వీక్షకులు
- 1,134,068 hits
-
-
ఉసుల గూడు (బ్లాగ్) గువ్వలు (పోస్ట్)
- నటుడు సి. ఎస్. ఆర్. పూర్వ స్మృతులు.1 వ భాగం.10.4.26.
- శ్రీ మద్రామాయణం. ఆచార్య పుల్లెల శ్రీరామ చంద్రుడి గారి బాలానందినీ వ్యాఖ్య.168 వ భాగం.10.4.26.
- శ్రీ పోలాప్రగడ సత్యనారాయణ మూర్తి గారి షేక్స్పియర్ సాహిత్య వైభవం.17 వ భాగం.9.4.26.
- నాట్యావధాన సరస్వతీ శ్రీ స్వర్ణ రాజ హనుమంతరావు గారి శ్రీమద్రామాయణం లో ఆంధ్రాయణం.8 వ భాగం.9.4.26.
- వాల్మీకి మహర్షి కృత శ్రీ మద్రామాయణం. ఆచార్య పుల్లెల శ్రీరామ చంద్రుడి గారి బాలానందినీ వ్యాఖ్య.167 వ భాగం.9.4.26.
- నారాయణ దాసు గారు రచించిన ‘జానకీశపధం’ (ఉత్తర రామ చరిత్ర) కీర్తనలు 72 మేళకర్త రాగాలలో ఉన్నా అవలీలగా పాడేసహజకవి ,పండితుడు ,గాంధేయవాది- హరికథక రాజహంస’, ‘కళాప్రపూర్ణ’ ‘నవరస మధుర సరస్వతి’ డా. అమ్ముల విశ్వనాథ భాగవతార్
- శ్రీ పోలాప్రగడ సత్యనారాయణ మూర్తి గారి షేక్స్పియర్ సాహిత్య వైభవం.16 వ భాగం.8.4.26.
- శ్రీమతి మేరీ కృపాబాయి గారి కథాంజలి.14 వ భాగం.8.4.26.
- నాట్యావధాన సరస్వతీ శ్రీ స్వర్ణ రాజ హనుమంతరావు గారి శ్రీమద్రామాయణం లో ఆంధ్రాయణం.6 వ భాగం.8.4.26.
- వాల్మీకి మహర్షి కృత శ్రీ మద్రామాయణం. ఆచార్య పుల్లెల శ్రీరామ చంద్రుడి గారి బాలానందినీ వ్యాఖ్య.166 వ భాగం.8.4.26
Archives
ఉసూల గూటి అరలు
- అనువాదాలు (24)
- అమెరికా లో (206)
- ఆ''పాత''మధురాలు (9)
- ఆరోగ్యం (4)
- ఊసుల్లో ఉయ్యూరు (81)
- కవితలు (147)
- కవి కోకిల స్వరాలు (11)
- దేవాలయం (38)
- నా డైరీ (9)
- నా దారి తీరు (136)
- నేను చూసినవ ప్రదేశాలు (108)
- పద్య రత్నములు (2)
- పుస్తకాలు (3,475)
- సమీక్ష (1,826)
- ప్రవచనం (15)
- మహానుభావులు (388)
- ముళ్ళపూడి & బాపు (61)
- రచనలు (2,903)
- రాజకీయం (66)
- రేడియో లో (55)
- వార్తా పత్రికలో (2,159)
- సభలు సమావేశాలు (337)
- సమయం – సందర్భం (852)
- సమీక్ష (33)
- సరసభారతి (10)
- సరసభారతి ఉయ్యూరు (543)
- సినిమా (378)
- సేకరణలు (318)
- సైన్స్ (46)
- సోషల్ మీడియా ఫేస్బుక్ youtube (2,186)
- స్వాతంత్ర సమరయోదులు (20)
- English (6)
ఊసుల గూడు
రాచకీయ ద్విప్లేట్స్-9(శునకానందం స్పెషల్ )
రాచకీయ ద్విప్లేట్స్-9(శునకానందం స్పెషల్ )
1-అసెంబ్లీ లో బిల్లు వోడిపోతే కే.సి.ఆర్. సీమాంధ్రుల ది అన్నాడు శునకానందం
పాపం గత ‘’జన్మ’’స్మృతి ఇంకా వీడక పొండుతున్నాడేమో అను క్షణం రాక్షసానందం
2-అసెంబ్లీ’’ బావి’’ లో అందరూ అయ్యారు కప్పలు
బిల్లు తిరస్కరించటానికే ఇంతగా పడ్డారు ఈ తిప్పలు ‘
3-ఆంద్ర ప్రదేశ్ నుంచి ధిల్లీ వెళ్లి వెంటబెట్టుకొని తిరిగోస్తాడట సగర్వం గా తెలంగాణ
ఇలా చెప్పి ఉత్తి చేతుల్తో ఎన్ని సార్లు వాపసోచ్చాడో ‘’దొర’’-,వెంట లేకుండా తెలంగాణ
4- అందరూ చేతులు దులిపేసుకొని ఎదురు చూస్తున్నారు ధిల్లీ వైపు
‘’ప్రణవ మంత్రమే ‘’పఠిస్తూ ఆశ గా ఎవరికి వారు ఉన్నారు వస్తుందని కైపు .
5-పెద్దల సభ ఎన్నికకు ప్రభాకర రెడ్డి ఆదాల
ఆడుతున్నాడు నాటకం పిల్లాడిలా ఉన్నట్లు అడ్డాల.
6-నన్నప నేని ప్రవర్తించింది నిన్న అచ్చమైన రాజకుమారిలా
వీరోచిత పోరాటం లో విజయం కోసం తెగించి చేసిందేమో అలా.
7-అబ్ డిల్లీ దూర్ హై అని దూరం గా ఉంటున్నాడు ముఖ్యమంత్రి కిరణ్
అడ్డుకోలేక సతమతమౌతోంది క్రమశిక్షణ అరచేత్తో ప్రతాప సూర్య కిరణ్ .
8- నిన్న ‘’బావి ‘’లోకి లంఘించిఎన్నో సార్లు దూకిన మేనల్లుడు హరీ
అన్ని సార్లూ అడ్డుకొని కాలులాగి కౌగిలించి అడ్డుకొని చేశారు కిరి కిరీ
9- శునకానికి ఎక్కువస్వామి భక్తీ ,విశ్వాసం
అవిలేకే ‘’తూలుడు’’ మాటల తో ‘’దొర’’ గారి అవిశ్వాసం .
10-మనుషులు విడినా కలిసున్నా మనసులు కలవాలి
అన్యోన్యం ఆత్మీయత ఎక్కడున్నా నిరంతరం కురవాలి .
11-క్షణికానందం వద్దు కావాలి మనకు శాశ్వతా నందం
అదేదో ‘’ఆయన’’ కే ఇచ్చేద్దాం కోరుకొన్న శునకా నందం .
మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -31-1-14-ఉయ్యూరు
హోమర్ నుండి జాయిస్ దాకా -2
హోమర్ నుండి జాయిస్ దాకా -2
గ్రీక్ రచయిత Aeschylusరాసిన oresteriaలోనాగరక విధానం లో ఉన్న న్యాయ పద్ధతికి ప్రాధాన్యం కని పిస్తుంది .గ్రీసు దేశం పై పర్శియన్ల్స్ దాడికి వ్యతిరేకించాడు .ఆదేశం తరఫున పోరాడాడు కూడా .విజయాన్ని గర్వం గా అహంకారం గా మార్చవద్దని సలహా ఇచ్చాడు .గర్వాన్ని ఆకలిగా ,అధికార దాహం గా మలచ వద్ద్దని హెచ్చరించాడు
![]()
మరో గ్రీకు రచయిత సోఫిక్లాస్ రాసిన ‘’ఓడిపస్ ది.కింగ్ ‘’లో ఓడిపస్ తండ్రిని చంపి తల్లికి మొగుడవుతాడు .ఈ పేరే గుర్తింపు చిహ్నం గా ఉంటుంది దీనికి ‘’swollen foot ‘’అని ఆంగ్లం లో అర్ధం .తెలుగులో ఉబ్బిన పాదాలు .ఒడి అంటే ఉబ్బిన అని అర్ధం .తెలుసుకోవటం అనే అర్ధమూ ఉంది ఇదొక నాటకం .ఇందులో మనిషి, చేసేవాడు -man and the doer పాత్రలు .ఇందులో ఓడిపస్ మనిషి చాలా వింత .తట్టుకోలేని ప్రపంచం లో ఉన్నట్లు అని పిస్తాడు .దైవం విధి శక్తులకు అన్నిటికీ తల ఒగ్గుతూ తన విషాదానికి తానే కారకుడవుతాడు .ఇతని ప్రవర్తను బట్టే ‘’ఈడిపస్ కాంప్లెక్స్ ‘అనే మాట పుట్టింది .’ఇందులో Erosఅనే మాటకు కామ వాంఛ అని అర్ధం .Agapiఅంటే సోదర ప్రేమ దానం ,కొడుకుపై ప్రేమ ,మనిషి పై జాలి అని అర్ధాలు .philiaఅనే మాటకు దగ్గర వారిపైనా స్నేహితులపైనా ప్రేమ అని అర్ధం .
Euripides రాసిన Bachae అనేది సమస్యా వలయం ఉన్న నాటకం . ఇందులోని ముఖ్య పాత్ర ఎలెక్ట్రా అనే స్త్రీ .ఆమె స్తిరమైన అభిప్రాయాలుంటాయి తిరుగు బాటు ఎదిరించటం చేసే నాయిక.తనను తానూ శిక్షించుకొనే తత్త్వం .ఆమె .హేళన వ్యంగ్యం ,క్రూరత్వం ఉన్న యువతి .
’’అరిస్తో ఫేన్స్’’రాసిన ‘’frogs’’ లో హాస్యం ఉంది .,మేధావులు ,రాజకీయ నాయకులమీద వ్యంగ్యం తో చేసిన దాడి దండ యాత్రా కని పిస్తాయి .చాలా ప్రతిభావంతం గా సీరియస్ గా అర్ధ వంతమైన సంభాషణలతో చెమ్పదెబ్బలు కొడుతున్నట్లుగా ఉంటుంది
వర్జిల్
వర్జిల్ Acneid రాశాడు .దీన్ని ‘’సుప్రీం లిటరరీ ఎపిక్ ‘’న్నారు చాలా మెరుగైన కవిత్వం వర్జిల్ రాశాడు .హోమర్ ‘’ఓరల్ పోయేట్ ‘’అయితేవర్జిల్ గ్రీకు లో మొదటి వ్రాత కవి .హోమర్ కవితకు ప్రత్యెక శ్రోతలు ఉంటారు .ఇదులో ఆరాధన ఉంది దీన్నే గ్రీక్ లో ‘’pietas’’అంటారు .ప్రేమ యొక్క వినాశక శక్తి ని చూపించాడు .పురాతన కద ను ఆఫ్రికా రాణి క్లియోపాత్రా కు అన్వయించి రాశాడు .ఇందులో పోరాటాలను ప్రేమను సమర్ధ వంతం గా చిత్రించాడు .ప్రతిదాంట్లో తీవ్ర కాంక్ష ఉంటుంది .’’the eternal affirmation of the spirit of man in literature ‘’అనేది వర్జిల్ సొత్తు గా భావిస్తారు .
వర్జిల్ తర్వాత Gottefried వస్తాడు .ఆయన ‘’ట్రిస్టాన్ ‘’రాశాడు ఇది మధ్యయుగ ప్రపంచానికి ఆధునిక వ్యక్తిత్వానికి ,స్వభావానికి వారధిగా నిలిచే రచన .మనిషి లోని అనేక పొరలను ఆవిష్కరిస్తాడు ఇందులో .అమరత్వానికి సాగే ప్రయాణ సన్నాహాన్ని చూపించాడు .మధ్యయుగ మానవత్వం తో కద ప్రారంభమవుతుంది .జీవితాన్ని ఒప్పుకోవటం ఉంటుంది .భూ చరుడైన మానవుడు దివ్య ఆత్మలు ఇందులో దర్శిస్తాం .కదా బీజం ఐర్లాండ్ లో ప్రారంభం అయి వేల్స్ ,బ్రిటన్ ,ఫ్రాన్స్ ,ల ద్వారా జర్మనీ చేరుతుంది .దీన్ని’’celestic sory అంటారు అంటే స్వర్గ లోక.ప్రేమకధ .ఇందులో బ్రహ్మాండమైన నిర్మాణం ,జీవాత్మ ఉన్నాయి .దీన్ని ‘’లిప్ ‘’అంటారు .ఇందులో ఉన్న ఆత్మ ఔన్నత్యం ను ‘’మౌట్‘’అనీ ,సౌభాగ్యాన్ని ‘’గౌట్ ‘’అనీ అంటారు .ఈ కద ఒక చతురస్రం లో బంధింప బడి ఉన్నట్లని పిస్తుంది .
తర్వాత ‘’డాంటే’’ రాసిన’’ ఇన్ ఫెర్నో’’గుర్తుకొస్తుంది .డివైన్ కామెడి లో భూలోకపు కారణాలను హోలీ స్పిరిట్ లో కోల్పోతాడు .డాంటే సౌందర్య తాత్వికత ,ప్రేమకోసమైనా సౌందర్యం కు ,ప్రేమనుండి దైవత్వానికి ప్రస్తానం గా గోచరిస్తుంది .దీనినే త్రికం ‘’ట్రినిటి ‘’అన్నారు .డాంటేగొప్పదనం అంతా అతని కే స్వంతమైన రూపకాలంకారం లో తీర్చిదిద్దటమే .అదొక వరం ఆయనకు ఇందులో మాట్లాడటం ,వినటం అనేవి ప్రత్యేకత సంత రించుకోన్నాయి వీటినే ‘’dicno e,odono ‘’ అంటారు .
డాంటే తర్వాత ప్రసిద్ధుడు ‘’మాంటేగ్ ‘’ఇతని వ్యాసాలూ బహుళ ప్రచారం పొందాయి .అతని సిద్ధాంతం అంతా ‘’Iiam human .i consider nothing human foreign to me ‘’.దీనినే వాళ్ళ భాష లో ‘’Homosum ,humoni a me nil alienm puto ‘’అంటారు .ఇతని ఎస్సే లను ఆత్మ కదా గా భావిస్తారు సెక్స్, నీతి, మతం పై వ్యాస పరంపర రాశాడు మాంటేగ్ దృష్టిలో ‘’essay attempts not conclusions n which experience would be tested and tried through writing ‘’.అతని సూక్తి కూడా గొప్పదే ‘’better to live happily than to die happily ‘’హాయిగా చావటం కంటే హాయిగా జీవించటం మేలు .చని పోయే ముందు తనను గురించి ‘’I have seen the leaves ,the flowers ,and the fruit ow the withering –happily since it is natural ‘’అన్న జీవిత సత్యాన్ని తెలియ జేస్తూ నిష్క్రమించాడు
షేక్స్ పియర్ హోమర్ రాసిన ఎపిక్స్ ను ఎతీనియన్ ట్రాజేడి ని ,అందుకొని భాగ స్వామి అయి అజ్ఞాతం లోఇతరులకే కాక తనకూ కనిపించని మానవ లక్షణాలను నాటకాలలో ఆవిష్కరించి ప్రపంచ ప్రసిద్ధ నాటక కర్త అయ్యాడని రచయిత అంటాడు
.
ఈయన తర్వాత’’సేర్వాంటిస్’’కనిపిస్తాడు అతని ‘’డాన్ క్విక్సోట్ ‘’నవల యదార్ధానికి భ్రమకు మధ్యలో ఉంటుంది .1547లో పుట్టాడు షేక్స్ పియర్ చని పోయిన రోజునే 23-4-1616న మరణించాడు .దీన్ని ‘’క్విక్సోటిక్ ‘’గా ఉందని విమర్శకులు చమత్క రించారు .స్వీయ వ్యక్తిత్వం కోసం చేసే విజయ పోరాటం ఈ కద .అప్పటికే స్పెయిన్ దేశం ఐరోపా సంస్కృతికి దూరమై ఒంటరిది అయి పోయింది (కల్చరల్ ఐసోలేషన్).అలాగే రచయిత సేర్వాంటిస్ కూడా ఒంటరి వాడైపోయాడు .ఆయన చని పోయిన పదేళ్లకు ఈ రచన బయట పడింది ఆంగ్ల సాహిత్య చరిత్రలో ఒడిస్సీ తో బాటు ‘’డాన్ క్విక్సోట్ ‘’మొదటి నవల .యదార్ధ కాల్పనిక కధకు ఈ నవలే నాంది పలికింది
.
సశేషం
మాఘ మాసం మంచి రోజుల శుభా కాంక్షలతో
7-10-2002 సోమవారం నాటి అమెరికా డైరీ(హూస్టన్ ) నుండి –
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -31-1-14-ఉయ్యూరు
నీతి నిలబడితేనే మనం నిలబడతాంఅంటున్న కృష్ణా జిల్లా మాజీ ఐ ఏ.ఎస్ అధికారి కాకి మాధవరావు

వ్యవస్థలో మార్పు కోసం శ్రమించే వారిని వ్యక్తులుగా విడదీసి అశక్తులుగా నిలబెట్టాలని చూస్తుంది సమాజంలోని ఒక వర్గం. అదే పనిగా కుతంత్రాలు చేస్తూ, కుంగదీయాలని కూడా చూస్తుంది. వాటిని ఎదిరించే దిశగా అడుగులు వేయలేకపోతే ఎవరైనా నిలువునా కూలిపోవాల్సి వస్తుంది. ఎన్నో అవరోధాల్ని అడుగడుగునా ఎదుర్కొంటూ నీతికీ నిబద్ధతకూ మారుపేరుగా నిలిచిన సీనియర్ ఐఏఎస్ ఆఫీసరు కాకి మాధవరావు. మూడున్నర దశాబ్దాల ఐఏఎస్ అధికారిగా, ఏడు దశాబ్దాల జీవన యాత్రికుడిగా కాకి మాధవరావుకు ఎదురైన కొన్ని సంఘటనలే ఈ వారం ‘అనుభవం’
కృష్ణాజిల్లాలోని పెదమద్దాలి మా ఊరు. నేనేదైనా ఒక స్థితికి వచ్చానూ అంటే, అందుకు దోహదం చేసిన బలమైన సంఘటనలు కొన్ని నా బాల్యంలోనే జరిగాయి. మా నాన్న ఒక పాలేరు. చుట్టుపక్కల చాలా ఊళ్లల్లో ఆయనకు బాగా శ్రమించే, నిజాయితీ గల మంచి పాలేరుగా పేరుంది. ఆ రకంగా తనకు లభించిన గుర్తింపు వల్లో ఏమో గానీ, ఆయన నన్ను కూడా పాలేరునే చేద్దామనుకున్నారు. ఆ మాటే అమ్మతో అంటే, లేదు. వాడ్ని బళ్లో వేద్దామంది. “బళ్లో వేస్తే ఏం చేస్తాడు? గాడిదల్ని కాస్తాడా?” అంటూ అసహనాన్ని వ్యక్తం చేశాడు నాన్న. అయినా, అమ్మ చదివించాల్సిందే అంది. ఎంత మాత్రం వీల్లేదంటూ నాన్న వెళ్లిపోయాడు. నాన్న ఆమోదం లేకుండానే అమ్మ నన్ను స్కూల్లో చేర్పించింది. పగలంతా పనికిపోయే నాన్నకు ఆ విషయం తెలియకుండానే ఉండిపోతుందని కూడా అనుకుంది. కానీ, కొద్ది రోజులకే ఆయనకు తెలిసిపోయింది. నేను చెప్పినా వినకుండా వాడ్ని స్కూల్లో చేరుస్తావా? అంటూ నాన్న ఆ రోజు అమ్మను గొడ్డును బాదినట్టు బాదాడు. అడ్డం వెళితే, మా అన్నయ్యనూ, నన్నూ కూడా తన్నాడు. అంత జరిగినా “ఎన్నాళ్లు కొడతాడో చూద్దాం మీరు మాత్రం చదువు మానేయొద్దు” అంది. ఆ కారణంగా అమ్మను ఎన్ని సార్లు కొట్టాడో లెక్కలేదు. చివరికి విసుగు పుట్టి వదిలేశాడు. నా చదువు, మా అన్నయ్య చదువు మా నాన్న అయిష్టత మధ్యే కొనసాగింది. మాకు తెలిసి ఆయన తన జీవితంలో ఓటమి అంటూ ఎరగడు. కానీ, ఈ ఒక్క విషయంలో మాత్రం నాన్న ఓడిపోయాడు. చూసే ప్రపంచం చిన్నదైపోయినపుడు ఎంత వారికైనా ఓటమి తప్పదేమోనని నాకనిపిస్తుంది.
చేయని నేరానికి….
సుబ్బయ్యని మా నాన్నకు ఒక సోదరుడు ఉండేవాడు. చెరువులోని తామరాకుల్ని కోసి వాటిని పొట్లాలు కట్టుకునేందుకు మిఠాయి షాప్‌లకూ, మాంసం షాప్‌లకూ అమ్ముతూ బతికేవాడు. ఒక రోజు సాయంత్రం ఏడుగంటల ప్రాంతంలో నేను చెరువు పక్కనుంచి న డుచుకుంటూ ఊళ్లోకి వస్తున్నాను. అప్పుడు నాకు 8 ఏళ్లు ఉంటాయేమో. అప్పటికే చీకటి పడింది. రోజూ లాగే ఆయన తామరాకుల్ని ఎండబె ట్టి ఆ తర్వాత వాటిని ఒకచోటికి చేరుస్తున్నాడు. సరిగ్గా అదే సమయంలో పెద్ద గాలి దుమారం వచ్చింది. ఆ తాకిడికి ఆకులన్నీ ఎగిరిపోతున్నాయి. అది గమనించిన ఆయన “ఓరి దేవుడా నా పొట్టకొట్టావురోయ్, నాకు తిండి లేకుండా చేశావు. ఈ ఆకులన్నీ పోతే నేను ఏమమ్ముకుంటాను? ఏం తింటాను.?” అంటూ పరుగులు తీస్తూ ఆ ఆకుల్ని పట్టుకునే ప్రయత్నం చేస్తున్నాడు. ఏదో కొంత సాయం చేద్దామని నాకు సాధ్యమైనన్ని ఆకుల్ని ఒక చోట చేర్చి, ఆ తర్వాత వచ్చేశాను. ఇంటికి వచ్చేసరికి బాగా ఆలస్యమయింది. మా నాన్న గుడ్లురుముతూ నా మీదికి వచ్చాడు. ఎక్కడికి వెళ్లావు.? ఎందుకు ఆలస్యమయింది? అనేమీ అడక్కుండా, నన్ను చితక బాదేశాడు. ఎందుకు కొడుతున్నాడో నాకు అర్థం కాలేదు. నే ను మంచి పనే కదా చేశాను, పైగా ఆయన సోదరుడికే కదా సాయం చేశాననే మాట నా మనసులో ఉంది. అయినా, ఆలస్యానికి ఇదీ కారణమని చెప్పాలని కూడా నాకనిపించలేదు. నేను తప్పు చేయకపోయినా కొడుతున్నాడనే బాధ నన్ను వేధిస్తోంది. తీవ్రమైన ఒక అంతర్వేదనతో ఆ రాత్రంతా గడిచిపోయింది. దీని మీద నా నిరసనను, నా కోపాన్ని ఆయనకు ఎలాగైనా తెలియచేయాలనుకున్నాను.
మా నాన్న ఎప్పుడు క్షవ రం చేయించినా మంగలిని జుత్తు మరీ చిన్నదిగా చేయమని చెప్పేవాడు. నేనే వద్దూ వద్దూ అంటూ ఉండేవాణ్ని. అలాంటి నేను మంగలి వద్దకు వెళ్లి గుండు చేయించుకుని వచ్చాను. అంతే కాదు అమ్మతోనూ, నాన్నతోనూ మాట్లాడటం మానేశాను. ఆ మౌనంలో నాకు ఏవేవో ఆలోచనలు వచ్చేవి. త ప్పు చేయకుండానే ఇలా దండించారే..! నిజంగానే తప్పు చేస్తే ఏం కావాలి? ఒక వేళ నిజంగానే నేను త ప్పు చేసి ఉంటే అప్పుడు నా వద్ద సమాధానం ఉండదు. అందుకే జీవితంలో తప్పంటూ చేయకూడదనే ఒక నిర్ణయానికి వచ్చేశాను. స్నేహితులు, సరదా కబుర్లు, ఆట పాటల లాంటివన్నీ ఆ రోజునుంచి నా జీవితంలోంచి పూర్తిగా అదృశ్యమైపోయాయి. ఫలితంగా, నాలో క్రమంగా పెరుగుతూ వచ్చిన సీరియస్‌నెస్ నన్నొక పుస్తకాల పురుగును చేసింది. నాన్న చేతిలో నేను అన్యాయంగానే హింసకు గురైనా అది నాలో వేరే రకమైన కసిని పెంచింది. హింసను ఒక వైపునుంచే చూస్తే మనం కూలిపోవడం ఖాయం. అలా కాకుండా ఆవలి వైపు నుంచి చూస్తే అది మనల్ని నిలబెడుతుంది కూడాను అని నాకనిపిస్తుంది.
నక్సలైటుగా ముద్రవేసి….
నేను వరంగల్‌లో కలెక్టర్‌గా ఉన్న సమయంలో జనాన్ని తీవ్రమైన ఆందోళనకు గురిచేసే పరిణామాలు కొన్ని జరిగాయి. నక్సలైట్లు అన్న పేరుతో పోలీసులు కొంత మంది స్థానిక యువకుల్ని అడవుల్లోకి తీసుకెళ్లి కొద్ది రోజులు ఉంచేసేవారు. ఆ తర్వాత ఒక ఇన్స్‌పెక్టర్ వాళ్ల తలిదండ్రులను కలిసి, పోలీసులు ఇవ్వాళో రేపో మీ పిల్లాడ్ని కాల్చేస్తారు, మీరు ఇంత డబ్బు ఇస్తే పోలీసులకు చెప్పి విడిపిస్తాను అంటూ బేరం పెట్టేవాడు. మోహన్ రావు అనే సిపిఐ నాయకుడొకాయన నాకీ విషయం చెప్పాడు. వెంటనే ఈ విషయాన్ని నేను ఎస్.పి గారికి చెప్పాను. ఆయన అలాంటిదేమీ లేదని దాటవేశాడు. మళ్లీ ఒకరోజు అదే మోహన్ రావు ఫలానా అడవిలోని ఫలానా కొండ మీద 16 మంది యువకుల్ని బంధించి ఉంచారంటూ సమాచారాన్ని చేరవేశాడు. అప్పుడింక తట్టుకోలేకపోయాను. సబ్-కలెక్టర్‌గా ఉన్న జి. పి. రావును, అసిస్టెంట్-కలెక్టర్‌గా ట్రెయినింగ్‌లో ఉన్న హరిని ఆ ప్రదేశానికి వెళ్లమని చెప్పాను. వీళ్లు అక్కడికి వెళ్లి చూస్తే 16 కాదు 22 మంది ఉన్నారు.
వాళ్లను వెంటనే విడిపించాను.
ఆ సంఘటనతో పోలీసులు నా మీద కన్నెర్ర చేశారు. వివిధ కారణాలతో అప్పటికే నా మీద ద్వేషంతో ఉన్న కొంత మంది ఎం.ఎల్.ఏలు, ఒక మంత్రి ఇదే అదనుగా ‘కలెక్టరు నక్సలైటు’ అంటూ నా మీద ఒక పిటిషన్ తయారు చేసి అప్పటి రాష్ట్రపతి వి.వి. గిరికి అందచేశారు. ఈ విషయం స్థానిక పత్రికల్లోనూ, వివిధ జాతీయ పత్రికల్లోనూ ప్రచురితమమయ్యింది. కాని ఎకనామిక్ అండ్ పొలిటికల్ వీక్లీలో మాత్రం నా గురించి చాలా పాజిటివ్ వ్యాసం వచ్చింది. దాని శీర్షిక ‘నక్సలైట్ ఇన్ ఐఏఎస్ క్లోత్స్..!’ అని. అందులో “అన్యాయంగా తమ భూమిలోంచి తరిమివేయబడ్డ పేదవారికి ఆయన తిరిగి ఆ భూమిని ఇప్పించాడు. గీతకార్మికులకు కాకుండాపోతున్న తాటి, ఈత చెట్లను వారికి అందేలా చేశాడు. ప్రభుత్వం ఇచ్చే కరువు నివారణా నిధులను పేదవాళ్ల పొలాలు చదును చేయడానికి, బావులు తవ్వడానికి ఖర్చు చేశాడు. ఈ చర్యలన్నీ నక్సలిజంలో భాగమే అయితే ఆ కలెక్టరు నక్సలైటే’ అంటూ రాశారు. ఈ వ్యాసం కూడా అప్పటి రాష్ట్రపతి వి. వి. గిరి దృష్టికి వెళ్లింది. ఆయన విచారణకు ఆదేశించారు.
ఐ.బి జాయింట్ డైరెక్టర్ కూడా నా వల్ల పోలీసులకు చాలా ఇబ్బందులు ఉంటాయని భావించి కొన్ని కుయుక్తులకు పాల్పడ్డారు. అందులో భాగంగా డి.ఎస్.పితో ఈ కలెక్టర్ మీద ఏదైనా ఒక నెగెటివ్ వాక్యం రాయండి. నేను అతన్ని తన ఉద్యోగ విధుల్లోంచి తొలగిస్తానన్నాడట. అయితే అలా రాయడానికి ఆ డి.ఎస్.పి మనస్సాక్షి ఒప్పుకోలేదు. అందుకే రాయలేదు. పైగా “అతని వల్ల కొంత మంది ఇబ్బంది పడుతున్న మాట నిజమే కానీ, అతనికి నక్సలైట్లతో సంబంధాలు ఉన్నాయని చెప్పడం నిజం కాదు” అంటూ రాశాడు. పలు ఆరోపణలు ఎదుర్కొంటున్నా, నేను అక్కడే కొనసాగడానికి అది దోహదం చేసింది. అయితే, ఐ.బి జాయింట్ డైరెక్టర్ తనతో అన్న మాటల్ని ఆయన తన మనసులోనే దాచుకున్నాడు. వెంటనే నాకు చెబితే, ‘నానుంచి ఏమైనా ఆశించి అలా చెబుతున్నాడని నేననుకుంటానేమో అనుకుని ఆ విషయాన్ని నేను రిటైర్ అయ్యేదాకా అంటే 1998 దాకా నాకు చెప్పలేదు. ఆ రహస్యం మరో వ్యక్తికి కూడా తెలిస్తే మంచిదని నేనంటే కేంద్ర ప్రభుత్వంలో సెక్రెటరీగా చేసిన జి. పి. రావు ముందు ఆ నిజాన్ని బయటపెట్టాడు. విధినిర్వహణలో సమస్యలు ఎప్పుడూ తప్పవు. కానీ, అత్యున్నత హోదాలో ఉండే వారు సైతం వక్ర మార్గం పడితే సమాజానికి ఇంక మనుగడేముంటుంది? హోదాల్ని కూడా మనుషుల హృదయాలతోనే కొలవాలన్న సత్యం ఆ సంఘటన నాకు నేర్పింది.
ఔదార్యానికి హద్దులా?
నిజాయితీగా ఉండడమే కాదు. మన నీతిని అనుమానించే పరిస్థితి ఏర్పడకుండా చూసుకోవడం కూడా అవసరమనుకుంటాను. ఎన్. టి. రామారావు ప్రభుత్వం అవినీతిని అంతమొందిస్తాం అంటూ అధికారంలోకి వచ్చింది. అవినీతికి పాల్పడే వారి గుండెల్లో రైళ్లు పరుగెత్తడం మొదలెట్టాయి. సరిగ్గా అదే సమయంలో మా అబ్బాయి పి.జి పూర్తి చేసుకుని సొంతంగా ఏదైనా పరిశ్రమ స్థాపించాలన్న అభిప్రాయానికి వచ్చాడు. అందుకు నేను అనుమతించలేదు. “నువ్విప్పుడు ఏ రుణంతో ప్రారంభించినా అది నేను అవినీతికి పాల్పడి సంపాదించిన డబ్బుతోనే పెట్టావని అనుకుంటారు. అందువల్ల నువ్వు సివిల్ సర్వీసెస్‌కు చదువుకోవడం మేలు” అని చెప్పాను. వాడు ససేమిరా అన్నాడు. “ఒకవేళ నువ్వు అంతగా అనుకుంటే నేను రిటైర్ అయ్యేదాకా వేచి ఉండు అప్పుడు పెట్టుకో” అన్నాను. “16 ఏళ్లు వేచి ఉండడం అంటే చాలా కాలం వృధా అవుతుంది కదా !” అన్నాడు. “అయితే నా ఇంట్లోంచి బయటికి వెళ్లిపో, నాకూ నీకూ ఏ సంబంధం లేదనుకున్నాక ఇంక ఏమైనా చేసుకో” అన్నాను. “అంత కఠోరంగా ఎందుకులే నాన్నా మీరు రిటైర్ అయ్యాకే ఆ పరిశ్రమేదో పెడతా” అన్నాడు. అప్పటికి వాడికి 38 ఏళ్లు వచ్చాయి. అన్న మాట ప్రకారం 1998 దాకా ఖాళీగా ఉండి ఆ తర్వాతే మా గ్రామస్తుడైన సుజనా గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ చైర్మన్ వై.ఎస్ చౌద రి (ఎం.పి) గారి కంపెనీలోని ఒక యూనిట్ తీసుకుని దాని మేనేజింగ్ డైరెక్టర్‌గా పని ప్రారంభించాడు.
కానీ, ఆ పరిశ్రమ నష్టాలే మిగిల్చింది. పరిస్థితి గమనించిన చౌదరి గారు ఆ పరిశ్రమ తిరిగి తానే తీసుకుని ఆ నష్టాలన్నీ తన మీదే వేసుకున్నాడు. నైరాశ్యానికి గురవుతున్న మావాడిని అంతటితో వదిలేయకుండా, తన కంపెనీల్లోని ఒక యూనిట్‌కు మేనేజింగ్ డైరెక్టర్ ఉద్యోగం ఇచ్చి కొండంత అండగా నిలబడ్డాడు. వాస్తవానికి నేను రిటైర్ అయ్యేనాటికి నాకు సొంత ఇల్లే లేదు. అప్పటిదాకా ఉన్న అద్దె ఇల్లు ఖాళీ చేయాల్సి వచ్చింది. నా కొడుకుకే కాదు, మా మొత్తం కుటుంబానికి ఆశ్రయంగా తన కంపెనీ హౌజ్‌ను మాకు ఇచ్చాడు. నేనున్న ఈ దశలో వై. ఎస్. చౌదరి లేని జీవితాన్ని ఊహించడం కూడా కష్టమే. జీవితమంతా ఒక కోణాన్నే చూస్తూ అందులో మనం ఎంత నిష్ణాతులమైనా కావచ్చు. కానీ, జీవితానికి మనుగడనిచ్చే మరో కోణం గురించి ఏమీ తెలియకపోతే ఎంత ప్రమాదమో ఈ పరిణామాలు నాకు తెలియచెప్పాయి. జీవితానికి విలువలు ఎంత ముఖ్యమో, ప్రాణానికి ప్రాణంగా, ఒక ఆలంబనగా నిలిచే స్నేహితులు కూడా అంతే ముఖ్యమని నా జీవితం నాకు నేర్పిన ఒక తాజా సత్యమిది.
‘కలెక్టరు నక్సలైటు’ అంటూ నా మీద ఒక పిటిషన్ తయారు చేసి అప్పటి రాష్ట్రపతి వి.వి. గిరికి అందచేశారు. ఈ విషయం స్థానిక పత్రికల్లోనూ, వివిధ జాతీయ పత్రికల్లోనూ ప్రచురితమమయ్యింది. కాని ఎకనామిక్ అండ్ పొలిటికల్ వీక్లీలో మాత్రం నా గురించి చాలా పాజిటివ్ వ్యాసం వచ్చింది. దాని శీర్షిక ‘నక్సలైట్ ఇన్ ఐఏఎస్ క్లోత్స్..!’ అని.
– బమ్మెర
ఫోటోలు: జి. రాజు
నా దారి తీరు -71 చెరుకు రైతుగా నేను
నా దారి తీరు -71
చెరుకు రైతుగా నేను
మేము హిందూ పురం నుంచి 1951లో ఉయ్యూరు వచ్చాం .మా నాన్న గారే వ్యవసాయాం చస్తూఉండేవారు .మేము ఎప్పుడైనా పొలం వెళ్లి వస్తూన్దేవాళ్ళం .అంతకు మించి మాకే వ్యవహారమూ తెలియదు .ఉయ్యూరు చేను ఫాక్టరీ వెనుకనే ఉంది .సాగునీటికి కాలువ సౌకర్యం ఉంది మింట సత్యం అనే అతను మా పొలం పనులు చూసే వాడు నాన్న పర్యవేక్షించేవారు .కౌలుకు ఇచ్చినా ధాన్యం కాని చెరుకు కాని అణా పైసలతో ఇచ్చే రైతులు మాకు దొరికారు .కనుక ఇబ్బంది లేదు .కాటూరు పొలం వర్రే సుబ్బయ్య కుటుంబం చూసేది . .వాళ్ళూ ఏంతో నమ్మకం గా చేసి మాకు తోడ్పడ్డారు .సుబ్బయ్య తర్వాత కొడుకులు వెంకట స్వామి భాస్కర రావు లు చూశారు వాళ్ళ తర్వాత పెద్దకొడుకు వెంకటస్వామి కొడుకు పాములు చూశాడు .కడవకొల్లు లో ఉన్న దేవుడి మాన్యాన్నీ వాళ్ళే చూసేవారు .ఇక్కడా ఏ ఇబ్బందీ లేదు .ధాన్యం బందీల మీద ఇంటికి తోలటం వడ్ల కొట్లో పోయటం లేక పోతే పురి కట్టటం లేక పోతే పాతర లో పోసేవారు పాతర అంటే భూమిలో దాదాపు అయిదడుగులు లోతుగా బాగా పొడవూ వెడల్పు ఉన్న దీర్ఘ చతురస్రాకార గొయ్యి తవ్వి దాని లోపల గడ్డి తో పేనిన వెంట్లు చుట్టి అడుగున గడ్డి మోపులు వేసి ధాన్యాన్ని పోసేవారు దానిపైన మళ్ళీ గడ్డి కప్పి మట్టి కప్పేవారు .దాదాపు ఆరునెలలు ఏమీ పాడుకాదు ధాన్యం .అడుగు ధాన్యం కొంత రంగు మారేది .మిగతాది బానే ఉండేది .అడుగుది కొంచెం తెలుపు పూత వచ్చేది ముక్కి పోవటం అనే వాళ్ళం .కొందరు గాదెల్లో పోసుకొనే వారు .
ఉయ్యూరు పొలం మెరక గా ఉండటం వలన చెరుకు సాగుకు మంచి వీలు .నాన్న ఒకటి రెండు సార్లు చెరుకు సాగు చేయించిన జ్ఞాపకం .నాన్నపేరు చెరుకు రైతుగా కే.సి.పి.ఫాక్టరీ లో రైతు నంబర్ 653. నాన్న1961లో అకస్మాత్తుగా మరణించిన తర్వాత ఆ రైతు నంబర్ నా పేర ట్రాన్స్ఫర్ అయింది నాన్న పేర అప్పటికే కే.సి.పి.షేర్లు కొన్ని ఉన్నాయి .అవీ నాపేరనే బదిలీ చెయ్యమని నాన్న వీలునామా లో స్పస్తీకరించారు.కనుక నా పేరనే బదిలీ అయాయి .అప్పటి నుంచి నేనే పొలం వ్యవహారాలూ చూసుకోవలసి వచ్చింది .మా మేన మామ గంగయ్య గారు నాకు అండగా ఉన్నాడు .కనుక వ్యవహారాల విషయం ఆయన మీదే పెట్టేవాడిని .ఆయనా నాకు బాగా సహకరించి కొంత కాలం వాళ్ళ పాలేర్ల తోనే వ్యవసాయం చేయించి ఖర్చులు నాదగ్గర తీసుకొని మాకు రావాల్సింది అంతా అంద జేసేవాడు .ఇలా కొంత కాలం సాగింది .మామయ్య వ్యవహారాలను తగ్గించుకొని పెద్ద కొడుకు పద్మనాభానికి అప్ప గించాడు .వాడు కూడా మాకు బాగా సహకారం అందించాడు .పొలం వ్యవహారాలన్నీ స్వయం గా చూసేవాడు .కనుక నాఉద్యోగం విషయం లో పెద్దగా ఇబ్బంది ఉండేది కాదు .పొలాలకు పెద్దగా వెళ్ళాల్సి వచ్చేది కాదు .ఈ విధం గా కొన్నేళ్ళు గడిచాయి .ఆదాయం పెద్దగా వచ్చేదికాదు .ఖర్చులు తడిసి మోపయ్యేవి .ఎలా ఇందులోంచి బయట పాడాలా అని చూస్తున్నాను .అప్పుడు ఒక సారి పొలం లో బోర్ వేస్తె నీటికి ఇబ్బంది ఉండదని అని పించింది .పద్మనాభామూ అదే చెప్పాడు రెండు ఊళ్ళ లోని మా పొలాలు కాలువ చివరి భూములు .అందుకని సాగు నీరు ఆలస్యం గా వచ్చేది .మధ్యలో ఎందరో రైతులూ పొలాలు ఇవన్న్నీ తడిసిన తర్వాత మా పొలాలలో నీరు ప్రవేశించేది .అందుకని ఊడ్పులు ఆలస్యం అయ్యేవి .ఒక్కో సారి నీరు అందకా పైరు ఎండి పోయేది .అందుకని బోర్ వెయ్యటం తప్పని సరి అయింది .ముందుగా కాటూరు పొలం లో వేయాలని నిర్ణయానికి వచ్చాం .
బోర్ వేసే విషయం లో నాకు ఏమీ తెలియదు దీనికీ పద్మనాభమే సాయం .ఒక రోజు మంచి రోజు అని చెప్పి ఉదయం పది గంటలకు ముహూర్తం బాగుందని చెప్పి తాను వస్తానని నన్ను అక్కడ గురతులు కొన్ని చెప్పి అక్కడే పలుగు పాతి కొబ్బరి కాయ కొత్తమన్నాడు .నేను వెళ్లాను కాని వాడు రాలేదు .సరే అనుకున్న సమయానికి ఆ గుర్తులను బట్టి నాకు తోచిన చోట పలుగు పాతి కొబ్బరి కాయ కొట్టాను ఒంటరిగా .ఆ తర్వాత వచ్చాడు వాడు .వాడు చెప్పిన చోట కాక కొద్ది అడుగుల దూరం లో నేను కాయ కొట్టానని చెప్పాడు .సరే అక్కడే బోరు వేద్దామన్నాడు .మనుష్యులను మాట్లాడటం గొట్టాలు దింపటం ,అన్నీ వాడి అజమాయిషీ లోనే జరిగింది .బెజవాడ వెళ్లి కుమ్మమూరు వాస్తవ్యుడు ,మా నాన్న శిష్యుడు ఐన రామినేని బ్రహ్మం దగ్గర వన్ టౌన్ లో కొన్నాం .వాటిని లారీ లో తెప్పించాం కొంత డబ్బు ముందు ఇచ్చి మిగిలింది తర్వాత ఇచ్చాం .మంచి వాడు బ్రహం. చాలా మర్యాదగా ఉండేవాడు .పోట్టిగా కొంచెం బొద్దుగా ఉండేవాడు .అప్పటికే కార్ మెయింటైన్ చేసేవాడు .బాగా సంపాదించాడని అనుకొన్నారు .పద్మనాభం అప్పటికే ఉయ్యూరు పొలం లో బోరు వేసిన అనుభవం ఉన్న వాడు .కనుక పూర్తిగా వాడి మీదే నేను ఆధార పడ్డాను .యాకమూరు లో ఉండే బ్రహ్మం అనే అతను బోరు వేయటం లో అప్పుడు ఎక్స్పర్ట్ అని అందరూ చెప్పారు అతనితోనే వేయించాము .రెండు పూటలా వచ్చి దగ్గరుండి అన్నీ చేయించేవాడు .మంచి నమ్మకస్తుడు .దాదాపు నూట పాతిక అడుగులలో మంచి జల పడింది .మోటారు ఏది కొనాలనే ఆలోచన వచ్చింది .గండి గుంటలో రామ చంద్ర రావు గారనే పెద్ద రైతు –ఉయ్యూరు లో వల్లభనేని గోపాల రావు గారి అబ్బాయి వీర భద్ర రావు గారి తమ్ముడు నాకు ‘’జ్యోతి ‘’మోటార్ ను కొనమని తన పొలాలలో దానినే వాడుతున్నానని మోనోబ్లాక్ మంచిదని చెప్పాడు బెజవాడ గురుదత్తా ఇండస్ట్రీస్ అనే ఓల్డ్ టౌన్ లోని బ్రాహ్మలాయన షాప్ లో కొన్నాం .అప్పటి దాని రేటు పద్దెనిమిది వందలని జ్ఞాపకం .ఇనుప గొట్టాలే వేశాం .కరెంట్ ను కూడా పద్మనాభమే ఉయ్యూరు ఎలెక్ట్రికల్ ఇంజినీర్ ను కలిసి ఇన్ఫ్లుయెన్స్ చేసి అతి త్వరలో వచ్చేట్లు చేశాడు .ఒక తాటాకుల పాక కూడా వేశాం .మరి డబ్బు నేనే పెట్టుబడి పెట్టాను మా తమ్ముడు మోహన్ కు చెప్పి చేసేవాడిని .వాడేమీ చేపలేదు నా తంటాలేవో నేనే పడే వాడిని .అవసరం అయితే పద్మనాభం సర్దేవాడు .ఆ చుట్టు పక్కల మేమే మొదటి సారిగా బోర్ వేశాం .మా మీద ఎందరో ఆధార పడిన రైతులున్దేవారు నీటికోసం .మాకు కొంచెం దూరం లో కాటూరి వాసి బాలయ్య గారు మా కంటే ముందే బోర్ వేశారు ఆయన కూడా వచ్చి సలహాలిస్తూన్దేవారు .
సశేషం
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -30-1-14-ఉయ్యూరు
రాచకీయ ద్విప్లేట్స్ -8
రాచకీయ ద్విప్లేట్స్ -8
1-పెద్దల సభకు సీటిచ్చినా రాముడు ,ఇవ్వక నరసింహుడు ,అవమానం అని రాజూ ఏడుపు
నామినేషన్ల ముందే ఇంత జరిగితే ,ఎన్నికప్పుడు కోట్లు పోయి సీట్లూ పోయి లబో దిబో నేనా ముగింపు?
2-బెజవాడలో మోడీ విజయం కోసం సభ పెట్టిన వెంకయ్య
బానే జనాన్ని సమీకరించి విజయాన్ని సాధించినందుకు మెచ్చిన రజ్జూ భయ్యా .
3- కరుణ ఇంట్లో విభేదాల కుంపటి
జనం నడుస్తారా అలగిరి వెంబటి ?
4-స్టాలిన్ ను వారసుడిగా ప్రకటించి చేద్దామనుకొంటే డిక్టేటర్
వెంట పడి గెలిపిస్తాడా గుడ్డిరాజుతో కేడర్ తో బాటు ఓటర్ ?
5-లాస్ట్ బాల్ విసరకుండానే విసిరాడు సి.ఏం కిరణ్ సవాల్
వ్యూహం అర్ధం కాక జనం చేస్తున్నారు అనేక ఊహాగానాల్ .
6-అందర్నీ దులిపేసి హీరో అనుకొన్నాడు నటుడు ఓవర్ యాక్షన్ తో మోహన్ బాబు
పాప ప్రక్షాళనం చేసే మరో పోపు ననుకొంటున్నాడేమో టింగిరి డింగిరి మాటల నవాబు .
7-ఆంద్ర ప్రదేశ్ రాష్ట్ర విభజన ఆపే హక్కు ఉంది బి.జే.పి.కి మాత్రమే
అన్న ఆశ తో ఉన్నారు పాపం దింపుడు కళ్ళం ఆశతో కొద్ది మంది మాత్రమే.
8-మళ్ళీ పొడుస్తుంది దిన పత్రిక ఉదయం
దాసరిమాటకు పడాలి కార్డు శుభోదయం .
9-అత్యంత సమర్ధ భావి భారత ప్రధాని అవుతాడని మోడీ
‘’నమో’’ ‘’నమో’’ అని ఎదురు చూస్తున్నారు బాబు తో జోడీ .
10-తెలుగు దేశం సీటు కోసం పాటు తెగ పాటు పడుతున్నాడు వేణు మాధవ్
నవ్వులు పూయించి చట్ట సభ టెన్షన్ తగ్గించి అవుతాడా క్రేజీ మాధవ్ ?
11-శాసన సభలో వ్యూహాత్మకం గా పావులు కదిపి తీర్మానాన్ని ఓడించిన కిరణ్ ,మనోహర్
ఇప్పుడే విన్న ఈ వార్తకు సీమాంధ్రుల తొలివిజయం గా జరుపుకుంటున్న తీరు నయన మనోహరం .
12-రెండు కళ్ళ సిద్ధాంతం తో ఇరకాటం లో అప్పుడు సందిగ్ధం లో చంద్ర బాబు పడ్డాడు
కాగల కార్యం గంధర్వులే తీర్చినట్లు బిల్లు తిరస్కరణ తో ఇప్పుడు సేఫ్ జోన్ లో పడ్డాడు .
మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -30-1-14-ఉయ్యూరు
హోమర్ నుండి జేమ్స్ జాయిస్ దాకా -1
హోమర్ నుండి జేమ్స్ జాయిస్ దాకా -1
వాలెస్ గ్రే అనే ఆంగ్ల ప్రొఫెసర్ రాసిన పై పుస్తకం లో ఉన్న అనేక విషయాలు ఆసక్తి కరం గా ఉన్నాయి వీటిని అందించటం నేను చేస్తున్న పని .
హోమర్
పరమేశ్వ రుడికి మానవ రూపం ఇవ్వటం అంటే ‘’anthropomorphism ‘’కు హోమర్ విలువ ఇచ్చాడు .దేవతలే సంఘటనలను నియంత్రిస్తారు .నాయకుల భయాలు కోరికలకు మారు రూపాలే హోమర్ సృష్టించిన దేవతలు .ఇలియడ్ లో సెక్సువల్ ఎక్సైట్ మెంట్ తో బాటు గ్రీకుయువకులకు విద్య కూడా ఉంటుంది .ఇది ఇతిహాసమే కాని చారిత్రిక ప్రాధాన్యత తక్కువే .దేవుళ్ళకు దుఖం ఉండదు బాగా నిద్రా పోతారు . Zeus దేవతకు చెడు చేయటం ఆశీర్వదించటం అనే రెండు స్వభావాలున్నాయి .మానవ ప్రవర్తన మంచీ చెడు అనుభవమిశ్రమం గా ఉంటుంది .పుట్టిన ప్రతివాడూ చావాల్సిందే ననే సిద్ధాంతం ఉంది .వీరోచితం గా ప్రవర్తించే హీరో లు చావు లేదనే ధైర్యం తో ముందుకు దూసుకు పోయినా చివరికి తాము మర్త్యులమే నన్నది గ్రహిస్తారు .యుద్ధ వీరుల అనుభవం సాధారణం గా శక్తి కి లేక అవకాశానికి చెందింది గా కనీ పిస్తుంది .ఇలియడ్ లో చావు కోసం కుక్కల్ని రాబందు లను ఉసి కొల్పటం కని పిస్తుంది

‘
ఒడిస్సీ లో మాత్రం మనిషి తనకేది కావాలో దాన్నే చేస్తాడు .ఇందులో ఓడిస్సియస్ పాశ్చాత్య సాహిత్య చరిత్రలో మొదటి సంపూర్ణ మానవుడిగా కని పిస్తాడు .ఓడిస్సియస్ అంటేనే బాధ ,శ్రమ లమిశ్రమం .ఇందులో మనిషి శ్రమతో జీవించి పునర్జన్మ ను తప్పించుకోవటానికి కాలిప్సో అనే మాత్రుగర్భం లాంటి గుహ లోఅమరత్వాన్ని పొందుతాడు .జీవించటానికి ఏకీకృత ఏకాగ్ర మైన వ్యక్తిత్వం ,కోరికలపై ఆరాధనతో ఉండాలి .తనకెలాంటి ప్రపంచం కావాలో దాన్ని పొందటా నికి తీవ్ర ప్రయత్నం చేస్తాడు .దీనికే గ్రీకు కు భాషలో ‘’టిసియస్’’అని పేరు .దీనినే ఓడిస్సియస్ అవలంబించి సాధిస్తాడు .’’నేను ఈశరీరాన్ని కాను ‘’అనేదే ఇందులో సిద్ధాంతం .అంటే నిరంతర అన్వేషణమే .ఓడిస్సియస్ ప్రయాణా లన్నీ ఆత్మను వె దకటం కోసం చేసేవే .బయట కని పించే వ్యతిరేకతలు అన్నీ అతని మానసిక స్థితి గతులకే అడ్డం పడుతాయి .’’human soul must ,confront and control itself ‘’అని తాత్పర్యం మా నవ బలహీనతలన్నిటిని నియంత్రిన్చాలనడమే ఓడిస్సియస్ లక్ష్యం .ఇక్కడి ‘’time and narrative fold ,unfold and fold back ‘’ లా ఉండటం విశేషం అంటాడు రచయిత .భవిష్యత్తే వర్తమానాన్ని నిర్దేశిస్తుంది .కళ సమస్తం నిర్దేశతను వ్యక్త పరుస్తుంది .ఇందులో ‘’rhapsodic fashion ‘’అంటే అన్వయించటానికి వీలుకాని అసంబద్ధమైన వైఖరి ఉందన్నమాట .ఇంకోరకం గా చెప్పాలంటే అనేక ముడులు చిక్కులు తో కధకుడు అల్లిన నేత లా కద ఉంటుంది .చివరి దారం పోగు ను విప్పెదాకా అది పూర్తీ అయినట్లు అని పించదు .హోమర్ కు ఈ కదా విధానం పై పూర్తీ అవగాహన ఉండటం తో బాటు తన శ్రోతలకేది కావాలో సంపూర్ణం గా తెలుసుకూడా .ఎందరినో ఎదిరించిన వారిని చంపటం చంపటం తో ప్రారంభమై ,భార్యకు రక్షకుడు గా ,గొప్ప తండ్రిగా మారి పోవటం ఓడిస్సియస్ సుదీర్ఘ సఫల ప్రయాణం ఉంది.ఇందులో ‘’నోటోస్’’అంటే ‘ఇంటికి చేరటం ‘’ అనేది చాలా ముఖ్యమైన విషయం .
ఇలియడ్ ఇప్పటి టర్కీ అయిన ఏసియా మైనర్అనే తూర్పు భాగం లో జరిగిన కద .ఒక నగర విచ్చేదనమూ ,గతపునాదుల్ని కూల్చి కొత్త నిర్మాణం చేయటం ఇందులో కనిపిస్తుంది .ఒడిస్సీ పశ్చిమానికి ప్రయాణం .అది ట్రాయ్ నగరం తో ప్రారంభమవుతుంది .ఇది పునర్నిర్మాణ ప్రక్రియ .కొత్త నగర నిర్మాణానికి నాన్దీవాచాకమై దాని సర్వతో భద్ర స్తితికి ,సంపూర్ణత్వానికి ప్రతీకగా నిలుస్తుంది .నవీన నాగరకతకు అంకురార్పణ చేయటమే .ఇలియడ్ యదార్ధ గాఢ అయితే ఒడిస్సీ భ్రమ ,ఊహ లకు ప్రాతిపదిక గా నిర్మించిన కళాత్మక రచన .మొదటి దానిలో వర్తమానం చిరంజీవి .రెండవదానిలో జ్ఞాపకాల దొంతర ఉంది గుర్తు పెట్టుకుంటేనే కాని ముందుకు అడుగు పడదు .ఇది రొమాంటిక్ గాద .మొదటిది యదార్ధానికి ప్రతీక .రెండో దానిలో పరిశుద్ధ పరచే విధానమూ పునర్జన్మా ఉన్నాయి .ఇందులో కుక్కలు రక్షిస్తూ విశ్వాసం తో ఉంటాయి .మొదటిది వర్గ ప్రయోజనాలకు సంబంధించి ఉంటె రెండోది వ్యక్తీ గతం గా కనీ పిస్తుంది మొదటిది ‘’abstract social structure ‘’అయితే రెండోది ‘’complex social structure ‘’.హోమర్ చెప్పేది మంచి ప్రవర్తన అది శల్యగతం అవాలని .రెండూ చివరికి తండ్రులా కొడుకుల ఎడుపులతోనే అంతమవుతాయి
సశేషం
7-10-2002సోమవారం నాటి నా అమెరికా డైరీ నుండి
మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -30-1-14-ఉయ్యూరు
”మహా భారత యుద్ద్దానికి కారణం ఎవరూ కాదు నేనే ”అని ఆవేదన పడ్డ బీష్మ పితామహుడు

భారతంలో భీష్ముడిది ఒక అరుదైన పాత్ర. ఆయన ఒక కఠోరమైన ప్రతిజ్ఞకు కట్టుబడినవాడు. మహా పరాక్రమశీలి. సత్యాన్ని అతిక్రమించనివాడు. అందరి పట్ల ఆదరభావం, సమదృష్టి కలిగిన నాయకుడు. దేశభక్తిని అణువణువునా నింపుకున్నవాడు. తన దేశ సరిహద్దులను రక్షించటానికి ప్రాణాలను పణంగా పెట్టడానికి సిద్ధపడిన వాడు. అధికార వాంఛా రహితుడు..ఒక్క మాటలో చెప్పాలంటే- ప్రస్తుతం మన సమాజంలోని నేతలందరికీ ఉండాల్సిన లక్షణాలు పుణికిపుచ్చుకున్నవాడు. అలాంటి భీష్ముడు తన ఆత్మకథ రాస్తే ఎలా ఉంటుంది? తనలోని సంశయాలను ఆయన ఎలా వెల్లడిస్తాడు? ఈ ఊహకు ప్రతిరూపమే ‘నేను భీష్ముడిని చెబుతున్నాను’. డాక్టర్ భగవతీ శరణ్ మిశ్రా రాసిన ‘మై భీష్మ బోల్ రహా హూ’ హిందీ నవలకు అనువాదమిది. దీనిలోని కొన్ని ఆసక్తికరమైన భాగాలు..
బాధ్యత-నిబద్ధత
‘యుద్ధమెందుకు ప్రారంభం కావటం లేదు?’- అడిగాడు దుర్యోధనుడు.
‘సేనాపతి నువ్వా? నేనా? ‘- సాధారణంగా కోపగించుకోని నేను కొంచెం గట్టిగానే అడిగాను. నిశ్చయంగా నా రజిత, శ్వేత, దీర్ఘ భృకుటిపై ఒత్తిడి పడి ఉంటుంది. అది దుర్యోధనుడు గమనించకపోయి ఉండడు. అయినా అతను తన ఉద్ధండతను నియంత్రించుకోవటమే శ్రేయస్కరమని భావించాడు. అతను సాధారణ స్వరంతోనే అన్నాడు. ‘నిస్సందేహంగా తమరే! సైన్యాధ్యక్షుడిగా తమరినే అభిషిక్తుని చేశాం కదా.’ ‘మరి అలాంటప్పుడు యుద్ధమెప్పుడు ప్రారంభించాలి? ఎలా ప్రారంభించాలి? అన్నది నా అధికార పరిధిలో ఉంటుంది. నీ పరిధిలో ఉండదు. నీవు ఈ నా అధికారాన్ని ధిక్కరించే దుస్సాహసం చేయకు’- అని గంభీరంగా అన్నాను. ‘కాని నేను యువరాజును.
హస్తినాపుర భావి చక్రవర్తిని. సంగ్రామం ప్రారంభించాలని మన యోధులు ఆతృత చెందుతున్నారు. ప్రారంభించటానికి ఆలస్యమెందుకు జరుగుతోందో తెలుసుకొనే అధికారం నాకుంది..’ అతని స్వరం మామూలుగానే ఉంది కానీ ‘యువరాజు’ అనే పదాన్ని పలికినప్పుడు అతని ముఖంలో గర్వం తొణికిసలాడింది. ‘నీవు రాజసభలోనే యువరాజువి. ఈ యుద్ధభూమిలో ఇతర యోధులవలె నీవు కూడా ఒక యోధుడవు. అంతకంటే ఎక్కువ కాదు. కావున నీవు కూడా నా అధీనంలోనే ఉన్నావు. నా ఆదేశాలకు బద్ధుడవు కూడా. కావున నన్ను ప్రశ్నించే అధికారం నీకు లేదు. ప్రశ్నించాలనుకుంటే- నేను నిన్ను ప్రశ్నించగలను. అయితే నువ్వు నా సలహా తప్పక అడగవచ్చు.
ఒక సేనాధిపతిగా నీకు సముచితమైన, మేలు చేయగల సలహా ఇవ్వటం నా బాధ్యత’ అన్నాను. అని- ‘ హస్తినాపుర భావి చక్రవర్తి కావటం విధి చేతుల్లో ఉంది. దానిపై మన ఇద్దరి నియంత్రణ ఉండదు. మనం యోధులం కావచ్చు. కానీ భవిష్యద్రష్టలం కాము. విధి ఎవరి పక్షాన నిర్ణయం తీసుకుంటుందో ఎవరికి తెలుసు? హస్తినాపుర భావిచక్రవర్తిని ఎన్నుకునేందుకే యుద్ధం మొదలయింది. ఇందులో ఎవరు విజయలక్ష్మిని వరిస్తారో, వారే భావి చక్రవర్తి కాగలరు. కానీ యుద్ధంలో ఎవరు విజయలక్ష్మిని వరిస్తారో, ఎవరు పరాజితులవుతారో, ఎవరికి తెలుసు? కావును నీవు కొంత కాలం గర్వము, అహంకారం త్యజించి, వీరోచితంగా ప్రవర్తించమని నా ఉచిత సలహా. శక్తినంతా ప్రయోగించి శత్రుసైన్యంతో పోరాడు. నీ హితులైన యోధుల మనోబలాన్ని పెంచు. నేను సైన్యాధ్యక్షుడిగా ఉన్నంతవరకూ నీవు నన్ను ప్రశ్నించకుండా ఉండటమే నీకు శ్రేయస్కరం..’ అని తేల్చి చెప్పాను.
నియమ పాలన
అర్జునుడు నిరాయుధుడైయున్నాడు. దుర్యోధనుడి ముఖంలో ఆనందం కనిపిస్తోంది. ‘యుద్ధం ఆరంభించండి’ అన్నాడు దుర్యోధనుడు.. ‘నేను యుద్ధమారంభించలేను.. ఎందుకంటే అర్జునుడి చేతిలో ఆయుధం లేదు. అతను నిరాయుధుడు’ అన్నాను. ‘అయితే ఏమయింది? ఇదే యుద్ధమారంభించటానికి సరైన సమయం. అంతే కాదు సువర్ణావకాశం కూడా’ అని అతను తొందరపెడుతూ అన్నాడు. ‘నువ్వంటున్నదేమిటి’- నేను ఆశ్చర్యంగా అడిగాను. ‘అవును. మీరు విన్నది నిజమే.
నిరాయుధుడైన అర్జునుడు యుద్ధమారంభించే స్థితిలో లేడు కాబట్టి యుద్ధమారంభించే బాధ్యత సహజంగా మీపైనే ఉంది. తమలాంటి యుద్ధనేర్పరి ఒక శరాఘాతంతోనే అర్జునుని శిరచ్ఛేదం చేయగలరు. అప్పుడు ఈ మహాభారత యుద్ధం ప్రారంభించకముందే సమాప్తమవుతుంది. అర్జునుని వధించిన తర్వాత పాండవ సైన్యం నిలదొక్కుకోగలదా?’- అన్నాడు దుర్యోధనుడు. ఈ మాటలు అంటున్నప్పుడు అతని స్వరంలో మార్పు వచ్చింది. ‘నువ్వేమంటున్నావు?- సాధారణ యుద్ధ నియమాలు కూడా నీకు తెలియవంటే నేను అంగీకరించను. నిరాయుధుడిపై ఆయుధం సంధించటం గర్హనీయం. అది కూడా ఒక మహారధిపై మరో మహారధి..ఒక సేనాధిపతిపై మరో సేనాధిపతి..’ అన్నాను. ‘తమరు యుద్ధ నియమాల్లో పారంగతులు కావచ్చు. కానీ రాజనీతితో మీకు సంబంధం తక్కువ. యుద్ధంలో అన్నీ ఉచితమైనవే! నేను చెబుతున్నాను. ఇప్పటికీ ఏమీ మించిపోలేదు. అర్జునుడు ఇప్పటికీ నిరాయుధుడే. కృష్ణుడు ఆయుధం చేపట్టనని ప్రతినబూనాడు. అర్జునుడి శిరస్సును లక్ష్యం చేసుకొని తమరు శరసంధానం చేయండి..’ అన్నాడు దుర్యోధనుడు. ‘కౌరవుల సంక్షేమం కోరి నేను చేయదగినవేవో, చేయకూడనివేవో- ఇప్పటి దాకా పట్టించుకోలేదు. ఇప్పుడు జీవిత సంధ్యాసమయంలో ఒక నిరాయుధుడైన యో«ధుడిని మోసంతో హత్య చేసి ఆ పాతకం నేను భరించలేను’ అన్నాను. ‘అయితే ఒక సువర్ణావకాశం కోల్పోతున్నాం’ అన్నాడతను. అతని స్వరంలో బాధ ఉంది.
‘ఇది అవకాశము కాదు. సువర్ణావకాశము అసలే కాదు. విధి గురించి నీకు తెలియదు. నేను నియమ విరుద్ధంగా పాపకార్యం చేయలేను. ఒక వేళ చేసినా అర్జునుడి శిరచ్ఛేదం జరుగుతుందన్న నమ్మకం లేదు. నీతి విరుద్ధమైన పని చేస్తున్నప్పుడు నా చేతులు కంపించవచ్చు. నా బాణం గురి తప్పవచ్చు’ అన్నాను. ‘అయితే ఇప్పుడేం చేయాలి?’ అన్నాడు దుర్యోధనుడు. ‘అర్జునుడు గాండీవం ధరించే వరకూ ఎదురు చూడటమే!’ అన్నాను. ‘ఎంత వరకూ?’ మళ్లీ రెట్టించాడు దుర్యోధనుడు. ‘అతను స్వయంగా గాండీవం ధరించేవరకూ’ అన్నాను నేను నిశ్చయస్వరంతో. ‘ఒక వేళ సూర్యాస్తమయం వరకూ గాండీవం ధరించకపోతే?’ అన్నాడు దుర్యోధనుడు. ‘అలా జరగదు’ అన్నాను దృఢస్వరంతో. ‘ఎందుకని’ అని తిరిగి ప్రశ్నించాడు దుర్యోధనుడు. ‘అర్జునుడి మిత్రుడు, రథ సారథి అయిన కృష్ణుడు – కపటనీతి, రాజనీతి, రణనీతి- అన్నింటిలోను నేర్పరి. ఆయన తన సఖుడి చేత ఆయుధం ధరింపచేస్తాడు. యుద్ధం జరుగుతుంది’ అని వివరించా.
* * *
ఆత్మావలోకనం
‘ప్రతి అతికి ఫలితం అనుభవించాల్సి ఉంటుంది. అపరిపక్వమైన వయస్సులో, పితృప్రేమ అంధత్వంలో నేను చేయకూడనిది చేశాను. అతి అతిగానే అనిపించుకుంటుంది. నా అవివేకానికి ఫలితం నేనెన్నోసార్లు అనుభవించాను. ప్రత్యేకించి ఈ జీవిత ఉత్తరార్థంలో, ఈ దుర్యోధనునివంటి వాడిని నిలబెట్టింది ఎవరు? నేనే కదా! నేను చేసిన క్షమించరాని పొరపాటు ఫలితమే ధృతరాష్ట్ర పుత్రుడగు దుర్యోధనుడు. ఇంకా ఎన్నని చెప్పేది? మెల్లమెల్లగా అన్నీ మీకే బోధపడతాయి. జీవితపు ఈ మలుపు వద్ద, ఈ అంపశయ్యపై ఉన్న నేను, ఆకాశంలో తిరుగాడుతున్న కళంకిత చంద్రుని చూసినప్పుడు, హస్తినాపుర సింహాసనం సురక్షితంగా వర్థిల్లునట్లు చేయటానికి నేను నా ఉత్తరీయంపై ఎన్ని కళంకాలు పూసుకున్నానో అనిపిస్తుంది. ఇతరుల దృష్టిలో పరమపూజ్యుడు, గంగాతనయుడు, సత్యవ్రతుడు, దేవవ్రతుడిగా- భీష్ముడిగా- ఎంతో గౌరవనీయుడినైన నేను చేసిన అనేక అనాలోచిత కృత్యాలకు, ఈ ఘడియలో నన్ను నేను నిందించుకుంటున్నాను. మహాభారత యుద్ధానికి మూలం ద్రౌపదో, శకునో, కర్ణుడో లేక ఈ ఉద్ధండ అన్యాయపరుడైన దుర్యోధనుడని ఎవరంటారు? ఈ మహాసమరానికి ఏకైక కారణం నేను. ప్రపంచమంతా భీష్ముడనే పేరుతో పూజించే దేవవ్రతుడను. బహుశా ఈ ప్రపంచమంతా ఇక ముందు కూడా నన్ను పూజిస్తూనే ఉంటుంది. కానీ ఈ కురుక్షేత్రంలో ప్రవహించిన అపార రక్తధారలకు, అసంఖ్యాక మహిళలు తమ నొసటిన కుంకుమలు కోల్పోవటానికి, తల్లులు పుత్రులను కోల్పోయి విలపించటానికి, వీటన్నింటికీ మూల కారణమైన వ్యక్తిని నేనే. ఆ అవివేకిని నేనే…

నేను భీష్ముడిని చెబుతున్నాను (రెండు భాగాలు)
అనువాదం: డాక్టర్ కొమ్మిశెట్టి మోహన్
ధర: రూ. 200
పేజీలు: 323
ప్రతులకు: 9441323170
నేత్రావధానం చేస్తున్న ఏడవ తరగతి విద్యార్ధినులు
నేత్రావధానం చేస్తున్న ఏడవ తరగతి విద్యార్ధినులు

కళ్లతో భావాలను పలికి ంచడం ఎంత గొప్పగా ఉంటుంది?
దాన్నే మరో మెట్టు పైకి తీసుకెళితే ఏమవుతుంది?
నేత్రావధానమవుతుంది.
దాన్ని ఏడో తరగతి చదివే ఇద్దరు నిరుపేద విద్యార్థినులు చేస్తే….?
అది వారి ప్రతిభకు అద్దమవుతుంది, పదిమంది ప్రశంసలకు అర్హమవుతుంది.
అవధాన విద్యే అంతరించిపోతోందనుకుంటే, అందులో నేత్రావధానం మరీ కనుమరుగైపోయే దశలో ఉంది. విశాఖపట్టణానికి చెందిన లలితకుమారి, రమాకుమారి జంటగా ఏర్పడి జాతీయ, అంతర్జాతీయ వేదికలపై నేత్రావధాన ప్రదర్శనలిస్తున్నారు. వారి తర్వాత ఎవరు? ఈ ప్రశ్నకు సమాధానంగానా అన్నట్టు అందరి ముందుకు వచ్చారు ఎన్.వి. శిరీష, కె. శిరీషల జంట. ఖమ్మం జిల్లా కల్లూరు మండలం ముచ్చవరం గ్రామంలోని ప్రాథమికోన్నత పాఠశాలలో 7వ తరగతి చదువుకుంటున్న విద్యార్ధినులు వాళ్లు.
అభ్యాసం + సాధన =
ముచ్చవరం బడిలో తెలుగు పండిట్, ప్రధానోపాధ్యాయుడు కూడా అయిన ఆదినారాయణస్వామికి నేత్రావధానమంటే ఆసక్తి. చదువులో రాణిస్తున్న శిరీషల జంటను చూసినప్పుడు ‘వీళ్లకు అది నేర్పిస్తే ఎలా ఉంటుంది’ అన్న ఆలోచన తళుక్కుమంది ఆయనలో. వెంటనే వారిని పిలిచి ‘నేర్పుతాను, నేర్చుకుంటారా’ అని అడిగారు. ముందు భయపడినా, తర్వాత ముందుకొచ్చారు విద్యార్థినులు. విరామ సమయం దొరికినప్పుడల్లా తనకు తెలిసిన నేత్రావధాన కళను శిరీష ద్వయానికి నేర్పించారాయన. “గతంలో నేర్చుకున్నప్పటికీ ఈ విద్యను ప్రదర్శించే అవకాశం నాకు రాలేదు. వీళ్లిద్దరూ చదువులో ముందుండటాన్ని గమనించి నేత్రావధానాన్ని నేర్పించడం ప్రారంభించాను. నా తపనకు సహోద్యోగి సుధాకర్ సాయం తోడైంది. మా ఇద్దరితోపాటు విద్యార్థినులు కూడా రెండేళ్ళు కష్టపడి ప్రదర్శనలిచ్చే స్థాయికి ఎదిగారు. ఆంధ్రజ్యోతి వారి ఏబీఎన్ వార్తా ఛానెల్లో రెండు గంటల సేపు నేత్రావధానం లైవ్ షో ఇవ్వడంతో రాష్ట్రవ్యాప్తంగా ఈ పిల్లలకు గుర్తింపు లభించింది” అని చెప్పారు ముచ్చవరం స్కూలు ప్రధానోపాధ్యాయులు ఆదినారాయణస్వామి. అదే స్కూల్లో సెకండరీ గ్రేడ్ టీచర్‌గా పనిచేస్తున్న సుధాకర్ మాట్లాడుతూ “నేర్చుకున్న విషయం ఏదైనా పదును తేలాలంటే నిరంతర సాధన తప్పనిసరి. అది చేస్తున్నారు గనుకనే మా విద్యార్థినులు అవలీలగా నేత్రావధానాన్ని చేయగలుగుతున్నారు” అన్నారు. ఈ విద్యార్థినులు అవధానాన్ని క్రమం తప్పకుండా అభ్యాసం చెయ్యడంలో ఆయన పాత్రే కీలకం. నేత్రావధాన ప్రదర్శనల్లో సుధాకర్ సంధానకర్తగా వ్యవహరిస్తున్నారు.
పేదరికమున్నా…
అవరోధాలను తల్చుకుంటూ చతికిలపడితే దేన్నీ సాధించలేం. అంకితభావం, ఏకాగ్రత, పట్టుదల ఉండాలేగాని నేర్చుకోలేనిదంటూ ఏమీ ఉండద ని ఈ గ్రామీణ బాలికలు ఋజువు చేశారు. ఎందుకంటే వాళ్లిద్దరివీ నిరుపేద కుటుంబాలే. ఒక శిరీషకు తండ్రి లేరు. మరో శిరీష తండ్రి పక్షవాతంలో లేవలేని స్థితిలో ఉన్నారు. దాంతో వీరి తల్లులు వ్యవసాయ కూలీలుగా పనులు చేస్తూ వీరిని చదివిస్తున్నారు. పేదరికం అడ్డని భావించకుండా ఈ బాలికలు రెండేళ్ల పాటు క్లిష్టమైన నేత్రావధాన విద్యను నేర్చుకుని సాధన చేశారు. ఇప్పటికే సత్తుపల్లి, భద్రాచలం, ఖమ్మం ప్రాంతాల్లో ప్రదర్శనలిచ్చారు వీరు. అటు చదువునూ నిర్లక్షం చెయ్యడం లేదు. భవిష్యత్తులో ఇతర భాషల్లో కూడా నేత్రావధానాన్ని నిర్వహించేందుకు ప్రధానోపాధ్యాయుడు వారిని సిద్ధం చేస్తున్నారు.
-మాదిరాజు సుధాకర్,
అబ్దుల్ మునాఫ్-సత్తుపల్లి
ఎలా చేస్తారంటే…
అష్టావధానం, శతావధానం, సహస్రావధానం, ద్విసహస్రావధానం, పుష్పావధానం, నాట్యావధానం, గంటావధానం మొదలైన ఎన్నో అవధానాలున్నప్పటికీ వాటికన్నా నేత్రావధానం భిన్నమైనది. ఇది మొత్తం మౌనంగా కేవలం కళ్ల సైగలతోనే సాగుతుంది. వేదికపై ఇద్దరు అవధానులు ఎదురెదురుగా కూర్చుంటారు. ప్రేక్షకులెవరైనా ఒక పదమో, వాక్యమో కాగితంపై రాసి అవధానుల్లో ఒకరికి ఇస్తారు. దానిని అందుకున్నవారు తమ కళ్లతో సంకేతాల ద్వారా అభినయిస్తూంటే మరొకరు వాటిని అర్థం చేసుకుని అక్షరీకరిస్తారు. ఇదెలా సాధ్యమంటే ఒక్కొక్క అక్షరానికి కనుల భాషలో ఒక సంకేతముంటుంది. అక్షరానికి ఒత్తులు, గుణింతాలు ఉంటే మరి కొన్ని భంగిమలుంటాయి. విరామ చిహ్నాలకు కూడా కొన్ని సంకేతాలుంటాయి. పృచ్ఛకులు కాగితంపై ఏది రాసిస్తారో జిరాక్స్ తీసినటుగ్లా అవధాని తన కాగితంపై అదే రాయడం ఆ కనుల సైగల ద్వారానే సాధ్యం. దాన్నే నేత్రావధానమంటారు. మరో విశేషం కూడా ఉంది. అదేమంటే – పృచ్ఛకులు గనక అక్షరాలు తప్పుగా రాస్తే అవధాని అక్షరానువాదంలో సైతం అవే తప్పులు రావడమనేది అవధానం కచ్చితత్వానికి నిదర్శనం. అవధానుల్లో ఎవరికే సందేహం వచ్చినా దాన్ని వారు కళ్లతోనే ప్రశ్నించుకుంటారు తప్ప నోరు మెదపరు.
మొదట్లో కష్టపడ్డాం
నేత్రావధానం నేర్పిస్తానని ఆదినారాయణస్వామి సార్ చెప్పినప్పుడు వద్దన్నాం. కానీ ఆయన ఎంతో ప్రోత్సహించి మాకిది నేర్పించారు. మొదట్లో చాలా కష్టపడాల్సి వచ్చింది. సాధన చేసి ప్రదర్శనలిస్తుంటే, వెళ్లిన చోటల్లా మాకు మంచి గుర్తింపు వస్తూంటే ఆనందంగా ఉంది.
-ఎన్ .వి. శిరీష
నిత్యం సాధనే
మాకు శిక్షణ ఇచ్చిన ఉపాధ్యాయులు సాధన తప్పనిసరి అని చెప్పారు. దాంతో ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం గంట సేపు సాధన చేస్తున్నాం. ఇంకా ఎన్నో ప్రదర్శనలు ఇవ్వాలని ఉంది.
– కె. శిరీష
కన్యాశుల్కంనాటకం ఆరోస్సారి-8 గంటల పాటు

‘తాంబూలాలిచ్చేశాను తన్నుకు చావండి’ ‘పొగతాగనివాడు దున్నపోతై పుట్టున్…’ ‘బుద్ధికి అసాధ్యం ఉందేమోగానీ, డబ్బుకి అసాధ్యం లేదు’ ‘డామిట్ కథ అడ్డం తిరిగింది..’ వీటిలో ఒక వాక్యమైనా తెలియని తెలుగువాళ్లుండరేమో! అంతలా జనంలోకి వచ్చేశాయి ‘కన్యాశుల్యం’ డైలాగులు. గురజాడ 150 ఏళ్ల జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని, ఆయన రాసిన ఈ ప్రసిద్ధ నాటకాన్ని వచ్చే ఆదివారం (ఫిబ్రవరి 2న) పూర్తిగా 8 గంటలసేపు రవీంద్రభారతిలో ప్రదర్శించనున్నారు.
తెలుగు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టిన నాటకాల్లో ‘కన్యాశుల్కం’ ముందువరసలో ఉంటుంది. కాలక్రమంలో ఎన్నో మార్పులకు లోనైన ఈ నాటకాన్ని పూర్తి నిడివితో ప్రదర్శించడమనేది అటు రంగస్థల అభిమానుల్లోను ఇటు సాహిత్య ప్రేమికుల్లోనూ ఒక కొత్త ఉత్సాహ తరంగమై వ్యాపిస్తోంది. గడచిన రెండేళ్లుగా తెలుగు నేలపై ఇది కొత్త ఆలోచనలకు తెర తీస్తోంది.
మూడు యాభైలు బతుకుతుంది
‘వందేళ్ల కన్యాశుల్కం రోజులు వచ్చేశాయి’ అని కవి పండితుడు ఆరుద్ర గుర్తు చేసినప్పుడు పుట్టిన ఉత్తేజంతో పూర్తినిడివి నాటకం చకచక తయారయింది లోగడ. దాన్ని 1992లో మొట్టమొదటిసారిగా విజయనగరంలో ప్రదర్శించారు. అప్పుడు పెద్ద ఉత్సవంలాగా రాష్ట్రంలోని పలు ప్రాంతాలనుంచి గురజాడ అభిమానులు, ప్రముఖులు తరలివెళ్లారు. కాలం గడిచింది. కిందటేడు గురజాడ 150వ జయంతి సందర్భంగా మళ్లీ ఎనిమిది గంటల ప్రదర్శన సిద్ధమైంది. 2012 సెప్టెంబర్ 21న విశాఖపట్నంలోని కళాభారతిలో మళ్లీ పూర్తి నిడివి నాటకాన్ని ప్రదర్శించారు. హాలులో కుర్చీలన్నీ నిండిపోయి, వాటి మధ్య నడిచే దారిలో నేలన కూర్చుని మరీ చూశారు ప్రేక్షకులు. అంతేకాదు, హాలు బయట నిలుచున్నవారికి విడిగా కుర్చీలు వేయించి, వారికోసం క్లోజ్‌డ్ సర్క్యూట్ టివిలను కూడా ఏర్పాటు చేశారు. అక్కడ కూడా ప్రవేశించటానికి స్థలం లేక ఆ చుట్టుపట్ల వీధుల్లో నిలబడిన ప్రేక్షకులు మైక్‌ల ద్వారా నాటకాన్ని ఆలకించి ఆస్వాదించారు. తెలుగు నాటకాన్ని పట్టివదలని తెగులు వంటి మైకులు, సౌండ్ సిస్టం తిప్పలు పెట్టినా కన్యాశుల్కంలోని రంజు ముందు అవన్నీ తెట్టులా తేలిపోయాయి. మంచి నాటకమైతే నిడివి పెద్ద లెక్క కాదన్న సత్యాన్ని కన్యాశుల్కం మరోసారి నిరూపించింది. విశాఖ ప్రేక్షక స్పందన చూసిన విజయవాడవాసులు తమ నగరంలో మలి ప్రదర్శనకు సన్నాహాలు చేశారు. తర్వాతి ప్రదర్శన వైజాగ్ స్టీల్ ప్లాంట్‌లో జేజేలు అందుకొంది. ఆ తర్వాత కిందటేడు సెప్టెంబర్ 21న విజయనగరం కళాభారతిలో జరిగిన నాటకానికి కూడా ప్రేక్షకులు సముద్ర తరంగాల్లా పోటెత్తారు. ‘మా ఊరి రచయిత, మా చుట్టుపక్కల ప్రాంతాల్లోని మనుషులు, వారి సహజమైన వేషభాషలు..’ అంటూ ప్రేమతో పరవశించిపోయారు. ఇప్పుడు రవీంద్రభారతిలో జరగబోయేది ఆరో పూర్తి నిడివి ప్రదర్శన.
అభిమానమే అసలు పెట్టుబడి
కన్యాశుల్కం ఎనిమిది గంటల ప్రదర్శన అంటే మామూలు విషయం కాదు. దాన్ని సుసాధ్యం చేసినది విజయనగరం జిల్లా రాజాంలో ‘వెలుగు’ సంస్థను నిర్వహిస్తున్న రామినాయుడు. తొలిసారి 1992లో ఆయన చేసిన ప్రయత్నం, కళాకారుడు సంపత్‌కుమార్ నిర్వహణలో విజయనగరంలో జరిగింది. అప్పుడు ఆచార్య సి.నారాయణరెడ్డి, అక్కినేని నాగేశ్వరరావు వంటి వారంతా దాన్ని తిలకించారు. ఆ జ్ఞాపకాలతోనే సంపూర్ణ ప్రదర్శనకు మరోసారి పూనుకున్నారు రామినాయుడు. ఈసారి ఆయనకు విశాఖలోని విప్లవ రచయిత చలసాని ప్రసాద్ చొరవ తోడైంది. వారి ఉత్సాహాన్ని చూసి విజయనగరం నవయుగ ఆర్ట్స్ సంస్థ ముందుకొచ్చింది. గురజాడ పట్ల అభిమానం తప్ప ఆర్థికంగా బలం, ఇతర హంగులూ ఏమీ లేవు వారికి. అయినా ఎనభై మంది కళాకారులను ఒక వేదిక మీదికి తీసుకొచ్చి ఎనిమిది గంటల ప్రదర్శన ఇస్తున్నారు. వారి శ్రమ వృథాపోలేదు. ‘ఎనిమిది గంటలు నాటకం వేస్తే ఎవడు చూస్తాడు లెద్దూ…’ అన్న విమర్శను ధాటిగా తిప్పికొట్టింది కన్యాశుల్కం. నాటకం ఏ ఊళ్లో జరిగినా, వేదిక ఏదైనా… ‘ఇసుక వేస్తే రాలనంత మంది’ అన్న జాతీయానికి అర్థం చెప్పేట్టుగా వచ్చారు ప్రేక్షకులు. ఎన్నో ఏళ్లుగా చదివిందీ, విన్నదీ, కన్నదీ అయినా సరే, అదే మొదటిసారి చూడటమన్నట్టు అడుగడుగునా కేరింతలు కొట్టారు. ప్రదర్శన జరిగిన చోట ఒక రకమైన ఆనందానుభూతి తరంగంలాగా వ్యాపిస్తూ ఉంటుంది. దీన్ని గమనించిన రాష్ట్ర ప్రభుత్వ భాషాసాంస్కృతిక శాఖవారు మధురవాణి, గిరీశం తదితరులను ఆహ్వానించి రవీంద్రభారతిలో ప్రదర్శనకు ఏర్పాట్లు చేశారు.
స్పందనకు బహుమతులు
“వ్యంగ్య – హాస్య ఇతిహాసంగా పరిశోధకుల ప్రశంసలందుకున్న నాటకం కన్యాశుల్కం. ఫిబ్రవరి రెండున జరుపుతున్న ప్రదర్శనకు ముఖ్యమంత్రితో పాటు ప్రముఖులందరినీ ఆహ్వానించాం. ఈ నాటకాన్ని ఆధునికులు ఎలా ఆస్వాదించాలో, అర్థం చేసుకోవాలో చెపుతూ ఇప్పటికే చాలా వ్యాసాలు రాశారు. వారంతా ‘గురజాడ పురస్కారాలు’ అందుకున్నవారే. వాటిని ఒక సంకలనంగా మా శాఖ ప్రచురిస్తోంది. నాటకం చూడటానికి వచ్చిన ప్రేక్షకులకు ఆ పుస్తకం అందజేస్తాం. అలాగే స్పందన పత్రాలు కూడా అందజేస్తున్నాం. మంచి అవగాహన, విమర్శన దృష్టితో స్పందన రాసిన వారికి సాంస్కృతిక శాఖ తరఫున బహుమతులు, ప్రోత్సాహకాలు అందిస్తాం. అంతేకాదు, 8 గంటల సేపు నాటకం చూడటానికి వచ్చేవారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా వసతులు కల్పిస్తున్నాం. అందులో భాగంగా మధ్యాహ్న భోజనం కూడా ఏర్పాటు చేస్తున్నాం” అని వివరాలు వెల్లడించారు రాష్ట్ర భాషాసాంస్కృతిక శాఖ సంచాలకులు డాక్టర్ రాళ్లబండి కవితాప్రసాద్.
– జిఎల్ఎన్. మూర్తి
గోవిందరాజు చక్రధర్ రాసిన మీడియాసంగతులనే పెద్ద బాల శిక్ష
గోవిందరాజు చక్రధర్ రాసిన మీడియాసంగతులనే పెద్ద బాల శిక్ష
గోవింద రాజు చక్రధర్ పేరు తెలియని పత్రికా పాఠకులే లేరు .జర్నలిస్తులకోసం కాలేజి నడుపుతూ తేర్చిదీద్దుతూ అనేక ప్రముఖ పుస్తకాలను కరదీపికలు గా రాసిన సీనియర్ జర్నలిస్ట్ జర్నలిస్ట్ మార్తాండుడు ఆయన .పాత తరం జర్నలిస్టుల మార్గం లో పయనిస్తూ విలువలకు అంకితమైన వారు చక్రధర్ ఈ సంవత్సరం,ఈనెలలోనే రాసి ప్రచురించిన తాజా పుస్తకం ‘’మీడియా సంగతులు’’ అందరికి వర్తించేవే .అంతా తెలుసుకోవాల్సినవే .ఇందులో ఆయన స్పృశించని అంశం లేదు .ఏది రాసినా సుబోధకం గా నిర్మోహ మాటం గా అభిప్రాయం చెప్పటం ఆయన ప్రత్యేకత . .విహంగ వీక్షణం ,ఫోకస్ ,జర్నలిస్టుల కోసం ,జననేతల కోసం ,విశ్లేషణలు అన్న శీర్షికలతో దీన్ని సంపూర్ణం చేశారు .
పత్రికా రచయితలే సంపాదకులు గా ఉండే స్థాయి స్థాయి నుండి పత్రికాదిపతులే ఎడిటర్లు అయ్యే స్థితికి రావటం మంచిదికాదని ,అయితే వివిధ అనుబంధాలతో వెలువడటం హర్షణీయమని ,టి.వి.మాధ్యమానికి దీటుగా పత్రికలూ ఉండటం,’’ఎడ్వాన్న్సింగ్ ద స్టోరి ‘’లా ముందడగు వేయటం ,సూపర్ లీడ్ లో కధనాత్మ శైలి చొప్పించటం ,సినిమా పేర్ల ను వార్త శీర్షిక గా పెట్టటం ,మంచి పరిణామాలన్నారు .వార్త పవిత్రం వ్యాఖ్య వారి వారి ఇష్టం అన్నది పోయి ప్రతి వార్తా వ్యాఖ్యతో వస్తోందని ,వార్తలకు వ్యాఖ్యలకు సరిహద్దు రీఖ చెరిగి పోయిందని ,శీర్షిక తో విషయం స్పష్టం కావటం లేదని ,గ్రాఫిక్కుల వాడకం ,పెరిగి ‘’సశేషం’’ కు కాలం చెల్లి పోవటం శుభ పరిణామమని పత్రికలూ చానెళ్ళు పరస్పర పూరణ పాత్ర పోషించటం మంచిదే అయినా జర్నలిస్ట్ రచనా సమర్ధత పెరగాలని, ఊహకు పదును పెట్టి ప్లానింగ్ పై పూర్తీ శ్రద్ధ పెట్టాలని సూచించారు .చానెళ్ళు నారద పాత్ర పోషించటం బాధా కరం అన్నారు .పరిశోధనాత్మక కధనాలు రక్తి కట్టిస్తున్నాయి మాండలికం లో వస్తున్నా వార్తలకు ప్రయోజనం కన్నా ప్రయోగమే మిగిలిన్దన్నారు భాషా సంబంధ శైలీ పత్రాన్ని అందరూ ఏర్పరచుకోవాలని హితవు పలికారు .హింసాత్మక సంఘటనల్ని పదే పదే చూపరాదని వెబ్ జర్నలిజం మరింత విస్తృత మవ్వాలని ఆశించారు.స్వంతం గా పుస్తకాలు ముద్రించి అమ్ముకోవటం అలవి మాలిన పని అయిందని ,లైబ్రరీ పుస్తకాల కొనుగోలు లో అవినీతి పక్షపాతం చోటు చేసుకోవటం వలన విలువైన పుస్తకాలకు అవకాశమే లేక పోయిందన్నారు .ఇతర దేశాల్లో సాంకేతిక ,వైద్య పుస్తకాలు మాతృభాష లో వస్తుంటే మనకింకా ఆ అదృష్టం పట్టలేదని బాధ పడ్డారు విహంగ వీక్షణం లో .
ఫోకస్ లో రామోజీ రావు ఈనాడు పత్రిక లో ప్రవేశ పెట్టిన మార్గ దర్శకాలను మెచ్చారు .ఆంద్ర అనే పదం లేకుండా ‘’ఈనాడు ‘’అని పత్రిక కు పేరు పెట్టటం పెద్ద ముందడుగు అన్నారు .మనోరమ తర్వాతా ఫాక్సిమిలీ సౌకర్యం పొందిన ప్రాంతీయ పత్రిక ఈనాడు అని కొనియాడారు .పాఠకుల అవసరాలకు ,ఆసక్తికే ప్రాధాన్యత నిచ్చి రాజీ పడనీ మనస్తత్వం తో ధైర్యం తోను జిల్లా ఎడిషన్ ల తోను విప్లవాత్మక మార్పు తెచ్చారని తెల్లార కుండానే పేపర్ గుమ్మం లో పడేట్లు చేసిన ఘనత రామోజీ దన్నారు .అన్నిటా ప్రమాణాలు పాటిస్తూ ముందడుగు వేసిన రామోజీ ని మనసారా అభినందించారు .అయితే ఎడిటర్ పాత్రకు ప్రాధాన్యత నివ్వక పోవటం విచారకరం అన్నారు .రాజకీయ ప్రయోజనా పరులు మీడియా మొగల్స్ గా ఏలటం మంచిది కాదన్నారు .ఉన్న పరిదులలోనే జర్నలిస్టులు వ్యక్తిత్వాన్ని నిలబెట్టుకోవాలి అని మంచిగా చెప్పారు .
జర్నలిస్టుల కోసం చక్రధర్ చెప్పిన మాటలు వారికి పెద్ద బాల శిక్షే .జర్నలిజం భుజాలు పెద్దవి అని చాటారు .జర్నలిజం స్కూల్స్ పై చిన్న చూపు ఉండటం బాగా లేదన్నారు .మీడియా లో గ్రాండ్ ఫాదర్స్ శాసించటం ఆరోగ్య దాయకం కాదు .ప్రెస్ అకాడెమీ లక్ష్యాలు పాత్రికేయ వృత్తిలో అధ్యయనం పరిశోధన అన్నారు .అకాడెమీ ల విజయాలను వైఫల్యాలను బేరీజు వేశారు .పత్రికే పరమ గురువు అనుకొనే వారిని ఆరాధించారు .విలేకరుల ప్రవర్తనకు ‘’గీతోపదేశ ‘’మే చేశారు . పత్రికలు టి.వి.లతో పోటీ పదాల్సిందే నన్నారు .నేర వార్తలు రాసే వారికి పదాలకు ఖచ్చితమైన అర్ధాలను గైడ్ లైన్ గా రాయటం ఏంతో ఉపయోగ పడుతుంది . ‘’మీడియా కు మీరు ఏంతో మీకు మీడియా కూడా అంతే అన్న పరమ సత్యాన్ని అర్ధం చేసుకోవాలని బోధ చేశారు .ఏ పరిస్థితి లోను నిగ్రహాన్నికోల్పోవద్దని హిత భాషణం చేశారు .మీడియా ఓవర్ యాక్టివ్ అయితే అనర్ధాలే అని ,చావు వార్తలతో మీడియా కాసులేరుకోవటం భావ్యం కాదని .ఉత్సాహం మంచిదే కాని అత్యుత్సాహం అనే కొరివి తో తల గోక్కో వద్దని హితవు పలికారు జర్నలిస్టూలు ‘’ న్యూసూ వ్యూసూ ‘’వండటం తో కాలం గడిపేస్తూ ఇంటి సంగతి పట్టించుకోకుండా ఉండటం నేరమని చెప్పి ‘’జర్నలిస్టు భార్యల్లారా ఏకం కండి’’ అని పిలుపు నిచ్చారు .ఈ పుస్తకానికి మీడియా ప్రముఖల ఫోటోలు అదనపు ఆకర్షణ .ఇన్ని మంచి విషయాలున్న ఈ పుస్తకం అందరికీ కరదీపిక అన్నది మాత్రం యదార్ధంఅని చెప్పి చక్రధర్ ను మనసారా అభినందిస్తున్నాను
గబ్బిట దుర్గా ప్రసాద్ -28-1-14-ఉయ్యూరు
సిమ్లాలో ఆంధ్రా వాలా

కృష్ణాజిల్లా ఇబ్రహీంపట్నం మండలం కొండపల్లి గ్రామంలో పుట్టిన పురుషోత్తమరావుది సామాన్య రైతు కుటుంబమే. ఇంటర్‌తో ఆపేసి వ్యవసాయాన్ని ప్రారంభించిన ఆయన మొదట రంగారెడ్డి జిల్లాలో కొంత భూమిని లీజుకు తీసుకొని కూరగాయలు సాగు చేశారు.1995లో ఉద్యానశాఖ నుంచి జిల్లా ఉత్తమ రైతు అవార్డును అందుకున్నారు. అదే ఏడాది అధిక ఉష్ణోగ్రతను తట్టుకొనే బంగాళదుంప విత్తనాల కోసమని తొలిసారిగా సిమ్లాలోనున్న కేంద్రీయ బంగాళదుంప పరిశోధనా కేంద్రం (సీపిఆర్‌సీ)ను సందర్శించారు. అప్పుడే సిమ్లాకు చెందిన కొందరు రైతులతో పురుషోత్తమరావుకు పరిచయం ఏర్పడింది. ఆసక్తి కొద్దీ ఆపిల్ పంట గురించి ఆరా తీస్తే, తాము ఆపిల్ సాగు చేస్తున్నప్పటికీ అధిక ధర పొందలేకపోతున్నామని, తెగుళ్లు కూడ పంటను నాశనం చేస్తున్నాయని వాళ్లు చెప్పారు.
సేంద్రియానికి శ్రీకారం
2004 తర్వాత పురుషోత్తమరావు సేంద్రియ వ్యవసాయంపై దృష్టిసారించారు. తొలి ఏడాదిలోనే మెరుగైన ఫలితాలు సాధించారు. “అప్పుడు నా సిమ్లా నేస్తాలకు ఈ పద్ధతులు పరిచయం చెయ్యాలన్న ఆలోచన వచ్చింది. ఎందుకంటే అప్పటికే వారి తోటలకు ‘వేరుకుళ్లు తెగులు’ సోకి ఇబ్బంది పడుతున్నారు. నేను పాటించిన విధానాలతో వారిక్కూడా మేలు జరుగుతుందనిపించింది. ఫోన్ చేస్తే వాళ్లు తప్పకుండా రమ్మని ఆహ్వానించారు. అలా అక్కడకు వెళ్లి ఆంధ్రాలో ఉద్యాన పంటల సాగుకు నేను ఉపయోగించిన సేంద్రియ ఎరువులను ఐదుగురు సిమ్లా రైతులకు అందజేసి వచ్చాను..” అని చెప్పారు పురుషోత్తమరావు. ఆయన ఇచ్చిన సేంద్రియ ఎరువులతో వేరుకుళ్లు తెగులును నాశనం చెయ్యగలిగారు ఆ రైతులు. దీంతో అక్కణ్నుంచి మళ్లీ పిలుపొచ్చింది రావుకు. ఈసారి ఏకంగా 100 మంది రైతులు సేంద్రియ వ్యవసాయం చేసేందుకు ముందుకు రావడంతో పురుషోత్తమరావు వారికి అవగాహన కల్పించడం ప్రారంభించారు. తొలినాళ్లలో దీన్ని వ్యాపారంగా మలుచుకోవాలని భావించినా, తర్వాత అక్కడే ఉండి తాను సైతం ఆపిల్ సాగు చెయ్యాలన్న నిర్ణయం తీసుకున్నారాయన.
కుటుంబంలో ఒకడు
పురుషోత్తమరావు మొదట మండి జిల్లాలోని కుగ్రామం కర్సోగ్‌లో నివాసం ఏర్పరచుకున్నారు. హిందీ బాగా రావడంతో స్థానికులతో త్వరగా కలిసిపోయారు. ఓవైపు సేంద్రియ వ్యవసాయంపై వారికి అవగాహన కల్పిస్తూనే, మరోవైపు తాను వ్యక్తిగతంగా ఐదెకరాల భూమిని లీజుకు తీసుకొని ఆపిల్ సాగును ప్రారంభించారు. రెండేళ్లు గడిచేసరికి సిమ్లా పరిసర ప్రాంతాల్లో 300 మంది రైతులు సేంద్రియ బాట పట్టారు. అప్పటికల్లా ఆయన వారందరికీ కుటుంబంలో ఒకరన్నంత ఆదరణ సంపాదించుకున్నారు. ‘అక్కడి కుగ్రామాల్లో రైతులకు సంప్రదాయంగా ఆపిల్ సాగుచెయ్యడమే తెలుసుగాని, అధిక దిగుబడి పొందడం, పండించిన పంటకు అధిక ధర పొందడం వంటివి తెలియవు. ఆపిల్స్‌ను గ్రేడ్ ప్రకారం ఎంపిక చేసి దూర ప్రాంతాలకు ఎగుమతి చెయ్యడంతో వాళ్లంతా అధిక లాభాలను పొందారు. దాంతో నా మీద వారికి నమ్మకం కలిగింది’ అని చెప్పారు పురుషోత్తమరావు. ప్రస్తుతం ఆయన పదెకరాల్లో సాగు చేస్తుండగా, మరో 500 మంది రైతులు 126 హెక్టార్లలో ఆయన సలహాలతో సేంద్రియ సాగు చేస్తున్నారు. “మన రాష్ట్రంలో విశాఖ ఏజెన్సీ లంబసింగి ప్రాంత ప్రజలు సహజంగానే సేంద్రియ పంటలు పండిస్తున్నారు. దీనికి సీసీఎంబీ శాస్త్రవేత్తల కృషి తోడయితే ఇక్కడ కూడా ఆపిల్ విరగపండుతుంది. వారి ప్రయోగాల్లో నేను కూడా భాగమై ఈ ఏడాది నుంచి ఇక్కడ సాగుకు కృషి చేస్తాను. సిమ్లా ఆపిల్‌లా ఆంధ్రా ఆపిల్ మార్కెట్‌లోకి రావాలని కోరుకుంటున్నాను” అంటున్నారు పురుషోత్తమరావు.
ఆంధ్రా ఆపిల్ వచ్చేస్తోంది
సిమ్లా ఆపిల్, కాశ్మీర్ ఆపిల్.. ఇలా ఎన్నో పేరున్న రకాలు మార్కెట్లో ఉన్నప్పుడు ‘ఆంధ్రా ఆపిల్’ మాత్రం ఎందుకుండకూడదు? ఈ ఆలోచనే వచ్చింది సీసీఎంబీ శాస్త్రవేత్తలకు. కాశ్మీర్, సిమ్లా మాదిరిగానే, మన రాష్ట్రంలోని లంబసింగి అత్యంత చల్లగా ఉండే ప్రాంతం. అక్కడి వాతావరణం, పర్వత ప్రాంతం ఆపిల్ పండ్ల సాగుకు అత్యంత అనువైన అంశాలు. వీటిని పరిశీలించిన సీసీఎంబీ ప్రయోగాత్మకంగా కొంత ప్రదేశంలో ఈ పండ్ల తోటలను పెంచుతోంది. ఈ ప్రయోగం విజయవంతమయితే మన లంబసింగి కూడా సిమ్లాలా ఆపిల్ తోటల నిలయంగా మారిపోతుంది.
ఇటలీ మొక్కలు ఇక్కడ
సిమ్లాలో సాధారణంగా ఆపిల్ పూత మార్చిలో ప్రారంభమవుతుంది. ఆగస్టు రెండో వారం నుంచి దిగుబడి మొదలవుతుంది. అంటు కట్టిన మొక్కలు నాటితే ఎనిమిదేళ్లకు కాపు మొదలై 45 ఏళ్ల వరకు పంట కాస్తాయి. ఒక మొక్క నుంచి ఏడాదికి 15 కిలోల దిగుబడి వస్తుంది. అదే రూట్‌స్టాక్ మొక్కలు నాటితే రెండేళ్లకే కాపుకొస్తాయి. 20 ఏళ్ల వరకు పంట వస్తుంది. ఒక మొక్క నుంచి 15 – 20 కిలోల నాణ్యమైన దిగుబడి వస్తుంది. ఇవన్నీ తెలుసుకున్న పురుషోత్తమరావు సిమ్లా రైతులు రూట్‌స్టాక్ మొక్కలను సాగు చేసేలా ప్రోత్సహించారు. హిమాచల్‌ప్రదేశ్‌లోని నోని విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు కూడ దాన్నే సిఫార్సు చేసి సహకారమందించారు. రూట్‌స్టాక్ మొక్కల సాగుతో ఇటలీ రైతులు హెక్టారుకు 40 నుంచి 45 టన్నుల దిగుబడి సాధిస్తున్నారు. దాన్ని పరిశీలించేందుకు కొంతమంది రైతులను వ్యక్తిగత ఖర్చులతో ఆ దేశానికి తీసుకెళ్లారు పురుషోత్తమరావు. అక్కడి రైతులు అవలంబిస్తున్న ఆధునిక పద్ధతులపై అవగాహన పెంపొందించుకున్నారు. అక్కడి నుంచి ఆ మొక్కలను దిగుబడి చేసుకున్న సిమ్లా రైతులు ప్రస్తుతం హెక్టారుకు 42 టన్నుల దిగుబడి సాధిస్తున్నారు.
వసుపరి జాన్ దయానంద్, చింతపల్లి
దేశ పురస్కారాలలో తెలుగుకు స్థానమే లేదన్న జి ఎల్ యెన్ మూర్తి

భారతరత్నతో సహా కేంద్ర ప్రభుత్వం ప్రకటించే ప్రతిష్ఠాత్మక పురస్కారాలలో తెలుగువారికి ప్రాధాన్యం తగ్గిపోతోంది. తెలుగువారి తరఫున కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి, మెప్పించే నాయకులు కూడా కరువయ్యారు. ప్రభుత్వపరమైన ప్రతిభా పురస్కారాలలో తెలుగుతేజం వన్నె నానాటికీ తరిగిపోతోంది. ప్రభుత్వేతర సంస్థలు చిత్రవిచిత్ర పురస్కారాలతో, బిరుదుల పందేరంతో హోరెత్తిస్తున్నాయి. అందులో కొన్ని కేవలం సత్కారాల కోసమే వెలిసినట్టుగా, సన్మానాల కంపెనీలుగా మారి తెలుగువారి కీర్తికండూతినికి ఆదుకుంటున్నాయి. ఒక్కో ఏడాదిలో జరిగిన సన్మానాలన్నిటినీ లెక్క కడితే కోట్లాది రూపాయల విలువతో ఈ సన్మానాలు చలామణీ అయిపోతున్నాయనిపిస్తుంది. అయితే అసలు సిసలు ప్రతిభంతా పైరవీల పెత్తనం ముందు బోసిపోతోంది. తెలుగువారి దరిదాపులకు రాని భారతరత్నతో మొదలుపెట్టి మన పెద్దలకు, తేజో మూర్తులకు అందివచ్చినవన్నీ నిక్కచ్చిగా లెక్కించుకోవాల్సిన సంధికాలం దాపురించింది.
ఇటీవల మన ఉన్నత న్యాయస్థానం పద్మశ్రీల వ్యవహార శైలిపై చేసిన వ్యాఖ్యానాలతో సహా మొత్తంగా సమీక్షిస్తే అనేక విచిత్రమైన సంగతులు బయటికి వస్తాయి. మన దేశంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన భారతరత్నను ఏడాదికి 3 మించకుండా ప్రదానం చేయవచ్చన్న నిబంధన ఉంది. గణతంత్ర దినోత్సం రోజున ప్రకటించే ఆనవాయితీతో 1954 నుంచి భారతరత్నను ప్రకటిస్తున్నారు. ప్రధానమంత్రి ప్రతిపాదించి నివేదిస్తే రాష్ట్రపతి ఆమోదంతో ప్రకటన జారీ అవటం ఆనవాయితీగా వస్తోంది. మన దేశ పౌరులకే ఇవ్వాలా, జీవించి ఉన్నప్పుడే ప్రకటించాలా అన్న దానిపై సందిగ్ధతతో, తటపటాయింపుతో ప్రభుత్వాలు వ్యవహరించటంపై కాస్తంత మాత్రమే చర్చ జరిగింది.
గాంధీజీ మరణానంతరం కొన్ని సందర్భాలలో చర్చ జరిగినప్పుడు అత్యున్నత కార్యాలయంలో కూడా దాటవేతలు, తర్జనభర్జనలు జరిగాయి. తొట్ట తొలి భారతరత్నలుగా 1954లో రాజాజీ, సివి రామన్, సర్వేపల్లి రాధాకృష్ణన్‌లను ఎంపికచేసి ప్రదానం చేశారు. 2013 దాకా మెత్తంగా ప్రదానంచేసిన పురస్కారాలు 43 కాగా రెండేళ్లుగా క్రీడారంగంలో వారికి ఇవ్వాలా వద్దా అంటూ నాన్చిన ప్రతిపాదన సచిన్ టెండూల్కర్‌తో ఖరారు అయింది. కాంగ్రెస్ ప్రభుత్వం తరఫున రాజ్యసభలో సభ్యత్వం పొందిన సచిన్‌కు అందరికన్నా పిన్న వయసులో భారతరత్నను ప్రదానం చేయటం ఎలాంటి స్ఫూర్తి, సంకేతాలకు దారితీస్తుందోనన్న రగడ జరిగింది. అంతకుముందు హాకీ రంగంలో ఒలింపిక్‌తో పాటు అంతర్జాతీయంగా జేజేలు అందుకొన్న ధ్యాన్‌చంద్ 1979లో మరణించగా 2011లో ప్రదానం చేయాలన్న 82 మంది ఎంపిల వినతి ఎలాంటి నిర్ణయమూ లేకుండా కాగితాల కట్టలలో చేరిపోయింది.
విదేశీయులకు కూడా…
పదవులలో ఉన్న వారు ప్రభుత్వ సత్కారాలు అందుకోవటం సబబు కాదని నిరాకరించిన అబ్దుల్ కలామ్ ఆజాద్ పేరును 1992లో దివంగతుడైన తరువాత భారతరత్నగా ప్రకటించారు. మన దేశంలో జన్మించకపోయినా, పౌరసత్వం లేకపోయినా సమస్త మానవాళికి ఆదర్శంగా ఉత్తేజకరమైన స్ఫూర్తి అందించే మహనీయులను గౌరవించటం మన ధర్మంగా భావిస్తూ 1997 దాకా జీవించి ఉన్న మదర్ థెరిస్సాకు, 1980లో సరిహద్దు గాంధీగా అందరి ఆదరణ పొందిన ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్‌కు, 1987లో జాతి వివక్షతపై, బడుగుల హక్కులపై మడమ తిప్పని పోరాటంతో ప్రపంచానికే దారి చూపిన నెల్సన్ మండేలాకు భారతరత్న లుగా మన దేశ ప్రభుత్వ అత్యున్నత పురస్కార ప్రదానం జరిగింది.
ఇప్పటిదాకా భారతరత్నలు ప్రకటితమైన వారిలో రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు ఎక్కువ సంఖ్యలో ఉన్నారు. నేతాజీ సుభాష్ చంద్రబోస్‌కు 1992లో రాష్ట్రపతి ఆమోదం తరువాత సుప్రీంకోర్టులో ప్రజాహిత వ్యాజ్యంతో వాదప్రతివాదాలతో సజీవమా మరణానంతరమో ఇదమిత్ధంగా తేల్చలేక ప్రకటన ఉపసంహరించుకున్నారు.
అంతకుముందు దివంగతులైన నేతలను సంస్మరించుకుంటూ భారతరత్నలుగా గౌరవించుకుందామని ప్రభుత్వం నిశ్చయించి పాటించింది. అలాంటి వారిలో 1966లో తాష్కెంట్ లో మరణించిన ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రికి అదే ఏడాది భారతరత్నగా నివాళి అర్పించారు. అదే తీరులో 1987లో మరణించిన ఎంజి. రామచంద్రన్‌కు 1988లో, 1991లో హత్యకు గురైన రాజీవ్ గాంధీకి అదే ఏడాదిలో, అరుణా అసఫ్ అలీ 1996లో దివంగతురాలు కాగా 1997లో ప్రకటించారు. 1984 దాకా జీవించి ఉన్న ఇందిరా గాంధీకి 3వ ప్రధానిగా 1971లో భారతరత్న ప్రదానం జరిగింది. నెహ్రూకు1955లో, గుల్జారీలాల్ నందాకు 1997లో, నిండు నూరేళ్లుగా 1995 దాకా జీవించి ఉన్న మొరార్జీ దేశాయ్‌కి, 1950లో మృతి చెందిన వల్లభాయ్ పటేల్‌కి 1991లో ఆ పురస్కార ప్రదానం జరిగింది.
విరామానికి సిద్ధం
రాజ్యాంగంతో పాటు నిమ్నజాతుల జీవన ప్రమాణాలు హక్కుల కోసం ముందునిలిచి పోరాడుతూ 1956లో మరణించిన బాబా సాహెబ్ అంబేద్కర్‌ను 1990లో భారతరత్నగా గుర్తించారు. 1977-80ల మధ్య కాలంలో దేశ అత్యున్నత పురస్కారం ఎవరినీ వరించలేదు. 2008లో హిందూస్థానీ సంగీత విద్వాంసుడు భీమసేన్ జోషీకి ప్రకటించిన తరువాత కేంద్ర ప్రభుత్వం మిన్నకుండి పోయింది. క్రిందటి ఏడాది సి.ఎన్.ఆర్. రావు, సచిన్‌లతో భారతరత్నలకు 5 ఏళ్ళ విరామం ఏర్పడింది. కళా రంగంలో ఉద్దండులైన వారిలో అందరికన్నా ముందుగా ఎం.ఎస్.సుబ్బలక్ష్మికి 1998లో, సితార్ విద్వాంసుడు రవిశంకర్‌కి 1999లో, పాటలరాణి లతామంగేష్కర్‌కు, షెహనాయ్‌తో దేవుడికి మేలుకొలుపు స్వరాల మాలలు అందించిన బిస్మిల్లా ఖాన్‌లను ప్రభుత్వం భారతరత్నలుగా 2001లో సత్కరించింది.
గణతంత్ర దినోత్సవం సమయంలో మన ప్రజాస్వామిక లక్షణం ప్రతిఫలించేలా పద్మ పురస్కారాలను ప్రభుత ్వం ప్రవేశపెట్టింది. ప్రతిష్టాత్మకమైన ఆ పురస్కారాలకు, బిరుదులకు తేడా తెలియనంతగా మోజు పెరిగి అందుకుగాను అడ్డదారులు తొక్కుతున్న పద్ధతులు పలు సందర్భాలలో విమర్శలకు నెలవు అవుతున్నాయి. ప్రతి ఏటా అక్టోబరు నెలలో అన్ని రాష్ట్రాల నుంచి పద్మ పురస్కారాల ప్రతిపాదనలు పరిశీలించి ఏడాదికి 120 కి మించకుండా ప్రదానం చేయాలన్న అత్యున్నత న్యాయస్థానం సూచనలు చురకల దరిమిలా కూడా విమర్శలు వివాదాలు పెల్లుబుకుతూనే ఉన్నాయి. అత్యున్నతమైన భారతరత్న తరువాత ప్రతిభావంతులైన వారిని గుర్తించి రాష్ట్రపతి ప్రశంసించే పద్మవిభూషణ్, పద్మభూషణ్, పద్మశ్రీలను ఎంపిక చేయటంలో ప్రమాణాలు విధివిధానాలు ఎప్పటికప్పుడు సవరింపులు సర్దుబాట్లతోనే చెల్లుబాటు అవుతునే ఉన్నాయి. రాష్ట్రపతి నిర్దేశించి పాటించే విధివిధానాల ప్రకారం పురస్కారాలు, బిరుదుల క్రమం ఖరారు అయినా చాలామందికి అవగాహన లేకుండా పోయింది.
అత్యున్నతమైన భారతరత్న తరువాత పరమవీరచక్ర, అశోకచక్ర, పద్మవిభూషణ్, పద్మభూషణ్, మహావీరచక్ర, కీర్తిచక్ర, పద్మశ్రీ, సర్వోత్తమ యుద్ధసేవ, యుద్ధ సమయాలు లేని శాంతి సమయంలో విశిష్ట సేవా పతకాలు, గాంధీ శాంతి బహుమతి, ఇందిరాగాంధీ శాంతి బహుమతి వంటివాటితో పాటుగా క్రీడలకు సంబంధించి రాజీవ్ ఖేల్‌రత్న, అర్జున, ద్రోణ, ధ్యాన్‌చంద్ పురస్కారాలు, సినిమా అవార్డులు ఉన్నాయి. జాతీయస్థాయిలో బాలలకు బాలశ్రీ వంటివి ఉన్నాయి. కాగా, వీటన్నిటిలో తెలుగువారికి అందుతున్నవి తెలిసినవి చాలా తక్కువ. ప్రభుత్వపరంగా కూడా సమాచారం సవిరంగా తెలియచెప్పగల వ్యవస్థ లేకపోవటంతో తెలుగుతనం తెలుగుతేజం తెరమాటున మగ్గిపోతున్నాయి.
– జి.ఎల్.ఎన్. మూర్తి
నేనెంత కాలం ఉంటాను మీరెన్తకాలమ్ చేస్తారు /అన్న అక్కినేని

“ఇప్పటివరకు బాగా చేశారు. ఇక చాలు. ఈ సంవత్సరంతో ముగిద్దామమ్మా’ అన్నారు. దానికి నేను నవ్వేసి ‘మేము చేస్తాంలెండి’ అన్నాను. ఆ తరువాత మళ్లీ స్టేజి మీద కూడా అదే మాట – ‘ఇంకెంతకాలం చేస్తారు. ఇదే చివరి సంవత్సరం’ అన్నారు.”
సెప్టెంబర్ 28, 2013
హైదరాబాద్ రవీంద్రభారతిలో సాయంత్రం వేళ. ‘రాగసప్తస్వర’ అనే సాంస్కృతిక సేవా సంస్థ ఎప్పటిలాగే ఎ.ఎన్.ఆర్ స్వర్ణ కంకణ ప్రదానోత్సవం వేడుక చేసింది. ఈ వేడుకలో ప్రముఖ డాక్టర్లను, పారిశ్రామిక వేత్తలను, నటీనటులను సత్కరించింది. రాగసప్తస్వర సంస్థకి ఎస్. రాజ్యలక్ష్మి వ్యవస్థాపక అధ్యక్షురాలు. ఆవిడ స్వాతంత్య్ర సమరయోధురాలు. దువ్వూరి సుబ్బమ్మ మనవరాలు. తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ నన్నపనేని రాజకుమారి ఆ సంస్థ గౌరవ అధ్యక్షురాలు. ఈ సంస్థ ఇరవైయేళ్లుగా ప్రతీ ఏడాది అక్కినేని నాగేశ్వరరావు పుట్టినరోజున ఈ కార్యక్రమాన్ని చేస్తూ వస్తోంది. నాలుగు నెలల క్రితం జరిగిన కార్యక్రమంలో నాగేశ్వరరావుగారు ముందే ఊహించినట్టుగా ‘ఇదే ఆఖరి సంవత్సరం’ అన్నారట. ఆ మాటల్ని గుర్తు చేసుకుంటూ నన్నపనేని రాజకుమారి చెప్పిన మాటలివి…
“రాగసప్తస్వర 28 యేళ్లుగా ఉంది. నాగేశ్వరరావు గారి స్వర్ణకంకణ ప్రదానోత్సవం మొదలుపెట్టి 20 సంవత్సరాలయ్యింది. మీ పుట్టినరోజున సన్మానం చేస్తామని ఆయన్ని కలిస్తే ‘నాకు సన్మానం వద్దు. నాకు కావాల్సింది అది కాదు. నా పేరుతో ఇంకెవరికన్నా సన్మానం చేయండి. నేనొస్తాను’ అన్నారు. అప్పట్నించి ప్రతి ఫంక్షన్‌కి సి. నారాయణ రెడ్డి గారు, నాగేశ్వరరావు గారు వచ్చేవారు. ప్రముఖ వైద్యుల్ని, పారిశ్రామికవేత్తల్ని, సినీ కళాకారుల్ని ఈ సంస్థ ద్వారా సన్మానిస్తాం.
విచిత్రం ఏమిటంటే… ఈసారి ఫంక్షన్ చేయడానికి ముందు నాగేశ్వరరావు గారితో మాట్లాడేందుకు ఆయన్ని కలిశాం. అప్పుడాయన నాతో, రాజ్యలక్ష్మితో ‘ఇదే ఆఖరి సంవత్సరం. అన్ని సంస్థలకి ఈ విషయం చెప్పాను’ అన్నారు. ఆయన అప్పటికింకా ఆరోగ్యంగానే ఉన్నారు. ఆయన ఆ మాట అనేసరికి ‘అలా ఎందుకవుతుందండీ. మీరున్నంతకాలం మా సంస్థ తరపున మీరు ఉండాల్సిందే’ అన్నాం నేను, రాజ్యలక్ష్మి. దానికాయన ‘నేనెంతకాలం ఉంటాను… మీరెంతకాలం చేస్తారు? ఇప్పటివరకు బాగా చేశారు. ఇక చాలు. ఈ సంవత్సరంతో ముగిద్దామమ్మా’ అన్నారు. దానికి నేను నవ్వేసి ‘మేము చేస్తాంలెండి’ అన్నాను. ఆ తరువాత మళ్లీ స్టేజి మీద కూడా అదే మాట – ‘ఇంకెంతకాలం చేస్తారు. ఇదే చివరి సంవత్సరం’ అన్నారు. చెస్ట్ పెయిన్ ఏమైనా ఉందా, గుండెకి సంబంధించి సమస్య ఏదైనా వచ్చిందా… ఎందుకిలా మాట్లాడుతున్నారు అనుకున్నాం. దాంతో ఇన్నేళ్లుగా మా సంస్థ ద్వారా ఆయన ఎవరెవరికయితే సన్మానం చేశారో వాళ్లందరూ కలిసి ఆయన్ని సన్మానిస్తే బాగుంటుందని ఆలోచించాం. ఆ ఆలోచనను డాక్టర్ గురవారెడ్డి, డాక్టర్ పద్మ వీరపనేనిలతో పంచుకుంటే అందుకు వాళ్లు కూడా సరేనన్నారు. అందరం మాట్లాడుకుని రజిత సింహాసనం చేయిద్దామని నిర్ణయించాం. అయితే ఆ మాట ముందుగా చెప్తే ఒప్పుకోరని ఆయనకి చెప్పలేదు. చెప్పకుండా “ఇన్నాళ్లు మీరు సన్మానాలు చేశారు కదా. వాళ్లందరూ కలిసి మీకు సన్మానం చేస్తార”ని మాత్రమే చెప్పి ఒప్పించాం. అలా ఆయనకి రజిత సింహాసనం బహూకరించే అవకాశం దక్కింది మాకు. దానిమీద ఆయన్ని కూర్చోపెట్టి పూలవర్షం కురిపించాం.
ఆ దృశ్యం ఇప్పటికీ నా కళ్ల ముందు సినిమా రీలులాగా కదులుతూనే ఉంది. కుర్చీలోంచి లేచేటప్పుడు ఇబ్బంది పడ్డారని ఇప్పుడనిపిస్తుంది. కుర్చీ పట్టుకునే చాలాసేపు నిల్చొన్నారు. ఆ సభలో నేను ప్రసంగించేటప్పుడు ‘ఈ సంవత్సరం ఆపేయమని నాగేశ్వరరావు గారు అంటున్నారు. కాని ఎట్టి పరిస్థితుల్లోనూ ఆపేయం. ఆయనకిప్పుడు 90 సంవత్సరాలు. ఆయన వంద సంవత్సరాలు తప్పకుండా ఉంటారు. అప్పటిదాకా ఫంక్షన్ చేస్తామ’ని చెప్పాను. నేనా మాటలు చెప్తున్నప్పుడు ఆయన అదో రకంగా నవ్వారు. (ఏడుస్తూ … ఇప్పుడు నాకనిపిస్తోంది ఆ రోజు ఆయనకి కచ్చితంగా తెలిసే ఉంటుందని.) ఆ రోజు చాలా ఘనంగా వేడుక జరిగింది. అదయిన కొన్నాళ్లకే ఆరోగ్యం బాగాలేదని ఆయనే స్వయంగా మీడియా ద్వారా ప్రజలకి చెప్పారు.
రాజకీయాలకి చాలా దూరంగా ఉండేవారాయన. అయినా చాలామందిని ప్రభావితం చేశారు. యువతకి గొప్ప స్ఫూర్తి. మహానటుడు, నిర్మాతే కాకుండా ఆదర్శవంతమైన భర్త ఆయన. అన్నపూర్ణ గారిని కడదాకా బాగా చూసుకున్నారు. పిల్లల్ని వృద్ధిలోకి తెచ్చారు. ఆయన మాటలో చమత్కారం, గంభీరం రెండూ ఉంటాయి. భాషా చాతుర్యం సంగతయితే చెప్పక్కర్లేదు. అంత బాగుండేది. సినిమాల్లో పాటలకు ఆయన వేసిన స్టెప్పులు, నటనా కౌశల్యం జీవితంలో మరిచిపోలేనివి. ఆయన మరణం ఓ చేదు జ్ఞాపకం.
ఆయన మన నుంచి భౌతికంగా మాత్రమే దూరమయ్యారు గాని ఆయనెప్పుడూ మనతోనే ఉంటారు. అందుకే ఇక మీదట మేము చేసే సన్మానాలకి ఆయన కుటుంబ సభ్యుల్ని ఆహ్వానిస్తాం. నాగేశ్వరరావు గారి శిల్పాన్ని లేదా చిత్రపటాన్ని పెట్టి ఆయన పేరుతో కార్యక్రమాన్ని కొనసాగిస్తాం. సన్మాన గ్రహీతలకు ఎప్పటిలాగానే ఎ.ఎన్.ఆర్ స్వర్ణకంకణం, సన్మానపత్రం, మెమొంటో ఇచ్చి సత్కరిస్తాం.
మొన్నటి సన్మాన కార్యక్రమంలో నేను, సినీనటి లక్ష్మి కలిసి నాగేశ్వరరావుగారితో ఫోటో దిగాం. అప్పుడాయన ‘ఒకరు సినీ నాయిక. మరొకరు రాజకీయ నాయిక’ అన్నారు నవ్వుతూ” అని ఆనాటి జ్ఞాపకాలను బరువెక్కిన హృదయంతో, తడిబారిన కళ్లతో గుర్తుచేసుకున్నారు నన్నపనేని రాజకుమారి.

గత 20 యేళ్లలో డాక్టర్ గురవారెడ్డి, డాక్టర్ శివారెడ్డి, డాక్టర్ నారాయణ, డాక్టర్ భాస్కరరావు (కిమ్స్), డాక్టర్ సబిత, డాక్టర్ సోమరాజు, డాక్టర్ గోపిచంద్, డాక్టర్ కాకర్ల సుబ్బారావు, డాక్టర్ సీత వంటి ప్రముఖ డాక్టర్లను సన్మానించాం. వీరితోపాటు పారిశ్రామిక వేత్తలు, సినీ కళాకారులకి ఎ.ఎన్.ఆర్ స్వర్ణకంకణాలు, మెమొంటో ఇచ్చి సత్కరించాం. మా కార్యక్రమానికి ముఖ్యమంత్రులు, గవర్నర్లు వచ్చారు. దివంగత ప్రధాన మంత్రి పివి నరసింహారావుగారు కూడా మా కార్యక్రమానికి వచ్చారు.
రావూరి భరద్వాజ పై అమరావాణి హైస్కూల్ విద్యార్ధులకు అవగాహన సభ -సరసభరతి 59 వ సమావేశం -22-2-14- శనివారం -ఉదయం -11గం లకు
అక్షరం లోక రక్షకం
సరసభారతి –సాహిత్య సాంస్కృతిక సంస్థ –ఉయ్యూరు
ఆహ్వానం -59వ సమావేశం
జ్ఞాన పీఠ పురస్కార గ్రహీత స్వర్గీయ రావూరి భరద్వాజ గారిపై అవగాహన సభ
వేదిక –శ్రీ అమరవాణి హైస్కూల్ –ఉయ్యూరు –కాకాని నగర్
తేది ,సమయం –22-2-2014-శనివారం ఉదయం -11గం లకు
విషయం –జ్ఞానపీఠ పురస్కార గ్రహీత స్వర్గీయ రావూరి భరద్వాజ జీవితం –రచనలు
సభాధ్యక్షులు –శ్రీ గబ్బిట దుర్గా ప్రసాద్ –సరసభారతి అధ్యక్షులు
సభా నిర్వహణ ,ఆతిధ్యం –శ్రీ పి.వి.నాగ రాజు –ప్రిన్సిపల్ –అమరవాణి హైస్కూల్
ముఖ్య అతిధి –శ్రీమతి మందరపు హైమవతి –ప్రముఖ కవి, కదా రచయిత ,విమార్శ కురాలు
ఆత్మీయ అతిధి –శ్రీ కే .ఆంజనేయ కుమార్ –ప్రసిద్ధ కవి ,విమర్శకులు
అమరావాణిహైస్కూల్ విద్యార్ధులకునిర్వహించిన ‘’భరద్వాజ గారి జీవితం’’పై వ్యాసరచన ,’’భరద్వాజ రచనలలో మానవతా దృక్పధం ‘’పై వక్తృత్వ పోటీలలో గెలుపొందిన విద్యార్ధులకు బహుమతి ప్రదానంచేయబడును .
సాహిత్యాన్ని సమాజం లోని అందరికి అందజేయాలనే తలంపు తో ఏర్పడిన సరసభారతి- విద్యార్ధులకు రావూరి భరద్వాజ గారి ఆదర్శ జీవితం ,వారి ప్రముఖ రచనలు ,పొందిన పురస్కారాల పై విద్యార్ధులకు అవగాహన కల్పించటానికి ఏర్పాటు చేసిన ఈసభకు సాహిత్యాభిమానులందరూ ఆహ్వానితులే .విచ్చేసి ,పాల్గొని జయ ప్రదం చేయ ప్రార్ధన .
జోశ్యుల శ్యామల మాదిరాజు శివలక్ష్మి గబ్బిట వెంకట రమణ గబ్బిట దుర్గా ప్రసాద్
గౌరవాధ్యక్షులు కార్య దర్శి కోశాధికారి అధ్యక్షులు –సరసభారతి
9989066375,08676-232797
అమరవాణి ప్రిన్సిపాల్ శ్రీ నాగ రాజు –ఫోన్ -9440636357
తెలుగులో మాట్లాడటం మన జన్మ హక్కు ,
,
జగమే మాయ అనే ఎరుక తో మరో ప్రపంచానికి మహా ప్రస్థానం సాగించిన బాటసారి-అక్కినేని
జగమే మాయ అనే ఎరుక తో మరో ప్రపంచానికి మహా ప్రస్థానం సాగించిన బాటసారి-అక్కినేని
స్వర్గీయ అంజలీ దేవి ,అక్కినేని లకు సరసభారతి నివాళి -23-1-14
అక్కినేని ని నేను మొదటి సారిగా 1963లో రాజమండ్రి రైల్వే ప్లాట్ ఫాం మీద చూశాను .నేనప్పుడు బి ఇ డి.ట్రయిం గ్ చేస్తున్నాను .మెయిల్ కోసం ఎదురు చూస్తున్నాను బెజవాడ వెళ్లి ఉయ్యూరు రావటానికి .పంచ కట్టు లాల్చీ మెడలో ఉత్తరీయం తో తెలుగు తేజం గా కనిపించాడు .ఆయనా మెయిల్ కోసమే ఉన్నాడు .కొంచెం ఎత్తైన బల్ల మీద నుంచుని ఉన్నాడు .పొట్టి వాడు కదా అందుకని పొడుగ్గా కనీ పించాలని అలా ఉన్నాడేమో ననుకొన్నా .చాలా సేపు వెయిట్ చేశాం .కాని నేనెందుకో సాహసించి మాట్లాడలేక పోయా .ఆయనా ఎవరైనా వచ్చి పలకరించి మాట్లాడుతారేమో నన్నట్లున్నాడు .చిన్నప్పటి నుంచీ ఉన్న ఆరాధ భావం మరింత బల పడింది ఆయన్ను చూడగానే .ట్రెయిన్ రావటం ఎవరి దారిణ వారు వెళ్ళటం జరిగి పోయింది .
రెండో సారి జాగర్ల మూడి రాధాకృష్ణ మూర్తి తీస్తున్న ‘’ప్రతి బింబాలు ‘’సినిమా షూటింగు లో ప్రసాద్ లాబరేటరి లో చూశాం నేనూ మా శ్రీమతి .అందులో మేమూ నటించాం గెస్ట్ లుగా .లాబ్ లో విరామ సమయం లో జయ సుధ కోసం ఎదురు చూస్తూ అందరం సీట్ల లో కూర్చుని ఉన్నాం .మా ముందు వరుసలోనే నాగేశ్వర రావు కూర్చుని ఉన్నాడు .వేరెవరో పక్కన కూర్చుని మాట్లాడుతున్నారు .అక్కినేని మాటల్లో పల్లెటూరి మొరటు తనపు మాటలు విన్నాం .అప్పుడూ మా వైపు చూసి మాట్లాడుతారేమోనని ఎదురు చూసినట్లే అని పించింది .మాకెందుకో మాట్లాడాలని పించేలేదు .కారణం ప్రక్కవానితో అతని మాటల్లో సంస్కారం నాకు అప్పుడు కనీ పించలేదు విని పించానూ లేదు .షూటింగ్ లో ఉదయం నుంచీ చాలాసేపు ఉన్నాం .రాత్రి ఏడు దాకా జరిగింది .కాని ఆ సినిమా ప్రతిబింబాలు ఎన్నో సార్లు విడుదలకు సిద్ధమై అసలు విడుదలె కాలేదు. చాలా ఏళ్ళు దానికోసం ఎదురు చూశాం నిరాశే మిగిలింది .
మూడవ సారి మా రెండో అబ్బాయి శర్మ హైదరాబాద్ లో రాజ్యలక్ష్మీ టెక్స్టైల్స్ లో కంప్యూటర్ అసిస్టంట్ గా పని చేసినప్పుడు మాటల్లో అక్కినేని దానికి ఒక డైరెక్టర్ అని తరచు అక్కడికి మీటింగులకోసం వస్తాడని చెప్పేవాడు .స్టాఫ్ లో ఆఫీసర్ రాంక్ వారికి ఆయన నంబర్ ఇచ్చేవాడట ఆ నంబర్ కు చేస్తే నే నాగేశ్వర రావు ఫోన్ ఎట్టేవాడట .ఒకసారి శర్మ ఆ నంబర్ మాకు ఇచ్చిమాట్లాడ మంటే ఫోన్ చేసి మాట్లాడాం .వెంటనే లిఫ్ట్ చేసి చక్కగా మాట్లాడాడు .మేము ఉయ్యూరు నుంచి మాట్లాడుతున్నామని ఆయనంటే పిచ్చ అభిమానమని ఆయన నటించిన సినిమాలన్నీ దాదాపు చూశామని నేను మా ఆవిడా చెప్పాం. చాలా శ్రద్ధగా విని సంతోషించాడు .అక్కినేని తో మాట్లాడామని రొమ్ములు విరుచుకొని బంధువులందరికీ చాటు కున్నాం కూడా .
ఆ తర్వాత హైదరాబాద్ లో అనేక సభల్లో నాగేశ్వర రావు ను చూశాను .నారాయణ రెడ్డీ నాగేశ్వర రావు లు లేని సాహిత్య సభాలు ఉండేవి కావు .అప్పుడు నేనొక కప్లేట్ రాసుకోన్నాను ‘’నా.నా(నాగేశ్వరరావు నారాయణ రెడ్డి )లు లేని సభయును –బోనాలు లేని ఇల్లు భాగ్యనగరం లోలేదంటే లేదు సుమ్మీ ‘’‘’అని .పేపర్లలో కూడా దీనిపై చాలా మంది చెవులు కొరుక్కున్నారు .వీల్లిద్దరేనా ?ఇంకెవరూ లేరా?అని అది వారికే చెల్లింది వాళ్ళుంటే నిండుగా ఉంటుందని నిర్వాహకుల తాపత్రయం వారు ఉంటె సాహితీ పరులు చేరుతారని ఆశా కావచ్చు .అయితే ఈ రహస్యం తెలిసిన అక్కినేని దాదాపు రెండేళ్ళపై బడి ఇలాంటి సభలకు హాజరుకాలేదు .రెడ్డి కూడా తగ్గించుకొన్నాడు .ఇదీ నాకు నాగ్ తో ఉన్న ప్రత్యక్ష సంబంధం .
నాగేశ్వర రావు ఎవరికీ చేతకాని విధం గా ‘’తల డిప్ప ‘ను పైకేత్తేట్లు చేయటం నాకిష్టం స్టెప్పులు ఇష్టం .భగ్న ప్రేమికుడిగా మరీ ఇష్టం .జయ భేరి నాగ్ అంటే మరీ క్రేజ్ .ఇద్దరు మిత్రుల అక్కినేని ఆ ఆరాధన. సుమంగళి నాగ్ పై జాలి .బాటసారి పై సానుభూతి ,దేవదాస్ పై విచారం ,వెలుగు నీడల నాగ్ ఆంటే అయ్యోపాపం .సువర్ణ సుందరి నాగ్ తమాషా .సంసారం ,ఆత్మీయులలో చిలిపి తనం ,భాలేరాముడిలో కొంటెతనం ధర్మ దాత లో ఓవర్ యాక్టింగ్ ,జక్కన్న నాగ్ లో ,అనార్కలి నాగ్ లో పాత్రోచితం నాకు కు బాగా ఇష్టం .
ఇన్ని ఇష్టాల కంటే అతి ఇష్టమైంది సుడి గుండాలు ,మరో ప్రపంచం .మొదటి దానిలో సమాజం లోని లోపాలు యువత పెడదారిలోకి జారుతున్న వైనం సమాజం బాధ్యతా రాహిత్యం ,నేరానికి తగిన శిక్ష లేకపోవటం మొదలైన సమస్యల్ని ఎక్స్పోజ్ చేశాడు ఆదుర్తి తో కలిసి .ఇది అందరూ అన్ని సినిమాల్లోనూ చేసేదే .ఆపనే వీరిద్దరూ చేశారని సరిపెట్టుకోవటానికి వీలు లేదు .సమస్యను తడిమిన వారు పరిష్కారాన్ని చూపించాలి అనే సత్యాన్ని తెలిసిన వారు వీరిద్దరూ .అందుకే పరిష్కార మార్గం గ మరో ప్రపంచం తీశారు సెహబాష్ భేష్ అని పించారు చూస్తుననంత సేపు నిజం గానే మరో ప్రపంచం లో ఉన్న అను భూతి కలిగించారు .నటీ నటులందరూ పండిన నటన ప్రదర్శించటం ఒక హై లైట్ .ఆ ప్రతిభను వెలికి తీసిన ఆదుర్తి కి హాట్స్ ఆఫ్ .సాహసం గా చేతులు కాల్చుకుని కీ రెండు చిత్రాలను తీసిన అ .ఆ .(అక్కినేని ఆదుర్తి )లకు సినీ ప్రేక్షకులు ఏమిచ్చినా ఋణం తీరదు .అందులో లో మోదుకూరి జాన్సన్ రచన ప్రశంసనీయం
అక్కినేని నటన అంటే నాకు చిరకాలం గుర్తుండి పోయేది ‘’సీతారామయ్య గారి మనవరాలు ‘’అరవై ఏళ్ళ నటనాను భవాన్ని రంగరించి నటించాడు అక్కినేని .ప్రతి అంగుళం లో నిండుతనం ,స్పూర్తి మత్వం ,ప్రేరణా అనుభవం ఆపేక్ష ,బాంధవ్యాలు ,మమకారం నిర్మ్మమ కారం ,హాస్యం కారుణ్యం ,తపన ,ఎదురు చూపు ,పెద్దరికం అన్నిటికీ ఒక పెద్ద బాల శిక్ష గా నటించాడు .క్రాంతికుమా ర్ సిని మాని ఒక క్లాసిక్ గా తీర్చిదిద్దితే ,కీరవాణి సంగీత స్వరామ్రుతం తో తడిపేశాడు .చిన్న. మీనా ఇంత ఎదిగి పోయిందా వయసులోనూ, నటనలోను చిలిపిదనం తోను అని అబ్బురపరచే చిత్రం ఇది
ఎనభై మూడేళ్ళ తెలుగు చలన చిత్ర రంగ చరిత్ర లో అక్కినేని లేకుండా ఒక అయిదేళ్ళు మాత్రమె గడిచింది మిగతా కాలమంతా అతని తో నడిచింది .అది చాలు మనం గర్వం గా చెప్పుకోవటానికి. వందేళ్ళ సినీ చరిత్ర మూడు వంతులు నాగేశ్వర రావు తో గడిపింది .ఇంత కంటే అదృష్ట వంతులు ఏవరుంటారు ?
అక్కినేనికి రావాల్సిన అవార్డులూ రివార్డులూ వెతుక్కుంటూ వచ్చేశాయి .తాను పొందినవి కాదు తాను ఇచ్చేది గొప్ప ఏమనిషి కైనా.అందుకే తన పేర జీవన సాఫల్య పురస్కారాలను ఏర్పరచి చిత్ర రంగం లో తమదైన ముద్ర వేసిన వారికి అందించాడు .ఈ యోచన రావటమే విశేషం .వచ్చింది అమలు చేశాడు .ఇక్కడా తనకు సాటి లేరని పించుకున్నాడు .
అక్కినేని అంటే ఆ చిరునవ్వే ఎవరికైనా చిరకాలం గుర్తుండి పోతుంది .ఆతెలుగు తనానికి నిలు వెత్తు రూపం గా నిలిచాడు .ఏ సినీ ఉత్సవానికైనా అదే వేష ధారణ తో రావటం అక్కినేని ప్రత్యేకత .అందుకే మరింత చేరువయ్యాడు అందరికి .దేవుడు ఉన్నాడో లేదో తనకు అనవసరం కాని పనిలోనే దైవాన్ని చూసుకొన్న కర్మిష్టిఅని పించాడు .రోజులు మారాయి లో పొలం దున్నే రైతు అయితే నమ్మిన బంటు లో యజమానికి నమ్మిన బంటు ,దౌష్ట్యానికి చెక్ పెట్టిన వీరుడు ,మిస్సమ్మ చక్ర పాణి లలో హాస్యం పండిస్తే ,ప్రేమించి చూడు లో ముసలి యువకుడుగా చలాకీ చూపించాడు అందరూ మెచ్చే ప్రేమ నగర్ సినిమా బోర్ కొట్టి మధ్యలోనే వచ్చేశాను ప్రేమాభిషేకం దాసరి పైత్యం అని విసుక్కొన్నాను మేఘ సందేశామూ నాకేమీ ఆనలేదు అతుకుల బొంత అని పించింది .అర్ధాంగి అక్కినేని అంటే ఒక మార్గ దర్శి అందులో సావిత్రి స్వయం సిద్ధ .ఆరాధనా మాంగల్య బలం చక్రవర్తి నాగులు నాకు బాగా నచ్చినోళ్ళు.
‘’ బుడ్డి మంతుడైనా ,బుద్ధి మంతుడైనా ‘’అక్కినేనే .తోడికోడళ్ళు నాగ్ మంచి తమ్ముడు .చెంచు లక్ష్మి లో విష్ణు మూర్తి నాగేశ్వర రావు నాకు అభిమాని .సూత్రధారులు అక్కినేని విశ్వనాద్ తీర్చి దిద్దిన బంగారు బొమ్మ .అందులో కొడుకు ప్రయోజకుడైనందుకు సంతోషిస్తూ సుజాత అక్కినేని ని రాహస్యం గా ఒక గదిలో కి తీసుకెళ్ళి ‘’ఎంత మంచి కొడుకును ఇచ్చావయ్యా ?’’అన్నప్పుడు నా కళ్ళ వెంబడి ఆనంద బాష్పాలు ఎప్పుడూ జలజలా రాలి పోతూంటాయి .ఇద్దరో ముగ్గురో ఉన్న రాముళ్ళ లో భలే రాముడికే నా మార్కులు . దొంగల్లో దొరలో నాగ్ అంటే చారిస్మా ఉంది అందులోని జి.వరలక్ష్మి తో బాటు .పెళ్లినాటి ప్రమాణాలను నిజ జీవితం లోను పాటించాడు .అందుకు అభినందనలు .పెళ్ళికానుక ,ఇల్లరికం నాగ్ మహా మోజు .శాంతినివాసం అక్కినేని ని ఎన్ని సార్లు చూశానో జ్ఞాపకమే లేదు .కాళిదాసు ,జయదేవుడు గా నే నాకు ఆయన కనిపించి నన్ను మురిపించాడు. మంచి మనసులు లో నాగ్ జీవించాడని పిస్తుంది ..గుండమ్మ కద కులగోత్రాల అక్కినేని సరదా మనిషి .చదువుకున్న అమ్మాయిలూ ఆత్మ బలం ,పూజా ఫలం లోని నటన ముగ్ధుణ్ణి చేసింది .అందాల రాముడు అక్కినేని నాకు ప్రాణం .మాయాబజార్ ,కృష్ణార్జున యుద్ధం లలో అక్కినేని, నందమూరి అందగాడితో పోటీపడి నటించి మెప్పించాడు .డైలాగ్స్ బొడ్డులోంచి తెచ్చుకొని అరిచినట్లు పలికినా నాకు బలే ఇష్టం .అభి గా సుందర యువకుడై నయనాందం గా కనిపించాడు మూగమనసుల్లో భావ గర్భిత పాటలు పాడి జన్మ జన్మ ల అనుబంధాన్నిగుర్తుకు చేశాడు చాణక్యుడుగా చంద్ర గుప్తుడిని మించాడు.పల్లెటూరి బావ ,బ్రహ్మ చారి గా మెప్పించాడు జక్కన్న గా శిలలపై శిల్పాలు చెక్కి శిల్ప కళా కారుడని పించాడు .ఇలా ఎన్నని చెప్పను? అన్నీఅన్నే. కాని కొన్ని సినిమాలు ఇప్పుడు చూస్తుంటే ఈ అక్కినేనినా నేను ఆరాధించింది?/అనే బాధ కూడా వస్తుంది కొన్ని ఇప్పుడు చూడనే లేము ..రామదాసులో కబీర్ నాగ్ వేషం కృతకం గా ఉన్నాజేవించాడు .రామ రాజ్యం లో మాత్రం వాల్మీకి గా నుంచో లేక చతికిల పది కూర్చుని నటించి ,పేలవమైన మాటలతో నాకు చిరాకే కల్గించాడు .
అక్కినేనిని అమెరికా ప్రభుత్వం స్టేట్ గెస్ట్ గా ఆహ్వానించి గౌరవించింది .అలాగే జర్మని ఫ్రాన్స్ ఇంగ్లాండ్ లు కూడా గౌరవించాయి .అక్కడ నాటక సినిమా కళలను అధ్యయనం చేశాడు .ఆస్ట్రేలియా సిడ్నీ ఫిలిం ఫెస్టివల్ కు అంతస్తులు చిత్రాన్ని అక్కినేని ఆధ్వర్యం లో పంపారు .మారిషస్ ఫిలిం ఫెస్టివల్ కు కూడా నాయకత్వం వహించాడు .
మద్రాస్ నుంచి చలన చిత్ర పరిశ్రమ హైదరాబాద్ తరలటానికి ముఖ్య కారకుడు అక్కినేనే .అంత ముందు చూపు ఆయనది .తర్వాతే మొత్తం అందరూ తరలి వచ్చారు .అన్న పూర్ణ స్టూడియో నిర్మించి సారధికి దీటుగా నడిపాడు స్వంత బేనర్ పై గొప్ప చిత్రాలను నిర్మించి తెలుగు చిత్ర పరిశ్రమలో ఒక శిఖరాయమైన వాడయ్యాడు .కుటుంబ సభ్యులందరూ నటులయ్యారు .అంతా కలిసి నటించి ‘’మనం ‘’అని పించుకొన్నారు .ఎక్కడో వెంకట రాఘవాపురం నుంచి ఒక పేద రైతు కుటుంబం లోంచి వచ్చిన ఈ బాల రాజు హైదరాబాద్ లో ఒక సినీ సామ్రాజ్యాన్నే స్థాపించి పాలించాడు .అవార్డులిచ్చాడు ఇప్పించాడు ,పొందాడు ఏది చేసినా గుర్తుండి పోయేట్లు చేశాడు .తాను చదువుకోలేక పోయానే అనే దుగ్ధ జీవితాంతం అక్కినేని ని వేధిస్తూనే ఉంది .దాన్ని బయటికి చెబుతూనే ఉన్నాడు .అందుకే విద్యా దానాలు చేశాడు .సంస్థలకు విరాలాలిచ్చాడు .కళా కారులకు అండగా నిలిచాడు .రాష్ట్రం కరువు కాటకాలు తుఫాను వరదల భీభత్సం లో అతలా కుతలమైనప్పుడు రామా రావు తోకలిసి మిగిలిన వారందరినీ కలుపుకొని భిక్షాటనం చేసి విరాళాలు సేకరించి ప్రజలను ఆదుకొన్న మానవీయుడు అక్కినేని. కృష్ణా జిల్లాకు చెందిన ఘంటసాల, అక్కినేని. రామా రావు త్రయం చరిత్రనే సృష్టించి యావద్భారత ఖ్యాతి పొందారు జిల్లాకు రాష్ట్రానికి దేశానికి తెచ్చారు .
‘’అన్న అడుగేస్తే మాస్ అన్న లుక్కేస్తే మాస్ ‘’అని ఇప్పుడు ఆయనకొడుకు నాగార్జున ను గురించి అనుకొంటే మేమేప్పుడో అరవయ్యవ దశకం లో నే అంతటి క్రేజ్ ను అక్కినేని పై చూపించాం .కేన్సర్ వస్తే అందరూ దాచి పెట్టుకొని బయట పడనీయ కుండా గుంభనగా ఉంటారు .అలా ఉంటె అక్కినేని ఎందుకు అవుతాడు ?తన జబ్బును తానే బయట పెట్టుకొని కుటుంబం వారికి అభిమానులకు ,ప్రజలకూ తెలియ జేసి నిబ్బరం గా ఉండమని చెప్పి ధైర్యం చెప్పాడు తాను మరి కొంతకాలం జీవించి ఆనందం కలిగిస్తానని భరోసా ఇచ్చాడు .ఇదికూడా చరిత్రలో నిలిచి పోయే ఘట్టం .గుండెకు బైపాస్ జరిగినా ఇన్నేళ్ళు ఆరోగ్యం గా జీవించి నటించి సినిమాలు తీయటం ఒక రికార్డు ఇది చూస్తె మేము2012లో అమెరికా వెళ్ళినప్పుడు అక్కడ ‘’రేడియేషన్ పోయెమ్స్ ‘’అనే సానెట్ కవితా సంకలనాన్ని చదివాను .అది ఒక కవయిత్రి రాసిన పుస్తకం .ఆమె భర్త యూని వర్సిటి లో జువాలాజి ప్రొఫెసర్ ఆయనకు కేన్సర్ సోకింది .దానికి నలభై రోజులు రేడియేషన్ ట్రీట్మెంట్ ఇప్పించారు .రోజూ ఈ అమ్మాయి ఆయన్ను హాస్పిటల్ కు తీసుకు వెళ్లి ట్రీట్మెంట్ అయిన తర్వాత ఇంటికి తీసుకొచ్చేది .ఆ సమయం లో అ నలభై రోజుల్లో భర్త పడిన బాధ తాను పడిన మానసిక క్షోభ డాక్టర్ల లోని మాన వీయతలను చూసి చలించి రోజూ ఇంటికి వెళ్ళిన తర్వాత ఒక సానెట్ రాసింది నలభై రోజుల్లో నలభై సానేట్స్ రాసి పెద్దలకు చూపిస్తే అద్భుతం గా ఉన్నాయని మెచ్చి ప్రచురించమని ప్రోత్సహిస్తే అలానే చేసింది .దీన్ని చదివి నేను నెట్ లో ఆ పుస్తకం పై ఒక ఆర్టికల్ రాస్తే విహంగ వెబ్ మాస పత్రిక లో ప్రచురితమైంది .అది చదివిన అమెరికా లోని మా మిత్రులు మైనేని గోపాల కృష్ణ మూర్తి గారు అదే రేడియేష ట్రీట్మెంట్ పొందిన ప్రముఖ చిత్రకారుడు సినీ దర్శకుడు బాపు గారికిపంపితే ఆయన చదివి మెచ్చుకొన్నారని మైనేని చెప్పారు ఇలాంటి రచనలు అవతలి వారిలో ఉపశమనం కలిగిస్తాయి .అదే నాగ్ చేసిన పని .దీనికి ఏంతో ఆత్మా పరిశీలనా శోధనా ఉండాలి .అవి ఉన్నవాడుకనుకే అలా చేశాడు
నాగేశ్వర రావు జీవితం లో అన్నీ పొందాడు అన్నీ సాధించాడు .సంత్రుప్తికర నిండు జీవితాన్ని ,సార్ధక జీవితాన్ని గడిపాడు .దేవుడి పై నమ్మకం లేక పోయినా నట దేవుడు అని పించుకొన్నాడు .అతనకు ఒక విజ్ఞాన సర్వస్వం అని పించాడు .జీవిత విలువలకు నడవడికి ,నటనా విశ్వ రూపానికి ఒక విశ్వ విద్యాలయమే అయ్యాడు .అక్కినేని నట వారసులు ఉన్నా అన్నిటా నాగేశ్వర రావు కవళికలు ,అభినయ చాతుర్యం ,ఈజ్ ఉన్న వాడు మాత్రం నాకు ఆయన మనవడు ఒక్క’’ సుమంత్’’ లోనే కనిపిస్తాయి .ఎన్ని చెప్పినా చెప్పుకున్నా తనివి తీరని చరిత్ర అక్కినేనిది . ,లక్షలాది అభిమానుల అశ్రు తర్పణం అందుకొన్న అమరజీవి .మంత్రాలు లేక పోయినా ఆ రెండు రోజులూ ఘంట సాల భగవద్గీత ను క్షణం వదలకుండా ఆయన పార్ధివ దేహం వద్ద వినిపించటం అయన అభిమాన గాయకుడికి ఇచ్చిన విశేష గౌరవం ,భగవద్గీత సారాన్ని జీవితం లో అమలు చేసి పాటించిన అక్కినేని కి ఘన నివాళి కూడా .అతని మరణాన్ని ఏమనాలి ?పార్వతిని వెతుక్కుంటూ వెళ్ళిన దేవదాసు అనాలా ,అనార్కలి తో అమరుడైన సలీం అనాలా ?బహుదూరపు బాట సారి అనాలా ?ఏది అన్నా అన్నీ సరిపోతాయి .అందుకే నేను శీర్షికను అలా పెట్టాను .
ఈ జనవరి లో ఉదయ కిరణ్ తో ప్రారంభమయి ,అంజలీదేవి ,అక్కినేని లు మరణించటం చిత్ర పరిశ్రమకుఅభిమానులకు తీరని బాధ నే కలిగించింది .ఇక ఫుల్ స్టాప్ అయితే బాగుండు .అక్కినేని అమర్ రహే .
రిపబ్లిక్ దిన శుభా కాంక్షలతో
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -26-1-14-
మహిళా మాణిక్యాలు
మహిళా మాణిక్యాలు
సాహితీ బంధువులకు –శుభ కామనలు—వివిధ రంగాలలో ప్రపంచ ప్రసిద్ధులైన మహిళల పై ఇంటర్నెట్ లో నేను రాసిన 50ఆర్టికల్స్ ను ‘’మహిళా మాణిక్యాలు ‘’పేరు తో సరసభారతి తరఫున 12వ పుస్తకం గా ముద్రించి శ్రీ జయ నామ సంవత్సర ఉగాది వేడుకలలో అంటే 30-3-2014నఆవిష్కరింప జేయాలని సంకల్పం కలిగింది . ఇందులో డొక్కాసీతమ్మ గారు ,డాక్టర్ కాకాని భావాని (అమెరికా ) ,నాట్యగురువు రత్నపాప (అమెరికా )జిల్లెళ్ళమూడి అమ్మ ,భండారు అచ్చమాంబ ,మొదటి మహిళా మార్షల్ పద్మా బందోపాధ్యాయ ,ఏం ఎస్ సుబ్బు లక్ష్మి ,సుసాన్ ఆంథోని ,లేడీ కార్పెంటర్ మొదలైన వారి పై వ్యాసాలున్నాయి .కనుక దీనికిముద్రణ ఖర్చులు భరించే వదాన్యులైన దాతలెవరైనా ముందుకు వచ్చి స్పాన్సర్ గా ఉంటె సంతోషం తో స్వాగతిస్తున్నాము .ఒక వేళఅంతా ఒక్కరే భరించ లేక పోతే ఇద్దరు ముగ్గురు ఉన్నా స్వాగతమే .వీరి స్పాన్సర్ షిప్ ను పుస్తకం లో ప్రచురిస్తాము .అదీ కాక పోతే rs.500రూపాయలు ,అంతకంటే పైగా విరాళం ఇచ్చే దాతల పేర్ల ను పుస్తకం లో ప్రచురిస్తాము .ఈ అవకాశాన్ని అందరూ వినియోగించుకొని ముందుకు వచ్చి సహకరించవలసినదిగా అభ్యర్దిస్తున్నాము .మీ స్పందనే మాకు ప్రోత్సాహం ..ఫిబ్రవరి నెలాఖరు లోపల మీ స్పందన తెలియ జేయ వలసిందిగా కోరుతూ –మీ దుర్గా ప్రసాద్
26.01.2014
ఈ ఉదయం ”మహిళా మాణిక్యాలు ”పుస్తకం పై నేను చేసిన అపీల్ కు కొన్ని గంటలలోనే స్పందించి ఆ పుస్తకానికి తానే పూర్తిగా స్పాన్సర్ గా ఉంటానని ఫోన్ లో చెప్పి నన్ను ప్రోత్సహించారు నా ఆత్మీయులు ,సరసభారతికి అత్యంత సన్నిహితులు మా కుటుంబానికి ఆప్తులు అమెరికా లొఉంటున్న మా ఉయ్యూరు వాసి అయిన శ్రీ మైనేని గోపాల కృష్ణ గారు ..వారి సద్యొస్పన్దనకు కృతజ్ఞతలు . కనుక ఈ పుస్తకానికి ఇంక ఎవరూ స్పాన్సర్ గా ముందుకు రానవసరం లేదని మనవి చేసుకొంటున్నాను .
ఇంకా మమ్మల్ని,, సరసభరతిని ప్రొత్సహించాలను కొన్నవారు, స్పాన్సర్ గాఉండా లనుకొనె వారుంటే- నేను ఇంటర్నెట్ లో రాసిన 50ఎపిసోడ్ ల ”ఊసుల్లో ఉయ్యూరు ”ఉంది . మీ అందరి ప్రోత్సాహం ఉంటె దీన్ని కూడా పుస్తక రూపం లో వెలుగు లోకి తీసుకొని రావటానికి ప్రయత్నం చేస్తాను . మీ స్పందనతెలియ జేయగలరు
ఇలాంటి వదాన్యుల సహకారం తోనే సరసభరతి ఉత్తమ సాహిత్యాన్ని వెలువరిస్తొన్దని విజ్ఞప్తి చేస్తున్నాను ఈ ప్రోత్సాహమే మాకు కొండంత అండ అదే మన సరసభారతిప్రగతికి ముఖ్య కారణం అని విన్న విస్తూ-సెలవ్ -మీ దుర్గా ప్రసాద్
—
సినీ అస్టావధాని ‘’బహు ‘’మతి-భానుమతి
సినీ అస్టావధాని ‘’బహు ‘’మతి-భానుమతి
ఆ మాటలో వెటకారం మనసులో నిర్మలత్వం అభినయం లో శిఖరారోహణ హాస్యం లో అద్వితీయం సంగీతం లో సరస్వతీయం ,హాస్య సాహిత్యం లో సమర్ధత్వం, దర్శకత్వం లో అసామాన్యం ,ఆవకాయ పెట్టినా అత్తగార్ని ఝాడించినా అన్నిటా ఆమెకు ఆమే సాటి .జ్యోతిషం ,వేదాంతాల లోతులు తరచింది .బహుముఖీనప్రజ్నకు ‘’బహు’’ మతి శ్రీమతి పాలువాయి భానుమతి .తెలుగు వారి కి గర్వకారణం .
భానుమతి 1925 సెప్టెంబర్ 7నబొమ్మరాజు వెంకట సుబ్బయ్య సర స్వతమ్మ దంపతులకు ప్రకాశం జిల్లా ఒంగోలుకు దగ్గర దొడ్డవరం గ్రామంలో మూడవ సంతానం గా జన్మించింది .తండ్రి కి కర్నాటక సంగీతం లో మంచి ప్రావీణ్యం ఉండేది .కూతురు భానుమతిని తనతో బాటు కచేరీలకు తీసుకొని వెళ్లి ఆమెకు సంగీతం లో అభిరుచి కల్గించాడు .క్రమం గా సినిమా పై ద్రుష్టి పడింది .తెలుగు తామిళాలలో రెండు వందల సినిమాలలో నటించి,పాడి రచన సంగీత దర్శకత్వం దర్శకత్వం చేసి ‘’అష్టావధాని ‘’అని పించుకుంది .భరణి స్టూడియో నిర్మించింది .
1939లో వరవిక్రయం సినిమాలో కాళిందిగా నటించి సి.పుల్లయ్య దర్శకత్వం లో తెరంగేట్రం చేసింది భానుమతి మాలతీ మాధవం ,ధర్మ పత్ని,భక్తిమాల చిత్రాలలో నటించింది . కృష్ణ ప్రేమ సినిమాలో నిలదొక్కుకొని అందరి ద్రుష్టి ఆకర్షించింది .స్వర్గ సీమ చిత్రం ఆమె కెరీర్ ను మలుపు తిప్పి అసమాన నటిగా సుప్రతిస్టమైంది .మళ్ళీ మల్లేశ్వరి తో ఆమె నటన పరాకాష్టకు చేరింది .అందులో చిలిపితనం హాస్యం శృంగారం ,విరహం వేదన నాట్యం సెంటి మెంట్ అన్నీ సమర్ధ వంతం గా పోషించి తనకు సాటి లేరని రుజువు చేసింది. అదొక కళా ఖండం గా నిలిచి పోయింది .నాగి రెడ్డి దర్శకత్వ ప్రతిభ దేవుల పల్లి వారి సాహిత్య పరిమళం ,రాజేశ్వర రావు సంగీత దర్శకత్వ ప్రతిభ ,రామారావు నటనా వైదుష్యం ,అన్నీ సమపాళ్ళలో కుదిరి క్లాసిక్ అయింది మల్లీశ్వరి చిత్రం .చక్రపాణి సినిమాలో నవ్వుల పువ్వులే పూయించింది .అదొక ట్రెండ్ సెట్టర్ అయింది .చక్రపాణి కలల సాకారం అది .అంతస్తులు సినిమాలో ‘’ దులపర బుల్లాడా ‘’అంటూ చెడును అవినీతిని దులిపి పారేసింది .
నిర్మాత దర్శకుడు అయిన పాలువాయి రామకృష్ణ నుకృష్ణ ప్రేమ సినిమా చిత్రీకరణప్పుడు చూసి వలచి8-8-1943నవివాహం చేసుకొని భరణి కి జన్మ నిచ్చింది .కొడుకు పేరభరణి స్టూడియో నిర్మించి భరణి పిక్చర్స్ బేనర్ తో సినిమాలు నిర్మించింది ఆ జంట .ఆదర్శ దంపతులుగా వారు ఇండస్ట్రీలో వెలిగి పోయారు. రామ కృష్ణ గొప్ప దర్శకుడు .లైలా మజ్ను ,విప్రనారాయణ బాటసారి చిత్రాలు వారి ద్దరి కళా తపనకు నిలువెత్తు అద్దాలు .నాగేశ్వర రావు మజ్నూ గా చిరస్మరణీయ నటన ,లైలా గా భానుమతి ,సముద్రాల సాహిత్యం దాన్ని అమర ప్రేమ కావ్యం గా చేసింది .విప్రనారాయణ లో అక్కినేని ఆ పాత్రనే పోషిస్తే దేవ దేవి గా భాను తన నట ప్రతాపాన్ని చూపించింది .రాజేశ్వర రావు సంగీతం ,ఏ.ఏం.రాజా స్వరం ,భానుమతి మధుర గాత్రం ఆ సినిమాను ఏంతో ఎత్తున నిల బెట్టాయి
నటిస్తూనే దర్శకత్వ బాధ్యతలనూ చేబట్టి తన సమర్ధత ను నిరూపించుకోవాలనుకొని ‘’చండీ రాణి ‘’సినిమాను 1953లో తెలుగు తమిళ హిందీ భాషల్లో తీసి దర్శకత్వం నిర్వహించి తోలి మహిళా దర్శకురాలని పించుకోంది.మూడు భాషల్లో ఒకే సారి చిత్రాన్ని నిర్మించటమూ అపూర్వవిషయమే .దేనికైనా సమర్ధురాలు భానుమతి ఆమెది కుశాగ్ర బుద్ధి .తమిళనాడు ముఖ్యమంత్రి అన్నా దొరై భానుమతికి Nadippukku Ilakkanam” ‘’నటనకు వ్యాకరణం ‘’ అనే బిరుదు ప్రదానం చేశాడు .నట శిరోమణి జెమిని గనేషన్ ,తమిళ నాడు మాజీ ముఖ్యమంత్రి ,వందలాది సినిమాల హీరో ఏం జి.రామ చంద్రన్ భానుమతి తో సినిమాలలో నటిస్తూ సెట్ మీద ఆమె లోని అసమాన ప్రతిభకు ,ఆమె సాహసానికి ,ధైర్యానికి పెర్ఫెక్షన్ కు అబ్బురపడటమే కాదు ఆమె అంటే భయ పడేవారు కూడా .తెలుగు అగ్ర శ్రేణి నటులందరూ ఆమె తో నటించారు భానుమతి తమ గురువు అన్నారు అక్కినేనినందమూరి .చాలా రిజర్వేడ్ గా ఉండేది .ఎక్కడా సభ్యతా సంస్కారాలకు తేడా ఒచ్చినా సహించేదికాదు.అదే ఆమె గొప్ప తనం అందుకే అందరికీ అభిమానం .నటనకు చిరునామా గా ,సభ్యతకు పర్యాయ పదం గా ,భక్తికి పరాకాష్టగా ,ఆప్యాయతకు మరో పేరుగా స్నేహానికి ,ఆదరణకు పెట్టింది పేరుగా ఉండేది
ఒక సారి అంతస్తులు సినిమా షూటింగ్ అప్పుడు భానుమతికి హైదరాబాద్ లో రిట్జ్ కార్లతాన్ లో సూట్ బుక్ చేశాడు దర్శకుడు వి.బి.రాజేంద్ర ప్రసాద్ .ఆమె అంతఖర్చు నిర్మాత మీద పెట్టటం భావ్యం కాదని సారధిస్టూడియో లోనే ఉన్నది అక్కడ పాములు తిరిగేవి .రాత్రి పడుకొంటే ఎలుకలు వేలి గోళ్ళు కొరికాయి .ఉదయాన్నే రాజేంద్ర ప్రసాద్ వచ్చి అయోడిన్ రాయించి షూటింగ్ కేన్సిల్ చేద్దామా అని అడిగాడు .’’చిన్న చిన్న విషయాలకే షూటింగ్ కేన్సిల్ చేస్తే నేను భానుమతిని ఎలా అవుతాను “’?అని చెప్పి యదా ప్రకారం చిత్రీకరణలో పాల్గొన్న సాహస చండీ రాణి భాను .1985భర్త రామ కృష్ణ మరణించారు .అయినా మొక్కవోని ధైర్యం తో తన కార్యక్రమాలను యదా ప్రకారం కోన సాగించిన ధీర వనిత .
తెలుగు చిత్ర పరిశ్రమ లో అద్వితీయ నటనకు భానుమతి పేరు పొందింది .అందం చందం అభినయం చందమామ లాంటి గుండ్రని ముఖం కాణీ కాసంత కుంకుమ బొట్టు ఒంటి నిండా చీర తో భానుమతి సాక్షాత్తు అపర సరస్వతి గా భాసించేది భాను తేజం ఆమె లో ఉండేది .ఆమెను చూసి తల దిన్చుకొన్న వారే కాని తాల ఎత్తుకొన్న వారుండేవారు కాదు .అగ్ర నటులకూ ఆమె అంటే హడల్ .నటనకు పెద్ద బాల శిక్ష గా ఉండేది .సంగీతానికి సరస్వతి అనిపించేది దర్శకత్వానికి దార్శనికురాలని పించేది .నిర్మాణానికి సమర్దురాలని పించేది .ఇన్ని విషయాలు ఆమెలో దాగి ఉండి అవసరమైనప్పుడు వెలువడి ప్రతిభ ను వ్యక్తం చేసేవి .కర్నాటక ,హిందూ స్తాని సంగీతాలలో ఆమె నిష్ణాతురాలని పించుకోన్నది .నటికి బాల గ్రౌండ్ పాట పాడే వారు వేరుగా ఉండేవారు .కాని భానుమతి నటిస్తుంటే తన పాట తానె పాడుకొనేది .అదీ ఆమె ప్రత్యేకత .అలాకాక పొతే నటించేదే కాదు .హీరోయిన్ గా చేసినా కేరక్టర్ యాక్టర్ గా ఉన్నా చిత్రం లో ఆమెదే సింహ భాగం .భానుమతి పాడిన ‘’పిల చినా బిగువటరా ‘’,కిలకిల నవ్వులు ‘’ప్రేమే నేరమౌనా ,’’ ఎంత హాయి ఈ రేయి నిండెనో “’కోతీ బావాకు పెళ్ళంటా ‘’,జయదేవుని అష్ట పదులు అన్నీ రసగుళికలే .ఆపాత మధురాలే .మళ్ళీ మళ్ళీ వినాలని పించేవే .ఎన్ని సార్లు విన్నా తనివి తీరనివే .’’భక్త మార్కండేయ’’ చిత్రాన్ని అందరూ బాలలతో తీసి సంచలనం సృష్టించింది భానుమతి .పల్నాటి యుద్ధం లో బ్రహ్మనాయుడు పాత్ర రామా రావు తో నాగమ్మ పాత్ర లో భానుమతి అత్యద్భుతం గా నటించి అవార్డ్ పొందింది .రామినీడు దర్శకత్వ ప్రతిభ కు అది దర్పణంఆమె పాడిన ”ఒహొహొ పావురమా ”ఇంకా చెవుల్లో రింగు మంటూనే ఉంది .ఱజనీ కాంత రావు తో పాడిన పాటలూ మధురాలేభానుమతి చిత్రం తో తపాలా బిళ్ళ ను కేంద్ర ప్రభుత్వం వెలువరించింది అమె తో బాటు అదేసమయం లో రామా రావు ,రంగారావు పేరా విడుదల చేసి ముగ్గురికీ గౌరవం కల్పించారు
భానుమతికి అనేక సంస్థల తో అనుబంధం ఉండేది .రాష్ట్ర ఫిలిం అవార్డ్ కమిటీ సభ్యురాలుగా రెండేళ్ళు ఉంది .ఫిలిం ఇన్స్టిట్యూట్ కు విజిటింగ్ ప్రొఫెసర్ గా ఒక ఏడాది పని చేసింది .బాలల చలన చిత్రోత్సవ కమిటీ కి అయిదేళ్ళు సభ్యురాలుగా 1965-70లో ఉన్నది .
భానుమతి ఎన్నో కధలు రాసింది .అందులో హాస్యం అడుగడుగునా పండించింది .అత్తగారి ని అడ్డం పెట్టుకొని ఎంతో సాహిత్యాన్ని సృష్టించి సృజనాత్మక రచనకు సరిరారు తనకేవ్వరూ అని పించింది .’’నాలో నేను ‘’అనే స్వీయ జీవిత చరిత్రను భానుమతి రాసుకొన్నది .దీనినే ఇంగ్లీష్ లో ‘’మ్యూజింగ్స్ ‘’గా అనువాదం చేసి ప్రచురించారు భానుమతి ‘’అత్త గారి కధలు ‘’కు రాష్ట్ర సాహిత్య అకాడెమి పురస్కారం లభించింది .ఆంద్ర రాష్ట్ర లలిత కళా ఆకడేమికి అయిదేళ్ళు సాహిత్య అకాడేమికి పదేళ్ళు సభ్యురాలుగా సేవలందించింది .తమిళనాడు ప్రభుత్వ సంగీత కళా శాలకు ప్రిన్సిపాల్ గా డైరెక్టర్ గా నియమించి గౌరవించింది .
అనేక సాంఘిక సేవా సంస్థలతో భానుమతికి ప్రత్యెక స్థానం ఉండేది .చికాగో కి చెందినా ‘’ఆల్ ట్రూసా ఇంటర్నేషనల్ సంస్థ’’కు ప్రారంభం నుంచి (1963)జీవితాంతం వరకు సభ్యురాలు . ఇంటర్నేషనల్ రెడ్ క్రాస్ సొసైటీ లో జీవిత సభ్యురాలు .చెన్నై లో సాలిగ్రాం లో ‘’డాక్టర్ భానుమతీ రామ కృష్ణ మెట్రిక్ స్కూల్ ‘’ను స్థాపించి పేదలకు ఉచిత విద్యా సౌకర్యం కలిపించింది
భానుమతికి 1966లో పద్మశ్రీ ,2003లో పద్మ భూషణ్ లను కేంద్ర ప్రభుత్వం ప్రదానం చేసి ఆమె సమర్ధతకు తగిన ట్లు గౌరవించింది .అంతస్తులు ,పల్నాటి యుద్ధం చిత్రాలలో అసమాన నటనకు రాష్ట్రపతి అవార్డ్ లు పొందింది .’’నాలో నేను ‘’అనే స్వీయ చరిత్రకు 1964లో ప్రభుత్వ జాతీయ ఉత్తమ రచనా పురస్కారం అందుకొన్నది .రఘుపతి వెంకయ్య పురస్కారం నందీ పురస్కారం యెన్.టి రామారావు జాతీయ పురస్కారాలను పొందింది .తమిళనాడు ప్రభుత్వం ‘’కలైమణి’’ప్రదానం చేసింది .ఆంధ్ర విశ్వవిద్యాలయం కళా ప్రపూర్ణ ఇచ్చి సత్కరిస్తే వెంకటేశ్వర విశ్వ విద్యాలయం గౌరవ డాక్టరేట్ ప్రదానం చేసింది .రాజ లక్ష్మీ ఫౌండేషన్ పురస్కారం ఆమెను వరించింది .1956లో ఆంద్ర ప్రదేశ్ అవతరణ జరిగినప్పుడు భానుమతిని ప్రత్యెక ఆహ్వానితురాలిగా ప్రభుత్వం ఆహ్వానించి సత్కరించి గౌరవించింది .ఇలాగౌర్వం పొందిన తోలి నటి ఆమెయే .శృంగేరి శారదా పీఠాదిపతులు జగద్గురువులు శ్రీ అభినవ విద్యా తీర్ధ స్వామి భానుమతికి ‘’శ్రీ విద్యా ఉపాసక ‘’బిరుదును నలభై ఏళ్ళ క్రితమే ప్రదానం చేశారు .అంతటి ఉపాసకురాలు భానుమతి .
తెనాలి రామకృష్ణ ,బొబ్బిలియుద్ధం ,చింతామణి ,అనురాగం ,వివాహ బంధం తోడూ నీడ గృహలక్ష్మి మట్టిలో మాణిక్యం ,విచిత్ర వివాహం అమ్మాయి పెళ్లి ,మంగమ్మ గారి మనవడు ,బామ్మ మాట బంగారు బాట చిత్రాలలో భానుమతి నటనకు సంగీత మాధుర్యానికి ,పరవశించి పోతాం .కారణ జన్మురాలు భానుమతి .భానుమతి నటన అంటే ,గానం అంటే ఉవ్వ్విళ్ళూరి ,ఆరాధించే వారిలో సర్వేపల్లి రాధాకృష్ణన్ బేజ వాడ గోపాల రెడ్డి ,రాజమన్నార్,కొడవటి గంటి కుటుంబరావు చక్రపాణి మొదలైన ప్రముఖులెందరో ఉన్నారు
ఉయ్యూరు దగ్గర తోట్ల వల్లూరు లో శివలెంక బసవయ్య గారి శివాలయం లో ప్రతియేడు జరిగే మూడు రోజుల శివరాత్రి ఉత్సవాలకు భానుమతి స్వయం గా వచ్చి ‘’అయ్యగారు’’ అని అందరి చేతా పిలువ బడే బసవయ్య గారి ని సందర్శించి ఆశీస్సులు పొంది వెళ్ళేది . 2005డిసెంబర్ 24న 80వ ఏట ఆ సంగీత ,సాహిత్య,నట సరస్వతి సత్యలోకం చేరింది
మేము రెండవ సారి 2005నవంబర్ లో అమెరికాకు మా అమ్మాయి విజయ లక్ష్మి వాళ్ళింటికి వెళ్లాం .భానుమతి చని పోవటానికి ఒక వారం రోజుల క్రితం ఆవిడ మా ఆవిడ ప్రభావతికి కలలోఉయ్యూరు లో మా ఇంట్లో ఉత్తరం వైపు నుంచి వచ్చి దక్షిణం వైపుకు వెడుతూ తెల్ల జరీ యెర్ర బార్డర్ పట్టు చీరే తో నుదుట నిలువు బొట్టు తో’కనిపించి ’ ‘’వెళ్ళొస్తానని చెప్పటానికి వచ్చాను ‘’అన్నదట .ఈ విషయం భానుమతి మరణ వార్తను చెప్పగా జ్ఞాపకం చేసుకోంది.భానుమతి పాటన్నా మాటన్నా నటన అన్నా మా ఇద్దరికీ విపరీతమైన ఇష్టం .మాటల్లో చెప్పలేనంత అభిమానం .అందుకే కలలో కనిపించింది అనుకొన్నాం .
.భారతీయ చలన చిత్ర బహుముఖ ప్రజ్ఞా రాణి ,స్వర్ణకంకణ దారిణి,బహుకళా భారతి ,ధీరతి ,అష్టావధాని భానుమతి .
మీ -గబ్బిట దుర్గా ప్రసాద్ -25-1-14-ఉయ్యూరు
గురువులకు గురువు -దేవీ స్వరూపిణి ఆనందమయీ మా
గురువులకు గురువు -దేవీ స్వరూపిణి ఆనందమయీ మా
ఆమె సన్నిధే దైవ సన్నిధి .ఆమె సమక్షం ఆనంద రసప్లావితం .ఆమె వాక్కు పరావాక్కు . ఆమె గురువులకు గురువు అని పించు కొన్న దైవీ స్వరూపిణి అయిన ఆనందమాయీ మాత .అసలు పేరు నిర్మలా సుందరి .తూర్పు బెంగాల్ లో ఖొరా లో 1896లో ఏప్రిల్ 30న సంప్రదాయ కుటుంబం లో జన్మించింది .పసి తనం లో నే ముసి ముసి నవ్వులతో ముంచేసేది. అందుకే ‘’నవ్వ్వుల తల్లి ‘’అని ‘’సంతోషీ మా’’ అని పిలిచేవారు .పుట్టిన తర్వాత యేడవనే లేదు ,పరమ ప్రశాంతం గా ఉండేది .ఎప్పుడూ సమాధి స్తితిలో ఉన్నట్లు కనిపించేది .ప్రక్రుతి సౌందర్యానికి పరవశించేది .మాంసం చేపలు తినేదికాదు .ప్రతి పని అతి శ్రద్ధగా సంపూర్ణం గా చేసేది
ఆనందమయి కి పదమూడవ ఏట భోలానాద అనే యోగ్యునికిచ్చి వివాహం చేశారు .అనేక తాత్కాలిక ఉద్యోగాలు చేస్తూ అనేక ఊర్లు తిరిగేవాడాయన .ఆయన బంధువులలోనూ ఈమె అణకువ ,సంతోషం ఉన్న స్త్రీ గా పేరు తెచ్చుకోంది.పద్దెనిమిదవ ఏట అస్టగ్రామానికి లో భర్త తో కాపురానికి వెళ్ళింది .ఆమె తో దాంపత్య సుఖానికి ప్రయత్నిస్తే భర్తకు కరెంట్ షాక్ కొట్టినట్లయింది .ఇంకా వ్యక్తిత్వం రాలేదని సరి పెట్టుకున్నాడు .ఆమె దైవీ స్వరూపం అని గ్రామస్తులు భావించారు .పూజలో భజనలో ఆమె యిట్టె సమాధి స్తితికి వెళ్ళేది .
1916లో ఆరోగ్యం బాగుండక తలిదండ్రుల దగ్గరకు వెళ్ళింది .ఆరోగ్యం కుదుటపడిన రెండేళ్లకు మళ్ళీ భర్తను చేరింది .అంతకు ముందెన్నడూ వినని చదవని వేదం మంత్రాలు ఆమె నోటి నుండి ఆశువుగా వచ్చేసేవి .విన్న వారందరూ ఆశ్చర్యం ఆనందం పొందే వారు .అతి తేలికగా హఠ యోగం చేసేది .అప్పుడు ఆమెకు ‘’నువ్వే అన్నీ .నువ్వే శక్తివి ‘’అన్న అంతర్వాణి విని పించింది .తాను ఈ అనంతశక్తిలో ఒక శకలం అన్న భావన కలిగింది .ఇదొక శక్తి ప్రవాహం గా ఆమెకు సహకరించి ఎందరో రోగగ్రస్తుల కు వరమై స్పర్శ చేతనే వ్యాధులను నయం చేసింది .నిరంతరం వేద మంత్రాలు నాలుకచివర నుండి పలికేవి .
1922 ఆగస్ట్ మూడు న ఆంతరంగిక ప్రేరణ తో గురువు శిష్యుడు తానే అయి బీజాక్షరాలను అకస్మాత్తుగా పలికింది .ఆమె భర్తకంటే తాను కొంత ఉత్కృష్ట స్తితి లో ఉన్నట్లు గ్రహించింది .అయిదు నెలల తర్వాత భర్తకే మంత్రోపదేశం చేసి ప్రత్యక్ష గురువే అయింది .అతన్ని రెండు గంటలు సమాధి స్తితిలో ఉండేట్లు చేసింది .అప్పుడు భర్త భోలా నాద కు తాను పూర్ణ బ్రహ్మ నారాయణుడినని ,దైవాన్ని అని ఎరుక కలిగింది .అపుడు ఆయన లో ‘’ఇంతకీ ఈమె ఎవరు ?’’అనే జిజ్ఞాస కలిగింది .ఆమె లో దైవీ శక్తులు కేంద్రీకరించి ఉన్నాయని గ్రహించాడు .ఆమె క్రమం గా ఆహారం నిద్రలకు దూరమవుతోంది .మా మూడేళ్ళు పూర్తీ మౌనం గా ఉండి పోయింది .కుటుంబం ఢక్కా లోని షాభాగ్ గార్డెన్స్ కు మారింది .ఒక్కోసారి పన్నెండు గంటలు సమాదిలోనే ఉండి పోయేది మా .ఆమె లో అద్భుత మైన కాంతి పుంజం గోచరించేది. నిర్వికల్ప సమాధిలో ఉండిపోయేది .
ఢక్కా దగ్గర సిద్దేశ్వరిలో ఉన్న పురాతన కాళికా దేవాలయానికి ఒక సారి వెళ్ళింది .అక్కడే చిన్న ఆశ్రమాన్ని ఏర్పరచుకొని రాత్రిళ్ళు గడిపేది .1924 -28వరకు ఇక్కడే మా ఉండి పోయింది .అనుచరులేర్పడ్డారు .డజనుకు పైగా చోట్ల ఆశ్రమాలేర్పరచారు .1925లో మౌనాన్ని వదిలి సంభాషించటం మొదలు పెట్టింది .ఆమె ను దర్శిస్తే దివ్యానుభూతి కలుగుతుందనే అభిప్రాయం బాగా వ్యాపించింది .హిందూ ముస్లిం క్రిస్తియన్లు కూడా అదే అనుభవాన్ని పొందేవారు .కాళీ దేవికి నిత్య పూజాదికాలు చేయాబోతు పూలు తన శిరస్సునే ఉంచుకోవటం ,అమ్మవారికి పూయాల్సిన చందనాన్ని తానే పూసుకోవటం పరవశ స్తితి లో చేసేది .వేలాది మంది చేరేవారు .వారూ అదే పరవశాన్ని అనుభవించేవారు .అందరి కస్టాలు తనవిగా భావించి తనలో ఆపాదిన్చుకోనేది.అప్పుడు అందరూ ఆమెను ‘’ఆనంద మయీ మా ‘’.అని కీర్తించటం ప్రారంభించారు. ఆ పేరే స్తిర పడింది .భోలానాద్ ను’’ భాయీజీ ‘’ అని ఆప్యాయం గా పిలిచేవారు .ప్రార్ధన గీతాలను పారవశ్యం గా పాడి అందరిని భక్తీ లో ఓలలాడించటం మా ప్రత్యేకత .ఈ సమయం లో ఆమె శరీరం లో అనేక వింత మార్పులు గోచరించేవి .భూమి మీద పడుకోన్నప్పుడు శరీరం విపరీతమైన పొడవు పెరిగేది .,లేక పోతే అతి చిన్నదిగా కుంచించుకునేది .ఇంకోసారి రబ్బర్ బంతిలా గుండ్రం గా అయ్యేది .ఇవన్నీ మేరపు వేగంతో జరిగిపోయేవి .మరోసారి మధ్యాహ్నం నుండి సాయం సంధ్య వరకూ విపరీతం గా ఏడుస్తూ కూర్చునేది . .సిద్దేశ్వరిలో ఒకసారి ఆమె శరీరం ఉన్నట్టుండి సంకోచించి క్షణాల్లో అదృశ్యమై,చీరలో ఒక చిన్న ముక్క మాత్రమె మిగిల్చింది .అంతే వేగం తో యదార్ధ స్తితి పొందింది .


1924లో ఆహారం తీసుకొనే శక్తినే కోల్పోయింది .ఒక భక్తురాలే తినిపించేది .అనేక గంటలు రోజులు ఉపవాసం ఉండేది ఆరు నెలలు రోజుకు ఆరుగింజలు మాత్రమె తిన్నది .చెట్టునుండి రాలిన పండ్లను ఒకటో రెండో తినేది . ఎనిమిది నెలలు మధ్యాహ్నం రాత్రి మూడేసి ముద్దలు మాత్రమే తినేది .అయిదు నెలలు వారానికి రెండు సార్లే అన్నం ముద్దలు తినేది .డాక్టర్ శశాంక మోహన ముఖోపాధ్యాయ ఆయన కూతురు ఖుక్ని మాతకు శిష్యులై ఆన్తరంగికులైనారు .గురుప్రియ దేవిగా మారిన ఖుక్ని మా పై పదిహేడు గ్రంధాలను బెంగాలీ భాషలో ,పందొమ్మిది గ్రంధాలను హిందీ లో రాసి ఆనందమాయీ మా లీలా విభూతిని ప్రపంచానికి చాటింది .1950లో శిష్యులు ‘’శ్రీ శ్రీ ఆనందమయీ సంఘం ‘’ఏర్పరచారు .మా పర్యటనలు జరుపుతూ వేదాంత విషయాలను బోధించేది .1926లో ఉత్తర ,మధ్య భారతాన్నంతా తిరిగి జ్ఞాన బోధ చేసింది .1927లో కాశీ ప్రయాగ రుషీకేష్ మొదలైన పుణ్యక్షేత్ర సందర్శనం శిష్యులతో సహా చేసింది .ఉత్తర ప్రదేశ్ లో వింధ్యాచలం లో ఒక ఆశ్రమాన్ని స్తాపించింది .వారణాసి లో మహా మహోపాధ్యాయ గోపీ నాద కవిరాజ్ ను కలిసింది .ఆయన వెంటనే శిష్య పరమాణువైనాడు . ఆమేలో భగవత్ ప్రేరణ కలిగింది .దీన్ని ‘’ఖేయాల ‘’అన్నారు .ఆమె 36వ పుట్టిన రోజు వేడుకలను ఇరవై ఒక్కరోజులు ఘనం గా నిర్వహించారు భార్యా భర్తలు డేహ్రా డూన్ చేరి కొన్ని రోజులున్నారు .1934లో సిమ్లా కు వెళ్ళగా రాజు దుర్గా సింగ్ శిష్యుడైనాడు అక్కడ ఆనందమాయీ సంఘాన్ని స్తాపించారు .నెహ్రు భార్య కమలా నెహ్రు మా ను దర్శించి అనుభూతి చెందింది .1936లో పురుష సహకారం లేకుండా ఉత్తరభారత సందర్శనం చేసింది .టిబెట్ లోని శివ ధామం కైలాస శిఖరాన్ని సందర్శించింది
1938మే నెల ఏడవతేది మా భర్త భోలా నాద కు మసూచికం సోకి చని పోయాడు .అమ్మ శక్తి ప్రభావానికి అందరూ లోనయ్యారు .పెద్ద వాళ్ళను అమ్మా నాన్నా అని పిల్లలను బిడ్డలారా స్నేహితులారా అనీ సంబోధించేది .ఆస్ట్రేలియాకు చెందిన ప్రుముఖుడొకడు వచ్చి అమ్మ ప్రభావం చూసి అంతే వాసి అయ్యాడు .’’అంతా ఆయనదే నీది నాదీ ఏమీలేదు ‘’అని అందరికీ చెప్పేది మా .’’విచారం వద్దు సంతోషం గా ఉండండి ‘’అని బోధించేది .జీవితాన్ని దైవ లీల గా భావించేది .1974ఆగస్ట్ 27న మా మహాసమాధి చెందింది .పరమ హంస యోగా నంద మా జీవిత చరిత్ర’’ఒక యోగి ఆత్మ కద ‘’పేర రాశారు వారణాసి లో పేదలకు ఉచిత వైద్య సేవ లన్దించటా నికి ఒక హాస్పిటల్ ను నిర్మించారు విద్యా సంస్థలను ఏర్పరచి ఉచిత విద్య బోధిస్తున్నారు . మధ్య ప్రదేశ్ లో ఓంకారేశ్వర్ దగ్గర ట్రై బల్స్ కోసం ఒక ఉచిత విద్యాకెన్ద్రాన్ని ఏర్పరచి వారి సర్వతొముఖాభి వృద్ధికి కృషి చేస్తున్నారు ఇలా మాపేరఎన్నో సే వాకార్యక్రమలను అందిస్తూ ప్రజా పురోగతికి తోడ్పడుతున్నారు
‘’మీ బాధలూ విచారాలు నాకు తెలుసు .ఒకే ఒక ఆత్మ ఉంది నువ్వు నేను ఆ ఆత్మా లమే.మీరేవ్వరో నేనూ మీ లాంటి దానినే .ఒకే ఒక చిదానందం యొక్క రూపాలే మీరూ నేనూ .ఈ చిన్న పిల్ల ఎప్పుడూ మీతోనే ఉంటుంది .’’అని మా బోధనలో సారాంశం .మా పై దాదాపు ఇరవై పుస్తకాలు వెలువడి ఆమె భావ వ్యాప్తికి తోడ్పడ్డాయి .
మీ- గబ్బిట దుర్గా ప్రసాద్ -26-1-14-ఉయ్యూరు
వాయుసేన లో మొదటి మహిళా మార్షల్ -పద్మావతి బందో పాధ్యాయ
వాయుసేన లో మొదటి మహిళా మార్షల్ -పద్మావతి బందో పాధ్యాయ
తిరుపతిలో జన్మించి మెడిసిన్ లో డిప్లమా డిఫెన్స్ సైన్స్ లో ఉన్నత విద్యా పొందిన పద్మా గంగోపాధ్యాయ ఏం డి సాధించింది ఆర్మేడ్ ఫోర్స్ మెడికల్ సైన్స్ లో ఉద్యోగం ఆరంభించి,ఆర్కెటిక్ ఖండం పరిశోధనా బృందం లో పరిశోధన చేసింది .బెంగళూర్ యూని వర్సిటి లో ఏవియేషన్ మెడిసిన్ లో అసోసియేట్ ప్రొఫెసర్ గా చేరి అనేక ఉన్నత స్తానాలు పొందింది .
ఏయిరో మెడిసిన్ సోఅసైటీ ఆఫ్ ఇండియా ,ఇంటర్నేషనల్ మెడికల్ సైన్సెస్ అకాడెమి మొదలైన సంస్థలలో గౌరవ సభ్యత్వంపొందింది .న్యూయార్క్ అకాడెమి ఆఫ్ సైన్సెస్ గౌరవ పురస్కార గ్రహీత పద్మ .విశిష్ట సేవా మెడల్ , A.F.W.W.A..అవార్డు ను పొందింది .డిఫెన్స్ సర్వీసేస్ స్టాఫ్ కాలేజి లో ఉన్నత విద్య లో ప్రధమ శ్రేణి లో పాస్ అయి ఆర్మీ మెడికల్ కాలేజి సైనిక ఉద్యోగం లో చేరిన మొదటి మహిళ మన పద్మా బందో పాధ్యాయ . 1981లో వాయు సేవా దళం లో విశిస్టసేవలందించిన ఉద్యోగిని గా అపూర్వ సత్కారం అందుకోంది పద్మ .దేశ విదేశీ ప్రసిద్ధ మెడికల్ జర్నల్స్ కు పాతిక పైగా పరిశోధనా వ్యాసాలను రాసి ప్రచురించిన విశిష్ట మహిళా శాస్త్రజ్ఞురాలు పద్మ.
కీర్తి శిఖరాలు
1971లో ఇండియా –పాకిస్తాన్ యుద్ధం లో ధైర్య సాహసాలతో సేవ లందిన్చినందుకు పద్మ కు విశిష్ట సేవా పథకం ఇచ్చి ప్రభుత్వం గౌరవించింది .భారతీయ ఏయిరో స్పేస్ సొసైటీ మొదటి ఉమన్ ఫెలో గా గౌరవం పొందింది .ఉత్తర ధ్రువ ప్రాంతం లో పరిశోధనలు నిర్వహించిన తోలి మహిళా గా పద్మ గుర్తింపు పొందింది .డిఫెన్స్ సర్విస్ స్టాఫ్ కాలేజి లో చదివి1978లో కోర్సు పూర్తీ చేసిన తోలి మహిళా పద్మ .సెంట్రల్ మెడికల్ ఎస్టాబ్లిష్ మెంట్ను కమాండ్ చేసింది .భారతీయ వాయుసేనలో పని చేసే మహిళలలో మొదటి సారిగా ఎయిర్ వైస్ మార్షల్ గా పదోన్నతి పొందిన మొదటి మహిళా ఆఫీసర్ పద్మప్రపంచ వాయుసేన లో వైస్ మార్షల్ అయిన తోలి మహిళ పద్మ .ఆర్మడ్ ఫోర్సెస్ కు అడిషనల్ డైరెక్టర్ డైరెక్టర్ అయి , తర్వాత మెడికల్ బ్రాంచ్ లో ఎయిర్ చీఫ్ మార్షల్ గా 2004అక్టోబర్ ఒకటి న ప్రమోషన్ పొంది ప్రపంచం లోనే మొదటి మహిళా ఏర్ మార్షల్ గా మహిళా లోకానికి గర్వ కారణం గా నిలిచి ,మహిళలు రక్షణ సంస్థలోనూ అపూర్వ మైన ప్రజ్ఞా పాటవాలను ప్రదర్శించ గలరు అని రుజువు చేసింది .తనతో పాటు పని చేస్తున్న వాయుసేనాదికారి ఎస్.యెన్ బందో పాధ్యాయను వివాహమాడింది
జననం –విద్య –డాక్టర్ .
1944 నవంబర్ నాలుగున పద్మస్వామినాధన్ అలమేలు దంపతులకు కుమార్తె గా పద్మ తిరుపతి లో జన్మించింది ,తలి తరచుగా జబ్బుపడి హాస్పిటల్ పాలై అక్కడే జీవితకాలమంతా గడపటం చూసి డాక్టర్ కావాలని ,తన అమ్మ లాంటి వారికి సేవ చేయాలనే కోరిక బలం గా కలిగింది . ధిల్లీ లో కిరణ్ మాలి కాలేజి లో ప్రి మెడికల్ చదివింది . పూనా లో మెడికల్ కాలేజి ఏర్పడినప్పుడు దానికి ప్రవేశ పరీక్ష రాసిన మొదటి బాచ్ అమ్మాయి గా గుర్తింపు పొందింది .అంత దూరం పంపి హాస్టల్ లో చేర్చి అయిదేళ్ళు చదివించటం తలిదండ్రులకు ఇష్టం లేకపోవటం తో చేరలేదు .కాని బి బాచ్ లో చేరటానికి వారిని ఒప్పించి A.F.M.C లో చేరింది .మెడిసిన్ లో చదివేటప్పుడు అనేక మెడల్స్ ప్రైజులూ నగదు బహుమతులు పొంది మొదటి స్థానం లో అన్నిటా నిల బడింది
వాయుసేన లో సేవ –అన్నిటా ప్రధమ స్థానం
. వాయుసేన లో చేరాలని నిర్ణయిస్తే ఆమెకు బెంగళూర్ ఎయిర్ ఫోర్స్ హాస్పిటల్ లో ఇంటర్నీ గా పుద్యోగం వచ్చింది .
ఆర్మ్ద్ఫోఫో ర్స్ మెడికల్ కాలేజి లో చేరి 1968లో ఐ.ఏ.ఎఫ్ లో కమీషన్ అయింది .కంటి చూపు మంద గించటం వలన పైలెట్ గా సేవ కుదరదని వైద్య సేవకే ప్రాధాన్యత నిచ్చింది .1975లోకొత్తగా వచ్చిన ఏవియేషన్ మెడిసిన్ కు ప్రాధాన్యతగా ఎంచుకోంది. 23.రిసెర్చ్ పేపర్లు27 ప్రచురణలతో అగ్రగామి మహిళా గా నిల బడింది .మొదటి మహిళా ఏవియేషన్ మెడిసిన్ స్పెషలిస్ట్ గా పద్మ నిలిచింది స్క్వాడ్రన్ లీడర్ పద్మ డిఫెన్స్ ఫిజియాలజీ అండ్ అల్లైడ్ సైన్సెస్ లో వింగ్ కమాండర్ అయి హై ఆ ల్టిట్యూడ్ ఏవియేషన్ లో తూర్పు పశ్చిమ హిమాలయాలలో అద్భుత పరిశోధనలు చేసింది . అంత ఎత్త్తున పని చేసే సైనికులకు వచ్చే జబ్బుల నివారణకు ఆలోచించింది భారత రాస్ట్రపతి కి మొదటి మహిళా ఆనరరి డాక్టర్ గా నియమింప బడి అన్నిటా ముందు నిల్చింది పద్మావతీ బందోపాధ్యాయ.
ఇంటర్నేషనల్ మెడికల్ సొసైటీకి న్యూయార్క్ ఎకాడమి ఆఫ్ సైన్సెస్ కు ఇండియన్ సొసైటీ ఆఫ్ ఏయిరో స్పేస్ మెడిసిన్స్ లో సభ్యురాలైంది .1989నవంబర్ నుండి నాలుగు నెలలు ఉత్తర ధ్రువ ప్రాంతం లో ఉష్ణ మండల వాసులు ఉండటానికి అనుకూలించే పరిస్తితులపై రష్యన్ ఫిజిలాలజి ప్రయోగం లో పని చేసింది .ఈ పనిలో పాల్గొన్న మొదటి భారతీయ మహిళా పద్మ .దీనికి గాను పద్మ కు అతున్నత మైన ఇందిరా ప్రియ దర్శిని అవార్డ్ ను ప్రభుత్వం అందించి సత్కరించింది .ఎయిర్ ఫోర్స్ వైవ్స్ వెల్ఫేర్ సొసైటీ పురస్కారమూ పొందింది .గ్రూప్ కెప్టెన్ గా ప్రొమోషన్ పొంది వేస్త్రెన్ కమాండ్ లోడిప్యూటీ ప్రిన్సిపల్ మెడికల్ఆఫీసర్ అయింది . కార్గిల్ యుద్ధం లో వాయు సైనికుల వైద్య అవసరాలను పర్య వేక్షించింది .2006 జూన్ 26నభారత వాయుసేనమొదటి మహిళా కమాండర్ అయి రికార్డు సృష్టించింది . ఎయిర్ ఫోర్స్ మెడికల్ యూనిట్ కమాండర్ గా గొప్ప సేవచేసింది .దీనికే 2002 జనవరి26న ప్రభుత్వం చేత విశిష్ట సేవా పతాకాన్ని పొందింది .సాహసానికి అంకిత భావానికి సేవకూ మార్గ దర్శి గా నిలిచినా మహిళా మాణిక్యం పద్మావతీ బందోపాధ్యాయ .
అమ్మ కు నిర్వచనం జిల్లెళ్ళమూడి అమ్మ
అమ్మ కు నిర్వచనం జిల్లెళ్ళమూడి అమ్మ
‘’నీ పిల్లలో ఏమి చూస్తున్నావో అందరిలో దానినే చూడటం బ్రహ్మస్తితి పొందటమే .తిధులు విధిని మార్చలేవు .పెట్టింది కాదు ,జరిగేదే ముహూర్తం .మానవుడి నడక నవగ్రహాల మీద ఆధారపడి లేదు ,రాగ ద్వేషాలు అనే రెండే రెండు గ్రహాలమీదే .జీవితం సమస్యల తోరణం , సమస్యలతో రణం .వైకల్యం లేనిదే కైవల్యం .తృప్తే ముక్తి, దిగులే జిజ్ఞాస ,తపనే తపస్సు .వర్గం లేనిదే స్వర్గం .విశ్వాసం కర్తవ్యమే భగవంతుడు .విధి వర్షం లాంటిది కొందరికి అనుకూలం కొందరికి ప్రతికూలం .ప్రేరణే దైవం .సర్వత్రా అనురాగమే విరాగం .నేను అమ్మను ,మీరు నా బిడ్డలు ‘’ఇవీ అందరికి అమ్మ అమ్మకి నిర్వచనం అయిన జిల్లెల్ల మూడి అమ్మ అభిభాషణం .చిన్న చిన్న మాటలలో ఎంత జీవిత పరమార్ధాన్ని కర్తవ్యాన్ని ,బోదొంచిందో .?సకల వేదోపనిషత్తుల సారం అంతా వీటిలో నే ఉంది .ఆప్యాయతకూ ఆత్మీయతకు ,ఆదరణకు అమ్మ మారు పెరి నిలిచింది .జిల్లెల్ల మూడి అమ్మగానే అందరికి తెలుసు .అమ్మ జీవిత విశేషాలను తెలుసుకొందాం .




బాల్యం –వివాహం
అమ్మ గుంటూరు జిల్లా పొన్నూరుకు దగ్గరలోని మన్నవ గ్రామం లో 28-3-1923న ఆఊరి కరణం మన్నవ సీతాపతి శర్మ ,రంగమ్మ లకు జన్మించింది .అనసూయమ్మ గా నామకరణం చేశారు. పసితనం గొల్ల నాగమ్మ పెంపకం లో గడిచింది .చిన్నప్పటి నుంచే అమ్మ అనేక మహిమలు చూపి అందరికి ఆశ్చర్యం కలిగించింది .తల్లి రంగమ్మ చనిపోతే అందరూ ఏడుస్తుంటే ఏడవ వద్దని అమ్మ దేవుడి దగ్గరకే వెళ్లిందని ఓదార్చింది .ఒక సారి బాపట్ల భావనారాయణ స్వామి గుడికి వెడితే పూజారి గమనించకుండా గుడి తలుపులు మూసేసి వెళ్ళిపోగా అక్కడే విచికిత్స చేసి అన్నిటికీ ఆధారం భూమి కనుక భూమి పూజ చేయాలని చెప్పింది .మర్నాడు ఉదయం పూజారి వచ్చి గుడి తలుపులు తెరవగానే అమ్మ రాజ్యలక్ష్మీ అమ్మ వారుగా దర్శన మిచ్చింది .మరో సారి ఒక పోలీసు ఉద్యోగి అమ్మ మెడలోని పులిగోరు తీసుకోవటానికి ప్రయత్నిస్తే అమ్మే తీసి ఇచ్చింది .అతను ఆశ్చర్య పడి మళ్ళీ భక్తితో అమ్మ మెడకు అలంక రించి నమస్కరించి వెళ్లి పోయాడు .అమ్మ పై అందరికీ అనంత విశ్వాసం కలిగింది ఆమెను సర్వ దేవత స్వరూపిణి గా భావించారు .పదమూడవ ఏట అమ్మకు మేనత్త కనకమ్మ గారి పెద్ద కొడుకు బ్రహ్మాండం నాగేశ్వర రావు తో 5-5-1936న బాపట్ల లో వివాహం చేశారు కాపురం బాపట్ల లో పెట్టారు .నాలుగేళ్ల తర్వాత 1940లో జిల్లెల్ల మూడి కి ఆ దంపతులు చేరి అక్కడ కాపురమున్నారు .ఆగ్రామానికి ప్రయాణ సౌకర్యమే లేదు వారి పెద్దకొడుకు సుబ్బారావు గ్రామ సర్పంచ్ అయిన తర్వాతే 1966లో రోడ్డు వేశారు .
ధార్మిక కార్యక్రమాలు
1950నది వేసవి లో ఒక సన్యాసి ఆకలితో అలమటిస్తూ నడిచి సోలిపోతుంటే అమ్మ చూసి ఇంటికిపిలిచి ఆతిధ్యంస్వీకరించమని కోరింది .ఆ ఊళ్ళో దేవాలయం లేదు కనుక తాను భిక్ష స్వీకరించనని చెప్పగా అమ్మ మనసు తల్లడిల్లి ఒక దేవాలయం ,స్వంత సత్రం ఏర్పాటు చేయాలని భావించింది .ఊరి వారందరి సహకారం కోరుతూ ఎవరికీ ఇబ్బంది కలుగ కుండా రోజుకు ‘’పిడికెడు కెడు బియ్యం పధకం ‘’ఏర్పాటు చేసింది .ప్రతి ఇంటి వారు దాన్ని సేకరించి అండ జేసేవారు వాటిని భద్రం చేసి అందులో కొంత భాగం దేవాలయ నిర్మాణానికి ఉపయోగించటం ఆమె ఆలోచన .కొద్ది కాలం లోనే ఇది అద్భుతా విజయం సాధించింది .’’పిడికెడు బియ్యం ‘’అనేది మంత్రం లా పని చేసింది .1958ఆగస్ట్ పదిహేను న‘’అన్న పూర్ణాలయం ‘’కు ప్రారంభోత్సవం చేసింది .ఆ సత్రం లో భోజనం చేయటానికి ఆకలే అర్హత .అర్హత వేషధారణ బట్టి కాకుండా ఆకలిని బట్టే అన్నం పెట్టింది .అన్ని బాధల కంటే ఆకలి బాదే ఎక్కువ అనేది అమ్మ .సమాజం లోని అన్ని వర్గాల వారు అన్ని రకాల వారు అమ్మ చేతి అన్న పూర్ణ ప్రసాదాన్ని అమ్రుతోప మానం గా ఆర గించారు .అమ్మ తన ఇంటిని ‘’అందరి ఇల్లు ‘’అని పేరు పెట్టింది .
బాపట్ల కుష్టు ఆస్పత్రిరోగులకు అరటిపళ్ళు ,పరవాన్నం ,పులిహోరా పంపేది అమ్మ .అందరినీ సమానం గా చూడటమే అమ్మ మనసు .ఒక జ్యోతిష్యుడు వచ్చి ఏదైనా ప్రశ్న అడగమంటే ‘’సృష్టిలో ఏ ప్రాణీ ఆకలితో బాధ పడకుండా ఉండే రోజు ఎప్పుడొస్తుందో చెప్పండి ?’’అని అడిగి ఆయన్నుఅప్రతిభుడిని చేసింది .అదే అతిలోక మాతృత్వం అది అమ్మకే సాధ్యం .అన్నం తో బాటు బట్టలనూ అందరికీ అందించేది .జిల్లెల్ల మూడి వచ్చిన ప్రతి వారు అమ్మ ప్రసాదం తిన కుండా ,అమ్మ ఇచ్చిన వస్త్రాలను పొందకుండా వెళ్ళిన వాళ్ళు లేనే లేరు .మరో సారి వాసుదాస స్వామి అనే వైష్ణవ స్వామి వద్దకు అమ్మ వెళ్ళగా తల్లి లేని పిల్ల అని తెలిసి అందరూ తనను ప్రేమించేట్లు చేయనా అని అడిగాడు. అమ్మ ‘’అందరూ నన్ను ప్రేమించినా ద్వేషించినా నేను అందర్నీ ప్రేమించేట్లు ఆశీర్వ దించండి ‘’అని కోరి తన నడవడికి ఒక దివ్య మార్గాన్ని ఎన్ను కొన్నది అమ్మ .
సంస్కృత పాఠ శాల –విద్యాలయం –హైమాలయం –ఆదరణాలయం
ప్రేమ మయ వాతావరణం లో ఉండేట్లు అందరినీ చేసింది అమ్మ .అందరూ అక్కా చెల్లి అన్నా తమ్ముడు గానే అక్కడ మెలగటం విశేషం .అమ్మ సన్నిధిదైవసంనిదే వారికి . .1971లో సంస్కృత పాఠశాల ,కళా శాలను అమ్మ నెలకొల్పి మన సంస్కృతీ సంప్రదాయ వ్యాప్తికి ముందడుగు వేసింది .అక్కడ చదివే ప్రతి వారికి ఉచిత వసతి ,భోజన సౌకర్యాలు కలిగించి ఆదర్హ ప్రాయమైనది ..1978రోగార్తులకోసం ఒక ఉచిత విద్యాలయాన్ని స్థాపించి సేవలందించింది .అప్పటికే ఉన్న ఆయుర్వేద విద్యాలయానికి తోడుగా హోమియో వైద్య శాల ,అల్లోపతి వైద్య శాల ఏర్పరచింది .తన కుమార్తె హైమ లో అందరిలో మానవత్వాన్ని ,అనుబంధాన్ని అనురాగాన్నీపెంపొందించే తలం పు తో పెంచింది .ప్రసిద్ధ జర్నలిస్టు శ్రీ పొత్తూరి వెంకటేశ్వర రావు హైమ ను చూసి హైమ లో దేవత స్వరూపం కనీ పిస్తోంది అని కొనియాడారు .అమ్మ తన దగ్గరకు వచ్చే రోగుల్ని హైమ వద్దకు పంపేది.ఆమె వారి పాలిటి కల్ప వృక్షం కామ ద్వేనువు గా బాధలు నివారించేది .పదవీ విరమణ చేసిన వారికి ,జబ్బుతో బాధ పడుతూఎవరూ పట్టించుకోని వారికి అండగా ‘’ఆదరణాలయం ‘’ఏర్పరచి వారి పాలిటి దీన బంధువే అయింది అమ్మ .
ప్రచురణలు –సినిమాలు
మాతృశ్రీ పబ్లికేషన్ ట్రస్ట్ ను 1966లో ప్రారంభించి సంస్కృతాంధ్ర హిందీ ఒరియా భాషలలో వందకు పైగా ప్రచురించి అమ్మ సాహిత్యాన్ని ప్రపంచమంతా పంచి బెడుతున్నారు .1971లో ‘’విశ్వ జననీ పరిషత్ ‘’ను ఏర్పరచారు .అమ్మ పై అడపా రామ కృష్ణా రావు గారు మొదటిగా కొన్ని స్లైడులు తయారు చేశారు .తర్వాత అరగంట డాక్యుమెంటరి చిత్రం అమ్మ పై వచ్చింది .పది హీను రీళ్ల లో జిల్లెల్ల మూడి లో జరిగే అన్ని కార్యక్రమాలను ,అమ్మ పర్యటనలు స్వర్ణోత్సవ వేడుకలు ఆన్నీ చిత్రీకరించి శ్రీ కొండముది రామ క్రిష్ణ స్క్రిప్ట్ రాయగా ప్రముఖ నటుడు పి.జే.శర్మ కామెంటరి చెప్పాడు సూక్తులతో మరో కామెంటరి ఫిలిం తయారైంది. అమ్మ జీవితంపై ‘’మాతృశ్రీ జీవితం –సాహిత్యం –సౌందర్య సర్వస్వం ‘’పేరు తో డాక్టర్ బి.ఎల్ సుగుణ తెలుగు విశ్వ విద్యాలయం లో పరి శోధన చేసి ‘’మాతృశ్రీ తత్వ సౌరభం ‘’పేర ముద్రించారు
అమ్మ మహా ప్రస్తానం
.విశాల మైన నుదురు భ్రుకుటి పై పెద్ద యెర్ర కుంకుమ బొట్టు ,ముక్కుకు ముక్కెర ,చేతుల నిండా గాజులు ,ఒంటి నిండా చీర కొంగు కప్పుకొని,చిరునవ్వు తో ఆప్యాయం గా రారా నా కన్నా రా అమ్మా అని ఆప్యాయం గా పిలుస్తున్నట్లు చేతులు చాపి అపర అన్న పూర్నా దేవిలాగా సాక్షాత్కరించేది అమ్మ అనసూయమ్మ చూడగానే భాతి ప్రపత్తులతో ప్రనమిల్లాలనే ఆలోచన మనసులో వచ్చి నిండు హృదయం తో నమస్కరిస్తారు .ఆ సంస్కారం ప్రేమ ,ఆదరణ అమ్మ దానం లో ఉన్న కమ్మదనం అమ్మ లోనే అందరూ దర్శంచే వారు . అమ్మ పై ఆరాధన ఉన్న వారికోసం హైమాలయం అనసూయేశ్వరాలయాలు ఏర్పడ్డాయి పరిస్తితులకు మించిన గురువులేదు అన్న అమ్మకు గురువులే లేరు .1958మాఘ పౌర్ణమి నాడు నల్ల మడ వాగు అనే ఓంకార నదిలో అసంఖ్యాక భక్తులకు అమ్మ దేశి రాజు రాజమ్మ గారి అభ్యర్ధన మేరకు మంత్రోపదేశం చేసి చిరస్మరణీయురాలైంది .16-2-1981.అమ్మ భర్త, అందరికి ‘’నాన్నగారు’’ అయిన నాగేశ్వర రావు గారు మరణించారు..5-4-1968అమ్మ కూతురు హైమ చనిపోగా విగ్రహం చెక్కించి ప్రాణ ప్రతిష్ట చేసి దేవాలయం కట్టించింది .1973లో అమ్మ యాభై ఏళ్ళ స్వర్ణోత్సవ సమయం లో ఒకే పంక్తిలో లక్ష మందికి భోజనం పెట్టింది అమ్మ .మిగిలిన పదార్ధాలను పశు పక్ష్యాడులకు జల చరాలకు పెట్టించింది .వజ్రోత్సవం నాడు పశువులకు పూజ చేయించింది . అమ్మ ఆరోగ్యం క్రమంగా క్షీణించింది ..ఎందరో వైద్యులు అమ్మ ఆరోగ్యాన్ని కాపాడే ప్రయత్నం చేసినా ఫలించలేదు .అమ్మకు భ్రుకుటీ భేదం ,సహస్రార భేదం జరిగింది తలనుండి , భ్రుకుటి నుండి రక్తం చిమ్మి త్రుటిలో భస్మం గా మారిపోవటం జరిగి అందరికి ఆశ్చర్యం కలిగించింది .అమ్మ ను ‘’యోగ పరాకాష్ట స్తితి పొందిన జగన్మాత ‘’గా కొమర్రాజు లక్ష్మీ కాంత యోగి, కాంతయ్య యోగి వర్ణించారు .12-7–1985లో అరవై మూడవ ఏట అమ్మ జగదమ్మలో కలిసి పోయింది .5-5-1987 అమ్మ కళ్యాణ దినోత్సవం రోజున అమ్మ విగ్రహ ప్రతిష్టాపన జరిగింది
అమ్మను జీవితకాలం లో సందర్శించిన ప్రముఖులలో రఘువర దాసు ,ఆత్మానంద స్వామి లక్ష్మణ యతీంద్రులు ,నరసింహ యోగి ,ప్రభాకర ఉమా మహేశ్వర పండిట్ ,కుర్తాలం పీఠాధిపతి శివ సదానంద భారతీస్వామి ప్రసాద రాయ కులపతి ,కరుణశ్రీ ,జటావల్లభుల పురుషోత్తం జమ్మలమడక మాధవ రామ శర్మ ,ఎక్కిరాల కృష్ణమాచార్య ,పుట్టపర్తి నారాయణాచార్యులు ,పళ్ళే పూర్ణ ప్రజ్ఞాచార్యులు, దువ్వూరి వెంకట రమణ శాస్త్రిగారు వంటి వారెందరెందరో ఉన్నారు .ముప్ఫై కి పైగా తెలుగులోనూ అయిదు ఆంగ్లం లోను అమ్మపై పుస్తకాలను మాతృశ్రీ పబికేషన్స్ ప్రచురించి అమ్మ భావ వ్యాప్తికి దీప్తి కల్గిస్తోంది .
మీ- గబ్బిట దుర్గా ప్రసాద్ –
తొలితరం మహిలోద్యమ నాయకురాలు –భండారు అచ్చమాంబ
తొలితరం మహిలోద్యమ నాయకురాలు –భండారు అచ్చమాంబ
భారత దేశం లోనే మొదటి మహిళా చరిత్ర రచయితగా ,మన రాష్ట్రం లో తొలితరం మహిళోద్యమ సారధిగా శ్రీమతి భండారు అచ్చమాంబ గుర్తింపు పొందింది .కృష్ణా జిల్లా నందిగామదగ్గర పెనుగంచి ప్రోలు లో ఆమె 1874లో జన్మించింది తండ్రి కొమర్రాజు వెంకటప్పయ్య .కొమర్రాజు వెంకట లక్ష్మణ రావు గారికి సోదరి .తండ్రి ప్రభుత్వ దివాన్ గా పని చేసే వారు .అచ్చమాంబకు ఆరేళ్ళ వయసు వచ్చేసరికి తండ్రి మరణించారు .మేనమామ భండారు మాధవ రావు గారితో పదేళ్ళ వయసులో వివాహం అయింది .పదిహేడవ ఏట కాపురానికి వెళ్లి దాంపత్య జీవితం ప్రారంభించింది
అచ్చమాంబకు విద్య మీద అమితాసక్తి ఉండేది .కాని భర్త మాధవరావు అందుకు సహకరించ లేదు .తమ్ముడు లక్ష్మణ రావు సాయం తో అతని దగ్గరే చదివి తెలుగు హిందీ ఇంగ్లీషు మరాఠీ భాషలు నేర్చింది తమ్ముడు బిలాస్ పూర్ లో ఉద్యోగం లో చేరటానికి వెడితే తానే స్వయం గా బెంగాలీ,గుజరాతీ సంస్కృతం లను అభ్యసించి నేర్చుకొని స్వయం సిద్ధ అని పించు కొన్నది . అచ్చమాంబ దంపతులకు పుట్టిన ఒక కొడుకు కూతురు అకస్మాత్తుగా మరణించారు .ఆమె శోకం వర్ణనా తీతం గా ఉంది ,ఈ దుఖం నుండి బయట పడటానికి అయిదుగురు అనాధలను చేర దీసి వారికి వసతి, ఆహారం సమకూర్చి విద్యా బుద్ధులు నేర్పించి తల్లిగా అండగా నిలిచింది .’తీరాంధ్రం లోనే మొదటి స్త్రీ సమాజాన్ని ఓరుగంటి సుందరీ రత్నాంబ గారితో కలిసి ‘’బృందావన స్త్రీల సమాజం ‘’పేరిట 1902 లో మచిలీ పట్నం లో నెలకొల్పింది
‘’ అబలా సచ్చరిత్ర రత్న మాల ‘’అనే గ్రంధాన్ని అచ్చమాంబ రాసింది .అందులో1000 ఏళ్ళ కాలం నాటి i 34మంది హిందూ సుందరీమణుల చరిత్రలను మధురం గా వర్ణించింది .ఆమెకు కుట్టుపని అల్లిక లలో మంచి ప్రావీణ్యం ఉండేది ‘’క్రోషా అల్లిక ‘’పై ఆమె వ్యాసాలను ‘రాసి ‘’హిందూ సుందరి ‘’పత్రికలో ప్రచురించింది .ఆంద్ర దేశం అంతటా పర్య టించి అనేక ఉత్సాహక ప్రసంగాలు చేసి మహిళోద్యమానికి నాంది పలికి స్త్రీ జనాభ్యుదయానికి వారిని సమాయత్త పరచింది .స్త్రీజనాభ్యుదయం పై అనేక పత్రికలలో వ్యాసాలు రాసి చైతన్య పరచింది .మహిళా సమాజాలను స్థాపించి సేవలందించింది .రాష్ట్రమంతా తిరిగిఅనేక చోట్ల మహిళా సమాజాలను నెలకొల్పింది .
ఆచ్చమాంబ ఆ కాలం లోని అనేక విషయాల పైనా స్త్రీ సమస్యల మీద గొప్ప కధలు రాసి తొలితరం మహిళా రచయిత గా గుర్తింపు పొందింది .తెలుగు బ్రిటిష్ మహిళలపై అనేక జీవిత చరిత్రలను రాసి మార్గ దర్శనం చేసింది .190
అచ్చమాంబ రాసిన ‘’ధన త్రయోదశి ‘’కధ మనం అందరం మొదటి తెలుగు కధానిక గా భావిస్తున్న1910లో వచ్చిన గురజాడ అప్పారావు గారి ‘’దిద్దు బాటు ‘’కధ కంటే ముందు రాసినదే నని అందరూ అంగీకరింఛి అచ్చమాంబ గారి ధన త్రయోదశి కద మాత్రమె ‘’తొలి ఆధునిక కద’’ అని ఎందరెందరో నిక్కచ్చిగా చెప్పారు . ఆమె రచనలలో ‘’బీదకుటుంబం,ఖానా ,శతకం ,’’ఉన్నాయి .ఆమె రాసిన ‘’దంపతుల ప్రధమ కలహం ,విద్యా వంతులగు యువతులకు ఒక విన్నపం ,స్త్రీ విద్య ప్రభావం ‘’మొదలైన వ్యాసాలూ హిందూ సుందరి, సరస్వతి పత్రికలలో ప్రచురింప బడినాయి .అచ్చమాంబ ‘’ధన త్రయోదశి ‘’కద హిందూ సుందరి లో 1902లో ప్రచురితమైంది . బీద యువ దంపతుల కద ఇది . .దీపావళి కి దీపాలు కూడా వెలిగించలేని గర్బః దరిద్రం వారిది .భర్త నేరం, కుటిలోపాయం చేసి డబ్బు సంపాదింఛి దీపావళి జరుపుకొందామని ప్రయత్నం చేస్తే వారించి అతనిని సన్మార్గం లో పెట్టిన సద్గుణ రాశి అయిన యువతి కధ.
సోదరుడు లక్ష్మణ రావు సహాయం తో 1901లో అచ్చమాంబ రాసిన ‘’అబలా సచ్చరిత్రమాల ‘’లోని కొన్ని భాగాలు కందుకూరి వీరేశలింగం గారి ‘ప్రముఖ పత్రిక ‘’చింతామణి ‘’లో ప్రచురింప బడ్డాయి .ఆమె రాసిన’’ ఖనా ‘’ప్రముఖ భారతీయ ఖగోళ గణిత శాస్త్ర వేత్త ‘’వరాహ మిహిరుడు ‘’భార్య’’ఖన కధ.అచ్చమాంబ దేశమంతా పర్య టించి అనేక మంది ప్రసిద్ధులైన విద్యా వేత్తలతో పరిచయం సాధించి వారి మెప్పు పొందింది .మహిళోద్యమానికి మద్దతు కూడా గట్టింది 1905జనవరి 18నఅచ్చమాంబ తన సోదరుడు లక్ష్మణ రావు దగ్గర మధ్యప్రదేశ్ లోని బిలాస పూర్ లో మరణించింది.1905జనవరి 18నఅచ్చమాంబ తన సోదరుడు లక్ష్మణ రావు దగ్గర మధ్యప్రదేశ్ లోని బిలాస పూర్ లో మరణించింది.
ఎదిరించకపోతే అన్యాయాలదే రాజ్యం

సాఫీగా సాగిపోయే మార్గాన్ని ఎంచుకునేందుకు అనువైౖన జీవన నేపథ్యం ఆయనది. అయినా నిరంతరం పోరాట మార్గాన్నే ఎందుకు ఎంచుకున్నట్లు? ఏ చిన్న బాధకైనా కన్నీటి పర్యంతమైపోయే బొజ్జా తారకం అనుక్షణం తీవ్రమైన సంఘర్షణకు గురిచేసే మార్గంలో ఎందుకు నడిచినట్లు? కులపోరాటాల్ని, వర్గపోరాటాల్ని సమన్వయ పరచనిదే భారతదేశంలో ఏమీ సాధించలేమని నొక్కి పలికే ఆయన అనేక విషయాల్లో దళితలోకానికి ఒక పెద్ద దిక్కుగా ఉన్నారు. నాలుగున్నర దశాబ్దాల న్యాయవాద వృత్తిలో, ఏడు పదుల జీవితంలో బొజ్జా తారకం ఎదుర్కొన్న కొన్ని సంఘటనలే ఈ వారం ‘అనుభవం’
“అన్యాయమైన పద్దతిలో ఎవరైనా ఒకసారి తప్పించుకోవచ్చు. కానీ అక్కడితోనే మన ం ఆగిపోతే, అది వారి న్యాయమైన గెలుపుగా చలామణీ అవుతుంది. అందుకే అన్యాయాన్ని మళ్లీ మళ్లీ ప్రశ్నించడం ద్వారానే న్యాయాన్ని గెలిపించుకోవచ్చని ఆ రోజు నాకు బోధపడింది.
తూర్పు గోదావరి జిల్లాలోని కందికుప్ప మా ఊరు. కాకపోతే ఆ ఊరికి కిలోమీటర్ దూరంలోని ‘మాలపేట’ మా నివాస స్థలం. ఇది బంగాళాఖాతానికి మూడు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. మా తాతయ్య గోవిందదాసు తత్వాలు పాడుతూ ఆధ్యాత్మిక ప్రసంగాలు చేసేవాడు. ఆయనకు వేల మంది శిష్యులు ఉండేవారు. ఆ ప్రాంతంలో ప్రముఖంగా ఉండే రాజులు, కాపులు కూడా తరుచూ మా ఇంటికి వచ్చేవారు. అంటరాని కులానికి చెందిన వాడైనా ఆయనను ఎవరూ అలా చూసే వారు కాదు. అందుకే నా బాల్యంలో అంటరానితనం తాలూకు సమస్యలేవీ ప్రత్యక్షంగా నన్ను తాకలేదు కానీ, పరోక్షంగా వాటి గురించి కొంత తెలుసు.
నా పసితనంలో పెసరట్లు అమ్ముకోవడానికి ఒక వ్యక్తి మా పేటకు వచ్చేవాడు. మోకాళ్ల దాకా పంచె తప్ప అతని ఒంటి మీద చొక్కా కూడా ఉండేది కాదు. పెద్ద బొజ్జ ఉండేది. అతడు గొల్ల కులస్తుడు. అతను పెసరట్లను మాల పిల్లలకే అమ్ముకోవడానికి వచ్చినా ఎవరూ తనను ముట్టుకోకుండా దూరదూరంగా ఉండేవాడు. తననే కాదు తన సైకిలును గానీ, పెసరట్లు తెచ్చిన డబ్బాను గానీ ఎవరూ తాకడానికి వీలులేదు. పిల్లలు డబ్బులు ఇస్తే పైనుంచి అరచేతిలోకి వేయాలి. తను కూడా పెసరట్లను ఆకులో పెట్టి పైనుంచి అరచేతుల్లోకి వదిలేవాడు. అతను బతుకుతున్నది మాలపిల్లలు ఇచ్చిన డబ్బులతోనే అయినా వాళ్లు మాత్రం తనను తాకడానికి వీల్లేదనడంలోని ఆ వైరుధ్యం ఏమిటో మొదట్లో అర్థం కాకపోయినా ఆ తర్వాత రోజుల్లో అర్థమవుతూ వచ్చింది. నిజానికి ‘గొల్ల’ అగ్రకులమేమీ కాదు. అయినా అతనికి ఆ వాసనలు సోకాయి. 1942లో అంబేద్కర్ చేసిన ఆంధ్రప్రదేశ్ పర్యటన తర్వాత కుల వివక్ష కొంత బలహీనపడింది. ఏ సంఘ సంస్కరణ అయినా, ఉద్యమస్థాయిలో జరిగితే తప్ప ఆశించిన మార్పు జరగదన్నది నా భావన.
ఎక్కడో ఎదురవుతుంది
నాన్నగారు అప్పలస్వామి టీచర్‌గా పనిచేసేవారు. ఆయన 1952 నుంచి 1962 దాకా ఎంఎల్ఏగా ఉన్నారు. ఆ తరువాత ఎన్నికల్లో ఓడిపోయినా తన సామాజిక కార్యక్రమాలను మాత్రం యథావిధిగా కొనసాగించారు. ఎన్నో సామాజిక పోరాటాలు చేశారు. తాతయ్య చాలామందికి పూజనీయుడిగా ఉండడం వల్లగానీ, నాన్నగారు ఎం.ఎల్.ఏగా, ఒక సామాజిక నాయకుడిగా ఎదగడం వల్ల గానీ, నా చదువైపోయేదాకా ఎక్కడా కుల వివక్ష తాలూకు కష్టాలు నన్ను వేధించలేదు. కానీ, న్యాయవాద పట్టా తీసుకుని 1966లో కాకినాడలో తొలిసారిగా ప్రాక్టీస్ మొదలెట్టినప్పుడు మాత్రం ఆ సమస్యలు నన్ను ఢీకొన్నాయి. ఆ రోజుల్లో కాకినాడలో ఉన్న ఎస్సీ న్యాయవాదిని నేనొక్కణ్నే. నా కేసుల్ని స్వీకరించే విషయంలో గానీ, నా వాదనల్ని వినే విషయంలో గానీ, తీర్పు చెప్పే విషయంలో గానీ, న్యాయమూర్తులు చాలా వివక్షతో వ్యవహరించేవారు.
అది నన్ను తీవ్రమైన ఆవేదనకు గురిచేసేది. అక్కడంతా బ్రాహ్మణుల ఆధిపత్యమే ఉండేది. వాళ్ల కుటిలమైన ఎత్తుగడల వల్ల ఎస్సీ కేసులు తప్ప వేరే ఏవీ నా వద్దకు వచ్చేవి కాదు. పనిగట్టుకుని కొందరు అలా రాకుండా చేసేవారు. నాన్నగారి నుంచి ఆర్థిక సహాయం అందడం వల్ల సరిపోయింది గానీ, లేదంటే న్యాయవాద వృత్తి నాకు భారమయ్యేది. సరిగ్గా అదే సమయంలో ఒక భూస్వామి వద్ద పనిచేస్తున్న పాలేరును అన్యాయంగా ఒక కేసులో ఇరికించి అతన్ని దారుణంగా కొట్టి జైలుకు పంపించారు. వాళ్లు బెయిల్ కోసం నా వద్దకు వ చ్చారు. పిటిషన్ వేస్తే చాలా సులువుగా రావలసిన బెయిల్ రాలేదు. అది నన్ను తీవ్రమైన ఆందోళనకు గురిచేసింది. అప్పటికే అంతంత మాత్రంగా ఉన్న న్యాయవాద వృత్తి నాది. చివరికి బెయిల్ కూడా ఇప్పించలేని న్యాయవాదిననైతే నా ఉనికికి అర్థమేముంటుంది? జరిగిన కుతంత్రమేమిటో తెలుసుకుని ఐదు రోజుల తర్వాత బెయిల్ తిరస్కృతిని సవాలు చేస్తూ మళ్లీ పిటిషన్ వేశాను. ఇక తప్పదన్నట్లు ఈ సారి బెయిల్ ఇచ్చారు. అన్యాయమైన పద్దతిలో ఎవరైనా ఒకసారి తప్పించుకోవచ్చు. కానీ అక్కడితోనే మన ం ఆగిపోతే, అది వారి న్యాయమైన గెలుపుగా చలామణీ అవుతుంది. అందుకే అన్యాయాన్ని మళ్లీ మళ్లీ ప్రశ్నించడం ద్వారానే న్యాయాన్ని గెలిపించుకోవచ్చని ఆ రోజు నాకు బోధపడింది.
అన్యాయానిదే రాజ్యమై…
నిజామాబాద్‌లో ఉద్యోగం చేస్తున్న బోయిభీమన్న గారి కూతురు విజయభారతిని 1968లో నేను పెళ్లి చేసుకున్నాను. మొదట్లో వీలును బట్టి నిజామాబాద్‌కు వస్తూపోతూ ఉన్నా, ఆ తర్వాత నిజామాబాద్‌కే వచ్చేసి అక్కడే ప్రాక్టీస్ మొదలెట్టాను. ఆ రోజుల్లో నిజామాబాద్‌లో దళిత లాయర్‌గా ప్రాక్టీసు చేసినవాడ్ని నేనొక్కడ్నే. అక్కడే ‘అంబేద్కర్ యువజన సంఘం’ స్థాపించాను. ఎస్సీలే కాకుండా బీసీ యువకులు కూడా అందులో ఉండేవారు. అలా ఉండడం అదే ప్రథమం. బీసీని అధ్యక్షుడిగా, ఎస్సీని కార్యదర్శిగా పెట్టడం ద్వారా ఆ కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టాం. అంటరానితనానికి, అణచివేతకు, దళితుల మీద జరిగే దాడులకు వ్యతిరేకంగా ఉద్యమ స్పూర్తితో ఈ సంఘం పనిచేసేది. లాయర్‌గా నాకు కేసులైతే వచ్చేవి కానీ, సంపాదనైతే ఏమీ ఉండేది కాదు. నా భార్య ఉద్యోగం చేస్తున్నందువల్ల సంసార భారమంతా ఆమే మోసేది. నిజామాబాద్ పట్టణానికి 40 కిలో మీటర్ల దూరంలో ఉన్న ‘పాలెం’ అనే గ్రామంలో ఒక రోజు ఒక కాపు తన జీతగాణ్ని కొట్టి చంపేశాడు. ఆ వెంటనే ఆ శవాన్ని దళితులతో పాతిపెట్టించాడు కూడా. అటువంటి సంఘటనలు అంతకు ముందు చాలా జరుగుతూ వచ్చాయి.
కాని నేను అక్కడికి వెళ్లాక జరిగిన తొలి సంఘటన అదే. ఆ వార్త తెలియగానే నిరసన ర్యాలీ తీయడానికి 40 మంది కుర్రాళ్లతో కలిసి లారీలో ఆ ఊరు వెళ్లాం. ఒక ఎస్సీ వ్యక్తిపై దాడి జరిగితే, ఒక గుంపు ప్రజలు ఆ గ్రామానికి వెళ్లి, నిరసన ప్రకటించడం నిజామా బాద్ చరిత్రలో అదే ప్రథమం. మేము వెళ్లే దారిలో ఆర్మూరు అనే ఒక ఊరు ఉంటుంది. అక్కడ మా మీద దాడిచేస్తారని, వెళ్లొద్దని కబురొచ్చింది. అయినా భయపడకుండా వెళ్లాం. అందరూ చెప్పినట్లు ఆర్మూరు గ్రామం వద్ద ఎవరూ మమ్మల్ని ఆపలేదు. పైగా మేము వెళ్లగానే బాధితుడి పక్షాన పాలెం మాల మాదిగలంతా వచ్చేశారు.
వారిని వెంటతీసుకుని కాపుల వీధుల్లోంచే ఊరేగింపు తీశాం. రెడ్లంతా వాళ్ల మిద్దెల మీద నిలుచుని చూశారే గానీ, మమ్మల్ని నిరోధించడానికి గానీ, దాడి చేయడానికి గానీ ఏ ఒక్కరూ సాహసించలేదు. అప్పటిదాకా తాము చేసేవన్నీ న్యాయబద్ధమే అనుకునే వాళ్ల అవగాహనను తప్పని వారికి చెప్పగలిగాం. అందుకే వారు ఒక అపరాధ భావనతో చేష్టలుడిగి నిస్సహాయంగా నిలబడిపోయారు. ఆ తర్వాత నిందితుడ్ని అరెస్టు కూడా చేయించి జైలుకు పంపించాం. అన్యాయాన్ని ఎవరూ ధిక్కరించకపోతే, అదే పనిగా అన్యాయం చేసేవారికి అది న్యాయంగానే అనిపిస్తుంది. ఎవరో ఒకరు అది అన్యాయమని రుజువు చేయగలగిన నాడు, అన్యాయస్తులు తమ శక్తి సామర్థ్యాలను కోల్పోతారు.
అనుకున్నదే కదా!
1975లో అత్యవసర పరిస్థితి విధించినప్పుడు నిజామాబాద్‌లో నన్ను అరెస్టు చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా యువకుల్ని రెచ్చగొడుతున్నానన్నది పోలీసులు నా మీద మోపిన ప్రధాన అభియోగం. నిజామాబాద్ జైలుకు తరలించడానికి ముందు నన్ను పోలీస్ స్టేషన్‌లో ఉంచారు. ఆ విషయం తెలిసిన వెంటనే మా నాన్నగారు కాకినాడ నుంచి హుటాహుటిన బయల్దేరి నేనున్న జైలుకు వచ్చారు. నాకు తీవ్రమైన జ్వరంగా ఉంది, నన్ను చూడటానికి ఎవరినీ రానివ్వడం లేదు. నాన్నగారు నా వద్దకు రాగానే ఏడ్చేశాను. అప్పటికే ఎన్నో పోరాటాలు చేసిన ఆయనకు నా బేలతనం సరైంది కాదని అనిపించిందేమో! ” ఎందుకు ఏడుస్తావ్? నీకు నువ్వుగా ఎంచుకున్న మార్గమే కదా ఇది?” అన్నారు. ఆ మాటలు నాలో అదే పనిగా మార్మోగాయి. మనం ఎంచుకున్న మార్గమనే విషయం మనమే మరిచిపోతే మనమెంత బలహీనపడతామో ఆ మాటల ద్వారా నాకు తెలిసొచ్చింది. ఆ తర్వాత చంచల్‌గూడ జైలులో ఏడాది పాటు నిశ్చలంగా గడపడానికి కావలసిన శక్తినంతా ఆ మాటలే నాకు ప్రసాదించాయి.
పోరాటమిచ్చిన జ్ఞానం
1979 నుంచి హైదరాబాద్‌లో ఉంటూ హైకోర్టులో ప్రాక్టీసు చేస్తూ అనేక దళిత సమస్యలపై పోరాడుతూ వచ్చాను. ఉన్నట్లుండి 2013 లో ఒకరోజు దళిత సమస్యల పని మీద ఎక్కడికో వెళ్లి తిరిగి ఇంటికి వచ్చాను. అయితే నేను ఎక్కడినుంచి వచ్చానో నాకేమీ గుర్తు రావడం లేదు. ఆ మాటే నా భార్యను అడిగితే అదేం ప్రశ్న అన్నట్లు చూసింది. నాకు నేనే గుర్తుచేసుకునే ప్రయత్నం చేస్తున్నా గుర్తుకు రాకపోవడంతో ఏడుపొచ్చేసింది. వైద్య పరీక్షల్లో మెదడులో కణితి ఉన్నట్లు బయటపడింది. వెంటనే సర్జరీ చేశారు. అది కేన్సర్ కణితి అనే విషయం సర్జరీ అయిపోయే దాకా నాకు తెలియదు. ఆపరేషన్ తర్వాత నా ఆరోగ్యం క్రమక్రమంగా చక్కబడుతూ వచ్చింది. ప్రస్తుతం మా తాతయ్య, మా నాన్న గారి జీవిత కథల్ని ఒకే పుస్తకంగా రాసే పనిలో ఉన్నాను. అది పూర్తయితే మరో నవల కూడా రాయాలన్న సంకల్పం ఒకటి నాలో బలంగా ఉంది. నిరంతరం పోరాటాల మధ్య జీవించడం కారణంగానేమో గానీ, నన్నేదీ భయపెట్టదు.
పోరాటాలు ఏం నేర్పుతాయి? గెలుపోటములను సమదృష్టితో చూసే శక్తినిస్తాయి. జీవితాన్నీ మరణాన్నీ సమదృష్టితో చూసే జ్ఞానాన్నిస్తాయి. ఆ జ్ఞానమే బహుశా కేన్సర్ అని తెలిసినా నన్ను నిశ్చలంగా ఉండేలా చేసింది. నేను త్వరగా కోలుకోవడానికి కూడా బహుశా అదే దోహదం చేసింది. ఏ సమస్యను అధిగమించడానికైనా, ఏ వ్యాధిని జయించడానికైనా ఆత్మవిశ్వాసాన్ని మించిన ఔషధం మరొకటి లేదనుకుంటాను. ఇన్నేళ్ల నా పోరాటానికి ఏ ఆత్మవిశ్వాసం కేంద్రంగా ఉంటూ వచ్చిందో, ఆ ఆత్మవిశ్వాసమే నా భవిష్య జీవనానికి కూడా ఊతంగా ఉంటుందని నా ప్రగాఢ విశ్వాసం
– బమ్మెర
సంగీత సద్గురు త్యాగరాజ స్వామి వారి ఆరాధనోత్సవం -21-1-14-పుష్య బహుళ పంచమి
శ్రీ సువ్ర్చలాన్జనేయ స్వామి ఆలయం లో సంగీత సద్గురు త్యాగరాజ స్వామి వారి ఆరాధనోత్సవం -21-1-14-పుష్య బహుళ పంచమి
నాటకానికి ఎసెట్ సామ్యుల్ బెకెట్
నాటకానికి ఎసెట్ సామ్యుల్ బెకెట్
సామ్యూల్ బార్క్లే బెకెట్ 1906ఏప్రిల్ 13న ఐర్లాండ్ లోని డబ్లిన్ లో ఫాక్స్ రాక్ లో జన్మించాడు రచయిత నవలా కారుడు ,నాటక రచయిత డైరెక్టర్ ,కవి .పారిస్ లో ఉండేవాడు .ఇంగ్లీష్ ,ఫ్రెంచ్ భాషల్లో చేయి తిరిగిన రచయిత అని పించుకొన్నాడు .మానవ మనస్తత్వం లోని మొదాంత విషాదాన్తాలకు రచనలలో స్థానం కల్పించాడు .ఒక్కోసారి చౌకబారు హాస్యం ,వెకిలి నవ్వూ ఉన్నా అందరికి చేరువైన రచయిత అని పించుకొన్నాడు .ఇరవయ్యవ శతాబ్దపు రచయితలలో అత్యంత ప్రభావం ఉన్న రచయిత బెకెట్ .ఆధునికులలో చివరి వాడని పించుకొన్నాడు పోస్ట్ మోడర్నిస్ట్ గా ముద్ర వేయిన్చుకొన్నాడు .’’దియేటర్ ఆఫ్ ది అబ్సర్డ్ ‘’కు రూప కర్త బెకెట్ .నూతన నాటక నవలా విధానాలకు రూప శిల్పిఅయి నందుకు 1966లో నోబెల్ పురస్కారాన్ని అందుకొన్నాడు .1989డిసెంబర్ 22న 83ఏళ్ళ వయసులో బెకెట్ బకెట్ తన్నేశాడు .
Becket balzac Stendhal Flauburt
ఆధునిక కళ వ్యక్తి ,ప్రాపంచిక మైన తీవ్ర మార్పుల సంఘటనగా భావిస్తారు .బెకెట్ భావన ప్రకారం ‘’ఆబ్సేన్స్ ఆఫ్ టర్మ్స్ ‘’ఉంటుంది సృజనాత్మక కళ లో మరింత జీవితం ఉంటుంది .అలాగే కళాకారుడు కూడా తాను వేరు జీవితం వేరు అని అనుకోడు .మనం స్వేచ్చా జీవులుగా ఉండటానికి సహాయం చేస్తాడు .జీవితం నుంచి వేరై స్వతంత్రం గా ఉన్న కళ దేన్నీ సృష్టించలేదు .కనుక వ్యక్తీకరణ కంటే అదిలేకుండా ఉండటమే మరో మార్గం అని బెకెట్ భావించి దాన్నే ఎంచుకొన్నాడు .ఆయన ప్రతిభ అంతా శైలీ నాటకీయ వైవిధ్యం తోముడి పడిఉంటుంది .ఆయనకు ఆదర్శం ప్రఖ్యాత చిత్రకారుడు పికాసా మాత్రమె .అతనిలో ట్రాన్స్పరెంట్ రిప్రేసివ్ నెస్ ‘’ఉండటం ప్రత్యేకత .ఐడెంటిటి లేని వైవిధ్యం చూపించటం బెకెట్ కు చాలా ఇష్టం .అతని ప్రదానామ్శాలన్నీ అదృశ్యం కాకపోవటమే ప్రత్యేకత .జేవితం లోని భయానక విషయాల ప్రభావం కనిపిస్తుంది చావు కోరుకొనే పాత్ర లుంటాయి. లేకపోతే పూర్తిగానో కొంచెమో స్తబ్దత ఉంటుంది .కాలానికి అత్యధిక ప్రాధాన్యత నిస్తాడు .గతాన్ని వర్తమానాన్ని సంధించి పాత్రల చేత విషయాలను ఆవిష్కరింప జేస్తాడు అతని భాష, వివరణ విధానం, సమస్యల చిత్రీకరణ, పరిష్కారం అన్నీ బహు తమాషా గా ఉంటాయి .వాటికి సహజత్వం తో బాటు ఆవశ్యకత కూడా ఉంటాయి .మనం వెనక్కి తీసుకొని రాలేని గతకాలం పై అతని నాటక బీజాలన్నీ ఉంటాయి ఇదే బెకెట్ విలక్షణత .
మానసిక వైవిధ్యం ,ముఖ్యాంశాల మార్పు ,ప్రాముఖ్యత ,వాటి ప్రధాన గుణం ఏవీ ఒదిలి పెట్టడు .అతనిది ఎపిగ్రమాటిక్ స్టైల్ అంటారు .అంటే పురాతన పరిశోదనాత్మకం గా లఘు కావ్యం గా అతని నాటకాలు ఉంటాయి .సేన్త్రిఫ్యూగల్ అంటే అపకేంద్ర గామిత్వ ఆశలు వ్యతిరేకం అవుతాయి. దానితో అంతా పరివ్యాప్తమై పోవటం మరో లక్షణం .వ్యక్తిత్వాలు కోల్పోకుండా అస్తిత్వాలను నిలబెట్టుకొనే పాత్రల్ని సృష్టిస్తాడు .జీవితం లోని మొనాటమి నుంచి బయటకు వచ్చే ప్రయత్నాలే అవన్నీ .స్వయం గా స్వేచ్చగా అస్తిత్వ నిరూపకం గా ,ఆలోచనాత్మకం గా సృజనాత్మకం గా పాత్రలున్డటం విశేషం. అతని గొప్పతనం ‘’every expression is invention ‘’అని శ్లాఘిస్తారు విమర్శకులు అలాగే ‘’to be any thing is not to be ‘’అనేది ఇంకొక ఆదర్శం .బెకెట్ ఇల్లు అంటే మొత్తం భూ ప్రపంచమే ,-Becket ‘s home contains the entire Universe ..అన్నారు .బెకెట్ నాటకాలలో హీరో ఉండడుదేనిలోనూ కానీ పించాడు ఇంకా పుట్టాల్సిన వాడు మాత్రం ఉండటం విచిత్రం అతను జ్ఞానాన్ని అంతటిని సంపాదించివృద్ధి చెందుతాడు .బతుకు మీద విరక్తి గా ఉంటాడు .అంటే చని పోయిన వాడితో సమానం అన్న మాట .’’a self without personality and aliterature without books .The metaphysical pathos of his work is that exists .A voice not listening to itself but to the silence that it breaks Ameaningless verbal flow in wich the silence can perhaps be hard .Life and language are punishments –although life itself seems to be the crime ,so that they are entrapped ina sadistically imposed penace which increases their guilt .’’అని బెకెట్ ను ఎస్టిమేట్ చశారు Religious sensibility బెకెట్ రచనల్లో ఉంది ‘’I doubt God –exists ‘’అంటాడు బెకెట్ ‘’డిస్కోర్స్ ‘’లో
ఆయన రచనలు ‘’we read belong to some one out side the novel but they tell the story of some one in the novel who claims that his story can not be told .The impenetrable divinity is Becket who will only talkabout Malare and the un namable ‘’
బాల్జాక్ పక్షవాతం వచ్చిన కేంద్రం నుండి దూరం గా జరిగితే బెకెట్ సెంట్రి పీటల్ గా అంటే కేంద్రానికి ఆకర్షణం గా మారాడు .ఆయన రచనలన్నితిలో కేంద్రానికి దగ్గరగా వచ్చే ప్రయత్నమే,అన్నిటినీ అధిగమించే ప్రయత్నమే కనీ పిస్తుంది .అతని పాత్రలన్నీ ‘’డబ్బాలో మూత పెట్టి ఉండటం ఒక ప్రత్యేకత ‘’.దీనినే ‘’Becket’s worm ‘’అంటారు .’’becket’s worm have had occasion to see ,has been in the apple for some time’’స్తేన్దాల్ –భాష లో పాషన్ ను వ్యతిరేకిస్తాడు .కాని బెకెట్ ‘’it is always the words of the others ,never thoseof the self ‘’.
ఈ విషయాలన్నీ’’Leo Bersani ‘’ రాసిన ‘’belzac to Becket –centre and circumferencein French fiction ‘’ అనే పుస్తకం లోనివి దీన్ని నేను మొదటి సారి అమెరికా వెళ్లి నప్పుడు చదివి రాసుకొన్న నోట్స్ ననుసరించి రాశాను .
6-10-2002 శనివారం నాటి నా అమెరికా డైరీ నుండి
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -21-1-14-ఉయ్యూరు
..
చిట్టూర్పు లో ఆచార్య పింగళి వారి జయంతి వర్ధంతి సభ పై పత్రికా స్పందన
అమెరికా చేరిన మొదటి హిందూ మహిళా డాక్టర్ –ఆనందీ బాయ్ జోషి
అమెరికా చేరిన మొదటి హిందూ మహిళా డాక్టర్ –ఆనందీ బాయ్ జోషి
కాదంబినీ గంగూలీతో బాటు మొదటి సారిగా వైద్య పట్టా పొందిన మొదటి తరం మహిళా డాక్టర్ ఆనందీ బాయ్ జోషి .అమెరికా చేరిన తొలి హిందూ మహిళా డాక్టర్ కూడా .1865 మార్చి 31న మహా రాష్ట్ర లోని పూనా లో జన్మించింది .ఆమెది సంపన్న సంప్రాదాయ బ్రాహ్మణ కుటుంబం .చిన్నతనం లో యమున అని ముద్దుగా పిలిచేవారు తొమ్మిదవ ఏట నే గోపాల రావు జోషి తో కుటుంబం లోని వారు ఆమెకు వివాహం జరిపించారు .వివాహం తర్వాత భర్త యమున పేరు ను ఆనంది గా మార్చాడు .కళ్యాన్ లో పోస్టల్ గుమాస్తాగా పని చేసి ఆలీబెగ్ కు మారి, కలకత్తాకు వెళ్ళాడు .అభ్యుదయ భావాలున్నవాడు అవటం తో భార్యను అన్నివిధాలా ప్రోత్సహించాడు .స్త్రీ కి విద్య అవసరం అని భావించేవాడు .ఆ కాలం లో అందరూ సంస్కృతాన్ని చదివితే గోపాల రావు ఇంగ్లీష్ ప్రాధాన్యతను గుర్తించి ,ఆనందికి ఉన్న అభిరుచిని తెలుసుకొని ఆమె ఆంగ్ల విద్యాభ్యాసానికి ఏంతో సహకరించాడు
![]()
.
పద్నాలుగవ ఏటనే ఒక మగ పిల్లవాడికి జన్మ నిచ్చింది ఆనంది .అవసరమైన మందులు లభ్యం కానందున పది రోజులకే ఆ పసి వాడు చని పోయాడు .ఈ సంఘటన తో ఆమె కు డాక్టర్ అవాలనే బల మైన కోరిక కలిగింది .ఆమె అభిలాష ను తెలియ జేస్తూ అమెరికా లోనిప్రసిద్ధ మిషనరీ రాయల్ వైల్డర్ కు జాబు రాశాడు . క్రిస్టియన్ మతం తీసుకొంటే తప్పక సహాయం చేస్తానని ఆయన జవాబు రాశాడు. ఇది దంపతులకు ఏమాత్రమూ ఇష్టం లేదు .వైల్డర్ తన పత్రిక లో వీరితో జరిపిన ఉత్తర ప్రత్యుత్తరాలను ప్రచురించేవాడు .దీన్ని జెర్సీ లోని రోసేల్లాలో ఉండే థియోడికా కార్పెంటర్ చదివటం జరిగింది .భర్త జోషి భార్య ఆనందికి మెడిసిన్ చదవటానికి ఇస్తున్న ప్రోత్సాహం చదివి కార్పెంటర్ అబ్బురపడి ఆమె అమెరికా వస్తే వసతి వగైరా సౌకర్యాలను తాను ఏర్పాటు చేస్తానని జాబురాయటమూ జరిగిపోయాయి .అనేక జాబుల్లో భారతీయ సంస్కృతీ సంప్రదాయాలను ఆనంది థియోడికా కు తెలియ జేసింది .
ఇది ఇలా ఉండగా జోషి దంపతులు కలకత్తా లో ఉండగా ఆనంది ఆరోగ్యం క్షీణించింది తరచుగా తలనొప్పి,అలసట బలహీనత జ్వరం తో బాధపడింది .ఇది తెలుసుకొన్న థియోడికా ఆమెకు తగిన మందులను అమెరికా నుండి పంపినా,ఈమె వాడినా ప్రయోజనమేమీ కనిపించలేదు ..ఇంతలో జోషీకి శేరామ్పూర్ బదిలీ అయింది .ఆమె ఒత్తిడికి లోనైంది .ఇక తప్పదని అనారోగ్యం గా ఉన్నా భార్యను అమెరికా లో మెడిసిన్ చదవటానికి పంపాలని నిర్ణయించాడు .ఉన్నత విద్య నేర్చి అందరికి ఆదర్శ ప్రాయం గా ఉండాలని హితవు చెప్పాడు .తార్ బారన్ అనే డాక్టర్ దంపతులు ఆనందిని పెన్సిల్వేనియావుమెన్స్ మెడికల్ కాలేజికి అప్లికేషన్ పంపమని సలహా నిచ్చారు .ఆనంది అమెరికా లో చదవటానికి వెళ్తోందని తెలుసుకొన్న హిందూ చాందస వాదులు ఆమె పై నిషేధం విధించారు .చాలా మంది ఆమెనే బలపరిస్తే కొద్ది మంది ఆమె క్రైస్తవ మతం తీసుకోవటం మంచిది అని అన్నారు .
సేరామ్పూర్ కాలేజి హాల్ లో ఆనంది అందరిని సమావేశ పరచి తను మెడిసిన్ చదివే ఉద్దేశ్యాన్ని దానికోసం అమెరికా వెళ్ళ బోతున్న విషయాన్ని తెలియ జేసింది .భారత దేశం లో హిందూ డాక్టర్లు లేరని, ఆ కొరత తీర్చటానికే తాను వెళ్ళదలచుకోన్నానని ఇండియాలోలో ఒక మహిళా వైద్య కలాశాల ను స్థాపించే ఆలోచన తనకు ఉందని విస్పష్టం గా చెప్పింది .తాను క్రైస్తవ మతాన్ని తీసుకోనని నిర్ద్వంద్వం గా ప్రకటించింది. ఆమె ఉపన్యాసం విన్న వారంతా ఎంతో మెచ్చి స్పందించి డబ్బులు విరాళాలుగా అక్కడికక్కడే ప్రకటించి అందించి ఆమె ఆశకు ఉద్దీపన కల్గించారు .ఆనాటి వైస్ రాయ్ ఆమె ఉన్నత విద్యాభ్యాసం కోసం రెండు వందల రూపాయలు విరాళం గా అందించాడు
కలకత్తా నుండి న్యు యార్క్ కు చాపరాన్ అనే నౌకలో ఆనంది ప్రయాణం చేసింది . తార్ బరాన్ కు పరిచయం ఉన్న ఇద్దరు మహిళలు ఆమెతో ప్రయాణం చేయటం ఊరటగా ఉంది .1883జూన్ లో థియోడికా కార్పెంటర్ ఆనందిని న్యూయార్క్ లో కలిసి స్వాగతించింది .వెంటనే పెన్సిల్వేనియా మహిళా వైద్య కళాశాలకు తనను మెడికల్ ప్రోగ్రాం కు అనుమతించ వలసిందని అప్లికేషన్ పంపగా అప్పటి కాలేజి డీన్ రాఖేల్ బ్రాడ్లీ ఆమెను అనుమతింఛి చేర్చుకోవటం తో ప్రపంచం లోనే మొదటి సారిగా మెడికల్ ప్రోగ్రాం లో పాల్గొన్నమహిళగా చరిత్ర సృష్టించింది ఆనందీ జోషీ .పందొమ్మిదవ ఏట వైద్య విద్య చదవటం ప్రారంభించిన ఆనంది అందరి మన్ననలను పొందింది .కాని అమెరికా లో అలవాటుకాని వాతావరణం ,అనుకూలం గాలేని ఆహారం వలన క్రమక్రమం గా ఆరోగ్యం క్షీణించి క్షయ వ్యాధికి గురైంది .అయినా ధైర్యం సడల నీయకుండా చదివి 1886 మార్చి నెల 11న మెడిసిన్ లో M .D.డిగ్రీ ని సాధించి ,అందరికి ఆదర్శం గా నిలిచింది భర్త ప్రోత్సాహాన్ని విశ్వాసాన్ని నిలబెట్టింది ‘’obstestrics in Aryan Hindus ‘’అంటే ‘’ఆర్య హిందూ సమాజం లో మంత్రసానితనం ‘’అనే ప్రత్యెక విషయం పైన థీసిస్ రాసి సమర్పించింది . ఆనంది వైద్య డిగ్రీ ప్రదానోత్సవ సభకు ఎలిజబెత్ రాణి ఆమెకు అభినందన సందేశం పంపటం మరపు కు రాని మహోన్నత విషయం ఆమెకూ, మనకూ మహిళ లందరికీ .
సాధించిన విజయం తో ఆనంది జోషి భారత దేశానికి 1886లో తిరిగి వస్తే వేలాది మంది అభిమానులు ఆమెకు వీరోచిత స్వాగతాన్ని పలికారు. కొల్హాపూర్ రాజ సంస్థానం ఆమెను ఆల్బర్ట్ ఎడ్వర్డ్ హాస్పిటల్ లో స్త్రీ వార్ద్ కు ఇంచార్జి గా నియమించి గౌరవించింది .కాని విధి వక్రించి ఆనందీ జోషి మరుసటి ఏడాదే ఇరవై రెండేళ్ళు నిండకుండానే 1887 ఫిబ్రవరి26 నమరణించింది .ఇంకా ఎంతో సేవ చేయాల్సిన ఆమె జీవితం అకస్మాత్తుగా ముగియటం అభిమానులు జీర్ణించుకోలేక పోయారు ఆమె మరణానికి భారత దేశం అంతా సంతాపం ప్రకటించింది ఆమె అస్తికలను అమెరికాలోని ఆమెను అన్ని విధాలా ఆదుకొన్న థియో డికా కార్పెంటర్ కు పంప గా ఆమె వాటిని ఏంతో భక్తితో, కన్నీటితో న్యూయార్క్ లో పోకీప్సీఅనే తన కుటుంబ శ్మశాన వాటిక లో భద్రపరచినది .ఏ జననాంతర సౌహృదయ మో ఇది ?
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -20-1-14-ఉయ్యూరు
సరసభారతి -సాహిత్య సాంస్కృతిక సంస్థ -ఉయ్యూరు
అక్షరం లోక రక్షకం
సరసభారతి -సాహిత్య సాంస్కృతిక సంస్థ -ఉయ్యూరు
సరసభారతి ఆధ్వర్యం లో57 వ సమావేశం గా సంగీత సద్గురు శ్రీ త్యాగరాజ స్వామి వారి ఆరాధనోత్సవం 21-1-2014 మంగళ వారం సాయంత్రం ఆరు గంటలకు శ్రీ సువర్చలాంజనెయస్వామి వారి ఆలయం మహిత మందిరం లో జరుగుతుంది .త్యాగరాజ స్వామికి అస్టో త్తరనామ పూజ ,పంచరత్న కీర్తనల గానం ఉంటాయి
అనంతరం శ్రీ సీతా రామ చంద్ర భక్త సమాజం వారిచే భజన కార్యక్రమం జరుగుతుంది .ఈ కార్యక్రమానికి అందరూ ఆహ్వానితులే .పాల్గొని జయప్రదం చేయ ప్రార్ధన .
జోశ్యుల శ్యామలాదేవి -మాది రాజు శివ లక్ష్మి -గబ్బిట వెంకట రమణ –గబ్బిట దుర్గా ప్రసాద్
గౌరవాధ్యక్షులు కార్య దర్శి కోశాధికారి అధ్యక్షులు
– సరసభారతి –
మురిపించి ముగిసిన వేయిపడగలు
మురిపించి ముగిసిన వేయిపడగలు
హైదరాబాద్ ఆకాశ వాణి కేంద్రం నుంచి ఇరవై రెండు వారాలుగా శనివారం ఉదయం ఎడుమ్బావుకు ప్రసారమైన తొలి జ్ఞానపీఠ పురస్కార గ్రహీత విశ్వ నాద సత్యనారాయణ గారి వేయిపడగలు నవలకు మలచబడిన రేడియో నాటకం కిందటి వారం తో పూర్తికాగా ఈరోజు దానిపై విశ్లేషణ స్పందన ప్రసారమైంది .ఆచార్య కోవెల సుప్రసన్నాచార్య గారు సహృదయ స్పందన తెలిపి అభినందించారు .ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర డిప్యూటీ డైరెక్టర్ జెనరల్ శ్రీ మంగళగిరి ఆదిత్య ప్రసాద్ ఈ నాటకాన్ని ప్రసారం చేయటం కష్టతరం అనుకోన్నామని దీన్ని నాటకం గా మలచటానికి దిట్టకవి శ్యామలాదేవి గారు సర్వ సమర్ధురాలు అనే నమ్మకం తో అప్పగించామని మొదటి ఎపిసోడ్ ఆమె రాసి చూపిస్తే అద్భుతం గా వచ్చిందని పించిందని ఆమెనే పూర్తిగా రాయమని చెప్పానని ,తనకున్న నమ్మకాన్ని ఆమె కున్న శేష సాహితీ ప్రజ్ఞ ను జోడించి ,శ్రోతలకు హృదయ స్పందన కలిగేట్లు రాశారని ఇది చాలా అసాధారణ విషయమని అందుకే ఇంత అసాధారణ విజయాన్ని సాధించిందని ,రాష్ట్రం లోను రాస్త్రేతరం లోను శ్రోతలు రేడియో ద్వారా డైరెక్ట్ టు హోమ్ ప్రసారం ద్వారా విని పులకించి పోయి నట్లు ఉత్తరాలద్వారా మెయిల్స్ ద్వారా ఫోన్ల ద్వారా స్పందన లను తెలియ జేసి తమ ప్రయత్నానికి గొప్ప విజయం చేకూర్చారని, గాత్రదారులందరూ అత్యంత సమర్ధ వంతంగా పాత్రలను పోషించారని సరోజా నిర్మల గారు ఇంత భారీ ప్రాజెక్ట్ ను బ్రహ్మాండమైన బాక్ గ్రౌండ్ సంగీతం ఎఫెక్ట్ లతో తీర్చిదిద్దారని ఇదంతా సమష్టి విజయమని ,మంచి కార్యక్రమాలకు ఎప్పుడూ శ్రోతల ప్రోత్సాహం ఉంటుందని రుజువైంది అన్నారు .అందరికి కృతజ్ఞతలను తెలియజేశారు .శ్రోతల కోరిక పై ఈ నాటకాన్ని రాత్రి వేళ తొమ్మిదిన్నర గంటలకు త్వరలో మళ్ళీ ప్రసారం చేయబోతున్నామని తెలిపారు శ్యామలాదేవి తనకు ఈ ప్రాజెక్ట్ లో పని చేసే అదృష్టం కలిగించిన ఆకాశవాణి వారికి కృతజ్ఞతలు తెలియజేశారు .ఇంత గొప్ప ఆదరణ లభించటం సహృదయ శ్రోతల సంస్కారానికి అద్దం పట్టటమే నన్నారు .ఇది అందరి విజయం అని వినయం గా చెప్పారు
శ్రీ ఆదిత్య ప్రసాద్ మరొక గొప్ప ధారావాహికను త్వరలో ప్రసారం చేయబోతున్నామని అది ప్రసిద్ధ రచయిత ,సినీ కవి స్వర్గీయ వేటూరి సుందర రామ మూర్తి గారు 1970లో రాసిన ‘’సికాకోలు సిన్నది ‘’అనే సంగీత నాటకాన్ని పూర్తీ హంగులతో మరలా ప్రసారం చేయబోతున్నామని దీన్ని కూడా శ్రోతలు విని ఆదరించాలని ప్రతి ఎపిసోడ్ లోను ప్రసిద్ధులైన వారి చేత విషయ వివరణ చేయిస్తామని అన్నారు .నాటకం లో చివరి భాగం లోని ‘’నీవు మిగిలితివి –నేను మిగిలితిని ‘’అన్నధర్మా రావు వాక్యాలతో ఈ స్పందన కార్యక్రమాన్ని ముగించారు .
ఇంత మంచి కార్యక్రమాన్ని ప్రారంభించిన శ్రీ ఆదిత్య ప్రసాద్ గారికి మొదటి ఎపిసోడ్ వినగానే ఆక్షణమే ఫోన్ చేసి అభినందించాను. ఇవాళ ఈ ముగింపు ఎపిసోడ్ పూర్తీ అవగానే ఫోన్ చేసి మళ్ళీ అభినందిస్తూ ‘’అప్పుడే అయిపోయిందా ?’’అని పించిందని ఇంత మహాద్భుత కార్యక్రమాన్నిఇంత గొప్ప గా నిర్వహించినందుకు హృదయ పూర్వక అభినందనలను అందజేశాను .ఆయనకూడా చాలా ఆనంద పడ్డారు .తామూ ఇంత గొప్ప స్పందన ను ఊహించలేదని అంచనాలకు మించి విజయం సాధించిందని అది విశ్వనాధ దార్శనికతకు విజయమని తాము నిమిత్త మాత్రులమే నని అన్నారు .నేను చివరి రెండు ఎపిసోడు లను వినలేక పోయానని చెప్పగా ‘’మీ లాంటి వారి కోసమే మళ్ళీ రాత్రి పూట త్వరలో ప్రసారం చేస్తున్నాం వినండి ‘’అని నవ్వుతూ అన్నారు .
త్వరలో 26 ఎపిసోడ్ లతో వేటూరి వారి ‘’సికాకోలు సిన్నది ‘’సంగీత రూపకం మళ్ళీ అన్ని హంగులు సమకూర్చి ప్రసారం చేయబోతున్నామని చెప్పారు .నటుడు బాల కృష్ణ దీన్ని సినిమా గా తీసే ప్రయత్నం కూడా ఒకప్పుడు చేశాడని తెలిపారు .ఆయనతోఒక ఎపిసోడ్ కు ముందు మాట్లాడిస్తామన్నారు వేటూరి వారి అబ్బాయి తోను ప్రతి ఎపిసోడ్ లోను ముందుగా వేటూరి వారి జీవిత విశేషాలను చెప్పిస్తామని అలాగే వేటూరి వారితో పరిచయం ఉన్న లబ్ధ ప్రతిస్టూలైన వారందరినీ ఇందులో స్పందన తెలియ జేయటానికి ఆహ్వానించి ప్రసారం చేస్తామని ఆనందం గా తెలియజేశారు .హైదరాబాద్ ఆకాశ వాణికి అచ్చ తెలుగుదనం దిద్దుతున్నందుకు అభినందనలు అన్నాను .ఆయన నవ్వి ‘’ఈ మధ్య ,65మంది వివిధ భాషాకవులతో కవి సమ్మేళనాన్ని నిర్వహించానని బహుశా ఏ రాష్ట్ర కేంద్రం లోను ఇలా ఎవరూ ప్రయోగం చేయలేదని దీన్ని పరిశీలించటానికి ధిల్లీ నుండి అయిదుగురు కేంద్ర ప్రముఖులు వచ్చారని ఎంతో సంతృప్తి చెందారని రాష్ట్ర గవర్న ర్ గారు ఈ కార్య క్రమం లో పాల్గొని ఆశీర్వదించారని వారికి ఒక రేడియో ను తాము బహూకరించి కార్యక్రమాలు వినమని కోరామని నవ్వుతూ చెప్పారు .ఆయన సహజ శైలిలో ‘’మాస్టారూ !ఇలా ముందుకు వెడుతున్నాం ‘’అన్నారు .నిగర్వి ప్రచారార్భాటం అక్కర్లేని అనుక్షణ కార్య శీలి ,ప్రయోగ శీలి శ్రీ ఆదిత్య ప్రసాద్ .’’ఇంకా ఏమేం ప్రాజెక్టులు మీ మనసులో ఉన్నాయ్ ?’’అని నేను అడిగితే ‘’తెలుగు చారిత్రిక నవల కు116ఏళ్ళు వచ్చిన సందర్భం గా శ్రీ ముదిగొండ శివ ప్రసాద్ గారి ఒక చారిత్రతక నవల ను చదివించే ఆలోచన ఉన్నది’’ అన్నారు అప్పుడు నేను ‘’ఇటీవల మేము అమెరికాలో ఉన్నప్పుడు అక్కడ ‘’టోరి’’అనే అంతర్జాతీయ రేడియో కార్యక్రమంలో వారడిగిన ప్రశ్న లకు సరైన సమాధానాలు ,చెప్పినందుకు నాకు ముదిగొండవారి ‘’పట్టాభి ‘’అనే అమరావతి ప్రభువు వెంకటాద్రి నాయుడి పాలన కాలానికి సంబంధిన చారిత్రాత్మక నవలను, మహా మంత్రి తిమ్మరుసు డి.వి.డి ని కానుకగా ఇచ్చారని చెప్పగా సంతోషించారు .ముదిగొండ ‘’మరో పాకుడు రాళ్ళు ‘’అనే నవల రావూరి భరద్వాజ గారి పాకుడు రాళ్ళు నవలకు కొనసాగింపుగా రాశారని ,దాని మీద కూడా ద్రుష్టి ఉందని అన్నారు .చాలా ఓపికగా సంతోషం గా నాతో పావు గంట సేపు ముచ్చటించిన ఆదిత్య ప్రసాద్ గారి సంస్కారానికి నమస్సులన్దించాను .
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -18-1-14-ఉయ్యూరు



























































