శ్రీ శంకరుల లలి (కవి )తా సౌందర్య లహరి –42

        శ్రీ శంకరుల లలి (కవి )తా సౌందర్య లహరి –42

 94—‘’కలంకః కస్తూరీ రజనికర బింబం జలమయం –కళాభిహ్ కర్పూరైర్మరకత కరండం ,నిబిడితం

           అతస్తాద్భోగేనా ప్రతి దిన మిదం రిక్త కుహరం –విధిర్భూయో భూయో ,నిబిడ యతి నూనం తవ కృతే ‘’

          తాత్పర్యం –అమ్మా దక్షిణా మూర్తి స్వరూపిణీ !లోకం లో చల్లదనాన్ని చ్చే దాన్ని చంద్రుడని ,కళంకం అని ,చంద్ర కిరణాలని ,చంద్ర బిమ్బమని చంద్ర మండ లాన్ని గురించి అజ్ఞానం తోఅనుకొంటాం .నిజం గా ,ఆ చంద్ర మండలం –నువ్వు కస్తూరి మొదలైన పదార్ధాలను ఉంచుకొనే తాంబూల భరిణే .కళంకం అంటే నువ్వు ఉయోగించే కస్తురే.చంద్రుడు నువ్వు జలక  మాడే పన్నీరు గిన్నె .చంద్ర కళ లే పచ్చ కర్పూరం పలుకులు .ఇవన్నీ నిత్యం నువ్వు వాడుతూ ఉంటె తరిగి పోతుంటే ,నీ సేవకుడు బ్రహ్మ మళ్ళీ ఆ వస్తువులను అక్కడ నింపు తున్నాడు .లేక పోతే చంద్రునికి కళలు ఎందుకు తగ్గుతాయి ?

         విశేషం –కుబేర ,పశుపతి ,ప్రజాపతి అనే పంచ దశ దేవతలు శక్తి అయిన భగవతి స్వరూపాలే .చాంద్రీ ,కలా,అమృతమయ ,,పిబసి అనేవి అవే .భగవతి అమృత పానం వల్ల వారి వారి స్వసాదారణ శక్తి రూపం గ కన్పిస్తోంది .మార్కండేయ పురాణం లో ‘’యచ్చ కించి త్క్వచిద్వస్త ,సద సర్వాఖిలాత్మకే –తస్య సర్వాస్య యా శక్థిహ్ సా త్వం కిం స్రూయసే మయం ‘’అన్నదానికి వివరణేపై శ్లోకం .

        ‘’సర్వ త్రాను ,స్యూత దేవతా రూపేణ ప్రతిభా సమానో –ఏకైక చిచ్చక్తి రూపాది  భేదేన నానా ప్రతి భాసతే –‘’అని మంత్ర ప్రకాశిక లో ఉంది .కృష్ణ పక్షం లో కామేశ్వరీ ,భగమాలినీ ,నిత్యక్లిన్నా ,భేరుండా ,వహ్ని వాసినీ ,వజ్రేశ్వరీ ,శివ దూతీ ,త్వరితా ,కుల సుందరీ ,నిత్యా ,నీల పతాకా ,విజయా ,సర్వ మంగళా ,జ్వాలా మాలినీ ,చిత్రా అనే పంచ దశ నిత్యలు ప్రతి లోమం గా వస్తాయి .ఇవన్నీ శ్రీ దేవి అధిష్టాన భూతాలు

              రజని కర బింబం జలమయం .అమృత బీజ మైన వకారాత్మక బిందువు .రిక్త కుహరం .షోడశ స్వర ,సంవిత్కలా మాత్రావ శేషితం ..మళ్ళీ శుక్ల పక్షం లో అనులోమంగా ,కామేశ్వరి మొదలు చిత్ర వరకు ఆయా తిది నిత్య లక్షణ కళలు .పూరింప బడుతాయి .

  భగవతి సమస్త భోగానుభావం కలది .ఆమెకు బ్రహ్మాన్డమే గృహం .ఊర్ధ్వంగం విథానం .మేరువు మొదలైనవి విహార స్తలాలు .నక్షత్రాలు హారాలు .గోత్రాభిదులు పౌత్రులు .బ్రహ్మాదులు పుత్రులు .మార్తాన్డుడే ఇంట్లోని దీపం .సకల జగత్తును చక్కని చల్లని వెలుగులతో నింపే చంద్రుడు సుగంధ వస్తువులుంచే కరండం .అందులోని కలంకమే కస్తూరి .జలమే పన్నీరు .కల –కర్పూరపలుకులు .

  కళంకం ఉండటం లో  మరకత వర్ణం అంటే నీలి రంగు .చంద్రుడు జలమయం తెలుపు .సముద్రాలలో నీల వర్ణం ఉండటం చేత మరకత కరండం అయింది .చంద్ర కళలన్నిటిని దేవతలు కబ లిస్తారు .’’ప్రధమా పిబతే వహ్ని ద్వితీయా పిబతే రవిహ్ ‘’అని ఉన్నది .దేవి సర్వ మయి .సర్వత్రా అను స్యుత .అంబా స్తవం లో –‘’త్వం చంద్రికా ,శశిని ,తిగ్మరుచౌ ,రుచిస్త్వం –త్వం చేతనాపి ,పురుషే ,పవనే ,బలం త్వం –త్వం ,స్వాదుతాసి ,,సలిలే ,శిఖాని త్వమూష్మా –నిహ్ సారమే తదఖిలం త్వ ద్రుశే ,యదిస్యాత్ ‘’

    శ్రుతికూడా ‘’అహం రుద్రు భిర్వసుభిశ్చ  రమ్యః ,మాదిత్యై రుత విశ్వ దేవః ‘’అన్నది .స్మృతి లో’’యదాదిత్య గతం తేజో ,జగద్భాసయతేఖిలం –యచ్చంద్ర మసి ,యచ్చాజ్ఞౌ ,తత్తేజో విద్ధి మామకం ‘’అని చెప్పింది .

95—‘’పురారాతే రంతః పురమసి ,తతస్త్వచ్చరణయో –స్సపర్యా మర్యాదా తరల కరణానా ,మసులభా

       తదాహ్యేతే నీతా ,శ్శత ముఖా సిద్ధ మతులాం –తమద్వారో స్టాన స్తితిభి రణి మాద్యాభి రమరాః

           తాత్పర్యం –పురారాతి పట్టపు రాణీ ‘!నీ చరణ సపర్యా మర్యాద చపల చిత్తం వారికి దుర్లభం .అందువల్లే చపల చిత్తు డైన ఇంద్రుడు మొదలైన దేవతలు నీ అంతః పుర ద్వార పాలన చేసే అణిమ ,మహిమా గరిమ ,లఘిమ ,ప్రాప్తి ,ప్రాకామ్య ,ఈశిత్వ ,వశిత్వాలనేఅష్ట విభూతులను కొలిచి ,వారి వల్ల సాటి లేని అభీష్ట ఫల సిద్ధి ని పొందారు .చంచల చిత్తం లేని వారికే అంటే సమయా చారులకే సుధా సింధు మధ్యస్తిత శ్రీ దేవి పాదాంబుజ సేవ లభిస్తుంది .’

      విశేషం –శ్రీ దేవి అంతః పురం వద్ద ఉన్న అణిమాది సిద్ధులు ఆమెను ఎలా సేవిస్తున్నారో ,ద్వారాల వద్ద ఉన్న ఇంద్రాదులూ అలానే సేవిస్తున్నారు .అణిమాదులు ద్వారా పాలకులు కనుక సర్వదా అక్కడే ఉంటారు .ఇంద్రాదులు చపలురు కనుక ,అంతః పుర అర్హత లేని వారూ కనుక, ద్వారపాలకుల అను మతి తో ద్వారం వద్దనే ఉండి ,సిద్ధి పొందుతున్నారని భావం .శ్రీ చక్ర భూ గృహ ద్వారం వద్దే అణిమాది సిద్ధులకు స్తానం .వీరు అష్ట దిక్పాల కు లతో దేవిని కాపలా కాస్తున్నారు .

          ఇంద్రాదులు ద్వారపాలకుల వల్ల సంపద పొందారు .సంసారం లో ఆనందాన్ని అనుభ విస్తున్నారు .కనుక లోపలకు వారికి ప్రవేశార్హత లేదని భావం .మనో నిగ్రహం లేని వారికీ ,ధ్యాన విధానం లేని వారికీ శ్రీ దేవి చరణ కమల సేవ లభించదు .అకార వాచ్యు లైన బ్రహ్మాదులకు సులభం .ఇంద్రాదులు వైభవం తో ,ఊర్వశి మొదలైన దేవ వేశ్యల సంభోగం తో రసికులై ఇంద్రియ జయం పొందలేదు కనుక అర్హత సంపాదించ లేక పోయారని అర్ధం .అందుకే ద్వార పాలకుల్లా అక్కడే ఉండి పోయారు .అని శ్రీ శంకర మనో భావాన్ని తుమ్మల పల్లి వారు మనోహర మైన ఆవిష్కరణ చేశారు .

           సశేషం –మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –8-11-12-ఉయ్యూరు 


గబ్బిట దుర్గా ప్రసాద్

https://sarasabharati.wordpress.com
http://suvarchalaanjaneyaswami.wordpress.com

Posted in రచనలు | Tagged | Leave a comment

మన నుడి లిపి గొప్పది : ప్రపంచం లోనే రెండవది

Posted in సేకరణలు | Tagged | Leave a comment

అమెరికా లో జర్మన్ హవా -8

    అమెరికా లో జర్మన్ హవా -8

 1732-1800 కాలం లో జర్మన్ వార్తా పత్రికలు 38 మాత్రమె ఉండేవి .1848-60 మధ్య జర్మన్ అమెరికన్ పేపర్లు వచ్చాయి .జర్మ పేపర్లు 266 అయాయి .ఇన్ని పెరగటానికి కారణం ‘’ఫార్టీ యైటర్లె ‘1860 లో సెయింట్ లూయీస్ లో ఏడు మాత్రమె జర్మన్ డైలీ పేపర్లున్దేవి .నలభై ఎనిమిది వాళ్ళు Die Waage ,Anzazer ,dest westens పత్రిక లలో స్టాఫ్ గా చేరి పని చేశారు .చివరికి యాంటి స్లేవరి పేపర్లు గా మారాయి .చార్లెస్ నాస్ట్ అనే ఫార్టీ యైటర్-‘’ఫాదర్ ఆఫ్ పొలిటకల్ కార్టూనిస్ట్ ‘’అయాడు .ఆయనే డెమొక్రాటిక్ పార్టీ వారికి ‘’గాడిద ను ‘’రిపబ్లిక్ పార్టీ వారికి ‘’ఏనుగు ‘’ను‘’మస్కట్స్‘’గా వేశాడు .ottoman mergan thaler లినో టైప్ కనీ పెట్టి ,ఆటో మేటిక్ టైప్ సెట్టింగ్ కు ఆద్యుడైనాడు .ఇదంతా 1886 july 3న. ఈ మార్పుthe newyork tribune లోప్రారంభ మైంది .1894 లో 800 ఉన్న జర్మన్ పబ్లికేషన్లు క్రమం గా తగ్గాయి .1910-20కాలం లో 234కు పడి పోయాయి .

           1920 లో సెన్సస్ ప్రకారం జర్మన్ మైగ్రేషన్ 25.3% కు తగ్గింది .1923 లో సుప్రీం కోర్టు జర్మన్ భాష నిషేధాన్ని రద్దు చేసింది .1919 లో ఆల్కహాల్ తయారు చేయటాన్ని 18 వ సవరణ ను రద్దు చేసింది .దీనికి జర్మన్లు ఆర్ధికం గా బాగు పడటమే కారణం .దేశం లోని బ్రూవేరీలు అన్నీ జర్మన్లవే .1920 ఎన్నికలు కొంత మార్పు తెచ్చాయి .జర్మన్లు ఉడ్రో విల్సన్ నిల బెట్టిన వాడిని కాకుండా ప్రత్యర్ధి ,జర్మన్ అమెరికన్ లీగ్ బలపరచిన ‘’హార్దిన్గ్స్ కు వోట్లు వేశారు .ఆ తర్వాతా ఏడాది చికాగో లో రాడికల్ బర్జేర్ బాండ్ పార్టి హార్దిన్గ్స్ జర్మన్లకు కృతజ్ఞతలు చెప్పాలని కోరింది .అయితే దీని సంఖ్యా బలం తగ్గి పోయింది .

            ప్రపంచ యుద్ధం లో జర్మని లో 18లక్షల జర్మన్లు చని పోయారు .ఆర్ధికం గా జెర్మని దెబ్బతింది .జర్మన్ మారక ద్రవ్యం మార్క్ పతన మైంది ఎందరో జ్యూలు జర్మని వదిలి ఇతర దేశాలకు పారి పోయారు .అక్కడ ఉన్న వాళ్ళను చంపేశారు హిట్లర్ అనుయాయులు .హిట్లర్ పార్టి national socialist german worker’s party (naji )పార్టి ఏర్పడి జ్యూలను ,జిప్సీలను ,స్లావ్స్ ను మొదలైన ఆర్యేతరులను జర్మని నుండి తరిమేసి ప్రక్షాలన చేస్తా మన్నారు .నాజీ సభ్యులు అమెరికా వచ్చి ప్రచారం చేశారు .డెట్రాయిట్ లో 1934లో tuetonia association ను ఏర్పరచారు .అమెరికా సిటీ లలో అయిదు వందల మంది సభ్యులు చేరారు .హిట్లర్ గెలిస్తే జర్మని వెళ్లి పోవాలని వీరు ప్రచారం చేశారు .అయితే వీరి సంస్థ ఎవరినీ ఆకర్షించలేక చతికిల బడింది .1936 లో జర్మన్ అమెరికన్ బండ్ ఏర్పడి తనను తాను ‘’బొంద‘’పెట్టుకోంది.1930 లెక్కల ప్రకారం జర్మన్ అమెరికన్ లలో డెబ్భై శాతం వారికి ఇంటర్నేషనల్ నాజీయిజం మీద నమ్మకం లేదని రుజువైంది .ఇరవై శాతం మంది నాజీలకు పూర్తిగా వ్యతి రేకం అని చెప్పారు .బండ్ సభ్యుల సంఖ్య పాతిక వేల కు మించ లేదు .వీరికి రేడియో టెలివిజన్లు కొంత తోడ్పడ్డాయి .బండ్ లీడర్ fritz kuhn  అనే వాడు ఫండ్స్ తినేశాడని ఆరోపణ వచ్చి ,విచారణ జరిపించి జైల్లో పెట్టారు .

    1933 లో యూదులు జర్మన్ స్టోర్సు లను ,జర్మన్ వస్తువులను బహిష్క రించారు .నాజీల అక్రమాలను ముక్త కంథం తో అందరు నిరశించారు .అయిదు వందల మంది synagogues యూదుల స్టోర్సు లను తగుల బెట్టారు .వేలాది యూదులను కొట్టి బాధించారు .ప్రెసిడెంట్ –జర్మన్ రాయ బారి ని వెనక్కి పంపించే శాడు .సరి హద్దుల్ని మూయిన్చేశాడు stewben society .మొదటి సారిగా నాజీల దుర్మార్గాలను ఖండించింది .జర్మన్ పత్రిక లన్ని ‘’చీకటి బలగాన్ని ‘’ఈస డించింది .1941లో జర్మన్,అమెరికన్లు loyal Americans german descent ‘’ ను ఏర్పరచి అమెరికా కు ,ప్రజాస్వామ్యానికి సంపూర్ణ మద్దతు ప్రకటించి ఊగిస లాట ధోరణికి స్వస్తి పలికారు . 1942జనవరిstewbern news paper ‘’అంతా అమెరికా యుద్ధాన్ని బల పరుస్తూ రాసింది .ఇక్కడి జర్మన్లంతా అమెరికన్ జాతీయ స్రవంతి లో చేరి పోయారు .

           సశేషం –మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –7-11-12—ఉయ్యూరు 


గబ్బిట దుర్గా ప్రసాద్
https://sarasabharati.wordpress.com
http://suvarchalaanjaneyaswami.wordpress.com

Posted in అమెరికా లో | Tagged | Leave a comment

తెలుగు భాష కు క్లాసికాల్ హోదా సాధకుడు – ఆచార్య భద్రిరాజు కృష్ణమూర్తి

Posted in సేకరణలు | Tagged | 1 Comment

శ్రీ శంకరుల లలి (కవి )తా సౌందర్య లహరి –41

  శ్రీ శంకరుల లలి (కవి )తా సౌందర్య లహరి –41

92—‘’గతాస్తే మంచత్వం ద్రుహిణగిరి రుద్రేశ్వర భ్రుతః –శివ స్వచ్చ ,చ్చాయా ఘటిత కపట ప్రచ్చ దపటః

       త్వదీయానాం భాసాంప్రతి ఫలానా రాగారుణతయా –శరీరే శృంగారో ,రస ఇవ దృశాం దోగ్ది కుతుకం

    తాత్పర్యం –అమ్మా చిత్కళా నంద కలికా !బ్రహ్మ ,విష్ణు ,రుద్రా ,ఈశ్వర అనే నలుగురు సేవకులు నీ మంచం కోళ్ళు గా మారి మంచం రూపం పొందారు .వారు కామ రూపం తో నీ మంచానికి నాలుగు కోళ్ళు అయి,నీ సమీపం లో ఉన్నారు .పైన కప్పుకొనే వస్త్రం లా ఉన్న సదాశివత్వం ,తెల్లని కాంతులతో ,నీ అరుణ కాంతులు వ్యాపించగా శృంగార రసం రూపు దాల్చిందేమో అన్నట్లు ,నీ కండ్ల కు ఆనందం కల్గిస్తోంది .

        విశేషం –సదాశివునికి -భగవతి యెర్రని కాంతి  మీద పడి ,ఆయనకు సహజం గా ఉన్న తెల్లని దేహం అరుణ కాంతిని పొంది ,శృంగార రస శరీరం గా కనీ పిస్తోంది .అంటే శృంగారమే శరీరం లాగా ఉన్నాడు సదా శివుడు .’’పంచ ప్రేతాసనా సీనా ,పంచ బ్రహ్మ స్వరూపిణీ ‘’అని లలితా సహస్ర నామం లో ఉంది.’’రుద్ర మళ యాళం’’లో

  ‘’బ్రహ్మ విష్ణు రుద్రశ్చ ,ఈశ్వరశ్చ  ,సదా శివః –ఏతే పంచ మహా ప్రేతా భూతాది పతయో మాతః –చత్వారో మంచ చరణః పంచమః ప్రచ్చదః పటః –సాక్షీ ప్రకాశ రూపేణ ,శివేనా భిన్న విగ్రహే –తత్రాసనే సమాసీనా ,నిర్భరానంద రూపిణీ ‘’అని ఉన్నవిషయం శ్రీ శంకరులు చక్కని శ్లోకం లో అందం గా ,శృంగార భరితం గా చెప్పారు .

           పచ్చడమే –ఘటిత కపటం అంటే మాయా రూపం ‘’ప్రచ్చాడ కపటసం కశిపుహ్ –కశి పుశ్చ సదా శివః –కశి పూర్వక స్వదేహ కాంతి చే కల్పిత మైన ఉపరి వస్త్రం అని భావం .

93—‘’అరాళాకేశేషు ,ప్రక్రుత సరళా ,మంద హసితే –శిరీషాభా చిత్తేదృష ద్రుపల శోభా ,కుఛ తటే

         భ్రుశం తన్వీ మధ్యే ప్రుదురురసి జారోహ విషయే –జగత్రాతుం శంభోర్జయతి ,కరుణా, కాంచి దరుణా ‘’

         తాత్పర్యం –చారుహాసా మణీ !నీ కేశ పాశం నొక్కులు నొక్కులు గ ఉండటం వల్ల ,వక్రత ఉంది . .మరెక్కడా నీ శరీరం లో వక్రత లేదు ..స్వభావ సిద్ధ మైన నీ  చిరు నవ్వు ,అందం గా ,మెత్తగా ఉంది.స్తన యుగ్మం సన్నికల్లు లాగా బలుపు ,చెలువదనం కలిగి ఉంది.సన్నని నడుము ,స్తన యుగ్మం లో పిరుదుల వద్ద స్తూలత్వం పొందింది .అనిర్వచ నీయ మైన శంభుని కరుణా స్వరూపమైన అరుణ అనే శక్తి జగత్తును రక్షించటం లో నిపుణ యై ,సర్వత్రా ఉత్కర్ష తో ,ప్రకాశిస్తోంది .చిరునవ్వు లో స్వభావ సిద్ధ మైన సరళ ఆసక్తి ఉండి మనసులో దిరిసెన పువ్వు లాంటి మహా మెత్తని శక్తి ప్రకాశిస్తోంది .స్తనాల్లో సన్ని  కల్లు వంటి శక్తి ఉంది .నడుము లో తన్వీ శక్తి ఉంది  .కుఛ ,నితంబం లలో స్తూల శక్తి ఉంది .జగద్రక్షణకు అరుణ శక్తి ,కరుణా శక్తి ఉన్నాయి .

         విశేషం –శ్రీ శంకరా చార్యులు అమ్మ వారిని కిరీటం నుంచి ,పాదాంతం వరకు వర్ణించారు ‘’మౌళి తో మానవా,దేవాస్చారనః పునః ‘’అని కావ్య లతా అనే అలంకార శాస్త్రం చెబు తోంది .మానవులను శిరసు నుంచి ,దేవత లను చరణం నుంచి పైకి వర్ణించాలి అని శాస్త్రం .అయితే శ్రీ లలితా సహస్ర నామాలలో దేవిని కిరీటం నుండి పాదాంత వర్ణన చేయటం  . .దానినే భగవత్పాదులు అనుసరించారు వ్యాస మహర్షి పద్ధతి కూడా ఇంతే .ఈ శ్లోకం లో కూడా కేశం నుంచి నితంబం వరకు శంకరా చార్య వర్ణించారు .

        పరమేశ్వరుని జగద్రక్షణా శక్తి యేఅరుణ శక్తి .శక్తికి శక్తి వంతునికి భేదం లేదు .అందుకే వారి ఐక్యత కే ‘’క కార‘’ప్రయోగం చేశారు ఆచార్యుల వారు అంటే శివునికి అభిన్న ఐన చిచ్చక్తి మూర్తి రూపం ధరించి జగద్రక్షణ కు ప్రసన్ను రాలు అయింది అని భావం .

    భగవతి అరుణ .ఆమె లో శంభుని కరుణ మూర్తి కట్టింది .కరుణ కు కుటిలత్వ ,మందత్వ  ,శీర్నత్వ ,కథోరత్వ ,,హిమ్సత్వ ,క్షీణత్వాలు పనికి రావు .అందుకే ఆమె కేశాలకే కుటిలత్వం ఉంది  ,ఇంకెక్కడా లేదన్నారు .ఆ కేశాలనూ వెనక్కి తోసేసింది .మందత్వం చిరు నవ్వు లో ఉంచింది .కుటిలత్వం కేశ శోభ ను వృద్ధి చెందిస్తుంటే  ,మందత్వం చిరు నవ్వు కు సొగసు తెస్తోంది .క్రుశించింది నడుమే కాని ఆమె కరుణ కాదని స్పష్టం చేశారు .ఆ క్రుశిత్వాన్ని కప్పి వేయ టానికి స్తూలత్వం ఉంది ,స్తిరత్వం ఉంది .

            సశేషం –మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –7-11-12—ఉయ్యూరు 


గబ్బిట దుర్గా ప్రసాద్
https://sarasabharati.wordpress.com
http://suvarchalaanjaneyaswami.wordpress.com

Posted in రచనలు | Tagged | Leave a comment

వద్దమ్మా ….!! కవిత చరితార్ధ తెలుగు తేజం – కవిత

Posted in కవితలు | Tagged | Leave a comment

మా కుల స్వామి – రచన్ – జి . కృష్ణ

Posted in రచనలు | Tagged | 1 Comment

అమెరికా లో జర్మన్ హవా –7

  అమెరికా లో జర్మన్ హవా –7

 

 బిస్మార్క్ 1871 లో జర్మనీ ఐక్యత ను సాధించాడు .అతన్ని ‘’ఐరన్ చాన్సెలర్ ‘’అంటారు .మన సర్దార్ పటేల్ సంస్థానాలను రద్దు రద్దు చేసిన పుడు ఆయన్ను ‘’బిస్మార్క్ ఆఫ్ ఇండియా ‘’అని ,ఉక్కు మనిషి అని అన్నారు .బిస్మార్క్ ప్రష్యా దేశాస్తుడు  .సైన్యం లో జేర్మన్లను తీసుకొన్నాడు .అమెరికా లోని జర్మన్ల ఆరాధ నీయుడైనాడు .అందుకని వారు జర్మనీ ఐక్య త సాదింప గలిగి నప్పుడు ,జర్మని అమెరికన్ల ఐక్యత ను ఎందుకు సాధించ లేము అని ఆలోచించారు .కొందరు మాత్రం బాక్ టు పెవిలియన్ లా,జర్మని వైపు దృష్టి సారించారు .ఇక్కడి భాష ,పద్ధతులకు నెమ్మదిగా అలవాటు పడ్డారు .ఒకరికొకరు సాయం చేసుకోవాలని భావించారు .ఇంతలో immigration restriction ,American  protective association అనే సంస్తలేర్పడ్డాయి .జర్మని అమెరికన్లు ఇంగ్లీష్ మాట్లా డాలనే ఆందోళన పెరిగింది .దీన్ని జర్మన్లు వ్యతి రేకించారు .

        1907 లో’’german American national alliance ‘’ అనేది అమెరికా లో పుట్టిన జర్మన్ ఇంజినీర్ charles J.hexamer నాయకత్వం లో ఫిలడెల్ఫియా లో ఏర్పడింది .ఇది కూడా ‘’pan greeman league లాంటిదే .జర్మని నాయకుడు Kaiser whelem 1890 లో అధికారానికి వచ్చి మిలిటరి డామినిజాన్ని పెంచాడు .ఈ పరిస్తితి లో ఇలాంటి సంస్థ ఏర్పడితే ,అనుమానాలు పెరుగుతాయని జర్మన్లు పునరాలోచన లో పడి పోయారు .అమెరికా లో ఉడ్రో విల్సన్ ప్రెసిడెంట్ అయి  .’’set the nation on a course of neutrality using that Americans be ,impartial in thought and well as in action ,neutral in fact aswell as in name ‘’అని ప్రకటించాడు .యుద్ధం ఒక నెల జరగ గానే జర్మన్ల మారణ కాండ, లోవెన్ లైబ్రరి దహనం ,లూసియాన అనే బ్రిటీష నౌక పై బాంబు దాడి ,పన్నెండు వందల మంది ప్రయాణీకుల్లో నూట ఇరవై మంది అమెరికన్లు దుర్మరణం చెందటం వల్ల తటస్థ వైఖరి మీద విల్సన్ తీవ్రం గా మాట్లాడ వలసి వచ్చింది .

           జర్మన్ అమెరికన్ పేపర్లు తనకు వ్యతి రేకం గా రాయటం విల్సన్ ను బాధించింది .’’మన దేశ రక్త నాళాల్లో విషం నింపిన వారిని నిర్దాక్షిణ్యం గా అణచి వేస్తాం ‘’అన్నాడు ఉడ్రో -కాంగ్రేస్ లో .’’the right is more precious than peace ‘’అంటూ ప్రజాస్వామ్య అవసరాన్ని నొక్కి చెప్పాడు .క్రమంగా యూరప్ లో జర్మన్ వ్యతిరేకతా పెరిగి పోయింది .1918 లో యాంటి జేర్మనిజం ‘’అమెరికా లో ఎక్కువై పోయింది .జర్మన్ లను  అను మానించారు .జర్మన్ల తోయుద్ధానికి సహాయం కోసం ‘’లిబర్టి బాండ్స్ ‘’కొని పించారు .యుద్ధానికి వ్యతి రేకం గ మాట్లాడితే శిక్షించారు .అమెరికా జండాను ముద్దు పెట్టుకోమన్నారు .స్కూళ్ళు ,ఇళ్ళునిర్జనాలై పోయాయి .1917-1950 కాలం లో పది హేను వందల మంది మిన్నో నైట్లు అమెరికా నుంచి కెనడా పారిపోయారు .

               జర్మన్ సంగీత కళాశాల పై దాడి చేశారు .జర్మనీ సంగీత ఉజ్జ్వల కెరటం సింఫనీ మహా విద్వాంసుడు బీథోవెన్ ను పిట్స్ బెర్గ్ లో అడుగు పెట్ట నివ్వ లేదు .తత్వ వేత్త ,మహా జర్మన్ నాటక కర్త ,విఖ్యాత జర్మన్ రచయితా అయిన’’ గోధే’’విగ్రహాన్ని కూల గొట్టారు ..స్కూల్ కర్రిక్యులం లో జర్మన్ భాషను ఎత్తేశారు .జర్మన్ స్కూళ్ళు మూత పడ్డాయి .జర్మన్ పేపర్లను నిషేధించారు .ఒక రకం గా చెప్పా లంటే జర్మని ని తుడిచి పెట్టె సర్వ ప్రయత్నాలు చేశారు .’’de germanaize ‘’జరిగింది .మిన్నే సోటా లోని సెయింట్ పాల్ లో జర్మన్ లైఫ్ ఇన్సురెన్స్ బిల్డింగ్ మీద ఉన్న‘’జేర్మీనియా ‘’దేవత విగ్రహాన్ని కూడా పడ గొట్టారు .ఆ బిల్డింగ్ పేరు ను గార్డియన్ బిల్డింగ్ గా మార్చారు ..వీధులు ,స్కూళ్ళు టౌన్ ల  పేర్లన్నీ మార్చి పారేశారు . ‘’హం బర్జేర్ ‘’ను ‘’లిబర్టి స్టేక్ ‘’అని పిల్చారు .sawerkrant ను లిబర్టి కాలేజి అన్నారు .నెబ్రాస్కా లోని జర్మన్ టౌన్ –గార్లాండ్ అయింది .అయోవా లోని బెర్లిన్ ను లింకన్ అని పిలిచారు .జర్మన్ మీసిల్స్ ను లిబర్టి మీజిల్స్ అన్నారు .డాక్టర్లు .

           1918 జర్మన్ అమెరికన్ నేషనల్ అలయన్సు కను మరు గైంది. జర్మన్ భాష మాట్లాడటం మానేశారు .ఇంట్లో కూడా జర్మన్ భాష మాట్లాడటం లేదు పేర్లను మార్చుకొన్నారు .జార్జి వాషింగ్ ట న్ వొచ్ ఆఫ్ ఫిల డేల్ఫియా తన పేరు చివర ‘’వోక్స్ ‘’అని తగి లించుకొన్నాడు మతాన్ని బాగా అభిమానించే జర్మన్లు ఇంకా ఎక్కువ గా ఆచరించటం మొదలెట్టారు .అదే ఏడాది నవంబర్ లో ఈ చర్చి గ్రూపులు జర్మని లో పునరావాస కార్య క్రమాలు చేబట్టి ఇక్కడి అమెరికన్ లకు కారం రాశారు .మళ్ళీ జాతీయ భావాలు పెరిగాయి .జర్మన్ అమెరికన్లు జర్మనీ కి అన్ని విధాలా సాయం చేసి పునర్వైభవానికి సహకరించారు

        1919 లో న్యు యార్క్ లో ‘’స్టీన్ బెన్ సొసైటీ ‘’ఏర్పడింది అది రాజకీయ ఐక్యత కోసం మంచి కృషి చేసింది .అప్పటికే జర్మన్లు ఇంగ్లీష నేర్చుకోవటం ,అనేక వృత్తుల్లో చేరటం జరిగింది .ఇరవై శతాబ్దం వచ్చే సరికి జర్మన్ భాష మాట్లాడటం దాదాపు మర్చి పోయారు .యుద్ధానంతరం జర్మన్లు ‘’cultural amnesia ‘’లో పడి పోయారు .మొదటి తరం వారు తమ మూలాలను వదిలేస్తే ,తరువాతి వారికి అసలు ఆ సంప్రదాయమే కరు వై పోయింది .

            సశేషం –మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –6-11-12-ఉయ్యూరు 

గబ్బిట దుర్గా ప్రసాద్
https://sarasabharati.wordpress.com

Posted in అమెరికా లో | Tagged | Leave a comment

శ్రీ శంకరుల లలి (కవి )తా సౌందర్య లహరి –40

 శ్రీ శంకరుల లలి (కవి )తా సౌందర్య లహరి –40

 

 90—‘’దదానే ,దీనేభ్యః శ్రియ మనిశ,మాశాను సదృశీ –మమందం ,సౌందర్య ప్రకర మకరందం ,వికిరతి

        తవాస్మిన్ ,మందారస్తబక ,సుభగే ,యాతు చరణే –నిమజ్జన్మజ్జీవః ,కరణ చరనై షట్త్చరణతాం ‘’

        తాత్పర్యం –నాద రూపిణీ !దీనులకు వారి కోర్కెలను అనుసరించి ,తగిన సంపదలను ఎల్లప్పుడు ఇచ్చే నీ ,అధిక లావణ్య సంపుటి అనే పువ్వుల తేనెను వెదజల్లే ,కల్ప వృక్షపు పూగుత్తి లాగా ,సుందర మైనది అయిన నీ పాద కమలాల యందు ,మనసు తో కూడిన అయిదు జ్ఞానేన్ద్రియాలతో సహా ఆరు పాదాలను కల వాడ నైన నేను తుమ్మెద నై మునుగుదును గా.క .

        విశేషం –నేను అనే జీవుడు ఆరు పాదాల తుమ్మేదను అయి నీ పాద కమలాలను  అర్చిస్తాను భక్తీ తో ఆ మకరందాన్ని గ్రోలు తాను అని శంకర భగ వత్పాదులు భక్తీ తో వేడుకోన్నారని భావం.

 91—‘’పదన్యాస క్రీడా పరిచయ మివారబ్దు మనసః—స్ఖలన్తస్తే ,ఖేలం ,భవన ,కలహంసా ,న ,జహతి

        అతస్తేషాం,శిక్షాం ,సుభగ మణి మంజీర రణిత –చ్చలా దాచక్షాణం ,చరణ కమలం ,చారు చరితే ‘’

          తాత్పర్యం –సుచరితా దేవీ !నీ పెంపుడు హంసలు నీ దగ్గర నడక నేర్చు కోవా టానికి ప్రయత్నిస్తూ ,తొట్రు పడుతున్నాయి .అయినా ,నీ విలాస గమనాన్ని వదల లేదు .అందు చేత నీ పాద కమలం అతి రమ్య మైన మణులతో కూడిన అందేల మ్రోత అనే నెపం తో ,ఆ పెంపుడు హంసలకు నడక లో శిక్షణ ను ఉపదేశిస్తున్నాయేమో నన్నట్లు గా ఉంది‘’

          విశేషం –హంసలు సహజం గా తమను పెంచే వారి వెంటే నడుస్తాయి .అలా పోవటం ,నడక నేర్చు కోవటానికే .జీవన్ముక్తు లైన పరమ హంస లే శ్రీ దేవికి పెంపుడు హంసలు .వారు ఆమె కు ఆశ్రితులు .శ్రీ చక్ర రూపం గా ఉన్న గృహం లో నర్తించే కల హంసలు ,అవ్యక్త మధుర ధ్వని తో హంస మంత్రాన్ని పథిస్తాయి అవే చక్రేశ్వర ,గణపతి ,కమల నాద ,ద్వీప నాద ,వసంతులు .వీరే శ్రీ చక్రాధి

 ష్టాన దేవతలు .

          పదాలు అంటే చతుర్దశ భువన స్తానాలు .న్యాసం అంటే ఉంచటం .అంటే సృష్టి .క్రీడా అంటే రక్షణం .పరిచయం అంటే సంహారం . చిజ్న్ –చయనే –సంహారం అని అర్ధం ఈ కల హంసలు భువన సృష్టి స్తితి ,లయ కారణ సామర్ధ్యాన్ని ఆశిస్తాయి .అవి చిదాకాశం లో (ఖే )’’అల మత్యంతం స్తలంతః చరంతః సంతః ‘’అన్నట్లు గా ఆమె చరణాలను వదలవు .కారణం ఆమె చర ణాలు శుభగాలు .హంస అంటే ‘’సోహం ‘’అంటూ నిరంతరం జపించేవి అని భావం .ఇన్ని భావాలను భగవత్పాదులు ఈ శ్లోకం లో నిక్షిప్తం చేశారని వివరించారు తుమ్మల పల్లి మహాశయులు ..

             సశేషం –మీ– గబ్బిట దుర్గా ప్రసాద్—6-11-12-ఉయ్యూరు 

గబ్బిట దుర్గా ప్రసాద్
https://sarasabharati.wordpress.com
http://suvarchalaanjaneyaswami.wordpress.com

Posted in రచనలు | Tagged | Leave a comment

కొన్ని అవాస్తవాలు – మరి కొన్ని అపోహాలు

Posted in వార్తా పత్రికలో | Tagged | 1 Comment

తెలుగు ‘శారద’

Posted in అమెరికా లో | Tagged | Leave a comment

నాన్న లేరు … ఆయన పాట ఉంది

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

పద చిత్ర రామాయణము –అరణ్య కాండ

 పద చిత్ర రామాయణము –అరణ్య కాండ

తెలుగు కధా సీమలో అలవోక గా విహరించి ,విమర్శ అరణ్యం లో వీర విహారం చేసి ,ఇప్పుడు పద చిత్ర రామాయణం లో సభక్తికం గా విహరిస్తున్న ఆప్తులు శ్రీ విహారి గారికి –మనః పూర్వక ప్రణామాలు .ఉభయ కుశలోపరి –

          మేమిద్దరం ఏప్రిల్ మొదటి వారం లో అమెరికా వెళ్లి ,ఆరు నేలలుంది ,అక్టోబర్ మొదటి వారం లో తిరిగి వచ్చాము .వెళ్ళేటప్పుడు మీ ‘’అయోధ్య ‘’నుతాపీగా ఇక్కడ చదివే తీరిక లేనందు వల్ల  మాతో అమెరికా తీసుకొని వెళ్లాను .మేము వచ్చేసరికి ‘’అరణ్య కాండ ‘’అందింది .రెండు చది వాను .ముందుగా అయోధ్య కాండ గురించి –అమెరికా లో నాలుగైదు సార్లు చదవ టానికి తీవ్ర ప్రయత్నం చేశాను .కాని కదా భారమో అన్నిటా అందులో వ్యాపించిన దుఃఖ భారమో ,గుండెల్ని పిండి వేసే సన్నివేశాల బరువో ,అందరి మనో భావాలు ఆర్డర మై పోవటం వల్ల గుండె బరువై పోవటమో తెలీదు కాని పద్యం నుంచి ,పద్యానికి కదలటానికి చాలా సమయం పట్టేది ..ఆపి మళ్ళీ చది వే వాడిని .మళ్ళీ అదే స్తితి .కధే అంత .రామ వనవాస ప్రారంభం అందర్నీ శోక సంతప్తులను చేసింది .శోక సంద్రపు కెర తాలు ఈడ్చి ఈడ్చి తనను తున్నాయి .గుడ్ దిటవు చేసుకొంటేనే ముందుకు సాగ గలమని పించింది .మొత్తం మీద అక్కడే అయోధ్య ను పూర్తీ చేశాను .ఏదో మీ తనువు లో ఇవతళించిన ప్రాచీ భావం మిమ్మల్ని ఊపిరి సలప కుండా శ్రీ రామ గాధను రాయిస్తోంది .మీ కవిత్వం లో విశ్వనాధ దర్శనమిస్తాడు .పురాకవుల వైభవం జ్యోతకం అవుతోంది .ప్రతి పద్యం సాన దేరింది .సందర్భానికి తగిన ఛందస్సు నుపయోగించి ,ఆ ఛందస్సుకే సార్ధకత ను చేకూర్చారు .అడుగడుగునా మీ ఆరాధన భావం వేద వేదాంగాల పై పట్టు కానీ పిస్తుంది .చాలా కాలానికి దీని పై రాస్తున్నాను కనుక ఇంత కంటే రాయటం సమర్ధ నీయం కాదని పించి అయోధ్య ను ముగిస్తున్నాను .

             మేము వచ్చేసరికి అరణ్య కాండ మా కోసం ఎదురు చూస్తోంది .కాస్త వెసులు బాటు చేసుకొని పది హేను రోజుల క్రితం చదవటం ప్రారంభించి పూర్తీ చేశాను .దాని పై పూర్తిగా రాసే ముందు మీకో విజ్ఞప్తి .. త్వరలో మీరు మిగిలిన రెండు కాండలు పూర్తిచేస్తారు .అప్పుడు వాటికి అను బంధం గా మీరు వాడిన వివిధ ఛందో రీతులు ,వాటి అవసరం అవి సందర్భానికి ఎలా తగి ఉన్నాయి ,కధకు ఏవిధం గా దోహద పడ్డాయి ,శిల్పాన్ని ఎలా పరి పుష్టం చేశాయి ,కదా నిర్వహణ లో అవి ఎంత విలువను సంతరించుకొన్నాయి అన్న విషయాలన్నిటి మీద సాది కారం గా ఛందో నిపుణులు ఎవరి తో నైనా విశ్లేషణాత్మకం గా వివరణాత్మకం గా పరిశీలన ,పరి శోధనా చేయించి రాయిస్తే పరమాద్భుతం గా ఉంటుందని నాకు అని పించింది .ఆ పని తప్పక చేసి,నాబొంట్లకు అందులోని రహస్యాలను అందు బాటు లోకి తీసుకు రావాలని మనవి చేస్తున్నాను .

                               అరణ్య కాండ

           ముఖ చిత్రమే మహా ముచ్చట గా ఉంది.’’వెడలెను కోదండ పాణి ‘’కి అనుగుణం గా ఉండటం తగినది .తపోధను లైన మహర్షులను వర్ణించి చెబుతూ ‘’చిరుత నవ్వుల నిసువు –ససి ,మిస –నొసలు ‘’అనటం కొత్తదనం .శ్రీ రామ సోదరులను చూచినా వర ముని బృందం ‘’గాలి పటంబుల గాంచుచు కేరేడు బాలల పగిదిన్ ‘’అని పించటం అడవిలో గాలి పటాలను ఎగరేసి చూపించి నట్లుంది .భావుకత కు జోహార్లు .ఆ రెండు పద్యాలను ‘’మధుర గతి ‘’చందం లో రాయటం వారి మనసు మాధుర్యాన్ని వ్యక్తం చేసింది అది అమృత కాంక్షే మునులకు .అక్కడి ప్రాకృతిక అందాన్ని వర్ణించే ముందు ‘’కమల గీతి ‘’లో చెప్పిన కోమల భావం బాగుంది .సమగీతి ,పవడ గీతి పద్యాలలో వాతావరణ ప్రశాంతత గోచరించింది .’’రామ రామాభ్యుదయ హితా రామ సోమ ‘’అనే పద్యం లో పాదాలన్నీ ఆమ్రేడితాలై సొగసు కూర్చాయి .మునుల ఆనంద  పార వశ్యం కన్పించింది .తాపసీ లలనల దర్శనాన్ని ‘’సుమంగలి’’పద్యం లో జోడించటం ఔచిత్యానికి పరమో దాహరణ

      రెండే పాదాలతో సాగే ‘’కలియుగ మంజరి ‘’ప్రకృతి చిత్ర పటాన్ని ఆవిష్కరింప జేసింది .అంతే కాక గమనాన్ని సూచిందని పించింది ‘’సకల మెరిగిన వారు సాక్షులై నిలువ ,–వికల్పము నొందె నడవి తనంత తాను ‘’అన్న మాట సొగసు గా ఉంది.విరాధ కధలో రాముని స్తితిని రామానుజుడు ‘’నీరు రామియున్ ,సారము లేక తీలు బడు సస్యములో తల వంపు ‘’గా ఉందని గొప్ప సామ్యం గా రైతు భాష గా చెప్పారు .వాడి మదాన్ని ‘’మత్త క్రీడ‘’లో వర్ణించటం బాగు బాగు .అగస్త్య మహర్షి రాముని తో రామ ధర్మ పత్నిని ‘’ఈ ధరాజ ,నీ మనసు ధార లోని సిరి ,మానిత వర్తిని భాగ్య రాశియున్ ‘’అని చెప్పటం లో సీతా సాధ్వి వేద శిఖా మణి అని గుర్తు చేయటమే .శూర్పణఖ చేసిన పనిని ‘’పెరగాయ పని ‘’అనటం కొత్త మాటే .సోదరుడు రావణుని తో శూర్పణఖ సీతా దేవి గురించి ‘’సుధ్యుపాస్య –సౌందర్యమున కామే నిర్వచనము ‘’అన్న మాటలలో మొదటిది ప్రాచీ నతకు ,రెండోది ఆధునిక భావా విష్కరణకు నిదర్శనం .

          మారీచాశ్రమం లో రావణుని తొందర పాటు ను వర్ణించేందుకు వాడుకొన్న ద్రుత విలంబితం ,అశ్వ గతి సందర్భోచితం గా ఉన్నాయి .మాయ లేడి ని చూసి సీత వ్యామోహ పడటానికి ‘’మధురాక్కర ‘’పద్యం మధురం గా అక్కర తీర్చింది .త్రిపదలు ‘’త్రిపధల్లా ‘’శోభించాయి .సీతను రావణుడు తర లించటానికి ,తరళాన్ని,అల్ప మైన మనసు తెలియ పరచటానికి ‘’అల్పాక్కర ‘’ ఉపయోగ పడ్డాయి .సీతను లంకకు చేర్చటానికి ‘’వియోగిని ‘’ఛందస్సు బాగా తోడ్పడింది

         శబరి రాముని రాక కై ఎదురు చూస్తూ పూల చెట్లను సరి చేసే పద్యం ‘’ఓపిక జేసి కొంచు’’కృష్ణ శాస్త్రి గారి రచనా అని పించింది సుమా .’’వియతి చందం ‘’లో ఆమె మనో వేదన ఆరాధనా చక్కగా ఆవిశారైంచారు .’’ఆలస గతి ‘’లో ఆమె రాముని ‘’ఆలస గతి నీ రెరుగు డైన దయ చేతన్ ‘’ అని చెప్పించటం అరుదైన విషయం .సందర్భో చితం పరమ ఔచితీ వంతం .అరణ్య కాండ ముగింపు లో ఆ కాండాన్ని ‘’సత్య ధర్మ పరాక్రమ సత్వ వివ్రుతి –యుదిత సుఖ దుఃఖ మిశ్ర భావోప పత్తి –సమాధిక పద చిత్ర రచనా శ్వాస సమితి ‘’అని మొత్తం సారాన్ని పిండి చెప్పారు .

           ఇంత కవితా విహారం, కదా కదన.శిల్ప  విహారం మీరు చేసినా వినమ్రం గా ‘’రధియై శ్రీ రఘు రాముడు–కధనము నడిపెను ,మదీయ కరములు వ్రాసెన్ –విదియు ,విధానము నతనివే –ప్రదిత కు నేనెట్లు తగుదు–పలుకుల వెలదీ ‘’అని సరస్వతీ దేవికి నివేదించటం మీ వినయానికి ,ప్రదితకు ,మహా సంస్కారానికి ప్రతీక .

         మీ– గబ్బిట దుర్గా ప్రసాద్ –5-11-12—ఉయ్యూరు 

 


గబ్బిట దుర్గా ప్రసాద్
https://sarasabharati.wordpress.com
http://suvarchalaanjaneyaswami.wordpress.com

Posted in సేకరణలు | Tagged | Leave a comment

దర్శ నీయ దేవాలయాలు –2

– దర్శ నీయ దేవాలయాలు –2

                  బంది పోటు దొంగల పేరు తో వెలసిన పంటి మిట్ట కోదండరామ స్వామి దేవాలయం –2 

 కొదండ రాముని దర్శించిన కొందరు ప్రముఖులు –పోతన

    భాగవతాన్ని మందార మకరంద మాదుర్యాలోలికే టట్లు తెలుగులోకి అనువ దించిన బమ్మెర పోతనా మాత్యుడు ఇక్కడి వాడే .ఆయన ‘’అల వై కుం థ పురంము లో ‘’పద్యానికి ఇదే నేపధ్యం .పద్యం మధ్యలో ఆగి పోతే ,శ్రీ రాముడే స్వయం గా వచ్చి దాన్ని పూర్తీ చేసింది ఇక్కడే .ఆయన ఇల్లు ,పొలాలు అక్కడి చెరువు దగ్గరే ఉన్నాయి కాల గర్భం లో అవి కలిసి పోయి ,కనీ పించటం లేదు .ఆ ప్రదేశాన్ని దేవాదాయ శాఖ యాత్రికుల సౌకర్యార్ధం సత్రాలకు  ఉపయోగిస్తోంది .ప్రతి ఏడాది పోతన సాహిత్య పీథం పోతన జయంతిని శ్రీ రామ నవమి నాడు జరిపి ఘనం గా ఆయన్ను స్మరిస్తుంది .

                                             అన్నమయ్య 

  వెంకటేశ్వర స్వామికి అనన్య భక్తుడు ,పద కవితా పితా మహుడు తాళ్ళ పాక అన్నమా చార్యులు కడప జిల్లాలో తాళ్ళ పాకకు చెందిన వాడు .అది దీనికి ముప్ఫై కిలో మీటర్ల దూరం లోనే ఉంది.అన్నమయ్య ఒంటి మిట్ట కు వచ్చి కోదండ రాముడిని దర్శించి కీర్తన ల తో కీర్తించాడు .

                         వావికొలను సుబ్బా రావు

    ఆంద్ర వాల్మీకి అని పిలువబడే వావి కొలను సుబ్బా రావు గారు వాల్మీకి రామాయణాన్ని తెలుగు లోకి అను వాదించారు .రామాయణానికి ‘’మంధరం ‘’అనే వ్యాఖ్యానం రాసిన మహాను భావుడాయన .ఆలయాన్ని అభి వృద్ధి చేయటానికి ఇంటింటికీ తిరిగి ధనం సేకరించిన పుణ్యాత్ముడు మూల విరాట్ కు బంగారు కవచం చేయించారు సేకరించిన ధనంతో .’’భక్త సంజీవని ‘’అనే ఆధ్యాత్మిక మాస పత్రికను దేవాలయం తర ఫున నిర్వ హించారు .వీరినే ‘’వాసు దాసు‘’గారు గా గౌరవం గా పిల్చు కొంటారు /

                   సద్గురు సమర్ధ నారాయణ మహా రాజ్

        సద్గురు సమర్ధ రామ దాస స్వామి పద కొండవ పీథాది పతి అయిన శ్రీ శ్రీ సద్గురు సమర్ధ నారాయణ మహా రాజ్ ఇక్కడే లక్షలాది మందిక ‘’రామ తారక మంత్రం ‘’ను ఉపదేశించి అన్నదానాలను నిర్వ హించారు .ఆయన్ను అందరు ఆంజనేయ స్వామి అవతారం గా భావిస్తారు .1961-లో సద్గురువు లు ,పద కొండు రోజులు లక్షలాది జనానికి అన్నదానం నిర్వ హించిన మహా భక్తుడు .అఖండ రామ నామాన్ని అందరి చేత జపింప జేస్తూ ,ఆ కార్యక్రమాన్ని నిర్విఘ్నం గా కొన సాగించారు .గాలి గోపురాన్ని పునరుద్ద రించారు .స్పటిక లింగాన్ని వేద మంత్రాల తో భూమి నుండి బయటికి తీసి దాన్ని ప్రతిష్టించారు .ఇవాల్టికీ ఈ లింగాన్ని మనం దర్శించు కొ వచ్చు .కోదండ రామ స్వామి సేవలో జీవితాన్ని పండించు కొని ముక్తి పొందారు స్వామి .

                 నంద గురు విజయ రాఘవా చార్యులు

        నంద గురు వీర వెంకట రాఘ వా చార్యులు గారిని వాసు దాసు గారు ఆలయ ప్రధాన అర్చకులు గా నియ మించారు .యోగి పుంగవులు ,రామ నామ భక్తీ ప్రచారకులు ,కవి ,రచయిత ,ఆధ్యాత్మిక శేఖరులు అయిన ఆచార్యుల వారు మహు ముఖ ప్రజ్ఞా శీలి .ఆయుర్వేద ,జ్యోతిష ,పంచ రాత్ర ,అగమాలలో నిష్ణాతులు .వీరి కుమారులు విజయ రాఘవా చార్యులు కూడా అంతటి ప్రజ్ఞా దురంధరులే .వీరు ‘’శ్రీ రాఘ వెంద్రసుప్రభాతం ‘’రచించారు .దీన్ని ఒంటి మిట్ట కోదండ రామ స్వామికి అంకిత మిచ్చారు .

                సాయైన్ వరద దార్న్

       వీరు కొండ మాచు పల్లి గ్రామస్తులు .ఇది సిద్ధ వటం తాలూకా లో ఉంది .సత్యాగ్రహ ఉద్యమం లో పాల్గొన్న రాజకీయ నాయకులు .’’కోదండ రామామ్రుతం ‘’.రాసి ఆ కోదండ రామునికి అంకితమిచ్చిన కృతి కర్త సన్యాసం స్వీకరించి మోక్షాన్ని పొందారు .

              బహ వన సాయి మాల ఓబన్న

         శ్రీ రాముని మీద నిత్యం పాటలు రాసి ఆలయం బయటి నుంచే స్వామికి విని పించే వాడు ఓబన్న .ఆయన అంట రాని వాడు అన్న నెపం తో అర్చకులు ఆలయ ప్రవేశానికి అంగీక రించ లేదు .కోదండ రామ స్వామి తూర్పు ముఖం గా ప్రతిష్టించి ఉన్నాడు .కాని ఈ భక్తు నికి నిరాదరణ చూసి స్వామి తన భక్తుడు ఓబన్న నిలిచి ఉన్న పశ్చిమ దిశకు తిరిగి దర్శన మిచ్చి అందర్ని సంభ్ర మాశ్చర్యాలలో ముంచెత్తాడు .దీన్ని గమనించిన అర్చకులు తమ తప్పుకు చెంప లేసుకొని ఓబన్న భక్తిని మెచ్చి ఆలయ ప్రవేశం చేయించి తప్పు దిద్దు కొన్నారు అప్పటి నుండి నిత్యం ఆలయం లో కి వచ్చి స్వామి పై కేర్తనలు పాడి విని పించే వాడు ఆ తర్వాతస్వామి మళ్ళీ తూర్పు ముఖమై కొలువున్నాడు .అదీ భక్తుని గొప్ప దనం .అనన్య భక్తీ కి కులం ,మతం అడ్డంకి కావు అని భక్త ఓబయ్య నిరూపించాడు .2001లో ముఖ్య మంత్రి చంద్ర బాబు ఒంటి మిట్ట ను దర్శించి అక్కడి అస్ప్రుస్యత ను రూపు మాపే కార్య క్రమం లో పాల్గొన్నారు .ఓబయ్య కధను పూజారి గారి ద్వారా తెలుసుకొని విభ్రాంతికి లోనైనారు .

                                ఇమాం బేగ్ నవాబు .

          కోదండ రాముని అభిషేకానికి ఇక్కడ బావి తవ్వించిన ముస్లిం భక్తుడు ఇమాం బేగ్.న వాబు గారు సిద్ధ వటం కోటకు వెళ్తూ ఇక్కడ విశ్రమించారు అక్కడి కోనేటి  నీటిని త్రాగి తన గుర్రానికి కూడా తాగించారు  అప్పుడు అనుకో కుండా కోదండ రాముడు ఆయన్ను పేరు పెట్టి పిలవటం విని నిర్ఘాంత పోయారు .స్వామి మహాత్మ్యాన్ని అర్ధం చేసుకొన్నారు .అప్పుడే వెంటనే బావి త్రవ్వించి అభిషేకానికి విని యోగించే ఏర్పాటు చేశారు . 

          వర కవాల్ అనే ఆయన కోదండ రామ శతకాన్ని రాశాడు .అందులో ఆ నాటి రాజకీయ సంక్షోభాన్ని వివ రించాడు .దీన్ని వెంకటేశ్వర విశ్వ విద్యాలయం వారు భద్ర పరిచారు .నెల్లూరు జిల్లాలో వర కావై పూడి అనే గ్రామం ఉంది.మత్తిరాజులు ఆలయ నిర్మాణం లో పాలు పంచు కొన్నారు .దశరధ రామ శతకాన్ని ఉప్పు గుండూరువెంకట కవి రాసి స్వామికి అంకిత మిచ్చాడు .అయ్యల రాజు రామ భద్ర కవి ’’రామాభ్యుదయం ‘’కావ్యం రాశాడు .చిన్నతనం లో ఆయన్ను ఆలయం లో వదిలేసి తలుపు లు వేసి వెళ్లి పోతే ,గుక్క పట్టి ఏడుస్తుంటే సీతా దేవి ఆయనకు స్తన్యం ఇచ్చి ఆకలి తీర్చింది . అయ్యల రాజు తిప్ప రాజు అనే కవి శ్రేష్టుడు ‘’రఘు వీర శతకం ‘’రాసిన ఒంటి మిట్ట నివాసి .ఆయనే శ్రీ నాదుడికి కనకాభి షేకం చేశాడు .ఈయన్నే త్రిపురాంతకుడు అంటారు .

      ఇంత మంది కవులు ,పండితులు ,రాజులు నవాబులు ఒంటి మిట్ట కోదండ రామ స్వామిని దర్శించి ఆయన పై శతకాలు ,కావ్యాలు రాసి ,అంకిత మిచ్చి జీవితాన్ని ధన్యం చేసుకొన్నారు .స్వామికి ఇంత వైభవం రావ టానికిమూల  కారణం అయిన బంది పోటుదొంగలు ఒంటడు మిట్టడు అందుకే చిరకాలం గా  మనకు స్మరణ లో ఉండి పోయారు .జీవితాలను ధన్యం చేసుకొన్నారు .       

            సంపూర్ణం —మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ – 5-11-12- ఉయ్యూరు 

గబ్బిట దుర్గా ప్రసాద్
https://sarasabharati.wordpress.com
http://suvarchalaanjaneyaswami.wordpress.com

Posted in రచనలు | Tagged | Leave a comment

శ్రీ శంకరుల లలి (కవి )తా సౌందర్య లహరి –39

 శ్రీ శంకరుల లలి (కవి )తా సౌందర్య లహరి –39

 

88—‘’పదం తే ,కీర్తీనాం ,ప్రపద మపదం దేవి ,విపదాం—కదం నీతం సద్భిహ్ కతిన కమతీ కర్పూర తులాం

      కధంవా ,పాణిభ్యా ,ముపయ మన కాలే పురభిదా –యదాదాయ న్యస్తం ద్రుషది ,దయా మానేన ,మనసా ‘’

        తాత్పర్యం –కౌలమార్గ తత్పర సేవితా భవానీ !సత్కీర్తులకు నిలయమై ,ఆపదలను తొలగించే ,నీ మీగాలు (అడుగు పై భాగం )ను ,కవులు ఆడు తాబేలు వీపు చిప్పతో పోలుస్తున్నారు .దయా పూర్ణ మనస్సుగల శివుడు ,మీ వివాహ సమయం లో నీ పాదాలను కథిన శిల యైన సన్ని కల్లు రాయి మీద ఉంచటానికి మనసు ఎలా ఒప్పిందమ్మా ?

          విశేషం –దయామయుడైన శివుడు శ్రీదేవి పాదాన్ని ఎలా ఉంచ గలిగాడు ?పూర్వ కవులు తో బాటు ,పురభేది కూడా వివేకం లేకుండా ప్రవర్తించారు .వివాహ సమయం లో సప్తపది క్రియ లో వధువు పాదాన్ని వరుడు సన్ని కళ్ళు పై ఉంచటం ఆచారం .’’గూడ గుల్ఫా ,కూర్మ పృష్ట ,జయిష్ణు ప్రపదాన్వితా ‘’అని లలితా సహస్ర నామాలున్నాయి .సప్త పడిలో ‘’అతిష్టే మమ శ్మాన ,మష్మే వత్వం ,స్తిరాభవ ‘’అన్న మంత్రం చదువుతారు .అంటే సన్నీ కళ్ళు లాగా మనసు ద్రుధంగా ఉంచుకోవాలని భావం ..

89—‘’నఖి ర్నాక స్త్రీణాం ,కరకమల ,సంకోచ శశిభిహ్ –స్తరూణందివ్యానాం ,హసత,ఇవ ,తే చండి చరణౌ

         ఫలానిస్వస్తేభ్యః కిసలయ ,కరాగ్రేణ,దదతాం –దరిద్రేభ్యో భద్రాం శ్రియ ,మనిశ ,మహ్నాయ దదతౌ ‘’

          తాత్పర్యం –అమ్మా చండీ దేవీ !సకల సంపదల చె ,తుల తూగే స్వర్లోక వాసు లైన దేవతలకు మాత్రమె ,చిగురు తాకులు అనే హస్తాలతో కోర్కెలను తీర్చే కల్ప వృక్షాలను దరిద్రులకు కూడా ,సర్వ లోకాల్లో తరుగు లేని సంపదలను శీఘ్రం గా ఇచ్చే నీ పాదాలు –శచీ దేవి మొదలైన దేవతా స్త్రీల కర పద్మాలను ముకుళింప జేసే గోళ్ళు అనే చంద్రుల చేత పరిహాసం చేస్తున్నాయేమో అన్నట్లున్నాయి .

          విశేషం –స్వర్గ లోక దేవతలకు కోరిన కోరికలను దేవి చరణాలు నెమ్మది గా టీరుస్తున్నాయి .కాని ,అన్ని లోకాలలోని ,దీనులకు తిరుగు లేని ,మంగళ కర మైన సంపదలను వెంటనే ఇస్తున్నాయి .

           కల్ప వృక్షాలు కరాగ్రాలతో స్వర్గ లోక వాసులకు కొద్ది రోజుల్లోనే అనంత సంపదల నిస్తున్నాయి .భగవతి చరణాలు ఐహిక ,ఆముష్మిక సుఖ ,సంతాన ,సముల్లలిత సంపదను వెంటనే ఇస్తాయి .అందుకే నఖాలు నవ్వుతున్నాయి అని చమత్కరించారు భగవత్పాదులు .

          గోళ్ళను చంద్రుని గా చెప్పటం అవి అతి తెల్లదనం కలవని చెప్పటమే .శ్రీ దేవి పాద కమలాల ముందు కల్ప తరువు న్యూనత చెందినదట .అవి చేతులతో చెయ్య లేని దాన్ని శ్రీదేవి పాదాల తో చేస్తోందని అన్నారు శంకరులు .

           సశేషం —మీ గబ్బిట దుర్గా ప్రసాద్ –5-11-12-ఉయ్యూరు
గబ్బిట దుర్గా ప్రసాద్
https://sarasabharati.wordpress.com
http://suvarchalaanjaneyaswami.wordpress.com

Posted in రచనలు | Tagged | Leave a comment

దర్శనీయ దేవాలయాలు –2 బంది పోటు దొంగల పేరు తో వెలసిన

 దర్శనీయ దేవాలయాలు –2

                                      బంది పోటు దొంగల పేరు తో వెలసిన

                             ఒంటి మిట్ట కోదండ రామ స్వామి  దేవాలయం– 1

                       ఇతిహాసం 

 కడప జిల్లా లో ఒంటి మిట్ట గ్రామ ఉంది. దీనినే ఏక శిలా నగరం అంటారు .ఇది మహర్షులకు తపోధనులకు యజ్న ,యాగాలకు త్రేతా యుగం లో ప్రసిద్ధి చెందింది .ఋషుల తపస్సుకు తరచుగా రాక్షసులు భంగం కలిగించి ,విఘ్నం చేసే వారు .శ్రీ రాముడు సీతా దేవి ,లక్ష్మణ సమేతుడై ఒంటి మిట్ట కు వచ్చాడు .ఆయన కోదండం ధరించి ,పిడి బాకు తో రాక్షస వధ చేసి ఋషుల తపస్సు ను నిరాటంకం గా జరగటానికి దోహదం చేశాడు .సీత కోరిక మేరకు రాముడు ఒక బాణం తో భూమిని చీల్చి భూ గర్భ జలాన్ని పైకి తెప్పించాడు .అది ఒక కొలను గా మారింది .దీనిని ‘’రామ తీర్ధం ‘’అని పిలుస్తారు .లక్ష్మణస్వామి కూడా తానేమీ తీసి పోనని బాణం తో భూమిని చీల్చి జలధారను తెప్పించాడు అదీ సరస్సు గా మారింది .దానికి లక్ష్మణ తీర్ధం అని పేరొచ్చింది .ఈ రెండు తీర్ధాలు ఇప్పటికీ అక్కడ కనీ పిస్తాయి .ఋషులు యాగ సమాప్తి అయిన తర్వాత సీతా రామ లక్ష్మణులను అర్చించారు .వారి మూర్తులను ఏక శీల పై మలిచి అప్పటి నుండి పూజాదికాలు నిర్వ హించారు .అందుకే’’ ఏక శిలా నగరం’’ అయింది ..అప్పటికి అంజ నేయ స్వామితో రాముడికి పరిచయం కలగలేదు .అందు వల్ల హనుమ మూర్తి లేదు ద్వాపర యుగం లో జాంబ వంతుడు ఈ ఏక శిలా మూర్తులను ఆగమ విధానం లో ప్రతిష్టించాడు .అందుకని దీన్ని జాంబ వంత ప్రతిష్ట లేక కపిల వానర ప్రతిష్ట అంటారు .

                                స్థల పురాణం

         కలియుగం లో వస్తు వినిమయం జరిగేది .దీనినే ‘’బార్టర్ పద్ధతి ‘’అంటారు .ఆ కాలం లో విలువైన వస్తువులు బంగారు ఆభరణాలను ఇంటి గోడల్లో దాచుకొనే వారు .ఆ నాడు బాగా పేరు పొందిన ఒంటడు ,మిట్టడు అనే ఇద్దరు బందిపోటు దొంగలు ప్రయాణీకులను దోచుకొని బంగారం మొదలైన వాటిని దగ్గర లో ఉన్న కొండ గుహ లో దాచుకొనే వారు .ఆ గుహ లో ఉన్న సీతా రాములు వారికి దర్శన మిచ్చి దొంగతనం మానేసి గౌరవ ప్రద మైన జీవితం గడప మని ఆదేశించారు .అంతే, వారిలో మార్పు వచ్చి దొంగతనాలు మానేసి దివ్య జీవనం సాగించారు .శ్రీ రామునికి అత్యంత భక్తులై ,ఆ మూర్తులకు గర్భాలయాన్ని నిర్మించారు .అప్పటి నుండి ఈ బంది పోటు దొంగల పేరు మీద ఈ గ్రామానికి ‘’ఒంటి మిట్ట ‘’అనే పేరు వచ్చింది . .

                                 చారిత్రిక గాధ

     ఆలయ శిలా శాసనాలను పరి శీలిస్తే ఎన్నో విషయాలు తెలుస్తాయి ఈ దేవాలయాన్ని మూడు దశల లో నిర్మించారని  తెలుస్తోంది .మొదట గర్భాలయ నిర్మాణం జరిగింది .తర్వాత ముఖ మండప నిర్మాణం జరిగింది .మూడవ దశ లో గాలి గోపుర నిర్మాణం పూర్తీ అయింది గుడికి ఉత్తరాన  రెండు శాసనాలున్నాయి .అందులో మొదటిది 1555 నాటిది .దీన్ని గ్రామాదికారి కల్లూరి లింగయ్య రాయించారు .ఆ ప్రాంత సైనికాధికారి ,విజయ నగర పాలకుడు వీర సదా శివ రాయల వద్ద పని చేసే ‘’యతి తిరుమలయ్య దేవ మహా రాజు ‘’ పూల పుత్తూరు గ్రామాన్ని స్వామికి దానం చేశాడు .అలాగే కంచ రాజు మత్రాజయ్య భోగే పల్లి గ్రామాన్ని ,మరి కొంత భూమిని రాసిచ్చాడు .రెండవ శిలా శాసనం ప్రకారం 1558లో ఒంటి మిట్ట తదితర గ్రామాలను ఆలయానికి దానం చేశాడు .రధం నిర్మించటానికి ,బ్రహ్మోత్స వ నిర్వ హణకు ,ప్రహరీ గోడల నిర్మాణానికి దానిని వినియోగించాలని తెలిపాడు . విజయ నగర చక్ర వర్తి అయిన సదా శివ రాయల ముఖ్య మంత్రి గుత్తి యేరా తిరుమల రాజు కుమారుడు నాగ రాజదేవ నాగ రాజు  భూరి విరాళం అంద జేశాడు . .

                               శిల్ప కళా వైభవం

         ముఖ మండపం అన బడే కళ్యాణ మండపం 32 స్తంభాల తో నిర్మించారు .దాని పై కళా వైభవం కను విందు చేస్తుంది .వాటి పై రామాయణ ,మహా భారత ,దశావతార ,కాళింగ మర్దనం ,గోవర్ధన గిరి ధారణా, పూతన సంహారం ,నాట్య కారిణుల శిల్పాలు అత్యద్భుతం గా మలచ బడినాయి ..వాటి పై శిల్పించిన ఏనుగు ,ఆవు చూడ తగినవి .నర్తకి శిల్పం మనల్ని విపరీతం గా ఆకర్షిస్తుంది .ఆమె ముఖం లో అనేక భావ సంపద విలువైనది .ప్రేమ ,మొదలైన భావ గరిమ కొని యాడ దగింది .ఇదంతా ఏక శీల పై చెక్కి సంభ్ర మాశ్చర్యాల తో ముంచెత్తు తుంది .165అడుగుల ఎత్తైన గాలి గోపురం ఈ ఆలయానికి ఒక ఒక త్యేకత ను చేకూర్చింది 1652 లో ఫ్రెంచ్ యాత్రికుడు తవార్నియార్ ఆలయాన్ని సందర్శించి ఈ తనివి తీరని కళా సంపదను మహా మెచ్చు కొన్నాడు .ఇంతటి మహాద్భుత ఆలయం ఎక్కడా తాను చూడ లేదని ,గొప్ప చారిత్రాత్మక కట్టడం అని కీర్తించాడు .ఇక్కడ మతం తో బాటు ప్రశాంతత ,శాంతి లభిస్తాయి అనంత యాత్రికులనుఇప్పటికీ  అందుకే ఆకర్షిస్తోంది  .

శ్రీ రాముడు

శ్రీ రాముడు

 ఇప్పుడు ఈ ఆలయాన్ని దేవాదాయ శాఖ నిర్వ హిస్తోంది .భారతీయ పురా వస్తు శాఖ ఆధ్వర్యం లో పరి రక్షింప బడు తోంది ..

 

‘’వందే వందారు మందార వందనం బుధ చందనం –చండ కోదండ దండం మండితం ,రణ పండితం

   శ్రీ మదేక శిలావాసం ,జానకీ లక్ష్మణ నివేశితం –స్వాశ్రితాభీష్టవగదం,కరుణా వరుణాలయం ‘’

మా పెద్ద అబ్బాయి  శాస్త్రి   ఈ అక్టోబర్ లో దర్సించి పంపిన ఫొటోస్    

సశేషం —మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –4-11-12—ఉయ్యూరు

 

 


గబ్బిట దుర్గా ప్రసాద్
https://sarasabharati.wordpress.com
http://suvarchalaanjaneyaswami.wordpress.com

Posted in రచనలు | Tagged | Leave a comment

అమెరికా లో జర్మన్ హవా –6

       అమెరికా లో జర్మన్ హవా –6

1852-54 కాలం లో అయిదు లక్షల మంది జర్మన్లు అమెరికా చేరారు .వాలందఱు అమెరికా పద్ధతుల్ని ఒంట బట్టించుకొని ‘’tranformed  them selves complete yankee ‘’అని పించుకొన్నారు మాత్ర్రు భాషను మాత్రం కాపాడుకొన్నారు .జాతీయతను నిల బెట్టుకొన్నారు .1836లో సెయింట్ లూయీస్ లో జర్మన్ భాషా విద్యా లయాన్ని ఏర్పాటు చేసుకొన్నారు .ఇవి 1860 కి 38 అయాయి .మరో నాలుగేళ్ల లో జర్మన్ భాషను కర్రిక్యులం లో చేర్చి బోధించాలని ప్రభుత్వం విధాన ప్రకటన చేసింది 1850లో అమెరికన్లు జర్మనీ భాష ను నేర్చారు .అప్పుడు మిల్వాకీ లో ఏడు జర్మన్ ‘’బ్రూవేరీలు ‘’ఉన్నాయి .పదేళ్ళ తర్వాతా ఇవి 19 కు పెరిగాయి .బీర్ గార్డెన్ల ను పెంచారు .జర్మన్ బీర్ కు ప్రత్యేకత పెరిగింది .జర్మన్ సంగీతానికి ప్రాధాన్యత వచ్చింది .ఒపెరాలు పెరిగాయి .జిమ్నాస్టిక్ క్లబ్బులు ,వెలిశాయి .శిక్షణా విద్యా లయాలు వెలిశాయి .ఇప్పటికి టర్నర్లు జిమ్నాస్టిక్ ప్రాక్టీస్ చేస్తున్నారు .వ్యాయామ విద్య నేర్పారు .యార్క్ విల్ అనే  న్యూయార్క్ లోని అతి పెద్ద భాగం లో జర్మన్లు ఎక్కువ గా ఉన్నారు .

      అమెరికా లో కిండర్ గార్టెన్ స్కూళ్ళు జర్మన్ల వల్లనే ఏర్పడ్డాయి .’’రోసరీ ‘’అనే స్త్రీ ‘’ది సిస్టర్స్ ఆఫ్ చారిటీ ‘’సంక్షేమ సంస్థ ను బాల్టి మోర్ లో ఏర్పరచి ఆర్ధిక సాయం అందించింది .ఆమెయే మొదటి హాస్పిటల్ ను 1846 లో ఏర్పరచింది .జర్మన్ యూదులకు ,ప్రోటేస్తంట్ లకు వేర్వేరు సంస్థ లున్నాయి .

                        ఫార్టీ యైటర్లు

    1848 లో నాలుగు నుంచి పది వేల దాకా జర్మన్లు జెర్మనీ  రివల్యూషన్ లో ఇమడ లేక అమెరికా వచ్చేశారు .వీ రినే‘’ఫార్టీ యైటర్స్ ‘’ అంటారు .వీరంతా జర్మన్ అమెరికన్ సంస్కృతిని చాలా గొప్ప గా పెంచటానికి కృషి చేశారు .1835లో‘’know nothing party ‘’అనే anti foreign feeling ‘’ఏర్పడింది .ఇంకో పదిహేనేళ్ళ లో నేటివిజం పెరిగి వీరికి బలం పెరిగింది .ఇమ్మిగ్రంట్స్మీద ఆంక్షలు విధించాలని కోరారు .అమెరికా చేరిన వారి హక్కులు కత్తి రించాలని ఒత్తిడి చేశారు .జర్మన్లు ‘’సాబాత్ ‘’అనే పండుగ ను చేసుకొంటారు .ఆ పండుగ రోజున సారా త్రాగటం వారి సంప్రదాయం .దీన్ని అమెరికన్లు వ్యతిరేకించారు .డాన్సులు ,తాగుడు ,బౌలింగ్ ఆది వారం నాడు ఇక్కడ నిషేధం .జర్మన్లు దీన్ని వ్యతిరేకించారు .1861లో జర్మన్ సినిమా హాల్ యజమాని ఆదివారం నాడు సినిమా హాలు మూసెయ్య టానికి ఒప్పుకో లేదు .నలభై మంది ఆఫీసర్లు హాల్లోకి జనం రాకుండా అడ్డు పడ్డారు .1855 లో కక్షలు బాగా పెరిగాయి .కాద లిక్కులు బాగా దెబ్బ తిన్నారు .సివిల్ వార్లో బానిసత్వ వ్యతిరేకులకూ ఇదే గతి ‘’.48 గాళ్ళు ‘’బానిసత్వానికి వ్యతి రేకులు .వీరిలోcarl shulz రిపబ్లికన్ పార్టీ లో చేరాడు .ఈ పార్టి 1854 లో ఏర్పడింది .ఈ  పార్టి ‘’నో నతింగ్ ‘’గాళ్ళ కు వ్యతి రేకం .దీనితో జర్మన్ల రొట్టె విరిగి నేతి లో పడింది .

           1860 లో ‘’minute men ‘’అనే దక్షిణ సోల్జర్ల అనుకూల సంస్థ ఏర్పడింది .వీరిని అడ్డుకొన్న వాళ్ళు జర్మన్ వాలన్తీర్లె . దీనితో మిసోరి యునియన్ లో ఉండి పోయి, జర్మని అమెరికన్ల కు రాజ కీయ విజయం లభించింది .పెన్సివేనియా నుండి కొలరాడో దాకా ఉన్న జర్మ యువకులందరూ సివిల్ వార్ లో పాల్గొన్నారు .henry A.kircher అనే మొదటి తరం అమెరికన్ సివిల్ వార్ గురించి విస్తృతం గా రాసి జర్మని కి పంపాడు .ఈయన ఇలినాయిస్ లోని బెల్ విల్ కు చెందిన వాడు .ఈయన కూడా యుద్ధం లో పాల్గొన్నాడు .వేలాది జర్మన్లు ఈ యుద్ధం లో చని పోయారు .1865లో సివిల్ వార్ముగిసింది .జర్మన్ల దేశ భక్తీ అనన్యం అని రుజు వింది .

              పారిశ్రామీకరణ –యుద్ధాలు

         1880 లో 1,445,181మంది జర్మన్లు అమెరికా చేరారు .ఇంకో రెండేళ్ళ తరువాత రెండు లక్షల యాభై వేల మంది వచ్చారు .వీరంతా గ్రేట్ ప్లైన్స్ అంటే కెనడా లోని ‘’సస్కాచేరాన్ ‘’నుంచి నార్త్ ,సౌత్ డకోటా, నెబ్రాస్కా ,కేంసాస్ వరకు చేరుకొన్నారు .ఇక్కడ వర్ష పతం తక్కువే .అయితే 1872 -1920 కాలం లో రష్యన్ జర్మన్లు లక్షా ఇరవై వేల మంది వచ్చారు .ఈ ప్రయరీలు వాళ్లకు ‘’స్తేప్పీలు ‘’అని పించాయి .ఇక్కడ చేరి వ్యవసాయం చేసి 1920 నాటికి సస్య శ్యామలం చేసి ‘’granary of the world ‘’గా మార్చేశారు .ఇప్పటికి నాలుగు లక్షల ఇరవై వేల మంది జర్మన్లు అయారు .ఎన్నో రకాల ధాన్యాలను పండించారు .వీరే ఇక్కడ మొదటి సారిగా ‘’యెర్ర గోధుమ ‘’పంట పండించిన వారు .ఈ విత్తనాన్ని టర్కీ నుంచి తెచ్చారట .దీన్నే వీళ్ళ భాష లో ‘’red hard winter wheat ‘’అన్నారు .పైన చెప్పిన ప్రదేశా లన్నిటిలో గోధుమ విరగ పండింది .క్రమం గ సాగు భూమి తగ్గింది .

   Verbote  అనే జర్మన్ వార్తా పత్రిక 188౦ లో ఓట్ల భాగవాతాన్ని ప్రచురించింది .మరో నాలుగేళ్ల లో కూలీలలు గడ్డు కాలం దాపురించింది .ఇంకో రెండేళ్లలో చికాగో లోని కార్మికుల సంఖ్య లో మూడో వంతుజర్మన్లె అయారు .నేటివ్ అమెరికన్లు బాగా తగ్గి పోయారు .

                సశేషం —మీ గబ్బిట దుర్గా ప్రసాద్ –4-11-12—ఉయ్యూరు 


గబ్బిట దుర్గా ప్రసాద్
https://sarasabharati.wordpress.com
http://suvarchalaanjaneyaswami.wordpress.com

Posted in అమెరికా లో | Tagged | Leave a comment

శ్రీ శంకరుల లలి (కవి)తా సౌందర్య లహరి –38

 శ్రీ శంకరుల లలి (కవి)తా సౌందర్య లహరి –38

86—‘’మృషా కృత్వా ,గోత్రస్ఖలన మధు వైలక్ష్య నమితం –లలాటే భర్తారం ,చరణకమలే ,తాడయతి తే

    చిరా దంత శ్శల్యం దహన కృత ,మున్మూలిత వతా –తులా కోటి క్వానైహ్ కలి కిలిత మీశాన రిపుణా‘’

      తాత్పర్యం –విశ్వ మాతా !పోరపాటులో అకస్మాత్తుగా ,నీ ఎదుట ,నీసవతి పేరు చెప్పి ,తన తప్పు తెలుసుకొని ,ఏమీ చేయటానికి పాలు పోక ,నీకు నమస్కరించే నీభర్తనుపశు పతి నాదుడిని నీవునీ చరణ కమలం తో నుదుట తాడనం చేస్తే ఆ శివ వైరి యైన మన్మధుడు శివ లలాటాగ్ని బాధతో చాలా కాలం గా బాధ పడుతూ ఇప్పుడు సమయం దొరికింది కదా అని మంజీరధ్వని రూపం గా కిల కిలా రావాలను మన్మధుడు చేసి నట్లుగా ఉంది,నీ మంజీర ధ్వని .

         విశేషం –పోరా పాటున వేరొక స్త్రీ పేరు చెప్పటాన్ని గోత్ర స్కలనం అంటారు .అలా శివుడు చేసి నందుకు పర మేశ్వరుడు అని కూడా చూడ కుండా జగదీశ్వరి పాద స్పర్శ విధి చేసింది .ఆయన కోరుకోన్నదీ అదే .ఇక తన బోటి వారికి ఆమె చరన కమలాలే కదా గతి అని శ్రీ శంకరుల భావం .అది కూడా పూర్వ జన్మ సుకృతం వల్ల మాత్రమె లభించాలి .

        తను చేసిన పొరబాటుకు లజ్జితుడై శివుడు దేవి ముందు తల వంచుకొన్నాడు .గోత్రస్ఖలన ప్రభావం శ్రీ దేవి చరన ప్రహార సౌభాగ్యమే అని భావించాడు .అందుకే వంగి వంగి నమస్కరిస్తున్నాడు .మన్మధుడు చాలా కాలం గా ఉన్న హృదయ శాల్యాన్ని (శల్య తుల్య మైన వైరాన్ని )వెల్ల దించాడు .ఇదీ వీర ధర్మమే .అతనికిది ఉచిత సమయం కూడా .

 శ్రీ దేవి శివుని లలాతాన్ని తాడనం చేసింది అక్కడ ఉన్నది ‘’ఫాల నేత్రాగ్ని ‘’.శ్రీ దేవిని ఆశ్ర యించి ఉన్న మన్మధుడు శత్రువుల దర్పం అణచి వేసేట్లు సింహ నాదం చేశాడని అర్ధం .ఇంతకు ముందున్న శ్లోకం లో శివుడు శివానీ యొక్క పాద తాదనాన్ని కోరాడు .ఈ శ్లోకం లో దాన్ని తీర్చారు శంకరా చార్యస్వామి .

     ‘’గాన్త్రాయతే ఇతి గోత్రం ‘’అంటే ఇంద్రియ సంయమనమే గోత్రం .గోత్ర స్ఖలనం అంటే ఇక్కడ ఇంద్రియ సంయమనం జారి పోవటం .అంటే తగ్గినా ఇంద్రియ సంయమనాన్ని ,తిరిగి పరి పుస్తం చేసుకోవటం దీనినే ‘’వై లక్ష్య నమితం‘’అంటారు అంటే –లక్ష్యం తో కూడిన దృష్టి .కిందికి జారటం అని భావం .యోగా శాస్త్రం లో దీన్ని ‘’శాంభవీ ద్రుష్టి‘’అంటారు .అంటే శాంభవీ ముద్ర సందర్భ ద్రుష్టి .’’అంతర్లక్ష్యం బహిర్ద్రుస్తిర్నిమేషోన్వేష వర్జితా ,సా ఏషా ,శాంభవీ ముద్రా సర్వ తంత్రేషు గోపితా ‘’బయటి ద్రుష్టి లక్ష్యం పై ఉండదు .కన్నులు తెరచి ,అర మోడ్పు గా ఉంటాయి .అప్పుడు జాలన్ధర బంధనం లో శిరస్సు ముందుకు వంగుతుంది .గడ్డం కంతం లోని గుంత వరకు దిగి పోతుంది .ద్రుష్టి నేలకు ఒరుగుతుంది .ఇదే వై లక్ష్య నమితం అంటే .అప్పుడు కుండలినీ శక్తి జాగ్రుత మై ,శీఘ్రమే ఆజ్ఞా చక్రాన్ని ప్రవేశించి ,శివ లలాటం లో కాలు పెట్టి ,సహస్రా దిశా గా పైకి పరుగు తీస్తుంది

          దేహాన్ని భరించే వాడు భర్త .అంటే దేహాభి మాని .ఆజ్ఞా చక్రం వరకు సాధకునికి దేహ స్మృతి ఉంటుంది .దాటగానే ఉన్మనీ స్తితికి అభి ముఖం గా సంచారం జరుగుతుంది .అప్పుడు దేహ స్మృతి ఉండదు .దేహాభి మానం మాయ మవుతుంది ఇదీ ఇందులోని రహస్యం అని వివ రించారు శ్రీ తుమ్మల పల్లి రామ లింగేశ్వర శర్మ గారు .శ్రీ శంకరా చార్యుల వారు శ్రీ దేవి అంగ ప్రత్యంగా వర్ణన లో కామదేవుడిని సహయోగం గానే చెప్పారు .అంటే చని పోయిన మన్మదుడికి ,అనంగ రూపంతో పునర్జన్మ శ్రీ దేవి కరుణ వల్లనే లభించింది .ఆమె కృప తో లోకాలను జయిస్తు ,తన పని చేస్తున్నాడు .అంటే కాముడు ఉపాశించి ఆమె తో సాయుజ్యం పొందాడు .అందుకే కామదేవుని రూపం అమ్బికయే అని చెప్పారు శర్మ గారు .

  శ్రీ దేవి పంచ దశాక్షరీ మంత్రం అంటే ‘’కాదివిద్య ‘’లో మొదటి అక్షరం ‘’క ‘’కారమే .ఈ అక్షరం గొప్ప తనాన్ని ‘’త్రిపుర తాపిన్యుపనిషత్తు ‘’చాలా బాగా వివ రించింది

 ‘’స ఎకో దేవః శివ రూపే ద్రుష్యత్వే న వికాసతే –యతిషు ,యజ్ఞేషు ,కామయతే ,కామం జాయతే –స ఏష నిరంజనో ,కామత్వే నో జ్జ్రుమ్భతే అ క చ ట ప –యశాన్ సృజతే తస్మాదీశ్వరేహ్ కామో భి ధీయతే –తత్పరి భాషయా  కకారం వ్యాప్నోతి ‘’

దీని భావం –ఆ ఒక్క దైవమె శివుడు గా కనీ పిస్తున్నాడు .యతులలో ,యజ్ఞం లో ,యోగులలో ‘’కామన ‘’చేస్తున్నాడు .అందుకే కాముడు అని పిలువబడుతున్నాడు .నిరంజనుడు ,కామ రహితుడు అయిన ఆ శివుడే విజ్రుమ్భించి అ,క,చ ,ట,త ,ప ,య ,శ,,వ ,ర వర్ణ సమామ్నాయాన్ని సృష్టిస్తున్నాడు .కనుక ఈశ్వరుడే కాముడు .-అంటే కామేశ్వరుడు .అంటే క కారం వల్ల వెలిసే వాడు

        సృష్టించే సృజన శక్తి కామ శక్తే .ఇచ్చ అంటే ‘’కామన ‘’యే .సృజన చేయాలన్న ‘’ప్రజనన వాసన ‘’ను కామ వాసన అంటారు .ఇది సృజనాభి ముఖ మైన శివ శక్తి .ఇది ప్రసవ భావం తో ‘’శివా ‘’అవుతుంది .సృష్టి అంటే ప్రభవం,లయం దాని విపరీత భావనలు పరస్పర విరుద్ధం గా ఉంటాయి .

     సమాధి సమయం లో శివుడు కాముడిని శత్రువు గా భావించి జయిస్తునాడు .సృష్టి కార్యాచరణ సమయం లో కాముడు శివుని అర్ధాంగి గా మారి సృష్టి కార్యానికి సహ యోగిఅవుతున్నాడు .సమాధి వేళ తన ప్రజ్ఞా నేత్రాగ్ని చేత కాముని దహిస్తే ,సృష్టి వేళ వాడే పరిహాస ముఖు డవుతున్నాడు . అంటూ విశేశార్ధాలను విస్పష్ట పరచారు రామ లింగేశ్వర విజ్ఞులు .

 87—‘’హిమానీ హంతవ్యం ,హిమగిరి నివాసైక చతురౌ –నిశాయాం ,నిద్రాణం,నిశిచ పర భాగే చ ,విశదౌ

     పరం లక్ష్మీ పాత్రం ,శ్రియ మతి,సృజన్తే సమయినాం –సరోజం త్వత్పాదౌ ,జనని ,జయ ,తశ్చిత్ర మిహికిం ‘’

     తాత్పర్యం –శివ శక్త్యై క రూపిణీ !మంచు కొండ పై నివసించి ,నడిచే నేర్పు కల వీ ,అన్ని వేళలా ప్రసన్న మైనవీ ,సమయాచారు లైన నీ భక్తులకు సౌభాగ్యాన్ని కల్గించేవి అయిన నీ పాదాలు మంచు వల్ల నాశనం పొందేవీ ,రాత్రి ముడుచుకొని పోయేవీ ,లక్ష్మీ దేవికి పీథమైనవీ ,అయిన కమలముల కాంతులను మించి అతిశయిస్తున్నాయి .

     విశేషం –రాత్రులు తమస్సుకు ప్రదానాలు .నీల కాంతి కలవి .పాదాలేమో అరుణాలు ఈ రెండు రంగుల మిశ్రమం గొప్పది .దేవీ  చరణ భక్తీ భావం తో కూడిన శాస్త్రం ‘’సమయ మతం ‘’అంత రంగిక పూజ కు విలువ నిచ్చేది .హృదయం లో భగవతిని ఉపాసించే వారికీ అంటే సమయాచారులకు సర్వ వితర్క విలయ పూర్వకం ,ఐశ్వర్యం సృష్టి ప్రకాశమైన దాన్ని భగవతి సృజిస్తుందని భావం .అంబ స్తవం లో ఇలా అని ఉంది–

 ‘’యావత్పరం ,పద సరోజ యుగం ,త్వదీయం –నాంగీ కరోతి హృదయేశు ,జగచ్చరన్యే –           తావద్వికల్ప జటిలః కుటిల ప్రాకారా –స్టార్క గ్రహాఃసమయినాం ,ప్రళయం న యాతి ‘’

సశేషం –మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –4-11-12- ఉయ్యూరు

Posted in రచనలు | Tagged | Leave a comment

అమెరికా లో జర్మన్ హవా –5

అమెరికా లో జర్మన్ హవా –5

 

    1821లో మిసోరీ డెబ్భై వేల జనాభా తో స్టేట్ అయింది ‘’ద్యుడేన్ ‘’అనే ఆయన ఇవాల్టి వారం కౌంటీ వద్ద 270ఎకరాల స్తలం కొని కమ్యునిటి ఏర్పాటు చేశాడు .పన్నెండేళ్ళ తర్వాత Gielsen Emigration Society ఏర్పడింది .వీరు కర పత్రాలు ముద్రించి జెర్మని కి పంపి ఇక్కడి భూలోక స్వర్గానికి రమ్మని ఆహ్వానించారు .’’A free german state in North America ‘’అని ఆశ పెట్టారు .అయిదు వందల మంది వచ్చారు .వీరందరూ ‘’లాటిన్ ఫార్మర్స్ ‘’అయారు .ద్యూడేన్ చెప్పిన స్వర్గం కనీ పించ లేదు ‘’the American axe is more difficult to wield than the pen ‘’అని విసుక్కొని మోసపోయామని బాధ పడ్డారు .కాని ఆ తర్వాతా ద్యూడేన్ మాట కు స్పందించి యాభై వేల మంది జర్మన్లు వచ్చి చేరారు .వీరు లైబ్రరీలు ,స్కూళ్ళు ,వార్తా పత్రికలూ స్తాపించారు .1837లో జర్మన్ ఫిలడెల్ఫియా సెటిల్  మెంట్ సొసైటీ అనేది గాస్కోనేడ్ కౌంటీ లో పన్నెండు వేల ఎకరాలను కొన్నది..క్ర్సమంగా హీర్మాన్ ,మిస్సోరీ లకు వలసలు ఎక్కువైనాయి .హీర్మాన్ పరిసర ప్రాంతాలు పళ్ళ తోటల ల తో కళ కళ లాడింది .సారా పరిశ్రమ పెంపొందింది

            1840 లో జర్మన్లు మూడు రెట్లు చేరారు .అమెరికా లోని జర్మన్ ఇమ్మిగ్రెంటు లకు సాయం చెయాలనే కోరిక కలిగింది .కాని అప్పటికి అక్కడ కేంద్ర ప్రభుత్వం లేదు 1838 లో ‘’జేర్మేనియా సొసైటీ ఆఫ్ న్యు యార్క్ ‘’ఏర్పడి ,జర్మన్లు టెక్సాస్ లో ఉండటం క్షేమం అని భావించింది .జర్మని లోని ఉత్తర రాష్ట్రాల నుంచి జనం టెక్సాస్ వచ్చారు .ఇక్కడ ప్రజాస్వామ్య ప్రభుత్వం ,సార వంత మైన నేల వారిని ఆకర్షించాయి .మిసోరీ కి చేరిన వారి కంటే ఇక్కడికి చేరిన వారి సంఖ్య తక్కువే .

      1843 లో జర్మనీ రిపబ్లిక్ టెక్సాస్ వెళ్ళే వారిని ప్రోత్స హించింది .new father land beyond sea ‘’అని పేరు పెట్టారు .ఒక్కొక్కరికి 120 డాలర్లు ,ఉచిత ప్రయాణం ,మధ్య పశ్చిమ టెక్సాస్ లో నలభై ఎకరాల భూమి ఇస్తామని జేర్మేనియా సొసైటీ వాగ్దానం చేసింది .1844 నాటికి మూడు ఓడలలో జనం టెక్సాస్ చేరారు .1847 లో సొసైటీ దివాలా తీసింది .అంతకు ముందు 1845 లో టెక్సాస్ కు మెక్సికో కు యుద్ధం జరిగింది .ఈ సమయానికి సొసైటీ మళ్ళీ పుంజు కొంది .వచ్చిన వారిలో వెయ్యి మంది కామ్పుల్లో ఉండి చని పోయారు .’’prince Frederick of prushya ‘’పేరు మీద మొదటి మొదటి వైట్ సెటిల్ మెంట్ టెక్సాస్ లో ఏర్పడింది .మరో అయిదేళ్ళలో రెండు వేల మంది అయారు .ఇక్కడికి చేరిన వారు జర్మనీ లోని బంధువు లకు ఉత్తరాలు రాస్తూ ‘’జర్మనీ లో పని చేసే దానిలో సగం పని అమెరికా లో చేస్తే చాలు హాయిగా జీవితం వెళ్లి పోతుంది .అంతకు మించి స్వాతంత్ర్యం ఉన్దిక్కడ .ఇక్కడి ఇండియన్ల వల్ల ప్రమాదం లేదు .వాళ్ళు మాకు గుర్రాలను ,మాంసాన్ని అంద జేస్తున్నారు ‘’అని సంతృప్తి కరం గా వారికి తెలియ జేశారు .సివిల్ వార కు ముందు టెక్సాస్ లో జర్మన్లు ముప్ఫై వేలు .1857 లో గాల్వస్టేన్ అంతా జర్మన్ల తో నిండి పోయింది .అయితే అక్కడ‘’న్యు జర్మని ‘’అనే మాట మాత్రం రాలేదు .

          పనితనం ఉన్న కూలీలను విస్కాన్సిన్ ఆహ్వానించింది browing ,tanning ,పని వారికి రైతులకు స్టోర్స్ వచ్చాయి సెయింట్ లూయీస్ జర్మన్ల సాంస్కృతిక కేంద్రం అయింది సాధారణ కూలీలు మిడ్ వెస్ట్ చేరారు అక్కడ చేతి నిండా పని దొరికింది న్యు యార్కు న్యు ఆర్లియన్ల రోడ్లు ప్రయాణానికి బాగా అనుకూలించాయి .నదుల పై ప్రయాణం ఎక్కువైంది 1830—40 కాలం లో ఇవే ‘’హై వే‘’లని పిలువ బడినాయి .1825 లో ‘’ఈరీ కెనాల్ ‘’వాడుక లోకి వచ్చి ,ప్రయాణాన్ని మరింత సుఖం చేసింది 1851రైల్రోడ్ వచ్చి మరింత సౌకర్యం కలిగించింది . 1850 లో చికాగో లో ఎనిమిది శాతమే జర్మంలుండేవారు మరో పదేళ్లలో నాలుగో వంతు అయారు .చికాగో మిడ్వెస్ట్ కు మంచి కేంద్రం .ఒహాయో, సిన్సినాటి లలో జర్మన్లు పెరిగి పోయారు .1841  లో జర్మన్లు 28%సిన్సినాటి ని ‘’క్వీన్ సిటీ ఆఫ్ ది వెస్ట్’’అంటారు .ఇక్కడ జర్మన్లు జనాభాలో సగ భాగం అయారు .

      1847-55 లో ఎక్కువ మంది యూరోపియన్లు వచ్చారు .అందులో జర్మన్లు ఎక్కువగా విస్కాన్సిన్ చేరుకొన్నారు .ఇది 1848 లో యునియన్ లో కలిసి పోయింది .మిలాక్వీ నది లేక్ మిచిగాన్ లో కలిసే చోటు మహా ఆకర్షణీయం గా ఉంటుంది .ఎనిమిది వేలకు పైగా జర్మన్లు 1850 లో చేరి 1860 కి 45వేల మంది అయారు .జర్మన్లు అందరు ఒకే చోట ఉండే వారు .ఐరిష్ వారు వేరుగా ఉండే వారు .సిన్సినాటి లో జర్మనులున్న ప్రాంతాన్ని ‘’over the rhine ‘’అని ముద్దుగా పిలుచుకొన్నారు .

          జర్మని నుంచి చాలా మంది యూదులు వచ్చారు .1840 జ్యూయిష్ కమ్మ్యునిటి పది హేను వేలు మాత్రమె .1880 నాటికి జ్యూలసంఖ్య 2,50,000  అయింది వీరందరికీ వ్యాపారం ఇష్టం .డిపార్ట్ మెంట్ స్టోర్లను ఏర్పాటు చేశారు .న్యూయార్క్ లో బాంకులు పెట్టారు .lehman ,loeb కుటుంబాలు వీటిలో ప్రసిద్ధులు ‘’డ్రై గూడ్స్ స్టోర్స్ ‘’ప్రారంభించారు .అదే ఆ తర్వాతా ‘’zean empire ‘’అయింది .అంటే అమెరికా లో జీన్ల ప్రవేశం వీరి వల్లే జరిగింది .ఇలా అమెరికా అంతా క్రమం గా వ్యాపించి అక్కడి వ్యాపార ,ఉద్యోగ సాహిత్య కళావిద్యా  సంస్కృతిక రంగా లలో స్తిర పడిపోయారు .అప్పుడు అమెరికన్లకు వీరి పై క్రమంగా అసూయ ప్రారంభ మైంది.

                   సశేషం –మీ–గబ్బిట  దుర్గా ప్రసాద్ –3-10-12-ఉయ్యూరు 

— 
గబ్బిట దుర్గా ప్రసాద్
https://sarasabharati.wordpress.com
http://suvarchalaanjaneyaswami.wordpress.com

Posted in అమెరికా లో | Tagged | Leave a comment

శ్రీ శంకరుల లలి (కవి )తా సౌందర్య లహరి –37

      శ్రీ శంకరుల లలి (కవి )తా సౌందర్య లహరి –37

84—‘’శ్రుతీనాం మూర్ధానో ,దధతి తవయౌ ,శేఖర తయా –మమాప్యే తౌ మాతఃశిరసి దయయా  ధేహి ,చరణౌ

        యయొహ్ పాద్యం పాధఃపశు పతి ,జటాజూట తటినీ –యయోర్లాక్షా లక్ష్మీ ,రరుణహరి చూడా మణిరుచిహ్’’

       తాత్పర్యం –పాశు హన్త్రీ !వేదాల శిరస్సులు అని పిలువబడే ఉపనిషత్తు లే ,సిగ పూలు గా ధరించబడినవి .పశు పతి జటా జూటం లోని గంగా జలం చేత ప్రక్షాళనం చేయ బడినవీ ,ఎర్రగా ఉన్న శ్రీ హరి కౌస్తుభ మణి కాన్తులే ,లాక్షా రస కాంతి గా కలవీ ,అయిన నీపాదాలను ,నా తల పై ఉంచి నన్ను అనుగ్ర హించు .

          విశేషం –ప్రణయ కోపం పొగొట్ట టానికి పశు పతి దేవికి ప్రణుతి చేస్తాడు .ఆయన శిరసు లోని గంగా జలం శ్రీ దేవి పాదాలను కడుగు తుంది .అంటే గంగ ఆమె కు పాడ్యజలం అయి పవిత్ర మైంది అని భావం .ప్రతి రోజు ఉభయ సంధ్యల్లో నమస్కరించే విష్ణువు మకుటం లోని కౌస్తుభ మణి తెల్లగా ఉన్నప్పటికి ,శ్రీ దేవి చరణాలకున్న లత్తుకయొక్క ప్రసాదం వల్ల ఎరుపు రంగుగా ప్రకాశిస్తోంది .

             భగవతి పాదాంబుజ ద్వయం వేదాల శిరస్సు లందు ,సదా శివుని శిరస్సు నందు ,విష్ణువు శిరస్సు నందు సంచరిస్తోందని ,మూర్ధ అంటే శిరస్సు పై సంచరం ఆమె పాదాలకు ఉన్నదని ,భావం .అలాంటి పాదాలను తన శిరసు పై ఉంచమని భగవత్పాదులు కోరుతున్నారు భగవతి పాద ప్రక్షాలన జలం తో హరి ,బ్రహ్మ మొదలైన దేవతలు పవిత్రు లవుతున్నారని అర్ధం .ఆ మహిమ తోనే వారు తమ అధికారాలను పొంది ,నిర్వ హిస్తున్నారు .

       శృతి శిరస్సు లైన ఉపనిషత్తులకు భగవతి చరణాలు సిగ పూలు గా ఉన్నాయి అంటే ,సమస్త వేదాంత ప్రతి పాదనలు భగవతి చరణాలే అని భావం .’’లోకస్య ద్వారా మర్చి యత్పవిత్రం ‘’అని శృతి అంటోంది .’’యం ,కామయ తం తముగ్రం ,క్రునోతి తం బ్రహ్మాణం ,తమ్రుషిం ,తం సుమేదాం –అహం రుద్రాయ ,ధనురాతనోమి ,బ్రహ్మ ద్విశే ,శరవే ,హంత వా ఉ ‘’భక్తులకు అతి మహత్తు నివ్వ టానికి భగవతి పాదాలే శరణ్యం .శ్రీ దేవి కూడా పశు పతికి ప్రణామం చేయటం వల్ల ఆమె జానువులు భూమికి తాకటం చేత కథినా లైనాయని భావం .వారిద్దరూ సమ ప్రధానులు .సమాన మైన బల ,సత్వాలున్న వారు .సమ ఓజస్సు ,తేజస్సు ఉన్న వారు .కనుక శివుడు కూడా ఆమె కు నమస్కరించటం సమంజసమే నని సమర్ధిస్తారు శ్రీ శంకరులు .’’సమ ప్రదానౌ ,సమ సత్వౌ ,సమౌజసా ,వ్రుభా దాతారా ,విహ సౌభగానాం‘’అని వేదం అంటోంది .

 85—‘’నమో వాకం బ్రూమో ,నయన రమణీయాయ పదయొహ్—తవాస్మై ద్వంద్వాయ స్పుట రుచిర సాలక్త కవతే

      అసూయత్యత్సంతం  ,యదభి హననాయ ,స్పృహ యతే –పశూనా మీశానః ప్రమద వన కంకేళి తరవే ‘’

         తాత్పర్యం –మలయా చల వాసినీ !ణీ పాదాల తాడనం చేత పుష్పించిన అశోక వృక్షాన్ని చూసి ,ణీ భర్త ఈశ్వరుడు అసూయ పడుతున్నాడు .ఆ పాదాలు నాయన రమణీయంగా ,తడి లత్తుక తో ప్రకాశిస్తున్నాయి .అలాంటి ణీ పాద ద్వయానికి నమో వాకాలు

             విశేషం –ప్రణయ కలహం తో ,అనుగ్రహం గా శ్రీదేవి పాద తాడనం లభిస్తుందేమో నని శివుడు ఎదురు చూసి నిరాశ చెందాడు .అచేతన వస్తుయిన అశోక వృక్షం ఆమె పాదాల తాకుడుకు పుష్పించటం చూసి ఆ చెట్టు పై అసూయ చెందాడు .ప్రణయ కలహం లో కూడా భర్తను పాద  తాడనం చేయ లేదు ..కనుక ఆమె పాతి వ్రత్యం చాలా గొప్పది .లక్ష్మీ సరస్వతులకు ఇంత ఘనత లేదని ధ్వని .

         అశోక వృక్షం పద్మినీ జాతి స్త్రీల పాద తాడనం వల్ల పుష్పిస్తుంది .’’అశోకశ్చ రణ పాతే జ్ఞాయతే పుష్పవత్తరం‘’దీనినే ‘’దోహదం’’ అంటారు ‘.పరమ శివుడు కూడా శ్రీ దేవి పాద తాడనాన్ని కోరుతున్నాడు .అంటే –మన వంటి వారికి జన్మాంతర సుకృతం లేక పోతే ,ఆమె చరణసేవ లభించ లేదు .అశోకం అంటే శోకం లేనిది .శివుడు శోక రహితుడే .ఆయన పాశ ముక్తుడు ‘’పాశా బద్ధ స్తదా జీవః పాశా ముక్తః సదా శివః –పాశా బద్ధ పశుహ్ ప్రోక్తః పాశా ముక్తః పశు పథిహ్ ‘’

     సశేషం –మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –3-11-12-ఉయ్యూరు 


గబ్బిట దుర్గా ప్రసాద్
https://sarasabharati.wordpress.com
http://suvarchalaanjaneyaswami.wordpress.com

Posted in రచనలు | Tagged | Leave a comment

అన్నిటా ముందున్న అమెరికన్ మహిళ –లిడియా మేరియా చైల్డ్- గబ్బిట దుర్గాప్రసాద్

http://vihanga.com/?p=5783

విహంగ లో వచ్చిన వ్యాసం మీ కోసం

ఆమె అమెరికా లో చిన్న పిల్లలకోసం మొదటి పత్రికను నడిపిన తొలి మహిళ,సాధారణ ఆదాయం ఉన్న కుటుంబ మహిళల కోసం ఇంటింటివిషయాలను రాసిన ప్రధమ మహిళ ,బానిసత్వాన్ని సమూలం గా అధ్యయనం చేసి చరిత్రనంతా రాసిన మొదటి మహిళ ,నగర ప్రజల కోసం పత్రికలో సిటీ కాలం ప్రారంభించిన మొదటి రచయిత్రి ,అమెరికాలో చారిత్రిక నవలలురాసిన అతి కొద్ది మందిలో ఒకరు గానిలిచిన మహిళోద్యమ నాయకు రాలు –ఆమెయె -లిడియా మెరియా చైల్డ్ .ఆమె సృజనాత్మ క శక్తి ఉన్న రచయిత .భర్త ఆదాయం అంతంత మాత్రమె అయినా ,తన రచన ల ద్వారా సంపాదించుకొన్న డబ్బు తోనే కుటుంబాన్ని అంటే తనను, భర్తను పోషించుకొన్న ఆదర్శ స్త్రీ .భర్త తో కాపురం అంతంత మాత్రం గానే ఉన్నా ,కడ దాకా అతని తో సాహచర్యం చేసి ఓర్పు కు ఉదాహరణ గా నిలిచింది .అంత మాత్రం చేత ఆమె అసాధారణ స్త్రీలేక సూపర్ హ్యూమన్ అను కొంటె పోరబాటే .ఆమె సాధారణ మధ్య తరగతి గృహిణి .పిల్లల కోసం పరితపించింది .పిల్లలు కలగక పోయినా జనం లో తన పిల్లలను చూసుకోన్నది .స్వేచ్చ ,న్యాయాలకోసం ఆహరహం  శ్రమించింది .ఆమె జీవితం అను క్షణ పోరాటమే .డిప్రెషన్ కు లోనైనా ,మళ్ళీ తనను తను సరి దిద్దు కొని జీవనయానం సాగించింది .

           లిడియా భర్త అనేక వ్యాపారాలు చేశాడు .అన్నిట్లోనూ నష్ట పోయాడు .ఈమె తన సంపాదన అంతా అతని బాగు కోసం ,అభివృద్ధి కోసం ఖర్చు చేసింది .అయినా ఫలితం లేదు .అతనిది నిలకడ లేని జీవితం నష్ట జాతకుడు .అతనూ పత్రికా సంపాదకుడిగా పని చేశాడు . ఆర్ధిక విషయాలలో భర్తను కొద్దిగా దూరం గానే ఉంచాల్సి వచ్చిన్దామెకు .అయినా భర్త పై ఆమె కు ప్రేమానురాగాలేమాత్రమూ తగ్గలేదు .అతని బాగు కోసమే ఆ పని చేసింది .ప్రతి గాయం ,ప్రతి వెనుకడుగు ,ప్రతి నిరాశను ఆమె కప్పి పుచ్చుకొని ,రెట్టింపు ధైర్యం తో ముందుకు సాగింది .మళ్ళీ మళ్ళీ ప్రయత్నించింది అనుకొన్న లక్ష్యాన్ని  సాధించిన ధీర వంత మేరియా .

       మేరియా గొప్ప రచయిత్రి .ఆమె ఏది రాసినా చదువరుల హృదయాలకు చేరు వయ్యేది అందుకే పెద్ద పెద్ద పత్రికలన్నీ ఆమెను బ్రతిమాలి రాయించుకొనేవి .బానిసత్వ నిర్మూలనపోరాటం లో ఆమెది అలుపెరగని పాత్ర .ఆ విషయం పై ఆమె రాసింది అంతా సాదికారమే నని చరిత్ర కారులు తేల్చారు .అంత అధ్యయన శీలి ఆమె .డెబ్భై ఏళ్ళు ఆరోగ్యం గా జీవించింది .కాని ఆమె కూడ బెట్టుకొన్న ఆస్తి ఏమీ లేదు .సంపాదన పై ఆమెకు శ్రద్ధ తక్కువ .సేవా భావమే ఆమె ఆస్తి .ఆ వయసులో ప్రజలు ఇచ్చిన కానుకలు ,తాను రాసిన పుస్తకాలపై వచ్చే రాయల్టీ యే ఆమె కు ఆర్ధికం గా ఆసరా .అయినా కుంగి పోలేదు .అదే ఉత్సాహం తో ఆపని చేసింది తన దగ్గర చేరిన ధనాన్ని బానిసత్వం నుండి విముక్తి పొందిన వారి సంక్షేమం కోసం ఖర్చు చేసిన పెద్ద మనసు చైల్డ్ ది. తన సంపాదన ఈ రకం గా ఉప యోగపడుతున్నందుకు ఆమె ఎంతో సంతృప్తి చెందింది .చివరి రోజుల్లో బౌద్ధ ధర్మానికి చేరువ అయింది .బౌద్ధానికి చెందిన ఎన్నో పుస్తకాలను కొని ,చదివి లోతులను పార జూసింది .ఆమె రాసిన ‘’Progress of religious ideas’’పుస్తకానికి ఇది బాగా ఉపయోగ పడిందని చెప్పింది .ఇరవై ఏళ్లకే ఆమె గొప్ప అధ్యన శీలి గా పేరు పొందింది .బైబుల్ లోని ముఖ్య విషయాలనన్నిటిని చేర్చి Electic Bible అనే స్వంత పుస్తకాన్ని తయారు చేసుకోవాలనే ఆమె తీవ్ర సంకల్పం నేర వెర కుండానే మరణించింది .’’Aspiration of the world ‘’,’’A chain of opals ‘’అనేవి ఆమె రాసిన చివరి పుస్తకాలు .ఇందులో గ్రీక్ ,రోమన్ ,బుద్ధిజం ,జ్యూయిజం ,క్రిస్తియన్ ,,చైనాయిజం ,పెర్షియన్ ,హిందూ మతాలకు ఆధునిక రచయితలు ఎందరో రాసిన రచనలను పొందు పరచింది .ఇవన్నీ’’ క్రోన లాజికల్ ఆర్డర్ ‘’లో రాయటం ఆమె గొప్పతనం .ఆమె ‘’Anti Asian Racism ‘’పుస్తకాన్ని రాయాలని అన్నీ సేకరించుకోన్నది కాని రాయలేక పోయింది .అన్ని కాలాలు ,దేశాలు ,పవిత్ర మైన ఆశయాలతో నే ఉన్నాయి అన్నది ఆమె నిశ్చితాభిప్రాయం .

        లిడియా మెరియా చైల్డ్ 1802 ఫిబ్రవరి పద కొండున అమెరికా లోని మాసా చూస్త్స్ రాష్ట్రం లో మేడ్ ఫీల్డ్ అనే చోట జన్మించింది .చిన్నప్పుడే నేటివ్ అమెరికన్ ల తో స్నేహం చేసి ,వారి జీవిత విధానాలను తెలుసుకొన్నది .అప్పుడే ప్రఖ్యాత తత్వ వేత్త ,మహా రచయితా అయిన ఎమర్సన్ హార్వర్డ్ లో విద్యార్ధి గా ఉండే వాడు .Hobonok ,a tale of early times ‘’నవలను చిన్నతమ లోనే రాసి ,అందరి దృష్టి ఆకర్శించింది . .అందులో నేటివ్ ఇండియన్ ల సంస్కృతి ,తో బాటు అమెరికన్ ,ఇండియన్ వర్ణాంతర వివాహం కూడా రాసి ,ఆమె కాలాని కంటే,ముందుగా నిలిచి ,మార్గ దర్శి అని పించుకోంది .అప్పటికి అమెరికా సాహిత్యం లో ఈ భావ వ్యాప్తి జరగ లేదు .ఆ బీజం వేసింది ఈమెయే.ఆమె రెండో పుస్తకం చిన్న పిల్లల కోసం రాసిన కదా సంపుటి ‘’ .evenings in New England’’ఆమె రాసిన ‘’ది రెబెల్స్’’ చారిత్రాత్మక నవల .ఇందులో అమెరికా విప్లవ యుద్ధం లోను , ,దేశం స్వతంత్రం సంపాదించిన మొదటి దశలోను , స్త్రీల పాత్ర ను వివరించింది .

       ఇండియన్ అమెరికన్లు అయిన చేరోకీల ను వారి స్థావరాల నుండిప్రభుత్వం  ఖాళీ చేయిస్తే,వారి పునరావాసానికి ఉద్యమం నడిపింది .స్త్రీల కోసం ఎన్నో రాసింది .వంటింటి చిట్కాలు చెప్పింది .సంపాదనా మార్గాలు సూచించింది .పరిమిత ఆదాయం తో ఎలా జీవించా వచ్చో రచనల ద్వారా తెలియ జేసింది .’’కాలమే ధనం ‘’అన్నది ఆమె నినాదం .1829 లో మహిళల కోసం ‘’The frugal house wife ‘’రచన చేసింది .బానిసలను వారి యజమానులే విద్యా వంతుల్ని చేయాలని సూచించింది .బానిస నిర్మూలన ఉద్యమం లో చురుకుగా పాల్గొన్నది .ఎందరో ఆఫ్రికన్ అమెరికన్ నాయకులు ఆమె సలహాలను స్వీక రించే వారు .బానిసత్వ వ్యతిరేక సభలను నిర్వ హించింది .వారి ఆర్ధిక సాయం కోసం విరాళాలు వసూలు చేసి అంద జేసింది .లిడియా చేసిన ముప్ఫై ఏళ్ళ సుదీర్ఘ పోరాటం తర్వాత బానిసలకు విముక్తి లభించింది .

            మేరియా చివరి రోజులను  బోస్టన్ బోర్డింగ్ హౌస్ లో ఒంటరిగా ఒక గది లో గడిపింది .డబ్బును చాలా జాగ్రత్తగా క్షర్చు చేస్తూ ,నీతికి నిజాయితీకి ,వ్యక్తిత్వానికి ప్రాధాన్యత నిస్తూ జీవితాన్ని ధన్యం చేసుకోంది .తన గది లో కిటికీ లో ఒక ‘’ప్రిజం ‘’అంటే’’ పట్టకం’’ ను పెట్టు కొని ,దాని ద్వారా ఇంద్ర ధనుస్సు రంగులను తన గది గోడల మీద పడేట్లు చేసుకొని ఆనందాన్ని  అనుభవించేది .1880 అక్టోబర్ ఇరవై న ఆమె గుండె పోటు తో మరణించింది .ఆమె ను సమాధి చేసిన రోజున ఆకాశం లో అంతకు ముందెన్నడూ కనీ పించని అతి పెద్ద అద్భుత మైన ఇంద్ర ధనుస్సు కనీ పించి,అందర్నీ ఆశ్చర్యం లో ముంచింది .ఈ ఇంద్ర ధనుస్సు అందమైన భిన్నత్వం లో ఏకత్వానికి ప్రతీక అని అందరు భావించారు .ఈ ఇంద్ర ధనుస్సు ఆమె సేవా తత్వానికి ఘన మైన నివాళి అన్నారు .లిడియా మేరియా చైల్డ్ నిజం గా నే పేద ప్రజల ఆశల ఇంద్ర ధనుస్సు .

      – గబ్బిట  దుర్గా ప్రసాద్

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

 

 

Posted in రచనలు | Tagged | Leave a comment

శ్రీ శంకరుల లలి (కవి )తా సౌందర్య లహరి –36

  శ్రీ శంకరుల లలి (కవి )తా సౌందర్య లహరి –36

81—‘’గురుత్వం ,విస్తారం ,క్షితి ధర పధిహ్ పార్వతి నిజా –న్నితంబా ,దాచ్చిద్య త్వయి ,హరణ రూపేనా ,నిదధే

      అతస్తే ,విస్తీర్ణోగురు రాయ మశే షాం వసు మతీం –నితంబ ,ప్రాగ్భారః శ్తగాయతి లఘుత్వం నయతిచ ‘’

        తాత్పర్యం –ప్రాణ దాత్రీ పార్వతీ దేవీ !కొండ ల  రాజైన నీ తండ్రి హిమ వంతుడు తన నితంబ ప్రదేశం నుంచి కొంత గురుత్వాన్ని ,వైశాల్యాన్ని తీసి ,నీ వివాహ సమయం లో తాను కుమార్తె కిచ్చే ,కానుక గా నీకు సమర్పించాడు .నీ పిరుదుల అతిశయంచాలా గొప్పదీ ,వెడల్పైనదీ అయి ,భూమి నంతా ,కప్పుతోంది .భూమి దీనితో చులకన అయి పోయింది .

         విశేషం –భగవతి పిరుదులు భూమిని తిరస్కరిస్తున్నాయి .అంటే –భూమి ఆమె కు పీ థమైంది .శ్రీ దేవి ప్రకృతి స్వరూపం .భూమిని ఆశ్రయించిన శోభ అంతా ప్రకృతి శోభే ఆమె శోభ .ప్రాకృతిక శోభకు గిరి పుత్రిక లైన నదులే ఉదాహరణలు .

          ఆమె నితంబ సౌభాగ్యం ముందు సకల భూ బింబం చులకన అవుతుంది,వేల వేల బోతుంది .ఆమె పాదాక్రాంత మైన భూమి ఇలా అవటం లో తప్పేమీ లేదని సమర్ధిస్తున్నారు శ్రీ శంకరులు .మార్కండేయ పురాణం లో ‘’సదదర్శ ,తతో దేవీం ,వ్యాప్య ,లోకత్ర్తయం ,త్విపా — దాక్రాన్త్య ,నత భువం ,కిరీటోల్లిఖితాంబరాం –క్షోభి తాశేష పాతాలం ,ధనుర్జ్యానిహ్ స్వనేన తాం –దిశో భుజ సహస్రేణ సామంతా ,ద్వాప్య సంసిద్ధతాం ‘’అనేది దీనికి నిదర్శనం

82—‘’కరీన్ద్రానాం ,శుం డాన్,కనక కదళీ ,కాండ పటలీ—ముఖాభాం ,మూరుభ్యాముభాయ మపి నిర్జిత్య భవతే

        సువ్రుత్తాభ్యాం ,పత్యుహ్ ప్రణతి కతథినాభ్యాం ,గిరి సుతే –విదిజ్నే ,జానుభ్యాం ,విబుధ ,కరి కుంభ ద్వయ మసి‘’ ,

          తాత్పర్యం –వేద విజ్ఞాత్రీ !వేద ధర్మాన్ని చక్క గా అనుష్టించే గిరికన్యవు .నీ తొడల అందం దిగ్గజాల తొండాలను ,బంగారు అరటి స్తంభాలను మించి ఉంది.శోభనం గా ,వర్తులం గా ఉంది .సదా శివుడు నీకు మొక్కే తప్పుడు భూమిని స్ప్రుశించటం వల్ల ,కాయలు కాచిన మోకాళ్ళచేత ,ఐరావతం యొక్క కుంభ ద్వయాన్ని కూడా జయించి ప్రకాశిస్తున్నావు .

        విశేషం –భగవతి సర్వ సౌభాగ్య లక్షణాలు కల మహా పతివ్రత .జగాలను కానిదీ ,ధరించేడీ .ప్రళయ కాలం లో మేల్కొని ,ఉండేది భగవతి .’’సుతే జగంతి భగవతీ భవతీ ,భిభర్తి ,తత్ క్షయ కృతే భవతీ భవానీ ‘’అని కాళి దాస మహా కవి చెప్పాడు .లలితా సహస్ర నామాలలో కూడా ‘’కామేష జ్ఞాని సౌభాగ్య ,మార్దవో రుద్వయాన్వితా ,మాణిక్య మకుటా కార జాను ద్వయ విరాజితా ‘’అని ఉంది

83—‘’పరాజేతుం ,రుద్రం ,ద్విగుణ ,శర గర్భౌ గిరిసుతే –నిషం గౌ జమ్ఘేతే ,విషమ ,విశిఖో బాద ,మక్రుత

      యదగ్రే ,ద్రుశ్యంతే ,దశ ,శర ఫలాఃపాద యుగళీ—నఖాగ్రచ్చ ద్మాన ,స్సుర మకుట శానైక నిశితా

          తాత్పర్యం –రుద్రాణీ !‘’రుద్రుని జయించ టానికి మన్మధునికి ,తన దగ్గరున్న అయిదు బాణాలు చాలనే లేదు .అందుకని ,పది బాణాలు గా చేయ దలచి ,నీ పిక్కలను అమ్ముల పొదిగా ,,కాళి వ్రేళ్ళను బాణాలుగా ,వ్రేలి గోళ్ళను బాణాల చివర పదును పెట్టి ఉంచిన ఉక్కు ముక్కలుగా ,చేసుకొన్నాడు .నీకు నమస్కరించే దేవతల కిరీటాలలో ఉన్న మణులు అనే ఒరిపిడి రాళ్ళ పై నఖాగ్రాలు అనే ములుకులు పదును పెట్ట బడ్డాయి .

        విశేషం –మదనుడు పది బాణాలను సంపాదించుకొన్నాడు .ఇది రుద్ర విజయ సాధనార్హత వల్లనే అని భావం .లలిత లో ‘’ఇంద్ర గోపా పరిక్షిప్త ,స్మర తూణాభ జమ్ఘికా ‘’అని ఉంది .శ్రీ దేవి జం ఘలు మదన తూణీరాల వలె ,అతి లోక రమ్యాలు అని అర్ధం .

               సశేషం –మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –.2-10-12-ఉయ్యూరు 


గబ్బిట దుర్గా ప్రసాద్
https://sarasabharati.wordpress.com
http://suvarchalaanjaneyaswami.wordpress.com

Posted in రచనలు | Tagged | Leave a comment

ఊసుల్లో ఉయ్యూరు –43 పిల్లి బల్లి నల్లి వంశ పారంపర్యం

  ఊసుల్లో ఉయ్యూరు –43
                            పిల్లి బల్లి నల్లి  వంశ పారంపర్యం  

 

   మేము హిందూ పుర నుంచి వచ్చే సరికి మా ఇంట్లో పిల్లులేవీ లేవు .కాని కొంత కాలానికి నెమ్మదిగా ఒక తెల్ల అందమైన పిల్లి పిల్ల చేరింది .పెద్ద వాళ్ళ కు పిల్లు లంటే మంట .ఇంట్లోకి రానిచ్చే వారు కాదు ..అది బిక్కు బిక్కు మంటూ చూసేది .నాకు కాస్త జాలి కలిగేది .కాని పెద్దల మాట కాదన లేని స్తితి .కనుక కొంచెం చాటుగా నేను తిన్న పెరుగన్నం కొద్ది గా వదిలే సె వాడిని ..అది అప్పటి దాకా పక్కనేఉండి అప్పుడు నా కంచం దగ్గరకు వచ్చి తినేసి వెళ్లి పోయేది .పిల్లి నాకిన కంచం అంటే మా ఇంట్లో గొడవ, గొడవ చేసే వాళ్ళు .పని మనిషి కంచాలు తోమటం అప్పటికింకా మా ఇళ్లలో రాలేదు .ఆడ వాళ్ళే కంచాలు తోముకొనే వాళ్ళు .అంట్ల గిన్నెలు మాత్రమె పని మనుషులు తోమే వారు .అందుకని మా అమ్మ నన్ను తిట్టేది ‘’వెధవ్వేషాలేయ్యకు పిల్లి ముట్టిన కంచం లో మళ్ళీ తింటే కుష్టు రోగాలోస్తాయి మళ్ళీ అల్లా చేస్తే కంచం పెట్టి బుర్ర రామ కీర్తన పాడిస్తా ‘’అనేది .నేను ముసి ముసి నవ్వులు నవ్వే వాడిని .అలాగే గడిచింది కొంతకాలం .ఆ తర్వాతా ఈ తిట్లు తిన లేక నేను పెరుగన్నాన్ని కంచం బయట వదిలే వాడిని .పాపం అది తిని వెళ్ళేది .ఆ పిల్లి మీసాలు బలేగా ఉండేవి .మ్యావ్ మ్యావ్ ‘’’’మంటూ తెగ అరిచేది .ఇంట్లో దాని మొహం చూసే ఏకైక వీరుణ్ణి నేనే అని దానికి తెలిసి నా మీద సాఫ్ట్ కార్నర్ తో ఉండేది .నా కాళ్ళ చుట్టూ ప్రదక్షిణం చేసేది .నాకు పిల్లి అంటే పెద్ద అభిమానం ప్రేమా ఏమీ లేవు .దాన్ని ఒళ్ళోకి తీసుకోవటం ముద్దు పెట్టు కోవటం ఎప్పుడు చెయ్య లేదు కూడా .కాని చెవులు పట్టి కాసేపెప్పుడైనా ఆడించే వాడిని .నేను ఇంటికి ఏ సమయం లో వచ్చినా అది యెట్లా పసి గట్టేదో వెంటనే పరి గేత్తుకొని వచ్చేది .పిల్లిని చేరనివ్వటం మా వాళ్ళేవారికి సుత రామూ ఇష్టం లేదు .నేను చనువు ఇస్తున్నానని కోపం గా ఉండే వారు ..ఏదో మూగ జీవి అని నా భావన .

         ఆ తెల్ల పిల్లి పిల్ల కొంచెం పెద్దదైంది .దానితో జోడు కట్ట టానికి గండు పిల్లి వేమ్పర్లాడేది..అదో భీభత్స రస ప్రధానం .అరుపులు ,ఉరుకులు ,పరుగులు .మాకు హుషారుగా నే ఉండేది కాని పెద్ద వాళ్ళు చీదరించుకొనే వారు .వడ్లకొట్లో చేరేవి .అరిచి అరిచి కూన లొంగి పోయేదేమో .కాసేపు విరామం ..ఇది జత కట్టిందని మిగిలిన గండు పిల్లు లకేం తెలుసు ?అవీ దీని మీదకు దూకేవి .వాటి బారి నుండి తప్పించుకోవటానికి ఇది శ్రమ పడేది .మొత్తం మీద మా పిల్లి గర్భం దాల్చింది .రెండో మూడో కూనలను కన్నది .దాని కాపురం మా వడ్ల కొట్టే .అన్నీ అక్కడే నివాసం .మా పిల్లికి దాని సంతానానికి మా లానే శాకాహారం అలవాటేమో అన్నట్లు ,వడ్ల కొట్లో చేరే ఎలుకల్ని మాత్రం పట్టుకోనేవి కావు .ఎప్పుడైనా బయటి నుంచి ఎలుకను చంపి తెచ్చి పిల్లలకు పెట్టేది .అప్పుడు ఇల్లంతా గౌలు కంపు కొట్టేది .భరించలేక పోయే వాళ్ళం .కర్ర పట్టు కొని తరిమేసేది మా అమ్మ .అయితేనేం ?వాటికి మంచి ఆవాసం వదులు కోవటం ఇష్టం లేదేమో .మళ్ళీ చేరేవి .మా ఇంట్లో పాలు ,పెరుగు వెన్న సమృద్ధిగా ఉట్ల మీద ఉండేవి .కను మాయ చేసి ఒక్కో సారి మేక్కేవి .తిట్టు కొంటూ అదిలించే వాళ్ళం .పిల్లి ముట్టినవి తిన కూడదని ఉన్నా ,అన్నీ అవి ఎంగిలి చేస్తుంటే దేన్నీ పారేస్తారు .సర్వ మంగళం అయి పోయేది .

           అన్ని రకాల రంగులున్న పిల్లులు ఉండేవి .కొన్ని మచ్చలతో ఉండి భలే ఆకర్షణీయం గా ఉండేవి .వాటి కళ్ళు భలే గా మెరుస్తున్దేవి .ఇలా పిల్లులు క్రమం గా సంతతిని పెంచుకొంటూ పోయేవి .ఒక్కో సారి సంఖ్య బాగా పెరిగితే పాలేరు తో సంచీలో పెట్టి దూరం గా ఎవరింటి దగ్గరైనా విడిచి పెట్టి రమ్మనే వాళ్ళం .పిల్లి కూనల్ని తినటానికి గండు పిల్లులు ఎప్పుడూ రెడీ గా ఉండేవి .వాటిని కాపాడు కోవటానికి తల్లి పిల్లి పడే ఆరాటం చెపప్ప నలవి కాకుండా ఉండేది .గండు తో యుద్ధమే చేసేది .అయినా ఒక్కో సారి గండు నుంచి పిల్లల్ని కాపాడు కోలేక పోయేది .మా వయసు తో బాటు పిల్లుల సంతానము పెరుగుతూనే ఉంది.

            నా పెళ్లి అయిన తర్వాతా మా ఆవిడ కాపురానికి వచ్చి నప్పుడు ఒక తెల్లని పిల్లి పిల్ల ఉంది..అది చాలా చలాకీ గా ఉండేది .రాత్రి పూట నేను కాని ప్రభావతి కాని దాన్నిపాపం పొరబాటున  తొక్కినా ఏమీ అనేది కాదు .అదే మా ఓదిన మా అమ్మ  తొక్కితే గోళ్ళతో గిచ్చి పెట్టేది . నేను అన్నం తినేటప్పుడు దూరం గా కూర్చుని సందడి చేసేది కాని కంచం దగ్గరకు చేరేది కాదు .ననేను వచ్చే దాకా నా పీత మీదనే కూర్చునేది నేను వదిలిన అన్నం మాత్రమె తినేది ఇంకెవరి కంచాల దగ్గరకు వెళ్ళేది కాదు .వాళ్ళు కూడా ఎవరు దాన్ని ఆదరించే వారు కాదు .తమాషా ఏమిటంటే మా ఆవిడా తో పాటు ఈ పిల్లి కూడా ‘’నీల్లోసుకోనేది ‘’మా అమ్మ దాన్ని వెటకారం గా ‘’కోడలు పిల్లా ,పిల్లి పిల్లా ఒకే సారి కంటారు ‘’అని చమత్కరించేది.

         ఈ బుజ్జి పిల్లి నాకు బాగా మాలిమి ..కంచం లో అన్నం వడ్డించి మా ఆవిడ నన్ను అన్నానికి రమ్మని పిలిస్తే నేను ఏదో పని మీద ఉండి రావటం ఆలస్య మైతే పిల్లితో ‘’మీ తాతయ్య ను పీల్చుకొని రావే ‘’అనేది .అది వెంటనే నా దగ్గరికి వచ్చి కాళ్ళ చుట్టూ తిరిగి చొక్కానో ,లుంగీ నో పట్టు కొని తన భాషలో రమ్మని పిలిచేది .అప్పుడు వెళ్ళే వాడిని .అంత చనువు దానికి .ఇంట్లో దొంగ తిళ్ళుతినేది కాదు .ఇలా తరతరాలుగా దాని సంతతి మా ఇంట్లో వర్ధిల్లింది .ఏ నాటి రుణాను బంధమో అని పించేది .పిల్లిని అదిలించటానికి చేతిలో కొబ్బరి చీపురు పుల్ల పెట్టుకొనే వాడిని .ఎప్పుడైనా మరీ గోల చేస్తే దానిచివర్ల తో చేళ్ మని పించే వాడిని .తద్దినాల రోజుల్లో పిల్లిని ఇంట్లోకి అడుగు పెట్ట నిచ్చే వాళ్ళం కాదు పిండాలు ముట్టుకుం టాయని, మడివాళ్ళను ముట్టుకొంటాయని  భయం అంతే కాదు పిల్లి ముట్టుకుంటే శ్రార్ధం మళ్ళీ పెట్టాల్సిందే నని నియమం.ఉంది.పిండాలు ముట్టుకొంటే మహా తప్పు .ఎవరి నైనా తిట్టా లంటే ‘’నీ పిండం పిల్లికి పెట్టా‘’అని తిట్టే వారు .అంత తాక రాని జీవి పాపం అది .వాటి కి తెలుసో ఏమో మా ఇంట్లో తద్దినాలప్పుడు అవి పసి గట్టి ,ఆ చాయలకు కూడా వచ్చేవి కావు .అయినా మా జాగ్రత్త లో మేముండే వాళ్ళం .అది వాటి సంస్కారమేమో నని పించేది .పిల్లికి కూడా హాని చెయ్యని వాడు అని మంచి వాళ్ళను అంటారు .పిల్లిని చంపితే బ్రహ్మ హత్యా పాతకం చుట్టూ కొంటుందని అంటారు .దానికి ప్రాయశ్చిత్తం గుడి కట్టటమే నని పరిష్కారం చెప్పారు .అందుకే మల్లాది చంద్ర శేఖర శాస్త్రి గారు పురాణం చెబుతూ ‘’పిల్లిని చంపిన పాపం ఖాతా వేరు గుడి కట్టిన పుణ్యం ఖాతా వేరు ‘’అనేవారు .అంటే గుడి కట్టి నంత మాత్రం చేత పిల్లిని చంపినదోషం పోదు అని భావం .

           బల్లి కూడా మా ఇంట్లో కొలువుండేది .ఎన్ని బల్లులు తర తరాలుగా వర్దిల్లయో చెప్పలేం .మా సావిట్లో దూలం కింద ట్యూబ్ లైట్ ఉండేది .అక్కడ ఎక్కువ గా చేరేవి .రాత్రి పూట అవి వింత శబ్దాలు చేసేవి .అంటే వాటి భాష లో మాట్లాడుకొనే వేమో ?దీపం పురుగులను గుటకాయస్వాహా చేసేవి .అందుకనే వాటిని ఏమీ చేయ లేక పోయే వాళ్ళం .బల్లి పిల్లలు ముచ్చట గా ఉండేవి .చిన్న పిల్లలకు తలుపు సందుల్లో పడితోకలు తెగేవి .ఒక్కో సారి మీద పడుతుండేవి .మొదటి సారి పడితే బల్లిశాస్త్రం చూసి ఫలితం చెప్ప వచ్చు .కాని నిత్యం వాటితో కాపురం చేస్తుంటే ఫలితాలనేమి చెప్పగలం ?.అందుకని పెద్ద గా పట్టించుకొనే వాళ్ళం కాదు .అందుకే ఎందు కైనా మంచి దని కంచికి వెళ్లి నప్పుడల్లా అందరు అక్కడి బంగారు బల్లి ని స్పర్శించి వస్తూంటారు .అది సర్వ దోష హరం .పాలు ,పెరుగు విషయాలలో చాలా జాగ్రత్త గా ఉండే వారు .మూతలు లేకుండా ఇంట్లో దేన్నీ ఉంచే వారు కాదు. బల్లి విషం చాలా ప్రమాద కరం .దాని కాళ్ళ కింద ‘’సక్కర్లు ‘’ఉంటాయి వాటి పై ఒత్తిడి తెస్తే గాలి బయటికి వెళ్లి శూన్య ప్రదేశం ఏర్పడి అది గోడకు అతుక్కు పోతుంది కింద పడదు .ఆ కాళ్ళ పై గాలి ఒత్తిడి కల్గించి పడ నీయడు అని చదువు కొన్నాం .తెల్లా ,నల్లా బల్లులు ఎక్కువ .వంటింట్లో గదుల లో  అన్ని చోట్లా దర్శన మిచ్చేవి .అవి దూరని ప్రదేశం ఉండేది కాదు .స్వేచ్చగా విహరించేవి .బల్లి అంటే చాలా మందికి ఆసహ్యం,భయం కూడా .మీద పడితే ఉలికి పడతారు .ఇలా పిల్లి తో పాటు బల్లీ మా ఇంట్లో తరాలు గడి పాయి .అయితే యే బల్లి ఏమిటో పట్టించుకోవటం కుదరదు కదా .వాటి మానాన అవి తిరుగుతూ ,పెరుగుతూ పోతున్నాయి .ఇప్పుడిప్పుడే కొత్త ఎలెక్ట్రిక్ పరికరాలు వస్తున్నాయి .వాటిని ప్లగ్ లో పెట్టి స్విచ్ వేస్తె ,సన్నని కీచు శబ్దం చేస్తాయి దానితో బల్లి ఆచాయలకు కూడా రావటం లేదు .పిల్లుల తో బాటు బొద్దిన్కలూ మాయమవుతున్నాయి .

          నల్లి ఇప్పుదేక్కడా కానీ పించటం లేదు కాని పాతికేళ్ళ కిందటి వరకు నల్లులు ఇళ్ళ ల్లో ని మంచాలలో ,గోదాల్లోని సందుల్లో ,చిన్న చిన్న బొక్కల్లో విప రీతం గా ఉండేవి .వాటి సంతానం తామర తంపర గా పెరిగి పోయేది ఎన్ని నల్లులను చంపినా వాటి ఈనులు వస్తూనే ఉండేవి .పరుపుల్లో ,దిండ్ల లో దుప్పట్ల లో మంచం బద్దీ లలో ,నులక లో నవారు మంచాల నవారు కిందా అవి దూరని ,పెరగని ప్రదేశం ఉండేది కాదు .కొందరి శరీరాలు నల్లులకు చాలా ఇష్టం .తెగ రక్తం తాగి బలిసేవి .రాత్రుళ్ళు నిద్ర ఉండేది కాదు నల్లులను చంపుకొంటు గడపాల్సి వచ్చేది .ఒక్కో సీజన్ లో అవి మరీ విజ్రుమ్భించేవి .వాటి బారిన పడని వాళ్ళు లేరంటే అతిశయోక్తి కాదు .వేసవి కాలం నల్లులకు చావు కాలం .అంటే జనం మంచాలను ఎండలో వేసి ,మధ్య మధ్యలో కొడుతో కర్రతో నవారును నులకను బాదుతూ చంపే వాళ్ళం .అదీ కాక మరుగుతున్న వేడి నీరు పోసి దబ్బనాల తో చంపే వాళ్ళం .అదీ కాక పోతే కిరస నాయిలు పోసి చంపే వాళ్ళం .అదొక ప్రహసనం గా ఉండేది .అందుకే ఒక కవి శ్రీ మహా విష్ణువు పాల కడలి లో ను శివుడు కైలాసం లోను ఉండ టానికి కారణం నల్లి బాధలు భరించ లేకే అని చమత్కరించాడు .ఆ తర్వాతా పురుగుల మందులు విప రీతం గా వాడకం లోకి వచ్చిన తర్వాతా క్రమంగా నల్లులు కను మరుగై నాయి పాతికేళ్ళు గా నల్లి కానీ పించటం లేనే లేదు .ఈ తరం వారు ఈ రకం గా అదృష్ట వంతులు .నల్లి కుడితే విపరీతం గా దద్దుర్లు వచ్చేవి రక్త పిపాసుల్లా ఉండి ,పండుల్లా బలిసేవి .వాటి సంతానం విపరీ తం .శీతా కాలం లో అయితే శివ రాత్రి జాగారనే అయేది .ఇవీ వంశ పారంపర్యం గా వర్ధిల్లి అదృశ్యం అవటం ఆశ్చర్యం గా ఉన్నా ,వాటి బాధ నుంచి విముక్తు లవటం ఊరట .అప్పుడు పిచ్చుకలూ విపరీతం ఇప్పుడు సెల్ టవర్ల వల్ల అవీ కను మరుగాయాయి అయితే అమెరికా లో బానే ఉన్నాయి పిచ్చుకలు .ఇదీ మా పిల్లీ బల్లీ నల్లీ గాధ

      మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –1-11-12—ఉయ్యూరు –

         

గబ్బిట దుర్గా ప్రసాద్
https://sarasabharati.wordpress.com

Posted in ఊసుల్లో ఉయ్యూరు | Tagged | Leave a comment

ఆత్మ నిజం – బంగారు జాతీయ గీతం

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

అమెరికా లో జర్మన్ హవా –4

  అమెరికా లో జర్మన్ హవా –4

1732లో మేరీ లాండ్ లోని బాక్ లాండ్స్ ను మూడేళ్ళ పాటు ,డబ్బేమీ కట్ట కుండా రెండు వందల ఎకరాలు లభించింది .తర్వాతా ఎకరానికి ఒక్క సెంటు మాత్రమె డబ్బు కట్టాలి .అందరికి భద్రత ఉంటుందని లార్డ్ బాల్టి మొర్ ప్రకటించాడు  .ఇక్కడ పొగాకు బాగా పండుతుంది .18 వ శతాబ్దపు యాత్రికుడు ‘’పోగాకే మాకు మాంసం ,పానీయం ,బట్ట ,డబ్బూ‘’అన్నాడు .అయితే జర్మన్లకు ఆహార ధాన్యాల మీద ధ్యాసఎక్కువ. .అందుకని అక్కడ చేర లేదు .1740 లో monocacyనది మీద ‘’అన్నా పోలీస్ ‘’ను కలుపు కొని ,బ్రిడ్జి పడింది .మార్కెట్ కూ అను కూల మైంది .ఫ్రెడరిక్ కౌంటి మంచివ్యవసాయ క్షేత్రమైంది .అక్కడ bachelors delight ఏర్పడింది .చివరికి ఇక్కడికి చేరిన వాడే హేగార్స్ డిలైట్ .న్యు ఇంగ్లాండ్ లో ‘’వాల్డో బార్న్ ‘’లో జర్మన్ కమ్మ్యునిటి ఏర్పడింది .1740 లో మూడు వందల మంది పాల టైన్ లోని లూధరన్లు ,’’మైం’’కు చేరారు .వారికి బూమి ,ఇళ్ళు ,చర్చి వాగ్దానం చేశారు .సామ్యుయాల్ వాల్డో దగ్గర పెద్ద మైదానం లోకి చేరారు .వలస దారుల్ని బోస్టన్ లో కలిసి కొత్త నివాసాలకు చేర్చారు .లాగ్ కాబిన్ లో  శీతాకాలం rye తో చేసిన వంటకం తో కాల క్షేపం చేశారు .వీరిపై కెనడియన్ ఇండియన్లు విరుచుకు పడే వారు .భయ పడి కొందరు ‘’నోవా స్కేడియా ‘’కు పారి పోయారు .మిగిలిన వారిని ఇండియన్లు చంపేశారు .అంతా ఖాళీ అయింది .1752 లో ‘’కేన్నెబీ’’నది ఒడ్డున కొందరు జర్మన్లు చేరి ,’’ఫ్రాంక్ ఫర్ట్ టౌన్ ‘’ఏర్పాటు చేసుకొన్నారు .తర్వాత ఇది ‘’dresden‘’తో కలిసి పోయింది .

 

           జర్మన్లు శాంతి కాముకు లవటం ,వ్యవసాయ దారులు కావటం వల్ల రాజకీయాల జోలికి పోలేదు .వాళ్ళు పౌరులు అని పించు కోవటానికి అవరోధాలు చాలా ఉండేవి కూడా .అయితే అమెరికా రివల్యూషన్ ను జర్మన్లు సమర్ధించారు .టెక్సాస్ స్టాంప్ ఆక్ట్ వాళ్ళను రాజకీయాల్లో దిగెట్లు చేసింది .లూధరన్లు ,రిఫార్మర్ మినిస్టేర్లు రివల్యూషన్ ను సమర్ధించారు .కొద్ది మంది మాత్రం బ్రిటిషర్ల ను సమర్దిన్చాల్సి వచ్చింది .దీనికి కారణం యూరప్ లోని జర్మన్ రాజ్యాలను బ్రిటన్ కొనటమే .ముప్ఫై వేల మంది ‘’nercenaries ‘’ను ‘’హేస్సియన్ల’’ను అమెరికా తో యుద్ధం చేయటానికి బ్రిటీష్ ప్రభుత్వం పంపింది .యుద్ధం లో ఓడిపోయినా వారిని జర్మన్ సెటిలర్స్ ఆహ్వానించారు .యుద్ధ ఖైదీ లను ఫ్రెడరిక్ మేరీ లాండ్ లకు పంపి వ్యవసాయ కూలీలుగా పని చేయించారు .మొత్తం మీద చావగా మిగిలిన ఆరు వేల మంది హేస్సియన్లు అమెరికా లో ఉండి పోయారు .1783మార్చి లో యుద్ధం ముగిసిందని తెలియ గానే వీరంతా ఆనందం గా’’ బాండ్ ‘’వాయించారు .

               అమెరికా రివల్యూషన్ ,నెపోలియన్ యుద్ధాలు ,1812లో యుద్ధం వల్ల అమెరికా కు వలసలు తగ్గాయి .అమెరికా రిపబ్లిక్ అయిన మొదటి నలభై ఏళ్ళు స్తిరత్వం కోసం కష్ట పడాల్సి వచ్చింది .కాని ,1804 లో జార్జి రాప్ప్ నాయకత్వం లోని ‘’రాప్పులు ‘’మత గ్రంధాల ఆధారం గా  జీవితం  గడిపే వారు .సంపాదన ను పౌర సేవ కు విని యోగిస్తూ ,1814 లో ఇండియానా చేరి ,’’న్యు హార్మని’’ లో ముప్ఫై వేల ఎకరాలలో స్తిర పడ్డారు .అక్కడి మలేరియా కు తట్టుకో లేక పదేళ్ళ తర్వాతపెన్సిల్వేనియా కు చేరుకొన్నారు .చివరి స్తావరం ఒహాయు నది ఒడ్డున ఎకానమీ .ఇది పిట్స్ బర్గ్ కు ఇరవై కిలో మీటర్ల దూరం .అక్కడ ఆయిల్ ,బొగ్గు గనులు ఏర్పాటు చేసుకొని ఆరేళ్ళ తర్వాతబాగా పున్జుకొన్నారు .

       ‘’ కామన్ ఓనర్ షిప్ ‘’పేరఏర్పడిన జర్మన్ మత సంస్థలు కొన్ని ,’’జోర్‘’ఒహాయు ‘’లకు1819 లో చేరాయి .1844లో బెతేల్ మిస్సోరీ లకు ,1856లో ‘’ఆరా .ఓరిగాన్ ,అమోనా ,ఐయోవా లకు వచ్చారు .మత కారణాల వల్ల ఈ రకం జర్మన్లు అమెరికాకు రావటం కొత్త విషయం .19 వ శతాబ్దం లో వ్యక్తీ గతం గా కుటుంబాలతో ,సామూహికం గా అమెరికాకు జర్మన్లు చేరారు .రెండొంతుల మంది ఆస్త్రియా  ,హంగేరి ,రష్యా లకు వెళ్లారు .1820 లో ఎనిమిది వేల మంది జర్మన్లు అమెరికా వచ్చారు .నెపోలియన్ యుద్ధం వల్ల బ్రిటీష వారు పంపించే ‘’చీప్‘’వస్తువులను చూసి జర్మన్లు ఏవ గిన్చుకొన్నారు .

         ఆంద్ర ప్రదేశ్ అవతరణ దినోత్సవ శుభా కాంక్షల తో

            సశేషం –మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –1-11-12-ఉయ్యూరు 

Posted in రచనలు | Tagged | Leave a comment

శ్రీ శంకరుల లలి (కవి )తా సౌందర్య లహరి –35

  శ్రీ శంకరుల లలి (కవి )తా సౌందర్య లహరి –35

79—‘’నిసర్గ క్షీణస్య స్తన తట భరేణ క్లమ జుషో –నమన్మూర్తే ,ర్నారీ తిలక,శనకై స్స్తుట్యత ఇవ

        చిరంతే మద్యస్య ,త్రుటిత తటినీ తీర తురుణా –సమానస్తాస్తే మ్నోభవతు కుశలం శైల తనయే

             తాత్పర్యం –కపర్దినీ !నారీ తిలకమైన నువ్వు స్వభావ సిద్ధం గానే బాగా కృశించి ,సన్నదైనదీ ,స్తన భారం తో బడలిపోయి ,వంగినదీ ,మేళ మెల్లగా తెగి పోతుందేమో అన్నట్లు ఉండేదీ ,ఒడ్డు విరిగిన ఏటి గట్టు పై ఉన్న చెట్టు లాగా ఉన్న ,నీ నడుము చిరకాలం మాకు సౌఖ్యాన్నివ్వాలి .

          విశేషం –నడుము చాలా సన్నగా ఉండి ,పది పోతుందేమో అన్నట్లున్నా ,శరీరం నిలిచే ఉండి .నడుము క్రుశించినా శ్రీ దేవి మహాదేవుని భాగ్య వశం తో నిల్చి ఉండి అని భక్తీ రాసొంమేశితం అయిన హాస్యోక్తి .ఆమె నడుము విరిగితే ,సకల లోకాలకు విలయమే .జగత్ క్షేమం కోసం ఆమె నడుం చిర  కాలం ఉండాలి .నడుము అతి సూక్ష్మ మైనదీ ,అతి సారవత్వ మైనది అని భావం .

80—‘’కుచౌ సద్య స్స్విద్యత్తట ఘటిత ,కూర్పాసభి దుశౌ—కషంతౌ దోర్మూలే,కనక కలశాభౌకలయతా

         తవ త్రాతుం ,భంగా దలమితి వలగ్నం తను భువా –త్రిధా నద్ధం ,దేవి ,త్రివలి లవలీవల్లి భిరివ  

          తాత్పర్యం –ముక్తి నిలయా !ప్రకాశ స్వరూపం గల తల్లీ !చెమట తో పార్శ్వాలను అంటుకొన్న రవికను ,పిగులుస్తున్నవి ,బాహుమూల సమీప ప్రదేశాలని ఒరుచు కుంటున్నవీ ,బంగారు కలశాల సౌందర్య సౌభాగ్యాలతో కూడినవీ ,అయిన నీ స్తనాలను నిర్మిస్తున్న మన్మధుడు ,వాటి బరువుకు నడుము ఒంగి పోకుండా ఉండటానికి ,ఏలకి లత చేత మూడు చుట్లు చుట్టాడా అన్నట్లు నీ ఉదరం పై మూడు ముడతలు కన్పిస్తున్నాయి . 

          విశేషం –నడుము వంగి పోకుండా మహాదేవుని అనుగ్రహం పొందటానికీ , మన్మధుడు మూడు కట్లు కట్టాడు .అతడు తను భవుడు .అంటే శరీరం లో నిత్యం ఉండే వాడు .దేహ యోగాక్షేమాదులను నిత్యం గమనిస్తాడు మన్మధుడు .స్వస్థాన పరి పాలనా దక్షుడు .లలితా సహస్ర నామాలలో ‘’స్తన భార లసన్మధ్య పట్టభందవలిత్రయా ‘’  అన్నదానికి ఇది కవిత్వీకరణ. బిగి చన్నులు ,సన్నని నడుము ,మూడు ముడుతలు ఉత్తమ స్త్రీల లక్షణాలు .

             సశేషం –మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ – 1-11-12- ఉయ్యూరు   


గబ్బిట దుర్గా ప్రసాద్
https://sarasabharati.wordpress.com

http://suvarchalaanjaneyaswami.wordpress.com

Posted in రచనలు | Tagged | Leave a comment

అమెరికా లో జర్మన్ హవా –3

 అమెరికా లో జర్మన్ హవా –3

1756-63 మధ్య ఏడేళ్ళు జర్మన్ యుద్ధం జరిగిన కాలం లో అక్కడి నుంచి వలసలు లేవు .ఈ కాలం లోనే బ్రిటన్ సముద్రాది పత్యాన్ని సాధించిన తర్వాత240ఓడల లో ఫిలడెల్ఫియా చేరారు .అందులో జర్మన్లె ఎక్కువ .1747 లో గవర్నర్ థామస్ రాష్ట్రం లోని రెండు లక్షల జనాభా లో 3/5వంతు మంది జర్మన్లె అని రాశాడు .స్తానికులకు అసూయ పెరిగి ,ఆందోళన కు దిగారు .1753లో అమెరికా స్వాతంత్రోద్యమ నాయకుడు ,శాస్త్ర వేత్త బెంజమిన్ ఫ్రాంక్లిన్ జర్మన్లను సమర్ధించాడు .1750 లో పద మూడు కాలనీలలో ,జర్మన్ల సంఖ్య పెరిగింది .అప్పటికే రెండు లక్షల యాభై వేల మంది జర్మన్లు చేరారు .న్యూయార్క్ ,న్యూ జెర్సి రాష్ట్రాలలో కూడా జర్మన్ల హవా సాగింది .ఇరవై శాతం మంది మేరి లాండ్ ,వర్జీనియా ,కరోలినాస్ ,జార్జియా లకు చేరుకొన్నారు .

          న్యు ఇంగ్లాండ్ అని పిలువ బడే మాసా చూసేత్స్ లో కూడా జర్మన్లు చేరారు .అక్కడ ప్యూరిటన్లు ఎక్కువ .వారు మత వ్యతి రేకుల్ని సహించరు .ఇతర దేశీయులు మొదట చేరిన ప్రదేశం కావటం వల్ల, భూమి తగి నంత భూమి లభ్యం కాలేదనే భావం కూడా కారణం కా వచ్చు .సున్నపు  గనులున్న ప్రాంతాలే తమకు అనుకూలం అని జర్మన్లు భావించారు .దక్షిణ ప్రాంతం లో ప్లాంటేషన్ ఎక్కువ .అమెరికా జర్మన్ల కు బానిసలు లేరు .బానిసత్వానికి వ్యతిరేకులు కూడా .ఫ్రాన్సిస్ పాస్తోరియాస్ ,డచ్, జర్మన్ క్వేకర్లు 1688 లోనే బానిసత్వానికి వ్యతి రేకం గా ప్రచారం చేశారు .ఫిలడెల్ఫియా లో గొప్ప బహిరంగ సభ నిర్వ హించారు .

          ఒక మేన్నో నైట్ రైతు తన స్నేహితుడు బానిసలను క్రూరం గా హింసించ టాన్ని చూసి ,వారింట్లో నిద్ర కూడా పోకుండా బయటే పొలం లో పడుకోన్నాడట .జర్మన్లు కాలనీలు మారారు .1709 లో పలా ట నైట్ లపై ఫ్రెంచి సైన్యం దాడి చేసింది .దానితో పద మూడు వేల మంది  శరనార్ధులుమెయిన్ ,నేక్కార్ ,రాయి రెయిన్ రివర్  ల గుండా ,లండన్ చేరారు .జ్వరాలు పీడించాయి .అప్పుడు ప్రోటేస్తంట్ అయిన ‘’క్వీన్ అన్నే ‘’వారి లోని రోమన్ కాధలిక్కు లను అయిర్ లాండ్ కు పంపించింది .ఆరు వేల ఆరు వంద ల మంది సెటి లర్సు ను నార్త్ కరోలినా పంపించింది .వీరు న్యు బార్న్ లో చేరారు .అక్కడి టెక్సా రోమా ఇండియన్లు చేసే దాడులను తప్పించు కోవా టానికి రాణి ఆజ్ఞా తో రెండు వేల ఎనిమిది వందల పద్నాలుగు మంది ను హడ్సన్ వాలీ ప్రాంతానికి పంపారు .అక్కడ తారు ,టర్పన్ టైన్ ,తయారీ లో సాయం చేశారు .వీరికి సరి హద్దు లను కాపాడే బాధ్యత ను అప్ప గించారు .

          లండన్ నుంచి న్యు యార్క్ కు ఓడ లో రావటానికి ఆరు నెలలు పట్టేది .పంపించిన ప్లానటినేర్స్ లో నాలుగో వంతు మంది దారిలోనే చని పోయారు .న్యూ యార్క్ చేరిన వారికి తగిన ఏర్పాట్లు కూడా చేయ లేదు .గుడారాల లోనే కాపురాలుండా వలసి వచ్చింది .జబ్బుల పాలైనారు .

మళ్ళీ క్వీన్ అన్నే కల్పించుకొని భూమిని కేటా ఇంచింది .కాని రాబర్ట్ లివింగ్ స్టేన్ అనే ఆయన ఆ భూమి అంతా తనదే నని ,వాళ్ళ తో  హెమ్ప్ పంట కు వారిని వాడు కొన్నాడు .ఇంటి అద్దె ,రవాణా ఖర్చులు వసూలు చేశాడు .1713 లో దీన్ని సహించ లేక ‘’జాన్ కాన్రాడ్ వీసర్ ‘’అనే ఇమ్మిగ్రంట్ ఎదురు తిరిగాడు .కాని ఫలించ లేదు .స్ప్రింగ్ సీజన్ లో నూట యాభై కుటుంబాలు నలభై మిల్ల దూరం లోని schohairieకు చేరారు .పరిస్థితులు అను కూలించాయి .పంటలు బాగా పండాయి .ధాన్యం మిల్లు వచ్చింది .

            లివింగ్ స్టేన్ తో సహా ఏడుగురు మళ్ళీ అడ్డు కొన్నారు .అద్దె కట్టమంటే కట్టం పొమ్మని ఎదిరించారు .వీజర్ ,రాణి దగ్గర కు వెళ్లి ఫిర్యాదు చేద్దా మంటే ,ఆమె చని పోయిందని ,తెలిసింది అక్కడివారు వీళ్ళను ఆదరించ లేదు జర్మని చేరి,బానిస జీవితమే గడిపారు .అరవై కుటుంబాలు వీజర్ తో బాటు పెన్సిల్వేనియా లోని బెర్క్స్ కౌంటీ చేరారు కొందరు అక్కడి నుండి న్యు జెర్సి వచ్చారు .ఇవాన్జికల్ ప్రోటేస్తంట్లు అయిన మొరేవింలు పారిటాన్ నది ఒడ్డున ‘’హోప్‘’అనే సెటిల్ మెంట్ ఏర్పాటు చేసుకొన్నారు అయితే 1808కి అది పూర్తిగా నీరు కారి పోయింది .

          లూసియానా లో ‘’జాన్ లా‘’అనే వాడు గొప్ప వ్యవసాయం చేయ దలచి జర్మన్లను కూలీలుగా కుదుర్చు కొందామను కొన్నాడు .వాళ్ళు వచ్చిన తర్వాతా పట్టించుకోలేదు .వాళ్లంత జర్మన్ కోస్ట్ఆఫ్ లూసియానా చేరారు .దక్షిణాన ఎబెనేజేర్ ,జార్జియా లకు కొందరు చేరారు .సౌత్ కరోలినా కు యూరప్ నుండి చార్ల్స్తాన్ పోర్ట్ గుండా సరాసరి వచ్చారు జర్మన్లు .నార్త్ కరోలినా ‘’ఆరంజి బెర్గ్ ‘’లో ,మొదటి కాలని ఏర్పడింది .ఇక్కడి నుంచి ,ఇప్పటి లెక్సింగ్ తన కౌంటి వరకు విస్తా రించారు .రిచ్ లాండ్ ,ఫెయిర్ లాండ్ లు ఆ ఊరి పేర్లే .

       వర్జీనియా లో ఎత్తైన ప్రదేశాలకు చేరారు .పెన్సిల్వేనియా లో భూమి దొరక లేదు .అక్కడి ఇండియన్ల దగ్గర కొనాలి .అదీ సరి హద్దు ప్రదేశాలలోనే .అక్కడ అను కూలం కాని వాతా వరణం .1732 లో ‘’జోస్ట్ హైడ్ ‘’అనే జర్మన్ పద హారు కుటుంబా లతో పోతామిక్ రివర్ దాటి ,వర్జీనియా లోని shennadoahకు చేరాడు .విన్చేస్తర్ వద్ద సెటిల్ అయారు .కొందరు ‘’స్ట్రాస్ బర్గ్ ‘’చేరారు .’’శన్నడోవా ‘’లోయ నంతా జర్మన్లు ఆక్రమిన్చేశారు .

            సశేషం –మీ– గబ్బిట దుర్గా ప్రసాద్ –31-10-12-ఉయ్యూరు 


గబ్బిట దుర్గా ప్రసాద్
https://sarasabharati.wordpress.com
http://suvarchalaanjaneyaswami.wordpress.com

Posted in రచనలు | Tagged | Leave a comment

శ్రీ శంకరుల లలి (కవి)తా సౌందర్య లహరి –34

               శ్రీ శంకరుల లలి (కవి)తా సౌందర్య లహరి –34

 

77—‘’యతే తత్కాళిందీ,తను తర తరంగాక్రుతి శివే –కృశేమధ్యే ,కిన్చిజ్జనని తవ యద్భాతి సుధియాం

      విమర్దా దంన్యోన్యం  ,కుఛ కలశయో ,రంతర గతం –తనూభూతం ,వ్యోమ ప్రవిశదివ నాభిం ,కుహరిణీం‘’

        తాత్పర్యం –హరు సామ్రాజ్నీ !కృశించిన నీ నడుము లో ముందుగా ఎదురుగా కన్పిస్తూ ,యమునా నది యొక్క చిన్న చిన్న తరంగం లాగ ,నల్లగా ఉన్న నీ నూగారు ఎలా ఉందీ అంటే –నీ కుఛ కుంభాలు రెండు ఒరుసుకోవటం వల్ల ,వాటి మధ్య ఉన్న ఆ కాశం ,ఆ ఒరిపిడికి ఆగ లేక నలిగి పోయి ,నల్లగా మారి ,సన్నగా నాభి వరకు కిందికి లక్క జారి నట్లు జారినది గా భావిస్తున్నాను .

    విశేషం –భగవతి రోమ రాజి ,ఇతరులకు కన్పించాడు .గిరీశుడైన శివునికే కన్పిస్తుంది .ఆమె స్తనాలు పరి పుష్టాలు .అదే భాగ్య లక్షణం .రోమావళిఅతి సూక్ష్మం .ప్రకాశామానం గా ఉంటుంది .ఆకాశం నుంచి వాయువు దాని నుంచి అగ్ని ,దాని నుండి జాలం ,దాని నుండి భూమి జన్మించాయి .ఉరాసి స్తానం లో అనాహత చక్రం ,దాని పై విశుద్ధ చక్రం ఉంటాయి .అది ఆకాశ తత్వానికి గుర్తు .విశుద్ధ స్తానం లో ఉన్న ఆకాశ తత్త్వం నలిగి ,సన్నగా కిందికి జారుతోందని భావం .

           హృదయం సూర్య మండలం .యమున సూర్య తనయ .నాభి నుంచి జారే ఆకాశ తత్త్వం సూర్య మండలం నుంచి కిందికి జారుతోంది .కనుక యమునా నదితో పోల్చారు .ఇడా,పింగళా సుషుమ్నా నాడులే గంగా ,యమునా ,సరస్వతి నదులు .పింగళ అంటే యమున యే .ప్రాణ వాయువు వల్ల షట్చక్ర భేదం ,గ్రంధి త్రయ భేదనం జరుగుతుందని అర్ధం .కాళిం దీనామ ,యమునా నామం గల పింగళా నాడీగత ప్రాణ క్రియను వివరించటమే శ్రీ శంకరులు చేసిన ప్రయత్నం .

78—‘’స్తిరో గంగా వర్త స్స్థన ముకుర రోమావళి లతా –కలావాలం ,కుండం ,కుసుమ శర తేజో హుత భుజః

      రతేర్లీలా గారం ,కిమపి ,తవ నాభిర్గిరి సుతే –బిలద్వారం ,సిద్దేర్గిరిశ,నయనానాం,విజయతే ‘’

        తాత్పర్యం –త్రిపుర సుందరీ !నీ నాభి స్తిరమై ,వినాశం లేని గంగా నది .పాలిండ్లు అనే పూల మొగ్గలు పూసిన ,రోమ రాజి అనే ,తీగ పాదు,మన్మధ తేజస్సు అనే అగ్నికి హోమ గుండం గా ఉంది .అది రతీ దేవికి విహార గృహం .ఈశ్వర నేత్ర తపస్సిద్ధికి గుహాముఖం .వర్ణించ టానికి వీలు కాని చెలువం అంటే శోభ కలది .

         విశేషం –శివుడి కన్నుల ఫలం ఏమిటి ?మంచి దృశ్యా లను చూడటం .ఆమె నాభియే ,ఆయన చూపులకు ఫలసిద్ధి .శివుని మూడో నేత్రం చూపు వల్ల దానికేమీ భయం లేదు .కారణం అది ఇది వరకే అగ్ని గుండం కనుక .నాభి దగ్గర స్వాధిష్ఠాన చక్రం ఉంది.అక్కడే భగవతిని ఉపాశించాలి .నాభి బిల ద్వారమే కాని బిలం కాదు .బిలం –స్వాధిష్ఠాన చక్రం .అక్కడ మన్మధుడు దేవిని ఉపాసిస్తున్నాడు .శివుని తపస్సు కూడా అక్కడే ఫలిస్తుందని అర్ధం .ఆమె నాభి ,బిలద్వారం గిరీశనయనాలకు తపస్సిద్ధి కల్గిస్తుంది .ఇతరు లెవరు దానిని చూడ లేరు .

      నవంబర్ ఒకటి గురువారం ‘’ఆంధ్ర ప్రదేశ్ అవతరణ ‘’దినోత్సవ సందర్భం గా శుభా కాంక్షలు .

      సశేషం –మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –31-10-12-ఉయ్యూరు 


గబ్బిట దుర్గా ప్రసాద్
https://sarasabharati.wordpress.com
http://suvarchalaanjaneyaswami.wordpress.com

Posted in రచనలు | Leave a comment

శ్రీ శంకరుల లలి (కవి)తా సౌందర్య లహరి –33

  శ్రీ శంకరుల లలి (కవి)తా సౌందర్య లహరి –33

 75—‘’తవస్తన్యం ,మన్యే ,ధరణీధర కన్యే హృదయతః –పయః పారావారః పరి వహతి సారస్వత మివ

     దయాపత్యా దత్తం ద్రవిడ శిశు రాస్వాద్య తవ యత్—కవీనాం ,ప్రౌధానా  జనని కమనీయః కవయితాః’’

        తాత్పర్యం –శైలేంద్ర తనయా !పాల కడలి పైకి సారస్వత రూపం గా ప్రవహించే వాజ్మయం గా నేను నిన్ను భావిస్తాను .లేక పోతే –మిక్కిలి పుత్ర వాత్సల్యం తో ,నీవిచ్చిన చనూబాలు త్రాగి ఈ ద్రావిడ శిశువు (శంకరా చార్యులు )ప్రౌఢ కవులలో జగన్మోహను డైన కవిగా ఎలా కీర్తి పొందుతాడు ?

        విశేషం –ఆమె హృదయం నుండి పాలు సారస్వతం లాగా ప్రవహిస్తున్నాయి .చిన్నప్పుడు శంకర భగవత్పాదుల వారు ఆలయానికి వెళ్లి అమ్మవారికి పాలు నైవేద్యం పెట్టె వారు .ఆమె త్రాగగా మిగిలిన పాలనే తండ్రి తనకు ఇస్తున్నాడని అనుకునే వారు .ఒక రోజు తండ్రి ఊరికి వెళ్లాడు కుమారుడు పాలు తీసుకొని ఆలయానికి వెళ్లాడు .దేవి త్రాగ లేదు .ఏడవటం ప్రారంభించాడు బాల శంకరుడు .ఆమె ప్రేమతో ఆ పాలను పూర్తిగా త్రాగేసింది .తనకు కొంచెం కూడా మిగిల్చ లేదని మళ్ళీ ఏడ్చాడు .ఆమె కనీ కరం తో తన స్తన్యాన్నిచ్చింది బాల శంకరులకు /.అది మొదలు ఆయనకు మహా ప్రజ్ఞ కలిగింది .

     ఆరు మాసాల వయసు లో ఉన్న శంకరుడు దరిద్రాన్ని అనుభ వించాడు .తండ్రి భిక్షాటనానికి వెళ్లాడు తల్లి నీరు తేవటానికి పూర్ణా నదికి వెళ్ళింది .ఇంట్లో ఒక్కడే ఉన్న బాలుడికి ఆకలై ఏడ్చాడు .పార్వతీ దేవి జాలి పడి ,ప్రేమతో ఎత్తుకొని ,కంటి నీరు తుడిచి ,స్తన్యాన్నిచ్చింది .పడుకో బెట్టి అదృశ్య మైంది .ఆ రోజు నుండే ఆయనకు సర్వ శాస్త్రాలు కరతలా మలకాలైనాయి శ్రీ దేవి అనుగ్రహం ఉంటె సర్వ విధ ఈప్సితాలు నేర వేరుతాయని భావం శివజ్ఞాన ప్రదం .

76—‘’హర క్రోధ జ్వాలా వలిభి రవ లీదేన వపుషా –గభీరే తే నాభీ సరసి ,కృత సంగో మనసిజః

        సముత్తస్తౌ తస్మా దచల తనయే ,ధూమ లతికా –జనస్తాం జానీతే ,తవ జనని రోమావలి రితిహ్ ‘’

           తాత్పర్యం –హర ప్రియే !హరుని క్రోధాగ్ని జ్వాలల తో చుట్ట బడిన శరీరం తో మన్మధుడు తనను తాను కాపాడు కోవా టానికి లోతైన నీ నాభి మడుగు లో దూకి కాపాడుకొన్నాడు .కాలు తున్న వాడి శరీరం వల్ల పుట్టిన పొగతీగ చాలు ఒకటి ,నీ పొక్కిలి నుంచి పైకి పాకి కన్పించింది .ఆ పొగతీగె చాలునే లోకం ,నీ నూగారు గా బావిస్తోంది .

          విశేషం –సాధన చేసే తప్పుడు కామోద్దీపన కలిగితే ,వెంటనే భ్రు మాధ్యమ లో హరుని నిలిపి ధ్యానిస్తే (అక్కడ జ్ఞాన నేత్రం ఉండి కనుక )హృదయం లోని కామ తాపం నాభికి దిగి శాంతి లభిస్తుందని పరమ రహస్యం .హరుని క్రోధం నుండి కాపాడ గల సమర్ధురాలు భగవతి మాత్రమె .అన్యులకు అసాధ్యం అని భావం.

     సశేషం –మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –30-10-12-ఉయ్యూరు

Posted in రచనలు | Tagged | Leave a comment

మన విజయ వాడ పై విరిసిన కవితా ఇంద్ర ధనుస్సు

మన విజయ వాడ పై విరిసిన  కవితా ఇంద్ర ధనుస్సు 

  యువకుడు, మిత్రుడు ,సాహిత్యోపాసకుడు ,రస రమ్యం గా రమ్య భారతి ని తీర్చి దిద్దుతున్న వాడు చలపాక ప్రకాష్  రమ్య భారతి ఆధ్వర్యం లోవివిధ కవులు ‘’మన విజయ వాడ ‘’పై రాసిన కవితలను  కవితా సంకలనం గా తీసుకొచ్చారు .పుస్తకం విజయ వాడ అంత అందం గా ,వైవిధ్యం గా ,ముచ్చటగా ఉంది .సుమారు సంవత్సరం క్రితం జరిపిన కవి సమ్మేళనం లోని కవితలే ఇవన్నీ .అందులో నేను ప్రత్యక్షం గా భాగస్వామి అయి ,ఆ కవిత లను విన్న అదృష్ట వంతుడిని .ఆ నాడు పాల్గొన్న కవుల కవితలే కాకుండా ,విజయ వాడ లోని లబ్ధ ప్రతిష్టు లైన కవుల కవితలనూ అడిగి రాయించి ఇందులో చేర్చటం ప్రకాష్ చొరవ ,ఆసక్తి ,నిర్దుష్టం గా,సమగ్రం గా పుస్తకం ఉండాలన్ని తపన కన పడుతోంది .దీనికి చలపాక పూర్తిగా అభి నంద నీయుడు .పదహారు మంది మహిళా కవులు తమ అమూల్య కవితలను అందించి ,నిండుదనం చేకూర్చారు .పద్య కవులూ తమ సత్తా చూపటం హర్ష దాయకం ..విజయ వాడ పై తమ అభిప్రాయాలను విస్పష్టం గా ,నిర్మోహ మాటం గా చెప్పారందరూ .విజయ వాడ సాంస్కృతిక ,ఆర్ధిక ,సామాజిక ,రాజకీయ ఆధ్యాత్మిక కళా సాహిత్య వేదిక గా ఎలా విలసిల్లిందో కవిత్వీకరించారు .ఇక్కడి పెద్దలను ,ప్రదేశాలను చారిత్రిక వైభవాన్ని మన ముందుంచారు .అన్ని షేడ్స్ ఆఫ్ ఒపినియన్ లు ఉన్నందున ఇది విజయ వాడ పై విరిసిన ఇంద్ర ధనుస్సు అని పిస్తుంది ..ముచ్చ టై న ముఖ చిత్రం ,వెనుక కనక దుర్గమ్మ వారు తో బాటు కళా కేంద్రాల ఫోటోలుండి కను విందు చేసింది ..ఒక నగరం పై ప్రత్యేకం గా కవి సమ్మేళనాన్ని నిర్వ హించటం ఆ కవితలను పుస్తక రూపం లోకి తీసుకు రావటం ఇదే ప్రధమం అను కొంటాను .ఆ ఘనత విజయ వాడకు దక్కింది .ఆ కీర్తి లో పాలుపంచుకొన్న వారందరూ ధన్యులు .దీని సూత్ర దారి చల పాక కృషి చాలా ఉంది అభినంద నీయుడు .

      ‘’నగర పంజరం లో ఎగర లేని మానవ హృదయ విహంగం అలానే చచ్చి పోయింది –భూమాత రొమ్ము మీద వ్రణాల్లా మనుషులు పట్టని పాకలు ‘’అన్నారు పెద్దిభొట్ల సుబ్బరామయ్య .నగరం లోని నిరుపేదల పక్షాన నిలిచి .’’ఇక్కడి మనిషి మనసుకు ప్రశాంతత లేదు గావున ‘’ప్రసాదులు ‘’కిక్కిరిసి ఉంటాయి ‘’ అని చమత్కరించారు .కనకదుర్గమ్మ గర్భ గుడి లో నిరంతరం బందీ అని అంటూ ,ఆమె లేవా లేదు తరాలెన్ని గడిచినా ఈ నగరమూ లేవా లేవదు ‘’అని నిస్పృహ ను వ్యక్తం చేశారు .కవి పువ్వాడ తిక్కన సోమయాజి పద్య కవిత లో ‘’మేధా సుధా రాసి వేదాద్రి మధి యింప,పొంగి పోర్లేది భావ పున్జమనగా ‘’అన్నారు .క్క్రిష్ణ వేణివారికి ‘’విజ్ఞాన తృష్ణ ‘’లాగా కని పించింది .కృష్ణ ను ప్రేమికుల విహార భూమి కావాలని పిరికి పందలను పైకి ఉరక నియ్యద్దని వేడారు .అవధాని పాల పర్తికవి ‘’బ్రాహ్మీ మయ మూర్తి బిడ్డడయి నాడన్నట్టి విఖ్యాతి ,ఉజ్వల వేణీ రమణీయ వాహినికి కృష్ణా మాత కున్నట్లుగాన్ ‘’అని విశ్వ నాద బాణీ లో కృష్ణమ్మ గొప్పతనం గంగకు ,గౌతమి కి లేదు అని ధంకా బజాయించారు .’’మమతల కోవెల ,విశ్వనాధ నడయాడిన నేల ,బాల మురళి గానం తో పరవశించిన వాడ బెజ వాడ ‘’అన్నారు కాటూరి రవీంద్ర త్రివిక్రమ్ .మోఘల్రాజ పురం ‘’రాజరికం ,ఆ నాటి దర్పం వాడి పోని పూల దండ ‘’గా కనీ పించింది స .శ్రీ కి .’’పెద్దిభొట్ల కదల నగరం భమిడి పాటి జగన్నాధ రావు మువ్వల సవ్వడి ‘’విని పించింది ఆయనకు ..పూర్ణ చందుకు ‘’ఫణి పడగమీద వెలుగు లీనే మణిభాషోద్యమం ‘’అని పించింది .’’సిరలు ,ధమనుల్లా ప్రవహించే జంట కాలువలు సమర్పించే జల నైవేద్యం ‘’దర్శన మిచ్చింది పాటి బండ్ల రజనీకి .’’విశ్వ నాద కవి కల్ప వృక్షం గా విస్తరించిన నేల కదూ ‘’అని కీర్తించింది .’’జామ తోటల ,గులాబీ తోటల ,పున్నమ్మ తోటల ,చెట్ల బజారుల ‘’చిరునామా ఎక్కడుంది ? అని ప్రశ్నించారు మందరపు హైమ వతి .వెన్నా వల్లభ రావు కు ‘’నిత్య వేసవి గా మారిన నిప్పుల వాడ ‘’కని పించింది,అని పించింది .చల పాక ‘’రెండు ప్రాంతాల మనసులు కలిపే వారధి కావాలి ‘’అని ఆశ ను వ్యక్త పరిచాడు . తన శక్తియుక్తుల కదే అలంకార వరం –అలం ‘’కర‘’వాలం ‘’అన్నాడు తన పెన్ను కత్తిఅని చెప్పకనే చెబుతూ .

     ‘’ ఈ నాడు అక్షర సాక్షి గా వెలుగుతున్న ఆంద్ర జ్యోతి ఈ విజయ వాడ ,అంద చందాల సొగసరి విజయ నగరి ఆంద్ర జాతి కి తర’’గని ‘’సిరి ‘’అని శ్లేషించారు సాయి ప్రసన్నఅనే  సింగ్ జీ .కావూరి సత్య వతికి ‘’సాహిత్యానికి ఎక్సు రే కిరణం ‘’గా అని పించింది ఎక్స్ రే సాహితీ సంస్థ ను జ్ఞాపకం చేసుకొంటూ .ముట్నూరి ,పట్టాభి ని గుర్తు చేసుకొన్నారు వై ఎస్ లక్ష్మి .’’లత పరిజ్ఞానం’’ జ్ఞాపకం చేసుకోవటం బాగుంది .’’జ్ఞాన పీథం  వరించిన సాహితీ భూమి గా ,గ్రందాలయోద్యమానికి ఊపిరు లూదిన అయ్యంకి వారి పుట్టినిల్లు ,గా ,కాకానికి ఆట స్తలం గా ‘’కనీ పించింది లక్క రాజు సరోజినీ కి .’’ఈ నగరం ప్రియురాలు కాదు –తల్లి నీడ ‘’అని కైమోడ్పు నిచ్చారు అరస విల్లి కృష్ణ మహా గొప్పగా .

       ‘’జాతి పతాకకు మువ్వన్నె లద్దిన మూర్తి ‘’పింగళి వెంకయ్య ను స్మరించారు సర్వ జిత్ ‘’కృష్ణమ్మ పారుతున్నా ,ఎండే గొంతుల ఆక్రందనలు ‘’విని పించాయి సర్వ జిత్ కు ‘’మా బాణీ ఆకాశ వాణి’’అని మురిసి పోయింది విజయ వాడ రేడియో కేంద్రాన్ని చూసి మురిసిన అమూల్య .విష్ణు భోట్లకు ‘’ఆముక్త మాల్యద జన్మ స్తలం ‘’అని పించింది కోపూరి పూషా దేవి కి ‘’రాష్ట్రానికి సాంస్కృతిక రాజ దాని ‘’అని నిజం గానే అని పించింది ‘’ఇక్కడి ఆయుర్వేద వైద్య శాల కోస్తాకే తల మానికం ‘’అన్నారు రావెళ్ళ .గుమ్మా  ‘’ప్రజల్ని చైతన్యం గావించే పత్రికలన్నీ పురుడు పోసుకొన్న ది మన బెజ వాడ లోనే ‘’అన్నాడు .అంతే కాదు ‘’ప్రాచీనాదునికతల –సమ్యక్ సమ్మేళనం ‘’గా బెజ వాడ దర్శన మిచ్చింది .’’బెజ వాడ రౌడీయే ‘’అంటూ ,యుద్ధ మల్లుని బెజ వాడ శాస నాన్ని ,ఆంద్ర పత్రిక  రాసిన అమ్రుతాన్జనాన్ని పార్ధుని పశు పతాస్త్రాన్నిస్పురణ కు తెచ్చారు .అందరు జగజ్జట్టీలే కనుక బెజ వాడ రౌడీలకేంద్రం అన్నారు వేలూరి కౌండిన్య .

     ఉమా మహేశ్వరి ఆయ్యదేవర గారి పద్మ భూషణ పురస్కారాన్ని గుర్తు చేసుకొని ‘’గుజరాతీ ,రాజస్తానీ ,సిక్కు ,మలయాళీ ,తమిళ బెంగాలీ సంస్కృతుల విరి జల్లుల వాడ ‘’అని సంస్మరించింది .తెలుగు శాత వాహనుల ప్రయాణ ప్రాంగణాన్ని దక్షిణ మధ్య రైల్వే కేంద్రాన్ని గుర్తుకు తెచ్చు కొని ,ఎన్విరాన్ మెంటల్ సస్టైనబుల్ అవార్డు పొందిన నందుకు విజయ వాడను అభి నందిన్చింది .పద్మా వతి శర్మ కు మాచవరం ఆంజనేయస్వామి  ,భవానీ ద్వీపం ,జంధ్యాల దక్షిణామూర్తి వైద్యం గుర్తుకొచ్చాయి .క్షేత్రయ్య కళాక్షేత్రం ,ఘంటసాల సంగీత కళాశాల ,హనుమంత రాయ గ్రంధాలయ వైభోగం పై స్పందిన్చారామే .విజయవాడ నగరం అంటే ‘’రెండు రోడ్లే కాదు –ఒక కార్ల్ మార్క్సు –ఒక మహాత్మా గాంధీ ‘’అన్నారు చిత్తలూరి సత్య నారాయణ .’’చైతన్యం సంత రించుకొన్న వాడ ‘’గా విజయ వాడ కన్పించింది కోకా విమల కుమారికి .విజయ వాడ లోని  అక్షరాలతో విశేషాలను తెలిపి డమరుకం మోగించాడు .పాణి గ్రాహి రాజ శేఖర్ కు ‘’కొండల పై ఎగబ్రాకె జనం ‘’కని పించారు ‘’చరిత్ర పుటల కెక్కిన అమరుల త్యాగం ‘’గోచరించింది .

         ‘’వెలిదండ్ల వారి వేదిక ,సర్వోత్తమం గా తీర్చి దిద్దిన ‘’స్వరాజ్యం ‘’మన సొంతం ‘’అంటూ ,’’హాస్యానికి భాష్యం చెప్పిన నండూరి సుబ్బారావు ,సాహితీ పరి మళాలను గుబాళించిన రజనీ గంధం  ఉషశ్రీ ప్రసంగ ఝరి ‘’జ్ఞాపకం చేసుకోన్నారు రాధిక .రెజీనా కు కళాశాలలలో ‘’శారద గీర్వాణ నిక్వణ స్వరాలు ‘’విని పించాయి .దివి కుమార్ కు‘’విలువలు ,అగాధాల అంచులు –చీల్చుకొని దిగజారు తున్న చోట –అరవై ఏళ్లుగా నడక కుంటుతున్న చోటు‘’కనిపించింది .బృందావన రావు కు ‘’బీసెంట్ రోడ్డు డీసెంటు రోడ్డు గా’’ కనీ పించలేదు .అక్కడ ఆగర్భ శ్రీ మంతులకు–అడుక్కునే అంగ వికలురకు ఉచిత ప్రవేశమే ‘’నని దేప్పాడు .’’అందాలు కను విందు జేసే మందార పూగుత్తి ‘’గా అని పించింది బీసెంట్ రోడ్డు .’’విశాలాంధ్ర తెలుగు జనులదని వాక్కా ణిస్తున్న వాడ –దమ్మున్నోల్ల,సోమ్మున్నోల్ల కలయిక ఈ వాడ ‘’అన్నారు హాజరయ్య గుప్తా.

          అందరికి భిన్నం గా వలి వేటి –కమ్మని గీతాన్ని రాసి బెజవాడకు సమర్పించాడు ‘’నేటికాలపురాజకీయం –నేటి కాలపు చలన చిత్రం –నేటి కాలపు విజ్ఞాన యంత్రం –నేటి కాలపు సుజ్ఞాన ప్రాంతం ‘’గా విజయ వాడ కను విందు చేసింది వలి వేటికి .

  విజయ వాడ లోని కవుల కవితల తర్వాత ,శివారు ప్రాంత కవుల కవితలనూ  చేర్చటం హర్ష ణీయం ఎక్కువ కవితలలో కవిత్వం తక్కువ గా ఉండటం విచారకరం కోటబుల్ కోట్స్ కోసం వెతుక్కోవాల్సి వచ్చింది .లిష్టులే రాశారు కొందరు మరీ దారుణం గా .

         లో బ్రిడ్జి ,మామిడి పళ్ళ సీజన్ ,కాళేశ్వర ,కేదారేశ్వర మార్కెట్ లు ,భావానీ  పురం సొరంగం ,పాల శేతల కేంద్రం ,రాయన పాడు వాగన్ వర్కింగ్ ,కొండపల్లి బొమ్మలు ,వన్ టౌన్ ఇరుకు రోడ్డు రద్దీ ,బంగారు ,వెండి నగల తయారీ ,మల్లేశ్వర స్వామి దేవాలయం నుంచి బెజవాడ పట్టణ శోభా దర్శనం ,ప్రకాశం బారేజి ,గుణదలమేరిమాత ,ఎస్ఆర్ఆర్ కాలేజి ,లయోలా ,లితో వర్కింగ్ ,సినీ సైన్ బోర్డు హోర్డింగుల కళా ప్రతిభ ,సినీ డిస్ట్రిబ్యూషన్ ,జిమ్ఖానా క్లబ్ ,తంగిరాల వారి వితరణ ,రాఘవయ్య పార్కు ,రెహ్మాన్ ,అన్సారి పార్కులు ,చుండూరు వెంకట రెడ్డి ,డాక్టర్ తెన్నేటి చల పతి రావు చలం తిరుగాడిన నేల ,అమెరికన్ హాస్పిటల్ ,డాక్టర్ల నిలయ మైన నక్కల రోడ్డు ,డోర్నకల్ రోడ్డు ,భారతీయ సంస్కృతికి అద్దం పట్టిన దుర్గా కళా మందిరం ,పాశ్చాత్య సినిమాలయం లీలా మహల్,మారుతీ ,సరస్వతి ,అలంకార్ టాకీసులు,సత్యనారాయణ పురం గేటు దాని దగ్గర పాలు పెరుగు అమ్మకం ,గణ పతి నవరాత్రి ఉత్సవాలు ,శ్రీ రామ నవమి పందిళ్ళ సందడి ,రామకోటి పందిళ్ళు రామా టాకీసు ,వినోదా టాకీసు ల దగ్గర రాత్రి పూట జరిగే చీకటి వ్యారం   అన్నీ బెజ వాడ ప్రత్యేకతలే .చరిత్ర భాస్కర కోట వెంకటా చలం గారు ప్రాతస్మరణీయులు .భారత జాతి చరిత్ర నంతా ఒక్క చేత్తో రాసి అసలైన మన చరిత్రను తెలియ జెప్పిన మహాను భావుడాయన .ఆ నాటి కవి సమ్మేళనం లో నేను వెంకటాచలం గారి గురించి చెప్పి, ఆయన పై ఒక కవిత రాసి విని పించాను .దాన్ని నెట్లో మర్నాడే ప్రకాష్ కు పంస్తూ ఒక కాపీ ని  వారి కుమారుడు డాక్టర్ నిత్యా నంద శాస్త్రి గారికి పోస్ట్ లో పంపాను .కాని అది ఈ సంకలనం లో చోటు చేసుకో లేక పోయింది .ఎవరిని మరువ రాదని అనుకోన్నామో వారినే  మరిచి పోయాం .గతం గతః

         ఇంత మంచి సంకలనాన్ని తీసుకొచ్చిన చల పాక ప్రకాష్ ను , పాల్గొన్న కవులను మరో మారు అభి నందిస్తున్నాను .ఇది అందరికి ఆదర్శం కావాలని ,అన్ని నగరాల పై ఇలాంటి పుస్తకాలు రావాలని ఆశిస్తున్నాను

       మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –30-10-12—ఉయ్యూరు 


గబ్బిట దుర్గా ప్రసాద్
https://sarasabharati.wordpress.com

http://suvarchalaanjaneyaswami.wordpress.com

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

వెయ్యి జెండాల ఊరు మాది – వేజండ్ల

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

అమెరికా లో జర్మన్ హవా –2

 అమెరికా లో జర్మన్ హవా –2

పాస్టర్ డేనియల్ పాస్టోరియాస్ అనే ఆయన 1683 లో అమెరికా లోని ఫిలడెల్ఫియా కు బయట ప్రతి ఇంటికి మూడు ఎకరాల భూమి నిచ్చి ,తాను ఆరు ఎకరాలు ఉంచుకొని ,ఒక కాలనీ ఏర్పాటు చేశాడు .అదే ‘’జర్మన్ టౌన్’’అయింది .అది wissa hicon నుంచి  wingohocking creeks దాకా వ్యాపించింది .దాని లేఅవుట్ మధ్య యుగ నైరుతి లోని గ్రామాల స్వరూపం గా ఉండేది గ్రామ మధ్యలో అరవై అడుగుల వెడల్పు రోడ్డు ఉండేది .దానికిరుప్రక్కలా ఇళ్ళు ఉండేవి ..ఇంటి వెనక తోట ,పోలాలున్దేవి ..విలియం పేన్ అనే క్వేకర్ గవర్నర్ ఆహ్వానం పై వీరంతా ఇక్కడ స్తిర పడ్డారు .క్వేకర్లు అంటే ‘’సొసైటీ ఆఫ్ ఫ్రెండ్స్ ‘’అని అర్ధం .ఈ ఉద్యమం  .1640 లో ఇంగ్లాండ్ లో ప్రారంభమై అన్ని దేశాలకు వ్యాపించింది .శాంత స్వభావం తెల్లని బట్టలు వీరి ప్రత్యేకత .పెన్సిల్వేనియా రాష్ట్రం చేరిన తోలి సెటిలర్లు వీల్లే .1681 లో రెండవ చార్లెస్ రాజు పేన్ గారికి ఈ ప్రాంతం అంతా అందజేశాడు .ఆయన అందరికి ఉత్తరాలు రాస్తూ ‘’హోలీ ఎక్స్పేరి మెంట్ ‘’గా దీన్ని వర్ణించి జర్మనీ భాష లోకి తర్జుమా చేయించి ఆ ఉత్తరాన్ని జర్మనీ దేశానికి పంపాడు .చవకగా భూములు రావటం ,మత సామరస్యం ఉండటం ,థో ‘’క్రేఫెల్ద్ ‘’(డచ్బార్డర్ లోని జర్మని టౌన్ )నుంచి ,పద మూడు కుటుంబాలు ,ఫ్రాంక్ ఫర్ట్ అమ్మిన్ నుంచీ వచ్చారు .మొదట్లో చెప్పి నట్లుగా పాస్టోరియాస్ తాను అనుకొన్నట్లు సహాయం చేశాడు .ఈయన పేన్ ఆదేశం పై ఫ్రాంక్ ఫర్ట్ లో november 1682లో వెళ్లి కొద్ది కాలం ఉండి వచ్చాడు .అతని మాటలు నమ్మి వీరంతా ఇక్కడికి చేరారు .కొద్ది మాత్రం ‘’ఇక్కదేముంది బావుకోవటానికి ?’’అని పెదవి విరిచారు కూడా .

       పేన్ నుంచి పదిహేను వేల ఎకరాలు  ఎకరం పది సెంట్ల కు కొని కాలననీ  ఏర్పాటు చేశారు .1517 లో జర్మనికి చెందినా మార్టిన్ లూధర్ కింగ్ చర్చిని సంస్కరించాలని కోరాడు .అతని ప్రభావం పెరిగింది .అదే ‘’ప్రోటేస్తంట్ ‘’ప్రభావం అయింది .’’కాల్వ నిస్టులు అంటే రిఫార్మర్లు ‘’అన బాప్తిస్టులు ‘’అయారు .ముప్ఫై ఏళ్ళ మత యుద్ధాలలో ప్రోటేస్తంట్ ,కేధలిక్ రాజులు తీవ్రం గా కలహించుకొన్నారు .henne berger లో మూడొంతుల జనాన్ని చంపేశారు .రెండు వంతుల ఇళ్ళు తగల బెట్టుకొన్నారు .ఇతర దేశస్తులు ,దొంగలు స్వైర విహారం చేశారు .నరమాంస భక్షణ కూడా (కన్న బాలిజం )కూడా జరిగింది .ఈ గొడవల్లోంచి బయట పడటానికి జర్మనీ నుంచి ఇతర చోట్లకు వలసలు ప్రారంభ మయాయి .జర్మనీ లోనే వివిధ ప్రదేశాలు తిరిగి స్విస్ ,హాలాండ్ కొందరు చేరగా ,మిగిలిన వారు అమెరికాకు వలస వచ్చారు .

          పెన్సిల్వేనియా లో పాస్టోరియాస్ తో చేరిన వారు పన్నెండు మంది క్వేకర్లు ,ఇంకొకతను జాకబ్ టేల్నార్ రైన్ నది నుండి రాటెన్ డాం ఇంగ్లీష చానల్ దాటి ,ఇంగ్లాండ్ చేరి అక్కడి నుండి అట్లాంటిక్ సముద్రం దాటి అమెరికా చేరారు .ఇలా వచ్చిన ముప్ఫై నాలుగు మంది సెటిలర్లు ను fore runners of German colonists ‘’అన్నారు .అంతకు ముందే అమెరికా పద మూడు కాలనీ లలో జర్మన్లు చేరినా ,మొదటి జర్మన్ టౌన్ పెన్సిల్వేనియా లోనే ఏర్పాటైంది .ఇదిbirth of the history of Germans ‘’గా గుర్తింపు పొందింది .1700లో పదమూడు కుటుంబాలు ,అరవై నాలుగు కుటుంబాలు అయి , 1790 నాటికి 556 అయి ,మూడు వేల జనాభా అయారు జర్మన్లు అమెరికా రివల్యూషన్ తర్వాత అన్ని రాష్ట్రాల వారు వచ్చారు .అందులో palatine  మొదలైన భాషలు మాట్లాడే వారున్నారు .ఈ జర్మన్లు గొప్ప మెకా నిక్కులు .వర్క్ షాప్ లనేర్పరచారు .అప్పుడు ఒక వ్యక్తీ ఎన్ని వృత్తు లైనా చేయ వచ్చు .అప్పుడు రైతుల్ని ‘’husbands men ‘’,’’vine dressers ‘’అనే వారు .1683—1727 మధ్య అమెరికా చేరిన వారందరూ క్వేకర్లె .

        సశేషం –మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –29-10-12-ఉయ్యూరు

 

 

Posted in అమెరికా లో | Tagged | Leave a comment

కార్తికేయ దర్శన సమీక్ష

 కార్తికేయ దర్శన సమీక్ష

కృష్ణా జిల్లా కలిదిండి గ్రామంలో పాతాళ భోగ లింగేశ్వర స్వామి దేవాలయం అతి ప్రాచీన మైనది .ఇదులో కార్తికేయ స్వామి కూడా కొలువై ఉన్నారు .ఆయన పై బ్రహ్మశ్రీ అడివి వెంకట గంగాధర శర్మ గారు ‘’కార్తికేయ శతకం ‘’ను అత్యంత భక్తీ తో రాశారు .వీరి కుటుంబమే ఇక్కడ కార్తికేయ విగ్రహాన్ని ప్రతిష్టించారు .ఈ శతకాన్ని నూరు మార్లకు పైగా పారాయణం చేసిన మిత్రులు రంగా వఝల మురళీ ధర రావు గారు ఆ శతకం లో అడివి వారు నిక్షిప్తం చేసిన షణ్ముఖ విశేషాలన్నిటిని ‘’దర్శనం ‘’పేర,శతకం తో సహా రాశారు .దీన్ని వదాన్యులు శ్రీ దాసరి నారాయణ శాస్త్రి ,శ్రీమతి నాగరత్నమ్మ దంపతులు పుస్తక రూపం లోకి తెచ్చి ‘’అమూల్యం ‘’గా ఆస్తిక జనానికి అందించి ,అభిమాన పాత్రులయారు .ఇలాంటి ఈ ముగ్గురు కలిసి చేసిన సంయుక్త ప్రయోజన కార్యమే ఈ పుస్తకం .అందరు అభి నంద నీయులే .

      ముందుగా శ్రీ ఆదినారాయణ శర్మ గారి కవిత్వం గురించి చెప్పుకోవాలి .అది ద్రాక్షా పాకం .ఎన్నో కధలను గాధలను శతకం లో నిక్షిప్తం చేశారు .ప్రతి పద్యం లో వారి బహుముఖీన మైన ప్రజ్ఞా ,పాండిత్యం ,ఆశుదార ,పద్య రామణీయకం ప్రతి బిమ్బిస్తాయి .హాయిగా యే పద కోశం అవసరం లేకుండా హృదయానికి హత్తు కు పోయే కవిత్వం వారికి అబ్బింది .దాన్ని సార్ధకం చేసుకొన్నారు .పుస్తకాన్ని నేను ఒక్క గంట లోనే చది వేశాను .క్రిస్టల్ల్ క్లియర్ గా ఉంది..దీనిలోని వేదాంత ,వేద శాస్త్రాల విషయాలను మురళీ ధర రావు గారు లోతుగా తరచి చెప్పారు .సూక్ష్మం గా ముందు పద్య భావం చెప్పి ,తర్వాత విశేషాల ను ప్రస్తావించారు .మురళీధర రావు గారితో చాలా కాలం గా నాకు పరిచయం ఉంది.ఆయన రెండవ శ్రేణి తెలుగు పండితులుగా ,నేను సైన్స్ టీచర్ గా సుమారు పాతికేళ్ళ క్రితం పెనమ కూరు హైస్కూల్ లో పని చేశాం .ఆయన కనక వల్లి గ్రామం లో కాపురం ఉన్నారు .ఆయన బోధనా పటిమ మా అందరికి ఎంతో నచ్చేది .అదే మొదటి పరిచయం .ఆయనలో గొప్ప కవి, భావుకుడు ,జిజ్ఞాసి ఉన్నారు .లోతుగా విషయాన్ని అధ్యయనం చేసే శక్తి సామర్ధ్యా లున్న వారు .నిరంతర అధ్యయన శీలి .మూలాలలోకి వెళ్లి అసలు రహస్యం చెప్ప గల సామర్ధ్యం .ఆయనది .అప్పటి నుంచి ఇప్పటిదాకా తరచుగా కలుస్తూనే ఉన్నాం .ఆయన రచనలు నాకు పంపిస్తూనే ఉన్నారు .నేను చదివి నాఅభిప్రాయాలను చెబుతూనే ఉన్నాను .కుర్రాళ్ళలో విజ్ఞాని .కావ్యాలను అవలోడనం చేసిన వారు .రేడియో ప్రసంగాలు ,వివిధ వ్యాసాలూ రాసి సాహితీ వ్యవసాయం నిరంతరం సాగిస్తున్న వారు .అందరికి ఆదర్శ పాత్రులు .అందుకే నాకు మురళీ ధర రావు గారు అంటే  అభిమానం ..నేను అమెరికా వెళ్ళిన సంగతి ,వచ్చిన సంగతి నా శిష్యుడు కాళీ ప్రసాద్ ద్వారా తెలుసుకొని ,నేను రాగానే ఫోన్ చేసి, చెప్పి ఈ పుస్తకం పంపారు రావు గారు .ఆయన నా కంటే చిన్న వారే అయినా మిత్రత్వమే మాది .ఆయన చర్చించిన విషయాలన్నీ పరమ ప్రామాణికమైనవి . అందరు తప్పక తెలుసు కొ న దగినవి .కనుక‘’కార్తికేయ  దర్శనం ‘’అందరు విధిగా’’ చేయాలని ‘’నా అభ్యర్ధన .

       ఇప్పుడు నాకు తెలిసినా ,నేను తెలుసుకొన్నా కొన్ని సంగతులు ముచ్చటిస్తాను .ముందుగా కలిదిండి గురించి –ఈ క్షేత్రానికి రాజ రాజ నరేంద్రుడు నన్నయ గారితో కలిసి వచ్చి స్వామిని దర్శించుకొన్నాడు .అప్పుడు నిర్జన ప్రాంతం .వారికి ఒక సరస్సు ,దగ్గర లో శివ లింగం కనిపించాయి ఆశ్చర్యం గా అక్కడే నిలిచి పోయారు .అప్పుడు సరస్వతి దేవి కన్య రూపం లో వారికి కని పించి వారు చూసింది నాగేంద్రుడు అని ,కారణం లేకుండా వారు దర్శనమీయరని ,పగలు బయటకు వచ్చి ,రాత్రి పాతాళానికి వెళ్లి పోతారని ,ఆ సరస్సు పాతాళానికి దారి అని పాతాళభోగేశ్వరుడు సత్యమహిమ కల స్వామి అని చెప్పి అదృశ్యమైంది .అప్పుడే రాజరాజ నరేంద్రుడు నన్నయ భట్టారకుని మహా భారతం ను ఆంధ్రీక రించ మని కోరాడట .కవి సమ్మతించి కావ్యానికి అంకురార్పణ అక్కడే చేశాడట ..ఉదంకుడు స్తుతించిన నాగసమూహాం పై రాసిన పద్యాలన్నీ ఇక్కడ రాసినవే నట .ఈ పద్యాలు చదివితే యే నాగు బాము కాటు వేయదు అని దీన్ని మాకు ఇంటర్ లో బోధించిన పాటి బండ్ల మాధవ శర్మ గారు చెప్పిన విషయం నాకు ఇంకా జ్ఞాపకం .ఆ పద్యా లన్నీ కంథో పాథంచేయ మని చెప్పారాయన .ఇక్కడపంచ బుగ్గలకోనేరు ఉంది.దీని ఒడ్డున నుల్చుని ‘’పాతాల భోగేశ్వారా హర హర ‘’అంటే కోనేరు నీటిలో బుడ బుడ మంటూ బుడగలు వస్తాయి .ఇది ఇప్పటికి జరుగుతోంది .ఇదీ కలిదిండి ప్రాశాస్త్యం .

      కుమార స్వామియే శరవణ భవుడు .ఆయనే సుబ్రహ్మణ్యుడు ..సుబ్రహ్మణ్యం కూడా బ్రహ్మమే .దీనినే అరుణ పారాయణం లో ‘’సుబ్రహ్మన్యోహం సుబ్రహ్మన్యోహం ,సుబ్రహ్మన్యోహం ఇంద్రా గచ్చ హరివ ఆగచ్చ మేధా తిదే ‘’అన్నారు .శివుని కుమారు లైన గణపతి కుమారస్వాములిద్దరు రుతంబర ప్రజ్ఞాకు సంకేతం గా భావిస్తారు .ఈ ప్రజ్ఞా నే శివ శక్తులకు కుమారుని గా చెబుతారు .ఈ ప్రజ్ఞా కలిగితే బుద్ధి ,సిద్ధి కలుగుతాయి వారి వల్ల విఘ్నాలను నివారించే వాడైవిఘ్న హంత అవుతున్నాడు వినాయకుడు .

        కుమారస్వామి భార్యలు వల్లీ ,దేవ సేనలు .వల్లీ అంటే లతా .ఆమే సర్పాక్రుతి కుండలినీ శక్తి .దేవ సేన అంటే తత్వ సముదాయం .గణపతి స్కందుడు ఇద్దరు నైష్ఠిక బ్రహ్మ చారులే .ఈ ఇద్దరి బ్రహ్మ చర్య విషయం విస్పష్టం చేయ టానికే వీరి పూజా విధానాలలో ‘’వటువు ‘’లను పూజించే ఆచారం వచ్చింది .కుండలినీ శక్తి వ్యష్టి ,సమష్టి పరం గా చెప్పవలసి వస్తే సర్పం గా చిత్రించటం ఆచారం గా ఉంది .స్త్రీ గా భావిస్తే కౌమారి .పురుషుడు గా భావిస్తే కుమారుడు .సమష్టి కుండలిని సర్పదేవత గా నాగ చతుర్ధి నాడు పూజిస్తారు .అది కుండలినీ శక్తికి ప్రతీక .నాగ పంచమి నాడు పూజించేది వ్యష్టి కుండలిని .అంటే వల్లీ  దేవిని –అంటే కుమారస్వామి అర్ధాంగి ని.కుమారస్వామి దేవ సేనా నాధుడు .ఇంద్రుని కుమార్తె దేవ సేన కు నాధుడు .తత్వ సముదాయమే దేవ సేన .జగత్తును సృష్టించటానికి తగిన సామగ్రియే  ఈ తత్వ సముదాయం .కల్పాంతం లో ఈ తత్వాన్ని (చమువు )ఉపసంహరించేది చాముండా .(చముండా తీతి చాముండా ) చండీ నవాక్షరాధి పతి చాముండా –శివ శక్తియే .రుతంభారా ప్రజ్ఞామూర్తి బ్రహ్మ కు భిన్నుడు కాదు .సుబ్రహ్మణ్యం కూడా బ్రహ్మమే .

         ఇక్కడ నాకు నన్నే చోడ కవి రాజు రాసిన ‘’కుమార సంభవం ‘’లోని అద్భుత మైన పద్యం ఒకటి మీ దృష్టికి తేవాలని పించింది .అది కుమారస్వామిని గురించి చెప్పిన పద్యమే –

‘’తన జనకుడగు స్తాణువు –జనని యపర్ణాఖ్య ,దా,విశాఖుం డనగా –దనరియు ,నభిమత ఫలముల –జనులకు దయ నొసగు చుండు షణ్ముఖు గొలుతున్ ‘’

   ఇందులో స్వారస్యం చూద్దాం –కుమారస్వామి తండ్రి శివుడు స్తాణువు అంటే మ్రోడు .తల్లి పార్వతి అపర్ణ .అంటే ఆకులు లేనిది .అయితే తాను విశాఖుడు –అంటే కొమ్మలు లేని వాడు .అయినా కోరిన ఫలాల నిస్తాడట కుమారస్వామి .మ్రోడై ,ఆకులు ,శాఖలు లేని చెట్టు ఫలాలివ్వటం ఏమిటి ?అదే కవి చమత్కారం .శబ్ద శ్లేష తో శివ పార్వతుల కు ,కుమారస్వామికి ఉన్న సహజ మైన పేర్ల తో చమత్కారం చేశాడు టెంక ణాదిత్యుడు అయిన నన్నే చోడ కవీశ్వరుడు .

           స్తానువు అంటే ప్రళయ కాలం లో కూడా చలించక నిలిచే వాడు –శివుడు అని అర్ధం .అపర్ణ అంటే ఆకులు కూడా తిన కుండా ఘోర తపస్సు చేసిన పార్వతీ దేవి .విశాఖుడు అంటే విశాఖా నక్షత్రం లో పుట్టిన కుమారస్వామి .విశాఖ అంటే నెమలి వాహనం గా కల వాడనీ అర్ధం ఉంది .అనేక అంటే పన్నెండు చేతులున్నవాడనీ ,వేద శాఖలు తెలిసిన వాడనీ అర్ధాలున్నాయి .ఇవన్నీ ఉన్న వాడు కుమారస్వామినే స్కందుడు అంటారు ,ఈ పద్యాన్ని ‘’కందం’’ లో అందం గా చెప్పాడు కవి రాజు .అదీ సొగసే కవికోరిక తీరింది .అభీప్సితమూ నేర వేరింది .అందుకే ఆయన్ను ‘’కవి రాజ శిఖా మణి ‘’అన్నారు .స్కందం అనేది ప్రాకృత ఛందస్సు లో ఉంది .దాని నుంచి వచ్చిందే మన కంద పద్యం అంటారు .తీసుకొన్న పద్యం, చెప్పే విషయం ఒకటే అయితే ముద్రాలన్కారం అంటారు .దీన్ని కూడా మొదట ప్రవేశ పెట్టిన వాడు కూడా నన్నే చోడుడే .ఈ కావ్యం లో కుమారస్వామి కధకు ముందు వినాయకుని జనం కూడా చెప్పాడు కవి రాజు .సంస్కృతం లో ఈ పధ్ధతి లేదు .ఇక్కడా తన ప్రత్యేకతను చూపించాడు .

       ఇవన్నీ మురళీ ధర రావు గారి ‘’కార్తికేయ దర్శనం ‘’చేసిన తర్వాతా గుర్తుకొచ్చి అందరికి ఉపయోగ పడతాయని తెలియ జేశాను .మరోసారి శతక కర్త గంగాధర శర్మ గారికి ,వారి భావావిష్కరణంచేసిన మురళీ ధర రావు గారికి ,అమూల్యం గా అందరికీ అందించిన దాసరి దంపతులకు అభి నందనాలు తెలియ జేస్తున్నాను .కార్తికేయస్వామి అందరిని చల్లగా కాపాడాలని కోరుతున్నాను .

           మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –29-10-12—ఉయ్యూరు 

Posted in రచనలు | Tagged | Leave a comment

శ్రీ శంకరుల లలి (కవి )తా సౌందర్య లహరి -32

    శ్రీ శంకరుల లలి (కవి )తా సౌందర్య లహరి -32

71—‘’నఖానా ముద్యోతైర్నవన లిన రాగం ,విహసతాం—కరాణంతే ,కాంతిం ,కదయ ,కధయామః ,కధముమే

       కయాచిద్వా ,సామ్యం ,భవతు కలయా ,హంత కమలం –యది క్రీడల్లక్ష్మీ ,చరణ తల లాక్షారుణ దళం ‘’

     తాత్పర్యం –ఉమా దేవీ !ప్రభాత కాలం లో ,అప్పుడే వికసించిన తామర పూవు కాంతిని పరిహసించె గోళ్ల సముదాయం తో విలసిల్లె నీ హస్తాల శోభ ను ఎలా వర్ణించగలను ?కమలం లోని కమలాలయ యైన లక్ష్మీ దేవి పాదముల లత్తుక యొక్క ఎరుపు రంగును పొందితే ,కొంచెం పోలికగా ఉందిఅన వచ్చు .అది కూడా సంపూర్ణ మైన పోలికకు తగదు .నీ నఖాగ్రాలు నిరుపమ శోభా రంజితాలు .

72—‘’సమం దేవీ స్కంద ,ద్విప వదన ,పీతం స్తన యుగం –తవేదం ,నఃఖేదం,హరతు ,సతతం ప్రస్నుత ముఖం

      యదా లోక్యా శంకా కులిత హృదాయో హాస జనకః –స్వకుమ్భౌ హీరంభః పరి మ్రుశతి హస్తేన ఝటితి ‘’

        తాత్పర్యం –సర్వేశ్వరీ !నీ స్తనముల యొక్క స్తన్య పానీయం చేస్తున్న వినాయకుడు ,ఆ వక్షోజాలను చూసి ,తన శిరః కుంభాలు అక్కడికి వచ్చాయేమో నని అనుమానంతో ,తన కుంభ స్తలాన్ని ,తన తొండం తో తడిమి  చూసు కొంటున్నాడు .ఇతని అమాయకత్వానికి పార్వతీ పరమేశ్వరులు నవ్వుతున్నారు .ఆ స్తనద్వాయాన్ని గణపతి ,కుమారస్వామి ,ఇద్దరు ఒకే సారి పానం చేస్తున్నారు .పుత్రవాత్సల్యం తో ,పాలు పొంగుతున్న ఆ స్తనద్వయం ,మా దుఖాన్ని పోగొట్టు గాక .

        విశేషం –జగత్పూజ్యు లైన ప్రమద గణాధి పతి ,దేవ సేనా పతి పుత్రులు గా గల శ్రీ దేవి ,మహాత్మ్యం సర్వ లోకాతిశయం.ఆమె కుఛ కుంభాలు స్వభావ సిద్ధం గా గజ కుంభాలు అని భావం .

 73—‘’అమూతే ,వక్షోజౌ ,వమృతరస ,మాణిక్య కుతుపౌ –న సందేహ స్పందో ,నగపతి ,పతాకే మనసినః

     పిబంతౌ ,తౌ ,యస్మాదవిదిత ,వధూ సంగ రసికౌ –కుమారా వద్యాపి ,ద్విరద ,వదన ,క్రౌంచ దళనే ‘’

     తాత్పర్యం –శైలజా !నీ చనుల జంట అమృత రసం తో నిండి ,మాణిక్య మయ కుప్పెలు గా ఉన్నాయి .ఇందులో సందేహమేమీ లేదు .కారణం –నీ చనుబ్రాలు త్రాగిన వినాయకుడు ,కుమారస్వామి నేటికీ ,యవ్వన ఉత్సాహం తో ,ఆనంద రసాస్వాదన రసికులుకాకుండా ,బాలురు గానే ఉన్నారు సుమా !

    విశేషం –గణ పతి భార్యలు సిద్ధి ,బుద్ధి .కుమారస్వామి భార్యలు వల్లీ ,దేవసెనలు .వీరు శబ్ద వాచ్యులు ,శక్తి స్వరూపులే కాని ,స్త్రీ సుఖం ఇచ్చిన వారు కాదు .భ్రాంతిలో ఉన్న దాంపత్యం ఇది .

         శివ శక్తి యోగ సాధన లో సాధకుడైన యోగికి లభించే రుతంబరా ప్రజ్ఞను గణ పతి అంటారు .ఈ ప్రజ్ఞయే శివ,శక్తుల కుమారుని గా చెబుతారు .ఈ ప్రజ్ఞ కలిగితే ,బుద్ధి ,సిద్ధి వశం అవుతాయి .వారి వలన విఘ్నాలను నివారించే వాడై,విఘ్న హంత అవుతున్నాడు గణపతి .

          కుమారస్వామి భార్యలు వల్లీ దేవసెనలు .వల్లీ అంటే లతా .ఆమె సర్పాక్రుతిలో ఉన్న కుండలినీ శక్తి .దేవసేన అంటే తత్వ సముదాయం .గణపతి ,కుమారస్వాములిద్దరు నైష్ఠిక బ్రహ్మ చారులే .ఈ ఇద్దరి బ్రహ్మ చర్య విషయం విస్పష్టం చేయటానికే ,వీరి పూజా విధానం లో వతువులను పూజిస్తారు .

        కుండలినీ శక్తి ని వ్యష్టి ,సమష్టి పరం గా చెప్పవలసి వస్తే ,సర్పం గా చిత్రించటం ఆచారం .స్త్రీ గా భావిస్తే కుమారి .పురుషుడిగా భావిస్తే కుమారుడు .సమష్టి కుండలిని సర్ప దేవత గా నాగ చతుర్ధి నాడు పూజిస్తారు .అది కుండలినీ శక్తికి ప్రతీక .నాగ పంచమి నాడు పూజించేది వ్యష్టి కుండలిని .అంటే వల్లీ దేవిని .-అంటే కుమారస్వామి అర్ధాంగి ని .

        కుమారస్వామి దేవ సేనా నాధుడు .ఇంద్రుని కుమార్తె దేవ సేన కు అది పతి .తత్వ సముదాయమే దేవ సేన .జగత్తును నిర్మించటానికి తగిన సామగ్రియ ఈ తత్వ సముదాయం అంటే .కల్పాంతం లో ఈ తత్వాన్ని (చమువు )అంటే ఉపసంహరించేది చాముండా (చముండాతీతి చాముండా ).చండీ నవాక్షరాది పతి చాముండా –శివశాక్తియే రుతంభర ప్రజ్ఞా మూర్తి- బ్రహ్మ కు భిన్నుడు కాడు.సుబ్రహ్మణ్యం కూడా బ్రహ్మమే .

74—‘’వాహన్త్యంబ ,స్తంబే రామ దనుజ ,కుంభ ప్రక్రుథిభిహ్ –సమారబ్దాం ,ముక్తామణి భిరమలాం ,హారలతికాం

       కుచాభోగో ,బింబాధర రుచిభి  ,రంతశ్శబలితాం –ప్రతాపవ్యామిశ్రాం ,పురదమయిథుహ్ కీర్తి మివతే ‘’,

         తాత్పర్యం –అంబా !గజాసురుని శిరస్సు యొక్క కుంభస్తలమే జన్మ భూమి గా కలిగి ,కర్పూర వాసన ,దోష రహిత మైన ముక్తామణుల హారాన్ని ,నువ్వు ,నీ విశాల స్తన మండలం మీద ధరిస్తున్నావు .నీ ఆధర బింబం యొక్క యెర్ర దనపు కాన్తులచే ,ఆముత్యాల హారం ,లోపలే పుట్టిన చిత్ర విచిత్ర కాంతులతో పరమ శివుని ప్రతాపాన్నీ ,కీర్తినీ ధరించి నట్లుగా విరాజిల్లు తోంది .

            విశేషం –శ్రీ దేవి హృదయ పీథంమీద ఉన్న హారం ,శివుని ప్రతాప కీర్తులను ప్రకాశింప జేస్తోంది .అంటే ,ఆయన కీర్తి ప్రతాపాలు ఆమె హృదయ గతాలు అని భావం .ఆమె కంథం లోని ఇతర ఆభరణాలు కూడా శత్రు సంహార లక్షణాలు కలవని అర్ధం .అధర కాంతితో  మెరిసే భగవతి స్తనద్వయం పైనున్న హారం ,జగదేక వీరుడైన త్రిపురారి అయిన శివుని శత్రువైన గజాసురుని కుంభ స్తలం లో ఉన్న ,ముత్యాల లాగా ,ఆమె కుచాల యందు నిక్షిప్తం అయాయి అని భావం .అలాంటి భగవతి యొక్క భర్త ప్రతాపం తో కూడిన మూర్తి కీర్తిధారణ తో పతివ్రతా ధర్మాన్ని చూపిస్తోంది .శివ కీర్తికి ఉత్పత్తి స్తానం శ్రీ దేవి కుచాలు అని అంతరార్ధం .

 సశేషం –మీ –గబ్బిట  దుర్గా ప్రసాద్ –29-10-12-ఉయ్యూరు 

Posted in రచనలు | Tagged | Leave a comment

కన్ఫూజన్ లేని కన్ఫూసియస్ సిద్ధాంతం

  కన్ఫూజన్ లేని కన్ఫూసియస్ సిద్ధాంతం

 చైనా దేశపు దార్శనికుడు ,వేదాంతి కన్ఫూసియస్ .సుమారు 2,500సంవత్సరాల క్రితం వాడు .ఆయన జీవిత కాలం లో చెప్పిన వాటి నన్నిటినీ శిష్యులు సేకరించి ‘’అనలేట్స్ ‘’పేర రాశారు .చైనా ను పరి పాలించిన రాజు లందరూ ఆయన సిద్ధాంతాలనే అమలు చేశారు .206-220 b.c.కాలం లోను , ఆ తర్వాతా పాలించిన వారికీ ఆయనే ఆదloర్శం .చైనా ను ఏకం చేసిన చాన్కై షేక్ ,క్విన్ వంశపు రాజులకు అతని సిద్ధాంతాల మీదే గురి .1978 లో den xiao ping చైనా ను ఆర్ధిక సామాజిక రంగాలలో ముందుకు తీసుకొని వెళ్లాడు .రాజకీయం గా ,ఆర్ధికం గా చైనా ప్రపంచ దేశాలలో అగ్ర స్థానం పొందింది .1947లో వచ్చిన మావో పాలన నుంచి కాపిటలిస్ట్ భావాలను అదుపు లో ఉంచుకొని అభివృద్ధి చేశాడు .డెంగ్ ది ‘’గెట్టింగ్గ్ గ్ రిచ్నెస్ ఈస్ గ్లోరియస్ ‘’అనే నినాదం .అయితే దీన్ని సాధించినా ,ధనికులకు ,పేదలకు మధ్య దూరం పెరిగి పోయింది ప్రజలు ఒక్క సారి వెనక్కి తిరిగి ఆలోచించారు .కన్ఫ్యూసియాస్ మాత్రమె తమకు శరణ్యం అని భావించారు .

    రెండు వేల ఏళ్ళ క్రితం ‘’హాన్ డై నాస్టీ’’కి చెందిన ‘’వు’’అంత వరకు ఉన్న వంద మంది తత్వ వేత్త లను దూరం గా పెట్టి కన్ఫ్యూసియాస్ సిద్ధాంతాన్నే అమలు పరచాడు .వెయ్యేళ్ళ క్రితం ‘’సాంగ్ వంశానికి ‘’చెందినా జుయావో పు ‘’అనే ప్రధాని‘’కన్ఫ్యుసియాస్ పుస్తకం లో సగ భాగం చాలు ప్రపంచాన్ని పాలించా టానికి ‘’అన్నాడు .అంటే, ఆ దార్శనికుని గొప్పతనమేమిటో తెలుస్తోంది .

   చైనా లో హాట్ స్ప్రింగ్స్ చాలా ఉన్నాయి .అందులో ఒకటి –‘’ask sickness spring ‘ లో స్నానం చేస్తే అన్ని రోగాలు పోతాయి .కీళ్ళ నొప్పుల వాళ్ళు స్నానం చేసి గట్టు ఎక్కే సరికి తీసేసి నట్లు నొప్పులు మాటు మాయం ..’’gastro intestinal problems ‘’ఉన్న వాళ్ళు చేస్తే లోపల ‘’గట్’’అంతా క్లీనవుతుంది .చర్మ వ్యాధులున్న వాళ్ళు చేస్తే ,కొత్త చర్మం వచ్చిన అను భూతి పొందుతారు .పాత చర్మం ఊడి కొట్టుకు పోయి నట్లున్తుంది .పాము కుబుసం విడిచి నట్లు గా ఉంటుందట .ఇవి ఆయన సూచించిన ప్రదేశాలే

     కన్ఫ్యుసియాస్ ఆలోచన సూటిగా ,సరళం గా తేలిగ్గా ఉంటుంది .ఆయనకు వెయ్యి మంది శిష్యులు .అందులో డెబ్భై రెండు మంది ఆయన విజ్ఞానాన్ని ,ప్రతిభను అందరికి చాటి చెప్పారు .అందుకే ఆయన్ను ‘’సేజ్’’అన్నారు .దీని అర్ధం –ఆలోచనలో ,ఆచరణ లో నిర్దుష్టత ఉండి ,ఇతరులను ఆకర్షించే వాడని .దేశాన్ని చూసి స్వర్గం నవ్వాలి అని చెప్పేవాడు .భూమి అనుకూలం గా ఉండాలి .అప్పుడే అది నిలబడి అభి వృద్ధి చెందుతుంది అన్నాడు .మానవాళి ,ప్రకృతి పూర్తీ సామరస్యం తో సాగాలి .ప్రకృతి పై ఆరాధనా భావం ఉండాలి .అది లయాన్వితం గా ఉండాలి .నమ్మకమే దేశాన్ని కలిపి ఉంచుతుంది .gross national productకాదు కావాల్సింది gross national happiness  అన్న మహానుభావుడాయన

          మనిషికి నిర్మల స్వచ్చ ఆంతరిక ఆనందం ఉండాలి దరిద్రం లో ఉన్నా ,మర్యాదగా నవ్వుతు సంతృప్తి తో ఉండాలి .ఆత్మ గౌరవం ,మానసిక సంతృప్తి ఉన్న వారిని Zunzi’’అంటారు .ఇప్పటికీ చైనా లో స్వీయ వ్యక్తిత్వం ఉన్న వారిని ఆ పేరుతోనే పిలుస్తారు .’’our eyes see too much of the world and too little of the heart and soul ‘’అన్న వేదాంతి .’’loving other people is benovolence –understanding others is wisdom ‘’అన్న దార్శినికుడు .ఇవాళ భౌతిక సంపద,అతి వేగ వంత మైన జీవితం వల్ల నిర్ణయాలు త్వరగా తీసుకొంటూ ,ఏది ఉత్తమ మైనదో తెలుసుకొనే తీరిక లేకుండా ఉన్నాం .మన మార్గం నూటికి నూరు శాతం మన మార్గం అవాలి .అప్పుడే సాఫల్యత ..పూర్తిగా ఒంటరిగానూ ,పూర్తిగా జనం లో ను జీవించటం అభిలష ణయం కాదు .’’going too far is as bad as not going far enough ‘’అన్నది ఆ యన మార్గం ఇవాళ చైనా లో జనాలతో సంబంధం లేకుండా జీవిస్తున్నారు .స్నేహితులకు ,బంధువులకు తగిన స్తానం ఇస్తే ,కొత్త లోకాలు దర్శన మిస్తాయి .తక్కువ మాట్లాడాలి ఎక్కువ చేయాలి .జాగ్రత్త గా మాట్లాడాలి .’’troubles come from mouth ‘’అన్నది చైనా సామెత .అతిగా మాట్లాడితే దాని అర్ధమే నశిస్తుంది అన్నాడు ఆ వేదాంతి .ఏదైనా ఎవ రైనా చెప్పింది వింటే ,అందులోని సత్యాన్ని గురించి విచారించాలి .పని చేసే ముందు ఒక్క క్షణం ఆలో చించి ప్రారంభించాలి .గౌరవం గా ప్రవర్తించాలి అవతలి వారికి గౌరవం ఇవ్వాలి .

       నైతిక శీలాన్ని పెంచుకోవాలి .మంచి విద్యనభ్య సించాలి .విధేయత ముఖ్యం .అప్పుడే మనం చెప్పింది అవతల వారు ఆచరిస్తారు .సత్య నిర్మలత ఉంటె ,ఉత్తాన పతనాలను లెక్క చేయక పోతే ,పూర్తీ సంతృప్తి ఉంటుంది .’’be the first to worry for the worries of the world and the last to take joy in the joys of the world ‘’అన్న గొప్ప సత్య బోధకుడు కంఫ్యుసియాస్ .దేశం అభి వృద్ధే నాకు బాధ్యత అంటే –నీ స్వంత లాభాలను త్యాగం చేయటమే .a man of benevolence never worries ,a man of wisdom is never two minds ,a man of courage is never afraid ‘’అని అతి సూక్ష్మం గా వివరించాడు .అలాగే మనుషుల లోని తార తమ్యాలను గురించి చెబుతూ ‘’the gentle man agrees with others without being an echo –the small man echoes without being agreement ‘’అన్నాడు .

            ప్రతి విషయం లోను ధనాత్మక దృక్పధం ,తగినంత అవగాహన ,పరిమితులతో ఇతరులతో ప్రవర్తించటం చేస్తే అవతలి వారిలో సంతోషం ,ఆనందం కలిగించి , శక్తి వంతులను చేయ గలుగుతారు .సూర్యుని లా ప్రకాశించి ,వెలుగులను నింపాలి .దీని వల్ల కుటుంబం లో ,స్నేహితుల్లో సమాజం లో సఖ్యత ఏర్పడి అందరు సుఖం గా ఉండ గలుగుతారు .ఇదే మనం ముందు చెప్పుకొన్న ‘’జుమ్జి ‘’అది మనతో ప్రారంభం అవాలి .మూడు రకాల స్నేహితులుంటారు .మొదటి రకం వారు సూటిగా ప్రవర్తిస్తారు నిజాయితీ తో ఉంటారు .వీరికి మంచి హృదయం ఉంటుంది .వారి ప్రవర్తన మన పై మంచి ప్రభావాన్ని చూపిస్తుంది .ధైర్యం కలుగుతుంది .నిర్ణయాత్మకం గా వ్యవహరించేట్లు చేయ గలుగుతారు .రెండో రకం స్నేహితులు –విధేయత కలిగి నమ్మకం గా ఉంటారు వీరిలో నటన ఉండదు .వీరందరూ వెంట ఉంటె స్తిరత్వం రక్షణ ,ప్రశాంతత లభిస్తాయి మనం స్వచ్చత పొంది ఎదగ టానికి వీరు తోడ్పడుతారు .మూడో రకం స్నేహితులు –వీరికి లోక జ్ఞానం ఎక్కువ .అన్నీ తెలుసు .వీరు ప్రపంచాన్ని బాగా చదివిన వారు గా ఉంటారు మనమూ వారితో పాటు లోకజ్ఞానం పొంద గలుగుతాం

    ఇతరులతో పోట్లాడటం కంటే నీ లో నువ్వు ఘర్షణ పడు అప్పుడు పరిష్కారం పొంద గలవు .ఇది నీ అభి వృద్ధికి దారి చూపిస్తుంది .మనకు విస్తృత మైన అనేక రకాలైన కోరికలు లేక కాదు .సరైన దారి లేక పోవటం ,మార్గ దర్శి లేక పోవటం వల్లే కోరికలు తీరటం లేదు .నిజ మైన ‘’జున్ జి ‘’.అంటే ,మాట్లాడటం మానేసి, క్రియా శూరుడయే వాడు .అతని దృష్టిలో శక్తి అంటే పని లోనే కాని మాటల లో శక్తి కాదు .మన ఆలోచనా విధానమే అన్నిటినీ నిర్ణయిస్తుంది .జున్జి లంటే సమాజపు ఆత్మ కు దర్పణం వంటి వారు .’’’’the part of our selves that performs in a social role ,is plainly visible .but often we muffle the voice of our own spirit ‘’అని తెలియ జేశాడు .సమాజ                     బాధ్యత అందరిదీ .సమాజం బాగా ఉంటె దేశం బాగా ఉంటుంది సమాజం బాగా ఉండా లంటే కుటుంబం బాగా ఉండాలి .ఇది ఉండాలి అంటే వ్యక్తీ నిర్దుష్టం గా ఉండాలి .’’success in our professional life is not necessary the heart’s true ambition ‘’మనసు కోరింది సాధించి నప్పుడే తృప్తి .ఉద్యోగం లో పొందిన విజయం నిజమైన ది కాదు .ఇవన్నీ చిన్న విషయాలే అని పించినా నిర్మల స్తిరచిత్తానికి అవసర మైనవే ఇవి .ఇక్కడి నుంచే మన ప్రస్తానం ప్రారంభం అవుతుంది .వ్యక్తీ గా  ఉన్నతి ని సాధించటం స్వార్ధం ఏమీ కాదు .దీనితో వ్యక్తులు సమాజానికి ఇతోధిక సేవ జేసి దాని అభి వృద్ధికి కారకులవాలి .

        చైనా లో బాగా ఉన్నత మేధావి వర్గాన్ని ‘’shit’’అంటారు .అయితే ఎవరు తమ ధర్మాన్ని సక్రమం గా నిర్వ హిస్తు పవిత్ర మైన మనసు కలిగి విలువలకు ప్రాధాన్యత నిస్తూ ,సమాజానికి నిజం గా ఉప యోగా పడతారో ,బయటి ప్రపంచం తో మంచి సంబంధాలను కలిగి ఉంటారో వారే ‘’షిట్’’..చివరగా కన్ఫ్యూసియాస్ వాణిని ఆయన మాటలలో తెలుసు కొందాం –At fifteen ,I set my heart learning –at thirty I took my stand –at forty I came to be free from doubts ,at fifty I understood the Doctrine of Heaven –at sixty my ear is attuned ,at seventy I followed my heart desire without overlapping the line ‘’

‘’The wise find joy in water ,the benevolent find joy in mountains ,.the wise are active ,the benevolent are still .the wise are joyful .the benevolent are long lived ‘’

         చైనా దార్శనికుడు ,వేదాంతి కన్ఫ్యుసియాస్ సిద్ధాంత సారాన్నిYu Dan  అనే మహిళ,associate Dean of school of arts and media in Beizing Normal University 2006 లో చైనా టి.వి. లో చేసిన ప్రసంగాన్ని దాదాపు రెండు మిలియన్ల మంది చూశారు, విన్నారట .అంటే ఇప్పటికి కన్ఫ్యుసియాస్ అంటే చైనా ప్రజలకు ఎంత అభిమానమో తెలుస్తోంది .ఆమె చైనా సాహిత్యం లో డాక్టరేట్ డిగ్రీ సాధించింది .అంతే కాక ఫిలిం అండ్ టి.వి.స్టడీస్ లో కూడా డాక్టరేట్ సాధించిన మహిళ’’యు డాన్’’

              మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –27-10-12-ఉయ్యూరు 


గబ్బిట దుర్గా ప్రసాద్
https://sarasabharati.wordpress.com
http://suvarchalaanjaneyaswami.wordpress.com

Posted in రచనలు | Tagged | Leave a comment

శ్రీ శంకరుల లలి (కవి )తా సౌందర్య లహరి –30

   శ్రీ శంకరుల లలి (కవి )తా సౌందర్య లహరి –30

67—‘’కరాగ్రే ణస్పృష్టం తుహిన గిరిణావత్సలతయా –గిరీశేనో దంతం ,ముహురధర ,పానా కులతయా

      కర గ్రాహ్యం శంభోర్ముఖ ముకుర వ్రుంతం ,గిరి సుతే –కదం కారం ,బ్రూమస్త వ చుబుక మౌపామ్య రహితం .

        తాత్పర్యం –అమ్మా విష్ణు సోదరీ !నీ తండ్రి హిమ వంతుడు నీ మీద మిక్కిలి పుత్రికా వాత్సల్యం తో నీ చుబుకాన్ని పునుకు తాడు .నీ పతి పశు పతి నీ క్రింది పెదవి మాధుర్యాన్ని చవి చూసే సందర్భం లో మాటి మాటికీ నీ ముఖాన్ని పైకెత్తు తు ,శంభుని చేతి తో తీసుకోన దాగిన ముఖం అనే అద్దానికి పిడిని వర్ణించ టానికి తగిన వస్తువే లేక పోయింది .అలాంటి నీ చుబుకాన్ని ఎంతని వర్ణించాను ?

        విశేషం –శివుడు శ్రీ దేవి చుబుకాన్ని చేత్తో పట్టుకొంటున్నాడు .కారణం –ఆమె ముకుర వ్రుంత కనుక ఆ ముఖ దర్పణానికి చుబుకం పిడి అవటం వల్ల పట్టుకొని ,ఆ అద్దం లో తన ప్రతి బింబాన్ని చూసు కొంటున్నాడు అని భావం .శృంగార సమయం లో స్త్రీలు తల వంచుకొని ఉంటారు .ఆ ముఖాన్ని పైకి ఎత్తితేనే ‘’సు చుంబనం ‘’అవు తుంది .అంటే చక్కని ముద్దు సాధ్యం అవుతుంది .సమగ్ర లావణ్యం కలిగింది కనుక చుబుకాన్ని పోల్చా టానికి ఏ వస్తువూ లేదు .అనుపమమైనది అని అర్ధం .

       68 –‘’భుజా శ్లేషాన్నిత్యం ,పుర దమయిథుహ్ కంటక వతీ –తవ గ్రీవా ధత్తే ,ముఖ కమల నాళశ్రియ మియం

            స్వతః శ్వేతా కాల గురు బహుళ జంబాల మలినా –మ్రుణాలీ లాలిత్యం వహతి ,యదదో హార లతికా ‘’

        తాత్పర్యం –మూల మంత్రాత్మికా !సహజం గా స్వచ్చ మైనదీ ,కృష్ణా గరు చేత నల్లనైనదీ ,ముత్యాల సరాలున్న తీగలు కలది  ,అయిన నీ కం థనాళం ,కలువ తూడు లాలిత్యాన్ని ,పొంది ,త్రిపుర మదనుడైన ఈశ్వరుని బాహువు లచే ,ఆలింగనం తో ,నిత్యం రోమాన్చాలనం కలది ముఖ పద్మనాళ శోభ తో విరాజిల్లు తోంది .

        విశేషం –ముఖం పద్మం .నాళం –కమల  నాళం .పరమ శివాలింగానం తో కలిగిన రోమాన్చలం కలిగిన నాళం అందులోని కంటకాలు అంటే ముళ్ళు కంథం కింద పూయ బడిన క్రిష్ణాగరు గంధపు బురద ..ముత్యాల హారాల ,తామర తూళ్ళు .

          సశేషం –మీ– గబ్బిట దుర్గా ప్రసాద్ –27-10-12-ఉయ్యూరు 


గబ్బిట దుర్గా ప్రసాద్

https://sarasabharati.wordpress.com
http://suvarchalaanjaneyaswami.wordpress.com

Posted in రచనలు | Tagged | Leave a comment

శ్రీ శంకరుల లలి (కవి )తా సౌందర్య లహరి –31

 శ్రీ శంకరుల లలి (కవి )తా సౌందర్య లహరి –31

 

 69—‘’గళేరేఖాహాస్తిశ్రో ,గతి గమక ,గీతిక నిపుణా –వివాహ వ్యానద్ధ ప్రగున ,గుణ సంఖ్యా ప్రతి భువ

        విరాజన్తే ,నానావిధ ,మధుర రాగా కర భువాం –త్రయాణాం గ్రామానాం స్తితి నియమ సీమాన ఇవతే ‘’

        తాత్పర్యం –కైవల్య పద దాయినీ !నీ గళం పై మూడు రేఖలున్నాయి .ఇవి ,వివాహ వేళ వేయబడిన మంగళ సూత్రాలుగా ఉన్నాయి .తల్లీ ! మార్గ ,దేశి అనే సంగీత గతుల యొక్క అయిదు రకాలైన స్వర గమకాల యొక్క గీతాలను పాడటం లో నీవు నిపుణవు..నీ గళం పై ఉన్న మూడు ముడతలు మూడు భాగ్య రేఖలు .వివాహ సమయం లో మంగళ సూత్రం  కట్టిన తర్వాత ,వాటి దగ్గర అనేక పేటలతో కలిపి ,పేనిన,మూడు సూత్రాలను జ్ఞాపకం చేస్తున్నాయి .నానా విధ మధుర గానాలకు నిలయ మైన షడ్జ గ్రామ ,మధ్యగ్రామ ,గాంధార గ్రామాల ఉనికిని తెలియ జేయటానికి ఏర్పరచిన సరిహద్దుల్లా ఉన్నాయి .

         విశేషం –పతివ్రతలు ,తమ పతి ప్రాణాలను తమ మంగళ సూత్రాలలో ధరిస్తారు .’’బ్రహ్మ విశ్న్వీశ  రూపేషు రంద్ర శ్యేతం త్రి తంతుకం –త్రిరత్న ,రుక్మజం ,స్త్రీణాం ,మాన్గాల్యాభరణం విదుహ్ –

          సంగీతం లో రాగానికి గతి ,గమకం ,గీతం అనేవి మూడు అంగాలు .రాగం నడక గతి .స్వరాల ఆరోహణావరోహణలు గమకం ,నిర్దుష్టమైన స్వరాల క్రమం గా పాడటం గీ తం .సంగేతానికి షడ్జమ ,మధ్యమ ,గాంధార అనే మూడు గ్రామాలున్నాయి .ఏ గ్రామం లో ప్రారంభిస్తే ముగింపు కూడా ఆగ్రామం లోనే చేయాలి .ఈ రోజుల్లో గాంధారం లో పాడేవారు లేరని చెబుతారు .మాధ్యమంగా పాడే వారు చాలా తక్కువ మంది ఉన్నారని సంగీత విశ్లేషకుల అభి ప్రాయం .

         శ్రీ భగవతి మాత్రం మూడు స్తాయిల్లోను ,సంకరం కాకుండా ,గానం చేయ గల నిపుణ .మంగళ సూత్రం అంటే పవిత్ర మైంది .కలంక రహిత మైనది .పరిశుద్ధ మైనది అని అర్ధం .’’పవెహ్ త్రాయతీతి పవిత్రః ==’’పవి అంటే మృత్యువు .మృత్యువు నుండి రక్షించేదే మాంగల్యం –అందుకే పవిత్ర మైనది .మాంగల్య తంతువు (దారాలు )తత్వాలను సూచిస్తుందని దాని వల్ల ‘’బ్రహ్మమఃహ  మస్మి’’అనే స్మృతి రూపం లోని మేధస్సు యొక్క ప్రభ జనిస్తుందని భావన అని తెలియ జేశారు బ్రహ్మశ్రీ తుమ్మల పల్లి రామ లింగేశ్వర శర్మ  గారు ‘’

 70— ‘’మ్రునాళీ మ్రుద్వీనాం తవ భజలతానాం చతుసృనాం—చతుర్భి స్సౌన్దర్యం సరసి భవ స్త్యేతి ,వదనైహ్

        నఖేభ్య ,స్సంత్రస్సన్ ప్రధమ ,మదనాదంధక రిపో –స్చాతుర్నాం ,శీర్శనాం సమ మభయ  ,హస్తార్పణ దియా ‘’

     తాత్పర్యం –కామ కళా రూపా !పూర్వం శివుడు బ్రహ్మ యొక్క అయిదవ శిరస్సు ను తన వ్రేలి గోటి తో ఖండించాడు .అప్పుడు ,మిగిలిన నాలుగు ముఖాలు తమను కూడా ఖండిస్తాదేమో నని భయం తో ,ఈశ్వరుని కోపాన్ని పోగొట్టి ,తమ నాల్గు తలలను కాపాడ టానికి అభయ హస్తం ఇవ్వ మని బ్రహ్మ –తన నాలుగు ముఖా లతో తామర తూడుల్లాగా మెత్త నైన నీ బాహు లతలను గురించి దీనం గా ప్రార్దిస్తున్నాడు

        విశేషం –బ్రహ్మ చతుర్ముఖాలతో నాల్గు వేదాలతో స్తుతిస్తున్నాడని భావం .సృష్టించటం వల్ల లభించిన అహంకారమే బ్రహ్మ గారి అయిదవ తల .నాలుగు ముఖాలు ఉంటె ,శ్రీ దేవి బాహువులను అహంకారం వదిలి బాగా వర్ణించ గలడు అని అర్ధం .

గబ్బిట దుర్గా ప్రసాద్

Posted in రచనలు | Tagged | Leave a comment

అమెరికా లో జర్మన్ హవా -1

అమెరికా లో జర్మన్ హవా -1

                                                           

  వందేళ్ళకు పూర్వమే అమెరికా జాతీయ కవి వాల్ట్ విట్మన్ అమెరికాను ‘’here is not merely a nation ,but ,a teeming nation of nations ‘’అని అమెరికా బహుజాతుల సమాఖ్య అనే విషయాన్ని కవిత్వ పరం గా చెప్పాడు .’’AMERICA IS MADE UP OF MANY PEOPLE ‘’అని వాళ్ళ రాజ్యాంగం లో రాసుకొన్నారు కూడా .

       1986 జనాభా లెక్కల ప్రకారం 300 ఏళ్ళ అమెరికా చరిత్ర లో అమెరికా లోని జర్మన్లు ,బ్రిటీష్ వారికంటే ,ఎక్కువ .దాదాపు 44 మిలియన్ల మంది జర్మంలున్నారు .వీరు పద్దెనిమిది శాతం .ఇవాల్టి నలభై నాలుగు మిలియన్ల జర్మన్ అమెరికన్లలో నాలుగు శాతం మాత్రమె జర్మనీ లో పుట్టిన వారున్నారు .1871 కి పూర్వం జర్మని ఒక దేశమే కాదు .డజన్ల కొద్దీ చిన్న రాష్ట్రాలు మాత్రమె .డచేస్ ,రాజ్యాలు ,ప్రిన్సిపాలిటీలు ఉండేవి .ఒక్కో దానికి ఒక్కో రాజు ,సంప్రదాయం ,ప్రాంతీయ యాస భాష ఉండేవి .ఏడు వందల ఏళ్ళు యుద్ధాలు ,తిరుగు బాట్లు ,వలసలు ,మత సంఘర్షణలు చోటు చేసుకొన్నాయి .ఉత్తరమధ్య యూరప్ ,ఉత్తర సముద్రం నుండి ,kaunas ,lidhunia దగ్గర నీమాన్ నది వరకు ఉండేది .జర్మనీ భాష మాట్లాడే వారంతా డెన్మార్క్ ,నెదర్లాండ్ ,బెల్జియం ,లక్సం బెర్గ్ ,ఫ్రాన్స్ ,స్విట్ జేర్లాండ్ ,ఆస్ట్రియా ,హంగేరి చెక్ ,పోలాండ్ ,రష్యాల నుండి వచ్చిన వారే .వీరందర్నీ జర్మన్లు అనే అన్నారు .వీరే మొదటి సారిగా అమెరికా వచ్చిన జర్మన్లు .నిజం గా వీరికి అప్పుడు జర్మనీ స్వదేశమే కాదు .అక్కడ పుట్టిందీ లేదు .కనుక వీరందరినీ ఒకే గాట కట్టేసి జర్మన్లు అన్నారు .

      1683  లో ఇంగ్లీష్భాష మాట్లాడని జర్మన్లె అమెరికా రావటం ప్రారంభించారు .,1776 తిరుగు బాటు యుద్ధం నాటికి వీరి సంఖ్య 2,25,000 అయింది అమెరికాలో .ఇరవై వ శతాబ్దం లో వీరంతా ,ఇంటర్ మారేజీలు చేసుకొని అమెరికా అంతా వ్యాపించారు .అమెరికాలో ,యూరప్ లో ని అంతర్యుద్ధాల వల్ల వలసలు తగ్గినా ,జర్మన్లు మాత్రం అమెరికా కు వస్తూనే ఉన్నారు .1830 నాటికి రికార్డు స్తాయిలో జర్మన్లు అమెరికా చేరారు .ఐరిష్ వారి తర్వాతస్తానం జర్మన్ల దే అందుకే వారిని’’largest non English speaking group ‘’ అన్నారు .ఒక్క 1882 లోనే 2,50,000 మంది జర్మన్లు చేరారు .

          1816-90  మధ్య వచ్చిన వారికి ,అంతకు ముందు వచ్చిన వారికి తేడా ఉంది .18 వ శతాబ్దం లో వచ్చిన జర్మన్లు విట్టేన్ బెర్గ్ ,రైన్ నది ఒడ్డున పశ్చిమ,ఉత్తర ప్రాంతాల వారు .అయితే ,ఇప్పుడొచ్చిన వారు ‘’సెకండ్ వేవ్ ‘’జనం .వీరు తూర్పు ,ఉత్తర ప్రష్యా ,బవేరియా ,సాక్సనీ ప్రాంతాల వారు .1870 లో జర్మని ఏకీకృతం అయింది .ఈ కాలానికి ముందు వచ్చిన జర్మన్లు తమ రాజ్యానికి విధేయులు .,జర్మనీకి కాదు ..xaxes ,baveria ,,Berlinar లం అని గర్వం గా చెప్పుకొంటారు ఇప్పటికీ .అన్ని రకాల వారు ,అనేక కారణాల వల్ల వలస వచ్చారు .మత దురహం కారం వల్ల ఇబ్బంది పడిన మతాల వారు కూడా చేరారు .19 వ శతాబ్దం లో రాజకీయ అణచి వేత లను భరించలేక పోయిన వారూ అమెరికా చేరారు .వీరంతా బాగా చదువు కొన్న వారు .,రాజకీయ అవగాహన ఉన్న వారూ.

          అయితే ,ఆర్ధిక పరిస్తితి మెరుగు పరచు కోవటానికి వచ్చిన వారే ఎక్కువ .వ్యవసాయం అక్కడ గిట్టక ,పొలాలు చాలక ,ఇక్కడికీ ,కెనడాకు చేరుకొన్నారు .అంతర్యుద్ధాలకు  ముందే వీరంతా వలస వచ్చారు .సివిల్ వార్  తర్వాత,పారిశ్రామిక ప్రగతి అమెరికా లో బాగా ఎక్కువ అవటం ,రాక పోకలకు స్టీమర్లు రావటం, అక్కడ కూలి జనాలు దొరక్క పోవటం వల్ల వీరందరూ ఇక్కడికి చేరుకొన్నారు .ఇర వైవ శతాబ్దం లో మరో రకమైన వలసలేర్పడ్డాయి .మొదటి ,రెండు ప్రపంచ యుద్ధాల శరణార్ధులు అమెరికా కు రావటం తో సైన్స్ ,బిజినెస్, కళలు లో గణనీయ ప్రభావం కలిగింది .వీరిలో చాలా మంది యూదులు .కాధలిక్కులు ,ప్రోటేస్తంట్లు ,హిట్లర్ దాష్టీకానికి భయ పడిన వారూ కూడా వచ్చేశారు జర్మనీ నుంచి .అమెరికా లో కూడా జనాభా మత ,కుల ,సరి హద్దు లతో విడి పోయారు .జర్మన్ సెటిలర్లు అమెరికా అంతా వ్యాపించారు .చాలా మంది సిటీలు చేరుకొన్నారు .త్వరలోనే ,స్తానికులతో కలిసి పోయారు .వారి బలం అంతా సెయింట్ లూయీస్ ,సిన్సి నాటి ,మిల్వాకీ ,ఫిలడెల్ఫియా మధ్య అట్లాంటిక్ ,పైన ఉన్న మిడ్వెస్ట్ రాష్ట్రాలలో చేరింది వీరు తమ సంస్కృతిని భాషను ,చరిత్రను కాపాడుకొంటున్నారు .పెన్సిల్వేనియా లోని డచ్చులు –అసలు డచ్ సంతతి వారు కాదు –జర్మన్లె .వీరు deuseche’’వారు .ఆ పేరు ను యాన్కీలు డచ్ గా అపార్ధం చేసుకొన్నారని భావిస్తున్నారు .మొదటి ప్రపంచ యుద్ధం తర్వాతా అమెరికా లో జర్మన్ వ్యతి రేకతాభావాలు వ్యాపించాయి .

         సశేషం –మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –28-10-12-ఉయ్యూరు 

Posted in అమెరికా లో | Tagged | Leave a comment

అమెరికా పశ్చిమ సరి హద్దు దళ పతి –విట్ ఏర్ప్—3(చివరి భాగం )

అమెరికా పశ్చిమ సరి హద్దు దళ పతి –విట్ ఏర్ప్—3(చివరి భాగం )

 

 డాడ్జి సిటీ లో ఫ్రీ లంచ్ ఇచ్చే సెలూన్లు చాలా ఉండేవి .రోజంతా స్నాక్స్ ఇస్తూనే ఉండే వారు .చచ్చిన పశువు లను తొలగించటం ,ఊర కుక్కల్ని పట్టు కోవటం ,నడక కోసం చెక్క రోడ్ల మరమ్మతు ,లను విట్ చేబట్టాడు .వింటర్ లో ఇక్కడ పని లేక పోతే ,’’డెడ్ వుడ్’’టౌన్ కు వెళ్ళే వాడు .అప్పడు అది డకోటా సరి హద్దు లో ఉండేది .గోల్డ్ రష్ బాగా  ఎక్కువ .టెక్సాస్ కు వెళ్లి జూదం ఆడే వాడు .ఇలా అప్పుడప్పుడు ‘’జంప్ జిలానీ ‘’గా ఉన్నా అతనంటే డాడ్జి వాసులకు  దేవుడే .మల్లీఉద్యోగం ఇచ్చారు .అక్కడే ‘’డాక్ హాలి డే’’ అనే పేకాట రాయుడి తో పరిచయమేర్పడింది .ఒక కౌ బాయ్ తుపాకీ తో ఎర్ప్ వీపు మీద పేల్చ బోతే డాక్ కాపాడాడు .

      అక్కడి నుంచి న్యు మెక్సికో సరి హద్దు చేరాడు .అక్కడి సిల్వర్ గనులు తవ్వకం చే బట్టాడు సోదరుడు వర్జిల్ తో కలిసి మైనింగ్ కోసం పది హేను గుర్రాలను కొన్నాడు .ఇద్దరూ  ‘’లాస్ వెగాస్ ‘’చేరారు .అక్కడి నుంచి అరిజోనా ,చేరి సిల్వర్ మైన్ల ను గుర్తించారు .దీన్నే ‘’టూమ్బ్ స్టోన్’’అంటారు .సిల్వర్ ఉండటం వల్ల ఆపెరోచ్చింది .సోదరుడు వర్జిల్ డిప్యూటి మార్షల్ అయాడు .ఇది బాగా ఉందని పించింది .ఈ పట్టణం 4,500అడుగుల ఎత్తున ఉన్న పట్టణం .బాగా కష్టపడాలి జీవితం కూడా చాలా కష్టం గా ఉండేది .ఇది గన్ ఫైట్ల కు ప్రసిద్ధి .ఇక్కడి ‘’సిమేటరి ‘’అమెరికా నైరుతి భాగం లోనే చాలా పెద్దది .ఇల్లు అన్నీ బుల్లెట్ల బొక్క లతో కనీ పిస్తాయి .గాంబ్లింగ్ విపరీతం .ఇక్కడి ‘’అపెచీ ఇండియన్లు ‘’దాడి చేస్తూంటారు తరచుగా .పశువుల సంత ఉండి .దొంగలు ,బంది పోట్లు ఎక్కువ .అయినా వేగం గా వృద్ధి చెందింది .వెండి గనుల్లో లాభ పడ టానికి చాలా మంది వస్తూంటారు .ఎర్ప్ ఇక్కడికి చేరే సరికి జనం అంతా టేన్తుల్లోకాపురం .బిల్డింగు లనేవి లేనే లేవు .

       చిన్న ఇంట్లో అద్దె కున్నాడు .స్టేజి కోచ్ డ్రైవర్ గా పని చేశాడు .కొంత కాలం తర్వాతా ‘’వేల్స్ ఫార్గో ‘’లో పని చేశాడు .‘’ఇప్పుడు బాంకింగ్ చేస్తోంది . ఫార్గో ‘’లో సెక్యూరిటీ మాన్ గా పని చేశాడు .ఇది డబ్బు ,విలు వైన వస్తువుల్ని చేర వేసే సంస్థ .షాట్ గన్ పెట్టు కొని కోచ్ డ్రైవర్  ప్రక్కన కూర్చోవటమే అతని పని .అతని బంధు గణంఅంతా చేరారు .తాను‘’లామాన్ గా ,వర్జిల్ డిప్యూటీ మార్షల్ గా పని చేశారు .యాభై కిలో మీటర్ల దూరం లో ఫెడరల్ మార్షల్ ఉండే వాడు .త్వరలోనే అన్నదమ్ము లిద్దరూ మంచి పేరు తెచ్చు కొన్నారు .విట్ విధి సక్రమం గా నిర్వ హిస్తాడని ,సాహసి అని గుర్తింపు పొందాడు .పైన కోటు లేకుండా ,చేతి లో ఆయుధం లేకుండా తిరిగే వాడు .ప్రశాంతం గా ,ఉద్రేక పడకుండా ఉండటం అతని లక్షణం .ఒక సారి ‘’మైక్ ఓ రూర్కీ ‘’అనే గామ్బ్లార్ ప్రాణాలను కాపాడాడు .అతను ఒక మైనర్ ను హత్య చేస్తే ,జనం ఇతని పై దాడి చేస్తే ,ఉపాయం గా పట్టు కొన్నాడు .లేక పోతే మాబ్ చేతిలో మరణం పొంది ఉండే వాడు ఆ గామ్బ్లార్ .ప్రజాగ్రహాన్ని శాంత పరచి వీడి ప్రాణాన్ని కాపాడి కేసు పెట్టాడు .ఇతని ధైర్యం చూసి జనం పొంగి పోయారు .’’వీర తాళ్ళు ‘’వేశారు .ఎవరూ ఎర్ప్ ను గాయ పరచక పోవటం ఆశ్చర్యం గా ఉంది .

        1880 లో డిప్యూటీ మార్షల్ ను వదిలేశాడు .మైనింగ్ లో వచ్చిన లాభాలను వ్యాపారం లో పెట్టాడు .’’ఓరియంటల్ సెలూన్ ‘’అనే గాంబ్లింగ్ సెంటర్ లో భాగ స్వామి అయాడు .’’ఫారో ‘’అనే కార్డ్ గేమ్ ను పర్య వేక్షించే బాధ్యత తీసుకొన్నాడు .ఒక సారి వెళ్ళకు వ్యతి రికి ఒకడు జాన్ అనే రౌడీ ని ఉసి గొల్పి ,పంపాడు .వాణ్ణి మెడ బట్టు కొని బయటకు తోసి ,ఆట కు ఇబ్బంది లేకుండా చేశాడు .ఆ రోజుల్లో ‘అసాంఘిక కార్య క్రమాలను చేసే వారిని కౌ బాయ్స్ అనే వారు .ఎర్ప్ సోదరులకు ,ఈ ముథాకు తగాదాలు పెరిగాయి .ఒక దొంగతనం కేసు లో చాలా రహస్యం గా ,పకడ్బందీ గా దర్యాప్తు జరిపి అసలు దోషుల్ని పట్టు కొన్నాడు విట్ .

  వేరొక సారి ఈ గ్రూపుల మధ్య గన్ ఫైట్ ‘’తీవ్రం గా జరిగింది .ఎర్ప్ సోదరులు కౌ బాయ్స్ ను వెల్లి పోమని ,గొడవలు వద్దని నచ్చ చెప్పినా విన లేదు .చివరికి బాల వంతం గా గెంటేశారు .కేసు నడి చింది .జనం అందరు ఎర్ప్ నే సమర్ధించారు .ఆత్మ రక్షణ కోసమే కాల్చవలసి వచ్చిందని చెప్పాడు .కేసును కొట్టే శారు .

       1882 లో అరిజోనా వదిలి కోలా రాడో ,అక్కడి నుంచి కాలిఫోర్నియా ,అలాస్కా లకు చేరాడు .మళ్ళీ సౌత్ వచ్చాడు .ఎర్ప్ జీవితం మీద చాలా పుస్తకాలు వచ్చాయి .అతిని జీవితాన్ని సాహస గాధలను సినిమా గా తీశారు .అతను ‘’నేషనల్ ఫిగర్ ‘’అయాడు .సెలిబ్రిటీ అని పించుకొన్నాడు .’’Wytt Earp –frontier Marshal ‘’,అనే పుస్తకం వచ్చింది .’’horse rustling ‘’,boxing లలో రిఫరీ గా పని చేశాడు .ఎనభై ఏళ్ళు జీవించాడు 1920 .లో కాలి ఫోర్నియా లోని హాలీ వుడ్ లో నివాసం ఉన్నాడు .తన జీవిత చరిత్ర ను రాసుకొన్నాడు .1929 జనవరి 31న ‘’పశ్చిమ సరి హద్దు దళ పతి విట్ ఎర్ప్ ‘’మరణించాడు ..అతడు సాహసమే ఊపిరి గా జీవించి అందరి మన్ననలు అందుకొన్నాడు

                మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –26-10-12—ఉయ్యూరు 

Posted in రచనలు | Tagged | Leave a comment

సరసభారతి దసరా సమావేశం

This gallery contains 42 photos.

More Galleries | Tagged | Leave a comment

శ్రీ శంకరుల లలి (కవి )తా సౌందర్య లహరి -29

శ్రీ శంకరుల లలి (కవి )తా సౌందర్య లహరి -29

 

69—‘’రాణే జిత్వా ,దైత్యా ,నప హృత శిరస్త్రైహ్ కవచిభిహ్ –ర్నివ్రుత్తి ,స్చండాం శ ,త్రిపుర హర నిర్మాల్య విముఖై

       విశాఖేన్ద్రో పేన్ద్రై శ్శశి విశద ,కర్పూర శకలా –విలీయన్తే ,మాతస్తవ ,వదన ,తాంబూల కబళః‘’

    తాత్పర్యం –త్రిదగ్ని కుండసంభూతా !యుద్ధం లో రాక్షసులను జయించి వచ్చి ,తల పగాలను విడ దీసి ,కవచాలను ఇంకా ఉంచుకొని, చండుడు అనే ప్రధముని చేతఅనుభవించ టానికి వీలైన ‘’హరుని నిర్మాల్యం వద్దు ‘’అన్న కుమారాస్వామి –దేవేంద్ర ,ఉపెంద్రుల చేత చంద్రుని లాగా ,స్వచ్చందం గా ,నిర్మలం గా ఉన్న కర్పూరపు పలుకులు గల ,నీ వదన తాంబూలం యొక్క తమ్మలు కాజేయ బడుతున్నాయి . 

      విశేషం –కుమారస్వామి ,దేవేంద్రుడు ,ఉపెంద్రుడు ,యుద్ధం లో రాక్షసుల్ని జయించి ,శ్రీ దేవికి పాదాభి వందనం చేయ టానికి తల పాగాలు తీశారు .ఆమె ప్రసన్నం గా నవ్వింది .అప్పుడు ఆమె నోటి నుండి కర్పూర పలుకుల తో కూడిన తమ్మల కబళాలు (తాంబూలం యొక్క ఉమ్మి )కింద పడ్డాయి .ఆ ముగ్గురూ వాటిని గ్రహించి ,మింగారు .అందులోని కర్పూరం మెత్తగా మారి కలిసి పోయింది .జగన్మాత అయిన భగవతికి కుమారులపై అంత ప్రేమ ఉండి అని భావం .కుమారా స్వామి కి ఇది మామూలే .ఇంద్ర ,ఉపెంద్రులకు అప్పుడప్పుడు జరిగే సంఘటన .

    శివ నిర్మాల్యం ‘’చండుడు ‘’అనే ప్రధముడి కే దక్కాలి .ఇతరులకు దక్క కూడదు .శివునికి అభి షేకం చేసే ముందు నిర్మాల్యం తీసేసి ‘’వచ్చందేశ్వరాయ నమః ‘’అంటారు .అందుకని కుమారస్వామి మొదలైన వారు అమ్మ దగ్గరకే వచ్చారు .మాతృ రూప ఉపాసనం క్షిప్ర ఫలదాయకం అని చెబుతారు .

         యుద్ధం నుంచి తిరిగి వచ్చిన వారికి ,శ్రమ పోగొట్టటానికి శ్రీ దేవి వదన కర్పూర మిశ్రిత తాంబూల శకలాలు ఉపయోగ పడినాయి అని అర్ధం .మహాదేవుని శిరస్సు పై ఉన్న చంద్రుణి వెన్నెల కూడా శివ నిర్మాల్యమే .దానిని కూడా వదిలి ,వీరు అమ్మ తాంబూల కబళాలు స్వీక

 రించారని భావం .దీని వల్ల ఆమె ముఖ సౌభాగ్యం స్తుతింప బడింది ..

                   అమ్మ మాటల గొప్పదనం

66—‘’విపంచ్యా గాయంతీ ,వివిధ మపదానం పశు పతే –స్త్వయా రబ్దే ,వక్తుం ,చలిత ,శిరసా ,సాధు వచనే

     త్వదీయై ర్మాదుర్యై రపలసిత ,తంత్రీ కల రవాం ,–నిజాం వీణాం వాణీ ,నిచుళ యతి చోళేన నిభ్రుతం .’’

         తాత్పర్యం –శివ కుటుంబిణీ !నీ ముందు కూర్చుని సరస్వతీ దేవి శివుని వీర గాధలు ,అంటే త్రిపుర సంహారం ,దక్ష యజ్న ధ్వంసం ,హాలాహల భక్షణం ,జలంధర వధ ,గజాసుర వధ లను వీణ తో గానం చేస్తోంది .అప్పుడు నీ మనస్సు సంతోషం తో నిండి ,అనుగుణం గా శిరస్సును ఊగిస్తూ ,మధుర వచనా లతో ప్రశం సిస్తున్నావు .నీ వచో మాధుర్యం ముందు సరస్వతి వీణా గాన మాధుర్యం నవ్వుల పాలైంది .ఆమె సిగ్గు పడింది .అప్పుడామే తన వీణ ను పై ముసుగు తో కప్పేస్తోంది ..

           సశేషం

                     మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –26-10-12-ఉయ్యూరు

Posted in రచనలు | Tagged | Leave a comment

ఆ నవ్వు ఆగింది

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

అమెరికా పశ్చిమ సరి హద్దు దళ పతి విట్ ఏర్ప్-2

అమెరికా పశ్చిమ సరి హద్దు దళ పతి విట్ ఏర్ప్-2

  విట్ చిన్నతనం లో అతని తండ్రి కుటుంబాన్ని ‘’మిడ్ వెస్ట్‘’నుంచి కాలి ఫోర్నియా కు మార్చాడు .అందరు చిన్న వాగన్ ట్రైన్ ఎక్కారు .దాన్ని ఇరవై కి పైగా గుర్రాలు లాగే బండ్ల తో నడిచింది .వాళ్ళను వాళ్ళు రక్షించు కోవటం ,పరస్పర సహకారానికి అలా ప్రయాణం చేసే వారు .దారిలో బఫెలో హంట్ చేసే వారు .అప్పుడు జిం బ్రిద్జేర్ అనే అతను బఫెలో హంట్ లో ఎక్స్పెర్ట్ .దారిలో నేటివ్ ఇండియన్స్ తో పోరాడా వలసి వచ్చేది .

        కాలి ఫోర్నియా లో సాన్బెర్నాన్దినో లో ఉన్నారు .అప్పుడు అక్కడ జనాభా రెండు వేలు మాత్రమె .అది ‘’గోల్డ్ రష్‘’కాలం .ఎర్పి పది  హేడేల్ల వయసు లో స్టేజ్ కోచ్ డ్రైవర్ గా పని చేశాడు .అతడికి అప్పుడు గుర్రాలంటే మహా సరదా గా ఉండేది .ప్రయాణం అంటే బలే సంతోషం .ఇక్కడే మొదటి సారి విస్కీ తాగాడు .తర్వాతా ఇరవై ఏళ్లలో మందు తాగనే లేదు .బఫెలో హంట్ చేసినా ,పీస్ ఆఫీసర్ గా పని చేసినా మద్యం జోలికి వెళ్ళక పోవటం ఆశ్చర్యం వేస్తుంది .రైల్రోడ్ నిర్మాణానికి సరుకులు చేర వేసే వాడు దీన్నే ‘’స్టీం స్టార్ ‘’అంటారు .దీనితో అతని ప్రయాణం సరదా బాగా తీరింది .ఎప్పుడూ తీరిక లేకుండా గుర్ర బ్బండీ లో సామాన్లు చేర వేసే వాడు .ఈ పని అతను కాలి ఫోర్నియా నుంచి అరిజోనా వరకు చేసే వాడు .దీన్ని ఎక్కువ కాలం చేయలేదు .తండ్రి కుటుంబాన్ని మళ్ళీ మిడ్  వెస్ట్కు మార్చాడు .

        తండ్రి లా గానే ఎర్ప్ కూడా లా ఆఫీసర్ అయ్యాడు .1869 లో తండ్రి ఉద్యోగం ఇతనికి వచ్చింది .తండ్రి  శాంతి నిర్వహణ న్యా యాది పతి గా నియమింప బడ్డాడు .కొడుకు ‘’షరీఫ్ ‘’అయాడు .ఆ ఊళ్ళో న్యాయాన్నీ ,చట్టాన్నే అమలు పరచే బాధ్యత వీరిద్దరిదే .చట్టాన్ని అతిక్ర మించే వారి గుండెల్లో రైళ్ళు పరి గేత్తించారుచాతండ్రీ కొడుకూ.

      లా మార్ అనే చోట లా ఆఫీసర్ ఉద్యోగం హాయిగా ఉంది .పెద్దగా నేరాలు ,ఘోరాలు లేవు .1870 లో స్వంత ఇల్లు కొనుక్కొని ఉరిల్లా ను పెళ్లి చేసుకొని ఒక ఇంటి వాడయ్యాడు .ఏడాది లోపే ఆమె చని పోయింది .అతనికి వ్యతి రేకం గా కేసు పెట్టారు .రిజైన్ చేసే శాడు .డబ్బు దుర్విని యోగం చేశాడని ,లైసెన్సుల కోసం ఇచ్చిన డబ్బు ను జమ చేయ లేదని అతని పై అభి యోగం .ఇల్లు అమ్మేశాడు ఈ నాడు ఒక్లహామా అని పిలువాబడే ఇండియన్ టేరిటేరి చేరాడు .ఇక్కడ గుర్రాలను దొంగి లించటం ఆ నాడు పెద్ద నేరం .అలా చేశాడని మళ్ళీ అభి యోగం .అరెస్ట్ వారంట్ వస్తే ,అక్కడి నుంచి నెమ్మది గా జారుకొన్నాడు .ఎవరికి కానీ పించాకుండా తిరిగాడు .చివరికి ఇలినాయిస్ లోని పియోరియా చేరాడు .వ్యభి చార గృహం లో ఉన్నట్లు పోలీస్ రికార్డుల్లో ఉంది .ఇక్కడి రివర్ బోట్లో బ్రోతల్ హౌస్ నిర్వ హించాడు .ఇదంతా జులాయి తిరుగుడే .బఫెలో హంటర్ గా కూడా ఉన్నాడు .మాంచి వేట కాడని మహా గొప్ప పేరు .రోజుకు రెండు వందల అడవి దున్న పోతుల్ని వేటాడ గలడు అని గుర్తింపు పొందాడు .ఈ ప్రాంతాల్లో వీటి సంఖ్యా మిలియన్ల లో  ఉండేది .బఫెలో మాంసం అంటే సైనికులు రోట్టలేసుకొని తింటారు .అంత ఇష్టం వారికి .వేట గాల్ల బారి పడివేల సంఖ్య లో మిగిలాయి .ఇప్పుడు అపురూపం అయి ,అంత రించే స్తితి లో ఉన్నాయి .ఈ సరి హద్దు ప్రాంతాల్లో వెండి ,బంగారు గనులున్నాయి .గొడ్లపెంపకం ఎక్కువ .గనుల వల్ల టౌన్లు బాగా పెరిగి పోయాయి .రైల్ రోడ్ కూడా జనాభా పెరగటానికి కారణం అయింది .

    వంటి మీద కు ఇరవై ఏళ్ళు వచ్చే సరికి ఎర్ప్ హంటింగ్ మానేశాడు .బఫెలో గన్ అమ్మేసి కాన్సాస్ లోని’’ విచిటా’’చేరాడు .టెక్సాస్ నుంచి వచ్చే కాటిల్ డ్రైవర్స్ తో బాగా రద్దీ గా ఉండే ప్రదేశం ఇది .అక్కంసన్ నదీ తీరం కూడా .అందమైన లాండ్ స్కేప్ .ఇక్కడ అన్నీ చెల్లు బాటు అవుతాయి .కౌ బాయ్స్ కు విహార భూమి .కనుక తగాదాలు ,గొడవలు ఎక్కువ .’’లా మాన్ ‘’అవసరం చాలా ఉండేది .వారంతా తాగితే మనుష్యలు గా ప్రవర్తించరు .అక్కడ అమాయకుల పాలిటి మరణ మ్రుదంగమే .ఈ డ్రోవర్స్ వల్ల పెద్ద ఆదాయం వస్తుందక్కడ .అందుకని అక్కడి వర్తకులు ఆగడాలను సహించి ఊరు కోవలసి వస్తోంది .ఈ కౌ టౌన్ లో శాంతి భద్రతలు నెల కొల్పటం సున్నిత మైన వ్యవహారమే .సమర్ధు డైన ‘’లా మాన్‘’కావాలని అందరి అభిప్రాయం .ఈ వాతా వరణానికి తానే తగిన లా మాన్ అని అనుకొన్నాడు విట్ ఎర్ప్ .కొట్లాటలంటే భయం లేదు .పైగా బలిష్టుడు .ధైర్య శాలి .స్వచ్చంద మార్షల్ గా చేరాడు .పై రాబడి బాగానే ఉండేది .1875లో జీతం తో డిప్యూటీ గాఉద్యోగం  ఇచ్చారు .బారుల్లో వచ్చే తగాదాలు కూడా తీర్చాల్సి వచ్చేది .అతని మొరటు పద్ధతికి తగిన ఉద్యోగమే .

       డిప్యూటీ మార్షల్ గా బాగా పరిణతి చెందాడు .వీలైనప్పుడల్లా దొరికిన పని చేసే వాడు .వ్యక్తిత్వం పెంచుకొన్నాడు .శక్తి ,విధేయత ,ఆత్మ విశ్వాసం ,గౌరవం పెరిగాయి .విచిటాకు తగిన ఆఫీసర్ అని పించుకొన్నాడు .ఒక సారి ఒక తాగు బోత ఫుల్ గా మందుకొట్టి రోడ్డు మీద పడి పోయాడు .వాడి దగ్గర అయిదు వందల డాలర్లు ఉన్నాయి .అతన్ని నెమ్మది గా లేపి ,ఆ డబ్బుతో వాడిని ఇంటికి చేర్చాడు .ఈ వార్త వార్తా పత్రికలలో కధలు ,గాధలుగా వచ్చింది .అతను ఎంత గొప్ప ఆఫీసారో రుజువు చేసే సంఘటన ఇది .అరుదైన వ్యక్తీ అన్నారందరూ .

    విలియం బాట్ అనే అతని తో స్నేహం చేసి జూదం ఆడే వాడు .పీస్ ఆఫీసరు గా పని చేస్తూ ,గుర్రపు దొంగల్ని పట్టిస్తూ మంచి పేరు తెచ్చుకొన్నాడు .ఈ ఉద్యోగమూ ఒక్క ఏడాదే .స్మిత్ అనే వాడితో తగాదా పడి వాడిని చావ చితక్కోట్టాడు .ఉద్యోగం హుళక్కి .పని లేక పోతే ,అతనికి పిచ్చులూ ,వేర్రులూ ఎత్తెది .క్రమంగా శాంతి భద్రతలు మెరుగై నాగరకత ఆ ప్రాంతమంతా విచ్చుకోంది .ఇదంతా విట్ ఎర్ప్ పుణ్యమే .

           అక్కడి నుంచి ఇంకో బూమింగ్ సిటీ ‘’డాడ్జి సిటి ‘’కి చేరాడు .ఇది కేంసాస్ లో ఉండి .అది ఒకప్పుడు బఫెలో కాంప్.పెద్ద కౌ టౌన్ గా పెరిగి పోయింది .అన్నే అనే బ్రోతల్ తో ఇక్కడికి చేరాడు .కొన్నేళ్ళు భార్యా భార్తల్లా జీవించారు వారిద్దరూ .ఈ సిటీ చాలా మురికి కూపం గా ఉండేది .సౌకర్యాలు లేవు .గోల ,గుర్రబ్బగ్గీల రద్దీ .డ్రోవర్సు ,పశువులు కొనే వాళ్ళు ,సోల్ జర్లు ,బఫెలో హంటర్లు ,రైల్వె వర్కర్ల తో మహా సందడి గా ఉండేది .అందుకే దాడ్జి సిటి ‘’క్వీన్ ఆఫ్ ది కౌ టౌన్స్ ‘’అని పేరొందింది .దీనితో అసాంఘిక కార్యాలకు అడ్డా అయింది .వేశ్యలు ,హంతకులు ,జూద గాళ్ళు ,గుర్రం దొంగలు అంతా అక్కడే ఉండే వారు .తాగుడు ,వ్యభిచారాల తో హోరెత్తి పోతోంది .ఎర్ప్ కు ‘’లా మాన్’’ గా పని చేయాలనే కోరిక మళ్ళీ కలిగింది .డిప్యూటీ మార్షల్ (హైరేడ్ )గా పోలీసులు అద్దెకు అంటే హైర్ చేసుకొన్నారు ఎర్ప్ ను .

                  సశేషం –ముగింపు ఈ సారి

            మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –25-10-12-ఉయ్యురు

Posted in అమెరికా లో | Tagged | Leave a comment

సత్యభామను ప్రేమించాను – శోభానాయుడు

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

అమెరికా పశ్చిమ సరి హద్దు దళ పతి –విట్ ఏర్ప్

 అమెరికా పశ్చిమ సరి హద్దు దళ పతి –విట్ ఏర్ప్

  నిత్య యాత్రికుడు ,చిక్కడు దొరకదు అని పించుకొన్న వాడు ,తనను తాను ఆవష్కరించు కొన్న వాడు ,అనేక ఉద్యోగాల చేసిన ఘనా పాథీ,సంఘర్షణ జీవి ,తల వంచని వీరుడు అని పించు కొన్న వాడు ,హాస్యం అంటే ఆమడ దూరం లో ఉండే వాడు ,డిప్యూటీ లామాన్ ,నేరస్తులకు సింహ స్వప్నమైన వాడు ఎనభై ఏళ్ళ వయసులో ఆరేళ్ళు మాత్రమె ఉద్యోగం చేసినా ,ఇప్పటికీ అతని పేరు నే స్మరించెంత గుర్తింపున్న వాడు విట్ ఏర్ప్.

 

         విట్ పాత పశ్చిమం లో లా మాన్ ఉద్యోగం చేశాడు .అదేమీ ఫుల్ టైంజాబెమీ కాదు .పశువుల పట్నాలలో ,వాటిని వాగన్ ల దగ్గరకు తోలుకొని వచ్చే కౌ బాయ్ లతో గడిపే వాడు .ఒకలా హామా ,కాన్సాస్ ,టెక్సాస్ లకు పశువులను చేర్చటం ,వాటిని రైళ్ళలో తూర్పు ప్రాంతాలకు చేరచె తప్పుడు గుర్రాల దొంగ తనాలు ,తాగుడు ,విపరీతం గా ఉండేవి .పశువులను అమ్మిన డబ్బు చేతి నిండా ఉండటం తో జూదం ,తాగుడు వ్యభిచారం చేసే వారు కౌ బాయ్స్ .అందుకని వారి కందరికీ చేతిలో తుపాకి తప్పని సరిగా ఉండేది .వాళ్ళల్లో వాళ్ళు కలహించు కోవతమూ ఎక్కువే .ఆత్మా రక్షణ కోసం వారి కి తుపాకి అవసరమే .అందరి దగ్గరా ఆయుధాలు ఉంటె హింసే హింస .సాదా రణం గా మామూలు రోజుల్లో ప్రశాంతం గా ఉన్న టోన్లు ,వీళ్ళ రాకతో సందడే సందడి గా ఉండేవి .ఆ సమయాలలో నేరాల సంఖ్యవిపరీతం గా ఒక్క సారి పెరిగి పోయేవి .అందుకని శాంతి భద్రత కోసం ‘’పీస్ ఆఫీసర్లు ‘’ను నియమించే వారు .ఇది సీజనల్ జాబ్ .సంవత్సరం అంతా డేప్యూటీలు ,మార్శల్సు ,షరీఫు లకు ఉద్యోగం ఉండదు .అందుకని ఇంకో వ్యాపకం లో వారు ఆదాయం పొందుతారు .వ్యవసాయం ,రాన్చింగ్ ,ప్రాస్పెక్తింగ్ ,జూదం మొదలైన వి చేసి పొట్ట పోసుకొంటారు .

        పైన చెప్పిన ఈ ఉద్యోగాలు చట్ట సమ్మత మైన వేమీ కాదు .అందుకొని వీరు ఒక్కో సారి చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకొంటే కాని పరిస్థితులు చక్క బడేవి కావు .విట్ ఎర్ప్ ఒక్కో సారి చట్టానికి అతీతం గా వ్యవహరించాడు .దాని తో చిక్కుల్లో పడే వాడు .ఆ ఉద్యోగం ఒక చిన్న ప్రాంతానికి తప్ప మిగిలిన ప్రాంతానికి తెలీని వాడు గా ఉండేది .చాలా మొరటు మనుష్యుల తో వ్యవహరించాల్సి వచ్చేది .అతని పూర్తీ పేరు wytt Berry Stapp Earp .1848 march 19 న ఇలినాయిస్ లోని మాన్ మౌత్ అనే చోట పుట్టాడు .అతని ఇల్లు పదహారు ఎకరాల ఫారం హౌస్ .ఇది మెక్సికన్ అమెరికన్ యుద్ధం లో పని చేసి నందుకు ప్రభుత్వం ఇచ్చిన భూమి .ఎన్నో ‘’గన్ షాట్ల ‘’నుండి తప్పించుకొని బ్రతికాడు .విపరీత మైన ఒర్పున్న వాడు .టూమ్బ్ టౌన్ లో వ్యవ సాయం చేశాడు .మాంచి ‘’బఫెలో హంటర్ ‘’గా ప్రఖ్యాతి పొందాడు .చాలా నిశ్చయ బుద్ధి తో ఉండే వాడు .’’డాడ్జి సిటీ ‘’లో లా మాన్ గా పని చేశాడు .గనుల వ్యాపారమూ చేశాడు .కార్డ్ డీలర్ గా ఉన్నాడు .దీనికి తోడు స్టేజి కోచ్ డ్రైవర్ గా కూడా పని చేశాడు .పెద్ద పెద్ద సెలూన్ ళ అది పతి అయాడు .

        ప్రభుత్వం అతనికి ‘’shot gun riffle ‘’ను నేటివ్ ఇండియన్ల నుండి ప్రాణ రక్షణ కోసం ఇచ్చింది ‘’.six gun ‘’ను పొంది పేల్చటం నేర్చు కొన్నాడు .గొప్ప గురి ఉన్న మొనగాడనిపించుకొన్నాడు .కాలిఫోర్నియా లో రైల్ రోడ్ వర్కర్ గా కూడా వెలగ బెట్టాడు .మళ్ళీ తూర్పు కు వెళ్లి బఫెలో హంటర్ గా మారాడు .”’wagon train scout ‘’గా కూడా పని చేశాడు .ఇరవై రెండేళ్ళ వయసులో యూరిల్లా సండ ర్లాండ్ తో పెళ్లి జరిగింది .ఒక్క ఏడాదే ఆమె బతికింది .

 

  ఒక్ల హామా అని పిలువ బడే ఇండియన్ టేరిటరి కి వెళ్లాడు .మళ్ళీ బఫెలో హంటింగ్ లో కాలక్షేపం చేశాడు .అతడు రేసు గుర్రాలను దొంగిలించే వాడని అభి యోగం వచ్చింది . బెయిల్ పొంది ,.కాన్సాస్ కు చేరుకొన్నాడు .’’Dedliest pistol shot ‘’గా ,’’great courageous person ‘’గా ఖ్యాతి పొందాడు .’’లెజెండ్ ‘’అనిపించుకొన్నాడు .కౌ బాయ్స్ ల ఆట కట్టించి ,దుండగులను గుర్తించటం లో దిట్ట అని పించుకొన్నాడు విట్ ఏర్ప్ .

          సశేషం

            మరిన్ని విశేషాలు ఈ సారి –

                 విజయ దశమి శుభాకాంక్షల తో –

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –24-10-12—ఉయ్యూరు 

Posted in అమెరికా లో | Tagged | 1 Comment