హోమర్ నుండి జాయిస్ దాకా -2
గ్రీక్ రచయిత Aeschylusరాసిన oresteriaలోనాగరక విధానం లో ఉన్న న్యాయ పద్ధతికి ప్రాధాన్యం కని పిస్తుంది .గ్రీసు దేశం పై పర్శియన్ల్స్ దాడికి వ్యతిరేకించాడు .ఆదేశం తరఫున పోరాడాడు కూడా .విజయాన్ని గర్వం గా అహంకారం గా మార్చవద్దని సలహా ఇచ్చాడు .గర్వాన్ని ఆకలిగా ,అధికార దాహం గా మలచ వద్ద్దని హెచ్చరించాడు
మరో గ్రీకు రచయిత సోఫిక్లాస్ రాసిన ‘’ఓడిపస్ ది.కింగ్ ‘’లో ఓడిపస్ తండ్రిని చంపి తల్లికి మొగుడవుతాడు .ఈ పేరే గుర్తింపు చిహ్నం గా ఉంటుంది దీనికి ‘’swollen foot ‘’అని ఆంగ్లం లో అర్ధం .తెలుగులో ఉబ్బిన పాదాలు .ఒడి అంటే ఉబ్బిన అని అర్ధం .తెలుసుకోవటం అనే అర్ధమూ ఉంది ఇదొక నాటకం .ఇందులో మనిషి, చేసేవాడు -man and the doer పాత్రలు .ఇందులో ఓడిపస్ మనిషి చాలా వింత .తట్టుకోలేని ప్రపంచం లో ఉన్నట్లు అని పిస్తాడు .దైవం విధి శక్తులకు అన్నిటికీ తల ఒగ్గుతూ తన విషాదానికి తానే కారకుడవుతాడు .ఇతని ప్రవర్తను బట్టే ‘’ఈడిపస్ కాంప్లెక్స్ ‘అనే మాట పుట్టింది .’ఇందులో Erosఅనే మాటకు కామ వాంఛ అని అర్ధం .Agapiఅంటే సోదర ప్రేమ దానం ,కొడుకుపై ప్రేమ ,మనిషి పై జాలి అని అర్ధాలు .philiaఅనే మాటకు దగ్గర వారిపైనా స్నేహితులపైనా ప్రేమ అని అర్ధం .
Euripides రాసిన Bachae అనేది సమస్యా వలయం ఉన్న నాటకం . ఇందులోని ముఖ్య పాత్ర ఎలెక్ట్రా అనే స్త్రీ .ఆమె స్తిరమైన అభిప్రాయాలుంటాయి తిరుగు బాటు ఎదిరించటం చేసే నాయిక.తనను తానూ శిక్షించుకొనే తత్త్వం .ఆమె .హేళన వ్యంగ్యం ,క్రూరత్వం ఉన్న యువతి .
’’అరిస్తో ఫేన్స్’’రాసిన ‘’frogs’’ లో హాస్యం ఉంది .,మేధావులు ,రాజకీయ నాయకులమీద వ్యంగ్యం తో చేసిన దాడి దండ యాత్రా కని పిస్తాయి .చాలా ప్రతిభావంతం గా సీరియస్ గా అర్ధ వంతమైన సంభాషణలతో చెమ్పదెబ్బలు కొడుతున్నట్లుగా ఉంటుంది
వర్జిల్
వర్జిల్ Acneid రాశాడు .దీన్ని ‘’సుప్రీం లిటరరీ ఎపిక్ ‘’న్నారు చాలా మెరుగైన కవిత్వం వర్జిల్ రాశాడు .హోమర్ ‘’ఓరల్ పోయేట్ ‘’అయితేవర్జిల్ గ్రీకు లో మొదటి వ్రాత కవి .హోమర్ కవితకు ప్రత్యెక శ్రోతలు ఉంటారు .ఇదులో ఆరాధన ఉంది దీన్నే గ్రీక్ లో ‘’pietas’’అంటారు .ప్రేమ యొక్క వినాశక శక్తి ని చూపించాడు .పురాతన కద ను ఆఫ్రికా రాణి క్లియోపాత్రా కు అన్వయించి రాశాడు .ఇందులో పోరాటాలను ప్రేమను సమర్ధ వంతం గా చిత్రించాడు .ప్రతిదాంట్లో తీవ్ర కాంక్ష ఉంటుంది .’’the eternal affirmation of the spirit of man in literature ‘’అనేది వర్జిల్ సొత్తు గా భావిస్తారు .
వర్జిల్ తర్వాత Gottefried వస్తాడు .ఆయన ‘’ట్రిస్టాన్ ‘’రాశాడు ఇది మధ్యయుగ ప్రపంచానికి ఆధునిక వ్యక్తిత్వానికి ,స్వభావానికి వారధిగా నిలిచే రచన .మనిషి లోని అనేక పొరలను ఆవిష్కరిస్తాడు ఇందులో .అమరత్వానికి సాగే ప్రయాణ సన్నాహాన్ని చూపించాడు .మధ్యయుగ మానవత్వం తో కద ప్రారంభమవుతుంది .జీవితాన్ని ఒప్పుకోవటం ఉంటుంది .భూ చరుడైన మానవుడు దివ్య ఆత్మలు ఇందులో దర్శిస్తాం .కదా బీజం ఐర్లాండ్ లో ప్రారంభం అయి వేల్స్ ,బ్రిటన్ ,ఫ్రాన్స్ ,ల ద్వారా జర్మనీ చేరుతుంది .దీన్ని’’celestic sory అంటారు అంటే స్వర్గ లోక.ప్రేమకధ .ఇందులో బ్రహ్మాండమైన నిర్మాణం ,జీవాత్మ ఉన్నాయి .దీన్ని ‘’లిప్ ‘’అంటారు .ఇందులో ఉన్న ఆత్మ ఔన్నత్యం ను ‘’మౌట్‘’అనీ ,సౌభాగ్యాన్ని ‘’గౌట్ ‘’అనీ అంటారు .ఈ కద ఒక చతురస్రం లో బంధింప బడి ఉన్నట్లని పిస్తుంది .
తర్వాత ‘’డాంటే’’ రాసిన’’ ఇన్ ఫెర్నో’’గుర్తుకొస్తుంది .డివైన్ కామెడి లో భూలోకపు కారణాలను హోలీ స్పిరిట్ లో కోల్పోతాడు .డాంటే సౌందర్య తాత్వికత ,ప్రేమకోసమైనా సౌందర్యం కు ,ప్రేమనుండి దైవత్వానికి ప్రస్తానం గా గోచరిస్తుంది .దీనినే త్రికం ‘’ట్రినిటి ‘’అన్నారు .డాంటేగొప్పదనం అంతా అతని కే స్వంతమైన రూపకాలంకారం లో తీర్చిదిద్దటమే .అదొక వరం ఆయనకు ఇందులో మాట్లాడటం ,వినటం అనేవి ప్రత్యేకత సంత రించుకోన్నాయి వీటినే ‘’dicno e,odono ‘’ అంటారు .
డాంటే తర్వాత ప్రసిద్ధుడు ‘’మాంటేగ్ ‘’ఇతని వ్యాసాలూ బహుళ ప్రచారం పొందాయి .అతని సిద్ధాంతం అంతా ‘’Iiam human .i consider nothing human foreign to me ‘’.దీనినే వాళ్ళ భాష లో ‘’Homosum ,humoni a me nil alienm puto ‘’అంటారు .ఇతని ఎస్సే లను ఆత్మ కదా గా భావిస్తారు సెక్స్, నీతి, మతం పై వ్యాస పరంపర రాశాడు మాంటేగ్ దృష్టిలో ‘’essay attempts not conclusions n which experience would be tested and tried through writing ‘’.అతని సూక్తి కూడా గొప్పదే ‘’better to live happily than to die happily ‘’హాయిగా చావటం కంటే హాయిగా జీవించటం మేలు .చని పోయే ముందు తనను గురించి ‘’I have seen the leaves ,the flowers ,and the fruit ow the withering –happily since it is natural ‘’అన్న జీవిత సత్యాన్ని తెలియ జేస్తూ నిష్క్రమించాడు
షేక్స్ పియర్ హోమర్ రాసిన ఎపిక్స్ ను ఎతీనియన్ ట్రాజేడి ని ,అందుకొని భాగ స్వామి అయి అజ్ఞాతం లోఇతరులకే కాక తనకూ కనిపించని మానవ లక్షణాలను నాటకాలలో ఆవిష్కరించి ప్రపంచ ప్రసిద్ధ నాటక కర్త అయ్యాడని రచయిత అంటాడు
.
ఈయన తర్వాత’’సేర్వాంటిస్’’కనిపిస్తాడు అతని ‘’డాన్ క్విక్సోట్ ‘’నవల యదార్ధానికి భ్రమకు మధ్యలో ఉంటుంది .1547లో పుట్టాడు షేక్స్ పియర్ చని పోయిన రోజునే 23-4-1616న మరణించాడు .దీన్ని ‘’క్విక్సోటిక్ ‘’గా ఉందని విమర్శకులు చమత్క రించారు .స్వీయ వ్యక్తిత్వం కోసం చేసే విజయ పోరాటం ఈ కద .అప్పటికే స్పెయిన్ దేశం ఐరోపా సంస్కృతికి దూరమై ఒంటరిది అయి పోయింది (కల్చరల్ ఐసోలేషన్).అలాగే రచయిత సేర్వాంటిస్ కూడా ఒంటరి వాడైపోయాడు .ఆయన చని పోయిన పదేళ్లకు ఈ రచన బయట పడింది ఆంగ్ల సాహిత్య చరిత్రలో ఒడిస్సీ తో బాటు ‘’డాన్ క్విక్సోట్ ‘’మొదటి నవల .యదార్ధ కాల్పనిక కధకు ఈ నవలే నాంది పలికింది
.
సశేషం
మాఘ మాసం మంచి రోజుల శుభా కాంక్షలతో
7-10-2002 సోమవారం నాటి అమెరికా డైరీ(హూస్టన్ ) నుండి –
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -31-1-14-ఉయ్యూరు