గణిత విజ్ఞాన వేదాంత తత్వ శాస్త్ర కోవిదుడు –ఇమాన్యుల్ కాంట్ -6

గణిత విజ్ఞాన వేదాంత తత్వ శాస్త్ర కోవిదుడు –ఇమాన్యుల్ కాంట్ -6

డాక్టర్ కాంట్ –మీజిస్టర్

1754 లో ముప్ఫయ్యవ ఏట కాంట్  .’’whether the earth has changed its revolution ‘’,’’on the question whether the earth aging from physical point of view’’అనే రెండు ప్రఖ్యాత వ్యాసాలు  రాశాడు .31 వ ఏట 1755 లో ‘’మీజిస్టర్ ‘’గాఅంటే లెక్చరర్ గా  ప్రమోషన్ పొందాడు .దీనికి కారణ మైనది ఆయన దీసిస్స్ ‘’on fire ‘’.దీన్ని succeinet meditation on fire ‘’అన్నాడుప్రొమోషన్ కు కావలసిన ఫీజు ను బాబాయి రిచ్ స్టర్ ‘’కట్టాడు .నాలుగు వారాల తర్వాతా పబ్లిక్ పరిక్ష రాసి జూన్ పన్నెండు న డాక్టరేట్ పొందాడు .’’Hahn ‘’అనే ఆయన కాంట్ పేరు ను రిజిస్టర్ చేశాడు .అప్పుడు కాంట్ ‘’on the essay  and through instruction in philosophy ‘’అనే విషయం మీద గొప్ప ఉపన్యాసం ఇచ్చాడు .దీనితో కాంట్ కు ప్రాముఖ్యం పెరిగింది .ఆయనది ‘’ఎక్సెలెంట్ బ్రెయిన్’’ అన్నారంతా .  కాంట్ రాసిన’’ a new exposition of the first principle of meta physics ‘’చూసిన  కొనిగ్స్ బర్గ్ వర్సిటి అధికారులు అదేయూని వర్సిటి లో లెక్చర్లు ఇవ్వటానికి అంగీకరించారు .1755  నాటికి కాంట్ ప్రతిభ తెలియని వారే లేక పోయారు .1756 లో లిస్బన్ లో జరిగిన మూడు భూకంపాలపై మూడు వ్యాసాలూ రాశాడు .1756 లో ఏప్రిల్ 25 న రాసిన ‘’new remarks about the explanation on the theory of winds ‘’ను సమ్మర్ సెమిస్టర్ కు విషయం గా ఎంచుకొన్నాడు

లీబ్నిజ్  ,ఉల్ఫ్ ల రెండు ప్రాధమిక సిద్ధాంతాలకు కాంట్ అభ్యంతరం చెప్పాడు .అవే ‘’ప్రిన్సిపిల్  ఆఫ్ కాంట్ర డిక్షన్ ,ప్రిన్సిపిల్ ఆఫ్ సఫీషి ఎంట్ రీజన్’’ .కాంట్ సఫీషి ఎంట్ రీజన్ ను మార్చి కొత్త నిర్వచనమిచ్చాడు కొత్త పద్ధతిని ఆచరణ లోకి తెచ్చాడు .అదే ‘’the system of universal connection of substances ‘’కాంట్ దృష్టిలో దేవుడు ఒక ప్రాధమిక పదార్ధం .అదే విశ్వమంతా వ్యాపించి ఉంటుంది .మొదట్లో దానికి చలనం లేదు .మొదటి చలనం దేవుడి నుంచి రాలేదు ప్రకృతి శక్తుల ప్రభావం వల్లనే చలనం వచ్చింది  ఆ చలనం నిరంతరం అనంతం గా సాగి పోతుంది .మన ఆత్మ ఏదో ఒక గ్రహం లో ఉండే ఉంటుంది అంటాడు కాంట్ .ప్రపంచానికి ప్రారంభం ఉంది కాని అంతం లేదు .’’నాకు పదార్ధాన్ని ఇస్తే ప్రపంచం ఎలా ప్రభవిన్చిందో చూపిస్తాను ‘’అనే వాడు కాంట్ .

1796 లో ‘’లాప్ లేస్ ‘’చెప్పినటు వంటిదే కాంట్ చెప్పిన ‘’జెనరల్ థీరి ‘’ఇదే19 వ శతాబ్దం లో ‘’కాంట్ –లాప్ లేస్ ‘’సిద్ధాంతం అయింది .ఈ సిద్ధాంతం కాంట్ బ్రతికుండగా ప్రాచుర్యం పొందలేదు .దీనికి కారణం పబ్లిషర్ దివాలా తీయటం ఒకటి అయితే రెండో కారణం చాలా కాపీలు పబ్లిషర్ ఇంట్లో నాశనం కావటం .ఇప్పుడు కాంట్ మీజిస్టర్ అయ్యాడు కనుక యూని వర్సిటి లో సబ్జెక్టులు బోధించటానికి అర్హుడు కూడా అయ్యాడు .వర్సిటి మాత్రం దీనికి జీతం ఏమీ ఇవ్వదు .విద్యార్ధుల ఫీజులే ఆధారం .వేరే ఆదాయం లేక పొతే బతకటం కష్టమే .లెక్చరర్లు యూని వర్సిటి రూముల్లో కాకుండా ప్రైవేట్ లెక్చర్ హాల్స్ లో పాఠాలు బోధించాలి .

కాంట్ బోధించే హాల్స్ అన్నీ విద్యార్ధులతో నిండి పోయేవి .అంత మాత్రం చేత అందరికీ ఆయన ఇష్టం అని ఏమీ భావిన్చక్కరలేదు .జీవిక కోసం చాలా లేక్చర్లిచ్చాడు 1755-56- మొదటి సెమిస్టర్ లో లాజిక్ ,మెటాఫిజిక్స్ ,గణితం ,ఫిజిక్స్ బోధించాడు .సమ్మర్ సెమిస్టర్ లో జాగ్రఫీ ,ఎథిక్స్ చెప్పాడు దాదాపు 16-24 లెక్చర్లు ఇచ్చేవాడు .ఇంత అరచుకొన్నా ఆదాయం మాత్రం అంతంత మాత్రమె .ఆయన దగ్గర ఖజానా లో 20 బంగారు నాణాలున్దేవి .వాటిని చాలా భద్రం గా దాచుకొనే వాడు ఎప్పుడే అవసరం వస్తుందో నని జాగ్రత్త .కాని వాటి జోలికేప్పుడూ పోలేదు దానిని కాంట్ ‘’ఐరన్ రిజర్వ్ ‘’అని ముద్దుగా పిలుచుకొనే వాడు .చినిగే దాకా ఒకే కోటు వేసే వాడు స్నేహితులు కొత్తది కొనిస్తామన్నా వద్దని వారించే వాడు .మొదటి మూడేళ్ళు ఇబ్బందులతోనే గడిపాడు .తరువాత కొంత నయం .మంచి బోధకుడిగా కాంట్ పేరు మారు మ్రోగింది .కాంట్ ఖచ్చిత మైన ఆహార నియమాలేవీ పాటించి నట్లు కనీ పించదు .కానీ ఆయన ఖచ్చిత మైన దిన చర్య ను మాత్రం పాటించాడు

కాంట్ దిన చర్య

కాంట్ దిన చర్య గురించి చరిత్రకారు లందరూ ప్రస్తావించారు .ఆయన గడియారానికే సమయ పాలన చెప్పి నట్లు గా ప్రవర్తించే వాడు కార్య క్రమాలన్ని సమయ బద్ధం గా ,అన్నికాలాల్లోను జరిగి పోయేవి నియమ ,నిస్ట ఉన్న చింతనా పరుడు కాంట్ .ఉదయం అయిదింటికే నిద్ర లేవటం కాఫీ తాగటం రాసుకోవటం కాలేజికి వెళ్లి పాఠాలు చెప్పటం ,మధ్యాహ్నం ఒంటి గంటకు ఎక్కడ వీలైతే అక్కడే భోజనం చేయటం.సాయంత్రం షికారు అన్నీ సమయాన్ని పాటించి చేసే వాడు వాహ్యాళి చేసి సాయంత్రం ఇంటికి తిరిగి వచ్చి కిటికీ లోంచి చర్చి గోపురాన్ని చూస్తూ ధ్యాన నిమగ్నడయ్యే వాడు ఖచ్చితం గా రాత్రి పదింటికి  నిద్ర పోయే వాడు .

ఖచ్చితం గా మధ్యాహ్నం3-30 కి వీధి గుమ్మం దాటి షికారుకు బయల్దేరే వాడు .ఒక్క సెకను అటూ ఇటూ ఉండేది కాదు .ఆయన్ను చూసి గడియారాల టైం ను సరి చేసుకొనే వారు ‘’.lime tru ‘’ అనే ప్రదేశం లో షికారు చేసి,ఇల్లు చేరే వాడు .ఆయన వాహ్యాళి చేసిన ఆ ప్రదేశాన్ని ‘’ఫిలాసఫర్స్ వాక్ ‘’అనే వారట..వాన వస్తే ,ఆయన దగ్గర పని చేసే ముసలి నౌకరు గొడుగు పట్టి వెనక నడిచే వాడు .30 ఏళ్ళు గా కాంట్ దిన చర్య లో ఏ మాత్రం మార్పు లేదు దటీజ్ కాంట్ ..

ఆరోగ్యాన్ని చాలా జాగ్రత్త గా కాపాడుకొనే వాడు .బజారు లోకి వస్తే నోట్లోంచి గాలి లోపలకు పోకుండా జాగ్రత్త పడే వాడు .రోగ కారక సూక్ష్మ జీవులు నోట్లోంచి శరీరం లోకి వ్యాపిస్తాయనే ఈ జాగ్రత్త .మితం గానే భోజనం చేసే వాడు .దారిలో తెలిసిన వారు నీ పించినా మితం గానే మాట్లాడే వాడు .కాలక్షేపానికి పేక ఆడే వాడు .బిలియర్డ్స్ కూడా ఇష్టం గా ఆడే వాడు .ఆయన చెప్పుకొనే ‘’లక్సరీ ‘’అంటే విలాసం ఒక్కటే అదే పైప్ కాల్చటం

అమోఘ పాండిత్యం

కాంట్ కు ఈస్తటిక్స్ అంటే ఏమిటో తెలియదు .కవిత్వం ,సంగీతం పట్ల మోజు లేదు .తత్వా శాస్త్ర చరిత్రనే ఆయన అభ్య సించ లేదు .ఇది మరీ విడ్డూరం .లీబ్నిజ్ ,వోల్టైర్ ,ఉల్ఫ్ ,రూసో లను కాచి వడబోశాడు కాంట్ .బ్రిటిష్ తత్వ శాస్త్ర ,సాహిత్యాలను అధ్యయనం చేశాడు .న్యూటన్ ఆవిష్కరించిన సిద్ధాంతాలను జీర్ణించుకొన్నాడు .మేధావి కాంట్ తత్వ వేత్త కంటే  సైంటిస్ట్ గానే జీవించాడు తనకు తెలిసిన విజ్ఞానాన్ని అందరికి అందించాలన్న తపన తో సులభ శైలిలో ఫిజిక్స్ ,ఖగోళ ,భూగర్భ ,ఆన్త్రో పాలజీ లపై గ్రంధాలు రాశాడు .డార్విన్  చెప్పిన జీవ పరిణామ సిద్ధాంతాన్ని ఒంట బట్టించుకొని దాని వ్యాప్తికి మార్గం సుగమం చేశాడు .

సశేషం

67 వ భారత స్వాతంత్ర్య దినోత్సవ శుభా కాంక్షలతో

మీ—గబ్బిటదుర్గా ప్రసాద్ –15-8-13 –ఉయ్యూరు

 

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

తెలుగు జాతి ఘన కీర్తి చరిత్ర -లేదురా మన వంటి జాతి ఇంకెందు

telugu jati ghana keerti -1 telugu jati ghana keerti -2 telugu jati ghana keerti -3 telugu jati ghana keerti -4

Posted in సేకరణలు | Tagged | Leave a comment

ఆంధ్రపత్రిక 15th ఆగష్టు 1945

Freedom Independence 15 8 1947R

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

గణిత విజ్ఞాన వేదాంత తత్వ శాస్త్ర కోవిదుడు –ఇమాన్యుల్ కాంట్- 5

   గణిత విజ్ఞాన వేదాంత తత్వ శాస్త్ర కోవిదుడు –ఇమాన్యుల్ కాంట్- 5

రచనా వ్యాసంగం

భౌగోళికం గా కొనిగ్స్ బర్గ్ చాలా మారు మూల ఉండటం వల్ల  ఇక్కడి యూని వర్సిటి లో అన్ని ఫాకల్టీ లను బాగా బోధించే వారు కాదు .కొన్ని అసలు బోధనకే నోచుకో లేదు .ప్రయోగాత్మక భౌతిక శాస్త్ర బోధనా ఉన్నా సరైన ప్రయోగ శాలలు లేవు .బీద విద్యార్ధులు ఎక్కువగా ఇక్కడ ఉండటమే అసలు కారణం .అంటే తగినంత ఆర్ధిక ననరులు ఉండేవికావు .జర్మనీ లో అన్ని చోట్ల కంటే ఇక్కడ జీవ శాస్త్ర బోధన పరమ నాసి రకం గా ఉండేది .1744లో ఈ వర్సిటి లో 44మంది ప్రోఫెసర్లుండే వారు .జీతాలు చాలా తక్కువగా ఇచ్చేవారు .లెక్చరర్లకు అసలు జీతాలే ఉండేవికావు .విద్యార్ధులు కట్టే ఫీజుల మీదే వారి ఆధారం .అందుకే జీవనానికి వేరే మార్గం లో సంపాదిన్చుకోవాల్సి వచ్చేది .కొంత మందిలెక్చరర్లు  విద్యార్ధుల కోసం డార్మిటరీ లు నిర్వహించేవారు కొందరు విద్యార్ధులను తమ ఇళ్ళల్లోనే ఉంచుకొనే వారు .ఫిలాసఫర్ లకు అందరి కంటే అతి తక్కువ జీతాలు ఉండేవి. సాధారణం గా ఫిలాసఫీ కి అంత గిరాకీ ఉండేది కాదు .దియాలజీ కి మంచి క్రేజ్ ఉండేది .దీన్ని బోధించే ప్రొఫెసర్లకు జీతాలు బాగా ఎక్కువ .వీరికి పలుకు బడి కూడా అధికం గా ఉండేది .ఇక్కడి ప్రొటెస్టెంట్ మతం లో అరిస్టాటిల్ సిద్ధాంత బోధనే ఎక్కువ గా ఉండేది .క్రమం గా మతాధి పతుల పెత్తనాన్ని తగ్గించేశారు .ఇమాన్యుల్ కాంట్ చేరే నాటికి దాన్ని ఇంకా బోధిస్తూనే ఉన్నారు .

1726 లో ‘’హాల్లె ‘’సిద్ధాంతాలతో దియాలజి ని బోధించాలని నిర్ణయించారు .కొనిగ్స్ బర్గ్ లోని ప్రీస్ట్ అయిన అబ్రహాం ఉల్ఫ్ వద్ద శుద్ధత్వం (కేరక్టర్ ),విద్యా సర్టిఫికేట్ లు ఉంటేనే మతాధికారి గా నియమించే వారు .పీటిస్ట్ ల ప్రభావం 1740 వరకు ఉచ్చ స్తితి లో ఉండేది .కాంట్ యూని వర్సిటి లో చేరే నాటికి ఫిలాసఫీ లో ఎనిమిది మంది ప్రోఫెసర్లుండే వారు ..ఎంతో మంది అసోసియేట్ ప్రొఫెసర్లు గా ఉండే వారు .వీరికి తోడూ లేక్చరర్లుండే  వారు .వీరంతా గ్రీక్ ,హీబ్రు ,ఛందస్సు ,కవిత్వం ,చరిత్ర ,తర్కం ,వేదాంతం ,అనుస్టాన వేదాంతం ,గణితం ,భౌతిక శాస్త్రాలు బోధించే వారు .జర్మనీ లోని మిగిలిన యూని వర్సిటీల కంటే కొనిగ్స్ బర్గ్ లో ‘’మెటా ఫిజిక్స్‘’నేర్చుకొనే వారు ఎక్కువ అని విజిటర్లు సంతోషించేవారు .ఇదే సమయం లో Knewtzen ‘’అనే ఆయన జర్మనీ భాష లో ‘’philosophical proof of Christianity ‘’రాసి ప్రచురించాడు ఆయన పద్దెనిమిదవ శతాబ్దపు గొప్ప ఫిలాసఫర్ .ఈ విశ్వ విద్యాలయం లోనే కాంట్ కు ఫిలాసఫీ ,దియాలజి ,నేచురల్ సైన్స్ లతో గాఢ పరిచయ మేర్పడింది .అప్పటికి ఫిజికల్ సైన్స్ లో ముఖ్యం గా ఖగోళ శాస్త్రం లో గొప్ప పండితులేవరూ లేరు .ధీ రిటి కల్ ,ప్రాక్టికల్ ఫిజిక్స్ లలో కాంట్ సాధించింది ఇక్కడేమీ కనీ పించదు .

కాంట్ లోని అసమాన వేదావితనం వల్ల  యూని వర్సిటి లో చేరిన నాలుగేళ్ళకే ‘’thoughts on the true estimation living forces ‘’ అనే గొప్ప వ్యాసాన్ని రాశాడు అంటే ఇరవై ఏళ్ళ వయసులో రాశాడన్న మాట .. ఈ రచనకు తనను ప్రేరేపించిన్దేమితో కాంట్ ముందు మాటల్లో ఏమీ చెప్ప లేదు .ఆయన చేసిన ‘’the great masters of knowledge ‘’అనేది లీబ్నిజ్ ,న్యూటన్ లను ఉద్దేశించికాదుకూడా .  జర్మని పబ్లిక్  కంటే కొనిగ్స్ బర్గ్  ఎకాడమిక్ కమ్యూనిటీ ని ఉద్దేశించే రాసినట్లున్తుంది . కాంట్ ‘’మెటాఫిజికల్ కాన్సెప్ట్స్ ‘’ప్రవేశ పెట్టటం ప్రారంభించాడు .’’కదిలే వస్తువులు  లోపల ఉన్న ఫ్రీ మోషన్ వల్ల  కదుల్తాయి ‘’అని చెప్పాడు .అందుకే వేగం ఎప్పుడూ సమానం గా నే ఉంటుందని వివరించాడు .వస్తువుల స్వేచ్చ ,అనంత వేగం లను కొలవటానికి ‘’లివింగ్ ఫోర్స్ ‘’మాత్రమె కారణం అన్నాడు .దీన్ని లీబ్నిజ్ సిద్ధాంతాల నాధారం గానే అర్ధం చేసుకోవాలి .’’ఫ్రీ మోషన్ ఉన్నప్పుడే లివింగ్ ఫోర్స్ ‘’ఉంటుందని తేల్చాడు .ఈ లివింగ్ ఫోర్స్ ‘’monad ‘’తో సంబంధం కలిగి ఉంటుందని చెప్పాడు .’’ప్రపంచ స్తితి ముందే ఏర్పాటు చేయ బడి ఉంటుంది’’ అన్నది కాంట్ భావన .వస్తువుల లోని అంతరిక సిద్ధాంతాలు బయటి వాటితో ఏక స్వరం తో అంటే ‘’హార్మని’’తో ఉంటాయి అంటే లోపలి వాటికి బయటి వాటికి వ్యతిరేకత ఉండదు .’’ఆత్మకు దాని చలనం దానికి ఉంటుంది .ఇది ఇతర మైన వాటిని కదిలించనూ గల శక్తి కలిగి ఉంటుంది ‘’అని సిద్ధాంతీకరించాడు

1744 లో అంటే కాంట్ కు ఇరవయ్యి ఏళ్ళు వచ్చే  తండ్రి చని పోయాడు .కుటుంబ బాధ్యత అంతా పేద్ద వాడైన కాంట్ మీదే పడింది .కాంట్’’ మెటా ఫిజిక్స్ ఆఫ్ మోరల్స్ ‘’రాసి  నట్లే కుటుంబానికి ఎక్కువ సమయం కేటాయించి వారి ఆలనా పాలనా చూశాడు .1748 లో ప్రైవేట్ ట్యూటర్ గా ‘’Judschen ,Arnsdorf ,Rauten burg లలో పని చేశాడు తండ్రి ఎస్టేట్ వ్యవహారాలూ చూశాడు .కాంట్ విద్యార్ధి జీవితం అంత ఆనందమయం గా గడవ లేదు .ఆర్ధిక సమస్యలే కాదు అయన  స్వేచ్చ బౌద్ధిక ఎదుగుదలకు అడ్డంకు లేర్పడ్డాయి .ఇరవైనాలుగు ఏళ్ళకే   స్వంత కాళ్ళ మీద నిల బడి తన సత్తాను చాటుకొన్నాడు . సమూలం గా జీవితాన్ని మార్చుకో గలిగాడు .

ఫాస్టర్ ఆన్ ద్డ్రీచ్చ్ ,బెర్న్ హార్డ్ ఫ్రీడ్రిచ్ వాన్ హోల్సన్ ,కీసర్లిన్గ్స్ అనే వారు తమ పిల్లలకు కాంట్ తో చదువు చెప్పించుకొన్నారు .అది ఆ విద్యార్ధులకు పట్టిన అరుదైన అదృష్టమే ఆన్డ్రిచ్ కున్న  అయిదుగురు కొడుకులలో ముగ్గురికి కాంట్ చదువు చెప్పాడు .అందులో ఒకడు ‘’వైన్ మర్చంట్ ‘’అయ్యాడు .కాంట్ కు ఆ తర్వాతా మంచి దోస్త్ గా ఉన్నాడు కూడా .కొనిగ్స్ బర్గ్ కు అరవై మైళ్ళ దూరం లో ‘’హల్సన్ ‘’గారి ఎస్టేట్ ఉంది .ఈ కుటుంబం తో కాంట్ కు మంచి అను బంధమేర్పడింది .ఆయన అక్కడి నుండి వెళ్లి పోయిన తర్వాతా కూడా కాంట్ తో ఉత్తర ప్రత్యుత్తరాలు జరిపే వాడు .ఆ రోజుల్లో ప్రైవేట్ ట్యూటర్ ను ‘’hofmeister ‘’అనే వారు కాంట్ తనను గూర్చి చెప్పుకొంటూ .’’ I am worsr private teacher or hofmeister ‘’అని అనుకొన్నాడు .అదొక బాదర బందీ వ్యవహారం అని పించేది ఆయనకు .కాని తనకు తెలియ కుండానే గొప్ప టీచర్ అని పించుకొన్నాడు కాంట్ .ఈ ‘హాఫ్ మీస్టర్  ‘’’గా ఉన్నకాలం లో తన విధానాలకు  ,నైపుణ్యానికి మెరుగులు దిద్దు కొన్నాడు .ఇలా జీవితాన్ని గడుపుతూనే ‘’general natural history and theory of the Heavens or An essay on the constitution and mechanical origin of the whole Universe Treated in accordance with Newtonian principles ‘’రాయటం పై ద్రుష్టి సారించాడు

సశేషం

మీ –గబ్బిటదుర్గా ప్రసాద్ –14-8-13- ఉయ్యూరు

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

స్వాతంత్ర్య సిద్ధి -పద్యాలు ,తెలుగు మాట్లాడే ప్రాంతాలు

telugu bhaashaa saamskrutika chitrapatamsvatantrya siddhi

Posted in సేకరణలు | Tagged | Leave a comment

శ్రీ కృష్ణుడి ఎదో గీత ఇదే

sri krishna commission -5 chapter

Posted in సేకరణలు | Tagged | Leave a comment

ప్రాచీనాంధ్ర గ్రంధ మాల – విజయవాడ Antique Book Store – Vijayawada

Narra Jaganmohan Rao R1

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

ద్రవ ఆధునికత -రెండు ప్రశ్నలు -వి.వి.న మూర్తి

drava adhunikatha rendu prashnalu

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

వెండితెర బంగారం

telugu sinema

Posted in సినిమా | Tagged | Leave a comment

గణిత విజ్ఞాన వేదాంత తత్వ శాస్త్రజ్ఞుడు –ఇమాన్యుల్ కాంట్ -4

      గణిత విజ్ఞాన వేదాంత తత్వ శాస్త్రజ్ఞుడు –ఇమాన్యుల్ కాంట్ -4

            కాంట్ యవ్వనం, ఉన్నత విద్య ,  సంపాదన 

   సాధారణం గా యవ్వన ప్రాదుర్భావం లో శరీరం లో అనేక మార్పులు వచ్చి రూపు రేఖలు ఏర్పడి స్తిరత్వాన్ని పొందుతాయి .కాంట్ రూపు రేఖలేలా ఉన్నాయో తెలుసు కొందాం .కాంట్ అందమైన వాడని ఏ చరిత్ర కారుడూ చెప్ప లేదు .వికార స్వరూపుడు గానే అందరూ రాశారు అయిదు అడుగుల ఎత్తు  మాత్రమె ఉన్న వామనా కారి కాంట్ .చాలా బలహీనం గా ఉండేవాడు .అందుకే అర్భకుడు అన్నారు .పొట్ట లావు గా ఉండేది .చాతీ సిమెంటు బల్లలా ఉండేది .వీటికి తోడు భుజం వంకర గా ఉండటం తో ‘’అష్టా వక్రుడు ‘’గా కనీ పించే వాడు .మహా వేదాంతి,గ్రీకు తత్వ వేత్త సోక్రటీస్ కూడా ఇదే ఆకారం లో ఉండే వాడట .ఇలాంటి మహాను భావులకు అందం తో ఏమి పని ? వారి హృదయం, మనసు మేధా సంపత్తి  అన్నీ ఎంతో అందమైనవి .కనుక వారినేమీ బాహ్య రూపం బాధించలేదు అంతస్సౌన్దర్యం నిండిన మహాత్ములీ ఇద్దరు .ఇమాన్యుల్ కాంట్ మాట్లాడుతుంటే అదొక వాక్ ప్రవాహమే .మంత్రం ముగ్ధులై శ్రోతలు ఆ ఝరీ ప్రవాహం లో కొట్టుకొని పోయే వారు .అప్పుడాయన బాహ్య రూపం ఏమీ వారికి కనీ పించేదికాదు అసలు దాని పై వారికి దృష్టే ఉండేదికాదట .వికారానికి ఆయన మాటల్లో ఉండే చెణుకులు హాస్యాం మందుగా పని చేసిందేమో నని పించేది .నవ్విస్తూ చతురోక్తులతో ,చక్కని సంభాషణా చాతుర్యం తో ,శైలితో శ్రోతలను కాంట్ ఆకర్షించే వాడు .ఎంత కష్టమైన విషయాన్నైనా అలవోకగా అరటి పండు ఒలిచి చేతిలో పెట్టినట్లు చెప్పగల నైపుణ్యం, నేర్పూ ఉన్న వాడు వాగ్ధాటి ,పాండిత్యం ప్రతిభ అవగాహనా ,పూర్వాపరాలతో మనసుల్ని దోచుకొనే  ముగ్ధ మనోహర ఉపన్యాసకుడని పించుకొన్నాడు . .ఆడపిల్లల్ని ఆకర్షించే శారీరక సౌందర్యం లేక పోవటం వల్ల  కాంట్ ను వలచి వచ్చిన కన్య ఎవరూ లేక పోయారు .ఇది తీరని వెలితిగానే మిగిలి పోయింది .ఈయన కూడా ఏ అమ్మాయిని ప్రేమించినా అడుగు కూడా ముందుకేసే సాహసం చేయ లేక పోయాడు .కనుక జీవితాంతం పెళ్లి కాని బ్రహ్మ చారి గానే ఉండి  పోవాల్సి వచ్చింది .

 

 

 

        కొనిగ్స్ బర్గ్ యూని వర్సిటి లో పదహారవ ఏట 1740 లో కాంట్ చేరాడు .తత్వ శాస్త్రం ఫిజిక్స్ ,జామెట్రీ ,ఆల్జీబ్రా ,సైకాలజీ ,ఆస్ట్రానమి ,లాజిక్ సబ్జెక్టులు చదివాడు .కాంట్ చదువు కోసం తండ్రి చేసిన సాయం ఏమీ లేదు .తనతో చదివే,చదువులో వెనక బడిన విద్యార్ధులకు ట్యూషన్ చెప్పి డబ్బు సంపాదించి దాంతో చదువుకొనే వాడు ,జీవించే వాడు ..ఇప్పుడే మొదటి విలియం మరణించి అయన కొడుకు రెండవ విలియం రాజయ్యాడు .యూని వర్సిటి లో చేరిన తర్వాత కాంట్ జీవితం లో గొప్ప మార్పు వచ్చింది .తనకు కావలసిన సబ్జెక్ట్ తీసుకొనే స్వేచ్చా ,రోజంతా తనకిస్ట మై నట్లు గడిపే స్వాతంత్రం లభించటం వల్ల  హాయిగా ఉందని పించింది .ఏది ఎప్పుడు ఎలా చెయ్యాలో చెప్పే వారే లేరు .తండ్రితో ఉన్న ఇంటిని వదిలేసి వచ్చేశాడు .స్వంత గదినొక దాన్ని ఏర్పరచుకొని ,యూని వర్సిటి కి బయటే ఉన్నాడు .యూని వర్సిటి మెంబర్ అవటం వల్లా ,ఎకడమిక్ సిటిజన్ అవటం వల్లా కొనిగ్స్బర్గ్  సిటీ అధికారుల ,అధికారాలకు లోను కావలసిన అవసరం లేకుండా పోయి పూర్తీ స్వేచ్చా జీవి అయ్యాడు .కాని యూని వర్సిటి అధికారులకు మాత్రం తల వంచక తప్పలేదు .అందువల్ల కాంట్ కు అనేక రకాల ప్రయోజనాలు అధికారాలు లభించాయి .ముఖ్యం గా నిర్బంధం గా సైన్యం లో చేరాల్సిన పని తప్పింది ..ఈ యూని వర్సిటి లో చేరటం తో జీవితాంతం దానితో శాశ్వత అను బంధమేర్పడింది .

       1940 సెప్టెంబర్ 24 న కాంట్ తన పేరు  ‘’Emanuel Kant ‘’గా యూని వర్సిటి రికార్డులలో రిజిస్టర్ అయింది .ఇక్కడ చేరటాన్ని కాంట్ సరదాగా ‘’టౌన్ లో నుంచి ‘’గౌన్ ‘’లోకి ప్రవేశించటం ‘’అని చమత్కరించాడు .దీనితో ఉన్నత గౌరవాలు పొందే అర్హత ఏర్పడింది .సరిగ్గా పదహారేళ్ళ వయసులో ఇంత అద్భుత మైన మార్పు తన జీవితం లో జరిగిందని ఏంతో  సంబర పడి  పోయాడుకాంట్.  .’’కోలీజియం ఫ్రేడ రీషి యం ‘’నుంచి పట్టా పుచ్చుకొన్న తర్వాత ఇక్కడ పెట్టిన ప్రాధమిక పరీక్షలో అతి తేలికగా గట్టేక్కేశాడు .కాంట్ కోలీజియం లో స్తైఫండ్డ్ కాని ,ఫెలోషిప్ కాని తీసుకో లేదు .బోధనా కూడా చేయక పోవటం కూడా ప్రత్యేకతే .తన దారేదో తానూ ఏర్పరచుకొన్నాడు క్లాసిక్స్ నే వృత్తి గా తీసుకోవాలని మొదట భావించినా ఫిలాసఫీ ని మొదటి విషయం గా ఎన్నుకొని చదివాడు .

      ఇక్కడే కాంట్ కు Christoph Freidrich Heilsberg  .,అనే ఆయన సహాధ్యాయి అయ్యాడు .మంచి స్నేహితుడూ అయ్యాడు .కాంట్ కు ఒక ఏడాది జూనియర్ ఈయన .ఇద్దరూ ఒకే క్వార్టర్ లో ఉండే వారు .Wolmer ‘ఆదేశం మేరకు హీల్స్ బెర్గ్ మొదలైన వారికి కాంట్ ఫిలాసఫీ పుస్తకాలు ఇచ్చాడు .వారికి స్వయం గా బోధనా చేశాడు .క్రమంగా డబ్బు సంపాదన కోసం ఇతర విద్యార్ధులకూ బోధించటం ప్రారంభించాడు .వారందరూ కాంట్ కు అనేక రకాలుగా సాయం చేసి కృతజ్ఞత తెలుపు కొన్నారు .కాంట్ కు కావలసిన సదుపాయాలూ కల్పించారు .కాఫీ ,రొట్టెలను అంద జేసే వారు . ..వోల్మార్ బెర్లిన్ కు చేరడం తో ఆయన స్తానం లో ఉన్న Bellan Kallenberg ‘’కాంట్ కు ఉచిత క్వార్టర్ ను ఏర్పరచి అవసరమైన సాయం చేశాడు .కాంట్ తండ్రి చని పోయిన తర్వాత బాబాయి ‘’Richter ‘’ అనే చెప్పులు కుట్టే ఆయన చిన్న తమ్ముడిని దగ్గరకు తీసుకొని పోషించాడు .కాంట్ బయటికి వెళ్ళే టప్పుడు అరువు తెచ్చుకొన్న కోటు ,పాంటు, చెప్పులు వేసుకొని వెళ్ళే వాడు అంత బీదరికం అనుభవించాడుకాంట్ .ఇవేవైనా చిరిగి పోయి పాడై  పోతే స్నేహ బృందం డబ్బులు వసూలు చేసి కొత్తవి కొనిచ్చే వారు .ఇదే కాంట్ కున్న గొప్ప ‘’ఫ్రేటర్నిటి’’అంటే స్నేహ బృందం ..ఆ రోజుల్లో యూని వర్సిటి విద్యార్ధులు తాగుడు ,ఫైటింగ్ మొదలైన వ్యసనాలకు పూర్తిగా బానిసలై పోయే వారు .కాంట్ వీటన్నిటికి దూరం గా జీవించి తన ప్రత్యేకత ను రుజువు చేసుకొన్నాడు .ఆదర్శం గా జీవించాడు మార్గ దర్శీ అయ్యాడు .

       కాంట్ –యువ విద్యార్ధులకు సబ్జెక్టులు బోధించటం మాత్రమె కాదు ,వారి శీల ప్రవర్తనల లో గణనీయ ప్రభావం కలిగించాడు .కాంట్ నే విద్యార్ధులు ‘’నైతిక గురువు ‘’గా భావించి గౌర వించే వారు .అక్కడాయన పని చేసినంత కాలం వారిపై కాంట్ ప్రభావం ఉండేది .కాంట్ గారు’’ నవ్వటాన్ని’’ ఎవ్వరూ చూడలేదట .ఈ విషయాన్ని ఆయనే స్వయం గా వెల్లడించాడు కూడా .’’ఎరాస్మస్ ,రోటే న్ డాం ,మాంటేగ్ ‘’ లరచనలు చదివి ప్రపంచం లో ఉన్న మంచిని పెంచుకోమని విద్యార్ధులకు సలహా ఇచ్చేవాడు కాంట్ . ఆట స్తలం లో పెద్దగా కాంట్ ఆడిన ట్లు లేదు .కాని ‘’బిలియర్డ్స్ ‘’మాత్రం చాలా ఇష్టం గా ఆడే వాడని హీల్స్ బెర్గ్ చెప్పాడు .

      1700 ప్రాంతం లో జర్మని లో 28 యూని వర్సిటి లున్దేవట .దాదాపు అన్నీ చిన్నవే .మొత్తం 900 మంది విద్యార్దులుందే వారు .1760 లో సంఖ్య ఏడు వేలకు పడి పోయింది .ఆ తర్వాతా అయిదు కొత్త వర్సిటీలు వచ్చినా పరిస్తితి మారలేదు .ప్రష్యా లోని ‘’ఆల్బెర్ర్తినా ‘యూని వర్సిటి ఉన్న రెండు పెద్ద వాటిలో ఒకటి .కొనిగ్స్ బర్గ్ లో ఇతర దేశీయ విద్యార్ధులూ చేరి చదివే వారు .పోలాండ్ ,లుదివేనియాల నుండి వచ్చి చేరే వారు .’ఇక్కడ వేదాంతం చదివే వారికి హాలీ యూని వర్సిటీ లో రెండేళ్ళు చదవాల్సిన అవసరం ఉండేది కాదు .అంటే అంత ఉన్నత ప్రమాణం లో దీన్ని బోధించే వారన్న మాట .      సశేషం

     మీ—గబ్బిటదుర్గా ప్రసాద్ -13-8-13- ఉయ్యూరు 

 
 
Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

సరస భారతి 49 వ సమావేశం –శ్రీ కృష్ణాష్టమి వేడుకలు -27-8-20013 మంగళ వారం

              అక్షరం లోక రక్షకం

                                                                                   సరస భారతి

 సాహిత్య సాంస్కృతిక సంస్థ –ఉయ్యూరు

  

తేది సమయం –27-8-20013 మంగళ వారం –సాయంత్రం -6-30 ని లకు

వేదిక –శ్రీ సువర్చ లాంజనేయ స్వామి  దేవాలయం

విషయం –శ్రీ కృష్ణ జన్మాష్టమి సందర్భం గా వేడుకలు

ధార్మిక ఉపన్యాసం –  శ్రీ కృష్ణ వైభవం

 ఉపన్యాసకులు –     శ్రీ ఏ. త్రినాధ శర్మ ఏం ఏ.బి.యిడి 

 శ్రీ కృష్ణ జననం –పోతన భాగవతం నుండి పద్య పఠనం

  రాత్రి -7-30 ని కు –బాల బాలికలకు శ్రీ కృష్ణ వేషధారణ పోటీలు

                        మరియు బహుమతి ప్రదానం

        అందరూ ఆహ్వానితులే.  .విచ్చేసి కార్యక్రమాన్ని జయ ప్రదం చేయ ప్రార్ధన

జోశ్యుల శ్యామలాదేవి –మాదిరాజు శివ లక్ష్మి –గబ్బిట వెంకట రమణ –గబ్బిట  దుర్గా ప్రసాద్

గౌరవాధ్యక్షులు              కార్య దర్శి —            కోశాధికారి —           అధ్యక్షులు

                                                                                   సరస భారతి –

                                                                                    ఉయ్యూరు

                                                                                 ఫోన్ –9989066375

                                                                                                              08676-232797                        

Posted in సరసభారతి ఉయ్యూరు | Tagged | Leave a comment

వి ‘’భజన ‘’పరులు

       వి ‘’భజన ‘’పరులు

    ఇద్దరూ ఒక్క పార్టీ వాళ్ళే

     ఏక వాక్యం తో విభ (భు )జించితే కేరింతలతో

    ‘’వీర భక్తి’’ ప్రదర్శించిన వారు కొందరు 

       ఒక్క కలం పోటు తో ముక్కలు చేసినందుకు

       ‘’వైర భక్తి  ‘’ ప్రదర్శించారు ఇంకొందరు

        మొదటి వారు -ఇచ్చినమ్మ అత్తకు భర్తకూ

        హారాలు ఫలహారాలూ పాలాభిషేకాలు చేస్తే

         రెండో వారు అవే బొమ్మలకు

          చెప్పులదండలేసి చీకొట్టి విరగ్గొట్టారు

          పైనున్న గుడ్డి ప్రభుత్వం పార్టీ

          ఇద్దరూ తమ వారే నని భుజాలు చరచుకొన్నారు

          అత్త కంటే ఏడాకులేక్కువ చదివిందని వారంటే

          అత్తకన్నా పోడి చేసినావిడేం కాదని వీరంటారు

          అంతా ఆ తాను గుడ్డలే

          ఒకరిది వీరభక్తి వేరొకరిది వైర భక్తీ అంతే

           ఇద్దరి భజనా ఏక తీరు కాపోయినా ఏక వ్యక్తికే

          పాపం అక్కడొక ప్రధాని ఉన్నాడని ఒక ప్రభుత్వం ఉందని

          ఇక్కడా ఒక సి.ఏం ఉన్నాడని

         ఆయనకో ఆత్మ ఉందని అంతా మర్చిపోయారు

         డిప్యూటీ మాత్రం ఇష్టం వచ్చినట్లు నోరు పారేసుకో వచ్చు

          అసలు వారు మాత్రం నోరు మూసుకోవాలా ?

         అంటున్నారు రహస్యం తెలిసిన వాళ్ళు

          అందుకే ప్రజలు అన్ని వర్గాల వారు ఒక్క తాటి పై నిలిచి

           అందరికి బుద్ధి చెప్పటం ‘’తొమ్మిదో వింత’’ అయి కూర్చుంది

           రాజీ ‘’నామాలు ‘’పెట్టి ఇక మోసం చెయ్యలేని స్తితి కల్పించి

            మార్గ దర్శనం చేస్తున్న యువత విద్యార్ధి లోకం ,ఉద్యోగులు

           ప్రపంచ ద్రుష్టినే  ఆకర్షిస్తున్నారు

           పార్టీల కు అతీతం గా ఉద్యమించి సాధిస్తారని

          అందరి ప్రగాఢ విశ్వాసం

          ఇక ఎవ్వరూ తోక ఝాడించ లేరని

           నమ్ముతున్నారు ఆశా వాదులు .

         మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -10-8-13—ఉయ్యూరు

           

Posted in కవితలు | Tagged | 1 Comment

గణిత విజ్ఞాన వేదాంత తత్వ శాస్త్ర కోవిదుడు –ఇమాన్యుల్ కాంట్ -3

గణిత విజ్ఞాన వేదాంత తత్వ శాస్త్ర కోవిదుడు –ఇమాన్యుల్ కాంట్ -3

         కోలీజియం అనేది ‘’పీటిష్ ‘’వాళ్ళ స్కూలు .ఆధ్యాత్మిక అవినీతిని అంతం చేయటం సరైన నీతి ధర్మాలతో కూడిన క్రైస్తవాన్ని ఆచరించటం దీని ప్రత్యేకత .ప్రపంచ పరి రక్షణ ,సుహ్రుద్భావాన్ని నెలకొల్పటమే వీరి లక్ష్యం .జీవితం లోను ,చర్చి లోను ఉన్నత శ్రేణి నాయకులను తయారు చేసే సంస్థ .చాలా మంది విద్యార్ధులు దీనిలోనే ఉండి చదువు కొనే వారు .కొద్ది మందికి బయట నుండి వచ్చి చదువుకొనే అనుమతినిచ్చే వారు .కాంట్ ఇంటి నుండే వచ్చి ఇక్కడ చదివాడు  ఇక్కడ చదువు అంతా ఒక నిర్ణీత ఛట్రం లో బిగించి నట్లు నడిచేది .ఉదయం ఏడు గంటల నుండి సాయంత్రం నాలుగు గంటల వరకు బడి వేళలు.. ఉదయం 11నుండి ఒంటి గంట వరకు మధ్యాహ్న భోజన విరామ సమయం .వారానికి ఆరు రోజులు స్కూల్ ఉండేది .సెలవులు చాలా తక్కువ .ఈస్తర్ పండుగకు కొద్ది రోజులు సెలవులున్దేవి .అలాగే పెంతే కోస్ట్ ,క్రిస్మస్ సెలవులు ఉండేవి .

      గంటకు ఒక సబ్జెక్ట్ బోధించే వారు .ఉదయంఏడు నుంచి  ఎనిమిది గంటల వరకు వేదాంతం లో అయిదు క్లాసులు .ఎనిమిది నుండి పది గంటల వరకు లాటిన్ క్లాసులు .పది గంటల నుండి పదకొండు వరకు గ్రీక్ భాష లో పెద్ద క్లాసులు జరిగేవి .ఎక్కువ మంది విద్యార్ధులు లాటిన్ చదివే వారు .పద కొండు నుండి పన్నెండు వరకు కేటా  ఇంచిన గదిలో  భోజనం చేసే వారు .ఆ సమయం లోనే ఉపాధ్యాయులు కొందరు విద్యార్ధులకు ఉప యోగ పడే వి ఏవైనా చదివి విని పించే వారు .మధ్యాహ్నం పన్నెండు నుండి రెండు వరకు లాజిక్ ,హిస్టరీ ,ఫిలాసఫీ జాగ్రఫీ ,చర్చి చరిత్ర ,దస్తూరి మొదలైన  ఎవరికిష్టం అయిన ది వారు నేర్చుకొనే వారు .మధ్యాహ్నం రెండు గంటల నుండి మూడు వరకు హీబ్రూ భాష ,లెక్కల క్లాసులు ఉండేవి  బుధ ,శని వారాలలో కావాలను కొనే వారు లెక్కలు నేర్చు కోవచ్చు .మధ్యాహ్నం రెండు గంటల కాలం లో ఎవరికైనా ఇష్టమైతే గాత్ర సంగీతం నేర్చు కోవచ్చు .ఇదీ బిజీ షెడ్యూల్ .నేటి మన కాన్వెంట్ చదువుల్లాగా .

       మొదటి ఏడాది మత శిక్షణ లో ‘’లూధర్ గారి ప్రశ్నోత్తరాలు ‘’బట్టీ పట్టాలి .బైబిల్ కధలు చెబుతారు .రెండో ఏడు ప్రశ్నోత్తరాల తో బాటు ‘’సుదీర్ఘ సంభాషణలు ‘’నేర్వాలి .మరిన్ని బైబిల్ కధలు రావాలి .మూడవ ఏడాది కూడా ఇలానే కోన సాగుతుంది .నాల్గవ ఏడు ‘’cris toph starke –‘’order in tabular form ‘’ఉంటుంది .అయిదు ,ఆరు క్లాసులకు ‘’న్యు టెస్ట మెంట్ ‘’ను క్షుణ్ణం గా నేర్పిస్తారు . –

       కాంట్ కు ‘’ధియాలజీ’’ బుర్రకు ఎక్కనే లేదు .మూడవ ఏడాది గ్రీక్ ,లాటిన్ లను బాగానే నేర్చాడు .ఆయనకు ఇష్టం ఉన్నా లేక పోయినా దియాలజి లో మంచి ఫౌండేషన్ ఏర్పడింది .అదే జీవితాంతం జ్ఞాపకం ఉండి  పోయింది . కోలీజియం చదువులకు వెన్నెముక లాటిన్ భాష .కాంట్ కు లాటిన్ బాగా వచ్చేసేది .1739-40 లలో కాంట్ కు ఫిలాసఫీ మీద ఎక్కువ అభిమాన మేర్పడింది .క్లాసిక్స్ ఎందుకో రుచించ లేదు .ఆయనకు ఇష్టమైన టీచర్ లాటిన్ బాగా బోధించే ‘’Heyden reich ‘’ గారు .హిస్టరీ జాగ్రఫీ క్లాసులూ ఉండేవి అయితే అంత  ప్రాధాన్య మైనవి కావు .ఫ్రెంచ్ భాష నేర్వాల్సిన అవసరం ఉండేది కాదు .అది కావాలను కొన్న వారు బుధ ,శని వారాల్లో నేర్చుకోవచ్చు

        పీటిష్  విద్యా విధానం లో పిల్లల్ని కొట్టటం అనేది ఉండేది కాదు అదే క్రమ శిక్షణ కు మంచిది అని భావించే వారు .స్వయం క్రమ శిక్షనే ధ్యేయం అయినా అది పెద్ద గా ఫలితాన్నివ్వలేదు స్కూలు చదువు పూర్తీ అవటానికి మూడేళ్ళ ముందే కాంట్ తల్లి చని పోయిందని ముందే చెప్పుకొన్నాం .

     కాంట్ పుట్టి పెరిగిన కొనిగ్స్ బర్గ్ చుట్టూ ప్రక్కల ఉన్న రాజకీయ పరిస్తితులు

 ఆ నాటి ఫ్రెడరిక్ రాజు పాలన ను ‘’the age of enlightenment ‘’ అన్నాడు కాంట్ .కొనిగ్స్ బర్గ్ను  ‘’ఏకాంత బాక్ వాటర్ టౌన్ ‘’అని 18 వ శతాబ్దం లో పిలిచే వారు .ప్రష్యాకు  . ‘’సరి హద్దు నగరం ‘’అనే వారు .నిజం గా ఇది ప్రష్యా దేశానికి ఈశాన్యం గా ,రష్యా దేశానికి దగ్గరలో ఉంది .ప్రష్యా కంటే పోలాండ్ కు దగ్గర .గొప్ప ప్రాముఖ్యం ఉన్న నగరం కూడా .1706 లో కొనిగ్స్ బర్గ్ జనాభా 40 వేలు .1786 కు ఇది 56 వేలకు పెరిగింది .ప్రష్యా దేశం లోని ముఖ్య నగరాలలో కొనిగ్స్ బర్గ్ ఒకటి .ప్రష్యా రాజ్యం అప్పటికి బలహీనం గా నే ఉండేది .ప్రష్యా జనం తమను ప్రష్యన్లు అని అను కొనే వారు కాదు  .పైగా జర్మన్లు గానే భావించు కొంటారు .ప్రష్యన్లు అని అని పించుకొనే అర్హత కొనిగ్స్ బర్గ్ ,ఆ పరిసర వాసులకే ఉంది .ప్రష్యా రాజు బెర్లిన్ లో ఉంటాడు కొనిగ్స్ బర్గ్ కు బెర్లిన్ నగరం తో సాన్నిహిత్య సంబంధం ఉంది

     18 శతాబ్దం లో సైనికులు ప్రష్యా సైనిక స్తావరాలలో ఉండే వారు కాదు .సిటీ లోని పౌర స్తావరాలలోనే ఉండే వారు .దీని వల్ల  ఘర్షణలు ఎక్కువ గా జరిగేవి .కొత్త వారిని సైనికులు గా తీసుకోవాల్సి వస్తే పౌరులను నిర్బంధం గా చేర్చుకొనే వారు .అందుకని కాంట్ కు సైనికులపై సదభిపాయం ఏర్పడలేదు .కాంట్ యువకుడు గా ఎదిగే వరకు అక్కడ స్వేచ్చ .పరిణతి ఉండేవి ప్రభుత్వం చాలా క్రూరంగా ఉండేది .ఫ్రెడరిక్ మొదటి విలియం రాజు కాలం లో కొనిగ్స్ బర్గ్ ‘’అంతర్జాతీయ నౌకాశ్రయం ‘’గా రూపు దిద్దు కొంది.వ్యాపార లావాదేవీలు ఎక్కువే .అధికారులతో వ్యాపారస్తులతో కొనిగ్స్ బర్గ్ కళ  కళ  లాడేది ..కనుక ‘’బాక్ వాటర్ సిటి ‘’అన్న మాట నిజం కాదు .

    కాంట్ స్నేహితులు కూడా కొనిగ్స్ బర్గ్ చుట్టూ ప్రక్కల ప్రాంతాల వాళ్ళే .స్వేచ్చా వాణిజ్యం ,నైపుణ్యం ఉన్న కుటుంబాల పిల్లలే ఆయన స్నేహితులు .అయితే చిన్న నాటి స్నేహితు లేవర్నీ ఆయన వృద్ధాప్యం లో గుర్తు ఉంచుకోలేక పోయాడు పాపం .కాంట్ పెరిగిన వాతా వరం ఇలాంటిది అని చెప్పటానికే ఇదంతా ఆ వాతావరణం అత్యంత ప్రమాద కరమైంది అన్నాడు కాంట్ .ఎన్నో అగ్ని ప్రమాదాలు ,వరదలు తుఫాన్ల భీభాత్సాలతో  జన జీవితం ఎప్పుడూ అల్లకల్లోలం గా ఉండేది .కాంట్ జీవితకాలం లోనే  లెక్క లేనన్ని అగ్ని ప్రమాదాలు జరిగాయి ఆయన పుట్టిన స్వంత ఇల్లే 1769 .లో అగ్నికి ఆహుతైంది ఆయన నివశించిన ప్రాంత మైన ‘’vorder vorsadt ‘’లో 76 ఇళ్ళు పరశురామ ప్రీతి చెందాయి .ఇంత  ప్రమాద కర మైన నగరమైనా కొనిగ్స్ బర్గ్’’ మధ్య యుగపు జర్మన్ నగరం ‘’లా అందం గా ఉంటుంది .నగరం లో ఎన్నో వంతెనలు ఉండటం  వల్ల ‘’ఉత్తర వేనీస్ ‘’నగరం అనే వారు

    18 వ శతాబ్దపు కొనిగ్స్ బర్గ్ అనేక సంస్కృతులకు నిలయం గా ఉండేది .లిదూనియన్లు ,మిన్న నైట్లు,హుజినాట్లు మొదలైన వారంతా ఇక్కడికి వచ్చి చేరారు .ఫ్రెంచ్ భాష మాట్లాడే వారూ ఉన్నారు .వీరందరూ వ్యాపారస్తులే .పోలాండ్ ,రష్యా దేశస్తులు, యూదులు డచ్ ,ఇంగ్లాండ్ వర్తకులకు కొనిగ్స్ బర్గ్ నిలయమై పోయింది .ఎవరి ఆచార వ్యవహారాలను వారు స్వేచ్చగా పాటించే వారు .పరస్పర సంబంధాలు తక్కువ గానే ఉండేవి ..అంటే విభిన్న సంస్కృతీ విలసిత నగరం గా కొనిగ్స్ బర్గ్ ఉండేది ఈ భిన్న సంస్కృతులను అధ్యయనం చేయటానికి కాంట్ కు ఇతర దేశాలు తిరగాల్సిన అవసరమేర్పడ లేదు .అన్నీ ఇక్కడే ఉండటం తో అధ్యాయం సులభ మైంది ఇన్ని ఉన్నా స్కూల్ వేళ  అయి పోయిన తర్వాత పిల్లలు ఆడుకోవ టానికి ఆటస్తలం కాని పార్కులు కాని ఉన్న దాఖలాలు లేవు .మొదటి విలియం మరణించి రెండవ విలియం రాజైన సంవత్సరం లోనే కాంట్ గారి స్కూల్ జీవితం పూర్తీ అయి పోయింది .రెండవ విలియం తండ్రి కంటే ఉదార వాదిగా ప్రవర్తించాడు .ఆయనకు సాహిత్యం వేదాంతాలలో మంచి అభినివేశం ఉండేది .విలియం రాజు ‘’  Halle ‘’అనే ఆయన స్థానంన లో ‘’wolff ‘’అనే అతన్ని ‘’లా ప్రొఫెసర్ ‘గా ’,యూని వర్సిటి వైస్ చాన్సలర్ గా చేశాడు .అందువల్ల ప్రష్యాకు గౌరవ స్స్థానం కల్పించి ప్రష్యా వెలుగులు యూరప్ వెలుగు కావాలని భావించాడు రాజు ‘ . 

   కాంట్ యువ జీవితాన్ని గురించి తర్వాత తెలుసు కొందాం

      సశేషం

               మీ- గబ్బిట దుర్గా ప్రసాద్ -10-8-13- ఉయ్యూరు 

 

 

 
Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గణిత విజ్ఞాన వేదాంత తత్వ శాస్త్ర కోవిదుడు –ఇమాన్యుల్ కాంట్-2

గణిత విజ్ఞాన వేదాంత తత్వ శాస్త్ర కోవిదుడు –ఇమాన్యుల్ కాంట్-2

           కాంట్ కుటుంబ నేపధ్యం బాల్యం విద్య

యూరోపియన్ తత్వ శాస్త్రాన్ని ఒక కొత్త సిద్ధాంతం ద్వారా మలుపు తిప్పిన మహా నీయుడు జర్మనీ కి చెందిన మేధావి ,తత్వ వేత్త ఇమాన్యుల్ కాంట్ .ఆయన సిద్ధాంతానికి ఆయన పేరు మీదుగా ‘’కాంటియన్ సిద్ధాంతం ‘’అన్నారు .మానవ మనసుకు అను గుణం గా బాహ్య ప్రపంచం కనీ పిస్తుందని అయన చెప్పిన కొత్త వాదం .జగత్తు ఫలానా విధం గా మన మనసే నిర్దేశిస్తుందని అందులోని భావం

        కాంట్ తూర్పు ప్రష్యా దేశం లో ఒక మారు మూల గ్రామం ‘’కొనిగ్స్ బర్గ్ ‘’లో 1724 ఏప్రిల్ 22న జన్మించాడు .అక్కడే80 ఏళ్ళ వయసులో1804 ఫిబ్రవరి 12న  తనువు చాలించాడు .పుట్టిన ఊరు నుండి ఎక్కువగా మరెక్కడికీ పెద్ద గా కదల లేదు . కాంట్ .ఒక వేళ  వెళ్ళినా 40 మైళ్ళు దాటి వెళ్ళిన దాఖలాలు లేవు .కాంట్ పూర్వీకులు స్కాట్ లాండ్ దేశీయులు .ఇక్కడికి వచ్చి స్తిర పడ్డారు .జర్మని లోని ప్రొటెస్టెంట్ మతం లో ‘’పయటి స్ట్ ‘’శాఖ కు చెందిన కుటుంబం వీరిది .ఇమాన్యుల్ అంటే‘’భగవంతుడు తోడుగా ఉన్న వాడు ‘’అని అర్ధం .ఆ పేరు తనకు తగిన పేరే నంటాడు కాంట్ .ఆ పేరు ను సార్ధకం చేయటం, దాని పై సూక్ష్మ దృష్టితో పరిశీలన చేయటం తన లక్ష్యం అనీ చెప్పుకొన్నాడు .కాని కాంట్ కు స్వయం వ్యక్తిత్వం ఉంది ఆత్మ బోధి ఆయన .స్వయం సిద్ధుడు కూడా

       కాంట్ తండ్రి ‘’జోహాన్ గార్గ్ కాంట్ ‘’.కస్ట  పడే బతుకు  బండీ  ఈడ్చే వాడు .అయన గుర్రాల జీన్లను ,బండ్లను వాటికి అవసరమైన పరికరాలను తయారు చేసే వృత్తి .అంటే చర్మకార వృత్తి .ఇంటి దగ్గరే వర్క్ షాప్ ఉండేది . అంత  మాత్రాన ధనిక కుటుంబం మాత్రం కాదు .నాలుగు వేళ్ళు లోపలి వెళ్ళే సంపాదన మాత్రం ఉన్న వాడు .ఈ కుటుంబానికి  సంఘం  లో మంచి గౌరవం ఉండేది .ఆ వృత్తి చేసే వారందరికీ ‘’గిల్డు ‘’లు ఉండేవి .గిల్డులోని   వారంటే సమాజం లో భద్రతా ,గౌరవం ఉండేది .వీరి కుటుంబం ‘’సాడిల్ మేకర్స్ ‘’వీధిలో కాపురం ఉండేది .ఆ కాలం లో ఈ వృత్తి చేసే వారంతా ఇక్కడే ఉండేవారు .    1730-40ప్రాంతం లో ఈ వృత్తి పని వారికి జీవిక దుర్భరమై పోయింది .పోటీ ఎక్కువై మార్కెట్ లేక పోవటమే దీనికి కారణం .పొట్ట గడవటమే కష్టమై పోయిన కాలం అది .కాంట్ కు తల్లి పోలికలెక్కువ గా ఉండేవి .అదే ఆయన పై గొప్ప ప్రభావం చూపించింది . ఇరవయ్యవ శతాబ్దపు మహిళల కంటే కాంట్ తల్లి బాగా చదువు కొన్న స్త్రీయే .గొప్ప సంస్కృతీ ఉన్న మహిళ గా గుర్తింపు పొందింది .కొడుకు కాంట్ నుతల్లి ‘’అన్నా రేజీనా ‘’ తనతో ఎక్కువ గా బయటికి తీసుకు వెళ్ళేది .తల్లి కన్న తొమ్మిది మంది సంతానం లో ఇద్దరు మగ పిల్లలు ముగ్గురు ఆడపిల్లలు మాత్రమె మిగిలారు .

 ఎనిమిదవ ఏట ఒక పయతటిస్ట్ స్కూల్ లో చేరాడు అక్కడి మత బోధ కాని ,చదువు కాని కాంట్ కు నచ్చలేదు .పైగా క్రైస్తవ మతం పై విరక్తి కూడా కలిగించాయి .కాంట్ తన సోదరిలా స్వభావాలకు భిన్నం గా ప్రవర్తించే వాడు .ఎవరి తోను ఎక్కువ చనువు గా ఉండే వాడుకాదు .అయితే కుటుంబానికి చేయాల్సిన పనులు అన్నీ బాధ్యత గా నిర్వర్తించే వాడు .

    కాంట్ పద మూడవ ఏట తల్లి రేజీనా మరణించింది .అప్పటి నుండి ఆయన జీవితం దుర్భర మై పోయింది .ఆ కాలం లో కొనిగ్స్ బర్గ్ లోను జర్మనీ లో ను ప్రొటెస్టెంట్ మతం లో ‘’పీటిజం ‘’మహా ఉద్యమం గా ఉండేది .చాందస ప్రొటెస్టెంట్ లకు ఇది వ్యతిరేకం .వీరు బైబిల్ ను ఎవరికి వారు స్వతంత్రం గా చదువు కోవాలని ,ప్రతి వ్యక్తికీ ఆరాధనా స్వేచ్చ ఉండాలని .మాతాదికారుల పెత్తనం ఉండ రాదనీ వీరి ఉద్యమం .దీనినే ‘’ఇవాన్జలిక్ ఉద్యమం ‘’అంటారు .ముక్తి అనేది వ్యక్తీ స్వయం గా సాధించి పొందేది అని ,పస్చాత్తాపమే  దానికి మార్గం అని చెప్పింది .బగవంతుని  కృప వల్లనే మనిషి మారుతాడు ‘’.భూమి పుత్రుడు భగ  వంతుని పుత్రుడు గా మారాలి ‘’అనేది వీరి సిద్ధాంతం .పీటిజం హృదయానికి చెందినది .బుద్ధికి సంబంధించింది కాదు ఇది బాగా వ్యాప్తి కావటానికి ఫ్రెడరిక్ రాజు మొదటి విలియం .తన కోసమే వీరిని ప్రోత్సాహించాడు .సుపరి  పాలన ,పటిస్ట ఆర్ధికాభి వృద్ధి ,సుశిక్షిత సైన్యం ,మంచి విద్యా విధానం ఎర్పరటమే విలియం రాజు ధ్యేయం గా ,లక్ష్యం గా పెట్టుకొన్నాడు .అందుకోసమే పీటి స్టులను ప్రోత్స హించాడు .పేద పిల్లలకు విద్య కల్పించట మే రాజు లక్ష్యం గా పెట్టుకొన్నాడు .జర్మనీ లోని ఇతర ప్రాంతాలలో ఉన్న పీటిజానికి,’’హాల్లె’’ లోబోధించే దానికి తేడా ఉంది .ఇక్కడ సాంఘిక చైతన్యం బాగా ఎక్కువ .అనాధలకోసం ఎన్నో విద్యాలయాలేర్పడ్డాయి .వ్యక్తిత్వం నిజాయితీ గల పౌరులను తయారు చేయటమే లక్ష్యం గా సాగింది .

     కాంట్ ఎలాంటి స్కూల్ లో విద్య నేర్చాడో తెలుసు కొందాం .కొనిగ్స్ బర్గ్ సిటీ కి బయట ‘’ఏకోపాధ్యాయ ‘’బడిలో కాంట్ చేరాడు .ఆ మేస్టారే వారానికో సారి సిటీ జైలు ను పరిశీలించటానికి న తనిఖీ కి వెళ్ళాలి ..ఈ గురువు పేరు ‘’లుడ్విగ్ బోచెం‘’.3R లు అయన దగ్గరే నేర్చాడుకాంట్ .ఎక్కువ కాలం ఇందులో చదవ లేదు .’’SHULZ ‘’ అనే ఆయన కాంట్ తెలివి తేటలను గురించి విని కొడుకు ను ‘’కొల్లీజియం ‘’లో చేర్చమని  తండ్రికి హితవు చెప్పాడు .ఆయన దానికి డైరెక్టర్ కాక పోయినా ఆ కోలీజియం  తో మంచి సంబంధాలున్న వాడు .

 కోలీజియం లో కాంట్ చదువు ఎలా సాగిందో తర్వాత తెలుసు కొందాం

     సశేషం

   మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –9-8-13—ఉయ్యూరు .

   

   

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గణిత విజ్ఞాన వేదాంత తత్వ శాస్త్ర కోవిదుడు -ఇమ్మాన్యుల్ కాంట్ -1

గణిత విజ్ఞాన వేదాంత తత్వ శాస్త్ర కోవిదుడు -ఇమ్మాన్యుల్ కాంట్ -1

             ఈ రచనకు నేపధ్యం

   నాకు సుమారు పద్దెనిమిదవ  ఏడు వచ్చిన దగ్గర నుంచి ఏ వేదాంత ,తత్వ గ్రంధం చదివినా అందులో ఇమ్మాన్యుల్ కాంట్ ను ఉదాహరించని పుస్తకం లేదు .ఆ తర్వాత ఉద్యోగం లో చేరి అనేక చోట్ల పని చేస్తూ అక్కడ ఉన్న లైబ్రరీల లో ఉన్న పుస్తకాలను చదివి నప్పుడూ తరచుగా కాంట్ గురించి ఉండేది .ఇంతకీ ఎవరీ కాంట్ అన్న జిజ్ఞాస నాలో సుమారు యాభై ఏళ్ళ నుంచీ రగులు తూనే ఉంది.కాని ఆయన పై రచన లేవీ  నాకు అందు బాటులో క నిపించలేదు .లేక నేనే శ్రద్ధగా వేదక లేదేమోకూడా .శ్రీ అనుభవానంద స్వాముల ‘’సర్వ మత సిద్ధాంత సౌరభం ‘’సీరియల్ పుస్తకాలను చదివిన కొద్దీ వారూ కాంట్ ను పడదే పదే గుర్తు చేసుకోవటం ఆశ్చర్యం కలిగించింది .అలాగే సర్వేపల్లి రాదా కృష్ణ పండితుని వేదాంత ధార చదివినప్పుడూ ఆయన కాంట్ ను జ్ఞాపకం చేసుకొన్న సందర్భాలున్నాయి .కనుక కాంట్ నన్ను వదలి పెట్ట లేదు బహుశా  నేనే ఆయన రచనలను చదివే స్తితి పొందలేక పోయానేమో నని పిస్తుంది .

     మొదటి సారి 2002 లో అమెరికా కు టెక్సాస్ లోని హూస్టన్ లో ఉన్న మా అమ్మాయి వాళ్ళ దగ్గరకు వెళ్లి నప్పుడు అక్కడున్న లైబ్రరీ ని బార్న్స్ అండ్ నోబుల్ వాళ్ళ సంస్థల ను ఉపయోగించుకొన్నా నా ద్రుష్టి ఎక్కువ గా ఆంగ్ల సాహిత్యం ,ప్రపంచ సాహిత్యం మీదకే పోయింది తగి నన్ని పుస్తకాలు వెతుక్కొని చదివి చాలా మంది రచయితల గురించి రచనల గురించి చదివాను .ఇప్పుడు కూడా కాంట్ నా ద్రుష్టి లో పడలేదు .ఆయన పుస్తకాల కోసం నేను వెదక లేదు అంటే బాగుంటుందేమో .రెండో సారి మిచిగాన్ లో డెట్రాయిట్ కు మా విజ్జి వాళ్ళింటికి వెళ్ళినప్పుడు కూడా ఆంగ్ల నాటకాలు వివిధ ప్రక్రియలు .వగైరా సాహిత్యాన్నే చదివాను ఇప్పుడూ కాంట్ నాకు అందు బాటులోకి రాలేదు .రాలేదు అంటే నేనే శ్రద్ధ పెట్టలేదంటే సబబేమో .

    మూడవ సారి మళ్ళీ మిచిగాన్ కు వెళ్ళినప్పుడు మొదటి మూడు నెలలు ఏ పుస్తకం దొరికితే ఆ పుస్తకామే చదివాను కాని కాంట్ నా మనసులో ఉన్నా అక్కడ ఏ విభాగం లో ఆయన రచనలుకాని  ఆయన గురించి కాని ఉంటాయో తెలుసుకోలేక పోయాను ఇది నా స్వయంకృత అపరాధమే  .అయినా నా మనసులో కాంట్ గారు తిష్ట వేసుకు కూర్చున్నాడు .మూడో నెలలో మా ఉయ్యూరు వాస్తవ్యులు ,ప్రస్తుతం అమెరికా లో అలబామా  రాష్ట్రం లో హాంట్స్ విల్ (వేట పాలెం )లో ఉన్నరితైరేడ్ లైబ్రేరియన్  శ్రీ మైనేని గోపాల కృష్ణ గారితో ఒక రోజు ఫోన్ లో సంభాషించటం తో  అక్కడ మా ఇద్దరికీ స్నేహం,ఆత్మీయత ,ఆప్యాయత ,చిగురించటం మొదలైంది . అంతకు ముందు 2004 లో వారు ఉయ్యూరు ఏ.సి. లైబ్రరీ కి దాదాపు అయిదు లక్షల భారీ విరాళం ఇచ్చి ఇంకో లక్ష రూపాయల పుస్తకాలు అందజేసి, లైబ్రరి ప్రారంభోత్సవానికి జూలై పద్దేనిమిదిన రాష్ట్ర మంత్రులచే జరిగే ప్రారంభోత్సవానికి ఆయనా ఆయన అక్కగార్లు బావ గారు స్వయం గా వచ్చి ఇంకో లక్ష ఖర్చు చేసి ప్రారంభోత్సవాన్ని ఘనం గా నిర్వహించి నప్పుడు ఆ లైబ్రరీ నిర్మాణ కమిటీ కి  కన్వీనర్ గా ఉన్న నాకు వారితో తోలి పరిచయమేర్పడింది .మా ఏం ఎల్ సి.రాజేంద్ర ప్రసాద్ పూనిక తో ఇదంతా జరిగింది .ఆ నాటి కృష్ణా జిల్లా గ్రంధాలయ చైర్మన్ శ్రీ గొర్రెపాటి గోపీ చంద్ అమెరికా లో వారిని కలిసి ఈ విరాళాన్ని అర్ధించి మహోప కారం చేశారు వీరూ తగినట్లు  స్పందించారు . అందు వల్ల  ఉయ్యూరు లో ‘’దక్షిణ భారతం లో అంత  వరకు లేని ’మొదటి ఏ.సి.లైబ్రరి ఉయ్యూరు లో’’ వచ్చింది .ఇదీ మా పూర్వ పరిచయం

    సరే మిచిగాన్ లో ఉన్న చివరి మూడు నెలల్లో దాదాపు రోజు విడిచి రోజు వారు ఫోన్ లో  సమభా షించటం  కాని మెయిల్ ద్వారా పలకరించటం కాని చేసే వారు ..వారి శ్రీమతి శ్రీమతి సత్య వతి  గారు కూడా తరచూ నాతొ మా శ్రీమతి తో ,మా  అమ్మాయి విజ్జి తో  మాట్లాడే వారు వారింట కాసిన కూరలను పోస్ట్ లో పంపే వారు. ఇప్పుడే మా ఉయ్యూరు వారు ప్రస్తుతం అమెరికా లో కాలి ఫోర్నియా లో ఉంటున్న ప్రపంచ ప్రసిద్ధ ఆర్ధిక శాస్త్ర వేత్త శ్రీ ఆరిక పూడి ప్రేమ చంద్ గారితో నాకు ఫోన్ ద్వారా మైనేని గారు పరిచయం చేశారు అంతేకాదు నవంబర్ లో మేము ఇండియా వచ్చినప్పుడే ప్రేమ చంద్ గారూ ఇండియా వచ్చారు ప్రేమ చంద్ గారికి నా చేత సాహితీ మండలి  ఆధ్వర్యం లోస్వంత ఖర్చులతో మైనేని గోపాల కృష్ణ గారు ఉయ్యూరు లో ఘన సన్మానం చేయించారు. ప్రేమ చంద్ అంటే మైనేనికి గురు భావం ఆత్మీయ భావం

 

      అప్పుడప్పుడు మా సంభాషణలలో కాంట్ గురించి వచ్చేది నేను కాంట్  పుస్తకాలు నాకిక్కడ దొరక లేదని చెప్పాను .ఆయన ఫి లాసఫీ పుస్తకాలున్నా చోట వెదక మని సలహా ఇచ్చారు చూశ లాభం లేక పోయింది  ఆయన ఎప్పుడూ ‘’ప్రసాద్ గారూ !మీకు ఏ పుస్తకం కావాలన్నా నాకు చెప్పండి నాలుగు రోజుల్లో మీ దగ్గిరకు వచ్చేట్లు చేస్తా‘’ననే వారు ఆబగా మొదట్లో కొన్ని అడిగితే పంపారు కొన్ని ఆయనే నేను తప్పక చదవాల్సిన పుస్తకాలు అని ఎన్నో పంపారు .వాటి ఖరీదు పోస్టల్ ఖర్చు చూసి నేను క్రమం గా అడగటానికి జంకే వాడిని .కాని ఆయనకివేమీ పట్టేవి కాదు ఎన్నోవిలువైన పుస్తకాలు పంపి నాతొ చదివించిన మార్గ దర్శి గోపాల కృష్ణ గారు. మా ఆత్మీయత క్రమం గా పెరిగింది కాంట్ గురించి సరైన పుస్తకాలు లేవని అంటూనే శ్రీ వాడ్రేవు చిన వీర భద్రుడు  కాంట్ ఫిలాసఫీ మీద రాసిన చిన్న పుస్తకం పంపారు .అది నేను చదివాను కాని ఒక్క ముక్క కూడా అర్ధం కాలేదు .ఆ మాటే చెప్పాను ఫోన్ లో ‘’అంతే నండీ !’’అన్నారు .కాని ఊరుకో లేదు మరో ఇంగ్లీష్ పుస్తకం పంపారు .అదీ నాకు ‘’గ్రీక్ అండ్ లాటిన్ ‘’అని పించింది అయ్యో కాంట్ గారు చేరువ కాలేక పోతున్నారు అని దుగ్ధ మాత్రం వదలలేదు .2008 నవంబర్ లో ఇండియా వచ్చాం . 

   మా ఇద్దరి మధ్యా ఆత్మీయత పెరిగుగుతూనే ఉంది .కాంట్ గారిపై ‘’kant ,a biography –by Manfred kuechinరాసిన జీవిత చరిత్ర ను నాకు పోస్ట్ లో పంపారు .అది అందగానే చదివేశాను బాగా రాశాడు రచయిత .ఆ మాటే  వారికి చెప్పి కృతజ్ఞతలు జేశాను .కాని అందులో ఆయన ఫిలాసఫీ మాత్రం  నాకు  ఇంకా అర్ధం కాలేదు ఎలా ఎలా అని ఎదురు చూస్తున్నాను తెలుగు విజ్ఞాన సర్వస్వం తిరగేశాను .ఎన్సైక్లో పెడియా బ్రిటానికా చూశాను.కాని దారి దొరక లేదు .అయినా కాంట్ గురించి నాకు తెలిసింది రాద్దాం అనుకోని 2012 లో నాలుగో సారి అమెరికాలోని నార్త్ కెరొలినా కు  వెళ్ళే ముందు కొంత రాశాను  .’ఇండియా వచ్చిన తర్వాత  వెదికితే  అది నాకు కనీ పించలేదు నిరుత్సాహ పడ్డాను .కాని అనుకో కుండా మా బావ మరిది ఆనంద్ ఇంట్లో హైదరాబాద్ లో నండూరి రామ మోహన రావు గారు రాసిన‘’విశ్వ దర్శనం ‘’పుస్తకం కనీ పించింది ఆబగా చదివేశాను  ఆయన కాంట్ ఫిలాసఫీ ని అద్భుతం గా అర్ధం చేసుకొని విశ్లేషించి సామాన్యులకు కూడా అర్ధమయ్యేట్లు రాశారు అది నా పాలిటి చింతామణి అని పించింది. అది అడిగి తెచ్చుకొన్నాను  ఇంకఆలస్యం చెయ్య కుండా కాంట్ గారి పై బృహత్ వ్యాసం రాయాలని సంకల్పించాను  ఎన్నో  ఏళ్ళ నా కోరిక తీర్చుకోవాలని తహ తహ లాడాను 21-5-2013 న ప్రారంభించి,24-5- 13 తో 46 పేజీల బృహత్ వ్యాసం తయారు చేశాను . .దీనినే ఇప్పుడు ధారా వాహిక గా అందజేస్తున్నాను .ఎన్నో పేర్లు ఆలోచించి చివరికి ‘’గణిత విజ్ఞాన వేదాంత తత్వ శాస్త్ర కోవిదుడు ఇ మ్మాన్యుల్ కాంట్ ‘’అని శీర్షిక గా ఎంచుకొన్నాను .ఈ రచనకు బాగా తోడ్పడిన పుస్తకాలు ఆంగ్లం లో మాన్ ఫ్రెద్ రాసిన  కాంట్ జీవిత చరిత్ర మరియు నండూరి వారు రాసిన విశ్వ దర్శనం .

      నాలుగో సారి లో అమెరికా కు వెళ్లి నప్పుడు మైనేని వారింటికి వెళ్లి వారిని సందర్శించాను ఆకుటుంబం నాపై చూపిన ఆదరాభి  మానాలు మరువ లేనివి ..నన్ను బస్ ఎక్కిస్తూ,నా జేబులో 500 డాలర్ల చెక్ పెట్టిసరస భారతికి కాని ఏదైనా సత్కార్యానికి కాని వినియోగించామన్నారు .నా నోట మాట రాలేదు దాదాపు పాతిక వేల రూపాయలు , అక్కడ వారి మిత్రు లందరికి పరిచయం చేహారు అందుకే వారిచ్చిన డబ్బు తో  నేను రాసిన   ‘’సిద్ధ యోగి పుంగవులు‘’పుస్తకాన్ని ‘’సరస భారతి’’ తరఫున ప్రచురించి వారి కోరిక పై వారి తల్లి గారికి అంకిత మిచ్చాను .ఇలా వారి సొమ్మును సద్వినియోగం చేశానని తృప్తి చెందాను .    నాకు కాంట్ పై గ్రంధాలను పంపి ,ఈ రచన కు తోడ్పడి ప్రోత్సహించిన ఆత్మీయులు శ్రీ మైనేని గోపాల కృష్ణ గారికి ఆత్మీయం గా ఈ  ‘’గణిత విజ్ఞాన  వేదాంత ,తత్వ శాస్త్ర కోవిదుడు ఇమ్మాన్యుల్ కాంట్ ‘’ బృహత్ వ్యాసాన్ని అంకిత మిస్తున్నాను  .అసలు కద రేపటి నుంచి –

    సశేషం

      మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –8-8-13- ఉయ్యూరు  

 
Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

కొందరు ప్రముఖ లాటిన్ అమెరికన్ రచయితలు -2(చివరి భాగం )

కొందరు ప్రముఖ లాటిన్ అమెరికన్ రచయితలు -2(చివరి భాగం )

              4-ఇస బెల్ అల్లెండీ

   చిలి దేశపు రచయిత్రి .1942  జననం చిలి అధ్యక్షుడు అలెండీ కి బంధువే .పదిహేనేళ్ళ వరకు అనేక దేశాలు తిరగాల్సి వచ్చింది అనేక భాషలు నేర్చుకోవాల్సి వచ్చింది ,అనేక మంది స్నేహితులేర్పడ్డారు దీనికి కారణం చిలీ లో రాజకీయ అస్తిరత్వమే ఏ ప్రభుత్వమో నిలకడ గా లేదు .సైనిక పాలన లో జనం ఉక్కిరి బిక్కిరి.అలెండీ హత్య తో మరీ దిగ జారిపోయింది దేశం .1970 లో సాల్వేడార్ చేరింది .అలెండీ దేశాధ్యక్షుదయ్యాడు .కాని మిలిటరీ వ్యూహం వల్ల 1973 లో హత్య గావింప బడ్డాడు దీనికి అమెరికా కూడా కారణమే నని అన్నారందరూ .అలెండీ కి  సోషలిస్ట్ భావాలు ఎక్కువే .దాని తో పాలనా పరమైన మార్పులు తెచ్చి ప్రజల మనిషి గా నిలిచాడు .ఇసబెల్ ఆయన ప్రెసిడెంట్ గా ఉన్నప్పుడు ఆయన తో విందు ఆరగించింది కూడా .భర్త విల్ గార్డెన్ .the house of the spirits ,city of the beasts ,eeva luna daughter of fortune మొదలైన నవలలు రాసింది ఆమె రచనల్లో మాజిక్  రియలిజం ఉంటుంది .ఆమెకు నేషనల్ ప్రైజ్ ఫర్ లిటరేచర్ ,కామన్ వెల్త్  అవార్డ్ ,అమెరికన్ బుక్ అవార్డులు లభించాయి .యునైటెడ్ నేషన్స్ కు చెందినా ఫుడ్ అండ్ అగ్రికల్చర్ కు చిలీ లో పని చేసింది .చని పోయిన తన కూతురు పోరా పేరిట ఇసాబెల్ అల్లెండీ ఫౌండేషన్ స్తాపించి సేవా కార్య క్రమాలు చేస్తోంది .

 

 

5—జార్జి అమేడో

ఈయన బ్రెజిల్ దేశస్తుడు 1912 లో పుట్టాడు .ఆ దేశం చాలా పెద్దది కమ్యూనిస్ట్ అభిమాని అయ్యాడు .తర్వాతా వదిలేశాడు .1966 లో ‘’donaflor and her two husabands ‘’ నవల రాశాడు .మొత్తం మీద  32 పుస్తకాలు రాశాడు .48 భాషల్లోకి అవి అనువాదం పొందాయి ‘’world’s most frequently translated author ‘’.గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్స్ రికార్డ్ కు ఎక్కాడు ‘’బ్రెజిల్ అకాడెమి ఆఫ్ లెటర్స్ ‘’అనే గౌరవం పొందాడు .లండన్ వెళ్లి కొంత కాలం ఉన్నాడు 1985 లో మళ్ళీ బ్రెజిల్ చేరాడు2001- 8- 6 నdied . journa list ,federal depuuty representative  and satirist .had left views ,   

 

 

6 –కార్లోస్ ఫాం టేస్

     1928 లో పుట్టాడు సాంస్కృతిక రాయ బారిగా మంచి ప్రఖ్యాతి పొందాడు .వైవిధ్య మైన కధలతో కధనం తో లబ్ధ ప్రతిస్తుదయ్యాడు .ఆయన రాసిన ‘’హైడ్రా హెడ్ ‘’కు పెద్ద ప్రోచ్చింది .వివాదకర మైన అనేక వ్యాఖ్యలు చేసి అందరికి దూరమయ్యాడు అందుకే ఆయన్ను ‘’స్వ దేశం లో పరదేశి ‘’అంటారు

 

7–   julio cortazar 

 

 

 

1914 -1984 కాలం లో జీవించిన రచయిత బెల్జియం దేశస్తుడు .అతని దృష్టిలో ‘’we have to revolutionary literature rather thsan literate of revolution ‘’అని అభిప్రాయం ఉన్న వాడు .wrote  10 novels ,poetry non fiction drama and criticism    

 

 

  26-9-2002 గురువారం నాటి నా అమెరికా డైరీనుండి

    ఇంతవరకు 2002 లో మేము మొదటి సారి అమెరికా కు వెళ్ళినప్పుడు నేను అక్కడహూస్టన్ లో  ఉన్న జంగ్ మానస్ లైబ్రరీ లో తీసుకుని చదివిన పుస్తకాల గురించి నా దరీ లో దిన చర్య లో రాసుకొన్న వాటిని పెంచి లేక తగ్గించి నాకు ఇస్టమైనవీ నచ్చినవాటి గురించి మీ అందరికిధారావాహికం గా  తెలియ జేశాను . మంచి స్పందనే కనిపించింది ..ప్రస్తుతం ఈ ధారా వాహిక కు స్వల్ప విరామం ఇస్తున్నాను మరల త్వరలో మొదలు పెట్టి మిగిలిన పుస్తకాల గురించి ,రచయితల గురించి తెలియ జేయ గలను.

           రేపటి నుండి కొత్త ధారావాహిక మొదలు పెడుతున్నాను

         మీ –గబ్బిటదుర్గా ప్రసాద్ -7-8-13-ఉయ్యూరు

 

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

కొందరు ప్రముఖ లాటిన్ అమెరికన్ రచయితలు -1

   కొందరు ప్రముఖ లాటిన్ అమెరికన్ రచయితలు -1

      ఉత్తర అమెరికా లోని మెక్సికో ,హోండూరస్ ,నికారుగ్వా ,కోస్టారికా ,పెనామా ,దక్షిణ అమెరికా లోని వెనిజుల ,కొలంబియ ,ఈక్వెడార్ ,పేరు ,బ్రెజిల్ బొలీవియ ,పరాగ్వే ,అర్జంటీనా ,చిలీ ,ఉరుగ్వే దేశాలను లాటిన్ అమెరికా దేశాలని అంటారు .ఈ దేశాల రచయితలు 1960 నుండి ప్రపంచ దృష్టిని ఆకర్షించారు .ఇందులో స్పానిష్ ,పోర్చుగీస్ ,భాషలు మాట్లాడే వారే ఎక్కువ .వీటిని స్పెయిన్ పోర్చుగీసు దేశాలు ఆక్రమించటం వల్ల నే ఈ భాషలు నిలిచినాయి .క్రీశ.1500ప్రాంతం లో 300 ఏళ్ళు యూరోపియన్ కాలనీలు గా ఉన్న దేశాలివి .19 వ శతాబ్దం లోనే విముక్తి పొందాయి .యూరస్ లోని అన్ని ప్రాంతాల జనాలవారు  వలస రావటం తో ఆవాస భూములయ్యాయి .ఎక్కువ మందికి స్పానిష్ మాత్రు భాష . బ్రెజిల్ లో మాత్రం ఇంగ్లీష్ ఫ్రెంచ్ డచ్ భాషలు మాట్లాడుతారు

        ఈ దేశాలన్నీ యుద్దాలతో ,అంతర్యుద్ధాలతో అతలా కుతల మై పోయాయి .నిలకడ గా ఏ ప్రభుత్వమూ లేదు .వీళ్ళ రచనల్లో ‘’మాజికల్ రియలిజం ‘’ఎక్కువ గా ఉంటుంది .అంతర్యుద్ధాల వల్ల  రచయితలూ ఇతర దేశాలలో తల దాచుకొనే వారు .ఇందులో కొందరు సాహిత్యం లో నోబెల్ ప్రైజ్ సాధించిన వారు కూడా ఉన్నారు .వారిలో కొందరి గురించి సంక్షిప్తం గా తెలుసు కొందాం

                    1—జార్జి లూయీస్ బోర్జెస్

    బోర్జెస్ అర్జెంటీనా లో బ్యూనస్ ఐర్స్ లో1899 లో జన్మించాడు .చిన్ననాటి నుండి కధలు వినటం చెప్పటం అలవాటు .ఆరవ ఏట మొదటి కద రాశాడు  .స్కూల్ లో చదువు సాగలేదు .మొదటి ప్రపంచ యుద్ధ కాలం లో జెనీవా కు వెళ్ళాడు ..ఇరవయ్యవ శతాబ్దపు ఈ రచయిత లందరికి స్కూలు చదువు లేదు స్వంతం గా నే అన్నీ నేర్చుకొన్నారు .1921లో మళ్ళీ స్వదేశం చేరుకొన్నాడు .కళ్ళు సరిగ్గా కానీ పించక ఇబ్బంది పడే వాడు .కొంత కాలం లైబ్రేరియన్ గా పని చేశాడు .1928 లో కళ్ళు అసలు కనీ పించేవికావు .తాను చెబుతూ ఉంటె తల్లి రాసి పెడుతూ ఉండేది .నేషనల్ లైబ్రరి కి డైరెక్టర్ అయ్యాడు .దేశానికి ‘’పీరాన్ ‘’అనే వాడు అధికారం లోకి రాగానేఉద్యోగానికి రాజీనామా చేశాడు .తర్వాత ఇంగ్లీష్ ప్రొఫెసర్ అయ్యాడు .ఇంగ్లాండ్ రాణి బోర్జెస్ కు ‘’నైట్ హుడ్ ‘’ప్రదానం చేసి గౌరవించింది .అమెరికా కాంగ్రెస్ లో షేక్స్ పియర్ పై1976 లో మహాద్భుత మైన ఉపన్యాసం ఇచ్చాడు .1986 జూన్ 14 న  99 ఏళ్ళ నిండు జీవితాన్నిసంతృప్తిగా గడిపి మరణించాడు

 

 

                       2–   గేబ్రియల్ గార్సియా మార్క్వెజ్

1982 లో నోబెల్ బహుమతి పొందిన ఈ సాహితీ మూర్తి .కొలంబియా లో 1946 లో పుట్టాడు .1956 లో పారిస్ లో ఉన్నాడు ఫిడేల్ కాస్ట్రో క్యూబా ను స్వాధీన పరచుకొనటాన్ని గేబ్రియల్ సమర్ధించాడు .  1965 లో ఒక సారి మెక్సికో లో రోడ్డు మీద వెడుతుంటే ‘’one hundred years of solitude ‘’అనే నవల ప్లాట్ అంతా మదిలో మెదిలింది .వెంటనే ఇంటికి వచ్చి రాయటం ప్రారంభించాడు .ఇది అత్యంత జనామోదం పొందింది ప్రపంచం లో 50 భాషల్లోకి అనువాదం పొంది విశేష మైన కీర్తిని ఆర్జించి పెట్టింది .ఇందులో తమ దేశ చరిత్ర ,ఫిక్షన్ రెండు కలిసే ఉంటాయి .1982 లో దీనికే నోబెల్ బహుమతినిచ్చారు ‘’love in the time of cholera ‘’నవల బెస్ట్ సెల్లర్ అయింది .ఊహాత్మక రచయితగా మంచి పేరుంది

 

 

                          3-.రోసారియో కాస్టెల నాస్

     ఈమె 1925 లో జన్మించి 1974 లో మరణించింది .మెక్సికో లో సంపన్నుల ఇంట పుట్టింది .ఆ కాలం లో ఆ దేశాలలో ఆడవాళ్ళకు చదువు చెప్పించే వారు కాదు .1933 లో ఒక స్నేహితురాలు వాళ్ళ ఇంట్లో ఒక చిన్నారి మరణం త్వరలో జరుగుతుందని జోస్యం చెప్పింది .తమ్ముడు చని పొతే బాగుండునని ఈ పిల్ల అనుకొంటే ఈపిల్ల చస్తే బాగుండు నని తల్లి భావించింది .చివరకు తమ్ముడే చచ్చి పోయాడు .ఆ తర్వాత కుటుంబ ఆస్తి అంతా హారతి కర్పూరం లాగా హరించుకు పోయింది .ప్రభుత్వం వీరి భూములను స్వాధీనం చేసుకొని నేటివ్ ఇండియన్ లకు పంచి పెట్టింది .ఈ విషయాలన్నిటిని ‘’the three knots in the net ‘’నవల లో రాసింది .1948 తలిదంద్డ్రులిద్దరు  చని పోయారు ..అప్పటిదాకా గారాబు బిడ్డగా పెరిగింది .1950 డిగ్రీ పూర్తీ చేసింది .స్పెయిన్ లో చదువు కోవటానికి అనుమతి సాధించింది యూరప్ అంతా పర్య టింన్చింది .ఆమె రాసిన ‘’the nine guardians ‘’నవలకు బహుమతి వచ్చింది .భర్త రికార్డో ఫిసాసఫీ ప్రొఫెసర్ .పెళ్లి అయిన కొన్నేళ్ళకు విడి పోయారు 

 

 

.

           రోసారియో  చిన్న పిల్లల కోసం చాలా కధలు రాసింది .1966 లో’’ professor for comparative literature ‘’ అయింది .తర్వాతా విజిటింగ్ ప్రొఫెసర్ అయింది .’’one must laugh ,then since laughter ,as we know is the first manifestation of freedom ‘’అని నవ్వుకు గొప్ప అర్ధం చెప్పిందామె .1971 లో ‘’ఫామిలి ఆల్బం ‘’ విడుదల చేసింది .ఆ ఏడే రాయబారి గా ఆమె ను ప్రభుత్వం నియమించి గొప్ప అరుదైన అవకాశాన్ని కల్గించింది .ఆడవాళ్ళలో ఇంత గౌరవాన్ని పొందిన వారెవ్వరూ అప్పటి దాకా ఎవరూ లేరు ఆమెకే ఆ మొదటి అదృష్టం దక్కింది .49 వ ఏటఇస్రాయిల్ లోని టెల్ అవైవ్ లో1974 august 7 న  ఇంట్లో ఎలెక్ట్రిక్ లాంప్ ను అమరుస్తూ షాక్ కొట్టి మరణించింది .ఇక్కడ మన తెలుగు నవలా రచయిత్రి మాది రెడ్డి సులోచనా దేవి గాస్ స్టవ్ ప్రమాదం లో మరణించిన విషయం మనకు గుర్తుకొస్తుంది విధి వంచితలిద్దరూ ‘’రోసారియో  కా స్టేల నాస్ ‘’ను ప్రభుత్వ లాంచనాలతో ‘’national heroes ‘’ఉంచే   చోట సమాధి చేసి అత్యున్నత గౌరవాన్ని కల్గించారు

       26-9-2002 గురువారం నాటి నా అమెరికా డైరీ నుండి

      సశేషం

మీ –గబ్బిటదుర్గా ప్రసాద్ -6-8-13- ఉయ్యూరు

.

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

సకలకళా ప్ర పూర్ణుడు డి.హెచ్.లారెన్స్–2

సకలకళా ప్ర పూర్ణుడు డి.హెచ్.లారెన్స్–2 

            ప్రేమ ను గురించి అత్యద్భుతం గా వర్ణిస్తాడు లారెన్స్ ‘’there are two loves .sacred and profane ,spiritual and sensual .in sensual love it is the two blood systems the man’s and the women’s which sweep up into pure contact almost fuse .almost mingle .never quite .there is always the finest imaginable wall between the two blood waves ,though which pass unknown vibrations forces but through which the blood itself must never break or it means bloodying .

    ‘’ in spiritual love the contact is purely nervous .the nerves in the lovers are set vibrating in unision like two instruments .the pitch can raise higher and higher . But carry this too far and the nerves begin to break . ,to bleed ,as it were and aform of death sets in ‘అని రెండు రకాల ప్రేమలలోని తారతమ్యాలను చెప్పాడు ఆయన మాటల్లో చదివితేనే బాగుంటుందని అదే ఇక్కడ రాశా .ఇంత  గొప్పగా చెప్పగలగటం అందరికి రాదు .

              మనిషి లో ఉన్న చిక్కేమిటంటే తన అదృష్టానికి తానె కారణం అధికారి అనుకోవటమే అంటే కాక ఏకత్వాన్ని కోరుతాడు . spiritual love ‘’ సాధించిన తర్వాతా అదే జీవితాంతం కావాలను కొంటాడు దీనినే అతడు ‘’ hightening llife ‘’అన్నాడు .ఈ కలయిక తర్వాతా దీని ద్వారా విశ్వ సమ్మేళనాన్ని వాంచిస్తాడు మానవుడు అంటాడు లారెన్స్ మనిషికి ఎప్పుడూ ప్రేమ కావాల్సిందే .దాన్ని పొందాల్సిందే .దాన్ని త్యాగం చేసి ఒంటరిగా ఉండలేడు .ఇవన్నీ ఆలోచించే ఎడ్గార్ ఎల్లెన్ పో రాశాడని మెచ్చుకొంటాడు .

        ప్రేమ ఆత్మల మధ్య యుద్ధం అంటాడు .కవిత్వానికి’’మెకానికల్ రిధం’’ ఉందంటాడు .దానినే ఎడ్గార్ పట్టుకోన్నాడని చెప్పాడు .ఒక జీవి ని గురించి పూర్తిగా తెలుసుకోవాలంటే దాన్ని చంపాల్సిందే అని పో అభిప్రాయం గా లారెన్స్ అన్నాడు .తన కున్న మేధస్సుతో మనిషి జీవిత రహస్యాలను తెలుసుకొనే అధికారి అని అనుకొంటాడు అది ప్రోటోప్లాజం ను విశ్లేశింటమే అవుతుంది .చని పోయిన ప్రోటో ప్లాజం ను అనలైజ్ చేస్తేనే అందులోని భాగాలు దాని నిర్మాణం తెలుస్తుంది అందుకే దీన్ని‘’death process ‘’అన్నాడు .’’murder is a lust to get at the very quick of life itself and kill it ‘’అని అభిప్రాయం చెప్పాడు .

             జీవితం లో ఎన్నో కస్టాలు అనుభవించాడు దరిద్రం అంచునే చాలాకాలం జీవించాడు రాంచ్ హౌస్ కొన్నాడు  గుర్రపు  స్వారి చేశాడు .ఒంటరి  ప్రయాణాలు చేశాడు  ఽనాగరకులతొ జీవించి వారిని మార్చే ప్రయత్నం చేశాడు .ఇంగ్లిశ్ ఫిక్షన్ కు ఒక కొత్త రూపు సంత రించి పెట్టాడు  .విమర్శ లోతులు తరచాడు .   

      లారెన్స్ క్రిటిసిజం చదువుతుంటే వారేవా లారెన్స్ అని పిస్తుంది .తన బ్రెయిన్ ను అం తా  డ్రైన్ చేసి అక్షర ప్రవాహం తో నిమ్పాడని పిస్తుంది .సాహిత్య బీజాలకు సశ్య శ్యామల ఫలితాన్నిచ్చే జీవనది గా మార్చాడని పిస్తుంది .ఆ గడ్డం లో ఆ చూపులో ఒక దార్శనికత స్పష్టమౌతుంది .అతని రచనలలో ఏంతో  నిగూఢ త ,భావ సాంద్రత ఉన్నాయి అతని హృదయమంతా కవితామృతమే .అందుకే లారెన్స్ కలం పట్టుకొంటే మాట పాటై ,పద్యమై హృద్యమై సద్యోగర్భితం గా వెలువడి ఆనందాన్నిస్తుంది .శ్రీ పాద వారి కదన శైలి ఉంటుంది .లోతైన అవగాహనా ఉంది ఎప్పుడు చదివానో ఇదివరకు లారెన్స్ మీద ఎందు వల్లనో విపరీత మైన ,వల్ల  మాలిన అభిమానం ఏర్పడిపోయింది నా మనసులో .అతని మాటలు ‘’కో ట బుల్ కోట్స్‘’చదివిన జ్ఞాపకం ఉంది అందుకే అంతటి ఆరాధనా భావం ఏర్పడిందేమో ?

23-9-2002 సోమవారం నాటి నా అమెరికా డైరీ నుండి

      మీ—గబ్బిటదుర్గా ప్రసాద్ -6-8-13ఉయ్యూరు

 

 
 
 

— 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

సకల కళా ప్రవీణుడు డి.హెచ్. లారెన్స్ -1

       సకల కళా ప్రవీణుడు డి.హెచ్. లారెన్స్ -1

   లారెన్స్ 1885 లో ఇంగ్లాండ్ లోని నాటిన్ఘాం షేర్ దగ్గర ఈస్ట్ వార్డ్ అనే చోట జన్మించాడు . పదహారేళ్ళ వయసులోనే ‘’వైట్ పీకాక్ ‘’నవల రాశాడు . బారోస్ అనే ఆవిడతో ప్రేమాయణం సాగించాడు .1912 లో ఇంగ్లాండ్ ,ఇటలీలు పర్య టించి అవి నచ్చక జెర్మని చేరాడు .ఈ లోపల భార్య ఇంకోడితో జంప్ . 1814 లాక్ టు పెవిలియన్ గా ఇంగ్లాండ్ చేరాడు . ‘’రైన్ బౌ ‘’అనే విఖ్యాత నవల రాశాడు .తర్వాతా ‘’విమెన్ ఇన్ లవ్ ‘’రాశాడు .సావేజ్ పిల్గ్రిమ్స్ రాసి పేరు పొందాడు ఇండియా తో సహా అనేక దేశాలు తిరిగాడు 1925 లో ఆయన ప్రసిద్ధ నవల ‘’lady chatterley’s love ‘’రాశాడు దీన్ని ప్రభుత్వం నిషేధించింది .అతనొక గొప్ప చిత్రకారుడు కూడా .వీటినీ బాన్ చేసింది . స్వాధీన పరచుకొంది ప్రభుత్వం . 1930 లోమార్చి రెండవ తేదీ న     ఇటలీ లోని వెనిస్ లో నలభై అయిదు ఏళ్ళకే లారెన్స్ మరణించాడు .50 కధలు ,12 నవలలు ,అనేక కవితలు ,ఎన్నో చిత్రాలు ,యాత్రా సాహిత్యం ,సాహిత్య విమర్శ మొదలైన అనేక మైన రచనలు చేశాడు .లారెన్స్ రచన చదువుతుంటే కవిత్వం జాలు వారుతున్నట్లున్డటం అతని శైలికి అద్దం . ధర్డ్ పెర్సన్ లోనే కదా చెబుతాడు .రచనలన్నీ యాభై సంపుటాలుగా వచ్చాయి .లారెన్స్ మరణం తర్వాతా హెచ్.జి.వేల్స్ కొన్ని టిని ప్రచురించాడు .

 

 

‘’the very great literary talent f the time .he lived with titanic energy and produced enormous quqntity of work ‘’అని ఒక్కమాటలో లారెన్స్ గురించి చెప్ప వచ్చు .అతని భావ తీవ్రతను ‘’temperate tone ‘’అంటారు .తనను తాను ‘’మానవ బాంబ్ ‘’గా చెప్పుకొన్నాడు లారెన్స్ . Lawrence bomb image suggests the total annihilation Christian civilization which is condition for a new birth like phoenix which rises to a new life from its ashes ‘’అంతటి ప్రభావాన్ని చూపిన ఘనా ఘనుడు .

      లారెన్స్ భావాలు చాలా తమాషా గా ఆలోచనాత్మకం గా ఉంటాయి .అతని దృష్టిలో ‘’sex is understood by primitive peoples before the body has been purified and de energiged ,civilized out of existence . it is when man fulfills his sexual nature ,that he attains his highest human destiny and achieves god head ‘’మన చలం టైప్ అన్నమాట . రజనీష్ భావజాలం కూడా ఇంతే కదా .అదో యోగం .భోగం లో యోగం . క్రమ పధ్ధతి లో ఆలోచించే వాడాయన . ఇంకోరకం గా మానసిక శాస్త్ర వేత్త కూడా . అన్ని రచన లలోమానవుడే కన్పిస్తాడు .గొప్ప జీనియస్ అని పించుకొన్న లారెన్స్ అంటే విమర్శకులకు అసహనం గా ఉండేది .రచనలన్నీ దాదాపు ఆయన స్వీయ చరితామ్రుతాలే .అతని ఆరోగ్యం బాగుండేది కాదు కాని మైళ్ళ కొద్దీ నడిచే సత్తా ఉన్న వాడు .ఇంగ్లీష్ నవలకు కొత్త రూపు ను సంతరించాడు తన కాలపురచయిత లందరిలో”దిగ్రేటెస్ట్”అనిపించుకొన్నాడు.      

      లారెన్స్ కధల్లో ‘’the Prussian officer ,the blind man ,two blind birds ,the fox the rock of horse winner ‘’మంచి పేరు తెచ్చుకోన్నాయి . నవలలలో ‘’ women in love ,rainbow లు అందరి మెప్పు పొందాయి కవితల్లో ‘’tortois ‘’. కవిత లో’’-traveller-with your tail tucked in a little on one side –like a gentleman in a long skirted coat –a life carried on your shoulder –invincible fore runner  ‘’అని ఏంతో భావాత్మకం గా చెప్పాడు దానినే ఇంకా వర్ణిస్తూ‘’blotted –o n this small  bird –this rudiment –this little dome this pediment –of all creation –this slow one ‘’అని మన అది కూర్మ అవతారాన్ని  జ్ఞప్తికి తెస్తాడు .లారెన్స్ రాసిన ‘’స్నేక్ ‘’కూడా మన పుస్తకాలలో అంశం గా చేర్చి బోధించటం చూశాం .జీవితాలలో ప్రమాణాలతో కూడిన జీవితాలున్దాలంటాడు దీనినే ‘’kindling the life quality where it was lost ‘’అన్నారు

        లారెన్స్ గొప్ప సాహితీ విమర్శకుడు .చాలా లోతుగా తీవ్రం గా అలోచించి చెబుతాడు .అమెరికన్ మొదటి ఆధునిక కవి వాల్ట్ విట్మన్ గురించి ‘’and who ever walks a mile full of false sympathy walks to the funeral of the whole human race ‘’అని కుహనా మెచ్చు గాళ్ళకు చీవాట్లు పెట్టాడు .అలాగే ఎడ్గార్ అల్లెన్ పో కవి మీద అద్భుత ప్రశంశా వాక్యాలను కవితాత్మకం గా చెప్పాడు ‘’fenimore cooper has two vibrations going on together –a disintegrating and slowing of the old consciousness ,the forming of a new consciousness underneath .Poe has only oneonly the disintegrative vibration.this makes him more a scientist than an artist ‘’అని గ్రేటెస్ట్ ట్రిబ్యూట్ ఇచ్చాడు .శిల్ప హృదయం ఉన్న వాడుకనుక ఆ శిల్పి అంతరంగాన్ని చక్కగా ఆవిష్కరించాడు .పో ఎందుకు అనారోగ్య కర మైన రచనలు చేశాడు అని మొరలిస్ట్ లు ఆశ్చర్య పోతే దానికి సమాధానం గా ‘’they need to be written because old things need to die and disintegrate because the old white psyche has to be gradually broken down before any thing else come to pass ‘’అని ఘాటుగా క్లాస్ పీకాడు లారెన్స్ .అంతే కాదు’’ పో’’ లో ఉన్నది మానసిక ,చేతనా యొక్క రసాయనిక విశ్లేషణ ,.నిజమైన కళ లో ద్వంద్వ లయ సృష్టి, మరణం  ఉంటాయన్నాడు అందుకే కవి పో తన రచనలను ‘’కధలు –టేల్స్ ‘’అన్నాడు .అవి కారణ కార్య సంబంధాల పై కేంద్రీకరణమే నంటాడు లారెన్స్ .అవి మనిషి హృదయం లోని దెయ్యపు భావనలే అతన్ని చీకాకు పరచేవే వాటినే పో అద్భుత సృష్టి తో తీర్చి దిద్దాడు .

         అతని దృష్టిలో జీవుల జీవితం   లో ముఖ్య మైనది ప్రతి జీవి తాను ఒంటరిది,ప్రత్యెక మైనదే నని .అది తన ఏకాంతాన్ని భగ్నం చేసుకొన్నా క్షణం నుంచి ఇతరాలతో కలిసినప్పుడు దిక్కు తోచక గందర గోళం లో పడి పోతుందని దాని వల్ల  మృత్యువుకు చేరువౌతుందని .ఈ సృష్టి రహస్యం అన్ని జీవు జాతులకు సహజమేనని మనిషి నుండి అమీబా వరకు ఇదే జరుగుతుందని చెప్పాడులారెన్స్ ‘ 

మరిన్ని విశేషాలు మళ్ళీ

23-9-2002 సోమవారం నాటి నా అమెరికా డైరీ నుండి

  మీ—గబ్బిటదుర్గా ప్రసాద్ -5-8-13- ఉయ్యూరు

  

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

అన్నే ఫ్రాంక్

 అన్నే ఫ్రాంక్

 16 సంవత్సరాల వయసున్న జర్మనీ బాలిక అన్నే ఫ్రాంక్ తన జీవిత చరిత్రనుడైరీ గా  రాసుకొని దానికి ‘’దిడైరీ ఆఫ్ ఏ యంగ్  లేడి ‘’ని పేరు పెట్టుకోంది.నాజీల దౌష్ట్యానికి గురైన తనకుటుంబ చరిత్ర అంతా రాసింది అందులో .’’I want to live on after my death   ‘’అనే స్పూర్తి తో  రాసిన డైరీ ఇది  అదె ఆమెను చిరంజీవి ని చేసింది . 

        1929 జూన్ పన్నెండు న జర్మని లో ‘’Frankfurt am main ‘’లో ఆటో ,ఎడిత్ లకు జన్మించింది అన్నే ఫ్రాంక్ .వారిది జ్యూ కుటుంబం . తండ్రి బిజినెస్ మాన్ .అప్పటికే నియంత హిట్లర్ అధికారం లోకి వచ్చాడు .యూదు లంటే అతనికి విపరీత మైన ద్వేషం . వారిని అన్ని రకాల హింసలకు గురి చేశాడు .వారి వ్యాపారాలన్నీప్రభుత్వ పరం చేశాడు .1939 లో రెండవ ప్రపంచ యుద్ధం మొదలైంది . నా జీలు  హాలండ్ ను ఆక్రమించుకొన్నారు .పాపం వీళ్ళ కుటుంబానికి అక్కడా నీడ దొరక లేదు . తీవ్ర నరకం అనుభవిన్చేట్లు చేశాడు దుస్టహిట్లర్ ..యూదులంతా ఇంగ్లాండ్ కో అమెరికా కో పారి పోయారు .

                                                                                                             ఆమె నివశించిన అపార్ట్ మెంట్ 

     జ్యూలుఎక్కడున్నా వేటాడి చంపించాడు హిట్లర్ .1942 లో అన్నే కుటుంబం రహస్య స్తావరాలలో దాక్కో వాల్సిన గతి పట్టింది . తండ్రిని పట్టుకొని నాజీ సైనికులు ఎక్కడికో తీసుకొని పోయారు .తల్లి అన్నే , సోదరి లకు కొందరు ఆశ్రయం ఇచ్చి దాచారు .ఈ విషయాన్ని అన్నే ‘’secret annex ‘’అన్నది .1942 జూన్ పన్నెండు న ఆమె పుట్టిన రోజు పండుగ . ఎవరో ఒక డైరీ ని కానుక గా ఇచ్చారామెకు .దానినే తన స్నేహితుని గా భావించి ‘’కిట్టి’’అని దాన్ని ముద్దు  పేరు పెట్టుకొని దిన చర్య రాయటం ప్రారంభించింది ..25 నెలలు అంటే రెండేళ్ళు అజ్ఞాత వాస జీవితం గడిపింది .

    యుద్ధ సమయం లో ఎవరైనా డైరీలు రాసుకొని ఉంటె యుద్ధం పూర్తీ అయిన తర్వాతా వాటిని ప్రచురిస్తామని 1944లో రేడియో లో ప్రకటన వచ్చింది . అయితే ఎవరో కుట్ర చేసి వీరిని పట్టించారు . 1944 లో సెప్టెంబర్ మూడు న వీళ్ళందరినీ పోలాండ్ కు గొడ్లను తోలుకు వెళ్లి నట్లు తోలుకు వెళ్ళారు . ఆడవాళ్ళను ,పిల్లల్ని బట్టలు ఊడ దీయించి వర్షం లో నిల బెట్టారు .గాస్ చేంబర్ లలో పెట్టి లక్షలాది మందిని చంపేశారు నాజీ నియంతలు . ‘Anne  wept when most of us had not tears left ‘’అని ఒక అమ్మాయి ఈ సంఘటన గురించి రాసింది .

        బట్టలు లేకుండా నే వీళ్ళను ఫ్లాష్ లైట్ వెలుతురుఎన్నో గంటల సేపు  లో కూర్చో బెట్టేవారు .విపరీత మైన ఆకలి ఊపిరి ఆడక పోవటం తో  చాలా మంది చని పోయారు . 1945 లో బ్రిటిష్ వాళ్ళు అందర్నీ వదిలేశారు . అంతకు ముందే కాంప్ లో తల్లి చని పోయింది .వీళ్ళిద్దరూ అంటే అన్నే ఫ్రాంక్ ,సోదరి , టైఫాయిడ్ తో పోషకాహారం లేక పోవటం వల్ల చని పోయారు 16 వ ఏడు రాకుండానే అన్నే ఫ్రాంక్1945 march  లో మరణించింది .తండ్రి ఇంటికి తిరిగి వచ్చిన తర్వాతఅన్నే రాసిన డైరీ దొరికింది .దానిని ఆయన 1947 లో కొద్దిగా మార్చి ప్రింట్ చేస్తే 25 మిలియన్ల  అమ్ముడయాయి ఎందరో నాజీ నిర్బంధాన్నిగురించి వారు చేసిన దారుణాలను గురించి డైరీలు రాసినా అన్నే ఫ్రాంక్ దైరీకున్న ప్రాధాన్యత దేనికీ రాలేదు . దాదాపు అరవై భాషల్లోకి అనువాదం పొందింది . బైబిల్ తర్వాతా అన్నే డైరీకి అంతగిరాకీ  వచ్చింది .దక్షిణాఫ్రికా స్వాతంత్ర ఉద్యమ నేత ,అధ్యక్షుడు నెల్సన్ మండేలాజైలు లో ఉండగా  అన్నే ఫ్రాంక్ డైరీని తానూ చదివానని ఏంతో  ప్రభావితం చేసిందని తోటి ఖైదీలకు కూడా చదివి విని పించానని రాశాడు 

        ఈ డైరీ కి ప్రెసిడెంట్ రూస్ వెల్ట్ భార్య ముందు మాట రాసింది .ఫ్రాంక్ తండ్రి  81 వ ఏట 1980 లో చని పోయాడు .అన్నే పేరఒక ట్రస్ట్ ఏర్పడింది దాని ద్వారా ఎన్నో ప్రజోపకార మైన పనులు చేస్తున్నారు .ఆమె ఇంటిని స్మ్రుతి చిహ్నం గా మార్చారు . ప్రతి ఏటా కనీసం ఆరు లక్షల మంది దాన్ని సందర్శిస్తారు .అన్నే డైరీ ని నాటకం గా కూడా మలచి ఆడుతున్నారు దీనికి పులిట్జర్ బహుమతి వచ్చింది

      1944 ఏప్రిల్ లో చివరి ఎంట్రి గా అన్నే ‘’I want to live on after my death ‘’అని రాసుకోంది.ఈ మాటలే అందరికి మంత్రాలైనాయి గొప్ప స్పూర్తి కలిగించాయి . స్కూళ్ళల్లో పాఠంగా పెట్టిబోధిస్తున్నారు ..అందుకే అన్నే ‘’has become a martyr rather than a victim ‘’అయింది ఆమె ఇంకా యవ్వనం లోకి ప్రవేశించక ముందే జీవితం నుండి నిష్క్రమించాల్సి వచ్చింది .ఆమె డైరీని ‘’comforting document ‘’భావిస్తారు బాదోప శమన కారిణి అన్న మాట .ఆమె డైరీ చదివితే ‘’even in the midst of history’s worst depredations ,the human spirit is not quilled ,goodness and beauty endure ‘’అని నిరూపించింది పిస్తుందని విశ్లేష కాభి కాభిప్రాయం . అది ఆమె స్వంతమే అయినా దాని ప్రభావం అంతటిది .అందుకే అన్నే ఫ్రాంక్ డైరీ ని ‘’A record of triumphant defeats. Anne found her strength in her love of the very world which was denied her ‘అని పిస్తుంది మనకు

     తానూ లక్షలాది మంది చావును విన్నదీ కన్నదీ . తానూ స్వర్గానికి వెడితే ఈ క్రూరత్వం కూడా ఆగిపోతుంది అన్నది ఇంతకస్టం లో ను ప్రజలు నిజం గా మంచి మనసున్నా వారేనని అంటుంది .చివర గా ‘’ I can not build up my hopes on a foundation of confusion misery and death ‘’అని ఏంటో ధైర్యం గా నవ్వ్వుతూ నాజీలకు బలి అయి పోయిందా అమాయకపు పిల్ల అన్నే ఒక తేజో రూపం ఒక ఆరాధ్య దేవత అయింది

26-9-2002 గురువారం నాటి నా అమెరికా డైరీ నుండి

       మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -4-8-13- ఉయ్యూరు

Posted in పుస్తకాలు | Tagged | 1 Comment

అమెరికా నాటక రంగాన్ని మరో మలుపు తిప్పిన టేన్నీసి విలియమ్స్ –1

అమెరికా నాటక రంగాన్ని మరో మలుపు తిప్పిన టేన్నీసి విలియమ్స్ –1

     అమెరికా లో పాత దారిలో నడిచే నాటకాలకు కొత్త జవం ,ఉత్తేజితం చేసిన వాడు టెన్నిసీ విలియమ్స్ .అసలు పేరు థామస్ లేనియర్ విలియమ్స్ .1911 మార్చ్ ఇరవై ఆరున మిసిసిపి లోని కొలంబస్ లో పుట్టాడు .దీనినే ‘’హార్ట్ ఆఫ్ అమెరికన్  సౌత్ ‘’అంటారు . అతని గురించి ఒక్క మాటలో ‘’williams acquired a great taste for light ladies and a heavy drinker ‘’అని చెప్పేస్తారు . తల్లి ఎద్వినా .కుటుంబం అంతా ‘’ మెంటల్ నెర్వస్ డిసార్దర్ ‘’ తో బాధ పడిన వాళ్ళే . తల్లికీ అదే జబ్బు . చిన్నప్పుడే డిఫ్తీరియ ,కాళ్ళకు పక్ష వాతం వచ్చాయి విలియమ్స్ కు . తండ్రికి నికరాదాయం లేనందున పదేళ్ళలో పదహారు సార్లు కుటుంబం వేరు వేరు చోట్లకు మారాల్సి వచ్చింది

 

 

         బాధలు మరవటానికి తాగుడు అలవాటై బానిసే అయి పోయాడు . చెల్లెలు రోజ్ గ్లాస్ తో చేసిన చిన్న జంతువుల బొమ్మలను సేకరించేది హాబీగా . హేజల్ అనే అమ్మాయి తో పరిచయమేర్పడింది . సినిమాలు కధలు ,కవితలు టో చదువు అటకెక్కింది . ‘’can a good wife be a good sport ‘’?అనే అంశం పై వ్యాసం రాస్తే మొదటి బహుమతి వచ్చింది ‘’.the vengeance of nitocris ‘’కధలు ‘’స్మార్ట్ ‘’పేపర్ కు రాశాడు ప్రచురితమైనాయి .1928 లో తాత తో కలిసి యూరప్ పర్య టిం చాడు .రోడ్డు మీద నడుస్తుంటే అకస్మాత్తుగా ‘’he was struck with an overwhelming fear othat by his own account pushed him within a hair breadth of going quite mad ‘’అని పించింది అప్పుడే ఆలోచనలలో ఫోబియా వచ్చింది . భరించ లేని భయం ఆవహించింది . అనుకోకుండా మతం పై అచంచల విశ్వాసాం మిరకిల్ గా ఏర్పడి పోయింది .యేసు క్రీస్తు తన తలపై చెయ్యి వేసి ఒడార్చుతున్నట్లు గా అని పించింది . అందుకే విలియమ్స్ రచనలలో ఎస్స్తేతిక్ సెన్స్ ఎక్కువ గా కనీ పిస్తుంది .

     1929 లో కొలంబియా యూని వర్సిటి లో చేరాడు జర్నలిజం తీసుకొన్నాడు .’’beaty is the word ‘’,’’hot milk at three in the morning ‘’అనే రెండు నాటకాలు రాశాడు . ఆదాయం ఏమీ లేదు .తర్వాతా చెప్పుల కంపెని లో పని చేశాడు .అక్కడి దుర్భర పరిస్తితి ‘’it was designed for insanity –it was a living death ‘’ అని పించింది . తనను ప్రేమించిన హేజేల్ వేరేవరినో పెళ్ళాడింది .దీంతో మెంటల్ వచ్చింది .ఉద్యోగం ఊడింది .మెంఫిస్ కు వెళ్లి కోలుకొన్నాడు ‘’. kairo  shaanghai Bombay ‘’ అనే ఏకాంకిక రాశాడు 1936 లో సెయింట్ లూయిస్ చేరాడు .రచయిత కావాలనే సంకల్పం పెరిగింది . అక్కడ’’ Mc Burney ‘’అతని literary factory ‘’తో పరిచయ మేర్పడింది . యుద్ధ వ్యతిరేక భావజాలం తో ‘’హెడ్ లైన్స్ ‘’రాశాడు ‘’the fujitive kind  ,’’candles to the sun ‘’నాటికలు రాస్తే మంచి పేరే వచ్చింది . విర్శకులు విలియమ్స్ ప్రతిభను గుర్తించారు . డిగ్రీ పూర్తీ చేయకుండానే యూని వర్సిటి నుండి బయటికి వచ్చేశాడు .

         ‘’Iowa university ‘’లో చేరాడు .బామ్మ డబ్బు సాయం చేసింది .మళ్ళీ ఆరోగ్యం దెబ్బతింటే ఆస్పత్రిలో చేరాడు .scizo phernia ‘’వచ్చి ‘’the frantal lo botomy ‘’ఆపెరేషన్ చేశారు 1938 లో డిగ్రీ పొందాడు .1939 లో డ్రామా పోటీలలో ‘’అమెరికన్ బ్లూస్ ‘’నాటిక రాశాడు పేరును ‘’Tennesse ‘’గా మార్చుకొన్నాడు . అప్పుడే ఆండ్రి వుడ్ తో పరిచయం కలిగింది .జీవితాంతం పెర్సనల్ మేనేజర్ గా ఉద్యోగం ఇచ్చాడు రచనలు చేయటానికి సహాయం గా అమెరికా కోటీశ్వరుడు రాక్ ఫెల్లర్ నుండి వెయ్యి డాలర్లు అందాయి .1940 లో న్యూయార్క్ చేరాడు .’’battle of angels ‘’నాటకం రాశాడు .న్యూయార్క్ లో ప్రదర్శిస్తే ఫెయిల్ అయింది . ఎడమ కంటికి నాలుగు సార్లు ఆపరేషన్ జరిగింది పాపం . 1943 లో M.G.M. కు వారానికి రెండొందల యాభై డాలర్ల జీతం మీద పని చేశాడు అ తను రాసిన డైలాగ్స్ నచ్చక వదిలేశారు . అప్పుడే అతని ప్రసిద్ధ  ‘’the glaas menagerie ‘’నాటకం రాయటం ప్రారంభించాడు

29-9-2002 ఆదివారం నాటి నా అమెరికా డైరీ నుండి

        సశేషం

       మీ గబ్బిట దుర్గా ప్రసాద్ –3-8-13- ఉయ్యూరు 

Posted in అమెరికా లో | Tagged | Leave a comment

అమెరికా నాటకాన్ని మరో మలుపు తిప్పిన టేన్నేసి విలియమ్స్ -2

 అమెరికా నాటకాన్ని మరో మలుపు తిప్పిన టేన్నేసి విలియమ్స్ -2

     టేనేసీ విలియమ్స్ రాసిన’’ దిగ్లాస్ మేనేజేరి ‘’నాటకం బ్రహ్మాండమైన విజయాన్ని సాధించింది .1944 లో చికాగో లో56 ప్రదర్శనలతో ‘’స్టార్  ట్లింగ్ స క్సెస్’’అని పించుకోంది .’’బెస్ట్ అమెరికన్ ప్లే ‘’అని ప్రశంశ పొందింది .1949 లో ‘’దిహార్ట్ ఆఫ్  ఏ లోన్లీ హంటర్ ‘’నవల రాశాడు .తర్వాతా ‘’a street car named desire ‘’రాశాడు .’’హైపో కాన్ద్రియా‘’తో  బాధ అనుభవించాడు . ‘’డిసైర్ నాటకం  ‘’న్యు యార్క్ లో ప్రదర్శించారు .ప్రేక్షకుల నీరాజనాలు అందుకొన్నాడు ప్రదర్శన తర్వాతా అరగంట సేపు ప్రేక్షకులు నిర్విరామం గా చప్పట్లు కొడుతూనే ఉన్నారు . అతని కళాత్మతకు గొప్ప మెప్పే పొందాడు .పులిట్జర్ ప్రైజ్ వచ్చింది .855 సార్లు ఈ నాటకం ప్రదర్శింపబడింది . దీన్ని సినిమా గా తీశారు వచ్చిన డబ్బు తో ఫ్లారిడా లో ఇల్లు కొనుక్కున్నాడు .

      The rose totto ,cat on a hot tin roof నాటకాలకు పేరు ,ప్రఖ్యాతులే కాదు పులిట్జర్ బహుమానం కూడా వచ్చింది రచనలన్నీ సినిమాలుగా తీశారు’’sweet bird of incredible youth ‘’ నాటకాన్ని నాలుగు లక్షల డాలర్లు  ఇచ్చి హక్కులు కొనుక్కున్నారు .’’టైం ‘’మాగజైన్ విలియమ్స్ ముఖ చిత్రం తో ప్రత్యెక సంచిక తెచ్చి గౌరవించింది . ఈ ప్రత్యెక సంచికయే తనకు మిలియన్ డాలర్ల బహుమానం అని సంబరపడ్డాడు టెన్నెసీ ..1957 లో మళ్ళీ డిప్రెషన్ .వచ్చింది .పానిక్ గా మారాడు హైపోకాన్ద్రియాతో బాధ పడ్డాడు క్లాస్త్రో ఫోబియ కూడా చేరింది .ఇంతలో తాత చని పోయాడు . వెంటనే తండ్రి మరణం . తట్టుకోలేక మందుకు, డ్రగ్స్ కు బానిసైనాడు .’’intense psycho analysis ‘’కు సిద్ధ పడ్డాడు .దీని తర్వాత రాసిన వన్నీ ఫైల్యూర్ అయాయి .విలియమ్స్ అభిమాని ఫ్రాంక్  మెర్లో మరణం మరీ బాధించింది . తన జీవితం గురించి చివరి రోజుల గురించి ‘’stoned age ‘’రాశాడు .

      మాట పడి  పోయింది .1969 లో సెయింట్ లూయిస్ లో ‘’psychiatric ward ‘’కు తరలించారు . అక్కడ పరిస్తితులు అమానుషం గా ఉన్నాయి ఈ స్తితి లోను ‘’milk train ‘’,slapping tragedy ‘’రాశాడు .1970-80 కాలం లో తీవ్ర మైన ఫ్రస్ట్రేషన్ తో  బాధ పడ్డాడు . 1982 లో తన జీవిత కదనే ‘’a house not meant for stand ‘’నాటకం గా రాశాడు .గుర్తింపు రాలేదు .డ్రగ్స్ ఆల్కహాల్ విపరీతమైనాయి .1980 లో తల్లి చని పోయింది . తట్టుకోలేక పోయాడు .1969 లో జిమ్మీ కార్టర్ ప్రెసిడెంట్ గా ప్రమాణ స్వీకారం చేసి నప్పుడు ‘’presidential medal of freedom ‘’ఇచ్చారు . కార్టర్ విలియమ్స్ గురించి మాట్లాడుతూ Williams has shaped the history of American drama .From paasionate tragedy to lyrical comedy .his master pieces dramatize the eternal conflict of body and soul and death and love and despair .Through the unity of reality and poetry tennesse shows that the truly heroic in life or art in human compassion ‘’అని గొప్ప గా మెచ్చాడు  . 

         భయం ,సిగ్గు ,సెక్సువల్ కంఫూజన్  లతో విలియమ్స్ చివరి రోజులు చాలా ఒడిదుడుకులతో సాగింది  .అతని దృష్టిలో తానూ ‘’బోర్న్ రైటర్ ‘’. ‘’I wrote not for audience but for myself ‘’అన్నాడు . ‘’it is a therapy to expose and deal with inner turmoil and doubts ..’’అని చెప్పుకొన్నాడు .ఒక రకం గా ఆయన రచనలన్నీ పాక్షిక స్వీయ జీవిత చరిత్రలే . అతన్ని ‘’he was afraid of success ,had inordinate fear of insanity .he was obsessed with his own death .As an artist he was a fighter . తన జీవితం లో సంఘటనలు ఏవీ ఒకదానితో ఒకటి కూర్చబడలేదని వాటినే తానూ తెరకు ఎక్కిన్చానని చెప్పాడు ‘’I just peakout from behind the curtain now and then and find myself on totally different terrain . ‘’అని రచనా విధానాన్ని ఆవిష్కరించాడు .ఇరవై ఎనిమిది పెద్ద నాటకాలు ,ఎనిమిది చిన్నవి ,రెండు నవలలు ,తొమ్మిది స్క్రీన్ ప్లే లు ,ఇరవై కధలు ,డజనుకు పైగా ఏకాంకికలు ,రెండు కవితా సంకలనాలు ,ఇతరత్రా బోలెడు రాసిన వాడు విలియమ్స్ 

           టేనస్సీ విలియమ్స్1983 ఫిబ్రవరి ఇరవై అయిదున న్యు యార్క్ లో 72ఏళ్ళ  మరణించాడు . అతని మరణాన్ని గురించి న్యు యార్క్ టైమ్స్ రాస్తూ ‘’he came into the theatre bringing his poetry ,his hardened edge of romantic adoration of the lost and the beautiful . for a while the theatre loved him and then it went back to searching in its pockets for its souls . He chose a hard life that requires the strain of an  alligator and the heart of a poet .To his everlasting honour ,he preserved and bore all of us towards glory ‘’అని గొప్ప ప్రశంసా వాక్యాలు రాసింది . టెన్నెసీ విలియమ్స్ తాను కాలి పోతు వెలుగు నిచ్చిన నాటక రచయిత .జీవన రంగం లో బికారి . నాటక రంగం లో బేహారి .నాటక రచనలో షరీఫు .స్టువార్ట్ మిల్ కు సమకాలికుడు విలియమ్స్ .ఇద్దరూ గొప్ప రచనలే చేశారు .ఇద్దరూ జీవితం లో ఫైల్యూర్ .రచనల్లో సక్సెస్.

 

మిస్సోరి లోని సెయింట్ లూయిస్ లో విలియమ్స్ సమాధి 

     29-9-2002 ఆదివారం నాటి నా అమెరికా డైరీ నుండి

         మీ –గబ్బిటదుర్గా ప్రసాద్ -3-8-13- ఉయ్యూరు

   .

Posted in అమెరికా లో | Tagged | Leave a comment

ఎడిత్ వార్టన్

                ఎడిత్ వార్టన్

       అమెరికా లోని న్యు ఇంగ్లాండ్ లో పుట్టి మానవ నిరాశా నిస్పృహలను , ఆనందం లేని జీవితాలను ,వారి కోరికలను ,వారి మనస్సులో చెలరేగే భావ సంఘర్షణ లను అత్యద్భుతం గా చిత్రించిన రచయిత్రి ఎడిత్ వార్టన్ . ఆమె నవలలలో ,రచనలలో గోతిక్ ఎలిమెంట్స్ ,వాస్తవికత ,పెసిమిజం ఉంది కంట నీరు తెప్పిస్తాయి .

          1892 లో జనవరి 24 న వార్టన్ సంపన్న కుటుంబం లో పుట్టింది .అసలు పేరు Edith Newbold jones ‘’. ఆ సమయం లో కుటుంబాలు నీటి బుడగలలా ఉబ్బి ఠప్పున పేలి పోయే స్తితిలో ఉండేవి . వీరు  ‘’the 400 ‘’ అనే పాత తరం కు చెందినవాళ్ళు . ‘’the house of mirth ,the custom of the country ,the innocence ‘’అన్నీ వీరి సాంఘిక జీవన పోరాటాలను తెలిపేవే .1870 లో టైఫాయిడ్ జ్వరం వచ్చి ఎడిత్ కు చావు కొద్దిలో తప్పి పోయింది .జర్మని ,ఇంగ్లాండ్ లకు వెళ్లి ఐరోపా సాహిత్యాన్ని మధించింది . తండ్రి దగ్గర ఉన్న అమూల్య పుస్తక భాండా గారాన్ని సద్వినియోగం చేసుకోంది .పన్నెండేళ్ళ వయసులోనే ‘’fast and loose ‘’నవల రాసింది .గొప్ప చేయి తిరిగిన రచయితా రాసిన రచనా అని అందర్నీ ఆశ్చర్య పరచింది ఆ నవల .

          

Signature  

            

 

   16 వ ఏట కవితా వ్యాసంగం మొదలు పెట్టింది . ‘’new money family ‘’కి చెందిన’’హారీ ‘’తో పెళ్లి నిశ్చయ మైంది .కాని పెళ్లి కొడుకు తల్లికి నచ్చ నందున పెళ్లి కాన్సిల్ అయింది . తర్వాతా ‘’బెర్రీ ‘’అనే అతని తో స్నేహం చేసింది . ఈ స్నేహం జీవితాంతం కోన సాగింది . తెడ్డి వార్టన్ ను వివాహ మాడింది .కొత్త దంపతులు బోస్టన్ నగరం లో కాపురం పెట్టారు . ఈమెకు తగిన భర్త కాదు టేడ్డి .అప్పటికే ఈమె మేధా పండిన స్త్రీ గా వ్యవహరించేది .అంటే ‘’mature intellect ‘’.1889-90 లో న్యూయార్క్ నగరం లో కాపురమున్నారు . 1894 లో నెర్వస్ బ్రేక్ దౌన్ తో.ఇబ్బంది పడింది nausea ,exhaustion ,melancholy  తో ఉండేది .ఆ సమయం లో రాసిన కధల్లో కవితల్లో ఇవే ప్రతి బిమ్బించాయి .

       ‘’ఇంటీరియల్ డెకరేషన్ ‘’ మీద పుస్తకం రాసింది .1899 లో ‘’the greater inclination ‘’కదలు  మంచి  గుర్తింపు తెచ్చాయి . కాపురాన్ని మాసా చూసేట్స్ కు మార్చింది . ఇప్పుడే ఆమె మేధో సర్వస్వం అని పించే ‘’Ethan Home ‘’నవల రాసింది .తర్వాత’’ సమ్మర్ ‘’నవల రాసింది . ఎడిత్ రాసిన ‘’the house of mirth ‘’నవల 1,40,000కాపీలు అమ్ముడు పోయి ఆమె కు విశేష ప్రాచుర్యం కల్గించింది . ఆరు నెలలు పారిస్ లో మరో ఆరు నెలలు అమెరికా లో ఉంది .1906 ప్రముఖ రచయిత హెన్రి జేమ్స్ తో పరి చాయం కలిగింది .1890 లో భర్తకు దూరమైంది . చిన్న నాటి స్నేహితుని తో సహవాసం చేసింది . అతనికి డిప్రెషన్ . ఈమె ఆదాయం పైనే వారి కుటుంబం గడవాలి . ఆమె పారిస్ లో, ఇతను బోస్టన్ లో ఉన్నారు . భర్త అప్పుల పాలయ్యాడు .ఈవిడ పట్టించుకో లేదు . 1912 లో ‘’the reef ‘’,the curtain of the country ‘’రాసింది .1911 లో’’ ఈతాన్ ఫ్రేం ‘’నవల బ్రహ్మాండమైన విజయాన్ని సాధించింది . 1923లో భర్తకు విడాకు లిచ్చేసింది . జర్మనీ లో కాపురముంది .’’ రెడ్ క్రాస్’’లో 1917 లో చేరి సేవలందించింది . పారిస్ లో ఉన్న ఇల్లు ధ్వంసం అయింది .

        ఎడిత్ వార్టన్ తన జీవిత చరిత్ర ను ‘’a backward glance ‘’పేర రాసుకొన్నది .  1924 లో ‘’ఓల్డ్ న్యూయార్క్‘’రాసింది . అందులో అమెరికన్ల డబ్బు ఆకలి ,నిజాయితీ లేని తనం ,కళ మీద వారికున్న నిర్లక్ష్యం ,సంస్కృతిపై వారి ఏవగింపు ‘ల పై విరుచుకు పడి రాసింది .  అప్పుడే అమెరికా ‘’లీగ్ ఆఫ్ నేషన్స్ లో’’ అంటే నానా రాజ్య సమితి లో సభ్యత్వం తీసుకోలేదు .  ఆమెకు  ‘’soul mate and closest literary adviser ‘గా  వ్యవహ రించిన ‘’వాల్టర్ బెర్రీ‘’అనే ఆమె ఆప్తుడు చని పోయాడు .1929 లో వచ్చిఅన అమెరికా ఆర్ధిక సంక్షోభం వల్ల  ఆమె ఆస్తికేమీ నష్టం కలగ లేదు .ఆమె రాయటం ప్రారంభించిన ఆటో బయాగ్రఫి 1932 లో పూర్తీ చేసింది .1937 ఆగస్ట్ పద కొండు న ఎడిత్ వార్టన్ ఫ్రాన్స్ లోని పారిస్ నగరం లో 45 ఏళ్ళ వయసులోనే  మరణించింది .

       ఆమె చని పోయిన చాలా కాలం వరకు ఎడిత్ రచనల పై ఎవరూ ద్రుష్టి పెట్ట లేదు . 1950-60 కాలం లో అమెరికన్లకు ఆమె రచనల పై శ్రద్ధ పెరిగింది .పునర్ మూల్యాంకనం చేయ ప్రారంభించారు .  ‘’her ability to incorporate a whole society ‘s rituals ,struggles ,and beliefs ‘’తన రచనల్లో ప్రతి బిమ్బింప జేయ టానికి అద్భుత కృషి చేసిందని విమర్శకులు కీర్తి కిరీటం పెట్టారు .ఆమె రచనల్లో డ్రమాటిక్ ఐరనీ ఉండటం ప్రధాన లక్షణం . ఎన్నో  కధలను కూడా రాసింది అందులో దెయ్యాలు ,భూతాలు ఉండే రచనలే ఎక్కువ.సుమారు ఇర్వి అయిదు నవలలు ,మూడు కవితా సంకలనాలు ,పదిహేడు షార్ట్ స్టోరీ కలెక్షన్స్ తో బాటు తొమ్మిది నాన్ ఫిక్షన్ రచనలు చేసింది .”the book of the home ” అనే జర్నల్ కు ఎడిటర్ గా కూడా ఉన్నది . ఆమె ఫ్రెంచ్ ఇమ్పీరియలిజం ను ప్రోత్స హించింది ంఒదతి ప్రపంచ యుద్ధం తర్వాతా మొరాకో వెళ్లి అక్కడ సైనికాధికారికి అతిధి గా ఉంది అక్కడే ”మొరాకో ”అనే పుస్తకం రాసింది .ఫ్రెంచ్ భాష బాగా మాట్లాడేది ఽఅమె రచనలు ఫ్రెంచ్ లోను వచ్చాయి 

   30-9-2002 సోమ వారం నాటి నా అమెరికా డైరీ నుండి

        మీ –గబ్బట దుర్గా ప్రసాద్—2-8-13-ఉయ్యూరు       .  . 

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

ట్వెల్వ్ యాంగ్రీ మెన్

   ట్వెల్వ్  యాంగ్రీ మెన్

  రేజినాల్ద్ రోస్ అనే ఆయన రాసిన తమాషా నాటకం ‘’ట్వెల్వ్ యాంగ్రీ మెన్ ‘’.ఇది సినిమా గా టి.వి.సీరియల్ గా కూడా గొప్ప ప్రాచుర్యం పొందింది . అమెరికా లో ‘’మేకార్దీ ముఠా’’-రచయితలను కమ్యూనిస్టులు అని ముద్ర వేసి విచారణ జరిపించచేవారు . నానా అగచాట్ల పాలు చేసేవి ఆ నాటి అమెరికా న్యాయాలయాలు . ఆ విచారణ అంతా టి.వి.లలో ప్రత్యక్ష ప్రసారం చేసే వారు . దీని ని స్పూర్తిగా తీసుకొని ఒక కుర్రాడు తన తండ్రిని చంపాడని ఒక ముసిలాడు చంపుతుండగా చూశాడనిఅభియోగం మోపి దానిపై  జరిగిన కోర్టు విచారణ ను కళ్ళ ముందు చూపిన నాటకమే ఇది .

     ఇందులో పన్నెండు మంది ‘’జూరర్స్ ‘’ఉంటారు . వాళ్ళ మనోభావాలు ,వారి వ్యక్తిగత జీవితాలు ,వాళ్ళు కోర్టులో మాట్లాడిన పద్ధతులు అద్భుతం గా చిత్రించాడు నాటక కర్త రెజినాల్డ్ రాస్ . రచయిత కూడా మేకార్దీ కాలం లో జరిగిన ఒకానొక విచారణ లో ఒక ‘’జూరర్ ‘’గా ఉన్నాడు .కనుక ఆ కాలం లో ఎలా కోర్టులు స్పందిన్చేవో జూరర్లు అసలు విషయం వదిలి తమ పర్సనల్ విషయాలకు ఎలా ప్రాధాన్యత నిచ్చేవారో తప్పుడు అభియోగాలేలా ఉంటాయో చివరికి కొండను తవ్వి ఎలుకను ఎలా పట్టుకోలేక పోతారో భలే ముచ్చటగా రాసి కడుపుబ్బా నవ్విస్తాడు ఆయన అనుభవం ఈ నాటకం పండ టానికి భలే తోడ్పడింది ఆద్యంతం హుషారు గొల్పుతూ పరిగేత్తిస్తుంది .

180px-Twelve_Angry_Men_Roundabout

      దీనిలో ‘’fair and impartial juries are important ,the rights of the individual need to be respected and defended –regardless of his or her ethnicity or political belief s and beware of the dangers of big government and of a powerful few who lose their perspective ‘’అనే కఠోర సత్యాన్ని ఆవిష్కరిస్తాడు రాస్. అమెరికా న్యాయస్తానాలలో కేసును విచారించే పన్నెండు మంది జూరర్స్ ఏక గ్రీవ నిర్ణయం ప్రకటించాలి దోషి అనో కాదు అనో .కాని వీళ్ళు నిర్ధారణ కు రాలేక పోతారు . జడ్జి వీరిని ఒక గదిలోకి వెళ్లి మాట్లాడుకొని ఏకాభిప్రాయానికి రమ్మంటాడు .వీళ్ళు గదిలో చేరినా ఒకరితో ఒకరు మాట్లాడుకోలేరు ఎవరెవరో వారికే తెలియదు జాతి మతం వగైరాలు అడ్డు వచ్చి అసలు విషయం చర్చించనే చర్చించా లేని వింత పరిస్తితి లో ఉంటారు .ఇదీ ఇందులో కద .

       మేకార్దీ పై గూడా ఆరోపణ వచ్చి ప్రెసిడెంట్ ‘’ఐసన్ హోవర్ ‘’కాలం లో ‘’censure ‘’ ‘’చేశారు 1954 లో జరిగిన సెనేట్ లో జరిగిన వోటింగ్ లో అభిశంన  తీర్మానానికి అనుకూలం గా 67,వ్యతిరేకం గా 22వోట్లు వచ్చి తీర్మానం నెగ్గింది . మేకార్దే ను‘’contemptuous ,contumacious ,and denunciatory ‘’గా నిర్ణయించారు . వెయ్యి రాబందులను తిన్న  గద్ద ఒక గాలి వానకు రాలి పోయి నట్లు అయింది మేకార్దే పని . 1957 లో మేకార్దే చని పోయాడు అందుకే తప్పుడు అభియోగాలను మెకార్ధేఇజమ్ ‘’అనే పేరుతొ పిలవటం అప్పటి నుండి అలవాటయింది

       ట్వెల్వ్ ఆంగ్రి మెన్ నాటకం రాసిన రెజి నాల్డ్ రాస్ కూడా టి.వి. రచయితగా ప్రఖ్యాతుడే . సినిమాలు తీసిన వాడే . జనం లో మంచి క్రేజ్ ఉన్న రచయితా కూడా . ఈ నాటకానికి నిజం గా రోనాల్డ్ ఒక రోజ్ అని పిస్తాడు .

 .28-9-2002 శని వారం నాటి నా అమెరికా డైరీ నుండి

    మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -2-8-13–ఉయ్యూరు 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

సాహితీ నల్ల వజ్రం –మాయా యాంజేలో

సాహితీ నల్ల వజ్రం –మాయా యాంజేలో

    ‘’all my work is meant to say ‘’you may encounter many defeats ,but you must not be defeated ‘’అనేదినల్ల జాతి  మహా రచయిత్రి మాయా  యాంజేలో నినాదం .ఆ స్పూర్తితోనే ధ్యేయం తోనే గడిపింది . అంతే కాదు అడ్డు అయ్యే ప్రతి సమస్య ఒక సవాలై ఒక అనుభవమై జీవిత పురోగతికి తోడ్పడుతుందని చెప్పింది .దీని వల్ల వైవిధ్య దృక్పధం కస్ట సహిష్ణత వస్తాయని నమ్మింది .తన జీవిత రేఖను ‘’fighting defeat ‘’గా అభి వర్ణించింది . ఆరడుగుల అందహీను రాలు యాంజేలో . కవి రచయిత్రి ,నాటక రచయితా ,ఎడిటర్ ,పెర్ఫార్మర్ ,సింగర్ ,ఫిలిం మేకర్ ,డాన్సేర్ ,టి.వి.పెర్సనాలిటి,విద్యా వేత్త ,ప్రపంచ దేశాలను ప్రభావితం చేసిన సకల కళా సరస్వతి . ఒక రకం గా కొంత వరకు మన భానుమతి అన వచ్చు 

250px-Angeloupoem

 

        అమెరికా లోని మిస్సోరి లో 1928 ఏప్రిల్ నాలుగున జన్మించింది . తండ్రి వదిలేసి పోయాడు .తల్లి ఇంకోడితో సంబంధం పెట్టుకోంది . అప్పుడు కు క్లు క్లాక్స్ ఉద్యమం తీవ్రం గా ఉండేది . నిరాశామయ జీవితం .అంతశ్శక్తితో గౌరవం గా జీవించాలని నిశ్చయించు కొంది..కాని విధి వంచిత అయింది .తల్లి బాయ్ ఫ్రెండే ఈమెను ఎనిమిదేళ్ళ వయసులో రేప్ చేశాడు .అది ఆమెకు దిక్కు తోచని స్తితి అవమానకరం . తాతమ్మ దగ్గరకు చేరింది గత్యంతరం లేక . జరిగిన చెడు అనుభవానికి నాలుగేళ్ళు మౌన వ్రతం పట్టింది . ‘’బెర్త్ ఫ్లవర్స్ అనే ఆమెతో పరిచయం కలిగింది . కధలు ,పుస్తకాలు చదవమని ఆమె చెప్పిన హిత బోధ పని చేసి నిరంతర పుస్తక వ్యాసంగం లో మునిగింది .

    1941 లో చెల్లెలి తో మళ్ళీ తల్లిని చేరింది . స్కూల్ లో చేరి డాన్స్ డ్రామా ప్రాక్టీస్ చేసేది . ఒక అనాధ శరణాలయం  లో కొంత కాలం ఉంది . ఇక్కడ ఉండటమే తన జీవితం లో సహనానికి నాంది పలికిందని గమ్యం ఎర్పరచుకోవటానికి మార్గమేర్పడిందని చెప్పింది . సిటి బస్ కండక్టర్ గా ఎంపికైంది ఈమెయే మొట్ట మొదటి లేడీ బస్ కండక్టర్ . తానూ పరిణతి చెందలేదని ,స్త్రీత్వం పూర్తిగా రాలేదని గ్రహించింది . ‘’లేస్బియాన్ ‘’గా ఉన్నానేమో అనే సందేహమూ కలిగింది . ఈ సందేహం తీర్చుకోవటానికి తనతో చదివే కుర్రాడిని పిలిచి సెక్స్ లో పాల్గొంది .కడుపోచ్చి పిల్లాడు పుట్టాడు . వాడికి గే జాన్సన్ అని పేరు పెట్టింది .

    .తల్లి దగ్గర తన కొడుకును వదిలి ఉద్యోగాన్వేషణ చేసింది మాయా . వంటపని వైట్రేస్స్ పని చేసింది . భుక్తి కోసం వేశ్యా వృత్తినీ చే బట్టింది . మళ్ళీ తల్లిని చేరింది మాదక ద్రవ్యాల అమ్మకమూ చేసింది . తానిన్ని పనులు చేస్తున్నా చంద్రుని కాంతి లా స్వచ్చమైన దానినే నని బతక టానికి చేసిన పనులే ఇవని అంటుంది . తర్వాత సేల్స్ క్లార్క్ గా పని చేసింది  శాన్ఫ్రాన్సిస్కో లో  అక్కడ తెల్ల జాతి వారితో పరిచయమేర్పడింది . తోష్ అనే అమెరికన్ గ్ర్గ్రీక్ తోపరిచయం, పెళ్లి అయ్యాయి .వాడు ఈమెను వంటింటికే పరిమితం కావాలని శాసించాడు.వాడికి దేవుడి పై నమ్మకమూ లేదు . ఈవిడ చర్చికి వెళ్తుంటే వద్దనే వాడు .కలహాల కాపురం . రెండేళ్ళ తర్వాత విడాకులు .

         నైట్ క్లబ్ లో డాన్సర్ గా,సింగర్ గా చేరింది . పేరును మాయా యాన్జేలూ నుంచి ‘’మాయా యాంజేలో ‘’గా మార్చుకోంది .ఈ పేరు క్లిక్ అయింది . కధలు రాయటం ప్రారంభించింది . న్యు యార్క్ చేరింది . అక్కడి రైటర్స్ గిల్డ్ లో చేరింది . ‘’the heart of a woman ‘’ రాసింది . వరుసగా ది. ఫైర్,నెక్స్ట్ టైం లు రాస్తే మంచి ప్రోత్సాహమే లభించింది . దియేటర్ లో పని చేసింది అక్కడే నల్ల జాతి హక్కుల పోరాట నాయకుడు మార్టిన్ లూధర్ కింగ్ తోపరిచయ మేర్పడింది . ఆయన ఉద్యమం పై తీవ్ర ఆసక్తి చూపి దాని కోసం ఒక బెనిఫిట్ షో నిర్వహించింది . 1960 లో ‘’make ‘’ అనే సౌత్ ఆఫ్రికన్ తోపరిచయమై దక్షిణాఫ్రికా కు అతనితో వెళ్ళి,పెళ్లి చేసుకోంది . .అక్కడ నాటకాలలో వేషాలు వేసి మంచి పేరు ,ప్రఖ్యాతి పొందింది .ఇది వాడికి నచ్చలేదు . వాడు ఇంకో అమ్మాయితో సంబంధం పెట్టుకొన్నాడు . ఇదేమిటి అని ఈమె ప్రశ్నిస్తే అది తమ ఆచారం పొమ్మన్నాడు . పేచీలు , విడాకులు .

        ఈజిప్ట్ చేరుకొంది . ‘’ఆరబ్ అబ్సర్వర్ ‘’లో పని చేసింది . రేడియో లో ఉపన్యాసాలిచ్చింది . 1961 లో కొడుకు తో ఘనా చేరింది . నాలుగేళ్ళు అనేక పత్రికలకు ఆర్టికల్స్ రాసింది .గుర్తింపు లభించింది . ఘనా అధ్యక్షుడు ‘’నుక్రుమా ‘’తో పరిచయం కలిగింది . ఘనా వాళ్లకు బ్లాక్ అమెరికన్లు అంటే ఇష్టం లేదు . మళ్ళీ కాలిఫోర్నియా చేరింది . కధలు ,పాటలు పద్యాలు రాసింది . టి.వి.సిరీయల్స్  లో పాల్గొంది .1969 లో ‘’the poetry of Mayo ‘’ విడుదల చేసింది . కాన్సాస్ యూని వెర్సిటి లో ఫెలోషిప్ సాధించింది . ‘’I know how the caged bird sings ‘’ అనే తన స్వీయజీవిత  చరిత్ర రాసుకోంది .. మొదటి భాగాన్ని చదివిన బాల్డ్విన్ అనే విమర్శకుడు ‘’her portrait is biblical study of life in the midst of death ‘’అని గొప్ప గా ప్రశంషించాడు .

    1971 లో ‘’give me a cool drink before I die ‘’,కు పులిట్జర్ బహుమతి వచ్చింది .1972 లో ‘’జార్జియా జార్జియా‘’సినిమాకు స్క్రీన్ ప్లే రాసింది . అమెరికా సాహిత్య చరిత్రలో మొదటి నల్ల జాతి స్త్రీ రాసిన స్క్రిప్ట్ అది .మూడో సారి ‘’పాంట్ ‘’అనే వాడితో పెళ్లి . 1974 లో విజిటింగ్ ప్రొఫెసర్ అయింది .1976 లో ‘’all day long ‘’రాసింది .,roots ‘’సినిమా లో ‘’కిటా కింటే‘’పాత్ర లో గ్రాండ్ మదర్ గా నటించింది ..1981 లో the heart of a woman ‘’కు మంచి పేరొచ్చింది . తన జీవిత చరిత్రలో అయిదవ భాగానికి ‘’all god’s children need traveling shoes ‘’అని పేరు పెట్టింది . ఇది బాగా క్లిక్ అయింది .

     1093  లో అమెరికా అధ్యక్షుడిగా బిల్ క్లింటన్ పదవీ స్వీకర ప్రమాణం చేసినప్పుడు మాయా ను ఆహ్వానించి కవిత చదవమని కోరాడు . ‘’on the pulse of morning ‘’అనే కవితను చదివి సార్ధకత తెచ్చింది . ఇప్పటికీ ఇరవయ్యవ శతాబ్దపు గొప్ప కవిగా మయా యాంజేలో కు గుర్తింపు ఉంది . ఆమె రచనలను విశ్లేషిస్తూ ‘’though Maya’s work is personal ,she aspires to be universal ‘’అని శ్లాఘిస్తారు . ఆఫ్రికన్ అమెరికన్ మహిళ గా జన్మించి ఎన్నో అవాంతరాలను ఎదుర్కొని జంకు లేకుండా ధైర్యం తో   తన ధ్యేయాన్ని సాధించి వివిధ రంగాలలో తన బహుముఖ ప్రావీణ్యతను నిరూపించిన నల్ల జాతి వజ్రం మాయా యాంజేలో .

   28-9-2002 శని వారం నాటి నా అమెరికా డైరీ నుండి

     మీ—గబ్బిట దుర్గా ప్రసాద్ -1-8-13- ఉయ్యూరు 

 
 
Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

ది సి అండ్ ది బెల్స్

        ది సి అండ్ ది బెల్స్

    చిలీ దేశం లో పుట్టి సాహిత్యం లో 1971లో  నోబెల్ బహుమతి పొందిన పాబ్లో నెరూడా కవి రాసిన కవితా సంపుటి యే ‘’the sea and the bells ‘’.సృజనాత్మక కవి ‘’sound of stones being born ‘’అంటూ వింతగా చెబుతాడు .

 

220px-Pablo_Neruda_(1966) 160px-Firma_Pablo_Neruda.svg 170px-La_Sebastiana_Neruda_1

                                                                                                                         ఆయన ఇల్లు 

 

          ఈశీర్షిక లో బెల్స్ అంటే కదిలే షిప్స్ .అవి కాలానికి సంకేతం . సాగర తరంగాలు తనను ధ్యాన ముద్ర లోకి తీసుకొని వెళ్తాయని భావిస్తాడు . అలానే ‘’merchandise ‘’అంటే బీదతనం –పావర్టికి చిహ్నం . ఈ కవి చని పోయే సమయం లో ఈ కవితలు ఆయన డెస్క్ మీద ఉన్నాయట .తర్వాత మరణానంతరం ప్రచురింప బడ్డాయి . భార్య మేటేల్డీ పైన కూడా కవిత రాశాడు . చాలా సహజం గా సాధారణం గా  గా అవసరానికి తగిన సామగ్రి తోకవిత రాసి రంజింప జేస్తాడు . ‘’he feels his life being regenerated daily by its intimate knowledge of the seas of renewal and articulated by the generosity of love . Facing imminent death ,he remarks in the past tense ‘’it was beautiful to live –when you lived ‘’అంటాడు .భార్య తో తన ప్రేమ ‘’cyclic process of seasons of the feminine principle of sunshine and rain and the day ‘’గా గొప్ప గా అభి వర్ణించాడు

 1973 సెప్టెంబర్ లో మరణించాడు .జననం 12-7-1904 సర్రియలిస్తిక్ కవిగా గొప్ప గుర్తింపు . ప్రపంచ భాషలలో ఇరవయ్యవ శతాబ్దపు గొప్ప కవిగా ప్రఖ్యాతి చెందాడు .బ్రెజిల్ లో కమ్యూనిస్ట్ నాయకుడు కార్లోస్ గౌరవార్ధం లక్ష మంది హాజ రైనా సభలో నెరూడా తన కవితలను విని పించి అందరిని ఆకర్షించాడు .నోబెల్ బహుమతి ని స్వీకరించి చిలి చేరినప్పుడు ప్రెసిడెంట్ అలెండీ సమక్షం లో డెబ్భై వేల మంది పాల్గొన్న సభలో తన కవితలు విని పించాడు  ఽఅయన మరణిస్తే అంత్యక్రియల రోజున జనం కర్ఫ్యూ ను ధిక్కరించి వేలాదిగా హాజరై గౌరవం గా అంత్య క్రియలు పూర్తీ చేశారు .  

           కొన్ని కవితా పంక్తులు

 1-‘’that is why I am so much and so little –so wealthy and so destitute –because I am from below –from the earth

2-‘’slender is our country –and on the naked edge of knives –her delicate flag brns

3-‘’hour after hour one spoonful –of acid falls from the sky as to day falls from the day –from the day of this day ‘’

4—‘’monotonous is my song –my word is a shadow bird –fauna of stone and sea the grief –of winter planet in corruptible ‘’

5—‘’once more young men ready yourselves –for another chance to kill to die again –and to scatter flowers over the blood ‘’

 

27-9-2002 శుక్రవారం నాటి నా అమెరికా డైరీ నుండి

      మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –1-8-13- ఉయ్యూరు 

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

తెలుగు చారిత్రాత్మక నవలకు నూట పదహారేళ్ళు

charitraka navala -116yrs-1charitraka navala -116yrs-2charitraka navala -116yrs-3charitraka navala -116yrs-4charitraka navala -116yrs-5charitraka navala -116yrs-6charitraka navala -116yrs-7

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

జ్వలించే అగ్ని పర్వతం ఎజ్రా పౌండ్

 జ్వలించే అగ్ని పర్వతం ఎజ్రా పౌండ్

    ఆతనొక  వజ్రం .సాన బెట్టిన కొద్దీ మెరిసిన వాడు ..’’bubbling pond ‘’అన్న పేరు ను సార్ధకం చేసుకొ న్న వాడు . శ్రీ శ్రీ ని మన అద్దేపల్లి రామ మోహన రావు ‘’అగ్ని సరస్సున వికశించిన వజ్రం ‘’అన్నాడు .ఇది పౌండ్ కు కూడా వర్తిస్తుంది . దీప శిఖ.స్వేచ్చకు సంకేతం పౌండ్ .అయినా స్వేచ్చ అనుభవించని అతని చరమాంకం చూస్తె బాధే కలుగు తుంది’’ .solitary volcano ‘’అంటారు ఎజ్రా ను . ‘’flaming savanarola of modern poetry .un predictable bundle of electricity అని అంటాడు జేమ్స్ జాయిస్ . ‘’whirl wind of forked lightning ‘’ అని కీర్తించాడు టి.ఎస్.ఇలియట్ .

         ఇరవయ్యవ శతాబ్దపు విప్లవ కవిత్వానికి ఆద్యుడు .’’ Trotsky of literature ‘’అని ప్రముఖ రచయితా w. Lewes టో ప్రశంశ పొందాడు . పెడగాగిక్ వాల్కనో అనీ అన్నారు విమర్శకులు . కోపాన్ని శక్తిని ముప్ఫై ఏళ్ళ పాటు అనుక్షణం కక్కిన విప్లవ మాంత్రికుడు . అతని నినాదమే ‘’make it new.’’.భావ చిత్ర శిల్పం అతని ఊపిరి . ‘’poetry is dance of intelligence among words ‘’అంటాడు 

     బ్రిటిష్ కవిత్వాన్ని చేడా మడా తిట్టేశాడు .అతని దృష్టిలో ఆంగ్ల కవిత్వం ‘’boiled oat meal consistency .Popy cock and rhetoric dim ,painted adjectives ,అని తిట్టినా తిట్టు తిట్టకుండా తిట్టి పోశాడు .’’it needed a constant change of manner if it was to live ‘’అని ఆంగ్ల కవిత్వాన్ని బతికిన్చుకొనే తరుణోపాయం చెప్పాడు . పౌండ్ దృష్టిలో మంచి కవిత్వం అంటే శాశ్వత మైన కవిత్వం కాదు .’’by good art  I mean the art that bears true witness ‘’అని తీర్పు చెప్పాడు . ‘’I mean the art is most precise .Beauty in art reminds one what is worth while ‘’అంటాడు .

     పౌండ్ స్వభావాన్ని గురించి చెప్పాలంటే ‘’always self conscious and nervously awares of others ,high strung impatient ,mercurial and exuberant .Pound presented himself as the figure of the poet ‘’పౌండ్ ఆకారాన్ని వర్ణించాలంటే ‘’with green trousersmade of billards cloth ,with his pink velvet coat and its blue glass buttons ,a hand painted tie ,his mane of reddish blond hair tucked under a sombrero his green eyes ,a beard cut to point to  resemble ,a Spanish conquistador and as  a final touch a singular turquoise ear ring ‘’ఇదీ అయ్య గారి ఆకారం . ఇలా లండన్ వీధుల్లో చెడ తిరిగే వాడు .

 

 

    పౌండ్ రాసిన కవితలనుచదివితే కోపం తో ద్వేషం టో ఉర్రూత లూగి పోతారు .భూకం వచ్చి నప్పుడు ఊగి నట్లు నవ్వుతో ఊగి పోతారు అన్నారు  సమీక్షకులు .జేమ్స్ జాయిస్  పౌండ్ రాసిన ‘’యులిసెస్ ‘’ను సమీక్షిస్తూ  ‘’ a new historical period has begun –the Pound era ‘’అని పౌండ్ శతాబ్ది ప్రారంభామైన్దన్నాడు . పౌండ్ రాసిన‘’కాస్మోస్ ‘’లో సెల్ఫ్ పిటి ఉంది. .పౌండ్ పారిస్ వెళ్లి పికాసో ఇలియట్ లతో స్నేహం చేశాడు .రెండవ ప్రపంచ యుద్ధ కాలం లో ‘’Italian state radio ‘’లో ఫాసిజం ను సమర్ధిస్తూ చాలా సార్లు మాట్లాడాడు . ప్రెసిడెంట్ రూజ్ వెల్త్ పౌండ్ ను తిట్టాడు . అమెరికా వెళ్ళిన తర్వాత ఆరు అడుగుల పొడవు ఆరడుగులు వెడల్పు మాత్రమె ఉన్న సెల్ లో వేసి విచారించారు .ఒంటరి వాడిని చేసే ఉంచారు .. చలికి ఎండకూ గురి చేశారు . తర్వాత రాబర్ట్ ఫ్రాస్ట్ ,ఇలియట్ వగైరా ప్రముఖులు జోక్యం చేసుకొని పౌండ్ ను విడుదల చేయించారు .

 

                                                                                                                                     the death prision in pisa 

       ఇటలీ వెళ్లి పోయాడు .చివరి పదేళ్ళు ఎవరి తోనూ మాట్లాడకుండా గడిపాడు పౌండ్ .  కనీ పించిన ఆడదాన్ని చూపులతో యిట్టె పడేసే వాడు . అందుకే పౌండ్ ను ‘’King Lear of modernism ‘’అన్నారు . చివరికి 87 వ పుట్టిన రోజున నిద్రలోనే మరణించాడు పౌండ్ .పౌండ్ జనం అమెరికా లోని ఫిలా దేల్ఫియా లో 1889 జూన్ లో .తనను గురించి పౌండ్ ఇలా చెప్పుకొన్నాడు ‘’I knew at fifteen pretty much what I wanted to do . >I resolved that at thirty I would know more about poetry than any man living .poetry is indestructable ‘’.

     తాను చని పోయే లోపు ఇది వరకేప్పుడూ ఎవరూ రాయని గొప్ప కవిత్వాన్ని సృష్టిస్తాను అన్నాడు పౌండ్ . దాన్ని నిజం గానే నిల బెట్టుకొన్నాడు . రవీంద్ర నాద టాగూర్ ను ఇలియట్ ద్వారా కలిశాడు పౌండ్ . తానూ సంకలనం చేసిన పుస్తకం లో రవి కవి గీతాలను  చేర్చాడు . 1922 ను ‘’a year of modernism ‘’అంటారు . ప్రముఖ రచయితఎర్నెస్ట్ హెమింగ్ వే కు రాసే మెలకువ నేర్పింది పౌండ్ మాత్రమె . అతని దృష్టిలో వివాహం ‘’ romantic love marriage was more a sustained friendship .Artists were special cases who could be expected to have many deep friendships .Pound felt a connection between his creativity as apoet and his ability to attract and seduce women .He could woo and win women even at the age of 60 .

        నోటికి యెంత వస్తే అంట మాట్లాడే వాడు pope pious 11 ను ‘’ఏ సన్ ఆఫ్ బీచ్ ‘’అన్నాడు తీవ్రం గా . ఇలియట్ కు స్నేహితుల ద్వారా ఆర్ధిక సాయం అందించాడు పౌండ్ . ఏడాదికి కనీసం వెయ్యి ఉత్తరాలైనా రాసే వాడు . ఇలా కనీసం పదేళ్ళు చేశాడు . జైలు నుండి విడుదల చేయ టానికి ఫ్రాస్ట్ చాలా ప్రయత్నాలు చేశాడు . ‘’our mood is your mood mr.Frost ‘’అన్నాడు ప్రభుత్వ అధికారి .జైలు నుండి విడుదల అయిన తర్వాత ‘’not like an old man ,but like a dead man ‘’గా అని పించాడు మిత్రులకు . తనలో తానూ ‘’wrong ,wrong –I have always been wrong ‘’అనుకొనే వాడట . చివరికి తనకేమీ తెలియదని తెలుసుకోన్నానని అనే వాడు . చివరి ఇంటర్ వ్యూ లో ‘’all my life I believed I knew nothing yes ,I knew nothing . And so words became devoid of meaning ‘’అని చెప్పాడు

      1965 లి ఇలియట్ కవి  మరణించాడు . 1966 లో ‘’ఎకాడేమి ఆఫ్ అమెరికన్ పోఎట్స్ ‘’ గౌరవించి సత్కరించింది . హామిల్టన్ కాలేజి వారు గౌరవ డాక్టరేట్ నిచ్చారు . ఎమర్సన్ –తోరో అవార్డ్ ను ‘’మానవత్వ కవిత్వానికి ఇస్తారు . దీనికి పౌండ్ పేరు ను ప్రతి పాడించారు .దానికి పౌండ్ జీవితాలను నరక ప్రాయం చేశాడు అనే నెపం తోఅభ్యంతరం వచ్చింది .1-11-1972 లో మరణించాడు . జననం 30-10-1885అమెరికా లోని ఇడాహా లోని హైలీ

 లో .1905 లో  గ్రాడ్యుయేషన్ ను రోమాన్స్ లో చేశాడు కొంతకాలం టీచర్ ఉద్యోగం చేశాడు . 

   25-9-2002 బుధ వారం నాటి నా డైరీ నుండి

   మీ –గబ్బిటదుర్గా ప్రసాద్ –31-7-13- ఉయ్యూరు . 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

అమెరికన్ నాటక నవలా కారుడు స్టీఫెన్ క్రోన్

 అమెరికన్ నాటక నవలా కారుడు స్టీఫెన్ క్రోన్

        కేవలం 28 సంవత్సరాలు మాత్రమె జీవించి తన రచనల టో చిరంజీవి అయిన నవలా నాటక రచయితా స్టీఫెన్ క్రేన్ .యుద్ధం కధలు నవలల తో ప్రసిద్ధి చెందాడు .’’you can feel nothing unless you are in that condition your self ‘’అంటాడు క్రేన్ .అంతేకాదు ‘’I can not help vanishing and disappearing and dissolving ‘’అనీ అనగలడు .

       1871లో నవంబర్ ఒకటి న న్యూయార్క్ దగ్గరున్న న్యు జెర్సీ లో స్టీఫెన్ క్రేన్ జన్మించాడు .పద్నాలుగురున్న సంతానం లో చివరి వాడు . క్రేన్ పూర్వీకులు అమెరికన్ డిక్ల రేషన్ పై సంతకం చేసిన వాళ్ళు .తల్లి చాలా కాస్త పడేది .పుస్తకాలు బాగా చదివే వాడు బాల్యం నుంచీ . తోమ్మిదిఏళ్ళప్పుడే తండ్రి గుండె జబ్బుతో చని పోయాడు .కుటుంబ బాధ్యతా తల్లిదే . న్యు యార్క్ మిలిటరీ అకాడెమి లో చేరాడు . బేస్ బాల్ ఆట ఆడే వాడు దేశ ద్రిమ్మరి గా కొంతకాలం తిరిగాడు .1893-94 లో చాలా దుర్భర జీవితం గడిపాడు . భరించలేని వ్యధ టో నలిగి పోయాడు .బీదతనం ,ఒంటరితనం టో ఉక్కిరి బిక్కిరయ్యాడు .దీనికి తోడూ టి.బి.ఎటాక్ .1894 లో కస్తాల కడలినే ఈదాడు ..అదొక ప్రయోగమే అయింది .

 

 

crane’s realistic portrait

      ‘’ మాగీ ఏ గర్ల్ ఆఫ్ ది  స్ట్రీట్ ‘’రచన చేశాడు .ఆ తర్వాత ప్రసిద్ధ రచన ‘’the red badge of courage ‘’రాసి ప్రచురించాడు. దీనిని సివిల్ వార్ సమయం లో రాశాడు . అమెరికా అంతర్యుద్ధం లో ప్రజల మానసిక వేదనకు చలించి రాసిన నవల ఇది . ‘’I wonder that some of these fellows do not tell how they felt in those scraps –they spout eternally of what they did but they are as emotionless as rocks ‘’అని ఆ కాన్ఫ్లిక్ట్ లో చిక్కుకొని నోరు మెదపని వారిని గురించి అంటాడు .

     తర్వాత మెక్సికో వెళ్ళాడు .1895 లో ‘’the black riders ‘’రాశాడు . ‘’the third violet ‘’కూడా రాసి మెప్పు పొందాడు క్రేన్ రచనలన్నీ ఇంగ్లాండ్ లో క్రేజ్ పొందాయి . ‘’one of the deathless books which must be read every body who desires to to be or to seem ,a connaiser of fiction ‘’అని శ్లాఘించారు బ్రిటిష్ క్రిటిక్స్ . హెచ్.జి.వేల్స్ .మరీ ముచ్చటపడ్డాడు క్రేన్ రచనా చాతుర్యాన్ని శిల్ప వైభవాన్ని చూసి . 1896 లో న్యూయార్క్ చేరాడు .కధలు రాయటం జర్నల్స్ లో శీర్షికలు రాయటం చేశాడు అక్కడి పోలీసులు ,అధికారులలో ఉన్న అవినీతి పై పేపర్లలోఏకి పారేశాడు . జనం వీర తాళ్ళు వేశారు . ఫ్లారిడా లోని జాక్సన్ విల్ వెళ్లి కొంతకాలం పని చేశాడు యుద్ధ వార్తస్లు రాయటానికి క్యూబా వెళ్ళాడు అక్కడ కోరా అనే అమ్మాయి తోపరిచయం .ఇద్దరు ప్రయాణం చేసే షిప్ సముద్రం లో మునిగి పోయింది .లైఫ్ బోట్ పట్టుకొని తీరం చేరారు .ఈ అనుభవాన్ని పేపర్ లో అక్షర బద్ధం చేస్తే గొప్ప రేస్పాన్సే వచ్చింది .

     గ్రీకో టర్కిష్ యుద్ధం లో వార్తలకోసం ఇంగ్లాండ్ వెళ్ళాడు .కోరా తోపెళ్లి జరిగింది . 1897  ఫిబ్రవరి 17న అమెరికా మెరైన్ ను హవానా హార్బర్ లో పేల్చి వేశారు .దీనితో అమెరికా క్యూబా పై యుద్ధం ప్రకటించింది .క్షయ వ్యాధి నవ నాడులనీ కుంగ దీస్తున్నా యుద్ధ వార్తలకోసం ‘’వరల్డ్ ‘’పత్రిక కు పని చేశాడు .పని ఒత్తిడికి తట్టుకో లేక పోయే వాడు .మలేరియా టో బాధ పడ్డాడు ఉద్యోగం పోయింది పోర్తారీకా లో కాపురం పెట్టాడు .అక్కడి నుండి హవానా వెళ్ళాడు .న్యూయార్క్ జర్నల్ కు రచనలు చేస్దాడు .ససెక్స్ లో కాపురం . అది ఆనాడు ‘’డెత్ ప్లేస్ ‘’అనే పేరు తెచ్చుకోంది . అక్కడ వేడి లేదు వెలుతురూ లేదు ,కరెంట్ లేకుండా గడిపాడు .

    1899లో లండన్ చేరి గొప్ప విందు నిచ్చాడుక్రెన్ .   వేల్స్ ,కాన్రాడ్ మొదలైన హేమా హేమీలంతా ఆ పార్టీకి వచ్చారు .ప్రముఖ రచయితా లందరితో ‘’the ghost ‘’అనే నాటకాన్ని రాయించాడు క్రేన్ . తెల్ల వార్లూ .1999 డిసెంబర్ 27 న  ప్రదర్శించాడు . ఇరవై ఎనిమిదేళ్ళకే 1900 జూన్ అయిదు న రక్త నాళాలు తెగి పోయి క్రేన్ మరణించాడు ‘’the red badge of courage ‘’రాసిన కర్త ఇక లేదని పించాడు .

                    రచనా విశేషాలు

‘’crane was the first great tragic figure in the modern American generation .His are humorous tales with parody ,technical master pieces .he writes a kind of grammar in which war is the subject ,the verb and the object of every sentence . It was an effort born pain . ‘’అని కీర్తిస్తారు క్రేన్ రచనలను . అమెరికా ఫిక్షన్ ప్రాజ్ కు సృజనాత్మక ట ను చేకూర్చిన వాడు . మాస్టర్ ఆ ఫోరిజినల్ స్టైల్ అని పించుకొన్నాడు .అతని రచనలు ఈ నాటికీ సజీవం గా కానీ పిస్తాయి .కారణం అత్సను గొప్ప కళా కారుడు క్రేన్ ను‘’one of the first –post impressionalists ‘’అంటారు అతని ‘’snake ‘’ లో డార్విన్ చెప్పిన జెనెటిక్ ఇండికేషన్ ఉంది . ‘’in the man was all the wild strength of the terror of his ancestors ,his raceof kind .A deadly repulsion had been handed over from man to man through long dim centuries .later he seizes a stick and smashes the snake to death . అని మానవ స్వభావాన్ని అద్భుతం గా ఆవిష్కరిస్తాడు .తనవి తన పూర్వీకులవి ఎమోషన్లను అనచుకోలేక మనిషి పిచ్చ వాడి పోతున్నాడని బాధ పడతాడు .

    క్రేన్ కధలు వాస్తవికత కు దగ్గర గా ఉంటాయి ఐరనీ అతని రచనల్లో ప్రాణం పోసుకొంతుంది . క్రేన్ రాసిన రెడ్ బాడ్జ్ అమెరికా మొదటి  ఇమ్ప్రేశానలిస్ట్ నవల .ఇందులో హీరో కు తానూ యుద్ధం లో ఒడి పోతానని తెలిసినా ,తానూ పిరికి వాడిన ,ముందుకు దూకి కర్తవ్యమ్ నేర వేరుస్తాడు . అలాగే ఓపెన్ బోట్ లో కూడా ప్రక్రుతినేదిరించి హీరో విజయం సాధిస్తాడు .క్రేన్ కధల్లో మాటలు వర్ష పాతం గా మీద పది తడిపెస్తాయి . బాడ్జ్ లో కదా ముగిస్తూ క్రేన్ ‘’he had been to touch the greatdeath and found that ,afterall ,it was but the great death .he was a man ‘’అని మహా గొప్పగా అంటాడు .

     26-9-2002 గురువారం నాటి నా అమెరికా డైరీ నుండి

        మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –31-7-13- ఉయ్యూరు 

Posted in అమెరికా లో, పుస్తకాలు | Tagged | Leave a comment

అమెరికన్ బ్లేక్ ఖలీల్ జీబ్రాన్

         అమెరికన్ బ్లేక్ ఖలీల్ జీబ్రాన్

   ఖలీల్ జీబ్రాన్ లెబనాన్  కు చెందిన సృజనాత్మక కవి,చిత్రకారుడు .  . అ దేశం లో ఒక ఆచారం ఉంది ‘’tummaz ‘’.అనే దేవత కంచు విగ్రహం చేసి పూజించి కన్యలు నదులలో కలిపితే అలాంటి భర్త గా తిరిగి వస్తాడని నమ్మకం . ప్రక్రుతి పరవశించే‘’బెచేరి ‘’అనే చోట 1883జనవరి ఇరవై  ఆరు న పుట్టాడు జీబ్రాన్ . తండ్రికున్న పద్నాలుగు అంది సంతానం లో ఎనిమిది మందే మిగిలారు .పెద్దన్న పీటర్ అమెరిక వెళ్లి డబ్బు బాగానే సంపాదించాడు .జీబ్రాన్ ,తల్లి ,సోదరి కూడా అమెరికా వెళ్ళారు . బోస్టన్ నగరం లో నివాసమున్నారు . కవిత్వం రాయటం పెయింటింగ్ చేయటటం ,కుట్టు పనులు చేయటం చేసేవాడు .తీసుకు వెళ్ళిన పెద్దన్న పీటర్ ,తల్లి కూడా క్షయ వ్యాధి తో అక్కడే మరణించారు . కుటుంబ బాధ్యతాజీబ్రాన్ పై  పడింది .

     పారిస్ వెళ్లి చిత్రలేఖనం లో రెండేళ్ళు కస్టపడి సాధించాడు . మేరి ఎలిజే బెత్ హేస్కేల్ ఆనే ఆమె అతనికి ఏంటో సాయం చేసింది అభివృద్ధికి తోడూ పడింది . క్రిస్టియన్ మతానికి చెందినా వాడ్సైనా ముస్లిం మాట ప్రభావం అందునా సూఫీ మాట ప్రభావం ఎక్కువ . సిరియా కు అరబిక్ భాష జాతీయ భాష కావాలని వాంచించాడు 

 

                            లెబనాన్ లో ఇల్లు                   చిన్ననాటి ఫోటో                   జీబ్రాన్ గీసుకొన్న స్వీయ చిత్రం 

జీబ్రాన్ మ్యూజియం ,సమాధి       వాషింగ్టన్ లో మెమోరియల్      బోస్టన్ లో మెమోరియల్

        అమెరికా లో చిత్ర ప్రదర్శన పెడితే ఎవరూ హర్షించలేదు . మేరీ హాస్కిల్ ,బార్బోర యాంగ్ లు ప్రోత్స హించి న్యూయార్క్ నగరం లో ప్రదర్శిస్తే గొప్ప పేరు ,గుర్తింపు లభించాయి . ఆరబిక్ భాషలో మంచి కవిత్వం రాశాడు .అతను రాసిన ‘’the procession ‘’అనే గేయం బాగా ప్రాచుర్యం పొందింది . దాన్ని’’beautiful in form ,creative In thought ,immediate and lasting favour ,ranked among the classics of contemporary English literature ‘’అని పించు కొంది .తన వూరు వెళ్లి పోవాలని wadi-quadisha ‘’ను స్వతంత్రం చేయాలని ఆలోచించే వాడు .  .కాని టి.బి. తో ఆరోగ్యం దెబ్బతింది  డాక్టర్ పరీక్షించి మందులు వద్దన్నాడు . 1939 ఏప్రిల్ పది న నలభై ఎనిమిదవ ఏట ఖలీల్ జీబ్రాన్ కవి న్యు యార్క్ లో  మరణించాడు .శవాన్ని స్వంత ఊరుకు చేర్చారు . అఖండ జన నీరాజనాల మధ్య అంత్య క్రియలు జరిగాయి . జీబ్రాన్ ను ‘’అమెరికన్ బ్లేక్’’అంటారు .కవిత్వం లోను రాజకీయాలలోనూ తీవ్ర వాది 1923లో రాసిన ”the prophet ” తో ఆంగ్ల భాషా భిమానులకు దగ్గరయ్యాడు . అతని ఫిలసాఫికల్ వ్యాసాలూ మంచి ఆలోచనలను రేకెత్తించాయి . అన్ని కాలాల లోను అత్యధిక పుస్తకాలు అమ్ముడు పోయిన కవులలో మూడవ వాడు జీబ్రాన్ .1918 వరకు అరబిక్ భాషలోనే రాశాడు ఽఅ తర్వాత అంటా అ ఇంగ్లీష్ లోనే  .లెబనాన్ లో జీబ్రాన్ మ్యూజియం ఏర్పాటు చేశారు .. అతని సమాధి ప్రక్కన ఇలా రాశారు ‘ Wen next to Gibran’s graveritt are the words “a word I want to see written on my grave: I am alive like you, and I am standing beside you. Close your eyes and look around, you will see me in front of you.”[citation needed] 

అమెరికా లోని మేరీ లాండ్ యూని వర్సిటి లో ”జీబ్రాన్ చైర్ ఫర్ వాల్యూస్ అండ్ పీస్  ”’ఏర్పాటు చేశారు  రాసిన ”   pity the nation ”’అనే ప్రముఖ కవిత మరణానంతరం వెలువడింది .

 

 

 

      అతని కొన్ని కవితా పంక్తులు

1-‘’to steal a flower ,we call mean –to rob a field is chivalry ‘’

 2-‘’hounours are but false delusions –like the froth upon the wave ‘’

 3-‘’if you shall meet happy on –who is contented with his lot –unlike the rest of all mankind –pray his Nirvana disturb not ‘’

4 –‘’in the forest no destination –of soul or body is istilled

5-‘’air is water aerated –and the dew –water distilled (soul and fertility )

 
 24-9-2002 మంగళ వారం నాటి నా అమెరికా డైరీ నుండి 
         మీ –గబ్బిట  దుర్గా ప్రసాద్– 31-7-13-ఉయ్యూరు 

 

Posted in అమెరికా లో | Tagged | Leave a comment

లెసన్ బిఫోర్ డైయింగ్

  లెసన్ బిఫోర్ డైయింగ్

    ఎర్నెస్ట్ జే..గ్రైన్స్ రాసిన నవల ‘’ఏ లెసన్ బిఫోర్ డైయింగ్ ‘’.ఒక నల్ల జాతి కుర్రాడి మరణ శిక్ష మీద కదా .హత్య చేసినట్లు ఒప్పుకోడు . వర్జిన్ అనే ప్రొఫెసర్ వాడికి చాలా ధీమా గా గర్వం గా చావటం గురించి చాలా కాస్త పది నేర్పుతాడు . వాడిని మనిషి గా మార్చాలని తాపత్రయం .చివరికి సాధిస్తాడు ‘’simple heroism of resisting and defying ‘’నేర్పిస్తాడు .తనకు ఉరి శిక్ష పడే ముందు ఆ కుర్రాడు ప్రొఫెసర్ కు తనలో వచ్చిన మార్పు గురించి వివరం గా ఉత్తరం రాస్తాడు .ఈ పుస్తకం గురించి‘’the book will be read ,discussed and taught  beyond the rest of the lives ‘’అని ఈ నవల గురించి చికాగో ట్రిబ్యూన్ కితాబు నిచ్చింది .చదివి తప్పక అర్ధం చేసుకోవాల్సిన పుస్తకం..

 A_Lesson_Before_Dying_novel

       కేసు విచారణ లో అటార్నీ అనేక విషయాలు తెలుసు కొంటాడు .కుటుంబాన్ని విచారిస్తాడు .ఆఫ్రికన్ అమెరికన్లు చీకటి లో మగ్గుతున్నారని వారికి చదువు నేర్పాల్సిన అవసరం ఉందని గ్రహిస్తాడు .రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత ,సివిల్ రైట్స్ పొందక ముందున్న ఈ జాతి వారి ని ఏంటో అభి వృద్ధి పరచాల్సిన అవసరం ఉందని తెలియ జేస్తాడు .కుటుంబం లోని వారి కోర్కెలను తీర్చటానికి ,వారి అసంబద్ధ కోర్కెలను నేర వేర్చతానికి ఈ కుర్రాడు తీసుకొన్న నిర్ణయాలు చేసిన అసాంఘిక కృత్యాలు వాడి మెడకు ఉరి తాళ్ళను పెనాయి అని నిర్ణయిస్తాడు .మానవ హృదయం టో వాడి నేపధ్యాన్ని గుర్తించాలని కోర్టుకు నివేదిస్తాడు .

      జెఫర్సన్ ను మానవ మాత్రుడిగా మార్చటానికి గ్రాంట్ అనే మాస్టారు చేసిన ప్రయత్నం అంటా ఇందులో కనీ పిస్తుంది .అందుకే దీని శీర్షిక చాలా ప్రాముఖ్యత పొందింది . ఇందులో సింబాలిక్ గా చివర వచ్చే సీతా కోక చిలుక ఇద్దరిలో వచ్చే పరి వర్తనకు సాక్షయం .గా నిలుస్తుంది . జెఫర్సన్ చావుకు ముందు ఒక సత్యాన్ని గ్రహించాడని ఒక పాతం నేర్చుకోన్నాడని తెలుస్తుంది . జెఫర్సన్ లోని పిరికి తనం పోయిందని గ్రహిస్తాడు .తనతో బాటు సమాజం లో ఉన్న తెల్ల జాతి వారు నల్ల జాతికి చెందినా ఈ కుర్రాడి మరణం ఒక గుణ పాఠంగా గ్రహించి వారి హక్కుల కోసం ,వారి సౌకర్యాలకోసం విద్యకోసం సహకరించాలి అని ఒక కర్తవ్య బోధ ఉంది . అందరు చదివి తెలుసుకోవాల్సిన కద ఇది .

   21-9-2002 శనివారం నాటి నా అమెరికా డైరీ నుండి

     మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –31-7-13 -ఉయ్యూరు   

   

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

అక్షర విలాపం కవిత -కరుణశ్రీ పుష్ప విలాసానికి పేరడీ

akshara vilapam kavita

Posted in కవితలు | Tagged | Leave a comment

షావుకార్ జానకి కుటుంబం

s janaki family

Posted in సేకరణలు | Tagged | 1 Comment

యువత కోసం రాసిన పాల్ జిమ్ డెల్

యువత కోసం రాసిన పాల్ జిమ్ డెల్

         యువత కోసమే అపూర్వ రచనలు చేసి వారికి మార్గ నిర్దేశం చేసిన  రచయితపాల్ జిన్డేల్.1936 లో అమెరికా లోని న్యూయార్క్ లో జన్మించాడు . పదిహేనేళ్ళ వయసులోనే క్షయ వ్యాధి బారిన పడ్డాడు . 1954 లో గ్రాడ్యుయేషన్ పూర్తయింది . 1958 లో కేమిస్త్స్ట్రి లో బి.ఎస్. డిగ్రీ సాధించాడు .అల్లైడ్ కెమికల్స్ కు టెక్నికల్ రైటర్ గా పని చేశాడు .1959 లో M.S.in education ‘’చేసి కేమిస్ట్రి,,ఫిజిక్స్ లను బోధించాడు .

              ‘’the effect of gamma rays ‘’,’’man in the moon ‘’రచనలు చేశాడు . 1967 లో ఉద్యోగాన్ని వదలి నాటక రచయితా గా మారాడు . 1968 లో ‘’pigman ‘’అనే మొదటి నవల రాశాడు 1971 లో గౌరవ డాక్టరేట్ ను పొందాడు . రాసిన నాటికలన్ని విజయ వంతం గా ప్రదర్శింప బడ్డాయి’’ childre’s picture books ‘’రాశాడు.సినిమాలకూ పని చేశాడు . 1981 లో ‘’the girl who wanted a boy ‘’. నాటకం రాశాడు .1982 లో మరో తోటి రచయితా టో కలిసి గొలుసు నవల రాశాడు . to take a drive ‘’,runaway train ‘’సినిమా లకు స్క్రీన్ ప్లే రాశాడు . టి.వి.కోసంప్రత్యేకం గా  ‘’babes in Toyland ‘’. రాశాడు . 1987 ల్’the amazing and death defying diary of Eugine Dingman ‘’ప్రచురించాడు .

 

          చిన్నప్పటి నుండి పాల్’’ నేగ్లేక్తేడ్ చైల్డ్ ‘’గా ఉండేవాడు .తండ్రి హృదయం లో స్తానం తనకు లేనట్లు భావించే వాడు .భార్య కు భర్తకు సిఫిలిస్ వచ్చిందేమో నని అనుమానం .తండ్రి అనేక ఇళ్లు మారాడు .. తల్లి ప్రాక్టికల్ వుమన్ .నర్సు గా పని చేసేది . జీవితం అభద్రతకు లోనైంది . తల్లికి ‘’సెక్సువల్ న్యూరోసిస్ ‘’జబ్బు .1986లో తల్లి మరణం . పాల్ స్కూల్ లో చదివే తప్పుడు తోటి విద్యార్ధులంతా మత్తు మందుకు బానిసలై మరో లోకం లో విహరించటం చూసే వాడు . 1970 లో ‘’గామా ‘’నాటకం హూస్టన్ లో ప్రదర్శింప బడింది . దీనికి పులిట్జర్ బహుమానం వచ్చింది అప్పుడు మెక్సికో లో ఉన్నాడు . ఇతనికి ‘’tachy cardia ‘’అనే జబ్బు వచ్చింది . దీని లక్షణం –గుండె బయటికి వచ్చి గంతు లేస్తున్నట్లు అని పించటం . సమయానికి వైద్యం అంది ప్రాణాపాయం తప్పింది

         తర్వాత ‘’. Nervous exhaustion ‘’దీనికోసం సైకో అనాలిసిస్ చేశారు . స్వయం వ్యక్తిత్వం ,బాధ్యతా ,యువత సాధికారత ,సెక్సువల్ రోల్ అండ్ డెత్ లమీదే ఎక్కువ రాశాడు . టీనేజేర్స్ కు కధలు రాశాడు . కధల్లో పాత్రలు జీవితం తో మమైక్యం అవ్వాలని భావించే వాడు .తన లక్ష్యాలను పదింటి ని దృష్టిలో పెట్టుకొని రచనలు చేశాడు . అంటే’’ టెన్ కమాండ్ మెంట్స్ ‘’లాంటి వన్న మాట .ఒంటరితనం నష్టాలు అవమానాలు పొందిన వారి కదలనే వస్తువు గా చేసి రాశాడు .రాసిన 39 పుస్తకాలన్నీ యువతకోసం పిల్లల కోసం రాసినవే .1930 లో అమెరికా లో అనేక సార్లు నిషేధింప బడిన పిగ్మన్ ను ఇప్పటికి అమెరికా స్కూళ్ళలో బోధిస్తూనే ఉన్నారు అందులోని భాష అఫెంసివ్ గా ఉందని అప్పటి ఆరోపణ .   

         పిగ్మన్ దగ్గర గ్లాసు తో ,మట్టి తో ,మార్బుల్ తో చేసిన ‘’పందులు’’ ఉండటం వల్ల పిగ్మన్ అనే పేరు వచ్చింది . యూజీన్ దిన్గ్మాన్ నవలలో యూజీన్ అనే వాడు జీవితం పై విరక్తి వచ్చి వేసారి పోయి’’మహాత్మా ‘’అనే హిందూ గురువు దగ్గర కు వెళ్తాడు . ఆయన ‘’before you expect some one to love you ,you must love yourself ‘’అని తారక మంత్రం ఉపదేశిస్తాడు .వాడిలో మార్పు వస్తుంది . చివరికి ‘’I finally learned that there was in me an invisible summer ‘’అంటూ ‘’gine Dingman born ‘’అంటాడు .అమెరికన్ లైబ్రరి అవార్డ్,మార్గరెట్ ఎడ్వర్డ్ అవార్డ్లను పులిట్జర్ తో బాటు పొందాడు .  my darling ,,gamaa rays ,pigman లను మూడిటిని కలిసి ”triology  ”అంటే త్రయం గా భావిస్తారు . 

              తన పాత్రలన్నీ జీవిత పాఠాలను నేర్చుకొంటాయి వాటి తోబాటు నేనూ ఏర్చుకొంటాను అంటాడు  జిన్డేల్ . యూజీన్ తన జీవితాన్ని నియంత్రణ చేసుకొనే స్తితి కి వచ్చాడు . గామా లో బీత్రిస్ అనే అమ్మాయికి తల్లి ప్రోత్సాహం లభించదు . ఆ పిల్ల ఆట వస్తువలన్నితిని తల్లి కావాలనే పాడు చేస్తుంది . కాని ఆమె చేసిన గామా ఎక్స్పెరమేంట్ విజయ వంతం అయి గొప్ప గుర్తింపు పొందుతుంది . అప్పుడామే ‘’my experiment has made me feel important –every atom in me . –in every body ,has come from the sun ,from places beyond our dreams ‘’అని అనుకొంటుంది .రికగ్నిషన్ కు అంత విలువ ఉంటుంది . పిల్లలు తలిదండ్రుల నుంచి దీనినే ప్రేమగా కోరు కొంటారు .అది వారికి లభించక పొతే నిరాశ చెంది కుంగి పోతారు కాని ఈమెదాన్ని జయించి విజయం సాధించి తన గొప్ప తనాన్ని చాటింది

        రచయితను ‘’మీరు ‘’సినిస్ట్ కాదా’?అని అడిగితె మా’’ ఇల్లే యూని సెక్స్ ‘’అని సమాధానం చెప్పాడు .2003 మార్చి ఇరవై ఏడున న్యూయార్క్ లో చని పోయాడు .  

         21-9-2002 నాటి నా అమెరికా డైరీ నుండి

          మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –25-7-13 ఉయ్యూరు

         

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

ప్రముఖ నాటక రచయితఆర్ధర్ మిల్లర్ -4

              ప్రముఖ నాటక రచయితఆర్ధర్ మిల్లర్ -4

         ఆ నాటి అమెరికా లో బీద వాడి స్తితి ఎలా ఉందంటే అందర్నీ వదిలి కుటుంబం లోను బయటా అందర్నీ  గట్టుకోవాల్సిన స్తితి .అన్నీ ఫామిలీ కోసం చెయ్యాలి .భర్తగా కుటుంబం కోసం కష్టపడాలి .కుటుంబ పటిష్టత కు తోడ్పడాలి . అందుకని కుటుంబానికి బానిస గా ఉండి పోవాలి .అదే అతనికి తప్పని స్తితి ,అదీ సంతోషం గా చేస్తాడు .కాని అమెరికా బిజినెస్ మాన్ మాత్రం స్వార్ధ పరుడు కాదు . అతను తనను తానూ అర్పించుకొనే స్వయం సిద్ధుడు .ఈ త్యాగానికి ఎప్పుడైనా ఒక గుర్తింపు రావచ్చు రాక పోనూ వచ్చు .

         అమెరికా లో కుటుంబ స్తితి –బలహీన బంధాలతో కుటుంబం ఉండేది .దానికి సాంఘిక చేయూత లేదు .కుటుంబానికి వ్యతిరేకం గా సంఘం ఉండేది .ఇద్దరు వ్యక్తుల సృష్టి యేవారి కుటుంబం ..వారికొకరు తెలియని వాళ్ళు .  వేర్వేరు భౌగోళిక పరిస్తితులనుండి వచ్చి చేరిన వారు వారి సాంఘిక స్తితులు కూడా భిన్నమే . వేర్వేరు అభిప్రాయాల వాళ్ళు . పిల్లలు యేవో వేర్వేరు సిటీ లకు వలస వెళ్ళే వాళ్ళు . అంటే ప్రతి విషయం లోను ‘’కంటిన్యుటి’’ లేని స్తితి . ఇవే అమెరికా ఫామిలీ వ్యవస్తను శాసిస్తున్నాయి ఒక వేళ ఆ స్తితి అందుకోలేక పొతే వారిని క్షమించరు . .ఈ అపజయాలనే మిల్లర్ తన కధలకు వస్తువు గా వాడుకొన్నాడు .

                అమెరికా అనుభవం అతని రచనకు భూమిక . అది తండ్రి  ,కొడుకుల అను బంధం .బంధాలు సడలి పోయే సమయం లో కొడుకు దూరం అవటం ఉంటుంది .తండ్రి అనేక ఒడి దుడుకులతో సతమత మావుతూంటాడు . తండ్రీ కొడుకుల మధ్య తీవ్ర మనస్పర్ధలు . తండ్రి అవి నీతి పఅరుడు .ఆ అవినీతిని కొడుకు అనేక సమయాల్లో బయట పెడతాడు .అవినీతి విలువలతో తండ్రి జీవితం సాగిస్తాడు .కారణం అదే అతనికి తెలిసిన విధానం . దీనికి ప్రత్యామ్నాయం తెలియని వాడు .

                అమెరికా కల ఏమిటో ‘’డెత్ ఆఫ్ ది సేల్స్ మాన్ ‘’నాటకం లో అసలు సమస్య . రాజ్యాంగం ప్రజా రక్షణ చేస్తానని హామీ నిచ్చినా నిలుపుకోలేక పోయింది . వ్యాపారం దెబ్బతిని పోయింది . మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత సేల్స్ మాన్ షిప్ పెరిగి పోయింది . .ఇదంతా అవినీతి మాయమై పోయింది .లాభమే పరమావధి గా బతుకులు గడుస్తున్నాయి మనిషికి మనిషికి మధ్య ఉన్న సంబంధం వస్తువులే అంటే ‘’commadities’’మాత్రమె . మనిషి మనిషిగా పూర్తిగా నశించాడు .ఆతను ‘’BECOMES A COMMADITY HIMSELF .,A SPIRITUAL CIPHER ‘’అయ్యాడు .అంటే పూజ్యం ,పనికి మాలిన వాడు అయి పోయాడు . ఇది మానవత్వానికే సిగ్గు చేటు .పతనానికి పరాకాష్ట . ‘’He sees his personality . this personality became the means to an end namely consummated sale .commercial face ,commercial smile ‘’తో బతుకు లాగుతారు . మనిషి ‘’oily cog in the machine of the sales apparatus ‘’వ్యాపార యంత్రం లో చక్రం యొక్క పన్ను  అయి పోయాడు . . దీనితో ప్రవర్తనలో పెద్ద మార్పు వస్తుంది అన్నిటా వైఫల్యమే .కూలి పోతాడు .కుంగి పోతాడు .

           కాని మనిషి యంత్రం కాదు .డెత్ ఆఫ్ దిసేల్స్ మాన్ లో సేల్స్మన్ చావు ‘’symbolic of the break down of the whole concept of salesmanship inherent in our society ‘’గా భావిస్తారు .ఇదే అ నాటి లక్షలాది మనుషుల నిస్సహాయ స్తితి .’’హిల్లీ లోమన్ ‘’ఇదులో హీరో .అతడు కింది  మధ్యతరగతి యువకుడు.ఆ ప్రాయం వారికి ప్రతినిది .ఇతన్ని గురించి మిల్లర్ ‘’the lovable lower middle class mole to a type of living and thinking which really all of us-professionals as well as salesmen ‘’. అని చెప్పాడు . ఇందులో ‘’stream of consciousness ‘’ఉంది . స్పష్టమైన అ పూర్వక నైతికత కనీ పిస్తుంది .

        దిక్రూసిబిల్ నాటిక లో మేకార్ధిజం పై తీవ్ర మైన విమర్శ ఉంది . అంటే ruisonous accusation without any basis in evidence ‘’మొత్తం మీద అమెరికా నాటక కర్తలలో ఓక అద్భుత ప్రయోగ  శీల  నాటక కర్త ,సమాజ దృక్పధాన్ని మలుపు తిప్పిన వాడు సాటి రచయితల అభ్యున్నతికి వారి నిర్బంధాలను ఎదిరించి పోరాడిన వాడు గా ఆర్ధర్ మిల్లర్ నిలిచి పోయాడు .మన  ఆచార్య ఆత్రేయ తోమిల్లర్ ను పోల్చవచ్చు నని పించింది .

                సమాప్తం

   21-9-2002 శని వరం నాటి నా అమెరికా డైరీ నుండి

       మీ –గబ్బిటదుర్గా ప్రసాద్ –24-7-13 ఉయ్యూరు 

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

ప్రముఖ నాటక రచయిత ఆర్ధర్ మిల్లర్ -3

    ప్రముఖ నాటక రచయిత ఆర్ధర్ మిల్లర్ -3

     P.E. N .కు అధ్యక్షుడైన తర్వాత మిల్లర్ రచయితల రాజకీయ ,సాంఘిక అభి వృద్ధి కోసం తీవ్రం గా కృషి చేశాడు . 1969లో న్యూయార్క్ లో ఈ సంస్థ సమావెశం జరిగింది .మిల్లర్ తండ్రి ఆరోజే అకస్మాత్తుగా మరణించాడు . అయినా సభకు అధ్యక్షత వహించి నిర్వహించాడు అప్పుడే ప్రపంచం లోని అన్ని ప్రభుత్వాలకు  తమ వడ్డ రాజకీయ నెపం తో బందీలుగా ఉన్న రచయిత లందరినీ ముఖ్యం గా లిథువేనియా ,దక్షిణ ఆఫ్రికా ,చెక్ ,లాటిన్ అమెరికా ,రష్యా దేశాలలో జైళ్ళలో మగ్గిపోతున్న వారిని వెంటనే విడుదల చేయ వలసిందిగా కోరాడు .

       మిల్లర్ రాసిన ‘’ప్రిన్స్ ‘’నాటిక ఒక కుటుంబం లో ఇద్దరన్న దమ్ముల కదా . బ్రహ్మాండం బద్దలైన స్పందన .425ప్రదర్శనలు జరిగాయి .అంతేకాదు మిల్లర్ రాసిన పాత నాటకాల నన్నిటిని మోజు మీద ఆది గొప్ప గౌరవం కల్గిస్తున్నారు . అతనికి అమెరికా లో విలువల వలువలూది పోతున్నాయని దిగులు గా ఉండేది ..తన జీవిత చరిత్ర ‘’time bends a life ‘’రాసుకొన్నాడు .దిఅమెరికన్ కుక్ ,ఆర్చిబిషప్సీలింగ్ నాటికలు లండన్ మహా నగరం లో బ్రహ్మాండం గా ప్రదర్శింప బడ్డాయి .

      1970 లూడా మిల్లర్ రచయితల హక్కులకోసం,స్వతంత్రం కోసం  తీవ్రం గా పని చేస్తూనే ఉన్నాడు . బ్రెజిలియన్ రచయిత అగస్తో బోల్ ,పావెల్ కాహాట్ అనే జెక్ కవిని నిర్బంధం నుంచి విముక్తి చేయించాడు . 53 మంది మిగిలిన రచయితల టో సంతకాలు పెట్టించి జెక్ లో బందీలుగా ఉన్న ప్రభుత్వ వ్యతిరేక భావాలున్న రచయితలను విడుదల చేయమని అర్జీ పంపాడు అలేక్సాందర్ సోల్జెంత్సి విడుదల కోసం తీవ్ర పోరాటం చేశాడు . మిల్లర్ జీవితమే ‘’క్రూసిబిల్‘’నాటిక లో జాన్ ప్రోక్తార్ . పీటర్ రాల్లీ అనే అనే రచయితనుజైలు నుండి  విడిపించాడు సంఘటిత శక్తి ని నిరూపించి . మిల్లర్ కున్న న్యాయ పరిజ్ఞానం వీటికి బాగా దోహద పడింది . 1984 లో ‘’కేన్నేడి సెంటర్ ‘’. అ పురస్కారం అందుకొన్నాడు . ఎక్కడ తనపై కేసు పెట్టి విచారించారో అక్కడే మిల్లర్ కు ఘన సన్మానం జరగటం చారిత్రాత్మక విషయం . 1991 లో ‘’లాస్ట్ యాంకీ ‘’అనే కామెడీ డ్రామా రాశాడు . 1996 లో దిక్రూసిబిల్ నాటకాన్ని సినిమా తీశారు . 2005ఫిబ్రవరి లో తొంభై ఏళ్ళ వయసులో కనెక్టి కట్ లో మిల్లర్ జీవిత నాటకం ముగిసింది .

             మిల్లర్ తాననిర్మించిన పాత్రలు నైతిక పక్షవాతాన్ని అధిగమించాలని భావిస్తాడు .తన నైతిక విలువలు బహుళ జన అభిప్రాయానికి వ్యతి రేక మైనా  కట్టు బడి ఉంటాడు . సంక్షోభం అడుగున అందరిని బంధించే ఒక విశ్వ జనీన భావం ఉంటుందని విశ్వ సిస్తాడు . రచయిత సంఘం లో నిర్వ హించాల్సిన పాత్రను గురించి పూర్తిగా తెలిసి అలా ఆచరించిన వాడు మిల్లర్ .ఆదర్శాన్ని నూటికి నూరు పాళ్ళు అమలు జరిపాడు . తన అభిప్రాయాలను సంఘం ,రాజకీయ పక్షులు వ్యతి రేకిన్చినా ,వ్యక్తిత్వాన్ని వదులు కోలేదు

                        రచనా వైవిధ్యం

      మిల్లర్ నాటక రచన అంటే ‘’అర్ధాన్ని వెతుక్కోవటమే ‘’నన్నాడు . మిల్లర్ ‘’the depression was my book ‘’అని తన రచనకు భాష్యం చెప్పాడు అంతే కాదు 1929 was our Greek year ‘’ అనీ అన్నాడు తనకు కమ్యూనిజం తో ఉన్న సంబంధాన్ని గూర్చి ప్రశ్నిస్తే ‘’’’these were writers ,poets as far as could see and the life of a writer despite what it some times seems is prettytough . I would not make it any toughter for any any body .i ask you not to ask me that question .’’అనేశాడు .ఇంకో మనిషి బాధ్యతను తానూ స్వీకరించాలేనన్నాడు . అతని నాటకాలలో ‘’domestic realism ‘’ఉంది . దీనిని ‘’వో నీల్ ‘’అనే నాటక కర్త మొదట ప్రవేశ పెట్టాడు దీన్ని నాటకం గా ఆడి మెప్పించటం సాధ్యం 1950 కాలం లో మిల్లర్ ,టెన్నిసీ విలియమ్స్ బాగా ప్రచారం చేశారు .

 ‘’the American drama is for all practical purposes the 20th century American drama ‘’అని భావిస్తాడు డొమెస్టిక్ డ్రామాలను ఇస్బాన్ ,చెకోవ్ లు అంతకుముందే సృష్టించారు ఇందులో మెలో డ్రామా ఉండేది దీన్ని‘’negative connotation ‘’గా వాడుతున్నారు . దీని అర్ధం ఏమిటంటే –‘’shallow or excessive emotional effects ‘’అని . 1930 లో డొమెస్టిక్ రియలిజం రాజకీయ ,నైతిక పాఠాలకు అద్దంపట్టింది

     సామాన్యుడిని మిల్లర్ దృష్టిలో పెట్టుకొని రాశాడు అతడు అసాధారణ సాంఘిక ఒత్తిడి లో ఎలా నలిగి పోతాడు ఎలా ఎదుర్కొని విజయం సాధిస్తాడు అనేదే ఆయన రచనకు ఆధారం మూలం . అయితే టెన్నిసీ విలియమ్స్ అసాధారణ వ్యక్తుల గురించి రాశాడు మిల్లర్ నాటకాలు నిలువుగా ఉంటె విలియం వి అడ్డం గా ఉంటాయి అంటారు ఈ ఇద్దరు అమెరికా దేశపు ‘’outstanding dramatistsof the period ‘’.దీనినే the school of Miller and the school of Williams ‘అంటారు మనిషి తన అదృష్టానికి తానె బాధ్యుడు అనేదే సిద్ధాంతం . దీనిని ‘’this man who had all the luck ‘’. నాటకం లో మిల్లర్ చూపించాడు .

          మిల్లర్ రచనల్లో మనిషి అస్తిత్వానికి సమాజం అతని నుండి ఆశించే దానికి సంబంధం ఉంటుంది . ఈ వైరుధ్యం లో ఘర్షణ ఉంటుంది మిల్లర్ రచనల్లోఅమెరికా  కుటుంబ విషయాలెలా ఉన్నాయో చర్చించారు విమర్శకులు‘’American family is constantly fragile ,constantly disintegrating attempt to crete a personal frame work of affection and loyalty in a world where classes ,institutional aand local loyalties have been reduced to a minimum or do not exist at all’’ అని తేల్చారు .అయితే ఈ విషయం లో బ్రిటిష్ కుటుంబ జీవితం హాయిగా నే ఉంటుందని భావించారు . అమెరికా కుటుంబం లో సుఖం  లేదు బ్రిటిష్ మధ్యతరగతి వారికీ సొసైటీ ఉంది ,దాని లో స్తానమూ ఉంటుంది .అమెరికా లో మిడిల్ క్లాస్ మాన్ కుటుంబం కంటే భిన్నుడు బిజినెస్ లో రక్షణ లేదు .దీనికి సొసైటీ కూడా లేదు ఎప్పుడూ డేంజర్ జోన్ లోనే ఉంటాడు .సాటి బిజినెస్ మెన్ సహాయ సహకారాలు లభించవు .

          మిగిలిన వివరాలు మరో సారి

21-9-2002 నాటి నా అమెరికా డైరీ నుండి

         మీ –గబ్బట దుర్గా ప్రసాద్ –24-7-13- ఉయ్యూరు

       

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

వ్యాస పూర్ణిమ

 వ్యాస పూర్ణిమ

          విపరీతం గా పెరిగి పోయిన వేద వాగ్మయాన్ని నాలుగు వేదాలుగా చక్కగా విభజన చేసి ,బ్రహ్మ సూత్రాలు రాసి ,భారత భాగవత పురాణేతిహాసాలను రచించి అష్టాదశ మహా పురాణాలను నిర్మించి భారత జాతికి అక్షర భిక్షపెట్టిన మహాత్ముడు వేద వ్యాస మహర్షి . సాక్షాత్తు విష్ణు మూర్తి అవతారం .కృష్ణ ద్వైపాయణుదు అనిపిలువ బడ్డ వాడు . ఇంతకీ వ్యాస దేవుడు ఎక్కడ జన్మించాడు ?నేపాల్ లోని తనాహు జిల్లాలో ఉన్న ‘’దమౌలి ‘’లో జన్మించి నట్లు తెలుస్తోంది .అక్కడ ఆయన భారతాది మహా గ్రంధాలను రాసిన గుహ ఇప్పటికీ ఉందట .వేలాది మంది నిత్యం దర్స్ధించే పుణ్య క్షేత్రం గా వెలసిందట

           విష్ణు మూర్తి యొక్క కాల అవతారం గా వ్యాసుడిని భావిస్తారు . మనకున్న చిరంజీవులలో వ్యాస భగవానుడూ ఉన్నాడు . అద్వైత రుషి పరంపర లో నాల్గవ వాడు .మొదటి వాడు ఆది శంకరాచార్యులు .వ్యాసుడు రాసిన భారతానికి జయ అని పేరు .

    ప్రతి ద్వాపర యుగం లో ఒక వ్యాసుడు ఉద్భవించి ఆర్ష విద్య ను విస్తరిస్తాడు వ్యాసుడు అనే పేరు ఒక అధికారం .మన కృష్ణ ద్వైపాయనుడికి ముందు ఇరవై ఏడుగురు వ్యాసులున్నారు ఈయన ఇరవై ఎనిమిదవ వాడు . మొదటి ద్వాపర యుగం లో స్వయంభువు వ్యాసుడయ్యాడు .రెండవ దానిలో ప్రజా పతి ,మూడులో శుక్రుడు ,ఆ తర్వాత బృహస్పతి ,వసిస్టుడు,త్రివర్షుడు ,సనద్వాజుడు ఇలా ఇరవై ఏడుగురి తర్వాత ద్వైపాయనుడు వ్యాసుడయ్యాడు .

 

        వ్యాస జననం జరిగిన తీరు ఒక సారి గమనిద్దాం . విష్ణు మూర్తి నాభి కమలం నుండి బ్రహ్మ పుట్టాడు .ఆయన నాలుగు ముఖాల నుండి నాలుగు వేదాలను ప్రసరింప జేయటానికి విష్ణువు మానసికం గా సంకల్పిస్తే ‘’అపాంతర తముడు ‘’ఉద్భవించాడు ఈ విష్ణు మానస పుత్రుడు ఆవిర్భ వించచాగానే విష్ణువు ఆనందం టో ‘’వేద వ్యాసా !రా నాయనా .నాకుమారుడి గా మానస పుత్రునిగా జన్మించి నాకు ఆహ్లాదం కల్గిన్చావు .అన్ని మన్వంతరాలలో ఇలానే చెయ్యి తర్వాత పరాశర మహర్షికి కుమారుడివి గా పుట్ట్టు . కురు రాజులు అధర్మాన్ని పెంచి ,హింసా దౌర్జన్యాలను పోషించి లోక కంటకులని పించుకొంటారు అప్పుడు మళ్ళీ వేద వ్యాపకం చెయ్యి నీఎకు రాగ ద్వేష రహితుడైన కుమారుడు జన్మించి నిన్ను మించిన వాడౌతాడు ‘’అని ఆశీర్వ దిస్తాడు విష్ణువు తన మానస పుత్రుడైన అపాంతర తముడిని .

         .మహా భారతం లో వ్యాసుని పాత్ర గణ నీయమైంది . సత్య వతి పరాశర దంపతులకు ద్వైపాయనుడు గా వ్యాసుడు జన్మించాడు . అంటే వసిష్ట మహర్షి పౌత్రడన్నమాట ..కురు పాండవ జననాలకు వ్యాసుడు  సహకరిస్తాడు ద్రుత రాస్త్రుడు పాండు రాజు విదురుడు ఈయన వల్ల జన్మించిన వారే . .

     .    అర్జునుడు మత్చ్య యంత్రాన్ని భేదించి ద్రౌపదిని స్వయం వరం లో దక్కించు కొంటె ,ద్రుపద మహా రాజు అయిదుగురికి తన కూతురు భార్య అవటాన్ని జీర్ణించుకోలేక మధన పడుతుంటే వ్యాస బగ వానుడు ప్రత్యక్ష మై ఆమె కారణ జన్మురాలని యాజ్ఞా సేన అని గుర్తు కు చెప్పి  సందేహించ వద్దని హితవు చెప్పాడు . ద్రుత రాస్త్రుడి వద్దకు స్వయం గా తానె వచ్చి కొడుకు దుర్యోధనుని వికృత చేష్టలు కురువంశ నాశనానికి దారి తీస్తాయని అదుపులో పెట్టమని గట్టిగానే చెప్ప్పాడు . పాండవ వన వాసం లో వారి చెంతకు వచ్చి ధర్మ రాజు కు ఊరట కల్గించి ‘’ప్రతి స్మ్రుతి ‘’అనే విద్యనూ బోధించాడు .అర్జునునికి శివుని మెప్పించి పాశు పతాస్త్రం మొదలైన అస్త్రాలు సాధించుకొని జగదేక వీరుడవు కమ్మని ఆశీర్వ దించాడు .

             కొడుకు తన మాట వినటం లేదని నక్క వినయాలు చూపిస్తూ పెద్ద రాజు వ్యాసమహర్శిని స్మరిస్తే ప్రత్యక్ష మయ్యాడు ‘’కురు ,పాండవులలో ఎవరి బలం యెంత “”? అని అడిగితె ‘’ధర్మం ఎక్కడ ఉంటె అక్కడ విజయం ఉంటుంది ధర్మ పక్షాన దేవుడుంటాడు సాక్షాత్తు పరమేశ్వరుడైన శ్రీ కృష్ణుడు పాండవ పక్షాన ఉన్నాడు కనుక వారి బలమే ఎక్కువ .యుద్ధం తప్పక పోవచ్చు .ఇప్పటి కైనా నువ్వు పాండవులతో సంధి చేసుకొని కురు వినాశనాన్ని నివారించు ‘’అని గట్టిగా నే చెప్పాడు .కురు క్షేత్ర సంగ్రామానికి గంటలు మోగాయి భయ పడ్డ గుడ్డి రాజు మళ్ళీ వ్యాసుడిని సంస్మరిస్తే వచ్చి నిలిచాడు అప్పుడు నిర్మోహ మాటం గా వ్యాసుడు ‘’రాజా !కాలం వచ్చేసింది .రాజు లందరూ చచ్చే కాలం మీద పడింది .నీకు యుద్ధాన్ని చూడాలని కోరిక ఉంటె ద్రుష్టి ని ఇస్తాను నీకళ్ళ తో ఆ ఘోరాన్ని నువ్వు చేతులారా తెచ్చుకొన్న దురద్రుస్తాన్ని చూడు ‘’అన్నాడు అప్పుడు గుడ్డి రాజు ‘’నేను ఆ భీభత్సం చూడ లేను కాని నాకు అనుక్షణం యుద్ధ వార్తలు వినాలని కోరిక గా ఉంది ‘’అన్నాడు అప్పుడు మహర్షి ‘’సంజయునికి ఆ శక్తినిస్తాను అతను నీ దగ్గరే కూర్చుని ప్రత్యక్షం గా యుద్ధాన్ని చూడ గలిగే మహిమ,శక్తులను  ఇస్తాను అతడు నీకు చూసినదంతా ప్రత్యక్ష ప్రసారం గా విని పిస్తాడు ‘’అని చెప్పి వెళ్లి పోయాడు .  అందరు కలిసి మాయోపాయం తో అభిమన్య కుమారుని  వధించినపుడు పాండవ శిబిరం శోకం తోఅలమటిస్తుంటే వచ్చి ఓదార్చాడు వ్యాసుడు .

          ఒక సారి రెండు చిలకలు సంసారం చేస్తుంటే చూసి తనకూ పిల్లలు పుడితే బాగుండును అని అనుకొన్నాడు వ్యాసుడు . వెంటనే హిమాలయాలకు వెళ్లి ‘’శక్తి ‘’ని గూర్చి తపస్సు చేశాడు ఆమె ప్రత్యక్ష మై కోరిక చెప్పమంటే ‘’పంచ భూతాలతో సమాన మైన కుమారుడిని ప్రసాదించు ‘’అని కోరాడు .అలాగే జన్మిస్తాడని అభయం పొందాడు

               ఒక సరి అగ్ని కార్యం చేస్తూ .ఆరణిని మదిస్తుంటే ఘ్రుతాచి అనే అప్సరాసచిలుక గా మారి వచ్చింది అతన్ని కవ్వించింది మన్మధ చేష్టలతో అంటే ఆ మహర్షి రేతస్సు స్కలనం చెంది ఆరణి లో పడింది శుక మహర్షి జన్మించి లోకోత్తర పురుషడయ్యాడు .భాగవతాన్ని అందరికి ప్రవచనం చేసి తరింప జేశాడు తండ్రికి మించిన తనయడని పించుకొన్నాడు .వ్యాసుడే కుమారుడు శుకునికి సర్వ శాస్త్రాలు నేర్పాడు . ముక్తి మార్గాన్ని బోధించ మని శుకుడు తండ్రిని కోరితే జనక మహర్షి నేర్ప గల సామర్ధ్యం ఉన్న వాడని చెప్పి అక్కడికి పంపాడు .

         రాబోయే సూర్య సావర్ణి కాలం లో వ్యాసుడు సప్తర్షులలో ఒకడు అవుతాడు .వ్యాసుడు కాశీ క్షేత్రం లో ఉండేవాడు ఆయనకు శిష్యులకు ఒకసారి ఏడు రోజుల పాటు భిక్ష ను ఎవ్వరూ వెయ్యలేదు ఆకలితో అలమటించి కాశీని శపించాడు . అప్పుడు విశాలాక్షీ దేవి ముత్తైదువు రూపం లో వారిని ఆహ్వానించి మ్రుస్స్టాన్న భోజనం పెట్టింది శివుడు వ్యాసుని దుర్భాషలాడి కాశీ లో ఉండే అర్హత లేదని వెంటనే కాశీ ని వదిలి వెళ్ళమని శపించాడు వ్యాస కాశీ చేరి తర్వాత దక్షిణ దేశం వచ్చాడు వ్యాస మహర్షి గోదావరి తీరం లో బాసర లో త్రిశాక్త్యాత్మక సరస్వతి దేవిని దర్శించి ఆమె విగ్రహాన్ని ఇసుక తోచేసి ప్రతిస్టించాడు వ్యాసుని పేర అది క్రమం గా ‘’బాసర ‘’క్షేత్రమయింది .

       లోకానికి అక్షర సాహిత్యాన్ని అందించిన తోలి గురువు వ్యాసుడే అందకే ఆయన పుట్టిన ఆషాఢపౌర్ణమిని గురు పూర్ణిమ లేక వ్యాస పూర్ణిమ గా జరుపుకొని ఆ మహాను భావుడిని స్మరిస్తాం తరిస్తాం .      

     మీ –గబ్బిటదుర్గా ప్రసాద్ –24-7-13- ఉయ్యూరు

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

ప్రముఖ నాటక రచయిత ఆర్ధర్ మిల్లర్ -2

  ప్రముఖ నాటక రచయిత ఆర్ధర్ మిల్లర్ -2

         1950 లో అగ్ర రాజ్యాల మధ్య ఆయుధ  పందెం వచ్చింది అంతర్జాతీయం గా ఒకరికొకరు శత్రువు లై ప్రతి వారినీ అను మానించే స్తితి కల్గింది . ఆమెరికా జీవిత విదానినికి కమ్యూనిజం విఘాతం కల్గిస్తోండదనే అభిప్రాయం బల పడింది . దీని నే ‘’it was a tense era ,when federal workers were required to take loyalty oaths to pledje their allegiance to America and the government establishedloyalty boards to investigate reports of communist sympathizers గా అభి వర్ణించారు . ‘’కమ్మీ భూతం ‘’అమెరికాను వణి కించింది . ఆ సమయం లో అమెరికా లోని విస్కాసిన్ సెనేటర్ జోసెఫ్ మేకార్దీ తో బాటు’’ దిహౌస్ అన్ అమెరికన్ యాక్టివిటీస్ కమిటీ ‘’‘’ఏర్పడింది . ఎవరు కనీ పించినా ‘’నువ్వు కమ్యూనిస్టు వా ?నీతో బాటు ఎవరున్నారు ?మీటింగు లకు వెళ్ళావా/’’’’అని అడగటం  మామూలయింది . రచయితలపై వారి కమ్యూనిస్ట్ భావజాలం పై ద్రుష్టి పెట్టారు . నిఘా ఎక్కు వైంది.

                                         red scare(mccarthy)

          1947 లో మిల్లర్ కు మార్క్సిజం తోకొంత సంబంధం ఉండేది . ‘’డైలీ వర్కర్ ‘’అనే సోషలిస్ట్  న్యూస్ పేపర్ లో రచనలు చేస్త్తూండే వాడు .. చివరికి’’ HU.A.C ‘’ముందు దోషిగా నిల బెట్టారు .’’contempt of congress ‘’గా అతన్ని గుర్తించారు .అతనిపై మోపిన అభియోగం చాలా పెద్ద మెజారిటీ తో అంటే’’ 373 to 9 ‘’తో నెగ్గింది .అయితే పబ్లిక్ సపోర్టంతా మిల్లర్ వైపే ఉంది .అందుకని కేసును పునర్విచారించారు . 1958 లో కొలంబియా కోర్టు లో మళ్ళీ వాద ప్రతి వాదనలు జరిగాయి . కొలంబియా కోర్టు మిల్లర్ ను ‘’నిర్దోషి ‘’గా తీర్పు నిచ్చింది . ఆ మధ్య మనస్తాపం తో 1952 లో the crucible నాటిక ‘’రాశాడు . దాన్ని మాసా చూసేట్స్ లోని సేలం దియేటర్లో ప్రదర్శించారు .పెద్దగా గుర్తింపు రాకున్నా 197 సార్లు ప్రదర్శించారు . ‘’మీద పడిన ‘’యెర్ర మచ్చ ‘’తొలగి పోయింది .ఈ రకమైన యాంటి కమ్యూనిస్ట్ భావాలను వ్యాప్తి చేయటాన్నే ‘’మేకార్ధిజం ‘’అన్నారు నొప్పించైనా ఒప్పింప జేయటమే అతని పని . .క్రూసిబిల్ ను సినిమా గా తీశారు మంచి పేరొచ్చింది . ఇప్పటికీ చాలా సార్లు వేస్తూంటారు భార్య తోమనస్పర్ధలు పెరిగాయి .

            1951 లో ప్రముఖ హాలీ వుడ్ నటీ మణి‘’మేరిలీన్ మన్రో ‘’తో ప్రేమ సంబంధం పెట్టుకొన్నాడు .. the golden girl who was like champaigne on the screen ‘’అని పించింది .1955 లో ఏ వ్యూ ఫ్రం ది బ్రిడ్జ్ ‘’,ఏ మెమరీ ఆఫ్ మండేస్‘’రాశాడు .క్లిక్ కాక డిసప్పాయింట్ అయాడు.1956 లో మెర్లిన్ మన్రో ను రహస్యం గా  పెళ్లి చేసుకొన్నాడు . .’’బస్ స్టాప్ ‘’అనే సినిమాకు రచన చేశాడు .మన్రో కు తాగుడు ,మాదక ద్రవ్యాల అలవాటు తో బాటు మానసిక రోగం ఎక్కు వైంది .మిల్లర్ డబ్బంతా వీటికోసం హారతి అయింది. ఒక రకం గా మన్రో మిల్లర్ ను తినేసింది అన్నారు విమర్శకులు . ‘’దిమిస్ ఫిట్స్ ‘’సినిమా లో మన్రో సరిగా నటించ లేక పోయింది .1961 పెళ్లి పెటాకులై విడాకులు పుచ్చుకున్నారు . మిల్లర్ తల్లి మరణించింది . చిన్న కధలు చాలా రాశాడు . మన్రో 1962 లో నిద్ర మాత్రలు మింగి ఆత్మ హత్య చేసుకోంది.ఆమె అంత్య క్రియలకు వెళ్తే అదొక సర్కస్ అవుతుందేమో నని మిల్లర్ హాజరు కాలేదు .

 

 

 

          ఇగ్నో అనే ఆవిడను పెళ్లి చేసుకొన్నాడు .’’ఆఫ్టర్ దిఫాల్ ‘’రాస్తే సక్సెస్ కాలేదు .1965 లో పారిస్ వెళ్ళాడు .అక్కడ అందరి సహకారం టో ‘’international writers’organisation of poets ,play wrights ,editors ,essayists and novelists ‘’(p.e.n.)ను ఎర్పరచాడు మిల్లర్  ఆసభ మొదటి సమావేశానికి అధ్యక్షత వహించాడు . బెర్నార్డ్ శా—షా ,హెచ్ జి వేల్స్ లాంటి ప్రముఖ రచయితలందరూ సభ్యులే . మిల్లర్ ను ప్రెసిడెంట్ చేశారు ఏకగ్రీవం గా .

   మరిన్ని వివరాలు ఈ సారి

         21-9-2002 శనివారం నాటి నా అమెరికా డైరీ నుండి

    సశేషం –మీ గబ్బిటదుర్గా ప్రసాద్ -23-7-13 ఉయ్యూరు

         

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

ప్రముఖ నాటక రచయిత ఆర్ధర్ మిల్లర్ –1

  ప్రముఖ నాటక రచయిత  ఆర్ధర్ మిల్లర్ –1

          1915 లో అక్టోబర్ పది హేడు న అమెరికా లోని న్యూయార్క్ లో ఆర్ధర్ మిల్లర్ జన్మించాడు . తండ్రిది ఆడ వాళ్ళ కోట్లు తయారు చేసే వృత్తి .,వ్యాపారం .తల్లి బాగా చదువు కొన్నఆవిడ..మధ్యాహ్నం పుస్తకం చదవటం ప్రారంభిస్తే రాత్రికల్లా ఆమె చదివేసేది .. చదివిన నవల పై చర్చించటానికి ప్రతి వారం కొలంబస్ యూని వెర్సిటి విద్యార్ధులను డబ్బు లిచ్చి ఇంటికి పిలుపించుకోనేది . ‘’she was haunted by a world she could not reach out by books she would not to read ,concerts she would not get to attend ,and above alla ,interesting people ,she would never get meet ‘’/అని తల్లి ని గురించి చెప్పాడు మిల్లర్ . .14 వ సంవత్సరం వరకు మిల్లర్ బాల్యం బాగానే గడిచింది . . అప్పుడు ‘’గ్రేట్ డిప్రెషన్ ‘’కూడా వచ్చింది . తండ్రి వ్యాపారం దెబ్బతిని వీధిన పడ్డాడు . తండ్రి  చేతకాని తనం పై తల్లికి విప రీతమైన కోపం .

images (13) 160px-Arthur_Miller_signature.svg

 

కుటుంబం బ్రూక్లిన్ చేరింది . సరి అయిన గ్రేడ్లు రానందున యూని వర్సిటి లో ప్రవేశం లభించలేదు మిల్లర్ కు . ఆ సమయమే ఆతను ‘’సేల్డ్స్ మాన్ ‘’నాటకం రాయటానికి గొప్ప నేపధ్యం లభించింది .సేల్స్ మాన్ పాత్ర ను సాహిత్యం లో అద్భుతం గా చిత్రించాడు .దాస్తోవిస్కి ,టాల్ స్టాయ్ పుస్త కాలను విపరీతం గా చదివాడు 1934 .లో మిచిగాన్ యూని వర్సిటి లో చేరి జర్నలిజం ,ఏకనా మిక్స్ ,హిస్టరీ లను చదివాడు ..అప్పుడే ‘’ a quest to understand how society changed ,how it influenced the individual and how it could be improved ‘’అనే భావం ఏర్పడింది . సోషలిజం మీద మోజు ఏర్పడింది . సామాన్య మానవుడి హక్కులు ,గౌరవం గురించి తెలుసుకొన్నాడు . ‘’ a social evolution of the planet ‘’ వల్ల కొత్త న్యాయం ,చట్టం, ఉన్న వ్యవస్థ వస్తుందని ఊహల్లో తేలియాడాడు ..

         కాలేజి లో నాటక రచన పోటీలో మొదటి బహుమతి పొంది , 250డాలర్ల నగదు పొందాడు .  ఆ నాటకమే ‘’నో విలన్ ‘’.అందులోని పాత్ర లన్నీ తన కుటుంబం లోని వారి వంటి వారే . ఇందులో మిల్లర్ ‘’introduced many of the themes and conflicts that dominate his later and more artistic works ‘’. స్వార్ధానికి ,పరాభవానికి మధ్య ఉన్న టెన్షన్ ను ,క్లాస్ స్ట్రగుల్ ను ,కుటుంబ సభ్యులకు కుటుంబ ఆనుకూల్యత కుమధ్య ఉన్న విభేదాలను మొదలైన ఎన్నో విధానాలను అందులో చూపించాడు . దీని వల్ల వచ్చిన ప్రోత్సాహం టో ఇంగ్లీష్ లో డిగ్రీ ని సాధించాడు . దియేటర్ ప్రాజెక్ట్ లో చేరాడు . మేరీ స్లేటరి ని పెళ్లి చేసుకొన్నాడు .  ఇద్దరు పిల్లలు కలిగారు .బ్రూక్లిన్ నేవీ యార్డ్ లో పని చేశాడు .రేడియోకు నాటికలు రాసి మంచి పేరు పొందాడు . 1944 లో ‘’man who had all the luck ‘’నాటికను బ్రాడ్వే లో ప్రదర్శించారు . అది స్పందన కల్గించలేక పోయింది . ఆ విషయాన్ని గురించి రాస్తూ ‘’I could become no body  like music player on wrong instruments ina false scale ‘’అని తనను తానూ ఎస్టిమేట్ వేసుకొన్నాడు

              తర్వాత ‘’ఫోకస్ ‘’నవల రాశాడు . 1930 లో ఫ్రస్ట్రేషన్ తోనలిగి పోయాడు ఆర్ధర్ . అప్పుడు ‘’ఆల్ మై సన్స్’’నాటిక రాస్తే ఒక మాదిరి స్పందన కలిగింది ప్రేక్షకులలో . కాని 328 సార్లు ప్రదర్శింప బడింది . దీనికి ‘’డ్రామా క్రిటిక్స్ సర్కిల్ అవార్డ్ ‘’వచ్చింది . అప్పుడు తాను పొందిన విజయానికి గర్వ పడ్డాడు ఆనందం పొందాడు సంత్రుప్తిలభించింది . ‘’my identification with life’s failures was being menaced by my fame ‘’అని   ఆనందం గా మిల్లర్ రాసుకొన్నాడు .

        1949 లో చిర కీర్తి తెచ్చి పెట్టిన ‘’the death of the sales man ‘’నాటకం రాశాడు . దానిపై ప్రశంసా వర్షమే కురిసింది . మొదటి ప్రదర్శన ఫిలడెల్ఫియా లో జరిగింది . నాటకం అయి పోగానే ప్రేక్షకులు ‘’did not applaud .Instead sat in silence ,stood up ,put their coats and sat down again ,not wanting to leave the theatre . Some people were crying ,finally almost as an after thought ,the applause exploded’’అని మిల్లర్ ఆ నాటి అనుభవాన్ని ఆనందాన్ని అక్షర బద్ధం చేశాడు మంచి నాటకానికి రసజ్ఞులైన ప్రేక్షకులు స్పందించాల్సిన విధానం గా వారు స్పందించారు .నాటక కర్త కు జేజేలు పలికారు అదీ సహృదయ స్పందన అంటే .అలా స్పందించాలి అసలైన ప్రేక్షకులు హాట్స్ ఆఫ్ టు ప్లే రైటర్ అండ్ ది ఆడియన్స్ .ఈ నాటకం 742 సార్లు ప్రదర్శింప బడి రికార్డు సృష్టించింది . పులిట్జర్ అవార్డ్ కైవశ మైంది . గొప్ప నాటక కర్త గా బహుళ ప్రాభవాన్ని పొందాడు మిల్లర్ .

         21-9-2002 శనివారం నాటి నా అమెరికా డైరీ నుండి

               మిగిలిన వివరాలు తర్వాత

              మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –22-7-13 ఉయ్యూరు 

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

పోలాండ్ రచయిత జేస్లా మిలోజ్

 పోలాండ్ రచయిత జేస్లా  మిలోజ్

       పోలాండ్ లోని లితుయాన దగ్గర జేస్లా మిలోజ్ 1911 జూన్ ముప్ఫై న జన్మించాడు .రెండవ ప్రపంచ యుద్ధ కాలం లో ప్రసిద్ధి చెందినా కవి కధకుడు ,వచన రచయితా .తన కవిత్వాన్ని ‘’ది వరల్డ్ ‘’పేరిట అతి సాధారణ కవితలు ఇరవయ్యింటిని రాసి ముద్రించాడు . పోలాండ్ రిపబ్లిక్ కు సాంస్కృతిక సంబందాదికారిగా పని చేశాడు . తర్వాత ‘’వెస్ట్’’కు  చేరాడు .1953 లో ‘’ది కాప్తివ్ ‘’అనే స్టాలిన్ వ్యతిరేక పుస్తకం రాశాడు .

          అమెరికా లోని కాలి ఫోర్నియా యూని వర్సిటి లో  ‘’slavik languages and literature ‘’కు ప్రొఫెసర్ గా1961 నుండి 1998 వరకు పని చేశాడు . అమెరికా పౌరసత్వాన్ని పొందాడు .1978 లో ‘’ఇంటర్నేషనల్ ప్రైజ్ ఫర్ లిట రేచర్ ‘’ను అందుకొన్నాడు .1980 లో సాహిత్యం లో ‘’నోబెల్ పురస్కారం ‘’పొందాడు .ఆయన బహు భాషా పండితుడు .పోలిష్ ,లిథువేనియన్ ,రష్యన్ ,ఇంగ్లిష్ ఫ్రెంచ్ భాషల్లో అమోఘ పాండిత్యాన్ని సంపాదించాడు . కాధలిక్ మతం ను స్వీకరించాడు .

 

        1960 లో అమెరికా కు చేరాడు  . పోలాండ్ లోని కమ్యూనిస్ట్ ప్రభుత్వం మిలోజ్ పుస్తకాలను నిషేధించింది . రష్యాలో స్టాలిన్ నియంతృత్వం నశించిన తర్వాతా అంటే ‘’ఇనుప తేరా పగల కొత్త బడిన తర్వాత ‘’మళ్ళీ పోలాండ్ చేరాడు .ఇజ్రాయిల్ ప్రభుత్వం “Righteous among the Nationsఅవార్డ్ నిచ్చి గౌరవించింది .ఒక సారిరెండవ  పాప్ జాన్ పాల్ టో భేటీ అయితే వారిద్దరి మధ్యా సంభాషణ ఈ రకం గా జరిగింది .. In an 1994 interview, Miłosz spoke of the difficulty of writing religious poetry in a largely postreligious world. He reported a recent conversation with his compatriot Pope John Paul II; the latter, commenting upon some of Miłosz’s work, in particular Six Lectures in Verse, said to him: “You make one step forward, one step back.” The poet answered: “Holy Father, how in the twentieth century can one write religious poetry differently?” The Pope smiled.[16] A few years later, in 2000, Miłosz dedicated a rather straightforward ode to John Paul II, on the occasion of the pope’s 80th birthday.[17]

    93 ఏళ్ళ వయసులో 2004 ఆగస్ట్ 14 నస్వంత ఇంటిలో మిలోజ్ మరణించాడు .ఆయన కవితా సంపుటాలు ఇరవై కి పైనే ఉన్నాయి వచన సంపుటులు ఇరవైఆరు ఉన్నాయి . అనువాదం చేసినవీ ఎక్కువే ఽఅయన రచనలు అనేక భాషల్లోకి అనువదింప బడ్డాయి . తనను గురించి ఆయన ”i a faithful son of the black earth ,shall return to the black earth ” అని చెప్పుకొన్నాడు .ంఇలొజ్ కవిత్వం లో కొన్ని ఝలక్ లు 

 ”the rose is only a sexual symbol 

so what else is now ?i am not my own friend -time cuts me in two 

but she too looked at me as if if i were a ring of saturn 

the human heart holds more than  speech does 

        జేస్లోక్ కు కమ్యూనిజం ,జాతీయ సోషలిజం తో సంబంధం ఉన్న వాడు ఱాజకీయ అవగాహన ను కవిత్వంరచన ల ద్వారా తెచ్చాడు . 

          17-9-2002 మంగళ వారం నాటి నా అమెరికన్ డైరీ నుండి 

         22-7-13-మీ గబ్బిటదుర్గా ప్రసాద్ -ఉయ్యూరు 

                 

      

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

‘రంగస్థలం’ కోసమే జీవితం అంకితం

‘రంగస్థలం’ కోసమే జీవితం అంకితం

July 22, 2013

  మాజీ ఐఏఎస్ అధికారి గుమ్మళ్ల బలరామయ్య ప్రభుత్వంలో వివిధ హోదాలను నిర్వహిస్తూనే, తాను స్వయంగా పాత్రలో పోషిస్తూ, రంగస్థల అభివృద్ధికి, ప్రాచుర్యానికి పెద్దయెత్తున కృషి చేశారు. రిటైరైన తరువాత మరింతగా ఈ రంగం అభివృద్ధికి నడుం బిగించారు.

నాటక రంగంపై అనంతమైన మమకారంతో పాటు, అభినయ పాటవం కూడా పెంచుకున్న సీనియర్ ఐఏఎస్ అధికారి గుమ్మళ్ల బలరామయ్య ఈ రంగం మీద ఇక మరింతగా శ్రద్ధ చూపించబోతున్నారు. ఇటీవల పదవి విరమణ చేసిన బలరామయ్య వీలయినంతగా రంగస్థలాన్ని అభివృద్ధి చేయడానికి పథకాలు సిద్ధం చేస్తున్నారు. అత్యున్నతమైన స్దాయి పదవీ బాధ్యతలు నిర్వహిస్తూనే నాటకాలలో వివిధ పాత్రలు పోషించిన ఈ మాజీ ఐఏఎస్ అధికారి తన జీవిత కాలంలో రంగస్థలం మీద అందుకున్న అవార్డులకు లెక్కే లేదు. నిజానికి ఓ ఐఏఎస్ అధికారిగా నాటకాల్లో పాత్రలు ధరించడం ఆయనకు మాత్రమే చెల్లింది. ఆయన సుమారు 55 ఏళ్లుగా నాటకాలలో కొన్ని వందల పాత్రలు పోషించారంటే అందులో అతిశయోక్తేమీ లేదు. అ«ధికారానికి అతీతమైన కళాప్రతిభతో వేలాదిమంది అభిమానులను కూడగట్టుకున్న ఆయన తన అనుభవాలను వివరించారు. ఆయన అనుభవాలు, విశేషాలు ఆయన మాటల్లోనే….

చిత్తూరు జిల్లాలో మారుమూల ఉన్న మధుమాల పల్లెలో పుట్టి పెరిగిన నాకు మామూలు బడిలో కూడా చదువుకునే అవకాశాలు లేకుండా బాల్యం గడిచిపోయింది. అప్పట్లో చదువుకు అవకాశాలు లేకపోయినా, నాటకాలలో పాత్రలు ధరించడం మాత్రం బాగానే ఒంటబట్టింది. ఎలాంటి ఆస్తిపాస్తులూ, చదువులూ లేని ఇంట్లో అయిదుగురిలో ఆఖరి అబ్బాయిగా పెరిగాను. మా అమ్మ నన్ను బాగానే గారాబం చేసేది. చిన్నబడిలో కూడా చదువుకునే స్తోమత లేకపోవటంతో ఎలాగైనా ఎంతో కొంత చదువుకునేలా చేయాలన్న ఆమ్మ ఆరాటంతో మేనమామల ఊరు పూడిలో వీధి బడిలో ఓనమాలు నేర్చుకునే అవకాశం దక్కింది. అక్కడ తెలుగు పంతులుగారు సూరి చెప్పిన అక్షరాలు, ఆయన చెప్పే పద్యాలు నాకు తెలియకుండానే నాలో సంగీతం, అభినయాల పట్ల కూడా ఆసక్తి పెంచాయి.

నాకు అప్పట్లోనే నాటకాల పట్ల అభినివేశం మరీ మితి మీరి ఉండేది. 1953లో పుట్టిన నాకు 60-70 దశకంలో వచ్చిన నాటకాలలో ఏదో ఒక పాత్ర ధరించేలా అవకాశాలు వచ్చేవి. మొదట్లో పూడి గ్రామ పరిసరాల్లోని కళాకారులతో సన్నిహిత పరిచయాలు పెరిగాయి. గురప్ప పిళ్లె అనే పెద్దాయన ఆ రోజుల్లో చిత్తూరు జిల్లాలో బాగా పేరున్న కళాకారుడు. ఆ చుట్టుపక్కల చాలా మందికి నాటక రంగ గురువు. ఆయనే నాకు అభినయ పాఠాలు, పద్ధతులు నేర్పారు. అక్కడ జరిగే నాటకాలు అందులో పాత్రలు ధరించేవాళ్లు పరిచయం కావటంతో అందులోని లోతుపాతులు క్రమక్రమంగా అవగతం కావడం ప్రారంభించాయి. నేను మనసుపెట్టి నటించిన ‘రాతిమనిషి’ నాటికలో ఉత్తమ నటనకు బహుమతి వచ్చింది. హైస్కూలు చదువు పూర్తి చేసుకుని, శ్రీకాళహస్తిలో కళాశాలలో ప్రవేశించే నాకు ఓ రంగస్థల నటుడిగా పేరు వచ్చేసింది. అప్పటికే నాకు ఇబ్బడిముబ్బడిగా బహుమతులు కూడా వచ్చాయి.

చిన్నప్పటి నుంచే…
జిల్లాలో జరిగే పరిషత్తు నాటకాల్లో పాల్గొనడం, ఒక్కొక్కసారి బయటి ప్రాంతాలకు కూడా వెళ్లడం నాకు బాగా అలవాటైపోయింది. మా కాలేజీలో విద్యార్థుల సాంస్కృతిక సంఘానికి నాయకుడిగా ఉండేవాడిని. ఆ రోజుల్లో బాగా పేరున్న నాటకాలన్నీ మా బృందం ద్వారానే వేదికల మీద కనిపించేవి. పౌరాణిక నాటక రాజం శ్రీకృష్ణరాయబారం వేయటానికి 40తో కూడిన బృందం మా ప్రాంతంలో ఉండేది. అలా నాటకాలు వేయటంతో పద్యగానంతో పాటు సంగీతంలో కూడా పట్టు దొరికింది. ఏ మాత్రం స్వర దోషాలు లేకుండా ఆలపించేవాడిని. సాంఘిక నాటకాలు, నాటికల్లో ఎంతెంత దూరం, సుడిగుండం, చూడు చూడు నీడలు వంటి వాటిని అద్భుతంగా ప్రదర్శించాం. ఈ నాటకాలన్నీ నాకు మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చిపెట్టాయి.

ఆ రోజుల్లో అందరూ ప్రతిష్ఠాత్మకంగా పరిగణించిన నెల్లూరు నెఫ్జా పోటీల్లో పాల్గొనటమే గొప్పగా ఉండేది. అందులో కూడా మేము ఉత్తమ బహుమతులు గెలుచుకున్నాం. తెలకం రాఘవయ్య అనే పెద్దాయన ఆ ప్రాంతంలో రంగస«్థల ప్రముఖుడు. ఆయన మమ్మల్ని మెచ్చుకుని ఎంతగానో ప్రోత్సహించేవారు. వరసగా నాకు ఉత్తమ నటుడుగా బహుమతులు రావటంతో నాటక రంగంలో ఇంకా పట్టు పెంచుకోవాలన్న తృష్ణ పెరిగింది. వీటి గురించి లోతుగా చదవటంతో పాటు కొత్త ప్రక్రియలపై కూడా దృష్టి పెట్టాను. నాకు బాగా ఇష్టమైన రచయిత్రి బీనాదేవి రాసిన ‘డబ్బు డబ్బు డబ్బు’ కథని ఏకపాత్రాభినయంగా మలిచాను. అందులో ఓ ఆటో డ్రైవర్ సొమ్ముల చుట్టూ తిరుగుతున్న మనుషుల జీవితాల్ని ఏకరువు పెడుతూ, చుట్టూ ఉన్నవాళ్లకి క«థలు కథలుగా చెపుతాడు. ఉత్తరాంధ్ర యాసలో ఆ పాత్ర మాటల్ని చిత్తూరు జిల్లా పలుకుబడికి అలవాటు పడ్డ నేను చెప్పి చూపించేవాడిని.

నాకు చిన్నప్పటి నుంచి ఎన్టీరామారావు అంటే చాలా ఇష్టం. వీరాభిమానిని. మా చిన్నప్పుడే శ్రీకృష్ణ పాండవీయం విడుదల అయింది. చాలా కష్టాలు పడి ఇష్టంగా చూసేవాడిని. ఆ ప్రభావంతో నేను స్వయంగా సుయోధన సార్వభౌమ, అశ్వద్ధామ పాత్రలను ఏక పాత్రాభినయాలుగా రూపొందించుకున్నాను. కాలేజీ స్థాయి నుంచి యూనివర్సిటీలో ఎం.ఎ చదవటం దాకా నాటక రంగం లో నా గమనం కూడా పెరిగింది. 1970 ప్రాంతాల్లో విస్తృతంగా వేదికల పైకి వచ్చిన ‘సంఘం చెక్కిన శిల్పాలు’, ‘ఆగండి కొంచం ఆలోచించండి’, ‘ఛాయ’ వంటి నాటకాలు మా మిత్ర బృందం అద్భుతంగా ప్రదర్శించింది. ఈ నాటకాలన్నిటిలోనూ నేను చక్కని పాత్రలు ధరించాను. అలా ఎన్నెన్నో నాటకాలు, అనుభవాలతో నా రంగస«్దల మైత్రి పెనవేసుకుపోయింది.

నటిస్తూనే, పోటీ పరీక్షలకు వెళ్లా…
ఆ కాలంలో అగ్ర స్థాయి పరిషత్తుగా పేరు సంపాదించిన రాజమండ్రి ఎల్.కె.ఎమ్‌లో నాటకం వేయటంతో పాటు అక్కడ అన్ని ప్రాంతాల నుంచి వచ్చే రంగస్థల ఉద్దండులతో కలిసిమెలిసి తిరగటం వల్ల నాకు చాలా విషయాలు ఆకళింపుకు వచ్చాయి. మరో వైపు చదువు పూర్తయి పోయి బతుకు దారిలో ముందడుగు వేసే ప్రయత్నాలు చేస్తుంటే గ్రూప్ 4లో సర్వీసు కమిషన్ ద్వారా ఎంపిక వర్తమానం వచ్చింది. సచివాలయంలో గుమాస్తాగా పని చేసే సమయంలోనే సిద్దప్ప నాయుడు. డిఎస్.ఎన్. మూర్తి, ఎర్రంనేని చంద్రమౌళి, రాధాకృష్ణమూర్తి వంటి వారి నాటకాలు చూడటం అలవాటు అయింది. అప్పటి రోజుల్లో కొడాలి గోపాలరావు రాసిన చైర్మన్, అప్పలాచార్య రాసిన మంచం మీద మనిషి వంటి నాటకాల్లో నేను ప్రధాన పాత్రలు పోషించాను. ఒక వైపు ఉన్నత ఉద్యోగాల కోసం పోటీ పరీక్ష లకు వెడుతుండడం, మరో వైపు నాటకాలలో నటించడం దాదాపు జమిలిగా సాగాయి. సర్వీసు కమిషన్ ద్వారా ముందుగా గ్రూప్ 1 సెలక్షన్, ఆ తరువాత ఐఎఎస్‌కు ఎంపిక కావడం జరిగిపోయాయి.

ప్రకాశం జిల్లాలో జాయింట్ కలెక్టర్‌గా పనిచేస్తున్న కాలంలో పాటిబండ్ల ఆనందరావు రచించి, దర్శకత్వం వహించిన ‘పడమటి గాలి’ నాటకం చూడటం, ఆ బృందంతో పరిచయం పెంచుకోవడం జరిగింది. సుమారు 4 గంటలపాటు ఏకబిగిన సాగే ఆ నాటకంలో పాత్ర ధరించాలన్న కోరిక నన్ను మళ్లీ వేదిక మీదకి తెచ్చింది. చిన్న ఉద్యోగంలో ఉన్నప్పుడు ఆంక్ష లు, పట్టింపులూ లేవు కానీ, ఉన్నతోద్యోగంలో మాత్రం ప్రభుత్వ నియమావళి ప్రతిబంధకం తెచ్చిపెట్టింది.. ఐఎఎస్ అధికారిగా ఉంటూ, నాటకాల్లో పాత్రలు పోషించడానికి నిబంధనలు అడ్డువచ్చాయి. ప్రభుత్వ అనుమతి కోసం దరఖాస్తు చేసుకుంటే ‘ఇదేం విడ్డూరం’ అంటూ తిరస్కరించారు. నాటకాలవారికి సాంస్కృతిక రంగానికి ఆత్మీయబంధువు అయిన డాక్టర్ కె.వి. రమణకి ఈ విషయం తెలిసి, మన రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య కార్యదర్సితో వాదించి, ఒప్పించి, అనుమతి ఇప్పించారు.

‘పడమటి గాలి’లో వేషంతో ఐఏఎస్ స్థాయిలో నటుడుగా ప్రేక్షకుల ముందుకు వచ్చాను. తిరుమలలో జె.ఇ.ఒగా ఉన్నప్పుడు, ఆ తరువాత వివిధ శాఖల అధిపతిగా ఉన్నప్పుడు నాటకాలలో నటించడమో, వాటికి సన్నిహితంగా ఉండడమో జరుగుతూనే ఉండేది. నేను మే నెలలో పదవీ విరమణ చేసినా తెలుగు రంగస్ద్థలంలో మాత్రం చురుగ్గానే ఉండాలనుకుంటున్నాను. రాష్ట్ర సాంస్కృతిక శాఖకు కార్యదర్శిగా ప్రతిష్ఠాత్మకమైన ప్రపంచ తెలుగు మహాసభల నిర్వహణలో కీలకమైన భాధ్యతలు నిర్వహించే అవకాశం దక్కింది. కె..వి. రమణ, సాంస్కృతిక మండలి చైర్మన్ ఆర్.వి. రమణమూర్తి. తెలుగు అధికార భాషా సంఘం చైర్మన్ మండలి బుద్దప్రసాద్, సంచాలకుడు కవితాప్రసాద్‌లతో కలిసి పలు ప్రత్యేకతల్ని ఆ సభలకు సంతరించి పెట్టాం. నాటక రంగానికి తగిన ప్రాధాన్యాన్ని కల్పించాం. మన నాటక రంగం ప్రత్యేకతలు, చరిత్ర, ప్రతిభావంతులు ప్రపంచ నాటక రంగానికి ఏ విధంగానూ తీసిపోని స్థితిలోనే ఉన్నట్టు ఖాయంగా చెప్పగలను.

కుటుంబమంతా సమష్టి కృషి
భార్య సుగుణశీల చిత్తూరు జిల్లా పూడి గ్రామంలో ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కుమార్తె సృజన సివిల్ సర్వీసెస్‌కు ఎంపికయింది. నా కుటుంబమంతా రంగస్థల అభివృద్ధి పట్ల ఆసక్తి ప్రదర్శిస్తుంటుంది. నాకు నచ్చిన విశేషాలు, నా ఆలోచనలు కలగలిపి, నాకు నచ్చినవారితో కలిసి తెలుగు రంగస్థలానికి పూర్వ వైభవం తీసుకు వద్దామనే ఆలోచనలో ఉన్నాను. మనకున్న అద్భుతమైన సాహిత్య సంపదను రంగస«్థల వికాసానికి సంక్రమించేలా చేయాలని ఉంది. మంచి కథలు, ఇతివృత్తాలను నాటకాలుగా మలచటం బాగుంటుంది. ఆ దిశలో కొందరు సంప్రదిస్తున్నారు. బుల్లి తెరపై నాటకరంగ ప్రమాణాల పెంపుదలకు సాటిగా మేటి ప్రదర్శనలు, సింగిల్ ఎపిసోడ్‌లు వంటివి విస్తృతంగా జనరంజకం చేయాలన్న ఆలోచనలున్నాయి..మంచి రిపర్టరీని అభిరుచిగల కళాకారుల సమన్వయ కేంద్రంగా తీర్చిదిద్దాలని కూడా కొందరు సూచిస్తున్నారు. నాటక వికాసం కోసం నేను చేయగలిగిందంతా చేస్తాను. కలిసివచ్చేవారికి నా ఆహ్వానం. తెలుగువారు ఎక్కడెక్కడ ఉన్నా నాటకం అందివచ్చేలా చేయాలని ఉంది.

Posted in సేకరణలు | Tagged | Leave a comment

అనుక్షణ నవీన మోహిని ద్రవాధునికత – డా.పాపినేని శివశంకర్

అనుక్షణ నవీన మోహిని ద్రవాధునికత – డా.పాపినేని శివశంకర్

July 22, 2013

ద్రవాధునికత వంటి కొత్త భావనల్ని (లేదా ప్రత్యయాల్ని) మన సమాజ, సాహిత్యాలకు అన్వయించుకున్నప్పుడు నూతన విశేషాలు బయటపడతాయి. సంకీర్ణ సమాజం మనది. దీనికి గ్రాహ్యత (absorption), జీర్ణీకరణ assimilation) స్వభావం ఎక్కువ. దీనిలో పూర్వాధునిక లక్షణాలు ఎట్లాగూ ఉన్నాయి. పూర్వాధునికత నుంచి ఆధునికతకి సాగే క్రమమూ ఉంది. ఆధునికత నుంచి ద్రవాధునికతకి సాగే క్రమం కూడా కన్పిస్తుంది…

మీరు చూసే ఉంటారు. రోడ్డు మీద అపరిమిత జనసందోహం మధ్య ద్విచక్రవాహనం మీద పాతికేళ్ల కుర్రాడు శరవేగంతో పోతుంటాడు. తల పక్కకి వాలిపోయి భుజాన్ని తాకుతుంటుంది. చెవికి, భుజానికి నడుమ ఒక సెల్‌ఫోను అతుక్కుపోయి ఉంటుంది. అతను తన బాస్‌తో ఆ పూట ఆఫీసు పని గురించి మాట్లాడుతున్నాడా, లేక స్నేహితురాలితో సాయంత్రం సినిమా గురించి ముచ్చటిస్తున్నాడా అనేది మన కనవసరం. సదరు ద్విచక్ర వాహన చోదకుడి పరిస్థితిలో చలనవేగం ఉంది. అందువల్ల అస్థిరత ఉంది. అందువల్ల అభద్రత కూడా ఉంది. ద్రవాధునికత (Liquid Modernity) అనే భావనని అర్థం చేసుకోవటానికి ఆ దృశ్యం చక్కని ఉదాహరణ.

ఇప్పటిదాక తత్వవేత్తలు ప్రపంచాన్ని రకరకాలుగా వ్యాఖ్యానించారు, అసలు సంగతి దాన్ని మార్చటమే నన్నాడు చాన్నాళ్ల కిందట కార్ల్ మార్క్స్. అయితే కర్త ఎవరో కనపడకుండా విపరీత వేగంతో మారుతున్న ప్రపంచ వ్యవస్థల మధ్య మనమిప్పుడు అవస్థలు పడుతున్నాం. పల్లెల నుంచి పరదేశాల దాక వలసలు, భూసంబంధాల్లో విస్థాపనలు (displacements), మూలాల విచ్ఛిన్నత, రంగులు మారే వస్తు ప్రపంచం, మార్కెట్ సంక్షోభాలు, ఉద్యోగ జీవితాల్లో అభద్రత, ఆధునిక మానవుడి మానసిక గ్లాని -ఇవన్నీ మనల్ని కలవరపెడుతున్నాయి. ఈ అస్థిర వర్తమానాన్ని కొత్తగా అర్థం చేసుకోవటానికి, విశ్లేషించి వ్యాఖ్యానించటానికి జిగ్మంట్ బౌమన్ Zygmunt Baum- an) రాసిన ‘లిక్విడ్ మోడర్నిటీ’ (Liquid Modernity) అనే పుస్తకం ఉపయోగపడుతుంది. ఆ విధంగా మార్పుకి దోహదం చేస్తుంది.

పోలెండ్‌కి చెందిన ఈ సామాజిక తత్వవేత్త, ఆచార్యుడు పాశ్చాత్య తత్వశాస్త్రంతోపాటు సామాజిక శాస్త్రం బాగా అధ్యయనం చేశాడు. కార్ల్ మార్క్స్, మాక్స్ వెబర్, ఆంటోనియోగ్రాంసీ, డెరిడా మొదలైన వాళ్ల ప్రభావాలకు లోనయ్యాడు. వాటికి కొనసాగింపుగా లిక్విడ్ మోడర్నిటీ, లిక్విడ్ లవ్, వేస్టెడ్ లైవ్స్, లిక్విడ్ లైఫ్ పుస్తకాలు రచించాడు.

ఎప్పటికప్పుడు వేగంగా మారుతున్న ప్రస్తుత ప్రపంచాన్ని అర్థం చేసుకోవటానికి బౌమన్ రెండు భావనలు రూపొందించుకొన్నాడు. అవే 1. ఘనాధునికత (Solid Modernity) 2. ద్రవాధునికత (Liquid Modernity). (పోస్ట్ మోడర్నిటీ అనే పదంలోని గందరగోళం తప్పించటానికి బౌమన్ లిక్విడ్, సాలిడ్ అనే పదాలు గ్రహించాడు).

ఘన ద్రవ లక్షణాలు: ఘన పదార్థాల్లోని అణువుల మధ్య గట్టి బంధం ఉంటుంది. అది ఆ అణువులు విడిపోకుండా -పదార్థం సడలిపోకుండా- నిరోధిస్తుంది. ప్రత్యేక నిర్మాణ విధానంవల్ల వాటికి ఒక స్థిరత్వం ఉంటుంది. ఘన పదార్థాలు నిలకడగా ఉంటాయి. కొంత స్థలం ఆక్రమిస్తాయి. స్థలమే ప్రధానం, కాలం వాటికి ముఖ్యం కాదు. అంటే చిరకాలం నుంచి అవి అట్లాగే పడి ఉంటాయి. కదలికను లేదా మార్పును ఎదుర్కొనే స్వభావం వాటిల్లో బలంగా ఉంటుంది.

ద్రవ పదార్థాలకు స్థలకాలాల నిర్నిబంధం ఉండదు. అవి తమ ఆకృతిని ఎక్కువకాలం స్థిరంగా నిల్పుకోజాలవు. ఆకృతి మార్పుకు సిద్ధంగా ఉంటాయి. అవి స్థలాన్ని ఎక్కువ (సేపు) ఆక్రమించవు. కాలమే వాటికి ముఖ్యం. ద్రవ పదార్ధాలు తొణుకుతాయి. చిందుతాయి. తేలిగ్గా కదులుతాయి. వేగంగా పరిగెత్తుతాయి. పొర్లుతాయి. ఉప్పొంగుతాయి. ఘనపదార్థాలను ఆపినంత తేలిగ్గా వాటిని ఆపలేం. అవి ఆటంకాల్ని దాటతాయి. కొన్నిటిని తమలో కరిగించుకొంటాయి. కొన్నిటిలోనుంచి ప్రయాణిస్తాయి. అసాధారణమైన ఈ కదిలే గుణం వాటికి తేలికదనాన్నిస్తోంది. ఎల్లప్పుడు కదలికే, అస్థిరతే. వర్తమాన వినూత్న సామాజిక ఘట్టాన్ని ఆకళించుకోవటానికి బౌమన్ ఈ ద్రవత్వం (ఫ్లూయిడిటీ లేదా లిక్విడిటీ) అనే రూపకాన్ని ముఖ్యంగా గ్రహించాడు. ఘన, ద్రవ -ఈ రెండు మాటలకి ‘ఆధునికత’ అనేది అంటిపెట్టుకొని ఉంది. కనుక ఆధునికతని ముందుగా అర్థం చేసుకొంటే ఆ తర్వాత అందులో వచ్చిన మార్పుని తేలిగ్గా అర్థం చేసుకోగలం.

ఘనాధునికత:
దరిదాపుగా 300 ఏళ్ల నుంచి ఆధునికత (Modernity) ఏర్పడి, కొనసాగిందని బౌమన్ అభిప్రాయం. భౌతికంగా పారిశ్రామిక విప్లవం, భావజాలపరంగా ఫ్రెంచి విప్లవం ఆధునికతకి అంకురార్పణ అనుకోవచ్చు. బిపన్‌చంద్ర కూడ ఈ అభిప్రాయమే వెలిబుచ్చాడు. బౌమన్ ఆలోచనలో స్థలకాల సంబంధంలో మార్పు ఆధునికతకి ప్రారంభ బిందువు. మనిషి జీవనాభ్యాసం నుంచి స్థలకాలాలు విడివడటంతో, అవి పరస్పరం విడివడటంతో ఆధునికత మొదలైంది. అంటే జీవనం ఇంకెంత మాత్రం స్థలకాలాలకు బందీ కాదన్నమాట. అధికారం, ఆధిపత్యం సాధించటానికి త్వరణవేగం ప్రధాన సాధనమైంది. నిబ్బరమైన నడకను తప్పించిన యాంత్రిక ప్రయాణ సాధనాలు నిర్దిష్ట స్థలం నుంచి గొప్ప కదలిక నిచ్చాయి. వేగవంతమైన యాంత్రిక ఉత్పత్తి కాలాన్ని జయించింది; దేశదేశాలకు చేరింది. ఆధునికతకి ఇదొక చిహ్నం.

ఘనాధునికతలో తొలి దశ యిది. ఇందులో కొన్ని కచ్చితమైన నమూనాలున్నాయి. రాజ్యం ఇట్లా ఉంటుంది; వర్తకం ఇట్లా సాగుతుంది; అభివృద్ధి ఈ విధంగా జరగాలి. ఇట్లా కొన్ని నమూనాలు. గత ఉదాహరణల సాయంతో, అనుభవ సంపాదనతో చక్కగా కార్య నిర్వహణ చెయ్యవచ్చని నమ్మిన కాలం అది. గట్టిగా, ఘనాకృతితో అంతగా మారని ప్రపంచంలో ఈ ప్రణాళిక అర్థవంతంగా సాగిందన్నాడు బౌమన్. ఈ దశలో తగినంత సమాచార సేకరణతో, జ్ఞానంతో, సాంకేతిక నైపుణ్యంతో మరింత కచ్చితమైన, హేతుబద్ధమైన ప్రపంచం రూపొందించగలమని మేధావులు భావించారు. 20వ శతాబ్ది తొలి భాగం దాక ఘనాధునికత గురించి, దానిలో రావాల్సిన, రాగల మార్పుల గురించే చర్చించామన్నాడు బౌమన్. ఘనాధునిక దశలో పెట్టుబడిదారు, శ్రామికుల మధ్య, ఇతర వ్యక్తుల మధ్య వైరుధ్యాలతోపాటు దృఢమైన సంబంధాలుండటం గమనించదగింది.

ఈ పరిస్థితిని మన దేశానికి అన్వయించుకుంటే ఇక్కడ వలసవాదుల ద్వారా ఆధునికత ఆలస్యంగా అడుగుపెట్టింది. మేధావులు చాలమందిని ఆధునిక భావజాలం ఆకర్షించింది. అందులో గురజాడ ఒకడు. ‘ముత్యాల సరములు’లో ముందు ముందు మేటి వారల మాటలనే మంత్ర మహిమతో జాతి బంధాలు జారిపోతాయని ఆయన అనుకొన్నాడు. ‘ఎల్ల లోకము వొక్క యిల్లై, వర్ణ భేదము లెల్ల కల్లై’ మనుషుల మధ్య ప్రేమబంధం బలపడుతుందన్నాడు. మతాలన్నీ మాసిపోయి, జ్ఞానం ఒక్కటే నిలిచి వెలుగుతుందన్నాడు. ఆధునికత ప్రసాదించిన ‘జ్ఞానదీపం’ స్వర్గలోకాన్ని అంటే ఒక సుఖమయ నూతన ప్రపంచాన్ని- చూపించగలుగుతుందనే నమ్మకం అది.

‘కమ్యూనిస్ట్ మేనిఫెస్టో’లో ‘melting the solids’ అనే మాట ఉంది. దాని అర్థం, ఘనీభవించిన భావజాలం తొలగించి, దాని స్థానంలో సరికొత్తగా అభివృద్ధి చేసిన ఘన-నమూనాలు ప్రతిష్ఠించటమే; మన కాళ్లు చేతులు కట్టిపడేసిన సాంప్రదాయిక విధేయతలు, ఆచారపరమైన హక్కులు తొలగించటమే; అసంబద్ధంగా ఉన్నవాటిని హేతుబద్ధం చెయ్యటమే. ఈ విధంగా ఆధునికతలో రెండోదశ- modernization of modernity-మొదలైందని బౌమన్ గుర్తించాడు. తద్వారా మరింత ఘనీకృత వ్యవస్థలు ఏర్పడ్డాయి. ఇక్కడ బౌమన్ ప్రజాస్వామ్య, సోషలిస్టు వ్యవస్థలు రెండింటినీ ఉద్దేశించి ఉండవచ్చు.

ద్రవాధునికత :
దాదాపు అర్ధ శతాబ్దం నుండి ఆధునికత ఘనస్థితి నుంచి ద్రవస్థితికి చేరినట్టు బౌమన్ నిర్ధారించాడు. మనదేశంలో ఈ క్రమం ఇటీవలే మొదలైంది. ఇది సాఫ్ట్‌వేర్ పెట్టుబడిదారుల శకం. ఇక్కడ పెద్దపెద్ద యంత్రా లు లేవు. స్థలాన్ని జయించటం లేదు. ప్రపంచమంతా తన ఉక్కురెక్కలు సాచిన మైక్రోసాఫ్ట్ కంపెనీకి సియాటిల్ నగరమే ఏకైక నిలయం. (ఫ్లోటింగ్ బ్రిడ్జి మీద నుంచి చూస్తే బిల్‌గేట్స్ భవన సముదాయం తప్ప ఫ్యాక్టరీలు, భారీ ఉత్పత్తులు కనపడవు) అంటే పెట్టుబడి కార్ఖానాలు, పెద్ద పెద్ద యంత్రాలు, శారీరక శ్రమ చేసే కార్మికుల్ని వదిలిపెట్టి, కాబిన్ లగేజి వంటి స్వల్ప భారం మోస్తుంది. కనుక ఇప్పుడు పెట్టుబడి ఒక బ్రీఫ్‌కేస్, లాప్‌టాప్, సెల్‌ఫోనులతో ప్రపంచం నలుమూలలకి తేలిగ్గా ప్రయాణించగలదు. ఇది భారరహిత విధానం.

ఈ దశలో పెట్టుబడిదారుకి, ఉద్యోగికి శాశ్వత ‘వివాహ బంధం’ తెగిపోయి ‘కలిసి బతకటం’ అనే పద్ధతి వచ్చింది. ఇది తాత్కాలిక సహజీవనం. ఈ బంధం మిక్కిలి బలహీనం. ఎప్పుడైనా పుటుక్కుమనవచ్చు. లేబర్ యూనియన్‌లు లేవు. ఉద్యోగ భద్రత లేదు. అన్ని అస్థిరమైన, కొద్దికాలపు ఉద్యోగాలే. ఇవి రోలింగ్ కాంట్రాక్టులు. ఏ రోజుతో ఉద్యోగానికి మంగళం పాడతారో తెలియదు. కార్పొరేట్ రంగంలో కాంట్రాక్టు లేబర్‌తో పోల్చితే పర్మనెంట్ లేబర్ శతాంశమే.
ద్రవాధునికతలో ద్రవీకృత శ్రామిక విపణిని (fluid labour market) గుర్తించాడు బౌమన్. సాఫ్ట్‌వేర్ తరంలో శ్రామిక వర్గం సడలిపోయిందని, అందువల్ల పెట్టుబడి భారరహితంగా మారిందని, అందువల్ల తేలిగ్గా, వేగంగా కదలగలిగిందని వివరించాడు బౌమన్. తేలికదనం, వేగం వల్ల కలిగే సమస్యలు వేరు. ఈ భారరహిత పెట్టుబడి విధానం విమానయానం వంటిది. పైలట్ క్యాబిన్ ఖాళీగా ఉంటుంది! ప్రయాణికులకు విమానం ఎటు పోతుందో, ఎక్కడ దిగుతుందో తెలియదు. అది క్షేమంగా కిందికి దిగటానికి తామేం చెయ్యగలరో విధివిధానాలు తెలియవు. అయితే ప్రయాణం సులువుగా ఉంటుంది.

ఈ విధానంలో ఉద్యోగి ఒక ప్రాజెక్టు నుంచి యింకో ప్రాజెక్టుకి గెంతుతాడు. ఏ రంగంలోను ప్రత్యేక నైపుణ్యం సంపాదించకుండానే గోళమంతా తిరుగుతాడు. ఎప్పటికప్పు డు పాతది మర్చిపోయి కొత్త ప్రాజెక్టుకి అవసరమైన కొత్త నైపుణ్యం సంపాదించటమే. మారుతున్న ప్రపంచంలో తెలివిగా, హుందాగా, నీతిగా ప్రవర్తిస్తూ విజయం సాధించటమే పెద్ద సమస్య. ‘ప్రజలే చరిత్రను నిర్మిస్తారు; కాని అది వాళ్ళకి నచ్చిన పరిస్థితుల నుంచి కాదు’ అని కార్ల్ మార్క్స్ ఎన్నడో చెప్పిన మాట ఉదాహరిస్తూ బౌమన్ ‘నువ్వు పని చేసే ప్రపంచం నువ్వు నిర్ణయించుకొన్నది కాదు’ అన్నాడు. అంటే నువ్వు సాధించాలనుకొన్నదానికి, సాధ్యమయ్యేదానికి మధ్య ఘర్షణ ఉందన్నమాట.

ఇప్పటి కార్పొరేట్ ప్రపంచాన్ని అర్థం చేసుకోవటానికి ద్రవాధునిక భావన బాగా ఉపయోగపడుతుంది. కంప్యూటర్లు, అంతర్జాలాలు, సెల్‌ఫోనులు, ఆన్‌లైన్ కాన్ఫరెన్సులు నిండిన ఈ ప్రపంచంలో ఉద్యోగికి స్థలంతో సంబంధం లేదు. అతను బంధరహితుడు, అస్థిరుడు. అతను ఈ దేశంలోనో, అమెరికాలోనో ఉండి పరదేశాల్లో క్లయింటుల అవసరాలు తీరుస్తాడు. తన పని ద్వారా ఏ ఉత్పత్తి జరుగుతుందో అతనికి తెలియదు. తెలియాల్సిన అవసరమూ లేదు. కంటికి కనపడని ఏ లక్ష్యం కోసమో అతను పని చేస్తాడు. తన అసలు యజమానిని అతను కలలోనైనా చూసి ఉండడు. చూసేదల్లా తనపై మేనేజర్లని, తన సమాచారం, లేదా ‘జ్ఞానం’ అందిపుచ్చుకొనే నలుగురైదుగురు సాటి ఉద్యోగుల్ని. ఆలోచనలు, డిజైన్లు, అంచనాలు తప్ప శరీరంతో చేసే పనేమీ ఉండదు. కీబోర్డు మీటలు నొక్కటమే అతని ప్రధాన శారీరక శ్రమ. కళ్లముందు ఏ ప్రాంతం లేదు. భౌతిక నిర్మాణం లేదు. ఉన్నదంతా కంప్యూటర్‌లో కనపడే ఆభాస వాస్తవికతే (virtual reality). ఈ సరికొత్త ప్రపంచాన్ని, అందులోని అస్థిర సంబంధాల్ని మన రచయితలు లోతుగా అన్వేషించాల్సి ఉంది.

ద్రవాధునికతలో ప్రపంచీకరణ ఉంది; వలసలున్నాయి. సంచార జీవనం ఉంది; అంతర్జాలం ఉంది; సెల్‌ఫోన్లు ఉన్నాయి. జీవితంలో మార్పు అనేది ఇవాళ ‘శాశ్వత’ పరిస్థితి. మార్పు లేని గానుగెద్దు పద్ధతి ఇంక కుదరదు. ఏదో ఒక గత ఉదాహరణని అనుసరించటం ‘మంచిది’ కాదు. జ్ఞానం సంపాదించి, దానిమీదనే ఆధారపడటం ఇవాళ ‘తెలివైన ప్రతిపాదన’ కాదు. అంటే ఏవో కొన్ని స్థిరమైన అభిప్రాయాలను అంటిపెట్టుకొని బ్రతకటం గాక ఎప్పటికప్పుడు మారే పరిస్థితుల కనుగుణంగా మారుతూ పోవటమే నేటి జీవన విధానంగా బౌమన్ గుర్తించాడు. ఈ జీవన విధానంలో 1. అపాయం, 2. అస్థిరత్వం, 3. దుర్బలత్వం (vulnerability) అనే లక్షణాలు కూడా గమనించాడు. అభద్రతే వాటి సారాంశం. అయితే సామాజిక శాస్త్ర వికాసంతో, నిర్ణయ స్వేచ్ఛతో కూడిన ఉన్నత సమాజంలో మనుషులు తమ జీవితాల్ని అర్థవంతం చేసుకోగలరని బౌమన్ ఆశించాడు.
ద్రవాధునికత వంటి కొత్త భావనల్ని (లేదా ప్రత్యయాల్ని) మన సమాజ, సాహిత్యాలకు అన్వయించుకున్నప్పుడు నూతన విశేషాలు బయటపడతాయి. సంకీర్ణ సమాజం మనది. దీనికి గ్రాహ్యత (absorption), జీర్ణీకరణ (assimilation) స్వభావం ఎక్కువ. దీనిలో పూర్వాధునిక లక్షణాలు ఎట్లాగూ ఉన్నాయి. పూర్వాధునికత నుంచి ఆధునికతకి సాగే క్రమమూ ఉంది. ఆధునికత నుంచి ద్రవాధునికతకి సాగే క్రమం కూడా కన్పిస్తుంది. ముఖ్యంగా విద్యాధిక, ధనాధిక, కార్పొరేట్ వర్గ జీవన విధానంలో ఈ సరికొత్త పరిణామాన్ని తేలిగ్గా గుర్తించగలం. అది మోగించే ప్రమాద ఘంటికలూ వినగలం. ప్రపంచీకరణకి, ద్రవాధునికతకి గల రక్త సంబంధాన్ని కూడా మనం గుర్తించాల్సి ఉంది. ఈ గుర్తింపు మన సాహిత్య వస్తువులో నూతన ఆవిష్కరణలకి దారి తీస్తుందని నా నమ్మకం.

85008 84400

Posted in మహానుభావులు | Tagged | Leave a comment

వెలిచాల సంకల్పరూపం విశ్వనాథ ‘జయంతి’ పీఠం

 

ఎనభై సంవత్సరాల నిత్య చైతన్యశీలి డాక్టర్ వెల్చాల కొండలరావు. ఆయన నిర్వహణా దక్షతకు తార్కాణంగా నిలిచిన విశ్వనాథ సాహిత్య పీఠాన్ని ఆరంభించి ఇప్పటికి దశాబ్ది కాలమవుతోంది. ఈ కాలంలో పీఠం నిర్వహించిన కార్యక్రమాలు, వెలువరించిన సంచికలు సారస్వత ప్రేమికుల ప్రశంసల్ని అందుకున్నాయి.

కొండలరావు తెలుగు ఆచార్యుడిగా పనిచేశారేమోనని చాలామంది అనుకుంటారు. ఆయన దశాబ్దాలుగా తెలుగు భాషా సాహిత్యాల్లో కొనసాగిస్తున్న కృషి వల్ల ఈ అభిప్రాయం ఏర్పడడం సహజమే! కొండలరావు కామర్స్ పోస్ట్ గ్రాడ్యుయేట్! చిన్ననాడు ఉర్దూ మాధ్యమంలో చదువుకున్నారు. నిజాం వ్యతిరేక పోరాటంలోనూ ముందున్నారు. కరీంనగర్, జగిత్యాల డిగ్రీ కళాశాలల ప్రిన్సిపాల్‌గా తెలంగాణలో ఉన్నత విద్యారంగానికి విలువైన బాటలు వేశారు. తెలుగు అకాడమి సంచాలకులుగా మరచిపోలేని సేవల్ని అందించారు. నిరంతర అధ్యయనశీలి, ఇంగ్లీషుతో పాటు ఉర్దూలోనూ గొప్ప పండితులు. తిలక్ అమృతం కురిసిన రాత్రి కావ్యాన్ని ఆంగ్లంలోకి, గాలిబ్ కవితల్ని తెలుగులోకి అనువదించారు. మరో అరడజనుకు పైగా రచనలు కొండలరావు కలం నుండి వెలువడ్డాయి. నిత్యోత్సాహంతో సాహితీ రంగంలో మునుముందుకు సాగుతున్న కొండలరావుకు ‘విశ్వనాథ సాహిత్య పీఠం’ ఒక సుందర స్వప్నం. ఆ కల నిజమైంది.

కొన్ని సాహిత్య సంస్థలు నామమాత్రమైనవి. మరికొన్ని సన్మానాలతో సరిపెట్టుకుంటాయి. ఇంకా కొన్ని సంస్థలు సంవత్సరానికి ఒకటి రెండు సాహిత్య సభలతో పెద్ద పెట్టున ప్రచారాన్ని తెచ్చుకుంటాయి. ఈ లక్షణాలు విశ్వనాథ సాహిత్య పీఠంలో అసలు కన్పించవు. పీఠం ఎవరినీ ప్రత్యేకంగా సన్మానించిన సందర్భాలు లేవు. పీఠం నిరంతర సాహిత్య సం’చలనం’తో ఉంటుంది.

విశ్వనాథ సత్యనారాయణ సాహిత్యంపై వెల్చాల కొండలరావు అభిమానం వెలలేని ది. జాతీయ, అంతర్జాతీయ స్థాయిల్లో విశ్వనాథకు తగినంత గుర్తింపు రాలేదన్నది కొండలరావు ఖచ్చితమైన అభిప్రాయం. విశ్వనాథ సాహిత్యంపై ఇప్పటికీ కొన్ని అపోహలు ఉన్నాయనీ, సమగ్రమైన అధ్యయనంతో ఈ అపోహలన్నీ తొలగిపోతాయని కొండలరావు అం చనా. ఆయన విశ్లేషణ ప్రకా రం కవిసమ్రాట్టు విశ్వనాథ సాహిత్యంలోని ఎన్నెన్నో కీలక కోణాలపై ఇంకా పరిశోధనలు జరగనే లేదు. విశ్వనాథ వాడినన్ని అన్యదేశ్య (ఎక్కువగా ఉర్దూ) పదాల్ని మరే తెలుగు రచయితా వాడలేదనీ, విశ్వనాథ అద్భుతమైన వాడుక భాషను వాడారనీ, వీటిపై ఎవరూ దృష్టి సారించలేదనీ కొండలరావు చెబుతారు. విశ్వనాథ సాహిత్యంపై వినూత్న రీతి లో పరిశోధించాలనుకునే యువ రీసెర్చ్ స్కాలర్స్‌కు తాము చేయూతనందిస్తామని కొండలరావు చెబుతున్నారు. విశ్వనాథపై పరిశోధనలకు అవసరమైన పూర్తి వాఙ్మయం సాహిత్యపీఠంలో అందుబాటులో ఉంది. విశ్వనాథ మాటల కేసెట్లు ఉన్నాయి. విశ్వనాథ రామాయణ కల్పవృక్షాన్ని ఆయన సన్నిహిత మిత్రుడు జువ్వాడి గౌతమరావు అపూర్వరీతిలో గానం చేశారు. ఈ పద్యాల్ని విన్న ప్రసిద్ధ రచయిత రాచకొండ విశ్వనాథశాస్త్రి, ప్రముఖ కవి అబ్బూరి వరద రాజేశ్వరరావులు గౌతమరావును ఎంతగానో ప్రశంసించారు. ఇది 1992 నాటి మాట. ఈ కేసెట్లు కూడా పీఠంలో అందుబాటులో ఉన్నాయి. విశ్వనాథ సాహిత్యాన్ని విశ్లేషించిన ఇంగ్లీషు వ్యాసాల బృహత్ సంకలనాన్ని (760 పుటలు) పీఠం ప్రచురించింది. విశ్వనాథపై ఎవరైనా డాక్యుమెంటరీ చిత్రాన్ని నిర్మిస్తే అది తెలుగువారికి ఒక చారిత్రక సంపదగా మిగులుతుందని కొండలరావు నమ్మకం.
విశ్వనాథ సాహిత్యపీఠం ఒక్క విశ్వనాథ సత్యనారాయణ సాహిత్య విశ్లేషణలు – ప్రచురణలకే పరిమితం కాలేదు. మంచి రచనలు చేసిన కవుల్ని రచయితల్ని పం డితుల్ని మేధావుల్ని పీఠం సముచిత రీతిలో గుర్తిస్తుం దని చెప్పేందుకు ‘జయంతి’ సంచికలు తార్కాణాలు.

‘జయంతి’ పత్రికకు జగమంత గతం ఉంది. భారతి, శారద, సుజాత వంటి అత్యున్నతశ్రేణి సాహిత్య పత్రికల వరుసలో నిలబడగలిగే జయంతి తొలుత 1927లో ఆరంభమైంది, ఆగిపోయింది. తిరిగి 1959లో విశ్వనాథ ఆశీస్సులతో గౌతమరావు సంపాదకత్వంలో పునఃప్రారంభమైంది. ఏడాదికి పైగా నడచింది. ఈ స్వల్ప వ్యవధిలోనే తనదైన నిర్మొహమాటమైన ధోరణితో సాహితీ లోకాన్ని ఆకట్టుకున్నది. చాలాకాలం క్రితమే నిలిచిపోయిన ‘జయంతి’ని గురించి రమారమి నాలుగు దశాబ్దాలపాటు ఎవరూ పట్టించుకోలేదు. 2003లో కొండలరావు సంపాదకత్వంలో జయంతి తిరిగి ఆరంభమైంది. ఇది మూడు నెలలకొకసారి వెలువడే సాహిత్య సంచిక. ప్రతి సంచికా విలువైనదే. అపురూపమైనదే. విశేష సందర్భాలలో ‘జయంతి’ ప్రత్యేక సంచికల్ని వెలువరించింది. ‘యాది’ సదాశివ మాస్టారుపై వందల పుటల అపూర్వ సంచిక ఎందరినో అలరించింది. ఇస్మాయిల్, పి.వి.నరసింహారావు, శేషేంద్ర, పఠాభి, సంపత్కుమార వంటి ప్రసిద్ధుల్ని గురించి ప్రచురించిన ప్రత్యేక సంచికలు పది కాలాలపాటు పదిలపరచుకోవలసినవి.

గతంలో కేవలం సాహిత్య విమర్శ పరిశోధనలకే ‘జయంతి’ పరిమితమయ్యేది. సమకాలీన భాష సాంస్కృతిక అవసరాలకు అనుగుణంగా కొండలరావు జయంతిని మార్చి వేశారు. తెలుగుతో పాటు ఇంగ్లీషులోను జయం తి వెలువడుతోంది. భాషా పరిరక్షణ ఈనా టి తక్షణ అవసరమని కొండలరావు అంటా రు. తెలుగు సాహిత్య విశేషాలు ఇతర భాషీయులకు అందాలని అందుకు అందమైన అనువాదాలకు మించి న సాధనం మరొకటి లేదని ఆయన చెబుతారు. మౌలికమైన భావనలతో భాషా సాహిత్యాలను విశ్లేషిస్తూ వెలువడిన జయంతి సంచికలు ఈ తరానికి బాగా విలువైనవి.
విరామ మెరుగక పరిశ్రమించే డా.కొండలరావు 81వ యేట అడుగుపెడుతున్నారు. ఆయన కవి, రచయిత, అనువాదకుడు, సం పాదకుడు. అంతేకాదు తన తర్వాత తరాన్ని భుజం తట్టి ప్రోత్సహించే సుమనస్వి. స్వంత వూరు కరీంనగర్‌లో ఆయన అభిమానులు, శిష్యు లు, మిత్రులు ఘన సన్మానాన్ని నిర్వహిస్తున్నారు.

తనకు వ్యక్తిగతంగా ఎటువంటి కీర్తి కిరీటాలు అక్కర లేదని విశ్వనాథ సాహిత్య పీఠాన్ని భవిష్య తరాలు బాగా ఉపయోగించుకుంటే చాలునని కొండలరావు చెబుతారు. ‘జయంతి’ పత్రిక పాటిస్తున్న ప్రమాణాలు చెదరకుండా పదిలంగా ఉండాలన్నది ఆయన మరో బలమైన కోరిక.
– డా.గుమ్మన్నగారి బాలశ్రీనివాసమూర్తి
(వెల్చాల కొండలరావుకు 80 ఏళ్లు,
‘జయంతి’ పత్రికకు – విశ్వనాథ సాహిత్యపీఠానికి దశాబ్ది -నిండిన సందర్భంగా)

Posted in మహానుభావులు | Tagged | Leave a comment

జోసెఫ్ కాన్రాడ్

                 జోసెఫ్ కాన్రాడ్

1857 లో డిసెంబర్ మూడున రష్యా  ఆక్రమిత పోలాండ్ లో జోసెఫ్ కాన్ రాడ్  జన్మించాడు . అసలు పేరు ‘’Jozef Teodor Konrad Nalicz Korzieniowski ‘’చిన్నప్పుడే తల్లి మరణించింది . తండ్రికి టి.బి. జబ్బుతో ఆరోగ్యం కోల్పోయాడు .తండ్రి కవి ,నాటక రచయితా . పన్నెండేళ్ళ వయసులో తండ్రి కూడా చని పోయాడు . 1874 లో ‘’ఫ్రెంచ్ మెర్కండైస్ ‘’లో ప్రవేశించాడు . మూడు సార్లు వెస్ట్ ఇండీస్ కు వెళ్ళాడు . ప్రేమ విఫలమై బాధ పడ్డాడు . ద్వంద్వ పోరాటం లో ఒక సారి బులెట్ దెబ్బ తగిలింది . 1886 లో షిప్ కు యజమాని అయ్యాడు .

 

 

         బ్రిటన్ చేరాడు పౌరసత్వాన్ని పొందాడు . ‘’concord ‘’గా పేరు మార్చుకొన్నాడు . మలేరియా టో బాధ పడ్డాడు . కాంగోలో ఉద్యోగం లో చేరాడు 1894 .కాంగో ఉద్యోగానికి రాజీ నామా చేసి ఇంగ్లాండ్ వెళ్ళాడు ..’’the black mate ‘’అనే మొదటి కద 1886 లోరాశాడు .  మూడేళ్ళ తర్వాత ‘’an out  cast of the island ‘’,’’the Nigger of the Narassus ‘’రాశాడు ..తర్వాత ‘’టేల్స్ ఆఫ్ అన్ రెస్ట్ ‘’ ,హార్ట్ ఆఫ్ డార్క్ నేస్’’పూర్తీ చేశాడు 1902 లో ‘’టైఫూన్ అండ్ ది యూత్ ‘’అనే చిన్న కదా సంపుటి వెలువరించాడు .

 

 

           1904 లో ‘’nostroma ‘’,1907 లో ప్రసిద్ధ రచన అని పించుకొన్న ‘’the secret agent ‘’నవల రాశాడు ఇది చలన చిత్రం గా కూడా వచ్చింది . అతని ‘’మిర్రర్ ఆఫ్ ది సి ‘’కి కూడా పేరొచ్చింది . తర్వాత ‘’మెంటల్ బ్రేక్ డౌన్ ‘’వచ్చింది కాన్రాడ్ కు. ‘’చాన్స్ ‘’అనే నవల బాగా క్లిక్ అయింది . పాప్యులారిటి పెరిగింది .తర్వాత ‘’the shadow line ‘’,the arrow of gold ‘’రాసి ప్రచురించాడు . 1923 లో అమెరికా వెళ్ళాడు . అక్కడ న్యు యార్క్ లో ఘన స్వాగతం లభించింది .1923 లో చివరి నవల ‘’the rover ‘’విడుదల చేశాడు .1924 ఆగస్ట్ మూడు న ఇంగ్లాండ్ లో మరణించాడు 

           ఇరవయ్యవ శతాబ్దపు మానవ పతనాన్ని కాన్రాడ్ తన రచనల్లో నేపధ్యం గా చూపించాడు ..రాజకీయం ,నాగరకత ,మానసిక శాస్త్రం మొరాలిటి ,పరిణామం ,మనషి తనను తాను  అర్ధం చేసుకొన్నవిధానం అనే వాటిపై ద్రుష్టి పెట్టి రాసిన రచనలు కాన్రాడ్ వి .’’హార్ట్ ఆఫ్ డార్క్ నేస్ లో  తన భావాలను విస్పష్టం గా ప్రకటించు కొన్నాడు . .బుద్ధుని లాగా కూర్చుని స్పష్టం గా కద చెప్పి నట్లు కాన్ రాడ్ చెప్పేవాడు అని ప్రసిద్ధి చెందాడు .రచనల్లో సింబాలిజం ,మేలో డ్రామా ఎక్కువ . ‘’going up that river was like traveling back to the earliest beginning of the world ‘’లాగా అని పిస్తుందని భలే తమాషా గా చెప్పాడు వేదాంతాన్ని మిళితం చేసి .

          కద చెబుతూ ‘’it was not my strength that wanted nursing ,it was my imagination that wanted soothing ‘’అంటాడు కాన్రాడ్’’మార్లో ‘’అనే కద చెబుతూ . ‘’marlo’s and concord’s journey up the ‘’congo ‘’is one sense ,a journey back into time ,beginning with Marlo’s apprehenshion that England too was once one of the dark places of the earth and moving to consideration of the fascination of the abomination –the fascination of civilized man for his primitive atavistic roots ‘’.the voice of the surf heard now and then was a positive pleasure –like the speech of a brother ‘’ఇందులో ‘’the horror ,the horror ‘’అని పించటం లో ప్రపంచం లో మానవుడి దుష్టత్వ భావానికి పరా కాస్ట కన్పిస్తుంది .

           హార్ట్ ఆ ఫ డార్క్ నేస్ లో సంప్రాదాయ వైవిధ్యత కన్పిస్తుంది . రాజకీయ వ్యంగ్య వైభవం ఉంటుంది .అందుకే దీన్ని‘’సైకలాజికల్ ఒడిస్సీ ‘’అంటారు .  కాన్రాడ్  జీవిత చరిత్రే ఇది .ఎన్నో ఐరనీలతో సింబాలిక్ గా పెసిమిజం తో నిండి ఉంటుంది .అతని ‘’షాడో లైన్ ‘’ను మాస్టర్ పీస్ ‘’అంటారుగొప్ప స్టైలిస్ట్ రచయిత అని ముద్ర పొందాడు . .ఆయన వాణ్ణి అంటి హీరోయిక్ పాత్రలే  .ది హెచ్ .లారెన్స్ ,హెమింగ్ వె , ఫాక్ నర్,ఫిట్జెరాల్డ్ ,ఆర్వెల్ వంటి ప్రముఖ రచయితా లేందరి పైనో కాన్రాడ్ ప్రభావంఉంది స్వీయ జీవితాన్ని ,మాతృదేశం పోలాండ్ భావనలను కలబోసి రచన చేశాడు 

    .ఇరవయ్యెల్లు వచ్చే దాకా ఇంగ్లీష్ ను ధారాళం గా మాట్లాడలేని కాన్రాడ్”వన్ అఫ్ ది గ్రేటెస్ట్ ఇంగ్లీష్ రైటర్స్ ”అని పించుకొన్నాడు . ఇరవై ,ఇరవై ఒకటి శతాబ్దపు అంతర్జాతీయ ప్రమాద ఘంటికలకు అద్దంపడతాయి అతని రచనలు . అతని నవలలెన్నో సినిమాలుగా వచ్చాయి లండన్ లో ఉన్నా తానూ పోలాండ్ వాడినే నని గొప్ప గా చెప్పుకొంటాడు కాన్రాడ్
       మీ -గబ్బిటదుర్గా ప్రసాద్ -21-7-13 ఉయ్యూరు 
 
18-9-2002 బుధ వారం నాటి నా అమెరిక డైరీ నుండి
 
Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

రుడ్యార్డ్ కిప్లింగ్

   రుడ్యార్డ్ కిప్లింగ్

             .ఈ పేరు వినగానే ఆయన ప్రసిద్ధ రచన ‘’ది జంగిల్ బుక్ ‘’తప్పక గుర్తొస్తుంది . రుడ్యార్డ్ కిప్లింగ్ 1865 డిసెంబర్ 30న ఇండియా లోని బొంబాయి లో జన్మించాడు .  తల్లి ఆలీస్ ,తండ్రి జాన్ లాక్ వుడ్ కిప్లింగ్ . 1882-87 మధ్య కాలం లో లాహోర్ లో ‘’ది సివిల్ అండ్ మిలిటరీ గెజెట్ ‘’లో పని చేశాడు . తర్వాత అలహా బాద్ లో ‘’ది పయనీర్ ‘’పత్రికకు పని చేశాడు .1888 లో ‘’ఫెయిర్ టేల్స్ ఫ్రం ది హిల్స్ ‘’రాసి ప్రచురించాడు . ‘’అండర్ ది దియోడార్స్ ,’’’’ది ఫాంటం రిక్షా ‘’లను రాసి ముద్రించాడు . 1889 లో లండన్ ,జపాన్ ,అమెరిక లలో పర్య టించాడు . sea to see ‘’రచన పూర్తీ చేశాడు .

 images (4) images (3) images (2) images (1) images

              1891 లో ‘’life’s handicap ‘’ప్రచురించాడు . దక్షిణ ఆఫ్రికా ,ఆస్ట్రేలియా ,న్యూజిలాండ్ లలో పర్యటన జరిపి మళ్ళీ  ఇండియాకు చేరాడు .1892 లో ‘’coroline Balestier ‘’,the naulakkaa ,barrack room and ballads ‘’ప్రచురించాడు .1894 లో కిప్ప్లింగ్ కు గొప్ప పేరు తెచ్చి పెట్టిన ‘’the jungle book ‘’రాసి ముద్రించాడు . 1899 లో అమెరికా చేరాడు . 1900 -08 మధ్యలో ఏడాది కోఆ  సారి ఆఫ్రికా కు వెళ్లి వచ్చాడు . 1903 లో ‘’five nations ‘’అనే కవితా సంపుటిని తెచ్చాడు .1907లో సాహిత్యం లో నోబెల్ బహుమతి పొందాడు . అతి చిన్న వయసులో ,అందునా ప్రోజు లో నోబెల్ బహుమానం పొందిన మొదటి బ్రిటిష్ రచయిత అని పించుకొన్నాడు . 1913 లో ఈజిప్ట్ వెళ్ళాడు . 1915 లో కొడుకు బల వన్మరణం చెందాడు .1927 లో బ్రెజిల్ వెస్టిండీస్ వెళ్ళాడు 1936 జనవరి 18న లంద్సన్ లో కిప్లింగ్ మరణించాడు .

 

ఆయన చిత్రించిన చిత్రాలు    

              రుడ్యార్డ్ కిప్ప్లింగ్ రాసుకొన్న స్వీయ జీవిత చరిత్ర ‘’some thing of my life ‘’1937 లో మరణానంతరం వెలువడింది . కిప్లింగ్ రాసిన ‘’కిం ‘’నవల అతని మాస్టర్ పీస్ అని పేరు పొందింది . ఇది’’epic of the American consciousness ‘’అని పించు కొంది.వాల్ట్ విట్మన్ ,రాసిన లీవ్స్ ఆఫ్ గ్రాస్ ,మేల్విల్లీ రాసిన మోబి డిక్ ,మార్క్ ట్వేన్ రాసిన హకల్ బేరి ఫెన్ లసరసన నిలువ దగిన రచన గా కిప్ప్లింగ్ నవల ‘’కిం ‘’ను యెంచుతారు . ‘’my soul drew one area to the great soul which is beyond all things . I saw nothing for ,I was all things ,having reached the ‘’great soul ‘’.అని ఈ నవలలో కిం చేత కిప్ప్లింగ్ అని పిస్తాడు .అందుకే కిం అనే వాడు కిప్ప్లింగ్ యొక్క భావాలకు సంపూర్ణ ప్రతినిధి అని పిస్తుంది ..ఒక రకం గా ఇది ‘’being and becoming ‘’గురించిన కద . ఇందులో విషయం ,నిర్మాణం కలిసి పోయి ఉన్నాయి . ఆత్మ ను తెలుసుకోవాలనే తాపత్రయం కనీ పిస్తుంది ఇందులో . అందుకే ‘’ఫస్ట్ రేట్ బుక్ ‘’ అంటారు . అస్తిత్వం కోసం అన్వేషణ ఉన్న నవల .రుడ్యార్డ్ ను ఇరవయ్యవ శతాబ్దపు ”బ్రిటిష్ ఇమ్పీరియలిజంకు ప్రాఫెట్ ”అన్నాడు జార్జి ఆర్వెల్ అనే ప్రఖ్యాత విమర్శకుడు కాలాన్ని బట్టి రాజకీయం మార్చాడు కిప్ప్లింగ్ . బ్రిటిష్ ప్రబుత్వ ఆస్తానకవి గా ”కిట్ హుడ్ ”కు  ప్రతిపాదనలు చేస్తే తిరస్కరించాడు సున్నితం గా కిప్ప్లింగ్ అనేక వివాదాత్మక విషయాలను ప్రకతిన్చాదాయన .ఇమ్పీరియలిజమ్ అంతమయ్యాక కిప్ప్లింగే అసాధారణ రచయితా అని పించాడు . 

          కిప్ప్లింగ్ రాసిన జంగిల్ టేల్స్ స్ప్పూర్తితో స్కౌట్ వ్యవస్తాపకుడు బాడెన్ పావెల్”ఉల్ఫ్ క్లబ్స్ ”లాంటివి యెర్పరచాదు.  

    17-9-2002 మంగళ వారం నాటి నా అమెరికా డైరీ నుండి

          మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -21-7-13- ఉయ్యూరు 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment