ఉయ్యూలోని ‘హిందూ స్మశాన వాటిక అభి వృద్ధికి ”అమెరికా నివాసి శ్రీ మైనేని గోపాల కృష్ణ గారి విరాళం

సాహితీ బంధువులకు -శుభకామనలు -ఉయ్యూరు వాసి ,ప్రస్తుతం అమెరికా నివాసి శ్రీ మైనేని గోపాల కృష్ణ గారు ఉయ్యూరు లో ”హిందూ స్మశాన వాటిక ‘ను రోటరీక్లబ్ వారు  ఆధునీకరించి అభివృద్ధి చేస్తున్న సందర్భం గా నా ద్వారా విషయం తెలుసుకొని ఉడతా భక్తిగాతానూ భాగస్వామి అవాలనే తలంపు తో ఇరవై అయిదు వేల రూపాయలు విరాళం గా నాకు పంపి రోటరీ వారికి అందజేయ మన్నారు .ఈ రోజు ఉదయం పదకొండు గంటలకు మా శ్రీ సువర్చలాన్జనేయ స్వామి వారి ఆలయం లో ,మీడియా మిత్రుల సమక్షం లో రోటరీ క్లబ్ ప్రెసిడెంట్ శ్రీ నాగేశ్వర రావు గారికి స్టేట్ బాంక్ ఆఫ్ ఇండియా  చెక్ ద్వారా అంద జేశాను  మై నెని వారి వదాన్యతకు క్లబ్ ప్రెసిడెంట్ గారు ఎంతో కృతజ్ఞత తెలియ జేశారు .ఇలాంటి  దాతల సహకారం వలననే శ్మశానాన్ని ఒక కోటి రూపాయలతో ఆధునీకరించే ప్రాజెక్ట్ చేబట్టామని ,దాతల సహకారం మరువ లేనిదని స్వచ్చందం గా ముందుకొచ్చి విరాళాలు అందిస్తున్నారని మైనేని వారికి ప్రేరణ కలిపించి విరాళం తెప్పించిన దుర్గా ప్రసాద్ గారి లాంటి వారి సహకారం మరచిపో లేనిదని చెప్పారు.దుర్గా ప్రసాద్  .myneni donation to rotary club uyyuru 001

ఉయ్యూరు హిందూ శ్మశాన వాటిక ఆధునీకరణ అభి వృద్ధికి అమెరికా వాసి శ్రీ మైనేని గోపాల కృష్ణ గారు రోటరీ క్లబ్ వారికి ఇచ్చిన విరాళం ఇరవై అయిదు వేల రూపాయల చెక్ ను అండ జేస్తున్న చిత్రాలు 100_3482 100_3483 100_3484 100_3485 100_3486 100_3487 100_3488

 

Posted in సరసభారతి ఉయ్యూరు | Tagged | 1 Comment

సరసభారతి సమావేశంలో – ఏకపాత్రాభినయం

This gallery contains 13 photos.

More Galleries | Tagged | Leave a comment

పూర్వాంగ్ల కవుల ముచ్చట్లు -32 అంతమైన స్వప్నం

పూర్వాంగ్ల కవుల ముచ్చట్లు -32

అంతమైన స్వప్నం

ఒకరి ప్రతిభతో ఒకరు పోల్చటానికి వీలు లేక పోయినా వర్డ్స్ వర్త్ ,కాల్రిద్జ్ టేలర్ ,సూతే లు కొత్త మార్గాలు తొక్కారు .తిరుగు బాటు చేయక పోయినా వ్యతిరేకించారు .మనిషి సాటి మనిషిపై బాధ్యత గురించి ఆలోచించారు .రాజకీయాల బదులు సాంఘిక నీతి రాజ్యమేలాలని స్వప్నించారు (యుటోపియ).తమ సృజన తో ఆత్మ శక్తిని అందించి మంచి గొప్ప ప్రపంచం కోసం కలలు కన్నారు .కాని అవి కల్లలే అయ్యాయి .దీనికి అనేక సంఘటనలు కారణమయ్యాయి .వాగ్దానాల హోరేక్కువైంది .బాస్తిల్లీ పతనం వలన రోమాన్స్ ,రివల్యూషన్ లు పల్చ బడ్డాయి .తిరుగు బాటు యువకుల కర్తవ్యమే అయింది .కవులు శృతి కలిపారు లు . వర్డ్స్ వర్త్  వీరందరి తరఫునా వకాల్తా తీసుకొని ‘’bliss was it in that dawn to be alive –but to be young  was very heaven ‘’.అని చెప్పాడు .

కల సాకారం కావాలనే అందరూ భావించారు .స్తబ్దత నుంచి చైతన్యం రావాలని కోరారు .కాని శిష్యులకు వాస్తవం చెడు అయింది .హింస ధ్వనిని తట్టుకోలేక పోయారు ఫ్రెంచ్ .విప్లవం తరువాత  నాలుగేళ్ళకు  ఇంగ్లాండ్ ఫ్రాన్స్ తో యుద్ధం చేసింది .నియంత నెపోలియన్  బెదిరింపుతో  భయం తో పందొమ్మిదో శతాబ్ది ఉదయించింది .తిరుగు బాటు విముక్తి కి అని ,యుద్ధం భావ శుద్ధి (కేతార్సిస్ )కి అన్న అభిప్రాయం తప్పు అయింది .యువత అంతా మధ్య తరగతి కన్జర్వేట్లు గా మారారు .సూతీ ఆస్థాన కవి అయ్యాడు .కాల్రిడ్జి  లైబ్రరీ పుస్తకాలలో కూరుకు పోయాడు .వర్డ్స్ వర్త్ ప్లేటు మార్చి’’ టోరీ’’ అయ్యాడు .

ప్రకృతి కవి – విలియం వర్డ్స్ వర్త్

ప్రకృతికవి అని పిలువ బడే విలియం వర్డ్స్ వర్త్ 7-4-1770నకంబర్ లాండ్ లో కాకర్ మౌత్ లో పుట్టాడు .ఇది అందమైన లేక డిస్ట్రిక్ట్ లో దార్వేంట్ నదీ తీరం లో ఉంది .తండ్రి లాయర్ .ఎస్టేట్ వొనర్ కూడా .వీరిని’’ నార్త్ కంట్రీ పీపుల్స్ ‘’అంటారు .పురాత యార్క్ షైర్ ముతక మనుషులని ముద్రపడ్డారు .భాష కూడా చాలా మొరటుగా ఉంటుంది ..అయిదుగురు పిల్లలలో విలియం రెండవ వాడు .తల్లి ముప్ఫై ఏళ్ళకే చని పోయింది .విలియం సోదరి డరోతి కంటే భిన్నమనస్తత్వం ఉన్న వాడు .చిన్నప్పుడే మూడీ గా కొరుకుడు పడనీ వాడుగా ఉండేవాడు .ఒక సారికోప పడితే గదిలో దూరి చస్తానంటూ బెదిరించాడు .అమ్మ తరఫు బంధువులైన ‘’కూకాంస్ ‘తరచూ వచ్చి వెల్తూండేవారు .వారిలో మేరీ హచిన్సన్ అనే కజిన్ పై ప్రేమలో పడి పెళ్లి చేసుకొన్నాడు .తల్లి చావుతరవాత ఎనిమిదో ఏట హాక్ షెడ్ లోని గ్రామర్ స్కూల్ కు పంపారు .ఏదో వానాకాలం చదువు చదివి అత్తిసరు మార్కులతో ముక్కాడు .క్లాసు పుస్తకాలలోని చదువుకంటే విండర్ మీర్ ,ఆమ్బుల్ సైడ్ పర్వత దృశ్యాల వలన నేర్చిన చదువే ఎక్కువ .ఇంటిలో ఉండే ఆనందం కంటే ఇక్కడే ఎక్కువ ఆనందం సంతోషం పొందేవాడు .ఆటా పాటా ,స్కేటింగ్ ,నడక కొండలేక్కి దిగటం సరస్సులో స్నానాలు ఏంతో ఇష్టం గా ఉండేవి .స్వీయ జీవిత చరిత్ర గా పిలువ బడే ‘’ప్రేల్యుడ్ ‘’లో ఇవన్నీ రాసుకొన్నాడు కవితాత్మకం గ .‘’attends upon the motion of the winds –embodied in the mystery of words’’అందుకే ఈ కవిని ‘’the essential passions of the heart ‘’కు అంకితమైన కవి అంటారు .

తండ్రి మరణం తర్వాత కుటుంబం విచ్చిన్నమైంది .పద్నాలుగేళ్ళప్పుడు అన్న రిచర్డ్ తోకలిసి అమ్మ తరఫు ‘’కాక్సంస్ ‘’ల దగ్గరకు చేరాడు .చిన్నప్పటి నుంచి అన్యోన్యం గా మెలగిన సోదరి దరోతి తల్లి కజిన్ దగ్గర పెరుగుతోంది .పదేళ్లకు కాని ఆమెను మళ్ళీ చూడలేక పోయాడు .ఎవరి మీదో ఆధారపడి ఉండటం ఇష్టం లేని విలియం పది హేడవ ఏట సెయింట్ జాన్స్ కాలేజిలో చేరి విశేష ప్రతిభ కనబరచాకుండానే ,చదువు పై అంతశ్రద్ధ లేకుండా చదువంటే ఏవగింపు కలిగి మానేశాడు .వికారం గా’’ వేగ బాండ్’’గా  కని పించేవాడు .మృదు స్వభావం లేదు .మొరటుతనమే కనిపించేది అన్నిట్లోనూ .స్నేహితులూ ఏర్పడలేదు .ఒంటరిగా రోడ్ల మీద తిరుగుతూ బయటికి వినిపించేట్లు పాడుకొంటూ తిరిగే వాడు .వంద  పంక్తుల ‘’యాన్ ఈవెనింగ్ వాక్ ‘’కవిత రాసి తన తీరు తెన్నులను నింపాడు .జేమ్స్ బీటిల్ అనే  మినిస్త్రెల్ ‘’ప్రేల్యుడ్ ‘’రాయమని ప్రోత్సహించాడు .

కాలేజి లో చదువు పూర్తిచేసి  లా చదువుతాడేమో నని  కుటుంబం ఆశ పడింది .మనవాడికి ఆ ధ్యాసే లేదు .పార్శ్వ నెప్పి ,తల నెప్పి తో బాధ పడేవాడు .విలియం ఏది చేసినా చెల్లెలు హర్షించేది .’’ఆరోగ్యం బాగా ఉంటె వాడే లా చదువుతాడులే ‘’అని సర్ది చెప్పేది .సైన్యం లో చేరాలను కొన్నాడు .లండన్ చేరి ఫ్రాన్స్ లో జరుగుతున్న విషయాలు తెలుసుకొన్నాడు బాష్టిస్తి పతనమైంది .రాజరికాన్ని కూల ద్రోసి ప్రజాస్వామ్యం ఏర్పరచారు ..ప్రేల్యుడ్ కవితలను బ్యూపే అనే ఆతను మెచ్చి ప్రోత్సహించాడు .స్వార్ధ రహిత విప్లవ వాదిగా మారాడు .దానినే ‘’France standing at the top of golden hours –and human nature seeming born  again ‘’అని కవిత్వీకరించాడు .నిరంకుశత్వాన్ని ఈసడించాడు .ప్రజలు తమ భవిష్యత్తును తీర్చి దిద్దుకోవాలని చెప్పాడు .ఇదొక ‘’యుటోపియా ‘’.దీన్ని సాధ్యం చేయాలని ఆలోచించాడు .ఒక రకం గా .పునర్జన్మ పొందాడు .ఆర్లియాన్స్ లో ఒక లాడ్జి లో ఉన్నాడు .పాల్ వాలన్ తోపరిచయం జీవితాన్నే మార్చేసింది .అయన తన సోదరి ‘’ఆన్నేట్టే ‘’ను కవికి పరిచయం చేశాడు .ఆమె ఫ్రెంచ్ కన్య .మన వాడి మారిన మనస్తత్వం ఆమెకు నచ్చింది  .ఇద్దరూ ప్రేమలో పడి ఒక కూతురుఆన్ కరోలిన్  ను కన్నారు .ఫ్రాన్స్ ఇంగ్లాండ్ మధ్య యుద్ధం మొదలైంది .ఎక్కడికీ కదిలే వీలే లేకుండా పోయింది .భార్య పిల్లను పంపే అవకాశమే లేదు. ఇంగ్లీష్ దేశస్తుడైనా తను ‘’ప్రపంచ భక్తుడు ‘’అని పించుకొన్నాడు .ఆ ఊహా ప్రపంచానికి తన భార్య ఒక ప్రతీక అనుకొన్నాడు .

ఇరవై మూడులో తీవ్ర హింసల పాలయ్యాడు .ఫ్రాన్స్ లో హింస రాజ్యం చేస్తోంది .కాని ఇది ప్రపంచ విముక్తికి దోహదం చేస్తున్దనుకోన్నాడుపాపం .భార్య విషయం లో ఆందోళన ఎక్కువైంది .అక్రమ సంతానానికి కారకుడైనందున ఇంట్లోకి రానివ్వలేదు .అక్కడ భార్య ఇతనికోసం ఎదురు చూస్తోంది .భర్త ఏదో ఒక రోజు వచ్చి కలుసుకొంటాడని ఎదురు చూస్తోంది .కానిమనవాడు ఆ జ్ఞాపకాలన్నీ తుడిచేసుకొన్నాడు .ఆమెతో జరిపిన ఉత్తర ప్రత్యుత్తరాలను తగల బెట్టాడు .ఈ ఉదంతాన్ని డెబ్భై ఏళ్ళు దాచేశాడు విలియం మరణం తర్వాతే ఇది బయట పడింది .ఆమెకు ద్రోహం చేశానని మనసు క్షోభ పడుతోంది .విప్లవం ఊపులో అన్నీ మరిచాడు .చివరికి అది రక్తపు టేరులను పారిస్తోందని తెలుసుకొన్నాడు .ట్యూటర్ గా ,మేగజైన్ కు రచయితగా ఉండాలనుకొన్నా సాగలేదు .సంపాదనే లేదు. స్నేహితుల దయాదాక్షిణ్యం పైనే జీవిస్తున్నాడు .క్షయ తో మరణానికి చేరువ లో ఉన్న రైస్లీ అనే అతనికి సేవచేశాడు .అతని మరణం తో తొమ్మిది వందల పౌండ్లు లభించాయి .

డరోతి మేనమామల ఇల్లు వదిలి విలియం ను చేరింది .పల్లె టూరు లో ఉండాలని కోరింది .అతను  ‘’నేచర్స్ లారిఎట్ ‘’కావాలని భావించింది .లండన్ వెళ్ళిపోయాడు .మళ్ళీ దొర్సేట్ షైర్ లో రేస్ డౌన్ లో ఒక అద్దె ఇల్లు తీసుకొని ఉన్నారు .వారిద్దరి మధ్య విపరీతమైన ఆకర్షణ ప్రేమ ఉండేవని చరిత్రకారులు చెప్పారు .వారిద్దరి మధ్యా సంభాషణలు కూడా ప్రేమికుల సంభాషణల్లా ఉండేవి .ఆమె ఇతని భావాలకు విరుద్ధం గా కని  పించేది .ఇరవై మూడేళ్ళ వయసులో ఒక పబ్లిషర్ విలియం రాసిన ‘’డిస్క్రిప్టివ్ స్కెచెస్ ‘’,యాన్ ఈవెనింగ్ వాక్ ‘’లను ముద్రించి ఇచ్చాడు .ఇవి ఆగస్టన్ పోయిట్రీకి అనుకరణ .సమీక్షలు ఆశా జనకం గా రాలేదు. కాల్ రిడ్జి వచ్చి వీరితో చేరిన తర్వాతే విలువతెలిసింది .వర్డ్స్ వర్త్ ‘’వర్త్ ఏమిటో ‘’ లోకానికి తెలిసింది ఆంగ్ల కవిత్వా తీరు తెన్ను మార్చేసే కవిత్వం వచ్చింది .కాల్ రిడ్జికి విపరీతమైన భావోద్రేకం ఊహా ఉన్నాయి .వర్డ్స్ వర్త్,  కాల్ రిడ్జి,  సూతే త్రయం అవిభాజ్యమై కొత్తపోకడలతో ఇంగ్లీష్ కవిత్వాన్ని కదను తొక్కించారు .

సామ్యుల్ టేయిలర్ కాల్ రిడ్జి

కాల్ రిడ్జ్ రాసి వదిలిన వాటిని పూర్తీ చేయటానికి రెండు నిండు జీవితాలు చాలవు అంటారు .తేల్చుకోలేని మనస్తత్వం ,నల్లమందు భాయీ .21-10-1772లో దేవాన్ లో సెయింట్ మేరీ లోని ఒటారిలోజన్మించాడు .పదముగ్గురి లో చివరి సంతానం .అన్నతో గొడవ పడి వాడు చావా కొడితే నది ఒడ్డున స్పృహ తప్పి పడిపోయి మర్నాటి దాకా లేవలేదు .చలికి ఒళ్ళు మొద్దుబారింది. దీనితో నరాల బాధలేర్పడ్డాయి .అందువలన జీవితం అంతా దాదాపు పనికి రాని  వాడుగా ఉండి పోవాల్సి వచ్చింది .ఒంటరిగా పుస్తకాలతో కాలక్షేపం చేశాడు .’’అరేబియన్ నైట్స్ ‘’చదివి ఆరేళ్ళ వయసులో సాహస గాధ లంటే మహా ఇష్టపడ్డాడు .మాయలు మంత్రాలు తమాషా కధలు చదివి రాత్రుళ్ళు పలవ రించేవాడు ..తొమ్మిదో ఏట దరిద్రం తో తండ్రి చనిపోయాడు .ఒక లోకల్ జడ్జి కాల్ రిడ్జి ని చారిటీ స్కూల్ లో చేర్పించాడు. .అక్కడి మురికి వాతావరణం నచ్చలేదు.తిండి అసలు బాగా లేదు చిన్న రొట్టె ముక్కే గతి .ఇవి భరించలేక ఒక మూల చేరి ‘’చదువే చదువు’’ గా గడిపాడు .రివరెండ్ జేమ్స్ బాయర్ అనే టీచర్ మాత్రం ఇతన్ని దారిలో పెట్టి మార్చాడు .’’Boy! the school is your father .The school is your mother –the school is your sister .,your brother all the rest of your relations ‘’అని ప్రబోధించాడు .జీజస్ ను ప్రేమించమని బోధించాడు .అంటే కాల్ రిడ్జి జీవితం కార్నర్ తిరిగింది .

అతని చూపుల్లో మార్పు వచ్చింది కాని కవళికలు ఒకదానికొకటి పొంతన లేకుండా ఉన్నాయి .కళ్ళల్లో కాంతి ప్రస్పుటం గా గోచరిస్తోంది .అందరిలో కొట్టవచ్చినట్లు ప్రత్యేకం గా కని  పించే వాడు .విలియం ‘’రిడ్జి’’ ని ఇంటికి ఆహ్వానిస్తే అతని సోదరి ఇవాన్స్ పై మనసు పారేసుకొని ,చెట్ట పట్టాలేసుకొని తిరిగాడు .ఆమెపై కవితా వర్షం కురిపించాడు .కాల్ సోదరుడు లూక్ డాక్టర్  అయ్యాడు .మనవాడికి సర్జన్ అవాలనే అభిలాష కలిగింది .కుప్ప తెప్పలుగా మెడికల్ పుస్తకాలు, సామగ్రి అందు బాటులో ఉన్నాయి .రోగాల, మందుల గురించి సమగ్ర జ్ఞానం సాధించాడు .ఇదంతా ఒక భ్రాంతిలో చేసిన పని .కీళ్ళ వాతం తిరగ బెట్టింది .పది హేడు నుండి పందొమ్మిదేళ్ళ వరకు మంచం మీదే ఉండి పోయాడు .

జీసస్ కాలేజ్ కేంబ్రిడ్జి నుంచి స్కాలర్షిప్ పొందాడు .మంచానికే పరిమితమై పోయాడు .జబ్బుతో .ఫ్రెంచ్ రివాల్యూషన్ చూసి రిపబ్లికన్ గా మారి గొప్ప వక్త అయ్యాడు .అప్పులు ఎక్కువయ్యాయి  .తప్పించుకోవటానికి లండన్  పారి పోయాడు .దీనినే అతని భాష లో ‘’I fled to London to debauchery ‘’అన్నాడు .సంపాదన లేదు .ఉన్నదానితో గాంబ్లింగ్ ఆడాడు .ఆత్మ హత్యా ప్రయత్నం చేశాడు .ఇరవై ఒకటిలో పేరు మార్చుకొన్నాడు .ఆర్మీ లో చేరాడు .నాలుగు నెలల తర్వాత సోదరుడు జార్జి చలవ తో బయట పడ్డాడు .అన్నీ తొందర బాటు నిర్ణయాలే . కేంబ్రిడ్జి కి తిరిగి వచ్చి స్కాలర్షిప్ పునరుద్దరింప బడితే చదువు సాగించాడు .అద్భుతం గా అనేక అనువాదాలు చేశాడు .మొదటి రచన ‘’లెవ్ టి ‘’మొదలెట్టాడు .దీనికే ‘’సర్కాసియాన్ లవ్ చాంట్ ‘’అని మరో పేరు .రాబర్ట్ సూతీ తో పరిచయమేర్పడింది .ఇద్దరికీ కవిత్వం పిచ్చి ఎక్కువే .

రాబర్ట్ సూతీ

12-8-1774లో బ్రిస్టల్ లో పుట్టాడు రాబర్ట్ సూతీ .వంశం బాగా గౌరవాదరాలున్నదే .తాత సోమర్సెట్ రైతు .తండ్రి బట్టల వ్యాపారి .తల్లి సంపన్న గృహం నుంచి వచ్చింది .సూతీ పిన తల్లి రక్షణ లో పెరిగాడు .ఆడపిల్లలా ముద్దు చేసి డ్రెస్ చేసి ఆరేళ్ళ వరకు పెంచింది .ఎనిమిదో ఏట ‘’స్కిపియో ‘’అనే ట్రాజెడీ రాశాడు .తర్వాత కవిత్వం రాశాడు .పదమూడు లో పెద్ద అంత్య ప్రాసల కవిత్వం రాశాడు .లాటిన్ లో పాండిత్యం సంపాదించి తోటి వారికి నేర్పాడు .

స్కూల్ చదువు కుంటి నడక నడుస్తోంది ‘’ది ఫ్లాజలేంట్ ‘’అనే స్కూల్ మేగజైన్ ను నిర్వహించాడు .కాలానికి భిన్నమైన దొరణు లుంటే స్కూల్ నుంచి బయటికి పంపేశారు . క్రైస్ట్ చర్చికి అప్ప్లై చేస్తే తిరస్కరించారు .ఆక్స్ ఫర్డ్ లోని బిలియాల్ కాలేజి అడ్మిషన్ ఇచ్చింది .అందులో చేరిన కొద్ది రోజులకే బ్రిటన్ ఫ్రాన్స్ యుద్ధం మొదలైంది .చదువు వదిలేసి రిపబ్లికన్ అయ్యాడు .అక్కడ దేశం లో కొంపలు మునుగుతుంటే , స్వతంత్రం కోసం పోరు సాగుతుంటే  కాలేజిలో ‘’యూక్లిడ్ ‘’చదువుతూ కూర్చోవటం భావ్యం కాదను కొన్నాడు .ఈ భావాలతో ‘’జోన్ ఆఫ్ ఆర్క్ ‘’రాయటం ప్రారంభించాడు .ఇంకా అప్పటికి వేదాంతం ఒంట బట్టలేదు .యువ రక్తపు పొంగులో రాసిన రచన అది .సమాజానికి తీవ్ర చికిత్స కావాలన్నాడు .అమెరికా వెళ్ళాలనే ఆలోచనా వచ్చింది .అమెరికా లో స్వాతంత్ర పోరాటం నచ్చింది. స్వేచ్చ పొందటం ఆకర్షించింది .

అరిస్తోక్రసికి వ్యతిరేకం గా పాంటిసోక్రసి  ఏర్పాటు

సూతీ కాల్రిడ్జి స్నేహిత బృందం ఆడా మగా కలిసిఒక బృందాన్ని ఏర్పాటు చేసుకొన్నారు   .ఆదర్శ జీవితం గడపటమే ధ్యేయం .అందులో పన్నెండు జంటలు ఉన్నాయి  .కొంత పొలం సంపాదించారు .ప్రతి వారూ రోజుకు మూడు నాలుగు గంటలు కస్టపడి పని చేయాలి .వచ్చింది అందరూ సమానం గా అనుభవించాలి .ఒక నమూనా రాజ్య స్థాపన చేయాలని ఆదర్శం .యుద్ధానికి ,విప్లవానికి దూరం గా ఉండి దీన్ని సాధించాలని ప్లాన్ .కాల్రిడ్జి దీనికి నికి పాంటిసోక్రాసి పాన్తిసోక్రసి ‘’అని పేరు పెట్టాడు .ఇది అరిస్తోక్రసి కి వ్యతిరేకం .స్వయం నిర్ణయ ప్రభుత్వం ఏర్పడాలి .కొద్ది మందిని ఎన్నుకొని వారిద్వారా పాలన సాగించాలి .ఇందులో ప్రతి ఒక్కరికీ సమాన హక్కులూ బాధ్యతలు ఉంటాయి .ఇదొక సాంఘిక సంస్థ .వీరి భావనలు అభిప్రాయాలు అంతా కవితాత్మకం గా ఆకర్షణీయంగా  గా ఉన్నాయి .కొంత కాలం ఈ ‘’స్వప్న లోక విహారం’’ బాగానే నడిచింది. కాని కాల్ రిడ్జి ఇవాన్స్ ను మర్చిపోలేక  పోతున్నాడు .సారా ఫ్లికర్ కు లైన్ వేస్తున్నాడిక్కడ .ఇంగ్లాండ్ వదిలి ఊహా లోకం లో విహరించ వద్దని మేరీ ఇవాన్స్ చెబుతూనే ఉంది .ఆమె ఇతన్ని సోదరుడి లాగా భావిస్తున్నాని రాసింది .షాక్ అయి అవాక్కయ్యాడు  ఇర  ఇరవై మూడు వయసులో కాల్ రిడ్జి సారా ను పెళ్లి చేసుకొన్నాడు ..యెంత పకడ్బందీ గా ప్లాన్ చేసినా ‘’పాంటిసోక్రసి ‘’ఇబ్బందుల పాలయ్యింది .ఇంగ్లాండ్ అమెరికాల మధ్య కొత్త ఒప్పందం కుదిరింది .ఈ బృందం వేల్సు లో ఒక ప్రదేశాన్ని ఎన్నుకొని అక్కడికి చేరి రచనలు చేసి ,వ్యవసాయం చేస్తూ డబ్బు సంపాదించా లను కొన్నారు .ఇందులో ఇద్దరు అప్పుల్లో మునిగి ఉన్నారు .బృందం చీలిపోయే దశకు చేరింది .’’the fraternal group ceased to fraternize ‘’అయిపొయింది .ఒకరి నొకరు తిట్టుకొన్నారు .సూతీ రహస్యం గా ఎడిత్ ను పెళ్ళాడాడు .ఆమె లా చదవటానికి నిర్ణయించుకోంది. కాల్ రిడ్జి ఈ ముఠాను వదిలేసి క్లేవేడాన్ చేరి కవిత్వం లో పడ్డాడు .

ఈ త్రయం పై మరి కొన్ని విశేషాలు ఈ సారి

SamuelTaylorColeridge.jpg  William Wordsworth 001.jpg

Robert Southey.jpg   రాబర్ట్ సూతీ                                    

కాల్రిడ్జి                                                           వర్డ్స్ వర్త్

రాబర్ట్ సూతీ

సశేషం

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -29-5-14-ఉయ్యూరు

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

రాచకీయ ద్విప్లేట్స్ -34(సామాన్యుడు అసామాన్యుడైన వేళ)

                          రాచకీయ ద్విప్లేట్స్ -34(సామాన్యుడు అసామాన్యుడైన వేళ)

1-భారత ప్రజాస్వామ్యాన్ని మళ్ళీ బతికించాడు ఓటరైన ‘’సామాన్యుడు’’

 కుళ్ళిన సమాజాన్ని ,అవినీతి పాలకుల్ని ఏరిపారేసి అనిపించాడు ‘’అసామాన్యుడు ‘’ .

2-ప్రజలు ,సార్క్ దేశాధిపతుల సమక్షం లో ప్రధానిగా పట్టాభిషిక్తుడైన ‘’మోడీ ‘’

   సమర్ధుడు  తగిన నాయకుడు,పాలకుడు యెంత వెతికినా  –ఇంకోడు’’ ఏడీ?’’

3- అర్హత ఉన్నవారిని తన సహచర మంత్రులుగా చేర్చి పక్కన పెట్టి   ముసలి ముఠా

   శాఖలూ సమర్దులకే అప్పగించి కొత్తరక్తం ఎక్కించి ఉత్సాహం ఊపు నిచ్చిపేల్చాడుజోడు గుళ్ళపిస్తోలుఠా.

4-మంత్రిపదవి  పొందింది  రాహుల్ ను ముప్పతిప్పలు పెట్టిన ‘’ఇరానీ స్మృతి’’

  పాపం ‘’మొద్దబ్బాయి’’ నిద్రపట్టకుండా  తలచు కొంటాడేమో  ‘’పరాభవ స్మృతి ‘’?

5-కాంగ్రెస్ కొంప ‘’ఖాళీ ‘’

 పని చేయ దింక ఏ’’ మోళీ ‘’.

6-.ఎక్కిన మర్నాడే ‘’నల్ల కుబేర భరతం’’ పట్టటానికి ఏర్పాటు చేశాడు  ‘’సిట్’’

  పదేళ్ళు పాలించినా ఆదిశలో ముందుకు వెళ్ళకుండా చేసిన కాంగీ పాలన ‘’షిట్ ‘’.

7-కొత్త రాజధాని, రాష్ట్రం అభి వృద్ధికి దాతలను ప్రోత్సహిస్తున్న ‘’ఆంద్ర జ్యోతి ‘’

  వరదలా వచ్చి పడుతున్న నిధులతో నిండుగా  వెలగాలి ‘’ స్వర్ణాంధ్ర జ్యోతి ‘’.

8-పదికోట్ల మంత్రం జపించే సి.పి.ఐ ‘’నారాయణ ‘’

  సి.పి.ఏం . ముందు భంగపడి  అయ్యాడు అయ్యో ‘’వెర్రి నాయన ‘’

9-జగన్ పార్టీ ది పరనిందా,’’సొంత డబ్బా ‘’

  మైసూరా ,వెంకన్న ముఠావాయించేది’’ పరస్పర డబ్బా ‘’.

10-ఓడినా సిగ్గురాని ఖద్దరు  చేతి నేతలు

  అది నేత్రి పాదాల పై ఇంకా పడి లేవని’’ పీతలు ‘’.

     మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -28-5-14-ఉయ్యూరు

Posted in రాజకీయం | Tagged | Leave a comment

”మహిళా మాణిక్యాలు ‘పుస్తకం పై శ్రీమతి కోపూరి పుష్పాదేవి సమీక్ష -ఆంద్ర భూమి 25-5-14 ఆదివారం

manikyala samiksha 001

Posted in సరసభారతి ఉయ్యూరు | Tagged | Leave a comment

పూర్వాంగ్ల కవుల ముచ్చట్లు -31 హాలిక కవి –రాబర్ట్ బర్న్స్

పూర్వాంగ్ల కవుల ముచ్చట్లు -31

హాలిక కవి –రాబర్ట్ బర్న్స్

మరచి పోరాని కవిత్వం రాసి, మేధావిగా కష్టజీవి గా, విఫల రైతుగా ,సహజ పాండిత్యునిగా ,ప్రతీకాత్మక కవి గా ,లిజెండరీ హీరో గా ,సంచార జాతి దేవుడి గా రాబర్ట్ బర్న్స్ సుప్రసిద్ధుడు .’’ది ఫార్మర్స్ ఇంగిల్ ‘’అనే కవిత చాలా సాధికారకం గా రాశాడు .25-1-1759లోస్కాట్ లాండ్ లోని ఐరిషైర్ లో  కిల్ లోని అల్లోవే లో జన్మించాడు .తండ్రి విలియం బర్న్స్ స్వంత చేతులతో ఒక చిన్న కాటేజీ  నిర్మించుకొన్నాడు .అంతా రైతు వాతావరణం .తల్లి కూడా అదే కుటుంబం నుంచి వచ్చింది .చదువు రాని స్త్రీ .బైబిల్ లో కొన్ని పేజీలు  మాత్రం చదవ గలిగేది .జానపద కధలు చెప్పటం లో ఆరి తేరి ,పిల్లలకు  ఆ కధలతో వినోదం పంచేది .ఆమె సోదరి కూడా వీరితోనే ఉండి ఆమెకు పాటల్లో గృహ క్రుత్యాలలో తోడుగా ఉండేది .ఆరవ ఏట బర్న్స్ అల్లోవే స్కూల్ లో జాన్ మర్డాక్ దగ్గర విద్య నేర్చాడు..ఆ మేస్టారికి ఫుడ్డూ బెడ్డూ అన్నీ ఈ రైతులే చూసేవారు .నిర్దుష్టమైన ఇంగ్లీష్ ను పిల్లలు నేర్వాలని ఆయన తాపత్రయం .తండ్రి బర్న్స్ కు పొలం పనులు నేర్పాడు. మూడు వారాలు సెలవ ఇస్తే దూరం గా ఉంటున్న గురువు గారు మద్రోక్ దగ్గకు వెళ్లి చదువుకొనే వాడు

తండ్రికి మొదటి బ్రేక్ డౌన్ ,కొడుకు మొదటి కవిత ఒకే సారి వచ్చాయి .పది హేనవ ఏట రైమ్స్ తో కవిత్వం రాశాడు .కూలీల కష్ట జీవితాలను పేదరికాన్ని కవిత్వీకరించాడు .పంటలు వాటికి పట్టే చీడ పీడలూ కవిత్వం లో చోటు చేసుకొన్నాయి .పందొమ్మిది లో కుటుంబం లోచ్లీ కి మారి ఏడేళ్ళు ఉండి పోయారు .ఇరవైలో అలిసాన్ బేగ్ బీ అనే పని కత్తే ను ప్రేమించి ముగ్గు లోకి దించాడు ..ఆమెపై కవితలూ రాశాడు .ఇక్కడి వాతావరణం నచ్చక ఇర్విన్ వెళ్ళాడు .తండ్రి అప్పులపాలై క్షయ సోకి చావు బతుకుల మీద ఉన్నాడు .తండ్రి దగ్గరకు చేరి సేవ చేశాడు .అతనిలోని రచయిత బయటికి వచ్చి విజ్రుమ్భించాడు .తండ్రి మరణానికి ముందు ‘’కామన్ ప్లేస్ బుక్ ‘’మొదలు పెట్టి రాస్తున్నాడు మనసులో మెదిలిన ప్రతిభావాన్నీ కాగితం పై పెట్టాడు .తండ్రి పోయిన తర్వాత వ్యవసాయం చేశాడు నకిలీ విత్తనాలు ,అదనుకు సాగు చేయక పోవటం తో నష్టాల్లో కూరుకు పోయాడు .పెట్టు బడులే రాలేదు .

ఈ వూరు వదిలేసి పక్కనే ఉన్న మాచ్లిన్ చేరాడు .అక్కడ అందమైన అమ్మాయిలూ సరదా అబ్బాయిలతో కాల క్షేపం చేశాడు .ఎలిజ బెత్ పాటన్ అనే మరో పని అమ్మాయి ని వలచాడు .ఆమెతో అక్రమ సంతానాన్ని పొందాడు .తండ్రి అయ్యాననే గర్వం తో’’ఏ పోఎట్స్ వెల్కం టు హిజ్ లవ్ బిగాతెన్ డాటర్ ‘’ ఒక కవిత రాసి పేపర్ కు పంపాడు .పుట్టిన పిల్లను బర్న్స్ తల్లే పెంచింది .ప్రియురాలికి ఇరవై పౌండ్లు ఇచ్చి సర్దు బాటు చేసుకొన్నాడు. ఆమె తలిదండ్రులను చేరింది .తెలియని జబ్బు ప్రవేశించి బాధిస్తోంది .రాసిన కవితలను చేతి వ్రాత ప్రతులనే అందరికీ ఇచ్చే వాడు .స్టాంజాలు రాయటం లో కొత్త పుంత తొక్కాడు .అందుకే వాటిని ‘’బర్న్స్ స్టాం జాలు ‘’అనే ముద్రపడింది .’’జాలీ బెగ్గర్స్ ‘’అనే కవిత తరతరాలుగా చదివించింది .ఇందులో జంతువుల ఆత్మ ఘోష ఉంది .

ఇరవై ఆరులో ఒక తాపీ మేస్త్రి కూతురు జీన్ ఆర్మార్ ను ప్రేమించాడు .తండ్రి ఒప్పుకోలేదు .సాక్షుల సమక్షం  లో పెండ్లాడి లీగల్ మారేజీ చేసుకొన్నాడు .మామ కు కోపం వచ్చి ఇతన్ని అల్లుడే కాదు పొమ్మన్నాడు .వినే వాడిది పాపం కవితలు పిలిచి వినిపించేవాడు .జమైకా వెళ్లి చెరుకు సాగు చేద్దామనుకొన్నాడు .ఇంతలో ఇంకో పాలమ్మే మేరీ కాంప్ బెల్ అనే అమ్మాయిని లైన్ లో పెట్టుకొన్నాడు .ఆమెను ‘’హైలాండ్ మేరీ’’అని పిలిచి కవిత్వం చిందించాడు .ఆమెకు కడుపోచ్చింది .పిల్లను కనీ ఆమె చనిపోయింది. బర్న్స్ అనారోగ్యం పాలయ్యాడు .చనిపోయిన మేరీ పై ఎలిజీ రాశాడు .జమైకా వెళ్లి చెరుకు సేద్యం చేశాడు .ఇక్కడా నెత్తిన చేతులే .మామగారి తో అసమర్దుదనిపించుకొని వ్యవసాయం లో దెబ్బతిని ఏమీ సాధించలేని వాడని ముద్రపడ్డాడు. చివరికి కవిత్వమే శరణ్యం అనుకొన్నాడు .జాలీ బెగ్గర్స్ ను ఒక మారుమూల ఊరిలో ప్రింట్ చేశాడు మూడు  షెల్లింగుల రేట్ పెట్టాడు .చాలా మంది ఎగపడి చందా రారులై నారు ప్రింట్ చేసి డబ్బు బాగా సంపాదించాడు .ఒక్క నెలలో ఒక అజ్ఞాత పల్లెటూరి అంత్య ప్రాసల కవి కవిత్వాన్ని ఆరు వందల మంది పోషించి వెలుగు లోకి తెచ్చారు ఇరవై  ఏడు లో ‘’సేలేడోనియా బార్డ్ ‘’అని ఆ అమాయక అక్షరం ముక్క రాని ప్రజల చేత కీర్తింప బడ్డాడు బర్న్స్ .స్కాటిష్ మాండలికం లో ఉన్న ఇంగ్లీష్ శైలిలో వాటిని నగిషీలు చెక్కాడు .ఇంగ్లీష్ కవిగా గుర్తింపు పొందాలని ఉవ్విళ్ళూరుతున్నాడు .కిల్మర్నాక్ పోయెమ్స్ గా పిలవ బడే ఈ కవితలు నలభై మూడు .ఇందులో చేత్తకవితలూ ఉన్నాయి .ఒక మంచి కవిత ను చూద్దాం –

‘’is there in human form ,that bears a heart –a wretch a villain lost to love and truth –that can with studied ,sly ,ensnaring art –beasty sweet jenny;s un suspecting youth ‘’

ఈ సంకలనం డబ్బు నిచ్చింది .దానితో ఆశ పెరిగి అదృష్టాన్ని పట్నం లో పరీక్షించుకొందామని ఎడిన్ బర్గ్ చేరాడు .అక్కడి సాహితీ ప్రముఖులేవరూ స్వాగతించలేదు .’’పొలం లో పెంట పోగు  మీద పెరిగిన పుష్పం గా ‘’అందరూ భావించారు .మనిషి అధైర్య పడ్డ్డాడు .పేరు  ప్రఖ్యాతులు ఒక్క సారిగా రావని గ్రహించాడు .క్రమం గా జనం దగ్గరకు వస్తున్నారు .ప్రతిభకు గుర్తింపు వచ్చింది .చిన్న చిన్న సన్మానాలు చేస్తున్నా వారి మధ్య తానూ తేలి పోతున్నట్లు భావించాడు డబ్బు వస్తోందికాని మానసికానందం లేదు .ఎరల్ ఆఫ్ గ్లేన్కారిన్ సహాయం తోతన కవితల  రెండవ ఎడిషన్ తెచ్చాడు .చేతిలో డబ్బు ఆడుతోంది .కాని మానసిక ప్రశాంతత కరువైంది .సరిహద్దు రాష్ట్రాలు తిరిగాడు ప్రయోజనం కనీ పించలేదు .పల్లె జనుల పాటలు వింటూ వాటి ని సరి చేస్తూ హాయిగా గడిపాడు .

ఎడిన్ బర్గ్ లో స్కాటిష్ సాంగ్స్ ను’’స్కాట్స్ మ్యూజికల్ మ్యూజియం ‘’వెలువరించే ప్రాజెక్ట్ లో జేమ్స్ జాన్సన్ వచ్చి సహాయం చేయమంటే చేశాడు .అవి ఆరు వాల్యూములుగా తెచ్చారు .అందులో బర్న్స్ ఎక్కడ  సరిదిద్దాడో ఎక్కడ స్వంతవి చేర్చాడో   తెలీకుండా చేశాడు .వినటానికి మహా కర్ణ పేయం గా వచ్చాయి .బర్న్స్ జీఎవితం లో ఇదొక గొప్ప ఎచీవ్ మెంట్ అయింది .ఈ ప్రాజెక్ట్ వలన బర్న్స్ ఒక’’ లిరిక్ రైటర్’’ అని పేరు వచ్చింది .ఇంటికి వెళ్ళటానికి ఇష్టం లేదు .రెండో సారి ఎడిన్ బర్గ్ కు వచ్చినప్పుడు  ఆగ్నెస్  మాక్లి హోస్ ను ప్రేమించాడు  .ఆమె ఇతనికి తగిన అమ్మాయి .అప్పటికే ఇద్దరు పిల్లలు పుట్టారు. కాని పెళ్లి చేసుకోలేదు  .అదృష్టం కలిసొచ్చి ఎక్సైజ్ లో ఆఫీసర్ ఉద్యోగి అయ్యాడు .నిత్ నది ఒడ్డున  డం ఫ్రైస్ లో చిన్న వ్యవసాయ క్షేత్రం కొన్నాడు .జీన్ కు ఇద్దరేసి కవల పిల్లల్ని కన్నది నలుగురూ రోజులే బతికి చనిపోయారు .అప్పడు పెళ్లి చేసుకోన్నాడామెను .దాన్ని’’I gave her a matrimonial title to my corpus ‘’ అని కవిత్వీకరించాడు .జీన్ గ్రుహిణిగా ప్రింటర్ గా ,సహకరించింది .స్మగ్లింగ్ ను అరికట్టే ఉద్యోగం చేస్తూ ఏడాదికి యాభై పౌండ్ల జీతం పొందుతున్నాడు .జీన్ స్వయం గా పొలం పనులు చేస్తూ చేయిస్తూ ఉండేది మరో బిడ్డ జననం .ఇక్కడి నీరస జీవితం బోర్ కొట్టింది .

ముప్ఫై రెండులో అన్నే పార్క్ అనే బార్ లో అమ్మాయిని పడేశాడు ప్రేమలో. ఆమె ఆరాధనలో మళ్ళీ కవిత్వం దూకి పారింది .ఈ ప్రేమకు ఒక కూన కూడా పుట్టింది .అక్కడ జీన్ మరో పిల్లాడిని కన్నది. ఐలిష్ లాండ్ వ్యవసాయం ఏమీ కూడు పెట్టటం లేదని గ్రాహించి మొత్తం అంతా అమ్మేశాడు .డంఫ్రైస్ కి మకాం మార్చి వచ్చే కొద్ది జీతం తో బతికాడు .అయిదేళ్ళు ఇక్కడే ఉండి చనిపోయాడు .రాజకీయాలు  ,పౌర సమస్యలపై రాశాడు .1776అమెరికన్ కాంగ్రెస్ ను మెచ్చుకొన్నాడు .ఫ్రెంచ్ విప్లవాన్ని సమర్ధించాడు .1792లో నిత్య గర్భిణి అని పించుకొన్న జీన్ ఇంకో పిల్లఎలిజ బెత్ ను  ప్రసవించింది .పొలం లో పంట  పండించా లేక పోయినా   భార్య  జీన్ కడుపు పండిస్తున్నాడీ హాలిక కవి .ఇదివరకటిలానే ఈ సంతానమూ దక్కలేదు .బర్న్స్ కుఫిట్లు  ,తాగుడు వలన వాత రోగం వచ్చింది .అయినా ‘’జాన్ ఆండెర్సన్ మై జో ‘’,అనే పురాతన బూతుకదను ఆధునిక పరిభాషలో మార్చి వివాహ బాంధవ్యాన్ని బలపరచేట్లు రాశాడు .కిల్మార్ నాక్ ఎడిషన్ తర్వాతా ఆరేళ్ళకు కొత్త ఎడిషన్ తెచ్చాడు అందులో ఇరవై  తొమ్మిది కొత్త కవితలున్నాయి .ఇందులో కొన్ని ‘’రౌడీ రైమ్స్ ‘’కూడా చేరాయి .

ముప్ఫైలలో వ్యాధి పెరిగింది .ఇంకో ఏడాదికి మరీ క్షీణించి పోయాడు .ఆకలి లేదు.ఎముకల పోగుగా మిగిలాడు .గోరు చుట్టుమీద రోకటి పోటు లా ఒక పబ్లిషర్ బర్న్స్ ఒక బిల్లుకు డబ్బు చెల్లించలేదని కోర్తుకెళ్లాడు .జైలుకు వెళ్ళాల్సి వస్తుందేమో నని మోనని భయ పడ్డాడు .భార్య జీన్ కు జాబు రాశాడు పరిస్తితి ని తెలియ జేస్తూ .అవే చివరి అక్షరాలు  .21-71796న హాలికుడై  ,నిరాశతో ఆల్కహాలికుడైన కవి రాబర్ట్ బర్న్స్ చనిపోయాడు .గొప్ప కవుల జాబితాలో బర్న్స్ చేరడు .లోతైన అంతర్ ద్రుష్టి ,ఊహా లేనికవి .భాష హోరేత్తిస్తుంది .రసహీంత ఇబ్బంది కలిగిస్తుంది .కాని ‘’Burns distilled a pure essence of the crude stuff of life ‘’అని తేల్చారు .’’a conciliation of the regional and the universal was finally accomplished .The overwhelming conflicts may have resulted in the death of the peasant ,but they brought everlasting life to the poet ‘’.

 

బర్న్స్ కవిత్వం లో రిపబ్లికనిజం తో బాటు రాదిక లిజం కూడా ఉన్నాయి .అతని దస్తూరి అనేక రకాలుగా ఉండేది అందుకని ‘’మానిక్ డిప్రెషన్ ‘’లో ఉండేవాడని తెలుస్తోంది .’’బ్లూ డేవిలిజం ‘’తో బాధ పడినట్లు అతనే చెప్పుకొన్నాడు .స్కాటిష్ కేనదియన్లు బర్న్స్ ను అమితం గా ఆరాధించారు .అమెరికా నవలా కారుడు స్టెయిన్ బెక్ బర్న్స్ కవితలో ఒక భాగాన్ని తీసుకొని ‘’ఆఫ్ మిస్ అండ్ మెన్ ‘’నవల రాశానని చెప్పుకొన్నాడు .సాలింజర్ కూ ప్రేరణ నిచ్చినకవి .బర్న్స్ రచనలు రష్యన్ భాషలోకి అనువాదం చెంది సామాన్యులను విశేషం గా ఆకట్టుకొన్నాయి .’’ఏ మాన్స్ ఏ మాన్ ‘’కవిత రష్యన్ లకు ప్రగతి శీలం గా అనిపించి’’ప్రోగ్రెసివ్ ఆర్టిస్ట్ ‘’అన్నారు . 1924.రష్యాలోకి అనువదింప బడిన కవితలు ఆరు లక్షల కాపీలు అమ్ముడై రికార్డు సృష్టించాయి .బర్న్స్ పేరా ప్రత్యెక స్టాంప్ ను రష్యా ప్రభుత్వం విడుదల చేసింది .రాబర్ట్ బ్రౌన్ స్కాలర్శిప్పులిస్తున్నారు .బర్న్స్ పేరా అయిదు పది పౌండ్ల కరెన్సీ నోట్లు విడుదల చేశారు .’’ది గ్రేటెస్ట్ ష్కాట్ ‘’గా గౌరవించి ఆరాధిస్తున్నారు .

 

Inline image 1

 

సశేషం

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -27-5-14ఉయ్యూరు –

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

హనుమజ్జయంతి

ఉయ్యూరు శ్రీ సువర్చలన్జనేయ స్వామి దేవాలయం లో శ్రీ హనుమజ్జయంతి మూడుర్ ఒజుల పాటు  వైభవం గా జరిగింది . మొదటి రోజు 21-5-14బుధవారం ఉదయం అయిదు గంటల నుండి అష్ట   కలశాల శ్రీ స్వామి    స్నపన నిర్వహించాము   అనంతరం ,మన్యుసూక్తం తో అభిషేకం నిర్వహించాము ఆలయ అర్చకులు ఛి వేదాంతం మురళీ కృష్ణ ఈ కార్యక్రమాన్ని మా అబ్బాయి వెంకట రమణ స్వయం గా పాల్గొని  జరిపించాడు .ఉదయమ్ తొమ్మిది గంటలకు సామూహికం గా గంధ సిందూర పూజ జరిగింది .నైవెద్యమ్ తీర్ధ ప్రసాద వినియోగం తో మొదటి రోజు ఉదయం కార్య క్రమం పూర్తీ  అయింది

 

సాయంత్రం  సరసభారతి 61వ కార్య క్రమంలో  శ్రీమతి కొమాండూరి కృష్ణ ‘’దాస్య భక్తీ –శ్రీ ఆంజనేయ స్వామి ‘’అనే అంశం పై గంట సేపు అలవోకగా ,ఆసక్తిగా ,ఎన్నో ఉదాహరణలతో ,ప్రసంగించారు .యామెకు ఆలయ మర్త్యాదతోఅర్చకుడు సన్మానించాడు . సరసభారతి ఆమెకు చీరా జాకెట్ శాలువా 500రూపాయల  నగదు ,జ్ఞాపిక సరసభారతి పుస్తకాలనిచ్చి మా అమ్మాయి ఛి సౌ విజయ లక్ష్మి చేత  సత్కరించింది .ఇందులోకార్య దర్శి శ్రీమతి శివలక్ష్మి సహకరించింది . అంతకు ముందు హనుమాన్ చాలీసా చేసిన శ్రీ గుడిసేవ స్వామి కి రెండు వందల రూపాయలు నగదు కానుక గా అందించాను ..తరువాత శ్రీ సీతారామాంజ నేయ భక్త సమాజం వారు రెండుగంటల సేపు తన్మయత్వం తో భజన చేసి అందరి ప్రశంసలు అందుకొన్నారు .వారి నాయకులు శ్రీ బాబూరావు గారికి ఆలయ మర్యాదలతో ముందుగానూ తరువాత సరసభారతి సత్కరించి500రూపాయలు నగదు కానుక, శాలువా, జ్ఞాపిక పుస్తకాలను అంద జేసింది మొదటి రోజు కార్యక్రమం ఇలా భక్తీ శ్రద్ధలతో బాగా జరిగింది .

రెండవ రోజు 22-5-14గురువారం ఉదయం తొమ్మిది గంటలకు సామూహికం గా ,రసాల మామిడి పండ్ల   తో ,అరటి పండ్ల తో దానిమ్మ ,బత్తాయి ద్రాక్ష జామ సపోటా బొప్పాయి మొదలైన పండ్ల తో విశేష అర్చన నిర్వ హించాము .న భూతో గా సాగిన ఈ పండ్ల పూజ చాలా వైభవం గా జరిగింది .ప్రసాద నైవేద్యం ,మంత్రం పుష్పం తీర్ధ ప్రసాద వినియోగం తో ఉదయం కార్యక్రమం ముగిసింది .సాయంత్రంసరసభారతి నిర్వహించిన 62వ సమావేశం లో  మచిలీ పట్నం సోదరులు ఛి వీరు భొట్ల పవన్ కుమార్ (12సం ),వరప్రసాద్ (6సం)లు పల్నాటి బాలచంద్రుడు మాయ సభలో దుర్యోధనుడు ,అర్జునుడు మొదలైన వేషాలతో పౌరాణిక ,వేషధారణ తో ముచ్చటగా నటించి మెప్పించారు .నిన్న ,ఈ రోజు జరిగిన ఈ సాంస్కృతిక కార్యక్రమాలకు జనం పెద్దగా రాక పోవటం బాధించింది .ఎండ వేడి కూడా 43 ఉండటం ఒక కారణం అయి ఉంటుంది .పెళ్ళిళ్ళ సేజన్ కూడా .వీరు భొట్ల చిరంజీవులకు మా మనుమరాలు ఛి రమ్య చేత శాలువాలు కప్పించి ఒక్కొక్కరికి 500రూపాయల కానుక లిప్పించి పుస్తకాలు జ్ఞాపికలు అంద జేయిన్చాము .అంతకు ముందు ఆలయ సంప్రదాయం తో ఆ చిన్నారులకు శేష వస్త్రాలను అర్చకుని చేత అంద జేయిన్చాం .వీరి తండ్రి శ్రీ మూర్తి గారిని సరసభారతి సత్కరించి శాలువా1000రూపాయల నగదు పుస్తకాలు జ్ఞాపికలను మా అన్నయ్య గారి అబ్బాయి ఛి రామనాధ బాబు చేత ఇప్పించాము . మూర్తి గారు ఏంటో శ్రద్ధతో పిల్లలను తీర్చి దిద్దుతూ ,ఆహార్యం తానే సమకూరుస్తూ ,పడుతున్న కష్టం మరిచి పోలేనిది .కార్య దర్శి శ్రీమతి శివ లక్ష్మి కూడా పాల్గొన్నది .తర్వాతా జరగాల్సిన కూనపరెడ్డి వెంకటేశ్వర రావు భజన .అతను రాక పోవటం తో రద్దు అయింది .చక్ర పొంగలి పులిహోర ప్రసాదాలను అందరికి అంద జేశాం.దీనితో రెండవ రోజు కార్యక్రమం పూర్తయింది

23-5-14-శుక్రవారం  వైశాఖ బహుళ దశమి శ్రీ హనుమజ్జయంతి –సందర్భం గా ఉదయం ఆరు గంటల నుంచి పది గంటల వరకు’’ వంద కట్టల ‘’తమల పాకులతో విశేష అర్చన(నాగవల్లీ దళపూజ ) నిర్వహించాము .ఉదయం ఆలయం తెరచినప్పటి నుండి స్వామి వారల దర్శనానికి వందలాదిగా భక్తులు వచ్చి దర్శనం చేసుకొని వెళ్ళారు .పది గంటలకు శ్రీ సువర్చలాన్జనేయస్వామి వారాలకు శాంతి కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహించాము .మా ఆలయ అర్చకుడు మురళి,విశ్వశాంతి ఉపాధ్యాయుడు శ్రీ చక్ర వర్తి పౌరోహిత్యం చేసి విశేషాలను తెలియ జేస్తూ శ్రీ బలరామ కృష్ణ గారి సహకారం తో కల్యాణాన్ని కమ నీయం గా నిర్వహించారు. నేనూ ,మా శ్రీమతి పీటల మీద కూర్చుని శ్రీ స్వామి వారల కల్యాణాన్ని శ్రద్ధ గా నిర్వహించాము .ఎండ 44దిగ్రీలున్నా భక్త జనం సముద్రం లా వచ్చి ఆలయం లో బయటా షామియానాలలో కూర్చుని కన్నుల పండువుగా కల్యాణాన్ని దర్శించి తరించారు .మేము మాత్రమె స్వామి వారాలకు తలంబ్రాలు పోయటం కాకుండా వచ్చిన అందరి చేతా తలంబ్రాలనుప్రతిసారీ లాగే తలంబ్రాలు  పోయిన్చాము .భక్తులు పరవశించి పోయారు .శ్రీ బంగారు నాగేశ్వర రావు గారు ప్రతి ఏడాది లాగానే ఈ ఏడు కూడా స్వామి వారికి వెండి ఉత్త్తర జంధ్యాలు అమ్మ వారికి మట్టెలు ,మంగళ సూత్రాలుతయారు చేసి  తలంబ్రాలకు ముత్యాలు  తయారు  భార్య గారితో అంద జేశారు .ఆమె కూడా కల్యాణం అయేవరకు కూర్చుని ఆనందించారు .సరసభారతి కార్యక్రమాలను ఆలయం లో నిర్వహించ టానికి సహకరించిన మా అర్చకుడు ఛి మురళిని శాలువాతో ను 500రూపాయల నగటు తోను సత్కరించాము .హైదరాబాద్ నుంచి వచ్చిన మా పెద్ద కోడలు ఛి సౌ సమతా మా అమ్మాయి ఛి సౌ విజ్జి మా మనవరాలు ఛి రమ్య వచ్చిన వారందరికీ నిన్న పూజ చేసిన రసాల మామిడి పండ్లు అంద జేశారు .బహుశా ఉయ్యూరు లో ఇలా ప్రతి ఏడూ శ్రీ హనుమజ్జయంతి రోజున మామిడి పండ్లను పంచిపెట్టటం మా ఆలయం లో తప్ప ఏ ఆలయం లోను లేదు .దీనికి నాకు స్పూర్తి –మా చిన్నప్పుడు విష్ణ్వాలయం  లో వైశాఖ పౌర్ణమి నాడు శ్రీ వేణుగోపాల స్వామి  కల్యాణాన్ని నిర్వహించేవారు .ఉయ్యూరు హెడ్ కరణం స్వర్గీయ ఆదిరాజు నరసింహా రావు గారు ట్రస్ట్ బోర్డ్ అధ్యక్షులుగా ఉండి కార్యక్రమాన్ని నిర్వహించే వారు .అప్పుడు ‘’పోతుల్లాంటి బంగినపల్లి మామిడి పళ్ళు ‘’ఆందరికీ ఇచ్చేవారు .ఆ తర్వాత ఎవరూ చేసిన జ్ఞాపకం లేదు .మన ఆలయం లో భక్తుల సహకారం తో దీన్ని నిర్వహిస్తూ  వస్తున్నాము ..అప్పాలు ,రవ్వకేసరి ,పులిహోర ,పానకం ల ప్రసాదాలిచ్చి అందరి మన్ననలను పొందాము .సాయంత్రం కాలనీ మహిళా మండలి వారు శ్రీ హనుమాన్ చాలీసాను 108సార్లు పారాయణ చేసి భక్తీ ప్రకంపనలు సృష్టించారు .వీరికి  ప్రేరణ గా మొదటి నుంచీ ఉన్న యాభై ఏళ్ళ క్రిందటి నా శిష్యురాలు ,నా దగ్గర ఎస్ ఎస్ ఎల్ సి కి ట్యూషన్ చదివి మా ఇంట్లోనే పడుకొని చదివిన ఛి భాగ్య లక్ష్మి కి అందరి మాట గా మా పెద్ద కోడలు ఛి సౌ సమత తో శాలువా కప్పించి 500నగదు జ్ఞాపిక మహిళా మాణిక్యాలు పుస్తకం ఇప్పించాను .మా పెద్దబ్బాయిఛి శాస్త్రి  చిన్నప్పుడు భాగ్య లక్ష్మి చదివింది .వాడికి రోజూ జడ వేసి పూలు పెట్టేది .అలాంటి శాస్త్రి భార్య సమత చేత సన్మానం చేయించటం తమాషా అనిపించింది. మా అబ్బాయి ఛి రమణ మొక్కుకున్న108కొబ్బరి కాయలను మా కోడలు అమ్మాయి మనవరాలు బడ్డీ బుడ్డి వాళ్ళన్నయ్య పెద్దాడు సహాయంతో కొట్టారు .అందరికి కొబ్బరి చిప్ప అరటి పండ్లు పనస తొనలు ,స్వామికి ప్రత్యేకం గా వేసిన గారెల దండ లోని గారెలు ప్రసాదం గా అంద జేశాము .సాయంత్రమూ ఖాళీ లేకుండా భక్తులు వచ్చి స్వామి దర్శనం చేసుకొని పోతూనే ఉన్నారు ..ఈ విధం గా శ్రీ హనుమజ్జయంతి అత్యంత వైభవం గా మూడు రోజులు జరిగి అందరికి ఆనందం కలిగించింది .

మీ- గబ్బిట దుర్గా ప్రసాద్ -24-5-14-ఉయ్యూరు

 

 

 

Posted in దేవాలయం | Tagged | Leave a comment

సంక్షోభంలో భాషా వికాసం

సంక్షోభంలో భాషా వికాసం

రాష్ట్ర విభజన తరువాత సాంస్కృతిక రంగం, భాషా వికాసం వంటివి ఏ రూపం సంతరించుకోబోతున్నాయన్నది అటు తెలంగాణలోనూ, ఇటు ఆంధ్రప్రదేశ్‌లోనూ చర్చనీయాంశంగా మారింది.

తెలుగుతనానికి ప్రతిరూపంగా ఉండాల్సిన మన ప్రభుత్వ సాంస్కృతిక శాఖ మరో వారం రోజులలో పెనుమార్పులు సంతరించుకోబోతోంది. జూన్ 2 నుంచి 2 రాష్ట్రాలుగా అవతరించనున్న అరవై ఏళ్ళ ఆంధ్రప్రదేశ్ నుంచి విడిపోయిన తెలంగాణ రాష్ట్రంలో సరికొత్త సాంస్కృతిక శాఖ మొగ్గ తొడగబోతోంది. ఇప్పటి దాకా కొనసాగిన భాషా, సాంస్కృతిక శాఖ మరో ఆరు నెలల కాలంలో ఎలా రూపుదిద్దుకోబోతోందనే చర్చ ప్రారంభమైంది. పలు ప్రాంతాల్లో కళాకారులు తమకు తోచిన రీతిలో సదస్సులు, చర్చలు కొనసాగిస్తున్నారు. 1981లో సాంస్కృతిక శాఖ ఏర్పడిన తరువాత 33 ఏళ్ల కాలంలో ఇది రూపు మార్చుకోవడం ఇదే మొదటిసారి. ఇప్పటి దాకా సజావుగా సరైన కార్యక్రమాలేవీ జరగలేదు. సరైన విధివిధానాలే రూపుదిద్దుకోలేదు. ప్రస్తుతం రమారమి 265 మంది సిబ్బంది, వారికి బాధ్యతలు నిర్దేశించే ఒక సంచాలకుడు దాదాపుగా 70 కోట్ల రూపాయల కేటాయింపులతో ఈ శాఖలో వ్యవహరాలు జరుగుతున్నాయి. అయితే, ఈ కార్యక్రమాలు మదింపు మాత్రం ఇంతవరకూ జరగలేదు.

తెలుగు కళా రంగంలో ముఖ్యమైన అధ్యాయాలు, ఘట్టాలు కాగితాల కట్టల్లో చిందరవందర అయిపోతున్నాయి. తెలుగువారికి మాత్రమే చెందిన సంస్కృతీ సంప్రదాయాలను భద్రపరచటం వంటివి ప్రభుత్వం తమ బాధ్యతగా భావించడం సాంస్కృతిక శాఖ చరిత్రలోనే లేదు. కొద్ది మంది కళాకారులు మాత్రమే దీని వల్ల ప్రయోజనం పొందారు. ప్రభుత్వ నిర్వహణలోని ప్రాంగణాలు, నిర్వహణాధికారులు, అతి కొద్ది మంది కళాకారులు ఉత్తుత్తి సంబరాలతో 60 ఏళ్లు కోట్లాది రూపాయలను దుర్వినియోగం చేశాయి. చాలామంది ముఖ్యమంత్రులు, సాంస్కృతిక రంగం పట్ల కనీస అవగాహన, మమకారం లేని వారు కొందరి ఇచ్చకాలను, అవినీతి మాయలను గొప్పవిగా భ్రమింపచేస్తూ ప్రభుత్వపరమైన మోసాన్ని పరంపరగా కొనసాగించారు.

తెలియని సంస్కృతి
మన ప్రభుత్వ రాజముద్రికలో ఉన్న విశేషాల నుంచి పలు అంశాలపై అవగాహన, మమకారం పెంచకుండానే, కనీస ప్రయత్నాలు లేకుండానే ఆరు దశాబ్దాలు గడిచిపోయాయి. మన సంస్కృతికి కీలకమైన ప్రతీకగా శాతవాహనుల పాలనను ప్రస్తుతించే పూర్ణకుంభం తెలుగు సచివాలయం ముందు అనామకంగా ఎవరి పట్టింపూ లేకుండా ఉంది. మా తెలుగుతల్లికి మల్లె పూదండ అనే తెలుగుజాతి గీతం ఇక మీదట ఒక రాష్ట్రానికే పరిమితం అయిపోయింది. తెలుగుజాతి జీవనాడిగా ఒక శాస్త్రీయ నృత్య సంప్రదాయంలో సుశిక్షితులైన 25,000 మంది కళాకారులతో ప్రపంచ వేదికలు, రికార్డులు నెలకొల్పిన కూచిపూడి నాట్యం కూడా అధికారికంగా కుంచించుకుపోబోతోంది.
మన రాష్ట్రంలో తొలి రోజుల్లో విద్యాశాఖలో ఆ తరువాత సమాచార పౌర సంబంధాల శాఖలో అంతర్భాగంగా ప్రభుత్వ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించేవారు. 1981 జూలై నుంచి ఇప్పటి సాంస్కృతిక శాఖ ఉనికిలోకి వచ్చింది. ఆ శాఖ ఏర్పాటయినా సాహిత్యం, కళలకు సంబంధించి అకాడమీలు కూడా కొనసాగుతూ ఉండేవి. ఆయా అకాడమీలకు అధ్యక్షులు, సిబ్బంది ఉండేవారు. అన్ని కళలకు ఆలవాలంగా కేంద్ర ప్రాంగణంగా రవీంద్ర భారతి పెద్ద ప్రయత్నాలు లేకుండానే రూపుదిద్దుకొంది.
ప్రామాణికమైన కళారంగ విశ్లేషకుడిగా రచయితగా ప్రసిద్ధి చెందిన పి.ఎస్.ఆర్. అప్పారావు తొట్టతొలి సంచాలకుడిగా సాంస్కృతిక శాఖ కార్యకలాపాలకు శ్రీకారం చుట్టారు. ఆయన తరువాత కన్యాశుల్కం నాటకం, శంకరాభరణం సినిమాల ద్వారా లబ్ధప్రతిష్టుడైన జె.వి. సోమయాజులు సంచాకుడిగా బాధ్యతలు నిర్వహించారు. సంస్కృతి, కళలపై నిజమైన మక్కువ కలిగినవారు ఏ కార్యక్రమాన్ని చేపట్టినా దాన్ని తమ వ్యక్తిగత ప్రయోజనానికి అనువుగా మలుచుకోగలిగిన సమర్థ అవినీతిపరులు సంచాలకుడి బాధ్యతలను, పనితీరును పలు విధాలుగా మలుపులు తిప్పారు. పలు ప్రభుత్వ శాఖలను ఏక కాలంలో నిర్వహించిన రికార్డుతో పాటు శిల్పారామం వంటి సాంస్కృతిక కేంద్రాలు నెలకొనటానికి కారకుడైన అధికారి జి. కిషన్‌రావు. ఇక కె.వి.రమణ వంటి ఐ.ఏ.ఎస్ అధికారులు పలు చర్యలతో సాంస్కృతిక రంగానికి పేరు ప్రతిష్ఠలు సంపాదించిపెట్టారు.

ఈ శాఖకు ఇంతవరకూ 32మంది సంచాలకులుగా వ్యవహరించారు. ఈ శాఖలో ఐ.ఎ.ఎస్ సీనియర్ అధికారులతో పాటు తెలుగు సంస్కృతి పట్ల ఏమాత్రం గౌరవాభిమానాలు లేని వారు కూడా ఆ స్థానంలో అధికారం చలాయించి అప్పటి దాకా సక్రమంగాఉన్నవాటిని కూడా భ్రష్టుపట్టించారు. ప్రస్తుతం సంచాలకుడిగా కొనసాగుతున్న కవితా ప్రసాద్ 5 ఏళ్ళుగా ఆ శాఖలో పలు చ క్కని కార్యక్రమాలకు సమన్వయకర్తగా వ్యవహరించారు. గతంలో ఎన్నడూ లేని అట్టహాసాలు 100 కోట్ల పైచిలుకు నిధుల వ్యయం ఆయన హయాంలో జరిగాయి. జీవ వైవిధ్య సదస్సు, ప్రపంచ మహాసభలు, పలు ఉత్సవాలు రవీంద్రభారతి ప్రాంగణంలో నిర్వహించిన శతరూప వంటి కార్యక్రమానికి 80 లక్షల పైచిలుకు ఖర్చుతో వర్ధమాన కళాకారులకు గతంలో లేని నగదు పారితోషికంతో ప్రోత్సహించారు.
2012 లో జరిగిన 4వ ప్రపంచ మహాసభల తరువాత ప్రభుత్వం 2013 ఏడాదిని భాష సాంస్కృతిక శాఖ సంవత్సరంగా ప్రకటించింది. అన్ని జిల్లాలో కలెక్టర్లకు వినిమయ అధికారం కట్టబెడుతూ 45 కోట్ల రూపాయల పైచిలుకు ఖర్చు చేసింది. అయినా పలు జిల్లాల్లో లెక్కలు పూర్తి కాని గందరగోళంలోనే రాష్ట్ర విభజన జరిగిపోతోంది. తెలుగు మహాసభల నిర్వహణలో నిధులు ఉదారంగా రావటంతో పందేరం కూడా మరింత ఉదారంగా జరిగింది. వాటికి బాధ్యులు ఎవరు అన్న మీమాంస కొనసాగుతుంది.

సాంస్కృతిక విభజన
విభజనకు సంబంధించిన 9వ షెడ్యూల్‌లో భాగంగా భాషా సాంస్కృతిక శాఖ రెండు పాయలు గా వేరు దారుల్లో సాగేలా సంసిద్ధం అయిపోయింది. 52 -48 నిష్పత్తిలో పంపకాలకు ప్రతిపాదనలు ఖరారు అయిపోయాయి. జూన్ నెలాఖరు దాకా తాత్కాలిక ఏర్పాట్లు ఆ తరువాత ఆయా రాష్ట్ర ఏలికల ఆలోచనలకు తగిన రీతిలో తలపెట్టినవన్నీ సజావుగా జరిగేలా నిర్దేశన మార్గం రెడీ అయింది. మొదటి 4 మాసాలకు అవసరమైన నిధుల కేటాయింపు కూడా జరిగిపోయింది. రెండు రాష్ట్రాలకు చెరి 17 కోట్ల రూపాయలు అందివచ్చే ఏర్పాటు జరిగింది. జూన్ 3 నాటికి రెండు రాష్ట్రాలకు చెందిన సాంస్కృతిక శాఖల కార్యాలయాలకు సంబంధించి భవనాలు, అందుకు కావల్సిన వనరుల కేటాయింపు ఖరారు అయినా అందుకు భాధ్యతలు వహించాల్సిన సంచాలకుల ఎంపిక నియామకం దశ మాత్రం కనీస సన్నాహాలకు నోచుకోలేదు.

ప్రస్తుత సంచాలకుడి నియామకం తెలంగాణకు చెందినవాడైనా డిప్యుటేషన్ కావటంతో సందిగ్ధత కొనసాగుతోంది. ఆంధ్ర ప్రాంత శాఖకు సంచాలకుడి నియామకం కూడా జరగాల్సి ఉంది.కాగా ఈ శాఖకు సంబంధించి సంపూర్ణ అవగాహన, కళారంగం పట్ల అభినివేశం కలవారిని మాత్రమే నియమించాలన్న మార్గదర్శక సూత్రం ఖరారు అయింది. అందుకు తగ్గ వెతుకులాటకు ఎక్కడా ప్రయత్నం ప్రారంభం కాలేదు. భాష, పురావస్తు ప్రదర్శనశాలలు, అందుకు సంబంధించిన శాఖ, శిల్పకళ, పౌర గ్రంథాలయాలు, ప్రాచ్యలిఖిత ప్రతుల భాండాగారం, అన్ని కళలకు చెందిన అకాడమీలు, ప్రాచీన భాష హోదా వంటివి కూడా ఈ శాఖలో ఉండేలా చేయాలన్న నిర్ణయం పరిశీలనలో ఉంది. ప్రతిష్టాత్మకమైన రవీంద్రభారతి ,తెలుగు లలితకళా తోరణంలు పూర్తిగా తెలంగాణ రాష్ట్రానికి చెందుతాయి. ప్రభుత్వ సంగీత నృత్య కళాశాల విభజన కూడా పూర్తయిపోయింది.హైదరాబాదులోని 3 కళాశాలలతో పాటు వరంగల్, నిజామాబాద్, మంధనిలలో గల కళాశాలలు తెలంగాణకు చెందుతాయి. దాదాపుగా అన్ని కళాశాలలో బోధన సిబ్బందికి చెందిన ఖాళీలు చాలా ఉన్నాయి. అందుకు అవసరమైన నియామకాలకు చేపట్టిన చర్యలు తొలిదశలోనే పెండింగ్‌లో ఉన్నాయి.

హామీలు గాలికి…
గతంలో 4 గురు ముఖ్యమంత్రులు ఉగాది రోజున ప్రకటిస్తామని హామీలు ఇచ్చి దశాబ్దాలు గడిపేశారు. ప్రస్తుతం దాని ప్రస్తావనే లేదు. 3 అకాడమీలకు సంబంధించి విధాన నిర్ణయం జరిగినా అమలుకు ప్రయత్నాలు ప్రారంభం కానే లేదు. అత్యుత్తమ నాటకాలు, నవలలకు ప్రభుత్వం తరఫున పోటీలు నిర్వహించి లక్ష రూపాయల బహుమతులు, ప్రోత్సాహక బహుమతులు ఇవ్వాలన్న నిర్ణయానికి స్పందన బాగున్నా తదుపరి చర్యలకు చురుకుదనం కొరవడింది. రమారమి 150 నాటకాలు 50 నవలలు పోటీలకు సమాయత్తం కాగా, అందుకు తగిన న్యాయ నిర్ణయం ఇంతవరకూ జరగలేదు. మరో వైపు నాటక నంది పోటీలు నిర్వహించే బాధ్యత రాష్ట్ర చలనచిత్ర, టీవీ, నాటకరంగ అబివృద్ధి సంస్థ నుంచి సాంస్కృతిక శాఖకు మార్పిడి అయినా గత ఏడాది పోటీలు వరంగల్ లో నిర్వహించాలన్న విధాన నిర్ణయం సమాచార పౌర సంబంధాల కమీషనర్ వద్ద నానుతోంది.

ఏప్రిల్ 16 న తెలుగు రంగస్థల దినోత్సవం నిర్వహించే ఆనవాయితీ ఈ ఏడాది ఉత్తుత్తి మంత్రం అయింది. ఇలా ఉండగా, తెలుగు సాంస్కృతిక వికాసంపై ఇరు ప్రాంతాలలో చర్చలు, సదస్సులు జరుగుతున్నాయి. ఏలూరులో కళారత్న కె.వి.వి. సత్యనారాయణ, పలు నంది అవార్డుల విజేత ఖాజావలీ, కూచిపూడి గురువు పసుమర్తి కేశవ ప్రసాద్ అ నిర్వహణలో కొత్త రాష్ట్రంలో సాంస్కృతిక విధానంపై చర్చాగోష్టి నిర్వహించారు. హైదరాబాదులో ఎల్లా వెంకటేశ్వరావు నేతృత్వంలో పలువురు కళాకారులు ప్రతిపాదనలు చేశారు. కేంద్ర రాష్ట్ర పురస్కార గ్రహీతలు, పలువురు విద్వాంసులు కళారంగం వికాసం కోసం రెండు తెలుగు రాష్ట్రాలలో చేపట్టాల్సిన విధివిధానాలను నూతన ప్రభుత్వాలకు సమర్పించనున్నారు. తెలంగాణకు చెందిన కళాకారుల పక్షాన కరీంనగర్‌లో కృపాదానం, వరంగల్ ప్రాంతీయులు పి. శేఖర్ బాబు, వనం లక్ష్మీకాంతరావు, మిర్యాలగూడెంలో తడకమళ్ల రామచంద్రరావు వంటివారు ప్రభుత్వానికి కొత్త ఆలోచనలు అందచేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.
ఞ జి.ఎల్.ఎన్. మూర్తి

 

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

సాహితీ గంధం గంగాధరం

సాహితీ గంధం గంగాధరం

1974లో అరసం మహాసభలు ఒంగోల్లో జరిగినప్పుడు చిరసం నుంచి మధురాంతకం రాజారాం,
కలువకొలను సదానంద, ఎస్.మునిసుందరం లాంటి ప్రముఖ సాహితీ మూర్తులతోను, కవి మిత్రులు
విజయకుమార్ (సౌభాగ్య), కేఎస్వీల తోను గంగాధరం శిష్యుణ్నిగా ఆయన వెంట వెళ్లడం అదో మరపురాని అనుభూతి! 1975 జనవరిలో అనుకుంటా కడపలో ఆ జిల్లా రచయితల సంఘం ఏర్పాటు చేసిన మూడు రోజుల సాహితీ సమావేశాల్లో పాల్గొన్నారు గంగాధరం. ఆధునిక కవిత్వం గురించిన సదస్సుకి ఆయనే అధ్యక్షత వహించారు.

ఇవాళ మన వాడుకలో లేకపోవడం వల్ల రంగు రుచి వాసన కోల్పోయిన మాటల్లో త్రికరణశుద్ధి ఒకటి. మంచినే అనుకోవడం, అనుకున్నదే చెప్పడం, చెప్పినట్టే చెయ్యడం ఇదీ త్రికరణశుద్ధి! అయితే లోపల ఏదో అనుకోవడం, ఆ అనుకున్నది లోపలే దాచుకోవడం, ఆ ఆలోచనకి, ఈ మాటలకి ఏమాత్రం సంబంధం లేనట్టుగా తమ ప్రయోజనం మాత్రమే పరమావధిగా ఎంత అన్యాయమయినా, అక్రమమయినా ఎవరికీ వెరవక తెగించి చేసెయ్యడం- డిప్లమసీ! ఇవాళ చిన్నా పెద్దా తేడా లేకుండా ఏ పదవిలో ఉన్నవాళ్లకయినా అవశ్యం వుండవలసిన క్వాలిటీ ఇదే! ఇప్పటి మన వ్యవస్థలో ఈ బహువేషధారణ సామర్థ్యం ఎవరిలో ఎంత ఎక్కువగా వుంటే ఈ సమాజంలో వాళ్లకి అంతగా గుర్తింపు, రాణింపు! ఇదీ నేటి కాలగతి-ప్రవాహం! అయితే సమాజ హితాన్ని కోరి ఏటికి ఎదురీదగలిగిన ధైర్యస్థైర్యాలున్నవాళ్లు కళాకారులు. ముఖ్యంగా కవులు! కానీ పైకి అభ్యుదయం, సమానత్వం అంటూనే లోలోపల జాతి మూలాల్లో అభ్యుదయ వ్యాధులుగా అల్లుకుపోతున్న మేధావులు, సంకుచిత స్వభావులు కవులు కావడం అనివార్యమైన, అపాయకరమైన పరిణామం! ఇలాంటి స్వార్థపూరితమైన ఈ సమాజంలో, ఈ సన్నివేశంలో దాదాపు నాలుగు దశాబ్దాల కాలాన్నిదాటి వెనక్కి వెళితే అక్కడ ఆశావహమైన మా విద్యార్థి జీవితంలో అమాయకమైన మా అక్షర ప్రపంచంలో అప్పుడప్పుడే ఉదయించిన ఓ కాంతి పుంజం ఇప్పటికీ వెలుగులు చిమ్ముతూ గోచరిస్తుంది. అసలైన అభ్యుదయ కర్మానుష్ఠానం కోసం అవతరించిన ఆ తేజఃప్రసారం నూతలపాటి గంగాధరం! తన వ్యక్తిత్వమే కవిత్వమైన ఆ అభ్యుదయ కవిని, రవిని ఆవాహనం చేసుకున్న అనుభూతిని మనసారా ఒక్కసారిఅందుకుందామన్న ఆశతో ఒక్కసారిగా ధ్యానముద్రలోకి వెళితే –
1966 ప్రాంతాల్లో మేం చిత్తూరుజిల్లా నిండ్ర జిల్లా పరిషత్ హైస్కూల్లో పదవ తరగతిలో వున్నప్పుడొచ్చారు మాకు గంగాధరం- సీనియర్ తెలుగు పండిట్‌గా! రావడంతోటే ముందుగా మా అందరినీ ఆకట్టుకుంది ఆయన నిలువెత్తు గంభీర విగ్రహం! ఆపైన ఆయన పాఠ ప్రవచన విధానం! తర్వాత తర్వాత తన సాహితీ సంబంధమైన సంస్కారం! అంతవరకు తెలుగుని ఏదో ఒక పాఠ్యాంశంగా మాత్రమే చదువుతున్న మేము అప్పట్నుంచి అదో కవితాంశంగా ఓ ప్రత్యేకమైన శ్రద్ధతో అధ్యయనం చెయ్యడం మొదలెట్టాం. వ్యాకరణం, ఛందస్సు, అలంకారాలు కేవలం మార్కుల కోసం సాగే వ్యవహారంలా కాక మాకందరికీ అభిరుచి పాత్రమైన అంశాలుగా మారిపోయాయి. పైగా వారిమల్లే తెలుగు విద్వాన్ పట్టభద్రులమైతే తెలుగు పంతుళ్లుగా బ్రతుకు తెరువూ ఏర్పడుతుందన్న బలమైన ఆశ కూడా అప్పట్లోనే మాకు కలిగివుండాలి. కాబట్టే నేనూ, మరో ముగ్గురు మిత్రులూ పనిగట్టుకుని తిరుపతి వెళ్లి ఓరియంటల్ కాలేజీలో చేరాం! ఆయన అప్పట్లో అలా మాకు తెలుగు పండిట్‌గా రావడం వల్లే ఇవాళ మేం మీముందు ఇలా నిలబడగలుగుతున్నాం- అని ఇప్పటికీ సభల్లో చెప్పుకుంటూనే వున్నాం! శిష్యుల్ని అంతగా ప్రభావితుల్ని చెయ్యగలిగిన ఆకర్షణీయమైన వ్యక్తిత్వం గంగాధరంగారిది!
మరి గురువుగారి వూరు నాగలాపురం దగ్గర రామగిరి! మా వూరికీ, రామగిరికీ మధ్య దూరం ఆరుమైళ్లు! శనివారం సాయంత్రం నేనూ, మా వూళ్లోని మరో మిత్రుడూ నాథముని (అతనూ ఇప్పుడు లేకపోవడం అదో విషాదం) కలిసి సైకిళ్లమీద రామగిరికి బయలుదేరేవాళ్లం. అక్కడ ఆ వూళ్లో రామయ్య, రామ్మూర్తి, హరనాథ్ మొత్తం ఐదుగురు మిత్రులం. గురువుగారి వెంట పక్కనున్న అరుణా నదికి ఉదయం, సాయంకాలం మా వాహ్యాళి. ఆ గట్లు, చెట్లనీడలు తాత్కాలికంగా మా తరగతి గదులు. ఆ సమయమంతా గురువుగారి సాహితీ ప్రబోధాలు. ఇక ఆ తరువాత వారి ఇంటికి తిరిగివెళితే ఎండవేళ మండువాలో మకాం. రాత్రి డాబా మీద చందమామని చూస్తూ లైటు వెలుతుర్లో, వెన్నెల్లో కవిత్వ పఠనం. నేర్చుకుంటున్న ఛందస్సులో మా ప్రారంభ ప్రయోగాలు. గురువుగారి సలహాలు, సూచనలు!
ఆ తరువాత హైస్కూలు చదువు ముగిసి, తిరుపతికి వెళ్లి చదువుకునే ఆర్థిక స్తోమత లేక రేండేళ్లు ఖాళీగా వుండి మళ్లీ అప్పటిదాకా కలలుగన్న ఆ కాలేజీ చదువు కొనసాగించడం! అలా రెండేళ్ల తరువాత కూడా ఎల్లాగయినా సరే కష్టపడి విద్వాన్ చదవాలి అని ఆ కోర్సుని పూర్తిచెయ్యడం, కేవలం గంగాధరం గారి స్ఫూర్తివల్ల! వారి మల్లే కవిగా, రచయితగా పత్రికల్లో మన పేరూ చూసుకోవాలన్న తపన వల్ల!
అలా తిరుపతిలో వున్న నాలుగేళ్లలోను మధ్యమధ్య వారి నుంచి వుత్తరాలు! చిత్తూరు జిల్లా రచయితల సంఘం విశేషాలు, సమావేశాలు! అప్పుడే ఆయన మాటమీద అందులో సభ్యత్వం. తృతీయ వార్షికోత్సవ మహాసభల్లో తొలిసారిగా నేను కవిసమ్మేళనంలో పాల్గొనడం. అప్పుడు అధ్యక్షత వహించిన తిరుమల రామచంద్ర ‘చీకటి కళ్లు’ అన్న నా వచన కవితని ప్రత్యేకించి మెచ్చుకుంటే ఎంత సంబరపడ్డారో గురువుగారు! అలాగే నేను కాలేజీ విద్యార్థిగా వున ్నరోజుల్లోనే ఓ దినపత్రిక ఆదివారం అనుబంధంలో నా సాహిత్య వ్యాసం అచ్చయితే ఆ రోజున్నే ఓ సాహితీ సమావేశం కోసం తిరుపతికొచ్చారు గంగాధరం. అప్పట్లో కలుసుకోలేక వెంటనే వూరెళ్లిపోయారు. తరువాత ఓ రోజు వుత్తరం రాశారు. ‘నీ వ్యాసం మొదట చూసింది నేను. ఆ రోజే నీకు అభినందనలు తెలుపుదామనుకున్నాను. మళ్లీ నువ్వు కనిపించలేదు. ఉత్తరం రాద్దామనుకున్నాను. తీరిక లేకపోయింది. నీ ఉత్తరం చూశాను. బదులు రాయడానికి ఇప్పటికి తీరికైంది. సెలవులు వచ్చాయి కదా, క్షణం ఒక చోట తీరిగ్గా కూర్చోవడానికి వీల్లేకపోతోంది. నీ వ్యాసం పత్రికలో చూచినప్పుడు నేనెంత సంతోషించానో చెప్పలేను. నా మొదటి రచన అచ్చయినప్పుడు కూడా నేనంత సంతోషించలేదు.”
అంతేకాదు, అప్పట్లో నా కవితలు అచ్చయితే వాటిని క్లాసుల్లో పిల్లలకి చదివి వినిపించి “వీడు… నా శిష్యుడు” అని చెప్పి మురిసిపోయేవారట గురువుగారు! లోకంలో పుత్రోత్సాహం పొందే తండ్రులుంటారు. కాని ఛాత్రోత్సాహం పొందిన నిజమైన గురువు గంగాధ రం!
తరువాత 1974లో అరసం మహాసభలు ఒంగోల్లో జరిగినప్పుడు చిరసం నుంచి మధురాంతకం రాజారాం, కలువకొలను సదానంద, ఎస్.మునిసుందరం లాంటి ప్రముఖ సాహితీ మూర్తులతోను, కవి మిత్రులు విజయకుమార్ (సౌభాగ్య), కేఎస్వీల తోను గంగాధరం శిష్యుణ్నిగా ఆయన వెంట వెళ్లడం అదో మరపురాని అనుభూతి! ఇంకా అలాంటివే మరికొన్ని సంఘటనలు! అలాగే 1975 జనవరిలో అనుకుంటా కడపలో ఆ జిల్లా రచయితల సంఘం ఏర్పాటు చేసిన మూడు రోజుల సాహితీ సమావేశాల్లో పాల్గొన్నారు గంగాధరం. ఆధునిక కవిత్వం గురించిన సదస్సుకి ఆయనే అధ్యక్షత వహించారు. అప్పుడు పక్కనే ప్రొద్దుటూర్లో పండిట్స్ ట్రెయినింగ్‌లో వుంటూ మిత్రులతో కలిసి వచ్చాన్నేను ఆ సమావేశాలకి. అదే చివరిచూపు! ఆ సమావేశాలు పూర్తయి ఆయన రామగిరికి వెళ్లింతర్వాత సరిగా మే నెలలో నేనక్కడ ట్రెయినింగ్‌లో వుండగానే జరిగింది ఆ దుర్ఘటన! అంతటి షాక్‌లోను వెంటనే నన్ను గుర్తుతెచ్చుకుని మిత్రుడెవరో వుత్తరం రాస్తే తెలిసి తట్టుకోలేక, నమ్మీ నమ్మక, పరీక్షల్ని పట్టించుకోక పరుగెత్తుకొచ్చాను రామగిరికి! వచ్చేసరికి ఏముంది? వారి శోకగృహం అది నిజమని నమ్మమంది. అరుణా నది బావురుమంది. చేలగట్లు మౌనం వహించాయి. ఆ రాత్రి చంద్రుడు వెలవెలపోయాడు. మనస్సులో అతి భయంకరమైన, విషాదభరితమైన నిశ్శబ్దం మాత్రం అలుముకుంది.
నాకు ఊహతెలిసి నా జీవితంలో జరిగిన మొట్టమొదటి ప్రియ వియోగం అది. నాకే కాదు, మా ఇంటిల్లిపాదికీ! అదివరకోమారు మా వూళ్లో మా ఇంటిని వెదుక్కుంటూ వచ్చారు గురువుగారు. ఆ శిష్యవాత్సల్యానికి కరిగిపోయేరు అప్పట్లో మా అమ్మానాన్న, మా పెదనాన్న! ఆ అనుబంధంతోనో, ఏమో! వారిని పలకరించడానికన్నట్టు వారు వెళ్లిన ఆరు నెలలకి మా పెదనాన్న, మరో ఆరు నెలలకి మా నాన్న ‘మన గంగాధరం అయ్యోరు’ అనుకుంటూ ఆయన దగ్గరికే వెళ్లిపోయారు. నాకు లోకం తెలియని వయసులో వెంటవెంటనే ముమ్మారు వినిపించిన మృత్యుఘోష. అదే మొదటి డిప్రెషన్ నా జీవితంలో ! – విధి చవిచూపింది! తరువాతి రోజుల్లో స్నేహం పేరుతో సన్నిహితులు మిగిల్చిన చేదు అనుభవాల్ని అలావుంచితే, నా జీవననౌక అలా విద్వాన్ తీరం వేపు సజావుగా సాగడానికి చుక్కాని, తెడ్డూ తెరచాపల్లా తోడ్పడ్డ ఆ మహానుభావులు మువ్వురూ నా ఉద్యోగ జీవితం ప్రథమాంక ప్రారంభానికే లేరు. ఇప్పుడు విశ్రాంత జీవితం కొనసాగిస్తున్న ఈ దశలోను గురువుగారి జ్ఞాపకాల బరువుని మోస్తూ సజీవ స్మృతి చిహ్నాలుగా మిగిలినవాళ్లం నేనూ, నా మిత్రులు నలుగురూ వున్నాం!
గంగాధరంగారి పెళ్లి సందర్భంలో కవిమిత్రులందించిన ‘తలంబ్రాలు’ అన్న కవితా గుచ్ఛంలో
నీలిమేఘము వంటివాడా!
నేస్తుడా!
నింగిలో తారాడువాడా! – అన్న సదానందగారి సంబోధనల్లోని ఉపమ అతిశయోక్తులు తనపట్ల స్వభావోక్తిగా-
గంగాధరుని వివాహము
సంగతి విని పొంగిపోతి; సరస కవిత్వో
త్తుంగ తరంగాంచిత యగు
అంగన గొనునట్టి సుకవి కగుత శుభంబుల్
అన్న దాశరథి సంభావనకి సాక్షాత్ అక్షరరూపంగా వెలిగిన ఆ ఆదర్శామృతమూర్తిని మళ్లీ మనం చూడగలమా
ఈ చర్మ చక్షువులతో-మనశ్చక్షువులతో తప్ప!
మనసు ప్రమిదచేసి మంచిని వెలిగించి
నాడు వెలుగజేయువాడె నరుడు!- హైస్కూలు వీడ్కోలు సభలో మమ్మల్ని సాగనంపుతూ గంగాధరం పలికిన ప్రబోధం అది! అక్షరాలకీ, ఆచరణకీ మధ్య దూరం తగ్గించిన నిజమైన అభ్యుదయ కవి, కర్మిష్ఠి ఆయన.
సామాజిక వర్గ స్పృహ మరీ బలీయంగా వున్న గ్రామీణ వాతావరణంలో ఆ వర్గ విభేదాల్ని విస్మరించి తన విద్యార్థులందరికీ తమ ఇంట సమంగా ఆతిథ్యం ఇప్పించిన అభ్యుదయ భాస్కరుడు. మొదట తాను వెలిగాడు. తరువాత తనవారిని వెలిగించాడు. మొత్తం సాహితీ ప్రపంచానికే వెలుగులు పంచాడు. ఇప్పుడు ఆ వెలుగు దివ్వెలే ఆయనకి అక్షర నీరాజనం సమర్పిస్తున్నాయి. తిరుపతి పట్టణం కేంద్రంగా ‘గంగాధరం సాహితీ కుటుంబం’ పేరిట ఆయన మిత్రులు కొందరు కవిత, కథ, నవల, విమర్శ వీటిలో ఒక్కో ఏడు ఒక్కో ప్రక్రియలో ప్రతి ఏటా ఎన్నికైన అత్యుత్తమ గ్రంథకర్తకి అత్యున్నత పురస్కారం అందించి గౌరవిస్తున్నారు. చిరంజీవి ఐన కవి పేరిట సాటి కవిని ఏటా సత్కరించే సత్సంప్రదాయాన్ని ఇప్పటికీ సజావుగా కొనసాగిస్తున్నారు.
– డాక్టర్ కాసల నాగభూషణం
09444452344

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

కవిత్వమై గెలిచిన తెలంగాణ

కవిత్వమై గెలిచిన తెలంగాణ

తెలంగాణ మలి దశ ఉద్యమంలో కవులు నిర్వహించిన పాత్ర మరువలేనిది.
సాహిత్య పేజీల్లో నిరంతరం కవిత్వం ఊట లాగా వెలువడుతూనే ఉండింది. వేలాది కవితలు,
వందలాది సంపుటులు, పదుల సంకలనాలు వెలుగు చూశాయి. ఎన్నో సంస్థలు ఏర్పడి
మొదలు కవిత్వం ద్వారానే తెలంగాణ ఆకాంక్షను వ్యక్తపరిచాయి.

ఉద్యమం పక్కదారి పట్టినప్పుడల్లా తెలంగాణ కవులు హెచ్చరికలయ్యారు. ఉద్యమం వెనకపట్టు పట్టినప్పుడల్లా ముల్లుగర్రలతో అదిలించారు. ఈ క్రమంలో తెలంగాణ కవులు ఎక్కడా వెనకడుగు వేసిన దాఖలా కనిపించదు. ఆత్మవిశ్వాసంతో ఎక్కడికక్కడ, ఎప్పటికప్పుడు నిలదీస్తూ ముందుకు సాగారు. యుద్ధ వీరులని తలపించారు. రాజకీయ ఉద్యమం చతికిల పడిన సందర్భాలొచ్చి నప్పుడల్లా కవిత్వంతో జవసత్వాలనిచ్చే ప్రయత్నం చేశారు.

ఉద్యమమైనా మొదట కవిత్వంలో వ్యక్తమవుతుంటుంది. భావ కవి త్వం, అభ్యుదయ, విప్లవ, స్త్రీవాద, దళిత, ముస్లిం, తెలంగాణ కవిత్వా లు ఆయా ఉద్యమాల్లో తొలి దశలో తమ వంతు పాత్ర నిర్వర్తించాయి. మిగతా ఉద్యమాల కన్నా తెలంగాణ ఉద్యమానికి ఒక ప్రత్యేకత ఉంది. ఈ ఉద్యమం రాజకీయ ఉద్యమంతో మమేకమై చివరికి తమ ఆకాంక్ష ప్రత్యేక రాష్ట్ర ఆవిర్భావంతో కార్యరూపం దాల్చడంతో సఫలీకృతమైంది.
తెలుగు సాహిత్యం పేరు మీద తెలంగాణ సాహిత్యానికి అన్యాయం జరిగింద ని, వివక్షకు గురైందని స్పృహలోకి వచ్చిన తెలంగాణ కవులు ఎన్నో ప్రశ్నలు సం« దిస్తూ కవిత్వం రాయడం వరకే పరిమితం కాకుండా కార్యాచరణలోకి దిగారు. తమ భాష, సంస్కృతి వేరని ఎలుగెత్తి చాటారు. ఉద్యమానికి ఊతమయ్యారు.
1969 ఉద్యమం సందర్భంలో భావజాల రంగంలో సమైక్యాంధ్ర భావనదే పైచేయి అయింది. కాని మలిదశ ఉద్యమంలో తెలంగాణ కవులు, కళాకారులు కవిత్వం ద్వారా పాట ద్వారా అనేక పుస్తకాల ద్వారా భావజాల రంగంలో సమైక్యాంధ్ర భావనను పూర్వపక్షం చేసి సీమాం«ద్రులపై పైచేయి సాధించగలిగారు.
తెలంగాణ ఉద్యమం సమయంలో ఎందరో కవులు నిలిచి వెలిగితే, మరెందరో పుట్టుకొచ్చారు. కాళోజీ లాంటివారు మొదట్లో సమైక్యవాది అయినప్పటికీ త్వరలోనే ఆయన తెలంగాణ వాదిగా మారి, ‘ప్రాంతేతరుడు మోసం చేస్తే పొలిమేర దాకా తరిమికొడతాం/ప్రాంతం వాడే మోసం చేస్తే ప్రాంతంలోనే పాతర వేస్తాం’ అనేంత తీవ్ర స్థాయిలో కవిత్వం రాశారు.
1995 నుంచి తెలంగాణ మలిదశ ఉద్యమం రాజుకుంది. 1998లో తెలంగాణ కవులు, సాహిత్యకారులు సుంకిరెడ్డి నారాయణరెడ్డి, నందిని సిధారెడ్డి, కె.శ్రీనివాస్, అంబటి సురేంద్రరాజు, కాసుల ప్రతాపరెడ్డి తదితర ముఖ్యులు కూడి తెలంగాణ సాంస్కృతిక వేదికను ఏర్పర్చుకున్నారు. ఐదుగురు కన్వీనర్లుగా- సురేంద్రరాజు, సుంకిరెడ్డి, మల్లేపల్లి లక్ష్మయ్య, అనిశెట్టి రజిత, స్కైబాబ ఎంపికయ్యారు. ఎన్నో కవిసమ్మేళనాలు, సదస్సులు జరిగాయి. ఈ సంస్థ తరఫునే సురేంద్ర రాజు, సుంకిరెడ్డి సంపాదకత్వంలో ‘మత్తడి’ (2002 డిసెంబర్) అన్న బృహత్ కవితా సంకలనం వెలువడింది. ఇందులో 1917 నుంచి 1952 వరకు ఒక విభాగం, 1952 నుంచి 1998 వర కు రెండవ విభాగం, 1995 నుంచి 2002 వరకు మూడవ విభాగంగా విభజించి మొత్తంగా 258 మంది కవిత్వాన్ని సంకలనం చేశారు. 2002 నాటికి తెలంగాణలో పేరుబడ్డ కవులందరూ ఇందులో ఉన్నారనే చెప్పవచ్చు. ‘మత్తడి’ రూపుదిద్దుకుంటున్న సమయంలోనే జూలూరి గౌరీశంకర్ సంపాదకత్వం లో ‘పొక్కిలి’ (2002 మే) సంకలనం వెలువడింది. 129 మంది కవిత్వం ఇందులో చోటుచేసుకుంది.
అప్పటికే లబ్దప్రతిష్ఠులైన సిధారెడ్డి, సుంకిరెడ్డి, జూకంటి జగన్నాధం, ఎస్.జగన్‌రెడ్డి, అఫ్సర్, సిద్ధార్థ, దెంచనాల శ్రీనివాస్, కాసుల ప్రతాపరెడ్డి, జూలూరి గౌరీశంకర్, అమ్మంగి వేణుగోపాల్, ఆశారాజు, నాళేశ్వరం శంకరం, షాజహానా, అన్నవరం దేవేందర్, అన్వర్, స్కైబాబ, పొట్లపల్లి శ్రీనివాసరావు, వఝల శివకుమార్, కోట్ల వెంకటేశ్వరరెడ్డి, కోడూరి విజయకుమార్ తదితరులు తెలంగాణ కవిత్వం రాశారు. గద్దర్, గూడ అంజయ్య, అందెశ్రీ, గోరటి వెంకన్న తదితర వందలాది మంది వాగ్గేయకారులు తెలంగాణ ఉద్యమంలో పాటల రూపంలో కవిత్వాన్ని పండించారు. వేముల ఎల్లయ్య, ఎం.వెంకట్, సీతారాం, ప్రసేన్, యాకూబ్, అయిల సైదాచారి, పగడాల నాగేందర్, అంబటి వెంకన్న, బెల్లి యాదయ్య తదితరులు ఎంతోమంది రాసిన కవిత్వం తెలంగాణ కవిత్వానికి అదనపు సౌందర్యాన్ని, వస్తు విస్తృతిని అందించింది.
రెండేళ్ల తర్వాత సిధారెడ్డి ఆధ్వర్యంలో ఆయనే అధ్యక్షుడుగా తెలంగాణ రచయితల వేదిక ఏర్పడింది. తెరవే అన్ని జిల్లాలకు విస్తరించడమే కాకుండా ఎందరో కొత్త కవులకు ఊతమందించింది. ‘సోయి’ అనే పత్రికను వెలువరించింది. అనేక సభలు సమావేశాల ద్వారా ఉద్యమ కవిత్వం విరివిగా పుట్టుకొచ్చేలా కృషి చేసింది. 2007లో జూకంటి జగన్నాధం, జూలూరి గౌరీశంకర్ అధ్యక్ష కార్యదర్శులుగా ఎన్నికై ఈ సంస్థ మరెన్నో కార్యక్రమాలు తీసుకుంది. 2012లో ఈ సంస్థకు సూరేపల్లి సుజాత కార్యదర్శిగా ఎంపికయ్యారు. 2006లో సుంకిరెడ్డి, సంగిశెట్టి శ్రీనివాస్, స్కైబాబ, పసునూరి రవీందర్ తదితరుల పూనికతో ‘సింగిడి’ తెలంగాణ రచయితల సంఘం ఏర్పడి ఎన్నో సదస్సులు, సభలు నిర్వహించడంతోపాటు కొన్ని విశిష్టమైన సంకలనాలు వెలువరించింది. ‘1969-73 తెలంగాణ ఉద్యమ కవితా’ సంకలనం కూడా ఈ సంస్థ వెలువరించింది.
2009లో ‘జాగో..జగావో’ పేర ప్రొ.జయశంకర్ ప్రారంభోపన్యాసంతో ఒక రోజంతా జరిగిన కవిసమ్మేళనంలో వచ్చిన కవితలకు మరిన్ని పాటలు జోడించి ‘జాగో..జగావో’ తెలంగాణ ఉద్యమ కవిత్వం పేర 120 మందికి పైగా కవులతో సంకలనం వెలువడి మలి ముద్రణ కూడా పొందింది. కెసిఆర్ నిరాహారదీక్ష తర్వాత నడిచిన ఉద్యమంలో ఈ సంకలనంలోని పాటలు, కవితలు విద్యార్థులకు, ఉద్యమకారులకు ఎంతో తోడ్పడ్డాయి. టాంక్‌బండ్‌పై విగ్రహాల కూల్చివేత సందర్భంలో ‘దిమ్మిస’ వినిర్మాణ కవిత్వం పేర 51 మందితో ఒక సంకలనం వెలువడడం విశేషం. ఈ సంకలనం వల్ల కూల్చివేత పట్ల ఎక్కువ వ్యతిరేకత రాకుండా తెలంగాణ కవులు చేయగలిగారు. శ్రీకృష్ణకమిటీ రిపోర్టు వెలువడిన వెంటనే ఆగ్రహోదగ్రులైన కవులు 31 మంది దాకా కలిసి తీసుకొచ్చిన ‘క్విట్ తెలంగాణ’ సంకలనంలోని కవితలు వివాదాస్పదమవడం తెలిసిందే. తెలం గాణ వ్యతిరేకులపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఈ కవులను మొత్తం ఆంధ్రా ప్రాంతంవారి వ్యతిరేకులుగా చిత్రించే ప్రయత్నం జరిగింది. అనంతరం ‘మునుం’ పేర 256 మంది కవులతో మరో సంకలనం వేముగంటి మురళీకృష్ణ, వఝల శివకుమార్, అందెశ్రీ, కాంచనపల్లి, దాసరాజు రామారావు తీసుకొచ్చారు. అయితే ఈ సంకలనంలో తెలంగాణేతరులు రాసిన కవిత్వం కూడా చేర్చడం పలు విమర్శలకు దారితీసింది. తర్వాత అనిశెట్టి రజిత పూనికతో 100 మందికి పైగా కవులతో ‘జిగర్’ సంకలనం వెలువడింది. డా.ఖుతుబ్ సర్‌షార్, స్కైబాబ సంపాదకత్వంలో ‘రజ్మియా’ తెలుగు-ఉర్దూ సంకలనం (36 మంది తెలుగు ముస్లిం కవులు, 31 మంది ఉర్దూ కవులు) వెలువడింది. తెలంగాణ జాతిపిత జయశంకర్ చనిపోయిన సందర్భంలో జూలూరు సంపదకత్వంలో ‘జయశంకరా’, వేముగంటి మురళీకృష్ణ సంపాదకత్వంలో ‘జయశిఖరం’ కవితా సంకలనాలు వెలువడ్డాయి. ఇవే కాక వివిధ జిల్లాల నుంచి ఎన్నో సంస్థలు ఎందరెందరో కవులతో సంకలనాలు వెలువరించాయి. కొన్ని జిల్లాల కవులతో ప్రత్యేకమైన సంకలనాలు కూడా వెలువడ్డాయి. ప్రత్యేక సంచికల్లోనూ కవిత్వం విరివిగా చోటుచేసుకుంది. రెండు సంచికలుగా వెలువడిన ‘ముల్కి’ పత్రికలోనూ, మరెన్నో ఛోటా మోటా పత్రికల్లోనూ తెలంగాణ కవిత్వమెంతో అచ్చయింది. అన్వర్, సుంకర రమేష్, అన్నవరం దేవేందర్ లాంటివారు పత్రికల్లో అచ్చయిన కవిత్వాన్ని సంకలనాలుగా వెలువరించారు. అఖిల భారత తెలంగాణ రచయి తల వేదిక ఇతర రాష్ట్రాలలోని కవులను కూడా ఉద్యమంలో భాగం చేసింది. మొత్తంగా తెలంగాణ కవుల్లో తెలంగాణ కోరుకోని కవి ఒక్కరూ మిగలలేదంటే, తెలంగాణపై ఒక్క కవిత కూడా రాయని కవి మిగల్లేదంటే అతిశయోక్తి కాదేమో!
ఉద్యమం పక్కదారి పట్టినప్పుడల్లా తెలంగాణ కవులు హెచ్చరికలయ్యారు. ఉద్యమం వెనకపట్టు పట్టినప్పుడల్లా ముల్లుగర్రలతో అదిలించారు. ఈ క్రమంలో తెలంగాణ కవులు ఎక్కడా వెనకడుగు వేసిన దాఖలా కనిపించదు. ఆత్మవిశ్వాసంతో ఎక్కడికక్కడ, ఎప్పటికప్పుడు నిలదీస్తూ ముందుకు సాగారు. యుద్ధ వీరులని తలపించారు. రాజకీయ ఉద్యమం చతికిల పడిన సందర్భాలొచ్చినప్పుడల్లా కవిత్వంతో జవసత్వాలనిచ్చే ప్రయత్నం చేశారు.
ఉద్యమంలో భాగంగా వివిధ సందర్భాల్లోనూ విభిన్నంగా, విరివిగా కవిత్వం వచ్చింది. ‘తెలంగాణ ఎప్పుడు? ఎట్లా?’ ‘ఇప్పుడేం చేద్దాం’, ‘తెలంగాణ కవుల గర్జన’, ‘విద్రోహదినం’, ‘యుద్ధభేరి’, ‘సిర్ఫ్ తెలంగాణ’ అంటూ పూట పూటంతా, రోజు రోజంతా కవిసమ్మేళనాలతో ఉద్యమం ఉర్రూతలూగింది. ఆత్మహత్యలు, సకల జనుల సమ్మె, మిలియన్ మార్చ్, సాగరహారం ఇలా ఎన్నో సందర్భాలు పోరాట రూపాలై కవిత్వం పలికాయి. తెలంగాణ ఉద్యమం పలికించిన వివిధ రూపాలు- దూలా, బతకమ్మ, బోనాలు, రాస్తారోకోలు, రహదారుల బంద్, రోడ్లమీద వంటావార్పు-సామూహిక భోజనాలు లాంటివన్నీ కవిత్వంలోనూ ప్రతీకలయ్యాయి. సబ్బండ వర్ణాల వృత్తులన్నీ ఉద్యమంలో నిరసన రూపాలవడం, ప్రతీకలవడం విశేషం. ఇట్లా ఒక ఉద్యమం ఇన్నేసి రకాల కవిత్వాన్ని అందివ్వడం అరుదేనేమో! అయినప్పటికీ అవన్నీ ఉద్యమానికి ఊతమందించాయనడంలో సందేహం లేదు. తెలంగాణ ఏర్పడుతున్నది కాబట్టి ఇక ముందు తెలంగాణ కవులు రాశి కన్నా వాసి మీద ఎక్కువ దృష్టి పెట్టాల్సి ఉంది. మరింత బలమైన, లోతైన భావంతో, విభిన్న కోణాల నుంచి కవిత్వాన్ని అందించాల్సి ఉంది. తెలంగాణ కవిత్వం మరింత విస్తృతి పెంచుకోవాల్సి ఉంది.
-స్కైబాబ

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

పూర్వాంగ్ల కవుల ముచ్చట్లు -30 స్వర్గ నరకాల పరిణయం చిత్ర శిల్ప కవి -విలియం బ్లేక్

పూర్వాంగ్ల కవుల ముచ్చట్లు -30

స్వర్గ నరకాల  పరిణయం

చిత్ర శిల్ప కవి -విలియం బ్లేక్

లండన్ లో 28-11-1757న జన్మించిన విలియం బ్లేక్ తండ్రి హోసరీ మర్చంట్ .పుట్టుక నుంచి విజనరీ ద్రుష్టి ఉన్న వాడు .నాలుగేళ్ళప్పుడే భగవంతుడు కనిపించినట్లు అను భూతి పొందాడు .పొలాలలో నడుస్తూ డుస్తూ  దేవతా గణాలతో ఉన్నట్లు వాటికి రెక్కలున్నట్లు భ్రమించాడు .ప్రతి పొదలో నక్షత్రాలున్నట్లు అను భూతి పొందాడు .వాటిని తన చేతి అర్రతో స్పర్శించి ఆనందాన్ని పొందాడు .తమ్ముడు రాబర్ట్ ఈ అనుభవానికి ప్రత్యక్ష సాక్షి .పెద్దన్న జేమ్స్ తండ్రి వ్యాపారాన్ని నిర్వహిస్తే మూడో వాడు జాన్ తప్ప తాగి చనిపోయాడు .సోదరి కేతరీన్ అవివాహితగానే ఉండి పోయింది

బ్లేక్ స్కూల్ లో చదవనే లేదు .ఎప్పుడూ యేవో బొమ్మలు వేసుకొంటూ ఆ నాటి లండన్ ను కొత్తకోణం లో చిత్రించేవాడు  ఇంటికి ధేమ్స్ నది అతి దగ్గర.ఇవే అతని జీవితాన్ని మలుపు తిప్పాయి .ఆ నాటి కుర్ర కారు కు విరుద్ధం గా కొడుకు ఉండటాన్ని తండ్రి విపరీత ధోరణిగా భావించక ప్రోత్సహించాడు .పదో సంవత్సరం లోనే ఆర్ట్ క్లాసులకు పంపాడు .ప్లాస్టర్ ,గ్రీకు దేవతలా చిత్రాలు డబ్బు  ఇచ్చి అతని సృజనను ప్రోత్సహించాడు .బ్లేక్ జీవితాదర్శం మైకేల్ యాంజే లో ల అవ్వాలని .సొసైటీ ఆఫ్ అప్ప్రేన్టిస్  లో చేరాడు .వెస్ట్ మినిస్టర్ ఆబ్బే లో ఉన్న స్మ్రుతి చిహ్నాలను కాపీ చేసుకొన్నాడు .అందులోని గోదిక్ ఆభరణాలపై ప్రత్యెక ద్రుష్టి పెట్టాడు .ఈ భావన ను ఎప్పుడూ వదలుకోలేదు .పదహారు లో స్వంత ‘’జోసెఫ్ ఆఫ్ అరిమాటియా అమాంగ్ ది రాక్స్ ఆఫ్ ఆల్బియాన్ ‘’అనే శిల్పాన్ని తయారు చేశాడు .దీని నేపధ్యం అంతా సృజన తో కల్పించాడు .ఇది మైకేలాన్జేలో శిల్పం ‘’ క్రూసి ఫిక్సేషన్ ఆఫ్ సెయింట్ పీటర్ ‘’ను గుర్తుకు తెస్తుంది .దీనిని వర్ణిస్తూ’’ఈ పదహారేళ్ళ పడుచు కుర్రాడు ‘’ రాసిన  కేప్షన్ తలలు పండిన పండితులు రాసినట్లు గా ఉండి అందర్నీ ఆశ్చర్య పరచింది అదే –‘’this is one of the Greek artists who built the cathedrels in what we call the Dark ages wandering about in sheepskins and goat skins ,of whom the world was not worthy .Such were the Christians in all ages ‘’.

ఇరవై ఒకటి లో బసీర్ దగ్గర శిక్షణ పూర్తీ చేసుకొని స్విస్ ఆర్టిస్ట్ జార్జి మోసర్ దగ్గర చేరి మెరుగులు దిద్దుకొన్నాడు .మానసిక దృష్టితో ప్రతి విషయాన్ని దర్శించి అనుభూతి చెంది చిత్రించే వాడు, శిల్పించేవాడు .గోదిక్ కళలో శిల్పాలు జీవంలేక శవాక్రుతి లో ఉన్నాయని పించేవి .వాటికి అమరత్వం లేదని  అనుకొన్నాడు .స్వీయ భావన తో అనేక చిత్రాలు గీశాడు ,చెక్కాడు  కాని అవి జీవన భ్రుతికి సరిపడడబ్బు నివ్వలేదు .’’ఎటర్నల్ యూత్ ,ఎటర్నల్ మాన్ ‘’గా తయారు చేశాడు .ఏంతో మానసిక ఆనందాన్ని అనుభ వించాడు .’’గ్లాడ్ డే ‘’అనేది బ్లేక్ ఆదర్శ చిత్ర రాజం .అన్నారు   బంగారు రంగు జుట్టుతో బ్లేక్ స్వర్ణ  కిరీట దారి గా కనిపించేవాడు .ఇరవై అయిదులో కీధరిన్ సోఫియా బూచర్ తో సల్లాపం సాగించాడు .నల్ల కళ్ళచదువు రాని ఆ సుందరిని పెళ్ళాడి తానె గురువై చదవటం రాయటం నేర్పాడు .ఆదర్శ గృహిణి గా ఆమె సహకరించింది .తన భర్త ఎప్పుడూ స్వర్గ లోక విహారే అనేది ఆమె .తిండికి కూర్చున్నప్పుడు ఖాళీ ప్లేట్ మాత్రామే పెట్టేది .తండ్రి చనిపోయిన తర్వాత కుటుంబాన్ని పెద్దన్న చూసుకొన్నాడు .బ్లేక్ ఒక ప్రింట్ షాప్ పెట్టాడు .అన్న రాబర్ట్ అకస్మాత్తుగా మరణించాడు .రాబర్ట్ ఆత్మా సీలింగ్ దాటి విశాల గగనం లోకి చేరటం తాను చూశానని బ్లేక్ చెప్పాడు .సచిత్ర మేగజైన్లను తాయారు చేయటం స్వీయానుభవం తో సాధించాడు .ప్రింట్ షాప్ అచ్చి రాలేదు .పబ్లిషర్ల పుస్తకాలకు సొగసులు కూర్చే పని చేశాడు .బ్లేక్ అందంగా కవితాలను చదివేవాడు మాథ్యూస్ తో కలిసి తన పుస్తకం ‘’పోలిటికల్ స్కెచెస్ ‘’ముద్రించాడు .రాత మాథ్యూస్ ,బొమ్మలు బ్లేక్ తో బాగా వచ్చింది .ఎలిజబెతేన్ జాకోబిన్ కవుల ధోరణి లోనే రాశాడు .కానివీటికి  కొత్త స్వేచ్చ ,స్వచ్చత అద్దాడు .పునరుజ్జీవనం రొమాంటి కవిత్వాలకు మధ్య వారధి గా బ్లేక్ కొత్త పోకడలు పోయి కవిత్వం రాశాడు .

ముప్ఫై లో ‘’సాంగ్స్ ఆఫ్ ఇన్నోసేన్స్ ‘’రాసి ప్రచురించాడు .వినటానికి మహదానందం గా ఉండేవి .బ్లేక్ కవితా లక్షణాన్ని మోనా విల్సన్ ‘’a return from the idea of Excellence to that of Ecstasy as the aim and justification of poetical enterprise ‘’అని శ్లాఘించాడు .బ్లేక్ అరాసిన దిలాంబ్ ,దిలిటిల్ బ్లాక్ బాయ్ ,యాన్ అనదర్  సారో  నైట్ ‘’కవితలు అందరూ చదివిన వాళ్ళమే .భారీ సహాయం తో బ్లేక్ సాంగ్స్ ఆఫ్ ఇన్నో సెన్స్ పుస్తకాన్ని చేతితో తయారు చేసి ,ఇంకెవరూ పబ్లిష్ చేయ కుండా విడుదల చేసి చరిత్ర సృష్టించాడు .ఇలా ఇంతకూ ముందెవరూ చేయలేదు .దీనినే బ్లేక్’’ఇల్ల్యూమినేటేడ్ ప్రింటింగ్ ‘’అన్నాడు .కాగితాలను అందం గా ఆకర్శ ణీయం గా బంగారు రంగుతో కొన్ని పేజీలు  వివిధ వర్ణాలతో తయారు చేసి ధగ ధగ మెరిసేట్లు చేశారు .అతని ఆలోచనకు ఆచరణకు సృజనాత్మక శక్తికి అందరూ నివ్వెర పోయారు ..స్పష్టం గా నిర్డుస్టం గా కంటికి బాగా కనిపించి విందు చేస్తూ చదివిన్చేట్లు చేసి తయారు చేశారు బ్లేక్ దంపతులు .

దీనికి సీక్వెల్ గా కొన్ని లిరిక్కులు రాశాడు .బ్లేక్ భావన ప్రకారం చిన్నపిల్లాడు ఈడెన్ వదిలి ,ప్రపంచంలో ఎదిరించి బతుకుతూ ,స్వర్గం లో పోగొట్టుకోన్నదాన్ని ఇక్కడ పొందాలి .ద్వంద్వాలను ఏకం చేయటమే బ్లేక్ ఆదర్శం’’a fusion of innocence and experience ,good and evil ,flesh and spirit and as he was so enunciate with challenging vehemence ,the marriage of heaven and hell’’ .రెండు విభిన్న ప్రపంచాలలో బ్లేక్ జీవించాడు .అలానే అతని సృజన కళకూడా ఉండేది .కొద్ది కాలం తర్వాత ‘’ట్రయల్ ‘’ దిబుక్ ఆఫ్ ది తేల్’’రాశాడు కాని ఎనభై అయిదేళ్ళ తర్వాతాకాని ముఉద్రింప బడ లేదు .బ్లేక్ స్వీడిష్ ఫిలాసఫర్ ‘’స్వీడెన్ బర్గ్ ‘’అను యాయి .బర్గ్ ‘’దేవుడిని దివ్య మానవుడు ‘’అన్నాడు .బ్లేక్ ధనాత్మక స్వభావం ఉన్న వాడు .వార్ధక్యం పై పడిన కొద్దీ బ్లేక్ అందరికి దూరం గా ఉన్నాడు .

1793లో గ్రామీణ లామ్బెత్ కు చేరి చిన్న ఇంట్లో ఉన్నాడు .పిల్లల జంజాటం లేదు భార్యా భర్త హాయిగా ఆనందాన్ని అనుభవించారు .ధనమూ బాగానే వస్తోంది .సుఖ జీవితం గడుపుతున్నారు .ముప్ఫై లలో సంతృప్తికర జీవితాన్ని అనుభవించాడు .కొత్తా భావనలు మనసులో చోటు చేసుకొన్నాయి .పాత వాటిని మార్చి కొత్తగా తయారు చేశాడు భార్య సాయం తో .వాటిని ‘’richly illuminated volumes’’అన్నాడు .ఇంగ్లాండ్ చరిత్ర ,ను పిల్లల కోసం రాశాడు .గేట్స్ ఆఫ్ పారడైజ్ ను కూడా పిల్లలకోసమే .దీర్ఘ కవితలను రంగుల హర్మ్యం గా తయారు చేశాడు. అమెరికా రివల్యూషన్ కు మద్దతుగా ‘’అమెరికా –ఏ ప్రాఫసీ ‘’రాశాడు ఊహా  ప్రపంచం లో ఉన్దేవాప్పుడూ .బ్లేక్ చిత్రాలు దివ్య కళా విభూతితో దర్శన మిచ్చేవి . జార్జి  కంబర్ లాండ్ అనే నేషనల్ ఆర్ట్ గాలరీ కి చెందిన ఆయనతో పరిచయం ఏర్పడింది .బ్లేక్ ను ఎడ్వర్డ్ యంగ్ రచన ‘’నైట్ థాట్స్ ‘’కు చిత్రాలు వేయమనికోరితే వేశాడు .నలభై మూడు చిత్రాలతో ఇది మొదటిభాగం గా వెలువడింది .

నలభై లో ‘’ది ఫోర్ జోస్ ‘’అనే సింబాలిక్ రచన ప్రారంభించాడు .ఇందులో పాత కొత్త నిబంధనలకు సంబంధిన వన్నీ చోటు చేసుకొన్నాయి .కొంత గందర గోళాన్ని సృష్టించాడు .’’he who works and has his health can not starve ‘’అనే దృఢమైన నమ్మకం బ్లేక్ కు ఉండేది ..ఆగస్ట్ గ్రామం లో ఒక ఇల్లు   అద్దెకు తీసుకొని ఉన్నారు జంట .’’ఫెల్హాం ‘’అనే రచన ప్రారంభించి చిక్కుల్లోపడ్డాడు .సహాయకుడి గా పెట్టుకొన్న వాడి పధ్ధతి బాగాలేక తరిమేస్తే వాడు రాజుకు ఫిర్యాదు చేస్తే రాజుకు  విషయం వివరిస్తూ ఉత్తరం రాశాడు .ఒక సైన్కాదికారిని కొట్టాడని నేరం మోపారు .కేసైంది .బ్లేక్ నిర్దోషి అని తీర్పు వచ్చింది .రాజు బ్లేక్ ను సెక్రెటరి అసిస్టంట్ ను చేశాడు .పాపం బ్లేక్తను ద్వేషించిన  ‘’హెలీ కవి ‘’రాసిన దాన్ని విని,, పొగడాల్సిన  కష్టం వచ్చింది .దీనికి విచారపడుతూ ‘’o why was I born with a different face ?-why was I not orn like the rest of my race?-when I look ,each one starts !when I speak ,I offend –when I am silent and passive ,I lose every friend ‘’అని రాసుకొన్నాడు .శత్రుకవుల దాడిని సునాయాసం గా తిప్పికొట్ట గలుగుతున్నాడు కాని శ్రేయోభిలాషులు  పెట్టె ఇబ్బందుల్ని  భరించ లేక పోతున్నాడు .విసుగొచ్చి లండన్ వదిలి పుట్టిన ఊరికి చేరాడు .పవిత్ర జీవితాన్ని ప్రశాంతం గా గడుపుతున్నాడు .కొత్త సింబాలిక్ కవితలు’’మిల్టన్ అండ్ జెరూసలెం’’  రాస్తున్నాడు .ఇవి మిల్టన్ రాసిన పారడైజ్ లాస్ట్ కు వివరణలతోకూడిన చిత్ర దృశ్యాలు .రెండేళ్ళు బాగానే గడిచింది .

లాభా పేక్ష తో ముచ్చటైన డిజైన్ లతో ‘’కాంటర్ బారీ పిలిగ్రిమ్స్   ‘మొదలు పెట్టాడు .ఇది తెలుసుకొన్న స్తాత్ బాండ్ అనే వాడు పబ్లిక్ ఎక్సిబిషన్ పెట్టి కుబేరుడయ్యాడు .అందరూ బ్లేక్ ను కవిగా అంతగా గుర్తించలేదు .బాధ పడ్డాడు .అతని సృజన కళను ఎవరూ గుర్తించక పోవటం దురదృష్టం .ఒక ‘’డిస్క్రిప్టివ్ కేటలాగ్ తయారు చేసి తన చిత్రాలను ప్రదర్శించాడు .ఫలితం శూన్యం .యాభైలలో పేదరికం వరించింది. భార్య ఆతను ఊహల్లో విహరిస్తుంటే భార్య సంసారాన్ని దిద్దుకోన్నది .ఇంటి అద్దె కూడా చెల్లించలేని దయనీయ స్తితి .కొద్ది మంది ఉదారుల సహాయం లభించక పోయి ఉంటె బ్లేక్ దంపతులు ఆకలితో చని పోయి ఉండేవారు .అతని శిష్యులు గురువు లోని అసామాన్య కళను ఆరాధిస్తూ సహాయం చేశారు .ఇంకా ఇరవై ఏళ్ళు బతికి అసలైన రచన చేయాల్సి ఉంది .మిల్టన్ పై పుస్తకాల డిజైన్ పూర్తీ అయింది .దిఎవర్ లాస్టింగ్ గాస్పెల్ ‘’ఇంకా రావాలి .గేట్స్ ఆఫ్ పారడైజ్ మళ్ళీ తేవాలి చాసర్ కధలు పునర్ముద్రణ పొందాలి .వీటిలో మిల్టన్ పై వచ్చింది అత్యంత ఆశ్చర్యకరమై నదే .దీన్ని బ్లేక్’’sublime allegory for future generations similar to Homer;s Illiad ‘’and Milton;s paradise lost .వీటిని అంతరాత్మ ప్రబోధం గా రాశానని చెప్పాడు .దీన్ని ‘’grandest poem that this world contains ‘’అని బ్లేక్ చెప్పుకొంటే ‘’the most confusing of his long parables an un successful melding ‘’అన్నారు విమర్శకులు .

నిజం గా బ్లేక్ మిల్టన్ తో తాదాత్మ్యం చెంది రాశాడు .మిల్టన్ ను ‘’క్లాసిక్ ఎథీస్ట్ ‘’అన్నాడు బ్లేక్ .ముసలితనం వస్తున్న కొద్దీ మిల్టన్ లా కాకుండా బ్లేక్ జాగ్రత్త పడ్డాడు .మానసిక పోరాటాన్ని ఆపలేదు .విప్లవం గురించి ఎక్కడా బయటికి చెప్పలేదు .అరవై లో ఆరోగ్యం దెబ్బతినటం మొదలైంది .ఒణుకు ,ఫిట్లు వస్తున్నాయి .చిత్రకళా కారుడిగా నే గుర్తుండి పోయాడు .1827ఏప్రిల్ లో తాను మృత్యు ద్వారం  నిరీక్షిస్తున్నట్లు జార్జి కంబర్లాండ్ కు జాబు రాశాడు .శరీరం క్రుశిస్తున్నా బుద్ధి మనసూ బలం గా నే ఉన్నాయన్నాడు .ఇదే ఆఖరి ఉత్తరం అయినా చివరి రచన మాత్రం కాదు .విపరీతమైనశ్రమ ,రచనల తో చిక్కి శల్యమైనాడు .మూత్రపిండాలలో రాళ్ళ బాధ తో ఉన్నా డాంటేపై చిత్రాలు గీస్తూనే ఉన్నాడు .12-8-1827నచిత్ర శిల్ప కవి విలియం బ్లేక్ ఇహం అనే నరకాన్ని  వదలి పరం అనే స్వర్గాన్ని చేరుకొన్నాడు .

‘’to see a world in a grain of sand –and a heven in wild flower –hold infinity in in the palm of your hand –and Eternity in an hour ‘’అన్న కవిత దేశదేశాలలో బహుళ ప్రచారమైంది .బ్లేక్ ను పిచ్చోడు అన్నారు సమకాలికులు .కాని ‘’Blake was like the figures he loved to draw bound to no law of nature moving gravely to his goal, employing the emanations of earth ,air ,fire and water at home among the elements .this outward creation  was a transparent shell though which Blake beheld the fiery secret ,the burning core of e cstacy ‘’.సూర్యోదయం అయినప్పుడు ఆయన చుట్టూ గోల్డ్ గినియా లాంటి వలయం కనీ పిస్తుంది అనటం వాస్తవం కాదు –నాకు మాత్రం  ‘’an innumerable company of heavenly host crying Holy Holy Holy is the Lord god Almighty ‘’కనిపించటం యదార్ధం అని తాదాత్మ్యం తో అన్న దివ్య విభూతి పొందిన ప్రక్రుతిఆరాధకుడు. చిత్ర శిల్ప కవి విలియం బ్లేక్ మహాశయుడు .ఫ్రీ లవ్ సొసైటీ కి ఈజమ్ వేసింది బ్లేక్ అంటారు .వివాహ బంధం విషయం లో క్రిస్టియానితికి  వ్యతిరేకం గా ఉండేవాడు .’అతనిది ”  enlightened philosophy ”

William Blake by Thomas Phillips.jpg

 

 

సశేషం

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -26-5-14-ఉయ్యూరు

 

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

5-5-14ఆదివారం రోహిణి ప్రవేశం నాడు – శ్రీ కనక దుర్గమ్మ -శ్రీ నృసింహ స్వామి- శ్రీ తిరుపతమ్మ దేవాలయ సందర్శనం

25-5-14ఆదివారం రోహిణి ప్రవేశం నాడు – బెజవాడశ్రీ  కనక దుర్గమ్మ వారు ,వేదాద్రి శ్రీ నృసింహ స్వామి ,పెనుగంచి ప్రోలు శ్రీ తిరుపతమ్మ దేవాలయ సందర్శనం -ఖమ్మం లో మా తోడల్లుడు శ్రీ మూర్తిగారి గృహం ,వత్స వాయిలో నేనుముప్ఫై ఏళ్ళ క్రితం మొదటి సారిగా హెద్మాస్ట ర్  గా పని చేసిన హై స్కూలు ,నేను అద్దెకున్న ఒక గది, ఆ ఇంటి వోనర్లు పుల్లయ్య నాయుడు కుటుంబం . 

Posted in నేను చూసినవ ప్రదేశాలు | Tagged | Leave a comment

పూర్వాంగ్ల కవుల ముచ్చట్లు-29 ఆలివర్ గోల్డ్ స్మిత్

పూర్వాంగ్ల కవుల ముచ్చట్లు-29

ఆలివర్ గోల్డ్ స్మిత్

10-11-1728లో ఆల్వార్ గోల్డ్ స్మిత్ ఐర్లాండ్ లోని  లాంగ్ గ్ ఫీల్డ్ లోని పల్లాస్ మోర్ లో జన్మించాడు .తండ్రి క్లేర్జిమన్ ట్రినిటి కాలేజి లో చేరి ,చదువు మీద  శ్రద్ధ  పట్టక ,విదూషకుడిగా అల్లరి చేస్తూ గడిపాడు .కర్క్ కు పారిపోయి ఆడామగా పిల్లలకు డాన్స్ లో వినోదం కల్పించాడు .కాలేజిలో మళ్ళీ చేరమని కోరితే చేరి తక్కువ మార్కుల తో డిగ్రీ ముక్కాడు .తర్వాత హోలీ ఆర్డర్ కు అప్ప్లై చేస్తే తిరస్కరించారు .సంపన్నకుటుంబం కు  ట్యూటర్ గా కుదిరాడు .నిలవ లేక వదిలేసి ,ఒక స్కూల్ లో చేరి నీరస రొటీన్ కు విసిగి మానేశాడు .బాబాయి ఇచ్చిన యాభై పౌండ్లతో జల్సాగా గాంబ్లింగ్ లో పోగొట్టుకొన్నాడు .ఇంగ్లాండ్ వదిలి అమెరికా వెల్లి డాక్టర్ అవాలని అను  కొన్నాడు .లేడేన్ లో క్లాసులకు హాజరై మెడికల్ డిగ్రీ సాధించాడు .తండ్రి వదిలి వెళ్ళిన చివరి పెన్నీ కూడా ఖర్చయి పోయింది .ఫ్రాన్స్ స్విట్జెర్లాండ్ లకు ఒకే ఒక షార్ట్ పాంట్ లతో చేతిలో ఫ్లూట్ తో కదిలి వెళ్ళాడు .డాన్సులు ఉత్సవాలలో తిరిగాడు .పూటకూళ్ళ ఇళ్ళల్లో వాయిస్తూ పోట్టపోసుకొన్నాడు .

ఇరవై  ఆరు లో నిరాశ తో తిరిగి లండన్ చేరాడు .చిన్న పల్లె టూరిలో డాక్టర్ గా ప్రాక్టీస్ పెట్టినా రాణించలేదు .ఇండియా లో డాక్తర్  చేయాలనుకొన్నా అవకాశం రాలేదు .తప్పక రచయితా అయ్యాడు .ఏది కావాలంటే అది రాశాడు కాసుల కోసం .మారుపేర్ల తో పబ్లిషర్లు అడిగినవన్నీ రాశాడు అనువాదాలు లిటరరీ సర్వేలు చేశాడు .’’ది  బీ’’పత్రిక కు ఎడిటర్ అయ్యాడు .వ్యాసకర్త గా పేరు తెచ్చుకొన్నాడు .దాదాపు డబ్బు లేకుండానూ ,డబ్బు చేతికొస్తే విచ్చల విడిగా తగలేస్తూ గడిపాడు .సామ్యుల్ జాన్సన్ తో పరిచయం ఏర్పడింది .ఏ కష్టమొచ్చినా ఆదుకొన్నాడు .డబ్బు ఎలా జాగ్రత్తగా వాడుకోవాలో తెలియ జెప్పాడు ‘’వికార్ ఆఫ్ వెక్ ఫీల్డ్’’నవల రాసి దాన్ని అమ్మి ఇంటి అద్దె బాకీ తీర్చాడు .వోల్టైర్ ,పార్నెల్ ,మొదలగు వారి చరిత్రలు రాశాడు .ఇంగ్లీష్ గ్రామర్ రాశాడు .నాటకాలతో అదృష్టం పరిక్షిన్చుకోవాలను కొన్నాడు ‘’దిగుడ్ నేచార్డ్ మాన్ ‘’,’’ది ట్రావెలర్ ‘’నాటకాలు రాశాడు .ఆరేళ్ళ తరువాత ‘’ది డిసేర్తెడ్  విలేజి ‘’నాటకం అమరుడిని చేసింది .

నలభై అయిదేళ్ళు వచ్చాయికాని చేతిలో పైసా నిలవటం లేదు .ఆరోగ్యమూ దెబ్బ తింది .మనసూ సరిగ్గా లేదు నలభై నాలుగేళ్ల వయసులో గోల్డ్ స్మిత్  4-4-1774న చనిపోయాడు .రచనల్లో తన కష్టాలను ప్రతిఫలింప జేశాడు .ఆరాధన పొందిదింప లేక పోయాడు .వికార్ నవలా ఆయన జీవిత చరిత్రే .కవితలు ఆయన సాహిత్యం లో తక్కువ గానే ఉన్నాయి .’’I can not afford to court the draggle –tail muses –they would let me starve ‘’అన్నాడు .పోప్ తర్వాత దిట్రావెలర్ కవిత మంచి పేరు పొందింది .డేసేర్తేడ్ విలేజి పూర్తిగా వాస్తవికత ఉన్నదికాదు .ముచ్చ టైన కవి అన్నాడు వాషింగ్ టన్ ఇర్వింగ్ .ఆయన రాసిన విలేజ్ స్కూల్ మాస్టర్ ,విలేజ్ ప్రీచర్ ,విలేజ్ కవితలు అతని స్వంత ఐర్లాండ్ కు సంబంధించినవే .అందులో అమాయకత్వం వ్యక్తిత్వం కనీ పిస్తాయి .గోల్డ్ స్మిత్ మరణం తర్వాతా టెంపుల్ చర్చ్ వెస్ట్ మినిస్టర్ ఆబే లో స్నేహితులు జాన్సన్ నాయకత్వం లో ఒక క్లబ్ ఏర్పాటు చేశారు లాటిన్ నుంచి జాన్సన్ అనువదించిన ‘’Oliver Gold smith –a poet  naturalist ,and historian who left scarcely any style of writing untouched and touched nothing that he did not adorn ‘’of all the passions whether smiles ,were to be moved or tears a powerful yet gentle master .ingenius ,vivid ,versatile ,sublime .In style clear levated elegant ‘’అని రాసిన ఫలకాన్ని సమాధిపై అమర్చారు .

 

Oliver Goldsmith by Sir Joshua Reynolds.jpg

 

 

క్రిస్టఫర్ స్మార్ట్

గొప్ప మతాత్మక కవితాలు రాసి క్రిస్టఫర్ స్మార్ట్ చరిత్రలో నిలిచిపోయాడు జర్నలిస్ట్ గా ఉన్నా ఈ కవితలే రాశాడు .దివ్య స్వచ్చత కోసం రాశాడు .11-4-1722 ణ కెంట్ లోని  షిప్ హార్న్ లో జన్మించాడు .తండ్రి స్తివార్డ్ గా ఒక చిన్న ఎస్టేట్ యజమాని గా ఉన్నాడు .తండ్రి చని పోయిన తర్వాతా పదకొండేళ్ళ వయసులో వేన్ ఫామిలీ ఇతన్ని రేబీ కాజిల్ కు తీసుకొని వెళ్ళారు .కౌన్తెస్ ఆఫ్ విల్చేసా స్మార్ట్ తెలివి తేటలకు ముచ్చట పడి పాట్రన్ గా ఉన్నది .కావాల్సిన డబ్బు అంద జేసేది .నాలుగేళ్ళకే రైం తో కవిత్వం చెప్పాడు .పద మూడేళ్లకే ఒడ్ రాశాడు పద హేదేల్లకు పెంబ్రోక్  కాలేజి లో చేరాడు .ర్హేటరిక్ లో లెక్చరర్ అయ్యాడు .ప్రేమలో పడ్డాడు .ఆమె పై కవితలు రాశాడు .తాగుడుకు బానిస అయ్యాడు .క్లాసులో నిద్రపోయేవాడు .ఇరవై అయిదులో అప్పుల పాలయ్యాడు .ఇంట్లో నుంచి భయం తో బయటికి వెళ్ళే వాడు కాదు .కేంబ్రిడ్జి వదిలి లండన్ చేరి ప్రింటర్ పబ్లిషర్ న్యూ బెర్రీ కు సహాయం చేశాడు .బాల సాహిత్యం ప్రచురించే సంస్థ అది .అతని బంధువులమ్మాయిని  పెళ్ళాడాడు .

‘’ఆన్ ది ఎటర్నిటి ఆఫ్ దిసుప్రీం బీయింగ్ ‘’రాసి సియాటన్ ప్రైజ్ పొందాడు .అయిదేళ్ళలో నాలుగు సార్లు ఈ బహుమతి పొందాడు .’’ది హిల్లియాద్ ‘’అనే హోమర్ రచన ఆధారం గా సెటైర్ రాశాడు .అనేక సంస్థలు అతన్ని గౌరవించాయి .స్మార్ట్ భ్రాంతి పూర్వక రచనలు ప్రమాదకరం అని జాన్సన్ అన్నాడు .శరణాలయం లో చేరాడు .అక్కడే గొప్ప కవిత రాశాడు .’’ఏ సాంగ్ టు డేవిడ్ ‘’అనే ఆశ్చర్యకర రచన చేశాడు .విడుదలైన స్మార్ట్ కు స్నేహితులు చందాలు వేసుకొని సాయం చేశారు .పని చేయలేక తాగుడు మానలేక అప్పులు తీర్చలేక అప్పుల అప్పారావు గా జీవించి కింగ్స్ బెంచ్ ప్రిజన్ లో ఖైదుపాలయ్యాడు .21-5-1771లో చనిపోయాడు

బ్రౌనింగ్ ఒక శతాబ్దం తర్వాతా స్మార్ట్ రచన్ అ ఆధారం గా ‘’సాల్ ‘’రాశాడు .స్వస్థత కోల్పోయిన మనసుతో ఇమేజేరీ కవితలు రాశాడు .సాంగ్ డేవిడ్ అనేక సార్లు ముద్రణ పొందింది మొదటి సారి చదివితే అర్ధం కాదు కాని చదివిన కొద్దీ అద్భుతం అని పిస్తాయి .ప్రక్రుతి పైనా జాతీయ భావ జాలం మీదా గొప్ప కవిత్వం రాశాడు .ప్రక్రుతి ఆరాధకుడు .జంతుజాలాన్ని ప్రేమించాడు images in A Song to David are related also to depictions of the Temple in Isaac Newton’s Chronology of Ancient Kingdoms Amended (1728), the John Bunyan‘sSolomon’s Temple Spiritualiz’d (1688), and to the Geneva Bible, these works were relied on by the Freemasons.[194]

Based on this theory, the first pillar, the Greek alpha, represents the mason’s compass and “God as the Architect of the Universe.”[195] The second, the Greek gamma, represents the mason’s square.[196] In addition, the square represents the “vault of heaven.”[193] The third, the Greek eta, represents Jacob’s ladder itself and is connected to the complete idea of seven pillars.[197] The fourth, the Greek theta, is either “the all-seeing eye or the point within a circle.”[197] The fifth letter, the Greek iota, represents a pillar and the temple.[198] The sixth letter, the Greek sigma, is an incomplete hexagram, otherwise known as “the blazing star or hexalpha” to the Freemasons.[198] The last, the Greek omega, represents a lyre and David as a poet..

 

 

 

 

Christopher Smart.jpg

థామస్ చాటర్టన్

కీట్స్ చేత ‘’దిమార్వేలేస్ బాయ్ ‘’అని పిలవ బడిన థామస్ చాటర్ టన్ ఒక పేద స్కూల్ మాస్టారబ్బాయి .చర్చి నీడలో బాల్యం గడిచింది .జననం 20-11-1752.ఎనిమిదేళ్ళవరకు అక్షరం ముక్క నేర్ఫ్వ లేదు .ఫ్రెంచ్ మ్యూజిక్ ,బైబిల్ మీద మోజేర్పడింది .పదో ఏట కవిత్వం అలవడింది .మేరీ రెడ్ క్లిఫ్ చర్చి లో ఒక గది లో ఉండిపురాతన గ్రందాల రాత ప్రతులను ,స్పెల్లింగ్ ల ను అధ్యయనం చేశాడు .’’దిరోమాంటే ఆఫ్ దిస్నిఘ్నేట్’’కవిత చదివి అసలు రచయితా ఎవరో తేల్చి చెప్పాడు .పది హేనేళ్ళా లో అందగాడైన ఈ కుర్రాడు రూమ్సీ ని ప్రేమించాడు బ్రిస్టల్ అటార్నీకి అసి స్టంట్  గా పని చేశాడు శ్రద్ధ చూప లేదు .’’దాడ్స్లీ ‘’రాసి పేరుపొందాడు ..ఇది బాగాపేల లేదు.హోరేస్ వాల్ పోల్ కు రాశాడు సహాయం చేయమని .మోసం జరిగిందని గ్రహించి న్యాయం చేసి మళ్ళీ ఆ జోలికి పోవద్దన్నాడు .

పది హేడేళ్ల్లప్పుడు లండన్ వెళ్లి  ‘’రౌలీ’’ పోయెమ్స్ ,సాంగ్స్ ,డ్రమాటిక్ లిరిక్స్ ,అసంపూర్తి నాటకాలు రాశాడు ఒక నెలలోనే అరడజన్ మెగా జైన్లకు రచనలు చేసి పేరొందాడు .లండన్ మేయర్ స్పాన్సర్ గా ఉంటానని వాగ్దానం చేశాడు సేకరించి రాసిన పురాతన గ్రందాల ముద్రణ కు ఎవరూ ముందుకు రాలేదు .మేయర్ చనిపోవటం తో స్నేహితులకు ముఖం చూప లేక పోయాడు  .చలి ఆకలి తో అలమటించాడు .హాల్ బారన్ గారేట్ కు చేరి బయటికి వచ్చేవాడు కాదు .తల్లికి భార్యకు సంతోషం గా ఉన్నట్లు పోజు పెట్టేవాడు .ఎవరైనా ముందుకొచ్చి డబ్బు ఇస్తామంటే అగౌరవం అని భావించేవాడు .రచన , జర్నలిజం తో బతక లేనని నిర్ధారించుకొన్నాడు .ఆఫ్రికా షిప్ ట్రేడింగ్ లో స్థానం సంపాదించాడు .

24-8-1770లో ఇంటి యజమానురాలు ఇతను చిన్న రొట్టె ముక్కలు మాత్రమెవారం రోజులుగా  బతుకుతున్నాడని తెలుసుకొని మంచి ఆహారం తీసుకొని అంద జేస్తే ఆకలి లేదని వద్దన్నాడు .అర్ధ రాత్రి ఒక రొట్టెల దుకాణానికి వెళ్లి అప్పుకు రొట్టె ముక్కలిమ్మన్నాడు .ఇవ్వనని వాడంటే జీవితం పై విరక్తి కలిగి ఎలుకలు చంపటానికి కావాలని’’ ఆర్సెనిక్ ‘’తెచ్చుకొని తినేశాడు .రెండు రోజులుగా రూము తలుపులు తెరచుకోక పోవటం తో లోపల తాళం వేసిన అ గది తలుపులు పగల కొట్టి లోపలి వెళ్లి చూస్తె చాటర్టన్ చనిపోయి ఉన్నాడు .అప్పటికి అతని వయసు పది హేడు సంవత్సరాల తొమ్మిది నెలలు మాత్రమె .అతని చుట్టూ చినిగిన రాత ప్రతులెన్నో ఉన్నాయి .పాపర్ అయి చనిపోయాడుకనుక ఈ కవిని వర్క్ హౌస్ షూ  లేన్ లో సమాధి చేశారు .

ఇతని కవితల్లో చాసర్ ,స్పెన్సర్ చాయలుంటాయి .పందొమ్మిదో శతాబ్దం వరకు ఇతని కవితలు ఆదరం పొందాయి .రొమాంటిక్ కవులు ఇతన్ని వెతికి పట్టుకొని పునర్జీవి ని చేశారు .కార్లైల్ ఇతని డార్క్ టోనేడ్ మ్యూజిక్ కు పరవశం చెంది ‘’కుబ్లాయ్ ఖాన్ ‘’లో వాడుకొన్నాడు .కీట్స్ ‘’ఎండిమేన్ ‘’లోఈ  కవిని గురించి రాశాడు .మొదట ఆంగ్లం లో సాధారణం గా రాసి తర్వాతా రౌలీ విధానం లోకి మార్చాడని భావిస్తారు. కవితల్లో మనసులోని భావాలను సగమే చెప్పాడు . అనేక మేనరిజాలను ప్రయోగించాడు .ప్రతిభ ఉన్నా సమర్ధించి ప్రోత్స హించే వారు లేక దెబ్బ తిన్న కవి చాటర్టన్ .మరణం 24-8-1770 .మధ్య యుగానికి చెందినా అనేకమైన వాటికి అనుసృజన ,అనువాదాలు చేశాడు .పది హేనవ శతాబ్దికి చెందినా థామస్ రౌలీ అనే ఊహా జనిత సన్యాసిని తానుగా భావించి ఆ ధోరణి లో రాశాడు .చాటర్టన్ ‘’స్వాన్ సాంగ్ ‘’అని పిలువా బడే చివరి కవిత అందర్నీ కదిలించింది –

‘’awake awake o Birtha swotie  mayde –‘’

 

 

 

Thomas Chatterton.jpg  

చావు సీను

సశేషం

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -14-5-14-ఉయ్యూరు

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

పూర్వాంగ్ల కవుల ముచ్చట్లు -28 విలియం కాలిన్స్

పూర్వాంగ్ల కవుల ముచ్చట్లు -28

విలియం కాలిన్స్

విలియం కాలిన్స్ విషాద గీతాల కవి .1721నపుట్టి 1759 లో చనిపోయాడు .ఇతని జీవితం కూడా విషాదాంతమే .మతి స్తిమితం కోల్పాయాడు చివర్లో ..చీసేస్టర్ లో టోపీల వ్యాపారి కొడుకు .ఆక్స్ ఫర్డ్ లో మాగ్దలీన్ కాలేజి లో చదివాడు .’పెర్షియన్ కలోగ్స్  ‘’ను డిగ్రీ చదువుతూనే రాశాడు .పదామూడేల్ల వయసులో మొదటి సంకలనం పబ్లిష్ చేశాడు .ఇరవై  ఆరులో ‘హౌ స్లీప్ ది బ్రేవ్ ‘’రాశాడు .ప్రతిభా వంతుడైన కవి అని పించాడు .చర్చి ,సైన్యం లలో దేనిలో చేరాలో తెలీక ఊగిస లాడాడు.ఇరవై  ఎనిమిదిలో చేతిలో దమ్మిడీ లేని స్తితి .ఒక అంకుల్ ఆదుకొన్నాడు .ముప్ఫై లో ఉన్మాదం వచ్చింది .చివరి తొమ్మిదేళ్ళు మానసిక ఆందోళన ,శారీరక రుగ్మత లతో బాధ పడ్డాడు .ఆక్స్ ఫర్డ్ లో శరణాలయం లో ఉన్నాడు .ఎవర్నీ చూడ టానికి ఇష్టపడలేదు చని పోయినా ఎవరికీ తెలియ లేదు ఏ పేపర్లోనూ అతని చావు వార్తా రాలేదు .‘’దిర్జీ అండ్ సింబలిన్ ‘’మాత్రం అందర్నీ ఆకర్షించింది .ఇది స్వీయ చరిత్ర .విషాదం గా సాగుతుంది .మంచి భావుకత ఉన్న కవి

WilliamCollinsPoet.jpg

 

.                          విలియం కూపర్

ఈ ప్రపంచ దుస్తితికి కుంగి కాలిన్స్ లానే పిచ్చివాడైన విలియం కూపర్ 26-11-1731లో బెర్కామ్స్ స్తేడ్ లో పుట్టాడు .అసూయ అతాన్ని తోటివారికి దూరం చేసింది .బోర్డింగ్ స్కూల్ లోనే అందరూ ఏడిపించేవారు .వెస్ట్ మినిస్టర్ చేరాడు …సొలిసిటర్ కు సహాయకుడి గా ఉన్నాడు .మిడిల్  టెంపుల్  లో బార్ లో చేరాడు .ఒక కజిన్ ను ప్రేమించి భంగపడి దెబ్బతిన్నాడు .కొద్దిగా ప్రాక్టీస్ లో ఉండగా తోటి లాయర్ల ఈసడింపుకు గురై రెండో సారి  దెబ్బతిన్నాడు నరాల బలహీనత మరీ కుంగ దీసింది .తరచూ  డిప్రెషన్  కు లోనయ్యే వాడు .ముప్ఫై రెండులో హౌస్ ఆఫ్ లార్డ్స్ లో గుమాస్తా ఉద్యోగం వస్తే చేరాడు .అక్కడ చేయాల్సిన పని చూసి మనస్తిమితం కోల్పోయాడు .చావాలని ప్రాయత్ని స్టే శరణాలయం లో చేర్చారు .పద్దెనిమిది నెలల తర్వాతా బయటికొచ్చాడు .హంటింగ్ హాం చేరాడు మొరాలియన్ అన్విన్  దంపతులు ఆదరించారు .రెండేళ్ళ తర్వాతా మొరలె గుర్రపు సవారిలో కిందపడి చనిపోతే కూపర్ బకింగ్ హాం షైర్ లో ఒల్నీ కి చేరాడు .మేరీ అతని వెంట ఉంది జాగ్రత్త గా కనీ పెట్టి చూస్తుండేది .ఇద్దరి మధ్యా వలపులు సాగి పెళ్లిదాకా వచ్చి మళ్ళీ దురదృష్ట వశాత్తు మేరీ చనిపోవటం తో మూడోసారి మానసికం గా దెబ్బ తిన్నాడు .శారీరక, మానసిక ఆరోగ్యాల లేమితో డెబ్భై ఏళ్ళు బతికి 25-4-1800లో చనిపోయాడు .జాన్ న్యూటన్ అనే మత ప్రవక్త ప్రేరణ తో ఇవాంజెలికల్  ధోరణి లో  అరవై ఏడు భక్తీ కవితలు రాశాడు .వీటికి ‘ఒల్నీ హైమ్స్’’అని పేరు పెట్ట్టాడు .పెళ్లి చేసుకో దలచిన అమ్మాయి గురించిన చింతన తో రాశాడు .కూపర్ కవి విషాదాన్ని సిసిల్ ‘’ది  స్త్రికేన్ ‘’లో రాసిన లార్డ్ డేవిడ్  కు చూపాడు .యాన్తాలజిస్తులు కూపర్ రాసిన ది పాప్యులర్ ఫీల్డ్ ‘’,ఆన్ ది లాస్ ఆఫ్ దిరాయల్ జార్జి ‘’కవితల్ని తరచూ ఉదహరిస్తారు .గొప్ప లేఖా సాహిత్యాన్నీ రచించాడు మంచి  ప్రభావం  ఉన్నా విధి చేతిలో దెబ్బ తిన్న కవి.”ది డై వేర్తేడ్ హిస్టరీ ఆఫ్ జాన్ గిల్పిన్ ”రాశాడు

 

 

 

William Cowper by Lemuel Francis Abbott.jpg

బీద డాక్టర్ కవి -జార్జి క్రేబిల్

వివాదాస్పదు డని పించుకొన్న జార్జి క్రేబిల్ 24-12-1754లో ఆల్దేన్ బర్గ్ లోని సఫోల్క్స్ లో పుట్టాడు .విద్యా గంధం లేని వాడు .స్వయం కృషితో అన్నీ నేర్చాడు .ఉప్పు పన్ను వసూలు చేసే ఉద్యోగం చేశాడు .తర్వాత ఒక సర్జన్ కు అసిస్టంట్ అయ్యాడు .మిడ్ వైఫ్ గానూ ఉన్నాడు.రోజు కూలి చేసీ బతికాడు .చివరకు ఆల్డే బర్గ్ లో డాక్టర్ అయ్యాడు .అతని ఊరి వాళ్ళు ఇతను బీదవాడనే భావన తో ఉండి డాక్టర్ గా గుర్తించలేదు .అతని సామర్ధ్యం పై నమ్మకం పెట్టుకోలేక పోవటం తో కేసులు రాక రాబడిలేక డాక్టర్ గా ఫైల్యూర్ అని పించుకొన్నాడు .ఇరవైఆరుకే చిల్లిగవ్వ లేని డాక్టర్ అయ్యాడు .ఎందరినో కలిశాడు .ప్రయోజనం శూన్యం .ఎడ్మండ్ బర్క్ ఆదరింఛి లండన్ తీసుకొని వెళ్ళాడు .అక్కడ సామ్యుల్ జాన్సన్ వంటి వారిని కలిసి వారి సాయం పొందాడు .బర్క్ సలహాతో చర్చి విధుల్లో చేరాడు .మళ్ళీ స్వంత ఊరు ఆల్దేబర్గ్ చేరినా అతని పేదరికం అతన్ని వెక్కిరించి అతని ద్వారా మత బోధ పొందటానికి ఎవరూ ముందుకు రాలేదు .మళ్ళీ నిరాశ .బర్క్ సలహా మేరకు జార్జిని చాప్లిన్ చేశాడు డ్యూక్ ఆఫ్ రట్ లాండ్ .సారా ఎమిలీ ని పెళ్ళాడాడు . దొర్సేట్ షైర్  లో రెండు పట్టణాలను అప్పగించాడు .

అక్కడే మొదటి ‘’ది విలేజ్ ‘’అనే కవితా సంకలనం తెచ్చాడు .ఇందులో గోల్డ్ స్మిత్ రోమాన్స్ కవితలని చెండాడాడు నవలా కర్త సర్ వాల్టర్ స్కాట్ ఆహ్వానిస్తే ఎడిన్ బర్గ్ వెళ్ళాడు .జార్జి కవిత కు అబ్బుర పడి చదివి విని పించుకొని మెచ్చి పదేళ్ళ తర్వాత కూడా వాటిని మర్చి పోకుండా నోటితో చెప్పాడు స్కాట్ .వయసు పెరిగిన కొద్దీ భావ సాంద్రతా  పెరిగింది అరవైలో త్రో బ్రిడ్జి చర్చి కి మినిస్టర్ అయ్యాడు ‘’టేల్స్ ఆఫ్ ది హాల్ ‘’రాశాడు .థామస్ హార్డీ ‘’నేను క్రేబిల్ రాసిన విలేజ్ చదవక పోయి ఉంటె నా నవలలను రాసి ఉండే వాడిని కాను ‘’అని కితాబు ఇచ్చాడు .అభిమానులు ,కవుల మధ్య చివరి రోజులు గడిపాడు .జలుబు తో ప్రారంభమైన  జబ్బు అతని ప్రాణాలను 3-2-1832న బలి కొన్నది .దాదాపు అజ్ఞాత కవిగా మిగిలాడు .ఒక శతాబ్దం తర్వాతా ఎడ్విన్ ఆర్లింగ్ టన్ క్రేబిల్ గుణ గణాలను ‘’  ‘’plain excellence and stubborn skill ‘’ ‘అని పొగిడారు .

 

George Crabbe by Henry William Pickersgill.jpg

ఆస్థాన కవి హోదా ను తిరస్కరించిన  – థామస్ గ్రే

పన్నెండు మంది పిల్లలలోమిగిలింది ఒక్క  ధామస్ గ్రే ఒకడుమాత్రమె  .అలాగే ఒకే ఒక్క ‘’ఎలిజీ ‘’తో కవుల్లో అగ్రేసరుడని పించుకొన్నాడు గ్రే .లండన్ లో 26-12-1716జననం .చిన్నప్పుడే క్షయ లక్షణాలతో ఇబ్బంది పడ్డాడు .నుదుటిపై ఒక రక్త నాళాన్ని కోసి తల్లి బతికించింది. తండ్రి ముక్కోపి .దమ్మిడీ సంపాదన లేదు భార్య వదిలేసి పోయి కొడుకును స్వంతం గా పెంచుకోంది .తల్లి తరఫు బంధువు ఆదుకొన్నాడు .ప్రధాని ,రిచార్డ్ వెస్ట్ మరియు లార్డ్ చాన్స్ లర్ ఆఫ్ ఐర్లాండ్  కొడుకు హోరేస్ వాల్ పోల్ కు అసిస్టంట్ గా చేరాడు .లార్డ్ అకస్మాత్తుగా చనిపోతే గ్రే ఒకసానెట్ ను రాశాడు అది బాగుందని అన్నారు  ’’and weep the more because I weep in vain ‘’ .పీటర్ హౌస్ లో లాయర్ అవాలనే కోరిక ఉండేది క్లాసిక్స్ పై ద్రుష్టి పడింది గణితం మానేసి అనువాదాలు చేశాడు కేమ్ బ్రిడ్జి లో  చదివినా డిగ్రీ పొందలేదు .వాల్ పోల్ తనతో యూరప్ పర్యటనకు గ్రే ను వెంట తీసుకొని వెళ్ళాడు .రెండేళ్ళు ఇటలీ ఫ్రాన్స్ వగైరాలు చూశారు .ధన గర్వంతో గ్రే ను చిన్న చూపు చూసేవాడు వాల్ పోల్ .గ్రే ఇంగ్లాండ్ తిరిగోచ్చేశాడు .రెండేళ్ళు చదివి లాలో డిగ్రీ పొందాడు .కాని ప్రాక్టీస్ చేసిన దాఖలాలు లేవు

తల్లి రిటైర్ అయి ఇతని దగ్గరే ఉంది .వాల్ పోల్ జరిగిన దాన్ని క్షమించమని మిత్రుడికి కబురు పంపాడు అతను రాసిన ఎలిజీ అద్భుతం అన్నాడు .దాన్ని కావ్యం గా రాయమని కోరాడు .ఏడేళ్ళు రాసి అద్భుతం అని పించాడు ..పరువు ,ప్రతిస్టా పెరిగాయి .వ్రాత ప్రతి పైరేట్ అయి ఒక పబ్లిషర్ చేతికొచ్చి ప్రింట్ చేశాడు .డబ్బు తీసుకోవటానికి గ్రే తిరస్కరించి దెబ్బతిన్నాడు .దాన్ని అమ్ముకొన్న పబ్లిషర్ వెయ్యి పౌండ్లు సంపాదించుకొన్నాడు .తల్లి చని పోయిన తర్వాత పల్లెటూరిలోనే ఉన్నాడు .పూర్వ చరిత్ర ,ఐస్ లాండిక్ వేర్స్ లపై దృష్టి  పడింది .’’పిండారిక్ ఓడ్స్ ‘’రాశాడు .నలభై లలో రాజాస్థాన కవి పదవి కి ఆహ్వానం వచ్చినా తిరస్కరించాడు .అది ఏ సరుకూ  బుర్రా లేని విలియం’’ వైట్ హెడ్ ‘’కు దక్కింది .

ప్రొఫెసర్ అయి బోధించాలని ఆరాట పడ్డాడు. రాలేదు యాభై రెండులో ‘’ప్రొఫెసర్  ప్రొఫెసర్ ఆఫ్ హిస్టరీ   అండ్ మోడరన్ లాంగ్ వేజేస్ ‘’అయ్యాడు .యాభై మూడులో స్విట్జెర్లాండ్ వెళ్ళాలను కొన్నాడు .అకస్మాత్తుగా జబ్బు పడ్డాడు .వాత రోగం వచ్చి క్షయ ముదిరి యాభై అయిదేళ్ళలో 30-7-1771.నచనిపోయాడు .పిండారీ ఓడ్స్ అందర్నీ మెప్పించాయి దానికి సరి అయిన రచన రాలేదు .అందుకే ‘’elegy is the one poem which entitles Gray to enduring fame .He presents a series of twilight pictures and condenses a philosophy which is both sad and soothing .youth to fortune and to fame unknown ‘’అని అతని స్నేహితుడు భావించాడు .

”the elegy written in a country church yard ”   కు విశేష   ప్రాభవం పొందాడు

PortraitThomasGrayByJohnGilesEccart1747to1748.jpg

 

సశేషం

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -24-5-14-ఉయ్యూరు

 

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

పూర్వాంగ్ల కవుల ముచ్చట్లు -27 సోగాసు,లాలిత్యాల పతనం

పూర్వాంగ్ల కవుల ముచ్చట్లు -27

సోగాసు,లాలిత్యాల పతనం

పద్దెనిమిదో శతాబ్ద సాహిత్యం కృత్రిమం ,వక్రం ,పదాడంబరం అనే పేరు తచ్చుకోంది .పోప్ కాలం అంతా వ్యక్తిగత కవిత్వానికే ప్రాధాన్యమై పోయింది .గొడవలు ,మనస్పర్ధలె రాజ్యం చేశాయి .కాని వీటికి విరుద్ధం గా కవిత్వం లో మరో పాయ ప్రవహించింది .గ్రామీణ ఇంగ్లాండ్ పుష్ప ఫల ,భరితమై పంటలకాలవాలమైంది  .వీటి అందాలను కవిత్వం లో నింపారు కవులు .అలాంటి వారిలో మాధ్యూ గ్రీన్ జేమ్స్ థామ్సన్ ,థామస్ గ్రే జాన్ డయ్యర్ ,విలియం కాలిన్స్ ,విలియం కూపర్ .మారుతున్న పల్లె స్తితి గతులను ఆలివర్ గోల్డ్  స్మిత్ గ  జార్జి క్రాబిల్ లు ఆవిష్కరించారు .క్రిస్టోఫర్ స్మార్ట్ ,థామస్ చాట్టేర్ట న్ ,కొంతపట్న  వాసనను పల్లె కవిత్వానికి అంటించారు .రాబర్ట్ బర్న్స్ పాటలు విలియం బ్లేక్ ,విజన్ మరి కొంత మార్పును చూపాయి . రెండో తరాహా కవులు సామ్యుల్ జాన్సన్ ,చార్లెస్ చర్చిల్ లు మాత్రం పోప్ తరహా కవిత్వాన్నే అనుసరించారు .హీరోయిక్ కప్లేట్స్ రాశారు .భావాలను వృద్ధి చేసి కవిత్వ విధానం లో మార్పులు చూపారు .ఈ ప్రయత్నాలు ,కొత్త పోకడలు ,రీతి ఉన్నా కన్సర్వేటివ్ మనస్తత్వం ఉందని ఇలియట్ అన్నాడు .

సాహిత్య షరాబు ,నిఘంటు నిర్మాత – సామ్యుల్ జాన్సన్

కవిగా గుర్తింపు లేక పోయినా అసలు కవే కాక పోయినా సామ్యుల్ జాన్సన్ ఆగస్టస్ కాలం లో విశేష ప్రాభవం ఉన్న వ్యక్తీ .వ్యాస కర్త ,జీవిత చరిత్రకారుడు ,లేక్సికో గ్రాఫర్ ,విమర్శకుడు ,గొప్ప సంభాషణా చతురుడు .17-9-1709లో శాఫోర్డ్ షైర్ లోని లిచ్ ఫీల్డ్ లో జన్మించాడు .తండ్రి పుస్తక వ్యాపారి .బాల్యం బాలారిస్టాలతో గడిచింది .నాలుగేళ్ళప్పుడు ‘’కింగ్స్ ఈవిల్ ‘’అనే జబ్బు సోకి ,రాజుగారి హస్త స్పర్శ తో తగ్గుతుందనే నమ్మకం తో లండన్ కు  తీసికెళ్లారు .అన్నే రాణి చేయాల్సింది అంతా చేసింది కాని గుణం కనీ పించలేదు .ఆ జబ్బుతోనే జీవితాంతం  బాధ పడ్డాడు .కంటి చూపు తగ్గి పోయింది .ఇన్ని అవరోదాలెదురైనా  స్వయం గా విజ్ఞాన సముపార్జన చేశాడు  .అతని జ్ఞాపక శక్తి అసాధారణం .గ్రామర్ స్కూల్ లో లాటిన్ నేర్చాడు పందోమ్మిదిలో ఆక్స్ ఫర్డ్ లోని పెంబ్రూక్  కాలేజిలో చేరి ,ఒక ఏడాది చదివి ఆర్ధిక ఇబ్బందులతో మానేశాడు .అతని బూట్లు చిరిగి పోయి పాదాలు బయట పడేవి కొత్తవి కొనుక్కోలేనంత నిర్భాగ్యుడు .

రెండేళ్ళ తర్వాత తండ్రి మరణం తో ఆయన ఇచ్చిన ఇరవై పౌండ్ల తో జీవించాల్సి వచ్చింది .మార్కెట్ బాస్ వర్త్ లోని ఒక స్కూల్ లో టీచర్ గా చేరి పొట్ట పోసుకొన్నాడు .బిమ్మింగ్ హాం జర్నల్ కు రాస్తూ కాస్తో కూస్తో సంపాదిస్తూండే వాడు .అక్కడి పుస్తక వ్యాపారి జాన్సన్ మొదటి పుస్తకం ‘’ ఏ ఒడ్ టు అబిసీనియా ‘’ను ప్రచురించాడు .ఇరవై ఆరో ఏట ఎలిజ బెత్ పోర్టర్ ను పెళ్లి చేసుకొన్నాడు .ఆమె ఇతితని కంటే ఇరవై ఏళ్ళు పెద్దదైన వితంతువు .ఇద్దరు కలిసి బోర్డింగ్ స్కూల్ నడిపారు .ఏడాదికే మూత పడింది .జాన్సన్ లండన్ చేరి అక్కడే ఉండిపోయాడు .చూడటానికి అందం గా ఉండే వాడుకాదు .కోపం ఉద్రేకం ,సరైన వస్త్ర ధారణ లేక పోవటం ,తీవ్ర స్వభావం జాన్సన్ బాహ్య  లక్ష ణాలు .సన్నగా అస్తిపంజరం లా ఉండేవాడని శిష్యుడు బాస్వేల్ గురువును వర్ణించాడు .ఒక కంటితోనే చూడా గలిగే వాడు .అవయవాలను స్వేచ్చగా కదిలించ గలిగే వాడు కాదు .కాని మానవత్వం ఉన్నవాడు .న్యాయ ధర్మాలతో సంచరించేవాడు  సాహిత్యాన్ని బేరీజు వేసి తూచి నాణ్యతను నిగ్గు తేల్చే గొప్ప సమర్ధత ఉన్న షరాబు .ప్రతి సాహిత్య కారుది మీదా జాన్సన్ ఏం చెప్పాడు అని అందరూ ఎదురు చూసే వారు .

‘’ది జెంటిల్ మానస్ మెగ జైన్ ‘’ ప్రింటర్ పబ్లిషర్ ఎద్వార్డ్ కేవ్ –జాన్సన్ కు ఉద్యోగం ఇచ్చాడు .అందులో పని చేస్తూ వ్యాసాలూ స్కెచ్ లు కవితలు ,పార్ల మెంటరీ చర్చల పై  రిపోర్టులు రాశాడు .వినపడని వాటిని స్వయం గా సందర్భానికి తగి నట్లు కూర్చి రాసేవాడు .జువేనాల్ రాసిన ‘’మూడవ సెటైర్ ‘’పారా ఫ్రేజ్ రాశాడు తర్వాత ‘’వానిటీ ఆఫ్ హ్యూమన్ విషెస్ ‘’పదకొండేళ్ళ తర్వాతా రాశాడు .అతని కామెంటరీ లన్నీ లాటిన్ పద జాలం తో బైబిల్ సూక్తి ముక్తావళి తో ఉండేవి .ఒక సమగ్ర డిక్షనరీ తయారు చేయాలనే కోరిక కలిగి దానికి తగిన ప్రణాళిక తయారు చేసి లార్డ్ చెస్టర్ ఫీల్డ్ కు సమర్పించాడు .యేళ్ళు  గడిచినా దానిపై రాజు స్పందించలేదు నిర్లక్ష్యానికి బాధ  పడ్డాడు .అనుమతి లేక పోయినా మొదలు పెట్టాడు .పూర్తీ చేశాడు దీనిమీదా రాజు పెద్దగా ద్రుష్టిపెట్టలేదు .విసిగెత్తి విన్నపాలుగా జాబులు రాశాడు .కావాలనే రాజు అలా చేశాడని గ్రహించాడు

జాన్సన్ అదృష్టం దోబూచు లాడింది .’’ఐరీన్ ‘’పేరరాసిన బ్లాంక్ వేర్స్ ట్రాజెడీని గార్ర్రిక్ అనే శిష్యుడు ప్రదర్శించాడు దీని కి రెండు వందల పౌండ్లు మాత్రమె వచ్చాయి .ట్రాజెడీ ట్రాజేడీనే మిగిల్చింది త .’’రాసీల్స్ –ప్రిన్స్ ఆఫ్ అబిసీనియా ‘’నవల రాశాడు  దీన్ని ఒల్తైర్  రాసిన ‘’కాన్దీద్ ‘’తో పోల్చారు .మూడవ జార్జి అధికారం లోకి వచ్చిన తర్వాత జాన్సన్ కు ఏడాదికి మూడొందల పెన్షన్ ఏర్పాటు చేశాడు .ఆర్ధిక స్తితి బాగు పడింది .షేక్స్ పియర్ నాటకాలను ఎనిమిది పుస్తకాలుగా పూర్వపు వారి కామెంటరీ ల ననుసరించి తెచ్చాడు. అందులో జాన్సన్ సామర్ధ్యం తక్కువే నన్నారు .చివరి రచన గా ‘’లైవ్స్ ఆఫ్ ది పోఎట్స్ ‘’ను డెబ్భై వ ఏట రాయటం ప్రారంభించాడు. అదే వ్యాపకం గా జీవించాడు. రెండు వందల గినీలోచ్చాయి అతని జ్ఞాపక శక్తి మేధా ,కూర్పు అనితర సాధ్యమని పించాయి .రెండు వందల ఏళ్ళ  పాటు అదే కవుల జీవితాలకు కరదీపిక గా నిలిచింది .కవుల జీవితం కవిత్వం అందులోని సొంపులు ఇంపులు విమర్శనాత్మకం గా రాశాడు .సత్యాన్వేషణ లో ఎవరినీ వదలలేదు .’’un disputed leader of thought for a quarter of a century –a writer whose prodigious reputation surpassed his out put .’’డెబ్భై అయిదేళ్ళ వయసులో 13-12-1784 న జాన్సన్ మరణించాడు .వెస్ట్ మినిస్టర్ ఆబ్బే లో సమాధి చేశారు .

జాన్సన్ రాసిన చిన్న కవితాలలో మెరుపులు లేవు గుర్తుండి పోయేవీకావు .’’రాసిలాస్’’ లో జాన్సన్ ‘’the business of a poet is to examine not the individual but the species –to remark general properties and large appearences .he does not number the streaks of the tulip or describe the different shades of verdure of the forest ‘’అని భాష్యం చెప్పాడు .సాహిత్యం లో జీవిత చరిత్రలకు తేరా దీసిన వాడు జాన్సన్ .రాసి తక్కువైనా వాసి ఎక్కువ అనేట్లు కవిత్వం రాశాడని కొందరి అభిప్రాయం .’’క్రిటిక్కుల క్రిటిక్ ‘’అన్నారు .

Portrait of Samuel Johnson after Sir Joshua Reynolds

 

వ్యంగ్య కవి చార్లెస్ చర్చిల్

చర్చిల్ కవిత్వం ఏవగింపు అన్నాడు సామ్యుల్ జాన్సన్ .చర్చిల్ కవిత్వం తాత్కాలికానందాన్నిస్తుందని శిష్యుడు బాస్వేల్  అంటాడు .సమకాలీనులను ఆశ్చర్య చకితుల్ని చేశాడు చర్చిల్ .ఒక క్లేర్జిమన్ కు 1732లో పుట్టిన చర్చిల్ వెస్ట్ మినిస్టర్ స్కూల్ లో చదివి కేంబ్రిడ్జి సెయింట్ జాన్ కాలేజిలో చదివాడు కాని మెట్రి కూడా పాస్ కాలేదు .బాకీ ఉన్న డబ్బులు కవిత్వం రాసి తీరుస్తానన్నాడు .’’అపాలజీ ‘’రాసి వెయ్యి పౌన్లు ఆర్జించాడు .భార్యనోదిలేసి కనపడిన అందరితో కులికాడు .ఒక వ్యాపారి కూతురికి లైన్ వేసి కొంపలో కూర్చో బెట్టాడు. ముతక కవిత్వం గిలికాడు ‘’ది ప్రాఫేసీ ఆఫ్ ఫామిన్ ‘’రాసి కొంచెం కదిల్చాడుజనాన్ని .జనం మర్చిపోయిన కవుల్లో చర్చిల్ ఒకడయ్యాడు .ముప్ఫై రెండులో ఒక ప్రయాణం లో ఆక్సి డెంట్ వలన4-11- 1764లో చనిపోయాడు .1763లో రచనలు ముద్రింప బడ్డాయి.

 

  

 

గ్రీన్ ,డయ్యర్ ,థామ్సన్

ప్రయోజన కరమైన కవిత్వాన్ని రాసిన వారిలో మాధ్యూ గ్రీన్ ఉన్నాడు .1697లో పుట్టి 1737లో చని పోయాడు .లండన్ లో పుట్టి అదే ప్రపంచం గా బతికాడు మర్యాదాపూర్వక కవితలల్లాడు .క్వేకర్స్ కోసం ది సీకర్ ‘’,’’అపాలజీ ఫర్ క్వేకర్స్ రాశాడు .ఒకరకం గా క్వేకర్ కవి .

ఉన్నికవి-  జాన్ డయ్యర్ వేల్స్ 1699-1744వాడు .ఇటలీలో పెయింటింగ్ కోర్సు చదివాడు .ప్రక్రుతి దృశ్యాలను చిత్రకారుడి దృష్టితో చూశాడు కవిత్వం సాహిత్య భ్రాంతి తో ఉంటున్దని అన్నారు  .ప్రతి నామ వాచాకానికి విశేషనం ఉంటుంది .క్లేర్జిమన్ అయిన డయ్యర్ పరిశీలనను నీతి బోధనాన్ని చేర్చి మనిషి కోసం రాశాడు. విషయాన్ని వాస్తవ దృష్టితో చూసి కవిత్వం రాశాడు .ఏడు వందల లైన్ ల ‘’ప్లీస్ ‘’రాశాడు .ఇది వర్జిల్ రాసిన జిఅర్జిక్స్ లా ఉంటుంది .ఉన్ని నేత విషయమే ఎక్కువ ..మగ్గాల ధ్వనుల్ని పసికట్టి కవిత్వం లో చోటుకల్పించాడు. మాంచెస్టర్ ,చెస్ ఫీల్డ్ లకు వృత్తికి ప్రతీకలివి ‘’the cries of sorrow sadden all the streets –and the disease of intemperate wealth ‘’ అను ఉన్ని వ్రుత్తి లో వారి కష్ట సుఖాలన్నీ కళ్ళకు కట్టించాడు .’’ఉన్ని కవి ‘’అని పిస్తాడు ‘’గ్రాన్గేర్ హిల్’’అనే ప్రసిద్ధ కవిత లో పతన వాస కవిత్వం లోని డొల్ల తనాన్ని చూపాడు .సూక్తి ముక్తావళి లాంటి కవిత్వాన్ని రాశాడు .

బ్రిటన్ జాతీయ గీతాన్ని రాసిన  జేమ్స్ థామ్సన్ 1700లో పుట్టి 1748లో మరణించిన స్కాట్ లాండ్ కవి .ఎడిన్ బర్గ్ యూని వర్సిటి లో చదివి చర్చి మినిస్టర్ కు సెలెక్ట్ అయి మనసు మార్చుకొని లండన్ చేరి పోప్ సర్కిల్ లో చేరి ,పోషకుల వలన ఇటలీ ఫ్రాన్స్ లు తిరిగి ఫ్రాన్స్ లో లార్డ్ చాన్స్ లర్ కొడుకుకు కు ట్యూటర్ అయ్యాడు .డ్రామటిస్ట్  గా విజయ దుందుభి మొగిన్చి లండన్  తిరిగి వచ్చాడు .గ్రామీణ రిచ్ మాండ్ లో కాపురమున్నాడు .అయిదు ట్రాజేడీలు రాశాడు .టెన్ సిలబిల్ బ్లాంక్ వేర్స్ ను వాడాడు .’’ఒ సోఫియా సోఫియా ‘’అనే దీర్ఘ ఎలిగరి  కవిత రాశాడు .’’ది కాజిల్ ఆఫ్ ఇండోలేసేన్స్ ,’’ఆల్ఫ్రెడ్ ‘’లు కూడా రాసి మెప్పించాడు .ఆల్ఫ్రెడ్ లో బ్రిటన్ జాతీయ  గీతం ఉంది .ప్రకృతిని ప్రేమిస్తూ చాలా రాశాడు .దీర్ఘకవితల్లో బ్లాంక్ వేర్స్ నుపయోగించాడు. కొత్త పరిశోధనలపై కవిత్వం రాసి అంతకు ముందెవరూ చేయని సాహసం చేశాడు .శరదృతువులో జాబిలీ అతనికి ‘’week and blunt ,is wide refracted rays ‘’లా కని పించింది .’’ది సీజన్స్ ‘’లో పెద్దగా సంచలనాత్మకమైన విషయాలు లేవు .కాని ఆ పంక్తులలో సంగీతం మనసుకు హాయి నిస్తుంది .ఆ తరం కవులలో ఎవరికీ అబ్బని ఈ సంగీత గుణం థామ్సన్ కవిత్వం లో చేరి బంగారానికి తావి అబ్బి నట్లయిది .దీనికి జెర్మనీ అనువాదం ప్రపంచ ప్రసిద్ద మైంది .ధాంసన్ మరణం పై జాన్సన్ స్పందిస్తూ ‘’ by taking cold on the waters between London and Kew ,he caught a disorder which careless exasperation ended in a fever that put end to his life’’అన్నాడు .

సశేషం

రేపు శ్రీ హనుమజ్జయంతి -శుభా కాంక్షలతో

మీ- గబ్బిట దుర్గా ప్రసాద్ -2-5-14-ఉయ్యూరు

 

 

 

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

ఎంత మంది మహత్ములబ్బా! గాంధీపై పటేల్ విసుర్లు -raj mohan gandhi

ఎంత మంది మహత్ములబ్బా! గాంధీపై పటేల్ విసుర్లు

Published at: 22-05-2014 00:23 AM

భారత స్వాతంత్య్ర ఉద్యమ చరిత్రలో సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్‌కు ఒక ప్రత్యేక స్థానముంది. గాంధీ, నెహ్రూ, పటేల్‌ల మధ్య ఉన్న సంక్లిష్టమైన అనుబంధాలు, జాతీయోద్యమంపై వాటి ప్రభావం, సమకాలీన భారతదేశంలో పటేల్ సిద్ధాంతాల ఆవశ్యకతలపై ఇప్పటికీ చర్చ జరుగుతూనే ఉంది. అయితే పటేల్ జీవితాన్ని సమగ్రంగా చిత్రీకరించిన రచనలు అతి తక్కువ. ఈ లోటును పూరిస్తూ గాంధీ మనమడు, చరిత్రకారుడు రాజ్‌మోహన్ గాంధీ ఇంగ్లీషులో రాసిన పటేల్ జీవితకథను-“వల్లభ్‌భాయ్ పటేల్.. ” పేరిట ఎమెస్కో పబ్లికేషన్స్ ఇటీవల తెలుగులో ప్రచురించింది. దానిలోని కొన్ని ఆసక్తికర భాగాలు..

లండన్‌లో లా కాలేజీలను ‘ఇన్స్ ఆఫ్ ద కోర్ట్’ అని పిలిచేవారు. అటువంటి కాలేజీలలో ఒకటైన మిడిల్ టెంపుల్‌లో వల్లభ్‌భాయ్ చేరాడు. అక్కడ కోర్సులో భాగంగా మూడేళ్లలో తొమ్మిది టర్మ్‌లు చదవాలి. ప్రతి టర్మ్‌లో ఏదో ఒక ఇన్‌లో కనీసం ఇన్నిసార్లు రాత్రిపూట భోజనం చేయాలనే నియమం ఉంది. తనకన్న ముందు మోహన్‌దాస్ గాంధీ, మహమ్మద్ అలీ జిన్నా, విఠల్‌భాయ్ అలాగే చేసారు. 1910లో జవహర్‌లాల్ నెహ్రూ కూడా ఇన్నర్ టెంపుల్‌లో చేరాడు. ఆయన వల్లభ్‌కన్న 14 సంవత్సరాలు చిన్నవాడు. అక్కడ చేరేముందు నెహ్రూ.. హారో, కేంబ్రిడ్జ్‌లలో చదివాడు; వల్లభ్‌లాగా పెట్లాడ్, నడియాడ్, బోర్సాడ్‌లలో కాదు. లండన్‌లో వల్లభ్, జవహర్‌లాల్ కలిసినట్లు ఎక్కడా రికార్డు లేదు. భౌతికంగా, విద్యాపరంగా సమీపంలో ఉన్నా వారు ఎవరి ప్రపంచంలో వారుండిపోయారు.

‘ఈక్విటీ’ అనే సబ్జెక్టులో మొదటి మార్కులు వచ్చినందుకు వల్లభ్‌భాయ్‌కు, గాడ్‌ఫ్రే డేవిస్ అనే క్లాస్‌మేట్‌కు 1911 జనవరిలో కాలేజీవారు అయిదేసి పౌండ్లు బహుమతిగా ఇచ్చారు. ఆ బహుమతి పొందినప్పుడు తనకు ఎంత ఆనందం కలిగిందో ఆయన నర్సీభాయ్‌కి రాసిన ఒక ఉత్తరాన్ని బట్టి గ్రహించవచ్చు.

“గౌరవనీయులైన సోదరులు నర్సీభాయ్‌కి, నేను ఒక పరీక్ష రాసాను. మొదటిర్యాంక్ వచ్చింది. గౌరవనీయులైన తల్లిదండ్రులకు నా ప్రణామాలు తెలియజేయండి. అక్కడి సమాచారాలు రాస్తుండండి. కాశీభాయ్ అసలేమీ రాయటంలేదు… భగవంతుని దయ ఉంటే తక్కిన రెండు సంవత్సరాలు త్వరలోనే గడిచిపోయి, తిరిగి మీ అందరినీ చూస్తాను. మీ సేవకుని ప్రణామాలు. వల్లభ్‌భాయ్.”

ఇంగ్లాండులో విద్యార్థులు కోరుకుంటే సుమారు 20 నెలలకే పరీక్షలు రాయవచ్చు. ఆనర్స్‌లో పాసైన వారు తమ ఇన్‌లో మరొక టర్మ్‌పాటు నిర్ణీత కార్యక్రమం ప్రకారం డిన్నర్లు పూర్తిచేస్తే, అప్పుడు వారిని ఆరునెలలు ముందే బార్‌కు పిలుస్తారు. ఆ విధంగా విఠల్‌వలెనే వల్లభ్ కూడా 20 మాసాలకే ఫైనల్ పరీక్షలు రాసి, ప్రథమశ్రేణిలో ఉత్తీర్ణుడై, 50 పౌండ్ల బహుమతి గెలుచుకున్నాడు. దాని గురించి కూడా ఇంటికి ఉత్తరం రాసాడు:

“మిడిల్ టెంపుల్, లండన్ నుంచి నర్సీభాయ్‌కి, 7-6-1912:
నా పరీక్షలు పూర్తయ్యాయి. ప్రథమశ్రేణిలో ఉత్తీర్ణుడినయ్యాను. అందువల్ల ఆరు మాసాలు ముందుగానే ఇంటికి రాగలను. వచ్చే జనవరిలో తిరిగివస్తాను. ఈ మాట తల్లిగారికి, తండ్రి గారికి తెలియజేయగలరు. మిత్రులకు కూడా తెలుపగలరు. ఇంతే విశేషాలు. ప్రణామాలతో మీ సేవకుడు వల్లభ్‌భాయ్.”

అగ్రస్థానానికి చేరేందుకు పటేల్ కోసం ఒక నిచ్చెన వేసి ఉంచి, సమయం కోసం ఎదురుచూస్తుండిన విధి, మరో ఇతర ఆలోచనకు కూడా చేసింది. ఆ విధి 1915లో మరొక బారిష్టర్‌ను అహమదాబాద్‌కు తీసుకుని వచ్చింది. ఆయన పేరు మోహన్‌దాస్ కరమ్‌చంద్ గాంధీ. ఆయన అప్పటికే ఇరవై సంవత్సరాలకు పైగా దక్షిణాఫ్రికాలో గడిపాడు. వల్లభ్‌భాయ్‌కన్న ఆరేళ్లు పెద్దవాడైన గాంధీ దక్షిణాఫ్రికాలోని భారతీయులకు శ్వేతజాతీయులతో సమానావకాశాలకోసం ఉద్యమించి చెప్పుకోదగ్గ ఫలితాలు సాధించాడనటంలో సందేహంలేదు. స్వదేశానికి తిరిగి వచ్చిన నెలరోజులలోనే ఆయనను మహాత్ముడన్నారు. అందుకు వల్లభ్‌భాయ్, “మనకు ఇప్పటికే చాలామంది మహాత్ములున్నా” రంటూ ఈసడించాడు. గుజరాత్ క్లబ్ సభ్యులు కొందరు నగరంలో గాంధీ ఆరంభించిన కొచ్‌రబ్ ఆశ్రమానికి కుతూహలం కొద్దీ వెళ్లారు. వారు.. సత్యాగ్రహం, అహింస అనే కొత్త ఆయుధాలను గాంధీ తీసుకొచ్చాడనే కబురు మోసుకొచ్చారు. ఆ ఆయుధాలు భారతీయులకు ఉపయోగపడగలవని, బహుశా వారిని పరాయి పాలన నుంచి విముక్తులను కూడా చేయగలవని ఆయన నమ్ముతుండినట్లు వారికి తోచింది. అంతేకాదు, విద్యావంతులైన భారతీయులు ధాన్యం విసరాలని, మరుగుదొడ్లను శుభ్రంచేయాలని ఆయన చెప్పాడని వాళ్లు చెప్పారు.

అది విని నవ్విన పటేల్, గాంధీ “తిక్క” గురించి, “విచిత్ర ఆలోచనల” గురించి వ్యంగ్య వ్యాఖ్యలు చేసి అందరినీ నవ్వించాడు. కొందరి ఆహ్వానంపై గాంధీ ఒకరోజు ఆ క్లబ్బుకు వెళ్లాడు. అక్కడి లాన్స్‌పైన ఆయన చేయబోయే ప్రసంగం వినేందుకు కొందరు వెళ్లారు. వారంతా వరండాలోని తన బ్రిడ్జ్ టేబుల్ పక్కనుంచి వెళుతుండగా చిరాకుపడిన వల్లభ్‌భాయ్, వారిని ఆపేందుకు ప్రయత్నించాడు. బ్రిడ్జ్ టేబుల్ వద్ద పటేల్ చర్యలను గమనిస్తుండిన మావ్లంకర్ ఆ తరువాత చెప్పిన వివరాలను బట్టి, అదంతా 1916 వేసవికాలంలో జరిగినట్లు నిర్ధారించవచ్చు. అంతలో గాంధీ రావటాన్ని చూసి మావ్లంకర్ లేచి నిలుచున్నాడు.

పటేల్: మావ్లంకర్, ఎక్కడకు వెళుతున్నారు? ఎందుకు లేచారు?

మావ్లంకర్: చూడండి, గాంధీ వస్తున్నారు.

పటేల్: అయితే ఏమిటి. మన గేమును చూసి మీరు ఇంకా ఎక్కువ నేర్చుకోవచ్చు. ఆయనేమంటాడో నేను చెప్పగలను. ఆయన మిమ్మల్ని గోధుమల నుంచి రాళ్లు ఏరగలరా అని అడుగుతాడు. అందువల్ల దేశానికి స్వాతంత్య్రం లభిస్తుందట.
ఆ మాట విని అందరూ మరింత పెద్దగా నవ్వారుగాని మావ్లంకర్ మాత్రం గాంధీ కోసం వెళ్లాడు. ఆయన ఉద్దేశంలో, వల్లభ్‌భాయ్ తన ధోరణిలో ఆ విధంగా మాట్లాడినప్పటికీ ఆ సరికే “ఆ మనిషిని గౌరవించటం” మొదలుపెట్టాడు. పాతికేళ్ల తరువాత వల్లభ్‌భాయ్ ఆ విషయమై మాట్లాడుతూ, 1915లో, 1916లో తను సుమారు 40 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు, విశిష్టమైన మేధాశక్తిగల యువకులు గాంధీపట్ల ఆకర్షితులు అవుతుండటం తనకు అర్థంకాని విషయంగా తోచిందని ఒప్పుకున్నాడు.

డిసెంబర్‌లో బీహార్‌లో పర్యటించిన పటేల్ రైతులను ఉద్దేశించి హిందీలో ప్రసంగాలు చేసాడు. అందులో మధ్యమధ్య గుజరాతీని చేర్చాడు. సూటిగా మాట్లాడే ఆయన పద్ధతి అక్కడ కొత్త పుంతలు తొక్కింది:
“నేను మీమీద కోపగించటానికి వచ్చాను తప్ప ఆశీర్వదించేందుకు కాదు. మహాత్ముడు ఇతర ప్రాంతాలకన్న ముందుగా మీవద్దకు వచ్చారు. కాని ఆ గౌరవానికి మీరు అర్హులైనట్లు తోచటం లేదు. మిమ్మల్ని నోరుమూయించే క్రూరమైన ప్లాంటేషన్ యాజమాన్య ధోరణులు ఇప్పుడు లేవు. అయినప్పటికీ మీరు ఇంకా మూగపశువుల్లా ఉంటున్నారు. మీ జమీందార్లపై రాత్రింబగళ్లు ఫిర్యాదులు చేస్తారు. కాని వాళ్లను దారికి తెచ్చేందుకు ఏమీ చేయరు… జమీందార్లు తమ పద్ధతులు మార్చుకోనట్లయితే వారికోసం వ్యవసాయం చేయకండి.

మీ స్త్రీలను పరదాల వెనకే ఉంచటానికి మీకు సిగ్గువేయటం లేదా? ఎవరీ స్త్రీలు? మీ తల్లులు, సోదరీమణులు, భార్యలు. వాళ్లు బయటి ప్రపంచంలోకి వచ్చినట్లయితే మీ బానిసత్వాన్ని చూసి ఇక మీతో తెగతెంపులు చేసుకుంటారని భయపడుతున్నారా? వారితో మాట్లాడే అవకాశమేగాని నాకు లభిస్తే, ఇటువంటి పిరికిభర్తలతో సంసారం చేయటంకన్నా విడాకులివ్వమని చెప్తాను.

మతంపేరిట బాల్యవివాహాలు చేసే బ్రాహ్మణులు, బ్రాహ్మణులు కారు, వారు దయ్యాలు. జమీందార్లు, బ్రాహ్మణుల నియంతృత్వానికి ఇష్టపూర్వకంగా లొంగిపోయే మీకు, రైతులనిపించుకునే అర్హత లేదు.”

వల్లభ్‌భాయ్ 1929వ సంవత్సరంలో చేసిన ప్రసంగాలన్నింటిలో భూమిశిస్తు హెచ్చుగా ఉండటం గురించి ప్రస్తావించేవాడు. ఆ అంశాన్ని ఆధారంగా చేసుకుని భారతదేశాన్నంతా ఒకటి చేయవచ్చునన్నది ఆయన నమ్మకం. కాని మహాత్మునికి అంత నమ్మకం ఉండేది కాదు. ఆయన ఆ అంశాన్ని 1929 సెప్టెంబర్ యంగ్ ఇండియా సంచికలో చర్చించాడు.

వల్లభ్‌భాయ్ పటేల్ (జీవిత కథ)
రచయిత: రాజ్‌మోహన్ గాంధీ
తెలుగు సేత: టంకశాల అశోక్
వెల:300 రూపాయలు
పేజీలు: 822

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

పూర్వాంగ్ల కవుల ముచ్చట్లు -26 పోట్టివాడైనా గట్టి వాడు –అనధికార ఆస్థాన కవి -అలేక్సాండర్ పోప్

పూర్వాంగ్ల కవుల ముచ్చట్లు -26

పోట్టివాడైనా గట్టి వాడు –అనధికార ఆస్థాన కవి -అలేక్సాండర్ పోప్

‘’  విషం కక్కే సాలీడు ‘’అని సమకాలీనులు అన్నా ,శారీరక వంకర్లున్నా ,,మానసిక వక్రత ఉన్నా ,ఈ నాడు అలేక్సాండద పోప్ కవి ఆరాధింప బడుతూనే ఉన్నాడు .’’కోల్డ్ బ్లడేడ్ టెక్నీషియన్’’ అని పేరు .తెలివిగల వ్యాస కర్త ,తమాషా రైమ్స్ తో కవిత్వాన్ని పండించిన వాడు .కాలాతీత కవిత్వాన్ని సృష్టించాడని ఇరవయ్యవ శతాబ్ది విమర్శకుల అభిప్రాయం .’’one of the greatest poets of our poets who is in his two finest poems perhaps the most flawless artist of our race has produced ‘’అని ఎడిత్ సిట్వేల్ చేత ప్రశంసింప బడ్డాడు .ఆయన రచనలు అనేక ఆలోచనలకు  పదకోశం .షేక్స్ పియర్ తర్వాత తరచుగా ఉదహరింప బడే కవి .’’to  err is human to forgive is divine ‘’,a little learning is a dangerous thing ‘’,fools rush where angels fear to tread ‘’men must wlalk before they dance ‘’మొదలైనవి అందరూ తరచుగా ఉదాహరించేవే .

అలేక్సాండర్ పోప్ లండన్ లో 22-5-1688న జన్మించాడు .ముసలి తలిదండ్రులకు ఒక్కడే కొడుకు .తండ్రి లినెన్ డ్రీపర్ .చిన్నప్పుడు కుర్రాడు బానే ఉండే వాడు .కాని చిన్ననాటే జబ్బుకు గురై ఆరోగ్యాన్ని కోల్పోయాడు మళ్ళీ పూర్వ ఆరోగ్యాన్ని పొందలేదు .ఇక పొందలేదని కూడా రూఢి అయింది .పూర్తిగా ఎదగక పొట్టి వాడుగా నే ఉండిద పోయాడు .డొక్క లోపలి పోయి యూని వర్సిటీలలో చదవ లేదు .సామాన్య కుటుంబం లో పుట్టటం వలన అన్నిటికీ దూరమైనాడు .జీవితాంతం బాధించిన ఆవ్యాధియేఅన్నిటికీ కారణమైంది .విధి వక్రించింది ఒక రకం గా .పదేళ్ళ వయసులో గ్రీక్ లాటిన్ లను అనువదించిన మేధావి .పన్నెండుకు హోరేస్ రాసిన సాలిట్యూడ్ కు పారా ఫ్రేజ్ రాశాడు .అది ఇప్పటికీ గొప్ప ఆ యాన్తాలజి గా గుర్తింపు పొందుతోంది .ఒక మహా కావ్యాన్ని ‘’అలేక్సాండర్ ప్రిన్స్ ఆఫ్ రోడ్స్ ‘’పేరిట రాయటం ప్రారంభించాడు .ఇందులో తానూ అభిమానించిన అందరికవుల చాయలూ ఉన్నాయి .ముఖ్యం గా వర్జిల్ ,హోమర్ లంటే వీరాభిమానం .

లండన్ నుంచి కుటుంబం విన్ స్టార్ ఫారెస్ట్ లోని బిన్ ఫీల్డ్ కు మారినప్పుడు ఈ కావ్యం మొదలెట్టాడు .దాన్ని తగల బెట్టేశానని చెప్పాడు కాని పన్నెండు పదిహేనేళ్ళ మధ్య దాన్ని మళ్ళీ రాసి వెలుగు లోకి తెచ్చాడంటే పొట్టోడు గట్టొడే అని పిస్తుంది అందుకే ‘జయంట్’డ్వార్ఫ్ ‘’అన్నారు .పద్నాలుగో ఏట ‘’ఆన్ సైలెన్స్ ‘’,అపాన్ నతింగ్ ‘’లు రాశాడు .పదహారు లో వరుస ‘’పాస్తోరల్ ‘’పోయెమ్స్ రాశాడు .ఇవి వ్రాతప్రతులుగా అందుకొన్న వాల్ష్ ,జార్జి గ్రాన్ విల్లీ వంటి వారిని మెప్పించాయి ‘’ఒక అజ్ఞాత మహా మేధావి అడవిలో మగ్గుతున్నాడు ‘’అను కొన్నారు .ఇలాగే విజ్రుమ్భించి రాస్తే అందర్నీ మించిపోయే మహా కవి అవుతాడని మురిశారు .ఇది తెలిసిన జాకబ్ తాన్సన్ అనే ముద్రాపకుడు వాటిని ముద్రిస్తానని  ముందుకొచ్చ్చాడు .అతనిలో మహా పాండిత్యం కవితా ప్రతిభా ఉన్నాయని గ్రహించాడు .వాటి ముద్రణ తో పోప్ గొప్ప కవి అయి పోయాడు ఇరవై కే .

ఇందులో పోప్ గొర్రెల కాపర్లు లండన్ వాసుల్లా మాట్లాడి ఆశ్చర్య పరుస్తారు .ఒకే రైం ను కొన్ని పంక్తుల్లో వాడాడు .చెవికి ఇంపైన పదజాలం తో అతనొక  మాటల  సృష్టి కర్త అయ్యాడు .

ఇరవై రెండో ఏట ‘’ఎస్సే ఆన్ క్రిటిసిజం ‘’రాశాడు .ఇందులో భాష లో భావం లో శబ్ద కూర్పులో హోయాల్లో లయలలో ఆయన పోకడలు అనంతం .ఇది పోయెం ఆఫ్ ది పీరియడ్ గా గుర్తింపు పొందింది .సరి అయిన విద్య నేర్వాలని హెచ్చరించాడు .కొత్తదనం కోసం పాకులాడ వద్దన్నాడు .కొత్తొక వింతా పాతొక రోత అనే భావం వదిలేయ్యమన్నాడు .’’fear not the anger of the wise to raise .those best can bear reproof who merit praise ‘’అని బోధించాడు .

‘’his life is had been no longer than one of his poems –the life of half a day ‘’అని కొందరు ఈసడించారు .అతని శారీరక అవ లక్షణాన్ని ఆవ హేళన చేయటం తో ఆ ఇరవై మూడేళ్ళ యువకుడు మానసికం గా కున్గిపోయాడు .కాని ఎక్కడా బయట పడలేదు .కాని లోలోపల కుములుతున్నాడు .తన బాధను ఒక కవితలో’’ గే కవి’’కి చెప్పుకొన్నాడు .యాభై లో ఎవరొ ఒకరి సాయం లేకపోతే నిలబడ గలిగే వాడుకాదు .దీన్ని జాన్సన్ ఎద్దేవా చేశాడు .అబట్టలు మార్చటం కూడా ఎవరో చేయాల్సిందే. ఎప్పుడూ ఒకసేవకుడు   ఉండాల్సి వచ్చేది .నరక యాతన అనుభవించాడు .దీనికి తోడూ సూటి పోటీ మాటలు .ఆయనకు తెలియ కుండా జోనాధన్ స్విఫ్ట్ తో జరిపిన ఉత్తర ప్రత్యుత్తరాలు  ప్రింట్ చేశారు .స్విఫ్ట్ గ్రహించి  తనకు పోప్ రాసినవి తిరిగి పంపించేశాడు .ఇలా ఆ కురచ మహా కవిని అన్ని విధాలా అవహేళన చేశారు .ఇందులో పోప్ స్వయం క్రుతాపరాధమూ లేక పోలేదు .

ఏంతో మంది స్త్రీల తో తిరిగాడంటారు .అందులో తెరెసా ,మార్తా బ్లౌంట్ అనే సిస్టర్స్ ఉన్నారు .ఇందులో ఒకరు ఆయన అర్ధాంగి అయి ఉంటారని ఊహా గానం .అనుమానాలకు తావు ఇవ్వటం పోప్  లక్షణం కూడా .లేడీ మాంటేగ్ తో ఒప తగాదా పడ్డాడు .ఆమె చేసిన అవమానాన్ని మర్చిపోలేక పోయాడు ఒకదాని వెంట ఒకటి కవితలు గిలికి పారేశాడు .ఆమె కున్న మర్మావయవ జబ్బును అందరికి  అంటించింది అని కూడా   .’’ది రోప్ ఆఫ్ దిలాక్ ‘’లో అనేక అసందర్భాలున్నాయి ‘ది ఎపిసిల్ టు డాక్టర్ ఆర్బత్ నాట్ ‘’ను నలభై ఆరో ఏట ప్రచురించాడు .పోప్ కంటే పాతికేళ్ళు పెద్ద వాడైన ఆర్బర్త్ నాట్ ‘’ద్వేషం వదిలేయి మానవ ప్రకృతిలోని మంచినీ నీతినీ గురించి ఇక నుంచైనా రాయి ‘’అని సలహా ఇచ్చాడు .అది తనమంచికోసమే ననీ చెప్పాడు .దీనితో పోప్ కళ్ళు తెరుచుకొన్నాయి కొత్త భావాలు ఆలోచనలు దర్శనాలు తో కవిత్వం దారి మళ్ళింది .వ్యక్తిగత ద్వేషాన్ని దూరం చేసుకొన్నాడు .’ఎపిజిల్స్ ‘’లో తన నూతన ప్కడలు చూపాడు కాని లోపల లార్డ్ హీర్వీ పై ద్వేషం వదలలేదు  .

పోప్ అనువాదం చేసిన ఇలియడ్ ప్రచురణ తో ఆర్ధికం గా పున్జుకొన్నాడు ఒక్కో దానికి గినియా రేటు పెట్టాడు ఆరు వందల మందికొన్నారు .రాజు రెండు వందల పౌండ్లు కానుక ఇచ్చాడు .ఆరుగురు అసిస్టంట్ లతో ఆ అనువాదాన్ని ఆరేళ్లలో పూర్తీ చేశాడు .అయిదు వేల పౌండ్ల ధనాన్ని చేకూర్చింది ఇది .దీనిపై విమర్శలోచ్చాయి ఇది హోమర్ రచన లా లేదన్నారు .ఇవేవీ పోప్ ను ఆపలేక పోయాయి ఆ కాలపు ‘’సాహిత్యమార్తాండుడే ‘’అయ్యాడు .దీనితర్వాత ‘’ట్వికెన్ హాం ‘కు మకాం మార్చాడు చిన్న ఇల్లు తోట ఏర్పాటు చేసుకొన్నాడు .స్విఫ్ట్ వచ్చి ఇక్కడ కొంతకాలం ఉన్నాడు పోప్ ను గురించి ‘’.Pope has the talent well to speak –but not to reach the ear his loudest voice is low and wea k –the Dean too deaf to hear ‘’అని స్విఫ్ట్  తన అనుభవాన్ని గురించి రాశాడు .ఒడిస్సీ కి పోప్ రాసిన మూడు భాగాల పుస్తకాలు అప్పుడే పబ్లిష్ అయ్యాయి నాలుగు అయిదు భాగాలు ఏడాది తర్వాతా వచ్చాయి .’’the story is Homer;s  but the accent is Pope;s ‘’అన్నారు .ఇరవై నాలుగు భాగాలలో అయిదు తప్ప మిగిలినవ్నీ పోప్ ట్రాన్స్లేట్ చేశాడు .నిజానికి ఆయన చేసినవి పన్నెండు మాత్రమె. మిగిలిన వాటికి పర్య వేక్షణ చేశాడు .

నలభై లో’’ది దంసియాడ్’’అనే స్వీయ రచన ప్రారంభించాడు ,ఇందులోపగా ద్వేషం పరాకాష్ట లో ఉంటాయి .యాభై ఒకటిలో దైవం మానవుడు అనే విషయాల మీద రాయాలని ఉందని జాన్ కార్లైల్ కు రాశాడు .’’ఎస్సే ఆన్ మాన్ ‘’రాశాడు .దీన్ని ముద్రించిన తర్వాతా అయిదేళ్ళు సెటైర్స్ వగైరా రాశాడు .’’డి వర్క్స్ ఆఫ్ అలేక్సాండర్ పోప్ ‘’ముప్ఫై వ ఏట నే ముద్రించారు .రెండో భాగం నలభై ఏడులో దీనితో పాటు ఉత్తర ప్రత్యుత్తరాలూ అచ్చయ్యాయి .సన్నిహితురాలైన మార్తా బ్లాంట్ కు చివరి ఉత్తరం మార్చ్ లో రాశాడు .రెండు నెలల తర్వాతా’’30-5-1744లో ‘’మరు గుజ్జు మహా కవి ‘’మరణించాడు . డాక్టర్ ను తన ఆరోగ్యం ఎలా ఉంది అని అడిగాడు చనిపోయే ముందు బాగుందని వాళ్ళు అంటే ‘’here I am dying hundred good symptoms ‘’అని తన చావు దగ్గర పడిందని చెప్పాడు .రోమన్ కేధలిక్ చర్చి విధానం లో అంత్య క్రియలు చేశారు  చేశారు .చర్చ్ ఆఫ్ ఇంగ్లాండ్ ,చర్చ ఆఫ్ సెయింట్ మేరీ ది విర్జిన్  ఆఫ్ ట్వింకిల్ హాం లలో సమాధి చేశారు .

‘’Pope was an accurate recorder of a society that flourished on cliques and intrigues and countless subterfuges.to this society Pope was a victim and mocking contributor .he was also un acknowledged laureate .it is a poetry that speaking almost entirely to the disillusioned intelligence ,springs from the dischanted mind –a saddened but a cynical mind ,aware that while men;s  machanations may make for ignoble living ,they also make entertaining and some times enduring literature ‘’అని పోప్ ను అతని కవిత్వాన్ని అంచనా వేశారు .

హీరోయిక్ కప్లేట్స్ లో సుప్రసిద్ధుడు .ఆక్స్ ఫర్డ్ ఇంగ్లీష్ డిక్షనరీ లో పోప్ ను అనేక మార్లు షేక్స్పియర్, టెన్నిసన్ ల తర్వాతా ఉదాహరించారు .బైబిల్ సంస్కృతికి ప్రతి బింబం గా ఉన్నాడు .స్త్రీ భావ వ్యతిరేకి అని స్త్రీ వాద రచయితలు భావించారు .

 

 

Alexander Pope by Michael Dahl.jpg        

  

పోప్  మరణ దృశ్యం

 

సశేషం మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -21-5-14-ఉయ్యూరు

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

పూర్వాంగ్ల ముచ్చట్లు -25 డచెస్ ఆఫ్ న్యూ కాజిల్ –అందాల రాశి –స్త్రీ వాద రచయిత్రి -మార్గరెట్ లూకాస్ కేవండిష్

పూర్వాంగ్ల ముచ్చట్లు -25

డచెస్ ఆఫ్  న్యూ కాజిల్  –అందాల రాశి –స్త్రీ వాద  రచయిత్రి -మార్గరెట్ లూకాస్ కేవండిష్

‘’మార్గ రేట్ లూకాస్ ఎంత రొమాంటిక్ లేడీ యో అంత రొమాంటిక్ గా రాసింది ‘’అన్నాడు సామ్యుల్ పెపీస్ .ఈమెతో బాటు దీటుగా రాసిన మరి ఇద్దరు ఆఫ్రా బెన్ ,అన్నే ఫించ్  అనే స్త్రీ కవులు .మార్గరెట్ లూకాస్ 1623లో లో బాగా పేరున్న కుటుంబం లో పుట్టింది .సోదరులు సాహసులైతే సోదరిలు పధ్ధతి ఉన్నవారు .కాని మార్గ రేట్ కు మాత్రం రోమాన్స్  వంటిన పుట్టిన విద్య .నడవటం నేర్చిన నాటి నుండే ఇందులో దిగింది .బ్రిటన్ అంతర్యుద్ధం లో వీరి కుటుంబాన్ని ప్రవాసానికి పంపారు. లూకాస్ హేన్రిట్టా మేరియా కు చెలికత్తె గా చేరింది .యాభై ఏళ్ళ న్యూ కాజిల్ డ్యూక్ ఈమెను చూడగానే ప్రేమించి పెళ్ళాడాడు .రాజుతో బాటు తాత్కాలికం గా దూరమైనా మళ్ళీ లండన్ చేరారు .రేస్తోరేషన్ తర్వాత భర్తను డ్యూక్ ను చేశాడు  ఈమె డచేస్ అయింది .ఖరీదైన దుస్తులు ధరించి అందం గా అలంకరించుకోనేది .ఏ ఉత్సవం లో పాల్గొన్నా అందరూ తనకోసం ఎదురు చూడాలని ఆలస్యం గా వచ్చేది .అరడజన్ స్త్రీలు ఆమె కారేజ్ ను లాక్కోచ్చేవారు అంత వైభవం ఒలక బోసింది .రాయల్ సోసైటీలోకి దురుసుగా ప్రవేశించేది .దేస్కార్టేస్ హాబ్స్ మొదలైన ఫిలాస ఫర్ ల తో తనకున్న విభేదాలను బహిర్గతం చేసేది .హాబ్స్ ‘’ఏ నీతి పుస్తకం లోను లేనంత నీతి మార్గరెట్ దగ్గర ఉంది ‘’అన్నాడు  .ఇంతటి వైభవం గా జీవించిన ఆమె యాభై వ ఏట 1673లో మరణించింది .సైన్స్ ఫిలాసఫీ లను అలవోకగా రాసింది .’’అబ్సర్వేషనన్స్ అపాన్ ఎక్స్పెరిమెంటల్  ఫిలాసఫీ ,దిస్క్రిప్షణ్ ఆఫ్ ఏ న్యు వరల్డ్ ‘’అనే సైన్స్ ఫిక్షన్ రాసింది .

మార్గరెట్ కవిత్వం ప్రాధమికం గా నే ఉన్నా మహిళా ప్రభావం ఉండేది . ఫాంటసి ప్రాధాన్యత నిచ్చింది .చెట్లు జంతువులుగా కనిపిస్తాయి .పది హేడు ,పద్దెనిమిది శతాబ్దాలలో స్త్రీలు తేనే ,గులాబి పూల వంటివారని కవులు వర్ణించారు

File:Margaret Cavendish.jpg

 

గూఢచారి కవి   –  ఆఫ్రా బెన్

జాన్ ,ఏమిస్ ల కూతురు ఆఫ్రా బెన్ ఒక వేగు గా గుర్తింపు పొందింది .కెంట్ లో 1640లో ఒక మంగలి కుటుంబం లో పుట్టింది .ఇంగ్లాండ్ అధీనం లో ఉన్న సురియం గయానా లలో చదివింది .పద్దెనిమిదో ఏట ఇంగ్లాండ్ చేరింది .సాటిలేని మాట కారి .ఇరవై ఆరేళ్ళ వయసులోనే భార్తాను కోల్పోయింది .రెండవ చార్లెస్ కు డచ్ యుద్ధం లో  గూఢ చారి గా పని చేసింది .మిలిటరీ వ్యూహం లో మంచి నేర్పున్న మహిళా .చాలా విలువైన ,ముఖ్య సమాచారాలను సేకరించి రాజుకు అందజేసింది .కాని ఆమె కు ఇంటా బయటా శత్రువులున్నారు .కుట్రలు పన్ని ఆమె ను రాజుకు దూరం చేశారు .ఆఫ్రా పేదలు ఉండే  చెరసాల లో బంధించి హింసించారు .

పునర్వైభావాన్ని రచనల ద్వారా సాధించాలని నిర్ణయించుకోంది.సహజ రచనా చాతుర్యం అలవడింది .తన సాహసాలను ప్రేరణ నిచ్చేట్లునాటకాలు  రాసింది .దాదాపు పది హేనును నాటకాలు రాసింది .అందులో ‘’రోవర్ ‘’బాగా క్లిక్ అయింది .మధ్యమధ్య కవితలూ నవలలూ రాసి మెప్పించింది .చిన్న నాటి స్మృతులను ‘’ఒరనూకో ‘’,లో రాసుకొన్నది .అదొక బానిస కదా .ఫిలాసఫికల్ ఫిక్షన్ .ప్రజా భిమానాన్ని ఎక్కువ కాలం పొందలేక పోయింది .యాభై ఏళ్ళకే చనిపోతే వెస్ట్ మినిస్టర్ ఆబ్బే లో సమాధి చేసి గౌరవించారు .నాటకాలు ఆమె లో ఒక పార్శ్వాన్ని ,కవిత్వం రెండో పార్శ్వాన్ని తెలియ జేస్తాయి .మగాదిలాగా రాసిందన్నారు కాని మించి రాసింది .

All women together, ought to let flowers fall upon the grave of Aphra Behn… for it was she who earned them the right to speak their minds… Behn proved that money could be made by writing at the sacrifice, perhaps, of certain agreeable qualities; and so by degrees writing became not merely a sign of folly and a distracted mind but was of practical importance.[13]

 

 

 

Aphra Behn by Peter Lely ca. 1670.jpg

అన్నే ఫించ్

1661లో అన్నే కింగ్స్ మిల్ లో అన్నే ఫించ్ – విలియం కింగ్స్ మిల్ ,కు సౌత్  యాంప్ టన్ వద్ద సిద్ద్ మాన్తాన్ లో పుట్టింది .ఇరవై రెండో ఏట రాజ దర్బార్ లో మెయిడ్ గా చేరింది .కల్నల్ ఫించ్ ను పెళ్ళాడింది .చిన్నప్పుడే కవిత్వం రాసింది .డ్రాడేన్ ను పోప్ ను చదివి అర్ధం చేసుకోంది .వీరిలా అతిగా పోకుండా రాసింది .ఆలోచనాత్మకం గా స్త్రీ వాదం గా రాసింది .హాయిగా తోటలో విశ్రాంతి పొందేది .పల్లె పట్టు సొగసుల్ని కవిత్వం లో ప్రతిఫలింప జేసింది ..తానూ అమితం గా ప్రేమించి ఇష్టపడిన చోటే అరవైలో చని పోయింది .ఆమెను వర్డ్స్ వర్త్ ‘’ఏ నేచురల్ రేవేరీ ‘’అని కీర్తించాడు .అందులో తాజా గ్రామీణ ఇమేజరీ ఉంటుంది .’’if for a woman I would die ‘’the Ateist and the acorn ‘’కవితలు స్నిగ్ధ మనోహరం గా ఉంటాయి .’’if they re denied ,I on my self can live –and slight those aids unequal chance can give –when in the sun my wings can be displayed –and in retirement I can bless the shade’’అనేది ఆమె కవితల్లో ఒకటి .కింగ్ విలియం కు విధేయత ప్రకటించే ప్రమాణం చేయటానికి తిరస్కరించింది .హాయిగా జీవించినా కింది వారి దుఖాన్ని గురించి రాసింది. ఆమెను మేలాన్కలి వుమన్ అన్నారు .

 

చార్లెస్ సిడ్నీ

1639లో రోచెస్టర్ లో పుట్టిన చార్లెస్ సిడ్నీ వాదం కాలేజి లో చదివి ‘’మెర్రి గాంగ్ ‘’లో చేరి రెండవ చార్లెస్ కాలం లో పనికి మాలిన రెండు ట్రాజేడీలు రాసి ,కొద్దిగా నయం అనిపించినామూడు కామెడీలు రాసి కల కలం సృష్టించాడు .శ్రోతలకు వీనుల విందు చేశాడు .మంచిపాటలే రాశాడు

 

 

.Sir Philip Sidney from NPG.jpg

రిచార్డ్ లీ,ఆంబ్రోస్ ఫిలిప్స్ ,థామస్ పార్నెల్ ,జాన్ బ్రియాన్

 

వీరి గురించి అప్పుడప్పుడు మాత్రమె చెప్పుకొంటారు ముగ్గురూ 1649 ,1675 ,1679ల లో పుట్టి 1779 ,1718లలో చనిపోయారు .లీ ని ‘’చిత్ర కవి ‘’ ఫిలిప్స్ రాసిన ఈక్లోగ్స్ ‘’అప్పటిగోప్ప కవిత్వం అన్నారు .’’నంబి పంబీ ‘’అనే మారు పేరు .డబ్లిన్ లో పుట్టిన పార్నెల్ ఇలియడ్ ను అనువాదం చేసి చని పోయిన తర్వాతా పబ్లిష్ అయి పేరొందాడు .ఓడ్స్,కదాత్మకాలు పవిత్ర కవితలు రాశాడు .

షార్ట్ హాండ్ పిత –జాన్ బిరామ్

జాన్  బిరామ్ 1692-1763వాడు .హిమ్స్ రాశాడు .పాస్టో రల్  రైమ్స్ ,దయాలిక్ట్ వెర్సెస్ రాశాడు .’’ది యూనివర్సల్ ఇంగ్లీష్ షార్ట్ హాండ్ ‘’కనీ పెట్టి మాంచెస్టర్ లో బోధించాడు .లేఖా సాహిత్యం లో దూసుకు పోయాడు .’’జర్నల్స్ అండ్ పేపర్స్ ‘’కు మంచి పేరు .ఇందులో ఆ కాలం నాటి నిత్య జీవితాన్ని డైరీ లాగా రాశాడు . అంటాలజిస్టులు తప్ప అందరూ బ్రియాన్ ను మర్చిపోయారు అతని ఎపిగ్రం గుర్తింపు పొందింది .’’God bless the king –I mean the faith;s defender –god bless –no harm in blessing –our pretender –but who pretender or who is king?-god bless us all ,that is quite a different thing ‘’మచ్చుకు ఒకటి .

 

 

John Byrom.jpg

జాన్ గే

1685లో పుట్టి 1732లో చనిపోయిన జాన్ గ్రే విట్ ఉన్నకవి నాటకాలు ఒపెరాలకు లిబర్టోలు ,నీతి కధలు జానపదాలు ,పట్నకవితలూ ,రాజకీయ సెటైర్లూ రాశాడు .బారన్ స్టేబుల్ లో బీద వాడుగా పుట్టి పదేళ్ళకే అనాధ అయ్యాడు  మెట్రో పాలిటన్ జీవితం లో అడుగు వర్గాల దయ నీయ స్తితిని స్వయం గా అనుభవించీ చూసి చాలించాడు .లండన్ లో సిల్క్ మర్చంట్ దగ్గర పని చేశాడు ‘’ది ఆర్ట్ ఆఫ్ వాకింగ్ ది స్ట్రీట్స్స్త్రీ ఆఫ్ లండన్ ‘’లో ఆ నగర ఆనందం విషాదాలను చూపించాడు .వీటినే నలభై ఏళ్ళ వయసులో ‘’దిబెగ్గర్స్ ఒపేరా’’లో రాస్తే జాన్ రిచ్ దర్శకత్వమ్ చేశాడు .దీనితో డబ్బు  వచ్చింది .దాన్ని ‘’made rich Gay and Gay rich ‘’అని చమత్కరించాడు .ఇందులో ప్రభుత్వాధికారుల మీద సెటైర్లు బాగా పండాయి పేలాయి . ప్రధాని సర్ రాబర్ట్  వాల్ పోల్ ను ఉద్దేశించి రాశాడు .అతని అవినీతి భాగోతాన్ని చీకటి వ్యాపారాన్ని చీల్చి చెండాడాడు .హాన్దిలియాన్ ఒపేరా అవక తవకలు ఎండ గట్టాడు .. దీనికి ఈక్వేల్ రాయాల్సి వచ్చింది .’’పోలీ ‘’రాశాడు .రాజకీయ కారణాలతో బాన్ చేశారు అతాని అదృష్టం దోలాన్దోలమానం అయింది .ఫేబుల్స్ కవితల్లో వచ్చిన డబ్బు అంటా అయిపొయింది సౌత్ సీ స్కాండల్ అనే ఆర్ధిక దోషం పై చర్చ జరిగింది కొద్ద్దికాలమే జీవించినా సుఖ పడ్డాడు నలభై ఏడులో చని పోయాడు .ఆరు వేల పౌండ్ల నిలువ ధనాన్ని చని పోయేటప్పటికి సంపాదించాడు అతాని ప్రాభవానికి వెస్ట్ మినిస్టర్ ఆబ్బే లో ఖననం చేశి గౌరవించారు .

‘’life is a jest and all things show it –I thought so once and now I know it ‘’.మంచికవిత .డ్రై డే న్  పోప్ లంత క్రూరం గా రాయలేదు ‘’a satire without spite ‘’గ రాయటం ఇతని ప్రత్యేకత .అతను రాసిన కవిత్వం అంతా నిరాపెక్షనీయ కవిత్వామే అన్నారు .పల్లె వాడైనా పట్నం లో గుర్తింపు పొందాడు .

John Gay - Project Gutenberg eText 13790.jpg

 

జోనాధన్ స్విఫ్ట్

ఈ పేరు వినగానే గలివర్స్ ట్రావెల్స్ అందరికి గుర్తోస్తుంది .నిజానికి ఆయన కవికాడు . 1667లోడబ్లిన్ లో  పుట్టి 1745లో చనిపోయాడు .తీవ్రమైన చురుకుదానం భావోద్వేగాలతో రగిలి పోయాడు .జీవితా చరమాంకం లో కవిత్వం రాశాడు డ్రైడేన్ కవికి కజిన్ .తండ్రి చనిపోయిన తర్వాతా అంకుల్ దయాదక్షిన్యాల మీద బతికాడు .ఇరవై రెండేళ్లకే ఇంగ్లాండ్ లోని సర్ విలియం టెంపుల్ అనే దూర బంధువుకు సేక్రేఅతరి అయ్యాడు .టెంపుల్ తన కన్నా తెలివి తేటల్లో తక్కువ వాడు అంతేకాక అక్కడి స్ట్రిక్ట్ డిసిప్లిన్ ను భరించలేక పోయాడు .ఏదో మంచి జరుగుత్న్డనే ఆశతో పదకొండేళ్ళు అలానే లాగించాడు .లాభం లేదనుకొని ఎయిర్ లాండ్ చేరుకొన్నాడు డబ్లిన్ లో సెయింట్ పాట్రిక్ కు డీన్అయ్యాడునలభై లో .ఇక్కడా ,లండన్ లోనూ గడిపాడు కాలం మత బోధ , రచనలు  చేస్తూ ఉన్నాడు .అడిసన్ స్టీవ్ ,పోప్ మొదలైన ప్రముఖులతో పరిచయాలేర్పడ్డాయి  .రాజకీయం గా కరపత్రా రచనలో దూసుకు పోయాడు మతం లో విద్యా విధానం లో అవినీతిని బయట పెట్టాడు .ఐరనీ తో అందరికి చెమటలు పట్టించాడు .

ఈస్తర్ జాన్సన్ అనే అమ్మాయిని  చిన్నప్పటి నుండి ప్రేమించాడు .టెంపుల్ వద్ద ఆమె తల్లి సేవకురాలు .ఈ పిల్ల ఆయన పిల్లె అను పుకార్లు షికార్లు చేశాయి .ఈ అమ్మాయికి ట్యూటర్ గా స్విఫ్ట్ ఉన్నాడు ఐర్లాండ్ లో స్తిరాపడి ఆమెనూ డబ్లిన్ లో ఉంచాడు .డబ్లిన్ వ్యాపారి కూతురు వెనిసా తో పీకల్లోతు ప్రేమలో పడ్డాడు .ఈస్తర్ తో ప్రేమ ఈమె తో సల్లాపాలు ఇబ్బంది పెట్టాయి .ఇద్దర్నీ మైంటైన్ చేశాడు ..కొద్దిరోజుల్లో వేనేసా ,మరో అయిదేళ్ళలో ఈస్తర్ మరణించారు .గలివర్స్ ట్రావెల్స్ ను యాభై వ ఏట రాశాడు .అరవై లో తాను పతనం చెందుతున్నట్లు గ్రహించాడు .చెవుడు బాగా వచ్చి బాధించింది .ఇంకో పదేళ్ళు బతికాడుకాని గార్దియన్లు అవసరమైనారు .పెరాలిసిస్ తో బాటు అఫెశియా జబ్బు వచ్చింది .డెబ్భై ఎనిమిదో ఏట చనిపోయాడు .తన సమాధి పై’’here lies jonathan Swift –where savage indignation can no longer tear his heart .అని రాయించాడు తన ఆస్తిని బుద్ధి  మాంద్యులకు  చికత్స చేసే హాస్పిటల్ కు రాశాడు .

‘’పోయిట్రీ –ఏ రాప్సడి ‘’లో ఆయన ఐరాని అంతా గుప్పించాడు దీన్నే ఎప్పుడూ అందరూ ఉదహరిస్తారు .’’so naturalists observe a flea –has smaller fleas that on him prey –and hese have smaller still to bite them –and so proceed ad infinitum ‘’ఆయన కవిత్వం లో నిరాశ ఉండదు .’’he gave his little health he had –to build a house for fools and mad –and showed by one satiric touch –no nation wanted so much –that kingdom he hath left his debtor –I wish it soon may have a better ‘’అన్నకవిత చాలా ప్రసిద్ధం .

 

Jonathan Swift by Charles Jervas detail.jpg

మాధ్యూ ప్రయర్

మాధ్యూ ప్రయర్ పెద్ద గా పేరున్న వాడుకాడు .1664లో పుట్టి 1721లో చనిపోయాడు .డ్రై డే న్ అనుయాయి .సమకాలీన పరిస్తులపై వ్యంగ్యాత్మకం గా చెణుకులు రాశాడు .తండ్రి పోయిన తర్వాతా లార్డ్ డార్సేట్ ప్రాపకం పొందాడు అతనే వెస్ట్ మినిస్టర్ స్కూల్ లో చేర్పించి చదివించాడు  కేం బ్రిడ్జి లో సెయింట్ జాన్ కాలేజిలో చేర్పించాడు పదమూదేళ్ళప్పుడే ఓవిడ్ ,ఆరెస్ లను అనువాదం చేసిన చిన్నారి పిడుగు .చార్లెస్ మాంటేగ్ తో కలిసి డ్రై డే న్  రాసిన దాన్ని కధలుగా రాశాడు .కవిత్వం రాజకీయం రెండిటిలోనూ సవ్య సాచి అయ్యాడు .హాలండ్ రాయబారికి సెక్రెటరి హోదా వచ్చింది .పారిస్ లో సీక్రెట్ ఏజేంట్ గా నియమింప బడ్డాడు .టోరీలతో జత కలిపాడు .వారికోసం అనేక సమావేశాలు నిర్వహించి ‘’ట్రీటీ ఆఫ్ అత్రేచ్ట్ ‘’శాంతి ఒప్పందం సాధించాడు దీనికే అతని పేర ‘’మాట్స్త్ పీస్ ‘’అని పిలిచారు .

అన్నే రాణి మరణం తర్వాతా రాజకీయం గా బల పడే యత్నం చేశాడు .కాని తన్నింది .విగ్గులు జైల్లో పెట్టారు .రెండేళ్ళ తర్వాత విడుదలయ్యాడు .కంచే బాగు చేయటం ,సంపద వృద్ధి చేయటం లో కృత క్రుత్యుడైనాడు .యాభై నాలుగులో అతని మొదటి కవితా సంపుటి ‘’పోయెమ్స్ ‘’వెలువడింది .రచన లాభ సాటిఅని గ్రహించాడు .అమ్మకాలు చేస్తే నాలుగు వేల గినియస్లు  లభించాయి .,ఇదీ లార్డ్  హార్లీ ఇచ్చిన నాలుగు వేల పౌన్డ్లూ కలిపి ఎస్సెక్స్ లో డౌన్ హాల్ కొన్నాడు .అందాగాడు కాకపోయినా  మంచితనం తో   స్నేహితుల్ని పొందాడు పదహారవ లూయీ స్నేహితుడైనాడు .క సారి ఆయన్ను రాజు వేర్సైల్స్ లాగా చిరస్మరణీయ వి ఏవైనా ఎర్పరచాడా అని అడిగితె ‘’monuments of my master;s actions are to be seen every where except in his own house ‘’అని రాయబారిగా ఉన్నా చమత్కరించాడు .

దాదాపు అన్ని ప్రక్రియలలోనూ ప్రయర్ రచన చేశాడు .లాంగ్ సాలిలోక్వీకప్లేట్స్ సెటైర్స్ ,వ్యాసాలూ బాలడ్స్  లను రాశాడు సద్యో కవితలు చెప్పాడు .’’be to her virtues very kind –be to her faults a little blind ‘’అన్న కవిత పేలింది .గుర్తుండి పోయే కవిత్వం రాశాడు .తనను గురించి ‘’nobles and heralds by your leave –here lies what once was  Mathew prior –the son of Adam and Eve –can Bourbon or  Nassau claim higher?

 

 

 

సశేషం

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -20-5-14-ఉయ్యూరు

 

 

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

మృత్యువును పరిహసించినకార్టూనిస్ట్ -శేఖర్

ఆంధ్రజ్యోతి కార్టూనిస్ట్ శేఖర్ కన్నుమూత

జీర్ణకోశ కేన్సర్‌తో మృతి
రెండేళ్లుగా అంపశయ్యపైనే..
తుదిశ్వాస వరకూ కళకే అంకితం

ఆ కుంచెకు నవ్వించడమే తెలుసనుకున్నాం. నిప్పులు చిమ్మడమే ఎరుకనుకున్నాం. గుండె లోతుల్లోంచి పిండిన సంవేదనను బొమ్మ కట్టడం చూశాం. కానీ, శిథిలమవుతున్న శరీరాన్ని వేళ్ల మధ్యకు తెచ్చుకొని రోజూ ఒక సూర్యోదయాన్ని చిత్రీకరిస్తున్న విషయం మిత్రులకే చాలాకాలం తెలియదు. బ్రష్‌కు కాన్వాస్ అమరినట్టు.. చెదరని గీతకు చక్కని రాత సైజోడయి ‘సై..సై..’ అంటూ రాజకీయ కార్టూన్‌ని పరుగులు పెట్టించిన ఆంధ్రజ్యోతి కార్టూనిస్ట్ శేఖర్ మరిలేరు.

హైదరాబాద్, మే 19 : కొంతకాలంగా అనారోగ్యంతో బాధ పడుతున్న ఆంధ్రజ్యోతి కార్టూనిస్ట్ శేఖర్ (కంభాలపల్లి చంద్రశేఖర్) కన్నుమూశారు. రాష్ట్రంలో రాజకీయ కార్టూనింగ్‌కు వన్నెతెచ్చిన శేఖర్ (49) గత రెండేళ్లుగా జీర్ణకోశ సంబంధ క్యాన్సర్‌తో బాధపడుతున్నారు. హైదరాబాద్‌లోని ఓ ఆస్ప త్రిలో చికిత్స పొందుతూ సోమవారం తెల్లవా రుజామున తుదిశ్వాస విడిచారు. ఆయనకు భార్య చంద్రకళ, కుమార్తె చేతన, కుమారుడు నందు ఉన్నారు. నల్లగొండ జిల్లా సూర్యాపేటలో జూలై 16, 1965లో శేఖర్ జన్మించారు. చిన్నతనం నుంచి బొమ్మలు గీయడం అభిరుచిగా పెట్టుకొన్న ఆయనను చుట్టూ ఉన్న ఉద్యమ వాతావరణం ఉత్సాహపరిచింది. ఎంఏ (తెలుగు) పూర్తయిన తరువాత పూర్తిగా చిత్రకళారంగానికే శేఖర్ అంకితం అయ్యారు. పత్రికలను వేదిక చేసుకొని తన భావాలకు రూపం ఇవ్వడం మొదలుపెట్టారు. ప్రజాశక్తి దినపత్రికలో కార్టూనిస్ట్‌గా 1989లో తన ప్రస్థానం మొదలుపెట్టారు.

కొంతకాలం ఇతర పత్రికల్లో పనిచేసి.. 19 97లో రాజకీయ కార్టూనిస్టుగా ఆంధ్రజ్యోతి దినపత్రికలో చేశారు. తుదిశ్వాస విడిచేవరకు సంస్థకు సేవలు అందించారు. 20 ఏళ్లలో దాదాపు 45 వేల కార్టూన్‌లు ప్రచురించారు. ఆయన బొమ్మలు హిందీ, ఇంగ్లిష్, గుజరాతీ, పంజాబీ పత్రికల్లో ప్రచురితమయ్యాయి. ఆంధ్రజ్యోతి అనుబంధ నవ్య వార పత్రికలో శేఖర్ ట్యూన్స్, ఆంధ్రజ్యోతి ఆదివారం అనుబంధంలో లైఫ్ లైన్ శీర్షికలను నిర్వహించారు. మృతి చెందడానికి కొద్దిరోజుల ముందే ‘కాస్ట్ కేన్సర్’ పుస్తకాన్ని తీసు కొచ్చారు. గిదీ తెలంగాణ, బ్యాంక్ బాబు, శేఖర్ టూన్స్, పారాహుషార్ తదితర కార్టూన్ పుస్తకాలు వెలువరించారు. బెల్జియమ్‌లో 1996లో జరిగిన కార్టూన్ ఎగ్జిబిషన్‌లో పాల్గొని ఉత్తమ కార్టూనిస్టుగా అవార్డు అందుకున్నారు. హిందూస్థాన్ టైమ్స్ 1998లో నిర్వహించిన పోటీలో పాల్గొని.. విజేతగా నిలిచారు.

రాష్ట్ర ప్రభుత్వం 2006లో ఉత్తమ కార్టూనిస్ట్ పురస్కారంతో సత్కరించింది. ఇటీవల అమెరికా ప్రభుత్వం ఆహ్వానం మేరకు అక్కడ జరిగిన కార్టూన్ ఎగ్జిబిషన్‌లో పాల్గొ న్నారు. ఆయన మరణవార్త తెలియగానే చిత్రకళ, రాజకీయ, ఉద్యమ, సాహిత్య రంగాలకు చెందిన ప్రముఖులు, ఆయన సహచరులు, అభి మానులు బోడుప్పల్‌లోని శేఖర్ స్వగృహానికి తరలివచ్చి నివాళులర్పించారు. బోడుప్పల్ నుంచి బయలుదేరిన అంతిమ యాత్ర సాయంత్రం నాలుగు గంటలకు కాచిగూడలోని అంబర్ పేట హిందూ శ్మశాన వాటికకు చేరుకుంది. కుమారుడు నందు తండ్రి చితికి నిప్పు అంటించారు. ప్రొఫెసర్ కంచె ఐలయ్య, ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి, ప్రముఖ కార్టూనిస్టులు రమణ, నర్సిమ్, మోహన్ తదితరులు అంత్యక్రియల్లో పాల్గొన్నారు.

పత్రికా రంగానికి తీరని లోటు : కేసీఆర్
శేఖర్ మృతి పట్ల టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంతాపం వెలిబుచ్చారు. శేఖర్ మృతి పత్రికా రంగానికి తీరని లోటని పేర్కొన్నారు. పత్రికా లోకానికి, పాఠకులకు శేఖర్ సుపరిచితులని టీ-బీజేపీ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి అన్నారు. ‘శేఖర్ టూన్స్” శీర్షిక ద్వారా భావి కార్టూనిస్ట్‌లకు మార్గదర్శిగా నిలిచారని ప్రెస్ అకాడమీ చైర్మన్ ఎ.సత్యారావు తెలిపారు. ఐజేయూ సెక్రటరీ జనరల్ డి.అమర్, వై.నరేందర్ రెడ్డి, ఏపీయూడబ్ల్యూజేఎఫ్ ప్రధాన కార్యదర్శి జీ ఆంజనేయులు, తెలంగాణ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్ కన్వీనర్ బీ బసవపున్నయ్య, జర్నలిస్ట్స్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ అధ్యక్షుడు బి.చక్రధరి తదితరులు నివాళులర్పించారు.

ఆంధ్రజ్యోతి-ఏబీఎన్ ఎండీ రాధాకృష్ణ నివాళి
శేఖర్ పార్థివదేహానికి ఆంధ్రజ్యోతి ఎమ్‌డీ వేమూరి రాధాకృష్ణ, ఎడిటర్ కె. శ్రీనివాస్, నెట్‌వర్క్ ఇన్‌చార్జ్ కృష్ణప్రసాద్, ఇతర సిబ్బంది నివాళి అర్పించారు. దుఖఃంలో మునిగిపోయిన శేఖర్ కుటుంబాన్ని వేమూరి రాధాకృష్ణ పరామర్శించారు. ప్రముఖ పాత్రికేయులు కె.రామచంద్రమూర్తి, అల్లం నారాయణ, వినయ్ కుమార్, తెలకపల్లి రవి, ఉద్యమ నాయకులు కోదండరాం, విమలక్క, వరవరరావు, జూలూరు, జీహెచ్ఎంసీ అడిషనల్ కమిషనర్ యాదగిరి రెడ్డి నివాళులు అర్పించినవారిలో ఉన్నారు.

మృత్యువును పరిహసించినవాడు…

 

శేఖర్ లేడని తలచుకుంటేనే గుండెలు పిండేస్తున్నాయి. జీవితంతో పోరాడి గెలుపును ఆస్వాదించే సమయానికి మృత్యువు సవాలు విసిరింది. ఆఖరి నిముషం దాకా కలం, కుంచెతో మృత్యువును ఏమార్చి చిట్టచివరకు అలసి సొలసి కడపటి నిద్రలోకి జారిపోయాడు. సోమవారం నాటి ఆంధ్రజ్యోతి సంచికలో శేఖర్ ఆఖరి కార్టూన్ సంతకం చేసి పెన్నుమూశాడు. శేఖర్‌తో నాది దాదాపు రెండున్నర దశాబ్దాల పై అనుబంధం. ప్రజాశక్తితో ప్రారంభమైన మా పరిచయం హైదరాబాద్‌లో పెనవేసుకుపోయింది. తను ఆంధ్రప్రభలో చేరిన తర్వాత నేను ఆంధ్రజ్యోతికి వచ్చాను. దాదాపు రోజూ కలసే వాళ్ళం.
కార్టూన్లకే పరిమితం కాకుండా చిత్రలేఖనానికి సంబంధించిన సకల రంగాలని ఆకళింపు చేసుకునేందుకు బాలి, టీవీ నుంచి బాపూ వరకు పెద్ద పెద్ద కళాకారులను కలుసుకోవడం, టెక్నిక్‌లు చర్చించడం శేఖర్‌కు ఇష్టమైన పని. తుమ్మపూడిలో కళాతత్వ విమర్శకుడు సంజీవదేవ్‌ను కలిసేందుకు టి. వెంకట్రావు గారితో కలసి వెళుతూ నన్ను కూడా తీసుకువెళ్ళారు. అప్పుడు సంజీవదేవ్‌ను అనుకోకుండా ఇంటర్వ్యూ చేసే అవకాశం నాకు దొరికింది.
జీవితం పట్ల అంతులేని ఆపేక్ష, కార్టూన్ ప్రపంచంలో రారాజు కావాలనే ఆకాంక్ష, పట్టువీడని పరిశ్రమ కలిస్తే కంభాలపల్లి చంద్రశేఖర్ అవుతాడు. హైదరాబాద్‌లో లబ్దప్రతిష్టులైన మోహన్ లాంటి టైకూన్‌ల స్థాయికి తాను ఎదగాలనేది ఒక ఆకాంక్ష. ప్రజాక్షేత్రంలో పనిచేసే వారు ఎవరైనా కరపత్రం నుంచి పోస్టర్… కవర్ పేజీదాకా ఏమి వేసి పెట్టమని అడిగినా శేఖర్ ఎంతో ఇష్టంతో ఆ పని చేసిపెట్టేవాడు.
మేమిద్దరం పుస్తకాలు వేయడం నుంచి సిండికేట్ నడిపేదాకా ఎన్నెన్నో ఆలోచనలు చేసేవాళ్ళం. ఆ చర్చలలో అసాధ్యం అనుకున్న ఐడియాలను తర్వాత కాలంలో అమలు జరిపాడు. శేఖర్ టూన్స్ వంటి సిండికేషన్ ద్వారా చాలా భాషలలోకి తన బొమ్మను నడిపించాడు. అలాగే అమెరికా టూర్. ఎలా ఆహ్వానం వచ్చిందో, ఎలా వెళ్ళాడో… నాకయితే ఆశ్చర్యం. అసాధ్యమైన దాన్ని సుసాధ్యం చేయ డం కూడా ఒక కళే. దానికి అవసరమైన పరిశ్రమ, పట్టుదల శేఖర్‌కు చిన్నతనం నుంచే బాగా అబ్బినట్లున్నాయి.
జీవిత సహచరి చంద్రకళకు అక్షరాభ్యాసం నుంచి కంప్యూటర్ కళలో దిట్టగా తీర్చిదిద్దడం వరకూ ఎన్నో సవాళ్ళు గెలిచాడు. మృత్యువు విసిరిన వలను సైతం పట్టుదలతో నిముష నిముషం తను తప్పించుకున్న తీరు వైద్యం చేస్తున్న డాక్టర్‌కే ముచ్చట కల్పించిందని మిత్రులు కొందరు చెప్పారు. వైద్యం లేని రోగానికి జీవితేచ్ఛ అనే ఔషధాన్ని శేఖర్ సొంతంగా పరిశోధించి కనుగొన్నాడు. దానితోనే ఇన్నాళ్ళు చావును చంపుతూ బతికాడు. కానీ క్లినికల్ ట్రయల్స్ లెక్కలు ఎక్కడో తప్పాయి. డ్రగ్ డిజైనింగ్‌లో ఏదో తేడా జరిగింది. ఆ క్షణాన్ని క్షణంలో మృత్యువు అవకాశంగా తీసుకుంది.
చాలా కాలం క్రితం నేను విజయవాడలో వుండగా శేఖర్ చిన్న సర్జరీ చేయించుకున్నాడు. డాక్టర్ ఆపరేషన్ తర్వాత చిన్న టిష్యూను బయాప్పీకి పంపినప్పుడు తనకేదో అంతుపట్టని జబ్బు వచ్చిందేమోనని భయపడ్డాడు. డాక్టర్‌తో మాట్లాడమని నాకు ఒక తెల్లవారుజామున హఠాత్తుగా ఫోన్ చేశాడు. నేను తనను ట్రీట్ చేస్తున్న డాక్టర్‌తో తెలిసిన డాక్టర్ మిత్రుడితో మాట్లాడి భయపడాల్సింది లేదని చెప్పించాను.
సాధారణంగా ఏ కాస్త తేడా వచ్చినా నాతో చెప్పేవాడు. కానీ ఈ సారి ఆపరేషన్ జరిగిన తర్వాత తెలకపల్లి రవి చెప్పేదాకా తనకు ఇంత పెద్ద జబ్బు చేసిందని నాకు తెలియదు. ఇంత జబ్బులోనే… నాకు బైపాస్ జరిగిందని తెలిసి పలకరించడానికి రామ్‌నగర్ దాకా వచ్చాడు. సెల్ సిగ్నల్ లేకపోవడంతో ఆ రోజు కలవలేకపోయాం. మిత్రులను సంతోషపెట్టడం శేఖర్‌కు ఇష్టమైన పనుల్లో కల్లా ఇష్టమైనది. ఇకముందు ఇలా సంతోషపెట్టేదెవరు. శేఖర్ లేని లోటును తీర్చేదెవరు.
– 

Posted in వార్తా పత్రికలో | Tagged | 1 Comment

రాచకీయ ద్విప్లేట్స్ -33(ఎలక్షన్ పోస్ట్ మార్టం )

    రాచకీయ ద్విప్లేట్స్ -33(ఎలక్షన్ పోస్ట్ మార్టం )

1-బి జే.పి రాజకీయ చదరంగం లో సూత్ర దారి ‘’అమిత్ షా’’

   దిగిపోయిన పరువును పైకెత్తి ప్రత్యర్ధులకు పెట్టాడు ‘’షా ‘’.

2- గుడ్డిగా కొడుకు కూతురు ,మేనళ్ళుళ్ళను వెనకేసుకొచ్చిన’’ కరుణానిధి ‘’

   ‘’జయ’’ చేతిలో కాటా దెబ్బతిని ఒక్క సీటూ  లేక పాలయ్యాడు ‘’అధోగతి ‘’

3-మోడీ ని కాదని ‘’ హస్తం ‘’ఆలంబనం పొందిన ‘’నితీష్ ‘’

   ఉన్నదీ  ఉంచు కొన్నదీపోయి రాచకీయం గా అయ్యాడు ‘’మటాష్ ‘’

4-మధ్య ప్రదేశ్ ,రాజస్థాన్ గుజరాత్ లలో కాంగ్రెస్’’సున్నా’’

  భస్మాసుర ‘’హస్తం ‘’పెట్టుకొన్న వారికి  అంతేరా ’’ వెర్రి కన్నా  ‘’ .

5-‘ నమ్మి ప్రచారం తో సహా అన్నీ అప్పగిస్తే ‘’చిరంజీవి  ‘’

   తన పార్టీ తో బాటు హస్తాన్నీ చంపి పారేసి చేశాడు   ‘’మెగా ఫ్లాప్ షో’’.

6-కుటుంబం లోని నలుగురినే కాదు పార్టీని  ముంచి తానూ మునిగాడు ‘’బొత్స’’

  సోల్లూ ,పోల్లూ ,పని నిల్లూ,డబ్బు మందూ బెల్ట్ షాపులూ ఫుల్లూ తో ‘’చేతికి ‘’ఇచ్చాడు’’బొచ్చె ‘’

7-షీలా కొడుకు తో సభ్యులను కొట్ట్టించిన మధు యాష్కీ

  పూర్తిగా ఓడి రెంటికి చెడ్డ రేవడై మధువు కోసం ఇష్కీ ఇష్కీ .

8-తల్లీ  కొడుకుల  రాజీనామా వద్దన్న దద్దమ్మ కాంగీ వర్కింగ్ కమిటీ

   సిగ్గూ శరం లేకుండా మళ్ళీఅమ్మ  కాళ్ళ మీద పడటం ఏమిటి ?

9-అంటకాగిన నితీష్ ను ఆదర్శం గా తీసుకో లేరా ?

   మళ్ళీ పాత పాటే పాడి బుద్ధి తెచ్చుకోలేరా?

10- కత్తీ సుత్తీ ,కొడవలి మధ్య పోరాటం

ఇంకా బుద్ధి రాక సీట్ల కోసం ఆరాటం .

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -19-5-14-ఉయ్యూరు

 

Posted in రాజకీయం | Tagged | Leave a comment

పూర్వాంగ్ల కవుల ముచ్చట్లు -24 చమత్కార ప్రపంచం

పూర్వాంగ్ల కవుల ముచ్చట్లు -24

చమత్కార ప్రపంచం

డ్రైడేన్ కవికి పోప్ కవికి మధ్య అర్ధ శతాబ్ద కాలం కవిత్వానికి చిన్న రోజులే .రేస్తోరేషన్ తర్వాతాకవిత్వం చాలా కృత్రిమం గా ,తయారైంది .సాహసానికి వీరత్వానికి ప్రాముఖ్యత పెరిగింది .మనస్సాక్షికి అవకాశం వచ్చింది .మెటాఫిజికల్ కవిత్వం ఆదరణ కోల్పోయింది .బుద్ధి చతురత ,హాస్యాలకు మోజు ఎక్కువైంది .సామ్యుల్ పెపీస్ ,ఎవిలిన్ రాసిన విమర్శ ,సమీక్ష ,కరపత్రరచన డైరీ లను ఆదరించారు .సున్నితత్వాన్ని ,వినోదాన్ని కోరారు .ఈ పరిధిలో రాసి గుర్తింపు పొందిన వారిలో జాన్ విల్మాంట్ ఎరల్ఆఫ్ రోచెస్టర్, మార్గరెట్ లూకాస్ ,ఆఫ్రా బెన్ అన్నే ఫించ్ ,లేడీ విన్చేల్సియా ,మొదలైన వారున్నారు .వారిని గురించి సంక్షిప్తం గా తెలుసుకొందాం .

సెటైర్ వజ్రం -ఎరల్ఆఫ్ రోచెస్టర్ –జాన్  విల్మాంట్

జాన్  విల్ మాంట్ రెక్ లెస్ మనిషి .1-4-1647 న ఆక్స్ ఫర్డ్ షైర్ లో డిచిలీ లో పుట్టాడు .పన్నెండేళ్ళ వయసులోనే తండ్రికి వారసుడై ఎరల్ ఆఫ్ రోచెస్టర్ అయ్యాడు .ఆక్స్ ఫర్డ్ వాడాన్ కాలేజి లో చదివి పదిహేనవ ఏటనే  ఏం ఏ పాస్ అయ్యాడు .డచ్ వారికి వ్యతిరరేకం గా యుద్ధం లో పాల్గొన్నాడు .ఇంగ్లాండ్ తిరిగి వచ్చి రెండవ చార్లెస్ రాజుకు సన్నిహితుడయ్యాడు .అందం అధికారం ప్రాపకం తో అన్నీ పొందాడు . సెక్సు  స్కాన్దల్స్ ,అవినీతి లో చిక్కుకు పోయాడు .డచ్ రాజు చార్లెస్ ను అవమాన పరుస్తూ రాస్తే అతను ప్రయాణం చేసే నౌకను తగల బెట్టించాడు .రోచెస్టర్ రాజ  వంశానికి చెన్దిన మాలేట్ ను శృంగారం లోకి దించే ప్రయత్నం చేస్తే ఆమె తిరస్కరిస్తే రహస్యం గా  పెళ్లి చేసుకోక తప్ప లేదు .ఆమెతో బాటు అందుబాటులో దొరికిన సామాన్య స్త్రీల దగ్గరనుంచి రాజకన్యలు రాణీ లనూ  అనుభవించటం మొదలెట్టాడు .చార్లెస్ రాజు రాసలీలలను కవితామయం చేశాడు .విసుగెత్తి అతన్ని బహిష్కరించారు .భార్య ఎస్టేట్ లో తల దాచుకొన్నాడు .రాజు ఇతన్ని వదలుకోలేక పోయాడు .

ముప్ఫై ఒకటవ ఏట ఆరోగ్యం దెబ్బతినటం మొదలైంది .జ్వరం వచ్చి శరీరాన్ని మనసును ఇబ్బంది పెట్టింది .రెండేళ్ళ తర్వాత తను చేసిన పాప కృత్యాలకు సిగ్గుపడ్డాడు పశ్చాత్తాపం చెందాడు .ముప్ఫై మూడవ ఏట నే 16-6-1680న చని పోయాడు .చాలా అనాగరక భాష లో కవిత్వం రాశాడు .’’ఫేర్ వెల్ టు ది కోర్ట్ ‘’,కవిత అరువు సొమ్ముతో అలంకరించిందే .ఏ సెటైర్ ఎగైనెస్ట్ మాన్ కైండ్’’కవిత  అతని మనసును ఆవిష్కరిస్తుంది . .’’I would be a dog ,a monkey or a bear –or any thing but that vain animal –who is so proud of being rational ‘’అని మనిషిగా పుట్టటానికి ఇష్టం లేదన్నాడు .రోచెస్టర్ అసందిగ్ధ భావాలను వదిలి వెళ్ళాడు .అతను చనిపోయిన తర్వాతే కవితలు అచ్చయ్యాయి .రెండున్నరశతాబ్దాల తర్వాతా1926 లో ముద్రణ కు నోచుకోన్నాయి .జాన్ హోవార్డ్ ఇంగ్లాండ్ లో ప్రింట్ చేశాడు .అమెరికాలో వద్దన్నారు .

‘’love a woman !you are an ass –it is a most insipid passion –to choose out for your happiness –the silliest part of God’s creation ‘’అని తన అనుభవాలను  నెమరేసుకొంటూ బాధ పడుతూ బోధ చేశాడు .తప్పుడు భావాలను వ్యాప్తి చెందిన్చాడని అందరూ నిరసించారు .ఒక్క మాటలో చెప్పాలంటే ‘’Rochester expressed himself in many and often opposed moods –sordid and witty indignant and indifferent ,daring vulgar and always him self ‘’.ప్యూరిటన్ ల ఆధ్యాత్మిక సాధికారతను ఎదిరించి నిలిచినమొదటివాడు .ఆ తరానికి మార్గ దర్శి కూడా .సేటైరిస్ట్ లలో అగ్రగామి అనిపించాడు .విక్టోరియన్ కాలం లో అతని కవిత్వం చాలా భాగం సెన్సార్ అయింది .ఆధునిక కవులు గ్రాహం గ్రీన్ కు ఎజ్రా పౌండ్ కూ ఆదర్శం .హాబెర్ట్ యొక్క మెటీరియలిజం కు దూరం గా ‘’లినర్టి నిజం ‘’రాశాడని విమర్శకులన్నారు .యవ్వన మదం లో చెడ తిరుగుళ్ళు అసభ్య శృంగారం వ్యభిచారం లతో అతనికి ‘’గనేరియా ‘’సోకి దానితోనే చనిపోయాడు .ఆక్స్ ఫర్డ్ షైర్ లో స్పీల్స్ బరి చర్చ లో సమాధి చేశారు .అతను రాసిన ‘’డెత్ బెడ్ రి నన్సిఎషన్ ‘’అనే ‘’లిబర్టి నిజం ‘’ను తర్వాత ప్రచురించారు .ఇందులో భావాలన్నీ ‘’ప్రాడిగల్ సన్ ‘’పశ్చాత్తాపం గ నేఉంటాయి .అతని ‘’ప్రేన్తిస్ వర్క్ ‘’,ఎర్లీ మేచూరితి ‘’ ట్రాజిక్ మేఛూరిటి ,’’దిసిల్యూజన్ అండ్ డెత్ ‘’అనే నాలుగు విమర్శ గ్రంధాలు దాదాపు అతని జీవిత చరిత్రలే .డెబ్భై అయిదు కవితలు రాశాడని తేల్చారు .

చార్లెస్ రాజు పై రాసిన ‘’we have pretty witty king –and whose words no man relies on –he never said a foolish thing –and never did a wise one ‘’ను చదివి రాజు నవ్వుకొని ‘’that is right –my words are my own but my actions are those of my ministers ‘’అన్నాడట .అతని కవిత్వం లో విజ్ఞానం ,ప్రభావం రెండూ ఉంటాయి  మారుపేర్ల తోనే ఎక్కువ గా రాశాడు .నాటక రంగం పై మోజు ఎక్కువ అంతకంటే అందులో నటించే నటీమణులంటే మరీనూ .’’కొడాం ఆర్ దిక్విన్తెసేన్స్ ఆఫ్ డిబాచేరి ‘’నాటకం బాగా పేరు పొందింది .తగల బెట్టగా మిగిలిన ‘’సోడాంనాటకాన్ని అమ్మితే 45,600పౌండ్లు వచ్చాయట .భార్యకూ స్నేహితుడికీ రాసిన ఉత్తరాలు సరస సల్లాపాల్లాగా,చాల తేలిక వచనం తో అందర్నీ ఆకర్షించాయి .

ఆ కాలం లో ఎందరో నటులకు రోచెస్టర్ ఆదర్శం .   శామ్యూల్ జాన్సన్  ‘’worthless and dissolute rake ‘’    అన్నాడు  .ఆండ్రూ మార్వేల్ మాత్రం ‘’the only man in England that had the true vein of satire ‘’అని పొగిడాడు .వోల్ టైర్ ‘’మాన్ ఆఫ్ జీనియస్ అండ్ గ్రేట్ పోయేట్ . సెటై ర్ లలో శక్తి ,సామరధ్యం ఉన్నాయి ‘’అని మెచ్చాడు .   హాజ్ లిట్ రోచేస్టర్ కవితలు సాన బెట్టిన వాజ్రాలని కాంతితో మెరిసి పోతూ ఉంటాయనీ అన్నాడు  . గోతే   తన స్వీయ చరిత్రలో  రీజన్ కు మానవత్వానికి వ్యతిరేకం గా ఉన్న  రోచెస్టర్ సెటైర్ ను పొందు పరచాడు .ఇలా దూషణ భూషణ తిరస్కార పురస్కారాలన్డుకొన్నాడు రోచెస్టర్ .

John Wilmot.jpg  

సశేషం

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -19-5-14-ఉయ్యూరు

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

నాద స్వరానికి ప్రాణ ప్రతిష్ఠ-

నాద స్వరానికి ప్రాణ ప్రతిష్ఠ

Published at: 19-05-2014 08:22 AM

మంగళ వాయిద్యరంగంలో సరికొత్త తరం విద్వాంసులు మన సాంస్కృతిక రంగంలో కొత్త అధ్యాయాలు సృష్టిస్తున్నారు. తెలుగు గడ్డ మీదే కాదు, అమెరికా ఆలయాలలో సైతం రసవత్తర స్వరార్చనతో దేవతలతో పాటు భక్తజనులను పరవశింపచేస్తూ ఆశీస్సులు అందుకుంటున్నారు. తెలుగుగడ్డపై నాదస్వర విన్యాసాలలో సరికొత్త రికార్డులు సృష్టించిన తరిగోపుల నారాయణ మనుమలు చిరుప్రాయంలోనే హేమా హేమీలైన విద్వాంసులు సాధించలేని రసరమ్య చరిత్రను నమోదు చేస్తున్నారు. ప్రతిష్టాత్మక వేదికలపై వారి నాదస్వర కచేరీలు ఇప్పటికే ప్రపంచ రికార్డులు సృషి ్టంచాయి. తాతయ్య శిక్షణతో నిత్య సాధనతో ఆ స్వరప్రపంచ సిసింద్రీలు మన సాంస్కృతిక రంగ పెద్దల మన్ననలతో చిరు సెలబ్రిటీలుగా మారిపోయారు. మన ప్రభుత్వం నిర్వహించే సంగీత నృత్య కళాశాలలు సాధించలేని ఆశయ లక్ష్యాన్ని హైదరాబాదు చిక్కడపల్లి ప్రాంతంలోని డోలు తాతయ్య సాధించాడు.
వేలాది ఏళ్ళ నుంచి మన నాగరికతలో మమేకమైన మంగళ వాయిద్యాలు, నాదస్వర కచ్చేరీలు అత్యాధునిక నాగరికతలో చిత్ర విచిత్ర విన్యాసాలను సంతరించుకున్నాయి. శుభకార్యాలు, విందు వినోదాల్లో సంకల్పం నుంచి సంపూర్ణం దాకా సుస్వరాల నేప«థ్యంలో నాదస్వరాలు, మంగళవాయిద్యాలు ఒక భాగం అయిపోయాయి. అయిదుగురితో కూడిన బృందంతో శుభకార్యాల సమయంలో ప్రతి ఇంటా వాద్యకారులు ప్రాధాన్యం సంపాదించుకున్నారు. డోలు, సన్నాయి, తాళంతో పాటు శ్రుతి పెట్టెతో మేళ తాళాలు తెలియని వారు ఉండరు. అయితే, యాభై అరవై ఏళ్ల ముందునాటి పద్ధతులు సమూలంగా మారిపోయాయి. గొప్పగొప్ప విద్వాంసులు మహా మహా అద్భుతాలు సృష్టించిన రాగాలు, లయ విన్యాసాలు మరుగైపోయి అరుదైపోయాయి.
దక్షిణ భారతంలోని ఆలయాల్లో నాదస్వరం తో నే తలుపులు తెరుచుకునే సంప్రదాయంలోని మెలకువలు, ఆచారాలు ఇతరులకు మార్గదర్శకాలయ్యాయి. ఉత్తర భారతంలో విస్తరించిన హిందుస్తానీ సంగీతంలో షెహనాయ్‌తో దేవుడికి మేలుకొలుపు చెప్పటం ఆనవాయితీ. 1200 ఏళ్ల మన ఆలయాల చరిత్రలో నాదస్వర సుప్రభాతం తెల్లారకట్ట వీనుల విందు చేయటం తో పాటు మనసుకు ఉల్లాసం, ఉత్తేజం కలిగించటం ఆగమశాస్త్రంలో విధివిధానం అయింది. తూర్పు వెలుగులు విప్పారుతుంటే, భూపాలరాగంతో స్వరాలు వెల్లువెత్తిస్తుంటే ఆ పరిసరాలన్నీ మంగళప్రదంగా మారుతాయని వేలాది ఏళ్లుగా ఓ నమ్మకం ఉంది. శ్రీరాగం నేపథ్యంలో హారతి, ఉత్సవాలు, మూలవిరాట్టుల ఊరేగింపులలో నాటరాగం ఆలపించటం ప్రత్యేకంగా మల్హరితో రాగమాలికలతో డోలు వాయిద్య విన్యాసాలు చేయడం ఆలయాల సంప్రదాయం అయింది.
శుభకార్యాలో మేళతాళాలు
ఆలయ సేవలలో కమ్మకమ్మగా ఆనందభైరవి, నీలాంబరి రాగాలలో మంద్రంగా లాలిపాటల వరుసలో పవళింపు సేవలు నిర్వహించటం అనూచానంగా కొనసాగుతూనే ఉంది. గంగానదీ తీరంలో షెహనాయ్‌తో కాశీ విశ్వేశ్వరస్వామికి స్వరార్చన చేసిన బిస్మిల్లా ఖాన్ భారతరత్న గా మన జాతి మన్ననలు అందుకొన్న తీరుతెన్నుల్ని అవలోకిస్తే మన ఆలయ విద్వాంసుల ప్రతిభాపాటవాలు మనకు పులకింతలతో పాటు కాసింత గర్వం కూడా పెంచుతాయి. ఇప్పటి తమిళనాడులో వందల సంవత్సరాలుగా పూజలు అందుకుంటున్న వందల ఆలయాలలో క్రమంగా అలవడిన నాదస్వరంలో ఈ తరం గమనికలోనికి రాని అంశాలు ఎన్నెన్నో ఉన్నాయి. ఆలయంలో స్వరాల కొలుపులతో మాత్రమే కాక మాడ వీధులలో ఊరేగింపులు, హారతుల సమయంలో నాదస్వరం కీలకమైంది. నాయీబ్రాహ్మణ కులం, ముస్లింలలో ప్రత్యేక తెగ గా గుర్తింపు ఉన్నవారు తరతరాలుగా దేవతల స్వరార్చనలో బతుకుదారిని ఎంచుకున్నారు. వైణిక బాణి, నాదస్వర బాణీలుగా స్వర ప్రపంచంలో పరిగణించే పద్ధతుల్లో మన కళ్ల ముందే మనకు తెలియనివి చాలా చాలా ఉన్నాయి. సెమ్మంగుడి శ్రీనివాసయ్యర్‌లాంటి అగ్రశ్రేణి గాయకుడు తనకు గాత్ర శుద్ధికి, పద్ధతికి ఉద్దీపన తెచ్చిపెట్టింది తమ పల్లెలోని నాదస్వరమే అనేవారు. పైడిస్వామి వంటి నాయీబ్రాహ్మణుడి నేతృత్వంలో జరిగిన నాదస్వర బృంద కచ్చేరీతోనే తనకు గానంలో సంగతులు అబ్బాయని ప్రసిద్ధ విద్వాంసుడు ఎం.ఎస్. బాలసుబ్రమణ్య శర్మ చెప్పుకునేవారు….
ఇంటింటా ఎలాంటి వేడుక జరుపుకున్నా ఆ సందర్భంలో మంగళ వాద్యాలను ఏర్పాటు చేయటం తాత ముత్తాతల తరాలనుంచి ఆనవాయితీ అయింది. శుభాలతో పాటుఅశుభాలు జరిగినప్పుడు బాజాలు జాతరలు గ్రామదేవతల పూజలలో వేరువేరు పద్ధతులు అలవాట్లు అయిపోయాయి. గృహాలలో శుభప్రదంగా భావించే చిన్నా పెద్దా పండుగలలో మేళం తప్పనిసరి అయిపోయింది. ఆకుపచ్చని మామిడి తోరణాల మధ్య సన్నాయి మేళం, భజంత్రీలు లేకుండా ఉండని సంప్రదాయం మనలో మమేకం అయింది. ఖరహరప్రియ, కళ్యాణి రాగాలతో ఉల్లాసాన్ని పొంగులెత్తించటం అందరి అనుభవాలలోనిదే. మన వాగ్గేయకారులు ఆయా సందర్భాలు, సన్నివేశాలకు అనువుగా చేసిన రచనలు వాయిద్యాలతో అనుభూతిలోకి తేవటం మన మనసుల్లో మెదులుతాయి. మునిరామయ్య, దాలిపర్తి పిచ్చాహరి, దోమాడ చిట్టబ్బాయి,షేక్ చిన పీరు సాహెబ్, అన్నవరపు బసవయ్య వంటివారు నాదస్వర రంగంలో రసవత్తర స్వర విన్యాసాలు సృష్టించారు. ఈ తరంలో తరిగిపోయిన విద్వాంసుల పరంపరలో 78 ఏళ్ల తరిగోపుల నారాయణ సంప్రదాయ నిష్ఠతో పలు విజయాలు సాధించారు.
ఎల్లలు దాటిన విన్యాసాలు
తాత ముత్తాతల నాదస్వర వారసత్వంలోని అసలు సిసలు సారాన్ని సారస్వాన్ని అందిపుచ్చుకున్న పెద్దాయన నారాయణ తన మనుమలతో సాధిస్తున్న రికార్డులు గత వైభవంలో వన్నెల్ని గుర్తుకు తెస్తున్నాయి. పలువురు పెద్దల మెప్పుతో పాటు అమెరికాలోని ఆలయాలలో పాత తరం కచ్చేరీలపై శ్రద్ధాసక్తులు పెరిగేలా చేయగలుగుతున్నారు. వందల సంఖ్యలో మన ఆలయాలు విరివిగా పెరిగినా, అక్కడ నాదస్వర విద్వాంసుల సేవలను వినియోగించుకోకపోగా, రికార్డులు, సీడీలను ఉపయోగించి స్వరార్చనను సరిపెడుతున్న తీరుతెన్నులు కొద్దిగా బాధ కలిగిస్తాయి. వారు ఈ పరిస్థితిని మార్చి కొత్తతరంలో ప్రావీణ్యం పెంచుతున్నారు. ఆయన మనుమలు ఇద్దరు, ఒక మనుమరాలు చిరుత ప్రాయంలోనే అసాధారణ ప్రతిభ తో దిన దిన ప్రవర్ధమానం అయ్యేలా చేయగలిగారు. మన దేశంతో పాటు దేశ విదేశాల్లో ఆ బుల్లి విద్వాంసుల త్రయం సాధిస్తున్న విజయాల గురించి తాతయ్య వివరించారు.
కర్నూలు జిల్లా నందికొట్కూరు మండలం మిడుతూరు పల్లె నుంచి రాజధాని నగరానికి వచ్చి మా కులవృత్తి విద్యలో ప్రామాణికమైన పద్ధ్దతులు పెంచటానికి చేతనయిన వన్నీ చేశాను. మా వాళ్ల తో గత వైభవం లోని గౌరవ ఆదరాలు పెంచుకోవటంపై కావాల్సిన శిక్షణ సాధనలకు అవకాశాలు పెంపొదిస్తున్నాం. 1981 నుంచి నేను చేసినవన్నీ గమనించండి. ఇంకా ఎంతో చేయాల్సి ఉంది. నా ఆలోచనల్ని పంచుకుంటూ మెచ్చుకున్న సిలికానాంధ్ర వ్యవస్థాపక అధ్యక్షుడు ఆనంద్ నడుం బిగిస్తే మన రాష్ట్రంలోని4,200 మంది నాదస్వర కళాకారులు, 1,082సన్నాయిలు, 321 క్లారినెట్‌లు, 1331 డోలులు శృతి, తాళంతో ఒకే వేదికపై ప్రదర ్శన ఇచ్చారు. ఆ నేపథ్యంలోనే మా ఇంటి బుడతలు ప్రత్యేక ప్రదర్శనలు ఇచ్చారు.హైదరాబాదులో పుట్టిపెరిగిన 6 ఏళ్ల చిన్నారి మణిదీప్ తాతయ్యగా నా నుంచి నేర్చుకున్న డోలు విన్యాసాలు చిత్రవిచిత్ర జతులు గమకాలతో పాత తరం పెద్దల నాద విద్వత్తు తో పెద్దల నుంచి మెప్పు పొందాడు.
డోలుపై తాళం వాయించటంలో ఆ సిసింద్రీ ప్రతిభ గవర్నర్‌తో సహా ఎందరో పెద్దల్ని ఆకట్టుకుంది. పద్యాలు రాయటంలో ఛందస్సులా లయ వాయిద్యంలో తాళం అత్యంత కీలకమైంది. అదే ప్రాణంలాంటిది. 35 తాళాల ప్రస్తారక్రమం, దానికి దీటుగా 108 తాళాలు వాటికి ముందు పంచగతుల గమనం, దక్షిణ మార్గం, అతిచిత్ర మార్గం వంటి విన్యాసాలు అలవోకగా చేయగలిగాడు. అంతకన్నా రెండేళ్లు పెద్ద అయిన మనుమరాలు, మనుమడు అమెరికాలో అంతకు మించిన నాదస్వర సత్తాతో మహామహుల ఆశీర్వచనాలు అందుకుంటున్నారు. నేను ఆ దేశంలో 6 నెలలు, ఇక్కడ చిక్కడపల్లిలో, ఆ తరువాత మా స్వగ్రామంలో ఆసక్తి కలిగినవారందరికి ఇందలో శిక్షణ ఇస్తున్నా.
అమెరికాలోని దేవాలయాలలో నాదస్వరం కోసం స్థిరంగా ఎవరూ లేరని గమనించాను. అక్కడి ఆలయాల్లో మేళం కోసం శ్రీలంక, తమిళనాడులకు చెందిన కొద్ది మంది వాయిద్య ప్రవీణులు దూరప్రాంతాలకు ప్రయాణాలు చేస్తూ ఆయా కార్యక్రమాలు సజావుగా జరిగేలా చేస్తున్నారు. తరాల మార్పిడి వల్ల మారిపోయిన నాదస్వరంలో తేడాలు, పట్టింపు లేకుండా కొనసాగిపోతున్నాయి. నా కుమారుడు సాఫ్ట్‌వేర్ రంగంలో ఉద్యోగిగా బోస్టన్ ప్రాంతంలో స్థిరపడి, మా కులవృత్తిలో చిన్ననాటి సాధన వట్టిపోకుండా ఆయా ఆలయాల్లో అవకాశం బట్టి నాదస్వరంలో కచ్చేరీలు చేస్తున్నాడు. ఒక మనుమరాలుకి పేరు కూడా రాగశ్రీ అని పెట్టుకున్నాం. ఆ పిల్ల మా నాదస్వర వారసత్వంతో పాటు గాత్రంలో కూడా మంచి పట్టు సాధించింది. మా ముగ్గురు మనుమలు కలిసి అమెరికాలో వీలయినన్ని ప్రాంతాలలో కచ్చేరీలు చేసేలా కొందరు పెద్దలు కలిసి సన్నాహాలు చేస్తున్నారు. 78 ఏళ్ల వయసు పైబడటం తో నాకు తెలిసిన విద్య, మెలకువలు తరువాతి తరానికి అందించాలన్న తపన పెరిగింది.
డోలు వాయిద్యం, గ్రహ, గతి బేధం, చాపు తాళ సమ్మేళనం వంటి వాటి పై సీడీలు రూపొందించాను. అరుదైన సింహనందిని, గోపుచ్ఛయతి, సమతాళం, మిశ్రగమనం, దివ్యసంకీర్ణ గతి, త్రిపుటతాళంలో భిన్నగతులు, డోలు త్రయం, డోలు పంచకం, సప్తకం, తాళ వాద్య కచ్చేరీ, స్వరలయ విన్యాస తరంగిణి, దశ డోలు వాయిద్యం లతో సప్తతాళాల జతి వంటివి సీడీల రూపంలో వెలువరించాను. ఇవి కేవలం వినికిడికి మాత్రమే కాక శబ్ద రహస్యాలు వాటి సొంపులు విన్యాసాలు అవగతం చేసుకోవటానికి కూడా ప్రయోజనకరం. ఇంకా శివతాండవంలో, డమరుక యతిలో మా డోలుతో పాటు పద్మశ్రీ ఎల్లా వారి మృదంగంతో కూడా చేశాం. 12 నిమిషాల 24 సెకండ్లలో 35 తాళాలు వాయించి గిన్నిస్ నమోదుతో రికార్డుతో తెలుగు నాదస్వర కేతనం ప్రపంచం అంతా చూసేలా చేశాను. అందరి ఆదరాభిమానాలతో ఇంట గెలిచి రచ్చ గెలవటం అన్నట్టుగా అమెరికాలో మా చిన్నారులతో కలిపి కచ్చేరీ చేసి జేజేలు పంచుకునేలా చేస్తా.
జూ జి.ఎల్.ఎన్. మూర్తి

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

దా. కొలకలూరి ఇనాక్తొ రాసిన మొదటి దళిత స్త్రీవాద కధ ఊరబావి

తొలి దళిత స్త్రీవాద కధ ఊరబావి

Published at: 19-05-2014 03:26 AM

ఒక సాహిత్య ఉద్యమం సామాజిక, చారిత్రక కారణాల వల్ల కొంత వాడివేడి తగ్గాక పునర్‌మూల్యాంకనం చేసుకోవడం అవసరం. అప్పటివరకు గుర్తింపుకు రాని రచనలు, రచయితలు, కవులు, కవయిత్రులు ముందుకు వస్తారు. ఈ పనిని ఎక్కువగా విమర్శకులు, రచయితలు చేస్తారు. ఒక్కోసారి వీరిలో ఆ ఉద్యమ కవులు, రచయితలు కూడా ఉంటారు. అంటే ఒక ఉద్యమం తర్వాత సాహిత్య వాతావరణం కొంత నిశ్శబ్దానికి గురై మరో ఉద్యమం ప్రారంభమయ్యే మధ్య కాలంలో ఆ సాహిత్యాన్ని కొత్త సైద్ధాంతిక పద్ధతుల ద్వారా, లేదా పాత పద్ధతుల ద్వారా పరిశీలించడం జరుగుతుంది.
దళిత సాహిత్యం దళిత స్త్రీకి ఇచ్చిన గుర్తింపు తక్కువే. అయితే స్త్రీవాద సాహిత్యం, దళితవాద సాహిత్యం దళిత స్త్రీ వాదానికి కావాల్సిన నేపథ్యాన్ని ఏర్పరిచాయి అనడంలో ఎటువంటి అనుమానమూ లేదు. దళిత స్త్రీ సాహిత్యంగా ‘నల్లపొద్దు’ కవితా సంకలనం ఆధునిక తెలుగు సాహిత్య పరిణామంలో గుర్తించదగిన మైలురాయి లాంటిది. గోగు శ్యామల, జూపాక సుభద్ర, జాజుల గౌరి, బోయ జంగయ్య, గద్దల బాను, కాలువ మల్లయ్య మొదలైన వాళ్లు దళిత కథాసాహిత్యాన్ని సుసంపన్నం చేశారు, చేస్తున్నారు.
‘దళిత స్త్రీ గురించి దళిత స్త్రీలే రాయాలి’ అనే అంశాన్ని వదిలి ఆలోచిస్తే దళిత సాహిత్యం ఉద్యమ స్థాయికి రాకపూర్వమే – 1969 జూలై 2, ఆంధ్రప్రభ సచిత్ర వారపత్రికలో వెలువడిన కొలకలూరి ఇనాక్ కథ ‘ఊరబావి’. ఈ కథను దళిత సాహిత్యంలో భాగంగా కాక, దళిత స్త్రీ వాదానికి భూమికగా గుర్తించాల్సిన అవసరం ఉంది. సాహిత్య ఉద్యమ పరిణామంలో చైతన్యం, ప్రతిఘటన అనేవి చివరి అంశాలు. కానీ వీటిని రచయిత ఈ కథలో దళిత సాహిత్య ఉద్యమ ప్రారంభంలోనే చిత్రించారు.
2002 మార్చి 8న అలీసమ్మ విమెన్స్ కలెక్టివ్ విడుదల చేసిన ప్రకటనలో భారతీయ స్త్రీవాదాన్ని పితృస్వామ్య దృక్కోణం నుండే కాకుం డా కులతత్వ కోణం నుండి కూడా చూడాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పింది- ‘భారత మహిళా లోకా న్ని కులతత్వ పితృ స్వామ్యం చీల్చివేసిన విషయాన్ని గుర్తించవల సిందిగా దళితేతర స్త్రీలనూ మేం కోరుతున్నాం. భారతదేశంలో కేవలం పురు షాధిపత్యం మాత్రమే కాదు, కులతత్వ పితృస్వా మ్యం పనిచేస్తుందన్న విషయాన్ని గుర్తించ వలసిందిగా మిమ్మల్ని కోరు తున్నాం. భారతీయ మహిళల్లో కొనసాగుతున్న భిన్నత్వం (బహుళత్వం) రాజకీయ ప్రాధాన్యతను గుర్తించవలసిందిగా కోరు తున్నాం. మీరు రూపొందుతున్నారు, మేం ధ్వంస మవుతున్నాం. మిమ్మల్ని గుడిలో ప్రతిష్టిస్తున్నారు. మమ్మల్ని రేయింబవళ్లూ పనిచేయమని పొలాల్లో విసిరేస్తున్నారు. మిమ్మల్ని ‘సతి’గా మార్చుతున్నా రు. మమ్మల్ని వేశ్యలుగా మార్చుతున్నారు. ప్రజా స్వామిక స్త్రీవాదం ఏదైనా దాని లక్ష్యం జండర్, కులం, వర్ణం మొదలైన అధికార నిర్మాణాల్లో యిమి డి వున్న సామాజిక బంధాలను మార్చడమే.’
జండర్, కులం, వర్ణం అనే మూడు విధాల దళిత స్త్రీ పొందుతున్న అవమానాలను, ప్రతి ఘటించిన వైనాన్ని ‘ఊరబావి’ కథలో ఇనాక్ చిత్రించారు. కథలో ప్రధానాంశం దళితుల నీటి సమస్య. ఈ సమస్య పరిష్కారాన్ని ఆనాటి సాహిత్య పరిస్థితుల దృష్ట్యా రచయిత సంస్కరణ లేదా ఉద్ధరణ ద్వారా చూపాలి. కానీ ఇనాక్ ఒక మాదిగ స్త్రీ చైతన్యం ద్వారా పరిష్కారాన్ని చూపడం గుర్తించదగిన గొప్ప విషయం.
క్లుప్తంగా కథ విషయానికి వస్తే- వేసవి కాలంలో మిగిలిన బావులు ఎండి పోవడంతో పల్లెజనం, గ్రామంలోని జనం ఒకే బావి నుంచి నీళ్లు తెచ్చుకోవలసి వస్తుంది. పల్లెలో దళితులు బావినీళ్లు తోడుకోడానికి గ్రామంలోని వాళ్లు ఒప్పుకోరు. ఊరిజనం కనికరించి తోడిపోయాలి. బావి దగ్గరకు నీటికెళ్లిన మాదిగ చిదంబరం భార్యను ఊరి యువకుడు బాన ఎత్తుతూ ఆమె శరీరాన్ని చూస్తూ, తాకుతూ బాన వదిలేస్తాడు. బాన పగిలి పోతుంది. విషయం పల్లెంతా, ఊరంతా పాకుతుంది. ఎవరికీ తెలియకుండా చిదంబరం భార్య బావిలో ఎద్దుదట్టేన్ని పడేస్తుంది. అంతకు ముందే చిదంబరం ఊరి జనాలను వేణుగోపాలస్వామి ఆలయంలోకి పోలీసు సహాయంతో వెళ్లడం, రైల్వే స్టేషన్లో బెంచీపై కూర్చొని ఊరిజనాలు వస్తే లేవకపోవడం లాంటి సంఘటనల్లో ఎదిరించి ఉంటాడు. అందువల్ల చిదంబరం మీద అనుమానంతో మునసబు చిదంబరం తండ్రి రాముడ్ని, చిదంబరాన్ని కట్టేసి కొడతాడు. కానీ ఆ రాత్రి చిదంబరం భార్య మునసబును ఎవరికీ తెలియకుండా మంచానికి కట్టేసి కొడుతుంది. మునసబు సావిడికి, వాములకు నిప్పు పెడుతుంది. దాంతో ఊరి జనాలు, మునసబు బావి నీళ్లను పల్లెజనాలు వాడుకోడానికే ఒప్పు కుంటారు. చివరకు బావిలో ఎద్దు దట్టేన్ని బయటకు తీయడానికి అందరూ భయపడుతుంటే చిదంబరం భార్య చాకచక్యంగా బయటకు లాగుతుంది.
ఈ కథలో అన్యాయానికి గురయ్యే పాత్రలు మూడు. ఒకరు- చిదంబరం తండ్రి రాముడు. ఇతడు ఏమాత్రం చైతన్యం లేని వ్యక్తి. రెండు- చిదంబరం. ఇతడు సమస్యకు సానుకూల పరిష్కారాన్ని కోరుకుంటా డు. మూడు- చిదంబరం భార్య. బావి దగ్గర జరిగిన అవమానానికి అతడ్ని కొట్టడం.. పల్లెనీటి సమస్య తీర్చడానికి ఎద్దుదట్టేన్ని బావిలో వేయడం.. రైల్వేస్టేషన్లో భర్త చిదంబరాన్ని కొట్టడానికి చెయ్యెత్తిన ఊరి అతడ్ని ఆపి, దబాయించడం.. మామను, భర్తను కొట్టిన మునసబును మంచానికి కట్టేసి కొట్టడం.. మునసబు ఆస్తి సావిడి, వాములు తగలబెట్టడం.. చివరకి ఎవరి వల్లా కాని ఎద్దుదట్టేన్ని బావిలోంచి తీయడం.. ఇవన్నీ మాదిగ స్త్రీ చైతన్యాన్ని తెలియజేసే సంఘటనలే.
చిదంబరం భార్య నీటికోసం బావి దగ్గరకెళ్లి పొందిన అవమానంలో ఒక్క జెండర్ అంశమే కాకుండా నీటిని బావి దగ్గర సొంతంగా తోడుకోలేకపోవడం అనే దళిత సమస్య కూడా ఉంది. ఈమె భర్తను, మామను కొట్టడం, రైల్వే స్టేసన్ సంఘటనలు ఒక్క కుల సమస్యనే కాకుండా భూస్వామ్య వ్యవస్థలో ఉన్న వర్గ సమస్యను కూడా తెలియజేస్తాయి. అదే విధంగా ఎద్దుదట్టేన్ని బావిలోంచి తీయడంలో దళిత స్త్రీకి శ్రమలో ఉన్న ప్రాధాన్యాతను కూడా తెలియజేస్తుంది. ఈ అంశాలన్నీ దళిత స్త్రీకి, దళితేతర స్త్రీకి గల భేదాన్ని వివరిస్తూ, దళిత స్త్రీ ఎదుర్కొనే సమస్యలను కూడా మన ముందుకు తెస్తాయి.
ఈ కథ వెలువడిన సుమారు పదేళ్లకు దళితులపై జరుగుతున్న అనేక దాడులు వెలుగులోకి వచ్చాయి. ప్రకాశం జిల్లా కారంచేడు గ్రామంలో మాదిగకుంట చెరువులో పశువులకు పెట్టే కుడితిని పోయడం జరిగింది. ఆ కుంటలో నీళ్లు మాదిగలు తాగేవాళ్లు. దీనిని దళిత స్త్రీ సువార్తమ్మ ఎదిరించింది. తర్వాత ఈ సమస్యే పెద్ద తిరుగుబాటుకు దారితీసింది. అంతేకాదు కారంచేడు దళిత స్త్రీ హత్యల కేసులో ప్రధాన సాక్షి అలీసమ్మ. ఆమె కొడుకును చంపడం స్వయంగా చూసింది. సాక్ష్యం చెప్పడానికి పూనుకోవడంతో ఆమెను కూడా చంపేశారు.
‘ఊరబావి’ కథలో రూపం విషయానికి వస్తే- కథ సమస్యతో ప్రారంభమవుతుంది. ముగింపులో సమస్య పరిష్కారం ఉంది. పాత్రోచితమైన భాష, వర్ణనలన్నీ సహజత్వానికి దగ్గరగానే ఉంటాయి. కథ సర్వసాక్షి దృక్కోణంతో సాగినా రచయిత ఎక్కువగా కథలో ప్రవేశించారు. ప్రధాన పాత్ర చేసే పనులను గోప్యంగా ఉంచి ‘ముళ్ల’ను వర్ణించడం ద్వారా తెలియజేస్తారు- ‘చిదంబరం మునసబు మంచం వైపు చూశాడు. చేతులు తలవైపు పట్టెకూ, కాళ్లు కాళ్ల కట్టకూ కట్టి వేయబడ్డాయి. ముళ్ళు! నేర్పయిన ముళ్ళు! ఏనుగు ముళ్ళు! అతనికి ఊరబావి గిలకల పట్టెలకు మోకులు వేసిన ముళ్ళు గుర్తుకు వచ్చాయి!’ కథ చివరలో ఎద్దు దట్టేన్ని బావి లోంచి తీసిన తర్వాత ముళ్లు గురించి చిదంబరం ఈ విధంగా ఆలోచిస్తాడు. ‘చిదంబరం ఇందాకటి నుంచి ఆలోచిస్తున్నాడు. బావిలోంచి మోకులు తెచ్చి ఆమె పట్టెకు వేసిన ముళ్లు గూర్చి. చక్కని ముళ్లు! అందమయిన ముళ్లు! నేర్పుగల ముళ్లు! ఏనుగు ముళ్లు!’
ఈ కథలో చిదంబరం భార్య అని ప్రధాన పాత్రను పేరు లేకుండా చిత్రించడం వెనుక దళిత స్త్రీకి సమాజంలో, దళితుల్లోనూ ప్రాధాన్యత తక్కువగా ఉందని తెలియజేయడం మాత్రమే. ఈ విధంగా ఈ కథ దళిత స్త్రీచే రచించబడకపోయినా, దళిత రచయితగా గుర్తింపు పొందిన పద్మశ్రీ కొలకలూరి ఇనాక్ దళిత స్త్రీ చైతన్యాన్ని, ప్రతిఘటనను కథలో వాస్తవ రూపంలో రాశారు. దళిత స్త్రీవాదం నేడు తన మూలాలను కథలో కూడా వెతుక్కునే సమయం వచ్చింది కాబట్టి ఈ కథను ప్రప్రథమ కథగా గుర్తించాల్సిన అవసరం ఉంది.
-శ్రీభవ్య
9603935285

 

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

సామాన్యుని చేతిలోకి పుస్తకం

సామాన్యుని చేతిలోకి పుస్తకం

ఉత్తమ గ్రంథాల ప్రచురణ కోసం, యువజనుల్లో పఠనాసక్తిని పెంపొందించడం కోసం కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ ఆధీనంలో న్యూఢిల్లీలో 1957లో స్థాపించబడిన సంస్థ నేషనల్ బుక్ ట్రస్ట్ (ఎన్‌బిటి). దీని విభాగాలు మొదట కోల్‌కతా, బొంబాయి, బెంగుళూరులలో ఏర్పాటయ్యాయి. 2009లో జాతీయ అనువర్తిత ఆర్థిక పరిశోధనా మండలి సహకారంతో ఎన్‌బిటి దేశవ్యాప్తంగా యువజనులలో పుస్తక పఠనాభిలాష అలవాట్లపై ఒక సర్వే నిర్వహించింది. అక్షరాస్యులైన యువజనుల విద్యా స్థాయికి, వారి పఠనాసక్తులకు మధ్య సంబంధమున్నట్టు ఆ అధ్యయనంలో వెల్లడయింది. టెలివిజన్ ప్రసారాలను వీక్షించడం, ఇంటర్నెట్ సర్ఫింగ్ చేయడం కంటే పుస్తక పఠనమే ముఖ్యమని అక్షరాస్యులైన యువజనులలో 75 శాతం మంది అభిప్రాయపడినట్టు ఆ సర్వే వెల్లడించింది.
1986 జాతీయ విద్యా విధానం స్ఫూర్తితో సమాజంలోని అన్ని వర్గాల వారికి పుస్తకాలను అందుబాటులోకి తేవడానికి ముఖ్యంగా బాలలు, యువతలో పఠనాసక్తిని పెంచడానికి ప్రతి రాష్ట్రంలోనూ కేంద్ర పాలిత ప్రాంతాలలోనూ ‘బుక్ ప్రమోషన్ సెంటర్స్’ని ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించింది. ఈ ప్రతిపాదన ప్రకారం ఎన్‌బిటి అన్ని రాష్ట్రాలలోనూ ఈ సెంటర్స్‌ను ఏర్పాటు చేసే పనిలో ఉంది. అందులో భాగంగా ప్రస్తుతం గౌహతి, పాట్నా, గోవా, అగర్తలా లతోపాటు హైదరాబాద్‌లోని ఉస్మానియా విశ్వవిద్యాలయం పరిధిలో ఉన్న సాక్షరతా భవన్‌లో ఈ సెంటర్‌ను ఏర్పాటు చేస్తున్నారు. వచ్చే జూలైలోగా సెంటర్ ప్రారంభం కానున్నది. బుక్ ప్రమోషన్ సెంటర్‌లో పుస్తక విక్రయ కేంద్రంతో పాటు సాహితీవేత్తలు, చిత్రకారులతో సమావేశాలు, చర్చలకు సైతం సదుపాయంగా ఉండేలా ఒక సమావేశ మందిరాన్ని కూడా ఏర్పాటు చేస్తున్నారు. పుస్తక ప్రచురణ, పఠనాసక్తిని ప్రోత్సహించడం, భారతీయ గ్రంథాలను విదేశాలలో ప్రచారం చేయడం, రచయితలకు, ప్రకాశకులకు ఆర్థిక సహాయం చేయడం, బాలల సాహిత్యాన్ని ప్రోత్సహించడం ఎన్‌బిటి ప్రధాన కార్యక్రమం. ఈ సంస్థ చాలా సంవత్సరాలుగా దేశమంతటా పుస్తక ప్రదర్శనలను ఏర్పాటు చేస్తోంది. ప్రతి రెండేళ్ల కొకసారి న్యూఢిల్లీలో విశ్వ పుస్తక వేదికను ఏర్పాటు చేస్తున్నది. ఆసియా, ఆఫ్రికా దేశాలలో జరిగే పుస్తక ప్రదర్శనల్లోకెల్లా ఇదే పెద్దది. ఇందులో 1200కు పైగా దేశ విదేశాల ప్రచురణ సంస్థలు పాల్గొంటాయి. ఈ ప్రదర్శనల్లో రచయితలతో ముఖాముఖి, పుస్తకావిష్కరణలు, చర్చలు, సెమినార్లు, వర్క్‌షాప్‌లు నిర్వహిస్తుంది.
పుస్తక పరిశ్రమ అభివృద్ధికి ప్రచురణ, విక్రయ విభాగాల్లో ప్రతిభావంతులైన యువకుల కోసం ఢిల్లీలో మూడు మాసాల శిక్షణా తరగతులు నిర్వహిస్తుంది. 100 రూపాయల సభ్యత్వ రుసుముతో ఎన్‌బిటిలో సభ్యులుగా చేరిన వారికి ప్రతి కొనుగోలుపై 20 శాతం తగ్గింపు ఉంటుంది. సాహిత్య అకాడమీ, పబ్లికేషన్స్ డివిజన్ మొదలైన సంస్థల ప్రచురణలను కూడా ఈ బుక్ ప్రమోషన్ సెంటర్ విక్కయ కేంద్రం అందుబాటులో ఉంచుతుంది. ఇంకా ఎన్నో రకాలుగా ఉపయోగకరంగా ఉండే ఈ సెంటర్‌ను సాహిత్యకారులందరూ ఉపయోగించుకోవాలని దాని బాధ్యులు పత్తిపాక మోహన్ కోరుతున్నారు.

 

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

వంటింటి సూర్యోదయాలు-మందరపు హైమవతి

వంటింటి సూర్యోదయాలు-మందరపు హైమవతి

పొద్దున్నే లేవగానే
పొగలు కక్కే కాఫీ తాగుతూ
పేపరు చదవాలని నా చిరకాల వాంఛ
కలల శాలువా కప్పుకొని
నిద్రా దేవత కౌగిలిలో
ఇంటిల్లిపాది పరవశిస్తున్న వేళ
నేను మాత్రం కళ్ళు నులుముకొంటూ
కాలు పెడతాను వంటింట్లోకి
నా సుందర సూర్యోదయాలన్నీ
వంటింటి ఆకాశంలోనే
ప్రతి ప్రభాతం కాఫీరాగం పలికించడానికి
శ్రుతి చేస్తాను వంటింటి వాయులీనాన్ని
చిన్నప్పుడు భయపెట్టిన దయ్యాల కథల్లా
పెద్దయ్యాక వెంటాడే పీడకల వంటిల్లు
నలభీమ పాకమని ప్రస్తుతించినా
వంటింటి పుస్తకంపై కాపీరైటు వనితలకే
విద్యార్థులు ఒక జవాబునే పదే పదే రాసినట్లు
ప్రతి రోజు బియ్యం కడిగి కడిగి
కూరలు తరిగి తరిగి
ప్రతినిత్యం లక్షల క్షణాల అవిరళ శ్రమ
పచ్చడి ప్రియులకు పప్పు ప్రియులకు
వేపుడు లేనిదే వెర్రెత్తి పోయేవారికి
అందరి అభిరుచుల మేర వండిపెట్టి
నా అభిరుచినే విస్మరించిన నేపథ్యంలో
ఇల్లు పట్టించుకోని వాళ్ళు
పిల్లల పేర్లు తెలియని వాళ్ళు
సంఘసేవకులుగా కీర్తింపబడుతున్న వేళ
మున్నూటరవై ఐదు రోజులు
వంటింటి చెరసాలలోనే మగ్గిపోతూ
నిగమశర్మ అక్కలా మిగిలిపోతున్నా
ంంం
ఉపమలతో రూపకాలతో
ఉత్తమ కవితను తీర్చిదిద్దినట్లు
కనుల విందుగా నోటికి పసందుగా
నా శాయశక్తులా సమయమంతా వెచ్చించి
వంట చేసి వడ్డించినా
చేస్తావుగానీ మా అమ్మ చేతివంటను
మరపించలేవనే అభిప్రాయ ప్రకటనతో
నేనొక దిగులు పిట్టను
ంంం
ఎంత జాగ్రత్తగా వున్నా
ఎప్పుడో ఒకప్పుడు పప్పులో కాలెయ్యక తప్పదు
నా అభిమాన కవి కవిత్వం చదువుతూ
తిక్కన కందంలా తీర్చిదిద్దాలనుకొన్న
తియ్యని కంద పులుసు
ఛందో భంగమైన పద్యంలా
అంద వికారంగా మారినపుడు
ప్రతి పద్య చమత్కార చేమకూర కవిత్వంలా
హృద్యంగా వండదలచిన చేమదుంపల కూర
చేదు రుచినే మిగిల్చినపుడు
పరవశింపచేసే పాటలు వింటూ
మల్లెమొగ్గలా పరిమళించాల్సిన అన్నాన్ని
మసిబొగ్గులా మార్చినపుడు
వెండిగిన్నెలాంటి పాలగిన్నె
కుండపెంకులా మాడినపుడు
వంటంటే శ్రద్ధ లేదని
రుచి లేని పచనంతో
తన జీవితం వ్యర్థమైందని
శ్రీవారు పరిపరి విధాలుగా
గాయపరచినపుడు నా మనసును…
ంంం
బాల్య వివాహ పంజరంలో
ఊపిరాడక ఉసురు కోల్పోయిన పూర్ణమ్మ
కలలు కాలరాచిన కన్యాశుల్క బాధిత బుచ్చమ్మల
బ్రతుకు కన్నీటి చిత్రాలు చిత్రించినందుకు గాక
సామూహిక వంటశాలలు నిర్మించాలని
ఒక చిన్న మాట రాసిన గురజాడ చేతిపై
ఒక చిన్న ముద్దు పెట్టాలని నా కోరిక
-మందరపు హైమవతి
94410 62732

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

శ్రీమతి మల్లాది సుబ్బమ్మ -నిత్య చైతన్య శీలి అని చెప్పిన -ఓల్గా

నిరంతర చైతన్యశీలి – ఓల్గా

సనాతన సంప్రదాయ కుటుంబంలో 1924లో పుట్టి, పదకొండేళ్ళకు పెళ్ళి చేసుకుని, ఐదుగురు పిల్లల్ని కనిపెంచిన ఒక స్త్రీ, ఒక సామాజిక ఉద్యమకారిణిగా, స్త్రీవాదిగా మారిన క్రమమే మల్లాది సుబ్బమ్మగారి జీవితం. ఈ జీవితం ఆమె స్వయంగా నిర్మించుకున్నది. తన నిర్ణయాల ప్రకారం తన జీవితాన్ని నిన్నటి వరకూ కొనసాగించిన మల్లాది సుబ్బమ్మగారు ఇవాళ లేరు. తన జీవితంలో సగం కాలం తన చుట్టూ అల్లుకున్న ఆచారాలు సంప్రదాయాలనే ముళ్ళ పొదలను నరకటంలోనే వృథా అయిపోయిందనీ, కొంతవరకు మాత్రమే సమాజానికి ఉపయోగపడిందనీ ఆమె చెప్పుకునేవారు.

చిన్నతనంలోనే కనుపర్తి వరలక్ష్మమ్మ గారు నడిపించిన స్త్రీ వితైషిణీ మండలి ప్రభావం సుబ్బమ్మ మీద ఉంది. ఆ సంఘంలో పనిచేసిన అనుభవం తర్వాతి రోజుల్లో అనేక సంఘాలు పెట్టి నడపటానికి ఆమెకు ఉపయోగపడింది. 1972లో ప్రత్యేక ఆంధ్ర ఉద్యమంలో పాల్గొనటంతో ఆమె సాంఘిక ఉద్యమాలలోకి అడుగుపెట్టారు. ‘ప్రాంతాల మధ్య వైషమ్యాలు పెరుగుతున్నాయి. పగిలిన అద్దం ఎంత అతికించినా అతుకు అతుకే తప్ప సహజం కాలేదు. అందువల్ల విడిపోతే తప్ప పరిస్థితి చక్కబడదు. ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం ఇచ్చి తీరాలి’ అని ఆమె ఆనాడు చీరాల సభలో మాట్లాడారు. ఇప్పుడు రాష్ట్రం విడిపోయిన సంగతి తెలిసి కొంతకాలంగా అస్వస్థతలో ఉన్న ఆమె ఏమనుకున్నారో! ఆ తర్వాత జయప్రకాశ్ నారాయణ్ ప్రారంభించిన ఉద్యమంలో పాల్గొన్నారు. ఎమరె ్జన్సీలో భర్త రామ్మూర్తి గారు అరెస్టయి జైలులో ఉంటే, ఆ కాలమంతా ఎమర్జెన్సీ వ్యతిరేక భావాల ప్రచారం ఏదో ఒక రూపంలో చేస్తూనే వచ్చారు. 1979లో అభ్యుదయ మహిళా సమాఖ్యకు అధ్యక్షురాలై అనేక కార్యక్రమాలు చేపట్టారు. కూరగాయల ఎగుమతి వల్ల ఇక్కడ వాటి ధరలు పెరగటాన్ని గమనించి ఎగుమతిని నిషేధించాలని కోరుతూ జంటనగరాల మహిళా సంఘాలన్నీ కలసి చేసిన ఆందోళనలో సుబ్బమ్మ ముందు నిలచి పనిచేశారు. ఆ రోజు ఉల్లిపాయల ధర రూపాయి నుంచి మూడు రూపాయలకు పెరిగిందని ఆందోళన చెయ్యాలని పిలుపు ఇస్తే స్వచ్ఛందంగా వెయ్యిమందికి పైగా స్త్రీలు వచ్చి ఊరేగింపులో పాల్గొన్నారు. అలాంటి చైతన్యవంతమైన కాలంలో ఆ కాలాన్ని సద్వినియోగం చేస్తూ జీవించారు మల్లాది సుబ్బమ్మ.

కుల నిర్మూలనోద్యమంలో కూడా ఆమె చాలా కృషి చేశారు. కులనిర్మూలన సంఘంలో చేరి, సభలలో మాట్లాడటం, వ్యాసాలు రాయటం, ఆ సంఘం చేసే కులాంతర వివాహాలను ప్రోత్సహించి సహాయపడటం వంటి పనులెన్నో చేశారు. 1983లో కుల, మత ప్రసక్తిలేని వివాహాలను ప్రోత్సహించటానికి ‘అభ్యుదయ వివాహ వేదిక’ని స్థాపించి ఎన్నో ఆటంకాలను ఎదుర్కొంటూ కూడా కులాంతర, మతాంతర వివాహాలు జరిపిస్తూ వచ్చారు. హేతువాద ఉద్యమంలో భాగమై ఆ చైతన్య వ్యాప్తికి దోహదం చేశారు. 1988లో రాజస్థాన్ హైకోర్టు ఆవరణలో ఆరు అడుగుల మనువు విగ్రహాన్ని ప్రతిష్ఠించారని విని సుబ్బమ్మగారు అంబేద్కర్ సంఘం వారి మీటింగులో దుష్ట మేధావి మనువు అంటూ మనుధర్మ శాస్త్రాన్ని తూర్పార బట్టారు. రాడికల్ హ్యూమనిస్టుగానూ ఆమె పనిచేశారు.

స్త్రీల సమస్యల మీద అనేక వ్యాసాలు, కథలు, నవలలు రాశారు. చాలా రాడికల్ భావాలతో ఆమె కథలు సాగేవి. వికాస కేంద్ర స్థాపన తన జీవితంలో అత్యంత ముఖ్యమైన ఘట్టమని సుబ్బమ్మ గారు చెప్పేవారు. సమస్యలలో ఉన్న స్త్రీలు ఎవరైనా అక్కడికి రావచ్చుననే ధైర్యం కలిగించే ప్రయత్నం చేశారు. ‘నేను ఫెమినిస్టుని కాదు’ అని సామాజిక ఉద్యమాలలో సేవలో, రచనలో ఉన్న చాలామంది స్త్రీలు చెప్పుకుంటున్న రోజుల్లో ‘నేను ఫెమినిస్టుని, హ్యూమనిస్టు ఫెమినిస్టుని’ అని చె ప్పుకున్న సాహసవంతురాలు సుబ్బమ్మగారు. ఆమె ఆత్మకథ శీర్షిక కూడా ‘పాతివ్రత్యం నుంచి ఫెమినిజం దాకా’. ఆంధ్రప్రదేశ్‌లో సారా వ్యతిరేకోద్యమం పెద్ద ఎత్తున సాగిన నాటికి సుబ్బమ్మ గారికి 68 సంవత్సరాలు. అయినా సారా వ్యతిరేకోద్యమంలో చురుగ్గా పాల్గొన్నారు. ప్రదర్శనల్లో, ప్రభుత్వంతో జరిపే చర్చలలో ఉత్సాహంగా పాల్గొన్నారు. సభలలో తన వాగ్ధాటితో సారాపై విరుచుకు పడ్డారు.

‘మల్లాది సుబ్బమ్మ ట్రస్టు’ అని పెట్టి తన స్థిర చరాస్తులను పిల్లలకు కాకుండా ట్రస్టు ద్వారా సామాజిక సేవకు అందేలా చేయటం సుబ్బమ్మగారి ప్రత్యేకత. ఒకప్పుడు ఆమె నివసించిన ఇంట్లో ఇప్పుడు బాలికలకు వృత్తి శిక్షణ కళాశాల నిర్వహిస్తున్నారు. కొన్నేళ్ల క్రితం అక్కడ సుబ్బమ్మగారు తన విగ్రహాన్ని ప్రతిష్టించారు. జీవించి ఉండగానే ఇలా ఎందుకు చేస్తున్నారని అడిగితే-మరణించిన తర్వాత మన గురించి ఎవరు పట్టించుకుంటారు? మనం చేసిన పనులను మనమే గౌరవించుకుంటే తప్పేంటి అని అన్నారు. అప్పుడు నవ్వేశాం గానీ మన దేశ చరిత్ర నిర్మించిన స్త్రీల గురించి మనకి తెలిసినదెంత?

వారు తమ గురించి తాము కొంత శ్రద్ధ తీసుకుని ఉంటే స్త్రీల చరిత్ర ఎంత సంపన్నవంతంగా ఉండేది అనిపించినపుడు సుబ్బమ్మగారు చేసిన పని అర్థవంతమైనదేనేమో అనిపిస్తుంది. ఈ పురుష ప్రపంచంలో స్త్రీలు పని చేసుకుంటూ పోవటమే కాక తమ గురించి తాము చెప్పుకోవాలి. లేకపోతే ఇంత ఆధునిక కాలంలోను వారిని తేలికగా మర్చిపోతారు.

భోళాగా కనిపిస్తూ, గలగలా మాట్లాడుతూ, విశ్రాంతి లేకుండా పనిచేస్తూ, నమ్మినదాన్ని నిక్కచ్చిగా చెప్తూ, దానిని ఆచరిస్తూ ఎంతటి అధికారులనైనా నిర్భయంగా నిలదీస్తూ తనకున్న అవకాశాలన్నిటినీ సద్వినియోగం చేసుకున్న మల్లాది సుబ్బమ్మగారు తన సేవల ద్వారా, చరిత్రలో చిరకాలం జీవిస్తారు.

-ఓల్గా

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

ఓటరు నేర్పిన గుణపాఠం (కొత్త పలుకు) –

ఓటరు నేర్పిన గుణపాఠం (కొత్త పలుకు) – ఆర్కే

తెలుగు ప్రజలకు సంబంధించిన రెండు రాష్ట్రాలూ అభివృద్ధి చెందాలంటే ఉభయ ప్రాంతాల ముఖ్యమంత్రుల మధ్య సమన్వయం అవసరం. ఇటు కేసీఆర్, అటు చంద్రబాబు నాయుడు ఆ దిశగా కృషిచేసి తమ ప్రాంతాల ప్రజల మన్ననలు చూరగొంటారని ఆశిద్దాం!

ఈ (2014) సార్వత్రిక ఎన్నికలలో పాల్గొన్న ఓటరు మహాశయులకు సలాం! అధికారం అప్పగించేది సేవ చేయడానికేగానీ షేవ్ చేయడానికి కాదని ఈ ఎన్నికల్లో ఓటర్లు రాజకీయ పార్టీలకు మరోమారు గుర్తు చేశారు. మీకింత పెడతాం.. మేం ఇంత తింటామంటే కుదరదని కుండబద్దలు కొట్టి మరీ తీర్పు ఇచ్చారు. కేంద్రంలో అధికారం చలాయించిన కాంగ్రెస్ పార్టీకి ఎలా బుద్ధి చెప్పాలో అలాగే బుద్ధి చెప్పారు. ఇక తెలుగువారి విషయానికి వస్తే, ముఖ్యంగా సీమాంధ్ర ఓటర్లను అభినందించకుండా ఉండలేం. ప్రజాస్వామ్య వ్యవస్థకు ఎదురైన అతిపెద్ద ముప్పును ఓటర్లు తమ విజ్ఞతతో తప్పించారు. రాజశేఖర్ రెడ్డి వదిలివెళ్లిన కీర్తి వలయం మాయలో పడిన ఓటర్లు చివరకు విజ్ఞత ప్రదర్శించారు. సీమాంధ్రలో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చి ఉంటే ప్రజాస్వామ్య వ్యవస్థ అపహాస్యం పాలయ్యేది. అవినీతికి ప్రజామోదం లభించినట్టయ్యేది. చంద్రబాబు నాయుడుపై ఉన్న కోపంతోనో, ఆయన విధానాలు నచ్చకో ఒక వర్గం జగన్ పంచన చేరింది. మేధావులుగా చలామణి అవుతున్నవారు కూడా ఆయనను సమర్థిస్తూ వచ్చారు. జగన్ ముఖ్యమంత్రి కాకూడదా? అంటే అవ్వొచ్చు. అయితే ఆయనపై ఉన్న కేసుల సంగతి ఏమిటి? దేశ చరిత్రలో కనీవినీ ఎరుగని రీతిలో క్విడ్‌ప్రోకో విధానాన్ని ప్రవేశపెట్టి తెల్లవారేసరికి ఒక మాయా వ్యాపార సామ్రాజ్యాన్ని నిర్మించిన జగన్ అవినీతిపరుడు కాదని ఆయనను సమర్థించే వాళ్లు కూడా అనలేరు. అవినీతికి సంబంధించిన కేసులలో పీకలలోతు కూరుకుపోయి బెయిల్‌పై జైలు నుంచి విడుదలైన ఒక వ్యక్తి ముఖ్యమంత్రి కావాలనుకోవడమే వింత! అలాంటి కోరికతో ఉన్న వ్యక్తిని సమర్థించడం కూడా అనైతికమే అవుతుంది. అయినా ఈ రాష్ట్రంలో నెలకొన్న ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా జగన్ కూడా ఒక నాయకుడిగా మన ముందుకు వచ్చారు. ఆయన అధికారంలోకి రావడం ఖాయమన్న అభిప్రాయాన్ని ఆయన మద్దతుదారులు విస్తృతంగా వ్యాపింపచేశారు. ఈ నేపథ్యంలో జరుగుతున్న పరిణామాలను కొంతమంది మౌన ప్రేక్షకులుగా వీక్షించగా, కొంతమంది మాత్రం వ్యతిరేకించారు. ప్రజలు దారి తప్పితే వారిలో చైతన్యం తీసుకురావలసిన మీడియా సంస్థలలో కొన్ని జగన్‌కు వంతపాడటం ఆశ్చర్యం కలిగించకమానదు. గ్రామీణ భారతం గురించి అవగాహన లోపించిన జాతీయస్థాయి జర్నలిస్టులు కూడా జగన్‌ను ఒక శక్తిగా కీర్తించడం రోత పుట్టించింది. ఎన్నికల ఫలితాల వెల్లడికి ముందు ప్రకటించిన ఎగ్జిట్ పోల్స్‌కు సంబంధించిన చర్చలలో పాల్గొన్న కొంతమంది మేధావులు, సీమాంధ్రలో జగన్ బలం ఇంకా ఎక్కువ ఉంటుందని వాదించారు. ప్రజల నాడితో సంబంధం లేకుండా కేవలం ఇంగ్లీషు మాత్రమే వచ్చిన వాళ్లు కొంతమంది ఈ దేశంలో మేధావులుగా చలామణికావడం కూడా దురదృష్టమే! మీ మేధావుల అభిప్రాయంతో మాకేమి పని అన్నట్టుగా సీమాంధ్ర ఓటర్లు మాత్రం తెలివైన తీర్పు ఇచ్చారు. తెలంగాణ సమాజానికి, సీమాంధ్ర సమాజానికి తేడా ఉంది. తెలంగాణ ప్రజలు కుడుమిస్తే పండుగ అన్నట్టుగా భావిస్తారు. సీమాంధ్ర ప్రజలు అలా కాదు. తమ ముందున్న భోజనం గురించి కాకుండా రేపు చేయబోయే భోజనం గురించి ఆలోచిస్తారు. ఈ కారణంగానే రాష్ట్ర విభజన తర్వాత సీమాంధ్ర ప్రజల వైఖరిలో మార్పు వచ్చింది. రాజధాని కూడా లేకుండా ఉన్నపళంగా తమను గెంటేసిన కాంగ్రెస్ పార్టీపై కక్ష తీర్చుకోవడంతోపాటు తమ భవిష్యత్‌కు భరోసా కల్పించగలరన్న నమ్మకంతో జగన్‌ను కాదని చంద్రబాబుకు పట్టంకట్టారు. కొత్తగా ఏర్పడుతున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కాబోతున్న చంద్రబాబుకు ‘ఆంధ్రజ్యోతి’ సంస్థల తరపున అభినందనలు. అదే సమయంలో ఒక మీడియా సంస్థగా కొన్ని జాగ్రత్తలు చెప్పవలసిన బాధ్యత కూడా మాపై ఉంది. చంద్రబాబు ప్రకటించిన రుణమాఫీ పట్ల ప్రజలు ఎంతో ఆశగా ఉన్నారు. ఈ హామీని త్వరగా నెరవేర్చవలసిన బాధ్యత ఆయనపై ఉంది. ఎన్నికల ప్రచారం సందర్భంగా ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమైతే ప్రజల ముందు దోషిగా నిలబడవలసి వస్తుంది. అదే సమయంలో ఆంధ్రప్రదేశ్ నిర్మాణం విషయంలో ప్రజలు ఆయనపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. వారి ఆశలను వమ్ముచేయకుండా తన అనుభవాన్ని ఉపయోగించి ఆంధ్రప్రదేశ్‌కు రూపురేఖలు ఇవ్వవలసిన బాధ్యత చంద్రబాబుపై ఉంది. ఒకరకంగా చెప్పాలంటే చంద్రబాబు ధరించబోయేది ముళ్ల కిరీటమే!
ఇక తెలంగాణ రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రి కాబోతున్న కేసీఆర్‌కు మా అభినందనలు. కేసీఆర్‌పై గురుతర బాధ్యత ఉంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే తమ సమస్యలన్నీ తీరిపోతాయని తెలంగాణ ప్రజలు గంపెడాశతో ఉన్నారు. దానికితోడు ఎన్నికల ప్రణాళికలో ప్రకటించిన హామీలు ఉండనే ఉన్నాయి. తెలంగాణ అనేది రెడీమెడ్ రాష్ట్రం కనుక కొత్తగా నిర్మించవలసింది ఏమీలేదు. హైదరాబాద్ మహానగరానికి ఉన్న బ్రాండ్ ఇమేజ్‌ను కాపాడుకుంటే చాలు. రాజకీయ వ్యూహరచనలో కేసీఆర్ తనకు తానే సాటి! మాటల మరాఠీ కనుక తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన కాంగ్రెస్‌ను కాదని, తెలంగాణ ప్రజలు తనను మాత్రమే ఆదరించేలా ఒప్పించగలిగారు. కేంద్రంలో తెలంగాణకు అన్యాయం జరగకుండా అడ్డుకోవాలంటే టీఆర్ఎస్‌కు చెందిన అభ్యర్థులనే ఎంపీలుగా గెలిపించి పంపాలన్న ఆయన పిలుపునకు తెలంగాణ సమాజం కూడా స్పందించింది. ఆ కారణంగానే శాసనసభలో బొటాబొటి మెజారిటీని సమకూర్చిన ప్రజలు, ఎంపీల విషయానికి వస్తే ఏకంగా 11 మందిని గెలిపించారు.

ఈ సందర్భంగా కేసీఆర్‌కు ఒక సూచన! ఉద్యమ నాయకుడిగా ఇంతకాలం ఆయన ఏమిచేసినా, ఏమి మాట్లాడినా సెంటిమెంట్ నీడలో చెల్లిపోయింది. ఇకపై ఈ వెసులుబాటు ఉండదు. ఇప్పుడు ఆయన తెలంగాణ ముఖ్యమంత్రి. ప్రతి మాటను ప్రతి చర్యను నిశితంగా గమనించేవాళ్లు ఉంటారు. తెలంగాణలోని అయిదు జిల్లాలను దాదాపుగా స్వీప్ చేసిన కేసీఆర్‌కు దక్షిణ తెలంగాణలో మాత్రం మిశ్రమ ఫలితాలు వచ్చాయి. ముఖ్యంగా హైదరాబాద్ నగర ప్రజలు ఆయనను ఆదరించలేదు. నగరంలో సీమాంధ్రుల సంఖ్య గణనీయంగా ఉండటం ఇందుకు కారణం కావచ్చు. మున్ముందు కూడా ఇదే పరిస్థితి ఉంటుంది కనుక ముఖ్యమంత్రిగా ఆయన హుందాగా వ్యవహరించగలిగితే హైదరాబాద్‌లో కూడా ఆదరణ లభిస్తుంది. సరిగ్గా అయిదు సంవత్సరాల క్రితం ఇదే కేసీఆర్‌ను తెలంగాణ ప్రజలు తిరస్కరించారు. ఓటమి అనే అవమానాన్ని తట్టుకోలేక అప్పట్లో కేసీఆర్ కంటతడి పెట్టారు. అదే కేసీఆర్ ఇప్పుడు తెలంగాణ ప్రజల దృష్టిలో హీరో! ఇకపై సీమాంధ్రలో చంద్రబాబు పనితీరుతో తెలంగాణలో కేసీఆర్ పనితీరును పోల్చుకుంటూ ఉంటారు. ఈ కారణంగా ఇద్దరూ పోటీపడి పని చేయవలసి ఉంటుంది. చంద్రబాబుపై కేసీఆర్‌కు కోపం ఉండవచ్చు. ఆ కారణంగానే సీమాంధ్రలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతారని జోస్యం చెప్పారు. కేసీఆర్ జోస్యాలు తరచుగా తప్పుతూ ఉంటాయి. గత ఎన్నికల సందర్భంగా కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం వస్తుందని అంచనావేసి ఫలితాల వెల్లడికి ముందే ఆ పార్టీకి స్నేహహస్తం చాచారు. ఇప్పుడు కూడా ఆయన అంచనాలు తప్పాయి. కేంద్రంలో బీజేపీకి మద్దతు ఇవ్వబోమని, తృతీయఫ్రంట్ లేదా కాంగ్రెస్‌తో జతకడతామని చెప్పి పప్పులో కాలేశారు. ఈ తప్పొప్పుల సంగతి అలా ఉంచితే, తెలుగు ప్రజలకు సంబంధించిన రెండు రాష్ట్రాలూ అభివృద్ధి చెందాలంటే ఉభయ ప్రాంతాల ముఖ్యమంత్రుల మధ్య సమన్వయం అవసరం. ఇటు కేసీఆర్, అటు చంద్రబాబు నాయుడు ఆ దిశగా కృషిచేసి తమ ప్రాంతాల ప్రజల మన్ననలు చూరగొంటారని ఆశిద్దాం!
ఊ ప్రకృతి చెప్పే పాఠం..

ముఖ్యమంత్రి పదవిపై వల్లమాలిన మమకారం పెంచుకుని ఈ ఎన్నికలలో భంగపడిన జగన్మోహన్ రెడ్డి విషయానికి వద్దాం. నేను గతంలోనే పేర్కొన్నట్టు ఆయన ఇటు డబ్బు అటు అధికారాన్ని కోరుకోవడం తప్పు. ఈ రెండింటిలో ఏదో ఒకదానిని మాత్రమే ప్రకృతి అనుమతిస్తుంది. ప్రకృతి ధర్మానికి విరుద్ధంగా వెళితే ఏమి జరగాలో అదే జరిగింది. తండ్రి అధికారాన్ని ఉపయోగించుకుని అడ్డగోలుగా సంపాదించుకున్న జగన్ అక్కడితో సంతృప్తిచెంది ఉండాల్సింది. అలా జరిగి ఉంటే, బహుశా ఆయనపై అవినీతి కేసులు కూడా ఉండేవి కావు. రాజశేఖర్ రెడ్డి మృతిచెందిన వెంటనే ముఖ్యమంత్రి కావాలని జగన్ కలలు కన్నారు. శాసనసభ్యుల మద్దతు లభించినప్పటికీ కాంగ్రెస్ అధిష్ఠానం కనికరించలేదు. దాంతో ఆయన కాంగ్రెస్ పార్టీపై తిరుగుబాటు చేసి, సొంత పార్టీ పెట్టుకున్నారు. అలా కాకుండా కొంత సంయమనం పాటించి కాంగ్రెస్‌లోనే కొనసాగి ఉంటే రోశయ్య తర్వాత జగన్మోహన్ రెడ్డినే కాంగ్రెస్ అధిష్ఠానం ముఖ్యమంత్రిని చేసి ఉండేది. ముఖ్యమంత్రి పదవి కోసం రాజశేఖర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో రెండున్నర దశాబ్దాలు వేచి ఉన్నారు. మధ్యలో ఒక దశలో కాంగ్రెస్‌ను వదిలిపెట్టాలన్న ఆలోచనకు వచ్చినప్పటికీ ఆయన ఆ సాహసం చేయలేకపోయారు. అదే ఆయనకు కలిసి వచ్చింది. రాజకీయాలలో ఓర్పు, సంయమనం అవసరం. చంద్రబాబు విషయమే తీసుకుందాం! 2004లో ఓడిపోయిన తర్వాత ఆయన కొంతకాలమైనా మౌనంగా ఉండకుండా ఎప్పుడెప్పుడు అధికారంలోకి రావాలా అని ఆయన ఆశపడుతున్నారని ప్రజలు భావించేలా వ్యవహరించారు. దీంతో 2009లో కూడా ఆయనకు అధికారం దక్కలేదు. ఆ తర్వాత రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితుల వల్ల తెలుగుదేశం పార్టీ ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొంది. ఆయా సందర్భాలలో భూదేవికి ఉన్నంత ఓపికను ప్రదర్శిస్తూ చంద్రబాబు పార్టీని నిలబెట్టుకున్నారు. పది సంవత్సరాలపాటు ప్రతిపక్ష నాయకుడిగా వ్యవహరించారు. ఈ కాలంలో ఎన్నో అవమానాలను సహించారు. ఈ లక్షణాలే ఆయనను మళ్లీ ముఖ్యమంత్రిని చేశాయి. ఉమ్మడి రాష్ట్రానికి దీర్ఘకాలం ముఖ్యమంత్రిగా, ప్రతిపక్ష నాయకుడిగా వ్యవహరించిన ఘనత ఆయన ఖాతాలో చేరింది.ఇప్పుడు కొత్తగా ఏర్పడుతున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రిగా చరిత్రలో నిలిచిపోతారు. రాజశేఖర్ రెడ్డి, చంద్రబాబును చూసి జగన్ నేర్చుకోవలసింది ఎంతో ఉంది. అయితే ఆయనకు ఇవేమీ పట్టవు. ముఖ్యమంత్రి కావడానికే తాను జన్మించానని ఆయన నమ్ముతారు. తనను ముఖ్యమంత్రిని చేయవలసిన బాధ్యత దేవుడిపై ఉందనుకుంటారు. అందుకే జగన్ తరచుగా ‘దేవుడున్నాడు’ అని అంటూ ఉంటారు. ప్రకృతి ధర్మానికి విరుద్ధంగా ఉన్న జగన్ కోరికను తీర్చడం దేవుడికి కూడా సాధ్యంకాలేదు. ప్రజాస్వామ్య సూత్రాలను ఏ మాత్రం వంటపట్టించుకోని జగన్మోహన్ రెడ్డి వంటివాళ్లు రాజకీయాలలో రాణించడం కష్టం. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ తరపున ఎన్నికైన శాసనసభ్యులలో ఎంతమంది ఆయనతో మిగులుతారో తెలియదు. ఎందుకంటే ఆ పార్టీలో చేరిన వారంతా ఎన్నికలలో గెలవాలన్న ఆశతోనే చేరారు. వారికి జగన్మోహన్ రెడ్డిపై ప్రేమ ఉండికాదు. వర్తమాన రాజకీయాలలో ప్రేమాభిమానాలకు తావులేదు. తెలుగుదేశంలో ఉండి ఇప్పుడు టీఆర్ఎస్ తరఫున శాసనసభ్యులుగా, ఎంపీలుగా ఎన్నికైన పలువురు వ్యక్తులకు పార్టీలో ఉన్నప్పుడు చంద్రబాబు ఆర్థిక సహాయం కూడా చేస్తూ ఉండేవారు. అయినా వారు కృతజ్ఞత చూపించలేదు. గెలుపు అవకాశం వెతుక్కుంటూ టీఆర్ఎస్‌లో చేరారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ విషయంలో కూడా ఇలాగే జరగవచ్చు. తనను తాను జయలలితతో సరిపోల్చుకోవడం జగన్‌కు ఉన్న మరో అలవాటు. ముఖ్యమంత్రి అయిన తర్వాత జయలలితలా వ్యవహరిస్తానని ఆయన పలు సందర్భాలలో ప్రస్తావించేవారు. నిరంకుశ పోకడలను తమిళ ప్రజలు భరించగలరు కానీ తెలుగు ప్రజలు భరించలేరు. మొత్తంమీద ముఖ్యమంత్రి కావాలన్న జగన్ కోరికను సీమాంధ్ర ప్రజలు తీర్చలేదు. ఇప్పుడు ఆయన ప్రతిపక్ష నాయకుడు. మామూలుగా అయితే ప్రతిపక్ష నాయకుడిగా ప్రజలను ఒప్పించి మెప్పించి 2019లో ముఖ్యమంత్రి పదవి దక్కించుకునే అవకాశం ఉండేది. ఆయనపై ఉన్న అవినీతి కేసులు న్యాయస్థానం విచారణలో ఉన్నందున జగన్ రాజకీయ భవిష్యత్ ప్రశ్నార్థకంగా ఇప్పుడు మారింది. పరస్పరం సహకరించుకోలేని స్థాయిలో శత్రుత్వం ఉన్న చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా, జగన్ ప్రతిపక్ష నాయకుడిగా ఇప్పుడు మన ముందు నిలిచారు. ఈ కారణంగా జగన్‌కు మళ్లీ కష్టాలు మొదలయ్యాయని చెప్పవచ్చు.

ఈ పరిస్థితి వస్తుందని గమనించేకాబోలు విలేకరులు అడిగిన ఒక ప్రశ్నకు సమాధానంగా ఇంతకాలం సోనియాగాంధీ వేధించారు- ఇప్పుడు చంద్రబాబు వంతు వస్తుందేమో అని జగన్ వ్యాఖ్యానించారు. తనను ఇతరులు వేధిస్తారని చెప్పుకొనే ఆయన తాను చేసిన నేరాలను మాత్రం గుర్తుకు తెచ్చుకోవడం లేదు. ప్రజల సానుభూతిపై ఆధారపడి రాజకీయాలు చేయడం అలవాటుకావడం వల్ల కాబోలు, ఆయన వాస్తవ ప్రపంచంలోకి రాలేకపోతున్నారు. కొంతకాలం పాటు వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణం వల్ల ప్రజలలో ఏర్పడిన సానుభూతిని సొమ్ము చేసుకోవడానికి ప్రయత్నించారు. జగన్ జైలుకు వెళ్లిన తర్వాత జరిగిన ఉపఎన్నికలలో ఆ అంశంతోపాటు రాజశేఖర్ రెడ్డిని సోనియాగాంధీనే చంపించిందని తల్లి విజయలక్ష్మి, చెల్లి షర్మిల ప్రచారం చేసి ఆ ఎన్నికలలో లబ్ధిపొందారు. సానుభూతి పవనాలు ఎంతోకాలం నిలవలేవు. అందుకే ఈ ఎన్నికలలో తల్లి, చెల్లితో పాటు జగన్మోహన్ రెడ్డి ఎండల్లో పడి 13 జిల్లాలను చుట్టివచ్చినా నాలుగు జిల్లాలలో మాత్రమే విజయం చవిచూశారు. దివంగత రాజశేఖర్ రెడ్డి భార్య అని కూడా చూడకుండా విశాఖపట్నం ప్రజలు విజయలక్ష్మిని ఓడించారు. నిజానికి ఆమె అంత శిక్షకు అర్హురాలు కాదు. రాజశేఖర్ రెడ్డి ఉన్నంతవరకు బయట ముఖం చూపని ఆమె, కుమారుడి కోసం రాజకీయాలలోకి వచ్చారు. స్వతహాగా మంచిమనిషి అయిన విజయలక్ష్మికి రాజకీయాలు సరిపడవు కూడా! అయినా విశాఖ ప్రజలు ఆమెను ఓడించడానికి కారణాలు లేకపోలేదు. ప్రశాంత జీవనానికి అలవాటుపడిన విశాఖవాసులు తమ ప్రాంతంలో కడప సంస్కృతి వ్యాపించడం ఇష్టంలేక ఆమెను ఓడించారు. ఎన్నికల ప్రచారం సందర్భంగా కడప జిల్లాకు చెందిన పలువురు విశాఖలోని హోటళ్లలో దిగి హడావుడి చేసేవారు. ఇదంతా చూసిన విశాఖ ఓటర్లు ఆమె గెలిస్తే తమ ప్రశాంత జీవనానికి భంగం కలుగుతుందని భావించి ఉంటారు. సీమాంధ్రకు విశాఖను రాజధాని చేయడానికి కూడా అక్కడి ప్రజలలో అత్యధికులు అంగీకరించడం లేదు. తమ నగరం రాజధాని అయితే ప్రశాంతత కొరవడుతుందని భయపడటమే కారణం. అలాంటి విశాఖపట్నం నుంచి ఎంపీగా తల్లిని పోటీపెట్టడం జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యూహాత్మక తప్పిదం. జరిగేది జరగక మానదు అన్నట్టుగా ఏమి జరగాలో అదే జరిగింది. జగన్మోహన్‌రెడ్డి విషయంలో కూడా భవిష్యత్తులో ఏమి జరగాలో అదే జరుగుతుంది. అందుకు ఆయన కూడా మానసికంగా సిద్ధపడినట్టు కనిపిస్తున్నది. ఇక సిద్ధపడవలసింది ఆయనను అభిమానించే వారే!

ఊ చేతికి చిల్లు…
ఇటు రాష్ట్రంలోనూ, అటు దేశంలోనూ చావుదెబ్బ తిన్న కాంగ్రెస్ విషయానికి వద్దాం! దేశచరిత్రలో తొలిసారిగా కాంగ్రెసేతర రాజకీయపక్షం కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటుకు అవసరమైన మెజారిటీని సొంతంగా సమకూర్చుకోవడం ఇదే మొదటిసారి! ఇందుకు కాబోయే ప్రధాని నరేంద్రమోదీ ఎంత కారణమో కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ, ఆమె పుత్రరత్నం రాహుల్‌గాంధీ కూడా అంతే కారణం. ప్రజల మనోభావాలతో సంబంధం లేకుండా అధికారం ఉందికదా అని ఇష్టమొచ్చినట్టు వ్యవహరిస్తే ఏమి జరగాలో అదే జరిగింది. మన రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి ఈ దుస్థితి ఏర్పడటానికి స్వయంకృతాపరాధమే కారణం. దత్తపుత్రుడు, అద్దెపుత్రుడిని నమ్ముకుని రాష్ట్ర విభజనకు పూనుకోవడం ద్వారా రాజకీయంగా లబ్ధిపొందాలనుకుని ఉభయ ప్రాంతాలలో చావుదెబ్బ తిన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసినందుకు కనీసం ఆ ప్రాంతంలో కూడా విజయాలు సాధించలేకపోయారు. దేశవ్యాప్తంగా కాంగ్రె స్‌పై ఉన్న వ్యతిరేకత ఇక్కడ కూడా పనిచేసి ఉండవచ్చు. అయితే రాష్ట్రాన్ని విభజించే ముందు తీసుకోవలసిన కనీస జాగ్రత్తలు తీసుకుని ఉంటే పరిస్థితి కొంతవరకైనా మెరుగ్గా ఉండేది. లేడికి లేచిందే పరుగు అన్నట్టుగా హడావుడిగా రాష్ట్రాన్ని విభజించడంతో ఏ ప్రాంతం వారిని కూడా మెప్పించలేకపోయారు. తెలంగాణ వస్తే ముఖ్యమంత్రి అవుదామని కలలు కన్నవారు పార్టీ విజయావకాశాల గురించి ఆలోచించలేదు. ఫలితంగా పలువురు ముఖ్యమంత్రి అభ్యర్థులు ఓడిపోయారు. సీమాంధ్రలో అయితే ఆ పార్టీ ఖాతా కూడా తెరవలేదు. పలు స్థానాలలో డిపాజిట్లు కూడా పోయాయి. గత ఎన్నికలలో 33 ఎంపీ స్థానాలను గెల్చుకున్న కాంగ్రెస్ ఇప్పుడు రెండు స్థానాలకే పరిమితమైంది. తెలంగాణ కోసం పోరాటం చేయకుండా చివరి నిమిషంలో తెరమీదకు వచ్చి చొక్కాలు చించుకున్న కాంగ్రెస్ ప్రముఖులందరిని ప్రజలు ఓడించారు. తెలంగాణ గురించి ఆర్భాటంగా ప్రకటనలు చేయని జానారెడ్డి, ఉత్తమ్‌కుమార్ రెడ్డి వంటి వారిని మాత్రం ప్రజలు గెలిపించుకున్నారు. కేసీఆర్ ఎత్తుగడలకు విరుగుడు చర్యలను తీసుకోవలసిన నాయకత్వమే తెలంగాణ కాంగ్రెస్‌కు లేకుండా పోయింది. సమర్థత ఉన్నవారిని పక్కనపెట్టారు. ఏదిఏమైనా కాంగ్రెస్ పార్టీకి పడవలసిన శిక్షపడింది. ఇప్పుడు తెలంగాణలో మూడు రాజకీయ శక్తులు వేళ్లూనుకున్నాయి. ఉత్తర తెలంగాణలో కేసీఆర్ ఆధిపత్యం ప్రదర్శించగా, దక్షిణ తెలంగాణలో కాంగ్రెస్ తన ఉనికి చాటుకుంది. హైదరాబాద్‌తో పాటు రంగారెడ్డి జిల్లాలో తెలుగుదేశం-బీజేపీ బలంగా నిలబడ్డాయి. ఈ కూటమి మధ్య బంధం మరింత బలపడితే భవిష్యత్తులో టీఆర్ఎస్ లేదా కాంగ్రె స్‌లలో ఏదో ఒకదానికి ముప్పు తెస్తుంది.

రాజకీయాలలో గెలుపోటములు సహజంగానీ రాజకీయాల నుంచి అవమానకరంగా నిష్క్రమించవలసిరావడం మాత్రం ఎవరికైనా బాధాకరమే! మాజీ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డికి ఇదే అనుభవం ఎదురైంది. వీర సమైక్యవాదిగా ముద్ర వేయించుకున్న ఆయన మితిమీరిన విశ్వాసంతో కాంగ్రెస్ పార్టీని వదిలి సొంత పార్టీ పెట్టుకుని ఎన్నికలను సమర్థంగా ఎదుర్కోలేక అవమానాన్ని మూటగట్టుకున్నారు. తమ శక్తిని అతిగా ఊహించుకున్న వారి విషయంలో ఇలాగే జరుగుతుంది. కాంగ్రెస్‌ను వీడి సొంత పార్టీ పెట్టాలని ప్రోత్సహించిన వారు సైతం కిరణ్‌కుమార్ రెడ్డి వైఖరితో విసిగిపోయి మిడిల్‌డ్రాప్ అయ్యారు. లగడపాటి రాజగోపాల్, సబ్బం హరి, ఉండవల్లి అరుణ్‌కుమార్ వంటి వారు ఇందుకు ఉదాహరణ. ప్రత్యర్థులైన చంద్రబాబు నాయుడు, జగన్మోహన్ రెడ్డి సీమాంధ్రను సుడిగాలిలా చుడుతూ ఉంటే, కిరణ్ మాత్రం ఒళ్లు అలవకుండా రోజుకు రెండు సభలలో అదికూడా కొద్ది రోజులు మాత్రమే ఎన్నికల ప్రచారం నిర్వహించి ఇంటికొచ్చి పడుకున్నారు. సీన్ కట్ చేస్తే కిరణ్ సొంత పార్టీ ఎందుకు పెట్టుకున్నారో ఇప్పుడు అర్థంకాని పరిస్థితి. బహుశా ఆయనకు కూడా తెలియకపోవచ్చు. మొత్తంమీద ఆయనకు చిన్నవయసులోనే రాజకీయ వైరాగ్యం ప్రాప్తించింది. ఉట్టికెగరలేని అమ్మ స్వర్గానికి ఎగరడానికి ప్రయత్నించడం అంటే ఏమిటో కిరణ్‌కుమార్ రెడ్డి ఉదంతం చూసి తెలుసుకోవచ్చు. ఈ ఎన్నికలలో గుణపాఠం నేర్చుకోవలసిన వ్యక్తి మరొకరున్నారు. ఆయనే లోక్‌సత్తా అధినేత జయప్రకాశ్ నారాయణ్. ప్రస్తుత పరిస్థితులలో రాజకీయాలు చేయడానికి తనవంటి వారు పనికిరారన్న వాస్తవాన్ని ఆయన ఎంత తొందరగా గుర్తిస్తే ఆయనకు అంత మంచిది. సమాజంలో మార్పు తీసుకురావడానికి రాజకీయ పార్టీలే పెట్టనవసరం లేదు. లోక్‌సత్తా ఒక సంస్థగా ఉన్నప్పుడు ఆయన ఎంతోకొంత చేయగలిగారు. లోక్‌సత్తా సంస్థని రాజకీయ పార్టీగా మార్చిన తర్వాత ఆయనతో పాటు సంస్థ కూడా నష్టపోయింది. ఇప్పటికైనా జయప్రకాశ్ నారాయణ్ పార్టీని రద్దుచేసి లోక్‌సత్తాను మళ్లీ సంస్థగా తీర్చిదిద్దడం శ్రేయస్కరం.

అత్యంత జుగుప్సాకరంగా జరిగిన ఈ ఎన్నికలలో ప్రధాన రాజకీయ పార్టీలు డబ్బు, మద్యం పంచగా, ఉభయ కమ్యూనిస్టు పార్టీలు వినోదం పంచాయి. రాష్ట్రంలో ఉభయ కమ్యూనిస్టు పార్టీలు తొలిసారిగా విడివిడిగా పోటీచేశాయి. వామపక్షాల ఐక్యత అనేది నేతి బీరకాయలో నెయ్యి చందం వంటిదని అందరికీ తెలిసిందే! కడుపులో కత్తులు పెట్టుకుని పైకి చిరునవ్వులు చిందిస్తూ ఐక్యత గురించి మాట్లాడగలిగేది వామపక్ష నాయకులే! తమకు ఒక కన్నుపోయినా పర్వాలేదు. సోదర కమ్యూనిస్టు పార్టీకి రెండు కళ్లూ పోవాలని సీపీఐ – సీపీఎం భావిస్తుంటాయి. ఖమ్మం లోక్‌సభ, మంగళగిరి అసెంబ్లీ స్థానాల విషయంలో ఆ రెండు పార్టీలు ఇలాగే వ్యవహరిస్తూ ఉంటాయి. ఖమ్మం లోక్‌సభ స్థానానికి పోటీచేసిన సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణను ఓడించడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్‌తో సీపీఎం అవగాహన కుదుర్చుకుంది. అవినీతి ఆరోపణల ఊబిలో కూరుకుపోయిన ఆ పార్టీతో జత కట్టడం నైతికమా? అనైతికమా? అనేది ఆ పార్టీకే తెలియాలి. ఖమ్మం జిల్లా ఓటర్లు కాంగ్రెస్-కమ్యూనిస్టుల మధ్య ఎన్నడో చీలిపోయారు. తెలుగుదేశం ఓట్లు కమ్యూనిస్టులకు, కమ్యూనిస్టుల ఓట్లు తెలుగుదేశానికి బదిలీ అవుతాయిగానీ కాంగ్రెస్- కమ్యూనిస్టుల మధ్యన ఈ వెసులుబాటు లేదు. ఇది తెలిసి కూడా ఖమ్మం లోక్‌సభ బరి నుంచి నారాయణ పోటీచేయడం తప్పు. జాతీయస్థాయిలో తాము ఉభయులం వ్యతిరేకిస్తున్న కాంగ్రెస్‌తో రాష్ట్రంలో నారాయణ జతకట్టడం అవకాశవాదమని సీపీఎం విమర్శిస్తున్నది. ఎన్నికల ఫలితాలు కూడా వెలువడక ముందే కేంద్రంలో కాంగ్రెస్ సహకారంతో తృతీయఫ్రంట్ ప్రభుత్వం ఏర్పాటుచేస్తామని సిీపీఎం నాయకులే ప్రకటించారు. తాము వ్యతిరేకించే కాంగ్రెస్ సహకారంతోనే ప్రభుత్వం ఏర్పాటు చేయాలనుకున్నవారు ఎన్నికలలో ఆ పార్టీని వ్యతిరేకించడం ఎందుకో తెలియదు. పరస్పర వైషమ్యాలు, వైరుధ్యాలతో ఐక్యత ప్రదర్శించే వామపక్షాలు తమ లోపాలను సవరించుకోని పక్షంలో భవిష్యత్తులో ఆ పార్టీల ఉనికే ప్రశ్నార్థకమవుతుంది. సీమాంధ్ర శాసనసభలో ఉభయ కమ్యూనిస్టులకు ప్రాతినిధ్యం లేకుండాపోయింది. తెలంగాణలో చెరో స్థానంలో మాత్రమే గెలిచాయి. వైషమ్యాలు వీడని పక్షంలో ఖమ్మం, నల్లగొండ జిల్లాలలో సైతం ఆ పార్టీలు ఉనికి కోల్పోయే ప్రమాదం ఉంది!

 

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

”ఎద్దులే ”వెండి తె ర బంగారాలు

 

Posted in సినిమా | Tagged | Leave a comment

వరంగల్ లో వేయి స్తంభాల గుడి పునర్నిర్మాణం

— 

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

పూర్వాంగ్ల కవుల ముచ్చట్లు -23 హేతు వాద యుగం

పూర్వాంగ్ల కవుల ముచ్చట్లు -23

 

హేతు వాద యుగం

జాన్ డ్రైడేన్

‘’ ఆగస్టస్’’ కాలం లో లాటిన్ భాష, సంస్కృతి గొప్ప  సొగసులు సంతరించుకొంది .నాణ్యత పెరిగింది .అంతకు ముందుతరాలలో విజ్రుమ్భించిన రొమాంటిక్ మెటాఫిజికల్ కవిత్వానికి ఆదరణ తగ్గింది .ఇమేజేరి భాషాడంబరం వెగటు పుట్టించాయి .అందం గా నేర్పుగా ,నియంత్రణలో ,ఒక పద్ధతిలో కవిత్వం ఉండాలన్న భావం  ఏర్పడింది .దీనినే పోప్ కవి ‘’ఆర్డర్ ఈజ్ హేవెన్స్ ఫస్ట్ లా’’అని సూత్రీకరించాడు .ఈ కాలంలోనే సైన్స్ లో కొత్త విషయాల ఆవిష్కరణ జరిగింది .కొత్త విధానాల కు ఆదరణ కలిగింది .అందుకే ఈ కాలాన్ని ‘’ఏజ్ ఆఫ్ యెన్ లైటేన్ మెంట్ ‘’అన్నారు .ఊహ కంటే మేధకు ప్రాముఖ్యత వచ్చింది .నాటకాలలో పెళ్లి తంతు లో ఉన్న లోపల ఆవ హేళన ,గౌరవంపై చిన్న చూపు ,విలువలపై హేళన పెరిగాయి .కవిత్వం లో నగిషీలేక్కువైనాయి .విషయ ప్రాధాన్యత లేదు .కాని విధానం మాత్రం వన్నెలు చిన్నెలతో దూసుకు పోయింది .ఛందస్సు తీవ్రం గా స్టైల్ గా కొలువు తీరింది .

జాన్ డ్రైడేన్ ఈ కాలం లో అంటే హేతువాద యుగం లో అగ్రాగామి కవిగా నిలిచాడు .మిల్టన్ కంటే పిరికి వాడు .అంది వచ్చ్చిన ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకొన్నాడు .దేన్నీ లేక్కచేయని  తత్త్వం ,నీతి నిజాయితీలను బలాదూర్ చేసి ఇష్టం వచ్చినట్లు విశ్రుమ్ఖలం గా విజ్రుమ్భించాడు .ఉన్నదాన్ని ఉన్నట్లు గా ఉంచటమే అతని ధ్యేయం .ఆంగ్ల కవిత్వం లో భాషాభివృద్ధి జరగాలని కోరాడు .దానికోసమే శ్రమించాడు .

9-8-1631ననార్త్ యాంప్ షైర్ లో ఆలడ్ విన్ క్లిల్ ఆల్ సెయింట్స్ లో జాన్ డ్రైడేన్ పుట్టాడు .పద్నాలుగు మంది సంతానం లో పెద్దవాడు .స్కూల్ లో చదువుతూనే సెటైర్లు రాసి ప్రైజులు గెల్చాడు .లాటిన్ కవి పెర్సియాస్ రచనను ఇంగ్లీష్ లో తర్జుమా చేశాడు .కేంబ్రిడ్జి ట్రినిటి కాలేజి లో చేరి డిగ్రీ పొందాడు .మొదటి ఎలిజీ ‘’అపాన్ ది డెత్ ఆఫ్ లార్డ్  హేస్టింగ్స్ ‘’రాశాడు .కజిన్ ఆనర్ డ్రైడేన్  తో సరససల్లాపాల్లో తేలి కవిత్వం ,వచనం కలగలిపి ఆమె పై రాశాడు .ఆమె ఎవరినీ పెళ్లి చేసుకోలేదుకాని ఇతనితో చివరిదాకా సంబంధం సాగించింది .

ఇరవై  మూడేళ్ళ వయసులో తండ్రి పోయాడు .కొంత ఆస్తి డబ్బు ఇతనికి ఇచ్చాడు .లండన్ వెళ్లి తన విద్యా ప్రతిభ నిరూపించుకోవాలను కొన్నాడు డ్రై డెన్ .సర్ గిల్బర్ట్ ఫ్లికరింగ్ అనే కజిన్ దగ్గర సేక్రేటరిగా చేరాడు ..ఇతను లార్డ్ క్రాం వెల్ కు లార్డ్ చాంబర్లిన్ .కవికి కామన్ వెల్త్ లో  చిన్న ఉద్యోగం  ఇప్పించాడు .పుస్తకాలకు ముందుమాటలు రాస్తూ సమీక్షలు చేస్తూ ఆదాయాన్ని పెంచుకొన్నాడు .తన స్వంత రచనలు ప్రచురించాడు .ఎవరి కిందో పని చేసి సంపాదించటం నామోషీ గా భావించి స్వంత కాళ్ళ మీద నిల బడాలనుకొన్నాడు  .మంచి స్తిరమైన ఉద్యోగం లభించే వయసే అది. కాని తన విశ్వాసాన్ని విధేయతను తరచూ మారుస్తూ ఉండటం తో చిక్కులోచ్చాయి .1658లో క్రామ్వేల్  మరణం తర్వాతా  ఆ డిక్టేటర్ ను ఆకాశానికి ఎత్తుతూ ‘’హీరోయిక్ స్టాంజాస్ ‘’రాశాడు .రెండవ చార్లెస్ రాజు ప్రవాసం వదిలి డోవర్ లో అడుగు పెట్టినప్పుడు స్వాగతించిన కవుల్లో తానూ ఒకడుగా ఉండి ‘’ఏ పెనేగేరిక్ ఆన్ హిస్ కారోనేషణ్ ‘’రాసి అంకిత మిచ్చాడు .కొత్త ప్రభుత్వానికి పూర్తీ మద్దతు ప్రకటించాడు .గోడలు దూకుతున్నా కవిత్వాన్ని వదలలేదు .రాబర్ట్ హోవార్డ్ పై రాసిన కవిత వలన ప్రాముఖ్యత పెరగటమే కాదు భార్యనూ ఇచ్చింది .హోవార్ద్ ఎరల్ ఆఫ్ బెర్క్ షైర్ ను అంటకాగాడు .కుటుంబం లో సన్నిహితం గా మెలగి అతని చిన్న కూతురు లేడీ ఎలిజ బెత్ ను వలచి   పెళ్లి చేసుకొన్నాడు .ఈ పెళ్లి సుఖం  అందించింది .ముగ్గురు పిల్లలు కలిగారు .పొజిషనూ క్రమం గా పెరిగింది .డబ్బూ వస్తోంది .నలభై వ ఏట ద్రైదేన్ రాజుకే డబ్బు అప్పు ఇచ్చే స్థాయికి పెరిగాడు .

అప్పటిదాకా ఇరవై ఏళ్ళు నాటక శాలలు మూత పడి ఉన్నాయి .డ్రై డెన్ చొరవ తో వాటిని తెరిపించాడు .స్వయం గా నాటకాలు రాయాలని   అనుకొన్నాడు .’’దివైల్డ్ గాలంట్ ‘’అనే వచన కామేడిని ముప్ఫై రెండో ఏటనే రాశాడు ..అది తన్నింది .నిరాశ పడలేదు ..విధానం టెక్నిక్ మార్చి ‘’దిరైవల్ లేడీస్’’రాశాడు .ఇందులో బ్లాంక్ వేర్స్ ను అంత్యప్రాసలతో రాశాడు .బావ మరిది తోకలిసి ‘’ది ఇండియన్ క్వీన్ ‘’రాసి పేరుపొందాడు .ఇలాంటి హీరోయిక్ నాటకాలే బాగా క్లిక్ అవుతాయనుకొన్నాడు .వీటిల్లో హీరోయిక్ కప్లేట్స్ నిమ్పాడుకూడా .ప్రతి ఏడాది ఒక కొత్తనాటకాన్ని పందొమ్మిదేళ్ళు రాశాడు .ఇందులో ట్రాజిక్ సెమి ట్రాజిక్ లున్నాయి .సీక్రెట్ లవ్ ,ది కాంక్వెస్ట్ ఆఫ్ గ్రనడా ,ఔరంగ జేబ్ వంటివి ఉన్నాయి వీటిలో మిధ్యా క్లాసికల్ పద్ధతులను చౌక బారుతనాన్ని చూపాడు .ఆ కాలానికి తగిన అభిరుచులకు అనుగుణం గా తాత్కాలిక ప్రయోజనం గా రాశాడు .అంతర్గాత భావానికి ప్రాముఖ్యత నివ్వలేదు .షేక్స్ పియర్ ను చాలా కాలం మరిపించేశాడు నాటకాలతో .పది హేడవ శతాబ్ది ఉత్తరార్ధం లో కళను ప్రకృతిని ఆరాధించ టమే కాక భావోద్రేకాలనూ ఆదరించారు .

రేస్తోరేషన్ కాలం లో నాటక రంగం ప్రజలకు దగ్గరైంది .ఈ వికాస యుగం లో షేక్స్పియర్ నాటకాలను అభి వృద్ధి చేశారు పోప్ తనకు నచ్చని లైన్లను తీసేశాడు .నాటక రచన ‘’కవిలోని కవిని’’ అణ చేసింది .35వయసులో డ్రైడేన్  ‘’ఆన్స్ మిరాబిలిస్ ‘’అనే పన్నెండు వందల లైన్ల కవితను రాసి వదిలాడు .ఇది జర్నలిజం కు ప్రేరణ కలిగించింది .చార్లెస్ రాజుకు ఈ కవి కవిత్వం బాగా నచ్చి ‘’ఆస్థాన కవి ‘’ని చేశాడు .ముప్ఫై అయిదేళ్ళ వయసులో ఈ పదవి వరించింది .ఇద్దరు గొప్ప రాజుల వద్ద (మొదటి జేమ్స్ మొదటి చార్లెస్ )ఆస్టానకవిని అని గర్వం గా చెప్పుకొన్న విలియం డేవనంట్ స్థానం లో ఆస్థానకవి అయ్యాడు ఆ ఇద్దరు రాజులు డేవనంట్ కు అధికారికం గా ఆ పదవిని ఇవ్వలేదు .ఆయనే చెప్పుకొన్నాడు పాపం .కాని ఇప్పుడు రెండవ చార్లెస్ సాధికారంగ డ్రైడేన్ గ  ను మొట్టమొదటి సారిగా ఆస్టానకవిని చేసి గౌరవించాడు .రెండేళ్ళ తర్వాత ‘’హిస్టరియోగ్రాఫర్ ‘’ను చేశాడు .కీర్తి పెరిగి పోయింది .ఇతని తర్వాతా ఆస్థాన కవులైన పద్నాలుగు మందిలో అసలైన అర్హులు వర్డ్స్ వర్త్ , మిల్టన్లు  మాత్రమె .మిగతా వాళ్ళంతా కాకా పట్టి బాకా లూది సాధించిన వారే .

రాజుగారి  శత్రువులపై అనేక సెటైర్లు రాసి శహభాష్ అని పించాడు .ఏడాదికి రెండువందల పౌన్లు వార్షికం ఇచ్చి తర్వాత మూదొందలకు పెంచారు .పొట్టిగా ఎర్రగా కొంచెం కున్గినట్లు కనిపించేవాడు .నెమ్మదిగా మాట్లాడేవాడు .సెటైర్లూ రిపార్టీలతో రాజ దర్బారు మారు మొగిపోయేది .1679లో ‘’మాక్ ఫ్లేక్నో ‘’రాశాదు .దుందుడుకు  స్వభావం వలన నెమ్మదిగా స్నేహితులకు దూరమైనాడు .రాజ బంధువులూ దూర మైనారు .ఒక రోజు కోవర్ట్ గార్డెన్ మీదుగా వెడుతుంటే డ్రైడేన్ ద ను అవమానించి పిచ్చ పిచ్చ గా కొట్టారు .అయినా రాజు దగ్గర మార్కులు కొట్టేస్తున్నాడు .కేధలిక్కులకు టోరీలకు విద్వేషాలోచ్చాయి .’’ఆబ్సలాం అండ్ అచితోఫెల్ ‘’అనే వ్యంగ్యాత్మక నాటకం రాసి సమకాలీన పరిస్తుతులకు అద్దం పట్టాడు .ఎవరినీ వదలలేదు .ఈయన రాసిన సెటైర్ లలో ఇదే గొప్పదని పేరు .ఇది బాగా పేలటం తో దీనికి సీరియల్ అంటే సీక్వెల్ రాయమనే డిమాండ్ పెరిగింది .రెండొందల లైన్లు రాసి కోరిక తీర్చాడు .రాజకీయం గా ఆర్ధికం గా మంచి స్తితిలో ఉండాలనేదే ఎప్పుడూ కోరిక .

ఇంగ్లాండ్ లో విప్లవం ఉవ్వెత్తున విరుచుకు పడ బోతోందనే సంగతి గ్రహించలేక పోయాడు .దానికి సమాయత్తమూకాలేదు కూడా .రెండవ చార్లెస్ పూర్తిగా  మతోన్మాడిగా కాధలిక్ మోనార్క్ గా ప్రవర్తించాడు .అప్పటిదాకా విధేయులుగా ఉన్న టోరీలు పూర్తిగా వ్యతిరేకించారు .కొందరు బిషప్పులపై అభియోగాలు మోపి రుజువుకాక వదిలేశారు. రాజు వ్యతిరేకత కట్టలు తెగి పారుతోంది .ఇంగ్లాండ్ ను ‘’పాపల్స్ పాపాల ‘’నుండి రక్షించాలనే సంకల్పం బలీయమైంది .జేమ్స్ కూతురు మేరీ ని పెళ్లి చేసుకొన్న విలియం ఆఫ్ ఆరంజ్ ను రాజు చేయాలనే భావం బల పడింది ఇది తెతెలుసుకొన్న చార్లెస్ పలాయనం చిత్త గించాడు .వెనక్కి రప్పించి విచారించారు .తప్పించుకు పారిపోయాడు విలియం కు మేరీకి ఉమ్మడిగా రాజరికం కట్ట బెట్టారు .కొత్త రాజుకు విధేయత ప్రకటించటానికి ఒప్పుకోలేదు  దీనితో ఆస్థాన పదవి హిస్తరియోగ్రాఫార్ పదవీ ఊడ గొట్టారు .డ్రైడేన్ ద్వేషించి సెటైర్ల తో చీల్చి చెండాడ బడిన షాద్ వెల్ ఆస్థాన కవి అయ్యాడు .

మానసికం గా కుంగి ఆదాయాం లేక మనకవి ఇబ్బందిపడ్డాడు .ఏభై ఎనిమిదేల్లోచ్చాయి .నాటాకాలు రాసి అనువాదాలు చేసి డబ్బు చేసుకోనాలని నిర్ణయించాడు .ఒపెరాలకు లిబర్తోస్ రాశాడు .‘’దిస్టేట్ ఆఫ్ ఇన్నోసేన్స్ అండ్ ఫాల్ ఆఫ్ మాన్ ‘’అచ్చు అయింది ఆ ఊపులో అరడజన్ నాటకాలు గీకి పారేశాడు .అరవైలో ఏ ఇంగ్లీష్ రచయితా చేయని గొప్ప ప్రయత్నం చేశాడు .తన పుస్తకాలను అమ్ముకొని బతకటం ప్రారంభించాడు .ఇలా పదేళ్ళు గడిపాడు .అనువాదాలు చేసి అచ్చేసి అమ్ముకొన్నాడు .ఇవన్నీ చాలా సరదాగా కాలక్షేపం బటాణీల్లా ఉన్నాయి .పన్నెండు వందల పౌండ్లు ఆర్జించాడు .అరవై తోమ్మిదో ఏట చివరి రచన ‘’ఫేబుల్స్ , ఎంషేంట్అండ్ మోడరన్ ‘’రాశాడు ఇందులో చాసర్ కధలను ను ఆధునిక ఇంగ్లీష్ లో రాశాడు .చని పోవటానికి మూడు వారాల క్రితం మిసెస్ స్తీవార్డ్ కు తాను ఒక కొత్త మాస్క్ రాశానని తెలియ జేశాడు అదే’’ సెక్యులర్ మాస్క్’’.తను పని చేసిన ఇద్దరు రాజుల ప్రవర్తత, ఆ శతాబ్దాపు ధోరణి అందులో చూపించాడు .వివాదాస్పద రచయితా గానే గుర్తుండిపోయాడు .మెటా ఫిజిక్స్ అవుట్ ఆఫ్ ఫాషన్ అయింది .ప్రక్రుతి గురించి రాశాడు .కవిత్వాన్ని సాన బెట్టి మెరుగులు దిద్దాడు .మాటల మంత్రం జాలం తో ఆకట్టుకొన్నాడు .కవిత్వం లో లాజిక్ ను నింపాడు .కవిత్వానికి వేగం, టైమింగ్ ఇచ్చాడు .’’ he ought to be on our shelves  ,but he will rarely be found in our hearts’’అని తేల్చారు అయినా ‘’with the the element of magic .his is in its own characteristic way ,the shortest ,the most pointed and perfectly finished kind of poetry ,if poetry can be attained without wonder .’’12-5-1700న డ్రై డే న్ మరణించాడు .

డోన్నె,మిల్టన్ ల తర్వాతపదిహేడవ శతాబ్దిలో  గొప్ప కవి . షేక్స్ పియర్ బెన్ జాన్స న్ ల తర్వాతగొప్ప నాటక రచయిత .సాహిత్య  విమర్శ  వచన రచనలలో అసామాన్యుడు .డ్రామా లో కవిత్వం లో అందరినీ మించాడు .ప్రఖ్యాత హాస్య రచనలు చేశాడు .అతని అనువాదాలు అనితర సాధ్యమైనవని పించుకోన్నాయి .’’హీరోయిక్ కప్లేట్స్త్’’ను హీరో గా చేశాడు .రెండు సృజనాత్మక సెటైర్లు రాశాడు .అతని ఆకారం కంటే ‘కవితాకారం ‘’బహు సుందరం గా ఉంటుంది .దాదాపు నలభై రచనలు చేశాడు .వర్జిల్ పై గొప్ప పుస్తకం రాశాడు

John Dryden portrait.jpg  

.

సశేషం

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -18-5-14-ఉయ్యూరు

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

మోడీ సునామీ

మోడీ సునామీ

‘’మోడీ పెళ్ళాన్నే ఎలుకోలేని వాడు .దేశాన్ని ఎలా పాలిస్తాడు?ఆయన భార్య ఎవరో చెప్పమనండి.ఆయన వస్తే ఇరవై వేల మంది ఊచ కోత తప్పదు .క్రిస్తియన్లు దేశం విడిచిపోవాలేమో?కాషాయం రెపరెప లాడుతుంది .దేశమంతా బాబ్రీ మసీద్ అవుతుంది .గుజరాత్ అల్లల్ర్లనే అదుపు చేయలేక పోయాడు .చాయ్ అమ్ముకొనే వాడు ఈ దేశానికి ప్రధాని అవటం హాస్యాస్పదం .గుజరాత్ లో అభి వృద్ధి అనేదే లేదు .అక్కడ రైతులు పీకల లోతు కష్టాల్లో కూరుకు పోయారు .పై అంతస్తు వాళ్ళకే ఏదైనా చేశాడేమో కాని కిందివారికి మేలు జరగ లేదు ఆమ్బానీలను ఆద్వానీలను వెనకేసుకోస్తాడు దేశం భ్రస్టు పట్టి పోతుంది .కుంభకోణాలు మా పాలన లో లేనే లేవు. ఇంత విశాల దేశం లో అవి సముద్రం లో నీటి బుడగలు .రెండు సార్లు ప్రధాని పదవి తిరస్కరించింది సోనియా .రాహులే దేశానికి యువ రాజు .మన్ మోహనే మా మారాజు. ఆయన ఏది చేసినా దేశం కోసమే .హిందూత్వం మూల మూలలకు విస్తరిస్తుంది .ఆర్ ఎస్ ఎస్ వాళ్ళ చేతుల్లో దేశం బందీ అవుతుంది .దేశం లో ముస్లిం లు మోడీ ని వ్యతిరేకిస్తున్నారు .క్రిస్తియన్లు మండి పడుతున్నారు.అంతర్యుద్ధం వస్తుంది  సెక్యులరిజం మంట గలుస్తుంది .అమెరికాకు దాసోహం అంటాడు .ప్రపంచ దేశాల్లో మన పరువు కొల్లేరే ‘’ఇదీ గత ఏడాదిగా కాంగ్రెస్ అధినాయకత్వం  తో బాటు, అంగుస్టమాత్రులు .వెదచల్లిన విష ప్రచారం ..

అంతే తప్ప తమ కుంభకోణాలు ,అవినీతి పనులు రాజ్యాంగేతర శక్తుల విచ్చల విడితనం ,ప్రధానిని ఒక’’ రోబో ‘’లాగా వాడుకోవటం .కూతురు మొగుడు కుమ్భకోణాలపై స్పందించక పోవటం ,కరుణానిధి కను సన్నల లో మెలగటం ,ప్రజలతో సంబంధమే లేని చతుస్టయాన్ని కోటరీని నమ్ముకొని ప్రజల దగ్గరకు రాలేక పోవటం. రాసిచ్చింది చదవటమే తప్ప విషయం ఏదీ తెలియని అది నేత్రి ,ప్రధానిని బహిర్గతం గా మాటలతో చేష్టలతో అవమాన పరుస్తున్నా నోరు మేదపక పోవటం కొడుకు దుందుడుకు తనానికి అడ్డ కట్ట వెయ్యలేక పోవటం ,దేశం పరువు అన్ని రంగాల్లో దిగాజారినా ఏమీ పట్టించుకోక పోవటం ,అనాలోచిత నిర్ణయాలు ఆ తర్వాత చెంప లేసుకోవటాలు ,దుర్భర జీవితాలనుభవిస్తున్న ప్రజల బాగోగులు పట్టించుకోక పోవటం అవినీతి పరుల కొమ్ము కాయటం ,కరుణా నిధి కరుణ కోసమే ఎదురు చూడటం లెఫ్ట్ పార్టీలను దూరం చేసుకోవటం ,ఆంధ్ర ప్రదేశం అట్టుడికి పోతున్నా చిద్విలాసం గా ధిల్లీ లోనే కూర్చోటం ,ఏమీ సాధించలేని చిరంజీవికి రెడ్ కార్పెట్ పరిచి పార్టీలో కలిపేసుకోవటం ,అవినీతి ఆశ్రిత పక్షపాతం తో నిండా మునిగిన జగన్ ను జైల్లో నుంచి తప్పించటానికి ,తేరా వెనుక నాటకాలాడటం ,పనికి మాలిన ఏ సన్నాసి వచ్చినా పార్టీలో చేర్చుకోవటం ,రాష్ట్రం గురించి మంచి మాటలు చెప్పిన వారి నందర్నీ దూరం చేసుకోవటం ,ములాయం, లాలూ ల మీదకేసులేత్తేసే ప్రయత్నాలు. ఏ సపోర్టూ లేని అజిత్ సింగ్ ను అక్కున చేర్చుకోవటం ,తెలంగాణా ఇస్తే కెసిఆర్ పార్టీని కలిపే స్తా దాని నమ్మటం  ,తానూ తప్ప ఇతరులను గెలిపించలేని తెలంగాణా రెడ్డి మంత్రిని నమ్మటం  అన్నీ కాంగ్రెస్ అధినేత్రి చారిత్రాత్మ క తప్పిదాలు .ఆమెయే దేవత ఇచ్చినా ఇవ్వకున్నా అమ్మే .ఆమె దయ మీదే బతుకుతున్నాం అని మోకాలు దండాలు వేయటం .ప్రజల సెంటి మెంట్ లను పట్టించుకోక పోవటం ,ఆంధ్రాలో ఎన్ని అవినీతి భాగోతాలు జరుగుతున్నా పదేళ్ళ నుంచి నోరు మెదపక పోవటం యై ఎస్ ను గుడ్డిగా పూర్తిగా నమ్మటం .కెవిపి చెప్పు చేతల్లో నడవటం అంతా స్వయం క్రుతాప రాధమే .వీటిని గురించి కాంగ్రెస్ వాళ్ళుపట్టించుకో లేదు .సుఖం గా ప్రశాంతం గా యెన్ డి ఏ  మూడు  రాష్ట్రాలని విభజించి అందరి ఆమోదాన్ని సంతృప్తి గా పొందితే దాన్ని ఖాతరు చేయకుండా తన విల్ అండ్ ఫాన్సీ తో పదవి పూర్తీ అయ్యే సమయం లో విభజన జరిపి ప్రజాస్వామ్య సంప్రదాయాల్ని రేప్ చేయించి తూ తూ మంత్రంగా ,రౌడీఇజమ్ తో బిల్లు పాస్ చేయించటం ,స్పీకర్ పదవిని దిగాజర్చటం ,పార్ల మెంటు ను బైపాస్ చేయించటం ఏంతో నమ్మకం పెట్టుకొన్న రాష్ట్ర పతి  కాడి పారెయ్యటం ,విభజనకు ఇది సమయం కాదని తెలుసుకోక పోవటం ,అది నేత్రి ,ఆవిడ ముఠా చేసిన అనకానేక తప్పిదాల నిర్వాకాల  లిస్టు .

రాష్ట్రం లో ఆరు నెలలు ప్రజలు రోడ్డు మీద పడి ఆందోళన చేస్తే వారి తో మాట్లాడి సమస్య మూలాలను తెలుసుకోలేక పోవటం శ్రీ కృష్ణ కమిషన్ ను చెత్త బుట్టలో పదేయ్యటం ,ప్రతిపక్షాన్ని కాన్ఫిడెన్స్ లోకి తీసుకోక పోవటం సంభాషణ లతో సమస్యా పరిష్కారానికి పూనుకోక పోవటం ,రెచ్చి పోతున్న ముఖ్య మంత్రి ని అదుపు చేయలేక పోవటం ,అసెంబ్లీ తీర్మానానికి విలువ నివ్వక పోవటం ,అన్నీ ఇంకెన్నో స్వయం క్రుతాపరాదాలు .తన కేన్సర్ జబ్బు ,కొడుకు అప్రయోజకత్వం. అతడు తప్ప దేశానికి దిక్కు లేదని మీడియా ,పార్టీ వేదికల ద్వారా ఊదర కొట్టటం .అతను ఏ ఉద్యమాన్నీ నడిపి సక్సెస్ కాక పోవటం. వీడెక్కడి దరిద్రం రా బాబూ మన నేత్తినేక్కటానికని జనం బావించటం, పసి గట్ట లేని కబోది తనం తో ప్రబుత్వమూ, పార్టీ ఉండటం తో ప్రజలు ఒక నిశ్చయానికి వచ్చారు .బీహార్ లో నితీష్ కుమార్ మచ్చ లేని నాయకుడే అప్పటి దాకా .పెద్దమనిషే .అందరూ తలచుకొంటే ప్రధాని అయ్యే చాన్స్ ఉన్న వాడె .అతని తాత్కాలిక మోడీపై ద్వేషం శృతి మించి కూటమి నుంచి బయటికొచ్చి అవినీతి కశ్మలం లో ముంగి కంపు కొట్టే సోనియా పక్కన చేరటం అతన్నీ భ్రస్టు పట్టించింది .జయలలితను మమతనూ దూరం చేసుకోవటం మాయావతి మాయ మాటలకు మోసపోవటం దోబూచులాట చూసి చూసి విసిగెత్తి పోయారు జనం ఆసేతు హిమాచలం .కమ్మీలు క్రెడిబిలిటి కోల్పోయారు .వాళ్ళపై నమ్మకం పోయింది థర్డ్ ఫ్రంట్ తో మళ్ళీ కాంగ్రెస్ ను అధికారానికి తెచ్చే తేర వెనుక నాటకాన్నీ గమ నించారు .అందుకే పది సీట్ల తో చాలు పొమ్మన్నారు .ఎవరినో ఒకర్ని అంటకాగటం నాలుగు ఓట్లు తెచ్చుకోవటం వాళ్లకు మామూలై పోయింది .వారిలో వారికి వైరం ఒకడు కాంగ్రెస్ కు జో హుజూర్ ఆటే వేడొకడు జగన్ జిందాబాద్ అని తలవంపులు తెచ్చుకొన్నారు .

మంచి మాటలు చెప్పే వాడు చెప్పింది చేసి చూపించేవాడు, విజన్ ఉన్న వాడు, యువతకు నమ్మకమైన వాడు ఆరోపణే తప్ప గుజరాత్ ముద్ర రుజువు కాని వాడు, వ్యూహ రచయితా, గొప్ప కమిట్ మెంట్ ఉన్నవాడు ,స్వాప్నికుడే కాదు కార్య సాధకుడు అని నమ్మకం కలిగించిన వాడు నరేంద్రా మోడీ అని నిజం తెలుసుకొన్నారు .అతను వస్తేనే దేశం సౌభాగ్య వంతం అవుతుంది ‘’సురాజ్యం ‘’వస్తుంది  కలలు నేర వేరుతాయి .అభివృద్ధి అతనికే సాధ్యం .మాట నిల బెట్టుకొంటాడు .అందర్నీ ఆప్యాయం గా పలకరిస్తాడు. గొప్ప సంభాషణా చతురుడు ,జవం బలం నిస్టా ,అవగాహనా  ఉన్న వాడు ఆధునిక టెక్నాలజీ అంతా కరతలా మలకం గా ఉన్నవాడు అని ‘’నమో నమో ‘’అన్నారు .ఇక్కడ హిందూ ,ముస్లిం క్రిస్టియన్ జాట్ ,జైన్ బౌద్ధ విభేదాలేవీ కనీ పించలేదు ఉద్యోగులు నిరుద్యోగులు పెంషనర్లు  వీటన్నిటికి అతీతం గా ముందుకొచ్చారు .దేశం అంతా మోడీ ప్రభంజనం తో మునిగి పోయింది. మోడీ సునామి చుట్టేసింది .దీని ముందు ఏ గడ్డిపోచా నిలవ లేక పోయింది ఏ మహా వృక్షమూ నిలవ లేక పోయింది .అన్నీ కూకటి వేళ్ళతో సహా నేల మట్టం అయ్యాయి .సమర్ధుడు వస్తేనే దేశ భవిష్యత్తు ఉంటుందని నమ్మి ఆంద్ర జ్యోతి భాషలో ‘’కసి గా ‘’వేశారు ఓట్లు .జగన్ డబ్బు మందూ కులం మతం తండ్రి పేరూ తో అడ్డొచ్చినా చంద్ర బాబు జైత్ర యాత్ర ను ఆపలేక పోయాయి .అవినీతి ఫాను గాలిని వద్దని కరెంటు పీకేశారు .విభజిస్తే ఉభయ భ్రస్టూత్వమే అని ఉండవల్లి ,హర్ష కుమార్ ,రాయపాటి మొదలైన వాళ్ళు నెత్తిన నోరు పెట్టుకొని చెప్పినా సీమాన్ధ్రను నడి బజార్లో నిల బెట్టి చీల్చిన విధానం జుగుప్స కలిగించింది .బి జే పి పై అపోహలను వదిలి మోడీ వెంట ముందుకు కదిలారు .పవన్ ప్రాభవం తోడైంది .అంతే వోట్ల వర్షం కురిసింది నేర చరితులు సుడిగాలికి కొట్టుకు పోయారు .సునామీ లో దిగ్గజాలు మదించిన మత్త గజాలు ,చిచ్చుపెట్టిన శకుని గాళ్ళు ,అందరూ కొట్టుకు పోయారు .దిక్కూ మొక్కూ లేకుండా పోయారు .అక్కడ మోడీకి ఇక్కడ బాబుకు పట్టం కట్టారు రెండుకళ్ళ సిద్ధాంతం అని ఎద్దేవా చేసిన వాళ్ళే నెత్తి కేత్తుకొన్నారు .ఇక్కడా మళ్ళీ రాష్ట్ర పునర్నిర్మాణం రాజ దాని ఏర్పాటు యువతకు ఉద్యోగాలు బాబు వల్లనే సాధ్యం అనుకోని అందలం ఎక్కించారు. దీనికి యెన్ ఆర్ ఐ ల సహకారమూ తోడైంది .మోడీ వ్యూహం ఆచరణ ,ఓట్లను కుమ్మరించాయి. కొన్ని రాష్ట్రాల్లో ‘’చెయ్యి ‘’విరిగే పోయింది .కొన్ని చోట్ల’’ మొండి చెయ్యి గా’’ మిగిలింది .ప్రజాగ్రహం అంటే ఏమిటో చూపించారు .అసలే రగిలి పోతున్న జనానికి మోడీ ఒక దేవుడే అయ్యాడు .ఎద్దేవా చేసిన వారిని ‘’చేదు చాయ్ ‘’రుచి చూపించారు .అయితే ఈ సునామీ తప్పించుకొన్న మమత ,జయా ,తామ ప్రాభవాన్ని నిల బెట్టుకొన్నారు గుడ్డి రాజు ద్రుత రాస్త్రుడి లా కూలి పోయాడు తమిళనాడులో అందర్నీ కోల్పోయి .కెసిఆర్ తెలంగాణలో రాజయ్యాడు .బాబు సీమాన్ధ్రకు చంద్రుడయ్యాడు మోడీ దేశానికి నరెంద్రుదయ్యాడు .రాజ నాద సింగ్ అన్నట్లు ‘’మోడేసిన్’’పాత కొత్తా రోగాల్ని పోగొట్టి శుభ్ర ,భద్ర ,స్వచ్చ ప్రజాస్వామ్యం సురాజ్యం భారత్ లో ఏర్పడి ప్రపంచం లో అగ్ర గామి గా వెలుగొందాలని మనసారా కోరుకుందాం .శుభం భూయాత్ .మేరా భారత్ మహాన్ .

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -17-5-14-ఉయ్యూరు

 

 

 

 

Posted in రాజకీయం | Tagged | Leave a comment

పూర్వాంగ్ల కవుల ముచ్చట్లు -22 స్వేచ్చా స్వాతంత్ర్య పిపాసి – జాన్ మిల్టన్ -2

పూర్వాంగ్ల కవుల ముచ్చట్లు -22

స్వేచ్చా స్వాతంత్ర్య పిపాసి –

జాన్ మిల్టన్ -2

వివాహ వివాద కాలం లో మిల్టన్ లోపలా బయటా పెద్ద ఒత్తిడికిలోనైనాడు . 1643లో పార్లమెంట్ అసహనం గా అన్నిరకాల వ్యతిరేకతనూ అణచి వేయాలని నిశ్చయించింది .వాక్ రచనా స్వాతంత్రాలపై నిషేధం విదించింది .పుస్తకాలు రాస్తే సెన్సార్ చేయించి ప్రచురించాలనే నియమం పెట్టింది .విడాకుల విషం పై మిల్టన్ రాసిన కరపత్రాలు అభ్యంతర మైనవని ఎంచింది .ఇలా నిషేధిస్తూ పోతే మానవ స్వాతంత్ర్యమే ఆబాసు పాలవుతున్దన్నాడు మన కవి .దీనికి సమాధానం గానే ‘’’’ఆర్కో పాగాడీస్ ‘’రాశాడు .సాహిత్యాన్ని స్వేచ్చనూ హరిన్చవద్దాని హితవు చెప్పాడు .తన భావాలను ‘’who kills a man kills a reasonable creature ,God;s image ,but he who destroys a book kills reason itself ,kills the image of God as it were the eye.good book is the precious life –blood of a master  spirit ,embalmed and treasured up on purpose to a life beyond life ..killing books is a kind of massacre ,whereof the execution ends not in the slaying of an elemental life ,but strikes at the ethereal and fifth essence the breath of reason itself slays an immorality rather than a life ‘’ అని సాహిత్య ప్రయోజనాన్ని దాన్ని నిషేధిస్తే వచ్చే అనర్ధాన్ని నిర్భయం గా నిర్మోహ మాటం గా తెలిపాడు .అప్పటికి ఇంకా మిల్టన్ విద్య అందరూ పొందే హక్కు , ,రాసి అచ్చు వేసే హక్కు ,సంతోషం గా జీవించే హక్కు  ఇష్టం లేని పెళ్లి నుండి స్వేచ్చ పొందే హక్కు ల గురించి చెప్పలేదు .

1645మొదటి ఇరవై ఎనిమిది కవితా స్సంపుటిని విడుదల చేశాడు .ఇవి అపూర్వం అని పించాయి .ఇందులో కొన్నిఇటాలియన్ భాషలో రాసిన  సానేట్లూ ఉన్నాయి .కాని రాజకీయాలు అట్టుడికి పోతున్నాయి .ప్యూరిటన్ రివల్యూషన్ కు ‘’అనధికార ఆస్థాన కవి’’ అయ్యాడు .చార్లెస్ రాజు పై విచారణ జరిగింది .యెంత గొప్ప రాజైనా సక్రమ పాలన లేకుండా ,నియంత గా క్రూరం గా ప్రవర్తిస్తే నిర్దాక్షిణ్యం గా చంపెయాల్సిందే అన్నాడు మిల్టన్ .రాజును ఉరి తీసిన తర్వాత మిల్టన్ ను ‘’లాటిన్ సెక్రెటరి ఆఫ్ స్టేట్ ‘’హోదా నిచ్చి గౌరవించారు .ఆ నాడు ప్రభుత్వాల మధ్య వాడుకలో ఉన్న భాష లాటిన్ .రెండవ చార్లెస్ హాలాండ్ లో ప్రవాసం లో ఉండగా సాల్మసియాస్ అనే మర్యాదా సాహిత్య కారుడితో రాజరికం పైనా రాజు దైవాంశ సంభూతుడు అనే విషయం మీద ,రాజు హక్కుల మీదా  రాయించాడు మిల్టన్ ను సమాధానం రాయమని ప్రతినిధిని చేశారు .ఇద్దరి ఉత్తర ప్రత్యుత్తరాలు లాటిన్ లోనే నడిచాయి .వీటిని అధ్యయనం చేస్సిన తత్వ వేత్త థామస్ హాబ్స్ ఎవరి భాష నిర్డుస్టమైనదో ,ఎవరి వాదనలో సారం ఉన్నదో తేల్చి చెప్పలేము అన్నాడు .

మిల్టన్ రాత పని సాగుతూనే ఉంది. కళ్ళు మసకగా కని  పించటం ప్రారంభ మైంది .ఆండ్రూ మార్వేల్ కవి సాయం తీసుకొంటున్నాడు .48వ ఏట మిల్టన్ మళ్ళీ పెళ్లి కొడుకయ్యాడు .కేధరిన్ వుడ్ కాక్ అనే అపరిచిత యువతిని పెళ్లి చేసుకొన్నాడు .మనువు అయిన పది హీను నెలలకే ఆమె ,ఆమె శిశువు మరణించారు .ఆమె పై ఒక సానెట్ రాసి తృప్తి చెందానని జాన్సన్ కు తెలిపాడు .కొద్ది రోజులకే పూర్తిగా గుడ్డి వాడై పోయాడు .దీనికి కారణం పై అందరూ చర్చిన్చారుకాని ఒక నిర్ణయానికి రాలేక పోయారు .సమకాలీన మతాధికారి ‘’దేవుడి తీర్పు ,విదాకులపై అవాకులూ చవాకులూ రాసినందుకు దైవ శిక్ష అన్నాడు .కళ్ళకు అధిక శ్రమ ఇవ్వటం వలన అని కొందరన్నారు .విపరీతమైన మానసిక శారీరక శ్రమ వల్లద్రుష్టి లోపం వచ్చిందని కొందరు .డాక్టరు వారించినా మిల్టన్ వినలేదని మరికొందరన్నారు .కాని నిష్ణాతులు ‘’తల్లి నుండి మిల్టన్ కు’’ కన్జెనీటల్ సిఫిలిస్ ‘’సంక్రమించిన్దన్నారు .దీనివలననే ఇద్దరు భార్యలు ,పుట్టిన పిల్లలు చనిపోయారని తేల్చారు .ఇది పచ్చి అబద్ధం అని అతని పిల్లలు కొందరు బతికే ఉన్నారని అంటూ మిల్టన్ గుడ్డి వాడు అవటానికి ‘’గ్లోకోమా లేక కంటినాడికి పక్ష వాతం కారాణాలు అన్నాడు .ఇవన్నీ మిల్టన్ రాసిన కవితల్లో సానేట్స్ లో స్వీయ చరిత్ర గా రాసుకొన్నాడు .ఇందులో విషాద అనుభవాలతో కూడి అత్యున్నత కళ ఉంటాయి .మనం చాలా మంది చదివిన కొన్ని లైన్లు ‘’doth God exact day labor ,light denied?-I fondly ask –who best bear mild yoke ,they serve him best –they also serve who only stand and wait’’

‘’సెకండ్ డిఫెన్స్ ఆఫ్ ఇంగ్లీష్ పీపుల్ ‘’అనే పుస్తకం లో తనపై మోప బడిన ఆరోపణలన్నీ అసత్యం అన్నాడు .తనకు గుడ్డితనం వరమేనన్నాడు .వారి మనసులపై మేఘాలు కప్పుకోన్నాయన్నాడు .అందుకే రీజన్ ,అంతరాత్మ చ వారికి చీకటి లోనే ఉండిపోయాయన్నాడు .ఇప్పుడు తనకు హాయిగా స్వేచ్చ లభించింది అని ,మనసుతోనే సౌందర్యాన్ని ,సత్యం  ,నీతి ధర్మం స్తిరత్వాన్ని చూసుకొంటున్నా నని తెలిపాడు .దీని వలన మిల్టన్ లో వచ్చిన పరిపక్వత తెలుస్తోంది .’’it is not so wretched to be blind ,as it is not to be capable of enduring blindness ‘’అని స్పష్టం గా చెప్పాడు .లార్డ్ క్రామ్వేల్ నియంతృత్వం వలన ప్రజలకు మేలు కలుగుతున్దని ఆశించాడు కాని మరీ భ్రస్టు పట్టించాడు .యుద్ధం కంటే శాంతి ముఖ్యం అన్నాడు . రెస్తోరేషన్ తప్పదని తెలిసింది .రాజుకు వ్యతిరేకం గా మాట్లాడటం ప్రారంభించాడు .

క్రామ్వేల్ చావు తర్వాత మిల్టన్ రక్షణ కోసం ఊగాడు .అప్పటికే ఇంగ్లాండు ముఠా తగాదాలతో విసిగి పోయింది .ప్రజా స్వామ్య పాలన అసాధ్యం అని తేల్చారు .మళ్ళీ రాజరికమే గతి అని నిర్ణయించారు .హౌస్ ఆఫ్ లార్డ్స్ ను పునరుద్ధ రించారు రెండవ చార్లెస్ ను రంగ రంగ వైభవం గా స్వాగతించారు .కౌలీ వాలేర్ డ్రైడేన్ మొదలైన కవులు స్వాగత గీతాలు రాసి చదివారు .వీటికి దూరం గా మిల్టన్ ఉన్నాడు .ఇంకా మిల్టన్ కు స్వేచ్చ మీద ఆశ పోలేదు రాచరికం స్వేచ్చను హరిస్తుందని భావించాడు .లండన్ వదిలి వెళ్లి ఎక్కడైనా దాక్కోమని చెప్పారు .కాని మిల్టన్ ను అరెస్ట్ చేశారు. అదృష్టవశాత్తూ తప్పించుకొన్నాడు .ఆయన పుస్తకాలన్నిటిని పబ్లిక్ గా తగల బెట్టేశారు .మార్వేల్ సాయం తో జైలు నుండి విడుదల అయ్యాడు .మరణశిక్ష విధించక పోయినా ఆయన కస్టాలు తీరలేదు .ఒంటరి తనం వేధిస్తోంది .చేతిలో పెన్నీ లేని దరిద్రం ఆవహించింది .ఉన్న ముగ్గురు పిల్లమీదే ఆధార పడి జీవిస్తున్నాడు .అందులో ఇద్దరమ్మాయిలకు చదువే రాదు .కాని  వారికి ఆరు భాషలను నేర్పాడు .వారు చదివి విని పించేవారు .అందులో ఏమున్నదో వాళ్ళకేమీతెలీదు .పెద్ద పిల్లలు అన్నే మేరీలు ఈ పైకి చదివే పద్ద్ధతిని వ్యతిరేకించారు .తండ్రికి తెలీకుండా మోసం చేసి కొన్ని పుస్తకాలు అమ్మేశారు  .యాభై అయిదేళ్ళ వయసులో ముచ్చటగా మూడో పెళ్లి చేసుకొన్నాడు .అతని కంటే ఆమె ముప్ఫై ఏళ్ళు చిన్నది .పిల్లలకు ఇష్టం లేదు ఆమెకు సహక రించలేదు. కాని దేబోరో అనే కూతురు మాత్రమె కొత్త అమ్మపై సాను భూతి చూపింది .యాభైలో ఉన్నా మిల్టన్ కు ముసలితనం వచ్చేసి నట్లని పించింది .కళ్ళు కనీ పించక పోయినా  వాటిల్లో  దివ్య మైన వెలుగు కనీ పిస్తోంది .అంతర్ ద్రుష్టి ఆయనలో విజ్రుమ్భించింది .

అనిబద్ధ కవితా పిత –జాన్ మిల్టన్

యాభై ఏడేళ్ళ వయసులో మిల్టన్ చారిత్రాత్మక ఎపిక్ ను రాయటం ప్రారంభించాడు .కద చారిత్రాత్మకం గా బైబిల్ కు సంబంధించింది గా ఉండాలని నిర్ణయించుకొన్నాడు .దీనికోసం తొంభై డ్రమాటిక్ పోయెమ్స్ ను నోట్సు గా రాసుకొన్నాడు .దానికి ‘’ఆడమన్ పారడైసేడ్ ‘’అని ముందు పేరు పెట్టాడు కాని అది చివరికి ‘’పారడైస్ లాస్ట్ ‘’గా తేలింది .సాహస కృత్యాలను వదిలేశాడు . మతానికి సత్యానికి ప్రాధాన్యత నిచ్చాడు .మానవత్వం కోసం పోరాటమే అతని  ధ్యేయం .తన భావాలను ‘’assert Eternal providence –and justify the ways of God to man ‘’గా తెలిపాడు .ఇలాంటి క్లాసిక్ కు అంత్య ప్రాస అంత నప్పుదుఅనుకొన్నాడు .బ్లాంక్ వేర్స్ ‘’లో మాత్రామే చెప్పదలచుకొన్న భావాలను పకడ్బందీ గా చెప్పగలను అని పించి దానినే ఎన్నుకొన్నాడు .వక్తృత్వ భాష లో తీర్చి దిద్దాడు .అప్పటికి పెద్దగా ఆకర్షణ లో లేని అని బద్ధ కవిత్వానికే పెద్ద పీట వేశాడు .అనేక ఆధునిక కవులు దీన్ని లక్ష్యం చేయలేదు కాని ఇలియట్ మాత్రం‘’Adam and Eve  were not to  be meant to be individuals but proto types of man and Woman ‘’అన్నాడు .

పిల్లలకు చెప్పి రాయిస్తూ ఆ కావ్యాన్ని రాశాడు కొంచెం నెమ్మదిగా సాగింది .పూర్తీ చేసి 1667లో ముద్రించాడు ఒక అయిదు పౌన్లు మాత్రమె లభించాయి .మిల్టన్ రాసిన రెండు లైన్లను ఆ తర్వాత వర్డ్స్ వర్త్ వాడుకొన్నాడు –stood almost single ,phrasing odious truth –darkness before and danger ;s voice behind’’..మిల్టన్ ‘’హిస్టరీ ఆఫ్ ఇంగ్లాండ్ ‘’గ్రంధం రాశాడు కాని సెన్సార్ అయింది .అందులో సాక్సన్ మాన్క్స్ ను నిందించాడు బహుశా తనకాలపు వారిని చూసి అలా రాసిఉండాలి .లాటిన్ గ్రామర్ ,లాజిక్ పాఠ్య పుస్తకం మత బోధనా పై గ్రంధం రాశాడు పారడైజ్ లాస్ట్ తర్వాత నాలుగేళ్ళకు పారడైజ్ రీ గైనెద్ద్ రాశాడు .ఈ రెండూ మిల్టన్ లో అంతర్ దృష్టినీ దేవుడి సన్నిధిని కలిగించాయి .మానసిక శాంతి లభించింది .చిత్త శుద్ధి ఏర్పడింది .వాదాల జోలికి పోలేదు .ఇంట్లో మతపరమైన కార్యక్రమాలు చేయలేదు .కూతుళ్ళను ఎంబ్రాయిడరీ నేర్చుకోవటానికి బయటికి పంపేవాడు .మంచి స్త్రీలుగా ఎదగాలని భావించాడు .అరవై అరవ ఏట 8-11-1674మహా కవి మిల్టన్ మరణించాడు ఆత్మా పరమాత్మ లో చేరిపోయింది .’’పారడైజ్ లాస్ట్’’ రాసిన వాడు ‘’పారడైజ్ రీగైన్ ‘’ను  పొందాడు .

యెంత గొప్ప కవి అయినా ఆయన రాసినవి చదివే వారు తక్కువే .కవి, రాజకీయ వేత్త ,ప్రాపగాం డిస్ట్  ,కరపత్ర కార్య దక్షుడు ,పెద్దగా చదువు లేక పోయినా అందరికి జ్ఞానం నం బోధించిన పరిపక్వ మాన వీయ మూర్తి మిల్టన్ .సంగీత ధ్వనుల లాంటి మాటలతో ఏకత్వ బోధన చేసే కవిత్వం రాశాడు .’’Milton was infatigable worker for liberty carved and erected milestones that stil stand on the road to freedom .A religious poet ,he was also a builder .choosing his phrases as though they were stones for a cathedral ,he raised a great edifice ,a monument of words I marble ‘’.

ఎడ్మండ్ బర్క్ మిల్టన్ చిత్రించిన ‘’నరకం ‘’అద్భుతం అన్నాడు .రొమాంటిక్ కవులు మిల్టన్ బ్లాంక్ వేర్స్ పై ఎంతో అన్వేషించారు కాని అందులోని మత భావాలను దూరం చేశారు .వర్డ్స్ వర్త్ ‘’మిల్టన్ ఇప్పుడు మనమధ్య ఉంటె బాగుండును’’ అన్నాడు .జాన్ కీట్స్ ‘’his style is uncongenial.his verse can not be written but in an artful  rather artist;s humor ‘’ అని పొగిడాడు .విక్టోరియన్ యుగం అంతా మిల్టన్ ప్రభావం తోనే నడిచింది .’’Milton  is the central problem  in any theory and  poetic influence in English ‘’అన్నాడు ప్రముఖ విమర్శకుడు రాబర్ట్ బ్లూమ్.’’Milton  is esteemed the parent  and author of blank verse among us .his verse might be  synonymous  for blank verse  as poetry a new poetic terrain independent from both  the drama and the heroic couplet’’.

అని బద్ధ కవితకు పట్టం కట్టి ‘’అనిబద్ధ కవితా పిత’’ అనిపించుకొన్నాడు జాన్ మిల్టన్

  

  

.

 

మరో కవి తో కలుద్దాం

సశేషం

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -17-5-14-ఉయ్యూరు

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

రా’’చ’’ కీయ ద్విప్ల్లెట్స్-32 –మోడీ -చంద్రోదయం తరువాత

రా’’చ’’ కీయ ద్విప్ల్లెట్స్-32 –మోడీ -చంద్రోదయం తరువాత

1-నమో నమో నమో నమో నమహః

  విజయం అందింది నభూతో గా ‘’యమహా ‘’

2-చమటోడ్చి  సాధించాడు  విజయం ‘’బాబు’’

   నమ్మకమే గెలిపించి గద్దె పై చేర్చింది మహా ‘’బాగు’’   .

3-సైకిల్ ఎక్కి విజయం సాధించాడు ‘’బుద్ధుడు ‘’

  మచ్చ లేని చరిత్రకు ,సంస్కృతికి ‘’నిబద్ధుడు ‘’.

4-వేసవిలో’’ ఫాన్’’ ఉపయోగ పడుతుందను కొంటె

  స్విచ్చాఫ్ చేసి అవినీతి గాలి మా కొద్దన్న ‘’కుర్ర కొంటే ‘’.

5-తెలంగాణా ఇచ్చీ , సీమాంధ్ర ను  నొప్పించి  చీలిస్తే

  రెండు చోట్లా తన్నితరిమేసి ‘’చేతులు ‘’దులిపారు ‘’కొలిస్తే ‘’.

6-‘’దుషక  చతుషక తయం యమ  ‘’ఘోర పరాజయం’’

    ప్రజా సంబంధాలు లేని వార్ని నేత్తికేక్కిస్తే రాదా ‘పరాభవం’’ ?

7-‘’గులాబి’’ దండు దండుకోంది డబ్బుతో బాటు ఓట్లూ’’ కారెక్కి’

     బుద్ధిగా అభి వృద్ధి మార్గం లో ఉండి-ఇక మాట్లాడరాదు’’ కొవ్వెక్కి’’ .

8-ఆసేతు హిమాచలం వీచింది ఉద్ధృతం గా మోడీ’’ జంఝా మారుతం ‘’

  కొత్త  జవ సత్వాలతో భారత్ వెలిగి ఆదర్శం’తో తేవాలి ‘’మలయ మారుతం ‘’

9-బాబు విజయం వెనక ఉన్నారు ఎందరో ‘’ప్రవాసాంధ్రులు ‘’

 రాష్ట్ర అభి వృద్ధిలో పాత్ర పోషించి అనిపించుకోవాలి ‘’అసలాంద్రులు ‘’ .

10-ఏదో క్రేజీ గా  తొందర పడి గద్దేనేక్కాలను కొన్న ‘’కేర్జీవాల్ ‘’

  గురివింద  సామెత రుజూ చేసుకొని అయ్యాడు ‘’ఉల్టా పల్టా వాల్ ‘’

11-‘’యువ రాజును’’ యెంత మోసినా యెక్క లేక’’ పోయాడు ‘’

     పులి ముందు పిల్లి అయి కాటా దెబ్బతిని ‘’తప్పి’పోయాడు ‘’.

12-పదేళ్ళ ‘’మన్మోహన్ సోనియా అండ్ కో’’ పాపాలను’’ కడగాలి ‘’

   స్వచ్చ శుభ్ర పాలన ‘మోడీ బాబు అండ్ కో ‘’ప్రజలకు ‘’అందించాలి ‘’.

13-జీరో బడ్జెట్ తో కొత్తాంధ్ర ‘’మొదలు’’

  ‘’ బాబు’’ మంత్రం దండమే తీర్చాలి ‘’వెతలు ‘’

14- కారూ సైకిలూ గుద్దుకోకుండా సాగాలి పయనం

    రెండు కళ్ళూ మనవే నని మార్చుకోవాలి ‘’వయనం ‘’.

    మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -16-5-14-ఉయ్యూరు

   

 

 

Posted in రాజకీయం | Tagged | Leave a comment

పూర్వాంగ్ల కవుల ముచ్చట్లు -21 చీకటి తో (లో)వెలుగు జాన్ మిల్టన్

పూర్వాంగ్ల కవుల ముచ్చట్లు -21

చీకటి తో (లో)వెలుగు

జాన్ మిల్టన్

‘’ఎల్ అలిగ్రో ‘’,పెంసేరోసో 2’’రాసిన కవి ఒకడే అంటే ఆశ్చర్య మేస్తుంది .కళ్ళు లేని కబోదిగా గాజా లో బానిసల మధ్య సామ్సన్ ను దుఖితుడిని చేసిన కవి .దుర్మార్గాన్ని క్రూరత్వాన్ని ఎదిరించిన కుటుంబ రక్తం ప్రవహించిన వాడు. తండ్రి నిర్బంధ పాపిజం కు దూరమై ,కొడుకు మిల్టన్ కు ఆదర్శం గా ఉన్నాడు .

జాన్ మిల్టన్  లండన్ లోని చీప్ సైడ్ సైన్ ఆఫ్ దిస్ప్రెడ్ ఈగిల్ లో 9-12-1608లో జన్మించాడు .ప్రేమను ,స్వాతంత్ర పిపాసను తండ్రి నుండి  వారసత్వం గాపొందాడు .తండ్రి చేసిన సంగీత కృతులు ఇప్పటికీ ప్రొటెస్టెంట్ హైం బుక్స్ లో ఉన్నాయి .అన్నే అక్క .ఎడ్వర్డ్ జాన్ ఫిలిప్ లు తమ్ముళ్ళు .వీరిద్దరూ అన్నకు శిష్యులే కాక అతని చరిత్రను రాసిన వాళ్ళు కూడా .క్రిస్టఫర్ అనే తమ్ముడు ఏడేళ్ళు చిన్న మిల్టన్ కు పూర్తీ వ్యతిరేకి అయి, కేధలిక్ గా ,రాయలిస్ట్ గా ,అవకాశ వాదలాయర్ గా ఉండి ,రాజు కోర్టులోని జడ్జీలను నియమించే స్థాయికి ఎదిగాడు .

మిల్టన్ చిన్న పిల్లాడుగా చీప్ సైడ్ జిల్లా లో ఆడుకొనే వయసులో షేక్స్పియర్ ఇంకా బతికే ఉన్నాడు .ఆ మహా నాటక రచయిత లండన్ కు చివరి సారి వచ్చినప్పుడు మేర్మిడ్ లో స్నేహితులను కలిసే ప్రయత్నం లో  బెన్ జాన్సన్ తో కలిసి వెళ్ళిన సాయం సంధ్యలో బ్రెడ్ స్ట్రీట్ లో ఆరేళ్ళ ‘’కుర్ర మిల్టన్ ‘’ఇంటివద్ద ఆటలాడటం తేరిపార జూసి చూసి  స్త్రాఫార్డ్ చర్చ యార్డ్ లో తనకొక చిన్న సమాధి కావాలని అనుకోని ఉండవచ్చు నని డేవిడ్ మేసన్ రాశాడు .మిల్టన్ తండ్రి వద్దే ఎక్కువ గా విద్య నేర్చాడ. తండ్రి స్తేష నరీ వ్యాపారం చేస్తూ నోటరీ గా ఉండేవాడు .సెయింట్ పాల్ చర్చికి చెందిన రివరెండ్ థామస్ యంగ్ వంటి ట్యూటర్స్ వలన చార్లెస్ ది ఒడ్ వంటి వారి స్నేహం లభించింది .తండ్రియే మిల్టన్ ‘’మెంటార్’’.మానవత్వ విలువలున్న వాటిని చదవ మని తండ్రి చెప్పేవాడని మిల్టన్ చెప్పుకొన్నాడు .బాల్యం నుండి తన ప్రతి కదలిక తండ్రి కను సంనల్లోనే జరిగిందన్నాడు .సైన్స్ మీద అభిరుచికీ ఆయనే కారణం .

పదహారేళ్ళ వయసులో కేంబ్రిడ్జి లో క్రైస్ట్ కాలేజి లో చేరి ఏడేళ్ళు ఉన్నాడు .అక్కడి ప్రతి విషయాన్నీ ఏవ గిన్చుకొన్నాడు .కర్రిక్యులం లోని సబ్జెక్టులు స్ట్రిక్ట్ విధానాలు ఏ వీ నచ్చలేదు .ఆక్స్ ఫర్డ్ కు వెళ్ళిన మిత్రుడు దియోది రాసిన గ్రీక్ఉత్తరం  లోని  తప్పులు సవరించాడు .ఆక్సఫర్డ్ వచ్చేసి హాయిగా స్వేచ్చ గా చదువుకోమని సలహా కూడా ఇచ్చాడు .’’my books are my whole life ‘’ అని మిల్టన్ సమాధానం రాశాడు .అంటే తను ఎమికాబోతున్నాడో అతనికి అవగతమైంది .కవికావాలనే కోరిక బలమైనది .కవి అనుభూతి చెందటమే కాక సంఘానికి తగిన సూచనలూ చేయాలని ,బ్యూటీ తోను దేవునితోను సంబంధం కలిగి ఉండాలని భావించాడు .23వయసులో గొప్ప సానెట్ రాశాడు .అసందిగ్ధం గా మొదలు పెట్టి ప్యూరిటన్ సమర్ధన తో ముగించాడు

ఈకవిత రాసే సమయం లో తోటివిద్యార్దుల ,కాలేజి యాజమాన్యం వల్లా ఇబ్బందులు పడ్డాడు .అతని అందాన్ని ,పట్న జీవితాన్ని హేళన చేసే వారు ‘’లేడీ ఆఫ్ క్రైస్ట్స్ట్ ‘’అని మారు పేరు పెట్టారు .అన్నిటిలో అతని ఆధిక్యతకు అసూయ పడ్డారు కూడా .దీనికి దీటుగానే సామాధానం చెప్పేవాడు. దేన్నీ దాచుకోలేదు .టీచర్ల తో గొడవ పడ్డాడు .ఇంటికి పంపింది యాజమాన్యం .పనీ పాటా లేక రోడ్లమ్మట తిరిగాడు .అప్పుడే తానెప్పుడూ వినని ,కనని గొప్ప పుస్తకాలను చూశాడు .కొద్ది రోజుల తర్వాత మళ్ళీ స్కూల్లో చేర్చుకొన్నారు .కేంబ్రిడ్జి కి వెళ్లి లాటిన్ భాషలో ఉన్న అనేక మైన వాటిని లాటిన్ భాషలో కవితలుగా రాశాడు .లాటిన్ లో ఉన్న చాలా ‘’సామ్స్’’ను కవితలుగా రాశాడు .వీటిలో ఇంగ్లీష్ భాష ఉబికి వచ్చి వాటిని సుందర మయం చేసింది .కేంబ్రిడ్జి లో రాసిన ‘’ఒడ్ ఆన్ ది మార్నింగ్ ఆఫ్ క్రైస్త్స్ నేటివిటి ‘’కవిత తిరుగు లేని ‘’మాస్టర్ పీస్ ‘’ దీన్ని ఇరవై  ఒక్క వయసులో రాశాడు  ఇమాజేరి లో స్పెన్సర్ గుర్తొస్తాడు. కొన్నిటిలో   మెటా ఫిజికల్ కవులు కని  పిస్తారు .మొత్తం మీద సర్వాంగ సుందరామైన కవిత .భావానికి పద విన్యాసానికి గొప్ప ఉదాహరణ .కవిత చివరికొచ్చేసరికి కవిత్వం శిఖరారోహణమే చేస్తుంది .గోల్డెన్ ఏజ్ లో సంగీతం తోడై ఉయ్యాల లూగిస్తుంది .

ఈ కవిత రాసిన తర్వాత కేంబ్రిడ్జి వదిలి తండ్రి ఎస్టేట్ ఉన్న హార్తాన్ వెళ్ళాడు .అక్కడి ప్రశాంత వాతావరణం లో గ్రీక్ ,లాటిన్ రచయితల గ్రంధాలను చదివి జీర్ణించుకొన్నాడు .సంగీతం లెక్కల మీదా దృష్టిపెట్టాడు .ఆరేళ్ళు ఇక్కడే గడిపాడు ప్రీస్ట్ కావాలన్న కోరికను తున్చేసుకొన్నాడు .తను ఏదైనా బోధిస్తే కవిత్వం ద్వారానే చేయాలనే నిర్ణయానికి వచ్చాడు .ప్రక్రుతి ఏ నిర్బంధం నియమాలు  లేకుండా చదువు నేర్పుతుంది అని గ్రహించాడు .క్రిస్టియన్ బోధకుల  , ఇటలీ రచయితల పుస్తకాలూ చదివాడు .గ్రీకు రోమన్ వెనిస్ చరిత్రలను చదివి మననం చేసుకొన్నాడు .హార్తాన్ లో ఉండగానే మిల్టన్ చిరస్మరణీయ కవితా ఝరిని ప్రవహింప జేశాడు .  బైబిల్ ను మాత్రం వదల కుండా చదువుతూనే ఉండేవాడు .’’ఎల్ ఆలిగ్రో పెంసేరోసో లు చాలా ప్రాచుర్యం పొందాయి .మధుర మైన కాలాన్ని ఇక్కడే గడిపి అంతకంటే మధురకవిత్వం రాశాడు .’’అర్కాదేస్ ‘’ఇక్కడే రాశాడు .ఎరల్ ముగ్గురు పిల్లలు ఇందులో నటించారు కూడా .’’కొమాస్ ‘’లో మేధో మార్గం ఉంది .కేంబ్రిడ్జి వదిలేశాక మిత్రులను దాదాపు మరిచాడు .

కాని తన కంటే చిన్న వాడైన’’ ఎడ్వర్డ్ కింగ్ ‘’అనే వాడిని మర్చిపోలేదు .అతని చావుకు  ఒక కవిత లో అమరత్వం కల్గించాడు .ఇది గొప్ప ఎలిజీ గా గుర్తింపు పొందింది .29లో ప్యూరిటన్ కవి అయి ఎలిజీలు మానేశాడు సంఘానికి పనికొచ్చేవే రాశాడు ‘’లిసిదాస్ ‘’లో పాగాన్ మైతాలజు క్రిస్తియాన్ తియాలజి లను మిశ్రమం చేసి రాశాడు .దీనిని సామ్యుల్ జాన్సన్ అంగీకరించలేదు ఎద్దేవా చేశాడుకూడా .మిల్టన్ క్లాసికల్ ,క్రిస్టియన్ ప్రపంచాలను కలిపాడన్న విషయాన్ని జాన్సన్ విస్మరించాడని విమర్శకాభిప్రాయం .తాను ప్రజలలో ఒకడిని అని రుజువు చేశాడు .తన అసమాన ప్రతిభను ప్రదర్శించాడు .అతాని మేదోజనితమైనదే ఈ కవిత .

ముప్ఫై వ ఏట ఇంకా విస్తృత ప్రపంచాన్ని చూడాలని అందులో గడపాలని నిర్ణయించుకొని ఇంక కొత్త లోకాలను చూడాలని కోరుకొన్నాడు .ఆ  ఊరు వదిలి వెడుతూ ‘’at last he rose and twitched his mantle blue-tomorrow to fresh woods and pastures new’’అని రాసుకొన్నాడు .ప్యూరిటన్ అయినా  ఇంకా  పాత దేవుళ్ళూ,దయ్యాలు గుర్తుకొస్తూనే ఉన్నారు .ఫ్రాన్స్ లో కొంతకాలం ఉండిద డచ్ హ్యూమనిస్ట్ ,స్వీడన్ రాయబారి అయిన   గ్రోతియస్ తో మాట్లాడి ఇటలీ గమ్యం చేసుకొన్నాడు .జేనోవాకు బయల్దేరి లెగ్ హారన్, పీసా లను సందర్శించి ఫ్లారెన్స్ కు 1638సెప్టెంబర్ లో చేరాడు .అక్కడి సాహిత్య కారులందరూ మిల్టన్ కు అపూర్వ స్వాగతం ఇచ్చి తమ రచనలు అంకితం చేశారు .మిల్టన్ రాసిన లాటిన్ వెర్సెస్ లను  విపరీతం గా మెచ్చారు .ఇటాలియన్ మేధావులు మిల్టన్  అంటే వీరాభిమానం చూపారు .అక్కడి కళా కారులతో ,నోబుల్స్ తో ,విద్యా వేత్తలతో తత్వ వేత్తలతో సమా వేశాలు జరిపి విందు వినోదాల్లో పాల్గొన్నాడు .74 ఏళ్ళ గెలీలియోను కలిసి ఆయన చెప్పింది విన్నాడు .సీనా, రోమ్ నేపుల్స్ తిరిగి పుస్తకాలు, వ్రాత ప్రతులు కొనుక్కున్నాడు .సిసిలీ, గ్రీస్ వెళ్ళాలను కొన్నాడు .కాని ఇంగ్లాండ్ లో సివిల్ కమిషన్ వార్త తెలిసి తన దేశస్తులు స్వాతంత్రం కోసం పోరాడుతూ ఉంటె తాను వృధాగా దేశ యాత్రలు చేయటం భావ్యం కాదని భావించి లండన్ కు తిరిగి వెళ్ళాడు .

లండన్ చేరిన తర్వాత తన ఒక ఏడాది బయటి జీవితం లో ఇక్కడ జరిగిన విషయాలు అవగతం చేసుకొన్నాడు .అనిశ్చిత అస్తవ్యస్త పరిస్తితులలో తనకోసం తగిన ప్రదేశం కోసం చూస్తున్నాడు .అప్పటికి ఇంకా రాజకీయాలల్ జోలికి వెళ్ళలేదు .ఆ అవగాహనా లేదు .ముందుగా పార్ట్ టైం టీచర్ అయ్యాడు .అతని విధవ సోదరి అన్నే మళ్ళీ  పెళ్లి చేసుకోవటం తో ఆమె ఇద్దరి సంతానాన్ని ఎడ్వర్డ్ ,జాన్ లను చూసుకొంటున్నాడు .ఇంకొందరు ఇంట్లో చేరారు .ఇల్లు ఒక చిన్న బోర్డింగ్ స్కూల్ అయింది .తానే ఒక టీచర్ అయి సిలబస్ తయారు చేసి తన ఆశయాలకు అనుగుణం గా వారికి బోధించాడు .గ్రీక్ టెస్టమెంట్ లో ఒక చాప్టర్ చదివి విని పిపించే వాడు .లెక్కలు నేర్పాడు. యంత్రం పని ,సాహిత్యం ఖగోళం ,వ్యవసాయం సైనిక వ్యవస్థలను గురించి బోధించాడు .ఇటలీ భాషలో చరిత్ర ,ఫ్రెంచ్ భాషలో జాగ్రఫీ చదవాలనే వాడు .ముప్ఫై మూడవ ఏట ఈ ప్రైవేట్ టీచర్ ఉద్యోగం కొంప ముంచింది .చార్లెస్ రాజు పార్ల మెంట్ సమావేశాన్ని ఏర్పాటు చెయ్యాలనే ఒత్తిడి వచ్చింది .బిషప్పులు తిరుగు బాటు చేశారు .అన్ని శాసనాలు రద్దు చేయాలని కోరారు .బిషప్పుల సర్వాదికారాలను కూకటి వ్రేళ్ళతో పీకేయ్యాలని ఆందోళన వచ్చింది .కొత్త ఆలోచనకూ పాత ప్యూరిటన్ భావాలకు మధ్య మిల్టన్ నలిగి పోయాడు .చివరికి నిర్ణయానికి వచ్చి తన అభిప్రాయాలను ఒక కరపత్రం ద్వారా తెలిపాడు ‘’పార్ల మెంటు బిషప్ లను హుందాగా ఉండమని కోరుతోంది .మాట్లాడేస్వేచ్చ లేక పొతే తీవ్ర పరిణామాలోస్తాయి .చర్చి అధిపతులు రాజు సలహాతో భగవంతుని సేవే లక్ష్యం గా పని చేయాలి .మనిషి బానిసత్వం నుండి బయట పడాలి .కనుక సమాజం లో స్వేచ్చ స్వాతాన్త్ర్యాలకోసం నేను నా శక్తి యుక్తుల్ని దారాపోయ టానికి నిర్ణ ఇంచుకోన్నాను ‘’అని తన మనో భావాలను బహిర్గతం చేశాడు .

రాజుకు అధికారం కావాలన్న  దాన్ని అడ్డం పెట్టుకొని క్రాం వెల్ నియంతలా  వ్యవహరించాడు .అతని వల్లనే సామాన్యుడి బతుకులు బాగు పడతాయని దానికి సమర్ధుడు అతనేనని మొదట మిల్టన్ అనుకొన్నాడు.. ఇప్పటిదాకా పోయెట్రీ మాత్రామే రాసిన మిల్టన్ తాన అభిప్రాయాలుప్రజలకు తెలియాలంటే ఫాం ప్లేట్స్  మాత్రమె సరిపోతాయని భావించి వచనం లో విజ్రుమ్భించాడు .స్వతంత్రం కోసం సర్వస్వాన్ని ఒడ్డి ప్రచారం చేశాడు .మనసులో ఒక గొప్ప ‘’ఎపిక్ ‘’రాయాలనే ఆలోచన సుడి తిరుగు తోంది .దానికి అనువైన వాతావరణం కావాలని ఆగాడు .సేనేకా రాసిన ఒక ఎపిగ్రం ను ఇంగ్లీష్ లోకి ‘’there can be slain –no sacrifice to God more acceptable –than an unrighteous and a wicked king ‘’గా తర్జుమా చేసి వదిలాడు .

అనుకోకుండా ఈ ముప్ఫై అయిదేళ్ళ ముదురు బ్రహ్మ చారి ‘’మేరీ పావెల్’ అనే పది హేడేళ్ళా పడుచును పెళ్ళాడే శాడు  .వారి వయసు రీత్యా ,కోరికల రీత్యా అది పొసగని దాంపత్యమే అయింది .జీవితం లో సెక్స్ హాయి అనుభవించలేక పోయానే అని తొందర పడ్డానని ఆయనే చేమ్పలేసుకొన్నాడు .తమది ‘’brutish congress ‘’అని చెప్పాడు .’’two carcasses chained un naturally together ‘’అని విచారించాడు .శరీరం సుఖం కోరుతోంది మనసు ఆధ్యాత్మకత వైపు చూస్తోంది .ఈ వైరుధ్యాన్ని భరించ లేక పోయాడు .ఇక ఈ ముసలాడితోలాభం లేదని ఆవిడే పెళ్లి అయిన ఒక నెలలోనే వదిలేసి వెళ్లి పోయి మిల్టన్ ను తాత్కాలికం గా  ను సంసార బంధం నుండి తప్పించింది ఒక రకం గా .ఎన్నో సార్లు రమ్మని కబుర్లు పంపాడు .రాలేదు .వచ్చి ఇంటి బాధ్యతా తీసుకోమని హుకుం లాంటి అభ్యర్ధన చేశాడు .సమాధానం .లేదు కోపం వచ్చింది .ఆవిడను వదలటానికి మనసొప్పటం లేదు. బాధ ,కోపం, వ్యధ అవమానం  లను రంగ రించి ‘’ది డాక్త్రిన్ అండ్ డిసిప్లిన్ ఆఫ్ డై వొర్స్ ‘’అనే కరపత్రంరాసి  రాసి పురాణాల లో  భార్యా భర్తల అనుబంధాన్ని గూర్చి చెప్పిన వాటిని ఉదాహరించాడు

మిల్టన్ మామ గారు పావెల్ అల్లుడికి అయిదు వందల పౌండ్లు బాకీ ఉన్నాడు .కూతురినే  సపోర్ట్ చేశాడు. .మిల్టన్ విడాకుల పై రాసిన కరపత్రం ,క్రామ్వేల్ అధికారం చూసి ‘’అల్లుడు మామకు మొగుడు ‘’అని గ్రహించి మామ కూతురు  మేరీ ని లండన్ కు పంపాడు .ఆవిడ ఇంట్లోకిరాగానే భర్త కాళ్ళ  మీద పడి ఏడ్చింది .మోకాలి దండా వేసి క్షమించ మని కోరింది .మిల్టన్ ప్రేమగా ఆమెను చేర దీశాడు. హాయిగా ఆతర్వాత కాపురం చేసి ముగ్గ్గురు పిల్లల్ని కనీ నాల్గవ పిల్లను ప్రసవించిన వెంటనే  ఇరవైఆరవ ఏటనే చని పోయింది .ఈ పసి పిల్ల కొద్ది రోజుల్లోనే మరణించటం తో మిల్టన్ కు ముగ్గురు పిల్లలే మిగిలారు .

 

 

John-milton.jpg

సశేషం

మోడీ, చంద్ర బాబు విజయ శుభా కాంక్షలతో

మీ- గబ్బిట దుర్గా ప్రసాద్-16-5-14-ఉయ్యూరు

 

 

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

పూర్వాంగ్ల కవుల ముచ్చట్లు -20 కొంటె కవి -రాబర్ట్ హీర్రిక్

పూర్వాంగ్ల కవుల ముచ్చట్లు -20

కొంటె కవి -రాబర్ట్ హీర్రిక్

కొంటెతనం చిలిపిదనం తో తన తరాన్ని ప్రభావితం చేసిన రాబర్ట్ హీర్రిక్ వాజ్రాల నగిషీ చేసే కంసాలి  కుటుంబం వాడు .లండన్ లో 1591లో పుట్టి కుల వ్రుత్తి లో రాణించాడు .కవితలనూ వజ్రాల్లాగానే సాన బట్టిమేరుగులు తీర్చటం అలవాటైంది .అందుకే కవితలు ధగ దగా కాంతితో మిరు మిట్లు గొలుపుతాయి .పదహారవ ఏటఉంగరాలను అద్భుతం గా తయారు చేసే నేర్పున్న  బాబాయి పనికి అప్రెంటిస్  గా ఉన్నాడు .చదువు సంగతి తెలియదు . కేంబ్రిడ్జి లో రెండేళ్ళు చదివాడు .రెండు డిగ్రీలు ట్రినిటి కాలేజి నుంచి పొందాడు .’’లా’’చదవాలని కోరిక ఉండేదట .చదివి ఉద్ధరించాడో లేదో తెలియదు .

లండన్ చేరి బెన్ జాన్సన్ ముఠా లోచేరాడు .బెన్ ఇతన్ని తన’’ వారసకవి ‘’ అని చెప్పుకొన్నాడు . హీర్రిక్ ను అందరూ ‘’జాన్సన్ కొడుకు ‘’అనే వారు .కవిత్వం రాయటం మొదలేట్టాడు .మొదటి కవిత ‘’ప్రేయర్ టు బెన్ జాన్సన్ ‘’రాశాడు ‘’when I a verse shall make –know I have prayed thee –for old religion’s sake –saint ben to aid me’’అని మొదలు పెట్టి కైమోడ్పు లందించాడు తండ్రికాని తండ్రి కవితకు వారసుడు అయిన హీర్రిక్ .1629లో హుందాగా జీవించటానికి అభిమానులు వికారేజ్ డీన్ ప్రియర్ ‘’ను డేవాన్ షైర్ లో చేశారు. ఇక్కడే మరో పద్ద్దేనిమిదేళ్లున్నాడు .చక్కని ప్రకృతి ప్రశాంత పల్లె వాతావరణం నచ్చాయి .కాని ఎందుకో ఉండాలని పించేదికాదు .ఒక చెరసాలలో ఉన్నానని భావించే వాడు .పెద్దగా స్నేహి తులు యేర్పడ లేదు  .గ్రామీణ అనాగరక జనం పై అసహ్య భావం ఏర్పడింది ..దానినే కవితలో ‘’a people currish churlish as the seas –and rude almost as rudest as savages ‘’అని మండి పడ్డాడు .ఒంటరితనం మరీ బాధించింది .ఎటూ పాలు పోనీ స్థితి .

పల్లె ఊసులు అతన్ని ఆ కట్టుకోన్నాయి .అవే ప్రేరణ నిచ్చి కవిత్వం రాయించాయి. గొప్ప పరిశీలన ,ఊహ ఉండటం తో అనేక మూడ్స్ లో ఉండి ‘’బే ఫరవా కవితలు ‘’రాసి పారేశాడు .గ్రామీణ సెమి పాగన్ ఆకర్షించింది .గ్రామీణ క్రీడల్లో పాల్గొన్నాడు .పెంపుడు జంతువుల్ని బాగా చూసుకొన్నాడు .కొంచెం సేపు ఈ వాతా వరణం విసుగని పించేది .రాసినది అంతా’’ ఇనీసి ఏషన్’’ కోసం వచ్చిన వారిపై విసిరి పారేసి’’ మాన్ ఆఫ్ మూడ్స్’’ అని పించుకొన్నాడు .వాళ్ళు ఇతన్ని అర్ధం చేసుకొని మరింత ప్రేమ చూపారు .ఇతనూ కలిసి పోయాడు .ఈ మట్టి నుంచే మంచి కవిత్వం సృష్టించాడు .ఈ గ్రామీణ జీవితాన్ని నేపధ్యం గా చేసుకొనే అనాకానేక కవితలు సృష్టించాడు .యాభై ఆరో ఏట జీవిక పోయింది .సివిల్ వార్ లో రాజును సమర్ధించాడ ని కామన్  వెల్త్ ఇతని  పదవి ఊడ బెరికింది .లండన్ రావటం పెద్ద గా ఇష్టం లేదు .

నోబుల్ నంబర్స్ అని గొప్ప గా చెప్పుకొనే పుస్తకాన్ని పబ్లిష్ చేశాడు అందులో కొన్ని మంచి కవితే ఉన్నాయి .కవికి ,అతని నిజ జీవితానికి వైవిధ్యం కనీ పిస్తుంది .కవిగా ఒక రకం గా ప్రీస్ట్ గా వేరొక రకం గా వ్యవహరించాడు .అంటే ‘’స్ప్లిట్ పెర్సానాలిటి ‘’అన్న మాట .పదమూడు వందల కవితలు రాశాడు .హుషారు ,ఖుషీ ఉన్నకవి .ఎస్పెరిడేస్ అనే కవితా సంపుటి ప్రసిద్ధి చెందింది .స్విన్ బరన్ కవి హీర్రిక్ ను’’గ్రేటెస్ట్ సాంగ్ రైటర్ ‘ఎవర్ బారన్ ఇన్ ఇంగ్లీష్ రేస్’’’అన్నాడు ..

Robert Herrick (poet).jpg

ధామస్ కారే

అరిస్టాక్రాట్ గా పుట్టి మొదటి చార్లెస్ రాజుతో సహవాసం  చేసిన కవి ధామస్ కారే 1595లో పుట్టాడు. చాన్సారి లో మాస్టర్ అని పించుకొని ఆక్స్ ఫర్డ్ మేర్టాన్ కాలేజి లోచేరి పదమూడో ఏట డిగ్రీ పొందాడు .మిడిల్ టెంపుల్ లో పదహారవ ఏట ప్రవేశించాడు .ఇరవై ఏళ్ళ వయసులోపే ఇటలీకి రాయబారి అయ్యాడు .చాలా కాలం తర్వాత ప్రీవీ చేంబర్ లో జెంటిల్ మాన్ హోదా పొందాడు .ముప్ఫై రెండేళ్ళ వయసులో రాజు గారికి ‘’సర్వర్ ‘’అయ్యాడు .కవిత్వం రాశాడు అందులో బాధలూ ,వేదనలు చూపాడు .

హీరోయిక్ కప్లేట్ కవి -ఎడ్మండ్ వాలేర్

3-3-1606లో హెర్ట్ ఫోడ్స్ షైర్ లో లో విలాస వంతమైన ఎస్టేట్ లో ఎడ్మండ్ వాలేర్ పుట్టాడు .బకిం హాం షైర్ లో బీకన్ స్ ఫీల్డ్ లో గొప్ప ఎస్టేట్ కు   వారసుడయ్యాడు .కేంబ్రిడ్జి ఈతాన్ కింగ్స్ కాలేజి లో పదహారో ఏట ఏం ఏ పాస్ అయ్యాడు .పార్ల మెంట్ లలో శిక్షణ పొందాడని అంటారు .అధికారం లో ఉండి అసూయ తో అనేక సార్లు ‘’జంప్ జిలాని ‘’గా రాజకీయం మార్చాడు .స్తిరత్వం యేర్పడ లేదు .విధేయత లేకుండానే ప్రతి వెధవ నూ  అంటకాగాడు .దగ్గరికి యెంత స్పీడ్ గా చేరే వాడో అంత వేగం గా ఓదిలేసేవాడు.’’trained sychophant ‘’అని పించుకున్నాడు .చార్లెస్ రాజు దగ్గర బాగానే ఉన్నాడు ‘’వాలేర్ ప్లాట్ అని పిలువా బడే కుట్రలో పాలు పంచుకోన్నాడనే నేరం తో అరెస్ట్ అయ్యాడు .టవర్ జైలు కు పంపారు .పది వేల పౌండ్లు ఫైన్ చెల్లించి విడుదలయ్యాడు .రికార్డు కాని ఇంకా ఎన్నో కుట్రాల్లో స్నేహితుల్నీ మోసం చేశాడు .

ప్రొఫెషనల్  కవిగా గొప్ప గౌరవాన్ని   పొందాడు .యాభైయో ఏట ‘’పెనిగ్రిక్ టు మై లార్డ్ ప్రోటేకతాక్తర్’’రాశాడు .తర్వాత ‘’ట్రిబ్యూట్ టు ది కింగ్ అపాన్ హిస్ మెజెస్టీ ‘’రాశాడు .ఇరవై ఐదో ఏట ఒకమ్మాయిని పెళ్లి చేసుకొన్నాడు కాని మూడేళ్లకే చని పోయింది .మొదటి పుస్తకం కంటే రెండోది పేలవం గా ఉంది .పెన్ షార్ట్ లో లార్డ్ సిడ్నీ కుటుంబం తో పరిచయం ఏర్పడి లేడీ డరోతీ ని వలచి  ఆమె పై ‘’సచ్చరిస్సా ‘’రాశాడు. కాని ఆమె ప్రేమను తిరస్కరించింది .మేరీ బ్రాసీ ని పెళ్ళాడాడు .సమకాలీనులకు దూరం గా అర్దాయుస్సు తో చని పాయిన వారిని గురించి కలవర పడ్డాడు .వారికి భిన్నం గా ఎనభై రెండేళ్ళ దీర్ఘ జీవితాన్ని గడిపి 21-101687మరణించాడు .

పద్దేనిమిదో ఏటనే  కవిత్వం రాశాడు .రాజకీయాలలో మునిగి తేలుతూ కూడా మంచికవిత్వమేచేప్పాడు .మెటాఫిజికల్ కవిత్వం వదిలేసి ప్రక్రుతి కవిత్వాన్ని సరాళం గా చెప్పాడు .అతని ‘’హీరోయిక్ కప్లేట్స్’’మహా ఆదరణ పొందాయి .పది హేడవ శతాబ్ది అంతానికి ఇవి బాగా జనం లోకి చొచ్చుకు వెళ్లి   ఇంగ్లీష్ కవిత్వాన్ని డామినేట్ చేశాయి .

Thomas Carew.jpg

 

‘’క్రిబ్బెజ్’’ఆటను కనీ పెట్టిన- జాన్ సక్లింగ్

ఇతని సాహిత్య సహవాసులు గొప్పకవిగా,అతని తో ఆడిన వాళ్ళు తమ నాయకుడిగా జాన్ సక్లింగ్ ను మెచ్చుకొన్నారు .ఆ కాలం లో గొప్ప వేటకాడు జూదగాడు .రెండు వందల ఏళ్ళు సమాజం అతనికి రుణ పడి ఉంది .కారణం ‘’cribbage’’అనే ఆటను కనీ పెట్టింది అతనే .మిడిల్ సెక్స్ లో ట్వికెన్ హాం లో 1-2-1609లో డబ్బున్న కుటుంబం లో పుట్టాడు .కేంబ్రిడ్జి ట్రినిటి కాలేజి లో చదివాడు పదిహేనవ ఏట .మొదటి జేమ్స్ రాజు తండ్రి కి నైట్ హోదా ఇచ్చాడు  కాని త్వరలోనే తండ్రి మరణించటం తో ఎంతో విలువైన ఆస్తికి వారసుడయ్యాడు .స్నేహిత బృందం పెద్దది .పందొమ్మిదో ఏట ఎందుకూ పనికి రాని  బేవార్సు గా తిరుగు బోతు గా మారిపోయాడు .ఫ్రాన్స్ ,ఇటలీలు చూశాడు. డబ్బు హజం కిందా పైనా కాన నీయ లేదు .జేర్మనిలో గుస్తావాస్ అదోల్ఫాస్ తరఫున యుద్ధం చేశాడు. ఇంగ్లాండ్ తిరిగి వచ్చి ఏదో ఒక పనికి మాలిన సాహస కృత్యాల తో విచ్చల విడిగా డబ్బు దుబారా చేస్తూ గడిపాడు .

ఇరవై ఒకటవ ఏట నైట్ హుడ్ లభించింది .చతుర సంభాషణం ,విచ్చల విడి ప్రవర్తన్ అందర్నీ ఆకర్షించింది .రాజ దర్బారు లో చేరి అందర్నీ ఆకట్టుకొన్నాడు .అతని నాటకం ‘’ఆల్గార ‘’ప్రదర్శించినప్పుడు నటులు వేసుకొనే సాధారణ దుస్తులను వేసుకో నివ్వ లేదు అసలైన జరీ లేసుల్ని ,ఏమ్బ్రాయిదరీలను అసలైన బంగారు వెండి లతో చేయించి వేయించాడు .చార్లెస్ రాజు తో స్కాట్లాండ్ పరిశోధనకు బయల్దేరినపుడు వంద గుర్రాల తో పన్నెండు వేల పౌండ్లు ఖర్చు చేసిఒక దళాన్ని  ఏర్పాటు చేశాడు .గుర్రాలకు సింగారం ఆశ్వికులకు అదిరే దుస్తులు స్కార్లెట్ కోట్లు  సమకూర్చాడు .ఇలా అంచెలంచెలుగా ఎదిగాడు. కాని ఒక చిన్న పొరబాటు జరిగింది .ఎరల్ ను బహిష్కరించిన తర్వాత విధేయుడైన స్త్రాఫార్డ్ ను రక్షించే ప్రయత్నం లో విఫలమయ్యాడు .ఇది బయట పడింది .ఫ్రాన్స్ కు పరారయ్యాడు .అక్కడే ముప్ఫై మూడో ఏట చని పోయాడు .తన డబ్బంతా ‘’సక్ ‘’చేసి ఊరందరికీ పెట్టిన సాక్లింగ్ ప్రవాసం లో చావటం విడ్డూరం .ఆత్మ హత్య చేసుకోన్నాడని అంటారు .కాదు అవిధేయుడైన నౌకరు పొడిచి చంపాడని రుజువైంది

నాటక రచయిత గా కొన్నే రాసినా పెద్ద కవితలు చాలా రాశాడు ప్రజలకు దగ్గరవ్వాలనే ధ్యేయం తో తన ‘’అగ్లారా ‘’ను ఒకదాన్ని ట్రాజిక్ గా మరోదాన్ని హాపీ ఎండింగ్ గా సవ్య సాచిత్వం తో రాశాడు .అతాని నాటకాలేవీ బతికి బట్ట కట్ట లేదు .’’సెషన్ ఆఫ్ దిపోఎట్స్ ‘’ను మాత్రం విద్యా వంతులు ఆదరించారు .బెన్ జాన్సన్ కు తనను గురించి ‘’హావ్ యు సీన్ బట్ ఏ బ్రైట్ లిలీ గ్రో’’అని తెలియ జేశాడు అతని’’ బాలడ్ అపాన్ వెడ్డింగ్’’ బాగుంటుంది .సంభాషణా చాతుర్యం తో కవిత నడిపిస్తాడు .

 

 

రిచార్డ్ లవ్ లేస్

మొదటి జేమ్స్ వలన నైట్ హుడ్ పొందిన ఒక పెద్ద మనిషి కొడుకే రిచర్డ్ లవ్ లేస్.బంగారు చెంచా  ఉన్న నోటి తో పుట్టిన భాగ్య వంతుల బిడ్డ .అందమైన రూపం ,సాహసం లతో రాజాస్థాన ఉద్యోగి అయ్యాడు సక్లింగ్ లా కాకుండా ఎప్పుడూ కస్టాల  అంచులలోనే బతికాడు .ఎక్కువ కాల జైలు లోనే గడిపి. కావాలనే 1657లో చచ్చి పోయాడు .

1618లో పూర్వ కేంటిష్ కుటుంబం లో వూల్ విచ్ లో జన్మించాడు .చార్టర్ హౌస్ స్కూల్ లో చదివాడు .ఆక్స్ ఫర్డ్ గ్లూసేస్టర్ హాల్ లో పై చదువు .నాలుగు పెద్ద ఎస్టేట్లకు వారసుడయ్యాడు .తారా పధం లోకి దూసుకు పోయాడు .సరైన రాజకీయ పక్షం వైపుకు చేరకుండా తప్పుడు నిర్ణయం తో ఇరవై నాలుగో ఏట గెట్ హౌస్ జైలు శిక్ష అనుభవించాడు .అతని కవితల్లో గొప్పదైన ‘’టు ఆల్తియా ఫ్రం ప్రిజన్ ‘’రాశాడు .’’stone walls do not make a prision make –nor iron bars a cage –minds innocent and quiet take –that for an hermitage –if I have freedomin my love –in my soul am free –angels alone that soar aove –enjoy such liberty ‘’అని నిబ్బరం గా రాసుకొన్నాడు

జైలు నుంచి విడుదల అయిన తర్వాత నలభై వేల పౌండ్ల ధనవంతుడుగానే ఉన్నాడు .స్నేహితులు కవుల బృందం చేరింది .తాను దేశ భక్తుడినని రుజువు చేసుకోవాలనుకొన్నాడు .పెరోల్ మీద ఉండగానే రాయలిస్ట్ ఆర్మీ కోసం ఒక రెజిమెంట్ ను ఏర్పరచాడు .కాని అది పూర్తిగా ఓడిపోయింది యుద్ధం లో .నాలుగు ముదనస్టపు ఆస్తులను హారతి కర్పూరం లా హరిన్చేశాడు .పదేళ్ళు చేతిలో పెన్నీ లేకుండా కటిక దరిద్రాన్ని అనుభవించాడు .రాజ లాంచనాలతో ఖరీదైన దుస్తులతో వెలిగి పోయిన వాడు చీకి గుడ్డలతో మురికి వాసనతో ఏవ గిమ్పుగా కనీ పించి అందరికీ దూరమయ్యాడు .poor in body and purse be fitting the worst of beggars and the poorest of the servants’’లాగా తన పరిస్తితి ఉందని వాపోయాడు .చేసుకొన్నా వాడికి చేసుకోన్నంత. విధీ వక్రించింది పాపం .స్నేహితులు కవులు అంటే భయమేసింది .రోడ్ల మీద పడ్డ ఎంగిలి పదార్ధాలను ఏరుకొని తినే దుస్తితి వచ్చింది .గన్ పౌడర్ ఆల్లీ లో ఉన్నాడు క్షయ సోకింది .

చిన్న కవితలకే పేరొచ్చింది .కవితల వెనక కవే కనీ పిస్తాడు .రూపకాలన్కారాలను స్వేచ్చగా వాడాడు .

 

 

సశేషం

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -15-5-14-ఉయ్యూరు

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

పూర్వాంగ్ల కవుల ముచ్చట్లు -19 పవిత్రులు –రంద్రాన్వేషకులు

పూర్వాంగ్ల కవుల ముచ్చట్లు -19

పవిత్రులు –రంద్రాన్వేషకులు

ఇంగ్లాండ్ లో మొదటి చార్లెస్ రాజుకు నియంత క్రూరుడు అయిన క్రాం వెల్ కు మద్య జరిగిన పోరాటం ఇంగ్లాండ్ లో ప్రతి మూలా జరిగింది .1629-నుండి 1640దాకా  పదకొండు ఏళ్ళు  సాగిన ఈ విద్వేషాగ్ని దేశం లో పార్ల మెంటే లేకుండాను ,మరో పదకొండేళ్ళు1649-60 రాజే లేకుండాను పరిపాలన  చేసింది . న్యూ కామన్  వెల్త్లే ఫ్రీ స్టేట్ ఎలా ఉన్నా బాగా ప్రాచుర్యం పొందింది .దేవుడే తన తో చేయిస్తున్నాడని క్రూరం గా నిర్దాక్షిణ్యం గా మానవ మారణ కాండచేసి  క్రూర నియంత గా పాలించిన క్రాం వెల్ చివరికి సహచారులే అసాహ్యించుకొనే స్తితిని తెచ్చుకొన్నాడు .ప్రజలు ఈ నిత్య బాధ భరించలేక సుపరిపాలన కోసం మంచి రాజు కోసం నిరీక్షిస్తున్నారు .ప్రవాసం లో ఉన్న రెండవ చార్లెస్ ను అభిషిక్తుడిని చేశారు .ఈ దశ లో దేశం అంతా రాజకీయం గా ,మత పరం గా విడి పోయింది .దీని ప్రభావం సాహిత్యం మీదా పడింది .ఉత్సాహం,మానవ ద్వేషం (enthusiasm and cynism )ల మధ్య ఊగి పోయింది ప్యూరిటన్లు అనే రంద్రాన్వేషక కవులు (puritans so called caviliar poets)హుషారైన కవితలు రాసి ఊగిపోయారు .బెన్ జాన్సన్ ప్రభావం వీరిమీడా ఇంకా ఉంది .లాటిన్ నుండి విషయాన్ని భావాల్ని అరువు తెక్చుకొని రాయటం లో విజ్రుమ్భించారు .అలాంటి ప్యూరిటన్ కవులలో ఆండ్రూ మార్వేల్,ధామస్ కేర్ రాబర్ట్ హీర్రిక్ ,ఎడ్మండ్ వాలేర్ ,జాన్ సక్లింగ్ ,రిచార్డ్ లవ్ లెస్ ఉన్నారు .ఇప్పుడు వీరి గురించే తెలుసుకో బోతున్నాం .

ఆండ్రూ మార్వేల్

ఆండ్రూ మార్వేల్  ప్యూరిటన్ మాత్రామే కాదు కవిలియర్ కూడా .31-3-1621లో పుట్టి 16-8-1678లో చనిపోయాడు .జీవితం అంతా వైరుధ్యమే .ప్యూరిటన్ కవులలో అగ్రగామి .కాని సహచరులు  కేవిలియర్ గా ఇష్టపడ్డారు .మొదటి చార్లెస్ పై పై సాను భూతి ఉన్నది . క్రాం వెల్ సెక్రటరీగా మిల్టన్ ఉన్నప్పుడు ఇతను మిల్టన్ కు అసిస్టంట్ గా ఉన్నాడు .మార్వేల్ ‘’రాక్షకుడి ‘’ని  ను సీజర్ తో పోలుస్తూ  వొద్ రాశాడు .క్రాం వెల్ చచ్చిన తర్వాత అబ్బే లో అతని అంత్యక్రియలకు హాజరైనాడు .రెండేళ్ళ తర్వాతా ‘’రేస్తోరేషన్ పార్ల మెంట్ ‘’లో సభ్యుడయ్యాడు  .ఈ పార్లమెంట్ క్రాం వెల్ సమాధిని తవ్వి పారేసి తలను నరికి అవమాన పరచిన సభలో ఉన్నాడు .ప్రజలకు దగ్గరగా ఉండేవాడు .దీనికోసం దేని నైనా భరించేవాడు .

హాల్ దగ్గర విన్స్తేడ్ లో పుట్టాడు తండ్రి దగ్గరే చదివాడు. ట్రినిటి కాలేజి లో చదివి బి ఏ సాధించాడు .తర్వాతా విరుద్ధ భావాల తో పని చేశాడు .గట్టి రాయలిస్ట్ గా ఉంటూనే పార్ల మెంట్ ను సమర్ధించే వాడు .మిల్టన్ బంధువు సిరియాక్ స్కిన్నార్ డబ్బు తో ఆదుకొనే వాడు .మిల్టన్ కు పరిచయం చేశాడు .క్రాం వెల్ సైన్కాదికారి అయిన లార్డ్ ఫెయిర్ ఫాక్స్ కూతురుకు కు ట్యూటర్ గా ఉన్నాడు .క్రాం వెల్ దుస్ట చేష్టలకు విసిగి వేసారి యార్క్ షైర్ లోని ‘’నన్ ఆప్పిల్ టన్ ‘’కు వెళ్ళిన ఫైర్ ఫాక్స్ తో మార్వేల్ తానూ వెళ్ళాడు .అక్కడే కవిత్వం రాయటం ప్రారంభించాడు .దీన్ని ‘’గార్డెన్ పోయిట్రీ’’అన్నారు .అందరూ ఆదరించి మెచ్చుకొన్నారు .ముప్ఫై అయిదేళ్లకు క్రాం వెల్ వార్డ్ కు ట్యూటర్ అయ్యాడు .తర్వాత మిల్టన్ అసిస్టంట్ట్ అయి, రాయలిస్ట్ లు మిల్టన్ ప్రాసిక్యూట్ చేసినప్పుడు అతన్ని సమర్ధించాడు .క్రాం వెల్ ను సమర్ధించినా చార్లెస్ రాజుకు దగ్గర కాలేక పోయాడు .ఇద్దరి స్వభావాలను బేరీజు వేశాడు .క్రాం వెల్ సమర్ధుడు ,పాలకుడు ,విధి చేతి కీలు బొమ్మ అనుకొన్నాడు చార్లెస్ పవిత్రుడు వివేకం ఉన్న సమర్ధుడు మత ధర్మం తెలిసిన వాడు అని తేల్చుకొనిసివిల్ యుద్ధం గొప్ప విపత్తు  తెచ్చిందని  భావించాడు .పార్ల మెంట్ మళ్ళీ బతికి బట్ట కట్టిన తర్వాతా మెంబర్ అయ్యాడు .సాదు స్వభావి .అయినా రాస్తే మాత్రం నిప్పులు చేరుగుతాడు .రాజకీయ వ్యంగ్యాత్మక రచనలు చేసి అందర్నీ కడిగి పారేసే వాడు .పారడీ ని పండించాడు .చార్లెస్ శైలిని ఒక ఉపన్యాసం లో పారడీ గా రాసి అందరి దృష్టీ ఆకర్షించాడు .చార్లెస్ ఇంటి వ్యవహారాలూ వివాహేతర సంబంధాలు అన్నిటిని దూది ఎకి నట్లు ఎకేశాడు  .రాజు చదివి నవ్వుకొన్నాడు .’’లాస్ట్ ఇంస్త్రక్షన్స్ టు ఏ ప్రింటర్ ‘’లో చార్లెస్ ఉద్యోగుల అవినీతిని  డచ్ స్త్రీలతో శృంగారాన్ని తెలియ జెప్పాడు .ప్రబుత్వ ఉద్యోగం ఊదదీయలేదు  పబ్లిక్ సర్వెంట్ గా నే యాభై ఎనిమిదవ ఏట చని పోయే దాకా ఉన్నాడు .

విరుద్ధత మార్వేల్ ప్రత్యేకత .’’his verse is both worldly and detached from the world .,classical ,and yet colloquial rhetorical yet eminently reasonable ‘’అతని ఒప్ప కవిత ‘’to his coy mistress ‘’.అతని కవితలో ‘thou by the Indian Ganges side ‘’అని భారత దేశాన్ని పవిత్ర గంగా నదిని అందులో చేర్చాడు  .ఇర్వి ఏళ్ళు పార్ల మెంట్ లో మెంబర్ గా ఉంది తన మేధావి తనాన్ని దేశానికి ఉపయోగిమ్చేట్లు చేశాడు .అతని సమాధి పై ‘’the grave is fine private place . But none I think do there embrace’’అని అతని కవితా పంక్తుల్నే రాశారు .’’marvel;s style is more than a technical accomplishment or the vocabulary and sintaaxof an epoch it is what we have designated tentatively as wit a tough reasonableness beneath the lyric grace ‘’అన్నాడు టి ఎస్.ఇలియట్ .’’it is difference between intellectual poet and the reflective poet ‘’అని భావిస్తూ ఈ ట్రెండ్ వలన సాంప్రదాయానికి  ఆత్మ అంతఃకరణ సంబంధం పెరిగిందని ,దాని వలన కొత్త బలమైన శిల్పం శైలీ విన్యాసం భావం లో విధానం లో వచ్చి బైబిల్ కు క్లాసికల్ రచనకు కవిత్వం దూరమై కొత్త పోకడలు  పోయింది అన్నారు .కవిగా కంటే వచన రచయిత గా మంచి పేరు పొందాడు .

Andrew Marvell.jpg

 

 

సశేషం

శ్రీ దేవర్షి నారద మహర్షి జయంతి శుభా కాంక్షలతో

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -15-5-14-ఉయ్యూరు

 

 

 

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

పూర్వాంగ్ల కవుల ముచ్చట్లు -18 టెన్నిసన్ కు మార్గ దర్శి -హెన్రి వాఘన్

పూర్వాంగ్ల కవుల ముచ్చట్లు -18

టెన్నిసన్ కు మార్గ దర్శి -హెన్రి వాఘన్

దక్షిణ వేల్సు లో సిల్యూరులు అనే తెగ కు చెందినా వాడవటం వలన హెన్రి వాఘన్ ను  ‘’సిల్యూరిస్ట్’’అన్నారు .పురాతన తెగకు చెందినా వాడే ..ఆగిన్ కోర్ట్ లో వాళ్లకు ప్రాతినిధ్యం ఉండేది .తండ్రి సర్ థామస్ వాగ్హన్ ను మూడవ రిచర్డ్ రాజు చాపించడని షేక్స్పియర్ నాటకం తెలియ జేస్తోంది .హెన్రి థామస్ లు కవలలు,17-4-1621లో జననం  ఇంటి వద్దే ప్రాధమిక విద్య నేర్చి ఇద్దరూ ఆక్స్ ఫర్డ్ లోని జేసూస్ కాలేజి లో చేరారు థామస్  బి.యే. పాసై ఆల్కమిస్ట్ గా మాజిక్ డీలర్ గా అయ్యాడు .డిగ్రీ కాకుండానే హెన్రి లండన్ వెళ్లి మెడిసిన్ చదివి ఇరవై మూడో ఏట డాక్టర్ అయ్యాడు .బ్రిటన్ అంతర్యుద్ధం అతని వ్రుత్తి పై ప్రభావంకలిగించింది .రాజు గారి రౌటేన్ హీత్ యుద్ధ రంగం లో వెల్ష్ అంగ రాక్షక ఆశ్విక దళం లో ఒకడైనాడు .రాయలిస్ట్ గా గొప్ప విశ్వాసం కలిగి ఉన్నాడు .రెండేళ్ళ తర్వాత రిటైర్ అయి, వైద్య సేవ చేస్తూ వ్యాధిగ్రస్తుల పాలిటి ఆపద్బాన్ధవుడై ,కవిత్వాన్ని కూడా రాస్తూ గడిపాడు .బ్రేక్ నాక్ లో అర్ధ శతాబ్దం వైద్య సేవలో గడిపాడు .తర్వాత స్వంత ఊరు ‘’న్యూటన్ బై అస్క్ ‘’లో 7323-4-1695న చని పోయాడు .

వాఘన్ మతం మార్చుకొని బతకాల్సి వచ్చింది .సివిల్ వార్ ఫలితాల వైపరీత్యం వలన ,జబ్బు పడటంవల్ల అన్న చావు ,స్నేహితుల మరణాల తో కుంగి పోయాడు . ప్రపంచం లో మానవ దుఖాలను చూసి చలించాడు .ఇవన్నీ ‘’సైలెంట్ సింటిలన్స్’’రెండవ భాగం లో ప్రతి ఫలించాయి .24లో మొదటి భాగం వచ్చింది .’’పోయెమ్స్ ‘’లో ఎలిజబెత్  యుగాంతర  ధోరణి కనీ పిస్తుంది .వాగ్హన్ ,హెర్బర్ట్ ల మధ్య పోలిక ఉందని అంటారు కాని భేదమే ఎక్కువ కనీ పిస్తుంది .హెర్బర్ట్ వాడిన అలంకారాలు చర్చి సాంప్రదాయం లో ఉంటాయి .వాఘన్ వి ప్రక్రుతి పరం గా ఉంటాయి .పరిశీలన తో కంటే ప్రేరణ తో వాగ్హన్ కవిత్వం రాశాడు .హీర్బ్బర్ట్ ఇమేజెస్  సాంద్రం గా  గా ఉంటె వాగ్హన్ వాటిని పలచన చేస్తాడు .మేధావి కవి గా కంటే భావోద్రేకం ఉన్న కవి గా గుర్తింపు పొందాడు .ప్రక్రుతి ప్రేమికుడు మాత్రమే కాదు సృష్టి కర్త అయిన దేవుడికీ  దగ్గరయ్యాడు .’’vaughan was with man’s love of God ,he was also convinced of God;s need of man , a love beyond logic ,an essential mysticism which the intellect can never explain ‘’.ప్రకృతిని భౌతికాతీత ద్రుష్టి తో చూశాడు .అతని కవిత్వాన్ని ఆస్వాదిద్దాం .

‘’there is in God some say –a deep but dazzling darkness ,as men here –say it is late and dusky ,because they –see not all clear .-of for that night where I in Him –might live invisible and dim ‘’

సెక్యులర్ భావాలు కొన్ని అతనిలో కనిపిస్తాయి .వీటిని తరువాతి తరం కవులు ఆదర్శం గా తీసుకొన్నారు .తన కాలం కవుల కంటే భిన్నం గా రాశాడు .సమాజ దీన స్తితికి జాలి పడ్డాడు .దేవుడిని ,ప్రకృతిని ,స్వీయ అనుభవాలను రంగ రించి కవితలు రాసి అందరికంటే భిన్నత్వం చూపాడు .అతని కవిత్వం లో అ కాలానికంటే ఆధునిక భావాలు  ఉండటం ప్రత్యేకత .’’Vaughan is recognized as  another example of a poet who can write both graceful and effective prose .he influenced the work of such poets as words worth ,Tennyson and Siegfried Sasson .అమెరికా సైన్స్ ఫిక్షన్ రచయిత ‘’ఫిలిప్ కే డిక్ ‘’కూడా వాగ్హన్ ప్రభావం తన మీద ఉందని చెప్పాడు .

 

henry vaughan 1621 1695 henry vaughan was born in 1622 in breconshire ...

 

వర్డ్స్ వర్త్ కు ప్రేరణ -ధామస్ ట్రహెర్నే

1636-37లో పుట్టి 27-9-2674లో చనిపోయిన’ ధామస్ ట్రహేర్నే’’ గురించి వివరాలు సరిగ్గాలేవు . వెల్ష్ లో హియర్ ఫోర్డ్ షూ మేకర్ కొడుకు .ఆక్స్ ఫర్డ్ లో’’ బేసి నోస్ కాలేజిలో’’ చేరాడు .1657లో డిగ్రీ పొందాడు .క్రేడేన్ హిల్ లో ఒక ‘’పార్సనేజ్ ‘’గా పని చేశాడు .పదేళ్ళ తర్వాత సర్ ఓర్లాండో బ్రిడ్జ్ మాన్ కు ‘’చాప్లిన్ ‘’అయ్యాడు .ఓర్లాండో రాజ ముద్రికలను భద్ర పరచే ఉద్యోగి .అతనితో లండన్ వెళ్లి అతనితో తిరిగొచ్చాడు .అతనితోనే జీవించాడు .అతనితోనే  ట్ర హేర్నేర్నే47వయసులో  మరణించాడు .

విడవ కుండా రాసినా ధామస్ రచనలలో ఒక్క పుస్తకమే ‘’రోమన్ ఫోర్జేరీస్’’ అతని జీవితకాలం లో అచ్చయింది .ఆ తర్వాత రెండు వందల ఏళ్ళ దాకా అతని ఏ కవితా ముద్రణ భాగ్యం పొంద లేదు .ఆధునికులు వెతికి తీసి అతని కవిత్వపు విలువ ను నిగ్గు తేల్చారు .అతని వారసులకూ ఏమీ పట్ట లేదు . రెండు శతాబ్దాల తర్వాత ఒక బుక్ స్టాల్ లో వ్రాత ప్రతులు దొరికాయి .వాటిని కొన్ని షిల్లింగులు షాపు వాడికి చెల్లించి ఒక విద్వాంసుడు ‘’అలేక్సాండర్ బలూచ్ గ్రోసార్ట్ ‘’దక్కించుకొన్నాడు .వాటిని వాగ్హన్ కవి అముద్రిత కవితలను కొన్నాడు. పరిశోధకులు గ్రోసార్ట్ పొరపాటు పడ్డాడని నిర్ధారించి అవి ట్రాహేర్నే వే నని తేల్చి ,ముద్రించారు .

చర్చ ఆఫ్ ఇంగ్లాండ్ లో మినిస్టర్ గా ఉన్న ట్రాహేర్నే  బగ వంతునిపై అచంచల విశ్వాసం ,విధేయత అణకువ ఉన్న వాడు .నిత్య సంఘటనలను కూడా దేవుని లీల గా భావించి తన్మయం చెందేవాడు .పసి పిల్ల వాడిలాగా ప్రపంచాన్ని చూసే వాడు. ప్రతిదీ ఆశ్చర్యమే ప్రతిదీ దేవుని మహత్తే ..గొప్ప జాగ్రుత స్థితి ,పసి పిల్లాడి స్వచ్చ మనస్తత్వం అతికి ఉండటమే కాదు అది కవిత్వం లో ప్రతి ఫలించింది కూడా .’’for him the mere act of wandering is wonderful ‘’ అని పిస్తుంది .’’Traherne;s singular verses are to use the title that headed his un published volume ‘’poems of felicity ‘’మెటాఫిజికల్ కవి గానే గుర్తింపు పొందాడు .అతని కవిత్వం లో ‘’there is a frequent discussion  man;s almost symbolic  relationship with nature as well as frequent use of literal setting  that is an attempt faithfully re producing a sense of expression  from a given movement  a technique later used by William Words Worth .’’ఇలా ప్రక్రుతి కవి వర్డ్స్ వర్త్ ను ప్రభావితం చేసిన కవిగా చరిత్ర స్థాపించాడు .

ఆంగ్లికనిజం లో సెయింట్ గా గుర్తింపు పొందాడు .అమెరికా లోని ఎపిస్కోపల్ చర్చి ట్రాహర్నే మరణ దినాన్ని ‘’ట్రాహేర్నే ఫీస్ట్ డే ‘’గా గౌరవం తో నిర్వహిస్తారు .

Stained glass in the cathedral - geograph.org.uk - 615756.jpg  

సశేషం

దేవర్షి నారద మహర్షి జయంతి శుభా కాంక్షలతో

మీ- గబ్బిట దుర్గా ప్రసాద్ -15-3-14-ఉయ్యూరు

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

నాన్సెన్స్ సీరియళ్ళు ఆపండి

నేను కొద్దిగా ఇష్టపడే చానల్ మా చానల్న అందులో  చిన్నారి పెళ్లి కూతురు బాగా ఇష్టం గా చూస్తాను .దానికి ముందు వచ్చేవి మరీ అసహ్యం గా అసహనం గా అతిగా ,నీచ మనస్తత్వాలకు ప్రతిరూపాలుగా ఉంటున్నాయి .రాత్రి ఏడున్నరకు వచ్చే ”కాంచన గంగ ”తలాతోకాలేకుండా పరిగెత్తుతూనే ఉంది . అందులోఅత్తా కోడలు పాత్రలు స్త్రీ లు సిగ్గు పడేలా చేస్తున్నాయి వల్గారిటి పరాకాస్ట  గా ఉంది .కొదల్ని భర్తనూ చంపే ప్రయత్నాలే ఏ భాగం లో చూసినా .ఒళ్లంతా  నగలు దిగేసుకొని గ్లామర్ కు గ్రామర్ మిస్టేక్ లేకుండా సింగారించుకొని ఆ అత్తా కోడళ్ళు ఆడుతున్న నాటకం భీభత్సం గా ఉంటోంది  మొగుడు కాని  కాని మొగుడితో కోడల్ని కాపురం చేయమని అన్ని రకాల ఒత్తిళ్ళూ తెస్తుంది అత్త. అత్తకు సపోర్ట్ కొడుకు భార్య కోడలు.  వీరిద్దరి పాత్రల్నీ యెంత త్వరగా ముగిస్తే అంత మంచిది మొగుడు దు  కానికిరాయి  మొగుడు వచ్చి డబ్బుకోసం కక్కూర్తి పడి , ఎక్కడో ఒకమ్మాయిని రెప చేసి చంపి వచ్చి ఇక్కడ కిరాయి మొగుడుగా బతుకుతూతప్పించుకు తిరుగుతూ  ఆ ఇంటి ఒకే ఒక మనవరాలినీ అత్తా కోడళ్ళ ప్లాన్ తో చంపటానికి సిద్ధం .ఇదెమి దౌర్భాగ్యపు సీరియలో అర్ధం కావటం లేదు యెడ తెగని హింస  మనిషి  ప్రయత్నం కంటే దైవ ఘటన పెద్ద కోడల్ని కాపాడుతూ ఉంటుంది తాగుడుకు బానిస అయిన మరిదిని సన్మార్గం లోకి మార్చిన కోడలు ఇప్పుడు పీకల్లోతు కష్టాల్లో అవమానాల్లో ,అపాయం లో క్షణ క్షణ భయం తో జీవించి మనల్ని హిమ్సిస్తోంది ”.ఇమ్మీడి యెట్లీ  స్టాప్ దిస్  నాన్సెన్స్ సీరియల్ ”

   రాత్రి ఎనిమిదింటికి వచ్చే ”అష్టా చమ్మా ”మరీ దారుణం .ప్రెమించుకొన్న వాళ్ళు మనసు విప్పి మాట్లాడుకోరు.  తెగ సాగదీస్తారు కాని అంగుళం కూడా కదా కదలదు వారిద్దరి మధ్యా ముద్దు మురిపాలు జరగవు.  భరించలేని తలకాయ నెప్పి మనకు .ఇన్దులొ స్వప్న పాత్ర ఎప్పుడూ క్రూరంగా ఆలోచిస్తూ తను వలచిన వాడికి తన మీద ప్రేమ లేక పోయినా అన్ని రకాల వెకిలి చేష్టలూ చేస్తూ ,తండ్రిగా భావింప బడే వాడినితల్లిగా భావించే ఆవిదనూ  ,తను ప్రేమించిన వాడు వలచిన దాన్నీ,అడ్డం   వచ్చిన  ఆ అమ్మాయి కుటుంబాన్ని కిరాయి రౌడీలతో చంపే ప్లాను సాగుతూనే ఉంటుంది . అంతం లేదు ఇంతలో తగుదునమ్మా అని ”గీతాంజలి ”ప్రవేశం ఆ కర్కోటకు రాలికి వత్తాసు .ప్రెమికుడి  తల్లి నిమిషానికో మాట .యెటో  తేల్చుకోలేని ఇంటి పెద్దాయన  మాటలు  మర్చి పోయి,గుమ్మిడి కాయలో వీల్ కుర్చీకి పరిమితమైన న ఆయన భార్య అవిడ కు  తలమీద  ఏదో దెబ్బతగిలి మాటలు వచ్చి అసలు నిజం బయట పెట్టె దెప్పుడో ఈజీడిపాకం ఆగి పోయే దెప్పుడో తెలీదు అ సహజమైన సీరియళ్ళను మా చానల్ ప్రసారం చేస్తున్నందుకు అభిశంశించాలి .యెప్పుడా అష్టా చెమ్మాఆట  ఆగిపోతున్దిరా బగ వంతుడా   అని వేయి కళ్ళతో చూసే వాళ్ళు ఎదురు చూస్తున్నారు.  ట్రాష్ ఇక ఆపెయ్యండ హే ..
  కాని రాత్రి ఎనిమిదిన్నరకు వస్తున్న” శశి రేఖా పరిణయం ” బాగుంటోంది ” శశి బి టెక్”వేషం వేస్తున్న అమ్మాయి హావ భావాలతో మహా ముచ్చటగా ఉంది .బుల్లి తెరకు ఒక కొత్త వయ్యారాన్ని సింగారాన్ని నటనను చిలిపితనాన్ని తెచ్చింది ఆ పిల్ల పేరేమిటో నాకు తెలియదు కాని ఆ నటన అద్వితీయం .నాకు తెలిసి నంత వరకు నాటక ,సినీ టివి రంగాలలో ఇంతకూ ముందు నటించిన ఏ నటీ మణులూ ఇంత    బాగా చేయలేదని ధంకా బాజా ఇంచి చెప్పగలను అనితర  సాధ్యమైన నటనను హావభావాలను నవ రసాలను ఒలికిస్తోంది ఆ పిల్ల  ”అమ్మానీ నటనకు జొహార్.” .బుల్లి తేర బంగారానివి నువ్వు .నీ టేలెంట్ ఎవరు కనీ పెట్టి ఈ సీరియల్ లో నీతో చేయిస్తున్నారో వారి అన్వేషణకు అభినందనలు ”కీప్ ఇట్  అప్ తల్లీ” ఈ సీరియల్ లో హీరో” అభి”కళ్ళ జోడుతో ఉన్నా బానే చేస్తున్నాడు అతని తల్లి పాత్ర చేసే ఆమె సీనియర్ నటియే  .”మేకప్ చెడి పోతుందేమో ననే భయం తో జాగ్రత్తత తో పాత్ర  ను చేస్తున్నట్లని పిస్తోంది   బల రామయ్య విగ్రహం పుస్టి యే  .దబ్బింగ్ జానకి నాయనమ్మ పా త్రలో మేకప్ ఎక్కువగా ఉన్నా బానే చేస్తోందిఆమ్మను మనవ రాలు ”బాలా ”అని పిలవటం సరదాగా ఉంది మి గిలిన పాత్రల గురించి పెద్దగా చెప్పాల్సిందేమీ లేదు .ఉన్నంత  లో కాస్త రిలీఫ్ ఇస్తున్న సీరియల్ .శశి రేఖా పరిణయం
   ఏ సీరియల్ లోనైనా పాత సినిమా పాటలను సందర్భానికి తగినట్లు పెట్టి పబ్బం గడుపు కొంటున్నారు
 మీ -గబ్బిట దుర్గా ప్రసాద్-  15-5-14-ఉయ్యూరు

Posted in సమయం - సందర్భం | Tagged | 2 Comments

పూర్వాంగ్ల కవుల ముచ్చట్లు -17 రిచార్డ్ క్రాషా

పూర్వాంగ్ల కవుల ముచ్చట్లు -17

రిచార్డ్ క్రాషా

ప్రఖ్యాత ప్యూరిటన్ బోధకుడు విలియం క్రాషా కు రిచర్డ్ క్రాషా1612లో పుట్టాడు .మత బోధన మీదే అభిమానం .రోమన్ చర్చి పై మనసు మళ్ళింది .’’యాంటి పాపిస్ట్’’ అయిన తండ్రికి ఇది వ్యతిరేకం .లండన్ లో పుట్టి పెం బరాక్ లో ,చార్టర్ టన్ లలో చదివి ,మత ప్రచారకుల మధ్యనే నడి వయసు గడిపాడు .అబ్రహాం కౌలీ కవికి దగ్గరయ్యాడు .కౌలీ కవిత్వం లో మెళకువలు నేర్పటమే కాక ఆర్ధిక సాయమూ చేసేవాడు .ఇంగ్లాండ్ అంతర్యుద్ధ సమయం లో ఆర్ధికం గా పేదరికం  అనుభ వించలేక పారిస్ చేరాడు .కౌలీయే రిచార్డ్ ను లండన్ తీసుకొచ్చాడు .ప్రవాసం లో ఉన్న రాణి హెన్రి ఎట్టా మేరియా దృష్టికి క్రాషా విషయాన్ని తీసుకు వెళ్ళాడు .ఆ ఏడాదే క్రాషామతం మారాడు రోమ్ కు   చెందిన కార్డినల్ పలాట్తో.కు ప్రైవేట్ సెక్రటరి అయ్యాడు .తరువాత లోరాటో లోని హోలీ హౌస్ కేధడ్రిల్ కు’’ సబ్ కానన్ ‘’గా పదివి పొందాడు .రాజకీయం గా ,వ్యక్తీ గతం గా కుట్రల్లో కూరుకు పోయాడు .36వ ఏట అకస్మాత్తుగా16-8- 1649లోక్రాషా జీవితం నుంఛి కనుమరుగయ్యాడు  .

‘’స్టెప్స్ టు ది టెంపుల్’’అనే క్రాషాపుస్తకం అతని ప్రవాస కాలం లోనే వెలువడింది .ఇది హెర్బర్ట్ రాసిన ‘’ది టెంపుల్ ‘’ను పోలి ఉందన్నారు కాని పూర్తిగా తేడాగానే ఉంది .హెర్బర్ట్ స్తిమితం గా ఉన్న చోట క్రాషా విజ్రుమ్భించాడు .హెర్బర్ట్ దిపూర్తీ ఇంగ్లీష్ ధోరణి అయితే ,క్రాషాదిఇటాలియన్ స్పానిష్ ధోరణి లో ఉంటుంది .మత ఉత్సవాలను హెర్బర్ట్ ప్రోత్సహిస్తే  క్రాషాఅందులోనూ నాటకీయతను ప్రవేశ పెట్టి కొత్తదనం తెచ్చాడు .నగిషీలు చెక్కాడు అలంకారం చేశాడు .క్రాషాకవిత్వం ‘’so ornate ,so overembellishedthat it is sme times hard tosee the poetry because of the words ‘.His images are alternately gorgeous and grotesque ‘’అంటారు మేరీ మాగ్దలీన్ సజీవ శిల్పాన్ని కవితలో మన ముందుంచాడు .’’two walking baths two weeping motions –portable and compendious oceans ‘’.కల్పనా సృజనా జమిలిగా ప్రవహిస్తాయి నలభై రెండు స్టాంజాలలో  ఆమె అద్వితీయ సౌందర్యాన్ని ఆవిష్కరిస్తూ అది సహజ లావణ్యం అని ,అది ఆమెకే స్వంతం అని రాస్తాడు .

‘’సెయింట్ టేరస’’పై చెప్పిన కవిత క్రాషా కవితల్లో తల మానికం గా భావిస్తారు .ప్రతీకలను వాడటం లో నిష్ణాతుడు .భాషా గౌరవం అనే ఉక్కు ఛట్రంలో బిగిసి ఊపిరాడక కొట్టుకొన్న కవులకు వాటిని ‘’క్రాష్ ‘’చేసిన  క్రాషా ఆదర్శ ప్రాయుడైనాడు .క్రాషా రచనలను మొదటి సారి విలియం టంబుల్ ఒక పుస్తకం గా ముద్రించాడు .క్రాషా రాసిన ‘’బుల్లా’’అంటే నీటి బుడగ కవిత ఇలియట్ కార్టర్ కు  ప్రేరణ కలిగించింది . ‘’లో దిఫుల్ ఫైనల్ సాక్రి ఫైస్ ‘’కు జేరాల్ద్ ఫింజి సంగీతాన్ని సమకూర్చాడు .లాటిన్ కవి ‘’కాతలాస్ ‘’రాసిన కవితను జార్జి ‘’కం అండ్ లెట్ అజ్ లివ్’’గా ఇంగ్గ్లీష్ లో రాశాడు దీనికి జూనియర్ సామ్యుల్ వెబర్ ఇంగ్లీష్ లో సంగీత చేశాడు .

 

అబ్రహాం కౌలీ

లండన్ లో 1618 లో సంపన్నుడైన పుస్తక విక్రేత ,పుస్తకాల షాపు యజమాని కి జన్మించాడు .మొదటి నుంచి చాలా జాగ్రత్త గా ఉండేవాడు .పదేళ్ళకే ‘’పైరమాస్ అండ్ తిస్బే ‘’అనే పురాణ శృంగార కవిత  రాశాడు .రెండేళ్ళ తర్వాతా మరో ఎపిక్ ‘’కాన్స్తాన్శియా అండ్ ఫైలేతాస్ ‘’తయారు చేశాడు .ఈ రెండు కవితలు ‘’పోయేటికల్ బ్లాసంస్ ‘’లో ప్రచురితాలు .అప్పటికి ఈ బుడ్డాడి వయసు పదిహేను .ఇరవైకి  మరో రెండు పుస్తకాలు వదిలాడు .వెస్ట్ మినిస్టర్ స్కూల్ లో చేరాడు .తర్వాతా ట్రినిటీకాలేజి లో చేరి రాయలిస్ట్ దృక్పధం పై విపరీతం గా మాట్లాడటం వలన కేంబ్రిడ్జి నుంచి బహిష్కరించారు .ఆక్స్ ఫర్డ్ చేరాడు .స్టువార్ట్ రాజులు అండగా నిలిచారు .28కి పారిస్ లో ఉన్నాడు .ఈ ప్రవాసం లో హెన్రి ఎట్టా మేరియా కు సెక్రెటరి అయ్యాడు .పన్నెండేళ్ళు డిప్లమాటిక్ ఏజెంట్ గా వ్యవహరించాడు .రాణీకి చార్లెస్ కు మధ్య రహస్య రాయ బారం నడిపాడు .ముప్ఫై ఏడేళ్లకు ఇంగ్లాండ్ కు రాజు గారి వేగుగా  (స్పై) చేరాడు .క్రామ్వేల్ కు దొరికి పోయి జైలు పాలయ్యాడు .తిమ్మిని బమ్మిని చేసి బైలు పై విడుదలయ్యాడు ..రేస్తోరేషన్ కౌలీ పదవిని నిలిపింది .ఆక్స్ ఫర్డ్ చేరి మెడిసిన్ చదివాడు .కొద్ది పాటి ఆదాయాన్నిచ్చే ఒక చిన్న ఎస్టేట్ ను ఇచ్చారు .ఓల్డ్ కోర్ట్ లో హాయిగా జీవించాడు .’’that solitude which from his very childhood he had always passionately desired ‘’చిన్నప్పటి నుంచి కలలు కన్న ఒంటరి హాయైన జీవితం లభించి సంతృప్తి చెందాడన్న మాట .49వ ఏట 28-7-1667లో ఇహలోకం చాలించాడు .వెస్ట్ మినిస్టర్ ఆబ్బే లో అతని అంత్యక్రియలు నిర్వహించారు .కౌలీ బతికి ఉండగా పెద్దగా ఏ సాయం చేయని రెండవ చార్లెస్ రాజు ‘’cowley has not left behind him a better man in England ‘’అని మొసలి కన్నీరు కార్చాడు .

కౌలీ ప్రాభవం రాకెట్ లాగా అకస్మాత్తుగా పైకి ఎగిరి  అలాగే జారిపడింది . ఆ తరాన్ని ప్రభావితం చేసిన కవిగా కౌలీ గుర్తుండి పోతాడు .ఇవాళ అతన్ని పట్టించుకొనే వారుతక్కువే .’’దిఎనీద్’’అనే అతని రచన బైబిల్ లోని డేవిడ్ కధయే .’’ది దేవిదీస్ ‘’ కూడా నిజానికి దూరం గా ఉంటుంది .పిండార్స్ ముతకగా ఉంటుంది .కవిత్వాన్ని మొదలు పెట్టటం ముగించటం లో కౌలీ గొప్పప్రజ్న  చూపాడు .అతని బౌద్ద్ధిక తార్కిక జ్ఞానాన్ని కళ్ళెం వేసుకొని అదుపు లో పెట్టుకొని రాశాడు .చిన్న చిన్న కవితల్లో అసాదారణ ప్రతిభ చూపాడు .’’beauty thou wild fantastic ape –who dostin every country change thy shape ‘’మచ్చుకి ఒక ఉదాహరణ .’’Cowley’s paraphrases from Anacreon the Greek forerunner of Omar Khayyam ‘’అని అరువు సొమ్ము బరువు చేటుగా చేశాడని అంటారు .అతని వ్యాసాలను ఇప్పటికీ తరచుగా ముద్రించి ఆదరిస్తూనే ఉన్నారు .

  

సశేషం

బుద్ధ ,కూర్మ ,అన్నమయ్య ,రాదా కృష్ణ ,చిత్రగుప్త జయంతి శుభా కాంక్షలతో

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -14-5-14-ఉయ్యూరు

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

ఉయ్యూరులో ఒక రోజు ముందే ”యుగాది”స్టేట్ లీడర్ పక్ష పత్రిక

 

 

siva 001

 

eela1 001 eela2 001

 

 

ugadi1 001 ugadi2 001

Posted in సరసభారతి ఉయ్యూరు | Tagged | Leave a comment

పూర్వాంగ్ల కవుల ముచ్చట్లు -16 పునర్వైభవం తర్వాత

పూర్వాంగ్ల కవుల ముచ్చట్లు -16

పునర్వైభవం తర్వాత

మరణం లో జీవిస్తూ మృత్యు కవితలు రాస్తూ తార్కిక విశ్లేషణ చేస్తూ అనేక మందిని ప్రభావితం చేసిన జాన్ డోన్నె అనుయాయులు పది హేడవ శతాబ్దిలో ఆది భౌతికత వైపే మొగ్గి ,విరుద్ధతలను ప్రకటిస్తూ గడిపారు .వీళ్ళది ‘’దొన్నె స్కూల్ ‘’అన్నారు .అభిరుచి ,టెక్నిక్ లో వీరు భిన్నమైన మార్గాలు తొక్కారు .గొప్ప ఊహా పిపాసులని పించు కొన్నారు .దీనితో కవిత్వానికి ఒక కొత్త భాష ,నూతనత్వం ,చిక్కదనం ,శైలి వాక్య నిర్మాణం వచ్చి మనసులకు ఆహ్లాదం కలిగింది .ఇందులో కొందరు’’ డోన్నె’’ కు ‘’ డ్రైడేన్ ‘’కు వారధి లా నిలిచారు .వారే జార్జి హెర్బర్ట్ రిచార్డ్ క్రాషా ,హెన్రి వాగన్ ,థామస్ ట్రాహేర్న్ .

హోలీ -జార్జి హెర్బర్ట్

జార్జి హెర్బర్ట్  1593లో వేల్స్ లోని కాజిల్ ఆఫ్ మాంట్ గోమారీలో ,జన్మించాడు .తండ్రికున్న పది మంది సంతానం లో ఒకడు .అన్న హెర్బర్ట్ గొప్ప చరిత్రకారుడు ,వేదాంతి ,డిప్లమాట్ అయ్యాడు .హెర్బర్ట్ ఆక్స్ ఫర్డ్ లో చేరగానే కుటుంబం లండన్ కు వచ్చింది పన్నెండవ ఏట జార్జి వెస్ట్ మినిస్టర్ స్కూల్ లో చేరాడు .పదిహేనవ ఏట కేంబ్రిడ్జి లో ‘’కింగ్స్ స్కాలర్ ‘’గా చేరాడు .ఇరవై వ ఏట ట్రినిటి లో ‘’పబ్లిక్ ఆరేటర్’’అయి ఎనిమిదేళ్ళు పని చేశాడు .అన్నలా సాహస జీవి కావాలని తపన పడ్డాడు .అతని మనసు, బుద్ధి దేవుడిపైనే ఉండేవి .ఇలా చిన్నతనం నుంచి ఉంది .తల్లికి రాసిన ఉత్తరం లో తాను దేవుని మనిషి నని అలాగే జీవిస్తానని తెలిపాడు .తల్లి స్నేహితుడు జాన్ డోన్నె ఇతన్ని కవిత్వం వైపే కాక చర్చి వైపూ తిప్పాడు .32వ ఏట అధికారాలు పొంది ,36వ ఏట ‘’రెక్టార్’’అయ్యాడు .జెన్ డాన్వార్ ను పెళ్లి చేసుకొన్నాడు .చర్చిలను నిర్మించటం అభివృద్ధి చేయటం లో కాలం గడిపాడు .మైళ్ళకొద్దీ నడిచి వెళ్లి సాలిస్ బరి లో చర్చి లో సంగీతం తో మత బోధ చెస్తో రైతులను కూడా ఆకర్షించాడు .కవిగా ,బోధకుడిగా సంతృప్తి పొందాడు .కాని ఈ ఆనందం ఎక్కువ కాలం లేదు .

హేర్బర్ట్ కు క్షయ వ్యాధి ఎప్పుడు సోకిందో తెలియదుకాని 40వ ఏటనే పొట్టన పెట్టుకోంది .చావు సంగతి ముందే గ్రహించాడు. తగిన ఏర్పాట్లు చేసు కొన్నాడు .కామ్పియాన్ లాగా జార్జి సంగీతజ్ఞుడు కవి కూడా .తన పాటలను తానే సంగీతం కూర్చుకొని వీణ (lute)వాయిస్తూ పాడేవాడు .తాను ఒక దేవదూతను అనే భావం తో స్వర్గం లో గానం చేస్తున్న అను భూతితో పాడి శ్రోతలకూ ఆ అనుభవాన్ని కల్గిన్చేవాడు .అతని తన్మయత్వానికి ‘’హోలీ జార్జి హెర్బర్ట్ ‘’అనే వారు .దయ సాను భూతి ,మంచితనం కమ్మదనం హెర్బర్ట్ సొత్తు .డోన్నె లాగా మెటా ఫిజికల్ అయినా అతని కంటే సరళ స్వభావి .డోన్నె కున్న తీవ్రత హింస ఇతనిలో లేవు . శ్లేష ను  చక్కగా వొదిగేట్లు రచన చేసే వాడు .చర్చి అతనికి దేవాలయం మాత్రమే కాదు రూపకాలన్కారాలకు వేదిక కూడా .రూపకం మీదే కవితా సౌధం నిర్మించాడు .చర్చి అంటే ఆధ్యాత్మిక భావాలకు ఆలవాలం అనే నమ్మకం కలిగించాడు .’’చర్చి నేల  ,నమ్మకానికి పునాది .శిఖరం హృదయం .కట్టిన రాళ్ళు రప్పా వినయానికి ,వోర్మికి  ప్రతీకలు .వీటిని కదలకుండా బంధించే సిమెంట్ లేక సున్నం ప్రేమకు చిహ్నం .చర్చిద్వారపు  తాళం చెవి  చేతుల్లో దాచుకొన్న పాపాలను విడిపించేది ‘’అని చాలా చమత్కారం గా రూపకాలలతో బోధనా ను పరి పుష్టి చేసేవాడు హెర్బర్ట్ .దేవుడికోసమే నటిస్తున్నాను భూమి మీద అనే వాడు .’’ Jesu!I- Ease- you ‘’ అని మన ‘’త్వమేవాహం ‘’ ను ఒంట బట్టిన్చుకోన్నట్లు అనే వాడు .అర్ధ వంతమైన అనేక ద్విపదలను రాశాడు .మచ్చుకొకటి .దీన్ని అనాగ్రాం (శబ్ద వ్యతిక్రమం )అంటారు .మన వాళ్ళు రాసిన బంధ కవిత్వం వంటిది .

ANA[MARY]GRAM

[  ARMY]

కవిత్వం లో సాంకేతికత ను జోడించి చెప్పాడన్నమాట .చాలా సరళం గా ఏంతో  ప్రత్యేకం గా ఉంటాయి ఇవి .హెర్బర్ట్ రాసిన అమర గీతం –‘’o Almighty Love! Man  is one world and hath –another to attend him ‘’.

‘’సెవెన్ టిప్స్ ఆఫ్ యామ్బిగ్యుటి ‘ హెర్బర్ట్ సృజనకు పరాకాష్ట గా భావిస్తారు .అతని కవిత్వాన్నిచదివి  అర్ధం చేసుకోవటం కష్టమే .  అనేక రూపకాలు పదచిత్రాలు సింబాలిజం తో ఒక పట్టాన కొరుకుడు పడేది కాదు .ఆ భాష ఈ ప్రపంచానికి చెందింది గా అని పించదు కూడా .డోన్నె తన బాధను అంతటిని ‘’డ్రమటైజ్ ‘’ చేసి చెబితే హెర్బర్ట్ తన బాధలను దిగ మింగుకొని దేవుడితో మాట్లాడాడు .డోన్నె లాగా తనను ‘’job ‘’గా వర్ణించు కోలేదు .వ్యతిరేకించకుండా అసమ్మతి మాత్రం తెలియ జేశాడు .పాపానికి ,ముక్తికి మధ్య సన్నని విభజన రేఖ ను చూశాడు .ప్రపంచ అసహాయ స్తితికీ స్వర్గ సుఖాలకూ అంతే.హెర్బర్ట్ ను గురించి చెప్పాలంటే ‘’humility ,orderliness ,serenity grace ‘’తో వికసించిన సంపూర్ణ కవి అనవచ్చు .అసాధారణమైన ప్రత్యెక వ్యక్తిత్వం ఉన్న వాడు .మానసిక చాంచల్యం లేని వాడు .క్రమ శిక్షణకు మారు పేరు .’’serenity came after internal conflict and a feeling of inadequacy –and underneath the grace ,the wit ,and whimsicality ,there is an unshakable fervor as reasonable as it is religious .Quiet ,alternately courtly and colloquial this is a poetry which begins in wonder and ends in certainty ‘’ అని హెర్బర్ట్ కవిత్వాన్ని అంచనా వేశారు .’’ఎ సోల్ కంప్రైసేడ్ అఫ్ హర్మోనీస్ ‘’అని కీర్తించారు .’’లెట్ ఆల్ దివరల్డ్ ఇన్ ఎవిరి కార్నర్ సింగ్ ‘’అన్న కవిత బహుళ ప్రచారమైంది .’’ఈస్టర్ వింగ్స్ ‘’కవిత చదవటానికే కాదు ఆకృతికి కూడా అదిరెట్లు ఉంటుంది .అత్యధిక నైపుణ్యం ,శైలి ఉన్న బ్రిరీష్ ఆధ్యాత్మిక కవుల్లో అగ్రేసరుడు హెర్బర్ట్ .

 

హేర్బర్ట్ ముప్ఫై తొమ్మిదేళ్ళు జీవించి 1-3-1633 న దైవ సన్నిధికి చేరుకొన్నాడు .’’

 

George Herbert.jpg

 

 

సశేషం

శ్రీ కూర్మ ,బుద్ధ ,అన్నమాచార్య ,రాదా కృష్ణ జయంతి శుభాకాంక్షలతో

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -14-5-14-ఉయ్యూరు

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

బుద్ధ పూర్ణిమ శుభా కాంక్షలు

సాహితీ బంధువులకు శుభ కామనలు -వైశాఖ పౌర్ణమి -బుద్ధ జయంతి బుద్ధ పూర్ణిమ శ్రీ అన్నమాచార్య జయంతి ,శ్రీ కూర్మ జయంతి శ్రీ రాధా కృష్ణ జయంతి ,శ్రీ నాద జయంతి శ్రీ చిత్ర గుప్త జయంతి సందర్భం గా అందరికి శుభా కాంక్షలు -దుర్గా ప్రసాద్ 

  Annamacharya.jpg Buddha in Sarnath Museum (Dhammajak Mutra).jpgRadhamadhava.JPG

 

indo -3 001 indo4 001 indo5 001 indo6 001 indo7 002 indonesia buddha 1 001 indonesia budha 2 001

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

రసశిల్పి అన్నమయ్య – అంటున్న ఆచార్య ఎస్ గంగప్ప –

రసశిల్పి అన్నమయ్య -ఎస్. గంగప్ప

శ్రుతులై, శాస్త్రములై, పురాణ కథలై, సుజ్ఞానసారంబులై/ యతిలోకాగమ వీధులై, వివిధ మంత్రార్థంబులై, నీతులై,/ కృతులై, వేంకట శైల వల్లభ రతిక్రీడా రహస్యంబులై,/ నుతులై తాళుల పాకయన్నయ వచోనూత్న క్రియల్ చెన్నగున్’
– ఈ విధంగా ప్రసిద్ధి పొందిన తాళ్ళపాక అన్నమాచార్యులు (1408-1503) జననంతో తెలుగులో పదకవితావిర్భావ వికాసాలు ప్రారంభమయ్యాయి. అంతకు ముందు జానపదుల నోళ్లలో నానుతున్న పద కవితకు ప్రాధాన్యం లభించింది. అన్నమాచార్యుల రచనలను సంకీర్తనలంటారు అవి పదాలని గూడా ప్రసిద్ధమే. అందుకే అన్నమాచార్యులకు పదకవితా పితామహుడనీ, సంకీర్తనాచార్యుడనే బిరుదులున్నాయి. ఆనాటికే ప్రబంధకవుల వల్ల పద్యం ప్రసిద్ధమైంది. పద్యానికి పట్టాభిషేకం జరుగుతూంది. అది పండితులకు మాత్రమే పరిమితం. పదం ప్రజలందరికీ అర్థమయ్యేది. కనుకనే అన్నమాచార్యులు శ్రీ వేంకటేశ్వరునిపై శృంగార, అధ్యాత్మ సంకీర్తనలు 32 వేలు రచించి భక్తి, నీతి, వైరాగ్యాలను ప్రబోధించారు. ఆ పదాలలో పద్యకవులకు ఏ మాత్రం తీసిపోని కవితా వైభవాన్ని అన్నమాచార్యులు ప్రదర్శించారు.
అన్నమాచార్యులు 32వేల సంకీర్తనలు రచించగా, మనకు లభించినవి సుమారు 14వేల పదాలు మాత్రమే. ఈ సంకీర్తనలు లేదా పదాలు శృంగార, అధ్యాత్మ సంకీర్తనలని రెండు విధాలు. శృంగార సంకీర్తనలన్నీ పైన పేర్కొన్న ‘వేంకట శైల వల్లభ రతి క్రీడా రహస్యంబులు’ అంటే, అలివేలు మంగా శ్రీ వెంకటేశ్వరుల అలౌకిక శృంగారాన్ని చిత్రించు పదాలని అర్థం. ఈ శృంగార పదాలలోను, అధ్యాత్మక పదాలలోను శృంగారంతో పాటు, భక్తి, నీతి, వైరాగ్యాల వర్ణన మనోహరం. అందులో వ్యంజితమయ్యే కవిత్వం మనోహరమై, సహృదయరంజకమై ఏ పద్యకవికీ తీసిపోని రీతిలో ఒప్పారుతూండడం విశేషం. ప్రతిభాపూర్వకమైన భావుకత, చమత్కార వైభవం, వ్యంగ్య స్ఫూర్తి, వర్ణనా వైదగ్థ్యం, ఆలంకారిక శైలీ విన్యాసం-మొదలైన విశిష్ట కవితా లక్షణాలతో అన్నమాచార్యుల కవిత్వం మనోజ్ఞమై ఒప్పుతూంటుంది. లాక్షణికులు విశ్వనాథుడు చెప్పినట్టు ‘వాక్యం రసాత్మకం కావ్య’మ్మనే నిర్వచనానికి, జగన్నాథపండితరాయల ‘రమణీయార్థ ప్రతిపాదక శబ్దఃకావ్య’మ్మనే సిద్ధాంతానికీ సమంగా సరిపోయే పదాలివి. అందుకే అన్నమాచార్యులు ఆంధ్ర పదకవులందరికీ గురువనడం సమంజసం.
కవికి ప్రతిభ, వ్యుత్పత్తి, అభ్యాసముండాలంటారు. అందులో ప్రతిభ అనేది శ్రేష్ఠమైన గుణం. అన్నమాచార్యులలో ఈ ప్రతిభకు కొదవలేదు. భావుకత, ఊహాశాలిత అనే అంశాలు ప్రతిభా గుణ విశిష్టాలు. ఈ లక్షణాలన్నీ అన్నమాచార్యుల ఈ పదంలో మనం గమనించగలము.
‘ఏమొకో చివురుటధరమున యొడనెడఁ గస్తురి నిండెను/ భామిని విభునకు వ్రాసిన పత్రిక కాదుకదా
కలికి చకోరాక్షికిఁ గడ కన్నులు గెంపై తోచిన/ చెలువంబిప్పుడిదేమో చింతిపరె చెలులు/ నలువునఁబ్రాణేశ్వరుపై నాఁటిన యాకొన చూపులు/ నిలువునఁ బెరుకఁగ నంటిన నెత్తురు కాదుగదా
ముద్దియ చెక్కుల కెలకుల ముత్యపు జల్లుల చేర్పుల/ వొద్దికలాగు లివేమో వూహింపరె చెలులు/ గద్దరి తిరు వేంకటపతి కామిని వదనాంబుజమున/ అద్దిన సురతపుఁ జెమటల అందము కాదు గదా’
ఇందులో భావుకతననుసరించి భావమూ, భావాన్ని అనుసరించిన భాష ఒకటిని మించి మరొకటి పోటీపడుతున్నట్లు తెలుస్తుంది. అది అన్నమాచార్యుల ప్రతిభా సంపదకు చక్కటి నిదర్శనం. నాయక యొక్క ‘చిగరు టధరమున’ లేత పెదవిపై కస్తూరి నిండినట్లుందట. అంటే నల్లగా ఉంది. అది ఎలా ఉంది? ‘భామిని’ అంటే నాయిక ‘విభునకు’ ప్రియుడైన నాయకునకు వ్రాసిన ‘పత్రిక’ లేఖ ఏమో అన్నట్లుందట! ఇదెంత మనోజ్ఞమైన భావన! ఇలాంటి భావన చేసిన కవులు లేరు తెలుగులో. అది అన్నమాచార్యుల ప్రతిభ! ఇది కేవలం పల్లవి మాత్రమే. ఈ మూడు చరణాల్లోను ఈ చమత్కారం విదితమై కవి ప్రతిభా ప్రకటనకుపకరిస్తుంది.
కవితలో చమత్కారముంటే కవి విశిష్టత తెలుస్తుంది. అన్నమాచార్యులు ఆయా పదజాలాన్ని ప్రయోగించి చెబుతూ వాటికున్న అర్థం ఎంత సార్థకమో వివరించాడు ఈ క్రింది పదంలో . అంతేగాక ఇందులో మరో చమత్కారం దశావతారాలకొన్నిటిని వర్ణించడం జరిగింది.
‘ఈకెకు నీకుదగు నీడు జోడులు/ వాకుచ్చి మిమ్మఁ డొగడ వసమయొరులకు
జట్టిగొన్న నీ దేవులు చంద్రముఖి గనుక/ అట్టె నిన్ను రామచంద్రుఁడన దగును/ చుట్టమై కృష్ణ వర్ణపు చూపుల యాపె గనుక/ చుట్టుకొని నిన్ను కృష్ణుడ వనదగును
చందమైన వామలోచన యాపె Äౌఁగనుక/ అందరు నిన్ను వామనుడన దగును/ చెంది యాకె యప్పటికిని సింహ మధ్య గనక/ అంది నిన్ను నరసింహుడని పిల్వదగును’
నాయికకున్న విశిష్ట లక్షాణాలని బట్టి నాయకుడైన వానిని శ్రీకృష్ణుని, శ్రీరామచంద్రునిగా చెప్పడం జరిగింది చమత్కారంగా. అద్భుతమైన వర్ణనా వైధగ్థ్యం, ఆలంకారిక శైలీ విన్యాసంకు శబ్దాలంకారం, అర్థాలంకారాలకు అన్నమయ్య పదాలు ఆటపట్టులు. ఈ సంకీర్తనలో చక్కటి శైలీ విన్యాసంను చూడండి:
‘నెరజాణవు కడు నేర్పరివి
మరిగె నీకు నిన్ను మన్నించవయ్యా
దొంతులు వెట్టీ దొయ్య వలపులు
పంతపు మాటల బలుమారును
చింతల చిగురుల సిగ్గులనయ్యా
చెంత జేరి మచ్చికగొనవయ్యా’
ఇలాగా అన్నమ ఆచార్యులు సంకీర్తన రచన చేసినా ప్రబంధ కవులకు మాత్రం తీసిపోనిరీతిలో కవిత్వంలో తన సహజమైన ప్రతిభాపాటవాన్ని ప్రకటించి తదనంతర వాగ్గేయకారులకు ఆదర్శమయ్యారు.
n ఎస్. గంగప్ప
విశ్రాంతాచార్యులు
(నేడు, అన్నమయ్య 605వ జయంతి)

 

 

Posted in సేకరణలు | Tagged | Leave a comment

పూర్వాంగ్లకవుల ముచ్చట్లు -15–జాన్ డో న్నె

 

పూర్వాంగ్లకవుల ముచ్చట్లు -15

పది హేడవ శాతాబ్డిద సాహితీ కారులు వస్తువులోను ,ఆంతర్యం లోను పెను మార్పులు తెచ్చారు .కాని ఒక తరం తర్వాత ఈ విధానం పై మక్కువ తీరిపోయింది .మూడు వందల ఏళ్ళు కనీ పించకుండా పోయిన ఈ కవిత్వం ఇరవయ్యవ శతాబ్దిలో నూతన పోకడలు పోయి విశేష ప్రాచుర్యం పొందింది .ఆ కవులలతో విభేదించిన ‘’డ్రైడేన్’’కవి ఈ గ్రూపు తో సంబంధం లేకుండా ‘’Donne affects the meta physics not only in his satires but in his amorous verses ‘’అని ధంకా బజాయించి  ‘’జాన్ డోన్నే’’గురించి చెప్పాడు .

జాన్ డోన్నే

సామ్యుల్ జాన్సన్ ‘’మెటా ఫిజికల్ ‘’అనే అరువు మాటను తెచ్చుకొని డోన్నె తరువాతి కవులను పిలిచాడు .ఇది కొంచెం ముతకగా ఉన్నా’’the metaphysical poets were men of learning and to show their learning was their whole endevour ‘’అని కౌలీ మెచ్చుకొన్నాడు .ఈ కవులు అంత్య ప్రాసలకు ప్రాధాన్యం ఇచ్చి ,కవిత్వాన్ని రాయకుండా పదాల కూర్పు నే  చేశారు అని అభి యోగం ఉంది .మెటా ఫిజికల్ కవులకు కవులు అని పించుకొనే అర్హత లేదన్నాడు జాన్సన్ .ప్రక్రుతి ని కాని జీవితాన్ని కాని దేన్నీ అనుకరించ లేదన్నాడు .కాని విమర్శకులు జాన్సన్ ను లెక్క పెట్టలేదు .ఎడ్మండ్ గూస్’’ దొన్నె ఆంగ్ల సాహిత్యంపై, రచయితలపై ప్రభావంఎక్కువే ‘’అన్నాడు .ఇరవయ్యవ శతాబ్ది దాకా దొన్నె ప్రభావాన్ని గుర్తించలేక పోయారు విమర్శకులు .మెటా ఫిజికల్ కవిత్వానికి డోన్నె గొప్ప ఉదాహరణ అని అప్పుడు నిర్ద్వందాం గా ప్రకటించాడు .  టి ఎస్ ఇలియట్ ‘’ a mechanism of sensibility which could devour any kind of experience ‘’అని మెటా ఫిజి కల్ కవిత్వాన్ని అంచనా వేశాడు .

జాన్ డోన్నే శారీరక మానసికం గా ఎన్నో ఆటు పొట్లూ ఎదుర్కొన్నాడు .’’మానవ శరీరమే అతని పుస్తకం’’ .మనిషి ఆత్మ ఒక మిస్టరి అను కొన్నాడు .వయసు పెరిగిన కొద్దీ ఈ అంతర్యుద్ధం పెరుగుతూనే ఉంది .ప్రతి భావానికీ స్పందించాడు .సాహసికుడు గా యోధుడు గా  మారి పోయి మత ప్రచారకుడయ్యాడు .డోన్నెరాసిన ‘’సేర్మాన్స్’’లో1640 లో విడుదల అయింది అందులో అతని అనుభూతులనుంచి ఆత్మ తత్వానికి ప్రయాణం లో అభి వృద్ధి కని  పిస్తుంది .ముతక భావాలనుంది విశుద్ధ మానసిక పరిణామం గోచరిస్తుంది .ఇది ‘’పిలిగ్రిమ్స్ ప్రోగ్రెస్ ‘’కాక పోయినా ఆత్మోద్ధరణ .అతని ఆత్మ క్షోభ అసలు మరణానికన్నా ,ముందే చావును చూశాడు .అతని రచనలలో ఉన్న వైవిధ్యం అతని జీవితాన్ని తెలుసుకోవ టానికి బానే సహక రిస్తుంది ..

దొన్నె లండన్ లో 1573లో ఒకసంపన్న  ఇనప వ్యాపారి కొడుకు గా జన్మించాడు .తండ్రి ధామస్ మోర్ బంధువు జాన్ హేవుడ్ కూతురను పెళ్లి చేసుకొన్నాడు .సామాజికం గా ఉన్నత స్తాయి లో ఉన్నాడు .దార్బారు లో ఉద్యోగం పొందాడు .కేధలిక్ కుటుంబం .తనలో అమర వీరుల రక్తం ప్రవ హిస్తోందని భావించే వాడు .తల్లి తరఫు బంధువులను గురించి ముప్ఫై వ ఏట రాశాడు. లాటిన్ ఫ్రెంచ్  లను ఇంటి వద్దే ట్యూటర్స్ బోధించారు .పదకొండవ ఏట ‘’ఆర్ట్ హాల్ ఆఫ్ ఆక్స్ ఫర్డ్ ‘’లో చేరాడు .మూడేళ్ళు చదివి కేంబ్రిడ్జి లో ట్రినిటి కాలేజి లో చేరాడు .యూక్లిడ్ లాజిక్ ను అధ్యయనం చేశాడు .స్పానిష్ మిష్టిక్స్ చదివాడు .విశుద్ధ రీజన్ కు నమ్మకానికి భేదం గ్రహించాడు .

‘’లా’’చదివి పాసై ప్రాక్టిస్ చేశాడు .కేధలిక్ గా ఉన్నా చాందసానికి దూరం అయ్యాడు .తిరుగు లేని కవి అని పించుకొన్నాడు .సగం విషయేచ్చ సగం మానవ ద్వేషం తో రగిలి పోతున్నాడు .వీటినే ‘’సాంగ్స్ అండ్ సానేట్స్ ‘’లో ప్రతిఫలింప జేశాడు  .సెటైర్స్ ,ఎలిజీలతో దూసుకు పోయాడు .స్పెయిన్ ఇటలీ లు చూశాడు .తిరిగి రాగానే లార్డ్ కీపర్ సర్ ధామస్ ఈగర్ట న్  కు ప్రైవేట్ సెక్రెటరి అయాడు .ఈ పదవే అతని  కొంప ముంచింది .ఆ ఇంట్లో సన్నిహితం గా మెలిగాడు ఈగర్టాన్న్ బంధువు ‘’అన్నే మోర్’’ తో ప్రేమ లో పడ్డాడు .ఆమె తో లేచి పోయి పెళ్లి చేస్సుకొన్నాడు .దీనికి ఈగర్ టాన్ కోపానికి బలి అయ్యాడు ఉద్యోగం ఊడ గొట్టి ,జైల్లో పెట్టించాడు .ఒక ఏడాదికి పెళ్లి చట్ట బద్ధమై విడుదల అయ్యాడు. తన పరిస్తితిని తల్లికి ‘’Ane done –undone ‘’అని రాసుకొని వాపోయాడు .

తరువాత భార్యా భర్తల జీవితం ఒడి దుడుకులతో నడిచింది.పేదరికం. చేతిలో చిల్లి గవ్వ లేక పోవటం అప్పుల బాధ వలన రోమన్ కేధలిక్ ను వదిలేసి మతాధికారులను దూషిస్తూ అనేక కరపత్రలురాసి విడుదల చేశాడు .చివరికి ఈగర్ టన్ దొన్నె ను క్షమించాడు .కుటుంబ పోషణకు ధన సాయం చేశాడు .గొప్ప పదవి జారి పోయి రాజు దయా దాక్షిణ్యాల మీద బతకటం వలన డిప్రెషన్ కు లోనయ్యాడు .రాజు ఇస్తున్న డబ్బు దేనికీ చాలటం లేదు .ఆత్మ హత్య కు పాల్పడ్డాడు .తీవ్ర మైన జబ్బు ఏర్పడి జీవితాంతం బాధించింది .దీనిపై ‘’me thinks I have the keys of myprison in my own hand ,and no remedy presents itself so soon to my heart as mine own sword ‘’అని రాసుకొన్నాడు ‘

దొన్నె  బీదగా ,విచార గ్రస్తుడిగా చావు కోసం ఎదురు చూస్తూ గడిపాడు .ఇలా పదమూడేళ్ళు బాధ పడ్డాడు .సెక్రెటరి ఉద్యోగం వస్తుందని ఆశించి భంగ పడ్డాడు .ఎందరినొ  సహాయం కోసం అర్ధించాడు .ఎవరూ ముందుకు రాలేదు .అప్పుడప్పుడు చిన్న చిన్న ఉద్యోగాలు చేశాడు .ప్రయాణాలు చేశాడు .వాగ్దానాలు చేసిన వారే కాని చేతల్లో ఎవరూ ఆదుకో లేదు .’’సాంగ్స్ అండ్ సాట్స్త్స్’అనే మత సంబంధ కవితలు ’రాస్తూనే ఉన్నాడు .42వ ఏట ధ్యానం ,చాలా కాలంగా దేనిపై ధ్యాస లేక పోవటం వలన విసిగి వేసారి తండ్రి లాగా ఆంగ్లికన్ చర్చి భావాలకు దగ్గరయ్యాడు .మొదటి జేమ్స్ రాజు సంతోషించి దొన్నె ను ‘’చాప్లాన్ ‘’ ను చేశాడు .లింకన్స్ ఇన్ అతన్ని మత ప్రచారకునిగా అంగీకరించి తీసుకోంది .తర్వాత ‘’డీన్ ఆఫ్ సెయింట్ పాల్ ‘’అయ్యాడు .

ఆత్మాన్వేషణ ఫలించి దొన్నె గొప్ప ప్రచారకుడు గా పేరు తెచ్చుకొన్నాడు .డబ్బు కూడా బాగా అందుతోంది .అయినా సుఖం ,సంతోషం లేదు అతనికి .అమితం గా ప్రేమించిన భార్య చని పోయింది .జీవితం నుంచి దూరమై మత బోధనకే ప్రాధాన్యం ఇచ్చి గడిపాడు .ఒక్క సారి వెనక్కి తిరిగి చూసుకొని చేసిన తప్పులు తెలుసుకొని పశ్చాత్తాపం చెందాడు .జీవిత నుండి విముక్తి చెందాలనే కోరిక బలీయం అయింది .ఎక్కడా సుఖం ఉండదు అని గ్రహించాడు .ఆరోగ్యం బాగా దెబ్బతిని పోయింది .జీవితం లో దెబ్బతిన్నాననే భావం అతన్ని పీడిస్తోంది . అంతకు  ముందు దాకా మనిషి అమరుడు అనుకొన్నాడు .ఇప్పుడు మనిషి జీవితం శాశ్వతం కాదని గ్రహించాడు .

‘’ డివో షన్స్’’లో కూరుకు పోయి ఎనిమిదేళ్ళు బతికాడు .అతనిలో జీవం క్షీణించి పోతూనే ఉంది ,’’to pay a fever every half year as a rent for my life ‘’అని వాపోయాడు .బిషప్ గా ప్రమోషన్ పొందిన కొద్ది కాలానికే 57వ ఏట తీవ్ర అనారోగ్యాం అతన్ని కుంగ దీసింది .చనిపోతున్నానని  గ్రహించాడు.’’ఫనరెల్ స్టాట్యూ’’ ను తయారు చేయించాడు .దాన్ని రంగులతో తీర్చి  దిద్దాడు .అది పూర్తీ అయిన వెంటనే తన పక్కనే ఉంచుకొన్నాడు .చివరికి  31-3-1631లోకేన్సర్ తో  చని పోయాడు .దొన్నె బతికి ఉన్నకాలం లోనే అతని కవితలు బాగా ప్రచారంయ్యాయి. రెండు మాత్రామే అతని జీవిత కాలం లో ముద్రణ పొందాయి .అతని ‘’యనాటమి ఆఫ్ ది వరల్డ్ ,’’ఆఫ్ ది ప్రోగ్రెస్ ఆఫ్ దిసోల్ ‘’బాగా ప్రసిద్ధి చెందాయి .బతికి ఉండగానే పొగడ్తలు  తెగడ్తలు అనుభ వించాడు .’’Donne;s continual conflict between anxious hope and worldly disollusionment made him as characteristic of our age as of his ‘’.మూడు శతాబ్దాల తర్వాతా ప్రఖ్యాత అమెరికా నవలా రచయిత ఎర్నెస్ట్ హెమింగ్ వే  దొన్నె రాసి ఎవరికీ తెలియని ‘’డివోషన్స్ ‘’నుంచి ఒక దానిని ఎన్నుకొని ‘’ఫర్ హూం ది బెల్ రింగ్స్ ‘’రాశాడు .అందులో ‘’any man;s death diminishes me ,because I am involved in man kind .And therefore never send to know for whom the bell tolls .it tolls for thee ‘’అన్నాడు .

మెటా ఫిజిక ల్ అంటే- భౌతికానికి అతీతమైనది .అది ఆలోచన ను భావాలను ఏకీ కృతం చేస్తుంది .విరుద్ధాలను జత కలుపుతుంది .భావ చిత్రాలనేర్పరుస్తుంది .మీరు మిట్లు గొలిపే వెలుగును దర్శింప జేస్తుంది .donne showed his followers a new way of fusing sense and sensibility .he bought together pieces of a disordered universe and arranged them in a world of clear vision .he united complexity of thought and simplicity of language.’’దొన్నె గొప్ప సృజన శీలి .దాదాపుగా అతని అన్ని కవితల్లోనూ మరణమే వస్తువు .’’death had no horror for the sensual curiosity seeker ,the exhilarated being who shrank from no excess of impulse or devotion ‘’తన మనసును బయట పెడుతూ ‘’I have not the righteousness of job ,but I have the desire of jon –I would speak to the Almighty ,and I would reason with God ‘’అన్నాడు .

‘’thou art slave to fate ,chance ,kings and desperate men –and dost with poison ,warand sickness dwell-one short sleep ,past we wake eternally –and death shall be no more –death thou shall die ‘’అని చాలెంజ్ చేసిన కవి దొన్నె .ఇలాంటి కవితలు ‘’well serve as epitaph for one who ,predestined to a fearce singularity ,united the ecstatic and the austere in vehement of intellectual play and spiritual discipline ‘’అని ఏఎ కవిని అంచనా వేశారు .

JohnDonne.jpg  

  

 

దొన్నె నివసించిన ఇల్లు                              చని పోయే ముందు వేయించుకొన్న చిత్రం

 

సశేషం

శ్రీ నృసింహ జయంతి శుభా కాంక్షలతో

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -13-5-14-ఉయ్యూరు

 

 

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

పూర్వాంగ్ల కవుల ముచ్చట్లు -14 యువ బాలుడు ,కరపత్ర సవ్య సాచి –ధామస్ నాషె

పూర్వాంగ్ల కవుల ముచ్చట్లు -14

యువ బాలుడు ,కరపత్ర సవ్య సాచి –ధామస్ నాషె

‘’యంగ్ జువెనైల్ ‘’అని పేరొందిన థామస్ నాషె ను తర్వాత ‘’రౌడీ హాస్యగాడు ‘’అన్నారు .’’లిజబెతన్ రెబిలియన్  అనీ ముద్ర వేశారు .ఇతనికాలం 1567-1601.సవ్యమైన నిర్డుస్టమైన ,కఠిన శిక్షలతో ఉన్న పాలనపై తిరగ బడ్డాడు .అతని భాషా భావాలు చాలా కర్కశం గా ఉద్రేకం గా ఉండేవి .ఇరవై తొమ్మిదో ఏట రాసిన చివరి నాటకం’’ది ఐల్ ఆఫ్ డాగ్స్ ‘’లో రాజ్యం లో ఉన్న లొసుగులను బయట పెట్టాడు .దానికి ప్రతిఫలం కొన్ని నెలల జైలు .’’ఎలిజ బెతాన్ జాకోబీన్ సాంగ్స్ ‘’లో ‘’ a body of literary work more precious to the English than any other ,apart from Shakespeare and the translated Bible ‘’అని కవిత్వాన్ని అంచనా వేశారు .కాని అవన్నీ లభ్యం కాలేదు .కరపత్రరచనలో అంతవరకూ ఎవరూ ఇతన్ని మించలేదు .’’కల బర్ట్ కర్రి నెవ్ ‘’అన్నది నాషే రాసిందిగా అందరూ అంగీకరించారు .’’I am sick –I must die –Lord have mercy on us! ‘’అని రాసుకొన్నాడు

A crudely printed, full-length picture of a standing man. He is in Elizabethan-style clothing and chains are around his ankles

 

 

పెళ్లి ,చావు పాటల కవి –డాక్టర్ థామస్ కాంపి యాన్

1567-1620కు చెందిన ధామస్ కాంపియాన్ తనకు తానే ఒక నీతి శాస్త్ర గ్రంధం అని పించుకొన్నాడు .సంగీతం తో పాటు రచనలూ చేశాడు .అతని’’ బుక్ ఆఫ్ ఐర్స్’’ప్రసిద్ధి చెందింది .జీవితా చరిత్ర ఎవరికీ తెలియదు .రచనలన్నీ చరిత్ర లో కలిసి పోయాయి .మూడు వందల ఏళ్ళ తర్వాత పందొమ్మిదో శతాబ్దం చివర్లో మళ్ళీ అతన్ని గుర్తుకు తెచ్చుకొన్నారు .’’లా’’ చదివాడు .ప్రాక్టిస్ చేసిన దాఖలాలు లేవు .కాని మెడిసిన్ లో ‘’కేయాన్ యూని వర్సిటి నుండి 1605లో డిగ్రీ పొందాడు .అందుకే ‘’డాక్టర్ ఇన్ ఫిజిక్స్ ‘’గా గుర్తించారు. చని పోయే దాకా వైద్యం చేస్తూనే ఉన్నాడు ..గొప్ప తెలివి తేటలున్నవాడు .హైమ్స్ ఒడ్స్ ,పెళ్లి పాటలు ,చావు గీతాలు ,రాశాడు సంగీతం సమకూర్చే వారికి  మార్గ దర్శి గా ఉన్నాడు .’’ఏ న్యు వే ఆఫ్ మేకింగ్ ఫోర్ పార్ట్స్ ఇన్ ది కౌంటర్ పాయింట్ ‘’,కు గుర్తింపు వచ్చింది .’’అబ్సర్వేషన్స్ ఇన్ ది ఆర్ట్ ఆఫ్ ఇంగ్లీష్ పోయెట్రి ‘’అనే విమర్శనాత్మ గ్రంధం లో క్లాసికల్ సాహిత్యపు సొగసులను అందులోని ఛందస్సును మెచ్చి మళ్ళీ అవే గతి అని తేల్చి చెప్పాడు .’’he protested against the vulgar and artificial rhyming ‘’.

30వయసులో ఫిలిప్ రోసేస్టర్ అనే తోటి సంగీత కారుని తో కలిసి ‘’ఏ బుక్ ఆఫ్ ఆర్ట్స్ ‘’ లో మొదటి సగానికి  లిరిక్స్ రాయటమే కాకుండా మొత్తం సంగీతాన్న్ని పర్య వేక్షించాడు .ఈ ప్రయత్నం ఫలవంత మైంది ఈ ధోరణిలోనే మరో మూడు  అంకిత భావం తో తపన తో చేసి ముద్రించాడు .మెడిసిన్ కంటే మ్యూజిక్ కు ప్రాధాన్యత నిచ్చాడు .’’ఫోర్త్ బుక్ ఆఫ్ ఆర్ట్స్ ‘’రాశాడు .దీనిపై కామ్పియాన్ ‘’The apothecaries have books of Gold ,whose leaves being opened ‘’.,are so light that they are subject to be shaken ,with the least breath –yet rightly handed ,they serve both ornament and use ‘’అని రెండు రకాల ప్రయోజనాలను పేర్కొన్నాడు .

కామ్పియాన్ రాసిన లలిత ,పారదర్శక లిరిక్స్ చాలా సున్నితమైనవే అయినా మనసుపై గొప్ప ప్రభావాన్ని చూపాయి .అతను అన్నట్లు కదిలించాయి కూడా ..అతని లిరిక్స్ లో ‘’the superfluous  of his deeper  studies’’ఉంటాయి .వాస్తవ కవిత్వాన్ని సరి అయిన మత భావాలతో జత చేసి చెప్పటం అతని ప్రత్యేకత .’’beauty since you so much desire ‘’లాంటివి గుర్తుండి పోయే మాటలు .కవిత్వం పై కామ్పియాన్ కు ఉన్న భావాలను సామ్యుల్ డేనియల్ తిరస్కరించి కవిత్వానికి’’ రైం’’(అంత్య ప్రాస )అవసరమే నన్నాడు .కామ్పియాన్ పెళ్లి చేసుకోలేదు పిల్లలూ లేరు .1-3-1620న చనిపోయాడు .ఆరోజే వెస్ట్ ఫ్లీట్  స్ట్రీట్ లో సెయిం ట్ డం స్టన్లో అంత్య క్రియలు చేశారు .15-2-1567న జన్మించిన కామ్పియాన్ యాభై మూడేళ్ళు మాత్రమె జీవించాడు .

Thomas Campion (12 Feb. 1567–1 Mar. 1620)

 

జంట కవులు – ఫ్రాన్సిస్ బీమాంట్ ,జాన్ ఫ్లేచేర్

‘’A perfect union of genius and friend ship ‘’అని పేరు తెచ్చుకొన్న ఫ్రాన్సిస్ బీమాంట్ 1584-1616కాలం వాడు .పన్నెండు ఏళ్ళ  వయసులో ఆక్స్ ఫర్డ్ లో చేరాదు అప్పటికే  అదిరిపోయే రెండు ట్రాజెడీలను రాసిన ఘనుడు .ఇవి మార్లో రాసిన ‘’టంబర్ లైన్ ‘’,షేక్స్ పియర్ రాసిన ‘’టైటాస్ ఆండ్రోనికస్ ‘’లకు అనుకరణలు .లా చదివి పది హేనేళ్ళ వయసుకే ‘’మిడిల్ టెంపుల్ ‘’లో మెంబర్ అయ్యాడు .కొద్దికాలం లో లండన్ నాటక రచయితల సంఘం లో చేరాడు .ఇందులో ఫ్లెచర్ ఒక భాగ స్వామి .ఫ్లెచర్ కు సృజన ఎక్కువ. దానికి ముడి సరుకు బీమాంట్ అందించే వాడు .బెన్ జాన్సన్ కూడా తాను రాసింది సరి చేయటానికి బీ మాంట్ కే ఇచ్చే వాడు .ఫ్లెచర్ తో కలిసి పదమూడు నాటకాలను రాశాడు బీ మాంట్.‘’మొదటి బీమాంట్ ఫ్లెచర్ ఫోలియో ‘’35నాటకాలతో1647లో విడుదల అయితే  1679లో 53తో విడుదల అయింది .బీమాంట్ రాసినవి చాలా సీరియస్ గా గొప్ప నీతి బద్ధం గా ఉంటాయి .జంట రచనలు చేస్సినా అందులో ‘’సింగులర్ బ్యూటీ అండ్ పవర్ ‘’ఉందని మెచ్చుకొంటారు .జంట కవనం ఈ ఇద్దరితోనే ప్రారంభమైందని చెప్ప వచ్చు .

 

Francis Beaumont.jpg

జాన్ ఫ్లెచర్

బీమాంట్ కంటే తొమ్మిదేళ్ళు ఎక్కువ కాలం జీవించిన జాన్ ఫ్లెచర్ 1579లో పుట్టి 1625లో మరణించాడు .అవిశ్రాంత నాటక రచయిత గా ఆకాలం లో పేరు పొందాడు .కోస్టల్ ప్రాంతం ‘’రై ‘’లో పుట్టాడు. కేంబ్రిడ్జి బెనేట్ కాలేజి లో చదివాడు .ఇరవైలలో లండన్ చేరాడు .స్పురద్రూపం ,మంచి పద్ధతుల తో అందరినీ ఆకర్షించాడు .పదహారు నాటకాలుస్వయం గా  రాశాడని  గుర్తింపు .బీమాంట్ తోకలిసి ఏడు లేక ఎనిమిది రాసి ఉంటాడు .థామస్ మిడిల్ట న్   తో కూడా జత కలిసి రాశాడు .షేక్స్ పియర్ కూడా వీరితో కలిసి ‘’టు నోబుల్ కిన్స్ మెన్ ‘’,కింగ్ హెన్రి ది యైత్’’నాటకాలు రాశాడు .’’ట్రాజీ కామెడి ‘’ రాయాలనే బల మైన కోరిక ఫ్లెచర్ కు ఉండేది .’ఆ కోరిక తీరకుండానే ’ప్లేగు ‘’వ్యాధి సోకి అర్ధంతరం గా నలభై ఆరో ఏట చనిపోయాడు .వెస్ట్ మినిస్టర్ ఆబ్బే లో చాసర్ కవి ప్రక్కనే సమాధి చేశారు .

నాటకాలు రాసినా, ఫ్లెచర్ కు  కవి గానే ఉండటం ఇష్టం .’’the touch is light and the tone lyrical ,the lines move with grace ,warmth and spontaneity .Although his range is not great he had a definite influence on his followers ‘’అని అతని కవితా వైభవాన్ని ఎస్టిమేట్ చేశారు .ఫ్లేచేర్ రాసిన ‘’ఎలిజీ’’లు లఘు కావ్యాలుగా నీతి బోధకాలుగా ఉండటంప్రత్యేకత –

‘’lay a garland on my hearse –of the dismal yew –maidens willow branches bear –say I died true ‘’

‘’My love was false ,but I was firm-from the hour birth –upon my buried body lie –lightly gentle earth ‘’

ఇలాంటి పంక్తులు ఫ్లెచర్ కవితల్లో కో కొల్లలు .ఇలాంటి తళుకు బెళుకులు అచ్చమైన బంగారం మెరుగుల్లా అని పించటమే ఈ’’తళుకు యుగ ‘’లక్షణం .షేక్స్ పియర్ అనుయాయి గా మంచి పేరు పొందాడు .ప్రేక్షకులు అర్ధం చేసుకో లేనంత వేగం గా అతని రచనలుంటాయి .అయినా షేక్స్ పియర్ రచనలు లాగా వీటికి కాలాతీత విలువలు లేక పోవటం తో మరచి పోయారు .ఇప్పటిదాకా ‘’రెలిజియన్ కవిత్వమే ‘’ఏఎ యుగాన్ని డామినేట్ చేసింది

John Fletcher (1).JPG  

సశేషం

శ్రీ  నృసింహ జయంతి(వైశాఖ శుద్ధ చతుర్దశి ) శుభా కాంక్షలతో

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -13-5-14-ఉయ్యూరు

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment