దక్కదు అనుకొన్న లెక్చరర్ పోస్ట్ ఇద్దరు ఆంగ్ల అధికారుల నిష్పక్షపాతం వలన దువ్వూరి వారికి దక్కిన వైనం

దక్కదు అనుకొన్న లెక్చరర్ పోస్ట్ ఇద్దరు ఆంగ్ల అధికారుల నిష్పక్షపాతం వలన దువ్వూరి వారికి దక్కిన వైనం

 ప్రౌఢ వ్యాకరణ కర్త శ్రీ వఝల చిన సీతారామ శాస్త్రిగారు తెలుగు లెక్చరర్ గా ఆంద్ర విశ్వవిద్యాలయం లో 1941 లో రిటైరయ్యారు .ఈ పోస్ట్ ను నింపటానికి యూనివర్సిటి ఒక పండితుడుకావాలని ఆయన ఛందో వ్యాకరణాది లక్షణ గ్రంథాలలో బాగా కృషి చేసి ,బోధనానుభవం  తోపాటు శాసన పరిశోధన చేసి ఉండాలని పత్రికా ప్రకటన చేసింది .అప్పటికి శ్రీ దువ్వూరి వేంకట రమణ శాస్త్రి గారు చిట్టి గూడూరు ఓరిఎంటల్ కాలేజీలో పాతుకుపోయారు కదలాలనే ఆలోచనాలేదు .కాని ఊరూ పేరూ లేని పండితులు దానికి దరఖాస్తులు పెట్టి ,జమీన్దారులతో సిఫార్సు ఉత్తరాలతో ప్రయత్నిస్తున్నారని కర్ణాకర్ణి గా విని దరఖాస్తు పెట్టటానికైనా తనకు అర్హత లేదా అనుకోని సహాధ్యాపకులు రామానుజాచార్యులవారితో ,సోమశేఖర శాస్త్రి గారితో అన్నారు .వారిద్దరూ ‘’అది మీ గురువుగారు వజ్ఝల వారి స్థానం.అన్ని విధాలా మీకు అర్హత ఉంది .దరఖాస్తు పెట్టకపోతే అర్హత లేక ఊరుకున్నట్లు ఉంటుంది .అది మనకు చాలా చిన్నతనం .ఒక రాయి విసిరి చూడండి ‘’అని ప్రోత్సహించారు .

  వీరి ప్రోత్సాహంతో శాస్త్రిగారు ప్రిన్సిపాల్ వరదా చార్యుల వారి వద్దకు వెళ్లి విషయం చెప్పారు .ఆయన వెంటనే ‘’ఎవరు దరఖాస్తు పెట్టినా లాభం లేదు .అది వేటూరి ప్రభాకర శాస్త్రి గారికే ఇవ్వాలని యూనివర్సిటి ఇప్పటికే నిర్ణయం తీసుకొన్నది ,మొన్న తిరుపతిలో వేటూరి వారుకలిసి ‘’దేశం లో తెలుగు పోస్ట్ లలో పెద్దది కదా వెడదామని ఉంది ‘’అనగా ‘’తప్పకుండా వెళ్ళండి ‘’అని నేనూ అన్నాను ‘’అని ,’’మీరు కూడా ఒక కాగితం పెట్టండి వస్తుందని ఆశ మాత్రం పెట్టుకోకుండా ,దరఖాస్తు పంపి నిశ్చింతగా ఉండండి ‘’అని చావు కబురు చల్లగా చెప్పారు  ఆచార్య స్వామి .’’దరఖాస్తుతో పాటు రెండు మూడు  టెస్టిమోనియల్స్ ఉండాలి కనుక మీది ఒకటి ,వజ్ఝల వారిదీ, రాయుడు శాస్త్రిగారిదీతీసుకొని  పంపిస్తాను ‘’అన్నారు దువ్వూరి వారు .వజ్ఝాల వారికి రాస్తే ‘’ఏమయ్యోయ్ !నా స్థానం లో నువ్వు రావటం నాకు చాలా ఇష్టం .’’ఎప్పటికైనా నా పోస్ట్ లో మా వేంకట రమణ శాస్త్రి వస్తేనే బాగుంటుంది అని వీలైనప్పుడల్లా సన్నాయి నొక్కులు నొక్కుతూనే ఉన్నాను .ఇది అందరికీ తెలుసు కాని ఇప్పుడు దృశ్యం మారిపోయింది .వేటూరివారికే ఇద్దామని యూని వర్సిటి అభిప్రాయ పడింది .ఆయనకూడా ఈ మధ్య వచ్చి అందర్నీ కలిసి ,ఇల్లు కూడా మాట్లాడుకొని వెళ్ళారు .కనుక నీకు ఆ పోస్ట్ రాదు .లక్షణ గ్రంధాలలో అత్యంత ఆసక్తి కల నా అత్మీయుడు నా స్థానం లో వచ్చే యోగం లేకపోయింది . అయినా అడిగావు కనుక టెస్టిమొనియల్ పంపిస్తున్నాను ‘’ అని సుదీర్ఘ లేఖతో టేస్టిమోనియల్ పంపారు .రాయుడు శాస్త్రిగారు మ౦దేపంపారు .ఆచార్యులుగారూ మిగిలిన ఇద్దరూ చాలా వాత్సల్యాన్ని చూపిస్తూ మంచి మాటలు రాశారు ,టేస్టిమోనియల్ తో  దరఖాస్తు సకాలం లో యూని వర్సిటీకి పంపారు .శాస్త్రిగారు మనసులో ‘’ఉద్యోగం వద్దు సద్యోగం వద్దు .అలాంటి గురువుల వాత్సల్యాభిమానాలు లభించాయి చాలు అనుకొన్నారు .

   కొంతకాలం తారవాత విజయనగరం  సంస్కృత కాలేజి లో ఒరియా పండితులుగా పని చేసి ,యూని వర్సిటీలో ఒరియా పండితులుగా ఉన్న మధుసూదన షడంగి  దువ్వూరి వారి మసకపల్లికి ఉత్తరం రాసి ‘’మనమింక యూని వర్సిటీలో  కలిసి ఉంటాం ‘’అని రాశారు శాస్త్రిగారికి అది అర్ధం కాలేదు .ఆయనకు వేటూరి వారికి ఆపోస్ట్ ఇస్తున్నట్లు తెలిసి ఉండదు అనుకొన్నారు .సస్పెన్స్ తెర వీడి ,మూడు రోజులతర్వాత దువ్వూరి వారికి యూని వర్సిటి రిజిస్ట్రార్ నుంచి’’వాల్తేరు యూని వర్సిటి కాలేజిలో తెలుగు డిపార్ట్ మెంట్ లో ఆనర్స్ పండితులుగా మిమ్మల్ని సిండికేట్ అపాయింట్ చేసింది .15-6-1941 న జాయిన్ అయి రిపోర్ట్ ఇవ్వండి ‘’అని  ఒక కవరొచ్చింది .పెద్దగా ఆంగ్ల పాండిత్యం లేక శ్రుత పాండిత్యమే ఉన్న శాస్త్రిగారు అయిదారు సార్లు చదివి అర్ధం చేసుకొని అవాక్కయ్యారు .జులై 1కాని కాలేజీలు తెరవరు. కాని వజ్ఝలవారి పోస్ట్ ఖాళీ అయినందున పై తే దీకే జాయనింగ్ ఆర్డర్ ఇచ్చారు .

  సంతోషంగా వరదాచార్యులగారికి చెప్పి  కాగితం  చూపించగా ఆయనా మరింత తెల్లబోయారు .18ఏళ్ళు చిట్టి గూడూరులో పని చేసి శాఖను సమర్ధతతో నడపటం ,తనతర్వాత పంచా౦గమ్ నరసింహా చార్యులుగారున్నండువల్లా ,తమకాలేజీ లో పని చేసిన వ్యక్తికీ యూనివర్సిటీ పోస్ట్ రావటం వల్లా ఆచార్యులవారు పరమ సంతోషింఛి ‘’వెంటనే వెళ్లి జాయిన్ అవండి ‘’అన్నారు .విశాఖ  వెళ్లియూనివర్సిటీ కాలేజీల ప్రిన్సిపాల్ శ్రీ సూరి భగవంతం గారిని కలిశారు .ఆయన ‘’సంతోషం సెలవులు కనుక ఇంటికి వెళ్ళండి జులై 1 కి రండి ‘’అన్నారు .తెలుగు శాఖలో   ఉన్న పింగళి లక్ష్మీకా౦త౦  గారిని ,గంటి జోగి సోమయాజులుగారినీ , షడంగి గారినీ మర్యాదగా కలిసి మసకపల్లి వెళ్ళిపోయారు దువ్వూరి వారు .

  రాదు అనుకొన్న పోస్ట్ ఎలా వచ్చిందో  అనే మిస్టరీ వీడలేదు .నెమ్మదిమీద వివరాలు తెలుసుకొన్నారు .ముందు సెలెక్షన్  కమిటీ సమావేశమైంది .తెలుగు హెడ్ పింగళి ,ప్రిన్సిపాల్ విస్సాఅప్పారావుగారు సిండికేట్ మెంబర్ జయపూర్ దివాన్ ,మద్రాస్ యూని వర్సిటి నుంచి ఎక్స్పెర్ట్ మెంబర్ గా కోరాడ రామకృష్ణయ్యగారు ,వైస్ చాన్సలర్ కట్టమంచి రామలింగారెడ్డిగారు కమిటీ మెంబర్లు .రిజిస్ట్రార్ వి ఎస్ కృష్ణ గారు కూడా మీటింగ్ లో కూర్చున్నారు .మీటింగ్ ప్రారంభం లో కట్టమంచి ‘’వేటూరి వారిని వేస్తె బాగుంటుందను కుంటున్నాను. మీ అభిప్రాయం చెప్పండి ‘’అని లాంచనంగా అన్నారు ..ఆమాట ఇదివరకే అనుకొన్నాం కనుక ఆపేరు రాయండి అన్నారట మిగిలినవారు .అప్పుడు వైస్ చాన్సలర్ గారే ‘’సెలెక్షన్ కమిటీ లో ఒకే ఒక్క పేరు వేస్తె ఆక్షేపిస్తారు .వచ్చిన దరఖాస్తులబట్టి మరో రెండు పేర్లు చేరిస్తే మంచిది ‘’అన్నారు .కోరాడ వారు దువ్వూరి వారిపేరు ,పంచాగ్నుల ఆదినారాయణ శాస్త్రి గారి పేరు వేయమన్నారు .దివాన్ గారు ‘’బానే ఉంది కాని పంచాగ్నుల వారి పేరు రెండుగా వేయండి ‘’అన్నారు .లక్ష్మీకాన్తంగారు ‘’దువ్వూరి వారి దే రెండో పేరుగా ఉండాలి ‘’అన్నారు .రెడ్డిగారు ‘’ఏ పేరు వేసినా సిండికేట్ లో  ఇచ్చేది వేటూరివారికే కదా .ఏదో క్రమం చెప్పండి’’ అని విస్సావారిని కోరారు .ఆయన రెండవపేరు దువ్వూరి ,మూడవపేరు పంచాగ్నుల ‘’అన్నారు ఈ వరుసలోనే రాశారు .

 మర్నాడు సిండికేట్ మీటింగ్ లో అపాయంట్ మెంట్ విషయం వచ్చి కట్టమంచి వేటూరివారి పాండిత్యం  తాళపత్ర పరిశోధన సోదాహరణం గా చెప్పి ,సెలెక్షన్ కమిటీ కూడా  వీరి పేరే  ముందు సూచి౦ చింది కనుక వేటూరివారికే ఇద్దాం అన్నారు .సిండికేట్ లో ఎక్స్ అఫీషియో మెంబర్ విశాఖ  జిల్లా కలెక్టర్’’ మాస్టర్ మాన్’’ అనే యూరోపియన్ ‘’మిస్టర్ వైస్ చాన్సలర్ !పండితుల తారతమ్యాలు మీకు తెలిసినట్లు మాకు తెలియదు .కాని సెలెక్షన్ కమిటీ నిర్ణయించిన క్రమం సరిగా లేదని పించింది .వ్యాకరణ౦ లో ప్రత్యేకక కృషి చేసినవారికి ,ఎక్స్ పీరిఎన్స్ ఉన్నవారికీ  ఈ పోస్ట్ ఇస్తామని మనం ప్రకటించాం  .రెండవ వ్యక్తి వ్యాకరణం స్పెషలైజ్ చేసినట్లు ,వ్యాకరణ బోధనలో 22ఏళ్ళ సర్వీస్ ఉన్నట్లు అప్లికేషన్ లో స్పష్టంగా ఉంది .మొదటివారికి మూడున్నర ,మూడవవారికి రెండున్నర యేళ్ళే బోధనానుభవం ఉంది .మధ్యవ్యక్తి, పై ఇద్దరికంటే పదేళ్ళు చిన్నవారుగా ఉన్నారు .కనుక రెండో పేరును మొదటి పేరుగా మార్చండి ‘’అని ఖచ్చితంగా చెప్పి’’వాట్ డు యు సే మిస్టర్ రాయ్ స్ట్రాక్ “”?అని అడిగాడు .స్ట్రాక్ అమెరికావాడు .అతడూ వెంటనే ‘’ఐ ఎంటైర్లీ యగ్రి విత్ యు ‘’అన్నాడు .ముఖం మాడిన రెడ్డిగారు మనసుమార్చుకొని గంభీరంగా ‘’దట్సాల్ రైట్ .వుయ్ కెన్ చేంజ్ ది ఆర్డర్ ‘’అనగా రిజిస్ట్రార్ వరుసమార్చి దువ్వూరి వారిపేరు మొదటిపేరుగా మార్చారు .తర్వాతనే దువ్వూరివారికి ఆర్డర్ పంపారు. సమర్ధతను గుర్తించి దువ్వూరి వారికి ఆపోస్ట్ ఇచ్చిన ఆ తెల్ల దొరలు  అభినదనీయులు కదా .పోస్ట్ ల విషయం లో యెంత కిరికిరి జరుగు తుందో తెలిసిందా ? దీనికి ఎవరూ అతీతులు కారు .

  ఆధారం –దువ్వూరి వారి స్వీయ చరిత్ర

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -19-11-19-ఉయ్యూరు

.

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

గౌతమీ మహాత్మ్యం—71 101- చక్షుస్తీర్ధం

గౌతమీ మహాత్మ్యం—71

101- చక్షుస్తీర్ధం

గౌతమికి దక్షిణాన చక్షుస్తీర్ధం ఉంది. అక్కడ దేవదేవుడైన యోగీశ్వరుడు కొలువై ఉంటాడు .పర్వత శిఖరం పై ‘’భౌవనం ‘’అనే పురం ఉంది. దాని రాజు భౌవనుడు క్షాత్ర ధర్మ పరాయణుడు .ఆపురం లో కౌశికుడనే బ్రాహ్మణుడు ,అతని కొడుకు వేదపండితుడైన గౌతముడు ఉన్నారు .తల్లి మనో దోషం చేత యితడు తండ్రికి విరోధి అయి ,మణి కుండలుడు అనే ధనిక  వైశ్య బాలునితో స్నేహం చేశాడు .ఇది విచిత్ర స్నేహం .ఒక రోజు గౌతముడు అతనితో ‘’ధన సంపాదనకోసం పర్వతాలు సముద్రాలు దాటి  వెడదాం.నిర్ధనుడి జీవితం వ్యర్ధం ‘’అనగా వైశ్యబాలుడు ‘’నా తండ్రి సంపాది౦ చిందే చాలా ఉంది .ఇంకా నాకు డబ్బు ఎందుకు “’?అనగా గౌతముడు ‘’మానవునికి ఆధిక్యత కావాలి .పితృ దనం అపేక్షి౦చ నివాడినేలోకం గౌరవిస్తు౦ది.స్వయంగా డబ్బు సంపాది౦ చే వాడే కృతార్ధుడు ‘’అన్నాడు .

   నిజమేనని నమ్మిన మణి కుండలుడు రత్నాలు డబ్బు తెచ్చి గౌతముడికిచ్చాడు .విప్రుడు మోసకారి అని ఆమయాకుడికి తెలీదు .ఇద్దరు ఊరు వదిలి దేశాలు తిరుగుతున్నారు .మిత్రుని వద్ద వున్న దనం రత్నాలకు  కాజేయాలని గౌతముని దురాలోచన .డబ్బు సంపాదించి కాంతా సుఖం పొందాలని ఉవ్విళ్ళూ రుతున్నాడు బాపడు .ఒకరోజు మిత్రునితో ‘’ప్రాణులు అధర్మ౦ వలననే అభి వృద్ధి చెందుతున్నయి .ధర్మం వలన ప్రయోజనం లేదు ‘’అనగా మిత్రుడు ‘’కాదు ‘’అని ‘’ధర్మం వలన సుఖం ప్రతిస్టితమౌతుంది. పాపం లో దుఖం భయం శోకం దరిద్రం క్లేశాలున్నాయి .ధర్మం ముక్తి నిస్తుంది .ధర్మం వినాశనం చెందని శాశ్వతమైనది ‘’అన్నాడు ,

  చివరికి వారిద్దరి మధ్యా ‘’ఎవరి పక్షం ఉత్తమమం అని తేలితే ఎదుటివాడికి తన ధనం అంతా ఇచ్చెయ్యాలి’’అనే ఒప్పందం కుదిరింది .అక్కడున్న జనాలతో ‘’ధర్మం ,అధర్మం లలో ఏది గొప్పది ?’’అని అడిగారు .వాళ్ళు ధర్మాత్ములు దుఖం పొందితే పాపాత్ములు సుఖం పొందుతారు అని చెప్పగా ,తాను ఓడినట్లు ఒప్పుకొని ,.ధర్మ వేత్తలలో గొప్పవాడైన వైశ్యుడు తన దగ్గరున్న దంతా బ్రాహ్మణుడికి ఇచ్చేశాడు . గౌతముడు మళ్ళీ స్నేహితుడిని ‘’ఇంకా ధర్మాన్ని నమ్ముతావా ?’’అని ప్రశ్నించగా ‘’నమ్ముతాను ‘’అని నిస్సంకోచంగా చెప్పాడు .దానికి బాపడు ‘’నేనే జయించి నీడబ్బంతా తీసుకొన్నాను .కనుక ధర్మం నా చేత జయించబడింది .దీనికి చిరు నవ్వుతో వైశ్యుడు ‘’ధర్మం ఎవరి దగ్గర ఉండదో వాడిని ధాన్యం లో తాలు గా ,పక్షులలో ‘’పుత్తిక ‘’అంటే వ్యర్ధమైన పక్షిగా లోకం భావిస్తుంది .నాలుగు పురుషార్ధాలలో ధర్మమే మొదటిది .నువ్వు  జయించా నని ఎలా అనుకొంటావు ?అన్నాడు .’’ఐతే పందెం కాద్దాం’’అనగా ఇద్దరూ ఒప్పుకొని మళ్ళీ జనాలను అడుగగా వాళ్ళు అధర్మాన్నే సమర్ధించటం తో ద్విజుడు తానే గెలిచినట్లు ప్రకటించి కోమటి వాని రెండు చేతులూ ఖండింఛి మళ్ళీ అడిగాడు .ధర్మమే శ్రేష్టం అని మళ్ళీ చెప్పాడు వైశ్యుడు .గౌతముడు ధనవంతుడుకాగా మణి కుండలుడు చేతుల్లేక నిర్ధనుడై ,కలిసే సంచరిస్తూ గంగానదిని చేరి మళ్ళీ వాదు లాడుకొన్నారు .వైశ్యుడు గంగామాతను యోగీశ్వరుడైన హరిని స్తుతించగా గౌతముడు ధనగర్వంతో ‘’నీ రెండు చేతులు నరికాను ఇప్పుడు డు ప్రాణాలతో మాత్రమే ఉన్నావు .నాకు వ్యతిరేకంగా మాట్లాడితే తల నరికేస్తా ‘’అని బెదిరించాడు .

 నవ్వుతో వైశ్యుడు ‘’ధర్మమే గొప్ప హరిని నిందిస్తే పాపం .’’అని ‘’ఇప్పటికీ ధర్మమే గొప్ప అని నీవు అంటే మన ప్రాణాలను పణంగా పెడదాము ‘’అనగా సరే అన్నాడు .ఇద్దరూ జనాలను అడిగితె పూర్వపు సమాధానమే రావటం వలన బ్రాహ్మణుడు  జయించి నట్లు భావించాడు .కోపం పట్టలేక వైశ్యుని కిందపడేసి ఒకకన్ను పీకేసి ‘’నీ శరీరం లో భాగాలన్నీ పోయాయి .ఇకనేను పోతున్నాను .మళ్ళీ ధర్మం మాట ఎత్తకు ‘’అని హెచ్చరించి వెళ్ళిపోయాడు .వైశ్యుడు దీనంగా శోకం తో అక్కడే పడి ఉన్నాడు .రాత్రిఅయి చంద్రోదయం అవగా శుక్ల ఏకాదశి  కనుక విభీషణుడుతన పరివారం తో  అక్కడి వచ్చి గంగాస్నానం చేసి యోగీశ్వరుని పూజించాడు. అతడి కొడుకు ‘’వైభీషణి’’ దారిలో వైశ్యుని చూసి జాలిపొంది ,విషయం తెలుసుకొని తండ్రికి విన్నవించాడు .కొడుకుతో తండ్రి ‘’శ్రీ రాముడు నా గురువు .నా మిత్రుడు హనుమ ఈ సంజీవనీ పర్వతాన్ని ఇక్కడికి తెచ్ఛి అవసరం తీరగానే దాన్ని హిమవత్పర్వతానికి చేర్చాడు .నువ్వు దానిపై ఉన్న ఓషధి  తెచ్చి ,శ్రీహరిని స్మరిస్తూ అతని హృదయం దగ్గర పెట్టు  సంజీవ పర్వతం పై ఉన్న విశల్య కరణి ఇక్కడే పడిపోయింది ‘’అనగా విభీషణుడు చూపించగా కొడుకు’’ఇషేత్వె త్యస్య వృక్షస్య శాఖాం చిచ్చేదతత్సుత –‘’దానికొమ్మను ఖండించి  దాన్ని తీసుకొని వైశ్యుని దగ్గరకు వచ్చి తాకించగా అతడికి కళ్ళు చేతులూ వచ్చేశాయి .

  అకొమ్మను తీసుకొని గౌతమీ స్నానం చేసి ,పరి శుద్దుడై ,హరిని స్మరిస్తూ మహాపురం అనే  నగరం చేరగా ,అక్కడి రాజు మహాబలుడికి ఉన్న అంధురాలైన పుత్రిక కు కళ్ళు తెప్పించిన వాడికి ఆమెనూ రాజ్యాన్ని ఇస్తానన్న  ప్రకటన విని వెళ్లి ,రాజ నగరికి  వెళ్లి తన చేతిలోని కొమ్మను తాకించగా ఆమెకు కళ్ళు వచ్చాయి .అప్పుడు అతడు ‘’బ్రాహ్మణుల అనుగ్రహం ధర్మం యొక్క తపస్సు,దాన యజ్ఞ ,దివ్య ఓషధీ  ప్రసాదం వలన   నాకు ఇలాంటి ప్రభావం వచ్చి౦ది ‘’అనగా రాజు ఆశ్చరపడి ,విషయం తెలుసుకొని అతడు వైశ్యుడైనా ధర్మమార్గగామికనుక తన కూతురుతోపాటు రాజ్యాన్ని కూడా ఇచ్చి వివాహం చేశాడు .దంపతులు చాలాకాలం సుఖంగా  జీవించారు .రాజు వానప్ర స్థానికి  వెళ్ళగా ఇతడే పూర్తి అధికారాలతో రాజయ్యాడు .మిత్రుడు గౌతముడి దగ్గరున్న ధనమంతా జూదరులు హరి౦చా రని తెలిసి ,పిలిపించి ,ధనవంతుని చేసి ధర్మ శ్రేష్టత ఏమిటో వివరించాడు .అతని తలిదండ్రులనూ రప్పించి యదా శక్తి గౌరవ హోదాలు కల్పించాడు .అప్పటిను౦చి ఈ  తీర్ధం మృత సంజీవనీ తీర్ధంగా ,చక్షుస్తీర్ధంగా ప్రసిద్ధి చెందింది .మనసుకు నిర్మలత్వం ప్రశాంతత కలిగిస్తుంది అని నారదునికి బ్రహ్మ వివరించాడు .

  సశేషం

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -19-11-19-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

 వినమ్ర కృతజ్ఞతాంజలి

 వినమ్ర కృతజ్ఞతాంజలి

 నా దోవలో నేనేదో రాసుకుంటూ,చేసుకొంటూ  పోతూంటే ,ఆంద్ర ప్రదేశ్ రచయితల సంఘం అనే రాష్ట్ర స్థాయి సాహిత్య సంస్థ దుర్భిణీ వేసి గుర్తించి ,ఒక కొత్త  ‘’జ్ఞాన జ్యోతి’’పురస్కారం మొదటి సారిగా ఏర్పరచి ,దానిని ప్రప్రథమంగా నాకు అందజేయటం  వారి సౌజన్యానికి నిలువెత్తు ఉదాహరణ .వారందరికీ కృతజ్ఞతలు .ఇది నా అదృష్టమే .సరస భారతి సాహిత్య సాంస్కృతిక సంస్థ స్థాపించి 10 సంవత్సరాలు దాటిన శుభసందర్బం లో ఈ పురస్కారం అందుకోవటం వలన ఈ పురస్కారం సరసభారతి కే చెందుతుందని  మనస్పూర్తిగా,వినమ్రంగా  భావిస్తున్నాను .పురస్కార విషయం తెలుసుకొన్న అశేష సాహితీ బంధువులు ,సాహితీ మిత్రులు,సాహిత్యాభిమానులు , కుటుంబ బంధుగణం ,పెద్దలు ,పిన్నలు అందరూ విశేషంగా స్పందించి అభిన౦దనలు తెలియ జేసినందుకు అందరికీ కృతజ్ఞతా పూర్వక ధన్యవాదాలు తెలియ జేస్తున్నాను .నాపైనా ,సరసభారతి పైనా ఉంచిన మీ అందరి నమ్మకానికి శత సహస్ర నమస్సులు .

 

జ్ఞాన జ్యోతి పురస్కార ప్రదానం సందర్బంగా అందజేసిన విలువైన కానుక ,అభినందనపత్రం ,జ్ఞాపిక

  మీ- గబ్బిట దుర్గాప్రసాద్ -19-11-19-ఉయ్యూరు

Posted in సరసభారతి ఉయ్యూరు | Tagged | Leave a comment

గౌతమీ మహాత్మ్యం—70 100-భిల్ల తీర్ధం

గౌతమీ మహాత్మ్యం—70

100-భిల్ల తీర్ధం

సింధు ద్వీపముని,సోదరుడు వేదుడు  పరమ ధార్మికులు . వేదుడు ఒక రోజు  భిక్షాటనకు వెళ్ళగా ,వ్యాధుడు అనే  ధార్మికుడైన వేటగాడు వేటకు వచ్ఛి వేటాడి ,శివునికి అభిషేకం చేయటానికి నోటితో నీళ్ళు తెచ్చి , వేట మాంసాన్ని ధనుస్సు చివర ఉంచి పూజించాడు .అప్పటికే వేదుడు పూజించిన దాన్ని కాలితో తోసేసి, ఆది కేశవ శివుని పత్రాలతోపూజించి  మాంసం నైవేద్యం పెట్టి  ,నోటిలోని నీటి తో అభిషేకించేవాడు.ఇతడికి శివభక్తి తప్ప వేరే ఏమీ శుభ ప్రదం కాదు అనే నమ్మకం .ప్రతి రోజు అలానే చేసేవాడు .భిల్లుడు వచ్చి పూజించే దాకా శివుడు ‘’అనీజీ ‘’గా కనిపించేవాడు. ప్రసన్నత తక్కువగా ఉండేది .ఇలా రోజూ వేదుడు పూజించిన దాన్ని కాలితో తోసేయటం ,ఆకులతో పూజించి నోటితో తెచ్చిన ఎంగిలి జలం(గండూ షాంబు )  తో అభిషేకించి వేటాడిన మాంసం నైవేద్యం పెట్టటం చాలాకాలం చేశాడు .

   చాలాకాలం ఉపేక్షించిన వేదునికి ఒక రోజు కోపం వచ్చి శివద్రోహం చేసిన వాడు వధార్హుడు అని నిశ్చయించి ,తాను నిత్యం చేసే మంత్రపూత పూజను ధ్వంసం చేసిన వాడు ఎవడో  చూడాలనుకొని ప్రక్కగా నిలిచి ఉండగా ,వ్యాధుడు నిత్యపూజకు రాగా ‘’ఆలస్యంగా ఎందుకు వచ్చావు బాగా అలసి పోయినట్లున్నావు .నువ్వు లేకుండా నేను సుఖం గా లేను .నాయనా పుత్రుడు లాగా నన్ను ఓదార్చు ‘’అన్నాడు మహా శివుడు .ఈమాటలు వేదుడికి మిక్కిలి బాధ ,కోపం తెప్పించాయికాని ఏమీ మాట్లాడ లేకపోయాడు .భిల్లుడు యధాప్రకారం శివుని అర్చించి వెళ్లి పోయాడు .ఇంకా మండిపోయిన ధార్మికుడైన వేదుడు శివునితో ‘’ఆ భిల్లుడు జంతు హింస చేసే పాపి, క్రూరుడు, దయాహీనుడు,గురువు లేనివాడు, అజితే౦ద్రియుడు..అలాంటి వాడికి కనిపించి మాట్లాడావు .నిత్యం నీపూజ భక్తీ శ్రద్ధలతో  విధివిధానం గా చేసే నన్ను కనికరించలేదు . ఆ దురాత్మునికి తగిన శాస్తి చేస్తాను .నీ నెత్తిన బండ రాయి పెట్టి పోతాను ‘’అన్నాడు .శివుడు ‘’తొందరపడకు .రేపు వచ్చి ఏమి జరుగుతుందో కళ్ళారా చూసి ,కావాలనుకొంటే అప్పుడే ఈస్థాణుడిపై మహా స్థాణువుపెట్టు ‘’అన్నాడు .కోపం తగ్గించు కొని కొంత ప్రశాంత చిత్తుడై వెళ్లి పోయాడు .

  మర్నాడు  ఉదయం వేదుడు వచ్చిఆది కేశవునికి మంత్ర పూత అభిషేకం పూజ చేసి నైవేద్యం పెడదామని శివ లింగం దగ్గరకు వస్తే  .లింగం పై భాగం  నుంచి రక్తం కారటం చూసి భయపడి ,చేసేదిలేక మట్టీ,ఆవుపేడ  ఆకులు అలమలు కలిపి నూరి పట్టీలాగా వేసి దర్భలచే శుద్ధి చేసి ,శుద్ధ గంగా జలం తో కడిగి నిత్య పూజ చేశాడు . అప్పుడే భిల్లుడు రాగా చాటుకు వెళ్ళాడు .వ్యాధుడు శివుని శిరసుపైగాయం ,రక్తం చూసి తట్టుకోలేక ,తాను  జీవించి ఉండగా శివునికి ఎలాంటి  దుర్గతి కలిగిందని వాపోయి ,వాడియైన తన బాణాలచేత’’ తనను వందలు, వేలుగా చేది౦చుకొని ‘’అనన్య భక్తి చాటుకొన్నాడు .పరమ శివుడు భిల్లుని పరమభక్తికి అత్యంత ప్రీతి చెంది వేదవిదుడైన  వేదుడితో ‘’భక్తి భావ బందురుడైన భిల్లుని చూడు .నువ్వేమో మట్టి దర్భలతో గాయం మాన్పటానికి  ప్రయత్ని౦చావు . ఈ భిల్లుడు  తన ఆత్మ నే  సమర్పణ చేశాడు .  అతనిలో భక్తీ, ప్రేమ ,శక్తి  ఉన్నాయి .అందుకే ముందుగా అతనికే వరం ఇస్తాను .తర్వాత నీకు వరమిస్తాను ‘’అన్నాడు .

  భిల్లుని వరం కోరుకోమన్నాడు ఆదికేశవుడు  ‘’భూత నాథా!నీ నిర్మాల్యం నాకు ప్రసాదించు . ఈతీర్ధం నాపేర పిలువబడేట్లు చేయి .ఈ తీర్ధాన్ని స్మరిస్తేనే సర్వ క్రతు ఫలం లభించేట్లు  అనుగ్రహించు ‘’అని కోరుకున్నాడు .తధాస్తు అన్నాడు స్థాణుడు .అప్పటి నుంచి ఇది ‘’భిల్ల తీర్ధం ‘’గా ప్రసిద్ధి చెందిందని బ్రహ్మ దేవుడు నారద మహర్షికి వివరించాడు .

   సశేషం

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -18-11-19-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

గౌతమీ మహాత్మ్యం-69 99-భాను తీర్ధం

గౌతమీ మహాత్మ్యం-69

99-భాను తీర్ధం

భాను తీర్ధం త్వాస్ట్రం ,మాహేశ్వరం ,ఐంద్రం ,యామ్యం ,ఆగ్నేయం గా ప్రసిద్ధం .అభిస్టుడుఅనే రాజు మంచి సుందరాకారుడు. దేవప్రీతికోసం అశ్వమేధయాగం సంకల్పించాడు .వసిష్ట అత్రి మున్నగు రుషి శ్రేస్టులు  ఋత్విక్కులు .అక్కడ ‘’క్షత్రియుడే యజమానిగా ఉంటె యజ్ఞభూమి ఎలాఉంటుంది ?బ్రాహ్మణుడే దీక్షితుడైతే రాజు యజ్ఞ సంబంధ భూమిని ఇవ్వగలడు.మరి రాజే యజ్ఞ దీక్షితుడైతే ఎవరు యాచిస్తారు ?అలాంటి యాచన అమంగళకరం .క్షత్రియుడు యజ్ఞం చేయకూడదు ‘’అని బ్రాహ్మణులు చర్చిచు కొన్నారు .అప్పుడు వసిష్ట మహర్షి ‘’రాజే యజ్ఞ దీక్ష వహిస్తే భూమిని గూర్చి సూర్యుడిని ప్రార్ధించాలి ‘’అని చెప్పి రాజుతో సూర్యుని ప్రార్ధించి యజ్ఞోచిత భూమిని ఇవ్వమని ప్రార్ధించు అని సలహా చెప్పాడు .వెంటనే బ్రహ్మ విష్ణు ,శివాత్మక రూపుడైన ఆదిత్యుని ప్రార్ధించి ‘’దేవా !దేవతలకు యజ్ఞభూమి నివ్వు ‘’అని కోరాడు .క్షత్రియ కులదైవమైన సూర్యుడు వెంటనే ప్రసన్ను డై ఇచ్చేశాడు .ఏ భూమి ని భానుడు ఇచ్చాడో అక్కడికి రాజు ,ఋత్విక్కులు చేరుకొన్నారు .అదే భాను తీర్ధం అయింది .

  యజ్ఞ విఘ్నానికి దానవులు బ్రాహ్మణ వేషాలతో అక్కడికి  సామగానం చేస్తూ చేరటం తోఎవరూ అడ్డు చెప్పలేదు .లోపలి వెళ్లి యజ్ఞపాత్రాలు సోమం ,యూపస్తంభం యజ్ఞకుండాలు హవిస్సు చివరికి రాజు ను కూడా వాళ్ళు నిందించారు ,పీకిపారేశారు .వాళ్ళ ఆగడాన్ని విశ్వ రూపుడు తప్ప ఎవరూ గుర్తించలేరు.అతడు తండ్రితో ‘’వారంతా దైత్యులు ‘’అని చెప్పాడు .అప్పుడు త్వష్ట ‘’దర్భలతో పవిత్ర జలాలను చేతిలో తీసుకొని యజ్ఞ, యజ్ఞ పాత్రలను నిందించేవారు నా చేత నశి౦ప బడుదురు గాక ‘’అని చెప్పి చల్లి, నేలను తడపండి ‘’అన్నాడు .దేవతలు, త్వష్ట అలానే చేశారు .దానవులలో కొందరు  అందులో భస్మమైపోయారు,కొందరు భయంతో పారిపోయారు .త్వష్ట నీరు చల్లినదే త్వాస్ట్ర తీర్ధం .ఇది సర్వపాప హరణం. యమునిచే దైత్యులు సంహరి౦పబడిన చోటు కనుక ‘’యామ్యం ‘’అయింది .అమృతం అగ్నిలో పూర్ణాహుతి చేయబడింది కనుక ‘’అగ్ని తీర్ధం ‘’  అయింది .

  మరుత్తులతో సహా  ఇంద్రుడు వచ్చి రాజుతో ‘’నువ్వు రెండు లోకాలకూ సామ్రాట్టువు .నాకు మిక్కిలి సఖుడవు అవుతావు ‘’అన్నాడు .ఇక్కడ మాహేశ్వర శివ దేవుడు ఉండటం వలన ‘’మాహేశ్వర తీర్ధం ‘’అయింది .శివ కేశవులు అభిస్టు మహారాజుకు భక్తీ ,ముక్తి కలగజేశారు .ఈ తీర్ధం శైవ వైష్ణవులకు సమాన ప్రాధాన్యం కలది .భాను తీర్ధం లో చేసిన ప్రతి మంచిపని అభీష్టాలను సిద్ధింప జేస్తుంది అని బ్రహ్మ నారదునికి చెప్పాడు

   సశేషం

మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -18-11-19-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

జ్ఞానజ్యోతి పురస్కార ప్రదానం -వార్త-

జ్ఞానజ్యోతి పురస్కార ప్రదానం -వార్త-

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

ఉసిరి చెట్టుకింద అభిషేకం సత్యనారాయణ వ్రతం వనభోజనం చిత్రాలు

17-11-19కార్తీక బహుళ పంచమి ఆదివారం ఉయ్యూరు మా పెరటి ఉసిరి చెట్టుకింద ఉదయం 9గం.నుండి 1.30వరకు నాలుగు న్నర గంటల సేపు మహన్యాస పూర్వక రుద్రాభిషేకం ,శివ అష్టోత్తర సహస్రనామ ,బిల్వాస్తోత్తర పూజ అనంతరం శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం ,కార్తీక వనభోజనం చిత్రాలు

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

’జ్ఞానజ్యోతి ‘’పురస్కార ప్రదానం

‘’జ్ఞానజ్యోతి ‘’పురస్కార ప్రదానం

 ఆంధ్రప్రదేశ్ రచయితల సంఘం ప్రధాన కార్యదర్శి ఆత్మీయుడు శ్రీ చలపాక ప్రకాష్ సుమారు 15 రోజులముందు ఫోన్ చేసి’’ సంఘం కొత్తగా మొదటిసారిగా జ్ఞాన జ్యోతి పురస్కారం ఏర్పాటు చేస్తోంది.మొదటిపురస్కారం మీకే నవంబర్ 15విజయవాడ టాగూర్ గ్రంధాలయం లో గ్రంథాలయ వారోత్సవాల సందర్భంగా ప్రదానం చేయాలని ,అధ్యక్షులు మిగాతాకార్యవర్గం నిర్ణయించి మీకు తెలియ జేయమన్నారు ‘’అని చెప్పారు .’’ధన్యవాదాలు ‘’అన్నాను .ఈ విషయం మా శ్రీమతికితప్ప ఎవరికీ చెప్పలేదు .నవంబర్ 5న హైదరాబాద్ వెళ్ళినప్పుడు పేపర్ ప్రకటన ద్వారా విషయం తెలియ జేశామని  నాకు ఫోన్ చేసి ప్రకాష్ చెప్పారు .ఆతర్వాత మా అబ్బాయి రమణకు  ఫోన్ చేసి చెప్పి ఫేస్ బుక్ లో పెట్టాక వాడు నాకు ఫోన్ చేసి చెప్పి పంపిస్తే అప్పుడు మా అబ్బాయిలకు చెప్పాను . ఆతర్వాత రెండు రోజులకోసారి ఫోన్ చేస్తూ ప్రకాష్ గారు గుర్తు చేస్తూనే ఉన్నారు .’’మీరేమైనా పత్రికల వారిని పిలిపించి విషయం చెప్పారా ?’’అని ఒక రోజు చలపాక ఫోన్ చేస్తే ‘’అలాంటి హడావిడి నాకుఅలవాటు లేదు ‘’అని చెప్పాను .ఆయనే ఆపని చేసి వార్తాపత్రికలలో వచ్చిన విషయాలు మెయిల్ ద్వారా పంపిస్తూనే ఉన్నారు .ఒక విధంగా నేను అదృష్టవంతుడిని .ఏప్రిల్ 2నవిజయవాడ  శారదా స్రవంతి వారు శ్రీ పంతుల వెంకటేశ్వరరావు తండ్రిగారి పురస్కారం అందించారు .ఏప్రిల్ 4 న  నెల్లూరు లో శ్రీ సర్వేపల్లి రామమూర్తి గారి ఆధ్వర్యం లో సర్వేపల్లి చారిటబుల్ ట్రస్ట్ వారి ఉగాది సాహిత్య పురస్కారాన్నీ,మే17న గుడివాడ లోశ్రీమతి పుట్టినాగలక్ష్మిగారు   తమ తండ్రి శ్రీ పుట్టి వెంకటేశ్వరరావు స్మారక పురస్కారాన్నీ అందించారు . జులై 17న హైదరాబాద్ త్యాగరాజ గాన సభలో శ్రీ నోరి చారిటబుల్ ట్రస్ట్ వారి ఆధ్వర్యం లో నిర్వాహకులు బ్రహ్మశ్రీ  నోరి సుబ్రహ్మణ్య శాస్త్రి గారు  గురుపౌర్ణమి సందర్భంగా శ్రీ కళా సుబ్బారావు సాహితీ పురస్కారం అందజేశారు .ఇప్పుడు జ్ఞానజ్యోతి పురస్కారం అయిదవ పురస్కారం అవటం నా జన్మకు ధన్యత చేకూర్చింది .ప్రతిభ తక్కువా, గుర్తింపు అధికం అనిపించింది .అయినా పెద్దలమాట శిరోధార్యం కదా . ఈ ఆహ్వాన పత్రికను గుంటూరు లో ఉన్న ఆత్మీయులు ,కవి ,విమర్శకులు  డా రామడుగు వేంకటేశ్వర శర్మగారికి పంపిస్తే ,అందాక ఫోన్ చేసి మనః పూర్వకంగా అభినందిస్తూ ‘’సర్వ వాజ్మయం జ్యోతి స్వరూపం .దాని దర్శనానికి మీరు చేస్తున్నప్రయత్నం గుర్తించి ఈ పురస్కారం మీకు అందిస్తున్నారు .మీరు సర్వ విధాల అర్హులు ‘’అని చెప్పాక మనసు కుదుట బడింది.ఆత్మీయులమాట శ్రేయోదాయకం . మా అబ్బాయి రమణ జాగృతి సంస్థ ద్వారా  అందరికీ విషయం అందించి పేపర్లలో వచ్చేట్లు చేశాడు

జ్ఞానజ్యోతి పురస్కార ప్రదానం -ఈనాడు వార్త-

  నిన్న నవంబర్ 15 శనివారం మా దంపతులం ,మా కోడలు శ్రీమతి రాణి ,మనవడు చరణ్ ,ఆత్మీయులు శ్రీ గంగాధరరావు గారు ,మా అన్నయ్యగారి అబ్బాయి రామనాథ బాబు సుమోలో బెజవాడ టాగూర్ లైబ్రరీకి చేరాం .అప్పటికే అక్కడున్న ఆంధ్రప్రదేశ్ రచయితల సంఘం గౌరవాధ్యక్షులు ,ఒంగోలు జిల్లా రచయితల సంఘం అధ్యక్షులు,లాయర్  శ్రీ బి హనుమారెడ్డి గారికి నేను నమస్కరించి నాపేరు చెప్పబోతుండగా ‘’అక్కర్లేదు మీపేరు జగద్విదితం ‘’అని నన్ను మాట్లాడ నివ్వని సౌజన్యం వారిది .తర్వాత సంఘం అధ్యక్షులు శ్రీ సోమేపల్లి వెంకట సుబ్బయ్య గారు వచ్చారు .ప్రకాష్ గారు ముందే నాకు చెప్పినట్లు సరసభారతి ప్రచురించిన 24 రకాల పుస్తకాలను అక్కడ ఒక బల్లపై ప్రదర్శనకు పెట్టాము .గంటన్నర ఆలస్యంగా సభ ప్రారంభమైంది జాయింట్ కలెక్టర్,కృష్ణా జిల్లా  గ్రంథాలయ సంస్థ  పర్సన్ ఇంచార్జ్  శ్రీ కే మోహన్ కుమార్ వచ్చాక .

  మోహన్ కుమార్ గారి ఆధ్వర్యం లో వేదిక పై ఉన్నరెడ్డిగారు, సుబ్బయ్యగారు ,కవి సమ్మేళనం నిర్వహించే శ్రీమతి యామినీదేవి గారు శ్రీ ప్రకాష్  మొదలైన  పెద్దల సహకారం తో మా దంపతులను ప్రత్యేక ఆసనాలపై కూర్చోబెట్టి ,శిరసుపై పూల కిరీటం పెట్టి ,,శాలువాలు కప్పి, రోజాపుష్పహారాలు వేసి చందనం రాసి ,నుదుట బొట్టుపెట్టి ,జ్ఞాపిక ,శ్రీమతి కోనేరుకల్పనగారు చదివిన  అభినందన పత్రం  ,3వేల నూటపదహారు రూపాయల నగదు కవరు అందించారు .చాలా ఆత్మీయంగా గౌరవంగా కార్యక్రమం నిర్వహింఛి చిరస్మరణీయం చేశారు .అంతటా ఆప్యాయత స్పష్టంగా కనిపించి .మనసుకు ఆనందం కలిగించింది .ఇదంతా ప్రకాష్ గారి ప్రత్యేక శైలి . శ్రీమతి కోపూరి పుష్పాదేవి దంపతులు మాకు నూతనవస్త్రాలు సమర్పించి శాలువా కప్పారు .సరసభారతి ఆస్థానకవి శ్రీ తుమ్మోజు రామ లక్ష్మణాచార్యులు ,మా వియ్యంకులు శ్రీ కే ఆర్ శాస్త్రి దంపతులు ,గంగాధరరావు గారు, రామనాథ్ బాబు ,మా తోడల్లుడిగారబ్బాయి  మధు ,మామనవాడు చరణ్  లు కూడా శాలువాలుకప్పి అభిమానం తెలియ జేశారు .ముచ్చటగా ఉంది .రెడ్డిగారు ,సుబ్బయ్యగారు,ప్రకాష్ గారు  నాగురించి మంచిమాటలు చెప్పారు .

  నేను మాట్లాడుతూ సరసభారతి ఏర్పడ్డాక జరిగిన పదేళ్ళ అభివృద్ధి ,33పుస్తకాల ప్రచురణ ,అందులో నేను రాసిన 21పుస్తకాలు ,కేమోటాలజిపిత డా .కొలచల సీతారామయ్య ,117వ మూలకం కనిపెట్టిన డా ఆకునూరి వెంకట రామయ్య ,ప్రయోగాత్మక కాంతి శాస్త్రపిత డా .పుచ్చా వెంకటేశ్వర్లు గార్లగురించి వారిపై నేను రాసిన పుస్తకాల గురించి ,రామయ్యగారిపై పుస్తకం అమెరికాలో రెండు చోట్ల ,ఉయ్యూరులో మూడవసారి ఎం .ఎల్.సి .శ్రీ రాజేంద్ర ప్రసాద్ ఆవిష్కరించిన విశేషం ,సంస్కృత కవులపై 3 భాగాలలో 1090మందికవులను గురించి రాసిప్రచురించిన  విషయం,నెట్ లో రాస్తున్న  నాలుగవ భాగం లో 520 కవుల విషయం గురించి అందునా ప్రస్తుతం యూనివర్సిటీలలో ఉంటూ రాస్తున్న లేటెస్ట్ రచనలతో సహా చెప్పి ,జర్మనీకి చెందిన’’ సింఫనీ మాంత్రికుడు  బీథోవెన్, జర్మనీకి చెందిన ప్రఖ్యాత గణిత శాస్త్రవేత్త ఫిలాసఫర్  ఇమాన్యుయల్ కాంట్ ,వ్యాఖ్యాన చక్రవర్తి మల్లినాథ సూరి,కోనసీమ ఆహితాగ్నులు నా జీవిత చరిత్ర ‘’నా దారి తీరు ‘’,ఊసుల్లో ఉయ్యూరు   గురించి విస్త్రుతంగా  అంతర్జాలం లో రాసిన సంగతి ,నిత్యం సరసభారతి బ్లాగ్ లో ఏదో ఒక ప్రత్యెక విషయం  రాస్తున్న వైనం ,శ్రీమైనేని గోపాలకృష్ణగారు ఉయ్యూరులో ఎసి లైబ్రరీ ఏర్పాటు చేయటానికి ఇచ్చిన భూరి విరాళం ,దాని నిర్మాణం లో కన్వీనర్ గా నాపాత్ర ,సరసభారతి పుస్తకాల  ముద్రణకుఆయన స్పానర్ షిప్,ప్రకాష్ గారి తోడ్పాటు  వగైరాలు  చెప్పాను .

ఇదంతా జ్ఞాన మార్గ గామిగా నేను చేస్తున్న  కృషి మాత్రమేనని ‘’జ్ఞాన జ్యోతి ‘’అంటే జ్ఞానాన్ని జ్యోతిలాగా అందించేంత ‘’దృశ్యం ‘’ ఉన్నవాడిని ,’’బీకన్ లైట్ ‘’ను కానని వినమ్రంగా అన్నాను  .వారు అభిమానం తో శిరసునపెట్టిన పూలకిరీటం చిన్న దోమ తలకాయకు పెట్టినట్లు ఉందని భావిస్తున్నానని ,అందరికీ సాహిత్యం ,మంచి విషయాలు చేరువ చేయటానికే తపన పడుతున్నానని చెప్పాను .తర్వాత కవి సమ్మేళనం జరిగింది .ప్రదర్శనకు పెట్టిన పుస్తకాలు ప్రకాష్ గారికి అందించి కావలసినవారికి ఇవ్వమని కోరాను .ప్రకాష్ గారు హోటల్ కు వెళ్లి భోజనం చేద్దామని మమ్మల్ని బలవంత పెట్టారు .అయినా సున్నితంగా కాదని చెప్పి దారిలో హోటల్ లో టిఫిన్లు చేసి ఉయ్యూరు చేరేసరికి రాత్రి 11 అయింది .ఆంధ్రప్రదేశ్ రచయితల సంఘం ఇచ్చిన పురస్కారానికి,ప్రకాష్ గారి పూనికకు  సదా కృతజ్ఞుడను .

  మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -16-11-19-ఉయ్యూరు

.

Posted in సభలు సమావేశాలు | Tagged | 2 Comments

జ్ఞానజ్యోతి పురస్కార ప్రదానం -ఈనాడు వార్త-

జ్ఞానజ్యోతి పురస్కార ప్రదానం -ఈనాడు వార్త-

Posted in సరసభారతి ఉయ్యూరు | Tagged | Leave a comment

గౌతమీ మహాత్మ్యం-68 97-పతత్రి తీర్ధం

గౌతమీ మహాత్మ్యం-68

97-పతత్రి తీర్ధం

కశ్యప ప్రజాపతి అరుణుడు ,గరుత్మంతుడు కుమారులు .ఈవంశం  లోని వారే జటాయువు సంపాతి .ఈ ఇద్దరు బలగర్వం తో స్పర్ధతో ఆకాశానికి యెగిరి సూర్య దర్శనం చేయాలనుకొన్నారు .సూర్యతాపానికి తట్టుకోలేక ఇద్దరూ అలసిపోయి ఒక పర్వత శిఖరం పై పడిపోయారు .వీరిద్దరిని అరుణుడు చూసి విచారించి సూర్యునితో ఆ ఇద్దరినీ కాపాడమని వేడుకొన్నాడు .సరే అని రవి ఆ రెండుపక్షులను బ్రతికించాడు .గరుడుడు కూడా వీరి అవస్థ చూసి మహా విష్ణువుతో వచ్చి పరామర్శించాడు .వీరి తాపం పోవటానికి గంగా అనే గోదావరికి చేరి స్నానం చేసి తాపం పోగొట్టుకొన్నారు . అక్కడకు వచ్చిన విష్ణు శివుడు ,సూర్యుడు    తీరం పై కొలువై ఉన్న  తీర్ధమే పతత్రి తీర్ధం అని నారదునికి బ్రహ్మ చెప్పాడు .

98-విప్ర తీర్ధం

నారాయణ తీర్ధం అనే విప్రతీర్ధం విఖ్యాతి చెందింది .అంతర్వేదిలో వేదవేదాంగ పారంగతుడైన బ్రాహ్మణుడు ఉండేవాడు .అతనిపుత్రులు దయాగుణమున్న వారు .అందులో చివరివాడు’’అసందిపుడు ‘’జ్ఞానం తెలివి తేటలూ కూడా ఉన్నవాడు .ఇతని వివాహానికి తండ్రి ప్రయత్నం చేస్తున్నాడు .ఒక రోజు రాత్రి యితడు విష్ణు స్మరణ చేయకుండా ,ఉత్తరం వైపు తలపెట్టి నిద్రపోయాడు .అప్పుడొక రాక్షసి అతడిని గోదావరి దక్షిణ తీరాన ఉన్న శ్రీ గిరికి ఎత్తుకు పోయింది .అది ధర్మానికి పవిత్రతకు నిలయం .అక్కడి రాజు బృహత్కీర్తి సుగుణ సంపన్నుడు .రాక్షసి అక్కడికి చేరాక ముసలి వేషం ధరించి బ్రాహ్మణ పుత్రునితో ‘’ఇదే గంగానది .సంద్యోపాసన  చేయి .నన్ను తల్లిగా చెప్పుకొని అనుష్టానం చేయి .నామాట వింటే నీకు సకల సుఖాలు కలిగిస్తాను .నీ తలిదంద్రులవద్దకు పంపిస్తాను ‘’అన్నది .

  అప్పుడా విప్రుడు ‘’నువ్వు ఎవరు  “?అని ప్రశ్నించగా అది ‘’నేను కంకాలిని .నువ్వేది చెబితే అది చేస్తాను ‘’అన్నది సరే అనగా అతన్ని తీసుకొని అన్ని చోట్లా   తిరుగుతూ అతడు తనకొడుకే అని చెప్పు కొంటో౦ది .నిజమే అని నమ్మిఅక్కడి బ్రాహ్మణుడు తనకూతురును వాడికిచ్చి పెళ్లి చేశాడు .సద్గుణ రాశియైన తనభార్య ను, తనను రాక్షసి ఎప్పుడు మింగేస్తుందో అని విచారించాడు  .ముసలిది బయటికి వెళ్ళిన సమయం లో భార్య భర్త విచారానికి కారణం అడిగింది  .అసలు విషయమంతా ఆమెకు చెప్పాడు .తెలివిగల ఆమె ‘’అజ్ఞానం వలన భయం కలుగుతుంది .గౌతమీనది దుఖహారిణి.విష్ణుభక్తులకు భయం ఉండరాదు .’’అని చెప్పింది .వెంటనే ఆ విప్రుడు గౌతమీ ష్ణానం చేసి శుచియై ముకుందుని ధ్యానించాడు .అతని ప్రార్ధనకు కరిగిపోయిన విష్ణువు ప్రత్యక్షమై సుదర్శన చక్రం తో ఆ రాక్షసిని సంహరించాడు .దంపతులు సంతోషించారు .భార్యను మామగారింటికి తీసుకువెళ్ళి ఆనందం అనుభవించాడు. ఇదే విప్రతీర్ధం ,నారాయణ తీర్ధం అని బ్రహ్మనారదునికి ఉవాచ .

  సశేషం

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -15-11-19-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

దువ్వూరి వారి ‘’రమణీయం‘’పై రమణీయ భావనలు

 దువ్వూరి వేంకట రమణ శాస్త్రిగారు అంటే చిన్నయ సూరి బాలవ్యాకరణం ,ఆతర్వాత ‘’రమణీయం ‘’గుర్తుకొస్తాయి .దువ్వూరివారు సంస్కృత వ్యాకరణాన్ని మూడేళ్ళపాటు ఆసాంతం చదివి హస్త, మేధోగతం చేసుకొన్నారు .1914విజయనగరం మహారాజాకాలేజిలో విద్వాన్ కోర్సు చదవటానికి చేరారు .అప్పుడు చిన్నయ సూరి బాలవ్యాకరణ౦ లో సంజ్ఞాపరిచ్చేదం,చదివి’’ సంధి ‘’ప్రారంభించే సరికి ‘’ఇదేదో బింకంగా ఉందే.తెలుగు వ్యాకరణాలు చప్పచప్పగా ఉంటాయని అంటారే ,కాని సూరి వ్యాకరణం లో సూత్రాలు, వృత్తులు  ఉదాహరణలు ‘’పాణినీయం ‘’లోమాదిరి పట్టుగా ముద్దుగా బాగున్నాయే ‘’అనిపించింది .ఈ భావన కలిగిన 60ఏళ్ళ తర్వాత  1974 లో కూడా ఆ అభిప్రాయం  సుస్థిరమైఁదే కాని వీసమెత్తు తగ్గలేదు .పైగా రోజురోజుకూ బలపడుతూనే ఉంది .

  విద్వాన్ పాసై అదేకాలేజి లో ఉపాధ్యాడుగాచేరి బాల వ్యాకరణం బోధించే అవసరం కలిగింది శాస్త్రి గారికి .ఆ వరుసలో 45 ఏళ్ళు బాలవ్యాకరణ౦ భాషా ప్రవీణ క్లాసుల్లో ఎం .ఏ .క్లాసుల్లో  అవిచ్చిన్నంగా బోధించారు .మొదటి పదేళ్ళ తర్వాత సూరి రచనలో పాండిత్యం ,పటుత్వం మాత్రమె కాక మరేదో చమత్కారం ,సౌకుమార్యం ఉన్నట్లు కనబడింది .’’వ్యాకరణం లో ఇదేమిటి చెప్నా !’’అనుకొన్నారు .ఆలోచిస్తుండగా క్రమంగా ప్రతిమాటలో ఏదో సారస్యం ,ముద్దుముద్దుగా ముచ్చటగా ఉన్నట్లు అనిపించేది .పాఠం చెబుతున్న శాస్త్రి గారికే కాక వినే విద్యార్దులకూ ఉత్సాహంగా ,ఉల్లాసంగా అనిపించేది .అన్ని పాఠాలకన్నాబాల వ్యాకరణ పాఠంఎంతో వినోదంగా కనిపించేది .శాస్త్రిగారికే ప్రీతికాదు నేర్చుకొంటున్న శిష్యులకు కూడా అదే రకమైన ప్రీతి జనించటం అత్యాశ్చర్యకరం  .గ్రామర్ అంటే తలకాయ నెప్పి అనుకొనే విద్యార్ధులు ,సూరి వ్యాకరణం అంటే కావ్యం చదువుతున్నంత మహదానందం పొందేవారు. అది దువ్వూరివారి బోధనా విశేషం .

  గురువుకూ శిష్యులకు అత్యంత ప్రీతికరమైన బాలవ్యాకరణం పాఠం నిత్యం జరిగిపోతూ ఏదో లోకం లో విహరిస్తున్న అనుభూతి కలిగించేది .మిగిలిన తెలుగు వ్యాకరణా లెలా ఉన్నాయో అని అన్నిటినీ ఒకపట్టు పట్టి చూశారు శాస్త్రీజీ .చూచినకొద్దీ చిన్నయ సూరి’’ మహా పెద్దయ్య సూరి’’అనే భావమే ఎక్కువైంది .దానిముందు సూర్యునిముంది దివిటీలు అనిపించాయి .సూరి ప్రత్యేకత మరింత స్పష్టంగా దర్శనమిచ్చింది .సూరి మాటలమధ్య చమత్కారం ఆనందం ,ఆహ్లాదం పె౦చాయి  .

  ఇలా మరో పదేళ్ళు గడిచిపోయాయి .ఒక రోజు బాలవ్యాకరణ పీఠిక లో శాస్త్రిగారికి ‘’అనయము లలితోక్తులతో నొనరు పడం గూర్చి లక్ష్య యోజన మొప్పంగను బాలవ్యాకరణం బనగా లక్షణ మొనర్తు నాన్ద్రంబునకున్ ‘’అన్న పద్యం కనబడింది .రోజూ చూసే పద్యమే .’’అయితేనేం అంతవరకూ అందులోని అక్షరాలు కనిపించాయే కాని ,అంతరార్ధం స్పురించలేదు .’’లలితోక్తులతో వొనరు పడం గూర్చి లక్ష్య యోజనమొప్పన్’’అంటాడేమిటి అంటే  చెప్పే మాటా ,ఇచ్చే ఉదాహరణ లలితంగా ఉండేట్లు కూర్పు కూరుస్తున్నాను అంటాడేమిటి .ఇంకా మనం అతని లాలిత్యం వైపు ప్రత్యేక దృష్టి పెట్టాల్సిందే .ఈ దృష్టి తనలో ఉన్నట్లు స్పష్టంగా చెప్పాడే ‘’అనుకోని ‘’యురేకా ‘’అని యెగిరి గంతేసినంత పని చేశారు న్యూటన్ యాపిల్ కిందపడటం ఎన్నో సార్లు చూసినా మొదటిసారి అందులో ఏదో వింత ఉన్నట్లు తెలుసుకొని సూత్రం కనిపెట్టినట్లు దువ్వూరి వారికి బాలవ్యాకరణం లో లలిత రమణీయ భావనలు స్పష్టంగా కనులముందు గోచరించాయి .ఈ దృష్టిని చెదిరి పోనివ్వకుండా జాగ్రత్త పడ్డారు .సూరి అక్షరాల వైపు చూస్తుంటే ఏదో కొత్త విషయం దృగ్గోచరమై మనసుకు ఉల్లాసం కలిగేది. ఆనందం తాండవించేది .ఈ భావనలు ఇప్పుడు విద్యార్ధులకు బోధనలో కూడా చోటు చేసుకోవటం తో వారిలోనూ రామనణీయభావనలు బలపడి మరింత స్పష్టయ్యాయి గురు శిష్యులకు .సూరి పాండిత్య ,లాలిత్య ,నైపుణ్యాలు స్పస్టమై గట్టిపడ్డాక శిష్యులకు ఉత్సాహంగా చెప్పి వారినీ’’ఎలివేట్’’ చేసేవారు .1940కి పూర్వమే ఈ భావనలు బలీయమై మనసులో ఉంటె కాదు వాటికి అక్షర రూప మివ్వాలి చిన్న పుస్తకంగా తేవాలి అనేది చిట్టిగూడూరు కాలేజిలో ఉండగానే నిశ్చయమైంది .ఐతే ఇంకెందుకు ఆలస్యం అని లేడికి చేచిందే పరుగుగా తొందరపడి రాత ప్రారంభించలేదు .ఇంకొన్నాళ్ళు ఆగితే ఇంకేమేమి విశేషాలు బయటపడుతాయో అని అనిపించింది .

   చిన్నయ సూరి 18ఏళ్ళు అహోరాత్రాలు శ్రమించి ఆప్యాయనంగా సంతరించిన బాలవ్యాకరణం ‘’కొందరి వంచనా దృష్టితో శిస్టు కృష్ణ మూర్తికవి సంస్కృతీకరించి ‘’హరి కారికావళి’’అని పేరు పెట్టగా ,కల్లూరి వెంకటరామ శాస్త్రిగారు ‘’హరికారికా వళి’’యే మొదటి గ్రంథమని ,సూరి దాన్ని తెనిగించి బాలవ్యాకరణం ‘’అనే పేరు పెట్టాడని ,సూరికి అంత’’ దృశ్యం’’ లేదనీ ‘’అంటూ  చాలా అభూతకల్పనలు చేశారు .ఇక ఊరుకొంటే లాభం లేదని దువ్వూరివారు ‘’బాలవ్యాకరణమే మూలం హరికారికావళి దీనికి అనువాదమే అని సిద్దాన్తరీకరించి 40పేజీల వ్యాసం రాస్తే 1933లో ‘’ఆంద్ర సారస్వత పరిషత్ పత్రిక ‘’ప్రచురించింది .శాస్త్రిగారి సిద్ధాంతాన్ని పండితులందరూ సమర్ధించి గొప్ప’’ బూస్ట్’’ ఇచ్చారు .తరువాత మరో వ్యాసం ‘’సూరి లలితోక్తి చాతురి ‘’అని 25పేజీల వ్యాసం రాస్తే అదే పత్రిక1960లో ప్రచురించింది .ఇలా రమణీయం  రచనకు ఈ రెండు వ్యాసాలూ గొప్ప భూమికలయ్యాయి .

  మరో రెండేళ్లకు రిటైరౌతారనగా దువ్వూరివారు రచనకు ఉపక్రమించారు .’’నాపేరు రమణ కనుక ‘’వా నామ దేయస్య అనే వార్తికం వలన రమణ శబ్దం వృద్ధ ప్రాతిపదిక కాకపోయినా వికల్పంగా ఛ ప్రత్యయం వచ్చి ‘’రమణీయ’’శబ్దం సాధువు కనుక ‘’రమణీయం ‘’పేరు పెడదామనుకొని చివరకు ఉభయతారకంగా ‘’రమణీయం ‘’ పేరు ఖాయమైంది’’అని చెప్పుకొన్నారు శాస్త్రిగారు. బాల వ్యాకరణానికి అప్పటికే రెండుమూడు టీకలు ప్రచురింపబడ్డాయి .ఆతీరులో వ్యాఖ్యానం రాయటానికి ఇష్టపడక ,వ్యాఖ్యాన రూపంగా కాక తనకు తోచిన విశేషాలను మాత్రమె రాస్తూ ,ఒక సమీక్షగా రాయలనుకొని ప్రణాళిక సిద్ధం చేసుకొని రాయటం మొదలు పెట్టారు .అదే సమయం లో ‘’సూరిగారి శతవార్షిక వర్ధంతి’’ దగ్గర పడింది .ఆఉత్సవాన్ని హైదరాబాద్ లో సాహిత్య అకాడెమి వారు వైబవంగా నిర్వహించారు .శాస్త్రిగారు అందులో సూరి పాండిత్య ,లాలిత్యాలపై గంట సేపు ప్రసంగించారు .అధ్యక్షులు కవిసామ్రాట్ విశ్వనాథ  ఎంతో సంతోషించారు .సూరికి వారి వర్గం లో వారైన తాపీ ధర్మారావు కూడా సంతోషించి అభినందించారు .ఆ సందర్భంగా రమణీయం ముద్రణకు సాహిత్య అకాడెమి వెయ్యి రూపాయలు బహుమతి ప్రకటించారు .

   ఆంద్ర విశ్వ విద్యాల ప్రెస్ లో ముద్రిస్తే అందంగా పుస్తకం తయారౌతు౦దని ,తప్పులు దగ్గరుండి సరి చేయవచ్చు నని భావించి సిండికేటు కు లెటర్ పెట్టారు శాస్త్రిగారు. ఉచిత .ముద్రణమాట ఎత్తకుండా ,వెయ్యి రూపాయలు శాంక్షన్ చేసింది .3300రూపాయలు అడ్వాన్స్ ప్రెస్ కు ఇచ్చి  ప్రెస్ డైరెక్టర్ ముత్తుస్వామిగారి పర్యవేక్షణలో మంచి గెటప్ తో ముద్రణ జరిపించారు .99శాతం ముద్రణ తప్పులు లేకుండా జరిగింది .హైదరాబాద్ శ్రీ కృష్ణ దేవరాయ నిలయంలో ఆవిష్కరణ ఉత్సవం జరపమని కార్యదర్శి డా బిరుదురాజు రారాజుగారు శాస్త్రిగారిని కోరారు .విశ్వనాథ అధ్యక్షులుగా ,దివాకర్ల వెంకటావదానిగారు వక్తలుగా డా బెజవాడ గోపాల రెడ్దిగారు ఆవిష్కరణ జరిపారు .వ్యాకరణ పుస్తకానికి ఇంతఅద్భుతమైన ‘’గెటప్పా’’అని అందరూ అవ్వాక్కై ఆశ్చర్యపోయి శాస్త్రిగారిని ప్రత్యేకంగా అభినందించారు .

  దువ్వూరి వారి కృష్ణా –గుంటూరు జిల్లాల శిష్యులు తెనాలిలో ‘’రమణీయ సమ్మేళనం మూడు రోజులు ‘’నిర్వహించి శ్రీ వరదా చార్యులవారినీ ఆహ్వానించి ఘనంగా చేశారు .80 శిష్య బృందం పాల్గొన్న ఆసభలు దివ్యంగా మహా రమణీయంగా జరిగి రమణీయం రామణీయకాన్ని శతవిధాల పెంచాయి .శిష్యులు గురువుగారిని అత్యంత వైభవంగా సత్కరించి గురూణం తీర్చుకొన్నారు .సిండికేటు రూపాయి కూడా ‘’చేపకుండా  ‘’ఆతర్వాత శాస్త్రిగారే ప్రెస్ కు 2800రూపాయలు బాకీ అని నోటీసు పంపింది .చివరికి పెద్దలంతా కూర్చుని జుట్టుపీక్కుని ముద్రణఖర్చు 3200రూపాయలే అయి౦ది కనుక తామే శాస్త్రిగారికి 100రూపాయలు బాకీ  అని తేల్చి చివరికి ‘’మీ బాకీ సిండికేట్’’ ‘’వైవ్’’ చేసింది .మీ రేమీఇవ్వక్కర్లేదు’’ అని రిజిస్ట్రార్ కాగితం పంపటం తో రమణీయం రమణీయ నాటకం గా ముగిసింది .

   ఆధారం –దువ్వూరివారి స్వీయ చరిత్ర

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -14-11-19-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

గౌతమీ మహాత్మ్యం-67 96-భద్ర తీర్ధం

గౌతమీ మహాత్మ్యం-67

96-భద్ర తీర్ధం

త్వష్ట ప్రజాపతి కూతురు ఉష సూర్యుని భార్య .ఛాయ రెండవ భార్య.ఈమె కొడుకే శని .ఇతని సోదరి విస్టి భయంకరాకార కురూపి . ఈమెను ఎవరికిచ్ఛి  పెళ్లి చేయాలా అని ఆలోచిస్తున్నాడు తండ్రి .అప్పుడు విస్టి తండ్రితో ‘’కన్యను తగిన వాడికిచ్చి పెళ్లి చేస్తే తండ్రి కృతార్దుడౌతాడు .కన్యకు పదేళ్ళు దాటక పూర్వమే పెళ్లి చేయాలి .సద్గుణుడికి ఇవ్వాలి లేకపోతె నరకం అనుభవిస్తాడు .కన్యాదాన౦ అక్షయ పుణ్య ప్రదం ‘’అన్నది తండ్రి సూర్యునితో .సూర్యుడు ఆమె తో ‘’నిన్ను పెళ్లి చేసుకోవటానికి ఎవరూ ముందుకు రావటం లేదు .నీ గుణం ఒక్కటే గొప్పది మిగిలినవన్నీ తక్కువే కదా .నువ్వు ఒప్పుకొంటే ఇవాళే ఎవరికో ఒకరికిచ్చి వివాహం చేస్తాను ‘’అన్నాడు .దీనికి విస్టి’’పూర్వ జన్మ కృతం అందరూ అనుభవించాల్సిందే .మన వంశ ఆచారం తగినట్లు చేయి ‘’అని చెప్పింది .

  సూర్యుడు ఆమె మాటలప్రకారం త్వష్ట ప్రజాపతి కొడుకు ,భీషణాకారుడు ,శీలా సంపన్నుడు విశ్వ రూపుడు కు విస్టి నిచ్చి వివాహం చేశాడు .ఇద్దరు అన్యోన్యంగా దాంపత్య జీవితం గడిపారు .వీరికి గండుడు,అతి గండుడు ,రక్తాక్షుడు ,క్రోధనుడు ,వ్యయుడు ,దుర్ముఖుడు ,చివరగా హర్షణుడు అనే కొడుకులు పుట్టారు .చివరికొడుకు సత్ప్రవర్తన తో ,మనోహర రూపంతో శుచిగా ఉండేవాడు .ఇతడోకసారి మేనమామ యమ ధర్మరాజును చూడటానికి వెళ్ళాడు .యమలోకం లో దుఖితులను, సుఖం పొండుతున్నవారినీ చూసి మేనమామ ను సనాతన ధర్మం అంటే ఏమిటో వివరించమని కోరాడు .

  యముడు  తనమేనల్లుడు హర్షణుడితో ‘’ఎప్పుడూ విధ్యుక్త ధర్మం చేసేవారు నరకానికి రారు .శాస్త్రం ఆచారం ,వేదం ,పండితుల ఎడల గౌరవం చూపని వారు ,విధ్యుక్త ధర్మాన్ని అతిక్రమించిన వారు నరకం పొందుతారు ‘’అన్నాడు .అప్పుడు హర్షణుడు ‘’మా తండ్రి  ,తల్లి విస్టి నా సోదరులు అందరూ కురూపులే .వీరంతా శాంత స్వభావం సుందర రూపం నిర్దోషులు ,మంగళ కర్మాచారులు అవటానికి వారికోసం నేనేమి చేయాలో ఉపదేశించు ‘’అని ప్రార్ధించాడు .యముడు సంతోషం తో ‘’నీ పేరుకు తగిన సద్గుణాలున్న వాడివి .నీకు చాలామంది కొడుకులు పుడతారు. కాని వంశ ప్రతిష్ట పెంచలేరు .కనుక మీ అందరికీ మంచి జరగాలంటే గౌతమీ నదికి వెళ్లి స్నానం చేసి ,ఏకాగ్రతతతో శ్రీ మహా విష్ణువును స్తుతించి ప్రసన్నం చేసుకో .ఆయనే నీ కోరికలన్నీ తీర్చగలడు’’అని హితోపదేశం చేశాడు .

  ఆలస్యం చేయకుండా  హర్షణుడు గోదావరికి వెళ్లి నదీ స్నానం తో శుచియై ,శ్రీ హరి ని స్తుతించాడు .స్తోత్రాలకు  హర్షమానసుడైన విష్ణుమూర్తి హర్షణుడితో ‘’నీ సమస్త  అమంగళాలు ఉపశమన పూర్వకంగా మంగళమగుగాక ‘’అన్నాడు .వెంటనే తల్లి విస్టి,తండ్రి  ,సోదరులు అందరూ మంగళాకారులుగా మారారు .పుత్రులుకూడా భద్రులు అనే పేరుతో శోభిల్లారు .అప్పటినుంచి ఈ తీర్ధం ‘’భద్ర తీర్ధం ‘’అయింది .ఇక్కడ జనార్దనుడు కొలువుండి ,సమస్తకోరికలు తీరుస్తున్నాడు అని బ్రహ్మ నారదునికి వివరించాడు .

   సశేషం

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -14-11-19-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

సరసభారతి అధ్యక్షులు శ్రీ గబ్బిట దుర్గా ప్రసాద్ గారికి కి ప్రధమ జ్ఞానజ్యోతి పురస్కార ప్రదానం

సరసభారతి అధ్యక్షులు శ్రీ గబ్బిట దుర్గా ప్రసాద్ గారికి కి ప్రధమ జ్ఞానజ్యోతి పురస్కార ప్రదానం  15.11.2019  5:30PM

ప్రత్యక్ష ప్రసారం

https://sarasabharathivuyyuru.blogspot.com/

Posted in సరసభారతి ఉయ్యూరు | Tagged | 1 Comment

గౌతమీ మహాత్మ్యం-6695-చిచ్చిక తీర్ధం

సర్వ శాంతి కలిగించే ‘’చిచ్చిక తీర్ధం ‘’గోదావరి ఉత్తర తీరాన ఉన్నది .చిచ్చుక అనే పక్షిరాజును గండ భేరుండం గా,శ్వేత పర్వతం పై ఉంటూ  ప్రసిద్ధి చెందింది  .అక్కడ మహర్షులు ప్రశాంతంగా తపస్సు చేసుకొంటారు .సర్వవిధ వృక్షాలు అక్కడ ఉంటాయి .రోగాలు రొస్టులు ఉండవు .ధర్మ నిరతుడైనతూర్పు దేశ  క్షత్రియరాజు పవమానుడు మంత్రి సామంత పురోహిత సైన్య సమేతుడై అక్కడ ఉన్నాడు .ఒక రోజు మృగయావినోదం కోసం  స్త్రీలతో సహా అరణ్యాలకు వెళ్ళాడు .అలసి ఒక చెట్టుకింద విశ్రమించాడు .అక్కడ రెండుముఖాలున్న సుందరమైన  విచారంగా ఉన్న ఒక పక్షిని చూసి ఆశ్చర్యపోయి ‘’ఎందుకు విచారం గా ఉన్నావు .ఇక్కడ అందరూ ఆయిగా ఉంటె నీకెందుకు విచారం ?’’అని అడిగాడు .

  చిచ్చికపక్షి రాజుతో ‘’నాకు ఎవరి వలనా ఎవరికీ నావల్లా భయం లేదు .ఈ పర్వతం శూన్యంగా ఉందేమిటని చూస్తున్నాను .నాకు కొంతైనా సుఖం,సంతృప్తి  కలగటం లేదు .నిద్ర ,ఆనందం విశ్రాంతి నాకు లేవు .అందుకే నా చింత ‘’అన్నది .రాజు ‘’అసలు నువ్వెవరవు .ఈపర్వత౦ ఎందుకు శూన్యమైంది .రెండు తలలున్నా సంతృప్తి ఎందుకు లేదు .ఈజన్మలోకాని గత జన్మలోకాని ఏదైనా దుష్కృతం చేశావా ?’’అని అడగగా నిట్టూరుస్తూ ఆ పక్షి ‘’పూర్వజన్మలో నేను వేదవేదాంగ పారంగతుడనైన బ్రాహ్మణుడను .జ్ఞాన విజ్ఞానాలున్నా ఇతరులపనులు చెడగొట్టేవాడిని .కలహ ప్రియు డిని .ఎదురుగా ఒకరకంగా, చాటుగా వేరొకరకంగా మాట్లాడే వాడిని .బాగుపదేవాళ్లను  చూసి ఈర్ష్యపడేవాడిని .కృతఘ్నత ,పరనింద ,గురుద్రోహం డాంబికం ,నా స్వభావం .మనోవాక్కాయలచే అందరినీ హిసించేవాడిని .నేను చేయనిపాపం లేదు .నావంటి ద్రొహిమరొకడు ఉండడు.అందుకే రెండు ముఖాలతో అంటే’’ స్ప్లిట్ పర్సనాలిటి ‘’తోపుట్టాను కనుక ఇక్కడ అంతా దుఖమే కనిపిస్తోంది .కపట వినయం వలన పాపం కలుగుతుంది .డాంబికం తో సదాచారం లో ఉన్నట్లు నటించేవాడిని .అందుకే ఈ పక్షి రూపం .అయినా ఎంతోకొంత మంచి చేశాను .నా పూర్వజన్మ ను తలుచుకొంటూ ఉంటాను ‘’అన్నది .

  రాజు పవమానుడు చిచ్చిక పక్షితో ‘’ఏ కర్మవలన నీకు ముక్తికలుగుతుంది ?’’అని అడుగగా పక్షి ‘’గౌతమికి ఉత్తరాన గదాధరతీర్ధం పవిత్రమైనది .నన్ను అక్కడికి తీసుకు వెళ్ళు .నీ దయవలన ఆక్షేత్ర సందర్శన చేసి నా సకల పాపాలు తొలగించుకొంటాను ‘’అన్నది .దయతో రాజు ఆపక్షికి గదాధర క్షేత్ర సందర్శనభాగ్యం కలిగించి ,గౌతమిలో స్నానం చేయించాడు .చిచ్చిక ‘’అమ్మా గౌతమీ !నిన్ను చూడని వాడు పాపి .ఇప్పుడు నీ దివ్య దర్శనం కలిగింది నాపాపాలన్నీ క్షాళన చేసి పుణ్యం కట్టుకో ‘’అని ప్రార్ధించి స్నానించి గదాధరునిసేవించి అందరూ చూస్తుండగా స్వర్గానికి చేరింది .అప్పటినుంచి ఈ తీర్ధం ‘’చిచ్చిక తీర్ధం’’ , ‘’పవమాన తీర్ధం ‘’అనే పేరుతో విరాజిల్లుతోంది అని బ్రహ్మ నారదునికి చెప్పాడు .

   సశేషం

మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -13-11-19-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

కూతురుకాని కూతురే తల్లికాని తల్లి-2(చివరిభాగం

కూతురుకాని కూతురే తల్లికాని తల్లి-2(చివరిభాగం

డా .కామేశ్వరికి ట్రాన్స్ ఫర్ అయి విశాఖనుంచి హైదరాబాద్ వెళ్ళింది .తర్వాత ఆమెను మిలిటరీ సర్వీస్ లోకి తీసుకొన్నారు మద్రాస్ ,కలకత్తా ,జలంధర్ ,ఆర్మీలో పనిచేస్తూ 1970-74లో రూర్కీ లో మేజర్ అయింది .ఎక్కడ ఉద్యోగం లో ఉన్నా ఏడాదికో మాటు విశాఖ, గోదావరి లకు రావటం ‘’దువ్వూరి’నాన్న’’ ఉన్న చోటికి రావటం ,నాన్న దగ్గర నాలుగైదు రోజులు ఉండటం జరుగుతూనే ఉంది .నాన్నను చూడాలనే కోరిక ఆమెకు ఎక్కువో ,తల్లి ని చూడాలనే ఈయన కోర్కె ఎక్కువో తేల్చుకోలేక పోయారిద్దరూ .ఇదో విధమైన  రుణాను బంధం అన్నారు శాస్త్రిగారు .జన్మలుమారినా ప్రేమలు, అభిమానాలు అక్కడక్కడ గోచరిస్తూనే ఉంటాయి ,కామేశ్వరి ఎప్పుడు కలిసినా పెద్దలతో ,పిన్నలతో ‘’ఈయన నాకొడుకు ‘’అనే పరిచయం చేస్తుంది .ఉత్తరాలలో కూడా తల్లి కొడుక్కి రాసినట్లే రాస్తుంది .’’నువ్వు ‘’అంటు౦దే కానీ ఎన్నడూ ‘’మీరు ‘’అననే అనదు.

  దువ్వూరి’’ శాస్త్రి కొడుకు  గారి ‘’వొళ్ళో పడుకొంటుంది .’’ఏ పూర్వ జన్మలోనో నీకు తల్లినై  ఉంటాను నాన్నా !’’అంటుంది శాస్త్రిగారికీ అదే నిశ్చయం .ఆమె భర్తకూడా అంతే చనువుతో ఉండటం మరీ ఆశ్చర్యం .అదొక గొప్ప సంస్కారం .అతడు 1968లో ఎం.ఏ.పాసై ,ఇంగ్లాండ్ వెళ్లి ,ఏదో పరిశోధన చేశాడు .మధ్యమధ్యలో వచ్చి భార్యాపిల్లల్ని చూసి వెడుతూ ఉండేవాడు .ఇద్దరుకొడుకులు పాండిచ్చేరి అరవిందాశ్రమం లో చదివారు .తర్వాత ఒకడు మెడిసిన్, ఇంకోడు ఇంజనీరింగ్ చదివి సెటిలయ్యారు .కామేశ్వరి దంపతులు  నాన్న ను చూడటానికి వచ్చేవారు .భర్త యెదుటనే కామేశ్వరి కొడుకైన శాస్త్రిగారి వొడిలో తలపెట్టుకొని పడుకొని భర్తతో ‘’నాన్న వొళ్ళో తలపెట్టుకొని పడుకుంటే యెంత ప్రశాంతంగా ఉంటోందో !ఆ అనుభవం మీకు లేదుకదా ‘’అని ఆటపట్టించేది .జలంధర్ నుంచో కలకత్తా నుంచో తిరువన్నామలై వెడుతూ ,మధ్యలో దాక్షారామ దగ్గర దువ్వూరి వారి స్వగ్రామం మసకపల్లి వెళ్లి’’ నాన్న’’ ను ఒకటి రెండు సార్లు చూసి వెళ్ళింది’’ తల్లి’’ డా.కామేశ్వరి .  దువ్వూరి వారి కుటుంబం అందరితోనూ అదే చనువుతో ఉండేది .మగపిల్లలను అన్నా, తమ్ముడూ ఆడపిల్లలను అక్కా, చెల్లీ అని ఆప్యాయంగా పిలిచేది .శాస్త్రిగారి దౌహిత్రి నాగమణి అంటే కామేశ్వరికి మహా ప్రీతి .నాగమణి కి కూడా ఆమెపై ‘’కంచి కామాక్షి అమ్మవారిపై ఉన్నంత గౌరవ ఆదరాలు’’ .దీనికి కారణం ఎవరూ చెప్పలేరు ‘’కస్యచిత్ క్వచిత్ ప్రీతిః’’అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్కరిపై ప్రేమ ఏర్పడుతుంది .ఎందుకో చెప్పలేము .అది చెప్పలేకే జన్మాంతర సంబంధంగా భావిస్తాము .డా .కామేశ్వరిలో ఆధ్యాత్మిక భావమూ చాలా ఎక్కువే .నిత్యపూజ, దేవీధ్యానం ,దేవీ స్తోత్రం అంతా పరమ పవిత్రంగా ఉండి ముచ్చట,ఆశ్చర్యం తన్మయత్వం కలిగిస్తుంది .ప్రతియేడూ తిరువన్నామలై వెళ్లి గురు సాన్నిధ్యంలో కొంత సేపు గడిపిరావటం ఆమె ప్రత్యేకత .దేశం లో ఆమె చూడని క్షేత్రం లేనేలేదు .ఆమె తండ్రిగారు సన్యాసాశ్రమం స్వీకరించి సుమారు 20ఏళ్ళు తపస్సు చేసి సిద్ధి పొందారు .ఆ ఆధ్యాత్మిక సంస్కారం కూతురు కామేశ్వరిలో బాగా సంక్రమించింది .

   రిటైరైన దువ్వూరి వారిదగ్గరకొచ్చి నప్పుడల్లా ‘’నాన్నా !ఒకరి నిర్బంధం లో లేకుండా ఇప్పుడు స్వేచ్చగా ఉన్నావుకదా.వచ్చి నా దగ్గరే ఉండు నాన్నా !ఖాళీగా ఉన్నప్పుడల్లా మనమిద్దరం కలిసి పుణ్యక్షేత్రాలు తిరిగొద్దాం .డాక్టరైన నీ కూతురు నీదగ్గరే ఉంటు౦దికనుక ఆరోగ్యానికి భయం లేదు ‘’అనేది .అలా అంటూనే ఉంది .ఈయనా వెళ్ళాలనే అనుకొంటారు .కాని .అవి ‘’తీరే కోర్కేలా ‘’అంటారు శాస్త్రీజీ .చివరికి ‘’కొన్ని కోర్కెలు తొలగించుకోలేము ‘’అని మనసుకు సమాధానం చెప్పుకొన్నారుకళాప్రపూర్ణ దువ్వూరి  వేంకట రమణ శాస్త్రి గారు .

   ఆధారం –దువ్వూరి వారి స్వీయ చరిత్ర

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -13-11-19-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

గౌతమీ మహాత్మ్యం-65 94-సరస్వతీ తీర్ధం

గౌతమీ మహాత్మ్యం-65

94-సరస్వతీ తీర్ధం

పుష్పోత్మటం తూర్పున ,గౌతమికి దక్షిణాన ‘’శుభ్రం ‘’అనే పర్వతం బాగా ప్రసిద్ధి చెందింది .దానిపై శాకల్యుడు అనే ముని తపస్సు చేస్తు౦డగా,సమస్త ప్రాణికోటి అతనిన్ని స్తుతిస్తూ ,నమస్కరి౦చేది . అక్కడే ‘’పరశువు ‘’అనే రాక్షసుడు కామ రూపియై బ్రాహ్మణ ,పులి ,స్త్రీ ,బాలరూపాలు ధరించి రోజూ శాకల్యముని తపో భంగం చేసి తీసుకు వెళ్ళే ప్రయత్నాలు చేశాడు .కాని విఫలుడయ్యాడు .ఒక రోజు ఆ ముని తపస్సు అయ్యాక భోజనానికి వస్తుండగా ,ఆమాయావి దుర్బల బ్రాహ్మణ వేషం తోఒక కన్యకతో  వచ్చి ‘’మేమిద్దరం భోజనానికి వచ్చాం .ఆతిధ్యమిచ్చినవారు సర్వ శ్రేస్టులు ‘’అన్నాడు .

వాడి కపటం తెలీక  ముని అతడికి మర్యాద చేసి భోజనం పెట్టాడు .ఆపోశన వేశాక ‘’పరశువు ‘’అతిధి కోరిన కోరిక తీర్చటం లోకమర్యాద.నేను కోరింది తీరుస్తానంటే  భోజనం చేస్తాను ‘’అని మెలికపెట్టాడు.’’అడిగింది ఇస్తా .తినండి ‘’అన్నాడు ముని .అప్పుడు వాడు ‘’నేను పరశువు అనే రాక్షసుడను .నీకు శత్రువును కాను ,నావి తెల్లబడిన వెంట్రుకలు కావు .దేహం మాత్రం సుష్కించింది .నిన్ను, నీ అనుచరులను ఎత్తుకుపోయి తిని ఆకలి తీర్చుకొంటాను ‘’అన్నాడు .

శాకల్యముని వాడితో ‘’నాది వజ్ర శరీరం .అయినా ఒకమాట చెప్పాలినీకు .అతిధివికనుక హితం చెప్పటం నా విధి .నన్ను శ్రీహరి సకల దిక్కులలోనూ రక్షిస్తూ ఉంటాడు .నాపాదాలను విష్ణువు శిరస్సు జనార్దనుడు ,పృస్టాన్నికూర్మరాజు ,హృదయాన్ని శ్రీ కృష్ణుడు ,వరాహమూర్తి బాహువులను ,నృసింహస్వామి వ్రేళ్ళను ,పక్షివాహనుడు నేత్రాలను ,వాగీశుడు ముఖాన్ని ,కుబేరుడు చెవులను శివుడు అంతటా రక్షించుగాక .నారాయణుడే నాకు శరణు .ఆకలితో ఉన్నావు కనుక నన్ను తీసుకు వెళ్లి తిని ఆకలి తీర్చుకో ‘’అన్నాడు నిర్భయంగా . పరశు రాక్షసుడు ‘’మహాత్మా !నువ్వు సాక్షాత్తు శ్రీ మహా విష్ణువు స్వరూపంగా కనిపిస్తున్నావు .వేదస్వరూపునిగా ,జగన్మయుడివిగా దర్శన మిస్తున్నావు .కనుక నువ్వే నాకు శరణు .నా అజ్ఞానం పటాపంచలైంది .ఇనుము సువర్ణం అయినట్లు ఉందినాకు ‘’అన్నాడు .

అప్పుడు శాకల్యమౌని కృపతో  ‘’గౌతమీ తీరం చేరి ,సరస్వతీ దేవి అనుగ్రహం సాధించు .జనార్దనుడిని స్తుతించు .అన్నిటికీ తరుణోపాయం నారాయణ స్తోత్రమే ‘’అని చెప్పాడు .వాడు వెంటనే వెళ్లి పావన గౌతమీ స్నానం చేసి శుచిగా నిష్టగా గంగకు అభిముఖంగా కూర్చుని జగజ్జనని సరస్వతి దేవి దర్శన భాగ్యం పొందాడు .పాపాలన్నీ తొలగిపోయి పరిశుద్ధుడై ,.పరిశుద్ధ అంతరంగుడై ‘’అమ్మా !శాకల్య గురువు శ్రీ హరిని స్తుతించమని ‘చెప్పారు అనుగ్రహించి ఆ శక్తి నాకు కలిగించు ‘’అని వేడాడు .’’తధాస్తు ‘’అన్నది వాణీమాత .గీర్వాణి అనుగ్రహంతో విష్ణుమూర్తిని అనేక స్తోత్రాలతో మెప్పించాడు .మురారి సంతసించి’’నీమనసులో ఉన్న కోర్కె తీరుతుంది ‘’ అన్నాడు .అందరి అనుగ్రహం తో ఆ రాక్షసుడు స్వర్గం చేరాడు .ఈ ప్రదేశమే సరస్వతీ తీర్ధం .ఈశ్వేత పర్వతం నుంచి సారస్వతం ,వైష్ణవం ,శాకల్యం ,పరశు అనే తీర్దాలేర్పడినాయి అని బ్రహ్మ నారదునికి చెప్పాడు .

సశేషం

కార్తీక పౌర్ణమి శుభా కాంక్షలతో

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -12-11-19-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

జ్ఞాన జ్యోతి పురస్కార ప్రదానం – వార్తా పత్రికలో

Posted in సరసభారతి ఉయ్యూరు | Tagged | Leave a comment

ఉయ్యూరు శ్రీ సువర్చలాన్జనేయ స్వామి దేవాలయం లో కార్తీక మాసం 3వ మంగళవారం రాత్రి దీపాలంకర శోభ

ఉయ్యూరు శ్రీ సువర్చలాన్జనేయ స్వామి దేవాలయం లో కార్తీక మాసం 3వ మంగళవారం రాత్రి దీపాలంకర శోభ

https://photos.google.com/share/AF1QipOcfbRFpBr-1xi0Rp62XmadyCBHAMmiPUrBxPC9NQ_uMOhTfgayK4ctH25pp9HCHw?key=Z3hmcXRnVTJyZ3FkNEVfT2ZIWktLMVhvYTF6TTlB

Posted in సరసభారతి ఉయ్యూరు | Tagged | Leave a comment

9-11-19 శనివారం రాత్రి హైదరాబాద్ మియాపూర్ మా తోడల్లుడిగారబ్బాయి సూర్యం దంపతుల ఇంట్లో మేము

9-11-19 శనివారం రాత్రి హైదరాబాద్ మియాపూర్ మా తోడల్లుడిగారబ్బాయి సూర్యం దంపతుల ఇంట్లో మేము

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

9-11-19శనివారం హైదరాబాద్ బాచుపల్లిలో మా అబ్బాయి శర్మ ఇంట్లో ఉదయం 7-30నుంచి 11-15వరకు మహాన్యాసపూర్వక రుద్రాభిషేకం తరువాత 11-30నుంచి 2-30వరకు శ్రీసత్యనారాయణ స్వామి వ్రతం చిత్రమాలిక

9-11-19శనివారం హైదరాబాద్ బాచుపల్లిలో మా అబ్బాయి శర్మ ఇంట్లో ఉదయం 7-30నుంచి 11-15వరకు మహాన్యాసపూర్వక రుద్రాభిషేకం తరువాత 11-30నుంచి 2-30వరకు శ్రీసత్యనారాయణ స్వామి వ్రతం చిత్రమాలిక

https://photos.google.com/share/AF1QipO5Bo4itslgr2B5Ab2o9Ron_UO0E8t3ISWsmz0PWBPQLYcl9qcz1dlp-CjrKHIPjg/photo/AF1QipN8agkq8RWVcu8v4tXWIc_JURr7769mINe8OIsB?key=MG53VVdMUTFRTHpHcFBnR3VGZS1DM2JrdS1xdVJB

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

జ్ఞాన జ్యోతి పురస్కార ప్రదానం

సాహితీ బంధువులకు శుభ కామనలు -ఆంధ్రప్రదేశ్ రచయితల సంఘం మొదటి సారిగా ఏర్పాటు చేసిన ”జ్ఞానజ్యోతి ”పురస్కారం మొట్టమొదటి సారిగా నాకు గ్రంథాలయ వారోత్సవాల సందర్భంగా విజయవాడ ఠాగూర్ లైబ్రరీలో 15-11-19 శుక్రవారం సాయంత్రం ప్రదానం చేస్తున్నందుకు ,,వారికి కృతజ్ఞతలు తెలియ జేస్తూ ,వినమ్రంగా స్వీకరి0చటానికి  అంగీకరిస్తున్నామని సాహితీ బంధువులకు తెలియ జేస్తున్నాను –

 

Posted in సభలు సమావేశాలు | Tagged | 1 Comment

కూతురుకాని కూతురే తల్లికాని తల్లి

కూతురుకాని కూతురే తల్లికాని తల్లికొన్ని బంధాలు తమాషాగా యేర్పడి శాశ్వత బంధాలౌతాయి .చిరస్మరణీయాలౌతాయి .మధుర భావ బంధురాలౌతాయి ..ఎన్నో జన్మల అనుబంధాలేమో అనిపిస్తాయి .ఆ బంధానికి రెండు వైపులవారి స్పందనలు మరింత బలీయమైతే ఇక వాటిని గురించి చెప్పటానికి మాటలే ఉండవు . .ఆనందాను నుభవమే అయి మనసునమల్లెలై విరబూసి దిగంత వ్యాప్త పరిమళీ భూతాలౌతాయి .అలాంటి అనుబంధమే శ్రీ దువ్వూరి వెంకటరమణ శాస్త్రిగారికి ,డా  కామేశ్వరిగారికి యేర్పడింది .ఆమె ఆయనకు కూతురుకాని కూతురు మాత్రమే కాదు తల్లికాని  తల్లి కూడా ..  అబ్బూరి రామకృష్ణారావు  గారు ఆంధ్ర ప్రదేశ్ సాహిత్య అకాడెమీ వారి ప్రోత్సాహం తో ”నన్నయ భట్టు పద ప్రయోగ కోశం ”తయారు చేశారు అంటే నన్నయ భారతం లో  యేపద0 యెన్ని సార్లు యెక్కడెక్కడ ప్రయోగించాదో తెలియజేసే ”కంకార్డెన్స్ ”అన్నమాట ..దీని ఆవిష్కరణ తిరుపతి వెంకటేశ్వరా యూని వర్సిటీలో జరిగి ,నన్నయ  భాషను గురించి  ప్రసంగించటానికి దువ్వూరి వారిని ఆహ్వానించారు .మాట్లాడి మేడ మెట్లు దిగుతుంటే ఇద్దరు ”కుమారికలు” కనిపించి శాస్త్రిగారికి నమస్కరించారు .అందులో ఒకామె శాస్త్రిగారి శిష్యురాలు రాజేశ్వరి .ఆమె ఎం.ఏ చేసి పిహెచ్ డి పరిశోధన చేస్తోంది .తిరుపతియాత్రకువచ్చి ,శాస్త్రిగారి ఉపన్యాసం ఉందని తెలిసి వచ్చి,శాస్త్రిగారిని పలకరించటానికే ఆగారు .తనకు వేసిన పూలదందను ”అమ్మా తీసుకోమని ”రాజేశ్వరికి ఇవ్వబోతుంటే ,,రెండవ ఆమె ”మాస్టారూ మేమిద్దరం తీసుకొంటాము ”అని చేయి చాచింది .ఆమె యెవరు అని రాజేశ్వరిని అడిగితే ”మనవూరే వైజాగు .మెడిసిన్ పూర్తి చేసి కేజీ హెచ్ లో పనిచేస్తోంది .మీరు కొద్దిగా తెలుసట..తిరువణ్ణామలై వెడుతూ ఇక్కడ ఆగింది .ఇక్కడే కలిశాం ..నాతో పాటు మీ ప్రసంగం వినటానికి వచ్చింది ”అని చెప్పి పరిచయం చేసింది .అప్పుడు డా.కామేశ్వరి ”నాన్నగారూ !నేను రాజేశ్వరిలా శిష్యురాలినికానప్పటికీ ,మీకు దగ్గర దాననే అనుకోవాలని నా కోరిక .కేజీహెచ్ దగ్గరే మిమ్మల్నొకసారి చూశాను ..రమణాశ్రమ ప్రయాణం లో మీరు ఇక్కడ ఈమెతో కలిశారు  .మీటింగులో మీ మాటలు యెంతో సంతోషం ఆనందం కలిగించాయి .వైజాగ్ వెళ్ళాక ,మీ ఇల్లుకనుక్కొని వచ్చి కలుస్తాను ”ఆనగా  మాస్టారు ”సరేనమ్మా ”అనటం ఆతర్వాత యెవరి దారి వారు వెళ్లిపోవటం జరిగింది .ఇదే ఈ నాన్న ,కూతుర్ల తొలి పరిచయం . అదే   అత్యంత శాశ్వతమైంది .యేలాగో చూద్దాం .   వైజాగ్ లో కామేశ్వరి మళ్ళీ ఒకసారికలిసి అడ్రస్ తెలుసుకొన్నదికాని మళ్ళీ ఇద్దరూ కలవటం కుదరలేదు .ఒక నెల గడిచాక ఒక రోజు ఉదయం 
ఇంట్లో యేదో అనబోతుంటే ,శాస్త్రిగారి నోటి వెంట మాట రాలేదు ..యేదైనా చెప్పాలనుకొంటే నోట్ బుక్ మీద రాయటమే .అందరూ కంగారు పడ్డారు ..అప్పుడు కేజీహెచ్ లో ent  స్పెషలిస్ట్ డా పిన్నమనేని నరసింహారావు  గారోక్కరే .ఆయన్ డిపార్ట్మెంట్ హెడ్ .ఆయనదగ్గరకు రిక్షాలో పెద్దబ్బాయిని తీస్సుకొని వేడితే ,ఇల్లు తాళం వేసి ఉంది .యెప్పుడొస్తారో తెలీదని ప్రక్కవారు చెప్పారు ..కామేశ్వరి జ్నాపకమొచ్చి కాగితం మీద అబ్బాయికి రాసి ఇద్దరూ కామేశ్వరి ఇంటికి వెళ్లారు .కొడుకును లోపలికి పంపి ,విషయం చెప్పమనగా అతను అలానే చెప్పగా కామేశ్వరి గబగబా పరిగెత్తు కొచ్చి,బుజ0 మీద చేతులు వేసి ”నాన్నా !మాట రావటం లేదా ?”అని అడిగి లేదని చెబితే ,కళ్ళవెంట నీళ్ళు వచ్చాయి .చీరకొంగుతో ఆమేతుడిచి ,”నాన్నా! నేనున్నానుగా .హాస్పిటల్ కు  వెడదాం .ఆదివారమైనా ఫరవాలేదు ”అని చెప్పి 5,7యేళ్ళ వయసున్న తన కొడుకులను జాగ్రత్తగా ఉండమని చీప్పి శాస్త్రిగారబ్బాయిని మరో రిక్షాలో రమ్మని శాస్త్రిగారి రిక్షాలో కూర్చుని హాపిటల్ కు తీసుకు వెల్లీంది.పేషెంట్ ను చూడమని అక్కడివారికి చెబితే ”ఆదివారం .యెలా’?అని వారంటే దబాయించి ”తండ్రికి మాటరాకపోతే వారాలూ వర్జాలూ చూస్తారా డాక్టర్లమై ఉండి కూడా ”అన్నది ఖంగుతిని ”యెవరమ్మా ఆయన ”?అని అడిగితే ”మా నాన్న ఆండీ ”అని చెప్పగా ,అందరూ మర్యాదలు చేసి నాలుగురైదుగురు డాక్టర్లు మూగి తలోపరీక్షా చేసి, ఇంజెక్షన్ చేసి ”అమ్మా !మీ నాన్నగారికేమీ డిఫెక్ట్ లేదు ఈ ఇంజెక్షనేసాయంకాలం ఒకటి రేపు పొద్దున ఒకటి  మీరే చేయండి .తగ్గిపోతుంది ”అని చెప్పి రెండు సీసాలిచ్చారు ..ఆమె ”ధాంక్ యు డాక్టర్స్ ”అని చెప్పి ,శాస్త్రిగారబ్బాయితో ”అన్నయ్యగారూ !నాన్న ను  ఇంటికి తీసుకు వెళ్ళి విశ్రాంతిగా ఉంచండి .సాయంత్రం 5గంటలకు తీసుకువస్తే ఇంజెక్షన్ చేసి పంపుతాను ”అని చెప్పింది .ఇంటికి చేరి,యేదో కొంతతిని నిద్ర పోయారు .నాలుగంటలకు మెలకువవచ్చి అబ్బాయీ అని కేక వేశారు స్పస్టంగా  లేకపోయినా బాగానే ఉంది.వచ్చి ”వెడదామా” అంటే నీర్గసంగా  ఉంది రేపు పొద్దున వెడదాం అన్నారు .సరే అనుకొన్నాక మళ్ళీ గాఢంగా నిద్రపోయారు .    రాత్రి 11 కు తల్పు చప్పుడైంది  .చాలా పిలుపులకు మెలకువ వచ్చియెవరు మీరని అడిగారు.”డాక్టర్ల0”అంగానే తల్పు తీయించగా డా కామేశ్వరి మరి ముగ్గురు డాక్టర్లు  .దగ్గరకొచ్చి మంచం మీద కూర్చుని ”నాన్నా!మాట్లాడు తున్నావే .సాయంత్రం 6దాకా నీకోసం చూసి ,ప్రతి ఆదివారం వెంకటేశ్వరస్వామి గుడికి వెడతామ్ .మీరొస్తే ఉండమని ఇంట్లో చెప్పి దర్శనం చేసి ఇంటికి వేడితే మీరు రాలేదని చెబితే  మేమే  ఇక్కడికి వచ్చాం ”అని చెప్పి ఇంజెక్షన్ ఇచ్చింది ఆమానవీయురాలు .”ఆమాటా వాత్సల్యం చూస్తే గౌరవ మర్యాదలతో పిలుస్తున్నట్లు ఉన్నా ఆమె నాన్నా అంటుంటే కన్నకొడుకు పిలిచే పిలుపులా ఉంది..ఆమె దృస్తీలో నేను తండ్రినో ,కొడుకునో ?నా దృస్టి లో  ఆమె నాకు తల్లో,కూతురో ? ఆవేళ నాకు  తెలియలేదు .అప్పుడే కాదు ఇప్పటికీ 13-14 యేళ్ళు గడిచినా  తెలీదు  ”అన్నారు దువ్వూరివారు . ఆ అనుబంధం మరింత యెలా బలపడిందో ఈ సారి తెలుసుకొందాం .    సశేషం మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -7-11-19-కాంప్-మల్లాపూర్ -హైదారాబాద్ 

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

‘నూక వప్పెచిమాః-క్రమాత్ ”

‘నూక వప్పెచిమాః-క్రమాత్ ”
ఇదేమిటి తలా తోకా లేని శ్లోకం తెచ్చి హడల గొడుతున్నావని అనుకోకండి .”స్టేషన్సు  బెబ0 శాఖాయా0 -నూ క్రా శ్యాది నిర్ణయహ ” అని

-పూర్తిశ్లోకం  శ్లోకం మొదటి పాదానికే కంపరమొస్తే

శేషం యేమిటి స్వామీ అనకండి . దీనికో కధ ఉంది .చెబుతా వినండి సారీ చదవండి .
 దువ్వూరి వెంకట రమణ శాస్త్రిగారు 18యేళ్ళు చిట్టి గూడూరు ఓరియెంటల్ కాలేజీ లో వ్యాకరణ శాస్త్ర బోధకులుగా ఉన్నారు .వారు స్వగ్రామం మసకపల్లి వెళ్ళటానికి బందరు వరకు ఒంటెద్దు బండీలో వెళ్ళి ,అక్కడ బెజవాడ పాసెంజర్ యెక్కి బెజవాడ్  చేరి అక్కడినుంచి  ట్రెయిన్ లో వెళ్ళేవారు .వచ్చేటప్పుడూ అదే రూటు . బెజవాడ బందరు మధ్య దూరం 50మైళ్ళే కానీ హాల్టులు 12.. ట్రెయిన్ నడిచే సమయంకంటే ఆపుల సమయం యెక్కువై దున్నపోతు నడకగా పాకీ బండీలా ఉండేది . విసిగెత్తేది ప్రయాణం . అందులో శాస్త్రిగారికి ఈ హాల్టుల పేర్లు అసలు గుర్తుండేవి కావు . ఒకసారి అలాగే బెజవాడ నుండి బందరు పాసెంజర్ లోవస్తున్నారు . ప్రక్కన కూర్చున్న ఒక పెద్దమనిషిని  బెజవాడ దాటగానే” తర్వాత స్టేషన్ యేదండి”అని అడిగారు .ఆయన ”తరిగొప్పుల ”అన్నాడు .కాసేపాగి మళ్ళీ అదే ప్రశ్న వేశారు శాస్త్రీజీ .”ఇందుపల్లి ”అన్నాడు . మరికొంత సేపటికి తర్వాత హాల్ట్ యేదిఅని అడిగితే ,ఆయన విసుగు ముఖంతో ”మీకేమైనా సంస్కృత జ్నానముందా””అని అడిగాడు . ”యేదో కొద్దిగా వచ్చు లెండి ”అన్నారు ..” నాకూ ఒకప్పుడు ఈ పేర్లు గుర్తుండక ఒక శ్లోకం అల్లుకున్నాను ..అది చెబుతా విని గుర్తు పెట్టుకోండి .యెవరినీ ప్రశ్నలతో వేధించక్కర్లేదు ”అని తాను అల్లిన పైశ్లోకాన్ని చెప్పాడు శాస్త్రిగారు ధారణ చేసి బెజవాడ నుంచి బందరు వరకు ఉన్న స్టేషన్లను దాని ద్వారా గుర్తు పెట్టుకొన్నారు  .ఇంతకీ శ్లోక భావమేమిటి వెంకటేశా అంటే
బె-బెజవాడ ,రా-రామవరప్పాడు ,ని-నిడమానూరు ,ఉ-ఉప్పులూరు ,త-తరిగొప్పుల ,ఇం-ఇందుపల్లి ,దో-దోసపాడు ,గు -గుడివాడ ,నూ -నూజెళ్ళ,క-కవుతర0,వ-వడ్లమన్నాడు,పె-పెడన,చి-చిలకలపూడి ,మ-మచిలీ పట్నం
బెబం శాఖయా -అంటే బెజవాడ -బందరు లైన్ లో స్టేషన్సు -అంటే స్టేషన్లు అని అర్ధం అయింది కదా
 దువ్వూరివారికి ”నూక్రాస్యాత్ ”అంటే యేమితో అర్ధం కాలేదు .మనకీ అంతేకదా సారూ .మోహ మాటం లేకుండా ఈ శ్లోకం అల్లినాయన్నే ప్రశ్నించారు .”కవి హృదయం చెబితేకాని తెలియదు లెండి ”అని చిరునవ్వు నవ్వి ”యేమీ లేదు మాస్టారూ!నూ-అంటే నూజెళ్ళ లో క్రా-అంటే క్రాసింగ్ ,స్యాత్  -అంటే అవుతుంది అని చెప్పాడు .హమ్మయ్య అనుకోని ”నాకు చాలా శ్లోకాలు నోటికి వచ్చుకాని ఇంతఉపయోగించే శ్లోకం యేదీ లేదు అయ్యా మీ అడ్రస్సు వగైరా ”అంటూండగానే యేదో స్టేషన్ వచ్చి ఆ సహ ప్రయాణీకుడు ,ఈ శ్లోక రచయిత గబగబా దిగి వెళ్లిపోయాడు . చాలాబాధ పడి,ఆయనెవరో,యే వూరో ,యేం  చేస్స్తున్నాడో తెలుసుకోలేక పోయానే అని ఆ అజ్నాతకవి గురించి బాధ జీవితాంతం బాధపడుతూనే ఉన్నారు దువ్వూరి వెంకట రమణ శాస్త్రి గారు
ఆధారం -దువ్వూరి వారి స్వీయ చరిత్ర
మీ -గబ్బిట దుర్గాప్రసాద్ -6-11-19-కాంప్-మల్లాపూర్ -హైదారాబాద్
Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

అపార అన్నపూర్ణమ్మకు ”గొరసం ”వారి అక్షర నీరాజనం

అపార అన్నపూర్ణమ్మకు ”గొరసం ”వారి అక్షర నీరాజనం

Posted in సభలు సమావేశాలు | Tagged | Leave a comment

దిగ్విజయంగా జరిగిన 11వ అమెరికాతెలుగు సాహితీ సదస్సు

దిగ్విజయంగా జరిగిన 11వ అమెరికా తెలుగు సాహితీ సదస్సు

నవంబర్ 23, 2019, ఓర్లాండో మహా నగరం, ఫ్లారిడా

ఓర్లాండో మహా నగరం లో 11వ అమెరికా తెలుగు సాహితీ సదస్సు విజయవంతంగా ముగిసింది. ముందు చెప్పవలసిన నా మాట ఆఖర్న చెప్తాను….అంత వరకూ ఓపికగా ఈ సదస్సు సమీక్ష చదవండి. ఫొటోలు చూడండి. వీడియోలు వీక్షించండి….

ఇక ఫ్లారిడా లో, అందునా ఓర్లాండో లో జరిగిన మొట్టమొదటి తెలుగు సాహితీ సదస్సు మీద నా పరోక్ష సమీక్ష:

ప్రారంభ సభ:

ప్రధాన సమన్వయ కర్త మధు చెరుకూరి గారి నిర్వహణ లో జరిగిన ప్రారంభ సభలో భారత దేశం నుంచి మొదటి సారిగా అమెరికా ఆహ్వానిత అతిధులుగా విచ్చేసిన ‘శతావధాని” డా. రాంభట్ల పార్వతీశ్వర శర్మ, శ్రీమతి జ్యోతి వలబోజు గారు,  చెరుకూరి రమాదేవి, ఎస్. నారాయణ స్వామి, వంశీ రామరాజు గారు ముందుగా జ్యోతి ప్రజ్వలన చేయగా, రాధికా నోరి ప్రార్ధనా గీతంతో సభ శుభారంభం అయింది. ఓర్లాండో మహా నగర తెలుగు సంఘం (TAGO) అధ్యక్షులు నరొత్తమ్ జీడిపల్లి సభికులకి స్వాగతం చెప్పగా, ప్రధాన అతిధుల సముచిత ప్రసంగాలు, ముఖ్యంగా డా. రాంభట్ల పార్వతీశ్వర శర్మ, చెరుకూరి రమా దేవి గారు, జ్యోతి వలబోజు, నారాయణ స్వామిల ప్రసంగాలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఓర్లాండో మహా నగరం లో బాలబాలికలకి తెలుగు నేర్పుతున్న ఉపాద్యాయులకి (సత్య మంతెన, చంద్రశెఖర్ అయ్యలరాజు, ప్రవీణ పల్లమరెడ్డి, సారిక శ్రీరామ్, ధరణి ఎర్రా) చిరు సత్కారం జరిగింది.

పుస్తకావిష్కరణలు:

మూడు విడతలలో జరిగిన పుస్తకావిష్కరణ వేదికలలో ఈ క్రింది నూతన గ్రంధాలు ఆవిష్కరించబడ్డాయి. సదస్సుకి వచ్చిన ప్రతినిధులకి ఇచ్చిన నమోదు సంచీలో ఇంచుమించు ఈ గ్రంధాలు అన్నీ ఉచితంగా బహూకరించబడ్డాయి.  

వంగూరి సంస్థ ప్రచురణలు: అమెరికా తెలుగు కథానిక -14: అమెరికులాసా కథలు (వంగూరి చిట్టెన్ రాజు); నాట్య  భారతీయం (ఉమా భారతి కోసూరి)కాళీ పదములు & కాకీక కాకికి కాక (పాలపర్తి ఇంద్రాణి); తెన్నేటి సుధ కథలు: “రంగంటే ఇష్టం”(చాగంటి తులసి); చైతన్యం కథలు (సుధేష్ణ సోమ), “కంటి వైద్యం లో ప్రాచీన భారత దేశం విజ్ఞాన సంపద” (డా. వి.కె.రాజు); తెలుగే గొప్ప భాష -కానీ కనుమరుగౌతున్నది (పారుపల్లి కోదండ రామయ్య)  

ఇతర ప్రచురణలు: కొత్త కథలు-2019;  ప్రవాసాంధ్రుని పరి వేదన: డా. జి.వి.ఆర్.కె.శర్మపాలంకి కథలు – డా. శారదా పూర్ణ: “కళల కాణాచి”- డా. ప్రభల జానకి; రాజీవ నేత్రుడా” అయ్యప్ప స్వామి మధుర గీతాల సీడీ

అట్లాంటా నుంచి వచ్చిన పెమ్మరాజు లక్ష్మీ రావు గారు బాపు గారి 36 తిరుప్పావై పంచ రంగుల వర్ణ చిత్రాల అల్లిక ఆవిష్కరణ ప్రత్యేక ఆకర్షణ గా నిలిచింది.  

ప్రసంగ వేదికలు:

ఈ రెండు రోజుల సభలో జరిగిన ప్ర్రసంగ వేదికలు ఎస్. నారాయణ స్వామి సమర్ధవంతమైన నిర్వహణలో జరిగాయి. ఆ వేదికలలో రచయితలు సుమారు 75 మంది సభికుల సమక్షం లో ఎంతో ఉత్సాహంతో ఈ క్రింది సాహిత్య ప్రసంగాలు చేశారు. వీరిలో కనీసం పది, పదిహేను మంది ఫ్లారిడా రాష్త్రం వారే కావడం చెప్పుకోదగ్గ విశేషం.

జ్యోతి వలబోజు: అంతర్జాలంలో తెలుగు ప్రస్థానం

అత్తలూరి విజయ లక్ష్మి: శరత్ నవలలో శ్రీకాంత్

ప్రభల జానకి: కురు వంశ కుల వధువులు……ధర్మ మూర్తులు

పద్మ వల్లి: కథ చెప్పడం ఓ కళ !

సుభద్ర వేదుల:కథల్లో కొత్త వస్తువులు కావాలా? కావలిస్తే అవి ఏమిటి? 

లలితా త్రిపుర సుందరి: బ్లాగెడివి కబుర్లట !:

ఇంద్రాణి పాలపర్తి: ‘కథా రచనలో లోపాలు-కారణాలు

శ్రీనివాస్ నాగులపల్లి: “వెయ్యేళ్ళ తెలుగు సాహిత్యం పై ఒక అవలోకనం”

భాస్కర్ పులికల్: నా సాహిత్య ప్రయాణం
మధిర మూర్తి: ఆంధ్ర సాహిత్య మకుటము – పోతన భాగవతము

రాధిక నోరి: నా కథలు-సామాజిక స్పృహ

శ్రీనివాస్ సత్తిరాజు: ఆధునిక తెలుగు కవిత్వంలో “నేను” పదప్రయోగం.

భూషణ్: కవిత్వం ఎందుకు చదవాలి ??; 

ఎస్.నారాయణ స్వామి: నిడదవోలు మాలతి సాహిత్యం

వంశీ రామరాజు: గుర్తుకొస్తున్నారు: సినారె, రాయప్రోలు;  

ఉమా భారతి: సర్వకళా సారం సాహిత్యం

శారదా పూర్ణ శొంఠి: నేను , నా రచనలు, నా ప్రచురణలు 

అపర్ణ యేలూరిపాటి:సాహిత్యం లో కుటుంబ వ్యవస్థ.

భరద్వాజ కిశోర్: వలస వచ్చిన సంస్కృతి

విన్నకోట రవిశంకర్:  “కవిత్వంలో ఆశావాదం, నిరాశావాదం”

ప్రత్యేక ప్రసంగాలు, స్వీయ కవితలు: ‘శతావధాని’ డా. రాంభట్ల పార్వతీశ్వర శర్మ; శారద కాశీవజ్జుల తదితరులు.

కథాపూరణ:

మా ఆనవాయితీ ప్రకారం నారాయణ స్వామి నిర్వహణలో అతను ఎంపిక చేసిన ఒక కథని సగం తుంచేసి మొదటి రోజున అందరికీ ఇచ్చి, ఆ కథని పూరించమని అడుగుతాం. ఆ మర్నాడు దానికి వచ్చిన సభికుల స్పందనలలో న్యాయ నిర్ణేతలకి నచ్చిన మూడు పూరణలకి బహుమతులు ఇస్తాం. ఈ సారి ఆ పోటీలో ఈ క్రింది వారు బహుమతులు అందుకున్నారు:

ప్రధమ బహుమతి: శారద కాశీవఘ్ఘుల (కాలిఫోర్నియా)

రెండవ బహుమతి; శ్రీనివాస్ నాగులపల్లి (ఓర్లాండో)

మూడవ బహుమతి; జ్యోతి వలబోజు (హైదరాబాద్)  

మొదటి రోజు ప్రసంగ వేదికల అనంతరం పురస్కార సభలో ఈ క్రింది ఆత్మీయ సత్కారాలు జరిగాయి.  

జీవన సాఫల్య పురస్కారం:

అమెరికాలో తెలుగు సాహిత్యాన్ని సుసంపన్నం చేసిన వారిని సగౌర్వంగా గుర్తించి సత్కరించే సాంప్రదాయం లో ఈ 11వ అమెరికా తెలుగు సాహితీ సదస్సులో ప్రముఖ రచయిత సత్యం మందపాటి & విమల దంపతులకి జీవన సాఫల్య పురస్కారం శోభాయమానంగా జరిగింది.

భారత దేశ ఆహ్వానిత అతిధుల పురస్కారం:

మొదటి రోజు సాయంత్రం జరిగిన పురస్కార సభలో భారత దేశ అతిధులైన డా. రాంభట్ల పార్వతీశ్వర శర్మ, జ్యోతి వలబోజు, ప్రభల జానకి, అత్తలూరి విజయ లక్ష్మి గార్లకి ఆత్మీయ జ్ఞాపిక తో చిరు సత్కారం జరిగింది.

నిర్వాహకులకి సభికుల ధన్యవాదాలు:

 ఈ సదస్సు నిర్వహణ లో ప్రధాన సమన్వయ కర్తగా అన్ని ఏర్పాట్లూ చేసి, సభ విజయవంతం గా జరగడానికి ప్రధాన కారకుడైన మధు చెరుకూరి కి కుటుంబ సమేతంగా ఆత్మీయ జ్ఞాపిక తోటీ, టాగో సంస్థ అధ్యక్షులు నరోత్తమ్ జీడిపల్లి, ఇతర అధికారులకీ దుశ్శాలువల తో సత్కరించి సభికులు తమ ధన్యవాదాలు తెలుపుకున్నారు.

ఘంటసాల ఆరాధనోత్సవాలు:  

సాహితీ సదస్సు అనంతరం 12వ ఘంటసాల ఆరాధనోత్సవాలు -9వ బాలూ సంగీతోత్సవ కార్యక్రమం లో ‘అపర ఘంటసాల” బాల కామేశ్వర రావు (హైదరాబాద్), శారద ఆకునూరి (హ్యూస్టన్), రాధిక నోరి (టాలహస్సీ), సత్య కడాలి (కొలంబియా, NC)ల సినీ సంగీత విభావరి కార్యక్రమం జరిగింది. వంశీ రామరాజు గారు హైదరాబాద్ లో గత 31 సంవత్సరాలగా నిర్వహిస్తున్న దివ్యాంగ బాలబాలికల సంక్షేమ సంస్థ వేగేశ్న ఫౌండేషన్ కి విరాళాల సేకరణ కోసం జరిగిన ఈ కార్యక్రమానికి శ్రోతలు ఉదారంగా స్పందించారు.

రెండు రోజుల ఎంతో ఆహ్లాదకరమైన సాహిత్య వాతావరణం లో ఆత్మీయంగా జరిగిన 11వ అమెరికా తెలుగు సాహితీ సదస్సు  ఒర్లాండో మహా నగర తెలుగు సంఘం వారి వందన సమర్పణ తో విజయవంతంగా ముగిసి, ప్రతినిధులకి చిరకాల జ్ఞాపకాలని మిగిల్చింది.

కొస మెరుపు:

నమ్మండి, నమ్మక పొండి….ఈ 11వ సాహితీ సదస్సుకి నేను…అవును, నేనే వెళ్ళ లేదు. వెళ్ళలేదు అనే కంటే వెళ్ళలేక పోయాను అనడం నిజం. నిజానికి గత వారం, పది రోజులుగా నాకు ఆరోగ్యం అదోలా ఉంటే బుధ వారం (అక్టోబర్ 29) న వైద్య పరీక్షలు చేయించుకున్నాను. సదస్సుకి రెండు రోజులు ముందే వెళ్ళాలి కదా అని తయారు అయి, గురువారం పొద్దున్నే (అక్టోబర్ 30) న హ్యూస్టన్ లో విమానాశ్రయానికి బయలుదేరుతూ ఉండగా నా ప్లైట్ రద్దు అయినట్టు ఆ ఎయిర్ లైన్ వారు మెసేజ్ పంపించారు. హారినీ అనుకుని ఆ మర్నాడు శుక్రవారం ఓర్లాండో వెళ్ళడానికి మరొక ఫ్లైట్ బుక్ చేసుకున్నాను. అంతలోనే “మొన్నటి పరీక్షల రిజల్ట్స్ వచ్చాయి. నువ్వు ఫెయిల్ అయ్యావు. అంచేత ఇవాళ సాయంత్రం అర్జంటుగా ఆసుపత్రిలో చేరిపోవాలి. ఏర్పాట్లు అన్నీ చేసేశాను సుమా” అని మా కార్డియాలజిస్ట్ డాక్టరమ్మ ఫోన్ చేసి ఆర్డర్ వేసింది. ఇక తప్పదురా బాబోయ్ అనుకుని ఈ సదస్సు నిర్వహణలో నాకు అన్ని విధాలా సహకరిస్తున్న మధు చెరుకూరి ని పిలిచి అన్ని బాధ్యతలూ అప్పగించి, అలాగే ఆ డిట్రాయిట్ మిత్రుడు నారాయణ స్వామికి కూడా కార్యక్రమ నిర్వహణ లో సహాయం అడిగి, నా ప్రయాణం రద్దు చేసుకుని ఆ రాత్రి ఆసుపత్రిలో చేరిపోయాను. మర్నాడు వాళ్ళు అదెదో ఏంజియో ట…అది చేసి, అక్కడెక్కడో ఓ గొట్టాం లో 80 శాతం అడ్డుగోడ ఉందిట, దానికి విరుగుడుగా అదేదో అదేదో స్టెంట్ ట…అది పెట్టి, ఒక రోజు ఆతిధ్యం ఇచ్చి శనివారం (నవంబర్ 2..సదస్సు మొదటి రొజు) మధ్యాహ్నం ఇంటికి పంపించేశారు సదరు ఆసుపత్రి వారు.

సదస్సు ప్రతీ నిమిషం ప్రణాళికా నాదే చేశాను కాబట్టీ, ఫొటోలూ, వీడియోలూ అనుక్షణమూ నాకు అందాయి కాబట్టీ అంచేత ఓర్లాండో లోనే ఉన్నట్టు అనుకోబట్టీ, అందరూ నాకు ఫోన్లు చేసి విశేషాలు చెప్పబట్టీ ఇప్పుడు ఈ సమీక్ష అంతా వ్రాయగలిగాను. ఇందులో తప్పులు ఉన్నా, ఇవే కాక ఇంకా జరిగిన మరికొన్ని ప్రసంగాలూ, ఇతర విశేషాలూ లేక పోయినా నన్ను మన్నించండి. త్వరలోనే సభా విశేష సంచికలో అన్ని వివరాలూ ప్రచురిస్తాం.

గత పాతికేళ్ళగా, అమెరికాలో మా సంస్థ నిర్వహించిన వాటిల్లో నేను వ్యక్తిగతంగా పాల్గొనని ఏకైక సాహిత్య సమావేశం ఇదే. ఈ సదస్సు ఘన విజయం చూసి నేను ఉన్నప్పటి కంటే, లేనప్పుడే ఈ సమావేశాలు బాగా జరుగుతాయేమో అనే అనుమానం వచ్చేస్తోంది, కానీ అది మంచిదేగా!

ఈ సదస్సు విజయవంతంగా జరగడానికి కారకులైన అందరు ప్రతినిధులకీ, వక్తలకీ, రచయితలకీ, నిర్వాహకులకీ, టాగో సంస్థ వారికీ నా హృదయ పూర్వక ధన్యవాదాలు. అభినందనలు. నా ఆరొగ్యం గురించి ఆందోళన పడి సందేశాలు పంపించిన అనేక మంది శ్రేయోభిలాషులకి “ఇప్పుడూ భేషుగ్గానే ఉన్నాను” అని తెలియజేస్తూ వారి అభిమానానికి నా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. మధు చెరుకూరి పూనుకోనిదే ఈ సమావేశం జరిగేది కాదు….అతనికీ, అతని కుటుంబానికీ ఆశీస్సులు..ధన్యవాదాలు.

 నాకు అందుబాటులోకి వచ్చిన ఈ సదస్సు తాలూకు కొన్ని ప్రసంగాల వీడియోలు, ఫొటోలు ఇందుతో జతపరుస్తున్నాను. ..మీ కోసం.  

వీడియో లంకెలు:

శతావధాని డా. రాంభట్ల పార్వతీశ్వర శర్మ గారి ప్రారంభ ఉపన్యాసం.

అవధాని గారి సత్కారం: https://www.youtube.com/watch?v=8UpCMJ084eg&feature=youtu.be

 ఎస్. నారాయణ స్వామి: https://www.facebook.com/padmavalli99/videos/10214461060352602/

 భూషణ్: https://www.facebook.com/padmavalli99/videos/10214460825546732/

 లలితా త్రిపుర సుందరి: https://www.facebook.com/nasysan/videos/10217991006099318/

 ఇంద్రాణి పాపపర్తి: https://www.facebook.com/nasysan/videos/10217991100861687/

 పద్మ వల్లి: https://www.facebook.com/nasysan/videos/10217990609769410/
భవదీయుడు, 
వంగూరి చిట్టెన్ రాజు

Posted in సభలు సమావేశాలు | Tagged | Leave a comment

కార్తీక మాసం రెండవ మంగళవారం5-11-19 రాత్రి ఉయ్యూరు శ్రీ సువర్చలాన్జనేయస్వామి దేవాలయం లో దీపాలంకరణ

కార్తీక మాసం రెండవ మంగళవారం5-11-19 రాత్రి ఉయ్యూరు శ్రీ సువర్చలాన్జనేయస్వామి దేవాలయం లో దీపాలంకరణ

 

https://photos.google.com/share/AF1QipOa6wL1TGihlqd-SPl6AbLf2k0Mqf2qIGtOCaF1IysYiCmFuuT7Lx3UppjdE2VHIw/photo/AF1QipO-sdDsGb69E48Hqs_Fw0jRd8egFFT_milPzQKc?key=UWpFQzV2QTI2VkQ4a0pDWTE1dEdXMF9hbTNUMU1R

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

గౌతమీ మహాత్మ్యం-6392-కుశ తర్పణతీర్ధం

గౌతమీ మహాత్మ్యం-6392-కుశ తర్పణతీర్ధం

 

ప్రణీతా సంగమ తీర్ధం అనే కుశ తర్పణ తీర్ధం భుక్తి ముక్తి దాయకం .వింధ్యపర్వత దక్షిణ భాగాన సహ్యపర్వతం ఉంది .దీనిపాదాలనుండి గోదా, భీమరథీ నదులుద్భవించినాయి. దగ్గరలో ఏకవీరా, విరజా నదులు  కూడా ఉన్నాయి అని మొదలుపెట్టి బ్రహ్మ కొన్ని రహస్య విషయాలు చెప్పాడు నారదునికి .’’పరమపురుషుడు పరుడు .అవ్యక్తుడు అక్షరుడు .అతనినుంచే అపరుడు ,క్షరుడు ,ప్రకృత్యన్వితుడు కలిగారు .నిరాకార పురుషునివలన సావయవ పురుషుడు పుట్టాడన్నమాట .ఇతని నుంచి నీరు , ఈరెండిటివలన కమలం పుట్టింది .ఆకమలం లో బ్రహ్మ పుట్టాడు .బ్రహ్మకంటే ముందే పంచభూతాలైన భూమి వాయువు ఆకాశం జలం,తేజస్సు ఒకే సారి పుట్టాయి . అప్పటికి అవి తప్ప స్థావర జంగమాలు లేవు .వేదాలే లేవు .బ్రహ్మ దేనినుంచి పుట్టాడో దానినికూడా చూడలేకపోయాడు .బ్రహ్మకు మాట కూడా లేదు .అప్పుడు ఆకాశవాణి బ్రహ్మను స్థావర జ౦గ మాది సృష్టి చేయమని ఆదేశించింది .ఎలాచేయాలో అర్ధంకాక ఎలా ఎక్కడ సృష్టించాలి అని అడిగాడు .అప్పుడు ప్రకృతి యైన వాగ్దేవి యజ్ఞం చేసి శక్తిపొందమని యజ్ఞమే అన్నీసాధించి పెడుతుందని చెప్పింది .మళ్ళీ అనుమానం వచ్చి యజ్ఞం ఎక్కడ, దేనితో చేయాలని ప్రశ్నించాడు .అప్పుడు ఆకాశవాణి ఓంకార రూపమైన జగన్మయిగా విలసిల్లుతోందని ,దానివలన కర్మ భూమి యైన మానవ లోకం లో యజ్ఞేశుడైన యజ్ఞ పురుషుని గురించి యజ్ఞం చేయమని చెప్పింది .అతడే యజ్ఞసాధనం స్వాహా ,స్వాథా అనేవి మంత్రాలు .బ్రాహ్మణులు ,,హవిస్సు మొదలైనవి కూడా యజ్ఞమే .అన్నీ విష్ణువు నుంచే వస్తాయి అని వివరించింది .

  బ్రహ్మ కర్మభూమి ఎక్కడ ఉన్నది అని అడిగాడు .దానికి వింధ్య,సహ్య  పర్వతాలకు  దక్షిణాన  ఉన్న భూమి శ్రేష్టం అని చెప్పింది. బ్రహ్మ వెళ్లి పరిశీలించగా ఆకాశవాణి యే అన్ని సూచనలు చేస్తూ దారి చూపింది  .సంకల్పం చెప్పుకొని యజ్ఞ ప్రారంభం చేసి ,వేదాలు చెప్పినట్లు చేయమని సలహా చెప్పింది .అప్పుడు ఇతిహాస పురాణాలు అన్నీ బ్రహ్మ ముఖం లో చేరాయి .తర్వాత స్మృతికి వచ్చాయి .అప్పుడే వేదార్ధం గోచరించింది .పురుష సూక్తం స్మరించాడు .దానిలో చెప్పబడిన సమస్త యజ్ఞ ఉపకరణాలు ,యజ్ఞపాత్రలు కల్పించుకొని యజ్ఞ దీక్ష కు పూను కొన్నాడు . ఆ స్థలమే  బ్రహ్మగిరి .దీనికి పూర్వభాగం లో ఉన్న 84యోజనాల వరకు ఉన్న భూమి’’ దేవయజనం ‘’అని పిలువబడింది .దానిమధ్య యజ్ఞ వేదిక నిర్మాణం జరిగింది .దీనికి దక్షిణాన గార్హస్పత్యాగ్ని,దానిప్రక్క ఆహవనీయాగ్ని స్థాపనం జరిగాయి .

 పత్ని లేకుండా యజ్ఞం సిద్ధించదు అనిశ్రుతి చెప్పింది కనుక  ,బ్రహ్మ తన శరీరాన్ని రెండుభాగాలు చేసుకొని ,పూర్వభాగాన్ని పత్ని గా చేసుకొన్నాడు .ఉత్తరభాగం లో బ్రహ్మ ఉన్నాడు .ఉత్కృష్టమైన వన స్తన౦ ఆజ్యంగా గ్రహించాడు .గ్రీష్మాన్ని ఇద్మం అంటే సమిధలుగా ,శరత్తును హవిస్సుగా  వర్షరుతువును దర్భలుగా చేశాడు .సప్త ఛందాలు  పరిధులయ్యాయి కలలు, కాస్టాలు,నిమేషములు ,సమిధలు ,పాత్రలు,కుశలు అయ్యాయి .

  అనాది ఐన కాలం యూప స్తంభంగా ,పశువును బంధించే యోక్త్రం అవగా ,సత్వ రజస్ తమో గుణాలు పాశాలయ్యాయి .యజ్ఞపశువే లేదు .ఆశరీరవాణిని అడిగితే పురుషసూక్తం స్మరించమని చెప్పగా స్మరించాడు .తనను యజ్ఞపశువుగా చేసుకోమని ఆకాశవాణి చెప్పింది .అదిఅవ్యయుడైన పరమపురుషుని వాణి అని గుర్తించి ,యూపం ప్రక్క తత్వాది గుణ పాశాలతో బద్ధుడై ,దర్భలపై కూర్చున్న జన్మించిన పురుషుని పై ప్రోక్షణ చేశాడు బ్రహ్మ .అప్పుడా పరమ పురుషుని నుంచి చరా చర జగత్తు ఏర్పడింది .ముఖం నుంచి బ్రాహ్మణులు ,బాహువులనుంచి క్షత్రియులు ,ముఖం నుంచి ఇంద్రాగ్నులు ,ప్రాణం నుంచి వాయువు చెవులనుంచి దిక్కులు ,శిరస్సునుంచి సమస్త స్వర్గం ,మనసునుంచి చంద్రుడు ,కళ్ళ నుంచి సూర్యుడు ,నాభినుంచి అ౦తరిక్షం ,ఊరువులనుంచి దిక్కులు కలిగాయి .

  పరమపురుషుని పాదాలనుండి భూమి ,శూద్రుడు ,రోమకూపాలను౦డి రుషులు ,కేశాలనుండి ,ఓషధులు ,నఖాలనుంచి గ్రామ్యాలు ,వన్యాలు ,పశువులు పాయువు ఉపస్థలనుండిక్రిమికీటకాలు, పక్షులు ,అంటే సకల చరాచర జగత్తు అంతా ఆపరమ పురుషునినుంచి ఉద్భవించింది .అప్పుడు అశరీరవాణి బ్రహ్మ కోరిన సృష్టి అంతా జరిగిందని కనుక అగ్నిలో హవనం చేయమని ,పాత్రలను యూప ప్రణీతపాత్ర ,కుశాదులను రుత్విక్కులను ,యజ్ఞ రూపాన్ని ,ఉద్దేశ్యాన్ని, ధ్యేయం, సృవం ,పురుషుని ,పాశాలను మొత్తం   విసర్జించమని చెప్పింది .

  క్రమంగా యజ్ఞ కుండం లో గార్హస్పత్య , ఆహవనీయాగ్నులు ,దక్షిణాగ్నులలో,పూర్వాగ్ని లో ,క్రమంగా ఆయా స్థానాలలో జగత్ స్రష్ట ,మంత్రపూతుడైన పురుషుని అనుసంధానం చేసి హవనం చేశాడు బ్రహ్మ .అప్పుడుసర్వవ్యాపి యజ్ఞపురుషుడు ఐన విష్ణువు ఆహవనీయాగ్నిలో శుక్లారూప ధరుడు అయ్యాడు .దక్షిణాగ్నిలో శ్యామ వర్ణుడైన విష్ణువు ,గార్హస్పత్యాగ్ని నుండి పీత వర్ణుడైన విష్ణువు కలిగారు .అన్నిటా విష్ణుమూర్తి నిండిపోయాడు .తర్వాత బ్రహ్మ మంత్రాలతో ప్రణీతను సృస్టించాడు .ఈ ప్రణీత ఉదకమే ప్రణీతా నది అయింది .దర్భలచే మార్జనం చేసి దాన్ని వదిలిపెట్టాడు .ప్రణీత జలబిందువులు పడిన చోట్ల తీర్దాలేర్పడ్డాయి .ఈనది ద్వారా వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది .దర్భలు పడిన చోటు కుశాతర్పణ తీర్ధం అయింది .తర్వాత గౌతమి ఇక్కడ సంగమించగా అది ప్రణీతా సంగమ తీర్ధమైంది .కుశాతర్పణం జరిగిన చోటు కుశాతర్పణ తీర్ధం అయింది .

  వింధ్యకు ఉత్తరాన యూప స్తంభం నాటబడిన  చోటు విష్ణువుకు ఆశ్రయమైంది .అక్షర మైన యూపం అక్షయ  వట వృక్ష మైంది . వట వృక్షస్మరణ తో  యజ్ఞఫలం లభిస్తుంది .దేవయజనం దండకారణ్య  మయింది. క్రతువు  సంపూర్ణం కాగానే  బ్రహ్మవిష్ణువును భక్తితోప్రార్ధింఛి ప్రసన్నం చేసుకొని నమస్కరించి విసర్జన మంత్రాలు చెప్పాడు .24యోజనాలున్న దేవయజనం  శుభప్రదమైంది .అక్కడమూడు కుండాలున్నాయి.అవి యజ్ఞేశ్వర ,విష్ణు ,చక్రపాణి స్వరూపాలు .అప్పటి నుంచి అది బ్రహ్మ దేవ యజనం గా ప్రసిద్ధి చెందింది .అక్కడి క్రిమికీటకాలుకూడా ముక్తిపొందుతాయి .

  దండకారణ్యం ధర్మబీజమని ,ముక్తి బీజమని పిలువబడుతోంది .దండకారణ్యం తో ఉన్న గౌతమి పరమ పవిత్రమైనది .ఉభయ తీరాలలో 86వేల తీర్దాలున్నాయి .అన్నీపుణ్యప్రదాలే .ఈతీర్ధం భూవాసులకు స్వర్గద్వారమే ‘’అని బ్రహ్మ నారదునికి వివరించాడు .

 సశేషం

 మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -5-11-19-ఉయ్యూరు     ,,

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

గౌతమీ మహాత్మ్యం-62–90—వంజారా సంగమ తీర్ధం

 కద్రూ కొడుకులైన నాగులకు దాసుడుగా,తల్లి వినత చేసిన పందెం వలన  ఉండాల్సి వచ్చి,భరించలేక ఏకాంతం లో దుఖిస్తూ ‘’ఇతరులకు సేవ చేయనివారు ధన్యులు ,పుణ్యాత్ములు .వారు తమ శరీరాలకు ప్రభువులై సుఖ,ఆనందాలు పొందుతారు  .పరతంత్రులజీవితం దుర్భరం నీచం నింద్యం ‘’అని తల్లిని చేరి ‘’ఎవరి అపరాధం వలన నువ్వు దాసీ అయ్యావు ?కారణం చెప్పు ‘’అని ప్రార్ధించాడు .అరుణుని తమ్ముడైన వైనతేయునితో తల్లి ‘’నేనూ మీ పినతల్లి కద్రూ పందెం కాశాము. ఓడిపోయినవారు దాస్యం చేయాలని నేనే పందెం కాశాను కనుక తప్పు నాదే .ఆమె కపటోపాయం తో నన్ను జయించిందినేను దాసినయ్యాను. నాతో పాటు ఆ దురదృష్టం నీకూ పట్టింది ‘’అని వివరించింది . ఒకప్పుడు కద్రువ వినతతో ‘’నీ కొడుకు  దాసీ పుత్రుడైనా సూర్యుని నమస్కరించటానికి అడ్డులేకుండా వెళ్ళగలడు.నువ్వు ధన్యురాలవు త్రిలోక పూజితవు ‘’అన్నది  .ఆశ్చర్యపడిన వినత సవతితో ‘’నీ కొడుకులు కవి అంటే సూర్యుని చూడటానికి ఎందుకు వెళ్లరు ?’’అని అడిగింది .కద్రూ గరుడిని ‘’నాకోడుకుల్ని నాగాలయమైన పాతాళానికి తీసుకు వెళ్లి .అక్కడి చల్లని సరస్సు దగ్గర వదలమని చెప్పు  ‘’అనగా అలాగే చేశాడు .కద్రు వినతతో ‘’నా కొడుకులు నాగుల్ని నీకొడుకు దేవ నివాసానికి తీసుకు వెళ్ళేట్లు చేయి ‘’అనగానే అలానే చేశాడు గరుడ .మళ్ళీ ‘’నాకోడుకుల్ని రోజూ సూర్యుని వద్దకు నీకొడుకు తీసుకు వెళ్ళేట్లు చెయ్యి దాసీ ‘’అన్నది .భయపడుతూ వినత ‘’ సరే ‘’అనగా వినతాపుత్రుడు నాగులను అందర్నీ తనపై అధిరోహింప జేసుకొని సూర్యుని చేరబోగా ,ఆ మహోష్ణానికి తట్టుకోలేక సర్పాలు భయ భీతి  తో ‘’సూర్యతాపానికి  ఒళ్లుకాలిపోతున్నాయి. మమ్మల్ని మళ్ళీ మా అమ్మదగ్గరకు చేర్చు ‘’అని కోరగా ,వినకుండా సూర్యదర్శనం చేయిస్తానని సూర్య సంముఖానికి వారితో చేరాడు .నాగాలలో వేలకొలది పడగలన్నీ కాలికమురు కంపు కొడుతూ ‘’వీరణం ‘’అనేద్వీపం లో పడి పోయాయి .విషయం తెలిసిన కద్రువ వారిని ఓదార్చటానికి వెళ్ళింది .వినతతో ‘’నీకోడుకు దుష్టబుద్ధితో దుష్కార్యం చేశాడు .దీనికి శాంతిలేదు .కాశ్యపుడైన ఫణీశ్వరుడు ఆదిశేషుడు ఇక్కడ ఉంటే పిల్లలకు శాంతికలుగుతుంది ‘’అనగా ,ఆమె కొడుకుతో ‘’నీ పని బాగాలేదు వినయం ఉండాలి .శత్రువులకు కూడా అపకారం చేయకపోవటం సజ్జన లక్షణం ‘’అని హితవు చెప్పి ‘’నీకొడుకులు ముసలితనం పొందారు .వారికి శాంతి ఏమిటో చెప్పు నాకొడుకు చేస్తాడు ‘’అన్నది .కద్రూ ‘’రసాతలం లో ఉన్న శీతలజలం నా కొడుకులకు శాంతి చేకూరుస్తుంది ‘’అనగా క్షణం లో పాతాళం వెళ్లి వైనతేయుడు అజలం తెచ్చి నాగులపై అభి షేకింఛి శతక్రతువైన దేవేంద్రుని తో ‘’ముల్లోకాలకు శుభాలు చేకూర్చే మేఘాలు ఇక్కడ వర్షించేట్లు చేయి ‘’అని కోరగా వర్షాలు కురిసి ,నాగులన్నిటికి మహా శాంతి లభించింది .ఈ ప్రదేశమే నాగాలయం .నాగుల  ముసలితనం పోగొట్టిన రసాతల పవిత్రజలం ,నాగులకు సంజీవని ఔషధం అయిందో అది అమృత ప్రవాహమై ‘’వంజరా ‘’పేరు తో వర్ధిల్లి ,జరా, దారిద్ర్య, సంతాప హరణం అయి ,ఒక లక్షా ఇరవై ఐదు తీర్దాలతో విరాజిల్లుతోంది అని బ్రహ్మ నారదునికి చెప్పాడు .

91-దేవాగమ తీర్ధం

ధనం కోసం సురాసురులు  పోటీపడ్డారు .స్వర్గం దేవతలకు, భూమి రాక్షసులకు ఆవాసభూమి అయ్యాయి .అసుర గణం భూమి అంతా ఆక్రమించి విస్తరించారు .దుర్బుద్ధితో దేవతల యజ్ఞభాగాలను అపహరించి ,దాతలను హి౦సిచగా ,దేవతలకు యజ్ఞభాగాలు లేక బ్రహ్మ దగ్గర మొర పెడితే ,అసురులతో యుద్ధం చేసి భూమి సంపాదించి ,యజ్ఞయాగాదులు చేసి కీర్తి పొందమని చెప్పాడు .

దైత్య దానవ రాక్షసులంతా కలిసి బలగర్వంతోఅందులో ముఖ్యంగా అహి త్వాష్ట్రి,వృత్రుడు బలి,నముచి శంబరుడు శంఖుడు మొదలైనవారు వీరా వేశంతో యుద్దోన్మత్తులయ్యారు .అగ్ని ,ఇంద్ర వరుణ ,త్వష్ట , పూషా ,అశ్వినులు ,మరుద్గణాలు లోకపాలకాది దేవతా సమూహమంతా యుద్ధానికి బయల్దేరారు .దానవులంతా దక్షిణ దిక్కున మొహరిల్లి  మంత్రా లోచన చేశారు .మొదట త్రికూట పర్వతం వారి ఆవాసభూమి అయింది .దేవతలు కూడా ఇక్కడికే చేరారు .వీరంతా యుద్ధం చేసిన చోటే మలయపర్వతం .ఆప్రాంతమే మలయ దేశం .ఇక్కడ శివుడు గౌతమి తీరం లో నిత్యనివాసి ..

  దివ్య రథాలతో సురులు గౌతమీ పులిన తీరం చేరి భవు నారాధించి తమకు మేలు చేయమని కోరారు .దేవతలకు ఒక్కటే శరణ్యం విజయమో వీర స్వర్గమో .అని భావిస్తుంటే ఆశరీరవాణి’’దుఖం వద్దు .వెంటనే గౌతమి చేరి అక్కడ హర హరిలను ఆరాధించండి ‘’అన్నవాక్కు వినిపించి ,హరిహరుల ఆశీస్సులతో దేవతలు యుద్ధం లో గెలిచి వారివారి స్థానాలకు వెళ్ళిపోయారు .దేవతలు ఆగమనం పొందినదే ‘’దేవాగమ’’ దేవప్రియ  తీర్ధం ‘’.అని నారదునికి బ్రహ్మ చెప్పాడు .ఇదే కరీంనగర్ జిల్లా మంథెనలోని గోదావరి నది మధ్యలో ఉన్న ‘’సహస్ర లింగ క్షేత్రం ‘’.

   సశేషం

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -4-11-19-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

గౌతమీ మహాత్మ్యం-61 88-కిష్కింధా తీర్ధం  

గౌతమీ మహాత్మ్యం-61

88-కిష్కింధా తీర్ధం

శ్రీరాముడు  కిష్కింధలోని సుగ్రీవ వానరసైన్య సాయంతో లంక ప్రవేశించి ,రావణాది సర్వ రాక్షస సంహారం చేసి ,సీతాదేవి తో సహా అందరితోకలిసి అయోధ్యకు పుష్పక విమానం లో బయల్దేరాడు ..దారిలో పరమపావని ,సంతాప నివారిణి గంగానదిని చూసి పులకించి హనుమంతాదులనలను పిలిచి –

‘’అస్యాః ప్రభావాద్ధరయో  యాసౌ మామపితా ప్రభుః-సర్వ పాప వినిర్ముక్త స్తతో యతత్రి విస్ట  పం  .

‘’ఇయం జనిత్రి సకలస్య జంతోర్భుక్తిప్రదా ముక్తిమతాపి దద్యాత్ –పాపాని హన్యాదపి దారుణాని కాన్యాంనయాస్తత్ర నదీ సమానాః’’-గౌతమి ప్రభావంతో ప్రభువైన మాతండ్రి సర్వ పాప విముక్తుడై స్వర్గం చేరాడు .ఈ నది సకల జీవులకు తల్లి వంటిది ,పాప విమోచని .ఈనదికి మించిన నది పృధ్విలో లేదు .ఈనదీ ప్రభావంతో శత్రువులు మిత్రులయ్యారు సీతాదేవి లభించింది .హనుమ ఆత్మ బందువయ్యాడు . విభీషణుడు నిత్యమిత్రుడయ్యాడు ,లంక భగ్నమైంది. సర్వ రాక్షసులతో రావణుడు చంపబడ్డాడు .ఇంతపవిత్రమైన గంగానది ని గౌతమమహర్షి శివుని పూజించి ,శివ జటాజూటం లో ఉండేట్లు చేశాడు .సకలవరప్రదాయిని అమంగళహారిణి.అనేక నదులకు జన్మస్థానం మనసావాచా కాయం తో శరణు వెడుతున్నాను ‘’  అన్నాడు .

  రాముని మాటలు శ్రద్ధగా ఆలకించి ,వానరులంతా గౌతమీ స్నానం చేసి పునీతులై ,పూజ చేశారు .రాముడు శివుని మనసారా ప్రార్ధించి స్తుతించాడు .వానర బృందమంతా గాన నృత్యాలతో పరవశం చేశారు . ఆరాత్రి అందరూ అక్కడే గడిపి ,చెప్పరాని ఆనందం అనుభవించి జరిగిన కాయ క్లేశాలన్నీ మర్చిపోయారు .ప్రభాత సమయం లో విభీషణుడు వచ్చి నాలుగు రాత్రులు ఆక్కడే గడుపుదామని రామునికి చెప్పగా అందరూ సంతోషించి ఉండిపోయారు .సకలేశ్వరుడైన సర్వేశ్వరుని ,జగద్దాత్రితో ఉన్న సిద్దేశ్వర క్షేత్రం దర్శించి,  భక్తితో పూజించి అయిదు రోజులు౦డి ,లింగాభిషేకం చేసి తరించారు .హనుమ రాజైన రామునికి సకల సపర్యలు చేశాడు .హనుమను ఆ లింగాలనాన్నిటికీ విసర్జన కావించమని చెప్పాడు .సరే నని హనుమ వెళ్లి తన వాలం తో చుట్టి పీకేయాలనుకొన్నాడు .కాని అశక్తుడయ్యాడు .రామాదులకు ఆశ్చర్యమేసింది .మరల లింగాలకు  భక్తితో పూజాదికాలుచేశాడు .కపి వీరుల చేత సేవి౦ప బడిన ఈతీర్ధం కిష్కింధ తీర్ధం గా పవిత్రమై నది .రాముడు గౌతమికి మరలమరల నమస్కరించి ప్రసన్ను రాలు కావలసినదని ప్రార్ధించాడు . ఈ కథ విన్నవారికి చదివినవారికి  పాపాలు తొలగిపోతాయని బ్రహ్మ నారదునికి చెప్పాడు .

89-వ్యాస తీర్ధం

దీనికే ప్రాచేతస తీర్ధమని కూడా పేరు .బ్రహ్మమానసపుత్రులు పది మంది జగత్తు యొక్క సృష్టికర్తలు భూమి యొక్క అంతం తెలుసుకోవాలనే తపనతో ,బయల్దేరి వెళ్ళారు కాని తిరిగి రాలేదు .అప్పుడు వేదవేదాంగ తత్వవిదులు ,సకల శాస్త్ర నిపుణులు అంగిరసులుతండ్రి అంగిరసుని అనుజ్ఞ తీసుకొని తల్లి అనుమతి పొందకుండానే తపస్సుకు వెళ్ళారు .తల్లికి కోపం వచ్చి వారిని ‘’తపస్సు సిద్ధించదు ‘’అని శపించింది .ఎన్ని చోట్లకు వెళ్లి తపస్సు చేసినా వారికి తపోసిద్ధి కలగలేదు .రాక్షస మానవ స్త్రీల వలన అనేక విఘ్నాలు కలిగాయి .చేసేదిలేక అగస్త్యమహామునిని సందర్శింఛి తమ తపో విఘ్నాలకు కారణం అడిగారు .

  కుంభ సంభవుడు క్షణం ధ్యానించి ‘’మీరు సృష్టికర్త బ్రహ్మ చే సృస్టింపబడిన వారు. ఈ తపస్సు చాలదు .పూర్వం బ్రహ్మ చే  సృష్టింప బడినవారు సుఖాన్ని వెతుకుతూ వెళ్లగా  ,,వాళ్ళను వెతుకుతూ వెళ్ళినమీరు  అంగీరసులయ్యారు .మంచికాలం వస్తే మీరు ప్రజాపతికంటే గోప్పవారౌతారు .ముల్లోక పావని గంగానదిని చేరి శంకరధ్యానం చేయండి .ఆయన మీ సకల సంశయాలు తీర్చగల సమర్ధుడు .సద్గురువు లేకుండా ఎవరికీ సిద్ధి కలుగదు ‘’అన్నాడు .వారు ‘’జ్ఞానడుడు అంటే ఎవరు ?బ్రహ్మ విష్ణువా,మహేశుడా,ఆదిత్యుడా చంద్రుడా అగ్నియా వరుణుడా ?’’అని అడిగారు .అగస్త్యమహర్షి ‘’జలమే అగ్ని ,అగ్నే సూర్యుడు .సూర్యుడేవిష్ణువు.విష్ణువే భాస్కరుడు .బ్రహ్మయే రుద్రుడు .రుద్రుడే సర్వం .ఆసర్వమే జ్ఞానం .అతడే జ్ఞానదుడు.ఉపదేశకుడు ,ప్రేరకుడు ,వ్యాఖ్యాత ,ఉపాధ్యాయుడు ,తండ్రి ఇలా గురువులు అనేకరకాలు .వీరిలో జ్ఞాప ప్రదుడు గొప్పవాడు .జ్ఞానం వలన భేద బుద్ధి నశిస్తుంది .శివుడు ఒక్కడే .జ్ఞానులు ఆయనను శంభుడని ఇంద్రుడని ,సూర్యుడని అగ్నిఅనీ అంటారు అని వివరి౦చాడు..

  ముని వాక్యాలకు మనసు లో సంతోషించి ,సంశయ చ్చేదమై ,అంగీరసులలో సగం మంది గంగకు ఉత్తరం వైపు ,మిగిలిన అయిదుగురు దక్షణం వైపుకు వెళ్లి ,అగస్త్యుడు  చెప్పినట్లు సకల దేవతారాధన చేసి ,తత్వ చింతన చేస్తూ ఆసనాలపై ఉన్నారు .సకల దేవతాగణం ప్రీతి చెంది బ్రహ్మ సంకల్పంగా వారు లోకస్రస్టలు అవుతారని .అధర్మ ౦ పెరిగినప్పుడు ,వేదాలకు అపకారం జరిగినపుడు వారు వ్యాసులై  లోకోపకారం చేస్తారు అని ఆశీర్వదించారు  .వారంతా వేర్వేరు రూపాలు పొందినా వారంతా పరబ్రహ్మ స్వరూపమే .ఇక్కడ ఉండే శివ దేవుడు సర్వ దేవతలతో అనుస్టింఛి  ఉండి,అనుగ్రహం ప్రసాదిస్తాడు .అంగీరసులే ధర్మస్వూపులైన వ్యాసులు .వారే వేదవ్యాసులు .అందుకే ఈతీర్ధం మొహా౦ధకారం పోగొట్టే, జ్ఞానజ్యోతి వెలిగించే వ్యాస తీర్ధం గా విరాజిల్లింది అని నారదునికి బ్రహ్మ ఉపదేశించాడు .

   సశేషం

 మీ –గబ్బిటదుర్గాప్రసాద్ -3-10-19-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

అమెరికా స్థాపకులలో ఒకరైన ,మొదటి సెకండ్ లేడీ ,సెకండ్ ఫస్ట్ లేడీ -ఆబిగైల్ ఆడమ్స్ -రచన -గబ్బిట దుర్గాప్రసాద్ -విహంగ -వెబ్ మ్యాగజైన్ -నవంబర్ 

అమెరికా స్థాపకులలో ఒకరైన ,మొదటి సెకండ్ లేడీ ,సెకండ్ ఫస్ట్ లేడీ -ఆబిగైల్ ఆడమ్స్ -రచన -గబ్బిట దుర్గాప్రసాద్ -విహంగ -వెబ్ మ్యాగజైన్ -నవంబర్

క్రీ.శ.1744నవంబర్ 22 న అమెరికా లోని మాసా చూసెట్స్ రాష్ట్రం వేమౌత్ లో నార్త్ కా౦గ్రి గేషన్ చర్చ్ లో విలియం స్మిత్, ఎలిజబెత్ లకు ఆబిగైల్ ఆడమ్స్ జన్మించింది .తల్లి రాజకీయంగా చురుకుగా ఉన్న క్విన్సి కుటుంబానికి చెందినది .ఆడమ్స్ తండ్రి లిబరల్ కాంగ్రి గేషనల్ మినిస్టర్, యాంకీ సంఘ నాయకుడు . అయినా విలియమ్స్ మాత్రం వీటికి దూరంగా ఉ౦డి , హేతువుకు నైతికతకు ప్రాదాన్యమిచ్చాడు .ఆబిగైల్ తల్లి ఎలిజబెత్ 33ఏళ్ళ వైవాహిక జీవితాన్ని భర్తతో అనుభవించి మసూచికం సోకి ,తండ్రి విలియమ్స్77వ ఏటచనిపోయారు .

ఆబిగైల్ తరచూ జబ్బు తో బాధ పడుతు౦డటం తో ప్రాధమిక విద్య సరిగ్గా సాగలేదు .ఆకాలం లో ఆడపిల్లల చదువును ప్రోత్సహించేవారు కాదు . తల్లి చదవటం రాయటం ప్రాథమిక గణితం ఇంటి దగ్గరే నేర్పింది .అయితే తండ్రి, మేనమామ మాతామహుడు లకున్న పెద్ద లైబ్రరీలలో పుస్తకాలు చదివి ఇంగ్లిష్, ఫ్రెంచ్ సాహిత్యం అధ్యయనం చేసింది .తెలివిగల పిల్లకనుక ఆడవాళ్ళ హక్కులు ,ప్రభుత్వ నిర్వహణ విషయాలపై మంచి అవగాహన ఏర్పరచుకొని అమెరికా రాజ్య వ్యవస్ద ఏర్పడటానికి తానూ కారకురాలైంది .

జాన్ ఆడమ్స్ స్మిత్ తో తన 15వ ఏట 1759లో మొదటిసారి పరిచయమై ప్రేమ లోపడింది .వీరి వివాహానికి ఆమె తండ్రి అనుమతించలేదు కాని తల్లికి అల్లుడు లాయర్ కనుక ఇష్టపడింది .25-10-1764 వీరిద్దరి పెళ్లి జరిగింది .వివాహం అవగానే భర్తతో ఒకే గుర్రం మీద భర్త ఇంటికి వెళ్ళింది .అది చిన్నకాటేజ్ .తర్వాత దంపతులు బోస్టన్ కు వెళ్ళారు. అక్కడ ఆడమ్స్ లా ప్రాక్టీస్ బాగా విస్తరించింది .12 ఏళ్ళలో ఆరుగురి ని సంతానం గా పొందారు .పిల్లలను తీర్చి దిద్దటం లో, ఆడమ్స్ వంశ గౌరవం నిలపటం లో ఆబిగైల్ గొప్ప నైపుణ్యాన్ని చూపింది .భర్త తరచుగా కాంప్ లకు వెడితే,ఆయన పెన్సిల్వేనియాలోని ఫిలడెల్ఫియాలో ‘’కా౦ టి నెంటల్ కాంగ్రెస్ ‘’ సమయం లో ఉన్నప్పుడు ఇద్దరిమధ్య జరిగే ఉత్తర ప్రత్యుత్తరాలలో సాహిత్యం బాగా చోటు చేసుకొనేది .ఆమె కున్న విజ్ఞానం, మేధస్సుకు ఆడమ్స్ ముచ్చటపడి ప్రోత్సహించేవాడు .ఏడాది కేడాది జాన్ న్యాయవాద వృత్తి పెరుగుతుంటే దానికి తగినట్లు ఇల్లు మార్చాల్సి వచ్చేది .భర్త వ్యవసాయ క్షేత్ర యాజమాన్యం ,ఫైనాన్స్ లావాదేవీలు కూడా ఆమె జాగ్రత్తగా బాధ్యతగా చూసి భర్త అవసరాలకు ఎప్పుడూ డబ్బు లోటు రాకుండా నిర్వహించేది .ఆయనకూడా చాలావిషయాలలో ఆమె సలహాలను కోరేవాడు .

1784లో ఆడమ్స్ కు పారిస్ లో రాయబారి పదవి రావటం తో భర్త ,పిల్లలతో ఆబిగైల్ మొదటి సారి యూరప్ వెళ్ళింది .ఇక్కడ పెద్ద భవనం ,నౌకర్లు ,చాకర్లు ఉండటంతో చాలా ఆనందంగా గడిపింది .1785లో ఆమె భర్త బ్రిటన్ మొదటి జేమ్స్ రాజు కోర్టు లో అమెరికా మినిస్టర్ అవటం తో ఆమె గౌరవం పెరిగింది .స్నేహితులు లేక లండన్ ఆమెకు నచ్చలేదు .కాని తర్వాత థామస్ జెఫర్సన్ చిన్నకూతురు మేరీ తో పరిచయమై ఆనందం కలిగించింది . 1788లో కుటుంబం మళ్ళీ అమెరికా చేరి క్విన్సి లో ఓల్డ్ హౌస్ అనే దానిలో ఉంటూ క్రమంగా దాన్ని అభివృద్ధి చేశారు .

1797మార్చి 4 జాన్ ఆడమ్స్ అమెరికా రెండవ ప్రెసిడెంట్ గా ఫిలడెల్ఫియాలో పదవీ బాధ్యతలు చేబట్టాడు .అత్తగారు మంచం లో ఉండటం వలన సేవచేస్తూ, ఉండిపోవటం వలన భర్త పదవీ బాధ్యత స్వీకరణ ఉత్సవానికి హాజరు కాలేక పోయింది .భర్త ప్రెసిడెంట్ గా ఉన్నకాలం లో ఆమె ఫిలడెల్ఫియాలో ప్రతివారం పెద్ద టీపార్టీలుఇస్తూ, అవసరమైనప్పుదు ప్రజలకు కనిపిస్తూ ఉండేది .ఇప్పుడు అబిగైల్ మొదటి ఫస్ట్ లేడీ .అమెరికా రెండవ ప్రెసిడెంట్ జాన్ ఆడమ్స్ భార్య కనుక సెకండ్ ఫస్ట్ లేడీ అన్నారు .మొదటి ప్రెసిడెంట్ జార్జి వాషింగ్టన్ భార్య మార్తా లాగా కాకుండా ఆబిగైల్ చాలా చురుకుగా రాజకీయాలలో పాల్గొనేది .అందుకే ఆమెను ప్రతిపక్షం వాళ్ళు ‘’మిసెస్ ప్రెసిడెంట్ ‘’అని విమర్శించేవారు . భర్తకు అన్ని రకాల మద్దతిస్తూ ,రాజకీయాలపై అత్యంత అవగాహన పె౦చుకొని, భర్తకు విదేశీ వ్యవహార ,రాజద్రోహ చట్టాలు ఆమోదం పొందించటం లో గొప్ప కృషి చేసింది .1800లో ఫిలడెల్ఫియాలో భర్త ఆడమ్స్,పిల్లలతో పాటు ప్రెసిడెంట్ హౌస్ లో ఉన్నది . రాజధాని వాషింగ్టన్ డిసి కి 1800లో మారినపుడు వైట్ హౌస్ లోనవంబర్ లో వచ్చి ఉండి మొదటి ఫస్ట్ లేడీ అయింది .అవి ఆడమ్స్ పదవీకాలం లో చివరి నాలుగు నెలలు .చుట్టూ దట్టమైన అరణ్యం ,భవనాలు ఇంకాపూర్తికాకపోవటం కొంత అసంతృప్తి కలిగించింది.ఫైర్ ఉడ్ నరికి తెచ్చిపెట్టే నౌకర్లూ ఉ౦ డేవారుకాదు.భర్త ఆరోగ్యం కూడా బాగుందేదికాదు.

రెండవసారి ప్రెసిడెంట్ పదవికి పోటీ చేసి జాన్ ఆడమ్స్ ఓడిపోవటంతో కుటుంబం మళ్ళీ క్విన్సీకి చేరింది .బ్రిటన్ ప్రధాని జఫర్సన్ కూతురు, లండన్ లో తనకు స్నేహితురాలు మేరీ మరణం తెలిసి, ఆయన తనభర్త రాజకీయానికి వ్యతిరేకమైనా ,లండన్ వెళ్లి పలకరించి వచ్చింది .తనమనవడు జార్జి వాషింగ్టన్ ఆడమ్స్ ,మనవరాళ్ళ ఆలనా పాలనా చూసింది .1818 అక్టోబర్ 18న అలిగైల్ ఆడమ్స్ టైఫాయిడ్ జ్వరంతో బాధపడి 76ఏళ్ళ వయసులో చనిపోయింది .చనిపోతూ ‘’డియర్ ఫ్రెండ్ జాన్ నాకోసం ఏడవకండి .నేను వెళ్ళిపోతున్నాను ‘’అన్నది భర్త తో .మాసా చూసెట్స్ లోని క్విన్సిలోఉన్న చర్చ్ ఆఫ్ ది ప్రెసిడెంట్స్ లో ఖననం చేశారు .

అలిగైల్ కు రాజకీయంగా కొన్ని దృఢ అభిప్రాయాలున్నాయి . .రివల్యూషన్ వస్తుందేమో నని భయపడేది .సుస్థిరత ఉండాలని కోరేది .కుటుంబ వ్యవస్థ, మతాలకు గొప్ప ప్రాధాన్యమిచ్చింది . .మహిళలు కుటుంబ వ్యవస్థ చక్కబరచటానికి న్యాయ ,సామాజిక గౌరవం అడ్డురావన్నది .18శతాబ్ది స్త్రీల బాధలగురించి రాసింది .వివాహిత స్త్రీలకూ ఆస్తిహక్కు ఉండాలని కోరింది .స్త్రీవిద్య ప్రోత్సహించాలని చెప్పింది .భర్తకు సాహచర్యంతో తృప్తి పడకుండా ,మహిళలు తమను తాము తీర్చి దిద్దుకోవాలని ,తమమేధాశక్తితో పిల్లలకు,భర్తకు మార్గ దర్శనం చేయాలని హితవు చెప్పింది .ప్రెసిడెంట్ అయిన తనభర్త జాన్ ఆడమ్స్ కు1776మార్చి లో లేఖ రాస్తూ ‘’ఆడవాళ్ళను గుర్తుంచుకోండి .మీ పూర్వీకులకంటే వారిపట్ల ఉదారంగా ,అనుకూలంగా వ్యవహరించండి .భర్తలకు పరిమితిలేని హక్కులు ఇవ్వకండి .ప్రతిభర్త అధికారంతో క్రూరంగా ప్రవర్తిస్తాడని గుర్తించండి .ఆడవాళ్ళ సంరక్షణ ,వారిపై సరైన దృష్టి మీరు చూపకపోతే ,మా మహిళలంతా తిరుగుబాటు చేస్తాం .మాకోసం ప్రత్యేక చట్టాలు .మా గోడు వినిపించే అవకాశాలు ,మా కు ప్రాతినిధ్యం లేని మీ నిబంధనలేవీ మమ్మల్ని బంది౦చ లేవని గమనించండి ‘’అని ఘాటుగా రాసింది .ఐతే భర్తప్రెసిడెంట్ ఆడమ్స్ ఈ అసాధారణ నియమాలను తిరస్కరించాడు .

అమెరికా ప్రజాస్వామ్యానికి బానిసత్వం సాంఘిక దురాచారమని ,ముప్పు అనీ ప్రకటించింది .ఫిలడెల్ఫియాలో ఉండగా 1791లో ఒక నల్లజాతి యువకుడు ఆమె దగ్గరకు వచ్చి తనకు చదవటం రాయటం నేర్చుకోవాలని ఉందని చెప్పగా, అతడిని స్థానిక ఈవెనింగ్ స్కూల్ లో చేర్పించి చదివించింది .’’ముఖం నల్లగా ఉన్నంత మాత్రాన అతడు స్వేచ్ఛా పౌరుడుకాదా,అతడు చదువుకోకూడదా ,అతడి జీవికకు ఆధారం చూసుకోరాదా? .అందుకే ఆ కుర్రాడి చదువుకు ప్రోత్సహించాను .ఇందులో నాకు ఆత్మగౌరవం పోయిందని భావించను ‘’ అన్నది .

అలిగైల్ ఫిన్సిలో ఉండగా ఫస్ట్ పారిష్ చర్చి లో చురుకైన కార్యకర్తగా ఉండేది .ఈ విషయాలను చనిపోవటానికి కొన్ని రోజులముందు ఆమె కొడుకు 1816మే5న రాసిన ఉత్తరం లో ‘’నేను యునిటేరియన్ గా గుర్తిపు పొందాను. తండ్రి ప్రభువు యేసు ఒక్కడే దైవం అని నమ్మాను ‘’అని రాసింది .అలిగైల్, జాన్ ఆడమ్స్ ల మధ్య 1200ఉత్తర ప్రత్యుత్తరాలు నడిచి ,అమెరికాచరిత్రలో ఘనత వహించిన భార్యాభర్తలమధ్య జరిగిన కరెస్పా౦డెన్స్ గా రికార్డ్ సృష్టించాయి .ఆమె పేర అనేక స్మారక చిహ్నాలు నెలకొల్పారు .అమెరికా మొదటి ఫస్ట్ లేడీ ఐన ఆమెకు గౌరవ చిహ్నంగా అమెరికాప్రభుత్వం 10డాలర్ల బంగారు నాణాలు 2007జూన్19 ముద్రించింది .ప్రెసిడెంట్ అయిన భర్తకు విలువైన సలహాల౦దిస్తూ ,కుటుంబాన్ని పద్ధతిగా తీర్చిదిద్దితూ,మహిళా హక్కు,విద్య ,ఆస్తిలో వాటా కోసం ,బానిసత్వ నిర్మూలనకోసం తపన పడిన ‘’అమెరికా ఫస్ట్ లేడీ ‘’అలిగైల్ ఆడమ్స్ చిరస్మరణీయురాలు .

-గబ్బిట దుర్గాప్రసాద్

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

image.png
Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

ఇద్దరూ ఇద్దరే మహానుభావులు

ఇద్దరూ ఇద్దరే మహానుభావులు

శ్రీ దువ్వూరి వేంకట రమణ శాస్త్రిగారి స్వగ్రామం మసకపల్లి లో కాకర్లపూడి నరసరాజుగారు క్షత్రియ కుటుంబాలలో  మర్యాద మన్నన మంచితమున్నవారు .దువ్వూరివారు పుట్టటానికి ఇరవై ఏళ్ళకు ముందే ఆ వూరు వదిలి వెళ్ళిపోయారు .శాస్త్రిగారు విజయనగరం కాలేజి  లో పని చేస్తుండగా ,ఒకరోజు ఆయన స్నేహితుడు సొంఠి లక్ష్మీ నరసింహ శాస్త్రి ‘’మన ఊళ్ళో రాజుగారొకరు నీకు కొద్దిగా సొమ్ము బాకీ ఉన్నారని ,అది ఇచ్చేయ్యటానికి సిద్ధంగా ఉన్నానని ,నీకు కబురు చేయమన్నారు ‘’అని ఉత్తరం రాశాడు .ఈ కబురు వచ్చేనాటికి శాస్త్రిగారికి 20,రాజుగారికి 70ఏళ్ళు .

శాస్త్రిగారికి కావ్యాలు బోధించిన పినతాతగారు లింగయ్య శాస్త్రులగారికీ రాజుగారికీ మంచి స్నేహం .రాజుగారు లంకలో వ్యవసాయం చేస్తూ పెట్టుబడులకు అవసరమైన డబ్బుఊల్లో బ్రాహ్మణ్యం దగ్గర తీసుకొంటూ ,పంటరాగానే తీర్చేవారు .కొన్నేళ్ళకు వ్యవసాయం కలిసిరాక ఊళ్ళో  బ్రాహ్మలకు సుమారు 12వందల రూపాయలు బాకీ పడ్డారు .తీర్చలేక ,రోజూ వారు అడుగుతూ ఒత్తిడి చేస్తే ఊళ్ళో ఉండలేక మకాం ఎత్తేసి ,భద్రాచలానికి చాలాదూరం ఏజెన్సీ ప్రాంతం  చేరి, అక్కడ పొలం సాగు చేస్తూ కాలక్షేపం చేశారు .చేతిలో డబ్బు ఆడినప్పుడు ఇలా చిల్లరబాకీలు తీసుకొన్నవాళ్ళందరికీ ,12ఏళ్ళ కాలం లో బాకీలు తీర్చేశారు .ప్రోనోట్ల బాకీ 380మిగిలి ఉంది .అందులో ఒకటి 250,ఒకటియాభై ,ఒకటి ఎనభై.ఉన్నాయి అందులో 80 ప్రోనోటు శాస్త్రిగారి పినతాతగారిది .కాలదోషం పడుతున్న తరుణం లో మొదటివారిద్దరూ ,రాజుగారికిఎన్ని సార్లు ఉత్తరాలు రాసినా జవాబు లేకపోవటంతో ఊళ్ళో ,ఆకెళ్ళ రమణయ్య అనే లౌక్యుని సంప్రదించి కాకినాడ కోర్టు లో దావాలు వేయించారు .భద్రచాలానికి చాలాదూరంగా ఉన్న రాజుగారికి ఉత్తరాలు అంది ఉండకపోవచ్చు .

ఒకసారి రాజుగారికి రమణయ్యగారు రైలు లో కనిపించగా ,దావాల విషయం అడిగి ,తనకు దావాలు వేయించటం ఇష్టం లేదని వాళ్ళిద్దరి బలవంతం మీద దాఖలు చేశానని చెప్పారు రమణయ్య .అప్పుడు రాజుగారు ‘’లింగయ్య శాస్త్రి గారి నోటు ఒకటి ఉండాలికదా .అదీ మీ దస్తూరితో రాసి౦దేనని జ్ఞాపకం .దాని మాటేమిటి ?’’అని అడిగారు .అప్పుడు రమణయ్యగారు ‘’అవునండీ రాజుగారూ !మీరంటే జ్ఞాపకం వచ్చింది .కోర్టుపక్షిని ,పాపాల భైరవుడినీ నేనేకనుక శాస్త్రులు బావగారికి కూడా జ్ఞాపకం చేశాను  .కాకినాడ వెడుతున్నాను నోటు ఇస్తే కోర్టులో దాఖలు చేస్తాను అని చెప్పాను .అప్పుడు శాస్త్రిగారు ‘’అవునోయ్ రమణయ్య బావా !ఏమిటి నీ వెర్రి .నరసరాజు గారి కంఠం లో ప్రాణం ఉండగా ప్రోనోటుకు కాలదోషం ఏమిటి ?దావాలూ తంటాలు మనకేమీ వద్దు ‘’అన్నారని అందుకే ఆనోటుకు దావా పడలేదని రాజుగారికి రమణయ్యగారు చెప్పారు .ఇది విన్న రాజుగారు తెల్లబోయి ‘’మళ్ళీ సెలవియ్యండి’’ అని అడిగి చెప్పించుకొని ‘’ఎంత విలువైన మాట అన్నారు .లింగయ్యగారు ఆయనకు నామీద యెంత విశ్వాసం ?నాపై దావాలు వేసినవాళ్ళు ఏం తీసుకొంటారో కోర్టే తేల్చనివ్వండి ‘’అన్నారు తర్వాత ఎవరి దారిన వారు వెళ్ళిపోయారు .ఇది జరిగి అప్పటికి 40 ఏళ్ళయింది .దావాలు వేసినవారిద్దరూ ,వేయించిన రమణయ్యగారూ చనిపోయారు .

ఉత్తరం అందగానే దువ్వూరివారు మసకపల్లి వెళ్లి స్నేహితుడిని కలిశారు .ఆయన రాజుగారు రాయమంటే తాను  ఉత్తరం రాశానని ఆయన చెప్పాడు .ఉదయం 9గంటలకు అందరూ దువ్వూరి వారి అరుగుమీద కూర్చున్నారు .రాజుగారు వచ్చారు .కుశల ప్రశ్నలైన  తర్వాత రాజుగారు ‘’స్వయంగా నేనే మీకు మనవి చేయాలని ఉత్తరం రాయించాను .శ్రమపడి దయ చేశారు .మీరు నాకు తెలియదు .లింగయ్య శాస్త్రి గారి కి మనవలున్నట్లే నాకు తెలీదు .వారి కుటుంబం లో  లో ఎవరున్నారని వాకబు చేయగా మీ సంగతి తెలిసింది .మీ తాతగారికి నామీద విపరీతమైన అభిమానం .అవసరాలకు రెండుసార్లువారిదగ్గర నలభై,నలభై చేబదులు తీసుకొని సమయానికివ్వలేక, ఏకంగా 80రూపాయలకు ప్రోనోటు వ్రాశాను  .ఎవరు ఎన్ని చెప్పినా ఆయన నామీద దావావేయ్యలేదు సరికదా ‘’నరసరాజు కంఠం లో ప్రాణముండగా ప్రోనోటుకు కాలదోషమేమిటి ‘’?అన్నారని రమణయ్యగారి ద్వారా తెలిసింది .ఎప్పటికైనా వారి వారసులకు ఆడబ్బు ఇచ్చేసి రుణ విముక్తుడిని కావాలని తాపత్రయ పడుతున్నాను .వారి కుటుంబంలో మూడవ తరం దాకా ఇది కుదరలేదు .ఆఎనభైకి వడ్డీ లెక్క వేస్తె ఎనో రెట్లు అవుతుంది .అక్కడికి వెళ్ళినా గౌరవంగా కాలక్షేపం చేస్తున్నానే కాని పెద్దగా సంపాది౦చి౦ది లేదు .తాతగారిమీద అభిమానం ,నా పరిస్థితి గమనించి మీరు యెంత ఇమ్మంటే అంతా ఇచ్చి రుణ విమోచకుడిని అవుతాను  .ఈ అరుగుమీదే లింగయ్యగారి దగ్గర అప్పు తీసుకొన్నాను కనుక ఇక్కడే మీ బాకీ తీర్చాలని వచ్చాను .మిమ్మల్ని కూడా ఒకసారి చూడాలనే కోరికా ఉంది .నా పిచ్చి ఊహతో మిమ్మల్ని చాలా శ్రమ పెట్టాను మన్నించండి’’ అన్నారు ఆర్తిగా .

దువ్వూరి వారు ‘’తమరెవరోనాకు, నేనెవరో మీకు తెలీదు .మీ బాకీ మాట నేను ఎవరివల్లా వినను కూడా లేదు .కనుక నేను చెప్పదలచుకోలేదు .మీకు యెంత తోస్తే అంతా ఇవ్వండి ఎక్కువా తక్కువా అనుకోను .నిర్ణయం మీదే ‘’అన్నారు రాజుగారితో . రాజుగారు  ‘’నాకు తోచింది ఇస్తే రుణవిముక్తి అనిపించుకోదు .నామనసూ సంతోషించదు కూడా . తమరే సెలవియ్యండి’’అన్నారు .దువ్వూరివారు ‘’అసలు సంగతే మనం మాట్లాడుకొందాం. వడ్డీ సంగతి వదిలెయ్యండి .ఆ ఎనభైరూపాయలు ఇచ్చేస్తే బాకీ పూర్తిగా తీర్చినట్లు నేను భావిస్తాను ‘’అన్నారు .ఆమాట అనగానే రాజుగారు తానూ తొడుక్కున’’ కళ్ళీలాల్చి’’బిగువై పోయే౦తగా ‘’పొంగిపోయారు .అందరూ శాస్త్రిగారిని ‘’చాలాబాగా చెప్పావు .చిన్నవాడివైనా చాలాదూరం ఆలోచించావు ‘’అని అభినదించారు .రాజుగారు ఖండువా కొంగున కట్టుకొచ్చిన మూట విప్పారు .అందులో ఖచ్చితంగా 80 వెండి రూపాయలున్నాయి.వాటిని నాలుగు దొంతర్లుగా పెట్టి ‘’తీయించండి ‘’అన్నారు ‘’మా లింగయ్యన్నగారికన్నా తమరు నామీద ఎక్కువ అనుగ్రహం చూపించారు ‘’అన్నారు రాజుగారు కృతజ్ఞతగా .శాస్త్రిగారు ‘’అదేమీ  కాదండి. అది అనుగ్రహమే అయితే ,అది నాది కాదు .తాతగారికీ  మీకూ ఉన్న స్నేహానిది ‘’అని ఉచిత రీతిని చెప్పారు .రాజు గారు ఆనందంగా వెళ్ళిపోయారు .దువ్వూరివారు విజీనగరం బయల్దేరి వెళ్ళారు .ఇద్దరోఇద్దరే మహానుభావులు .

ఆధారం –దువ్వూరివారిస్వీయ చరిత్ర

.మీ- గబ్బిట దుర్గాప్రసాద్ -2-11-19-ఉయ్యూరు

.

 

 

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

గౌతమీ మహాత్మ్యం-60 86-కలపిలాతీర్ధం

గౌతమీ మహాత్మ్యం-60

86-కలపిలాతీర్ధం

అంగీరస తీర్ధం ,కపిలాతీర్ధం అనే ఈ తీర్ధం గౌతమికి దక్షిణాన ఉన్నది. దీనికే ఆదిత్య ,సైమ్హికేయ తీర్ధలని కూడా పేర్లున్నాయి .అన్గిరసులు ఇక్కడ యజ్ఞం చేసి ,ఆదిత్యులకకు  భూమిని దక్షిణగా ఇచ్చారు .ఈ భూమి సై౦హిక అంటే సింహపుపిల్లలాగా జనుల్ని భక్షిస్తోంది  .తర్వాత అన్గిరసులు తపస్సుకై వెళ్ళారు .జనం భయపడి అన్గిరసులవద్దకు వెళ్లి మొరపెట్టారు .ఇది సైమ్హిక పనే అని తెలిసినవారు ఆదిత్యునికి నివేదింఛి తామిచ్చిన భూమిని తీసేసుకోమన్నారు .ఆయన అంగీకరించక తిరిగి తీసుకొంటే వాళ్ళు అరవై వేలఏళ్ళు  కీటకంగా జీవిస్తారని చెప్పి ,యజ్ఞ దక్షిణగా వారిచ్చిన భూమిని కొని తీసుకొంటామని ఆదిత్యులు చెప్పగా,అన్గిరసులు సరే అన్నారు .

   ఆదిత్యులు శుభలక్షణ లక్షిత యైన కపిల ధేనువును వారికిచ్చి ,భూమిని తీసుకొన్నారు .కపిల దేవునిలో సాక్షాత్తు నారాయణమూర్తి ఉంటాడు .ఈ స్థానమే కపిలా సంగమం ,సకలపాప స౦హారకం .దానము చేయబడిన నీటి తో ఏర్పడిన దే కపిలా నది .ఇలా వస్తు వినిమయం తో ఆదిత్యులు భూ లోక రక్షణ చేశారు .ఇదే గోతీర్ధం .కపిలానది గంగానదితో కలిసిన చోటు కపిలా సంగమ తీర్ధం అని నారదునికి బ్రహ్మ ఉవాచ .

87-శ౦ఖ హ్రదతీర్ధం

గదాధరుడు శంఖ చక్రాలతో వెలసిన తీర్ధమే ఇది .ఇక్కడి పుణ్య స్నానం భవ బంధ విమోచకం .పూర్వం కృత యుగ ప్రారంభం లో బ్రహ్మ సామగానం చేస్తుండగా ,బ్రహ్మాండం అనే గృహం లో పుట్టిన రాక్షసులు బలోన్మత్తులై ఆయుధాలతో బ్రహ్మను తినేయ్యటానికి వచ్చారు .బ్రహ్మ విష్ణువును ప్రార్ధించగా ,ఆయన చక్రధారియై రాక్ష సంహారం కోసం వచ్చి ,చక్రం తో రాక్షసులను నిశ్శేషంగా  సంహరించి, విజయ విలాసంగా శంఖం పూరించాడు.ఇదంతా జరిగిన చోటునే శంఖు తీర్ధమని చక్రతీర్ధమని ప్రసిద్ధి చెందింది .ఇది సర్వాభీష్ట ప్రదాయకం పుణ్యకరం,లక్ష్మీ ప్రదం ఆరోగ్యదాయకం ,పుత్ర సంతాన దాయకం .ఇందులో పది వేలతీర్దాలున్నాయి .అన్నీ పాపహరాలే అని బ్రహ్మ నారదునికి వివరించాడు .

సశేషం

మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -2-11-19-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

గౌతమీ మహాత్మ్యం-59 84-భావ తీర్థం

గౌతమీ మహాత్మ్యం-59

84-భావ తీర్థం

భవుడు వెలసినదే భావతీర్దం..సర్వ ధర్మ పారంగతుడు ప్రాచీన బర్హి మూడున్నర కోట్ల సంవత్సరాలు రాజ్యపాలన చేసిన సూర్య వంశ క్షత్రియ రాజు .వార్ధక్యం లో భార్యా ,పిల్లలు సమస్తం వదిలేస్తాననుకొన్నాడు .ప్రజలు ఆది వ్యాధులు లేకుండా సుభిక్షంగా ఉన్నారు .ఒక సారి పుత్రులకోసం గౌతమీ తీరం లో యజ్ఞం చేస్తే ,శివుడు ప్రీతి చెంది ప్రత్యక్షమై వరం కోరుకోమంటే పుత్రుని ప్రసాదించమని బర్హి దంపతులు కోరారు .అప్పుడు అతనిని ముక్కంటి   తన మూడవ కంటిని చూడమన్నాడు . బర్హి చూడగా ఆనేత్ర కాంతినుంచి పుత్రుడు జన్మించాడు .అతనికి ‘’మహిమా ‘’అనే పేరు .అతడు చేసిన స్తోత్రం శివ మహిమన స్తోత్రంగా ప్రసిద్ధి చెందింది .ఆతీర్ధాన్ని తీర్ధ రాజమయేట్లు చేయమని కోరాడు .సరే అన్నాడు భవుడు అదే భావ తీర్ధం .ఇక్కడ 70పుణ్య తీర్దాలున్నాయని బ్రహ్మ నారదునికి చెప్పాడు .

85-సహస్ర కుండాఖ్య తీర్థం

పూర్వం శ్రీరామచంద్రుడు సముద్రానికిసేతువు నిర్మించి ,లంకను చేరి రావణాది రాక్షస సంహారం చేసి ,అగ్నిపునీత సీతాదేవిని పిలిచి తన అన్కమున కూర్చోటానికి అర్హత పొందిందని చెప్పాడు .కాని హనుమ అ౦గదాదులు అది సరైన మాట కాదన్నారు .అయోధ్యకు వెళ్లి సర్వ నృపతుల, తల్లుల సోదరుల, పురజనుల సమక్షం లో రామాన్కస్థిత కావాలని చెప్పారు . వీరి మాటలుకాదని విభీషణ, లక్ష్మణ,జాంబవంతుల మాట విని, రాముడు సీతా దేవిని సాదరంగా పిలువగా శ్రీరామ అంక పీఠం ఆరోహించింది సీతాసాధ్వి .అక్కడి వారంతా సంతోషించాగా .అందరూ పుష్పక విమానం లో అయోధ్యకు బయల్దేరి వెళ్లగా ,అయోధ్యలో  శ్రీ రామునికి  పట్టాభి షేకం   వైభవోపేతంగా జరిగింది .

కొంతకాలానికి ఒక అనార్యుని మాటలకు రాముడు నిండు గర్భిణి యైన సీతను పరిత్యజించాడు .రామాజ్ఞపై లక్ష్మణుడు సీతాదేవిని వాల్మీకి ఆశ్రమం దగ్గర ఆమె ఏ తప్పూచేయలేదని తెలిసినా వదిలి పెట్టి వచ్చాడు .కొన్నేళ్ళకు రాముడు అశ్వమేధ యాగం చేయ సంకల్పించి .సీతారాములకుమారులు లవ కుశులు రామాస్థానం  లో నారద తు౦బు రుల్లాగా రామాయణాన్ని గానం చేశారు .వారిని తనకుమారులుగా గుర్తించి రాముడు  దగ్గరకు పిలిచి పుత్ర గాత్ర పరిష్వంగ సుఖం అనుభవించాడు .ఆనందం, దుఖం తో రాముడు మాటిమాటికీ వారిని మళ్ళీ మళ్ళీ కౌగిలించుకొని ,మనసులో ఏదో ధ్యానిస్తూ ,ఉండగా లంకావాసులైన విభీష ణాది  రాక్షసులు, సుగ్రీవ ,అంగద ,జాంబవంతాది  వానర ప్రముఖులు వచ్చి ,రాముని చూసి సీతా దేవికనపడకపోవటం తో ద్వారపాలకులను అడుగగా ,వారు రాముడు  సీతను వదిలి పెట్టాడని చెప్పగా, వారంతా అగ్ని పునీత సీతను లోకాపవాద భీతితో వదిలిపెట్టటం ధర్మకాదని ,ఇక తమకు మరణమే శరణ్యమని భావించి గౌతెమీతీరం చేరారు ..

   వారి వెనుకనే రామ పరివారం వెళ్ళారు .అందరూసీతా దేవి రాకకోసం గొప్ప తపస్సు  చేయాలనుకొన్నారు. రాముడు అందరితో కలిసి  గౌతమీ స్నానం చేసి,  శివారాధన తత్పరుడయ్యాడు .చాలాకాలం తపస్సు చేసి పరితాపాన్ని పోగొట్టుకొన్నాడు .ఇక్కడే రాముడు పాప హరం, సర్వ ఆపత్ నివారకం అయిన హోమాన్ని వేయి కుండాలలో వసుధారతో చేశాడు.  ఈ తీర్ధమే ‘’సహస్ర కుండ తీర్ధం ‘’గా ప్రఖ్యాతి పొందింది .ఇక్కడి స్నాన దానాలు సహస్ర ఫలప్రాప్తి కలిగిస్తాయి అని నారదునికి బ్రహ్మ తెలియ జేశాడు .

  సశేషం

మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -1-11-19-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

అదో పాండిత్య రాజసం

       అదో పాండిత్య రాజసం

శ్రీ దండి భట్ల విశ్వనాధ శాస్త్రి గారు తెలుగువారే కాని ఎక్కడివారో తెలీదు .అత్తవారిది గోదావరి జిల్లా నేదు నూరు ప్రాంతం  .బాగా చిన్నతనం లోనే కాశీకి భార్యతో సహా వెళ్లి స్థిరపడ్డారు .పిల్లా పీచూ జంజాటం లేని కుటుంబం .ఆ రోజుల్లో కాశీలో ఒక అలవాటు ఉండేది .ఏ జమీందారు యాత్రకు వచ్చినా అక్కడ ఒక పండిత సభ జరిపి ,పరీక్షలు ,శాస్త్రార్ధాలు చేయించి శాలువాలుకప్పి బహుమతులివ్వటం రివాజు గా ఉండేది .ఈ సభలు తరచుగా జరుగుతూనే ఉండేవి .దండి భట్ల లాంటి పెద్దలు అధ్యక్షత వహించేవారు .వీరికి రెండేసి శాలువాలు కప్పేవారు .అవి తీసుకొని ఇంటికి వస్తూ దారిలో ఇద్దరు వేదవేత్తలను పిలిచి ,ఇంటికి తీసుకు వచ్చి ,భార్యతో’’ వేద పండితులొచ్చారు. వారు దేవతా స్వరూపులు ,ఈ రెండు శాలువలు చెరొకరికి సమర్పించి  నమస్కరించు ‘’అనేవారు .ఆమె అలానే చేసేది .వందలకొద్దీ శాలువాలొచ్చినా ఇదే పధ్ధతి .అన్నీ వినియోగించటమేకాని కప్పుకోటానికి ఒక్కటీ మిగిల్చుకొనే వారు కాదు .కప్పుకోవటానికి జమిలి దుప్పటే ఆయనకు .డబ్బు కూడా ఎంతవచ్చినా అది ఇలాగే సద్వినియోగమవ్వాల్సిందే .రేపటి ధ్యాస లేని నిరీహులాయన .భార్యకూడా ఈ పద్ధతికే అలవాటు పడిపోయి౦ది పాపం .

  ఒక ఏడాది శాస్త్రిగారి భార్యకు కోటిపల్లి తీర్దానికి మహా శివరాత్రి కి వెళ్ళాలనే కోరిక కలిగింది .ఆయనా సరే నన్నారు .కాకినాడ దాకా రైలు లో చేరి(వీరిద్దరికి రైలు  టికెట్ ఉండేదికాదు ) అక్కడి నుంచి కోటిపల్లికి బండీ మీద వెళ్ళాలి .చేతిలో డబ్బు ఉంచుకొనని  ఆయన ,కాకినాడ నుంచి మజిలీలు చేస్తూ ,కోటిపల్లికి నడిచి భార్యతో శివరాత్రి ఉదయం గోదావరి ఒడ్డుకు చేరారు .భార్యను అక్కడే ఉండమని చెప్పి ,తాను  గోదావరి స్నానంచేసి బయటికి వచ్చి, ఆమె చేతిలో ఉన్న సంచీ తనకిమ్మని చెప్పి,స్నానం తర్వాత ఇద్దరు గుడికి వెడదామని ఆమెను స్నానానికి పంపారు .ఆమె వెంటనే వెళ్ళకుండా రేవు వైపు చూస్తూ ‘’కాకిలాగా మునిగి రావటమేగా వెళ్తాలెండి ‘’అని కదలకుండా అలాగే నిలబడింది .ఆవిడ దృష్టిని అంతగా ఆకర్షించి౦ దేమిటా అని శాస్త్రిగారు పరకాయించి చూశారు .రేవులో ఎవరో కమ్మవారి  ఆడంగులు  స్నానాలు చేస్తూ ,అక్కడి బ్రాహ్మణులకు  రూపాయి బిళ్ళలు పంచి పెట్టటం కనిపించింది .ఆయన గ్రహించి ఆమె మనోభిప్రాయం తెలుసుకొని ‘’వాళ్ళలాగా పంచిపెట్ట టానికి మనదగ్గర డబ్బు లేదనే కదా నీ దిగులు  ?’’అన్నారట .ఆమె ‘’. ‘’ఎందుకా అడగటం .కావాలంటే మనకిప్పుడు డబ్బు వస్తుందా ?’’అంది కొంచెం వెటకారంగా .’’ఈ సంచీ పుచ్చుకొని అటూ ఇటూ తిరక్కుండా ఇక్కడే ఉండు .ఊళ్లో కెళ్లిడబ్బు తెస్తా .పిఠాపురం రాజా గంగాధర రామారావు గారు ,ఇక్కడికి వచ్చి హరిశాస్త్రి గారింట్లో ఉన్నారని సత్రం లో చెప్పు కొంటుంటే విన్నాను .అతని దగ్గర డబ్బు తెస్తాను .నుంచో ‘’అని చెప్పి ఎకాఎకిని హరి శాస్త్రిగారింటికి వెళ్ళారు నడిచి .

  హరి శాస్త్రి గారింట్లో జమీందారు గారు, ఆయన ,స్నానాలు చేసి  పట్టుబట్టలు ధరించి శ్రీ సోమేశ్వర స్వామి దర్శనానికి బయల్దేరుతూ సావిట్లో కనిపించారు .విశ్వనాధ శాస్త్రి గారిని చూసి ,గుడిప్రయాణం ఆపేసి ,ఆ ఇద్దరూ కూర్చున్నారు .రాజావారు ‘’శాస్త్రిగారూ ఎలా వచ్చారు ఎప్పుడొచ్చారు ?’’అని అడిగితే శాస్త్రీజీ ‘’ఏదో వచ్చాం లెండి. మా ఆవిడ కూడా వచ్చింది .స్నానాల రేవు దగ్గర ఉంది .దానికో పిచ్చి. రేవులో ఆడవాళ్ళు బ్రాహ్మణులకు రూపాయలు దానం ఇవ్వటం చూసి ,తనదగ్గర చిల్లిగవ్వకూడా లేదని దిగులుతో ఉంది .మీరిక్కడికి వచ్చారని తెలిసి కొంత డబ్బు తీసుకెళ్ళదామని వచ్చాను ‘’అన్నారు .జమీందారు ‘’అయ్యా !నేడు మహా శివరాత్రి పుణ్యకాలం .ఇంతకంటే ధన్యత ఉందా ?’’అని ,ఒక పళ్ళెం నిండా రూపాయి బిళ్ళలు తెప్పించి, బల్లపై పెట్టించి ,తీసుకు వెళ్ళమని కోరారు .శాస్త్రి గారు రెండు చేతులూ పళ్ళెం లో పెట్టి ,రెండు గుప్పిళ్ళలోరూపాయలు ఇరికించి పట్టుకొని ,రెండు జేబుల్లో పోసుకొని ‘’ఇవి చాలండి .అవన్నీ ఎందుకు ?’’అని చెప్పి ‘’ఇక నేను గుడికి వెడతాను .మీరూ గుడికి బయల్దేరండి ‘’అని చెప్పగా ‘’అలాకాదు స్నానాలు, దానాలు అయ్యాక అమ్మగారిని కూడా తీసుకొని గుడికి రండి .మా సిబ్బంది ముందే వెళ్లి దర్శనం ఏర్పాట్లు చేస్తున్నారు .ఈ జనసమ్మర్దం లో మీరు లోపలి వెళ్ళలేరు ‘’’అన్నారు .

  శాస్త్రిగారు ‘’దేవ దర్శనానికి  సిబ్బంది ఎందుకండీ .వీటి తాత లాంటి సమ్మర్దాలు కాశీ విశ్వేశ్వరాలయం లో ఎన్నో చూశాం .మేము సులభంగా వెళ్ళగలం. మీ దారిన మీరు వెళ్ళండి .నేను మళ్ళీ ఇటురాను ‘’అంటూ గోదావరికి వెళ్లి భార్యకు రూపాయలిచ్చి ‘’ఇందులో ఒక్క రూపాయి కూడా మిగల్చకుండా అన్నీ నీకు తోచిన వారికి పంచిపెట్టు ‘’అనగా భార్య అలానే చేసింది. ఇద్దరూ దైవ దర్శనం చేసుకొని మళ్ళీ కాశీకి ప్రయాణం చేశారు .పండితులలో ఆశాపరులు, దురాశా పరులే కాకుండా నిస్పృహులుకూడా దండి భట్ల విశ్వనాధ శాస్త్రి గారి లాంటి వారున్నారు .ఇలాంటి వారిని, సరసులైన సంపన్నులు నెత్తిన పెట్టుకొంటారు పిఠాపుర౦  జమీందారు శ్రీ  రావు వెంకట  మహీపతి  గంగాధర రామారావు గారిలాగా .  ఇదో పాండిత్య రాజసం .

ఆధారం -శ్రీదువ్వూరి  వారి స్వీయ  చరిత్ర

  నాగుల చవితి శుభాకాంక్షలతో

మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -31-10-19-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

గౌతమీ మహాత్మ్యం-5882-నిమ్న భేదతీర్ధం

పరమధార్మికుడు ఐలుడనే పురూరవరాజు ఊర్వశి ని చేబట్టి,కొద్దిగా నెయ్యిమాత్రమే తాగుతూ తపస్సు చేస్తుండగా ఊర్వశి వచ్చి అతడిని ఉద్రేకపరచి వివస్త్రుడుగా అయ్యాక ,ఆమె పాన్పు పై పడుకోగా  అతడు పాన్పు  చేరగా   ,అతడు నియమోల్ల౦ఘన  చేశాడని వెళ్ళిపోయింది  ,అతడు నగ్నంగా కనిపించనంతవరకే అతని వద్ద ఉంటానని ఇదివరకే వారిద్దరిమధ్య ఒప్పందం ఉంది .తాను  నగ్నంగా ఎందుకయ్యాడో తెలీక ,శత్రురాజు మీదకు వస్తే జయించి దేవలోకం చేరాడు .తిరిగి వచ్చి కులగురువు వశిష్టుని వలన ఊర్వశి వెళ్ళిపోవటం తెలుసుకొని ,విరహంతో నిరాశా దుఖం ,నిస్పృహలతో నిత్య కృత్యాలన్నీ మానేశాడు .వసిస్టు డు వచ్చి ‘’ఆమె ఇవాళ చనిపోయింది .స్త్రీలమనస్సులు కుక్కలలాంటివి .వంచన ,నృశంసత్వం ,చంచలత్వం, దుశ్శీలం వారి నైజాలు.ప్రతివారు స్త్రీలమాయలో పడిపోతారు .దుఃఖించక కర్తవ్యమాలోచి౦చు ‘’అన్నాడు .ఊరట చెందిన రాజు గౌతమీ నది చేరి నది గర్భం లో నిలబడి శివ ,జనార్దన బ్రాహ్మ భాస్కర గంగలను ధ్యానించాడు .తర్వాత శివునిపైనే ధ్యానముంచాడు .సంసారం త్యజించి అనేక యాగాలు చేసి ,రుత్విక్కులను భారీ దక్షిణలతో సంతృప్తి చెందించాడు .అందుకే ఇది యజ్ఞ ద్వీపమని వేద ద్వీపమని పిలువబడుతోంది   .ప్రతిపౌర్ణమి  రాత్రి ఊర్వశి అక్కడకు వచ్చి వెడుతుంది .ఈద్వీపానికి చేసిన ప్రదక్షిణ సమస్త పృధ్వికి చేసిన ప్రదక్షిణతో సమానం .ఇక్కడ వేదం స్మరించినా చదివినా ,వేదఫలం ,యాగ ఫలం పొందుతారు .దీనికే ఐల తీర్ధం పురూరవ తీర్ధం వాసిష్ట తీర్ధం ,నిమ్న భేద తీర్ధం అని పేర్లు .ఐలమహారాజు పాలనలో ఏ కర్మలమీద నిమ్నభావం ఉ౦డేదికాదుకనుక ఆపేరు సార్ధకమైంది .ఇక్కడ సర్వ భావమే తప్ప నిమ్నభావన లేదు .ఇక్కడి స్నాన జప దానాలన్నీ పరలోక ప్రాప్తి కలిగిస్తాయని బ్రహ్మ నారదునికి వివరించాడు .

83-ఆనంద తీర్ధం

నారదునికి బ్రహ్మ దేవుడు ఆనంద తీర్ధ మహాత్మ్యాన్ని వివరించాడు –అత్రిపుత్రుడు ‘’చంద్రమా ‘మహా తేజస్వి .గురువు బృహస్పతి నుండి సర్వ విద్యలు నేర్చాడు .ఇంకా ఏవైనా ఉంటె వాటినీ సాధించి గురుపూజ చేస్తానని గురువుకు చెప్పాడు .తనభార్య తార అనుమతిస్తే అలాగే అన్నాడు .ఇంటిలోపలికి వెళ్లి ,గురుపత్ని తారను చూసి  మోహపరవశుడై ,తన నివాసానికి లాక్కెళ్ళా డు .గురువుకు తెలిసి చంద్రుని శపించాడు ,,యుద్ధమూ చేశాడు .కాని చంద్రుడు చావ లేదు .నిర్భయంగా తారను మందిరానికి తీసుకువెళ్ళి ,భార్య రోహిణి తోపాటు అనేక సంవత్సరాలు సుఖం అనుభవించాడు .గురువు సర్వ ప్రయత్నాలు చేసినా శిష్యుడిని ఏమీచేయలేక ,చేసేదీ లేక నీతి వాక్యాలు స్మరిస్తూ ఉన్నాడు .

బృహస్పతి రాక్షసగురువు శుక్రుని దగ్గరకు వెళ్లి తన గోడు  వెళ్ళబోసుకొన్నాడు .సోదర గురువుకు జరిగిన అవమానానికి కినిసి కవి అంటే శుక్రుడు ‘’నీ భార్యను తెచ్చి నీకు అప్పగించేదాకా  నీరు త్రాగను, భోజనం చేయను,నిద్రపోను  ‘’అని ప్రతిజ్ఞ చేసి ,అభయమిచ్చి ,’’నీ భార్యను  నీదగ్గరకు చేర్చాక,గురుద్రోహి చంద్రుని శపించిన తర్వాతే ఏదైనా తింటాను ‘’అని చెప్పి వెళ్ళాడు .శుక్రుడు శంకరుని పూజించి అన్నివరాలు పొందాడు. గురు శుక్రులిద్దరుకలిసి చంద్రుడున్న చోటుకు వెళ్ళారు .చంద్రుని ‘’కుష్టు వ్యాధితో బాధపడు ‘’అని శపించాడు .ఈశాపం వెంటనే తగిలి చంద్రుడు క్షీణించటం మొదలుపెట్టి ఇక చేసేదిలేక తారను వదిలేశాడు .   తార చేయిపట్టుకొని శుక్రుడు సర్వ రుషిగణ,పితృ గణ,ఓషధీ గణ,పతివ్రతాగణాలను పిలిచి తారకు ప్రాయశ్చిత్తం ఏమిటి అని ప్రశ్నించాడు .అప్పుడు శ్రుతి’’బృహస్పతితో కలిసి తార గౌతమీ స్నానం చేస్తే పవిత్రమౌతుంది ‘’అని చెప్పింది .తారా బృహస్పతులు అలాగే గౌతమీ స్నానం చేయగా ,దేవతలు పుష్పవర్షం కురిపించగా ,జయశబ్దం భూ నభోన్తరాలలో  మర్మ్రోగింది .దేవతలు దిగివచ్చి ఆదంపతులను ఆశీర్వదించారు  .మనుషులు, రాజులు తార పవిత్రతను శ్లాఘించి బృహస్పతికి ఇచ్చారు .ఇక్కడే మహా తీర్ధం ఏర్పడి శుక్ర బృహస్పతి తారలకు సకల జనులకు ఆనందం క్షేమం ,పాప విధ్వంసం ,సర్వకామదం అయినందున ఆనంద తీర్ధం అయింది .గురువు గౌతమితో ‘’నువ్వు సదా పూజ్యురాలవు .ముక్తి దాయినివి .నేను అంటే బృహస్పతి సింహ రాశిలో ఉండగా త్రైలోక్య పావనివి అవుతావు .అప్పుడు అన్ని తీర్దాలు నీలో చేరతాయి ‘’అన్నాడు .శివుని వాహనం నంది ఇక్కడ ఎప్పుడూ ఉంటాడుకనుక ‘’నంది తీర్ధం ‘’అనే పేరుకూడా వచ్చింది అని బ్రహ్మ నారదునికి వివరించాడు .

సశేషం

నాగులచవితి శుభా కాంక్షలతో

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -31-10-19-ఉయ్యూరు

image.png

 

 

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

సర్వ స్వతంత్రులైన ఇద్దరు విశ్వనాథ శాస్త్రులు

శ్రీ పేరి కాశీనాథ శాస్త్రులుగారు అమాయకులు ,అత్మగౌరవ౦ అతి స్వతంత్రం ఉన్న మహా పండితులు .ప్రత్యేకించి ఆనాటి ప్రముఖ సంస్కృత పండితులుశ్రీ  తాతా రాయుడు శాస్త్రి గారికి అల్లుడు కూడా .ఆంధ్రప్రదేశ్ పండిత రాజ్యానికి రాయుడు శాస్త్రిగారే ఆనాడు సార్వభౌములు .పండితులకు ఆయన యెంత చెబితే అంత .కాని అల్లుడికి మామగారంటే కంపరం .ఒకరకంగా ఇద్దరికీ  షస్టాస్టకం.చుక్కెదురే .మామగారి మాటంటే తృణప్రాయం అల్లుడికి ..కాని పరోక్షంగా మామగారి పాండిత్యాన్ని మెచ్చి గౌరవించే వారు .ఇదో విపరీత స్వతంత్ర పధ్ధతి ఆయనది .ఫాలాక్షుడికి కూడా భయపడని తత్త్వం .సముద్రమంత పాండిత్యం .సరస కవితా శక్తి ,విజయనగర రాజాస్థానం లో విశేష గౌరవం ఉన్నవారు .ఆయనకిచ్చే రాచగౌరవం అలాంటి ఇలాంటిది కాదు .విజయనగర సంస్థానాధీశులు విజయరామ గజపతి ఆస్థాన పండితులు శ్రీ పేరి వెంకటశాస్త్రులుగారు .యువరాజు శ్రీ ఆనంద గజపతి ఆస్థాన పండితులు, ఆస్థానకవి ,శ్రీ పేరి కాశీ విశ్వ నాథ శాస్త్రులు గారు .ఆతండ్రీ తనయులవద్ద,ఈతండ్రీ కొడుకులు  ఆస్థాన పండితులన్నమాట  . ,విశ్వనాథశాస్త్రి గారు ప్రతిరోజూ వచ్చి  యువరాజావారి మహల్ లో  శాస్త్ర గోస్టీ,కవిత్వ చర్చ చాల చనువుగా జరిపేవారు .

  ఒక రోజు మధ్యాహ్నం 4గంటలకు శాస్త్రిగారు కోటలోకి వెడుతుంటే ,తండ్రీకొడుకులు మొతీమహల్ డాబాపై ఏదో మాట్లాడుకొంటూ పచార్లు చేస్తున్నారు .విజయరామ  గజపతి గారు ‘’ఎవరా పెద్దమనిషి ,గొడుగు దించకుండా వస్తున్నాడు ‘’అని ప్యూన్ ని కేకేశారు .బంట్రోతు గబగబా పరిగెత్తుకొస్తున్నాడు .దగ్గరకొచ్చాడంటే,ఆ గొడుగు మనిషి కాళ్ళూ, చేతులూ విరిచేసేవాడే .మహారాజలు తప్ప వేరెవరూ కోటలో గొడుకు వేసుకోవటం మహాపరాధం .,గొప్పనేరం  .ఆధిపత్యమే కాదు ఏకచ్చత్రాదిపత్యం కూడాకదా వారిది .యువరాజు ఎందుకో అటువైపు చూడగాశాస్త్రి గారిని గుర్తుపట్టి తండ్రితో ‘’ఆ వచ్చేది మన కాశీ విశ్వనాధ శాస్త్రులవారు .మన ఆస్థాన పండితులకుమారులు  . ఆస్థాన మర్యాదలు  ఉల్లంఘి చేవారుకాదు .ఏదో పొరబాటున అలా వచ్చి ఉంటారు .ఇది ప్రథమ తప్పిదంగా సర్కారు మన్నించాలి –ఆయన స్థానం లోనేను క్షమాపణ చెబుతున్నాను ‘’అన్నారు .వెంటనే మహా రాజు బంట్రోతుకు ఏదో సౌ౦జ్న చేశారు .దానితో బంట్రోతు వెనక్కి తగ్గాడు .లేకుంటే కాశీ శాస్త్రులుగారి కాలూ చేయీ కాశీలో కలిసిపోయేవి .మహాప్రమాదం నుంచి బయట పడ్డారు .శాస్త్రిగారు ఆనంద గజపతి మహల్ లో మామూలుగా కూర్చునేచోట కూర్చున్నారు .

  కాసేపటికి యువరాజు వచ్చిఅభివాదం చేసి ‘’ఏమిటండీ ఈ రోజు చాలా పొరబాటు చేశారే?’’అనగా ‘’ఏం పొరబాటు ?’’అన్నారు శాస్త్రీజీ .’’కోటలోకి గొడుగు వేసుకురావటం మహాపరాధం కాదంటారా ?’’అన్న ప్రశ్నకు ‘’మహాపరాధమే ప్రభో !.అందుకే నేను రోజూ మొదటి గేటు బయటే గొడుగు ముడుచుకొని మరీ వస్తాను.ఈ రోజూ అంతే చేశాను  ‘’అన్నారు .’’లేదు శాస్త్రీజీ !మూడు గేట్లు దాటి మోతీమహల్ఎదురుగా నడుస్తూ కూడా గొడుగు తీయలేదు .మేమే స్వయంగా చూశాం .మహారాజులు౦గారు  మహా ఆగ్రహపడ్డారు .మీ బదులు మేము క్షమాపణ చెప్పి శాంతి౦పజేశాం .చాలా ప్రమాదం తప్పింది ‘’అన్నారు యువరాజా .తెల్లబోయిన శాస్త్రిగారు ‘’ఇప్పటికీ గొడుగు ముడుచుకొని వచ్చాననే భ్రా౦తిలోనే ఉన్నానుప్రభూ .ఒక కల్పన స్ఫురించి శ్లోకంగా అల్లుకొంటూ మీకు వినిపించాలనే తదేక దృష్టిలో రావటం వలన గొడుగు మాట మరచి పోయి ఉంటాను క్షమించాలి ‘’అన్నారు అత్యంత వినయంగా శాస్త్రీజీ .

  ‘’ఇప్పటికే క్షమించేశాం .ఆకల్పన శ్లోకం వినిపించండి ‘’అనగానే శాస్త్రిగారు వినిపించగా కల్పనా, శ్లోకం రెండూ బాగున్నాయని యువరాజా మెచ్సి ,పాలు భంగూ ,మిఠాయి తెప్పించి ఆనందంగా ఆనంద గజపతి ,కాశీ విశ్వనాథ శాస్త్రిగారు కలిసి సేవించారు .పండితులను గౌరవించే విషయం లో ఆనందగజపతి మహారాజా చాలా నిక్కచ్చిగా ఉంటారు .

  మరో ముచ్చట చూద్దాం .పాణిని వ్యాకరణం లో పరిషే౦దుశేఖరానికి వాక్యార్ధ చంద్రిక ,శబ్ద రత్నాకరానికి చిత్రప్రభ అనే గొప్ప వ్యాఖ్యానాలు రాసిన శ్రీ భాగవతుల హరి శాస్త్రులుగారు విజయనగర ఆస్థాన పండితులుగా ,కాశీలో ,విజీనగరంలో ,కోటిపల్లి లో ఉంటూండే వారు .వీరికంటే కొంచెం పెద్దలు శ్రీ  దండిభట్ల విశ్వనాథ శాస్త్రిగారు ,కాశీలోనే చదువుకొని ,మహా వైయాకరణులై,కాశీలో స్థిర నివాసమేర్పరచుకొన్నారు .పాణినీయ వ్యాకరణం లో ఆయన మహా వీరులని ప్రసిద్ధి .  నిస్పృహులు ,అతి స్వతంత్రులు కనుక రాజాస్థాన ఉద్యోగాలు చేయలేదు .ఆనందగజపతి స్వయంగా పండితులుకనుక ,శాస్త్రిగారితో బాగా పరిచయం ఉండటమేకాక ,కాశీలోని తమసంస్థానం లో కొన్ని సార్లు ఉండి వచ్చేవారు .

   ఒక రోజు దండిభట్లవారు కాశీలో బయల్దేరి ఎక్కడికో వెడుతూ ,విజయనగరం లోదిగి ,సరాసరి ఆనంద గజపతిమహలు ఏదని కనుక్కొంటూ మూడు దేవిడీలు ,నాలుగు పారాలు దాటి,నాలుగవ విచ్చుకత్తుల పారా దగ్గరకు వెళ్లి హిందూ స్థానీలో  పహారా వాళ్ళతో మాట్లాడి ,ఈయన్ను అడ్డగిస్తే ,తమకు శిక్ష పడుతుందేమో నని భయపడుతూ మిన్నకున్నారు .శాస్త్రిగారు పెద్ద వస్తాదులాగా,చేఎత్తు విగ్రహం ,మాసిన గడ్డం 9 మూరల దుక్క పంచ, లోపల  ముతకబనీను మోకాళ్ళదాకా బొత్తాలు సరిగ్గా పెట్టని పెద్ద లాం కోటు (లాంగ్ కోట్ ) ,బుజం పై జమిలి నేత తెల్లదుప్పటి,నెత్తిన తట్టంత తలపాగా ,చేతిలో సంచీకూడా లేకుండా వచ్చారు కోటుకుఎడాపెడా జేబుల్లో యెంత సరుకైనా పెట్టుకోవచ్చు .చక్కని మాట .కాశీలో ఆన౦ద గజపతి తనకు స్నేహితులని ఠీవిగా చెబుతున్నారు .వాళ్ళూ హిందూ స్థానీయులేకనుక ఈయన్ని అడ్డగించలేదు .

      సరాసరి మహల్ లోకి వెళ్లి ఒక కుర్చీలో కూర్చున్నారు .ఒకనౌకరు దగ్గరకొచ్చి దండాలుపెడుతూ ‘’ఏమిటి సెలవు బాబూ !’’అని గౌరవంగా అడిగాడు .’’ఏమీ లేదు .మహారాజా వారితో కాశీనుంచి దండిభట్ల విశ్వనాథం వచ్చాడు ‘’అని చెప్పు అన్నారు బాగా బిగ్గరగా .మహారాజుకు వినబడి గుర్తుపట్టి ,వెంటనే వచ్చి ‘’ఎప్పుడు దయ చేశారు ?మాకు వ్రాయకుండానే వచ్చారు ?కాశీ నుంచేనా ,ఎక్కడికి ప్రయాణం ?’’అని అడిగారు .కాశీను౦చే కాని ఎక్కడికో తెలీదు .ఎటో తిరిగివద్దామని బుద్ధిపుట్టి బయల్దేరాను .రైలులో బరంపురం దాటాక జేబు తడుముకొంటే ‘’భంగు ‘’అయిపొయింది .తెలుగు దేశం లో అది దొరకదు ఎలా అనుకొంటే విజయనగరం జ్ఞాపకమొచ్చి మీదగ్గర ఉంటుందికదా అని దిగి వచ్చాను ‘’అన్నారు శాస్త్రీజీ .మహారాజు సంజ్ఞ తో నిమిషంలో అక్కడ ఒకపళ్ళెం లో భంగుముద్దా ,ఒకపళ్ళెం లో మిఠాయీ ,గ్లాసులో పాలు వచ్చేశాయి .ఇద్దరూకలిసి సేవించారు .మరి కొంచెం భంగు ,మిఠాయితెచ్చారు .వీటిని పొట్లాలు కట్టించుకొని జేబుల్లో కుక్కుకుని ‘’ఇక నే వెడతాను ‘’అన్నారు శాస్త్రిగారు .

  ‘’అదేమిటి శాస్త్రీజీ !ఆస్థాన పండితులను రప్పిస్తాం  .నాలుగు రోజులుండి వెళ్ళండి ‘’అని కోరారు రాజా .’’అబ్బే !నేనెవరి ఇంటా ఉండను  .ఇక్కడికైనా భంగుకోసమే వచ్చా.వెనక్కి కాశీ వెళ్ళిపోతా .ఈలోపు స్టేషన్ దగ్గర మంచుకొండ వారి సత్రం లో ఉండి,రేపు ఉదయం 10గంటల రైలుకు వెళ్ళిపోతాను .ఇంటికి వెళ్ళేదాకా భోజనం చేయను ‘’అని చెప్పి సెలవు పుచ్చుకొని వెళ్ళిపోయారు .

  ఆ సాయంత్రం ఆస్థాన పండితులు వస్తే ,సత్రంలో శాస్త్రి గారి దర్శనం చేయమని చెప్పగా మర్నాడు ఉదయం  వారు వెళ్లి కలిసి ,తమ ఇళ్ళకు  రమ్మని చాలా ఆర్తిగా ప్రార్ధించినా ‘’ఆ మాట వదిలేయండి .మీరంతా వచ్చారు సంతోషం .శిష్యులను  కూడా తీసుకొచ్చారు .వీరిలో వ్యాకరణ పండితులున్నారా ?’’అని అడగ్గా ‘’తమరు వారిని పరీక్షించమని మనవి ‘’అన్నారు వారు పరీక్షించి బాగుందని మెచ్చి ‘’శేఖరం ‘’చదువుతున్నఈకుర్రాడు బాగా పనికొస్తాడు కానీ ఇస్త్రీ బట్టలు ,ఆషోకు శాస్త్రానికి పనికి రాదు .అందరూ జాగ్రత్తగా చదువుకోండి ‘’అని హితవు చెప్పారు .ఆ ఇస్త్రీబట్టల షోకులకుర్రాడు మరెవ్వరోకాదు .శ్రీ తాతారాయుడు శాస్త్రి గారే .  ఉదయం  విశ్వనాథ శాస్త్రిగారిని అందరూకలిసి స్టేషన్ కు సగౌరవం గా తీసుకువెళ్ళి ,10గంటల రైలు ఎక్కించి  ‘’టికెట్టు ఎక్కడికి తీయ మంటారు ?’’అని వాళ్ళు అడిగితె ‘’అబ్బే!నాకు రైలులో ఎప్పుడూ టికెట్టు లేదు .ఆ కష్టం  మీకు అక్కర్లేదు .మీరంతా వెళ్ళండి ‘’అని చెప్పగా  వీడ్కోలు పలికి ఇంటిదారిపట్టారు ఆస్థాన విద్వాంసులు .శిష్యబృందం .

ఆధారం –శ్రీ దువ్వూరివారి స్వీయచరిత్ర

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -30-10-19-ఉయ్యూరు

image.png

image.png
Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged , | Leave a comment

గౌతమీ మహాత్మ్యం-57 80-నారసింహ తీర్ధం

గౌతమీ మహాత్మ్యం-57

గంగ ఉత్తర ఒడ్డునున్న నారసింహ తీర్ధం సర్వ రక్షాకం .హిరణ్య కశిపుడు బలపరాక్రమాలతో దేవతలను జయించి ,హరిభక్తుడైన తనకొడుకు ప్రహ్లాదునిపై ద్వేషం తో స్తంభం లో ఉంటె చూపించమంటే ,ఉన్నాడంటే, గదతో స్తంభాన్ని కొట్ట  గా అందులోనుంచి శ్రీహరి నారసింహ రూపం లో ఉద్భవించి ,తన విశ్వాత్మను ఆవిష్కారం చేసి హిరణ్యకశిపుని గోళ్ళతో చీల్చి చంపి ,దైత్యసైన్య సంహారం చేసి మహోగ్రరూపంతో ,రసాతలం లోని శత్రువులనూ చంపి ,స్వర్గానికి వెళ్లి అక్కడి రాక్షసులను భూలోక పర్వతాలపై ఉన్న రాక్షసులను ,సముద్ర, నదులలోని వారినీ, గ్రామ, వనవాస దైత్యులను సంహారం చేసి ,ఆకాశం చేరి అక్కడున్నవారిని, వాయువు ,జ్యోతిర్లోకం లో ఉన్న రాక్షసులను పరిమార్చి,పిడుగుకంటే కఠినాలైన గోళ్ళతో ,బాగాపెరిగిన జూలుతో ,మహా నాదం చేస్తూ వీర విహారం చేసి ,గౌతమీ తీరం చేరాడు ..

  అక్కడ అంబర్య అనే దండకాధిపుడైన శత్రువు ఉంటె  వాడితో భీకరపోరాటం చేసి ,గౌతమి ఉత్తర తీరాన వాడిని మట్టుపెట్టాడు .ఈ తీర్ధమే నారసి౦హతీర్ధ౦ .ఇక్కడ నారసింహ దైవం ఎల్లప్పుడూ ఉంటూ భక్తులకోర్కెలు తీరుస్తాడు అని బ్రహ్మ నారదునికి చెప్పాడు .

81-పైశాచ తీర్ధం

నారదునికి బ్రహ్మ పైశాచక తీర్ధ వివరాలు చెప్పాడు .ఒకప్పుడు ఒక బ్రాహ్మణుడు పిశాచ రూపం పొంది ఇక్కడ ముక్తి పొందటం తో ఆపేరొచ్చింది .’’సుయవుని ‘’ కొడుకు అజీగర్తుడు కుటు౦బభారం ,దరిద్రం తో బాధపడుతున్నాడు .అతని ముగ్గురుకొడుకులలో మధ్యవాడు శునశ్శేఫుడు గొప్పబ్రహ్మవాది  .ఇతడిని ఒక క్షత్రియుడికి యాగ పశువుగా బాగా ధనం తీసుకొని  సంహరించటానికి  అమ్మేశాడు తండ్రి .కొడుకును సంహరించటం అనే పాపం అతనికి చేరి ,నయంకాని రోగంతో తీవ్రంగా బాధపడి చనిపోయి ,నరకం చేరాడు .యమాజ్ఞచే అనేక యోనులలో జన్మించాడు .చివరికి పిశాచ రూపం పొందగా యమదూతలు వాడిని నిర్జనారణ్యంలో తోసేశారు డు .ఇదీ అతడి ఫ్లాష్ బాక్ ..

  పశ్చాత్తాపంతో ఏడవటం మొదలెట్టాడు .ఒక రోజు శునశ్శేఫుడు అటుగా వెడుతూ పిశాచి రోదనం విని ,జాలిపడి ,ఎవరని అడిగితె శునస్షేఫుని తండ్రినని తన వృత్తాంతమంతా వినిపించాడు .అప్పుడు కొడుకు తండ్రి దీనావస్థకు దుఃఖించి ‘’తండ్రీ !నన్ను విక్రయించి నరకానికి వెళ్లావు .నేనిప్పుడు నిన్ను స్వర్గానికి పంపిస్తాను ‘’అని విశ్వామిత్రుని దత్తపుత్రుడు ,తన నిజపుత్రుడు ఐన తనకన్నతండ్రికి ఉత్తమలోక ప్రాప్తికోసం గంగానది కి చేరి ధ్యానించటం ప్రారంభింఛి ప్రేత రూపు దైన తండ్రికి జలాంజలి ఇచ్చాడు .జలదాన మాత్రం చేత అతడికి పిశాచరూపం పోయి,అజీగర్తి పుణ్య శరీరం పొందాడు .అరవై వేల సూర్యుల తే గంగామాత  అనుగ్రహంతో అజీగర్తుడు ,దేవతా సంఘం నడిపే దివ్య విమానం లో వైకుంఠం చేరాడు .అప్పటినుంచి ఈ తీర్ధం ‘’పిశాచ నాశక తీర్ధం ‘’గా విలసిల్లింది అని బ్రహ్మ నారదునికి వివరించాడు .

   సశేషం

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -30-10-19-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

ఉయ్యూరు శ్రీ సువర్చలాన్జనేయస్వామి దేవాలయం లో కార్తీకమాసం మొదటి మంగళవారం29-10-19 రాత్రి దీపాలంకరణ

ఉయ్యూరు శ్రీ సువర్చలాన్జనేయస్వామి దేవాలయం లో కార్తీకమాసం మొదటి మంగళవారం29-10-19 రాత్రి దీపాలంకరణ

https://photos.google.com/share/AF1QipMd9ebuvDhFPTSukrcsM4Z9byBliGfr8BHPB8unqbsJB_oLaKTMUw07zI2gCvS8-A/photo/AF1QipMtfbCcYATwh6A3X5dDFuuM07N9TSUQdbK9dPoi?key=U2x3UEJiWmQxR2d6aWFHM2pib1p1R2FYVmxPOGJB

Posted in దేవాలయం | Tagged | Leave a comment

చిట్టి గూడూరులో సంస్కృత కళాశాల ఏర్పడిన విధానం బెట్టిదనిన –

చిట్టి గూడూరులో సంస్కృత కళాశాల ఏర్పడిన విధానం బెట్టిదనిన –

చిట్టి గూడూరు అంటే కృష్ణాజిల్లా బందరు దగ్గరున్న గ్రామం .ఆపేరు చెబితే శ్రీ మత్తిరుమల గుదిమెట్ల వరదా చార్యులు అంటే ఎస్ టి జి వరదా చార్యుల  వారి పేరే ముందు జ్ఞాపకమొస్తుంది .కారణం అక్కడ సంస్కృత కళాశాల స్థాపించి కృష్ణా గుంటూరు జిల్లాల లోని వారెందరికో చదువుకొనే వీలు కలిగించిన మహానీయులాయన .

  విజయనగరం మహారాజా కాలేజిలో ప్రధాన అధ్యాపకులు గా చేసి అక్కడే తెలుగు వ్యాకరణ బోధకులుగా శ్రీ దువ్వూరి వెంకట రమణ శాస్త్రి గారిని నియమించుకొని ,తర్వాత ప్రాచ్య పాఠశాలలపాలనా వ్యవహారాల పర్యవేక్షకునిగా పని చేసి ,తర్వాత ఈ ఇద్దరు కొవ్వూరులో శ్రీ తల్లాప్రగడ సూర్య నారాయణ రావు గారు కార్యదర్శిగా ఉన్న గౌతమీ  సంస్కృత కాలేజిలో చేరి ,కొంతకాలం అయాక వరదాచార్యులవారికి స్వగ్రామం చిట్టి గూడూరులో సంస్కృత కళాశాల స్థాపించాలనే కోరిక కలగటం తో ,దువ్వూరి వారు ,వేదాల తిరు వెంగళాచార్యులుగారు కొవ్వూరు కాలేజిలో చదువుతున్న సగం మంది విద్యార్ధులతో సహా అందరు ఒక రైలులో బయల్దేరారు .

  కాలేజి పెట్టాలంటే క్లాసులు నడిచి ,ఒక అధికారి వచ్చి చూసి రికగ్నిషన్ ఇవ్వాలి .అప్పటికి ఇంకా విశాఖలో (1923)లో ఆంద్ర విశ్వవిద్యాలయం పుట్టనే లేదు .అప్పటికి మద్రాస్ యూని వర్సిటి యే అన్నిటికీ .శాస్త్ర గారినీ ,విద్యార్ధులను బెజవాడలో దిగిపోయి ,చిట్టిగూడూరు చేరి మర్నాడే  కళాశాల ప్రారంభించమని చెప్పి, వరదాచార్యులుగారు సరాసరి స్టడీస్ బోర్డ్ మీటింగ్ కు మద్రాస్ వెళ్ళారు .అలాగే దువ్వూరి వారు చిట్టిగూడూరు లో సంస్కృత కాలేజి ప్రారంభించారు .కాలేజి ప్రారంభమైన నాలుగవ నాటికి ఆచార్యులవారు రికగ్నిషన్ సాధించి తీసుకొని గూడూరు చేరారు .తర్క అలంకార శాస్త్ర బోధకులుగా శాస్త్రిగారితో కొవ్వూరు ను౦చి వచ్చిన శ్రీ వేదాల తిరువెంగళాచార్యులు గారున్నారు. దువ్వూరి వారు తెలుగుకు ఉన్నారు .సాహిత్యం ,లాంగ్వేజ్ లిటరేచర్ కు వరదాచార్యులవారున్నారు .వ్యాకరణానికి విజయనగరం నుంచి శ్రీ కరి రామానుజా చార్యులను రప్పించి చేర్చుకొని కాలేజి అన్ని ఫాకల్టి  లతో ఆరంభమై నడిచింది .అందరు ఎవరి సబ్జెక్ట్ లో వారు సర్వ స్వతంత్రులు ,మహోత్సాహవంతులు .కనుక తమ సత్తా చాటారు .

  కాలేజి ఆయితే ప్రారంభమైంది కాని 50మంది ఉన్న విద్యార్ధులకు తరగతులనిర్వాహణ కు భవనాలు కాదుకదా తాటాకు పాకలు కూడా లేవు .అధ్యాపకులకు ఉండటానికి కొంపలు లేవు. అంతా వరదాచార్యులవారి విశాలమైన భవనం లోనే .క్లాసులు ఎవరింటి దగ్గర వారే నిర్వహించేవారు ఆచార్యులవారి ఇంట్లోని గదులలో ఉంటూ .నాలుగు పండిత కుటుంబాలు 50మంది విద్యార్ధులకు వసతి చదువు అన్నీ అక్కడే .అంతా ఎదురుగానే ఉ౦డేవారుకనుక ,అస్తమానంమానం పాఠాల యావ తప్ప వేరే ఏదీ ఉండేదికాదు .విద్యార్ధులూ అలాగే అలవాటు పడిపోయారు. వినోదానికి వెళ్ళాలంటే ఆరుమైళ్ళ దూరం లోని బందరు వెళ్ళాలి .కనుక సాహసం చేయకుండా విద్యార్ధులు చదువు మీదే ఏకాగ్ర దృష్టి పెట్టేవారు .ఇక్కడ చదువు బాగా చెబుతున్నారన్నవార్త కృష్ణా గుంటూరు జిల్లాలలో వేగంగా ప్రాకి కమ్మవారి పిల్లలు సంస్కృతాంధ్రాలు నేర్వాలనే ఆసక్తితో వచ్చి చేరారు .ఎవరొచ్చినా చేర్చుకోవటం, ఉన్నంతలో వారికి సౌకర్యాలు కలిగించటం వరదా చారిగారి ప్రత్యేకత .స్మార్త ,వైష్ణవులకన్నా ,కమ్మవారి విద్యార్ధుల సంఖ్య పెరిగి పోయింది .ఊళ్ళో సుమారు నలభై కుటుంబాలు మాత్రమె ఉండేవి.అన్యోన్యంతో అధ్యాపక  విద్యార్ధులు మెలగి ఆదర్శంగా నిలిచారు .

  అమరం ,ధాతువులు ,అస్టాధ్యాయీ ,చి౦తా మణి కారికలు  ,అధర్వణ కారికలు  క్లాసులలో కాకుండా తీరిక సమయాలలో పగలో, రాత్రో, తెల్లవారు ఝామునో సంతలు చెప్పేవాళ్ళు .నోటికి వచ్చాక మర్చిపోకుండా అప్పుడప్పుడు ఏకరువు పెట్టించేవారు .ఇదంతా మనం చెప్పుకొనే ‘’ఎక్స్ట్రా కర్రిక్యుల వ్యాసంగం అన్నమాట .’’పుస్తకేషు ఛయా విద్యాపరహస్తేచ యద్ధనం సమ యేతు పరిప్రాప్తేనసా ,విద్యా న తద్దనం ‘’ అన్నట్లుకాకుండా ,పరీక్షల్లో ,బోధనలో అవసరానికి గ్రంథం తో పనిలేకుండా ముఖ్యమైనవన్నీ నోటికి వచ్చేట్లు చేసేవారు .మౌఖిక పరీక్షలుపోయి రాత పరీక్షలు వచ్చాయికనుక ,ప్రశ్నాపత్రం లో వాటికి తగినట్లు జవాబులు రాయటానికి వ్రాతపని ఎక్కువగా చేయించేవారు .ఈ నలుగురే ఆలోచించి అమలు చేసేవారు .కాంపోజిషన్ క్లాసులు దువ్వూరివారేనిర్వహించారు.వ్యాకరణ విద్యా ప్రవీణ  సాహిత్య విద్యా  ప్రవీణ,భాషా ప్రవీణ పిల్లలంతా ఈక్లాసుకు వచ్చి శిక్షణ పొందేవారు .ఈక్లాసులో సుమారు 25మంది విద్యార్ధులు ,మిగిలిన క్లాసులలో సుమారు 10మంది ఉండటం వలన విద్యావ్యాసంగం మహా రమ్యంగా సాగేది .అర్ధంకాని పిల్లాడి’’ తెల్లమొహం ‘’చూసి గుర్తించి  ,మరొకమారు బోధించేవారు .

 నేర్చిన వ్యాకరణ జ్ఞానం వ్రాతలలో ప్రతి ఫలించిందో లేదో కనిపెట్టేవారు .ఏదో విషయం మీద విపులంగా వివరించి వ్యాసం రాయించేవారు. దువ్వూరివారు సరదాగా ఎన్నో రకాల ఎక్సర్ సైజులు చేయించి పుస్తకాలను ఒకరి పుస్తకం ఇంకోరికిచ్చి దిద్దించి తప్పులున్న చోట్ల గీతలు పెట్టించి,తప్పేమిటో తెలుసుకోనేట్లు చేయించేవారు .ఎవరైనా పొరబాటున తప్పు గీత గీస్తే దాన్ని కనిపెట్టిన విద్యార్ధి శాస్త్రి గారికి ఫిర్యాదు చేస్తే ,దానిపై చర్చించి ,సరిచేయి౦చేవారు.ఒకసారి చేసినతప్పులు మళ్ళీ చేసేవారుకాదు విద్యార్ధులు .ఇదే కాక శీఘ్ర లేఖనం ,సుశబ్ద అపశబ్ద వివేచనం బాగా అలవడేది .అందరికీస్వంత కాలేజి అనే భావం మనసులో కలిగి అంకితభావం తో పని చేసి, కళాశాల అభివృద్ధికీ విద్యాభి వృద్ధికీ తోడ్పడ్డారు

  1923నుంచి 18ఏళ్ళు 1941దాకా దువ్వూరి వారి అమూల్య సేవలు చిట్టిగూడూరు కాలేజికి లభ్యమయ్యాయి .  1929లో దువ్వూరి వారి గురువులు ‘’ప్రౌఢ వ్యాకరణ’’కర్త  శ్రీ వఝల చిన సీతారామ శాస్త్రిగారు   తెలుగులో దువ్వూరివారికి విజీనగరం కాలేజిలో గురువులు ,రెండవ సారి సెనేట్ కు పోటీ చేయాలని భావిస్తే ,ఆ పోస్ట్ గౌరవం  చిట్టి గూదూరుకే దక్కాలని వరదాచార్యులుగారు భావించి పోటీగా దువ్వూరివారిని నిలబడమని నచ్చచెప్పి నామినేషన్ వేయించారు .గురువుగారు శిష్యుడిని నయానా భయానా బెదిరించి  విత్ డ్రా  కమ్మని కోరినా లాభం లేక అవ్వారి సుబ్రహ్మణ్య శాస్త్రి గారిని తనకు బదులుగా పెట్టి జోరుగా ప్రచారం చేయించారు .అప్పటికి విజయనగరం కొవ్వూరు తెనాలి చిట్టిగూడూరు కాలేజీలలో అధ్యాపకుల వోట్లు 10.వజ్జలవారి ప్రయత్నాలన్నీ వమ్మై,ఎన్నిక జరగగా దువ్వూరి వారికి అవ్వారివారికి చెరిసమానంగా ఐదేసి ఓట్లు వచ్చి టైగా మారితే ,బెజవాడలో వైస్ చాన్సలర్ కట్టమంచి రామలింగారెడ్డి గారు రిజిస్ట్రార్,చెట్టిగారి సమక్షం లో ఆఫీసులో ఒక పెద్ద డబ్బాలో దువ్వూరి ,అవ్వారి పేర్లు రెండు చీటీలు రాసిపడేసి ఒక గడ్డికోసే ముసలతనితో తీయిస్తే దువ్వూరి వారి చీటీ తీయగా ,వెంకటరమణ శాస్త్రి గారు సెనేట్ మెంబర్ అయి చిట్టిగూదూరుకు గౌరవం దక్కించి వరదాచార్యులవారి ఈప్సితాన్ని నెరవేర్చారు .తర్వాత దువ్వూరివారు తెలుగు స్టడీస్ బోర్డ్ మెంబర్ కూడా అయ్యారు .యూనివర్సిటి ఆవిర్భావం నుంచి వరదాచార్యులవారే అవిచ్చిన్నంగా 45ఏళ్ళు చైర్మన్ గా కూడా ఉండి,సంస్కృత భాషా వ్యాప్తికి యెనలేని సేవ చేశారు .సంస్కృతం బోర్డ్ మెంబర్గా ఆచార్యులవారు ,తెలుగు బోర్డ్ మెంబర్ గా దువ్వూరి వారు ఒకే కాలేజీ నుంచి వచ్చి రికార్డ్ సాధించారు .

ఆధారం –కళాప్రపూర్ణ దువ్వూరి వెంకట రమణ శాస్త్రి స్వీయ చరిత్ర .

  మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -29-10-19-ఉయ్యూరు

image.png

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

గౌతమీ మహాత్మ్యం-56 78-అప్సరోయుగ సంగమ తీర్ధం

గౌతమీ మహాత్మ్యం-56

78-అప్సరోయుగ సంగమ తీర్ధం

గౌతమమీనదికి దాక్షిణాన ఉన్న ఈ తీర్ధం ముక్తిదాయకం .వంద్య స్త్రీ భర్తతో మూడు నెలలు ఇక్కడ స్నానం చేస్తే పుత్ర సంతానం ఖాయం .దీని విశేషాలను నారదునికి బ్రహ్మ చెప్పాడు .విశ్వామిత్ర వసిస్ట మహర్షి లమధ్య వైరం మొదటి నుంచి ఉంది .బ్రహ్మర్షి అవాలనే కోరికతో విశ్వామిత్రుడు  గంగా ద్వారంలో తీవ్ర తపస్సు చేస్తుంటే ఇంద్రుడు తపోభంగానికి ప్రయత్నింఛి మేనకను ప్రయోగించాడుఆమె వెళ్లి భంగం చేసి ఒక కూతురును కనీ ఆయనకిచ్చి వెళ్ళిపోయింది .చేసిన తప్పు తెలుసుకొన్న గాదితనయుడు దక్షణ తీరం చేరి కాలంజర తీర్ధం లో మళ్ళీ తపస్సు చేయగా దేవేంద్రుడు రంభ తిలోత్తమలను పురిగొల్పాలనుకొంటే కాదనగా ,గంభీర ,అతి గంభీర అనే అప్సరసలను ప్రేరేపించ గా వెళ్లి ప్రయత్నించారు .కాని మృత్యువుకంటే భయంకరుడు , భూలోకశంకరుడుగా ఉన్న మహర్షిని ఒక వేయ ఏళ్ళదాకా చూడనైనా చూడలేకపోయారు .తర్వాత దూరం నుంచే నృత్య గీతాలతో రెచ్చగొట్టే ప్రయత్నం చేయగా ,మహర్షి కోపం తో వారిని ద్రవరూపంగా మారిపొమ్మని శపించాడు .వారు మునిపాదాలపై పడిప్రార్ధించగా ,గంగా సంగమం పొందితే మళ్ళీ దివ్యరూపాలు వస్తాయని అనుగ్రహించాడు .ఇలా ఏర్పడిన ఈ రెండునదులను ‘’అప్సారో యుగం ‘’అంటారు  .ఈ రెండునదులూ గంగానది నికలిసి పరమపవిత్రమై ,మహాశివుని ఆవాస క్షేత్రమై పవిత్రమయ్యాయి .ఇక్కడి స్నానం సర్వ బంధ విమోచనం కలిగిస్తుందని బ్రహ్మ నారదునికి ఉవాచ .

79-కోటి తీర్థం

కోటీశ్వర శివ మహా దేవుడు ఉండే గంగానది దక్షిణ తీర తీర్ధమే ఇది .కణ్వుని కొడుకు బాహ్లికుడిని కాణ్వుడు అంటారు .వేద వేదాంగ పారగుడై ,భార్యతో పార్వాయణాది ఇష్టులు బహు శ్రద్ధగా చేశాడు .నిత్యాగ్ని హోత్రుడు .ఒకరోజు అగ్నిహోత్రునికి హవనం లో ఒక ఆహుతి సమర్పించి ,మరొకటి ఇవ్వటానికి హవిర్ ద్రవ్యాన్ని చేతిలో తీసుకోగా ,అనుకోకుండా అని చల్లారి పోయింది .విచారం తో ఏం చేయాలోఆలోచి౦చాదు  .రెండు ఆహుతులమధ్య అగ్ని చల్లారింది కనుక మరో అగ్ని చేస్తే అది వైదికాగ్ని ఔతుందా ,లౌకికాగ్ని అవుతుందా అనే సందేహం కలిగింది .అప్పుడు అశరీరవాణి ‘’వేరే అగ్ని ఇక్కడ ఉపాదేయం కాదు. అగ్ని చుట్టూ ఉన్న నిప్పుకణికలను చేర్చి సగ౦కాలిన సమిధలతో జ్వాలచేసి అందులో ద్వితీయ ఆహుతి సమర్పించు ‘’అనగా కాణ్వుడు’’అది సరియైన పద్ధతికాద’’న్నాడు .అపుడు మళ్ళీ ఆకాశవాణి ‘’అగ్ని పుత్రుడు  హిరణ్య గర్భుడు .తండ్రి ,కొడుకూ అతడే .పుత్రునికోసం ఇచ్చేది తండ్రికి సంతోషం కలిగిస్తుంది .తండ్రికివ్వాల్సింది కొడుక్కు ఇవ్వచ్చు .ఇలాచేస్తే అది కోటి రెట్ల ప్రీతి కలుగ జేస్తుంది ‘’అన్నది .వేదవాణి వాస్తవ ధర్మాన్ని చెప్పింది అని అక్కడి మహర్షులు సమర్ధించారు  .అలాగేకాణ్వుడు చేశాడు .ఈ తీర్ధం లో చేసినదానం కోటిరెట్ల ఫలితమిస్తుంది కనుక కోటి తీర్ధం అన్నారు .దీనికే కాణ్వ తీర్ధమని పేరు  .పితరులపేర ఇక్కడ దానమాచరిస్తే  కోటిరెట్ల ఫలం కలుగుతు౦దని నారదునికి బ్రహ్మ చెప్పాడు .

 సశేషం

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -29-10-19-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

గౌతమీ మాహాత్మ్యం -55 76-మార్కండేయ తీర్థం

గౌతమీ మాహాత్మ్యం -55

76-మార్కండేయ తీర్థం

బ్రహ్మ దేవుడు నారదమహర్షికి మార్కండేయ తీర్ధ విశేషాలు తెలియ జేస్తున్నాడు .సర్వక్రతువులకు ఫలం ,సర్వ పాప పరిహారం చేసేది ఈ తీర్ధం .మార్కండేయ ,భరద్వాజ ,వసిష్ట ,అత్రి ,గౌతమ ,యాజ్ఞవల్క్య,జాబాలి మొదలైనమునులు మహా శాస్త్రవేత్తలు ,పురాణ న్యాయమీమాంస విషయాలలో పరిణత బుద్ధులు .ముక్తి విషయంలో ఎవరి అభిప్రాయం వారు చెప్పారు .జ్ఞానాన్ని కొందరు, కర్మను కొందరు భావిస్తే ,కొందరు రెండూ అవసరమే అన్నారు .ఏకాభిప్రాయంకుదరక బ్రహ్మ సలహాపై వీరు శ్రీమన్నారాయణ మూర్తిని చేరి అడుగుదామనుకొంటేశంకరుని వద్దకు పంపాడు హరి .గంగానదిలో ఉన్న పరమశివుని దర్శించి ,పూజించి ఆయనే ఆర్యుడు అని పొగిడారు .

  శివుడు వారితో ‘’కర్మయే ప్రధానం .జ్ఞానం క్రియారూపం .దానినే కర్మ౦టారు .ప్రాణులు సిద్ధిపొండటానికి కర్మకావాలి .కర్మ లేనిది ప్రపంచం లేదు. విద్య ,యోగం యజ్ఞం ,శివపూజా అన్నీ కర్మలే .అదికాదంటే పిచ్చితనమే .మృకండ సూనికి కుమారుడు మార్కండేయుని సమక్షం లో ఈ సర్వవిషయ చర్చ జరిగి కర్మ చేతనే అంతాపొందబడుతోంది అనే నిర్ణయం ఎక్కడ జరిగిందో ,ఆ తీర్ధం మార్కండేయ తీర్ధంగా విరాజిల్లింది .గంగానదికి ఉత్తరాన ఉన్న ఈ తీర్ధం పితృదేవతలకుపావనం ,స్మరణమాత్రం చేత ముక్తినిచ్చేది.ఇక్కడే 98తీర్దాలున్నాయి .వేదం కూడా ఈమాటే చెప్పింది .మహర్షులూ ఆమోదించారు’’ అని నారదునికి బ్రహ్మచెప్పాడు.

77-కాలాంజర తీర్థం .

నారదునికి బ్రహ్మ కాలాంజర తీర్ధ విశేషాలు చెబుతూ దీనికి ‘’యయాతమ్’’ అనే పేరుందని ,ఇక్కడ శివుడు కాలామ్జర పేరుతొ కొలువై ఉన్నాడని చెప్పాడు. నహుషునికొడుకు యయాతి రాజు అపర దేవేంద్ర వైభవమున్నవాడు.పెద్దభార్య దేవయాని ,శుక్రాచార్యుని కూతురు చిన్నపెళ్ళాంశర్మిష్ట వృషపర్వుని కొమార్తె .

 బ్రాహ్మణపుత్రిక దేవయాని ప్రజ్ఞావంతురాలు .శుక్రుని అనుగ్రహం తో యయాతిభార్య అయింది .దేవయానికి యదు ,తుర్వసుడు కుమారులు శర్మిష్టకు ద్రుహ్యుడు ,అనుడు ,పూరుడు కొడుకులు .దేవయానికొడుకులు శుక్రుని రూపం తో ,శర్మిష్ట కొడుకులు ఇంద్ర అగ్ని వరుణ తేజస్సులో ఉంటారు .దేవయాని ఒక రోజు తండ్రి దగ్గరకు వెళ్లి ‘’నాకు ఇద్దరే ,నా సవితికి ముగ్గురు కొడుకులు .నాభర్త నాకు అపచారం చేశాడు కనుక నేను జీవించలేను ‘’అని మొరపెట్టుకొన్నది .శుక్రుడికి అల్లుడిపై కోపమొచ్చి యయాతి దగ్గరకు వెళ్లి తనకూతురుకు అపచారం చేసినందుకు ముసలివాడు కావాలని ,ముసలి రూపమున్నా కోరికలు చావక వార్ధక్యాన్ని భరించలేక కుమిలిపోవాలని శపించాడు .శుక్రుని కోపాన్ని భరించలేక యయాతి ‘’నేను పాపం ,అపకారం అపరాధం చేయలేదు .నీకూతురేవో లేనిపోనివి నీకు చెబితే వచ్చి అనవసరంగా నన్ను శపించావు .ఇది తగదు ‘’అన్నాడు .శుక్రుడు జరిగింది అర్ధం చేసుకొని,తప్పు దేవయానిదే అని గ్రహించి జాలి  పడినా ఇచ్చిన శాపం వెనక్కి తీసుకోలేనని ,కాని శాపానుగ్రహంగా ‘’నువ్వు ఎవరికైనా నీముసలితనం ఇచ్చేస్తే  నా శాపం తీరిపోతుంది .నీకు మళ్ళీ యవ్వనం ప్రాప్తిస్తుంది ‘’అన్నాడు .

  కృతజ్ఞత చెప్పి యయాతి రాజధాని చేరి పెద్దకొడుకు యదువు తో తనముసలితనాన్ని గ్రహించమని కోరగా కుదరదన్నాడు .తర్వాత  తుర్వసుడు,ద్రుహ్యుడు ,అనువు  కూడా తిరస్కరించారు .ముగ్గుర్ని శపించి మిగిలిన ‘’పూరు ‘’ను అడిగితె వెంటనే ఒప్పుకోగా ,ముసలితనం పొంది,యయాతి యవ్వనుడయ్యాడు వెయ్యిన్నొక్క ఏళ్ళు సకల భోగాలు అనుభవించాడు యవ్వనంతో యయాతి .సంతృప్తిపొంది కొడుకుని పిలిచి’’ నీయవ్వనం తీసేసుకొని నా ముసలితనం నాకిచ్చేసెయ్యి’’  అనికోరగా ప్రాజ్ఞుడైన పూరుడు’’తండ్రీ !ముసలితనం వలన నాకోరికలు నశించాయి .వృద్ధాప్యం అనివార్యంకదా.ఈ ముసలితనాన్ని తపస్సు చేత జయించి సార్ధకం చేసుకొంటాను ‘’అని వినయంగా చెప్పి, గంగానదికి వెళ్లి దక్షిణ తీరం పై గొప్పతపస్సు చేశాడు .శివుడు ప్రత్యక్షమై వరం కోరుకోమనగా ‘’మహేశా !మా తండ్రి జరను నశింపజేసి ,నా సోదరులకు శాపవిముక్తి కలిగించు ‘’అని కోరగా శివుడు అలాగే అనుగ్రహించాడు .అప్పటినుంచి ఈ తీర్ధం జరాదుల వినాశకరమై ,శివునిపేర’’కాలంజర తీర్ధం ‘’గా ప్రసిద్ధి చెందింది .ఇక్కడే యాయతం,నాహుషం ,పౌరం ,శౌక్రం ,శార్మిస్టం మొదలైన 108 తీర్దాలేర్పడి భుక్తి ముక్తి ప్రదాయంగా వున్నాయని బ్రహ్మ నారదునికి చెప్పాడు ..

   సశేషం

మనవి-కిందటి మాఘమాసం చివరిరోజు 6-3-19న 54వ ఎపిసోడ్ తో తాత్కాలిక విరామం తీసుకొని ,ఈకార్తీకం మొదటిరోజున 55వ ఎపిసోడ్ తో ‘’గౌతమీ మహాత్మ్యం ‘’కొనసాగిస్తున్నానని మనవి .

కార్తీకమాస ప్రారంభ శుభాకాంక్షలు

మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -28-10-19-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

27-10-19ఆదివారం మా ఇంటి దీపావళి

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

27-10-19ఆదివారం మా ఇంటి దీపావళి జీరో బడ్జెట్ తో (నిరుడు మిగిలిన సరుకు కాల్చి)

27-10-19ఆదివారం మా ఇంటి దీపావళి జీరో బడ్జెట్ తో (నిరుడు మిగిలిన సరుకు కాల్చి)

https://photos.google.com/share/AF1QipMbcEa1-fHyZfPI5DXBSHNsYmXIxnq_mVEv_57q579Ssjq3QhteaxZ45wnEPI_9Pw/photo/AF1QipOmnlSgoeM-PXalMDs1iCqw9AX66Ar5_IV-veMe?key=cHh3Vy1RaDZvcTEtSTVlbmlkaThOYkJURUN5ZnZn

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

‘’గద్య పద్య ధారణా బాల సరస్వతి’’ చిరంజీవి విష్ణుభట్ల కార్తీక్ బందరు ధారణావధానం

‘’గద్య పద్య ధారణా బాల సరస్వతి’’ చిరంజీవి విష్ణుభట్ల కార్తీక్ బందరు ధారణావధానం

 

సన్నగా పీలగా పొడుగ్గా బక్కపలచని యెర్రని రూపం సంప్రదయ  పంచకట్టు చొక్కా ,మెడలో జరీ అంచు ఖండువా , నుదుట విభూతి  రేఖలపై యెర్రని బొట్టు తో 13ఏడేళ్ళ ఎనిమిదవ తరగతి  బుడతడు ,’’అపర బాలమురుగన్’’ గా  నిన్న 25-10-19శుక్రవారం సాయంత్రం 6గం.లకు బందరు మహతీ ఆడిటోరియం లో ‘’తెలుగు భాషా సాంస్కృతిక సమాఖ్య ‘’నిర్వహించిన గద్య పద్య ధారణావధానం లో’’బాల ధారణా ధురీణ ‘’గా తన సామర్ధ్యాన్ని వందకు పైగా హాజరైన రసజ్ఞులైన ప్రేక్షక మహాశయుల ఎదుట నిరూపించుకొని శాహభాష్ అనిపించాడు .ఈ చిరంజీవి తలిదండ్రులు శ్రీ విష్ణు భట్లురమాకాంత్, శ్రీమతి లక్ష్మీ దుర్గ ల అంటే రమాకాతుడైనవిష్ణుమూర్తికి ,లక్ష్మీ  దేవిల కడుపు పంట ఐన ఈ చిన్నారి హరిహర రూపాత్మకుడై పద్య గద్యాలను పై స్థాయిలో పాడుతున్నా గొంతులో రవంత జీరకాని ,అస్పష్టత కాని లేకపోవటం సభ్యులను అబ్బుర పరచింది .భావ వివరణలో అత్యంత సునాయాసంగా ,తానే ,ఒక’’ మల్లినాథ సూరి’’లాగా విడమరచి చెప్పటం అందరినీ అలరించింది .అడుగడుక్కీ హర్ష ధ్వానాలు పలికి సభ్యులు మహదాన౦దాన్ని ,తనివి తీర అనుభవించారు .

 వయసు రెండున్నర నుంచే పద్య ధారణ చేసి ఆలపిస్తూ ,మూడవ తేటనుంచి వేదికపై అరంగేట్రంచేసి ,పద్య ధారణప్రస్థానం  కొనసాగిస్తున్నాడు .2012తిరుపతి ప్రపంచ తెలుగు మహా సభలలో,ముందుగా ఉపవేదికపై అవకాశం పొంది ,సత్తా చూపి అసలు వేదిక నెక్కి అసలైన సామర్ధ్యం చూపి అందరి ప్రశంసలు , దీవెనెలు,ఘనసన్మానం  అందుకున్నాడు కార్తీక్ .  రవీంద్రభారతి ,పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వ విద్యాలయం ,లలితా కళాతోరణం ,త్యాగరాజ గాన సభ వంటి విశిష్ట పండిత సభలలో తన ధారణా ప్రతిభ ప్రదర్శించి మెప్పు పొందాడు .చెన్నై వరల్డ్ తెలుగు ఫెడరేషన్ వారి జాతీయస్థాయి పద్యాలపోటీలో ప్రథమ బహుమతి నందుకొన్నప్రజ్ఞాశాలి .నారాయణ రెడ్డి ,మాడుగుల ,గరికపాటి ,కాశీ లోని శ్రీ కొల్లూరి అవతార శర్మ వంటి ఉద్దండ పండిత ,అవధానకవుల ఆశీస్సులు పొందిన ధన్యబాలుడు .ఉపరాష్ట్రపతి శ్రీ వెంకయ్యనాయుడు చేత తన స్వర్ణభారతి ట్రస్ట్ కు స్వయంగా ఆహ్వానింప బడి పద్య ధారణచేత పులకిప జేసి  సత్కరింప బడిన చిన్నారి ఈ చిరంజీవి .శివ దేవుని చిక్కాలలో అశ్వారోహణ పొంది పురవీడులలో ఘనంగా ఊరేగింపు పొందిన భాగ్యశాలి .అన్నవరం ద్వారకా తిరుమల ,దేవాలయాలలో ,దూరదర్శన్ లో ధారణా ధీరత్వం భక్తిభావానా మాధుర్యం చాటిన వాడు కార్తీక్ .

  నిన్న బందరు ధారణావధానం లో నేను సంచాలకునిగా ,పురాణేతి హాసాల పృచ్ఛకునిగా ద్విపాత్రాభినయం చేశాను ..మొదట అందరికీ దీపావళి శుభాకాంక్షలు చెప్పి ,ధనత్రయోదశి నాడు కార్తీక్’’ పద్య లక్ష్మీకనక ధార’’ కరిపించి బందరు పురజనులను తనియింప జేయాలని కొరాను. దీపావళి సందర్భం గా భాగవత పురాణం లో  నరకాసుర సంహార ఘట్టం లో పోతనగారు సత్యభామ వీరశృంగార రసాభినయాన్ని వర్ణించిన పద్యం చెప్పమని కోరగా చిరంజీవి’’వేణిం జొల్లెము వెట్టి,సంఘటిత నీవీ బంధయై భూషణ శ్రేణి దాల్చి,ముఖేందు మండల మరీచీ జాలముల్ బర్వగా పాణిన్ పయ్యెద జక్కగా ‘’దురిమి ,శు౦భద్వీర సంరంభియై –ఏణీ లోచన  లేచి నిల్చె,తనప్రాణేశాగ్ర భాగంబునన్ ‘’కమ్మగా పాడి వినిపించాడు     భావరాగ యుక్తంగా శ్రావ్యంగా పాడి వినిపించాడు ..సత్యభామ వ్యస్తాలీఢ పాదం తోచేసిన యుద్ధ వర్ణన బాగా వివరించాడు .దానికి మెచ్చినేను’’ బాపుగారు సత్యభామ ఈభంగిమను అత్యద్భుతంగా చిత్రీకరించారు .ఆయన దీపావళి గ్రీటింగ్స్ లో ఇది కనబడి కను విందు చేస్తుంది ‘’అని చెప్పాను . నేను మళ్ళీ ‘’పరుజూచున్ వరు జూచు ‘’ అనే పద్యం చెప్పమంటే’’ రాదు గురువుగారు ‘’అని సవినయంగా చెప్పాడు .కనుక ఇకపై పృచ్చకులందర్నీ’’ప్రత్యేకించి పద్యాలు గద్యాలు అడగవద్దు .ఎందులోకావాలో అడిగితె అదు లోనివి తనకు వచ్చినవి ధారణ చేస్తాడు ‘’అని చెప్పి ,అతని కి ఏమి వచ్చో దానినే విని ఆన౦దిద్దాం రానిదానిపై ప్రశ్నించవద్దు ,ఇది పరీక్షకాదు‘’అని చెప్పాను .అయినా ఆపద్యం మీకోసమైనా నేను చెప్పాలికదా –

‘’పరు జూచున్ వరు జూచు నొంప నలరింపన్ రోష రాగోదయా
విరత భ్రూకుటి మందహాసములతో వీరంబు శృంగారమున్
జరుగన్ కన్నులు కెంపు సొంపు బరగన్ జండాస్త్ర సందోహముల్
సరసాలోక సమూహమున్ నెరపుచున్ చంద్రాస్య హేలాగతిన్’’

సత్యభామ వీర శృంగార సౌందర్య ,భయ రౌద్ర రూపం దాల్చింది .కొడుకైన దుష్టనరకుడిని నరికి పారేసింది .

దీనికి అంటే పోతనగారికి ప్రేరణ పద్యం ‘’ఉత్తర హరివంశం’’ లోని నాచన సోముడు చెప్పినపద్యం –

‘’అరిజూచున్ హరిజూచు ,జూచుకములదందమందార కే-సరమాలా,మకరంద సలిల స్యదంబు లందంబులై –తొరుగం బయ్యెద కొంగొకింత దొలగం దొడ్తో శరాసారమున్ –దరహాసామృత పూరముం గురియుచు దన్వంగికేలీగతిన్ ‘’

  తర్వాత కార్తీక్ భారతం లో ఉదంకోపాఖ్యానపద్యాలు, రామాయణ పద్యాలు ధారణ చేశాడు .పద్మావతి మహిళాకళాశాల ఉపన్యాసకులు శ్రీమతి గురజాడ రాజ రాజేశ్వరి కావ్యాలలోని పద్యాలను ధారణ చేయమనగా ,మను వసు చరిత్ర పద్యాలు ,ఆముక్తమాల్యద లోని అత్యంత క్లిష్టమైన పద్యం ధారణ చేసి విభ్రాంతి కలిగించాడు .అవధానులపద్యాలపై పృచ్చించిన ప్రముఖ రచయిత్రి శ్రీమతి సిహాద్రిపద్మ సర్వశ్రీ మాడుగుల ,గరికపాటి, రాళ్ళబండి అవధానకవుల పద్యాలు అడగగా అత్యంత సునాయాసంగా పద్యాలు రాగయుక్తంగా వారి వారి ప్రత్యేక బాణీలతో విరుపులతో ,చమత్కారాలతో వారే వచ్చి మన కళ్ళ ఎదుట నిలబడి పద్యం చెబుతున్న భ్రాంతిని అద్భుతంగా కలిగించాడు చిన్నారి చిరంజీవి .’’తెభాసం స ‘’ కార్యవర్గ సభ్యురాలు ప్రముఖ కవయిత్రి శ్రీమతి గుడిపూడి రాదికారాణి’’ శతకాలపై ప్రశ్నిస్తూ ధూర్జటి రామదాసు ,శతకాలపపద్య ధారణ చేయమని కోరగా మంచి పద్యాలు ఎన్నుకొని ధారణ చేసి మెప్పించాడు .దూర్జటిలోని భక్త్యావేశం ,రామదాసులోని,ఆర్తి వేమనలోని చిత్తశుద్ధి ,విమర్శ కళ్ళముందు నిలిపాడు .చివరగా శ్రీ వెంకటేశ్వర దేవస్థానం స్థానాచార్యులు శ్రీ ముత్తేవి శ్రీనివాస శశికాంత్ పృచ్ఛి౦చిన’’భగవద్గీత ‘’లో శోక్లాలను అర్ధవంతంగా అర్ధతాత్పర్య సహితం గా చెప్పి ధారణావధానం కరతాళధ్వనులమధ్య ముగించాడు కార్తీక్ .

  తర్వాత సుమారు 45నిమిషాలు మన బాల సరస్వతి తన ఏకబిగి ధారణా దారామకరందం తో అందరినీ సంతృప్తులను చేశాడు .’’శ్రీనివాస గద్యాన్ని’’అలవోకగా నాన్ స్టాప్ గా కర్ణపేయంగా ధారణ చేసి మురిపించాడు .నేను ‘’ఇందులో ఒక్కపదం అర్ధం మనకు తెలియకపోయినా ,అందులోని నాదమాదుర్యం మనల్ని ఏడుకొండలని ఎక్కించి, ఆ తిరుమల నాథుని సన్నిధానానికి చేర్చింది .  పరబ్రహ్మ నాదానంద విభూతి దాయకుడు కదా .’అని చెప్పి ప్రేక్షక జనాలను లేచినిలబడికరతాళధ్వనులు చేయమని అంటే ‘’స్టాండింగ్ వోవేషన్’’ఇవ్వమని  కోరగా, అందరూ అలాచేసి తమ ఆనంద హర్షామోదాలు తెలియజేసి చిన్నారిని మనః పూర్వకంగా ఆశీర్వదించారు .

అలాగే భాగవతం లో గజేంద్ర మోక్షం లోనిపోతనగారి అరణ్య వర్ణన  గద్యాన్నిసు శ్రావ్యం గా   ధారాపాతంగా వినిపించాడు .నేను ‘’పోతనగారికవిత్వం మందార మకరంద మాధుర్యం .ఆయన గద్యలోనూ ఆ మాధుర్యం కరిపించాడు .అడవిలోని ప్రతిమొక్క చెట్టూ చేమా లతా తీగా,అన్నీ మనకు గోచరి౦జేశాడు .గద్యం రసాత్మకం కావ్యం అనే భ్రాంతి కలిగించాడు .చిన్నయసూరి గద్య నీతి చంద్రిక మనం చిన్నప్పుడు చదువుకొని అందులోని పద బందురాన్ని ఆస్వాదించాం .చిన్నయ సూరి బాలవ్యాకరణం లోని సూత్రాలలో గొప్ప  ఛందస్సు,లయ  ఉందని , అందులోని కవితా మాదుర్యాన్ని బ్రహ్మశ్రీ దువ్వూరి వెంకట రమణ శాస్త్రిగారు ‘’రమణీయం ‘’గ్రంథంలో దీన్ని నిక్షిప్తం చేశారని ,శాస్త్రి గారు వ్యాకరణం బోధిస్తుంటే కావ్యాన్ని బోధిస్తున్నట్లు ఉండేదని చెప్పాను .అంతసులభంగా గ్రామర్ బోధించటం ఎవరి తరమూకాలేదని ,మిగిలినవారు బోధిస్తుంటే శిష్యులు అర్ధంకాక తలలు పట్టుకొని కూర్చునే వారని చెప్పాను .  కవితాప్రసాద్ గారి ‘’కాదంబిని’’కావ్యంలో అమ్మవారిపై ఆయన రాసిన శతక పద్యాలలో అయిదారు అదే భక్తీ తాత్పర్యాలతో ధారణ చేసి గొప్ప అనుభూతికలిగించాడు .ఆముక్తమాల్యద లోని క్లిష్ట పద్యాలను మనుచరిత్రలోని ‘’పూతమెరుంగులున్ పసరు పూపబెడంగులు ‘’అనే దీర్ఘ చంపకమాలను చివర చెప్పిన ‘’సంస్కృతంబు పచరించిన పట్టున ‘’అనే దానితో సహా గానం చేసి తెలుగు సంస్కృత కవితా మాధుర్యాన్ని ఎదుట నిలిపాడు .అలాగే హరిశ్చంద్ర నాటకం లో చేరిన జాషువా గారి ‘’కాటి సీను ‘’పద్యాల ధారణతో కరుణ రసస్పూర్తి కలిగించాడు .చివరగా తెలుగు భాషా మాధుర్యం గొప్పతనం నేర్వవలసిన ఆవసరం గుర్తుకు తెస్తూ మంచి పద్యాలు ధారణ చేసి అందరికి కర్తవ్య బోధ చేసి,ధారా  ధారణ సమాప్తి చేశాడు . నేను ‘’ఈ చిరంజీవిని ఇక్కడి పాఠశాలలలకు  ఆహ్వానించి ,ధారణావధానం చేయించి విద్యార్ధులలో ప్రేరణ ఉత్సాహం స్పూర్తి కలిగించాలి .బందరులో సినిమా వారం ఆడితే రాష్ట్రం లో యాభై రోజులు ఆడుతుందనే నమ్మకం ఉండేది .ఇక్కడ ఈ కుర్రాడికి జరిగిన సత్కారం దేశమంతటా జరగాలి .అతనుక్రమంగా ఎదిగి అవధాని అవ్వాలి .గజారోహణగౌరవం కూడా పొందాలి’’అన్నాను . గాయని శ్రీమతి కాళీ పట్నం ఉమగారి భర్తనాదగ్గరకు వచ్చి పరిచయం చేసుకొని ,ఉదయం ఈచిరంజీవితో జైహింద్ హైస్కూల్ లో ధారణా చేయిచా మనే మంచి వార్త తెలియజేశారు.   ఆహ్వాన సంఘం గౌరవాధ్యక్షులు శ్రీ సిలార్ గారి ఆధ్వర్యం లో శ్రీ దత్తాత్రేయ శర్మగారి నేతృత్వంతో కార్తీక్ కు అతని మాతృమూర్తికి శాలువా ,నగదు,గులాబిమాల , జ్ఞాపిక లతో ఘనంగా సత్కరించి కార్యక్రమాన్ని చిరస్మరణీయం చేశారు .సరసభారతి తరఫున కార్తీక్ కు శాలువా కప్పి 500రూపాయల నగదు ,సరసభారతి రెండు పుస్తకాలు బహూకరిచాను నేను . తర్వాత చాలామంది నగదు ,శాలువాలు అందించి తమ అభిమానం చాటారు .దత్తాత్రేయ శర్మ గారు నాకు 500రూపాయలు కవర్ లోపెట్టి అందజేశారు .

యుటిఎఫ్ మాజీఅధ్యక్షులు ,తెలుగుభాషా సాంస్కృతిక సమాఖ్య మాజీఅధ్యక్షులు స్వర్గీయ శ్రీ పెనుబోతు వెంకటేశ్వరరావు గారి స్మారక సాహిత్య కార్యక్రమ౦ గా జరిగిన ఈ కార్యక్రమం ఆయన సేవలను బహుధాకొనియాడి ఘననివాళి ఘటించారు .ఈ మొత్తం కార్య క్రమానికి రూపశిల్పి ,నిర్వహణ చేసిన శ్రీ దండిభోట్ల దత్తాత్రేయ శర్మ అభినందనీయులు .

 నన్ను ఒక కార్యకర్త బైక్ మీద బస్ స్టాండ్ లో దింపగా రాత్రి 9-30 బస్ ఎక్కి ఉయ్యూరుకు రాత్రి 10-45కు చేరి ,ఇంత మజ్జిగన్నం తిని పడుకొన్నాను .

  రేపు27-10-19   దీపావళి శుభాకాంక్షలతో

మీ- గబ్బిట దుర్గాప్రసాద్ -26-10-19-ఉయ్యూరు

Posted in సభలు సమావేశాలు | Tagged | Leave a comment

దీపావళి శుభాకాంక్షలు

సాహితీ బంధువులకు ఈ రోజు 25-10 -19 శుక్రవారం ధనత్రయోదశి ,రేపు 26-10-19 శనివారం నరక చతుర్దశి ,ఎల్లుండి 27-10-19 ఆదివారం దీపావళి 28-10-19సోమవారం పవిత్ర కార్తీకమాస ప్రారంభ శుభాకాంక్షలు -దుర్గాప్రసాద్

image.png

image.png

image.png
image.png
image.png
Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment