వీక్షకులు
- 1,134,552 hits
-
-
ఉసుల గూడు (బ్లాగ్) గువ్వలు (పోస్ట్)
- శ్రీ పోలాప్రగడ సత్యనారాయణ మూర్తి గారి షేక్స్పియర్ సాహిత్య వైభవం.20 వ భాగం.12.4.26.
- మహానటుడు సి ఎస్ ఆర్ పూర్వ స్మృతులు.3 వ భాగం.12.4.26.
- నా దారి తీరు -3 డిగ్రీ చదువు –మొదటి ఏడాది(1958-59)
- నాట్యావధాన సరస్వతీ శ్రీ స్వర్ణ రాజ హనుమంతరావు గారి శ్రీమద్రామాయణం లో ఆంధ్రాయణం.11 వ భాగం .12.4.26.
- వాల్మీకి మహర్షి కృత శ్రీ మద్రామాయణం. ఆచార్య పుల్లెల శ్రీరామ చంద్రుడి గారి బాలానందినీ వ్యాఖ్య.170 వ భాగం.12.4.26.
- శ్రీ పోలాప్రగడ సత్యనారాయణ మూర్తి గారి షేక్స్పియర్ సాహిత్య వైభవం.19 వ భాగం.11.4.26.
- మహానటుడు సి.ఎస్. ఆర్. పూర్వ స్మృతులు.2 వ భాగం.11.4.26.
- నాట్యావధాన సరస్వతీ శ్రీ స్వర్ణ రాజ హనుమంతరావు గారి శ్రీమద్రామాయణం లో ఆంధ్రాయణం.10 వ భాగం.11.4.26
- శ్రీ మద్రామాయణం. ఆచార్య పుల్లెల శ్రీరామ చంద్రుడి గారి బాలానందినీ వ్యాఖ్య.169 వ భాగం.11.4.26.
- నటుడు సి. ఎస్. ఆర్. పూర్వ స్మృతులు.1 వ భాగం.10.4.26.
Archives
ఉసూల గూటి అరలు
- అనువాదాలు (24)
- అమెరికా లో (206)
- ఆ''పాత''మధురాలు (9)
- ఆరోగ్యం (4)
- ఊసుల్లో ఉయ్యూరు (81)
- కవితలు (147)
- కవి కోకిల స్వరాలు (11)
- దేవాలయం (38)
- నా డైరీ (9)
- నా దారి తీరు (136)
- నేను చూసినవ ప్రదేశాలు (108)
- పద్య రత్నములు (2)
- పుస్తకాలు (3,475)
- సమీక్ష (1,826)
- ప్రవచనం (15)
- మహానుభావులు (388)
- ముళ్ళపూడి & బాపు (61)
- రచనలు (2,912)
- రాజకీయం (66)
- రేడియో లో (55)
- వార్తా పత్రికలో (2,159)
- సభలు సమావేశాలు (337)
- సమయం – సందర్భం (852)
- సమీక్ష (33)
- సరసభారతి (10)
- సరసభారతి ఉయ్యూరు (543)
- సినిమా (378)
- సేకరణలు (318)
- సైన్స్ (46)
- సోషల్ మీడియా ఫేస్బుక్ youtube (2,186)
- స్వాతంత్ర సమరయోదులు (20)
- English (6)
ఊసుల గూడు
మురళీ కృష్ణ హారర్ కధల్లో కొత్తదనపు కస్తూరి గుబాళింపు -1
మురళీ కృష్ణ హారర్ కధల్లో కొత్తదనపు కస్తూరి గుబాళింపు -1
కస్తూరి మురళీ కృష్ణ ప్రముఖ కధా ,నవలా ,చారిత్రిక ,ట్రావెలోగ్ రచయిత .గొప్ప విమర్శకులు .ఏది రాసినా స్వంత వాణి ,బాణీ ఉన్న రచయిత .రైల్వేలో ఆఫీసర్ ఉద్యోగం లో క్షణం తీరిక లేక పోయినా,ఆయన కలం అను నిత్యం నర్తి స్తూనే ఉంది .తెలుగులో ఇప్పటి వరకు భయానక అంటే హారర్ కధలు రాలేదని ఆయన భావించి తానే దానికి నడుం కట్టి ,రాసి, మొదటి ‘’భయానక సంపుటి ‘’’’ఆ అరగంట చాలు ‘’అనే శీర్షిక తో ఇటీవలే వెలువరించి ,ఈ నేల ఏడవ తేదీ హైదరా బాద్ లో మా పెద్దబ్బాయి శాస్త్రి ఇంటికి ఆయన వచ్చి కలిసి ,నాకు ఆయన ఆ పుస్తకాన్ని న అంద జేషి దాని పై సరస భారతి ఉయ్యూరు లో క పరిచయ కార్య క్రమం ఏర్పాటు చేయమని కోరారు .ఆయన ఫిబ్రవరి చివరలో మార్చిలో బిజీ అని ఆయన అంటే ,మాకు జనవరి లో అవకాశం లేదని నేను చెప్పాను .ఎప్పుడు వీలైతే అప్పుడు ఏర్పాటు చేయమని ,తాను వచ్చి పాల్గొంటానని అన్నారు .మన సరస భారతి ప్రచురణలు ‘’శ్రీ హనుమాన్ కధా నిది ‘’,’’ఆదిత్య హృదయం ‘’ఆయనకు నేను అంద జేశాను .ఇప్పుడు సాహితీ బంధువులకు ఆ భయానక కదల వివరాలను ,అందులో మురళీ కృష్ణ వెలి బుచ్చిన అభి ప్రాయాలను తెలియ జేస్తూ నాలుగైదు హారర్ కధలను మీకు పరిచయం చేస్తాను ఇది సమీక్ష మాత్రం కాదని ,పరిచయమే నని తెలుపు కొంటున్నాను .
ముందుగా ‘’ఆ అర గంట చాలు ‘’అనే పది హేను భ యానక కధా సంపుటిలో రచయిత శ్రీ కస్తూరి మురళీ కృష్ణ ‘’మనవి ‘’మాటల్లో తన భావాలను పంచుకొన్నారు .తాను విభిన్న మైన కధలను సృష్టించానని ,తెలుగులోచారిత్రాత్మక కాల్పనిక కధలు’’కల్హణ కాశ్మీర రాజ తరంగిణి కధలు ‘’ రాశానని ,వీటిలో అవసర మైన కల్పనలు చేశానని చెప్పారు .జ్యోతిశ్శాస్త్రం పై ఉన్న అపోహలను తొలగిస్తూ జ్యోతిషా న్ని వ్యక్తిత్వ వికాసానికి ,ధనాత్మక ఆలోచనా సరళికి ఎలా వాడ వచ్చో పద మూడు కధలను ‘’జీవితం –జాతకం ‘’లో రాశానని చెప్పారు వాటిలో తాను సృష్టించిన జ్యోతిష్కుడు ‘’శ్రీ నాద్.’’బాగా ప్రాచుర్యం పొందారని అన్నారు .వాస్తవ ‘’వి జయ గాధ’’లను’’రియల్ స్టోరి ‘’గా రాశారు .వైజ్ఞానిక శాస్త్ర పరి శోధనఆధారం గా ‘’హార్డ్ కోర్ సైన్సు ఫిక్షన్ ‘’ రచించారు .ఇలా వి భిన్న కధ లను మురళీ కృష్ణ రాసి వాటికి కస్తూరి పరిమళాలను అద్దారు .ఆయన రాసిన వన్నీ వివిధ పత్రికలలో ప్రచురితాలు .వ్యంగ్య కధలు కూడా రాశారు .అవి ‘’వ్యంగ్యాస్త్రం ‘’పేర పాఠకాదరణ పొందాయి .
తెలుగు లో డిటెక్టివ్ కధలు చాలానే వచ్చాయని కాని భయానక కధలు రాలేదని భావించి తాను హారర్ కధలను ప్రత్యెక దృష్టి తో ధారావాహికం గా రాసి రాసి తెలుగు సాహత్య చరిత్రలో మదటి ‘’భయానక కధా సంపుటి ‘’ఆ ఆర గంట చాలు ‘’ని ప్రచురించానని దీనికీ చదువరుల ఆదరణ విశేషం గా ఉందని తెలిపారు మురళీ కృష్ణ .వీటిని ఆదరించిన ‘’నవ్య ‘’వార పత్రిక సంపాదకులు జగన్నాధ శర్మకు ,విపుల, చతుర మాజీ సంపాదకు రాలు శ్రీ మతి కే.బి.లక్ష్మి గార్ల కు ఆయన కృతజ్ఞతలు తెలిపారు .
తన హారర్ కధల్లో ప్రతి కధ లో ఒక చమత్కారం ,ఒక జలద రింపు ,,ఒక ఆలోచనా కలిగేట్టుమురళీ కృష్ణ కధలను రచించారు .ఈ కధలు పూర్తిగా చదివిన తర్వాత అవి భయానక కదల కన్నా ,’’సస్పెన్సు ‘’కధలు అని పిస్తాయని ఆయనే చెప్పుకొన్నారు .కధ అయి పోయి ,కళ్ళు మూసుకొనిసంఘటనలను ఊహిస్తే ఒక జలద రింపు కల్గుతుందని హామీ ఇస్తున్నారు . ఇందులో కొన్ని కధలు నిజంగా ,కొన్ని స్నేహితుల అనుభవాలని ,కొన్ని సైన్సు ఫిక్షన్ ,సైన్సు ఫాంటసి ల సరి హద్దుల్లో ఉన్నాయని ,ద్రుశ్యాత్మకమైనవి ,సంఘటనాత్మక మైన వీ ఉన్నాయని ,తాను భయానక వాతా వరణాన్ని సృష్టించానని ,పాత్ర అనుభ విస్తున్న భావాలను ‘’నేను ‘’అంటుఉత్తమ పురుష లో చెప్పటం వల్ల అనుభవాలు సూటిగా పాఠకులకు చేరి ,ఆ అనుభవం సాకార మవుతుందని చెప్పుకొన్నారు .కొన్ని కధల్లో పాఠకులను తప్పు దారి పట్టించి ,షాక్ కలిగించే టెక్నిక్ ను ప్రయోగాత్మకం గా చేశానని ,ఎలాంటి అపోహలు , ,రంగు టద్దాలు లేకుండా చదవమని కోరారు ఆంగ్ల సాహిత్యం లో అగాథా క్రిస్టీ ,ఎడ్గార్ ఎల్లెన్ పో ,సీఫెన్ కింగ్ ,జామ్ స్టో కర్ ,మేరీ షెల్లీ ,ధా పెద్యు మారియర్ ఇలాంటి కదలని రాసి ప్రాచుర్యం తెచ్చారని తెలిపారు .తన కధలు మూఢ నమ్మకాలను ప్రోత్స హించేవికావని ,చమత్కారం ,మూడ్ లను కలిగిస్తాయని ,ఇవి దెయ్యాలు భూతాల కధలు కావని వివరణ ఇచ్చు కొన్నారు .
.చివర గా మురళీ కృష్ణ ‘’వందేళ్ళ తెలుగు కధా సాహిత్య చరిత్రలో భయానక కదల తోలి సంపుటి మీ ముందుంది .చదవండి .మీ అభిప్రాయాలను నిర్మోహమాటం గా తెలియ జేయండి ‘’అని కోరారు . ఈ కధల్లో నూతనత్వం గుబాళించింది .అందుకే నేను ‘’మురళీ కృష్ణ హారర్ కధల్లోనూత నత్వపు కస్తూరి గుబాళింపు ‘’అనే పేరు తో మీకు పరిచయం చేస్తున్నాను .
సశేషం
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –18-1-13-ఉయ్యూరు
వేదాంతం వారికి పుష్పాంజలి ‘నేనే సత్యభామ’
వేదాంతం వారికి పుష్పాంజలి ‘నేనే సత్యభామ’

ఆరుదశాబ్దాల పాటు పట్టుచీర మెరమెరలు, పూలజడల గుబాళింపులు, అలకలు, వయ్యారాలు, కలహాలు , వన్నె చిన్నెల వయ్యారాలతో యావత్ ప్రపంచాన్ని మురిపించిన కూచిపూడి పెద్దాయన వేదాంతం సత్యనారాయణ శర్మ ఇటీవలే కన్నుమూశారు. కానీ ఆయనను సజీవంగా కళ్లముందు నిలిపేందుకు మంచి ప్రయత్నం చేశారు దూలం సత్యనారాయణ. నేనే సత్యభామ అనే పేరుతో ఆయన ఎంతో శ్రమించి రూపొందించిన డాక్యుమెంటరీ విశేషాలు.
కూచిపూడి నాట్యగురువు, అన్ని ప్రక్రియల మూలకర్త సిద్ధేంద్రయోగి రూపొందించిన భామాకలాపంలోని అసలు సారం ఔపోసన పట్టిన అతి కొద్దిమందిలో ఒకరు పద్మశ్రీ వేదాంతం సత్యనారాయణ శర్మ. ఆధునికులకు సత్యభామ అసలు తత్వం తెలియచెప్పి, అరుదైన ప్రక్రియను ఆక ళింపు చేసుకున్న గొప్ప కళాకారుడు ఆయన. ఈ మధ్యనే కన్నుమూసిన ఆయనను, ఆయన సుదీర్ఘ కృషిని సజీవం చేసే గొప్ప ప్రయత్నం ఒకటి జరిగింది.
వేదాంతం… సజీవం
కళా రంగంలో ఎందరో మహనీయులు నిరంతరం శ్రమించి, అద్భుతాలను అవిష్కరిస్తున్నారు. అయితే వారు చేసిన కృషి ముందుతరాలకు తెలియకుండా పోతున్నది. ఈ లోటును భర్తీ చేసేందుకు అమెరికాలో స్థిరపడిన నర్తకి స్వాతి గుండపనే ని, డాక్యుమెంటరీ రూపకల్పనలో మంచి అనుభవం గడించిన దూలం సత్యనారాయణ న డుంకట్టారు. ఎంతో శ్రమించి, లక్షల రూపాయలు వెచ్చించి ‘నేనే సత్యభామ’ పేరుతో వేదాంతం వారి అపారకృషిని డాక్యుమెంటరీగా చిత్రీకరించారు. ఆయనను, ఆయన కృషిని శాశ్వతం చేశారు. 70 నిముషాల నిడివిగల ఈ డాక్యుమెంటరీ నాట్యం గురించి తెలియని వారిలో సైతం ఆసక్తిని పెంచే విధంగా రూపొందింది. భామాకలాపంలో గత ఆరేడు దశాబ్దాల్లో చోటుచోసుకున్న మార్పుల గురించి వేదాంతం సత్యనారాయణ శర్మ వ్యాఖ్యానం రసరమ్యంగా సాగుతుంది.
1960లో కూచిపూడి గ్రామంలో ఆరంభమైన తొలి కూచిపూడి నర్తన శిక్షణాసంస్థ విశేషాలను పద్మశ్రీ వేదాంతం నోట వినటం అరుదైన సందర్భం. ఆడవేషాలు వేస్తూ ప్రపంచానికి వయ్యారాల ముచ్చట్లు, అలంకరణ పద్ధతులు తెలియచెప్పిన వారిలో నాటకాలలో స్థానం నరసింహారావు, నాట్యంలో వేదాంతం సత్యనారాయణలు జగత్ ప్రసిద్ధులు. స్థానం వారి వివరాలు, మంచి ఫోటో వంటివి ఈ తరం వారికి అందుబాటులో లేవు. కానీ దూలం సత్యనారాయణ చొరవతో వేదాంతం వారి రూపం, మాట, నడక, వేషం ప్రత్యేకమైన ఆట వంటి అంశాలు ముందతరాలకు అంది వచ్చాయి. ఈ తరంలో అగ్రశేణి నాట్యతారలుగా పేరు ప్రఖ్యాతలు గడించిన వారికి అడుగులు నేర్పిన పసుమర్తి వేణుగోపాల శర్మతో పాటు, కూచిపూడిని కలకాలం తలచుకునేలా చేసిన గురువులు ఆ చిత్రంలో వేషం కట్టి ఆడటం మరెక్కడా అగుపించని అపురూప అంశం.
ఈ డాక్యుమెంటరీ రూపకల్పనకు వీరిద్దరూ చాలా కష్టాలే పడ్డారు. 1965-70లలో కూచిపూడిలోని ప్రజ్ఞను తమ చిత్రాలలో పొదువుకున్న ప్రభుత్వ ఫిలిం డివిజన్ వారి చిత్రాలలోని సన్నివేశాలను తమ చిత్రంలో వాడుకోవటం కోసం అనుమతుల పొందడానికి నానా అవస్థలు పడ్డారు. అందుకోసం వారికి పెద్ద మొత్తంలో డబ్బు చెల్లించాల్సి రావటంతో అనేక ఇబ్బందులు ఎదురయ్యాయి. అయినా పట్టదలతో డాక్యుమెంటరీ పూర్తి చేశారు. కూచిపూడి గురువుతో మేలైన సంభాషణలతో డాక్యుమెంటరీని రసగుళికలా రూపొందించారు.
అందరికీ చేరువగా…
కొద్ది మంది అభిమానులు మాత్రమే చూడగలిగిన ఆ కూచిపూడి భామ చిత్రాన్ని అందరూ చూసేలా చేయాలని నిర్మాత, దర్శకులు ఉవ్విళ్లూరుతున్నారు. వేదాంతం వారు ఇటీవల కన్నుమూయటంతో ఆయన అనుభవాలను, జ్ఞాపకాలను రికార్డు చేయటం ఎంత అవసరమో వారు గుర్తించారు. ఆ అరుదైన డాక్యుమెంటరీని అందరికీ అందుబాటులోకి తెచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు. డాక్యుమెంటరీ నిర్మాణంలో అమెరికాలో శిక్షణ పొందిన సత్యనారాయణ రెండేళ్లు శ్రమించి, కూచిపూడి అగ్రహారంలో నాట్యకళ లోతుల్ని ఈ డాక్యుమెంటరీ రూపంలో మనముందుంచారు. కూచిపూడి గ్రామంలోని ప్రకృతి అందాలు, ఆ ఊరివారి ఆచార వ్యవహారాలు అన్నింటిని ఆ యువదర్శకుడు తన కెమెరాలో బంధించి ప్రేక్షకుల ముందుకు తెచ్చాడు. వాటిని అందుకోవాల్సిన బాధ్యత కళాహృదయులందరిదీ. ఆసక్తి కల వారు ఆ చిత్ర రూపకర్త సత్యనారాయణను 8886455000 ఫోన్ నంబరులో పలకరించవచ్చు.
భ.కా.రా.మేస్టారి చమత్ కారాలూ ,మిరియాలూ -6(చివరి భాగం )
భ.కా.రా.మేస్టారి చమత్ కారాలూ ,మిరియాలూ -6(చివరి భాగం )
తెలుగులో హాస్య రచనలు తక్కువే నని ఒక అభిప్రాయం బలం గా ఉండేది తెలుగు వాళ్ళు చాలా సీరియస్ ఫెలోస్ అన్న పేరూ ఉంది .అందుకే ఆంధ్రలో హాస్యం పుట్టలేదన్నారు ప్రబుద్ధులు కొందరు .కాని వెనక్కి తిరిగి చూస్తె గురజాడ పండించిన హాస్యమేమీ తక్కువ కాదు .చక్కని హాస్యమే పండించారాయన .చిలక మర్తి వారు కొంత సాధన చేసినా గణపతి లాంటివి తప్ప మిగిలిన ప్రహసనాలు కొంత వెగటు పుట్టించాయి పానుగంటి వారు మాటలతో హాస్యాన్ని పిండారు .ప్రహాసనాలే హాస్యం అని చెలామణి అయిన రోజులు ఎక్కువే .బక్క బిక్క చచ్చి పోయిన హాస్యం తో ముని మాణిక్యం వారు జీవ పుష్టి కలిగించారు .హాస్య సంజీవిని తో భమిడి పాటి కామేశ్వర రావు మేష్టారు మృత ప్రాయం గా ఉన్న హాస్యాన్ని బ్రతికించి బట్ట కట్టించారు .లోక పరిశీలన ,పరిశోధనలకు వారి మేస్టేరీ జీవితం బహుదా ఉపయోగ పడింది .ఇతర దేశాల హాస్యాలను అధ్యయనం చేసే అవకాశమూ కలిగింది అందుకే అన్ని కోణాల్లోంచి తనదైన చమక్కులతో స్వంత మాటల తో బాణీ తో వాణికి హాస్యపు కుచ్చుల కిరీటాన్ని పెట్టారు .అచ్చ తెనుగు హాస్యానికి మేజు వాణీ చేశారు .అరుదైన హాస్యాన్ని వండి వడ్డించారు .త్రేపులు వచ్చే దాకా త్రాగించి జీర్నింప జేశారు .
భ;కా.రా.మేస్టారి లో హాస్యం తో బాటు ఆలోచన పాలు కూడా ఎక్కువే .అందుకే ఆయన రాసిన వన్నీ సజీవాలు గా కన్పిస్తాయి .ఆయన రాసిన చిన్న నాటికలు హైస్కూళ్లలో వార్షి కోట్స వాల్లో ప్రదర్శించటానికి రాసినవే .అయినా జీవితం లోనీ ఓడిడుకులను ,హెచ్చు తగ్గులను చాలా లోతుగా ,సూక్ష్మం గా పరి శీలించి పండించిన ఘనత వారిది .ఎక్కడ బడితే అక్కడ హాస్యాన్ని వండి వడ్డించే నేర్పున్న రచయిత మేష్టారు .నల భీమ పాకమే .’’హాస్య బ్రహ్మ ‘’బిరుదు వారికి సర్వ విధాలా తగినదే .ఆత్మ తత్వాన్ని వంట బట్టించుకొని పంచ గల పంచ ముఖ బ్రహ్మ మేష్టారు .’’త్యాగ రాజు ఆత్మ విచారం ‘’ రచన తో కొత్త పుంతలు తొక్కారు .రాగం ,తానం లతో కుస్తీ పట్టే పాట గాళ్ళ హృదయ కవాటాలు తెరిపించి ,ఆత్మ తత్త్వం ఎక్కించి అసలు సంగీతానికి ప్రాభవం కల్పించారు .
రాక్షస చాణక్యుల దొంగా టకాన్ని చాలా సున్నితం గా రచించి అత్యాస్చర్య చకితుల్ని చేశారు .ముద్రా రాక్షసాన్ని రసోదంచితం చేసిన మహా నేర్పు వారిది .మోలియర్ రాసిన నాటికలను అసలు సిసలు తెలుగు నాటికలు గా పరి వర్తించి మహా పేరు పొందారు .ఆయన పాత్రాన్నీ జీవితం లోంచి వచ్చి నవే .’’ఇంట్లోని నౌకరు ‘’పాత్రను ఆయన నడిపి నంత పకడ్బందీగా మరెవ్వరు నడిపి ఉండరు .ప్రేమకు అంతస్తులు అడ్డు రావని తెలిపారు .ఆయన భాష ఒక మహా ప్రవాహం .పదాలు అచ్చం అలానే ఉంటేనే బాగుంటాయి అన్నంత ఒద్దిక తో రాశారు .వాటిని మార్చి వేరే మాటలు పెట్టలేము .పెడితే కృతకం గా గోచరిస్తాయి .వారి తూర్పు గోదారి మాండలీకం మాన్దలీన్ విన్నంత హాయి గా ఉండి తల ఊపిస్తుంది .చేవ గల రచయిత శ్రీ భమిడి పాటి .ఆయన రచనల్లో ఆయన భావాలు ,సమాజం పైనా ,భాష పైనా ,జీవన శైలి మీద విసరిన చెణుకులు ,కోరడాల్లా తగిలి చురుక్కు మన్నా కమ్మని హాయి అని పిస్తాయి .పై పెచ్చు ఆలోచనలను గిలకరింప జేస్తాయి .వారి ‘’అవును ‘’’’అన్నీ తగాదాలే ‘’భాగాల్లో ఉన్న హాస్యపు తరకల్ని ఇప్పటి దాకా మనం ఆస్వాదించాం.హాస్యపు జల్లు లో ముంచి ఉతికి ,ఆరవేసిన హాస్య ఘనా పాటీ భ.కా.రా.మేష్టారు .
భమిడి పాటి కామేశ్వర రావు మేష్టారు జీవితం అంతా రాజమండ్రిలోనే గడిచింది .ఆయన 1897 లో జన్మించి 61ఏళ్ళు మాత్రమె జీవించి అందులో దాదాపు నలభై ఏళ్ళు హాస్యాన్ని పండించి 1958 లో మరణించారు .ప్రణయ రంగం ఈడూ –జోడూ వినయ ప్రభ చెప్పలేం అనే నాలుగు నాటకాలు రాశారు .వారి లఘు వ్యాసాలలో మేజు వాణి తనలో అవును నిజం మాట వరస లోకో భిన్న రుచ్చి మన తెలుగు ఉన్నాయి .వారి ప్రత్యేకత ‘’హాస్యం ఆనంద వర్ధనం .ఆరోగ్య భావ సంవర్ధకం .సీరియస్ విషయాలను కూడా అందుకే హాస్యం లో రంగ రించి సుమారు నలభై ఏళ్ళు తెలుగు వాళ్ళ మెదడుల కుదుళ్ళ ను కది లించారు .నవ్వి నవ్వి కన్నీళ్లు వచ్చేదాకా ఆయన తన రచనలను చది వించారు .అంత కంటే సార్ధకత ఏముంది ?’’
ఈ హాస్యానికి ఇంతటితో ఫుల్ స్టాప్.
మరో కొత్త దారా వాహిక కోసం రేపటికి ఎదురు చూడండి
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –17-1-13-ఉయ్యూరు
దర్శనీయ దేవాలయాలు –4 అర్ధ గిరి శ్రీ వీరాంజనేయ స్వామి దేవాలయం
దర్శనీయ దేవాలయాలు –4
అర్ధ గిరి శ్రీ వీరాంజనేయ స్వామి దేవాలయం
అర్ధ గిరి అంటే సగం కొండ అని అర్ధం .చిత్తూరు జిల్లా తిరుపతికి 75కి.మీ దూరం లొ ఉన్న సుప్రసిద్ధ పుణ్య క్షేత్రమే అర్ధ గిరి వీరాంజనేయ స్వామి దేవస్థానం .ఇది సుప్రసిద్ధ వినాయక దేవాలయం అయిన కాణిపాకం నుంచి కేవలం పది కిలో మీటర్ల దూరం లో ధావన గిరి మండలం లో ఉంది . .అరగొండ అనే గ్రామంలో రెండు కిలో మీటర్ల ఎత్తైన కొండ పై శ్రీ అర్ధ గిరి వీరాంజనేయ స్వామి వెలశారు ఇక్కడ సహజ సిద్ధం గా ఏర్పడిన ‘’సంజీవ రాయ పుష్కరిణి ‘’విశేష ప్రాచుర్యాన్ని పొందింది .అందరిని సంభ్రమాశ్చర్యాలతో ముంచెత్తు తోంది .ఈ కొలను త్రేతా యుగానికి చెందిందని భక్తుల అపూర్వ విశ్వాసం .
ఈ దేవాలయాన్ని చోళ రాజుల కాలం లొ నిర్మించ బడి నట్లు స్థల పురాణం చెబుతోంది ,తగిన ఆధారాలు ఉన్నాయి .ఎంతో మంది మహర్షులు ,యోగులు ఈ క్షేత్రం లొ తపస్సు చేసిన గుహలున్నాయి .అవి చూసి మనం విస్మయానికి లోనౌతాం .ఇందాక చెప్పుకోన్నట్లు వన మూలికల ప్రభావం వల్ల సహజం గా ఏర్పడిన ‘’సంజీవ రాయ పుష్కరిణి ‘’లోనీ పవిత్ర తీర్ధాన్ని సేవిస్తే ,ఎన్నో నయం కాని దీర్ఘ వ్యాధులన్నీ మటు మాయం అవటం ముమ్మాటికీ నిజం .అంతే కాదు స్వామి అనుగ్రహం వల్ల కోరిన కోరిక లన్నీ తీరుతాయని భక్తుల నిశ్చితాభి ప్రాయం .
ఈ క్షేత్రం ఏర్పడటానికి రామాయణా నికి చెందినచరిత్ర ఉంది ..త్రేతాయుగం లొ రామ రావణ సంగ్రామం లో,రావణుడి కుమారుడైన ఇంద్ర జిత్ వేసిన బాణం తో లక్ష్మణ స్వామి మూర్చ పోతాడు .అతడిని మేలు కోలపటానికి’’ సంజీవిని’’ అవసర మైంది .దాన్ని సాధించి తెచ్చే ధైర్య సాహసాలున్న వాడు ఆన్జనేయస్వామే అని శ్రీ రాముడు గ్రహించి ,రామ భక్త హనుమాన్ ని సంజీవిని తీసుకొని రావటానికి పంపిస్తాడు .హనుమాన్ ‘’జై శ్రీ రాం ‘’అను కొంటూ ఆకాశం లోకి లంఘించాడు .సంజీవి పర్వతాన్ని చేరి అందులో కావలసిన వన మూలిక ఎక్కడ ఉందొ తెలుసు కొ లేక తిక మక పడతాడు .ఆలస్యం కాకుండా సంజీవి పర్వతాన్నే ఏకం గా పెకలించి అరచేతి లో పెట్టుకొని వాయు వేగం తో రణక్షేత్రానికి బయల్దేరాడు .కాని దారిలో ఆ కొండ సగం విరిగి ఫెళ ఫేళారావం తో నేల మీద పడి పోయింది .ఆ సంజీవ పర్వతం లోనీ అర్ధ భాగం పడిన ప్రాంతమే ఈ అర్ధ గిరి .అక్కడ ఒక గ్రామం కాల క్రమాన ఏర్పడింది .ఆ గ్రామమే అర కొండ గా ,అరగొండ గా ,చివరికి అర్ధ గిరి గా మారింది .
శ్రీ హనుమ చేతిలోని సగం సంజీవ పర్వతం పడిన అర్ధ గిరి పై ఉన్న నిత్య సంజీవిని ,,ఆరోగ్య వర ప్రసాదిని ,సర్వ రోగ నివారిణి ,సంజీవ పుష్కరిణి సహజ సిద్ధం గా ప్రభ వించాయి .పుష్కరిణి జలం ఎప్పటికీ చెడి పోకుండా ఉండటం మహాదాశ్చర్యాన్ని కల్గిస్తుంది అంతే కాదు యే కాలం లోను ఆ కొలని నీరు ఇంకి పోకుండా తన మహిమలను వెల్లడిస్తూ ఉంటుంది .
ప్రతి నెల పౌర్ణమి నాడు విశేష పూజలు నిర్వ హిస్తారు .భజనలుచేయిస్తారు . ,హరికధలు చెప్పిస్తారు .వేలాది సంఖ్య లో భక్తులు పాల్గొని భక్తి తో పరవ శిస్తారు ..
మరో క్షేత్ర విశేషం తో మళ్ళీ కలుద్దాం
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –16-1-13-ఉయ్యూరు
సీతమ్మ లేదు (మోడరన్ సీత ఉంది )వాకిలీ లేదు ,సిరీ ,లేదు ,సంపదా లేదు ,మల్లెకు ప్రాధాన్యమూ లేని సినిమా –చూసే వారికిమాత్రం చెవిలో కాబేజీ పువ్వు
సీతమ్మ లేదు (మోడరన్ సీత ఉంది )వాకిలీ లేదు ,సిరీ ,లేదు ,సంపదా లేదు ,మల్లెకు ప్రాధాన్యమూ లేని సినిమా –చూసే వారికిమాత్రం చెవిలో కాబేజీ పువ్వు
ఇంటాయన ప్రకాష్ రాజు కేమీ పని ఉండదు అంతా మంచి జరగాలని బోల్డు కోరుకొంటూ ఉంటాడు .పెద్దోడువెంకటేష్ బహు బద్ధకిష్టు ,చొక్కా కాలరు వెనక్కి అయిదు నిమిషాల కోసారి లాక్కుంటూ.సినిమా లొ చాలా సార్లు గోడమీదో పిట్ట గోదామీదో చెట్ల చాటునో కూర్చుని విచారిస్తూ ఉంటాడు .చిన్నోడు చిలిపోడు మహేష్ బాబు చొక్కా కింది భాగాన్ని అయిదు నిమిషాలకో సారి మడతలు సరి చేసుకొంటూ ,కిందికి లాక్కుంటూ ,లక్షణం గా లక్ష రూపాయల ఉద్యోగం ఇస్తామన్నా ‘’నా నవ్వు నేను నవ్వుకోలేని తొక్కలో ఉద్యోగం ‘’అని దులిపేసి హీపీగా ఇంటర్వ్యు నుంచి దులుపుకొని బయటికొచ్చేస్తాడు . .వాళ్ళ బామ్మ బుగ్గలు కొరుకుతూ చెవులు పిండుతూ ,భుజాలు రక్కుతూ ,తిండి మాత్రం టైముకు తింటూ ,డైరెక్టర్ చెప్పినప్పుడో సాంగేసుకొంటూమ్ టాడు .అన్నకు తిండి యావేలేదు అలిగి చీకట్లో కూర్చోటమే సరి పోతుంది .తండ్రీ ఇద్దరికోడుకులు కానీ సంపాదన లేక పోయినా ,ముసలమ్మ రోహిణీ హత్తాంగల్ చేతి బంగారు గాజులు ,ఒంటి మీది నగలూ అమ్మి హాయిగా బతికేస్తారు .పాపం జయ సుధ వీరందర్నీ ఎలా మేపిందో తెలీదు .అంతా రికామీ సంసారం .దీనికి తోడు ఎవరికి తోచిన యాస వాళ్ళు మాట్లాడు కుంటూ రీళ్లు నవిలేస్తారు ..ఇక హీరోఇన్లు అంజలి ,సమంతాలు పాపం వీలైనప్పుడల్లా కని పిస్తూ ,ఏదో మాట్లాడుతూ ,పాటేసుకొంటు కాలం గడిపేస్తారు .పెద్దోడు ,చిన్నోడు లకొక చెల్లి ఉందని మనకి తెలీదు .కాని హడా విడి పెళ్ళి జరిగి పోతుంది . చిన్నోడు ఊరి కెళ్ళి నప్పుడల్లా పెద్దోడు ‘’డబ్బుందా“’అని అడుగుతూ తానేదో పేద్ద సంపాదన పరుడయినట్లు చిన్నోడి చొక్కా జేబులో నోట్లు కుక్కుతూంటాడు .’’ఉన్నాయి’’ అంటూనే వద్దన కుండా నోక్కేస్తాడు చిన్నోడు .వాళ్ళిద్దరూ మాట్లాడుకోరు ,పోట్లాడుకోరు . పెద్దోడు అలిగి నప్పుడల్లా చిన్నోడు పక్కన చేరి ఏమీ మాట్లాడకుండా ,కాంప్రమైజ్ కోసం ప్రయత్నిస్తూ కాలం గడుపుతారు .ఇదో వింత అను బంధం .సినిమాటైటిల్ కీ కధకీ సంబంధమేమిటి అని ఆలోచిస్తే ”తొక్క మీద కాలేసి జారి నట్లే ”.నని గుర్తుంచు కొండి.
సరే బాగుంది అనుకొంటే –భద్రాచలం లొ శ్రీరామ కళ్యాణం కు ముఠా అంతాఅక్కడికి చేరుతుంది . ఒక లారీ కరెంటు స్తంభానికి గుద్దుకొని నిప్పుల వర్షం కురుస్తుంది జనం మీద ..కాని ఎవ్వరి కి ప్రమాదం జరగదు .చిన్నోడు ,పెద్దోడు కాలర్లేగేసుకొని అందర్నీ రక్షిస్తారు .’’హమ్మయ్య ‘’అను కొంటాడు ప్రకాష్ రాజ్ .సీతమ్మ వారు కాపాడిందో ,రామయ్య రక్షించాడో ,డైరెక్టర్ హామీ పడ్డాడో కధ సుఖాంతమయింది .ఇలాంటి సినిమా తీయ టానికి వెంకటేష్ అన్నట్లు ‘’గట్స్‘’ఉండాలి ,దానితో బాటు దమ్మూ ,సొమ్మూ ,ఉండాలి ,ప్రేక్షకుల మీద వమ్ము పోనీ నమ్మకమున్డాలి అన్నిటికీ మించి గొప్ప ‘’దిల్లు ‘,’దాంతో పాటు త్రిల్ ఇచ్చే ,కిక్ ఇచ్చే ఆలోచన ఉండాలి .ఇవన్నీపుష్కలం గా ఉన్న ‘’ధియేటర్ మొఘల్ ‘’అయిన ’’ దిల్ రాజు ‘’తీసిన సినిమా ఇది .’’అడ్డాల నాడే కాని గడ్డాల నాడు కాదు ‘’అని తెలియ జెప్పటానికా అన్నట్లు శ్రీ కాంత్ అడ్డాల కధంతా చింపి చింపి ముక్కలు ముక్కలు చేసి ఇష్టమొచ్చి నట్లు అతికి కతికి పారేశాడు .దిల్ రాజు కు తగ్గగట్స్ ఉన్న మొన గా డని పించాడు .ఇద్దరు మహా నటులను ఎవరు ఎక్కువ చేస్తే రెండో వాడి యాక్షన్ కు ఇబ్బందో నని ఇద్దర్నీ హాయిగా సైలెంట్ గా ,వయోలెన్స్ లేకుండా బాలన్స్ చేయటమే అడ్డాల చేసిన గొప్ప ఫీటు .అదే ఏమైనా సిరి ని కురిపించాలి .దీనికి ఇంకోటి కూడా తోడయిందని పించింది .అది –ఈ సినిమా తో పాటు రిలీజైన మరో హీరో సినిమా పై ‘’నెగటివ్ టాక్ ‘’బాగా ప్రచార మైంది .అది ఈ సినిమాకు బోలెడంత పాసిటివ్ సపోర్టు నిస్తుందేమో ?మా మనవళ్ళు మాత్రంఆ సినిమా కంటే ఇది వెయ్యి రెట్లు నయం అని హేపీ ఫీల్ అయారు మా ఇద్దరికీ మాత్రం ఎటూ చెప్పే సాహసం కని పించలేదు .అందుకని ఉన్నదున్నట్లు రాస్తున్నాను .
ఈ సినిమా కు ప్రాణం ‘’సీతమ్మ వాకిట్లో సిరి మల్లె చెట్టు ‘’పాట దీనికి రేడియో లొ స్వరం కట్టి పాడించిన వారు లలిత సంగీత స్వర చక్ర వర్తి స్వర్గీయ పాల గుమ్మి విశ్వనాధం గారు అని తెలిసి ఎంతో సంతోషించాను “సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు” పాలగుమ్మి విశ్వనాధం గారు ఆకాశవాణి కోసం స్వర పరచిన ఒరిజినల్ పాట.ఆ ఆడియో ను మిత్రులెవరో మెయిల్ పంపారు దాన్ని సాహితీ బంధువు లందరికి ఫార్వార్డ్ చేసి వారికీ ఆనందం కలిగించాను .అందులో పాలగుమ్మి వారి అరుదైన ఫోటోలున్డటం విశేషం .పాలగుమ్మి వారి గీతాన్ని ఈ సినిమా సంగీత దర్శకుడు వాడుకోన్నారేమో ?అదేమీ ఆక్షేప ణీయం కాదు.మిక్కిలి గౌరవం .అయితే ఆమాట టైటిల్స్ లొ వేసి చూపించితే మర్యాద గా ఉండేది . .మిక్కీ మేయర్ సంగీత దర్శకత్వానికి హాట్స్ ఆఫ్ .ప్రతి అంగుళం లొ ను సుస్వర సంగీతాన్ని పొదిగి పూలల్లో దారం లా సువాసన లందించి మేయర్ –మేజర్ పార్టు ను నిర్వహించాడు మణి శర్మ బాగ్రౌండ్ మ్యూజిక్కూ ,లాజిక్కు తో నడిచి మహదానందాన్ని చ్చింది .ఆ ఇద్దరికీ అభి నందన పరంపర .దిల్ రాజు కు మేయర్ అందించిన సంక్రాంతి కానుక అని పిస్తుంది ఈ సినిమా .
ఈ సినిమా
మా కుటుంబానికి ఒక మధురాను భూతినిచ్చింది .దాదాపు యే ముప్ఫై ఏళ్ళో దాటి ఉంటుంది మా కుటుంబ సభ్యులందరం కలిసి సినిమాకు వెళ్ళి .అందునా రాత్రి రెండో ఆటకు .భోగి నాడు రాత్రి రెండో ఆటకు మేమందరం కలిసి సినిమా చూశాం .ఇందులో మూడు తరాల వారుండటం విశేషం ,నేను నా శ్రీమతి ,మా అన్నయ్య గారి అబ్బాయి రామనాద్ ,కోడలు ,మనవడు ,,హైదరా బాద్ నుంచి సంక్రాంతి పండుగ కోసం చాలా సంవత్స రాలకు వచ్చినమా పెద్దబ్బాయి శాస్త్రి ,కోడలు ఇద్దరు మనవళ్ళు ,వాళ్ళ కారు డ్రైవరు ,మా మూడో వాడు మూర్తి కొడుకు కూతురు అంటే మా మనవడు మనవ రాలు ,మా నాలుగో అబ్బాయి రమణ ,కోడలు వెరసి పధ్నాలు గు మంది ఈ సినిమా చూసి రికార్డులు పగల గొట్టాం. గేటు దగ్గరి వాడు పద్నాలుగు టికెట్లు చింపి లోపలి పంపిస్తాడు అనుకొంటే ,శుభ్రం గా వాటిని మడిచి జేబులో పెట్టుకొని ‘’రొటేషన్ ‘’లొ పెట్టటం ఔరా !అని పించింది .ప్రభుత్వానికి బొక్క .హాలు యజమానికి కిక్కు .అద్భుతః ,ఆదరహా .
ముక్కనుము శుభా కాంక్షల తో
మీ– గబ్బిట దుర్గా ప్రసాద్ –16-1-13-ఉయ్యూరు
భ.కా.రా.మేస్టారి చమత్ కారాలూ ,మిరియాలూ -5
భ.కా.రా.మేస్టారి చమత్ కారాలూ ,మిరియాలూ -5
ఆంధ్ర విశ్వ విద్యాలయాన్ని ఎక్కడ పెట్టాలి అనే దాని మీద ఆనాడు పెద్ద మనుష్యులు బుర్రలు పగల కొట్టు కొన్నారు .పట్టు దలలు జోరుగా సాగాయి .ఇంగితం గూడా మరిచి ,వాదు లాడుకొన్నారు .పేపర్ల కెక్కి పరువు తీసుకొన్నారు .వీరందరి అంత రంగాన్ని మేష్టారు దూది యేకి నట్టు యే కి పారేశారు .బాణం లాగా ఆయువు పట్లు చేదించారు .మనుష్యులలోని సంకుచితత్వం ఎలా వెర్రి వేషాలేసిందో భ.కా.రా.గారు హాస్యం మిళాయించి బజాయించారు .’’ఏమండీ !మా నూతి దగ్గర ఖాళీ ఉంది .పోనీ ఆంధ్రా యూని వేర్సిటి అక్కడ పెట్ట కూడదా ?నిక్షేపం గా చాపా అదీ వేస్తాను ‘’అన్నాడట ఒకడు .వనరులు లేని చోట పెట్టి ఏం బావుకుం టారని సూటి విమర్శ ఇది .
‘’ప్రతి ఆంధ్రుడు ఆంధ్రా యూని వేర్సిటిపుణ్య క్షేత్రానికి వెళ్ళి ,ఓ కొబ్బరి కాయ కొట్టి నైవేద్యం పెట్టి ,తనకి సహం చెక్క ఇస్తారట .ఇవ్వక బోతే ,దెబ్బలాడి పుచ్చుకో వచ్చు .’’అని మెహర్బానీ కొందరిలో .’’ఇంగ్లీషు మేస్టేర్లకి ముట్టు తున్న జీతాలు ,తెలుగు మేస్టేర్లకీ ,తెలుగు మేస్తర్లకి ముట్టె జీతాలు ఇంగ్లీష్ వాళ్ళకూ ‘’అని అసలు పంతుళ్ళు ఆంద్ర లోనే చెబుతారా ?అరవం లొ చెబితే పోలా ‘’?అనే వ్యంగ్యం లొ కొంత మందీ ఈస డించుకొన్న కాలం అది .అంత సిద్ధాంత రాద్ధాంతాలు జరిగాయి .పట్టింపులకు పోయారు ఉచ్చ నీచాలు వదిలేశారు .దక్క కూడనిదేదో దక్కి పోతున్నట్లు బాధ పడ్డ్డారు కొందరు మహనీయులు .ఇలా అందర్నీ విశ్లేషించి మన ముందు నిల బెట్టారు హాస్య బ్రహ్మ .
విద్య యొక్క అసలు పరమార్ధాన్ని చాలా సున్నితం గా చెప్పారు కామేశ్వర రావు మేష్టారు .’’విద్య దైవికం .కనుక విద్యార్ధికి నైర్మల్యం ఉండాలి .విద్య పవిత్రం కనుక విద్యార్ధికి దయ ఉండాలి .ఇవి లేక పోతే విద్యార్ధి పైన దేవుడికీ ,మధ్య తనకీ ,చుట్టూ సంఘానికీ ద్రోహి ‘’అంటారు నిష్కర్షగా .వ్యంగ్యం లొ నుంచి వచ్చిన వైభోగం ఇది .అక్షర లక్షలు చేసే పసిడి పలుకులు .’’విద్య ముందు మోహ మాటంపడ కూడదు .డబ్బు ,దర్జా ,సత్తా ,ఇవన్నీ విద్య తర్వాతే .విద్య ఉంటె డబ్బు లాక్కు రా గలదు .కాని డబ్బున్డటం అనేది ఒక విద్య కాదు ‘’అన్నారు మేష్టారు .’’యూని వేర్సిటి పెట్టె దక్షత పెంచుకోవాలి కాని ,దక్షత ఉంది కదా అని యూని వేర్సిటి పెట్టరు ‘’అని ఖచ్చితం గా చెప్పారు .యూని వేర్సిటి దేనికోసం అంటే –ఆయన మాటల్లోనే ‘’లోకానికి దీని యందు అను రక్తి ,సాను భూతి ,అనేకుల అప్రయత్న సమ్మేళనం ,విద్య అంటే అపార మైన తృష్ణ ,విద్య సాధించాలనే కసీ ఇవే యూని వేర్సిటి జీవం ‘’దీన్ని నిల బెట్టడం ప్రతి ఆంధ్రుడి మీద ఉన్న తక్షణ కర్తవ్యం .ఆ నాటి మాట ఏనాడూ నిజమే .
తమ్ముడు పెళ్ళికి తరలి వెళ్లటం
అనే హాస్య రచన మరీ మరీ కడు పు చెక్క లయ్యేట్టు నవ్విస్తుంది .హడా విడి గా పెళ్ళి కుదిరింది .దానికి అంతా తరలి వెళ్ళాలి .ఆ కంగారు ,హడా విడి సెల్యులాయిడ్ పై కి ఎక్కించి నట్లు చెప్పుకొస్తారు మేష్టారు .మనం కూడా వారితో ప్రయాణం చేస్తున్నట్లు గానే ఫీల వుతాం .అదీ మేస్టారి గొప్ప తనం .ఆయన మనతో పాటు నడుస్తూ ,మాట్లాడుతూ న్నట్లే రాయటం మేస్టారి ప్రత్యేకత .అంత సహజం గా రాయటం ,హాస్యం మిళాయించడం ధనుతేగిరి పోయేలా వాయించడం ఆయనకే తగు .
‘’రైలు ఆ!నేను వెళ్ళను –అన్నట్టు కొంత హరామీ చేసి వెనక్కి కదలటం మొదలెట్టింది .ఆ పలం గా రైలు వాడు‘’ఏడిశావు .నడుద్దూ నీ ఇష్టం ఏముందీ ?అన్నట్లు చెవులు గిన్గిర్లేట్టే లాగు రయ్యిమని ఓ కూత కూసి ‘’ఓటేసి (పాస్ పోసి )రైల్ని నషాలం అంటే ట్టు ‘’ఒక్క టేశాడు’’ .దాంతో పాపం రైలు ‘’నెమళ్ళు కక్కు కుంటూ ‘’పరిగెత్తడం మొదలెట్టింది’’.అదీ రైలు బయల్దేరటానికి చేసిన హాంగామా సహజం గా చిందించిన హాస్యపు జల్లు .ఏదో కొంచెం రుచి చూపించాను .మిగతాది చదివి అనుభవిస్తేనే మజా .
మేస్త్రీ ఉద్యోగం గొప్పది అనే భావం పూటు గా ఉన్న వారు కామేశ్వర రావు మేష్టారు .’’మేస్త్రీ ఉ ద్యోగామో కాదో తెలీదు కాని ,ఉద్యోగు లంతా మేస్టారు సృజనే’’ .అన్న నిజాన్ని బాగా చెప్పారు .మేస్టారు అంటే ,ఎవడో కర్ర తో కొట్టి నట్లు జ్ఞాన నేత్రాన్ని తేరి పిస్తారాయన .’’ఇంత మంది ఉద్యోగుల్ని తయారు చేస్తున్నాను కదా ఇహ సౌఖ్యం ప్రధాన మైన ఉద్యోగం అందుకే నేను వదిలేస్తాను అనే వాడే మేస్టారు ‘’.’’ఇంకోడు బాగు పడితే ,తనూ బాగు పడ్డట్టే అనుకో గలిగిన వాడు మేస్టారు .అంటే ‘’మేస్టారికి భావానా శక్తి భూమికీ ఆకాశానికి తాళం’’అన్నంత ఉండాలి .హిందువులు వేదాంతులు .వారిలో మేస్టార్లు అగ్ర స్థానం అలంకరించాలి .’’-‘’ఇండియా లొ పూర్వం కర్త ,కర్మా ,క్రియా ఎక్కడ బడితే అక్కడ దొరికేవి .క్రమేపీ కర్త ,క్రియల్ని ఇతరులు అపహరించారు .కర్మ ఒక్కటే మిగి లింది .భుక్తి ఎల్లానూ ఇంతే –అని ముక్తి ,మోక్షాల కోసం దేవుల్లాడి పని చేయాలి .’’అని అందర్ని చితక బాది ధర్మ సూక్ష్మాన్ని తెలిపే పెంకి ఘటం భకారా మేష్టారు
యే ఉద్యోగమైనా ఉదార పోషనకేగా ?కోటి విద్యలూ అందుకేగా ?అయితే భమిడి పాటి మేస్టారికి’’మేస్ట్రీకూడా ఒక ఉద్యోగామేనా ‘’అని సందేహం వచ్చింది .ఇక చేతి నిండా పనే .బరికి పారేశారు .ఎవరో ఆయన్ను అడిగారట .’’ఇన్నాళ్ళు చదివీ చివరికి మేస్ట్రీ చేరాడేమిట్రా ?ఆడదీ కాకుండా ,మొగాడు కాకుం డానూ ‘’అదే ఆ రోజుల్లో పంతులు ఉద్యగం పై అందరికి ఉన్న చులకన భావం .’’మేస్టరీచాలా ఉన్నత మైనదీ ,విశిష్ట మైనదీ అని దారుణ స్తోత్రం చేసే వారు తమకి దీని యందు ఎంత అభి ప్రాయం ఉన్నా ,తమరు ఉండ కూడదట మేస్తార్లు గా ‘’అని చెంప చేదేల్ మనిపిస్తారు .అంటే మేష్టారు కావాలి కాని తాను మాత్రం మేస్టేరీ ఉద్యోగం చెయ్యరాదు అనే భావం ఉన్న వాళ్ళను ఉతికి ఆరేశారన్న మాట .
‘’ఉద్యోగం అంటే కొంత డబ్బూ ,దర్పం ఉండాలి .బిళ్ళ బంట్రోతు ఉండాలిట..డవాలూ అదీ అపసవ్యం గా తొడుక్కొని ,’’అస్మత్ పితుహ్ ,ప్రాచీనా వీతి ‘’అన్నట్టు ‘’అని డవాలు బంట్రోతు ఉన్న ఆఫీసర్ని వెక్కిరిస్తారు భకరా గారు .లంచాలు తిని ,పై వాడికి పెట్టె వాడే మొన గాడు ఆనాడు .ఈనాడు అంతే ననుకోండి .దానికి ముద్దుగా ‘’బల్లకింద చెయ్యి, చెయ్యి తడి ,రశ్మి ‘’అని మేష్టారు పేర్లు పెట్టారు ఆమ్యామ్యామ్యా అని తర్వాతా స్తిర పడింది ముళ్ళ పూడి వారి దయ వల్ల .దేనికైనా పిలిస్తే ‘’సెలవు దొరక లేదు .రాలేదు ‘’అని చెప్పేదే ఉద్యోగం అనీ ,అని అందరు అనుకుం టారట .ఏదీ దొరక్క మేస్టేరీ చేస్తారు చాలా మంది .’’ఎందుకు ట్రైనింగు అయ్యావు ‘’?అని అడిగితే గడుసుగా ‘’ఏమిటో నండీ .circumstances permit ‘’చెయ్యలేదు .’’some thing is better than nothing ‘’ట్రైనింగ్ అయి ఉండడం ఎందుకేనా మంచిది ‘’అంటా రట..’’కడం వాటికి చేతిలో చిలుం వదుల్తుంది .దీని కైతే ఏదో కొంత ‘’మనో వర్తి ‘’(స్టై ఫండ్డ్ )పారేస్తారుగా .’’అని కొందరంటారట .దేన్నీ బట్టి చూసినా ఉద్యోగానికి ఉండవలసిన లక్షణాల్లో మేస్టేరీకి ఒక్క లక్షణం కూడా లేదు‘’అంటారాయన .అదీ ఆ నాటి పరిస్తితి .ఇప్పుడు పూర్తిగా భిన్నం గా ఉంది కడుపు లొ చల్ల కదలని ఉద్యోగం .
‘’వెధవ్వాల్లకు తీర్ధపు రాచిప్పల మీద ,దోమలకు చెవుల మీదా ,దారిద్యానికి మేస్టేరీ మీద ఆపేక్ష ఎక్కువ ‘’అని చమత్కరిస్తారు .ఏదో మేస్టేరీ చేస్తూ ఇన్ని ప్రైవేట్లు చెప్పుకొని గడపచ్చు కదా నని అనుకొంటే ,దానికీ తిప్పలే నట .’’ట్యూషన్ అనగా బోధనా వ్యభి చారం .’’అని ముద్ర వేస్తారు ఒక వేళ చేసినా ,ఎలా లాగుతున్నాడో దరఖాస్తు పెట్టు గోవాలిట .’’అని వాయిన్చేస్తారు హాస్యపు కొరడా తో .ఎంత జీతం ఇచ్చినా పని చేసే వాళ్ళున్నారని అంటు ‘’యే మిచ్చినా సరే ,బోధనా వర్షం కురి పించక మానం ‘’అంటారా ట వారు .అన్నిటికీ ఓర్చు కొంటేనే మేస్తారట .జ్ఞానికి ఉన్న లక్షణాలన్నీ మేస్టారికి ఉండాలిట..
‘’తిట్టి కొట్టి రేని తిరిగి మాటాడక –అట్టు ఇట్టు చూసి అదిరి పడక
తను గాని యట్టు తత్తర పడ కున్న –నట్టివాడు బ్రహ్మ మౌను వేమా ‘’అన్న దాంట్లో’’ మేస్ట రౌను వేమా “’అని మారిస్తే సరి పోతుందని వ్యంగ్యం గా అంటారు .
చెప్పిందే చెప్పటం మేస్టారు పని .అలా చెప్పిందే చెప్పి తెగ డ్రిల్లు చేయాలి .సర్వజ్ఞుడు కావాలి .డబ్బు సంగతి తెస్తే ‘’అపవిత్రం ‘’ట అని చేన్నాకోలుచ్చుకొని సంఘాన్ని వాయిన్చేస్తారు .అసలు ఎడ్యుకేషన్ ఎవరి చేతుల్లో ఉందొ తెలీని కాలం .’’గవర్న మెంటు వారిని గ్రాంటు కోరకుండా ఉంటె చాలు .వారికి ఎడ్యుకేషన్ ఎల్లా ఉన్నా సరే .ఇనస్పెక్టర్ గారికి కొత్త పద్ధతులు ,పాఠాల లిస్టులూ ఉంటె చాలు ఎడ్యుకేషన్ ఎలా ఉన్నా పర్లేదు .అదే రకం గా ఒకటో తారీఖు కు జీతం వస్తే చాలు ,విద్యార్ధికి మార్కులు వేస్తె చాలు ,తండ్రికి ప్యాసైతే చాలు ఎడ్యుకేషన్ ఎలా ఉన్నా ‘’అని అందర్ని దులిపి వదిలారు భకారా మేస్తారు .
సశేషం –
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –16-1-13-ఉయ్యూరు
దర్శ నీయ దేవాలయాలు -౩ శ్రీ నెట్టి కంటి ఆంజనేయ స్వామి దేవాలయం
దర్శ నీయ దేవాలయాలు -౩
శ్రీ నెట్టి కంటి ఆంజనేయ స్వామి దేవాలయం
సాహితీ బంధువులకు కనుమ పండుగ శుభా కాంక్షలు .దర్శనీయ దేవాలయాలు శీర్షిక లొ సుమారు నేల క్రితం రెండు దేవాలయాల గురించి రాశాను .ఇప్పుడు మూడవ దేవాలయం ఈ శ్రీ నెట్టికంటి ఆంజనేయ స్వామి దేవాలయంతో కొనసాగిస్తున్నాను .ముందుగా ఆంజనేయ స్వామి ఆలయాలు గురించి రాసి తరువాత మిగతా దేవాలయాల గురించి రాయాలన్నది నా సంకల్పం .వీటిలో నేను రాసిన విషయాలు సమగ్రం కాక పోవచ్చు .మీ దగ్గర అదనపు సమాచారం ,ఫోటోలు ఉంటె సరస భారతికి తెలియ జేసి మీరూ భాగా స్వాములై సమగ్రతకు సహకరించ వలసిన ది గా కోరుతున్నాను .
నెట్టి కంటి అంటే ఒకే ఒక కన్ను గల వాడు అని అర్ధం .ఈ దేవాలయం అత్యంత ప్రాచీన మైనది .దీనికొక చరిత్ర ఉంది .క్రీ.శ.1521లొ హంపీ క్షేత్రం లొ శ్రీ వ్యాస రాయల వారు తుంగ భద్రా నదీ తీరం లొ నిత్య కర్మాను స్టానం చేస్తున్నారు .తాను ఒంటికి పూసు కొనే మంచి గంధం తో ,తన ఎదురుగా ఉన్న ఒక శిల మీద శ్రీ ఆంజనేయ స్వామి రూపం చిత్రించారట .అది నిజ రూపం ధరించి నడవటం ప్రారంభించిందట .వ్యాస రాయల వారు పట్టిన పట్టు విడవ కుండా అయిదారు సార్లు అలాగే చిత్రాన్ని రచించటం ,అది నడుస్తూ వెళ్ళి పోవటం జరి గిందట. .చివరికి వ్యాస రాయల వారు శ్రీ ఆంజనేయ స్వామివారి ద్వాదశ నామాల బీజాక్ష రాలతో ఒక యంత్రం తయారు చేసి ,దానిలో శ్రీ ఆంజనేయ స్వామి వారి నిజ రూపాన్ని చిత్రించారట .అప్పుడు స్వామి ఆ యంత్రం లొ బంధింప బడి అందులో స్థిరం గా ఉండి పోయారట .ఒక నాటి రాత్రి స్వామి వారు వ్యాస రాయల కలలో దర్శనమిచ్చి ‘’నన్ను కీర్తించి పూజిస్తే చాలదు .నాకొక ఆలయాన్ని నిర్మించు .అందులో నా విగ్రహం అత్యంత భక్తీ శ్రద్ధల తో ప్రతిష్టాపన చెయ్యి .’’అని చెప్పారట .
వ్యాస రాయల వారు ఎంతో శ్రమించి ,అందరి సాయం తో ఆ ప్రాంతాననే 732 శ్రీ ఆంజనేయ స్వామి విగ్రహాలను ప్రతిష్ట చేశారట .ఈ నాడు మనకు కని పించే ‘’చిప్ప గిరి ‘’గ్రామం లొ శ్రీ భోగేశ్వర స్వామి వారి దేవాలయం లొ వ్యాస రాయల వారు నిద్రిస్తుండగా శ్రీనేట్టి కంటి ఆంజనేయ స్వామి వారు కలలో కన్పించి తాను ఆ ప్రాంతం నుండి దక్షిణ దిశ గా ఉన్న ప్రాంతం లొ అతి చిన్న రూపం లొ భూమిలో ఉన్నానని తనను బయటికి తీసి మరలా ఆగమ సంప్రదాయాల నను సరించి ప్రతిష్ట చేయమని ఆనతిచ్చారట .ఆ ప్రదేశం ఎక్కడ ఉన్నదో తమకు మార్గ దర్శనం చేయమని వ్యాస రాయల వారు కోరగా స్వామియే ఒక ఎండిన వేప చెట్టు ఉన్న ప్రాంతం దగ్గరకు వెళ్ళమని అక్కడికి చేర గానే అది చిగురిస్తుందని అక్కడే భూమిలో తాను ఉంటానని చెప్పారట .
వ్యాస రాయల వారు కలలో స్వామి చెప్పినట్లే మర్నాడు బయల్దేరి నడిచి వెళ్ళి కొంత దూరం లొ ఎండిన వేప చెట్టును కను గొన్నారు .రాయల వారు దాని సమీపానికి రాగానే ఆ వేప చెట్టు తక్షణమే ఆకు పచ్చ గా చిగురించిందట .ఆశ్చర్య పడిన వ్యాస రాయల వారు అక్కడ భూమిని త్రవ్విన్చారట .అక్కడ దొరికిన ఒంటి కంటి ఆంజనేయ స్వామి విగ్రహాన్ని ప్రతిష్టించారు .దేవాలయాన్ని నిర్మించారు . ఈ ఆలయం కసాపురం .గ్రామానికి అతి దగ్గర లొ ఉండటం వల్ల శ్రీ ఆంజనేయ స్వామిని కసా పురం ఆంజనేయ స్వామి అని కూడా అంటారు .నెట్టి కల్లు లొ ఆవిర్భా వించాడు కనుక స్వామిని శ్రీ నెట్టి కంటి ఆంజనేయ స్వామి అనీ భక్తులు ఆప్యాయం గా పిలుచు కొంటారు .
శ్రీ నెట్టి కంటి ఆంజనేయ స్వామికి ఒక విచక్షణ లక్షణం ఉంది .స్వామి కి కుడి కన్ను మాత్రమె ఉంటుంది .ఆ కంటి తోనే భక్తులను కృపా కటాక్షాల తో వీక్షిస్తూ ,వారి మనో భీష్టాలను నేర వేరుస్తారని ప్రతీతి .భక్తుల బాధలను స్వామి వారికి విన్న వించు కొంటె, కలలో కన్పించి నివారణ మార్గాలను సూచిస్తారట .స్వామి విగ్రహానికి అపూర్వ తేజస్సు ,సాటి లేని ఆకర్షణా ఉండి,ముగ్ధుల్ని చేస్తుంది . .అందుకే అశేష భక్త జనం స్వామి వారల నుదర్శించి ,స్వామి వారి అనుగ్రహం తో తమ జీవితాలను తీర్చి దిద్దు కొంటున్నారు .స్వామి విగ్రహం తూర్పు ముఖమై ,దక్షిణ దిశ ను చూస్తూ ,,భక్త జనుల మొరలు విని పించు కొంటూ ,బాధలను తీరుస్తూ ,ఉన్నట్లు గా అని పిస్తుంది .స్వామి నిజ రూప దర్శనంను ఆ సుందర దివ్య సుందర విగ్రహానికి అభిషేక సమయం లొ కన్నుల పండువు గా దర్శించి ,తరించ వచ్చు.
కసాపురం అనంత పురం జిల్లాలో గుంతకల్లు రైల్వే జంక్షన్ కు అయిదు కిలో మీటర్ల దూరం లొ ఉంది.బస మార్గం లొ గుత్తి కి 35కి.మీ .దూరం లొ ఉంది.. ప్రతి ఏడాది ఒక చర్మ కారుడు ఏక భుక్తం ఉంటూ ,బ్రహ్మ చర్యాన్ని పాటిస్తూ శ్రీ ఆంజనేయ స్వామికి ఒక చెప్పుల జత తయారు చేసి సమర్పిస్తాడు మర్నాడు వచ్చి చూస్తె అది అరిగి పోయి నట్లు చిరిగి పోయి నట్లు కని పించటం విశేషం .స్వామి ఆ చెప్పులు ధరించి రాత్రి పూట వాహ్యాళి వెళ్ళి వస్తూంటాడని భక్తుల నమ్మకానికిది నిదర్శనం . ప్రతి ఏటా వైశాఖ ,శ్రావణ ,కార్తీక ,మాఘ మాసాలలో శని వారం నాడు అసంఖ్యాకం గా భక్తులు స్వామిని సందర్శించి తమ మనో భీష్టాలను నేర వేర్చుకొంటారు .చైత్ర మాసం లొ పౌర్ణమి రోజున ఈ ఆలయం లొ శ్రీ హనుమద్ జయంతి జరపటం ప్రత్యేకత ..
ఇప్పుడు వ్యాస రాయల (వ్యాస తీర్థులు) వారి గురించి కొంత తెలుసు కొందాం .
వ్యాస రాయల వారు బ్రహ్మ లోక నివాసి .బ్రహ్మ దేవునికి అత్యంత శ్రద్ధా భక్తులతో సేవ చేస్తూ ఆయన పూజ కు కావలసిన వన్నీ సమకూరుస్తూ ఉండే వారు .ఒక రోజున ఏదో ఏమరు పాటుగా ఉంది సకాలానికి బ్రాహ్మ గారి పూజకు సామాను సిద్ధం చెయ్య లేక పోయారట .బ్రహ్మ కు విపరీతం గా కోపం వచ్చి భూలోకం లొ జన్మించమని శపించాడు .ఆ శాప వశం గా ఆయనే కృత యుగం లొ రాక్షస రాజు అయిన హిరణ్య కషిపునికి శ్రీ హరి భక్తు డైన ప్రహ్లాదుని గా జన్మించారు .ద్వాపర యుగం లొ బాహ్లికుడు గా జన్మించి కురు క్షేత్ర సంగ్రామం లొ కౌరవుల పక్షాన యుద్ధం చేశాడు .కలియుగం లొ పద్నాలుగవ శతాబ్దం లొ విజయ నగర సామ్రాజ్యం లొ శ్రీ కృష్ణ దేవ రాయల కాలం లొ వ్యాస రాయలుగా జన్మించారు .ఆ తర్వాతా జన్మ లొ వారే మంత్రాలయం శ్రీ రాఘ వేంద్ర స్వామి గాఆవిర్భవించారు .శ్రీ వ్యాస రాయలు కర్నూలు జిల్లా శిల్ప గిరి –అదే నేటి చిప్ప గిరి కి వారి గురువు గారు విజయ దాస తీర్ధ స్వామి దర్శనానికి వచ్చి నప్పుడు శ్రీ మిట్ట కంటి ఆంజనేయ స్వామి వారు కలలో కన్పించి తన ఉనికిని చెప్పి ఆలయాన్ని నిర్మించమని కోరారు .
. మరో ఆలయ విశేషాలతో మళ్ళీ కలుద్దాం .
సశేషం-మీ—గబ్బిట దుర్గా ప్రసాద్ –15-1-13-ఉయ్యూరు
భ.కా.రా.మేష్టారి చమత్ కారాలూ ,మిరియాలూ -4
భ.కా.రా.మేష్టారి చమత్ కారాలూ ,మిరియాలూ -4
స్కూల్ లొ తనికీ ప్రారంభ మయింది .అక్కడ ఉన్నవి ఎన్ని క్లాసులు అని అడిగాడు అధికారి .సమాధానం గా ‘’అందరికీ ఏక మొత్తం గా గట్టి గా చెప్పటమే గాని ,క్లాసులంటూ ,భేషజం నేనెరుగను .ఆ ముగ్గురు పై క్లాసు ,ఈ కడం కింది క్లాసు ‘’అన్నాడు అయ్యవార్లు .అదీ అక్కడి చదువు .,చెప్పే రీతీ .’’ముని అనే మాటకు అర్ధం అడిగాడు అధికారి .మనిషి అన్నాడు ఒకడు .’’మరి నేను ముని నేనా ?’’అని ప్రశ్నించాడు మళ్ళీ .కాదన్నాడింకోడు.కారణం అడిగితే ‘’ముని అంటే మంచి మనిషి ‘’అని దెబ్బ కొట్టాడా కుర్రాడు ‘’ధణుతెరిగి పోయింది’’ అందరికి
ఇప్పుడు మేష్టార్ని పాఠంచెప్పమన్నాడు .సూర్యుడు భూమి చుట్టూ తిరుగుతాడని చెప్పాడు పంతులు .’’అబద్ధం ‘’అన్నాడు అధికారి .’’మీరు చెప్పండి .-ఇందాకట్నించి విన్నాగా నేను ‘’అని బరి తెగించాడు మేష్టారు .తను పిల్లలు గల వాడి నని మొత్తు కొన్నాడు .చివరికి ‘’అల్లా అయితే బాలు లారా !భూమేట సూర్యుడి చుట్టూ తిరుగు తుందట ‘’విన్నారా ?గిర గిరా ‘’అన్నాడు చివరికి .ఇంతట్లోకే నమ్మకం ఎలా మారిందని ఆశ్చర్య పడ్డాడు తల పాగా ఆయన .సమాధానం గా పంతులు గారు ‘’అయ్యా !నా జీతం రాళ్ళు నాలుగూ ,గిర గిరా తిరిగి వస్తుంటే చాలు .దేని చుట్టూ ఏది తిరిగితే పోయే దేముంది ?’’అన్నాడు గుక్క తిప్పు కొ కుండా .
తాను ఇది వరకే రాసిఉంచిన తనికీ పత్రం తీసి చదవటం ప్రారంభించాడు అధికారి .ఎలా సాగిందో తిలకిద్దాం–‘’మనో గణితం –మోతాదు .లెక్కలు –సుమారు .తెలుగు –జబ్బు .స్కూలు లొ –స్వేచ్చ.దేశాయి కసరత్తు –సున్నా .అందరికి తెలిసిన విషయం గురించి –రమా రమి . ఒక మాదిరి పా ఠమిస్తిని .పిల్లలు పద్యములు అర్ధ మగు నట్లు చదువ కూడదు .గొంతెత్తి పాడవలెను .’’తల తిరిగి పోయింది వెంకటాయికి ..’’తమరు చదివిన వాటిల్లో చాలా ఇప్పుడు జరగనే లేదే ‘’?అని బోల్డు ఆశ్చర్య పోయాడు ‘’నా ఉద్దేశ్యం లొ –ఒక వేళ అవి కూడా జరిగి ఉంటె వాటి విమర్శ ఇల్లా ,ఇల్లా ఉంటుంది సుమా –ఖబడ్ దార్ జాగ్రత్త .’’అని సమాధానం ఇచ్చాడు .ప్యాసు చేసి వెళ్ళ మన్నాడు మేస్టారు .’’పెద్ద క్లాస్ అందరు ప్యాస్ .చిన్న క్లాసులో టీకాలు లేని వాణ్ణి తప్పిస్తున్నాను ‘’అని వివరం చెప్పాడు .
రాత్రి స్కూల్ కూడా వెంకటాయ దే నిర్వాకం .అదీ చూడాలన్నాడు అధికారి .ఈ సారి చూస్తానని తప్పించు కొన్నాడు .’’పడక అరణ్య మెంటు ‘’జరిగి పోయింది .రాత్రికి రాత్రి ఇద్దరూ ,చెప్పా పెట్ట కుండా ఉడాయించారు .అర్ధం కాలేదు వెంకటాయి కి .మర్నాడు టపాలో నాల్గు రోజుల్లో స్కూలు తనిఖీ తంతు జరుగు తుందని సిద్ధం గా ఉండమని అసలు అది కారి నుండి ఉత్తరం వచ్చింది .అంటే వచ్చి మేసి వెళ్ళిన వాడు డూప్లికేట్, నకిలీ అన్న మాట .ఇలా ఆద్యంతం రక్తి కట్టించి నవ్వుల పాలు చేస్తారు భాకారా మేష్టారు కొసమెరుపు లొ ఆ నాటి తనిఖీ తంతు ప్రహసనం కళ్ళకు కట్టినట్లు చేస్తూ ,ప్రతి మాటలో హాస్యం మిళితం చేసి పండించారు హాస్య బ్రహ్మ భమిడి పాటి వారు .
అలాగే రాజ మండ్రి లొ కొత్తగా విమానం వచ్చింది .అంతా సరదాగా ఎక్కి చిన్న బలా దూర్లు కొట్టి వస్తున్నారు .ఆ విషయాలు రాస్తూ చూసిన వారు ఎలా బడాయీలు పోతున్నారో చాలా బాగా వర్ణించారు భ.కా.రా.మేష్టారు .విమానం చూడ గానే అందరికీ ఊర్ధ్వ దృష్టీ ,ఊర్ధ్వ శ్వాశా బయల్దేరి నాయని చేళుకులు .ఒక ఊల్లో తద్దినం జరుగు తోంది .విమానం ఆకాశం లొ ఎగురు తోంది .ఆ సన్ని వేశాన్ని అత్యద్భుతం గా హాస్యం మేళవించి తిని పిస్తున్నారు చూడండి .
‘’భోక్తలు భక్ష్యాలు విరుస్తున్నారు .కర్త పారణ కలుపుతున్నాడు .విమానం హోరుకు యజమాని వీధి లోకి ఎగడి,పక్షి వతు గా యెగిరి పోతున్న విమానాన్ని చూసి ,పితృ స్తానం లొ కూర్చున్న గోపాలాన్ని రెక్క లంకించు కొని ,నడివీధి లోకి ఈడుస్తూ మొర్రో మొర్రో అంటూండగా చేతి లొ గారే పళం గాయెగిరి రాకా ?తద్దినం మళ్ళీ వచ్చేదే .’’అని కసురు కున్నాడట . ఇది అశాస్త్రీయం అయినా ఏం ఉపద్రవామో అని మాత్రం చెప్పే ఆయన .’’ఇక్కడికి మీ నాన్న గారి ఆత్మ కి విమాన దర్శనం చేయించారు .ఏమి పితృ భక్తీ ?’’అని మెచ్చు కొన్నాట్ట .శ్రద్ధ గా పెట్టాల్సిన తంతు ఎలా విన్తకీ ,చోద్యానికి గురైందో ,దాని ప్రభావం ఎంత ఉందొ చెప్పటమే కాదు యజ మానికి కోపం రాకుండా మాటలు ఫిరాయించే మంత్ర గాళ్ళ మనో భావం కూడా బాగా బయట పెట్టారు .
విమానం లోంచి చూస్తుంటే కింద అంతా ఎలా కని పిస్తుందో జనం గోలగా చెప్పు కొంటున్నారు .అందులో కొన్ని చమక్కులు ‘’ఇది వరకు నేను ఏరి గున్న బ్రాహ్మలూ,అబ్రాహ్మలూ ,హిందువులు ,ముస్లిములు ,పునిస్త్రీలు ,వెధవ ముండలు ,వీళ్ళ వయినం కన్పించకుండా కన్పించింది .పైకి వెళ్ళి కిందకి చూసే టప్పటికి భూమి మీద మానవులు పెట్టు గోనే తేడాలు .నా చర్మ చక్షువులే అంత రించాయి .విమానం చూస్తున్నప్పుడు మానవుడి ఆఖండత్వం –కిందికి చూస్తున్నప్పుడు మానవుడి అల్పత్వం కని పించాయి ‘’.ఇందులో ఎంత వేదాంత భావన ఇమిడ్చారు మేష్టారు .మనో నేత్రం విచ్చు కోవటానికి హాస్యం ఎంత పకడ్బందీగా విని యోగా పడిందో చూడండి .అల్పత్వం వదిలించుకొని జీవించమని హెచ్చరిక కూడా ఇందులో జోడించారు మేష్టారు .కాంతా సమ్మితంఅంటే ఇదేనేమో నని పిస్తుంది .
కనుమ శుభా కాంక్షలతో
సశేషం ‘—మీ—గబ్బిట దుర్గా ప్రసాద్ –15-1-13-ఉయ్యూరు
సంక్రాంతికి గోచీలు,నూలు పోగులు
సంక్రాంతికి గోచీలు,నూలు పోగులు
మనవళ్ళకు ,మనవ రాలికి సంక్రాంతి రోజున భోగి పళ్ళుపోసే హడా విడి లో ఉన్నాం మకర సంక్రాంతి నాడు పిల్లలకు భోగి పళ్ళు.పిల్లలందరూ వచ్చారు పిల్లా జేల్లాతో ఇల్లంతా సందడి సందడి గా ఉంది .చాలా రోజులకు మా ముఠాఅంతా దిగటం మా శ్రీ మతికి మహదానందం గా ఉంది .క్షణం ఖాళీ లేకుండా పనులు చేస్తూ ,చేయిస్తూ ఉంది..మా ‘’యం బ్రహ్మ ‘’ఈ వాసన ఎప్పుడో పసి కట్టేశాడు .ఈ పాటికి వచ్చి వాలాల్సిందే.ఆలస్యం అయిందని వాళ్ళక్క కళ్ళల్లో ఒత్తు లేసుకొని చూస్తోంది తమ్ముడికోసం, వాడి భార్యా పిల్లల కోసం . ఇంతలో అదేదో సినిమాలో లాగా ఏం ఎస్ నారాయణ లా మహా గాలిలా కొట్టుకోచ్చాడు .రావటం రావటం వంటింట్లోకి పరి గెత్తి గిన్నేలన్నీ తిరగేశాడు .కావాల్సింది అక్కకు చెప్ప కుండా ప్లేటు లలో పెట్టు కొని లాగించేసి ,మేనల్లుళ్ళ ను పలకరించి ,వాళ్ళ సంతానానిన్ని కూడా పరా మర్శించి ,అప్పుడు నాఎదుట బడ్డాడు .నాకు లోపల రగిలి పోతోంది .ఏం చేస్తాం బామ్మర్ది కదా తమాయిన్చుకోన్నాను వాళ్ళఅక్క కోసం .
ఎదురుగా కుర్చీలో చేరబడి ‘’బావా ! తెలంగాణా దానం ఇస్తారట గా ‘’అన్నాడు ఏదో మాట్లాడాలి కాబట్టి .’’దానం ఇవ్వ టానికి ఎవర్రా .అది వాళ్ళ హక్కు అని గోలా యాగీ చేస్తుంటే ‘’అన్నాను .’’బావా !అర్ధం లేకుండా మాట్లాడటం అంటే నీ దగ్గరే నేర్చుకోవాలేమో ?’’అన్నాడు ఖంగు తిన్నాను .పేపర్లు చదవ్వు ,చానళ్ళు చూడవు .నీతో వచ్చిన చెడ్డ చిక్కు ఇదే ‘’అంటు ‘’దానం అంటే దానం గా అని పోర బాటు పడ్డట్టున్నావు .’’నేనన్నది దానం నాగేందర్ అన్న మాట గురించి .ఇచ్చేస్తున్నట్లు తనకు సంకేతాలంది నట్లు ,కాపిటల్ విషయమూ తేలి పోయి నట్లు చెప్పాడుకదా!ఫాలో కాలేదా ?’’అన్నాడు అసహనం గా .’’లేదురా.ఎవరో ఒకరు ఏదో అనుక్షణం అంటూ ఉంటారు .అవన్నీ పట్టు కొని నమ్మలేం .ధిల్లీ యేమాలో చిస్తుందో చిదంబరానికీ తెలియని ‘’చిదంబర రహస్యం ‘’’’మరి షిండే గారి మాటో?’’అన్నాడు మళ్ళీ ..’’ఆయన పునశ్చరణ తరగతుల్లోపాఠాలు అభ్యసిస్తున్నాడు ‘’అన్నాను ‘’.అయినా పండగ నాడూ పాచి మాటలెందుకు రా –ఏదైనా కొత్త విషయం ఉంటె గిలకరించు ‘’అన్నాను .
‘’సరే కాని బావా !కొత్త కవిత్వం మార్కెట్లో రిలీజయింది నీకు తెలుసా ?’’అన్నాడు ‘’అదేదో అఘోరించు ‘’అన్నాను .వాడి సస్పెన్సు భరించలేక .’’అదే బావా !’’గోచీ’’కవిత్వం .వినలేదా ?’’అన్నాడు ‘’గోచీ కవిత్వం ఏమిట్రా పాచి కవిత్వం లా‘’అన్నాను .’’అదే నీతో వచ్చిన చిక్కు .కొత్త దాన్ని ఎంకరేజి చెయ్యాలి బావా మరీ సాంప్రదాయం అంటు మడి కట్టుకొని ఎన్నాళ్ళు కూర్చుంటావు “’అని కాస్త కసురు కొంటున్నట్లు ఉరిమాడు .’’నేను వినలేదు రా .ఆ గోచీ ఏదో విప్పి ఏడు“’అన్నాను .’’బాబోయ్ –విప్పితే నువ్వు చూసి తట్టుకోలేవు బావా .’’అన్నాడు .’’ఓరి నీ అఘాయిత్యం మండా!గోచి విప్పటం అంటే విశ్వ రూప సందర్శనం కాదు .అదేమి కవిత్వమో చెప్పమని అర్ధం ‘’అన్నాను ‘’హమ్మయ్య బతి కిన్చావు బా ‘’అని ‘’గోచీ కవిత్వం అంటే’’ గొప్ప చీవాట్ల కవిత్వం’’ ట..మొన్ననే రిలీజయింది .హాట్ హాట్ గా ఉంది బావా .’’అన్నాడు .’’అయితే ఆ గోచి లోనీ రహస్యమేమిటో విడిచి పెట్టు ‘’అన్నాను .దొరికింది కదా చాన్సు అని మా వాడు విజ్రుమ్భించాడు ‘’బవా ఇదో కొత్త రకం కవిత్వ ప్రక్రియట.మొత్తం అయిదు పాదాలు మొదటి నాలుగు పాదాల్లో నాలుగు రకాలైన తిట్లు ,ఐదో పాదం లో ఎవరిని తిడుతున్నామో వారి గురించి ఉంటుందట ‘’అన్నాడు .’’బాగుందిరా .ఒక గోచీ లాగి వదులు ‘’అన్నాను .’’గూడ్సు బండి వెధవల్లారా –గడ్డి తినే గాడిదల్లారా –గుడ్ల గూబ గుంటల్లారా –అవి నీతి రాజ కీయ నాయకుల్లారా –మరెందుకు ఆలస్యం మీరు కూడా తెలుగు సాహిత్యానికి గోచీలు సమర్పించండి ‘’అని చది వాడు .’’బాగుందిరా .పూర్వం తిట్టు కవిత్వం అని ఉండేది .దాన్ని మించిన్దిరా నీ కవిత్వ గోచీ ‘’అన్నాను ‘’అన్నీ ఇలానే ఉంటాయా ?ఏమైనా మార్పుందా?/ప్రశ్నించాను .’’మగకవులతో పాటు ఆడకవులూ పెట్రేగి రాస్తున్నారు బావా ‘’అన్నాడు‘’విప్పు ‘’అన్నాను .వాడు సిగ్గు పడుతూ ,లంకిన్చుకొన్నాడు ‘’చిడతలు పంచె చిం పాంజీల్లారా –పిడకలు కూడా వదలని పింజారీ పిండాల్లారా –మరకలు పట్టిన సమాజం లో గురకలు పెట్టె గూండాల్లారా –ఎలుకల్లా కలుగుల్లో దాగుండే బంది పోటు తిండి పోతుల్లారా –మళ్ళీ మీరేగా గెల్చేది చా –చా చా ఛీ ఛీ ఛీ ‘’
‘’సరేరా .మనకే కవిత్వమైనా ఇతర దేశాల నుండి దిగు మతి అవుతుందికదా .మరి యే దేశం లో దీనికి ప్రాతి పదిక ఏర్పడింది ?’’అని అడిగాను .అప్పుడు వాడు సంబర పడి పోతు ‘’అమెరికా లోనీ అట్లాంటా నుండి ఒక గోఛీ కవి గొప్పగా గోచీ ఝాడించాడు బావా ?’’అన్నాడు ‘’ఆ ఆంగ్ల గోచీ నీ విప్పు ‘’అన్నాను .’’match stick head idiots –drainage face stupids –devil hand’s twisted nails –slum dog pappe rs –you ,sub prime culprits !shit shit shit ‘’
‘’ సరే .మగాల్లనే తిట్ల తో బాదుతున్నారా ?మహిళా మణులకీ సత్కారం చేస్తున్నారా ?/’’అన్నాను అమాయకం గా .’’బావా .కవి నిరంకుశుడు .వాళ్ళూ వీళ్ళూ భేదం లేదు అందర్నీ గోచీ తో వాయిన్చేసి ఉతికేస్తాడు . ‘ఇదిగో చూడు అంటు ‘’ఒసేయ్ సోకుల పాపాయమ్మా –వంకర భాష వెంకాయమ్మా –ఎక్స్ ప్రెషన్ లేని ఎర్రి ఎంకమ్మా –కేటువాక్కుల తింగిరి బుచ్చీ –నేటి ‘’టేలుగు ‘’హీరోయినూ డౌను డౌను ‘’అని అలిసి పోయి ఆగి పోయాడు /’’ఓరి నీ దౌర్భాగ్యం కవిత్వం గోచీఊడి పోను .ఇదెక్కడి తిట్ల దండకం రా .ఈ ప్రక్రియ పేరు పెట్టుకొని అందర్ని పెట్రేగి పోయి తిట్టచ్చు నని విజ్రుమ్భిస్తున్నట్లున్నార్రా .’’అన్నాను .(ఆంద్ర జ్యోతి నిన్న ఆది వారం స్పెషల్ లో బ్లాగోతం –ఆధారం గా ఈ కవితలు మీకు అందించాను )
‘’బావా !నాకో అయిడియా వచ్చింది .నువ్వు తిట్టకపోతే చెబుతాను ‘’అన్నాడు బామ్మర్ది యం బ్రహ్మం .’’సరే వదులు గోచీ కంపే భరించిన వాడిని ఇంకా ఏముంది భరించటానికి ?’’అన్నాను గ్రీన్ సిగ్నల్ ఇచ్చి నట్లు భావించి మా వాడు విజ్రుమ్భించటం మొదలెట్టాడు ‘’గోచీ కి కొద్దిగా నైనా గుడ్డ ముక్క కావాలి కదా బావా .నేను ఇంకో అడుగు ముందుకు వేసి ‘’నూ.పో’’అనే కొత్త ప్రక్రియ లో కవిత్వం రాద్దా మనుకొంటున్నాను నువ్వు పర్మిషన్ ఇస్తే వదుల్తాను’’అన్నాదు .’’సరే రోట్లో తల పెట్టిన వాడిని దేన్నైనా భరించాలి కదా .ఇంతకీ దాని వివరం చెప్పు ‘’అన్నాను ‘’ఏం లేదు బావా !నూ పో అంటే ‘’నూలు పోగు కవిత్వం’’.గోచీ కూడా ఉండదు .ఒక్క నూలు పోగే కవిత్వాన్ని కప్పు కోవటానికి ఉంటుంది అన్నమాట .’’అన్నాడు ‘’నాయనా ! తొందర పడొద్దు .కాస్త ఆలోచించి రంగం లో దిగి నూలు పోగు విప్పు ‘’అని సలహా ఇచ్చాను ‘’థాంక్స్ బావా ‘’అని అన్నాడు .
‘’బావా కరెంటు షాక్ తో జనం అల్లల్లాడుతున్నారు కదా నీ కామెంటు ఏంటి బా “’.’’ఏముందిరా .ఆంద్ర దేశం పేరు ఎప్పుడో’’ అంధేరా దేశం’’ అయి పోయిందిగా .ఇప్పుడు అఘోరించి ఏం లాభం ?’’అన్నాను .’’సరే కాని బా ఈ మధ్య మన ప్రేసి డెంటయ్య .చాలా బోల్డ్ స్టెప్ తీసుకొన్నారు కదా ‘’అన్నాడు .’’అవున్రా .నిజమే .దేశాధ్యక్షులు ప్రణబ్ ముఖర్జీ మన ప్రియ తమ ఆంద్ర నాయకుడు పి.వి.గారి పై ఒక ప్రైవేట్ చానెల్ వారి ఆహ్వానం పై హైదరా బాద్ లో ఆ పెద్దాయన పై అద్భుతం గా ,ఆనందం గా ,మనసు విప్పి మాట్లాడి మనలని రంజింప జేషి నందుకు మనం ఎంతో కృతజ్ఞత చూపాలి .అయితే సోనియా నుకాదని ఆమె అవమానించిన తెలుగు ప్రధాని పై ఇంత ధైర్యం గా మాట్లాడటం మనకు బానే ఉన్నా పాపం ఆ యన యే చిక్కుల్లో పడతారో నని పిస్తోంది .ఏమైనా రామచంద్ర మూర్తి గారి చొరవతో మొదటి పి.వి.స్మారక ఉపన్యాసం ఏర్పాటు చేయటం చానెల్ల లో కొత్తదనానికి ,నిర్భీతికి ,జరగాల్సిన న్యాయానికి మార్గ దర్శనం .ఇక్కడ మూర్తి గారూ అభి నందనీయులే ..
‘’బావా అదేదో సినిమా లో రేలంగి నీ బండ బడ .అంటాడు .నిజం గానే దానర్ధం నాకు తెలియదు .చెప్పు బావా‘’అన్నాడు ‘’ఏం లేదురా .సిలిండర్ అనే బండ రేటు పెంచు తు వాటి సప్లై నికోతకోస్తూ ,ఎక్స్ ట్రా గా కావాల్సి వస్తే వెయ్యికి బాదుతున్నారే అదే బండ బడ అంటే ‘’అన్నాను ‘’.బ్రహ్మం గారిలా రేలంగి ఆ నాడే ఊహించి చెప్పి నట్లున్నాడు బా.’’అన్నాడు.’’ఆఖరి ప్రశ్న బా –తెలుగు సభల్లో నీ జాడ ఎక్కడా కని పింఛి నట్లు లేదే నువ్వూ బహిష్క రించావా ?‘’అన్నాడు .’’అవున్రా అంత రిస్కు తీసుకో దల్చుకోక వెళ్ళ లేదు .బహిష్కరించటానికి మనమెంత ?ఏముందిరా కొత్తదనం ?హాయిగా ‘’సప్త గిరి చానేల్ లో ‘’ఇంట్లో నె కూచుని తిలకించా సభల సౌభాగ్యం ..మహా మహుల్ని పిలిచి వాళ్ళతో వేషాలేయించి త్రిభువన విజయం అంటూ పాత పద్యాలే పాడించి కొత్త ఆలోచనలేమీ లేకుండా చేశారు .ఎవరు ఎవర్ని సంమానిస్తున్నారో తెలీకుండా వేదిక మీద ప్రభుత్వాధి కారులు ,బాల మురళి లాంటి విద్వాంశులు పాడాలా వద్దా అన్నట్లు పాడిన తీరు ,చూస్తె కసరత్తు సరిగ్గా చెయ్యక పోవటం కని పించింది ప్రముఖ సాహిత్య సంస్థలన్నీ బహిష్కరించటం అంత మంచిదని నాకు అని పించలేదు .ప్రభుత్వమూ అందర్నీ సంప్రదించి జరపాల్సిన సభలు ,ఫాక్షన్ సభల్లా జరగటం తెలుగు భాషకు సంస్కృతికి కొత్త వేలుగులొస్తాయన్న నమ్మకానికి గండి కొట్టింది .చేసిన తీర్మానాలు ఇచ్చిన వాగ్దానాలు అమలు జరిగితే సభలు విజయ వంతమై నట్లే నని భావించ వచ్చు ‘’అన్నాను ‘’వస్తా బావా .విలువైన విషయం ముక్తా యింపు గా ఇచ్చావు ‘పొంగల్ శుభాకాంక్షలు అనబోయి నా కళ్ళల్లోకి చూసి సంక్రాంతి శుభా కాంక్షలు‘’అని దౌడు తీశాడు బామ్మర్ది యం బ్రహ్మం ..
సంక్రాంతి శుభా కాంక్షల తో
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –14-1-13-ఉయ్యూరు
మకర సంక్రాంతి నాడు పిల్లలకు భోగి పళ్ళు
అన్నయ్య గారి అబ్బయి రాంబాబు ఫామిలీ . హైదరాబాద్ లో ఉన్న మా పెద్దాబ్బాయి శాస్త్రి ఫామిలీ
మూడో అబ్బాయి మూర్తి ఫామిలీ
నాలుగో అబ్బాయి రమణ ఫామిలీ
మొత్తం 16 మంది సీతమ్మ వాకిట్లో సిరిమల్లి చెట్టు ఉయ్యూరు లో సినిమా వీక్షణం
మకర సంక్రాంతి నాడు , మనుమలకు , మనవరాలి కి భోగి పళ్ళు
ఫామిలీ ఫోటో
భ.కా.రా.మేస్టారి చమత్ కారాలూ ,మిరియాలూ -3
భ.కా.రా.మేస్టారి చమత్ కారాలూ ,మిరియాలూ -3
భమిడి పాటి వారు మేష్ట రీ చేశారు కనుక స్కూళ్ళ ఇన్స్పెక్షన్ బాగోతం చాలా బాగా చూపించారు ‘’పల్లె టూరు స్కూలు తణికీ తంతు ‘’కధ లో .ఆ పల్లె టూరి మేస్టారి నిర్వాకం ,పరీక్షాది కారుల చపలత్వం ,భేషజం తిండి మీద ఉన్న ఆసక్తి ,కళ్ళకు కట్టిస్తారు .
వెంకటాయి గారు గడ్డి పాలెం లో’’ ఉదర నిమిత్తం’’బడి పంతులు .స్తిరాస్తి భార్య ,చరాస్తి తనూ.ఆయనకు నమ్మకం గా వచ్చే ‘’సాలాదాయం ‘’ఒక ఆడ శిశువు .కొండొకచో కవలలు .దసరా పేరుతో ,అక్షరాభ్యాసం హడా విడి తో పదీ ,పరకా ‘’గతుకు తాడు ‘’.ఓ దస్తా వేజు గీకి పెట్టో ,ఓ సంబంధం ముడి పెట్టించో,ఓ సాక్ష్యానికి తగలడో ,,ఓ బ్రాహ్మ ణార్దానికి ఏడిసో ,దిష్టి కొట్టకుండా ఇంతో అంతో ‘’కతుకు తాడు ‘’.తణికీ దారుకి ‘’మనుగుడుపులు ‘’మేపి గ్రాంటు కొట్టేస్తాడు .కిందటేడు మాత్రం ‘’ఏదో ఒకా నొక సప్లయి సంతృప్తి గా జరక్క ‘’గ్రాంటు సరిగ్గా ‘’పారే యించ లేదు‘’.బంధువులు ,పక్కాలు వచ్చీ పోయే ఇల్లు ..చాకిరితో బాటు డబ్బు ఊడటం –ఇదీ పల్లె టూరి బడి పంతులు పరి స్థితి .’’వెంకటాయి గారు సంసారం విషయం లో వీల్లేక చదువు చెప్పటం విషయం లో మాత్రం’’ కుమ్మరి పురుగు’’ లా ఉంటూ,ఆర్జనకు అన్య మార్గాలు అన్వేషించాడు .’’ఎక్కడైనా ‘’కుండ తడిపినా’’,’’తూతూ బాకా విని పించినా ‘’అదే ఆఃహ్వానం గా భావించి హాజరయ్యే వాడు .
ప్రస్తుతం కొడుకు ఈయన దగ్గరే ఉన్నాడు .పెళ్ళాం పురిటికి వెళ్ళింది .ఎవర్నో ముసలమ్మను వంటకు‘’ఫిరాయించాడు ‘’.ఆవిడకు ‘’పుట్ల చెముడు ‘’..సొదఎక్కువ. ఎవడైనా భోజనానికి వస్తే ‘’ఓ టాప్పడవెడు ‘’బూతులు దిమ్మ రించేది .లేక పోతే కుర్రాణ్ణి పిల్చి ‘’రుంజ వాయించి నట్లు వాయించేది ‘’.దాంతో వచ్చిన వాడు పరారు .ఒక రోజు పక్క ఊళ్ళో పెళ్ళి. .కొడుకుతో అక్కడికి హాజరయ్యాడు వెంకటాయి .ఆయన ఖర్మ కాలి ,ఆ రోజునే ఇద్దరు ఊళ్లోకి ప్రవేశించారు .ఒకడి చేతిలో కాగితాలు ,గొడుగు ,రెండో వాడి నెత్తిన తలపాగా .ఊళ్ళో వాళ్ళు ఇనస్పెక్టర్ గా భావించి ,పక్క ఊర్లో ఉన్న పంతులు గారికి కబు రెట్టారు .’’ఓరి నీ ఇనుం కాల్చా .వచ్చింది ‘’మాసికం గారా ?’’’’కాళ్ళు కడగడం గారా ?’’పెళ్ళాం పిల్లలు కూడానా ?’’అని కనుక్కున్నాడు .పెళ్ళి పందిట్లో ఈ అప్రాచ్యపు మాట లేమిటనిఅంతా కేక లేశారు అర్ధం తెలీక .పెద్ద ఇనస్పెక్టర్ ని’’తద్దినం ‘’అనీ ,ఆయన కింది వాడిని ‘’మాసికంఅనీ , ‘ ,మైనర్ తనికీ గాడిని’’కాళ్ళు కడగటం ‘’అనీ తన పరి భాష చెప్పి బయట పడ్డాడు .’’వారే మాకు పితృ ,పితామహ ,ప్రపితామహులు ‘’’’అన్నాడు .
ఎంత లేదన్నా తెలివి గల పిండం కనుక ఆపసోపాలతో కొంపకు. చేరాడు ,దారిలో బొట్టు గిల్లుకొని ,,జుట్టు రక్కు కొని ,ముసలావిడతో ‘’గార్లోండి వంట కానివ్వ మ్మోయ్‘’అని చెప్పి ,స్కూలుకు చేరి బోజ్జాయన కాళ్ళ మీద పడి పోయాడు తెలివిగా .ఎండ దెబ్బ తగిలిందనుకొని సాను భూతి చూపించాడాయన .’’తమకు వేళ దాటింది .ఒళ్ళు తడుపు కొని మడి క ట్టు కొండి’’అన్నాడు .ఆయన పాపం సాను భూతి తో ‘’నా కోసం విశేషం ప్రయత్నించద్దు .గోకారం లో నాకు పెట్టిన భోజనం ఏం భోజనం అండీ .నాలుగు కూరలు ,నాలుగు పచ్చళ్ళు ,క్షీరాన్నం ,మాష చక్రాలు ,అబ్భ అబ్భ ,అంతా యధా విధే .నేను జఠరాజ్ఞి ,జీర్ణ పుష్టీ ఉన్న ఘటాన్ని గనక సరి పోయింది .’’అన్నాడు .వెంకటాయ గారు ‘’చిత్తం .పచ్చడి మెతుకులే నండీ .నాకే ముంది .బీద కుటుంబీ కుడిని.’’అని తన ఇంటికి తీసి కెళ్ళాడు .వంటాలస్యం ఉంది.అని ఒక తవ్వెడు పాలు ఇచ్చి ,పుచ్చు కొమన్నాడు .’’తమరికేమైనా మతి చలించిందా ఏం ?’’అంటు అతి సిగ్గుగా ,అయిష్టం గా విషం పుచ్చు కుంటున్నట్లు నటిస్తూ ,నిమిషం లో గిన్నె లో తడి అయినా మిగలకుండా ఊడి చేసి ,ఆయాసం నటించాడు .ఇందులో ఆ పాత్ర పోషణా ఆ నాడూ అంతే ఈనాడూ అంతే .తేడా ఏమీ లేదు .కాలం మారినా పద్ధతులవే .అదే మేపు ,అదే చేపు .
అయ్యగారికి అభ్యంగన స్నానం చెయ్యాలనే కోర్కె అదీ ఆవు నెయ్యితో .తప్పించుకోవాలని చూసినా ,కొడుకు తొందర మాటలతో ఇంట్లోని ఆవు నెయ్యి తో ,భజంత్రీ వాడిసాయం తో ‘’తధికిణ ధోం’’అయిందని పించాడు .వడ్డన చేసి ,రమ్మని పిలిచాడు .విస్తట్లో ‘’బకాసురిడికి తోడి నట్లు కుంభం మటుకు తోడి ఉంది.’’దాని అగ్ర మందు ‘’సార్వా గడ్డి కొంప మీద కొండ ముచ్చు మొహం లా ‘’వెక్కిరిస్తూ ,’’ఉస్తికాయంత ఉసిరి పచ్చడి ఉంది’’ .అధికారి అంతటి మనిషీ కూడా‘’చలిమిడి ‘’అయి పోయి ,ఆముదం మొగం పెట్టాడు .’’కూచోండిపొద్దు పోయింది కావలసినవి అడిగి వడ్డించు కొండి’’అని‘’చేణికాడు ‘’పంతులు .అధికారి కన్నీళ్ళతో పరిశేచనం చేసి ‘’ఎల్లా నేనిది ఏడవటం ?’’అన్నాడు .తక్షణమే వెంకటాయి తనకు నిరుడు గ్రాంటు వచ్చిన కాగితం చూపాడు .’’నె నేనెలా ఏడవడం ఇదీ ?’’అంటు ఒక్కొక్క అక్షరం ఒత్తి,ఒత్తిపలికాడు.సమయానికి తగూ అన్నట్లు ఠపీ
మని ,ఎత్తుఎత్తాడు . పారింది పాచిక .’’నేను గ్రాంటు కురిపిస్తా .అన్నం మీద ఒట్టు ‘’అన్నాడు అధికారి .ఉబ్బి పోయిన వెంకటాయి ముసలమ్మకు సౌజ్న చేశాడు . ఆవిడ ఈ విస్తరి పట్టుకొని వెళ్ళి తాజా విస్తరి పెట్టింది .అధికారి ముఖం వికశించి ‘’దంత పరిశ్రమ ‘’తో రంగ ప్రవేశం చేశాడు .’’గారెల పర్వం ‘’లోకి వచ్చాడు .’’ఏమిటో అనుకుంటాం .కాని’’భోజనం చేయటం కూడా కష్టమే సుమండీ ‘’.. అన్నాడు బొజ్జ నిమురు కంటూ .,గారెల పర్వతాన్ని ఊదేస్తూ .వేసిన కొద్దీ ఊదేస్తున్నాడు .విసుగెత్తింది ముసల్దానికి .పళ్ళెం లోనీ వన్నీ ,విస్తట్లోకి గిరాటేసి ,పళ్ళాన్ని వెంకటాయ నెత్తిన కొట్టింది .’’సత్రం బొక్కు జంతు వుల్ని తీసుకు రావద్దని ఎన్నో మాట్లుచెప్పినా సిగ్గు లేదు .మర్యాదా లేదు .తెచ్చి ,తెచ్చి ఎవడినో,’’సర్వ భక్ష కుడిని ‘’తెచ్చావు .కుర్రాడికి ఒక్క టైనా మిగల్చలేదు . వాడి కోసం మళ్ళీ వండి తగలడాలి ‘’అని తుర్రు మంది .అధికారి మింగా లేక,కక్కా లేక కాసేపు ఇదై ,తేరుకొని ,వెంకటాయ తో లౌక్యం గా ‘’నేను గనక సరి పోయింది .మరోళ్ళుఅయితే,లేచి పోయే వారు ‘’అని మళ్ళీ ‘’దంతాలను విసరటం ‘’ప్రారంభించాడు .’’గార్లె తర్వాత పెరుగైనా చేదే‘’అని మజ్జిగ కూడా లేకుండా లేచాడు .ఇన్స్పెక్షన్ కోసం స్కూల్ చేరాడు .ఆయాసం తో తెగ ఇదై పోయాడు .’’బొర్ర జారేశాడు’’ . రాత్రికి గార్లని పెరుగు లో నానవేయించమని ఫర్మానా జారీ చేశాడు .
సంక్రాంతి శుభా కాంక్ష లతో –
సశేషం –మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –14-1-13- ఉయ్యూరు .
మకర సంక్రాంతి
మకర సంక్రాంతి
సూర్యుడు ప్రతి నెల ఒక్కో రాసిలో ప్రవేశిస్తుంటాడు దాన్ని సంక్రమణం అంటారు .సూర్యుడు కర్కాటక రాశి లో కి ప్రవేశించినపుడు కటక లేక కర్కాటక సంక్రమణం అంటారు దీంతో దక్షిణాయణం ప్రారంభమైనట్లు .ఇది సాధారణం గా జూలైపదిహేడు న వస్తుంది .ఇది పితృ దేవతల కాలం . ఆరు నెలలు ఉంటుందని మనకుతెలుసు . .అలాగే రవి మకర రాసిలో ప్రవేశించినపుడు వచ్చేది మకర సంక్రమణం .రేపు అంటే ఈ నెల పద్నాలుగవ తేది సోమవారం మధ్యాహ్నం గం.12-10 కు సూర్యుడు మకర రాశి లో ప్రవేశించటం తో మకర సంక్రమణం ప్రారంభమవుతుంది .ఈ ఆరు నెలలు దేవయానం గా భావిస్తారు .ఉపనయనాలు ఉత్తరాయణం లోనే చేస్తారు .సంక్రాంతి పురుషుడు ఒక్కో సారి ఒక్కో రకం గ వస్తాడు . ఈ సంవత్సరం సంక్రాంతి పురుషుడు ఎలా ఉన్నాడో ,యేవాహనం ఎక్కి వచ్చాడో , వేషదారణం ఏమిటో ఆ వివరాలు తెలుసుకొందాం .
రేపు వచ్చే సంక్రాంతి పురుషుని పేరు ‘’ద్వాం క్ష ‘’అందువల్ల వైశ్యులకు హాని అని తెలుస్తోంది .గజ వాహనం ఎక్కి రావటం వలన పెద్ద పెద్ద పదవుల్లో ఉన్న వారికి భోగ భాగ్యాలతో పాటు అకారణం గా కలహాలేర్పడతాయని సూచన .చందన ఉదకం తో స్నానం చేయటం వల్ల పాడి పంటలు సమృద్ది గా ఉంటాయి .యవాక్షత ధారణం వలన అలచంద పంటకు నష్టాలుండ వచ్చు .నీలి రంగు వస్త్రం కట్టుకొన్నందున ప్రజలలో భయాందోళనలు ఎక్కువవ గా ఉండచ్చు .గోరోచనాన్ని లేపనం గా పూసుకొన్నందున విలాస వస్తువుల ధరలు ఆకాశమంత ఎత్తున ఉంటాయి .జపా పుష్పాన్ని ధరించటం వల్ల యుద్ధ భయం జాస్తి .గోమేధికాన్ని ఆభారణం గా ధరించటం వలన నవ రత్నాలకు గిరాకీ పెరుగుతుంది .తగరపు పాత్ర లో భోజనం చేయటం వల్ల లోహాలన్నిటికి గిరాకీ ఉంటుంది .పాలను తాగటం వల్ల శూద్రులకు అరిష్టం గా భావిస్తారు .
రేగు పండ్ల ను తినటం వల్ల పండ్ల తోటలు జాస్తిగా పెరుగుతాయని అంటారు .కోదండాన్ని ఆయుధం గా వాడటం వలన పాలకులకు మనశ్శాంతి తక్కువ అని చెబుతారు .బంగారు గొడుగు వేసుకోవటం వలన ప్రజలకు ఆయురారోగ్యాలు ఉంటాయి .విస్మయం చేష్ట గా ఉన్నందున వర్షాలు అధికం గా కురుస్తాయని సూచన .సంక్రాంతి పురుషుడు కూర్చుని ఉన్నట్లు ఉండటం వలన అనారోగ్యాలు ఎక్కువే నని ఊహిస్తున్నారు .బల్లెం తో సంచరించటం వల్ల జంతు నష్టం ,దొంగలకు హాని .ఆగ్నేయ దిశలో ప్రయాణించటం –ఆగ్నేయ ప్రాంతాల వారికి అరిష్టం గా భావిస్తారు .శుక్ల పక్షం లో ప్రవేశించటం వలన అన్ని వస్తువుల ధరలూ పెరిగి పోతాయట .తదియ తిది వల్ల చిన్న వ్యాపారులకు లాభాలెక్కువ .సోమవారం నాడు రావటం –పంటలకు నష్టం ,చిన్న పరిశ్రమలకు వృద్ధి .మేష లగ్నం లో ప్రవేశం వలన స్త్రీలకూ ప్రాముఖ్యత పెరుగుతుంది .ధనిష్ఠా నక్షత్రం లో ప్రవేశం కనుక నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుతాయని ఊహిస్తున్నారు .మధ్యాహ్న కాలం లో ప్రవేశించటం అధికారులతో మనస్పర్ధలు ఎర్పడేట్లు సూచన కని పిస్తోందని పంచాంగ కర్తలు చెబుతున్నారు .
సంక్రమణ సమయం లో జపం ,తపం చేయ గల వారు చేసుకో వచ్చు .సంక్రమణ ప్రవేశ సమయం లో దానాలు చేయాలి పితృదేవతలు సంతృప్తి పడతారు .బూడిద గుమ్మడి ని బ్రాహ్మణునికి వడ్ల తో దానం చేయాలి .పితృదేవతలకు తిలోదకాలు వదలాలి .ఇవన్నీ చేస్తే ఆయురారోగ్యాలు ,ఐశ్వర్యాలు ,పుత్రపౌత్రాభి వృద్ధి కలుగుతుంది ..
సంక్రాంతి శుభా కాంక్షల తో
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –13-1-13-ఉయ్యూరు
భ.కా.రా.మేష్టారి చమత్ కారాలూ ,మిరియాలూ -2
భ.కా.రా.మేష్టారి చమత్ కారాలూ ,మిరియాలూ -2
దేశ సేవ చేయాలనే ఆరాటం అందరిలో ఉంటుంది .సమాజ సేవలో తరించాలని కొందరను కొంటారు .ఏదో ఇంత తిని ఇంట్లో తొంగుంటే యెట్లా?’’కసింత కలా పోసాన ఉండాలిగా ‘’.దీనికోసం సమాజాలు ,దాని అధి పతులు ఉంటారు .నెలకో ,రెన్నెల్లకో సభ జరిపి ,ఉపన్యాసాలిప్పించి ,విని ,విని పించి ,అది పేపర్లో వస్తే చూసి చంకలు గుద్దు కోవటం మామూలై పోయింది .అలాంటి ‘’కండూతి రాయళ్ల ‘’గురించి ,,వారి బలహీనలత గురించి బయటకు లాగే రచనే భకరా గారి ‘’తుక్కు ముక్కల హక్కు చిక్కు ‘’.అంటే పర్మిషన్ లేకుండా నాటకం ఆడితే వచ్చే తంటా ఎలా ఉంటుందో చూపిస్తారు మేష్టారు .రాసిన వాడు ఒఠివెధవాయి అయినా పర్మిషన్ లేకుండా వేస్తే ఎంత హైరాన పడాలో తెలియ జెప్పిస్తారు .
రచయిత గారికో సాహితీ సంస్థ ఉంది .’’ఉరమ గల వారి చేత ‘’ఉపన్యాసాలిప్పిస్తారు .మన సంస్థ వెల్లడి కోసం సభ చేసుకో వద్దు అని ఎద్దేవా ఇందులో కని పిస్తుంది .ఘోషణ అనేది ఈ నాడు ఎంతో అవసరం .ఘోషణ వల్లే పోషణ జరుగుతుందట .అని పబ్లిసిటి ని పబ్లిక్ గా యేకేస్తారు .మీటింగు ఏర్పాట్ల గురించి రాస్తూ ‘’డిన్నర్ భాజాయిమ్పులూ ,సభలో కూర్చోటానికి కట్టు దిట్టాలూ ,అధ్యక్షుని బస గురించి ,ఆశ్రయించిన కవుల్నీ ,ఉపన్యాసకుల్నీ ప్రణాళిక లో‘’జోనపడాన్ని ‘’గురించి తంటాలు ‘’వివరిస్తారు .హాస్యరసం ఒప్పించి మాట్లాడే వాళ్ళ పేర్లు తమాషా గా ఉంటాయి .వాళ్ళ చేష్టలు ఎలా ఉంటాయో చూడండి .’’హాస్య రచయిత రాసిన వంకర టింకర మాటలకి తరిమిణిపట్టి ,నునుపు జేసి ,నవ్వించే జీనియస్ -కాని ,పార్టు రాదు ,చేష్టలేదు ,చేత కాదు .నట యోగిది యావత్తూ ఇంగ్లీష్ నవ్వు ,అతడు పల్లె తూళ్ళమ్మటా ,పర్రలమ్మటా ,పడి ఫార్సు ముక్కలు మూటేట్టుకొని కప్పుల్లో మెడల్సూ లాగేశాడు .హాస్యార్నవం ఎప్పుడూ ఇవతల నవ్వించే మాటలే చెప్తాడు కనుక అతనికి పార్టే అక్కర్లేదు .అతడికి కోపం వచ్చేట్టు మనం తిట్టి నప్పుడు అతడికి మరీ నవ్వు పుడ్తోంది.
వీల్లందరిలో ఒకాయన రాసిన నాటకాన్ని ‘’బోలెడు చోట్ల వాక్యాలు దిద్ది ,వాటికి మెరుగులు పెట్టి ,యే కోశాన స్పురించని హాస్య చేష్టలు చేసి ,చచ్చి చేడి జనాన్ని నవ్వించారు .’’ఇంత శ్రమ పడితే ఆ నాటక కర్త పర్మిషన్ తీసుకో లేదని ,పెట్రేగి పోయి కార్డులు బనాయించాడు .కేసులు వేస్తానని బెదిరిస్తూ ,దానికి ఈ సమాజం జవాబు ఇలా రాసింది‘’ఏం చేస్తాం ?మీరు యేడవ్వద్దు .మీకు గౌరవం తేవాలని మేం పడ్డ శ్రమకి ,మీరు చూపిన కృతఘ్నతకు రోజులు ఎలాంటి వి వచ్చాయో మీరు చూపించారు .మా కర పత్రం లో కొద్ది వాళ్ళ పేర్లే వేసి ,మీ బోటి పెద్ద వాళ్ళ పేర్లు తీసేశాం .మాకు మరో దిక్కు లేక మీ దిక్కు మాలిన నాటకం ఆడాం.మీకు రాయక పోవటానికీ కారణం ఉంది .నిజం చెప్పా లంటే మీ రచన దిక్కు లేని తెలుగు భాష .ఉన్నత భావ రహితం .పండిత శూన్యం .అందరికి తెలిసిన ముక్కలు .వీధిలో దొర్లాడే పడి కట్లూ .అందులో ఎందునా బొందని నీచం .ఇటు వంటి రచన చేసిన మీకు మీకు అనుమతి గురించి రాయటం కంటే ,మానేస్తేనే మీకు మీకు అనుమతి గురించి రాయటం కంటే మానేస్తేనే మీకు గర్వం తగ్గుతుందేమో నని మాకు తోచి ,మీ మేలు కోసమే మీ పేరు విసర్జించాం .ఆ మేలు స్మరించుకొని ,మీరు మాకు కృతజ్నులై ఉండాలి .మేము ఎంతో సత్కరణం అని చేసిన పనినే మీరు గొప్ప తస్కరణం అని అంటున్నారు కనుక మాట తడ బడు తున్నది మీరె ను ‘’మేం సత్కరించక మానం ‘’అని పోస్టు చేద్దామనుకొని ,చెయ్యకుండా చేశాట్ట రచయిత .అది మనో భావం అన్న మాట .
సాధారణం గా భాకారా మేష్టారు నాటికలు రాసి ‘’హెచ్చరిక ‘’గా ఒక మాట ముందు రాస్తారు .అది నిజం గా అందరికీ హెచ్చరికే .
‘’కేవలం వినోదం నిమిత్తమైనా సరే ,లేక సొమ్ము చేసుకొనే నిమిత్తమైనా సరే –ఈ ప్రదర్శన ఏదైనా సభ ఎదట ఆడ దలచిన ప్రతి సంఘం వారున్నూ ,ముందుగా నే ,గ్రంధ కర్తకి వ్రాసి ,లిఖితాను మతి పొందక పోవటం ,కాపీ రైట్ చట్ట ప్రకారం నేరం గనుక –ఆ సంగతి గమనించి లిఖితాను మతి పొంది ,తరువాతనే ఆడు కోవాలి ‘’
సంక్రాంతి శుభా కాంక్షల తో –
సశేషం –మీ–గబ్బిట దుర్గా ప్రసాద్ –13-1-13-ఉయ్యూరు
సంక్రాంతి శుభా కాంక్షలు
సాహితీ బంధువు లందరికి -జనవరి పదమూడు ఆదివారం భోగి ,పద్నాలుగు సోమవారం సంక్రాంతి ,పదిహేను మంగళ వారం కనుమ పండగ శుభా కాంక్షలు .”సమ్” క్రాంతి కాకుండా పూర్తి క్రాంతి అందరి జీవితాలలో లభించాలని ,తెలుగు పండగ లకు ,సంస్కృతికి ,భాష కు అఖండ గౌరవాదరాభి మానాలు కలగాలని ఆశిస్తూ -మీ దుర్గా ప్రసాద్

ఉయ్యురులో ప్రభావతి పెరటిలో పూ సిన అమెరికా రోజా
భ.కా.రా.మేస్టారి చమత్ కారాలూ మిరియాలూ -1
భ.కా.రా.మేస్టారి చమత్ కారాలూ మిరియాలూ -1
హాస్య బ్రహ్మ స్వర్గీయ భమిడి పాటి కామేశ్వరరావు మేష్టారు అంటే నాకెంతో ఇష్టం .ఆయన్ను మోలియర్ అనే నాటక రచయిత తో పోలుస్తుంటారు .అచ్చతెలుగు హాస్యాన్ని వండి వడ్డించిన సోషల్ మేష్టారాయన ..హైస్కూల్ విద్యార్ధుల కోసమే రాసిన నాటిక లైనా అందర్ని నవ్వుల్లో ముంచి తేలుస్తాయి .ఆయన రాసిన హాస్య నాటిక‘’అంతా ఇంతే‘’ను మేము స్కూలు వార్షికోత్స వాల్లో ఆడటమే కాక ,మా విద్యార్ధులతో కూడా వేయించి ఆ హాస్య రసాన్ని అందరికి పంచాము .అయితే అయన రాసిన ‘’అన్నీ తగాదాలే ‘’రచన చాలా మందికి పరిచయం తక్కువని నా అభిప్రాయం .అందులో హాస్య బ్రహ్మ చిలికించిన చమత్కారాలు ,మిరియాలు మీ అందరికి తెలియ జేయాలన్న సంకల్పమే ఈ రచన కు నేపధ్యం
సాంప్రదాయకం గా వస్తున్న కొన్ని విషయాల పై భ.కా.రా.మేస్టారికి తనదైన స్వంత అభి ప్రాయాలున్నాయి .అందుకే తన మనసు లోనీ చెప్పటానికి ఒక పుస్తకమే గీకి పారేశారు ‘’అన్నీ తగాదాలే ‘’నంటూ .ఆ తాగాదాలు భాషకు ,భావానికి ,పద్యానికి ,,వేషానికి చెందినా వై ఉంటాయి .నిష్కర్ష గా అందులో ఏదో పక పాత్ర చేత తన మాటల్ని మనకు విని పిస్తారు భమిడి పాటి మేష్టారు .
పద్యం అంటే ,అర్ధం అంటే ఏమిటి ?అన్న విషయాలపై తగాదా పడతారు మిత్రులు .భావ రాజు పాత్ర ద్వారా తన అభి ప్రాయాలను మనసుకు హత్తుకోనేట్లు చెప్పిస్తారు .’’శాశ్వతత్వం పొందిన ప్రపంచ కవిత్వం పద్య రూపం లోనే నిల్చి ఉంది . నడక అనేది వేద పురుషుని పాదాలు అని అందుకే అంటారు .సముద్రం లాంటి ప్రాపంచికాను భవం ,పైకి చెప్పుకో గల కవికి నడక ఈత లాంటిది .ఒక్కొక్కడు పద్యమే కాదు గద్యమైనా ,చివరికి కార్డు రాసినా తగల బెట్టి అతుకు తుంటాడు .నిశానీ కూడా పాడు చేసే వాడుండ వచ్చు .ఆలోచన పైకి రావాలంటే సాధన కావాలి .ఆ సాధన సముదాయమే ఆ భావానికి భాష .ఆ సాధనా ,చిత్త వృత్తీ మేళ వించిన మీదట ఆ భావం పండుతుంది .భావం భాష లోనే పుట్టి ,ప్రకటిత మై జీవిస్తుంది .’’ఇది పద్యాన్ని రాగం గా పాడాలి’’ అనే వారికి తగిన పాఠమే .భావ ప్రాధాన్యం వదిలి రాగాల జిలేబి చుట్టలు చుట్టకూడదని మేస్టారి మతం .ఇది అందరికి సమ్మతమే .అర్ధ ప్రాదాన్యానికి ఇచ్చిన విలువ ఇది ,ఇవ్వాల్సిన గౌరవం ఇది ..
ఇక రాగం-పద్యం విషయానికి వస్తే –శేషు అనే పాత్ర ద్వారా తన భావాలను ఆవిష్కరిస్తారు కామేశ్వరరావు మేష్టారు .’’భాష సముద్రం లాంటిది .సముద్రం లో అట్టడుగున పడి పోకుండా ,పై పైకి తేలగలిగిన ‘’ఆంద్ర కూర్మం ‘’’లాంటి దాన్ని ఆధారం గా చేసుకొని ,సంగతీ సందర్భాన్ని కవ్వం గా చేసుకొని ,నాలికలు అనే తాళ్ళతో జనం అంతా కలిసి మధనం చెయ్యగా చెయ్యగా బయల్దేరే హాలాహలాన్ని లయ కర్తకు వదిలేసి అమృతాన్ని మాత్రం తనకు చేత నయి నంత పట్టి నిలిపే వాణ్ణి కవి అంటారు .’’అని సమర్ధ వంత మైన నిర్వచనం చేస్తారు .అంతే కాదు –‘’తన భాష వాడు యెట్లా యెట్లా ఆలోచించి ఉండేవాడో ,అట్లా ఆలోచించి అప్పటి చిత్తవృత్తిని మాటల్లో బంధించే వాడే కవి .ఇంక రాగం తీయటం పై భకారా గారి భావం ఇలా ఉంటుంది ‘’పద్యం లో ఉండగల కవిత్వానికి అగమ్యత్వం మొదటి పూత .రాగాలు తీయటం రెండో పూత .సగం విన పడీ సగం విన పడకుండా చేయడం మూడో పూత పూత మెరుగులు కవిత్వం కిందకి రావు .ఎల్లానో ఆకర్షించటం కాదు .ఆకర్షణ సక్రమం గానూ ,సవ్యం గానూ ఉండాలి .ప్రాణ ప్రతిష్ట చేసి ఆకర్షించాలి .మొదటే ,అతీతులం అని బయల్దేర రాదు అని హెచ్చరిస్తారు మేష్టారు .
‘’వేషం ‘’అనేది పాత్ర స్వభావాన్ని పెంచేదీ ,పాత్ర పై ఆవ గాహన హెచ్చిన్చేదీ గా ఉండాలి కాని –అది ఆసహ్యం గా ఉండ రాదనీ ,పాత్ర పై ఏహ్య భావం కల్గిన్చరాదని హాస్య బ్రహ్మ అభి ప్రాయం .’’భాష అంటే భావం దాల్చే వేషం .భావం ఆంతర్యం .వేషం ప్రత్యక్షం .ప్రకృతి భగ వంతుని వేషం ‘’అంటారు మేష్టారు ..ఈ విషయాలన్నీ బలరామయ్య పాత్ర ద్వారా చెప్పించారు .భావం లేని కవిత్వం గూర్చి ఒకానొక పెద్దాయనను గురించి ‘’ఈయన కవిత్వం చేసే టప్పుడు తప్ప ,కడం అప్పుడు భావం బోధ పడే లాగ వ్యవహరిస్తాడు .’’అని చురక అంటిస్తాడు .
సాంఘిక నాటకాల్లో మరీ స్పష్టం గా వేష నిర్ణయం జరగ వచ్చు .పురాణ పాత్రల వేషమే తగాదా .వాళ్ళ వేషాలు పురాణ నాటక కారులు ఎరుగుదురేమో ?కాని చెప్పరు .’’అంతట బ్రహ్మ ప్రవేశించును ‘’’అంటారు యే తిట్ల కోసమో సిద్ధమై నటులే ,ఏదో ఏడుస్తారు .ఆ పాత్రలన్నీ సగ పాలు దేవుళ్ళు .-ఇమిటేషన్ దేవుళ్ళు .దేవుళ్ళ లాంటి మనుష్యులు .మనుష్యుల్లాంటి దేవుళ్ళు .ఋషుల గురించి చిన్తిల్లటం అనవసరమే .ఎటొచ్చీ వాళ్లకు కాస్త జనప నార గుడ్డ లూ ,వాటి కంపూ తప్ప ఇతర బాధే లేదు .’’అని వేష ధారణా ఎంత కృత్రి మత్వం దాల్చు తోందో కడిగేసేట్టు మాట్లాడిస్తారు పాత్ర ద్వారా .పెద్ద దేవుళ్ళకు మరీ కష్టాలోచ్చాయంటారు మేష్టారు .
ఉదాహరణకు బ్రహ్మ పాత్ర ఎలా ఎడుస్తుందో స్టేజి నాటకం లో చూపిస్తారు ‘’పురాణ బ్రహ్మ చతుర్ముఖుడు ,వారిజాసనుడు ,సృష్టి కర్త ,వేద మూర్తి .నాటక బ్రహ్మ సాధారణం గా ‘’యం బ్రహ్మ ‘’ఒక్కొక్కప్పుడు పెట్టుడు తలకాయలు చెవులు మూసెయ్యడం వల్ల ,ప్రాంటింగ్ అందాక ఒక్క మాట కూడా వాడికి విన బడి చావదు .’’ఇదే ఇట్లా ఉంటె విష్ణువు మామూలు మనుష్యుల కంటే హీనం గా ప్రవర్తిస్తాడు .శివుడు చంద మామ కాని ,త్రిశూలం కాని ,పాము కాని దొరికిన పరికరాలతో ‘’డబ్లీ పన్నా గడ్డం తో ‘’తయారు .శివ శివా నీ కెంత గతి పట్టిందిరా ‘’అన్న హేళన లో కొండంత నిజం స్పష్టం గా కని పిస్తుంది .
‘’ఇంద్రుడు ఒక అసందర్భపు కల్పన.ఆయన మీద ఎప్పుడు విశ్వాస రాహిత్యమే .ఎప్పుడూ ‘’తవ్వాయే ‘’.ఉల్టా సీదా భయమే .ఇతరుల నిష్ఠ చెడ గొట్ట టానికి ఎప్పుడూ స్త్రీలను పంపటమే .మామూలు సంగతులు కూడా ఎప్పుడూ ఇతరుల్ని అడగటమే .భోగ రాయుడు కనుక కోర్టు లో ఎప్పుడూ బోగం ఆటే .’’అంటు ఇంద్ర పాత్ర ఎంత భ్రష్టు పట్టిందో తిట్టింది తిట్టకుండా కడిగేస్తారు కామేశ్వరరావు మేష్టారు .
‘’నారదుడు మరీ చులకన అయి పోయాడు. పౌరాణిక నాటకాల్లో .కాని ఆయన్ను పోతన అద్భుతం గా వర్ణించాడు .’’ఆత్మ వేది ,పారద రుచి దేహుడు ,అపార దయా మతి ,వివేక విశారదుడు ప్రాచీన బర్హికి ఆత్మా తత్త్వం ఉపదేశించిన వాడు .సప్త స్వరములు తన యంత నమ్రోయు చున్న వీణా లాపన రతిం జేసి నారాయణ కధా గానం చేయు వాడు .’’కాని మన నాటక నారదుడు పరమ పాపిష్టి రకం .వాడి వేషం బొంబాయి బాపతు గావును –తలంతా బాగా నున్నగా ‘’గవ్వ మెరుగు వచ్చే లాగా ‘’‘’డేక్కించటం’’ ,వెనక్కి నిగిడె పిలక ఉండడం ,అది అచ్చం గా ముచిగి పళం గా ఉన్న గంగా బొండాం అని పించడం ,పాం కోళ్ళు ,వాయిచని చిడతలు చేతిలో తీగల్లేని వీణ ,-కొందరు నటులు వీణకు తీగలున్నా ,చేత్తో ముట్టుకోరు .ముట్టుగున్నా ఒక చేత్తోనే ,తల్లకిందుగా వాయింపు .’’అంతే కాదు నాటక నారదుడు ‘’అగ్గి పెట్టె గాడు ‘’అన్నారు మేష్టారు .అందుకే మాటలు విని పించని పాటలు పడుతూ పాడు పన్లు చేస్తూంటాడు .వాడు దేవుడూ కాదు ,ఋషీ కాదు ,మనిషీ కాదు .మంచి రాక్షసుడూ కాదు .ఒకటో రకమైన లుచ్చా .అటు వంటి వాడు పట్టు బడితే మామూలుగా తవ్వి పాత రేస్తారు .’’
రాగాలు మనకి లంచం గా ఇవ్వలేని నారదుణ్ణి నాటకం లో చూస్తె ఆపాత్ర ఎంత అపాత్రం అయి పోయిందో తెలుస్తుంది .ఇంకా –లోక మాతలుగా ఊహించుకో బడ్డ లక్ష్మి ,సరస్వతి ,పార్వతి దేవత్వ స్పురణ అవుతుంది అనుకోవటం హాస్యాస్పదమే వేషం ఎందుకు ?స్వభావాన్ని ప్రదర్శించాటానికా ?అన్న మీమాంస లో పడి తన భావాలనిలా చెప్పేస్తారు హాస్య బ్రహ్మ ‘’వేషం చూద్దాం విలాసం కావచ్చు ,వినోదం కావచ్చు .వేషం వెయ్యడం అంత కన్నా ఎక్కువాడే .ఒక్కొక్క వేషం సజీవం గా వ్రాసిన వాడి చేతా ,వేసిన వాడి చేతా ఒప్పించ బడితే అది నిజం గా మహోత్క్రుష్టమే .అట్టి వేషం ఒక్కొక్కటి నూరుగురు మనుష్యుల స్వభావ లేశాలని లోపల ఇముడ్చుకొని ఉంటుంది ‘’అని అభిప్రాయం వెలి బుచ్చారు .
పాత్రలో ఇమిడి నటిస్తే పాత్ర సార్ధకమవుతుంది ‘’రాజూ మంత్రీ అంటూ లాంటి వేషం ఏదైనా సరే వేసి సర్వసమ భూత సమత్వం స్థాపించి తనే ఒక కల్పిత పాత్ర అవస్థ గురించి ఏడిచి ,నవ్వి మొత్తు గోవడం లో ఆత్మా వత్ సర్వ భూతాని రుజువు చేసి తన నాశనం వల్ల ఏదో కల్పిత పాత్ర కి జీవం పోయ్యగల త్యాగి నటుడే ‘’అదే జీవిత పరమావధి .ఎంత అద్భుత మైన నిర్వచనమో చూడండి .సామాన్య మైన మాటల్లో ఎంతటి అసామాన్య విషయాన్ని ,ఎంత సూటిగా ,నిర్మోహ మాతం గా ,నిష్కర్ష గా నిజాన్ని తెలియ జేశారో మేష్టారు ?అదీ ఆయన ప్రతిభ ప్రతి పాత్ర లోను తొంగి చూసి పరకాయ ప్రవేశం చేసె నటనే అమోఘం కదా !
సంక్రాంతి శుభా కాంక్ష లతో
సశేషం –మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –12-1-13-ఉయ్యూరు
తనికెళ్ళ భరణీయం
బంధాలు వికసిస్తేనే అందం
రంగస్థలాన్ని దాటి సినీరచయితగా పదేళ్లు, నటుడిగా పాతికేళ్లు సుదీర్ఘ ప్రస్థానం చేసిన వారు తనికెళ్ల భరణి. స్వేచ్ఛ లేని చోట బాధ్యత ఏముంటుంది? బాధ్యతాయుతంగా ఏమైనా చేయొచ్చనుకుని సినీరచనకు సిద్ధమైన భరణికి ఆక్కడున్న సంకెళ్లు ఎంతో మానసిక క్షోభకు గురిచేశాయి. అయినా ఓ పదేళ్లు ఆ బాధ్యతల్ని మోసి ఆ తరువాత సినీనటనకు శ్రీకారం చుట్టారు.
పాతికేళ్ల తర్వాత తాను ఆశించినంత పూర్తి స్వేచ్ఛతో రచన, దర్శకత్వం చేసే ఒక అవకాశం మి«థునం ద్వారా ఆయనను వెతుక్కుంటూ వచ్చింది. ‘మిథునం’ తనకో గుర్తింపుగా మారబోతున్న ఈ తరుణంలో తనికెళ్ల భరణి జీవితంలోని కొన్ని అరుదైన సంఘటనల్ని మీ ముందు ఉంచుతోంది ‘ అనుభవం’
ఆనందంలోంచి కొంత నేర్చుకోవచ్చు. విషాదం లోంచీ కొంత నేర్చుకోవచ్చు. కానీ, ఆ రెండూ కలగలిసినప్పుడే సమస్య. అప్పుడూ నేర్చుకోవచ్చు. కాకపోతే, ఆ సత్యాలు కలగాపులగంగా ఉంటాయి. వాటిని జీర్ణించుకోవడం కొంత కష్టమయ్యే మాట నిజమే కానీ, అవే ఎంతో లోతైన సత్యాల్ని నేర్పుతాయి. దేవరకొండ నర్సింహకుమార్ అని నాకో మిత్రుడు ఉండేవాడు. ఇంటర్ నుంచి, డి గ్రీ దాకా వాడు నా క్లాస్‌మేట్. అప్పుడో ఇప్పుడో నేను రాసే కవితల్ని చదివి బాగా మెచ్చుకునే వాడు.
ఇంకా ఇంకా రాయమని ప్రోత్సహించే వాడు. వాడి ప్రోత్సాహమే నేను సాహిత్యం దిశగా పయనించడానికి అవసరమైన స్ఫూర్తినిచ్చింది. ఎవరెవరితోనో సాహిత్య చర్చలు చేస్తూ ఏ అర్ధరాత్రో ఇంటికి వచ్చేవాడ్ని. చాలా సార్లు ఆ టైంకి మా ఇంటికి వెళ్లలేక ఈ మిత్రుడి రూమ్‌కే వెళ్లి పడుకునే వాడ్ని. వాడి ధ్యాసంతా ఎప్పుడూ పుస్తకాల మీదే ఉండేది. నేను మొదట్నించీ కాస్త గాలివాటమే. బి.కాం చేసే రోజుల్లోనే వాడు టైప్, షార్ట్‌హ్యాండ్ కూడా నేర్చుకుంటూ ఉండేవాడు. కొద్దిరోజుల పాటు నేనూ టైపింగ్‌కు వెళ్లాను గానీ, నాకు అదేమీ అబ్బలేదు. మా నాన్నేమో అస్తమానం వాడితో పోలుస్తూ నన్ను అదేపనిగా తిడుతూ ఉండేవాడు. ఎప్పుడైనా వాడు మా ఇంటికి వస్తే చాలు మా నాన్న నా మీద వీర విహారం చేసేవాడు.
డిగ్రీ పూర్తయిన వెంటనే వాడికి ఒక మంచి కంపెనీలో స్టెనో ఉద్యోగం వచ్చింది. ఇంకేముంది? మా నాన్న తిట్లదండకం ఇంకా ఎక్కువయ్యింది. ఒక దశలో ‘ వీడివల్లే కదా నేను ఇన్ని తిట్లు తింటున్నాను’అన్న నెగెటివ్ ఫీలింగ్ నాలో మొదలయ్యింది. ‘అసలు వీడిని ఇంటికే రావద్దని చెప్పేస్తే బెటర్ కదా!’ అని కూడా అనుకున్నాను. చివరికి ఒకరోజు నేరుగా వాడితో ఆ మాటే అనేశాను. అందుకు వాడు బదులేమీ ఇవ్వకుండా, మౌనంగా నావైపు అలా చూస్తూ ఉండిపోయాడు. చివరికి నేనే తలతిప్పుకుని అక్కడి నుంచి వెళ్లిపోయాను.
అప్పుడే తెగిపోతే…
అంత మాట అనేసినా వాడు నాకు దూరం కాలేదు. నా స్నేహాన్ని వదులుకోలేదు. సాహిత్యం విషయంలో నన్ను ప్రోత్సహించడమూ మానుకోలేదు. తొలిసారిగా పత్రికలో వచ్చిన ‘అగ్గిపుల్ల-ఆత్మహత్యలు’ అన్న నా కవితను చూసి ఏ మహాశిఖరమో నా చేరువైపోయినట్లు తెగ ఆనందపడ్డవాడు వాడే. వాస్తవానికి, ఆ రోజుల్లో అంతలా ప్రోత్సహించే వాళ్లు నాకు మరెవరూ లేరు. ఈ రోజు ఈ కాస్త స్థాయిలో నేనున్నానూ అంటే వాడి ప్రోత్సాహ ఫలమే.
నేను వాణ్ని మా ఇంటికి రావద్దని చెప్పానే గానీ, చూడకుండా ఉండలేకపోయే వాడ్ని. వాడూ అంతే. ఒకరోజు వాళ్ల ఆఫీసు వాళ్లతో కలిసి గండిపేటకు పిక్‌నిక్‌కు వెళ్లాడు. మ«ధ్యాహ్నం 3గంటల వేళ నా మిత్రుడొకడు వచ్చి కుమార్ గండిపేట చెరువులో మునిగి చనిపోయాడని చెప్పాడు. నా శరీరంలోని ప్రతి అణువూ కాలిపోతున్నట్లనిపించింది. ఆగమేఘాల మీద గండిపేటకు చేరుకున్నాం. వాడి తల్లిదండ్రుల దుఃఖానికి అంతు లేదు. స్మశానానికి చేరుకున్నాం.
ఒక్కగానొక్క కొడుకు కన్నుమూశాడన్న దుఃఖంతో వాడి తండ్రి కుప్పకూలిపోయాడు. చివరికి నా మిత్రుడికి నేనే కొరివి పెట్టాను. భౌతికంగా వాడు నా కళ్లముందు లేకపోవచ్చు గానీ, వాడు నాలోనే ఉండి, నాతోనే నడుస్తున్నాడనుకుంటాను. ఆ రోజు ఎంత తొందరపడ్డాను? మా ఇంటికి రావద్దని నేను అంత కఠినంగా మాట్లాడేసిన్నాడు నిజంగానే వాడు నాకు దూరమై ఉంటే ఏమయ్యేది? ఈ రోజు నేనిలా నిలబడే వాణ్నే కాదు. మన జీవితాన్ని నిలబెట్టే అత్యంత ఆత్మీయుల నుంచి కూడా వాళ్లకు తెలిసో, తెలియకో, ప్రత్యక్షంగానో, పరోక్షంగానో ఎప్పుడైనా మన మనసు గాయమైఉండొచ్చు. అంత మాత్రానికే ఆ బంధాన్ని తెంచేసుకుని, వారికి దూరమైపోతే అది జీవితకాలమంతా తిరిగి పూడ్చుకోలేని భారీ నష్టమవుతుందన్న సత్యం ఆ అనుభవం నాకు నేర్పింది.
అన్నీ తెలియడం వల్లే…
పాతికేళ్ల క్రితం నాటి మాట. నాటకమే జీవితం అన్నట్లు ఎంతో ఉధృతంగా నాటకాలు వేస్తున్నాం. ఆ సమయంలో కళాసాగర్‌లో నాటకపోటీలు జరుగుతూ ఉంటే, నేను రాసిన ‘గోగ్రహణం’ నాటకాన్ని ప్రదర్శనకు తీసుకువెళ్లాం. తల్లావ ఝల సుందరం గారి దర్శకత్వంలో ఆ ప్రదర్శన జరిగింది. దాన్ని చూడటానికి ముఖ్య అతిథిగా ఆచార్య ఆత్రేయ గారు వచ్చారు. ప్రదర్శన తరువాత జరిగిన సభాకార్యక్రమంలో మాట్లాడుతూ, “సినిమాల్లోకి వచ్చాక నాటకాలు రాయడం మానేశాను. అయినా మళ్లీ నాటకాలు రాస్తాను… రాస్తాను అంటూ కొన్నేళ్లుగా మిమ్మల్ని భయపెడుతూ వచ్చాను.
కానీ, ఈ రోజు తేల్చిచెప్పేస్తున్నా.. తనికెళ్ల భరణి రాసిన ఈ గోగ్రహణం చూశాక నేనింక నాటకం రాయక్కర్లేదన్న నిర్ధారణకు వచ్చేశాను. అందుకే ఇంక నేను నాటకాలు రాయనంటే రాయను” అన్నారు. అంతటి ఒక మహా రచయిత నోట ఆ మాట రావడం నాకు గర్వకారణమే కానీ, ఆ మాటలతో నేను బాగా ఆలోచనలో పడిపోయాను. గొప్ప వాళ్లు తమను తాము నిలబెట్టుకోవడానికి ఎంతగా తపించిపోతారో… ఒక్కోసారి తమను తాము వదులుకోవడానికి కూడా అంతగానూ సిద్ధమైపోతారు కదా అనిపించింది. వాస్తవానికి ఆ సంస్కారమే వారిని ఆ శిఖరానికి చే ర్చింది. ఎదగాలనుకునే ఎవరికైనా ఆ సంస్కారం అవ సరం అనిపించింది. నాకైతే ఆ ప్రశంసల మాటున ఆ సత్యమే ప్రస్ఫుటంగా కనిపించింది.
“మన జీవితాన్ని నిలబెట్టే అత్యంత ఆత్మీయుల నుంచి కూడా వాళ్లకు తెలిసో, తెలియకో, ప్రత్యక్షంగానో, పరోక్షంగానో ఎప్పుడైనా మన మనసు గాయమైఉండొచ్చు. అంత మాత్రానికే ఆ బంధాన్ని తెంచేసుకుని, వారికి దూరమైపోతే అది జీవితకాలమంతా తిరిగి పూడ్చుకోలేని భారీ నష్టమవుతుందన్న సత్యం ఆ అనుభవం నాకు నేర్పింది.
యువతలోనూ ఒక పెద్దతనం ఉంది
శ్రీరమణ గారి మిథునం చదివిన్నాడు నేను కన్నీటి పర్యంతం అయ్యాను. అప్పటి నుంచీ ఆ ఇతివృత్తం దృశ్యమానమైనా మనసులో కదులుతూ వచ్చింది. అదొక మానవ సంబంధాల కథ. సినిమా తీస్తే యువతను మాత్రమే దృష్టిలో పెట్టుకుని తీయాలన్న భావజాలం చాలా మంది సినీ నిర్మాతా, దర్శకుల మనసుల్లో బాగా పాతుకుపోయింది. అందుకే యువ జీవితాలకు సంబంధించిన ఇతివృత్తాలే ఎంచుకోవాలని, లేకపోతే ఫెయిల్ అవుతుంద ని చెబుతుంటారు. ఆ కారణంగానే వయసు పైబడిన జీవిత కథలేవీ నేడు తెరకెక్కడం లేదు. నిజానికి యువతలోనూ నిగూఢంగా ఒక పెద్దతనం ఉంటుందనే సత్యాన్ని చాలామంది విస్మరిస్తున్నారు.
వారి మనసుల్లో ఉండే ఆ కోణాన్ని ఎవరైనా బలంగా తాకగలిగితే యువత కూడా ఈ తరహా సినిమాలు చూస్తారనే ది వాస్తవం. పరోక్షంగానే కావచ్చు కానీ, యువతరాన్ని తాకే అంశాలు ఏ వయసు వారి కథలోనైనా ఉంటాయి. మిథునంలో చిత్రీకరించిన అటాచ్‌మెంట్, డిటాచ్‌మెంట్ అంశాలే అందుకు సరియైన ఉదాహరణ. కొడుకులనూ, కూతుళ్లనూ ప్రేమించు. అయితే మధ్యలో వచ్చిన వాళ్లు, మధ్యలో వెళ్లిపోతారు. చివరి దాకా ఉండేది ఎప్పడైనా భార్యాభర్తలే. వార్థక్యాన్ని బరువుగానో, భారంగానో కాకుండా ఆనందంగా గడపవచ్చని చెప్పే ఒక అందమైన కథనమది.
దాంపత్యం అంటే శాశ్వతమైన స్నేహం అన్నాడు భవభూతి. ఆ సత్యాన్ని ఈ సినిమా అందంగా చెబుతుంది. ఈ అంశం యువతకు సంబంధం లేని విషయమేమీ కాదు కదా! అందుకే మిథునం సినిమాను యువతీయువకులు కూడా పెద్దవారితో సమానంగా చూస్తున్నారు. ఎంతో యిష్టంగా తీసిన సినిమా ఇది. రాష్ట్రానికే పరిమితం కాకుండా అమెరికా, కెనడా, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, దుబాయ్, సింగపూర్ వంటి దేశాల్లోనూ ప్రశంసలు అందుకుంటోంది. పెద్దవారిలో ఉండే కుర్రతనాన్ని గమనించగలిగినంత స్పష్టంగా కుర్రవాళ్లలోని పెద్దతనాన్ని తాకగలిగితే కళాత్మక సృజనలో వయోభేదాలు అడ్డుగోడలు కావన్న సత్యం మిథునం సినిమా ద్వారా మరింత బలంగా రుజువయ్యింది. -బమ్మెర
చిలుకూరు వారి వచన వాల్మీకి రామాయణం –7(చివరి భాగం )
చిలుకూరు వారి వచన వాల్మీకి రామాయణం –7(చివరి భాగం )
ఉత్తర కాండం
శ్రీ రామ కృష్ణ తపోవనం నుండి శ్రీ చిలుకూరు వారి విజ్ఞప్తి
అయోధ్య రాజుల పురోహితుడు వసిష్ట మహర్షి సప్తర్షి మండలం లోనీ వశిష్టుని రూపాంతరమే .బ్రహ్మ దేవుడు మొదట గా జలాన్ని సృష్టించాడు .జల రక్షణ కోసం ప్రాణ సృష్టి చేశాడని అవి ఆహారం లేక నీర సించి బ్రహ్మ ను ప్రార్ధిస్తే ,వాటికి జావసత్వాలు ప్రసాదించి ,జల రాసిని కాపాడమని ఆదేశించాడు .అందులో ‘’అలాగే రక్షిస్తాం ‘’అన్న వారే రాక్షసులు గా పుడతారని ‘’అట్లాగే పూజిస్తాం ‘’అన్న వారు యక్షులు గా పుడతారని బ్రహ్మ అనటం తో ఈ జాతుల ఆవిర్భావం జరిగిందట .మన నోరే మన కర్మలను నిర్దేశిస్తుందని తెలియ జేసే యదార్ధ సన్నివేశం ఇది .
రావణాసురుడికి ఆహుతి చేసుకొన్నా తొమ్మిది తలలను బ్రహ్మ మళ్ళీ ప్రసాదించటం ,కోరిన వరాలివ్వటం ,అతని చావుకు అతడే కారకుడవటం –అంటే -మానవులను తేలిగ్గా తీసి పారేయటం ,వారి వల్ల తనకే ప్రమాదం రాదన్న వాడి ధీమా వమ్ము అయి పోయింది .అదే విభీషణుడు అన్ని వేళలా తన బుద్ధి ధర్మ ము మీదే స్థిరం గా ఉండాలని కోరు కొంటాడు .అన్నదమ్ము లైనా ఆలోచనల్లో ,నడవడి లో ,ప్రవర్తనవర్తనలో ఎంతో భేదం కని పిస్తుంది .బుద్ధి కర్మను అను సరించే ఉంటుందికదా .కాలకేయాది రాక్షస సంహారం లో తన సోదరి శూర్పణఖ భర్తను కూడా చంపేశాడు రావణుడు .ఇదేమి ఘోరం అని ప్రశ్నించిన సోదరితో యుద్ధం లో బంధుత్వాలు గుర్తుకు రావు అన్నాడు .జరిగిన దానికి పరిహారం గా సోదర తుల్యు డైన ఖరున్ని దండకారణ్యానికి అనది కార రాజు గా ,సోదరుడు దూషణుడిని 14 వేల రాక్షస గణానికి సేనాధి పతి గా చేసి ,శూర్పణఖ కు తోడిచ్చి జనస్తానానికి పంపాడు .అంతే కాదు ఆమె ఆడింది ఆటగా ,పాడింది పాటగా హాయిగా ఉండే స్వేచ్చనూ ఇచ్చేశాడు .వారంతా చేయని అక్రుత్యమే లేదు .బరి తెగించి ప్రవర్తించారు .ఇష్టా రాజ్యం గా ప్రవర్తించారు .దానికి ప్రతి ఫలం గా జన స్థానం లో శ్రీ రాముడు వారందర్నీ వీర విక్రమంతో సంహరించి లోకోప కారం చేశాడు .ఇప్పుడు మనం ఉంటున్న ‘’జన దండకారణ్యానికి ‘’ఈ ఏడు ( april2011 ) ‘’ఖరుడే అది పతి .అంటే ఖరనామ సంవత్సరం లో ఉన్నాం కదా .ఇప్పటికే ఎన్నో నేరాలు ,ఘోరాలు చూస్తున్నాం ఇంకా యే విపరీతాలు చూడాలో ?
ఇంద్రజిత్ పరాక్రమం అవక్ర మైంది .అందరు తపస్సు చేసి అమరత్వం కోరుకొంటే ,తన పరాక్రమాన్ని చూపి అమరత్వాన్ని సంపాదిన్చుకొంటానని బ్రహ్మ దేవునితో చెప్పి ,తధాస్తు అని పించుకొన్న రావణ కుమారుడతడు .ఇంద్రుడు అహల్యా జారత్వం చేసి నపుడు గౌతమ మహర్షి ఇంద్రుడు చేసిన ప్రతి చెడ్డ పని మనుష్యుల్లో కూడా వ్యాపిస్తుందని ,మానవులు చేసిన పాపం లో చేసిన వారికి సగం పాపం ఇంద్రుడికి మిగిలిన సగం పాపం సంక్రమిస్తుందని శపించటం పాప కార్య తీవ్ర పరిణామాలను తెలియ జేస్తుంది .ఇంద్రపదవికే అస్తిరత్వం తెచ్చిన పాపి అయాడు దేవేంద్రుడు .మహా అంద గత్తే అయిన అహల్య రూప గర్వం ఆమె నూ పతితు రాలిని చేసింది .గౌతముని శాపంతో ఆమె ఏకైక అంద గత్తే అన్నది పోయి ,అందర్ని అంద గత్తేలను చేయటం జరిగింది .ఆమెకు ఖేదం ,సామాన్యులకు మోదం .రూప గర్వం పతనానికి పరా కాష్ట.అయింది అహల్య విషయం లో .
1000 వ పేజి లో జనకుడిని విదేహుడు అనటం దేహం నుండి పుట్టుకోచ్చాడని చిలుకూరు వారు రాశారు .కాని‘’దేహ భ్రాంతి లేని వాడు కనుక విదేహుడు అయాడు ‘’అని పెద్దలు చెప్పగా ,చదవగా నేను తెలుసుకొన్న విషయం .
భూమి పై రెండవ అధర్మ పాదం మోప బడటం తో ద్వాపర యుగం పేరు వచ్చింది అన్న మాట సరైనదే నని పిస్తుంది .ఎంత తపస్సు చేసినా ,శరీరం పై భ్రాంతిని పోగొట్టుకో లేక పోతే ‘’శ్వేతునికి ‘’పట్టిన గతే అందరికి పడుతుంది .
తెలియని విషయాలను తెలుసుకొనే విద్యకు ‘’ఆవర్తని ‘’అని పేరుందని నాకు ఇది చదివిన తర్వాతే తెలిసింది .ఇంకా ఎన్నో విషయాలను వెంకటేశ్వర్లు గారు స్పృశించి వివరించి అంద జేశారు .ఉత్తర రామాయణం లో ‘’భిక్షు తాడిత ‘’కుక్క కధ లో దైవ ద్రవ్యాపహరణం ఎంతటి నేరమో దాని వల్ల వచ్చే అనర్ధమేమితో తెలియ జెప్తుంది .ఇక్కడో విషయం మనవి చేస్తున్నాను .విజయ వాడ ఆకాశ వాణి వారు ‘’ఆలోచనా లోచనం ‘’శీర్షిక క్రింద ప్రతి మంగళ వారం ఉదయం ఏదుం పావు కు ప్రసారం చేస్తున్న దానికి నన్ను రాయమని డైరెక్టర్ శ్రీ మంగళ గిరి ఆదిత్య ప్రసాద్ గారు కోరగా నేను పద్నాలుగు ఎపి సొడ్లు రాస్తే, ప్రసారం చేశారు .ఆరవ ఎపిసోడ్ లో ‘’భిక్షు తాడిత ‘’కధ ప్రసార మైంది .దానికి నేను పెట్టిన పేరు ‘’దేవుని సొత్తు తింటే విపత్తే ‘’.
శ్రీ చిలుకూరు వెంకటేశ్వర్లు గారు తక్కువ వ్యవధిలో వాల్మీకాన్ని నేర్పుగా అనువ దించారు .ఎక్కడా క్లిష్టత లేదు .అన్వయ కాఠిన్యమూ లేదు ద్రాక్షా పానకం గా రచన సాగింది .ఆస్వాదనీయం గా ఉంది..శ్రీ రామునికి ఆంద్ర దేశానికి చాలా అవినాభావ సంబంధం ఉందని, యుద్ధం తర్వాత రాముడు అయోధ్యకు వెళ్ళ కుండా భద్రాచలం లోనే కొలువై నిలిచి పోయాడని ప్రఖ్యాత కవి ,విమర్శకులు ,’’విశ్వనాధ కాళి దాసుకు మల్లి నాద సూరి’’అయిన స్వర్గీయ మల్లం పల్లి శరభయ్య అయ్యవారు చమత్క రించారు . .శ్రీ రామ నవమిని ఆంద్ర దేశం లో చేసి నంత వైభవం గా ఇంకెక్కడా చెయ్యరు ఊరూరా వీధి వీధినా శ్రీ రామ నవమి పందిళ్ళ తో కోలాహలం గా ఉంటుంది .రామాలయం లేని ఊరు ఉండదు .సీతా రాముల పేరులో ఏదో ఒక పేరు ప్రతి ఇంటిలోను ఒకరికి ఉంటుంది .అలాంటి రామ చరితను మహర్షి వాల్మీకి రాసి తాను ధన్యుడై లోకాన్ని ధన్యత చెందిస్తే చిలుకూరు వారు తెలుగు వచనం లో ఆ మాధుర్యాన్ని, విశేషాలను అందించి ,మళ్ళీ ఒక సారి ఆ వైభవాన్ని చూపించారు .రుషి ఋణం తీర్చుకొన్నారు .అభ్యుదయ కవి అనుభూతి కవి స్వర్గీయ దేవర కొండ బాల గంగా ధర తిలక్ (అమృతం కురిసిన రాత్రి ఫేం ),పరవశించి శ్రీ రాముని గురించి రామాయణాన్ని గురించి అద్భుతం గా చెప్పిన పద్యం గుర్తు చేస్తూ
‘’రామ శబ్దము చాలు రచ్చలో గట్టులో –పులకించ నట్టిది పూవు లేదు
సీత శబ్దము చాలు శీతువో గ్రీష్మమో –వరదలై పారని వాగు లేదు
రామ సీతా నామ రమ్య నాదము చాలు –కోవెల కానట్టి గుండె లేదు
రామాభి రామ కీర్తనముతో మడియని –స్మయ భావ మద నిశాచరుడు లేడు
వాడ వాడల నాడు జీవత్కదాంశ–సంపుతీక్రుత కాకుత్ష్య చరిత మ్రోగే
దాని గైకొని ,ప్రతిభా నిదానుడైన –మౌని వాల్మీకి అక్షర మాల్య గూర్చే ‘’
దీనికి ముక్తాయింపుగా సీతా రాముల అభేదాన్ని తెలియ జెప్పే కవి సమ్రాట్ విశ్వనాధ వారి రామాయణ కల్ప వృక్ష కావ్యం లో అశోక వనం లో హనుమ దర్శించిన సీతా మాత స్వరూపాన్ని వర్ణిస్తూ చెప్పిన పద్య వైభవాన్ని ఒక్క సారి దృష్టికి తెస్తూ,సెలవు తీసుకొంటున్నాను
‘’ఆకృతి రామ చంద్రు విరహాకృతి ,కన్బొమ తీరు స్వామి చా
పాకృతి ,కన్నులన్ ప్రభు క్రుపాకృతి ,కైశిక మందు రామ దే
హాక్రుతి ,సర్వ దేహమున యందున ,రాఘవ వంశ మౌళి ,ధ
ర్మాక్రుతి ,కూరుచునున్న విధ మంతయు ,స్వామి ప్రతిజ్ఞ మూర్తి యై ‘’
సంపూర్ణం
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –11-1-13-ఉయ్యూరు
చిలుకూరు వారి వచన వాల్మీకి రామాయణం -6 సుందర కాండ
చిలుకూరు వారి వచన వాల్మీకి రామాయణం -6
సుందర కాండ
శ్రీ రామ కృష్ణ తపోవనం నుండి శ్రీ చిలుకూరు వారి విజ్ఞప్తి
శ్రీ హనుమ సముద్ర లంఘనం లో సురస ను ఎదుర్కొనే టప్పుడు శరీరాన్ని తొంభై యోజనాలకు పెంచాడు అనటం అసంబద్ధం గా ,పిల్లల సంతోషం కోసం చెప్పి నట్లుగా ఉందనటం నాకు నచ్చిన విషయం .కొన్ని చోట్ల ఇలాంటి ఔచిత్య భంగాలు బాధిస్తాయి .లంకలోని భావన సముదాయాలన్నిటి గురించి చెప్పిన విధానం తెలుసుకో తగినది .నాలుగు ద్వారాలుండేది ‘’పద్మం ‘’అని ,ఇవి సర్వతో భద్రమని ,పశ్చిమ ద్వారం లేక మధ్య వంపు తిరిగిన చతుస్శాల గృహాన్ని‘’హయాననం ‘’అంటే ,గుర్రపు ముఖం అని ,దక్షిణ ద్వారం లేని దాన్ని ‘’వర్ధమానం ‘’అంటారని ఇది ధన ప్రదమని ,తూర్పు ద్వారం లేని ది‘’స్వస్తిక గృహం ‘’అని ఇది పుత్ర ,ధన ,సంపదల నిస్తుందని కేటగరైజ్ చేయటం కొత్త విషయాలను తెలియ జేసింది .వీటి వివరణ ఇవ్వటానికి చిలుకూరు వారు ఎంతో శ్రమించి ఉంటారని పిస్తుంది .
పుష్పక విమానం యజమాని మనస్సును బట్టి నడుస్తుందని ,యజమాని నియంత్రణ లోనే పని చేస్తుందని ,ఏ వేగం కావాలంటే ఆ వేగం లో వెళ్తుందని వాల్మీకి చక్కగా వర్ణించిన విషయాన్ని తేట తెలుగు మాటల్లో వర్ణించటం బాగుంది .మన విమానాల్లో ఇంకా రావాల్సిన మార్పులను ఈ పుష్పకం సూచిస్తోందని పిస్తుంది .రామ రాజ భూషణుడు రాసిన ‘’వసు చరిత్ర ‘’ప్రబంధం లో ఇంద్రుడు వసు రాజుకు మహా మహిమాన్విత మైన విమానాన్ని బహూక రిస్తాడు .అందులో ఎయిర్ కూల్ ,ఎయిర్ కండిషనింగ్ కూడా ఉంటాయి .పుష్పకం కంటే మెరుగైందన్న మాట .’’వసు రాజు విమానం ‘’పేరుతో చాలా ఏళ్ళ క్రితం నేనొక వ్యాసం రాశాను ‘’మూసీ మాస పత్రిక ‘’లో ప్రచురితమైంది .ఊరికే కంపారిజన్ కోసం చెప్పాను .రావణాసురుడు కుబేరుని దగ్గర నుంచి పుష్పకాన్ని లాక్కొంటే ,వసురాజు దివ్యత్వాన్ని మెచ్చి దేవేంద్రుడు ఈ విమానాన్ని కానుక గా ఇచ్చాడు అదీ కధ .
సీతా దేవి ని తప్ప స్త్రీల నెవ్వరిని రావణుడు బలాత్కారం గా లంకకు తీసుకొని రాలేదని ,అతని గుణాలకు ఆకర్షితులై వారే వచ్చారని ,మరో పర పురుషుని పై వారికి ప్రేమ లేదని అందరు సత్కుల సంజాతలే నని ఈ కాండలో ఉన్నది .కాని ఉత్తర కాండ లో దీనికి విరుద్ధం గా విషయాలున్నాయి .రావణ గాంభీర్యానికి ప్రతిభకు ,హనుమ అప్రతి భుడయ్యాడని కాని భయ పడ లేదని మంచి వివరణ నిచ్చారు వెంకటేశ్వర్లు గారు .
యుద్ధ కాండం
యుద్ధానికి బయల్దేరిన వానర సైన్యానికి సూచన లిస్టు ,సుగ్రీవునికి శ్రీ రాముడు చాలా హెచ్చరికలు చేశాడు .శత్రువులు కంద మూలాల్లో ,ఫలాల లో విషం కలిపే ప్రమాదం ఉందని ,ఏమరు పాటు ఏ మాత్రం తగదని ,భూ సైన్యానికి‘’air protection ‘’ఉండేట్లు చూడమని చెప్పటం యుద్ధ సమయం లో రాజు ఎన్ని జాగ్రత్తలు తీసుకో వాలో తెలియ జేసే యుద్ధ విధానమే కాక, యుద్ధ నీతి కూడా ఉంది.సూర్య మండలం చుట్టూ చిన్న యెర్రని గూడు కడితే అందులో నల్ల మచ్చ ఉంటె రాబోయే ప్రళయానికి సూచన అని మహర్షి వాల్మీకి తెలియ జేశాడు .ఇది లంకకు చేటు కనుక ,ఆ సమయం లోనే యుద్ధం ప్రకటించాలని రాముడు లక్ష్మణుడి తో అనటం రాజనీతికి గొప్ప ఉదాహరణ .యుద్ధ తన్త్రానికి మకుటం .జాంబ వంతుడు ‘’గద్గదుని ‘’కుమారుడని ,అతని తమ్ముడి పేరు ‘’ధూమ్రుడు ‘’అని మనం తెలుసు కొంటాం .
మాల్య వంతుడు రావణుడి పిన తాత .రావణుడికి నీతి బోధిస్తూ మహర్షులు అగ్ని వలె ప్రకాశిస్తారని ,ధర్మ సంరక్షకులని ,వారి యాగ ధూమానికి రాక్షసులు చెల్లా చెదరౌతారని ,రాక్షస తేజాన్ని అణచే సర్వ సమర్ధులు మునులని ,వారి తపోగ్ని రాక్షసులకు తాపం కలిగిస్తుందని వారిని బాధించటం వల్ల రావణుడు పతనం కొని తెచ్చుకోన్నాడని బోధించాడు మాల్య వంతుడు .రామునితో సంధి చేసుకొమ్మని రావణుని తల్లి కైకసి ,’’అవిద్ధుడు ‘’అనే ముసలి మంత్రీ హితవు చెప్పారు .వినలేదు .వినాశ కాలే విప రీత బుద్ధి అంటే ఇదే .
పాదాల్లో పద్మ రేఖలున్న స్త్రీలు సామ్రాజ్యాధి పతుల భార్య లవుతారని హస్త సాముద్రికం చెప్పాడు వాల్మీకి .పుష్పక విమానం విధవలను తీసుకొని పోదు అనే విషయం విమాన రహస్యం .భరద్వాజుడు విమాన శాస్త్రాన్ని రచించాడని మనకు తెలుసు .దీన్ని జర్మన్ ,జపాన్ దేశాల వారు తీసుకొని వెళ్ళి ,విమానాలు తాయారు చేశారని మన వాళ్ళ నమ్మకం .కుంభ కర్ణుడు నీతులు బోధిస్తుంటే నిండా మునిగిన రావణుడు నీతులతో చర్చించే సమయం కాదని తన తెలివి తక్కువ ,భ్రాంతి వల్ల లోపాలు చేశానని ఇప్పుడు కర్తవ్యమేమిటో ఆలోచించమని దశగ్రీవుడు అనటం తక్షణ కర్త్వవ్య బోధ యే.జరిగి పోయిన్దాన్ని గురించి నిర్ణయం తీసుకొనే సమయం లో ఆలోచిస్తూ కాలం వృధా చెయ్య రాదనీ అందరు గుర్తిన్చుకోవాల్సిన విషయం .అతని తప్పుల్లో అందరికి బాధ్యత ఉంది..ఎలా అతడిని బైట పడేయ్యాలో ఇప్పుడు సూచించాలి .లక్ష్మణ మూర్చ సందర్భం గా రామ విలాపం లోనీ ఉచితానుచితాలను చిలుకూరు వారు చక్కగా చిలికి విశ్లేషించారు .ఆదిత్య హృదయాన్ని అతి తక్కువలో అందులోని ఆంతర్యాన్ని సూక్క్ష్మం గా చెప్పటం విశేషం .బాగుంది .
ప్రేమించే గుణం లేని రాజుతో యుద్ధానికి పోవటం సైనికులు ఇష్టపడరని కనుక యుద్ధ ము లో పాల్గొనే వానర వీరులను ముందే సత్కరించమని రాముడు విభీషణుడికి చెప్పి చేయించాడు .ఇది త్యాగానికి తగిన గుర్తింపు నివ్వటమే .అందుకే మన ప్రభుత్వం వీర ,శౌర్య చక్ర,పరమ వీర చక్ర పురస్కారాలిచ్చి సత్కరిస్తోంది .సైనికులను సంతోష పరుస్తున్నారు .అయోధ్యకు వెళ్తూ శ్రీ రాముడు భరద్వాజ మహర్షి ని సందర్శించి తాను వెళ్ళే దారిలో వృక్షాలు అన్నీఅకాలం లో కూడా సమృద్ధిగా ఫలాల నివ్వాలని ,పుష్ప ఫల భరితం గా ఉండాలని కోరాడు .ప్రజా క్షేమం అడుగుడుగునా రాజు కర్తవ్యం అని తెలియ జేసే సంఘటన .రాముని తరఫున రాజ్యం చేస్తున్న భరతుని కాలం లో అన్నీ పది రెట్లు అభి వృద్ధి చెందాయట .అది విని అందరు ఆనంద బాష్పాలు రాల్చారట .తన పై ఉంచిన బాధ్యతలను భరతుడు ఎంత సక్రమం గ నిర్వర్తిన్చాడో ,ఎంత నియమ బద్ధం గా పరి పాలన నిర్వ హించాడో మనకు తెలుస్తుంది .ఇదంతా తన గొప్ప కాదని రామ భద్రుని ప్రభావమే నని అతి వినమ్రం గా భరతుడు చెప్పటం అతని సుగుణ సంపత్తిని రెట్టింపు చేస్తుంది .
సశేషం –మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –10-1-13—ఉయ్యూరు
హైదరాబాద్ జనవరి ప్రయాణం
This gallery contains 59 photos.
— వృద్ధ మిదునాలు ఊరేగిస్తున్న ‘’మిధునం ‘’
— వృద్ధ మిదునాలు ఊరేగిస్తున్న ‘’మిధునం ‘’
ఇన్నాళ్ళకు ఈ నెల ఆరవ తేది ఆది వారం హైదరా బాద్ లో ఉషా మయూరి సినిమా హాల్లో సాయంత్రం ఆరు గంటల ఆట కు మా పెద్దబ్బాయి శాస్త్రి ‘’మా మిదునానికి ’’ ఈ మిధునం సినిమా చూపించాడు .అందులో కొన్ని సన్నీ వేశాలు అచ్చం గా నేను ఇంట్లో ప్రవర్తించే తీరు లో ఉన్నాయని ,అంత కట్టే కొట్టే లా ప్రవర్తించటం,కొడుకుల్నించి ఫోన్లు వస్తే వాళ్ళమ్మకు ఇచ్చేయటం తమకు అనుభవమే నని ,తనకు మా కోడలు సమత కు నచ్చిందని , మేము కూడా చూడాలని,తాను ఇప్పుడు రెండో సారి చూస్తున్నానని పట్టు బట్టి సినిమా చూపించాడు ..అక్కడ అందరు వృద్ధ మిదునాలే కని పించాయి . .హాలంతా నిండి పోవటం నాకు మహా ఆశ్చర్యాన్ని కల్గించింది .కాదు ఆనందాన్ని కూడా పంచింది .ప్రేక్షకులు ఎంత మెచ్చుకోక పోతే ఇంత మంది వస్తారు ?అందుకని ప్రేక్షక దేవుళ్ళను మనసారా అభి నందిస్తున్నాను .ఇది ప్రేక్షకులు అందించిన గొప్ప విజయమే నని పించింది .తెల్ల జుట్టు వాళ్లను హాలుకు తీసుకొచ్చిన నల్ల జుట్టు వాళ్ళు కొందరు ఉండటం విశేషమే .ఇది ‘’మన అమ్మా నాన్నల సినిమా ‘’అని యువత ఎగబ డటం లేదు కాని ఇది మన సినిమా అని మాత్రం వృద్ధులు అనుకొని చూడ టానికి బాగానే వస్తున్నారు .ఇలా ఉన్నామని అనుకొనే వారు ,ఇలా ఉంటె బాగుంటుందను కొనే వారు ,ఇలా ఉండ బోతున్నాం అనుకొనే వారు ,మన వాళ్ళందరూ ఇలా ఉంటె మహా బాగుంటుంది అను కొనే వారు ఈ సినిమా చూసే వాళ్ళల్లో ఉన్నారు .మూడో వారం లో ఇంత మంది జనం ఈ ఆర్ట్ ఫిలిం లాంటి సినిమాకు రావటం గొప్ప విషయమే నని పించింది .
ఇప్పుడు సినిమా లోనిఅసలు విశేషాలను తెలియ జేసే ప్రయత్నం చేస్తాను .అసలు మిధునం కధను అత్యద్భుతం గా రాశారు శ్రీ రమణ .దాన్ని అంత అద్భుతం గా తెరకెక్కించాలని భరణి చేసిన ప్రయత్నమే ఇది .అంతా పూర్తి సంతృప్తి ని కల్గించక పోవటం నిరాశే మిగి లించింది ..కధలో ఎన్నో మార్పులు చేశాడు భరణి .అవి కధా గమనాన్ని పెంచేవి గా ఏమీ లేవు ..హార్ట్ ఫుల్ గా ఈ సినిమా తీద్దామని ,ఆర్ట్ ఫిలిం గా మలిచి సత్తా చూపించుకోవాలని అనుకొని తీరా ‘’డిం షో ‘’గా నిలబెట్టాడు .అదే పెద్ద లోపం .ఫోటోగ్రఫీ మిధునం దంపతులు ఎంతో ఆశగా పెంచుకొన్న తోటలోని పువ్వులా గువ్వలా ,మొక్కలా, తీగెలాఅందాలను ఆర బోయాల్సింది పోయి చీకటి గుయ్యారం గా తయారు చేశాడు .ఆ సోయగాల సౌరు ఆనందించ లేక పోతాం . అదే బాధ కల్గిస్తుంది .చాయాగ్రహణం ఇషాన్ ఆర్యా ఫోటోగ్రఫీ లా ఉంటె కన్నుల నిండా వెన్నెలే ,ఆనందపు విన్దులే గా ఉండేవి అది కోల్పోయాం..అదే విచారం నూటికి నూరు శాతం మార్కులు కొట్టేయ్యాల్సింది పోయి పాస్ మార్కులతో సంతృప్తి పడాల్సి వచ్చింది .బహుశా ఇంకా భరణి తాను తీసిన ‘’సిరా ‘’బాటిల్ లోనుంచి ,‘’,గ్రహణం ‘’నుంచి దూరం కాలేక పోయాడని పిస్తుంది .అడే తీరు లో తీసి ఫోటోగ్రఫికి మార్కులు తెచ్చుకోలేక పోయాడు .
అయితే –శబ్ద గ్రహణం మాత్రం నూటికి ఇన్నూరు మార్కులు పొందింది .అద్భుతం అత్యద్భుతం అని పిస్తుంది .వీణా పాణి సంగీతం సమ కూర్చాడని పించలేదు .అసలు కధలో కలిసి పోయిందని పిస్తుంది .హాట్స్ ఆఫ్ టు’’సంగీతవాణి , పాణి –వీణా పాణి ‘’.జేసుదాస్ పాడిన మిధునం టైటిల్ సాంగ్ అర్ధ వంతం గా ,వీనుల విందుగా ,ఉన్నది .కొన్ని మాటలు శబ్దాలు వెనుక నుంచి విని పించటం మరి గొప్ప ప్రయోగం .నిజం గా అభి నందనీయ మైన విషయం ..జొన్న విత్తుల కాఫీ దండకం నాకేమి కొత్తకాదు ,ఆయన బానే పాడాడని పించింది ..
నటన విషయానికి వస్తే లక్ష్మి నటన నిజం గా సూపర్బ్ .అవధులకు మించి నటించి ‘’నట లక్ష్మి ‘’అని పించింది .ఆంగ్ల మాధ్యమం లో చదూకున్న అమ్మాయి అచ్చ తెనుగుకు పట్టం కట్టింది ..హావ భావ ప్రకటనలు మహా ముచ్చటగా ఉన్నాయి .చిలిపితనం ,గడుసు తనం ,ఆరిందాతనం ,ఉత్తమా ఇల్లాలు లక్షణం ,అందమైన కాపురానికి అందమైన గోపుర శిఖరం గా ఆమె నటన ఉంది. .అయినా ఆమె పాత్ర చిత్రీకరణ లో ఇంకా లోపం ఉందని పించింది .ఇంకా చేయగల చెవ ఉన్న నటి లక్ష్మి .రా బట్టాల్సిన నటన చాలా ఉందని పిస్తుంది .నూటికి రెండొందల మార్కులు కొట్టేస్తుంది లక్ష్మి .
బాలు విషయానికి వస్తే అంతా తెచ్చి పెట్టుకోన్నట్లుంది ..నటన కన్నా డైలాగ్ డెలివరి బాగుంది .ఆయన ముఖం చూడ కుండా సంభాషణలు వింటే బాగా ఉండేది అని పిస్తుంది .కష్టపడ్డాడు .పీపా లా ఉన్నా పాకాడు ,గెంతాడు ,పరిగెత్తాడు చిలిపి తనం చూపించాడు .,అంతా ఏదో లా ఉంది..నేను ఇచ్చే మార్కులు యాభై శాతమే .
మొక్కలు ,పూయటం కాయటం ,తీగెలు పాకటం పిందే,,కాయా,ఫలం కని పించింది అని మీడియా ఊదర కొట్టింది కాని అదేమీ ఇందులో కన్పించవు .కాయలు చూపినంత మాత్రాన అవి ఆ చెట్టువే నని నమ్మేంత గా లేక పోవటం వింత .అసలు ఆ చెట్ల లో ఆ మిధునం ప్రతి చేట్టులోను తమ సంతానాన్ని చూసుకొని వారిని గురించి వాటిని గురించి చెప్పుకొంటూ హాయిని , ,నిండైనన సంతృప్తి కరమైన జీవితం సా గించారు .ఆ అను భూతిని మనం కధ చదువుతుంటే కలిగిస్తారు చూస్తుంటే ఇంకా గొప్ప భావన రావాల్సి ఉంది .అది రాక పోవటం అసలు కధకే దెబ్బ అని పిస్తుంది .కధ చదివి సినిమా చూసిన వారికి కళ్ళు ఏ మాత్రం చమర్చవు .చివ్వర మూడు నిమిషాల్లో లక్ష్మి చూపిన నటన ను చూసి నప్పుడు తప్ప .అదే పెద్ద లోపం .ఆర్ద్రత తో నిండిన మనస్సు తో కన్నీళ్లు కారుస్తూ హృదయం ద్రవించి పోతుంది మనమందరం ఆ కధ లో లీన మై పోతాం .ఆ మమైకత్వం సినిమా లో లేక పోవటం పెద్ద లోపమే .ఇక్కడ శ్రీ రమణ కు పూర్తీ అన్యాయమే జరిగింది ..
మిధునం తో నా సంబంధం
దాదాపు ఇరవై ఏళ్ళ కిందట ‘’రచన ‘’మాస పత్రిక లోశ్రీ రమణ రాసిన ‘’మిధునం ‘’కధ చదివి ,ఆనంద పరవశత్వమే పొందాను .మళ్ళీ మళ్ళీ చదివాను .మా శ్రీమతి తో చది వించాను .ఆమె కూడా చాలా అనుభూతి పొందింది .ఎంతో మెచ్చింది .ఆ చెట్ల వాతావరణం మన ఇంటి వద్ద లేదు కదా అని బాధ పడింది .కాని ఇప్పుడు అనేక రకాల చెట్ల శోభ అంతా మా ఆ వరణ లో నిండి కళ్ళకు విందు చేస్తున్నందుకు మహా ఆనంద పడుతోంది .ఆ తర్వాతప్రముఖ చిత్ర కారుడు బాపు గారు ఈ కధను స్వహస్తాలతో రాయగా మళ్ళీ పుస్తక రూపం లో వస్తే ,ముచ్చట పడి మళ్ళీ చదివాను .శ్రీ కొమ్మూరి వేణు గోపాల రావు గారు మరణించటానికి కొద్ది రోజుల ముందు ఆయన మచిలీ పట్నం లో శ్రీ రావి రంగా రావు గారు నిర్వ హించిన కధా సదస్సులో పాల్గొన్నారు సభాధ్యక్షులు గా ప్రముఖ కధా రచయిత శ్రీ వీరాజీ వ్యవహరించారు .మరో ప్రముఖ కధా రచయిత శ్రీ కాటూరు రవీంద్ర త్రివిక్రమ్ గారు మొదలైన వారందరూ ఉన్నారు .నేనూ సదస్సులో పాల్గొన్నాను .కధ ల విషయం అంతా మాట్లాడిన తర్వాతా అధ్యక్షుడిని నాకు అయిదు నిముషాలు మాట్లాడే అవకాశం ఇమ్మని కోరాను .ఇచ్చారు .అయిదారు నిమిషాలలో శ్రీ రమణ రాసిన ‘’మిధునం ‘’కధ గురించి హైలైట్ చేసి మాట్లాడాను .ఆ కధ ప్రతి తెలుగు వాడి కధ అని దాన్ని ముద్రించి ప్రతి తెలుగు వాడింట్లో పంచి,చదివించి ఋణం తీర్చుకోవాలని చెప్పాను .అంత మంచి కధ ఆ మధ్య రాలేదని అన్నాను వీరాజీ ,కొమ్మూరి, త్రివిక్రమ్ గార్లు ఎంతో మెచ్చుకొన్నారు నన్ను .ఆ విషయాన్ని అక్కడే మర్చి పోయాను ..తర్వాతమూడు రోజుల కు రవీంద్ర త్రివిక్రమ్ గారు ఫోన్ చేశారు నాకు .కొమ్మూరి గారు నేను మిధునం పై మాట్లాడి మెచ్చిన తీరు ను శ్రీ రమణ గారికి ఫోన్ లో తెలియ జేశారని .,ఆయన ఎంతో ఆనంద పడ్డారని త్రివిక్రమ్ గారికి తెలియ జేశారట .ఆయన నాతో ఫోన్ లో ఈ విషయం చెప్పి నన్ను అభి నందించారు .దాదాపు ఏడాది క్రితం తెన్నేరు వాసి మాకు ఆత్మీయ మిత్రులు శ్రీ దేవి నేని మధు సూదన రావు గారు తమ స్నేహితుని వివాహ సందర్భం గా ‘’మిధునం ‘’కధ ను ముద్రించి వివాహానికి వచ్చిన వారందరికి ఉచితం గా పంచి పెడుతూ నాకొక కాపీ పంపారు .మేమిద్దరం మళ్ళీ మహదానందం గా చదివి చలించి పోయాం .ఆ మిదునాన్ని మనసారా అభి నందించాం . .ఆ కధను నేను చదువుతూ వాయిస్ రికార్డర్లో రికార్డు చేశాను .చివరి పది నిమిషాలు నా కళ్ళ వెంట దారా పాతం గా ఆనంద బాష్పాలు కారి పోతూనే న్నాయి కళ్ళు తుడుచుకుంటూ గద్గదం గా అలానే చదివి పూర్తీ చేశాను .దాన్ని mp3లో నిక్షిప్తం చేసి సాహితీ బంధువులందరికీ పంపాను ..అది విని చాలా మంది తమ పరిస్తితి నా లా నె ఉందని కన్నీళ్లు ఆపు కో లేక పోయామని మెయిల్స్ రాశారు .ఫోన్లూ చేశారు .అంతటి ప్రభావాన్ని కలిగించిన కధ శ్రీ రమణ కద – మిధునంమిధునం .ఇలా మనల్ని కది లించలేక పోయిందే సినిమా అని మాత్ర్తం బాధ ఎక్కువ గానే ఉంది.
మిధునం లో పద నిసలు
చిన్న ధియేటర్లు ‘’లో బడ్జెట్’’ సినిమాలు ఆడటానికి సహకరించటం లేదని రామోజీ హాలు కనుక నె ఇక్కడ ఈ సినిమా ఇంత కాలం ఆడుతోందని ఈ క్రెడిట్ అంతా రామోజీ రావుదే నని నాతో చూసిన వారు అన్నారు .టికెట్ కూడా యాభై రూపాయలే అత్యధికం గా ఉండటం కూడా బాగా ఆడటానికి వీలవుతోందని అంత మాత్రం చేత సౌకర్యాల కేమీ లోపం లేదని అన్నారు ..ఈ విషయం లో శ్రీ రామోజీ రావు ను అభి నందిన్చాల్సిందే అందరం .నిర్మాత ఆనంద రావు గారికి కూడా ఈ సినీమా నడక ఆనందాన్ని కల్గించే ఉంటుందని అనుకొంటున్నాను .దర్శకుడు భరణి సాహసానికి ,ఒక మంచి తెలుగు సినిమా తీసి అంతర్జాతీయం గా తెలుగు వాడి సత్తా ను ప్రపంచానికి చాటాలి అన్న తపన ఫలించిందనే అనుకొంటున్నాను .భరణి తన శక్తి సామర్ధ్యాలన్ని ఒలక పోశాడు .స్వయానా రచయిత అవటం ,దర్శకుని గా రాణించటం తానూ గొప్ప కారెక్టర్ నటుడవటం కలిసి వచ్చింది .ఇలాంటి ఇంకో సినిమా తీసే ధైర్యం వచ్చి ఉంటుంది ..అయితే పేపర్ వాళ్ళు బాగా బూస్ట్ ఇస్తున్నారనే మాట కూడా విని పించింది ..
మిధునం పై మధనం మిధునం మన తెలుగు సినీ బావుటా ను ఆకాశ మంత ఎత్తుకు ఎగరేయాలని ఆశిస్తూ –సెలవ్ –
మిధునం పై మధనం –ఈనాడు సినీ రివ్యు
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –9-1-13-ఉయ్యూరు
స్వర్గీయ శ్రీ తిరుమల రామ చంద్ర శత జయంతి సభ
స్వర్గీయ శ్రీ తిరుమల రామ చంద్ర శత జయంతి సభ
విజయవాడ లో ఈ నెల ఒకటవ తేది నుండి పదకొండవ తేది వరకు 24వ పుస్తక మహోత్సవం జరుగుతోంది .నిన్న అంటే ఎనిమిదో తారీఖు మంగళ వారం సాయంత్రం నేను చూడ టానికి వెళ్లాను .నాకు కావాల్సిన పుస్తకాలు కొనుక్కొన్న తర్వాత‘’నండూరి రామ్మోహన రావు వేదిక ‘’పై జరిగిన సాహిత్య కార్యక్రమాలను చూశాను .మొదట బాల సాహిత్యం పై జరిగిన సభకు గ్రందాలయోద్యమ వృద్దు శ్రీ వెలగా వెంకటప్పయ్య అధ్యక్షత వహించగా విజయవాడ ఆకాశ వాణి ఇన్చార్జి డైరెక్టర్ శ్రీమతి మున్జలూరి కృష్ణ కుమారి,శ్రీ తుర్ల పాటి కుటుంబరావు వగైరాలు వక్తలు గా పాల్గొన్నారు .బాల సాహిత్యం అనుకోన్నంతగా రావటం లేదని ,చదివే వారు తగ్గి పోయారని అందరు అన్నారు ..తుర్ల పాటి మాట్లాడుతూ అయిదు సి.లు పిల్లల్ని నాశనం చేస్తున్నాయన్నారు అవి సినిమా ,క్రికెట్ ,చానెల్ ,కంప్యుటర్ ,కార్టూన్ లని చెప్పారు .నేషనల్ బుక్ ట్రస్ట్ అధినేత కూడా సభలో పాల్గొన్నారు ..దీని తర్వాత జరిగిన సభ చిరస్మరణీయం గా ఉంది.
సాహితీ మేరువు తిరుమల రామ చంద్ర
తిరుమల రామ చంద్ర గారి శత జయంతిని పురస్కరించుకొని గొప్ప సభ జరిగింది .దీనికి అధ్యక్షత వహించింది రామ చంద్ర గారి కుమారుడు శేష సాయి గారు .వక్తలుగా రామ చంద్ర గారి అమ్మాయి ఆముక్త మాల్యద ,శ్రీ పుట్ట పర్తి నారాయణా చార్యుల వారి కుమార్తె ప్రఖ్యాత రచయితా విశ్లేషకు రాలు సప్త గిరి చానల్ కు ఎన్నో ఎపి సోడ్లులను నిర్మించిన శ్రీ మతి పుట్ట పర్తి నాగ పద్మిని గార్లు .రామ చంద్ర గారి పెద్దమ్మాయిరజని ని కూడా ఆహ్వానించారు కాని ఆమె రాలేక పోయింది .
తిరుమల శేష సాయి మాట్లాడుతూ తమ తండ్రి గారు అనుక్షణంసాహిత్యానికి అంకితమై పని చేశారని పొట్టకూటి కోసం ఆయన చేబట్టని ఉద్యోగం లేదని వారి ‘’హంపీ నుండి హరప్పా దాకా ‘’పుస్తకం లో ఆయన కలుసుకొన్న వివిధ వ్యక్తుల ప్రభా వాలను వివరించారని ఎక్కడ వసతి దొరికితే అక్కడ ఉన్నారని కష్టాలకు బాగా అలవాటు పడ్డ జీవితం ఆయనది అన్నారు .ఒక సారి పంజాబ్ లో ఒక సిక్కు గృహస్తు ఇంట్లో రామ చంద్ర బస చేసి నప్పుడు వారు ఆవ తో చేసిన మిఠాయి ఆయనకు పెట్టారని దాన్ని తిని ఎలా తయారు చేశారో తెలుసుకోన్నారని తాను ఇదివరకే ఆవ తో స్వీట్లు చేస్తారని రాసిన దాన్ని గురువు మాన వల్లి రామ క్రిష్నయ్య గారు కాదని ఆక్షేపించారని వెంటనే ఆ ఇంటి వారి నడిగి వారుపెంచిన ఆవ మొలకలను గురువు గారికి పోస్ట్ లో పంచ్పించారని చెప్పారు .ఏదైనా తనకు కాని కుటుంబ సభ్యులకు కాని కష్టం వస్తే ‘’ఇంకెంతకాలం రా ‘’ఆరు నెలల్లో ‘’అన్నీ సర్దుకుంటాయి రా ‘’అని అందర్ని ఓదార్చే వారని ఆరునెలల గడువు తో ఆయన సంతృప్తి చెందే వారని తెలియ జేశారు .రామ చంద్ర సుమారు 75దాకా పుస్తకాలు రాశారని ,గమ్యం లేని జీవితమే చాలా భాగం గడిపి చివరకు ప్రాకృత భాషా ధ్యయనాన్ని చేసి ఒక సుస్తిర స్థానం సంపాదిన్చుకోన్నారని చెప్పారు .అవన్నీ ముద్రణ పొంది యేన లేని కీర్తిని తెచ్చాయన్నారు ..ఆయన ను ఎవరైనా ఏది నీకు ఇష్టం అంటే ‘’ఆకలి ‘’అనే వారని ,ఎంత సంపాదించినా ఆ రోజుల్లో వచ్చే జీతాలు కడుపు నింప లేక పోయాయని అందుకనే ఆకలి అనే వారని చెప్పారు .ప్రేక్షకుల కళ్ళల్లో కన్నీరు కారింది ఈ మాట వింటుంటే ..తామంతా తమిళ దేశం లో నె పుట్టి పెరిగినా తమ ఇంట్లో చక్క గా తెలుగే మాట్లాడుకోవటం తమ తండ్రి గారిచ్చిన సంస్కారం అన్నారు .ఒక తెలుగు బహిరంగ సభలో పాల్గొనడం అందునా తెలుగు లోనే మాట్లాడటం తనకు లభించిన మహత్తర అవకాశం అని పొంగి పోయారు .నిర్వాహకులకు కృతజ్ఞతలు తెలిపారు ..సాయి గారు చక్కని తెలుగులో ప్రసంగించి తమ హృదయాన్ని బాగా ఆవిష్కరించారు .
తిరుమల రామ చంద్ర గారి అమ్మాయి శ్రీ మతి ఆముక్త మాల్యద తండ్రి తో తనకున్న జ్ఞాపకాలను నేమరేసుకొన్నారు .రాత్రి ఏ వేళచూసినా రామ చంద్ర గారు ఏదో చదువుతూనో రాస్తూనో కని పించే వారని జీవితం బోర్ గా ఉంటోందని తాము అన్నప్పుడల్లా ‘’బోర్ కే బోర్ కొట్టేట్లు ప్రవర్తిన్చాలమ్మా ‘’అని సలహా చెప్పేవారని చెప్పారు .ఎంత దూరమైనా కాలి నడకనే వెళ్ళే వారని ,వాహనాల్లో వెళ్ళటానికి ఇష్టపడే వారు కాదని అన్నారు .తమ తండ్రి గారి మీద ఇంతటి ఆప్యాయతా ,ఆదరణా ,ఆరాధనా ఇక్కడి వారు చూపిస్తున్నందుకు తామెంతో గర్వ పడుతున్నామని,అంతటి తండ్రికి సంతానం అయి నందుకు గర్వం గా ఉండని , చెమ్మగిల్లిన నయనాలతో ఆముక్త మాల్యద అన్నారు .
శ్రీమతి పుట్ట పర్తి నాగ పద్మిని అద్భుత ప్రసంగాన్ని చేశారు .తమ ‘’అయ్య’’పుట్ట పర్తి వారిని ,చిన్నయ్య అని తాను ఆప్యాయంగా పిలుచుకొనే ‘’తిరుమల రామ చంద్ర ను తెలుగు సాహిత్యం లో రెండు మేరు పర్వతాలనీ రెండు మహా సాహితీ సిన్దువులని పేర్కొన్నారు .ఇద్దరు జీవితం లో నిలకడ లేని జీవితాలనే గడిపారని రామ చంద్ర గారి తల్లి గారు బంధు జనం ఆయన్ను అతి గారాబం గా ,అతి ప్రేమ గా పెంచారని ,చూశారని అది ఆయనకు వెగటు పుట్టి వారికి దూరం గా వెళ్ళి పోయి స్వతంత్ర జీవనం సాగించారని చెప్పారు .తమ అయ్య దీనికి విరుద్ధం అని ఆయన తల్లి గారు చిన్నతనం లోనే చని పోవటం వల్ల ఆదరించే వారు లేక ఇంటికి దూరమయ్యారని ,స్వేచ్చా , ,విసృమ్ఖలత తో కొంత ఇబ్బంది పడ్డారని గుర్తు చేశారు .నారాయణా చార్యులు గారు కూడా అనేక సాహితీ ప్రక్రియలు చేబట్టి అనేక పోకడలు పోయి ,దేనిలోనూ స్తిరం గా ఉండలేక పోయారని చివరికి భక్తి ఒంట బట్టి దాని అంతు చూశారని తులసీ రామాయణాన్ని రాసి మంచి పేరు తెచ్చుకోన్నారని ,ఆచార్యుల వారి సకలోహ సర్వస్వమే ‘’శివ తాండవం ‘’అని అది వారి ‘’మాగ్నం ఓపస్ ‘’అయిందని దానితో వెనక్కి తిరిగి చూడలేదని ,ఆయన భాషా పాండిత్యం అందరికిరికి అబ్బుర పరచేదని ,పీఠాది పతులప్రశంశాల నందు కొని అనేక భాషలలో అపార పాండిత్యాన్ని సాధించి ‘’సరస్వతీ పుత్రులు ‘’అని పించుకోన్నారని గుర్తు చేశారు .ఈ ఇద్దరు మొదట్లో ను చివర్లోను ఒకే పద్ధతిలో చరించటం యాదృచ్చికం అన్నారు .రామ చంద్ర గారు ఏదైనా కొత్త విషయం కని పిస్తే దాన్ని నేర్చుకొనే దాకా వదిలి పెట్టరని అన్నారు .ఒక సారి కాశీ లో ఒక అస్సామీ ఆయన కలప వ్యాపారం లో మెళకువలు నేర్పుతాను అని చెప్పి నాలుగు రోజుల్లో వస్తానని ఇంటికి వెళ్ళిన వాడు నేల రోజులకీ పత్తా లేక పోతే ,ఆ నేల రోజులు ఆయన కోసం నిరీక్షిస్తూ తినటానికి తిండి కూడా లేక రెండు పూటలా కడుపు నిండా గంగా జలాన్ని త్రాగి బ్రతికిన పిచ్చి మారాజు చిన్నయ్య అనీ చెప్పారు .ఈ మాట అంటుంటే ఆమె కళ్ళు దారా పాతం గా కన్నీరు వర్షించాయి .అన్నీ తెలుసుకోవాలనే తపనతో ఒక సరి ‘’కొంచెం మందు ‘’కూడా పుచ్చుకోన్నారని,ఇది తెలిసిన గురువు గారు వేటూరి ప్రభాకర శాస్త్రి గారు ‘’పెళ్ళాం ,పిల్లా పీచు ,సంసారం ఉన్న వాడివి ,ఇలా సాహసాలు చేస్తే బతుకులు బజారు పాలౌతాయి జాగ్రత్త ‘’అని హెచ్చరించారని అప్పటి నుండి ఇలాంటి సాహసాలు చెయ్య లేదని గుర్తు చేశారు .
చిన్నయ్యకు తమ అయ్యగారి ‘’శివ తాండవం ‘’అంటే మహా ప్రీతీ అని అయ్య పాడగా అనేక సార్లు విన్నా తను కనిపించి నప్పుడల్లా తనతో ఒక్క సారైనా పాడించుకోకుండా ఉండే వారు కాదని చెప్పి అందులో నుండి కొంత భాగంఅద్భుతం గా పాడి మంత్ర ముగ్ధుల్ని చేశారు .ఆశైలి అనితర సాధ్యం అని గుర్తు చేశారు . ఇది వారి సాహితీ మిత్రత్వానికి గొప్ప చిహ్నమని అన్నారు .తిరుమలకు ,పుట్టపర్తి వారికి ఇద్దరికీ విశ్వనాధ సత్యనారాయణ గారు అమిత అరాధ్యులని వారిని గురించి ప్రసంగం లేకుండా వారిద్దరూ ఉండలేరని గుర్తు చేసుకొన్నారు .వారిద్దరి రచనల్లో విశ్వనాధ వారి ప్రస్తావన చాలా చోట్ల కని పించటం విశేషం అన్నారు .విశ్వనాధకు తమ అయ్యకు జరిగే వాదోప వాదాల్లో తమ తల్లి గారు మధ్య వర్తిత్వం వహించటం ,ఆమె తీర్పును వారిద్దరూ గౌరవించటం తనకు తెలుసుననీ అన్నారు .తన రచనలకు రామ చంద్ర ఎంతో సహకారం అందించారని ముఖ్యం గా తుంగ భద్రా నదీ పావనోదకాలలో అనేక ఔషధ గుణాలున్నాయని తాను విని వాటిని వివరించమంటే చిన్నయ్య చక్కగా కూర్చుని తాను రాసుకొన్న నోట్సు దగ్గర పెట్టుకొని బోధించి మార్గ దర్శనం చేశారని ఆ రుణాన్ని తానేన్నటికి తీర్చు కోలేని రుణ గ్రస్తను అని అన్నారు .అలాగే తాను హిందీ ,తెలుగు రామాయణాల తులనాత్మక పరిశీలన చేసి సీతా దేవి పాత్ర పై ప్రత్యెక ద్రుష్టి తో రిసెర్చ్ రచన చేస్తున్నప్పుడు పుట్ట పర్తి వారు హిందీ రామాయణాల సారాంశాన్ని అరటి పండు ఒలిచి చేతిలో పెట్టి నంతా తేలిగా వివరించి తన శ్రమ తగ్గించారని చెప్పారు .
శాలి వాహన గాదా సప్త శతి ,బసవేశ్వర పురాణం అయ్యను చిన్నయ్యను గొప్పగా ప్రభావితం చేశాయని ,రామ చంద్ర గారి హంపీ నుండి హరప్పా వరకు అనే జీవిత చరిత్ర రాహుల్ సాంకృత్యాయన్ రాసిన ‘’ఓల్గా సె గంగా ‘’కు ఏమా త్రం తక్కువ కాదని ఎన్నో చారిత్రాత్మక ,ఆధ్యాత్మిక సాంఘిక భౌతిక ,రాజకీయ పరిస్తితులను కళ్ళ కు కట్టి నట్లు రాసి, చిన్నయ్య గొప్ప సాహితీ ప్రస్తానం సాగించారని మనల్ని వారితో పాటు తిప్పుతూ ఆ ప్రదేశాలను మనుష్యులను చూపిస్తూ అనుభూతి కలిగిస్తూ విజ్ఞానం పంచుతూ సాగే మహా రచన అని వివ రించారు .చిన్నయ్యకు కనీసం షష్టి పూర్తీ కాని సప్తతి కాని ,సహస్ర మాస చందనోత్సవం కాని జరక్క పోవటం ఎవరూ దానికి పూనుకోక పోవటం తనకు ఆశ్చర్యాన్ని బాధను కల్గిన్చాయని ఒక సాహితీ మేరువు కు మనమిచ్చే మర్యాద ఇదేనా ‘అని ఆమె ఏడ్చేసి ప్రేక్షకులకు కన్నీరు తెప్పించారు .ఈ సభలో పాల్గొనడం తన అదృష్టమని బెజవాడ తో తనకు ఎంతో ఆత్మీయ అను బంధం ఉందని చెప్పారు .’’మన లిపి పుట్టు పూర్వోత్తరాలు ‘’సాహితీ సుగాతుని స్వగతం ‘’‘’మొదలైన తిరుమల వారి రచనలన్నీ ఎంతో లోతైన పరిశోధనా ,పరిశీలన తో రాసిన రిసెర్చ్ వర్క్ లాంటివే నని అవి సులభ శైలిలో రాసి చదువరులకు మనస్సుకు హత్తు కోనేట్లు చేసిన వారి నేర్పుకు జోహార్లు అని ప్రసంగాన్ని గద్గద కంఠం తో ముగించి అందరి ప్రశంశలను అందు కొన్నారు శ్రీ మతి నాగ పద్మిని .నా మటుకు నేను ఒక గొప్ప అను భూతి ని పొందాను .రామ చంద్ర గారన్నా ,పుట్ట పర్తి వారన్నా అమిత ఆరాధన ఉన్న వాడిని .నాకు గొప్ప మానసికా నందాన్నిచ్చింది ఈ సభ .జనాన్ని కదిలించి రామ చంద్ర పై మహా భిమానాన్ని పెంచి సార్ధక మైంది .ఈ సభలో అమెరికా నివాసి అక్కడ తెలుగు భాషా సంస్కృతులకు సేవ చేసిన తొలి తరం తెలుగు సేవకుడు ,నిత్యం ఏదో రాస్తూ అనేక పుస్తకాలను ప్రచురిస్తూ హాస్యానికి పెద్ద పీట,వేసినవాడు , తానా ,ఆటా లకు సలహాదారు గా ఉండి వాటి వైభవానికి తోడ్పడుతూ ,తానూ అమెరికా నుండి వచ్చి ఒక సారి హైదరా బాద్ లో ‘’ప్రపంచ తెలుగు సభలు ‘’నిర్వహించి బాపు ,రమణ ల స్నేహ షష్టి పూర్తిని ఆ సభల్లో నిర్వ్హహించి ఘన సన్మానం చేసిన హూస్టన్ నివాసి శ్రీ చిట్టెన్ రాజు కూడా ఉండటం ఆయన నాగ పద్మినిని మనసారా కొనియాడటం ముచ్చటగా ఉంది .ఇండియాలో చిట్టెన్ రాజు గారి కార్యక్రమాలకు చేదోడు వాదోడు గా ఉంటూ తన స్వంత కార్యక్రమాలను చేబడుతున్న శ్రీ వంశీ రామ రాజు కూడా సభలో ఉన్నారు
సరస భారతికి ప్రశంశ
సభ అయి పోగానే నేను నాగ పద్మిని గారి దగ్గరకు వెళ్ళి చాలా గొప్ప స్పూర్తి వంతమైన ప్రసంగం చేశారని అభి నందించి నా పేరు చెప్పగానే ‘’అమ్మమ్మా !మీరా దుర్గా ప్రసాద్ గారు ఎంత బాగా సరసభారతి బ్లాగ్ నిర్వ హిస్తున్నారండీ .నేను ఎప్పుడూ చదువుతూనే ఉంటాను ‘’అని మనస్పూర్తిగా ప్రశంశించి పక్కనే ఉన్న చిట్టెన్ రాజు గారితో ప్రత్యేకం గా ‘’వీరు దుర్గా ప్రసాద్ గారు సరస భారతి అనే బ్లాగ్ ను మహా గొప్ప గా నిర్వ హిస్తున్నారు ‘’అని ఆయనకు చెప్పటం ఆయన ఆనందం గా తన చేతుల్లోకి నా చేతులు తీసుకొని అభి నందించటం నాకు చిరస్మరణీయం .సరసభారతి నాగ పద్మిని గారి లాంటి వారిని అమితం గా ఆకర్షించి అభిమానుల్ని చేసి నందుకు మహదానందం గా ఉంది .మా ప్రక్కనే ‘’ప్రజాసాహితి’’ సంపాదకులు శ్రీ కొత్త పల్లి రవి బాబు ,ఆకాశ వాణి లో నాటక విభాగం లో చాలా కాలం పని చేసి అనేక నాటకాలను నిర్వహించిన శ్రీ పాండురంగ కూడా ఉండి ఆమె పొగడ్తను విని ఆనందించారు .’సరసభారాతికి నిన్న ఒక చారిత్రాత్మక మైన రోజు అని భావిస్తూ –సెలవ్
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –9-1-13-ఉయ్యూరు
చిలుకూరు వారి వచన వాల్మీకి రామాయణం –5
చిలుకూరు వారి వచన వాల్మీకి రామాయణం –5
శ్రీ రామ కృష్ణ తపోవనం నుండి శ్రీ చిలుకూరు వారి విజ్ఞప్తి
‘’మాండమహర్షి ‘’తపో బలం చేత నిర్మించ బడిన ‘’పంచాప్సరస సరస్సు ‘’నుండి సంగీతం అన్నికాలాల్లోను ఒకే రకం గా విని పించటం చాలా వింతగా ఉంది .చిలుకూరు వారికి ఆ సంగీతం ఎలా విన్పించిందో ,ఎవ్వరూ చెప్పని విషయమే నని నాకు అని పించింది .మూజికల్ ఫౌంటేన్స్ ఇప్పుడున్నాయి .అప్పుడు వీటిలో మహర్షి పేరు మీదుగా‘’మాండ లీన్ వాయిద్యం విని పించేదేమో ?14వేల మంది రాక్షసుల్ని ముహూర్త కాలం లో చంపేసిన శ్రీ రాముని కోదండ పాండిత్యానికి ,ఆనందం ,ఆశ్చర్యం,సంభ్రమం ముప్పిరి గోనగా రాముడిని ఆప్యాయం గా సీతా సాధ్వి కౌగిలించుకోవటం ,ఆమెకు రామ చంద్రుని పై ఉన్న ఆరాధనా భావానికి పరాకాష్ట..ఆ సుఖం భర్తకు దేని వల్లా లభించదు .,తృప్తి నివ్వదు .ఔచిత్యపు హద్దులో జరిగిన మాధుర్య సంఘటనం ఇది .
సీతా పహరణం తర్వాత విరహం తో వేదన చెందే రాముడు సకల జీవ రాశిని భస్మం చేస్తానని అనటం శోకానికి పరాకాష్ట ,ఉన్మత్త ప్రేలాపనే .ఇక్కడ ఉచితానుచితాలు కన్పించవు .’’నారాచం ‘’అంటేనే బాణం .ఇక్కడ చిలుకూరు వారు‘’నారాచ బాణాలు ‘’అనె మాట ను ప్రయోగించారు .అవి ఇంకో రకమైన బాణాలా ?పోరాబడ్డారని పించింది ..లక్ష్మణుడు అన్నను అనునయిస్తూ ,హితం చెబుతూ ఆయనలో దుఖం చేత అణగి ఉన్నజ్ఞానాన్ని మాత్రమె మేల్కొల్పుతున్నానని ,తాను చెప్పేవన్నీ పూర్వం అన్నగారు తనకు చెప్పినవే నని ,అవి హిత వచనాలే అని అనటం లో సుమిత్రా నందనుడిలో హుందా తనం ,ఆరిందా తనం ,కర్తవ్య బోధ ప్రస్పుటం గా కన్పిస్తాయి .సీతాదేవిని రావణుడు ఆహరించిన ముహూర్తం ‘’వింద’అనె పేరు కలిగిందని ,ఆ సమయం లో పోగొట్టుకొన్నది ,తిరిగి యజమానికి తప్పక లభిస్తుందని జ్యోతిశ్శాస్త్ర రహస్యాన్ని తెలియ జేశాడు మహర్షి వాల్మీకి .’’వంచులక పక్షి ‘’ఆపు లేకుండా కూయటం శుభ సూచకమే నని ,’’జయమ్ము నిశ్చయమ్మురా ‘’అని పించటం పక్షుల కూతల్లో శుభాశుభాలు తెలియ జెప్పే పరి భాష ఆనాడు వాడుక లో ఉన్నట్లు తెలుస్తోంది . కదల లేని వారిని చంపటం ,యజ్న పశువును చంపటంఅంత నింద్యం అని కబంధుని విషయం లో రాముడు అనటం యజ్ఞాలలో అప్పుడు పశు హింస లేదనే అని పిస్తుంది . ,
కిష్కింధ కాండ –రుష్య మూక పర్వతం పై నిద్రిస్తూ కల గన్న వాడికి ఆ కల యదార్ధం అవుతుందని ,పాపాత్ముడు ,దురాచారుడు దాన్ని ఎక్క లేరు అనటం స్థల మహాత్మ్యమే .వాలి నాలుగు సముద్రాల్లలో వాలి ,సంధ్యోపాసన చేసే వాడు అన్న దానికి వివరణ గా సూర్యోదయానికి పూర్వమే పశ్చిమ సముద్రం నుండి తూర్పు సముద్రానికి ,దక్షిణ సముద్రం నుండి ఉత్తర సముద్రానికి వెళ్ళి సంధ్యా వందనం చేస్తాడని వెంకటేశ్వర్లు గారు చెప్పిన వివరణ చక్క గా సమన్వయము తో కుదిరింది .వాలి అడిగిన ధర్మ సందేహాలకు రాముడు దొంగను శిక్షించిన వెంటనే వాడి దోషాలన్నీ నశిస్తాయని ,శిక్షించక పోతే ఆ పాపం దొంగల కంటే రాజునే ఎక్కువ గా బాదిస్తుందని ,అందుకే పూర్వం మాంధాత చక్ర వర్తి ‘’శ్రమణకుడు ‘’అనే వాడు చేసిన మహా పాపానికి ఘోరమైన శిక్ష అనుభ విన్చాల్సి వచ్చిందని యుక్తి యుక్తం గా ధర్మ బోధ చేశాడు .’’దేవ సఖ పర్వతం ‘’దాటితే వచ్చే 100యోజనాల ఎడారి రాజస్థాన్ ఎడారా ?అని సందేహం వస్తుంది .’’వైఖానస సరస్సు ‘’అవతల ఉన్న చీకటి ప్రదేశం లో స్వయం ప్రకాశులైన దేవతలు ,సిద్ధులు ,తమ దేహం నుండి ప్రసరించే కాంతి తో తపస్సమాది లో ఉండటం ఆశ్చర్యకరం గా ఉన్నా ,అసాధ్యం కాదు ,సంభవనీయమే నని పిస్తుంది .ఎనిమిది బుద్ధి గుణాలు ,నాలుగు బలాలు ,పద్నాలుగు సద్గుణాలను సూక్ష్మం గా వివరించిన తీరు ముచ్చటగా ఉండి .అందరు చదివి తెలుసుకో తగ్గవి .
సశేషం –మీ గబ్బిట దుర్గా ప్రసాద్ –9-1-13-ఉయ్యూరు
24 వ పుస్తక ప్రదర్సన విజయవాడ
tirumala raama chandra gari shatha jayanthi sabha -aayana kumaarudu
saayi ,kumaarte aamukya maalyada putta parti naaraayanaa chaaryula
gaari ammaayi naaga padmini –mariyu amerikaa chitten raaju (red
shirt),vamshee raama raaju (chevi pogulu )-anthaku mundu sabha lo
turlapaati velagaa venkatappayya ,munjaluri krishna kumaari (radio
station director )modalaina vaaru .madhyalo devineni madhu soodana rao
(nilabadi )
చిలుకూరు వారి వచన వాల్మీకి రామాయణం -4
చిలుకూరు వారి వచన వాల్మీకి రామాయణం -4
శ్రీ రామ కృష్ణ తపోవనం నుండి శ్రీ చిలుకూరు వారి విజ్ఞప్తి
భరతునికి అన్న శ్రీ రాముడు చేసిన నీతి బోధ అన్ని కాలాల్లోనూ ఆచరణీయాలే –ఆ విషయాల్లోకి వెళ్దాం ‘’తెల్ల వారు ఝామున నిర్ణయాలు చేయాలి .రాజు ఆలోచనలు ముందుగా బయటి వారికి తెలియ రాదు .రాజనీతి విశారదుల్ని మాత్రమె మంత్రులు గా నియమించాలి .మంత్రి సమర్ధత పై రాజ్యాభి వృద్ధి ఆధార పడి ఉంటుంది .తగి నంత జీతాలు చెల్లించాలి .సమయానికి ఖచ్చితం గా జీతాలు బట్వాడా చేయాలి .ఇహాన్ని గురించి ఆలోచించే బ్రాహ్మణుల్ని దూరం గా ఉంచాలి .దేశ సరిహద్దుల విషయం లో అనుక్షణ జాగరూకత ఉండాలి .ఆదాయం ఎక్కువా ,ఖర్చు తక్కువ గా ఉండాలి .సైన్యానికి సకల ఆయుధాలు ,సంబారాలు సకాలం లో అందించాలి .దొంగను ,లంచ గొండిని వదిలి పెట్ట రాదు .మనస్సు ,దానం ,వాక్కులతతో ప్రజల్ని ఆ కట్టుకోవాలి .ఆలోచించి నిర్ణయాలు చేయాలి .ఏక పక్ష నిర్ణయాలు అనర్ధ హేతువులు .పండితులను నిర్లక్షం చేయరాదు .కిన్దివారిని ప్రేమతో ,చనువుతో చూడాలి ‘’నిజం గా ఇవన్నీ మన ప్రమ్భుత్వాలు మంత్రులు అమలు చేస్తే భూలోకం స్వర్గమే అవుతుంది .మన ఏలికలు వీటికి పూర్తిగా విశుద్ధం గా ప్రవర్తిస్తూ ,ప్రజా జీవితం తో ఆడుకొంటున్నారు .ప్రగతిని భ్రష్టు పట్టిస్తున్నారు .జాబాలి అనే ఆయన చెప్పిన నాస్తిక వాదాన్ని ఖండిస్తూ శ్రీ రాముడు ‘’లోకం లో సత్యమే ఈశ్వరుడు .లక్ష్మీ దేవి సత్యాన్ని ఆశ్రయించి ఉంటుంది .సత్యమే అన్నింటికి మూలం ‘’అని చెప్పినవి అక్షర సత్యాలే .దీన్ని వదిలి ‘’ధనమేరా అన్నిటికి మూలం ‘’గా మనం వ్యవహరిస్తూ చిక్కులు కొని తెచ్చుకుంటున్నాం .రాముడు బోధించిన నీతులతో ఉన్న దశ వర్గ ,పంచ వర్గ ,చతుర్వర్గ ,సప్త వర్గ ,అష్ట వర్గ ,త్రి వర్గాలను ,త్రయీ ,షాద్గున్య,దైవ మానుష ,కృత్య ,వింశతి వర్గ ,ప్రకృతి ,మండల ,ద్వియోనీ ,సంధి ,విగ్రహాలాను చాలా తేలిక మాటలతో సూటిగా అర్ధమయేట్లు చిలుకూరు వారు వివరించిన తీరు గొప్పగా ఉంది.
అరణ్య కాండ –విరాధుని ప్రవేశమే మహా భయానకం గా ఉంది .రెండు తోడేల్లను ,పది జిన్కల్ని ,మూడు సింహాలను ,నాల్గు పెద్ద పులులను ఒక ఏనుగు తలను ఇనుప శూలానికి గుచ్చి భుజాన మోసుకు వస్తున్నాడట .వాడి అరుపులో బి.బి.శబ్ధం ధ్వనించటం వింత గొలిపే విషయం .దీన్ని పసి గట్టారు వెంకటేశ్వర్లు గారు .మునులు చేసే తపో ఫలం లో నాల్గవ వంతు రాజుకు చెందటం వల్ల రాజు తన రాజ్యం లో ఎంత ప్రశాంత వాతా వరణాన్నిన్ని నెలకొల్పుతాడో తెలుస్తుంది .దాని వల్ల ఉభయులకు క్షేమం ,భద్రతా కూడా .మునీశ్వరులతో రాముడు వారు తనను ఆజ్ఞా పించాలి కాని అర్ధించటం తగదు అని ,తన తండ్రి తనను మునుల సంరక్షణ కోసమే అరణ్యానికి పంపాడని అంతం లో రాముని లో విధ్యుక్త ధర్మాన్ని ,ప్రజలకు రాజు పై ఉన్న అధికారాన్ని తెలియ జేస్తాయి .’’యదా ప్రజా –తదా రాజా ‘’అన్నదానికి ఆ నాడే పునాది వేశాడు రాముడు అని పిస్తుంది .మనపాలకులు దీని సారం గ్రహిస్తే ,ఆందోళనలు హర్తాల్లు ఉండవు .ప్రజా జీవితం కుంటూ పడదు .
సీతా దేవి రామునితో అతడు ధర్మ వేత్త అయినా సూక్ష్మం గా ఆలోచిస్తే కొద్దిగా అధర్మం తనకు గోచరిస్తోందని ,సత్య ధర్మ నిష్ఠ బాగానే ఉన్నా ,ఇతరుల ప్రాణాలు తీయటం అనే వ్యసనం తనకు భయంకరం అని పిస్తోందని తన సందేహాన్ని నిర్భయం గా రాముడికి తెలియ జేసింది .సాధారణం గా ఏ భర్త అయినా ,తీవ్రం గా గర్హిస్తాడు .కోపం ప్రకటించి ధూమ్ ధాంచేస్తాడు .చెంప చెళ్ళు మని పిస్తాడు .మర్యాదా రాముడు కనుక సీత జనక సుత కనుక ,ధర్మా ధర్మ విచాక్షణం కలదని ,తనపై ప్రేమతోనే అలా చెప్పిందని మెచ్చుకొన్నాడు రాముడు .భార్య అవసర సమయాల్లో చక్కగా కర్తవ్య బోధ చేయాల్సిందే నన్నాడు .ఆమె ప్రశ్న కు దీటైన సంతృప్తి కరమైన సమాధానం చెప్పాడు .తాపసులు తపో భంగం చేసే రాక్షసుల్ని తమ తపో బలం చేత సంహరించ గల సమర్దులే నని ,దాని వల్ల చిరకాలం గా తాము తపస్సు చేసిపొందిన ఫలం ఖర్చు అయి పోతుందని ,,లోక కల్యాణానికి ఖర్చు అయితే తమకంటే సంతోషించే వారు ఉండదని కాని తమ ప్రాణాలను కాపాడు కోవటానికి దాన్ని ఉప యోగించి వ్యర్ధం చేయటం తమకు ఇష్టం లేదని వారు తనతో చెప్పారని ,తానే వారందరికి దిక్కు అని మొర పెట్టు కొన్నారని ,తాను దండకారణ్య మునులకు ,కండ కావరం తో హాని చేసే దనుజులను మర్దన చేస్తానని ప్రతిజ్ఞ చేశానని ,దాన్ని నిల బెట్టుకోవటం తన తన సత్య ధర్మమని చెప్పటం ,ఆమెకే కాదు మనందరికి సందేహ నివృత్తి అవుతుంది .అలాంటిటి మనసెరిగిన దంపతులు సీతా రాములు .అందుకే నేటికీ వారు ఆదర్శ దంపతులని పించు కొంటున్నారు .
సశేషం –మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –.8-1-13- ఉయ్యూరు
విహంగ లో వచ్చిన వ్యాసం ఐరిష్ అస్తిత్వ రచయిత్రి మేరియా ఎడ్జివర్త్
ఐరిష్ అస్తిత్వ రచయిత్రి మేరియా ఎడ్జివర్త్
ఐరిష్ అస్తిత్వ రచయిత్రి మేరియా ఎడ్జివర్త్
Posted on January 1, 2013 by విహంగ
గొప్ప వంశం లో జన్మించి తండ్రి సంస్థానానికి వారసురాలై ఐరిష్ దేశ ఉత్కృష్టతను ,అందులోని లోపాలను తెలియ జేసి బాల సాహిత్యాన్నిసృష్టించి , ,స్త్రీ ల అభ్యున్నతికోసం రచనలు చేసి నవలా సాహిత్యానికి ఊపిరి లూదిన కొద్ది మంది తొలి తరం ఐరిష్ రచయితలలో ఒకరుగా నిల్చి ఇంగ్లాండ్ కు ఐరిష్ దేశం దేనిలోనూ తీసి పోదని నిరూపించి ,ఆ దేశ సాహిత్య సంస్కృతులను పరిపుష్టం చేసి ,రైతు ,బీద జన పక్ష పాతియై న పద్దెనిమిదో శతాబ్దపు ఐరిష్ రచయిత్రి మేరియాఎడ్జి వర్త్.
మేరియా1768 జనవరి ఒకటి న ఐర్లాండ్ లో ఆక్స్ ఫర్డ్ షైన్ లోని బ్లాక్ బోర్టాన్ లో జన్మించింది .తండ్రి రిచార్డ్ లోవేల్ ఎడ్జివర్త్ .తల్లి మేరియా .చిన్నతనం లో అయిదవ ఏటనే తల్లిని కోల్పోయిన అభాగ్యురాలు . బాల్యాన్ని అమ్మమ్మ గారింట్లో ఇంగ్లాండ్లో గడిపింది .తండ్రి రెండో పెళ్ళి చేసుకొన్నాడు . అప్పుడు మళ్ళీ తండ్రి ఎస్టేట్ ఎడ్జి వర్త్ టౌన్ కు తిరిగి వచ్చింది ..1775 లో ఐర్ లాండ్ లోని డర్బిన్ స్కూల్ లో చేరి చదివింది .మారుటి తల్లి కూడా మరణిస్తే ,ఆమె చెల్లినే తండ్రి మళ్ళీ పెళ్ళి చేసుకొన్నాడు .తర్వాత లండన్ లో చదువు కొంది .తండ్రి ఈమె పై శ్రద్ధ బానే తీసుకొన్నాడు .ఈమె కన్ను ఇన్ఫెక్షన్ కు గురై చూపు మందగించింది .తండ్రి వెంట ఉండి అన్నీ తానై వ్యవహరించాడు . ఉపాధ్యాయులను నియమించి ఇంట్లోనే అన్నీ చెప్పించాడు .ఆర్ధిక ,రాజకీయ ,విజ్ఞాన శాస్త్రాలను ,సాహిత్యాన్ని క్షుణ్ణం గా నేర్చింది .తండ్రి అన్నిటిని స్వయం గా ఆమెకు బోధించి మెరుగులు దిద్దాడు .తండ్రి గారి లూనార్ సొసైటీ పెద్ద మనుషులు ఇంటికి వచ్చేవారు .వారితో పరిచయాలు పెంచుకొని తనను తాను మలచు కొంది .
తండ్రి కి ఉన్న ఎస్టేట్ వ్యవహారాల్లో సాయ పాడేది. ఎడ్జి వర్త్.అక్కడే రాస్తూ ఉండేది .నౌకర్లు ,చాకర్లు బోలెడు సిబ్బంది .అందరి ఆలనా పాలనా స్వయం గా పర్య వేక్షించేది .ఎస్టేట్ ప్రజల నిత్య జీవిత వ్యవహారాలను పరి శీలించి గ్రంధస్థం చేసింది .ఇవి తరువాత ఆమె రచించిన నవలకు ఎంత గానో తోడ్పడ్డాయి .ఆంగ్లో ఐరిష్ వారితో సాన్నిహిత్యం పెంచుకొన్నది అందులో ముఖ్యం గా మొదటి డ్యూక్ ఆఫ్ వెల్లింగ్టన్ తో గొప్ప పరిచయమేర్పడటం ఆమెకు వరమైంది .బాల్యం అంతా ఇంగ్లాండ్ లో గడపటం వల్ల భాష ,సంస్కృతి,ఆలోచన విషయాలలో ఆమె పై ప్రభావం చూపాయి .వివాదాస్పద విషయాల పై ఆమె తన భావాలను విస్పష్టం గా ప్రకటించి కొంత అసౌకర్యానికి గురైంది .తన అభి ప్రాయాలను ‘castle rackrent ,హార్రిన్గ్టన్’ నవలల లో రాసింది .
ఐరిష్ ఫ్యూడల్ వ్యవస్థ లోనీ లోపాలను ఎండ గట్టింది .ఐరిష్ వారు ఇంగ్లాండ్ వారికి దేనిలోనూ తీసి పోరనే విషయాలను ఆమె తన రచనలలో విస్పష్టం గా తెలియబరచి,ఐరిష్ అస్తిత్వ వాదానికి మూల స్తంభం గా నిల బడింది . వారిని జాగృతం చేసి వారి అభి మానాన్ని సంపాదించింది .రెండు దేశాల భాష లో ఉన్న భేదాలను సోపత్తికం గా చూపింది …ఆంగ్లో ఐరిష్ కాస్మాపాలిటిక్స్ ను వివరిస్తు మొదటి ఫిక్షన్ కధలు రాసింది .ఐరిష్ జాతీయ అస్తిత్వాన్ని,జాతీయ శీల స్వభావాన్ని వాటిలో ప్రతిబింబింప జేసింది .ఆమెకు కొన్ని స్పష్టమైన భావాలున్నాయి .మగ వారితో సమానం గా ఆడ వారు ఉండాలని ,ముఖ్యం గా భర్తల విషయం లో వారు ఏమాత్రం న్యూన భావం తొ ఉండ రాదనీ చెప్పింది .ఆమె భావాల పై రూసో ప్రభావం బాగా ఉండేది .అంతే కాదు స్త్రీల విషయం లో అవగాహన ఉన్న వారినే భర్తలను గా స్వీక రించాలని మహిళలకు హితవు చెప్పింది .
ఆమె రాసిన ‘’లివియన్ ‘’,ఫాషనబుల్ లైఫ్ అండ్ పాట్రో నేజ్ ‘’ లలో18 వ శతాబ్దపు ఐరిష్ విగ్ ప్రభుత్వాల అవినీతి ,ప్రాతినిధ్యాలను ఎత్తి చూపింది .’’హెలెన్ ‘’లో స్త్రీలు బాగా సంస్కృతీ కరణం చెందాలని ,మహిళలు రాజకీయాల్లో కి రావాలని ,స్త్రీలు ఆలోచనా ,వివేకం కలవారని చెప్పింది .కేథలిక్కు ల పై సాను భూతిని ప్రకటించింది .ఆమె రాసిన తొలి కధల్లో మెలో డ్రామా బాగా ఉండేది .వాస్తవికత ఉండేది కాదు .బాల సాహిత్యాన్ని విస్తృతం గా రాసింది .వారి కోసం ఎన్నో నీతి కధలు రాసింది .ఒక కధలో మనిషి శవం చర్మం తో మాస్క్ వేసుకొని ఒక విద్యార్ధి మాట్లాడి నట్లు చూపింది .ఆమె letters for literary ladies మొదటగా ప్రచురించినపుస్తకం . An essay on the noble science of self justification లో స్త్రీ శక్తిని గుర్తింప జేసి ,,మగవారి , అందునా భర్త ల దాష్టీకాన్ని సహించ వద్దని హెచ్చరించింది ‘’.parents assistance ‘’పుస్తకం రాసింది .బాలల విద్యకు ప్రోత్సాహమిచ్చింది .
మేరియా తండ్రి మంచి ముందు చూపున్న వాడు .గొప్ప ఇన్వెంటర్ అని పేరొందిన వాడు .కూతురి అభి వృద్ధికి అన్ని రకాలా తోడ్పడ్డాడు .ప్రఖ్యాత వేదాంతులు లాకె, రూసో ల ప్రభావం తొ ‘’praactical education ‘’ను విద్య కోసం రాసింది. అందరితో కలిసి మెలసి ఉండే తత్త్వం విద్యార్ధుల్లో ఉండాలని కోరింది .1800 లో మొదటి నవల-castle racknet తండ్రికి తెలియ కుండానే రాసి గొప్ప విజయం సాధించింది .ఇది ఆంగ్లో ఐరిష్ భూస్వాములపై సంధించిన వ్యంగ్యాస్త్రం .I rish land lording familiesలో నాలుగు తరాల వారి చరిత్ర ను పొందు పరిచింది . 1801 లో మూడు భాగాల’’ Belinda ‘’నవలను లండన్ లో ప్రచురించింది .ఇందు లో ప్రేమా ,ఆరాధన ,వివాహం ,సంఘర్షణ ల ను పొందు పరిచి పూర్తి విస్తృత స్తాయి నవల గా రాసింది .ఇందులో అంతర్జాతీయ వివాహాన్ని ప్రోత్సహించి,.ఆఫ్రికన్ బానిసకు ఇంగ్లిష్ భూస్వామ్య అమ్మాయితో వివాహాన్ని చేయించి సంచలనం సృష్టించింది .ఇది ఆ కాలానికి చాలా ముందడుగే .1809 లో tales of fashionable life ను చిన్న కధలను .స్త్రీల గురించి, వారికోసమే రాసింది .సమకాలీన నవలా రచయితలలో అగ్రశ్రేణి రచయిత గా గుర్తింపు పొందింది .ఒక నవలలో యూదులను కించ పరిచే విధం గా రాసిందని అమెరికన్ మహిళా రచయిత్రి విమర్శిస్తే ,వారికి క్షమాపణ చెబుతూ 1817 లోhamington రాసింది .ఆమెలో క్రమం గా పరివర్తన వచ్చింది ..నైతిక నిర్ణయాదికారాన్ని ,సాంఘిక అస్తిత్వాన్ని సాధించి ఆమె అందరికి ఆదర్శ ప్రాయ మైంది . ఆమె రచనల్లో వ్యంగ్యానికి పెద్ద పీటవేసింది .
ఫ్రాన్సిస్ బీ ఫోర్ట్ ను వివాహమాడింది .దంపతులు ఇంగ్లాండ్ అంతటా పర్యటించారు .అక్కడ కవి లార్డ్ బైరన్ తో సమావేశ మైంది .కాని బైరన్ అభిప్రాయాలతో ఏకీ భవించలేదు .హంఫ్రీ డేవి .ప్రముఖ నవలా కారుడు సర్ వాల్టర్ స్కాట్ లతో ఉత్తర ప్రత్యుత్త రాలు జరిపింది .తండ్రి మరణం తర్వాత ఎస్టేట్ కు వారసు రాలైంది .1845-49 లలో’’ ఐరిష్ పొటాటో ఫామిన్ ‘’వచ్చింది .అపుడు రైతులకు అండ గా నిలిచి వాళ్ల బాధా నివారణ కోసం oriandino రాసింది .క్వేకర్ ఉద్యమ నాయకుల సాయం కోసం రిలీఫ్ ఫండ్ వసూలు చేసి అందించింది .అమెరికా నుండి వారికి కానుకల రూపం లో సహాయం రా బట్టింది .తన సంస్థానం లోని రైతుల రుణాల మాఫీ చేసింది
రాయల్ ఐరిష్ అకాడెమీ కి విలియం రావన్ హామిల్టన్ ఎన్నికయిన తర్వాత ఆయనకు ముఖ్య సలహాదారు అయింది .ఐర్లాండ్ సాహిత్య విషయం లో ఆమె ఎన్నో సూచనలు చేసి అమలు పరచేట్లు చేసింది .అకాడెమి లో స్త్రీలు భాగా స్వామ్యులు కావాలని తీర్మానించి ,వారిని చేర్పించి చురుగ్గా పని చేసేట్లు చేయ గలిగింది .హామిల్టన్ మేరియా కు గౌరవ సభ్యత్వం ఇచ్చి అపూర్వ గౌరవం కలిగించాడు .ఎనభై ఒక్క ఏళ్ళు నిండుగా ,గౌరవం గా జీవించి, స్త్రీల అభివృద్ధి కి , ,బాలల విద్యాభి వృద్ధికి , ఐరిష్ భాషా సంస్కృతి ,అస్తిత్వాలకు కృషి చేసి,ముప్ఫైకి పైగా పుస్తకాలను రచించిన మేరియా ఎడ్జి వర్త్ 22-5-1849 లో ఎడ్జి వర్త్ టౌన్ లో గుండె పోటు తో మరణించింది .
– గబ్బిట దుర్గా ప్రసాద్
కేంద్ర సాహిత్య అకాడమి కార్యదర్శి కృత్తివెన్ను శ్రీనివాసు మా ఇంటికి వచ్చిన సందర్భం
తెల్ల షర్ట్ ఉన్న ఆయనపేరు కృత్తివెన్ను శ్రీనివాసు కేంద్ర సాహిత్య అకాడమి కార్యదర్శి , అడవి శ్రీరామమూర్తి విశ్రాంత ప్రధానోపాధ్యాయులు ,
05.01.2013 ఉయ్యూరు మా ఇంటికి వచ్చిన సందర్భం గాచిలుకూరు వారి వచన వాల్మీకి రామాయణం -3
చిలుకూరు వారి వచన వాల్మీకి రామాయణం -3
అయోధ్యా కాండ విశేషాలను తెలుసుకొంటు న్నాం.వెదురు పోద కుప సిన పుష్పం ఆ వెదురు పొదలను కాల్చి వేస్తుందిట .అన్న విషయం మనకు తెలియ జేశారు .గోమతీ తీరాన మను చక్ర వర్తి ఇస్ఖ్వాకునికి ఇచ్చిన భూ మండలం ను రాముడు సీతకు చూపించటం ,తన వంశ పరంపరను తెలియ జేయటం లా అని పిస్తుంది .”గంగా నది లోని నల్ల కలువలు గంగమ్మ తల్లి కల్లులాగా ఉన్నాయి .కమలాలు చేతుల్లా ఉన్నాయి తీరం లోని వృక్షాలు హారాల్లా ,ఇసుక తిన్నెలు జఘనాల్లా ఉన్నాయి ”అని మహర్షి వర్ణించిన తీరు మహా సౌరు గా ఉంది .కాళి దాస మహా కవికి మార్గ దర్శనం చేసి నట్లున్నది .గుహుడు తన బోయ జాతిని కన్నా బిడ్డల్లా పాలించటం వాళ్ళ అతన్ని ”స్తపతి ”అని గౌరవం గా పిలుస్తారని కొత్త గా తెలిసిన విషయం.నిషాద జాతి రత్నం గుహుడు .సంస్కారం జన్మను బట్టి కాదు ,సాధనను బట్టి లభిస్తుందని వాల్మీకి గొప్ప సందేశాన్నే ఇచ్చాడు .రాముడికి వాన ప్రస్తా మార్గాన్ని ఉపదేశించిన మహర్షి ”విఖనస్సు ”అని కొత్తగా తెలిసిన విషయం .సర్వజనుల శ్రేయస్సు కోసం శ్రీ రాముడు ‘దైవీ నావం ‘అనే మంత్రాన్ని జపించటం ‘బహుజన హితాయ బహుజన సుఖాయ”అన్న భారతీయ ధర్మానికి ప్రతీకయే .ఆచరించి చూపి ,ప్రతి సందర్భం లో ను శ్రీ రామ చంద్రుడు మార్గ దర్శి అని పించుకొన్నాడు .వనవాసం లో తమ్ముడు లక్ష్మణుడి తో కైక దౌష్ట్యాన్ని చెబుతూ ,తన తల్లి కౌసల్య వద్ద ఉన్న చిలుక ,గోరువంకలు రామ వన వాసం విషయం విన్నాయని ,అందులోని గోరు వంక చిలుకను వెళ్లి కైకేయి కాలు కొరికి పగతీర్చు కొని రమ్మని చెప్పిందని ,కౌసల్య మీద పక్షికి ఉన్న ఆదరణ తనకు లేక పోయిందని,కైకమాటను గుడ్డిగా అనుసరించి తన తల్లికి అపకారం చేశానని బాధ పడతాడు .ఇంత సూక్ష్మ విషయాన్ని నాకు తెలిసి నంత వరకు ఎవరు వ్యాప్తి లోకి ఇంతవరకు తీసుకు రాక పోవటం ఆశ్చర్యమే .వెంకటేశ్వర్లు గారు దీన్ని చక్కగా అందించి రామునికి తల్లి పట్ల ఉన్న ఆరాధనా భావాన్ని తెలియ జేసి అభి నందన లందు కొన్నారు .నాకు మాత్రం ఈ చిలుక గోరు వంక వృత్తాంతం పరమాద్భుతం గా ఉంది .సహవేదన అనేది జాతికి అతీతం గా ప్రతి బిమ్బించింది అని పించింది .
చిత్ర కూట పర్వతం పై ఉండే వారంతా ధర్మ కార్యాలు చేసి ధన్యులవుతారట .యమునా నదిని దాటేటప్పుడు సీత ‘మద్యపు కుం.డ”లను సమర్పిస్తానని మొక్కు కోవటం ,ఆ నాటి వారి ఆన వాయితీ .నదిని తల్లిగా పూజించే సంస్కారం .రాముడు వాస్తు పూజ చేసి పర్ణ శాలలో ప్రవేశించటం ,మంత్రాలను తానే పఠిం చటంవల్ల రాజు అన్నిటా సమర్ధుడై ఉండాలి అన్న బోధ ఉంది .అంతః పురమైన ,అడవి అయినా ఆచారాన్ని పాటించాలనే ధర్మ సూక్ష్మం కనీ పిస్తుంది .రాముడికి వచ్చిన కలలో తండ్రి దశరధుడు నల్లని వస్త్రాలు ధరించి ,ఇనుపీట లపై కూర్చున్నట్లు ,ఒళ్లంతా నల్ల రంగు పూసుకోన్నట్లు కని పించాడు ..ఒక రాక్షస స్త్రీ వికృతం గా నవ్వుతోంది .గాడిద రధం మీద నుంచి దశరధుడిని కిందికి నెట్టేసింది .ఈ కల రాముడికి ఏదో మరణ సూచికం గా అని పించి ,తమ్ముడికి చెప్పాడు .తండ్రి మరణం తధ్యం అని అని పించింది .స్వప్న వృత్తాంతాలు రామాయణం లో చాలా ఉన్నాయి .అన్ని దేశాల ఇతిహాసాలలోను ఇలానే ఉన్నాయి .వాటి ఫలితాలు వారు అనుభ వించారు .స్వప్నాలు దేశ కాలాతీతం అని పిస్తుంది .రాముడి ఈ కళను ఎవరు ఇంతగా ప్రచారం లోకి తేలేదు .ఒక్క వెంకటేశ్వర్లు గారే దీన్ని వెలుగు లోకి తెచ్చారని పించింది
భరతునికి అతని సైన్యానికి భరద్వాజ మహర్షి ఇచ్చిన ”విందు ”న భూతో న భవిష్యతి గా ఉంటుంది .ఈ నాటి ఫైవ్ స్టార్ హోటళ్ళుదీనిముందు బలాదూర్.ఎన్ని వసతులు ఎన్నెన్ని పిండి వంటలు ,ఎంత ఆనందం ,ఎంత ఆహ్లాదం ?మై మరపించి ,అక్కడే ఉండి పోవాలని పించే వ్యామోహం .దీని మాయలో భరతుడు పడతాడా ?లేదా ?అని మహర్షి పెట్టిన పరీక్ష అని పిస్తుంది .జితేంద్రియుడు వీటిని తరుణ ప్రాయం గా భావించి రామ దర్శనానికి బయల్దేరి వెళ్ళటం ఆహా అని పిస్తుంది భరతుని కర్తవ్య దీక్షకు జేజేలు చెప్పాలని పిస్తుంది .సన్నివేశ కల్పనా ,నిర్వహణ పరమాద్భుతం గా చేశాడు మహర్షి వాల్మీకి .అంత గొప్ప గాను ఆతిధ్యమిచ్చాడు భరద్వాజ మహర్షి అందుకే అ నాటి నుండి ఎక్కడ మహా గొప్ప విందు జరిగినా ”భరద్వాజ విందు ”అనటం లోక సహజం అయింది .అదొక ”coinage word’అయి పోయింది .ఇంత గొప్ప విందును రాముడికి ఇచ్చే సాహసం చెయ్య లేదు భరద్వాజుడు .ఇదే డ్రమాటిక్ ఎలిమెంట్ .భరతుడు ఆశ్రమ జీవితం దెబ్బ తిన కుండా తన సైన్యాన్ని దూరం గానే ఉంచి ,తన లోని సంస్కారాన్ని తెలియ జేశాడు .అందుకే రామాయణం ఉత్తమ సంస్కారాన్ని అందించే మహా గ్రంధం గా పేర్కొనటం .కైక ను దూషించే భరతుడితో రామ వన వాసం దైవ ప్రేరితమని ,అతని తల్లి కైక నిమిత్త మాత్రురాలే నని ,రామ వన వాసం లోక కల్యాణా నికే నని బోధించటం ,మనసు కుదు ట పడె ట్లు చేయటం భరద్వాజ మహర్షి చేసిన మహా గొప్ప కార్యం .
సశేషం –మీ–గబ్బిట దుర్గా ప్రసాద్ –5-1-13-ఉయ్యూరు
చిలుకూరు వారి వచన వాల్మీకి రామాయణం -2
చిలుకూరు వారి వచన వాల్మీకి రామాయణం -2
శ్రీ రామ కృష్ణ తపోవనం నుండి శ్రీ చిలుకూరు వారి విజ్ఞప్తి
బాలకాండ-ఆ నాడు సాంప్రదాయానికి విరుద్ధం గా యాగాలను నిర్వహించేవారు .తర్వాత బ్రహ్మ రాక్షసులై ,యాగ విధ్వంసం చేశారు .రాక్షసులు ఎక్కడి నుండో ఊడి పడరు .మనలోని అవ్యక్త శక్తులే ఆరూపం గా వ్యక్త మౌతాయి .అశ్వమేధం లో యజమాని భార్య ,కోన ఊపిరితో ఉన్న అశ్వాన్ని ,మూడు బంగారు సూదులతో గుచ్చగానే అది చని పోయేది అన్న వివరణ అవసరమైనదే. యాగం పై ఉన్న అపోహను పోగొట్టేది .జాంబ వంతుడు బ్రహ్మ దేవుడు ఆవలించిన ముఖం లో నుంచి జన్మించటం తెలియ దగిన విషయం .అందుకె ఆయన వానర సేనకు గొప్ప సలహా దారు ,పెద్ద దిక్కు అవగాలిగాడు .మన్మధుడు కాలి బూడిద అయిన దేశం అంగ దేశం అయింది అన్న విషయం తెలియ దగింది .విశ్వా మిత్ర మహర్షి శ్రీ రామునికి ఇచ్చిన ‘’గాంధర్వ మానవాస్త్రం ‘’విచిత్ర మైనదే .కావాలని రామునికి దీన్ని అనుగ్రహించాడు మహర్షి .ఇచ్చిన వాటికి కృతజ్ఞత తెలుపుతూ ,స్మరించి నప్పుడు మాత్రమె వచ్చి సహాయం చేయమని అంత వరకు మనస్సులో మెదులుతుతు ఉండమని కోరటం ‘’రాముని బుద్ధి మంత తనం ‘’వామన జన్మ ద్వాదశి నాడు శ్రవణా నక్షత్త్ర ములో చంద్రుడు ఉన్న అభిజిథ్ నక్షత్రం అని అదే వామన జయంతి అని అందరికి తెలియని విషయాన్ని ఎరుక పరచారు .
పార్వతీ పరమేశ్వరుల రహస్య క్రీడను అడ్డు కొన్న దేవతలకు సంతానం కలగదని అమ్మ వారి శాపం ,భూదేవి కూడా తనకు సంతానం కలుగ కుండా చేసి నందుకు ఆమెకు బహు భత్రు త్వాన్ని ,పుత్ర సంతానలేమి కల్గించటం లో ,ఎంత మహిమాన్వితు లైనా ,తమకు కలిగిన బాధను తట్టుకో లేరని ,ఎదుటి వారికీ అలంటి బాధలు రావాలని కోరుకోవటం ఒక వింత నైజం గా కన్పిస్తుంది .ఇక్కడే పార్వతీ దేవి కూడా దీనికి ఏమీ అతీతం కాదని అని పిస్తుంది .భూ భారాన్ని మోసే ‘’విరూపాక్ష దిగ్గజం ‘’,అలసట కలిగి నప్పుడు తలను కదిలిస్తే ,భూ కంపాలు కలుగుతాయని అనటం లో భూ కాలుష్యం ప్రమాదం అనే హెచ్చరికి ఉంది .క్షీర సాగర మధనం లో జన్మించిన 60కోట్ల మంది అప్సరసలను దేవ ,దానవులేవరూ వివాహం చేసుకోవటానికి ముందుకు రాక పోవటం వాళ్ళ వారంతా వేశ్యలైనారని చెప్పటం లో ఇన్ డైరెక్ట్ గా వివాహ వ్యవస్థ అవసరాన్ని చెప్పకనే చెప్పి నట్లయింది ఒక రకం గా వారు సమాజం లో డ్రైనేజి వ్యవస్థ గా ఉండిపోవాల్సి వచ్చిందన్న సత్యం కని పిస్తుంది .
ఇంద్రునికి మేష వృషణాల ను అమర్చటం వల్ల ,ఆ నాటి నుండి పితృ దేవతలు వృషణాలు లేని గోర్రేలనే భుజించారు .ఇదులో అవయవాల ట్రాన్స్ ప్లాంటేషన్ శాస్త్రం ఆనాడే అమల్లో ఉందని అర్ధమవుతుంది .ఈ రోజుల్లో మాంసం తినే వారికి గొర్రె వృషణాలు మహా ప్రీతీ పాత్రం అని వింటున్నాం .విశ్వా మిత్రుడు తన కుమారుల్ని యాగ పశువులు గా ప్రాణ త్యాగం చేయమని కోరితే ,వారందరూ తిరస్కరించగా ,వారిని అధమ జాతి మానవులు గా పుట్టమని శపిస్తాడు .ఆ జాతుల్లో ‘’అంధక ,ముష్టిక ‘’జాతులున్నాయి .అంధ జాతే ఆంద్ర జాతి అనే కధనం ఉంది .ఇది అంత సవ్యం గా లేదనుకొని వెంకటేశ్వర్లు గారు దాన్ని వదిలేశారు .గరళం తో కలిసి పుట్టిన వాడు సాగరుడు అవటం ,శాప జలం చేత కల్మషుడు అయిన వాడు కల్మష పాదుడు అవటం వ్యుత్పత్తి వ్యక్తీకరణాలు .భగుడు ఉత్తరా నక్షత్రం తో కూడిన రోజు వివాహానికి మంచి రోజు అని ,భగుడు సంతాన ప్రదాత అన్న మహర్షి జ్యోతిశ్శాస్త్ర పాండిత్యాన్ని వెలికి తీసి చూపారు .శ్రీ రాముని చేతిలో గర్వం ఖర్వం అయిన పరశు రాముడు రాత్రి పూట తాను భూమి పై ఉండ రాదనీ ,తన గమనానికి సహకరించే పాదాలపై బాణ ప్రయోగం చేయ వద్దని దశరధ రాముడైన కళ్యాణ రాముడిని కోరుకోవటం మనకు కొత్త విషయం గాస అని పిస్తుంది .
అయోధ్యకాండ –కోరికలతో కూడిన వ్యసనాలను ,క్రోధం తో వచ్చే వ్యసనాలకు హెచ్చరిక గా మంచి వివరణ నిచ్చారు రచయిత .శ్రీ రామ పట్టాభి షెక ముహూర్తాన్ని సభలో ప్రకటించిన దశరధ మహా రాజు కీడు ను శంకిస్తాడు .ఇది ఆయన మనో వ్యాకులతకు అద్దం పట్టు తుంది .రాబోయే అనర్దానికి సూచన కూడా .అలాగే రాముడు లక్ష్మణునితో తాను రాజ్యాభి షెకానికి అంగీకరించటం ,లక్ష్మణుడి కోసమే నని ,భోగాలు ,రాజ్య ఫలం లక్ష్మణుడు అనుభవించాలని తన మనో భావం అని తెలియ జేయటం లో రామునికి ఉన్న భ్రాత్రు ప్రేమ కు నిదర్శనం గా ఉంది మంధర ను ‘’యతో జాతా‘’అని వాల్మీకి సంబోదిన్చాడని ,అంటే –‘’అడ్రెస్ లేనిది ‘’అని చక్కని వివరణ నిచ్చారు వెంకటేశ్వర్లు గారు .’’అలర్కుడు‘’అనే రాజు తనను యాచించిన ఒక గుడ్డి బ్రాహ్మణుడికి నేత్ర దానం చేశాడు .కనుక రామాయణ కాలం లోనే ‘’నేత్ర దాన ప్రక్రియ ‘’ఉంది అని గ్రహించాలి .రాముడు పూసుకొన్న చందనం ‘’వరాహ రక్తం ‘’లా గా సుగంధాన్ని వేద జల్లుతోంది అన్న కొత్త విషయం తెలిపారు .అంటే వరాహ రక్తం అంత పరిమళ భరితం గా ఉంటుందని మనకు తెలియని విషయాన్ని రచయిత తెలియ జేశారు .
వన వాసానికి వెళ్ళే ముందు రాముడు దాన ధర్మాలను విపరీతం గా చేశాడు .’’క ఠ.కలాప శాఖ ‘’కు చెందినబ్రాహ్మణులు ‘తీపి పదార్ధాలు బాగా తింటారని ,వారికి వేదాధ్యయనం తప్ప వేరొక పని చేత కాదని కనుక వారికి కావలసిన సమస్తము సమ కూర్చమని తమ్ముడు లక్ష్మణుడిని రాముడు ఆదేశిస్తాడు .నిరంతర వేదాధ్యయ నం జరగాలి అని శ్రీ రామ చంద్రుని కోరిక అని ,వైదిక ధర్మ రక్షణ అందరి కర్తవ్యమని ఇందులోని సారాంశం .అసమన్జసుడి దురాగతాన్ని ప్రజలు రాజైన సగరునికివిన్న వీస్తే ,ప్రజా క్షేమం కోసం తన కుమారుడిని ,వాడి భార్యా పిల్లల్ని దేశం నుంచి కట్టు బట్టలతో బహిష్క రించి ప్రజా క్షేమం రాజు తక్షణ కర్తవ్యమ్ గా చేశాడు .ఆదర్శ ప్రాయు డైనాడు .ఇదీ ప్రజా భీష్టాన్ని నేర వేర్చటం అంటే .ఇవాళ మన నాయకులు వాళ్ళ కొడుకులు ,అల్లుళ్ళు ,బామ్మర్దులు ,వందిమాగధులు బంధు గణం అధికారాన్ని అడ్డం పెట్టుకొని చేయని దుష్క్రుత్యం లేదు .,ప్రజా పీడనా లేదు .ప్రజలు ఎంత మొత్తుకొన్నా వారికి చీమ కుట్టి నట్లుకూడా ఉండదు .ఇదీ మన ప్రజాస్వామ్యం .వారిని వెనకేసుకొచ్చి ఇంకా నెత్తికి ఎత్తు కొంటూ ‘’బె బె‘’అని మనల్నే ఎక్కి రిస్తున్నారు .వీటికి కోర్టులే శరణ్యం అయ్యాయి అందులోంచి ఫలితం తేలటా నికి ఏళ్ళూ ,పూళ్ళూ పడుతుంది .రాజ రిక వ్యవస్థ లో తక్షణ న్యాయం జరిగేది అని అని పిస్తుంది మనకు .వ్యవస్థ ఎంత పతనమైనదోఅర్ధమవుతుంది .ఆదర్శం అటకెక్కింది .అన్యాయం చంక నేక్కింది .ఇలాంటి ఎన్నో విషయాలు శ్రీ చిలుకూరు వెంకటేశ్వర్లు గారు మనకు తెలియ జేసి మార్గ దర్శనం చేశారు .
సశేషం
మీ—గబ్బిట దుర్గా ప్రసాద్ –4-1-13-కాంప్ –హైదరా బాద్
చిలుకూరు వారి వచన వాల్మీకి రామాయణం
చిలుకూరు వారి వచన వాల్మీకి రామాయణం
శ్రీ రామ కృష్ణ తపోవనం నుండి శ్రీ చిలుకూరు వారి విజ్ఞప్తి
మనిషికి పుట్టగానే డబ్బు సంపాదన యావ ఉండటం సహజం .ధనాన్ని ఎన్ని రకాల వీలైతే అన్ని రకాల సాధించి ,అష్టైశ్వర్యాలతో తుల తూగాలని కాంక్ష ఉంటుంది .దాన్ని సార్ధకం చేసుకోన్న్న వారెందరో మనకు తెలుసు .ఆ డబ్బును కొందరు సంఘ ప్రయోజనాల కోసం ధారాళం గా ఖర్చు ఠా అలాంటి అరుదైన మనిషి -మనీషిగా ఎదిగిన వారు బ్రాహ్మణులు అయిన శ్రీ చిలుకూరు వెంకటేశ్వర్లు .గారు.
శ్రీ చిలుకూరు వెంకటేశ్వర్లు గారు మా ఉయ్యూరు దగ్గర తోట్ల వల్లూరు లో నోరి వారింట జన్మించారు .తర్వాత చిలుకూరు వారికీ దత్తత వెళ్లారు .మద్రాస్ చేరి పెయింట్ వ్యాపారం లో, ,ఫైనాన్స్ లో ,రియల్ ఎస్టేట్ లో పిచ్చగా సంపాదించారు .అరవైఏళ్ళ దాకా ధన యావ తప్ప రెండోది ఆయనకు తెలీదు .అప్పుడు ఆయన జ్ఞాన నేత్రం తెరుచుకోంది..జీవిత గమ్యాన్ని మార్చుకోవాలన్న ఆలోచన కలిగింది .తన డబ్బు ,సంపదా అంతా కొడుకులకు, వారికి దక్క వలసినది అంతా న్యాయం గా పంచేసి , ,తనకు వచ్చిన దానిలో చెన్నై లోని శ్రీరామ కృష్ణా మ ఠంకు చాలా భాగం రాసిచ్చి , ,అక్కడే తపోవనం లో సాధారణ జీవితాన్ని ,ధ్యాన దీక్ష ,సాహిత్య రచన తో గడుపుతూ శ్రీ రామ కృష్ణ పరమ హంస వారి దివ్య బోధా ప్రచారం కోసం పుస్తకాలను రాసి ప్రచురిస్తున్నారు .భాగవతాన్ని వచనం గా సరళ శైలిలో రాశారు .భగవద్గీత ను పదవ తర గతి విద్యార్ధులను దృష్టిలో ఉంచుకొని ,వారికి అర్ధమై,అందే తీరులో శ్రీ పరమ హంస గారు చెప్పిన కధలను జోడిచి ,మనస్సుకు హత్తుకొనే రీతిగా రాసి ,విద్యార్ధులకు రామ కృష్ణ మిషన్ ద్వారా ఉచితం గా అంద జేశారు .తరువాత విద్యా రన్యస్వామి రచించిన శ్రీ శంకర విజయాన్ని అతి సుందర సుస్పష్ట తెలుగు వచనం గా అనువదించి ఇనుప గుగ్గేల్లను తీపి మిఠాయి చేసి అందించి ఏ కొద్ది మంది మాత్రమే బాగా సంస్కృత ప్రావే న్యం ఉన్న వారికి మాత్రమె అర్ధమయ్యే విద్యారణ్య బోధనలను ,జన సామాన్య్లకు చేరువ చేసి సంచలనం సృష్టించారు ., , మంచి పేరూ పొందారు .వాల్మీకి రచించిన శ్రీ మద్రామాయణాన్ని అత్యంత మెలకువ తో సులభ శిలిలోవచనం గా రెండు భాగాలుగా అనువదించి ,మహర్షికి గొప్ప నీరాజనం ఇచ్చారు .ఎప్పుడో డెబ్భై ,ఎనభై ఏళ్ళ క్రితంమహా పండితులు ,మంత్ర ద్రష్ట ,అనేక ఆద్యాత్మిక గ్రంధ రచయిత అయిన స్వర్గీయ జన మంచి శేషాద్రి శర్మ గారు రచించిన ‘’శ్రీ రామావతార తత్త్వం ‘’ను మళ్ళీ ఎవరు పునర్ముద్రించని కారణం గా వెంకటేశ్వర్లు గారు-శ్రీ శర్మ గారి విధానం లోనే ఇంకా సులభ గ్రాహ్యం గాఅనేక విశేషాలతో ,పూర్వా పరాలతో గొప్ప సమన్వయ ద్రుక్పధంత్తో రాసి ఆస్తిక జనానికి మహాద్భాగ్యాన్ని కల్గించారు .మా రెండో కోడలు ఇందిరకు ఆయన తాత గారు .నా అడ్రెస్ వారు సంపాదించి వారు ప్రచురించిన పుస్తకాలన్నీ పోస్ట్ లో పంపారు .అన్నీ చదివి ,వారికి వివరం గా నా అభిప్రాయాలను లేఖ ద్వారా తెలియ జేశాను .అప్పుడప్పుడు ఫోన్ లో మాట్లాడే వారు మన సరసభారతి ప్రచురించిన పుస్తకాలన్నీ వారికి పంపాను .చదివి స్పందించేవారు .ఇలా మా సాహిత్య బాంధవ్యం ఏర్పడింది .ఇప్పుడు నేను 7-4-2011 నవారికి రాసిన వారి వచన రామాయణ విశేషాలను మీ అందరికి అంద జేస్తున్నాను .About the Author Sri Venkateswarlu
శ్రీ మద్రామాయణం
వాల్మీకి కృత రామాయణానికి శ్రీ చిలుకూరు వెంక తెశ్వార్లు గారు చేసిన అను వాదం సరళం గా ,సహజం గా ,స్న్దరం గా ,నిసర్గ రమణీయం గా ఉంది .మంచి ముద్రణా ,అందమైన ముఖ చిత్రం తో సర్వాంగ సుందరం గా పుస్తకం హస్త భూషణం గా ఉంది .మొత్తం మీద ఒకే ఒక అచ్చు తప్పు కానీ పించింది అంటే ముద్రణ విషయం లో ఎంత జాగ్రత్త తీసుకొన్నారో అర్ధమవుతుంది ‘’మరి ఎలా రామాయణమ్మన్నచో ‘’అనుకొన్న విశ్వ నాద సత్య నారాయణ గారి మార్గం లోనే వీరూ ఆలోచించారు .ఆయన అనుభవ సారాన్ని ఇమిడ్చి రచించటం హర్షనీయం ,ఆనంద దాయకం .దగ్గర కూర్చో పెట్టుకొని ,ఆప్యాయం గా చక్కగా చిక్కగా కదా చెప్పి విని పించి నట్లు గా,హాయిగా ఉండటం విశేషం ..కధా గమనానికి అవసర మయాన వాటినే గ్రహిస్తూ ,అతిగా ఉండే వర్ణనల జోలికి పోకుండా ,ప్రతి వాక్యం చదవాలి చదివి అందులోని సారాన్ని తెలుసు కోవాలన్న ధ్యేయం తో సాగిన రచన .సాంప్రదాయ రచనగా ,ఆర్ష ధర్మ వ్యాప్తి గా రాశారు .శ్రీ పరమహంస ల అవ్యాజ కరుణా రసం వీరిపై సంపూర్ణం గా ఉంది .అందుకే రచన హృద్యమైంది .ఎక్కడా సందిగ్ధత లేదు .సారళ్యం సర్వదా కానీ పిస్తుంది .మహర్షి వాల్మీకి రామాయణాన్ని హృద్గతం చేసుకొన్నారు కనుక ,ఆ భావ వ్యాప్తి అంత సులభ తార మైంది వెంకటేశ్వర్లు గారికి .మనసారా అందరు అభి నందిన్చాల్సిన ప్రయత్నం .
అగ్ని శర్మ అత్రి మహర్షి ప్రేరణ చేత తపస్సు చేసి ,వాల్మీకి మహర్షిగా అవత రించటం,ఆది కవి అయి ,ఆది కావ్య మైనశ్రీ మద్రామాయణాన్ని రాయటం మనసుకు హత్తుకొనే రీతిలో రాశారు .ఈ నాడు విప్ల వాత్మకం గా భావించే ‘’Fraternity of mankind ,world citizenship,human dignity concern for society ,nationalism ‘’అన్నభావాలను రామాయణం లో అడుగడుగునా దర్శన మిస్తాయని చిలుకూరు వారు తమ ప్రస్తావన లోపెర్కొనటం సముచితం చక్కని ప్రాతి పదిక కూడా.ఈ మొత్తం భావ వ్యాప్తియే రామాయణం.రాముని మార్గమే కాదు సీత మార్గమే కాదు మానవాళి ప్రయాణ మార్గాన్ని సూచించాడు మహర్షి వాల్మీకి కవి .అలాగే రాముడు మానవ మాత్రుడి గానే వ్యవహరించటానికి తన ‘’మాయ ‘’ఏ తనను ఆవహించాలని కోరుకోవటం వల్లనే అన్న విషయం సరిగ్గా సరిపోతాయి .యుద్ధ కాండ చివరలో దేవత లంతా శ్రీ రాముడిని శ్రీ మహా విష్ణువే అని ప్రస్తు తిన్చితే రాముడు మాత్రం తాను దశరధ పుత్రుడినే అనటం ,రామాయణ ఆత్మను ప్రదర్శింప జేయట మే..మానవుడు అనుకొంటే అన్నీ సాధించగలడు అని స్పష్టం గా తెలియ జేయట మే ఈ మాటల్లోని పరమార్ధం.అందుకే ‘’మనుష్యుడిల మాహాను బావుడే ‘’అన్నాడు ఆధునిక కవి .
సశేషం
About the Author Sri Venkateswarlu
మీ –గబ్బిటదుర్గా ప్రసాద్ –3-1-13—కాంప్—హైదరాబాద్
మిధునం పై మధనం –ఈనాడు సినీ రివ్యు
మిధునం పై మధనం –ఈనాడు సినీ రివ్యు
సాహితీ బంధువులకు -ఈ నాడుపత్రిక సినిమా విభాగం లో మిధునం పై మంచి సమీక్ష చేశారు .అందులోని ముఖ్య విషయాలు వారి మాటలు ,నా మాటల మేళ వింపు తో మీకోసం –
”మిధునం మన మూలాల్ని గుర్తు చేసింది .ఇప్పటి దాకా మనం చూసింది తెలుగు సినిమాలేనా అని పిస్తుంది .పేర్ల నుండి పతాక సన్నీ వేశాల వరకు పచ్చదనాన్ని నింపారు .ప్రేక్షకుల్ని కన్నీరు ఒలికించారు అవీ పచ్చగా ఉండటం విశేషం .తెలుగు కాయ గూరలు కాపు ను పువ్వు దశ నుంచి ,పిందే,కాయ దశ వరకు ఉన్న క్రమస్తితిని తెరకెక్కించి తెలుగు తోట తీయదనాన్ని ,వికసనాన్ని ప్రత్యక్షీకరించారు .నేటివిటి కి అద్దం పట్టారు .జీవిత చరమాంకం లో ఒంటరిగా దాంపత్య జీవితం అను భావించటం లో ఉన్న జీవిత మాధుర్యాన్ని కళ్ళకు కట్టించారు .గొప్ప అను భూతిని కల్గించారు .మనమూ ఈ ఆనందాన్ని అనుభవించి తరిద్దాం అనే భావన అందరికి కలిగించటం ఈ సినిమా సాధించిన గొప్ప విజయం .ముసలి దంపతుల చిలిపి తగూలు ,ప్రేమాను రాగాలు ,చిరు అనుమానాలు మనకు ఎంతో అనురక్తిని కలిగిస్తాయి .తన కంటే భర్తనే తన దగ్గరకు తీసుకు వెళ్ళమని భార్య భగ వంతుని కోరుకోవటం లో ఆమెకు భర్త పై ఉన్న పూర్తీ ప్రేమ గౌరవం ,ఆరాధనా ప్రస్పుటం గా కని పిస్తుంది .
మనిషిగా పుట్టటం గొప్ప కాదు .మనిషి గా బతకటం గొప్ప అనే గొప్ప సందేశం ఇచ్చే చిత్రం .రిటైర్మెంట్ అంటే ఏ పనీ చేయకుండా కూర్చోవటం కాదని రొటీన్ పనులకు స్వస్తి చెప్పటమని మంచి భావనా వ్యాప్తిని తెచ్చిన సినిమా ఇది .శ్రీ రమణ రాసిన కధలో మూడు పాత్రలు ఉంటె దర్శకుడు భరణి రెండే పాత్రలతో ఆ సాంతం రక్తి కట్టించాడు .ఆ రెండు పాత్రల్లో బాలు ,లక్ష్మీ బాగా ఒదిగి పోయారు.పతాక సన్నీ వేశం లో లక్ష్మి నటన మనల్ని కట్టి పడేస్తే ,చిన్న పిల్లాడి మనస్తత్వం ఉన్న అసలు సిసలు తెలుగు ముసలాయనగా ,మల్లాది వారి ”అన్నప్ప శాస్త్రి”లాగా ఇందులో ”అప్ప దాసు ”గా బాలు పక్వ నటన ప్రదర్శించాడు .వీణా పాణి సంగీతం ,జేసుదాసు పాటలు ,సినిమావిజయానికి చాలా బాగా సహకరించాయి .భరణి అన్నీ తానే అయి తన” సకల కళావిశ్వ రూపాన్ని” ప్రదర్శించాడు .ఈ సినిమా తీయటం సాహసమే .ఆ సాహసాన్ని చేసి సాహస వీరుడని పించుకొన్నాడు నిర్మాత ఆనంద రావు .అచ్చమైన తెలుగు వారి సినిమా అంటే ఇలాగ ఉండాలి ,ఇలాగే ఉండాలి అని దర్శకుడు భరణి సాహస వంతం గా మిదునాన్ని తెర కెక్కించాడు . అచ్చ మైన తెలుగు చిత్రమైన ఈ ”మిధునం ”హృద్య మైన చిత్రం ”అని ఈనాడు సినిమా రివ్యు ప్రకటించింది .
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –2-1-13-ఉయ్యూరు
కాశీ ఖండం -45(చివరి భాగం ) కాశీ తీర్ధ పూజా విధి
కాశీ ఖండం -45(చివరి భాగం )
కాశీ తీర్ధ పూజా విధి
తీర్ధ యాత్ర ,దేవయాత్ర ,గురు యాత్ర అని మూడు రకాల యాత్రలున్నాయి .స్నాన ప్రధానంగా పుణ్య నదీ ప్రవాహాలున్న చోట్లకు వెళ్లటం తీర్ధ యాత్ర..దేవతా ప్రధానం గా ఉన్న క్షేత్ర దర్శనం దేవ యాత్ర .పరబ్రహ్మోప దేశం ,పంచాక్షరీ మంత్రోప దేశం పొంది వేద శాస్త్ర ఇతిహాస గ్రంధాలలోని జీవనో ద్దారక ,జన్మ తరణ సంబంధిత సూక్ష్మ ధర్మ విశేషాలను బోధిస్తూ సన్మార్గం లో నడిపే సద్గురు దర్శన ,సేవనం ,,పూజనంతో కాలం గడి పితే గురు యాత్ర .
సద్గురు కటాక్షం ద్వారా తప్ప జ్ఞాన ప్రాప్తి లభించదు .జ్ఞానం లేక పోతే దైవం ,దేవతా స్థలం ,తీర్ధ ,క్షేత్ర యాత్రల గురించి అవగాహన ,శ్రద్ధా ,విశ్వాసం ఏర్పడవు .అందరికి చివరి కాలం లో గురు యాత్ర కావాలి .గురు యాత్ర వల్ల సర్వ యాత్ర సంపూర్ణం గా పుణ్య ఫలం లభిస్తుంది సర్వ తీర్ధాలలో ప్రయాగ శ్రేష్టం .ఆ ప్రయాగ జలం కాశీ లోనీ గంగా జాలం పంచ గంగా ఘాట్ లో కలుస్తుంది .సమస్త క్షేత్రాలలో, దేవ యాత్రలలో ముఖ్య మైనది కాశీ యాత్ర .కాశీ యాత్ర చేసి వచ్చిన వారు కాశీ పూజ లేక తీర్ధ పూజ చేస్తారు .కాశీ తీర్ధ పూజా విధానం తెలుసు కొందాం
కాశీ గంగోదకాన్ని మూడు రాగి కలశాలలో నింపి సీల్ వేసి తెచ్చుకోవాలి ఆ నీటిలో ప్రయాగ సంగమ నీరు ,పంచ గంగానీరు ,మణి కర్ణిక నీరు తప్పక కలపాలి ..ఈ మూడూ కలిసిన జలాన్నే రాగి చెంబుల్లో పోసి సీల్ చేయించి ఇంటికి తెచ్చుకోవాలి .ఇంటి వద్ద ఈ మూడు కళాశాలకు భక్తీ తో పూజ చేయాలి .ఒక ఏడాది లోపు ,లేదా తొమ్మిది నెలల లోపు ,,లేక తొంభై రోజుల లోపు రామేశ్వరం వెళ్ళి ,ఒక కలశం లోనీ నీటిని అక్కడి పూజారికిఇచ్చి రామేశ్వర జ్యోతిర్లింగం పై గోత్ర నామాలు చెప్పించి ,అభిషేకం చేయించాలి ..తర్వాతా రామేశ్వరం లోనీ ఇసుకను ఒక డబ్బాలో పోగు చేసి ,ఏడాది లేక తొమ్మిది నెలలు ,లేక తొంభై రోజులు లోపల ,మళ్ళీ కాశీ చేరి ,ప్రయాగ సంగమ స్థలం లో రామేశ్వరం లోనీ ఇసుకతో శివ లింగాన్ని ఒక పాత్రలో చేసి పూజించి ,దక్షిణ ,వస్త్రాలతో పాటు ఆ పాత్రను దానం చేయాలి .ఆ సేతు శివ లింగాన్ని నిమజ్జనం చేయాలి .
రెండవ కలశం లోనీ తీర్ధ జలాన్ని పూజ చేసిన తర్వాతా విప్పి ,అందరికి ప్రోక్షణ చేయాలి .తీర్ధం గా కూడా గ్రహించాలి .యజమాని మూడవ కలశం లోనీ తీర్ధాన్ని పూజా గదిలో జాగ్రత్త గా భద్ర పరచి రోజు పూజ చేయాలి .ఆ నిండు కలశం లో కాశీ తీర్ధం మూడు చుక్కలు కలుపు కొని ,తర్వాత దేవుళ్ళను కడగాలి .రోజూ పూజ లో ఉపయోగించాలి .పండుగ రోజుల్లో ,పర్వ కాలాలలో ,గ్రహణ సమయం లో స్నానం చేసే టప్పుడు ఆ జలాన్ని మూడు చుక్కలు కలిపి స్నానం చేస్తే కాశీలో స్నానం చేసిన ఫలితం వస్తుంది .
తూర్పు లేక పడమర వైపు చుట్టూ స్థలం వదిలి తొమ్మిది ఫీట్ల స్థలాన్ని ఆవు పేడ ,ఆవు మూత్రం ,గంగాజలం తో శుద్ధి చేసి ,అయిదు రకాల రంగులతో ముగ్గు లు వేయాలి .ఆ ముగ్గుల్లో‘’కాశీ విశ్వేశ్వరాయ నమః ‘’అనే అక్షరాలూ కూడా ముగ్గు తో రాయాలి .సరి పడ బల్ల పీటా వేయాలి .ముగ్గు పై ఒక తెల్ల వస్త్రాన్ని మూడు వరుసలుగా పరవాలి .దాని పై తొమ్మిది కిలోల శుభ్రం చేసిన బియ్యాన్ని పోయాలి ..ఆ బియ్యం మధ్య అయిదు పావు సేర్ల బియ్యం ఉడికే ఇత్తడి కలశాన్ని సున్నం రాసి అయిదు పోగుల దారానికి మామిడాకు ,లేక తమల పాకు ను మడిచి కట్టి కలశానికి అయిదు చుట్లు చుట్టి ,,పసుపు ,కుంకుమ తో అయిదు బోట్లు పెట్టి ,అలంకరించాలి .ఈ కలశాన్ని నీతితో నింపాలి .పంచ పల్ల వాలు అంటే అయిదు రకాల చిగురు టాకులచిన్న కొమ్మలనుదగ్గర గా చేర్చి పచ్చని బట్టతో కట్టి ,కలశం లో ఉంచాలి దాని పై పెద్ద కొబ్బరి కాయను ,అడ్డం గా యజమాని వైపు ముఖం ఉన్దేట్లుఉంచాలి .చుట్టూ ఎనిమిది దిక్కులా ,రెండు తమల పాకుల్లో వక్కలు ,కర్జూర,బాదం వేయాలి .ఈశాన్యం లో నవగ్రహాలను కూడుక లో అమర్చాలి .ఆగ్నేయ ,నైరుతి ,వాయవ్య ఈశాన్య కోణాలలో వరుసగా అష్ట భైరవులను ,56వినాయకులను ,ద్వాదశాదిత్యులను ఏర్పాటు చేయాలి .వీటిలో వక్కలు కర్జూరం ఉంచాలి .ఉత్తరం లో నవ దుర్గలను ,గంగా దేవి మణి కర్ణికా లను ,తూర్పున ఏకాదశ రుద్రులను ,శివలింగాలను ,దక్షిణం లో దండ పాణి ,కాశీ గుహ భావానీలను ,బిందు మాధవుడిని ,పడమరగంగా ఘట్టాలను అమర్చాలి ఇరవై అయిదు కుడుకలు ,రెండు వందల ఎనిమిది పోకలు ,అన్నే కర్జూరాలు ,నూట ఎనిమిది తమల పాకులు కావాలి తొమ్మిది పోగులతో కూడిన కంకణాలను సిద్ధం చేసుకోవాలి .మండపాన్ని కొబ్బరి అరటి లతో అలంకరించాలి మామిడి తోరణాలు కట్టాలి .బంధువు లందర్నీ ఆహ్వానించాలి పైన ఉన్న అందరి దేవతలను ఆహ్వానించి యదా శక్తి గా పూజ చేసి నైవేద్యం పెట్టి హారతివ్వాలి ప్రదక్షిణ నమస్కారం చేయాలి ..ఈ కింది స్తోత్రం చెబుతూ సాష్టాంగ నమస్కారం చేయాలి
‘’జన్మ కారణ మైన కర్మకు –జన్మ మే లేని విధముగా –కర్మ భూమి లో వాసి కెక్కిన శర్మ భూమియే కాశి క్షేత్రము
పంచ భౌతిక దేహమిదియే –పంచ ప్రాణాత్మకము ఇదియే –పంచ క్రోశము తిరిగి నంతనె –పంచ ముఖు నె చేరులే
శక్తి తో అనురక్తి వీడి –యుక్తి తో ఆసక్తి వదిలి –అవి ముక్తమునే గాన్చుమా –ముక్తి పదవినే పొందుమా
ఆశా పాశము ద్రెంచుమా –ఆశను దాసిగా జేయుమా –క్లేశములే యెడ బాపుమా –కాశీ వాసము నీయుమా
దేవ దానవ మానవాళికి –దివ్య ధామము ,పాప నాశము –కవి కేదారుని ప్రాణ సమము –భువి లో వెలసిన భవు నివాసము ‘’
వారణా సీకీ జై –శ్రీ కాశీ విశ్వనాధ భగవాన్ కీ జై అని బిగ్గర అనాలి .
‘’హర హర మహాదేవ సాంబా –కాశీ విశ్వనాధ గంగా –మహాదేవ మహాదేవ విశ్వనాధ శివ శివ
మహా కాల మహా కాల రక్ష హర హర –హర సాంబ హర సాంబ సాంబ సాంబ హర హర
హర శంభో హర శంభో శంభో శంభో హర హర అని అయిదు సార్లు అనాలి .
కాశీ అన్న పూర్ణా విశాలాక్షీ సమేత విశ్వేశ్వర భగవాన్ కీ జై ,గంగా మాతకు జై అని గట్టిగా నినాదం చేయాలి .పరమేశ్వరార్పణం అని అక్షతలు నీరు వదలాలి .తొమ్మిది మంది దంపతులకు భోజనం పెట్టాలి
ఈ విధంగా , విధి విధానం గా పూజ చేసిన వారికీ సర్వ తీర్ధ స్నాన ఫలం ,సమస్త క్షేత్ర దర్శన ఫలం ,కాశీ నివాస ,యాత్రా సంపూర్ణ ఫలం లభిస్తాయి
నాతో పాటు మీరందరూ కాశీ యాత్రలో సుమారు నలభై అయిదు రోజులు పాల్గొన్నందుకు ”శుభం భూయాత్ ”–స్వస్తి
శ్రీ కాశీ ఖండం సర్వం సంపూర్ణం
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ —2-1-13-ఉయ్యూరు
నూతన సంవత్సరం – మొదటి సన్మానం
This gallery contains 12 photos.

























































