జెరోం డేవిడ్ సాలినర్-2 రచనల విశేషాలు

  జెరోం డేవిడ్ సాలినర్-2

                   రచనల విశేషాలు

          ‘’ కాచర్ ఇన్ ది రై ‘’నవల లో రెండవ ప్రపంచ యుద్ధపు ‘’అండర్  కరెంట్స్’’ను నిక్షిప్తం చేశాడు .అందుకే దీన్ని‘’కల్ట్ నావెల్ ‘’అన్నారు .మనుష్యులను ‘’ఫోనీలు ‘’గా వర్గీకరించాడు ..ఇంతకీ ఫోనీ అంటే-one who is only out to impress others ,some one  whose opinions are second hand ,some one who is unable to just-be himself ‘’ సాలినర్ మరకలున్న సరిహద్దు ప్రపంచాన్ని సృష్టించాడు .అందులో లోపలి విషయాలను చాలా క్షున్నం గా అధ్యయనం చేసి రాశాడు . అందులో వాస్తవాలను భ్రాంతులు గా చూపిస్తాడు .అదే అతని అసమాన ప్రతిభ .

         మార్క్ ట్వేయిన్  రాసిన ‘’హకల్ బెరిఫిన్’’ ఎలాగో, సాలినర్ రాసిన ‘’రై ‘’కూడా అలాంటిదే .హక్ ను ఇందులోని హాల్డేన్ కాల్ఫీల్ద్ పాత్రతో పోలుస్తారు విమర్శకులు .ఇద్దరు స్వంత అన్నా తమ్ముళ్ళు లాగా తమలోని అంతర్గత భావాలను ,అంతర్ద్రుస్తిని తెలియజేస్తూ అమెరికా జీవితాన్ని విమర్శిస్తారు .మార్క్ ట్వేయిన్ ,సాలినర్ ఇద్దరు చాలా స్పష్టం గా పాత్ర లను చిత్రించారు .ఎక్కడా అసందిగ్ధం కనీ పించదు .హక్ లాగానే ,హాల్డేన్ కూడా ఒక శరణార్దియే .సత్య పరీక్ష ఏ ఇద్దరికీ కోలబద్ద.అందుకే ఈ రెండు నవలలు ‘’deal obliquely and poetically with a major theme in American life past and present ,the right of the non conformamist to assert his own conformity ,even to the point of being handled with chain ‘’అని అభిప్రాయ పడ్డారు తులనాత్మక విమర్శకులు .

        సాలినర్  రచనలో వ్యక్తీ నైజం ప్రతి బిమ్బిస్తుంది .హాల్డేన్ భాష ‘’టీనేజ్ ‘’వాళ్ళ భాష  గా ఉంటుంది .సంభాషణల్లో వ్యాకరణాత్మక తమాషాలు చేసి మాట్లాడిస్తాడు . ‘’it is a secret between he and I ‘’అని పిస్తాడు .ఇందులో టీనేజర్ల గ్రామర్ నిబంధనల ను అతిక్రమించటం స్పష్టం గా ఉంటుంది .మన వాళ్ళు అన్నట్లు’’ఛందస్సుల పరిష్వంగాలను విదిల్చి నట్లు ‘’ఉంటుంది .’’she would give Allie or I a push ‘’I would woke him up ‘’లాంటి యువచిత్రాలను భాషలో చేయించాడు సాలినర్ .దీనిని అందరు అంగీకరించారు .దీనికి’’authentic rendering of a type of informal ,colloquial teenage American spoken speech ‘’అని కితాబు కూడా ఇచ్చి ప్రోత్సహించారు భాషా ప్రేమికులు .ఈ’’ టీనేజి భాష’’కే .వ్యామోహం హెచ్చింది .అంతటి భాష పూర్వక మార్పు తెచ్చిన వాళ్ళు సాలినర్ అంతకు ముందు మార్క్ ట్వేయిన్ .

             ఈ భాష వింత పోకడలను చూసి సంప్రదాయ వాదులు బుర్రలు పగలకోట్టుకొన్నారు జుట్టు పీక్కున్నారు ఈ పుస్తకాలను నిషేధించాలని ప్రభుత్వానికి మొర పెట్టుకొన్నారు ..స్కూళ్ళలో వీటికి ప్రవేశం ఉండరాదని ఉద్యమాలు చేశారు .దీనికంతటికి కారణం గ్రామ రూల్స్ ను అతిక్రమించటమే నని వారి వాదన ..ప్రిపరేటరి స్కూల్ విద్యార్ధులు ఇలా మాట్లాడరనీ అభియోగం తెచ్చారు .అయితే అమెరికన్ వాడుక భాష మీద రిసెర్చ్ చేసిన DONALD p.Costello ‘’అమెరికా లోని ఈశాన్య రాష్ట్ర యువజనులు సాలినర్ రాసినట్లు గానే  మాట్లాడుతారని తేల్చి చెప్పాడు .,సమర్ధించాడు .అందులో హాల్డేన్ అనే వాడు నిజానికి   వయస్సుఎక్కువ ఉన్న వాడుగా కనిపిస్తాడనీ చెప్పాడు .అలాగే P.G.Corbett అనే యూనివెర్సిటి ప్రొఫెసర్ ‘’we can not have a sinless literature about a sinful people ‘’అని గొప్ప గా మద్దతు ప్రకటించాడు .అంతేకాక ‘’Holden is himself phony ‘’అని జడ్జిమెంట్ ప్రకటించాడు .దీనితో బాటు ‘’Rye is a subtle ,sophisticated novel that requires an experience mature reader ‘’అని తీర్పునిచ్చాడు దీనితో భాష సంకరమై పోతోందని నెత్తీ నోరు కొట్టుకొన్న వాళ్ళ నోళ్ళు మూతలు పడ్డాయి .వీటితో మళ్ళీ సాలినర్ పూర్వపు వైభవాన్ని పొందాడు

         2-9-2002 సోమవారం నాటి నా అమెరిక డైరీ నుండి –

         మీ –గబ్బిటదుర్గా ప్రసాద్ –1-7-13 –ఉయ్యూరు

 .

Posted in అమెరికా లో | Tagged | Leave a comment

‘’శ్యామా మాతాజీ ‘’కీర్తనలకు తెలుగు అనువాదం

‘’శ్యామా మాతాజీ ‘’కీర్తనలకు తెలుగు అనువాదం

1

 

శ్యామ కృష్ణా !నాకోసం నువ్వేం చేశావు చెప్పు!

నన్ను నీప్రేమలో పడేసి పిచ్చిదాన్నిగా చేసే శావు

నువ్వు నా హృదయం లో ఉంటున్నావు

ప్రతి చోటా నీ కోసం వెదికే పనిఎందుకు  కల్పిస్తావు నాకు ?

నాకెందుకు ఈ బాధ??

నువ్వు లేకుండా నా మనస్సు రెపరెపలాడి పోతుంది .

నిన్ను నేను పొందాను

అయినా నీకోసం చూస్తూనే ఉన్నాను

నాతో ఎందుకీ దొంగాటలాడుతున్నావ్ ? 

నాకు నీప్రేమామృతాన్నిచ్చి మురిపించి మరపించావు

నువ్వు నన్ను నీ ప్రేమ గీతం గా మారుస్తున్నావు

 ఈ’’శ్యామ’’ నీ గురించే కలవరిస్తోంది , నీపిచ్చిలో పడి కొట్టుకొంటోంది 

2

శ్యామ కృష్ణా ! నా మాట కొంచెం విను

నువ్వు హాయిగా మెత్తని పరుపు మీద పడుకొంటావ్

 నేను మాత్రం నిద్ర లేని ఏకాంత దారుణ రాత్రులను గడుపుతున్నాను

నేను ఎవరికి ఫిర్యాదు చేయాలో నీకు చెప్పను

ప్రేమించిన నువ్వు నన్ను గెలిచావ్ ,నేనే ఓడిపోయాను దారుణం గా

ఇప్పుడే నాకనుల ముందు ప్రత్యక్షం కావాలి నువ్వు

నీ నేత్రామ్రుతాన్ని తనివార గ్రోలాలి నేను

ఈ ‘’శ్యామ’’ మనో వాక్కాయ కర్మలా నీకు వశమై పోయింది   .

శ్యామ కృష్ణా !దయచేసి బదులివ్వు

 వియోగి యోగి కంటే ఎలా తక్కువ వాడవుతాడు ?

యోగి శరీరం యోగాగ్నిలో కాలి బూడిదవుతుంది

నిన్ను ప్రేమించే వియోగి హృదయం నీ ప్రేమలో రగిలి బూడిద అవుతుంది

యోగి కాషాయం కడతాడు

వియోగి  నీ ప్రేమనే తనువూ మనసులకు కట్టుకొంటాడు

యోగి సమాధి లోకి వెళ్ళటానికిఎంతో  కష్టపడతాడు

వియోగి ప్రతి  కదలికతో తేలిగ్గా  భావనాసమాధి చెందుతాడు

యోగి  గుడిసె లో  నివశిస్తాడు

నిన్ను ప్రేమించే వారి హృదయమే ఒక దివ్యమైన గుడిసె , దేవాలయం

యోగి  శారీరక బాధలనుభవిస్తాడు

నిన్ను కోరిన వియోగి మానసిక క్షోభ అనుభవిస్తు తట్టుకొంటాడు

యోగి మంత్రాలను జపిస్తాడు

నిన్ను ప్రేమించే యోగి స్మృతి అంతా ప్రేమలో నిమగ్నమై ఉంటుంది

యోగి శాశ్వత దివ్య జ్యోతి ని చూడాలని ఆశిస్తాడు

ప్రేమికుడు నీతో శాశ్వత కలయిక లో పరవశిస్తాడు 

ఈ ‘’శ్యామ ‘’కు వేరే బంధువులెవరూ లేరు

శ్యాముడోక్కడే ఆమె ఏకైక దిక్కు ,గతి .

నీకు నా మీద దయ అనేది ఉంటె

శ్యామ కృష్ణా

నా కోసం రావటానికి ఇక ఆలస్యం చేయద్దు ..

       ఈ  రెండవ  కీర్తన ‘’శ్యామా మాతాజీ ‘’బొంబాయి లో రెండు వేరు వేరు చోట్ల అంటే ‘’అంధేరీ’’ లోను ,’’మలాద్ ‘’లోను  ఒకే సారి భౌతికం గా కనీపించి గానం చేసి అందర్నీ ఆశ్చర్య పరచింది .. తాను బొంబాయి లోని మలాద్ లో మాత్రమె కీర్తన లను గానం చేశానని ,అంధేరీ లో చేయ లేదని ఆమె చెప్పింది .కాని అంధేరీ లో ఆమె పాడినట్లు ఫోటోలు ,పేపర్ వార్తలను మర్నాడు ఆమె కు చూపించారు .అలా ”ఆ లీలా కృష్ణుడే” రెండో చోట తన రూపం లో వచ్చి పాడి ఉంటాడని ఆమె అందరకు చెప్పింది .

        24-10-1916 లో ఉత్తర ప్రదేశ్ లోని మధుర లో అంటే శ్రీ కృష్ణ జనం స్తానం లో జన్మించింది శ్యామా మాతాజీ .పెళ్లి అయి ఎనిమిది మంది సంతానాన్ని కన్నది. ఒకఆడపిల్ల మాత్రమె బతికింది .  .అత్తగారు వంశాంకుర మైన మగ పిల్ల వాడికోసం ఆమెను’బృందావనం లోని ’ 108శ్రీ బాబా రాదా స్వామీజీ మహారాజ్’’దగ్గరకు ఆశీర్వాదం పొందటానికి  తీసుకెళ్ళింది. ఆయన అనుగ్రహించి ‘’హరే రామ హరే రామ రామ రామ హరే హరే హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే ‘’మంత్రాన్ని ‘’రోజుకు లక్ష సార్లు’’ఆరు నెలల కాలం  జపించమని ఉపదేశించాడు .ప్రతి రోజు ఉదయం మూడు గంటలకు లేచి జపం ప్రారంభించేది .మళ్ళీ రాత్రి రెండింటి దాకా చేసేది లక్ష పూర్తీ కావటానికి .అంత నియమం గా ఆమె జపించి శ్రీ కృష్ణుని దివ్య దర్శనం పొందింది మగ సంతానం సంగతే ఆమెకు గుర్తు లేదు . దీనితో అత్తగారి ఆరళ్ళు పెరిగాయి .తట్టు కోలేక  బృందావనం కు, ఆ తర్వాతా కాశి కి ఎవరికి చెప్పకుండా వెళ్లి పోయింది . .అనుక్షణ సమాధి లో గడిపేది ..ఎన్నో అద్భుతాలను చూపేది. పై సంఘటన అలాంటి దివ్య శక్తులలో ఒకటి .శ్రీ కృష్ణ దివ్య విభూతిని అనుక్షణం అనుభవించేది .ఆమె కీర్తనలు అద్భుతం గా ఉన్నందున ఈ అనువాదం చేసి మీకు అందిస్తుస్తాను .

        మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -1-7-13- ఉయ్యూరు 

Posted in కవితలు | Tagged | Leave a comment

ఆంద్ర రాష్ట్రమే పరిష్కారం !

seperate state -ramprasad

Posted in సేకరణలు | Tagged | 1 Comment

ప్రాచీన హోదా ….. మనదే ఆలస్యం!!

01_07_2013_103_002

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

గురుదేవో భవనం

01_07_2013_101_003

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

అక్షరానకి అరవయ్ ఏళ్ళు

01_07_2013_004_003

Posted in సేకరణలు | Tagged | Leave a comment

కాన్వసపు లోగిల్లు -“ఆనందపు ” పు హరివిల్లు

Srinivas1Srinivas2Srinivas3Srinivas4

http://www.64kalalu.com/chithrakala

Posted in సరసభారతి ఉయ్యూరు | Tagged | Leave a comment

జెరోం డేవిడ్ శాలినర్

 జెరోం డేవిడ్ శాలినర్

         రాసిన నాలుగే నాలుగు పుస్తకాలతోఅందులో ఒకే ఒక నవల తో  మహా రచయిత అని పించుకొన్న వాడు అమెరికా రచయిత జెరోం డేవిడ్ శాలినర్ .1919 లో అమెరికా లోని పెన్సిల్వేనియా లో జన్మించాడు .ఏదైనా రచయిత రాశాడు అంటే అది చదువరుల హృదయానికి తాకి ఆ వెంటనే రచయిత తో ఫోన్ లో మాట్లాడాలి అని పించాలి అన్నాడు సాలినర్ .అదే మంచి రచన అవుతుందని చెప్పాడు .

సాలినర్ రాసిన నాలుగు పుస్తకాలలో ‘’catcher in the rye’’కిఊహించ రానంత పేరొచ్చింది .ఇరవై రెండు చిన్న కధలు రాశాడు .ఆయన తెలివి తేటలు అమోఘం .సాలినర్ కు చిన్నప్పుడు I.Q.115.ఉండేదట .1930 లో గ్రాడ్యుయేషన్ పూర్తీ చేశాడు .తండ్రి కి ఆస్ట్రేలియా లో వ్యాపారం ఉంది .ఇతను 1941 లో ఆర్మీ లో ఉద్యోగం చేశాడు .అందులో ఇతని పని counter intelligence ‘’లో .1944 జర్మన్ ఖైదీల ను  ఇంటరాగేషన్ చేశాడు .రచయిత హెమింగ్ వే తో పరిచయమేర్పడింది .ఫ్రెంచ్ వనిత సిల్వియా తో వివాహం .వెంటనే విడాకులు .1946-50 కాలం లో పది చిన్న కధలు రాశాడు .అవి మినీ కధలే అయినా చాలామంది  జనం మాట్లాడుకొనే భాషలో ,వ్యంగ్యాత్మకం గా ఉంటాయి .అతని కధలను ప్రసిద్ధ కదా రచయిత O..Henry తధలతో పోల్చారు విమర్శకులు ..తాను పుట్టుక నుంచే రచయితను అని తనను గురించి విశ్వాసం గా చెప్పుకొన్నాడు .అంతే కాదు తాను’’ born professional ‘’అనీ చెప్పాడు .తను ఏది రాసినా యువత కోసమే రాశానని చెప్పుకొన్నాడు .కధల్లో’’ ఐరనీ ,సెటైర్ ‘’లను పుష్కలం గా నింపాడు .పేరు ప్రఖ్యాతులు పెరిగాయి హాలీవుడ్ సినిమాలకూ పని చేశాడు ఆయన రచన’’ rye’’ ని సినిమా గా తీశారు అలాగే అతను రాసిన ‘’అంకుల్ విగ్లీ ‘’కధనూ సినిమా వాళ్లకు అమ్మాడు .1950 లో ‘’మై ఫూలిష్ హార్ట్ ‘’ రాసి ప్రచురించాడు .దీన్ని ఆ నాటి ప్రముఖ నటులు Dana Andrews ,,Susan Hayward లతో  సినిమా గా తీశారు .పెద్ద బాక్సాఫీస్ హిట్ సాధించింది .హేవార్డ్ కు ఉత్తమ నటి అవార్డు లభించింది .తరువాత ‘’పారి ‘’ అనే కలం పేరుతో franny and zooleyరాశాడు .

 

 

 

 

 

           సాలినర్ రాసిన’’ కాచర్ ఇన్ ది రై’’ అతని రచనలలో ఉత్తమోత్తమ మైనది .ఇది 1961 లో 1.5మిలియన్ల కాపీలుఅమెరికా లోనే  అమ్ముడయ్యాయి ..కాలేజీ హైస్కూల్ విద్యార్ధులు విపరీతమైన క్రేజ్ తో కొని చదివారు .1975 లో9 మిలియన్ల కాపీలు ఖర్చు అయ్యాయి .ఆ తర్వాతా ప్రతి నేలా 30,000 కాపీలు అమ్ముడవుతున్నాయి .దీనితో సాహితీ రంగం లో సాలినర్ పై విపరీత మైన మోజు పెరిగింది .తర్వాతకాపురాన్ని న్యు హాంప్ షైర్ కు మార్చాడు.1955 లో క్లైర్ డగ్లాస్ ను పెళ్ళాడాడు  .1963 లో raise high the roof beam ,carpenters and seymoor రాశాడు మళ్ళీ పెళ్లి పెటాకులై విడాకులు .సాలినర్ పుస్తకాలను నిషేధించాలని చాలా అమంది నుండి ఒత్తిడి వచ్చింది .కోర్టు మేట్లేక్కాడు .అయితే ఇవన్నీ సాలినర్ కే లాభం చే కూర్చాయి .salinger is famous for not wanting to be famous ‘’అను కొన్నారందరూ .’’slazenger  ‘’అని నిక్ నెం తో పిలిచారు గిట్టని వాళ్ళు .1997 లో హాప్ వర్త్ తో మళ్ళీ రచయిత గా పూర్వ వైభవం పొందాడు మొత్తం మీద ఆఆతని నవల ఒక్కటే మిగిలిన వన్నీ చిన్న కధలే .అతని రచనలలో ‘’జెన్ మతపు విస్తీర్ణత ఎక్కువ గా ఉంది .స్ట్రెస్ అతినిరచనల్లో  ప్రాణం  .యుద్ధ వ్యతిరేక నవల రాసి మహా కీర్తి మంతుదయ్యాడు సాలినర్2010 జనవరి ఇరవై ఏడు న న్యు హాంప్ షిర్  91 ఏళ్ళ వయసు లో చనిపోయాడు   

       మిగిలిన వివరాలు తరువాత

      మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -30-6-13 ఉయ్యూరు 

 
Posted in అమెరికా లో | Tagged | Leave a comment

హెర్మన్ మెల్ విల్లీ -2 మెల్ విల్లీ రచనా వైభవం

   హెర్మన్ మెల్ విల్లీ -2

             మెల్ విల్లీ రచనా వైభవం

     మెల్ విల్లీ రాసిన మోబీ డిక్ నవలను మిల్టన్ రాసిన డివైన్ కామెడి , షేక్స్ పియర్  రాసిన హామ్లెట్ నాటకం టాల్స్టాయ్ నవల వార్ అండ్ పీస్ లతో పోల్చారు .ఆయన  దేవుడితో పోట్లాడి నట్లు కనీ పిస్తుంది .న్యాయ బద్ధం కాని ప్రపంచాన్ని సృష్టించాడని భగవంతుని పై మెల్ విల్లీ కి కోపం అందరికి సమాన న్యాయం చేయలేదని దేవుడితో వైరం ..ఆయన్ను మంచి హాస్య రచయిత అని , ,సాంఘిక జీవిత వ్యాఖ్యాత అని అంటారు ..ఆయన రచనల పై వ్యాఖ్యానిస్తూ‘’t has been left unread is unspeakably vaster than what has been said ‘’అని తేల్చారు .ఆయన రచనల్లో సమాప్తి ఉండదని కాని సమాప్తికి కావలసిన పరిష్కారాలు ఉంటాయని చెబుతారు 

 

 md-1

.

          ప్రఖ్యాత రచయిత డి.హెచ్.లారెన్స్ మెల్ విల్లీ పై అద్భుత మైన రెండు వ్యాసాలూ రాసి ఆయన ప్రతిభా సర్వస్వాన్ని ఆవిష్కరించాడు .మెల్ విల్లీ కఠోర సత్యాలను రుజువు చేశాడని ,ఆయన ఒక గొప్ప దార్శనికడని ,స్విన్ బరన్ కవి విజన్ కంటే విస్తృత మైన విజన్ మేల్లీదని  ,సముద్రాన్ని దాని పై జీవితాన్ని మెల్ విల్లీ ఆవిష్కరించి నట్లు ఎవరూ చేయ లేదని చెప్పాడు . .సముద్రాన్ని సెంటి మెంటలైజ్ చేసిన ఘనుడు మెల్ విల్లీ అన్నాడు సముద్ర జీవుల వింత ప్రవృత్తిని ,వాటి ప్రతీకారేచ్చ ను కళ్ళకు కట్టిస్తాడు .అతను పిచ్చివాడూ కాదు ,క్రేజీ ఫెలో కూడా కాదు .సరిహద్దుకు పైనే ఎప్పుడూ ఉంటాడు .అతను ఉత్తరదేశీయుడేకాక , .సముద్ర జీవి .ఫసిఫిక్ సముద్రాన్ని,అట్లాంటిక్ సముద్రాన్ని ,మధ్యధరా సముద్రాలను  ఆసాంతం అధ్యయనం  చేశాడు ..అతని దృష్టిలో నిద్ర అంటే కలలు కనటమే .

     రాతి యుగం వారైన దక్షిణ సముద్ర వాసులను అతను చూసి వాళ్ళతో గడిపాడు .పసిఫిక్ సముద్ర హృదయం ఇంకా వింత గానే భావిస్తాడు .అది ఓక శూన్యం –వాక్యూం అన్నాడు దాన్ని ..మానవత్వానికి దూరం గా ఆ సముద్ర ప్రజల ఆవాసాల్లోకి చేరి వారి తో మమైక్యమైనాడు .ఈ ప్రపంచాన్ని మెల్ విల్లీ  ద్వేషించాడు .మానవ అసహనాన్ని జీర్ణించుకో లేక పోయాడు .మానవత్వం పై ద్వేషాన్ని ఎదిరించాడు .అతనికి అనాగరక మానవులే ఇష్టం .తన తెల్ల జాతి నక్కల కంటే వీరు ఏంటో ఉదారులని భావించాడు .’’భూ ప్రపంచం లో అతి మొరటోడు అమెరికన్’’ అన్నాడు .స్వర్గం ఉంది అని నమ్మిన వాడు మేల్విల్లీ .’’.he wants Americans to fight with the weapons of the spirit not the flesh .The mills of god were grinding inside him ‘’అని అతని హృదయాన్ని yఎరిగించారు …అతను పరిపూర్ణ స్త్రీ ప్రేమికుడు స్తాయి నుంచి పరిపూర్ణ స్నేహితుని స్తాయికి ఎదిగాడు .

      మేల్విల్లీ సూపర్ డూపర్ హిట్ నవల మోబీ డిక్ .దానికి మరో పేరు ‘’the white whale’’  . ఇదే చివరి సింబాలిక్ వేట .అందులో సేమిమేటాలిక్ భావం తో నీటి గురించి ప్ర్రారంభించి నవల మొదలు పెడతాడు .ఇదే స్పృహ లేని తనం ..’’ఇస్రాయిల్ పాటర్ ‘’నవలలో మగ వాడి శక్తి సామర్ధ్యాలను చిత్రించాడు .మోబీ డిక్ చదవాలి అంటే భారతీయ ఇతిసాలను అధ్యయనం చేయాల్సిందే .మన విష్ణు మూర్తి ని వైట్ వెల్ లో అంటే తిమింగిలం లో దర్శించాడు .విష్ణువు దశావతారాలలో ఇది ఒకటి గా భావించాడు .భారతీయ భావన లో నశించటం అంటే మళ్ళీ పుట్టటమే దాన్ని మెల్ విల్లీ అద్భుత నైపుణ్యం తో ఈ నవలలో చిత్రించాడు .అంటే మాట్చ్యావతారమే డిక్ అది వినాశనం చేస్తుంది మళ్ళీ సృస్తిన్స్తుంది కూడా .అది అరుదైన జంతువు.ఎన్నో రకాలుగా ఉప యోగపడుతుంది .దానిలో నుంచి spermacite ‘’అనే అరుదైన పదార్ధం తయారవుతుంది .అలా ఏ జంతువుకు ఇలాంటి పదార్ధాన్ని సృష్టించే శక్తి  భూ ప్రపంచం లో లేదు .దాని వీర్యం తో కొత్త జీవుల్ని సృస్టించ వచ్చు .దీపాలు వెలిగించ వచ్చు .ఈ దీపాలు సముద్ర దీపాలుగా ఇంటి దీపాలుగా పనికొస్తాయి విష్ణువు నామాలలో ఒకటి ‘’విశ్వ రేతః ‘’అంటే విశ్వానికి వీర్య రూపం లో ఉన్న వాడు అని అర్ధం .అందుకే డిక్ అనే తిమింగలం సృస్తించ టానికే కాదు సర్వ వినాశనానికి కా రణ మయ్యే ప్రచండ శక్తి .

 .సముద్రం లో దాని వేగం ,డాడి చేసే తీరు, పెద్ద నౌకల్ని తోక తో తలక్రిందులు చేసి నాశనం చేసే విధానం చూస్తె మనకు తెలుస్తుంది .

     సముద్రం లో వేల్ హంటింగ్ అంటే సింబాలిక్ గా భగవంతుని కోసం,సత్యం కోసంఅన్వేషణే..దానిని విశ్వ సంకేతం గా వాడుకొన్నాడు మెల్ విల్లీ .అందుకే విశ్లేషకులు ‘’Mobi dick in Mel villie ‘s fullness becomes the whole of man’s religious history’’ అని తేల్చారు ..

    5-9-2002 అమెరికా డైరీ నుండి

      మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -29-6-13- ఉయ్యూరు 

Posted in అమెరికా లో | Tagged | Leave a comment

సద్గురువు బేతవోలు -డాక్టర్ చాగం కొండారెడ్డి

సద్గురువు బేతవోలు -డాక్టర్ చాగం కొండారెడ్డి

June 28, 2013

పశ్చిమ గోదావరి జిల్లా ‘నల్లజర్ల’ లోని అతి సామాన్య కుటుంబంలో 1948 జూన్ 10 న ఆచార్య బేతవోలు రామబ్రహ్మం జన్మించారు. కష్టాలే తోడుగా వారి ప్రాథమిక విద్యాభ్యాసం సాగింది. ఆ తర్వాత కొవ్వూరు సంస్కృత కళాశాలలో భాషా ప్రవీణ చేశారు. అది గురుకులంగా భావించి ప్రాచీన కావ్య శాస్త్రాలను రావూరి వెంకటేశ్వర్లు గారి ప్రోత్సాహంతో ఆపోసన పట్టారు. వారి ప్రేరణతో భాషాప్రవీణ రెండవ సంవత్సరం చదివేప్పుడే అవధానాల వైపు ఆకర్షితులై పద్ధెనిమిదేళ్ల కే ( 1967లో)నవరాత్రి ఉత్సవాలకు మొదటి అవధానం చేశారు.

దాదాపు పాతిక సంవత్సరాల్లో 300 వరకు అవధానాలు చేసి తెలుగు ప్రజల హృదయాలను దోచుకున్నారు. తర్వాత లెక్కలేనన్ని అవధాన సభలకు సంచాలకత్వం వహించారు. అవధాన సుధాకరుడుగా సభా సంచాలక సార్వభౌమగా కీర్తి పొందారు. అంతేకాదు , వారు చదువుకున్న కొవ్వూరు సంస్కృత కళాశాల నుంచే ‘గౌతమి’ మాసపత్రిక వెలువడేది . అంతవరకు గ్రాంథికంలో వెలువడుతున్న ఆ పత్రికకు ఒక్క సంవత్సరం పాటు సంపాదకుడుగా వ్యవహరించి పూర్తిగా వ్యవహారంలోకి తెచ్చిన ఘనత వారికే దక్కుతుంది.

‘కేశిరాజు వేంకట నృశింహ అప్పారావు గారు’అని అప్పట్లో కొవ్వూరి సంస్కృత కళాశాల ప్రిన్సిపాల్ . పచ్చి గ్రాంథికవాది . స్వాతంత్య్ర సమరయోధుడు . గాంధేయ వాది . వారితో ఎన్నో చివాట్లు తిని మరీ ఆ పత్రికను వ్యవహారికంలోకి తెచ్చారు. అందులో బేతవోలు వారు ‘ జయసింహ చరిత్ర’ ( కల్పిత కథా ప్రబంధం) అన్న శీర్షికతో సరళ శైలిలో పద్యాలు రాశారు. ఆంధ్ర విశ్వవిద్యాలయం నుంచి ఎం ఏ తెలుగు చేసిన వీరు నాగార్జున విశ్వవిద్యాలయం నుంచి ఆచార్య తూమాటి దొణప్ప గారి పర్యవేక్షణలో ‘తెలుగు వ్యాకరణాలపై సంస్కృత వ్యాకరణాల ప్రభావం’ అనే అంశంపై పిహెచ్ డి చేశారు.

మొట్ట మొదట బేతవోలు గారు డా కెవికె సంస్కృత కళాశాల (గుంటూరు)లో ఉపన్యాసకులుగా చేరి అక్కడ ‘సరసభూపాలీయం, అహో బల పండితీయం’లోని పాఠ్యాంశాలు బోధిస్తుంటే అక్కడున్న అధ్యాపక బృందం చెవులు రిక్కించుకొని మరీ వినే వారు. ఆ కళాశాలలోని ఏలూరిపాటి అనంతరామయ్య , మల్లంపల్లి వీరేశ్వర శర్మ , కోగంటి సీతారామచార్యులు వంటి పండితులు ఏకంగా తరగతి గదిలోనే కూర్చొని వినేవారు.

జమ్మలమడుగు మాధవరామశర్మ గారైతే కిటికీ దగ్గరే కుర్చీ వేసుకొని వినేవారు. అంత అద్భుతంగా ఆకర్షిస్తుంది బేతవోలువారి బోధన. నాగార్జున విశ్వవిద్యాలయానికి వచ్చాక వారి బోధనా పఠిమ ఇతర శాఖల వారిని కూడా ఆకట్టుకొంది. ఆ విశ్వవిద్యాలయం ఆంగ్ల శాఖ ఆచార్యులు డివికె రాఘవాచార్యులు, రామబ్రహ్మం పాఠం ఉందంటే చాలు తప్పకుండా తరగతి గదిలోని పిల్లలతో పాటు కలిసి కూర్చొనేవారు.

ఒకసారి నాగార్జున విశ్వవిద్యాయలంలో బుద్ధిస్ట్ స్టడీస్ కేంద్రాన్ని ప్రారంభిచడానికి భూటాన్ దేశపు మఠాధిపతి జె.కంపూ, వారి బృందం వచ్చారు. వారితోపాటు అప్పటి మన ఉపరాష్ట్రపతి ఆర్. వెంకట్రామన్, యూజీసీ వైస్ చైర్మన్ ఆచార్య కె సచ్చిదానంద మూర్తిగారు కూడా వచ్చారు. ప్రారంభోత్సవం అయ్యాక సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా బేతవోలు రామబ్రహ్మం రాసిన ‘సౌందర నందం’ నాటకాన్ని పిల్లలతో ప్రదర్శింపజేశారు. నాటకాన్ని ప్రదర్శించేప్పుడి బుద్ధుడి పాత్ర వేదిక మీద కనిపించినప్పుడంతా ఆ భూటాన్ మఠాధిపతి, బృందం సభ్యులు నిల్చొనే తిలకించారు.

అంతేగాక నాటకం అయ్యాక బుద్ధుడి భిక్షాపాత్రని డాలర్లతో నింపి, రచయితను అభినందించి, ఆ ఆనందంలో మీరంతా మా దేశం వచ్చి పలుచోట్ల ప్రదర్శనలు ఇవ్వమన్నారు. దాంతో బేతవోలువారు భూటాన్ వెళ్ళి అక్కడ ‘ఉన్మత్త యక్షరాజం, సౌందరనందం’ వంటి బౌద్ధ సంబంధి నాటక ప్రదర్శనలు ఇప్పించి, అక్కడివారి ఆదరాభిమానాలను చూరగొన్నారు. ఇలా బేతవోలువారు తమ రచనల ద్వారా విదేశీయులను సైతం ఆకర్షించారు. నాటక రచయితే కాకుండా బేతవోలువారు స్వయంగా నాటకాలు ఆడారు.

ఎన్‌టి రామారావు ముఖ్యమంత్రి అయ్యాక ఒక ‘బుద్ధపూర్ణిమ’ రోజు నాగార్జున విశ్వవిద్యాలయానికి వచ్చారు. ఆ సందర్భంగా బేతవోలుగారు రాసిన పద్యాలతో రామారావు గారికి స్వాగతం పలికారు. ‘ఎన్టీ రాముడు మనసున, ట్వంటీ రాముడు’ వంటి ధోరణిలో నడుస్తాయి ఆ పద్యాలు. కార్యక్రమం అయ్యాక రామారావుగారు తిరిగి వెళ్తూ పద్యాలు రాసిన బేతవోలువారిని పిలిపించుకొని అభినందిస్తూ… ‘మేం త్వరలో ఏర్పాటు చేయబోయే తెలుగు విశ్వవిద్యాలయానికి మీ వంటి వారు అవసరం. త్వరలో మనం తప్పకుండా కలుద్దాం’ అని వెళ్ళారు. దాంతో రామారావు ప్రత్యేకంగా కళలకు సంబంధించి తెలుగు విశ్వ విద్యాలయం స్థాపించడం, రాజమండ్రి వద్దనున్న బొమ్మూరు కేంద్రంగా సాహిత్య పీఠాన్ని ఏర్పాటు చేయడం, అక్కడికి బేతవోలు వారిని ఆచార్యులుగా తీసుకోవడం జరిగింది.

అక్కడ తెలుగు సాహిత్య అధ్యయనం రూపకల్పనలోనూ, పరిశోధన విషయంలోనూ బేతవోలు వారు పెనుమూర్పులు తీసుకువచ్చి భావితరాలకు మార్గదర్శకత్వం వహించడంలో కీలకపాత్ర పోషించారు. ‘భారతి’ లేని లోటును తీర్చిన ‘వాజ్ఞ్మయి’ త్రైమాసిక పత్రిక పేరు వీరు సూచించిందే. హైదరాబాద్‌లో ప్రారంభమై ఏడాది పాటు నడిచిన ఆ పత్రికలను బొమ్మూరుకు తీసుకెళ్ళి పరిశోధనలో ప్రామాణికతను పాటిస్తూ తెలుగు సాహిత్యానికి విశిష్టమైన సంచికగా రూపొందించడంలో కీలకంగా నిలిచారు.

బొమ్మూరు విశ్వవిద్యాలయం తరపున ఒకసారి ‘వచన కవితకు షష్టిపూర్తి’ అన్న శీర్షికతో కవి సమ్మేళనాలు, సభలు నిర్వహించారు. ఆ సందర్భంగా వచన కవులు పద్యకవితను నిందిస్తూ, పద్యం ప్రగతి నిరోధకంగా ముద్రవేస్తున్న సమయంలో బేతవోలు వారు కెరటంలో పైకి ఎగసి ఉద్యమంలా ముందుకు సాగారు. వెంటనే హైదరాబాదులో ‘ఆంధ్ర పద్య కవితా సదస్సు’ నిర్వహించి నండూరి రామకృష్ణమాచార్యులు అధ్యక్షలుగా, బేతవోలు వారు ఉపాధ్యక్షులుగా రాష్ట్రం నలుదిశలా పర్యటించి పద్యం విశిష్టతను తెలిపారు. పద్యం కనుమరుగైతే ఏర్పడే పరిస్థితులపై చక్కని ఉపన్యాసం ఇచ్చారు. బేతవోలు వారు కొత్త గోదావరి వంటి పద్య కావ్యాలే కాకుండా నాటకాలూ రాశారు. కథలు రాశారు. అనువాద రచనలు చేశారు.

సాహిత్య వ్యాసాలు, పరిశోధనా గ్రంథాలు రాశారు. అన్నింటికన్నా సంస్కృత నాటకాలకు వ్యాఖ్యానాలు రాసి ఎనలేని కీర్తి గాంచారు. దేవీ భాగవతం వచన రచన ద్వారా కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు పొందారు. దాసరి లక్ష్మణ కవి సంకలనం చేసిన ఆణిముత్యాల వంటి 8 వేల పద్యాలకు వ్యాఖ్యానాలు రాయించడం, రాయడంలో నిమగ్నమై ఉన్నారు. బేతవోలువారి మార్గదర్శకత్వంలో పాతికమంది వరకు పీహెచ్‌డీలు చేసి డిగ్రీలు పొందారు. తొలినాళ్ళలో నాస్తిక భావాలున్న వీరికి ఆధ్యాత్మిక దిగ్ధర్శకత్వం నెరపినవారు లక్ష్మణ యతీంద్రులు. వీరికి దిశానిర్దేశం చేసి ఆచార్యునిగా తీర్చినవారు ఆచార్య తూమాటి దొణప్ప. ఆచార్య బేతవోలువారు శిష్య చిత్తాపహారకులైన సద్గురువని నిస్సందేహంగా చెప్పగలను.

-డాక్టర్ చాగం కొండారెడ్డి
(ఈ నెల 30వ తేదీన ఆచార్య బేతవోలు రామబ్రహ్మం పదవీ విరమణ చేయనున్నారు)

Posted in మహానుభావులు | Tagged | 1 Comment

హెర్మన్ మెల్ విల్లీ –1

   హెర్మన్ మెల్ విల్లీ –1

     ‘’మోబీ డిక్’’ అనే నవల ప్రపంచ ప్రాముఖ్య రచనలలో ఒకటి.దానిని యదార్ధ సహస గాధ అని కానీ అందులో వేదాంత ధోరణి అంతర్గతం గా ఉందని అన్నారు .దాని రచయిత అమెరికా కు చెందిన హెర్మన్ మెల్ విల్లీ .1819 లో అమెరికాలో న్యూయార్క లో పుట్టాడు .ఎనిమిది మంది గల సంతానం లో రెండవ వాడు .1830 లో వచ్చిన ఆర్ధిక మాంద్యం లో కుటుంబం చిన్నా భిన్నమైనది అనేక ఊళ్లలో టీచర్ గా పని చేసి కుటుంబాన్ని పోషించాడు మెల్ విల్లీ ..ఇరవై ఏళ్ళకే ‘’fragments from a writing desk ‘’రాశాడు .లివర్ పూల్ కు షిప్ జర్నీచేశాడు .షిప్ లో బాయ్ గా పని చేశాడు .ఇంటికి తిరిగి వచ్చేసరికి తల్లి ఉన్నదంతా అమ్మేసి చేతులు దులుపుకు కూర్చుంది .మళ్ళీ న్యూయార్క్ వెళ్ళాడు .అక్కడెంత ప్రయత్నించినా ఉద్యోగం రాలేదు .’సముద్రం లో ’వేల్స్ ‘’ను పట్టే కార్యక్రమం ‘’వేలింగ్ ‘’చెయ్యాలని పించింది

 16MOBYBOOKCOMBO-thumbStandard 150px-Herman_Melville_profile

 

 

         సౌత్ అట్లాంటిక్ లో ఆకునేట్ అనే పడవ లో ‘’వేల్ హంటింగ్ ‘’కు బయల్దేరాడు .కేప్ హార్న్ చేరగానే తోబీ గ్రీన్ అనే వాడి తో కలిసి సముద్రం లోకి దూకి పారి పోయాడు’’ .typee island చేరారు .అక్కడ నరమాంస భక్షకులున్నారు .వారితో కలిసి ఉన్నాడు .వాళ్ళు అతన్ని చంపక పోవటం అదృష్టం .వాళ్ళ తో కలిసి జీవించాడు వాళ్ళలో ఒకడైపోయాడు తర్వాత అక్కడి నుండి ఆస్ట్రేలియా షిప్ లో చేరి బయట పడ్డాడు ,అయితే షిప్ కెప్టెన్ తో గొడవ పడ్డాడు .క్రిస్టియన్ మతస్తులు అమెరికా లోని నేటివ్ అమెరికన్లను తమ మతం లోకి మార్చతాన్ని తీవ్రం గా వ్యతిరేకించాడు మెల్ విల్లీ .

       హవాయి ద్వీపం చేరుకొన్నాడు .రచన మీద మళ్ళీ గాలి తిరిగి’’typee’’  రాసి ప్రచురిస్తే మంచి ప్రచారం లభించింది అందులో రాసిన వన్నీ తన స్వంత అనుభవాలే .1847 లో ‘’omoo ‘’రాసి పబ్లిష్ చేశాడు ఎలిజబెత్ షా ను వివాహం చేసుకొన్నాడు .వారికి కూతురు పుట్టింది .1939 లో ‘’రెడ్ బర్న్’’ రాశాడు దీనితో వాస్తవ చిత్ర రచయిత గా గొప్ప పేరొచ్చింది .1949 లో ‘’మోబీ డిక్ ‘’నవల రాశాడు ‘’.నతానియల్ హతారన్’’ అనే అమెరికా ప్రసిద్ధ రచయిత తో గాఢ పరిచయమేర్పడింది ..ఈ స్నేహం జీవితాంతం కోన సాగించాడు 160 ఎకరాల ఫారం హౌస్ను పిట్స్ ఫీల్డ్ లో  కొన్నాడు .

     ‘’The house of seven gables ‘’నవల రాశాడు .1852 లో’’ మూడీ ‘’మారాడు .సంపాదన తగ్గింది రాసిన వేవీ సక్సెస్ కాలేదు ..1855 లో నాలుగవ సంతానం ఆడపిల్ల . .ఆర్ధికం గాను మానసికం గానూడిప్రేషన్ పాలైనాడు .భార్య ఇతని ధోరణికి తట్టుకో లేక పోతోంది ఆమె తండ్రి మొగుడు పెళ్ళాలను స్కాట్లాండ్ పంపాడు .1858 -60 లెక్చర్లు ఇస్తూ కాలం గడిపాడు .అతని రచనలలో మెటాఫిజికల్ ,ఫిలాసఫీ ఉండటం జనం మెచ్చలేదు 1860 లో ప్రపంచాన్ని చుట్టి రావాలని ఓడలో ప్రయాణించాడు .మూడేళ్ళకు న్యూయార్క్ కు తిరిగి వచ్చాడు .భార్య మెల్ విల్లీ ని వదిలేసింది కొడుకు ఆత్మ హత్య చేసుకొన్నాడు రెండో కొడుకు సముద్ర యానం లో మరణించాడు .ఇవన్నీ తీవ్రం గా మెల్ విల్లీ ని బాధించాయి .

             కొంత స్వస్తచేకూరిన తర్వాత ‘’బెల్లీ బడ్ ‘’నవల రాస్తే జనం బ్రహ్మ రధం పట్టారు  1890 లో 71 వ ఏట మరణించాడు .అతని మరణ వార్త ను పేపర్లేవీ పెద్ద గా పట్టించుకో లేదు ఒక చిన్న కాలం తో సరిపెట్టాయి .అతని రచనలలో విశ్వాశం, విశ్వాసానికివ్యతిరేకం గా   అసూయ ,మనుషుల గుడ్డినమ్మకం  ఈ  విశ్వాన్తరాల రహస్యం పై ప్రజలకు నమ్మకం లేక పోవటం ప్రతి బిమ్బిస్తాయి .అయితే అతని చావు తర్వాత నిజం గానే మెల్ విల్లీ పునర్జీవితుడయ్యాడు .అతని రచనలకు విశేష ప్రాభవం లభించింది .పాఠక హృదయాలలో తిష్ట వేసుకొని కూర్చున్నాడు మోబీడిక్ రచయిత మెల్ విల్లీ .

         సశేషం

మీ –గబ్బట దుర్గా ప్రసాద్ -28-6-13 ఉయ్యూరు  

     

Posted in అమెరికా లో | Tagged | Leave a comment

ఎర్నెస్ట్ హెమింగ్వే -2 హెమింగ్వే రచనా చాతుర్యం

 

                  ఎర్నెస్ట్ హెమింగ్వే -2

             హెమింగ్వే రచనా చాతుర్యం

       హెమింగ్వే కల్లోల ప్రపంచాన్ని గురించి రాశాడు అతని హీరోలు నిజాయితీ తో ఆత్మ గౌరవసం తో ఉంటారు .ఆయన్ను ‘’Hemingway veteran out of wars before he was twenty ,famous at twenty five ,thirty a master ,whitted a style carved in hardwood ,to tell hard stories .bloodied prize fighters ,hired killers ,disimbowled bull fighters ,crippled soldiers ,hunters of wild animals ,deep sea fishermen –hemingway’s favourite characters are men wh deal in death and accept its risk ‘’అని ఎస్టిమేట్ చేశాడు మాక్ లీష్ అనే విమర్శకుడు .ఆయన్ను రిలీజియస్ రైటర్ అన్నారు .హెమింగ్వే శైలి యేఆయన హీరో .ఆ స్టైల్ అనితర సాధ్యమని పించిన మహా రచయిత హెమింగ్వే .జీవితపు ఓటమిలో బాగా తన పాత్రను నిర్వహించాడు .

            అందరు మర్చి పోయిన ,వదిలేసిన పాత్రలకు జీవం పోసి కధలు రాశాడు .అతని పాత్రలన్నీ భయం ,ఒత్తిడి తో నిత్య పోరాటం తో కనిపించటం ప్రత్యేకత .అతనిదో వింత ప్రపంచం .అక్కడ పరిస్తితులు పెరగవు ఫలితాలనివ్వావు .అవి చితికి శల్యమై శిధిల మవుతాయి .అందుకే అతన్ని గురించి ‘’he attempts t deal with the fear of fear ‘’అనిచెబుతారు .బుల్ ఫైటర్లు వీరోచితం గా పోరాడి నట్లు కనీ పించినా వాళ్లకు శత్రువు భయమే అన్నట్లు అతని పాత్రలు ప్రవర్తిస్తాయి .

         యుద్ధం లో గాయ పడ్డప్పుడు ఆ గాయం ఆయన శరీరానికే కాదు మనసుకు కూడా  తీవ్ర గాయమైందని భావించాడు .అతను రాసిన’’ for whom the bell tolls ‘’ రచన లో’’ సైకిక్ ట్రీట్ మెంట్ ‘’కు ప్రాధాన్యత నిచ్చాడు .అతని విజన్ కు  నేపధ్యం  ఏమిటి అంటే ‘’శూన్య వాదమే’’ అంటే సత్యానికి ఆధారమైన విషయాలను తిరస్కరించటమే .యూరప్ రచయితల కంటే తీవ్రం గా స్వతంత్రం గా రాసి మెప్పించాడు .అతనికి మానవత్వం మీద ప్రగాఢ విశ్వాసం సాను భూతి ఉన్నాయి …అవే రచనలలో అంతర్వాహిని గా ఉండేట్లు రాశాడు .’’his style is his greatest  achievement ‘’అని ప్రశంశలు పొందాడు .అమెరికా సంస్కృతీ లో మాన వత్వం లోపించటం పై తీవ్రం గా కలత చెందిన మానవీయుడాయన .

       తన రచన ‘’to have and have not ‘’లో మానవుడి స్వార్ధం ,శారీరక సుఖాల పై ఆశ ,బాధ్యతా రాహిత్యాన్ని తీవ్రం గా విమర్శించాడు.అయన చిత్రించిన వ్యభిచార పాత్రలు అమెరికా వారివే .అతని స్టైల్ గురించి గొప్ప కితాబు ఇస్తారు ‘’he sought a new kind of prose that would be capable f expressing ‘’the realthing’’even beyond the third dimension  confusion which was half the terror f living ‘’శైలి విషయం లో ఇంతటి పేరు పొందిన వారు అమెరికా రచయితలో లేరు అని పించుకొన్నాడు మొదలు పెడితే  ప్రవాహ వేగం లో కొట్టుకు పోయి నట్లు గా ఉంటుంది అంతా అయిన తర్వాత ఎంతో రిలీఫ్ కానీ పిస్తుంది .’’living up to it to write it down ‘’అన్నది హెమింగ్వే ఆలోచన .దాన్నినే అనుసరించాడు విజయంసాధించాడు .

           ఆఫ్రికా దేశం వెళ్లి సఫారి చేశాడు . ఎన్నో  జంతువుల్ని ‘’సఫా ‘’చేశాడు ’గల్ఫ్ సముద్రాలలో ఈడాడు .మనుష్యుల్ని సన్నివేశాలను పిండేశాడు .ఇవన్నీ చిన్న కధలకు ,నవలలకు నేపధ్యమైనాయి .అన్ని రకాల పదార్ధాలు తిన్నాడు .అన్ని రకాల మత్తు పానీయాలు రుచి చూసి  నిగ్గు  తేల్చాడు ..అతనికి ఆహారం లో  ‘’రొమాన్సు‘’కనీ పించిందని చెప్పాడు .మిగిలిన చోట్ల రొమాన్సు అదృశ్యమైతే అది ఆహార పదార్ధాలలో దొరికిందని అన్నాడు .

        కాన్కార్డ్ తో స్నేహం హెమింగ్వే ను ప్రభావితం చేసింది .ఆయన ఇచ్చిన పుస్తకాలు చదివి ప్రేరణ పొందాడు .ఆయన రచనలు కూడా ఇతన్ని ప్రభావితం చేశాయి ..చని పోయినతర్వాత  రెండు దశాబ్డాలకాలం హెమింగ్వే రచనలను విమర్శకులు పట్టించుకోలేదు .తరువాత అతని ప్రభావం తెలుసుకొని ఆరాధించారు .అందులో కొత్తకోణాలను దర్శించారు .అంత మాత్రం చేత పాఠకులేవ్వరూ  ఆయన రచనలను చదవకుండా వదల లేదు క్రేజ్ గా చదువుతూనే ఉన్నారు అతని ఆకర్షణ ప్రభావానికి లోను కాని వారు లేరు. యువ రచయితలకు ఆరాధ్యదైవం హెమింగ్వే .ఆయన జీవితకాలం లో ఎన్నో సందికాలాలను చూశాడు .(transishans ).’’అతని రచనా వ్యాసంగం బాధ్యతా రాహిత్య ప్రపంచాన్ని ఎదిరించే ఆయుధం .

         ‘’Hemingway ‘s concerns ,courage ,dignity ,clarity of thought  and expression proved themselves ,the manifestations of his personality had interest without damaging the value of his work ‘’అని ప్రశంశలు పొందిన అమెరికా అరుదైన మహా రచయిత ఎర్నెస్ట్ హెమింగ్వే .

    2-9-2002 సోమవారం నాటి నా అమెరికా డైరీ నుండి

            మీ –గబ్బిటదుర్గా ప్రసాద్ –27-6-13- ఉయ్యూరు

    ‘’

 
 
Posted in అమెరికా లో | Tagged | Leave a comment

సాహితీ కితకితలు

సాహితీ కితకితలు

June 27, 2013

‘తెలుగువాళ్లకి నవ్వడం రాదండీ. తెలుగులో హాస్యం తక్కువండీ.. అనే వాళ్లని చూస్తే నవ్వొస్తుంది’ అంటూ ద్వానాశాస్త్రి తెలుగులో బోలెడు మంది రచయితలు రాసిన హాస్యాన్ని సేకరించి ‘తెలుగు సాహిత్యంలో హాస్యామృతం’ అన్న పుస్తకాన్ని తీసుకొచ్చారు. దాన్నుంచి కొన్ని హాస్యగుళికలు మీకోసం…
ముద్దుకృష్ణ ‘జ్వాల’ అనే పత్రిక నడిపేవారు. అందులో ఒక వర్థమాన కవిని విమర్శిస్తూ వ్యాసం వస్తే అతగాడు వెళ్లి ముద్దుకృష్ణపై మండిపడ్డాడట. అప్పుడు ముద్దుకృష్ణ తాపీగా ఇలా అన్నారు. ‘చూడండి కవిగారూ, పత్రిక కొనేవారిలో సగంమంది ఆ వ్యాసాన్ని చూడరు. చూచినవారిలో సగంమంది చదవరు. చదివిన వారిలో సగం మందికి అర్థం కాదు. అర్థం అయినవారిలో సగంమందికి మీరెవరో తెలీదు. తెలిసిన వారిలో సగం మంది నమ్మరు. నమ్మినవారిలో సగం మందిని మనం ఖాతరు చెయ్యవలసిన పనిలేదు. ఇకపోతే మిగిలేది ఆ సగం మంది కనుక మీరు ఖాయిలా పడకండి’ అని!
* * *
సమాచార పౌర సంబంధాల శాఖలోనూ, వికలాంగుల సంక్షేమ శాఖలోనూ పనిచేసిన గోపాల చక్రవర్తి హాస్యం తప్ప ఏమీ రాయలేదు (కొన్ని కవితలు తప్ప). ‘నాతి కథలూ – నీతి కథలూ’ ‘గోలాయణం’ ‘సల్లాప గోపాలం’ ‘నవ్వు గోపాలం’ వంటి రచనలు చేసి తెలుగు సాహిత్యంలో హాస్యపు లోటును కొంత వరకు తీర్చారు. అనువాదం కత్తి మీద సామువంటిది. సరిగ్గా అనువదించకపోతే అసలు రచయితకి అన్యాయం చేసినట్టే అంటూ గోపాల చక్రవర్తి చెప్పిన ఉదాహరణలు చూడండి.
‘ఎ స్మయిల్ బ్రోక్ ఆన్ హర్ లిప్స్’ను ‘ఆమె పెదాల మీద చిరునవ్వు బద్దలయింది’గా అనువదించాడట ఒకాయన. ఒక ప్రభుత్వ అధికారి మాట్లాడుతూ ‘దేర్ మస్ట్ బి గివ్ అండ్ టేక్ బిట్వీన్ పబ్లిక్ అండ్ ది గవర్నమెంట్’ అని చెప్తే అనువాదకుడు ‘ప్రజలకూ ప్రభుత్వోద్యోగులకూ మధ్య ఇచ్చిపుచ్చుకోవడాలు ఉండాలి’ అన్నాడట. వెంటనే సభలో నుంచి ఎవరో లేచి ‘మా ఊళ్లో ఇవి చాలాకాలం నుంచి ఉన్నాయిలే’ అన్నాట్ట!
ఓ బోర్డులో అనువాదం ఇలా ఉంది – ‘ప్రభుత్వ అవినీతి నిరోధక శాఖ’ – అంటే ప్రభుత్వంలో గల అవినీతిని (ఉందని ఒప్పుకున్నట్టేగా) నిరోధించేది అని కదా అర్థం? ఓసారి టైపిస్ట్ ‘మినిస్టర్ ఫర్ ఇరిగేషన్’ అని టైపు చెయ్యడానికి బదులు ‘మినిస్టర్ ఫర్ ఇరిటేషన్’ అని టైప్ చేశాట్ట.
* * *
‘ఆత్మహత్యలు చేస్కున్న రైతులకు మీ సర్కారు ఎక్స్‌గ్రేషియ ఎందుకు ఇస్తలేదు?’
‘ఆత్మ నీలల్ల నానదు, నిప్పులల్ల గాలదు. ఆత్మను కత్తి నర్కలేదు. తుపాకిగుండు తున్కలు జెయ్యలేదు. ఆత్మకు సావు లేదు. సావు లేని ఆత్మను రైతు ఎట్ల సంపుతడు? రైతులకు ఆత్మను ఎట్ల హత్య జెయ్యొస్తది? రైతులు ఆత్మహత్యలు జేస్కోనప్పుడు గాల్లకు ఎక్స్‌గ్రేషియ ఇచ్చే ముచ్చటే లేదు.’
ఇదీ తెలిదేవర భానుమూర్తి వరస. రాజకీ యాలతో ఈ మాటల దేవర ఫుట్‌బాల్ ఆడుకొంటాడు. భానుమూర్తి భాష, ధ్యాస అంతా తెలంగాణ గోస! తెలంగాణ తెలుగువెలుగులు తెలుసుకోవాలంటే భానుమూర్తిని చదవాలి.
ఒకసారి రైతులందరికీ నాయకులు ‘భగవద్గీత’ను ఉచితంగా పంచుతున్నారు. అందరికీ ఆశ్చర్యం వేసింది. ‘ఎందుకిలా’ అనుకుంటుంటే వారేం చెప్పారంటే –
‘బగవద్గీతను సదిఇతె మనసు నిమ్మలమైతది. పాత అంగిని ఇడ్సి కొత్త అంగిని తొడిగిన తీర్గ మన పానం గీ పెయ్యిని ఇడ్సి ఇంకొక పెయ్యిలకు పోతున్న దిశని బగవద్గీత జెప్తున్నది. గీ సంగతి ఎర్కుంటె ఏ రైతన్న పుర్గుల మంది తాగి సచ్చినా ఎవ్వలు ఏడ్వరు. మా సర్కార్‌ను దిట్టరు. లాబమొస్తదా నస్టమొస్తదా అని సూడకుంట పని జెయ్యాల అని బగవద్గీత జెప్తున్నది. రైతులందరు వానబడిందా లేదా అని సూడొద్దు. పంట పండుతుందా లేదా అని సూడకుంట ఎవుసం జెయ్యాలె. కస్టమొచ్చినా సుకమొచ్చినా ఒక్క తీర్గ ఉండాలని బగవ ద్గీత సదివితె ఎర్క అయితది!’
* * *
‘అవధానిగారూ, సన్యాసికీ సన్నాసికీ తేడా ఏమిటండీ?’ అని అడిగారు అప్రస్తుత ప్రాసంగీకులు. వెంటనే అవధానిగారు ‘అన్నిటినీ విడిచినవాడు సన్యాసి. అందరూ విడిచినవాడు సన్నాసి’ అని చెప్పగానే హర్షధ్వానాలు!
అనేక అవధానాలలో అప్రస్తుత ప్రసంగం చేసి ఎంతో పేరు తెచ్చుకొన్న కీ.శే. ఆమళ్లదిన్నె గోపీనాథ్‌గారు ‘అవధానాలలో అప్రస్తుత ప్రసంగాలు’ అనే విశిష్టమైన పుస్తకం రాశారు. ఇటువంటి పుస్తకం ఇంతకుముందు రాలేదు. సాహిత్యప్రక్రియ అయిన అవధానంలో ఎంత హాస్యం ఉంటుందో ఈ పుస్తకం తేటతెల్లం చేస్తుంది.
అవధానికి సమయస్ఫూర్తితో పాటు శబ్ద శక్తి కూడా ఉండాలి. అప్పుడే అప్రస్తుత ప్రసంగం బాగా రక్తి కడుతుంది.
‘అవధానిగారూ, రవికలో దాగి ఉన్న ఇద్దరు మహానుభావులెవరో తెలుపుతారా?’ అనే అప్రస్తుత ప్రశ్నకు అవధానిగారు చమత్కారపు విడుపు ఇది – ‘రవి, కవి వీరిద్దరూ దాగి ఉన్నారు’ అని చెప్పారు..

Posted in సేకరణలు | Tagged | Leave a comment

ఉత్తరా’’ శోక’’ ఖండం

   ఉత్తరా’’ శోక’’ ఖండం

                అది దేవ భూమి ,దివ్య భూమి

 అక్కడి గాలి, గంగమ్మ నీరు మహా పవిత్రం

                వీటిని పీల్చి, తాగే బతికారు మహర్షులంతా

                మానవ తప్పిదం తో, సౌకర్యాల పేరుతో

                అంతా మరుభూమిని చేసి తమాషా చూస్తున్నాం

                మూడు రోజుల జల ఖడ్గ ధారతో

                అంతా నిజం గానే మహా శ్మశానమే అయింది

                నాయకులు యువనాయక సంకీర్తన లో మునిగి పోతే

                అధినాయకులు నిశ్చేష్ట తో చక్కర్లు చుట్టి వస్తే

               మానవత్వం పరి మళించాల్సిన వేళ –ఆదుకోవలసిన

               అధికార గణం ‘’నాదే అధికారం’’ అని చిందు లేస్తుంటే

               జనం గోడు విని పించుకోన్నాదేవరు ?అక్కున చేర్చుకొన్న దేవరు  ?

               ఎప్పుడూ ప్రాణాలకు తెగించే సైన్యమే  అమ్మ’’ వారి ‘’రూపం లో

               సేద దీర్చి ,ఊరటకల్గించి, సాంత్వన చేకూర్చింది

               వారిలోనే పరమాత్మ ను దర్శించారు యాత్రికులు

               చేతులెత్తి కృతజ్ఞతలు చెప్పుకొన్నారు .

                విద్యుత్ ప్రాజెక్టుల పేరు తో భారీ నిర్మాణాలు

              సొరంగాలు నీట మళ్లింపు లు ,ప్రేలుళ్ళు జల విలయం సృష్టించాయి

              యుగాంతం ఇదేనేమో నని భీతి కల్గించాయి

              ‘’ధారీ దేవి ‘’చార్ ధాంప్రాంత సంరక్షురాలైన అమ్మవారు

               వద్దని వారించినా ఆమె విగ్రహాన్ని తీసి

               మహా పాపం మూట కట్టుకొన్నారు

               ఆమె ఆగ్రహానికి గురై జనాన్ని బలి చేశారు నిర్వాహకులు

               ఈ మధ్యనే ‘’గాలి ఘనుడు ‘’మన రాష్ట్రం లో

                అత్యాశకు పోయి’’ పోచమ్మ అమ్మ వారి గుడి ‘’కూల్చి

              ,తాను జైలు పాలై సర్వం కోల్పోయి 

               చేటు తెచ్చుకొన్న సంగతి ఇంకా మనం మరవలేదు 

               ఇవన్నీ హెచ్చరికలే –గుర్తించి నడవక పోతే ప్రళయమే

               కేదార్ నాధుడోక్కడే దిక్కు గా మిగిలాడు –సర్వం గంగార్పణం

               వేలను దాటిన మృతులకు శ్రద్ధాంజలి ఘటిద్దాం

               నవ్వు ముఖం తో పోనీల మీద ఎక్కించుకొని

                కేదారనాధ దర్శనం  చేయించి

                ఆరు నెలల రాబడితోమాత్రమె  ఏడాది అంతా జీవించే

                ఆ ఘర్వాల్ వాసుల గతి ఏమయ్యిందో

                ఎన్ని పోనీలు  మరణించాయో

                వాటి యజమానులు ఎందరు లోయల్లో నదీ గర్భం లో

                 కలిసి మృత్యు వాత పడ్డారో –తలచుకొంటే నే హృదయ విదారకం !

                 వీరందరి ఆత్మకు శాంతి కలగాలి

                 నాకు వీరిలోనే పరమాత్మ కన్పిస్తాడు

                 సహాయం చేయటానికి ఆదుకోవటానికి

               ‘’మోడీ ‘’చంద్ర బాబులు’’ ఆదర్శ ప్రాయం గా నిలిచారు

                 దేవుళ్ళు లాసమయానికి  బాధితులకు దర్శనమిచ్చి

                 అభయమిచ్చి ఆదుకొన్నారు ,ఇళ్ళకు సురక్షితం గా చేర్చారు  

                  వారే దేశానికి ,రాష్ట్రానికి నేత లవ్వాలని

                  కోరుకొన్న బాధితుల ఆకాంక్ష తీరాలని

                  దేశానికి రాస్ట్రానికి దిశా దశా నిర్దేశం చేసే అవకాశం

                  త్వరలోనే వారిద్దరికీ కలుగుతుందని ఆశిస్తున్నారందరూ .

                  విలయం లోంచి ,విధ్వంసం లోంచి  

                  ఆ ప్రాంతం బయట పడి స్వాస్త్యం పొందాలి

                  భక్తీ యాత్ర మృత్యు యాత్ర కారాదు

                  ఉత్తరా ఖండ్ మళ్ళీ మానవ తప్పిదం వల్ల

                ‘’ ఉత్తరా ‘’శోక ‘’ఖండం కారాదు , 

                   దేవ భూమి గా .దివ్య ధామం గా విలసిల్లాలి

 

                       మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ 26-6-13- ఉయ్యూరు

Posted in రచనలు | Tagged | Leave a comment

అందరూ దేవ ‘దాసు’ లే!

అందరూ దేవ ‘దాసు’ లే!

June 26, 2013


‘దేవదాసు’ సినిమా విశేషాలు తెలుగువారికి తెలియనివి కావు. శతదినోత్సవాల్లో, సిల్వర్, గోల్డెన్ జూబ్లీ వేడుకల్లో, పత్రికల్లో, ప్రత్యేక సంచికల్లో, ఆత్మకథల్లో ఈ క్లాసిక్ గొప్పదనం గురించి పదే పదే వస్తూనే ఉంటుంది. ఆ ‘పదే పదే’లో నేటి షష్టిపూర్తి సందర్భం కూడా ఒకటి. తెలుగు దేవదాసు సినిమాకు 60 ఏళ్లు నిండిన సందర్భంగా ఆ సినిమాకు పనిచేసిన కొందరి ప్రముఖుల అనుభూతులివి.

‘దేవదాసు’ను రీమేక్ చేయడం అసాధ్యం -అక్కినేని
ఇప్పుడు వస్తున్న సినిమాలు శరీరాన్ని మాత్రమే కదిలిస్తున్నాయి. కానీ ‘దేవదాసు’ అలా కాదు.. అది మనసును, ఆత్మను, బుద్ధిని కదిపే సినిమా. కావునే 60 ఏళ్లయినా దాని గురించి ఇప్పటికీ మాట్లాడుకుంటున్నాం. నిజం చెప్పాలంటే ‘దేవదాసు’ మామూలు కథే… కానీ మామూలు కథ కాదు. ఇలా ఎందుకన్నానంటే… ఒకమ్మాయిని ప్రేమించడం… ఆ ప్రేమ విఫలం కావడంతో మందుకు బానిసై తనను తాను కోల్పోవడం… ఈ పాయింటాఫ్ వ్యూలో సాదాసీదాగానే కనిపిస్తుంది. కానీ ఆయా పాత్రల సైకో అనాలసిస్ చాలా గొప్పగా ఉంటుంది.

పార్వతిని దేవదాసు ప్రేమించాడా? లేదా? అంటే ఈ విషయం ప్రేమించినవాడికే తెలియదు. పార్వతి పెళ్లి తర్వాత కానీ దేవదాసు మనసుకు దెబ్బ తగల్లేదు. తన మనసు నుంచి ఏదో మిస్సయిన ఫీలింగ్ అతడిని కుదురుగా ఉండనీయలేదు. అందుకే ‘అందని పొందు కన్నా అందమే లేదు… ఆనందమే లేదు’ అని ప్రాణం పోయేవరకు తాను కోల్పోయిన దాన్నే వెతుకుతూ పిచ్చిగా తిరిగాడు. ఒకవేళ దేవదాసుకు పార్వతి దక్కిఉంటే అందరిలా సంసారం చేసుకుంటూ ఉండేవాడు. కాలగర్భంలో కలిసిపోయేవాడు. కానీ అలా జరగలేదు. పార్వతికేమో ‘ఇగో’ సమస్య. దేవదాసు తండ్రికేమో వంశ గౌరవం, ప్రతిష్ఠ ముఖ్యం. పాత్రల నడుమ ఈ సంఘర్షణే దేవదాసును అజరామరం చేసింది.

ఈ సినిమా చేసేనాటికి నాకు 29 ఏళ్లు. అప్పుడప్పుడే నేను కెరీర్‌లో నిలదొక్కుకుంటున్నా. నిర్మాత డి.ఎల్.నారాయణగారు ‘దేవదాసు’ను నాతో చేయాలనుకున్నప్పుడు చాలా విమర్శలొచ్చాయి. ముఖ్యమైన ముగ్గుర్నీ పనికిరానివారని అనుకున్నారంతా. అంత బరువైన పాత్రను అక్కినేని భరించలేడన్నారు. సావిత్రి చిన్న పిల్ల ఆమెకేం తెలుసు అన్నారు. ఇక డాన్సులు నేర్పించే వేదాంతం రాఘవయ్య ‘దేవదాసు’ను డైరెక్ట్ చేయడమేంటని పదే పదే నిర్మాతను భయపెట్టారు. రాఘవయ్యగారు, నేను సరదాగా ‘తాతా… తాతా’ అనుకుంటాం. ‘ఏమైనా సరే తాతా ఈ సినిమాను బాగా తీయాల్సిందే’ అని ఇద్దరం ఒకరికొకరు చెప్పుకుని కసిని పెంచుకున్నాం.

శరత్ నవలకు, సినిమాకు చాలా మార్పులే ఉంటాయి. క్లాస్ నవలను మాస్‌కు నచ్చేలా తీయాలనే మా ప్రయత్నం సక్సెస్ అయ్యింది. ‘పల్లెకు పోదాం… పారును చూద్దాం చలో చలో’ అంటూ దేవదాసు ఉత్సాహంగా పాడుకోవడం, ‘అయ్యో అంత సిగ్గుపడితే ఎలా… కాస్త నీ పెళ్లికి అట్టే పెట్టుకో’ అని పార్వతితో దేవదాసు అనడం… ఇవన్నీ మామూలు ప్రేక్షకులకు కూడా ఆకట్టుకోవడానికి చేసిన ప్రయత్నాలే. మిగతా ‘దేవదాసు’ల కన్నా మన దేవదాసు బాగుందనడానికి ఇలాంటి కొన్ని చమక్కులతో పాటు సాహిత్యం, సంగీతం బాగా తోడ్పడ్డాయి. ఇక ‘ఆయనలా నటించడం, దేవదాసు పాత్రలో జీవించడం ప్రపంచంలో ఎవరి తరమూ కాదు’ అని దిలీప్‌కుమార్ గారు నాకు కాంప్లిమెంట్ ఇవ్వడం అప్పట్లో పెద్ద విశేషంగా చెప్పుకున్నారుగానీ ఏ ఊరి వస్తాదును ఆ ఊరిలో పొగడటం మామూలే కదా.

1972లో హై కొలెస్టరాల్‌తో నేను అనారోగ్యానికి గురయ్యాను. అప్పటికే ‘దేవదాసు’ నైజాం హక్కులు అమ్మకానికి వస్తే చాలా డబ్బు పోసి వాటిని కొన్నాను. 1974 అక్టోబర్ 18న అమెరికాలో నాకు బైపాస్ సర్జరీ జరిగింది. ఆ సమయంలో నా పని అయిపోయిందనుకున్నాను. అప్పులు కూడా ఉండేవి. సరిగ్గా అదే సమయంలో కృష్ణ, విజయనిర్మల కలర్‌లో తీసిన ‘దేవదాసు’ విడుదలకు సిద్ధమైంది. ఆ సినిమాకు వారం ముందు నా ‘దేవదాసు’ విడుదల చేస్తే నాక్కూడా నాలుగు డబ్బులొస్తాయి కదా అనే ఆలోచన కలిగింది. పైగా అప్పటికే ఆ సినిమా కోసం చాలా డబ్బులు పోశాను అనే డిప్రెషన్‌లో ఉన్నాను. అందుకే అమెరికా నుంచే డిస్ట్రిబ్యూటర్‌కు ఫోన్ చేసి సినిమా విడుదల చేయమన్నాను.

కృష్ణ ‘దేవదాసు’ పెద్దగా ఆడలేదు కానీ నా ‘దేవదాసు’ బ్రహ్మాండంగా ఆడి నాకు లాభాలను తీసుకొచ్చింది. అయితే అభిమానులు దీన్ని పెద్ద వివాదంగా మార్చారు. కృష్ణ ‘దేవదాసు’ బాగా లేదనే టాక్ రావడంతో నేను కూడా ఆ సినిమా చూడలేదు. పాత క్లాసిక్స్‌ను రీమేక్, రీమేడ్ చేయడం ఫ్యాషనైపోయింది. అయితే ‘దేవదాసు’ను రీమేక్ చేయడం అసాధ్యం. అలాంటి సాహసం ఎవరైనా చేస్తారని నేననుకోవడం లేదు. నేను బ్రతికుండగా ఎవరైనా రీమేక్ చేసినా చూసి తట్టుకోలేను.

-చల్లా శ్రీనివాస్

క్షణకాలమైనా కలకాలం గుర్తున్నాను
-‘మనోరమ’ పాత్రధారి సీత
‘దేవదాసు’లో నటించడం నిజంగా నా పూర్వజన్మసుకృతం. కొన్ని చిత్రాలు మొదట్లో నటించేప్పుడు చాలా సాధారణంగా అనిపించినా అవి కాలక్రమేణా కళాఖండాలుగా నిలిచిపోవడం చాలా సంతోషాన్నిస్తుంది. ‘దేవదాసు’లో నాకు పార్వతి స్నేహితురాలు మనోరమ పాత్ర షావుకారు జానకి ద్వారా దక్కింది. అప్పటికి ‘షావుకారు’ చిత్రంలో ఆమెతో కలిసి నటించడం వల్ల, ఆ స్నేహం కారణంగా నన్ను డి.ఎల్.నారాయణగారికి ఆమే సిఫారసు చేశారు. అప్పటివరకు ‘గుణసుందరికథ’, ‘యోగివేమన’, ‘షావుకారు’ వంటి చిత్రాల్లో చలాకీ వేషాలు వేసిన నేను ఈ చిత్రంలో కనిపించేది క్షణకాలమైనా కలకాలం గుర్తుండే బరువైన పాత్రను ధరించాను. నిజానికి ఇందులో నాది కథాపరంగా చాలా కీలకమైన పాత్ర. పార్వతి ఎడబాటుతో సర్వభ్రష్టుడైన దేవదాసు దీనస్థితిని పార్వతికి తెలియజెప్పి, ఎలాగైనా ఆ దొరబాబును మళ్లీ పూర్వస్థితిలో చూడాలని ఆశపడ్డ హితైషి పాత్ర. ఇంత చక్కటి పాత్రనిచ్చిన దర్శకనిర్మాతలు ఏ లోకంలో ఉన్నా వారికి నా ధన్యవాదాలు. 60 ఏళ్లయినా దేవదాసు సినిమా ప్రాణం కోల్పోని పత్రహరితంలా సజీవంగా ప్రేక్షకులను రంజింపజేయడం, ఈ గుదిగుచ్చిన ముత్యాలహారంలో ఒక మంచి ముత్యంగా నా పాత్ర ప్రకాశించడం నాకు సంతోషాన్నిస్తోంది. ఈ సందర్భంగా నన్ను గుర్తుపెట్టుకుని నా ఆనందాన్ని మీతో పంచుకునేలా చేసినందుకు ఆంధ్రజ్యోతికి నా ప్రత్యేక కృతజ్ఞతలు.

ఈనాటి కీ ‘దేవదాసు రాణి’ అంటారు
-గాయని కె.రాణి
ఏనాటి ‘దేవదాసు’… ఎప్పటి పాటలు… అయినా ఈనాటికీ నన్ను ‘దేవదాసు రాణి’గా పిలుస్తూ, మొన్న మొన్నటిదాకా కచేరీల్లో ఆ పాటలు పాడించుకునేవారు. దేవదాసులో నేను ‘అంతా భ్రాంతియేనా…’, ‘చెలియ లేదు చెలిమి లేదు…’ పాటలు పాడాను. వీటితో పాటు మూడోపాటగా ‘ఓ దేవదా’ను కూడా పాడాను. అయితే నా సహగాయని స్వర్గీయ జిక్కీ ఆ పాటను నాకంటే ముందు పాడిందని ఆ పాట రికార్డింగ్ నాటికి నాకు తెలియదు. అలా తెలిసుంటే ఆ పాటను నేను పాడేదాన్ని కాదేమో. చివరికి జిక్కీ పాటనే బయటకు వచ్చింది. కారణాలేమైనా ఆ పాటలో నా హమ్మింగ్ మాత్రం అలాగే ఉంచేశారు. ‘దేవదాసు’ రెండవమారు విడుదలై శతదినోత్సవం జరుపుకున్నప్పుడు అఖిలాంధ్ర ప్రేక్షకుల ముందు, ముఖ్యంగా ‘దేవదాసు’ (అక్కినేని) ముందు నేను ఈ సినిమా పాటలు పాడటం ఇప్పుడు తలుచుకున్నా నా మనసులో ఒక అనిర్వచనీయ ఆనందం కలుగుతుంది. మా అన్నయ్య (అక్కినేని) నిండు నూరేళ్లు పరిపూర్ణమైన ఆరోగ్యంతో జీవించాలని నా ఆకాంక్ష.

ఆ తృప్తి నాకుంది
– గాయని రావు బాలసరస్వతీ దేవి
‘దేవదాసు’ చిత్రంలో లలిత (చంద్రముఖి)కి చాలా లలితమైన పాటలు… ఇందులో ‘అందాల ఆనందం..’, ‘ఇంత తెలిసి యుండి…’, ‘తానే మారెనా…’ పాటలు పాడాను. నా శృతికి తగ్గ పాటలు నా చేత పాడించిన సంగీత దర్శకుడు ఆర్. సుబ్బురామన్ గారికి ఈ సందర్భంగా నా ప్రత్యేక కృతజ్ఞతలు. ఆయన సంగీతంలో అంతకు మునుపే నేను చాలా చక్కని పాటలు పాడాను. అయితే ఈ చిత్రంలో పాడిన పాటలకు వాటన్నింటిని మించిన పేరొచ్చింది. అక్కినేని, డి.ఎల్‌గారు మా ఇంటికి వచ్చి రాజావారిని ఒప్పించి మరీ నన్ను తీసుకెళ్లి పాడించారు. ఈనాటికీ కచేరీలలో శ్రోతలు నేను కనిపించినప్పుడల్లా ‘తానే మారెనా…’ పాటను కనీసం హమ్ చేయమనైనా అడుగుతారు. అజరామరమైన చిత్రంలో నేనూ పాటలు పాడాననే తృప్తి నాకుంది.

నిన్న మొన్ననే రికార్డింగ్ జరిగినట్లుంది!
-గాయని ఉడుత సరోజిని
‘దేవదాసు’లో చిన్నప్పటి పార్వతీ, దేవదాసులకు నేను, నా ప్రాణ స్నేహితురాలు జమునారాణి కలిసి ‘ఓ దేవదా…’ డ్యూయెట్ పాడాం. నిజానికి మా ఇద్దరి అనుబంధం చిత్తూరు నాగయ్య నిర్మించిన ‘త్యాగయ్య’ నాటిది. అలాంటిది దేవదాసులో ఈ పాట పాడే అవకాశం మమ్మల్ని వరించడం మాకు ఎంతో సంతోషదాయకం. ఆ రికార్డింగ్ నిన్నమొన్న జరిగినట్లుంది. అప్పుడే 60 ఏళ్లు వచ్చేశాయా? కాలప్రవాహం ఎంత వేగంగా వెళ్తోంది. ‘దేవదాసు’ 60 ఏళ్ల సందర్భంగా మేము ఇంకా జీవించి ఉండటం మా అదృష్టం. కళాకారులకు భగవంతుడిచ్చిన గొప్ప వరం… వారు లేకపోయినా వారు సృష్టించిన కళాఖండాలు శాశ్వతంగా నిలిచిపోవడం. మేమున్నా లేకపోయినా దేవదాసు చిత్రం ప్రేక్షకుల మదిలో ఉన్నంతకాలం మేము సంగీత ప్రపంచంలో చిరంజీవులమే.

కచేరీలలో ఇప్పటికీ పాడుతున్నా
-గాయని కె.జమునారాణి
సి.ఆర్.సుబ్బురామన్ గారికి, మాకు ఆ రోజుల్లో కుటుంబస్నేహం ఉండేది. ఆ స్నేహం కారణంగానే ఆయన నాకు ‘దేవదాసు’లో ఒక పాట పాడే మహద్భాగ్యాన్ని కల్పించారు. ముఖ్యంగా ఉడుత సరోజినితో కలిసి నేను యుగళగీతం పాడాను. నాకు చాలా సరదాగా ఉండేదా రోజుల్లో. ఎందుకంటే ఆ రోజుల్లో మేమిద్దరం పిల్లల పాటలకు లాండ్‌మార్క్. అయితే సరోజిని పిల్లల పాటలకే పరిమితమైంది. నాకు కొంటె పాటల కోణంగిగా పేరొచ్చింది. ‘దేవదాసు’లోని ఆ పాట (ఓ దేవదా…) కచేరీల కోసం ఎక్కడికెళ్లినా పాడుతూనే ఉన్నాను.
– కంపల్లె రవిచంద్రన్

Posted in సినిమా | Tagged | Leave a comment

ఎర్నెస్ట్ హెమింగ్వే-1

ఎర్నెస్ట్ హెమింగ్వే-1

          అమెరికా  ప్రఖ్యాత రచయిత ఎర్నస్ట్ హెమింగ్వే ఎందరికో స్పూర్తి ,ప్రేరణ .నోబెల్ బహు మతి గ్రహీత అయిన ఆయన గురించి తెలుసు కొందాం .

              హెమింగ్వే చికాగో లో 1899 జులై  21న జన్మించాడు .తల్లికి కొడుక్కీ మంచి సంబందాలున్దేవికావు .ఇతనికి ఒక అక్క ఉంది తల్లి బాగా చదువుకొన్న స్త్రీ .కూతుర్ని కొడుకును సమానం చూసేది .అది హెమింగ్వే కు నచ్చలేదు 1917 లో స్కూల్ చదువు పూర్తీ చేశాడు .పద్దెనిమిదేళ్ళ వయసులోనే ‘’kansas city star ‘’పత్రికకు రిపోర్టర్ గా పని చేశాడు .తర్వాతా రెడ్ క్రాస్ లో చేరాడు .1918 లో ఇటలీ దేశం వెళ్లి యుద్ధం లో పాల్గొన్నాడు .అక్కడ ఆయుధ కర్మాగారం లో అనుకోకుండా తీవ్ర మైన ప్రేలుడు జరిగింది .జనం భీభత్సం గా చని పోయారు హెమింగ్వే అక్కడ వారికి సహాయ కార్యక్రమాలు సమర్ధ వంతం గా నిర్వహించాడు .ఇక్కడ జరిగిన ఈ దారుణం పై ‘’A  natural history of the dead ‘’అని గుండెలు పిండేసే వ్యాసం రాసి ప్రచురించాడు .ఆ తర్వాతా సైన్యం లో చేరి అసలైన యుద్ధం లో పాల్గొన్నాడు అమెరికా తరఫున ..అప్పుడు పౌర సరఫరాలను అంద జేస్తుంటే  ట్రెంచ్ లోనుంచి ఒక మోటార్ షెల్ల్ వచ్చి తీవ్ర గాయం చేసింది .తలా ,కాళ్ళు దెబ్బతిన్నాయి .అంతే హీరో అయిపోయాడు .అమెరికా చేర గానే బ్రహ్మ రధం పట్టారు ఈ వార్ హీరో హెమింగ్వే కు .

 

  ఆగ్నెస్ అనే నర్సు తో ప్రేమలో పడ్డాడు  ప్రేమ లో పడ్డా

డు ఆమె ఒప్పుకోలేదు .చిన్న కధలు రాసి ప్రచురించి ప్రాచుర్యం పొందాడు .అతను రాసిన యుద్ధ అనుభవాలను మాగజైన్ల లో చదివి జనం విపరీతం గా ఆరాధించారు .క్రేజ్ పెరిగి పోయింది .1920 లో మొదటి ఆర్టికల్ వచ్చింది మరుసటి ఏడు ఎలిజబెత్ అనే అమ్మాయిని పెళ్లి చేసుకొన్నాడు .’’three stories and ten poems ‘’రాసి ప్రచురించాడు .తర్వాతా ‘’the torrents of spring ‘’రాశాడు పాలిన్  అనే జర్న లిస్టు  మన వార్ హీరో ను వలచింది .ఇద్దరితోనూ ప్రేమాయణం ఒక కృష్ణుడు –ఇద్దరు రాధల్లా సాగించాడు .చివరికి ఒకర్ని వదిలేసి ఎలిజే బెత్ నే పెళ్ళాడాడు

          ‘’ The sun also rises ,’’men without women ‘’రచనలు చేశాడు కొడుకు రాసే వేవీ తలి దండ్రులు మెచ్చుకోలేదు .ఫ్లారిడా రాష్ట్రం వెళ్లి ‘’.A farewell to arms ‘’నవల రాశాడు .ఎలిజ బెత్ కు గూడబై చెప్పి పాలిన్ ను పెళ్లి చేసుకొన్నాడు .హెమింగ్వే తల్లి తండ్రీ ఆత్మా హత్యలు చేసుకొన్నారు .death in the after noon ‘’రాశాడు .పాలిన్ తో జపాన్ కు హనీ మూన్ కు వెళ్ళాడు .అక్కడ ఇతని రాత గొడవ చూసి ఆమె సహించలేక పోయింది ‘’what I want ed was a wife in bed at night not somewhere ever having higher adventures at so many thousand backs the adventure ‘’ అంటూ ఆవిడ జర్నలిజానికి ఇష్టపడ లేదు అందుకని సహాయ నిరాకరణ చేసింది .ఇప్పటికి ముగ్గురయ్యారు .నాల్గవ భార్య గా మేరీ రంగ ప్రవేశం చేసింది .అప్పుడే across the river and into the trees ‘’రాశాడు .ఆఫ్రికా వెళ్లి సఫారీ చేశాడు సముద్రాల పై సుదూర ప్రాంతాలు పర్య టించాడు గుర్రాలను పెంచాడు .

            1952 లో the old man and the sea ‘’అనే చిన్న నవల రాశాడు ఇది పెద్ద హిట్ అయింది దీనికే1954లో  నోబెల్ బహుమతి పొందాడు .5,300,000 పుస్తకాలు అమ్ముడు పోయాయి ఇది రికార్డు సృష్టించింది అంతకు ముందు1953 లో  పులిట్జర్ బహు మతి వచ్చింది ఈ నవల మాస్టర్ పీస్ గా పేరొందింది .ప్రపంచ దేశాలన్నీ తిరిగాడు .తాగుడు విపరీతమయింది .ఇరిటేషన్ పెరిగి పోయింది .క్యూబా అధ్యక్షుడు ఫిడేల్ కాస్ట్రో హేమింగ్వే రాసిన అన్ని పుస్తకాలను స్వాధీన పరచు కొంది .అప్పుడు హెమింగ్వే కు బ్రేక్ డౌన్ వచ్చింది .’’paranoid delusion ‘’ తో విపరీతం గా బాధ పడ్డాడు బి.పి.బాగా పెరిగి పోయింది కంట్రోల్ కావటం లేదు .’’talking psychiatri therapy ‘’ఏమీ ఫలించలేదు .దీన్ని ఒద్దు అని తిరస్కరించాడు .తర్వాతా ‘’షాక్ థెరపీ ‘’చేశారు .దీనికే ‘’electro convulsive therapy (e.c.t.)అని పేరు .దీని వల్ల జ్ఞాపక శక్తి పూర్తీ గా దెబ్బతిన్నది .ఆస్పత్రి లోనే తుపాకి తో కాల్చుకొని1962 లో  ఆత్మా హత్య చేసుకొన్నాడు .

 హెమింగ్వే చని పోయిన తర్వాతా ముద్రింప బడిన ఆయన  ‘’the big bite ‘’అనే పుస్తకానికి ముందు మాట రాస్తూ నార్మన్ మైలర్ అనే ప్రముఖ రచయిత ‘’Hemingway ‘s inner landscape was a night mare and he spent his nights wrestles with gods –what he failed accomplished was heroic ‘’ అని కీర్తించాడు .

                 హెమింగ్వే గురించి చదువు తుంటే ఒకటి జ్ఞాపకం వస్తోంది .2002 మార్చి 11,12 తేదీలలో విజయ వాడలో భారతీయ సాహిత్య పరిషద్ శ్రీ బాపట్ల రాజ గోపాల రావు గారి ఆధ్వర్యం లో నిర్వహింప బడింది .నేనూ మా బావమరది ఆనంద్ వెళ్లాం .అక్కడే శ్రీ ప్రోలా ప్రగడ సత్య నారాయణ రావు గారితో పరిచయం అయింది. ఆ సభకు ఎందరో సాహితీ ప్రముఖులు విచ్చేశారు .రెండు రోజులూ కాఫీ టిఫిన్లు భోజనాలతో చాలా హుషారుగా సభా నిర్వహణ జరిగింది ..మంచి కద పై మాట్లాడ మని అందర్నీ కోరారు నేను శ్రీరమణ రాసిన ‘’మిధునం కధ ‘’పై రెండే రెండు నిముషాలు మాట్లాడాను .చాలా గొప్ప కద అని మెచ్చుకోన్నాను .సభ అయిన తర్వాతా ప్రోలా ప్రగడ వారు నా దగ్గరకు వచ్చి ‘’మంచి కధను మీరు గుర్తు చేశారు ‘’అని ఆప్యాయం గా కౌగలించుకొని అభి నందించారు .

          ఆ సాయంత్రం జరిగిన సభలో ప్రోలా ప్రగడ వారు గొప్ప ఉపన్యాసం ఇచ్చారు .అందులో విశ్వనాధ సత్య నారాయణ గారు తనను ‘’ఒరే !1954 లో నోబెల్ ప్రైజ్  హెమింగ్వే కు ఎందుకోచ్చిందో తెలుసా ??’’అని అడిగితే తెలీదని తాను చెప్పానని అప్పుడాయన ‘’ఒర్ సత్యం ! నేను హెమింగ్వే రాసిన ‘’ది ఓల్డ్ మాన్ అండ్ ది సి’’అమెరికా నుంచి తెప్పించుకొని చదివాను. దానికి ఇచ్చార్రా నోబెల్ .అందులో ఏమీ లేదు .మన భగవద్ గీత లో చెప్పిన దాన్నే వాడు చాలా చక్క గా మనసుకు హత్తుకోనేట్లు చెప్పాడ్రా .మన పని మనం చెయ్యాలి ఫలితం భగవంతునికే వదలాలి అన్న సూక్ష్మాన్ని హెమింగ్వే గొప్పగా డెవలప్ చేసి నవల రాసి నోబెల్ ప్రైజ్ పొందాడ్రా ‘’అని ప్రోలా ప్రగడ వారు గుర్తు చేసుకొన్నారు .

            ఇంకో విశేషం ఏమిటంటే ఈ రోజుకు నాలుగు రోజుల క్రితమే అంటే ఆగస్ట్ చివర్లో ప్రోలా ప్రగడ సత్య నారాయణ గారు మరణించి నట్లు’’ ఆన్ లైన్ టి.వి.న్యూస్ ‘’చూశాను .ఈ విధం గా హెమింగ్వేను , ,ప్రోలా ప్రగడ వారిని స్మరించుకొనే అవకాశం కలిగింది .

   2-9-2002 సోమవారం నాటి నా అమెరికా డైరీ నుండి

                         హెమింగ్వే ను గురించి మరిన్ని విశేషాలు మరో సారి

               సశేషం –మీ –గబ్బిటదుర్గా ప్రసాద్ -26-6-13- ఉయ్యూరు 

 
 
Posted in అమెరికా లో | Tagged | 1 Comment

నా దారి తీరు -34 మళ్ళీ బదిలీ వేట ప్రారంభం

 నా దారి తీరు -34

                           మళ్ళీ బదిలీ  వేట ప్రారంభం

            విస్సన్న పెట్ లో మంచి నీరు కొరత ఎక్కువ .నూతి నీళ్ళలో ఫ్లోరైడ్ ఎక్కువ .అందుకని ఊరి సెంటర్ లో చెరువు ఒడ్డున ఒకే ఒక బావి అందరికి ఆధారం .అక్కడి నుండే నీళ్ళు తెచ్చుకొంటారు .లేక పోతే పోయించు కొంటారు బోర్లు దాదాపు మూడు వందల అడుగులు దింపితే కాని మంచి నీరు పడదు .వాతావరణం కూడా ఆరోగ్య కరం గా ఉండదు ఊరిలో ఒకే ఒక సినిమా హాల్ ఉంది నూజి వీడు నుండి పుట్రేలకు, తి.రువూరుకు వెళ్ళే బస్సులు విస్సన్న పేట మీదు గా వెళ్తాయి .

చనుబండ,రమణక్క పేట లు దగ్గరే .చను బండలో మంచి దేవాలయాలున్నాయని చెప్పుకొనే వారు .మైల వరం కూడా ఇరవికిలో మీటర్ల దూరం .అస్వారావు పేట మీదుగా హైదరాబాద్ కు బస్సులు వెళ్తాయి పోలవరం ప్రాజెక్టు రామ పాదసాగార డాం దగ్గరే .రామ పాద సాగర డాం కట్టాలని నా చిన్నప్పటి నుంచి రాజకీయ నాయకులు ఆందోళన చేయటం రెండు మూడు సార్లు శంకు స్తాపన చేయటం గుర్తు .సెంటర్ లోనే ఒక మాదిరి హోటల్ ఉంది అక్కడ ఇడ్లి గారే బొండాలు మంచి కాఫీ దొరికేది

              ఒక సారి నా శ్రీమతి నూజి వీడు వాళ్ళ అక్కయ్య ఇంటికి వచ్చి ,వాళ్ళిద్దరూ కలిసి విస్సన్న పేట వచ్చారు రెండు రోజులు ప్రభావతి వండి పెట్టింది అప్పుడు మేము ‘’ధర్మాత్మా ‘’అనే హిందీ సినిమా రెండో ఆట చూశాం .మా పక్కనున్న తూటు పల్లి వారు మా మామ గారి ఇంటి పేరు వారే .వాళ్ళ ఇంటికి వెళ్లి పలకరించింది .వారానికో సారి సంకా పుల్లయ్య గారు విస్సన్న పేట వచ్చేవాడు .కలిసే వాడు .ఇక్కడ ఇండియాన్బాంక్ ఉంది అందులోనే ఖాతాలున్దేవి .లోన్లు ఇచ్చేవారు .

                         అవ్వారు శ్రీనివాస రావు కు చదువు చెప్పటం .

         ‘’ అవ్వారు శ్రీనివాస రావు –నవ్వారు నేత ‘’పదో తరగతి లెక్కలు సైన్సు లలో తప్పాడు నన్ను హెడ్ మాస్టారిని అడిగి నా సై న్సు  క్లాసుల్లో కూర్చుని వినే వాడు .ఆదివారం నాడు లేక పోతే రాత్రి పూట నా గదికి వచ్చి చెప్పించుకొనే వాడు అతనికి ఆ సబ్జెక్టుల మీద అవగాహన కల్గించాను ఏంతో  సంతోషించాడు .పాస్ అవుతాననే ధైర్యం కలిగింది అని చెప్పే వాడు .ఉయ్యూరు వచ్చినప్పుడల్లా మా ఇంటికి వచ్చే వాడు .

          నా బదిలీ ప్రయత్నాలు నేను చేస్తూనే ఉన్నాను

              తుమ్మల నారాయణ రావు అనే సైన్సు మేష్టారు నూజి వీడు నుంచి వచ్చాడు .ఆయన భార్య నూజివీడులో ప్రభుత్వ ఆస్పత్రిలో ఉద్యోగి. రోజు నూజి వీడు నుంచి వచ్చే వాడు మహా భయస్తుడు కాని మంచి నిజాయితీ పరుడు .ఆయన అన్న చాల మయ్య గారు రెవిన్యు డిపార్ట్ మెంట్ లో డిప్యూటీ తాసిల్దార్ చేసి రిటైర్ అయి ఉయ్యూరు లో ఇల్లు కట్టుకొన్నాడు నేను రిటైర్ అయిన తర్వాతా బాగా పరిచయం .వెటరన్ పరుగు పందాలలో పాల్గొని అనేక బహుమతులు సాధించాడు చలమయ్య గారు మాకూ ఉయ్యూరు కాలేజి గ్రౌండ్ లో నడక పోటీ పెట్టి బహు మతులిప్పించాడు నాకు మొదటి బహుమతి వచ్చింది అప్పటి దాకా నడవటం నాకు తెలియదు .కోటేశ్వర శర్మ గారే ఫాస్ట్ వస్తారని అందరూ అనుకొన్నారు ఆయన సెకండ్ వచ్చారు .అలారం గడియారం నాకు వచ్చిన బహుమతి .అప్పుడే ఇది జరిగి పదేళ్ళు అవుతోంది .

              ఒక లెక్కల మేష్టారుఆంజనేయ చౌదరి గారు  రోజూ నూజి వీడు నుంచి వచ్చే వారు కమ్మ వారు .తెల్ల జుట్టు .చాలా మంచి మనిషి ,నిదానస్తులు .నేను అంటే విపరీత మైన అభిమానం తో ఉండేవారు ఆయన భార్య నూజి వీడులో డ్రిల్ మేస్తారని .గుర్తు సాయి బాబా భక్తులు ఇంటి వద్ద సాయి భజనలు చేసే వారు .ఒక సారి వారింటికి వెళ్లాను అలానే గాడేపల్లి దక్షిణా మూర్తి శాస్త్రి అంటే మా హెడ్ మాస్తారింటికి కూడా ఒక సారి వెళ్లాను .భార్యా భర్తలైన డ్రిల్ మేస్టార్లు ఉండేవారు భర్త మంచి ప్లేయర్ .

              ముమ్మరం చేసిన ప్రయత్నాలు –ఫలించిన ప్రయత్నం

               డబ్బులిస్తే ట్రాన్స్ఫర్లు జరుగుతున్నాయని బాహాటం గానే చెప్పుకొంటున్నారు దీనికి కూడా కొన్ని కారణాలు కావాలి కుటుంబం లో ఎవరో ఒకరు మిలిటరీ లో పని చేస్తున్నా, తలిదండ్రులు తీవ్ర అస్వస్థత తో ఉన్నా ఎక్కువ కన్సిడరేషన్ ఉంది అని చెప్పారు మా తమ్ముడు కృష్ణ మోహన్ పూనా లో డిఫెన్సుఆర్డినెన్స్  ఫాక్టరీ లో పని చేస్తున్నాడు .వాడితో జిల్లా పరిషత్ కు లెటర్ పెట్టించాను ‘’నేను డిఫెన్సు లో ఉన్నందున ఇంటి వద్ద మా అమ్మ గారి ఆరోగ్యం మా కుటుంబ విషయాలు చూడ టానికి మా అన్నయ్య దుర్గా ప్రసాద్ ను ఉయ్యూరు దగ్గరి ఊరికి బదిలీ చేయండి ‘’అని రాయించాను నాకొక కాపీ పంపాడు .దీన్ని తురుఫు ముక్క గా వాడాలి

              ఒక ఆదివారం నేను అవని గడ్డ వెళ్లి మండలి కృష్ణా రావు గారికి విషయం చెబుదామని వెళ్ళా .తీరా వెళ్తే ఆయన హైదరా బాద్ వెళ్ళారని తెలిసింది .నెత్తిన చెంగేసుకొని అవని గడ్డ గుడి వాడ బస్ ఎక్కి పామర్రు లో దిగా .అక్కడ ఉయ్యూరుకు బందరు బెజవాడ  బస్ ఎక్కాను రాత్రి ఏడు అవుతుంది .ఆ బస్సులోనే నా మిత్రుడు శ్రేయోభిలాషి నన్ను మళ్ళీ ఉయ్యూరు దగ్గరకు ట్రాన్స్ఫర్ చేయించాలని తీవ్ర ప్రయత్నం లో ఉన్న లెక్కల మేష్టారు పి.ఆంజనేయ శాస్త్రి గారు ఎక్కారు .ఒకరి కొకరం ఆశ్చర్యం గా చూసుకొన్నాం .నా ప్రయత్నాలు అవనిగడ్డ నుంచి వచ్చిన వైనం ఆయనతో చెప్పాను ఆయన ‘’ప్రసా ద్ గారూ ! నేనూ అదే ప్రయత్నం లో ఉన్నాను .ఇప్పుడే బందరు నుంచి వస్తున్నాను జిల్లా పరిషత్ లో ప్రాపర్టీ మేనేజర్ శాస్త్రి గారు అనే ఆయన ఉన్నాడు ఆయన మన మహంకాళి సుబ్బరామయ్య మేస్తారికి మేన ల్లుడు . ..ఇప్పుడు ట్రాన్స్ఫర్లు అన్నీ ఆయన చేతి మీదుగానే జరుగుతున్నాయి సుబ్బరామయ్య గారిని పట్టు కొంటె పని అవుతుంది ‘’అన్నాడు సరేనన్నా …..మర్నాడు ఇద్దరం పొద్దున్నే సుబ్బరామయ్య గారి ని కలవాలనిఅనుకోని ఆయన ఇంటికి వెళ్లాం .ఇంట పొద్దున్నే ఎవరూ వస్తారని ఆయన ఊహించలేదు సుబ్బరామయ్య గారు నాకు ఎనిమిదో తరగతిలో తెలుగు చెప్పిన మేష్టారు .తర్వాతా ఇద్దరం ఉయ్యూరు స్కూల్ లో కలిసి పని చేశాం కూడా .ఆయన వంగల శివరామయ్య గారింట్లో  గారింట్లో  అద్దేకున్నారు వాకిట్లో హాయిగా చుట్ట కాలుస్తున్నారు .ఆయన చుట్ట కాలుస్తారని నాకు అప్పటిదాకా తెలీదు.గబుక్కున ఆర్పేశారు మమ్మల్ని చూసి ఆశ్చర్యోఅపోయారు .లోపలి తీసుకొని వెళ్లి విషయం చెప్పి నా బదిలీకి సహాయం చేయమన్నాం .ఆయన ముందుగా తనకేమీ తెలీదని దబాయించారు. కాని మేము శాస్త్రి గారనే ప్రాపర్టీ ఆఫీసరు పేరు చెప్పగానే మెత్త పడ్డారు .కాదనలేక పోయారు పైగా నేను ఆయన శిష్యుడిని .అప్పుడు సరే ప్రయత్నం చేద్దాం అంటూ వెంపటి లక్ష్మీ నరసింహ శర్మ అనే కనక వల్లి వాస్తవ్యులు మాతో పాటు పని చేసిన  తెలుగు పండిట్ గా కోన కంచి లో ఉన్నాడని  ఆయన కూడా  ప్రయత్నిస్తున్నాడని అందరం కలిసి మర్నాడు ఉదయం బందరు వెళ్దామని చెప్పారు.హమ్మయ్య అనుకొన్నాం

                 మర్నాడే ఆంజనేయ శాస్త్రి నేను వెంపటి శర్మ గారు  సుబ్బా రామయ్య మేస్తార్ని వెంబడి పెట్టుకొని బందరు ఈడేపల్లి లో ప్రాపర్టీ మేనేజర్ శాస్త్రి గారింటికి వెళ్లాం .ఆయన మమ్మల్ని ఆదరం గా చూశారు .దీనికి ఎంత ఖర్చు అయినా ఇస్తామని చెప్పాం మనిషికి అయిదు వందలు అవుతుందని అడ్వాన్సు గా రెండొందలు ఇవ్వమని బదిలీ అయిన తర్వాతా మిగతాది ఇవ్వ వచ్చునని ,ట్రావెలింగ్ అలవెన్సు కూడా వచ్చేట్లు చేస్తానని మాట ఇచ్చి ఈ విషయం ఎవరికి చెప్ప కుండా రహస్యం గా ఉంచాలని కోరారు ..అని ఊరట చెందాం .ఇది ఆంజనేయ శాస్త్రి గారి సహృదయం మా గురువు గారి పూనిక .నేను వెంపటి శర్మ గారు చెరో రెండొందలు శాస్త్రి గారి చేతులో పెట్టాం ‘’ఇక నిర్భయం గా ఉండండి పని పూర్తీ చేసే బాధ్యత నాది ‘’అన్నారు ప్రాపర్టీ శాస్త్రి గారు.నాకు మా తమ్ముడు జిల్లా పరిషత్ కు రాసిన డిఫెన్సు కాగితం బ్రహ్మాస్త్రం గా ఉపయోగ పడుతుందని శాస్త్రి గారు చెప్పారు .శాస్త్రి గారికి కొంత నత్తి ఉంది .జిల్లా పరిషత్ హైస్కూల్స్ లో అన్యా క్రాంత మైన భూముల్ని కాపాడి శిస్తులూ వసూలు  చేసే బాధ్యతే ప్రాపర్తి ఆఫీసర్ పని   ఈయనే మా అందరికి తన ఇంట్లో టిఫిన్లు కాఫీలు చేయించి పెట్టించారు .ఇంతకీ ఈ శాస్త్రి గారు మా క్లాస్ మట్ కనకవల్లి వాడు మారేపల్లి చలపతి కి కూడా బంధువు ఈయన కూతుర్నే చలపతికోడుక్కిచ్చారట ఆ చుట్టరికమూ తెలిసింది అందరం ఆయనకు కృతజ్ఞతలు చెప్పి ఇంటికి వచ్చేశాం

                  నాకు తొమ్మిదో బదిలీ జరిగి నాలుగో సారి ఉయ్యూరు కు మళ్ళీ వచ్చాను .శాస్త్రి గారు అనుకొన్న విధం గానే పని పూర్తీ చేశారు .ఉయ్యూరు మండలం లో పని చేయ రాదుకనుక  వల్లూరు మండలం లోని పెనమకూరు హైస్కూల్ కు  నన్ను విస్సన్న పేట నుంచి , వెంపటి శర్మ గారిని కోన కంచి నుండి బదిలీ చేశారు .ఆర్డర్లు వచ్చేదాకా అంతా టాప్ సెక్రెట్ మైంటైన్ చేశాం .విస్సన్న పేట స్కూల్ వాళ్ళూ హెడ్ మాస్ద్తారు దిమ్మెర పోయారు .పెనమ కూరు స్కూల్ వాళ్ళూ అక్కడి కమిటీ ప్రెసిడెంట్ షాక్ తిన్నారు నేను వల్లూరు నేటివ్ అయిన పిచ్చయ్య గారి స్తానం లో వచ్చాను .ఆయన్ను దూరం గా వేశారు .శర్మ గారు రామేశ్వర శర్మ అనే ఆయన్ను బదిలీ చేసి వేసి నట్లు జ్ఞాపకం .మొత్తం మీద ‘’ఆపరేషన్ సక్సెస్’’ -‘’.పేషేంట్ట్ సేవేడ్’’ సుబ్బరామయ్య గారికి కృతజ్ఞతలు చెప్పుకొన్నాం ఆయనా తన వల్ల  పని అయి నందుకు సంతోషించారు .పామర్రు నుండి ఉయ్యూరు వచ్చిన నాలుగు నేలకే విస్సన్న పేట బదిలీ అయితే, విస్సన్న పేట నుండి మళ్ళీ నాలుగు నెలలకే పెనమకూరు రాగలిగాను . 

            8-10-76 సాయంత్రం విస్సన్న పేట నుండి విడుదల అయ్యాను .మంచి పార్టీ ఇచ్చారు స్టాఫ్ అందులో నేను బోధించిన తీరు దవ తరగతి ఇంగ్లీష్ ను మొద్దు పిల్లలున్న సెక్షన్ కు చెప్పిన  విధానాన్ని డిసిప్లిన్ మైంటైన్ చేసిన తీరును హెడ్ మాస్టారు చాలా మెచ్చుకొన్నారు ఇంత త్వరలో ఇక్కడి నుండి వెలి పోతారని అనుకోలేదన్నారు .ఇది చాలు .పని చేసిన చోట శక్తి వంచన లేకుండా శ్రమింటమే మన పని .అదే అన్ని విజయాలకు సోపానం .రెండు రోజులు మాత్రమె ట్రాన్సిట్ వాడుకొని 11-1076  సాయంత్రం పెనమ కూరు హైస్కూల్ లో చేరాను  .హెడ్మాస్టారు వేముల పల్లి కృష్ణ మూర్తి గారు .విస్సన్న పేట లో నా బదులు సాంబశివ రావు అనే అతన్ని అతని భార్యను వేశారు .

                           విందు భోజనం 

                పెనమకూరు లో చేరిన నాలుగు రోజులకే ఒక ఆదివారం ప్రాపర్టీ మేనేజర్ శాస్త్రి గారిని ఉయ్యూరు లో మా ఇంటికి విందుకు ఆహ్వానించాము వెంపటి శర్మ గారు ,ఆంజనేయ శాస్త్రి గారు ,సుబ్బరామయ్య మేష్టారు లను కూడా ఆహ్వానించాను .మా అమ్మ ,మా ఆవిడా మంచి విందు భోజనం ఏర్పాటు చేశారు .శాస్త్రి గారు మంచి భోజన ప్రియుడు. బాగా లాగించారు .కిళ్ళీ లు తెప్పించాను .చాల తృప్తి చెందారు. నేను మూడు వందల రూపాయలు ,వెంపటి శర్మ గారు మూడొందల రూపాయలు తాంబూలాలలో పెట్టి ప్రాపర్టీ శర్మ గారి చేతిలో పెట్టి నమస్కరించాం .ఇక నుండి మనం స్నేహితులం అన్నారు శాస్త్రి గారు .కొంతత కాలం ఆ స్నేహాన్ని కోన సాగించాం . మాకు ఇద్దరికీ ట్రావెలింగ్ అలవెన్సులు కూడా సాంక్షన్ చేయించారు శాస్త్రి గారు. మేము పెట్టిన డబ్బులు మాకు తిరిగి వచ్చాయన్న మాట .ఇంత మాత్రం సహాయం ఎవరు చేస్తారు ?

             సశేషం –మీ –గబ్బిటదుర్గా ప్రసాద్ -25-6-13- ఉయ్యూరు  

Posted in నా దారి తీరు | Tagged | Leave a comment

చైతన్య స్రవంతి ని పోషించిన ఫాక్నర్ -2

             చైతన్య స్రవంతి ని పోషించిన ఫాక్నర్ -2

          విలియం ఫాక్నర్ గొప్ప ఫిలాసఫర్ .ఆయన భావాలు ఉన్నతం గా ఉంటాయి .’’The poet’s voice need not merely be the record of man ,it can be one of the props ,the pillars to  help him endure and prevail ‘’అని అంటాడు .ఆయన భావన లో ‘’man will not merely endure he will prevail ..He is immortal not because he alone among creatures has an in exhaustible voice .but because he has a soul ,a spirit capable of compassion and sacrifice and endurance.’’

            Go down Moses లో సెక్సువల్ ఎక్స్ప్లాయిటేషన్ గురించి రాశాడు .బానిసత్వాన్ని ఆక్షేపించాడు .ఆయన ప్రతీకలు విశ్వ సత్యాలు గా గుర్తింప బడ్డాయి .ఆయన తాను ‘’ I created

Cosmosis of my own .i can move these people around like God not only in space but in time too ‘’అని చెప్పుకొన్నాడు .అతని దృష్టిలో గతం అనేది లేదు .ఉన్నది అంతా వర్తమానమే ..దీని విషయమై ఆయన ‘’if was existed there would be no grief or sorrow .’’అన్నాడు ..ఫాక్నర్ ఇరవై ఏళ్ళలో ముప్ఫై పుస్తకాలు రాశాడు .ఆయన రచనల్లో హాస్యం తో బాటు అతి వాస్తవికత అంచు గా కనీ పిస్తుంది .ఆయన కళ హాస్యమే .అమెరికా రచయితల గురించి ‘’one trouble with us American artists is that we take out art and ourselves too seriously .’’ .

          ఆయన రాసిన ఏ రోజ్ ఫర్ ఎమిలి లో హాస్యం అది వాస్తవికత ఉంది క్లాసిక్ అని పించింది .సార్తారిస్ పెద్దకద .హాస్యం ,ప్రాంతీయ  మాండలికాలు అసందర్భాలు నీచ హాస్యం అన్నీ నింపాడు నీగ్రో హాస్యం అన్నారు దీన్ని విమర్శకులు .అందుకే అయన హ్యూమర్ క్క్రూరం గా విషాదాత్మకం గా ఉంటుంది అన్నారు అవి కధలో అంతర్భాగం గా చొప్పించటం ఆయన నేర్పు .ఫాక్నర్ రచనలలో నాలుగు టెక్నిక్స్ ఉన్నాయి .వయోలెన్స్ ,టైం మేనేజ్ మెంట్ ,కౌంటర్ పాయింట్ ,ఇమేజేరి .

          రచయిత ఉద్దేశ్యాన్ని గురించి చెబుతూ ‘’the aim of every artist is to arrest motion which is life ,by artificial means and hold it fixed so that 100 years later ,when a stranger looks at it ,it moves again since it is life ‘’అని చెప్పాడు .moral out come is despair అనేది అతని అభిప్రాయం .మనిషి ఓర్పు పట్టటమే కాదు బతకాలి ,నిలబడాలి అని చెప్పాడు .అయన రచనల్లో జీవితం లోని విస్తృతి ,దాని ప్రభావం కని పిస్తాయి ..ఆయన ‘’he has added life to life and a world of richly imagined motion to the moving world in which we live ‘’ఉంది. ఒక పాత్ర భూతకాలం లో ఉంటె రెండోది వర్తమానం లో ప్రవర్తిస్తుంది

           మాన వత్వం కల మనిషిగా జీవితాన్ని గడుపుతూ ధనాన్ని సద్విని యోగం చేసుకొంటూ ఆదర్శాన్ని ఆచరణ లో పెట్టి ,అన్ని గౌరవాలూ పొంది అందరి చేతా మంచి అని పించుకొన్న రచయిత ఫాక్నర్ .మంచి చెడు ఉన్న ప్రపంచం లో బతుకును సార్ధకం చేసుకోవాలన్న సిద్ధాంతాన్ని చెప్పాడు .నిరాశ పడితే దేన్నీ సాధించలేము .మన ప్రయత్నం మనం చేస్తూనే ఉండాలి ఒరిజి నాలిటి ఉన్న రచయిత ,వ్యక్తిత్వం ఉన్న మనిషి  stream of conscious  అంటే చైతన్య తిని జ్జేమ్స్ జాయిస్ నుండి అంది పుచ్చుకొని పుష్కలం గా పోషించన అమెరికన్ రచయిత ఫాక్నర్ ..

         2-9-2002 సోమవారం అమెరికా డైరీ నుండి

              మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -25-6-13- ఉయ్యూరు 

 

Posted in అమెరికా లో | Tagged | Leave a comment

నా దారి తీరు -33 ఉయ్యూరు వచ్చిన నాలుగు నెలలకే బదిలీ –సంతానం గారి ట్రాన్స్ఫర్లు

 నా దారి తీరు -33

                        ఉయ్యూరు వచ్చిన నాలుగు నెలలకే బదిలీ  –సంతానం గారి ట్రాన్స్ఫర్లు

            ఏడవ సారి బదిలీ అయి ఉయ్యూరు వచ్చిన సంతోషం నాలుగు నెలలకే ఆవిరయింది . అప్పుడే జిల్లా పరిషత్తుల చైర్మన్ అధికారాలు పోయి స్పెషల్ ఆఫీసర్ అధికారి అయ్యాడు అప్పుడు కలెక్టర్ అరవాయన .సంతానం గారు .చాల ముక్కు సూటి మనిషిగా పేరు పరిషద్ ఆఫీసర్ గా ఒక పశువుల డాక్టర్ గారొచ్చారు వీరిద్దరూ జిల్లా పరిషద్ స్కూల్స్ పోస్టింగులు ట్రాన్స్ఫర్లు చేయాలి .అప్పుడు ఏ జిల్లాలోను లేని విధం గా కృష్ణా జిల్లాలో ‘’నేటివిటి ‘’జీ.వో .ను ముందే అమలు చేశారు అంటే స్వగ్రామం లో ఎవరూ పని చేయరాదు దూరం గా పని చేయాలి స్వంత మండలం లో కూడా ఉండరాదు అనే నియమం అమలు చేశారు .దీనితో బదిలీలు స్కూళ్ళు తెరిచిన నాలుగైదు రోజుల్లోనే అత్యంత రహస్యం గా వచ్చాయి వీటినే మేము ‘’సంతానం  గారి ట్రాన్స్ ఫర్లు’’ అన్నాం .ఈ బదిలీల సమయం లో హెడ్ మాస్టర్ గా రేగుల పాటి  సీతా పతి  రావు గారున్నారు .ఆయన బ్రాహ్మణులు వారబ్బాయి ఉపనయనం ఉయ్యూరు లోనే చేశారు .మమ్మల్ని ముఖ్యం గా బ్రాహ్మణులనే పిలిచినజ్ఞాపకం .ఆయన కు కావలసిన సహాయం అంతా అందించాను .సరదా మనిషి .చేతిలో చిన్న బాగ్ తో వచ్చే వారు .కుది మట్టం గా పొట్టిగా ఉండేవారు ..పెద్ద స్కూళ్ళలో చేసిన అనుభవం ఉంది .ఆయన స్కూల్ తెరవగానే రోజూ మమ్మల్ని ఉడికిన్చేవారు. రెండు మూడు రోజుల్లో మీరంతా ట్రాన్స్ ఫర్ అయి పోవటం ఖాయం .కలెక్టర్ గారు చాలా స్ట్రిక్ట్ .బి .యి.డి.మేస్టార్లు ముందు వెళ్లి పోతారు ..తర్వాత తెలుగు మేస్టార్లు ఆ తర్వాతా సేకడరీలు చివరికి క్రాఫ్ట్ ,డ్రిల్ మేస్టార్లు. చివరికి హెడ్ మాస్టర్లు బదిలీ అవుతారు ‘’అనే వారు మేమూ దీన్ని ఎప్పటి నుంచో ఊహిస్తున్నాం .మనసులో సిద్ధపడే ఉన్నాం .

                       ట్రాన్స్ఫర్ ఆర్డర్లు వచ్చిన రోజున ప్రహసనం

           స్కూల్ కు స్పెషల్ మేసేన్జేర్ తో కలెక్టర్ ట్రాన్స్ఫర్ ఆర్డర్లు సీల్డ్ కవర్ లో పంపారు .ఎక్కడా లీక్ కాలేదు .అందరూ దూర తీరాలకే వెళ్లి పోతాం అనుకొన్నాం .అప్పటికి ఇంకా పాఠాల హడా విడి లేదు కనుక అందరిని తన రూమ్ కు రమ్మని పిలిపించారు ..వెళ్లాం ఒక్కొక్కరి ట్రాన్స్ఫర్ ను చదువుతున్నప్పుడు అయన ముఖం ‘’వెయ్యి కాండిల్ బల్బ్’’ లా గా వెలిగి పోతోంది .నన్ను విస్సన్న పేట కు ట్రాన్స్ఫర్ చేశారు .బి.యి.డి టీచర్ల పేర్లన్నీ అయిపోయాయి అందరు బదిలీ అయిన వాళ్ళే .ఒక ఏడాది సర్వీస్ ఉన్న వారిని భార్యా భర్తలను మార్చలేదు .తెలుగు పండిట్ల ఆర్డర్లు చదివారు ..అప్పుడూ ఆయన ముఖం వెలిగి పోతూనే ఉంది .చివరికి ‘’seethaa pati rao transferred to bhava devarapalli ‘’అని చదివి కూలి పోయాడు .వెయ్యి ఏనుగులను తిన్న రాబందు ఒక్క గాలి వానకు కూలినట్లు అయింది .ముఖం లో నెత్తురు చుక్క లేదు .తనకు బదిలీ రాదుఅని ధీమాగా  అనుకోన్నాడాయన .కానీ ఆయనకూ తప్పలేదు హెడ్ మాస్టర్ల బదిలీలు కూడా జరిగాయన్న మాట .అందుకే అంతసీక్రెట్ గా జరిగింది అని చెప్పాను ..మనుష్యులు   ప్రవర్తన తీరు ఎలా ఉంటుందో తెలిపేందుకే దీన్ని చెప్పాను .తనదాకా వస్తే కాని ఎవరికి తెలిసి రాదు .

                        ఎనిమిదో బదిలీ –విస్సన్న పేట లో చేరిక

                ఆర్డర్లు అందుకొన్న వెంటనే ఉపాధ్యాయులను బదిలీ చేయాలని ,అలాస్యం  చేయ వద్దని స్ట్రిక్ట్ ఇంస్త్రక్షన్లు .అందుకొనే ఆర్డర్లు వచ్చిన రోజునే అంటే 21-6-1976 సాయంత్రమే మమ్మల్ని ఉయ్యూరు స్కూల్ నుంచి విడుదల చేశారు .జిల్లా పరిషత్తు చేసిన బదిలీలు కనుక ట్రాన్సిట్ వాడుకొనే అవకాశం ఉంది ..ట్రావెలింగ్ అలవెన్స్ వస్తుంది .అందుకని నేను 22-6-76 నుండి 29-6-76 వరకు ట్రాన్సిట్ వాడుకొని 30-6-76 ఉదయం విస్సన్న పేట హైస్కూల్ లో చేరాను .హెడ్ మాస్టారు గాడే పల్లి దక్షిణా మూర్తి శాస్త్రి శర్మ గారు .ఆయన మాకు దూరపు బంధువే .మా రెండో బావ వివేకానందం గారి పెద్ద బావ గారు కృష్ణ శాస్త్రి గారికి తమ్ముడు .ఈయన పెంపకానికి వెళ్ళాడు .ఇదివరకు ఉయ్యూరు లో పని చేసి ఇక్కడికి వచ్చారు నూజి వీడు నివాసి మాంచి స్తితి పరులు పొలం ,మామిడి తోటలు స్వంత ఇల్లు ఉన్నాయి .అక్కడ .ఆయన భార్య వెంకమాంబ హిందీ పండిట్ .మా కోలచల చలపతికి స్వయానా అక్క .ఆవిడ అక్క కూడా సూరి శ్రీ రామ మూర్తి అనే మా దూరపు బంధువు కు భార్య .ఇంకో అక్క విధవరాలు రాయప్రోలు వెంకాయమ్మ.సూరి వారి బజార్లో వారికి స్వంత ఇల్లు కూడా ఉంది ..ఆకుటుంబం మా ఇంట్లో జరిగిన అన్ని శుభకార్యాలకు వచ్చే వారు ..అనుకోకుండా ఇలా బంధువు దగ్గర పని చెసె అవకాశమ్ వచ్చింది .శాస్త్రి గారు  ఉత్తర ప్రత్యుత్తరాలు ,అటెండేన్సు రిజిస్టర్ తో సహా అన్నీ తెలుగు లోనే నిర్వహించేవారు .విస్సన్న పేట ఎక్కడో అప్పటి దాకా నాకు తెలీదు నెమ్మది గా తెలుసుకొన్నాను నూజి వీడు స్టేట్ బాంక్ లో మా రెండవ తోడల్లుడు చతుర్వేదుల సదా శివ మూర్తి గారు అనే ఫేమస్ హెడ్ మాస్టర్ గారి అబ్బాయి శ్రీరామ మూర్తి పని చేస్తున్నారు ఇది వరకు ఒకటి రెండు సార్లు నూజి వీడు లో వాళ్ళ ఇంటికి వెళ్లాం .వాళ్ళ అమ్మగారు అక్కడే లక్ష వత్తుల నోము  సూరి వారి రామ మందిరం లో నోచుకొంటే వెళ్లాం .కనుక ఇబ్బంది లేదని పించింది .

                       విస్సన్న పేట లో కాపురం

          కొన్ని రోజులు నూజివీడు లో మా వాళ్ళ ఇంట్లో ఉండి అక్కడి నుండి విస్సన్న పేట కు రోజూ వెళ్లి వచ్చేవాడిని శనివారం సాయంత్రం ఉయ్యూరు కు వెళ్ళే వాడిని ..ఆ తర్వాత విస్సన్న పేట ఊరిలో ఆయుర్వేద డాక్టర్, బ్రాహ్మణులూ అయిన మల్లయ్య గారింట్లో ఒక గది అద్దెకు తీసుకొని ఉన్నాను .యాభై రూపాయలు అద్దె ..స్వంతం గా వంట చేసుకొనే వాడిని మల్లయ్య గారికి పాడి ఉండేది పొద్దున్నే పాలు పోసే వారు అప్పటికే ఆయన ముసలి వారు చాల మంచి కుటుంబం నన్ను ఎంతో ఆదరించారు భార్యా భర్త లిద్దరూ స్కూల్ కు దూరమే వీరిల్లు నాకు మంచం కుర్చీ వారే ఏర్పాటు చేశారు .ఆందుకు తింటూ కాల క్షేపం చేశా .కాని ధ్యాస అంతా మళ్ళీ ఉయ్యూరు మీదకు మళ్ళింది .అప్పటికే కొందరు ట్రాన్స్ ఫర్లను మార్చుకొని దగ్గర గ్రామాలకు చేరుతున్నట్లు సమాచారం రాజకీయ ప్రభావం డబ్బుల ప్రభావం బాగానే నే పని చేస్తున్నాయని క్రమం గా తెలిసింది చీమ బొక్క దొరికితే పాము అందులో చేరి నట్లు క్లూ దొరుకుతుందేమో నని నా చిన్ని చిన్ని ఆశ .మల్లయ్య గారింటి పక్కనే తూటుపల్లి వారి కుటుంబం ఒకటి ఉండేది .ముసలి ద్సస్మ్పతులు ,పెళ్లి కాని ఆడపిల్లలు ముసలావిడ మా ఉయ్యూరు లో సూరి కృష్ణ మూర్తి అనే సెకండరి మేస్టారి భార్యకు సోదరి అని విన్నాను .వాళ్ళో పలకరించలేదు నేనూ మాట్లాడలేదు .

                       స్కూల్ జీవితం

        పెద్ద స్కూలు .హెడ్ గారు చాలా నిక్కచ్చి మనిషి .ఈ చుటట్టు పక్కల ప్రాంతాలలో ఆయన కు మంచి పేరుంది మంచి లెక్కల మేసస్టరిగా ప్రాచుర్యం పొందారు ఇంగ్లీష్ లోను డ్రాఫ్ట్ రాయటం లోను దిట్ట .అప్పుడు స్కూల్ లో పత్రీ రామ మోహన రావు అనే తెలుగు పండిట్ ఉండేవాడు .నాకు క్రమంగా మిత్రుడయ్యాడు ఇంకొక ఆచార్యుల వారు కూడా తెలుగు చెప్పేవారు ఈయన పంచాలాల్చీ ధరిస్తే రావు ప్యాంటు వేసే వాడు కుర్రాడే .మంచి కవిత్వం రాసే వాడు ఇంఫ్లుఎంస్ బానే ఉంది .అక్కడే సెకండరీ టీచర్ గా కోట సోమయాజులు గారు చాలా కాలం నుండి పని చేస్తున్నారు ఆయనా మంచి స్నేహశీలి .వారింటికి వెళ్ళే వాడిని .ఈయనది శాయపురం ఆ ప్రాంతం లో పని చేస్తుండగా చూశాను ఇంకో సెకండరి టీచర్ ఆ స్కూల్ లోనే చేరి అక్కడే రిటైర్ ఆయినా అయన మాతో పని చేశాడు పేరు గుర్తు లేదు .కోటి మేస్తారో ఏదో .ఆయన అంటే అందరికి గౌరవం .సుదర్శన రావు అనే సోషల్ మేష్టారు ఉండేవాడు క్లాస్ కు వెళ్ళాలంటే భయం .అందులో పదో క్లాస్ కు మరీను ..డ్రిల్ మేస్టార్లు కుర్రాళ్ళే .సత్యనారాయణ అని ఉయ్యూరు లో లైబ్రరీ ప్రారంభామైనప్పుడున్న లైబ్రేరియన్ ఇక్కడే ఇప్పుడు పని చేస్తున్నాడు .ఒక డ్రాయింగ్ మాస్టారు బారుగా తమాషా గా ఉండేవాడు మంచి ఆర్తిస్త్న్ అని పేరు .పుల్లయ్య అనే కోమటి ఆయన నా ముందు సైన్సు మేష్టారు గా పని చేసి ఇప్పుడు ఉయ్యూరు బదిలీ అయ్యాడు .లాబ్ ఆయనే నాకు అప్పగించాడు ఆయన మా ఉయ్యూరులో వెటప్రగడ సాంబయ్య గారి చెల్లెలు కు అల్లుడు ..ఆ చెల్లెలు వాళ్ళది ఆకిరి పల్లి ఆమె భర్త కూడా మాకు బాగా పరిచయం .సంకా .పుల్లయ్య గారు టీచర్స్ కోఆపరేటివ్ బాంక్ ప్రెసిడెంట్ .  .నిర్దుష్టం గా నిర్వహించేవాడని చెప్పే వారు అక్కడి వాడే .కనుక ప్రాబల్యం ఎక్కువ .

               అటెండేన్సు లో పేర్లు తెలుగు లో రాసి వారు బోధించే సబ్జక్ట్ కింద రాసేవారు .అక్కడ అవ్వారు శ్రీనివాస రావు అనే క్రాఫ్ట్ మేస్తారుండే వాడు ఉయ్యూరు లో కొడాలి రామా రావు గారనే హిందీ మేస్తారికి దగ్గరి బంధువు .. ఆయన పేరు కింద ఆవ్వారు  శ్రీనివాస రావు –‘’నవ్వారు నేత ‘’అని రాసేవారు దీన్ని ఎవరూ గమనించలేదు .ఒక సారి నేనే చూసి అతనితో చెబితే భలేగా నవ్వు కొన్నాడు .‘’రైం’’బాగా కుదిరింది అతనిపేరుకు ..

            సుదర్శన రావు గారికి టెన్త్ ఇంగ్లీష్ అదీ చివరి సెక్షన్ ఇచ్చి నాకు తొమ్మిది ఇంగ్లీష్ ఇచ్చారు .ఆయన క్లాస్ కు వెడితే ఒకటే గోల .హెడ్ గారోస్తే కాసేపు ఊరుకొనే వారు .ఆ తర్వాతా మామూలే .ఆయనే ఒక సారి నా దగ్గర కొచ్చి’’ నేను ఆక్లాస్ కు వెల్ల లేనండీ .మీరే చెప్పండి .మీ క్లాసుల్లో ఎవరూ అల్లరి చేయరు నేను వెళ్తే చేపల బజారు ‘’అని వాపోయాడు .క్రమం గా హెడ్ గారికి పరిస్తితి అర్ధమయ్యింది నన్ను పిలిచి‘’మీరు ఆక్లాస్ తీసుకొంటారా ?’’అని అడిగారు .’’మీరిస్తే తీసుకొంటాను ‘’అన్నాను’’ మీకూ కష్టమేనేమో ?’’అన్నారు .ప్రయత్నిస్తాను అన్నాను .అప్పుడు విద్యార్ధులలో ఆక్లాస్  లో తెలివి గల పిల్లలు లేరు అంతా’’బిలో ఆవేరేజ్ ‘’వాళ్ళే .నేనే ఆ క్లాస్ కు ఫిజికల్ సైన్సు చెప్పే వాడిని .అన్ని సేక్షన్లకు భిన్నం గా వీరికి అతి తక్కువ కాలం బోధించి నోట్సు ను సంక్షిప్తం గా చెప్పి మర్నాడు క్లాస్ లో వాటిని నోటికి వచ్చేట్లు చేసి వారందరి మన్ననలు పొందాను హెడ్ గారికీ నా బోధనా  విధానం అర్ధమయింది మిగిలిన క్లాసుల్లో పకడ్బందీ గా బోధించే వాడిని అన్ని క్లాసుల్లోనూ సబ్జెక్ట్ నోటికి రావలసిందే .ఇంటి దగ్గర చదువుకొని రావాల్సిందే ..రోజూ రెండు మూడు ప్రశ్నలకు జవాబులు  చూచి రాత గా రాసి చూపించాల్సిందే .అన్నీ నేను చూడాల్సిందే సంతకం పెట్టాల్సిందే .అదీ పధ్ధతి బాగా క్లిక్ అయింది నాకిచ్చిన ఇంగ్లీష్ క్లాసులను ఇదే పద్ధతిలో చేశా .మంచి ఉత్సాహం వచ్చింది రెండు నెలల్లో గొప్ప మార్పు .ఏ మాత్రం క్రమ శిక్షణా రాహిత్య మైనా సహించే వాడిని కాను ..ఇలా జరిగి పోయింది కొద్దికాలం

               సశేషం –మీ –గబ్బిట.దుర్గా ప్రసాద్ -24-6-13- ఉయ్యూరు 

Posted in నా దారి తీరు | Tagged | 1 Comment

చైతన్య స్రవంతిని పోషించిన ఫాక్నర్ –1

               చైతన్య స్రవంతిని పోషించిన ఫాక్నర్ –1

               అమెరికా దేశానికి చెందిన విలియం ఫాక్నర్ మిసిసిపీ లో 25-9-1897 లో పుట్టాడుrపేరురు గల వంశమే ఆయనది .బాల్యం అంతా  మిసిసిపి  లోనే గడిచింది .తల్లితోను మిగిలిన కుటుంబ సభ్యులతోను జీవితాంతం బాంధవ్యాన్ని కోన సాగించాడు .తల్లి చనిపోతే  తండ్రి ఒక నీగ్రో స్త్రీని వివాహం చేసుకొంటే ,మారుటి తల్లి నీ తల్లిలాగా గౌరవించిన సంస్కారి .చిన్నప్పటి నుంచే కధలు చెప్పటం అలవాటయింది తల్లికి అతనితో క్లాసిక్ లిటరేచర్ ను చదివించాలని ఆరాటం ఉండేది .ఆమె చాలా మొండిది .వంటింట్లో ‘’do not complain ,’’do not explain’’ అని రాసి పెట్టుకోంది తండ్రి తాగుబోతు .

 

 

 

          ఫాక్నర్ చిన్నప్పటి నుంచే బొమ్మలు వేసే వాడు .అప్పటికే లా ,మెడికల్ పుస్తకాలు చదివేశాడు .కాని గ్రాడ్యుయేట్ కాలేక పోయాడు .అందరికంటే తెలివి తేటలలో ఆధిక్యం గా ఉండేవాడు .ఎస్తేల్లా అనే అమ్మాయితో ప్రేమలో పడ్డాడు .ఆ ప్రేమ విఫలమైంది .ఫైల్ స్టన్ అనే అతను ఫాక్నర్ కు మంచి పుస్తకాలు ఇచ్చి చదమని ప్రేరేపించాడు .అప్పుడే మొదటి ప్రపంచ యుద్ధం ప్రారంభమైంది ..కెనడా వెళ్లి ఎయిర్ ఫోర్స్ లో చేరాడు . ఆం హీర్స్ట్లోని యాంగ్ అనే అమ్మాయిని పెళ్లి చేసుకొని యూరప్ వెళ్లి అక్కడి మేధావులతో కాలక్షేపం చేశాడు .బాల భట సంఘానికి నాయకుడు గా పని చేశాడు .తాగుడు విపరీతం అయి నందు వల్ల  పీకేశారు

         నెమ్మదిగా ఫ్రెంచ్ భాష నేర్వటం మొదలు పెట్టాడు .కార్టూన్లు గీసే వాడు ఇన్ని తెలివి తేటలున్నా అందరు అతన్ని ‘’ఫూల్ ‘’అనే వారు ..1919 లో కవిత్వం రాయటం మొదలు పెట్టాడు .1920 లో Falkner గా ఉన్న తన పేరును తానే Faulkner గా మార్చుకొన్నాడు ‘’The lilacs ‘’ .అనే కవితా సంపుటిని రాసి విడుదల చేశాడు .తరువాత ‘’విజన్స్ ఇన్ స్ప్రింగ్ ‘’రాశాడు .అతని కవిత్వం లోని సింబాలిక్ ఇమేజేరి అందరికి నచ్చింది .దీని తర్వాతా‘’మార్బుల్ పాం ‘’అనేది కవితా సంపుటి రచించాడు .తర్వాత ఫాక్నర్ ధ్యాస అంతా నవలల మీదే పడింది.mosquitoes ,soldier’s pay నవలలు రాశాడు .1927 లో ‘’ఫ్లాగ్స్ ఇన్ ది డస్ట్ ‘’ రాశాడు .ఫాల్క్నర్ రచనలను విశ్లేషకులు జేమ్స్ జాయిస్ ,డాస్తో విస్కీ రచనల తో పోల్చారు .మంచి ప్రోత్సాహం లభించింది .అతను రాసిన సౌండ్ అండ్ ఫ్యూరీ నవలను”’Greek tragedy in North Msisipi ‘’ అన్నారు

              ఫాక్నర్ చిన్న కధలు కూడా రాశాడు .పవర్ ప్లాంట్ లో రాత్రి డ్యూటీలు చేశాడు ఆ సమయం లో ఎన్నో చదివాడు ఎంతో రాశాడు .1929-32 మధ్య ‘’As I lay dying ‘’నవల రాశాడు .దీనికేమీ విశేష ప్రాచుర్యం రాలేదు పెద్దగా అమ్ముడు కూడా పోలేదు .దీని తర్వాత ‘’sanctuary ‘’రచించాడు .దాన్ని ‘’one of the terrifying books ‘’అని జనం మెచ్చారు .ఎంతో అరుదైన గొప్ప పుస్తకం గా దానికి పేరొచ్చింది .ఫాక్నర్ మేధో విలసితం అని కీర్తించారు .ఆ పుస్తకాన్ని మన’’ గుడి పాటి వెంకట చలం ‘’పుస్తకాలను ఆకాలం లో ఎలా రహస్యం గా కొని ఎవరికీ కనపడ కుండా దాచుకొని రహస్యం గా చదివే వారో అలా చదివారు ‘’these 13 ‘’అనే కధలు.’’డార్క్ హౌస్ ‘’అనే నవలా రాశాడు .భార్య కోరిక పై దాని పేరు ను ‘’light in August ‘’గా మార్చాడు .ప్రాచుర్యం పెరిగి పోయింది ఫాక్నర్ ఏది రాసినా ప్రచురించే స్తితి లోకి పబ్లిషర్లు తయారయ్యారు .అంతకు ముందు తన పుస్తకాలను ప్రచురించమంటే తిరస్కరించిన పబ్లిషర్లు ఇప్పుడు ఫాక్నర్ ఇంటి మూడు ‘’క్యూ కట్టారు ‘’ఆయన దయా దాక్షిన్యాలకోసం ఎదురు చూశారు .పిచ్చ డబ్బు రావటం ప్రారంభమైంది దీని తో తాగుడూ పెంచేశాడు అతనికి ప్రైవేట్ జీవితమే ఎక్కువ .ఇంకేముంది సినిమా వాళ్ళు వెంట బడ్డారు .సినిమాలకూ పని చేశాడు

            Sanctuary నవలను పారామౌంట్ దియేటర్ వాళ్ళు’’ క్లార్క్ గేబుల్ ‘’ను హీరో గా పెట్టి సినిమా తీశారు .తరచూ యూరప్ పర్యటన చేసే వాడు ‘’ In Europe people asked what he thought ,but in California people asked where he had bought his hat ‘’అని తానే చెప్పుకొన్నాడు ఆ దేశాలకు ,అమెరికా కు ఉన్న తేడాను దీనితో ఆవిష్కరించాడు .1932 లో తండ్రి చనిపోయాడు ఫాక్నర్ కుటుంబ బాధ్యతలను మీద వేసుకొన్నాడు మారుటి తల్లి చనిపోతే దగ్గరుండి అంత్య క్రియలు చేశాడు .’’mammy  her white children bless her ‘’అని సమాధి మీద కృతజ్ఞతా పూర్వకం గా రాయించాడు .1933 లో ‘’Absalom ,Absalom ‘’నవల రాశాడు .తాను రాసిన‘’the un vanquished ‘’నవలను m.g.m.స్టూడియో వారికి అమ్మేశాడు .1935 ఫాక్నర్ కు జాతీయ గౌరవం లభించింది .ఆయన్ను ‘’లిరిక్ పోయేట్ ‘’అని కొని యాడారు .అంతే కాక most impressive novelist ‘’అని ప్రశంసించారు ‘

        భార్య ఎస్తేల్లా తాగుడుకు బానిస అయింది .చికిత్స చేయించాడు .విడాకులు మాత్రం ఇవ్వలేదు .నౌకాయానం వేట గుర్రపు స్వారీ అన్నీ నేర్చాడు 1940 లో మూడు నవలలు ‘’the wild palms ,the hamlet godown moses ‘’నవలలు రాసి ప్రచురించాడు .అతని సాహితీ వ్యాసంగానికి అబ్బుర పడి న్యూ యార్క్ టైమ్స్ బుక్ రివ్యు లో‘’declared that no living American author could match Faulkner ‘’అని మహోన్నతం గా కీర్తించింది .ఆయన తో జరిపిన ఇంటర్వ్యు ను m.g.m. సంస్థ సినిమా తీసిందంటే ఫాక్నర్ ప్రాభవం ఎంత ఉత్కృష్ట స్తాయి లో ఉందొ తెలుస్తోంది .

     1949 సంవత్సరానికి విలియం ఫాక్నర్ కు సాహిత్యం లో నోబుల్ బహుమతిని 1950 నవంబర్ పది న ప్రకటించి గౌరవించారు .తత్వ వేత్త బెర్ట్రాండ్ రసెల్ తో పక్కన కూర్చుని ఈ నోబెల్ ను గ్రహించాడు ఫాక్నర్ మరుసటి ఏడాది  రసెల్ కు ఆ బహుమతి దక్కింది .బహుమతి ప్రదానోత్సవం లో మాట్లాడమంటే ఫాక్నర్ అతని అమెరికా దక్షిణ ప్రాంత భాషలో చాల ఉద్వేగ భరితం గా మిసిసిపి నదీ వేగం గా మాట్లాడాడు .అక్కడున్న వారు అర్ధం చేసుకోలేక పోయారట మర్నాడు అదే పేపర్లలో వస్తే ‘’బాగు బాగు సేభాష్ ‘’ అని మెచ్చుకోన్నారట .దానిని ‘’best speech given at a Nobel dinner అని ఆశ్చర్యం తో ఆనందం ప్రకటించారు .తనకు వచ్చిన ముప్ఫై వేల డాలర్ల నగదు బహుమానాన్నిLafayetteకౌంటీ  లో ఉన్న ox fold నల్ల జాతీయుల జీవితాలు బాగు చేసే సేవాకార్య క్రమాలకు అందజేశాడు .చివరగా రాసిన పుస్తకం the river ‘’దీనిని ప్రఖ్యాత రచయిత మార్క్ ట్వేన్ రచన తో విశ్లేషకులు పోల్చారు .చాలా సంస్థలు ఫాక్నర్ ను గౌరవించి సత్కరించాయి అతని కూతురు జిల్ అనే అమ్మాయి పాల్ అనే అతడిని పెళ్లి చేసుకొంటున్నాను వచ్చి చూడమని కోరింది సరేనన్నాడు వెళ్ళాడు తండ్రిని పరిచయం చేస్తే ‘’who is faulkner ?అన్నాడట ఆ మొగుదు .అప్పుడు తండ్రి గొప్పతనాన్ని స్వయం గా తెలియ జెప్పింది .

            ఫాక్నర్ కున్న భావాల వల్ల ఆయన్ను కమ్యూనిస్ట్ అనుకొన్నారు సాంస్కృతిక రాయబారిగా గ్రీస్ ,జపాన్ దేశాలు పర్య టించి అమెరికా పై గౌరవం కల్గించాడు ఫాక్నర్ .తన ఫారం హౌస్ లో గుర్రాలను పెంచాడు 1962 జూన్17న ఒక అడవి గుర్రం పై స్వారి చేస్తుంటే అది కింద పడేస్తే వెన్నెముక దెబ్బ తిండి రక్తం గడ్డకట్టి ‘’Rowan oak ‘’అనే స్వంత వ్యవసాయ క్షేత్రం లో జూలీ ఏడున మరణించాడు తన చావు సంగతి అతనికి ముందే తెలుసు .ఇలా రాసుకొన్నాడు ‘’the moment ,instant ,night ,dark ,sleep ,when I would put it all away forever that I anguished and sweated over and it would never trouble me any more ‘’

           మరిన్ని విశేషాలు ఇంకో సారి

2-9-2002 సోమ వారం నాటి నా అమెరికా డైరీ నుండి

           సశేషం –మీ –గబ్బిటదుర్గా ప్రసాద్ –24-6-13- ఉయ్యూ


గబ్బిట దుర్గా ప్రసాద్
https://sarasabharati.wordpress.com
http://suvarchalaanjaneyaswami.wordpress.com

Posted in అమెరికా లో | Tagged | Leave a comment

కన్యాశుల్కం’ నాటకానికి కొత్త వెలుగులు

కన్యాశుల్కం’ నాటకానికి కొత్త వెలుగులు

June 24, 2013


ఇటీవల హైదరాబాద్‌లోని రవీంద్ర భారతిలో కొత్త నటీనటులతో ‘కన్యాశుల్కం’ నాటకాన్ని ప్రదర్శించినప్పుడు హాలు కిటకిటలాడిపోవడం నిజంగా నిర్ఘాంతపరచింది. సంజయ్ కిశోర్‌కు చెందిన ‘సంగమం’ అనే సాంస్కృతిక సంస్థ నిర్వహణలో డి.ఎస్. దీక్షిత్ దర్శకత్వంలో ప్రదర్శించిన ఈ నాటకాన్ని చూడడానికి వేలాది మంది రవీంద్ర భారతికి చేరుకున్నారు. వీరంతా తమకు హాలులో చోటు దొరికినా దొరకకపోయినా ఎంతసేపైనా నిలబడి నాటకాన్ని చూడడానికి సిద్ధమై వచ్చినట్టు కనిపించింది. వాస్తవానికి చోటు దొరకక నిరాశతో వెనుతిరిగిన వారి సంఖ్య కూడా వందల్లో ఉంటుంది. ఈసారి ప్రదర్శనలో ఉత్తేజ్, ఝాన్సీ వంటి సినీ నటులు కూడా పాల్గొనడం విశేషం. ఇంతవరకూ వయసు మీరినవారే ఇందులోని గిరీశం పాత్రను పోషించడం చూసిన ప్రేక్షకులకు ఉత్తేజ్ వంటి యువ నటుడు ఈ పాత్రలో ఒదిగిపోవడం, మధురవాణి పాత్రను ఝాన్సీ అద్భుతంగా పోషించడం ఆశ్చర్యం, ఆనందం కలిగించాయి.

మొత్తం మీద వెండితెర వెలుగులతో ఈ 120 ఏళ్ల ‘కన్యాశుల్కం’ ఇప్పుడు తెలుగునాట సరికొత్త జిలుగులు కుమ్మరిస్తోంది, 1892 ఆగస్టు13 న విజయనగరం కోటలో రాచ కుటుంబీకులు, బ్రిటిష్ అధికారులు కలిసి చూసిన ఆ నాటకం ఇప్పుడు కూడా దాదాపు అదే స్థాయిలో ఆదరణ పొందుతోంది. నాటకాలు చూసేవారు తగ్గిపోయారని, అందులోనూ గురజాడ అప్పారావు రాసిన చరిత్రాత్మక ‘కన్యాశుల్కం’ నాటకానికి కూడా ఆదరణ తగ్గిపోయిందని పొడిపొడి కన్నీళ్ల ఉపన్యాసాలు చెప్పేవారికి ఈ నాటక ప్రదర్శన, దానికి లభించిన జనాదరణ ఓ సమాధానంగా కనిపించింది. ఏడు తరాలుగా ఈ నాటకానికి లభిస్తున్న ఆదరణ మరో ఏడు తరాలైనా కొనసాగుతుందనే భావన అది చూసిన వారికి ఎవరికైనా కలుగుతుంది.

రవీంద్ర భారతిలో జరిగిన తాజా ప్రదర్శన తీరును స్వయంగా చూసిన సాంస్కృతిక శాఖ సంచాలకుడు రాళ్లబండి కవితా ప్రసాద్ ఈసారి 5500 మంది హాయిగా చూసేలా లలిత కళాతోరణంలో ఈ నాటకాన్ని ప్రదర్శిస్తామని, దీనికయ్యే ఖర్చును పూర్తిగా ప్రభుత్వమే భరిస్తుందని ప్రకటించారు. సినిమాలు, టీవీలలో ఎన్ని పాత్రలు వేసినా కలగని ఆనందం, తృప్తి, ఎదురు చూడని ఆదరణ ఈ ‘కన్యాశుల్కం’ నాటక ప్రదర్శనలో కనిపిస్తోందని కళాకారులు కూడా పరవశించిపోతున్నారు. ఇక మీదట తెలుగువారికి తమ నాటకాన్ని మరింత ఆకర్షణీయంగా అందించాలని వారు భావిస్తున్నారు.

ప్రపంచ నాటక చరిత్రలోనే ప్రత్యేక అ««ధ్యాయం సృష్టించిన ఆ నాటకంపై ఎందరో సాహితీవేత్తలు పరిశోధనలు చేస్తూనే ఉన్నారు. తెలుగు తెలిసినవారంతా చూడటానికి చదవటానికి ఎంతో మక్కువ చూపే ‘కన్యాశుల్కం’ నాటకంలోని పాత్రలను అభినయించటానికి నటులు కూడా ముందుకు వస్తున్నారు. సంగీతభరితమైన రాగాలు, వన్స్‌మోర్‌లు, కానుకల చదివింపులతో ఒకప్పుడు ఈ నాటకం హోరెత్తిపోయింది. పద్య నాటక ప్రదర్శనల కాలంలో, అంటే దాదాపు 1960ల వరకూ ఈ నాటకం కనీ వినీ ఊహించని విధంగా జనాదరణ పొంది రికార్డులు సృష్టించింది. ఈ నాటక నిర్వాహకులు ఇప్పుడు దీని ప్రదర్శనలో ఒక కొత్త ఒరవడిని ప్రవేశపెడుతున్నారు. జనం రాత్రి భోజనాలు ముగించుకుని తెల్లారకట్ల దాకా ఈ నాటకాన్ని చూసేవారు. అయితే, కాలం మారడంతో నిర్వాహకులు 3 గంటల నిడివిలో నాటక ప్రదర్శనను ముగించడానికి కసరత్తులు చేస్తున్నారు. నిజానికి 1892 నుంచి 2013 దాకా ఆ నాటక ప్రదర్శనలో అనేక మార్పులు చేర్పులు చోటు చేసుకోవడం సహజమైన విషయమే.

హైదరాబాద్‌కు చెందిన ‘రసరంజని’ సంస్థ గతంలో 23 సార్లు కన్యాశుల్కం నాటకాన్ని ప్రదర్శించింది. వచ్చే జూలైలో కూడా ఇది ఈ నాటకాన్ని ప్రదర్శించడానికి సన్నాహాలు చేసుకుంటోంది. ఇక హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ, తెలుగు విశ్వవిద్యాలయానికి చెందిన విద్యార్థులు ఈ నాటకం గురించి క్షుణ్ణంగా చదివి, అనేక పర్యాయాలు దీన్ని నాటకంగా ప్రదర్శించడం జరిగింది. ఇంతవరకూ సుమారు 150 నాటకాల్లో నటించిన దీక్షిత్ ఈ నాటకానికి దర్శకత్వం వహించారు. ఆయన దీన్ని హైదరాబాద్‌లోనే ప్రదర్శించారు. రెండవ పర్యాయం ఒంగోలులో ప్రదర్శించారు. ఆయన ఈ నాటకాన్ని ప్రదర్శించడం (రవీంద్ర భారతిలో) ఇది మూడవసారి.

కోటలో మొదటి మెట్టు
చదవటానికి తప్ప వేయటానికి పనికిరాదంటూ అంతా పెదవి విరిచిన ‘కన్యాశుల్కం’ నాటకాన్ని ఆ తరువాత గురజాడ కళ్ల ముందే అద్భుతంగా ప్రదర్శించి ప్రశంసలు పొందారు. నాటి ఆనందగజపతి రాజుకు అంకితమిచ్చిన ఈ నాటకానికి దర్శకుడు ఇంగ్లీషు, సంస్కృత నాటకాల్లో మాదిరిగానే నాందీ ప్రస్తావన చేశారు. జగన్నాధ విలాసిని సభ వారు వాసా జగన్నా«థరావు నిర్వహణలో మొదటిసారిగా ఈ నాటకాన్ని వేదిక పైకి తెచ్చారు. ఆ తరువాత వందలాది మంది నిర్వాహకులు, కళాకారులు దీని ప్రదర్శనకు మరిన్ని వన్నెలు దిద్దారు. ఈ నాటకాన్ని చూసిన ప్రేక్షకులు వన్స్‌మోర్‌లతో ఈ నాటకాన్ని మళ్లీ మళ్లీ వేయించుకుని చూశారు. దక్షిణ భారతదేశంలోనే మొదటిసారిగా ‘నటాలి’ పేరుతో రిపర్టరీని ఏర్పాటు చేసి, మహామహులతో గురజాడ పాత్రలను పోషింపజేసిన అబ్బూరి రామకృష్టా రావు కృషి నిజంగా మరచిపోలేనిది. తెలుగు నాట తొలి విశ్వవిద్యాలయంగా నెలకొన్న ఆం«ధ విశ్వవిద్యాలయంలో కొద్ది రోజులకే యూనివర్సిటీ నాటక సమితిని ఏర్పాటు చేసి మొదటి నాటకంగా కన్యాశుల్కాన్ని ప్రదర్శించారు. విశేషమేమిటంటే అప్పుడే ఈ నాటకాన్ని 3 గంటల నాటకంగా కుదించారు.

సుమారు 12 గంటల నిడివి తప్పని అసలు రచనను ముందుగా 8 గంటలకు, ఆ తరువాత 6 గంటలకు, ఆ తరువాత 3 గంటల నుంచి 2 గంటల ఇరవై నిమిషాల కుదించారు. ఇప్పుడు ప్రదర్శిస్తున్నది ఆ నాటకాన్నే. 1932 లో వాల్తేరులో యూనివర్సిటీ వేదికపై అందరి మెప్పూ పొందిన అగ్రశ్రేణి మేధావులు, విద్యార్థులు ఆయా పాత్రల కోసం రంగు పూసుకున్నారు. అప్పటికే తెనాలిలో అభిమానులు, కళాకారుల్ని కూడగట్టి అబ్బూరివారు 1924లో రామవిలాస సభను ప్రారంభించి, ఆ బృందంతో శతాధిక ప్రదర్శనల రికార్డు సృష్టించార అలా విస్తరించిన ఆ నాటకం వేరు వేరు సమాజాలు ఉద్దండ కళాకారులతో సాటి లేని మేటి నాటకంగా పేరు ప్రతిష్ఠలు పొందింది. దామోదరం సంజీవయ్య ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో ఈ నాటకానికి ప్రభుత్వ ప్రోత్సాహం వరించి వచ్చింది. 1962లో హైదరాబాదులోని పబ్లిక్ గార్డెన్స్‌లో ప్రత్యేకమైన వేదికపై ఆ నాటకాన్ని ప్రదర్శించారు. 3డీలో వేదిక అలంకరణ ప్రారంభమైంది. ప్రస్తుతం అమెరికాలో ఉన్న బక్షి శ్రీరాం ఈ ప్రదర్శనకు ఏర్పాటు చేసిన 300 స్పాట్ లైట్‌లు ప్రేక్షకుల మన్ననలు పొందాయి. అప్పట్లో రామచంద్ర కాశ్యప గిరీశంగా, ఆ రోజుల్లో విశాఖపట్నంలో మంచి పేరు గడించిన సత్తిరాజు మ«ధురవాణిగా అద్భుతంగా నటించి మెప్పించారు.

నటీనటుల్లో ఆసక్తి
ఆ నాటకాన్ని తీర్చిదిద్దిన అబ్బూరి రామకృష్ణారావు ప్రతిభ ఆ తరువాత కూడా వందలాది మంది కళాకారులకు స్ఫూర్తిదాయకమైంది. మద్రాసులో జరిగిన నాటకాన్ని చూసి పరవశించి పోయిన జి.టి.బి. హార్వే లక్ష రూపాయల విరాళం ఇచ్చి నటాలి సంస్థ నాటకాలలో అద్బుతాలు విజయాలు సాధించాలని శుభాకాంక్షలు తెలిపారు. అప్పట్లో స్టేజీ మేనేజర్‌గా వ్యవహరించిన ఆనంద మోహన్ ఇందులోని వెంకటేశం పాత్రను పోషించగా, ఇప్పుడు 75 ఏళ్ల ప్రాయంలో అత్యున్నత నాటక రంగ పురస్కారం అందుకొన్న కె.ఎస్.టి. సాయి కూడా ఉత్సాహంగా పాత్రలు ధరిస్తామంటున్నారు. ఇక గతంలో జె.వి. రమణమూర్తి, ఆయన తమ్ముడు జె.వి. సోమయాజులు తమ బృందంతో ఊరూరా తిరిగి నాటక ప్రదర్శనలిచ్చి జేజేలందుకొన్నారు. గోవిందరాజుల సుబ్బారావు, గొల్లపూడి మారుతీరావు కూడా ఆ తరువాత ఈ నాటకాన్ని అనేక ప్రాంతాల్లో ప్రదర్శించి ప్రశంసలందుకున్నారు. మాటలతో బురిడీలు కొట్టించే గిరీశం పాత్రను వారు తమ అత్యద్భుత నటనతో మరింతగా ప్రాచుర్యంలోకి తెచ్చారు. తెలుగు నాటకాల్లో ఆడవేషాల అందగాడుగా ఆదరణతో పాటు పద్మశ్రీ పురస్కారం కూడా పొందిన స్దానం నరసింహారావు వంటివారు కూడా ఇందులో నటించి నాటకాన్ని రక్తి కట్టించారు.

మరో విశేషమేమిటంటే, నిజ జీవితంలో వేశ్యలుగా ఉన్నవారు కూడా వేదిక పైకి వచ్చి నాటకంలోని వెలయాలు మధురవాణిగా సటించారు. వీరి సంఖ్య 80కి పైగా ఉంటుందని భావిస్తున్నారు. దాడి గోవిందరాజుల నాయుడు, బి.ఎస్. జోస్యుల వంటి విద్యావంతులు ఉన్నతమైన వ్యక్తిత్వం గల వేశ్యగా నటించి అవగాహన పెంచారు. 1991 నాటికి 100 ఏళ్లు పూర్తి చేసుకున్న ఆ నాటకం ప్రత్యేకతలపై కాకతీయ యూనివర్సిటీ ప్రొఫెసర్, పుస్తకంతో పాటు జిజ్ఞాస పేరిట గోష్టి నిర్వహించారు. 1955లో సినిమాగా, 1990లో దూరదర్శన్ వారి సీరియల్‌గా, 2005లో చెన్నైకు చెందిన అభిమాని ద్వారా ‘మా టీవీ’ సీరీయల్‌గా ఈ కన్యాశుల్కం నాటకం లక్షలాది మంది అభిమానుల్ని కూడగట్టుకుంది. తర తరాల తరాల వారసత్వాన్ని మూటగట్టుకొంది.

నాటకానికి కొత్త హంగులు
నాటక రంగంలో విశేషానుభవం ఉండడమే కాకుండా, కన్యాశుల్కం పట్ల ప్రత్యేకాభిమానం ఉన్న డి.ఎస్. దీక్షిత్ మున్ముందు తెలుగునాట దీన్ని మరింత విస్తృతంగా ప్రదర్శించాలనే ఊపులో ఉన్నారు. ఆయన పద్మభూషణ్ ఎ.ఆర్ కృష్ణ స్థాపించిన ‘నాట్య విద్యాలయ’లో నటన నేర్చుకున్నారు. “నాటక ప్రదర్శనలో రిపర్టరీ వల్ల ఒనగూడే మేలు అవగతం అయింది. చాలా కష్టనష్టాలతో అప్పటి రిపర్టరీని కొనసాగిస్తున్నాం. ఆ రోజుల్లో నీరాజనాలు అందుకొన్న కన్యాశుల్కం నాటకాన్ని ఈ తరానికి అందించాలని భావిస్తున్నాం. ఈ దిశగా వీలయినన్ని ప్రయత్నాలు చేస్తే ఇన్నాళ్లకి ఇది వేదిక పైకి వచ్చింది. పాత్రదారుల ఎంపికపై చాలా కసరత్తు చేయాల్సి వచ్చింది. తరాలు మారాయి. అభిరుచులు మారాయి. గతంలో గురజాడ పాత్రల వయసు, మనసులకు సంబంధం లేకుండానే అబినయం ప్రధానంగా నాటకాలు జరిగాయి. గిరీశంగా నటించినవారు పాత రోజుల్లోనే 50 ఏళ్ల పైబడినవారు. పొట్టలు పెరిగి సరిగ్గా నడవలేక పోయినా డైలాగుల వల్ల నాటకం నడిపించి మెప్పించేవారు” అని ఆయన అన్నారు.

అయితే, ఈ తరం వారికి గిరీశం పాత్రను యువ పాత్రగా చూపించాలనే ఉద్దేశంతో ఉత్తేజ్‌ను ఎంపిక చేసినట్టు ఆయన చెప్పారు. ఇందులో నటించడానికి పలువురు సినిమా నటులు ఆసక్తి చూపించినప్పటికీ, చివరికి ఉత్తేజ్, ఝాన్సీలను కీలక పాత్రలకు ఎంపిక చేసినట్టు ఆయన చెప్పారు. “ప్రసిద్ధ నటులు మురళీ మోహన్, రాళ్లపల్లి వంటి వాళ్లు మక్కువతో వచ్చారు. సుబ్బరాయ శర్మ, రాగిణి వంటివారితో పాటు బుల్లితెర కళాకారులు కూడా ముందుకు ఆసక్తిగా వచ్చారు” అని ఆయన చెప్పారు. ఆయన కూడా ఇందులో ఓ పాత్ర పోషించారు. ‘సంగమం’ సంస్థ ఇప్పటికి 3 ప్రదర్శనల్ని విజయవంతంగా పూర్తి చేసింది. అంతేకాక, ఈ నాటక ప్రదర్శనకు గురజాడ 150 ఏళ్ల జయంతి, ఈ నాటకం 120 ఏళ్ల వైభవం కలసి వచ్చాయి.

–  జి.ఎల్.ఎన్. మూర్తి

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

బదరీ కేదారాలు ఉండవా?

బదరీ కేదారాలు ఉండవా?

June 24, 2013

కలియుగాంతంలో బదరీకి దారి మూసుకుపోతుంది
కేదార్‌నాథ్ క్షేత్రం కూడా ఉండదు
జోషీమఠ్‌లో భవిష్యకేదార్ ఆలయం
అక్కడికి సమీపంలోనే భవిష్య బదరి
పురాణ కథనం. స్థానికుల విశ్వాసం

ఏమిటీ ఉత్పాతం ఎందుకీ విలయం ఎందుకిలా జరిగింది భవిష్యత్తులో ఏం జరగబోతోంది కేదార్‌నాథ్, బదరీనాథ్ క్షేత్రాలకు శాశ్వతంగా దారులు మూసుకుపోతాయనే కథనాలు నిజమేనా దానికి బదులుగా భవిష్య బదరి, భవిష్య కేదార్ క్షేత్రాలు ప్రాచుర్యం పొందనున్నాయన్న మాట వాస్తవమేనా?

ఉత్తరాఖండ్‌లో ప్రకృతి బీభత్సాన్ని చూసిన చాలా మంది మదిలో మెదులుతున్న ప్రశ్నలివి! భవిష్య కేదార్‌నాథ్ సంగతేమోగానీ.. మున్ముందు బదరీనాథ్ క్షేత్రానికి వెళ్లే దారిలో ఉండే నర, నారాయణ గిరులు (కొందరు వీటినే జయ, విజయ గిరులుగా కూడా వ్యవహరిస్తారు) కలిసిపోయి, ఆ దారి మూసుకుపోతుందని..అప్పుడు జోషీమఠ్‌కు సమీపంలో ఉన్న భవిష్య బదరి క్షేత్రమే బదరీనాథ్‌గా వెలుగొందుతుందని అష్టాదశ పురాణాల్లో ఒకటైన భవిష్య పురాణం చెబుతోంది. కలి ప్రభావం పెరిగిపోయి లోకంలో అశాంతి చెలరేగినప్పుడు.. కలియుగాంతం లో పాపులకు బదరీ క్షేత్రం కనిపించదని అగస్త్య మహర్షికి ఆ క్షేత్రాన వెలసిన నారాయణుడు తెలిపాడని మరొక కథనం కూడా ఉంది.

ఏదేమైనా..సప్త బదరీ క్షేత్రాల్లో భవిష్య బదరి అత్యంత ప్రాచుర్యం పొందింది. సప్త బదరీ క్షేత్రాలంటే వరుసగా.. విశాల్ బదరీ (ఇది ప్రధాన క్షేత్రం. బదరీనాథుడిగా విష్ణుమూర్తిని భక్తులు కొలిచేది ఇక్కడే), ఆది బదరి, వృద్ధ బదరీ, ధ్యాన్ బదరీ, అర్ధ బదరీ, భవిష్య బదరీ, యోగధ్యాన్ బదరీ. వీటిలోనూ..అర్ధ, ధ్యాన బదరీ క్షేత్రాలు మినహా మిగతావాటిని పంచ బదరీ క్షేత్రాలుగా వ్యవహరిస్తారు. వీటిలో ముఖ్యమైనది భవిష్య బదరి. ఆది బదరి క్షేత్రం కర్ణప్రయాగ నుంచి గంట ప్రయాణం దూరాన ఉంటుంది. ఇక్కడ కూడా బదరీనాథ్‌లాగా నే విష్ణుమూర్తి విగ్రహం సరిగ్గా 3.3 అడుగుల ఎత్తు ఉంటుంది. ఇక.. వృద్ధ బదరీ క్షేత్రం జోషీ మఠ్‌కు 7 కిలోమీటర్ల దూరంలోని అనీమఠ్ గ్రామంలో ఉంటుంది.

తపస్సు చేసుకుంటున్న నారదుడికి విష్ణుమూర్తి ఒక వృద్ధుడి రూపంలో ఇక్కడ ప్రత్యక్షమయ్యాడని పురాణ కథనం. అందుకు తగ్గట్టుగా ఇక్కడి మూలవిరాట్టు కూడా ఒక వృద్ధుడి రూపంలో ఉంటుంది. మూడోది భవిష్య బదరి. ఇక నాలుగోది.. యోగధాన్ బదరి లేదా యోగ బదరి. ఇది పాండుకేశ్వరర్ ప్రాంతంలో సముద్రమట్టానికి ఆరువేల అడుగుల ఎత్తున ఉండే క్షేత్రం. పాండురాజు తన శాపాన్ని పోగొట్టుకోవడానికి ఇక్కడే తపస్సు చేశాడని.. కుంతి, మాద్రిలతో కూడి ఇక్కడే మరణించాడని.. పాండవులు జన్మించింది ఇక్కడేనని చెబుతారు. ఈ క్షేత్రంలో పాండురాజు కంచుతో చేసిన యోగనారాయణుడిని ప్రతిష్ఠించి కొలిచాడని నమ్మిక.

అందుకు నిదర్శనంగా ఈ ఆలయంలో మూలవిరాట్టు యోగముద్రలో కనిపించడం విశేషం. అయితే.. ఈ విగ్రహం పూర్తిగా సాలిగ్రామ శిల. బదరీనాథ్ ఆలయాన్ని మూసేసినప్పుడు అక్కడి ఉత్సవ విగ్రహాలను ఇక్కడికే తరలించి పూజిస్తారు. మిగిలింది.. ధ్యాన బదరి. ఇక్కడ విష్ణుమూర్తి ధ్యానముద్రలో దర్శనమిస్తాడు.

భవిష్య బదరి..
జోషీమఠ్‌కు పదిహేడు కిలోమీటర్ల దూరంలోని శుభైన్ గ్రామంలో.. సముద్ర మట్టానికి 9,000 అడుగుల ఎత్తున భవిష్య బదరి క్షేత్రం నెలకొని ఉంది. జోషీ మఠ్ నుంచి సల్దార్ గుండా వాహనాలు వెళ్లే దారి ఉంది. ఇది 19 కిలోమీటర్ల దాకా ఉంటుంది. ప్రస్తుతం భవిష్య బదరిలో నరసింహ స్వామి విగ్రహం పూజలందుకుంటోంది. భవిష్యత్తులో ఈ నారసింహుడి విగ్రహం చేయి విరుగుతుందని అదే కలియుగాంతానికి గుర్తు అని.. అప్పుడే నరనారాయణ శృంగాలు కలిసిపోయి బదరీనాథుడు ఈ క్షేత్రంలో వెలసి పూజలందుకుంటాడని భక్తుల నమ్మిక.

జ్యోతిర్మఠంలోనే…
భవిష్య బదరి గురించి పురాణకథల్లో కనిపిస్తుందిగానీ.. భవిష్య కేదార్‌నాథ్ గురించి ఎక్కడా ఉన్నట్టు దాఖలాలు లేవు. కానీ, గర్హ్వాల్ కొండల్లోని స్థానికులు మాత్రం కలియుగాంతంలో అసలు కేదార్‌నాథ్ క్షేత్రమే ఉండదని..అప్పుడు శంకరాచార్యులవారు స్థాపించిన ఉత్తరామ్నాయ పీఠమైన జోతిర్మఠంలోని భవిష్య కేదార్ ఆలయంలోనే కేదారనాథుడు భక్తుల పూజలందుకుంటాడని విశ్వసిస్తారు. ఇందుకు ప్రతిగా జోషీమఠ్‌లోని ‘భవిష్య కేదార్’ ఆలయాన్ని చూపుతారు

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

‘తాగుబోతును చూడ్డానికి సినిమాకే వెళ్లాలా!’

ఫిల్మ్‌నగర్ : ‘తాగుబోతును చూడ్డానికి సినిమాకే వెళ్లాలా!’

June 22, 2013

– కంపల్లె రవిచంద్రన్s

అక్కినేని ‘పల్లెకుపోదాం పారును చూద్దాం చలోచలో’ అని ఉరకలెత్తే యవ్వనోత్సాహంతో గుర్రబ్బండి తోలుకొస్తున్నాడు. ఆ బొమ్మ చూడగానే నా మనసూ కీలుగుర్రమెక్కిన అక్కినేనిలాగా ఆనందోద్వేగానికి గురైంది. సినిమా మొత్తం రెప్పలార్పకుండా చూశాను. ఇల్లు చేరగానే మా అమ్మ ఏదో పేద్ద యుద్ధం నుంచి కొడుకు తిరిగి వచ్చినట్లు నాకు దిష్టి తీసింది. రెండు రోజుల నిరీక్షణ ఫలించింది.

ఇది 1986-87 నాటి సంగతి… నాన్నంటే భయం. ఒట్టి భయం కాదు. చచ్చేంత భయం. సర్వాంగాలూ ఎక్కడివక్కడ బిగుసుకుపోయేంత భయం. అయినా ‘దేవదాసు’ కోసం తెగించాను. మా ఎదురింటి పక్కసందులో గోడమీద చూసిన ‘దేవదాసు’ వాల్‌పోస్టరే నా భయాన్ని జయించేలా చేసింది. నాకోసమే దేవతలెవరో తెచ్చి దాన్ని అక్కడ అతికించినట్లుంది. ఒక చేతితో చిన్న కర్ర పట్టుకొని మరో చేత్తో సావిత్రి చెవిని మెలిపెడుతున్నాడు అక్కినేని నాగేశ్వరరావు. నీలిరంగులో ఉందా పోస్టర్. ఆ కిందే వేదాంతం రాఘవయ్య, డి.ఎల్.నారాయణ, సి.ఆర్.సుబ్బురామన్ అని పెద్ద పెద్ద అక్షరాల్లో పేర్లు. కానీ అక్కినేని, సావిత్రి తప్ప మరెవ్వరూ తెలీదు నాకు. వాళ్లెవరో, వాళ్ల పేర్లన్నీ అక్కడెందుకున్నాయో నాకర్థంకాక నిలబడి ఉంటే పక్కవీ«ధి మస్తాన్‌బాషా కొడుకు సైకిల్‌తో గుద్దేశాడు. ఎలాగో లేచి ఇంటికొచ్చాను.

అమ్మను డబ్బులడిగాను. అర్థరూపాయిచ్చింది. ఆ అర్థరూపాయితో పాటు నాకు మా చెల్లెల్ని కూడా అంటగట్టింది. “నా దగ్గరున్నది ఇదే. సినిమాకే వెళ్తావో, బుద్ధిగా స్కూలుకు వెళ్లి, అక్కడేమైనా కొనుక్కొని తింటావో నీ ఇష్టం” అని ఖరాఖండిగా చెప్పేసింది. ఆ లంకంత కొంపలో ఆ క్షణంలో మా అమ్మ నా ప్రాణానికో పెద్ద లంఖిణిలా, ఆ అర్థరూపాయిలో భాగస్వామైన నా చెల్లెలు మాధవీలత శూర్పణఖలా అన్పించారు. సరే నాన్ననే అడిగితే పోలా… అంతకు మూడు రోజుల ముందే మా ఊరు (చిత్తూరు జిల్లా పుంగనూరు) బి.ఆర్.టాకీస్‌లో చూసిన ‘పాతాళభైరవి’ సినిమా గుర్తుకువచ్చింది.

‘ధైర్యే సాహసేలక్ష్మీ’ అనుకున్నా. నెమ్మదిగా మా చెల్లెల్ని తీసుకొని నాన్న గదిలో కెళ్లాను. చండశాసనుడు మా నాన్న. గిరిజలా ‘ నరుడా…ఏమీ నీ కోరిక’ అని అనాలి కదా. అనలేదు. చాలా సీరియస్‌గా ఏదో టైపు చేసుకుంటున్నాడు. ఆ క్షణంలో నేను అడగాలనుకున్నది అడిగితే ఆ టైపుమిషను మీద పరుగెడుతున్న వేళ్లు నా వీపు మీద పరుగెడుతాయనిపించి గుండె ఝల్లుమంది. నేను, మా చెల్లెలు మౌనంగా నిలబడ్డాం. మా మౌనం మా నాన్నను ఏవిధంగానూ చలింపచేయలేదు. పైపెచ్చు నన్ను చూడగానే వంటగదిలోకెళ్లి మా అమ్మనడిగి కాఫీ తీసుకు రమ్మన్నాడు. సమయం ఉదయం తొమ్మిదిన్నర. సినిమా ప్రారంభమయ్యే సమయం పదిన్నర.

image2
కానీ పాత సినిమా కనుక పదిహేను నిమిషాలు ముందుగానే ప్రారంభిస్తారు. కాఫీ పట్టుకెళ్లి ఇచ్చేటపుడు డబ్బులడుగుదామనుకున్నాను. కానీ భయంలో చిన్నముల్లు అప్పటికే పదకొండు మీదకు వచ్చిందని గమనించనే లేదు. సరే మధ్యాహ్నం అడుగుదామనుకున్నాను. కోర్టుకెళ్లిన నాన్న సాయంత్రానికిగాని ఇంటికి రాలేదు. సరే రాత్రి పడుకునే ముందు అడుగుదామనుకున్నాను. ఒకవేళ దెబ్బలు పడితే రాత్రంతా నిద్ర ఉండదని ఊరుకున్నాను. ఏదో అసంతృప్తి. సినిమా ఎలాగూ చూడలేదు. కనీసం అక్కినేనిని వాల్‌పోస్టర్‌లోనైనా చూసి తృప్తి పడదామంటే రాత్రి గనుక బయటికి పంపరు. ఏం చేయాలి?

ఆ రాత్రంతా అరకొర నిద్రే. ఉదయం ఆరుగంటలైందనుకుని మూడు గంటలకే నిద్రలేచేశాను. రోడ్డుమీదకు వెళ్లి వాల్‌పోస్టర్ చూద్దామనుకున్నాను. కాని తలుపుగడియ అందదు. మా అమ్మేమో సరిగ్గా ఆరుగంటలకే నిద్రలేస్తుంది. ఎందుకు మా అమ్మ అందరిలాగా ఉదయం ముగ్గెయ్యదు… ముందు రోజు రాత్రే ఎందుకు ముగ్గులు పెట్టేస్తుందని తిట్టుకున్నాను. నా మనసులోని ఆరాటం ఆ క్షణంలో దేవుడికి తెలిస్తే ఎంత బావుంటుందోననిపించింది. అయితే దేవుడు నిజంగానే నా మొర ఆలకించాడు.

ఎప్పుడూ ఆలస్యంగా వచ్చే పాల సుబ్బయ్య ఆ రోజు ఎందుకో కాస్త ముందుగా వచ్చేశాడు. అతణ్ణి దేవుడే పంపించాడనుకున్నాను. ఆ సాకుతో బయటికెళ్లి వాల్‌పోస్టర్ చూద్దామనుకున్నాను. బయటకొస్తుంటే మా పెద్దక్కయ్య శైలజ ‘చీకట్లో ఎక్కడికిరా సతీష్’ (నా చిన్నప్పటి పేరు) అని కేకేసింది. అక్కను చింతబరికెతో చీరేయాలన్నంత కోపం. అప్పుడే వాల్‌పోస్టర్ చూసేందుకు బయటికి వెళ్లగలిగితే మా అమ్మ ఇచ్చే డబ్బుల్లో పదిపైసలు హుండీలో వేస్తానని దేవుడికి మొక్కుకున్నా.

దేవుడు ప్రలోభపడ్డాడేమో. కాఫీపొడి తెమ్మని మా అమ్మ తను తయారుచేయబోయే కాఫీకంటే కమ్మగా చెప్పింది. వెనకాముందు చూడకుండా పరుగెత్తుకు వెళ్లాను. కానీ అంతలోనే నేను మొక్కుకున్న దేవుడు నాపై శీతకన్ను వేశాడో, లేక నా తాపత్రయం సరిగ్గా అర్థం కాలేదో, దేవదాసు పోస్టరే ఆ గోడ మీద లేదు. దాని మీద ‘అగ్గిపిడుగు’ పోస్టరేశారు. రాజశ్రీ ఆహ్లాదకరంగా ఉన్నా, ఎన్టీఆర్ మాత్రం పెద్ద రాక్షసుడిలా కనిపించాడు నా కళ్లకు. ఆ పోస్టర్ నా నెత్తిన పిడుగులే వేసింది.

అప్రయత్నంగానే అక్కడున్న రాళ్లన్నీ ఎత్తి ఆ పోస్టర్ మీద వేసేశాను. ఎదురింటి షావుకారు శెట్టి కూతురు ఉమ “ఎందుకురా రామారావుపై రాళ్లేస్తున్నావు” అని గట్టిగా గదమాయించింది. ఆ అదిలింపుకు కారణం రామారావు మీద అభిమానం కాదు.. నేను చిన్నపిల్లాడిని, నా వయసుకు తగ్గ పనికాదనీ కాదు, ఆ పోస్టర్ అతికించింది వాళ్ల ఇంటి గోడకు కాబట్టి. నేనేమో బాధగా, భయంగా ‘దేవదాసు’ వెళ్లిపోయాడు కదా అన్నా. ‘నీకేమి పిచ్చా, వెర్రా, దేవదాసు బి.ఆర్.టాకీస్‌లో ఈ పోస్టర్ సినిమా తాజ్‌మహల్‌లో. థియేటర్ పేరైనా చూసేది లేదురా వెధవా’ అన్నది ఉమక్క.

నా మనసు ‘సువర్ణసుందరి’ సినిమాలో రాక్షసుడి కమండలం అమృతం చిలికిస్తుంటే రాజసులోచన ఎగిరినట్లు ఎగిరింది. కాని ఆ ఆనందం ఎంతోసేపు నిలవలేదు. నా కోసం ఎదురుచూడలేక ఇంట్లో కాఫీ కావాల్సిన పాలు టీ అయిపోయాయి. వాళ్లేమి తాగితే నాకేంటి. కానీ ‘అగ్గిపిడుగు’పై కురిపించిన రాళ్లవర్షంలో నా చేతిలో పావలా జారిపోయింది. మరిప్పుడెలా? అలాగే రిక్తహస్తాలతో ఇంటికొచ్చాను. అమ్మచేతిలో నా బుర్ర రామకీర్తన పాడింది. ఆ వాతావరణంలో మా నాన్నను దేవదాసు టికెట్ గురించి అడగలేక మౌనంగా స్కూలుకు బయల్దేరాను.

నాకిప్పుడు దేవదాసు సినిమా చూడాలనే దానికంటే ఆ పోస్టర్‌ను చూడాలనే కోరిక ఎక్కువయిపోయింది. ఆ రోజుల్లో వాల్‌పోస్టర్లు ఎక్కడ పడితే అక్కడ వేసేవారు కాదు మా ఊళ్లో. కొన్ని కొన్ని ప్రదేశాల్లో మాత్రమే వేసేవారు. బజారువీధికి ముందర శ్రీ వెంకటేశ్వరా పిక్చర్స్, కడప స్వీట్ స్టాల్‌పైన బి.ఆర్.పిక్చర్స్, సెంటర్‌లో ఇండియన్ బ్యాంకు ముందర అలంకార్ పోస్టర్లు అతికించేవారు. మధ్యలో చూద్దామన్నా చిన్న పోస్టర్లు సరిగ్గా కన్పించేవి కావు. ఆశ్చర్యం. మా స్కూలు దగ్గరికి లగెత్తుకెళ్లేసరికి నయన మనోహరంగా నా చేతికే ఇస్తున్నట్లుగా పేద్ద వాల్ పోస్టర్‌లో మందుగ్లాసుతో నా ఆరాధ్యనటుడు అక్కినేని. ప్రాణం అప్పటికి కుదుటపడింది.|

ఆరోజు ఎంత ప్రయత్నించినా నాన్న దగ్గర డబ్బు తీసుకోవడం కుదరలేదు. మా ఊర్లో దేవదాసు ఉండేది ఇక ఒక్కరోజు మాత్రమే. ఏమైతే అది అవుతుందని మా నాన్నని ధైౖర్యం చేసి డబ్బులడిగేశాను. ‘సినిమా కెళ్తావా? డబ్బుకావాలా? ఏ సినిమా?’ అని చాలా నిర్లక్ష్యంగా అడిగారాయన. భయపడుతూనే ‘దేవదాసు’ అని చెప్పాను. నాన్న చేతి ఐదువేళ్లూ నా పాలబుగ్గ మీద అచ్చుపడ్డాయి. ‘తాగుబోతును చూసేందుకు సినిమాకే వెళ్లాలా?’ ఇదీ నాన్న వ్యాఖ్యానం. నన్ను కొట్టినదానికన్నా, ఆ సినిమాపై ఆయన చేసిన కామెంట్ నన్ను చాలా బాధపెట్టింది. ఆ దిగులుతోనే స్కూలుకెళ్లాను. కానీ అక్కినేని నాగేశ్వరరావుపై నాకున్న అభిమానం గొప్పదేమో! నాన్న మనసు కరిగింది. కోర్టుకు వెళుతూ స్కూలు దగ్గర కారు ఆపి మరీ రూపాయిన్నర ఇచ్చి వెళ్లారు. మా నాన్నను గట్టిగా కౌగిలించుకున్నాను. మధ్యాహ్నం బడిలేదు గనుక మాట్నీకి చెక్కేద్దామనుకున్నాను.

ఇంతలో మరో ఉపద్రవం వచ్చిపడింది. మా అమ్మమ్మ అప్పుడే బస్సు దిగి మనవణ్ణి చూసి వెళ్దామని నేరుగా స్కూలు దగ్గరికే వచ్చింది. నా చేతిలో డబ్బు చూసింది. ఊళ్లో ఎక్కడ చూసినా దొంగలే. చేతిలో డబ్బులుంటే పిల్లల్ని పట్టుకెళ్లిపోతారని నానాయాగీ చేసింది. ఎలాగో ఆమెను ప్రాధేయపడి టాకీసు దగ్గరికి వచ్చేశాను. అప్పుడే టికెట్ కౌంటర్ క్లోజ్ చేశారు. నా మొహం జూనియర్ శ్రీరంజని మొహంలా అయిపోయింది. నిస్సహాయంగా థియేటర్ వద్ద ఉన్న అశోకవృక్షాల దగ్గర నిలబడి ఉంటే, టికెట్లు ఇచ్చే గురువయ్య నన్ను గుర్తుపట్టాడు. అతడు మా నాన్న క్లయింట్. ఆ కారణంతోనే ఆయన నన్ను ఉచితంగానే థియేటర్లోకి పంపాడు.

అక్కినేని ‘పల్లెకుపోదాం పారును చూద్దాం చలోచలో’ అని ఉరకలెత్తే యవ్వనోత్సాహంతో గుర్రబ్బండి తోలుకొస్తున్నాడు. ఆ బొమ్మ చూడగానే నా మనసూ కీలుగుర్రమెక్కిన అక్కినేనిలాగా ఆనందోద్వేగానికి గురైంది. సినిమా మొత్తం రెప్పలార్పకుండా చూశాను. ఇల్లు చేరగానే మా అమ్మ ఏదో పేద్ద యుద్ధం నుంచి కొడుకు తిరిగి వచ్చినట్లు నాకు దిష్టి తీసింది. రెండు రోజుల నిరీక్షణ ఫలించింది. ధైర్యే సాహసే లక్ష్మి అన్నది సత్యమనిపించింది. ఆ సినిమా వల్లే నేను సినిమా పాత్రికేయుణ్ణయ్యాను.

చిన్నప్పుడు ఏ అక్కినేని బొమ్మ చూస్తే చాలు నా జన్మ ధన్యమని అనుకునే వాణ్ణో… అదే అక్కినేనిని పెద్దయ్యాక ఎన్నోసార్లు కలుస్తానని, మా మధ్య గాఢపరిచయం ఏర్పడుతుందని ఆ రోజున నేనూహించలేదు. అయితే ఆ దేవదాసును ఎన్నిసార్లు చూసినా కన్నీటి కాలువలే కళ్లు. కొన్ని సినిమాలు అలా నిలిచిపోతాయి మరి!|

వ్యాసం, ఫోటోలు(సేకరణ): – కంపల్లె రవిచంద్రన్, 9848720478

 

Posted in సినిమా | Tagged | Leave a comment

పౌరాణిక నాటక అద్వితీయ నటుడు డి . వి.సుబ్బారావు

nattaka natudu d.v subbarao -1nattaka natudu d.v subbarao -2

Posted in మహానుభావులు | Tagged | Leave a comment

గుంటూరు నుండి యె.యెస్.ప్రసాద్ గారి స్పందన

spandana -1spandana -2a

Posted in సరసభారతి ఉయ్యూరు | Tagged | Leave a comment

తాత్వికుడు థోరో

  తాత్వికుడు థోరో

           అమెరికా మహర్షి  అనగానే హెన్రి డేవిడ్ తోరో గుర్తుకు వస్తాడు .మహాత్మా గాంధి ,వినోబా బభాయ్ లే కాక మార్టిన్ లూధర్ కింగ్ లాంటి నల్ల జాతి హక్కుల పోరాట నాయకుడికి కూడా తోరో ఆదర్శం .స్వతంత్ర జీవి .బుద్ధి జీవి గా ప్రసిద్ధుడు

                 తోరో 1817 లో అమెరికాలోని మాసా చూసేత్స్ రాష్ట్రం లో కంకార్డ్ లో జన్మించాడు ..1862మే 6 న మరణించాడు నలభై అయిదేళ్ళు మాత్రమె జీవించినా అమెరికా ప్రజలకు గొప్ప మార్గ దర్శి అయ్యాడు తాత్వికులలో గొప్ప వాడుగా ,ప్రేరకులలో ముందు వాడుగా గుర్తింప బడ్డాడు అసలు వీరి మూలం ఫ్రాన్సు .తోరో వల్ల  మాసాచూసేత్స్  రాష్ట్రానికే గొప్ప పేరు లభించింది .మేధావిగా ఆలోచనా పరుడిగా సంస్కార సంపన్నుడు గా ఆయన్ను అందరు గౌరవిస్తారు ఆయన గురించి సూక్ష్మం గా చెప్పాలంటే ‘’Thoreu was bred to no profession ,he never married ,he lived alone ,he never went to church ,he never voted ,he refused to pay taxes ,,he ate no flesh ,he drank no wine ,he never knew the use of tobaco,and though a naturalist ,he used neither trap ,nor gun ‘’

 

 images (40)

 

 

             స్వతంత్ర వృత్తి గా lead  పెంసిల్లను తయారు చేసి అమ్మే వాడు .ఆయనకు వడ్రంగి  పని బాగా వచ్చు .భూముల సర్వ్ చేయటం తెలుసు .వీటి వల్ల  వచ్చే ఆదాయం తో జీవించాడు బ్రతకటానికి మాత్రమె సరి ప డ సంపాదించటం ఆయన లక్షణం .దగ్గరలోని ‘’వాల్దేన్ పాండ్ ‘’లో కుటీరం నిర్మించుకొని  రెండేళ్ళు న్నాడు ప్రపంచం టో సంబంధం లేకుండా .ఆయనకు ప్రకృతిని తీక్షణం గా పరిశీలించే తత్త్వం ఉంది .ప్రక్రుతి అందాలన్నా శైలి అన్నా మహా ఇష్టపడే వాడు ఈయన ను ఆదర్శం గా చేసుకొనే గాంధీ సబర్మతీ ఆశ్రమం స్తాపించాడు .ఇండియా లోఇలాంటి వారు సాధారణమే .కాని అమెరికా లో తోరో లాంటి వారుండటం అత్యాస్చార్యమేస్తుంది .ఇది ఒక రకం గా తొమ్మిదో వింత అని పిస్తుంది .ఆయన ఎన్నో పుస్తకాలు రచించాడు తన ఆత్మకధ గాwher i lived ” రాసుకొన్నాడు . 

          సంతోషం అనేది జీవిత నియమాలలలో  ఒకటి అని ఆయన భావించాడు ‘’I SEE THE CIVIL SUN DRYING EARTH’S FEARS –HERE TEARS OF JOY WHICH ONLY FASTERFLOW ‘’అని కవితాత్మకం గా చెప్పాడు .అడవులు అంటే సహజ  పట్టణాలన్నాడు . ఆయన దృష్టిలో’’man is the fiercest and cruelest animal ‘’. ఏ ప్రభుత్వం తక్కువ గా పాలిస్తుందో అదే అసలైన ప్రభుత్వం అంటాడు – ‘’that government is best which governs least ‘’అంతే కాదు that government is best which governs not at all ‘’అనీ అన్నాడు .ప్రభుత్వ దాస్టేకాన్ని ఎదిరించాడు సహాయ నిరాకరణ చేశాడు .అందుకే ప్రభుత్వం పై ‘’under a government which imprisons any unjustly ,the true place for a just man is also a prison ‘’అని తన అరెస్ట్ ను గురించి చెప్పాడు ఆయన జైల్లో ఉన్న సంగతి తెలిసిన వేలాది ప్రజలు జైలు దగ్గరకొచ్చి విడుదల చేయ వలసిందిగా అధికారులను ఒత్తిడి చేశారు సాదు ,సత్ప్రవర్తకుడు జైలు లో ఉండటం ఆ ప్రజలు జీర్ణించుకోలేక పోయారు .అది వారి సత్యాగ్రహం అదే తర్వాతా అందరికి మార్గ దర్శస్క మైంది

              ఆయన ఎప్పుడూ ప్రజా పక్షమే .ప్రజా వ్యతిరేక మైన ఉత్తర్వులను అమలు చెయ్య దలిస్తే అధి కారులు ముందు రాజీ నామ చేయాలని చెప్పాడు .is there not a sort of blood shed which the consciousness wounded ?’’అని ప్రశ్నించాడు ‘’through this wound ,a man’s real wound ,a man’s real manhood and immortality flow out and he bleeds to an ever lasting death .i see this blood flow now’అన్నాడు .

              దేశమును ప్రేమించుమన్నా అన్న గురజాడకు మార్గ దర్శి తోరో మనదేశాన్ని మన తలిదండ్రుల లాగా చూడాలి అన్నాడు అంతఃకరణ సాక్షిగా ప్రవర్తించాలని కోరాడు .అమెరికా పాలకులకు ఇంకా స్వేచ్చా వాణిజ్యం అంటే ఏమిటో తెలీదని ,అమెరికా యూనియన్ స్వేచ్చ విషయం లో ఇంకా అవగాహనా లేక పోవటం సరి కాదని అన్నాడు .

          ఒంటె మన ఆదర్శం అని చెబుతూ ‘’you must walk like a camel which is said to be the only beast which ruminates when walking ‘’అని వివరణ నిచ్చాడు .ఒంటె నడుస్తూ నెమరు వేస్తుంది అలా మనమూ ఏపని చేసిన పాతది గుర్తు చేసుకోవాలని అర్ధం .ప్రక్రుతి కవి వర్డ్స్ వర్త్ ను గురించి ఆయన సేవకుడిని అడిగితే అతడు  ‘’here is his library .but his study is out of doors ‘’అని చెప్పిన విషయం తోరో కు కూడా వర్తిస్తుంది ప్రకృతి ప్రేమికుడు ఆయన .ఎన్నో అరుదైన విషయాలను సేకరించాడు అటవీ సంపద అంటే ఆయనకు యేన లేని మోజు దాని గురించి ‘’  wildness is the preservation of the world .From the forests and wildness came the tonics and barks which brace man kind.the most alive is the wildest .’’అని సిదాన్తీకరించాడు .

     అమెరికా ప్రజలు ‘’should work the virgin soil ‘’అని హిత బోధ చేశాడు సాహిత్యం లో wild అనే మాటే తనకు అత్యంత ప్రీతికరం అన్నాడు .తోరో may be ‘’అనటానికి బదులు ‘’perchance ‘’అని ఉపయోగిస్తాడు ఈ మాట ఆయన రచనల్లో చాలా సార్లు కనీ పిస్తుంది

         మహా భారత కధనం లో ఆది వరాహం పై దిగ్గజాలు  ఉన్నాయని ఉంది దాన్ని తోరో సమర్ధించాడుfossil tortoise has lately been discovered in India large enough to support an elephant ‘’ఆయన దృష్టిలో మంచి పను లన్నీ ‘’wild and free ‘’ భారత ఇతిహసా లను తన రచనలలో ఉదాహరించాడు అందులో జడ భరతుని కద కూడా ఉంది .ఆయనకు పేరు లేదనీ ఆయన కీర్తియే ఆయన పేరు అన్నాడు .

      నీప్సి అనే ఫ్రెంచ్ ఆయన ఒక విషయం కనీ పెట్టాడని తోరో చెప్పాడు .దీనిని ‘’actinism ‘’అంటారట .అదేమిటంటే సూర్య రశ్మి ప్రభావం వల్ల గ్రానైట్ రాళ్ళు ,రాతి నిర్మాణాలు లోహ  . విగ్రహాలు సూర్య కాంతి పడి నంత సేపు దెబ్బతింటాయి అయితే రాత్రి వళలలో మళ్ళీ పున్జుకొంటాయట అంటే తెల్ల వారే సరికి మళ్ళీ యదా స్తితికి వస్తాయట .అంటే రాత్రి ఎంత అవసరమో నిద్ర ఎంత ముఖ్యమో దీని వల్ల  తెలుసుకోవాలని ఆంతర్యం.

          Knowledge is our positive ignorance –ignorance is negative knowledge ‘’అంటాడు తోరో తత్వ వేత్త .మనం ఎంత ఉన్నతం గా ఎదిగామో చెప్పటానికి జ్ఞానం కోల బద్ద కాదువిజ్ఞానంతో కూడిన సాను భూతి మాత్రమే అంటాడు అన్ని చట్టాలకన్నా బతికే స్వేచ్చ గొప్పది ఆ స్వేచ్చ నిరంతర పరిశ్రమ వల్ల  ,మనను సృష్టించిన వాడి తో సంబంధం వల్ల సార్ధక మవుతుంది అన్న విష్ణు పురాణం లోని విషయాన్ని విశదీకరిస్తాడు .

 చివరిగా అన్ని ప్రభుత్వాలు తెలుసుకో దగ్గ సత్యాన్ని చెప్పాడు ‘’the effect of good government is to make life more valuable .’’

         ఇలా ఎన్నో ఆదర్శ విషయాలు దార్శనిక భావనలు ,అనుభవాలను తన రచనలలో నిక్షిప్తం చేసి ఆదర్శ మానవుని గా జీవితాన్ని సార్ధకం చేసుకొన్నాడు .అందుకే తోరో ను ‘’అమెరికా  మహర్షి ‘’అంటారు .

             ఇది 29 -08-2002 నాటి నా అమెరికా డైరీ నుండి మీకోసం 

                  మీ –గబ్బిట   దుర్గా ప్రసాద్ –23-6-13- ఉయ్యూరు 

Posted in అమెరికా లో | Tagged | 1 Comment

60 ఏళ్ళు ఓ దేవదా … !

23_06_2013_121_006_00123_06_2013_128_002

Posted in సినిమా | Tagged | Leave a comment

పల్లె పిల్లల్లోనే ఫైర్ ఎక్కువ June 23, 2013–లాఉ రత్తయ్య -విజ్ఞాన్ సంస్థలు

పల్లె పిల్లల్లోనే ఫైర్ ఎక్కువ

June 23, 2013


‘విజ్ఞాన్’ పేరు చెప్పగానే గుర్తొచ్చే పేరు లావు రత్తయ్య. ఆ విద్యాసంస్థల వ్యవస్థాపకులు ఆయనే. వేలమందిని ఇంజనీర్లుగా, డాక్టర్లుగా తీర్చిదిద్దిన ఆయన తనను తీర్చిదిద్దింది మాత్రం తన ఊరేనంటున్నారు. సొంతూరు పెదనందిపాడు గురించి లావు రత్తయ్య చెప్పిన విషయాలే నేటి మా ఊరు..
“మాది గుంటూరు జిల్లాలోని పెదనందిపాడు గ్రామం. మా ఊళ్లో వందల ఏళ్లనాటి సోమేశ్వరాలయం ఉంది. అందులోని నంది విగ్రహం చాలా కళగా ఉంటుంది. అందుకే మా ఊరి పేరు పెదనందిపాడు అయిందని చెప్పుకొంటారు. మా ఊరు ఇటు గుంటూరు పట్టణానికి, అటు బాపట్ల, చీరాల, పొన్నూరులకూ సరిసమానంగా ముప్పయ్యేసి కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. చరిత్రలో కూడా మా ఊరికి ఘనమైన పేరుంది. స్వాతంత్రోద్యమం ఊపిరి పోసుకుంటున్న రోజుల్లోనే మా ఊళ్లో పర్వతనేని వీరయ్యగారనే ఆయన పన్నుల నిరాక రణ ఉద్యమానికి శ్రీకారం చుట్టారు. కొద్ది రోజుల్లోనే అది ఉధృత రూపం దాల్చింది. బ్రిటిష్ ప్రభుత్వానికి ఊరు నుంచి కట్టవలసిన పన్నులన్నీ ఆగిపోయాయి.

దాంతో సెగ మొదలయింది. పత్రికలు మా ఊరి గురించి బాగా రాశాయి. అప్పుడు గాంధీగారు స్వయంగా మా ఊరికి వచ్చారు. ‘మన స్వాతంత్రోద్యమం ఇంకా ఇంత ఉధృతంగా దేశమంతా వ్యాపించలేదు. మీరు అందరికన్నా తీవ్రంగా దీన్ని అమలుచే స్తున్నారు. దీన్ని కొంచెం తగ్గించి దేశవ్యాప్తంగా ఒకే తీరున నడిస్తే బాగుంటుందేమో…’ అని సూచించిన మీదట మా గ్రామస్థులు కాస్త పట్టు విడిచారని చెప్పుకుంటుంటారు. ఆ తర్వాత మా ఊళ్లో బ్రిటిష్ ప్రభుత్వమే హైస్కూలును ప్రారంభించింది. ఇప్పటికి తొంభయ్యారేళ్ల చరిత్ర కలిగిన స్కూలది. దానివల్ల ఊళ్లోనూ, చుట్టుపక్కల ప్రాంతాల్లోనూ విద్య త్వరగా వ్యాప్తి చెందింది.

రైతుల కాలేజీ
స్వాతంత్య్రం వచ్చిన తర్వాత కొన్నేళ్లపాటు కమ్యూనిస్టు భావజాలం బాగా పెరిగింది. మా ఊళ్లో లేదు గానీ మాకు దగ్గర్లోని పాలపర్రు వంటి కొన్ని గ్రామాల్లో కమ్యూనిస్టులను వెతుకుతూ పోలీసులు రావడం, చాలా క్రూరమైన అకృత్యాలకు పాల్పడటం వంటివి జరిగాయి. అయితే ఆ భావజాలం వల్లనే అనుకుంటా, మా ప్రాంతంలో చదువు పట్ల శ్రద్ధ ఎక్కువగా ఉండేది. అలాగే సామాన్యులకు సైతం అన్ని విషయాలకు సంబంధించిన చైతన్యం బాగా ఉండేది. ఇటువంటి చైతన్యం కోసం ఎంతోమంది తమ జీవితాలను త్యాగం చేశారు. దీనికో ఉదాహరణ చెప్పాలి. అయితే ప్రభుత్వమో లేదంటే జమీందార్లో, భూస్వాములో ముందుకొస్తే తప్ప కాలేజీ ఏర్పడటం అసాధ్యం అనుకున్న రోజుల్లోనే మా ఊళ్లోని రైతులంతా కలిసి చందాలు వేసుకుని తమ పిల్లల కోసం ‘పెదనందిపాడు కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్స్’ను స్థాపించుకున్నారు.

తేళ్ల కృష్ణమూర్తి చౌదరిగారనే ఆయన ఈ ప్రయత్నానికి నేతృత్వం వహించారు. కొంతమంది రైతులు తమ పొలాలను తాకట్టు పెట్టి మరీ ఆ కాలేజీ నిర్మాణానికి అవసరమైన విరాళాలను పోగుచేశారంటే ఇప్పటి తరానికి గొప్ప ఆశ్చర్యంగా ఉండొచ్చు. ఆ కాలేజీని ప్రారంభించింది నలభైఐదేళ్ల క్రితం. దాని నిర్వహణ కూడా మొదట్నుంచీ రైతులే చేస్తున్నారు.

కూరగాయలు కొంటారా?
నేను 1952 జూలై 28న పుట్టాను. మా నాన్న అంకమ్మ, అమ్మ తులసమ్మ. మేం ముగ్గురన్నదమ్ములం, నేనే పెద్దవాణ్ని. అక్కచెల్లెళ్లు లేరు మాకు. మా నాన్నకు ఎనిమిదెకరాల పొలం ఉండేది. నీటి వసతి ఉన్న ప్రాంతం కానందువల్ల వ్యవసాయమంతా వర్షాధారమే. ఎప్పటికప్పుడు కష్టంగానే ఉండేది. శెనగ, మినుము, జొన్నలు వంటివి వేసేవారు. అప్పుడప్పుడు పొగాకు వేసేవారనుకుంటాను. ఇప్పట్లాగా టిఫిన్లు ఏమీ తెలియవు మాకు. మూడుపూటలా అన్నమే. ఇంట్లో పాడి ఉండేది గనక పెరుగు, ఆవకాయ వేసుకుని లాగించేసేవాళ్లం. అప్పుడప్పుడు జొన్న అన్నం తినేవాళ్లం. రోజుకో కూర చేసుకుని తినడమూ తెలియదు.

బజార్లో కూరగాయలు కొనడం అంటే ధనవంతులు మాత్రమే చేసేవారని అనుకునేవాళ్లం. రైతులు ఇళ్ల పెరళ్లలో దొండ, బెండ, దోసకాయలు వంటివి వేసుకునేవారు. అక్కడ కాసినప్పుడు కోసుకుని కూర చేసుకోవడమే మాకు తెలుసు. అలాగే మా ఊరి చెరువులో స్నానాలు చేసి ఆ నీళ్లే తాగేవాళ్లం. చేత్తో పట్టుకుంటే పచ్చగా కనిపించేవి ఆ నీళ్లు. రోజూ పెద్ద పోషకాహారం తినకపోయినా, పరిశుభ్రమైన మంచినీరు అందుబాటులో లేకపోయినా మేం ఎప్పుడూ అనారోగ్యం బారిన పడేవాళ్లం కాదు. ఇప్పుడు అందరూ ఆహారం, నీరు విషయాల్లో తీసుకునే శ్రద్ధ చూస్తే నాకు ఆశ్చర్యంగా ఉంటుంది. మా నాన్న పెద్దగా చదువుకోలేదుగానీ, తెలివిగా ఆలోచించేవారు.

మేం బాగా చదువుకోవాలని ఆకాంక్షించేవారు. అలాగని ఇప్పట్లా బలవంతాన రుద్దేసి అదేపనిగా చదివించడం లేదు. ‘బాగా చదువుకుంటే బాగు పడతార్రా’ అని మాత్రం చెప్పేవారాయన. ఏ సీజన్‌లోనైనా పగలూరాత్రీ మా అమ్మానాన్నలిద్దరికీ వ్యవసాయప్పనులతోనే సరిపోయేది. అందుకని మమ్మల్ని మరీ కనిపెట్టుకుని కూర్చునే తీరిక వాళ్లకుండేది కాదు.

జుట్టు కాలిపోయేది
చిన్నప్పుడు మాకు ఆరవుతూనే అన్నాలు పెట్టేసేవారు. తర్వాత చిన్న లాంతర్లు లేదా బుడ్డి దీపాలు పట్టుకుని ట్యూషన్ మాస్టారి దగ్గర కూర్చుని చదివేవాళ్లం. నేను కునికిపాట్లు పడుతూ ఒక్కోసారి ముందున్న బుడ్డిదీపం మీదికి ఒరగడం వల్ల జుట్టు కాలిపోయేది. ఇలా చాలాసార్లే జరిగింది. నేను క్లాసులో బద్దకంగా ఉండేవాణ్నిగానీ పరీక్షల్లో మాత్రం మంచి మార్కులొచ్చేవి. బీఎస్సీ ఎమ్మెస్సీ చదివేటప్పుడు మా మేనమామలు నన్ను ఆర్థికంగా ఆదుకున్నారు. మా ఊరి పక్కన నల్లమడ వాగుండేది. ఇతర కాలాల్లో మామూలుగా ఉండే ఆ వాగుకు ప్రతి వర్షాకాలంలోనూ తీవ్రమైన వరద వచ్చేది. అక్కడికి తరచూ వెళ్లేవాళ్లం.

నా తొమ్మిదో క్లాసులో ఈత రాకపోయినా ధైర్యం చేసి అందులో దిగాను. అది వరదల సమయం అనుకుంటా. మునిగిపోబోతే కాళహస్తి సత్యనారాయణ అనే స్నేహితుడు బైటికి లాగి రక్షించాడు. చలికాలంలో కూడా ఇప్పట్లాగా రగ్గులూ దుప్పట్లూ ఏమీ ఉండేవి కాదు. అయినా ఏమీ చింత లేకుండా గడిపేసేవాళ్లం. వేసవి కాలంలో మా స్కూలుకున్న పెద్ద గ్రౌండులో ఆటలే ఆటలు.

నాటుకుపోయిన పాఠాలు…
మా ఊళ్లో నాకు గుర్తుండిపోయిన మనుషులు చాలామందే ఉన్నారు. వాళ్లలో మొదట చెప్పుకోవలసింది మా బడి ఉపాధ్యాయుల గురించే. ఇతరత్రా ఏ రకమైన వ్యాపారాలూ వ్యవహారాలూ లేకుండా తమ పూర్తి శ్రద్ధను విద్యార్థుల మీదే కేంద్రీకరించిన గొప్ప వ్యక్తులు వాళ్లు. తమ దగ్గర చదువుకుంటున్న పిల్లలందరూ జీవితంలో పైకి రావాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ ప్రేమగా వ్యవహరించేవారు. ముఖ్యంగా మా తెలుగు టీచర్ నాజర్‌గారు. ఆయన పాఠం ఎంతసేపు చెబుతారో, అంతసేపు జీవితం గురించి కూడా చెప్పేవారు. పెరిగి పెద్దయ్యే క్రమంలో ఎలాంటి సమస్యలు ఎదురవుతాయో, వాటినెలా ఎదుర్కోవాలో, జీవితాన్ని కొన్ని విలువలతో ఎలా తీర్చిదిద్దుకోవాలో, ఎదుటివారితో ఎంత సంస్కారంగా మెలగాలో…. ఇవన్నీ పసి మనసుల్లో నాటుకుపోయేలా చెప్పేవారు.

ఆయన ప్రభావం నామీదే కాదు, మా బ్యాచ్‌లో చాలామంది మీద ఉంది. అలాగే కోటయ్య చౌదరిగారని లెక్కలు చెప్పే మాస్టారుండేవారు. గణితశాస్త్రమంటే భయం కలిగించకుండా తెలుసుకోవాలన్న ఉత్సాహం కలిగేలా బోధించేవారాయన. ఆయన వల్లే మా ఊళ్లో చాలామంది మ్యాథ్స్ అంటే ప్రేమతో పైచదువులు చదువుకున్నవాళ్లున్నారు. క్లాసులో నలభై మంది అబ్బాయిలుంటే ఏడెనిమిది మందే అమ్మాయిలుండేవారు. వాళ్లతో ఆటలుపాటలు, స్నేహాలు, అలకలు, జగడాలు, ఓరచూపులు, కోరచూపులు… అన్నీ ఉండేవి.

పిల్లల్లో పిల్లాడిగా…
నాకు తెలిసి మాది వెయ్యి గడప ఊరు. నాలుగైదు వేల జనాభా. ఊళ్లో శ్రీనివాస అనే థియేటరుండేది కానీ, అప్పట్లో సినిమా మా ప్రధాన వినోదం కాదు. ఎప్పుడైనా వెళ్లాలన్నా టికెట్టు పావలానో అర్థరూపాయో అయినా అంత డబ్బు మా చేతిలో లేక వెనకడుగు వేసేవాళ్లం. ఒక్కసారి మాత్రం సినిమాకి వెళ్లాలనో, లేదా ఇంక దేనికో గుర్తు లేదుగానీ నాకు డబ్బు అవసరమయింది. పొగాకు కాడలు పీకితే డబ్బులిస్తారని తెలుసు. దాంతో నేనూ పీకడానికి వెళ్లాను. అలవాటు లేని పని కావడం, ఆ పనిలో నేర్పున్న వాడిని కాకపోవడం వల్ల అరిచేతులు గీక్కుపోయి చర్మమంతా ఊడొచ్చింది. మా ఊళ్లో ఈదర వెంకటేశ్వర్లు అనే ఆయన కిళ్లీ దుకాణాన్ని నడిపేవారు. అక్కడ ఆంధ్రప్రభ, పత్రిక, ఆంధ్రజ్యోతి, విశాలాంధ్ర వంటి దినపత్రికలన్నీ అమ్మేవారు. ఇంటికి పత్రికలు తెప్పించుకునేవాళ్లు కూడా పొద్దున పూట అక్కడికొచ్చి బల్లల మీద కూర్చుని ఆ వార్తల మీద చర్చోపచర్చలు చేసేవారు.

మా ఊరికి చెందిన కొల్లా వెంకయ్యగారనే పెద్దాయన అప్పట్లో పార్లమెంట్ సభ్యులుగా ఉండేవారు. అయినా ఎంతో నిరాడంబరంగా ఉండేవారు. అసలాయన అటువంటి స్థాయిలో ఉన్నాడని కూడా మాకు తెలియనంత సాధారణంగా ఉండేవాడు. ఆయన కూడా ఉదయాన్నే ఈదర వెంకటేశ్వర్లు దుకాణానికే వచ్చి పేపర్లు తిరగేసేవాడు. అలాంటప్పుడు నేనూ ఆయన పక్కన కూర్చుని వాదాలు చేసేవాడిని. ‘కమ్యూనిజం మంచిదైతే ఈపాటికి ప్రపంచమంతా ఆ దారినే నడిచేది కదా. మనుషులంతా ఒక్కటే ఎలా అవుతారు. అసలు కమ్యూనిజం ప్రకృతికి విరుద్ధం కదా? కమ్యూనిస్టులు మాత్రం అన్ని వర్గాల గురించీ ఆలోచిస్తారా చెప్పండి…’ అంటూ తోచిందల్లా మాట్లాడేవాడిని. ఆయన పెద్ద మార్క్సిస్టు నాయకుడు.

చాలా జ్ఞానమున్న మనిషి. కొన్నాళ్లు జైల్లో కూడా ఉండొచ్చాడు. అయినా నాకు ప్రతీదీ అర్థమయ్యేలా వివరించడానికి ప్రయత్నించేవారు తప్ప విసుక్కునేవారే కాదు. ఆయన ప్రభావం నామీద చాలానే ఉంది. నేను కూడా ఆయనలా సింపుల్‌గా ఉండటానికి ప్రయత్నించేవాడ్ని.

బెరుకు తగ్గించుకుంటేనా..
ఆరోజుల్లో మేం ఒక్కరమే కాదు, ఊళ్లోని రైతు కుటుంబాలన్నీ కూడా మరీ చిన్నచిన్న అవసరాలు సైతం తీరక కటకటపడేవాళ్లు. ఒకసారి మా నాన్నకు అత్యవసరంగా ఎపెండిసైటిస్ ఆపరేషన్ చెయ్యవలసి వచ్చింది. అప్పట్లో అది చాలా చిన్నమొత్తమే. కానీ అదే సర్దుబాటు కాక అవస్థ పడ్డాం. బహుశా అలాంటి పరిస్థితుల వల్లే మాలో చాలామందికి జీవితంలో ఏదైనా సాధించాలన్న ఫైర్ ఉండేది.

ఇప్పటికీ విద్యాసంస్థల్లో గమనించి చూస్తే అన్నీ అమరిన పట్టణ ప్రాంతాల పిల్లల కన్నా గ్రామీణ ప్రాంతాల విద్యార్థుల్లోనే పట్టుదల ఎక్కువగా కనిపిస్తుంది. కానీ వాళ్లకు తమలోని శక్తియుక్తులు సరిగ్గా తెలియవు. దాంతో ఆత్మవిశ్వాసం లేకుండా ప్రవర్తిస్తుంటారు. ఆ బెరుకు జీవితాంతం ఉండిపోతుంది కొందరిలో. దీనికి నేనే ఉదాహరణ. బస్టాండుకో, రైల్వే స్టేషనుకో వెళితే మామూలుగానే ఉంటాను. అదే విమానాశ్రయానికి వెళితే మాత్రం నాకెందుకో తెలియని బెరుకు ఆవహిస్తుంది. ఇంత పెద్దవాడినైనా, ఇంగ్లీష్ బాగా వచ్చినా, చేతిలో డబ్బున్నా కూడా అలాంటి చోటకు వెళ్లినప్పుడు నా లోపలి పల్లెటూరి మనిషికి ఏదో తెలియని అసౌకర్యంగా ఉంటుంది.

చదువుతోనే మార్పు
ఈమధ్యే మా ఊళ్లోని కాలేజీకి నన్ను కరస్పాండెంటుగా ఎన్నుకున్నారు. అందుకే మా ఊరి కాలేజీలో సంప్రదాయ కోర్సులకు తోడు ఎంసీయే, ఎంబీయేలను కూడా ప్రారంభించాం. అక్కడికి వచ్చేది ఎక్కువగా చాలా పేద పిల్లలే. వాళ్లకివి అందుబాటులో ఉండటంతో బాగా చదువుకోగలుగుతున్నారు. ఈ సంవత్సరం ఫలితాలు చాలా బాగా వచ్చాయి.

జిల్లాలో ఎయిడెడ్ కాలేజీల్లో మాదే ప్రథమ స్థానంలో నిలిచింది. గ్రామీణ బాలబాలికలకు కూడా ప్రపంచస్థాయి విద్య అందుబాటులో ఉంచాలన్న ధ్యేయంతో ‘నెక్ట్స్‌జెన్’ పేరుతో ఓ పాఠశాలను మా ఊళ్లో ప్రారంభించాను. దాదాపు 850 మంది వెనకబడిన వర్గాల విద్యార్థులు దానిలో చదువుకోగలుగుతున్నారు. పోషకాహార లోపం ఉండకూడదని వారికి సాయంత్రం స్నాక్స్ వంటివి అందిస్తున్నాం. ప్రస్తుతం ఊరికి మంచి వైద్యం అందించాలనే ప్రయత్నంలో ఉన్నాను. కుటుంబ పరిస్థితిని మార్చే సామర్థ్యం చదువుకే ఉందని నేను బలంగా నమ్ముతాను. అందుకే ఆ దిశగా మా ఊరి విద్యార్థులను ప్రోత్సహిస్తున్నాను.”

‘లావు వీరభద్రస్వామి’
మా ఊళ్లో మా ఇంటి పేరున్న కుటుంబాలు ఎక్కువ. ‘లావు’ కుటుంబాలకు వీరభద్రస్వామి కులదైవం. ఈ కుటుంబాలన్నీ కలిసి ఏడాదికోసారి ఆయనకు కొలుపులు చేస్తారు. అది కూడా తిరునాళ్లలాగా అట్టహాసంగా జరుగుతుంది. అప్పుడు కొంచెం వీరశైవ భక్తిని ప్రదర్శిస్తారు. అంటే ఒంటికి దబ్బనాలు గుచ్చుకుని, నిప్పుల్లో నడిచి… ఇలా తమ భక్తిని చాటుకుంటారు. మా ఇంటిపేరు వాళ్లకు మరో ఆచారమూ ఉంది మా ఊళ్లో. అదేంటంటే పెళ్లికి ముందురోజున ఆడపిల్లయితే అబ్బాయిలాగా, వరుడైతే వధువులాగా తయారై ఊరేగింపుగా వీరభద్రస్వామి గుడి కి వెళ్లి మొక్కడం. ఇరవై ముప్పయ్యేళ్లుగా ఈ కొలుపులు సరిగా జరగడం లేదు.

దాంతో ఊళ్లో పరిస్థితి మారుతోందనిపించి మళ్లీ ఇప్పుడు వాటిని ఘనంగా చెయ్యడం మొదలుపెట్టారు. నేను దేవుణ్ని విశ్వసిస్తాను. ప్రతిఏటా మా విద్యాసంస్థల్ని ప్రారంభించినప్పుడు పూజ చేస్తాం. మా సాంకేతిక విశ్వవిద్యాలయం తెరిచే రోజున కూడా పూజ చేస్తుంటే కొందరు విద్యార్థుల తల్లిదండ్రులు అదేంటని అడుగుతుంటారు. మనల్ని మించిన శక్తి ఉందని, దాన్నే దేవుడంటామని చెపుతాను నేను.

Posted in సేకరణలు | Tagged | Leave a comment

నా దారి తీరు -32 ఉయ్యూరు స్కూల్ సమస్యలు –పరిష్కారం

నా దారి తీరు -32

                ఉయ్యూరు స్కూల్ సమస్యలు –పరిష్కారం

            హెడ్ మాస్టార్ని పునాదిపాడు నుంచి ఉయ్యూరు కావాలని తీసుకొచ్చ్చిన ఇద్దరు మేస్టార్లు వెంకటరత్నం ,కోటేశ్వర రావు లు ఆయన చేరిన తర్వాత తమ మాట ఆయన వినకుండా ,తన స్వంత నిర్ణయాలు తీసుకొంటున్నందుకు వీళ్ళకు మంట గా ఉంది .ఆయన పై కారాలు ,మిరియాలు నూరారట .ఆయన్ను గౌరవించటం లేదట .దీనికి తోడు ఇద్దరు యెన్.డి.ఎస్.లు కూడా వారిద్దరికీ దగ్గరయ్యారు వీరితో బాటు నరసింహా రావు అనే సెకండరి గ్రేడ్ టీచర్ కలిశాడు వీరంతా ఒక గ్రూప్ లా ప్రవర్తించే వారట .దీనితో హెడ్ గారికి వీరి మీద పీకల్లోతు కోపం .సూటి పోటీ మాటలు వరండాలో అరచుకోవటాలు జరిగే వట .ఇదంతా నేను ఉయ్యూరు స్కూల్ లో చేరక ముందు నేపధ్యం .అందరు హేమా హేమీ లే ఉన్నారు ఇక్కడ కాని రెండు గ్రూపులు గా విడిపోయారు ఎవరి పార్టీ వారు ఇచ్చుకొనే వారట .ఇదంతా నాకు బాధాకరం గా ఉండేది .ఒక సారి నేను చూస్తుండగానే న్వీరిద్దరూ వరండాలో గట్టిగా అరచు కోవటం చూసి ఇద్దర్ని విడదీసి ఎవరి స్తానాలకు వారిని పంపాను .

              ఆ సమయం లో పని చేస్తున్న ఉపాధ్యాయులను ఒక సారి జ్ఞాపకం చేసుకొంటాను .కొత్తపల్లి కృష్ణా రావు పి.ఎఫ్ ప్రభకరరావు డేవిడ్ రాజు  సోషల్ మేష్టార్లు . యీసిఎల్ ప్రసాదరావు   దేవేంద్ర రావు అనే లెక్కల మేస్టార్లు, సైన్సు  మేస్టర్లుగా నేను గిరి రెడ్డి నారాయణ రావు చంద్ర లీలమ్మ మొదలైన వారు తెలుగుకు వి,పూర్ణ చంద్ర రావు ,పిన్నమనేని రంగా రావు ,రామా రావు ,సెకండరి గ్రేడ్ లో కేఆర్ జి  కృష్ణ మూర్తి ,కాంతయ్య గారు రామ శేషయ్య ,వగైరా డ్రిల్ మేస్టార్లు వై. రామా రావు ఎస్.వి.సుబ్బారావు జే సుబ్బారావు ,యార్లగడ్డ పూర్ణ చంద్ర రావు ,ఆఫీస్ స్టాఫ్ లో వీరయ్య ,గురుదాస్ సుబ్బారావు మొదలయన వారు..అందరం కలిసి ఉండేవాళ్ళం .క్రాఫ్ట్ టీచర్ రామమోహన రావు డిసిప్లిన్ విషయం బాగా చూసే వాడు .

                        ఐక్యతా సాధన

           నేను ,దేవేంద్ర రావు కలిసి ఎలా అయినా టీచర్స్ లో ఐక్యత సాధించాలని పూనుకోన్నాం .అందరిని సంప్రదించం .అసమ్మతి వర్గం తోను మాట్లాడాం .ఇద్దరు యెన్ డి.ఎస్ లు తప్ప అందరు సరే నన్నారు నరసింహా రావు తో మాట్లాడాము ఆయనా కాదన లేక పోయాడు .అప్పుడు హెడ్ మాస్టారు మిక్కిలినేని వెంకటేశ్వర రావు గారికి విషయం తెలియ జేశాం .ఆయన ఓ.కే.అన్నారు మళ్ళీ ఎవరూ అనవసరం గా ఒకరిపై ఒకరు ద్వేషించుకోరాదని స్టాఫ్ తో చెప్పి కన్విన్స్ చేశాం హెడ్ గారిని కూడా జరిగిందేదో జరిగింది ఇక నుంచి అందరం కలిసి నడుద్దాం పాత విషయాలను మనసులో పెట్టుకొని ఆ టీచర్ల మీద అక్కసు పెంచుకోవద్దని ,వేధించ వద్దని నచ్చచేప్పాం లైన్ క్లియరయింది .అందరికి తలలో నాలుక లాగా ఉండే వాడు ,అందరితోను కలుపుగోలు గా ఉండేవాడు తెలుగు మేష్టారు పూర్ణ చంద్ర రావు ఆయన్నే స్టాఫ్ సెక్రెటరి గా చేశాం .సమస్య ఒక కొలిక్కి వచ్చింది అందరం ఐక మత్యం గా నడిచాం .హెడ్ మాస్టారికి అడ్మినిస్ట్రేటివ్ విషయం లో ఎలాంటి అడ్డంకులు కలగా కుండా దేవేంద్ర రావు నేను సహాయ పడే వాళ్ళం .ఆయన కూడా ఏదైనా సమస్య వస్తే మా ఇద్దరికీ చెప్పే వారు మేము మిగిలిన వారితో చర్చించి పరిష్కరించే వాళ్ళం .దీనితో అందరికి మా ఇద్దరి మీద మంచి గౌరవం ఏర్పడింది .మంచి పని చేయటానికి కొంత పూనిక ఉండాలి ఉంటె అదే దారి చూపిస్తుంది .మొదట్లో ఎన్డిఎస్ లు రాక పోయినాచివరికి వాళ్ళూ మాతో కలిశారు నరసింహా రావు కూడా పట్టు వదిలాడు .హమ్మయ్య అనుకొన్నాం

                    నేను పామర్రులో పని చేసినప్పుడు కూడా ఉయ్యూరు లో నాకు ఇంటి దగ్గర కనీసం అరడజను మంది పదో తరగతి విద్యార్ధులు ట్యూషన్ కు వచ్చే వారు ప్రైవేట్ అయిన తర్వాతా స్నానం చేసి అన్నం తిని బడికి వెళ్ళే వాడిని .టెన్త్ బి.సెక్షన్ కు నేను ఎప్పుడూ క్లాస్ మేస్టారు గా ఉండేవాడిని దానికే ఇంగ్లీష్ ,ఫిజికల్ సైన్సు  చెప్పే వాడిని .మిగిలిన తరగతులకు ఫిజిక్స్ చెప్పే వాడిని .అప్పటికే మా పెద్దబ్బాయిశాస్త్రి పదవ తరగతి ఉయ్యూరు హైస్కూల్ లో పాసయ్యాడు మండలం లో ఫస్ట్ వచ్చాడు.రాత్రి క్లబ్ వారు సత్కరించి బహుమతి అందజేశారు . .ఉయ్యూరు కాలేజి లో ఇంటర్ లో చేరాడు .ఏం.పి. గ్రూప్..రెండో వాడు శర్మ తోమ్మిదిలోకి వచ్చాడు .

         ఒక సారి కలపటపు నరసింహా రావు అని ఇదివరకు హెడ్ గారితో పోట్లాడాడని చెప్పిన సెకండరి మేష్టారికి  అనుకోకుండా ఒక ప్రమాదం లో కాలువిరిగింది .బహుశా సెలవల్లో అనుకొంటా .ఆయన వేసవి సెలవల తర్వాతా స్కూల్ లో చేరక పోతే జీతం రాదు అసలే ఆయనకు హెడ్ మాస్టారికి ఉప్పూ నిప్పూ లా ఉండేది .నాకు నరసింహారావు గారు కబురు చేసి ఎలాగోలా సాయం చేయమని కోరారు వాళ్ళ అబ్బాయిలు మా అబ్బాయిల క్లాస్ మేట్లు కూడా .ఈయన మాటలు కటలు దాటుతాయి ఊర తాతయ్య గారింట్లో అద్దెకుండే వాడు. అంతా తనకు తెలుసు నని అరచేతి లో వైకుంఠం చూపిస్తాడు .ఎప్పుడూ డబ్బుకోసం చీటీ రాసి వాళ్ళబ్బాయిని ఇంటికి పంపేవాడు నాకు తోచింది ఇచ్చి పంపేవాడిని ఎప్పుడో వీలు పడినప్పుడు తీర్చేవాడు ఇదీ పరిస్తితి నోటి దూల ఎక్కువ .           నేనూ దేవేంద్ర రావు కలిసి మాట్లాడుకోన్న్నాం .స్కూల్ తెరిచే రోజు ఆయన వచ్చి సంతకం పెట్టాలి .అయితే ఆయన కాలు నేల మీద మోప లేని పరిస్తితి ..ఏమి చెయ్యాలో అర్ధం కాలేదు మాకు ఈ పరిస్తితిని హెడ్ మాస్టారికి చెప్పాం ఆయనేమీ ఈయన మీద జాలి చూపించలేదు బ్రతిమిలాడాం .మాన వత్వం ప్రదర్శించి ఔదార్యం చూపండి అని రిక్వెస్ట్ చేశాం .ఆయన మొత్తం  మీద మెత్త బడ్డారు ఒక పరిష్కారం సూచించాం  .నరసింహా రావు గారు హాస్పిటల్ నుండి సరాసరి  కాలి కట్టుతో కారు లో స్కూల్ కు వచేట్లు కారు లోనే ఆయన అటేన్దేన్సు రిజిస్టర్ర్ లో సంతకం పెట్టేట్లు రాజీ కుదిర్చాం .మీరంతా ఔను అంటే నాకేమీ అభ్యంతరం లేదన్నారు హెడ్ మాస్టారు. స్టాఫ్ ను అందర్నీ సంప్రదించి ఒప్పించాం .రిఒపెనింగ్ రోజు అలానే మేము చెప్పి నట్లే కారు లో వచ్చి హెడ్ మాస్టారు దగ్గర కు చేరి సంతకం పెట్టిన్చాం ..ఇప్పుడు నరసింహా రావు గారు పరమ సంతోషించారు మాకు ఎంతో క్రుతజ్ఞాతలు లు చెప్పారు హెడ్ మాస్టారి పెద్దమనసుకు జోహార్ పలికారు .రెండు నెలల తర్వాత ఆయన మళ్ళీ స్కూల్ లో చేరారు .మెట్లు యెక్క లేదు చంకలో కర్ర తో నడక . .ఏం చేయాలి ?మళ్ళీ బుర్ర పెట్టాం నరసింహా రావు గారి క్లాసులన్ని మెట్లు యెక్క నవసరం లేని రూమ్  లో ఏర్పాటు చేయించాం ఆయన సరాసరి రిక్షా లో క్లాస్ రూమ్ లోకి వెళ్ళటం ,పాఠాలు చెప్పటం ఏ తరగతి కి ఆ తరగతి  పిల్లలు ఆ రూమ్ లోకి వచ్చే వారు ఆయన ఎక్కడికి కదలక్కర్లేదు ఈ ఏర్పాటుకూ ఆయన ఏంతో  సంతోషించాడు ఇది హెడ్ గారి మంచి మనసు.అంతే .నేను దేవేంద్ర రావు ఎప్పుడూ హెడ్ మాస్తారితో ఒక విషయం చెప్పే వాళ్ళం “’మేష్టారు !మీరు కావాలని ఈ స్కూలు కు వచ్చారు మేమంతా మీకు ఎలాంటి సహకారం కావాలన్నా అందిస్తాం అందర్నీ సమానం గా చూడండి మీ రిటైర్ మెంట్ ఇక్కడే ఘనం గా జరగాలి ‘’అని చెప్పే వాళ్ళం .ఆయనా మా మాట మన్నించే వారు ఘర్షణ వదిలి సామరస్యం గ ఉండే వారు   

         సశేషం –మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -22-6-13-  ఉయ్యూరు               

 
 
 
 
 
 
 


గబ్బిట దుర్గా ప్రసాద్
https://sarasabharati.wordpress.com
http://suvarchalaanjaneyaswami.wordpress.com

Posted in నా దారి తీరు | Tagged | Leave a comment

ఏబ్ లింకన్ గురించి కొన్ని విశేషాలు

             ఏబ్ లింకన్ గురించి కొన్ని విశేషాలు

           అబ్రహాం లింకన్ ను అందరు ఏబ్ లింకన్ అని ఆప్యాయం గా పిలుచు కొంటారు .ఆయన భావాలు తరతరాలకు ఆదర్శ ప్రాయాలు .ప్రభుత్వం నడిపే వారికి, ప్రజలకు లింకన్ ఎన్నో మంచి మాటలు చెప్పాడు .ఏ ప్రభుత్వానికైనా మొదటి విధి తనను తాను రక్షించుకోవటం తర్వాత దాని ఉనికి ని కాపాడుకోవటం అవసరం అన్నాడు లింకన్ ప్రెసిడెంట్ గా బాధ్యతలు చేబట్టే నాటికి ప్రభుత్వ నిధులన్నీ నైవేద్యం అయి పోయాయి .అంతకు ముందున్న ఏ ప్రెసిడెంట్ కు ఇంతటి ఆర్ధిక విపత్కర పరిస్తితి ఎదురు కాలేదు .ధైర్యాన్ని ,సాహసాన్ని ప్రదర్శించి మనసు దిటవు చేసుకొని అవగాహనా చాతుర్యం తో ,ప్రజల్లో విశ్వాసం కల్పించాడు ,ఉత్తేజం, ప్రేరణ కలిగించాడు .ప్రజా హృదయాలను గెలవటమే కాదు తనను తాను గెలిపించుకొన్నాడు అదీ లింకన్ అసమాన ప్రతిభ .

      ప్రెసిడెంట్ వాషింగ్ టన్ తర్వాత ప్రజల్లో ఇంత విశ్వాసం, నమ్మకం కలిగించిన వారెవరూ లేరు .లింకన్ మళ్ళీ అలాంటి విశ్వాసాన్ని ప్రజలకు కలిపించాడు స్తిర చిత్తం తో నిల బడ్డాడు .మూడేళ్ళ అస్తవ్యస్త స్తితి నుంచి గట్టెక్కించాడు .ఒక విశ్లేషకుడు చెప్పినట్లు ‘’కాలమే లింకన్ ప్రధాని మరియు సైన్యాధికారి ‘’.లింకన్ అటార్నీ గా ఉండి ప్రెసిడెంట్ పదవికి ఎదిగిన లాయర్. .ఆయన ఆకారాన్ని ‘’సామ్కోపాంజా‘’తో పోల్చి వినోదించిన వారూ ఉన్నారు .

           ఇంగ్లాండ్ రాజు హెన్రి ఫోర్త్ ను లింకన్ ను పోలుస్తూ Henry fourth ‘’went over the nation ‘-Lincoln steadily down the nation over to him .Henry left a united France  –LINCOLN RE UNITED America ‘’అని గొప్ప గా చెప్పారు .ఇంకొకరు విక్టోరియా రాణి తో పోలుస్తూ లింకన్ కూడా విక్టోరియా లా అందగాడు కాదన్నారు .అయితే అమెరికనిజం ఉన్న గొప్ప నాయకుడు అని కీర్తించారు .ఆయన్ను ‘’స్వయం సిద్ధ నాయకుడు’’ –ready made leader అన్నారు .    

        లింకన్ గొప్ప మేధావితనం, విషయావగాహనలోనే కాక ప్రజలను అర్ధం చేసుకోవటం లో కూడా కనీ పిస్తుంది .ఆయన ఆదర్శ నీయ మైన ,యదార్ధ రాజకీయ దురంధరుడు –స్టేట్స్ మాన్ ..ఉన్నదానిలో అత్యున్నత మైనదిఆశించటం ,కాకపోతే అంతకు దగ్గరలో ఉన్న దానిని పొందటం ఆయన లక్ష్యం ,లక్షణం . అయన లో విచక్షణ తో కూడిన అనుభవం పుష్కలం గా ఉంది .

         లింకన్ తాను ఎక్కడికి వెళ్ళినా తనతో బాటు అమెరికాను తీసుకొని వెళ్ళాడు .ఆయన పొందినదాన్నే అనుభ వించాడు .ఆయన్ను ప్రజల సాధారణ జ్ఞానానికి ప్రతి నిధి గా, అవతార స్వరూపుడిగా భావిస్తారు .ఆయన వాగ్దోరణి లో‘’సెంటి మెంట్ ‘’అనేది ఉండక పోవటం ప్రత్యేకత ఇది రాజ కీయ నాయకులందరూ గమనించాల్సిన విషయం ..సందర్భం సంఘటనల నేపధ్యం లో వాటిని తనకు, దేశానికి అనుకూలం గా మార్చుకొని రాజకీయాలు నడిపాడు సంఘటనలే ఆయనకు దారి చూపాయి కాలనీ ప్రజల దీర్ఘ ప్రయోజనాలనే దృష్టిలో పెట్టు కొని పని చేసిన మహోన్నత నాయకుడు లింకంన్ .లింకన్ కు ఆదర్శం ఫ్రెంచ్ తత్వ వేత్త ,దార్శనికుడు ‘’వోల్టైర్ ‘’చెప్పిన సూక్తి ‘’A consideration of petty circumstances is the tomb of great things ‘’అనేదే .

        ఏ విషయం వచ్చినా ‘’రండి కలిసి ఆలోచించి చర్చిద్దాం ‘’అనే వాడు ప్రజల ప్రేమను ,వారి తీర్పును అంత గొప్ప గా పొందిన ప్రెసిడెంట్ లేనే లేడు.మనిషి లోనుంచే ఉన్నత భావాలు రావాలి కనుక మనుష్యుల తో చర్చించి నిర్ణయాలు తీసుకోవటం లింకన్ కు ఇష్టం .నిర్ణయం తాను తీసుకొని ప్రజల మీద రుద్దటం భావ్యం కాదని భావించేవాడు ..ఆయన మాటల్లోకాని ,ప్రసారాల్లో కాని చాలా నిజాయితీగా ‘’this is the conclusion to which in my judjement ,the time has come and to which accordingly ,the sooner we come the better for us ‘’అనే వాడు .ఎక్కడైనా ‘’I’’అని ఉపయోగించినా అందులో ఈగోయిజం ఉండేది కాదు

         అయన మాట్లాడుతూ ఉంటె ప్రజలు తమ మనో భావాలను తాము బయట పెట్టుకొంటున్నట్లు గా ఉండటం లింకన్ తో ప్రజల మమైక్యానికి నిదర్శనం .ప్రజలకున్న తెలివి తేటల ను ప్రశంసించే వాడు .దానినే ప్రస్తావిన్చేవాడు .వారి అజ్ఞానాన్ని ,అమాయకత్వాన్ని గురించి ఎప్పుడూ మాట్లాడే  కాదు అదీ ప్రెసిడెంట్ లింకన్ వ్యక్తిత్వం . .ఎన్నికలలో మెజారిటీ సంపాదించటమే కాదు తన దేశ ప్రజలను తన దగ్గరకు తెచ్చుకొనే వాడు అంత నిజాయితీ నిర్భీకత ,శక్తి ఉన్న నాయకుడు ఏబ్ లింకన్ .

           ప్రెసిడెంట్ లింకన్ హత్య గావింప బడి చని పోతే ప్రజలు ‘’సామాన్య మాన వీయత ‘’ను కోల్పోయి నట్లు దుఖించారు .తమ   ఆరాధ్య  దైవం మరణించి నట్లు విలపించారు తమ మార్గ దర్శి ,సంక్షేమ కామి చని పోయినట్లు బాధ పడ్డారు .ఇంత గా ఏ ప్రెసిడెంట్ చని పోయినప్పుడూ ప్రజలు స్పందించలేదు .అదే ఆయన ప్రజల్లో కలిగించిన చైతన్యం . .ప్రజల్లో ఉన్న వీర ఆరాధన .ప్రజలకు, ఆయనకు భేదమే లేని అద్వైతం ఆయన సాధించాడు .మహోన్నతా మానవతా మూర్తి అబ్రహాం లింకన్ అమర్ రహే .

            9-8-2002 నా అమెరికా డైరీ నుండి మీ కోసం జేమ్స్ రస్సెల్ రాసిన వ్యాసం చదివిస్పూర్తి పొంది రాసుకొన్న విషయాలివి

           మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -22-6-13- ఉయ్యూరు .

 
 
 


గబ్బిట దుర్గా ప్రసాద్
https://sarasabharati.wordpress.com
http://suvarchalaanjaneyaswami.wordpress.com

Posted in అమెరికా లో | Tagged | Leave a comment

ఆదర్శ కమ్యూనిస్టు ఆలూరి

ఆదర్శ కమ్యూనిస్టు ఆలూరి

June 22, 2013

షహీద్ భగత్‌సింగ్ గురించి బిపిన్‌చంద్ర, ఎజి నూరానీ, చమన్‌లాల్ వంటి చరిత్రకారులు, న్యాయకోవిదులు, పరిశోధకులు శోధించి ఇప్పటికీ వెలికితెస్తున్న ఎన్నో ఉత్తేజకరమైన సంఘటనలు, సందర్భాలు, దార్శనిక భావజాలం కన్నా ముందు తెలుగు పాఠకుల ఒక తరాన్ని విప్లవ భావజాలం వైపు ఆకర్షించిన, నిలిపిన ప్రామాణిక గ్రంథం ‘సింహావలోకనం’. భగత్‌సింగ్ సమకాలికుడైన యశ్‌పాల్ భగత్‌సింగ్‌ను కేంద్రబిందువుగా చేసుకుని తాను కూడా తలమునకలుగా పాల్గొన్న విప్లవోద్యమం గురించి రాసిన ఆ గ్రంథం యశ్‌పాల్‌దని గుర్తుపెట్టుకున్నంతగా తెలుగు పాఠకులు దాని అనువాదకుడు ఆలూరి భుజంగరావుగారిని గుర్తుపెట్టుకున్నారా? భగత్‌సింగ్ తల్లి, అన్న కుటుంబం నుంచి ఆయన అరుదయిన జీవిత విశేషాలు విని ఇవాళ్టికీ మిగతా ఎవరికన్నా కూడా భగత్‌సింగ్ దార్శనికతను ఇవాళ్టి సామ్రాజ్యవాద వ్యతిరేక ప్రజాస్వామిక ఉద్యమంలో భాగంగా ప్రచారం చేస్తున్న ఆయన మేనల్లుడు ప్రొఫెసర్ జగమోహన్‌సింగ్ వలె భగత్‌సింగ్ అంతర్‌బహిర్ లోకాలను చూసినవాడు యశ్‌పాల్. ఆలూరి భుజంగరావు అనువాదం చేయకపోతే హిందీలో రాసిన ఆ పుస్తకం తెలుగు పాఠకులకు అందుబాటులోకి వచ్చేదే కాదు.
ప్రేంచంద్ ‘రంగభూమి’ నవల అంత ఉద్గ్రంథమైనా ఏకబిగిని అది చదివేసిగానీ బయటి ప్రపంచంలోకి రాలేకపోయానని జూన్ 20 సాయంత్రం గుంటూరులోని ఆలూరి భుజంగరావు అంత్యక్రియల దగ్గర నాతో ఒక పాఠకురాలు అన్నది. ప్రేంచంద్ సాహిత్యం, రాహుల్ సాంకృత్యాయన్ సాహిత్యం చదవని బుద్ధిజీవిని, సామాజిక స్పృహ కలిగిన వ్యక్తిని ఊహించుకోవడం కష్టం. హిందీ, ఇంగ్లీషులలో అవి చదువలేనివారు, చదవనివారు అవి మా చిన్నప్పుడే చదివాం గానీ వాటిలో ప్రేంచంద్ ‘గబన్’, ‘నోరా’, రాహుల్ సాంకృత్యాయన్ ‘జయÄౌధేయ’, ‘విస్మృత యాత్రికుడు’, ‘దివోదాసు’, ‘దర్శన్ దిగ్దర్శన్’ (ప్రాక్పశ్చిమ దర్శనాలు) మొదలయిన పుస్తకాలను ఆలూరి భుజంగరావు గారు అనువాదం చేసారని గుర్తుపెట్టుకోలేదు, ఆయనతో పరిచయం చేసుకోవాలని అనుకోలేదు అని బాధపడిన వాళ్లు కూడా ఉన్నారు. ఆలూరి భుజంగరావుగారు కిషన్‌చందర్ ‘వాయుగుండం’, ‘పరాజయం’ నవలలు కూడా అనువదించారు.

అయితే ఇదంతా ఐక్య కమ్యూనిస్టుపార్టీ, ఆ ప్రచురణ సంస్థలు 1930ల నుంచి 50ల వరకు నెలకొల్పిన ఉత్తమ విలువలు తెలిసినవారికి ఆశ్చర్యకరమైన విషయాలు కావు. గొప్ప సృజనాత్మక రచయితలందరినీ గొప్ప అనువాదకులుగా కూడా తీర్చిదిద్ది అనువాదం కోసమే ఒక సమర్థవంతమైన రచయితల బృందాన్ని తయారుచేసిన ఘనత కూడా ఐక్య కమ్యూనిస్టు పార్టీదే. తెనాలిలో సుప్రసిద్ధ నవలా రచయిత శారద కృషియైనా, ఆ తర్వాత కాలంలో గుడివాడలో ‘సాహిత్యనికేతన్’ ఏర్పాటు చేసి ఆలూరి భుజంగరావు గారు చేసిన కృషియైనా పూర్తిగా అట్లా ఒక నిర్మాణంలో భాగమని చెప్పలేం.

నక్సల్బరీ ‘వసంత మేఘగర్జన’ తర్వాత కూడా ఆ సంప్రదాయాన్ని కొనసాగించిన ఏకైక వ్యక్తి మాత్రం ఆలూరి భుజంగరావు. సమకాలీన చేదునిజాలను యశ్‌పాల్ చెప్తే ఆయన మాటలు ఈ లోకానికి చెప్పాల్సినవని అనుకున్నాడు. 1968 తర్వాత సరోజ్‌దత్తా చెప్తే కూడా ఇవి ఇవాళ్టి అవసరాలు, ఈ తరం తెలుసుకోవాల్సిన వాస్తవాలు అనుకొని అనువాదం చేసాడు. విగ్రహారాధనగా మారి భారత పునర్వికాస పితృత్వాల చర్విత చరణాలను సరోజ్‌దత్తా సాహసంగా ప్రశ్నిస్తే ఆ చిన్న చిన్న పొత్తాలను భుజంగరావుగారు తెలుగులోకి అనువదించి నక్సల్బరీ తరానికి అందించారు. ‘గాంధీజీ’ పై ‘మరోసారి ఈ దేశం మోసపోకూడదు’ వంటి కవితలు ఇటువంటి రచనలు తెలుగులో వెలుగు చూడకుండా సాధ్యమయ్యేవి కావు.

సామాజిక మార్పును కోరే నిజాయితీ కల బుద్ధిజీవికి ఆలూరి భుజంగరావు జీవితం ఒక ఆదర్శం. అటువంటి జీవితం ఎనభై అయిదేళ్లు గడవగలగడమనేది నిజంగానే ఆసిధారావ్రతం. ఆ జీవితం కూడా ఎట్లా మొదలయింది – దుర్భరంగా, ఇవ్వాళ మనం ఊహించుకోలేని అష్టదరిద్రంలో. ఆంధ్రాప్యారిస్ అని పిలుచుకున్న తెనాలిలో ముగ్గురి జీవితం అట్లా మొగ్గదొడిగింది. బురదగుంటలో చావకుండా బతికిన చిగురువలె, సుడిగాలికి తట్టుకొని నిలిచిన గడ్డిపోచవలె. ఆ ముగ్గురు ‘శారద’ పేరుతో ‘మంచీచెడూ’, ‘అపస్వరాలు’, ‘ఏదీసత్యం’ – వంటి జీవిత సత్యాలను ఆవిష్కరించిన నవలలు, కథలు రాసిన నటరాజన్ అనే తమిళుడు, ఆలూరి భుజంగరావు, ప్రకాశం. ప్రకాశం ఈ ముగ్గురి బృందానికి కమ్యూనిస్టు భావజాలాన్ని అంటించిన నాయకుడు. భుజంగరావుగారి తెనాలి జీవితంలో ఇంతే దుర్భరమైన జీవితాన్ని అనుభవించిన రావూరి భరద్వాజ కూడా ఉన్నారు. ఆలూరి భుజంగరావు హోటల్ వర్కర్‌గా పనిచేస్తూ, చదువు, రచన ఒక వ్యసనంగా గడిపిన బాల్యం, నవయవ్వనాల గురించి ‘శారద’ను కేంద్రస్థానంలో పెట్టి రాసిన ‘సాహిత్యబాటసారి శారద’, తన తర్వాత జీవితాన్ని కూడా ఆవిష్కరించిన ‘గమనాగమనం’, ‘గమ్యం దిశగా గమనం’ పుస్తకాల్లో చదువుతూ ఉంటే ఇన్ని కష్టాలు తట్టుకొని, ఇంత దారిద్య్రాన్ని, ఇంత ప్రమాదాన్ని ఎదుర్కొని ఈ బక్కపలచని మనిషి నిండుజీవితం ఎట్లా గడిపాడా అని ఆశ్చర్యం వేస్తుంది. అయితే ‘శారద’ బతికున్నంతకాలం (చాలా అల్పాయుష్కుడుగా, దారిద్య్రం నుంచి విముక్తి లేకుండా దారిద్య్రానికే ఎర అయ్యాడు ‘శారద’) ఆలూరి భుజంగరావు సృజనాత్మక రచనలు ఆయనే చేయాలనుకున్నాడు.

ఆయన జీవితంలోని మూడు దశల్లో మూడవ దశలో అరవయ్యో, డెబ్బయ్యో పడిలో గానీ ఆయన ఎక్కువ సృజనాత్మక రచనలు చేయలేదు. ‘కొండవాగు’, ‘ప్రజలు అజేయులు’ వంటి నవలలు, ‘అరణ్యపర్వం’ వంటి కథలు – అన్నీ ఆయన కమ్యూనిస్టు జీవితంలోని, విప్లవోద్యమంలోని స్వానుభవాలు.
‘సాహిత్యబాటసారి శారద’లో మనకు ఆయన శారద వంటి ఒక నిప్పులో పుటం పెట్టిన సాహిత్య నిమగ్నజీవిని పరిచయం చేస్తూ, ఆ పరిచయ క్రమంలో దేశ, కాల, పాత్రల్లో శారదను, తనను లొకేట్ చేస్తే, ‘ప్రజలు అజేయులు’లో 1980, 90లలో తెలంగాణలో జరిగిన విప్లవోద్యమం, అందులో నల్గొండ జిల్లా పీపుల్స్‌వార్ కార్యదర్శిగా అమరుడైన కిరణ్ చుట్టూ ఆ రెండు దశాబ్దాల ఆటుపోటులను చిత్రించాడు. కోరుట్లలో రాడికల్ ఉద్యమంతో ఆకర్షితుడైన కిరణ్ పూర్తికాలం విప్లవకారుడుగా మారి పీపుల్స్‌వార్ పార్టీలో చేరి అంచెలంచెలుగా ఎదిగి నల్లగొండ జిల్లా విప్లవోద్యమ నిర్మాణం చేస్తూ కార్యదర్శి అయి యాదగిరిగుట్ట పోలీసుస్టేషన్‌పై దాడి చేసి ఆయుధాలు స్వాధీనం చేసుకొని సాహసికంగా తప్పించుకుంటున్నప్పుడు మూసీనది ఉప్పొంగి దారులు మూసుకుపోయి పోలీసులకు ఎదురుపడి ‘ఎన్‌కౌంటర్’ అయిన కథనం కల్పన కన్నా గగుర్పొడిచే వాస్తవం. ఆ కిరణ్ స్వయంగా భుజంగరావుగారి అల్లుడు. ఆలూరి భుజంగరావు గారు ఒంటరి విప్లవ పరివ్రాజకుడు కాదు. నిన్నటిదాకా ఆయన వేలుపట్టుకొని ఏభైఏళ్లుగా ఆయనతో విప్లవ పథంలో నడుస్తున్న లలితగారితో పాటు ఆయన తన నలుగురు కూతుళ్లనూ విప్లవోద్యమంలోకి తెచ్చాడు. తెచ్చాడంటే తన బహిరంతర ఆచరణలో అటువంటి వాతావరణాన్ని కల్పించాడు. ఆ తర్వాత కాలంలో వాళ్లు ఎటువంటి జీవితాలను ఎంచుకున్నా ఆయన రక్తబంధుత్వం కూడా వర్గబంధుత్వ దృక్పథాన్ని నిలుపుకునే తనదైన ఒక జీవితాదర్శాన్ని ఆయన వదిలిపోయాడు.
గుడివాడలో హిందీపండిట్‌గా పనిచేసిన కాలంలో ఆయనకు గంజిరామారావు, మునిస్వామిగార్లతో పరిచయం, గాఢానుబంధం ఏర్పడింది. అదే ఆయనను విప్లవ రాజకీయాల్లోకి తెచ్చింది. 1986లో ఉద్యోగ విరమణ తర్వాత ఆయన పూర్తికాలం అనువాద దశనుంచి విప్లవం కోసం సాహిత్య కృషి చేసే పనిని ఎంచుకున్నాడు. 1984లో లేటు వయసులో విప్లవంపై ఘాటుప్రేమతో విరసంలో చేరాడు. అక్కడ కూడా ఆగకుండా ఆరు సంవత్సరాల పాటు అజ్ఞాత జీవితంలో గడిపి దండకారణ్య విప్లవోద్యమం నిర్వహిస్తున్న ‘ప్రభాత్’ హిందీపత్రిక సంపాదకవర్గంలో బాధ్యతలు పంచుకున్నాడు.
ఐక్యకమ్యూనిస్టు పార్టీ దశలో రాహుల్ సాంకృత్యాయన్, ప్రేంచంద్, కిషన్‌చందర్, యశ్‌పాల్ వంటి రచనలు అనువదించడానికి ఎంచుకున్నట్లే నక్సల్బరీ, శ్రీకాకుళం, జగిత్యాల, దండకారణ్య విప్లవోద్యమ దశలో తెలుగు నుంచి హిందీలోకి ‘విప్లవసాహిత్యాన్ని’ అనువాదం చేసి దేశానికంతా తెలంగాణ, దండకారణ్య విప్లవోద్యమాలను పరిచయం చేసాడు. సాధన రాసిన ‘రాగో’ నవల, సికాస కథలు ‘బొగ్గుపొరల్లో’, విరసం సంకలనం చేసిన ‘నేలతల్లి విముక్తికోసం’ కథలు, దండకారణ్య అమరవీరులు, అల్లంరాజయ్య కథ ‘అతడు’ హిందీలోకి అనువాదం చేసాడు.
ముప్పై ఏళ్లుగా విరసంలో సభ్యుడుగా ఆయన క్రమశిక్షణ గురించి చెప్పాలి. ఆయన, లలితగారు ఆయన ఆరోగ్యం అనుమతిస్తే రాకుండా ఉండే సభ, సమావేశం ఉండవు. శ్రద్ధగా వినాలి, చర్చలో పాల్గొనాలి, అంతే కాదు ఇద్దరూ చంకకు తగిలించుకుని తెచ్చే పుస్తకాలు పరచి అవి సభాస్థలి దగ్గర అమ్ముతూ కూచోవాలి. ఏకకాలంలో ఒక బుద్ధిజీవిగా, ఒక కార్యకర్తగా, అన్నిటినీ మించిన సాంస్కృతిక యోధునిగా ఆయన ఆఖరి శ్వాస వరకు కూడా ఇప్పటి తరానికి ఒక కఠోరమైన ఆచరణ నమూనాగా నిలిచిపోయాడు. కెవిఆర్ విప్లవ రచయితల సంఘం అనే పదసముదాయంలో విప్లవం, రచన, సంఘచైతన్యం – ఏ ఒక్కటీ తక్కువ చేయాల్సింది కాదు అని అంటుండేవాడు. ఆలూరి భుజంగరావుగారి జీవితం విరసంకు రెట్టింపు గనుక ఆయనను అంతకన్నా మించిన ఆదర్శ కమ్యూనిస్టుగా ఆవాహన చేసుకోవడం ఈ తరానికి సార్థకమైన స్ఫూర్తి.
– వరవరరావు

Posted in మహానుభావులు | Tagged | Leave a comment

నా దారి తీరు -31 హెడ్ మాస్టారి బదిలీ

     నా దారి తీరు -31

                  హెడ్ మాస్టారి బదిలీ

           పామర్రు హైస్కూల్ లో చేరి రెండేళ్ళు అయింది .అప్పటికి హెడ్ మాస్టారు రామ క్రిష్నయ్య గారు అయిదారేళ్ళ నుండి ఉన్నట్లు గుర్తు .ఆయనే కావాలనుకోన్నారో లేక పునాది పాడు   వాళ్ళు అడిగారో ఆయన్ను పునాది పాడు బదిలీ చేసి నట్లు జ్ఞాపకం .అక్కడి నుంచి ఉయ్యూరు కు ఆ తర్వాతా ఇంకెక్కడికో వేల్లినట్లుంది .రామ క్రిష్నయ్య గారికి బ్రహ్మాండమైన వీడ్కోలు ఇచ్చాం .అప్పుడు పామర్రు పెద్ద కోటి రెడ్డి గారు .తరచుగా స్కూల్ సమావేశాలకు వస్తూందే వారు వారి అబ్బాయి పెళ్లి మంత్రాలు లేకుండా చేసి మమ్మల్ని ఆహ్వానించి గొప్ప విందు చేశారు రామ క్రిష్నయ్య గారి గురించి చాలా మంచి మాటలు చెప్పారు .భార హృదయం తో ఆయన్ను సాగ నంపాము .ఆఫీసు స్టాఫ్ లో నల్లటి లావు పాటి అతను నాగ భూషణం  ఉండే వాడు . అతని తో మాట్లామాట్లాడటానికిఅందరు  భయ పడే వాడు.ఆఫీసురూం లోకి రానిచ్చే వాడుకాదు .నాకు ప్రవేశం ఉండేది . బల్లి పర్రు నివాసి వాళ్ళ అమ్మాయి చదివేది .తర్వాతా సమితి లో చివరికి జిల్లా పరిషత్ లో పై పదవులు చేశాడు .ఇంక్రిమెంట్ చేయమని అడగటానికి భయ పాడేవాళ్ళు మేస్టార్లు కసురుకొనే వాడు హెడ్ కి చెప్పినా పూజారి వరమివ్వందే సాగదని అందరు బిగ పట్టుకొనే వారు .వెడల్పు పళ్ళతో నల్లగా ఉన్నా తెల్లని బట్టలేసే వాడు .అంజి రెడ్డి ,రాధాకృష్ణ మూర్తి అని ఇంకో జూనియర్ గుమాస్తా ఉండేవారు ఇతను పంచె కట్టే వాడు ఖద్దరు బట్టలే కట్టే వాడు దగ్గరలోని కూచికాయల పూడి నుండి వచ్చేవాడు .నాకు మంచి స్నేహితుడయ్యాడు అతిగా మాట్లాడడు .రెడ్డి అలా కాదు .అన్నీ మీదేసుకొంటాడు బందరు వెళ్లి ఆఫీసు లో పనులు సాధించుకోస్తాడు బొమ్మా రెడ్డి సీతా రెడ్డి అనే స్తానిక నాయకుడికి బంధువు అంతే వాసి .రెడ్డి ఇల్లు స్కూలు ప్రక్కనే .తరచుగా మమ్మల్ని ఇంటికి తీసుకొని వెళ్లి కాఫీ యో టీయో ఇప్పించేవాడు అతని కూతురురు కొడుకు అక్కడ నా దగ్గరే చదువు కొన్నారు ..రామ క్రిష్నయ్య గారి ట్రాన్స్ఫర్ బహుశా 1974ఆగస్ట్ లో జరిగి ఉంటుంది .

              కొత్త హెడ్ మాస్టారు మోచర్ల పూర్ణ చంద్ర రావు గారు

         రామ క్రిష్నయ్య గారి స్తానం లో మోచర్ల పూర్ణ చంద్ర రావు గారు వచ్చి  వెంటనే చేరారు ..ఈయన భారీ మనిషి .మంచి పర్సనాలిటీ..పంచ తమాషా గా కట్టే వారు లాల్చీ వేసే వారు పైన ఖండువా ఉండేది కొంచెం స్పోటకం  మచ్చలతో చిన్న మొహం తో ఉండేవారు అయన జుట్టు లొంగేది గా ఉండేది కాదు తెల్ల బడిపోయింది వెనక్కి దువ్వె వారు నేను సర్వీసులో మొదటి సారి మోపి దేవి లో పని చేసి నప్పుడు ఆయన నాగాయ లంక స్కూల్ హెడ్ మాస్టారు గా ఉండే వారు .వారి స్కూల్ లో గ్రిగ్ స్పోర్ట్స్ జరిగితే మేము వెళ్లి ఆడం అప్పటి నుంచి ఆయన తో పరిచయం .బ్రాహ్మణ మేస్తార్లందరికి ఒక బ్రాహ్మల ఇంట్లో భోజనం ఏర్పాటు చేశారు ఆయనా మేము కలిసి భోజనం చేశాం .అదీ మా పరిచయం

               పూర్ణ చంద్ర రావు గారు రోజూ బందరు నుండే వచ్చే వారు ఖచ్చితం గా ఉదయం తొమ్మిదిన్నర కు స్కూల్ లో ఉండేవారు ఏనాడూ దీన్ని ఉల్లంఘించలేదు మంచి అడ్మినిస్త్రేటార్ గా పేరుంది చలాకీ గా మాట్లాడే వారు అతి లేదు అన్నీ టమ్చన్  గా జరిపే వారు .ఇంగ్లీష్ బోధించేవారు .ఆఫీసు వర్కు బాగా తెలిసినవారు స్కూలు బిల్లులు ఏవైనా పెండింగ్ లో ఉంటె ఆఫీసుకు కు వెళ్లి సాంక్షన్ చేయించేవారు .మంచి వాలీ బాల్ ప్లేయర్ కూడా పంచె పైకి ఎగ కట్టి అదే వారు .ఈ సమయం లోనే ఉయ్యూరు నుండి క్రాఫ్ట్ మేష్టారు కోడె రామ మహన రావు కూడా ఇక్కడికి బదిలీ అయ్యాడు .మేమిద్దరం కలిసే వచ్చే వాళ్ళం .   హెడ్ గారు మాంచి చతురులు .ఒక సారి నేను ఒక పది నిమిషాలు ఆలస్యం గా స్కూల్ కు వచ్చాను బస్ దొరక్క పోవటం వల్ల .ఆయన ఏమీ మాట్లాడలేదు .సాయంత్రం నేను ఇంటికి వెళ్ళ బోతుంటే పిలిచి ‘’ప్రసాద్ గారూ !ఇంటి దగ్గర భోజనానికి ఇబ్బంది అయితే కారియర్ తెచ్చుకోండి ‘’అన్నారు అంతే .’’ఇక నుంచి లేట్ గా రావద్దు అన్నీ చూసుకొని సమయానికి రావాలి సుమా ‘’అనే హెచ్చరిక ఉంది ఆ మాటలో వెంటనే గ్రహించి సారీ చెప్పా.మర్నాడు నుండి మళ్ళీ ఎప్పుడూ ఆలస్యం గా స్కూల్ కు వెళ్ళలేదు .పంక్చువాలిటి ని అంత సుతి మెత్తగా చెప్పారాయన .నాకు మార్గ దర్శి అయ్యారు ..

                    కొత్త పే స్కేల్స్

        ఆ కాలం లోనే పే రివిజన జరిగి జీతాలు బాగా పెరిగాయి ఇది వరకు  నా జీతం రెండొందల యాభై అయితే జలగం వెంగల రావు ముఖ్య మంత్రి గా ఉన్నప్పుడు అమలైన రివిజన్ వల్ల ఒక్క సారి గా 418 బేసిక్ అయింది ఇది వరకు స్కేలు 15-10-300ఉంటె ఇప్పుడు 320-14-460-15-580అయింది .అప్పటి దాకా బ్రహ్మా నంద రెడ్డి యాభై ఆరు రోజులు  స్ట్రైక్ చేస్తేముష్టి ఆరు రూపాయలుడి.ఏ.ఇచ్చాడు వెంగల రావు పుణ్యమా అని డి.ఏ.కేంద్రం ఇచ్చే దానీతో లింక్ చేశాడు ఇది ఊహించని జీతం దీనితో పాటు ఆటో మేటిక్ ప్రొమోషన్ స్కేల్లు ఎనిమిదేళ్ళకు పదిహేనేల్లకూ కూడా ఇచ్చాడు .ఇఇది వరకు దాకా మేస్టార్ల జీతం అందరి కంటే తక్కువ గా ఉండేది ఇప్పుడు అందరి కంటే ఎక్కువ జీతం తీసుకొంటున్నాం ‘’.బతక లేక బడి పంతులు పోయి బతకటానికి బడి పంతులు’’అయింది.సాంఘిక స్తాయి పెంచిన ఘనత  వెంగళ రావు దే దానికి ఉద్యోగస్తులందరూ రుణ పడి ఉంటారు .అయినా ఇందిరా ప్రభావం లో ఓడిపోవటం దురదృష్టం .

                            బదిలీ ప్రయత్నాలు

         మెల్లిగా గాలి ఉయ్యూరు మీదకు మళ్ళింది వీలైన ప్పుడల్లా ఏం.ఎల్.సి.కోటేశ్వర రావు ను కలవటం ఉయ్యూరు కు ట్రాన్స్ఫర్ చేయమనటం జరుగుతూనే ఉంది నాకంటే ముందే క్రాఫ్ట్ మేష్టారు వెళ్లి పోయాడు ఉయ్యూరు .ఆ రోజుల్లో ఉయ్యూరు ,పామర్రు సెంటర్ల లో ఉద్యోగం చేసే మేస్టార్లు ఏ రోజు ఉంటారో  ఏ రోజు బదిలీ అవుతారో తెలీని పరిస్తితి రాజకీయ అండ ఉంటేనే అక్కడ ఉండగలగటం లేకుంటే జెండా బుజాన వేసుకొని సిద్ధం గా ఉండటం నా విషయం లో ఎప్పుడూ బదిలీ చేస్తూనే ఉన్నారు ఏడాదికో రెండేళ్ళకో మళ్ళీ దగ్గరికి చేరుతున్నాను దీనికి కారణం మా కొల్లూరి. ఆయనే నాకు ‘’గాడ్ ఫాదర్ ‘’నేనన్నా ,నా మాట అన్నా అయన కు అభిమానం .దీనికి తోడూ కాంతా రావు కు ఆయన బి.యి.డి క్లాస్ మేట్ .మేమంతా ఒకటిగా ఉండటం ఏదైనా పని కావలసి వస్తే అందరం కట్ట కట్టుకొని బందరు వెళ్లి తెలుగు విద్యార్ధి ఆఫీసు లో ఆయన్ని కలవటం ఒత్తిడి చేయటం మాకు మామూలే .దానికి ఆయన పాజిటివ్ గానే స్పందించే వాడు .

                              ఉయ్యూరు కు బదిలీ

           ఒక ఆది వారం రోజు నేను మధ్యాహ్నం  బందరు వెళ్లాను కొల్లూరి ఇంటికి. అప్పుడు అయన చైర్మన్ పిన్నమ నేని తో ఫోన్ లో మాట్లాడుతున్నారు ‘’కోటేశ్వర రావు గారూ !ఉయ్యూరు హైస్కూల్ లో మనం కాలు పెట్టాలంటే దుర్గా ప్రసాద్ గారిని ఉయ్యూరు ట్రాన్స్ఫర్ చేయాల్సిందే గత్యంతరం లేదు ఆయన అక్కడ లేక పోతే మీకూ, నాకూ కాఫీ ఇచ్చేవాడుండడు నేను ఇదే చివరి సారి చెబుతున్నా మీ రాజకీయాలు తో నాకు పని లేదు మా దుర్గా ప్రసాద్ కు ఉయ్యూరు ఇవ్వాల్సిందే ‘’అని చెబుతూ ఉండగా నేను విన్నాను నాకేమీ తెలీనట్లు లోపలి వెళ్లాను ‘’రండి ప్రసాద్ గారు !ఇప్పుడే చైర్మన్ గారితో మాట్లాడాను చాలా గట్టిగా చెప్పాను మిమ్మల్ని ట్రాన్స్ఫర్ చేయక పోతే కుదరదని చెప్పాను’’అన్నారు . థాంక్స్ చెప్పి ఉయ్యూరు వచ్చాను .ఈ విషయం ఎవరికీ చెప్పలేదు. మా ఇంట్లో కూడా. ఇలాంటివి బయటికి పొక్కితే పని జరగదని నా అనుభవం .

                 ఉయ్యూరు లో గండ్రం వెంకటేశ్వర రావు గారి తమ్ముడు, మా వూరి అల్లుడు ఉమా మహేశ్వర రావు బి.కాం.గారు ఫిజికల్ సైన్సు  టీచర్ గా ఉన్నాడు .ఆయన ఈ కొత్త టాపిక్స్ ఎలా చెబుతాడో అందరికి ఆశ్చర్యం .ఆయనే కాదు అప్పుడు పామర్రు లో నరసయ్య గారు అనే ఫిజికల్ సైన్సు టీచర్ ఉండేవాడు .పుస్తకం చేతిలో తీసుకొని విద్యార్ధుల ముఖం కూడా చూడకుండా బోర్డు మీద రాయకుండా చదివేశావాడు పావు గంటలో పాఠం అయి పోయేది .మిగతా సమయం అంతా ఖాళీ గా కూర్చునే వాడు లేక పోతే స్వంత పనులు చూసుకొనే వాడు .ఈయన చైర్మన్ గారి పి.ఏ.కు బంధువు .అందుకని సెంటర్ స్కూల్ లో చలా ఇస్తున్నాడు  .ఇలానే ఉయ్యూరు లో’’ అయినాల’’ అని ఒకాయన ఉండేవాడు పిల్లల ముఖం చూడకుండా కుర్చీ వెనక్కి తిప్పి కూర్చుని నాలుగు మాటలు గోణుక్కొనే వాడు అంతే ఏమీ చెప్పే వాడు కాదు ఆయన కాకాని గారి నమ్మిన బంటు కనుక ఉయ్యూరు లాంటి సెంటర్ లలో దర్జా గా ఉద్యోగించాడు .కస్టపడి విద్యార్ధులకు అర్ధమయ్యేట్లు చెప్పి ‘’టంగులు తెగే దాకా చెప్పే వాడికి  చీటికీ మాటికీ బదిలీలు .అదే రాజ కీయ ప్రాభవం ఉంటె ఎదురు లేదు ఈరకమైన  రాకకీయ ప్రాభవం నుండి మేస్తార్లను కాపాడి, కౌన్సెలింగ్ నిర్వహించి గొప్ప ఉప కారం చేశాడు ఆ తర్వాతా ముఖ్య మంత్రి చంద్ర బాబు .ఇది ఒక గొప్ప వరమే మే అయింది ఖాళీ ఉన్న చోటికి వెళ్ళే అవకాశం కాండిడేట్లకు దక్కింది ఏ ప్రయత్నమూ అవసరం లేకుండా .

               ఫిబ్రవరి నెలలో నాకు ట్రాన్సఫర్ జరిగింది. ఇది అరుదైన విషయం .ఉయ్యూరు లోని ఉమా మహేశ్వర రావు ను పామర్రు మార్చి నన్ను ఆస్థానానికి బదిలీ చేశారు ఇదంతా కొల్లూరి ఘనతే .ఆయనకు నా మీద ఉన్న గౌరవమే ,అభిమానమే . 10-2-1976 సాయంత్రం పామర్రు హైస్కూల్ నుంచి రిలీవ్ అయి అదే రోజు సాయంత్రం ఉయ్యూరు హైస్కూల్ లో చేరాను అప్పుడు హెడ్ మాస్టారు నాకు మాని కొండలో హెడ్ మాస్టారు గా చేసిన మిక్కిలి నేని వెంకటేశ్వర రావు గారు .ను వచ్చి నందుకు ఎంతో సంతోషించారు .స్కూల్ లో చేరి ఇంటికి వచ్చి మా శ్రీ మతికి చెప్పాను అంత రహస్యం గా ఉంచాను ట్రాన్స్ఫర్ విషయాన్ని .

           సశేషం –మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -21-6-13- ఉయ్యూరు 

 
 
 

గబ్బిట దుర్గా ప్రసాద్
https://sarasabharati.wordpress.com
http://suvarchalaanjaneyaswami.wordpress.com
Posted in నా దారి తీరు | Tagged | Leave a comment

ఆప్తులు శ్రీ ఆలూరి భుజంగ రావు గారి అస్తమయం

ఆప్తులు  శ్రీ ఆలూరి భుజంగ రావు గారి అస్తమయం

Aluru

           దాదాపు పాతికా ముప్ఫై ఏళ్ళ క్రితం ఉయ్యూరు లో గ్లాస్కో పంచె అరవ గూడ కట్ట్టు కట్టుకొని,దానికి నడుము దగ్గర ముడి వేసి అరచేతుల చొక్కాతో ,భూతద్దం లాంటి నల్ల కళ్ళ జోడుతో ఆలూరి భుజంగరావు మ బజారు లలో తిరగటం చూశాను .భేషజం లేని తీరు .ఎవరేమని అనుకొంటారో అనే ఆలోచన లేని మనిషి .ఆప్యాయపు పలకరింపు నవ్వు ముఖం కదిపిస్తే విప్లవ భావ ధార తో మమ్మల్ని ఆకర్షించే వాడు .మా గురు తుల్యులు స్వర్గీయ వంగల కృష్ణ దత్త శర్మ గారింట్లో కాపురం ఉండే వారు .హిందీ ప్రేమీ మండలిని కొంతకాలం నడిపారు .ఆ తర్వాతా సి.బి.ఏం.స్కూల్ లో హిందీ పండిట్ గా పని చేశారు .మాట పెళుసుగా ఉన్నా మనసు వెన్న..నాకూ ,స్వర్గీయ టి.ఎల్.కాంతా రావు కు ఆంజనేయ శాస్త్రి కి ,రామకృష్ణా రావు గారికి మంచి స్నేహితులు .దత్తు గారు ఆయన గురించి మాకు ఎన్నో విషయాలు తెలియ జేశారు .రాహుల్ సాంకృత్యాయన్ రచనలను తెలుగు లోకి అనువాదం చేశారని దత్తు గారి వల్లనే తెలిసింది అప్పటి దాకా ‘’ఈయన వామ పక్ష భావాలున్న చాదస్తుడు ‘’అను కొన్నాను .కాని ఇంతటి సాహితీ సంపన్నుడు అని ఎరక్క పోయాను .ఇది తెలిసిన దగ్గర్నుంచి ఆయనపై ఆత్మీయతా భావం ,ఆరాధనా భావం పెరిగింది దత్తు గారింట్లో ఆయన రచనలు ఉంటె తీసుకొని చదివాను సాంకృత్యాయన్ ఎంత గంగా ప్రవాహం గా రాశాడో నాకు తెలియదు కాని భుజంగ రావు గంగా నిర్ఝర సదృశం గా రచన చేసి తెలుగు వారికి రాహుల్ ను సాక్షాత్కరింప జేశారు ..పైకి ఏమీ కనీ పించడు .లోపల అంతా సాహిత్యమే, విప్లవ భావజాలమే .

              నేను ఒక సారి ఆయన్ను అడిగాను ‘’భుజంగ రావు గారు!మీలో ఇంత విప్లవ భావ సంపద ఉందే మరి ఆ సిబి..ఏం.స్కూల్ లో ఎలా పని చేయగలుగుతున్నారు ?ఎలా ఇముడుతున్నారు నాకు ఆశ్చర్యం గా ఉంది ‘’అన్నాను దానికి ఆయన ‘’మేస్టారూ !ఇది జీవిక కు సంబంధించిన విషయం పెళ్ళాం పిల్లల్ని పోషించుకోవాలి ఏదో రాబడి కావాలి నేను పని చేస్తున్నాను వాళ్ళు జీతం ఇస్తున్నారు నా భావాలతో వాళ్ళకేమీ పని లేదు .వాళ్ళ మత ధర్మం నాకేమీ అడ్డు కాదు ‘’అన్నారు ఆయన కుటుంబం భార్యా పిల్లల సంగతి నాకేమీ పెద్దగా తెలియదు ఎప్పుడూ ఇంటికి వెళ్ళిన గుర్తు కూడా లేదు .అయితే నస్యం బాగా పీల్చే వారని గుర్తు .చేతి లో ఎప్పుడూ ఒక కర్చీఫ్ ఉండేది ముక్కు తుడుచు కోవటానికి .కళ్ళ జోడు ఎప్పుడూ ముక్కు మీదకు జారుతూ ఉండేది దాన్ని పైకి లాక్కుంటూ ఉండే వారు .రాత్రుళ్ళు చాలా సేపు మేలుకొని తన రచనా వ్యాసంగం చేసే వారని తానే నాకు చెప్పారు .మనిషి బక్క పలచగా, రివట లా గాలి వేస్తె పడి పయేట్లుందే వారు .శరీరం లో మాంసం ఉందా అని పించేది ..స్కూల్ కు పాంటు షర్ట్ తో వెళ్ళే వారు .లేక పోతే పంచ పైన ఉత్తరీయం

         ఉయ్యూరు హైస్కూల్ లో మా మిత్రబృందం సైన్సు రూమ్ నే సాహితీ కేంద్రం గా చేసుకొని అప్పుడు ఎన్నో సాహిత్య కార్యక్రమాలను నిర్వహించామని మీకు ఇది వరకే తెలియ జేశాను .సంక్రాంతి కి ,ఉగాది కి కవి సమ్మేళనాలు జరిపేవాళ్ళం .హైస్కూల్ ఆవరణలో. భుజంగరావు గారు తప్పక హాజరయ్యే వారు .ఆయనకు సామాన్యుడి జీవితమే ముఖ్యం .అప్పటికే అన్ని వస్తువుల ధరలూ ఆకాశం లో ఉండేవి .దానినే సబ్జెక్ట్ గా తీసుకొని కవిత్వం చెప్పే వారు .అది మా ఆంజనేయ శాస్త్రి గారికి నచ్చేది కాదు ‘’ప్రసాద్ గారూ !కవి సమ్మేళనం అంటే ఈ యన కూరలూ, చింత పండూ, పప్పు, ఉప్పూ సంగతి చేబుతాడేమి టండీ ?’’అని విసుక్కొనే వాడు .ఆయనకు కవిత్వసం అంటే మసి బూసి మారేడు కాయ చేసి చూపించటం .భుజంగరావు గారు చెప్పేవి యదార్ధ విషయాలు కనుక నచ్చక పోవటం సహజమే ఆ మాట కొస్తే నాకూ అలానే అని పించేది .కాని ఆయన్ని శాశించలేము కదా .అయన స్వేచ్చ ఆయనది బాగుంటే వింటారు లేకుంటే వినరు .దత్తు గారే మాకు కవి సమ్మేళనానికి అధ్యక్షత వహించే వారు .ఆయనకు కొంత వామ భావాలున్నాయి .కవిత్వాన్ని బేరీజు వేసే షరాబు లా వ్యవహరించే వారు దత్తు గారు .ఇలా కవి సమ్మళనాలలో భుజంగ రావు గారు మాకు దగ్గరయ్యారు .హిందీ బాగా బోధించే వారని మంచి పేరుంది .తన పనేదో తాను చేసుకు పోయే వారు .

            దత్తు గారింట్లో ఉన్నంత కాలం దత్తు గారు భుజంగ రావు గారికి చాలా అండగా నిలిచారు ఆయనకు అన్ని రకాల చేదోడు వాదోడుగా ఉండేవారు ఈ సహాయాన్ని భుజంగరావు గారు కలకాలం జ్ఞాపకం ఉంచుకొని మనసు నిండా కృతజ్ఞతా భావం తో ఉన్నారు ..దీనికి ఒక ఉదాహరణ .దాదాపు పదేళ్ళ క్రితం భుజంగ రావు గారు తన సహచరుడు నటరాజన్ అంటే నవలా రచయిత ‘’శారద ‘’జీవిత చరిత్ర లాంటిది రాస్తూ అందులో తాము తెనాలి లో గడిపిన కాలం ,శారద కుటుంబం అతని మరణం తన అన్నదమ్ములు తల్లి తో భార్య తో అక్కడి కాపురం విశేషాలు రావూరి భారద్వాజతో ధనికొండ హనుమంత రావు తో పరిచయాలురాశారు దీనికి ‘’స్మృతి శకలాలు ‘’అని పేరుపెట్టారు .  దాని పై  సమీక్ష ఏదో పేపర్ లో చదివాను అందులో ఆయన ఫోన్ నంబర్ కూడా ఇచ్చారు అప్పటికే గుంటూర్ లో ఉంటున్నారు .ఫోన్ చేసి మాట్లాడాను .పుస్తకాన్ని పంపారు దాని ఖరీదు మాత్రమె పంపమని అంతకంటే అదనం గా ఏమీ పంప వద్దని తెలిపారు అలానే చేశాను .వెంటనే గుర్తు పట్టి ఎంతో ఆప్యాయం గా మాట్లాడారు తాను ,భార్య కర్నాటక లోఅబ్బాయి దగ్గర ఇంతకాలం ఉన్నామని ఇప్పుడు గుంటూరు వచ్చి అద్దె ఇంట్లో ఉంటున్నామని అడ్రస్ ఇచ్చారు తరచూ మాట్లాడుకొందామని ఉత్తర ప్రత్యుత్త రాలు జరుపుదామని అన్నారు దత్తు గారిని అడిగి నట్లు చెప్ప మన్నారు దత్తు గారు మరణించారని తెలియ జేస్తే ఎంతో విచారించారు ‘’దత్తు గారు నాకు పితృ తుల్యులు అయన సహాయం లేక పోతే నేను ఉయ్యూరు లో బతక గలిగే వాడినే కాదు ‘’.అని కృతజ్ఞతలు తెలుపుకొన్నారు అలాగే పల్లా వజ్ఝాల మృత్యుంజయ శర్మ గారు అంటే ముత్తయ్య మాస్టారు ను కూడా జ్ఞాపకం చేసుకొన్నారు కాంతా రావు మొదలైన ఇతర బృందం విషయాలు అడిగి తెలుసుకొన్నారు. అప్పటికే కాంతా రావు మరణించాడు

              అయన కు ఉత్తరాలు రాసే వాడిని .కొంచెం ఆలస్యం గా సమాధానం రాసేవారు .ఉండటానికిస్వంత  ఇల్లు లేక పోయిందనే బాధ వారిలో కనీ పించింది సంపాదన ఏమిటో తెలీదు రెండు పొట్టలు రెండు పూటలా గడవాలి ఆయన ఉత్త్తరాలు చదివితే ఆర్ధిక స్తితి కాదు దయనీయం గా ఉందని అర్ధమవుతుంది . భార్య కూడా అనారోగ్యం తో బాధ పడుతున్నట్లు తెలిసింది .  .ఏదైనా సహాయం కావాలంటే చేస్తానని అన్నాను ఆయన నిర్ద్వంద్వం గా తిరస్కరించారు .పుస్తకాల మీద రాబడి ఏమైనా వస్తుందేమో అను కొన్నాను .ఒక సారి ఆయనకు జాబు రాస్తూ‘’భుజంగ రావు గారూ !ఇంతకాలం విప్లవ భావాలను నమ్మి ఉన్నారు వాళ్ళందరూ హాయిగా జీవిస్తున్నారు .మీకు కనీసం ఇల్లు కూడా కొని పెట్టలేక పోయారు ఆ భావ వాదులు. మిమ్మల్ని వాడుకోవటమే కాని మీకే సహాయం అంది నట్లు లేదు ‘’అని రాశాను దానికి నాకు సమాధానం రాలేదు .విరసం ను నారా నరాన జీర్ణించుకొన్న వారు భుజంగ రావు గారు .మారు పేర్ల తోను రచనలు చేశారు భగత్ సింగ్ జీవితం లో మనకు తెలియని విషయాలను రాశారు‘’ఆయన ఆత్మ కద ‘’మంచి పేరు తెచ్చు కొన్నది . .

       ఉయ్యూరు లో సాహిత్య కార్య క్రమాల గురించి ఒక సారి రాసి తెలుసు కొన్నారు ఉయ్యూరు వచ్చి అందర్నీ కలవాలను కొంటున్నట్లు చెప్పారు. అప్పుడు నేను సాహితీ మండలి ని నిర్వహిస్తున్నాను ‘’మీరు వస్తే సన్మానం చేసి ఇంతటి గొప్ప రచయిత తో మాకున్న అను బంధం గుర్తు చేసుకోవాలను కొంటున్నాము తప్పక. రావలసింది ‘’అని రాశాను .తప్పక వస్తాననే సమాధానం ఇచ్చారు అయితే మేము 2008 లో అమెరికా మూడో సారి వెళ్లి వచ్చి నప్పటి నుండి భుజంగ రావు గారివిషయమే ఆలోచించాను .ఒకటి రెండు సార్లు నా దగ్గరున్న అడ్రస్ కు జాబులు రాశాను సమాధానం లేదు అవి అందాయో లేదో తెలీదు ఇల్లు మారారో ఏమిటో అర్ధం కాలేదు .. ఒకటి ఎందు సార్లు ఆయన రచనలు పేపర్లో చదివాను గుంటూరు లోనే ట్లు తెలిసింది .కాని మళ్ళీ కమ్యూని కేషన్ లేక పోవటం బాధించింది

             నేను పామర్రు లో సైన్సు టీచర్ గా పని చేసినపుడు, అడ్డాడ లో హెడ్ మాస్టర్ గా పని చేసినప్పుడు గుడి వాడ టౌన్ హైస్కూల్ లు యేవో సమావేశాలున్దేవి . దానికి వెళ్ళే వాడిని ఒక సారి అక్కడ టౌన్ హైస్కూల్ లో భుజంగ రావు గారు ఫుల్ డ్రెస్ లో హిందీ టీచర్ గా పని చేస్తున్నారు కాసేపు మాట్లాడుకొన్నాం .రామకృష్ణయ్య గారు అనే నేషనల్ అవార్డీ దానికి అప్పుడు హెడ్ మాస్టర్ .అంతా పకడ్బందీ గా నడిపే హెడ్ మాస్టారు .అందుకని డ్రెస్ కోడ్ కూడా పెట్టి నట్లున్నారు .అక్కడే ఆయన్ను చివరి సారిగా చూడటం .

         భుజంగ రావు గారి జీవిత మంతా పోరాటమే దారిద్రం తో పోరాడి గెలిచారు సృజనాత్మక భావాలున్న రచయిత అని పించుకొన్నారు హిందీ రచనలను సరళ భాషలో అను వాదం చేసి చేయి తిరిగిన రచయిత అని పించుకొన్నారు విప్లవమే ఊపిరి గా జీవించి అలసి పోయారు .

         ఈ రోజు ఆంద్ర జ్యోతి లో శ్రీ ఆలూరి భుజంగ రావు గారి మరణ వార్త చదివి విచారించాను .మంచి మిత్రుని ఆత్మీయుడిని ,ఆప్తుడిని అభిమాన ధనుడిని నమ్మిన సిద్ధాంతానికి జీవితాంతం అంకితమైన వారిని ఆయనలో చూశాను . భావాలు వేరయి నంత మాత్రాన మనసులు కలవకుండా పోవటానికి వీలు లేదని భుజంగ రావు గారితో స్నేహం రుజువు చేసింది ఆ యన ఎంత సంప్రాదాయ వ్యతి రేకి అయినా, వారి భార్యగారికి మా సంతాపం, సాను భూతి వ్యక్తం చేస్తూ, భుజంగరావు గారి ఆత్మకు శాంతి ప్రసాదించ వలసిందిగా ఆ సర్వేశ్వరుని ప్రార్ధిస్తున్నాను .

            మీ –గబ్బిట దుర్గా ప్రసాద్—21-6-13- ఉయ్యూరు   

 
 
 
 
 
 
 


గబ్బిట దుర్గా ప్రసాద్
https://sarasabharati.wordpress.com
http://suvarchalaanjaneyaswami.wordpress.com

Posted in మహానుభావులు | Tagged | 1 Comment

రాహుల్ సాన్క్రుత్యాయాన్ రచన . హిందీ పండిట్ భరద్వాజా,నవలాకారుడు శారదల సహ చరుడు ఆలూరి భుజంగ రావు

aluri bhujangarao

Posted in మహానుభావులు | Tagged | Leave a comment

మహా మంత్రిన శివ దేవయ్య దేశిక కవి సామర్ధ్యం

mahamantri shiva devayya kavi -1 mahamantri shiva devayya kavi -2mahamantri shiva devayya kavi -3

Posted in మహానుభావులు | Tagged | Leave a comment

తక్కాళి శివ శంకర పిళ్ళై -కదా -కూలి గింజలు -చినుకు జూన్

takkaali shiva shankara pillai -1takkaali shiva shankara pillai -2takkaali shiva shankara pillai -3a

Posted in సేకరణలు | Tagged | Leave a comment

కధకుడు స్వర్గీయ [”త్రిపుర ‘]’అంటే -చినుకు -జూన్ సంచిక

tripura ante -1tripura ante -2

Posted in సేకరణలు | Tagged , | Leave a comment

తుస్సు మన్న సూపర్ సింగర్స్ ఏడు

 

తుస్సు మన్న సూపర్ సింగర్స్ ఏడు

          52 వారాల సుదీర్ఘ సమయం లో మా టి.వి.ప్రతి బుధ వారం అందించిన సూపర్ సింగర్స్ నిన్న రాత్రి రెండు గంటల’’ సుదీర్ఘ సుత్తి ‘’తో తుస్సుమని ముగి సింది .గాయకులందరూ ప్రతిభా సంపన్నులే వారిని నడిపించే మెంటార్స్  సుప్రసిద్ధ గాయనీ మణులే .నిన్న ప్రోగ్రాం చూసిన తరువాత ఇంత కాలం దీన్ని ‘’సాగాదీయాలా ?’’అని పించక మానదు .నా ఉద్దేశ్యం లో ఎప్పుడో రెండు నెలల క్రితమే దీనికి స్వస్తి పలక వచ్చు .ఈ రెండు నెలల కాలం లో ‘’లాగుడే కాని పరుగే లేదు’’ ఎవరెవరినో ఎక్కడెక్కడి నుంచో తీసుకొచ్చి అసలు పాడే వారి నెత్తిన రుద్ది వారి స్వర సమరానికి ఎంతో అంత రాయం కలిపించారని పించింది .దాదాపు స్థానాలు ఎప్పుడో నిర్ణయ మై పోయాయి ప్రేక్షకుల హృదయాలలో .మధ్య మధ్య ఎలిమినేషన్ పేర కొంత కాలం డ్రామా నడిచింది ..మళ్ళీ వారినీ ఏదో పేరు చెప్పి తీసుకొచ్చి ప్రమోషన్ నెపం తో నెత్తిన రుద్దారు. కావాలను కొంటె వారి గాన మాధుర్యాన్ని షో ముందో చివరో విని పిస్తే బాగుండేది

            సస్పెన్సు పేరు తో’’ యాంకరుడు  ‘’సృష్టించిన హంగామా అంత అవసరమా /?అయిదు నిమిషాలకో సారి భయానక థ్రిల్లర్ సిని మా లో పోజులు అందరితో ను పెట్టించి కంగారు పెట్టాలా ?అందరు సుప్రసిద్దులే వీరందర్నీ అంత ఉత్కంత తో ఉక్కిరి బిక్కిరిచేసి ఊపిరి ఆడకుండా చేస్తున్నట్లు నటిమ్పజేయడం అనవసరం .  చిన్న పిల్లలయితే అది కలిసి వచ్చేది ఇప్పుడు ఎబ్బెట్టు గా వెగటు గా అని పించింది .ఒక రకం గా చెప్పా లంటే ముప్పై ఎపిసోడుల తర్వాతా ఏమీ బాగా లేదు ఎవరూ అంతకు ముందు కంటే బాగా పాడనూలేదు స్థాయి బాగా తగ్గిపోయింది .

                 అయితే గుడ్డి లో మెల్ల –నిన్న రాత్రి సహకారం అందించిన వాయిద్య కారులను గుర్తించి గౌరవించటం చెప్పుకోదగిన విషయం .జడ్జేస్ లో చంద్ర బోస్ ఒక్కడే ఉన్నది ఉన్నట్లు చెప్పి నట్లు అని పించింది .ఈ మధ్య వచ్చిన శైలజా, అనంత శ్రీరాం లు చిలక పలుకులే పలికారు .వారి మాటలు వింటుంటే ఒక ప్రేరణ కలగాలి అలా కల్గించలేక పోయింది .అసలు నాటకం నిన్న రాత్రి .తెర ఎప్పుడెప్పుడు పడుతుందా హాయిగా పడుకొందాం అను కొంటె క్షణక్షణం సినిమా లా ఏదో లేని పోనీ థ్రిల్లింగ్ సృస్టించ బోయి సహనాన్ని పరీక్షించాడు యాన్కరుడు యమకరుడైనాడు . ఆయన పాడిన పట హావభావాలతో ఉన్నా సందర్భానికి తగి నట్లు లేదని పించటం సహజం ..

            యాభై రెండు వారాలు తిరిగి తిరిగి ,ప్రాక్టీసు చేసి చేసి .,ఆడి పాడిన మగ గాయకులకు దక్కింది ఇద్దరికీ కలిపి కేవలం లక్ష మాత్రమె .అంటే ఒక్కోరికి యాభై వేలు .అంటే వారానికి వెయ్యి రూపాయలు ఇది దారుణం గా లేదా ?హేమచంద్ర ను ఎందుకో చిన్న చూపు చూసి నట్లని పించింది .కృష్ణా సమ ఉజ్జీ గా నే పాడాడు .కాని హేమచంద్ర కున్న మెళకువలు తక్కువే అని పిస్తుంది చివరి చివరిలో మంచి పోటీ నిచ్చాడు .అమ్మాయిఅలలో గెలిచినా అమ్మాయి అంజనా సౌమ్య ప్రతిభకు జోహార్లు .ప్రధమ బహుమతి పొందిన టీం నాయకురాలు సునీత సామర్ధ్యం అన్ని ఎపి సోడుల్లోను కనీ పించింది .ఆదర్శ వంత మైన పోటీ ని గాయకుల మధ్య మాత్రమె ఉంటె ఇంకా రాణించేది ఏమైనా మంచి సంగీతాన్ని వారం వరం విని పించే అదృష్టం కలిపించి నందుకు మా టి.వి.ని అభి నందిన్చాల్సిందే .నిన్న రాత్రి ప్రోగ్రాం ఒక గంటలో ముగిస్తే ఎంతో ఊరట కలిగేది అందుకే లాగుడు వల్ల తుస్సు మంది .

             మీ —గబ్బిటదుర్గా ప్రసాద్ -20-6-13- ఉయ్యూరు 

Posted in సమయం - సందర్భం | Tagged | 1 Comment

శ్రీమతి డి.సుజాత గారి -ముఖే ముఖే సరస్వతి పుస్తకావిష్కరణ -30-6-13-సాయంత్రంఆరు రు గంటలకు టౌన్ హాల్ మచిలీ పట్నం

mukhe mukhe sarasvathi book release

Posted in సభలు సమావేశాలు | Tagged | Leave a comment

నా దారి తీరు -30 మా మిత్ర బృందం

   నా దారి తీరు -30

                    మా మిత్ర బృందం

          నేను ఏ స్కూల్ లో పని చేసినా నాకు ముఖ్యమైన మిత్రులు సైన్సు మేస్టార్ల కంటే సాహితీ అభిరుచి గలవారే ఎక్కువ .అందులో తెలుగు మేస్టార్లతో భలే జోడీ కుదిరేది .పెద్ద తెలుగు మేష్టారు శ్రీ హేమాద్రి తిమ్మరుసు గారు నాకు గురు తుల్యులు ,పితృ సమానులు .వారి అబ్బాయి అప్పుడు స్కూల్ లో చదివే వాడు .అలానే జి.ఎస్.వి అని పిలుచుకొనే గండ్రం వెంకటేశ్వర రావు గారు అనే లెక్కల మేష్టారు ,సెకండరి గ్రేడ్ టీచర్ ఆచారి గారు ఆయన అన్నగారు మల్లేశ్వర రావు గారు గుంటూరు సుబ్రహ్మణ్యం గారనే తెలుగు మేష్టారు ,ఘట్టి  శ్రీ రామ మూర్తి గారనే సెకండరి మేష్టారు కానూరు చంద్ర శేఖర రావు గారనే సెకండరి మేష్టారు ,గుమాస్తా అంజి రెడ్డి ,సంస్కృతం మేష్టారు ఎస్.ఆనంద రావు దాదాపు ఎప్పుడూ కలిసి ఉండే వాళ్ళం ఆనంద రావు గారు ముక్కు పొడి బాగా పీల్చేవారు సహృదయులు సంస్కృతాన్ని విద్యార్ధులకు చేతి వెన్న ముద్దా లా అందించేవారు వారబ్బాయి కూడా అప్పుడు చదివే వాడు స్కూల్ లో .ఇందులో కానూరి వారంటే మిగిలిన సెకండరి మేస్టర్లకు పడేది కాదు సూటీ పోటీగా ఏదో అనే వారు .ఆయనకు ఏమీ రాదనీ వీళ్ళ అభిప్రాయం ‘దానికి ఉదాహరణ గా వాళ్ళు ఆయన ఎప్పుడో ‘’నాకు ఫీవరీష్ వచ్చింది‘’అన్నాడట .ఇంగ్లీష్ చెప్పటం రాదనీ వీరి ఎద్దేవా .అయితేనేం ఆయన కుమారులు అమెరికా లో సెటిల్ అయి బాగా సంపన్ను లయారు ఈయన చాలా సార్లు అమెరికా వెళ్లి వచ్చారు గిల్డ్ కు ముఖ్యమైన వారు. రావు గారు అయన పొడవాసైన పాంటు దాని పై పొట్టి చేతుల పొడవైన చొక్కా తో ఉండేవారు డ్రెస్ ను బట్టి ఆయనే చంద్ర శేఖర రావు అని చెప్పచ్చు కొంచెం కోపం ఎక్కువ నాతో చాలా ఆప్యాయం గా ఉండేవారు .

             ఖాళీ పీరియడ్ లలో స్టాఫ్ రూమ్ లో మేము రాజకీయాలే మాట్లాడుకొనే వాళ్ళం తిమ్మరుసు గారు కాంగ్రెస్ అభిమాని. మేము వ్యతి రేకం ఆ నలభై నిమిషాలు తీవ్రం గా ఇందిరా గాంధి పాలసీలను విమర్శించే వాళ్ళం .రావు గారు మా పక్షం అంతే –మళ్ళీ మామూలే అంత స్నేహం మాది .ఆనందరావు గారు సరదాగా మాట్లాడే .వారు ఏదో ఒకటి చెప్పి నవ్వించేవారు అంజి రెడ్డి ఆయన తెగ సరదాగా మాట్లాడుకొనే వారు .నేను ఉయ్యూరు వచ్చిన తర్వాతా కూడా ఆనంద రావు గారు అంజి రెడ్డి కలిసి ఉయ్యూరు మా ఇంటికి వచ్చి వెళ్ళే వారు కొంత కాలం పిల్లల చదువుకోసం ఆయన ఉయ్యూరు లో కాపురమూ పెట్టారు తరచూ కలుసుకొనే వాళ్ళం ఆయనది ఉంగుటూరు ..రాళ్ళ భండి సాంబశివరావు సోషల్ మేష్టారు స్తానికుడు ఘడియారం వారికి, వీరికి అసలు పడేది కాదు .కొట్టుకొంటారేమో నన్నట్లు మాట్లాడుకొనే వారు .’’బావా బావా’’ అనుకొంటూనే తిట్టుకోనేవారు మాకు మహా ముచ్చటగా ఉండేది .సాంబశివ రావు ‘’ఎద్దనపూడి సులోచనా రాణి నా శిష్యురాలు .ఆ అమ్మాయిని తీర్చి దిద్దింది నేనే ‘’అని గొప్పలు చెప్పుకొనే వారు సన్నగా రివటలా పొడుగ్గా తెల్లపాంటు తెల్ల బుష్ షార్ట్ తో ఉండేవాడు ..ఆయనకు సవ్యం గా మాట్లాడటం రాదు .చెవి కింద చేరి నెమ్మదిగా వినిపించీ వినిపించకుండా అవతలి వారి మీద ముఖ్యం గా సీనియర్ సోషల్ మేష్టారు రంగమన్నారాచార్యుల మీద చాడీలు చెప్పే వాడు .అయన తమ్ముడేరాళ్ళ బండి కృష్ణ మూర్తి  సెకండరి మేష్టారు చాలా సౌమ్యుడు ,నాకు మంచి మిత్రుడు ,స్తానికుడు వీరిద్దరికీ హస్తి మశాకాంతరం

             అలానే ఘంటా కోటేశ్వరరావు లెక్కలు చెప్పేవారు ఆయన ఒకప్పుడు ఉయ్యూరు లో మాతో కలిసి పని చేశారు .సైలెంట్ కిల్లర్ లా ఉండేవాడు పైకి నవ్వుతూ మాట్లాడే వాడు కాని మనసులో విషమే .ఘడియారం సుబ్రహ్మణ్యం కామేశ్వర రావు లు అన్న దమ్ములు .ఇద్దరిది వేరు ప్రవ్రుత్తులే కామేశ్వర రావు లౌక్యుడు చాక చక్యం ఉన్న వాడు సుబ్రహ్మణ్యం నోటి దూల వాడు అందరితో తగాదా గా ఉండే రకం .కాని ఊరి వ్యవహారాలలో ఘడియారం ,రాళ్ళ బండి కుటుంబాలు మంచి సహకారం ఇచ్చేవి .సుబ్రహ్మణ్యం కొడుకులు చదివారప్పుడు కామేశ్వర రావు అబ్బాయి అమ్మాయి కూడా స్కూల్ లో చదివారు అమ్మాయి పెళ్లి స్కూల్ ప్రక్కనే ఉన్న సత్రం లో చేశారు కామేశ్వర రావు మా అందరికి గొప్ప విందు ఇచ్చాడు .వీళ్ళబ్బాయి తర్వాతా స్టేట్ బాంక్ లో ఉద్యోగం సంపాదించి మాకు బాగా పరిచయం అవటమే కాక సహాయ కారిగా ఉండేవాడు ఘట్టి వారబ్బాయి ఆంధ్రా బాంక్ లో ఉద్యోగం పొంది చల్ల పల్లి లో చాలా కాలం పని చేశాడు నేను మంగళా పురం హెడ్ అయినప్పుడు ఆ బాంక్ లోనే స్కూల్ అకౌంట్ ఉండేది తరచుగా కలిసే వాళ్ళం ఘట్టి వారు నేను అపామర్రు లో పని చేస్తుండగానే హార్ట్ ఎటాక్ వచ్చి చని పోయారు మంచి మిత్రుడిని కోల్పోయామని పించింది .

               తిమ్మరుసు గారు గొప్ప లోక జ్ఞానం కల వారు అన్నీ క్షున్నం గా తెలుసుకొనే వారు .మాకు పామర్రు లో మంచి మిత్రులు .నేను పెనమకూరు లో పని చేసినప్పుడు అయన కుమార్తే వివాహం పామర్రు లో జరిగితే వెళ్ళా. దురదృష్ట వశాత్తు ఆ పిల్ల పెళ్లి కలిసి రాలేదు .వారిద్దరి కాపురం సాగ లేదు .ఆమెకు మతి స్తిమితం తాప్పింది ఇదొక మానసిక బాధ అయింది మేస్తారికి .కొడుకు గుజరాత్ లో ప్రైవేట్ ఇంజినీర్ గా పని చేస్తుంటే పెళ్లి చేశారు అతనికి ఇద్దరు కొడుకులు పుట్టిన తర్వాతా ఏమై పోయాడో తెలీదు ఈ రెండు దెబ్బలకు తిమ్మరుసు గారు తల్లడిల్లి పోయారు .రిటైర్ అయాక గుడివాడలో కాన్వెంట్ ను దాదాపు పదేళ్ళు సమర్ధ వంతం గా నడిపారు చివరికి తోట్లవల్లూరు లో స్తిరపడ్డారు తరచు కలుస్తూందే వాళ్ళం ఆయన బావ మరిది కే/ఆర్.జి కృష్ణ మూర్తి మా ఇంట్లో దాదాపు పదేళ్లుగా అద్దె కుంటున్నాడు .అందరి మీద దయా సాను భూతి చూపించే తిమ్మరుసు గారికి రావలసిన కష్టం కాదిది .దైవ లీల .తప్పించు కోవటం అసాధ్యం .ఈయన పరిస్తితి గమనించి అమెరికా లోని కానూరి చంద్ర శేఖర రావు గారబ్బాయి అంటే తిమ్మరసు గారి శిష్యుడు ఒక లక్ష రూపాయలు బాంక్ లో వేసి దాని పై వడ్డీని తీసుకొనే ఏర్పాటు చేశాడు తండ్రీ కొడుకులు ఇండియా వచ్చినప్పుడల్లా తిమ్మరుసు గారిని చూసి పలకరించి వెళ్ళే వారు .తిమ్మరుసు గారు గొప్ప కవి కృష్ణా జిల్లా గిల్డ్ కు ఆయన ఆస్థాన రచయిత .స్వాగత పత్రాలు, పద్య నీరాజనాలు ఆయనతోనే రాయించేవారు .ఇటీవలే అయిదు ఏళ్ళక్రితం ముందుగా తిమ్మరుసు గారి అమ్మాయి చని పోయింది ఆ తర్వాతా ఆయన మరణించారు చని పోతానని తెలుసుకొని ముందే డబ్బు బాంకి నుంచి తెచ్చి ఇంట్లో పెట్టుకున్నారు భార్య ఆరోగ్యమూ అంత బాగుండేది కాదు ..వెళ్లి పరామర్శించి వచ్చాను వల్లూరు ఎప్పుడు వెళ్ళినా నాకు ముందు టీ పెట్టించి మర్యాద చేసే వారు మేష్టారు చాలా అభిమానం ఆవిడ బక్క పలచగా సన్నగా ఉండేది మేమంటే మహా ఆప్యాయత కనపరచేది . అభిమానం గల మనిషి తిమ్మరుసు గారు .ఎవరినీ ఏదీ అడిగే వారు కాదు .ఎదిచ్చినా తీసుకొనే వారు కాదు నేనే బాల వంతం గా నాకు వీలు చిక్కి నప్పుడల్లా ఆయన చేతి లో కొంత డబ్బు పెట్టి వస్తూండే వాడిని .ఇంతటి స్నేహ శీలిని కోల్పోయి నందుకు చాలా బాధ గా ఉంది .విధి కృతం అంతే .

       గండ్రం వారు తరచుగా ఫోన్ చేసి మాట్లాడే వారు ఆయన్ను పామర్రు నుంచి చాలా దూరం గా ప్రొమోషన్ మీద ట్రాన్స్ ఫర్ చేసినప్పుడు నేనూ తిమ్మరుసు గారు ఆయన్ను వెంట బెట్టుకొని చైర్మన్ పిన్నమ నేనిని ,ఏం ఎల్ సి కొల్లూరి ని కలిసి గుడి వాడ దగ్గర గురజ కు ట్రాన్స్ ఫర్ చేయించాం.అక్కడే రిటైర్ అయ్యారు .కోపధారేరే కాని లెక్కలు బాగా చెప్పే .వారు ఆయన అంటే ఝడుసుకొనే వారు పిల్లలు ఆయనా హార్ట్ అటాక్ తో పదేళ్ళ క్రితం చని పోయారు హైదరాబాద్ లో స్వంత ఇల్లు నిర్మించుకొన్నారు .పోక ముందు ఒక సారి., పోయిన తర్వాతా భార్య గారిని పిల్లల్ని పలకరించటానికి ఒక సారి వెళ్లాను భార్య గారు ఏంటో ఆదరం గా ఉండే వారు .ఈ విధం గా జి.వి.ఎస్.గారినీ కోల్పోయాము .

                           ఏ అధికారీ రానిస్కూలు

        పామర్రు మంచి సెంటర్ .రోజూ ఎంతో మంది అధికారులు అనధికారులు విద్యా ధి కారులు అటువైపు నుండి వెళ్ళే వారు కలెక్టరు రెవిన్యు వారు మొదలైన వారందరూ అటు వైపు వెళ్తున్నా ఎవరూ స్కూల్ లో కాలు పెట్టె వారు కాదు కారణం ఇక్కడ సమర్ధులైన వేమూరి రామ క్రిష్నయ్య గారు అనే ఆదర్శ వంత మైన ప్రధానోపాధ్యాయులు ఉండటమే .ఆయన ఖ్యాతి అంత గొప్పది .ఒక్క సారి మాత్రం కాంగ్రెస్ సోషలిస్ట్ నాయకుడు ఆ తర్వాత గవర్నర్ గా పని చేసిన రఘునాధ రెడ్డి గారు  ముందే చెప్పి, స్కూల్ కు వచ్చారు ఇక్కడి వాతా వవరణం,హెడ్ మాస్టారి సామర్ధ్యం చూసి స్కూల్ అసెంబ్లీ లో తెగ మెచ్చుకొన్నారు .గొప్ప సందేశాత్మక మైన స్పీచ్ కూడా ఇచ్చారు అందరికి గొప్ప ప్రేరణ కలిగించారు .నాకు తెలిసి నంత వరకు ఆయనేవచ్చిన వి.ఐ.పి..అలా నడిచింది స్కూలు .

                     ముదురు విద్యార్ధి

       కోటి రామ మూర్తి అనే కామర్సు మేష్టారు ఉండేవాడు .పొట్టిగా కు మట్టం గా తెల్ల డ్రెస్ తో ఉండేవాడు మహా చలాకీ గా మాట్లాడే వాడు .అయన దగ్గర ఉంటె నవ్వుల పూవులే ..సోషల్ చెప్పే వాడు .ఒక సారి ఆయన తొమ్మిదో క్లాస్ కు వెళ్ళాడట .సహజం గా నే సోషల్ క్లాస్ లో అల్లరి ఎక్కువ.ఈయన మరీ అలుసు ఇచ్చేవాడు .కోప్పడ్డాడు అందులో ఒక కుర్రాడు మరీ అల్లరి చేస్తుంటే ‘’ఒరే దున్న పోతా !సిగ్గు లేదా “’?అని తిట్టాడట.వాడు వెంటనే ఆనందం గా ‘’మేస్టారూ ! తిట్టితే తిట్టారు కాని నన్ను దున్న పోతు అన్నందుకు చాలా గర్వం గా ఉంది ‘’అన్నాడట .ఆయన ‘’అదేమిట్రా !దున్నపోతు అంటే అంత సంతోష పడతావు తల వాల్చుకోవాలి కాని ‘’అన్నాడట .వాడు ‘’సార్ ! మాది కురుమద్దాలి .మా ఊళ్ళో ఒకే ఒక దున్న పోతు ఉంది .ఊళ్ళో గేదేలన్నిటికి అదే గతి నేను దున్న పోతునైతే రోజూ ఎన్నో గేదెలతో ‘’జల్సానే’’ .అందుకని నవ్వ్వాను‘’ఆన్నాడట ఆముదురు విద్యార్ధి .ఈ మాటకు  కడుపు చేక్కలయ్యేట్లు నవ్వాడట రామమూర్తి  మేష్టారు .ఆ తర్వాతా ఈ విషయం మా అందరికి చెప్పి నవ్వించాడు .పెద్ద స్కూళ్ళలో ఇలాంటి ముదుర్లూ ఉంటారు.

                      ఆప్కో చేనేత బట్టలు

          ఆ రోజుల్లో ఆప్కో వారు ఉద్యోగస్తులకు ,స్కూల్ స్టాఫ్ కుఅప్పుమీద  బట్టలు కొనేందుకు అవకాశామిచ్చేవారు ఫారాలు పూర్తీ చేసి హెడ్ మాస్తారితో సంతకం పెట్టించుకొని వెళ్తే కావలసిన బట్టలు కొనుక్కో వచ్చు నెల నేలా జీతం లో వాయిదాల ప్రకారం హెడ్ మాస్టారు మినహాయించి వారికి చెల్లించే వారు చాలా నాణ్యమైన దుప్పట్లు జంపఖానాలు ,దోమ తెరలు చొక్కా గుడ్డలు చీరలు అందరు కొనుక్కొనే వారు నేనూ చాలా సార్లు తెచ్చాను అప్పుడు పామర్రు లో షాప్ లేదు గుడి వాడ వెళ్లి తెచ్చుకోవాల్సి వచ్చేది అలా సరదాగా స్కూల్ అవగానే అందరో ,కొందరో కలిసి వెళ్లి తీసుకొని వచ్చే వాళ్ళం అదొక తిరణాల లా గా ఉండేది .

              సశేషం –మీ –గబ్బిట .దుర్గా ప్రసాద్ -20-6-13-ఉయ్యూరు

Posted in నా దారి తీరు | Tagged | Leave a comment

నా దారి తీరు -29 స్టాఫ్ అసోసియేషన్ ఏర్పాటు – సెక్రటరిగా బాధ్యత

   నా దారి తీరు -29

                        స్టాఫ్ అసోసియేషన్ ఏర్పాటు – సెక్రటరిగా బాధ్యత

           పామర్రు హైస్కూల్ లొ అనైక్యత గురించి ముందే చెప్పాను .బదిలీ అయిన వాడికి పార్టీ లేదు వీడ్కోలు సభా లేదు .కావలసిన వాడికి మాత్రం ఇష్టులు ఏర్పాటు చేయటం .పాపం హెడ్ గారు ఏమీ చెయ్యలేని స్తితి .ఎవరేర్పాటు చేసినా స్కూల్ పెద్ద గా హాజరయ్యే వారు .మమ్మల్ని పిలిస్తే మేమూ వెళ్ళే వాళ్ళం .ఇదంతా ఒక గ్రూప్ తగాదా లా ఉంది కాని ఇంత పెద్ద స్కూల్ కు హుందా గా లేదు .నేను పామర్రు లో చేరిన దగ్గర నుంచీ ఈ విషయాన్ని మిగిలిన ఉపాధ్యాయులు,ఆఫీసు స్టాఫ్ తో తెలియ జేస్తూనే ఉన్నాను .అందరికి స్టాఫ్ అసోసియేషన్ ఏర్పడితే బాగుంటుంది అని, దాని ఆధ్వర్యం లో కార్య క్రమాలు నిర్వహిస్తే మంచిది అని తెలుసు .కాని ఎవరూ ముందుకు రావటం లేదు .నాకు మాత్రం చాలా చిరాకుగా ఉంది .

         నాకు పెద్దలైన తిమ్మరుసు గారు గండ్రం వెంకటేశ్వర రావు గారు ,ఆచార్యులు ,గారు కొండూరి వారు మొదలైన వారితో సుదేర్ఘం  గా మాట్లాడే వాడిని. మేమంన్దరం కలిసి హెడ్ మాస్టారు దృష్టికి కూడా తీసుకొని వెళ్లాం .ఆయనకూ ఇది బాగా నచ్చింది .కాని ‘’పిల్లి మెడ లో ఎవరు గంట కడతారు ?’’.ఎవరి పేరైన చెబితే ఆయన పనికి రాడని అనటం తో ఎన్నో పేర్లు చర్చకు వచ్చాయి .ఈ బృందమే అందర్నీ సంప్రదించింది .అందరూ స్టాఫ్ అసోసియేషన్  ఏర్పడాల్సిందే అని ఒక నిర్ణయానికి వచ్చాం .దీనికి వ్యతి రేకత రాలేదు మరి స్టాఫ్ సెక్రటరి గా ఎవరు /?అన్న దాని దగ్గరే ఆగిపోతోంది .అప్పుడు తిమ్మరుసు గారు మొదలైన వారు నాతో‘’ప్రసాద్ గారూ !అసలు స్టాఫ్ అసోసియేషన్ ఒకటి కావాలని పట్టు పట్టింది మీరు .అందరితో మాట్లాడి ఒప్పించింది మీరు .అందరికి మీ మీద విశ్వాసం ఉంది మీరు ఒప్పుకొంటే మా స్టాఫ్ సెక్రటరీ మీరే ‘’అన్నారు .నాకేందుకోచ్చిన భారం అని అనుకొన్నా.కాని నాపేరు అయితే ఎవరూ అభ్యంతరం చెప్పరని అందరి భావన .కనుక తప్పక ఒప్పుకోవలసి వచ్చింది .జ్ఞానేశ్వర రావు అనే పామర్రు నివాసి, డ్రిల్ మేష్టారు అసిస్టంట్ సెక్రటరి గా ఉంటె నేనూ రెడీ అని చెప్పాను.అతనూ చాల మంచి వాడు .అభి వృద్ధి కోరుకొనే వాడు వెంటనే అంగీకరించాడు .ఎన్నో నెలల ప్రయత్నం ఫలించి స్టాఫ్ అసోసియేషన్ ఏర్పడింది పామర్రు హైస్కూల్ లో దాదాపు పది పదిహేనేళ్ళ తర్వాత.ఇది నా విజయం అని అందరూ అనుకొన్నా దీన్ని కావాలను కొన్న వారందరి విజయం గా దాన్ని నేను భావిస్తాను .

           అప్పటి నుంచి ఎవరు స్కూల్ నుండి బదిలీ అయినా ఆయనకు స్టాఫ్ తరఫునశాలువా దండా జ్ఞాపిక తో  సన్మానం, వీడ్కోలు విందు ఏర్పాటు చేశాం జ్ఞానేశ్వర రావు జమా ఖర్చులన్నీఒక పుస్తకం లో రాసి అందరికి సర్క్యు లేట్ చేసే వాడు  .దానిలో అందరు సంతకాలు చేసే వారు .డబ్బులు వసూలు చేసి జాగ్రత్త చేసే వాడు ..ఏ రకమైన భేదాభి ప్రాయమూ రాలేదు .మేమిద్దరం మంచి జంట గా వ్యవహరించం .అందరు మమ్మల్ని అభి నందించే. వారు ఇలా పామర్రు హైస్కూల్ లో ఒక ఆదర్స్దాన్ని అమలు చేయ గలిగాం .ఆ తర్వాతా మళ్ళీ ఎప్పుడూ అక్కడ గూడు పుఠాణీలు ముఠాలు ఏర్పడలేదు ఆ వారసత్వం ఇప్పటి దాకా కోన సాగుతోంది .దీనికి హెడ్ మాస్టర్ రామకృష్ణయ్య గారి సహకారం మరువ లేనిది అందరం ఒకటిగా ముందుకు సాగాం .ఎవరి పెళ్లి అయినా ఎవరింట్లో శుభ కార్యమైనా అందర్నీ పిలిచే వారు స్టాఫ్ అందరం వెళ్ళే వాళ్ళం వారికి స్కూల్ తరఫున కానుక అందజేసే సంప్రదాయాని కూడా సృష్టించాం . కనుక ఎవరూ ఇబ్బంది పడలేదు ఎవరికో ఒకరిని భుజాన వేసుకోవటం ఇంకోర్ని తీసి పారెయ్యటం లేకుండా జరిపించాం . జ్ఞా నేశ్వర రావు సహకారాన్ని నేను ఎన్నటికీ మరిచి పోలేను అందరూ మాకు సహకరించి కార్య క్రమాల అమలుకు సహకరించి నందుకు వారందరికీ కృతజ్ఞతలు .

                              కూరగాయల మార్కెట్

          పామర్రు అంటే అరటి పండ్ల కు ప్రసిద్ధి .అలానే తాజా కూర గాయలకూ పేరు .’’పాస్’’బెల్ తర్వాత  పీరియడుఖాళీ ఉన్న వాళ్ళు దగ్గరలో ఉన్న కూరగాయల మార్కెట్ కు వెళ్లి తాజా కూరలు కొని సంచీలో వేసుకొని వచ్చేవారు .ఇంటికి వెళ్ళేటప్పుడు తీసుకొని వెళ్ళే వారు మేస్టర్లకు అందరి కంటే తక్కువ రేట్ కే అమ్మే వారు అందరికి ఆ వర్తకులు బాగా పరిచయం అయ్యారు ..తాజా కూరలు నోరూరించేట్లున్దేవి .అన్ని రకాలు దొరికేవి కొందరు ఇంటర్వెల్ సమయం లో వెళ్లి తెచ్చుకొనే వారు నేనూ చాలా సార్లు కూరలు కొని ఉయ్యూరు తెచ్చే వాడిని .

                  ఊటుకూరి వారి పచారీ కొట్టు

            పామర్రు సెంటర్ లో ఊటుకూరు వారి పచారీ దుకాణం బాగా ప్రసిద్ధ మైనది అక్కడ మంచి సరుకు మిగిలిన కోట్ల కంటే తక్కువ ధరలో దొరికేవి అందుకని మేస్స్టర్లందరూ అక్కడే చింతపండు మిర్చి కందిపప్పు మొదలైనవి కొనుక్కొనే వారు. అప్పు కూడా పెట్టె వారు .జీతాలు రాగానే తీర్చటం పధ్ధతి .షావుకార్లు మంచిగా మర్యాదగా ఉండే వారు .ఒక రకం గా మేస్టార్ల పాలిటి కల్ప వృక్షం ఊటుకూరి వారి దుకాణం ..

                                  పామర్రు మిఠాయి దుకాణం

           పామర్రు సెంటర్ లో ఒంతేనకు ఇవతల ఎడమ వైపు ఒక పెద్ద మిథాయి దుకాణం ఉండేది సరుకు బాగా ఉండటమే కాక బెజ వాడ బందరు మధ్య అంత చవక గా అమ్మే దుకాణం లేదు అందుకని స్కూల్ ఫంక్షన్లకు, జాతీయ దినోత్సవాలకు అక్కడే చుట్టుపక్కల స్కూల్ వాళ్ళందరూ ఆర్డర్ ఇచ్చి సరుకు చేయించుకొని తీసుకొని వెళ్ళే వారు .ఫ్రెష్ గా, రుచి కరం గా ఉండేవి .నేను మేడూరు హైస్కూల్ కు కూడా పామర్రు నుండే లడ్డూ కారప్పూస మిక్చర్ వగైరాలను  తెప్పించే  వాడిని .అంత ఫేమస్ దుకాణం అది .పేరు ఇప్పుడు గుర్తుకు రావటం లేదు తర్వాతా వంతెన అవతల అవని గడ్డ దారిలో ఎడమ వైపు ఇంకో కొట్టు వచ్చింది ఇక్కడా మంచి సరుకే లభ్యమయ్యేది ..వివాహాహాది శుభ కార్యాలకు అందరూ పామర్రు మిఠాయి దుకాణం నుండే అన్నీ తయారు చేయించి బుట్టలతో తీసుకొని వెళ్ళేవారు .

                పామర్రు సంత

             పామర్రు లో ప్రతి మంగళ వారం పండ్ల సంత జరిగేది..దున్నపోతు లాంటి అరటి పండ్ల తో గెలలు చూడ ముచ్చటగా ఉండేవి దివితాలూకా నుండి అరటి గెలలు వచ్చేవి ఈ సంతకు .ఇక్కడే కొని ఉయ్యూరు గుడివాడ కూచి పూడి మొదలైన చోట్లకు తీసుకొని వెళ్ళే వారు .ఇప్పుడు మా ఉయ్యూరు లో ను సంత వచ్చింది .కంకి పాడు సంతకూ గిరాకీ ఉంది అక్కడ ఒకప్పుడు కూరగాయలకు ప్రత్యేకం గా ఉండేది .అరటి గెలలకు అరటి ఆకులు చుట్టి గెల పాడు కాకుండా జాగ్రత్త చేసి రవాణా కు వీలుగా చేసి ఇవ్వటం ఉంది .అత్తవారింటికి అమ్మాయి ని పంపిస్తుంటే అరటి గెల ఇచ్చి పంపటం ఆన వాయితీ. చక్ర కేళీ పళ్ళు బాగా వచ్చేవి .

               పామర్రు హైస్కూల్ లైబ్రరి –పఠనం –రచనా వ్యాసంగం

              పురాతన మైన హైస్కూల్ పామర్రు స్కూలు ఇక్కడ పెద్ద లైబ్రరి ఉండేది ఎన్నో విలువైన గ్రంధాలు ఉండేవి .వాటిని చక్క గా చదివే వాడిని .ఎన్ని కావాలంటే అన్ని ఇంటికి తీసుకొని వెళ్ళేవాడిని .ఇక్కడ చదివిన అతి గొప్ప పుస్తకాలలో జనమంచి శేషాద్రి శర్మ గారి ‘’శ్రీ రామావతార తత్త్వం ‘’దాదాపు పదిహేను భాగాలు ఎంతోరిఫెరెంసు తో వారు రాశారు .అది నాకు చాలా ఉప యోగ పడింది .ఉయ్యూరు విష్ణ్వాలయం లో పరిమి రామ కృష్ణ శాస్త్రి గారు ఒక సారి సుందర కాండ ను, మరో సారి సంపూర్ణ రామాయణాన్ని పురాణం గా చెప్పారు ఆ  రెండు నెలలపాటు  సాగాయి రోజూ వెళ్లి వినేవాడిని ఆయన చెప్పే తీరు బాగుండేది. అన్నీ వాచో విదేయం .ప్రార్ధన ప్రారంభిస్తే మనల్ని మనం మరిచి పోతాం ఆ రెండు గంటలూ .అంత పకడ్బందీ గా చెప్పేవారు నల్లగా ఉన్నా ఆకర్షణీయమైన ముఖం వర్చస్సు ఉండేవి ,కళ్యాణాలు జరిపించటం ఉండేది. చివరి రోజున నన్ను మాట్లాడమని మా వాళ్ళు కోరే వారు .అప్పుడు ఆయన చెప్పని వాల్మీకి చెప్పిన విషయాలను వివరించే వాడిని ఆయన ఆశ్చర్యం తో విని ‘’ఇంత శ్రద్ధగా విన్నారా మేస్టారూ !నేనే చెప్పని విషయాలు అందరి దృష్టికి తెచ్చి నందుకు అభి నందనలు ‘’అని చెప్పారు .అందులో ముఖ్యం గా సుందర కాండ లో ‘’సీతమ్మ వారిని చూసినట్లు భావించిన ఆంజనేయుడు డాన్సు చేసి నట్లుగా చక్కని శ్లోకాలు మహర్షి చెప్పాడు వాటిని వివరించాను .అలాగే అహల్యా శాప  వృత్తాంతం లో శాస్త్రి గారు చెప్పిన తీరు సరిగా లేదని వాల్మీకి ఆమెను తప్పు చేసిన దాని లానే చెప్పాడని శ్లోకాలు ఉదహరించి చెప్పాను .ఇవి చెప్ప టానికి నాకు జ్ఞానాన్ని చ్చింది జనమంచి వారి రామా వాతార తత్వమే .అయితే పరిమి వారు ఈ పుస్తకాలను తాను చదవ లేదని సభా ముఖం గా  అంగీ కరించారు .ముఖే ముఖే సరస్వతి అంతటి జ్ఞాన సంపన్నుడికి ఇవి తెలియక పోవటం పెద్ద విషయమేమీ కాదు చెప్పాలను కొన్న నా తొందర బాటేమో నని అనిపించింది .కాని విషయం అందరికి చెప్ప్ప గలిగానని సంతృప్తి .ఆ తర్వాత పరిమి వారు ఎక్కడ కనీ పించినా చాలా గౌరవం గా ఆత్మీయం గా మాట్లాడే వారు వారు రోజూ కైక లూరు నుండి వచ్చేవారు ఉయ్యూరు లో ప్రవచనానికి

                 రెండో పుస్తకం ‘’తేవప్పేరు మాళ్లు ‘’గారు అభిజ్ఞాన శాకుంత  లానికి రాసిన టీకా టిప్పణి.నాకు కొత్త లోకాలు చూపించింది దానిని చదివిన తర్వాతే శాకుంతలం లో ఎవరూ స్పృశించని శకుంతల చెలి కత్తేలైన ‘’అనసూయ ప్రియంవద ‘’లపై పరిశీలనాత్మకమైన రచన చేశాను అది తెలుగు విద్యార్ధి మాస పత్రిక లో పడింది .అంతకు ముందు ఒక సారి మద్రాస్ వెళ్లి నప్పుడు కృష్ణ శాస్త్రి గారింటికి మా అక్కయ్య లోపాముద్ర తీసుకొని వెళ్లి పరిచయం చేసింది ఆయన ఎంతో ఆప్యాయం గా పలకరించి మాట్లాడి తన పుస్తకాలను నాకు సంతకం పెట్టి ఇచ్చారు వాటి ఆధారం గా ‘’భావ కవిత్వానికి మేస్త్రి –సాహో కృష్ణ శాస్త్రి‘’అన్న వ్యాసం రాశాను ఇదీ తెలుగు విద్యార్ధిలో ప్రచురిత మైంది .పామర్రు లో ఉండగానే పుట్టపర్తి వారి శివ తాండవం చదివి చలించి పోయా ఆయన బహు ముఖ ప్రజన నన్నెంతో ఆకర్షించింది దాని పై ‘’పుట్టపర్తి వారి శివ తాండవం ‘’అనే వ్యాసం రాసి పంపిస్తే ‘’ఆంద్ర ప్రభ సాహితీ గవాక్షం ‘’లో ప్రచురిత మైంది .ఇలా పామర్రు నాకు సాహిత్యం లో గొప్ప అనుభూతిని కలిగించి ప్రేరణ నిచ్చింది .

                 సశేషం –మీ –గబ్బిట-దుర్గా ప్రసాద్ 19-6-13-ఉయ్యూరు

Posted in నా దారి తీరు | Tagged | 1 Comment

రాత మార్చిన మాస్టారు -ఆంద్ర జ్యోతి -నవ్య

raatha maarche maastaaruraatha maarche maastaaru2

Posted in సేకరణలు | Tagged | Leave a comment

హాస్య నటుడు ఆలీ -హాస్య సినీ దర్శకుడు జంధ్యాల గురించి

hasya natudu aalee jandhyaala gurinchi

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

నా దారి తీరు -28 ముసురు వానల్లో చి.సౌ.వేద వల్లి వివాహం

  నా దారి తీరు -28

                    ముసురు వానల్లో చి.సౌ.వేద వల్లి వివాహం

          అసలే శ్రావణ మాసం .ఆరోజుల్లో ముసురు వర్షాలు జనానికి తీవ్ర ఇబ్బంది కలిగించేవి .1974శ్రావణ మాసం లో వివాహం .పెళ్ళికి పెద్ద ముసురు పట్టింది అప్పటికే ఏర్పాట్లన్నీ పూర్తీ చేశాము .చోడవరపు చంద్ర శేఖర రావు గారింట్లో విడిది .డాబా ఇల్లు కనుక ఇబ్బంది లేదు .పెళ్లి వారంతా ఎడ్ల బండీలలో,కార్లలో మొటారులో తరలి వచ్చారు .ఆ ముసురు లోనే వారిని సాదరం గా ఆహ్వానించాం.ఏ ఇబ్బందీ కలగ కుండా అన్ని ఏర్పాట్లు చేశాము .వంటకు ప్రఖ్య సీతా రామయ్య ను మాట్లాడుకొన్నాం .చాలా రుచికరం గా శుభ్రం గా చేయగలవాడు .నా ఒడుక్కి అతనే చేశాడు. బాగా పరిచయం ఉన్న మనిషి .ఉయ్యూరు వాడు .తువాలు కట్టుకొని పైన ఏమీ లేకుండా అలా నుంచుని పురమాయిస్తూ వంట చేయించే వాడు .అతనికి సహాయం గా మనుష్యులను తెచ్చుకొన్నాడు .కూరలు వంట సరుకులు అన్నీ సిద్ధం చేశాం .మా పడమటిల్లె సామాన్ల గది ఆదినారాయణ ,నరసింహం అనే నా స్నేహితులు దానికి ఇంచార్జి .చాలా జాగ్రత్తగా చూసుకొనే వారు .

                పెళ్ళికి, కట్నానికి కలిపి సుమారు పన్నెండు వేలు పైగానే కావాలి .మా దగ్గర అయిదారు వేలు  వేలు మాత్రమె ఉంది .మా మయ్య సలహాతో కోమటి సాంబయ్య అంటే  వెంట్రప్రగడ సాంబయ్య గారి దగ్గర నేను నోటు రాసి నాలుగు వేలు అప్పు తీసుకొన్నాము ..పెళ్లి వారికి కట్నం ఇచ్చేశాము .మిగిలిన ఖర్చులకు బోటా బోటీ గా డబ్బులున్నాయి. కూర గాయాలు చిన ఒగిరాల ,పేద ఒగిరాల నుండి మామయ్యకు తెలిసిన రైతులు అందజేశారు వాళ్లకు డబ్బులు తరువాత ఇవ్వచ్చు .పెళ్లి బట్టలు బెజవాడ  లక్ష్మీ జెనరల్ స్టోర్స్ లో శిస్తలా సీతా పతి   శాస్త్రి గారి దగ్గర అప్పుతెచ్చాం మామయ్యా ‘’అవాల్తీ ‘’ఉన్నాడు .తరువాత తీర్చే పధ్ధతి . సరుకులు ఊర వారి కొట్లో అప్పు తెచ్చాం. వాకిట్లో, దొడ్లో తాటాకు పందిళ్ళు వేయించాం .ఇవి పదహారు రోజుల పండుగ దాకా ఉంచటం ఆన వాయితీ .

          ఆ రోజుల్లో కళ్యాణ మండపాలు ఇంకా ఉయ్యూరు లో రాలేదు పెళ్ళిళ్ళు ఇళ్ళ దగ్గరే చేసే వారు .మా కు వాకిలి విశాల మైనది అక్కడే మా చిన్నక్కయ్య పెళ్లి చేశారు వేద వల్లి వివాహమూ వాకిట్లోనే చేద్దామని అన్ని ఏర్పాట్లు చేశాము కాని వారం ముందు నుండి భూమి ఆకాశం ఏక ధారగా వర్షాలు .కనుక మా ఇంటి లోనే వివాహం చేయాలని నిర్ణ యించాం మా కు బాగా విశాల మైన హాలు ఉంది మాది అప్పటికి మండువా ఇల్లు .నీళ్ళు మండువా లోంచి దోనే ద్వారా దక్షిణం వైపు సందులో పడేట్లుండేది మేము తర్వాతా దాన్ని మార్చి ఉత్తరం నుంచి తూర్పుకు పడేట్లు మార్చాం .వర్షం వస్తే పెంకుటిల్లు ఆగవు నీరు ఎక్కడో అక్కడ కారుతూనే ఉంటుంది కారే చోట చిన్న బొక్కెనలు పెట్టె వాళ్ళం లేక ఏదో పాత్ర ఉంచేవాళ్ళం అవి నిండితే పాలేళ్ళు బయట పారబోసే వారు ..ఇలాంటి పరిస్తితి వివాహానికి మేము అసలు ఊహించలేదు .

            ఆ రోజుల్లో బంధుగణం అందరు వారం రోజులు ముందుగానే వచ్చి ,పెళ్లి పనులకు సాయం చేస్తూ పదహారు రోజుల పండుగ వరకు ఉండటం ఒక ఆన వాయితీ .అలానే మా వాళ్ళూ తరలి వచ్చారు .ఇల్లంతా సందడీ సందడి .అప్పటికి మా మామయ్యా  తారస రాయితో డాబా వేసి పైన ఒక గది కూడా ఏర్పరచాడు .ఇది కొంత ఉపయోగ పడింది .పెళ్లి రోజున ఉదయం విపరీతం గా వర్షం పడింది ముహూర్తం తొమ్మిది గంటలకు .ముహూర్త సమయం లో వాన దయ తలిచింది .ఒక గంట విశ్రాంతి తీసుకోంది వర్షం ..హమ్మయ్య అనుకొన్నాం .మా ఇల్లు సందులోపల ఉంటుంది బయటి నుంచి లోపలి రావాలంటే మోకాలి లోతు బురద లోంచి ఇంట్లోకి రావాలి .ఏం చెయ్యాలో పాలు పోలేదు .ఎవరికి ఎలాంటి అసౌకర్యం కలగ కూడదని అనుకొన్నాం .మా పాలేరు కనకయ్య ‘’అయ్యగారూ !మీరు ఏమీ అనుకోకుండా ఉంటె నాదొక సలహా‘’అన్నాడు నా దగ్గరకొచ్చి ‘’ఏమిట్రా ! చెప్పు .పరవాలేదు ‘’అన్నాను .’’మనకు పెద్ద గడ్డి వాము ఉంది .దాని లోంచి గడ్డి తీసి కట్టలుగా గానో ,పనలు గానో పరచి సందు అంతా కప్పెద్దాం .ఇంక ఎవరికి కాలికి బురద అంటదు .’’అన్నాడు .’’మంచి ఆలోచనరా !వెంటనే కానివ్వండి ‘’అన్నాను అంతే వాడు ,మా మామయ్యగారి పాలేళ్ళు అందరు కలిసి క్షణాలలో గడ్డి సందు అంతా పరిచేశారు అందరు కాలికి బురద కాకుండా పెళ్ళికి ఇంట్లోకి వచ్చారు .వాకిట్లో కాళ్ళు కడుక్కోవటానికి గంగాళాలు నీరు ఏర్పాటు చేశారు హమ్మయ్యా అని ఊపిరి పీల్చుకొన్నాం .’’ఒక అయిడియా  జీవితాన్నే మార్చేస్తుంది’’అన్నది నిజమో కాదో కాని ‘’కనకయ్య అయిడియా సీన్ నే మార్చేసి సుఖాంతం చేసింది’’ .ఈ ఏర్పాటు ను చూసి అందరు మురిసి పోయారు క్రెడిట్ నాకు దక్కినా దక్కాల్సింది మా పాలేరు కనకయ్యకే .

               ఆ రోజుల్లో వంట అంటే గాడి పొయ్యి మీదే చేసే వారు మాకు దొడ్డి వైపు అంతా గచ్చు ఉంది .అయినా ఒక అడుగు వెడల్పు ఆరడుగుల పొడవుతో గాడి పొయ్యి దక్షిణం వైపుకు ఎప్పుడో మా చిన్న తనాల నుండి ఉంది దానిలోనే ఎంత వంట అయినా .వర్షానికి పందిరి ఇబ్బంది కల్గించలేదు అక్కడే వంట కొంత, కొంత మా వంటింట్లో సీతా రామయ్య చేశాడు ఉదయం కాఫీ టిఫిన్లు మధ్యాహ్నం భోజనం సాయంత్రం టిఫిన్ టీ రాత్రి భోజనం అన్నీ బాగా చేసి సమయానికి అందించాడు .గాడి పొయ్యి లోకి ఎండిన తుమ్మ పోరాట్లను ఎప్పుడో కొని దొడ్లో ఉన్న పాకలో తడవకుండా జాగ్రత్త చేసుకోన్నాం .కనుక వంట సరుక్కు ఇబ్బంది లేదు .

                         పామర్రు హైస్కూల్ స్టాఫ్ అందర్నీ పెళ్లి రోజు మధ్యాహ్నం భోజనానికి ఆహ్వానించాను దాదాపు అరవై మంది పైనే .అందరు నా మీద ఉన్న అభిమానం తో వచ్చారు హెడ్ మాస్టారు రామ క్రిష్నయ్య గారుముహూర్తం సమయానికి వచ్చారు మిగిలిన వారిని  అందర్నీగుమాస్తా అంజి రెడ్డి  వెంట బెట్టుకొని తెసుకొని వచ్చాడు రాగానే అందరికి కాఫీ లు ఇప్పించాం .తరువాత భోజనాలు అప్పటికి కొంత తెరిపి వచ్చింది వీరందరికీ భోజనాలు మా మామయ్య గారి డాబా మీద నిమిషాల మీద ఏర్పాటు చేశారు మా వాళ్ళందరూ అందరు ఎంతో బాగా వివాహం జరిగిందని మమ్మల్ని మెచ్చుకొన్నారు ..మా స్టాఫ్ కూడా ఎంతో అభినందించారు ..ఇంత మంది స్టాఫ్ ఇక్కడికి రావటం నాకు మహదానందం గా ఉంది .ఆ తర్వాత రెండు రోజులకు స్కూల్ కు వెళ్లి నప్పుడు ఒకరిద్దరు రాని వాళ్ళు ‘’మేస్టారూ !పెళ్లి బాగా చేశారట కదా .మన వాళ్ళు చెప్పారు .మేమూ వద్దామనుకోన్నాం వర్షం కదా మీకు ఇబ్బంది కలిగించటం ఇష్టం లేక రాలేదు‘’అన్నారు .అప్పుడు నేను ‘’నేను ఇబ్బంది పడాల్సి వస్తే మిమ్మల్నేవర్నీ పిలిచే వాడిని కాదండీ .మీ రందరూ వచ్చి ఆశీర్వదిన్చాలనే మా కుటుంబం కోరుకొన్నది .ఇలాంటి మాటలు నాకు నచ్చవు ‘’అన్నాను‘’సారీ సారీ .మీరిలా బాధ పడతారనుకోలేదు ‘’అని ఏదో అన్నారు వారు రాక పోవటం నాకు బాదే కలిగించింది సరే గతం గతః .హాయిగా మా అన్న గారి అమ్మాయి చి సౌ వేద వల్లి వివాహం చి రామ కృష్ణ తో అనుకొన్న ముహూర్తానికి దివ్యం గా వైభవం గా భగవంతుని దయ వల్ల జరిగింది .మా అన్న గారు చేయాల్సిన వివాహం ఇది.ఆయన 1957 లోనే చని పోవటం వల్లా, ,మా నాన్న గారు 1961లో మరణించటం వల్ల నేనూ, మాశ్రీమతి ప్రభావతి పీటల మీద కూర్చుని వివాహం జరిపించాము .         నవంబర్ డిసెంబర్ లలో చెరుకు కొట్టటం ఫాక్టరికి తోలటం తో జనవరి నాటికి పంట డబ్బులు పుష్కలం గా చేతికి వచ్చాయి చేసిన అప్పులన్నీ తీర్చేశాము ..ఈ మధ్యలో అల్లుడు వచ్చినప్పుడు కూడా బట్టలు పెట్టటానికి ఊరిలో కోట్లో అప్పు తో కొని తెచ్చి పెట్టాము .అయితే కర్తవ్యమ్ ముందు ఇవేమీ పెద్ద ఇబ్బందులని పించలేదు బంధువర్గానికి అందరికి నూతన వస్త్రాలు పెట్టించింది మా అమ్మ .ఆవిడే మా వెనక నిల బడి ఆదేశించి నడిపించి కార్యక్రమాన్ని సంతృప్తిగా జరిపించింది .మా ఇద్దరక్కయ్యాలు లోపాముద్రా దుర్గా బావలు కృపానిధి వివేకానందం ,వారి కుటుంబం చిర్వాడ నుంచి వేలూరి కృష్ణ మూర్తి మామ గారు భార్య అత్తమ్మత్తయ్య గారు మా పాపాయి పిన్ని, సీత పిన్ని లక్ష్మీ కాంతం అమ్మక్కయ్యా శివరామ దీక్షితులు బాబాయి ,బుల్లిమామ్మ రాధ కృష్ణ మూర్తి అందరూ వచ్చారు .అందరు మేము పూనుకొని ఈ వివాహాన్ని ఇంత బాధ్యత గా చేసి నందుకు మెచ్చుకొన్నారు .ఇది మా బాధ్యత గా చేశాం .మెప్పులకోసం కాదు .వసిస్తూ గారు మా ఇంటి పురోహితులు శ్రీ వంగల సుబ్బావధాని  గారే .ఇలా విపరీత మైన ముసురు లో వేదవల్లి వివాహం ఘనం గా జరిగి అందరికి ఆనందం కలిగించింది వియ్యాల వారు కూడా ఎంతో సంతృప్తిని తెలిపారు ఎక్కడా అపార్ధాలు అలకలు నిస్టూరాలు లేకుండా అంతా సవ్యం గా జరిగింది .

      సశేషం –మీ –గబ్బిటదుర్గా ప్రసాద్ -16-6-13- ఉయ్యూరు

Posted in నా దారి తీరు | Tagged | 1 Comment

పరిశోధనా పారంగతుడు

పరిశోధనా పారంగతుడు

June 16, 2013

సుప్రసిద్ధ పత్రికా రచయిత, పండితుడు, పరిశోధకుడు, స్వాతంత్య్ర సమరయోధుడు తిరుమల రామచంద్ర. సంస్కృతం, ప్రాకృతం, హిందీ, కన్నడం, తమిళం, ఆంగ్లం, ఆంధ్ర భాషలలో అనితరసాధ్యమైన పాండిత్యం, పరిశోధనా పాటవంతో వారు చేసిన రచనలు – తెలుగు భాష, సాహిత్య ప్రియులకు కరదీపికలు. సంస్కృతం, ప్రాకృతం, కన్నడం, తమిళం, హిందీ, ఇంగ్లీషు భాషలలోని అనేక అపురూప రచనలను తెలుగులో అనుసృష్టి చేశారు. శతాధిక రచనలు వారు చేసినప్పటికీ, ఇప్పటికీ దాదాపు పాతిక మాత్రమే పుస్తకరూపంలో వచ్చాయి. చీకటి కోణాల్లో దాగున్న తెలుగుకు తన పరిశోధనల ద్వారా వెలుగునిచ్చిన తిరుమల రామచంద్ర రచనలు తిరిగి తెలుగువారికి అందకుండా అంధకారంలో మ్రగ్గడం క్షంతవ్యం కాదు.
తిరుమల రామచంద్ర వ్రాసిన ‘మన లిపి-పుట్టు పూర్వోత్తరాలు’ అయినా, ‘నుడి-నానుడి’ అయినా ‘సాహితీ సుగతుని స్వగతం’ అయినా, ‘మరుపురాని మనీషులు’ అయినా, ‘గాథాసప్తశతి’లో తెలుగు పదాలు అయినా ఏ ఒక్కటి అమెరికా లాంటి పశ్చిమదేశంలో రచించి ఉంటే పరిశోధనాత్మక రచనలకుగాను జర్నలిస్టులకిచ్చే ‘పులిట్జర్’ అవార్డు ఎప్పుడో వచ్చి ఉండేది. ఆయన చివరి రోజులలో వ్రాసిన ఆత్మకథాత్మక రచన ‘హంపీ నుంచి హరప్పాదాకా’ జ్ఞానపీఠ్ అవార్డు రాదగినది.

తెలుగులో ఇంత చక్కని, చిక్కని, అక్కున చేర్చుకోదగిన జీవిత చరిత్ర మరొకటి రాలేదు. ఆంధ్రప్రదేశ్ అవతరించిన రెండు నెలల్లో వెలువడిన అపూర్వ గ్రంథం ‘మనలిపి-పుట్టుపూర్వోత్తరాలు’. ఎన్నో క్రొంగొత్త అంశాలు చెప్పిన ఈ గ్రంథం భారతీయ భాషలలో సమగ్రమైనది. ఇంతవరకు ఇలాటి గ్రంథం రాలేదు. అలాగే భాషాశాస్త్రాన్ని మానవజాతి శాస్త్ర, సాంఘిక శాస్త్ర, చరిత్రాదులతో సమన్వయించి రచించిన మరో అపూర్వగ్రంథం – ‘నుడి-నానుడి’. వివిధ దృక్కోణాలతో వ్రాసిన ఇలాంటి గ్రంథం కూడా మరొకటి లేదు. ప్రాకృత-తెలుగు సాహిత్యాలకు రెండువేల సంవత్సరాలకు పైగా సంబంధం ఉందంటారే తప్ప – వివరణాత్మకంగా వ్రాసినవారు లేరు. ఈ నేపథ్యంలో ‘గాథాసప్తశతి’లో తెలుగు పదాలు వెలికితీసి పుస్తకరూపం ఇచ్చారు. గాథాసప్తశతిని కాళిదాసు అనుకరించాడని ఈ గ్రంథంలో తిరుమల రామచంద్ర సిద్ధాంతీకరించి చెప్పారు. ‘సాహితీ సుగతుని స్వగతం’, ‘మరుపురాని మనుషులు’ మౌలిక వ్యాస సంపుటాలు. ఈ గ్రంథాలు ఆ రోజుల్లో నాలాంటి సాహితీ ప్రియులకు, యువ జర్నలిస్టులకు, విద్యార్థులకు స్ఫూర్తిగ్రంథాలు.

ఇంతటి పరిశోధనా పారంగతుడు తిరుమల రామచంద్ర ప్రమాదీచనామ సంవత్సర జ్యేష్ఠ శుద్ధ చతుర్ధశి జ్యేష్ఠ నక్షత్రంలో అంటే సరైన తేదీ 1913 జూన్ 17న జానకమ్మ – శేషాచార్య దంపతులకు జన్మించారు. రాష్ట్ర ప్రభుత్వం తెలుగుభాష, సాంస్కృతిక వికాస సంవత్సరంగా ప్రకటించిన ఈ యేడాదే తెలుగుభాషా సేవకుడుగా తనకుతానే ఎంతో గర్వంగా బతుకున్నంతకాలం చెప్పుకున్న తిరుమల రామచంద్ర శతజయంతి సంవత్సరం రావడం యాదృచ్ఛికమైనా, ప్రభుత్వం దానికి సంబంధించిన భాషా, సాంస్కృతిక సంబంధిత సంస్థలు శ్రద్ధ వహించి ఘనంగా నిర్వహించవలసిన అవసరం ఎంతగానో ఉంది. ఇంతవరకు పుస్తకరూపంలోకి రాని వారి రచనలు సేకరించి, వరుసగా ప్రచురించవలసిన తరుణమిది. 1997 అక్టోబర్ 12న కన్నుమూసిన తిరుమల రామచంద్ర ఎనభై నాలుగేండ్ల వయస్సులోను అప్పుడు జర్నలిస్టుగా చురుకుగా పనిచేస్తున్న నాలాంటి వారితో కలిసి ఎన్నో సభల్లో పాల్గొన్నారు.

మరెన్నోసార్లు తమ అనుభవాలు, జీవిత విశేషాలు, భాషా సాహిత్య విషయాల పరిశోధనలో అనుసరించిన పద్ధతులు చెప్పారు. వయస్సురీత్యానే కాకుండా, పాండిత్యపరంగా ఎలాంటి భేషజం లేకుండా మనసువిప్పి మాట్లాడే స్వభావం కలిగిన తిరుమల రామచంద్ర జీవిత, సాహిత్య సేవలను దిజ్మాత్రంగా ఆవిష్కరించే ప్రయత్నమే ఈ వ్యాసం.
తిరుమల రామచంద్ర నడిపిన శీర్షికలలో మరుపురాని మనీషులు, నుడి-నానుడి (ఆంధ్రప్రభ సచిత్ర వారపత్రిక) తెలుగు వెలుగులు (ఆంధ్ర సచిత్ర వారపత్రిక) సాహితీ సుగతుని స్వగతం (భారతి) ఆయనకు ఎనలేని కీర్తిని, తెలుగుకు అపురూప సాహిత్య సంపదను ఒనగూర్చాయి. ఇవి కాకుండా వారు మనవి మాటలు (భారతి), చరిత్ర కెక్కని చరితార్థులు (పరిశోధన), తెలుగుతల్లి, మాటలకథ, పదసంపద, సంస్కృతి సంప్రదాయ (ఆంధ్రప్రభ సచిత్ర వారపత్రిక), మాండలికాలు, పలుకుబడి, హైదరాబాద్ లేఖ (ఆంధ్రప్రభ), హైదరాబాద్ నోట్‌బుక్ (ఆంధ్రపత్రిక), రాజధాని విశేషాలు (ఆంధ్రప్రదేశ్), ఇదీ మన రాజధాని (ప్రజాతంత్ర) విజయవంతంగా నిర్వహించారు. కేవలం వారి పేరుతోనే కాకుండా సుమారు పాతిక వేల కలం పేర్లతో వారెన్నో రచనలు చేశారు. కన్నడం నుంచి పది, పన్నెండు నవలలు, కథా సంకలనాలు అనువదించారు. హిందీ, ఇంగ్లీషు నుంచి సుమారు ముఫ్పై గ్రంథాలు అనువదించారు.

తిరుమల పరిశోధనాత్మక రచనలలో పేర్కొనదగినవి ‘హిందువుల పండుగలు-పర్వాలు’, ‘తెలుగు పత్రికల సాహిత్య సేవ’, మూడు వాఙ్మయ శిఖరాలు, అహంభో, అభివాదయే, బృహదారణ్యకం, మనవి మాటలు, బుద్ధుణ్ణి బళ్ళోవేశారు లాంటివి. అనువాదాల్లో లలితవిస్తరం, అవధాన కల్పలత చెప్పుకోదగినవి. లలితవిస్తరం మహాయాన బౌద్ధ సంప్రదాయాను సారమైన బుద్ధుని చరిత్ర. భారతదేశంలోనే ఇది మొట్టమొదటి లౌకిక వచనమనీ, క్రీస్తుకు ముందు మూడు శతాబ్దాల నాడు రచించిందని రామచంద్ర అభిప్రాయం. మల్లంపల్లి సోమశేఖర శర్మ మొదలైనవారు లలిత విస్తరాన్ని ప్రస్తావిస్తూ దీనిలో విపుల సంగతి ఉందని, క్రీడల సంగతి అనేవారు. దీనికి రాజేంద్రలాల్ మైత్రా సంగ్రహ అనువాదం ఆంగ్లంలో ఉంది గానీ, యథామూలాను వాదం ఏ భాషలోను లేదు. రామచంద్ర, ప్రముఖ విద్వాంసులు బులుసు వెంకట రమణయ్య కలిసి దీనిని మక్కీకిమక్కీ అనువదించారు. మొదట ఇది 1962లో ఆంధ్రప్రభ ఆదివారం సారస్వతానుబంధంలో ధారవాహికంగా ప్రచురితమై పుస్తకరూపం పొందింది.
అనువాదం చేసే పద్ధతిలో ముఖ్యంగా తెనుగు తోబుట్టువుల అనువాదంలో రామచంద్ర మక్కికి మక్కి వాది. అంటే తెలుగు నుడికారం విడనాడి యథామూలమని కాదు.

పఠనీయత ఉండాలి. మూలానుసారిగాను ఉండాలి. సంక్షేపీకరణం, సారాంశకథనం ఆయనకు ఒప్పదు. ఉదాహరణకు ఒక సన్నివేశం. రామచంద్ర దక్షిణ భారత పుస్తక సంస్థ వారికి కొన్ని కన్నడ అనువాదాలు చేశారు. వాటిలో ఒక కథలో ఒక ఆఫీసరు కోపంతో ఆఫీసులో ప్రవేశించే భార్య కరాఘాతాలు తప్పించుకొనడానికి పెద్ద ఫైలును తల మీద పెట్టుకుంటాడు. అతడు దానిని టీకాచార్యులు హయగ్రీవుని కోసం శనగల పూర్ణం పళ్లెం నెత్తి మీద పెట్టుకున్నట్టు అని రచయిత వర్ణించారు. వ్యాసుని బ్రహ్మ సూత్రాలకు ద్వైత మతానుసారంగా మధ్వాచార్యుల వారు భాష్యం రాశారు. దానికి అణు భాష్యమని పేరు. దానికి జయతీర్థుల వారు టీక రాశారు. కనుక ఆయనకు టీకాచార్యులని పేరు. అది కూడా కఠినమని శ్రీపాదరాయలనే విద్వాంసులు మరొక వ్యాఖ్య రాశారు. శ్రీపాద రాయలకు హయగ్రీవుడు ప్రత్యక్షమని ఐతిహ్యం. శ్రీపాదరాయలు ఉడికించిన సెనగలు బెల్లం పళ్ళెంలో పెట్టుకుని తల మీద మోసుకుని గుదిగాళ్ళతో కూర్చుంటే హయగ్రీవుడు అశ్వరూపంలో వచ్చి, తన ముందు కాళ్ళు శ్రీపాదరాయల మోకాళ్ళపై పెట్టి ఈ బెల్లం శనగలు తినేవాడట. ఈచిత్రం ఏ ఉడిపి హోటలులోనైనా గోడకు వ్రేలాడుతూ ఉంటుంది. ఈయనకు కూడా టీకాచార్యులని పేరుంది. కొందరు దీనికి ఒప్పరు. టీకాచార్యులు పళ్ళెం నెత్తి మీద పెట్టుకున్నట్టు అనే ఉపమానం కన్నడంలో విద్యావంతులకు తెలిసిన సంప్రదాయం. రామచంద్ర ఆ విధంగానే వ్రాసి క్రింద అథస్సూచికలో వివరణ ఇచ్చారు. ఆ సంస్థలో తెలుగు ఎడిటర్‌గా ఉన్న బొమ్మకంటి సింగరాచార్యులు దానిని తీసివేసి వీరభద్ర పళ్ళెంలాగా అని మార్చారు. ముద్రణ జరిగిన తర్వాత రామచంద్ర దాన్ని చూచి, అది సరికాదని వాదించారు. వీరభద్ర పళ్ళెం మార్పు బాగుంది కానీ ఈ మార్పు వల్ల తెలుగు పాఠకులకు ఒక కొత్త సంప్రదాయ జ్ఞానం అందలేదు. అందుకు నిరసనగా రామచంద్ర ఇకపై ఆ సంస్థ వారికి అనువాదం చేయడం మానివేశారు. అది రామచంద్ర తత్వం.

తిరుమల రామచంద్ర రచనల గురించి ఇంకా ఎన్నని చెప్పను. ఏదో ఒక కొత్త విషయం లేకుండా ఏ రచనలు చేయలేదు. ఇవ్వాళ పత్రికలు వాడుతున్న భాషలో ఏది సరైన పదమో, ఏది తప్పో వివరిస్తూ రాసిన ‘పలుకుబడి’కి కూడా ఇంతవరకు గ్రంథరూపం ఇవ్వలేదు. తిరుమల రామచంద్ర శత జయంతి సంవత్సరాన్ని పురస్కరించుకునైనా ఈ యేడాది, గ్రంథాలుగా రాని వారి రచనలన్నీ వెలుగు చూస్తాయని ఆశిద్దాం.
– టి. ఉడయవర్లు
సీనియర్ జర్నలిస్టు
(జూన్ 17న తిరుమల రామచంద్ర శతజయంతి)

Posted in సేకరణలు | Tagged | 2 Comments