూడా దుఖం తో ఆ  చెట్టు కిందికే వచ్చి శోకం లో మునిగిపోయింది .కృశోదరి అనే రక్కసి ‘’ఇప్పటి దాకా నీ భర్తపై ప్రేమ చూపావ్. అదిమోతాదు మించింది .మోతాదు దాటితే ఏదైనా ప్రమాదమే .నీ మాటలు నేను కాదనను .నేను చెప్పే హితం తలకెక్కించుకో ‘’రాముడిని మర్చిపో నీ మనసులో రావణుడిని ప్రతిష్టింఛి సకలలోకేశ్వరి కా .రాముడి ఆయుస్సు తీరిపోయింది ఇక్కడికి రాడు రాలేడు.ఇంకా అతనితో నీకు పనిలేదు .రావణుడిని చేరి ఆనందం పొందు లేకపోతె మేమంతా నిన్ను చంపి తినేస్తాం ‘’అన్నది .

 వికట పిడికిలి బిగించి గర్జిస్తూ ‘’ఎన్ని అప్రియాలు నువ్వు పలికినా నీమీద దయతో సహించాం.కాని మేము చెప్పింది నువ్వు చెవికి ఎక్కి౦చు కోలేదు .దేవేంద్రుడు వచ్చినా నిన్ను రక్షించలేడు.స్త్రీల యవ్వనం అస్థిరం .అదిగడిచేలోపే సుఖాలు అనుభవించాలి .ఏడు వేలమంది రాక్షసా౦గనలు నీ అధీనంలో ఉంటారు  .నా మాట వినకపోతే నీ గుండె పీకి తినేస్తా ‘’అని బెదిరిస్తే ,మండోదరి(రావణపత్నికాదు ) అనే రాక్షసి శూలం తిప్పుతూ సీతను చూస్తె ఆబగా తినెయ్యాలని అనిపించిందని చెప్పి ‘’కడుపుకు కుడివైపున కాలఖండమనే మా౦సపిండం ,ఎడమవైపు గుల్మం అనే మాంసపిండం,దానిపై ఉండే మాంసం పద్మకోశం లాంటి హృదయం అనే మాంసం దానికింద అదోమా౦స౦ ,ప్రేగుల్ని ,తలనుకూడా తినేయ్యాలనిపిస్తోంది ‘’అని భయ పెట్టింది ,ఇంకో అడుగు ముందుకేసి ప్రఘస’’ఇంకా చూస్తారేమే.దీని మెడ పిసికి చంపి చచ్చిందని రాజుకు చెబుదాం ‘’అనగా అదోముఖి ‘’దీన్ని చంపి మాంసం తినే పనిలో పడదా౦ ముక్కలు చేసి పంచుకొని ,మద్యం ,తెనేలలో  న౦చుకొని హాయిగా తిందాం .శూర్పణఖ అనే రాక్షసి (రావణ సోదరికాదు)అజాముఖి చెప్పింది బాగుంది .మాంసం తింటూ మద్యం తాగుతూ లంకానగర పడమటి ద్వారం దగ్గరున్న భద్రకాళి ప్రీతికోసం నాట్యం కూడా చేద్దాం ‘’అని థర్డ్ డిగ్రీ దాటిన మెజర్స్ ప్రయోగించి రాజు చెప్పిన దండాన్నికూడా ప్రయోగించే రీతిలో ప్రవర్తిస్తే భయ విహ్వల సీతామాత నిస్సహాయయై సహనం ధైర్యం కోల్పోయి విపరీతంగా ఏడవటం ప్రారంభించింది .

48 శ్లోకాల 24వ సర్గ ఇది

ఇక్కడ కావలి రాక్షసులు రాజుమాట నూటికి నూరుశాతం పాటించి తమవిధ్యుక్త ధర్మాన్ని నెరవేర్చారు అని గ్రహించాలి

  ఈ సర్గలో హనుమమాట వాల్మీకి మాటగా వచ్చింది తప్ప ఆయన పలికి౦దేమీ లేదు

   సశేషం

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -12-5-20-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

ప్రపంచ దేశాలసారస్వతం 66- బెలారస్ దేశ సాహిత్యం

ప్రపంచ దేశాలసారస్వతం

66- బెలారస్  దేశ సాహిత్యం

బెలారస్ దేశం ఉత్తర యూరప్ లో రష్యా ,ఉక్రెయిన్ లిదువేనియా ల మధ్య యన్నది .రాజధాని –మిన్స్క్ .బెలారసియన్ రూబుల్ .జనాభా సుమారు కోటి బెలారస్ సాహిత్యాన్ని బెలారసియన్ సాహిత్యం అంటారు .17వ శతాబ్దికి ముందు క్లేవెన్ రస్ ఆధార సాహిత్యం ఉండేది .ఇదే రష్యన్ ఉక్రేనియన్ సాహిత్యాలకూ మూలం .బెలారస్ సాహిత్యం కు 16-17శతాబ్దాలు స్వర్ణయుగం .పాట బెలూశియన్ భాష అధికార భాష అయింది .ప్లేమిక్ సాహిత్యమన్తాఏ కాలం లోనే వచ్చి సుసంపన్నం చేసింది .16శతాబ్దిలో సాహిత్యం ముద్రణపొందింది .మొదటిపుస్తకం ‘’సాలిర్ ‘’ను 1517లో ఫ్రాన్సిస్క్ కర్యానా ప్రేగ్ లో ప్రింట్ చేశాడు .తర్వాత ఈస్ట్ సాల్వికన్ భాషలో పునర్ముద్రణ పొందింది .16,17శాతాబ్దాలలో కవిత్వం కూడా బాగా వచ్చింది .దీనిపై పోలిష్ సాహిత్య ప్రభావం ఎక్కువ .

 పోలిష్ ,లిథువేనియన్ కామన్ వెళ్త లో పోలిష్ ,రష్యన్ భాషల భాష పెత్తనం వల్ల  నామమాత్ర రచనలే వచ్చాయి .నాటక కారుడు కజేటాన్ మొరాజిస్కి ,మిఖల్ క్లేసీరేస్కిలు పోలిష్ బెలారస్ భాషలు మాట్లాడే కామిక్ పాత్రలు సృష్టించారు .19వ శతాబ్దిలో రినైజన్స్ ఉద్యమప్రభావంతో అజ్నాతకవులు ఇన్సైడ్ అవుట్ అనీడ్-1820,టారస్ ఆన్పర్నాస్సస్-1855లు వాడకం లోకి వచ్చి తర్వాత పబ్లిష్ అయ్యాయి .స్థానిక రచయితలూ జాన్ జేజ్కోక్ ,విన్సెంట్ డునిన్,అంద్రేజ్ రిపిన్స్కి పోలిష్ భాషలో రాశారు  .ఉత్తరార్ధం లో రియలిజం వచ్చి ఆడం హరినోవిక్ ,జన్కాలుసియాన లు ఆ ధోరణిలో రాశారు చాలామంది జానపదాలు నెత్తికేత్తుకొన్నారు.ఎమడోకిన్ రోమనోవ్ బృహత్ జానపద గేయ సంపుటి రాసి ప్రచురించాడు .ఈకాలం లో బెలారసియన్ లాటిన్ ఆల్ఫబేట్ సిరిల్లిక్ ఆల్ఫబేట్ లు ఉపయోగించారు రచయితలూ

  రష్యన్ రివల్యూషన్ తర్వాత 1905లో ఈ భాషలో వార్తాపత్రికలు వచ్చాయి .వీటితో రచయితల సర్కిల్స్ ఏర్పడి తమభాష అభివృద్ధికి అందులో రచనలకు ఆలోచన వచ్చింది .యాన్కాకుపాలా ,మాస్కిం బహానోవిచ్ మిత్రోక్ బ్లాడులియామొదలైన వారు రోమాన్టిజం,రియలిజం మోడర్నిజం భావాలతో గొప్ప రచనలే చేశారు .మొదటి ప్రపంచ యుద్ధం లో ఈదేశం స్వతంత్రం ప్రకతిన్చుకొని రిపబ్లిక్ అయింది 1918లో .తర్వాత బిలో రష్యన్ సోవియెట్ సోషలిస్ట్ రిపబ్లిక్ ఏర్పడి ,ఈ దేశారచయితలచేత రెండు పత్రికలూ స్థాపించబడి సాహితీ సేవ చేశారు .1960లో వచనం లో మొరాలిటి భావ వ్యాప్తి వచ్చింది .కొందరు రచయితలు విసిల్ బైకావ్ ,కారత్కవిచ్ మొదలైనవారు  వాక్ స్వాతంత్ర్యం కోసం పోరాటం చేశారు .చాలామంది రచయితలు బెలారస్ నుంచి వలస వెళ్ళిపోయారు .ఇక్కడి లీడింగ్ మేగజైన్ –లిటరేటురా ఇ మస్తస్క .స్వెత్లానా అలెక్సీ విచ్ ఇన్వెస్టి గేటివ్ జర్నలిజంలో మేటి .2015లో నోబెల్ పురస్కారం పొందాడు

 బెలారస్ ప్రముఖ రచయితలలో కొందరిపెర్లు –మిఖాస్ కారత్ కుజ్మాకోర్ని ,ఫ్రాన్సియాస్ ఉమెస్తౌస్కి,జన్కాబ్రిల్ ,షా కత్ యనోవిస్కి,రైసా బరావికోవా  ,ఎడ్యుర్డ్ స్కొబిలు ,సైమన్ బుడ్ని ,జాన్ జేజ్కాట్

67-జెక్ సాహిత్యం

జేకోస్లోవేకియాను జెక్ లేక జెక్ రిపబ్లిక్ అంటారు .1918 స్వాత౦త్ర్య౦   ప్రకటించుకొని ఆస్ట్రియా-హంగేరియన్ సామ్రాజ్యం నుంచి వేరై సావరిన్ రిపబ్లిక్ అయింది .ఒకటిన్నర కోటి జనాభా. ప్రేగ్ రాజధాని  .జెక్ స్లోవేక్ భాషలు .కరెన్సీ-జెక్ కొరున.

  ఇప్పుడు జెక్ భాష అమలులో ఉన్నా పూర్వం లాటిన్ జర్మన్ భాషల్లో రాసేవారు .13వ శతాబ్ది సాహిత్యంక్రానికల్స్ మాత్రమె .వీటిలో కాస్మాస్ రాసిన క్రానికల్ ను అందరూ గౌరవించి అనువాదం చేశారు .13వ శతాబ్దిలో ‘’మేన్నేసాంగ్ ‘’అనే జర్మన్ రాజ భాష కవిత్వం ఉండేది .ఆర్టిస్టిక్ ప్రోజ్ ను స్మిల్ ఫ్లాస్కా ,జోహేనెస్ వాన్  సాజ్ లు రాశారు

  15వ శతాబ్దిలో వచ్చిన ‘’హుస్సైట్ రివల్యూషన్ ‘’తో జెక్ భాష జీవం పోసుకోన్నది .థియాలజిస్ట్ జాన్ హుస్ మొదట్లో లాటిన్ లో తర్వాత జెక్ లో రాశాడు .ఈకాలం లోనేజేక్ రేలియజియాస్ సాంగ్స్ కూడా వచ్చాయి .సాహిత్యంలో సాంఘిక సమస్యలకు చోటు దొరికింది .హుస్సేట్ యుద్దాల తర్వాత జార్జి ప్రోదేర్బరి జెక్ సింహాసనం ఎక్కి జెక్ భాషను అభి వృద్ధిచేశాడు .లాటిన్ లో రాసే కేధలిక్కులకు జెక్ లో రాసే ప్రొటెస్టెంట్ లకు మధ్య పోరాటాలు జరిగి స్వతంత్ర జెక్ భాషను కొన్నిలాటిన్ పదజాలంతో అభి వృద్ధి పరచుకొన్నారు .బోరోక్ ,ఎన్లైటేన్ పీరియడ్లలో చరిత్రరచన డ్రామారచన వచ్చాయి .

  19వ శతాబ్ది అనువాదాలు ఎక్కువై జాతీయ సాహిత్యానికి దారి చూపింది .జోసెఫ్ జంగ్ మాన్ ప్రపంచ క్లాసిక్ సాహిత్యాన్ని జెక్ భాషలోకి అనువాదం చేశాడు .ఫ్రాంటి సేక్ పలాకి ,పావెల్ జోజేఫ్ లు జెక్ హిస్టరీ పునర్నిర్మాణం చేశారు .రచయితలూ ఆర్టిస్టిక్ లిటరేచర్ పై దృష్టిపెట్టి సీరియస్ గా రాశారు .సాంస్కృతిక వైభవానికి కారకులయ్యారు .మాచా ను కొత్త పంచాంగం  అనుసరించి చాలామందిరాశారు .జాతీయ పరిధి దాటి అంతర్జాతీయంగా ఆలోచించి యూరప్  లోని నూతన ప్రక్రియల్లో రాశారు .దీన్ని ‘’మేజెనరేషన్’’ అన్నారు .దీనితర్వాత నియో రొమాంటిజం ,రియలిజం సింబాలిజం ,డేకడేన్స్ కొత్త శైలీ విధానం వచ్చాయి .సమకాలీన సమస్యలపై రాశారు .జాన్ హీర్బెన్ ,కారెల్ వాక్లోవ్ ,ఇజ్ఞాట్ హెర్మన్ కేపక్ కోడ్ వంటివారు పేదరిక జీవులపై సానుభూతితో రాశారు.జేరస్లావ్ వ్రిచిలిస్కి ఈకాలపు గొప్పకవి .వచనరచయితలలో విలెం మ్రిత్సేకి ,రుజేనాస్వబోద్వా ,జోసెఫ్ కేరెల్ స్లేజ్హార్ ఉన్నారు

  20వశతాబ్దిలో అన్ని ఇజాలు దూరమై కాంక్రీట్ రియాలిటి ఏర్పడి ,దుఖం నుంచి విముక్తిపొంది కారెల్ టోమాన్ ,ఫ్రానా స్మరేక్ ,విక్టర్ డైక్,పీటర్ బెజురిక్  లు గొప్పగా రాశారు .శైలీ వైవిధ్యం బాగా కనిపించింది .తిస్చోవా నేచరిజంలో ,స్రమేక్ ,గేల్నియర్,జాన్ ఒపలస్కి లు ఇమ్ప్రేషనలిజ౦ ధోరణిలో రాశారు  .కేధలిక్ ఆధర్స్ కు మళ్ళీ ఊపిరి వచ్చింది .నియోక్లాసిజం స్థానం క్యూబిజం ఫ్యూచరిజం సివిలిజం ఆక్రమించాయి .ఇవన్నీ వెనకబడ్డాక,ప్రేరణాత్మక మార్గదర్శక సాహిత్యం ఊపులోకి వచ్చింది .జిరివోకర్ ,దేనేక్ కాలిస్టా ఇలారాశారు .తర్వాత ఫన్టాస్టిక్,ఉటోపియాలు ప్రవేశించాయి .1920-30లోని ఎకనామిక్ క్రైసిస్ వచ్చి ఆధ్యాత్మికతపై దృష్టిపెరిగి ఆతరహా రచనలు గుప్పించారు .ఇందులో చావు భయం ,ఇమేజేస్ ,చీకటి భయపెట్టాయి .సర్రియలిజం వచ్చి వెళ్ళిపోయింది .జర్నలిజ౦ ఎపిక్  రచనపై మమకారం పెరిగింది .జానపదం ఆకర్షించి బాలడ్ రచన పెరిగింది .సాంఘిక ఇతివృత్త నవలలు వచ్చాయి .పోలాకేక్ ,మేరిన్ మేజేరోవా ఇలారాస్తే ,సైకలాజికల్ నవలలు జేర్మిల్లా గజరోవాఈగన్ హాస్టో విస్కీ రాశారు .రాజకీయ నాటకాలు కరెల్ కేపాక్ రాసి ఫాసిజం డిక్టేటర్ షిప్ దుమ్ము దులిపాడు

  రెండవ ప్రపంచయుద్ధం తర్వాత సాంఘిక రాజకీయ సమస్యలపై రచనలు రాయాల్సిన అవసరం కలిగింది .ఎమికోల్పోయామో ఏమి సాధించామో అన్న ఆలోచనతో రచనలు చేశారు .1989లో కమ్యూనిజం పతనం తర్వాత జెక్ నాటకరంగానికి సంపూర్ణ స్వేచ్చ లభించింది .నిషేధ రచయితలైన ఇవాన్ బ్లాంటి ,జాన్ క్రేసేల్డో సాహిత్యం ముద్రణకు నోచుకొన్నది .సమకాలీన జెక్ సాహిత్యం జెక్ సినిమా సాహిత్య స్థాయి పొ౦ద లేక పొయి౦ది అనె విమర్శ ఉన్నది .పేటర్ సబోక్ ,ఇవాన్ మార్టిన్ జిరోస్ మొదలైనవారి రచనలు విస్తృతంగా వస్తున్నాయి జనమూ ఉత్సాహంగా చదువుతున్నారు  .జెక్ లిటరరీ అవార్డ్ లుకూడా ఏర్పాటయ్యాయి .

  జెక్ రిపబ్లిక్ రచయిత-జేరోస్లోవ్   సీఫర్ట్  1984లో సాహిత్య నోబెల్ ప్రైజ్ పొందాడు

  సశేషం

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -12-5-20-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

సుందర కాండ లో హనుమ బహుముఖీన వ్యక్తిత్వం-23

సుందర కాండ లో హనుమ బహుముఖీన వ్యక్తిత్వం-23

సీత మాట్లాడినమాటలకు ఎక్కడోకాలి రావణుడు ఆమెతో ‘’మగాడు అనునయి౦చిన కొద్దీ స్త్రీ వశపడుతుంది .గుర్రం పెడత్రోవ పడితే సమర్ధుడైన సారధి దాన్ని దారిలోపెడతాడు .నీపై ఉన్నకామాన్ని నా కోపం అడ్డగిస్తోంది .కామం ఏర్పడితే దయ ప్రేమకూడా కలగటం సహజం .నిన్ను అవమానించవచ్చు చంపచ్చు,వానప్రస్త వేషం లో ఉన్న రాముడిపై ప్రేమింకా నీకున్నా  నిన్ను చంపటానికి ఆజ్ఞ ఇవ్వలేకపోతున్నా.కాని నన్ను చాలానిర్దాక్షిణ్యంగా దూషించావు దీనికి ప్రతీకారంగా నిన్ను చంపటం న్యాయం ‘’అని అక్కసు అంతా వెళ్ళగ్రక్కి మళ్ళీ తమాయించుకొని ‘’నీకు ఇచ్చిన 12నెలలగడువులో 10నెలలు అయిపోయి రెండు నెలలు మాత్రమె మిగిలాయి .ఇప్పటికైనా నాతో రమించు .ఈ రెండు నెలలు దాటితే నిన్ను చంపి ఉదయ  భోజనానికి వండుతారు  ‘’అన్నాడు ఈమాటలకు సీతకు మాత్రమేకాదు దేవ గ౦ధర్వ కన్యలు  కూడా కన్నీరు కార్చారు .కళ్ళతో ,పెదవుల చలనాలతో ,ముఖ భంగిమలతో వారు సీతను ఓదార్చారు .

వాళ్ళ ఓదార్పులకు కాస్త తెప్పరిల్లి సీత రావణుడితో ఇలా చెప్పింది –తుచ్చుడా ! ఇంద్రుడికి శచీదేవిలాగా రాముడికి నేనుభార్యను . పరాక్రమశాలి రాముని భార్యనైననన్ను నీచపు మాటలతో బాధించావు. దీనికి తగిన ఫలితం అనుభవిస్తావు.మదపుటేనుగు రాముడికి ,చెవులపిల్లి నీకూ సాపత్యమా .మాయా మృగ వ్యాజం తో నన్ను దండకారణ్యం నుంచి ఎత్తుకోచ్చావు సిగ్గులేదా .ఇంకా రాముడి కంట బడ లేదు కనుక బతికి ఉన్నావు .అనార్యుడా !క్రూరమైన నీ నల్ల వికృతమైన కళ్ళు నేలపడి రాలిపోనూ. పతివ్రతనైన నన్ను నీచంగా మాట్లాడిన నీ నాలుక వెయ్యి వ్రక్కలుకానూ.నిన్ను శపించటానికి నా భర్త అనుమతి నాకు లేనందున నిన్ను బూడిద చేయాల్సి ఉన్నా దయతో వదిలిపెడుతున్నా .నీ మృత్యువు కోసం దేవుడే నీతో ఈ అకృత్యం చేయించి ఉంటాడేమో .కుబేరుడిఅన్నవు, సైన్యమున్నా రాముడిని దూరం చేసి నన్ను అపహరించిన పిరికి పందవు ‘’అనగానే రావణుడు కోపం కన్నులతో పాములాగా నిట్టూరుస్తూ ‘’నిర్ధనుడిని నమ్మావు .నిన్ను ఇప్పుడే సూర్యుడు సంధ్యను లాగా నా తేజంతో నాశనం చేస్తా ‘’అని భయంకరంగా గర్జించి కావలి కాస్తున్న అక్కడి రక్కసి స్త్రీలతో ‘’ఈమెను సామదాన భేదాది ఉపాయాలతో నాకు వశమయ్యేట్లు చేయండి .అవసరం వస్తే దండోపాయమైనా ప్రయోగించి నా వశం చేయండి ‘’అని కోపంతో ఆజ్ఞాపించగా ,దాన్యమాలి అతడిని కౌగిలించి’’సీత ఎందుకు నాతో సుఖించు రా .తన్ను ప్రేమించని స్త్రీని కామించే వాడి దేహం బాగా కాలిన కొలిమిలాఉంటుంది .నిన్నుమనసారా ప్రేమించే నన్నుపొంది ఆ తాపం తీర్చుకో ‘’అని వాడి మనసుమార్చగా వాడు ఆవు   వెంట వెళ్ళే ఆబోతులాగా  అంతః పురానికి  బయల్దేరి వెళ్ళాడు .

ఇది 46శ్లోకాల 22వ సర్గ

రావణ ,సీత లు ఒకరినొకరు తీవ్రంగా తీవ్రంగా దూషించుకొన్నారు .రావణుడు ఏదో బలమైన కారణం వల్ల సీత ను ఏమీచేయలేకపోయాడు  .సీత రాముని ఆజ్ఞ లేనందున వాడిని భస్మం చేయకుండా వదిలిపెట్టానని బుద్ధి కూడా చెప్పింది .  రావణుడు సీతను దారిలో పెట్టె బాధ్యత కావలి స్త్రీలకు అప్పగిస్తే ,సీత తనదైవమే రావణుడికి యుద్ధం లో జయించి బుద్ధి చెబుతాడని  చెప్పింది .

   సశేషం

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -11-5-20-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

ప్రపంచదేశాల సారస్వతం64-  అల్బేనియన్ సాహిత్యం

ప్రపంచదేశాలసారస్వతం64-  అల్బేనియన్ సాహిత్యం

మధ్యయుగాలలోనే అల్బేనియన్ సాహిత్యం ఆ భాషలోనే  వృద్ధి అయింది .అల్బేనియా ,కొసావో ,ఇటలీలోని అల్బెనియన్లు రాసినదే ఈసాహిత్యం .ఇండో యూరోపియన్ కుటుంబానికి చెందినభాష .అసలు దీని ఆవిర్భావం ఎప్పుడు ఎక్కడో తెలియకపోయినా ప్లిరియన్ భాషా జన్యం అంటారు 1332లో ఆర్చిబిషప్  ఆన్టివారి గులౌమే ఆడం ఒక రిపోర్ట్ రాస్తూ అల్బెనియన్లుపుస్తకరచనలో తమ భాషకు భిన్నమైన  లాటిన్ అక్షరాలూ వాడుతున్నారని చెప్పాడు .అల్బేనియన్ సాహిత్యంలో  అత్యంత పురాతనమైనది ‘’ఫార్ములా ఈ పెజిమేట్ ‘’అంటే బాప్టి  స్మల్ ఫార్ముల .దీన్ని డురెస్ బిషప్ పాల్ ఇంగ జేల్లి 1462లో  ఘేజ్ మాండలికం లో రికార్డ్  చేశాడు.దీనితో పాటు న్యు టెస్టమెంట్ గీతాలుకూడా చేశాడు .ఇంతకుపూర్వమే  1210లో ధియోదర్ ఆఫ్ స్కోడ్రా 208పేజీల ప్రాచీన రచన భద్రపరచాడు .

   15వ శతాబ్దిలో అట్టో వాన్ సామ్రాజ్యం  అల్బెనియన్లను చాలామందిని  దేశంనుంచి తరిమికోట్టింది .ఈ విషయం సభ్యప్రపంచానికి చరిత్రకారుడు మారిన్ బర్లేటి – 1460-1513రోమ్ చరిత్రలో భాగంగా ‘’హిస్టరీ ఆఫ్ స్కాన్దేన్ బెర్గ్ ‘’లో రాసి 1510లో ముద్రించాడు .ఇది అనేక యూరోపియన్ భాషలలోకి అనువాదం పొందింది .16వ శతాబ్దిలో అల్బేనియన్ భాష కోసం ఉద్యమం వచ్చి ఆతర్వాత ప్రొటేస్టంట్ లు బలపడ్డాకభాషా రచన మొదలైంది .మతగ్రందాలతోపాటు చారిత్రిక క్రానికల్ రచనా సాగింది .క్రిస్టియన్ టీచింగ్ ,రిట్యువల్స్ కే ప్రాధాన్యం .1621లో దీన్ని పిజేటార్ బుడి అల్బేనియన్ వచనంలో రాశాడు .బొగ్దాని అల్బేనియన్ సంస్కృతీ మానవీయ దృక్పధం తో రాశాడు .ఇదే ఆ సాహిత్యానికి గొప్ప మలుపు .జుట్ వేరిబోబా కూడా ఈదోరణే అవలంబించి రాశాడు .

   17,18శతాబ్దులలో బైబిల్ లో కొన్ని భాగాలు అల్బేనియన్ భాషలోకి తర్జుమా అయ్యాయి .కోస్టాన్డిన్   క్రిస్టో ఫోర్బిది -1830-95రెండుమా౦డలికాలనుకలిపి ఒకే అల్బేనియన్ భాషగా మార్చాడు .ఒసోక్టో పొజా సంస్కృతి 17వ శతాబ్దిలో బాల్కిన్ పెనిన్సులాలో గొప్ప నాగరకతను పె౦చింది .అకాడెమి ,ప్రింటింగ్ ప్రెస్ వచ్చాయి టి.కవిల్ జోటి.డిహెచ్ హాక్స్ హియు ల కృషివలన .వీరంతా తమతమ క్షేత్రాలలో అద్భుత రచనలు చేసి సాహిత్య స౦పద పెంచారు ,కల్జోటి రచనలలో ఎక్కువభాగం ముద్రణకు నోచుకోలేదు కాని ఆయన అన్ని శాఖల వేదాంతాన్నీ రచనలో చొప్పించాడు అతని పై  ప్లేటో ,డేస్కార్టేజ్,లీబ్నిజ్ లప్రభావం ఉన్నది .

   ఆధునిక యుగారంభం లో ఇస్లాంలోని సూఫీయిజం ఇక్కడ ప్రభావం చూపింది దండయాత్రలప్రభావం వలన .అప్పుడు ఆల్బనీ భాషలో రాసినా ఆరబిక్ అక్షరాలూ వాడారు .నేజిమ్ఫ్రాకుల్లా ,మొహమ్మేట్ కికికు ,సులేమాన్ నైబి ,హసన్ జికో కంబెరి ,షె మాలా ఇలారాశారు .బెట్జేక్స్ హింజ్  కవిత్వం పై పెర్షియన్ ,టర్కిష్ అరెబిక్ ప్రభావం జాస్తి .సున్నీ మతభావాలే రచనలలో వ్యాప్తి అయ్యాయి .నేజిమ్ ఫ్రాకుల్లా -1680-1760 మొదట్లో కవిత్వం పర్షియన్ అరెబిక్ లలో రాసి ,1731నుంచి 35వరకు అల్బేనియన్ భాషలో రాశాడు .హసన్ జైకొ కంబెరి  ముస్లిం సంప్రదాయం తుచ తప్పనికవి .అల్బేనియన్ భాషలో చాలా సెక్యులర్ గీతాలు కూడా రాశాడు .

   19వ శతాబ్దిలో జాతీయ రినైసేన్స్ వచ్చిమిలిటరీ, లిటరరీ ఉద్యమాలు సాగాయి .అల్బేనియన్ రోమాన్టిజం ఊపు వచ్చి స్వాతంత్ర్య కాంక్ష పెరిగి౦ది .జేరోనిం డీ రాడా-1814-1903,నయీం ఫ్రషేరి-1846-1900లు రొమా౦టిక్ కవులు  రాడారాసిన కవిత్వం కమనీయం .గ్రామీణ జీవిత సౌందర్యాన్ని నయి కవిత్వంలో దించేశాడు . కజూపి ని రస్టిక్ పోయెట్ అంటారు .రచనలలో కామెడి ఆఫ్ కస్టమ్స్ ,ట్రాజేడి ఆఫ్ హిస్టారికల్ ధీమ్స్ఉంటాయి .శామి ఫ్రాశేరి ,వాసో పాషా, జెఫ్ సెరేమ్బి,స్తావ్రే ద్రేనోవా వంటివారెందరో ఆధునికకవులున్నారు .ఫాన్ స్టిల్లాన్ నోలి కవి నాటకకర్త మ్యూజికాలజిస్ట్ .ఇతనినాటకాలు దిఎవేకేనింగ్ ,ఇజ్రలైట్స్ అండ్ ఫిలస్టైన్స్ ఫ్రెంచ్ రివల్యూషన్ బాగా పేరుపొందాయి

  రెండు ప్రపంచయుద్దాలంధ్యా రోమా౦ టిజం డామినేట్ చేసింది .ఫాక్ కొనిట్జా ఆధునిక వచనరచన పితామహుడు .వ్యంగ్యం పండించాడు.రష్యాలో స్టాలిన్ కమ్యూనిస్ట్ పాలన సిద్ధాంతాలను అల్బెనియాలో అమలు జరిపారు  .సోషలిస్ట్ రియలిజం లో రచనలు చేశారు చిన్నకథలూ అదే దారిపట్టాయి .

  సమకాలీన అల్బేనియన్ నవలా రచయిత ఇస్మాయిల్ కదరే నవలలు 45భాషలలోకి అనువాదం పొందాయి .ఇందులో జనరల్ ఆఫ్ ది డెడ్ ఆర్మీ ,దిసీజ్ ,క్రానికల్  ఇన్ స్టోన్,దిత్రీఆర్చేడ్ బ్రిడ్జ్ వంటివి అత్యద్భుతాలు .నిరంకుశత్వం ,యాత్రీకరణ నేపధ్యంగా రాసినవి.ఆధునిక ప్రసిద్ధకవయిత్రి  – లుజెటాలేషనాకు.ఎన్నోకవితా సంపుటులు రాసి ముద్రించింది .సృజనకు పట్టం కట్టి అనేక అంతర్జాతీయ బహుమతులు పొండింది.ఫోర్స్ ఫుల్ అండ్ కన్విన్సింగ్ రచయితగా గురింపు పొందినవాడు ఫటోస్ కొంగోలి .స్టాలిన్ నిరంకుశ పాలన లో అసలు కలం ముట్టుకోలేదు .స్టాలిన్ పతనం తర్వాత ‘’ది లూజర్ ‘’అనే గొప్పనవల-1992లోరాసి జగత్ ప్రసిద్ధుడయ్యాడు ఈ నవలలో హోక్సా పాలన తదనంతర పరిణామాలు వస్తువు . కా౦టేమ్పరి రైటర్  –బెన్ బ్లుషి రాసిన లివింగ్ ఆన్ యాన్ ఐలాండ్ ,ఒటెల్లో ప్రముఖమైనవి .యూరోపియన్ యూనియన్ ప్రైజ్ పొందాడు .

   సశేషం

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -11-5-20-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

సుందర కాండ లో హనుమ బహుముఖీన వ్యక్తిత్వం-22

సుందర కాండ లో హనుమ బహుముఖీన వ్యక్తిత్వం-22

రావణుడి మాటలకు తల్లడిల్లి తనకు అతడికి మధ్య ఒక గడ్డిపోచనుంచి సీతాదేవి ‘’నాపై మనసు నీభార్యలపై మరల్చు పాపం చేస్తే మోక్షం రానట్లే నువ్వు నన్ను కోరటానికి అర్హుడవు కాదు .ఇక్ష్వాకు వంశ పతివ్రతను నేను .నీ నిన్ద్యమైనకొరిక అంగీకరించను .నేను పరభార్యను .సజ్జన ధర్మాన్ని పాటించు .నీ భార్యల శీల రక్షణ యెంత ముఖ్యమో పరభార్యల శీలరక్షణా అంతే ముఖ్యం .చపల చిత్తం , ఇంద్రియ చాపల్యం తో పరభార్యలను రమించేవాడు కీర్తి ఆయుస్సు ఐశ్వర్యం కోల్పోతాడు .నీ దుష్కార్యాన్ని మా౦ చేన్చే సజ్జనులు ఇక్కడ లేరా ?చెప్పినా వినక సకల రాక్షస వినాశానికి పూనుకొంటున్నావా .రాజు నీతిబాహ్య కర్మలు చేస్తే సుసంపన్న రాష్ట్రం నగర౦ వినాశనమౌతాయి .పాపాల చేతా, దూర దృష్టి లేమి చేతా పాపి నశిస్తే ,ప్రాణులన్నీ అభినందిస్తాయి ,ఆన౦దిస్తాయి .నీ ఐశ్వర్య భోగ రాజ్య ప్రలోభాలు నన్నేమీ చెయ్యలేవు .సూర్యుని కంటే వేరుకాని వెలుగును నేను .రాముడికంటేకూడా వేరైనదానినీ కాదని గ్రహించు .వేదవ్రత స్నాతుడు ,ఆత్మజ్ఞాన సంపన్నుడు అయినవాడికి యోగాభ్యాస రూప విద్య లాగా శీల వయో వృత్తులచే నేను రామునికే తగిన భార్యను .రామవిరహంతో దుఖితను .బంధించి తెచ్చిన నన్ను రాముడిని ఆహ్వానించి ఆయను అర్పించు .నీ వంశ  నాశనం కాకుండా ఉండాలి అంటే రామునితో స్నేహమే నీకు మంచిది.

రాముడు ధర్మతత్పరుడు శరణాగత వత్సలుడు బతుకు మీద ఆశుంటే ఆయన చెలిమి నీకు శ్రేష్టం .శరణువేడి ఆయనను ప్రసన్నుని చేసుకో .శరణాగతుల తప్పులు క్షమించే ఉదారహృదయుడు నా స్వామి రాముడు  .మనసులో చెడుభావంవదిలేసి నన్ను ఆయనకు సమర్పించి బతికిపో .శుభం పొందు .ఇంకోమార్గం లో ప్రవర్తిస్తే ,వజ్రాయుధం నిన్ను చంపకపోయినా యముడు నిన్ను వదిలేసినా లోకనాథుడు రాముడు నిన్ను వదిలిపెట్టడు అని గ్రహించు .త్వరలో రామ ధనుస్టంకారం విని మూర్చపోతావు .సకల లంకా వినాశనం చూస్తావు. సోదరులు రామలక్ష్మణులు లంకచేరి, నీ రాక్షస సమూహాలను చీల్చి చెండాడి ఎవరికీ బ్రతికే అవకాశం లేకుండా చేస్తారు .గరుత్మంతుని చేతిలోపాములులాగా, రామ గరుత్మంతుని చేత రాక్ష పాములు చావటం ఖాయం .బలిని మూడు అడుగులడిగి రాజ్యలక్ష్మిని  దూరం చేసిన  వామనుడిలాగా నన్ను నీనుంచి తప్పిస్తాడు .

జనస్తానం లో రామపరాక్రమ౦  వినికూడా ,సోదరులు లేని సమయంలో మాయోపాయంగా నన్ను అపహరించే పాపం మూటకట్టుకొన్నావు .పులుల వాసన చూసి కుక్క వాటి దగ్గరకు ఎలా  వెళ్ళలేదో,రామలక్ష్మణుల గంధం తగిల్తే ఆదగ్గరకుకూడా రాలేవు .వొంటి చేతితో పోరాడిన వృత్రాసురుడు రేడు చేతులతో యుద్ధం చేసిన ఇంద్రుని చేతిలో చచ్చాడు .అలాగే నీ అపజయం నిజం .నీకు పోయేకాలం వచ్చింది .రాముడి నుండి పారిపోయి కైలాసం వెళ్ళినా, నీకు శనీశ్వరం తప్పదు,మహా వృక్షం పిడుగుపాటుకు కూలినట్లు రాముడినుంచి తప్పించుకో లేవు ‘’అని హెచ్చరించింది సీతామాత .

ఇది 34శ్లోకాల 21వ సర్గ

20నుంచి 26వ సర్గవరకు మనకు హనుమమాట వినబడదు .27త్రిజట స్వప్న వృత్తాంతం లోనే హనుమ దర్శనం మాట ఉంటాయి .

పరపురుషునితో  కులస్త్రీలు సూటిగా మాట్లాడటంఅప్పటికి లేదు .అందుకే మధ్యలో గడ్డిపరక అడ్డం పెట్టుకొని సీత మాట్లాడి సంప్రదాయం నిలబెట్టింది .ఇక్కడ గడ్డిపరక పెట్టటం లో ఉద్దేశ్యం వాడిని తుచ్చ గడ్డిపరకగా ఆమె భావి౦చి౦దని భాష్యం చెప్పిన వారూ ఉన్నారు .సీత మనో నిశ్చయం సూటిగా అత్యంత స్పష్టంగా నిర్దుష్టంగా చెప్పింది .రామ శౌర్యపరాక్రమాదులు ఎంతగొప్పవని  విస్పష్టంగా వివరించింది .అంతకు ముందు సర్గలో రావణుడు తన ప్రాభవపరాక్రమాలు ఏకరువు పెడితే ఇక్కడసీత దీటుగా రామ వీర విక్రమ విశేషాలను గొప్ప

దృష్టా౦తాలతో బోధపరచింది .వామనుడే రాముడు అని సూచ్యార్ధంగా చెప్పింది. బలి రాజ్యలక్ష్మి ఎలా చెయ్యి జారిపోయిందో వివరించింది .వృత్రాసుర వధ లోని మర్మ౦  కళ్ళకు కట్టించింది .గరుడ –సర్ప వృత్తాంతం జ్ఞప్తికి తెచ్చి నాగ వంశ నాశనం  స్వయం గా కోరి తెచ్చుకోన్నట్లే రావణుడు రాక్షస వినాశనం ఆహ్వానిస్తున్నట్లు తెలియజేసింది .రామలక్ష్మణులు పులులు అని రావణుడు కుక్క అని తేల్చిచెప్పింది. రామశరణాగత ధర్మం వివరించి రాముని కాళ్ళమీద పడటం ,శత్రుత్వం వదిలి మిత్ర ధర్మం పాటించటం ,తనను రాముడికి వాడే స్వయంగా అర్పించటం అనే చాయిస్ లన్నీ ఇచ్చింది .వినకపోతే నీ ఖర్మం అని గట్టిగా చెప్పింది కాదు చెప్పించాడు మహర్షి వాల్మీకి .

సశేషం

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -10-5-20-ఉయ్యూరు

 

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

ప్రపంచ దేశాలసారస్వతం 63-సైప్రస్ సాహిత్యం

ప్రపంచ దేశాలసారస్వతం

63-సైప్రస్ సాహిత్యం

సైప్రస్ దేశ సాహిత్యాన్ని సైప్రియట్ సాహిత్యం అంటారు .గ్రీక్ టర్కి ఇంగ్లిష్ ,ఫ్రెంచ్ ఆధునిక భాషలలో  ఆ సాహిత్యం ఉంటుంది .ఆధునిక క్రిప్టాలిక్ భాష -ఆధునిక గ్రీకు ఆగ్నేయ మాండలికం లా ఉంటుంది .సైప్రియట్ సాహిత్యం క్రీ.పూ 7వ శతాబ్దిలో స్ట్రాన్షియస్ రాసిన ఎపిక్ .స్టావోయిక్ స్కూల్ ఆఫ్ ఫిలాసఫీ ని క్రిప్రియట్ జీనో స్థాపించాడు .దీన్ని పెరూషియాస్ అనే శిష్యుడు అనుసరించాడు . అపోజిల్స్ కు చెందిన  వృత్తాంతాలున్నాయి .బైజాన్టిక్ మధ్యయుగ రచయితలలో లియో నిటోస్,ఆల్ధేడియస్ పేట్రియార్క్ గ్రిగరి ఉన్నారు ‘’ఆక్రిటిక్ సాంగ్స్ ‘’ఆయుగ ప్రధాన సాహిత్యం.

  మధ్యయుగ సైప్రస్ రాజ్య లెజిస్లేష ను అసిజేస్ ఆఫ్ జెరూసలెం అంటారు .దీన్ని స్థానిక మాండలికం లో,ఫ్రెంచ్ భాషలో  రాశారు  .1531లో ఇది ఇటాలియన్ లోకి అనువాదం చెందింది .ఇదే ప్రస్తుతం లభిస్తున్న సైప్రస్ మధ్యయుగ సాహిత్యం.లియాన్ టాయిస్ మఖేరియాస్ ,జార్జి బూస్టోనియస్ ల క్రానికల్స్ ఫ్రాన్కిష్ రాజ్యం లోనివి -1191-1489.ఇవి ఫ్రెంచ్ ప్రేరనున్న స్థానిక మాండలిక రచనలు .ఫ్రాన్సేస్కో పెట్రి యార్కారాసిన  ‘’పోయెమ్స్ డీ మోర్’’16వ శతాబ్ది గ్రీక్- సైప్రటిక్  లో  సైప్రస్ వెనిస్ రిపబ్లిక్ లో ఉన్నప్పుడు రాసినవి .వీటిలో కొన్ని పెట్రి యార్క్ బెమ్బో ,అరిస్టో ,సంనజారో ల సృజన కవితలూ ఉన్నాయి .షేక్పియర్ ఒథెల్లో నాటకంలో చాలాభాగం  వెనిషియన్ సైప్రస్ లో రాసిందే .

   ఆధునిక సైప్రస్ రచయితలలో కవి రచయిత కోస్టాస్ మొన్టిస్ ,కవి కిరియాకో స్,  చారలంబెడిస్,నవలాకారుడు పానోస్ లోన్నిడస్,కవి మైకేలిస్ పాసియార్డిస్ ,కవి ,అనువాదకుడు స్టెఫెనోస్ స్టెఫెన్డిస్,రచయితనికోస్ నికల్డేస్,హారర్ రచయితలుఫివోస్ క్రిప్రియానో,లూకిస్ అక్రిటాస్ మొదలైనవారు ,జానపద రచనలో పావ్లోస్ లియాసేడెస్,మైకేల్ డిస్ ఉన్నారు .సైప్రస్ కు చెందిన టర్కిష్ కవులు ,రచయితలలో ఒస్మాన్ టర్కే,ఓజ్ కెర్ యాసిన్ ,నేసె యాసిన్ నేరిమన్ కాహిట్.నేసె యాసిన్ కవయత్రి రచయిత్రి .ఈమె రచనలు గ్రీక్ ,ఇంగ్లిష్ లలోకి అనువాదం పొంది ప్రఖ్యాతురాలైంది .2002లో ఆమె నవల సీక్రెట్ హిస్టరీ ఆఫ్ శాడ్ గర్ల్స్ నిషేధానికి గురై ఆమెకు టర్కిష్ జాతీయవాదులనుంచి బెదిరింపులు వచ్చాయి .సెవ్ గుల్ డాగ్ –ఇన్వెస్టిగేటివ్ రిపోర్టర్  . అంతుచిక్కని  వేలాది మంది సైప్రస్ వాసుల ఆచూకీ వెలికి తీసింది .చాలాపుస్తకాలు రాసింది .ఉర్కే మైన్ బెల్మాన్ వివిధ ప్రక్రియలలో రాసిన రచయిత.వీటిలో రొమాంటిక్ కవితలు ,ఒంటరి పల్లెపిల్ల లపై గొప్ప కవితలు రాసింది .అర్మేనియన్ సైప్రియట్ కవి నోడానడ్జారిన్ మొదలైనవారు రెండు, మూడు తరాలవారు .కొందరు ఇతరదేశాలలో ఉంటున్నా రచనలు చేస్తున్నవారిలో మిరండా హోప్లరోస్ ,స్టీఫెన్ లాఫ్ట  న్,క్రిస్టి లెఫ్రేరి,పాల్  స్టెల్లింగ్ వంటివారు చాలామంది .20వ శతాబ్దిలో సైప్రస్  నాన్ లోకల్ సాహిత్య సృష్టిని ప్రోత్సహించింది .గ్రీస్ రచయిత ,నోబెల్ లారిఎట్ –జార్జి  సేఫరిస్ ను సైప్రస్ విపరీతంగా ప్రేరణకలిగించింది .ఇతని ప్రముఖ రచన –లాగ్ బుక్ 3 సైప్రస్ నేపధ్యంగా రాసిందే

  గొప్ప ,డోలాయమాన సాంఘిక సంస్కృతీ ఉన్న సైప్రస్ చిన్నదేశం .మిలియన్ జనాభా అయినా సాహిత్య సంపద ఇక్కడ బాగా ఎక్కువే .కాని కొందరు రచయితలు గుర్తింపు పొందలేకపోయారు .అలాటి వారిలో –1-ఒస్మాన్ టర్కే 30భాషలలో రచనలు చేశాడు .అంతర్జాతీయ కీర్తి ఉన్నవాడు .రెండుసార్లు నోబెల్ కు నామినేట్ అయినవాడు .ఇలియట్ ,డిలాన్ ధామస్ ప్రేరణతో అవ౦ట్ గార్డె అంటే ప్రేరణాత్మక మార్గదర్శక కవిత్వం రాశాడు .ప్రకృతికి విరుద్ధంగా సాంకేతిక మార్పులు పెనునస్టం కలిగిస్తాయని ఎలుగెత్తి చాటాడు .

2-టెనార్ బెబార్స్ –అనువాదకుడు నవలా రచయితా కవి .1950లో లండన్ లో స్థిరపడ్డాడు .అక్కడి గ్రూప్ ఆఫ్ పోఎట్స్ లో సభ్యుడు ‘’ఇమేజెస్ ఇన్ సెల్ఫ్ బయాగ్రఫి ‘’ను సైప్రస్ గ్రామీణ నేపధ్యంగా రాశాడు

3-కిరియా కోస్ చారలం బిడెస్-ప్రముఖ గ్రీక్-సైప్రోటిక్ కవి .ఫస్ట్ సోర్స్ కవితాసంపుటి ప్రచురించాడు .ఇతనికవిత్వాన్ని యేట్స్  కవి కవిత్వంతో పోలుస్తారు ‘

4-యా౦డ్రియస్ కౌమి-ది సైప్రియట్ నవలలో 1950-70కాలం నాటి రోమాన్స్ ను  ఎపిక్ గా రాయబడింది .క్రిస్టియన్ –ముస్లిం సంబంధాలు ,రాజకీయ సరిహద్దులు 1979 సైప్రస్ ఐలాండ్ విభజన జరగటానికి పరిస్టితులను   అందమైన ప్రేమ కధ ఆధారంగా రచి౦ప బడిన  గొప్పరచన .

   సశేషం

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -10-5-20-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

ప్రపంచదేశాలసారస్వతం62- క్రోషియన్  సాహిత్యం

ప్రపంచదేశాలసారస్వతం62- క్రోషియన్  సాహిత్యం

క్రోషియాప్రజలభాష క్రోషియన్. ఆసాహిత్యమే క్రోషియన్ సాహిత్యం .మధ్యయుగ వచనం యూరోపియన్ మధ్యయుగ వచనంలాగానే ఉండేది .మధ్యయుగ సాహిత్యం 11నుండి 16శతాబ్ది వరకు ఉన్నది .మొదట్లోవ్రాత రాతి  పలకలమీద ,తర్వాత పత్రాలమీద ఉంటూ ఆతర్వాత ముద్రణ  పొందింది .ఈయుగ క్రోషియన్ సెగ్మెంట్ లాటిన్ లో రాయబడింది .హాజియోగ్రఫీ ,చర్చి చరిత్ర లను డాల్మాషియన్ తీర ప్రాంత నగరాలలో రాయబడింది .ఉదాహరణకు 6-7శతాబ్దం ‘’స్ప్లిట్ లిస్కి ఎవాండ లిస్టర్’’మొదలైన లర్జికల్ ,నాన్ లర్జికల్ రచనలు .తొలితరపు క్రోషియన్ సాహిత్యం డాల్మాటిన్,ఇస్త్రియన్ అమర వీరుల చరిత్రలు ,సెయింట్ డుజే,సెయింట్ అనస్టా షియస్ మొదలైనవారు క్రిస్టియన్ ఆచారవ్యవహారాలు గురించి రాసినవి .ఇవన్నీ లాటిన్ హిజియోగ్రఫిలోనే రాయబడినవి .

    14వ శతాబ్దిలో పాశ్చాత్య ప్రభావం క్రోషియన్ సాహిత్యం పై పడి మూడు విధాల మిళిత  భాషలో రచనలు వచ్చాయి .సామాజిక దృష్టి పెరిగింది .ఉత్తమశైలీ నిర్మాణంతో వివిధవిషయాలపై రచనలు వచ్చాయి .క్రోషియన్ భాషలో 1483లో ముద్రణ పొందిన  మొదటి పుస్తకం ‘’మిస్సేల్ రోమానియం గ్లగోలిటిస్ ‘’.ఇదే మొదటి నాన్ లాటిన్ పుస్తకంగా రికార్డ్ కెక్కింది.డాల్మేషియన్ హ్యూమనిస్ట్ –మార్కో మారులిక్ లాటిన్ భాషలో దున్నేస్తూ యూరప్ అంతా ప్రసిద్ధి పొందాడు .కాని ఆయన రాసిన క్రోషియన్ రచనలే కీర్తికి కారణమయ్యాయి .ఇతని ‘’జుడితా ‘’అనే ఎపిక్ పోయెం 1501లో రాస్తే ,1521లో వెనిస్ లో ముద్రణ  పొందింది .హవార్ ఐలాండ్ కు చెందిన పీటర్ హెక్టో రోవిక్’’ఫిషింగ్ అండ్ ఫిషర్ మెన్స్ టాక్ ‘’అనేది క్రోషియన్ భాషలో వచ్చిన మొదటి కవిత .ఇందులో అన్యాపదేశంగా ప్రకృతి అందాలను తన పుట్టిన ఊరును వర్ణించాడు.హేక్త్రో విక్ జాలర్లపాటలు రికార్డ్ చేశాడు .ఈ కాలం లోనే హ్వార్హనిబాల్ లూసిక్ లు ఒవిడ్ రచనలను అనువాదం చేశారు.

  వచన రచనలు నాటకాలు రాసినవారిలో జింకోజ్లటారిక్,మావ్రో వెట్ర నోవిక్,మార్టిన్ డ్రిజిక్.మొదటి క్రోషియన్ నవల ‘’ప్లనైన్ ‘’అంటే పర్వతాలు ను పీటర్ జోరానిక్ రాశాడు .అతని మరణానంతరం వెనిస్ లో 1569లో పబ్లిష్ అయింది  .ఇందులో అతని ప్రకృతిఆరాధన ,సాహసాలు ,,పల్లెటూరిపిల్లపై ప్రేమ వున్నాయి  .17వ శతాబ్దిలో క్రోషియా లో ‘’బరాక్ సంస్కృతి ‘’వచ్చింది .ఇది కౌంటర్ రిఫార్మేషన్ ఉద్యమం .పవిత్రవంతమైన అర్ధవంతమైన లలిత కవిత్వం ఉద్భవించింది .ఒజాలి స్లావిక్ మొదలైన ప్రాంతీయ సాహిత్య సర్కిల్స్ ఏర్పడ్డాయి.క్రోషియన్ భాషలో ‘’ఓ లీపా ,ఓ డ్రాగా ఓ స్లాటికా స్లోబోడో’’అంటే హాయైన స్వేచ్చ , ప్రేమమయ స్వతంత్రం ,కమ్మటి అనుబంధ స్వేచ్చ కవిత బహుళ ప్రశస్తిపొందింది .అతని ఒస్మాన్ ,గుండిలిక్ రచనలలో ఇస్లాంకు క్రిష్టియానిటికి ఉన్న భేదం ,యూరప్ కు టర్కీలకు,పాశ్చాత్య తూర్పులకు ఉన్న భేదాలను చక్కగా విశ్లేషించాడు బానిసత్వానికి స్వేచ్చకు ఉన్న తేడాను వివరించాడు .గొప్ప సాహిత్య విలువలున్న రచనలుగా ఇవి గుర్తి౦పు పొందాయి .ఇతర ప్రసిద్ధ రచయితలలో –ఉంజి పాల్మోటిక్,ఇవాన్ బూనిక్ ఉక్కి ,పీటర్కనవేలిక్.లాటిన్ ,ఇటాలియన్ భాషా రచనలు ఈకాలం లో స్థానిక భాషలలోనికి అనువాదం పొందాయి .మొదటి క్రోషియన్ వ్యాకరణం బార్టోల్ కాసిక్ రాశాడు .క్రోషియా చరిత్రను లాటిన్ లో శాస్త్రీయంగా ఇవాన్ లుసికి రాశాడు .క్రోషియన్-ఇటాలియన్-లాటిన్ నిఘంటు రచన జాకోవ్ మికల్జా కూర్చాడు .

  18వ శతాబ్దిలో అట్టోవాసామ్రాజ్య కబంధ హస్తాలనుంచి డాల్మేషియా,స్లావోనియా విముక్తిపొందాయి .యూరప్ లోని ఎన్ లైటేన్ ఉద్యమప్రభావం పడింది .మేరియా ధేరేసా,జోసెఫ్ -2ప్రేరణబాగా ఉండేది.జాతీయతా భావాలు పెరిగి ఆయా దేశాలు స్వాతంత్ర్యాన్ని 19వ శతాబ్దిలో పొందాయి .జ్ఞానోదయ భావ స్పూర్తితో పావాయో రిట్టార్ విటేజోవిక్ అనే చరిత్రకారుడు ‘’ఆధునిక పాన్ స్లావిక్ ఐడియాలజీ’’స్థాపించి   స్టెమ్మటో గ్రాఫియా అంటే చరిత్ర గ్ర౦థాలు,ఓడిల్జెంజి సిజేట్సో -ఎపిక్  రాశాడు .ఈ శతాబ్ది చివరలో ప్రసిద్ధ స్కాలర్స్ ,ఫిలాసఫర్స్,రచయితలు క్రోషియన్ ,లాటిన్  ,ఇటాలియన్ భాషలలో రాశారు.డుబ్రోవినిక్ డిక్షనరీ రాసినవాడు జోకిం స్టులిక్.

  రోమాన్టిజం కూడా వ్యాపించి రచనలు చేశారు .1848లో రోమా౦టిజం ,రియలిజం లమధ్య సేతువు’’ ప్రోటో రియలిజం’’ వచ్చింది .అగస్టస్ సేనోవా దీనిలో ప్రసిద్ధుడు .జెంస్లేవ్ నోవాక్ రియలిజం లో ప్రసిద్ధుడు .ఇతనిప్రసిద్ధ నవల –ది లాస్ట్ సిపానిక్ .జెన్కో లోస్కోవార్ సైకలాజికల్ నవలారచయిత .ఇతని మిసావో న జేక్నోస్ట్ నవల ఆధునిక రచనకు నాంది .సిల్వజే స్ట్రాహిమిర్క్రాన్జ్ సేవక్19వ శతాబ్ది గొప్పకవి .ఇతని బుజర్కేంజే  కవితా సంపుటి జానపద గీతాలు .కవి నాటక ,నవలాకారుడు జోసిఫ్ డ్రాజేనోవిక్ తీరప్రాంతప్రజలు వారిమధ్య సంబందాలపై  రాశాడు .ఆన్ద్రె ట్రెసిక్పవికిక్  క్రోషియన్ కవిత్వంలో ఇటాలియన్ భావజాలాన్ని నింపాడు .ఇతని ‘’ట్విలైట్ సాంగ్స్ ‘’బాగా ప్రచారం పొందాయి .

  ఆధునిక భావ ఉద్యమం సాహిత్యంలోనేకాక కళలలోనూ ప్రవేశించి ప్రభావితం చేసింది .అంటున్ గుస్టావ్ టొస్,దడిన్కోసిముయోవిక్ లు ఈ ఉద్యమంలోనూ లేరు .వ్లాడిమిర్ నజార్ఆధునికయుగ రచయితలలో మేటి –స్లావిక్ లెజెండ్ .మిలాన్ ఒర్జినోవిక్ ,జోసెఫ్ కోసోర్ జానపదాలనుంచి విషయాలు తీసుకొని ప్రముఖనాటకాలురాశారు .అంటున్ గుస్టావ్ మాటొస్ కదానికా ప్రక్రియలో సుప్రసిద్ధుడు .సాహిత్య పత్రికలూ విరివిగానే వచ్చి సాహిత్యవ్యాప్తికి దోహదం చేశాయి

  ప్రసిద్ధ క్రోషియన్ రచనలు –నాగర్బ్ నాయిర్ –క్రోషియన్ రచయితల జీవిత విశేషాలు,ఫేర్వెల్ కౌబాయ్ –ఇవాన్సేవిక్ ,జగ్రెన్ ఎక్సిట్స్ సౌత్ –ఈడో ప్రపోవిక్ ,హెడ్జి  హాగ్స్ హోమ్-బ్రాన్కో కోపిక్ ,ఆన్ ది ఎడ్జ్ ఆఫ్ రీజన్ –మిరోస్లోవ్ క్రేల్జా ,ది కల్చర్ ఆఫ్ లైస్-డార్కీ హూమరస్ ఎస్సేస్ ,కేఫ్ యూరోపా –వ్యాస సంపుటి-జర్నలిస్ట్  స్లేవెంకా డ్రాకులిక్ ,జగ్రేబ్-సీలియా హాకేస్ వర్త్ ,చేజింగ్ క్రోషియన్ గర్ల్ –కోడీ బ్రౌన్ ,గర్ల్ ఎట్ వార్ –సారానోవిక్

  నోబెల్ ప్రైజ్ లు ఇద్దరు సైంటిస్ట్ లకు  కెమిస్ట్రిలో వచ్చింది కాని సాహిత్యంలో రాలేదు .

   సశేషం

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -10-5-20-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

సుందర కాండ లో హనుమ బహుముఖీన వ్యక్తిత్వం-21

సుందర కాండ లో హనుమ బహుముఖీన వ్యక్తిత్వం-21

రావణుడు సీతతో మాట్లాడాటం మొదలుపెట్టాడు ‘’భయంతో నీశరీరాన్ని దాస్తున్నావు సకలజన మనోభిరామ౦ గా ఉన్న నిన్ను నేను మోహిస్తున్నాను .నాపై వలపు చూపకపోతే నిన్ను తాకనే తాకను .నాశరీరంలో కామం వరదలై ప్రవహించినా సరే . ఇక్కడ నాకు తెలియకుండా ఎవరికీ ప్రవేశం లేదు.  భయం వదిలి మాట్లాడు .పరస్త్రీలతోపొందు ,బలాత్కారంగా తీసుకురావటం రాక్షస ధర్మమే కనుక నేను చేసింది అధర్మం కాదు .నన్నుప్రేమించి శోకాన్ని పోగొట్టుకో .పరధ్యానంగా ఉంటూ కిందపడుకొని అలంకార రహితంగా ఉపవాసాలతో ఉండటం తగదు.నన్ను చేరితే సకల దేవేంద్ర భోగాలు అనుభవించవచ్చు .నీ యవ్వనం సౌందర్యం గడిచిపోతున్నాయి . వాటికి సార్ధకత కలిగించు .నిన్ను సృష్టించిన బ్రహ్మ ఇంతకంటే అందమైన స్త్రీని సృష్టించలేక సృష్టి మానుకొని ఉంటాడు .బ్రహ్మైనా నిన్ను చూస్తే ఆరాధిస్తాడు .నిస్సంకోచంగా నా భార్యగా ఉండు.నిన్నే పట్టమహిషిని చేస్తాను. ఈ లంకారాజ్యంతో సహా నా అధీనం లో ఉన్నదంతా నీదే.మేమంతా నీ సేవకులమే ఈ పృద్విని అంతా జయించి నీ తండ్రి జనకుడికి అర్పిస్తాను .నన్ను ఎదిరించే సాహసి పుట్టలేదు .చక్కగా అలంకరించుకొని నన్ను పొందు నువ్వు మంగళస్వరూపివి అందరి సుఖాన్నీ చూస్తావు రాముడు ఇక్కడికి రాలేదు .వచ్చినా నన్ను జయించలేడు.ప్రస్తుతం నువ్వులేక అడవులలో సంచరిస్తూ పిచ్చివాడిలా తిరుగుతూ ఉంటాడు .అసలు బతికి ఉన్నాడో లేదో సందేహ౦ .ముందుభాగంలో కొంగలు ఉండటం వలన వెనకనల్లని మేఘాలలో మరుగు పడిన వెన్నెల ఎలా చూడటానికి వీలుకాదో రాముడు అలా నిన్ను చూడలేడు.

  ఇంద్రుని కి దక్కిన కీర్తిని హిరణ్య కశిపుడు పొందినట్లు రాముడు నానుంచి నిన్ను పొందలేడు.విలాసినీ !సర్పాన్ని హరి౦చి నట్లు నువ్వు నామనసు హరి౦చావు .ననా అంతఃపురంలో నిన్ను శ్రీదేవిని అప్సరలు సేవించినట్లు సేవిస్తాను .దేవీ ! తపస్సు ,బలం ,పరాక్రమం ,దానం సంపద ,తేజం ,కీర్తి లతో నాకు రాముడు సాటిరానివాడు .నా  యందు అనురాగం చూపించు. నిన్ను చూసి నీ బంధువులు సంతోషించాలి –

‘’పిబ విహర రమస్వ భు౦క్ష్వ భోగాన్ –ధన నిచయం చైవ ప్రదిశామి మేదినీం చ –మయి లాల లలనే యథాసుఖం త్వం-త్వయిచ సమేత్య లలంతు బంధవాస్తే’’

‘’కుసుమిత తరుజాల సంతసాని –భ్రమత యుతాని సముద్ర తీరజాని –కనక విమలహార భూషి తాంగీ-విహర మయా సహ భీరు కాననాని ‘’

 36శ్లోకాల 20 వ సర్గ ఇది

 ఇందులో మొదరి సారి రావణుడు సీత తో మాట్లాడాడు .ఇందులో సీతా దేవిపై ఆరాధనాభావమే కనిపిస్తోందినాకు .ఎక్కడా కామం తో మాట్లాడినట్లు నాకు అనిపించలేదు .అతడు ప్రయోగించిన శబ్దజాలం ఒక దేవికి చేసే స్త్రోత్రం లాగా ఉన్నట్లు అనిపించింది .కొంచెం వివరంగా చూద్దాం –అనేకపుష్పమాలలు చందనం ,అగరుపూట ,వివిధవస్త్రాలు ,దివ్యాభరణాలు పానీయాలు శయనఆసనాలు ,గీతం నృత్యం వాద్యం మొదలైన సకల భోగాలను అనుభవించమని కోరాడు .ఇవన్నీ ఒక అమ్మవారికి చేసే షోడశ ఉపచారాలుకావా ?బ్రహ్మ ఆమెను ఆరాధిస్తాడు అంటే త్రిమూర్తులు ముక్కోటి దేవతలు శ్రీదేవిని పూజిస్తారని అర్ధమే .ఆ శ్రీ దేవి వేరేవరోకాదు సాక్షాత్తు లక్ష్మీ స్వరూపమైన సీతాదేవి .శత్రువు అనే భావంవదిలెయ్యి అంటే మిత్రభావం దాసభావం చూపించు .అమ్మకరుణ అదే  .సుందరీవిలాసవతీ,విలాసినీ ,మానినీ సుందరీ,మంగళ స్వరూపిణీ అనే సంబోధించాడు ఆరాధనాభావం తో .మబ్బుల మరుగున ఉన్న చంద్రుడు కనిపించడు నిజమే –కాని మబ్బులు తొలగితే కనిపించక ఎక్కడికి పోతాడు ?అలాగే రాముడు ప్రస్తుతం దూరంగా ఉన్నా త్వరలో వస్తాడు అనే నమ్మకం, సూచ్యార్ధం ఉన్నాయి .ఇంద్రుడు హిరణ్యకశిపుని భార్యను అపహరించాడు ఆమె యేకీర్తి .మళ్ళీ వాడు భార్యను సాధించుకొన్నాడు .ఇక్కడా అలాగే సీత రాముని చేరుతుందని వాడే చెప్పాడు .శ్రీదేవిని అప్సరసలు పూజించినట్లు ఇక్కడ అందరూ అల్లాగే చేస్తారు అంటే అమ్మవారు లలితా పరమేశ్వరిని పూజించినట్లు పూజిస్తారు .అందుకే కాటూరి వెంకటేశ్వరరావుగారు రావణ హృదయాన్ని ‘’పౌలస్త్య హృదయం ‘’కావ్యంలో ఇదే ఆరాధనా భావంతో రాశారు .రావణుడికి జన్మజన్మల అనుబంధం  స్వామితో ,అమ్మవారితో  తీరలేదన్నమాట .

  సశేషం

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -9-5-20-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

ప్రపంచ దేశాలసారస్వతం 61-బల్గేరియన్ సాహిత్యం

ప్రపంచ దేశాలసారస్వతం

61-బల్గేరియన్ సాహిత్యం

స్లావిక్ ప్రజల ప్రాచీన సాహిత్యమే బల్గేరియన్ సాహిత్యం .9వ శతాబ్దిలోనే మొదటి బల్గేరియన్ సామ్రాజ్యం  చక్రవర్తి మొదటి సైమన్ కాలం లో వర్ధిల్లి౦ది .మధ్యయుగం లో గ్రేట్ మొరేవియా నుంచి సిరిల్ ,మేతోడియస్ లను బహిష్కరించాక ,వారిని బల్గేరియన్ సామ్రాజ్యం ఆహ్వానించటం తో సాహిత్యానికి కేంద్రమై సాహిత్యానికి స్వర్ణయుగం అయింది .11వ శతాబ్ది దాకా సాహిత్యం అన౦త౦  గా మూడుపూలు ఆరుకాయలులాగా విస్తరించి,బైజా౦టిక్ గ్రీకునుంచి  అనేకపుస్తకాలు అనువాదం పొందాయి  .చాలామంది విద్యావేత్తలు ప్రేస్లావ్ ,ఒవ్రిడ్ సాహిత్య విద్యాలయాలలో సిరిల్లిక్ స్క్రిప్ట్ సృష్టించి  రచనలు చేశారు .చెర్నో రిజేట్స్ హర్బార్ ‘’యాన్ అకౌంట్ ఆఫ్ లెటర్స్ ‘’ను ,క్లెమెంట్ ఆఫ్ ఒహ్రిడ్ గ్రీకు అనువాదాలూ చేశాడు .జాన్ ఎక్సార్క్ షెస్టోడ్ నెవ్,ఆర్ధడాక్స్ క్రిష్టియానిటి అనువాదాన్ని ,నౌమ్ ఆఫ్ ప్రేస్లావ్ మరింత సాహిత్య సృష్టి చేశారు .ఈరచనలు స్లావిక్ ప్రపంచంపై గొప్ప ప్రభావం కలిగించాయి .1018లో బల్గేరియన్ సామ్రాజ్యాన్ని బైజాన్టియన్లు ఆక్రమించాక సాహిత్య వేగం తగ్గి ,రెండవ బల్గేరియన్ సామ్రాజ్య కాలం లో మళ్ళీ పు౦జుకొన్నది .14వశతాబ్దం లో పెట్రియర్క్ ఎవిటిమ్లి బాగా ప్రోత్సహించాడు .ఇతడు టార్ణోవ్ లిటరరీ స్కూల్ స్థాపించి సెర్బియా మస్కోవైట్ రష్యా సాహిత్యాలను ప్రభావితం చేశాడు .ఓట్టోమాన్ దాడి తర్వాత రచయితలూ చాలామంది ఇతరదేశాలకుపారిపోయారు .ఈకాలపు రచయితలలలో కాన్స్టా౦టిన్  కోస్టే నెట్స్-1380,గ్రెగరీ స్లామ్బ్లాంక్ -1365-1420 ముఖ్యులు .మధ్యయుగ సాహిత్యం మతరచనల కే ప్రాధాన్యం .

  ఓట్టోమాన్ యుగం -1396లో రెండవ బల్గేరియన్ సామ్రాజ్య౦ అంతరించాక బల్గేరియన్ సాహిత్య సంస్కృతులకు పెద్ద విఘాతమే కలిగింది .17,18శతాబ్దాలలో పైవారి ఆదేశాను సారమే రచనలు చెయ్యాల్సివచ్చింది .కాని సాహిత్య సంప్రదాయం కొనసాగింది .17వ శతాబ్దిలో కేధలిక్కుల ప్రాభవం పెరిగి బల్గేరియన్ ,చర్చి స్లోవానిక్ ,సేర్బో-క్రోషియన్ అనే మిశ్రమభాషలో రచనలువచ్చాయి ఈ భాషను ‘’ఇల్లిరిక్ ‘’అన్నారు  .ఇందులో వచ్చిన మొదటిపుస్తకం ‘’అబాగర్ ‘’1651లో రోమ్ లో ఫిలిప్ ట్రాన్సిలోవ్ అనే బిషప్ ముద్రించాడు  .ఇల్లిరిక్ ఉద్యమం సౌత్ స్లావిక్ ఐక్యతకు భంగం కలిగించి ,18,19శతాబ్దుల బల్గేరియన్ సాహిత్యాన్ని దెబ్బతీసింది .1741లో స్టెమ్మటో గ్రాఫియా అనే మొదటి ఆధునిక బల్గేరియన్ కవిత్వం ను హిస్టోఫర్ జేఫరోవిచ్ రాశాడు.  ఇది నాలుగు పాదాల పద్యాల కావ్యం .

  ఐరోపా రినైసేన్స్ నుంచి వేరుపడి బల్గేరియన్ సాహిత్యం జానపద సాహిత్యానికి ప్రాముఖ్యమిచ్చింది .అద్భుత కథాజాలం సృష్టి౦పబడింది .పేసియస్ ఆఫ్ హిఫెందార్ ,ఇస్టో  రియా స్లావనోబో ల్గార్కస్యచరిత్రరచనలు చేశారు .సోఫ్రోనియస్’’లైఫ్ అండ్ సఫరింగ్స్ ఆఫ్ సోఫ్రోనియస్ ‘’రాశాడు .1840-75మధ్య విప్లవాత్మక టర్కీ వ్యతిరేక సాహిత్య సృజన జరిగింది .ఇందులో వాసిల్ డ్రుమేవ్,రేకోజింజిఫోక్,దొబ్రి చింతులోవ్ మొదలైనవారున్నారు .విప్లవీరుడైనకవి హ్రిస్టో బొటేవ్-1848-1876 19వ శాతాబ్దిలోకూడా రచనలు చేస్తూ బల్గేరియన్ అత్యంత ప్రతిభాశాలి ఐనకవిగా గుర్తి౦పు పొందాడు .కొద్దిగారాసినా పవర్ ఫుల్ గా భావోద్వేగ సందేశంతో రాశాడు .లుబెన్ కరవేలోక్ ,గోర్గి సావా రక్సోస్కి లుకూడా విప్లవకవులే .గోర్గి రాసిన ‘’గోర్స్కి పాత్నిక్ ‘’అంటే అడవిలో యాత్రికుడు ‘’క్రిమియన్ యుద్ధకాలం లో -1853-56టర్కిష్ సైన్యానికి దొరకకుండా కోటేల్ నగరంలో ఉండి రాసింది .దీనినే మొట్టమొదటి బల్గేరియన్ కవితా సంపుటిగా భావిస్తారు .ఇది 1857లో మాత్రమె పబ్లిష్ అయింది .

  రష్యా –టర్కి యుద్ధం తర్వాత బల్గేరియాకు పాక్షిక స్వాతంత్ర్యం వచ్చింది .ఇవాన్ వాన్జోవ్ ను మొదటి సాహితీ వేత్త అంటారు .1893లో ఇతనురాసిన ‘’అండర్ దియోక్’’అంటే కాడి కింద క్లాసిక్ రచనగా గుర్తి౦పు పొందింది .ఒట్టోవాన్ ల క్రూరత్వం అణచివేత ఇందులో ఇతివృత్తం .ఇది 30కి పైగా భాషలలోకి అనువాదం పొందింది .నేమిల్లి నేద్రగి ,చిచోవ్జి అనే చిన్ననవలలు, చాలా చిన్నకథలూ రాశాడు ‘’ఎపోపి ఆఫ్ది ఫర్గాట్టెన్’’ అనే 12ఓడ్స్ ల కవితా సంకలనం బల్గేరియన్ చారిత్రాత్మక వీరులకు అంకితం చేశారు .

   ఆధునికకాలం లో ప్లేంచో స్లావెంకోవ్ అనే ప్రముఖ రినైసేన్స్ కవికొడుకు పెట్కో స్లావెంకోవ్ బాగా ప్రసిద్ధకవి .యూరోపియన్ ఫిలసాఫికల్ మెటాఫిలసాఫికల్ భావాలను బల్గేరియన్ కవిత్వం లో చొప్పించాడు .ఇతని డ్రీం ఆఫ్ హాపినెస్ మంచిపపేరుపొందింది .కవులచరిత్రను ‘’’’ఆన్ దిఐలాండ్ ఆఫ్ ది బ్లిస్ఫుల్ ‘’గారాశాడు .ఇతని సాంగ్ ఆఫ్ బ్లడ్ అనే అసంపూర్తికావ్యం టర్కులతో పోరాట గాథ.వచనరచనలో అలెకో కాన్ స్టాంటి నోవ్ హాస్యాత్మక యాత్రాసాహిత్యం –‘’గో బాన్యో  అంటే చికాగో కు రాశాడు .పెట్కో  టేడరోవ్ క్రాస్త్యోకాస్టేవ్,పెయోఎవరోవ్ లు ‘’మోడర్నిస్ట్ సర్కిల్ ‘’ఏర్పరచారు .మిసై అంటే ఆలోచన మొదలైనవి ప్రచురించారు .పెయో యవ రోవ్ సింబలిస్ట్ కవి .గోప్పప్రభావంచూపాడు కవిత్వం తో.

  రెండు ప్రపంచ యుద్దాలమధ్య నికోలా కవి మోటార్ సాంగ్స్ కవితా సంపుటి ప్రచురిస్తే ,ఎలిన్ పెలిన్, యోర్డాన్ యువకోవ్  చాలా చిన్నకథలు, నవలలు రాశారు .ఇవి వాస్తవికతకు దగ్గర గాఉంటాయి. గ్రామీణ జీవన విషయాలే ఎక్కువ .ఫాని పోపోవా ముటాఫోవా శిఖరాగ్ర౦ చేరిన రచయిత్రి .1944తర్వాత రచయితలపై కమ్యూనిస్ట్ పార్టీ పెత్తనం వచ్చింది .సోషలిస్ట్ రియలిజం వచ్చింది .డిమిటార్ డిర్మోవ్ రాసిన ప్రసిద్ధ ‘’టొబాకో’’నవలను కమ్యూనిస్ట్ భావాలతోమారిస్తే  మారిస్తే సినిమా తీశారు .క్రైం ఫిక్షన్ ,సైన్స్ ఫిక్షన్ చలాతక్కువే .సర్రియలిజం వంటివీ వచ్చాయి .1989లో’’ఈస్ట్రన్ బ్లాక్ ‘’కొలాప్స్ అయ్యాక ప్రైవేట్ పబ్లికేషన్స్ ,సాహిత్య అవార్డ్ లు ఊపు అందుకొన్నా స్థాయి గలరచనలు ,జాతీయత ఉన్న కవిత్వం రాలేదు .చారిత్రకదృక్పధం దూరమైంది .పాతతరం రచయితలు పావ్లోవ్, హ్రిస్టోవ్, ఎడ్విన్ సుగారేవ్ వంటివారు ఇంకా ప్రాభవం లో ఉన్నారు  .

బల్గేరియన్ రచయితలో అయిదుగురు ప్రముఖులు –కవిత్వం లో –ఇవాన్ హ్రిస్టోవ్ ,డిమిటర్ కేనెరోవ్ లు ,  ఫిక్షన్ లో గోర్గి టేనోవ్,కన్సేర్టో ఫర్ సెంటెన్స్ –ఏమిలియా డోర్నోవా ,ఫిజిక్స్ ఆఫ్ సారో-గోర్గి గోస్పెరినోవ్.

సశేషం

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -9-5-20-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

ప్రపంచ దేశాల సారస్వతం 60-బోస్నియా అండ్ హెర్జె గోవినా సాహిత్యం  

ప్రపంచ దేశాల సారస్వతం

60-బోస్నియా అండ్ హెర్జె గోవినా సాహిత్యం

బోస్నియా అండ్ హెర్జె గోవినా సాహిత్యపితామహుడుగా మాటిజా డీవ్ కో విక్ ను భావిస్తారు .ఇతనితోపాటు హసనా జినికా కూడా జానపద సాహిత్యం లో ప్రసిద్ధుడు .20వ శతాబ్ది మహిళా రచయితలలో బిసేరా అలీ కెడిక్  లార్వా అండ్ క్రుగ్ రచనతో ప్రసిద్ధురాలు .గ్రాడ్ హిరాబ్రాస్ట్ –అంటే దిసిటి ఆఫ్ కరేజ్ ,దినిగా వేర్మేనా అంటే బుక్ ఆఫ్ టైం నవలలు 1900లో జరిగిన బోస్నియా యద్ద నేపధ్యంగా వచ్చినవి .ఈమె కవిత్వం ఇతర రచనలు ఇంగ్లిష్ ,జర్మన్ ఫ్రెంచ్ టర్కిష్ ఇటాలియన్ మొదలైనభాషలలోకి అనువాదం చెందాయి .12కవితా సంపుటులు వెలువరించింది .5వచన సంపుటులు రాసి ముద్రించింది .ఆర్డర్ ఆఫ్ లేబర్ విత్ గోల్డెన్ రీత్ అవార్డ్ ,గోల్డెన్ బ్రూక్ ఫర్ ఆర్ట్ అవార్డ్ ,స్కేండర్ కులోనోవిక్ అవార్డ్ పొందింది

నూనా బెజడుల్జి   -కవయిత్రి రచయిత్రి .బాలసాహిత్యం యువసాహిత్యం ,నవలలు నాటకాలు సుమారు 20రాసింది .vbzఅవార్డ్ గ్రహీత .అలెక్జాండ్రావోరోవిక్ –జర్నలిస్ట్ .బాలల విద్యావ్యాప్తికి రాసింది ,కృషి చేసింది .జుప్కో రేస్సిక్ అవార్డ్ ,స్టాంకో రకిటా అవార్డ్ ,స్లోవో ప్రడ్గేమికా అవార్డ్ లు పొందింది ఆమె రచనలు మాజిక్ రోజ్ నవల ,ఓవర్ కమింగ్ కవితా సంపుటి ప్రసిద్ధాలు నసిహా కపిడిక్హడ్జిక్-బాలసాహిత్యంరాసింది .కాస్ట్యూమ్ బాల్ ఇన్ ది వుడ్స్ఆమెరాసిన మొదటి పిల్లలపుస్తకం  ఏమ్బ్రాయిదార్డ్ బ్రిడ్జ్ ,హిడెన్ టేల్ ,దిడ్రీం అబౌట్ మీడోస్,లిల్లిపుట్ ,మై లాంబ్ స్లీప్స్ అండర్ దిబ్లాసమ్స్ మొదలైన రచనలెన్నో చేసింది .వేసేలిన్ మాసలీస ఓడలైన వార్డ్ లగ్రహీత .జెంజికా ములికవిక్ లుకాక్ –ప్రొఫెసర్ .రష్యా భాషనుంచి సెర్బియాకు చాలారచనలు అనువాదం చేసింది .చాలా మోనోగ్రాఫ్ లకు ఎడిటర్ .నేషనల్ ధియేటర్ స్థాపకురాలు నటి నిర్మాత డైరెక్టర్ కూడా .ఎన్నో అవార్డ్ లు పొందింది .లిజుబికా ఓస్టో జిక్-నాటకాలురాసింది .కవిత్వం రాసింది .ఈమె రాసిన స్వేజిటి లొస్ట్ బెస్ట్ బుక్ అవార్డ్ పొందింది .నఫీజా సరజలిక్ –మొదటి బోస్నియా ముస్లిం వచనరచయిత్రి .ఆస్ట్రో హంగేరియన్ కాలం నాటి విషయాలెన్నో రచనలలో త్రవ్వి తలకేత్తిందిది .పార్టింగ్ ,ఎ ఫ్యు పేజెస్ ,వన్ క్లాస్ మొదలైనవి బాగా పేరుపొందాయి .స్టాంజా స్టుపార్ట్రిఫు నో విక్-యుగోస్లేవియా యుద్ధ కాలపు సంఘటనలపై ఎక్కువగా రాసింది .కవిత్వం కధలు చాలారాసింది .కూకా ఓడి స్లోవా ,అడోర్నా స్వరకా ,గాల్వని జునేక్ కే జోవేజ్ కోజి సే జల్జుబ్జూజి యునేస్రే  బాగా ప్రసిద్ధాలు .యూరోపియన్ యూనియన్ ప్రైజ్ జ్లాన్టోసోవా అవార్డ్ ,మార్టి క్ లిటరరీ అవార్డ్ లు అందుకొన్నది .జగోడా తుహేల్కా –స్త్రీవాద రచయిత్రి ,బాలసాహిత్యమూ రాసింది .వీరంతా 20,21శతాబ్ది లబ్ధ ప్రతిష్ట రచయిత్రులే

పురుష రచయితలలో –ఐవో ఆన్ద్రిక్ ,బెనోబెనిక్ ,బ్రాన్కో కోపిక్ ,ఒస్మాన్ డి కిక్ ,డేర్విక్ సుసిక్ ,నెనాద్ విల్క్కోవిక్ ,కరీం జల్మోవిక్ వంటి వారెందరో ఉన్నారు

11మంది ప్రసిద్ధ రచయితలు-సెమెజ్ డిన్ మెహ్మనోదిక్,బిసేరా అలికాదిక్ ,ఒట్టో లాంగ్ ,కరీం జేమో విక్,జ్లాటా ఫిల్లిపోవిక్,మిల్జేంకో జెర్గోవిక్,అలిజా ఇజేట్ బెవిక్,సాఫ్వెట్ బెగ్ బసాజిక్ , అబ్దుల్లా సిడ్రాన్,ఐవో ఆన్డ్రిక్

యుగోస్లేవియా గురించి తెలిపే 5పుస్తకాలు –ది ఫాల్ ఆఫ్ యుగోస్లేవియా –మిషా గ్లేన్ని ,జ్లాటా డైరి –జ్లాటా ఫిలి కో విక్,ది బ్రిడ్జి ఆన్ ది డ్రినా-ఇవోఆన్డ్రిక్.దిసేల్లిస్ట్ ఆఫ్ సర్జేవో-స్టీవెన్ గలోవే,గుడ్ బై సర్జేవో-ఎట్రూ స్టోరి ఆఫ్ కరేజ్ ,లవ్అండ్ సర్వైవల్ –అటకా రీడ్అండ్ హానా స్కోఫీల్ద్ .

బోస్నియాను ‘’వేర్ ది ఈస్ట్ మీట్స్ దివెస్ట్ అంటారు మనహైదరాబాద్ ను వేర్ నార్త్ మీట్స్ సౌత్ అన్నట్లు .అట్టో మాన్ మరియు ఆస్ట్రో హంగేరియన్ ల ప్రాచీన సంస్కృతుల మేళవింపు ఇక్కడ కనిపిస్తుంది .38లక్షలజనాభాలో బీదరికంలో మగ్గేవారు 7లక్షలు. 25శాతం పిల్లలు పేద కుటుంబాల వారే.స్త్రీ విద్య ఉద్యోగాలుతక్కువే .నిరుద్యోగం శాతం ఎక్కువే .దేశం చిన్నది జనాభాఎక్కువ .రాజధాని- సరజెవో అధికార బోస్నియాభాషలేదు .సెర్బియన్ భాషలు మాట్లాడుతారు .

బోస్నియాలో పుట్టిన రచయిత-ఇవో అన్డ్రిక్ కు 1961లో సాహిత్యంలో నోబెల్ ప్రైజ్ వచ్చింది అప్పుడాయన యుగోస్లేవియాలో ఉన్నాడు .1967బోస్నియా దేశ అవార్డ్ పొందాడు .

   సశేషం

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -9-5-20-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

ప్రపంచ దేశాల సారస్వతం 59-హంగేరియన్ సాహిత్యం

ప్రపంచ దేశాల సారస్వతం

59-హంగేరియన్ సాహిత్యం

హంగేరియన్ భాష –ఫిన్నో –ఉగ్రియన్ భాషా కుటుంబానికి చెందింది .దీనికి ‘’మోడియర్’’అనే పేరుకూడా ఉన్నది .ధ్వని అనుకరణపదాలు తప్ప మిగిలినవేవీ సంయుక్తాక్షరాలతో మొదలుకావు అచ్చులు కూడా కొన్ని ఉపసర్గల్లాగానే వ్యవహరిప బడుతాయి .విభక్తి ప్రత్యయాలు పదం చివర ఉంటాయి. మొదట్లో టర్కీ రూని లిపిలో రాయబడేది. క్రీ.శ 1000నుంచి రోమన్ లిపి వాడుతున్నారు

సాహిత్యం -15వ శతాబ్ది దాకా లిఖిత సాహిత్యం లేదు .లాటిన్ లోనే రచన జరిగేది మతగ్రంథాలే ఎక్కువ.యూరప్ లో  పునరుజ్జీవన యుగం ప్రారంభమయ్యాక  ఆ కాక ఇక్కడ ఆలస్యంగా తాకింది .దీనిలో రాసిన మొదటికవి జాన్ వైటీజ్ .మొదట్లో నజివారాన్ పీఠ ఆచార్యుడై ,తర్వాత దేశానికే మతాచార్యుడయ్యాడు . మత్తయస్ రాజు -1458-1490కి ఆంతరంగికుడు ..కవిపండిత తాత్విక ఐతిహాసకులకు ఆస్థానం లో చోటు కల్పించాడు .ఇంతచేసినా హంగేరియన్ భాషలో ఉత్తమరచనలు రాలేదుకాని లాటిన్ లో వచ్చాయి .దిగువతరగతి ప్రజలలో విద్యా వ్యాప్తి బాగా రావటం తో దేశభాషపై ఆసక్తి వచ్చి అందులో రచనలుచేయాలనే కోరిక పెరిగింది .ఈ భావ పరివర్తనం తో 16వ శతాబ్దిలో ప్రోటేస్టెంట్ మతం బాగా వ్యాపించి దేశాభాషారచనలకు ప్రోత్సాహం కలిగింది .అనేక ప్రార్ధన గీతాలు లాటిన్ నుంచి అనువాదం చేశారు .కొన్ని స్వతంత్ర గీతాలు రాయబడినాయి .1590లో బైబిల్ హంగేరియన్ భాషలోకి మొదటిసారిగా అనువాదమైంది .జానపదసాహిత్యమూ బాగానే వచ్చింది .అప్పుడు ‘’విరాజీ నేకక్’’అంటే పుష్పగీతిక అనే సాహిత్య ప్రక్రియ బాగా వ్యాప్తి చెందింది .ప్రేమించిన స్త్రీని పుష్ప గీతికగా భావించి కవిత్వాలు రాశారు .పండితులు అడ్డుపెట్టినా యదేచ్చగా వస్తూనే ఉండేవి .చారిత్రకపురుషులు  ‘’సాల్మన్ ‘’మొదలైన వారిపై ఫై ఐతిహాసిక కావ్యాలు వచ్చాయి .ఇలా రాసిన వారిలో పీటర్ సేలిమన్ డి ఇసోల్వా ,సెబాస్టియన్ టినోదీ మొదలైన వారున్నారు .గేయకవి వేలెంబియాన్ బలస్సా ప్రసిద్ధుడు .ఇతడే చివరికవి .

  17వ శతాబ్దిలో రాజకీయ కల్లోలాల వలన సాహితీపోషణ  జరగలేదు .స్వీయ చరిత్రలు చాలావచ్చాయి. ప్రముఖ తత్వ వేత్త జాన్ శేరి డి అపాజా దేశాన్ని తీర్చి దిద్దేది ఉపాధ్యాయులే కాని సైనికులు కాదు అని ప్రవచించాడు .పద్యరచన చేసినవాడు స్టీఫెన్ గయోన్ గ్యోసి .సరళ శైలి సంవిధాన నైపుణ్యం ఇతనిలో పుష్కలం ..

  18వ శతాబ్దం లో కాల్పనికవాదం ప్రవేశించింది .ఫ్రెంచ్ సాహిత్య నేపధ్యం లో బెస్సేని అతని బృందం కావ్యాలురాశారు .ఈ వర్గానికి చెందని డుజో నిక్స్ ,గ్వడా నాయ్,షజేకా కవులకే విజయాలు లభించాయి .జర్మన్ కవితా సంప్రదాయం పాటించి ఫ్రాన్సిస్ కాజింసీ స్వతంత్ర రచనలు చేశాడు .షేక్స్పియర్ ,మోలియర్ రచనలను హంగేరియన్ భాషలోకి అనువాదం చేశాడు .ఈయుగ గేయకవులలో ఫ్రాన్సిస్ కొల్సీ ,జాన్ బక్సాన్యీ గొప్పవారు. కొల్సీ ‘’హంగేరియన్ జాతీయ గీతం ‘’రాసి సుప్రసిద్దుడయ్యాడు .

  19వ శతాబ్ది రచయితలలో జోసెఫ్ కటోనా రాసిన ‘’బ్యాంక్ జెన్’’నాటకం హంగేరియన్ సాహిత్యం లో అత్యుత్తమనాటకం .1830లో హంగేరియన్ సాహిత్య అకాడెమి ఏర్పడింది .ఈ యుగ కాల్పనికకవులలో చార్లెస్ కిస్ ఫలూది,మైకేల్ పరో స్మర్తి స్మరణీయులు .నవలలు కథలు ఎక్కువగానే వచ్చాయి .వాస్తవికవాదం బలపడింది యాన్డ్రూఫే,జోసెఫ్ యోవోజ్ ,పీటర్ వాజడా గొప్ప నవలా కారులు ,అత్యుత్తమ గేయకవి అలెగ్జాండర్  పెటోఫీ.జానపద రచనలో ప్రసిద్ధుడు –జాన్ అరానీ .అత్యుత్తమ నవలా రచయిత మౌరన్ జోకాయ్.వాస్తవికవాద రచనలో సుప్రసిద్ధులు  కాలోమన్ మిక్సి జాత్ ,ఫ్రాన్సిస్ హెర్ షె జెగ్ లు .

  పారిశ్రామిక యుగం లో కొత్త కవితా సంప్రదాయానికి దారి చూపింది ‘’మ్యగాత్ ‘’అనే సాహిత్య పత్రిక .ఆ దారిలో నడచినవారు యాన్డ్రూ ఆడి,మైకేల్ జే బిట్స్,ఫ్రెడరిక్  కరింతి,సీజస్మండ్ మో  రిజ్..మొదటి ప్రపంచయుద్ధం తర్వాత దేశం ఆర్ధికంగా చితికిపోయింది .అప్పటి సాంఘిక స్థితి గతులపై ఉత్తమనవలలు రాశారు –జూలియన్ క్రూడి,దెసిడర్ కొస్టో లాన్యి,లూయీ హత్వానీ బేలా శోల్ట్,జోలాస్ ఫోల్డిస్.

  20వ శతాబ్దం లో ఎన్డ్రే  ఆడి తన ‘’న్యు పోయెమ్స్ ‘’తో కొత్త శైలీ  విధానం లో విరుచుకు పడ్డాడు ,హంగేరియన్ కవిత్వానికి కొత్త జవసత్వాలు కలుగజేశాడు .దీనికి 1908లో వచ్చిన ‘’న్యుగత్’’అంటే దివెస్ట్ పత్రిక బాగా దోహదపడింది .ఆండీ 1924లో జిగ్మండ్ మోరిజ్-ది స్టోరి ఆఫ్ మై వైఫ్ అనే అద్భుత నవల రాశాడు .గ్యూలా కుర్దీ  స్ట్రీం ఆఫ్ కాన్షస్ నెస్ టెక్నిక్ తో రాశాడు .డేస్జోస్జోబో ‘’ఎక్స్ప్రేషనిస్ట్ నవలగా ‘’అజ్ ఎల్సో డోర్ట్ ఫలు’’-ఊడ్చివేయబడిన ఊరు అనే అద్భుతనవల రాశాడు .బూర్జువాల జీవితాలను ఎండగట్టటానికి నవల గొప్ప వాహిక అయింది .జానోస్ కోడలాని లస్జో స్ జిలాది మొదలైనవారు వ్యక్తికీ సంఘానికి మధ్య సంఘర్షణలు నవలలలో చిత్రించారు .1948-53లో చాలామంది రచయితలలు  సోషలిస్ట్ రియలిజం చూసి సైలెంట్ అయిపోయారు .

 20వ శతాబ్ది చివరలో ,21వ శతాబ్ది ప్రారంభం లో గర్గి కొన్రాడ్,పీటర్ హేస్టర్ హేజి లు ది కేస్ వర్కర్ ,ది సిటి బిల్డర్ రచనలాలో తీవ్రమైన ఉద్విగ్నత లోతైన అవగాహన అద్భుత శైలీ విన్యాసం తో నూతనసమాజ ఆవిష్కరణ యెలాఉండాలో చెప్పారు .70ఏళ్ళ జీవితానుభవాలను ‘’నాట్ ఆర్ట్ –ఎ నావెల్ ‘’గా రాసి ప్రపంచ ప్రసిద్ధి చెందాడు .హేస్టర్ హేజి .సాండర్ ఒరేస్ ఫిలాసఫీ కవిత్వం బాలసాహిత్యం కూడా రాశాడు .ఆన్ద్రాస్ సూటో నాటక నవలాకర్త .హంగేరీ మైనారిటీలు జెకోస్లోవేకియా యుగోస్లేవియా మొదలైన చోట్ల పడే బాధలను కళ్ళకు కట్టించాడు .

8ప్రసిద్ధ హంగేరియన్ నవలలు –ది  డోర్-మగ్డాస్జాబో ,ఎంబెర్స్ –సాండో మరాయ్,ఫేట్ లెస్ నెస్-ఇమ్రే కేర్తెజ్ ,దిపాల్ స్ట్రీట్ బాయ్స్-ఫెరెంక్ మోల్నార్,దిమాన్ విత్ ది గోల్డెన్ టచ్ –మోర్ జొకాయ్,ది కేస్ వర్కర్ –గోర్గి కొన్రాడ్,జర్నీ బై మూన్ లైట్ –అంటాల్ జేర్బ్ ,సత తాంగో-లస్జ్లో హోర్కాయ్

ఇమ్రే కెర్టేజ్- రచయితకు 2002లో సాహిత్యం లో నోబెల్ ప్రైజ్ వచ్చింది .

కానీ సినిమాలో బెస్ట్ సినిమాలు ఆస్కార్ అవార్డ్ కు 9సార్లు నామినేట్ అయి ఒకసారి అవార్డ్ పొందింది  హంగేరియన్ సినిమాలు చాలాఉన్నాయి .దిబాయ్స్ ఆఫ్ పాల్ స్ట్రీట్ ,కాట్స్ ప్లే ,హన్గేరియన్స్ ,కాన్ఫిడెన్స్ ,మెఫిస్టో-1891లో అవార్డ్ పొందింది-డైరెక్టర్ లస్జివో నెమెస్ ,జాబ్స్ రివోల్ట్ ,హనుస్సెన్,సన్ ఆఫ్ సాల్.ఈ హవా 1968నుంచి 2015వరకు సాగింది

సశేషం

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -8-5-20-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

సుందర కాండ లో హనుమ బహుముఖీన వ్యక్తిత్వం-20

సుందర కాండ లో హనుమ బహుముఖీన వ్యక్తిత్వం-20

ఇంత జరిగే సరికి రాత్రి మూడుజాములసమయం దాటి,చివరిజాము మాత్రమే మిగిలింది .అప్పుడు సాంగ వేదపండితులు , ,శ్రేస్ట యాగాలు చేయించగల సమర్ధులు ఐన బ్రహ్మరక్షస్సుల వేద ఘోష వినబడింది .మంగళవాద్యాలు మ్రోగాయి .రావణుడు వెంటనే నిద్ర లేచి జారినమాలలు ,వస్త్రాలతో సీతను తలచుకొన్నాడు .మదంతోమదించిన వాడు  ,మదన ప్రేరితుడై ,కామాన్ని అదుపులో పెట్టుకోలేక పోయాడు .వెంటనే సర్వాభరణ భూషితుడై ,మందీమార్బలంతో అశోకవనానికి వంద మంది రాక్షస స్త్రీలతో  బయల్దేరాడు .అందులో కొందరు బంగారు దీపస్తంభాలు పట్టుకొన్నారు ,కొందరు చామరాలు వీస్తూ అనుసరించి వస్తున్నారు .కొందరు బంగారు కలశాలలో నీరు పట్టుకొని ముందు నడిచారు .కొందరు కత్తులు, తివాసీలుతీసుకొని వెనక నడిచారు .ఒకామె మణిమయ మద్య పాత్ర పట్టుకొన్నది .ఇంకొకామె ఛత్రం పట్టుకొన్నది .మత్తుతో ఉన్న ఆతని కాంతలు మెరుపుతీగాల్లా వె౦టనడిచారు.కామ పరవశంతో మత్తెక్కిన రావణుడు విలాసంగా నడుస్తున్నాడు .మహాతేజశ్శాలిగా కనిపించాడు చెట్టుపై ఆకులమాటున నక్కి చూస్తున్న హనుమకు .

ఇది 32శ్లోకాల 18వ సర్గ

రావణుడి రాక గ్రహించి భయవిహ్వల మైన సీతాదేవి పెనుగాలికి కదలిపోయే అరటి చెట్టు అయింది .వెంటనే తేరుకొని భయంతో తొడలు ,ఉదరం  బాహువులచేత స్తనాలను కప్పేసుకోన్నది –పరపురుషుడు కనిపిస్తే కులాంగన లోకం లో సహజంగా ఇలానే చేస్తుంది .

‘’ఉపవిస్టా విశాలాక్షీ రుదంతీ వరవర్ణినీ – దశగ్రీవస్తు వైదీహీం రక్షితాంరాక్షసీ గణైః’’

మలినవస్త్రాలు, నిరాభరణ ,శోక దెవతలాఉన్న సీతను చూశాడు ఆమె రాజశ్రేస్తుడు ,ఆత్మవిడుడు ఐన రాముడి దగ్గరకు సంకల్పం అనే గుర్రాలతో కట్టబడిన మనో రథం లో పోతోందా అనిపించింది –

‘’సమీపం రాజసి౦హస్య రామస్య విదితాత్మనః –సంకల్ప హయ సంయుక్తైః యాన్తీమివ మనో రధై’’

అసత్య అపవాదం చేత చెడిన కీర్తిలాగా ,పునరావృత్తి లేకపోవటం వలన మరుగుపడిన విద్యలాగా సీత ఉన్నది .తరిగిన ధనలాభ౦లా ,చేయని యజ్ఞం లా ఉత్పాత సమయంలో మండే దిశలా ,దొంగిలిపబడిన పూజా ద్రవ్యంలా కనిపించింది .తాకకూడని వాడు తాకిన యజ్ఞ వేదికలా ,ఆరిపోయిన అగ్నిజ్వాల లా , రాహువు కబళించిన చంద్రునిలా ఉన్నది .తనవారి గుంపు నుంచి వేరు చేయబడి బంధింపబడి నిట్టూరుస్తూ దుఖపడే గజరాజు భార్యలా ఉన్నది .మనసులో రాముడు వచ్చి రావణ సంహారం చేయాలని దుఖంతో అ౦జలి ఘటించి దేవతలను ప్రార్ధించే పతివ్రతా శిరోమణి లా కనిపించింది .రావణుడు మాత్రం ఆమెను మచిమాటలతో దారిలో పెట్టాలనే సంకల్పం లో ఉన్నాడు .ఇవన్నీ ప్రేక్షకపాత్ర వహించి హనుమ చూస్తున్నాడు అంతకంటే ప్రస్తుతం ఏమీ చేయలేడు కదా .

‘’సమీక్ష మాణా౦ రుదతీ మనిందితాం-సుపక్ష్మ తామ్రాయత శుక్ల లోచనాం-అనువ్రతాం రామ మతీవ మైథిలీం –ప్రలోభయామాస వధాయ రావణః ‘’

ఇది 23శ్లోకాల 19వ సర్గ

ఈ రెండు సర్గలలో మహర్షి వాల్మీకి చిత్రించిన ఉపమానాలన్నీ సర్వోత్క్రు స్టంగా ,సందర్భానికి తగినట్లున్నాయి .సీత విషయంలో వాడిన ఉపమానాలు ఆమె కీర్తిని శీలాన్నీ ,నిజాయితీని ధర్మతత్పర్తను ,దృఢ సంకల్పాన్నీ ,రామునిపై ఉన్నఅపారమైన అనురాగాన్ని ,నమ్మకాన్నీ ,విశ్వాసాన్నీ తెలియబరచేవే .ఆమె గుణాన్ని మరింత గా పెంచేవే .అందుకే మహాకవి కాళిదాసుకు ఉపమానాలకు మార్గదర్శి వాల్మీకి అంటారు బుధులు .

సశేషం

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -8-5-20-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

రేడియో బావగారి కబుర్లు -5

రేడియో బావగారి కబుర్లు -5

బావగారు 2-బ్రహ్మమోక్కడే పరబ్రహ్మమోక్క డే –బుద్ధం శరణం గచ్చామి –నమస్కారం బావగారూ

బావగారు 1-నమ స్కారం బావగారు .అన్నమయ్యను బుద్ధుడిని వెంట తెచ్చారు బాగుంది

2-ఆవిశేషాలు తెలుసుకోవాలనే తాపత్రయం బావగారు సెలవీయండి

1-పరమానందంగా .ముందు అన్నమాచార్య గురించి చెబుతాను .అన్నమయ్య కడపజిల్లా తాళ్ళపాక లో పుట్టాడు .తండ్రివరకు అక్కడ శివాలయ పూజారులు .తర్వాత ఈయన తిరుమలవెల్లి అక్కడ వైష్ణవం తీసుకొన్నాడు .అన్నమయ్య తల్లి లక్కమా౦బ తో   ‘’మాడుపూరి మాధవ స్వామి ‘’మాట్లాడేవాడట .అదీ ఆమె భక్తి .సంతానం కోసం ‘’తిరు వేమ్గాముడైయ్యా ‘’కు సేవ చేసింది .కలలో స్వామి సాక్షాత్కరించి ‘’బిరుదు గజ్జియల కటారం ‘’ఇచ్చాడు .అందుకే అన్నమయ్య ‘’నందక అంశం ‘’లో పుట్టాడు అని అంటారు అన్నమయ్య తాతకు ‘’చింతలమ్మ ‘’దేవత ఒక సారి కలలో కనిపించి ‘’మూడవ తరమ్మునను –వదలని కీర్తి మీ వంశంబు నందు –పరమ భాగవతుండు ,ప్రభవించు శౌరి –వరమున జగదేక వల్లభుం డతడు’’అని చెప్పింది ఆ వర ఫలమే అన్నమయ్య.ఇంతకు  ముందు వారి వంశం లో ఎవరికీ ఈ పేరు లేదు ఈయన తోటే ప్రారంభమైంది. ఒక రోజు స్వామి ‘’పంచాస్త్ర కోటి స్వరూపుడు ,రవళిమ్చు పసిడి మువ్వల యందెలు ,పైడి వలువలు మొదలైన వస్త్ర ఆభరణ విశేషాలతో దివ్య తేజో రాశిగా దర్శన మిచ్చాడు .’’నాకై పదరచన ము అల్లుము ‘’అని ఆదేశించి అదృశ్యమైనాడు .సందేహాలన్నీ తీరాయని ,బ్రహ్మానందం పొందానని ,సంకీర్తన లతో దేవుని కోరిక తీరుస్తానని పదం చెప్పాడు.తాళ్ళపాకలో ఆయనక కుటుంబం వ్యవసాయంచేసేది .ఒకరోజు గడ్డికోయ్యటానికి పొలం వెళ్ళాడు ఏమరుపాటు తో కొడవలి చేతికి తగిలి రక్తం కారింది . .ఏదో అశాంతి మనసులో జొరబడింది . ఆ భావాలనే పదం గా రాశాడు .అప్పుడే వెంకటాద్రి ఉత్సవాలు జరుగుతుంటే భక్తజనం వెంట వెళ్ళాడు

2-తిరుమలేశుడు కనిపించాడా బావగారూ

1-.దూరం గానే ‘’తిరు వెంగడము ‘’కనిపించింది ‘.అది ‘’పది వేల శేషుల పడగల మయం –అఖిలోన్నతం  ,బ్రహ్మాదులకు అపురూపమైన హరివాసం.అఖిలానికి నిత్య నివాసం గా ,బ్రహ్మానంద రూపం గా ‘’ కన్పించింది .’’అది మూల నున్న దనం గా భాసించింది .ఆ కొండ వేదాలే శిలలుగా మారిన కొండ .పుణ్య రాశులే ఏరులైనాయి .బ్రహ్మాది లోకాల కొనల కొండ .సర్వ దేవతలు అక్కడ మృగ జాతిగా ఉన్నారు .జల నిధులే నిట్ట చరులు .తపసులే తరువులు .పొడుగ్గా ఉన్న కొండ పూర్వపు అంజనాద్రి .మరి అలాంటి చోట కొండపై శ్రీదేవుడు ఎందుకు కొలువై ఉండడు ?నడిచి నడిచి అలసిపోయాడు .ఒక చెట్టుకింద నిద్రపోయాడు .నిద్రలో అలమేలు మంగ చెప్పులతో కొండ యెక్క రాదనీ మందలించి స్వామి వారి ‘’లడ్డు ప్రసాదం ‘’తినిపించి సేద తీర్చింది. మెలకువ వచ్చి అమ్మపై ‘’శతకం’’ చెప్పాడు .ప్రతిపద్యం చివరా ‘’వెంకటేశ్వరా ‘’అనే మకుటాన్ని వాడాడు .మకుటమే స్వామిది. లోపలి పద్యమంతా అమ్మవారిపైనే .అప్పటికి అన్నమయ్య పదారేళ్ళ పడుచు అమ్మవారికి వేవేల మొక్కులర్పించాడు .’’లోకపావనీ !ధర్మార్ధ కామ మోక్షాలు నీకు సోపానాలు .నాలుగు వేదాలు నీకు దరులు .నీజలం సప్తసాగరాలు .కూర్మమే నీ లోతు.గంగాది తీర్దాలు నీ కడళ్లు.దేవతలు నీ జల జంతువులు .నీదగ్గరి మేడలు పుణ్యలోకాలు .గట్టుమీది చెట్లు పరమ మహర్షులు .  నీ ఆకారం వైకుంఠ నగరం వాకిలి .వేంకటేశుడే నీ ఉనికి ‘’అంటూ పరవశించి పాడి పడిపోయాడు .లేచి పెద్ద గోపురాన్ని ,చింత చెట్టును చూసి ప్రదక్షిణాలు  చేశాడు .ఆ వృక్షాన్ని’’ శేషాంకం’’ అన్నాడు .గరుడ ధ్వజానికి మొక్కాడు .విమాన శ్రీనివాసుడిని చూసి ,ఆనంద నిలయం వగైరా తనివి తీరా దర్శించి లోపల శ్రీనివాసుని మనసారా తనువారా సందర్శించిపులకి౦చి పోయాడు .అక్కడి చిలుకలు స్వామిని కీర్తిస్తున్నాయట .ముందే పెద్ద హనుమంతుని దర్శనం అయింది .ఆయన చేతిలో బలు ముష్టి ,పైకెత్తిన వల చేయి ,శిరస్సుమీద వాలుగా ఉన్న తోక ,మిన్నులను మోసే మహా కాయం .బంగారు పట్టు గోచి .తొడల దాకా వ్రేలాడే పెద్ద పతకం ,బలమైన కండలు .’’విఠలాని’’కి కావలి కాస్తూ కనిపించాడు .ఇక్కడ ‘’విఠలం ‘’అంటే అన్నమయ్య భావనలో ‘’వెంకటాద్రియే ‘’.అంటే కొంత దృష్టి భేదాన్ని తగ్గించుకొన్నాడన్న మాట .’’స్వామీ !నీవు ఇందిరా పతికి నిజ సేవకుడవు .నీ కింద పసిడి బడ్డల వాళ్ళు పదికోట్లు .మూడు లోకాలు నీశిశువులు .జగాన్ని అంతటిని ఒకే రాజ్యం గా ఏలావు .సూత్ర వతీ దేవికి ప్రభుడవు .నువ్వే వెంకట విభుని సిరుల పెన్నిదివి ‘’అంటూ పులకిన్చిపోయాడు .కట్టెదుట స్వామి దివ్య మంగళ స్వరూపం కనిపిస్తోంది . ‘’..జగాన్ని అంతటిని ఒకే రాజ్యం గా ఏలావు .సూత్ర వతీ దేవికి ప్రభుడవు .నువ్వే వెంకట విభుని సిరుల పెన్నిదివి ‘’అంటూ పులకిన్చిపోయాడు .కట్టెదుట స్వామి దివ్య మంగళ స్వరూపం కనిపిస్తోంది .

2-చాలా గొప్పగా చూపించారు బావగారు తిరుమలేశునిచూసి  ఊరుకున్నాడా అన్నమయ్య

1-ఊరుకుంటే మనం చెప్పుకోవాల్సింది ఏముంటుంది ? స్వామి పాదాలు ‘’బ్రహ్మ కడిగినవే .బ్రహ్మమే ఈ పాదం .బలి తలను తన్నింది ,గగనాన్ని తన్నింది ,భూమిపై మోపిందీ ఈపాదమే .బలికి మొక్షాన్నిచ్చిందీ ఈపాదమే ’’అని కీర్తించాడు .ప్రాచీనులు స్వామిని త్రివిక్రమావతారం గానే భావింఛి ‘’అడియోన్’’అన్నారు .స్వామి చేయిని పొగడుతూ ‘’అందరికి అభయమిచ్చినదని, వేదాలని వెతికి తెచ్చిందని ,భూదేవిని కౌగిలించిందని ,నాగేలును ధరించినదని ,మొక్షాన్నిచ్చే చేయి అని కీర్తించాడు .అక్కడ జరిగే సేవలన్నీ తనివి తీరా వీక్షించాడు .శుక్రువారప్పూజకు పరవశుడయ్యాడు .’’సొమ్ములన్నీ కడ బెట్టి ,సొంపుతో గోణము గట్టి –కమ్మని కదంబము ,కప్పు పన్నీరు –చెమ్మతోన’’వేష్టువలు ‘’రొమ్ముతల మొల చుట్టి ‘’అని పదం పాడాడు .ఇక్కడ ‘’వేష్టువం ‘’అనే మాట అన్నమయ్య వాడాడు .అంటే అప్పటికే కొంత వైష్ణవం ,సంప్రదాయం అన్నమయ్యకు అర్ధమైంది  .నైవేద్యాల వైభోహాన్ని కన్నులార గాంచాడు .’’మేరు మందారాలలాగా మెరిసే ఇద్దేనలు ,సూర్య చంద్రుల్లాంటి గుండ్రనిపళ్ళాలు ,చుక్కలు రాసి పోసినట్లు ఆరని రాజనాల అన్నం ,అనేక సముద్రాల్లాంటి వెండి గిన్నెలు ,మంచుకొందల్లాంటి వెన్న ముద్దలు ,వెన్నెల రసమా అన్నట్లు పంచదార కుప్పెలు ,తేనెల గిన్నెలు ,టెంకాయ పాలు ,ఆనవాలు ,వెన్నట్లు ,అరిసెలు ,గారెలు  కరిజి కాయలు (కజ్జికాయలు ),కండ మండేలు,పూర్ణపు కుడుములు (ప్పూర్నబ్బూరెలు )ఇలా ఎన్నెన్నో నైవేద్యాలు .స్వామి తిన్నాడో లేదోకాని మనకు మాత్రం నోరూరించాడుఅన్నమయ్య.కదా బావగారూ

2పరవశమే కలిగించారు మీరు .

1-ఇవన్నీ నేను చెప్పినవికాదు బావగారూ –సరస్వతీపుత్ర డా పుట్టపర్తి నారాయణాచార్యుల వారి అమోఘ విశ్లేషణ.నాకు అందింది మీకు అందించాను పోస్టాఫీస్ బిజినెస్ గా అంతే.అన్నమయ్య రాసిన 32వేల పదాలలో మొదటిదీ ఛివరిదీ ఎవరికీ ఇప్పటి వరకు తెలియదట

2-అసలు స్వామి ఎలాకనిపించాడు అన్నమయ్యకు బావగారూ

1-     పొడగంటి మయ్యా మిమ్ము పురుషోత్తమా !కోరిక లేడ సేయకయ్యా కోనేటి రాయడా –‘అని పదం పాడుతూ ‘’మమ్మల్ని ఏలే కులదైవం .మా పెద్ద లిచ్చిన నిదానం .చేతికందిన పారిజాతం , చింతా మణివి,కోరిక లిచ్చే కామ దేనువువి .చెడిపోకుండా కాపేడే సిద్ధమంత్రానివి ,రోగాలను పోగొట్టే  దివ్య  ఔషదానివి,బడి వాయక తిరిగే ప్రాణ బంధువువి నీ అభయ హస్తం తో చేదుకో ‘’ అని ఆర్తిగా వేడుకొన్నాడు .ఇన్ని చేసిన శ్రీనివాసుని అభయ హస్తం మాత్రం అన్నమయ్యకు ఇంకా దక్కలేదు

2-     తర్వాత ?

1-ఇంటికి తిరిగివచ్చాడు కాని ధ్యాస అంతా  శ్రీనివాసుడిపైనే ఇంట్లో చెప్పకుండా మళ్ళీ వెళ్లి దర్శించాడు .స్వామి దివ్యగాధలు ఊళ్లోనూ ఇక్కడా వింటూనే ఉన్నాడు .ఏమైనా స్వామిని పట్టుకోవాల్సిందే అనే నిశ్చయానికి వచ్చాడు .’’ఈతడు రామానుజుడు ఇహ పర దైవము –చలిమి నీతండే చూపే శరణాగతి –నిలిపినాడీతండేకా నిజ ముద్రా ధారణము –మలసి రామానుజు డే మాటలాడే దైవము ‘’అని పాడిన పదం లో అన్నమయ్య వైష్ణవ దీక్ష పొందాడని ,ఇక శ్రీనివాసుడే అన్నీ చక్క బరుస్తాడనే ధైర్యం నమ్మకం ఏర్పడింది .మనసంతా శ్రీనివాసుడే పరచుకోన్నాడు .ఆ హరి ధ్యానాన్ని వదిలి ఒక్క క్షణమైనా ఉండలేక పోతున్నాడు .శ్రీ హరి కీర్తనతో తనువు మనసు ధన్యంచేసుకొంటున్నాడు .’’హరిని  కాదన్నవారు అసురులె .పరమాత్ముడు ఈయన ప్రాణమే .వేదరక్షకుడైన విష్ణువే .ఇహపరాలనిచ్చేది ఈదేవుడే .పార్వతికూడా ఈతనినినే ‘’సుత్తి ‘’చేస్తుంది అని పాడాడు .

2-శృంగారం రంగ రించాడా

1-అమ్మవారి అయ్యవారి అన్నిరకాల శృంగారం కొంతమితిమీరినా బాగా రాశాడు .తాదాత్మ్యంలో ఒళ్ళూ పైనా తెలీవుకదా బావగారు ,కాంతలో 12రాసుల ఉనికిని పరమాద్భుతంగా గుర్తించి రాసి చరిత్ర సృష్టించాడు .

2-సాల్వ నరసింహుడి విషయం ఏమిటి

1-ఒకరోజు సాల్వుడు అన్నమయ్యను దర్శించాడు ‘’నువ్వు చక్రవర్తివి అవుతావు ‘’అని దీవించాడు .ఆ ప్రయత్నం లో ఉంటె గజపతులు దండెత్తారు అన్నమయ్య అప్పుడు ఓఢ్ర భాషకూడా నేర్చాడట .తురుష్కుల దండయాత్రకూడా సాగి ప్రజలను భయభ్రాంతుల్ని చేస్తుంటే ‘’అయ్యోయ్యోకలికాలము ‘’అని వాపోయాడు ఆ వాగ్గేయకారుడు .ఆయన పూజావిగ్రహాలు ఎవరో దొంగలించారు .ఆంజనేయుడు తో సహా అందరికీ మొరపెట్టుకున్నాడు ,దొరక్కపోతే తానె వెదకటం మొదలుపెట్టాడు .దొరికినట్లు లేదు

2-వైష్ణవం ఎప్పుడు స్వీకరించాడు

1-శఠ కోప యతీంద్రుల వారి దర్శనభాగ్యం కలిగి క్రమంగా వైష్ణవానికి దగ్గరై,ఆచారాలు వంటబట్టించుకొని వాటిపై కీర్తనలు రాశాడు .శిష్యుడు సింహాసనం దక్కించుకొని గురువుగారిని పెనుగొండ కు  ఆహ్వానించి కొలువులో ఉంచి సంగీతగోస్టులు చేశాడునిత్యం ఒకరోజు శృంగార కీర్తన చెప్పమని అడిగితె ,పాతవాసన గుర్తుకొచ్చి  ‘’ఏమొకో చిగురుటధరమున ఎదఎడ కస్తూరి నిండెను ‘’చెప్పాడు .తనపై పదం చెప్పమంటే చెప్పను అంటే గురువునే సంకెళ్ళ తో బంధించి చెరసాలలో పెట్టాడు .రాజు కండకావరాన్ని పోగొట్టేది ఒక్క శ్రీని వాసుడే అని నమ్మి ఆయనపై ముఖారి లో ‘’ఆకలి వేళల ,నలపైన వేళల –తేకువ హరినామ మే దిక్కుమరి లేదు  ,-కొరమాలి యున్న వేళ ,కులము చెడిన వేళ-జెరవడియోరులచే జిక్కిన వేళ-నోరపైన హరినామ మొక్కటే గతి గాక – సంకెల బెట్టిన వేళ,చంప బనిచిన వేళ-అంకిలిగా నప్పుల వారాగిన వేళ-వేంకటేశు నామమే విడిపించ గతి గాక –మంకు బుద్ధి బొదలిన మరి లేదు తెరగు ‘’అని ఆర్తిగా వేడుకొన్నాడు..రాయలకు భయం వేసి ఆయన జోలికి మళ్ళీ వెళ్ళలేదు

2-తర్వాత ఏమైంది బావగారూ

1-తాళ్లపాకకో తిరుమలకో చేరి ఉంటాడు .కొందరు సాహితీకారులు అన్నమయ్య జాతీయాలను ‘’దొబ్బేసి ‘’తమవిగా ప్రచారం చేసుకొన్న సంగతి చేవినబడి తన మనోభావాలను ‘’రామ క్రియ ‘’లో ఇలా తెలియ జేసుకొన్నాడు .’’వెర్రు లారా!మీరు వేరుక కలిగి తేను –అర్రు వంచి తడుకల ల్లంగ రాదా!ముడిచి వేసిన పువ్వు ముడువ యోగ్యము కాదు –కుడిచి వేసిన పుల్లె కుడువ గా రాదు –బడి నొకరు చెప్పిన ప్రతి చెప్ప బోతేను –అదరు శ్రీహరికిది అరుహము కాదు’’అని అంటూ ‘’చిబికి వేసిన గింజ చేత బట్టగ నేల-కబుక కెంగిలి బూరె గడు గంగ మరినేల?-మించు చద్ది కూటి మీద నుమిసినట్లు –మంచిదొకటి చెప్పి మరి చెప్పనేరక –పుచ్చి నట్టి పండు బూజు లోననె యుండు –బచ్చెన కవితలు బ్రాతిగావెందు-‘’అని చివరికి ‘’ఎన్నగ శ్రీ వేంకటేశు తాళ్ళపాక –అన్నమాచార్యులు అఖిల దిక్కులు మెచ్చ –ఉన్నతితో బాడిరాక డేవ్వ డను –సన్న నోరాసు నట సమ్మతా హరికి?అని ఏకి పారేసి శ్రీహరినే నమ్మాడు .

కీర్తి,కనకాలు వర్షిస్తూనే ఉన్నాయి .పదకవితా పితామహుడని పించుకొన్నాడు ఆ తర్వాత ‘’ ‘’సంకీర్తనా చార్యుడు’’అని పేరొందాడు .ఇక ఇక్కడి నుండి అన్నమయ్య సాధన ప్రారంభం అయింది.అప్పటిదాకా సంసారం ‘’అమృతపు నడబావి’’అనిపించి ఇప్పుడు ‘’జలధి లోపలి ఈత ,జము నోటిలో బతుకు ,చమురు తీసిన దివ్వె’’ ,’’అన్న ఎరుకకలిగి,అప్పుడెప్పుడో స్వామి కనిపించాడు కానీ మళ్ళీ కనిపి౦చ లేదన్నబాద పెరిగి అది తనతప్పే అని గ్రహించి ‘’  యెంత మాత్రమున ఎవ్వరు తలచిన అతడు అంతమాత్రమే .ఘన బుద్ధులకు ఘనుడు .అల్ప బుద్ధులకు అల్పుడు .నీటికొలది తామర ‘’అని స్వామి వెంటబడ్డాడు . శ్రీరాగం లో ‘’నిత్యాత్ముడై యుండి నిత్యమై వెలుగొందు –సత్యాత్ముడై యుండి సత్యమై తానుండు –ప్రత్యక్షమై యుండి ,బ్రహ్మమై యుండు ‘’అని స్వామి అసలు రహస్యం అర్ధం చేసుకొన్నాడు .’’ఏ మూర్తి బ్రహ్మాదులెల్ల వెదకెడు నాత-డేమూర్తి నిజ మోక్ష మియ్య జాలెడు నాత-డే మూర్తి లోకైక హితుడూ –ఏ మూర్తి నిజ మూర్తి  నే మూర్తి యును గాడు ,-ఏ మూర్తి త్రై మూర్తు లేకమై యాత-డేమూర్తి సర్వాత్ముడైన మూర్తి –ఆ మూర్తి తిరు వెంకటాద్రి విభుడు ‘’అని స్వామి సర్వాన్తర్యాన్ని ,త్రిమూర్తి స్వరూపాన్ని మనసులో దర్శించాడు .’ ఏ వేల్పు పాదయుగ మిలయు నాకాశంబు –ఏ వేల్పు పదమీ శాన్తంబనంతంబు –ఏ వేల్పు నిశ్వాస మీ మహా మారుతం-బే వేల్పు నిజ దాసు లీ పుణ్యులూ –ఏ వేల్పు సర్వేశు డేవేల్పు పరమేశు –డేవేల్పు భువనైక హిత మనో భావకుడు –ఏ వేల్పు కడుసూక్ష్మమే వేల్పు కడు ఘనము-ఆ వేల్పు తిరు వెంకటాద్రి విభుడూ ‘’అని అలౌకిక ప్పారవశ్యం తో వొడలు తెలియక పాడాడు.

2-ఇదే  భక్తరామదాసు సినిమాలో  కబీరు,రామదాసు కలిసిపాడుతారు .దీనికి మూలం అన్నమయ్య రచనే అన్నమాట

1-అవును యదార్ధం బావగారూ రచయిత భారవి అన్నగారు వేదవ్యాస రాసిన మహా గొప్ప పాట అది .చివరికి శరణాగతికి వచ్చి ‘’నీ నామం భవహరం ‘’అంటూ శ్రీనివాసునిపై భారం వేసి నిశ్చింతగా కూర్చుని ఆయన దయతో పరమపద సోపానం చేరాడు సంకీర్తనాచార్య ,పదకవితా పితామహ తాళ్ళపాక అన్నమాచార్య <span style=”font-size:9pt;font-family:Arial,sans-serif;color:rgb(51,51,51);background-image:initial;background-position:initial;background-size:initial;background

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

సుందర కాండ లో హనుమ బహుముఖీన వ్యక్తిత్వం-19

సుందర కాండ లో హనుమ బహుముఖీన వ్యక్తిత్వం-19

తెల్లకలువల సమూహం గా ప్రకాశించే నిర్మల చంద్రుడు ,నల్లని జలాలలోకి హంస వెళ్లినట్లు నిర్మలాకాశం పైభాగాన కనబడి ,తనకా౦తితో సహాయ పడేట్లు హనుమను సేవిచటానికి వచ్చాడు .ఆచల్లని వెన్నెలలో హనుమ సీతాదేవిని చూశాడు .ఆమె చుట్టూ ఒంటికన్ను ఒకే చెవి కలవారు చేటచెవులతో తలను దాచు కొన్నది ,అసలు చెవులే లేనిది ,పంది చెవుల్లాంటి చెవులున్నది ,ముక్కు పైకి ఉన్నది ,సన్నని పొడవైన మెడ ఉన్నది ,కొద్ది జుట్టున్నది అసలు జుట్టే లేనిది వ్రేలాడే చెవులు నొసలున్నది ,వ్రేలాడే పొట్ట, స్తనాలున్నది ,వ్రేలాడేమోకాళ్ళు న్నది ,గూనిది ,మరిగుజ్జుది,పారపళ్ళున్నది ,అసలు పొట్ట మోహంలో ఉన్న వికృతమైనది ,మొదలైన రాక్షస స్త్రీలను చూశాడు .నల్ల తెల్ల యెర్ర మొదలైన రంగు శరీరం ఉన్నవారు ,పందిముఖం లేడి ముఖం , ఎనుబోతుముఖం ,మేకమొహం ,నక్కముఖం ,ఏనుగు పాదం ఒంటేకాళ్ళు,దేహంలోనే తల దూరి ఉన్నవారు ,ఆవు నక్క కుక్క ఏనుగు ,కోతిచెవులున్నవారు ,అడ్డముక్కు పెద్దముక్కు ఏనుకాళ్ళవారు ,పాదాలలోజుట్టున్నవారు ,అనేక జంతు ముఖాలున్నవారు ,రకరకాల రంగు వెంట్రుకలున్నవారు కలవారు ,మద్యం లో పూర్తి నిషాలో ఉన్న అనేకరకాల రాక్షస స్త్రీలను సీత చుట్టూ ఉన్నట్లు గమనించాడు

  అనవద్య సౌందర్య తేజో మూర్తి సీతమ్మను చూశాడు .పతివ్రతా ధర్మం తో పెరిగిన కీర్తి శోభతో ,పతి స్నేహమే అలంకారంగా ,సింహం చేత బంధింపబడిన ఆడ ఏనుగులా గా , మేఘాలచే ఆక్రమించబడిన చంద్ర రేఖలా ,బెదరిన ఆడలేడి చూపులతో ,శోక సమూహంగా ,దుఖ సాగర తరంగం పైకి లేచినట్లు న్న సీతను చూసి హనుమ ఆనంద పారవశ్యంతో కన్నీరు కార్చాడు .రామలక్షమణులను ఒకసారి తలచుకొని నమస్కరింఛి ,శింశుపా వృక్షం ఆకులమధ్య దాక్కున్నాడు .

‘’నమస్కృత్వా చ రామాయ ,లక్ష్మణాయచ వీర్యవాన్ –సీతా దర్శన సంహృస్టో హనుమాన్ సంవృతో భవత్ ‘’

ఇది 32శ్లోకాల 17వ సర్గ .ఇందులో ఎన్నిరకాల రాక్షస స్త్రీలున్నారో వాల్మీకి మనకు చూపించాడు. సీత పాతివ్రత్యాన్ని మరింత మెచ్చే శ్లోకాలు రాశాడు .లంకలో దిగినప్పుడు చంద్రోదయం యెంత గొప్పగా హనుమకు సహకరించిందో ,ఇక్కడ అశోకవనం లోనూ చంద్రుడు ఆయనకు బాగా సహాయపడ్డాడు కాంతితో .

   సశేషం

  నృసింహ జయంతి శుభాకాంక్షలతో

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -6-5-20-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

ప్రపంచ దేశాలసారస్వతం 58-జర్మన్ సాహిత్యం -2

ప్రపంచ దేశాలసారస్వతం 58-జర్మన్ సాహిత్యం -2

యోహన్ క్రిస్టోప్ గొట్జ్ షెట్జ్-1700-1766 తో 18వ శతాబ్ది జర్మన్ సాహిత్యం మొదలైంది సాహిత్యం లో శైలి,రూపం తో నియమబద్ద రచన చేశాడు .విషాదాంత నాటకాలలో హాస్యం కూడా జతకలిపాడు తర్కానికి అధిక ప్రాదాన్యం ఇచ్చాడు తరువాత రచయితలపై ఇతని ప్రభావం జాస్తి ..ఇదికాదు అని భావుకతకు ప్రాదాన్యమిచ్చాడు గొట్టిలీబ్ క్లోవ్ స్టోక్-1724-1803.ఇతని ఇతిహాస మహాకావ్యం ‘’మేసియా ‘’లో భావన ,తొట్రుపాటు  ఎక్కువ .విన్క్మేన్ మొదలైనవారు గ్రీకు సాహిత్యం షేక్స్పియర్ సాహిత్యం ప్రచారం లోకి తెచ్చాడు .కావ్యకళ కు జీవం పోశాడు రేస్సింగ్ .హంబుర్గి షెడ్రమటుర్జీ-1769లో జర్మన్ నాటకరంగాన్ని సమీక్షించాడు 1766 ఇతడు ఉత్తమ సౌందర్య మీమాంస గ్రంథం’’లయోమాన్ ‘’రాశాడు .ఇదే గోథే,షిల్లర్ ల  కావ్య సృష్టికి పునాది అయింది మిస్ సారా సాంప్సన్ -1755,మినా ఫర్ బార్న్స్ హెల్మ్-1767,ఎమిలియా గలోటి-1772,నాథన్ డేర్ వైజ్ -1779 అనే నాటకాలురాశాడు హంబుర్గి .ఆధునిక యుగానికి ఇవే రాచబాట వేశాయి 18వ శతాబ్దం లో వ్యక్తిత్వం  ,కల్పనా ,భావుకత , అనుభూతుల  మేళవింపు తో వచ్చినకవిత్వమే ఆధునిక కవిత్వం . హేర్డర్ కవి ‘’ స్టుర్మ్ ఉండ్ డ్రాంగ్’’అనే ఆందోళన లేపాడు .దీనితో బుద్ధికి ప్రాధాన్యమిచ్చియా౦త్రికత ను వదిలేసి ,జానపద గీతాల పై దృష్టి కల్పించాడు .ఈ సమయంలో చాలా విదేశీ సాహిత్య గ్రంథాలు జర్మన్  భాషానువాదం పొందాయి .

  జర్మన్ దేశీయ సాహిత్యాకాశసూర్యుడు యోహాన్ ఉల్ఫ్ గ్యాంగ్ గోథే -1749-1832.సాత్విక భావాలకు ప్రాణం పోసి గోథిక్ కళను ,స్టెన్, షేక్స్పియర్ రచనలను అధ్యయనం చేసి ,తార్కికబుద్ధికన్నా ప్రతిభ మేలు అని భావించి  చిరస్మరణీయ కవితా సృష్టి చేశాడు .’’గొయట్స్ ఫన్ బర్లి షెన్గెన్’’అనే నాటకాన్ని రాశాడు .దీనిలో నూతనభావుకత ,కల్పనా సామర్ధ్యం పుష్కలం .మధ్యయుగం లోకి ‘’ఫాస్ట్ ‘’కథకు ఆకర్షితుడైనాడు .ప్రాపంచిక సుఖాలకోసం మెఫిస్టో ఫెలిస్ భూతానికి తన ఆత్మను అమ్ముకొన్న ఫాస్ట్ చివరికి నరకం చేరటం వృత్తాంతం ,ఫాస్ట్ ఆశయం ఆత్మ తృప్తి .అందుకే భూతానికి దాసుడయ్యాడు .మొదటిభాగం  అద్భుత కవిత్వం కల్పనా చమత్కృతి భావుకత  వెల్లి విరుస్తుంది గోథే రచనలో .రెండవభాగ౦ పై 30ఏళ్ళు దృష్టి పెట్టి రాసి , తన ప్రతిభా సామర్ధ్యాన్ని అంతా ఒలకబోసి భేష్ అనిపించాడు  .ఈ మధ్యలో ఒక భగ్న ప్రేమికుడి ఆత్మహత్య తెలిపే ‘’వేర్తెర్క్ లెయిడన్’’నవల రాశాడు .వీటి తర్వాత క్లౌవిగో ,ఎగ్మండ్ నాటకాలు ,విజేల్మ్ మైస్టర్అనే నవలా ,అనేక గేయాలూ రాసి ,జర్మన్ సాహిత్యానికే కాక ఐరోపా సాహిత్యానికీ మార్గదర్శి అయ్యాడు .తన జీవిత చరిత్రను ‘’డిష్ టుంగ్ ఉండ్ వర్ హిట్’’అంటే ‘’కవిత్వం –సత్యం ‘’పేరిట రాసి ప్రచురించాడు .. మహాకవి కాళిదాసు రచించిన ‘’అభిజ్ఞాన శాకుంతలం ‘’నాటకం చదివిన జర్మన్ నాటక కథ ,విమర్శకుడు దార్శనికుడు గోధే ఆనందం తో నృత్యం చేశాడని ‘’దివి ని భువి ని కలిపిన మహత్తర నాటకం ‘’అని శ్లాఘి౦ చాడు ‘’అని 3-3-14 న అమెరికాలోని హూస్టన్ లో గోథేరాసిన ‘’ఫాస్ట్ ‘’నాటకం చదివి దాన్ని గురించి చెబుతూ ఉపోద్ఘాతంగా నేను రాసిన మాటలివి .జర్మని ఎయిర్ పోర్ట్ ఫ్రాంక్ ఫర్ట్ లో    ఒక రెస్టారెంట్ కం బార్ లో గోథే విగ్రహాన్ని చూసి పులకించి ఫోటోలు తీశాను .అంతటి మహారచయితకు బార్ లో విగ్రహం ఏమిటని ఆశ్చర్యపోయాను కూడా .

   గోథే సమకాలికుడు షిల్లర్ -1759-1805’’డీ రాబర్ ‘’-దొంగలు నాటకంలో సంప్రదాయబద్ధ సాంఘిక మర్యాదలను విమర్శించాడు .ఇతడి ‘’ఫీస్కో ‘’నాటకం ప్రజాదరణ పొందలేదు కాని ‘’కబలే ఉండ్ లీబే ‘’కుట్ర –ప్రేమ నాటకం లో ఆత్మానుభూతి ,యదార్ధ పాత్ర చిత్రణ ,ఆవేగం అంటే తొట్రుపాటు ఉన్నాయి .డాన్ కార్లోస్ పద్య నాటికలో స్వంత చరిత్ర కొంత జోడించాడు .జర్మనీలో జరిగిన 30ఏళ్ళ యుద్ధం చరిత్ర ,వాల్లెన్ స్టెన్,డీ జంగ్ ఫ్రన్ ఫన్ ఆర్లియన్స్ ,విలేలం టేల్అనే మూడు ఉత్తమనాటకాలూ ,గేయాలూ రాశాడు .అన్నిటిలో శబ్ద శ్రావ్యత లావణ్యం ,లయ మూర్తీభవించి ఉన్నాయి .

 నూతన భావుకత హొయల్ డెర్లిన్ కవి కవిత్వం లో ఉన్నది -1770-1843.చివర్లో ఉన్మాదం వచ్చే ముందు రాసిన గేయాలు మనసుకు  ఆర్ద్రత కలిగిస్తాయి .మానవాతీత కథలు రాశాడు హోఫ్మన్-1776-1822.యక్ష,కిన్నెర గాథలు రాసి పండించాడు టీక్ కవి-1773-1853.కొన్ని మంచినాటకాలూ రాశాడు .ష్లె గెల్ సోదరులు నవ్య యుగ సాహిత్య ,నాటక సాహిత్యాలను సమీక్షిస్తూ రచనలు చేశారు .కొన్ని అనువాదాలూ చేశారు .బ్రెంటానో-1778-1842లో రాసిన కథలు తరువాతకవులకు కావ్య వృత్తాలైనాయి .చాయా, రహస్య వాదాలు  రిక్టర్ -1763-1825 రచనలలో కనిపిస్తాయి నోవాలిన్ కవి -1772-1901-కవిత్వం లో రహస్య,ప్రతీక వాదాలున్నాయి .,లాలిత్యం మాధుర్యం తో  .మధ్యే మార్గం లో గొప్ప పద్యాలురాశాడు యూసుఫ్ ఫన్ ఐచెన్ డోర్ఫ్-1788-1857..ఈయుగ ఉత్తమ నాటకకర్త హేన్రిష్ ఫన్ క్లైస్ట్ -1777-1811.నిరాశ నిండి ఉన్న ఇతని నాటకాలలో ఫ్రింజ్ ఫీడ్రిష్ ఫన్ హో౦ బర్గ్  శ్రేష్టమైనదని భావిస్తారు .

   సశేషం

నృసింహ జయంతి శుభా కాంక్షలతో

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -6-5-20-ఉయ్యూరు

 గోథే  చిత్రం కవిత

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

రేడియోబావగారి కబుర్లు -4

బావ 2-ప్రహ్లాద వరద గోవి౦దా హరి –నమస్కారం బావగారూ

బావ1-నమస్కారం రండి .సాభిప్రాయంగా నే పలకరించారు బావగారు

2-అదేమిటి బావగారూ

1-ఇవాళ ప్రహ్లాద వరదుడైన విష్ణుమూర్తి తన నాల్గవ అవతారంగా శ్రీ నృసింహావతారం దాల్చిన శుభదినం అంటే నృసింహ జయంతి

2-అలాగా యాదాలాపంగా అన్నదాన్ని చక్కగా సమన్వయం చేశారు బావగారూ .ఐతే  ఆ అవతార విశేషాలు సెలవీయండి

1-అలాగే బావగారూ .విష్ణువు నృసింహావతారం దాల్చాటానికి తనభక్తుడైన ప్రహ్లాదుడికి తాను  ఇచ్చిన మాట నిలబెట్టుకొవటానికే అన్నారువ విజ్ఞులు.ఆ విశేషాలు తెలుసుకొందాం .ప్రహ్లాదుని తండ్రి హిరణ్యకశిపుడు బ్రహ్మనుండి ,ఆయన  సృష్టించిన వాటి వలన మరణం రాకూడదని వరం పొందిన మేధావి .కనుక ఆ వరాలు అబద్ధం కాకూడదుకదా .విష్ణులోకం నుంచే ఏ చక్రాన్నో పంపి వాడిని చంపవచ్చు .కస్టపడి ఈ అవతారం దాల్చనక్కర లేదు .భాగవతం సప్తమ స్కంధం లో –‘’సత్యం విధాతుం నిజభ్రుత్య భాషితం –వ్యాప్తించ స్వస్య అఖిలభూత గమ్యతాం –అదృశ్యత ,అత్యద్భుత రూపం ఉద్వహన్ –స్తంభే సభాయా౦ న మృగ౦చ మానుషం ‘’అని ఉన్నది బావగారూ –దీని అర్ధం ఏమిటంటే –తనభక్తుడు చెప్పిన మాటను నిజం చేయటానికి ,తన సకల భూత వ్యాప్తినీ నిరూపించుకోవటానికి  సభామధ్యస్తంభం నుంచి నరసింహ స్వామి ఆవిర్భవించాడు అని భావం .ఇందులో ఎక్కడా హిరణ్యకశిపుని వధ కోసం అనే మాట లేదుకదా .

2-మంచి లా పాయింట్ లాగారు బావగారు .ఆ తర్వాత

1-‘’ఇందుగలడు అందు లేడు అనే సందేహం వలదు-చక్రి సర్వోపగతుండు ఎందెందు వెదకి చూచిన అందందే గలడు’’అని తండ్రికికొడుకు ఢంకా బజాయించి చెప్పాడాయెను.పైగా అనుమానం అక్కర్లేదనీ అన్నాడు .తల్లి కడుపులో ఉండగానే ప్రహ్లాదుడికి హరి సర్వాంతర్యామి అని స్పష్టం గా చెప్పాడు నారద మహర్షి .నారదుడికి ఈ రహస్యం చెప్పినవాడుసాక్షాత్తుఆయనతండ్రి  బ్రహ్మ . అది అతడికి నరనరానా జీర్ణించుకు పోయింది .వీరంతా  విష్ణుభక్తులే వారి నమ్మకం ,మాట నిలబెట్టటం భగవంతుని తక్షణ కర్తవ్యమ్ .భక్తుడు అన్నమాట నిజం చేయకపోతే దేవుడికి పుట్టగతులు౦ టాయా బావగారు ,అందుకే దైత్యరాజుస్తంభం లో చూపించమని దానిపై ఒక దెబ్బవేస్తే ,అందులోనుంచి ప్రళయరుద్రుడిలా ప్రత్యక్షమై భక్తుని మాట నిజం అని నిరూపించిన అవతారమిది .దీనికి తోడూ ‘’పరిత్రాణాయ సాధూనాం వినాశాయచ దుష్కృతాం ‘’అని మనకు తెలిసిన విషయమే .మరో కిటుకు కూడాఉంది

2-ఎక్కడో ముడి పెట్టి నెమ్మదిగా విడదీస్తూ అసలు విషయం చెబుతారుమీరు .ఆకిటుకేమిటోవిప్పండి బావగారూ  టెన్షన్ గా ఉంది

1-భక్తులకు నిజమైన ఆపద భగవంతుడు కనిపించకపోవటమే అన్నారు పెద్దలు .భగవంతుని దివ్య మూర్తి స్వరూపాన్ని ఒక్క త్రుటి కాలం  కూడా చూడలేకపోతే భక్తులు బ్రతకలేరు అన్నది సత్యం –‘’త్రుటి యుగాయతే తామవపశ్యతాం ‘’అని రోదిస్తాడు భక్తుడు .త్రుటి అంటే క్షణం లో 60వ వంతు .ఈ త్రుటి కాలం కనిపించకపోయినా అది భక్తులకు ఒక యుగం అనిపిస్తుందట .మరి ఇలాంటి పరమభాగావతోత్తముడైన భక్తుడికి భగవంతుడు యెంత ఇచ్చినా ,ఏమిచ్చినా సంతృప్తి ఉండనే ఉండదు .కనుక స్వామి తన స్వస్వరూపాన్ని భక్తులకు చూపించి పరమ సంతృప్తి కలిగించాడు నృసింహావతారం లో .భక్త ప్రహ్లాదుని మాట నిలబెట్టి ,ఆపద నివారించటమే ఈ నరసింహావతార పరమార్ధం అన్నారు తలపండిన విజ్ఞులు బావగారూ

2-భేషైన విశ్లేషణ బావగారూ .ఇంతదూరం అలోచించి వివరించిన వారి గురించి తెలుసుకోవాలని ఉంది

1-పరమ వైష్ణవ శిరోమణి డా కందాడై రామానుజా చార్య గారు బావగారూ .మనం వారికి కృతజ్ఞులం .

2-నృసింహ ఆవిర్భావం ఏ సమయంలో జరిగిందో ,ఆ రోజు ఏం చేయాలో వివరాలు అందించండి బావగారూ

1-వైశాఖ శుద్ధ చతుర్దశి సాయంత్రం హిరణ్య కశిపుని ఆస్థాన మండపం లో ఉన్న స్తంభం పై అతడు దెబ్బకోట్టగా స్వామి అవతరించాడు

వైశాఖశుక్లపక్షేతు చరుర్దశ్యాం సమాచరేత్,

మజ్జన్మసంభవం పుణ్యం వ్రతం పాపప్రణాశనమ్”

అని నరసింహుడు ప్రహ్లాదునితో పేర్కొన్నట్లుగా నృసింహ పురాణములో ఉంది.బావగారూ .ఇదంతా ఒకప్లాన్ ప్రకారమే జరిగింది  నృసింహ జయంతి నాడు ఉపవాసం ఉంటూ సాయం వేళ అ౦టే ప్రదోష  కాలం లో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి విగ్రహానికి పూజ చేసి ,మామిడిపళ్ళు ,పానకం ,వడపప్పు చలిమిడి నైవేద్యం పెట్టి బంధుమిత్రులకు వాటిని ప్రసాదంగా ఇస్తూ తాటాకు విసనకర్రలతో వీచి అందజేస్తారు .పిండి వండి మడితో ఉపాహారం గా సేవిస్తారు .ఓపిక ఉంటె  బంగారు నరసింహవిగ్రహం దానం చేసి రాత్రి జాగరణ చేస్తారు .మర్నాడు బంధువులను ఇంటికి పిలిచి షడ్ర సోపేత భోజనం పెట్ట దక్షిణ తాంబూలం ఇస్తారు

2-ఇంకా

1-నృసింహ పురాణం లో ఉన్న ప్రహ్లాదుని పూర్వ జన్మ కథ చదువుతారు .

2-ప్రహ్లాదుడికి కూడా ఫ్లాష్ బాకా బావగారూ

1-అవును ఉంది .నరసింహ పురాణంలో ఆకథ ఉంది

అవంతీ నగరంలో సుశర్మ అనే వేద వేదాంగ పారంగతుడు ఉండేవాడు .భార్య సుశీల ఉత్తమ ఇల్లాలు .వీరికి 5గురు కొడుకులు .చివరి వాడు వాసు దేవుడు వేశ్యాలోలుది అకృత్యాలు చేసేవాడు .ఒక రోజు వీరిద్దరికీ కలహం సంభవిస్తే వాసుదేవుడు అలిగి ఆ రాత్రి అన్నం తినలేదు .ఆ రోజు నరసింహ జయంతి కూడా .వేశ్య నిద్రపట్టక జాగరణ చేశాడు  .వేశ్యకూడా అలానే చేసింది .ఇలా తమకు తెలియకుండానే వారిద్దరూ నరసింహజయంతి నాడు ఉపవాసం జాగరణ చేయటం వలన వారిద్దరి పుణ్యం పుచ్చి ముక్తి పొందారు .ప్రహ్లాడుడే పూర్వ అన్మలో వాసు దేవుడు .

2-ఎప్పుడూ వినని కధ చెప్పారు తెలిసో తెలీకో మంచిచేస్తే కూడా గోప్పఫలితం కలుగుతుంది అని దీని అర్ధం కదా బావగారూ .నరసింహుడు ఆవిర్భ విన్చినప్పుడు కోలాహలం ఏమీ జరగా లేదా బావగారూ

1-ఎందుకు జాగలేదు ?ఆ విషయాన్నే గద్యంలో వివరించారు హృద్యంగా –వినండి

బ్రహ్మాండ కటాహం బ్రద్దలయ్యే ఛటఛట ఫటఫటారావములు ధ్వనించాయి. పదిదిక్కుల నిప్పులు చెదిరాయి. ప్రఫుల్ల పద్మయుగళ సంకాశ భాసుర చక్ర చాప హల కులిశాంకుశ జలచర రేఖాంకిత చారు చరణ తలుండును, చరణ చంక్రమణ ఘన వినమిత విశ్వ విశ్వంభరాభర ధౌరేయ దిక్కుంభి కుంభీనస కుంభినీధర కూర్మ కులశేఖరుండును, దుగ్ధజలధిజాత శుండాల శుండాదండ మండిత ప్రకాండ ప్రచండ మహోరు స్తంభ యుగళుండును, ఘణఘణాయమాన మణికింకిణీ గణ ముఖరిత మేఖలావలయ వలయిత పీతాంబర కటిప్రదేశుండును, ………. కులాచల సానుభాగ సదృశ కర్కశ విశాల వక్షుండును, వజ్రాయుధ ప్రతిమాన భాసమాన నిశాత ఖరతర ముఖ నఖరుండును, ధగధ్ధగాయమాన తటిల్లతా సమాన దేదీప్యమాన దంష్ట్రాంకురుండును, సంధ్యారాగ రక్త ధారాధర మాలికా ప్రతిమ మహాభ్రంకష తంతన్యమాన పటుతర సటాజాలుండును, ధవళ ధరాధర దీర్ఘ దురవలోకనీయుండును, ప్రహ్లాద హిరణ్యకశిపు రంజన భంజన నిమిత్తాంతరంగ బహిరంగ జేగీయమాన కరుణా వీర రస సంయుతుండును, మహాప్రభావుండును నైన శ్రీనృసింహదేవుడు” స్తంభమునుండి ఆవిర్భవించాడు.
2-మహా భీకరంగా కళ్ళకు కట్టినట్లుంది బావగారూ .మరి బాలప్రహ్లాదుడు భయపడలేదా

1-లేదు పరమానదించి ఆ మూర్తిని –

‘’లక్ష్మీకటాక్షసరసీరుహరాజహంసం పక్షీంద్రశైలభవనం భవనాశమీశం గోక్షీరసార ఘనసార పటీరవర్ణం వందే కృపానిధిం అహోబలనారసింహం ఆద్యంతశూన్యమజమవ్యయ మప్రమేయం ఆదిత్యచంద్రశిఖిలోచన మాదిదేవం అబ్జాముఖాబ్జ మదలోలుప మత్తభ్రుంగం వందే కృపానిధిం అహోబలనారసింహం’’

అని స్తుతించాడు భక్తిప్రపత్తులతో
‘’ఉగ్రవీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖమ్‌
నృసింహం భీషణం భద్రం మృత్యోర్‌ మృత్యుం నమామ్యహం’ అనే మంత్రాన్ని పఠించినా మృత్యువు సైతం ఆమడదూరంలో నిలిచిపోతుందని నమ్మకం బావగారు

2-నవనార సింహ క్షేత్రాలు అంటారు ఏమిటి బావగారూ

1-  హిరణ్య కసపుడిని  సంహరించి  వికటాట్టహాసాలు  చేస్తూ అహోబిల౦  కొండల్లో తిరుగుతూ తొమ్మిది ప్రదేశాల్లో వివిధ రూపాల్లో నరసింహ స్వామి వెలసారని ప్రతీతి .వాటినే నవనారసింహ క్షేత్రాలు అంటారు
(1) భార్గవ నరసింహ స్వామి
(2) యోగానంద నరసింహ స్వామి
(3) చత్రపట నరసింహ స్వామి
(4) ఉగ్ర నరసింహ స్వామి
(5) వరాహ నరసింహ స్వామి
(6) మాలోల నరసింహ స్వామి
(7) జ్వాల నరసింహ స్వామి
(8) పావన నరసింహ స్వామి
(9) కారంజ నరసింహ స్వామి

2-శంకరాచార్య జీవితం లో నరసింహ వృత్తాంతం ఉందని విన్నా నిజమేనా బావగారూ

1-బావగారూ మీరు అఖండులు.సమయానికి బాగా జ్ఞాపకం చేశారు  చెబుతా వినండి –

 శ్రీ శంకరులు శ్రీశైల పరిసరములలో చాలా కాలం తపస్సు చేసారు. శంకరులు తపస్సు చేసుకొంటూ ఈపరిసరాలలో హిందూ ధర్మ ప్రచార౦ చేస్తున్నప్పుడు  కొందరు కాపాలికులు అది నచ్చక ,ఆయనను అంతమొంది౦చే ప్రయత్నంతో   ఒకపెద్ద దొంగలముఠానాయకుని రెచ్చగొట్టి కొంత డబ్బిచ్చి  పంపించారు. వాడు పెద్ద కత్తితో సమయం కోసం ఎదురు చూస్తూ ఒక రోజు  శంకరుల వెనుకగా ఒకేవేటున తలఎగరగొట్టె ప్రయత్న౦తో  ముందుకురికాడు.  అదేసమయంలో   శంకరుల ప్రధాన శిష్యుడైన పద్మపాదుడు మల్లిఖార్జునుని దేవాలయ౦లోఈశ్వరుని ధ్యానించుచూ కూర్చున్నాడు .  మనసున లో  హఠాత్తుగా ఈ దృశ్యము కనిపించింది . వెంటనే అతడు మహోగ్రుడై శ్రీలక్షీనృసింహుని వేడుకున్నాడు. ఇక్కడ శంకరులను వధించటానికి  ఉరికిన ఆ దొంగలనాయకునిపై ఎటునుండో హటాత్తుగా ఒక సింహము దాడి చేసి శరీరాన్ని ముక్కలుముక్కలుగా చీల్చివేసి ఎలా వచ్చిందో అలాగే   మాయమైంది . ఇదంతా నరసింహస్వామి మహాత్మ్యం అని పద్మపాదుడు గ్రహించాడు .తమగురువు శంకర  భగవత్పాదులను తగిన సమయంలో కాపాడిన ఆయనకు కృతజ్ఞతలు చెప్పుకొన్నాడు తర్వాత మిగిలిన శిష్యులకు ఈ విషయంతెలిసి పద్మపాదుని అభినందించారు బావగారూ  .

2-ఇవాళ నరసింహ జయంతిని మహా సార్ధకం చేశారు బావగారూ .ధన్యవాదాలు .నమస్కారం  వెళ్లి వస్తా

1-సరే బావగారూ రేపు తప్పకరండి

  సశేషం

నృసింహజయంతి శుభాకాంక్షలతో

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -6-5-20-ఉయ్యూరు

Posted in రచనలు | Tagged | Leave a comment

6-5-20 బుధవారం శ్రీ నృసింహ జయంతి శుభాకాంక్షలు

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

ఉయ్యూరు శ్రీ సువర్చ లాంజనేయ దేవాలయం లో శ్రీ హనుమజ్జయంతి కార్యక్రమం  

ఉయ్యూరు శ్రీ సువర్చ లాంజనేయ దేవాలయం లో శ్రీ హనుమజ్జయంతి కార్యక్రమం

ఉయ్యూరు శ్రీ సువర్చలాన్జనేయ స్వామి వారల దేవాలయం లో17-5-20 శ్రీ హనుమజ్జయంతి మూడు రోజుల కార్యక్రమంగా ఈక్రింది విధంగా నిర్వహింపబడుతుంది .

15-5-20 శుక్రవారం –ఉదయం -5గం.కు మన్యుసూక్తం తో స్వామివార్లకు అభిషేకం అనతరం నూతనవస్త్రదారణ

ఉదయం 6గం-లకు గంధ  సిందూరం తో ప్రత్యేక అర్చన .ఉదయం 7గం.లకు తీర్ధ ప్రసాద వినియోగం

16-5-20-శనివారం –ఉదయం 6గంనుంచి 7గం వరకు –నాగ వల్లీ ( తమలపాకులు)పూజ -7గం.లకు తీర్ధ ప్రసాద వినియోగం

17-5-20-ఆదివారం –వైశాఖ బహుళ దశమి –శ్రీ హనుమజ్జయంతి

                          ఉదయం -6గం.నుంచి  -7గం.వరకు –మామిడిపండ్లు ,వివిధ ఫలాలతో ప్రత్యేక అర్చన  మరియు బంతిపూలతో అలంకరణ

                           ఉదయం -7గం నుండి 8గం వరకు –శ్రీ సువర్చలాన్జనేయస్వామి వారల శాంతి కల్యాణం

                        ఉదయం -8గం.లకు –తీర్ధ ప్రసాద వినియోగం

ముఖ్య గమనికలు -1-పై మూడురోజులలో ఆలయ ధర్మకర్తల ,కుటుంబ సభ్యుల ,ఆలయ నిర్వాహకుల పేరిట మాత్రమే పూజలు నిర్వహింప బడుతాయి. ఇతరులెవ్వరి పేరుతోనూ అర్చన జరుగదు .దీనికోసం ఎవరూ రుసుము  చెల్లించ వద్దు.

                 2-భక్తులు అత్యంత క్రమశిక్షణతో తప్పకుండా సా౦ఘిక దూరం పాటిస్తూ, మాస్కులు ధరించి మాత్రమే స్వామి వార్లను దర్శింఛి సహకరించవలసినదిగా కోరడమైనది .

     గబ్బిట దుర్గాప్రసాద్ –ఆలయ ధర్మకర్త -5-5-20 -ఉయ్యూరు

Posted in దేవాలయం | Tagged | Leave a comment

సుందర కాండ లో హనుమ బహుముఖీన వ్యక్తిత్వం-18

సుందర కాండ లో హనుమ బహుముఖీన వ్యక్తిత్వం-18

ముందుకు దూకుదామను కొన్న సమయం లో హనుమకు మళ్ళీ దుఖం ఆవరించింది .దీని నివారణకు సీతారామనామ స్మరణమే సాధనం అని భావించి ‘’అమేయ పరాక్రమశాలురైన సోదరద్వయం ,అమిత సాధుశీల సీతాదేవి లకే  ఇలాంటి దుఖం సంభవిస్తే’’ కాలాన్ని ఎవరూ అధిగమించటం సాధ్యం కాదు ‘’-అనిపిస్తోంది అనుకొన్నాడు .

‘’మాన్యా గురు వినీతస్య లక్ష్మణస్య గురుప్రియా –యది సీతాపి దుఖార్తా’’  దురతిక్రమః

వాల్మీకి మహర్షిహనుమతో చెప్పించిన ‘’కాలోహి దురతి క్రమః’’ అన్నఉడి మాట లోకం లో  నానుడి అయింది ’

మళ్ళీ విచార ధార  కొనసాగిస్తూ ‘’ స్వభావం ,వయసు ,నడవడి,వంశం,సాముద్రిక  లక్షణాలు సీతా రాములకు సమానంగాఉన్నాయి.లక్ష్మీ దేవి గా ఉన్న సీతను స్మరిస్తూ ‘’ఈమె కోసమే రాముడు వాలి సంహారం చేసి ,రావణ సాటి పరాక్రమమున్న కబంధుని హతమార్చాడు .జనస్థానం లొ14వేలమంది భీకర రాక్షసులను అవలీలగా చంపేశాడు .ఖర ,దూషణ ,త్రిశిరస్క మహా తేజోవంత  రాక్షసులను సంహరించాడు .   దక్కదు అనుకొన్న వాలి సామ్రాజ్యం కిష్కింద   సుగ్రీవుడికి అవలీలగా తమ్ముడు సుగ్రీవుడికి దక్కింది .సీత క్షేమం తెలుసుకోవటానికే  నదీనదపతి మహా సముద్రాన్ని దాటి వచ్చి లంకలో ప్రవేశించాను .అలాంటి పతివ్రతామతల్లి సీతా దేవి కోసం రాముడు ధరిత్రిని అంతా తలక్రిందు చేసినా తప్పు లేదు .ముల్లోకాదిపత్యమా ,లేక జానకీ దేవి సీత యా ఎవరు గొప్ప అని ప్రశ్నవస్తే ,సీతతో పదహారవ వంతు అయినా ముల్లోకాదిపత్యం సరిరాదు  అనిపిస్తోంది ఇది నిశ్చయం .-

‘’రాజ్యం వా త్రిషు లోకేషు ,సీతావా జనకాత్మజా –త్రైలోక్య రాజ్యం సకలం సీతాయా నాప్నుయాత్కలాం ‘’.ఈ శ్లోకమూ లోకంలో గొప్ప ఉదాహరణగా వాడుకలో ఉన్నది.

 శ్రేష్ట రాజు దశరధుని పెద్దకోడలు ,ధర్మజ్ఞుడు,కృతజ్ఞుడు,పరమాత్మ విదుడు ఐన శ్రీరాముని ధర్మపత్ని సీతాదేవి ఇక్కడ లంకలో రాక్షసులమధ్య దీనయై ,దుఖంతో  కుమిలిపోతోంది .అల్లారు ముద్దుగా జనకుని ఇంటపెరిగి ,రామవివాహంతో అయోధ్య మెట్టినింటికి వచ్చి అసూర్యం పశ్య గా ఉన్న మహాతల్లి ,భర్త తనతండ్రికిచ్చిన మాట నిలబెట్టటానికి తానూ వనవాసానికి వెన్నంటి వచ్చి కస్టాలు పడిపడి ,అడవిలోకూడా భర్త సేవలో రాజభవనం లో ఉన్న ఆన౦దాన్నే పొందుతూ ,రావణ దుష్టపన్నాగం తో ఇక్కడికి వచ్చి బందీ అయింది  .ఇక్కడ కూడా ఆమెకు రామధ్యానం తప్ప మరో ఆలోచన, చూపు లేదు .రామసమాగమనం కోసం ప్రాణాలతో ఉంది .అక్కడ రాముడు కూడా ఈమెకోసం పరితపిస్తూ వెదుకుతూ అనంత దుఖం లో ఉన్నాడు సీత మంచు దెబ్బతో సొంపుపు చెడిన తీగలాగా ,సహచరుడు లేని ఆడ చక్రవాకం లాగా కాంతి హీనంగా ఉన్నది .అనేక పుష్పాలభారంతో వంగి శోకాన్ని పోగొట్టే అశోకాలు కూడా ఈమెకు శోకాన్నే కలిగిస్తున్నాయి .

‘’హిమ వ్యపాయేన చ మందరశ్మి-రాభ్యుత్తితో  నిక సహస్ర రశ్మిః-ఇత్యేవ అ మర్ధంకపి రన్వవేక్ష్య-సీతేవ మిత్యేవ నివిస్ట బుద్ధిః-సంశ్రిత్య తస్మి న్నిషసాద  వృక్షే –బలీ హరీణా  వృషభ  స్తరస్వీ ‘’

వసంత  చంద్రుడూ శోకాన్నే కలిగిస్తున్నాడు‘’అనిఅనేక విధాలుగా ఆలోచించాడు.దెబ్బలు తగిలిన వారికే మళ్ళీ మళ్ళీ దెబ్బలు  తగలటం సహజం .మూలిగే నక్కపై తాటిపండు పడటం లోకరీతి .లేకపోతె శోకాన్ని దూరం చేయాల్సిన అశోకం శోకం పెంచటం ఏమిటి ?చల్లని వెలుగులతో మానసికానందాన్నివ్వాల్సిన చంద్రుడు కూడా దయమాలి శోక౦  కలిగించటం ఏమిటి ? ‘’ఇలా ఆలోచిస్తూ చివరికి  ఆమె సీతాదేవి అనే నిశ్చయానికి వచ్చి బలిస్టుడు,వానర శ్రేష్టుడు,,మహాహరి హనుమ , శింశుపా వృక్షం మీద కూర్చుని ఏం జరుగుతుందో చూస్తున్నాడు  .

ఇది32 శ్లోకాల 16వ సర్గ

  సశేషం

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -5-5-20-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

ప్రపంచ దేశాల సారస్వతం 58-జర్మన్ సాహిత్యం -1

ప్రపంచ దేశాల సారస్వతం

58-జర్మన్ సాహిత్యం -1

జర్మన్ భాష –ఆర్య భాషా కుటుంబానికి చెందిన’’ట్యూటనిక్’’ ,భాషలనుంచి జర్మన్, డచ్ ,డేనిష్  ,నార్వీనిజియన్ ,స్వీడన్, ఇంగ్లిష్ భాషలు వచ్చాయి .జర్మన్ భాషలో ప్రథమ ,ద్వితీయ ,చతుర్ధి ,షష్టివిభక్తులు ,త్రిలింగాలు ,అనేక వికరణాలు ఉన్నాయి .వస్తుస్వరూపంతో సంబంధం లేకుండా వ్యాకరణ నిస్ట మైంది లింగం .ఉపవర్గాలతో కొత్తశబ్దాలు, సమాసాలు ఈ భాషలో సృష్టించవచ్చు .పూర్వం లిపి ‘’గోథిక్’’అయినా ,ఇప్పుడు రోమన్ లిపి బాగా ప్రచారం లో ఉంది .

    జర్మన్ సాహిత్యం –జర్మన్ సాహిత్యం లో అతిప్రాచీన రచన ‘’డాస్ ఇన్నే బ్రాండ్స్ లీడ్ ‘’.దీనిలో తండ్రీ కొడుకులమధ్య యుద్ధ వర్ణన ఉన్నది .మధ్యయుగం లో బాలడ్ లు వచ్చాయి .13వ శతాబ్దిలో ఇతిహాస కావ్యం ‘’నిబు లున్గెన్ లీడ్ ‘’వచ్చింది .దీనిలో మొదట్లో హాగెన్ సీగ్ ఫ్రీడ్ విరోధం ,తర్వాత ప్రేమ స్వామి భక్తీ వీరధర్మం ఉదాత్తంగా రాయబడినాయి .ఇలాంటి వీర కావ్యాలనే  తర్వాత హార్ట్ మన్,ఓల్ఫ్రంఫన్ఎషెన్ భాక్ ,గొట్ట్ ఫ్రీడ్ ఫన్స్ట్రాఫ్ బుర్గ్ రాశారు .నిరంతరం అబద్దాలతో పోరాడి చివరకు విజయం పొందిన పార్జీ వాల్ చరిత్రను వోల్ఫ్రం రాశాడు ట్రిస్టన్ ఉండ్,ఐసోల్డ్ ల   ప్రేమ గాథను గొట్జ్ఫ్ ఫ్రీడ్ రాశాడు .ఈ కాలం లోనే ‘’మిన్నె సాంగర్ ‘’అనే ప్రణయ కావ్యరచయితలు బయల్దేరారు .వీరిలో ముఖ్యుడు –వాల్టర్ ఫన్  డెర్ ఫోగెల్ వైడే.ఆస్ట్రియాకవి రైన్ మార్ ఫన్ హగెనో కి శిష్యుడు .నాటి పోప్ కు వ్యతిరేకంగా ,రాజుకు అనుకూలంగా హృదయాన్ని తాకే కవిత వాల్టర్ రాశాడు .మధ్యయుగ గాయకుడు టాన్ హౌసెర్ పై అనేక కథలూ గాథలూ ప్రచారంలో ఉన్నాయి .

   15వ శతాబ్దిలో జానపద సాహిత్యం బాగా వచ్చింది .గేయకళలో మాధుర్యం నింపి ఆనందం విషాదం జనన మరణాలు మిత్రత్వ శత్రుత్వాలు హృద్యమంగా చిత్రి౦పబడినాయి .వీరుల సాహస కృత్యాలు ,సంయోగ వియోగాలు ఋతువులు కన్నులకు కట్టినట్లు వర్ణంపబడినాయి .ఇవన్నీ తర్వాత 1774 కవి గొట్జ్   ఫ్రీడ్ ఔగుంట్ బైర్గెర్ కవి ‘’బెయో వారే ‘’అనే గొప్పబాలడ్  కావ్యం రాయటానికి దోహదపడినాయి .ఈ ధోరణి అనుసరించి ‘’మైస్టర్ సింగర్ ‘’అనే గాయకులూ వచ్చారు.వీరిలో హన్స్ సాక్స్ -1494-1576 నాలుగు వేలగీతాలు రాశాడు .’’ఫాస్ట్ నాక్ట్ స్పీలే ‘’అనే హాస్య నాటకమూ రాశాడు .ఇతని సమకాలికుడు మార్టిన్ లూధర్  కృషితో   ప్రోటేస్టెంట్   చర్చి  వచ్చింది ..జాతీయత సాహిత్యంలో కాలుమోపింది .పునర్వికాస యుగం అనబడే రేనైజాన్స్ వచ్చి, అభ్యుదయానికి దారి చూపింది .

   ఈ నవ చైతన్యంతో మానవతావాదం యోహనేస్ రాయిల్ కిన్,డెసిడెరియుస్ఎరాన్యున్ ,ఉల్రిక్ ఫన్హుట్టెన్ ల నాయకత్వం లో ప్రవేశించి ,ప్రాచీన గ్రీక్ ,లాటిన్ ,సాహిత్య సంస్కృతులు పునరుద్ధరణ పొందాయి .భావనావిస్త్రుతి పెరిగింది .సమకాలీన వ్యవహార భాషలో కావ్య రచనకు అంకురార్పణ జరిగింది .ఇందులో ప్రధముడు సెబాస్టియన్ బ్రాస్ట్ .ఇతని ‘’నారెన్ షిప్ ‘’అంటే మూర్ఖుల నౌక 1494లో వచ్చింది .కానీ రచయితలకు గ్రీక్ లాటిన్ భాషా వ్యామోహం ఇంకా తొలగలేదు .అందరూ లాటిన్ లో గిలకటం మొదలుపెట్టారు .1617లో మాతృభాషలోనే రాయాలి అనే ఉద్యమాన్ని మార్టిన్ ఓ పిట్స్ ప్రారంభించినప్పుడు వాదోపవాదాలు లాటిన్ లోనే జరగటం మిక్కిలి ఆశ్చర్యకరం .అయినా తన  ధ్యేయాన్ని నీరు గార్చకుండా పిట్స్ ఖండ కావ్య సంపుటి ,జర్మన్ కవిత్వం పై విమర్శనాత్మక గ్రంథాలను జర్మన్ భాషలోనే రాశాడు .ఇంతలోనే 1618నుండి ప్రారంభమైన యుద్ధం 30ఏళ్ళు కొనసాగటం వలన జర్మన్ భాష కవితకు ఆటంకం ఏర్పడింది .17వ శతాబ్దం లో  గ్రేమ్మెల్స్ హౌసెస్ జర్మన్ భాషలో   ‘’సి౦ప్లి సిన్సిమున్ ‘’ అనే ఉత్తమ గ్రంథాన్ని 1668లో రాసి ప్రచురి౦చాడు .ఆ తర్వాత జర్మని ముక్కలుముక్కలుగా విభజింపబడి జర్మనీలో’’ ఫ్రెంచ్ భాష ‘’పాలకుల ఆదరం పొందింది .18వ శతాబ్దిలో ‘’లీప్సిగ్ ‘’నగరం సాహిత్య కేంద్రంగా వెలిగింది .

   సశేషం

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -5-5-20-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

సుందర కాండ లో హనుమ బహుముఖీన వ్యక్తిత్వం-17

సుందర కాండ లో హనుమ బహుముఖీన వ్యక్తిత్వం-17

అశోక వనం అంతా’’సంతానకం ‘’అనే తీగెలతో పూలు కాయలు పండ్లు ఉండే చెట్లతో కళకళలాడుతోంది .ప్రతిక్షణం రెక్కలల్లార్చే పక్షులతో ఆకులు ,రెమ్మలు లేని అశోకవనం లా ఉంది .ఎర్రని అశోక పుష్పాలు భూమిపైరాలి నిప్పు కణికలేమో అనిపిస్తున్నాయి .అప్పుడు శింశుపా వృక్షం కింద మలిన దేహంతో ,నిట్టూర్పు కన్నీళ్ళతో  బాగా శుష్కించిన చంద్ర రేఖలాగా ఒక వనితా రత్నం కనిపించింది హనుమకు .అగ్నిజ్వాలగా భాసిస్తున్న ఆమె సీతా దేవే అనే నమ్మకం కలిగింది .జీర్ణమయిన పసుపు పచ్చని ఏకవస్త్రగా స్నానాదులు,ఆబహరణాలు  లేకపోవటం వలన భూమిలోంచి పుట్టిన పద్మాలు లేని కొలను అనిపించింది .మూర్తీభవించిన దైన్యం తో శోక దేవతగా సాక్షాత్కరించింది .కుజగ్రహం తో పీడింపబడిన రోహిణి లాఉన్నది .కృష్ణ సర్పం లాంటి ఒకే జడ ,వేటకుక్కలమధ్య  భయంగా ఉన్న లేడిఅనిపించింది .రావణుడు అపహరించుకొని వెళ్ళినప్పుడు ఎలాంటి రూపం లో ఉందని విన్నాడో ఇపుడూ అలాంటి రూపం తోనే కనిపించింది .తపస్సులో ఉన్న  సుందర తపస్విని లా,అగ్ని జ్వాలగా  ఉన్నది –

‘’తాం స్మృతీమివ సందిగ్ధామృద్ధిం నిపతితామివ –విహతామివచ శ్రద్ధామాశాం ప్రతిహతా మివ’’

‘’సోపసర్గా౦ యధా సిద్ధిం బుద్ధిం కలుషామివ –అభూతే నాపవాదేన కీర్తిం నిపతితామివ ‘’

అంటే –సందేహం కలిగించే స్మృతి వాక్యం లాగా ,క్షీణించిన సంపద లాగా ,సడలిన శ్రద్ధ లాగా ,ప్రయోజనం లేని ఆశలాగా ,విఘ్నాలతో కూడిన కార్య సిద్ధిలా ,కపటం తో ఉన్న ఆలోచన లా,మిధ్యాపవాదం తో పతనమైన కీర్తిలాగా సీతా దేవి ఆ౦జ నేయునికి కనిపించింది

 ఇవన్నీ సార్ధకమైన ఉపమానాలే .భవిష్యత్ దర్శనాలే అనిపించింది నాకుమాత్రం మహర్షి వాక్య విన్యాసం కదా క్రాంత దర్శికదా ఆయన ,ఒక్కసారి ఇక్కడే నిలిచి ఆలోచిద్దాం .స్మృతివాక్యం పరమ ప్రమాణీయమే.కానీ దీని తస్సా చెక్కా ,అనేక అనుమానాల ప్రోగుకూడా .ఒక్కొక్కదాన్నీ విప్పుకుంటూ పోతేకాని సత్యం రుతం బయట పడవు .అలాగే సీతాదేవి అనే అనుమానం  ఉన్నా రూఢిగా చెప్పలేని  సందిగ్ధ స్థితి .సంపద క్షీణించినా దాని పూర్వవైభవం తగ్గదు.ఒక్కోసారి శ్రద్ధ సడలి పోవచ్చు కానీ కొంచెం జాగరూకత వహిస్తే మళ్ళీ పొందచ్చు .ఆశ ప్రయోజనకారి కాదు కొన్ని వేళల్లో అనిపిస్తుంది .ఆ ఆశ లేకపోతె జీవితం చీకటి మయమే .ఇవన్నీ తాత్కాలికాలే .శాశ్వత సత్యం నెమ్మదిగా ఆవిష్కారమౌతుంది అనే సూచ్యార్ధం మహర్షి ఉపమానాలో నాకు కనిపించాయి .అలాగే కార్యం మొదలుపెడితే తెలిసీతెలీకుండా అనేక విఘ్నాలు ఆవరిస్తాయి .ధైర్యంతో ముందడుగు వేస్తె ఫల సిద్ధికలుగుతుంది భయపడి వెనకడుగు వేస్తె విధి వెక్కిరిస్తుంది ప్రమాదో ధీమతామపి అన్నారు .మన ఆలోచనమనకే అబద్ధం అనిపిస్తుంది అనువుగాని వేళ.కాస్త నిదానిస్తే సంయమనం పాటించి మరి రెండుమూడు సార్లు దృష్టిపెడితే మనది రాజమార్గమే అని రుజువవుతుంది .మనం యెంత జాగ్రత్తగా ఉన్నా మంచి దారిలో నడుస్తున్నామని నమ్మినా లోకం మిధ్యాపవాదాలు వేసి ధ్యేయాన్ని ఆట౦క పరుస్తారు .ఇది విపరీతం కాదు లోకసహజమే .అప్పుడు మనకు ఆత్మనిబ్బరం మనం చేసేది యదార్ధం అనే నమ్మికా  ఉంటె,అవన్నీమబ్బు పింజేల్లా దూది పింజేల్లా   ఎగిరిపోయి సత్యం బయట పడి ధ్యేయానికి  విజయం కలుగుతుంది కీర్తి పున్నమి వికసిస్తుంది .ఇన్ని భావాలు ఇమిడ్చాడు వాల్మీకి మహర్షి ఈ సందర్భంగా .అంతేకాదు భవిష్యత్తులో సీతా దేవి పై లోక నింద మోపబడే విషయమూ సూచ్యార్ధమే అనిపిస్తుంది .మహా పండితుడు కనుక అతనికి ఇన్నిభావాలుకలిగాయి సీతాదేవిని చూడగానే .

  పూర్వం ఋష్యమూక పర్వతం పై జారవిడిచిన ఆభరణములు ఇప్పుడు ఈమెకు లేవు .విడువని నగలుమాత్రమే ఉన్నాయి అని గుర్తించాడు కనుక అనుమానం తీర్చుకోవటానికి ఇదొక బలమైన ఆధారం అయింది .ఋష్యమూక పర్వతం పై ఆమె జారవిడిచిన పసుపు పచ్చని ఉత్తరీయం ను సుగ్రీవాదులు చూశారు .నగలను జారవిడుస్తుండగా కూడా వాళ్ళు చూశారు .ఇప్పుడు ఈమెకు ఆ ఉత్తరీయం లేదు ఆనగలూ లేవు కనుక రెండవ బలీయమైన అనుమానం రుజువైంది .ఇంతటి సాద్వికనుకనే శ్రీరాముడు  అనుతాపం ,దుఖం ,ప్రేమలతో బాధపడుతున్నాడు అనుకొన్నాడు.సీత శరీరాకృతి ,రాముని శరీరాకృతి ఒకటిగానే ఉన్నందువలననే వారికి ఒకరికొకరు తోడూ అయ్యారు అని నిశ్చయించాడు .ఇద్దరి మనస్సులు ఒక్కటే అత్యంత స్థిరంగా ఉన్నాయి .అందుకే సీతాదేవి. ధర్మాత్ముడు రాముడు జీవించగలుగుతున్నారు .సీతా వియోగం ఆయన భరించలేడు.రాముని విడిచి ఈమె బ్రతుక లేదు .సీతను చూస్తె రాముని మనసు పూర్ణ చంద్రునిలా ఉప్పొంగిపోతుంది . రామచంద్ర దర్శనం తో సీత పులకించిపోతుంది .వీరిద్దరూ జీవికా జీవులు .అని బాధ సంతోషం తో ఉన్నాడు హనుమ .

‘’అస్యా దేవ్యా యథారూప మంగ ప్రత్యంగ సౌష్ఠవం –రామస్య చయథారూపం  తస్యేయ మసితేక్షణా’’

‘’తస్యా దేవ్యా మనస్తస్మిం స్తస్య చాస్యాం ప్రతిష్ఠితమ్-తేనేయం స చ ధర్మాత్మా ముహూర్తమపి జీవతి ‘’

వాల్మీక రామాయణాన్ని పూర్తిగా ఆకళింపు చేసుకొని రామాయణ కల్ప వృక్షం అనే అమృత కావ్యం రాశాడు కవిసామ్రాట్ విశ్వనాథ .అందులో సీతారాములకుఉన్న  అభేదాన్ని ఒక గొప్పపద్యంలో చొప్పించాడు

‘’ఆకృతి రామచంద్రు విభావాకృతి ,కన్బొమ తీరు స్వామి చాపాకృతి-కన్నులన్ ప్రభు కృపాకృతి  ,కైశికమందురామ దేహాకృతి,సర్వ దేహ –మునయందున ,రాఘవ వంశమౌళిధర్మాకృతి  -కూరుచున్న  విధమంతయు  స్వామి ప్రతిజ్ఞ మూర్తియై’’

 ఇంతకంటే గొప్పపద్యం లేదు ఆ ఇద్దరి అవినాభావ సంబంధానికి .అన్యోన్యానికి .

ఇది 55శ్లోకాల 15వ సర్గ

సశేషం

మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -4-5-20-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

ప్రపంచ దేశాల సారస్వతం 56- తువాలు దేశ సాహిత్యం

ప్రపంచ దేశాల సారస్వతం

56- తువాలు   దేశ సాహిత్యం

కరోన నీడపడని 15వ దేశం తువాలు దక్షిణ ఫసిఫిక్ లో తొమ్మిది ఐలాండ్ ల సముదాయం .పాం, చేతల్ బీచెస్ రీఫ్ లు ,ప్రకృతి దృశ్యాలు ఆకర్షణ .ఫునఫూటి రాజధాని .అత్యధిక బీద దేశం .జనాభా 11వేలు మాత్రమె .టూరిస్ట్ లకు సేఫెస్ట్ ప్లేస్ ..టెలికమ్యూనికేషన్ ఇంటర్నెట్ సౌకర్యం ఉన్నాయి .షార్ట్ వేవ్ రెడియో స్టేషన్,టేలివిజన్ బ్రాడ్ కాస్టింగ్ కూడా ఉన్నాయి .ప్రపంచ చిన్న దేశాలలో నాలుగవది .తువాలు అంటే ఎనిమిది ఐలాండ్ ల సముదాయం తోమ్మిదోది అతి చిన్నది ,సీలెవెల్ కు పైన ఉంటుంది .సుమారు 3వేల ఏళ్ళ క్రితమే  ఇక్కడ జనావాసాలున్నాయి   .ఎప్పటికైనా సముద్రం లో కలిసి పోతుందనే నమ్మకం అందుకని ‘’సింకింగ్ ఐలాండ్స్ ‘’అంటారు .

  పూర్వం దీన్ని ఎలిస్ ఐలాండ్స్ అనేవారు .1568లో స్పానిష్ వారు వచ్చి ఆక్రమించారు .1820లో రష్యన్ యాత్రికుడు దిగాడు .1861లో బ్రిటిషర్లు చేరారు

1978లో బ్రిటన్ నుండి స్వతంత్రం పొందింది నాలుగేళ్ళకోసారి ఎన్నికలు జరుగుతాయి పార్లమెంట్ ,ప్రధాని మంత్రివర్గం ఉంటాయి .క్వీన్ ఎలిజబెత్ సార్వభౌమాదికారిణి.2019లో కోసియా నటానో ప్రధాని అయ్యాడు .సైన్స్ సంకేతికసాయం ఆస్ట్రేలియ అందిస్తుంది .ఆస్ట్రే లియన్ వాలంటీర్లు ఎకనామిక్ అభివృద్ధికి ,బీదరిక నిర్మూలనకు సాయం చేస్తారు .చేపలవేట ,వ్యవసాయమే ఇక్కడ ఆదాయవనరులు .ప్రభుత్వం తువాలు ట్రస్ట్ ఏర్పాటు చేసి ఆర్ధిక వడిడుడుకులనుంచి రక్షిస్తుంది .ఆస్ట్రే లియన్ కరెన్సీ చెల్లుబాటు అయినా, స్వంత నాణాలు ఆ దేశం ముద్రిస్తుంది   ,మతం క్రిస్టియన్ మతం .తువాలు భాష ,ఇంగ్లిష్ జాతీయభాషలు .గుండెపోటు జబ్బులు ఎక్కువ 20వ శతాబ్దిలో చాలామంది దీనితో చనిపోయారు .ఫ్రీ కంపల్సారి విద్య అమలులో ఉంది .కేంబ్రిడ్జి సిలబస్ బోధిస్తారు .అక్షరాస్యతశాత౦ 99.సముద్ర షెల్స్ తో రకరకాల వస్తువులు చేయటం ఇక్కడప్రత్యేకత .చాలారకాల డాన్సులు సంగీతముంటాయి .కుటుంబవ్యవస్థ బలీయం . క్రికెట్ కంటె  చిన్నదైన ‘’కిలికిటి’’ఆట ఆడుతారు .వాలీబాల్,ఫుట్బాల్ కూడా    ఆడుతారు .వర్షాధార పంటలే .ట్రాపికల్ సైక్లోన్ లు ఎక్కువ బాధిస్తాయి .స్ప్రింగ్ సీజన్ లో సముద్రం మామాలుకంటే చాలా ఎత్తుకు లేస్తుంది .వీటిని కింగ్ టైడ్ లంటారు . ఇవివస్తే ఐలాండ్ లుమునిగిపోతాయి .

తువాలు సాహిత్యం –తువాలు దేశం లో కళలు సాహిత్యం మొదటినుంచి వలసదారులదే.క్లైమేట్ మార్పులను బట్టి వస్త్రధారణ మారుతుంది .అవి తయారు చేసే నేర్పు వీరికి ఎక్కువ వాటిపై పుస్తకాలోచ్చాయి .ఆధునికకాలంలో సెలీనా తులిసిటా మార్ష్ –ఈ దేశం లో సామోన్ లోపుట్టిన కవయత్రి ,లండన్ ఒలింపిక్ పోయెట్రి లో పాల్గొన్నది

ఆస్త్రేలియన్ రచయిత   ఆండ్రూ ఓ కొన్నర్ ‘’తువాలు ‘’నవల రాసి అవార్డ్ పొందాడు

ప్రసిద్ధ రచనలు –వేర్ ది హెల్ ఈజ్ తువాలు –ఫిలిప్ ఎలిస్ ,సీపీపుల్ –క్రిస్టియానా ధాంసన్ ,ఫసిఫిక్ దిఓషన్ ఆఫ్ ది ఫ్యూచర్ –సైమన్ విన్ చెస్టర్,దిమెటీరియల్ కల్చర్ ఆఫ్ తువాలు  -జేర్డ్ కోచ్ మొదలైనవి .

57-వనౌతు దేశ సాహిత్యం

కరోనా సోకని 16వ దేశం వనౌతు 80ఐలాండ్ ల సముదాయం  దక్షిణ ఫసిఫిక్ లో13,00కిలోమీటర్ల దూరం వ్యాపించి  ఉంది .వనౌ అంటే ఇల్లు .ఇల్లున్న దేశం అని భావం .స్కూబా డైవింగ్ ,కోరల్ రీఫ్ ,అండర్ వాటర్ కేవెర్న్స్ఆకర్షణ .పోర్ట్ విటా రాజధాని .కరెన్సీ వానౌతు వతు.3లక్షల జనాభా .ఒంటరిగా ఉండటం తో బీదరికం 13శాతం ఉంటుంది .తుఫాన్ల భీభత్సమూ ఎక్కువే .టూరిస్ట్ లకు భద్రమైన దేశం .3వేల ఏళ్లకుపూర్వమే ఆస్ట్రో నేషియన్లు  ఇక్కడ ఉన్నారు .1606లో యూరోపియన్లు వచ్ఛి 1768దాకా ఉన్నారు .1774లో కెప్టెన్ కుక్ వచ్చి ‘’న్యు హైబ్రేడేస్’’పేరు పెట్టగా అది 1980లో స్వతంత్రం పో౦దేదాకా ఉన్నది .వేల్స్ వేటకోసం నౌకలరాక ఎక్కువ .1825లో పీటర్ డిలాన్ నావికుడు ఇక్కడ గంధపు చెట్లను గుర్తించాడు .దీన్నికాజేయటానికి 1830దాకా వచ్చారు .తర్వాత బానిసలవ్యాపారం దానికోసం యుద్దాలుజరిగాయి .19వ శతాబ్దిలో రోమన్ కేధలిక్కులు ,ప్రొటెస్టెంట్ లు వచ్చి ఆక్రమించి ప్రత్తి సాగు చేశారు .ప్రత్తిధర తగ్గటం తో కాఫీ బనానా  కోకా  కొబ్బరి పంట వేశారు .1947లో కొంత ఉద్రిక్తత ఏర్పడింది .1970లో మొదటి రాజకీయ పార్టీ ఏర్పడి ,ఎన్నికలు జరిగి వాల్టర్ లిని ప్రెసిడెంట్ అయ్యాడు .తర్వాత ‘’కొబ్బరికాయ యుద్ధం ‘’వచ్చి 1980స్వతంత్ర రిపబ్లిక్ అయింది

  4వేలరకాల సముద్ర జీవులు ఇక్కడున్నాయి .మెరైన్ ఫిషింగ్ కు అనువైనది .సాల్ట్ వాటర్ క్రోకడైల్స్ నాలుగున్నాయి .వర్షాకాలం బాగా ఎక్కువ .తరచూ భూకంపాలు వస్తాయి .సిటిజన్ షిప్ ను ఒక లక్షాయాభై వేల డాలర్లకు అమ్ముతారు .దీనితో యూరప్ అంతా ఫ్రీగా తిరిగి చూడచ్చు .మాంగనీస్ ఖనిజం ఉన్నది .ప్రజా సౌకర్యాలన్నీ ఉన్న దేశం .జాతీయ భాష బిస్లామా .అధికాభాషలు బిస్లామా ఇంగ్లిష్ ఫ్రెంచ్ .మతం క్రిస్టియానిటి.అక్షరాస్యత శాతం 74.సాంస్కృతిక వైవిధ్యంఎక్కువ .ఫుట్బాల్ బాగా ఆడుతారు

 వానౌతు సాహిత్యం –మొదట్లో అంతా మౌఖిక సాహిత్యమే .1973లో యూనివర్సిటి ఏర్పడ్డాక రచనా జిజ్ఞాస పెరిగింది .మొట్టమొదటి కవి ఒకమహిళ-గ్రేస్ మోలీసా  స్త్రీవాద కవయిత్రి రచయిత్రి బిస్లామా ఇంగ్లిష్ భాషలలో రాసింది .2007లో ఫ్రాన్కోఫోన్ సింగర్ గీతరచయిత్రి ,ఆధర్ మార్సెల్మేల్తేరోరోంగ్ మొదటి నవల రాశాడు .అతని ‘’టోఘాన్’’నవలలో ఫసిఫిక్ ఐలాండర్ల యువత గమ్యం లేక మలేనేషియాన్ ,వెస్ట్రె న్ విలువలంధ్య ఊగిసలాట చిత్రించాడు .2009లో ఇది పునర్ముద్రణ పొందినపుడు సాహిత్య నోబెల్ పొందిన జీన్ మేరీ క్లేజియో ‘’న్యు అండ్ ఒరిజినల్ ‘’అని ముందుమాటలలో రాశాడు .కమ్యూనిటి దియేటర్ ను 1989లో స్థాపించిన వాన్ స్మోల్ బాగ్ ,ఇతర రచయితలూ సోషల్ అవేర్ నెస్ కోసం ఎయిడ్స్ ,మలేరియా నివారణ తుఫాను లో జాగ్రత్తలు మొదలైనవాటిపై  స్కిడ్స్ రాసి ప్రదర్శించారు .అతని నాటకాలు సిడిలుగా దొరుకుతాయి .

కొన్ని ప్రముఖరచనలు –కాలనైజ్డ్ పీపుల్ –గ్రేస్ మేరామోలిసా ,దిషార్క్ గాడ్ –చార్లెస్ మాన్ట్ గోమరి,దికోకోనట్ వార్ –రిచర్డ్ షేర్స్ ,హౌస్ గర్ల్స్ రిమెంబర్ –డొమెస్టిక్ వర్కర్స్ –మార్గరెట్ రోడ్ మాన్,బ్లాక్ స్టోన్-మోలిసా ,ఫిషింగ్ ఫర్ స్టార్స్ –బ్రిస్ కర్టేనరి మొదలైనవి

  పైరెండు దేశాలలో పేదరికం వంటరితనం వలన కరోనా వస్తే తట్టుకోవటం కష్టం అని భావించి ఆ దేశాదిపతులు ముందే జాగ్రత్త పడి అన్ని చర్యలు తీసుకోవటం వలన కరోనా ఈ రెండు  దేశాలకికి రాలేదు .బిజినెస్ లన్నీ బంద్ చే శారు . బార్డర్లుమూసేశారు .విద్యాలయాలకు సెలవులిచ్చి టూరిస్ట్ లకు పర్మిషన్ లేకుండా చేశారు “We know how the virus spreads and when we look at our culture and how we live, it’s in favour of this virus. If it comes, it would be a disaster. At this point, we have to be strict with our borders – our fear is that if enters Vanuatu, it would spread very quickly and we simply do not have the resources and facilities to manage it. The slightest mistake will impact us very badly.”అని ప్రజలుగాట్టిగా అభిప్రాయపడి ప్రభుత్వాలకు పూర్తిగా సహకరించారు .

  ఈ 16కరోనా సోకని దేశాల సాహిత్యం దీనితోపూర్తి.ఇకపై జనజీవన స్రవంతిలో ఉన్న దేశాల సాహిత్యం యధాప్రకారం ప్రారంభిస్తాను .ఇన్ని ఫసిఫిక్ దేశాలు నాతోపాటు చూసి  అక్కడి విషయాలు తెలుసుకొన్నందుకు ధన్యవాదాలు .

   సశేషం

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -4-5-20-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | 1 Comment

  హాస్య దినం    ముళ్ళపూడి వెంకటరమణకు హాస్యా౦జలి తో –

     హాస్య దినం

‘’ఒక అప్పారావు కు తండ్రి ,రుణాన౦దలహరికి జన్మస్థానం ,బుడుగుకు గొడుగు ,జనతా ఎక్స్ప్రెస్ కు రైలింజన్ ,సీగాన పెసూనా౦బ కు  గాడ్ఫాదర్ ,రాజకీయ బేతాళ పంచ వింశతిక కు స్వర్ణలతిక ,సినీ విక్రమార్క సింహాసనానికి పట్టువదలని రచనా విక్రమార్కుడు .అతని మార్కే వేరు రూటే సెపరేటు ,రిమార్కు లేని రచన ,’’తెలుగూస్ కు అరుదుగా లభించే బంగారు గూసు’’ ,సినీ జీవితాన్నిస్కాచ్ వడబోసి ,మన’’సారా’’ తాగిన  స్కెచ్ పెన్,అది విసిరే ప్రతిమాటా జోకుల తూటా చరుపే ,జలదరి౦పే ,ఇంపే ,సొంపే ,తలకడిగే ‘’షాంపే’’,తెలుగు మాటల తీరుకు అక్షరశిల్పి జక్కన్నే ,తెలుగు వాడి తలతిక్కకు ,పొగరుకూ ,ఠీవికీ  డాబూ దర్పాలకూ ,అమాయకత్వానికీ ప్రతిమలే . మలచినపాత్రలు మధురస పాత్రలే .కవ్విస్తాయ్,నవ్విస్తాయ్ ,కొంటె కోణంగిలా వెక్కిరిస్తాయ్,కొక్కిరిస్తాయ్ ,నెత్తి కెక్కి కూర్చుంటాయ్,మనల్ని వదలి పోనని భీష్మి౦చుకు కూర్చుంటాయ్.అతడే’’ ముళ్ళవాడి వ్యంగ్యట రమణ’’ .ఆయనది ఒక ప్రత్యెక స్కూల్ ఆఫ్ థాట్.మధ్యతరగతి మందహాసానికి మంద్ర స్వరరాగం .బాలమురళి స్వరం అంతటిహాయి ,కొత్తదనం మెత్తదనం ,ప్రయోగం ,సాఫల్యత అతని స్వంతం .దటీజ్ రమణ .తెలుగు హాస్య రమారమణుడు.మనసు నవనీతం మాట అమృతం .అంతశ్చేతనను తట్టి అ౦తర్ముఖుడై ,ఆధ్యాత్మికానికి ఆవలి మెట్టుగా ఉంటూ వెలుగు చూపే తెలుగోడు ,వెలుగోడు ,వెలుగు వెల్లువలాడు .

  ‘’వెంకట రమణీయార్ధక ప్రతిపాదిత శబ్దం ,కావ్యం ‘’అని రుజూ చేశాడు. అతడు పుట్టి కొత్తశబ్ద సృష్టి చేస్తాడని ఆ పేరు పెట్టి ఉంటారు .సినీ సంగీతం ఎలా ఉంటుందని అడిగితె ‘’మేమగునో ,జీవిత మేమగునో ‘’లా ఉంటుంది తలాతోకా లేకుండా అన్నాడు రవణ .మనచుట్టూ ‘’టోకరాసురులున్నారు జాగ్రత్త ‘’అని హెచ్చరిస్తాడు ‘’రాత్రిపదైనా ,పద్నాలుగైనా ‘’అన్నది మరో విరుపు .మనం సందియుగం లో ఉన్నాం కనుక ‘’వేదాన్తప్పుస్తకాలు ‘’అని మేకు బందీ చేస్తాడు .హిందీ ప్రభావం మనపై ఎక్కువకనుక ‘’ఆషా ,నిరాషలమధ్య మనిషి ఉన్నాడని చమత్కరించాడు .స్క్రిప్ట్ మీద రైటరు ,డై రెట్రూ ,ప్రొడ్యూసరు కూర్చున్నప్పుడు ‘’ఉప్పుకప్పురంబు పద్యం ‘’పోతన రాశాడని సినీకవి అంటే ,డైరెట్రు’’ఎన్ని సినిమాలకు రాశాడు ?’’అని అడిగితె మన మతులు దొబ్బెయ్యవా బాబాయ్ .

  పంచ తంత్రం లో వలెనె ప్రపంచ తంత్రమును అయిదు భాగమ్ములు ‘’అంటాడు .’’ద్వికరణ శుద్ధిగా ‘’అని కాయినేజ్ చేశాడు .అంటే –నోటా ,నొసటాఅని అర్ధం చెప్పాడు గడుసుగా .యతికోసం పాకులాడే కవులకు చురక అంటిస్తూ ‘’హాలీ వుడ్డు లో హరనాధ బాబు ఉండేవాడు ‘’అన్నాడు ఎలా అని ప్రశ్నిస్తే ‘’ఎందుకుండడు?యతి కోసం చచ్చినట్టు ఒదిగి కూర్చుంటాడు అని దబాయిస్తాడు .వర్ధమాన రచయితను ‘’రామాయణం చదివారా ‘’అని అడిగితె ,చిన్నప్పుడు బామ్మ చెప్పిన రామాయణం విన్నాను ఇంకా చదవటం ఎందుకు అని వోరిజినల్ చదవ లేదు అన్నాడట .’’ఇంకా ఏమైనా చదివారా ‘’అన్నప్రశ్నకు ‘’చాలా చదివా గుర్తు లేదు.అయినా ఇంత హఠాత్తుగా అడిగితె ఎలా అని విసుక్కున్నాడట ‘’.

   రైల్వే హోటళ్ళలో ఇడ్లీలు ‘’మాత్రలు ‘’లాగా ఉంటాయని చమత్కరించాడు .డబ్బాలు మూడురకాలు’’ స్వరడబ్బా ,పరడబ్బా ,పరస్పరడబ్బా’’  అని డబ్బాకొట్టి మరీ చాటాడు .మనిషి వర్ణన ఎలా చేశాడో చూడండి –‘’రామ చామి(రామస్వామి ) ది భారీ విగ్రహం –తెలుగు సినిమా అంత .అరవసినిమాడైలాగంత పొడుగ్గా ఉంటాడు. సగటు ఇండియా సినిమాహీరోయిన్ అంత లావుగా ఉంటాడు ‘’అని అన్నిభాషల సినిమాలనూ వాయించి వదిలాడు రవణ.

  ఇంతటి కమ్మని తెలుగు హాస్యం పండించిన ముళ్ళపూడి వెంకటరమణకు హాస్యా౦జలి తో –

  మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -3-5-20-ఉయ్యూరు

Posted in ఆ''పాత''మధురాలు | Tagged | 1 Comment

సుందర కాండ లో హనుమ బహుముఖీన వ్యక్తిత్వం-16

సుందర కాండ లో హనుమ బహుముఖీన వ్యక్తిత్వం-16

అశోక వనం చేరిన హనుమ అక్కడ వస౦తోదయం తో పులకించిన వృక్షజాలాన్ని చూశాడు .మృగగాపక్షి సంతతి మహాదానంద౦ తో కనిపించాయి .పక్షులకిలకిలారవాలు వీనుల వి౦దు చేశాయి వనాలు ఉపవనాలతో అది ఉదయించే సూర్యునిలా కనిపించింది .అతని సంచారంతో నిద్రిస్తున్నపక్షులు మేల్కొన్నాయి .రకరకాల పుష్పాలు పుష్ప వర్షం కురిపిస్తూ హర్షం కలిగింఛి పూలకొండ లాగా ఉన్నాడు .చెట్లమధ్య పరిగెత్తే అతడు  వసంతు డేమో నన్న భ్రమకలిగించాడు భూతజాలానికి .భూమిపై రాలిన పుష్పాలు అలంకరించుకొన్నభూ దేవిగా కనిపించింది .పులకించిన వృక్షాలు తమసర్వస్వమైన పుష్పాలన్నీ రాల్చేసి జూదం లో నగలు వస్త్రాలు సంపద అన్నీ ఓడిపోయిన జూదరులులాగా ఉన్నాయి .ఆన౦ద౦  తో కోతి చేస్టలుగా చేతులు ,కాళ్ళు తోక తో పరవశంగా శ్రేష్టమైన వృక్షాల కొమ్మలు విరగగోట్టగా అవి అశోక వనిక జుట్టు ముడి వీడి చందనం మొదలైన అలంకారాలు తొలగి ,చు౦బి౦పబడిన దంతాలు పెదవులు కలదై శరీరం పై నఖక్షత దంతక్షతాలున్న యువతి లాగా కనిపించాయి .అల్లిబిల్లిగా అల్లుకున్న తీగెల సముదాయాన్ని తెంపి చెల్లాచెదరు చేశాడు  .అక్కడ మణులతో వెండి బంగారు రేకులతో కప్పబడిన నేలను చూశాడు .అనేక ఆకృతుల దిగుడు బావులు వాటికి మణులతో చేయబడిన మెట్లు చూశాడు .ముత్యాల పగడాల పొడులు వాటి చుట్టూ మొలచిన కాంచన వృక్షాల్లా ఉన్నాయి .బావుల్లో తామర కలువ పూల శోభ ,చక్రవాకాల కూజితాలు భరత పక్షుల అరుపులు హంస ,సారసాల నాదాలతో పరమ మనోహరంగా ఉన్నాయి .బావులకు రెండువైపులా అమృతంలాగా రుచిగా ఉన్న జలాలున్న వాగులు వాటి తీరాలపై చెట్లు  రమ్యంగా ఉన్నాయి .వేలాది దట్టమైన పొదరిళ్ళు వాటిమధ్య గన్నేరు చెట్లు కను విందు చేశాయి .అక్కడ అందమైన ఒక పర్వతం ఎత్తైన శిఖరాలతో మేఘంలాగా గుహలు వృక్షాలతో ఉన్నది  .దానిపైనుండి నీటితో కింద పడుతున్న నది ప్రియుని తొడ వదిలి క్రిందపడుతున్న ప్రియురాలులాఉంది .ఎత్తైన చెట్ల  శాఖాగ్రాలు  నీటిలో వంగి ప్రణయ కోపంతో వెళ్ళిపోయే ప్రియురాలులాగా అనిపించింది .ఆనది కొంత దూరం ముందుకు ప్రవహించి అకస్మాత్తుగా వెనక్కి తిరిగిన నదీ జలాలు పతిపై కోపం వదిలి ,ప్రసన్నురాలై మళ్ళీ తిరిగి వచ్చినకాంత లాగా ఉంది .ఇలా అనంత వృక్ష సమూహంతో అశోక వనం కనిపించి పులకిపచేసింది .అక్కడే బంగారు రంగు శింశుపా వృక్షం ,ఆకులు లతలతో  చుట్టూ బంగారు అరుగుతో కనిపించింది .కొన్ని చెట్లు అగ్నిలాగా ప్రకాశామానంగా కనిపించాయి .ఆ కాంతుల మధ్య ఉన్న హనుమదేహం  మేరుపర్వత కాంతులతో శోభించే సూర్యునిలాగా బంగారు కాంతులు చిమ్మింది .అది ఆయనకే ఆశ్చర్యం కలిగించింది –

‘’సో పశ్య ద్భూమి భాగా౦ శ్చగర్త ప్రస్రవణానిచ –సువర్ణ వృక్షా నపరాన్ దదర్శ శిఖి సన్నిభాన్ ‘’తేషాం ద్రుమాణా౦ ప్రభయా మేరోరివదివాకరః –అమన్యత తదా వీరః కాంచనోస్మీతి వానరః ‘’

  ఇక ఊరుకోగలడా మహాకపి  వెంటనే పుష్పించిన కొమ్మలతో ఉన్న శింశుపా వృక్షం ఎక్కి –

‘’ఇతో   ద్రక్ష్యామి వైదీహీం రామదర్శన లాలసాం –ఇతి  శ్చేతశ్చదుఖార్తాంసంపతంతీం యదృచ్ఛయా’’అనుకొన్నాడు అంటే –రాముడిని చూడాలన్న కాంక్షతో ఉవ్విళ్ళూరే సీతను ఇక్కడే చూస్తాను .దుఃఖ పీడితయై,అప్రయత్నంగా ఇక్కడే ఎక్కడో అటూ ఇటూ తిరుగుతూ ఉంటుంది .పవిత్ర జలాలున్న ఈ నదికి సంధ్యోపాసనకోసం తప్పక వస్తుంది .అత్యంత శుభప్రదమైన ఈ అశోక వనం లోనే సీతామాత దర్శనం నాకు తప్పక కలుగుంది ‘’అనే మనో నిశ్చయం తో దట్టంగా పూసి ఆకులు ,కమ్ముకున్న ఆ వృక్షంపై సీత దర్శనం కోసం నిరీక్షిస్తూ చుట్టూ కలయ ఊస్తున్నాడు నేత్రాలతో .

52శ్లోకాల 14వ సర్గ ఇది .అప్పటిదాకా హనుమకు ఉన్న సంశయాలన్నీ తొలగిపోయాయి వసంతం కూడా హసించింది కనుక అన్నీ మాంచి శకునములే –సీతా దర్శన లాభాలే .అశోక వన ప్రవేశంతో .శోకం లేనిదే అశోకం .కనుక ఇక తనకూ సీతకు శోకం ఉండదు .  తప్పక ఇక్కడ సీత కనిపిస్తుంది అనే నమ్మకం కలిగింది .దైవాలన్నీ అనుకూలిస్తున్నాయి .

శింశుపా వృక్షం అంటే ఇరుగుడు చెట్టు .దాదాపు 40 మీటర్ల ఎత్తుతో సతత హరితంగా ఉంటుంది .ఉపాంత రహిత అండాకార పత్రాలుంటాయి .తెలుపు రంగు పుష్పాలు పూస్తాయి .ఏక విత్తనం ఉన్న దీర్ఘ వృత్తాకార రెక్క లున్న  ఫలాలు కాస్తాయి.బెరడు గాయాలనుంచి స్రవించే ద్రవం కారకుండా చేస్తుంది .దీని కలప గిటార్ తయారీలో ఉపయోగపడుతుంది .జావా దీవులలో బాగా పెరిగే వృక్షం . భేతాళకథల్లో విక్రమార్కమహారాజు  శి౦శుపా వృక్షానికి వ్రేలాడే  శవాన్ని కిందకు దింపి బుజాన వేసుకొంటాడు  .

   సశేషం

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -3-5-20-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

ప్రపంచ దేశాల సారస్వతం 55- తుర్కేమెనిస్తాన్ దేశ సాహిత్యం

ప్రపంచ దేశాల సారస్వతం

55- తుర్కేమెనిస్తాన్  దేశ సాహిత్యం

కరోనా సోకని 14వ దేశం తుర్కెమెనిస్తాన్ మధ్య ఆసియాలో కాస్పియన్ సముద్రం ,కారకుం ఎడారి తో చుట్టబడి ఉంటుంది .నీసా, మెర్వ్ లలో పురాతత్వ వస్తువులు ఎక్కువ .రాజధాని అష్కబాత్  సోవియట్ స్టైల్ లో నిర్మించబడింది .సుమారు 60లక్షల జనాభా .కరెన్సీ –తుర్కేమెనిస్తాన్ మనత్ .నేరాలు తక్కువ టూరిస్ట్ లకు ఇబ్బంది ఉండదు .ఆయిల్ ,నేచురల్ గాస్ ఆర్ధిక వనరు .విచ్చలవిడి మద్యపానం ఉండదు .ఎలెక్ట్రికల్ పవర్ ఎడారులు ,వ్యవసాయభూములున్నాయి .ఫ్రీ విద్యుత్తూ సరఫరా ఉంటుంది అందుకే ఇంట్లో స్టవ్ లు 24గంటలూ మండుతూనే ఉంటాయి అగ్గిపెట్టె ఖర్చులేకుండా .రాజ ధానిలో  బిల్డింగులు  చాలాభాగం ఖాళీ గా ఉంటాయి ,ఈ దేశం లో ‘’డోర్స్ ఆఫ్ హెల్’’టూరిస్ట్ స్పాట్ .ఆర్మీనియన్లు అజెరిస్ మొదలైన జాతుల వారుంటారు .సున్ని ముస్లిం లు ఎక్కువ.పూర్వం కారవాన్ రూట్ సిల్క్ రోడ్ మీదుగా చైనాకి ఉండేది .1881రష్యన్ సామ్రాజ్యం వశం చేసుకొన్నది .మధ్య ఆసియాలో బోల్షేవిక్  ఉద్యమానికి పట్టుగొమ్మగా నిలిచింది .సోవియట్ యూనియన్ విచ్చిత్తి తర్వాత 1991లో స్వతంత్ర దేశమైంది .ప్రపంచం లో గాస్ రిజర్వ్ ఎక్కువగా ఉన్న దేశాలలో నాల్గవస్థానం లో ఉంది .ఇక్కడ మానవహక్కులకు రక్షణ ఉండదు .సమాచార వ్యవస్థపై నిషేధం ఎక్కువ .అతి డ్రై ప్రదేశం .గ్రీన్ హౌస్ గాస్ ఎమిషన్లు వాతావరణ కాలుష్యం చేస్తున్నాయిక్కడ .ప్రత్తి పంటఎక్కువ ఇదీ ,గాస్ ఈ దేశ ఆర్దికాన్ని నిలబెడుతున్నాయి .ప్రజలకు నేచురల్ గాస్ ,కరెంట్ ,నీర్ ఉప్పు సబ్సిడీ రేట్లకు దొరుకుతాయి .మధ్య ఆసియా దేశాలలో విద్యుత్ పవర్ ప్లాంటులు అత్యధికంగా ఉన్న దేశం .దినపత్రికలు మేగజైన్లు ఎక్కువే

  సెకండరి లెవెల్ వరకు సార్వత్రిక విద్య తప్పనిసరి .విభిన్నమైన ఆర్కి టేక్చర్ కనిపిస్తుంది అడల్ట్ లిటరసి రేట్ 99.7

 తుర్కేమినిస్తాన్ సాహిత్యం –టర్క్ మెన్ ప్రజలు రాసిన వ్రాత సాహిత్యం ఉన్నది .కివాన్స్ బుఖావంస్ ,పెర్షియన్లపాలన లో ఉండటం వలన వారెవ్వరూ ఇక్కడి సాహిత్యాన్ని భద్రపరచలేదు. పూర్వ సాహిత్యం మౌఖికంగా తరతరాలుగా వ్యాప్తి చెందింది .కొద్దిభాగం మాత్రమె బార్డ్స్ అంటే భక్షీస్ లు వ్రాత ప్రతులను జాగ్రత్త చేశారు .17,18శాతాబ్డులలో టర్క్ మెన్ లు ఖ్వారేజం అంటే ఇవాల్టి తుర్కేమేనిస్తాన్,ఉజ్బెకిస్తాలకు  వలసవచ్చారు .ఉజ్బెక్ ఖాన్ షేర్ ఘాజి ఆనాటి టర్క్ మెన్ కవి ‘’అండలీబ్’’కు పోషకుడు . ఇతడు స్థానిక చాగటాయ్ భాషలో కవిత్వం రాశాడు . టర్కీకవిఆలీ షెర్ నవాయ్ రాసిన గజల్స్ కు చాగటాయ్ భాషలో అనువదించాడు .  టర్క్ మెన్  ఎపిక్ కావ్యం ‘’దేస్టాన్’’ను ఇస్లామిక్ విధానంలో రాశాడు .పర్షియన్ కవి రషీద్ ఆల్దిన్ రాసిన జామీ ఆల్ తవారఖ్ ,మధ్యయుగ కవి ఇమాద్ ఆల్ దిన్నేసిమి  రాసిన నేసిమి లలో ఆ దేశ సాంస్కృతిక విషయాలు తెలుస్తాయి

  18వ శతాబ్ది మధ్యలో టర్క్ మెన్ జాతీయ సాహిత్యానికి బీజాలుపడ్డాయి .1753లోవాజీ ఆజాద్ ,1756లోబెహిస్తామే రచనలు సున్నీమత విషయాలతో వచ్చాయి మక్తూం ఖ్వాలి 800 కవితలు రాశాడు .వీటిలోఎక్కువభాగం జానపదాలు .వీటిని ఘోస్గి అంటారు .షాహ్ బెబ్దే –ఖివా చదివి గుల్ బుల్బుల్ ,షహ్ బెహ్రాం అనే ప్రసిద్ధ కావ్యాలు రాశాడు .దేస్తాన్ రీతిలో రాసినవాడు మఘ్ రుపి-యూసఫ్ అహమాద్ ,ఆలి బెక్ బోలి బెక్ రాశాడు .1770లో జరిగిన తిరుగుబాటు నూ కవిత్వీకరించాడు .19వ శతాబ్దిలో మారుట్ తాలిబి తనపాక్షిక జీవిత చరిత్ర ‘’దాస్తాన్ తాలిబి వ సుఖ్ భేజ్మాల్ రాస్తే ,సెయిట్ నాజర్ సెయిది లిరిక్ శైలిలో జానపదాన్ని పండించాడు .19శతాబ్దిలో దేశాన్ని రష్యా ఆక్ర మి౦చాకకోద్దిపాటి కవిత్వం వచ్చినా అది భక్షీలఖాతాలోకే వెళ్ళింది

  మహిళలలో అన్నా సోల్టాన్సేలడోన్నా కేకిలోవా –సోవియట్ యుగ కవయిత్రి .కమ్యూనిస్ట్ పార్టీ సేవాకర్త రచయత్రి ,కస్టడీలో ఉంటూ కూడారచనాలు చేసి 30ఏళ్ళకే చనిపోయింది

భకర్ గుల్ కేరిమోవా –కవిత్వం, ఫిక్షన్ రాసింది .1983లో ఆమె రాసిన చిన్నకథల సంపుటి వెలువడింది .1988లో కవితా సంపుటి ముద్రించింది

సోనా యజోవా –ప్రజాకవిగా గుర్తి౦పు పొందింది. కవిత్వం లో దేశభక్తి ,ప్రేమ ఉంటాయి

జర్నలిస్ట్ లలో అన్నాకుర్బాన్ అమంఖిలేవ్ ,గోజల్ నురజిఎవా అక వేల్సేపార్ మొదలైనవారున్నారు .

పురుషకవి అమన్ కెకిలోవ్ ఒక్కడే సోవియెట్ తర్కమేన్ పోయేట్

ఖోద్జకోలి నర్లీవ్ –స్క్రీన్ ప్లే రైటర్,నటుడు కూడా .గోల్డెన్  ప్రైజ్ నామినేషన్ అందుకున్నాడు

ప్రపంచమంతా కరోనావైరస్ తో తల్లడిల్లుతుంటే తుర్కేమిస్తాన్ మాత్రం ప్రపంచ ఆరోగ్య దినోత్సవం నాడు బ్రహ్మాండమైన సైకిల్ రాలీ నిర్వహించింది .కానీ కరోనా వైరస్ కేసులు జీరో అని ప్రకటించింది  .చైనాకు ఇతర దేశాలకు విమానసర్వీసులు రద్దు చేసింది .అయినా  దేశంలో ప్రజాజీవితం యధాప్రకారం సాగుతూనే ఉన్నది .ఎవరూ మాస్కులు ధరించటం లేదు విందులూ వినోదాలు పెళ్ళిళ్ళూ అన్నీ మామూలే .

  సశేషం

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -3-5-20-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

సేవకు మారుపేరు-‘’లేడీ విత్ దిలాంప్’’ ఫ్లారెన్స్ నైటింగేల్ (వ్యాసం )-గబ్బిట దుర్గా ప్రసాద్-విహంగ -మే 2020

సేవకు మారుపేరు-‘’లేడీ విత్ దిలాంప్’’ ఫ్లారెన్స్ నైటింగేల్ (వ్యాసం )-గబ్బిట దుర్గా ప్రసాద్-విహంగ -మే

image.png

ఈనాడు కరోనా విపత్తు సమయంలో ప్రపంచమంతా అతలాకుతలై పోతుంటే , అపర నారాయణ స్వరూపులుగా డాక్టర్లు ,వారికి సాయపడే నర్సుల నిస్వార్ధ సేవలు చిరస్మరణీయంగా ఉన్నాయి .అందుకనే ఆ నాడేప్పుడో బాధ పడుతున్న వారికి, రోగులకు సీవ చేయటం లోనే ఎంతో సంతృప్తి ఉందని ,మానవ సేవలో తనజీవితం ధన్యమైనదని భావించిన నిస్వార్ధ సేవ కురాలు ఫ్లారెన్స్ నైటింగేల్ ను గురించి తెలుసుకొని స్పూర్తి పొందుదాం . ఫ్లారెన్స్ నైటింగేల్ 1812మే నెలలో ఇటలీలో పుట్టింది .తండ్రి విలియం ఎడ్వర్డ్ మహా సంపన్నుడు .తన కూతుళ్ళు ఇద్దరికీ ఇంటిదగ్గరే లెక్కలు ,జాగ్రఫీ ,గ్రామర్ బోధించేవాడు .తల్లి చాలా అందగత్తె.అక్క ,తండ్రి లతోపాటు ఊళ్ళు తిరిగేది .ఆ కాలం లో వివాహం కాని ఆడ పిల్లలు ఇంటి దగ్గరే కూపస్థ మండూకాలు లాగా ఉండాలని పెద్దలు భావించేవారు .అక్కడి ఆసుపత్రులలో శుచి శుభ్రత లేకపోవటం చూసి చాలా బాధ పడింది .అయినా సరే నర్సుగా పని చేయటానికి నిర్ణ యించుకొన్నది .అంటే ఆమె ఒకరకంగా విప్లవాత్మక భావాలు ప్రదర్శించి ,పేదలకు, అనాధలకు సేవ చేయాలన్న గాఢ మైన కోరిక మనసులో జ్వలించింది

ఫ్లారెన్స్ తల్లి ,తన కూతురు ప్రపంచ ప్రసిద్ధ సాహితీ వేత్త కావాలని ఆశపడింది .కాని ఈమె జర్మని లోని కైజర్ సంస్థ గూర్చి విని తెలుసుకొని ,అక్కడే పని చేయాలన్న పూర్తి సంకల్పం తో ఇద్దరు బిడ్డల్ని దత్తత తీసుకొని పెంచింది .1852లో నలభై ఏళ్ళ వయసులో ఇంగ్లాండ్ వెళ్లి ,అక్కడి ఆస్పత్రుల స్థితి చూసి ,విప్లవాత్మకమైన మార్పులు తీసుకురావాలని కృత నిశ్చయురాలైంది .1853లో ‘’సిస్టర్స్ ఆఫ్ చారిటీ’’చూసి స్పూర్తిపొంది ,లండన్ వెళ్లి తన నాయనమ్మ సేవ చేయాలను కొన్నది .కాని అప్పటికే అక్కడ కలరా వ్యాధి విపరీతంగా వ్యాపించి మృత్యు ఘోష పెడుతు౦డటం ఆస్పత్రులకు వెళ్లి రోగులకు సేవచేస్తూ పగలూ రాత్రీ పని చేసి౦ది ఆ కరుణామయి .పరి శుభ్రతకు అత్యధిక ప్రాధాన్యమిచ్చి ,రోగులకు బలవర్ధకమైన మంచి ఆహారం అందించేది .

1954-56లో క్రిమియా అనే చోట ఘోర యుద్ధం జరిగింది .తోటి నర్సులతో ఫ్లారెన్స్ ఇక్కడికి వచ్చి సైనికులకునిరుపమాన సేవలందించి,వారికి ధైర్యం చెబుతూ అందరి దృష్టీ ఆకర్షించింది .తోటి నర్సులు’’ఎరక్కపోయి వచ్చి ఇరుక్కు పోయాం ‘’అని ఈసడిస్తూ విసుక్కొంటూ సణుక్కు౦టుటే, అత్యంత ధనిక కుటుంబం లో పుట్టిన ఫ్లారెన్స్ మాత్రం అకు౦ఠిత దీక్ష ,మానవత్వం తో వారిని ఆదుకొన్నది .చేసే పని శ్రద్ధ ,ఇష్టం తో చేయటం వలన ఆమె రోగులపాలిటి ఆరాధ్య దేవత అయింది .రాత్రిళ్ళు లైట్లు ఉండేవి కావు .కానీ చేతిలో చిన్న దీపం తో రోగులముందు చిరు నవ్వుతో ప్రత్యక్షమై సేవలు అందించేది .ఆమె ముఖం ఆ దీపపు కాంతితో సేవా దీప్తి గా వెలిగిపోయి ‘’లేడీ విత్ ది లాంప్ ‘’అనే పేరు తెచ్చుకొన్నది . రోగులు కృతజ్ఞతా భావంతో కన్నీరు వర్షించేవారు .’’She is a “ministering angel” without any exaggeration in these hospitals, and as her slender form glides quietly along each corridor, every poor fellow’s face softens with gratitude at the sight of her. When all the medical officers have retired for the night and silence and darkness have settled down upon those miles of prostrate sick, she may be observed alone, with a little lamp in her hand, making her solitary round.

దీనినే’’Lo! in that house of misery
A lady with a lamp I see
Pass through the glimmering gloom,
And flit from room to room.

అని కవిత్వీకరింఛి చిర యశస్సు కల్పించాడు ప్రముఖ ఆంగ్లకవి హెచ్ డబ్ల్యు .లాంగ్ ఫెలో .

మొదట్లో ఆస్పత్రి డాక్టర్లు,అధికారులు తోటినర్సులు ఫ్లారెన్స్ నైటింగేల్ ను చూసి ఈర్ష పడేవారు .క్రమంగా ఆమె నిరుపమాన సేవానిరతి గుర్తించి ముగ్ధులయ్యారు. దీనితో రోగులకు అవసరమైన మందులు, ఆహార పదార్ధాలు ఆమె చెప్పటం ఆలస్యం ,సిద్ధం చేసేవారు .ఒక్కోసారి వారు పంపటం ఆలస్యమైతే తనస్వంత డబ్బు ఖర్చుపెట్టి తెప్పించి ,ఆదుకొనేది .ఆస్పత్రులలో రోగులకు సరిపడిన పడకలు లేకపోతె ,చుట్టుప్రక్కల ఉన్న పాత ఇళ్ళను, ,బిల్డింగ్ లను హాస్పిటల్స్ గా వాడుకోవటానికి అధికారులను ఒప్పించి ,సేవలకు ఆటంకం కలగకుండా చూసిన మానవీయ మూర్తి ఆమె ,రోజుకు మూడు గంటలు మాత్రమె నిద్రపోయి మిగిలిన కాలమంతా అంటే అహర్నిశలు సేవలోనే గడపటం తో ఫ్లారెన్స్ ఆరోగ్యం క్రమంగా క్షీణించి బాగా చిక్కి పోయింది .అయినా అదే పూనికతో పని చేసేది .ఆమెలో ఒక దైవీ శక్తి ఆవహించిందేమో అని భావించేవారు .

ఇలా నిరంతర,అనుక్షణ సేవలో ఉండగా ఒకరోజు ఆమె అనుకోకుండా స్పృహ తప్పి పడిపోయింది .మామూలు జ్వరమే అనుకొన్నారు.తర్వాత కాజిల్ హాస్పిటల్ లో చేర్చారు .ఆమెను చూసి రోగులు కన్నీరు మున్నీరుగా విలపించారు .ఆరోగ్యం కాస్త మెరుగు పడగానే క్రిమియా ,స్కుటారిఆస్పత్రుల మధ్య తిరుగుతూ మళ్ళీ యధాప్రకారం రోగులకు సేవ లందించింది . రోగులకు నిత్యం ధైర్యం చెబుతూ, డబ్బు తాగుడికి,వ్యసనాలకు ఖర్చుపెట్టకుండా కుటుంబం పట్ల శ్రద్ధపెట్టమని హితవు చెప్పేది .అందరికీ అందుబాటులో గ్రంథాలయాలు ఉండేట్లు చేసి,అక్షరాస్యత పెంచటానికి దోహదపడింది .

నైటింగేల్ తన నర్సు వృత్తి సంబంధమైన రెండు రచనలు 1-నోట్స్ ఆఫ్ హాస్పిటల్స్ 2-నోట్స్ ఆన్ నర్సింగ్ అనే ఉత్కృష్ట గ్రంథాలు రాసింది ,ధైర్యగా విక్టోరియా మహారాణికి ,పై అధికారులకు హాస్పిటల్స్ బాగోగులగురించి, వాటి స్థితి గతులను మెరుగు పరచాల్సిన అవసరాలగురించి ఎప్పటికప్పుడు ఉత్తరాలద్వారా రాసి, తెలియ బరచేది .దీనివల్లనే అప్పటి నుంచి నర్సులకు విధిగా శిక్షణ అంటే ట్రెయినింగ్ ఇచ్చే ఏర్పాట్లు ప్రారంభమయ్యాయి .1860జూన్ 24 న ‘’నైటింగేల్ స్కూల్ ఫర్ నర్సెస్ ‘’సంస్థను లండన్ లో స్థాపించారు.ఫ్లారెన్స్ నైటింగేల్ ను ‘’మదర్ ఆఫ్ మోడరన్ నర్సింగ్ ‘’గా గుర్తించారు .ఆమె సేవలను గుర్తించి 1883లో బ్రిటిష్ ప్రభుత్వం ‘’రాయల్ రెడ్ క్రాస్ ‘’పురస్కారం .’’లేడీ ఆఫ్ గ్రేస్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ సెయంట్ జాన్ ‘’అవార్డ్ ,1907లో ‘’ఆర్డర్ ఆఫ్ మెరిట్ ‘’అవార్డ్ అందజేసి గౌరవించింది .

భారత దేశం లోనూ ఫ్లారెన్స్ సేవలు చేసి కీర్తిపొందింది .1859లో ఆరోగ్య సంస్కరణలకోసం విక్టోరియా మహారాణి ఒక కమీషన్ ను నియమించింది .మద్రాస్ మేయర్ ఆడ నర్సుల శిక్షణ ను ప్రోత్సహించగా ఆమె వచ్చి శిక్షణ నిచ్చింది .నగర పారిశుధ్యం బాగా మెరుగుపడింది .మనదేశం ఆమె మాటలకు విలువ నివ్వటం వలన దేశం లో మరణాల రేటు బాగా తగ్గిపోయింది .1913ఆగస్ట్ 13 న రోగులపాలితటి దేవత, మానవత్వం మూర్తీభవించిన సేవా మూర్తి ,ఆపద్బాందవి ఫ్లారెన్స్ నైటింగేల్ 90 ఏళ్ళు నిండుగా జీవించి ,మానవ సేవయే మాధవ సేవగా భావించి ఆర్తుల, బాధితుల సేవలో జన్మ ధన్యం చేసుకొని లండన్ లో మరణించి౦ది .

ఇస్తాంబుల్ లో నాలుగు ఆస్పత్రులు ఆమె పేర నిర్మించి వైద్య సేవలందిస్తున్నారు .లండన్ లో వెస్ట్ మినిస్టర్ లో ఆర్ధర్ జార్జి వాకర్ శిల్పించిన ఫ్లారెన్స్ నైటింగేల్ విగ్రహం స్పూర్తివంత౦ గా ఉంటుంది .ధామస్ హాస్పిటల్ లో నైటింగేల్ మ్యూజియం ఏర్పాటు చేశారు .ఆమె శతాబ్ది ఉత్సవాలలో భాగం గా 2010 లో మాల్వెర్న్ తో ఆమెకున్న అనుబంధాన్ని పురస్కరించుకొని ‘’మాల్వేర్న్ మ్యూజియం ‘’ఏర్పాటుచేసి ఆమె జ్ఞాపికలు ప్రదర్శించారు .ఫోనోగ్రాం లో రికార్డ్ చేసి ,భద్రపరచబడిన ఆమె వాయిస్’’ When I am no longer even a memory, just a name, I hope my voice may perpetuate the great work of my life. God bless my dear old comrades of Balaclava and bring them safe to shore. Florence Nightingale.’’ను బ్రిటిష్ లైబ్రరి సౌండ్ ఆర్కైవ్ లోనూ , ఆన్ లైన్ లోనూ వినవచ్చు .

1920లో ఆమె జీవితాన్ని ‘’లేడీ విత్ ది లాంప్ ‘’పేరుతో నాటకంగా ఎడిత్ ఇవాన్స్ రాసి ప్రదర్శించాడు .1951లో ఇదే పేరుతో సినిమా తీశారు .2008 లో బి.బి .సి.లో డాక్యుమెంటరి గా ప్రదర్శించింది 2009లో సంగీత నాటకంగా ప్రదర్శించారు .బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ ఆమె చిత్రంతో 10పౌండ్ల నోటు ను 1975లో ముద్రించి విడుదల చేసింది . బ్రిటిష్ మహిళా మోనార్క్ ల బొమ్మలు కాక , వేరొక మహిళా చిత్రం ఉన్న బ్రిటిష్ కరెన్సీ ఒక్క నైటింగేల్ ది మాత్రమే.అదే ఆమెకు ఘనమైన నివాళి .1855లో మొదటిసారిగా ఆమె జీవిత చరిత్ర రాసి ప్రచురించారు .1911లో సాధికారికంగా నైటింగేల్ జీవితచరిత్రను ఎడ్వర్డ్ టాయ్స్ కుక్ రెండుభాగాలుగా రాసి వెలువరించాడు .2002లో బిబిసి ప్రకటించిన 100మంది’’ గ్రేట్ బ్రిటన్స్ ‘’లో ఆమెకు 52వ స్థానం లబిస్తే ,’’ది టాప్ హిస్టారికల్ పర్సన్స్ ఇన్ జపాన్ ‘’లో ఆమెకు 17వ రాంక్ లభించింది .అనేక దేశాలు నైటింగేల్ పోస్టేజ్ స్టాంప్ లు విడుదల చేసి గౌరవించాయి .ప్రపంచ నర్సింగ్ చరిత్రలో ‘’లెజెండ్ ‘’గా చిర యశస్సు నార్జించిన ఫ్లారెన్స్ నైటింగేల్ సకలమానవాళికి ఆదర్శం ,స్పూర్తి ,ప్రేరణ ,మార్గదర్శి .

-గబ్బిట దుర్గా ప్రసాద్

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

image.png

image.png
Posted in రచనలు | Tagged | Leave a comment

స్టే హోం జీరోలు కరోనా

స్టే హోం జీరోలు

దానయ్య –అమ్మా వాసంతి ఏమిటి అర్జెంట్గా ఫోన్ చేసి రమ్మన్నావు  మావాడు బానే ఉన్నాడా .ఏడీ కనబడడెం

వాసంతి –మీ కోసం ఎదురు చూస్తూ గదిలో ఉన్నరన్నయ్యా ,ఏమిటి తల, మొఖానికి  తువ్వాలు చుట్టుకు వచ్చారు

దాన-అదా అదీ  అదీ-కంగారులో వస్తుంటే మాస్క్ దొరక్కపోతే పోలీసులు పట్టుకొంటారని అలా వచ్చానన్నమాట అదన్నమాట .అంతకంటే ఏమీ లేదన్నమాట .

వాస-సర్లెండి .లోపలి వెళ్ళండి .లోపల హాయిగా మాట్లాడుకోండి బయట గొళ్ళెం పెడతా ఎవరూ రాకుండా

దాన –లోపలికెళ్ళి –అరె మదన్ అనగానే మదన్ భళ్ళున కక్కుకున్నట్లు ఏడుపు లంకించుకొన్నాడు  అదేంట్రా నోటికి ఆప్లాస్టర్ ఏమిటి

మదన్ –దానికి లాక్ డౌన్ అంత కథ ఉందిరా అన్నాడు ప్లాస్టర్ తీసేసి .

దాన-అదేదో వదులు త్వరగా మళ్ళీ ఇంటికిపోవాలి మీ చెల్లెలు ఎదురు చూస్తూ ఉంటుంది

మద-ఒరే అసెంబ్లీ లో మా వాళ్ళు అందర్నీ బండబూతులు తిడుతుంటే  నాకూ ఆమధ్య వీరావేశం వచ్చి అవన్నీ మా ఆవిడమీద ప్రయోగించా .ఆఫీసుకు వెళ్ళేవరకు బానే ఉండేది .లాక్ డౌన్ మొదలైన దగ్గర్నుంచి  నాపని నరకం చేసిందిరా .ఆఫీసుపనే కాక ఇంటి పనీ చేయిస్తోందిరా .ఏదైనా లోపం వస్తే పిచ్చబండ బూతులు తిడుతోంది .మొదట్లో నాకు అందులో డిగ్రీ ఉ౦ది కనుక నేనూ మొదలెట్ట బోయాను .అంతే చటుక్కు మూడు వరసలు ప్లాస్టర్ వేసి బెసగ కుండా క్రాస్ గా కూడా వేసి తీసుకోటానికి వీల్లేకుండా చేసి౦దిరా బాబాయ్.ఒకటి రెండు సార్లు ప్రయత్నిస్తే కుదరలేదు గదిలో సిసి కెమెరాలు పెట్టిందట క్షణం లో తెలిసి లోపలి వచ్చి నాపని భజగోవిందం చేస్తోందిరా.ఇంతకంటే ఘోరం చేసిందిరా .నోటికేకాదు కిందకూడా గట్టి ప్లాస్టర్ వేసి బంద్ చేసింది .ఆకంపు భరించలేక చచ్చిపోయాను .పిల్లలు చూసి భయపడి వాళ్ళ అమ్మమ్మగారింటికి పారిపోయారు వారం దాటాక నాకు మోక్షం కలిగించింది. కొంపంతా గౌలుకంపు రోజూ ఫినాయిల్ డెట్టాల్ తో కడిగి లైజాల్ చల్లి ఆ వాసన పోగొట్టటాని కి పది రోజులు పట్టింది .ఐతే ఫుడ్ ఎలర్జీ వస్తుందని నాతో ఆపది రోజులు వంట చేయించలేదు మిగిలిన ఆడవా చాకిరీ మామూలే  .

దాన-ఒరే మీ ఆవిడ పరమ సాధ్విలాగా ఉండేది .ఎప్పుడూ పూజలు పునస్కారాలు తీర్ధ ప్రసాదాలతో గడిపేది సడెన్ గా ఇంత వయోలేంట్ ఎలా అయిందిరా

మదన్ –పిల్లిని గదిలో  పెట్టి బంధించి బెదిరిస్తే  దానికీ పౌరుషం తన్నుకొచ్చి మీదపడి రక్కుతుంది అదే జరిగింది .బూతుమాట అసలే తెలియంది ఆన్ లైన్ బూతుపాఠాలు నేరుస్తూ ,కొత్తబూతుపుస్తకాలు తెప్పించిఅప్ డేట్ అవుతూ తిట్టిన తిట్టకుండా కొట్టిన చోట కొట్టకుండా కొట్టి పగ తీర్చుకొంటో౦ది .అసలుకారణం నామీదకాదు .మా నాయకుల బూతులమీద పగ అది నామీద చూపించింది అనుకొంటా.సరే ఇప్పటిదాకా నా వాయి౦పే కానీ  నీ నెత్తిన,ముఖానికీ ఆముసుగేమిట్రా

దాన –అమాంతం ముసుగు ఎత్తేసి బకెట్ కన్నీరు కార్చేసి రూమ్ అంతా వరదచేసి –నా బాధలు కూడా నీతో చెప్పుకోటానికే మా ఆవిడ వద్దనివారించినా మీ ఆవిడ ఫోన్ తో పరిగెత్తుకొచ్చా

మద-నెత్తిన కరోనా ముళ్ళు లాగా ఆ బొప్పులేమిట్రా చెంపలమీద ఆ కెంపు లేమిటి

దాన-అదో పెద్ద కాశీ మజిలీ  స్టోరీ . అన్నం సరిగ్గా ఉడక  లేదని ,పప్పులో ఉప్పు లేదని కూరలో కారం ఎక్కువైందని పచ్చట్లో పులుపు తగ్గిందని ,పులుసులో బెల్లం వెయ్యలేదని అప్పడాలకర్రతో కొట్టిన దెబ్బలు అవి  బహుశా నెత్తిన గాప్ ఉన్నట్లు లేదు . చెంప లంటావా బట్టల మురికి వదల్లేదని ,ఇల్లు సరిగ్గా ఊడవలేదని , అంట్లు క్లీన్గా తోమలేదని స్టవ్ సరిగ్గా మండటం లేదని టిఫిన్లు టైంకి చేయటం లేదని ఒక్కొక్కదానికి ఒక్కో చెంప దెబ్బ లేదా అట్లకాడ దెబ్బ .రెండు బుగ్గలూ బూరెల్లా   ఉబ్బి పోయాయిరా అన్నం తినటానికి లేదు నీళ్ళు మింగటానికి లేదు నాగతి అధోగతి అయిందిరా మామా

మద –ఏమోరా ఎప్పుడు మీ ఇంటికి వచ్చినా మీ ఆవిడ చాలా ఆత్మీయంగా పలకరించి కాఫీ తాగే దాకా ఊరుకోనేదికాదు .ఇంతసడన్ గా ఈ మార్పేమిట్రా

దాన –ఆఫీస్ కు వెళ్ళే రోజుల్లో ప్రతిదానికీ విసుక్కోటం సణుక్కోవటం ,సూటీ పోటీ మాటలతో బాధించటం ,ఒక్కోసారి పిచ్చకోపంతో చెయ్యి చేసుకోవటం చేసేవాడిని .ఇప్పుడుతీరుబడిగా ఇంట్లో ఉండటం తో ఆ పగా ,ప్రతీకారం రెట్టింపు ఉత్సాహంతో తీర్చుకొంటో౦ది మామా .నాబతుకు బస్టాండ్ అయింది బాబాయ్ .వీపు మీద చూడలేదు ఇదుగో చూడు చొక్కా విప్పుతా’’అని చొక్కా విప్పి చూపించి బావురుమన్నాడు .అంగుళం ఖాళీలేకుండా వాతలే వాతలు . ఇక పెడతాన్రా .ఆలస్యం ఐతే డబుల్ పనిష్మెంట్ భరించాలి ‘’అంటూ మళ్ళీ తలకూ మోహానికీ తుండుగుడ్డ చుట్టుకొని బై చెప్పి గది బైటికి వచ్చాడు

వాసంతి –అప్పుడే వెళ్ళిపోతున్నారా అన్నయ్యా .కమ్మగా కబుర్లు చెప్పుకోన్నారా .మా వారు బాగా మాట్లాడారా మనసు విప్పి మాట్లాడాడా నీ ఫ్రెండ్

దాన –హృదయ భారాలు తీరేదాకా హాయిగా మాట్లాడుకొని ఆనందించాం అమ్మా అన్నాడు డగ్గుత్తికతో

వాస-అదేంటి అన్నయ్యా కళ్ళవెంట ఆనీటి చారలేమిటి గొంతులో ఆకంపనం ఏమిటి

దాన-అదంతేలే అమ్మా. అంతేగామరి .అంతే మరి అని వినిపించీ వినిపించకుండా అనుకొంటూ నిష్క్రమించాడు

వాసంతి –రోలోచ్చి మద్దెలకు మొరపెట్టుకుని  వెళ్ళిందన్నమాట . స్టే హోం జీరోల బాధలంటే ఇవేనేమోమరి  ఏమోమరి నాకేం తెలుసు పాపం .

  మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -2-5-20-ఉయ్యూరు

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

ప్రపంచ దేశాల సారస్వతం 54-అంగోలా దేశ సాహిత్యం

ప్రపంచ దేశాల సారస్వతం

54-అంగోలా దేశ సాహిత్యం

కరోనా సోకని 13వ దేశం అంగోలా ఆఫ్రికాలో ట్రాపికల్ అట్లాంటిక్ బీచెస్ , నదులు ,సబ్ సహారా ఎడారులతో ఉంటుంది .రాజధాని లువాండా .దీన్ని రక్షించటానికి 1576లో పోర్చుగీస్ పటిష్టమైన కోట కట్టింది .పాలియోలితిక్ కాలం నుంచి జనావాసమున్న దేశం .ఎన్నో ఎత్నిక్ గ్రూపులున్నాయి .అనంతమైనఖనిజం పెట్రోలియం ఉన్నాయి .1975లో స్వతంత్రం పొంది రిపబ్లిక్ అయింది .అత్యధిక వేగంగా అభి వృద్ధి చెందిన దేశంకూడా .జీవనప్రమాణం చాలాతక్కువ .పిల్లలమరణాలు తక్కువే .ఆర్ధికం అంతా కొందరి గుప్పిట్లోనే ఉంటుంది .2008,12లలో ఎన్నికలు జరిగి కొత్తరాజ్యాంగం అమల్లోకి వచ్చింది .దేశఖనిజ సంపదకోసం అనేక అంతర్యుద్ధాలు అంతకు ముందు అనుభవించింది .2016 పాతికేళ్ళలో రాని పెద్దకరువు వచ్చి ఆర్ధికం కుదేలైంది .2017లో కొత్త ప్రెసిడెంట్ వచ్చాడు .శీతోష్ణస్థితిలో చాలావ్యత్యాసాలు ఉండటం వలన వర్షాకాలం కరువుకాలం ఉంటాయి .సెక్స్ వివక్షత ఎక్కువ .డైమండ్, గోల్డ్ ,కాపర్ ఆయిల్ వన్యమృగాలు ఎకానమికి దోహదం అయినా సివిల్ వార్స్ తో దెబ్బతిన్నది .చైనాతో ట్రేడ్ దోస్తీ ఎక్కువ .పెట్రోల్ గాలన్ 0.37డాలర్లు.2002 తర్వాత స్థిరమైన ఎకానమీ ఏర్పడింది .సౌత్ ఆఫ్రికానుంచి ఆహారపదార్ధాలు దిగుమతి చేసుకొంటుంది .అన్నిరకాల ప్రయాణ సౌకర్యాలు ఉన్నాయి .టెలికమ్యూనికేషన్స్ ,టెక్నాలజీ లో గణనీయం గా ముందుంది .ప్రజలభాష పోర్చుగీసుతోపాటు ఉన్గుమ్బు కిలోమ్బు మొదలైనవెన్నో జాతుల భాషలున్నాయి  .క్రైస్తవులు  ఎక్కువ .కలరా మలేరియా రేబిస్ మొదలైన జబ్బులెక్కువ

  8ఏళ్ళు ప్రాధమిక విద్య ఉచితం అయినా బిల్డింగ్ లు టీచర్స్ లేకపోవటం తో పిల్లలు బడికి రావటం లేదు .ఇటీవలి కాలం లో అక్షరాస్యత పెరిగింది .ఇక్కడి సంస్కృతిపై  పోర్చుగీస్ సంస్కృతిప్రభావం ఎక్కువ  .1972లో మొదటి సినిమా నిర్మించారు బాస్కెట్ ఫుట్బాల్ ఆటలు బాగాడుతారు .కరెన్సీ –అంగోలన్ క్వాంజా .

అంగోలా సాహిత్యం –అంగోలన్ సాహిత్యం 19వ శతాబ్దిలో మాత్రమె ఆరంభమైంది .రచయితలు  పోర్చుగీస్ భాషలోనే రాస్తారు .2006లో లువాన్డియో వీరా అనే రచయిత 1,28000డాలర్ల కొమోజ్ ప్రైజ్ పొందాడు కానీ తీసుకోలేదు. అంగోలా మొదటి ప్రెసిడెంట్ అగస్టినో నెటో కవి కూడా .బాలసాహిత్యరచయిత క్రెమిల్డా డీ లిమా .జో ఎద్యుర్డోఅగాలసా 2017లో ఇంటర్నేషనల్ డూబ్లిన్ లిటరరీ ప్రైజ్ పొందాడు .

 కొందరు అంగోలా రచయితలు  –హెన్రిక్ అబ్రాన్చేస్ ,ఆన్తెనో అబ్రూ ,ఫెర్మాడోకోస్టా అన్డ్రేడ్,అలేగ్జాండ డస్కలోస్ర్,మోటా ఎకేన్హా మొదలైన 60మందికి పైగానే ఉన్నారు

బెస్ట్ బుక్స్ –అనదర్ డే ఆఫ్ లైఫ్ –రిస్జార్డ్ కా ,గుడ్ మార్నింగ్ కామ్రేడ్స్ –ఒండ్రాజి,ఓస్ ట్రాన్స్పరెంస్ –ఒండ్జకి,మేయోమ్బే –పెపెటాల,దిలాస్ట్ ట్రెయిన్ టు జోనా వెర్డే(ఆఫ్రికన్ సఫారి )-పాల్ థెరాక్స్ వగైరా

అంగోలా లో అక్షరాస్యత తక్కువ డోలాయమానమైన ఎకానమీ ,విపరీత సీతోష్ణస్థితి  ఉండటం వలన బయటివారికి ఆవాసయోగ్యం కాదు .కరోనా వైరస్ ను ము౦దేగుర్తించి అన్నిజాగ్రత్తలు తీసుకొని అంగోలా మృత్యుముఖం నుంచి బయట పడింది

  సశేషం

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -2-5-20-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

సుందర కాండ లో హనుమ బహుముఖీన వ్యక్తిత్వం-15

సుందర కాండ లో హనుమ బహుముఖీన వ్యక్తిత్వం-15

విమానం నుంచి ప్రాకారం పై దూకి ,మేఘాలమధ్య  మెరుపులా వేగంగా వెళ్ళాడు హనుమ .అన్ని చోట్లా వెదికినా సీత కనపడనందుకు విచారించి ,సంపాతి చెప్పిన దానిప్రకారం సీత లంక లోనే ఉండాలి .అయోనిజ సీతామాత రావణుని వశం కాదు .రావణుడు ఆమెను ఎత్తుకొని వచ్చేటప్పుడు జారి కిందపడి పోయిందేమో ,లేక సముద్రంలో పడిపోయిందేమో ,లేక రావణుడి కబంధహస్తాలలో నలిగి చనిపోయిందేమో ,వాడుఆమెతో సముద్రం దాటుతుంటే నెమ్మదిగా విదిలించుకొని సముద్రం లో పడి పోయిందేమో ,ఒక వేళ దుష్ట రాక్షస రాజు రావణుడే ఆమెను తినేశాడేమో,లేక రావణభార్యలే భక్షించారేమో ,రాముడిని తలచుకొంటూ చనిపోయిందేమో .రామలక్ష్మణ అయోధ్యలను స్మరిస్తూ ప్రాణం విడిచిందేమో పంజరం లో బంధింపబడిన చిలక లాగా దుఖిస్తోందేమో .నా పిచ్చకాని ఆమె ఎట్టిపరిస్థితులలోనూ  రావణుడికి లొంగనే లొంగదు .సీత లేదనే వార్త రాముడికి ఎలా చెప్పను .నిజం చెప్పకపోతే దోషం అని పరిపరి విధాల ఆలోచి౦చాడుకాని ఒక నిర్ణయానికి రాలేకపోయాడు ,

  సీతను చూడకుండా కిష్కింధకు వెళ్లి ఏం ప్రయోజనం .అక్కడి వారు అడిగే ప్రశ్నల వర్షానికి నా దగ్గరం ఏం సమాధానం ఉంది .సీతకనపడలేదని చెబితే దుఖం ఆపుకోలేక రాముడు బతుకుతాడా ,ఆయన లేకపోతె తమ్ముడు లక్ష్మణుడు ఉంటాడా .ఈ ఇద్దరూ లేరని తెలిస్తే భరతుడు జీవిస్తాడా ,శత్రుఘ్నుడు కూడా అంతేగా .వీరి మరణం చూసి తల్లులు కౌసల్య సుమిత్ర కైకలు బతుకుతారా .ఇది తెలిసి సుగ్రీవుడు రుమ ,తార అంగదుడు చనిపోరా .వానరరాజులందరి మరణం జీర్ణించుకోలేక వానరులు రాళ్ళతో తలలు బద్దలు కొట్టుకొంటారు .విషం తాగి చస్తారు అడవులు పట్టిపోతారు .కనుక నేను కిష్కిందకు వెడితే భయంకర రోదనమాత్రమే చూస్తాను .ఎవ్వరిముఖంలోనూ సంతోషం జాడ కనిపించనే కనిపించదు .కనుక సీతను చూడకుండా కిష్కింధకు  వెళ్ళనే వెళ్ళను.నేను ఇక్కడే ఉంటె వారంతా ఎప్పుడో ఒకప్పుడు సీతను చూస్తాము అనే నమ్మకంతో బతుకుతారు .నిశ్చయంగా ఇక్కడే ఉంటూ దొరికింది తింటూ వానప్రస్థం గడుపుతా .లేకపోతేసముద్ర తీరం లో చితి పేర్చుకొని అగ్నికి ఆహుతి అవుతా .ఒక వేళ సన్యాసి గా ఇక్కడే ఉండిచనిపోతే ఆ శరీరాన్ని కాకులు గద్దలూ తినేస్తాయి .ఇదిమహర్షులు ఉపదేశించిన మార్గమే .పోనీ నీటిలో పడి చనిపోతే ?అని మళ్ళీమళ్ళీ ఆలోచించాడు  .చివరి సారిగా తాను  లంకలో ప్రవేశించిన రాత్రి గురించి గుర్తు చేసుకొన్నాడు . ఈ రాత్రే లంకాధి దేవతను చంపాడు చంద్రోదయంతో సుందరమైన లంక చూశాడు శక్తివంచన లేకుండా సీతకోసం వెతికాడు .ఇలాటి రాత్రి గురించి లోకం గొప్పగా చెప్పు కొంటుంది . ఆ  కీర్తిమాల వాడిపోకూడదు. సువాసనలు వెదజల్లుతూ ఉండాలి .ఈ శుభరాత్రి ఫలప్రదం అవ్వాలి .చిరస్మరణీయం గా నిలిచి పోవాలి .కనుక మరింత ఉత్సాహంతో మళ్ళీ అన్వేషిస్తాను .ఆహార నియమాలు పాటిస్తూ జితే౦ద్రి యుడను అయి అశోక వనం లో వెతికిచూస్తాను .సకల రాక్షసులను జయించి ,తపస్వికి తపస్సిద్ధి లాగా ,ఇక్ష్వాకు వంశానికి ఆనందం కలిగించే సీతాదేవిని రాముడికి అప్పగిస్తాను అనుకొన్నాడు

  ఇంతగా మనసును మధించాక అంతర్జ్వలనం అయ్యాక హనుమకు వివేక సూర్యోదయం అయింది .దేవుడు గుర్తుకువచ్చాడు పురుషకార్యానికి దైవీ శక్తి తోడ్పడితేనే కార్యం సాఫల్యమౌతుందని అర్ధమైంది .దండం అంటే నమస్కారం దశగుణం భవేత్ అన్నట్లుగాలేచిను౦చుని చేతులు జోడించి  తూర్పుకు తిరిగి దణ్ణం పెడుతూ  శ్రీరామ లక్ష్మణ సీతాదేవులకు నమస్కరించాడు .తర్వాత దిక్పాలకులు,సూర్య చంద్ర మరుత్తులు  గుర్తొచ్చి వారికీ నమస్సులు అర్పించాడు .మనసు ప్రశాంతమైంది .అంటే ఇప్పుడు కార్య సాఫల్యత భగవంతుడి పై వేశడన్నమాట .నీవే తప్ప ఇతః పరం బెరుగ అన్న గజేంద్ర సద్రుశుడు అయ్యాడు .అశోకవనం ప్రవేశించటానికి సంకల్పించి దానికి తగ్గట్లు శరీరాన్ని సూక్ష్మ రూపం లోకి మార్చుకొని ,సకల దేవతలు సకల భూతాలూ వీరికి ప్రభువైన శ్రీ మహా విష్ణువు  మహర్షులు కార్య సిద్ధికలిగించాలని ప్రార్ధించాడు .సీతామాత ఎప్పుడు కనిపిస్తుందా అని కళ్ళల్లో ఒత్తులు వేసుకొని మళ్ళీ వెతకటం ప్రారంభించాడు .

‘’నమోస్తు రామాయ స లక్ష్మణాయ-దేవ్యై చ తస్మై జనకాత్మజాయై –నమోస్తు రుద్రేంద్ర యమాని లేభ్యో –నమోస్తు చంద్రార్క మరుద్గాణేభ్యః  ‘’

‘’సిద్ధిం మే సంవిదాస్యంతి దేవా స్సర్షి గణాస్త్విహ

‘’బ్రహ్మా స్వయంభూ ర్భగవాన్ దేవాశ్చైవ దిశంతు మే

సిద్ధి మగ్నిశ్చ వాయుశ్చ పురుహూత శ్చవజ్ర భ్రుత్ ‘’

‘’సిద్ధిం సర్వాణి భూతాని భూతానాం చైవ యః ప్రభుః

దాస్యంతి మమ యే చాన్యేహ్యదృస్టాః పథి గోచరాః’’

ఇది 60శ్లోకాల 13వ సర్గ .

సాధకుడు సర్వ సన్యాసం చేసి పరమేశ్వరార్పణ బుద్ధితో పని చేస్తే ఫలితం సిద్ధిస్తుంది అన్న పరమ సత్యాన్ని విడమరచిన కాండ ఇది .ఒక విషమ సమస్య వచ్చినపుడు మనిషి ఎన్ని విధాల ఆలోచించి ,ఫలప్రదానికి ఉత్తమమైన మార్గం ఎంచు కోవాలన్న ఎరుకకూడా కలి గించింది .

  సశేషం

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -2-5-20-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

కరోనా భువనవిజయం

కరోనా భువనవిజయం

అష్టదిగ్గజాలు –నమోస్తు మహా మంత్రీ  .ఈ రోజు మా ఆసనాల వైఖరి మారింది .కవికీ కవికీ దూరం గజం పైనే ఉంది .ఏమిటి విశేషం అప్పాజీ

అప్పాజీ – కరోనా క్రిమి స్వైర విహారం చేస్తోందని చారులవలన విని దానికి సా౦ఘిక దూరమే విరుగుడు అని   ప్రభువులవారు నిర్దేశించగా ఇలా ఏర్పాటు జరిగింది .అందరిమేలుకోసమే కదా

అష్ట-బాగుంది .

అప్పా-అంతేకాదు ప్రతివారూ ముక్కుకు ,మూతికి ముసుగు ధరించాలి .అవీ సిద్ధంగానే ఉన్నాయి మీ ఆసనాలలో .ధరించి ఆసీనులుకండు కవివరులారా

రామలింగడు –అది కట్టుకొని కవిత్వం చదవాలంటే ఒకటి చదివితే ఒకటి వినిపిస్తుందేమో అమాత్యవర్యా

అప్పా-కొంటె వాడవు వికటకవీ .చదివేటప్పుడు తొలగించి నువ్వన్న ఇబ్బంది రాకుండా చేసుకోవపచ్చు .అరుగో ప్రభువులు వేంచేస్తున్నారు స్వాగతం పలుకుదాం

అందరూ-స్వాగతం శ్రీ కృష్ణదేవయ మహీపాలా ,జయోస్తు దిగ్విజయోస్తు

రాయలు –నమస్తే అప్పాజీ .కవి దిగ్గజాలకు వందనం  సుఖాసీనులు కండి

పెద్దన  –ప్రభూ !  ఈఅత్యవసర  సమావేశానికి కారణం తెలుసుకోవచ్చునా

రాయలు –అవశ్యం పెద్దనామాత్యా .అదేదో క్రిమి ప్రపంచమంతా వ్యాపించి  దానవమారణ హోమం చేస్తోందని తెలిసింది .దాని పేరు కరోనా అట .అందుకే ఇవాళ మనం ప్రత్యేకంగా కరోనా భువన విజయం నిర్వహిస్తున్నాం

అష్ట –భేషుగ్గా ఉంది మీ ఆలోచన .అదే ఇప్పటి తక్షణ కర్తవ్యమ్ ప్రభూ

రాయలు –అప్పాజీ ప్రారంభించండి

అప్పా –ధన్యుడను ప్రభు శత్రు రాజుల కదలికలు ముందే గ్రహించి తగినట్లు వ్యవహరించి మట్టు పెట్టె చాణక్యం దాని ముందు పని చేయటం లేదు .ఎలావస్తోందో ఎలా సోకి జనాలను వేలాది పోట్టనబెట్టుకొంటో౦దో అంతు చిక్కటం లేదు .ప్రపంచమంతా కి౦కర్తవ్య తా భావంలోదిక్కు తోచక  పడిపోయింది . మీ కవితా ప్రతిభాతోనైనా దాన్ని ప్రపంచం నుంచి తరిమేద్దామని ప్రభువులు సంకల్పించి ఇలా ఏర్పాటు చేశారు .మనం కూడా ఎక్కువ సేపు ఇక్కడ ఉండటమూ క్షేమంకాదు . కనుక ఒక్కొక్కరు ఒక్క పద్యంతో నే మీసత్తా చూపి ,దాన్ని భయపెట్టి ,తిట్టి ,చావగొట్టి చెవులుమూసి తరిమేయండి .ఇంతకంటే వేరు ఉపాయం లేదు

రాయ –మామనసును చక్కగా అర్ధం చేసుకొని వక్కాణించారు మహామాత్యులు అప్పాజీ

అప్పా –ధన్యుడను రాయా .ముందుగా నేను ఒక కవి పేరు చెబుతాను  వారి కవిత్వం అయ్యాక వారే తమతర్వాత ఎవరో సూచించి సమయం  వృధా కాకుండా చేస్తారు .పెద్దనా మాత్యా ఉపక్రమించండి

పెద్దన –మహా ప్రసాదం

 నిరుపహతిస్థలంబు రమణీ ప్రియ దూతిక తెచ్చి ఇచ్చు క

ప్పుర విడె మాత్మ కింపయిన భోజన మూయల మంచ మొప్పు త

ప్పరయు రసజ్ఞులూహ తెలియంగల లేఖక పాఠకోత్తములన్ కరోన  దూరము చేసె

 అవిలేని బాధితుడనైన నన్ను పద్యము రచియించుమటన్న శక్యమే ‘’

ధూర్జటి మహాకవీ మీరే తరువాత

ధూర్జటి-నీకుం గాని కవిత్వ మెవ్వరికి నేనీనంచు మీదెత్తితిన్

జేకొంటిన్ బిరుదంబు కంకణము ముంజేఁ గట్టితిం బట్టితిన్

లోకుల్ రచ్చరచ్చ చేసి నను శంకించి బాధించగా

పిప్పిటిగోటిపై రోకలిపోటనినట్లు కొ౦ప ము౦చేవు

కరోనా కారుణ్యమే లేదనీకు జీవులతో ఆటాడగన్ ?

రామలింగ కవీ అందుకో

రామలింగ- తెలియక వచ్చి తలుపు తట్టి లోన ప్రవేశించి

అస్తవ్యస్తముల్ జీవితములన్ జేసి కులుకుచున్నావు

కాలిడిన నోట దుమ్మువడ,చండాల ,కోవిద రూప ఓరి

 రోరి పలు మారు నీ పిశాచపు పాడె గట్ట

కరోన గిరోన తురాన యేగు మిక లేకున్న చీపురుతోడ   సి౦గారింతు ‘’

తిమ్మన్నకవీ  కానీండి

తిమ్మన –   అతుల మహానుభావ మని కరోన నొక పెద్ద సేసి,ఊహాను
నిచ్చకంబొదవ సూడిద నిచ్చిన నిచ్చెఁగాక

అది ఆదేశపు ప్రజల నర్పణ మొందిన మొంది౦చు గాక

     ఆమతకరి కోవిదుండు   మమ్ముఁ దలంపఁగ నేల యచ్చటి

 దాని పెకలించి దెచ్చి ఇచ్చట నాటగ నేల ఈ ఘోరకలి అంటించగానేల పృథ్వి అందంతటన్  ‘’

సూరనా మాత్యా మీదే తరువాయి

సూరన – తమి బూదీగల తూగుటుయ్యలల బంతాలాడుచుం దూగనా
కొమరుంబ్రాయపు గబ్బి గుబ్బెతల యంఘ్రుల్ చక్కగా జాగి

       ఉమ్మెత కాయ మొగంబై భీతి గొల్పుచు చనుదెంచు రోతన్ గంటె

      మానవులార నాక మృగీ నేత్రముల మీద మింటి మొగంబై

      సవాల్  విసరు నా వికృతాకార కరోన గాల్చాచు లా గొప్పెడున్ ‘’

  భట్టుకవీ మీ పట్టు పట్టండి

రామరాజ భూషణుడు –  హరిదం భోరుహ లోచనల్ గగన రంగాభోగ రంగత్తమో
భర నేపధ్యము నొయ్య నొయ్య సడలింపన్ రాత్రి పిశాచికి

వరుసన్మౌక్తిక పట్టమున్ నిటలమున్ వక్త్రంబునున్ దోఁచె నా
కరోనా కాకృతి వొల్చె రేకయి సగంబై బింబమై తూర్పునన్ విభ్రాంతి చేకూర్చుచున్

రుద్రకవీ సిద్ధం కండు-

రుద్రకవి – పండితులైనవారు దిగువం దగనుండగ నల్పమైన కరోన
ఉద్దండత బీఠమెక్కిన బుధప్రకరంబులకేమి యెగ్గగున్
గొండొక కోతి చెట్టుకొన కొమ్మకు నెక్కి ఫలప్రసూనముల్ రాల్చిన చందమయ్యే

 గండ భేరుండ మదేభ సింహములలైన మానవుల్

చేష్టలుడిగి కరోన చేతిలో చిక్కుట విదివ్రాతముగాదే యెంత వింతయో .’’

అయ్యలరాజు రామభద్రకవీ శుభప్రద౦ చేయండి

రామభద్ర –గోమా౦శాసని మద్యపాని సగరిన్ గొండీడు చండాలుడున్

హేమస్తేయుడు సోదరీ రతుడు గూడేకాదశిన్ భుక్తిగాం

చేమూఢాత్ముడులోనుగా గలుగు దుశ్శీలాత్మజుడైన జనులున్

దుదిన్  కరోనా వశవర్తులై చత్తురు నెత్తురుగ్రక్కి రఘువీరా జానకీ నాయకా

రాయలు –దిగ్గజకవులారా సరస రస కందాయ పద్యదుడ్డుకర్రలతో కరోనా నడుం విరగ్గొట్టారు భేష్ . ఈనాటి మన సభకు ప్రత్యేక ఆహ్వానితులుగా కొందరు ప్రసిద్ధ కవులనూ ప్రత్యేకంగా ఆహ్వానించాం  .వారూ కవితలతో మెప్పిస్తారు –పఠాభికవీ మోగించండి కవితా నగారా

పఠాభి-నాయీ వచన పద్యాల దుడ్డు కర్రలతో

కరోన నడుము విరగదంతాను

కోవిద్ కొంటె చేస్టల్ని చావు దెబ్బతీస్తాను

అనుసరిస్తాను నవీన పంథాకానీ

నేను శాంతి వల్లించే భావకవిని మాత్రం కాదు

చెడును దండించే అహంభావ కవిని ‘’

శ్రీశ్రీ కవితాగ్ని కురిపించు

శ్రీశ్రీ –నేనుసైతం కరోనాగ్నికి కవిత నొక్కటి ఆహుతిచ్చాను

నేను సైతం విశ్వ శాంతికి వీవెననై వీచాను

నేనుసైతం భువనఘోషను అణచి వేసే అరుపు ఒక్కటి అరిచాను

నెత్తురు చిమ్ముకొంటూ జనం రాలిపోతుంటే నిర్దాక్షిణ్యంగా ఉన్నారేమిట్రా

నేను చెప్పిన సమత మమతా మంటగలిపారు గదరా

భాభ్రాజమానం  భజగోవిందం లారా మీ మొహాలుమండా

ఆరుద్రా కవితా రుద్రుడవుకా

ఆరుద్ర –  దేవత అంత గొప్పది కరోనా రక్కసి

మా ఇంట్లో మా ఆవిడా కూడా యధాశక్తి డిటో

పేరేమిటో తెలిసినా అపలేకున్నాము

కోవిడ్ వాడు కాదు  అగస్త్య భ్రాత

పెళ్ళాం చుట్టాలపట్ల నాకూ  అదే వ్రాత

కరోనా కరోడా మొగుడు –మరే పేరుకీ తగడు

తిలక్ కవితాతిలకం దిద్దూ

తిలక్ – గాలిలేనిప్రకృతి యోగిలాగ రోగిలాగ
మూల్గుతోంది
కాలువిరిగిన ముసలికుక్క దీనంగా
మొరుగుతోంది
తరతరాల నిస్పృహ నన్నావరించుకొంది
చరచరాలు తాకిన కరోన మూర్తి విస్తరించింది
యుద్ధం మీద యుద్ధం వచ్చినా
మనిషి గుండె పగలలేదు
మనిషి మీద మనిషి చచ్చినా
కన్నుతుదల జాలిలేదు
నాగరికత మైలవడిన దుప్పటిలా
కరోన నిండా  కప్పుకుంది
నాకందని ఏవో రహస్యాలు బాధిస్తున్నాయి  నన్ను’’

కు౦దుర్తీ కవితా వాన కురిపించు

కుందుర్తి –దయ కాంతి ఉయ్యాలతో –ఊహ ఊడిగం చేసింది

క్షణక్షణ మొక వైవిధ్య సూచకంగా

విదివ్రాతలో దాగిన అర్దాలకనుగుణ౦గా విహరిస్తోంది కరోన నిర్దయగా

దాశరధీ కవితా పయోనిధి లో ముంచు

దాశరధి

చరిత్రపాడనిధరిత్రిచూడని
పవిత్రగీతంపాడండి
కరోన విచిత్ర భూతం చూడండి

నరాలలోతరతరాలగాథలు
శిరస్సులోనరనరాలబాధలు
గిరిశిరస్సుపైకోవిదహరీంద్రగర్జన
మనమనస్సులోతర్జనభర్జన
చరిత్ర పాడని ధరిత్రి చూడనివిషాద గాధలు  విన్నాం కన్నాం

లోకం పట్టని కవీ విశ్వనాథా అందుకోండి

విశ్వనాథ- కడచిన యామిని పిడుగువడ్డ సగంబు
మాఁడిన తలయైన మద్దిచెట్టుఁ
బోలినదానిని, ముంచెత్తు వానలు
సగములో వచ్చినం జల్లనారి
పోయిన కాష్ఠంబుఁ బోలిన దానిని,
గహనంబులోఁ గుంటగట్టులోన
మట్టలెండి జలాన మాఁగిన చిట్టీతఁ
బోలినదానిని, సోలుదాని

తే.   నెడపెడగ వాయువులు వీవనిట్లు వచ్చు
వాయువున వంగుచును నట్లువచ్చు వాయు
పూరణమున నాఁగుచు నాఁగి మొరయుచున్న
వేణువల్మీక గుల్మంబుఁ బోనిదాని

     కరోన నొకదాని గంటి నేను

సరస్వతీ పుత్రా శతపత్ర సుందరకవిత విప్పండి

పుట్టపర్తి నారాయణాచార్యులు – అదుగో పాతర లాడుచున్నయది సౌధాంతాల నిశ్శబ్ద, మ
ల్లదె మా ప్రపంచ  రాజ్యలక్ష్మి నిలువెల్లన్నీరుగానేడ్చుచు
న్నది, భాగ్యంబులుగాసెగట్టిన మహా దుఖా౦బోధిలో

సౌభాగ్య రేఖ చిదిమి వేసెను క్రూర నికృష్ట కరోనక్రిమి ఇక దారేది తెన్నేది లోకానికిన్’’

రాయలు –చాలా రసవత్తరంగా మన కరోన భువన విజయం సాగింది .పాల్గొన్న వారందరికీ ధన్యవాదాలు .ఐతే నేనిచ్చిన శీర్షిక కరోన భువన విజయం .అంటే నా భావం కరోన మహమ్మారి  ఈ భువనం పై విజయ సంకేతం చూపిస్తోంది కనుక దాన్ని అణచటానికి కవిత్వ సాధనం చేయమని. చక్కగాస్పందించి కవిత శూలాలతో వాగ్బాణాలతో ,చెప్పుదెబ్బల్లాంటి తిట్లకవిత్వంతో చేరిగిపారేసి తరిమికొట్టి ఈఅనంత భువనానికి మేలు చేకూర్చి పుణ్యం కట్టుకొన్నారు మీరంతా .చివరగా నా కవిత

బాలార్కాంశు విజృంభితామలశరత్పద్మాక్ష! పద్మాక్షమా

నీళాజాంబవతీశ! యీశ బలభి న్నీరేరుహోద్భూత ది

క్పాలామూల్యశిరోమణిద్యుతికనత్పాదాబ్జ! పాదాబ్జఫా

లాలంకారకచావలీ మకర దీప్యత్కుండలాంచన్ముఖా.

కరోన బాధితుల స్వాంతంబు చేకూర్చి విస్తరింపక నివారి౦చుమా

అప్పాజీ – ఈ నాటి భువన విజయానికి స్వస్తి .

  మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -1-5-20-ఉయ్యూరు

విన్నపం –మహాకవుల కవితలలో కవిత్వమే రాని నేను సాహసించి వ్రేలుపెట్టి సరదాకోసం ,శీర్షికకు న్యాయం కోసం స్వత౦త్రించి మార్పులు చేశాను .ఆమహాకవులకు చెంపలేసుకొని క్షమాపణ చెప్పుకొంటూ –దుర్గాప్రసాద్

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment