ప్రపంచ దేశాల సారస్వతం 52- సాలోమన్ ఐలాండ్స్ సాహిత్యం

ప్రపంచ దేశాల సారస్వతం

52- సాలోమన్ ఐలాండ్స్ సాహిత్యం

కరోనా సోకని పదకొండవ దేశం సాలోమన్ ఐలాండ్స్  సుమారు 900ల  దీవుల సముదాయం  .దక్షిణ ఫసిఫిక్ లో ఉంటుంది .అతిపెద్ద ఆర్చి పెలగాన్ ఐలాండ్ .రాజధాని హోనియారా గుడల్సనల్  ఐలాండ్ లో ఉంటుంది  .సాంప్రదాయ వృత్తి కళలకు పెట్టింది పేరు.1568లో స్పానిష్ నేవిగేటర్ అల్వరో డిమెండానా మొదట ఇక్కడికి వచ్చిన యూరోపియన్ .1893లో దక్షిణ దీవులను బ్రిటిష్ ప్రోటెక్ట రేట్ కిందకు తెచ్చారు .రెండవ ప్రపంచ యుద్ధం లో జపాన్ అమెరికా కామన్ వెల్త్ దేశాల సైన్యాలమధ్య భీకరపోరాటం జరిగి ‘’బాటిల్ ఆఫ్ గార్డి యసనల్ ‘’పేరుతో పిలువబడింది .1975లో దీవులపేరును ‘’దిసోలోమన్ ఐలాండ్స్ ‘’గా మార్చారు .తరవాత ఏడాది స్వతంత్రం పొంది ది తీసేసి సోలోమాన్ ఐలాండ్స్ అని మాత్రమె ఉంచుకొన్నారు .రెండవ ఎలిజబెత్ పాలనలో గవర్నర్ జనరల్ అధికారం నడుస్తుంది .2007లో భారీ భూకంపాలు ,సునామీ వచ్చి తీవ్ర నష్టం కలిగించింది .ఈదేశం యుఎన్ వో ,కామన్ వెల్త్ ,ఫసిఫిక్ ఐలాండ్స్ ఫోరం ఐఎం ఎఫ్ మొదలైనవాటిలో సభ్యత్వ౦ ఉంది .విద్య నీరు పారిశుధ్యం,స్త్రీలు గృహ హింస లను  మానవ హక్కుల సంఘం రక్షిస్తుంది .హోమో సేక్సువాలిటి నిషిద్ధం .ఇక్కడ ఈక్విటోరియల్ క్లైమేట్ ఉంటుంది .ఇక్కడి రెయిన్ ఫారెస్ట్ లు ఈకో రీజియన్ లో ఉన్నాయి .230కి పైగా ఆర్కిడ్ రకాలున్నాయి .క్షీరదాలు తక్కువే .అగ్నిపర్వత భయాలు ఎక్కువ .మంచి నీరు దొరకటం కష్టం .పారిశుద్ధ్యంకూడా పెద్ద సమస్య .అభి వృద్ధిలో బాగా వెనకపడింది .వ్యవసాయం ఫిషింగ్ మాత్రమె ఆదాయాలు పెట్రోలియం సరుకులు దిగుమతి చేసుకోవాలి .కలప ఈ దీవుల కు వరం .ఎగుమతి బాగా అవుతుంది. అందువలన అడవుల నిర్మూలనం బాగా జరిగి ఇప్పుడే మేల్కొన్నారు .కోప్రా కోకా పామాయిల్ పండించి ఎగుమతి చేస్తారు .సీసం జింక్ నికెల్ గోల్డ్ గనులున్నాయి .డైవింగ్ కోసం టూరిస్ట్ లు బాగావస్తారు .కరెన్సీ-సోలోమన్ ఐలాండ్స్ డాలర్  1977నుంచి అమలులో ఉంది అంతకుముందు ఆస్త్రేలియన్ డాలర్ ఉండేది .పునరుత్పాదక శక్తి కేంద్రాలున్నాయి.

  సుమారు 2శాతం ప్రజలుమాత్రమే ఇంగ్లిష్ మాట్లాడగలరు .సోలోమన్ పిజి ఇక్కడి మాతృభాష.74ఇతరభాషలు ఉంటె వాడకం లేక 4భాషలు అంతరించాయి .మతం –క్రిస్టియానిటి..ప్రజల జీవితకాలం 66ఏళ్ళు .అందమైన జుట్టు ఉన్నవారు 10శాతం ఉంటారు .ఇక్కడ విద్య తప్పని సరికాదు అందువలన 60శాతంపిల్లలే బడికి వెడతారు .ప్రభుత్వం దీనిపై అధిక శ్రద్ధపెట్టి కొన్ని చర్యలు అమలు చేసి పెంచింది .సంస్కృతిలో భిన్నత్వం కనిపిస్తుంది .గృహ హింస ,సెక్సువల్ వయోలెన్స్ చాలా ఎక్కువ .2014లో ఫామిలి ప్రొటెక్షన్ యాక్ట్ తెచ్చి కొంత నివారించారు .సాలోమన్ స్టార్ అనే ఏకైక దినపత్రిక ఉన్నది .ఈ దీవుల బ్రాడ్ కాస్టింగ్ కార్పోరేషన్ రేడియో నిర్వహిస్తుంది .టివి సిగ్నల్స్ అందటం కష్టం .మలనేషియన్ మ్యూజిక్ ఇక్కడ విశేషం .ఫుట్ బాల్,రగ్బీ  బీచ్ సాసర్ ఆడుతారు.

సోలోమన్ సాహిత్యం –ఇండిజినస్ ఫసిఫిక్ ఐలాండర్  లిటరేచర్  ఏర్పడ్డాక మాత్రమె ఇక్కడ రచన 1960లో ప్రారంభమైంది 1968లో సువా లో సౌత్ ఫసిఫిక్ యూని వర్సిటి వచ్చాక ఇక్కడి సాహిత్యకారులలో రాయాలనే ఉత్సాహం వచ్చింది .సృజనరచన కోర్సులు వర్క్ షాప్ లు నిర్వహించారు .1973లో యూనివర్సిటిలో ఆర్ట్స్ అసోసియేషన్ ఏర్పడ్డాక కవిత్వం చిన్న కథలుఫసిఫిక్ ఐలాండ్స్ మంత్లి లో  ప్రచురింపబడ్డాయి .1974లో సొసైటీ’’ మన ‘’అనే ప్రచురణ సంస్థ ఏర్పరచి ,1976లో ‘’మన జర్నల్ ‘’కూడా నడిపారు .మొదటిసారిగా సోలోమన్ ఐలాండ్స్ పోయెట్రి జర్నల్ లో ప్రచురించి ప్రోత్సహించింది .ప్రముఖ రచయితలుగా జాన్ సవునానా ,సెలో కులగోలు గుర్తింపు పొందారు .

  స్త్రీ రచయితా–జులి మాకిని –జూలో సిప్పో గా ప్రసిద్ధురాలు .కవి రచయిత ,స్త్రీ హక్కు ఉద్యమకారిణి .సివిలైజ్డ్ గర్ల్ ,ప్రేయింగ్ పేరెంట్స్ కవితాసంపుటులు వెలువరించింది .యూనివర్సిటి లో చదివి మొట్టమొదటి ఉమెన్ రైటర్స్ వర్క్ షాప్ నిర్వహించింది .ఆ దీవులలో ఆడవారు పడే హింస నుండి విముక్తికోసం శ్రమించింది .అనేక చోట్ల మహిళాహక్కులకోసం ప్రదర్శనలు నిర్వహించింది .గిజో ఫామిలి సపోర్టింగ్ సెంటర్ ఏర్పాటు చేయించింది .2017లో ‘ఇంటర్నేషనల్ వుమెన్ ఆఫ్ కరేజ్ అవార్డ్’’ ను అమెరికా సెక్రెటరి ఆఫ్ స్టేట్ నుంచి పొందింది .70మంది స్పూర్తి మహిళలలో ఒకరుగా గుర్తింపు పొందింది ‘

జర్నలిస్ట్ లలో వాల్టర్ నలన్గువ –మీడియా అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ .ఎడిటర్ ఇన్ చీఫ్ ఆఫ్ న్యూస్ .బ్రాడ్ కాస్టింగ్ కార్పోరేషన్ లో కరెంట్ అఫైర్స్ ఇంచార్జ్

నవలారచయిటలలో రెక్స్ ఫోర్డ్ ఒరటోలా ‘’దిటు టైం రిసరక్షన్ ‘’నవలారచయిత .ఫేసెస్ ఫ్రం సోలోమన్ ఐలాండ్ విలేజ్ అనే స్టోరి కలెక్షన్ తెచ్చాడు .రచనలో ఆధునిక ,సంప్రదాయ సంస్కృతీ వైరుధ్యం పై దృష్టిపెట్టాడు.

చైనా లో ప్రారంభమైన కరోనా వైరస్ తమ దేశాలకు రాకుండా సోలోమన్ ఐలాండ్స్ ముందు జాగ్రత్తగా బార్డర్లు  మూసి ట్రావెల్ పై నిర్బంధాలు విధించి వైరస్ సోకకుండా చేసింది అక్కడ వెంటి లెటర్స్ ,ఇంటెన్సివ్ కేర్ బెద్స్అవసరం కలగలేదు .లాక్ డౌన్కూడా ముందే ప్రకటించి ప్రజారోగ్యానికి ప్రాముఖ్యమిచ్చిన దేశం సోలోమన్ ఐలాండ్స్ .soloman aislands ‘

  సశేషం

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -30-4-20-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

ప్రపంచ దేశాల సారస్వతం 51-సావో టోమ్ అండ్ ప్రిన్సిపి దేశ సాహిత్యం

ప్రపంచ దేశాల సారస్వతం

51-సావో టోమ్ అండ్ ప్రిన్సిపి దేశ సాహిత్యం

కరోనా సోకని పదవ దేశం సావో టోమ్ అండ్ ప్రిన్సిపి దేశం రెండవ అతి చిన్న ఆఫ్రికా దేశం సావోటోమ్ మరియుప్రిసిపి అనే రెండు ఐలాండులు ఒకదానికొకటి 140కిలోమీటర్ల దూరం ఉన్న దేశం .ఒకప్పుడు ఇవి పోర్చుగీస్ కాలనీలు .1975లోలో స్వాతంత్ర్యం పొందాయి .1471లోనే పోర్చుగీసులు సావో టోమ్ లో,1492లో ప్రిన్సిపి లలో అడుగుపెట్టి ,ఆ నాటి సెయింట్ ల ప్రభావం ఎక్కువకనుక పూర్వపు ప్రిన్స్ అయిన ప్రిన్సిప్ పేరుగా సెయింట్ అంటావోదేశం గా అని ,1500లో ప్రిన్స్ ఆఫ్ పోర్చుగల్ గా మార్చారు .పోర్చుగల్ యాత్రికులు రాకముందు ఇక్కడ జనావాసమే లేదు .భూమధ్యరేఖకు కుడివైపున ఉన్నది .అట్లాంటిక్ సముద్రం,గల్ఫ్ ఆఫ్ గినియా కు దగ్గర .టూరిస్ట్ లకు భయం ఉండదు. నేరాలు అత్యల్ప౦ . .ఇక్కడ ఓహో నేచురల్పార్క్ ,మ్యూజియం ,పికోగ్రాండే,లాగోవా అజుల్ ,పికో మొగామ్బో ,ప్రాయామకొండో మొదలైన 10ప్రాంతాలు గొప్ప టూరిస్ట్ స్పాట్స్

1953లో ‘’బెటాపా మాసకర్’’జరిగి వందలాదినేటివ్ లను పోర్చుగీసులు హత౦ చేశారు .పంటలకోసం వాళ్ళను బలవంతంగా బానిసలుగా పని చేయించారు. పని చేయనివారిపై తీవ్ర చర్య తీసుకోమని గవర్నర్ జనరల్ హుకుం జారీ చేశాడు .క్రమంగా మువ్ మెంట్ ఫర్ లిబరేషన్ ఉద్యమం సాగి ,1990లో MLSTP అనే ఏకైక పార్టీ ఏర్పడి ,రాజ్యాగ సవరణ చేసి మిగిలిన రాజకీయ పార్టీలకూ అవకాశం ఇచ్చింది.నేషనల్ అసెంబ్లీ కి ఎన్నికలుజరిగి ‘’’’ పార్టీ ఆఫ్ డెమోక్రాటిక్ కన్వర్జెన్స్ ‘’అత్యదికస్థానాలు సాధించి మైగెల్ త్రొవోడా ప్రెసిడెంట్ అయ్యాడు

ఇక్కడ ట్రాపికల్ హుమిడిటి క్లైమేట్ ఉంటుంది .కొమరాన్ వల్కానిక్ లైన్ లో ఉన్నదేశం కనుక అగ్నిపర్వత భయం జాస్తి .కొన్ని చోట్ల అత్యధిక కొన్ని చోట్ల అత్యల్ప వర్ష పాతం ఉంటుంది .వ్యవసాయం, ఫిషింగ్ ఇక్కడి ఆదాయవనర్లు కోకా పంట విస్తృతం 95శాతం పంట ఎగుమతి అవుతుంది .రాగి దొరుకుతుంది .కాఫీ ,పామోలివ్ ప౦డుతాయి .స్వతంత్రం వచ్చాక ఎకనామి జాతీయం చేయబడింది .ఇతర దేశాల పై ,యుఎన్ ఓ సహాయం పై ఆధారం ఎక్కువ .కరెన్సీపేరు-డోబ్రా దీని విభాగాలు 100..ఆర్చిపెలాగాన్ ,నైజీరియాలో పెట్రోల్ పడింది ఈమధ్యనే .జనాభా ఒకలాక్ష అరవై వేలు .రాజధాని కూడా సావో టోమ్ .ఆఫ్రికన్ ,పోర్చుగీస్ సంస్కృతీ ఉంటుంది .డాగో౦ కాంగో డాన్సులు ఎక్కువ .పిల్లలు నాలుగేళ్ళు స్కూలు విద్య నేర్వాలి. రెండు కాలేజీలున్నాయి .

సావొటోమ్ ప్రిన్సీపి సాహిత్యం –రచన అంతా పోర్చుగీస్ భాషలోనే ఉంది .ఇంగ్లిష్ లోనూ కొన్ని ఉన్నాయి. స్థానికభాషలలో తక్కువే .ఈ దేశాల ప్రాధమిక సాహిత్యాన్ని కేటనో డ కోస్టాఅలగ్రా మొదట రికార్డ్ చేశాడు .అందులో ‘’విసావో ‘’అనే కవితా సంకలనంఉంది తర్వాత సారా పింటోకోఎల్హో అనే రచయితరచనలున్నాయి .20వ శతాబ్దిలో ఆర్చి పేలగా నుంచివచ్చిన ఫ్రాన్సిస్కో జోస్ టేనేరో చరిత్ర రచనలో సుప్రసిద్ధుడు .అమిత ప్రభావం కలిగించినవాడు .లిస్బన్ లో హైస్కూల్ ఆఫ్ కలోనియల్ అడ్మినిస్ట్రేషన్ లో చదివి క్లారిడేట్ పత్రికలోరివ్యూలు రాశాడు .కవిత్వంతోపాటు ఆఫ్రో అమెరికన్ పాటలను సేకరించి భద్రపరచాడు .రచయిత్రులలో మాన్యూలా మార్గరిడో,ఆల్డా ఎస్పిరిటో శాంటో ప్రసిద్ధులు .వీరి రచనలు జాతీయతపైనా స్వాతంత్ర్యుద్యమం పైనా ఉంటాయి .స్వతంత్రం వచ్చాక ఆలిండా బేజా ,కన్సెరికో లిమా 21వ శతాబ్ది గొప్ప రచయితలు

రచయితలుగా ప్రసిద్ధులు

· Olinda Beja

· Albertino Bragança

· Guadalupe de Ceita

· Sara Pinto Coelho

· Alda Neves da Graça do Espírito Santo

· Carlos Graça

· Conceição Lima

క వులుగా ప్రసిద్ధులు

·

· Olinda Beja

· Caetano da Costa Alegre

· Francisco da Costa Alegre

· Alda Neves da Graça do Espírito Santo

· Conceição Lima

· Manuela Margarido

· António Lobo de Almada Negreiros

· Rafael Branco

· Francisco José Tenreiro – historically the most renowned writer in history

· జర్నలిస్ట్ లు António Lobo de Almada Negreiros

· Aurélio Martins

డోనాల్డ్ బరన్స్ ‘’ఒస్సోబో ‘’అనే రచనలో ఆదేశ సాహిత్యం పై వ్యాస సంపుటి రాశాడు .

మార్చి 20కి ముందే ఈదేశం లో ఎమర్జెన్సి విధించి విద్యా సంస్థలు మూసేసి ,బార్డర్స్ మూసేసి టూరిజం ఆపేశారు కనుక కరోనా వైరస్ కాలుపెట్టలేదు .

సశేషం

మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -30-4-20-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

సుందర కాండ లో హనుమ బహుముఖీన వ్యక్తిత్వం-14

సుందర కాండ లో హనుమ బహుముఖీన వ్యక్తిత్వం-14

వెతకటంలో  అలసత్వం చూపానేమో అనే అనుమానం తో లతా గృహాలు ఉద్యానవనాలు ,నైట్ హాల్టింగ్ ప్రదేశాలు కూడా వెతికినా సీతా దేవి కనిపించలేదు .ఒకరకమైన వైరాగ్యభావం సహజం గా వచ్చేసి ‘’సీత చనిపోయే ఉంటుంది లేకపోతె కనిపించేదే గా .రావణుడు ఎన్ని క్రూర ప్రయత్నాలు చేసినా ,తనశీల రక్షణకోసం ఆమె తీవ్రంగా ప్రయత్నించి ఆ దుర్మార్గుడి చేతిలో హతమై ఉండచ్చు .లేక అనేక వికృతాకారులైన  రావణభార్యలు, దాసీ స్త్రీలను చూసి ఆమె భయపడిమరణి౦చి కూడా  ఉండచ్చు  .సీత కనపడక పోవటం శత్రువులపై  నా పరాక్రమం చూపక పోవటం వల రాజు సుగ్రీవుడి దగ్గరకు వెళ్ళటానికి మొహం చెల్లటం లేదు .అన్ని చోట్లా నా శక్తికొద్దీ వెతికినా నిష్ఫలమై, సీత కనిపించలేదు .సరే ఇక్కడే ఎక్కువకాలం ఉండలేను కదా .ఒట్టి చేతులతో కిష్కింధకు తిరిగి వెడితే నా సహచర వానరులు లంకలో ఏమి సాధించావు ?అని అడిగితె నాకు సమాధానం లేదు కదా .యువరాజు అంగదుడు వృద్ధుడు జాంబవంతుడు నన్ను ఎన్నో మాటలు అంటారు ‘’అని విచారించి –

‘’అనిర్వేదః శ్రియో మూల మనిర్వేదః పరం సుఖం –అనిర్వేదోహి సతతం సర్వార్ధేషు ప్రవర్తకః  ‘’

‘’న కరోతి సఫలం జంతోః కర్మ యత్తత్  కరోతి సహః –తస్మాదనిర్వేద కృతం యత్నం చేస్టే హ ముత్తమం ‘’అని ఆలోచించాడు .అంటే ఉత్సాహమే సంపదకు మూలం .ఉత్సాహమే పరమ సుఖం .ఉత్సాహమే అన్ని పనులను చేయిస్తుంది .చేద్దాము అనుకొన్న పనిని ఉత్సాహం సఫలం చేస్తుంది .కనుక నీరు కారిపోకుండా రెట్టించిన ఉత్సాహంతో సీతాన్వేషణ చేస్తాను .పిరికివాడిలా వెనక్కి తిరిగి వెళ్ళను .అని నిర్ణయానికి వచ్చాడు .పై రెండు శ్లోకాలో మహర్షి ఉత్సాహ సామర్ధ్యాన్ని అత్యంత స్పష్టంగా తేట తెల్లం చేయించాడు లోకానికి హనుమ ద్వారా .ఈ శ్లోకాలులోకం లో ‘’సూక్తి ముక్తావళి ‘’అయ్యాయి .

  ఇదివరకు వెతకని భూగృహాలు, చతుఃపథ మంటపాలు ,స్వేచ్చా విహారం కోసం మారు మూల ఉన్న గృహాలు అన్నీ తలుపులు తెరిచి లోపలి వెళ్లి చూస్తూ, మళ్ళీ మూసేస్తూ ,దిగుడుబావులు కొలనులు అన్నీ చూసి నిరాశ చెందాడు .అప్పుడు మనసులో

‘’చతురంగుళ మాత్రోపి నావకాశ స్స విద్యతే రావణా౦తః పురే తస్మిన్  యం కపి ర్నజగామ  సః’’అంటే లంకలో ‘’నాలుగు అంగుళాల’’ మేరకూడా వదలకుండా వెతికాను .కానీ నిష్ప్రయోజనం అయింది .ఇక్కడ పండితులు చతురంగ స్థలానికి చక్కని వేదాంత పరమైన అర్ధం చెప్పారు .మనగుండె చతురంగుళ పరిమాణం .కనుక బయట అంతా వెదికాడు కాని లోన వెదక లేదు అన్నారు .విద్యాధర నాగ స్త్రీలు కనిపించారు .ఇందరు కనిపించినా సీత జాడ కనిపించలేదు అని నిర్వేదం చెందాడు మళ్ళీ .తన సముద్ర లంఘనం వ్యర్ధమైనదని బాధ పడ్డాడు .శోక మోహ పీడుతుడై దుఃఖించాడు .ఇప్పుడుహనుమ ఒకసారి ‘’లో దృష్టి’’తో పరిశీలించుకోవాలి .ఇప్పటిదాకా తన ప్రయత్నం వల్లే సాధ్యమౌతుందని తలచాడు .ఇక భగవంతుని తోడ్పాటు కావాలని ,అది జతకలిస్తేనే కార్యం సఫలమౌతుందనే ఎరుక అతనికి కలుగ బోతోంది .

ఇది25శ్లోకాల పన్నెండవ సర్గ .

సశేషం

మీ-గబ్బిట దుర్గాప్రసాద్-30-4-20-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

సుందర కాండ లో హనుమ బహుముఖీనవ్యక్తిత్వం-13

సుందర కాండ లో హనుమ బహుముఖీనవ్యక్తిత్వం-13

బుసకొట్టే సర్పం లాగా నిశ్వసిస్తున్న రావణుడి దగ్గరకు చేరి హనుమ భయపడినట్లు కనిపించి ,తర్వాత వెనక్కి తగ్గాడు .పాన్పుపై ఉన్న రావణ భుజాలు బంగారు బాహుపురులతో ఇంద్ర ధ్వజాల్లా కనిపించాయి పూర్వం ఐరావతం తో పోరాడినప్పుడు ఏర్పడిన గాయాలమచ్చలు ,,దేవేంద్రునితో తలపడినపుడు తిన్న వజ్రాయుధ గాట్లు ప్రకాశంగా కనిపించాయి .విష్ణు చక్రగాయాలమచ్చలూ  ఉన్నాయి . మంచి మూపు ,మంచిలక్షణాల గోళ్ళు  బొటన వ్రేళ్ళు ,అరచేతులు ఏనుగు  తొండాలలాగా భుజాలపై అయిదు తలల నాగుపాము లాఉన్నాయి .మహా బలదర్పాలతో శోభాయమానంగా రెండు భుజాలు మండరపర్వత౦  మధ్య నిద్రించే మహా సర్పాల్లా ఉన్నాయి .రెండు శిఖరాల మందరం లా ఉన్నాడు .నోటినుంచి మామిడి ,పొన్న సుగంధం ,పొగడపూల గంధం ,శ్రేష్ట మద్య గంధం తో నిట్టూర్పులున్నాయి .నిగనిగ లాడే మినపరాసి లా ఉన్నాడు .గంగా జలాల్లో విశ్రమిస్తున్న ఏనుగు లా కనిపించాడు .రావణభార్యలు మహా అందగత్తెలు .నిద్రలోకూడా నాట్య స్త్రీ వాసనాబలంతో ముద్రలు వేస్తోంది .ఇంకొకామె స్తనాలను చేతులతో కప్పుకొని ఆదమరచి నిద్రిస్తోంది.

   రావణ భార్య మండోదరి మహా సుందరంగా శయనిస్తోంది .ఆమె సౌందర్యం,యవ్వనం చూసి సీతా దేవి ఏమో అనుకొన్నాడు .సంతోషం కలిగింది .పులకింత వచ్చి౦ది కూడా .సీతా దేవి దర్శనభాగ్యం కలిగిందన్న పరమానదంలో సహజ వానర చేష్టలు చేశాడు  వెనుకటి గుణమేల మాను అన్నట్లు ప్రవర్తి౦చాడన్నమాట .

‘’ఆస్ఫోట యామాస చుచుబ పుచ్చం-ననంద చిక్రీడ జగౌ జగామ –స్తంభా నారోహ న్నిపపాత భూమౌ –నిదర్శయన్ స్వాం ప్రకృతిం కపీనాం ‘’

తన ఆనందాన్ని హనుమ వానర సహజమైన చేష్టలతో చేస్తూ జబ్బలు చరుస్తూ ,తోకను ముద్దాడుతూ ,ఆనంద పారవశ్యం చెందాడు .ఆడాడు పాడాడు ఇటూ అటూ తిరిగాడు .స్తంభం ఎక్కి కిచకిచమన్నాడు ,మళ్ళీ కిందికి దూకాడు.

  ఇలాంటి కోతి చేష్టలను మనం చూసే ఉంటాం ,పూర్వం కోతుల్ని గొలుసుతో కట్టి తీసుకొని వచ్చి ఇళ్ళముందు ఆడించేవారు జ్ఞాపకం ఉందా.ఇలాంటి చేష్టలన్నీ వాటితో చేయించేవారు .నెత్తిన కుండ బుజాలపై కర్ర ,గబుక్కున స్తంభం ఎక్కి దిగటం పేలు తీసుకోవటం ,దువ్వెనతో దువ్వుకోవటం, అద్దం చూసుకోవటం  చొక్కాలాగూ తోడుక్కోవటం విప్పెయ్యటం ,తలపాగా పెట్టుకోవటం కర్రతో ఇంటికాపలా కాయటం  వంటివన్నీ కోతులతో చేయించి వినోదం పంచి డబ్బులు అడుక్కునేవారు .వాటి ప్రాణాలకు హింస, మనకు వినోదం .దేనికోసం వచ్చాడో ఆపని నెరవేరింది అన్న పిచ్చిఅనందంలో హనుమ ప్రవర్తించాడు సహజ సిద్ధం గా .

ఇది 54శ్లోకాల పదవ సర్గ

  కాసేపటికి అసలు రంగు బయటపడి తాను  చూసింది సీత కాదు మండోదరి అని గ్రహించాడు హనుమ .అప్పుడు వివేకం ప్రవేశించింది .ఆలోచన పెరిగింది యదార్ధం గ్రహింపు కు వచ్చింది .రామ వియోగంతో సీతా దేవి నిద్రపోదు ,భుజించదు అల౦క రించు కోదు . ,ఏదీ తాగదుకూడా .దేవేంద్రుడు వచ్చినా తిరస్కరిస్తుంది .శ్రీరాముడి కి సాటి అందగాడు ఉండడు.వీళ్ళు అంతా మధుపానమత్తులు .మృష్టాన్న భోజనులు .రతికేళీ తత్పరులు .వాళ్ళు ఆవులమంద ఐతే రావండు వాటిమధ్య ఉన్న  వృషభం  అనిపించింది .అదొక పానభూమిగా దున్నలు పందులు మాంసాల కుప్పలతో వెండి పాత్రల్లో సగం నమిలి వదిలేసిన నెమలి కోడి మాంసాలు ,ఖడ్గ మృగ ,అడవి పందుల ,లేళ్ళు నెమలళ్ళ మాంసాలు పాలు పెరుగు ,నంజుకోవటానికి ‘’సువర్చలం ‘’అనే లవణం పాత్రలనిండా ఉన్నాయి .కొక్కెర చకోర ,మేక మాంసాలు వాటి పచ్చళ్ళు ,పాయసాదులు మొదలైన భోజ్య పదార్ధాలు కనిపించాయి .అమృత మదన౦ లో వచ్చిన మద్యాలు అవికాక వేరేరకాలైన అనేక మద్యాలు పాత్రల నిండా ఉన్నాయి

   ఆడవాళ్ళూ ఒకరినొకరు కౌగిలించుకొని పడుకున్నారు .రతి లో అలసి పోయారు చాలామంది .మద్యం మాంసం మగువ మకారత్రయం తో మోగిపోతోంది భీభత్సంగా రావణ అంతపురం .ఒక్క అంగుళం భూమికూడా వదలుండా రావణ భవనాలు గాలించాడు .కాని సీత కనపడలేదు .మళ్ళీ అంతర్ముఖుడయ్యాడు .’’ఇంతమంది పరస్త్రీలను నిద్రలో అనేక భంగిమలలో చూశానునాకు ధర్మలోపం జరుగు తుందేమో .కానీ నామనసు రవంత కూడా చలించలేదు .అవయవాలను నడిపేది మనసు .అది నా స్వాదీనం లోనే ఉన్నది .ఇంకో చోట సీత ను వెదకకూడదు .అక్కడా స్త్రీలే ఉంటారు కదా. తప్పిపోయిన వనితను ఆడు లేళ్ళలో వెదకటం వివేకం కాదు .అత్య౦త పరిశుద్ధమనస్సుతో  వెతికాను. కానీదేవి కనిపించలేదు ‘’అనుకొని దేవ ,గ౦ధర్వ నాగకన్యలలో వెదికాడు లాభం లేదు .చివరికి ఈ పాడు పానభూమిలో వెదకటం నిష్ప్రయోజనం అని నిశ్చయంగా భావించి రావణ భవనం వదిలేసి బయటికి వచ్చి వేరేప్రదేశాలలో వెతకాలనుకొన్నాడు హనుమ –

‘’తామపశ్యన్ కపి స్తత్ర పశ్యం శ్చాన్యా వరస్త్రియః –అపక్రమ్య తదా వీరః ప్రధ్యాతు ముప చక్రమే ‘’’’స భూయస్తు పరం శ్రీమాన్ మారుతి ర్యత్న మాస్థితః-ఆపానభూమి ముత్శుజ్య తాంవిచేతుం ప్రచక్రమే ‘’

 ఉత్తమకాన్తలను చాలామందిని చూసి సీత కానరాక ,శ్రీమాన్ హనుమ ద్విగుణీకృత ఉత్సాహం తో ,ఆ పాడు పానభూమి విసర్జించి వెదకటానికి నిశ్చయించాడు .

ఇది 47 శ్లోకాల పదకొండవ సర్గ .మహర్షి ఇక్కడి మొదటి శ్లోకం లో హనుమను ‘’కపి ‘’అని ,రెండవ శ్లోకం లో శ్రీమాన్ మారుతి అనటం లో చాలా విశేషం ఉన్నది .ఆయనలోని కపిత్వం పోయి ,సర్వ శ్రేష్ట మారుతిత్వం కనిపించింది అన్నమాట .ఎరుక అంతర్ముఖత్వం అతడిస్థాయిని పెంచింది . అంటే కార్యం త్వరలోనే సానుకూలమౌతు౦దన్న మాట .

  సశేషం

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -29-4-20-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

ప్రపంచ దేశాల సారస్వతం 50-సోమోవా దేశ సాహిత్యం

ప్రపంచ దేశాల సారస్వతం

50-సోమోవా దేశ సాహిత్యం

కరోనా సోకని తొమ్మిదవ దేశం సమోవా 1997దాకా వెస్ట్ సమోవా అని పిలువబడేది .ఇందులో రెండు ముఖ్య ఐలాండ్ లు సవాయ్ ,ఉపోలు ఉన్నాయి .ఇక్కడ 3,500 ఏళ్ళ క్రితమే లాపిటా ప్రజలు ఆవాసాలు ఏర్పరచుకొన్నారు .రాజధాని ఎపియా. ఇక్కడ యునిటరి పార్లమెంటరి డెమోక్రసీ,12అడ్మినిస్ట్రేటివ్ డివిజన్లతో ఉంది .కామన్ వెల్త్ లో సభ్యతవమున్న దేశం .పడమటి సమోవా యుఎన్ వో లో చేరి అమెరికన్ సమోవాతో సహా మొత్తం ఐలాండ్ ల సమూహ౦ ‘’నేవిగేటర్ ఐలాండ్స్ ‘’గా పిలువబడుతున్నాయి .1962స్వతంత్రం పొందకపూర్వం దేశం నూజిలాండ్ అధీనం లో ఉండేది .18వ శతాబ్దిలో వేల్స్ హంట్ కోసం నౌకలురావటం తో ఆర్దికానికి బాగా తోడ్పడింది .1830లో క్రిస్టియన్ మిషనరీ ఇక్కడ కాలుపెట్టింది .జర్మన్లకు కూడా ఈ దీవులపై వ్యామోహం కలిగి ఉపోలు చేరి కోప్రా ,కోకా బీన్స్ ప్రాసెసింగ్ మొదలుపెట్టింది .క్రమంగా అమెరికా ఇక్కడ కు చేరి ,స్థావరాలను దక్కించుకొని అమెరికన్ సమోవా అయింది .బ్రిటన్ కూ కన్నుపడి బ్రిటిష్ వాణిజ్యరక్షణకు సైన్యం పంపింది.స్థానికుల మధ్య చిచ్చురగిలి 8ఏళ్ళు యుద్ధాలు చేసుకొంటే మూడు దేశాలూ ఆయుధాలు సరఫరా చేసి వినోదించాయి .1889లో వార్ షిప్ లను ఎపియా హార్బర్ కు పంపగా మార్చి 15 ప్రళయ భయంకర తుఫాను వచ్చి ఆ మూడు దేశాల యుద్ధనౌకలు మునిగిపోయి మిలిటరీ కాన్ఫ్లిక్ట్ సమసింది .1898లో మళ్ళీ సివిల్ వార్ వచ్చి ,జర్మని బ్రిటన్ అమెరికా లు ఎవరిది ఆదిపత్యమో తేల్చుకోవటానికి సిద్ధపడ్డాయి .’’ప్రిన్స్ తను’’కు విధేయులైన సైన్యానికి రెబెల్స్ కు యుద్ధం జరిగి రెబెల్స్ ఓడిపోయారు అమెరికా బాంబుల వర్షం కురిపించిస్వాధీనం చేసుకోగా అమెరికన్ సమోవా ఐంది  .మొదటి ప్రపంచయుద్ధం లో జర్మన్ సైన్యం దాడి చేసి స్వాధీనం చేసుకొని జర్మన్ సమోవా అయింది .యుద్ధం ముగిశాక 1962దాకా న్యూజిలాండ్ అధీనం లో పాలన సాగింది .ఇలా అన్ని దేశాలవారూ సమోవా తో ఆటాడుకోన్నారు .1962లో స్వతంత్రం పొంది ,1997దేశం పేరును పడమటి సమోవా కాకుండా సమోవా గా రాజ్యాంగ సవరణ చేసి౦దిప్రభుత్వం  .21వ శతాబ్దిలో మోటారిస్ట్ లకోసం డ్రైవింగ్ రోడ్లు ఏర్పాటు చేశారు .సిడ్నీకి 21గంటల కాలం వెనక్కు ఉండే ఈ దేశం 2011 డిసెంబర్ లో అకస్మాత్తుగా కాలెండర్ లో డిసెంబర్ 30 ని రద్దు చేసి ‘’ఇంటర్ నేషనల్ డేట్ లైన్ ‘’లో పడింది .2017లో న్యుక్లియర్ ఆయుధాలు తయారు చేయరాదని తీర్మానించింది .దేశమతం క్రిస్టి యానిటి .జనాభా సుమారు 2లక్షలు .అధికారభాష ఇంగ్లిష్ తోపాటు సోమోవాన్ ..ఇక్కడ ఈక్విటోరియల్ క్లైమేట్ ఉంటుంది .కరెన్సీ –సమోవన్ టాలా.

   ఈ దేశంలో చిన్నపిల్లలకు మీసిల్స్ అంటే ఆటలమ్మ,తట్టు చిన్నమ్మవారు  బాగా సోకుతుంది పిల్లల మరణాలూ ఎక్కువే.16వ ఏడు వరకు విద్య ఉచితం కంపల్సరి .ప్రైమరీ విద్య 6ఏళ్ళు  మిడిల్ స్కూల్ 2ఏళ్ళు తర్వాత 8ఏళ్ళసెకండరిలో చేరటానికి నేషనల్ ఎక్సాం రాసి పాసవ్వాలి .ఏడాదికో సారి ఫీజుకట్టాలి .సమోవాలో యూనివర్సిటి ఉంది.

  ఈ దేశం అత్యంత ప్రాచీన పోలీ నేషనల్ దేశం .సంస్కృతీ 3వేలఏళ్ళనుంచి ఉన్నది .మైదాలజిలో ఎందరో దేవతలుంటారు .సంప్రదాయం బాగా పాటిస్తారు .క్రికెట్ ,నెట్బాల్ బాగా ఆడుతారు .రగ్బీ లీగ్ ఉన్నది . పశ్చిమ  ఫసిఫిక్ దేశాలలో అత్యంత స్థిరమైన ఆర్ధిక స్థితి ఉన్న   దేశం .దేశం లో   సుదూర ప్రాంతాలు భాగాలు వెనకబడి బీదరికం లో ఉంటాయి .నేరాలుతక్కువ .ప్రజలు సహాయకారులు .ఈదేశాన్ని ‘’క్రేడిల్ ఆఫ్ పోలినేషియా’’అంటారు .అందమైన ప్రకృతి దృశ్యాలు ఆకర్షణ . కల్చర్ అందం బీచెస్,వాటర్ ఫాల్స్ ,ఫారెస్ట్ హైక్స్ , ఆహారం ,ప్రశాంతత ,వైల్డ్ అండ్ మెరైన్ లైఫ్ ,సైజ్ ,మొదలైన నవ విధ ఆకర్షణలు ఇక్కడ ఉంటాయి .

సమోవియన్ సాహిత్యం –ప్రి అండ్ పోస్ట్ కలోనియల్ కాలం లో సాహిత్యం మౌఖికం .వీటిలో సోలో, జీనియాలజీలు ,మైథాలజి, జానపద గాథలు ,పాటలు ఉంటాయి .వీటిని జర్మన్ సైంటిస్ట్ అగస్టిన్ క్రెమర్ మొదట సంకలించగా ,ఇంగ్లిష్ మిషనరీ సైంటిస్ట్ ధామస్ పావెల్ 19వ శతాబ్దిలో ,ఎథ్నో మ్యూజికాలజిస్ట్ రిచర్డ్ మోయ్లె 20వ శతాబ్దిలో రికార్డ్ చేసి ముద్రించాడు .1960లో మాత్రమే  వ్రాత లో సాహిత్యం వచ్చింది . మొదటి ఫసిఫిక్ ఐలాండర్ ఆల్బర్ట్ వెండిట్ 1973లో ‘’సన్స్ ఫర్ ది రిటర్న్ హోమ్’’నవల రాసి ప్రచురించాడు .తర్వాత చాలానవలలు రాశాడు .2001లో ఇతని సాహిత్యకృషికి ‘’ఆర్డర్ ఆఫ్ న్యూజిలాండ్ ‘’అవార్డ్ పొందాడు .మొదటి సౌత్ ఫసిఫిక్ రైటింగ్ ‘’లాలీ ‘’కి సంపాదకత్వం వహించాడు .సౌత్ ఫసిఫిక్ ఆర్ట్ సోసైటీఏర్పడి ఐలాన్డర్స్ సాహిత్యం ముద్రించింది .1976లో ‘’మన ‘’సాహిత్య జర్నల్ వచ్చింది .సమోవా అబ్జర్వర్ న్యూస్ పేపర్ స్థాపించిన కవి సవీయా సవానో మాలిఫా ,ఆర్టిస్ట్ మల్లెటోవా వాన్ రీచీ తమరచనలు సొసైటీ ద్వారా ముద్రించారు .కవులు సపావు రూపరేక్ పెటాజ ,ఈతి సాగాలు ప్రసిద్ధులు .ప్రధాని తజూటువాటుపా సమసేసే అనేక బిరుదులూ పొంది సమోవన్ కల్చర్ ,ట్రెడిషన్ పై  చాలా రచనలు చేశాడు .నేషనల్ యూనివర్సిటి వైస్ చాన్సలర్ ఎమ్మా క్రుసే వాయ్ గొప్పకవి రచయిత .డా.సీనావాయ్ ఇంగ్లిష్ ప్రొఫెసర్ ,విమర్శకకవి  రచయిత, పరిశోధకురాలు  ‘’వెస్టర్న్ పోలినేషియా కాలనిజం’’ పై పిహెచ్ డి చేసింది  ‘’లవోని రైన్స్’’కవితా సంపుటి రాసింది .సినవైనా గబ్బార్డ్ అమెరికన్ సమోవా ఫలీటు ప్లేస్ పై అధ్యయనం చేసింది .

  సియాఫిగెల్ నావలిస్ట్ ,కవి ‘’వేర్ వుయ్ వన్స్ బిలాంగ్డ్’’అనే నవల కామన్ వెల్త్   ప్రైజ్ పొందింది .’’గర్ల్ ఇన్ ది మూన్ సర్కిల్ ,పోర్ట్రైట్ ఆఫ్ ఎ య౦గ్ ఆర్టిస్ట్ ఇన్ కాంటెం ప్లేషన్’’మొదలైన నవలలు ,కవితా సంపుటులు  వెలువరించింది  .కొత్తతరం రచయితలూ ఆమెస్పూర్తి .ఇతర కవయిత్రులలో టుసిఎట్ అవియా ,సెరీనా సుసిటాలమార్ష్ ,నవలారచనలో లాని వెండిట్ య౦గ్ ఉన్నారు ‘’.కోకోనట్ మిల్క్’’ కవితా సంపుటి డాన్ టలుపామాక్ ముల్లిన్ అనే అమెరికన్ సమోవా రచయిత రాశాడు ,విక్టర్ రోడ్జేర్,కియానా రివేరా  బ్రియాన్ ఫాటా నాటకాలు కూడా రాశారు .జెన్ని బెన్నెట్  టూనో నెటో రాసిన షార్ట్ స్టోరి కలెక్షన్ కు 2018కామన్ వెల్త్   ప్రైజ్ వచ్చింది .

మార్చి 21 నే సమోవా ప్రభుత్వం సరిహద్దులు మూసేసి ,ఎమర్జెన్సి ప్రకటించి కరోనా వైరస్ రాకుండా జాగ్రత్త పడింది .అంతకు ముందే చిన్నపిల్లలకు సోకే ‘’మీజిల్స్ ‘’ను పూర్తిగా అరికట్టేసింది .అంతర్జాతీయ విమాన సర్వీసులు రద్దు చేసింది .విద్యాసంస్థలను మూసేసింది  ,మీటింగ్ లను రద్దు చేసింది .అంత తెలివిగా ప్రజా రోగ్యం కాపాడింది కనుకనే సమోవా దేశం లో కరోడా కరోనా కాలుపెట్ట లేకపోయింది .

   సశేషం

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -29-4-20-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

సుందర కాండ లో హనుమ బహుముఖీన వ్యక్తిత్వం-12

సుందర కాండ లో హనుమ బహుముఖీన వ్యక్తిత్వం-12

మూడవసారి హనుమ రావణ భవన ౦ లో  వెదికాడు .ఆమడ పొడవు అరామడ వెడల్పు ఎన్నో మేడలతో అలరారింది పుష్పకం మధ్యలో నివాసం ఉన్న రావణ ప్రధాన గృహం చేరాడు .అక్కడి ఏనుగులు నాలుగు ,మూడు దంతాలతో విచిత్రంగా ఉన్నాయి .అతని రాక్షసభార్యలు, చెరబట్టి తెచ్చిన రాజకన్యలు ఉన్నారు .ఆప్రాసదం  పెద్దపెద్ద చేపలు మొసళ్ళు తిమింగిలాలు పాములు తో కల్లోలం చెందిన సముద్రంలాగా కనిపించింది .కుబేరుని,పచ్చని గుర్రాలున్న దేవేంద్రునికి ఉన్న సంపద అంతా ఇక్కడే కనిపించింది .మళ్ళీ పుష్పకాన్ని చూశాడు .బ్రహ్మకోసం విశ్వకర్మ దీన్ని నిర్మిస్తే ,కుబేరుడు తపస్సుతో బ్రహ్మనుమెప్పించి దాన్ని వరంగా పొందాడు .రావణుడు అన్నకుబేరుని జయించి దీన్ని స్వాధీనం చేసుకొన్నాడు .సర్వతో భద్రాకారంగా ఉన్న జాలాలు అంటే వెంటి లెటర్లు కిటికీలు మణిఖచిత వేదికలు ఉన్నాయి .సరదాగా పుష్పకం ఎక్కి సరదా తీర్చుకొన్నాడు మహాకపి .దివ్యగందాల పరిమళం వ్యాపించి,తనను ఆహ్వానిస్తోందానిపించింది ..అది స్వర్గమా, 33దేవతలకు ఆవాస భూమియా అనిపించింది .దీపకాంతి ,ఆభరణాల ప్రకాశం అ౦తటావ్యాపించి ‘’తగలబడుతున్న శాల ‘’లాగా కనిపించింది భవిష్యత్తులో జరిగేది ఇదే కదా .దానికి సూచ్యార్ధ సూచన చేశాడు మహాకవి వాల్మీకి .

   కంబళాలపై వివిధ భంగిమలలో నిద్రించేఉత్తమజాతి  స్త్రీలను చూశాడు .వారిముఖాలు పద్మ గంధాన్ని కలిగి ఉన్నాయి .అవి వికసించిన పద్మాలు గా భావించి మకరందం ఆశతో తుమ్మెదలు వాలుతాయేమో అని శంకించాడు .వనితామధ్యమాన నక్షత్రాలతో ఉన్న చంద్రుడిలాగా రావణుడు కనిపించాడు .మితిమీరిన మధుపానం ఆతర్వాత యెడ తెగని రతికేళి తో పుష్పమాలలు ఆభరణాలు స్థాన భ్రంశమయ్యాయి .కొందరి ముఖాల  తిలకాలు తుడిచి వేయబడగా ,కొందరి మొలత్రాళ్ళు వదులై మార్గాయాసంతో నేలపై పొరలే  ఆడ గుర్ర్రాల్లా కనిపించారు .నిద్రావస్తలో విశాల  పిరుదులున్న స్త్రీలు హంస కారండక చక్రవాకాలతో ఉన్న ఇసుక తిన్నెలున్న నదులుగా భాసి౦చారు .రావణుడు   నానావిధ భంగిమల సుఖాలు వారివల్ల అనుభవించి అలసి సొలసి నిద్రించాడు .అతనికి భయపడి దీపాలుకూడా నిశ్చల కాంతి వెదజల్లుతున్నాయి. వీరంతా రాజర్షుల ,పితరుల ,దైత్య,గ౦ధర్వ ,రాక్షస కన్యలు తమంత తాము రావణుని వలచి వచ్చినవాళ్ళే  .ఒక్క సీతా దేవి తప్ప ఎవరూ బలాత్కారం గా తేబడిన వారుకాదు .హనుమ మనసులో ‘’ఈ రావణుడు ఎప్పుడూ తన తేజస్సును యెడ బాయకుండా ఉన్నాడో ,అలాగే సీత కూడా రాముడిని ఎడబాయకుండా ఉండేట్లు రావణుడు ఆమెను రామునికి అర్పిస్తే ,అతని సంపద అవిచ్చిన్నంగా ఉంటుంది కదా ‘’అనుకొన్నాడు శత్రుహితం కోరి .

‘’బభూవ బుద్ధి స్తు హరీశ్వరస్య –యదీ దృశీ రాఘవ ధర్మపత్నీ –ఇమా యథా  రాక్షస రాజ భార్యాః -సుజాత మస్యేతి హాయ్ సాదు బుద్ధేః’’

సీతాదేవి పాతివ్రత్య గుణంతో విశిస్టురాలు . వీడు సీతాపహరణ అనే నీచ కార్యం చేసిపెద్దపాపం చేశాడు .కనుక ఆమె పాతివ్రత్యానికి ఎలాంటి భంగం కలుగదు అని భావించాడు హనుమ .

73శ్లోకాల తొమ్మిదవ సర్గ ఇది .క్షుణ్ణంగా వెతికాను అనే మానసిక సంతృప్తికోసం హనుమ మూడుసార్లు రావణ భవనం  వెదికాడు .అక్కడి స్త్రీలు  వారి భంగిఅమలు చూసి పతివ్రతా శిరోమణి సీత ఇక్కడ ఉండదు అనిపించింది .మనషి పరహితం కోరుకోవాలి అదే అతని సహజ లక్షణం .ఆలక్షణాన్ని హనుమ చూపించాడు .రావణుడు సీతను స్వచ్చందం గా రామునికి  సమర్పిస్తే వాడి వైభవం అలాగే కొనసాగుతుంది కదా అనుకొన్నాడు. అదీ మనీషి లక్షణం అలాంటి మనీషి గా హనుమ ఇక్కడ మనకు కనిపిస్తాడు’.

సశేషం

   శ్రీశంకర రామానుజ జయంతి శుభాకాంక్షలతో

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -28-4-20-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

రేడియో బావగారి కబుర్లు -3

2-బావగారు –శ్రీమతే రానుజాయనమః శివగోవిందగోవింద –నమస్కారం బావగారు .ఎండలు మెండుగా కాయుచున్నవి దేవుడు గుర్తుకొచ్చాడు

1-బావగారు –రండి బావగారు .మీ రాకతోనే ఇవాళ రెండు గొప్ప విషయాలు తెలీకుండా చెప్పారు .

2-అవేమిటోసెలవియ్యండి బావగారు

1-ఇవాళవైశాఖ శుద్ద పంచమి జగద్గురువు,అద్వైత మత స్థాపచార్య  శ్రీ ఆది శంకరాచార్యుల వారి జయంతి ఈ రోజే విశిష్టాద్వైత మత స్థాపకులు భగవాన్ రామానుజా చార్యుల వారి జయంతి కూడా .మీనోటితోనే మీకు తెలీకుండానే ఆ ఇద్దరు మహాపురుషుల నామం ఉచ్చరించారు సందర్భ శుద్ధిగా

2-అలాగా బావగారూ ఆ ఇద్దరు మహానుభావుల విశేషాలు మీ నోటితో వినే అదృష్టం కలిగిందన్నమాట నాకు .సెలవియ్యండి .

1-వైశాఖ మాసం లో కారణజన్ముల జయంతులు చాలా వస్తాయి .మొన్న చెప్పుకున్న పరశురామ జయంతి ,ఇవాల్టి శంకర ,రామానుజ జయంతి ,శుద్ధ చతుర్దశి శ్రీ నృసింహ జయంతి ,పౌర్ణమినాడు బుద్ధ జయంతి ,అన్నమయ్య జయంతి ,బహుళ దశమి శ్రీ హనుమజ్జయంతి .అన్నీ విశేషమైనవే

2-నిజమే బావగారూ వీటిని పూర్వకాలం లో బాగా జరిపేవారని మా పెద్దలు చెప్పేవారు

1-ఇది వేసవికాలం కనుక దేవుడికీ మనకూ దాహ, తాప ఉపశాంతికి బెల్లం  మిరియాలు ఏలకులతో పానకం తయారు చేసి నైవేద్యం పెట్టి అందరికీ పంచే వారు .తాటాకు విసినకర్రలతో వీచి బహూక రించేవారు ,మామిడిపళ్ళకాలం కనుక పండిన మామిడిపళ్ళు కూడా నైవేద్యం పెట్టి అందించటం అరిగేది .వీటితోపాటు దక్షణా తాంబూల ,వడపప్పు ,చలిమిడి కూడా ఇచ్చేవారు ఇక అడవారికితలనిండా మల్లెపూల దండలు కూడా ఇచ్చేవారు .ఆ గుమాయింపు పరమ మనోహరంగా ఉండేది .

2-ఇవాళ ఫ్యాన్లు వచ్చి, విసనకర్రలు వెనకబడి పోయాయి బావగారూ .ఇంతకీ శంకర జయంతి విశేషాలు చెప్పారు కారు బావగారూ

1-వస్తున్నా –శంకర భగవత్పాదుల గురించి యెంత చెప్పినా తనివి తీరదు .ఆయన సాక్షాత్తు శివావతారమే .ఆయన వేద విద్యలో బ్రహ్మ .వేదా౦గమైన ఉపనిషత్తులలో గార్గ్యుడు,వేదాంత వివేచనలో బృహస్పతి ,వేద కర్మ భాష్యానికి జైమిని ,వేద తత్వమూలానికి భగవాన్ వ్యాసమహర్షి .అంటే మూర్తీభవి౦చినననూతన వ్యాసుడే శ్రీ శంకరులు బావగారూ

2 –సూక్ష్మలో మోక్షం లాగా ఎంతబాగా చెప్పారు బావగారూ .ఇంకా

1-8ఏళ్ళ వయసులో కపిలుని సాంఖ్యం ,పతంజలి యోగశాస్త్రం ఔపోసనపట్టిన బాలమేధావి విజ్ఞానఖని .భట్టపాదుల వార్తికం ,అర్ధం చేసుకొని అద్వైత సుఖాన్ని పొందిన మహానుభావుడు

2-భేష్ భేష్ బావగారు ఆయన మూర్తిమత్వం యెలాఉండేది

1-ఒక చేతిలో అద్వైతసారం ,రెండవ చేతిలో జ్ఞానముద్ర ధరించి ఎదుటి వారి  వాదనలోని స్కాలిత్య౦  అంటే దోష౦ ను రెండు చేతులతో తీసి వేస్తున్నట్లు బాల శంకరుడు కనిపించేవాడట బావగారు

2-అద్భుతం ,పరమాద్భుతం బావగారు ఇంకా

1-చంద్రుడూ ,శంకరుడూ అమృతాన్నే ఇస్తారట .ఎలాగంటే చంద్రుడు కాంతి రూపం లో శంకరుడు వేదాంత భావ నిరూపకంగా .కానీ చంద్రుడు నక్షత్ర కాంతిని హరిస్తాడు .కాని శంకరుని ముఖ చంద్రుడు సజ్జనులకు తేజస్సును అనుగ్రహిస్తాడు

2-ఇదివరకు వినని విషయాలు మహా బాగా చెబుతున్నారు బావగారూ –మరింత –

1-శంకరుడు ఫాలభాగం పై ధరించే విభూతి గంగాయమునా సరస్వతీ త్రివేణీ సంగమం .అవి మూడు వేదాల శిరస్సులు అనే ఉపనిషత్తుల వ్యాఖ్యానాలు అనే 3 కీర్తులట

2-ఒళ్ళంతా పులకోస్తోంది బావగారు –మరేమైనా –

1-నిజమే ఆ అనుభవం అలాంటిదే బావగారూ .అజ్ఞాన అరణ్యం లో పుత్ర ,స్త్రీ అనే కార్చిచ్చు మంటలచే తపిస్తున్న జనాలకు ,ఆత్మ విద్య ఉపదేశించటానికి సాక్షాత్తూ శ్రీ మేధా దక్షిణా మూర్తి మౌనముద్ర  వదలి  శంకరుడిగా అవతరించాడు .శివుడికీ ఈ శంకరుని పోలికలు చాలా ఉన్నా ముఖ్య భేదం మాత్రం ఒకటి ఉందట .భగవత్పాదులు వైదిక మార్గావలంబి యై యజ్ఞాలు చేశాడు చేయించాడు .కానీ ఆ మహేశ్వర శివుడు మామగారైన దక్షుని యజ్ఞాన్ని ధ్వంసం చేశాడు ఇదొక్కటే భేదం ట

2-దుస్టవాదాలు హరించి శంకర  వాక్ ఝరి ఎలా ఉండేది బావగారూ

1-శ్రీ శంకరాచార్య అనే హిమవత్పర్వతం నుంచి బయల్దేరిన ‘’వాక్కు ‘’అనే గంగా ప్రవాహం దుష్టవాదాలు అనే కలపు మొక్కలను హరించి వైదిక పంటలు ఇబ్బడి ముబ్బడిగా పండించింది  .ఆయన వాక్ పరిమళాన్ని పచ్చకర్పూరం అప్పుగా ,కస్తూరి పరిమాణ౦గా ,కుంకుమ పువ్వు కొనుబడి చేస్తే ,చందనం ఏకంగా  దొంగిలించిందట అని విద్యారణ్య మహర్షి చమత్కరించారు  బావగారూ

2-ఒక గొప్పవాని గుణగణాలుమరొక గొప్ప వాడే గ్రహిచగలడు కదా బావగారూ .మీరు అంతకు ముందు చెప్పిన విషయాలన్నీ విద్యారణ్యు లవె కదా బావగారు

1-సూక్ష్మగ్రాహి మీరు బావగారు సరిగ్గా చెప్పారు .ఇదంతా విద్యారణ్య మహర్షి రాసిన ‘’శంకర విజయం ‘’లోనిదే .ఆయనే రాయక పొతే  లోకానికి  యదార్ధమైన శంకరాచార్య చరిత్ర తెలిసి ఉండేదికాదు .ఆస్తికజనం ఆయనకు ఎంతో రుణపడి ఉన్నది బావగారూ

2-ఆధునికంగా శంకరులను ఎలా చెప్పాలి బావగారూ

1-మంచి ప్రశ్న బావగారూ .’’అద్వైతం పూర్వం అరణ్యాలలో ఉండే మహర్షులు మాత్రమెఆచరి౦ చేవారు కనుక ‘’ఆరణ్యకం ‘’అయింది .బుద్ధుడు దాన్ని జనసామాన్యం లోకి తెచ్చాడు .కానీ తర్వాత అది భ్రష్టు పట్టింది .మళ్ళీ శంకరుడు నిలబెట్టాడు .ఒకరకంగా నైతిక దృక్పధంతో బుద్ధుడు ,శాస్త్రీయ భావనతో శంకరుడు అద్వైతాన్ని నిలబెట్టారు ‘’అన్నాడుస్వామి వివేకానంద

2-చాలాబాగుంది బావగారూ –ఇంకా –

1-ఈ నాటిసమాజానికి  శంకరునిమేధస్సు బుద్ధుని కారుణ్యం కలిసి వియ్యమందితేనే సమాజ కల్యాణం సాధ్యం .అంటే అద్వైతం ఆచరణలో కనబడాలి మానవునిలో బ్రహ్మాన్ని చూడగలగాలి .కనుక మొదట అనుష్టానం తర్వాతే జ్ఞానం .ప్రతిదానిలో బ్రహ్మ ఉన్నాడన్న ఎరుక రావాలి

2-దాన్ని శంకరులు ఆచరణ సాధ్యం చేశారా  బావగారూ

1-వేద సంహిత కాలం లో భయం ఉండేది .ఉపనిషత్ కాలం లో అదిపోయి నిర్గుణ భావం వ్యాపించింది .విజ్ఞాన సర్వస్వం అనిపించే శంకరుడు పలికిన ప్రతిపలుకు ,శ్లోకం ,స్తవం స్తోత్రం లో వాత్సల్యం భక్తీ జ్ఞానం త్రివేణీ సంగమమై ,అందిన చోటు నుండి అందనంత దూరానికి తీసుకు వెళ్ళే సామర్ధ్యం ఉన్నది

2-అద్భుత ఆవిష్కరణ బావగారూ .శంకర స్తోత్రాల విశిష్టత ఏమిటి

1-సంస్కృత వాజ్మయానికి గొప్ప ప్రచారం సాధించిన పెట్టాయి అవి .వాటిని రచించి  సూక్ష్మమార్గం లో మోక్షం అందుబాటు లోకి తెచ్చిన సాదు సద్గురువు ఆయన .ప్రతిశ్లోక౦  అమృతోపమానమే జ్ఞానగంగాస్నాన ఫలదాయకమే ,వైరాగ్య ఉషోదయమే .జీవన్ముక్తి సాధించటానికి ఆయన స్తోత్రాలూ భాష్యాలూ అద్భుత సాధనాలే .అంతటి మహా విజ్ఞాని మళ్ళీ పుట్టలేదు బావగారూ .వ్యాసమహర్షి శ్రీ మహా విష్ణువు అవతారమైతే ,ఆదిశంకరాచార్య సాక్షాత్తు శ్రీ శంకరావతారమే

2-విన్నకొద్దీ వినాలనిపిస్తోంది బావగారూ .ఇంకా శంకరు గురించి ఎవరేమేమి అన్నారో చెప్పరా

1-In Shankara we see tremendous intellectual power ,throwing scorching light reason upon every thing ‘’అన్నాడు వివేకానంద .ఏ కే బెనర్జీ ‘’Sankara was not merely a philosopher ,not merely a religious leader ,but he was the greatest nation bulider and thought leader ‘’అని గొప్పగా కీర్తించాడు

2-అద్భుతః బావగారూ –ఇక రామానుజా చార్యుల వారి విశేషాలు శాయించండి

1-ప్రస్థాన త్రయం అయిన ఉపనిషత్ లు ,బ్రహ్మ సూత్రాలు భగవద్గీత లను జనసామాన్యం లోకి తెచ్చిన మాన్యుడు రామానుజాచార్య విశిస్టాద్వైతం అప్పటికే ఉన్నా ,దానికొక సిద్ధాంత కల్పన చేసి ప్రజా బాహుళ్యానికి దగ్గర చేశాడు .దీనికి ఒక్క ఉదాహరణ –గురువు అంగీకారం లేకున్నా ,వద్దని వారించినా ,గుడిగోపురం ఎక్కి తిరుమంత్రాన్ని అక్కడ హాజరైన వేలాది ప్రజలకు తరతమ భేదాలు లేకుండా బిగ్గరగా అరచి చెప్పి అందించైనా పరమ కారుణ్య మూర్తి

2-అంత సాహసం ఎలా చేశాడు బావగారూ

1-బహుజన హితం ఆయన ధ్యేయం .తాను  అలాచేసినందువల్ల దుష్ఫలితం అనుభవించినా అందరికీ ముక్తి లభిస్తుంది కదా అని ఆయన మనోభావం .బ్రహ్మ సూత్రాలకు ఆయన రాసిన భాష్యానికి ‘’శ్రీ భాష్యం ‘’అనే గొప్ప పేరు పెట్టాడు .అందరికి అందుబాటులో ఉండేట్లు వేదాంత సారం వేదాంత దీపిక ,వేదార్ధ సంగ్రహం ,శ్రీరంగ గద్యం మొదలైనవి రాశాడు .విశిష్టాద్వైత ప్రచారానికి రాజులను ,జియ్యంగార్లను ,పరమై కాంతులను నియమించాడు

2-నియమం నిస్టా ఉండేవా బావగారూ

1-మాలమాదిగలు కూడా దేవుడిని అర్చి౦చ టానికివైష్ణవ దాసులను ఏర్పరచాడు .చాత్తాడ వైష్ణవులు,అమ్మ౦గార్లు  ఆయన ఏర్పరచినవారే .అందరికీ ముక్తిపొందే అవకాశం ఉందనే ఇలా చేశారు

2-బహుజన ముక్తికోసం ఇంతగా పరితపించిన వారు లేరనుకొంటా మరిన్ని విశేషాలు తెలియజేయండి బావగారూ

1-తిరుమల మూల విరాట్టు ను’’ ధ్రువ బేరం’’ అంటారు .అది శైవులదనీ, కాదు వైష్ణవులదనీ వాదం కొనసాగిన రోజుల్లో శైవులు ప్రత్యక్ష ప్రమాణం కోరితే , స్వామి విగ్రహం ఎదుట రెండు మతాలకు చెందిన బంగారు ఆయుధాలు చేయించి పెట్టి ఒకరోజు గుడి తలుపులు మూసేస్తే మర్నాడు దయానికి ధ్రువ బేరానికి శంఖు చక్రాలుఆయుదాలుగా కనిపించాయట .కనుక పాలకుడు యాదవ రాజుకు మూలవిరాట్టు శ్రీనివాసుడిదే  అని నమ్మకం కలిగించి అప్పటినుంచి వైష్ణవారాదనను అమలు చేయించాడు రామానుజా చార్య. తర్వాత కై౦ర్యాలు సక్రమంగా నిర్వహించటానికి ‘’ఏకాంగి వ్యవస్థ ‘’ఏర్పాటు చేశాడు ఆచార్య .తర్వాతకాలం లో అదే జియ్యర్ల వ్యవస్థగా మారింది

2-ఇవి నాకు కొత్తవిషయాలు బావగారూ ఇంకా –

1-గురువు చెప్పింది గుడ్డిగా నమ్మవద్దు అని ఆయన అభిప్రాయం తర్కం తో అసలు విషయం తెలుసుకోమని చెప్పాడు .సంప్రదాయంగా వస్తున్న ఆచారాలవలన చాందసంగా మారి  సామాజిక పురోగతికి అడ్డు రాకముందే  గుర్తించి వాటిని మానటమో,మార్చటమో చేయాలని సూచించాడు .ఆయన జీవితానంతరం విశిష్టాద్వైతం ద్రావిడ ,విడ సంస్కృత ప్రాబల్యాన్ని బట్టి తె౦గలై,వడగలై అనే అనే రెండు శాఖలుగా మారిందని ఆచార్య తిరుమల రామ చంద్ర చెప్పాడు .ఆయన భక్తి గరీయసి బావగారూ

‘’విషీదితానాథ-విషానలోపనం –విషాద భూమౌ భావసాగరే హరే –వరం ప్రతీకార మపశ్య సాధునాం –మయాయమాత్మా భవతీ నివేదితః’’అని దేవుడికి మొరపెట్టుకొన్నాడు

దీని భావం –విషాగ్ని సమానం ,సర్వ దుఖకారకం అయిన ఈ సంసార సాగరం లో, నా రక్షణ ఎక్కడా కనిపించటం లేక పోవటం తో ఓ ప్రభూ !నీదాసుడినై నన్ను నీకే సమర్పించుకొంటున్నాను

2-పరమ భక్తాగ్రేసర చక్రవర్తి రామానుజా చార్య బావగారూ –మరిన్ని విశేషాలు –

1-రామానుజుడు వేదా౦తులకు  తాము కోల్పోయిన ఆత్మను తిరిగి ఇచ్చాడు అంతకు ముందు శంకరాద్వైతం తో బ్రహ్మలో అదృశ్యమైంది .ప్రేమ తత్త్వం మీద నిర్మించబడింది విశిష్టాద్వైతం .భక్తిమార్గమే భగవంతుడిని  చేరే  సులభమార్గం అన్నదామతం

2-శంకరాచార్యకు ,రామానుజాచార్యకు ఉన్న సారూప్యం వివరించండి బావగారూ

1-ఇదీ అసలు ప్రశ్నఈ రోజు అడగాల్సిన ముఖ్య ప్రశ్న కూడా .’’శంకరుడు జ్ఞాన యోగాన్ని ప్రచారం చేసి 32సంవత్సరాలకు పరమ పదించారు .రామానుజులు శంకరుని అభిప్రాయమైన భక్తిమార్గాన్ని ప్రచారం చేశారు. ప్రపత్తి అంటే సర్వ సమర్పణ మార్గాన్ని సంపన్నం చేశారు 32ఏళ్ళు పూర్వ మతాలన్నీ అవలోడనం చేసి ,33వ ఏట విశిష్టాద్వైత మత ప్రచారం తురీయ ఆశ్రమంలో ప్రారంభించారు 120 ఏళ్ళు సార్ధకంగా జీవించారు .శంకర రామానులు జన్మించిన మాసాలూ నక్షత్రాలూ ఒకటే .ఇద్దరి ప్రమాణ గ్రంధాలూ ప్రచార విధానాలూ ఒకటే .విశిష్టాద్వైత

మత స్థాపనకు శంకరాచార్య అవతారం పూర్వ రూపం అయితే ,రామానుజావతారం ఉత్తర రంగం .బ్రహ్మం శంకరులనుండి రామానుజాచార్యులవరకు క్రమంగా సూక్ష్మం నుంచి స్థూలానికి పరిణమించింది ‘’అని రెండుమతాలను,ఇద్దరు స్థాపనా చార్యులను  క్షుణ్ణంగా పరి శోధించిన సారాంశంగా’’ నారాయణ కీర్తి కౌముది’’లో శ్రీ నారాయణ జీయర్ వెలిబుచ్చిన విలువైన విశేషం .

2-చక్కని విశ్లేషణ బావగారూ .ఇప్పుడు శంకరాచార్య శ్లోకాలు నాలుగు వినిపించి చెవుల తుప్పు వదిలించండి బావగారూ

1-ఓ దానికేం భాగ్యం –వినండి

‘’చామ్పేయ గౌరార్ధ శరీరకాయై –కర్పూర గౌరార్ధ శరీరకాయ –ధమ్మిల్లకాయై  చ జటాధరాయై-నమః శివాయైచ నమః శివాయ

‘’పశూనాం పతిం పాపనాశం పరేశం –గజేంద్రస్య కృత్తింవసానం వరేణ్యం –జటాజూట మధ్యే స్పురద్గాంగవారి౦  మహాదేవ మేకం  స్మరామి స్మరారిన్

‘’కలాభ్యాం చూడాలంకృత శశి కళాభ్యాంనిజతపః-ఫలాభ్యాం భక్తేషు ప్రకటిత ఫలాభ్యాం భవతుమే –శివాభ్యామస్తోక త్రిభువన శివాభ్యాం హృదిపున-ర్భవాభ్యామానంద స్ఫుర దనుభావాభ్యాం నతి రియం ‘’

‘’కదాచిత్కాలిందీ తటవిపిన సంగీతక వరో-ముదా గోపీ నారీ వదన కమలా స్వాద మధుపః –రమాశంభు బ్రహ్మామరపతి గణేశార్చిత పదో-జగన్నాథస్వామీ నయనపథ గామీ భవతుమే ‘’

‘’నమంతం నో యంత్రం తదపి చనజానే స్తుతి మహో –నచాహ్వానం ధ్యానం తదపి చ న జానే స్తుతి కదా-నజానే ముద్రాస్తే తదపి చ  న జానే విలపనం –పరం జానే మాతస్త్వనుసరణం క్లేశహరణం’’

‘’ఉద్యద్భాను  సహస్ర కోటి సదృశా౦ కేయూర హారోజ్వలాం –బింబోస్టీంస్మితదంత పంక్తి రుచిరాం పీతాంబరాలం కృతాం-విష్ణు బ్రహ్మ సురేంద్ర సేవిత పదాంతత్వ స్వరూపం శివాం-మీనాక్షీం ప్రణతోస్మిసంతతమహం కారుణ్య వారాం నిధిం ‘’

‘’నమస్తే శారదా దేవీ కాశ్మీర పురవాసినీ –త్వామహం ప్రార్ధయే నిత్యం విద్యా దానం చ దేహిమే ‘’‘’శివః శక్త్యాయుక్తో యది భవతి శక్తః ప్రభవితుం –న చే దేవం దేవో న ఖలు  కుశలః స్పందితు మపి –అతస్త్వా మారాధ్యాం హరిహర విరించచాదిభిరపి-ప్రణంతు స్తోతుం వా కథ మకృత పుణ్యః ప్రభవతి ‘’

2-శివ కర్ణామృతం గ్రోలినట్లున్నాయి శ్లోకాలు బావగారూ ధన్యవాదాలు మళ్ళీ కలుస్తా నమస్కారం

1-వెళ్ళిరండి బావగారూ శివోహం

సశేషం

శ్రీ శంకర రామానుజ జయంతి శుభాకాంక్షలతో

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -28-4-20-ఉయ్యూరు

Posted in రచనలు | Tagged | Leave a comment

శంకరజయంతి శుభాకాంక్షలు

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

సుందర కాండ లో హనుమ బహుముఖీన వ్యక్తిత్వం-11

సుందర కాండ లో హనుమ బహుముఖీన వ్యక్తిత్వం-11

మళ్ళీ రావణ సౌధానికి వచ్చిన హనుమ అక్కడి భోగ ఐశ్వర్యాలను శిల్పకళను చూసి సాక్షాత్తు ’మయుడే వచ్చి నిర్మించాదేమో ‘’అనుకొన్నాడు .ఇంతలో పుష్పక విమానం కనిపించింది .దాని శోభా వర్ణనానాతీతం .అది అనేక దాతువులచేత ,పుష్పాల పుప్పొడితో ఉన్న కొండ లాగా కనిపించింది .దాని రత్నకాంతులు కళ్ళు జిగేలుమనిపిస్తున్నాయి .అందులో సుందరీమణులున్నారు . ఆకాశం లో  మేఘంలా ,మబ్బులు కమ్మిన చిత్ర  వర్ణం లా ఉంది. ఆ విమానం లో తెల్లని భవనాలు అందమైన పూలతోటలు వికసించిన తామరపూలున్న కొలనులు ,విశేష వనాలు ఉన్నాయి .పుష్పకం పై కొన్ని పక్షులు వైడూర్య,కొన్ని వెండి,మరికొన్ని పగడ  నిర్మితాలు  .దానిపై గుర్రాలు పాములు ,అందమైన పక్షులు రత్నాలతో  చెక్కబడినాయి .బంగారు పూలతో ఉన్నాయి .ఇదంతా మన్మధుడికి సహాయకారి గా అనిపించింది ఘోటక బ్రహ్మ చారికి .తామరకొలనులు ,అందులో లక్ష్మీదేవి ఆమెకు అభిషేకం చేసే స్త్రీలు విస్పష్టంగా చిత్రి౦ప బడినాయి .మొత్తం చుట్టి వచ్చినా  స్త్రీ సౌఖ్యం పొందుతున్న రావణుడు కనిపించలేదు ,జానకీ మాత దర్శనం కాలేదని పరితపించాడు –

‘’తతస్తదాబహువిధ భావితాత్మనః –కృతాత్మనో జనక సుతాం సువర్త్మనః –అపశ్యతో భవ దతి దుఖితం మనః –సుచాక్షుషః ప్రవి చరతో మహాత్మనః ‘’

అనేక రకాలుగా ఆలోచించే నిశ్చలబుద్ధి ,సదాచార సంపన్నతఉన్న మహాత్ముడు ,ఉత్తమ దర్శన శక్తి కలవాడు అయిన హనుమ సీతా దేవి కనిపించక చింతా క్రాంతుడయ్యాడు

ఇది 17శ్లోకాల ఏడవ  సర్గ .ఇందులో పుష్పకం అనే అత్యంత పెద్ద విమానం కూడా రావణుడి భవనం లో ఉన్నది అంటే అది ఎంత విస్తీర్ణం తో ఉందో ఆలోచించాలి .అంతేకాదు ఆ విమానం లో సకల సౌకర్యాలు ,అత్యంత విలాస విషయాలు ఉద్యానవనాలతో సహా ఉన్నాయట .కనుక ఇది మయుడి నిర్మాణమే అనే నిశ్చయానికి హనుమ వచ్చాడు .

      దూరం నుంచి మాత్రమే చూసి వర్ణించిన తీరుమాత్రమే ఇది .తర్వాత సర్గ లో మహర్షి హనుమ లోపలి చూసిన పుష్పక వర్ణన ఉంటుంది .అ అరుదైన విమానం కిటికీలు మేలిమి బంగారు నిర్మితాలు .అతి వైభవోపేతంగా అత్యంత సుందరంగా దాన్ని నిర్మించి విశ్వకర్మ తన నిర్మాణ చాతుర్యానికి తానే బోలెడు ఆశ్చర్యం ప్రకటించుకొన్నాడు –

‘’తదప్రమేయా ప్రతికార కృత్రిమం –కృతం స్వయం సాధ్వితి విశ్వకర్మణా-దివం గతం వాయు పథ ప్రతిష్టిత౦ –వ్యరాజతా దిత్య పథస్య లక్ష్మ్య వత్ ‘’

  అంతేకాదు దానికి చోదకుడు అంటే పైలట్ అక్కర్లేదు ,రావణుడు మనసులో ఎలా తలచుకొంటే అలా గమనం చేస్తుంది .ఇంకెవరికీ అది నడపటం సాధ్యంకాదు .ఇంద్రుడి విమానం కూడా దీనిముందు దిగదుడుపే .దాన్ని వేలాది రాక్షసులు ,భూతగణాలు మోస్తున్నట్లు చిత్రించటం మరీ విశేషం

‘’మనోభిరామం శరదిందు నిర్మలం –విచిత్ర కూటం శిఖరం గిరేర్యథా

వహంతి యంకుండల శోభితాననా –మహాజనా భూత గణా స్సహస్ర శః

‘’వసంత పుష్పోత్కర చారు దర్శనం –వసంత మాసాదపి కాంత దర్శనం –సపుష్పకం తత్ర విమాన ముత్తమం –దదర్శ త ద్వానర వీర ముత్తమం ‘’

వసంత పుష్ప సమూహాలలాగా కనిపించే సుందరమైన ,వసంత మాసం కంటే మనోహరమైన ,సర్వ శ్రేష్టమైన పుష్పక విమానాన్ని కపి శ్రేష్ట హనుమాన్ దర్శించి పులకి౦చాడు   ‘’

8శ్లోకాలు మాత్రమే ఉన్న ఈ ఎనిమిదవ సర్గ లో మహర్షి రెండు తమాషాలు చెప్పాడు .లోకం లో ఎవరైనా ఒక గొప్ప పని చేస్తే ,ఒక్కోసారి అతడికే తన పని అమితాశ్చర్యం కలిగిస్తుంది .ఆ లక్షణాన్ని విశ్వకర్మ కు కూడా ఉన్నట్లు చూపించాడు .ఎంతటి వారైనా ఇలాంటి మనోభావాలకు అతీతులు కారు అనే లోక సహజ విషయాన్ని బయట పెట్టాడు విశ్వకర్మ చేస్టద్వారా .పుష్పకం పేరులోనే పుష్ప సౌందర్యం భాసిస్తుంది .మరి దాని అందాలు చూస్తే మనసు సంపూర్ణ వికసిత శతపత్రమే అవుతుంది .అలాంటి అనుభూతి పొందాడు హనుమ .అంతేకాదు వసంతం మనసును హసితం చేస్తుంది .ఆహ్లాద పరచి ఉల్లాసం కలిగిస్తుంది .అందుకే వసంత నవరాత్రులు చేస్తాం .అలాంటి వసంత శోభకంటే విశిష్టమైన శోభ పుష్పక విమానానికి ఉండటం తో ఇప్పటిదాకా కల్లోలంగా ఉన్న హనుమ మనసు కొంత సేద తీరిందని గ్లాని తగ్గిందని ,కొద్ది కాలం లో ఏదో తెలీని మధు మధుర విషయాలు జరిగి తాను  వచ్చిన పనికి సార్ధకత తెస్తుందనీ  మహర్షి వాల్మీకి సూచ్యార్ధం గా చూచి౦చాడేమో అని పించింది .

   సశేషం

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -27-4-20-ఉయ్యూరు

Posted in రచనలు | Tagged | Leave a comment

ప్రపంచ దేశాల సారస్వతం 49-పలావు దేశ సాహిత్యం

ప్రపంచ దేశాల సారస్వతం

49-పలావు దేశ సాహిత్యం

 ఆర్చిపెలగు ఐన 500దీవుల సమూహమే పలావు దేశం పశ్చిమ ఫసిఫిక్ తీరం లో ఉంది.కరోనా సోకని ఎనిమిదవ దేశం .బెబిల్ డాబ్ రాజధాని .3వేలఏళ్ళ క్రితమే ఇక్కడ వలసలు ఏర్పడ్డాయి .16వ శతాబ్దిలో స్పెయిన్ మొదటిసారిగా ఇక్కడ కాలుపెట్టిన యూరోపియన్ దేశం .1898లో జరిగిన స్పానిష్ –అమెరికన్ యుద్ధం లో ఇంపీరియల్ జర్మనీకి దీన్ని అమ్మేశారు .మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత జపాన్ చేతికి వచ్చింది .1979లో పూర్తి సార్వభౌమాధికారం పొంది స్వతంత్ర దేశమైంది .ప్రెసిడెంషియల్ రిపబ్లిక్ ప్రభుత్వం .పలావు ,ఇంగ్లిష్ లు అధికార భాషలు .ఇక్కడ ట్రాపికల్ రెయిన్ ఫారెస్ట్ క్లైమేట్ ఉంటుంది .పర్యావరణ వినాశనం కాని దేశం .ఉప్పునీటి మొసళ్ళు ఇక్కడ ప్రత్యేకం .ఇవి లెక్కలేని ఉన్నా ప్రమాదకరమైనవి అంటున్నా ,పెద్దగా మనుషుల్ని ఇబ్బంది పెట్టిన జాడ బహు స్వల్పం .15అడుగులపోడవు క్రోకడైల్స్ కూడా ఉండిఆశ్చర్యం కలిగిస్తాయి .భూకంపాలు అగ్నిపర్వత భయాలు ఎక్కువ .తాగునీటి సరఫరా సరిగ్గా ఉండదు వ్యవసాయభూమి చాలాతక్కువ .2009లో ప్రెసిడెంట్ ఇక్కడ ప్రపంచం లోనే మొట్టమొదటి ‘’షార్క్  శాం క్త్యురి ‘’ఏర్పాటు చేస్తానని ప్రకటించాడు .కమ్మర్షియల్ షార్క్ వేట నిషేదించి  ‘’ఎక్స్ల్యూజివ్ ఎకనామిక్ జోన్ ‘’ఏర్పాటు చేసి ,సముద్రం లో 6లక్షల చదరపు కిలోమీటర్ల మేరకు రక్షించే ‘’షార్క్ అభయ ప్రదేశం –శాన్క్త్యురి ‘’ఏర్పాటు చేసి ప్రపంచ మన్ననలు పొందింది పలావు .ప్రెసిడెంట్ టోరిబియాంగ్ యునైటెడ్ నేషన్స్ లో మాట్లాడుతూ ప్రపంచ దేశాలన్నీ షార్క్ వేట నిషేధించాలని కోరాడు ఫ్రాన్స్ అంగీకరించింది .ఈ సాహస నిర్ణయానికి  ‘’వరల్డ్ ఫ్యూచర్ కౌన్సిల్ ‘’ పలావు దేశానికి’’ఫ్యూచర్ పాలిసి అవార్డ్ ‘’అందించింది .మెరైన్ ఈకో సిస్టం పరిరక్షణలో పలావు దేశం మార్గదర్శి అయింది .

   ఈ దేశ ఆర్ధికం ఫిషింగ్ ,టూరిజం కొద్దిపాటి వ్యవసాయం వల్లనే వస్తుంది .స్కూబా డైవింగ్ కు టూరిస్ట్ లు ఎగబడతారు .అమెరికాపైనే ఆర్ధికానికి ఎక్కువ ఆధారపడుతుంది .2006పలావు సేవింగ్స్ బాంక్ దివాలాతీసింది .జనాభా సుమారు 18వేలు .రోమన్ కేధలిక్కులు ,ప్రొటే స్టంట్ లు ఉన్నారు .జనాలు అన్ని చోట్లా సంప్రదాయం తప్పక పాటిస్తారు .బేస్ బాల్ ఆట ఇష్టం .నేషనల్ ఫుట్ బాల్ టీం ఉంది.16వ ఏడులోపల ప్రైమరీ విద్య పూర్తి చేయాలి .పలావో  కమ్యూనిటి కాలేజి ఉంది.పై చదువులకు బయటి దేశాలకు వెళ్ళాల్సిందే .లోతైన నీలి సముద్రంలో హాయిగా విహరించటానికి ‘’పిస్టైన్ పారడైజ్ ‘’ఉంది.దీని  సంస్కృతిని అత్యంత భద్రంగా సంరక్షిస్తున్నారు .

  పలావు దేశ సాహిత్యం –కొందరు రచయితలు ,రాసిన   పుస్తకాలు -1-బీయింగ్ ఎ పలావియన్ –హోమర్ జి బార్నెట్ 2-వర్డ్స్ ఆఫ్ ది లేగూన్ –ఆర్ ఇ.జోనాన్స్ 3లాస్ట్ మాన్ స్టాండింగ్ –డిక్ కాంప్ 4-వరల్డ్స్ ఎవే –పాట్రిక్ ఫినేల్లి 5-పలావు స్ట్రగ్లింగ్ ఫర్ ఇండిపెండెన్స్-ఆర్నోల్డ్ లీబో విజ్ 6-లెఫ్ట్ టు డై-డాన్ కుర్జిమన్7-సిక్స్టి యియర్స్ ఆఫ్ సెర్చింగ్ ఫర్ దిమిస్సింగ్ మెన్ ఆఫ్ వరళ్డ్ వార్ -2-విల్ ఎస్ విల్టన్ మొదలైనవారు

 బాలల పుస్తకం రాసిన జొలేన్ గోరియాకిల్ అనే ఆమె పలావు భాషలో  బాలసాహిత్యం రాసినకోద్దిమందిలో ఒకరు .వెయ్యికాపీలు ముద్రించింది. దీనికి ఆమెకు ప్రోత్సాహంగా ఫసిఫిక్ యూత్ నుంచి గ్రాంట్ లభించింది .ఆ పుస్తకాలన్నీ స్కూళ్ళకు ఉచితంగా ఆమెసరఫరాచేసి గ్రాంట్ కు సార్ధకత చేకూర్చింది  .ఇంతకంటే వివరాలు దొరకలేదు

ప్రపంచాన్ని కరోనా వైరస్ చుట్టుముట్టి బాధిస్తుంటే ,దాన్ని పలావు దేశం లో అడుగుపెట్టకుండా ఆ దేశ అధ్యక్షుడు  టామీ రేమింగ్ సావు దేశ టూరిజం కోసం ఇక్కదికిరాకుండా చాలా స్ట్రిక్ట్ నిబంధనలు అమలు చేశాడు ప్రపంచం అంతా కరోనా నుంచి విముక్తి పొందాకే బార్డర్లు తెరుస్తాను అని నిర్మొహమాటంగా చెప్పి నిలబెట్టుకొంటున్నాడు ప్రజారక్షణ అంటే అదీ .మనరాస్ట్రం లాగా మంత్రులు శాసనసభ్యులు ఇతర ప్రజాప్రతినిధులు మందీ మార్బలంతో వెళ్లి కుళాయి నో టాయ్ లెట్ నో ,వస్తు సరఫరానో చేయటం లేదు .టూరిజం మీదనే ఎక్కువ ఆధారపడిన దేశమైనా ప్రెసిడెంట్ అత్యంత సాహసోపేత నిర్ణయం తీసుకోవటం అభినందనీయం. Profits come and go. But you only have one life to live and that’s the basic model we’ve been following … That’s why, as of today, no single virus (case) has been detected.” అని ప్రజలప్రాణమే అన్నిటికన్నా మిన్న అని ఘంటా పదంగా చెప్పాడు ఆ ప్రెసిడెంట్ . Key to that readiness was being able to convince people to follow strict hygiene and social distancing measures, while accepting that school closures and business and economic losses were sacrifices for the greater good, Remengesau said. If you don’t respect yourself, you don’t respect your neighbours, and that’s when chaos can ensue.” అని ప్రజలకు నచ్చ చెప్పి వారందరి మద్దతు సాధించి భేష్ అనిపించాడు .ఎన్నికలకోసమో ,పాప్యులారిటీకోసమో  కక్కుర్తి పడే జనం,వాళ్ళ నాయకులు తప్పక  గ్రహించాల్సిన విషయం ఇది .

   సశేషం

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -27-4-20-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

సుందర కాండ లో హనుమ బహుముఖీన వ్యక్తిత్వం-10

సుందర కాండ లో హనుమ బహుముఖీన వ్యక్తిత్వం-10

సీతాదేవి కనిపించలేదని బాధపడి దుఖించిన హనుమ మరింత వేగంగా వెదకటానికి బయల్దేరి రావణ గృహం చేరాడు .అది బంగారు వెండి ద్వారాలతో ,మేలిమిగుర్రాలు రథాలతో ,సింహాల ,పులుల చర్మాలతో కప్పబడిన దంతం వెండి బంగారం కదిలితే వినసొంపైన శబ్దాలు చేసే సుందర రథలతో ,రాత్నాసనాలు నానామృగ పక్షి సందోహాలతో కూడిన రావణ గృహం చూశాడు .సుందర స్త్రీలతోభేరీ శంఖ మృదంగ వాద్య ధ్వనులతో ,ఛత్ర చామరాది రాజలక్షణాలతో,సముద్ర గంభీరం తో ఉన్న ఆభవనం చూసి సీత కనిపించకపోవటం తో రావణకుమారులు ,మంత్రుల గృహాలు వరుసగా చూస్తూ ,ప్రహస్త,మహాపార్శ్వ ,కుంభకర్ణ ,విభీషణ గృహాలు దాటి  ,మహోదర ,విరూపాక్ష ,విద్యుజ్జిహ్వ ,వజ్ర దంష్ట్ర ,శకరక్షస గృహాలు కూడా పరికించి ,సారణుడి  ఇంటికినీ దాటి ,ఇంద్రజిత్ ,జంబుమాలి ,సుమాలి ,రశ్మి కేతు ,సూర్య శత్రు ,వజ్రకాయ గృహాలు  వెదికి ,ధూమ్రాక్ష ,సంపాతి ,విద్యుద్రూప ,భీమ ,ఘన ,విఘ్న ,శుకనాస ,వక్త్ర శఠ,వికట ,బ్రహ్మకర్ణ ,దంష్ట్ర ,రోమశ ,యుద్దోన్మత్త,మత్త,ధ్వజగ్రీవ ,నాది,విజ్యుజ్జిహ్వ ,ఇంద్రజిహ్వ ,హస్తిముఖ ,కరాళ,పిశాచ ,శోణిటాక్ష గృహాలు వెతికి,వారి సపదలకు ఆశ్చర్యపోయి ,పీచే మూడ్ అన్నట్లు మళ్ళీ రావణ గృహానికి వచ్చి అక్కడ అతడు నిద్రిస్తుండగా మేల్కొని కావలికాసే రాక్షస స్త్రీలను చూశాడు .సైన్యమక్కడనిరంతరం పహరాకాస్తోంది.అనేక ఆకారాల పల్లకీలు లతా చిత్ర శాలలు క్రీడాభవనం ,క్రీడా శైలం ,దేవగృహాలు చూశాడు.అనేక నిధులు రత్నాలు ఉన్న  రావణ ధనాగార౦ ,రత్నకాంతులు రావణ తేజం తో ఆభవనం సూర్యునిలాగా తేజరిల్లింది .నేలఅంతా తేనెతో తయారైనమద్యం తో తడిసి ఉంది .మణిమయ పాత్రలు ఎన్నో ఉన్నాయి .వందలాది స్త్రీ లతో వ్యాప్తమైన ఆ రావణ భవనం ప్రవేశించాడు హనుమ .

44శ్లోకాల ఆరవ సర్గ ఇది  .ఇందులో మనం తెలుసుకోవాల్సింది ఏమిటి అంటే ,ఎక్కడా ఏ భవనమూ  వదలకుండా అన్నిటినీ జాగ్రత్తగా సీతా దేవికోసం గాలించాడు  దర్పానికి కారణమైనరావణ  అనంత ఐశ్వర్యాన్ని స్వయంగా చూసి తెలుసుకొన్నాడు. దేనిపైనా ఆసక్తికాని ,అసూయ కాని కలుగలేని స్థిత ప్రజ్ఞత హనుమలో మనం చూస్తాం

  సశేషం

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -26-4-20-ఉయ్యూరు

Posted in రచనలు | Tagged | Leave a comment

ప్రపంచ దేశాల సారస్వతం 48-ఉత్తర కొరియన్ సాహిత్యం

ప్రపంచ దేశాల సారస్వతం

48-ఉత్తర కొరియన్  సాహిత్యం

కరోనా తాకని ఏడవ దేశం ఉత్తరకొరియా ఉత్తర ఆసియాలో ,కొరియన్ పెనిన్సులా కు ఉత్తరాన ఉన్నది .పయోన్ గ్యాంగ్ రాజధాని .రెండున్నర కోట్ల జనాభా .కరెన్సీ-నార్త్ కొరియన్ వన్.1910లో జపాన్ వశపరచుకొని ,రెండవ ప్రపంచయుద్ధం ఆతరవాత 1945 సోవియెట్ అధీనం లోని ఉత్తర కొరియా,అమెరికా అధీనం లోని దక్షిణ కోరియాగా విభజన చెందింది .రెండిటిని కలిపే ప్రయత్నాలు విఫలంకాగా నార్త్ కొరియా పీపుల్స్ రిపబ్లిక్ ,దక్షిణకోరియాతో 1950నుంచి మూడేళ్ళు యుద్ధం –అదే కొరియా యుద్ధం చేసి ,చవరికి రెండూ ఒకా ఒడంబడికకు వచ్చినా శాంతి చేకూరలేదు .ఉత్తరకొరియా ఎన్నికలు నిర్వహించి ప్రభుత్వాలు ఏర్పరుస్తుంది .కాని అవి ఉత్తుత్తి ఎన్నికలు అని బయటిలోకం భావిస్తుంది.కిం వంశపాలనే ఇక్కడ .1994వచ్చిన భయంకర కరువు నాలుగేళ్ళు బాధించింది .దాదాపు నాలులక్షల పాతికవేల జనాభా చనిపోయారు  .1956ఇతరదేశాలనుంచి విముక్తిపొంది స్వతంత్ర దేశం అయింది .వెంటనే ఆర్ధిక వృద్ధికోసం తీవ్రప్రయత్నాలు చేసి సాధించింది .1992లో అంతర్యుద్ధం నెమ్మదిగా మొదలై ,రెండవ కిం ఆరోగ్యం తగ్గటంతో కిం జాంగ్ అనేక పాలనాపరమైన బాధ్యతలు తీసుకొని ,రెండవకిం చనిపోతే మూడేళ్ళు సంతాపం సంవత్సరాలుగా ప్రకటించి కిం జాంగ్ నాయకుడిగా ప్రకటించుకొన్నాడు  .న్యూక్లియర్ ఆయుధాల తయారీ తగ్గించాడు .తనపాలసికి ‘’సొంగుం ‘’అంటే ము౦దు మిలిటరి ‘’గా చెప్పాడు .1990లో విపరీతమైన వరదలతో దేశం పంటలు తీవ్రంగా నష్టపోయాయి .1996లో యు యెన్ వో సహాయం తో బయటపడింది.201లో జార్జి బుష్ అమెరికా ప్రెసిడెంట్ అయ్యాక  ,దక్షిణ కొరియా ‘’సన్ రైజ్ పాలసి ‘’ని నిరసించి,ఉత్తరకొరియా ను ‘’రోగ్ స్టేట్’’గా భావించాడు .ఇరాక్ లాగా దెబ్బతినకూడదని నార్త్ కొరియా పవర్ఫుల్ న్యూక్లియర్ ఆయుధాలు తయారు చేసుకొన్నది .ఒబామా ప్రెసిడెంట్ అయ్యాక చాలా స్ట్రాటజిక్ గా ఆదేశం తో మసిలాడు.కింగ్ జాం చనిపోయాక 2011లో అధికారం కొడుకు కిం జాంగ్ ఉన్ కు దక్కింది. హైడ్రోజెన్ బాంబులు అమెరికా పైకి దూసుకు వెళ్ళే మిసైల్స్ తయారు చేయించాడు .ట్ర౦ప్ అధ్యక్షుడయ్యాక మళ్ళీ రెండు దేశాలమధ్యా టెన్షన్ పెరిగింది.

  నార్త్ కొరియాలో కాన్టి నెంటల్ ,ఓషియానిక్ క్లైమేట్లు ఉంటాయి .మంచుతుఫాన్లు వస్తాయి .వేసవిలో విపరీతమైన వేడి ,చలికాలం లో బాగా చల్లదనం ఉంటుంది .జీవనప్రమాణం 70ఏళ్ళు .అంటువ్యాధులు ఎక్కువే .టిబి, మలేరియా హెపాటిటిస్ ఎక్కువే .ప్రజలందరికి ప్రభుత్వం మంచినీరు నిరంతరంగా సరఫరా చేస్తుంది పరిశుభ్రత పాటిస్తారుజనం .2008లెక్కలప్రకారం అందరూ అక్షరాస్యులే .సెకండరి స్థాయి వరకు ఫ్రీ కంపల్సరి విద్య .గ్రాడ్యుయేట్ విద్యకు యూని వర్సిటిలలో చదవక్కరలేదు .మిలిటరీ సర్వీసస్ ,వ్యవసాయ క్షేత్ర విధులు చేస్తే చాలు .భాష కొరియన్ భాష .దీన్ని వీరు ‘’కల్చర్డ్ లాంగ్వేజ్’’ అంటారు .ఇంగ్లిష్ రష్యన్ చైనీస్ భాషలూ మాట్లాడుతారు .దేశాన్ని మతరహిత దేశం చేశారు .అయినా బౌద్ధ కన్ఫ్యూషియన్ మత ప్రభావం సంస్కృతిలో కనిపిస్తుంది .పరిశ్రమలవలన ఆదాయం లభిస్తుంది .సైన్స్ ,టెక్నాలజీ లకు ఆదరణ ఎక్కువ .సోషలిస్ట్ రియలిజం తో విజువల్ ఆర్ట్స్ ఉంటాయి .జానపద సంగీతం తోపాటు పాప్ మ్యూజిక్ కూ స్థానం ఉంటుంది .

  ఉత్తరకొరియా సాహిత్యం –ఇక్కడి ప్రజలకు రష్యన్ సాహిత్యం పై మోజు లేదు కానీ మాక్జిం గోర్కీ రచనలు బాగా ఇష్టం .1945-50కాలం లో ఇక్కడ సాహిత్యానికి  నాంది జరిగింది .కిం 2 విదేశీ సాహిత్యాన్ని నిరసి౦చగా  దేశీయ సాహిత్యం ప్రారంభమైంది .హాన సొరయా కొరియన్ ఎత్నిక్ సాహిత్యం సృష్టించాడు .1986కస్పాన్ ఫాక్షన్ ఇంసిడెంట్ తో ప్రజలవద్ద  పుస్తకాలన్నిటినీ లాగేసుకొన్నారు  .వీటిలో టాల్స్టాయ్,గోర్కీ ,డాస్టో విస్కి ,రచనలేకాక చైనా గ్రీక్ జర్మని ఫిలాసఫీ పుస్తకాలు కూడా కనపడకుండా చేశారు .మార్క్స్ పుస్తకాలు అరుదుగా లైబ్రరీలలో ఉంటాయి .రాజకవి జాంగ్ జింగ్ సంగ్ చెప్పినదానిప్రకారం కిం-2కాలం లో నవలారచన బాగా జరిగింది .నవలాకారులకు దేశంలోనే విశిష్టమైన పురస్కారాలు లభించాయి .ఆరాజు చరిత్ర కు ఆనవలలే ఆధారం .రాజుకూడా నవలలు రాయటమేకాదు గోప్పపాఠకుడు కూడా .1994అతడు చనిపోయాక నవలస్థానం కవిత్వం ఆక్రమించింది .దీనికి కారణం ఆర్ధిక సమస్య మాత్రమేకాక  పేపర్ ఖరీదు బాగా పెరిగిపోవటం కూడా .దీనితో ‘’డియర్ లీడర్ ‘’ఘనకార్యాలు ఒకే పేజీఉన్న దినపత్రికలో వచ్చేవి .చిన్నకవితలకు ప్రోత్సాహం పెరిగి పెద్ద ఎపిక్ కవిత్వం ఆరుగురు కవులకు  అదీ రాజాస్థాన కవులకే పరిమితమైంది .కవిత్వమే రాజకీయ ప్రాపగా౦డా కు చేయూతయింది .రష్యా చైనీస్ లలోకి ఇక్కడి రచయితలైన రికి యాంగ్ -1895-1984,హాంగ్ మియాంగ్ హు -1888-1968,హాన్ సోర్యా-1951 నవలలు అనువాదం పొందాయి .

  21వ శతాబ్దిలో 2006లో ‘’వర్డ్స్ వితౌట్ బార్డర్స్ ‘’సంస్థ నలుగురు నార్త్ కొరియన్ రచయితల రచనలను ఇంగ్లిష్ లోకి అనువదించింది .కథాసాహిత్యమూ వచ్చింది .బియుంగు చోన్ రాసిన ‘’ఫాలింగ్ పర్మిషన్స్’’ కొరియా విభజనపై ఎమోషనల్ సఫరింగ్ కవిత .పునరేకీకరణ కావాలన్న ఆశ ఉంటుంది .2002లో హాంగ్ సియోక్ జంగ్ నవల ‘’హ్వాన్గిని ‘’2004మన్హే లిటరరీ ప్రైజ్ పొందింది .దీని నేపధ్యం 16వ శతాబ్ది .దీన్ని సౌత్ కొరియా మొదటిసారిగా నార్త్ కొరియన్ రచయితకు ఇచ్చిన ప్రైజ్ .రచనలపై సెన్సార్ షిప్ ఉండటం తో రచయితలూ ఇతర దేశాలలో తమరచనలు ముద్రిస్తున్నారు .

7-ప్రముఖ పుస్తకాలు -1-దియక్యుజేషన్-చిన్నకథల సంపుటి .రచన బంది .క్రూర పాలనలోనూ మానవత్వం ఉన్న మహిళకథ కంట తడిపెట్టిస్తుంది 2-హౌ ఐ బికేం నార్త్ కొరియన్ –క్రిస్ లీ .అజ్ఞాతవాసంలో గడిపిన ముగ్గురి గురించి కన్నీటి వ్యధ 3-యువర్ రిపబ్లిక్ ఈజ్ కాలింగ్ యు –కిం యాంగ్ హా –కేపిటలిజం కమ్యూనిజం లలో ఉన్న లోపాలను తెలిపేది 4-ది ఆర్ఫాన్ మాస్టర్స్ సన్-ఆడం జాన్సన్ –మాజిక్ రియలిజం సెటైర్ తో ఉన్నరచన పులిట్జర్ ప్రైజ్ పొందింది 5-వితౌట్ యు దేరీజ్  నో అజ్-సుకి కిం – బాంబులకు బదులు మంచి భావాలు నాటమని చెప్పటానికి వచ్చిన కంప్యూటర్ సైన్స్ గ్రాడ్యుయేట్  కిం ఈ దేశం లో ఫెన్సింగ్ దగ్గర దయనీయ స్థితిలో అనేకకస్టాలు పడిన బాదధామయగాథ6-నథింగ్ టు ఎన్వి-ఆర్డినరి లైవ్స్ ఇన్ నార్త్ కొరియా –బార్బరా డేమిక్ –కొంజ్హిన్ సిటి కరువు తో అల్లాడి పోవటం ప్రజల  బాధామయ జీవితాలను వర్ణించే రచన 7-ఎ రివర్ ఇన్ డార్క్ నెస్-వన్ మాన్ ఎస్కేప్ ఫ్రం నార్త్  కొరియా –మషాజి ఇషికవా -1958లో కిం2 సంగ్ –ఇతర దేశాలలో ఉన్న ప్రజలను భూలోకస్వర్గమైన నార్త్ కొరియాకు రమ్మని ఆహ్వానిస్తే ,ఇషికివ తండ్రి స్పందించి కుటుంబంతో ఇక్కడికి రాగా ఇషికివ త్వరలోనే అక్కడ ‘’ఆలోచన కు మాత్రం స్వేచ్చ లేదని ‘’,ఉన్నదంతా సూడో రిలిజియస్ కల్ట్ అనీ గ్రహించి ,36ఏళ్ళు ప్రభుత్వ పొలాలలో ఆడవా చాకిరి చేస్తూ భయంకర దుర్భర జీవితం గడిపి ,చివరికి విసిగి వేసారి ధైర్యంతో ‘’యాలూ రివర్ ‘’ఈదుకొంటూ దాటి చైనా చీకట్లో చైనా చేరి చివరికి జపాన్ లో స్థిరపడిన యదార్ధ గాథ.ఇవ.న్నీ ఉత్తరాకోరియాను అర్ధం చేసుకోవటానికి ఉపయోగ పడే రచనలే

  ఇల్లీగల్ డ్రగ్స్ తయారు చేయటం ,నకిలీ సరుకులు అమ్మటం ,దొంగనోట్ల ముద్రణ ,టెర్రరిజం నార్త్ కొరియాలో నిషిద్ధం .2017నుంచి అమెరికా టూరిస్ట్ లకు ప్రవేశం లేదు .ఇన్ని రెస్ట్రిక్షన్  లు ఉంటె ఉత్తరకొరియలోకి కరోనా ప్రవేశించే సాహసం చేయక తోక ముడిచి వారి ప్రాణాలను కాపాడింది .

  సశేషం

అక్షయ తృతీయ శుభాకాంక్షలతో

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -26-4-20-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

రేడియో బావగారి కబుర్లు -2

రేడియో బావగారి కబుర్లు –2

బావగారు 2-నమస్కారం బావగారు .నిన్న మీరు  చెప్పినకబుర్లు నా మనసుకు చందనం పూసినత చల్లగా హాయిగా ఉన్నాయి

బావగారు -1-నమస్కారం .రండి చందనం అంటే జ్ఞాపకమొచ్చింది .ఇవాళ చైత్ర శుద్ధ తదియ అక్షయ తృతీయ మాత్రమేకాక సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామి చందనోత్సవం కూడా బావగారూ

2-అలాగైతే ఇవాళ బోలెడు విశేషాలున్నాయన్నమాట .అక్షయ తృతీయ అంటే ఏమిటి బావగారు

1-తెలుసుకోవలసినవిషయమే అడిగారు బావగారు .అక్షయం అంటే క్షయం అంటే నాశనం లేనిది లేక అనంతమైనది అని అర్ధం .ఈ రోజును ‘’సర్వ సిద్ధి ముహూర్తం ‘’గా  దైవజ్ఞులు చెప్పారు .అంటే ఈరోజు ఏ మంచి పని మొదలుపెట్టినా తప్పకుండా విజయం సిద్ధిస్తుంది అని నమ్మకం .మనవాళ్ళు ఎప్పుడు ఆశీర్వది౦చినా  ‘’అక్షయ పుణ్యలోక ప్రాప్తి రస్తు ‘’అక్షయ ధనధాన్య భోగ సమృద్ధి రస్తు ‘’అని ఆశీర్వదిస్తారు అందుకే

2-మరి ఈనాడు ఎలాంటి మంచి పని చేయాలి బావగారు

1-సంప్రదాయ సిద్ధంగా ఈ రోజు కనీసం ఒక చిన్నం అయినా బంగారం కొంటారు .ఇవాళకొంటే అది అక్షయ వృద్ధి చెందుతుందని నమ్మకం .భూములు ,ఇళ్ళూవగైరా కోనేవారూ ఉన్నారు .బావగారూ ఏమైనా ఒకకిలో బంగారం కొని దాచారా

2-సరేలెండి బావగారు .ఏదో రేడియో లో పని చేస్తున్నారు .వీళ్ళకు డబ్బు లెక్కేమిటి అనుకొంటుంది లోకం .మన జీతాలెంత ,మనకుతుంబ భారమెంత .నా వల్ల కానే లేదుబావగారూ .మీరు బాగానే కూడబెట్టినట్లు తోస్తోంది మీముఖం చూస్తె

1-మనం ఇద్దరం ఒకే తాను  గుడ్డలం బావగారూ .ఎలా సాధ్యమౌతుంది .అదీగాక గత 6ఏళ్ళుగా మనకేంద్రప్రభుత్వం  ప్రభుత్వ సంస్థలైన పోస్ట్ ,టెలిఫోన్ ,టివి,రేడియో వంటి వాటి గురించి అస్సలు పట్టించుకోవటం లేదు .ఎంతసేపూ ప్రైవేట్ వాళ్ళకే అ౦బా నీలకూ ఆదానీలకే వత్తాసు కాస్తోంది ,దోచిపెడుతోంది కదా బావగారు

2- నిష్టూరం  అనిపించినా నిజం చెప్పటం లో మీకు సాటి లేరు బావగారు .మనగొడవ ఎప్పుడూ ఉండేదే అనంతం .అక్షయ తృతీయ విశేషాలు ఇంకేమైనా ఉన్నాయా బావగారూ

1-లేకేమి చాలా ఉన్నాయి .ఈ రోజే విష్ణువు ఆరవ అవతారమైన పరశురామ జయంతి .ఈ రోజే త్రేతాయుగం ప్రారంభమైందని నమ్మిక .దివినుండి గంగానది భువిపై ఉద్భవి౦చి౦దీ  ఈరోజే .వ్యాసమహర్షి మహాభారత రచన ప్రారంభించిందీ ఈరోజేనండి .అక్షయంబుగ కాశిలోపల అన్నపూర్ణ భవానివై ‘’అని మనం పూజించే అన్నపూర్ణా దేవి జన్మదినమూ ఇవాళే.ఈ రోజే కుబేరుడు శివుని పూజించి లక్ష్మీదేవి  అనుగ్రహం తో  అక్షయ సంపద పొంది దానికి సంరక్షయ్యాడు  .ద్రౌపదీ మానసంరక్షణ అక్షయ వస్త్రాలతో శ్రీకృష్ణుడు  చేసిన రోజు ,తనను సందర్శించిన బాల్యమిత్రుడు కుచేలుడుప్రేమగా తెచ్చిన అటుకులు గ్రహించి శ్రీ కృష్ణుడు అక్షయసంపద ఇచ్చిన రోజుకూడా అక్షయ తృతీయే బావగారు

2-అక్షయ పాత్ర పేరేదో లోకం లో ఉన్నట్లు, విన్నట్లు జ్ఞాపకం

1-బాగా గుర్తు చేశారుబావగారూ –అజ్ఞాతవాసం లో ఉన్న పాండవులకు సూర్యభగవానుడు ‘’అక్షయ పాత్ర ‘’ప్రదానం చేసినరోజుకూడా అక్షయతృతీయే .శంకర భగవత్పాదులు బాల్యం లో మొదటిసారిగా పేద ఇల్లాలి ఆమలకం భిక్షగా గ్రహించి ‘’కనకదారా స్తవం ‘’ ‘’చెప్పి,ఆమె ఇంటి ముందు అక్షయకనకధార కురిపించింది ఈరోజే  ,  బదరీనాద్ ఆలయం ద్వారాలు నాలుగు నెలలమూత తర్వాత ఇవాళే భక్తుల దర్శనం కోసం  తెరుచుకొంటాయి .పూరీ జగన్నాధ రధయాత్ర కు రధం నిర్మించే కార్యక్రమకూడా ఈ రోజే మొదలౌతుంది .బృందావనంలోని ‘’బ౦కే బిహారీ ‘’ఆలయం లో శ్రీ కృష్ణుని పాదదర్శనం ఈ అక్షయ తృతీయ ఒక్కరోజునే సాధ్యం .మన సింహాద్రి అప్పన్న చందనోత్సవం కూడా అక్షయ తృతీయ నాడేబావగారు

2-ఇవన్నీ వింటుంటే ఒళ్ళు పులకిస్తోంది బావగారు .అక్షయ తృతీయ అంటే బంగారం కొనటం ఒక్కటే అనుకొన్నాను ఇన్ని విశేషా లున్నాయా బావగారు ధన్యవాదాలు .ఇంతకీ చందనోత్సవం కథా కమామీషు ఏమిటి బావగారూ?నరసింహస్వామి లక్ష్మీ నారసింహుడుగా ,యోగ నారసింహుడుగా విన్నాను కానీ ఈ వరాహ నరసింహం తిరకాసు ఏమిటి బావగారూ

1-అదీ జిజ్ఞాసువుకు ఉండాల్సిన ముఖ్య లక్షణం బావగారూ .తండ్రి హిరణ్య కశి పుడినుంచి తనభక్తుడైన ప్రహ్లాదుడిని రక్షించటానికి నృసింహావతారం దాల్చి హిరణ్యుని చంపి ,ప్రహ్లాదుని కోరికపై వరాహ నరసి౦హు డిగా సింహాచలం లో వెలశాడు కనుక ఆ పేరు వచ్చింది

2-అంటే రెండు అవతారాల సమ్మేళనం అన్నమాట కదా బావగారూ

1-అవును బావగారూ .వరాహావతారం  నరసింహా వతారం కలిసిన నూత్న అర్చామూర్తిగా స్వామి స్వయంభువుగా వెలసిన మహా పుణ్యక్షేత్రం సింహాచల దివ్యక్షేత్రం .మహావిష్ణువు స్వయంభువుగా వెలసిన ఏకైక మహా దివ్యక్షేత్రం

2-వినటానికే మహా సంతోషంగా ఉంది అసలు అమూర్తి యెలాఉంటాడు  బావగారూ

1-ఇక్కడ స్వామివారు వరాహ వదనం తో ,మానవ శరీరం తో ,తెల్లని సింహంజూలు ,భుజం పై సింహపు వాలం అంటే తోక ,రెండు చేతులు ,భూమిలో దాగిఉన్న పాదాలతో   విలక్షణ మూర్తిగా దర్శనమిస్తాడు బావగారూ

2-వర్ణిస్తూంటే ఒళ్ళు పులకరిస్తోంది .చూస్తె ఎంత బాగుంటాడో?నిత్యం ఇలాగే దర్శనమిస్తాడా భక్తులకు బావగారూ

1-లేదండీ .సంవత్సరం లో ఒక్క అక్షయ తృతీయ నాడు తప్ప ,మిగిలిన 364రోజులూ ఇక్కడ ప్రసిద్ధమైన ,ప్రశస్తమైన పరిమళ సుగంధ దట్టమైన చందన౦ పూతతో ఒక శివలింగం  లాగా దర్శనమిచ్చి శివకేశవాద్వైత భావన కలిగిస్తాడు

2-మరి ఆచందనం ఎప్పుడుఎలా  తొలగిస్తారు బావగారూ

1-వైశాఖ శుద్ధ తదియ అంటే అక్షయతృతీయ నాడు చందనం ను బంగారు ,వెండి బొరిగలతో స్వామి శరీరం పై దట్టంగా ఉన్న చందనాన్ని గీకి తొలగిస్తారు  .తర్వాత  కొన్ని గంటలుమాత్రమే ‘’నిజ రూప దర్శనం ‘’అంటే వరాహ నరసింహ దర్శనం కలిగిస్తారు .దీన్ని వీక్షించటానికి తండోపతండాలుగా భక్తజనం చేరుకొని దర్శించి పులకిస్తారు

2-తొలగించిన చందనం ఏం చేస్తారు బావగారూ

1-భక్తులకు ప్రసాదంగా ఇస్తారు దాన్ని నుదుట పెట్టుకోవాలి .తీర్ధంలో కలిపి కూడా ఇస్తారు .ఈ తీర్ధం దీర్ఘ రోగ నివారిణి గా భావిస్తారు

2-అసలు ఈ చందనం పూయమని ఎవరు చెప్పారు బావగారూ

1-మహా భేషైన ప్రశ్న సంధించారు బావగారూ .ఈ స్వామిని భక్త ప్రహ్లాదుడు మొదట పూజించాడు .తర్వాత చంద్రవంశరాజు పురూరవుడు విమానం లో ఆకాశమార్గాన ఇటుగా వెడుతుంటే ,ఈ స్థలప్రభావం వలన విమానం కిందకు ఆకర్షి౦ప బడింది .ఏమిటో అని దిగి చూస్తె ఒకపుట్టలో కప్పబడిఉన్న వరాహ నరసింహ స్వామి విగ్రహం కనబడింది .దాన్ని భక్తితో బయటికి తీయించగా ఆకాశవాణి పురూరవునితో ఒక సంవత్సరకాలం విగ్రహాన్ని చందనం తో కప్పి ఉంచి వైశాఖ శుద్ధ తదియ నాడు మాత్రమె స్వామి నిజరూప దర్శం కలిగించేట్లు చేయమని చెప్పింది .ఆలయాన్ని నిర్మించి స్వామిని ప్రతిష్టించి పూజించాడు .అప్పటినుంచి అదే పద్దతి పాటిస్తున్నారు

2-ఇంకా కారణాలు ఉండి ఉండచ్చా బావగారూ

1-అక్షయ తృతీయ రోహిణి లేక కృత్తిక నక్షత్రం లో వస్తుంది .ఈ రెండూ అగ్ని నక్షత్రాలు .అసలేస్వామి ఉగ్రనారసి౦హుడు .కనుక శాంతపరచటానికి చందనలేపం తప్పని సరి

2-అవును బావగారు శివుడు కృత్తికా నక్షత్ర సంజాతుడు కనుక ఆయన్ను నిరంతరం చల్లబరచటానికే మహన్యాస పూర్వక అభిషేకాలు లు చేస్తారు

1-చాలా మంచి విషయం జ్ఞాపకం చేశారు బావగారూ

2-ఇంకా విశేషాలుంటే తెలియ జేయండి బావగారూ  

1-విశాఖ పట్టణానికి అతి సమీపం లో సింహాచల క్షేత్రం ఉంది .ఇది పనసపంట కు , సంపంగి చెట్లకుప్రసిద్ధి . హిరణ్యకశిపుడు అన్నిరకాల దండనలతో కొడుకు ప్రహ్లాదుని బాధ పెడుతూ చివరికి సముద్రం లోకి విసిరి వేయమని భటులను ఆజ్ఞాపిస్తే ,అలానే చేస్తే విష్ణు మూర్తి ఇక్కడే రెండు చేతులుజాపి అతడిని సముద్రం లో పడకుండా కాపాడాడు అని అతిహ్యం కూడా ఉంది

2-వరాహావతారం తర్వాత నృసింహావతారం కదా బావగారు –ఆముచ్చట చెవిన వేయండి

1-మహా ప్రళయకాలం లో విష్ణుమూర్తి యోగనిద్రలో ఉంటె భూమి నీటిలో మునిగిపోయింది .భూమిని ఉద్ధరించటానికి బ్రహ్మ నాశిక నుంచి బొటనవ్రేలు ప్రమాణ౦ కల వరాహంగా శ్రీహరి ఉద్భవించి ,క్రమగా పెరిగి యజ్ఞవరాహ స్వామిగా విరాట్ రూపం పొందగా ,తనతో యుద్ధం చేయగలవాడు విష్ణువే అని వరుణుడు చెప్పగా హిరణ్యాక్షరాక్షసుడు హరిని వెతుక్కుంటూ రాగా ,ఆయన రసాతలం లో మునిగి ఉన్న భూమిని తన  దంతాగ్రాలపై నిలిపి  ఉండగా హిరణ్యుడు యుద్ధానికి వచ్చాడు .ఉపాయంగా భూమిని సముద్రపు నీటిపై ఉంచికాపాడి ,వాడితో భీకరయుద్ధం చేసి చంపేశాడు.

2-ఇవాళ సమయం చాలా సార్ధకమైంది బావగారూ వరాహ నరసింహ పై కవులేమైనా రాస్తే వినిపించండి

1-        రాయకేమి .దశావతార స్తుతి లో జయదేవమహాకవి –

‘’వసతి దశన శిఖరే  ధరణీ తవలగ్నా –శశిని కలంక కలేవ నిమగ్నా – కేశవధృత సూకర రూప –జయజగదీశాహరే  ‘’అని వర్ణించాడు  

2-శంకరాచార్యులవారు కూడా రాసే ఉంటారేమో బావగారూ

1-రాశారు .కరావలంబన స్తోత్రం ప్రసిద్ధమైనది

‘’శ్రీ మత్పయోనిది నికేతన చక్రపాణే-భోగీ౦ద్ర భోగ మణిరంజిత పుణ్యమూర్తీ –యోగీశ శాశ్వత శరణ్య భవాబ్ది పోత –లక్ష్మీ నృసింహ మమదేహి కరావలంబం’’

2-అక్షయ తృతీయను అక్షయ విశేషాలతో సార్ధకం చేశారు బావగారూ .వెళ్ళొస్తా

1-వెళ్ళిరండి బావగారూ మళ్ళీ కలుద్దాం  

  సశేషం

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -26-4-20-ఉయ్యూరు

 

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

సుందర కాండ లో హనుమ బహుముఖీన వ్యక్తిత్వం-9

సుందర కాండ లో హనుమ బహుముఖీన వ్యక్తిత్వం-9

నెన్నెల మెండుగా ఆకాశం లో కురిపిస్తున్న చందమామను హనుమ చూసి పరవశించాడు జనుల దుఖాల్ని పోగొట్టి సముద్రానికి వృద్ధి కలిగింఛి ప్రాణికోటికి ప్రకాశం కలిగించే చంద్రుని దర్శించాడు .మందర పర్వత కాంతి ,సాయం సముద్రానికి ఉన్న ప్రకాశం  జలకమలలకున్న  వెలుగువంటి కాంతితో చంద్రుడు శోభాయమానంగా ఉన్నాడు .వెండి పంజరపు హంసలా , ,మందరపర్వత సింహం లా ,మదించిన ఏనుగు ఎక్కిన వీరుడిలా కనిపించాడు ఉడురాజు.వాడి కొమ్ములున్న తెల్లని  వృషభంలా ,ఎత్తైన శిఖరాలున్న కొండ లా ,బంగారు తొడుగు గల కోరలున్న ఐరావతంగా సకల కళా పరిపూర్ణుడు గా వెలిగిపోతున్నాడు విను వీధిలో .మంచు అనే మాలిన్యం వదలి ,శుక్ర  గురు గ్రహాలను కప్పి విడిచిన నిర్మలత్వంతో ,మహాగ్రహమైన సూర్యుని కిరణాలు పొందటం చేత మహా అంధకారం తొలగి ,బాగా కనిపించే మచ్చ తో ప్రభావశాలిగా చంద్రుడు వెలిగిపోతున్నాడు .ప్రదోషకాలం అయిన సాయంకాలం గడిచింది .రాత్రి అయేసరికి పతివ్రతలు తమ భర్తలతో శయనిస్తున్నారు .రాక్షసులు నిశాచరులు కనుక మహాదానందంగా విహరిస్తున్నారు .మద్యం తో మదించి ,ఏమరు పాటున్న జనాలతో ఉన్న వివిధ రథ తురగ గజాలతో వీరలక్ష్మి లాగా వెలిగే గృహాలను  ఆ వెన్నెల్లో  దర్శించాడు హనుమ .తాగుబోతుల ప్రేలాపనలు ,మత్తెక్కి తమనే తాము తిట్టుకోనేవారు ,రొమ్ములు విరిచి ,భార్యల అవయవాలపై  పై కాళ్ళూ చేతులూ వేసి పడుకున్నవారినీ ,విచిత్ర వేషగాళ్ళను ,విల్లు ఎక్కుపెట్టి తిరిగే వారినీ చూశాడు .

  చందన లేపం ఒంటికి పట్టించుకొనే వారు నవ్వేవారు కోపం నిట్టూర్పులు విడిచే స్త్రీలను చూశాడు .పూజి౦పతగిన సత్పురుషులు లేక ,యుద్ధం చేయటానికి సరిపోయే ప్రతి వీరులు లేక ,ఆ లంకా పట్టణం నిట్టూర్పు పాములతో ఉన్న మడుగు లాగా అనిపించింది .ఉత్తమ  గుణాలకు తగ్గ ప్రవర్తనతో ఉన్న సుందరాకారులు ,తేజోవంతంగా దానికి తగ్గ  నడవడి ఉన్న  వికృతాకార రాక్షసులనూ చూశాడు .పతుల చేష్టలకు సిగ్గుపడేవారు వారు, చల్లినపూలరాశిలో కప్పుకు పోయినవారు అయిన స్త్రీలను చూశాడు .మేడలపై మొగుడి తొడలపై కూర్చుని విలాసం వొలికించే స్త్రీలు ,మదన పరవశంతో భర్తలకు అమితానందం చేకూర్చేవారు కనిపించారు .ముసుగు తొలగిన స్త్రీలు బంగారు తీగల్లా ,కొందరు మేలిమి బంగారం లా ,పతులను ఎడబాసి చంద్రునిలాగా పాలిపోయిన వారినీ చూశాడు .అభిసారికలను ,మధుర మనోహరగనలను  చూశాడు. కానీ

‘’న త్వేవ సీతాంపరామాభిజాతాం-పథి స్థితే రాజకులే ప్రజాతాం-లతాం ప్రఫుల్లా మివ సాధు జాతాం-దరర్శ తన్వీం మనసాభి జాతాం’’

అంటే పరమ సౌందర్యవతి ,సన్మార్గ  నిష్టమైన రాజవంశం లో పుట్టి ,  ,గారాబ౦గా  పెరిగి వికసించే పూల తీగలాగా నాజూకుగా ,సంకల్ప మాత్రంగా అయోనిజగా జన్మించిన తన్వి సీతామాతను  మాత్రం చూడలేక పోయాడు .పాతివ్రత్య ధర్మంతో ,రామదర్శనం కోసం పరితపించే నిశ్చయ నిర్మల బుద్ధి కలిగి రామహృద్యాన్ని ఆకర్షించిన ఉత్తమ వనితా రత్నం,పూర్వం’’ నిష్కం’’ అనే ఆభరణం ధరించి,ఇప్పుడు కన్నీరే ఆభరణంగా ఉంటున్న సు౦దరవదన,స్పష్టంగా కనిపించని చంద్ర రేఖలా   ఉండే ,దుమ్ముతో కాంతి హీనమైన బంగారు కడ్డీలా ఉండే ,గాలిచే చెదరగొట్టబడిన మేఘ రేఖలా ఉండే శ్రీరాముని అర్ధాంగి సీతాదేవి మాత్రం కనిపించక మూఢమతిలాగా దుఖి౦చాడు హనుమ .

  ఇది 27శోకాల అయిదవ సర్గ. దీనిలో చంద్రుడు ఎన్నిరకాలుగా ప్రకాశామానంగా కనిపించాడో వాల్మీకి మహర్షి చల్లని వెన్నెల కురిపించి మానసిక ఆనందాన్ని ఇచ్చే ఉదాత్త ఉత్తమ శ్లోకాలలో  అభి వర్ణించాడు .తెల్లదనం అంతా మూర్తీభావి౦చినట్లు చెప్పాడు .ఎవ్వరికైనా ఆనందం ప్రత్యక్షానుభవం అవుతుంది .మరి వానర రూప హనుమ కు మరింత ఆనందం .తర్వాత రాక్షసాగ నలు, వారి వివిధ భంగిమలు  శయన విలాసాలూ చూశాడు .కానీ అమ్మవారు వీరెవరిలాగా ఉండదు అనే నిశ్చయమనస్సున్నవాడు కనుక వీరంతా సామాన్య రాక్షస స్త్రీలని గ్రహించి ,వీరిలో సీతా దేవి ఉండదనిపించి౦ది .కానీ తాను వెదకే, వెతకాల్సిన సాధ్వి ఎలా ఉంటుందో మనసులో  భావన చేశాడు .వీరంతా మదమత్తులులాగా ప్రవర్తిస్తున్నారు .సీత మాత్రం భోగాలనీడ పడకుండా భర్తకోసం కుంగి కృశించి మకిలి పట్టిన బంగారు తీగలాగా ఉంటుందని తెలుసుకొన్నాడు .అలాంటి సాధ్వి సీతా దేవి సందర్శనం ఈ సామాన్య రాక్షస గృహాలలో లభించదు అనుకొన్నాడు .కాని ప్రయత్నం   వృధా అయింది ..కనుక పామరత్వం ప్రవేశించగా దుఃఖించాడు మహా మతిమంతహనుమాన్ .

   సశేషం

 పరశురామ జయంతి శుభాకాంక్షలతో

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -25-4-20-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

ప్రపంచ దేశాల సారస్వతం 47-నౌరు దేశ సాహిత్యం

ప్రపంచ దేశాల సారస్వతం

47-నౌరు దేశ సాహిత్యం

కరోనా సోకని 6వ దేశం నౌరు  మైక్రో నేషియాలో   ఆస్ట్రేలియాకు ఈశాన్య౦ లో ఉన్న ఐలాండ్ .కోరల్ రీఫ్ లకు తెల్ల ఇసుక బీచ్ లకు ప్రసిద్ధి .’’ప్లెజెంట్ ఐలాండ్ ‘’గా గుర్తింపు పొందింది తూర్పున అనిబెరా బే ఉంటుంది .అండర్ గ్రౌండ్ ఫ్రెష్ వాటర్ లేక్ మోకా వెల్స్ దగ్గర మోకా లైం స్టోన్ గుహల సమీపం లో ఉంటుంది .రాజధాని –ఎరేన్.కరెన్సీ –ఆస్ట్రేలియా డాలర్ . క్రీ.పూ వెయ్యేళ్ళ క్రితమే ఇక్కడ మైక్రో నేషియన్లు ,పోలి నేషియన్లు వచ్చి స్థిరపడ్డారు .19శతాబ్దిలోజెర్మని  ఎంపైర్ స్వాధీనం చేసుకొన్నది .మొదటి ప్రపంచయుద్ధం లో జపాన్ సైన్యం చేరింది .యుద్ధం తర్వాత యు యెన్ వో ట్రస్టీ షిప్ లో ఉన్నది .ఫాస్ఫేట్ నిక్షేపాలు భూమికి దగ్గరలోనే పుష్కలంగా ఉన్న ఐలాండ్ .మైనింగ్ తేలిక .ఫాస్ఫేట్ ఖాళీ అయిపోగా ఎకానమీ దెబ్బతిని ,బతికి బట్టకట్ట టానికి ఇల్లీగల్ మనీ లాండరింగ్ సెంటర్ అయింది .ఆస్ట్రేలియా సాయం అర్ధించి,ఆస్ట్రేలియా పై ఆధార పడిన దేశం అయింది .1948లో చైనీస్ గువానో మైనింగ్ వర్కర్లు జీతాల విషయం లో సమ్మె చేయగా హింస చోటు చేసుకోగా  ఎమర్జెన్సి విధించారు . 1966జనవరిలో దేశం స్వతంత్రం పొందింది . రెండేళ్ళ తర్వాత  ప్రెసిడెంట్ ను ఎన్నుకొన్నారు .బ్రిటిష్ ఫాస్ఫేట్ కమీషనర్ల ఫాస్ఫేట్ నిలవలన్నీ కొనేసింది దేశం .1970లో నౌరు ఫాస్ఫేట్ కమిషన్ ఏర్పడి దేశానికి వెన్నెముకగా  ,ఆర్ధికాభి వృద్ధికి నిలిచి ,ఇవాళ ప్రపంచం లోనే అత్యధిక సంపన్న మైన దేశం గా నిలబడింది .ఈ దేశం లో వేడి ,హుమిడిటిఎక్కువ.మాన్సూన్ వర్షాలు అతలాకుతలం చేస్తాయి .జీవావరణంఫాస్ఫేట్ మైనింగ్ వలన  బహు తక్కువ . అరుదైన పక్షిజాతులు అంతరించిపోయాయి .60 రకాల ప్రత్యేకత కల  వాస్క్యులార్ ప్లాంట్ స్పెసీస్ ఉన్నాయి.పాలిచ్చేస్థానిక  జంతువులూ లేవు కాని  స్థానిక కీటకాలున్నాయి .నౌకలవలన ఇక్కడికి కుక్క పంది ,పిల్లి ఎలుక ,చికెన్ వచ్చాయి .రీఫ్ డైవర్సిటి వలన ఫిషింగ్ ఇక్కడ బాగా పాప్యులర్ అయింది .స్కూబా డైవింగ్ ,స్నార్కెలింగ్ కు టూరిస్ట్ లు ఎగబడతారు .ఇక్కడి భాష –మైక్రో నేషియా భాషాజన్యమైన నౌరాన్ భాష ను 96శాతం ప్రజలు మాట్లాడుతారు .ఇంగ్లీష్ కూడా వచ్చు ఇదే అధికారభాష .మతం –క్రిస్టియానిటి.దినపత్రిఅకలు లేవు పదిహేనురోజులకు ఒక ‘’మ్వివెన్ కో ‘’అనే పత్రిక వస్తుంది .ప్రభుత్వ టివి స్టేషన్ ఉంది .ప్రోగ్రాములు న్యూజిలాండ్ ఆస్ట్రేలియా లనుండి ప్రసారమౌతాయి .ఫుట్ బాల్ ,వెయిట్ లిఫ్టింగ్ జాతీయ క్రీడలు .వాలీబాల్ నెట్ బాల్,టెన్నిస్ కూడా ఆడుతారు . రెండేళ్ళ నుంచి రబ్బి సెవెన్ ఆడటం మొదలుపెట్టారు .అక్షరాస్యత శాతం 96శాతం పైనే .16వ ఏడు వరకు కంపల్సరి విద్య .యూనివర్సిటి కూడా ఉంది .జీవితకాలం సుమారు 60ఏళ్ళు .ఆడవారిలో ఊబకాయం ఎక్కువ .40శాతం ప్రజలు డయబెటేస్ వ్యాధి  బాధితులే .కిడ్నీ ,హార్ట్ డిసీజ్ లూ ఎక్కువే .ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ ఉన్నది ‘.చెక్కబోమ్మలతయారీ దేశీయ  కళ.లీస్ట్ విజిటేడ్ కంట్రి’’గా ముద్రపడిన దేశం నౌరా .జనాభా 10వేలు మాత్రమె

నౌరూనియన్ సాహిత్యం – నౌరు దేశ సాహిత్యం పెద్దగా లభ్యం కావటం లేదు .లభ్యమైన ఒకపుస్తకం –స్టోరీస్ ఫ్రం నౌరు .వీటిని బెన్ బాం సాల్మన్ , ఎల్మినా క్వాడినా ,ఈస్టన్ థోమా ,పామెలా స్క్రివెన్,జేరిలిన్ జేర్మియ ,లూషియా బిల్ ,మాకెరిటా వాయ్ మొదలైన రచయితలు  రాశారు.

స్త్రీ రచయితలలో జోయెన్నాఏకాం బడియా గోబురే ,మార్గరెట్ హెండ్రి ఉన్నారు.జోయన్నే నౌరో జూనియర్ కాలేజి గ్రాడ్యుయేట్ .ప్రభుత్వం ఎంపిక చేసి ఐటి టీచర్ నియమించింది .ఇంగ్లిష్ లో ధారాళంగా కవిత్వం రాసింది .ఆమె రాసిన ‘’ప్రేయర్ ‘’బాగా పాప్యులర్ అయింది .మరో రచయిత్రి మార్గరెట్ హెండ్రి-నౌరానా భాషలోనే రాసింది .దేశ జాతీయగీతం రాసి గొప్ప ప్రసిద్ధి చెందింది .దీనికి హెన్రి హక్ సంగీతం కూర్చాడు .

ఫ్రాన్స్ దేశం లావ్రే,మకువా లలోని కాసియానాలు మూసెయ్యటం ,NBAహై ఫైవింగ్ ఫాన్స్ ను షట్డౌన్ చేయటం ,ఆస్ట్రేలియా టాయ్ లెట్ పేపర్ హోర్డింగ్ అరికట్టటం ,ఫసిఫిక్ సముద్రయానం నిషేధించటం తో కరోనా నౌరు లో అడుగు పెట్టలేదు .దీనితో దేశం ఊపిరి పీల్చుకున్నది .

సశేషం

పరశురామ జయంతి శుభా కాంక్షలతో

మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -25-4-20-ఉయ్యూరు

 

 

 

 

 

 

 

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

రేడియో బావగారి కబుర్లు –

బావగారు 2-నమస్కారం బావగారు .బహుకాల దర్శనం .కులాసానా

బావగారు 1-రండి బావగారు క్షేమమే .అవును నిజంగా నే మనం కలుసుకొని కబుర్లు చెప్పుకొని దాదాపు యాభై ఏళ్ళయింది .ఏమిటి విశేషాలు ఇలా దయ చేశారు

2బా- ఇవాళ పరశురామ జయంతి అని జ్ఞాపకం వచ్చి ఆ వివరాలు మీ ద్వారా వింటేనే సంతృప్తి అనుకోని వచ్చాను బావగారు .నాలుగు ముక్కలు చేవినేసి పుణ్యం కట్టుకోరూ

1-బా –అదెంతహాగ్యం బావగారూ .మన౦ కలిసేది మంచి విషయాలు అందరికీ చెప్పటానికేగా .ఇవాళ వైశాఖ శుద్ధ తదియ పరశురామ జయంతి .విష్ణుమూర్తి అవతారాలలో ఆయనది 6వ అవతారం .కొందరు ఈ రోజు ఉపవాసం చేసి ఆయనకు షోడశ ఉపచారాలతో పూజ చేసి ‘’జమదగ్ని సుత వీర ,క్షత్రియా౦తక  ప్రభో –గృహాణార్ఘ్యంమయా దత్తం కృపయా పరమేశ్వరా ‘’అని అర్ఘ్యం ఇస్తారు .

2-కొత్త విషయం చెప్పారు  బావగారు .అయినా ఆయన పరమ కోపిస్టి ఆయనకు ఎందుకు జయంతి

1-గాది కొడుకు విశ్వామిత్రుడు .జమదగ్ని రేణుకల కొడుకే విష్ణు అంశతో పరశురాముడిగా పుట్టాడు .ఆవంశ  కోపం తరతరాలుగా సంక్రమించింది .శివుడిదగ్గర అస్త్ర విద్యలు నేర్చి అవక్రపరాక్రము డయ్యాడు

2-బ్రాహ్మణ వంశంలో పుట్టినవాడికి ఈకోపం ఏమిటి మహాత్మా

1-మంచి ప్రశ్న .కుశ వంశ రాజు గాది దగ్గరకు భ్రుగు వంశ రుచీక వెళ్లి ఆయనకూతురు సత్యవతిని తనకు ఇచ్చి పెళ్లి చేయమని అడిగాడు .నల్లటి చెవులున్న వెయ్యి గుర్రాలిస్తే పెళ్లి చేస్తానన్నాడు రాజు .వరునణదేవుడిని ప్రసన్నం చేసుకొని వాటిని పొంది ఇచ్చి సత్యవతిని పెళ్లి చేసుకొన్నాడు .ఒకరోజు సత్యవతి భర్తను తనకు, తనతల్లికి పుత్ర సంతానం ప్రసాదించమని  వేడింది .బ్రాహ్మణ మంత్ర పూతమైన ఒక హవిస్సు ,రాజమంత్ర పూతమైన మరో హవిస్సు ఆయన తయారు చేసి స్నానానికి వెళ్ళగా ,విషయం తెలియక రాజమంత్ర హవిస్సును తానూ తీసుకొని విప్రహవిస్సు తల్లికిచ్చింది .రుచీకుడికి విషయం తెలిపి, ప్రాధేయపడగా పుట్టే కొడుకు సాత్వికుడుగా ఉండి మనుమడు మాత్రం ఉగ్రుడుగా ఉంటాడు అని చెప్పాడు .కనుక జమదగ్ని సాత్వికుడుగా ఆయనకొడుకు పరశురాముడు ఉగ్రరూపంగా విష్ణు అంశతో జన్మించాడు బావగారు .

2-అబ్బో దీనిలో ఇంత తిరకాసున్నదా బావగారూ .మరి క్షత్రియుల్ని చంపాల్సిన అవసరం ఆయనకు ఎందుకొచ్చింది బావగారూ

1-అవసరమైన ప్రశ్న ఇది బావగారు .హైహయ రాజు కార్త వీర్యుడు చేతులు లేకుండా పుట్టగా దత్తాత్రేయుడిని ప్రసన్నం చేసుకొని వెయ్యి చేతులతో మహా పరాక్రముడయ్యాడు .ఒకరోజు వేటలో అలసి జమదగ్ని ఆశ్రమానికి రాగా  గొప్ప  విందుతోఅతనికీ, పరివారానికి ఆతిధ్యమిస్తాడు .ఇంతమందికి ఎలా సాధ్యం అని మహర్షిని అడిగితె తన కామధేనువు సంతానమైన ఆవు అని చెప్పాడు .దాని తనకు ఇవ్వమని అడిగితె ఇవ్వను  అంటే ,బలవంతంగా లాక్కు పోతాడు .ఇంటికి వచ్చిన పరశురాముడికి విషయం తెలిసి మాహిష్మతీ పురం వెళ్లి అతడి వెయ్యి చేతులను తలను తన గండ్ర గొడ్డలి అనే పరశువుతో ఖండిస్తాడు .తండ్రికి చెబితే పాప ప్రక్షాళనం కోసం తీర్ధయాత్రలు చేయమని పంపిస్తాడు .అందుకే ఆయన  గొడ్డలికి  ‘’ధర్మ పరశు ‘’అనిపేరు

2-కార్తునిపై కోపం సకల రాజ వంశ నిర్మూలనానికి ఎలా దారితీసిందో అర్ధం కావటంలేదు బావగారూ

1-కొంతకాలం గడిచింది .ఒకరోజు రేణుకాదేవి చెరువుకు నీటికోసం వెడితే గంధర్వుల జలకేళి చూడటం వలన ఇంటికి రావటం ఆలస్యమైతే ,శంకించి కోపించిన జమదగ్ని ఆమెను హతమార్చమని కొడుకుల్ని ఆదేశిస్తాడు .వాళ్ళు ఒప్పుకోరు .పరశురాముడిని తల్లినీ సోదరులను చంపమని  ఆదేశించగా ,క్షణం ఆలోచించకుండా నేరవేర్చగా,  సంతృప్తి చెంది వరం కోరుకోమంటే తల్లినీ సోదరులను బ్రతికించమంటే బతికిస్తాడు మహర్షి .

2-ఇదీ బానేఉంది కానీ నేను అడిగిన అసలు విషయం—

1-తొందర పడకండి .అక్కడికే వస్తున్నా .ఒకరోజు పరశురాముడు ఇంట్లో లేని వేళ,కార్తవీర్యుని కొడుకులు తండ్రి మనశ్శాంతికోసం  జమదగ్ని తలనరికి తమ పట్టటానికి తీసుకు వెడుతుంటే రోదిస్తూ రేణుకా దేవి 21సార్లు గుండె బాదుకొని  రోదించింది .ఇంటికి వచ్చిన పరశురాముడు తీవ్రకోపం తో మాహిష్మతికి వెళ్లి కార్తవీర్యుని కొడుకుల్ని గొడ్డలితో చంపి ,తండ్రి తల తెచ్చి మొండానికి అంటించి బ్రతికిస్తాడు .తనతల్లి 21సార్లు రోదించటం తెలిసి క్షత్రియజాతిపై ద్వేషంతో నిర్వంశం చేయాలని 21సార్లు దండెత్తి సర్వ శత్రు సంహారం చేసి సంతృప్తి చెందటమే కాక శ్యమంత పంచకం అనే అయిదు సరస్సులను క్షత్రియ రక్తం తో నింపి తలిదండ్రులకు తర్పణ చేస్తాడు .

2-గొప్ప విషయం చెప్పారు బావగారు .మరి సూర్యవంశం ఎలా బతికి బట్టకట్టింది

1-దశరధుడు మరికోద్దిమంది రాజులు ఆవులమందాలో ఆడవేషాలలో దాక్కొని తప్పించుకొన్నారు .తాను సాధించిన శక భూమండలాన్నీ పరశురాముడు కశ్యప మహర్షికి దానం చేసిన  మహా దాతకూడా బావగారూ  ,తపస్సు కోసం వెళ్ళిపోయాడు

2-రామాయణం లో పరశురాముడు మళ్ళీ కనిపిస్తాడుకదా  బావగారూ

1-సీతారామ కల్యాణం తర్వాత ,తనగురువు శివుని విల్లు విరిచిన రాముడి పై యుద్ధానికి వస్తాడు .దశరదుడితో సహా శాంతించమని కోరినా వినక ,అంత పరాక్రమవంతుడైతే తన ‘’విష్ణు చాపం ‘’ఎక్కు పెట్టమని ఇవ్వగా అవలీలగా ఎక్కుపెట్టగా అందులోని విష్ణు తేజం రామునిలో చేరింది . బాణం ఎక్కడ వదలాలని అడిగితె తన తపోశక్తిని కొట్టేయ్యమని చెప్పి అలా చేయగా ,లోకం లో ఒకడే రాముడు ఉండాలని రాముని ఆశీర్వదించి  తాను మహేంద్రగిరిపై తపస్సుకు వెళ్ళిపోయాడు పరశురాముడు

2-ఇద్దరూ విష్ణు స్వరూపులే .పరశురాముని అవసరం ఇక లోకానికి లేదు కనుక ,రామ అవసరం పుష్కలంగా ఉంది  కనుక నిష్క్రమించాడు .మళ్ళీ ఎప్పుడైనా కనిపిస్తాడా బావగారు

1-బాగా చెప్పారు బావగారు .ద్వాపరయుగం లో మహా భారత కాలం లో భీష్మునికి గురువై అస్త్రవిద్య నేర్పాడు .అంబికను పెళ్లి చేసుకోమని గుర్వాజ్ఞగా చెప్పినా, తాను చేసిన ప్రతిజ్ఞకు బద్ధుడై నిరాకరించగా ,యుద్ధానికి దిగగా ఘోర యుద్ధం జరిగి, దేవతల అభ్యర్ధనమేరకు ఇద్దరూ శాంతించారు

2-కర్ణుడు కూడా శిష్యుడని విన్నాను

1-అవును బ్రాహ్మణవేషం లో కర్ణుడు పరశురామ శిష్యుడై అస్త్రవిద్య నేర్చి ,తర్వాత అతని అబద్ధం గ్రహించి యుద్ధకాలంలో అస్త్రవిద్య గుర్తుకు రాదనీ కర్ణుడిని శపించాడు .అంతేకాదు బావగారు కురుపాండవులకు అస్త్రవిద్యా గురువు ద్రోణా చార్యుడూ పరశురామిని దగ్గరే అస్త్ర విద్య నేర్చాడు .మహేంద్ర పర్వతంపై తపస్సులో ఉన్న పరశురాముని అర్జునుడు దర్శించి ఆశీస్సులు పో౦దాడుకూడా.

2-ఇంకేవైనా విశేషాలుంటే తెలియజేయండి బావగారు

1-నిరభ్యంతరంగా .ఒకసారి పరశురాముడు శివదర్శనానికి కైలాసం వెడితే ,ద్వార పాలకుడు వినాయకుడు అడ్డగిస్తే గొడ్డలి విసిరితే ,శివ ప్రసాదమైన పరశుపై గౌరవంతో తన దంతాన్ని ఒకటి సమర్పించాడు దానికి .కనుకనే ఏకదంతుడు .పరశురాముడు చిరంజీవి కల్క్యావతారం లో విద్యలు ఉపదేశిస్తాడని ,తర్వాత మన్వంతరం లో సప్తర్షులలో ఒకరు గా అవుతాడని కధనం ఉంది

2-అంతా కొత్తగా ఉంది .ఇంకా విశేషాలు చెప్పండి

1-క్షణికావేశ పరుడైన పరశురాముడు తాను సాధించిన సమస్త భూభాగాన్నీ కశ్యపుడికి దానం చేసినట్లు చెప్పుకొన్నాం కదా .మరి ఆయన తపస్సు చేసుకోవటానికి స్థానం లేకపోయింది .తన పరశువును సముద్రం లోకి విసిరేశాడు సముద్రుడు వరుణుడు  ఆయనపై ఉన్న గౌరవంతో పరశువు పడినంత మేరకు గోకర్ణం ,కన్యాకుమారి లమధ్య  వెనక్కి తగ్గాడట.అలా వెలువడిన భూభాగమే కేరళ రాష్ట్ర౦ అంటారు .కేరళలో అందుకే 7పరశురామ క్షేత్రాలు ఆయనగౌరవంగా వెలశాయి బావగారూ .దేశం మొత్తంపై 108పరశురామాలయాలున్నాయి

2-అందులో ఏదైనా ఒకదాని గురించి —

1-కేరళ తిరువనంతపురం దగ్గర’’ తిరు వళ్లం’’లో కరమణ నదీ తీరం లో 2వేల ఏళ్ళనాటి పురాతన పరశురామ మందిరం ఉన్నది .ఇక్కడ పితృ దేవతలను పూజించటం మరో విశేషం

2-ఇంతటి మహా నుభావుడిపై కవులు ఏమైనా రాశారా బావగారూ

1-జయదేవ మహాకవి రసమయ శ్లోకంగా  దశావతార స్తుతిలో రాశాడు-

‘’క్షత్రియ రుదిరమయేజగదపగత పాపం-స్నపయసి పయసి శమిత భవతాపం – కేశవ!ధృత భృగుపతి రూప –జయ జగదీశ హరే ‘’

2-బాగుంది బావగారు .మన తెలుగులో అంతసాహసం ఎవరూ చెయ్యలేదా

1-చెయ్యకేం –దాశరధీ శతకం లో భక్తరామదాసు గారు పరశురామ స్తుతి చేశారు –

ఇరువదియొక్క మాఱు ధరణీశులనెల్ల వధించి తత్కళే
బర రుధిర ప్రవాహమున బైతృక తర్పణమొప్పజేసి భూ
సురవరకోటికిన్ ముదము సొప్పడ భార్గవరామమూర్తివై
ధరణినొసంగితీవె కద దాశరధీ కరుణా పయోనిధీ.

బావగారు -2-ధన్యుణ్ణి బావగారు .పరశురామ  జయంతి నాడు పరశురామ వృత్తా౦తం సాకల్యంగా చెప్పి నాకు మహోపకారం చేశారు .మళ్ళీ కలుస్తాను. వస్తా బావగారూ

బావగారు -1-సంతోషం బావగారూ .వస్తూ ఉండండి ఇలానే మంచి విషయాలతో కాలక్షేపం చేద్దాం .

అంకితం-మద్రాస్ తెలుగు రేడియోలో బావగారి కబుర్లు సాయంత్రం వేళ ప్రసారమయ్యేవి .అందులో ఒక బావగారు  శ్రీ గాడేపల్లి చిన సూర్యనారాయణ గారు . తన ప్రత్యేక కంఠస్వరంతో ఖంగుమని పలుకుతూ, జానపద శైలిలో పాడుతూ శ్రోతల్ని వుర్రూత లూగించిన రెండవ వారు  శ్రీ ప్రయాగ నరసింహశాస్త్రి. మూడు దశాబ్దాలు ఆకాశవాణిలో పనిచేసి ‘ సెబాస్ ‘ అనిపించుకొన్న వ్యక్తి. 1936 లో ప్రయాగ ఆకాశవాణి మదరాసు కేంద్రంలో నిలయ విద్వాంసుడుగా చేరారు. ‘ బావగారి కబుర్ల ద్వారా వీరు శ్రోతలకి చేరువయ్యారు. వీరు, గాడేపల్లి సూర్యనారాయణ గారు కలిసి బావగారి కబుర్లు నిర్వహించేవారు. అవి శ్రోతల జీవనంలో భాగమైపోయాయి. ‘ ఏమండోయ్ బావగారు ! రావాలి ! రావాలి ! ‘ అనే పలకరింపులు సహజమయ్యాయి. స్క్రిప్టు లేకుండా యధాలాపంగా అనర్గళంగా తన సంభాషణలతో వినోదాన్ని అందించేవారు ప్రయాగ..చినసూర్యనారాయణ గారు మద్రాస్ లో ఉంటున్న మా పెద్ద బావగారు అంటే మా పెద్దక్కయ్య లోపాముద్ర భర్త గాడేపల్లి కృపానిధి గారి తండ్రి’’ పండిట్ రావు’’ గా ప్రసిద్ధుడైన , రోషనార,చంద్రగుప్త మొదలైన హిందీనాటకాలలో నటించి ,పాత వెంకటేశ్వర మహాత్మ్యం సినిమాలో భ్రుగు మహర్షిగా  నిర్దోషి మొదలైన సినిమాలలో నటించిన శ్రీ గాడేపల్లి సూర్యనారాయణ గారికి  స్వయాన తమ్ముడే  .ఈయన్ను పెద సూర్యనారాయణ అనేవారు .అలాగే శ్రీ గాడేపల్లి శంకరం గారు కూడా ఒక తమ్ముడే .ఈయన భార్య దుర్గాబాయి గారి మహిళా సభ స్కూల్ లో హిందీ పండిట్ గా ఉండేవారు ..ఈ కుటుంబాలన్నీ మా బావ గారింట్లో ఏ కార్యక్రమం జరిగినా ,పిల్లాపాపలతో హాజరయేవారు  . ఇప్పుడూ అలానే వస్తున్నారు మా అక్కయ్యా బావ చనిపోయినా  వారూ గతి౦చినా  వారిపిల్లలుకూడా మా మేనల్లుడు మేన కోడళ్ళ ఇంటికి . నాకు గుర్తున్నంతవరకు చినసూర్యనారాయణగారిఅల్లుడే దేవులపల్లి కృష్ణ శాస్త్రిగారు .కృష్ణ శాస్త్రిగారిని అయిదారు సార్లు వారింటి వద్దే చూసి మాట్లాడాను .1950ప్రాంతం లో కృష్ణ శాస్త్రిగారు ,కాటూరి వెంకటేశ్వరరావు గారు ఒకసారి ఉయ్యూరులో మా ఇంటికి వచ్చి గంట సేపు కూర్చుని మాట్లాడటం నేను ఎప్పటికీ మరచిపోలేని విషయం .

  ఇలా బావగారి కబుర్లతో గాడేపల్లి,ప్రయాగ గార్లు చక్కని వాచకం తో ,విషయాలను సూటిగాస్పస్టంగా చెప్పి రక్తి కట్టించటం నాకు ఇంకా గుర్తు ఉంది .

  విజయవాడ రేడియోలో 1971నుంచి 75వరకు’’ సాయంత్రం 6-50నుంచి పదినిమిషాలు 7గంటల వార్తల వరకు బావగారి కబుర్లు’’ శ్రీ సి.రామమోహనరావుఅనే చివుకుల రామమోహనరావు , శ్రీ నండూరి సుబ్బారావు ద్వయం  చెప్పి ఉత్సుకత కలిగించేవారు …వినసొంపుగా ఉండేవి అలవోకగా చెప్పేవారు ఏ విషయమైనా .1971లో యుద్ధం ,బంగ్లాదేశ ఆవిర్భావం విశేషాలు కబుర్లద్వారా ప్రజలలోకి సూటిగా తీసుకు వెళ్ళేవారు .వీటిని టేపులపై భద్రపరచినట్లు లేదు .ఉంటె ఎంతటి ప్రేరణకలిగించేవో .ఒక్కోసారి ‘’ధరవరలు ‘’కూడా చదివే వారని గుర్తు .’’పంది’’వారు’’ధర చెబుతుంటే తమాషాగా ముక్కు మూసుకొనే వాడిని ఎన్నో నాటికలలో హాస్య సన్నివేశాలలో వీరి వాచిక నటన అనన్య సామాన్యంగా ఉండేది. ప్రతిదీ చిరస్మరణీయం చేసెవారు  ఈ జంట .

 ఒక సారి వీరందరినీ స్మరించాలన్న తలంపుతో ఇవాళ ‘’రేడియో బావగారికబుర్లు ‘’ ప్రారంభించాను .ఈ ఎపిసోడ్ లన్నీ రేడియో ద్వారా బావగారి కబుర్లు చిరస్మరణీయం చేసిన శ్రీ గాడేపల్లి సూర్యనారాయణ ,శ్రీ ప్రయాగ నరసింహశాస్త్రి ,శ్రీ సి.రామమోహనరావు ,శ్రీ నండూరి సుబ్బారావు గార్లకు అంకితమిస్తూ ధన్యత పొందుతున్నాను

సశేషం

పరశురామ జయ౦తి శుభాకా౦క్షలతో

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -25-4-20-ఉయ్యూరు  .

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

సుందర కాండ లో హనుమ బహుముఖీన వ్యక్తిత్వం-8

సుందర కాండ లో హనుమ బహుముఖీన వ్యక్తిత్వం-8

లంకా దేవతను చంపి హనుమ ద్వారం కాని ప్రదేశంద్వారా ప్రాకారం  దాటి ,శత్రు శిరసుపై కాలు పెట్టినట్లు ఎడమ పాదం పెట్టాడు .శుభానికి కుడికాలు పెట్టాలి అశుభానికి ఎడమపాదం అన్నది మన సంప్రదాయం .అది తెలిసిన ప్రజ్ఞా శీలి .రాత్రి వేళ యధేచ్చగా లంకలో తిరిగి చూశాడు .గాన నృత్యాలతో నగరం అట్టహాసంగా ఉన్నది .అభి వృద్ధికి చిహ్నాలైన పద్మ స్వస్తిక అనే నిర్మాణ విశేషాలు చూశాడు .అన్నీ అత్యుత్తమ గృహ సముదాయాలే .అంటే వాస్తు ప్రకారం  సర్వతో భద్రంగా నిర్మించినవే. ‘దుష్ప్రదేశమైన లంకలో ప్రవేశించగలిగాను కనుక రామ సుగ్రీవుల మనోరధం ఈడేరుగాక ‘’అని సంకల్పం చెప్పుకొని ఆన౦దించాడు ‘’సుశ్రావ మధురం గీతం త్రిస్థాన స్వరభూషితం’’అప్సరసలులాగా రొమ్ము .కంఠం,  శిరస్సు అనే మూడు స్థానాలనుంచి పుట్టిన మధురగీతాలు విన్నాడు .అనేక రకాల భవనాలు వివిదాకృతులున్న స్త్రీలు కనిపించారు .రెండు చేతులు వ్యత్యస్తం  గా పెట్టి ,భుజాలను తడుతూ వచ్చే ధ్వనితో సింహనాదాలను జపంగా చేస్తూ ఉన్న వారి వేద మంత్రాలు విన్నాడు .బ్రహ్మభాగం పఠించే వారు  ,రావణ స్తోత్రం చేస్తూ గర్జి౦చేవారి నాదాలు విన్నాడు .నగరం మధ్యలో ఉన్న గూఢచారులను ,రాక్షస సేన నూ చూశాడు .దీక్షలో ఉన్నవారు జడలు కట్టినవారు ,బోడితలలవారు ,ఎద్దుతోలు కట్టినవారు దిగంబరులు ,పిడికిలి నిండా ఆయుధాలు ధరించినవారు ,జయ హోమం చేసేవారు ,కూట,ముద్గర ,దండాయుధ దారులు ,ఒంటి కన్ను అంటే ‘’ఏకాకన్నయ్యలు’’ ,ఒంటి చెవి ఏకా కర్ణయ్యలు ,వ్రేలాడే పొట్టి స్తనాలవారు ,వంకర మొహాలవారు ,అవయవాలు విషమంగా ఉన్నవారు ,విల్లు కత్తి శతఘ్నిఅంటే ఇనుపగద ఆయుదాలున్నవారు ,జానెడు ఉండే ముసలం,పరిఘ  ఆయుధంగా ఉన్నవారుకనిపించారు .ఆశ్చర్యమైన కనులతో ,దున్నపోతుల్లాంటి వారు ,పొట్లకాయలాంటి సన్న వారు ,మరుగుజ్జులు, లాంగ్ పోల్ లాగా బారైనవారు ,తెల్ల నల్లముఖాలవారు ,గూని వాళ్ళు ,తేజస్సున్నవారు ,రాజచిహ్నాలైన టెక్కాలు పట్టుకొన్నవారు మొదలైన వారందర్నీ చూశాడు హనుమ .శక్తి ,వృక్షం ఆశని ,పడవ తెడ్లు ,త్రాళ్ళు ఆయుధాలు గా ఉన్నవారు కనిపించారు .ఉష్పమాలలు చందనం లతో బహువేషాల లవారు ,శూల వజ్రాయుధ ధారులు ఐన మహాబలవంతులైన రాక్షసులను చూశాడు .రావణ అంతః పురం ఎదుట లక్షమంది సైనికులు కాపలా కాయటం చూసి ఆశ్చర్యపడ్డాడు .బంగారు ద్వారాలున్న రావణ భవనం చూశాడు .దాని చుట్టూ లోతైన అగడ్తలు ఉన్నాయి .ఏమరు పాటు లేకుండా అందరూ విధులు నిర్వహిస్తున్నారు .గుర్రాల సకిలింపులు ,స్త్రీపురుషుల కంకణ మణిమంజీరాది భూషణ ధ్వనులు వినిపించాయి .రథాలు ,పల్లకీలు తెల్ల ఏనుగులు ,బాగా మేసి మత్తుగా పడుకొన్న మృగాలు ,రకరకాల పక్షులు కనిపించాయి ‘’స హేమ జామ్బూ నదచక్రవాళం-మహార్హ ముక్తా మణిభూషితాంతం-పరార్ధ్య కాలాగరు చందనాక్తం –స రావనణా౦తఃపుర మా వివేశ ‘’-జంబూ నదిలో, ఇతర చోట్లా లభించే రెండు రకాల బంగారం చేత పూయబడిన ప్రాకారం ,విలువైన  ముత్యాలతో అలంకరింపబడిన అగరు ,చందనాలు పూయబడిన రావణుని అంతః పురం లో హనుమ ప్రవేశించాడు .

ఇది 27శ్లోకాలనాలుగవ సర్గ  .దీనిలో రావణ భవన వైభవంమందీ,మార్బలం , నిశాచరుల నిరంతర పహారా ,గాన గీత నాట్య విశేషాలు తోపాటు ,వివిధ రకాలైన రాక్షసులు ,వారు ధరించే ఆయుధ విశేషాలు ,వారి బలపరాక్రమాలు అన్నీ చూడగలిగి ఒక ఎస్టిమేషన్ కు రాగలిగాడు భవిష్యత్ కార్యం కోసం  ఇంతమంది కన్ను కప్పి తిరగటం ఎంత ప్రమాదమో అర్ధమైంది .అయినా బురిడీ కొట్టించాడు .తనపని తానూ హాయిగా చేసేసుకొన్నాడు సూక్ష్మ బుద్ధి ఉన్న ఆంజనేయుడు .

   సశేషం

మీ- గబ్బిట దుర్గాప్రసాద్ -24-4-20-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

ప్రపంచ దేశాల సారస్వతం 45-మైక్రో నేషియా సాహిత్యం

ప్రపంచ దేశాల సారస్వతం

45-మైక్రో నేషియా సాహిత్యం

కరోనా బారి పడని అయిదవ దేశం మైక్రో నేషియ .మైక్రో నేషియా అంటేనే చిన్న చిన్న దీవుల సమూహం అని అర్ధం .దీన్ని ఫెడరల్ స్టేట్స్ ఆఫ్ మైక్రోనేషియా అంటారు .పడమటి ఫసిఫిక్ సముద్రంలో వేలాది ఐలాండ్స్  ఉన్న దేశం .తూర్పున పోలినేషియా ,దక్షిణాన ఐలాండ్ మలనేషియా లతో సాంస్కృతిక సంబంధాలున్న దేశం .జనాభా చాలాభాగం ఆస్ట్రో నేషియన్లు .ఓషియానిక్ రియలం లో ఇది భాగం .నాలుగు ఆర్చిపెలాగో లున్నాయి అవే కరోలిన్ ఐలాండ్స్ ,గిల్బర్ట్ ఐలాండ్స్ ,మారియానా ఐలాండ్స్ ,మార్షల్ ఐలాండ్స్ .ఎన్నో మిలియన్ల సంవత్సరాలక్రితమే ఇక్కడ మానవ ఆవాసం ఉన్నది .1521నుంచి మాత్రమే స్పానిష్ షిప్ లు మారియానాస్ లో కాలు పెట్టిన దగ్గర్నుంచి యూరోపియన్ ల సంపర్కం ఏర్పడింది .20వ శతాబ్దిలో ఈ దేశం అంతా అమెరికా ,జర్మని ,బ్రిటిష్ ఎంపైర్ లమధ్య మూడు విదేశీ గ్రూపులుగా విభజన చెందింది .21వ శతాబ్దిలో మైక్రోనేషియాలో ఉత్తర మారియానా ఐలాండ్స్ తప్ప మిగిలిన  ఐలాండ్స్ స్వతంత్ర రాస్ట్రాలయ్యాయి .మొత్తం ఒకలాక్ష 13వేల జనాభా. చేపల వేట ,ఎగుమతి ఇక్కడి ముఖ్య ఆదాయం .టూనాపంట కూడా ఆర్దికానికి తోడ్పడుతోంది .కోరల్ రీఫ్స్ చూడటానికి వచ్చే స్కూబా డైవర్స్ ,వాల్ డైవ్స్,సంకేన్ షిప్స్ చూసే జనం ఇక్కడి అట్రాక్షన్ .సర్ఫింగ్ కోసం విపరీతంగా టూరిస్ట్ లు వస్తారు .బికినీ డైవింగ్ మరో ప్రత్యేకత. ఇక్కడి తెగలలో కరోలియన్ ,కామోర్రో ,చౌకీస్ ,కేపింగ్ ,నౌరువాన్  లు ఉంటారు .దాదాపు అంతా మైక్రోనేషియాన్ భాషలనే మాట్లాడుతారు .ఇవే మార్శల్లెస్,గిల్బెర్టేస్ ,కొశ్రియన్,నౌరువాన్ .ఉపభాషా కుటుంబ౦  ట్రూపిక్-లో 11రకాల పోనాపెలిక్ భాషలుంటాయి .అమెరికన్ డాలర్ ఇక్కడి కరెన్సీ .యూరోపియన్లు ఇక్కడికి వచ్చేదాకా ఇక్కడ కుక్కలు,పందులు లేవు .ఫ్రూట్ బాట్స్ అనే పాలిచ్చే జంతువులూ ఇక్కడ ఉంటాయి .ఇక్కడి జనం వక్కలతో తమలపాకులు పెప్పర్ కలిపి తాంబూలం  బాగా నముల్తారు . స్టోన్ కార్వింగ్ ఎక్కువ.’’స్టోన్ మని బ్యాంక్ లు ‘’ఇక్కడి మరో విశేషం .ఆడవారు ఇక్కడివంటరి ఐలాండ్స్ లో తిరగటం క్షేమంకాదు .నేరాలెక్కువకనుక జాగ్రత్తపడాలి .కుక్క మాసం తినని మంచి జనం ఇక్కడివారు .సరిహద్దులను పక్కాగా మూసెయ్యటం వలన ఇక్కడికి టూరిస్ట్ లను అనుమతించకపోవటం తో కరోనా వైరస్ ఇక్కడికి చేరలేదు .

  హయ్యర్ లెవెల్ చదువు నేర్పే విద్యా సంస్థలు చాలా ఉన్నాయి .13ఏళ్ళలోపు వారంతా తప్పక చదువుకోవాల్సిందే .ఉత్తర మారియానాకాలేజి లో ఉన్నతవిద్య నేరుస్తారు .న్యాయవ్యవస్థ సరిగా ఉండదు .సంగీతం నాట్యం బాగా ఉంటాయి .వెయిట్ లిఫ్టింగ్ పైఅభి రుచి ఎక్కువ .

  సాహిత్యం –ఇక్కడి సాహిత్యం ఓషియానియన్ సాహిత్యం .ఇది ఇతర దేశాలకు భిన్నంగా ఒంటరిగా వృద్ధి చెందింది .మతచిహ్నాల వాడకం ఎక్కువ .మొదటి సారిగాదేశీయ  మైక్రో నేషియన్ రచయితలు  కవిత్వం చిన్న కధ , సృజనాత్మక వ్యాసం కబుర్లు నాటక భాగాలు ఒక చోట చేర్చి ప్రదర్శించారు .70మంది రచయితలూ ,వందరకాల ,13దేశీయ భాషల సంకలం తెచ్చి ప్రపంచ దృష్టిని ఆకర్షించారు .వీటిలో వైవిధ్యం సముద్రమంతా ,లోతు మారియాన ట్రెంచ్ అంత అని ఇక విశ్లేషకుడు చెప్పాడు .వీటిలో ఆరిజిన్ ,రెసిస్టింగ్ ,రిమెంబరింగ్ ఐడె౦టిటీస్ ఐ వాయేజేస్ ,ఫామిలి ,న్యు మైక్రోనేషియా విభాగాలున్నాయి .ఈ మొత్తం సంకలననానికి ‘’ఇండిజెనస్ లిటరేచర్ ఫ్రం మైక్రో నేషియా’’అనే పేరు పెట్టారు .

  ఈ ఫెడరేషన్ కవులలో ఏమిలిషేర్ కిహ్లేంగ్ అనే కవయిత్రి మొదటిసారిగా మొదటికవిగా తనఇంగ్లిష్ కవితా సంపుటి 2008లో ‘’మై ఊరోస్ ‘’ముద్రించింది .క్రియేటివ్ రైటింగ్ లో హవాయ్ యూనివర్సిటి మాస్టర్ డిగ్రీ హోల్డర్ .ఫసిఫిక్ స్టడీస్ లో పిహెచ్ డి –అంశం –పోహిమ్పియాన్ స్కర్ట్స్.దీన్ని ఎత్నికాగ్రఫీ పోయెట్రి అన్నారు .ఆమె తీసుకున్న డ్రెస్ అంశం పోహ్నేపియాన్ స్త్రీలు ధరించేది .2009లో గువాం యూని వర్సిటి ప్రొఫెసర్ ఒకప్రకటన చేస్తూ –గువాం ,పాలూ మెరియానా ఐలాండ్స్ నౌరు ,కిరిబాతి మొదలైన ప్రాంతాల రచయితల రచనలకు ప్రచురిస్తామనితెలియ  జేసి  ప్రోత్సాహం కల్పించాడు .కేహ్లింగ్ ఒక్కరుమా త్రమే మైక్రోనేషియాలో కవి

 చరిత్ర రచనలో మొదటి చరిత్రకారుడు లుఎలేన్ బెర్నార్ట్ -1866-1946.రచనపేరు ‘’ది  బుక్ ఆఫ్ లుఎలిన్ ‘’

   సశేషం

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -24-4-20-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

25-4-20 శనివారం -వైశాఖ శుద్ధ విదియ పరశురామ జయంతి మరియు ,ఉదయం 10-18నుంచి అక్షయ తృతీయ

రేవు  25-4-20 శనివారం -వైశాఖ శుద్ధ విదియ పరశురామ జయంతి మరియు ,ఉదయం 10-18నుంచి అక్షయ తృతీయ

26-4-20 ఆదివారం వైశాఖ శుద్ధ తదియ -అక్షయ తృతీయ మరియు సింహాచల అప్పన్న చందనోత్సవం
28-4-20 మంగళవారం వైశాఖ శుద్ధ పంచమి -శ్రీ శంకరాచార్య జయంతి శుభాకాంక్షలు

image.png

image.png
image.png

image.png
Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

సుందర కాండ లో హనుమ బహుముఖీన వ్యక్తిత్వం-7

సుందర కాండ లో హనుమ బహుముఖీన వ్యక్తిత్వం-7

కాలోచిత ఆలోచన హనుమ ప్రత్యేకత .బలమైన సైనికులు అకుక్షణం పహారా కాస్తున్న ,వైభవం లోకుబేరుని అలకానగరం లా ,దేవేంద్రని అమరావతిలా ,స్వర్ణద్వారాలు వైడూర్యవేదికలు  నేలంతా రత్నఖచితంగా వైడూర్యాలమెట్లతో సుందర వైభవ లంకను హనుమ చూశాడు .దానిగురించి మనసులో ‘’ఈ లంక గొప్పతనం కుముడుడికి ,అ౦గ దుడికి సుషేణుడికి,మైంద ద్వివిదులకు ,సుగ్రీవ కుశపర్వవానరరాజుకు రుక్షునకు కేతుమాలికి మాత్రమేచేరటానికి సాధ్యం ఇది .’’అనుకొన్నాడు .మరి తానూ వచ్చాడుగా ,దాన్ని గురించి చెప్పుకోకపోవటం వినయ లక్షణం ఇక్కడ భాసించింది .ఇతరుల బలపరాక్రమాలు తెలిసి పొగడటం వీర ధీర లక్షణం .హనుమ అదే పాటించి సుభాష్ అనిపించుకొన్నాడు .రామ ,లక్ష్మణ శౌర్య పరాక్రమాలు ఒకసారి గుర్తు చేసుకొని వారిద్దరూ అనాయాసంగా లంకను జయించగలరు అని నమ్మకం కలిగింది .లంక ‘’రత్నాలే వస్త్రాలుగా ,సామాగ్రి నిలవచేసే కొట్లే కర్ణాభరణాలుగా ,యంత్రాగారాలే స్తనాలుగా ఉన్న సర్వ శోభిత అయిన యువతి’’లాగా కనిపించి౦ది   కుర్రాడికి .అప్పుడు మరో పరీక్ష ఎదుర్కొన్నాడు .

 లంకా నగర దేవత వికృతముఖం ,భయంకరమైన కళ్ళు ,అయిన నిజ రూపం తో  కనపడి పెద్దగా అరుస్తూ ,హనుమను చూసి ‘’ఓకోతీ! నువ్వెవరవు .ఎందుకొచ్చావ్ నీ ప్రాణాలు తీసే లోపు నిజం చెప్పు .సర్వ సురక్షమైన లంకలో నీకు  ప్రవేశం లేదు ‘’అనగా అత్యంత వినయంగా ‘’అమ్మా !అంతా నిజమే చెప్తా అబద్ధం చెప్పను .అసలు నువ్వు ఎవరు  తల్లీ .ఎందుకు భయంకర రూపంతో నన్ను అడ్డుకున్తున్నావు ,బెదిరిస్తున్నావు ?’’అడిగాడు .కామరూపి ఐన ఆమె ‘’రాక్షసరాజు రావణ ఆజ్ఞావర్తిని .నగరాన్ని కాపాడటం నా విధి నన్ను ఎదిరించటం ఎవరికీ సాధ్యం కాదు .నా ప్రమేయం లేకుండా లంకలో నువ్వు ప్రవేశించలేవు .నిన్ను ఇప్పుడే దీర్ఘ నిద్రలోకి పంపిస్తా .’’అన్నది .పర్వతాకారంలా ఉన్న దాన్ని చూసి ఇక యుద్ధమే తక్షణ కర్తవ్యం అనుకోని ,ఎందుకైనా మంచిదని ‘’అందంగా ఆకర్షణగా ఉన్న ఈ నగరాన్ని చూడాలనే కోరిక కలిగింది .ఇక్కడి వనాలు ఉపవనాలు అడవులు ముఖ్యమైన ఇల్లు చూడటానికి మాత్రమె వచ్చాను ‘’అన్నాడు

 వికృతంగా వికటాట్టహాసం చేస్తూ అది ‘నీ దుర్బుద్ధి నాకు తెలిసింది నన్ను ఓడించాకుండా లంకానగర సందర్శనం నీకు శక్యం కాదు ‘’అని దబాయించింది .తగ్గు బాలయ్యా తగ్గు అన్నట్లు హనుమ ‘’మంగళాకారిణీ !నేను ఈ పట్టణం అలాఅలా చూసి  వెళ్లి పోతానేం’’అన్నాడు .ఇక ఆలస్యం చేయటం మంచిదికాదని ఆ రాక్షసి అరచేతితోచాచి  హనుమను గట్టిగా కొట్టింది .ఆమెకంటే పెద్ద ధ్వని చేసి హనుమ ఎడమ చేతి వ్రేళ్ళు ముడిచి పిడికిలితో బాదాడు .ఆ దెబ్బకు దిమ్మ తిరిగి బొమ్మకనిపించి నేలపై పడిపోయింది .స్త్రీ కదా అని జాలిపడగా గర్వం ఖర్వమైన అది హీన స్వరంతో ‘’మహా బలా హనుమా ! ప్రసన్నుడవు కా .కాపాడు స్త్రీలను ధీర వీర శూరులు చంపరాదు .కనిపించే లంకాపురిని నేనే మహాబలుడవుకనుక నన్ను జయించావు .పూర్వం బ్రహ్మ నాకు ఒక వరం ఇచ్చాడు .దానిప్రకారం ఎప్పుడు వానరుడు తనపరాక్రమంతో నన్ను వశం చేసుకొంటాడో ,అప్పుడు రాక్షసులకు భయమేర్పడుతుంది .అది నిజమైంది నీ దర్శనం తో .బ్రహ్మమాట యదార్ధం .దానికి తిరుగే లేదు .దుర్మార్గ రావణుడు సీతాపహరణం కారణం గా సకల రాక్షస సమూహంతో వినాశనం చెందే కాలం నీ రాకతో సమీపించింది .కనుక ఏ పనిమీద శాపగ్రస్త మై బలహీనపడిన ఈ లంకకు వచ్చావో ,ఆపనులన్నీ యధేచ్చగా  నెరవేర్చుకొని  , నీ ఇష్టం వచ్చినట్లు తిరిగి ,సీతామాత దర్శనం చేసుకొని వెళ్ళు ‘’అని దీవించింది-‘’ప్రవిశ్య శాపోహతాం పురీం –యదృచ్చయా త్వం జనకాత్మజాం సతీం విమార్గ సర్వత్ర గతో యధా సుఖం ‘’

  52శోకాల తృతీయ సర్గ ఇది .లంకను అందమైన సర్వాభరణ శోభిత యువతిగా వాల్మీకి హనుమ చేత  వర్ణింపజేయటం సరదాగా బాగుంది.అన్ని వేళలా బలం ఉపయోగించరాదు కనుక అంత భీకరాకారంగా ఉన్న లంకా ధీ దేవత కనిపించినా ‘’మంగళస్వరూపిణీ ‘’అని సంబోధించటం హనుమ లోని  వెటకారం కన్పిస్తుంది .ఆమె ప్రసన్నతకూ  కారణమ మయింది  ఆమాట .ఎవరైనా ఎందుకొచ్చావని అడిగితె లోక సహజంగా ‘’ఊరికే చూట్టానికి వచ్చాను ‘’అంటాం .హనుమా అలానే అన్నాడు .దెబ్బకు దెయ్యం పరిగెత్తినట్లు ఒక్క ముష్టిఘాతానికి దాని నిజస్వరూపం బయట పడేట్లు కొట్టాడు హను .కనుక సమయం చూసి బలం ప్రదర్శించాలి ఇక్కడ తప్పలేదు .లంక  దేవత యదార్ధం చెప్పేసింది .బ్రహ్మవరం కూడా వివరించి చెప్పి లంకా నగర సందర్శనకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చి పచ్చ జెండా ఊపింది .హనుమకు మరో రహస్యం ఆమె వలన తెలిసింది .శాపోపహత లంక అనే పరమ రహస్యం కూడా తెలిసింది .అంటే ఆయువు పట్టు చిక్కింది .అడగకుండా ఆమె సీతా దేవి ఇక్కడే ఉంది అని రూఢిగా చెప్పటమే కాదు భవిష్యత్  ద్రష్టగా  హనుమ ఆమెను దర్శించి వెడతాడు అని నమ్మి ఆశీర్వదించింది .మహర్షి ఏది చెప్పినా ఇంత క్రాంత దర్శనంగా ఉండటం విశేషం .

  సశేషం

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -23-4-20-ఉయ్యూరు

Posted in రచనలు | Tagged | Leave a comment

కరోనా కామాక్షీ మీనాక్షి కబుర్లు

కరోనా కామాక్షీ మీనాక్షి కబుర్లు

మీనాక్షి –ఏంటోదినా డబ్బా లో అక్షింతలు ఒక్కోటి కిందపడేస్తున్నావ్

మీనాక్షి –అదా .దానికో పెద్ద ‘’స్టోరు ‘’ఉ౦దొదినా

మీ-నా చెవిన పడేస్తే ఊరంతా ఆ కధ గాధలుగా ప్రచారం చేస్తాగా చెప్పు

కా –డబ్బాలో వంద అక్షింతలు ముందే లెక్కపెట్టి జాగ్రత్తగా పోశాను వదినా

మీ- మరి కింద పారేస్తున్నావెందుకు

కా –మన నాయకుడూ రాష్ట్రం చేస్తున్న ఒక్కొక్కతప్పుకూ హైకోర్టు మొట్టికాయలు వేసినప్పుడల్లా ఒక్కొక్క గింజ కిందపడేస్తానన్న మాట .

మీ –అదేదో సినిమాలో రామారావుకృష్ణుడు వేషం లో పళ్ళెం లో వక్కలు లెక్కపెడుతూ కింద పడేస్తున్న సీను లా ఉంది నీ పని  .హాయిగా వక్కలే పెట్టుకొని ఆయనలా ఏరిపారేయ్యచ్చుగా

కా –సడేలే సంబడం .పావుకిలో నాలుగొందలు. దానికి అంతడబ్బు ఎందుకు దండగ అని ఈ ఉపాయం పన్నా

మీ- నీ బుర్ర మహా సూక్ష్మ౦ వదినా .వందా అయ్యాక ఏమౌతుంది ?

కా –ఆ సినిమాలో ఏమైందో అదే అవుతుందని నమ్మకం .ఇప్పటికి  62 గింజలు ఏరిపారేశాను

మీ-సరేకానోదినా.కరోనా మహమ్మారి ఇంతలా విరుచుకు పడిం దేంటి

కా –అవునొదినా .

మీ- ఎక్కడికీ కదలటానికి మెదలటానికీ లేని అష్ట దిగ్బంధం అయింది వెధవ జీవితం

కా –నాకూ అలానే అనిపించింది కానీ ,చాలా మేళ్ళుకూడా చేసిందని  పించింది నాకైతే

మీ-ఆ మాట అంటే జనం ఊరుకోరేమో వదినా .అయినా ఎందుక లా అన్నావ్

కా –మన ప్రధాని నాలుగు రోజులకోసారి ,బయల్దేరి అరడజను దేశాలు తిరిగి వచ్చే వాడు .ఇప్పుడు కదలటానికి వీల్లేకుండా పోయి౦ది కదా .వేలకోట్లు ప్రజాధనం సేవ్ అయి౦ది కదా .అరగంటకో సారి లాల్చీ చొక్కాలు టర్బన్ మార్చే అవసరం లేదుకదా దర్జీ ఖర్చు ఇస్త్రీ ఖర్చు ఆదాకాలేదా

మీ –అవునుస్మీ .భలే ఆలోచిస్తావు నువ్వు వదినా .ఇంకా ?

కా –మార్చి నుంచి ఇక్కడి వేడి తట్టుకోలేక ఏదో ఒక మిషతో చల్లని దేశాలకు ఫామిలీలతో సహా తుర్రుమనే మంత్రుల ,ప్రజాప్రతినిధుల టూర్ల ఖర్చు ఇబ్బడి ముబ్బడిగా తగ్గింది కదా

మీ –అవునుస్మా –మన నాయకుడి సంగతి ?

కా –యాత్రలపెరుతో రోడ్లమీదకొచ్చి బుగ్గలుగిల్లి ముద్దులు పెట్టె సీన్లు కట్ చేసి వాళ్ళ ను కాపాడింది కదా  కరోనా

మీ –అవునొదినోయ్.పాపం బాబు బయటికి రావటం లేదు కదా

కా -70 ఏళ్ళు అలుపెరుగని ప్రజాజీవితం లో అలసి పోయాడు .కాసింత విశ్రాంతి కలిగించి౦ది కాదా  కరోనా

మీ –నిజమే ,ఇంకా

కా –  రాజధాని అమరావతి అక్కడే ఉండాలన్న ఉక్కు ధ్యేయంతో  ఎవ్వరూ పట్టించుకోకపోయినా 127రోజులు గా చేస్తున్న ఉద్యమం కరోనాలోనూ వారి మనో ధైర్యాన్ని దేబ్బతీయకపోవటం అభినదనీయం .వారి జోలికి కరోనా రాకపోవటమే వారికి విజయం సిద్ధిస్తుందనే నమ్మకం కలిగిస్తోంది .వారంతా సురక్షితంగా ఉండాలని, త్వరలోనే ఆశయ సాధన జరుగుతుందని ఆశిద్దాం .గంటకో జీవో మార్చే వారికి పరాభవం తప్పదు మీనాక్షీ

కా –అన్నిరకాల ప్రయాణాలు లేవు కనుక యాక్సి డెంట్లు లేవు జనమరణాలు లేవు .ఇంతకంటే ఏంకావాలి

మీ-వినోదాలు బంద్ కదా వదినా

కా –సినిమా క్లబ్బు పబ్బు అన్నీ బంద్ అవటం తో ఆడపిల్లల ,స్త్రీల మానప్రాణాలు రక్షి౦ప బడలేదా  .అవునా కాదా నువ్వే చెప్పు

మీ –అవునవును అంతా నిజమే .ఇదివరకు ఎక్కడ చూసినా జనప్రవాహమే .ఇప్పుడా గోల లేదు

కా –ఎస్ .ప్రతిదీ మితిమీరితే అనర్ధమే మిగిలేది .హాయిగా ఇంటి పట్టున ఉంటూ కుటుంబంతో కాలక్షేపం చేసే తీరిక లభించింది కరోనా లాక్ డౌన్ వలన

మీ- మనం సరే దేవుళ్ళకు కూడా ఫుడ్ కట్ కదా

కా –పాపం దేవుళ్ళకు విశ్రాంతి అనేది లేకుండా చేస్తున్నారు భక్తులు .ఇరవైనాలుగు గంటలూ దర్శనాలే ,ప్రసాదాలే .సమస్త లోకాలను పాలించే వారికి కాసింత అయినా విశ్రాంతి వద్దా ?అలా లేక పొతే వారి మానసిక స్థితి ఏమౌతుంది .పాలన సవ్యంగా చేయగలరా ?ఇదీ వారిపాలిటి వరమే . మనమూ తీర్ధ యాత్రలపేరుతో వేలాది రూపాయలు ఖర్చు చేసే పని లేకుండా పోయింది .ప్లాస్టిక్ వాడకమూ తగ్గింది

మీ-చక్కగా చెప్పావు కామాక్షి వదినా .వాతావరణమూ కాలుష్య రహితమవటానికి   బాగా తోడ్పడిందికరోనా

కా –అవును పర్యావరణ స్పృహ కలిగించింది .జీవావరణ ,ప్రకృతి పరిరక్షణపై దృష్టి ఏర్పడటానికి సాయం చేసింది .మనచుట్టూ పచ్చని ప్రకృతి ఉంటేనే, మనజీవితాలూ పచ్చగా భద్రంగా ఉంటాయి వదినా

మీ –కరోనా లాక్ డౌన్ వలన ఆర్ధికం ఏమౌతుంది

కా –కుదేలౌతుంది ఖాయం .కాని ఒక గుణ పాఠం నేర్పింది .మాటలు చప్పట్లు ,కొవ్వొత్తులతో జీవితాలు బాగు పడవు అనే ఎరుక కలిగించింది .మన ఆర్ధికం ఎంత డొల్లగా ఉందో విస్పష్టంగా చూపించింది .చేతులుకాలాక ఆకులు పట్టు కోవద్దు అనీ బోధించింది

మీ –అంటే ?సరిగ్గా అర్ధమయెట్లుచెప్పోదినా

కా –మన ఆస్పత్రులు యెంత అధ్వాన్నంగా,ఉన్నాయో వాటికోసం మన ప్రభుత్వాలు యెంత తక్కువ డబ్బు కేటా ఇస్తోందో,రోగుల నిష్పత్తిని బట్టి డాక్టర్లు ,నర్సులు మందులు  పరికరాలు లేకపోవటం మనల్ని వెక్కిరిస్తున్నాయి  .రిసెర్చ్ మీద దృష్టి ముందు చూపు లేకపోవటాన్ని ఎత్తి చూపింది కరోనా

మీ –అలా అంటా వేమిటి వదినా .మన దేశానాయకుడు ప్రక్క దేశాలనే మట్టి గరిపిస్తుంటే ?

కా –మనం చెప్పినట్లు చేసే సైన్యం ఉ౦ది కనుక ఏదో హడావిడి దాడి చేసి   ఎన్నికలముందు వోట్ల పంట రాల్చుకొంటున్నారు .రోగాలు మనకు చెప్పిరావు .వాటిని ఊహించే సామర్ధ్యమూ మన సైంటిస్ట్ లకూ  మనం కల్పించం .అందుకే కరోనా ఒక ఝలక్ ఇచ్చి అందర్నీ ‘’సావదాన్ ‘’చేసింది

మీ-పండగలు ,జనాలతో  పూసుకోటాలు రాసుకోటాలు ,ఎవరో ఇచ్చినవి ఎవరిపేరుతోనో మూక జన సమావేశాల్లో జాతరలాగా అందరికీ ఆదర్శంగా ఉండాల్సిన ప్రాజాప్రతినిధులు మంత్రులే చేయటాలు   పంచటాలు ,మత ప్రార్ధనలు వారిని అనుమంతి౦చటాలు,వారివల్ల కరోనా వ్యాప్తి అయి కొంప మునిగే దాకా హోమ్ శాఖ నిర్లిప్తంగా ఉండటం ఇవన్నీ ఏ ప్రభుత్వమూ చేయరాని పనులుకదా వదినా

కా –నువ్వూ బానే ఆలోచిస్తున్నావే  వదినా ధాంక్స్ .ఎదుటి వాడికి చెప్పేటందుకే నీతులు ఉన్నాయి అన్నకవి మాట మనం నిజం చేస్తున్నాం .మనం ఆచరించకుండా ప్రవచనాలు చేస్తాం

మీ-అసలు కరోనా సమస్యే కాదన్నవారు  ఇప్పుడు గగ్గోలు పెడుతుంటే ఆశ్చర్యంగా ఉంది

కా –కరెక్ట్ వదినా .పారా సెట్ మాల్  బ్లీచింగ్ పౌడర్ , ఫినాయిల్ చాలు అని ఉద్బోధించి ప్రజలను జోకొట్టి మభ్యపెట్టిన నాయకులవల్లనే ఇంత వ్యాప్తి జరిగింది .నిజాయితీగా లెక్కలుతెలియ జేయకపోవటం ,కక్కుర్తిగా కిట్లు కొని లాభాలు పండించుకోటం,గంటకో అబద్ధం చెప్పి  దబాయించటం  అడిగినవాడి పై కేసులు పెట్టటం డ్యూటీ సక్రమంగా చేసే డాక్టర్లు మందులు పరికరాలు  సేఫ్టి మెజర్స్ లేవని అడిగితె సస్పెండ్ చేయటం ఆటవికమే .తగిన ఫలితం అనుభవిస్తారు .

మీ-మానవత్వం పరిమళించాల్సిన చోట దానవత్వం రాజ్యమేలటం మన దురదృష్టం  చేతులారా వోట్లేసి  అంటించుకొన్న  అరిష్టం

మీ-ఈ మధ్య పొత్తులు చెడినట్లు వార్తలు వస్తున్నాయి ?

కా –కావాలని అన్నిరకాల అబద్ధాలు రిగ్గింగులు ఎన్నికలకమీషన్ చేత దొంగ దెబ్బలు ఇటియెం మెషిన్ల తో దాగుడు మూతలు ,నోట్ల మూటలపంపకాలతో వంచనా శిల్పం తో దగ్గరుండి గెలిపించి ,ఇప్పుడు తమనే లెక్క చేయకపోతే గురివింద సామెత గుర్తుకొచ్చింది ఢిల్లీ పాలకులకు .సర్వతోముఖంగా అభి వృద్ధి చెందుతున్న రాష్ట్రాన్ని చేజేతులా సర్వ నాశనం చేసి అపకీర్తి మూటకట్టుకొన్న దాని ఫలితమే ఇది .తమదాకా వచ్చేదాకా ఎవరికీ తెలియదుకదా .ఇప్పుడు ఒకరిపై ఒకరు అవినీతి ఆరోపణల వర్షం, తిట్ల దండకం కాణీపాకం ప్రమాణాల దాకా వచ్చారు .తిలాపాపం తలాపిడికెడు. అనుభవించాల్సిందే వదినా

మీ –నీ దగ్గరకు రావటం తో నా మససు శాంతపడింది వదినా .చెప్పుకోటానికి ఎవరూ లేరు .అందుకే వచ్చి నిన్ను విసిగించాను .

కా –అదేమిటి మీనాక్షి వదినా.నాలుగు మంచి సంగతులు మాట్లాడుకొన్నాం .మంచి జరగాలని కోరుకున్నాం.తప్పులు సవరించుకోమని సూచించాం  .అంతేగా

మీ –అంతేగా అంతే మరి కామాక్షి వదినా  ఉంటాను .

  మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -23-4-20-ఉయ్యూరు

.

Posted in రచనలు | Tagged | Leave a comment

ప్రపంచ దేశాల సారస్వతం 45-మార్టిన్ ఐలాండ్ సాహిత్యం 

ప్రపంచ దేశాల సారస్వతం

45-మార్టిన్ ఐలాండ్ సాహిత్యం

ఈశాన్య కరేబియన్ సముద్రం లో సెయింట్ మార్టిన్ లేకా మార్టిన్ ఐలాండ్ ఉన్నది .కరోనా సోకని నాలుగవ దేశం .ఫ్రెంచ్ రిపబ్లిక్ ,నెదర్లాండ్స్ మధ్యలో రెండు భాగాలుగా ఉన్నా ,రెండు చోట్లా జనాభా సమానంగా ఉంటారు .దక్షిణంగా ఉన్న సింట్ మార్టిన్ డచ్ లో భాగం ఉత్తరాన ఫ్రెంచ్ భాగంగా ఉన్నది సెయింట్ మార్టిన్. ఈ భాగం యూరోపియన్ యూనియన్ లో ఉన్నది బీచ్ అతి సమీపం లో ఎయిర్ పోర్ట్ ఉంటుంది .జనాభా సుమారు 78వేలు మాత్రమె .ఈ రెండిటినీ కలిపే సెయింట్ మార్టిన్ అంటారు 1493లో నవంబర్ 11కొలంబస్ ఇక్కడకాలుపెట్టి ‘’సాన్ మార్టిన్ ‘’పేరుపెట్టాడు .తర్వాత మార్పులు చెంది సెయింట్ మార్టిన్ అయింది .1620లో డచ్ వారుఇక్కడి ఉప్పునీటి గుంటలనుంచి ఉప్పు తయారు చేశారు .1648లో ఫ్రెంచ్ డచ్ దేశాలమధ్య ఒప్పందం జరిగి రెండుభాగాలైంది .ఇక్కడ ట్రాపికల్ సవన్నా శీతోష్ణస్థితి ఉంటుంది .2017 హరికేన్ ‘’ఇర్మా ‘’అల్లకల్లోలం చేసి,తీవ్ర నష్టం కలిగించింది ఇరువైపులా  .జిడిపి15,400 డాలర్లు .టూరిజానికి గొప్ప అనువైనది  .2000సంవత్సరం లో ఒకమిలియన్ మంది టూరిస్ట్ లు వచ్చినట్లు తెలుస్తోంది. డచ్ వైపు ప్రాంతం రాత్రి విందు వినోదాలు ,జ్యువెలరి ,డ్రింక్స్ తో మత్తేక్కిస్తే ,ఫ్రెంచ్ వైపు ప్రాంతం ‘’నూడ్ ‘’బీచెస్,షాపింగ్ లతో ఆకర్షిస్తుంది .అధికారభాష ఫ్రెంచ్ .డచ్ ఇంగ్లీష్ కూడా ప్రజలు మాట్లాడుతారు  .దేశం ‘’ఇంటర్ ట్రాపికల్ కన్వర్జెన్స్ జోన్’’ లో ఉండటం వలన అట్లాంటిక్ హరికేన్ల తాకిడి వేసవి చివర్లో ,ఫాల్ మొదట్లో ఎక్కువ.కరెన్సీ ‘’యూరో ‘’. ఉప్పు లేని మంచి నీటి సరఫరా ఉంటుంది .ఉప్పు ఉత్పత్తి ,టూరిజం ఈ దేశ ఆర్దికానికి ముఖ్యమైనవి .ఒకప్పుడు బానిసలతో  యజమానులు ఉప్పు తయారు చేయించేవారు .టూరిస్ట్ లతాకిడి లేకపోతె కొంప కొల్లేరే .వేసవిలో రావాలంటే హరికేన్ తుఫాన్లభయం .అందుకే కరోనా కూడా ఇక్కడ కాలుపెట్ట టానికి భయ పడి ఉంటుంది .కనుక ఇక్కడి జనం బతికి పోయారు

  సాహిత్యం –సెయింట్ మార్టిన్ రచయితలూ –షీలా సి విలియమ్స్ -1955అరుబాలో పుట్టి ఇక్కడికి వచ్చి౦ది.లసనా సేకౌ,విసిఫ్ఫీ స్మిత్ లోయీకీ మొరేల్స్, డేబ్బీ జాక్ ,చార్లెస్ బరోమియా హోడ్జ్,ఎస్తెర్ బాద్షాగుమ్బ్స్ ,ఎర్నా మే ఫ్రాన్సిస్ ,రాస్ చంగా ,రూబి బూట్ మొ  దలైనవారు

  లసానా యం సేకౌ-కవిత్వం మొనోలోగ్స్ ,చినకథలు మొదలైన 13రచనలు చేశాడు .సెయింట్ మార్టిన్ దేశ ప్రముఖ రచయితగా గుర్తి౦పు పొందాడు .అంతర్జాతీయంగా అనేక సాహిత్య సా౦స్క్రుతిక కార్యక్రమాలలో పాల్గొన్నాడు .దేశ స్వాతంత్ర్యం కోసం కృషి చేశాడు .సెయింట్ మార్టిన్ దేశ సాహిత్యం ‘’ది సాల్ట్ మెటఫర్’’గా వర్ణిస్తారు.ఉప్పును నిలవ చేయటానికి రోగ నివారణకు ఉపయోగిస్తారు కనుక అలా అంటారట .ఇక్కడ ఒక సామెత ఉన్నది ‘’మే యువర్ లైఫ్ బి ఆజ్ స్వీట్ ఆజ్ సాల్ట్ ‘’.అది దీవేనకూడా ఈ దేశం లో.సారా ఫ్లోరియన్ ‘’సాల్ట్ మెటఫర్’’అనే కవితా సంపుటి రాసింది . ఈమెకవిత్వాన్ని డిలాన్ ధామస్ కవిత్వం లా ఉంటుంది అంటారు   ఇక్కడ’’ బ్రేర్ రాబి టేల్స్’’అనే జానపద కథలుతరతరాలుగా ప్రచారం లో ఉన్నాయి .

  సశేషం

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -23-4-20-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

సుందర కాండ లో హనుమ బహుముఖీన వ్యక్తిత్వం-6

సుందర కాండ లో హనుమ బహుముఖీన వ్యక్తిత్వం-6

సముద్రం లంఘించి త్రికూట పర్వత శిఖరం పై ఉన్న లంకా నగరం చూశాడు హనుమ .హరి దర్శనానికి పులకి౦చా యేమో చెట్లు అన్నట్లు సువాసన వెదజల్లే పూల వర్షం కురిపిస్తే ,పూలతో చేయబడిన కోతిలా ఉన్నాడు .అలసట నిట్టూర్పులు లేకుండా ఉన్న అతడు ‘’వందేమిటి సహస్ర యోజనాలున్న సముద్రమైనా దాటేయ గలను ‘’అని కించిత్ గర్వంతో రొమ్ము విరుచుకొన్నాడు .ఇది సహజ మానవ లక్షణం .కంటితో ఎటు చూసినా లంక మహా శోభాయమానంగా పచ్చ పరుపు పరచినట్లు కనిపించి,జయధ్వానాలతో ‘’పచ్చ జెండా ‘’ఊపుతున్నట్లని పించింది .ప్రతిప్రాకారం స్వర్ణమయం .కళ్ళు జిగేలు మనే కాంతి మయం .విశ్వకర్మ నిర్మించిన ఈ నగరం త్రికూట శిఖరం పై ఉండటం తో ఆకాశం లో తేలుతున్నట్లు అనిపిస్తుంది .సంకల్పమాత్రం తో సృష్టించిన విశ్వకర్మ శిల్ప నైపుణ్యానికి అబ్బురపడ్డాడు .కోటలు అగడ్తలు  రమ్య  భర్మ్య హర్మ్యాలు కను విందు చేశాయి .క్రూర రాక్షసులచేత అనుక్షణం కాపాడబడే లంక ఒకప్పుడు కుబేరుడిది. అతన్ని నెట్టేసి ఆక్రమించాడు రావణా బ్రహ్మ .

  ఇప్పుడు విచికిత్సకు లోనయ్యాడు మారుతి .’’వానరులు ఇక్కడికి వచ్చినా ఏమీ చేయలేరు .దేవతలు కూడా లంకను జయించలేరు .సప్తతాళ భంజనాన్ని ఒకే బాణం తో చేసిన రాముడు కూడా ఏమీ చేయలేడేమో ఇక్కడికి వచ్చి .’’ప్రాప్యాపి మహా బాహుః  కిం కరిష్యతి రాఘవః ‘’అసుర ప్రవృత్తి కల రాక్షసులముందుసాంత్వనం పని చేయదు .వారు సంపన్నులు కనుక దానమూ పని చేయదు .బలగర్వమున్నవారు కనుక భేదమూ కుదరదు .బలపరాక్రమబుద్ధి విశేషం ఉన్నవారుకనుక యుద్ధం చేత కూడా నిగ్రహింప బడరు .లంకకు రావటానికి అంగదుడు ,నీలుడు ,మా రాజు సుగ్రీవుడు  నాకు మాత్రమె సాధ్యం .ముందు సీతాదేవి జాడ వెతికి ,ఆతర్వాత కర్తవ్యమ్ ఆలోచిస్తాను ‘’అని ఆలోచించి ,మళ్ళీక్షణం ఆలోచించి ‘’నేను ప్రస్తుతం ఉన్న రూపం లో లంకలో ప్రవేశించకూడదు .కపట క్రూర వర్తనులైన రాక్షసులను వంచించటం ప్రస్తుతం తప్పదు.ఇలా కనిపిస్తే దొరికి పోతా .చిన్న రూపం లో ఇంత లంకంతా వెదకటం చాలాకష్టం .కనుక మధ్యే మార్గం గా చిన్నదీ కాక పెద్దదీకాని మద్యం రూపం పొంది రాత్రి వేళ లంక చేరి అనుకున్నపని సాధిస్తాను .

  ఇంతటి మహా నగరం లో సీతాదేవి ఎక్కడ ఉన్నదో ఎక్కడ రావణుడు దాచిపెట్టాడో తెలుసుకోవటం మహా కష్టం .ఆమె ఒంటరిగా ఉంటె నేను ఒంటరిగా చూస్తాను .వివేకం ప్రదర్శించకపోతే ,కావాల్సిన పనికూడా దూత చేతిలో విఫలమౌతుంది .రాజు మంత్రిఎంతో ఎన్నివిదాలో ఆలోచించి పని నిర్ణయిస్తారు .అవివేకి ఐన దూత దాన్ని  చెడ గొట్ట వచ్చు ‘’ఘాతయంతి హి కార్యాణిదూతాః పండిత మానినః ‘’అని ఆర్యోక్తి .అంటే అన్నీ తమకే తెలుసు అనుకునే దూతలు ఇచ్చిన పనులు చెడగొట్టి చెడ్డ పేరు తెచ్చుకొంటారు రాజకార్యం విఫలమౌతుంది .శ్రీరామకార్యం నా మూలాన చెడిపోవటానికి వీల్లేదు .నేను అవివేకి గా ఉండక పోవటం ఎలా అనేది పెద్ద సమస్య .సముద్ర లంఘనం విఫలం కారాదు .రాక్షస రూపం దాల్చినా ,రాక్షసులు తేలికగా గుర్తించే బుద్ధి సూక్షం కలవారు .ఇక్కడ రాక్షసులకు తెలీకుండా గాలికూడా వీయదుఅని నా అభిప్రాయం .వాళ్లకు తెలీనిది ఏదీ ఉండదు .కనుక చిన్న కోతి రూపం లోనే రాత్రిపూట లంక ప్రవేశం చేస్తాను .రాత్రి పూట ఎవరికీ కనిపించకుండా లంకానగరం అంతా వెదకి అమ్మవారి జాడ తెలుసుకొంటాను ‘’అని బహువిధాల ఆలోచించి ఒక నిశ్చయానికి వచ్చి సూర్యాస్తమయం ఎప్పుడు అవుతుందా అని ఎదురు చూశాడు .

  రాత్రికాగానే ‘’పిల్లి అంత’’రూపం పొంది ,విశాల లంకానగరమంతా గాలి౦చటానికి సిద్ధమయ్యాడు .శుభకార్యానికి సముద్రుడు ,మైనాకుడు,సూర్యుని వంటి తానూ చుక్కల మధ్య ప్రకాశించే చంద్రుడు కూడా హనుమకార్యానికి సాయం చేస్తున్నట్లు వెన్నెల కురిపించాడు  .అప్పుడు శంఖం ,పాలు, తామర తూడులు లాగా తెల్లగా సరస్సులో నుంచి పైకొచ్చిన హంస లాగా  తారాపతి చంద్రుడు మార్జాల హనుమకు దర్శనభాగ్యం కలిగించాడు అని58శ్లోకాల  ద్వితీయోధ్యాయం .-‘’శంఖప్రభం క్షీర మృణాల వర్ణ –ముద్గచ్చ మానం వ్యవ భాసమానం –దదర్శ చంద్రం స హరి ప్రవీరః –పోప్లూయ మాన౦ సరసీవ హంసం ‘’

  ఈ సర్గలో హనుమ ఆలోచనలు యెంత విస్తృతంగా ఉన్నాయో ,దూతకార్యం ఎలా కత్తిమీద సాములాగా ఉంటుందో .కార్యం సఫలం అవటానికి ఎంతగా వివేకం బుద్ధి సూక్ష్మత అవసరమో నిరూపించాడు ,ఒక్కటే ధ్యేయం హనుమది –అదే రామకార్య సాఫల్యత .అందుకే వచ్చిన తాను పరిపరి విధాల వితర్కించి ‘’నేతి నేతి ‘’అని పండితులు తర్కించి బ్రహ్మాన్ని దర్శించే ప్రయత్నం చేశారో అలా చేసి ఆదర్శ దూత అనిపించాడు .చంద్ర ప్రకాశమూ ఆతనికి గొప్పగా సహకరించింది .అందుకే వాల్మీకి రసవత్తర శ్లోకం లో ఉప్పొంగి పోయి వర్ణించాడు . ’ఘాతయంతి హి కార్యాణిదూతాః పండిత మానినః’’ అన్న రుషి వాల్మీకి వాక్యం లోకం లో నానుడిగా నలుగుతోంది ఇప్పటికీ .రస స్వరూపుడు పరమాత్మ కనుక  కవితా రసప్రవాహమే ఇక్కడ కనిపించింది .

  సశేషం

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -22-4-20-ఉయ్యూరు

Posted in రచనలు | Tagged | Leave a comment

కొరోనా లాక్ డౌన్ బ్రూ ‘’స్లీ లలు

లాక్ డౌన్ బ్రూ ‘’స్లీ లలు

బ్రూ 1-హలో బ్రూ ఎలాఉన్నావ్ .ఏంటి లాక్ డౌన్ విశేషాలు ?

బ్రూ 2- ఏమున్నాయి బ్రూ .కక్కాలేక మింగాలేకా ఉంది నా పరిస్థితి .

1-అదేంటి బ్రూ అంత నీరసంగా ఉంది వాయిస్ బ్రూ .

2-దానికే నీకు ఫోన్ చేశాను బ్రూ .ఇక అట్టే నాంచక నా గోడు వినిపిస్తా సానుభూతితో విను బ్రూ .

1-కష్టాల్లో ఆదుకోకుంటే ఎలా బ్రూ ?త్వరగా చెప్పు మా ఆవిడ ఇప్పటికే అయిదుసార్లు పిలిచింది

2-ఈలాక్ డౌన్ నా ప్రాణానికి మహమ్మారి ఆయింది బ్రూ .నా బెడ్ రూమ్ లోనే సిస్టం పెట్టుకొని పని చేసుకొంటున్నాను .కానీ బ్రూ —

1-ఏడవమాక బ్రూ .నేనున్నాగా .మైహూనా .చెప్పు

2-అరగంట కోసారి సింగారించుకొని పగలూ రాత్రీ తేడాలేకుండా నైటీతో బెడ్ రూమ్ లోకొచ్చి మా ఆవిడ నాపనిచేసుకోనివ్వకుండా ‘’నా సిస్టం ఆన్’’ చేయమని గోల బ్రూ .ఆ నైటీ చూడలేక చస్తున్నా బ్రూ .చీరకట్టుకోవచ్చుగా అంటే ‘’అది విప్పటం లేటవువుతు౦దికదా  ‘’అని కొంటె నవ్వోకటీ .ఆఫీస్ పని ,మీటింగ్ అని చెప్పినా వినక ‘’మేటింగ్’’ కోసం మీద పడి పోతోంది బ్రూ .ఇక ఆ సిస్టం ఆన్ చేసి ఈ సిస్టం స్టార్ట్ చేసి సంతృప్తి చెందిస్తున్నా బ్రూవో .బెడ్ రూమ్ బాత్ రూమ్ తప్ప మిగిలిన రూములు ఎక్కడున్నాయో మర్చేపోయాబ్రూ

1-పిల్లలు ఇంట్లోలేరా బ్రూ

2-మా ఆవిడ కతర్ నాక్ బ్రూ .పిల్లలని  ముందే వాళ్ల అమ్మా మానాన్న ఇంటికి తెలివిగా తోలేసింది బ్రూవో .

1-ఏడుపెందుకు బ్రూ హాయిగా ఎంజాయ్ చేయక

2-ఒకసారా రెండు సార్లా  పగలూ లేదు సాయంత్రం లేదు రాత్రీ లేదు ఇదే పని’’ అదే పని ‘’.ఒళ్ళు అలిసి పోతోంది కూసాలు కదిలిపోతున్నాయి

1-తిండి తింటున్నావా బ్రూ

2-దానికేం ఢోకాలేదు బ్రూ .పందెం కోడి ని మేపినట్లు మేపుతోంది బ్రూ .గర్భాదానం పెళ్లికొడుక్కి అత్తారింట్లో మేపినట్లు మేపుతోంది బ్రూ .తినలేకా ,అనలేక ,అన్నీ మూసుకొని అనుభవిస్తూ ,’’అనుభవం ‘’పంచుతున్నా బ్రూ గత్యంతరం లేక

1-ఈ అనుభవం ఎప్పుడైనా ఉండేదా బ్రూ

2-ఇదివరకు లేదుబ్రూ .నెలకోసారి ‘’ముచ్చటకే ‘’విసి గేది.ఇప్పుడేమో కామదేవత ఆవహించినట్లు అదే రంధి.దీని రంధి పాడుగానూ.బాటరీ వీకై పోయిఇక దేనికీ పనికి రానేమో అని పిస్తోంది బ్రూవా బ్రూవా .ఈలాక్ డౌన్ ఎప్పుడు ఎత్తేస్తారో ఈ గృహహింస ఎప్పడు తీర్తుందో బ్రూ

1-పోన్లే బ్రూ –కన్సోల్ యువర్ సెల్ఫ్ .పీతకస్టాలు పీతవి .

2-సర్లే ఇంతసేపూ నా గోడే వినిపించా .నువ్వైనా హాపీ గాఉన్నావు చాల్లే బ్రూ

1-రోలు వెళ్లి మద్దె లకు మొరపెట్టుకొన్నట్లుంది నాపని బ్రూ  .నువ్వు చెప్పుకున్నావు నేను చెప్పలేక  ఏడవలేక చస్తున్నాబ్రూవా

2-ఆర్ యు నాట్ హేపీ బ్రూ

1-హేపీనా టోపీనా బ్రూ .మా ఆవిడది ఇంకో టైప్

2-అంటే ‘’ఆ టైపా’’

1-చా చా నోర్ముయ్ బ్రూ .పతివ్రతటైప్ .నాలుగింటికే లేస్తోది లాక్ డౌన్ లో కాఫీ టిఫిన్ గట్రా చేసి నన్ను లేపి పాదాలు లోషన్  నీళ్ళతో  కడిగి ,పాద పూజ చేస్తుంది .నా స్నానాదులు పూర్తయ్యాక కుర్చీలో కూచోబెట్టి మంగళహారతిచ్చి స్తోత్రాలు చదివి పూజ కానిస్తుంది .అక్కడ సిస్టం లో నన్ను పిలుస్తున్నాఋ మీటింగ్ నా  అన్నా వినిపి౦చు కోదు  .తర్వాత తన టిఫిన్ వగైరా అయ్యాక వంట చేస్తుంది .వంట పూర్తయ్యాక అన్నీ దేవుడితోపాటు నాకూ నైవేద్యం పెడుతుంది .సాయంత్రం,రాత్రిళ్ళు కూడా పొద్దున్న సీన్లే రిపీట్ అవుతాయి బ్రూ  నేనేమీ చెయ్యలేని నిస్సహాయుడిని అయిపోతున్నాబ్రూవా బ్రూవా .దానిముఖం  చూసి ఎన్నాళ్లైందో బ్రూ .ఎప్పుడూ మూతికీ ముక్కుకూ నెత్తికీ  ముఖానికీ  మాస్కులు .ఎక్కడో సౌదీ అరేబియాలో ఉన్నామేమో అనిపిస్తోంది బ్రూవా.

2-ఇదో గృహ హింస టైప్ అనుకొంటా బ్రూ

1-ఎక్సాట్లీ బ్రూ .కాసేపు మొగుడి పక్కలో కూచుందాం ముద్దు ముచ్చటా చేద్దాం అని యావ లేనేలేదు బ్రూ .ఈ పెళ్లి ఎందుకు చేసుకోన్నానా అనిపిస్తోంది బ్రూ

2-ఇంకా విశేషాలున్నాయా బ్రూ

1-లేకేం బ్రూ  .చానల్స్ లో వచ్చే ప్రతివారి ప్రవచనాలూ వినటం ,అప్పటిఅకప్పుడు అప్ప్లై చేయటం తో బుర్ర దొబ్బేస్తోంది బ్రూ

2-ఏదో అది ఆవిడ కో ‘’తుత్తి ‘’అనుకుని సరిపెట్టుకో  బ్రూ .సరే తను పాటించేవి ఇతరులకు కూడా చెప్పి పాటించేట్లు చేస్తుందా బ్రూ

1-వాట్సాప్ పుణ్యమా అందరికీ ఉచితంగా ఫోన్ చేసే వీలుకలిగిందిగా బ్రూ .అర్దరాత్రి లేదు అపరాత్రి లేదు.ఒకటే చాటింగ్ సలహాలు నివారణోపాయాలు .కౌన్సిలింగ్ లు తలపగిలి పోతో౦దిబ్రూ’

బ్రూ 3-హలో గంటనించి ఫోన్ చేస్తుంటే ఎత్తటం లేదేం బ్రూ .ఎలాఉన్నారు బ్రూ

1,2-బానే ఉన్నాం బ్రూ .ఇంతకీఎందుకు కాల్ చేశావ్ బ్రూ

3-లాక్ డౌన్ ఎప్పుడు ఎత్తేస్తారో అని ఎదురు చూస్తున్నా బ్రూ

1,2-అదేంటి అంతకస్టమేమొచ్చింది బ్రూ

3-నా కడుపు చించుకొని మీకాళ్ళమీద పడేద్దామని కాల్ చేశా బ్రూ

1,2-ఇప్పటిదాకా మాకస్టాలు చెప్పుకొని కన్నీళ్లు కడవలకోద్దీకార్చి ఉపశమనం పొందాం .నీ అనుభవం ఏకరువు పెట్టు బ్రూ .విన్నాక ముగ్గురం మూడు సాగరాల  ఏడుపు నీళ్ళు  కారుద్దాం కానీ గురూ –సమయం లేదు మిత్రమా బ్రూ

3-బ్రూస్ టూకీగా చెప్పి ఏడుస్తా .లాక్ డౌన్ మొదలైన దగ్గర్నుంచి మా ఆవిడ కరోనా బొమ్మకు ఫ్రేం కట్టించి ,పూజగదిలోకాకుండా బయట పీఠం మీద పెట్టి పూజ చేయటం మొదలు పెట్టింది .అపార్ట్ మెంట్ లో వాళ్ళను పిలవటం ,వాళ్ళతో పూలు వేయించటం హాతరులిప్పించటం స్తోత్రాలు కలిసి పాడటం కరోనా దేవత శాంతి స్తోత్రాలు,శాంతి హోమాలు ,వాయనాలు  కలిసికట్టుగా చదివి హోరెత్తించటం నైవేద్యాలు గొబ్బరికాయలు  ముఖాలనిండా పసుపుకుంకుమలు నెత్తిన సిందూరం ,నిమ్మకాయ దండలు ,గుగ్గిలం పొగలు ,పానకాలు వడపప్పు  చీరెలు జాకెట్లు నల్లపూసలు పంచటం ఓరి నాయనో ఇదేం వేలం వేర్రిరా బాబోయ్ అని పిస్తోంది బ్రూస్ .ఇంట్లో మగాడున్నాడు వాడి అతీగతీ కనుక్కోటం మర్చిపోయింది బ్రూస్లూ.పగోడికికూడా ఇలాంటి కష్టం రాకూడదు బ్రూస్ .

1,2-అంతేనా ఇంకేమైనాఏడవాలాబ్రూ

3-అవును బ్రూ –మొన్నరాత్రి ఒక స్వామీజీ ఏదో చానల్ లో ‘’ఈమంగళవారం పునిస్త్రీలకు అపకారం తర్వాత అమావాస్య మహా ఇబ్బంది .కనుక పునిస్త్రీ మెడలో నల్లపూసలున్నా లేకున్నా పసుపు కొమ్ము దారానికి తప్పని సరిగా కట్టుకోమని సెలవిచ్చాడట .మా ఆవిడ విని ఇంకేముంది కరోనా వైరస్ కన్నా ఈ వార్తా వైరల్ అయి వాట్సాప్ మెసేజెస్ కుప్పలుతెప్పలుగా అందరికీ పంపేసి పసుపుకొమ్ము కట్టుకోమని పురోహిత స్త్రీలా హుకుం  జారీ చేసింది .మర్నాడు మంగళవారం కనుక ఈపని చేయరాదుకనుక సోమవారమే అర్జెంట్ గా వార్త తోసేసింది .ఇతర దేశాల స్త్రీలకు ఇళ్ళల్లో రెడీగా ఉండవు కనుక ఏం చేయాలని రిప్లై మెసేజ్ .కాసేపు అలోచించి ఆరిందాలా ‘’పసుపు కుంకుమ సాంపిల్ పాకెట్ ‘’కు పిన్నీసు గుచ్చి కట్టుకోమన్నది  అవీ లేకపోతె చిటికెడు పసుపు ఒకి౦త కుంకుం  పోట్లాలుకట్టి మెడడలో దాల్చమని చెప్పింది .అరగంటలో ఈ వార్త దావానలమై ప్రపంచమంతా చేరటం ఆచరించటం జరిగిపోవటం అందరూ మా ఆవిడకు ధాంక్స్ చెప్పటం జరిగిపోయింది .నా ఆతీ గతీ కనుక్కున్నపాపానికి ఒడిగట్టలేదు నాపెళ్ళాం బ్రూ’’అని బావురుమన్నాడు

1,2-ఇంటికో కరోనా లాకౌట్ గాధ అన్నమాట బ్రూ .ముగ్గురం కలిసి కాసేపు ఏడుద్దాం బ్రూ బై బ్రూ .

 మనవి-మొన్న యు ట్యూబ్ లో చంద్రగిరి సుబ్బు ‘’లాకౌట్ లో ఆడవాళ్ళకస్టాలు ‘’ ఎపిసోడ్ చూశాక పిచ్చపిచ్చగా నచ్చి ,రివర్స్ గా ఇలా రాస్తే ఎలాఉంటుంది అనిపించి రాశా బ్రూస్

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -22-4-20-ఉయ్యూరు .

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

ప్రపంచ దేశాల సారస్వతం 44-లెసెతోవియన్ సాహిత్యం

ప్రపంచ దేశాల సారస్వతం

44-లెసెతోవియన్ సాహిత్యం

కరోనా వైరస్ మహమ్మారి సోకని మూడవ దేశం లెసెతోవా  కింగ్డం దక్షిణాఫ్రికా సరిహద్దు లో ఉంది.దీనితోపాటు వాటికన్ సిటి సాన్ మేరినో లున్నాయి .ఇతర మూడు దేశాల సరిహద్దు ఉన్న ఏకైక రాజ్యం .రాజధాని మసేరు.ఒకప్పుడు బ్రిటిష్ క్రౌన్ బ్రాస్టో లాండ్ లో ఉండేది .స్వతంత్రం 4-10-1966పొందింది .20లక్షల జనాభా .యుఎన్ ,కామన్ వెల్త్ ,ఆఫ్రికన్ యూనియన్ లలో సభ్య దేశం .’’సెసోతో భాష మాట్లాడే ప్రజలు ‘’అని ఆదేశ౦ పేరుకు  అర్ధం .ఇక్కడి ప్రజలను  ‘’సాన్ ‘’అంటారు .వారి ప్రత్యేకమైన ‘’రాక్ ఆర్ట్ ‘’అక్కడి పర్వత ప్రదేశాలన్నిటిపైనా కనిపిస్తుంది

  ఒకప్పుడు బసౌటోలాండ్ గా పిలువబడిన లెసెతో దేశం మోషోయి షో రాజుపాలన లో 1822లో ఏక రాజ్యమైంది .తర్వాత బ్రిటిష్ ,డచ్ కాలనీల పోరాటాలలో 1785లో బ్రిటిష్ వశమైంది .కేప్ కాలని నుంచి’’ ట్రెక్ బోయర్ లు ‘’వచ్చి స్థిరపడ్డాడు .1869నుంచి 1966వరకు బ్రిటిష్ పాలనలో ఉన్నది .1966లో స్వాతంత్ర్యం పొంది ‘’కింగ్డం ఆఫ్ లెసోతో ‘’అయింది .పార్లమెంట్ ఉన్న మొనార్కి దేశం .న్యాయవ్యవస్థ చాలా స్వతంత్రంగా ఉంటుంది .2010లో చేసిన టెస్ట్ లవలన నాలుగవ వంతుజనాభాకు హెచ్ ఐ వి .పాజిటివ్ ఉన్నట్లు తేలింది .అధిక నిరుద్యోగం ,ఆర్ధిక దివాలా బలహీనమైన కరెన్సీకూడా  ఈ దేశానికి శాపాలు .ఎత్తైన దేశం కనుక సంవత్సరమంతా చల్లగా ఉంటుంది .స్నో కూడా పడుతుంది .ఎన్నో సార్లు వర్షాభావ పరిస్థితులేర్పడి ,చిన్నకమతాలపై ఆధారపడి జీవిస్తారు .2007లో30ఏళ్ళలో ఎప్పుడూ రాని  తీవ్రమైన కరువు తో దేశం అల్లకల్లోలమై యుఎన్ వో దేశం లో ఎమర్జెన్సి ప్రకటించమని సలహా ఇచ్చింది .ప్రపంచ దేశాలు మానవతా భావంతో సాయం అందించి ఆదుకొన్నాయి .పల్లెలు వదిలి పట్టణప్రాంతాలకు, సౌత్ ఆఫ్రికాకు వలస పోవటం ఇక్కడ సహజం

  లలెసోతా దేశం లో 339 జాతుల పక్షులున్నాయి .క్రూర జంతువులూ పాములు పాలిచ్చే జీవజాలం తోపాటు ఇక్కడి’’ తెల్లతోక ఎలుక’’ ప్రత్యేకం .ఆల్పైన్ వనాలు జాస్తి .వనౌషధాలో ఎక్కువే  .ఇక్కడి సహజ వనరులలో పుష్కలమైన నీరు ,వజ్రాలు  మరో ప్రత్యేకత .లేట్సేంగ్,మోతే లిఖో బాంగ్ మొదలైన చోట్ల డైమండ్ లు ఉత్పత్తి అవుతాయి .2014లో 300 మిలియన్ డాలర్ల ఖరీదైన 24వేల కారట్ల వజ్రాలు ఇక్కడ తయారయ్యాయి .దీనితో క్రమక్రమ౦గా ఆర్ధికాభి వృద్ధి చెందుతోంది దేశం .కరెన్సీ పేరు ‘’లోటి’’.ఇది దక్షిణాఫ్రికా ,నంబియా స్వాజిలాండ్ మొదలైన దగ్గర దేశాలలో చెల్లుబాటు అవుతుంది .

 ఇక్కడి తెగలు దాదాపు 90శాతం బంటూ భాష మాట్లాడేవారు .క్రిస్టియన్ మతావలంబకులే .ఆఫ్రికా దేశాలో ఎక్కువ అక్షరాస్యతా శాతం 75 ఉన్న దేశం  లిసోతో.3శాతం ప్రజలు మాత్రమె ఇంటర్ నెట్ వాడుతారు .నేషనల్ సెక్యూరిటి కౌన్సిల్ ఏర్పడి ప్రజారోగ్యం సంరక్షిస్తోంది .ఫ్లూట్ లాంటి ‘’లెకోలులో ‘’ఇక్కడి సంగీత వాయిద్యం .వీరి జాతీయగీతం ‘’లెసోతో మా తరతరాల దేశం ‘’తో మొదలౌతుంది .ఆహారపు అలవాట్లలో ఆఫ్రికా, బ్రిటిష్ విధానాలు ఉంటాయి .ఆడవారు స్వయంగా వంట చేసి వడ్డించటం సంప్రదాయం .పశువులపెంపకం బాగా ఉంటుంది .  లెసోతో లో చైల్డ్ లేబర్ ఇప్పటికీ ఉంది .డయాబెటేస్ వ్యాధి ఎక్కువ .రేప్ లలో టాప్-92శాతం .60శాతం స్త్రీలు సెక్స్ వయోలెన్స్ బాధితులే .నేరాలూ ఘోరాలూ ఎక్కువే .ఇన్ని ఉన్నా సురక్షిత దేశం అని పేరుపొందింది .జిడిపి 1222డాలర్లు .అయినా నవనాగరకత కు దూరం గా ఉన్న దేశం కనుక ,ఎయిడ్స్ వ్యాధి ఎక్కువ ,ఆడవారు సెక్స్ హింసా బాధితులూ ,అతిపెదరికం ,దుర్భిక్షం  కరువుకాటకాలు ,చైల్డ్ లేబర్ ఉండటం తో కరోనా ఇక్కడకాలు పెట్టటానికి బయపడి ఉంటుంది .అందుకే ఆదేశం హాయిగా ఉ౦ది  ఉన్నదానితో సంతృప్తి చెందుతూ .

 లెసోతో సాహిత్యం –బంటూ నాయకులు పూర్వతరాలవారి పాటలు పాడుకొనేవారు .వీటికి ‘’లితోకోఆఫ్ లెసోతో ‘’అనిపేరు .మోసోతో ఒకకవి .పాటలలో గొప్ప లయ ఉంటుంది .గొప్ప ఊహాశక్తి ఉన్నపాటలు .

రచయితలలో మొరోసి అఖిన్ బారే1945-2020,ధామస్ మోఫోలో -1876-1948,కరోలిన్ నిసేలి సెంగ్ మోజ్మనో హాల్పో, మోఫో మస్తెపో నితున్య ఉన్నారు .వీరు ఇంగ్లిష్ లోనే రాసినా సాహిత్యం అందుబాటులో లేదు .మోపోలో 1931లో ‘’చకా ‘’అనే ప్రసిద్ధ నవల సేసోతో భాషలో రాశాడు .ఇది జులు అనే చక్రవర్తి రాజు కథ –20వ శతాబ్ది ఆఫ్రికా సాహిత్య 12 బెస్ట్ బుక్స్ లో ఇది ఒకటి .ఇంగ్లిష్ లోకి రెండు సార్లు తర్జుమా అయింది .మోఫోలో ఆఫ్రికా అతిపూర్వ సాహిత్యకారులలో ఒకడు .లేసోతాలో ఖోజనే లో పుట్టాడు .మిషనరీ బడులలో చదివి టీచర్ సర్టిఫికేట్ పొందాడు ,మాన్యుస్క్రిప్ట్ రీడర్ గా ఉద్యోగించాడు .అప్పుడే మొదటిరచన మొయేటి ఓయు బోచబెలా –అంటే’’ ది ట్రావెలర్ ఆఫ్ ది ఈస్ట్ ‘’రాశాడు .ఇదిఒక యువ సేసోతో యాత్రికుని కథ అతన్ని క్రిష్టియానిటి రక్షించిన ఇతి వృత్తం .దీని విజయం ప్రేరణతో ఉపాధ్యాయులు రచన ఉద్యమం ప్రారంభించారు .1910లో ‘’పిట్సేంగ్’’రాశాడు ఇందులో మతం చేతిలో మోసపోయిన యువకుడి  జీవితం ఆవిష్కరించాడు .ఇది ఆనాడు పెద్ద సంచలనే తెచ్చింది .

  ‘’ఇఫ్ మౌన్టేన్స్ స్పోక్’’రచన మాట్స్ ఎలిసో మొట్స్ఓయన్ రాశాడు .

  సశేషం

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -22-4-20-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

ప్రపంచ దేశాల సారస్వతం 43-కిరబటిన్ సాహిత్యం

ప్రపంచ దేశాల సారస్వతం

43-కిరబటిన్ సాహిత్యం

కరోనా సోకని రెండవ దేశం కిరబటి ఐలాండ్స్ మధ్య ఫసిఫిక్ సముద్రం లో ఉంది సుమారు ఒకలక్ష పది వేల జనాభా .ఇందులో సగం ‘’తరావా అటోలి’’ లో ఉంటారు .దేశంలో 32అటోలి లున్నాయి .అందులో ఒకటి కోరల్ ఐలాండ్ బనాబా .దేశం మొత్తం 8వేల చదరపు కిలోమీటర్ల  విస్తీర్ణం .బ్రిటన్ నుంచి స్వాతంత్ర్యం 1979లో పొంది సావరిన్ అయింది .ఫసిఫిక్ కమ్యూనిటిలో సభ్యత్వం పొందింది .మొదట్లో ఆస్ట్రోనేషియన్స్ ఇక్కడ వలసవచ్చి స్థావరం ఏర్పరచుకొన్నారు .వీరిది క్రీ పూ ౩౦౦౦ –నుంచి క్రీశ 30౦౦ వరకు ఓషియానిక్ భాష.తర్వాత సమోవా టోంగామొదలైన చోట్లనుంచి సెటిలర్స్ వచ్చారు .వారిలో వారు పెళ్ళిళ్ళు చేసుకొని సంస్కృతి పెంచుకొన్నారు .సముద్రయానం చేసే మెటనీషియా వాసులు  నల్లగా పొట్టిగా చిక్కు జుట్టుతో ఉండేవారు. ఇక్కడ మొదట్లో చేరారని చరిత్ర.వీరినే తర్వాత ఆస్ట్రో నేషియన్లు గుర్తించారు.

  క్రీశ 1300లో ఇక్కడసామోస్ లో  నర మాంసం భక్షకులను నిషేధించటం వలన వారు ఇక్కడినుంచి బయటకు వలస వెళ్ళిపోగా ,బహుళజాతి సమాజం ఇక్కడ అభి వృద్ధి చెందింది .15వ శతాబ్దిలో ఉత్తర ఐలాండ్స్ వారికీ ,మధ్య దక్షిణ ఐలాండ్స్ వారికి పాలన విషయాలలో తగవు లేర్పడి ,అంతర్యుద్ధాలు సాగి ,యూరోపియన్ల రాక తో వారి ఆయుధాలు మందుగుండు సామగ్రితో స్థానిక వనరులఆక్రమణపై పోరాటాలు సాగి రక్తం ఏరులై ప్రవహిచింది .కిరబటి అతని సైన్యం పొందిన ఆయుధ సామగ్రివల్ల ఎదురులేక పెత్తనం చెలాయించాడు .17,18శతాబ్దాలలో యూరోపియన్ షిప్ లు ఇక్కడికి వచ్చి దక్షిణ ,ఉత్తర పసిఫిక్ తీరాలకు నౌకామర్గాలేర్పరచి కాలనీ ప్రభుత్వాలు స్థాపించాయి .తర్వాత స్థానికపౌరుల పోరు ఫలితంగా స్వయం పాలన ఇచ్చి ,తర్వాత 1979జులై 12న సార్వభౌమాధికారం ఇచ్చేశారు .టేబురోరో టిటో1994 లో ప్రెసిడెంట్ అయ్యాడు .2012లో సెకండ్ లార్జెస్ట్ ఐలాండ్ ఫిజి నుంచి 2,200 హెక్టార్ల భూమిని కిరబటి ప్రభుత్వం కొన్నది .చాల దేశాలతో సంబంధ బాంధవ్యాలు ఏర్పరచుకోన్నది .ఇక్కడి పోలీస్ వ్యవస్థ చట్టాల అమలుకు సాయపడుతుంది ,దేశాన్ని మొత్తం 3 ఐలాండ్ గ్రూపులుగా –గిల్బర్ట్ ఐలాండ్స్ ,ఫోనిక్స్ ఐలాండ్స్ ,లైన్ ఐలాండ్స్ గా విభజించి పాలన సాగిస్తున్నారు .

  దేశంలో సముద్రమట్టాలు విపరీతంగా పెరిగిపోతుంటాయి .నేలలో ఉప్పు శాతం ఎక్కువ .వాతావరణం ఆరోగ్యకరం కాదు .ఫాస్ఫేట్ నిక్షేపాలు ఎక్కువ దానికోసం మైనింగ్ బాగా జరుపుతారు .సహజంగా కొబ్బరి ,పాండనస్ చెట్లు విపరీతం .దేశం స్వతంత్రం పొందేనాటికే ఫాస్ఫేట్ నిక్షేపాలు అయిపోయాయి .కనుక ప్రపంచం లో అభివృద్ధిలో బాగా వెనకబడిన దేశం అయింది .ఆస్ట్రేలియన్స్ ,టైవాన్ దేశాలు  ,వరల్డ్ బ్యాంక్ బాగా ఆర్ధిక సాయమందిస్తున్నాయి .ఇక్కడ రెండు ఎయిర్ లైన్స్ మాత్రమె వినియోగం లో ఉన్నాయి .

 ఇక్కడి ప్రజలు ఓషియానిక్  భాష ఐన ‘’గిల్బెర్టీస్’’మాట్లాడుతారు .ఈ దేశానికి బ్రిటిష్ కెప్టెన్ ధామస్ గిల్బర్ట్ పేరుమీద ‘’గిల్బర్ట్ ఐలాండ్స్ ‘’అని కూడా పిలుస్తారు .అధికారభాష ఇంగ్లిష్ .రాజధాని తరోవా బయట ఇంగ్లిష్  మాట్లాడరు .ఈ రెండు భాషల్ని కలగాపులగం చేసి మాట్లాడుతారు .ముఖ్యమతం క్రైస్తవం .సగటు జీవనప్రమాణం 60ఏళ్లు.వండని సముద్ర ఆహరం తినటంతో ఆరోగ్య సమస్యలు ఎక్కువ .లక్షమందికి 23మంది డాక్టర్లే ఉన్నారు.విషాహారం తినటం తో జబ్బులెక్కువ . ప్రాధమిక విద్య ఉచితం తొమ్మిదేళ్ళవరకు .మిషన్ స్కూల్స్ రద్దు చేసి ప్రభుత్వమే స్కూల్స్ నిర్వహిస్తోంది .ఉన్నతవిద్య ఫిజీలో చదువుతారు .కిబాటి యూనివర్సిటి ఏర్పడింది .

  పాటలు డాన్స్ సంగీతం బాగా ఇష్టం ప్రజలకు .కామన్వె ల్త్ గేమ్స్ లో పాల్గొంటుంది .వెయిట్ లిఫ్టింగ్ అభిమానం. ఫుట్బాల్ టీం ఉంది .సముద్ర పక్షులకు గొప్ప ఆవాసభూమి స్కూబా డైవింగ్ ,వరల్డ్ క్లాస్ ఫ్లై ఫిషింగ్ ఎక్కువ .విహార యాత్రకు అనువైనదికాదు.అసలామాట నే విని ఎరుగరు అక్కడి జనం. దాన్ని పలకటం కూడా రాదు.నాలుగు అర్ధగోళాలలో  స్తబ్దుగా ఉండే దేశం ఇది .ఉద్యోగకల్పన ,సంప్రదాయ నైపుణ్యానికి స్పందనలేకపోవటం ,  ఇంటర్నల్ మైగ్రేషన్ ,వనరులను విపరీతంగా వాడుక ,స్త్రీలకూ ప్రోత్సాహం లేకపోవటం ,అప్పులలో కూరుకు పోవటం ,కుటుంబ నియంత్రణ కు మతం  అడ్డుఅవటం తో  జనాభా పెరగటం ,ఆహార పదార్ధాలకు దిగుమతులపై ఆధారపడటం కిరబాటి దేశానికి గొప్ప శాపాలు .అందుకే ఎవరూ ఇక్కడికి వచ్చి ఉండటానికి సాహసం చేయకపోవటం ఒకరకమైన వరం కూడా .ఇక్కడ నారకత వ్యామోహం వెర్రి తలలు వేసి ఆటవికంగా మారకపోవటం వలన కరోనా కన్య కు ఈ ఐలాండ్స్ పై దృష్టి సోకలేదు  కన్నెత్తి అయినా చూడలేదు .

  కిరబాటి సాహిత్యం –కిరబాటి కవులలో ఒక్కరే టేరెసియా సీల్వాకనిపిస్తోంది .1969లోపుట్టి 2017మరణించింది . .ఆఫ్రికన్ –అమెరికన్ స్కాలర్ .ఫసిఫిక్ స్టడీస్ లో  దిట్ట .ఫిజిలోని సమకాలిక సమస్యలపై పరిశోధించింది .ఫసిఫిక్ వ్యవహారాలలో ఆరితేరింది. ఆమె సలహా అందరికి శిరోధార్యం .తనమార్గదర్శి ఎపెలి హావోఫా అన్న ‘’ We sweat and cry salt water, so we know that the ocean is really in our blood”అన్నమాటలు ఆమెకు స్పూర్తి .2009ఏప్రిల్ గార్డియన్ పత్రిక ఆమెను ‘’కిరబాన్ నేషనల్ ఐకాన్స్ లో ఒకరు ‘’అని ఘనంగా శ్లాఘించింది .పసిఫిక్ ఐలాండ్స్ సంస్కృతి పై మహత్తర పరిశోధన చేసిన మహిళా మూర్తి అన్నది ఒరిగాన్ యూని వర్సిటి.2010లో మెకాలే లెక్చర్ అవార్డ్ పొందింది .2014లో ఫసిఫిక్ పీపుల్స్ అవార్డ్ అందుకొన్నది .మొదటి ఫసిఫికా అవార్డ్ కూడా దక్కింది .విద్యాబోధనలో విద్యార్ధులకు క్రియేటివ్ ఇంటర్ ప్రిటేషన్ కు గొప్ప అవకాశం కల్పించింది .ఆమె రచనలలో కొన్ని –వాట్ మేక్స్ ఫిజి వుమెన్ సోల్జర్స్ ,న్యూడిటి,బికినీస్ అండ్ ఆదర్ ఫసిఫిక్ నేషన్స్.కవిత్వం లో- నీ నిమోనా అంటే సెర్చింగ్ ఫర్ ఐ కన్ సీ ఫిజి ,విస్సోని హీరేనేకో రియల్ నేటివ్స్ టాక్ ఉన్నాయి .

 రచనలు చేసినవారు ముగ్గురే కనిపిస్తున్నారు 1-అబురేటిటకాయివో2తెరేసియా,తియాల్వా 3-కీనా టిటో.వీరిలో అబురేటియో-పొలిటీషియన్,ఆకడేమీషియన్.ఒకప్పుడు లైన్ అండ్ ఫోనిక్స్ గ్రూప్స్ కు మంత్రిగా ఉన్నాడు .ఇతని రచన –కంట్రోల్ –ఇ టాకు టే కమిటాన బాగా పేరుపొందింది .మూడవ రచయిత కీనాటితో కిరబాటి రిపబ్లిక్ ఫస్ట్ లేడీ –సంస్కృతీ ,పరిరక్షణపైచాలా ప్రసంగాలు చేసింది .తరతరాల సంస్కృతిని కాపాడమని స్త్రీలను ఉద్బోధించింది .ట్రడిషన్-ఎన్శేంట్ గిల్బార్టేస్ సొసైటి ‘’పుస్తకాని కో ఆధర్ కూడా .తెరేషియా గురించి ముందే తెలుసుకొన్నాం .

  ఈ దేశ ప్రముఖ పుస్తకాలు –అకెకేరియా-టోని,జీన్ విన్కాప్,ఎ టోల్పాలిటిక్స్ –రచయితల సముదాయం ,సి౦ డ్రిల్లాస్ ఆఫ్  ది ఎంపైర్ .మేనేజి మెంట్ ఆఫ్ ది మెరైన్ రిసోర్సెస్ –రోనిటిటీ వాకి,టేల్స్ ఆఫ్ కిరబాటి-కాటియామై బార్నికి ,కేబెటీటకే మై బొంరికి అండ్ మేరియా మై  బువోటా మొదలైనవి .

  సశేషం

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -21-4-20-ఉయ్యూరు

Posted in రచనలు | Tagged | Leave a comment

సుందర కాండ లో హనుమ బహుముఖీన వ్యక్తిత్వం-5

సుందర కాండ లో హనుమ బహుముఖీన వ్యక్తిత్వం-5

ఇంకో విషమ పరీక్షను ఎదుర్కున్నాడు హనుమ .కామరూపి సింహిక చాలాకాలం తర్వాత తనకు మంచి ఆహారం గా అతి పెద్ద ప్రాణి లభిస్తోందని ఎంచి ,హనుమ నీడను పట్టి గుంజింది .ఈఅకస్మాత్తు ఘటనకు ఆశ్చర్యపోయి ,ప్రచండమైన ఎదురుగాలి చే వెనక్కి నడుస్తున్న పడవలాగా తనపని అయిందని ,అన్ని వైపులకు పరికించి చూడగా ,నీటి నుంచి పైకి లేచిన ఒక పెద్ద జంతువు కనిపించగా ,తమకు ఒకప్పుడు సుగ్రీవుడు సముద్రం లో  నీడను బట్టి వెనక్కి లాగే అతిపెద్ద జంతువు ఒకటి ఉంది అని   హెచ్చరించిన విషయం చటుక్కున స్పురించి,ఆజంతువు అదే అయి ఉంటుందని నిశ్చయించి ,వర్షాకాల మేఘం లా తన దేహాన్ని మరింత పెంచాడు .సింహిక కూడా ఆశ్చర్యపోయి,పాతాళ బిలం లాంటి తననోరు విస్తృతంగా తెరచి,హనుమను తరమసాగింది .అంత విశాలమైన నోటితో తనను  కబళిస్తుంది అని వెంటనే గ్రహించి ,దాని నోరు ,దేహ పరిణామం ,ప్రాణస్థానం  సూక్షం బుద్ధితో చూసి గ్రహించి ,మహా చాకచాక్యంగా తన శరీరాన్ని అత్యంత వేగం గా తగ్గించుకొంటూ దాని నోట్లోకి దూరిపోయాడు .రాహువు మింగుతున్న చంద్రుడులాగా కనిపించాడు సిద్ధచారణులకు .వెంటనే సింహిక ఆయువు పట్లను గోళ్ళతో అత్యంత వేగంగా అది నోరు మూయక ముందే చీల్చి ,ఉపాయంగా మనోవేగం తో పైకి ఎగిరిపోయాడు .అది విగత జీవియై సముద్ర జలాలపై పడిపోయింది .అప్పుడు ఆకాశ దేవతలు –‘’తాం హతాంవానరే ణాషు పతితాంవీక్ష్య సింహికాం-భూతా న్యాకాష చారీణి తమూచుః ప్లవగోత్తమం ‘’అంటే వానరశ్రేస్టా  ,హనుమా !ఒకగొప్ప జంతువును చంపి భయంకర కార్యం సాధించావు .ఇక నీ అభీష్టానికి తిరుగు లేదు .’’ధృతి,ర్దృష్టిర్మతిర్దాక్క్ష్యం స కర్మసు న సీదతి.’’-సతైస్సంభావితః పూజ్యః ప్రతి పన్న ప్రయోజనః ‘’’నీలాగా ధైర్య ,సూక్ష్మబుద్ధి ,బుద్ధి కుశలత ,సామర్ధ్యం ఉన్నవాడు ఎప్పుడూ పరాజయం పొందడు ‘’అని ఆకాశ భూత సంతతి అభినందించి ఆశీర్వదించాయి .ఇలా సింహికను సంహరించి దాదాపు సముద్రం అంతా దాటేసి ,ఒక్కసారి అన్ని వైపులకు చూడగా మనోహరమైన వృక్షజాలం తో లంకానగరం ,దక్షిణ తీర మలయపర్వతం .దానిపై తోటలు కనిపించాయి .

  ఇప్పటిదాకా అతి పెద్దగా ఉన్న తన దేహాన్ని ఒక్క సారి చూసుకొని ,అంతపెద్ద రూపంతో రాక్షసులకు కనిపిస్తే తానెవ్వరో తెలుసుకోవాలనే తపనఉత్సుకత  ,తన్నుపట్టుకొనే పన్నాగం చేస్తారని గ్రహించాడు .చిటికలో విరాట్ రూపాన్ని,మూడడుగుల దానం కోరి బలిని పాతాళానికి తొక్కేసిన  వామన మూర్తిగా రూపం మార్చుకొని మామూలు కోతిలాగా కనిపించాడు .అవ్వలి తీరాన్ని ఎవరూ చూడకుండా చేరి ,లంబగిరి శిఖరం పై దిగాడు .అక్కడ నుంచి దేవతల రాజధాని అమరావతి లాగా ఉన్న లంకానగారాన్ని చూశాడు –

‘’ససాగరం  దానవ పన్నగాయుతం –బలేన విక్రమ్య  మహోర్మి మాలినం –నిపత్య తీరే చ మహోదధే స్తదా –దదర్శ లంకా మమరావతీ మివ ‘’

రాక్షసులు ,పన్నగులు ఉండే ,పెద్ద అలలల్తో కూడిన శతయోజన విస్తీర్ణ మహా సముద్రాన్ని తన స్వీయ బలంతోదాటి ,తీరం చేరి ,అపర అమరావతి లాగా ఉన్న లంకానగారాన్ని కనులారా సాయం వేళ చూశాడు .

 202శ్లోకాల ఈ ప్రధమ సర్గ లో హనుమ బయల్దేరిన దగ్గరనుంచి నాన్ స్టాప్ గా ప్రయాణం చేసి విడువబడిన రామబాణం లక్ష్యం చేరినట్లు లంక కు చేరాడు .మధ్యలో ఎన్నో హుషారురుకలిగించేవి భయపెట్టేవి సంగతులు ఉన్నాయి .లక్ష్యం వైపు  సాగే మనిషి ఎక్కడా అలసత్వం చూపరాదు .అనుకోకుండా ఎదురయ్యే భ్రమ ప్రమాదాలను సూక్ష్మ బుద్ధితో వివేకాన్ని జోడించి పరిష్కరించుకోవాలే కాని భయపడి వెనకడుగు వేయరాదు అనే సత్యాన్ని లోకానికి చాటాడు .మంచి పనికి దేవతలుకూడా ఆమోదం చూపి ఆశీర్వదిస్తారని తెలియ జేశాడు .వారికి కావాల్సింది లోకకల్యాణమేగా .ఆత్మీయత  చూపినవారిపట్ల  మైనాకుని ఆదరించినట్లు ఆదరించి ఆనందం చేకూర్చాలి .పరీక్షా సమయంలో సూక్ష్మగ్రాహి గా ఉండాలి .తననే చంపాలనుకొన్న సింహిక గర్వాన్ని నేర్పుగా ఖర్వం చేసిట్లు ,దారికి అడ్డం తొలగించు కోవాలి .అప్పుడే తధాస్తు దేవతలు సంపూర్ణ అనుగ్రం చూపి కార్యానికి సానుకూల వాతావరణం కలిగిస్తారు .ఇలా ఎక్కడ ఒడిదుడుకు లేర్పడినా హనుమ ధైర్య శోర్య సాహస బుద్ధి వివేకాలతో అధిగమించి అనుకొన్నది సాధించాడు ఇదే ఈ సర్గలో మనం గ్రహించాల్సింది .సముద్రం లో ఎలాంటి తమాషా జీవులు౦టాయో ,వాటి సవ్రూప స్వభావాలేలా ఉంటాయో మహర్షి చూపించాడు .సింహిక లాంటి ప్రమాదకర జంతుఉ ఉంటుందని రాజుసుగ్రీవుడు చెప్పిన విషయాన్ని సద్యో స్పురణకు తెచ్చుకోవటం మహామతిమంతుడైన హనుమ వివేకం .అదే మర్చి పోయి ఉంటె లేనిపోని ప్రమాదం లో పడేవాడు .తక్షణ ఆలోచన తటిల్లత లాగా రావాలి అప్పుడే గొప్ప ఫలితం లభిస్తుంది .ట్యూబ్ లైట్ బుర్ర ఐతే వెలిగే లోపు జీవితం ఆరిపోవచ్చు . . 

సశేషం

 మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -21-4-20-ఉయ్యూరు

Posted in రచనలు | Tagged | Leave a comment

సుందర కాండ లో హనుమ బహుముఖీన వ్యక్తిత్వం-4

హనుమ చేసినపనికి దేవేంద్రునితో సహా సకల దేవతలు మెచ్చి ఆశీర్వదించారు .మైనాకునితో ఇంద్రుడు ‘’నీ పనికి ప్రీతి చెందాను .ఇకపై నావలన నీకు అపకారం జరగదని హామీ ఇస్తున్నాను .జంకు గొంకులు లేకుండా సుఖంగా  వర్ధిల్లు .మహా సాహసకార్యానికి వొడిగట్టినహనుమకు వందయోజనాలు దాటగానే అతనికి ఏ అపాయం వస్తుందో అని భయపడ్డాం .ఏమాత్రం భయపడని హనుమ కు నువ్వు చేసిన సాయం విలువలేనిది .రామదూతకు నువ్వు చేసిన సత్కారానికి అత్యంత ప్రీతి చెందాను ‘’అని నిండుమనసుతో అభినందించాడు. హనుమ తిరిగి వచ్చేటప్పుడైనా తనా ఆతిధ్యం గ్రహిస్తాడన్న కొండంత ఆశతో మైనాకుడు నీటిలో మునగకుండా ,ఇంద్రుడిచ్చిన అభయ౦  తో అలాగే ఉండిపోయాడు .

 .ఇందరి ఆశీస్సులు దండిగా పొందిన హనుమ అత్యుత్సాహంతో ఆకాశం లో సముద్రాన్ని క్షణకాలం లో దాటగా ,దేవ, గ౦ధర్వ ,సిద్ధ, మహర్షులు సూర్యతేజం తో ఉన్న నాగమాత సరస తో క్రూర  రాక్షస రూపం దాల్చి నోటిని ఆకాశమంత చాచి హనుమ ప్రయాణానికి  ముహూర్తకాలం విఘ్నం కలిగించమని,అతని బలపరాక్రమాలు తెలుసుకోవటానికి అది పనికొస్తుందని ,ఉపాయంతో అపాయం ఎలా తప్పించుకొంటాడో చూద్దామని  కోరారు .ఆమె అలాంటి రూపమేదాల్చి హనుమమార్గానికి అడ్డు నిల్చి,’’దేవతలు నిన్ను నాకు ఆహారంగా పంపారు .నిన్ను తినేస్తాను నా నోట్లో ప్రవేశించు ‘’అన్నది .చాలా ఆనందంగా ఆమెకు  నమస్కరించి ‘’రాముడు తమ్ముడు లక్ష్మణుడు భార్య సీతతో తండ్రి దశరధుని  ఆజ్ఞగా దండకారణ్యం ప్రవేశిస్తే మాయా వేషంతో సీతను రావణుడు అపహరించుకొని పోయి లంకలో దాచాడు .సీత జాడ తెలుసుకొని రమ్మన్న రామాజ్ఞతో దూతగా వెడుతున్నాను .నువ్వు ఇప్పుడు రామ రాజ్యం లోనే ఉన్నావని గ్రహించు .కనుక ప్రభువుకు సాయం చేయటం నీ విధి .కాదంటావా రామకార్యం పూర్తి చేసి తిరిగి వచ్చినీ నోట ప్రవేశించి  నీకు ఆహారమౌతాను అని ప్రతిన చేస్తున్నాను నమ్ము ‘’అన్నాడు ,తనను దాటి ఎవరూ ముందుకు పోలేరని ,తనకు కబ్రహ్మ వరం ఉంది ‘’అన్నది  కామరూపిణి సరస .బుద్ధిమాన్ హనుమ వెంటనే ఆమె నోట్లో ప్రవేశించి క్షణం లో బయటికి వచ్చేసి ‘’దాక్షాయణీ !నీవు కోరినట్లే నీ నోట్లో దూరాను  బయటికి వచ్చేశాను. బ్రహ్మవరం సార్ధకమైంది కదా. నమస్కారం ‘’అన్నాడు .ఆమె తన సహజ రూపం పొంది ‘’హరి శ్రేస్టా!ఇక సుఖంగా ప్రయాణం సాగించు సీతాదేవినీ, రాముడిని కలిపి పుణ్యం కట్టుకో ‘’అని దీవించింది .దీనితో నాగమాత ఆశీస్సులూ దక్కి  మరింత ఉత్సాహం తోప్రయాణం సాగించాడు .క్రిందికి ముడుచుకొన్న రెక్కలతో నాలుగు దిక్కులకు వ్యాపించిన  పర్వత రాజు  లాగా హనుమ కనిపించాడు .

  ఈఘట్టం లో దేవతలు హనుమ ధీశక్తిని పరీక్షించారు .వివేకంతో అతడు సురస నోట్లో దూరి అవ్యవధానం గా బయటికొచ్చి తన తెలివి తేటలు ప్రదర్శించి సురసద్వారా దేవ యక్ష గ౦ధర్వ మహర్షుల అభిమానాన్ని పొంది ఆశీస్సుల౦దు కొన్నాడు .ఇవన్నీ అతని బలాన్ని మరింతగా పెంచాయి .మేధస్సును పదును పెట్టాయి .అఘటన ఘటనా సమర్ధుడు అనిపించుకొన్నాడు .కనుక అతనికి దుష్కరకార్యం ఉండదు అని తేట తెల్లమైంది .

   సశేషం

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -20-4-20-ఉయ్యూరు  

 

Posted in రచనలు | Tagged | Leave a comment

ప్రపంచ దేశాల సారస్వతం 43-కామరోనియన్ సాహిత్యం

ప్రపంచ దేశాల సారస్వతం

మనవి-ప్రపంచమంతా కరోనా వైరస్ తో  విలవిలలాడుతూ గిజగిజ తన్నుకొంతుంటే ,కరోనా పేరే తెలీని, సోకని  16 దేశాలున్నాయట .వాటినీ ఆదేశ ప్రజలను అభినందిస్తూ ,వాటి గురించి ,ఆ దేశాల సాహిత్యాన్ని గురించి ఇప్పుడు వరుసగా తెలియ జేసే కార్యక్రమం మొదలు పెట్టాను .ఆ దేశాలే కామరోస్ ,కిరబాది మొదలైనవి .

యూనియన్ ఆఫ్ కామరాస్ దేశం హిందూ మహా సముద్రం లో ఉత్తర చివరనమొజాంబిక్ చానల్ దగ్గర ఆఫ్రికా తూర్పు తీరం లోని ఐలాండ్ .రాజధాని మొరోని .సున్నిమతస్తులు .ఆరబ్ లీగ్ లో సభ్యత్వమున్న దేశం .ఆరబ్ ప్రపంచంలో ఈ దేశం ఒక్కటే దక్షిణార్ధ గోళం లో ఉన్నది .అగ్నిపర్వత భయం జాస్తీగా ఉన్న దేశం  .భాష కామరోనియన్ లేక’’ షికోమోరి’’ .కామరోనియాన్ భాష –బంటూ భాషాజన్యం .అరెబిక్ ,లాటిన్ లిపులు వాడుతారు ఫ్రెంచ్ కూడా అధికారభాషగా ఉన్నది ఆరబిక్ తోపాటు.30ఏళ్ళ రాజకీయ పోరాటం చేసి 1975లో స్వతంత్రం పొందింది .ఇక్కడ ట్రాపికల్ క్లైమేట్ ఉంటుంది .కామరాస్ అడవులు దట్టంగా వ్యాపించి మంచి వర్షాలనిస్తాయి.ఫెడరల్ ప్రభుత్వం అధికారం .ఇస్లామిక్ చట్టాలే అమలౌతాయి .మగవారైనా ఆడవారైనా అనైతిక సెక్స్ కు అర్హులుకారు .జనాభాసుమారు పది లక్షలు .ఇక్కడ ఎత్నిక్   గ్రూపులు ఎక్కువ .జనసామాన్యభాష కామోరియన్.లక్షమంది జనాలకు 15మంది డాక్టర్లే ఉంటారు .45శాతం ప్రజ దారిద్ర్య రేఖకు కిందే ఉంటారు .

  చదువులన్నీ ఖురానిక్ స్కూల్స్ లోనే జరుగుతాయి .టీచర్ ట్రయినింగ్ తక్కువకనుక విద్యా వ్యవస్థ బాగుండదు ,వసతులు చాలాతక్కువ .పూర్వం యూని వర్సిటి చదువులకోసం ఇతర దేశాలకు వెళ్ళాల్సి వచ్చేది .స్త్రీలు చీర లాంటి డ్రెస్ వేసుకొంటారు .మగాళ్ళు కలర్ ఫుల్ లాంగ్ డ్రెస్ వాడుతారు .పెళ్ళిళ్ళు రెండురకాలు .1-లిటిల్ మారేజ్ 2-గ్రాండ్ మారేజ్ .మొదటిది చట్టబద్ధమైన సింపుల్ మారేజ్ .ఖర్చు తక్కువ .వరకట్నం పెద్దగా ఉండదు .ఈ పెళ్లి గ్రాండ్ మారేజ్ దాకా చెల్లుబాటౌతుంది .గ్రాండ్ మారేజ్ లో హంగూ ఆర్భాటం నగలు నట్రా పెద్దకట్నం లతో ఆర్భాటంగా 15రోజులు చేస్తారు .గ్రాండ్ మారేజ్ కి దాదాపు లక్ష డాలర్లు ఖర్చు చేస్తారు ఇందులో మూడవవంతు మాత్రమె పెళ్ళికూతురు వాళ్లఖర్చు .మిగిలింది వరుడు తాలూకు వారే భరిస్తారు .కామరన్ ఐలాండ్స్ లో ఇది సోషల్ స్టేటస్ కు చిహ్నం .ఇంతఖర్చా అనే వారూ ఉన్నారక్కడ .ప్రభుత్వ దినపత్రిక ‘’అల్ వతన్’’

  మారుమూల దేశం అనిపించినా భద్రతా బాగానే ఉంటుంది.కొమొరియన్ ఆర్చి పెలగో లో ఉండటం వలన అగ్ని పర్వత భయం ఎక్కువ .కానీ ‘’పెర్ ఫ్యూమ్డ్ ఐలాండ్స్ ‘’అంటారు .కారణం వనౌషధుల సువాసన ,అందమైన ప్రకృతి పరిసరాలు.అందుకే నెమో ఇక్కడ కరోనా రావటానికి భయపడి ఉంటుంది .అంటే వనౌషధ మహాత్మ్యం కరోనాకు’’నో ఎంట్రి ‘’అన్నదన్నమాట .

 కామరోనియన్ సాహిత్య కారులలో మహమ్మద్ అహమ్మద్ చమంగా ముఖ్యుడు .లింగ్విస్ట్ ,పరిశోధకుడు రాజకీయవేత్త ,ప్రొఫెసర్ .స్వాహిలి , అరెబిక్ భాషలు చదివి  మడగాస్కర్ ఫ్రాన్స్ లు పర్యటించి అనుభవాలతో ‘’షికోమోరి’’అనే వ్రాత ప్రతి సృష్టించి అందులో వ్యాసాలూ రాశాడు .తర్వాత తనపరిశోదనను 1991లో ముద్రించాడు .ప్రస్తుతం పారిస్ లో’’ నేషనల్ డెస్ లాంగ్వేజెస్ ఎట్ సివిలిజేషన్స్ ఓరియ౦టల్స్’’లో బోధన చేసి కామరోస్ యూని వర్సిటి ఏర్పడ్డాక ఇక్కడే ప్రొఫెసర్ గా ఉన్నాడు .

  స్త్రీరచయితలలో కోరాల్లి ఫ్రీ ,తౌహ్ఫాట్ మౌహ్తరే,ఫైజా సోయి యూసఫ్ ఉన్నారు .కోరాల్లీ నర్సింగ్ డిప్లోమాచేసి, వృత్తిలో ఉంటూ రచనలు చేసింది  .ప్రస్తుతనివాసం స్విట్జర్లాండ్ .కవిత్వం తోపాటు నవలలూ రాసింది .ఇంగ్లిష్ ,స్పానిష్ లలో దిట్ట .టౌలోసి,పావూ యూని వర్సిటీలలో చదివింది .ఫ్రెంచ్ ,జర్మన్ భాషలలో నవలలు కవిత్వమా రాస్తూనే ఉన్నది .ఆమె రచనలు-లా పెరు డెస్ కొమరిస్ ,లాట్రే కోటే డీ లోషియన్,లి జర్నల్ డే మాయా కాన్ఫిడెన్స్ డున్ చాట్ .మౌహతారే అనేక దేశాలలో నివసించింది ఇక్కడపుట్టినా .సేర్బార్న్ నుంచి ఫారిన్ లాంగ్వేజెస్ లో డిప్లోమాహోల్డర్.వచన రచయితలో రెండవ స్థానం .కవిత్వమూ రాసింది .’’ఆమెస్ సస్పెండిస్’’అనే తననవలా సంపుటి 2011లో వెలువరించింది .ఆమె వ్యాసాలూ అనేక పత్రికలలో  వచ్చాయి .ఫైజా యూసఫ్ –జర్నలిస్ట్ ,నావలిస్ట్ .ఆమె నవల ‘’ఘిజ్జా ‘’2015లో వచ్చింది .ఆల్ వతన్ పత్రిక సంపాదకురాలుకూడా .తనరచనలకు తగిన పురస్కారాలూ పొందింది.

  సశేషం

 మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -20-4-20-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

సార్ధక స్మృతి దినం

సార్ధక స్మృతి దినం

మాచిన్నక్కయ్య శ్రీమతి వేలూరి దుర్గ రెండేళ్ళక్రితం ఇదే రోజు చైత్ర బహుళ త్రయోదశి నాడు మరణించింది .ఇవాళ 20వ తేదీ సోమవారం ఆమె రెండవ వర్ధంతి రోజైన స్మృతి దినం . హైదరాబాద్ లో  ఈ రోజు పెట్టాల్సిన ఆబ్దికం కరోనా లాక్ డౌన్ వలన సాధ్యపడలేదు ఆకుటుంబానికి .బ్రాహ్మణుడిని పిలిచి మా బావగారు శ్రీ వివేకానంద్ గారు  ,పెద్దమేనల్లుడు ఛి అశోక్ కుటుంబం ఇంట్లో స్వయం పాకం ఇస్తున్నట్లు అమెరికాలో ఉన్న మా చిన్న మేనల్లుడు ఛి వేలూరి మృత్యుంజయ శాస్త్రి (Jay Veluri )ఈ 18శనివారం వట్సాప్ లో నా బాంక్ అకౌంట్  కు డబ్బు పంపించినట్లు ,దాన్ని ఉయ్యూరులో మా అబ్బాయి రమణ మిత్రబృందం నిర్వహిస్తున్న నిరుపేదల అన్నదానానికి ఉపయోగించమని కోరాడు .మంచి సార్ధకమైన ఆలోచన అనిపించింది .రమణతో మాట్లాడి ఈ సోమవారం నాడు సరసభారతిద్వారా  100 మంది నిరుపేద ఎరుకలు ,ఏనాదులలైన ,పనులు లేక , ఇంట్లో పస్తు పడుకొంటున్న ,వంట చేసుకోవటానికి నిత్యావసర వస్తువులు కూడా లేని ప్రజలకు రిక్షాలున్నా,తొక్కే వీలులేని  రిక్షా కార్మికులకు వారి కుటుంబాలకు  ఆరోగ్యవంతమైన క్వాలిటి ఆహారం –ఒక స్వీటు ఒక హాట్ ,పప్పు కూరా పచ్చడి సాంబారు ,పెరుగు ,మంచినీళ్ళ పాకెట్ తో సహా  పాకెట్లను  కేటరింగ్ కోటేశ్వరరావు కుటుంబం తో తయారు చేయించి,ఉదయం 10గంటలనుంచి ఇళ్ళకు వెళ్లి పంచిపెట్టే కార్యక్రమ౦ నిర్వహించాం .రమణకు మా ఎమ్మెల్సి శ్రీ రాజేంద్ర ప్రసాద్ కు ఉన్న చనువుతో అతన్ని కూడా ఆహ్వానించి ఆతని చేతులమీదుగా ఇవ్వాలని భావించాం.సరిగ్గా 10కి రావాల్సిన అతను,ఇలాంటిదే ,వేరేకార్యక్రమ౦ ముగించుకొని వచ్చేసరికి 11దాటింది .అతని కారులో సిటీ కేబుల్ వాళ్ళూ, మందీ మార్బలంతో నేనూ కూడా కూర్చుని   అనుకొన్నవార౦దరికి అనుకొన్నట్లు అందజేసి సంతృప్తి చెందాం .

  ఈ విధమైన సేవను రోజుకు 100 మందికి మా రమణ,ఆంజనేయులు ,కోటేశ్వరరావు వాళ్ళ అబ్బాయిల , బృందం ఇవాల్టికి 26రోజులుగా  కొనసాగిస్తున్నారు .దీనికి ఉదారులైన దాతలు స్వచ్చందంగా ముందుకు వచ్చి ఆర్ధిక సాయం చేస్తూ తోడ్పడటం అభినందనీయం .వారందరినీ అభినందిస్తున్నాను .ఇలాంటి నిరుపేదలు మనదేశం లో దాదాపు 10కోట్లమంది ఉన్నారు .దేశమంతటా ఇలాంటి సహృదయులు ఉంటే ,ఆకలితో అలమటించే నిర్భాగ్యులు ఉండరు .’’ఒక్క నిరుపేద ఉన్నంత వరకు ,ఒక్క మలినాశ్రుబిందు వొరిగినంత వరకు –ఒక ప్రేగు ఆకలి కనలి నంతవరకు –నాకు శాంతి కలుగదు నేస్తం ,నేను నిగర్వి నయ్యాను –ఈ సిగ్గులేని ముఖాన్ని చూపించలేను  -ఈ గుండెగూడుపట్లు  ఎక్కడో కదిలినవి –ఈకనులు వరదలై పారినవి –ఈకలలు కాగితపు పేలికలై కాలినవి ‘’అని ఆర్తిగా ‘’ఆర్తగీతం ‘’రాసిన అనుభూతి కవి స్వర్గీయ దేవరకొండ బాలగంగాధర తిలక్ మాటలు మనందరికీ వేద వాక్యాలై కర్తవ్య బోధ చేయాలి .

 నిజంగా మా చిన్నక్కయ్య తిది ఈ రోజు ఈ పేదలకు అన్నప్రసాద వినియోగం తో సార్ధకమైంది .ఇదే ఆమెకు అర్ధవంతమైన స్మృత్యంజలి . ఆకుటుంబం కలకాలం ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలి ఆమె ఆశీస్సులు అనుక్షణం వారికి మార్గ దర్శనం చేయాలి.సమయజ్ఞత తో ఈ కార్యక్రమానికి ధనం పంపి సద్వినియోగం చేయించిన మా మేనల్లుడు శాస్త్రి బహుధా అభిన౦దనీయుడు .ఆ కుటుంబానికి శుభం భూయాత్ .

  మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -20-4-20

 

 

 

 

 

 ,

    

 
Posted in సరసభారతి ఉయ్యూరు | Tagged | Leave a comment

సుందర కాండ లో హనుమ బహుముఖీన వ్యక్తిత్వం-3

సుందర కాండ లో హనుమ బహుముఖీన వ్యక్తిత్వం-3

ఆకాశం లో చేతులు సాఛి హనుమ ఎగురుతుంటే ,ఆ చేతులు పర్వత శిఖరాలనుంచి వస్తున్న అయిదు తలల సర్పాలులాగా ఉన్నాయి .ఒక్కోసారి మరీ కిందకు దిగి ఎగురుతుంటే సముద్రజలాలను తాగుతున్నాడేమో అనిపించింది .రెండుకళ్ళుమెరుపులతో ఉన్న అగ్నిగోళాలుగా,ఉదయించే సూర్య చంద్రుల్లా  దర్శనమిచ్చాయి .ఎర్రని ముక్కు కాంతి వలన ముఖం సంధ్యారాగ సూర్యుని తలపిస్తోంది .తోక ఇంద్రధ్వజమే అనిపించింది .తోకను తన చుట్టూ చక్రాకారం గా ముడుచుకొని ఎగురుతుంటే సూర్యుని కిరీటం లాగా అందులోని సూర్యునిలాగా భాసించాడు .వాల మూలం చీల్చబడిన గైరికాది ధాతుమయమైన గిరిలా కనిపించాడు .కటి ప్రదేశంనుంచి వెళ్తున్నగాలి మేఘ గర్జనలా ఉన్నది .ఉత్తరదిక్కులో కనిపించే తోకతో ఉండే ఉల్క ఏమో అనే భ్రమకలిగిస్తోంది .ఆకాశం లో హనుమ ,క్రింది జలరాశిలో ఆయన ప్రతిబింబం చూస్తె తెరచాప తో గాలి వేగానికి అతి వేగంగా వెడుతున్న నావ లాగా ఉన్నాడు .ఆయనగమన వేగానికి గాలి భయంకరంగా గర్జించే సముద్రం కూడా అందర్నీ కలవర పరుస్తున్నాయి.ఆయన గమన వేగానికి సముద్ర జలం మేఘ మండలం దాకా వ్యాపించి శరత్కాల మేఘ సదృశంగా ఉన్నది .సముద్ర సర్పాలు అల్లకల్లోల జలదినుంచి భయంతో పైకెగసి ఆయన తమను భక్షి౦చ టానికి వస్తున్న గరుత్మ౦తుడేమో అనుకొన్నాయి  .హరి వీరుని నీడ పది యోజనాల వెడల్పు ,ముప్ఫై యోజనాల పొడవుతో సముద్ర జలం పై బహు సుందరంగా భాసించింది .అది సముద్రంలో వ్యాపించిన దట్టమైన నిర్మల మేఘాల వరుస లాగా ఉన్నది .సముద్రజలం అతని వేగానికి అడుగంటి ద్రోణి ఏర్పడినట్లు,ఏదో ఉపద్రవం రాబోతున్న సూచనగా ఉన్నది .రంగురంగుల మేఘాలమధ్య ,మబ్బుల చాటున దాగి మళ్ళీ బయటికి వస్తుంటే చంద్రునిలా అనిపించాడు .తనవంశ పావనుడైన శ్రీ రాముని కార్య దురంధరుడు కనుక గురువు సూర్యుడు, తండ్రి వాయువు తమప్రతాపాలను చూపక చల్లగా కనికరంగా ఉన్నారు .యక్షకిన్నెర కింపురుషాదులు ఋషులు హనుమ ను చూసి స్తోత్రాలు చేసి ,మానసికోల్లాసం కలిగించారు .

  ఇక్ష్వాకు వంశజులైన సగర పుత్రులతో వర్ధిల్లిన,ఆ వంశ క్షేమం గౌరవం  కోరే  సాగరుడు తనలో తానూ వితర్కి౦చు కొన్నాడు .’’వానరకుల శ్రేష్టుడు హనుమకు నేనిప్పుడు ఏదో కొంత సాయం చేయకపోతే లోకం నన్ను నిందిస్తుంది .ఇఖ్వాకు వంశకులజుడైన శ్రీరాముని దూత హనుమ .అతనికార్యానికి ఏ కష్టమూ రాకూడదు .అలసి పోయి ఉంటాడు కనుక కాస్త విశ్రాంతి పొందే ఆలోచన చేయాలి .విశ్రాంతి తర్వాత యధాప్రకారం రెట్టించిన ఉత్సాహంతో గమ్యానికి బయల్దేరి వెడతాడు ‘’అని భావించాడు .తనలో దాగిఉన్న మైనాక పర్వతం ఇప్పుడు తోడుపదటాడని అనుకోని ,పిలఛి ‘’మైనాకా !పాతాళం లో ఉన్న రాక్షసులు భూమిపైకి రాకుండా ఉండటానికి ఇంద్రుడు నిన్ను నాలో ఇనుప గడియగా అడ్డంగా ఉంచాడు .నువ్వు రాక్షసమూకలు పైకి వచ్చి చెలరేగకుండా పాతాలలోక ద్వారాన్ని బాగా కప్పేశావు .నువ్వు అన్ని వైపులా పెరగగల సామర్ధ్యమున్నవాడివి .కనుక ‘’సంచోదయామి త్వాముత్తిస్ట గిరి సత్తమ –స ఏష కపి శార్దూల స్త్వా ముపర్యేతివీర్యవాన్ –హనుమాన్ రామకార్యార్ధం భీమకర్మా ఖ మాప్లుతః –అస్య కార్యం మయాకార్య మిక్ష్వాకు కులవర్తినః ‘’అంటూ సీతాన్వేషణ అనే పవిత్రకార్యం పై వచ్చిన హనుమ మనకు అతిధి .పూజనీయుడు .కనుక నీటిపైకి వచ్చి నీ శిఖరం పై కాసేపు విశ్రమించమని నాతరఫున అర్ధించు ‘’అని కోరాడు .

  సముద్రుని మాటకు గౌరవమిచ్చి మైనాకుడు పెద్ద చెట్టు, తీగలతో పైకి వచ్చి తనశిఖర దర్శనం కల్గించి నూరుమంది సూర్యులు ఒకే సారి ఉదయించినట్లు అధికకా౦తితో విరాజిల్లాడు .ఇది తన ప్రయాణం లో తొలి విఘ్నం గా భావించి హనుమ ,తానూ మహావేగంగా పెరిగి మేఘాన్ని వాయువు చెదరగోట్టినట్లు తన రొమ్ము దెబ్బతో సునాయాసంగా పడేశాడు .అకస్మాత్తుగా ఇలా జరుగుతుందని భావించని మైనాకుడు బిత్తరపోయి ,హనుమ వేగాన్ని మెచ్చుకొని పులకించి ఆనందించి .మానవ రూపం పొంది ‘’కపి శ్రేస్టా! హనుమంతా !ఎవ్వరికీ సాధ్యంకాని పని చేస్తున్నావు అభినందనలు .కాసేపు నా శిఖరం పై విశ్రమించి సేద తీర్చుకొని మళ్ళీ ప్రయాణం సాగించు .సముద్రుడు రాముని పూర్వులచే వర్దిల్లినవాడు .కనుక రామహితం కోసం నన్ను ఇలా చేయమని చెప్పించాడు .నీకు ఆతిధ్యమిచ్చి తనకోరిక తీర్చుకోవాలని తలచాడు .మాకూ మీకూ చాలాకాలం నుంచి సత్సంబంధాలున్నాయి .ఇది అతిధి ధర్మమే .నీకు నేను చేసే పూజ మీ తండ్రి వాయు దేవునికిచేసే పూజ అవుతుంది .కృత యుగం లో పర్వతాలకు రెక్కలు ఉండేవి .గరుత్మ౦తు నిలాగా ,వాయువు లాగా అన్ని దిక్కులకు యెగిరి పోయేవి .సకల జీవరాసులు మా గమనానికి భయపడి పోయాయి .ఇంద్రుని ప్రార్ధించాయి .శతక్రతువు ఐన దేవేంద్రుడు పర్వతాల రెక్కలను  తన వజ్రాయుధంతో ఖండించాడు .నాపైకి కూడా రాగా మీ తండ్రి దయతో అతనికి అందకుండా నన్ను విసిరేశాడు .నేను వచ్చి ఈ సముద్రం లో పడటం వలన నా రెక్కలు అలాగే సురక్షితంగా ఉన్నాయి .కనుక సాగరుడికీ నాకూ పరమ ఆత్మీయుడవుకనుక మా ఆతిధ్యం పొంది వెళ్ళు ‘’అని వేడుకొన్నాడు .మతిమాన్ హనుమ ‘’నీఆదరణకు సంతోషం .నీ దర్శనమే నాకు ఆతిధ్యం .నేను కర్తవ్యమ్ మరువరాదు .చీకటిపడే లోగా లంకకు చేరాలి .నేను చేసిన ప్రతిజ్ఞప్రకారం ఎక్కడా క్షణం కూడా ఆగకూడదు ‘’అని చిరునవ్వుతో సమాధానం చెప్పి తన పవిత్ర హస్తం తో మైనాకుని తాకగా సముద్ర ,మైనాకులు ‘’నీ వల్ల రామకార్యం సఫలీకృతం అవుగాక ‘’అని రామకార్యానికి తగ్గట్లు ఆశీర్వదించగా  రివ్వున ఆకాశానికి యెగిరి హనుమ వాయుమార్గాన గమనం సాగించాడు .

  ఈ భాగం లో హనుమ ను సూర్య చంద్ర అగ్ని వాయు రూపాలుగా వర్ణించాడు వాల్మీకి మహర్షి .వారి ప్రతాపాలన్నీ ఆయనలో నిండి నిబిడీకృతం అయ్యాయని భావన .కనుక కార్యం అసాధ్యం కాదని సూచన .సూర్య వాయుదేవులు కూడాఆయనకు  అనుకూలంగా ఉండి సాయం చేస్తున్నారు ప్రతాపాలు చూపక తగ్గి ఉన్నారు .మహర్షులు ,దేవతలు మొదలైనవారు ఆశీర్వదించారు.వారి ఆశీస్సులు అమోఘం కనుక తప్పక ఫలిస్తాయి .ఇక్కడ సాగరుని ఆలోచనా అభినందనీయమే .హనుమకు కాసింత విశ్రాంతి నివ్వాలని ఆతిధ్యమిచ్చి ధన్యత చెందాలని భావించటం సహజం .కనుక హనుమ తండ్రి మైనాకుడికి చేసినసాయం గుర్తుకొచ్చి అతని ద్వారా తన కోరిక తీర్చుకోవాలనుకొన్నాడు .మైనాకుడూ తనవంతు ధర్మం  నెరవేర్చాడు .మైనాకుని రెక్కలు కత్తిరి౦పబడ లేదనే సత్యమూ మనకు తెలిసింది ఇక్కడ .కారణం వాయువు అన్న విషయమూ అర్ధమైంది . కానీ వీరిద్దరికీ హనుమ చేసిన ప్రతిజ్ఞ తెలీదు .ఆతిధ్యం ఇద్దాము అనే ధ్యాసతప్ప  రామ కార్యానికి  ఆలస్యకారణం అవుతాము అన్న ఆలోచన లేదు వారికి .అందుకే సంస్కార వంతుడు హనుమ సున్నితంగా వారి మర్యాదలకు అది సమయం కాదని తన ప్రతిన విషయం చెప్పి నిరుత్తరులనుచేసి తెలివిగా బయట పడ్డాడు .తక్షణ వివేకమే ఎప్పటికీ ఉత్తమ ఫలితమిస్తుందని మనకు కూడా ఎరుక పరచాడు ఆంజనేయుడు .

   సశేషం

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -19-4-20-ఉయ్యూరు

 

image.png

 

 

 

 

 

Posted in రచనలు | Tagged | Leave a comment

ప్రపంచ దేశాల సారస్వతం 42-రష్యన్ సాహిత్యం-4(చివరిభాగం )

ప్రపంచ దేశాల సారస్వతం

42-రష్యన్ సాహిత్యం-4(చివరిభాగం )

సామ్యవాద యుగం -1918 నుంచి –ఈ యుగం లో సాహిత్యం సామాజిక ప్రగతికే అంకితమైంది .విప్లవనేత వ్లాడిమిర్ లెనిన్ ,అతని అనుచరుడు ట్రాట్ స్కి.’’సాహిత్యం –విప్లవం ‘’రాసిన ట్రాట్ స్కి సోషలిస్ట్ సోసైటీ నిర్మాణానికి సాహిత్యం చేసే తోడ్పాటు ను వివరించాడు .ఆనాడు విప్లవభావాలు లేని రచయితలకు ఆడరణ లేదు .విప్లవాభిమాన రచయితలు ‘’పొవుట్చకి’’అంటే ‘’శక్తికొద్దీ సహకరించే వారు అనే పేరుతొ సంఘాన్ని ఏర్పాటు చేశారు .దీనితర్వాత శ్రామిక నవలా రచయితల సంఘం ఏర్పడి వారి రచనలు ప్రజామోదం బాగా పొందాయి .ఈ వర్గ రచయితలు-ఏటం  వేస్లి,ఫడ సెరికి సేమోనాన్ ప్రముఖులు .శ్రామికులు ఉత్పత్తి పెంచటం లో ,పనిలో శ్రద్ధ లపై ఈ రచనలు వచ్చాయి .’’నా జన్మభూమి ‘’అన్న వేసిలీ రచన -1926 బహుళ ప్రచారమైంది .ఇతనికంటే పెద్దవాడైన ఇలియా ఎలెన్ బెర్గ్  విశ్వ విఖ్యాతి నార్జించిన బహు గ్రంథ రచయిత..రచనకు గొప్ప సార్ధక్యం తెచ్చి ప్రపంచ ప్రసిద్ధిపొందినవాడు –బోరిస్ పాస్టర్ నాక్-1890-1960..మానసిక సంఘర్షణనలను చిత్రించటం లో ఇతనికి ఇతడే సాటి .ఇతని ‘’డాక్టర్ జివాగో ‘’ప్రపంచ ఉత్తమ గ్రంథం గా వన్నెకెక్కింది .దీనికి 1958లో నోబెల్ ప్రైజ్ పొందాడు .ఐతే నాటి సోవియెట్ రష్యా సమాజం తనకు నచ్చకపోవటం వలన ప్రైజ్ ను తీసుకోవటానికి నిరాకరించాడు .

 20వ శతాబ్ది ప్రసిద్ధ 10 మంది రష్యన్ రచయితలు –అలేగ్జాండర్ సోల్జేనిట్స్కి  .ఇతని గులాగ్ ఆర్చ్ పెలాగో ,ఒన్ డే ఇన్ దిలైఫ్ ఆఫ్ ఇవాన్ డేనిసో విచ్ ‘’నవలలు సుప్రసిద్దాలు .వ్లాడిమిర్ నబకోవ్-ఎంటోమాలజిస్ట్ ..ఇతని ‘’లోలిత ‘’నవల జగత్ ప్రసిద్ధం .క్లాసిక్ గా గుర్తింపు పొందింది .7 నేషనల్ బుక్ అవార్డ్ అందుకొన్న అరుదైన రచయిత.మైకేల్ బుల్గకోవ్ –డాక్టర్ రచయిత నాటక కారుడు .సోవియట్ రష్యా సమాజం పాలనపై వ్యంగ్య రచనలు చేశాడు .మాస్టర్ అండ్ మార్గరిట  ‘’నవల సుప్రసిద్ధమైనది .ఇవాన్ బునిన్ –రష్యన్ సాహిత్యం లో మొదటి నోబెల్ పొందినవాడు .వాస్తవికత కు అద్ద౦ పట్టాడు కవికూడా .అతని ఆటోగ్రాఫ్ ఐన ‘’ది విలేజ్ అండ్ డ్రై కాలీ’’బాగా పేరు పొందింది .వీరితో పాటు ఈకాలపు సుప్రసిద్ధ రచయితలైన టాల్ స్టాయ్ ,డాస్టో విస్కీ ,గోగోల్ ,చెకోవ్ ,టర్జెనేవ్,పుష్కిన్ మొదలైనవారి గురించి ముందే తెలుసుకొన్నాం .10ప్రసిద్ధ నవలలు –యుజిన్ ఒన్ జీన్ –పుష్కిన్ ,దిహీరో ఆఫ్ అవర్ టైం-మైకేల్ లేర్మనెంటో,ఫాదర్స్ అండ్ సన్స్ -టుర్గెనోవ్ ,దిబ్రదర్స్ కర్మజోవ్ –డాస్టో విస్కీ ,డాక్టర్ జివాగో –బోరిస్ పాస్టర్ నాక్ ,దిక్వయట్ ఫ్లొస్ డాన్-మైకేల్ షుల్కొవ్,లైఫ్ అండ్ ఫేట్-వాసిలి గ్రాస్ మన్,వన్ డే ఇన్ దిలైఫ్ ఆఫ్ ఇవాన్ డెనిసో విచ్-అలేగ్జాండర్ సోల్జెన్ ట్సిన్,దిఫనరల్ పార్టి-లియుడ్ మిలా ఉలిత్సయ .

21వ శతాబ్ది గొప్ప రచయితలలు- లియుడ్ మిలా ఉలిత్సయ,వేరాపోలోనో జోకోవ,బోరిస్ ఆకునిన్ ,మైకేల్ షిష్కిన్ ,డిమిట్రిగ్లుకోవ్ స్కి ,తాత్యాన  టాల్ స్టాయ

21వ శతాబ్ది గొప్పరచనలు,రచయితలు   –లుయుడ్ మిల ఉలిట్సయ –అంతర్జాతీయ ఖ్యాతి పొందిన రచయిత్రి .మొదటినవల ‘’సోనేచ్కా ‘’.సమకాలీన రష్యన్ రచయితలలో మిక్కిలి పాప్యులరాటి పొందింది .వీరా పోలోజ్ కోవా -5వ ఏటనే కవిత్వం రాసింది .2008లో మొదటికవితా సంపుటితో పేరుపొందింది .బోరిస్ అకునిన్ –డిటెక్టివ్ నవలారచయిత.ఎన్నెన్నో అపరాధ పరిశోధకనవలలతో ప్రసిద్ధి పొందాడు .మైకేల్ షిషిస్కిన్-మూడు రష్యన్ లిటరరీ అవార్డ్ లు పొందాడు .సాహిత్యం లో పుష్కిన్ వారసుడుగా గుర్తింపు పొందాడు .డిమిట్రి గ్లూకో విస్కీ –సైన్స్ ఫిక్షన్ రచనలతో ఉర్రూత లూగించాడు .మెట్రో -2033అనే ఇతని పోస్ట్ అపోనోపలిప్టిక్ నవల  మాస్కో మెట్రో పై రచన .దీనితోపాటు మెట్రో 2034,మెట్రో 2035 స్సేక్వేల్స్ రాశాడు.తాత్యానా టోల్ స్టాయ-టాల్ స్టాయ్ కి బహుదూరపు చుట్టరికం  ఉన్నరచయిత్రి  .టర్గెనోవ్ కు బంధువు .సర్రియలిజం రచయిత్రి .నేబకోవ్ తో ఈమె రచనలు పోలుస్తారు .

 సాహిత్య నోబెల్ ప్రైజ్ విన్నర్స్ –ఇవాన్ బునిన్ -1933,బోరిస్ పాస్టర్ నాక్ -1958మైకేల్ షలోకోవ్ -1965,అలేగ్జాండర్ సోల్జేన్ ట్సిన్- 1970,జోసెఫ్ బ్రాడ్ స్కి-1987,

  సశేషం

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -19-4-20-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

ప్రపంచ దేశాల సారస్వతం42-రష్యన్ సాహిత్యం-3

9వ శతాబ్ది మొదట్లో రష్యన్ రచయితలకు జర్మన్ సాహిత్యకారులతో పరిచయమేర్పడి కాల్పనికవాదం ప్రవేశించింది ..ఇందులో వాసిలీ యాన్డ్రీ విచ్ జకోస్కి -1783-1852 మొదటివాడు .ఇంగ్లిష్ రచయితలైన  బైరన్ ,స్కాట్ లనుకూడా యితడు పరిచయం చేశాడు .ఈ యుగ సాహిత్య౦ అంతా అలేగ్జాండర్  సెర్జియో విచ్ పుష్కిన్ -1799-1837 రచనలతో పరమ వైభవం పొందాయి .లుస్లాన్ అండ్ లయుడ్ మిల్లా ‘’అనే ఈతనికావ్యం కల్పనా చమత్కృతిలో విశిష్ట స్థానం పొందింది .లయ సరళత శైలీ త్రివేణీ సంగమంగా సాగింది .’’ఇవ్జినీ వన్ ఈజిన్ ‘’.అనేది ఉత్తమోత్తమకావ్యం .ప్రేమించి సర్వస్వం అర్పించటానికి సిద్ధమైన  ఒక అమాయిక బాలికను కాదని చివరికి ఆమె వేరోకడిని పెళ్ళాడి నా,క ఆమెశీలాన్ని నాశనం చేయాలని ప్రయత్నించిన మూర్ఖ యువకుడు నాయకుడు .పాత్ర పోషణా కల్పనా అసమానాలు .వచనం లోనూ కొత్త వొరవడి సృష్టించి గొప్ప రచనలు చేసి పండించాడు పుష్కిన్..మరికొందరు ప్రముఖులు –యాన్ టన్ అబ్రమో విచ్ డెల్విగ్-1798-1831,నికోలాయ్ మైకలో విచ్ యూజికోవ్ .ఈ యగ కడపటి రచయిత-మైకేల్ యూరి విచ్ లేర్మన్ టోవ్-1814-41.బీదవాడిని కధానాయకుడిగా తీసుకొని అతనిపై లోకానికున్న నిరసన చిత్రించి బాగా ప్రసిద్ధి పొందాడు .

  విప్లవ యుగం -1837-1917—పుష్కిన్ తర్వాత కవులకు గేయకావ్యాలపై ఆసక్తి తగ్గింది .కొత్త విజ్ఞాన శాస్త్ర భావనలకు ఊతం బాగా వచ్చింది వాస్తవిక వచనంపై ఆసక్తి పెరిగింది .దీనితో నవల వికసించింది 20వ శతాబ్దిలో రష్యా లో వచ్చిన  సాఘిక ,ఆర్ధిక విప్లవం రచనలలో ప్రతిఫలించాయి .ఈయుగ తొలి ప్రసిద్ధ రచయితలు -ఇవాన్ సార్జివిచ్ తర్జినీవ్ -1818-83.,నికోలాయ్ వాసిలోవిచ్ గోగోల్ .యూరోపియన్ సంస్కృతిని రష్యాలో ప్రవేశపెట్టినవాడు తర్జి నీవ్.ఇతడి 6నవలలో –తండ్రులు –పిల్లలు ,అనే పేరున్న నవల గొప్పది .దేవుదినికాదని సర్వం సైన్సు అని హేతువాదాన్ని నమ్మి అశాస్త్ర నియమాలను ప్రతిష్ట చేయటానికి ప్రయత్నించి విఫలుడైన బ్జరోవ్ అనే యువకుడు నాయకుడు .వెట్టి చాకిరీ చేసే వ్యవసాయ కూలీల దుర్భర జీవితాలను  ‘’క్రీడాకారుని స్మృతులు ‘’నవలగా రాశాడు .క్రిందితరగతి ఉద్యోగస్తుల లంచగొండి తనాన్ని హాస్యం తో మేళవించి ,వ్యవస్థాగత లోసుగుల్ని బయటపెట్టినవాడు గోగోల్ .బానిసల జీవితాలను మనో ప్రవృత్తులను  అద్భుతంగా  ఆవిష్కరించాడు .ఇతని సమకాలికుడే అలెగ్జాండర్ ఇవనో విచ్ గన్ చెరోవ్.ఇతని ‘’ఓబ్లామావ్ ‘’నవల లో అపూర్వ ప్రజ్ఞ కనబరచాడు  .ఈ యుగ సాహిత్య చక్రవర్తి కౌంట్ లియో టాల్ స్టాయ్ .-1828-1910.ఇతని వార్ అండ్ పీస్ నవల ఉత్క్కృస్టం అన్నాకేరీనీనా కూడా ప్రసిద్ధమైనదే చిన్నకథలూ విరివిగా రాశాడు ..ఎందరికో యితడు ఆదర్శప్రాయుడు .ఫాదర్ డాస్టో విస్కీ -1921-81.బీదల జీవితాలను గొప్పగా చిత్రించాడు .మానసిక వికృ  తులను చిత్రించటం లో ఘనాఘనుడు .సైకాలజీ ఫిలాసఫీ కలగలుపుగా గొప్పనవలలు రాశాడు .క్రైం అండ్ పనిష్ మెంట్,నోట్స్ ఫ్రం అండర్ గ్రౌండ్ ,దిఇడియట్ మొదలైన నవలలు గొప్పవి .నవీన నవలారచనకు మార్గదర్శి అయ్యాడు .దార్శనికుడు అంటారు .చాలామంది రచయితలున్నా టాల్ స్టాయ్ ,డాస్టో  విస్కీ అనే మర్రిమానుల కింద ఎదగలేకపోయారు .వీరి రచనలన్నీ 1880కి ముందే వచ్చాయి .తర్వాత పెద్దగా గొప్ప రచనలు రాలేదు .

  రాజకీయ నైరాసశ్యమూ ఒకకారణమే .ఇలాంటి అంధకార యుగం లో దీపంలాగా మెరిశాడు ఆంటాన్  పవలోవిచ్ చెకోవ్ .హాస్య శైలితో కథలు నవలలు రాసి గిలిగింతలు పెట్టాడు .పేదల ఇక్కట్లే ఇతని కథలు చప్పట్లు కొట్టించాయి .అనన్య సదృశ కథా శిల్పం ఇతని సొమ్ము .నాటకాలూ రాశాడు. చిన్నకథలకు పెద్ద పీటవేశాడు .’’మాస్టర్ ఆఫ్ ది మోడరన్ షార్ట్ స్టోరీస్ ‘’అంటారు ఇతని ప్రభావం పడనీ ఆధునికయుగ రచయిత లేనేలేడు .ఈయుగ రచయితలంతా ఆకాలపు అశాంతిని రచనలలో ప్రతిఫలింప జేశారు .కానీ పరిష్కారం చూపించినవారెవరూ లేకపోయారు .ఈ లోటు తీర్చిన మహానుభావుడే మాక్జిం గోర్కీ -1869-1939.గోర్కీ అంటే ప్రజలు అని అర్ధం .మార్క్స్ సిద్ధాంతాలను సామాన్యులకు అర్ధమయే భాషలో రచనలలో చెప్పాడు .బోల్షెవిక్ లు రష్యాను చీకట్లోకి తోసేస్తున్నారని ఎదురు తిరిగాడు ఇతడి ‘’అమ్మ ‘’నవల విశ్వవ్యాప్త కీర్తి నార్జించింది .సోషలిస్ట్ రియలిజం కు ఆద్యుడు .నాటకాలూ రాశాడు

   ఈకాలం లోనే ‘’ఆర్ట్ ఫర్ ఆర్ట్ సేక్ –కళకళకోసమే ఉద్యమం కూడా వచ్చింది.దీనిలో ముఖ్యుడు డిమిట్రి సేర్జియోవిచ్ మెర్జ్ కోవిస్కి .ఇతడి క్రైస్ట్ అండ్  యాన్టి  క్రైస్ట్ ‘’నవల ప్రముఖం..చివరికి ఇతడూ మార్క్స్ తీర్ధమే పుచ్చుకొన్నాడు .1917 రష్యన్ విప్లవానికి ముందు కొద్దికాలం పద్యం రాజ్యమేలింది .నికోలాయ్  స్టెవెనో విచ్ గుమిలేవ్ -1886-1921,భార్య అన్నా అఖ్మోతవా కావ్యాలు రాశారు .తర్వాత మహా విప్లవం వచ్చి ఇవన్నీ తుడిచిపెట్టుకుపోయి సాంఘిక రాజకీయ ఆర్దికాలలో పెనుమార్పులు వచ్ఛి సాహిత్యం లోనూ చోటుచేసుకొన్నాయి .

  సశేషం

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -18-4-20-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

సుందర కాండ లో హనుమ బహుముఖీన వ్యక్తిత్వం-2

సుందర కాండ లో హనుమ బహుముఖీన వ్యక్తిత్వం-2

సుగ్రీవుని పనుపున శ్రీ రామాజ్ఞ గా దక్షిణ వైపు సీతా దేవిని వెతకటానికి అంగదుని నాయకత్వం లో జాంబవంత ఆన్జనేయాదులు బయల్దేరి దక్షిణ సముద్రం చేరి అలసి కాసేపు విశ్రమించి సముద్ర లంఘనం విషయమై చర్చి౦చు కొంటున్నారు .ఇదేమీ తనపనికానట్లు నిర్లిప్తంగా ఒక ఎత్తైన బండమీద హనుమ శ్రీరామనామ  ధ్యానం చేస్తూ పులకించి మైమరిచిపోతూ విభూతి పొందుతున్నాడు .వానరనాయకులు తమ బలాబలాలను నిక్కచ్చిగా బేరీజు వేసుకొంటున్నారు .శత యోజన విస్తీర్ణ సముద్రాన్ని లంఘించి అమ్మవారి జాడ కనిపెట్టి తిరిగి రాగల సమర్ధుడు వారిలో ఎవరూ లేరని చివరికి తేల్చుకొన్నారు .కిం కర్తవ్యమ్ ?తమలో హనుమ లేడేమీ అని వితర్కించారు .సకల బల తేజస్సంపన్నుడు ధీర వీర శౌర్య హనుమాన్ కు మాత్రమె సముద్ర లంఘనం చేయగలవాడని జామ్బవాన్ తెలియ జేయగా ,ఆయన ఉన్న చోటుకు వెళ్లి ,అతని ధ్యానం అయేదాకా వేచి ఉండి,ముక్త కంఠం గా హనుమ మాత్రమె లంకను చేరగలడు అని చెప్పి అది ప్రభు ,రామకార్యం అనీ గుర్తు చేశారు .యోగబలం సాధించి స్పృహలోకి వచ్చి న హనుమకు వారి మాటలు వినిపించాయి .వారిలో దైన్యం ప్రస్పుటంగా కనిపిస్తోంది .చిన్న వారు చేతులు జోడించి నిలిచారు .అది సుగ్రీవాజ్ఞ గా జా౦బవాన్  నిర్ణయంగా ,యువరాజు కోరికగా గుర్తించాడు .’’నేనా !సముద్ర లంఘనమా మహాత్ములారా !పరాచికాలాడుతున్నారా ?అంతటి శక్తి సామర్ధ్యాలు నాకెక్కడివి ?సామాన్య వానరుడను .శక్తికి మించిన భారం నాపై పెట్టటం సముచితమా .చిన్నప్పుడు సూర్యుని దగ్గరకు బాల్య చాపల్యం తో తెలిసీ తెలియని వయసులో  వెళ్లానేమో ?దానికి ప్రాయశ్చిత్తమూ అనుభవించి దవడ  వాయ గొట్టి౦చు కొన్నాను కూడా .ఇది అలవిగాని పనినాకు అని సవినయంగా విన్న విస్తున్నాను ‘’అన్నాడు వృద్ధ  జాంబవంతునితో .ఆయన చిరునవ్వు నవ్వి ‘’ఆ౦జ నేయా !మేమందరం మా శక్తిసామర్ధ్యాలను చెప్పుకొని మా లో ఎవరివల్లా ఈ ఘనకార్యం సాధ్యం కాదని ఏకాభి ప్రాయానికి వచ్చి ,నీ శక్తి, యుక్తి ,ధీ శక్తి ,యోగ తేజస్సులన్నీ పరిగణనలోకి తీసుకొని కార్యభారాన్ని నీకు అప్పగిస్తున్నాం .క్షేమ౦గా వెళ్లి లాభంగా తిరిగిరా .మా అ౦దరి ఆశీస్సులు ,రాజు సుగ్రీవుని ఆజ్ఞ,శ్రీరామ అంగీకారం మా మాటల్లో ఉన్నాయి. సందేహింప పని లేదు .అమృత ఘడియలు సమీపిస్తున్నాయి .ఈ సమయంలో ప్రయాణం సర్వ విధ విజయకారకం అవుతుంది ‘’అన్నాడు .లేచి నుంచొని పెద్దలకు నమస్కరించి ఆశీర్వాదం పొందాడు.అయినా హనుమమనసులో ఎక్కడో సందేహ బీజం  మొలకెత్తింది .పరే౦గిత గ్రాహి ,జ్ఞాన వయో వృద్దు  జామ్బవాన్ ఇక ఆ సందేహ బీజం వృక్షం కాకూడదని  అక్కడికక్కడే చిదిమేయాలని భావించి ,అక్కడి వానరులందరి చేతా శ్రీరామ నామం బిగ్గరగా చేయించాడు మాట చెప్పకుండా కను సైగలతో .ఇంకేముంది .పరవశించి పోయాడు వీర ధీర బుద్ధ్హిమాన్ హనుమ .రామ నామో చ్చారణతో పాటు హనుమ గుణ గానం బాల్యాది చేసిన సాహస కృత్యాలు గేయాలుగా పాడించాడు .ఒక్కో గేయానికి ఒక్కో అంగుళం పెరిగిపోయాడు హనుమ .పూర్తిగా ఎదిగి పోయి యోగీశ్వరుడై ముకుళిత హస్తాలతో నిలుచున్నాడు .ఒకరకంగా స్తుతులకు ఉబ్బి పోయాడు .తన బలం తనకు తెలిసి వచ్చింది .తాను తప్ప ఈ అఘటనఘటనా సామర్ధ్యం ఎవ్వరికీలేదని పూర్తి విశ్వాసం ,నిశ్చయం కలిగింది .’’వానరుడే  మహనీయుడు శక్తియుతుడు ,యుక్తి యుతుడు వానరుడే ‘’అనిపించాడు .ఈ ఉత్సాహపు పొంగు  చల్లార కుండ కపి సైన్యం హనుమపై పుష్ప వృష్టి కురిపించారు .అంతే అదే గొప్ప బలవర్ధక టానిక్ గా పని చేసింది .అందరి వద్దా సెలవు తీసుకొని’’ జై శ్రీరాం’’ అంటూ  ఉచ్చ్చైస్వరం తో దిక్కులు పిక్కటిల్లేట్లు నినాదం చేయగా కపి సేన కూడా గొంతు కలుపగా ,అప్పటికే విజయోత్సవ వాతారణం  కనిపించింది అందరి ముఖాలలో .ఆనందం బాష్పాలుగా కన్నులనుండి స్రవించింది .’’విజయోస్తు దిగ్విజయోస్తు ‘’నాదాలు దశ దిశలా మారు మ్రోగాయి .’’ఆపదామపహర్తారం దాతారం సర్వ సంపదా౦-లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం ‘’శ్లోకం అందరి నోటామంగళ తూర్య ధ్వని లా  వినిపించి౦ది .

‘’తతో రావణ నీతాయా స్సీతాయా  శ్శత్రు కర్శనః –ఇయేష పద మన్వేస్టు౦ చారణే చరితే పథి’’

 ఇదీ సుందరకాండలో మహర్షి వాల్మీకి ప్రధమ శ్లోకం .స్వకార్య విరోదాలను రూపు మాపే వాడూ ,సర్వ సమర్ధుడు హనుమంతుడు ,రావణుడు అపహరించిన సీతాదేవి ఉండే చోటుకు వెతకటానికి సిద్ధ సాధ్యులు దేవతలు తిరుగాడే ఆకాశ మార్గం లో బయల్దేరాలని భావించాడు .శ్రీరాముని అభ్యుదయం కోరుతూ ,పర్వ దినాలలో  సముద్రం ఉప్పొంగినట్లు తన శరీరాన్ని పెంచేశాడు .తానున్న మహేంద్ర పర్వతాన్ని కాలితో ఒక్క నొక్కు నొక్కగా దానిపై ఉన్న సకల వృక్ష ప్రసూనాలు ఆయనపై రాలిపడి పూజ చేస్తున్నట్లు కనిపించాయి .అక్కడి విద్యాధరులు భయపడి ఆకాశమార్గం పట్టారు .హనుమ పని రామకార్యం వానరకార్యం కూడా .ఋషులు ఆకాశం లో నిలబడి ఆశీర్మంత్రాలు చదివి దీవించారు .ముడుచుకొని ఉన్న తోకను ఒక్క సారి ఝాడించగా అది సర్పం లాగా భయభ్రాంతుల్ని చేస్తూ ,గరుత్మంతుడు కాళ్ళతో తీసుకు పోయే కాల సర్పం లా భాసించింది .నడుం సన్నగా చేసుకొని కాళ్ళను,చేతులు మెడ  కుంచించి ,తనలో నిక్షిప్తమైన మహా తేజస్సును .మరింత పెరిగేట్లు చేసుకొని ముఖం పైకెత్తి ,తోటి వానరులతో ‘’యథా రాఘవ నిర్ముక్తః శరః  శ్వసన విక్రమః   -గచ్ఛేత్తద్వద్గమిష్యామి లంకాం రావణ పాలితాం-నహి ద్రక్ష్యామి యది తాం లంకాయాం జనకాత్మజాం  -అనేనైవ హి వేగేన గమిష్యామి సురాలయం ‘’విడువబడిన రామబాణం లక్ష్యం వైపు ఎలా దూసుకుపోతుందో అంటే ఎన్ని విఘ్నాలు మధ్యలో వచ్చినా ఆగకుండా ,నేను కూడా రావణపాలిత లంకకు చేరతాను .అక్కడ సీతా దేవి కనపడకపోతే ,అదే వేగంతో స్వర్గం వెళ్లి వెతుకుతా .అక్కడా జాడ దొరక్కపోతే ,క్షణం ఆలస్యం చేయక రాక్షసరాజు రావణుడిని లంకతో సహా పెకలించి  బంధించి తీసుకు వస్తా ‘’అని వానరులకు ఉత్సాహం కలిగించి తన దైన మార్గం లో ప్రయాణం సాగించాడు .

 ఒక్కసారి వెనక్కి చూస్తె నిర్లిప్తంగా తపస్సు చేసుకొంటున్న హనుమ పరిసరాలనే మర్చిపోయాడు .మంత్రాంగం సంగతి తెలీదు .తనపై ఇంత పెను భారం పెడతారని ఊహించలేదు .అక్కడి వారి పెద్దరికాన్ని మాటను గౌరవించి సముద్ర లంఘనకు బయల్దేరాడు .కానీ చపల చిత్తం కదా ,తనబలమేమిటో తనకు తెలీదు .దీన్ని బయటికి తేవటానికి జాంబవంతుని తెలివి కలిసొచ్చింది .ఉబ్బేయించాడు స్తోత్రాలతో ,ముఖ స్తుతి ఎంతటి సాహసానికైనా పురిగొల్పుతుంది .సమయోచిత ధర్మం అంటే ఇదే .తన బలపరాక్రమాలు వారి నోటి వెంట విని పొంగి ,యదార్ధమని  గ్రహించి  కార్యోన్ముఖుడయ్యాడు .అజ్ఞానం పొర తొలగి జ్ఞాన జ్యోతిస్సు దర్శించాడు .ప్రభుకార్యం తన దైవం రామకార్యయజ్ఞానికి  తాను ఒక సమిధను మాత్రమె అనే ఎరుకకలిగింది .ఎరుకకలిగితే శరీరం లో సర్వ శక్తులూ శత పత్ర పద్మ౦  లాగా విచ్చుకొంటాయి .ఇక ఎదురన్నది ఉండదు .అసాధ్యం సుసాధ్యమౌతుంది .అందుకే వీడ్కోలు పలుకుతూ రాముడు విడిచిన బాణ౦ లాగా లక్ష్యాన్ని చేరతాను అన్నాడు .అప్పటికే రామబాణ మహాత్మ్యం అతినికి వాలివదఘట్టం లో అంతకుముందు సప్తతాల భంజనం లో ప్రత్యక్షంగా చూసి ఉన్నాడుగా .కనుకనే  అలా పలకగలిగాడు .సీతమ్మ జాడ దొరక్కపోతే ఏం చేస్తానో అన్నదికూడా విస్పష్టంగా చెప్పాడు మహా మతిమంతుడు హనుమ .

  సశేషం

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -18-4-20-ఉయ్యూరు

    

image.png
Posted in రచనలు | Tagged | Leave a comment

సుందర కాండ లో హనుమ బహుముఖీన వ్యక్తిత్వం

  సుందర కాండ లో హనుమ బహుముఖీన వ్యక్తిత్వం

సుందరకాండ మనోభీస్టాలను ఫలప్రదం చేసే ,మధుర కాండ .నాకు ఇందులో ఆంజనేయుడు బహు పార్శ్వాలతో ,విభిన్న భావాలతో కనిపిస్తాడు .వీటిలో జాతి లక్షణమైన వానర లక్షణం తో పాటు ,అమాయక ,,తొందరపాటు ,ఆలోచనారహిత ,నిశ్చేష్ట ,నిర్లిప్త లక్షణాలూ ,ధీర వీర ,పరాక్రమ శౌర్య పార్శ్వాలూ ,ధీశక్తి ,మతిమంతత్వం ,రామభక్తి ,ప్రభుభక్తి ,కార్య నిర్వహణ దీక్ష ,అమ్మను చూడలేకపోయానన్న వేదన ఎవరినినో చూసి సీతమ్మ అని భావించి పొరబడిన విధం ,తప్పు చేసి వెంటనే సరి దిద్దుకొనే మాన్యలక్షణం  అన్నిటికీ మించి తన శక్తియుక్తుల సమాహారమైన విశ్వరూప సందర్శనం చూస్తె, ఇంతింతై ఎదిగి మహోన్నతుడైన తీరు కనిపిస్తుంది .చంచలత్వం కోతిలక్షణ .దాని నుంచి పరిణతి సాధించిన వృషా కపి ,హరి మనకు దర్శనమిస్తాడు .ఒకరకంగా స్ప్లిట్ పర్సనాలిటి అనిపిస్తుంది .కాని అది వినాశనానికి కాక మానవోద్ధరణకు ,సకల జన శ్రేయస్సుకు, లోకకల్యాణానికి ,ఆది దంపతుల సమాగమానికి రామనామ నిర్నిద్రతకు పరాకాష్ట గా వెలుగొందాడు అని నాకు అనిపిస్తుంది .ఈ భావాలు చాలాకాలం గా మనసులో గూడు కట్టుకొని ఉన్నాయికాని ,ఈ భావాలతో  జనుల మనస్సులలో ఇప్పటికే  సుప్రతిస్టితమైన భావాలను కి౦చ పరచానను కొంటారేమో అనే సందేహం ఉండటం వలన ఇప్పటి వరకు సాహసించలేక పోయాను .కానీ వారం పది రోజులనుంచి భావాలు సుళ్ళు తిరుగుతూ ఉక్కిరిబిక్కిరి చేస్తుంటే ఆయనమీదే భారం వేసి అడుగు ము౦దుకేస్తున్నాను. దీనికో నేపధ్యంకూడా ఉన్నది సుమారు పాతికేళ్ళ క్రితం కృష్ణాజిల్లా కైకలూరుకు చెందిన,రామాయణ సుందరకాండ ప్రవచన నిష్ణాతులు బ్రహ్మశ్రీ పరిమి రామకృష్ణ శాస్త్రి గారు రోజూ అక్కడినుంచి ఉయ్యూరువచ్చి సాయంత్రం  ఖచ్చితంగా 6-30నుంచి 8గంటలవరకు ఉయ్యూరు విష్ణ్వాలయం లో ప్రవచనాలు చేశారు .నేను రోజూ వెళ్లి ఆసక్తిగా వినేవాడిని .ఆయన నా శ్రద్ధకు చాలా సంతోషించేవారు .వారికి చేతిలో పుస్తకం అవసరం లేదు.అంతా  వాచో విదేయమే .అనర్గళ ధారా పాతమే .ఒకసారి సుందర కాండ ప్రవచనం అయ్యాక వారికి సత్కారం చేస్తూ నన్ను మాట్లాడమన్నారు .నేను బ్రహ్మశ్రీ జనమంచి శేషాద్రి శర్మగారి రామాయణ సారం రోజూ చదివి రెడీ గా వెళ్ళేవాడిని ,అంతకు మించి కొత్తవిషయాలు  చెబుతారేమోనన్న ఆలోచనతో .నన్ను మాట్లాడమంటే ‘’అంతా బాగానే ఉంది కాని శాస్త్రిగారు హనుమ లంకలో కాలుపెట్టి చంద్రుని చూసి పొంగిపోవటం ,మధువనం లో అందరితోపాటు మధువు ఆస్వాదిస్తూ నృత్యం చేయటం వంటి కొన్ని ఘట్టాలు మన దృష్టికి తీసుకు రాలేదు .జనమంచి వారి వ్యాఖ్యానం చాలా విషయాలు తెలియ జేస్తాయి .శాస్త్రిగారు దాన్ని చూసినట్లు లేదు అనిపించింది అని నిర్మొహమాటంగా చెప్పాను ‘’ ఆయన ప్రవచన తీరును బాగాహైలైట్ చేసి మాట్లాడాను .ఆయనతానూ జనమంచి వారి రచన చదవలేదనీ ,కాని అందులో విషయాలు నేను చెప్పిందుకు  చాలా సంతోషించారు .మళ్ళీ అక్కడే రామాయణం చెప్పెటప్పుడూ వెళ్ళేవాడిని .నన్ను చూసి దగ్గరగా కూర్చోమని సౌ౦జ్ఞ చేసేవారు నిత్యం .ఎవరైనా ఏదైనా కొత్తగా తెలుసుకోవాలన్నది నూతనంగా చెప్పాలన్నది  నా దృష్టి .ఆ వేడిలోనే అప్పుడే ‘’శ్రీహరి ద్యూతం ‘’అనే పేరుతో  హరి అంటే కోతి, వానరమనే అర్ధంతో సుందరకాండ హనుమ దౌత్యం గురించి పాతిక ముప్ఫై పేజీలు  రాశాను పెద్ద బారు నోట్ పుస్తకం లో ..అది నా సర్వస్వం అనుకొన్నాను .ఆసమయం లో నేనుజగ్గయ్యపేట దగ్గర గండ్రాయి హైస్కూల్ లో సైన్స్ మేస్టర్ గా పని చేయటం, మా అన్నయ్యగారబ్బాయి రా౦ బాబు పెళ్లికుదరటం, నేను అక్కడే ఉండటం వలన ఇంటికి సున్నాలు వగైరా రిపేర్ పనులతో వాళ్ళే సర్దటం తో నేను వచ్చిచూశాక ఆపుస్తకం నాకు కనపడకకపోవటం తీవ్ర నిరాశ కలిగించింది .చాలాకష్టపడి రాసిన రచన అది .తర్వాత సుందరకాండ పుస్తకం మా బావగారు శ్రీ వివేకాంద్ గారు ఇస్తే పారాయణ చేయటం ఆతర్వాత  అడ్డాడ హైస్కూల్ లో హెడ్ మాస్టర్ గా 1987జూన్ నెలాఖరుకు రిటైరయ్యేటప్పుడు స్కూల్ పేరెంట్స్ కమిటీ అధ్యక్షులు డా శ్రీ మేడూరి బాల రత్నవర ప్రసాద్ ఆప్యాయంగా నాకు శ్రీమాన్ చలమచర్ల వెంకట శేషా చార్యుల వారి వ్యాఖ్యానంతో ఉన్న సుందరకాండ పవిత్ర గ్రంధాన్ని కానుకగా అంద జేశారు .అదొక సువర్ణ అవకాశంగా భావించి అప్పటినుంచి క్రమం తప్పకుండా వీలైనప్పుడల్లా పారాయణ చేస్తూ ధనుర్మాసం లో మా సువర్చలాన్జనేయ దేవాలయం లో కనీసం 3సార్లు అయినా పారాయణ చేస్తూ ఈ 2020ధనుర్మాసానికి 67సార్లు పారాయణం చేసిన అదృష్టవంతుడిని అయ్యాను .ఇంతమాత్రం చేత అదంతా నాకు మనసుకు పట్టిందనికానీ  అందులోని లోతులు అర్ధమయ్యాయనికానీ అనుకోవటం లేదు .విపులాచ పృధ్వీ .ఈ నేపధ్యం లో ఈ ‘’ సుందర కాండ లో హనుమ బహుముఖీన వ్యక్తిత్వం ‘’మొదలు పెట్టి రాస్తున్నాను .దీనికి నాకు ప్రణాళిక లేదు .లాప్ టాప్ ముందు కూర్చుని ,తోచింది సందర్భ శుద్ధిగా రాయటమే నాపని .ఫలితం దైవా దీనం .

సశేషం

  మీ- గబ్బిట దుర్గాప్రసాద్ -17-4-20-ఉయ్యూరు

Posted in రచనలు | Tagged | Leave a comment

ప్రపంచ దేశాల సారస్వతం42-రష్యన్ సాహిత్యం-2

తార్తార్ యుగం -1240-1480-తార్తారులు రష్యన్ సామంతులనుండి దండిగా కప్పం వసూలు చేసు కోవటమే పరమావధి గా ఉండటం వలన రష్యన్ సంస్థలతో ,జీవన విధాలలో జోక్యం కలిగించుకోలేదు .కానీ ఈకాలం లో సాహిత్యం మాత్రం పెద్దగా అభి వృద్ధి చెంద లేదనే చెప్పాలి .యౌపట్ కోలో వ్రత్ కదలు,మతోపదేశాలు ,సన్యాసుల జీవితాలకు సంబంధించినవి మాత్రమె వచ్చాయి  .ఈకాలపు గొప్ప గ్రంథం-‘’జోడోష్ చిన’’.దీన్లో 1380లో కులికోవో దగ్గర తర్తారులు పొందిన మొదటి పరాభవం ,పరాజయాలు ఉన్నాయి .రచయిత’’సోఫ్రోనియా మతగురువు ‘’లే ఆఫ్ ఐగార్స్ ‘’కాంపెయిన్ అనే గ్రంధం చదివి ,దాన్ని అనుకరిస్తూ , రాశాడు .కవితా ప్రతిభ లేనివాడు .తార్తార యుగం చివర్లో ట్వైర్ వర్తకుడు అఫనసి నికిటన్ రాసిన ‘’జర్నీ బియాండ్ ది త్రీ సీస్’’-1466-72 పుస్తకం మాత్రం చాలా ముఖ్యమైనది .పర్షియా భారత్ దేశాలలో తాను  చేసిన సముద్ర ప్రయాణ సాహస కృత్యాలను సుందర సరళ శైలిలో రాసి రీడబిలిటి తెచ్చాడు .ఈ యుగం చివర్లో మాస్కో రాజులు దేశ ఐక్యత కోసం కొంత పాటుపడ్డారు .ఫలించి చివరికి 1480లో మూడవ ఇవాన్ రాజు తార్తారులనుంచి రష్యాకు విముక్తి కలిగించాడు .దీనితో మాస్కో యుగం ప్రారంభమైంది .

మాస్కో యుగం -1480-1702-ఈ యుగం లో రష్యన్ సాహిత్యానికి మాస్కో కేంద్ర బి౦దు వైంది .సాహిత్యానికి రాజపోషణ లభించి కొన్ని ముఖ్యరచనలు వచ్చాయి నాల్గవ యువాన్ చక్రవర్తి -1530-1584 కూడా గొప్ప రచయితగా గుర్తింపు పొందాడు ఇతని చేతిలో ఓడిపోయి,పోలాండ్ లో తలదాచుకొన్నవైకో లోవిచ్ కుర్ బెస్కీ కూడా ఉత్తమ రచనలు చేశాడు .వీరిద్దరి రచనలలో బైజా౦టిక్ ప్రభావం ఎక్కువే .కుర్ బెస్కి రచనలలో ప్రామాణిక రష్యా దేశ చరిత్ర లభిస్తుంది .ఈ యుగం చివర్లో నవలా రచన మొదలైంది .ఇవి మతాచార్యుల ,పురాణాలకు సంబంధించిన నవలలు .

   మాస్కో యుగం లో  రష్యాకు , పాశ్చాత్య దేశాలతో మొదటిసారిగా పరిచయం కలిగింది .యూక్రేనియాన్ సాహిత్యం మూలంగా లాటిన్ రచనల గొప్పతనం మొదట్లో రష్యాకు తెలిసింది .లాటిన్ ఛందస్సుకు రష్యన్లు ఆకర్షింప బడ్డారు .పీటర్ చక్రవర్తి -1672-1725కాలం లో పాశ్చాత్య సంస్కృతి రష్యా అంతా వ్యాపించింది .సెయింట్ పీటర్స్ బర్గ్ యుగ సాహిత్య వికాసానికి దారి తీసింది .

సెయింట్ పీటర్స్ బర్గ్ యుగం -1702-1837-పీటర్ చక్రవర్తి సెయింట్ పీటర్స్ బర్గ్ నగరాన్ని నిర్మించి రష్యన్ సంస్కృతీ కేంద్రంగా చేశాడు .పాశ్చాత్య సంస్కృతిని వల౦బిస్తూ ,దాన్ని స్వంతం చేసుకొన్నప్పుడు మాత్రమె రష్యన్ జాతి ఉన్నతి చెందుతుంది అని గాఢ౦గా నమ్మి, తన జీవితాన్ని దానికోసం అంకితం చేశాడు . రష్యా వేష భాషలలో భావనలలో గొప్ప మార్పు తెచ్చాడు .పాశ్చాత్యులకు  దీటుగా రష్యాను అన్ని విధాలా తీర్చి దిద్దటానికి విద్యా ,ఆర్దికాది రంగాలలో అనేక సంస్కరణలు తెచ్చాడు .దీనితో రష్యన్ లకు ఫ్రెంచ్ భాషతో పరిచయమేర్పడి,ఆ భాషాపదాలు .ఎన్నో ప్రక్రియలు వచ్చి చేరాయి .పీటర్ చనిపోయాక రాణి కేధరిన్ అదే మార్గం లో కృషి చేసింది ‘’రష్యన్ సాహిత్య పిత’’అని పేరు పొందిన మైకెలో వాస్లి విచ్ లో మెనో సావ్ -1708-1765 ఈయుగపు మేటి రచయిత ..ప్రసిద్ధ సైంటిస్ట్ గానే కాక సాహిత్యం లోనూ ప్రముఖుడు .రష్యన్ వ్యాకరణం మొదటి సారిగా రాసి ,రష్యన్ గీతాలకు ఛందస్సు కూడా అమర్చాడు .మరో ప్రముఖుడు –పెట్రోవిచ్ సుమరోకోవ్-1717-1774మొదటి రష్యన్ నాటకం రాశాడు .ఇతనికన్న గొప్ప వాడు అనిపించుకొన్నాడు –గన్ రిలా డేర్జవిన్ -1743-1816 గేయరచయితగా లబ్ధ ప్రతిస్టుడు..ఉత్తమకవిత్వానికిఅతని గేయాలు లక్ష్యంగా ఈనాటికీ భావింప బడుతున్నాయి .ఈయుగం లో వచన రచనలు కూడా బాగానే వచ్చాయి .వీటికి పశ్చిమ యూరోపియన్ భాషలే ప్రేరణ .ఇంగ్లిష్ రచయితలైన ఎడిసన్ ,స్టీల్ మొదలైన వారిని ఆదర్శం గా తీసుకొని రష్యన్ రచయితలూ వాస్తవిక వాదానికి బాటలు వేశారు .వీరిలో ప్రసిద్ధుడు –నికోలస్ నొవి కొవ్.-1744-1816.ఇతడి రచనలలో కేధరిన్ రాణిపై విమర్శ ఎక్కువగా ఉండటం తో నిషేధించారు .

  పాశ్చాత్య సంస్కృతీ ప్రభావం తో రష్యన్ భాషలో వచ్చిన మార్పు ను సుస్థిరం చేసి ,భాషకు ఒక నిర్దిష్ట రూపాన్ని చేకూర్చాడు నికోలాయ్ కరం జిన్-1765-1826.స్లావిక్ భాషలోనుంచి వచ్చిన పాత పదాలన్నీ తీసేసి కొత్తభావాలకు అద్దం పట్టే పదాలను పాశ్చాత్యభాషలనుంచి గ్రహించి భాషను సువ్యవస్థితం చేశాడు కరం జీన్.భాషతో పాటు శైలీ విన్యాసంలో కూడా పెద్ద మార్పు తెచ్చాడు .ఇతని ‘’పూర్ లీజా ‘’వంటి  నవలలు,చరిత్రలు  దేశమంతా ఆసక్తిగా చదివారు .దీనితో అనువాదాలు చేయటంకూడా తేలికైపోయింది .దీన్ని అందరూ సమర్ధించి ప్రోత్సహించి అనుసరించారు .ఇతని సమకాలికుడే –ఇవాన్ యాండ్రియోవిచ్ క్రై లావ్ కల్పనా సాహిత్యానికి బీజాలు వేశాడు .ఇతడు రాసిన 200ల కల్పనా కథలు ఈ నాటికీ రష్యాలో ఆసక్తిగా చదువుతున్నారు .

  సశేషం

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -17-4-20-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

కరోనా ఓ కరోనా ఓ కరోనా పేరడీ గీతం

పేరడీ గీతం

కరోనా ఓ కరోనా ఓ కరోనా

కోవిదా  కోవిదా ఓ కోవిదా

నీపై యెంత ద్వేషం పెంచుకొన్నానో

ముక్కు మాస్కు నడుగు మూతి ముసుగు నడుగు చెబుతాయీ –కరోనా ఓ కరోనా

నీపై ఎంత యెంత పగ రగులుతోందో  ఈ చేతుల్ని అడుగు ఇకనైనా

చేతులు ముఖానికి తాకినా ,మూతీ ముక్కుకు చేర్చినా

ఒడిలో వాలిపోయి వినాశనం తెస్తున్నావు

జాలీ నాలీ లేని కోవిదా ఓహో కోవిదా

చిరుగాలి, సెలయేరు చూసి  ఎన్నాళ్లై  పోయిందో

ఇంట్లో మగ్గి మగ్గి మాడిపోయే జనాలనడుగు

చేయి తాకితే చాలు భస్మాసుర హస్తమై

ప్రళయం సృస్తిస్తున్నావు కరోనా ఓ కరోనా

మల్లె పూల వాసనలు చూసి కలవరి౦చి ఎంతకాలమైనదో

తుమ్ముల్లో దగ్గుల్లో దాగి దాగి ఉండి

 ఆవులింతలో పేట్రేగి పోయి పోయి

ఆయువు హరిస్తున్న కరోనా ఓ కరోనా

తడి తగిలితే చాలు దావానలమై కోరలు చాస్తున్నావు

నిట్టూర్పులకూ దూరం చేసి నిండా

 ము౦చు తున్నావు కోవిదా ఓ కోవిదా

ఎదలో రాసిన రేఖలు నుదుటి రాతలై నులిమేస్తుంటే

 లక్షలాది జనం ప్రపంచమంతా నీ కోరలకు ఆహుతై

 క్షణాలలో క్షితి బాసి పోతూ నిస్సహాయులైపోతుంటే

కొన ఊపిరులతో మరణం అంచున అల్లాలాడుతుంటే

కనికరం లేని కరోనా కనిపించకుండా పారిపో ,పారిపారి పో ఇకనైనా

జాలిలేని కోవిదా మళ్ళీ ముఖం చూపకు ఎప్పటికైనా మరెప్పటికైనా

నోట్-అక్బర్ సలీం అనార్కలి సినిమా లో’’ సిపాయీ –హసీనా ‘’పాటకు నా స్వేచ్చా పేరడీ

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -17-4-20-ఉయ్యూరు 

Posted in రచనలు | Tagged | Leave a comment

ప్రపంచ దేశాల సారస్వతం 41-ఫ్రెంచ్ సాహిత్యం -3(చివరిభాగం )

ప్రపంచ దేశాల సారస్వతం

41-ఫ్రెంచ్ సాహిత్యం -3(చివరిభాగం )

   18వ శతాబ్దం లో ఫ్రెంచ్ సాహిత్యం హేతువాద యుగంగా మారింది .జీవిత విలువలన్నిటినీ హేతు వాద దృష్టితో బేరీజు వేసి ,సరికాదు అనుకొంటే ఉల్టా సీదా చేయటమే ధ్యేయమైంది .ఆస్తికత ,మతవిశ్వాసం ,పరంపరగా వస్తున్న ఆర్ధిక వ్యవస్థ ,ఆస్తి హక్కు మొదలైనవన్నీ ఈ కొత్త భావనలకు చెల్లా చెదరరై పోయాయి .ఇంగ్లాండ్ విజ్ఞానం ,రాజకీయం కూడా బాగా ప్రభావితం చేశాయి .ఇవే సాహిత్యం లో ప్రతిబింబించాయి .దీనికి ఆద్యుడు –పెయరి బెయిలి .ఆనాటి మత నైతికత ,పవిత్రత లపై విరుచుకు పడ్డాడు .కానీ ఇవే భావాలతో ప్రజలను రచనలద్వారా ఆకర్షించినవాడు మాత్రం వాల్టేర్..ఇతనికి ప్రేరణ రూసో ,మాన్టేస్కి,డెనిస్ డీ డేరో,లెసాగీ ,మేరీవా లు .ఈ శతాబ్దం లో దాదాపు 80ఏళ్ళు జీవించిన వాల్టేర్ వివిధ సాహిత్య ప్రక్రియలతో సమానత్వ భావాన్ని పాదుకొల్పాడు .బహుముఖ ప్రజ్ఞాశీలి కనుక ఉత్తరాలు కరపత్రాలు ,కావ్యాలు ,కథలు,వ్యంగ్యరచనలు పద్యగద్యాలలో విశ్రుమ్ఖలంగా  రాసి వినుతి కెక్కటమే కాక ఎందరినో ప్రభావితం చేశాడు .అన్నిట్లో మానవ శ్రేయస్సు మాత్రమె ధ్యేయం గా రాశాడు .స్వేచ్చకు విలువ నిచ్చాడు .సునిసిత హాస్యం అండర్ కరెంట్ గా ఉండేది .సజీవపాత్రలతో ఆకర్షణీయ సన్ని వేశాలతో ప్రతిదీ మనసుకు హత్తుకోనేట్లు రాశాడు .రాజకీయంగానే కాక సరళ వచన రచయితగా ప్రసిద్ధి చెందాడు మా౦టేస్కో .కొత్తరకం నవలలతో ఆకర్షించినవాడు లెసాగీ .మానవ మానసిక సంఘర్షణకు చోటు కల్పించి నవలలు రాశాడు –మెరీనా .నవలా రచనకు ఉత్కృష్ట స్థితి కల్పించింది మాత్రం –యాబీ ప్రవోస్ట్..వైజ్ఞానిక భావుకుడైన డెనిస్ ఓడోరబ్ సృష్టి పరిణామ రహస్యాలను భావనాబలంతో సాహిత్యం రూపంగా రాశాడు .జీన్ లీ రాండ్ ద లెంబర్ట్అనే పండితుడితో కలిసి ఫ్రెంచ్ భాషలో మొట్టమొదటి విజ్ఞాన సర్వస్వం రూపొందించాడు .ఆనాటి. విప్లవ భావాలకు సిద్ధాంత రూపం ఇచ్చినవాడు రూసో .వీరందరివల్ల ఫ్రెంచ్ సాహిత్యం నవనవోన్మేషణం పొందిది,ఫ్రెంచ్ విప్లవానికి దారితీసింది .

   19వ శతాబ్దిలో ఫ్రెంచ్ సాహిత్యం లో ఆధునికయుగావిర్భావం జరిగింది .దీని వైతాళికులు-మేడం స్టేల్ ,షెటో బ్రా లు .నవలలలను నూతన విధానం లో,కళాత్మకంగా అత్యున్నత స్థాయిలో   స్టేల్ రాసి నవలకు పెద్ద పీట వేసింది ,తర్వాత వచ్చిన షెటో బ్రా మాత్రం కాల్పనిక వాద వికాసానికి తోడ్పడింది .గేయకవిత్వం మళ్ళీ చిగురించి ,పూర్వం కంటే గొప్పగా వికసించింది .19వ శతాబ్ది కవితా సామ్రాజ్య చక్రవర్తులుగా –లా మార్టిన్ ,మస్సేట్,వీనీ ,హ్యూగో లు .విఫలప్రేమను చిత్రిస్తూ ఉత్తమకావ్యాలు రాసినవాడు లామార్టిన్ ఆల్ఫ్రెడ్ మస్సేట్ వ్యంగ్య చతుర,దారాళ ,కదన నైపుణ్య కవిత్వానికి ఆటపట్టు .మానవ స్వభావ లోతుపాతులను వెలికి తీయటానికి సాహిత్యాన్ని ఊతంగా తీసుకొన్నవాడు ఆల్ఫ్రెడ్ డీ వీనీ .ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్కభావానికి ప్రాముఖ్యమిస్తూ ,వస్తు ,సన్నివేశాలకు తగిన శైలిని ఎన్నుకొని ,అన్ని రీతులలో అందర్నీ జయిస్తూ విశ్వ సాహిత్య క్షేత్రం లో విరాజిల్లినవాడు విక్టర్ హ్యూగో .జీవితం లో 60 ఏళ్ళు సాహిత్యానికే ధారపోసినమహా రచయిత హ్యూగో .ఫ్రాన్స్ లో మహాగొప్ప రొమాంటిక్ కవిగా గుర్తింపు పొందినా అంతర్జాతీయంగా ,సింబాలిజం ,ఆబ్స్ట్రాక్ట్ ఎక్స్ప్రేషనిజం లలో మార్గదర్శి అయ్యాడు .ఇతనినవలలు  ‘’దిహన్చ్ బాక్ ఆఫ్ నోటర్ డాం ‘’’’లెస్ మిజరబుల్స్ ‘’అన్ని దేశాలలనూ ఆకర్షించాయి ప్రభావితం చేశాయి .రెండవది యదార్ధ కథ.మనోరంజకమైన కొత్త కథలకు హ్యూగో మార్గదర్శి .హ్యూగో తరవాత పేర్కొనదగిన వారు థియో ఫైల్,గౌటియర్,చార్లెస్ బాడర్లైర్ లు . ఈశాతాబ్ది చివర్లో ‘’సాంకేతిక వాదం ‘’అనే కొత్త వాదం బయల్దేరింది .అసలైన అర్ధాన్ని కొన్ని సాంకేతికాల మాటున చిత్రించి చెప్పటం దీని పధ్ధతి .వీరిలో వేర్లైన్,మలోర్మి ,రింబా లు ముఖ్యులు .హ్యూగో తర్వాత నవలలలు రాసినవాడు ‘’స్టెన్ డాల్’’అనే మారు పేరుతొ రాసిన హెన్రి బెయిల్ .ఇతనితోపాటు ప్రముఖ నవలాకర్తలు –అనరి డీ బాల్జాక్ ,ఫ్లాబర్ట్ ,అలేక్జాండర్ డ్యూమాస్,గైడి మపాసా .ఈ శతాబ్ది ప్రముఖ నవలాకారుడు  ఎమిలీ జోలా  ప్రభావం పడని  రచయితలు  లేరు .నేచురలిజం దియేటర్ నేచురలిజం ,సైకలాజికల్ నవలా రచనలతో గొప్ప జ్వాజ్వల్యమానంగా వెలిగాడు  జోలా రాసిన దేరేసే రాక్విన్ నవల నేచురలిజానికి ప్రతీక . మంచి ప్రతిభావంతమైన నాటకాలూ ఈ శతాబ్దిలో వచ్చాయి .

  20వ శతాబ్దం లో ఫ్రెంచ్ నవల కొత్త అందాన్ని పొందింది .నేరేషన్ లో విప్లవం తెచ్చారు నవలాకారులు .వీరిలో ముఖ్యుడు అనటోల్ ఫ్రాన్స్ .19వ శతాబ్దం చివరినుంచే నవలలు రాయటం మొదలు పెట్టాడు .1921నోబెల్ ప్రైజ్ విన్నర్ .ఈ కాలం లో ఆత్మ పరిశీలనతో రచనలు చేశాడు మార్సెల్ ప్రౌస్ట్ .ఇతని 7భాగాల మాన్యుమెంటల్ నవల –‘’లా రిచెర్చేడు టెమ్ప్స్ పెర్డు’’.ఇతనిని 20వ శతాబ్ది అత్యధిక ప్రేరణాత్మక నవలాకారునిగా విశ్లేషకులు భావించారు . యాండ్రి గైడ్ అక్రమ లైంగిక వ్యవహారాలను ఇతి వృత్తంగా తీసుకొని కళాత్మక నవలలు అల్లాడు .సింబాలిక్ నవలలు యాంటి కలోనిజం నవలలు రాసి ప్రసిద్దిపొంది 1947 నోబెల్ ప్రైజ్ అందుకొన్నాడు  .దివాటికన్ సేల్లార్స్ ,దిపాస్టోరల్ సింఫనీ ,దికౌంటర్ ఫీటర్స్ ప్రముఖ నవలలు .నాటకరచనలూ చేశాడు కథా కథన చాతుర్యం ,పాత్ర పోషణ ,వస్తు చిత్రణలలో అద్వితీయుడు .ఈ కాలపు మరో ముఖ్య ప్రక్రియ ‘’సైక్లిక్ నావెల్ ‘’సృష్టికర్త –రోమేన్ రోలాండ్  .10 భాగాల ‘’సీక్వెన్స్ జీన్ క్రిస్టో ఫే ‘’నవల యిది . ఒక వ్యక్తీ జీవిత కధను  ఇంట విస్తృతంగా చిత్రించటం అరుదైన విషయం .కథైక్యం చెడకుండా ,సంఘటనలకు ప్రాధాన్యమిచ్చి మణిహారం కూర్చి నట్లు రాశాడు .నాటకాలు రాశాడు .హిస్టోరియన్ కూడా .ఇతని ఆదర్శ వాద రచనలకు 1915లో నోబెల్ పురస్కారం వచ్చింది .ఇదే బాటలో జూలిస్ రోమేస్ కూడా రాశాడు .’’టిబాల్ట్స్’’అనే చంక్రమ నవల అంటే సైక్లిక్ నవల ను మార్టిన్ డు గార్డ్ రాసి 1937 సాహిత్య నోబెల్ పొందాడు .

  20వ శతాబ్దం లో పద్య కవిత్వం కూడా వచ్చింది అధివాస్తవిక వాదమూ ప్రవేశించింది .పద్యకవుల్లో పాల్ వేలేరీ సుప్రసిద్ధుడు. తాత్విక విషయాలను ఆలంకారిక శైలిలో సరళ సుందరం గా రాయటం ఇతని ప్రత్యేకత .నాటకాలకు స్వర్ణయుగమే .కొత్త ఆలోచనలు నాటక విధానం లో వినూత్నత ప్రత్యేకాలు .ఐతే ‘’మేటర్ లింక్ ‘’నాటకాలు బహుళ ఆదరణీయాలైనాయి .ఇతని ఇంట్రూడర్ ,ది బ్లైండ్ ,ది బ్లూ బర్డ్ మొదలైన నాటకాలు ప్రపంచ ప్రసిద్ధాలు .చావు ,జీవిత పరమార్ధం ఇతనికథా వస్తువులు ,ఇతనికి విభిన్న నాటక రచనకు 1911లో నోబెల్ బహుమతి లభించింది .అలౌకిక విషయాలను వస్తువుగా తీసుకొని గోప్పనాటకాలు రాసినవాడు పాల్ క్లాడెల్.అనేక ఫ్రెంచ్ ప్రభుత్వ ప్రైజులు పొందాడు .

 కొత్త వైజ్ఞానిక ఆవిష్కరణలు ,కొత్త రాజకీయాలు ఫ్రెంచ్ సాహిత్యం పై ప్రభావం చూపించాయి .ప్రపంచయుద్ధం దేశాన్ని సంక్షోభం లోకి నెట్టింది ఫలితంగా మత నైతికత లలో అవిశ్వాసం పెరిగి రచనలలో చోటు చేసుకొన్నాయి .దీన్ని ఎదుర్కోవటానికి క్లాడేల్ లాంటి కవులు కృషి చేశారు .ప్రాచీన –ఆధునికాలకు సమన్వయము చేకూర్చినవాడు ,తాత్విక సందేశంతో ప్రభావితం చేసినవాడు హెన్రి బెర్గ్ సన్.ఇతని తత్వ గ్రంథాలు మహా కావ్యాలుగా పరిగణించారు ఇవి నవ్యరచయితలకు కవులకు మార్గ దర్శకాలైనాయి .తక్షణ అనుభవం -ఇమ్మీడియేట్ ఎక్స్ పీరిఎన్స్ ,అంతర్ దృష్టి-ఇంట్యూషన్లు రేషనలిజం ,సైన్స్ లకన్నా సత్యాన్ని తెలుసుకోవటానికి ముఖ్య సాధనాలుగా భావించాడు .దీనికి ఫ్రాన్స్ దేశపు అత్యున్నత పురస్కారం –గ్రాండ్ క్రోయిక్స్ డీ లా లీజియన్ డీ ఆనర్ ‘’1930లో అందుకొన్నాడు  .భారతీయ తాత్విక చి౦తనలన్నీ ఇతని రచనలలో దర్శనమిస్తాయని అభిజ్ఞులు గుర్తించారు .

  21వ శతాబ్ది ఫ్రెంచ్ రచయితలు –గాలియా ఆకర్మన్ ,నికోల్ బాచ్ రాన్ ,పియర్రీ చావోట్ ,హ్యూబర్ట్ డామిష్,జీన్ పాల్ ఏర్దోవెన్ , పాస్కల్ ఏంజెల్ ,ఎలిశే ఫిషర్ ,రోజేర్ గరూడీ,జీన్ క్లాడ్ గుల్లెబాడ్,లారా హైం,అలాన్ జాబెర్ట్ ,జులివా క్రిస్తీవా ,బెర్నార్డ్ హెన్రి లేవి ,రాబర్ట్ మిస్రాహి ,లారే మూరట్,మైకేల్ ఒర్సేల్ ,నిటా రూసో ,పీటర్ జెండి,క్సేవియర్ టిల్లెట్టీ,ఆల్బర్ట్ ఉదెర్జో,పియర్రీ వేలిటేట్ మొదలైనవారెందరో ఉన్నారు

  నోబెల్ ప్రైజ్ పొందినవారు –సల్లీ పృదోం-1901,ఫ్రెడరిక్ మిస్ట్రెల్-1904,మారిస్ మీటర్లింక్ -1911,రోమిన్ రోలాండ్ -1915,అనటోల్ ఫ్రాన్స్ -1921,హెన్రి బెర్గ్ సన్-1927,రోజేర్ మార్టిన్ డు గార్డ్ -1935.

  సశేషం

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -16-4-20

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

ప్రపంచ దేశాల సారస్వతం 41-ఫ్రెంచ్ సాహిత్యం -2

ప్రపంచ దేశాల సారస్వతం

41-ఫ్రెంచ్ సాహిత్యం -2

16వ శతాబ్దంలో తాత్విక రచనలు చేసిన తత్వవేత్తలూ ఉన్నారు .ఐతే అంత శ్రేస్టత వాటిలో లేదంటారు .వీరిలో రబేలే ,కెల్విన్ ,మా౦టేయిల్ ఉన్నారు .రబేలే రాసిన ‘’గర్గాన్టువా ఎట్పంటాగ్రుయల్ ను    నవలగా భావిస్తారు .పాత్ర పోషణ శైలి లలో చాలాకాలం వరకు దీన్ని దాటింది లేదు .ఆకాలపు నవ్యాదర్శాలకు ,నూతనభావాలకు అది వేదికగా నిలిచింది .మైకేల్ డీ మాన్ టెయిల్ రాసినవి ఆత్మాశ్రయ వ్యాసాలు  .తనా అనుభావాలను చక్కని విమర్శన దృ ష్టి తో పరిశీలించి ,మానవ జీవిత లోతుపాతులను అవగాహన చేసుకోవటానికి తోడ్పడుతుంది .ఉదాత్త శైలితో ఉత్తమస్థితి పొందింది .ప్రోటేస్టెంట్ మతానికి తన వాద చాతుర్యం తో బలం కలిగించినవాడు కెల్విన్ .క్రైస్తవ మత సువ్యవస్థపై ఇతడి గ్రంధం తాత్వికతతోపాటు సాహిత్య పరిమళమూ ఉన్నది .’’అల్పాక్షరాల్లో అనల్పార్ధాలను ‘’నిక్షేపించటం ఇతని ప్రత్యేకత .రెబేలే ,కాల్విన్ లు ఫ్రెంచ్ వచనాన్ని అందలం ఎక్కించిన మహాను భావులు .ఈ మార్గం లో సాహిత్యాన్ని మరింత ముందుకు తీసుకు వెళ్ళాడు అమియోట్. గ్రీకులో ప్లూటార్క్ రాసిన  జీవిత గాధలను యితడు వచనం లో ఫ్రెంచి భాషలోకి అత్యుదాత్తంగా మూలానికే వన్నెలు తెచ్చేట్లు అనువది౦చాడు..ఈకాలం లో వచ్చిన నాటకాలు ‘’నాం కే వాస్తి ‘’.

  ఒక రకంగా ఫ్రెంచ్ సాహిత్య౦ కు 17వ శతాబ్ది గర్వకారణమైంది.కొత్తకవితా రీతులతో సాహిత్యానికి విశేష గౌరవం కలిగించారు కవులు ,రచయితలు .దీనికి ముఖ్యమైన రెండు కారణాలున్నాయి .అందులో మొదటిది ‘’ఫ్రెంచ్ అకాడెమి స్థాపన ‘’.రెండవది రాజాదరణం .1634లోఫ్రెంచ్ అకాడెమి ఏర్పడి పునరుజ్జీవ ఉద్యమానికి  రాజుల బలం కూడా చేకూరింది .ఈ ఉద్యమ మూల పురుషులు నిర్ణయించిన కావ్యలక్షణాలు  అనుల్ల౦ఘనీయాలై ,పరమ ప్రామాణికాలయ్యాయి.కావ్యాలను పరిశీలించి ఉత్తమమైన వాటిని ఎంపిక చేయటానికి 40మంది సభ్యులతో ఉన్న అకాడెమి విశిష్ట కృషి చేసింది .రాజు 13వ లూయీ జాతీయ జీవనం లో ఏకత్వం సాధించటానికి సాహిత్య పోషణ ఒక మార్గం గా భావించి పోషించాడు .ఈకాలం లో వచ్చినవి మంచినాటకాలు .ఈశతాబ్ది మొదటి పాతికేళ్ళ లోనే 100 రూపకాలు వచ్చాయి .నాటక రచయితలలో –పియరీ కార్నియేల్,జీన్ రేసిన్,మోలియర్ అత్యంత ముఖ్యులు .కొత్తరచనా విధానంతో కార్నిఎల్  నాటకాలు రాశాడు .ఇతడి ట్రాజెడీ లలో ‘’సిడ్’’మోదా౦తాలలో’’మెన్ టోర్’’ప్రముఖమైనవి .ఈ రెండు తర్వాత నాటకాలకు ఒరవడి పెట్టాయి .ఫ్రెంచ్ ట్రాజెడీ కి పట్టాభిషేకం చేసినవాడు మాత్రం రేసిన్.ఇక మోలియర్ పేరు చెబితేనే హాస్యం రసప్రవాహమై కడుపుబ్బా నవ్విస్తుంది .ప్రపంచ ప్రఖ్యాత నాటక రచయితగా మోలియర్ గుర్తింపబడ్డాడు .చతుర సంభాషణలు సన్నివేశాల రూపకల్పన లతో ప్రేక్షకులకు గిలిగింతలు పెట్టి ఎన్నెన్నో  దేశాల నాటక రచయితలకు  గొప్పప్రేరణగా నిలిచాడు మోలియర్ .తెలుగు లో భాకారా అంటే భమిడిపాటి కామేశ్వర రావు మాస్టారు హాస్య నాటకాలకు మోలియర్ నాటకాలే స్పూర్తి .పేర్లలో ,సన్నివేశాలలో డైలాగ్ లు కుట్టటం లో  భాకారా మాస్టారు  మోలియర్ ని మించిపోయారు అనిపిస్తారు .

   ఈకాలం లో వచనం కూడా ప్రౌఢత చెందింది .ఈతరం గద్య రచయితలలో –జీన్ డీలాఫాన్టేన్ ప్రత్యేకత ఉన్నవాడు .రాసిన 12 సంపుటాలలో ప్రకటించిన కల్పనా కధలు,శైలీ రసపోషణ ,సంవిధాన నైపుణ్యం ప్రశస్తమైనవి .తత్వవేత్తలు డెకార్టె,పాస్కల్  వచనం లో రాసిన అమూల్య  గ్రంథాలు తలమానికాలు .ఈకాలపు బొయిలో కావ్యరచయిత గా ,లాక్షణికుడుగా విశిష్ట స్థానం పొంది,ప్రామాణికుడు అని పించుకొన్నాడు .కావ్య లక్షణాలన్నీ సంక్షిప్తంగా చెప్పటం ఇతడి ప్రత్యేకత .కళయొక్క ముఖ్యోద్దేశం ,రస వివేచనా ,ప్రకటనా విధానం మొదలైన  వాటిపై అతని అభిప్రాయాలు 18 వ శతాబ్దం  చివర వరకు మార్గ దర్శకాలుగా ఉన్నాయి .ఆతడు సృస్టించిన 12 అక్షరాల పాదం ఉన్న ‘’అలెగ్జా౦డ్రియన్ ఛందస్సు’’అతని తర్వాతకవులకు కూడా ఆదర్శమై అనుసర ణీయమైంది .ఈ శతాబ్ది పూర్తి నాటికి వాక్య రచనలో కొత్తమార్పులు ,సంక్షిప్తత వచ్చాయి .ఇలాంటి వచనరచన చేసినవారిలో –లా బృయీరీ ,లా రాకీ ఫోకాల్డ్,సెయింట్ సైమన్ ముఖ్యులు .

   సశేషం

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -16-4-20-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

బాబాయ్ -అబ్బాయ్

బాబాయ్ -అబ్బాయ్
అబ్బాయ్ -కరోనా తెచ్చిన అతిముఖ్య మార్పు అస్పృశ్యత పునరుద్ధరణకదా బాబాయ్
బాబాయ్ -ఏడిసినట్లే ఉంది నీ తెలివి .అది సాంఘిక దూరం పాటించటం
అబ్బా -సాన్ఘికదూరం అందరికీ ఒకటేనా బాబాయ్
బాబా-ఒక్కటే కాని అధికార పార్టీ వాళ్లకు కాదేమో అనిపిస్తోంది వార్తలు వింటుంటే పేపర్లు చూస్తుంటే
అబ్బా-అధికార అంటే గుర్తుకొచ్చింది అధికార భాషా సంఘం ఏం చేస్తోంది బాబయ్యా
బాబా-ఏమోరా ఈమధ్య కనిపించటం లేదు కరోనాభయంతో క్వారంటైన్ లో ఉందేమో
అబ్బా -ఇలాంటివె మరో రెండు ఉండాలి అవేమయ్యాయి బాబాయ్
బాబా-అవీ అదేదారి పట్టి ఉండచ్చేమో అబ్బాయ్
అబ్బా-మోడీ భాయ్ సప్త సూత్ర ప్రణాళిక బాగుందికదా బాబయ్యా
బాబా -అందులో బీదవారికి పనికొచ్చేదేదీ లేద౦టున్నారబ్బాయ్యా విదుర నీతి దుర్యోధనుడికి చెప్పినంట్లుందట
అబ్బా-ఇప్పటికీ రోడ్లమీద అడుక్కునే చెంచుల ఏనాదుల ఎరుకల వారి ఆతీ గతీ పట్టించుకొనే నాధులు లేరంటున్నారెంటి బాబాయ్
బాబా -ఉయ్యూరులో అలాంటి సేవ చేస్తున్నవారున్నారు అబ్బాయా మిగాతాచోట్ల నాకు తెలీదు ఇందిరాగారి గరీబీ హఠావో మోడీ గారి మేకిన్ ఇండియామేడ్ఇన్ ఇండియా మంత్రాలకు చింతకాయలు రాలలేదు .దరిద్రం అలాగే ఘనీభవించి వెక్కిరిస్తోంది.అయినా మతాలకు తగ్గ చేతలు లేని నేతలతో ఒరిగేది శూన్యం అబ్బాయా
అబ్బా-స్థానికం సంగతేంటి బాబయ్యా
బాబా-బాబు చెప్పు తీసి సాయి రెడ్డి 80ఏళ్ళ చెప్పుపెట్టినా కోర్టు ముందు నిలవదటున్నారబ్బాయా
మీ- గబ్బిట దుర్గాప్రసాద్ -15-4-20-ఉయ్యూరు
Posted in రచనలు | Tagged | Leave a comment

ప్రపంచ దేశాల సారస్వతం 41-ఫ్రెంచ్ సాహిత్యం -1

Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

సరసభారతి పేస్ బుక్ లైవ్ లో ప్రసారమైన పుస్తక పరిచయము 

సరసభారతి పేస్ బుక్ లైవ్ లో ప్రసారమైన పుస్తక పరిచయము

ఆధునిక ఆంద్ర శాస్త్ర మనిరత్నాలు , ఊసుల్లో ఉయ్యూరు ,  కథా సుధ  

 

 

కథా సుధ  

 

 

 

 

 

 

 

 

ఆధునిక ఆంద్ర శాస్త్ర మనిరత్నాలు మరియు ఊసుల్లో ఉయ్యూరు

 

 

 

 

 

 

 

 

Posted in సరసభారతి ఉయ్యూరు | Tagged | Leave a comment

ప్రపంచ దేశాల సారస్వతం 40-గ్రీన్ లాండిక్ సాహిత్యం

ప్రపంచ  దేశాల సారస్వతం

40-గ్రీన్ లాండిక్ సాహిత్యం

ప్రపంచం లోనే అతిపెద్ద ఐలాండ్ గ్రీన్ లాండ్ ఆర్కిటిక్ –అంటార్కిటిక్ సముద్రాలమధ్య ,కెనడియన్ ఆర్కెటిక్ అర్చిపెలగో కు తూర్పున ఉంటుంది .డెన్మార్క్ దేశం లో అటానమస్ ప్రాంతం గ్రీన్ లాండ్ .భౌగోళికంగా ఉత్తర అమెరికాకు చెందినా,రాజకీయ ,సాంస్కృతిక విషయాలలో యూరప్ తో సంబంధం కలిగి ఉంటుంది .ఇక్కడి మెజారిటీ ప్రజలు ‘’ఇనూట్ ‘’జాతికి చెందినవారు .వీరి పూర్వీకులు అలాస్కా నుంచి ఉత్తర కెనడాద్వారా ఇక్కడ ప్రవేశించి సెటిలర్స్ అయ్యారు.ఎక్కువ జనాభా ఆగ్నేయ  తీరం లో ఉంటారు .మిగిలిన చోట్ల చెల్లా చెదురుగాకనిపిస్తారు . 5మునిసిపాలిటీలు ఉంటాయి.వీటిలో చేరని రెండు ప్రాంతాలు నార్త్ ఈస్ట్ గ్రీన్ లాండ్ నేషనల్ పార్క్ ,తూలే ఎయిర్ బేస్..రెండోది డెన్మార్క్ అధీనం లో ఉన్నా ,పాలన అంతా అమెరికన్ ఎయిర్ ఫోర్స్ చూస్తుంది .దేశం లో మూడు వంతులు ఎప్పుడూ మంచుతో కప్పబడి ఉంటుంది .జనాభా సుమారు 56వేలు .ప్రపంచం లో అత్యల్ప జనసాంద్రత ఉన్న దేశం .మూడోవంతు జనం ‘’పెద్ద సిటి ‘’నూక్’’ లో నివశిస్తారు .ఇక్కడ జన జీవితం సుమారు 4,500ఏళ్ళ నుంచే ఉన్నది .నార్స్ మెన్ ఇక్కడ మొదట ప్రవేశించారు .ఎస్కిమో సంస్కృతీ ఇక్కడ ఎక్కువ .1979లో డెన్మార్క్ దేశం గ్రీన్ లాండ్ కు స్వాతంత్ర్యం అంటే ‘’హోమ్ రూల్ ‘’ఇచ్చింది .

   ఇక్కడ గడ్డ కట్టిన ఐస్ ఒక తీరం నుంచి మరోతీరానికి ప్రయాణం చేస్తుంది .ఈ ఐస్ షీట్ పై అయిదు పరిశోధక బృందాలు స్థావరాలు ఏర్పాటు చేసుకొన్నాయి .1950వరకు ఒకే ఒక రేడియో స్టేషన్ ఉండేది .2003లలో 35మీటర్ల పొడవు ,15మీటర్ల వెడల్పు ఉన్న ఒక చిన్న ఐలాండ్ ను కనుక్కొన్నారు .గ్రీన్ లాండ్ లో 700ల జీవజాతులున్నాయి అంటే బయో డైవర్సిటి ఎక్కువ .యూరోపియన్ వైట్ బిర్చ్ చెట్లు, గ్రీన్ లాండ్ డాగ్స్,ఫంగి మాస్ ,గ్రీన్లాండ్ షీప్ ,గోట్  రీన్ డీర్ గుర్రాలు అధికం .

  గ్రీన్లాండ్ లో సోషల్ డెమోక్రాటిక్ వ్యవస్థ ఉన్నది .ఆర్ధికం అంతా ఫిషింగ్ వల్లనే వస్తుంది .ఖనిజ సంపదా ఎక్కువే .రూబి డిపాజిట్స్ ఎక్కువగా ఉన్నట్లు గుర్తించారు  .విద్యుత్ ఆయిల్ డీజెల్ ప్లాంట్స్ వల్ల ఉత్పత్తి అవుతుంది .హైడ్రోపవర్ ప్లాంట్ నిర్మాణమూ జరుగుతోంది .ఎయిర్ ట్రాన్స్ పోర్ట్ సిస్టం కూడా రవాణాకు ఉపయోగపడుతోంది .

 గ్రీన్ లాండిక్ అనబడే  ఎస్కిమో భాష-ఎల్యూట్ ను, డేనిష్ భాషను ఇక్కడ మాట్లాడుతారు .గ్రీన్ లాండిక్  భాషను  అధికారభాష చేశారు .సుమారు పదిశాతం మాత్రమె డేనిష్ మాట్లాడుతారు .డెన్మార్క్ లో లాగా నే ఇక్కడ విద్యా వ్యవస్థ ఉంటుంది .పదేళ్ళ ప్రైమరీ విద్య కంపల్సరి .హైస్కూల్ యూని వర్సిటి చదువుకు అవకాశాలున్నాయి .యూని వర్సిటి ఆఫ్ గ్రీన్లాండ్ అనే ఏకైక యూని వర్సిటి ఉన్నది .

  ఇక్కడిమతం షమానిస్టిక్ అనే ఇంసూట్ వారిమతమే .వీరి పురాణాలలో పగతీర్చుకొనే దేవతలు ,వేళ్ళు లేని జలదేవతలు కనిపిస్తారు .వీరే వేల్ వేట  సీల్స్ వేట ను రక్షిస్తారని నమ్మకం .మొదటి నార్సే కాలనీ వారు నార్సే గాడ్స్ ను పూజించారు .కాని ఎరిక్ దిరెడ్ అనే వాడి కొడుకు క్రిస్టియన్ మతం తీసుకొని నార్వే వెళ్లి అక్కడినుంచి మిషనరీలను పంపిమతవ్యాప్తి చేశాడు .ఇప్పుడు ప్రొటెస్టెంట్ మతం ఎక్కువ .ఇక్కడ ఆత్మహత్యల శాతం బాగా ఎక్కువ .మత్తుపానీయం తాగే వారి శాతమూ ఎక్కువే .ఎయిడ్స్ వ్యాదికూడా అత్యధికం .నిరుద్యోగతా ఎక్కువే .

  ఇప్పుడు స్కాండినేవియన్ కల్చర్ ఇక్కడ చోటు చేసుకొన్నది .మ్యూజిక్ కల్చర్ కూడా మొదలైంది .ఫుట్ బాల్ ఆట కు కేంద్రం .వీరి ముఖ్యాహారం ‘’సువాసాట్ ‘’అనే సముద్ర జంతువుల మాంసం .సాల్ట్ ,పెప్పర్ వాడుతారు .మాంచి రుచికరమైన కాఫీ ఇక్కడి మరో ప్రత్యేకత .తారురోడ్లు ఎక్కువకను కార్లుకూడా ఎక్కువే .

 గ్రీన్ లాండిక్  మొదటి నవల ‘’రిప్ వాన్ విన్కిల్ ‘’.మతయ్యాస్ స్టార్చ్ అనే ప్రీస్ట్ ‘ది’గ్రీన్ లాండర్స్ డ్రీమ్స్ ‘’రాసి శతాబ్దం క్రిందట ప్రచురించాడు .’’మా చుట్టూ అందమైన ప్రకృతి ,మేము చిన్నచిన్న గుడిసెలలో ఉంటాం వేట మా వృత్తి ‘’అంటారు .చాలాతక్కువమంది రచయితలే ఉంటారు .ఇతరదేశాలలో ముద్రణపొందిన రచనలు ఇక్కడి నేటివ్ భాషలోకిఅనువాదం పొంది వస్తాయి .పెద్ద లైబ్రరీలు అయిదు , కొన్ని పుస్తకాల షాపులు ఉన్నాయి .డేనిష్ రచయితల రచనలే ఇక్కడ ఉంటాయి .నార్డిక్ క్రైం నవలలకు గిరాకీ ఎక్కువ .వెయ్యి కాపీలు అమ్ముడైతే అదే బెస్ట్ సెల్లర్ ఇక్కడ.

  27ఏళ్ళ గ్రీన్ లాండిక్ రచయిత నివిలాక్ కోర్నేలిసన్ ఇక్కడి సాహిత్య చరిత్ర తిరగరాశాడు ఆతను రాసిన ‘’హోమో సెపైన్స్ ‘’నవల 2014లో పబ్లిష్ అయి ,’’స్ట్రీం ఆఫ్ కాన్షస్ నెస్ ‘’ప్రక్రియతో 5ప్రధాన పాత్రలతో21వ శతాబ్ది  గ్రీన్ లాండిక్ కల్చర్ ను ప్రతిబిబించేట్లు రాశాడు  .ముఖ చిత్రంకూడా అద్భుతంగా ఉంటుంది .ఇతడే ఇప్పుడు టాప్ నవలాకారుడు .200పేజీలలో ‘’క్రిమ్సన్ ‘’అనే నవలరాసిన సారా డీటం మంచి పేరుపొందింది నవలలో ఆప్రజల సెక్స్ ,హింస మొదలైనవాటిని అత్యద్భుతంగా చిత్రించింది .నూతన రచయితలూ ఇప్పుడు ఆదేశ సాహిత్యాన్ని బాగా తీర్చి దిద్దుతున్నారు .వీరిలో జేస్సిక్లేమన్ ,జులి హెడెన్ హార్డెన్ బెర్గ్ ,కట్టి ఫ్రడరిక్సన్ వున్నారు.’’దిఇండిజినస్ పీపుల్ ఆఫ్ నార్దేర్న్ యూరప్  ‘’వంటి మంచిపుస్తకాలు వచ్చాయి .’’గ్రీన్ లాండిక్ లిటరరి అవార్డ్ ‘’లుబాలసాహిత్య ,యువ సాహిత్య  రచయితలకు అందించి ప్రోత్సహిస్తున్నారు .బుక్స్ ఫ్రం గ్రీన్ లాండ్స్ ,రైటర్స్ ఫ్రం గ్రీన్లాండ్ పుస్తకాలూ లభిస్తున్నాయి .

  సశేషం

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -14-4-20-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

ప్రపంచ దేశాల సారస్వతం 39-సౌత్ జార్గియన్ సాహిత్యం

ప్రపంచ దేశాల సారస్వతం

39-సౌత్ జార్గియన్ సాహిత్యం

దక్షిణ అట్లాంటిక్ లో సౌత్ జార్జియా ఐలాండ్ ఉన్నది .ఇక్కడ ‘’గ్రిట్వికన్’’అనే సేటిలర్స్ ఉంటారు . సౌత్ సాండ్ విచ్ దీవులు దీనికి సమీపం లో ఉంటాయి .దీన్ని 1675లో ఆంథోని డి లారోచ్ అనేలండన్ మర్చంట్ మొదట చూశాడు .అందుకని దీనికి’’ రోచ్ ఐలాండ్స్’’ అనే పేరొచ్చింది .తర్వాత 1756లో కమ్మర్షియల్ స్పానిష్ షిప్ ‘’లియాన్ ‘’వారు చూశారు .ఇక్కడ ‘’సీల్స్’’ బాగా విస్తృతంగా లభించటం తో 1786నుంచి 1991 వరకు వాటిని పట్టి ఎగుమతిచేసేవారు .1775లో ‘’జేమ్స్ కుక్’’ ఇక్కడికివచ్చి కాలుమోపాడు .ఇది బ్రిటిష్ సామ్రాజ్య భాగం లోనిది అని ప్రకటించి,జార్జి రాజుపేరిట ‘’జార్జియా ‘’అని  నామకరణం చేశాడు .1843నుంచి బ్రిటన్ రాజుల అధీనంలోకి వచ్చింది .అప్పుడే సాండ్ విచ్ ఐలాండ్స్ నుకూడా ఆయన కనుక్కొన్నాడు

  1882-83లో జర్మన్ ఎక్స్పెడిషన్ షిప్ ఇంటర్నేషనల్ పోలార్ యియర్ ఇక్కడ రాయల్ బే లో లంగరు వేయబడింది .ఇక్కడి ఆదాయం అంతా ‘’వేలింగ్ ‘’,ఫిషింగ్ వల్లనే వస్తుంది .కరెన్సీ పౌండ్ . ఈ  రెండు ఐలాండ్స్ లోనూ పర్మనెంట్ సెటిలర్స్ ఉండరు .దీన్ని ‘’పీచ్ స్టేట్’’అనీ అంటారు .పీకాన్స్ ,పీనట్స్ ఉత్పత్తి బాగాఎక్కువ .ఇక్కడి ఉల్లిపాయలు తియ్యగా ఉండటం ఒక ప్రత్యేకత .ఈ ఐలాండ్స్ ను ‘’అంటార్కిటిక్ ఒయాసిస్ ‘’ అనీ ‘’గాలాపగాస్ ఆఫ్ ది పోల్స్ ‘’అనీ అంటారు .కారణం పెంగ్విన్స్ ఎక్కువగా ఉండటం .’’గాడ్ ఫర్బిడెన్ ఐలాండ్ ‘’అనీపేరుంది .’’ఫస్ట్ గేట్ వె ఆఫ్ అంటార్కిటికా ‘’అనీ  ‘’లోన్లీ ప్లానెట్ ‘’అనీ అంటారు .ఇక్కడి కొమ్ముల” రీన్ డీర్ ”ప్రత్యేక జంతువు .

  ఇక్కడి సాహిత్యం అంతా వేల్స్ వేట గురించే ఎక్కువ .బాస్ బెర్గ్ జాన్ –ది షార్ వేలింగ్ స్టే  షన్స్,ఇలియట్ జి ఏ –వేలింగ్ ఎంటర్ ప్రైజ్ ,హార్డీ ఏ –గ్రేట్ వాటర్స్ ,హార్ట్ ఐ –పెస్కా ఐడాన్ ఎల్లిస్ ,వేలింగ్ ఇన్ దిఫాక్ లాండ్ ఐలాండ్స్ ,హెడ్ లాండ్ ఆర్ కే.-దిఐలాండ్ ఆఫ్ సౌత్ జార్జియా ,షాకిల్టన్-సౌత్ హీ నే మాన్ రాశారు .

ఇంతకంటే సాహిత్య విషయాలేవీ లభ్యం కాలేదు . దీనితో దక్షిణ అమెరికా దేశాల సాహిత్యం అంటే లాటిన్ అమెరికా దేశాల సాహిత్యం అంతా రాశాను .

  సశేషం

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -12-4-20-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

ప్రపంచ దేశాల సారస్వతం 38-ఫాక్ లాండియన్ సాహిత్యం

ప్రపంచ దేశాల సారస్వతం 38-ఫాక్ లాండియన్ సాహిత్యం

ఫాక్ లాండ్ లు ఆర్చిపేలగో అనే 763 ల దీవులు .దక్షిణ అట్లాంటిక్ సముద్ర పడమరవైపుంటాయి .అర్జంటినాకు తూర్పు తీరానికి 480కిలీమీటర్లు . వీటికి ”ఐలాస్  మాల్వినాస్”అనే పేరుకూడా ఉంది  జనాభా 3వేలుమాత్రమే .విస్తీర్ణం మాత్రం 12వేల చదరపు కిలోమీటర్లు .జమైకాకంటే కొంచెం పెద్దది  వేల్స్ లో సగం ఉంటుంది .కనుక ఆవాసాలు దూరదూరంగా ఉంటాయి .బ్రిటన్ సముద్రతీరాలకు సమీపం .85శాతం ప్రజలు రాజధాని స్టాన్లీ లోనే ఉంటారు 2006 జనాభాలెక్కలప్రకారం అక్కిడి ప్రజలలో 55శాతం పైగా అక్కడ పుట్టినవారు కాదు .ఇంగ్లాండ్ ,సెయింట్ హెలీనా,చిలీ ఆస్ట్రేలియా  లనుండి వలసవచ్చినవారే , ఈదేశ ప్రజలు 74రోజులపోరాటం లో అర్జెంటీనా నుండి విముక్తిపొంది చరిత్ర సృష్టించారు .ఎక్కువభాగం ఇంగ్లిష్ మాట్లాడుతారు .కానీ వ్యాకరణం నిర్దుష్టంగా ఉండదు .

   ఫాక్లాండ్ ఐలాండ్ లలో మొదట ఆవాసం ఏర్పరచుకొన్నది ఫ్రాంకో ఫోన్- ఐన లూయీ ఆంటోనీ బోగన్ విల్లా 3-2-1764న .కొద్దికాలం లోనే 150మంది చేరారు .తర్వాత ఆంగ్లో ఫోన్ సెటిల్ మెంట్ 2-1-1833న  కెప్టెన్ ఆన్ స్లో రాకతో జరిగింది .ఆతర్వాత చాలామంది  సెటిలర్స్ వచ్చి చేరారు .ఇంగ్లిష్ ప్రభావమే అన్నిట్లోనూ వచ్చేసి రేడియో కూడా ఆభాషలోనే వచ్చింది .ఇప్పుడు అక్కడ ఉన్న ఇంగ్లిష్ గత 180ఏళ్ళుగా అభి వృద్ధి ఐనదే .

  అర్జంటినా యుద్ధంతో అక్కడ సాహిత్య సృష్టి జరిగింది .దీనిలో స్వీయ చరిత్రలు ,ది ఇన్సైట్ టీంఅండ్ లాటిన్ అమెరికన్ ,టెక్నికల్ ,అధికార విచారణలు ఉంటాయి .బ్రిటిష్ అమెరికా ,అర్జెంటీనా ప్రభుత్వాల పాత్ర ,సార్వభౌమాధికారం పై తగాదా ,ఆ ద్వీపాల  సహజ వాతావరణం ,అక్కడి ప్రజల జీవిత విధానం ,శాంతి ప్రయత్నాల వైఫల్యాలు అన్నీ ఇందులో ఉన్నాయి .

  జిడిపి స్థాయి ఎక్కువ .అత్యధిక జిడిపి ఉన్న దేశాలలో అయిదవ దేశం .2016 కి నిరుద్యోగం 1శాతం మాత్రమె .’’హై హ్యూమన్ డెవలప్ మెంట్ ఇండెక్స్’’ ఉన్న దేశం .ఇక్కడి కరెన్సీ- ఫాక్లాండ్ ఐలాండ్ పౌండ్ .షిప్ రీ సప్లైయింగ్ ,గొర్రెల పెంపకం ఎక్కువ .ఇక్కడ బ్రిటిష్ సెట్లర్స్ ల సంస్కృతే ఇప్పటికీ ఉన్నది .కాని గాచో ఇన్హాబిటెంట్ ల పదాలు ఇంకా వాడుకలో ఉన్నాయి .ఇక్కడి ఇంగ్లిష్ అంటే బ్రిటిష్ ఇంగ్లిష్ అధికారభాష .కొందరు స్పానిష్ కూడా మాట్లాడుతారు .ఈ దీవులలో రెండే రెండు వీక్లీ మేగజైన్లు –టీ బెర్రీ ఎక్స్ప్రెస్ ,ది పెంగ్విన్ న్యూస్ ఉన్నాయి .ఇంగ్లాండ్ నుంచే టివి,రేడియో  ప్రోగ్రామ్లు ప్రసారమౌతాయి .మాంసం,చేపలు ,బీఫ్  తోపాటు ఇంట్లో చేసిన బిస్కట్లు, కేకులు తింటారు .తమాషా ఐన క్లబ్బూ సంస్థలు ఉన్నాయి .మాక్డో  నాల్డ్,స్టార్ బక్ వంటి సంస్థలు లేవు .ఇక్కడ ఉలెన్ వస్తువులు ,డ్రిఫ్ట్ వుడ్ క్రాఫ్ట్స్ ఎక్కువ.ఎక్కడ చూసినా పెంగ్విన్స్ పెంగ్విన్స్ పెంగ్విన్స్ కనిపించి ముద్దుచేస్తాయి .

   ఫాక్లాండ్స్  రచయితలలో ముఖ్యుడు -1968లో పుట్టిన –జేమ్స్ పెక్.అర్జంటినా బ్రిటిష్ పౌరసత్వాలను  వదిలేసి,2016లో ఫాక్లాండ్సకు  వచ్చి స్థిరపడ్డాడు .అర్జెంటైన్  నేషనాలిటి లా పుస్తకం రాశాడు .గొప్ప ఆర్టిస్ట్ కూడా .1968లోరాజధాని  స్టాన్లీ లోపుట్టాడు .ఫాక్లాండ్స్  వార్ పై రచన చేశాడు .ఫాల్క్లాన్డ్స్ లో పుట్టిన మొట్టమొదటి వ్యక్తిగా రికార్డ్ కెక్కాడు .దీనికి అతనికి దేశ ప్రెసిడెంట్ ‘’డాక్యుమెంటో నేషినో డి ఐడెంటి డాడ్’’ను పాస్ పోర్ట్ ను ప్రదానం చేశాడు .2014లో ఇక్కడికొచ్చి స్థిరపడ్డాడు .

టోనికార్ –మిడీవల్ వెల్ష్ హిస్టరీ ప్రొఫెసర్ .18ఏళ్లవయసులో’’బ్రెయిన్ ఆఫ్ బ్రిటన్ ‘’అవార్డ్ ను 1956లో అందుకొని అంత చిన్న వయసులో అఆవార్డ్ అందుకొన్న మొదటివ్యక్తిగా రికార్డ్ సృష్టించాడు .

డేవిడ్ గాల్లోవే –వెస్ట్ ఫాక్లాండ్లో ఎడ్యుకేషన్ సైకాలజీ  టీచర్ .ఫాక్ లాండ్ ఐలాండ్స్ పక్షులపై పరిశోధన చేసి రాశాడు .

 అయిడాన్ కెర్-అగ్రికల్చర్ డిపార్ట్ మెంట్ లో సీనియర్ సైంటిస్ట్ .కంట్రీ సైడ్ మేనేజ్ మెంట్ పై గ్రంథ రచన చేశాడు

డేవిడ్ లక్స్టన్-పోస్ట్అండ్ టెలిగ్రాఫ్ లో ఉద్యోగించాడు .1969లో న్యూజిలాండ్ వెళ్లి హిస్టరీ పై పుస్తకాలురాశాడు .

జోనాధన్ మీ బర్గ్-జాగ్రఫీ గ్రాడ్యుయేట్ .కారకరాస్, అక్కడి ప్రజలపై రచన చేశాడు

స్టీఫెన్ పామర్-క్రైస్ట్ చర్చి రెక్టార్ .ఈ  లాండ్స్  జర్నల్స్ కు వ్యాసాలూ రాశాడు

ఆన్ సేవర్స్ –కేంబ్రిడ్జి స్కాట్ పోలార్ రిసెర్చ్ సెంటర్ లో పని చేశాడు .వ్రాతప్రతుల కీపర్ గాఉన్నాడు .ఆర్కిటెక్ గాలరీకి బాధ్యత వహించాడు .డేఫినిటివ్ హిస్టరీ ఆఫ్ ఆర్ ఆర్ ఎస్ డిస్కవరీ మొదలైన పుస్తకాలు రాశాడు .

ఫిల్ స్టోన్-బ్రిటిష్ జియోలాజికల్ సర్వేలో రిసెర్చ్ అసోసియేట్ –సౌత్ జార్జియాలో అంటార్కిటిక్ సర్వేలో ఉద్యోగం .డిపార్ట్ మెంట్ ఆఫ్ మినరల్స్ అండ్ రిసోర్సెస్ కు జియోలాగికల్ అడ్వైజర్ .

ఎడ్వర్డ్ వాల్ష్ -19వ శతాబ్ది ఐరిష్ మైగ్రేషన్ పై రచన చేశాడు .షాకిల్ టన్ స్కాలర్షిప్ పొందాడు .ఫాక్లాండ్ బయోగ్రఫీ డిక్షనరీ కి సహకరించాడు .లండన్ లోనే ఉండిపని చేస్తాడు .

రోబిన్ వుడ్స్ –బ్రిటిష్ అంటార్కిటిక్ మెటిరలాజికల్ సర్వే లో పని చేశాడు .1963వరకు పక్షులపై పరిశోధన చేసి ,ఫాక్లాండ్ ఐలాండ్స్ లోని వృక్ష ,జంతు పక్షి,క్షీరదాలు మొదలైన సంతతులపై గొప్ప రిసెర్చ్ చేశాడు ..’’అట్లాస్ ఆఫ్ బ్రీడింగ్ బర్డ్స్ ఆఫ్ ఫాక్ లాండ్ ఐలాండ్స్ ‘’ను 1997లో ప్రచురించాడు .దీనిపై చెక్ లిస్టు ను 2017లో విడుదల చేశాడు .పీతలు , సెడ్జి రెన్స్ ,స్ట్రియేటేడ్ కారకారా అంటే మహా ఇష్టంకష్టం పడిపరిశోధించాడు .ఐలాండ్ జీవావరణం పై క్షీరదాల (మామల్స్ )ప్రభావం  పైకూడా రిసెర్చ్ చేసి రాశాడు బోర్డ్ ఆఫ్ కన్జర్వేషన్ కు చైర్మన్ ,ఆనరరి వైస్ ప్రెసిడెంట్ ..ప్రకృతి సంరక్షణకోసం చేసిన కృషికి M.B.E.అవార్డ్ అందుకొన్నాడు ‘

కోలిన్ య౦గ్ –గ్రాస్ లాండ్ ఆఫీసర్ .గ్రాస్ లాన్డ్స్.కాన్ఫరెన్స్ నిర్వహించాడు .1967లో మొదటిజర్నల్ ముద్రించాడు .దీనికి తగిన మెప్పు లభించింది .

   సశేషం

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -11-4-20-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment