అమెరికా ఊసులు –22–అమెరిక ”నిజం ”

 అమెరికా ఊసులు –22–అమెరిక ”నిజం ”
అమెరికా అంటే భూలోక స్వర్గం అని భావించటం సర్వ సాధారణం .ఇక్కడ వసతులు అంత బాగా ఉంటాయి .ఉద్యోగస్తులకు ఉద్యోగం ఉన్నంత వరకు హేపీ .ఇద్దరు ఉద్యోగులే అయితే మరీ హాయి .కావలసి నంత రాబడి .అన్నీ అమర్చుకో వచ్చు .స్వంత ఇల్లు ఏర్పాటు చేసుకోనూ వచ్చు .స్వంత ఇల్లు ఇక్కడ ఏర్పడటం తేలికే .అన్నీ బిల్డర్ చేసి పెడతాడు .ఖర్చులో ఐదో వంతు కాష్ గా కట్టే సమర్ధత ఉండాలి .’loan ‘కూడా వాళ్ళే ఏర్పాటు చేయిస్తారు .వాయిదాలు దీర్ఘ కాలానికి తీసుకొంటారు కనుక తీర్చటం తేలికే అవుతుంది .అయితే స్వంత ఇంటి చాకిరీ కూడా ఎక్కువే .లాన్ను జాగ్రత్తగా మైన్ టైన్ చేస్తారు .కూరగాయలు పండించు కో వచ్చు .కరెంటు పెట్రోలు చౌక .ఎక్కడికి వెళ్ళినా కారు లో వేళ్ళ వచ్చు కారు పొందటమూ తేలికే .సులభ వాయిదాల మీద తీర్చుకో వచ్చు .ఇల్లు బొమ్మరిల్లు లాగా మూడు నెలల్లో నిర్మించేస్తారు .కావాల్సిన మోడల్ ఎన్ను కోవటమే .వలసిన వన్నీ అమర్చు కో వచ్చు .సేల్సు ఉన్న రోజున కొంటె వస్తువు లన్ని చౌకగా వస్తాయి ఫర్నిచర్  తో సహా .ఆఫర్లు చాలా ఉంటాయి .నెట్ లో వెతుక్కొని ఆర్డర్ చేస్తే తక్కువ లోనే ఎలేక్రానిక్స్ పొందచ్చు .”దెయ్యాల పండగ ”(హాలొ వెన్ )రోజుల్లో కొత్త సంవత్సరం క్రిస్మస్ ,ఇండెపెండెన్స్ డే వగైరాలలో క్లియరెన్స్ సేల్సు లో అతి తక్కువ డబ్బులతో అన్నీ కోని అమర్చుకో వచ్చు .పిల్ల చదువులు హాయి .హైస్కూల్  వరకు చదువు, పుస్తకాలు, బస్సు, ఫ్రీ .ఇది ఎంతో ఉపశమనం గా ఉంటుంది .పిల్లలకు ఎప్పటి కప్పుడు పరీక్షలు పెట్టి వారి సామర్ధ్యాన్ని అంచనా వేసి ప్రత్యెక శిక్షణ నిస్తారు .బండ చాకిరి పిల్లలకుండదు .తెలివికీ, క్రియేటివిటీ కే ప్రాధాన్యం .అందులో బాగా చొచ్చుకు పోవచ్చు .లైబ్రరీలు గొప్ప సేవ చేస్తాయి వేసవి లో రీడింగు కు ఎక్కువ ప్రాధాన్యత నిస్తారు .స్కూళ్ళు  తేరి ఛే సమయం లో ముందు పై తరగతి పుస్తకాలను తెచ్చుకొని చదువు కో వచ్చు .ముఖ్యం గా ఆర్టు కు ప్రాధాన్యత బాగా ఉంటుంది .శక్తి సామర్ధ్యాలను చూపే అవకాశాలుంటాయి .లైబ్రరీ లలో కూడా ప్రత్యెక శిక్షణ నిస్తారు .అయితే డబ్బులు కట్టు కోవాలి .కరాటే, జిమ్నాస్టిక్స్ లలో డబ్బిచ్చి చేరి నేర్చుకో వచ్చు .వారికి మంచి ఎంకరేజ్ మెంట్ ఉంటుంది .భాషా సేవా కేంద్రాలు పోటీలు నిర్వ హించి బహు మతులను అంద జేస్తారు .సమ్మర్ లో y.m.c.a.వాళ్ళు ,హిందూ సెంటర్ వాళ్ళు ప్రత్యెక కోర్సులను నిర్వహించి ఆటా ,పాటా డాన్సు నాటకం వగైరాలను స్విమ్మింగ్ ను నేర్పుతారు .దీనికి పిల్లలు బాగా ఉత్సాహం చూపిస్తారు .అపార్టు మెంట్ల వద్దా ,కమ్మ్యూనిటీ లలో స్విమ్మింగ్పూల్సులలో   పిల్లలు వేసవిలో మంచి కాల క్షేపం .సంగీతం నేర్పే వారు డాన్సు నేర్పే వారు లెక్కలు నేర్పే వారు ఉంటారు .మన పిల్లల అభి రుచి ని బట్టి ఏర్పాటు చేసుకో వచ్చు .ఇంటికి వచ్చి కూడా చెప్పే వారున్నారు .
ఇక్కడి మనుష్యులు చాలా స్నేహ శీలం గా అని పిస్తారు .ఎవ్వరి జోలికీ ఎవ్వరూ సాధారణం గా రారు .మనుష్యులలో ఆందోళన కనీ పించదు .స్తిర చిత్తం తో ,ప్రశాంతం గా ఉండటం గమనార్హం .ముసలి వారు కూడా లైబ్రరీలకు కారు నడుపు కొంటూ వచ్చి పుస్తకాలు తీసుకొని వెళ్లి చదువుతారు .షాపింగుకు వస్తారు .వాళ్ళను చూస్తుంటే” అసహాయ శూరులు ”అని పిస్తారు .నవ్వు ముఖం తో పలకరించి ”హాయ్”చెబుతారు .న లాంటి ముసలి వారు కానీ పిస్తే కారు లో వెడుతున్నా నవ్వుతో చేతులతో హాయ్ చెప్పటం వీరి ప్రత్యేకత .మనతో రాసుకు ,పూసుకు తిరక్క పోయినా, మర్యాదనుచక్క గా పాటించటం ఆనందమేస్తుంది .ఆది వారి సంస్కారం .ఇదే అమెరికనిజం అని పిస్తుంది .ఎక్కడైనా ఇలాగే ఉంటారు .హడా విడి హళ్ళూ ,పెళ్ళూ లుండవు .
ఇక్కడి రోడ్లను చూస్తె బలే ముచ్చటగా ఉంటాయి .అసలు రోడ్లు ముందు పుట్టి అమెరికా తర్వాతా పుట్టిందా అన్నంత ఆశ్చర్యం వేస్తుంది .రోడ్ల మీద ప్రతి మైలుకి గుర్తులు ఊర్లోకి వెళ్ళటానికి ,ఊరి బయటకు రావా టానికి ,ఏ రోడ్డు ఎంత దూరం లో ఉందొ తెలియ జేసే వివరాలు అన్నీ పకడ్బందీ గా ఉంటాయి దీనికి తోడు ఇప్పుడు జియో పొజిషన్ సిష్టం అంటే జి .పి.ఎస్.కూడా వచ్చింది కనుక ఎక్కడికి వెళ్ళా లన్నా రోడ్డు మాప్ తో పనీ లేదు .హాయి గా డైరేక్షన్లు ఫాలో అవుతూ ఎంత దూరమైనా వేళ్ళ వచ్చు .ఇక్కడ గొప్పతనం ఒకటి ఉంది .ఎన్ని గంటలైనా స్వంతకారు లో హాయిగా ప్రయాణించి వెళ్తారు కుటుంబం అంతా ఆనందాన్ని అనుభవించే వీలు .శని ఆది వారాలోస్తే ఎక్కడికో అక్కడికి పిక్నిక్ కో, సైట్ సీయింగ్ కో వెళ్లి ఎంజాయ్ చేస్తారు .ఇండియన్ హోటళ్ళు దాదాపు అన్ని చోట్లా ఉన్నాయి .మన తిండి మనం తినచ్చు .ఉడిపి హోటళ్ళు మద్రాస్ హోటళ్ళు  పంజాబీ దాబాలు అన్నీ ఉన్నాయి వెతుక్కొని వెళ్ళాలి అంతే .ఎన్నో ఫ్లై ఓవర్లు ఎటు వెళ్తున్నామో ,ఎటు వస్తున్నామో తెలీకుండా ఆశ్చర్యాన్ని కల్గిస్తాయి . అమెరికా లో ఎంత దూరం ప్రయాణం చేసినా ఒకటే స్సేనారి కానీ పిస్తుంది .అవే ఇల్లు .అవే స్టోర్లు .అన్నీ ఒకే మోడళ్ళు .సామ్ స్ , వాల్ మార్టు ,క్రోజర్, కే మార్టు,జె.సి పెన్నీ లలో బట్టలు వస్తువులు చీప్  .ఎలేక్త్రానిక్సు చవక .
ఎంత దూరం ప్రయాణం చేసినా అలుపూ సొలుపు ఉండదు .రోడ్లు ప్రయాణానికి తగి నట్లుంటాయి .రోడ్డుకు ఇరు వైపులా పైన్  ,కోన్ మొదలైన చెట్లు పచ్చ దనం తో పర వశింప జేస్తాయి. కొన్ని చోట్ల మన ఊటీ ,కొడైకెనాల్ లాగా భ లేగా ఉంటాయి .ఇండియా వాళ్లకు ఇక్కడ హాయి .సీతా కాలం భరించటం ఓ కొంత ఇబ్బందే .దానికి సరి పడ దేర్మో వస్త్రాలు కోట్లు బూట్లు తప్పవు .కారు లోంచి బయటికి వెళ్లి నప్పుడే చలి .కారులో హీటు, షాపుల్లో హీటు ఉండనే ఉంటుంది .మిచిగాన్ లాంటి చోట స్నో బాగా పడి ట్రాఫిక్ కు ఇబ్బంది కలుగ జేస్తుంది .అయినా వెంటనే ఉప్పు చల్లి క్లియర్ చేస్తారు .కార్లు తుడుచుకోవాలి .ఫాల్ చలి ప్రాంతాలలో అద్భుతం గా ఉంటుంది .ఆకులు ఎర్రబడి రాలి పోతు సుందరం గా ఉంటుంది .చెట్ల మొదల్ల లో చలికి  రక్షణ కోసం చెక్క పొట్టు వేస్తారు .అమెరికా లో ప్రత్యేకం ఒకటేమి టంటే చెట్లు నిటారుగా నే పెరుగు తాయి కాదు కాదు నిటారుగా నే ఉండేట్లు పెంచుతారు .మొక్క నాటిన రోజు నుండి దీనిపై శ్రద్ధ తీసుకోవటం ఆశ్చర్యం గా ఉంటుంది .ఎక్కడా దాదాపు వంకర వృక్షాలు కనీ పించావు .అంతే కాదు చెట్లను నరకటం ఎక్కడా కనీ పించాడు .రోడ్డువేడల్పు చేయటానికో ఇళ్ళ నిర్మాణం అప్పుడో చెట్లను నరుకు తారు .దారి వెంబడి చెట్లను  ముట్టుకోరు .కొమ్మ విరిగితే అక్కడి వరకే కోసి మిగతా చెట్టును రక్షిస్తారు .”వృక్షో రక్షతి రక్షితః ”అన్నదాన్ని అమెరికన్లు బాగా పాటిస్తారు .
రోడ్డు ప్రక్కల పూల మొక్కలు, అపార్ట్ మెంట్ల వద్ద పూల మొక్కలు ముచ్చట గా ఉంటాయి .ఏ సీజన్ కు ఆ సీజన్ పూలు పూసే మొక్కలు ,చెట్లను ఎన్నుకొని పెంచుతారు .మొన్నటి దాకా రోడ్ల ప్రక్క చెట్లకు యెర్రని గులాబీ రంగు తలుపు ,పింక్, కలరు పూసి   నాయనానంద కరం చేస్తాయి .ఇప్పుడు పొదల్లాగా ఉన్న చెట్లు ముళ్ళ పంది ఆకారం లో సూదుల్లాంటి ఆకులతో భలేగా కనీ పిస్తున్నాయి .రోడ్ల వెంట వెళ్ళే వారికి మానసిక, నాయనానందాన్నిస్తాయి ఇక్కడి చెట్లు .”ఆనందో బ్రహ్మ ”అని పిస్తుంది .పండ్ల చెట్లు రోడ్ల మీద తక్కువే .
                                  పూలోయమ్మ పూలు 
ఇక్కడ మాల్సు లో ముఖ్యం గా హోమ్  డిపో, వాల్ మార్ట్ ,గార్డెన్ రిడ్జి ,మొదలైన చోట్ల ఎన్నో రకాల పూల చెట్లను కుండీలలో సంరక్షించి పెంచి అమ్ముతూ ఉంటారు .చేమంతుల్లో ఎన్నో రంగులు ,సైజులు ముచ్చటగా ఉంటాయి .అలాగే బంతి పూలు లు తెలుగు దేశానికే ప్రసిద్ధి అనుకొంటాం .ఇక్కడ కూడా విపరీతం గా బంతి పూలున్నాయి ఇళ్ళల్లో దొడ్ల లో కూడా పెంచుకొంటారు .హూస్టన్ నగరాన్ని ”మాగ్నోలియా ”సిటీ అంటారు .అక్కడ చంపక పుష్పాలు ఎక్కువ .భలే అందం గా ,తెల్లగా పెద్దగా ఉండే పూలు .మనకు హిమాలయాల లోనే లభిస్తాయి .ఇక్కడ శార్లేట్ లోను మాగ్నోలియా అంటే చంపకాలు బాగా ఉన్నాయి .మరువం ,మల్లె కూడా బాగా ఉన్నాయి కరివేప చెట్టు సోర ,బీర ,వంగ మిర్చి టమేటా ,ఆకుకూరలను మన వాళ్ళు పెరట్లో బాగా పండిస్తున్నారు .అలబామా లోని హన్త్స్ విల్ లో మైనేని  గారి భార్య సత్య వతి గారు ఎన్నో రకాల కూరలు పండిస్తూ అందరికి ఉచితం గా అందిస్తున్నారు .ఇక్కడ మా అమ్మాయి ,సుబ్బుఇళ్ళల్లో కూరలు బానే పండిస్తున్నారు .కనుక ఇండియా వాళ్ళు ఇక్కడే అన్నీ పండిస్తున్నారు .ఎక్కడో చలి రాష్ట్రాలలో పంటలున్దవేమో కాని మిగిలిన చోట్ల స్తోర్సులలో అన్నీ దొరుకుతాయి .అదే ఊరట .దొరకని కూర   ఉండదు .చేసుకొనే ఓపిక లేక పోతే రెడీ మేడ ఫుడ్ రెడీ .కనుక తిండి  సమస్య లేదు .
పెట్రోల్ అంటే వీళ్ళ భాష లో ”గాస్ ”.చౌకే .బంకుల దగ్గర నిలబడి గాస్ కొట్టిన్చుకోనక్కర లేదు .ఎవరికి వారు హాయిగా” స్వంతం గా గాస్ కొట్టు కొంటారు” . అదీ దక్షిణ రాష్ట్రాలలో ,ఆది వాసులుండే ప్రాంతాలలో గాలను పెట్రోలు మిగిలిన చోట్ల కంటే నలభై పైసలు తక్కువ .కారణం దీనిపై ఇక్కడి ప్రభుత్వం టాక్సు వెయ్యక పోవటమే .సౌత్ కరోలీనా లో నార్తు కరోలీనా కంటే గాస్ నలభై సెంట్లు తక్కువ .ఇక్కడ ఈ రెండు రాష్ట్రాలు పక్కనే సందు దాటితే వేరుగా ఉంటాయి .అంత కలిసి పోయాయి .       బియ్యం పటేల్ బ్రదర్సు లో కొంటారు. భారతీయ వస్తువులన్నీ ఇక్కడ లభిస్తాయి అప్పడాలు వడియాలు ఊరు మిర్చి తో సహా .దీపావళికి వీళ్ళు అన్నీ చాలా తక్కువ రేట్లకు అమ్ముతారు .దీపావళి సామాను అమ్మే దుకాణాలూ ఉన్నాయి స్వంత ఇంటి వాళ్ళు హాయిగా కోని కాల్చు కో వచ్చు .
ఆంధ్రా వాళ్ళు, తమిళ వాళ్ళు అందరు కలిసి మేలసే ఉంటారు .బర్త్ డే పార్టీలు పండుగలు షష్టి పూర్తి  మారేజ్ డే లు చక్కగా నిర్వ హించుకొంటారు .మన దేశ సాంప్రదాయాన్ని అప్పుడు బాగా పాటిస్తారు శ్రావణ మాసం నోములు ఆడ వాళ్ళు నోచి వాయనాలిస్తారు కనుక ఆంధ్రా లో ఉన్న భావన కనీ పిస్తుంది .ఇలా అన్ని చోట్లా ఉంటుందని చెప్పలేం .దేవాలయాలు ఎక్కడ పడితే అక్కడ ఉన్నాయి కనుక శని ఆది వారాలలో అక్కడికివెల్లి దైవ దర్శనం చేసుకొంటారు .అక్కడ టిఫిన్ సెంటర్లుఉంటాయి . తీర్ధ ప్రసాదాల తో కాల క్షేపం చేయ వచ్చు .అన్ని రకాల దేవుళ్ళను ఒకే కాంప్లెక్సు లో ఉంచుతారు .కనుక టెంపుల్ కాంప్లెక్సు అని పిస్తుంది .పూజారులు కూడా సంప్రదాయ బద్ధం గా పూజలు నిర్వహిస్తారు. కళ్యాణాలు, అభి షెకాలు ధనుర్మాసం ,ఏకాదశి ,దీపావళి ,దసరా ,మొదలైన రోజుల్లో ప్రత్యెక పూజలుంటాయి .కనుక ఇబ్బందేమీ లేదు .గుడిలోనే బర్త్ డే లు ఫంక్షన్లు చేసుకొనే వీలుఉంటుంది .
తలిదండ్రులను వేసవి లో ఇక్కడికి తెచ్చుకొని వారికి ప్రదేశాలు చూపిస్తూ వారితో గడపటానికి ఉత్సాహ పడుతుంటారు .సాఫ్టు వేర్ ఉద్యోగాల వాళ్ళ వేలాది తలి దండ్రులకు అమెరికా వచ్చి చూసే గొప్ప అవకాశాలొచ్చాయి .ఎవరూ ఎప్పుడూ ఊహించని మార్పు .యువకులకు స్వర్గ సీమ అమెరికా ముసలి వారికి కాల క్షేపం ఉండదు .ఏదో వ్యాపకం లేక పోతే ఇబ్బందే .ఇన్ని అవకాశాలు ఉండ బట్టే అమెరికా అంటే మోజు పెరిగింది .అమెరికనిజం అంటే ఇదే .
మీ–గబ్బిట దుర్గా ప్రసాద్ –26-9-12-కాంప్–అమెరికా

Posted in అమెరికా లో | Tagged | Leave a comment

శ్రీ శంకరుల లలి(కవి )తా సౌందర్య లహరి –8

 శ్రీ శంకరుల లలి(కవి )తా సౌందర్య లహరి –8
18–”తను చ్చాయాయాభిస్తే ,,తరుణ తరణి శ్రీ సరణిభిహ్ –దివం సర్వా ముర్వీ ,మరు మణి ,నిమగ్నానాం స్మరతియః
భవ్యన్త్యస్య త్రస్య ద్వహన హరిణ శాలీన నయనాః –సహోర్వస్యః కతి కతి న గీర్వాణ గణికాః”
తాత్పర్యం –ఉమా దేవీ !ఉదయ సంధ్య లోని ఎరుపు రంగు తో ,నీ శరీర కాంతి ఈ భూమిని ,ఆకాశాన్నీ అరుణిమ గా భావించి ,ఎవరు ధ్యానిస్తారో ,వారికి అప్సరస స్త్రీలు వశమవుతారు .ఊర్వశిని విష్ణువు తొడల నుండి (ఊరువు )సృష్టించాడని ఐతిహ్యం .
19–”ముఖం బిందుం కృత్యా కుచయుగ మదన్యస్థా తదధో –హరార్ధం ధ్యాయే ద్యో హర మహిషి ,తే ,మన్మధ కలాం
ససద్య స్సంక్షోభం ,నయతి ,వనితా ,ఇత్యతి లఘు –త్రిలోకీ మప్యాసు భ్రమ యతి ,రవీందు స్థనయుగాం .”
తాత్పర్యం –శ్రీ చక్ర వాసినీ !ముఖాన్ని బిందు స్థానం లో కల్పించి ,దానికి క్రిందుగా ,స్థన యుగ్మాన్ని చేసి ,దానికి క్రింద శివుని శరీరం లో సగం అయిన శక్తిని అంటే త్రికోణం గా భావించి ,దాని లో నీ కామ బీజాన్ని (క్లీం )ఎవడు ధ్యానిస్తాడో వాడు స్త్రీల మనసుల్నిరంజింప జేస్తాడు .ఎందుకంటె -సూర్య చంద్రులే చనులు గా ఉన్న స్వర్గ ,మర్త్య ,పాతాళ లోకాలను భ్రమ తో నువ్వు మోహ పెడుతున్తావు .
విశేషం –క్లీం అనేది మన్మధ బీజం గా చెబుతారు .దీన్ని ధ్యానిస్తే కావలసిన స్త్రీ భార్య గా లభిస్తుందని శాస్త్రం చెబుతోంది .బిందువు ముఖం .దాని కింద స్థానాలు .దాని కింద యోని ని అదో ముఖం గా ధ్యానించాలి .తురీయ స్వరూపం ”ఈం ”దీన్ని జపించే టప్పుడు పై బొట్టు రవి అంటే సూర్యునిగా ,కింది బొట్టు చంద్ర ,అగ్నులు గా (కుచాలు )భావించాలి .రవి రూపం గా ఉన్న బిందువే ముఖం .కిందివి రెండు స్థానాలు .”హ” కారార్ధం యోని రూపం లో ఉంటుందనిఅక్షర నిపుణులు అంటారు .” హ ”అంటే సంస్కృతం లోని హకారం .హ కారం శివ వాచికం గా చెబుతారు .హకారార్ధమే ”ఏ”-ఇది పార్వతీ వాచకం గా భావన చేస్తారు .”శివ ”లోని”వ్ శ్”తీసేస్తే మిగిలేవి ఇ,అ .ఈ రెండు కలిస్తే” ఏ”ఏర్పడుతుంది .ఇదే సంస్కృతం లోని త్రికోణా కృతి .
20—”కిరంతీ మంగేభ్యః కిరణ నికురంబామృత రసం –హ్రుదిత్వా ,మాధత్తే,హిమ కర ,శిలా మూర్తి మవయవః
ససర్పాణాం ,దర్పం ,శమయతి ,శాకున్తాధిప ఇవ –జ్వర ప్లష్టాన్ ,దృష్ట్యా ,సుఖ యతి ,సుధా సార సిరయాః”
తాత్పర్యం –శివ మనోహరీ !నీ సర్వ అవయవాల నుండి ,స్రవించే కిరణాలు అమృతాన్ని వర్షించే ,చంద్ర కాంత మణి మయం గా ఎవడు ధ్యానిస్తాడో,అతడు గరుత్మంతుని లాగ ,అన్ని రకాల పాములనుండి వచ్చే విష బాధలను పొగొట్ట గల సమర్దుడౌతాడు .జ్వరం తో ఉన్న వారికి అమృత ధార గా తన శీతల స్పర్శ తో బాధను తొలగించి సుఖం ఇవ్వగలుగు తాడు .
ఈ విధం గా ఆరు నెలలు ధ్యానిస్తే గరుత్మంతుని తో సమాన మవుతాడని శాస్త్రం .దృష్టి చేత లోకాన్ని ఆకర్షిస్తాడు .చూపులతో స్త్రీ లను వశం చేసుకో గలుగు తాడు .సర్పాదుల వల్ల భయాన్ని పొగొట్టగల  సమర్దుడౌ తాడు .
సశేషం –మీ–గబ్బిట దుర్గా ప్రసాద్ –26-9-12-కాంప్–అమెరికా

Posted in రచనలు | Tagged | Leave a comment

అమెరికా డైరీ –శ్రీ వినాయక చవితి వారం -2

అమెరికా డైరీ –శ్రీ వినాయక చవితి వారం

This slideshow requires JavaScript.

Posted in అమెరికా లో | Tagged | 1 Comment

అమెరికా డైరీ –శ్రీ వినాయక చవితి వారం

అమెరికా డైరీ –శ్రీ వినాయక చవితి వారం 

సెప్టెంబర్ పది హేడు సోమవారం నుంచి ఇరవై మూడు ఆదివారం వరకు విశేషాలు

సోమ వారం సాయంత్రం లైబ్రరీ లో పుస్తకాలన్నీ ఇచ్చేసి గుడ్ బై చెప్పాను .పద్దెనిమి సెప్టెంబర్ మంగళ వారం   మా శ్రీ మతి పుట్టిన రోజు .మా అమ్మాయి బొబ్బట్లు చేసింది .హోమ్ డిపో లో మంచిచేమంతి పూల కుండీలు రెండు కొన్నాం .సాయంత్రం ప్రక్కనున్న రవి  కుటుంబం ,నాగ మణి కుటుంబం లను పిలిచి మా అమ్మాయి వాళ్ళ అమ్మ పుట్టిన రోజు వేడుక జరి పింది .బొబ్బట్ల నే కేక్ గా భావించి కట్ చేయించింది .అందరికి బొబ్బట్లు పెట్టింది .బిస్కట్లతో సహా .  .గాయత్రి కొడుకు క్లారినెట్ తో ”హేపీ బర్త్ డే” పాట వాయించటం విశేషం .ఆది హేపీ బర్త్ డే,పాట అని మా ఆవిడ చెప్పే దాకా నాకు తెలీదు. రవి తలిదండ్రులు రాఘవేంద్ర రావు గారు సుగుణ కామాక్షి గారు రావటం నిండు దనాన్నిచ్చింది .మా అల్లుడు హైదరాబాద్ కులాసా గా చేరాడు .ప్రేమ చంద్  గారుఫోటోలు చూసి ప్రభావతి జన్మ దిన శుభా కాంక్షలు పంపారు .
   శ్రీ వినాయక చవితి .
పందొమ్మిది బుధ వారం శ్రీ వినాయక చతుర్ధి .మనకు తొలి పండుగ .ఇండియా లో ఉన్నట్లుగా ఇక్కడ హడా విడి ఉండదు .మా మన వళ్ళు పొద్దున్నే స్కూల్ కు వెళ్ళే లోపలే నేను లేచి స్నానం చేసి మామూలు పూజ చేసి ,వాళ్ళతో దేవుడికి పత్రీ వేయించి ప్రార్ధన చేయించి పంపాను .ఆ తర్వాతప్రభావతి మా దొడ్లో కాసిన సోర కాయ ,దోస కాయ ,బీర కాయ ,చమ్మ కాయ ,టమేటా లతో అద్భుతం గా శ్రీ గణేష్ విగ్రహాన్ని చేసిందిమా గార్డెన్ గణేశ (అమెరికాలో .దానికి పాల వెల్లికట్టి ,దొడ్లో పూసిన పూలు ,పత్రీ తో ఉదయం పదింటికి పూజ మొదలు పెట్టి శాస్త్రోక్తం గా చేశాని .మా అమ్మాయి ఉండ్రాళ్ళు ,పాల కాయలు, పాయసం వడపప్పు ,పానకం తయారు చేసింది .నైవేద్యం పెట్టి కధాక్షిన్తలు అందరికి వేసి పూజ పూర్తీ చేశాను .మామిడి కాయ పప్పు ,వంకాయ కూర, సాంబారు, బొబ్బట్ల తో భోజనం .ఈ రోజు నుంచే” సౌందర్య లహరి” పై ఆర్తికల్సు ప్రారంభించాను .కొత్త పంచ ,లాల్చీ కట్టుకోన్నాను .సాయంత్రం పవన్ వాళ్ళింట్లో భజన .సుమారు ఇరవై మంది వచ్చారు . అక్కడ విందు .పవన్ ఇండియా వెళ్లాడు .ఇరవై ఆరున  వస్తాడు .వంకాయ కూర ,ఆలూ కూర ,చట్ని ,ఆవకాయ ,పులిహోర ,పాయసం ,మినప సున్ని ,ఉండ్రాళ్ళు సాంబారు అన్నం, పెరుగు లతో పవన్ భార్య రాధ మంచి విందే ఇచ్చింది .
శుక్ర వారం ఆది నారయణకు ఫోన్ చేశా .వాళ్ళ ప్రయాణం శనివారం హేపీ జర్నీ చెప్పా . సాయంత్రం .మైనేనికి ప్రేమ చంద్ గారికి మా తిరుగు ప్రయాణం గురించి రాశా .మైనేని బెస్ట్ విషెస్ రాశారు .డాక్టర్ యాజికి కూడా తెలయ జేశా .అతనూ వెంటనే స్పందించాడు .రాత్రి మా ఇంట్లో భజన .ఇక్కడి సాయి సెంటర్ వాళ్ళందరూ  రాలీ లో మెడికల్ కాంప్ కు వాలంటరీ చేయ టానికి వెళ్లటం తో భజనకు ఎవరు రాలేదు .మా అమ్మాయి , మా మనవడు శ్రీ కేత్ ఒక పావు గంట భజన గీతాలు పాడి అయిందని పించారు .అంతా అయినతర్వాత రాధా  ,పిల్లలు వచ్చారు .
ఫెస్టివల్ ఆఫ్ ఇండియా 
ప్రతి ఏడాది శార్లేట్ లో బాంక్ ఆఫ్ అమెరికా సౌజన్యం తో ఫెస్టివల్ ఆఫ్ ఇండియను సెప్టెంబర్ లో నిర్వ హిస్తారు. లేబర్ డే లాంగ్ వీకెండ్ రో జుల్లో.ఈ సారి అధ్యక్షుడు ఒబామా ఇక్కడ డెమొక్రాటిక్ పార్టీ కన్వెంషన్  లో ఆ సమయం లో పాల్గొనటం వల్ల వాయిదా పడి, ఈనెల22 ,23 శని ,ఆది వారాలలో నిర్వ హించారు .ఇది 18  వ ఫెస్టివల్ .దీనితో బాటు ”బాలీ వుడ్ ”ఏర్పడి 180 సంవత్సరాలు అయిన సందర్భం గా కూడా దీన్ని ఘనం గా నిర్వ హించారు .పాటలు ఆటలు డాన్సులు ప్రదర్శన లతో మోత మోగించారు .భారతీయత ఈ రెండు రోజుల్లో కళ్ళకు కట్టించారు .సౌత్ tryon  వీధిలో దీన్ని నిర్వ హించారు .
 అమెరికా లో చిత్ర కళా ” ఆనంద్ మ్ ”  
బాంక్ ఆఫ్ అమెరికా ,వేల్స్ ఫార్గో బాంకుల సమీపం లో ఈ కార్య క్రమం జరిగింది .ఔత్సాహికులైన చిత్ర కారుల చిత్ర కళా ప్రదర్శన ను ఏర్పాటు చేశారు .”knight theater ”పైన ఉన్న హాలులో ప్రదర్శన జరిగింది .హైదరా బాద్ నుండి మా బావ మరది బ్రహ్మానంద శాస్త్రి ఉరఫ్ ఆనంద్ చిత్రించిన” తెలంగాణా ”చిత్రాలను ఆరింటిని శని వారం ఉదయం నేను, మా అమ్మాయి, నాగ మణి భర్త తీసుకొని వెళ్లి స్టాండు లపై ఏర్పాటు చేసి వచ్చాం .మొత్తం నలభై మంది ఆర్టిస్టులు పాల్గొన్నట్లు, తొంబై యేడు చిత్రాలు ప్రదర్శించి నట్లు తెలిసింది .

This slideshow requires JavaScript.

మర్నాడు ఆది వారం మేమందరం వెళ్లి అక్కడ విశేషాలు చూసి సాయంత్రం అయిదింటికి ముగిసే సమయానికి మా చిత్రాలు మేము ఇంటికి తెచ్చుకోన్నాం .మొత్తం ఆరు చిత్రాలకు కలిపి మూడు వేల డాలర్లు అమ్మకానికి పెట్టాం. ఏదీ అమ్ముడు పోలేదు .”బాగా కష్ట పడి వేశారు చాలా బాగున్నాయని మెచ్చుకోన్నారట” కాని ఎవరూ కొనే సాహసం చేయ లేదు .పాపం మా అల్లుడు వీటిని ఇండియా నుండి షిప్పింగ్ లో తెప్పించి ,అమ్మి పెడదామని ప్రయత్నించాడు .మూడేళ్ళ నుండి ఇక్కడే మూలుగుతున్నాయి . ఈ సారి పెట్రోలులు ఖర్చు, పార్కింగ్ చార్జీలు కలిసి ముప్ఫై డాలర్లు పైనే అయాయి. నిరాశ మిగి లింది .మొత్తం మీద అయిదు చిత్రాలే అమ్ముడు పోయి నట్లు నిర్వాహకురాలిని అడిగితే చెప్పింది .అవీ యాభై ,అరవై డాలర్ల మధ్య ఉన్నవే .ఏమైనా ఆర్టిస్టులకు మంచి అవకాశం .తమ ప్రతిభను ప్రదర్శించ టానికి మంచి వేదిక లభిస్తోంది .మంచి వైవిధ్యం ఉన్న చిత్రాలు వచ్చాయి ఊహాత్మికం గా నూ ఉన్నాయి .సంప్రదాయ బద్ధం గా ఉండి చూపరులను ఆకర్షించాయి .ఆడా, మగా చిత్రకారులు పాల్గొన్నారు ..నిర్వాహకులు శ్రద్ధగా నిర్వహించారు .ఫెస్టివల్ అంతా డౌన్ టౌన్ లో నిర్వహించారు .ఈ రూ పెణా,డౌన్ టౌన్ చూసే వీలు కల్గింది .డ్యూక్ ఎనెర్జీ వారి పెద్ద బిల్డింగ్ ,వేల్సు ఫార్గో వారి బిల్దిగు ,బాంక్ ఆఫా అమెరికా వారి బిల్ల్దింగు అన్ని అక్కడే ప్రక్క ప్రక్కన .ఈ ఉత్సవం కోసం రోడ్లు మూసేశారు .శని ,ఆది సెలవలె కనుక అందరు పండగ కు వచ్చి నట్లు వచ్చారు .
వస్త్ర ప్రదర్శన నగల ,పుస్తకాల బొమ్మల ప్రదర్శన కూడా ఉన్నాయి .వస్త్ర వ్యాపారం బాగానే జరిగి నట్లు కనీ పించింది . .
  పాటలు నృత్యాలు 
నైట్ థియేటర్ లో శని ,ఆది వారాలు మధ్యాహ్నం పన్నెండున్నర నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు నిర్విరామం గా పాట్లు నృత్యాలు ప్రదర్శించారు .తలి దండ్రులు తమ పిల్లలకు సాంప్రదాయ వస్త్ర ధారణా తో తీసుకొని వచ్చి కూచి పూడి,రవీంద్ర ,కేరళ,  బావ్రా ,మొదలైన నృత్యాలను ప్రదర్శించారు .తెలుగు తమిళ బెంగాలీ పంజాబీ మహారాష్ట్ర గుజరాతీ దాన్సులను చేయించారు .శార్లేట్ లోని సుమారు డజన్ నృత్య విద్యాలయాల విద్యార్ధులు తమ అభినయ కౌశలాన్ని చక్కగా ప్రదర్శించారు .కర తాళ ధ్వనులు మారు మ్రోగాయి .అమెరికా లో ఉన్నా ,సాంప్రదాయ నృత్యాన్ని వదల కుండా నేర్చుకొని ప్రదర్శించటం చాలా ముచ్చటగా ఉంది. నేర్పిన గురు వరే న్యులు మరీ అభి నందనీయులు .ఎప్పుడూ ధియేటర్ జనం తో కిట కిట లాడింది .మంచి ప్రోత్సాహం చూపి ప్రేక్షకులు, గొప్ప సహకారం అందించారు .మా ఇంటి దగ్గరున్న ముసునూరు అమ్మాయి నీలిమ కూతురు కూడా డాన్సు చేసింది .
ధియేటర్ లోనే కాకుండా ,ఆరు బయట వేదిక నిర్మించి అక్కడ కూడా పాటలు పాడించి ,చేయించారు .ఇక్కడ పంజాబీ మరాఠీ గుజరాతీ నృత్యాలు చేసి జనం మెప్పు పొందారు .మా ఇంటి దగ్గరున్న గుజరాతీ ఆవిడ ,మిగిలిన వాళ్ళ తో కలిసి గుజరాతీ నృత్యాన్ని అద్భుతం గా చేసింది .వయసు లో ఉన్న వాళ్ళే కాదు, వయసు పై బడిన వారు కూడా ఎక్కడా ఉత్సాహం కోల్పోకుండానృత్యం చేసి , విజయ వంతం చేశారు .చిన్న పిల్లల ప్రదర్శన చూడ ముచ్చటేసింది .థియేటర్ లోకి వెళ్లి చూడ టానికి అయిదు డాలర్ల టికెట్ పెట్టారు .అక్కడే బాంక్ ఆఫ్ అమెరికా వాళ్ళు తిరిగే చక్రాన్ని పెట్టి ఆడించారు .పాయింటర్ ఆగిన చోటును బట్టి బహు మతులిచ్చారు .మా మన వళ్ళు ఆశుతోష్ష్ ,పీయూష్ లు యెర్రని మంచి శాలువాలు గెలుచుకొన్నారు .చాలా మందికి వచ్చాయి .ఇవి అ బాంక్ ఆఫ్ అమెరికా బహు మతులు .
భారతీయ తిను బండారాల స్తాల్సుల్సు జనం తో నిండిపోయాయి .పూరీ ,చపాతీ, దోసె, ఇడ్లీ ,కాఫీ టీ, మాంగో లస్సీ చోలీ కూర, సాంబారు, పాన్ పూరీ  అందర్నీ ఊరించి తినిపించాయి .రెట్లు చాలా తక్కువే .మషాలా దోసె,పాన్ పూరీ పూరీ,ఇడ్లీలు    నాలుగు, కాఫీ ,లస్సీ వగైరా రెండు డాలర్లే .ఆది వారం జనం విశేషం గా వచ్చారు .
  అమెరికా లో అగస్త్య రాజు వారి కలయిక 
ఉయ్యూరు లో మా ఇంటి వద్ద ఉండి కే.సి.పి.లో పని చేసిన,” లండన్ రాఘవ  రావు”అణి పిలువా బడిన    అగస్త్య రాజు రాఘవ రావు గారు మంటాడ లో శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయాన్ని నిర్మించారు .వారి అబ్బాయి రామ మోహన రావు గారు కూడా అందులోనే పని చేసి తండ్రి మరణాంతరం దేవాలయాన్ని నిర్వ హించారు .ఆయన భార్య భారతీ ,ఆయనా  మాకు బాగా తెలుసు .క్వార్టర్ల లో ఉంటారు .అనుకో కుండా  ఈ ఆది వారం నాడు ఫెస్టివల్ ఆఫ్ ఇండియా లో వారు కలిశారు .వారమ్మాయి  శార్లేట్ లోనే ఉందట .అమ్మాయి మనుమ రాళ్ళు కూడా కనీ పించారు .మా శ్రీ మతే ముందు గా వాళ్ళను గుర్తు పట్టింది .కాసేపు మాట్లాడుకోన్నాం .ఇలా యాదృచ్చికం గా ఉయ్యూరు వాళ్ళు కలవటం తమాషా గా ఉంది .వారు అక్టోబర్ మధ్యలో ఇండియా వెళ్తారు .
చిన్నపిల్లలకు కాలక్షేపం గా రబ్బరు ,గాలితో నింపిన రెండు ప్లే హౌస్ లున్నాయి .పిల్లలు అందులో బౌన్సింగ్ ఆడి హడా విడి చేసి కాల క్షేపం చేశారు .తలిదండ్రులు చక్కగా వారిని ఆడించారు .
 అమెరికా లో రైతు బజారు  
శని వారం ఇంటికి వస్తు డౌన్ టౌన్ కు దగ్గర లో ఉన్న” ఫార్మేర్ మార్కెట్” కు వెళ్ళాం. ఆంధ్రా లో మార్కెట్ యార్డులున్నట్లే షేడ్ల లో రైతు బజారు నిర్వహిస్తున్నారు .చేతి పరిశ్రమలకు  కూర గాయాలకు ఒక షెడ్డు, పూలు ,చెట్లు  ఇంకో షెడ్డు ఉండి చవక గా తాజాగా లభిస్తాయని అందరు ఆరాట పడి వస్తారు .శని ఆది వారాలే ఉంటుంది ఉదయం పది నుండి రెండు వరకు .జనం వాల్లాడి పోయారు .
 త్రిమూర్తి దేవాలయ ఉత్సవ విగ్రహ ప్రతిష్ట 
డౌన్ టౌన్ లోనే కొద్ది దూరం లో ”త్రిమూర్తి దేవాలయం ”కడు తున్నారు .యెన్ .సి .జగన్నాధం గారు అనే textile వ్యాపారం చేసిన తమిళాయన పది హేను ఏక రాల స్థలం కోని దేవాలయం నిర్మించే ప్రయత్నం చేస్తున్నారు .మొత్తం ఖర్చు అంతా ఆయనదేనట .గణేశ, బాలాజీ, లక్ష్మి, పద్మావతి దేవుల ఉత్స విగ్రహాలను చేయించి వాటికిఆగమ యుక్తం గా హోమాదులతో ప్రాణ ప్రతిష్ట చేస్తున్నారు .భట్టర్ గారు అనే వారి ఆధ్వర్యం లో మూడు రోజుల కార్య క్రమాన్ని నిర్వ హించారు ఆరు మంది కి పైగా రుత్విక్కులున్నారు ..మేము శని వారం సాయంత్రం వెళ్ళాం .అప్పటికి హోమాలు, అధి వాసాలు, అయి పూర్ణాహుతి జరిగింది .స్వామి వారలకుపవళింపు  సేవలో  నీలాంబరి రాగం లో ”కస్తూరి రంగ రంగా ”అనే కీర్తనను ఒకావిడ మహా శ్రావ్యం గా ఆల పించి అందరి అభిమానాని సంపాదించింది .కొందరు పిల్లలు భక్తీ గీతాలు పాడారు .ప్రసాదం గా పులిహోర,ఉప్మా ,కేసరి, మైసూర్ పాక్ ,సామ్బారన్నం పెరుగన్నం పెట్టారు .
ఆది వారం సాయంత్రం ఫెస్టివల్ ఆఫ్ ఇండియా అ యిన  తర్వాతా మళ్ళీ దేవాలయం దగ్గరకు వచ్చాం .కార్య క్రమాలు పూర్తీ అయి యాజ్నీకులకు సంభావనలు అంద జేస్తున్నారు .మూర్తులను వేదిక పైన ఉంచి ప్రసాదం నైవేద్యం పెట్టి మంగళ హారతి పాడారు .తిరుమల నుండి వచ్చిన ఆలయ పూజారి భగవద్ రామానుజుల వారు రచించిన ”చూర్నిక ”ను శ్రావ్యం గా పాడారు .తిరుమల లో వీరే పాడతారట .ప్రత్యేకం గా పిలి పించారు .ఆ తర్వాతా మూర్తులను అక్కడే ప్రక్కన  నిర్మించిన భవనం లోకి మేళ తాళాలతో తీసుకొని వెళ్లి లోపల ఉన్న వేదిక పై ఉంచారు .ఈ మూర్తులకే ఇక రోజూ పూజా పునస్కారాలు చేస్తారు .రెండేళ్ళ లో ఆలయాన్ని నిర్మించి అసలు విగ్రహాలను చేయించి అప్పుడు ప్రతిష్ట చేస్తారు .అందరికి ప్రసాదం గా చక్ర పొంగలి ఉప్మా ,రవ్వ కేసరి ,సాంబారు అన్నం ,పెరుగన్నం పెట్టారు .అవి స్వీకరించి తిని ఇంటికి వచ్చేసరికిరాత్రి  పది అయింది .ఈ విధం గా అమెరికా లో ఒక ప్రతిష్టాపనా కార్య క్రమాన్ని కూడా చూసి ధన్యులమయాం .ఇదే హైలైట్  మా అమెరికా యాత్రకు అని పించింది .
  శిశిరానికి రెడ్ సిగ్నల్ 
అక్టోబర్ వస్తే అమెరికా లో చెట్లు ఆకులన్నీ ఎరుపు రంగు లోకి మారుతాయి .ఆ తర్వాత ఆకులు రాలి పోతాయి .అప్పుడే దాని ప్రభావం కనీ పిస్తోంది .కొన్ని చెట్ల ఆకులు యెర్ర బడి పోతున్నాయి .శిశిరానికి ”రావద్దు ”అని యెర్ర జెండాలు ఊపు తున్నట్లని పించాయి .ఆ శిశిర వేదన భరించలేక తమ సర్వస్వం అయిన ,జీవపూత  మైన ఆకులను రాల్చేస్తున్నాయా అని పిస్తున్నాయి .దీన్నే వీళ్ళు ”ఫాల్ ”అంటారు .”what a fall my dear leaves of the  trees !”
మీ–గబ్బిట దుర్గా ప్రసాద్ –25-9-12-కాంప్–అమెరికా

Posted in అమెరికా లో | Tagged | Leave a comment

శ్రీ శంకరుల లలి(కవి )తా సౌందర్య లహరి -7

   శ్రీ శంకరుల లలి(కవి )తా సౌందర్య లహరి -7
15–”శర జ్యోత్నా శుద్ధం ,శశి యుత ,జటా జూట మకుటం –పరస్త్రాస త్రాణ స్పటిక ఘటికా పుస్తక కరాం
సక్రున్నత్వా ,నత్వా ,కధమివ ,సతాం సన్ని దధతే –మధు క్షీర ద్రాక్షా ,మధురి మధురణాహ్ ఫణి తయః ”
తాత్పర్యం –త్రిపురసుందరీ !శరత్ పూర్ణిమ వంటి శుద్ధ మైన శరీరం  కల దానివి .చిన్న జాబిల్లి తో కూడిన జడ ముడి ఉన్న కిరీటం కల దానివి .సకలాభీష్టం ఇచ్చే వర ముద్ర ,భయం పోగొట్టే అభయ ముద్ర స్పటికాక్షర మాల ,విద్యా రూప పుస్తకం ధరించిన నిన్ను ఒక్క సారైనా నమస్కరించిన వారికి ,తేనె ,ఆవు పాలు, ద్రాక్షా ఫలం తో సమాన మైన మాధుర్యం కలవాక్కును,  కవిత్వాన్నిఅందజేస్తావు .
విశేషం –శ్రీ దేవి క్రియా శక్తి స్వ రూపిణి .మూడు వేదాల లోని మొదటి అక్షరాలూ కలిస్తే .”ఐం ”అనే బీజం ఏర్పడుతుంది .దీనినే ”వాగ్బీజం ”అంటారు .దీన్ని జపిస్తే ,సర్వ విద్యా ,కవిత్వ లాభం కలుగుతుతాయి ..ఇదే ”దుర్గా నవాక్ష రాలు ”లో ”మహాకాళి బీజం” .కాళిదాసు  ఈ బీజక్షరాన్ని జపించే మహా కవి అయాడు .”చిద్గగన చంద్ర కళ”లో కాళిదాస మహా కవే స్వయం గా చెప్పుకోన్నాడట .నాలుగు హస్తాలు, నాలుగు పురుషార్ధాలకు చిహ్నాలు .వర ముద్ర -కోరికలను తీర్చటానికి ,అభయ ముద్ర- భయం లేకుండా చేయటానికి ,సంసార భయ నివారణ చేసి ,జన్మ రాహిత్యం కలిగించ టానికి,  జప మాల సర్వ తపస్సిద్ధి నిస్తుందని ,పుస్తకం- సర్వ విద్యా ప్రదత్వానికి గుర్తు అని భావించాలి .
16–”కవీన్ద్రానాం చేతః కమల వన బాలాతప రుచిం –భజన్తే ఏ సంతః కతిచ ,దరుణా మేవ భవతీం
విరించి ప్రేయస్యాస్తరళ తర శృంగార లహరీ    – గాభీరాభిర్వాగ్భిర్విదధతి సతాం రంజన మమీ ”
తాత్పర్యం –అమ్మా సౌందర్య లహరీ !కవీశ్వరుల మనస్సు అనే పద్మ వనానికి నువ్వు బాల సూర్య ప్రభవు .అరుణవు. ఏ కొందరో సత్పురుషులు నిన్ను కొలువ గలుగుతున్నారు .వారు మాత్రమే పుంభావ సరస్వతులు అవుతున్నారు .అందుకే వారు సభా రంజనం చేయ గల సమర్దులౌ తున్నారు .
ఆమె సరస్వతీ ప్రతీక స్వరూప .అరుణం శృంగార రసానికి చిహ్నం .వాక్కు  తో చేసే జప మహిమను ఇక్కడ శంకరులు  వివ రించారు ..రెండవది ”కామ రాజ కూట జప ఫలం ”అని విజ్ఞులు తేల్చారు .దీనికి ”గుప్త మహా సారస్వత మంత్రం ”తురీయం గా భావిస్తారు .అ దే ”ఈం”బీజం అంటారు .
17–”సవిత్రీ భిర్వాచాం ,శశి మణి శిలా భంగ రుచిభిహ్ –ర్వశిత్వా ద్యాభిస్త్వాం ,సహ జనని ,సంచిత యతి యః
స కర్తా కావ్యానాం ,భవతి ,మహాతాంభంగి రుచిభిహ్ –ర్వచో భి ర్వాగ్దేవీ వదన ,కమలా మోద మధురైహ్ ”
తాత్పర్యం –మహేశ్వరీ !చంద్ర కాంత మణి కాంతులతో శ్రీ చక్రం లో ,సర్వ రోగ హర చక్ర స్వామినులు అయిన వశిని ,కామేశ్వరి మొద లైన అష్ట శక్తు లతో ,12మంది యోగినులతో ,గంధా కర్శిణి తో ,కూడిన నిన్ను ఎవరు ధ్యానిస్తారో ,వారు కాళి దాసు లాంటి మహా కవీశ్వరులై ,మహా శక్తి వంత మైన కావ్యాలను రచించి చిర కీర్తిని పొందుతారు .
విశేషం –ఎనిమిది శక్తులు –వశిని ,కామేశ్వరి ,మోదిని ,విమల ,అరుణ ,జయిని ,సర్వేశ్వరి ,కౌలిని .
వసివ్యాదులు అంటే -క వర్గ ,చవర్గ ,ట వర్గ ,త వర్గ ,ప వర్గ ,య వర్గ ,శవర్గ ళ తో కూడిణ అక్షరాలూ
12యోగి నులు-అంటే -విద్యా ,రేచికా ,మోచికా ,యోగినీ ,అమృత యోగినీ ,దీపికా  జ్ఞాన ,ఆప్యాయినీ ,వ్యాపినీ ,మేధా ,వ్యోమ రూప ,సిద్ధ రూప  లక్ష్మీ యోగినులు .
8వశినులు ,12యోగినులు కలిసి20 కళలు.శుద్ధ స్పటికం లాగా అని పించేవి .గందాకర్శిణిఅంటే -గందాకర్శిణి ,రసా కర్శిణి,రూపా కర్శిణి, స్పర్శా కర్శిణి.”గంధ ద్వారాం ధురాకర్షాం నిత్య పుష్టం కరీషినీం-ఈశ్వరీం సర్వ భూతానాం ,తా మిహోపహ్వాయే శ్రియం ”అని పూజా విధానం లో ఉన్నది ఈ నలుగురి తో కూడినదే ”గంధ ద్వారా ”.దురాధర్షాంఅంటే మంద మతులు సమీపించ రానిది .నిత్య పుష్ట అంటే -అను నిత్యం ఆనంద స్వరూపిణి గా ఉండేది .కరీషినీంఅంటే గంధాదులను ఆకర్షించే శక్తి కలది .లేక ఏనుగుల చేత పరి వేష్టింప బడేది .ఈశ్వరీం –సర్వ భూతాది దేవత అని అర్ధం .తాం -అంటే ఆమేను అంటే శ్రీ విద్యన, ఇహ అంటే ఈ చక్రం లో ఊహాహ్వాయే -అంటే ఆహ్వానిస్తున్నాను .
అ మొదలైన సర్వ శక్తులు స్పటికాల వలె శుద్ధ మైనవి .క నుండి మ వరకు పగడపు రంగు కలవి .య నుండి ళ వరకు పసుపు రంగు కలవి .క్ష -ఎరుపు రంగు కలది .అకారాదులు బూడిద రంగు లోను ,క నుండి థవరకు సింధూరం రంగు లోను ,డనుండి ఫ వరకు అక్షరాలూ తెలుపు రంగులోను ,బ నుండి ళ వరకు అరుణం రంగులో ,వ నుండి స వరకు వర్ణాలు బంగారం రంగు లోను ,హ నుండి క్ష వరకు అక్షరాలూ ఎరుపు రంగు లోను ఉంటాయి .,ళఅక్షరం లలోని భాగమే .ఇదే శ్రీ శంకరుల మతం అని శ్రీ తుమ్మల పల్లి వారు విశేష వ్యాఖ్యానం చేసి ఎరుక పరిచారు .ఇలా ప్రతి అక్షరానికి క ప్రత్యెక ఫలితం రంగు వున్నాయి అని తెలుస్తోంది .
వచస్సులు –అంటే శుభగ ,శోభన ,భగ ,ఐశ్వర్యాదులు అని నాలుగు రకాలు .ఇవి మధురం గా ,సరస్వతీ దేవి ముఖ కమలం నుండి వినిర్గతమవుతాయి .ఇవి చాలా మృదువు గా ఉండటం విశేషం .ఈ విధం గా ఆమెను ధ్యానిస్తే  కర్తా ,నిర్మిత కూడా అయి ,కావ్య రచన చేస్తాడు అని భావం .
సశేషం –మీ– గ బ్బిట దుర్గా ప్రసాద్ –25-9-12-కాంప్–అమెరికా

Posted in రచనలు | Tagged | Leave a comment

శ్రీ గురజాడ అప్పా రావు పంతులు గారి మరణం – ఆనాటి వార్తాపత్రికలలో – 150 వ జయంతి

పంపిన వారు – Ramineni Bhaskaredra Rao

 

Posted in సమయం - సందర్భం | Tagged | 2 Comments

శ్రీ శంకరుల లలి(కవి )తా సౌందర్య లహరి –6

 శ్రీ శంకరుల లలి(కవి )తా సౌందర్య లహరి –6
12— ”త్వదీయం సౌందర్యం ,తుహిన గిరి కన్యే ,తులయితుం –కవీన్ద్రః కల్పంతే ,కధ మపి ,విరించి ,ప్రభ్రుతయః
యదా లోక్యౌ త్శుక్యా ,దమర లలనా యాంతి మనసా –తపో భిర్డు ష్ట్రా పామపి ,గిరిశ ,సాయుజ్య పదవీం ”
తాత్పర్యం –ఓ పార్వతీ మాతా !నీ అందాన్ని వర్ణించ టానికినాలుగు ముఖాలున్న  బ్రహ్మాదుల వల్ల  కూడా కాదు .బ్రహ్మ సృష్టించిన లోకోత్తర సౌందర్య రాశు లైన రంభాది అప్సరసలు నీ చక్కదనానికి ప్రభావితు లై ,నిన్నే తదేక ధ్యానం తో అలా చూస్తూ ఉండి పోతారు .వారు శివ సాయుజ్యం పొంద టానికి మనసు లోనే భావించటం వింత గా ఉంటుంది .వేరే పూజ వారికి అక్కర లేదని పిస్తుంది .
నీ సౌందర్యం తెలిసిన వాడు శివుడు ఒక్కడే .ఆయనతో మానసిక ఐక్యత కోరి ,శ్రీ దేవి సౌందర్యాన్ని పూర్తిగా చూడాలను కొనే వారు అప్సరసలు .నీ సౌందర్యానికి మించిన సౌందర్యం ప్రపంచం లో లేనే లేదు .నీ ధ్యానం తో నానా భోగాలను అనుభవించి, శివ సాయుజ్యం పొంద వచ్చు .
13— ” వరం వర్షీ యామ్సం ,నయన విరసం ,నర్మ సు జడం –తావా పామ్గా  లోకే ,పతిత ,మనుధావంతి  శత సహః
గళద్వేణీబంధః ,కుచ కలశ ,విస్రస్త ,సి చయా –హఠాత్ ,త్రుట్యత్కాం చ్యో  ,విగలిత,యువ తయః ” .
తాత్పర్యం –కాత్యాయినీ !ముసలి వాడై ,కంటి చూపు కూడా లేకుండా ,శ్రుంగార భావం నశించిన వాడు కూడా నీ కడ గంటి చూపు తో నవ మన్మధుడై స్త్రీ లను ఆకర్షించే శక్తి సంపన్నుడు అవుతున్నాడు .అంతటి సామర్ధ్యం నీ కడ గంటి చూపుకు ఉంది .
14—”క్షితౌ ,షత్పంచాశ ,ద్విసమధిక ,పంచాశాదుదకే –హుతాశే ,ద్వే షష్టి శ్చ తురధిక ,పంచా దనిలే
దివి ,ద్విషత్రిమ్శన్మన సిచ ,చతు స్షష్టి రితియే –మయూఖా ,స్తేషా మప్యుపరి ,తవ ,పాదాంబుజ యుగం ”
తాత్పర్యం –పృధ్వీ తత్త్వం తో కూడిన మూలాధారం లో 56,జల తత్వ మైన మణి పూరకం లో 52,అగ్ని తత్వ మైన స్వాదిష్టానం లో 62,వాయుతత్వ ప్రధాన మైన అనాహతం లో 54,ఆకాశ తత్వ మైన విశుద్ధం లో 72,మనస్తత్వం కల ఆజ్న లో 64,కిరణాలు సాధకుని దేహం లో ప్రసిద్ధి చెందాయి .వాటి పైన ఉన్న సహస్ర దళ మధ్యమ లో ,చంద్ర బిమ్బాత్మక మైన బైందవ స్తానం లో ,సుధా సింధువు లో ,నీ అడుగుల జంట నర్తిస్తోంది .ఇదంతా సమయా చార సంప్ర దాయం గా భావించాలి .
విశేషం –మూలాధార ,స్వాధీ ష్టానాలు ఒక ఖండం .మణి పూరక అనాహతాలు రెండవ  ఖండం .విశుద్ధ ,ఆజ్ఞలుమూడవ ఖండం .మొదటి ఖండానికి పైన అగ్నిస్థానం ఉంటుంది .ఇదే రుద్రా గ్రంధి అంటారు .రెండవ ఖండం పైన సూర్య స్తానం ఉంటుంది .ఇదే విష్ణు గ్రంధి .మూడవ ఖండం పైన చంద్ర స్తానం ఉంటుంది .ఇదే బ్రహ్మ గ్రంధి .ఇదే సోమ ,సూర్య ,అనలాత్మకం అని అవరోహణ క్రమం లో (కింది నుంచి పైకి )చెబుతారు .ప్రధమ ఖండం లోని అగ్ని జ్వాల అంతటా వ్యాపిస్తుంది .రెండవ ఖండం లోసూర్య కిరణ ప్రసారం జరుగు తుంది .చంద్రుడు తన కళ ల చేత మూడవ దాన్ని ప్రకాశింప జేస్తూంటాడు .
మూలాధారం లోపృథ్వి ,అగ్ని  జ్వాలలు56, మణి పూరకం లో ఉదక జ్వాలలు 52,కలిసి మొత్తం108 అగ్ని జ్వాలలు .స్వాదిష్టానం లో అగ్ని తత్వాత్మక జ్వాలలు 62,అనాహత వాయు తత్వాలు54, కలిసి సూర్య కిరణాలు 116.సూర్య కిరణాలు మణి పూరకం వదిలి ,స్వాధీ శతానం చేరటం అంటే సూర్యుడు ,అగ్నీ ఒక్కరే నాన్న భావాన్ని తెలియ బర్చతమే .అంటే సూర్యునిలో అగ్ని అంతర్భావం అని అర్ధం .సూర్య స్థానం లో అగ్ని ,అగ్ని స్థానం లో సూర్యుడు ప్రవేశిస్తారు అని తెలుసుకోవాలి .అగ్ని ని శమింప జేయ టానికి ”సంవర్తం ”అనే మేఘం సూర్య కిరణాల వాళ్ళ పుట్టి వర్షాన్నిస్తుంది .
ఆకాశాత్మక మైన విశుద్ధం లో 72,మనస్తత్వాత్మక మైన ఆజ్న లో 64కలిసి 136 చంద్ర కళలు .అగ్నికి 108 జ్వాలలు ,సూర్యునికి116.కిరణాలు ,చంద్రునికి136 కళలు అని తెలియ దాగిన విషయం .ఈ విధం గా సోమ సూర్య అగ్నులు అంద ,పిండ ,బ్రహ్మాన్దాలను ఆవరించి ఉన్నారని భావం .పిందాన్డానికి అతీతం గా ,సహస్ర కమలం ఉంది .ఆది వెన్నెల సముద్రం .అక్కడి చంద్రుడు నిత్య కళా స్వరూపి .సహస్ర దళ కమలం లోని చంద్రునికి వృద్ధి ,క్షయం అనేవి ఉండవు .16వాడి అయిన చంద్ర కళ ”సదా ”అనే పేరుతో సహస్రారం లో ఉంటుంది .మొదటి 15కు వృద్ధి క్షయాలున్నాయి .
”  పంచాతిధి ”రూపం ఉండటం వాళ్ళ శ్రీ విద్య కు ”చంద్ర కళా విద్య ” అనే పేరు వచ్చింది 360.కిరణాలు కలిస్తే ,360రోజులు ఉన్న సంవత్సరమే అవుతుంది .దీనికి రూపం ”ప్రజాపతి ”.ఆయనే జగత్కర్త .కనుక కిరణాలు ఈ జగత్తును సృష్టించ టానికి కారణం అవుతున్నాయని భావం .ఇవి స్రేఎ దేవి పాడార విండ సంభావాలు .”మరీచిః స్వాయమ్భువః ”అని తైత్తిరీయ ఉపనిషత్తు యొక్క సారమే ఇదంతా .
సూర్య చంద్రాగ్నులు భగవతి పాడార విన్దాల నుండి ప్రభవించిన అనంత కోటి కిరనాలనుంది కొన్నిటిని మాత్రమె తీసుకొని జగత్తును ప్రకాశిమ జేస్తున్నాయి .అయితే సర్వ లోకాలకు అతీత మైన చంద్ర కళా చక్రం మే బైండవ స్థానం .అక్కడే శ్రీ దేవి చరనాముజాలున్నాయి .అంటే అనేక కోటి బ్రహ్మాండ ,పిండాండ ల పై భగవతి పాద పద్మాలు నర్తిస్తున్నాయని తెలుసు కోవాలి .”తమేవం భాంతం ,అనుభాతి సర్వం తస్య భాషా సర్వ మిదం విభాతి ”అని కథోపనిశత్ తెలియ జేస్తోంది .అదే ఇది .
పగలు సూర్యుడు ,రాత్రి చంద్రుడు ,సంధ్య వేల అగ్ని ప్రకాశిస్తాయి .ఈ కిరణాల మొత్తం360 అని ముందే చెప్పుకొన్నాం .అదే ప్రజాపతి అంటే 360రోజులున్న సంవత్సరం .ఆయన మరీచి మొదలైన మునులను సృష్టిస్తే ,వారు లోక పాలకులను సృష్టిస్తే ,వారంతా లోకాలను రక్షిస్తున్నారని భావం .జగత్ సంహారం ”హరుడు ”చేస్తాడు .భవుడు జగత్తు ను ఉత్పత్తి చేస్తాడు .మ్రుడుడు జగత్తును రక్షిస్తాడు .ఈ విధం గా సృష్టి స్తితి ,లయలు పరమేశ్వరి నియమం తో శివుడు చేస్తున్నాడని అర్ధమయ్యే విషయం .కంథం’లో విశుద్ధం ,హృదయం లో అనాహతం ,నాభి లో స్వాదిష్టానం ,లింగం లో మణి పూరకం  గుదం లో మూలా ధారం ఉన్నాయి .ఇన్ని విషయాలను ఎరుక పరచ టా నికే ఈ శ్లోకాన్ని పరమ రమణీయం గా ,నిగూధం గా ,తెలుసు కొనే వారికి తెలియ దగి నంతగా, లోతులు తరచే వారికి ప్రజ్ఞా నిది సమూహం గా భగవత్పాదులు ఈ శ్లోకం రాసి తరింప జేశారు .
సశేషం –మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ —24-9-12-కాంప్–అమెరికా

Posted in రచనలు | Tagged | Leave a comment

శ్రీ శంకరుల లలి(కవి )తా సౌందర్య లహరి –5

 శ్రీ శంకరుల లలి(కవి )తా సౌందర్య లహరి –5
10— ” సుధా సారా సారై ,శ్చరణ ,యుగాళాన్తరవి గలిథైహ్ ప్రపంచం ,సిన్చంతే ,పునరపి ,రసామ్నాయ మహాసా –
అవాప్సత్వాం భూమిం ,భుజగ నిభ మధ్యష్ట వలయం -స్వమాత్మానాం కృత్వా స్వపిషి ,కుల కుండే ,కుహరిణి ”
తాత్పర్యం –కుమారీ !నీ రెండు పాదాల మధ్య నుండి స్రవించే అమృత ధారా వర్షం చేత ,72000నాడులను తడు పుతూ ,దాన్ని అమృత కిరాణ కాంతి గల చంద్రుని వది లేసి ,మళ్ళీ మూలాధారానికి చేరి ,అందులో స్వ స్వ రూపం అయిన పాముల చుట్టలు గా చుట్టూ కోని ,పృధ్వీ తత్వం లోని సన్నని రంధ్రం ద్వారా ,కుండలినీ శక్తి వై, నువ్వు నిద్రిస్తావు .
విశేషం –శిరస్సు లో చంద్ర మండలం ఉంటుంది .ఇది పదహారు కళల తో ఉంటుంది .పైన కానీ పించే చంద్ర మండలం కూడా శ్రీ చక్రమే .పద్మాసనం పై కూర్చుని ,సాధకుడు శ్వాసను ఊర్ధ్వ ముఖం గా నాడు పుతూ ,కుంభకం లో మనసు ను నిలపాలి .లోపల వాయువును నిలపదాన్నే కుంభకం అంటారు .దీని వాళ్ళ స్వాధీ శతానం లోని అగ్ని జ్వలిస్తుంది .దాని వేడికి ”ఆహిరాట్ ”అనే కుండలినీ శక్తి మేల్కొంటుంది .ఆ శక్తి స్వాధిష్ఠాన ,మణి పూరకళ మధ్య గల రుద్రా గ్రంధిని చేదించి ,మణి పూరక ,అనాహతాల మధ్య ఉన్న విష్ణు గ్రంధిని భేదించి ,అనాహత ,విశుదదాల మధ్య గల బ్రహ్మ గ్రంధిని , ఆరు మలాలను అనాగా ఆజ్ఞా చక్రాన్తాన్ని చేదిస్తుంది .ఆ తర్వాతా కుండలిని ,సహస్రారం చేరి శివుని తో కలిసి ,సంతోషాన్ని పొందు త్హుంది .ఈ స్తితి లో నిశక్తే పరాశక్తి .ఆమె నిత్య సుఖ ప్రదాయిని .
శివ ,బ్రహ్మ శక్తులే అమ్మ వారి చరణాలు .ప్రకాశ విమర్శలు  .ప్రకాశ శక్తి బ్రహ్మం ,శుక్ల వర్ణం గా ఉంటుంది .విమర్శ- మూల శక్తి .రక్త వర్ణం లో ఉంటుంది .శక్తి తో కూడిన శివుడే ”పరా పాదుక ”గా భావింప బడుతాడు .
పాదుకాంత దీక్ష -విమర్శ రూప శక్తి ,ప్రకాశ శివ సంగతి కలిసి సహస్రారం లో చేసేదే ఆనందామ్రుతాభి షేకం .పాదుకా మహా మంత్రాన్ని ఉప దేశం గా స్వీక రించటం ,సర్వ ఔషధాలున్న కాషాయ స్నానం చేయటం ,మాత్రమె పాదుకాంత దీక్ష కాదు .ఈ విధం గా సుధా సారాభి షెకాన్ని పొందిన వాడే పాదు కాంత దీక్షా ను భవం గల నిర్వాణ యోగ్యుడు అవుతాడు .అని దీని పై లోతులు తరచిన వారు తెలియ జేస్తున్నారు .కుండలిని 3,1/2మూడున్నర చుట్టలు గా ఉంటుంది .
11—”చతుర్భిహ్ ,శ్రీ కన్థైహ్ శివ యువథిభిహ్ ,పంచభి రాపి –ప్రభిన్నాభిహ్ ,శంభోర్నవ భి రపి ,,మూల ప్రక్రుతిభిహ్
త్రయశ్చత్వా రిమ్ష ,ద్వసు దళ ,కళా శ్రీ ,త్రివలయ –త్రిరెకాభిహ్ ,సార్ధం ,తవ ,శరణు కోణః పరి ణతః ”
తాత్పర్యం –చాముండీ !నీ నిలయం అయిన శ్రీ చక్రం లో నాలుగు శివ కోణాలు ,అయిదు శక్తి కోణాలు కలిసి తొమ్మిది మూల ప్రకృతుల చేత ,అష్ట దళ ,షోడశ కళ ,త్రివలయ ,భూ, పురత్రయాదు ల చేత 44 అంచులు గా మారింది .అయిదు శక్తి చక్రాలు -త్రికోణ ,అష్ట దళ ,దశ కోణ ద్వయ ,చతుర్దశ కోణాలు అన్న మాట .నాలుగు శివ చక్రాలు –బిందు ,అష్ట దళ ,షోడశ దళ ,చతురస్రాలు .
విశేషం –శ్రీ చక్రానికి మూల కారణాలైన తొమ్మిది చక్రాలు ప్రపంచ నిర్మాణ కారణాలైన తొమ్మిది దాతువులే .చర్మ ,రక్త ,మాంస ,మేధ ,ఆస్తులు ఈ అయిదు శక్తి సంభూతాలు .మజ్జ ,శుక్ల ప్రాణ ,జీవాలు నాలుగు శివ సంజాతాలు .అలాగే పంచ భూత ,పంచ తన్మాత్ర ,పంచ జ్ఞానేంద్రియాలు ,పంచ కర్మేంద్రియాలు మనశ్శక్తి సంబంధాలు .మాయ శుద్ధ ,విద్య ,మహేశ్వర సదాశివ లు శివ శక్తికి సంబంధించినవి .ఇలా25 తత్వాలు కలిసిన 9 కొణాలే బ్రహ్మాండ ,పిండాండ నిర్మాణానికి ఆధారం అని విజ్ఞులు చెబుతున్నారు .
అహంకారం మనసులో ,ఖ్యాతి విద్య లో ,గుణాలు ప్రకృతి లో ,ప్రకృతి శక్తి లో అంతర్భావాలు .పురుషుడు మహేశ్వరుని లో ,”కళకు శుద్ధ లో ”అంతర్భావం .కాలానికి మహేశ్వరుని లో ,సదాశివుని లో శక్తికి శుద్ధ విద్య లో అంతర్భావం .శివ తత్త్వం సదా శివ తత్త్వం లో అంతర్భావం .
అయిదు భూతాలు ,అయిదు తన్మాత్రలు ,అయుదు జ్ఞానేంద్రియాలు ,అయిదు కర్మేంద్రియాలు  ,మనసు ,మాయ ,శుద్ధ విద్య ,మహేశ్వర ,సదాశివ లతో కూడిన25 తత్వా లవల్ల ఆత్మ ఏర్పడు తుందని వేదోపనిషత్తులు తెలియ జేస్తున్నాయి .”పంచ వింశ ఆత్మా భవతి ”అని చాందోగ్య ఉపనిషత్ అంటోంది .వీటన్నిటికీ అతీత మైంది శివ శక్తి సంపుటం అయిన శ్రీ చక్రం ,దీని వల్ల నే జగత్తు ఉత్పత్తి అవుతోంది .పరమేశ్వరుడు శక్తి తో కలిసి నపుడే కార్య కారణ సమర్ధుడు అవుతాడు .ఇన్ని విషయాలను ఒక్క శ్లోకం లో నిక్షిప్తం చేసి, విశ్వ సృష్టి రహస్యాన్ని, అమ్మ వారి శక్తి సామర్ధ్యాన్ని తెలియ జేశారు శ్రీ శంకర భగ వత్పాదులు .
సశేషం –మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –23-9-12-కాంప్–అమెరికా

Posted in రచనలు | Tagged | Leave a comment

శ్రీ శంకరుల లలి (కవి )తా సౌందర్య లహరి –4

  శ్రీ శంకరుల లలి (కవి )తా సౌందర్య లహరి –4
8 — ”సుధా సింధు ర్మధ్యే ,సుర విటపి ,పాటీ పరి వ్రుతా -మణి ద్వీపే ,నీపోప వన వసతి చింతా మణి గృహే
శివా కారే ,మంచే ,పరమ శివ పర్యంక నిలయం –భజంతిత్వం  ,ధనయః ,కతి చన ,చిదా నంద లహరీ ”
తాత్పర్యం –పరాశక్తీ !అమృత సముద్రం మధ్య లో ,రత్నాల దీవిలో ,కల్ప వృక్షాల తో పరి వేష్టించ బడిన కదంబ వృక్ష వనం లో ,చింతా మణి నిర్మిత నగరం లో ,శక్తి స్వరూపం అయిన త్రికోణా కార మంచం పై ,పరమ శివుని ప్రక్కలో ,ప్రకాశించే జ్ఞాన స్వరూపమైన ,నిరతి శయ  సుఖ ప్రవాహం గా ఉన్న నిన్ను కొంత మంది ధన్య్లు లు మాత్రమె సేవించ గలుగు తున్నారు .
విశేషం –శ్రీ చక్రం అంటే ”వియత్ ”చక్రం .ఆకాశ చక్రం అన్నమాట .అంటే ఇది ఆకాశ పూజ అన్న మాట .దహరా కాశ ,బాహ్యాకాశ పూజ అని అర్ధం .పీఠం లో భూర్జ పత్ర ,శుద్ధ వస్త్ర ,సువర్ణ ,రజత రేకుల పై శ్రీ చక్రాన్ని వ్రాసి ,ఆరాధించా టాన్ని బాహ్యాకాశ పూజ అంటారు .హృదయాకాశం లో చేసే పూజ దహరా కాశ పూజ .శివాత్మక మైన నాలుగు యోనులు అదో ముఖం కలవి .శక్త్యాత్మక మైన అయిదు యోనులు ఊర్ధ్వ ముఖం కలవి .ఈ తొమ్మిది యోనులు కలిగిన ,శ్రీ చక్రం క్రింది ప్రదేశం లో ణి బిండువునే ”సుధా సింధువు ”అంటారు .బిందు స్థానం సుఖ సముద్రమే .అయిదు యోనులు కల్ప వృక్షాలు .అక్కడే కదంబం .దాని మధ్య మణి మంటపం .అందులో చింతా మణి గణం చేత నిర్మించ బడిన పీఠం ఉంటుంది .అక్కడే శక్తి రూప మైన మంచం మీద శివుడు దిండుగా ,రమ్య మైన పాన్పు గా ఉన్న సదా శివుడు ఉన్నాడు .బ్రహ్మాదులు ఆయన్ను సేవిస్తుంటారు .ఇంద్రుడు తమ్మి ప డగ.అక్కడ పర మేశ్వరి అయిన మహా త్రిపుర సుందరీ దేవి ఉంటుంది .శివార్క మండలం ఛేదించి చంద్ర మండలాన్ని ద్రవింప జేస్తూ ,,దాని లో విని పించే అమృత తుల్య మైన పరమానందాన్ని పొందుతూ, కుల సుందరి, కులాన్ని త్యజించి, పరమ మైనద ర్శనాన్ని పొందు తోంది .
దేవీ మందిరం 43 కోణాలు గల శ్రీ చక్రం. దానికి .బ్రహ్మ ,విష్ణు ,రుద్రా ,ఈశ్వరులు నాలుగు కోళ్ళు .మహేంద్రుడు తాంబూలం ఉమ్మి వేసే పళ్ళెం .కులం — కుల మార్గ శుషుమ్నా నాడి మార్గం .అక్కడే చంద్ర మండలం లో నిలిచి ,72,000నాడులు అమృత వర్షా న్నిస్తూంటాయి .మళ్ళీ కుండలిని స్వస్థానం పొంది ,స్వాదీష్టా నం లో నిద్రిస్తుంది .మూలాధారం లోని కుండలినీ శక్తి ,సుషుమ్న ద్వారా ,సహస్రారా నికి,వేళ్ళ బోతూ ,దహర గత సూర్య మండలాన్ని చేదించి ,బ్రహ్మ రంధ్రాన్ని కప్పి ,అక్కడి చంద్ర మండలాన్ని ద్రవింప జేసి ,అమృత వర్షం తో ,సర్వ ప్రపంచాన్ని అంటే సాధకుడి నాడీ మండలాన్ని తడిపి ,తృప్తి పొందు తోంది .శివుడు ”ఏ”ఆకారం .అదే ఏకాదశ స్వరం .అందు వల్లే ఆది త్రికోణం అయింది .పరమ శివుడు బిందువు .అక్కడ ఉండేది త్రికోణా కార మధ్య బిందు నిలయం .ఆమెను ధన్యు లైన వారే పూజించ గలరు .ఇదే శ్రీ శైలం లాంటి దేవాలయ దర్శనం అని రామ లింగేశ్వర శర్మ గారి అత్యన్తాద్భుత వ్యాఖ్య .అనాహత చక్రం పరమ కళ్యాణ రూపం .అదే పర్యంకం అంటే తోడ .అక్కడే చిదానంద లహరి ని దర్శిస్తారు .
9—”మహీం మూలాధారే,కమపి ,మణి పూరే  ,హుత వహం –స్థితం ,స్వాధి ష్టానే ,హృది మరుత ,మాకాశ ముపరి
మనోపి ,భ్రూ మధ్యే ,సకల మపి ,భిత్వా ,కుల పధం –సహస్రారే  ,పదమే ,సహ ,రహసి ,పత్యా విహరసే .”
తాత్పర్యం –ఆది శక్తీ !మూలా ధారం లో పృధ్వీ తత్త్వం ,మణి పూరం లో జల తత్త్వం ,స్వాదిష్టానం లో అగ్ని తత్త్వం ,అనాహతం లో వాయు తత్త్వం ,విశుద్ధం లో ఆకాశ తత్త్వం ,ఆజ్న లో మనస్తత్వంఉన్నాయి . ‘,సుషుమ్నను చేదించి ,సహస్రారం లోని భర్త అయిన సదా శివుని తో సదా విహరిస్తున్నావు నువ్వు .
విశేషాలు –నాలుగు శివ చక్రాలు ,అయిదు శివా అంటే లలితా దేవి చక్రాలు కలిసి శ్రీ చక్రం గా రూపు దాల్చింది .శివ చక్రం లో బిందు ,అష్ట దళ ,షోడశ దళ ,చతుర్దశ దళ క్రమాలుంటాయి .ఈ కొణా ,చక్రాలు శ్రీ దేవి ఆధార స్వరూపాలు .అమ్మా! నువ్వు త్రికోణ రూప శక్తివి .బిందు రూప శివుడిని నేను అని సాధకుడు భావిస్తాడు .మూలాధారం నుంచి ఆజ్ఞా చక్రం వరకు ఉన్న ఆరు చక్రాలకు ”కుల మార్గం ”అని పేరు .ఆ మార్గం లో సహస్రారం లో ,సహస్ర దళ పద్మం పై పరమ శివుని తో రహస్యం గా భగ వతి విహరిస్తుంది .ఇది ధ్యాన యోగానికి ఉపాసనా విధానం .దీని వల్ల యోగ సిద్ధి కలుగు తుంది .మూలాధారంలో  కుండలినీ శక్తి నిత్య నివాసి అని భావిస్తారు .
సశేషం –మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ –22-9-12–కాంప్–అమెరికా

Posted in రచనలు | Tagged | Leave a comment

అవీ ఇవీ అన్నీ

 అవీ ఇవీ అన్నీ
2005నుండి కాలి  ఫోర్నియా లోని హిందూ స్వయం స్వక సంఘం వార్షిక ”గురు వందనం ”కార్య క్రమాన్ని క్రమం తప్పకుండా నిర్వహిస్తోంది .ఈ యేడు కూడా జూన్ పదిహేను న ఉపాధ్యాయలను ఆహ్వానించి సమ్మానించింది .వారి పాదాలను తాకి నుదుట తిలకం పెట్టి ఆనంద  బాష్పాలు రాలుస్తూయువకులు ,చిన్నారులు తమ కోసం ఆహరహం  శ్రమించి తమను తీర్చి దిద్దు తున్న గురు వరేణ్యులను అత్యంత శ్రద్ధా ద్ద భక్తులతో వారందరూ పూజించి,సత్కరించి  తమ కృతజ్ఞతలను తెలియ జేసుకొన్నారు .ఇది అందరిని ఆనంద సాగరం లో ముంచి తేల్చిన ఘటన .
2011. డిసెంబర్ లో బంగ్లా దేశ్ లో బీద విద్యార్ధుల కోసం విశ్వ నికేతన్  అనే స్కూల్ ను ప్రారంభించారు .దీన్ని అమెరికా లోని లాభాపేక్షలేని గీతా సొసైటీ వారు ఏర్పాటు చేశారు .దీని సంస్థాపకులు అమెరికా నేవీ మాజీ ఆఫీసరు మరియు శాన్ జో స్టేట్ వర్సిటీ ప్రొఫెసర్ డాక్టర్ రామ చంద్ర ప్రసాద్ .ఈ సంస్థ ఒక లక్ష భగవద్గీత పుస్తకాలను ఉచితం గా పంపిణీ చేసింది. అమెరికా లోని హిందూ సంఘటనకు ఈ సంస్థ దివ్యమైన కృషి చేస్తోంది .
ఆస్ట్రే లియా లోని  ”సిడ్నీ సంస్కృత విద్యా లయం ”లోని విద్యార్ధులు  సంస్కృతాన్ని నేర్చు కోవటమే కాదు చక్కగా సంస్కృతం లో సంభాషిస్తు  అందరికి ఆదర్శం గా నిలుస్తున్నారు .స్థాపించి అయిదేల్లయింది .దిన దిన ప్రవర్ధ మానం అవుతోంది .ప్రతి ఏడాది ”సంస్కృత ఉత్స వాన్ని ”ఘనం గా నిర్వ హిస్తున్నారు .కిందటి నవంబర్ లో దున్దాస్ కమ్యూనిటి సెంటర్ లో నిర్వ హించారు .అక్కడికి వచ్చిన అతిధులందరూ సంస్కృతం లో మాత్రమె మాట్లాడటం గొప్ప ముందడుగు .శ్రీ ఛా.ము కృష్ణ శాస్త్రి గారు అక్కడ” సంస్కృత భారతి” అనే సంస్థను స్తాపించి ,సంస్కృతానికి పూర్వ వైభవాన్ని తీసుకొని రావటానికి సర్వ శక్తులు ధార పోసి పని చేస్తూ అనుకొన్నది సాధిస్తున్నారు .”సంస్కృతాన్ని పునరుద్ద రించి అందరికి అనుసంధాన భాష గా తీర్చి దిద్దటమే మా ధ్యేయం .ఆది సామాన్యుని భాషను చేయాలనేదే మా సంకల్పం .దాని అపార జ్ఞాన సంపదను అందరికి అందించటమే  మా ధ్యేయం .సంస్కృతం తోనే సాంఘిక సామరస్యం ,జాతీయ సమైక్యత సాధ్యం అని నిరూపించటమే మా లక్శ్యం .మాకు జాతి కుల మత భాషా భేదాలు లేవు ”అని వారు తెలియ జేస్తున్నారు .
కమ్యూనిస్టు చైనా లో ఎన్నో ఊహా తీత మైన మార్పులొస్తున్నాయి ,ముఖ్యం గా హిందువు లందరూ గర్వించ దగిన సంఘటనలు అక్కడ చోటు చేసుకొంటున్నాయి. చైనా లోని ”wilken arts and crafts ltd .” అనే సంస్థ” xiamen”లో ఏర్పడి అతి తక్కువ ఖర్చుతో పోలీ రేజిన్ పదార్ధం తో హిందూ దేవతా మూర్తులను తయారు చేస్తోంది .రెండేళ్ళ క్రితేమే ఏర్పడిన ఈ సంస్థ గణేష్ ,బుద్దా విగ్రహాలను ఆటో డాష్ బోర్డు వారికి తయారు చేసి ఇచ్చింది . .అవి బాగా అమ్ముడు పోవటం  తో ఇంకా ఎక్కువ రకాలను తయారు చేయటం లో నిమగ్న మైంది .పెద్ద పెద్ద విగ్రహాలను నిర్మిస్తోంది .సాయిబాబా ,లోక నాద్ ,షిర్డీ బాబా ,రామ కృష్ణ పరమ హంస మొదలైన విగ్రహాలను ఆర్డర్ల మీద తయారు చేసి అందిస్తున్నారు .కనీస ఆర్దర్ అయిదు వందల బొమ్మలున్డాలి .చాలా తక్కువ ఖరీదు కే విగ్రహాలు లభించటం తో జనం కొనుక్కోవటానికి క్యూ లు కడుతున్నారట .
మీ–గబ్బిట దుర్గా ప్రసాద్ –22-9-12- కాంప్–అమెరికా

Posted in అమెరికా లో | Tagged | Leave a comment

భలే బాలి

          భలే బాలి 

ఎన్నో ప్రత్యేకతలు సంత రించుకొన్న ద్వీపం బాలి .కొత్త సంవత్స రానికి చాలా ప్రాముఖ్యత ఉంది .మిగతా దేశాలలో లాగా ఇక్కడ కొత్త ఏడాది వస్తుంటే టపాకాయలు కాల్చటం తెల్లార్లూ మేల్కొని హాపీ న్యు యియర్ చెప్పటం అర్ధ రాత్రి పన్నెండు కు ముందు కౌంట్ డౌన్లు లెక్కించటం ఉండదు .వీరి దృష్టిలో ప్రతి కొత్త సంవత్సరం మనలోని కల్మశాల్ను విసర్జించుకొని ,శుద్దులవటానికే నని భావిస్తారు .కొత్త సంవత్స రాది నాడు సమ్పూర్ణ మౌనాన్ని పాటించటం బాలీ ప్రత్యేకత .మొత్తం దీవి అంతా నిశ్శబ్దం తాండ వీస్తుంది .వీరికి రెండు రాకా లైన కేలన్దర్లున్నాయి .అందులో” pawukon ” అనే కేలండర్ ప్రకారం ఏడాదికి 210 రోజులే .రెండవది ”saka ”కేలండర్ సూర్య ,చంద్ర గమనం ఆధారం గా ఉంటుంది .దీని ప్రకారం” nyepi”అంటే కొత్త సంవత్స రాన్ని గణిస్తారు .2012లో ఇది మార్చి నెల 23న వచ్చింది .ఈ పండుగ తో కొత్త సంవత్సరం ప్రారంభ మైనట్లు గా భావిస్తారు .ఇది వసంత రుతువు ప్రారంభం లో మార్చి ఏప్రిల్ మధ్య లో వస్తుంది .మనకూ అంతే .
కొత్త సంవత్సరం కు ముందు రోజు అందరు సముద్రపు బీచి ల వద్దకు చేరుకొంటారు .అందమైన దుస్తులు ధరిస్తారు .ఈ రోజున ”melaasti ”అనే సంబరం జరుపుతారు .దీని భావం ఏమిటంటే సముద్రానికి , భూమి కి  అధి దేవత దేవుడే అని తెలియ జేయటం .సముద్ర తీరాన ఉన్న దేవాలయాలలో పూజలు నిర్వ హిస్తారు .దేవతలకు నైవేద్యాలు పెడతారు .వరుణ,విష్ణు  దేవుల ప్రసాదం గా నీటిని భావించి దాన్ని ”అమృతం ”అని పిలుస్తారు .ఆ నీటితో శరీరాన్ని శుద్ధి చేసుకొని బాహ్య, అంతర శుద్ధి పొందుతారు .తీర్ధం గా గ్రహిస్తారు .ఆ తర్వాతా రోజు ను భూత యజ్న దినం గా చేస్తారు .సంవత్సరం లో చేసిన పాపాలు ,తప్పులకు పశ్చాత్తాపం ప్రకటించుకొంటారు .తమలోని వ్యతి రేక భావాలను విసర్జిన్చుకొంటామని ప్రతిన పూను తారు .ఇది దేవుడికి మనిషికి, ప్రకృతికి ,మధ్య సమతుల్యతను సాధించటమే .ముందు రోజు స్థానిక హిందువు లంతా గ్రామం అంతా తిరిగి వెదురు దీపాలతో వీలైనంత పెద్ద పెద్ద శబ్దాలను చేస్తారు .దీనితో చెడ్డ భావాలు చెడ్డ దేయ్యాలు వ్యతి రేక శక్తులు లు పారి పోతాయని భావన ,.దీన్ని”ngerupuk ”అంటారు .దీనితో బాలి లోని చెడు అంతా తరిమి వేయ బడిందని అనుకొంటారు ..
ఈ పని అయి పోగానే ద్వీపం అంతా నిశ్శబ్దం అలము కొంటుంది .దీన్నే” nyepi ”.లేక ఉగాది అంటారు .ఉదయం ఆరు గంటల నుండే నిశ్శబ్దాన్ని పాటించటం ప్రారంభిస్తారు .ఇరవై నాలుగు గంటలు పాటు పాటిస్తారు .దెయ్యాలను తరిమేశారు చెడు తలంపులు దూరం అయాయి .అందుకని అంతా ప్రశాంతం అని అర్ధం .అసలు ద్వీపం లో మనషులు ఉన్నారా అన్నంత నిశ్శబ్దం ఏర్పడు తుంది .ఆది ఒక్క బాలి లోనే సాధ్యం .ఈ రోజున స్వీయ భావ పరావర్తనం గా అనుకొంటారు .స్థానిక సెక్యురిటీ వాళ్ళు నల్ల యుని ఫాం వేసుకొని బజార్ల వెంట తిరుగుతూ పర్య వేక్షిస్తారు .యే వాహనాన్ని అనుమతించారు .కాలి నడకా ఉండదు .ఇళ్ళ దగ్గర యే పనీ చేయరు .దాదాపుగా అందరు ఇళ్ళల్లో ఉపవాసం ఉండి పూజాదికాలు నిర్వ హిస్తారు .అగ్ని ప్రజ్వలన ఉండదు .విద్యుద్దీపాలార్పెస్తారు .వీధి దీపాలు వెలిగించరు .రేడియో ,టెలివిజన్ వగైరా లేమీ ఉండవు .రతి కార్యమూ  బందే .విశేషం ఏమిటి అంటే కొత్త సంవత్సరం రోజున కుక్కలు కూడా మొరగవు .గప్ చిప్  .ఇలాంటిది యే దేశం లోను సాధ్యం కాదు .నిజం గా ఇది హిందువుల పండుగ అయినా ,ముస్లిములు, క్రిస్టియన్లు కూడా దీన్ని శ్రద్ధ గా మౌనాన్ని పాటించటం గొప్ప సంగతి .బాలి లోని విమానాశ్రయాన్ని కూడా మూసి వేస్తారు .ఈ విషయాలు ముందే తెలుసుకొని యాత్రికులు జాగ్రత్త పడ తారుదీని తర్వాత రోజున మళ్ళీ జీవితం యదా ప్రకారం మొదలవు తుంది .ఈ రోజును” ngembak geni ”అంటారు . .
ఇక్కడ ఆవు మాంసాన్ని కూడా తింటారు .ఆవు వారికి ”హోలీ”(పున్యమైనది ) యే కాని సేక్రెడ్(పవిత్రమైనది ) కాదని అంటారు .హోలీ అంటే గౌరవింప తగినదని సేక్రెడ్ అంటే అలాంటి దాన్ని తాకను కూడా తాకరాదని అర్ధం చెబుతారు .ఇది భలే గా ఉంది కదూ .అదే భలే బాలి అంటే .ప్రతి వంద ఏళ్లకొక్క సారి ”ఏకా దశ రుద్రఉత్సవం ”చేస్తారు .ఆ రోజున 200 రకాల జంతువులను బలి ఇస్తారు .సాధారణ గృహస్తు ఏడాదికి రెండు నుండి అయిదు డజన్ల జంతువులను బలిస్తాడు. .
ముందే చెప్పుకొన్నాం బాలి లో ఎవరైనా చని పోతే ఆది సమాజం అంతా బాధ్యత గా నిర్వ హిస్తుందని .మేళ తాలతో బాజా భజంత్రీ లతో పెద్ద అట్ట హాసం గా శవాన్ని ఇంటి నుంచి శ్మశానానికి వేడుక గా తీసుకొని వెళ్తారు .ఎవ్వరూ ఏడ వరు నవ్వుతూ ,తుళ్ళుతూ పండుగ లాగా ప్రవర్తిస్తారు .సంగీతం పాడిస్తారు, డాన్సులు చేయిస్తారు .”ఎందుకిలాగా ”? అని మనం సుబ్బరాయ శర్మ లాగా ప్రశ్నిస్తే ”చని పోవటం అంటే దేవుడి దగ్గరకు వెళ్లటం .మనం ఆయన దగ్గర్నుంచే వచ్చాం కదా .మళ్ళీ అకడికి వెళ్తుంటే సంతోషం వ్యక్తం చేయాలి కాని ఏడుపు లెందుకు “‘అని వేదాంత రహస్యాన్ని అద్భుతం గా ఆవిష్కరిస్తారు నిజం గా ఆ విషయం మనకూ తెలుసు .కాని ఏడవ కుండా ఉండలేము. మనం మాటలు మాత్రం చెప్ప గలం .బాలీయులు చేతల తో వేదాంతాన్ని అనుష్టించి చూపిస్తారు .అందుకే భలే బాలి అన్నాను .అంతే కాదు శ్మశానాల దగ్గర కొనుక్కోవ టానికి దుకాణాలు చాలా ఉంటాయి .హాయిగా కొనుక్కొని తింటూ శవ యాత్ర లో పాల్గొన వచ్చు చావును వేడుక గా ,పండుగ గా నిర్వ హించే బాలీయులు భలే వారు .ఆడ వాళ్ళు కూడా చక్కగా శవ యాత్ర లో వెంట వెడతారు నవ్వుతూ తుళ్ళుతూ వెళ్తారు .శవాన్ని మోసుకు వెళ్ళే బండీకి ముందు ఒకటే చిన్న చక్రం ఉంటుంది .ఇదో తమాషా .మనం శవాన్ని పెట్రోల్  తో ,కిరోసిన్ తో కాల్చం .కాని వారు వెంటనే దహనం అవ్వాలని వాటిని సమృద్ధి గా వాడేస్తారు .ఇదీ భలే .
ఇక్కడ దహన సంస్కారం మనిషి చని పోయిన వెంటనే చేయరు .మంచి రోజు చూసి చేస్తారు .ఒక్కో సారి వారం పట్ట వచ్చు నెలలు కూడా పట్టా వచ్చు .రెండు రకాల క్రియలుంటాయి ఒకటి వక్తి గతమైనది ,రెండోది సామూహిక మైనది .ధన వంతులు మంచి రోజు వచ్చే దాకా శవాన్ని ఇంట్లోనే ఉంచుతారు .సాధారణ ప్రజలు స్మశానం లో వెంటనే పూడ్చి మంచి రోజు వచ్చిన తర్వాతా త్రవ్వి తీసి వందా ,రెండు వందల శవాలను ఒక్క సారే సామూహికం గ అ ఖననం చేస్తారు .ఆ రోజున హడా విడి ఎక్కువే .బాజాలు భజంత్రీలు. ఉంటాయి పల్లకీ లో వూరేగిస్తారు .పూజారులు పవిత్ర మంత్రాలు చదువుతుండగా కార్య క్రమాన్ని చేస్తారు .దీనితో అయి పోలేదు ఆ తర్వాతా తంతులు చాలా ఉంటాయి .ఇవన్నీ చేసే సరికి చాలా ఖర్చు అవుతుంది .
మనకు లాగానే అక్కడా పూర్వపు గ్రంధాలన్నీ తాళ పత్రాలలో లిఖించ బడి ఉన్నాయి వీటిని” లోన్తార్” ల పై రాసే వారు .ప్రాచీన 50.,000 లోన్తార్తార్ గ్రందాలున్నాయని అంచనా .అందులో పురాణాలు ,ఇతి హాసాలు ,వేదాలు ,ఆగమాలు ,భూమి రికార్డులు ,మత గ్రంధాలూ వైద్యానికి సంబందినవి ,మాజిక్ కు చెందినవి ,వంశ చరిత్రలు .శిల్పశాత్రం , ,చిత్ర లేఖనం ,కోడి పందాలు నిబంధనలు ఒకటేమిటి సమస్తం అందులో ఉన్నాయి .ప్రతి ఇంట్లో లోన్తార్ గ్రంధాలలో ఏదో ఒకటి ఉంటుంది .చాలా భాగం ”కావి ”భాషలో అంటే ప్రాచీన జావా భాష లోను , కొన్ని సంస్కృతం లోను  ఉన్నాయి .రామాయణ ,మహా భారతాలు సంస్కృతం లో నుంచి కావి భాషలోకి అను వదించి రాసుకొన్నారు .ఇవి పల్లవుల నుండి లభించాయి .కొత్త లాంతార్ గ్రంధాలు” అక్షర బాలి లిపి” లో ఉన్నాయి .ఇది15 శతాబ్దం లో ఇక్కడికి చేరింది .మజా పెహిత్ రాజ్యం ధ్వంసం అవగానే ,ముస్లిములు తమ తో బాటు ఇండో నేషియా కు జావా ,నుండి దీన్ని తెచారు .ఇప్పుడు వీటిని భద్రం చేసుకోవాలని ప్రయత్నిస్తున్నారు డిజిటల్ గా మార్చే ప్రయత్నాలు ముమ్మరం అయాయి .అసలు లోన్తార్ అంటే ఏమిటో  తెలుసు కొందాం .ఇది పురాతన జావా మాట .రోన్ అంటే ఆకు .అని ,తాల్ అంటే తాళ వృక్షం అని అర్ధం .అంటే తాటి ఆకు. అదే తాళ పత్రం .రఅనేది  ల గా కాల క్రమం లో మారి పోయింది వీటిని తగిన పరి మాణం లో కత్తి రించి చివరి భాగం లో మూడు రంధ్రాలు చేసి కట్టగా కడతారు .వీటిపై రసాయన పదార్ధాలు బాలీ లోని ఔషధాలు పూసి శుద్ధి చేస్తారు .వాటిపై గంటం తో రాస్తారు .ఇవి అమూల్య పత్రాలుగా ప్రభుత్వం భావించి సంరక్షిస్తోంది .లోన్తా ర్గ్రందాలలో ఎక్కువ శివుని గురించినవే ఉంటాయి .శైవ ఆగమాలు ఎక్కువ .వీటిని డిజిటల్ గా మార్చటానికి సాన్ ఫ్రాన్సిస్కో సహాయం చేస్తోంది .ఇప్పుడు ఆం లైన్ మీద ఇవి లభిస్తున్నాయి ఇదీ భలేగా ఉంది .కొబ్బరి ఆకులను ఎక్కువగా పూజా సమయం లో వాడుతారు చదరం గా ఉన్న అరటి ఆకు లో పదార్ధాలను పెట్టి దేవుడికి నైవేద్యం చేస్తారు .రక రకాల పూలు ,పండ్లు ఉపయోగిస్తారు . ఈవిధం గా బాలీ ద్వీపం హిందూ సంస్కృతిని పరి రక్షించుకొంటు, ప్రాచీన ధర్మ మార్గం లో నడుస్తూ ఆ సంస్కృతిని నిత్య జీవితం లో అవలంబిస్తూ తర తరలకు అంద జేస్తోంది .బాలీ ప్రజలు తమ ప్రత్యేకతను కాపాడుకోవటానికి తీసుకొంటున్న శ్రద్ధ అందరికి  ఆదర్శ ప్రాయం .బాలీ అంటే” జాలీ ”కాదు. బాలీ అంటే కర్తవ్య నిర్వహణ ,సనాత ధర్మ  పరి రక్షణ ,సాంప్రదాయ  రక్షణ .బోలో బాలీ కీ జై .
సమాప్తం                     మీ– గబ్బిట దుర్గా ప్రసాద్ –21-9-12-కాంప్–అమెరికా

Posted in రచనలు | Tagged | Leave a comment

బాలి -కళా కేళి

  బాలి -కళా కేళి 
బాలీ ద్వీపం లో కళలు అద్భుతం గా వర్ధిల్లు తున్నాయి .అవి అక్కడి సంస్కృతి ,ప్రజల మనోభావాలను ప్రతి బిమ్బిస్తాయి .అందులో దేవాలయ శిల్ప కళ  ,నాట్యం ,చిత్రకళా ,సంగీతం ,నాటకం అన్నీ చాలా బాగా రాణిస్తున్నాయి .ఈ కళలన్ని భగవ రాధన గా భావిస్తారు .ఇక్కడ యే కళ అయినా రామాయణ ,మహా భారత లే ప్రాతి పదికలు గా ఉంటాయి .తోలు బొమ్మ లాటకూ ప్రాధాన్యత ఉంది .మతమే బాలి లో సంస్కృతికి మూల బీజం .పదహారవ శతాబ్దం నుండి ,ఇరవై శతాబ్దం వరకు క్లాసికల్ కల్చర్ కు తూర్పు బాలి కేంద్రమైంది .ఊబుద్ ఇప్పుడు ఆధునిక కళకు నిలయమైంది . 

This slideshow requires JavaScript.


1920  వరకు సాంప్రదాయ ”కామసాన ”పద్ధతిలో చిత్రకళా సాగింది ఇవి టు డైమెన్షన్ కలవి .వీటిని వస్త్రం లేక చెట్టు బెరడు మీద గీసే వారు .సహజ వర్ణాలను వాడే వారు .తక్కువ రంగులే ఉపయోగించే వారు .1930లో పాశ్చాత్య ప్రభావానికి లోనైంది .కొత్త పదార్ధాలను వాడటం ప్రారంభించారు .అయినా బాలి సంస్కృతికి భిన్నం గా లేకుండా జాగ్రత్త పడ్డారు .దీన్నే” modern traditional Balinese painting ”అని పిలుస్తారు .ప్రపంచం లో చాలా దేశాలలో వీరి చిత్రాలను ప్రదర్శిస్తారు .మ్యూజియమ్స్ లో అలంకరిస్తారు .సాధారణం గా దేవుళ్ళ దేవతల చిత్రాలే ఎక్కువ గా ఉంటాయి .వీరే వారికి స్ఫూర్తి .తమ చిత్రాల ద్వారా భగ వంతుడిని సేవ చేయ వచ్చు నని వాళ్ళ అభి ప్రాయం .
దేవాలయ శిల్ప కళ ఇక్కడ బాగా వర్ధిల్లింది .ప్రాచీన ఆచారాలనే వారు పాటిస్తారు .నిర్మాణమంతా ”హస్త కౌశల కౌశలి ”పద్ధతి లో ఉంటుంది .ప్రతి శిల్పి తన తండ్రి లేక తాత నుంచి వారసత్వం గా ఈ కళను పొందుతాడు .ఇదొక పరమ పవిత్ర కార్యం గా వారు భావిస్తారు .దీనికి డబ్బు ఏమీ తీసుకోరు .అలా దేవాలయనిర్మాణాన్ని చేసే వారిని ”ఉదంగి ”లంటారు .వీరికి ఉదర పోషణకు వేరే వ్యాప కాలుంటాయి. కనుక ధనం ప్రధానం కాదు .అలా తీసుకొంటే తప్పు అని అంటారు ఇన్ని దేవాలయాలను ఇళ్లను కట్టినా ఇందులో చాలా మంది ఉదంగి లకు స్వంత ఇల్లు ఉండడదు .
బాలి దీవి లో పదహారవ శతాబ్దం లో నిర్మించబడిన” Ubud palace court yard ”అనేది నాట్యానికి గొప్ప వేదిక .ఇక్కడే డాన్సు ,డ్రామా లను ప్రదర్శిస్తారు .బాలి మంచి టూరిస్ట్ అట్రాక్షన్ ఉన్న ప్రదేశం .ఈ కళను చూసి యాత్రికులు పరవశిస్తారు .వీటికోసమే వచ్చే వారు చాలా మంది ఉంటారు .హైస్కూల్ లో ప్రాధమికం గా అందరికి నృత్యం నేర్పిస్తారు .వీటికి తోడు ప్రైవేట్ విద్యాలయాలున్నాయి .వీటిని ”సంగార్ ”అంటారు .ఇవి సంస్కృతీ రక్షక నిలయాలు .పాశ్చాత్య సంస్కృతి వల్ల తమ కళల కేమీ ప్రమాదం లేదని వీరి ధీమా .ప్రతి ఏడాది ”బాలి ఆర్ట్ ఫెస్టివల్ ”జూన్ ,జులై లలో నిర్వహిస్తారు .అందుకని ఇది ప్రదర్శన కళ గా బాగా రాణించింది దీని ఆత్మ అంతా హిందూ ధర్మమే నంటారు వాళ్ళు .అక్కడ దేవాలయానికి కాని వివాహాది శుభ కార్యాలకు కాని ఉత్స వాలకు కాని అందరు సాంప్రదాయ దుస్తులనే ధరించి వెళ్ళాలి .అలానే వెళ్తారు కూడా .కళలు వినోదానికి మాత్రమె కాదని భగవంతునికి నివేదన అని వారు ద్రుధం గా నమ్ముతారు .
రిథం కు ప్రాధాన్యం .వీరి సంగీతం లో metallo phones ,gongs , ,xylophones ,ను బాగా ఉపయోగిస్తారు .వీరి సామ్ప్రదాయమైన వాయిద్యం వెదురు తో చేసిన బూరా దీన్ని ”ఆన్క్లుంగ్ ”అంటారు .రెండు తీగల ఫిడేల్ వంటి ”రేబాబ్ ” వీరికి చాలా  ఇష్టం .వీరి డాన్సు లో బోరాంగు డాన్సు ముఖ్య మైనది .ఇందులో దేవుడు దుష్ట శక్తులను అణచటం ఉంటుంది .దుష్ట శక్తుల్ని పరి మార్చటం కాదు కాని, సంస్కరణ వీరికి ఇష్టం .ఈ డాన్సు చాలా సంక్లిష్టం గా ఉంటుంది .పాద విన్యాసాలు చాలా కష్టం గా ఉంటాయి .అయినా కష్ట పడి సాధన చేస్తారు .ఇది రాజ దర్బారుల్లో ప్రదర్శించే దైవీ కళ .దీన్ని ఆడపిల్లలే చేస్తారు రజస్వల కాని పిల్లలే చేయాలి .అయిదేళ్ళ లోపు పిల్లలకే తీవ్రం గా నేర్పటం ప్రారంభిస్తారు .ఈ డాన్సు చేసిన వారికి ఉన్నత ఉద్యోగాలు, పదవులు ,రాజ కుటుంబీకుల తో వివాహాలు జరుగు తాయి .”kecak ”డాన్సు కూడా ముఖ్యమైనదే .ఇది రామాయణం లో కోతి మూక మాట్లాడటం (monkey chat ).150 మంది గుండ్రం గా కూర్చుని సంబంధిత దుస్తులు ధరించి చేసేది. తమాషా గా వింత ధ్వని తో ”కాక్ ”అని ఆయుధాలు పడేస్తారు .ఇదిరామ రావణ యుద్ధం లో హనుమంతునికి సంబంధించిన కధ .వీరికి చాలా ఇష్టం .పపేట్ షో కూడా అమితం గా ఇక్కడ ప్రదర్శింప బడుతుంది నూనె దీపాల వెలుతురు తో దీన్ని రామాయణ ,మహా భారత గాధలను ప్రదర్శిం ఛే వారు  .ఇప్పుడు కరెంటు దీపాలోచ్చాయి .
చిన్నప్పటి నుంచే పిల్లలకు డాన్సు నేర్పుతారు .ఉయ్యాల్లో ఉండగానే సంగీతానికి ప్రాధాన్యత నిస్తారు తల్లి అభినయ ముద్రలను పిల్లలకు నడక రావటాని కంటే ముందే  నేర్పిస్తుంది .ఎంతో మంది గురువులు గ్రామాలలో సంగీతం నాట్యం నేర్పుతారు .వారికి తగిన పారి తోషికం లభిస్తుంది .సంప్రదాయం సంస్కృతి ల మీద అభి రుచే వీరిని ముందుకు నడి  పిస్తోంది .ఇలా కళలకు కాణాచి గాఉండి బాలి-  కళా కేళితో కళ కళ లాడుతోంది .
మీ–గబ్బిట దుర్గా ప్రసాద్ –21-9-12-కాంప్–అమెరికా

Posted in సేకరణలు | Tagged | Leave a comment

శ్రీ శంకరుల లలి (కవి)తా సౌందర్య లహరి –3

 శ్రీ శంకరుల లలి  (కవి)తా సౌందర్య లహరి –3
5–”హరిస్త్వా మారాధ్య ,ప్రణత జన సౌభాగ్య జననీం –పురానారీ భూత్వా ,పురరిపు మపి క్షోభ మనయత్
స్మరోపిత్వాం ,నత్వా ,రతి నయన లేహ్యన వపుషా–మునీనా మప్యంతః ప్రభవతి ,హి ,మోహాయ మహతాం .”
తాత్పర్యం –శర్వాణీ !సౌభాగ్యాన్ని ఇచ్చే నిన్ను ఆరాధించే ,పూర్వం విష్ణు మూర్తి మోహినీ రూపం ధరించి ,త్రిపుర సంహారకు డైన మహేశ్వరుడిని కూడా మొహం చెందించాడు .శరీరమే లేని మన్మధుడు నీకు నమస్కరించి ,భార్య అయిన రతీ దేవి కన్ను లతో ఆస్వాదించ దగిన శరీరం తో మునీశ్వరులనే మోహ పెడుతున్నాడు .నీ అనుగ్రహం లోకా ద్భుతం గా ఉంది .లలితా దేవిని స్మరిస్తే చాలు ఎంతటి కష్టమైనా పని నైనా చేసే సమర్ధత వస్తుంది అని భావం .
6—”ధనుహ్ పౌష్పం ,మౌర్వీ మధుకర మయీ ,పంచ విశిఖాః–వసంతః  సామంతో ,మలయ మరుదా యోధన రధః
తదాప్యేకః,సర్వం ,హిమ గిరి సు తే ,కామపి ,కృపాం –అపామ్గత్తే ,లబ్ధ్వా ,,జగదిద,మనంగో విజయతే ”
తాత్పర్యం -పురాణీ !పూల విల్లు ,తుమ్మెద గుమ్పులే అల్లే త్రాడు ,అయిదు మాత్రమె పుష్ప బాణాలు ,జడుడు, ,సంవత్స రానికి ఒక సారి మాత్రమె కనీ పించే వసంతుడే చెలికాడు గా ,గంధపు కొండ గాలి రధం గా ,చేసుకొని మన్మధుడు ,నీ కడ గంటి చూపు అనే కరుణ తో ,అంతు లేని దయను పొంది ,,ఈ జగత్తు నంతా చేల రేగి జయిస్తున్నాడు .
విశేషం –పుష్పాలు అతి మెత్తనివి సుకుమారమైనవి .తాకితే వాడి పోయేవి .ఎప్పుడూ రోద చేస్తూ ఎగురుతుండే తుమ్మెదలు .ఇవన్నీ సమర్ధ వంత మైనవి కావు .అంటే వీటి పై నమ్మకం పెట్టుకోవ టానికి వీలు లేదు .కాని దేహమే లేని మన్మధుడు ప్రపంచం పై శ్రీ దేవి కరుణా కటాక్షం వల్ల  విజ్రుమ్భించి అందర్నీ మోహ పర వశు లను చేయ గలుగు తున్నాడు .కారణం లేకుండానే కార్యం జరిగి పోతోంది .గడ్డి పరక మేరు పర్వతం గా ,మూగ వాడు వాచాలుని  గా ,కుంటి వాడిని పర్వతాలను ఎక్కే సామర్ధ్యం కల  వానిని గా లలితా త్రిపుర సుందరి చేయ గలుగు తుంది అని భావం .
7—”క్వణత్కాంచీదామా ,కరి కలభ ,కుమ్భస్తన భరా –పరిక్షీణా మధ్యే ,పరిణత ,శరశ్చంద్ర వదనా
ధనుర్బాణాన్ ,పాశం ,సృణీ మపి ,దధానై ,కరతలైహ్ -పురస్తా దాస్తాం నః ,పురమధితు రాహో ,పురుషికా ”
తాత్పర్యం –రుద్రాణీ !మెరిసే మణుల గజ్జల మొల నూళులు ,గున్న ఏనుగు కుంభ స్థలాల వంటి చనులు కలిగి ,సన్నని నడుము తో ,వంగి ,శరత్కాల వెన్నెల వంటి ముఖం తో ,తామర తూడుల వంటి సుతి మెత్తని చేతులతో ,చెరుకు విల్లు ,పూల బాణాలు ,పాశం ,అంకుశం అనే ఆయుధాలను ధరించి ,త్రిపుర సంహారకు డైన ఈశ్వరుని యొక్క అలంకార స్వరూపు రాలైన న శ్రీ దేవి మా ఎదుట సుఖా శీనురా లవుఅవు  గాక .
విశేషం –త్రిపురా మంత్ర బీజాలను మదించి ,నవనీతం అంటే వెన్నను తీసే వాడు త్రిపురారి అంటే శివుడు .శ్రీ దేవి స్తూల ఆకారాన్ని ,మంత్ర రూప మైన సూక్ష్మ ఆకారాన్ని ,పరా స్వరూప మైన మాయా కారాన్ని శ్రీ శంకరులు ఇక్కడ సూచించారు .”పరమధితుం ”అనటం లో ఐం ,క్లీ ,సౌహ్ ,అనే త్రిపురా మాతృకా బీజాలను శివుడు ఉద్ద రించి ,లోకాలను ప్రకాశింప జేశాడు అని అర్ధం .అ-అంటే బ్రహ్మ -హ -అంటే శక్తి ఈ రెండు కలిస్తే అహం -అంటే ప్రత్య గాత్మ అయిన పురుషుడు -అదే ”అహో పురిషికా ”అన్న మాటలో భగవత్పాదులు పొదిగారు .గజ్జల మోల నూలు మ్రోత -సాధకునికి  ఆజ్ఞా చక్రం తర్వాత విని పించే నాదం అని భావం .సహస్రారం లో పరాశక్తి చంద్ర జ్యోత్స్న గా ప్రకాశిస్తుంది .దానినే ఆది శంకరులు ”పరి ణత శరశ్చంద్ర  వదనా ”అనే మాటలో నిక్షిప్తం చేశారు .
సశేషం –మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –21-9-12-కాంప్–అమెరికా

Posted in రచనలు | Tagged | Leave a comment

మా గార్డెన్ గణేశ (అమెరికాలో)- హైదరాబాద్ లో హర్షిత మట్టి తో చేసిన గణపతి

This slideshow requires JavaScript.

హైదరాబాద్ లో మా మనుమరాలు  హర్షిత మట్టి తో చేసిన గణపతి  పూజ

Posted in అమెరికా లో | Tagged | Leave a comment

బాలీ దేవాలయాలు

బాలీ దేవాలయాలు 

బాలీ లో చాలా దేవాలయాలున్నాయి .అందులో గొప్ప  దేవా లయం అని పించుకోన్నది ”మదర్ బెశాఖి దేవాలయం ”.ఇది 3610అడుగుల ఎత్తున మౌంట్ ఆగంగ్ పై ఉంది .మన మేరు పర్వతం గా వారు దీన్ని భావిస్తారు .నిజం గా ఇది ఇరవై రెండు దేవాలయాల సముదాయం .ఇది పది హేడవశాతాబ్దపు నిర్మిత దేవాలయం .ముందు గా ఇక్కడ”పురా గోవా రాజ గుహ” దేవాలయాన్ని ను చూడాలి .ఇక్కడ దేవాలయాలకు వెళ్ళాలంటే ప్రత్యెక మైన దుస్తులు ధరించాల్సిందే.సామ్ప్రదాయమైన సారంగు ,శిరస్త్రానం ధరించి లోపలి వెళ్ళాలి .అన్ని దేవాలయాలు ఆరు బయటే ఉంటాయి .కాని ఇది ప్రత్యేకంగా  గుహలో ఉంటుంది .దీనికో కధ ప్రచారం లో ఉంది .ఒకప్పుడు ఒక దుష్ట రాజు ఇక్కడ పాలిస్తూ ప్రజల్ని పీడించే వాడు .దేవతలు, రాజు ను శిక్షిం చ టానికి మూడురకాల  సర్పాల రూపం లో వచ్చారు .బ్రహ్మ భూమి నుండి అనంత భోగ నాగు బామునేక్కి వచ్చాడు .విష్ణు నీటి నుండి వాసుకి నాగునేక్కి వచ్చాడు .ఈశ్వరుడు ఆకాశం నుండి తక్షక నాగ రూపం లో వచ్చాడు .అవన్నీ ఇక్కడే పరి వేష్టించి ఉన్నాయి .దీనికి ఒక పర మార్ధం ఉందని బాలీవాసులంటారు .భూమి ,నీరు ,గాలి ఇక్కడ సమ తూకం గా శాంతియుతం గా  ఉంటాయని అందు వల్ల  ప్రపంచం సమతా స్తితి లో ఉంటుందని వీరి నమ్మకం .ఈ దేవాలయం ఆ మూడింటిని బాలన్సు చేసి ఉంచే స్థానం అని నమ్మకం . .
మళ్ళీ మెట్లు ఎక్కి వెళ్తే లక్ష్మి దేవాలయం వస్తుంది .చాలా ప్రశాంత మైన వాతా వరణం .ఇక్కడ కూచుంటే చిత్త శాంతి కలుగు తుంది .ప్రకృతి అందాలు పర వశింప జేస్తాయి .భక్తులు తెల్ల వస్త్రాలతో తెలుపు , ,పసుపు రంగు గోడుగులతో దర్శనాలకు వస్తారు .ఇక్కడికి వచ్చిన వారు తమ పూర్వీకులు దేవతలుగా మారాలని కోరు కొంటారు .అక్కడి పూజారి పవిత్ర జలాన్ని అందరి శిరస్సు ల మీదా చల్లు తాడు .నైవేద్యం పెట్టిన బియ్యాన్ని అందరికి ప్రసాదం గా పంచి పెడతాడు .బియ్యమే ఇక్కడి ప్రసాదం .ఇక్కడ దేవాలయాలకు చెప్పులు వేసుకొని లోపలి వేళ్ళ వచ్చు .అయితే పూజ చేయిచు కొనే వారు మాత్రం చెప్పులు వదిలి వెళ్ళాలి .
ఇక్కడి ”దేనా పాసార్ ”అనే చోట ద్విజేంద్ర ఫౌండేషన్ స్కూల్ ఉంది .అందులో 4000 మంది విద్యార్ధులు చదువు కొంటున్నారు .ఇక్కడ వీరికి.”HINDU HUMAN RESOURCES” లో శిక్షణ నిస్తారు .మతం, సంస్కృతి ,సాహిత్యాల పై అభినివేశం కల్గిస్తారు. అవగాహన పెంచటమే వీరి ధ్యేయం .దీన్ని 1953లో శ్రీ దాంగ్ హయాంగ్ ద్విజేంద్ర కట్టించారు .ఆది ఎనిమిదో శతాబ్దపు జావా పూజారి స్మారకార్ధం అదే  పేరు మీద నిర్మిత మైంది .ఈయనే బెశాఖి దేవాలయాన్ని నిర్మించాడు .ఆ విద్యా లయం లో ద్వారం దగ్గర భారీ సరస్వతి, గణపతి విగ్రహాలుండి చూపరులకు కను విందు ,భక్తీ కలిగిస్తాయి .వేలాది విద్యార్ధులు మోటారు సైకిళ్ళ మీద అక్కడికి చేరటం ముచ్చట గా ఉంటుంది .ఇక్కడ మతాతీత విద్యనే బోధిస్తారు .బి.యే.వరకు విద్యా బోధన ఉంటుంది .ఇక్కడ చదివే వారిలో 99% హిందూ విద్యార్ధులే .ప్రభుత్వం ఫ్రీ గా పుస్తకాలు అందిస్తుంది .ఏడాదికి250 మంది విద్యార్ధులకు ఉచితం గా విద్య నేర్పిస్తారు .కాని దీనికి హిందూ స్కూల్ అనే పెరుండదు అంతే .12మంది టీచర్లు ,హిందూ ధర్మాన్ని యోగాను బోధిస్తారు .ఫీజులు చాలా తక్కువ .కిండర్ గార్టెన్ విద్యార్ధికి నెలకు యాభై ఆరు అమెరికన్ సెంట్లు మాత్రమె .సెకండరి వారికి ఒక డాలరు ముప్ఫై ఆరు సెంట్ల ఫీజు మాత్రమె .తొమ్మిదో గ్రేడ్ లో అవతారాలను ,నీతి కధలను ,వేదాంతాన్ని ,హిందూమతం యొక్క పుట్టు పూర్వాలను చరిత్రను  బోధిస్తారు .కర్మ ఫలాన్ని గురించి చెబుతారు .రామాయణ ,మహా భారత, భగవద్ గీత లను బోధిస్తారు . .భజనలు ,యోగా ,మంత్రాలు ,దేవతారాధన ,నైవేద్య విధానం నేర్పుతారు .విద్యార్ధులు ప్రతి రోజు స్కూల్ కు రాగానే అక్కడ ఉన్న దేవాలయానికి అందరు వెళ్లి దేవతలకు నైవేద్యం సమర్పిస్తారు .ప్రార్ధన చేస్తారు .ప్రతి పౌర్ణమి నాడు నాలుగు వేల మంది విద్యార్ధులుసాంప్రదాయ దుస్తులు ధరించి  సామూహికం గా పూజ నిర్వ హించి నైవేద్యం పేడ తారు .చూడటానికి రెండు కళ్ళు చాలవు .ఇక్కడ బోధించే ఉపాధ్యాయులు ”హిందూఇజం మాకు స్తిర చిత్తాన్ని ,ప్రశాంతతను ప్రసాదిస్తుంది ”అని చెబుతారు విద్యార్ధులు తమ మనసును కేంద్రీక రించే శక్తి అద్భుతం గా పెరిగింది అని తెలియ జేస్తారు .హిందూ ధర్మాన్ని తమ జీవితం లో అనుభవం లోకి తెచ్చుకోవటానికి ఆ స్కూల్ పుపయోగ పడుతోందని, విచక్షణ పెరుగు తోందని ,మంచి చెడు తెలుసుకో గలుగుతున్నామని అంటారు .తాము యే వ్రుత్తి లో ఉన్నా మంచి ,మానవత్వం ఉన్న మనిషులుగా    సంఘానికి ఉప యోగ పడే వారు గా మారాలని భావిస్తారు .
బాలి లో ”హిందూ యూని వేర్సిటి ” ఉంది .ఇది ప్రైవేట్ సెక్యులర్ విద్యా లయమే అయినా హిందూ ధర్మాన్ని తప్పక బోధిస్తారు .చదువు లో అదొక భాగమే .ఊబాద్ అనే చోట” ఆర్ట్ సెంటర్ ”ఉంది .అక్కడ బాలి సంస్కృతిని ,వేదాంతాన్ని ,కళలను నేర్పుతారు .అవి సకల సమాజానికి ఎలా ఉప యోగా పడాలో బోధిస్తారు .బాలి లో పద హారు సంస్కారాలను పిల్లలకు చేస్తారు .అందులో పై దవడ ముందు ఆరు పండ్లకు మెరుగు పెట్టటం ఒకటి .ఇక్కడి ముఖ్య పూజారి కొన్ని కథిన నియమాలను పాటించాలి ఆయన మోటార్ సైకిల్, కారు లను నడప రాదు .షాపింగు కు వేళ్ళ రాదు .సినిమాలు చూడ రాదు .పేకాట వ్యభిచారాలకు దూరం గా ఉండాలి .పూర్తీ శాకాహారమే భుజించాలి .ఇంటి నుండి బయటకు వెళ్ళేటప్పుడు ఒంటరిగా వేళ్ళ రాదు .ఎవరో ఒకరు తోడు ఉండ గానే వెళ్ళాలి .బాలి లో దేవాలయాలను కట్టే వారిని ”అందగీలు ”అంటారు .వీరికి విశ్వ కర్మ ప్రధానం గా ఆరాధనీయుడు .ఇల్లు ,దేవాలయం నిర్మాణం మొదలు పెట్టెటప్పుడు భూమి పూజ చేస్తారు .నిర్మాణం పూర్తి కాగానే ”మలపాస్ ”అనే తంతు జ రుపుతారు .దీని వల్ల  నిర్మాణానికి జీవ శక్తి లభిస్తుందని భావన .పంచ ధాతువులను నిక్షేపిస్తారు .అవి బంగారం వెండి ,రాగి ఇనుము రూబీ .ఇవి పంచ మహా భూతాలకు ప్రతీకలు .
బాలి లో సాంప్రదాయ హిందూ ధర్మాన్నే పాటిస్తారు .శంకర ,రామానుజ మొదలైన వారు సంస్కరణల పేరు తో దీన్ని కలుషితంచేశారని  భావిస్తారు ఇది నవీన హిందూ ధర్మమని దాన్ని పాటించం అనీ అంటారు .”ఆర్ద డాక్సు హిందూఇజం ”నె  ఆచరిస్తామని గర్వం గా చెప్పుకొంటారు .జంతు బలి వారికి నిషేధం లేదు .దేవుడిని మూడు లెవెల్స్ లో పూజిస్తారు .వారిది శైవ సిద్ధాంతం అని మనం ముందే చెప్పుకొన్నాం .పరమ శివుడు అత్యంత ఉన్నతుడు .ఆయన్నే”IDA SANGHYANG WIDI WASS ” అంటారు .ఈయనే వీరికి సర్వోత్కృష్ట దైవం .ఆ తరువాత సదా శివుడిని ఆ తరువాత శివుడిని ఆరాధిస్తారు .పరమ శివుడు నిర్గుణుడు ఆయనకు ఆకారం లేదు .సదా శివుడు ”అర్ధనారీశ్వరుడు ”అంటే సగుణ ,నిర్గుణ మాత్రమె కాక రెండూ ఆయనే .శివుడు ,శక్తీ అన్న మాట.మూడవ రూపం శివుడు .శివుడిని మహా రాజు గా భావించి ఆరాధిస్తారు .ఇదే శైవ సిద్ధాంతం .
దుర్గా దేవిని అంటే పార్వతి దేవిని, శివుడిని కొలుస్తారు .వారిద్దరూ ఒకే నాణానికి బొమ్మా బొరుసు అనుకొంటారు .ఏదైనా వింత జరగాలని మనసులో ఉంటె దుర్గా మాతను సేవిస్తారు .ఆమెను పది హేను రోజుల కొక సారి జంతు బలి తో పూజ చేయటం సంప్రదాయం .అక్కడ పూజా విధానం లో మూడు మార్గాలున్నాయి .వామాచారం బెంగాల్ నుంచి వచ్చిందని చెబుతారు .తాంత్రిక విధానం ఇందులో ఉంటుంది . మనిషి పగలు మానవుని గా ,రాత్రి పశువు గా కనీ పిస్తాడు .ఇదే వామ మార్గం .శక్తి మార్గం .అలాంటి శక్తి కల వాడు ఎవరి చెయ్యి పట్టుకొన్నా వాళ్ళ చెయ్యి పక్షవాతం వచ్చి నట్లు చచ్చు బడి పోతుంది .పర్యాటకులు తమ సామ్ప్రాదాయానికి ఇబ్బంది కలిగించ కూడదని వీరు కోరు కొంటారు .బాలీయులు త్రికరణ శుద్ధి పాటిస్తారు .మంచిగా ఆలోచించటం ,మంచిగా మాట్లాడటం ,మంచి చేయటం వారికి అలవాటైన విషయం .వారికి మూడు ”హిత కరణాలు”చాలా అభిమానమైనవి .అవే -ప్రకృతి పట్ల ఆరాధనీయభావన ,మానవుల యెడ సుహృద్భావం ,భగ వంతుని యెడ అపార విశ్వాసం .వారి జీవితం లో ”పంచ యజ్ఞాలకు ”ప్రాముఖ్యం ఉంది .మానవులకు ,జంతువులకు,దేవతలకు ,తమ పూర్వీకులకు ,ఋషులకు కానుకలు సమర్పించటం .ఇవన్నీ పాటిస్తే తాము” సదా శివులం” అయి పోతామని వీరి దృఢ విశ్వాసం .                    మీ–గబ్బిట దుర్గా ప్రసాద్ –20-9-12-కాంప్ -అమెరికా

Posted in సేకరణలు | Tagged | Leave a comment

బాలి లో జోరుగా వీస్తున్న హిందూ గాలి

బాలి లో జోరుగా  వీస్తున్న హిందూ గాలి 

అనేక శతాబ్దాలుగా బాలి లో హిందూ సంస్కృతి నిలిచి ఉండటానికి కారణం తమ సహన శీలతా ,చిరు నవ్వే నని వారు చెబుతారు .”నవ్వు అనే సంస్కృతి నర నరానా జీర్నిన్చుకొన్న వాళ్ళం మేము” అని గర్వం గా ప్రకటిస్తున్నారు .2002,2005లలో టెర్ర రిష్టులురెండు సార్లు  విరుచుకు పడినా నవ్వు తోనే వారిని ఎదుర్కొన్నామని చెబుతున్నారు .మౌనం ,ప్రార్ధన లతో వారికి సమాధానం చెప్పారట .ప్రతి రోజు దేశాన్ని కాపాడమని సామూహిక ప్రార్ధనలు చేశారట .ఒక్క హిందువు ల కోసమే కాదు మొత్తం ఇండో నేషియాకోసం ప్రార్ధనలు చేశారు వారు .ప్రతి రోజు ప్రత్యెక ఉత్సవాలు నిర్వ హించారట .అందరి సంక్షేమం కోసమే ప్రార్దిన్చామని వారు చెప్పారు .”ఆ దేవ దేవుని నుండి మాకు ఆశీర్వాదం, శక్తి లభిస్తాయి ”అని నమ్మకం గా చెప్పారు .
భారత దేశం తో సాంస్కృతిక సంబంధాలను నేల కొల్ప టానికి డాక్టర్ కరణ సింగ్ నాయకత్వం లో” Indian council for cultural relations ”బాలి లో అనే ప్రభుత్వ సంస్థ బాలి లో ఒక విభాగాన్ని ఏర్పరచింది .సాధారణం గా ఇలాంటివి దేశానికి ఒకటి మాత్రమె ఉంటాయట .కాని ఇండొనీషియా  లో రెండు కేంద్రాలను ఎర్పరచారట .ఒకటి జకార్తా లో ,రెండోది బాలి లో .దీని ఆధ్వర్యం లో అన్ని పండుగలు నిర్వ హిస్తారు .యోగా తరగతులు నిర్వ హిస్తారు .భరత నాట్యంనేర్పిస్తారు  మౌలనా అబ్దుల్ కలాం దీని వ్యస్థాపకుడు

.హిందీ నేర్పుతారు .ఇక్కడి విద్యార్ధులకు సంవత్స రానికి 30 స్కాలర్షిప్పులను ఇండియా లో చదువు కోవటానికి ఇస్తారు .అక్కడి వారు గణేష్ చతుర్ధి ని వైభవం గా నిర్వ హిస్తారు .Neiypi ,అనే పండుగను ,ప్రతి రెండు వందల పది రోజులకో సారి వచ్చే ”galungaan ” పండుగను చేస్తారు .ఇది పది రోజుల పండుగ .ఆ పది రోజుల్లో దేవత లంతా భూమి మీదకు దిగి వస్తారని వీరి నమ్మకం .యజ్న కర్మలను నిర్వ హిస్తారు .1960కి ముందు హిందువులు చాలా మంది క్రిస్టియన్లు గా మారారట.కాని ఆ తర్వాత మళ్ళీ కొన్నేళ్ళకు అందరు హిందువులుగా మారిపో యారట .
ఇక్కడ” world Huindu Youth organization ”HSC ను ఏర్పాటు చేసుకొన్నారు .బాలి లో హిందువు లందరూ ఒకే కుటుంబం లాగా కలిసి ఉంటారు .సంస్కృతే వారిని ఒకే కుటుంబం లా కలిపి ఉంచు తోంది .ఇక్కడ రక్షణ కోసం పోలీసు వ్యవస్థ లేదు .ప్రతి గ్రామం లో ప్రతి మూలా పౌరులే రక్షణ వ్యవస్థ ను నిర్వ హించటం ఇక్కడి ప్రత్యేకత .వీరిని ”పాచాలకులు ”అంటారు .అలాగే ఇక్కడ వివాహం జరిగితే తలిదండ్రులకు బాధ్యత తక్కువ .సమాజమే ఆ బాధ్యత నిర్వ హిస్తుంది .ఎవరిని పెళ్ళికి పిలవాలో అక్కర్లేదో యజమానికేమీ సంబంధం లేదు .పెళ్లి రోజు ను చెప్పటమే తలిదండ్రుల బాధ్యత .ఇక్కడి గ్రామ పెద్ద ”బంజార్ ”యే అందర్నీ ఆహ్వానిస్తాడు .ఆయనే పెళ్లి పెద్ద .అన్నీ గ్రామమే ఏర్పాటు చేస్తుంది .అలాగే ఇంట్లో ఎవరైనా చని పోయినా అంతే .గ్రామానిదే అంతా బాధ్యత .చావు యే ఒక్కడి విచారము  కాదు .అందరిదీ .పెళ్లి ఎలాగో ఇదీ అంతే .ఇదీ ఇక్కడి సమాజ బాధ్యత .బాలినీయులు తాము తమ కుటుంబం తమ సమాజం ,తమ దేశం కోసం ప్రార్ధనలు చేస్తారు .అందరు కలిసి సామూహికం ప్రార్ధించటం ఇక్కడి గొప్పతనం ,ప్రత్యేకతా .ఇదే సమాజాన్ని కలిపి ఉంచు తుంది .సమైక్య భావన, సోదర భావన యేర్పడ టానికిదే తోడ్పడు తుందని వారి నమ్మకం .
హిందువులు ఇతర మతాల్లోకి మారి పోకుండా ఉండ టానికి బాలి లో ”institute of Hindu dharma ”ను ఏర్పాటు చేసుకొన్నారు .స్వామి వివేకా నంద ,సత్య సాయి బాబా ల ప్రభావం ఇక్కడ బాగా పని చేసింది హిందూ అనాధ పిల్లలకు రక్షణ కల్పిస్తున్నారు .ఎనిమిది అనాధ ఆశ్రమాలను ఏర్పరచి సేవ లందిస్తున్నారు .అందరికి శాకా హార భోజనమే .బాలి ఇండియన్ ఫ్రెండ్షిప్ అసోసియేషన్ దీన్ని పర్య వేక్షిస్తుంది .భారతీయ సంప్రదాయాలను ఇక్కడ ఇంకా పటిష్టం గా అనుసరిస్తున్నారు .ఎడమ చేతి తో ఏదైనా ఇవ్వటం కాని చూపుడు వ్రేలితో ఎవరి నైనా చూపించటం కానిచేయరు .అలా  చేస్తే అపవిత్రం  గా భావిస్తారు .వారి భావన ప్రకారం భారత దేశం లోని హిందువులు కలుషితం అయారు .కాని ఇక్కడి హిందువులు చాలా స్వచ్చం గా ఉన్నారు అంటారు. వారి ఉన్నత సంస్కారం మనందరికి ఆదర్శనీయం అని బాలి ని సందర్శించిన హిందువులు చెబుతున్నారు .
బాలి కమ్యునిస్టు వ్యతి రేక భావనలున్న ప్రదేశం .1960లో ఇక్కడి ప్రభుత్వం మత విధానాలకు ఒక మంత్రిత్వ శాఖ ను ఏర్పరచింది కాని అందులో” ఆగమ తీర్ధం ” అనే దానికి మాత్రం గుర్తింపు నివ్వ లేదని బాలీ హిందువులు బాధ పడతారు .ఇక్కడి ముస్లిములు హిందూ పేర్లను పెట్టు కొంటారు .ఇక్కడి శూద్రులు అంటే ఇండియా లో లాగా తేలిక భావం లేదు .గర్వం గా భావిస్తారు .రామాయణ  మహా భారతాలు వారి జీవన సంస్కృతి లో భాగమై పోయాయి .వీటికి సంబంధించిన నాటకాలలో ముస్లిములు ఆ పౌరాణిక పాత్రలను ధరించి రంజింప జేస్తారు .అక్కడి ఒక హిందూ పెద్ద చెప్పిన విషయం గుర్తుంచు కో తగినది ”అయిదు వందల ఏళ్ల క్రితం హిందువులు బాలి లోకి ప్రవేశించారు .వారి మతాన్ని కాపాడు కోవటం కోసం” పంది  మాంసాన్ని” తిన్నారు .అలా చేయటం వాళ్ళ ముస్లిములు తమను మతం మార్చుకోమని బల వంతం చేయరు అని భావించారు .ఆ ”స్ట్రే ట జి” ఫలించింది .కనుక మతాంతీకరణ చాలా అరుదు గా జరిగి వీరంతా హిందువులు గా నె ఉండి పోయారు .
ఇక్కడి పూజారులు త్రీ సంధ్య లలో పూజ చేస్తారు ఆరు శ్లోకాలను చదివి పూజ నిర్వ హిస్తారు .మొదటి శ్లోకం లో భూమి ఆకాశం ,స్వర్గాలను దేవతలు అని సూర్యుడు దేవుని ప్రతి నిది అని తమ లోని ఉన్నత భావాలకు ఆ కాంతి కారణం అనీ అర్ధం వచ్చే శ్లోకంచదువుతారు . .రెండోది నారాయణునికి చెందింది .నిర్గుణ నిరాకార స్వయంభు గా ఏక నిరంజన్ గా ఆయన్ను స్తుతించే శ్లోకం .మూడవది శివుడికి చెందినది .ఆయనే మహాదేవుడు , ఈశ్వరుడు , బ్రహ్మ,విష్ణు ,రుద్రా ,పురుష , అని భావిస్తారు .అన్నిటికీ ఆయనే మూలం .సర్వ శక్తి మంతుడు .నాల్గవ శ్లోకం లో తామంతా పాపాత్ములమని తమ పాపాలను పోగొట్టమని దుఖం పోగొట్టి ,శారీరక మానసిక బౌద్ధిక శాంతిని కల్గించమని ప్రార్ధిస్తారు .అయిదవ దానిలో మహా దేవుడిని ముక్తిని ఇవ్వమని కోరుతారు .మార్గ దర్శి యై మంచి మార్గం లో ప్రయానిన్చేట్లు చేయమని ప్రార్ధిస్తారు .ఆరవ శ్లోకం లో చేసిన తప్పులు పాపాలు క్షమించి శాంతి సుఖాలను త్రీ శాంతులను ఇవ్వ మని ప్రార్ధిస్తారు .వీటి వల్లనే ఇక్కడి హిందూ ధర్మం సజీవం గా శతాబ్దాల పాటు ఉంది అని బాలినీయుల భావన . ఇక్కడ ”మహర్షి మార్కండేయ యోగా సిటి ప్రాజెక్ట్ ”యోగా శిక్షణ నిచ్చే అతి పెద్ద కేంద్రం .దీనిలో యోగా ,ఆయుర్వేదం ,ధ్యానాలను నేర్పుతారు .
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –20-9-12-కాంప్–అమెరికా
Gabbita Durga Prasad

Posted in సేకరణలు | Tagged | Leave a comment

శ్రీ శంకరుల లలి (కవి ) తా సౌందర్య లహరి –2

 శ్రీ శంకరుల లలి  (కవి ) తా సౌందర్య లహరి –2
2–” తనీ యామ్శుం పామ్శుం ,తవ చరణ పంకేరుహ భవం –విరిన్చిహ్ సంచిన్వన్ ,విరచ యతి ,లోకాన వికలం
వహత్సేనం ,శౌరిహ్ ,కధ మపి సహస్రేణ శిరసాం –హరః ,సంక్షుద్యైనం ,భజతి ,భస్మో ద్ధూలిన విధిం ”.
తాత్పర్యం –అమ్మా !నీ పాద ధూళి రేణువు తగిలి ,బ్రహ్మ దేవుడు చరా చర సృష్టి చేస్తున్నాడు .ఆ రేణువు నే ,వేయి తలల తో అనంతు డైన విష్ణువు  మోస్తున్నాడు .దానినే ఈశ్వరుడు భస్మం గా శరీరం అంతా పూసుకొంటున్నాడు .
విశేషం –శ్రీ దేవి పాద ధూళి యే ,బ్రహ్మ ,విష్ణు ,శివ దేవులకు సృష్టి ,స్తితి ,లయ శక్తులకు కారణం అవుతోంది .ఆ మాయా గుణాలే ,సత్వ ,రజ ,తమోగుణాలు .విష్ణువు శింశు మార (మొసలి )రూపంతో ఊర్ధ్వ లోకా లను ధరిస్తున్నాడు .శేష రూపం లో అతల మొదలైన అదో లోకాలను ధరిస్తున్నాడు .శివుడు భస్మ స్నానం చేస్తున్నాడు .అంటే పృధివి ,నీరు అగ్ని ,వాయువు ఆకాశం అనే పంచ భూతాలు భస్మం చేస్తున్నాడని భావం .”అగ్ని రితి భస్మం ,వాయురితి భస్మం ,జలమితి భస్మం ,స్థల మితి భస్మం వ్యామేమితి భస్మం సర్వం హువా ఇదం భస్మమన ఏతాని చక్శూమ్సి భస్మాని ”అని ఉంది .
పృధివి మొద లైనవి అమ్మ వారి చరణ ధూళి కణాలు అవుతుంటే ,ఆమె స్వరూపం తెలుసు కోవటం ఒక్క శివ మహా దేవుడికే సాధ్యం అని అర్ధం .రజో గుణం అనే పంకేరుహం లో బ్రహ్మ సృష్టి చేస్తుంటే ,శుక్ల చరణ పంకేరుహం తో విష్ణువు పోషిస్తుంటే ,మిశ్ర చరణ పంకేరుహం తో శివుడు లయం చేస్తున్నాడని విశేషం .సృష్టికి ఉపాదాన కారణం ”పరమాణువులు ”అనీ ,కణాదుడు గౌతముడు మొదలైన మహర్షులు సిద్ధాంతం గా ఎప్పుడో చెప్పిన సంగతి మనకు తెలుసు .వేదాంత భావన లో ఈశ్వర ఇచ్చాశక్తియే ప్రధాన కారణం అని చెబుతారు .
3— ”అవిద్యానాం అంతస్తిమిర మిహిరోద్దీపన కరీ–జడానాం ,చైతన్య స్తబక మకరంద శ్రుతిఝరీ
దరిద్రానాం ,చింతా మణి ,గుణ నికా, జన్మ జలధౌ –నిమగ్నానాం ,దంస్ట్రా మురరిపు ,వరాహస్య భవతి ”.
తాత్పర్యం —జననీ !నీ పాద కమల రేణువు,లోపల ఉన్న అజ్ఞానం అనే చీకటికి సూర్య కిరణం లాంటిది .జ్ఞానం కలిగిస్తుంది .మంద బుద్ధులకు చైతన్యం అనే కల్ప వృక్ష పుష్పం యొక్క మకరందం .దీనులకు అన్ని కోర్కె లను తీర్చే చింతా మణి .జనన ,మరణ ,సంసార సముద్రం లో మునిగి ఉన్న వారికి యజ్న వరాహ మైన విష్ణువు యొక్క దంష్ట్రం (కోర ).లలితా పరా భట్టారిక ను స్తుతిస్తే -అవిద్య ,జడత్వం ,దరిద్రం, జనన ,మరణ భయాలు ఉండవు అని స్పష్ట పరుస్తున్నారు శంకర భగవత్పాదులు .
4–”త్వదన్యహ పాణిభ్యా ,మభయ  వరదో ,దైవత గణః –త్వమేకా ,నైవాసి ,ప్రకటిత ,వరా భీత్య భినయా
భయాత్రాతుం ,దాతుం ,ఫలమపి ,చ ,వాన్చా సమధికం –శరణ్యే ,లోకానం,తవహి ,చరణా వేవ నిపుణౌ ”.
తాత్పర్యం -భవానీ ! ఇతర దేవతల చేతి లో అభయ వర ముద్రలు ఉన్నాయి .అందరి కంటే ముఖ్యురా లైన నీ చేతులలో ఆ ముద్రలనేవి లేనే లేవు .అయితే నేమి ?నీ పాదాలే, భయం నుంచి కాపాడి ,కోరిన దాని కంటే ఎక్కువ ఇచ్చే అధిక సామర్ధ్యం కలవి .అవే  మాకు దండి .పాశ ,అంకుశ ,ఇక్షు ,బాణాదులే ఆమె హస్తాలలో ఉంటాయి .ముద్రాభి నయం అనేది లేదు కనుక ఆమె పాదాశ్రయమే భోగం, మోక్షం అని భావం .
సశేషం –మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ —20-9-12-కాంప్–అమెరికా

Posted in రచనలు | Tagged | Leave a comment

బాలి లో భగ వంతుడు

 బాలి లో భగ వంతుడు 

ఇండో నేశియా లోని బాలి లో హిందూ మతం విస్తృతం గా వర్ధిల్లింది .వర్ధిల్లు తోంది .అక్కడ వినాయకుడి విరిగిన దంతం విషయం లో ఒక చర్య చేబడతారట .ఇది మన దేశం లోని కధకు ఆధారం.చిన్న పిల్లలకు పై దవడ లోని ఆరు ముందు పండ్లను   మత పెద్ద, సాన పెడతాడట .ఈ ఆరు కామ ,క్రోధ ,లోభ ,మద ,ఈర్ష్య ,మోహ గుణాలకు ప్రతీకలు గా భావిస్తారట .వారి దేశం లో చెడ్డ దెయ్యం అనేది లేదు .వాటిని సౌమ్య జీవులుగా భావిస్తారట .వాటికి కావలసినవి నైవేద్యం పెట్టి ,దాన్ని దైవం గా మార్చటానికి ప్రయత్నిస్తారట .చెడును చంపటం వాళ్లకు ఇష్టం లేని పని .వాటిని మార్చటమే వారి ధ్యేయం .వాళ్ళ దృష్టిలో శివుడు అంటే సంహారకుడు కాదు .శివుడు మార్పు తెచ్చే వాడు కాని నాశన కారుడు కాదు .దేవుడు సృష్టించినది ఏదైనా చెడు అని అంటే ,లేక దేవుడికి ఇష్టం లేదని అంటే దేవుడే చెడ్డ వాడు అనే అభి ప్రాయం కల్గుతుందట .అదీ దేవుడే సృష్టించాడు కనుక చెడ్డది అంటూ లేనే లేదు .భాగ వంతుడు సృష్టించిన దానిలో చెడు ఉండదు .అంతా పవిత్రమైనదే అని వారి అభిప్రాయం .ఇండో నేశియా అంటే ముస్లిం దేశం కాని అక్కడ ఆ భేదం ఎక్కడా కానీ పించాడు .బాలి లో దేవాలయాలను ,ఇళ్లను నిర్మించే టప్పుడు ”భూమి పూజ ”చేస్తారు .దీనికొక అర్ధం వారు చెబుతున్నారు .అదేమిటంటే ”బాలి లో ఉన్న హిందువు లైన మేము ఇక్కడి భూమి పుత్రులమే ఎక్కడి నుండో ఇతర మైన చోట్ల నుంచి వచ్చిన వారం కాము అని తెలియ జేయటానికే ”అని చెబుతారు .
బాలి లో హిందూ మతం క్రీ.శ .500 లో ప్రవేశించిందని తెలుస్తోంది .మార్కండేయ మహర్షి ఇక్కడ హిందూ మతాన్ని స్థాపించాడని వారి విశ్వాసం .1500లో మహర్షి ద్విజేంద్ర బాలి కి వచ్చారట .నాలుగవ శతాబ్దం లో మొదటి హిందూ సామ్రాజ్యాన్ని ,కుల వర్మన్ స్తాపించాడని చరిత్ర చెబు తోంది .ఇక్కడికి వచ్చిన హిందువులు అందరు దాదాపు దక్షిణ భారత దేశం నుంచి ఒరిస్సా రాష్ట్రం నుండే వచ్చారట .ఇక్కడ శైవ ,శాక్తేయ ,తంత్ర ,పురాణ ,వైష్ణవ బుద్ధ ఆరాధనలు కన్పిస్తాయి .ఇవన్నీ కలిసి పోయి ఇప్పుడు శైవ సిద్దాన్తమొక్కటే కానీ పిస్తోంది .అందుకే ఇండో నేషియా ను ”శైవ సిద్ధాంత ఇండో నేషియా ”అంటారు .కనుక బాలినీయుల హిందూ మతం అంటే శైవ సిద్ధాంతమే .ఇక్కడ ద్వైత ,అద్వైత సాంప్రదాయాలు రెండు ఉన్నాయి .మజీవుడికి దేవుడికి భేదం ఉంది అంటే ద్వైతులు నమ్ముతారు .జీవుడే దేవుడు అంటే అద్వైతులు ఆనందిస్తారు .ఈ రెండూ కూడా బాల్నీస్ ను బాల మైన హిందువులు గానే చేసింది కాని భేద భావాన్ని కల్గించక పోవటం ఇక్కడి గొప్ప విషయం .
బాలినీయులు ఒంటరిగా ఎక్కడికీ వెళ్లారు .కుతుమ్బాలతోనే కలిసి వెళ్తారు .అందరు కలిసి దేవాలయానికి వెడితే దేవుడు సంతోషిస్తాడనే నమ్మకం వారిది .వారు అతిధులకు నమస్కారం చేసి ”ఓం స్వస్తి రస్తు  ”అని పలకరించటం సంప్రదాయం ”.భగవదాశీర్వాదం మీ పైన వర్షించు గాక ”అని అందులోని అర్ధం .బాలి లో 600మంది పూజారులున్నారు .అందరు బ్రాహ్మణులే .ఇక్కడ ”అబ్రాహ్మణుడు ”అనే మాట విని పించదు .ఆది నేరం .పూజారులు అన్ని కులాల కు సంబంధించిన వారూ ఉన్నారు .గురు శిష్య సంప్రదాయం లో వారికి శిక్షణ నిస్తారు .ఆడ వారు కూడా పూజార్లు గా ఉండటానికి అర్హత ఉంది .సాధారణం గా భార్యా భర్తా కలిసి కార్య క్రమాలను నిర్వ హిస్తారు .అలా చేస్తే ఫలితం ఎక్కువని వీరి నమ్మకం .ఇక్కడి దేవుళ్ళు ముఖ్యం గా ముగ్గురు .వారే మన త్రిమూర్తులు బ్రహ్మ, విష్ణు, శివుడు .బాలి లో తమ పూర్వీకులు అందించిన సంస్కారాల వల్ల  తర తరాలుగా ప్రశాంతం గా జీవిస్తున్నామని చెబుతారు .వాటి వల్లే తాము శక్తి వంతం గా బలీయం గా ఉన్నామని అంటారు .అక్కడ విగ్రహారాధన ఉండదు .ఎత్తైన వేదికల మీద దేవుళ్ళను ఆహ్వానించి వారికి పూజ చేస్తారు .ఈ విధానం అంతా పూజారే నిర్వ హిస్తాడు .అతనికి సహాయ కులుంటారు .బాలి లో గ్రామాన్ని ”దేశం ”అంటారు .దేశం లో అంటే గ్రామం లో బ్రహ్మ గుడి ఊరికి మధ్యన ,విష్ణు గుడి పొలాల దగ్గర ,శివాలయాన్ని శ్మశానం దగ్గర నిర్మిస్తారు .గ్రామం లోని భూమి అంతా అందరిదీ .అందరు వచ్చి దేవాలయాలలో పూజ చేయాలి .గ్రామ నిబంధనలను పాటించక పోతే గ్రామం వదిలి వెళ్లి పోవచ్చు .హిందూ మతం లో నుంచి ఇంకో దాని లోకి మారినా గ్రామం వదిలి వెళ్లి పోవాల్సిందే .అంతా కర్మ ఫలం అని నమ్ముతారు .
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –19-9-12-కాంప్-అమెరికా

Posted in సేకరణలు | Tagged | 1 Comment

చవితి చేష్టలు

చవితి చేష్టలు

తెల్లా రిందో లేదో మా బామ్మర్ది యోగా నందం ఫోన్ చేసి పెట్టేశాడు .మేం అమెరికా లో ఉన్నాం కదా .ఇక్కడి నుంచి మేం ఫోన్ చేస్తే వాడికి పైసా ఖర్చు లేదు కదా ఆ రహస్యం తెలిసి పొద్దున్నే మేల్కొన్నట్లున్నాడు .ఏదో పండగ కబుర్లు తెలుసు కొందామని వాడి ఆరాటం .అమెరికా లో వినాయక చవితి అంటే యెట్లా ఉంటుందో నని వాడి అనుమానం .వినాయకుడి విగ్రహాలు దొరుకు తాయో లేదో పత్రికి ఏం తంటాలు పడాలో నని భయం వాడికి .భాక్షాలు  లేహ్యాలూ చోశ్యాలు లుఎలా అని మరీ సందేహం ..సరే  నేనే ఫోన్ చేశా .గోతి కింద కాచుక్కూచుంటాడు కదా ఆలస్యం చేయకుండా ఎత్తాడు ”.ఏమిట్రా విశేషాలన్నాను” .”బావా నువ్వు కనీసం పండగ శుభా కాంక్షలు చెప్ప క పోయినా నాకు తప్పదు కదా. బావా వినాయక చవితి శుభా కాంక్షలు అన్నాడు .”మీ అందరికీ కూడా ”అన్నా ముక్త సరిగా .”అక్కడ పండగ యెట్లా చేసుకొంటారు ?”అని వాడి తిరుగు టపా ప్రశ్న .”మామూలుగానే .పిల్లలు స్కూల్ కు వెళ్ళే ముందు లఘువు గా చేసి ఆ తర్వాతా తీరిగ్గా అసలు పూజ చేస్తాము ”అన్నాను .”’సరే -పండగ స్పెశాల్సేమిటి “?అని మళ్ళీ లకోటా .” ఏముందిరా ‘ ఉండ్రాళ్ళు పరవాన్నం ,పులిహోర మామూలే ”అన్నాను .”’ఇవి ఇంట్లో చేస్తారా ?ఎక్కడ్నించి అయినా పార్సిల్ తెప్పిస్తారా ?”వాడి చవట ప్రశ్న.”ఒరే ! మన దేశం లో ఎలా చేస్తారో ఇక్కడా అంత కంటే శ్రద్ధగానే చేస్తారు  .మీ అక్కయ్యే మడి కట్టు కోని అన్నీ చేస్తుంది .నేను మడి కట్టుకొని పూజ చేస్తా ”అన్నాను  .”అబ్బో శానా ఉందే .అక్కడ కూడా ఈ ఆచారాలున్నాయా ?”అని మళ్ళీ తిక్క ప్రశ్న .ఇప్పటికే సహనం పోయింది నాకు .”సరే ఇండియా వదిలి మేం నెల అయింది .అక్కడి విశేషాలేమిట్రా “‘అన్నా టాపిక్ డైవేర్ట్ చేయ టానికి .
ఇప్పుడు బల్బు బాగా వెలిగింది .”బోలెడున్నాయి .ఈ సారి వినాయక చవితి చాలా ఆశావహం గా అందరు చేశారు బావా “‘అన్నాడు .”ఆశావహం ‘అంటే ”అన్నాను నేను .”ఏంలేదు బావా “అందరు ఏదో ఆశించి  ఈ చవితిపూజ చేశారు .ఒక్కొక్కడి మనసు లో ఒక్కో కోరికా .తప్పక గణపతి దేవుడు తీరుస్తాడని ఆశ ”అన్నాడు .”చానళ్ళలో ఆ విశేషాలు చూపిస్తున్నారా ?”అన్నాను .”మరీ రెచ్చి పోయి చూపిస్తున్నారు బావోయ్ ”అన్నాడు .”యే చానెల్ లో బాగుందో చెప్పు చూస్తాను ”అన్నాను . ”ఛా.ఛా”అన్నాడు .అదే మిట్రా చేనల్ పేరు చెప్పమంటే ఏదో ”ఛీఛీ ”అన్నట్లు ఒక్క సారిగా ”ఛా. ఛా ”అన్నావు?”అని ప్రశ్నించా .”పొరబాటు పడ్డావు బావే ,నన్ను అపార్ధం చేసుకోన్నావు .నేను చెప్పింది కొత్త గా వస్తున్నా” ఛా ఛా ”చానెల్ పేరేనీకు  చెప్పింది . ”ఆపేరేమిట్రా అసహ్యం గా ”అన్నాను .ఆది సరైన పేరే బావా .దాని అర్ధం ”ఛానళ్ళకు ఛాలెంజి ”చానెల్ .బలే గా ఉందిలే .జనం విరగ బడి చూస్తున్నారు .మీక్కూడా వస్తోందేమో చూడు .మాకిక్కడ అమెరికా లోను విజయ యాత్ర చేస్తున్న చానల్ అని .తెగ డబ్బా కొడుతున్నారు .నువ్వెప్పుడు పెట్టి చూడ లేదా ?”అని కసురుకోన్నంత పని చేశాడు .”నేను మా మూలు చానళ్ళే సరిగ్గా చూడటం లేదు .ఈ తొక్కలో చానళ్ళు ఎక్కడ చూడను?చదువుకోవ టానికే నాకు టైం చాలటం లేదు ఈ ప్రయోగాలు నేను చెయ్యలేను .మీ అక్కయ్యకూ విసుగే నని తెలుసు గా నీకు ”అన్నాను ”.సూక్ష్మం గా అందులో కొత్త విశేషాలేమితో తెలియ జేయి బామ్మర్డీ ”అన్నాను. .
” బావా ! ఈ సారి వినాయక చవితిని బలేగా ఎంజాయ్ చేశాం .మన రాష్ట్ర ముఖ్య మంత్రి గారు వినాయకుడి ముఖాన్ని సోనియాముఖం గా  చేయించి పూజించాడు .కే.సి.ఆర్ .గణపతి ముఖానికి తెలంగాణా తల్లి ముఖం పెట్టించాడు .చిరంజీవి ”అంతూలే ముఖం పెట్టించి పూజించాడు .తనను పార్టీ లోకి ఆహ్వానించింది ఆయనే కదా ఆయనే కేంద్రం లో పదవి ఇప్పిస్తాడని ఆశ గా .బొత్సా గారు మాత్రం ”వోక్సు వాగన్ ”ముఖం పెట్టించాడు మళ్ళీ వస్తుందనే ఆశ .చంద్ర బాబు వినాయకుడికి రెండు ముఖాలు పెట్టించాడు .ఒకటి ఆంధ్రా ముఖం ,రెండోది తెలంగాణా ముఖం ట .మంత్రి వెంకటేష్ రాయలతెలంగాణా కోరే వాడు కనుక ”వినాయకుడి ముఖాన్ని రాయల వారి ఫోజు తో చేయించి పూ జించాడు .జై ఆంధ్రా ఉద్యమ నాయకులు తెన్నేటి విశ్వ నాదం గారి . ఆకారం పెట్టించారు .మూడు ముక్కలు కావాలను కొనే వారు మూడు ముఖాలు చేయించి పూజించారు .ఇవన్నీలైవ్ లో బలే రంజు గా చూపించారు ఛా ఛా వాళ్ళు ”అని ఊపిరి పీల్చుకొన్నాడు యోగి .
” అన్నీ బానే ఉన్నాయి కాని అసలైన పార్టీ కాంగ్రెస్ ఎముఖాన్ని పెట్టి పూజ చేసింది ?” అని అడిగాను .దానికి వాడు ”ఇదీ తెలీదా బావా ! యే ముఖం పెడితే ఏమి కొంప మునుగు తుందో నని తలకాయ లేకుండా గణేశుని చేయించి పూజించారని చెవులు కొరుక్కుంటున్నారు బావోయ్ ”అన్నాడు .”మరి దీన్ని ఛా ఛా లో చూపించాలేదా ”అడిగాను .”ఛీ.ఛీ.చూపించలేదు బావా .చూపిస్తే ఏమవుతుందో నని పార్టీ ఆఫీసులో నె తంతు జరిపించేశారని, ముఖ్యులైన వారికే ప్రవేశం కల్పించారని, మీడియా వారికి ప్రవేశం లేదని తెలిసింది బావా” ”బానే ఉంది మరి తెలంగాణా ఎప్పుడు వస్తుందని అనుకుంటున్నారు “?అని అడిగా .”అందరి పార్టీ లలోపలి గోడ ల  పై ”రేపు ‘అని రాసుకోన్నారట బావా .ఆది సీక్రెట్ .ఎవరికీ చెప్పట్లేదు ఆ రాత చూపించటం లేదట .”జైపాల్ రెడ్డి సి.ఏం .అవుతాడని ఇక్కడిమిత్రులు అంటున్నారు అక్కడ ఆ వాసన యే మైనా ఉందా “‘? అని అడిగా ”.అందుకనేనేమో బావా ఈ మధ్య ఆయన్ను చాలా క్లోజప్ లలో చూపిస్తున్నారు .అక్కడున్నా నువ్వు బలే గా పసి కట్టావే “”?అన్నాడు ఆశ్చర్యం గా .”బావా ! అక్కయ్య ఎప్పుడూ ఏదో వే రైటీ గా గణేష్ ను చేస్తుంది కదా ఈసారి ఎలా తయారు చేసింది ?అని కుతూహలం గా అడిగాడు ”? ”ఈ సారి వినాయకుడికి” పెరట్లో గణ పతి ”అని పేరు పెట్టింది మీ అక్కయ్య .ఇక్కడి పెరట్లో పండిన సొరకాయ, దోసకాయ,బీరకాయ,  టమేటా,చమ్మ కాయలతో వినాయకుడిని చేసింది .ఇక్కడ మట్టి విగ్రహాలు దొరకవు .ఎవరో ఆ మధ్య గిఫ్టు గా మంచి అందమైన గణేష్ విగ్రహాన్నిచ్చారు .ఈ రెండిటి తో పూజ  చేశాం .చాలా ఆకర్షణీయం గా ఉన్నాయి .బంతి పూలు, చామంతి పూలు ,మల్లెపూలు, మందారాలు, మరువం గులాబీ లతో పూజ బాగా చేశాం .ఇవీ దొడ్లో పూసినవే .అందుకే ఈ సారి పూజ  మాకూసరదాగా ఉందనిపించింది .దేశాలు వేరు అయినా భావన ఒక్కటే .మా” ఛీమతి ”అదే మీ అక్కయ్య పిలుస్తోంది .ఛా ఛా – నీ చానల్  ప్రభావం నా మీదా పడింది శ్రీ మతి అనటానికి” ఛీ మతి” అని వచ్చింది నోటి వెంట ఛీ ఛీ …” అని ఫోన్ పెట్టేశాను ”బావా బావా ”అని అరుస్తూనే ఉన్నాడు యోగానందం బామ్మర్ది .
 గణేష్ చతుర్ధి శుభా కాంక్షల తో –మీ గబ్బిట దుర్గా ప్రసాద్ –19-9-12–కాంప్–అమెరికా

Posted in సమయం - సందర్భం | Tagged | 1 Comment

శ్రీ శంకరుల లలి (కవి )తా సౌందర్య లహరి -1

  శ్రీ శంకరుల లలి (కవి )తా సౌందర్య లహరి -1
 సరస భారతి సాహితీ బంధువులకు –హార్దిక శ్రీ వినాయక చతుర్ధి శుభా కాంక్షలు 
ఈ శుభ సందర్భం గా శ్రీ ఆది శంకరా చార్యుల వారి అపూర్వ కవితా సృష్టి” సౌందర్య లహరి ”ని ధారా వాహికం గా మొదలు పెడుతున్నాను .ఇందులో శ్లోకం ,తాత్పర్యం తో పాటు అవసర మైన విశేషాలను మాత్రమె అందరికి అందు బాటు లో ఉండే టట్లు తెలియ జేయటమే నా లక్ష్యం . ఇందులో భాగ వత్పాదుల కవితా సౌందర్యాన్నీ వెలువ రించటం కూడా ఉంది .అందుకే దీనికి ”లలి(కవి )తా సౌందర్య లహరి ”అని పేరు ఉంచాను .  .వచ్చేది అమ్మ వారికిష్టమైన శరన్నవ రాత్రులు కనుక ఈ ప్రయత్నం .సమాదరిస్తారని ,అమ్మ వారి కరుణా కటాక్షలహరి  మనందరి పై ప్రస రించాలని కోరుతున్నాను .మీ–దుర్గా ప్రసాద్
” శృతి స్మృతి పురాణామాలయం కరుణా లయం –నమామి భాగవత్పాదం శంకరం లోక శంకరం ”
సౌందర్య లహరి ని పరమ శివుడే ,పర దేవత ను స్తుతిస్తూ చెప్పినదని ,శ్రీ శంకర భాగ వత్పాదులు లోకానుగ్రహం బుద్ధి తో వెళ్ళ డించారని ప్రతీతి .ఇది భక్తీ సాహిత్యం లో మణి పూస గా పేర్కొన బడింది .సమయ మతాన్ని అనుసరించే శ్రీ విద్యోపాసకుల కు ఇది గౌరవ శ్రేష్టమైన గ్రంధం .ఇందులో శాక్త మతాన్ని సమర్ధి స్తున్నట్లు గా కనీ పిస్తుంది .కౌల ,మిశ్రమ ,సమయా చారాలు అని శాక్తేయ మతం లో మూడు రకాలున్నాయి .కౌల ,మిశ్రమ వారికి ఐహిక దృష్టి ఎక్కువ .సమయా చారు లది పరమార్ధ దృష్టి అని తెలుస్తుంది .షణ్మతస్థాపకు లైన భాగ వత్పాదులు శక్తి ఉపాసకులను సంస్కరించి ,వైదిక పద్ధతి  గా తన మార్గాన్ని చూపారు .ఇందులో మొదటి శ్లోకం అన్ని శ్లోకాలకు సార భూత మైన దానిని గా భావిస్తారు .
ఆగమాలు అంటే సగుణ బ్రహ్మ ను గురించి చెప్పేవి .ఇందులో తంత్ర గ్రంధాలు ముఖ్య మైనవి .ఇవే మంత్ర శాస్త్రాలని పిలువ బడుతాయి .సామాన్యులకు కూడా ఇవి అర్ధమవు తాయి .ఇందులో శైవ ,వైష్ణవ ,శాక్త ఆగ మాలు అని మూడు రకాలున్నాయి .శక్తి ని జగన్మాత గా ,పర తత్వం గా చెప్పేవి శాక్తాగమాలు .కౌల ,మిశ్రమ ,సమయ అని ఇందులో మూడు రకాలు .మిశ్రమాగమాలు -ధర్మ ,ఉపాసనా వివరణ ఉన్నవి .ఇందులో కుండలినీ శక్తి వివరణ ,దాని ఉత్థానం ,అవలంబించాల్సిన సాధన ప్రక్రియ తెలియ జేయ బడుతుంది .సమయ మతం అంటే పర మార్దదృష్టి తో కర్మ మార్గాన్ని వదిలి జీవ బ్రహ్మఐక్యాన్ని గురించి చెప్పేది .”బ్రహ్మం నాలోనే ఉన్నాడు ”అని సమయ శబ్దానికి అర్ధం .ఈ పద్ధతి లో శక్తిని ఉపాశించాలని చెబుతుంది .సమయ  అంటే ”సహ మయ ”అని అర్ధం చెబుతారు .
కేన ఉపనిషత్ లోని ”ఉమ”సాక్షాత్కారాన్ని విపులీకరించే దే ”సౌందర్య లహరి ” కుండలిని జాగృతం చేసి ,మూలాధారం నుంచి ,పైకి తెచ్చి ,షట్ చక్రాలను భేదం చేయించి ,సహస్రారం లో చేర్పించటం ఇందులో చెప్ప బడిన ముఖ్య విషయం .కౌల మతం వారికి మూలాధారం లోనే ఉపాసన ఉంటుంది .సమయా చార సారమే సౌందర్య లహరి .నిర్గుణ బ్రహ్మాన్ని తెలుసు కోవటం సామాన్యులకు వల్ల  కాని విషయం .అటు వంటి వారికి పర తత్వం సగుణ మైనదే అని శ్రీ శంకరులు అంటారు .బ్రహ్మం దాని కది గా నిష్ప్రాపంచికం గా ,చూస్తె ,నిర్గుణమే .అవాన్మానసమే .ప్రాపంచిక దృష్టి లో చూస్తె మాత్రం సగుణమే .బ్రహ్మం మాయ తో కూడి నప్పుడు ఈశ్వరుడు అవుతాడు అని తాత్పర్యం .భక్తుల కోసం దేవతా స్వరూపం ధరిస్తాడు .శివ ,విష్ణు, దేవీ, సూర్య ,గణపతి,  కుమార స్వామి పూజా విధానాలను సంస్కరించి ,ప్రార్ధనా శ్లోకాలను  శంకరా చార్యుల వారు మనకు ఎంతో మేలు చేశారు .ఈ దేవతా మూర్తులు వేరైనవి కావు .పర తత్వ రూపాలే అని తెలియ జెప్పారు .ఇందులో యే దేవత నైనా స్వార్ధ త్యాగ బుద్ధి తో పూజిస్తే ఈశ్వరానుగ్రహం లభిస్తుంది .అప్పుడు అద్వైత భావన కలిగి ముక్తి లభిస్తుంది .వేద విరుద్ధ మైన వాటిని విసర్జించి ,వేద విహిత మైనవీ ,శుద్ధ మైన ఆగమ పూజలను ఆచార్యుల వారు అంగీక రించారు .అదే షణ్మత స్థాపన అని పెద్దలంటారు .
శ్రీ విద్య -లో జ్ఞాన ,కర్మ లు కలిసే ఉంటాయి .ఇది క్రియ తో కూడిన అద్వైత సాధనం గా పరిగ ణిస్తారు .బ్రహ్మ విద్యా స్వరూపమే ఇది అని స్పష్టం చేస్తారు .శక్తి లేని శివుడు కర్తృత్వ హీనుడు .కనుక శక్తికే ప్రాధాన్యం .శివుడు శక్తి అవసరం లేకుండా నే సర్వ స్వతంత్రుడు .అనే ఈ రెండు భావాలకు సమతూకం లో ఆది శంకరులు సౌందర్య లహరి రచించారని ఇందులోని గోదార్ధ దర్శనం చేసిన శ్రీ తుమ్మల పల్లి రామ లింగేశ్వర రావు గారు తెలియ జేశారు .”మాయాంతు ప్రకృతిం ,విద్యాన్మాయి నంతు మహేశ్వరం -తరత్య విద్యాం వితథం హృది తస్మిన్నివేశితే ”అన్న దాని లో ”మిధ్యా జగదది ష్టాత్రి ”అనే అమ్మ వారి నామం లో భావం .శ్రీ విద్యనే మోక్ష విద్య అంటారు .”ఆత్మా విద్యా ,మహా విద్యా శ్రీ విద్యా ,”అని లలితా సహస్రనామాలలో ఉంది .ఆత్మా స్వరూపాన్ని చెప్పేదే.ఆత్మా విద్య మోక్ష విద్య అని చాందోగ్య ఉపనిషత్ చెబు తోంది .బ్రహ్మ విద్య అయిన ఆత్మా విద్య ను స్త్రీ రూపం గానే శంకరులు ధ్యానిన్చారని భావం .
సౌందర్య లహరి లో నిర్గుణ పర బ్రహ్మాన్ని వర్ణించ కుండా సగుణ రూపం లోనే ఆమె సౌందర్యాన్ని వివరించారు శ్రీ శంకరులు .నిర్గుణ పరబ్రహ్మాన్ని దాచి పెట్టి ,దాని ప్రాపంచిక దృష్టికి కన్పించిన సృష్టి విలాసాన్ని వర్నిం చట మే శ్రీ శంకరులు  చేసిన కవితా సౌందర్యం .దీన్నే అలంకార శాస్త్రం లో ”అపహ్నవ అలంకారం ”అంటారు .మనసుకు ,వాక్కు కు గోచరించని ,జగత్తుకు కారణం అయినట్టి ,మొదటగా ప్రాదుర్భావించిన స్త్రీ రూపం గా కేన ఉపనిషత్ లో ”ఉమా దేవి ”గా చెప్పబడింది .ఉపనయన సమయం లో బ్రహ్మోప దేశాన్ని స్త్రీ రూపం గానే చేయటం మనకు ఆచారం గా వస్తోంది .బీజ ప్రాయం గా ”కేన ”లో ఉన్న శ్రీ విద్య  సౌందర్య లహరి లో విస్తృతి చెందింది  .ఇది మంత్ర ,యంత్ర ప్రతీక రూప ఆరాధనం .మంత్రం వాక్కు కు సంబంధించింది .ప్రతీక మనస్సు కు సంబంధించింది .పూజ చేసేది కాయానికి .ఇవి వాక్ ,మన ,కాయ త్రికరణాలు .దీనికి ప్రతీక శ్రీ చక్రమే నని భావన .ఇదీ సౌందర్య లహరి లో ప్రవేశించే ముందు మనకు అవగాహన కావలసిన విషయాలు .ఇక ఆ సౌందర్య ప్రవాహం లో మునిగి ఈదుతూ తేలియాడుదాం .
1–”శివ శ్శక్త్యా యుక్తో ,యది భవతి శక్తః ప్రభు వితుం –నాచే దేవం ,దేవో న ఖలు కుశలః స్పందితు మపి
అతస్త్వా మారాధ్యాం హరి హర విరించాదిభిరపి –ప్రణంతుం స్తోతుం వా ,కధ మక్రుత పుణ్యః ప్రభవతి ”
తాత్పర్యం –తల్లీ !సర్వ మంగళవు అయిన నిన్ను చేరితేనె ,నీ నాధుడు శివుడు సర్వ ప్రాభవం తో ,ప్రపంచాన్ని నిర్మిస్తున్నాడు .అలా కాక పోతే స్థాణువు అంటే కదల టానికే సామర్ధ్యం లేని వాడు అవుతాడు .అందుకే హరి ,హర ,బ్రహ్మ మొద లైన దేవతల చేత కొలువ బడే నీకు మ్రోక్కటం ,నిన్ను స్తుతించటం పూర్వ జన్మ సుకృతం లేని వాడెవడూ చేయ లేడు .
విశేషం –శివుడు జగన్నిర్మాణశక్తి తో కూడిన వాడైనాడు .ఆయన అవిచ్చిన్నుడు .అవిద్య అయిన మాయ తో కూడిన వాడు .జగన్నిర్మానానికి శక్తి యుతుడైన పుడే ఆది సాధ్యం అయింది .లేక పోతే స్పందించ టానికి కూడా ఆయనకు సాధ్యం కాదు .శివ ,శక్తులు భార్యా భర్తలు .జాయా పతులు .జాయా పతి ,జాయ యొక్క శక్తి తోనే ప్రపంచ రూప సంతానాన్ని నిర్మించ గలదు .శక్తి లేక పోతే సంతాన ప్రాప్తి లేదు .శివుడు సర్వ మంగళుడు .అంటే జనన ,మరణ మైన అమంగళం లేని వాడు అని అర్ధం .
శ్రీ చక్రం లో తొమ్మిది యోనులు ఉంటాయి .అందులో నాలుగు శివ సంబంధ మైనవి .అయిదు శక్తికి సంబంధించినవి .రెండు అర్ధ చక్రాలు గల తొమ్మిది యోనుల తో కూడిన శ్రీ చక్రమే ఇది .ఇది విశ్వ వ్యుత్పత్తి ,స్తితి లయాలకు స్వరూపమే .పరుడు అంటే శివుడు శక్తి లేని వాడు అయితే సృష్టి స్తితి లయాలు చేయ లేడు .అందుకే వీరి  అధి దేవత లైన విష్ణు ,బ్రహ్మా ,రుద్రులచే పూజింప బడే భ,గ వతి -ప్రపంచానికి తల్లి .”ఆది ”అనటం లో వేద ధ్వని కని పిస్తుంది .శ్రీ విద్యోపాసకులు– విష్ణు ,శివ ,మను ,చంద్ర ,కుబేర ,లోపాముద్ర ,అగస్త్య,స్కంధ ,మన్మధ ,ఇంద్ర ,బల రామ ,దత్తాత్రేయ, దుర్వాసాదులు .శ్రీ దేవుని స్తుతించ టానికి పూర్వ జన్మ సుకృతం ఉండాలి .ఇతర దేవతలను పూజించినా ,ఆ దేవతలు శ్రీ దేవి అనుగ్రహం తోనే భుక్తిని, ముక్తిని ఇస్తారు .శ్రీ దేవి సేవ సర్వత్రా ఫల దాయకం .ఇతర  దేవోపాసన కూడా శ్రీ దేవి ఉపాసనే అవుతుంది .అన్ని వర్ణాలు శివ శక్తి మయాలే .దీన్ని పథిస్తే సకల శ్రేయోభి వృద్ధి కలుగు తుంది అని  ఫల శ్రుతి .
సశేషం –
మరొక్క సారి శ్రీ వినాయక చతుర్ధి శుభా కాంక్షల తో   –మీ– గబ్బిట దుర్గా ప్రసాద్ –19-9-12-కాంప్–అమెరికా
Rtd. head Master

Posted in రచనలు | Tagged | Leave a comment

శ్రీమతి కి జన్మదిన శుభాకాంక్షలు

This slideshow requires JavaScript.

Posted in సమయం - సందర్భం | 2 Comments

అమెరికా ఊసులు –21 హ్యూమర్ కు ఫీల్డు -w.c. ఫీల్డు

  అమెరికా ఊసులు –21
  హ్యూమర్ కు ఫీల్డు -w.c. ఫీల్డు 
అమెరికా లో హాలీ వుడ్ సినిమా ల లో హాస్య నటుడి గా మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకొన్న నటుడు w.c.ఫీల్డు .బాగా డ్రింకింగ్ అల వాటున్న వాడు గా కూడా ప్రఖ్యాతుడు .తాను ఎంత తాగాడో లెక్కలు కూడా చెప్పాడు .1938నాటికి ఆయన తాను 1,85 ,000డాలర్ల ఖరీదు చేసే విస్కీ తాగానని లెక్క చెప్పాడు .అదీ నలభై రెండేళ్ళ కాలం లో .తన మీడే తాను జోకులేసుకొనే చమత్కారి ఫీల్డు .తన మూత్ర పిండాల కండ రాల మీద ripples   ఏర్పడినా తాను 125ఏళ్లపది హేను రోజులు  గ్యారంటీ గా బతుకు తానని జోకేశాడు .ఆయన 1880 లో పుట్టి అరవై ఆరేళ్ళు మాత్రమె జీవించి 1946 లో అంటే ఆయన వేసుకున్న లెక్క లో సగం కాలమే జీవించి చని పోయాడు .తాను అప్పటికే సరైన మార్గం లో నుంచి దూరమై పోయానన్నాడు .ఆయన్ను” ఆల్కహాలిక్ జీనియస్ ”అనే వారట .
తాను తాను ఇష్ట పడనీ మనిషి నేవర్నీ అంత వరకు కలుసు కో లేదన్నాడు .తాను  అసహ్యించుకోని,కుక్కను కానీ బేబీ ని కానీ కలుసు కో లేదని వ్యంగ్యం గా అంటాడు .అతను ఆడ వాళ్ళ గురించి ”women are like elephants .i like to look at them .but i do not want to own one.”అని తన అభిప్రాయాన్ని తెలియ జేస్తాడు .నేత్రా నందమే కాని కాపురం చేసే ఆలోచన లేదంటాడు .అతని దృష్టిలో ”sleep is the most beautiful experience in life except drink ”అని తన నిశ్చితాభి ప్రాయాన్ని విప్పి చెప్పాడు .ఆయన్ను మాస్టర్ ఆఫ్ కామెడీ అని మాస్టర్ ఆఫ్ స్పీచ్ అని తెలిసిన వాళ్ళు అంటారు .ఆయన భాషను చక్క గా మార్చుకొని హాస్యం పుట్టించేట్లు చేయ గల నేర్పున్న వాడంటారు .అతని కొన్ని మాటలు ఆయన మాటల్లోనే వింటే ,అందులోని స్వారస్యం తెలుస్తుంది ”No suggestive move ments in scenes with Indian .No exposure in the bath tub ”అనేది అందులో ఒకటి .
ఫీల్డు కు కార్లు అంటే పిచ్చ పిచ్చి .ఆయన కారు లో ప్రత్యేకం గా తాగ టానికి ఒక ”బార్ ”ఉండేదట .అలా ఉండటం ఒక రక మైన నాగర కత న్నాడు ”it is one sign of civilization is worth having ”అని గర్వం గా చెప్పు కొనే వాడు .ఒక సారి ఆయన ”బారున్న కారు లో వెళ్తూ ఫుల్ గా డోసులాగిస్తూ  ఉన్నాడు .ట్రాఫిక్ లో కారు ఆగింది .పోలీస్ వచ్చాడు .’you are double parked ”’ అన్నాడు .అప్పుడు ఫీల్డు తొణక్కుండా బెనక్కుండా ”No ,we are sitting at the cross roads between Art and nature trying to figure out where Delirium Tremens leaves off and Holly wood begins ”అని మాటలతో బురిడీ కొట్టించాడు .పోలీసు ”ఓ.కే.ఫీల్డ్స్ ”అని  నమ్మి పంపించాడట.
ఫీల్డు ఎప్పుడూ స్వంత ఇంటిని కొనుక్కో లేదు .అద్దె ఇంటి లోనే కాపురం ఉండే వాడు .ఇంటి యజమాను లంటే ద్వేషం .వాళ్ళను ఎలెక్ట్రిక్ చైర్స్ లో పెట్టాలనే వాడు .ఆయన హాలీ వుడ్లో గ్రిఫిల్ పార్కు దగ్గర ఒక ఇల్లు అద్దె కు తీసుకొని ఉండే వాడు .ఆది అయిదు బెడ్ రూముల ఇల్లు .భార్య దగ్గర లేదు .పడ కొండు బాత్ రూములున్దేవట .ఒక లైబ్రరీ రూం ,రికార్డింగ్ స్టుడియో ,గ్లాస్ ఎలి వెటర్ ,ఫుల్ ఫ్లోర్ బార్ ,టెన్నిస్ కోర్టు ,అబ్జేర్వేషన్ డేక్ ,ఉండేవి పని వాళ్ళ అపార్ట్ మెంట్ వేరే .నేలకు అద్దె ఆరోజుల్లో రెండు వందల యాభై డాలర్లు .అద్దె పెంచమని వొనర్ గోల చేసినా పెంచే వాడు కాదట .ఆది కూలి పోతున్నా అందులోనే ఉన్నాడు .పైగా వ్యాయామానికి ఇంకో గడి ,ర్యింగ్ మెషీన్ కూడా పెట్టు కున్నాడట .  ,
ఫీల్డు గారికి చక్రాల మీద నడిచే అతి పెద్ద ఫ్రిజ్ ఉండేదట .దానికి ఆంజనేయుడి తోకంత అతి పెద్ద అంతు లేని ఎలెక్ట్రిక్ వైర ఉండే డేటా .యే రూములో తాగ తాని కైనా ఫ్రిజ్ ను వాడుకోవటానికి ఆయన చేసుకొన్నా ఏర్పాటిది .మామూలు కుర్చీల తో పాటు ”బార్బర్ చైర్ ”ప్రత్యేకం గా ఉండేది .ఇది వెన్ను నొప్పి పోగొట్టు కోవా టానికి వాడే వాదట .అన్ని గడులకూ తాళాలు జాగ్రత్తలు చేసుకొనే వాడు .నౌకర్ల తో ఎప్పుడూ గోడవలె తగా దాలేట .దాన్ని సరదా గా” a capital versus labour ”  అని చూసిన వాళ్ళు నవ్వు కొనే వారట .ఎప్పుడూ విస్కీ ఫుల్ గా తాగినా ఎప్పుడు దానికి లొంగి పోలేదు .  (never got drunk ‘).ఒక నైట్ వాచ్ మాన్  ను రాత్రి తెల్లార్లు తన తోపాటు  తాగటానికి డబ్బు ఇచ్చి పెట్టు కొనే వాడు. కంపానియన్ అన్న మాట .
ఆయనను ”do you like children “‘ ? అని ఒక విలేకరి ప్రశ్నిస్తే ” i do, if they are properly cooked ” ”అని చిలిపి సమాధానం చెప్పాడు .అతని చివరి సినిమా1945 వచ్చింది .అతనికి ” ఆర్డర్ ”గా ఉండటం అంటే ఇష్టం .అతను U.S marshal గానూ ,a Los angel’s county Sheriff గా కూడా పని చేశా డంటే ఎంత ఆర్డర్లీ గా ఉండే వాడో చూడండి .అయితే ఈ ఆర్డర్ అంతా అతను చని పోయితర్వాత  అంత్య క్రియల రోజు 2-1-1947నాడు తారు మారై అస్తవ్యస్తం (కేయాస్ )గా మారిందట .ఆయన చని పోయే టప్పటికి ఆయన దగ్గర నిలువ ఉన్న కాష్ 7,71,428డాలర్లట .ఒక drinker  ఇంత డబ్బు దాచుకో వటం చరిత్రే .ఇవి గాక బాంకి   డిపాజిట్లు, ఆస్తులు వేరుగా ఉన్నాయి .కొందరు స్త్రీలు వచ్చి ఫీల్డు తమను పెళ్లి చేసుకొన్నాడని నమ్మ బలికి, కొందరు అబ్బాయిలు ఫీల్డు తమ కన్న తండ్రి అని చెప్పీ, డబ్బు నోక్కేశారట .అసలు భార్యHattie  fields  న్యాయ పోరాటం ఏడేళ్ళు చేసి మిగిలిన దాన్ని ఆమె 75వ ఏట దక్కించు కొందట .ఆయన గురించి చాలా గొప్ప గా ”Field did not belong to this world .but he  arrived from some other easier planet ”అని పొగడటం అత్యంత సముచితం గా  ఉంది .ఆయనకు చాలా ఇష్టమైన వాక్యం ఒకటి ఉంది .దాన్ని ఆయన ఎప్పుడూ ఉపయోగిస్తాడు అదే ”Never give a succer an even break .”దీన్నే అతను బ్రేకింగ్ పాయింట్ గా జీవితాంతం పాటించాడు అని విమర్శకుల భావన .
వినాయక చవితి శుభా కాంక్షలతో –మీ గబ్బిట దుర్గా ప్రసాద్ –18-9-12-కాంప్–అమెరికా

Posted in అమెరికా లో | Tagged | Leave a comment

అమెరికా డైరీ వీక్లీ రీడింగ్ వీక్

 వీక్లీ రీడింగ్ వీక్ 
సెప్టెంబర్ పది సోమ వారం నుంచి పదహారు ఆది వారం వరకు విశేషాలు –
మేము అమెరికా వచ్చి ఈ పద వ తేదీ కి సరిగ్గా అయిదు నెలలయింది .అన్గలూరు  రాజేంద్ర ప్రసాద్ గారు ఫోన్ చేశారు .ఆయన కాలి  ఫోర్నియా వెళ్లి వచ్చి నట్లు  చెప్పారు .ఆది నారాయణ గారి కోడలు అనారోగ్యం గురించి చెప్పి, ఇప్పుడు పూర్తిగా తగ్గి కులాసా గా ఉన్నట్లు తె లియ జేశాను .ఆది నారాయణ తో మాట్లాడ మన్నాను. సాయంత్రం పక్కింటి గాయత్రీ ,రవి దంపతులకు శ్రీ హనుమ కదా నిది ,మా అక్కయ్య పుస్తకాలను ఇచ్చాము .మంగళ వారం మైనేని గోపాల కృష్ణ గారికి ఫోన్ చేసి మాట్లాడాను .మా ఇండియా ప్రయాణం అక్టోబర్ మూడు బుధ వారం అని చెప్పా.బాపు గారి ఆరోగ్యం బాగా మెరుగ్గా ఉన్నట్లు తెలియ జేశారాయన .బుధ వారం హూస్టన్ నుంచి వావిలాల లక్ష్మి గారు ఫోన్ చేశారు .ఇండియా వస్తే ఎవరింటికి వెళ్ళాలో తెలీయటం లేదన్నారు .”ఉయ్యూరు లో మేమున్నా మని  గుర్తుంచుకోండి .మీరు ఎప్పుడు వచ్చినా వెల్కం” ”అన్నాము .గురు వారం రాత్రి ఆది నారాయణ ఫోన్ చేసి ”విమానం ”గురించిన ఆర్టికల్ చాలా బాగుందని దాన్ని కాపీలు తీసి మిత్రులకు ఇస్తున్నట్లు సంతోషం గా చెప్పారు .రచనకు అంత కంటే పరమార్ధం ఏముంటుంది ?ఆదినారాయణ వాళ్ళ ఇండియా ప్రయాణం ఇరవై రెండు  అయితే ,రాజేంద్ర ప్రసాద్ వాళ్ళది ముప్ఫై న.
          మహాన్న దాత డొక్కా సీతమ్మ తల్లి 
ఆస్టిన్ లో ఆదినారాయణ వాళ్ళ అమ్మాయి వాళ్ళ  ఇంటి ప్రక్క నే ఉంటున్న శ్రీ డొక్కా రామయ్య గారు మహాన్న దాత, భద్రాచలం దగ్గర ఉండేస్వర్గీయ  డొక్కా సీతమ్మ గారి మనుమడు  అని చెప్పారు .చాలా ఆనందం వేసింది .దాదాపు వంద  సంవత్స రాల క్రితం డొక్కా సీతమ్మ గారి అన్నదానం గురించి ఆంద్ర దేశం లో తెలియని వారు లేరు .ఎవరు ఎప్పుడు  యే వేళఇంటికి వచ్చినా అన్నం వండి, వడ్డించి, సంతృప్తి గా భోజనం పెట్టె మహా ఇల్లాలు గా సీతమ్మ గారిని గురించి చెప్పుకొంటారు .ఆమె వదాన్యతకు, దాతృత్వానికి ,అన్న సమరాధనకు చేతు లెత్తి నమస్కరించని ఆంధ్రుడు లేడు .యాత్రికుడు తిన్నాడో లేదో అని స్వయం గా విచారించి ఒక వేళ మోహ మాటం పడితే ”ఒర్ నాయనా ! అన్నం పర బ్రహ్మ స్వరూపం .దాన్ని తిని జీవుణ్ణి తృప్తి చెందిస్తేనే భగ వంతుడు కూడా తృప్తి చెందుతాడు ”అని పిలిచి మరీ అన్నం పెట్టె దొడ్డ ఇల్లాలు .భర్త గారు కూడా అంత సహకారాన్నివ్వ బట్టే ఆమె అన్న సమారాధన నిరంత రయం గా సాగింది .ఖాళీ కడుపు పుతో ఎవరూ వేళ్ళ రాదు అని ఆమె నియమం .సీతా రాముల సన్ని  దా నం లో ఉండబట్టేనేమో, ఆయమ్మ కు ఆ సీతా సాధ్వి సుగుణాలన్నీ వచ్చి ఉంటాయి ”.ఆంద్ర దేశపు మరో కాశీ అన్న పూర్ణ” మన డొక్కా సీతమ్మ తల్లి .అ మహా త్యాగ మూర్తికి ఎన్ని నమస్కారాలు, కృతజ్ఞతలు తెలియ జేసినా ఆమె  ఋణం తీర్చు కో లేము .కలిగి, సిరిఉండి  అన్న దానం చేయటం వేరు పెద్దగా ఏమీ లేకుండా నే ఆ గొప్ప బుద్ధి కలగటం దాన్ని ఆచరణ సాధ్యం చేయటం ఆమె కే సరి పోయింది సీతమ్మ గారు 1841 లో జన్మించి 1909 లో మరణించింది .భర్త మరణం తర్వాత ఆమె సాంప్రదాయానికి విరుద్ధం గా అందర్నీ ఇంటికి ఆహ్వానించి భోజనం పెట్టటం ఊళ్ళో బ్రాహ్మలకు అసూయ ,కోపం తెప్పించాయి .ఆమె ను చాలా అవమానించారు .కానీ  కర్తవ్య పరాయణు  రాలై న ఆమె వాటిని పట్టించు కో కుండా తన పని తాను చేసుకొని పోయింది .ఎవరి బెది రిమ్పులకు ఝడవ లేదు .అన్న సమారాధన కోసం ఆమె ఎకరా లన్నీ అమ్మింది. చివరకు ఆమె కు మిగిలింది ఉన్న ఇల్లు ,అతి కొద్ది పొలం మాత్రమే .అయినా చలించ లేదామే .నిరతాన్న దానాన్ని కొన సాగించింది ..చివరికి ఆమె లో ఓపిక నశించి కాశీ వెళ్లి అక్కడే మరణించాలని అనుకొంది  .ఏరోజు కా రోజూ ఇదే ఆఖరి రోజూ రేపే కాశీ ప్రయాణం అను  కొంటు నలభై ఏళ్ళు గడిపింది .అతిధి సేవ ,అన్నం పెట్టటం అంటే ఆమెకు అంత ఇష్టం దీనికోసం కాశీ విశ్వేశ్వర దర్శనాన్నే వాయిదా వేసుకొన్న అన్న పూర్ణమ్మ ఆమె .
చివరికి తెగించి ఒకఎడ్ల బండీ  మాట్లాడు కోని,కాశీ  ప్రయాణానికి బయల్దేరింది .గతుకుల రోడ్డు మీద ప్రయాణం చేసి అలిసి పోయి ఒక సత్రం లో పడుకొంది  .అర్ధ రాత్రి ఆ సత్రం లో నుండి ,  తండ్రీ తల్లి  కొడుకుల  మాటలేవో విని పించాయి .పిల్లలు ఆకలికి అలమటిస్తున్నారు .తల్లీ తండ్రీ ”ఒరే నాయన లారా కొన్ని గంటలు ఓపిక పట్టండి .మనం డొక్కా సీతమ్మ గారింటికి చేరా బోతున్నాం .అక్కడ ఆ మహా ఇల్లాలు వంట చేసి సిద్ధం గా ఉంచు తుంది .మనల్ని పిలిచి అన్నం పెడు తుంది ”ఒక పిల్లాడు ”సీతమ్మ గారిన్టికే ఎందుకు వెళ్ళాలి ”? అని ప్రశ్నించాడు .దానికా తలి దండ్రులు ”సీతమ్మ గారు మర్యాద గా పిలిచి గౌరవం గా కడుపు నిండా భోజనం పెడుతుంది .అలాంటి ఇల్లాలు ఈ పరగణా లోనే లేదు ”అన్న మాటలు విన్నది .అంతే ఆమె కు నిద్ర పట్ట లేదు .వెంటనే బండీ వాణ్ని నిద్ర లేపి బండీ కట్టించి వెనక్కి తిరిగి ఇంటికి వెళ్లి పోయింది .అర్ధ రాత్రి సమయం . సత్రం లోని వాళ్ళు నెమ్మది గా సీతమ్మ గారింటికి వచ్చారు .తలుపులు తీసి ఉండక పోవటం వల్ల ఆమె లేదను కొన్నారు .రెండు నిమిషాలలో కమ్మని పప్పు కూరా పులుసు ల  వాసన లు నాసికలకు  సోకాయి .ఆమె వీరిని ఆప్యాయం గా లోపలి ఆహ్వానించి అడిగి అడిగి మరీ వడ్డించి భోజనాలు పెట్టి త్రుప్తిచెందింది .ఇక ఆమె కు కాశీ వెళ్ళే ఆలోచన విరమించుకొంది . .
..  .ఆదినారాయణ వల్ల ఆ సాధ్వి సీతమ్మ గారిని ఈ రూపం గా స్మరించే అదృష్టం నాకు దక్కింది .రామయ్య గారు ఆస్టిన్ లో తెలుగు ను బోధిస్తూ ,చిన్న పిల్లలకు తెలుగు లో పద్యాలు మొదలైన వి నేర్పిస్తూ శ్లోకాలను అభ్యాసం చేయిస్తూ పోటీ పరీక్షలు నిర్వహించి బహుమతు లంద జేస్తూ ”అమెరికా ఉన్న  ఆంద్ర తేజం ”అని పిస్తున్నారు .వారిని గురించి సమగ్ర సమాచారాన్ని నాకు అంద జేయ మని ఆదినారాయణ కు మెయిల్ చేశాను .వస్తే వారి గురించి అందరికి తెలిసే ఒక మంచి వ్యాసం రాయాలని ఉంది .అలాగే ఆస్టిన్ లోనే ఉన్న మరో దేశీయభి మాని శ్రీ ఆచార్యుల వారు కూడా చాలా కాలం గా సంస్కృతాన్ని నేర్పుతూ గీర్వాణ భాషా గౌరవాన్ని విద్యార్ధులకు తెలియ జేస్తూ ,అభి రుచి కల్గిస్తూ భాషా సేవ చేస్తున్నట్లు ఆది నారాయణ నాకు ఇది వరకే ఫోన్ లో చెప్పారు .వీరి గురించి కూడా వివరాలు నాకు పంపమని చెప్పాను .
శుక్ర వారం రాత్రి మా అమ్మాయి వాళ్ళింట్లో భజన .ఎనిమిది నుండి తొమ్మిది దాకా జరిగింది .వల్లం దంపతులు సుబ్బు ఫామిలీ ,రాహుల్ కుటుంబం వచ్చారు .
                 వీక్లీ రీడింగ్ క్లాసులు 
మా అల్లుడు ఎప్పటి నుంచో ప్లాన్ చేసిన ”వీక్లీ రీడింగ్ క్లాసులు ”ఈ శని వారంసాయంత్రం  నుండి ప్రారంభించాడు .నాగమణి భర్త సహాయం చేశాడు .పది మంది వచ్చారు .ఆరోక్లాసు లోపు వారికే .ఇందులో ముగ్గురు మా మన వళ్ళు .పవన్ కూతురు, ప్రియా ఇద్దరు కూతుళ్ళు ,నాగమణి కొడుకు వగైరాలు .ఇంకొందరు తరువాతి వారం నుండి వచ్చే అవకాశం ఉంది .మా మన వళ్ళకు ఇది వరకే ఈ క్లాసులు, ఆ రీడింగ్ మెటీరియల్ చేయటం అలవాటే .ఈ క్లాసుల కోసం కుర్చీలు టేబుల్లు ,బోర్డు సిద్ధం .
శని వారం ఉదయం సత్యా సౌమ్య ల అమ్మాయి హాపీ బర్త్ డేని స్కేటింగ్ హాల్ లో జరిపితే మా అమ్మాయి మన వళ్ళు వెళ్లారు. బాగా ఎంజాయ్ చేశారు .అందరికి గిఫ్టులు ఇ చ్చారట .
ఆది వారం మా అల్లుడి ఇండియా ప్రయాణం .పన్నెండు రోజుల trip .మళ్ళీ ఇరవై యేడు బయల్దేరి ఇరవై ఎనిమిది కి ఇక్కడికి వస్తాడు .ఉదయం ఏడున్నర ఫ్లైట్ కు నేను మా అమ్మాయి ఆయన తో వెళ్లి ఎయిర్ పోర్ట్ లో దింపి ఇంటికి వచ్చాం .
లైబ్రరీ పుస్తకాలన్నీ చదవటం పూర్తీ అయింది .కొత్త పుస్తకాలు తెచ్చే ఆలోచన లేదు .ఈ సారి పుస్తకాలన్నీ విలు వై న వే .వీటిలోని విషయాలను చాలా భాగం ఆర్తికల్సు గా రాసేసి మీ కు అందించాను .మిగిలినవాటి  విశేషాలను నోట్సు రాసుకోన్నాను .వీలు వెంబడి వాటిని అంద జేస్తాను .
అందరికి  ” శ్రీ  వినాయక చవితి శుభాకాంక్షలు ”.రేపటి నుండి కొత్త ఆధ్యాత్మిక ధారా వాహిక ప్రారంభం అని గుర్తు ఉండే ఉంటుంది కదా .
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –18-9-12-కాంప్–అమెరికా

Posted in అమెరికా లో | Tagged | Leave a comment

జన వేమన –30(చివరి భాగం ) నిత్య స్మరణీయుడు- బ్రౌన్

 జన వేమన –30(చివరి భాగం )
                                            నిత్య స్మరణీయుడు- బ్రౌన్ 

తెలుగు జాతికి నిత్య స్మరణీయుడు చార్లెస్ ఫిలప్ బ్రౌన్ .86ఏళ్ల సఫల జీవనం లో 66ఏళ్ళు తెలుగు భాషా సాహిత్యాలకు సేవ చేసి జీవితాన్ని ధన్యం చేసుకొన్న ఆంగ్లేయుడు .ఆయనే లేక పోతే తెలుగు ప్రాచేన గ్రందాలెన్నో వెలుగు చూసేవి కావు .వేమన అంటే ఎవరికీ తెలిసేది కాదు .తెలుగు వారికి పనికి వచ్చే ,నిఘంటు నిర్మాణం అంత త్వరగా జరిగి ఉండేది కాదు .వ్రుత్తి మేజిస్ట్రేట్ పదవి అయినా ప్రవ్రుత్తి తెలుగు భాషా సేవ గా జీవించిన వాడు బ్రౌన్ .సర ఆర్ధర్ కాటన్ దొర డెల్టా ను సస్య శ్యామలం చేయటానికి ఎంత కృషి చేశాడో ఆంద్ర భాషాభి వృద్ధి కి బ్రౌన్ అంతటి కృషి సల్పాడు .అందుకే వారిద్దరూ తెలుగు వారికి నిత్య ప్రాతస్మరణీయులు .
1798లో మన దేశం లోనే కలకత్తా నగరం లో బ్రౌన్ జన్మించాడు .తండ్రి డేవిడ్ బ్రౌన్ ప్రోత్సాహం తో చిన్న తనం లోనే దేశీయ భాష, హిందూ స్తాని తో పాటు ,లాటిన్ ,గ్రీక్ ,హీబ్రు భాషలు నేర్చాడు .తండ్రి చర్చి లో ఉద్యోగి .ఆయనకు సాయం చేస్తూ అచ్చయిన కాగితాల ప్రూఫులను దిద్దే వాడు .తండ్రి మరణం తో ఇంగ్లాండ్ కు చేరాడు .అయిదేళ్ళు అక్కడే గడిపి1817 లో మద్రాస్ కు వచ్చాడు .అప్పటి దాకా తెలుగు అనే భాష ఉందని బ్రౌన్ కు తెలీనే తెలీదు .అంటే ఆయనకు19 ఏళ్ళు వచ్చేదాకా తెలుగు భాషా వాసనే లేదు .అప్పటి నుంచి40  సంవత్స రాలు అంటే 1855 వరకు యే కొద్ది కాలం లోనో తప్ప ,భారత దేశం లోనే -అదీ మద్రాస్ ,బందరు, కడప ప్రాంతాల్లోనే ఉన్నాడు .దానితో తెలుగు భాష పై ఆసక్తి కలిగి ,ప్రవేశం పొంది ,ఆ భాషా సేవలో జీవించాడు .ఉద్యోగ ధర్మానికేమీ భంగం కాకుండా సర్వ సమర్ధం గా నిర్వ హిస్తూనే ,తెలుగు భాషాభి వృద్ధికి కృషి చేశాడు .బ్రిటీష కంపెనీ ఉద్యోగం లో క్షణం తీరిక ఉండేది కాదు .అయినా విశ్రాంతి సమయం లో స్వంత డబ్బు ఖర్చు చేస్తూ అమల్య మైన సేవ చేశాడు .తెలుగు వారందరూ ఆయన్ను తమ వాడి గా ఆత్మీయుడి గా భావించారు .తమ యేడు గడ ,సచివుడు ,సారధి అను కొన్నారు .తెలుగు ప్రాంతం లో నలభై ఏళ్ళు పై గా గడిపిన బ్రౌన్ భాషా సేవ అత్యంత విలు వైనది .
బ్రౌన్ తెలుగు భాష కు చేసిన సేవ ను అయిదు దశలుగా భావించ వచ్చు .మొదటి దశ లో 1829లో తన 31వ ఏట ‘వేమన పద్యాలు ”సేకరించి ,పరిష్కరించి ,ఆంగ్లీక రించి లోకానికి అంద జేశాడు .అప్పటి దాకా వేమన అంటే ”ఆట వెలదులు ”తో ఆడుకొనే వాడిగా తేలిక భావంపండిత లోకం  లో ఉండేది .వారు ఆయన్ను కవి గా గుర్తిన్చలేదు .ఎప్పుడైతే దొర ,వే మన పద్యా లను ఆంగ్లం లోకి తర్జుమా చేసి గౌర విన్చాడో అపుడు” వేమన మన వాడు” అనే భావన కలిగింది .ఆ ఘన కార్యాన్ని మొదట సాధించి తెలుగు వారి జాతీయ ఛందో వైభవాన్ని ,వేమన రచన చమత్క్రుతిని ,సంఘ దురాచార నిర్మూలనానికి ఆయన చేసిన కృషి ని ఎరుక పరచాడు బ్రౌన్ .అదొక గొప్ప ముందడుగు .
తాళ పత్రాలలో నిక్షిప్త మై ఉండి ,ఎవ్వరి దృష్టీ సోకని ,వెలుగు చూడని ఎన్నో తెలుగు కావ్యాలను గ్రంధాలను ఉద్దరించటం రెండవ దశ .స్వంత ఖర్చు లతో ఎంతో మంది కవి పండితులను నియమించుకొని వారికి వాటి పరిష్కార బాధ్యతను అప్పగించి ,శుద్ధ మేలు ప్రతులు తయారు చేయించి ,ముద్రింప జేయటం ఈ రెండవ దశ లో కన్పిస్తుంది .దీనికి సాయ పడిన జూలూరి అప్పయ్య ,రావి పాటి గురు మూర్తి ,పధ్యంఅద్వైత బ్రహ్మ శాస్త్రి మొదలైన మహా పండితులు బహు ప్రశంశ నీయులు .మను చరిత్ర ,వసు చరిత్ర మొదలైన కావ్యాలకు విపులమైన ,ఉపయోగ కరమైన వ్యాఖ్యలను రాయించి సామాన్య జనాలకు వాటిని చేరువ చేశాడు .ఇందు లో బ్రౌన్ కృషి విశిష్టంఅని విమర్శకుల ,విశ్లేషకుల ఏక గ్రీవ అభిప్రాయం .
పాశ్చాత్యులు తెలుగు నేర్వటం, అలాగే తెలుగు వారు ఆంగ్లం నేర్చు కోవటం చాలా కష్టం గా ఉన్న రోజులు అవి .దీనికోసం నిఘంటు నిర్మాణం జరగాలని భావించి ,ఆ దిశ లో కృషి చేయటం మూడవ దశ.1852-53లో అచ్చు అయిన నిఘంటువు లన్ని ఆయన కృషి ఫలితమే .1854లో ముద్రింప బడిన ”మిశ్రమ భాషా నిఘంటువు ”అనేక ప్రయోజనాలను సాధించింది .మంచి వ్యాకరణం కూడా రాయాలనే సంకల్పం బ్రౌన్ కు కలిగింది .ఆ కృషి లో వచ్చినవే తెలుగు వ్యాకరణం ,తెలుగు వాచకాలు ,ఛందస్సు మీద వ్యాసాలూ .ఇవి కాక ,వివిధ విషయాలపై రాసిన వన్నీ సంపుటీక రించాడు .ఇది నాల్గవ విభాగం గా గుర్తింప బడింది .హిందూ ముస్లిం చరిత్ర కు సంబంధించిన కాల నిర్ణయ పట్టికలు ,క్రైస్తవ మత సంబంధ మైన రచనలు చేశాడు .ఇది అయిదవ విభాగం గా భావిస్తారు .
వీటన్నిటికి మించిన కృషి అమూల్య తాళ పత్రగ్రంధాల సేకరణ .దేశీయమేధావులైన ఏనుగుల వీరాసామయ్య ,కావలి బోర్రయ్య వంటి వారు బ్రౌన్ కు సన్నిహితులు .వారి ద్వారానే భారతీయ సంస్కృతీ వికాసాన్ని అర్ధం చేసుకొని, దాని వికసనానికి తోడ్పడ్డాడు .తెలుగు లిపి ని సంస్కరించి, అచ్చు వెయ టానికి తగి నట్లు గా అక్షరాలను మార్పించాడు .మాటలకు తగిన అర్ధాన్ని వివ రించి రాయించాడు .పండితులకు సరైన అర్ధం తట్టక పోతే తానే తెలియ జేసి ఒప్పించాడు .శాసనాల కోసం ,స్థల వివ రాల కోసం ,గ్రామ నామాల ఔచిత్యం కోసం ఆయన తిరగని గ్రామం అంటూ ఆంద్ర దేశం లో లేదు అంటే అతి శయోక్తి కాదు .ఉద్యోగ రీత్యా యే ప్రదేశం వెళ్ళినా ఆ చుట్టుపక్కల ఉన్న తాళ పత్ర గ్రంధాలను వాకబు చేసి ,వారిని కలిసి ,మాట్లాడి ,వాటిని సంపాదించి ,చక్కని పరిష్కరణం చేయించి ,ప్రచు రించే వాడు .ఆంద్ర దేశం లోనే కాదు ,యే రాష్ట్రం లో బ్రౌన్ పని చేశినా ఆ భాషాభి వృద్ధి కి దోహద పడే వాడు .ప్రజల ఆచార వ్యవ హారాలను ఆకళింపు చేసు కొనే వాడు .సాహిత్యం లో అవి ఎలా కలిసి పోయాయో నిశితం గా పరి శీలించే వాడు .
ముద్రణ ద్వారా తెలుగు సాహిత్య వ్యాప్తిఎక్కువ చేయ వచ్చునని భావించి అచ్చు యంత్రాలను తెప్పించి ,సులభతరం గా ముద్రించే ఏర్పాటు చేశాడు .అనవసర మైన అక్షరాలను తొలగించి ,ఒత్తుల విషయం లో చాలా జాగ్రత్తలు తీసుకొనే వాడు .బ్రౌన్ మానవత్వం ఉన్న ఆఫీసరు .కరువు కాటకాలతో విల విల లాడుతున్న జనానికి ఆత్మ బంధువు గా వ్యవ హరించే వాడు .ధర్మ తత్పరతను ,ధర్మ బుద్ధి ని నమ్మి ,సహాయం చేసే వాడు .ఎంతో మందితో ఉత్తర ప్రత్యుత్త రాలు జరిపే వాడు .దొరను అడగటానికి ఎవరికీ సంకోచం ఉండేది కాదు .అందరి వాడు ,ఆపద్బాంధవుడు అని పించుకొన్నాడు .న్యాయం గా ,నిర్దుష్టం గా పరి పాలన చేయాలని భావించి అమలు చేసిన ఆంగ్ల దొర బ్రౌన్ .లంచం తీసుకొనే వారికి సింహ స్వప్నం బ్రౌన్ .ఆయన కాలం లో యోగ్యులైన వారి కేవ్వరికి అప కారం జరగ లేదు .బ్రౌన్ తో సత్కరింప బడని పండితుడు ఆనాడు లడనేది నిర్వివాదమైన విషయం .
న్యాయ దృష్టి న్యాయ నిర్వహణ లో నేర్పు ,స్వార్ధ రాహిత్యం ,కల్మష రహిత మైన మనస్సు ,సత్య పాలన బ్రౌన్ కు నచ్చే విషయాలు .తనను పొగిడే వారి కంటే ,నమ్మిన దాన్ని నిర్మోహ మాటం గా చెప్పే వారంటే బ్రౌన్ కు మహా ఇష్టం .అలాంటి వారిలో అయోధ్యా పురం కృష్ణా రెడ్డి ఒకరు .వారిద్దరి బంధం చిర కాలం ఉంది .బ్రౌన్ ఇంటి దగ్గర ఉన్న ఒక బ్రాహ్మణుడు చని పోతే అతని  భార్య సహగమనానికి ప్రయత్నిస్తే ,తానే స్వయం గా స్మశానానికి వెళ్లి ,ఆమెను రాకుండా కట్టడి చేసి ,శవ దహనాన్ని దగ్గరుండి జరిపించాడు దొర .సహగమనం క్రూరమని దాన్ని ఆపటం తన ధర్మ మని బ్రౌన్ చేసిన మహోపకారం ఇది .ఆ కుటుంబానికి తల్లిని ఆసరాగా నిల బెట్టి ,కుటుంబాన్ని కాపాడి ఆ తర్వాత ఆమెకు పెన్షన్ మంజూరు చేసిన పెద్ద మనిషి ,సంస్కారి బ్రౌన్ .
తెలుగు వారిని అక్ష రాస్యులను చేయాలనే తపన బ్రౌన్ కు ఉండేది .వారి కోసం బడులు పెట్టించి ,హిందీ ,పార్శీ భాషను కూడా నేర్పించాడు .మద్రాసు లో ”ధర్మ బడి ”స్తాపించి ఇంగ్లీష్ ,తమిళం ,తెలుగు నేర్పించాడు .బీదలకు ఇవి బాగా ఉప యోగా పడ్డాయి .వారికి  భోజన ,వసతి సౌకర్యాలు కల్పించాడు .భారతీయులు ,ఆంగ్లేయులు ఒకరి భాషను ఇంకోరు నేరిస్తే ప్రయోజనం అని తెలియ చెప్పాడు .తెలుగు వారి విద్యా తత్పరతను శ్లాఘించాడు .తెలుగు విద్యా వేత్త లను చులకన చేసే అధికారులను క్షమించ లేదు బ్రౌన్.సద్భావనే బ్రౌన్ తెలుగు వారికిదగ్గర చేసింది .”దేశ ,కాల ,జాతి ,మత ,భాషా తీతం గా పని చేసి సహృదయుల మన్నన పొందాలి” అని బ్రౌన్ దొర ఉద్యోగులకు బోధించే వాడు .తెలుగు వారి కంటే తెలుగు ను అత్యది కం గా ప్రేమించి ,తెలుగు భాషా సాహిత్యాభి వృద్ధికి కృషి చేసిన కార్య దక్షుడు ,నిష్కామ కర్మ యోగి బ్రౌన్ .
తెలుగు లో తాను ఎంత రాసినా ,తెలుసు కొన్నా ,సేవ చేసినా ,సంపాదించినా ”,భాషా విషయం లో నూ ,నుడికారం లోను ,తుది మాట తెలుగు వారిదే ”అని నమ్మి ,గుర్తించి ప్రవర్తించిన వాడు అధికారి బ్రౌన్ .అంతటి సంస్కారం అది చాలా అరుదైన విషయం .ఆది బ్రౌన్ దగ్గరున్డటం గొప్ప విషయం .అందరి సలహాలు బ్రౌన్ స్వీక రించే వాడు .అహంకారం అధికార గర్వం లేకుండా ప్రజాభి ప్రాయ సేకరణ చేసే వాడు .తన పరిధి ఏమిటో తెలుసు ఆని ,ప్రవర్తించిన విశిష్ట భాషా సేవకుడు బ్రౌన్ .1855లో బ్రౌన్ స్వదేశం ఇంగ్లాండ్ చేరాడు .1884లో మరణించే వరకు అక్కడే ఉండి ఆంద్ర భాష కు సేవలు అందిస్తూనే ఉన్నాడు .అక్కడ విశ్వ విద్యా లయా లలో” ఆంద్ర ఆచార్యుడు” గా కూడా పని చేశాడు .”తన ఇల్లే విద్యా కేంద్రం గా ,తానే మహా రాజ పోషకుడు గా ,వ్యవహరించి ,ఆంద్ర భాషా సాహిత్యాలకు సేవ చేసి ,పండితులను పోషించి ,సమకాలీను లచే ,”నూరార్లు లెక్క సేయక వేమార్లర్ధ మిచ్చు వితరణి ”అని కీర్తింప బడ్డాడు బ్రౌన్ .”అన్న ఆచార్య కొత్త పల్లి వీర భద్ర రావు గారి మాటలు అక్షర సత్యాలు .
వేమన ను వెలుగు లోకి తెచ్చి ,తెలుగు భాషా సాహిత్యాలకు విస్తృత సేవ చేసిన  ,నిత్య ప్రాతస్మరణీయుడు చార్లెస్ ఫిలిప్ బ్రౌన్ కు ”జన వేమన ”నువినయం గా  అంకితమిస్తున్నాను .
మనవి – ”రెడ్డి జ్యోతి ”మాస పత్రిక లో దాదాపు మూడేళ్ళు ”రెడ్డి కవులు – -దొడ్డ దొడ్డ రచనలు  ”అన్న శీర్షిక తో  ప్రచురింప బడిన    ఈ ధారా వాహికను ”జన వేమన ”పేరుతోసరస భారతి తరఫున  ముద్రించి ,శ్రీ నందన నామ సంవత్సర ఉగాది కవి సమ్మేళనం లో అంటే 16-3-2012నాడు ఆవిష్కరణ జరిపించాం .
జన వేమన సంపూర్ణం –మీ గబ్బిట దుర్గా ప్రసాద్ –17-9-12-కాంప్–అమెరికా

Posted in మహానుభావులు | Tagged | Leave a comment

హాస్యపుసుత్తికి పట్టం కట్టిన వేలు

హాస్యపుసుత్తికి పట్టం కట్టిన వేలు 

ఈగ ఇల్లలుకుతూ తన పేరు మరిచి పోయి నట్లు సుత్తి వేలు గా తన పేరు మారటం తో  కురుమద్దాలి లక్ష్మీ నర సింహా రావు తన పేరు ఎప్పుడో మరిచి పోయి ఉంటాడు . జంధ్యాల వెతికి పట్టు కొన్న నట ముత్యాలు  ఆయన .,వీర భద్ర రావు కూడా .జంధ్యాల మావటి గా  వీరిద్దరూ సుత్తిని హాస్యపు ”హత్తి ”(ఎనుగు )పై కూర్చుని ఊరేగించారు .వేలు సన్నగా వేలంతటి వాడు గా ఉండి   ఆ పేరు  కు చిన్నప్పుడు సార్ధకం చేస్తే, స్టేజి నాటకాల తో తన ప్రతిభను నిరూపించుకొని హాస్య బ్రహ్మ దృష్టిలో పడి తెలుగు హాస్యాన్ని పూల రధం లో ఊరేగించిన వారిలో ఒకడయ్యాడు వీరభద్రుడితో . జంట పండించిన అర్ధ శత సినిమాలే దీనికి నిలు వెత్తు సాక్షి . గ్రామ్యమైనా ,బ్రాహ్మణ్య మైనా ఆ మాటలను వారి హృదయాల నుండి వచ్చి నట్లు చెప్ప గల మహా గొప్ప నటుడు వేలు .సంఘర్షణ లో అతని సీరియస్ నటన కల  కాలం గుర్తు పోయేది .సదా చార సంపన్నుడిగా వేసినా ,విల విల లాడే తండ్రి గా వేసినా, నాటి రాజరికపు పోజు పోనీ మాజీ రాజు గా చేసినా,చిరు  చంటబ్బాయికి చిరు నిక్కర్ తో పెద్ద పోడు గాటి అసిస్టంట్ గా వేసినా అతని మార్కు అతనిదే .ముక్కు తో మాట్లాడి హాస్యాన్ని మన ముక్కు పిండి,నవ్వింప  జేస్తాడు .అతని డైలాగ్ డెలివరీ యే ఒక ప్రత్యెక స్కూల్ ని పిస్తుంది . . పాత్రలో ఒదిగి పోవటం పాత్ర స్వభావాన్ని పూర్తీ గా ఆవిష్క రింప జేయటం వేలు ప్రత్యేకత వేలేడంతటి వాడు  అతి వేలమై పోతాడు నటనలో .
జంధ్యాల మార్కు సినిమా లకు వేలు అదనపు ఆకర్షణ .అతను లేక పోతే ఏదో తెలీని వెలితి గోచరిస్తుంది .పరి పక్వ మైన నటుడు అలానే మనల్ని ఆ కట్టు కొంటాడు .ఆయన పంచె  షర్టూ వేసినా గోచి  పెట్టి తిరిగినా, కోటూ సూటు వేసినా ,లాయరైనా ,దళారి అయినా, తండ్రి అయినా ,తాత అయినా ,పూజారి అయినా ,పండితుడైనా  ఆ పాత్రకు ఒక స్వంత వ్యక్తిత్వం ఉండేట్లు చేస్తాడు .వేలు చిందించిన నవ్వుల పువ్వులు వేలకు వేలు .అవి సువర్ణ పుష్పాలు .అతను జాలు వార్చిన నవ్వులు పొదరిల్లు లై ఆహ్లాదం చేకూరుస్తాయి .నిరంతరం హాస్యపు జల్లు వేలు అనచ్చు .సినిమా లలో రాణించి బుల్లి తెరకూ రాణ తెచ్చాడు .డిటెక్టివ్ కధల్లో అతని అడుగడుగు చమత్కారానికి పరవశిస్తాం .పళ్ళు కొంచెం బయట పెట్టి ఆయన నవ్వే నవ్వు చిదానందమే .చెణుకులు రువ్వటం లో వేలు అందే వేసిన చెయ్యి .వేలు ఉంటె చాలు అన్న సినిమాలు చాలానే ఉన్నాయి .అంత గుర్తింపు పొందిన నవ్వులపువ్వుల రేడు వేలు .
              భ.రా .గో.కధలకు జీవం వేలు 
ఇవన్నీ ఒక ఎత్తు అయితే భమిడి పాటి రామ గోపాలం గారి కధలకు వేలు చేసిన పాత్రలు నవ్వే కాక ,విషయ పరిజ్ఞానాన్ని , లోక వృత్తినీ, కవితా మర్మాలను ,డాంబిక ప్రవృత్తిని ,సన్మానాలు అందుకోవాలన్న వారి” తీటను ”బయటను బయట పడేయటం లో వేలుచూపిన హావ భావాలు చిరస్మరనీయాలు .అతని కతనే సాటి అని చాటి చెప్పే  ధారా వాహికాలు .భ.రా.గో.రాయటం ఒక ఎత్తు అయితే , వేలు ఆ పాత్రకు అంటే భరాగో కు జీవం పోసి నటించటం ఒక ఎత్తు .రెండూ పోటా పోటీ గా సాగి ఎన్ని సార్లు చూసినా మళ్ళీ మళ్ళీ చూడాలని పించేటట్లుఉంటాయి . నా ఉద్దేశలో  తో ఈ కధలు చాలు వేలును చిరంజీవిని చేయ టానికి . అతని నట విశ్వ రూపాన్ని దర్శించటానికి ఇవి హై లైట్లే .హాస్యం లో ఎంత ఎట్టు కు ఎదిగాడో సాత్వికాభినయం లోను వేలు అంతే ఎత్తున నిల బదాడని చెప్పే సీరియల్సు ఇవి .ఇక్కడ దర్శకుని ప్రతిభనూ మనం మెచ్చు కోవాలి .వేలు లోని నట నను అన్ని కొనాల లోనుంచి రాబట్టే అద్భుత ప్రయోగం ఈ ధారా వాహిక .హాట్స్ ఆఫ్ భరాగో మరియు వేలు .ఇద్దరు స్వర్గ స్తు లైనారు . కాని తెలుగు హాస్యాన్ని స్వర్గపు సుధర్మ లో పంచి పెట్ట టానికి వెళ్లారని భావిద్దాం .
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –17-9-12-కాంప్–అమెరికా

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

ఆయన పంచిన నవ్వులు వందలూ …. ‘వేలు’

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

సుమనం

  సుమనం 

సుమన్ పేరు చెబితే ఈ టి..వి.గుర్తొస్తుంది ఈ టి.వి అనగానే సుమన్ జ్ఞాపకం వస్తాడు .ఆ లోగో చూస్తుంటే ,ఆ సీరియల్ల ప్రారంభం పాటలు వింటుంటే ఆ సీరియల్ రియల్ గా నే హిట్టవుతుందని నమ్మకం కలుగు తుంది .తీసే ప్రతి సన్నీ వేశం లో పెర్ఫెక్షన్ కన్పిస్తుంది .మొదట్లో డబ్బింగు సీరియల్లకే ప్రాధాన్యం ఇచ్చినా క్రమ క్రమంగా స్వంత  వాణీ బాణీ తెచ్చిన వాడు సుమన్ .అతను ఒక గొప్ప చిత్ర కారుడు అవటం గొప్ప ఎస్సెట్ .అతని చిత్రం తో సీరియల్ మొదలవు తుంటే దానికో నిండుదనం కన్పిస్తుంది .సీరియల్ కు ఈ .టి.వి.లో గొప్ప స్తానం కల్పించిన వాడు సుమన్ .మరీ బజారు పోట్లాటలు ,అసహ్య సన్నీ వేశాలు పిచ్చి వేషాలు లేని సీరియల్ల కు పెట్టింది పేరు అన్నట్లు తీశాడు సుమన్ .ఎందరో నటులకు నటీమణులకు అతని ప్రోత్సాహం ఉత్తేజితుల్ని చేసి ,వారి లోని ప్రతిభను రా  బట్ట గలిగాడు .అచ్యుత్ అందులో మంచి పేరు పొందాడు అశ్విని ,కిన్నెర ,యమునా మొదలన స్త్రీ కళా కారులు తమ సత్తా చాటారు .పాటలను దాదాపు ఆయనే రాశాడు .వందలాది పాటలు రాసినా అందులో ఎంతో వైవిధ్యం కన్పిస్తుంది .వాసూరావు , ,మాధవ పెద్ది సురేష్ వంటి సంగీత దర్శకులకు అదొక ఆస్థానం .ఆ స్తానం శాశ్వతం గా ఉండేట్లు వాళ్ళందరూ ఆ యన నేతృత్వం లో పని చేశారు .గాయకులూ నీహాల్, మనో కౌసల్యా మొదలైన వారు  తమ స్వర సంతర్పణ చేశారు ఈ చానెల్ లో .ఒక కొత్త ప్రక్రియ ”పాడుతా తీయ గా ”లాంటి వాటికి స్థానం కల్పించి వర్ధ మాన గాయకులేన్దరికో ప్రోత్సాహం కల్పించారు .తండ్రి రామోజీ రావు గారు తన పై పెట్టిన బాధ్యత ను అతి సమర్ధ వంతం గా నేర వేర్చి తండ్రికి ముదాన్ని చానెల్ కు ప్రజాదరణను ప్రేక్షకులకు వినోదం తో బాటు విజ్ఞానాన్ని పంచి పెట్టాడు .ఈ నాడు సినిమాలకు కూడా ప్రత్యేకత ఉంది .మంచి సిని మాలు ఆ నాటివి, ఈ నాటివి కలిపి ప్రేక్షక హృదయ రంజనం చేయటంఈ చానెల్ ప్రత్యేకత  .ఒకే వర్గానికో కుటుంబానికో సంబంధించిన సిని మాలు వేసి వేసి బోర కొట్టించక పోవటమూ హర్షణీయం .
పంచ తంత్రం సీరియల్ తో గొప్ప సంచలనాన్ని సృష్టించారు .పిల్లలకు ఎంతో వినోదాన్ని పంచారు .భాగవతం ప్రారంభించ టానికి ఎంత గ్రౌండ్ వరకు చేశారో చూస్తె ఆశ్చర్యమేస్తుంది .చివరికి బాపు రామణలను వదిలేసినా సీరియల్ ను రక్తి కత్తించటం లో  లో కృత కృత్యు లయారు .సుమన్ లో మంచి మనసు ఉంది అని అతని తో పని చేసిన కళా కారు లందరూ ఆ నాడూ చెప్పారు ఈనాడూ చెప్పుతున్నారు .అతనిది” వర్కహాలికతత్వం” అని అందరు అంటారు .తనకు కావలసినదేదో ఆర్టిస్టు ల నుంచి రా బట్టు కొనే దాకా విశ్రాంతి తీసుకోడని అందరి అభిప్రాయం .అంత పెద్ద చానల్ కు అది నేత గా ఉంటూ తన ఆర్టిస్టులతో భేషజం లేకుండా ప్రవర్తించి వారి మనసుల్ని దోచుకొన్నాడు .నిరంతర కఠోర శ్రమ ఆయన ఆరోగ్యం పై ప్రభావం చూపిందేమో నని పిస్తుంది .లేక పోతే నలభై అయిదేల్లకే అతను అమరుడవటం బాధా కరమే .అతని లో  తపన, ధ్యేయం, సాధన, నిరంతర కృషి ఉండటం అభినందించాల్సిన విషయం .తోటి వారి లో ఒకడు గా ఉంటూ తన లక్ష్యాన్ని నేర వేర్చుకొన్న ఘనుడు సుమనుడు .
సుమన్ లో దైవ భక్తీ రాశీ భూతమై ఉంది. శ్రీ వేంకటేశ్వరస్వామి  పై వేయి  అన్ని సందర్భాలకు సంబంధిన పాటలు రాసి సుస్వరం గా స్వర పరిపించి మంచి గాయకులతో పాడించి సహస్ర గేయ స్తోత్ర మాల గా ఆ బాలాజీ కి సమర్పించిన భక్తీ భావ బందురుడు .ఒక రకం గా తన ఆత్మా సమర్పనే చేశాడు .చిన్న చిన్న మాట లతో గంభీర భావాన్ని పొడగతం సుమన్ ప్రత్యేకత . .అతని ప్రతి మాటకు ప్రతి పాటకు ఒక నిర్దుష్ట భావన ఉంటుంది ..బయట ఈ సభల్లోనూ కనీ పించటం అరుదే .తన చానల్, తన పని, దాని విశిష్టతకై కృషి అదే అతని కార్య క్రమం .మహిళలకు  వంటా, వారి సమస్యలకు పరిష్కార మార్గాలు అన్వేషించటం అతను తొక్కిన కొత్త బాట .”మార్గ దర్శి” ఈ నాడు కు యేన లేని కీర్తిని తెచ్చి పెట్టింది .ఎందరెందరో మహాను భావులను వారి సేవా నిరతిని సమాజానికి వారు చేసిన సేవలను వెలుగు లోకి తెచ్చే అద్భుత కార్య క్రమం ఇది .నిజం గా నే మిగిలిన చానెళ్లకు కూడా మార్గ దర్శి గా కన్పిన్స్తుంది .ప్రేరణా స్ఫూర్తి కల్గిస్తుంది .అలాగే డిటెక్టివ్ కధలు తీసిచూపే నేర్పు ముచ్చట గా ఉంది .ఒక వ్యక్తీ ఇన్ని కొణాల లో ఆలోచించి దాన్ని ప్రదర్శించి దాంతో ప్రజాహృదయాలను చూర గోనటం ఆషా మాషీ కాదు .
2004ఎన్నికల ముందు తర్వాతవచ్చిన ”మాయా బజార్”అనే రాజకీయ సీరియల్ ఒక ఊపు ఊపింది .ఎన్నో ఆలోచనలను తేరపైకి తెచ్చింది .ఎక్కడ ఏమి జరుగుతోందో జనానికి తెలిసింది .ఇలా ఆనాడు తీయటం  సాహసమే .ఇలాంటివి ఉండాలి అనే భావం రావటం ఒక గొప్ప విషయం .హాస్యానికి సమ ప్రాధాన్యం ఉంది .అన్నిటి కంటే ఈ నాడు వార్తలు అంటే ”గప్పూ గాసిప్పు కాదు ”అసలు సిసలైన వార్తలు అని పించటం ఈ చానల్ ప్రత్యేకత .ఏదో సంఘటన జరి గింది కదా అని కెమెరా అక్కడే పెట్టి తీసి తీసి చూపి చూపి జనం సహనానికి పరీక్ష పెట్టక పోవటం దీని ప్రత్యేకత . న్యూస్ న్యూస్ గానే ఉంటుంది ”వ్యూస్ ”గా ఉండదు. రామోజీ రావు గారికి సుమన్ కూడా ఈ క్రెడిట్ దక్కు తుంది అనుకుంటా .ఇంకో విషయం వార్తలు చది వే వారు తీసుకొనే గొప్ప శ్రద్ధ .స్త్రీలు  లు మాత్రం సాంప్రదాయ వేష ధారణ లో వార్తలు చదివి తప్పులు లేకుండా రక్తి కట్టించటం ఆ మహిళా మణు లను చూస్తె చేయెత్తి నమస్కరించాలి అని పిస్తుంది .ఇది ఈ చానల్ ప్రత్యేకత . .దీన్ని అందరు మెచ్చాల్సిన విషయం .
భాష విషయం లో ఎన్నో కబుర్లు చెప్ప  వచ్చు .కాని ఆచరణ లో పెట్టటం గొప్ప సవాల్ .ఆ సవాల్ ను అధిగ మించి ”తెలుగు వెలుగులు ”శీర్షిక ను ప్రారంభించి అన్ని రకాల ప్రక్రియ లకు ప్రాధాన్యం ఇచ్చి తెలుగు భాష లో లబ్ధ ప్రతిష్టులైన వారందరినీ రప్పించి ,వారితో భాషా సౌందర్యాన్ని తెలుగు గొప్ప దనాన్ని విన్పించి మన చమక్కులు సామెతల ఆమెతలు అంటే విందు భోజనాలు ఏర్పాటు చేసి తెలుగును చానెల్ లో భక్తీ గా ఊరేగించటం అభి నందనీయం .దీనికి ఈ టి.వి.ని అభి నందించాలి .సుమన్ మరణం తో ఆంద్ర సాహితీ లోకం ఒక సాహితీ బాన్ధవుడిని కోల్పోయింది .సుమన్ ఉంటె చానెల్ మరిన్ని విషయాలలో ముందంజ వేసేది. పాపం అతని హఠాత్ మరణం తండ్రి రామోజీ రావు  గారికే కాదు, ఈ నాడు టీ వీ వారికి, దాని నభి మానించే లక్షలాది ప్రేక్షకులకు ఆశని పాతమే .”సుమం” తో సమాన మై న సున్నిత   సుమనస్కుడు అయిన సుమన్ అమర రహే -”.సు మనం” అంటే మంచి మనసు అని ఈ పాటికి గ్రహించే ఉంటారు .
మీ–గబ్బిట దుర్గా ప్రసాద్ –16-9-12-కాంప్–అమెరికా

Posted in రచనలు | Tagged | 2 Comments

జనవేమన -29 వేమన స్తుతి మాల

 జనవేమన -29
                                        వేమన స్తుతి మాల 

జన వేమన ప్రజా దరణ పొందిన పద్యాను ముక్తకాలుగా చెప్పి తెలుగు సరస్వతికి మౌక్తికా  భి షేకం చేశాడు .అలాంటి వేమన గురించి ప్రముఖులు ప్రశంశలు పలికి నీరాజనాలంద జేశారు .అందులో కొన్ని టిని తెలుసుకొందాం .”కవులు అని పేరు సంపాదింప ని కవు లలో చేరిన కవి వేమన ”అన్నారు రాళ్ళ పల్లి అనంత కృష్ణ శర్మ గారు .’ఉల్లేఖాలన్కారానికి వేమన ఉజ్వల మైన ఉదాహరణం .ఆయన లోక కవి ,ప్రజా కవి ,విశ్వ కవి ,నాద యోగి ”అన్నారు”మన వేమన ”లో  ఆచార్య కొర్ల పాటి శ్రీ రామ మూర్తి .సమగ్రాంధ్ర సాహిత్యం లో ఆరుద్ర ”పామరుల దృష్టి లో వేమన కవి కాదు ,అవతార పురుషుడు .పండితులు ,సాహిత్య కారులు ఆయన్ను మహా కవి గా గుర్తిన్చనే లేదు .ఆయన్ను కవి గా గుర్తించిన వారు ఆధునికులే .కొమర్రాజు వారు ఇల్లు అలికారు ,కట్ట మంచి వారు ముగ్గు పెట్టారు ,వంగూరి వారు పీట వేశారు .వేటూరి వారు, బండారు వారు ,శేషాద్రి రమణ కవులు ప్రస్తు తించారు .రాళ్ళ పల్లి వారు మహా కవి గా గుర్తించారు ”అని కీర్తి కిరీటం పెట్టాడు .అన్నాడు ఆరుద్ర.”వేదాలు లిఖితాలు కాదు ,వేమన కవిత్వమూ అంతే .సన్య సించిన తర్వాత గోచీ తో పాటు గంటాన్నీ విసరి వేసిన వాడే .సందర్భాన్ని బట్టి ఆశువు గా చెప్పిన పద్యాలు జనం నాలుక పై నిలిచి పోయాయి .లేఖక పాథక ప్రమాదాలు వేమన్న కున్నంత గా ఇంకెవరికీ లేవు .నోటి ప్రచారం తర్వాత తాటాకు ల పైకేక్కాయి .నిరక్షరుల నోట ,ఇంటా అవి బతికాయి ”అన్నారు ”విశ్వ దాభి రామ ,వినుర వేమా ”లో త్రిపుర నేని వెంకటేశ్వర రావు .
”ముక్తకం వ్యంగ్య పూరితం .దాన్ని వినటం ప్రారంభించ గానే వినే వాడిలో ఉద్బుద్ధంఅయ్యే కుతూహలాన్ని పద్యం ముగిసే లోగా తృప్తి కలిగించాలి .దానికి క్లుప్తత అందం .ఈ సంక్షిప్తతే అనవసర మైన విషయ వివరణ అనే దోషం అంట కుండా కాపాడు తుంది .పై ముక్తక లక్షణాలు చాలా మటుకు వేమన పద్యాలకు వర్తిస్తాయి ”అని ఆచార్య యెన్ .గోపి తన ”ప్రజా కవి మేమన ”లో ప్రస్తు తించారు .”తనకు తోచిన అంశాన్ని వస్తువు గా గ్రహించి శతక పద్యా లను చెప్పిన వారి లో వేమన ఆద్యుడు ”అని ”ఆంద్ర శతక సాహిత్య వికాసం ”లో డాక్టర్ కే.గోపాల కృష్ణా రావు అన్నారు .
”శాప గ్రస్తుడైన జీవి ,విరక్తి మార్గం పడ తాడు .పర మార్ధాన్ని ఆకాన్క్షిస్తాడు . .వేమన జీవితం ఇదే మార్గాన్ని పట్టింది .యవ్వనం లో మోహిక భోగాలను భ వించాడు .అందులో అర్దార్ది సంబంధం తప్ప ,పరమార్ధం కన్పించలేదు .కాంచనం వంచనం రక్తి మార్గం లో ముళ్ళ పొదల్లా కన్పించాయి .దాన్ని వదిలి భక్తీ మార్గం పట్టాలి .భక్తికి విశ్వాసం ముఖ్యం .వివేకాన్ని నమ్మినంతగా విశ్వాసాన్ని నమ్మ లేదు .అందుకని భక్తుడు కాలేక పోయాడు .కాని ,భగ వంతుని చేరే మార్గా లన్నిటిని పరా మర్శించాడు .బహిర్ముఖ జీవితం పై కోపం వచ్చింది .అంతర్ముఖుడై తన లోనే భగ వంతుడిని చూసుకొన్నాడు .జీవితం నేర్పిన గుణ పాథంఇది .నీలోనే నిజం ఉంది తెలుసుకో .అని చివరకు పాథం నేర్పింది .అందుకే కవిత్వం ”ఆత్మాశ్రితం  ”అయింది .అదే దాని అంతర్లీన శక్తి ”అని ఆచార్య జి.వి.సుబ్రహ్మణ్యం గారు ”వేమన యోగి ,పద్యం ప్రక్రియ మకుటం ముద్ర ”అన్న వ్యాసం లో అద్భుత విశ్లేషణ చేశారు .”వేమన దృష్టి లో మనిషే దేవుడు .ఆయన తత్త్వం మానవతా వాదం .ప్రబోధం తో పాటు సంస్కరణ అవసరం అని భావించాడు .మానవుడే మాధవుడని చెప్పిన జ్ఞాన యోగి .అందుకే ఆయనది వేద వాక్కు .ఆయన్ను సమాజ కవి గా ,నాధ సంప్రదాయ కవి గా ,భావించారు .ఆయన వాక్కు ప్రజల గుండెల్లో సరాసరి ప్రవేశించి నిలిచే శక్తి కలిగి ఉంది .వేమన తో కలిసి పాడటం ,వేమన వలె స్వంతం గా పద్యం పాడటం అప్పటికి ఇప్పటికి కళే .వేమన పద్యాలు అనే ప్రసిద్ధి .మకుటం వల్ల  శతకం అన్నారు .మకుటం పెట్టటం వల్ల  ”పద కవితా సాంప్రదాయం ”కూడా వచ్చింది .శతక పద ప్రక్రియను మకుట ముద్ర తో యోగించి యోగి అయ్యాడు .అతని పద్యం ఒక ప్రక్రియ .అతని మకుటం ఒక ముద్ర .పదానికి ,పద్యానికి ఒక విచిత్ర సంబంధం కలిపాడు .తత్త్వం లా పాడాడు .వేమన తనువు చాలించినా అతని పద్యం జీవితం చాలించ లేదు .పాట రాని పద కర్తలు వేమన పద్యాల అనురక్తులు .పదం భక్తీ లో మునిగింది .పద్యం బతుకు లో ఈదింది ”అని మహా విమర్శక శిఖామణి మూలాల లోతులు తరచే ఆచార్య గూడ వెంకట సుబ్రహ్మణ్యం గారు (జి.వి.)పరమాద్భుత మైన విశ్లేషణ చేసి వేమనను చిరంజీవిని చేశారు ..
”ఆధ్యాత్మిక సంకర భావ మూధా చారాలను భస్మీ పటలం గావించే విప్లవ మహాగ్ని జ్వాల గా విశ్వ కవి వేమన ,ఆయన పద్యాలు జరామరణం ఎరుగని చెదపట్టని చింత నిప్పులు ,చిలుం పట్టని స్వరాక్ష రాలు ,కుల మత చాందసుల కత్తులకు అవి అ  గ్రాలు ” అని విప్ల వాభి వందనం చేస్తారు వేమన భావాలను అనేక కోణాల్లో ఆవిష్కరించిన బత్తిన గురు మూర్తి గారు తమ ”వేమన పద్య సందేశం ”లో .వేమన గారు జీవితం లో బంగారం చేశారో లేదో కాని ఆరుద్ర మాత్రం బంగారం లాంటి మాటలు ఆయన్ను గురించి చెప్పాడు .ఆంద్ర ప్రదేశ్ సాహిత్య అకాడెమి వేమన గారి వంద పద్యాలు సంస్కృతం లోకి తర్జుమా చేసి నివాళు లర్పించారు .ఈ అను వాదాన్ని బందరుదగ్గర చిట్టి గూడూరు సంస్కృత కాలేజి ప్రిన్సిపాల్ శ్రీ ఎస్.టి.జి.వరదా చార్యులు చేయటం అద్భుత మైన విషయం .గద్వాల ఆస్థాన కవులు శతావ ధాని గంధం శ్రీ రామ మూర్తి ,ఇర్రింకి నరసింహ మూర్తి గార్లు ”వేమన గీత ”పేరు తో అనుష్టుప్ శ్లోకాలుగా అనువదించి నట్లు ఆరుద్ర పేర్కొన్నారు .వేమా అనే మకుట పదం ఎక్కడో ఒక చోట వచ్చేట్లు అనువాదం చేశారట .
చార్లెస్ యి గోవర్ దొర వేమన సూక్తుల్ని ఇంగ్లీష్ పద్యాను వాదం చేసి ఆంగ్ల సాహిత్య రంగ ప్రవేశం కల్పించారు .వేమన్న ను ఘనం గా నే పద్య కవులు శ్లాఘించారు శ్రీ వెంకట పార్వతీశ్వ ర కవులు వేమనను -”సకల మతముల నొక త్రోవ జరిపి నావు –నిఖిల జాతుల నొక ఇంట నిలిపి నావు –అఖిల శక్తుల నొక చోట కలిపి నావు –పరమ యోగేంద్ర వేమ భూపాల చంద్రా ”అని కవి రాజునే చేశారు .శ్రీ వేటూరి ప్రభాకర శాస్త్రి గారు ”ఏమేని పఠింప కే ,సముదితాహీన పబోధంబునన్ –సామాన్య ప్రజా కేని ,యశ్రమకర స్పష్టా ప భోగం బు గా –వేమారున్ మననంబు సేయ దగు ,నవ్వేదాంత సిద్దాన్తముల్ –వేమా రెడ్డి రచించే పద్య ఫణితిన్ ,విశ్వాభి రామంబుగాన్ ”అని మనోహరం గా మెచ్చుకొన్నారు .వేమన కాలానికి సంబంధించిన వివాదం లోకి తాను ప్రవేశించనని ”నీ వాచా మాధురి ,నీ నిరర్గల కవిత్వాస్పూర్తి గీర్తిన్చేదన్ ”అని కరుణశ్రీ జంధ్యాల పాపయ్య శాస్త్రి కీర్తించారు .ఆయనే మళ్ళీ –”అభిరామాక్రుతులైన నీకృతుల నవ్యత్వాభి రామంములై –ప్రభుతం గన్నవి యావదాంధ్ర జన హ్రుత్పద్మ్మమ్ములన్ భాను స –న్నిభ ,యుష్మత్కవితా రుణ ప్రభలు నిండెన్ ,గేహ గేహాల –యభి వాదమ్ములు గొమ్ము వేమన కవీంద్రా కర్మ యోగీశ్వారా ”అన్నారు .
”ఒక్క పొల్లు మాట లేకుండా మర్రి విత్తనం అంత చిన్న పద్యం లో మహా వ్రుక్షమంత అనుభవాన్ని ఇవ్వ గలిగిన వాడు మహా కవి .మాటలు పొదుపు గా వాడటం అనే సుగుణం మన సాహిత్య ప్రక్రియ లో ”కవిత్రయం ”వారి తో కరు వై పోయింది .ఆ ముగ్గురి తర్వాతా వెదికితే వేమన గారు తప్ప కను చూపు మేర లో ఇంకెవరూ కనీ పించారు .కవిత్రయం లో లేని ఇంకో గొప్ప గుణం వేమన లో కన్పిస్తుంది  ఆది -పుస్తకాలలోని పదాలు కాక ,జీవితం లోని పదాల ను వాడటం ”అన్నారు ఆరుద్ర .వేమన ప్రభావం తో కవిత్వం రాసిన వారి లో కూచి మంచి తిమ్మన ,కను మార్తి అచ్చయ్య ,కూచి మంచి జగ్గన ఉన్నారు .”తల్లిదండ్రి మీద దయ లేని పుత్రుండు ”అన్న పద్యం తంజావూర్ లోని శివాజీ రాసిన యక్ష గానం లో ముఖారి రాగం లో ఒక పద్యం ఉన్నట్లు ఆరుద్ర చెప్పారు .ముద్దు పళని కూడా వేమన ప్రభావానికి లోనై రాసింది .18శతాబ్దపు చాలా మంది కవుల పై వేమన ప్రభావం ఉంది .
దేశ సర్వతోముఖాభి వృద్ధికి ఎన్ని ప్రణాలికలు రచించినా ,ఎంత డబ్బు ఖర్చు చేసినా ప్రజల మధ్య ఐక్యత లేక పోతే నిత్యం రావణ కాష్టమే .నిర్బంధమే ,అనుమానాలే .సంఘ బలం తో కదిలి తేనె ,పునర్నిర్మాణం సాధ్యం .”ఐక మత్య మొక్క టావస్యకం బెపుడు –దాని ,బలిమి నెంత యైన కలుగు -గడ్డి వెంటి బెట్టి కట్టావా యేనుంగు “‘అని స్పష్టం గా ఆనాడే వేమన చెప్పాడు .విశ్వ కుటుంబ భావన ఉంటె ఎప్పుడూ మంచే జరుగు తుంది .ఈ భావం నిలిస్తే వేమన చిరంజీవే ..ప్రపంచమంతా సచ్చిదానందమే .ఇది వేమన్న సమగ్ర దర్శనం కాక పోయినా సమ్యక్ దర్శనం ,సదానందమే .
సశేషం –మీ గబ్బిట దుర్గా ప్రసాద్ –16-9-12-కాంప్–అమెరికా

Posted in నేను చూసినవ ప్రదేశాలు, మహానుభావులు | Tagged | Leave a comment

పునరుత్పాదక ఇంధన శక్తి

పునరుత్పాదక ఇంధన శక్తి 

అణు రియాక్టర్లు గుండెల పై కుమ్పట్లనీ అణు విద్యుత్తు చౌక   కాదని అణు ధూళిప్రమాదకరమని అన్నాం . .నిజమే .మనకు సంప్రదాయ ఇంధనాలున్నాయి అవే బొగ్గు, ఖనిజ తైలం ,సహజ వాయువు .వీటి వల్ల విద్యుత్తు ను తయారు చేసుకొంటూనే ఉన్నాం .జల విద్యుత్తు సరే సరి .అయితే చాలా కాలం గా జలాశయాలు కళ తప్పాయి .అందులోంచి వచ్చే విద్యుత్తు బోటా బోటీ గా ఉంది .తెర్మల్ విద్యుత్తు కు ఫాక్టరీలు పని చేసే గంటలకు కరెంట్ సప్ప్లై ఉండాలి .అంత సేపు విద్యుత్తు ఇచ్చే దమ్ము మనకు లేదు .ఇటీవలి కాలం లో రోజుకు నాలుగు గంటలు కూడా రైతులకు ఇవ్వ లేక ప్రభుత్వం చేతు లేత్తేసింది .ఇక ఫాక్టరీల గోడు వినే దేవడు ?కేంద్రం కూడా ఏమీ చేయలేక ”మీ ఎడుపేదో మీ రేడ  వండి మా కు చెప్పకండి ”అనే స్తితి లోకి వచ్చింది .ఈ మధ్యనే భారత దేశపు అన్ని రాష్ట్రాలూ చీకటిలో మగ్గి పోయిన సంఘటన మనకు తెలిసిందే .మన రాష్ట్రం సంగతి అంతా ”దైవా దీనం మోటారు సర్వీసు” లా ఉంది .ఇది వరకు ప్రజలు ”అన్నమో రామ చంద్రా ”అనే వారు .ఇప్పుడు ”కరెంటో క (కి)రుణ కుమారా!”అంటున్నారు .వసతులు పెంచుకోన్నాం .వాడకం పెరిగింది .యంత్రాలు పెరిగాయి .సుఖాలు పెరిగాయి .వీటన్నిటికి కావలసిన విద్యుత్తు ఉత్పత్తి కావటం లేదు .ఇదేదో మన సమస్య మాత్రమె కాదు ప్రపంచం లో చాలా దేశాల పరిస్తితి ఇంతే .ఉన్న బొగ్గు అంతా తవ్వి తీసేస్తున్నాం ..దీనికి తోడు పర్మిషన్ తీసుకొన్న దాని కంటే ఎక్కు వ బొగ్గు తవ్వి రాష్ట్ర ,కేంద్ర ప్రభుత్వాల కళ్ళు కప్పి విదేశాలకు ఎగు మతి చేసి బిలియనీర్లై” నల్ల చక్ర వర్తులై” మన ముందే పళ్ళు ఇకిలిస్తున్న వారిని చూస్తున్నాం .అట్లాగే దొంగ విద్యుత్  వాడకం దారులను అరి కట్ట లేక పోతున్నాం.సహజ వాయువు పై అనేక ఆంక్షలు ఉన్నాయి . .అదీ ప్రైవేట్ పరమై శూన్యం అయింది .ఈ సమస్యలకు పరిష్కారం తెలీక ఇంజినీర్లు శాస్త్ర వేత్తలు తల పట్టు కుంటున్నారు .ఈ సహజ వనరులన్నీ ఖాళీ చేస్తే మళ్ళీ కొత్త వాటిని మనం సృష్టించలేము .ఇవి పునరుత్పాదకాలు కావు .అందుకని పునరుత్పాదక లేక  సాంప్ర దాయేతర  ఇంధనాల పై దృష్టి సారించారు .అందులో సోలార్ ఎనర్జీ, తరంగ శ, గాలి మరలు, భూగర్బ్ఘ విద్యుత్తు వంటివి అనేకం ఉన్నాయి .వీటి పై సరిగ్గా దృష్టి పెడితే అవన్నీ తరగని సంపద లా మన అవసరాలను తీరుస్తాయి. వాటిని గురించే ఇప్పుడు మనం తెలుసు కో బోతున్నాం .
                           గాలి శక్తి ( విండ్ పవర్ )
గాలి మరల నుండి శక్తిని యూరప్ లో చాలా దేశాలు తయారు చేసి వినియోగించుకొంతున్నాయి .ఈ శక్తి కాలుష్య రహితం .ఆర్ధికం గా బాగా గిట్టు బాట వు తుంది .ఇది చాలా సాధారణ టెక్నాలజీ తో పని చేయటం ఒక ఆకర్షణ .సంక్లిష్ట న్యూక్లియర్ రియాక్టర్ల నిర్మాణం కంటే బాగా గాలి వీచే ప్రాంతా లలో వీటిని నేల కొల్పటం తేలిక .ఖర్చు బాగా కలిసి వస్తుంది .ఒక అధ్యయనం ప్రకారం 2000 వ సంవత్సరం లో వాడిన మొత్తం విద్యుత్తు కంటే నలభై రెట్లు అధిక విద్యుత్తు అంటే సుమారు 72టెర్రా వాట్ల విద్యుత్తు అన్ని ఖండాల  లోని 8000గాలి మరల వల్ల  లభించి రికార్డు సాధించింది .ఇది ఇరవై శాతం .దీనినే మనం సాధించ గలిగాము అంటే ,  ,ప్రపంచం మొత్తానికి కావలసిన శక్తిని సాధించ గలం అనే నమ్మకం కలుగు తోంది అంటారు శాస్త్ర వేత్తలు ఒక టెర్రా వాట్ విద్యుత్తు100 వాట్ల బల్బులను   10 బిలియన్  లను వెలిగించే సామర్ధ్యం కలిగి ఉంటుంది .ఈ శక్తి వనరులు యూరప్ లోని ఉత్తర సముద్ర ప్రాంతంలో ,అమెరికా లోని గ్రేట్ లేక్స్ ప్రాంతం లో దక్షిణ అమెరికా దక్షిణ భాగం లో ను ఉన్నాయి .గాలి వల్ల   వచ్చే విద్యుత్తు ఏటా 34 %పెరుగు తోందని లెక్క వేశారు .గత పదేళ్లు గా దీని ఉత్పాదన వేగ వంత మైంది .అయితే ప్రపంచ విద్యుత్తు తో పోలిస్తే ఇది ఒక అర శాతమే ఉంది .
1970 లో ఆయిల్ సంక్షోభం వచ్చిన సంగతి మనకు తెలుసు .అప్పుడు డెన్మార్కు దేశం గాలి శక్తిని ఉపయోగించే ప్రక్రియను ఉధృతం చేసింది .1988 చేర్నోబిల్ ప్రమాదం తర్వాత ,ఆ ప్రభుత్వ న్యూక్లియర్ పవర్ ప్లాంటు లను నిర్మించ రాదనీ చట్టం చేసింది .ఇప్పుడు డెన్మార్క్ నాలుగవ జెనెరేషన్ విండ్  ట ర్బైన్లను నిర్మించి అందరికి ఆదర్శ వంతం గా ఉంది .దీని టెక్నాలజీ బాగా తెలిసిన దేశం గా గుర్తింపు పొందింది .అక్కడి ఒక పౌరుడు  ”I wanted my children to have five fingers .,we made a choice -no nucear energy ”.అని స్పష్టం గా చెప్పాడట .ఇంకో విషాదకర విషయం ఏమి టంటే డెన్మార్కు లోని ఆహారపదార్ధాలలో  లో ఇంకా రేడియో ధార్మికత ఉంది ట .పాతిక సంవత్స రాలైనప్పటికీ ఆ రేడియో ఆక్టివ్ దెయ్యం వదలక పీడిస్తూనే ఉంది పాపం .
అమెరికా లో విండ్ పవర్ బాగా ప్రాచుర్యం లో ఉంది .రాకీ పర్పర్వతాలు మిస్సి సిపి మధ్య ఉన్న భాగాన్ని ”soudi arebia of the wind ”అని ముద్దు గా పిలుస్తారు .ఈ ప్రయరీ ప్రదేశం లో గాలులు ధారాళం గా ,నిరంతరం గా వీచటమే దీనికి కారణం .టెక్సాస్ ,కాన్సాస్ ,నార్త్ డకోటా కలిసి అమెరికా కు కావలసిన విద్యుత్తు ను నూటికి నూరు శాతం అందించ గలవు .అయితే గ్రేట్ లేక్స్ ,ఉత్తర ,ఈశాన్య ప్రాంతాలలో ఇంకా విండ్ పవర్ ను టాప్ చేయటం తక్కువ గానే ఉంది .1990 నుండి మిన్నే సోటా  రాష్ట్రం లో వందలాది గాలి టర్బైన్లు పని చేసి పవర్ తయారు చేసి రైతులకు బాగా అందిస్తున్నాయి .పెద్ద పెద్ద కార్పో రేషన్లు రైతులకు రెండు వేల నుంచి అయిదు వేల దాలర్లవరకు ధన సహాయం చేసి వింద మిల్స్ ను ఏర్పరుస్తున్నాయి .కొందరు రైతులు తామే వీటిని తయారు చేసుకొని ఉప యోగించటం ఒక ముందడుగే .విండ్ టర్బైన్లున్న వ్యవ సాయ క్షేత్రాలను ”combines in the sky ”అని పిలుస్తారు .దీని వల్ల  పంటలు బాగా పండుతున్నాయి కాలుష్యం దూర మైంది .అందుకే దీన్ని ”గ్రీన్ ఎనర్జి ”అంటారు .అయితే వీటి వల్ల  తయారయ్యే విద్యుత్తు గ్రిడ్ లకు చేరాలంటే కష్టం గా ఉంది .గ్రిడ్లు వీటికి చాలా దూరం లో ఉంటున్నాయి .ఇంకో శుభ వార్త ఏమిటంటే ,జాన్ డీన్ కా ర్పోరేషన్ దీనికి కావలసిన పెట్టు బడి పెట్ట టానికి సిద్ధం గా ఉంది .దీనితో నాణ్యమైన శుద్ధ విద్యుత్ లభిస్తుంది .
చైనా దేశం లో విద్యుత్ వాడకం ఎక్కువే .దీని కోసం విండ్ పవర్ ను ఉప యోగిస్తున్నారు .ప్రభుత్వం అన్ని రకాల సాయం అందిస్తోంది ”.huitengxile” అనే మంగోలియా ప్రాంతం లో 68 మెగా వాట్ పవర్ ల  విండ్ ఫారం ను ఏర్పాటు చేశారు .ఇది 2008 నాటికి 400మెగా వాట్ల ను తయారు చేసింది .జన సంఖ్య బాగా ఎక్కువ ఉన్న ప్రాంతాలలో వీటి సంఖ్యను బాగా పెంచింది. ఆ దేశం లో బొగ్గు నిల్వలు చాలా ఎక్కువ గా ఉండటం తో దాని వల్ల  ఉత్పత్తి అయ్యే విద్యుత్తు202౦ నాటికి 20 000మెగా వాట్ల కు చేరి అవసరాలు తీరుతాయని భావిస్తున్నారు .విండ్ పవర్ తయారు చేసే వారికి పన్ను రాయితీ లను ప్రభుత్వం కల్పిస్తోంది .సాంప్రదాయేతర ఇంధనాల నుండి  వచ్చే విద్యుత్తు ను కోనా లను కొన్న రాష్ట్రాలకు ఆర్ధిక సాయం చేస్తోంది
                                        సౌర శక్తి (సోలార్ ఎనేర్జి )
ఇరవై ట్రిలియన్ వాట్ల విద్యుత్తు ను ఫోటో వోల్టాయిక్ సేల్స్ నుండి తయారు చేస్తున్నారు .అయితే ఇది ఇంకా అభి వృద్ధి చెందటానికి కావలసిన యంత్ర సామగ్రి అందరికి అందు బాటు లో లేదు .వీటి వాళ్ళ నాన్య మైన విద్యుత్తే వస్తోంది .ఆ సెల్లు ల జీవిత కాలం ముప్ఫై ఏళ్ళు మాత్రమే ..ఇది తయారు చేసే విద్యుత్తు వల్ల  98శాతం కాలుష్య రహితం ,ఆరోగ్య కరం .వీటిని అమర్చ టానికి తగిన ప్రదేశం కావాలి అదే దీని తో వచ్చిన చిక్కు .అంతే కాక దీని పై తగిన సాంకేతిక పరిజ్ఞానం ఇంకా అందుబాటు లోకి పూర్తిగా రాలేదు .అమెరికా లోని సిలికాన్ వాలీ లో” క్లీన్ టేక్ ”పేరుతో సోలార్ శక్తిని నీటి శుద్ధికి ,ఇతర ఆటోమోటివ్ ఇంధనాలను వాడుతున్నారు .ఇది ఒక గొప్ప బై ప్రాడక్ట్ గా భావిస్తున్నారక్కడ .వీటికోసం ప్రభుత్వాలు సబ్సిదీ లనిస్తున్నాయి .మూడు లక్షల ఇళ్ళ లో   సౌర శక్తిని విని యోగిస్తున్నారని అంచనా .వాటి సామగ్రి 500 మిలియన్ డాలర్ల అమ్మకం చేసింది .ఇది గతం కంటే28 % ఎక్కువట .అయినా  దీన్ని నేల కొల్పతా నికి ఖర్చు చాలా అవుతోంది .అమెరికా లోని న్యు జెర్సి లో దీనికి 50 వేల డాలర్లు ఖర్చు అవుతుంది .ప్రభుత్వం ప్రతి వాట్ కు అయిదున్నర డాలర్లు ఇస్తుంది .ఇది ముప్ఫై అయిదు వేలు అవుతుంది .మిగిలిన పది హీను వేల డాలర్లను బిల్లులు కట్టి తీర్చుకొంటారు .
ఇప్పుడు జెర్మని కధ తెలుసు కొందాం .2025 నాటికి జెర్మని న్యూక్లియర్ పవర్ కు స్వస్తి చెప్పాలని నిర్ణ యించు కొన్నది .కనుక ఇతర శక్తి వనరు  ల పై దృష్టి పెట్టింది .ఇప్పుడు ఎనిమిది శాతం విద్యుత్తు  ను విండ్ పవర్ తో సాధించింది .2050 కి తన అవసరాలకు సరి పడ ప్రత్యా మ్నాయ ఇంధన శక్తిని విని యోగించాలి తీర్మానించు కొంది .అప్పటికి కార్బన ఉద్గారాలను అయిదు శాతం మాత్రమే ఉండేట్లు చేసుకొనే ఆలోచన లో ఉంది ..ఇంగ్లాండ్ కూడా ఇదే ధోరణి లో ఆలోచిస్తోంది .2005 లో అమెరికా ఆఫ్గనిస్తాన్ ఇరాక్ యుద్ధాల కోసం 50 బిలియన్ డాలర్లను కేటాయించింది .దీనికి కారణం ఆయిల్ సామ్రాజ్యాన్ని తన గుప్పిట్లో ఉంచుకోవటమే .ఆయిల్ ను విపరీతం గ వాడటం  వల్ల గ్లోబల్ వార్మింగ్ జరుగుతుందని ఆ డబ్బు లో సగ మైనా విండ్ పవర్ ,,సోలార్ పవర్ మీద పెట్టు బడి పెడితే జనానికి భద్రత ,ఆర్ధిక వెసులు బాటు కలుగు తుందని నిపుణుల అభి ప్రాయం .
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –15 -09 -12 -కాంప్ -అమెరికా

Posted in సేకరణలు | Tagged | Leave a comment

మన అను (ణు )బంధం .

 మన అను  (ణు )బంధం .

 
భారత దేశం న్యూక్లియర్ రియాక్టర్ లో ప్లుటోనియం ను ఉప యొ గించి మొదటి న్యూక్లియర్ ఆయుధాన్ని తయారు చేసు కొన్నది .తర్వాతా ప్లుటోనియంను న్యూక్లియర్ పవర్ ప్లాంటు లలో ఉత్పత్తి చేయటం ప్రారంభించింది .దీనితో ఇండియా ”రోగ్ నేషన్ ”లజాబితా లో చేరి పోయింది .నిరాయుధ ఒడంబడికలో నార్త్ ,ఉత్తర కొరియా లతో పాటు చేరకుండా ఉండి పోయింది. వీటి పై పెత్తనానికి ఎవరికి అధికారం లేదనే వీరి అభి ప్రాయం .అయితే అమెరికా తో భారత రహస్య ఒప్పందాన్ని చేసుకొందని అందరు అభి ప్రాయ పడుతున్నారు ..2005july 18న భారత ప్రధాని మన్ మోహన్ ,అమెరికా అధ్యక్షుడు బుష్ ఆ ఒప్పందం పై సంతకాలు చేసి నట్లు తెలుస్తోంది .దీనితో భారత కు సివిలియన్ ,న్యూక్లియర్ పవర్ ప్రోగ్రాంల  కోసం అమెరికా సహాయం చేస్తుంది. భారత ఇప్పటికే బ్రిటన్ ,కెనడా ,అమెరికా లద. సాయంతో న్యూక్లియర్ ఆయుధాలను తయారు చేసుకొన్నది .వీటికి కావలసిన డిజైన్ వివ రా ల తో పాటు శుద్ధి చేసిన యురేనియం కూడా  బ్రిటన్ సమ కూర్చింది .ఈ ఇంధనాన్ని” అప్సర రియాక్టర్”లో మన దేశం ఉప యోగించింది .కెనడా మనకు న్యూక్లియర్ ఎనెర్జీ కోసం ”cirusభార జలాన్ని” అందించింది .అమెరికా కూడా భార జలాన్ని అందించి సహాయం చేసింది .
ఆ తర్వాత భారత లోని దేశం ” తారా పూర్ ”లోని మొదటి కమ్మర్శియల్  పవర్ ప్లాంట్ కు అమెరికాసాయం చేస్తే ,కెనడా దేశం రెండవ ప్లాంట్ ”రావత్ భాటా” కు సహాయం అందించింది .అయితే ఈ రెంటి వల్ల భారత్ కు ఒరిగిందేమీ లేదు .పవర్ సప్ప్లై లో వీటి వల్ల వచ్చే విద్యుత్తు మూడు శాతం మాత్రమె అని నిపుణులు తేల్చారు .దీని కంటే గాలి మరలు వల్ల వచ్చే విద్యుత్తే ఎక్కువన్నారు .మన రియాక్టర్లు ప్రపంచం లోనే బాగా కలుషిత మైన వాటి ని  భావిస్తున్నారు .వీటి లో పని చేసే వారికి చాలా ఎక్కువ మోతాదులో రేడియేషన్ ప్రభావం సోకుతోందని తెలుపుతున్న్నారు .రాజస్థాన్ పవర్ ప్లాంట్ కు సమీ పం లోని జనాభా ను నిపుణులు పరిశోధించి తెలుసుకొన్న విషయం వింటే గుండె బాదు కోవాల్సిందే .ఆ జనాల్లో కాళ్ళూ చేతులు వంకరపోతున్నాయి . ,పుట్టే పిల్లలు బాధ పడుతున్నారు .ఆడ వాళ్లకు గర్భ స్రావాలు ఎక్కు వై పోయాయి .ట్యూమర్లు విపరీతమైనాయి కడుపులోని శిశువులకు చాలా ప్రాణాంతక వ్యాధులు సంక్రమిస్తున్నాయి .
భారత దేశం ఈ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ల తో న్యూక్లియర్ ఎనెర్జీ తో బాటు ,న్యూక్లియర్ ఆయుధాలను కూడా తయారు చేస్తోంది .ఇప్పటికి భారత్ 65న్యూక్లియర్ ఆయుధాలు తయారు చేసిందని అంచనా వేశారు .ఇలా చేస్తూనే న్యూక్లియర్ ఆయుధాలు లేని ప్రపంచం కావాలని చాటు తోంది .ఇది విమర్శలకు గురి అయింది .ఏడేళ్ళ క్రితం బుష్ తో కుదుర్చుకొన్న ఒప్పందం ప్రకారం భారత్ విడిగా సివిలియన్ ,మిలిటరి న్యూక్లియర్ టెక్నాలజీ లను ఉప యోగించాలి .అంతే కాదు అంతర్జాతీయ సంస్థ అయిన ”..I.A. E.A” వారి ఇన్స్పెక్షన్ కు సిద్ధమవాలి .ఇక్కడ గమనించాల్సిన,ముఖ్య  విషయం ఒకటి ఉంది  .అమెరికా తో ఒడంబడిక లు కుదుర్చుకొన్న దేశాలైన ఫ్రాన్స్ బ్రిటన్ ,రష్యా చైనా లు సివిలియన్ కు వేరుగా, న్యూక్లియర్ ఆయుధాలకు వేరుగా  ఉపయోగించాలనే నియమానికి ఒప్పు కో లేదు .మన దేశమే అలా ఒప్పుకోన్నది .ఇది అందరు హెచ్చరిస్తున్న విషయం .ఇంకో తమాషా విషయం అందరి దృష్టికి వచ్చింది.అమెరికా తన దేశం లో ఉన్న అతి తక్కువ అంటే వేళ్ళ పై లెక్క పెట్ట దగినఅయిదు  న్యూక్లియర్ రియాక్టర్లను మాత్రమె ”.iaea”ఇన్స్పెక్షన్ పరిధి లోకి తీసుకొని రావటం .మిగిలిన వాటికి ఇన్స్పెక్షన్ ఉండదన్న మాట .ఇది పరిశీలకుల కు చాలా విడ్డూరం గా అని పిస్తోంది .వీటిలో సివిలియాన్ పదార్ధాలను మిలిటరి వ్యవస్థకు ఉప యోగించే,హక్కు , వీలు ఉంది .వీటిలో అధికారికం గా న్యూక్లియర్ ఆయుధాలున్నాయని భావిస్తున్నారు .
సరే భారత దేశం అమెరికా తో సంతకం చేసిన జాయింట్ స్టేట్ మెంట్ ప్రకారం –ఇండియా న్యూక్లియర్ పరీక్షలు చేయ రాదు .అయితే అమెరికా దీన్ని ఎక్కడా పాటించలేదని విశ్లేషకులు చెబుతున్నారు .భారత్ అణు రియాక్టర్ల కు కావలసిన ఇంధనాన్ని అమెరికా దాని మిత్ర దేశాలు అంద జేస్తాయి .వీటిని ఉరేనియం సప్ప్లై దేశాలంటారు .దేశం లో ఉత్పత్తి అయిన ఖనిజాన్ని ఆయుధాలకు వాడుకో వచ్చు దీని వల్ల  ఇండియా130 కి పైనే ఆయుధాలు తయారు చేసి నిల్వ చేసుకో వచ్చు .కాని ఇండియా లోని పవర్ ప్లాంటు లలో ఉన్న”spent fuel ”రక్షణ గురించి ఎక్కడా మాట మాత్రం లేదు అంటున్నారు వేత్తలు .ఇప్పటికే సుమారు 8000కిలో గ్రాముల రియాక్టర్ గ్రేడ్ ప్లుటోనియం స్పెంట్ ఫ్యుఎల్ లో ఉందట .దీంతో ఇంకో 1000 అణ్వాయుధాలు తయారు చేసుకో వచ్చు .అలా అయితే అమెరికా ,రష్యా ల తర్వాత భారత దేశం మూడ వ స్తానం లో అణ్వాయుధాలను నిల్వ చేసుకొనన్న దేశం అవుతుంది .ఇది మనకు గర్వ కారణమే .కాని భయ కారణం కూడా .ఇవన్నీ పైకి బానే కన్పిస్తాయి .వీటి వెనుక చిదంబర రహస్యం ఉంది అని చెవులు కొరుక్కుంటున్నారు విశ్లేషకులు .
ఈ జాయింట్ స్టేట్ మెంట్ భారత దేశ ప్రభుత్వ కాబి నెట్ కి కాని, దాని సెక్యురిటీ కమిటీ కి కాని, అమెరికా జాతీయ రక్షణ కౌన్సిల్ కు కాని ,అమెరికా జాతీయ రక్షణ సలహా బోర్డు కు గాని ,కనీసం అమెరికా అణు శక్తి డిపార్ట్ మెంట్ కు కాని తెలీకుండా తయారు చేసి అత్యంత గోప్యం గా భారత ప్రధాని, అమెరికా అధ్యక్షుడు సంతకాలు చేశారని అంతా అయి పోయిన తర్వాతా గుప్పు మంది .
ఇండియా చైనా కు దీటుగా ఆశియా లో యెద గాలాని అమెరికా కోరిక .ఇదొక వ్యూహం .దీని వల్ల  ఇండియా15 బిలియన్ల డాలర్ల మిలిటరి సామగ్రిని అమెరికా నుండి కొను గోలు చేస్తుంది .వీటిలో”anti sub marine patrol aircraft ”లు ఉండటం విశేషం .వీటి వల్ల హిందూ మహాసముద్రం లో విహరించే చైనా  వారి జలాంతర్గాములను తేలిగ్గా పసి గట్ట వచ్చు .అలాగే చైనా వాళ్ళ strai of malacca లోని మిలిటరి వ్యూహాలనుభారత్ ధ్వంసం చేసే ఆయుధాలు కూడా కొనుక్కో వచ్చు .అంతే కాదు ఇస్రాయిల్-అమెరికా టెక్నాలజీ తో  తయారు చేసిన ”arrow missile system ”  ను ఇండియా కొనుక్కో వచ్చు .”వేష్టింగ్గ్ హౌస్” తయారు చేసిన A.P.-1000 ను కూడా కొనుక్కో వచ్చు .ఈ మధ్య అమెరికా పర్య టించిన భారత దేశాధ్యక్షురాలు ఇండియా లో న్యూక్లియర్ పవర్ జెనెరేషన్ కోసం పెట్టు బడులు పెట్టమని ,కోరారు .దీనితో generation 3 generation 4న్యూక్లియర్ రియాక్టర్ల ఏర్పాటుకు భారత్- అమెరికాకు   ద్వారాలు తెరచి నట్లే నంటున్నారు నిపుణులు . వీటి వల్ల  మన రక్షణ వ్యూహం ,దేశ భద్రత, సర్వ సత్తాక ప్రతి పత్తి,ముఖ్యం గా కష్టపడి సాధించుకొన్న స్వాతంత్రం అన్నీ ప్రమాదం లోకి నెట్టేసి నట్లే అని దేశీయులు, దేశ భక్తులు, జాతి నిర్మాతలు అందరు భయ పడుతున్నారు .కనుక తస్మాత్ జాగ్రత  జాగ్రత అని హెచ్చ రిస్తున్నారు .మన అభి వృద్ధికి దోహద పడే ఒప్పందాలు మంచివే ,కాని భస్మాసుర హస్తం లా ఉండేవి అయితే ఉపద్రవమే ,ఆత్మ హననమే .”Be ware -o! my country men .”అను  బంధం పెరిగితే మచిదే కాని అణు బంధం వల్ల సమస్యలు ఉత్పత్తి కా కూడదు .
మీ–గబ్బిట దుర్గా ప్రసాద్ –15-9-12-కాంప్ -అమెరికా

Posted in సేకరణలు | Tagged , | Leave a comment

జన వేమన — 28 ప్రపంచమే శిక్షణా లయం

జన వేమన — 28
                                           ప్రపంచమే శిక్షణా లయం 

ఈ ప్రపంచాన్ని వదల నక్కర లేదు .జనం తో ఉంటూనే తన సంస్కారాన్ని పెంచు కోవాలి .ప్రపంచమే ఒక గొప్ప శిక్షణా లయం .అందుకే ”ఇల్లు ,నాలు విడిచి ఇనుప కచ్చలు గట్టి –వంటకంబు ,నీరు వాంఛలు డిగి –వంటి నున్న యంత వచ్చునా తత్వంబు ”అని కేక లేస్తాడు .ప్రపంచం లో సర్వ జీవులు ఒక్కటే నన్న భావం రావాలి .”ఇహము విడిచి ఫలము లింపు గలవని –మహిని బల్కు వారి మతము కల్ల –ఇహము లోన బరము నొసగుట గానరో ”అని ఇహం లోనే పరాన్ని చూడ మన్నాడు .ప్రపంచాన్ని వది లేయటం మంచిది కాదు .ప్రపంచ పరిత్యాగం మానవ సంస్కారాన్ని పెంచాడు .వారు ధరించే వన్నీ బాహ్య సన్యాస చిహ్నాలే .అందుకే ”గ్రామము ,భూములు వదలక –ప్రేమయు ,దయ ఇంత లేక భీకర మతు లై –భామల సుతులను వదలక –బాముల బడ నేల యడవి పట్టున వేమా ?”అని ప్రపంచం లోని శాంతిని వదిలి పారి పో వద్దు అన్నాడు .పకీరులుగా ,బికారులుగా ,తిరిగే వారంటే వేమనకు చీత్కారం .వాళ్ళందరూ శాపోహహతులు అంటాడు .”మది ముక్తికి నా స్పదంబు మహిలో వేమా ”అని చెబుతూ మనస్సు ముఖ్యం కాని వేషంముఖ్యం కాదు అని ఆయన అభి ప్రాయం .
                అసత్య జీవిత మార్గం 
ఆత్మా శిక్షణ కు ,జీవిత విజయ సాదా నానికీ యోగం చాలా శ్రేష్టం .అయితే మానసిక వైరాగ్యం వాళ్ళలో చాలా మందికి ఉండదు .డాంబికం గా ఉంటారు .సత్యాన్ని తెలుసు కోవాలానే కోరిక వారి లో తక్కువ మందికే ఉంటుంది .ఆత్మ సంస్కార వంతులు తక్కువే .అలాంటి వారి గురించి ”కలియుగమునను బుట్టి ,క తేర గా లేక -యొడలు బడల జేసి .యుగ్ర తపము –తమరు చేసి ఏమి ,తత్వము గ లేరు ”అని వీళ్ళను” లైట్ తీసుకొన్నాడు” .కాలు చేయి వంచి గాలి నిండా పీల్చి నేల మీద వ్రాలి కొన్ని ,నిలిచి కొన్ని ఆసనాలు వేస్తారు .లో చూపు చూడ నోల్లరు -వాచా బ్రహ్మము పలుక వద్దు ”అని హితవు చెప్పాడు .మాటలు కాదు ,చేతల్లో కనీ పించాలి అని సవాలు చేశాడు .రాజ యోగి అంటే తానే బ్రహ్మం అని తెలుసు కొన్న వాడు అన్నాడు .”శాంత మానసమున జల్లని శీతల –భాతి నున్న వాడు పరమ యోగి ”లాగా ఉన్న వాడే ముక్తిని సాధిస్తాడని వేమన అభి ప్రాయం .
                       సత్యం ఒక్కటే 
కర్మ కాండ ఆధ్యాత్మికం గా అంధ కారం లోకి నేడు తుంది .భేదాలు పెరుగు తాయి .దేవతలకు చేసే ఉపాసనతో మానవ ఐకమత్యాన్ని సాధించాలి .కర్మ చేయటం వాళ్ళ ప్రాపంచిక లాభం పొంద వచ్చు .కాని ధర్మ శాంతి సౌఖ్య సిద్ధి కలుగవు .ఆత్మా చిక్కులు విప్పిన వాడే యోగి .ఆత్మా శుద్ధి లేని ఆచారం పనికి రాదు .తీర్ధ యాత్రలు మానవ కళ్యాణ మార్గాలు కావు .హృదయం లో మార్పు రావాలి .”ఓడలు శుద్ధి చేసి ,ఆచారం యెడ యని చూడరా ”అన్నాడు .జీవితం పై ఉదాసీనత పనికి రాదు .అలా చేస్తే ,మానవుడి మీద గౌరవం పోతుంది .మానవీక్రుత సంస్కారమే మానవుని జీవితానుభవం .చెప్పటం తేలికే ఇవన్నీ .ఆచరించటం కష్టమే .ఔదార్యం మానవాభ్యుదయానికి అలంకారం .క్రూర భావాలు మాన వ వ్యక్తిత్వాన్ని భ్రష్టు పట్టిస్తాయి .”ఆస పాప జాతి అన్నిటి కంటే”అన్నాడు .పాపం ఎక్కడో లేదు .తాను చేసిన కర్మ లోనే ఉంది .”చంప దగిన యట్టి శత్రువు తన చేత -జిక్కె నేని కీడు సేయ రాదు -పొసగ మేలు చేసి పొమ్మనుటే చాలు ”అని సర్వ కాలాలకు తగిన నీతి చెప్పాడు .మనశ్శాంతి అంటే ఇంద్రియా లను సంస్కరించటమే కాని అణచి వేయటం కాదు .”అన్న మధిక మైన నది దా జమ్పురా — అన్న మంట కున్న నాత్మ నొచ్చు –చంప ,నొంప బువ్వ చాలదా ”అన్నం లేక పోయినా ,ఎక్కువైనా చస్తాం .చంపటానికి వేరే కారణాలు అక్కర్లేదు .అన్నం చాలు .ప్రకృతిని తెలుసుకోక పోతే భక్తీ రాదు .పాపానికి వెర వాలి .”మరువం గా వలదు మేలు ”అని మేలు చేసిన వాడిని మరు వద్దు అన్నాడు .మరిస్తే క్రుతఘ్నతే .ధనం ఎవరి సోమ్మ్మూ కాదు .ధర్మమే మన సొమ్ము .కోకిల వనం లో హాయిగా విల సిల్లి నట్లు ప్రాజ్ఞుల పలుకులు మానసిక ఆనందాన్నిస్తాయి .
నిజ మైన గురువు మార్గ దర్శకం గా ఉండాలి .మత పుస్తకాలు చదవటం వాళ్ళ ప్రయోజనం తక్కువే .జీవిత లోతుల శోధనకు ఆది చాలదు .స్వాను భూతి కావాలి .గురువు అంటే పరమాత్మే .శిష్యుడే జీవుడు .”గురు శిష్య జీవ సంపద –గురు తరముగ గూర్చు నతడు గురు వాగు వేమా ”అని యదార్ధ గురు దర్శనం చేయించాడు .మానవుని మోక్షం అతని చేతుల్లోనే ఉంది .”సకలా కారు దానంతుడు –సకలాతమల యందు సర్వ సాక్షియు దాని –సకలమున నిర్వి కారు –దాక లంక ,స్తితిని బ్రహ్మ మన బడు వేమా ”సందేహాలు ,అనుమానాలు భగవారాధన తో తొలగి పోతాయి .భయం వదలాలి .అజ్ఞానమే భయం .భయం పోతే జ్ఞాన సూర్యోదయమే .ఈ దేహం ,దేవాలయం కావాల్సిందే .”జయమే సుమీ జీవుదనుచు చాటార వేమా ”అని ఆయన సందేశం .సంసార జీవితం లో న్తూనే ,తామ రాకు పై నీటి బొట్టు లాగా వ్యవ హరిస్తూ ,భగవంతుని తో అనుక్షణం మానసికం గా గడుపుతూ ఉండే మానవుడే సర్వ స్వతంత్రుడు .అతడే భగ వంతుడు .
సత్యం తెలిస్తే ,ఆత్మ వశమై నట్లే .సత్యం ,విజ్ఞానమే దైవం .నిన్ను నీవు తెలుసు కొంటె భగ వంతున్ని తెలుసు కొన్నట్లే .చావుకు భయ పడ రాదు .ప్రళయం రాక తప్పదు .ఆత్మ జ్ఞానమే నావ .”ధర గిరులు ,జలధులన్నియు –పరి కిమ్పంగా ప్రళయమును భస్మాక్రుతులే –సురలును ,మునులను జనగ –నెర యోధులు నుండ గలరే నేర్పున వేమా ”ఇంతటి పరిణత భావాలను వేమన విర బూయించాడు .వాటిని తన నిశిత దృష్టి తో” డాక్టర్ ఈశ్వర తోపా” పరి శీలించి మనకు అందించారు .వేమన హృదయాన్ని మానవీయ కోణం లో అందజేసిన” తోపా ”గారు మనకు చిరస్మరణీయులు .వేమన కు అక్షరాభి షేకం చేసిన పరమ భక్తులు ”తోపా ”గారు .వేమన పద్యాలు భావాలు ఆ ముత్యాలే .అక్షర సత్యాలే .సుధా సిన్దువులే .తరగని గనులే .వన్నె, వాసి చేడని రత్న మాణిక్యాలే .అచ్చ మైన ప్రగతి శీల సజీవ కవితా చైతన్య మూర్తి వేమన కవి ,యోగి.అందుకే ఆయనను ”జన వేమన ”అన్నాను .
సశేషం –మీ గబ్బిట దుర్గా ప్రసాద్ -15-9-12–కాంప్–అమెరికా

Posted in మహానుభావులు | Tagged | Leave a comment

జన వేమన –27 ధనం -దరిద్రం

  జన వేమన –27
                                         ధనం -దరిద్రం 

దరిద్రం లో ఉంటె మాన వత ఉండదు అన్న భావానికి వేమన విలువ నివ్వ లేదు .డబ్బు తోనే ఆది లభిస్తుందన టానికి వీలు లేదు కూడా .ధనం కావాల్సిందే’ ఆత్మ సంస్కారం విషయం లో డబ్బుకు విలువ లేదు .ధన వ్యామోహం పతనానికి దారి తీస్తుంది .”ధనము చూచి నపుడే దగులు మనసు -కూలి నప్పుడరయ కుసులేల్ల విరుగును –”అని ధన ప్రభావం చెప్పాడు .ధన స్వభావం నశ్వరమే .మాన వ ప్రయోజనానికి ఉప యోగించే ధనం విలువైనది .”కలిమి కలిగే నేని కరుణ లేకున్డినా –కలిమి  యేల నిలుచు కర్ములకును ”ధనం ఉన్న వాడికి కరుణ ,దయా, సాను భూతి ,సహవేదనా ఉంటేనే ఆధనం రాణిస్తుంది .అర్హులకు ,ఆర్తులకు ధన వంతుని ధనం చేరాలి .ధన వంతుడు ధనానికి trustyమాత్రమె నని గాంధీ గారు టాటా బిర్లా లకు చెప్పిన విషయం మనకు తెలుసు .”దాన మిచ్చు నపుడే తనకు దక్కే ”అంటాడు .ధనాన్ని బడుగు జనానికి అందించ మన్నాడు .అయితే ధనం లేక పోతే మనో నిశ్చలత ఉండదని ఆయనకు తెలుసు .ఆధ్యాత్మిక శక్తి అనే ధనం ముందు లౌకిక ధనం వేల వేల బోతుంది .”ధైర్య మొదవ దేని ధనము లేదు -”అనీ చెప్పాడు .ధనానికి మేలు చేసే శక్తి ఉందనితెలిపాడు .సంపద వల్ల ధన వంతులు చెడి పోతారు .కనుక జాగ్రత్త గా ఉండాలి .
లోకం రీతి తమాషా గా ఉంటుంది .డబ్బున్న వాడు వికారం గా ఉన్నా మన్మధుడి లాగా కనీ పిస్తాడు .దరిద్రుడైతే మదనుడైనా మాల గా చూస్తాడు .అందుకే ”గోనమే (గుణం )ప్రధానం అన్నాడు .”గోనమే మూలము స్త్రీ లకు -మనమే మూలంబు ముక్తి మహిమ కు వేమా ”అన్నాడు .ఇచ్చే వారి వారి సంపద హెచ్చేదే కాని లేమి ఎలా కలుగున్ ?”అని ప్రశ్నిస్తాడు .సద్విని యోగమైన ధనం సంపదను పెంచుతున్దంటాడు .ఎటు వంటి కోరికా లేకుండా ప్రతి ఫలా పేక్ష లేకుండాసద్విని యోగం  చేసే దానం శోభిస్తుంది .మనిషి ధనానికి బానిస కారాదు .”ధన మిచ్చిన మన మెచ్చును -ధన మిచ్చిన దుర్గునంబు మానక హెచ్చున్ –ధన ముడిగిన మన ముడుగును –మన ముడిగిన దుర్గునంబు మానుము వేమా ”అంటాడు .అని ”డబ్బు టు ది పవర్ ఆఫ్ డబ్బు ” సూత్రం చెప్పాడు .మానవుల మధ్య సత్సంధాన కర్త గా డబ్బు ఉపయోగ పడాలి .దానం, ధర్మం ఆముష్మిక ప్రాప్తికి మార్గాలు .ధన సంపద త తో ధర్మ సంపదను దానం చేయాలి .మానవ కళ్యాణమే ధనం ధ్యేయం .గర్వంతో ప్రవర్తిస్తే వినాశనమే .సంపద్గర్వం పతన హేతువు .
ధనం కావాల్సిందే కాని అదే యావ పనికి రాదు .దరిద్రం అవసరాలను చెడ గోడుతుంది.”ధనము లేమి యనెడి దావానలంబు -తనను చేర్చు దరిదాపు జెరచు –ధనము లేమి చూడ దలచనే పాపంబు ”అని బాధ పడతాడు .ఆ పరిస్తితి లో దరిద్రుడికి మంచి మాట చెప్పినా రుచించదు .అతని ఇంద్రియ వ్యాపారం దెబ్బ తింటుంది .అప్పుడతనికి సాయం ,సాను భూతి,దయా  అవసరం .”ధనము లేమి  ఎవరికి తాలికై యుండదు ?”అన్నాడు .వారిని ఉద్ధరించాలని కోరాడు .ధనం లేక పోతే కులం,శుచి   శుభ్రం ఉండవు .గౌరవం రాదు .ఈనిన పులి ళా  ఖాండ్రు ఖాండ్రు మంటాడు . .మానవత్వం చేసిన మహా పాపమే దరిద్రం .”పేదను పొగడగను వాడున్ –కాదని ,శవ మనుచు జూచు గదరా వేమా “‘అంటాడు .దరిద్రుడు శవం తో సమానం గా సంఘం లో చూడ బడు తున్నాడని ఆవేదన చెందు తాడు .”శవం -శివం ”కావాలి .దరిద్రం భిక్షా పాత్రను చేతి కిస్తుంది .భిక్షా వ్రుత్తి కూడా దరిద్రం లా గా హీన మైనదే .కనుక వారి పట్ల ఔదార్యం చూపాలి .”బడుగు నేరుగా లేని ప్రాభావంబడి ఎల ?”ఆకలి కన్నా వారికి అన్నం పెడితే -హరున కర్పితముగా నారా గించు ”అని చెప్పాడు .అదే దారిద్ర నారాయణ సేవ .అలాంటి పనులన్నీ యజ్న యాగాదులంతటి పవిత్ర మైనవి అలాంటి ఫలాన్నే ఇస్తాయి .దారిద్ర సమస్యకు సమాజం బాధ్యత వహించాలి .”పెట్టి నంత ఫలము ,పెక్కుమ్గ్రకుపహతి –జేయ కున్న దాను చెరుప కున్న –పెండ్లి చేయు నట్టి పెద్ద ఫలంబురా ”అని దరిద్రునికి చేసే సేవా ఫలం కన్యా దాన ఫలం కన్నా గోప్పదన్నాడు .దీనులకు దయ తో దాన మిచ్చిన వాడే పుణ్య జనుడన్నాడు .దరిద్రుడిని ఉద్ధరించటానికి అవతలి వాడిని చెయ్యి చాచి అడిగి అయినా సాయం అందించాలి .దిక్కు లేని ప్రపంచపరిత్యాగం మాన వ సంస్కారాన్ని పెంచదు .అలా చేస్తే వారంతా యాచకులే అవుతారు .బాహ్య సన్యాసం వదలి ఆంతరిక సన్యాసం స్వీక రించాలి .ప్రపంచం లోని శాంతిని వదిలి ఎక్కడో ముక్కు మూసుకొని జనానికి దూరం గా ఉండ వద్దు అని చెప్పాడు .”తలలు బోడు లైన తలపులు బోడులా ”అని ప్రశ్నించాడు .
దారిద్ర నిర్మూలనకు ప్రభుత్వం ప్రజలు అందరు కలిసి కట్టు గా పని చేయాలి .లోభగుణాన్ని వదిలి ఆపద్బాన్ధవులు గా ఉండాలి ఉద్ధరణ అందరి ధ్యేయం కావాలి సమాజోద్ధరణకు దారిద్రాన్ని రూపు మాసేట్లు చేయాల్సిందే .సమ సమాజం కావాలి అని చెప్పే సోషలిస్టు భావాలకు వేమన ఆనాడే పునాది వేశాడు .వేమన కంటేపెద్ద  సోష లిస్టు ఉండడు
సశేషం –మీ–గబ్బిట దుర్గా ప్రసాద్ — 14-9-12-కాంప్ –అమెరికా

Posted in మహానుభావులు | Tagged | 1 Comment

అణు కేంద్రా లంటే- గుండెల మీద నిప్పుల కుంపట్లే

అణు కేంద్రా లంటే- గుండెల మీద నిప్పుల కుంపట్లే 
అన్ని రకాల విద్యుత్తు కన్నా అణు విద్యుత్తు చవక అనే అభి ప్రాయం తో అణు రియాక్టర్లను ఎక్కడ పడితే అక్కడ ఏర్పాటు చేసి మురిసి పోతున్నారు .చేర్నోబిల్ మొదలైన ప్రమాదాలను గమనించి కూడా వ్యామోహం పెరుగుతూనే ఉంది కాని తగ్గటం లేడు .ప్రజలు సాంఘిక సేవా కార్య  కర్తలు శాస్త్ర వేత్తలు నెత్తిన నోరెట్టు కొని గగ్గోలు పేడు తుంటే ఇప్పుడిప్పుడే కొంత ఆలోచన చేసి వెనక్కి తగ్గుతున్నారు .సునామీ ల ఉపద్రవాల వల్ల రియాక్టర్ల భవిషత్తు మరీ దారుణం గా ఉంది .ఒక రకం గా చెప్పా లంటే అణు రియాక్తర్లంటే గుండెల  మీద మండుతున్న నిప్పుల కుమ్పట్లే .
ఎన్నో అధ్యయనాల తర్వాతా తేలిందేమి టంటే అణు విద్యుత్ చాలా ఖర్చు తో కూడింది అనీ .దాన్ని భరించటం కష్టం అనీ .ఇవి టెర్ర రిస్తులకు లక్ష్యాలు అయితే మరీ ప్రమాదం.అవి పేలితే జెనెటిక్ వ్యాధులు ప్రబలి దీర్ఘ రోగాల పాలై జన జీవితం చిద్రమవుతుంది.రియాక్తర్లను రక్షించే వ్యవస్థ చాలా బలహీనం గానే ఉందని  బాగా అభి వృద్ధి చెందినఅమెరికా లోను అదే పరిస్తితి ఉందని తెలుస్తోంది ..న్యూక్లియర్ పవర్ ప్లాంటులు అంటే అటామిక్ బాంబు ఫాక్తరీలే అని గ్రహించటం లేదు . 1000మెగా వాట్ సామర్ధ్యం ఉన్న రియాక్టర్ 500పౌన్ల ప్లుటోనియం ను సంవత్స రానికి ఉత్పత్తి చేస్తుంది .ఆటం బాంబు కు పది పౌండ్ల ప్లుటోనియం ఇంధనం గా సరి పోతుంది .ఒక చిన్న ఆటం బాంబు ఒక పెద్ద సిటీ ని విధ్వంసం చేసే సమర్ధత కలిగి ఉంది .కనుక నిత్యం ప్రమాదం అంచున ఉన్నట్లే .
2005లో వచ్చిన ”గ్రీన్ పీస్ ”రిపోర్ట్ ప్రకారం సోలార్ శక్తి చాలా చవక గా లభిస్తోంది ..వంద మిలియన్ల జనానికి సరిపడ సోలార్ శక్తిని విని యోగించుకొనే ప్రాజెక్టులున్నాయి వాటి వల్ల 54   వేల మంది జనానికి ఉపాధి లభిస్తుంది .ఖర్చు  కేవలం ఇరవై బిలియన్లె .బ్రిటన్ లో మరైన్ ఎనెర్జీ తో ఇరవై శాతం జనం లాభ పడుతున్నారు కాలుష్య వాయువుల ప్రమాదం లేదు .అలాగే మిగిలిన పునరుత్పాదక శక్తి కల  ఇంధనాలను ఉపయోగించుకొని అణుభారాన్ని వదిలించు కోవాలని నిపుణుల సలహా .అమెరికా లో ఆయిల్  బిల్డింగ్ లకు ఉష్ణాన్ని కల్పించ టానికి వాడుతున్నారు .దీన్ని  ఎలెక్ట్రిక్ పవర్ గ్రిడ్ లకు పవర్ కోసం వాడటం లేదు .ఆయిల్ తో రెండు శాతం మాత్రమె పవర్ ఉత్పత్తి అవుతోంది .
1980-85కొత్త అణు రియాక్తర్లేమీ అమెరికా లో రాలేదు .రియాక్టర్ నిర్మాణానికి బోలెడు ఇనుము ఉక్కు సిమెంట్ అవసరం అయి తడిసి మోపెడవుతోంది .దానికి తగిన రక్షణ వ్యవస్థ ఏర్పాటు చేయటం కష్టమైంది .రియాక్టర్ ను చల్ల బరచ టానికి ఉప యోగించే నీరు త్రిటియం ,రేడియో యాక్టివ్ హైడ్రోజెన్ కార్బన్ 14వల్ల  కలుషితమై పోతోంది .ఇవి వాతావరణం లోకి ప్రవేశించి తీవ్ర నష్టాన్ని కలిగిస్తున్నాయి .ఈ నీరు సముద్ర జలాల్లో కలిస్తే ,తాగు నీటిలో చేరితే చెప్ప లేని ఉపద్రవమే .ప్రభుత్వం చెప్పే లెక్కల ప్రకారం న్యూక్లియర్ ఎనెర్జీ తయారవటానికి కిలో వాట్ అవార్ కు సుమారు ఒకటిముప్పావు సెంట్లు అవుతుందని .గాస్ తో తయారవుతే సుమారు అయిదున్నర సెంట్లు అని .కాని ఇవి నిజమైన లెక్కలు కావని తేలింది న్యూక్లియర్ ఎనెర్జీ కి ప్రభుత్వం ఇచ్చే సబ్సిడి చాలా ఎక్కువ .ఆది లెక్కలో చూపించరు .
d.n.a నిర్మాణం పైన కూడా న్యూక్లియర్ ప్లాంట్ ప్రభావం పడుతోందని అధ్యన నివేదికలు తెల్పుతున్నాయి.  ముఖ్యం గాకళ్ళకు  హాని కల్గు తోంది .రేడియో ఆక్టివ్  waste నుసరిగ్గా భద్ర పరచక పోతే దాని వల్ల వచ్చే నష్టం అంతా ఇంతా కాదంటున్నారు .పునరుత్పత్తి చేసే జీన్ల పై ప్రభావం చూపి జెనెటిక్ వ్యాధులు సంక్రమిస్తాయని హెచ్చ రిస్తున్నారు .iodine 131అనేది పాలలో చేరి థైరాయిడ్ గ్రంధికి చేటు తెస్తుందట .దీన్ని రక్తం స్పంజి లాగా పీల్చుకొంతుంది .అలాగే స్ట్రాన్షియం 90ఎముకలలోకి చేరి బోన్ కేన్సర్ కలిగిస్తుంది .లుకేమియా కూడా వచ్చి బాధ పెడుతుంది సీజియం 137కండరాలలో చేరి కందర కాన్సర్ కు కారణమవుతుంది .
సునామీ లు భూ కంపాలు వస్తే -ఇవి సముద్రాల దగ్గరే నిర్మింప బడి ఉంటాయి కనుక మరీ ప్రమాదం .ఆ సమయాలలో రేడియో యాక్టివ్ ఉద్గారాలు సముద్రం పాలైతే కొన్ని శతాబ్దాల పాటు మానవ జంతు జీవ  వినాశనం జరుగు తుందని హెచ్చరిస్తున్నారు .అవి మెల్ట డౌన్ ఆయె తప్పుడు రక్షణ సరిగ్గా లేకుంటే ప్రమాదం ముంచుకొని వస్తుంది. దాన్నిఅరికట్టటం అసాధ్యం అవుతుంది . .చుట్ట ప్రక్కల వందలాది మైళ్ళు ఈ ప్రభావానికి గురి అవుతాయి .అక్కడి జీవావరణం అంతా నాశనమే .రియాక్టర్ లలో ”స్పెంట్ ఫ్యుయేల్ ”మరీ డేంజర్ .వీటిలో హై లెవెల్ రేడియో యాక్టివ్ వేష్టుఉంటుంది .అమెరికా లో103 కంమేర్శియాల్ రియాక్తర్లున్నాయి .అవి 65 చోట్ల 31రాష్ట్రాలలో ఉన్నాయి .వీటిలో 34boi ling  waatar riaactor”  .లు .69ప్రేజరైజేడ్ వాటర్ రియా కటార్లు 14,కమ్మర్శియాల్ రియాక్టర్లు .వీటిని ఈ మధ్యనే మూసే శారు .వీటి కూలింగ్ వల్ల వచ్చే వేష్టు నుఎక్కడ నిల్వ చేయాలో తెలీక చాలా కాలం బుర్ర పగల కొట్టు కొంది ప్రభుత్వం .చివరికి జిమ్మీ కార్టర్ ప్రేసిడేన్సి లో నెవెడా లోని యూకా మౌంటేన్ లో రంధ్రం చేసి అక్కడికి తర లించాలని నిర్ణయించారు .అక్కడి స్తానికులు అడ్డు చెప్పారు .దానితో ఆగి పోయింది వీటిని రీ పాక్ చేసే టప్పుడైనా ఓవర పాక్ జరిగినప్పుడైనా పెద్ద ప్రమాదాలే జరిగి పోతాయని హెచ్చరిస్తున్నారు .స్పెంట్ ఫ్యుఎల్ పూల్ చాలా విధ్వంసాన్ని సృష్టిస్తుంది .ఇందులో యాభై శాతం రేడియో యాక్టివ్ పదార్ధాలు పదేళ్ళ దాకా సజీవం గా ఉండేవి ఉంటాయట .ఇవి చేసే అనర్ధం లెక్కకు మించిందే .కనుక ఇప్పుడు ప్లాంటుల దగ్గరే కొంచెం ఎత్తు మీద వీటిని నిర్మించి రక్షణ చర్యలు తీసుకొంటున్నారు .
ఈ రియాక్తర్లు నాలుగు దశలలో నిర్మించారు .ఒక దానికంటే ఒకటి ఖర్చు పెంచిందే కాని తగ్గించలేదు అవే జెనెరేషన్ వన్ ,టు, త్రీ ఫోర్ లు .ఇవన్నీ సంతృప్తిని ఇవ్వక బ్రీడర్ రియాక్టర్ లను తయారు చేశారు .వీటిని లిక్విడ్ సోడియం తో చల్ల బరుస్తున్నారు .కాని ఫాస్ట న్యూట్రాన్లను తగ్గించ లేక పోతోంది .అంతేకాక  సోడియం కు అంటుకొని మండే స్వభావం బాగా ఉంది .అదీ అనర్ధమే .నాల్గవ జెనెరేషన్ రియాక్టర్ లు చాలా ఖరీదైనవి .వీటి నిర్వహణ కు ఏదేశం లోను నిపుణులు లేరు .నిర్మాణం కూడా కష్టం, క్లిష్టం అవు తోంది .వీటి నిర్మాణం పూర్తీ కావటానికి ఇంకా పది  హేను నుంచి ముప్ఫై అయిదేళ్ళు పట్టవచ్చు అని అంచనా .ఆర్ధికం గా కష్ట  సాధ్యమే .అభి వృద్ధి చెందు తున్న దేశాలకు మరీ భారం .
న్యూక్లియర్ ఆయుధాలు కలిగిన దేశాలను”rogue nations” అంటారు .అమెరికా బ్రిటన్ రష్యా ,ఫ్రాన్స్ ,చైనా ,ఇండియా ,పాక్ ,ఇస్రాయిల్ ఉత్తర కొరియా ఇరాన్ లు ఈ జాబితా లో చేరాయి .పోటీ తత్త్వం పెరిగి పక్క దేశాలకు పక్కలో బల్లెం గా ఉంటున్నాయి .ఏదేశమైనా మొండిగా అణ్వాయుధం ప్రయోగిస్తే వినాశనమే .ఆపే శక్తి ఉండదు . .కనుక అణు శక్తి చవక కాదని నిత్య ప్రమాద భరితమని,రియాక్టర్లను ప్రోత్స హించ రాదనీ  అందరు తెలుసు కోవాలి .
మీ–గబ్బిట దుర్గా ప్రసాద్ –14-9-12-కాంప్–అమెరికా
http://suvarchalaanjaneyaswami.wordpress.com

Posted in రచనలు | Tagged | Leave a comment

ఊసుల్లో ఉయ్యూరు -34 మా ఆస్థాన క్షురకులు

 ఊసుల్లో ఉయ్యూరు -34
                                  మా ఆస్థాన క్షురకులు 

ఇదేదో కొత్త మాట లా ఉందా ? మా ఆస్థానం అన్నా మా సంస్థానం అన్న మా ఇల్లు అని అర్ధం .క్క్షురకులు అంటే జుట్టు పని చేసే వారు .పూర్వం జుట్టు కొట్టించు కోవా టాన్ని ”పని చేయించుకోవటం ”అనే వాళ్ళం .లేక ”మంగలి పని చేయించు కోవటం” అనే వారు .ఆ పని చేసే వారిని మంగళ్ళు అనే వారు .అయితే ఆ మాట కొంత ఎబ్బెట్టు గా ఉందని ”నాయీ బ్రాహ్మలు ”అన్నారు .అలాగే ఆ పని చేసే వారిని క్షురకులు అని సంస్కృతం లో అనే వారు .ఆ పని చేయ టాన్ని క్షవరం అనే వారు .లేక క్షౌరం ”అనీ పిలిచే వారు .ఆ స్థానాన్ని ”క్షౌర శాల ”అనటం ఉండేది .ఇప్పుడు ఇంగ్లీష్ మాటలు అలవాటై బార్బర్ అనీ బార్బర్ షాప్ అనీ చెప్పటం ,రాయటం జరుగు తోంది .అంతే కాదు క్షవరం అనే దానికి అర్ధం కూడా మారి పోయింది .ఎవ డైనా డబ్బు పోగొట్టు కొంటె ”క్షవరం అయిపోయిందన్న మాట  ”అనేస్తున్నాం .ఇంకా ఎక్కువ గా నష్ట పోతే ”తిరు క్షవరం ”అని పాపం ఆ యేడు కొండల వాడికి అంట గట్టు తున్నాం .అంటే నున్న గా గీకేశాడు ,గోకే శాడు  అని అర్ధం .ఎవరైనా సరిగ్గా క్షవరం చేయించుకోక పోతే ”ఏమిట్రా ! ఆ తిరు పతి నొక్కులు ?”అనటం బాగానే అలవాటయింది .
మేము హిందూ పురం నుండి ఉయ్యూరు కు వచ్చేసరికి మా మామయ్య గారింట్లోఉయ్యూరు వీరాస్వామి అనే ఆయనక్షురకుడు గా ఉండే వాడు .నీరు కావి ధోవతి కట్టు కొని  వచ్చి ఇళ్ళ దగ్గర పిల్లలకూ ,పెద్దలకు ”పని ”చేసే వాడు .ఈ పని చేసే వాళ్ళ చేతిలో అన్ని సామాన్లు పెట్టు కోవటానికి ఒక చిన్న నగిషీలు చెక్కిన కొంచెం కాషాయ రంగులో ఉండే  చెక్క పెట్టె ఉండేది .ఇందులో జుట్టు కత్తి రించే కత్తెరలు దువ్వెన ,కత్తికి పదును పెట్టెదీర్ఘ చతురస్రా కారపు సాన ,పటిక ముక్క , చిన్న చేతి గుడ్డ ,నీళ్ళు పోసుకోవటానికి చిన్న సత్తు బొచ్చె,  బ్రషు  ఉండేవి .కొంత మంది చిన్న అద్దాన్ని కూడా పెట్టుకొని తెచ్చే వారు .ఈ మొత్తం సామాను పెట్టె, పెట్టె ను ”పొది ”అనే వారు .దీన్ని ఎడమ చంక కింద పెట్టుకొని ఇళ్లకు వచ్చే వారు .ప్రతి ఇంటికి ఏదో నిర్ణీత వారం ఉండేది .ఆ నెలలో ఆ వారం లో వచ్చి ఎవరెవరికి పని చేయాలో చేసి వెళ్ళే వారు .అలా వీరా స్వామిని మొదట మేము చూశాం .మా ఇంట్లోను పనికి కుదిరాడు ఆయన .మా కంటే చాలా పెద్ద వాడు .అతని తమ్ముడు రఘు నాదం కొంచే క్లాస్ గా నల్ల గా పొడుగ్గా ఉండే వాడు .వీరా సామి పెద్ద కొడుకు మా కంటే పెద్ద వాడు అతను సివిల్  చదివి మంచి ఉద్యోగమే చేశాడు .అతని తమ్ముడు నాగేశ్వర రావు నాకు క్లాస్ మేట్ .వారసత్వపు పనిలోనే ఉన్నాడు .వీరా సామీ కి నాద స్వరం వాయించే బృందం ఉండేది .పెళ్ళిళ్ళకు అతని బృందం తోనే కార్య క్రమాలను నిర్వ హింప జేసే వారు .రఘు నాదానికి బాండ్ మేళం ఉండేదని జ్ఞాపకం .దాన్ని బాగా వాయించే కళా కారులుండేవారు .డబ్బున్న వాళ్ళు బాండ్ మేళాన్ని, సామాన్యులు సన్నాయిని పెట్టె వారు .రఘునాధం పెద్ద కొడుకు నాకు క్లాస్ మేట్ .వాళ్లకు ఉయ్యుర్లో మా పొలాలకు కొంచెం దూరం లో పోలాలున్దేవి .ఇంటి మంగలికి సంవత్స రానికో సారి ధాన్యం కొలిచే వారు .ఆ ఇంట్లో ఎంత మంది ఉన్నారో లెక్క ఉండేది కాదు .దీన్ని వార్షికం అనే వారు .ఎప్పుడు కబురు చేసినా వచ్చి పని చేసి వెళ్లాల్సిందే .సా ధారణం గా ఆ కాలం లో శుక్రవారం ,అమావాస్య మొదలైన రోజుల్లో చేయించుకొనే వారు కాదు .వయసు లో పెద్ద గా ఉన్న వారందరికీ గుండు పిలకా .చిన్న పిల్లలకు యువకులకు క్రాఫు .అదీ పద్ధతి .ఇంటికి మంగలి వస్తే వాకిట్లో ఒక మూల ఒక పీట మీద కూర్చొని చేయించు కోవాలి. మంగలి వంగొని కూర్చుని చేసే వాడు .నీళ్ళు చెంబు తో ఆయన బొచ్చె లో నీళ్ళు పోయాలి .పని అయినతర్వాత ఆజుట్టంతా అతను జాగ్రత్త చేసే వాడు .వెంట్రుక కనీ పిస్తే పెద్ద వాళ్ళు ఊరుకొనే వారు కాదు .ఆ పని చేయించుకోవటానికి పెద్ద వాళ్ళు లుంగీ లతో ,పిల్లలు గోచీ లతో కూర్చునే వాళ్ళు .ఒళ్లంతాకత్తిరించిన జుట్టు పడి, చీదర చీదర గా ఉండేది .అదంతా ఒక ప్రహసనం .స్నానం చేస్తే నేకాని ఇళ్ళ లోకి రానిచ్చే వారు కాదు .ఇంట్లో పెద్ద వాళ్ళు కుంకుడు కాయలను చితక కొట్టి ,గింజలు వేరు చేసి  ఒక గిన్నె లో పోసి గోరు వెచ్చని నీరు కలిపి నురుగు వచ్చేట్లు చేసి  రుద్దు కోన మనే వారు .ఆది కళ్ళ ల్లోకి పోయి, మండిఇబ్బంది గా ఉండేది . తర్వాత కళ్ళ వెంట ధారారా పాతం గా నీళ్ళు కారేవి .ఇలా సాగేది తలంటు భాగోతం .ఇప్పుడు తలంటు అంటే కూడా అర్ధం మారి పోయింది ..”వాడు వీడికి బాగా తలంటాడు ” అంటే పూర్తిగా దోచు కొన్నాడ”నే అర్ధం ఇప్పుడు వచ్చింది .
                                   
  రామ దాసు 
కొంత కాలం గడిచింది .మేము కొంచెం పెద్ద వాళ్ళం అయ్యాం.కాలేజిలో చేరాం .అప్పుడు వంగల కృష్ణ దత్తు గారికి పని చేసి, వ్యవహారాలూ చూసే రామ దాసు మా కూ పని చేయటానికి మా నాన్న గారు కుదిర్చారు . .రామ దాసు నల్లగా ఉండే వాడు పంచె కట్టే వాడు .మంచి మాట కారి ,పని బానే చేసే వాడు .చేస్తున్నంత సేపూ మాటలు చెబుతూనే ఉండే వాడు నవ్వించే వాడు .దత్తు గారి కబుర్లు అడిగి తెలుసుకొనే వాళ్ళం .మాకు కూడా అతను తలంటు కు కుదిరాడు .అప్పటికే కొంత ముదిరాం కనుక మా తలంటి మేము పోసుకోవటం నామోషీ అయింది .అందుకని తప్పలేదు .అదో భోగం .ఒళ్లంతా నువ్వుల నూనె పూసే వాడు .బాగా ఇగిరే దాకా రుద్దే వాడు .మెత్తని పెసర పిండి   లో కొద్దిగా పసుపు కలిపి ఒక గిన్నె లో మా పెద్ద వాళ్ళు ఇచ్చే వారు దానికి నలుగు పిండి అని పేరు ..దాన్ని రెండు చేతులకు  పులుము కొని మా ఒంటికి ఆపద మస్తకం పట్టించే వాడు .దీన్ని నలుగు పెట్టటం అనే వారు .అదంతా పూసిన తర్వాత మా ఆకారం చూస్తె దెయ్యమో భూతమో అన్నట్లు ఉండేది .చెవుల్లో నూనె పోసి గిల కొట్టే వాడు .బాగా చెవి లోకి,ఇంకి  పోయే దాకా ఇలా చేసే వాడు .ఇలా రెండు చేవులలోను పోసి గిల కొట్టే వాడు .ఒక చెవి అవగానే తల ఒక పక్కకు పెట్టి ఉండే వాళ్ళం .నూనె కారి పోకుండా వేళ్ళు అడ్డం పెట్టుకొనే వాళ్ళం .నెత్తికి ఆముదం పోసి తల అంటే వాడు .భలే తమాషా గా అంటే వాడు .ఇది ఎంత సేపున్నా భలేగా ఉండేది .మంచి మోత మోగించే వాడు .ఈ లోపు ఒంటికి పట్టించిన పెసర పిండి అంతా ఎండి  ఒలవటానికి తయారు గా ఉండేది .నెమ్మది గా చెయ్యి, కాలు ,నలుస్తూ దాన్ని బలపాలు బలపాలుగా నలిచి కింద పడేట్లు చేసే వాడు .మా చుట్టూ చిన్న పోగు గా ఆది పడి తమాషా గా ఉండేది .అప్పుడు మా వాళ్ళు ఒక పెద్ద గిన్నె లో అంతకు పూర్వమే దంచి ఉన్న కుంకుడు కాయలు పోసి ఉంచి గోరు వేచ్చని నీళ్ళు దానికి కలిపే వారు .ఇక ఆ గిన్నె ముట్టుకొనే వారు కాదు .రామ దాసు ఆ గిన్నె లో ఉన్న కుంకుడు కాయ లను బాగా కలిపి కుంకుడు పులుసు చేసే వాడు .మమ్మల్ని కళ్ళు మూసు కోన మనిఆ నురుగు నెత్తిమీద కొద్ది కొద్ది గా పోస్తూ  రుద్దే వాడు .ఆది కారుతూ జారుతూ తెల్లగా ఒళ్లంతా పాకేది .దాన్ని అన్ని చోట్లా రుద్దే వాడు .అలా మొదటి సారి అవగానే మా వాళ్ళు బొక్కెన లో తోడి ఉంచిన వేడి నీరు, కల పటానికి ఉంచిన చన్నీళ్ళు కావాల్సిన పాళం కలిపి రుద్దిన తర్వాతా పోసే వాడు .కళ్ళల్లోకి పోయి గోల చేసే వాళ్ళం .కళ్ళు మండేవి .కుంకుడు వాసన భలే తమాషా గా ఉండేది .మళ్ళీ నురుగు పోసి ఒళ్లంతా రుద్దే వాడు .మూడో సారి రసం తో తల రుద్దే వాడు .ఒంటికి పట్టిన చిలుము, కిలుము అంతా వదిలి పోయేది .ఒళ్లంతా నీళ్ళు పోసి స్నానం చేయించే వాడు .దీని తోఅతని పని అయి పోయేది .ఆ నీళ్ళ తో ఇంట్లోకి రాకూడదు .అందుకని మా పెద్ద వాళ్ళు విడి గా ఒక బకెట్ లో సమ పాళం లో నీళ్ళు కలిపి మా నెత్తిన చెంబెడు, చెంబెడు ఒళ్లంతా తడి సెట్లు పోసే వారు .అప్పుడు తువాల ఇస్తే తుడుచు కొనే వాళ్ళం .అప్పుడే  ఇంట్లోకి వేళ్ళ టానికి పర్మిషన్ .నెలకోసారి తప్పకుండా తలంటి పోయించుకొనే వాళ్ళం .తలంటి పోసుకొన్న రోజు రాత్రి విప రీతం గా నిద్ర వచ్చేది .తల లోని వేడి అంతా యెగిరి పోయి ఎంతో రిలీఫ్ గా ఉండేది .రామదాసు కు కూడా మేళం ఉండేది .అతని కొడుకుసూర్య నారాయణ  మంచి క్లారినెట్ విద్వాం శుడు.అతనికి మంచి డిమాండ్ ఉండేది .సుస్వర నాదానికి అతనికి పేరు .మా తరం లో ఇలా జరిగింది .
                                    లోక నాధం
మా పిల్లల తరం వచ్చే సరికి లోక నాధం అనే అతను పని చేసే వాడు .మాకు ,వాళ్లకు కూడా .అతను పొడుగ్గా ఒక కన్ను కొద్దిగా మూసి, లుంగీతో ఉండే వాడు .అతనికీ మేళం ఉండేది .లోక నాధం మేళం అనే వాళ్ళం .బాండ్ మేళానికి ప్రసిద్ధి .మాటలు కోటలు దాటించే వాడు .” బాబు గారు బాబు గారు ”అంటూ పిల్లల్ని, ”మేష్టారు గారు ”అంటూ నన్ను పలకరించే వాడు .పిల్లలకు జుట్టు కత్తి రించటం ,తలంటి పోయటం బానే చేసే వాడు .అప్పటికి ఫాషన్ కూడా మారి పోయింది .పిల్లలకు కాలానికి తగి నట్లు క్రాఫ్ చేయాలి .దానికి లోక నాదమే ఆ రోజుల్లో అందరికి నచ్చిన మనిషి .మా పిల్లల తో పాటు ,మా మేనల్లుళ్లు కూడా వుండే వారు .అంతా గోచీలు పెట్టుకొని నూనె రాయించుకొని వరుసగా కూర్చొని తలంటి పోయించు కుంటుంటే చూడ టానికి తమాషా గా ఉండేది .పాలేళ్ళు ఉండే వాళ్ళు కనుక వేడి నీళ్ళు కాచటం చన్నీళ్ళు బావిలోంచి తోడి గుండిగలలో పెట్టటం చేసే వాళ్ళు .అప్పటికి కొంత ఆచారమూ మార్పు చెందింది .కొంత కాలం దాకా లోకనాధనికీ వార్షికం గా వడ్లు కొలిచే వాళ్ళం .ఆ తర్వాతా డబ్బు లు ఇచ్చి నట్లు జ్ఞాపకం .సంక్రాంతి నాడు మేళ గాళ్ళు అందరు ఊదుకుంటూ ,డోలు వాయిన్చుకొంటుమంగళ వాద్యాలను విని పిస్తూ తండోప తండాలుగా  ఉదయమే ఊరంతా ఇల్లిల్లు తిరిగే వారు .అందరికి కొట్టు లోని ధాన్యం పాలేళ్ళతో తీయించి బస్తాలకు చేర్చి పిల్లల తో పెట్టించే వాళ్ళం .మా చిన్నప్పుడు మేమే పెట్టాం .ఇప్పుడు వారసత్వం గా వాళ్ళు .అదో సరదా గా చేసే వాళ్ళు .మధ్యాహ్నం పన్నెండు దాకా మేళ గాళ్ళు వస్తూనే ఉండే వారు .ఎవరికి లేదనకుండా పెట్టె వాళ్ళం .ఇంటి మంగలికి అందరి కంటే ఎక్కువ పావు బస్తా కు తగ్గ కుండా పెట్టె వాళ్ళం .రామ దాసు కూ అంతే, లోక నాధానికీ అంతే .లోక నాధం పిల్లలు మా అబ్బాయిలకు క్లాస్ మేట్లు కూడా .ఇస్తున్నా మనే గర్వం మాకు కాని తీసుకు వెళ్తున్నాం అనే న్యూనతా భావం వారి లో కాని ఉండేది కాదు .అదొక అవిచ్చిన్న సంప్రదాయం .ఇటీవలి కాలం లో అంటే సుమారు ఇరవై ఏళ్లుగా అలా,మేళ గాళ్ళేవరూ   ఇళ్లకు రావటం లేదు .వచ్చినా డబ్బులు ఇచ్చి పంపుతున్నాం .మా ఇళ్ళల్లో పెళ్ళిళ్ళకు లోక నాధం మేళం చేసే వాడు .లేక పోతే ఎవరి నైనా కుదిర్చే వాడు .అతని తర్వాత అతని తమ్ముడు లైన్ లోకి వచ్చాడు .ఇప్పుడెవరూ లేరు .రామ దాసూ ,లోకనాధమూ ఇద్దరు చని పోయారు .అంతా షాప్ లోకి వెళ్లి చేయిన్చుకోవటమే .తలంటి అనేది నిఘంటువు కే పరిమిత మై పోయింది .ఆ పదమే తెలీదు చాలా మందికి .మంగలి వారిలో వైద్యులు ఎక్కువ గానే ఉండే వారు ‘
ఉయ్యూరు లో మా గురువు గరుడాచలం మేస్టారి గారి తండ్రి మంచి వైద్యం చేసే వారని ప్రతీతి .ఆ ముసలాయన పొది పట్టుకొని ఇళ్ళ కు రావటం నాకు కొంత గుర్తుంది .అలాగే జగన్నాధం అనే ఆయన  కూడా ఇళ్లకు వచ్చి పని చేసే వాడు .మేళం ఉండేది .అప్పటికే ముసలి వాళ్లయి పోయారు .స్వారస్యం ఉండేది కాదు .అందుకని ఎవరింట్లోనైనా మేళం బాగా లేక పోతే ”ఇదేమిటి రా జగన్నాధం మేళం లా ఉంది ”అనటం అల వా టైనది .వ్రుత్తి ధర్మాన్ని పవిత్రం గా భావించి వారు ప్రవర్తించిన తీరు ప్రశంశ నీయం .వృత్తికి గౌరవంఇవ్వటం  ఇంకా మనకు పూర్తిగా అల వాటుకు రాక పోవటం బాధా కరం ..
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –13-9-12-కాంప్ –అమెరికా

Posted in ఊసుల్లో ఉయ్యూరు | Tagged | Leave a comment

మొదటి విమానం మనమే తయారు చేశాం

 మొదటి విమానం మనమే తయారు చేశాం 
                                                                 నేపధ్యం 
భారద్వాజ మహర్షి విమాన శాస్త్రాన్ని రాశాడుఅని  అందరు చెప్పిన విషయమే .మనకు ఇద్దరు ముగ్గురు భారద్వా జులున్నారు .సప్తరుషు లలో ఒక భరద్వాజుడున్నాడు .అత్రి ,వసిష్ఠ ,విశ్వా మిత్ర ,గౌతమ ,జమదగ్ని  ,అగస్త్య  భరద్వాజ వారి పేర్లు .ఋగ్వేదం ఆరో మండలం అంతా భారద్వాజునిదే .అందులో 75 మంత్రాలున్నాయి .చక్ర వర్తి భరతుని సమకాలికు డు .రామాయణ కాలం లో ఉన్న భరద్వాజుడు బృహస్పతి మహర్షి కుమారుడు .ఈయనకు ప్రయాగ లో ఒక ఆశ్రమం ఉండేది .ఇప్పటికి అక్కడ ఉంది .శ్రీ రాముడికి, భరతుడికి గొప్ప విందు నిచ్చిన వాడు ఈయనే .ఇందులో యే భరద్వాజుడు రాశాడో కాని వైమానిక .శాస్త్రం ఆయన పేర లోకం లో ఉంది .ఇదే ప్రపంచం లోని విమాన యానానికి దారి చూపింది అని అందరి నమ్మకం .
         డాక్టర్ కోలచల సీతా రామయ్య ఉవాచ
కృష్ణా జిల్లా ఉయ్యూరు కు చెందిన కోలాచల సీతా రామయ్య గారు చిన్నప్పుడే రష్యా వెళ్లి అక్కడిఆయిల్ శాస్త్రాన్ని అధ్యయనం చేసి డాక్టరేట్ ను సంపాదించారు .అక్కడి రష్యా ఆమ్మాయినే వివాహం చేసుకొని స్తిర పడి పోయారు .ఆయన్ను గురించి మా చిన్నప్పుడు కధలు గాధలుగా చెప్పుకొనే వారు .చాలా కాలానికి ఆయన మాతృదేశం భారత దేశానికి వచ్చారు .అప్పుడు ఉయ్యూరు లోని ప్రజలందరూ వారికి బ్రహ్మ రధం పట్టారు .పౌర సన్మానం చేశారు .చాలా సాదా సీదా గా ఉండే వారాయన .మంచి తెలుగు లో మాట్లాడారు .ఆయన దగ్గరి బంధువు మా ఇంటికి ఎదురు గా ఉండే వంగల కృష్ణ దత్త శర్మ గారింట్లో ఉన్నారు .అక్కడ వారిని మేమందరం కలిసే వాళ్ళం .ఆయన తో మాట్లాడే వాళ్ళం .భేషజం లేకుండా మాట్లాడే వారు .ఏదైనా ప్రశ్నిస్తే చాలా వివరం గా సమాధానం చెప్పే వారు .ఆయన తో జరిగిన సంభాషణల్లో ‘విమాన శాస్త్రం ”గురించి వచ్చింది .అప్పుడు ఆయన విమాన శాస్త్రాన్ని భరద్వాజ మహర్షి రచించాడని, దాన్ని జెర్మనీ వారు తీసుకొని వెళ్లి ,మన సంస్కృత పండితులతో అర్ధం చెప్పించుకొని వివరాలన్నీ సేకరించి జర్మన్ భాష లోకి అనువదింప జేసుకోన్నారని చెప్పారు .తాను రష్యా లో ఉన్నాను కనుక పబ్లిక్ గా ఈ విషయాలు చెప్ప రాదనీ ఇది అంత రంగిక సమా వేశం కనుక చెప్పానని నవ్వుతూ చెప్పారు .నేను ఆ సమావేశం లో ఉన్నాను ,విన్నాను .కానీ మన దేశీయు లెవ్వరు ఆ శాస్త్రాన్ని పట్టించుకోలేదని ,దాని పై రిసెర్చ్ చేసే సదుపాయాలూ కూడా మన దేశం లో లేక పోవటం బాధా కరమనీ చెప్పారు .ఇదీ విమాన శాస్త్రానికి నేపధ్యం .అంటే’ థీరీ” అంతా మనదే .practicals మాత్రం ఇతర ఆదేశాల వారివి అని తెలుస్తోంది .కానీ ఇదీ నిజం కాదు అని అన్నిటిలోనూ మనమే ముందు న్నాము అని ఆ తర్వాత తెలిసింది .
                       వైమానిక శాస్త్రం 
భారద్వాజ మహర్షి రాసిన ”వైమానిక శాస్త్రం ”మాత్రమె ఇవాల్టి ”airo dyanamics ;” కు ఆధారం .1860-1940లో ఉన్న జి.ఆర్ .సుబ్బరామ శాస్త్రి వైమానిక శాస్త్రాన్ని సంస్కృతం లో రాశాడని తెలుస్తోంది .ఆయన చెప్పిన దాని ప్రకారం భరద్వాజ మహర్షి ఆయన కు  ఆ శాస్త్రాన్ని స్వయం గ చెప్పాడని ,దాన్ని ఆయన  రాశాడని తెలుస్తోంది .1918-23కాలం లో డిక్టేట్ చేస్తే రాసి నట్లు కన బడుతోంది .దీనిలో 3000శ్లోకాలు ,ఎనిమిది అధ్యాయాలు ఉన్నాయి .  దీన్ని 1959 లో హిందీ లోకి అనువాదం చేశారు .1973 లో ఇంగ్లీష్ లోకి అనువాదం పొందింది .ఇందులో విమాన శాస్త్ర రహస్యా లన్నీ ఉన్నాయి .1974లో బెంగళూర్ లోని indian Aeronautics సంస్థ ఈ పుస్తకాన్ని సమగ్రం గా అధ్యయనం చేసి అందులో పనికి వచ్చే  విలువైన సమాచారం ఏదీ లేదని చెప్పింది .కాని అందులో వర్ణించ బడిన ”రుక్మ విమానం ” గురించి మాత్రం చాలా గొప్ప వివరాలున్నాయని ప్రశంశించింది .దానికి పొడవైన ,నిలువైన ”ducts with fans on the top ” ఉన్నానయనీ, అవి గాలిని పీల్చి కింద ఉన్నducts   కు పంపుతాయని ,దాని వల్ల విమానం పైకి గాలి లోకి లేస్తుందనీ చెప్ప్పారు .
ఈ పుస్తకాన్ని  International Academy of sanskrit research కు చెందిన వ్యవస్తాపక డైరెక్టర్ అయిన శ్రీ G.R. Joshyer ఇంగ్లీష లోకి అనువాదం చేసి మైసూర్ కారోనేషన్ ప్రెస్ లో ముద్రించి మహోప కారం చేశారు .ఆయన పెట్టిన పేరు Vaimaanika shaastra by Bhardvaaja Maharshi –yantra sarvasva –”science of aeronautics” .అదీ దీని పూర్వ గాధాలహరి .మరి దీని మీద ఏమైనా పరిశోధనలు జరిగాయా అంటే ఎవరు పెదవి విప్పలేదు .ఎందుకంటె ”రైట్ సోదరులు ”మొదటి విమానాన్ని తయారు చేసి గాలిలోకి ఎగిరారని రూధి అయి పోయింది కదా .ఇక ఎవరు చెప్పినా నమ్మరు అనే భావన నెల కొని ఉంది .కాని సూర్యరశ్మి ని చేతులతో ఆపలేము కదా .
        ప్రపంచం లోనే మొదటి విమానం ”మారుత సఖి ”
భారత దేశానికి చెందినవారు , పైనఅంతా వివరం గా తెలుసుకొన్న  శ్రీ టి.సుబ్బరామ శాస్త్రి గారే ప్రపంచం లో మొదటి విమాన నిర్మాత .అదీ రైట్ సోదరులు నిర్మించిన కాలం కంటే ఆరేళ్ళ కు ముందే నిర్మించారని చెబితే ముక్కు మీద వేలు వేసుకొంటారు పాశ్చాత్యులు .మనమూ అంతే గా .కాని ఆది యదార్ధం .బెంగళూర్ జిల్లా లోని అనేకాల్ తాలూకా కు చెందినా మహర్షి టి.సుబ్బరామ శాస్త్రి గారు ,బొంబాయి కి చెందిన శివ కర్ తాల్పుడే గారు కలిసి ఈ విమానాన్ని నిర్మించి మొదటి సారి బొంబాయి లో గాలి లోకి యెగిరించి  అందర్నీ సంభ్రమాశ్చర్యాలలో ముంచారు .శాస్త్రి గారు వేద విజ్ఞాన నిధి .తాల్పుడే గారు ఆధునిక విజ్ఞాన శాస్త్ర వేత్త .వీరిద్దరి కలయిక ప్రగతికి మెట్లు అయాయి .
బొంబాయికి చెందినా ప్రముఖ పారిశ్రామిక వేత్త పూన్జీ లాల్ గిరిధర్ బెంగళూర్ వచ్చి శాస్త్రి గారి వద్ద రెండు వారాలు ఉండి విమాన రహస్యాలను ఎన్నీటి నో  తెలుసుకొన్నారు .బొంబాయి వెళ్లి అక్కడి విమాన శాస్త్ర పరిశోధకుడైన డాక్టర్ తాల్పుడే గారికి శాస్త్రి గారు ప్రత్యేకం గా చెప్పిన విషయాల పై పూర్తీ అవగాహన కల్పించాడు .ఆ తర్వాతా తాల్పుడే గారు శాస్త్రి గారిని కలిసి చర్చించారు .తాను తెచ్చ్చిన విమానాల నమూనా లను శాస్త్రి గారికి చూపించారు .ఇద్దరూ వేరు వేరు చోట్ల ఉండి పని చేస్తే ముందడుగు వేయ లేమని గ్రహించారు .శాస్త్రి గారు సదాచార సంపన్నులు .ఆయన నియమ నిష్టలకు యే మాత్రం భంగం కలుగ కుండా శాస్త్రి దంపతులను తాల్పడే గారు బొంబాయికి తీసుకొని వచ్చారు .తాల్పుడే గారి భార్య కూడా విజ్ఞాన శాస్త్ర వేత్త కావటం తో గొప్ప సహకారం లభించింది .ఈ ప్రయత్నానికి వెనుక ఉండి  ఆర్ది క, హార్దిక సహకారాన్ని అందించిన వాడు పూన్జీ లాల్ గారు .ఈ ముగ్గురి మేధా ఫలితంగా ఆవిర్భ వించిన తొలి విమానమే”మారుత సఖి ” .
1895లో బొంబాయి నగరం లో ఉదయాన”చౌపాతి ”వద్ద స్వదేశీ విమానం అయిన  ”మారుత సఖి ”ఆకా శం లో విహారం చేయ టానికి సర్వం సిద్ధం చేశారు .విమాన యంత్రాన్ని పాదరసం, సూర్య రశ్మి ,ఆవిరి తో నింపారు .అందరు ఆసక్తి గా విమాన విహారాన్ని వీక్షించటానికి ఆకాశం వంక చూస్తున్నారు .బరోడా మహా రాజు సయాజ్ దేవ్ గైక్వాడ్ ,న్యాయ మూర్తి మహాదేవ్ గోవింద రేనడే మొదలైన ప్రముఖులందరూ విచ్చేశారు .శాస్త్రి గారి పాదాలకు నమస్కారాలను అత్యంత భక్తీ తో చేసి డాక్టర్ తాల్పుడే గారు విమానం వద్దకు వచ్చి సూర్య దేవుడికి నమస్కరిస్తుండగా వేద మంత్రోచ్చాతన విను వీధిని విని పిస్తుండగా ,ముహూర్త సమయానికి ప్రపంచ తొలి విమానం”మారుత సఖి ” బొంబాయి చౌపతి నుండి గగనానికి ఎగసింది .అశేష జన సమూహం ఆనందాతి రేకం తో జయ జయ ధ్వానాలు కరతాళధ్వనులు చేసిపులకించిన  చారిత్రాత్మక ఘట్టానికి శుభం పలికారు .తాల్పుడే దంపతులు ఆనంద బాష్పాలు రాలుస్తుండగా సుబ్బరామ శాస్త్రి గారు ధ్యాన నిమగ్ను లయారు .మారుత సఖి ఆకాశం లో దేదీప్య మానం గా విహరిస్తోంది .1500అడుగుల ఎత్తుకు చేరి, అక్కడా విహరించింది ,అక్కడ చేరిన బ్రిటీష గూద చారులు ,అధికారులు ఆశ్చర్యానికి లోనై భయ భ్రాంతులు కూడా అయారు .
భారతీయులందరూ దేశాభి మానం ఉప్పెన గా పొంగి రాగా ”భారత మాతా కు జై ”అని నినదించారు .వేలాది మంది విమానం కిందికి దిగ గానే చూడ టానికి తాకి అనుభవించటానికి పరుగులు తీశారు .తొక్కిస లాట జరిగింది పోలీసులు కొద్దిగా లాఠీ చార్జి చేయ వలసి వచ్చిందట కూడా .ఇంత దిగ్విజం గాభారతీయులు స్వంత సామగ్రి తో  విమానాన్ని తయారు చేసి నడప టాన్ని జీర్ణించుకోలేని ఆంగ్ల ప్రభుత్వం,ఈ వార్తను పేపర్ల లో రాకుండా నిషేధించింది .అందుకని ఈ విషయం ఎవరికీ తెలియ లేదు .ఆ తర్వాత కొంత కాలానికి డాక్టర్ తాల్పుడే గారి భార్య ,ఆ తర్వాత తాల్పుడే గారు మరణించారు .కొంత కాలం తర్వాత తాల్పుడే బంధువులు ”మారుత సఖి ”విమాన యంత్రాన్ని ”రాలీ బ్రదర్స్ ”అనే విదేశీ సంస్థకు అమ్మి వేశారు .
అనేకల్ టి.సుబ్బరామ శాస్త్రి గారు విషాదం తో స్వంత గ్రామానికి చేరుకొన్నారు .ఈ విమాన విజ గాధ ను యే పత్రికా వేలువరించక పోవటం మన దురదృష్టం .అయితే 1895  లో లోక మాన్య బాల గంగాధర తిలక్ గారు తమ ”కేసరి ”పత్రిక లో ”మారుత సఖి ”విమాన విజయాన్ని ప్రచురించి లోకానికి ఎరుక పరిచారు .ప్రముఖ చారిత్ర క పరి శోధకు డైన ivan Kopsatica ”విమాన యంత్రాన్ని మొట్ట మొదట తయారు చేసిన వాడు బొంబాయికి చెందిన డాక్టర్ తాల్పుడే అని రాశాడు .
డాక్టర్ తాల్పుడే వద్ద ఎప్పుడూభారద్వాజ మహర్షి  రచించిన విమాన శాస్త్ర గ్రంధం ఉండేదట ”.Stefen Pyaav”అనే పరిశోధకుని ప్రకటన మేరకు తాల్పడే  విమాన యంత్రానికి పాద రసాన్ని ఇంధనం గా ఉపయోగించాడనితెలిసింది .తాల్పడే గారు విమాన శాస్త్రానికి చెందిన సకల విషయాలూ సంస్కృత గ్రంధాల నుండి సేకరించి దాచుకొన్నారు .అంతే కాక సుబ్బరామ శాస్త్రి గారు ఆచార్య నారాయణ ముని రచించిన ”విమాన బిందు ”,మహర్షి దండి రాజ రచించిన ”విమాన జ్ఞానార్ధ ప్రకాశికా ”మొద లైన గ్రంధాలనుండి విషయాలను తాల్పడే గారికి తెలియ జేసి ఆ శాస్త్రం లో ఆయన కు పూర్తీ ఆవ గాహన కల్పించారు .అనేక గ్రంధాలలో శ్రీ శాస్త్రి ,శ్రీ తాల్పుడే గార్ల కృషి గురించిన వివ రాలు చాలా కన్పిస్తాయి . .
ప్రపంచం లోనే తొలి విమానం ”మారుత సఖి ” ని తయారు చేసి ,గగనం లో విహరింప జేసిన ఘనత భారతీయ శాస్త్ర వేత్తలైన శ్రీ సుబ్బ రామ శాస్త్రి, శ్రీ తాల్పుడే గార్లకే దక్కు తుంది అన్నది నిర్వివాదాంశం .జై బోలో భారత్  మాతా కీ జై .
ఈ వ్యాసానికి ఆధారం– కడప లోని బ్రౌన్ లైబ్రరి వ్యవ స్తాపకులు, సలహా దారు, నిరంతర రచనా శీలి,  పండిన జ్ఞాన, విజ్ఞాన ఫలం అయిన  శ్రీ జాను మద్ది హను మత్సాస్త్రి గారి రచన ”ప్రపంచం లోనే తొలి విమానం –మారుత సఖి ” ..
   .శ్రీ హనుమచ్చాస్త్రి గారికి కృతజ్ఞతలతో —
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –13-9-12-కాంప్–అమెరికా

Posted in రచనలు | Tagged | 1 Comment

జన వేమన –26 వేమన కవిత్వం లో మానవతా విలువలు

 జన వేమన –26
వేమన కవిత్వం లో మానవతా విలువలు 

మానవుడు వర్గం ,కులం ఉచ్చు లో చిక్కు కొని నిత్యం బతుకుతుంటాడు .దీన్ని అధిగామించలేని స్తితి .జాతీయ భావం అతనికి సాధ్యం కావటం లేడు .మానవ పతనానికి సంఘమే కారణం .కనుక కొత్త సాంఘిక జీవితానికి పునాదులు పడాలి .సంఘాన్ని మార్చాలి అని వేమన తల చాడు .అప్పుడే వ్యక్తీ చైతన్యం వస్తుంది .అతని స్వాతంత్రానికి అడ్డు పడ కూడదు .మాన వ జీవిత స్వాతంత్రమే అతని వజ్ర కవచం .దీనికి వర్గ కులాల భావం పోవాలి .”సాను జాత మయ్యే సజ్కల కులము –హెచ్చు తగ్గు మాట లెల్ల లేరున్గా వచ్చు ”అని ప్రశ్న ను సంధించాడు .అందుకే ;;ఎరుక గలుగు మనుజుడే జాతి కల వాడు ”అని తీర్మానించాడు .దీని పై ఆవేశం తో ”కూడదేమి చేసేకుల మేమి చేసెను -భూమి ఏమి చేసే బొంది కత్తి -నరుడు పాడేది పాట్లు నగు బాట్లు చూడగా  ”అన్నాడు .కులం ,గోత్రం ,విద్య చేత విర్ర వీగే వారంతా ”పసిడి గల్గు వాని బానిస కొడుకులు ”అని తిట్టే శాడు .సంపద ఉన్న వ్యక్తీ ఎంత లోప భూయిష్టు డైనా ,వాడికి సంఘం లో అతి గౌరవం ఉంటుంది .కులం కంటే ధనం బలీయ మై పోయింది .”కులము కన్నా మిగుల కలిమి ప్రధానంబు ”అన్నాడు .”అందరోకత గల ,యన్న దమ్ము లే గదా ”అని సమానత్వాన్ని చెప్పాడు .మానవ గౌరవం సమానత్వం .ఆది గాలిలో కలిసి పోరాడు .ఆ సమానత్వం రావాలి అంటే ”ఉర్వి వారి కెల్లా నొక్క కంచము పెట్టి –పొట్టు గుడిపి ,కులము పోలియ జేసి -తలను చెయ్యి బెట్టి తగు నమ్మ జెప్పరా ”అని చాప కూడు తింటే కాని అంతా ఒక్కటే నాన్న భావం రాదు అని తేల్చేశాడు .ఇవాళ మన రాజ కీయ నాయకుల ప్రచార ఆర్భాటాలలో ఇలా కతుకు తున్నారని మనం చూస్తూనే ఉన్నామ్.సమానత్వం చూపిస్తున్నట్లు నటన .అంతే .హృదయం లోంచి మార్పు రావాలి .నినాదాల వాళ్ళ ,శుష్క విధానాల వల్ల  రాదు .మనస్పూర్తి గా ఆచరణ లోకి తేవాలి .అని ఆనాడే వేమన చెప్పాడు .ఆయన చెప్పింది పరమ సామాజిక సత్యం ,సూత్రం .
అస్పృశ్యత ను అసహ్యిన్చుకొన్నాడు వేమన .”ముట్టు ముట్టనుచు ముట్ట రాదందురు –ముట్టు కుదిరి ఏమి మూల మేమి ?-నవ  బిలము మురికి నరుల కందరకును –పుట్ట గానే పుట్టు ముట్టుపుటక భేదం తో సంబంధం లేని మానవ పవిత్రత ను వేమన కోరాడు .శూద్రుడు ,అని ,అస్పృశ్యుడు అని వేరు చేస్తే వేదన చెందాడు వేమన .మానవుడి లో భగవద్విషయ మైన తేజస్సు ఉంటె ,అందరి మాన వుల్లోను ఉన్నట్లే కదా అని తెలియ జేశాడు .అలాంటి మాల మాదిగ లలో ”వాని లోన బల్కు వాని కులంబేది ?”అని శంకరా చార్యుల వారిని మాల వాని రూపం లో ఉన్న శివుడు ప్రశ్నించి నట్లు ప్రశ్నించి -మనల్ని నిరుత్తరులను చేశాడు .”మాట మార్చిన వాడే మాల ”అని నిర్ధారించాడు .”మాట నిలుప లేని మనుజుండు చండాలుడు ”అని తీర్పు ఇచ్చాడు .ఇంతేనా ?”వాక్సుద్ధి లేని వాడు చండాలుడని ,ఆత్మ మీద మనసు నిలిపిన వాడు మాల కాదు అని ,”మనసు నిల్ప కున్న మహి మీద మాలడు ”అనీ తేల్చాడు .కనుక మానవుడి గా పుట్టటమే కాదు ,తనను తాను మానవుడి గా సంస్కరించు కోవాలి .ఆత్మ సంస్కారం లో ఉన్న తేడాయే మానవుల మధ్య భేదం .అందుకే ”మంచి గుణము లేక మరి ద్విజు డేట్లగు ?”అని నిల దీశాడు .కులానికంటే గుణానికే ప్రాధాన్యం అని చెప్పాడు .”అరిది గిట్టు వేళ నడుగు ద్విజత్వంబు ”అంటే చచ్చిన తర్వాత కులాలు లేవు ,మతాలు లేవు .మంచి జీవన విధానాలను అను సరించిన వారంతా మానవులే .ఒక్కటే .అదీ” వేమనీయం ”.
                                   జీవిత భ్రాంతి 
మానసిక క్రమ శిక్షణ లేకుండా ఆత్మ సంస్కారం రాదు .కర్మ కాండలు  ,యజ్న యాగాలు మనిషిని ఒక వైపుకు లాగుతూ ఉంటాయి .వాటిని వదిలి పెట్టె ధైర్యం ఉండదు .అందులో ఏదో విశేషానికి ఆకర్షణ కలుగు తుంది కాని అందులోని మర్మం తెలీదు .కోరికలు ,శకునాలు ,ప్రశ్నలు ఇవన్నీ మనిషిని ఉక్కిరి బిక్కిరి చేస్తాయి .మానవ జీవితం లో శరీర తత్వం  తో బాటు ఆధ్యాత్మిక తత్త్వం కూడా పెన వేసుకొనే ఉంది .ఆ శక్తిని జాగృతం చేయాలి .శరీరానికి ఆత్మ కు ఉన్న సంబంధాన్ని తెలుసు కోడు మానవుడు .నిజ మైన జ్ఞానం కలిగితే ఉన్నతం గా ప్రవర్తిస్తాడు ఆధ్యాత్మిక ప్రకాశం లేని భౌతిక జీవితం ఎంత గొప్ప దైనా నిరర్ధక మైనదే .ఈ దేహం కోసం ఎన్నో పాట్లు పడతాడు మానవుడు ”.మాయామేయ జగం ఇది” అని గుర్తించడు .”మాయ బ్రతుకు కింత మాయ గప్పిస్తివి ”అని మాయలో పడ వద్దని హెచ్చ రిస్తాడు .సంసారం అంటే నీటి మీద రాత లాంటిది .నేనేమి కావాలి ?అని ప్రశ్నించు కోవాలి .”వచ్చేదిని ,పోయేదిని -చచ్చేదిని గనగ లేక సహజము లను చుం –విచ్చల విడి గా దిరుగుట -చిచ్చున బడి నట్టిమిడుత ర వేమా ”అని విశృంఖలత్వం తగదు అన్నాడు .శాంతిని గురించి ఆలోచించాలి .చిత్త శాంతి చాలా ముఖ్యం .నిత్యా నందం ఉంటె దుఖమే ఉండదు. ”మాయను చెరసాల ,మనసను గొలుసును -భేద మనెడు బొంద బెరసి యుండు –ఇట్టి బద్ధ జీవి కెన్నండు మోక్షంబు “”?అని మాయ చేత బంధింప బడిన వారికి మోక్షం రాదు .ఆ మాయా బంధాన్ని చేదించుకోవాలి అప్పుడే ముక్తి .జీవిత భ్రాంతి పోతే అన్నీ వాటంనంతటికవే సిద్ధిస్తాయి అన్న పరమ సత్యాన్ని చెప్పాడు వేమన .

Posted in మహానుభావులు | Tagged | Leave a comment

జన వేమన –25 వేమన ది మాన వీకరణ మార్గం –ఈశ్వర తోపా

 జన వేమన –25
   వేమన ది మాన వీకరణ మార్గం –ఈశ్వర తోపా 
డాక్టర్ ఈశ్వర్ తోపా గారు ఆంగ్లం లో ”సెయింట్ వేమన అండ్ హిస్ ఫిలాసఫీ ”అనే గ్రంధాన్ని రచించారు .దానిని డాక్టర్ దివా కార్ల వెంకటావ ధాని గారు సరళం గా తెలుగు చేశారు .దీని లో తోపా గారు ప్రవహింప జేసిన భావ ధార ను పరి శీలిద్దాం .
సంఘం లో మానవుడు ఇంకా సంస్కారి కాలేదు .మాన వత్వ విషయం లో చాలా వరకు మానవుడు వెనక బడే ఉన్నా డింకా .అతనికి మార్గ దర్శ కాలై ,అభ్యుదయానికి ఉప యోగ పడే సహజ సరళ మార్గాన్ని వేమన చెప్పాడు .ఉన్నత వర్గా లలో సంస్కృతి మృగ్యం గా ఉందని వేమన గ్రహించాడు .మానవ జీవితం జీవ శాస్త్ర సిద్దాంతా లకు అనుగుణం గా వర్తిస్తుంది .అందుకే వేమన ”దేహము బడలిక బడి నను –పోషణ తత్వములు పొందవు ”అన్నాడు .వ్యాకులత ఉంటె ,భావ చాంచల్యం కలుగుతుంది .మనసు మాత్రమె ఆలోచన లను సంబద్ధం గగా ,అర్ధ వంతం చేస్తుంది .బ్రతికి నప్పుడే ,ఆలోచనలు మనిషికి తోడ్పడాలని వేమన భావం .”తనువు తీరే నేని ,తలపు తోడనే తీరు ”అని హెచ్చ రించాడు .ఆత్మ ను సంస్క రించు కోవాలి .ఆ సంస్కారమే మనిషికి పశువు కు తేడా ను తెలుపు తుంది .మనిషి గా తన పని చేసుకొంటూ ,ఆత్మ విజ్ఞానం తో బుద్ధి గా జీవించాలి .తన హద్దులు తెలిస్తే గర్వం రాదు .అందుకే ”జనన మరణములకు సరి స్వతంత్రుడు కాదు -మొదల కర్త గాదు తుదను గాదు –నడుమ కర్త ననుట నగు బాటు కాదొకో ”అని జన్మ రహస్యాన్ని తెలియ జేశాడు .ఈ జీవిత సత్యం తెలుసు కో కుండా ,దానిలో మునిగి పోవటం మూధత్వం .మన చుట్టూ మంచి ,చెడు రెండూ ఉన్నాయి .వివేకం తో సంచ రించాలి .ప్రలోభ పడ రాదు .అంతటి సంస్కారం లేక పోతే జీవితం అర్ధం కాదు .జీవితం లోని రహస్యాలను అర్ధం చేసుకో వాలి  .హీన మైన సంస్కృతి నుంచి ఉత్తమ సంస్కృతికి మానవుడు చేరాలి .మనుష్యుల పరిస్తితి ”కలి యుగాన లేడు ,కదలిమ్పడా నోరు –వినియు ,వినగా లేడు విస్మయమున -సంపద గల వాడు సన్నీ పాతక మిది ”అని మానవ స్వభావం చెప్పాడు .జీవితం తమ నుండి ఏమి కోరుతోంది అని మనిషి తెలుసుకోలేక పోతున్నాడు .మానవ ప్రకృతి అవగాహనను  మొదటగా నేర్వాలి .అప్పుడే అతనికి అన్నీ దక్కు తాయి .”వ్రాత వెంట గాని వర మీదు దైవంబు –సేత కొలది గా వ్రాత గాదు –వ్రాత కజుడు కర్త ,సే తకు దా కర్త ”అని మనిషి చేసే పని మీదే అంతా ఆధార పడి ఉంటుందని తేల్చి చెప్పాడు .
భోగ పరాయణత్వం జీవితాన్ని దెబ్బ తీస్తుంది .మనశ్శాంతి ఉండదు .కృతజ్ఞత రాదు .”పర సుఖంబు నొంది ,బ్రతు కంగా నేరడు –”అన్నాడు అందుకే .”నేర నన్న వాడు నేర జాణ మహి లోన -నేర్తు నన్న వాడు వార్త కాడు –ఊరకున్న వాడే ఉత్తమోత్తము డెందు ”అందుకే మనిషి ముందుగా తనను తాను తెలుసు కోవాలి .తనకు చెప్ప గల వారెవరు ?”తను దా తెలియక ఉండిన –తన కేవరున్దెలుప లేరు తధ్యము వేమా ”అన్నాడు .సంస్కారం కావా లంటే సత్య సంద్హత కావాలి .లోకం లో అసత్యం ఆధి పత్యం వహించటం వాళ్ళ అంత రాత్మ నిర్జీవమై ,సత్య భాషి ద్వేషానికి గురి అవుతున్నాడు .నిజాన్ని నీచుని తో చెప్ప రాదు .”నిజ మహాత్ము గూడి నిజ మాడ వలె నురా ”అని మంచి నిజాన్ని బోధించాడు .వేమన చెప్పే సంస్కృతీకరణ చేస్తే ,”మనుష్యుడిల మహాను భావుడే ”అవుతాడు .”జాతి వేరు లేక జన్మ క్రమంబున -నెమ్మదిన భవుని నిల్పె నేని –యఖిల జనుల కెల్ల నాతడే ఘనుడయా ”
మనిషిని అర్ధం చేసికోవటం ,స్నేహం చేయటం వల్ల బంధం గాధం అవుతుంది .మత సిద్ధాంతాలు మాన వత్వం తో నిండి ఉండాలి .అప్పుడే సామరస్యం వస్తుంది .మనిషిని మతం సృష్టి కర్త కు దగ్గర చేర్చేదే కాక మానవుల్ని ఐక్యం చేసేది గా ఉండాలి .సత్యమైన మతం దీన్నే బోధిస్తుంది .మానవత కోసం మతం అవసరం .అందుకే వేమన ”ఎల్లి ,రేపు నేడదేలాగు నైనను -మనసు నిలుపు వాడు మంచి వాడు ”అన్నాడు .ఇంద్రియాలను వశం చేసుకోవాలి .లేక పోతే సంస్కారం రాదు .”కడుపు చిచ్చు చేత కామానలము చేత –క్రోధ వహ్ని చేత ,కుటిల పడక –నొక్క మనసు తోడ నుండి నప్పుడే ముక్తి ”అని చెప్పాడు .ఇంద్రియాలను జయిన్చుకోవాలి అందుకే ”మచ్చరమున తనను జెరచు మహిలో వేమా ”అని హెచ్చరిక .సంపూర్ణ మాన వుడి ని ఆవిష్కరించాలి అని వేమన తీవ్రం గా భావించాడు .సమగ్ర మాన వత్వం రావా లంటే తనకు ,ప్రపంచానికి మధ్య ఉన్న క్లిష్ట బంధాన్ని తప్పించుకొనే సామాన్యుడు పొందే సమగ్ర రూపమే సంపూర్ణ మాన వుడు .అంటే -ప్రపంచానుభవం ఉన్న ఉదాత్త మానవుడే అని అర్ధం .”పగలు రేయి మరచి భావంబును మరచి –తాను ,నేన యన్న తప్పు మరచి -యుండు  వాని నెంచు నుత్తమ యోగిగా ”అని నిర్వచనం చెప్పాడు .మానవ బుద్ధి సంపదకు వేమన సజీవ ఆదర్శం .”మనిషి లోని వాని మానుగా దెలిసిన –నుర్వి జనులు వాని యోగి యండ్రు -నీవు నిన్నేరుంగనీవే పో శివుడవు ”.అదేఎ వేమన ఆదర్శం .
సశేషం –మీ గబ్బిట దుర్గా ప్రసాద్ –12-9-12-కాంప్–అమెరికా

Posted in మహానుభావులు | Tagged | Leave a comment

గ్రాండ్ మాస్టర్ ఆఫ్ సైన్స్ ఫిక్షన్ –రే బ్రాడ్ బరీ

  గ్రాండ్ మాస్టర్ ఆఫ్ సైన్స్ ఫిక్షన్ –రే బ్రాడ్ బరీ 
ఫాంటసి, సైన్స్ ఫిక్షన్ హారర్  మిష్టరీ ఫిక్షన్ మొదలైన అనేక ప్రక్రియలలో రాటు దేలిన ణ రచయిత గా ప్రఖ్యాతి పొందాడు రే బ్రాడ్ బారీ .22-8-1920 లో జన్మించి తొంభై రెండేళ్లు సంతృప్తి గా జీవించి ఎన్నో పురస్కారాలను అందుకొని 5-6-2012న మరణించాడు .ఆయన రాసిన నవలలెన్నో సినిమాలుగా, టెలివిజన్ సీరియల్స్ గా వచ్చాయి ఇరవై వ శతాబ్దపు ప్రఖ్యాత రచయిత గా గుర్తింపు పొందాడు .ఆయన రాసిన అనేక సైన్స్ ఫిక్షన్ రచనల వల్ల ”గ్రాండ్ మాస్టర్ ఆఫ్ సైన్స్ ఫిక్షన్ ”అని విఖ్యాతు డైనాడు .ఆయన జీవితం రచయిత లందరికి ఉత్తెజమే .ఆయన వ్రాసింది అంత కవిత్వం వంటి వచనం అవటం అందర్నీ ఆకర్షించింది .
అసలు పేరు ”రే డగ్లాస్ బ్రాడ్ బరీ ”.ఇల్లినాయిస్ రాష్ట్రం లో ”వాకేంగాన్ ”లో టెలిఫోన్ ,పవర్ డిపార్ట్ మెంట్ లో లైన్ మాన్ గా పని చేసే ఈస్తర్ బాడ్ బరీ ,లినోల్ద్ స్పాల్డింగ్ దంపతులకు జన్మించాడు .ఒక్క రెండు సార్లు మాత్రమె అదీ ఏడాది పాటు మాత్రమె జన్మ భూమి గి దూరం గా ఉన్నాడు .కుటుంబం అరిజోనా లోని ”టక్సాన్ ”చేరింది .అదొక ఎడారి ప్రాంతం గా భావించాడు .ఆ నేపధ్యం లో కధలు రాశాడు .పద్నాలుగేళ్ళ వయసు లో కుటుంబం కాలిఫోర్నియా లోని లాస్ ఏంజిల్స్ కు చేరింది .అక్కడే హై స్కూల్ చదువు పూర్తీ చేశాడు .చేతికి అందిన ప్రతి పుస్తకం చదివే వాడు .అతని సాహిత్య దాహానికి అన్తుండేది కాదు .క్రమంగా స్వంత రచనలు ప్రారంభించాడు .అవి పత్రికల్లో పడేవి ఆని డబ్బులేవరూ ఇవ్వలేదు .1944లో రాసిన సూపెర్ సైన్స్ స్తోరీలకు మొదటి సారిగా లక్ష్మీ కటాక్షం కలిగింది .అదేబాటలో కోన సాగి అందులో మహా రచయిత అని పించుకొన్నాడు .1947లో ”dark carnival ”పుస్తకం లో హారర్ కధలు రాసి మెప్పు పొందాడు .
కుజ గ్రహానికి సంబంధించిన కధలను ”the martial chronicles ”పేర1950 లో ప్రచురించి స్సిన్స్ ఫిక్షన్ కు దిశా నిర్దేశం చేశాడు .తర్వాత ఏడాది ”the illustrated man ”రాసి రచయిత గా చిర కీర్తి పొందాడు .మరి మూడేళ్ళ లో రెండు డజన్ళ  కు పైగా కధలు రాసి సెభాష్ అని పించుకొన్నాడు .రేడియో లో అవన్నీ అందర్నీ అలరించాయి .వీటిని x minus one ,suspense ,lights out గా మార్చి టెలివిజన్ సీరియల్స్ గా ప్రసారం చేసి గొప్ప ప్రాముఖ్యత కల్గించారు .c.b.s.television work shop ,aalfred hitch cock presents పేరా బ్రాడ్ బారీ సీరియల్సు ప్రసారమై దేశ విదేశాలలో మంచి ఉత్సాహాన్ని కల్గించాయి .ఆయన రాసిన వాటి లోంచి ఎంపిక చేసి the meteor ,the fog horn లను ప్రసారం చేశారు .             1953 లో ఆయన మొదటి నవల” fahrenheit 451 ”వెలువడింది .మంచి పేరొచ్చింది .ఇదొక హారర ధోరణి కధ .దీనికి అనుబంధం గా చాలా రాశాడు .” october country ”రెండేళ్ళ తర్వాతా వచ్చింది ఇంకో రెండేళ్లకు ”dandelian wine ”అనే రెండో నవల వచ్చింది .1960-70కాలం లో ఆయన రాసిన చాలా వాటిని ప్రేక్షకులకు అందించారు .ఫారెన్హీట్ ,దాన్దేలిన్ సీరియల్స్ గా సినిమా గా వచ్చి జనాన్ని మేస్మేరైజ్ చేశాయి .ఆయన రాసిన వాటిలో మొత్తం 35పైగా సినిమాలుగా టెలివిజన్ ప్రోదక్షన్లు గా వచ్చాయి అంటే ఆయన రచనలను ప్రజలు ఎంత ఇష్ట పడ్డారో తెలుస్తోంది .అన్ని రకాల ప్రేక్షకులు ఆయన సీరియల్స్ ను సినిమాలను విప రీతం గా ఆదరించారు .అరవై ఏళ్ళు పైగా రచనలు చేస్తూ న్నా ఆయన కలం వాడి తగ్గ లేదు.చదువరులలో అభిమానం తగ్గ లేడు .ఆయన మీద క్రేజ్ ఇంకా ఉండనే ఉంది .ఇంతటి అభిమానాన్ని పొందిన రచయితలు అరుదు గా కన్పిస్తారు .17-11-2004లో ప్రెసిడెంట్ బుష్ దంపతులు ”శ్వేత సౌధం ”లో బ్రాడ్ బారీ కి ”national medal of arts ”బహూక రించి సన్మానించారు .వరల్డ్ ఫాంటసి కమిటీ ,ఆయన్ను సత్కరించింది .మొదటి ఫాండం అవార్డ్ పొందాడు .ఎందరికో ప్రేరణ గా నిలిచాడు రే బ్రాడ్ బారీ .
ఆయన ఇల్లినాయిస్ లో ఉండగా ”గ్రీన్ టౌన్ ”అనే పేరు ను సేఫ్టీ ,కి ఇంటికి సింబాలిక్ గా పెట్టు కొన్నాడు .ఆయన రాసిన  మోడరన్ క్లాసిక్ అని పిలువ బడ్డ రచన  ”డాండలిన్  వైన్ ”కు ఇదే నేపధ్యం .ఆయన అంకుల్ ఇక్కడే ఆయనకు అతీత శక్తులను ప్రదర్శించి చూపింది కూడా ఇక్కడే .అవే ఆయనకు కదా వస్తువులై నాయి .అలాగే ఆయన రాసిన ”సమ్మర్ మార్నింగ్ ,సమ్మర్ నైట్స్” కదా స్రవంతి గ్రీన్ హౌస్ నేపధ్యం లో రాసినవే .పదకొండేళ్ళ వయసు నుంచి స్వంతం గా కధలు రాసిన చాతుర్యం ఆయనది .గ్రేట్ డిప్రెషన్ రోజులలో కధలు రాశాడు .అమెరికా షేక్స్ పియర్ స్కాలర్ అని పిలువా బడే దగ్లాస్ స్పాల్డింగ్ తో స్నేహం చేశాడు .పడి హేదేల్ల వయసు లో ఆర్థర్ క్లార్క్ రాసిన సైన్స్ ఫిక్షన్ అంతా ఊదేశాడు .ఆయన అభిమాన రచయితలు రాబర్ట్ ఫ్రాస్ట్ ,షెల్లీ స్టీన్ బెక ,ఆల్దాస్ హక్స్లి థామస్ వుల్ఫ్ లు .ఎదిత్ వార్టన్ అంటే ప్రత్యెక అభిమానం .లైబ్రరి లో కూచుని ఎంతో సాహిత్యం అధ్యయనం చేశాడు అందుకే ”libraries raised me ”.అని గర్వం గా చెప్పుకొన్నాడు .కాలేజీ లలో ఏదీ నేర్చుకోలేరని అక్కడ చదువుతూ రాయటం సాధ్యం కాదని చెప్పాడు ”you can not learn to write in college .it is very bad place for writing because the teachers always think they know more than you -and they do not ”అని తన అనుభవాన్ని కుండా బద్దలు కొట్టి చెప్పాడు .పబ్లిక్ లైబ్రరి సిష్టెం బాగా అభి వృద్ధి చెందాలని కోరాడు .
              పొందిన అవార్డులు -రివార్డులు 
రే రాసిన అనేక కధలు హాలీవుడ్ సినిమాలకు ఆధారమైనాయి .అందుకే వాళ్ళు ఆయనకు ”హాలీ వుడ్ వాక్ ఆఫ్ ఫేం ”అవార్డు నిచ్చి గౌరవించారు .అపోలో -15aastro nauts భూమి ఉపగ్రహం లోని ఒక క్రేటర్ కు ఆయన నవల పేరుతో ”dandalin cretar ”అని ప్పేరు పెట్టి ఆయన ఫిక్షన్ కు జేజేలు పలికారు .1992లో కానీ పెట్ట బడ్డ”asteroid ” ను ”9766 brad buri ”అని ముద్దుగా పిలిచారు .ఆయనకు 1994లో ఎమ్మీ అవార్డు వచ్చింది .2003లో wood bury university ఆయన కు గౌరవ డాక్ట రేట్ ఇచ్చి సత్కరించింది .2004లో నేషనల్ మెడల ఇచ్చారని ముందే చెప్పుకొన్నాం .world fantasy award ,A.C.clerke award అందుకొన్నాడు .pulidjer board ఆయన్నుప్రత్యేకం గా  పిలిచి సత్కరించి ”citation ”అందజేసింది .2007ఫ్రెంచ్ కమాండర్ అవార్డ్ పొందిన కలం వీరుడు రే బ్రా డ్ బరీ ..2008 లో ”S.F.P.A.grand master award ,2009లో  చికాగో లోని కొలంబియా కాలేజి వారు గౌరవ డాక్టరేట్ ను ఇచ్చి గౌరవించారు .2012 N.A.S.A.curiosity rover on planet mars ను  ”బ్రాడ్ బరీ లాండింగ్ ”అని అత్యుత్తమం గా,అధిక గౌరవాస్పదం గాఅమిత అభిమానం గా   పిలిచారు .ఇంత కంటే రచయిత కు కావాల్సింది ఏముంది .అద్భుత రచనకు మహాద్భుత సత్కారం ఆదరణ ,పురస్కారం
            ఫారెన్ హీట్ – 451 .
బ్రాడ్ బరీ నవల ఫారెన్ హీట్ సైన్స్ ఫిక్షన్ కు కొత్త సాహిత్య స్తానాన్ని కల్పించింది .మేధావి రచన గా పేరు పొందింది ఆధునిక సాంకేతికత అత్యంత వేగం గా పురోగా మిస్తున్న సంగతికి అద్దం పట్టింది .క్లాసిక్ అని పేరు పొందింది .”యాంటిటి టోటలిటేరియన్ సాహిత్యం” గా ప్రాముఖ్యం వచ్చింది .ఇరవై నాలుగో శతాబ్దపు అమెరికా ఎలా ఉండ బోతోందో చూపే నవల. అందుకే దీన్ని” dystopian novel ” అన్నారు .అంటే ఊహాత్మక  నాగరి కాభి వృద్ధి ని తెలియ జేసేది అని అర్ధం .అయితే అందులో నిజమైన సుఖం ,ఆనందంఅనేవి అసాధ్యం  అని కూడా సారాంశం .ఈ నవల లో ”అగ్ని ”అనేది ఒక ప్రతీ కాత్మకం గా చెప్ప బడింది (symbolic ).దాన్ని జాగ్రత్త గా నియంత్రించక పోతే అనర్ధం అని భావం .శక్తి ని అత్యాశ గా ఖర్చు చేస్తే విప రీత పరిణామాలు యేర్పడతాయనే నీతి . .భవిష్యత్తు ను జాగ్రత్త గా భద్రం చేసుకోవాలనే హెచ్చరిక ఉంది .
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –12-9-12-కాంప్–అమెరికా

Posted in మహానుభావులు | Tagged | Leave a comment

ఊసుల్లో ఉయ్యూరు –33 మంచి ప్రిన్సిపల్సు ఉన్న ముగ్గురు ప్రిన్సి పా ల్సు

     ఊసుల్లో ఉయ్యూరు –33
                                                     మంచి ప్రిన్సిపల్సు  ఉన్న ముగ్గురు ప్రిన్సి పా ల్సు
మా ఉయ్యూరు లో పాలి టెక్నిక్ కాలేజి మూడు రకాల కోర్సులు కలిగి ఎందరో వేలాది విద్యార్ధులకు ఉపాధికి కారణ మైంది .దానికి అను బంధం గా ఉన్న ఐ.టి.ఐ.చిన్న తరగతులు చదివి చదువు కోన సాగించ లేని వారికి ఆసరా గా ఉంది .చదివి పాస్ అయిన వారందరికీ ఎక్కడో అక్కడ ఉద్యోగాలు గ్యారంటీ గా లభించేవి .అందుకే ఆ రెండు కాలేజీలు ఉయ్యూరు కే కాదు చుట్టూ ప్రక్కల గ్రామాలకే కాదు దూరం గా ఉన్న జిల్ల్లాల   వారికీ కూడా ఆకర్షణీయం అయాయి . ఆ నాడు ఉయ్యూరు చదువుల హబ్ అయింది అంటే ఆశ్చర్యం లేదు  .వీటిని ఏర్పాటు చేసి ప్రభుత్వం తన దూర దృష్టిని తెలియ జేశింది .గ్రామీణ వాతా వరణం లో అతి తక్కువ ఖర్చు తో విద్య నేర్వటం ఒక ఆదర్శ ప్రాయం అయి అందుబాటు లోకి వచ్చింది .ఊరంతా కాకి లాగూలు తెల్ల చొక్కాల విద్యా ర్దులతో కళ కళ లాడి పోయేది .స్థానికం గా ఉన్న కే.సి.పి.షుగర్ ఫాక్టరి లో ఉద్యోగాలకు అవకాశాలూ లభించటం దీని విజయానికి కారణం కూడా అయింది .మంచి విద్యా బోధనా తో ,క్రమశిక్షణ గల విద్యా ర్దులతో,అనుభవం కలలెక్చరర్ల తో  కావలసిన సౌకర్యాల తో వీటిని పర్య వేక్షించి ఉత్తమ విద్యార్ధులను తీర్చి దిద్దే సంకల్పం ఉన్న ప్రిన్సి పాల్సు ఉండటం తో కళా శాల మూడు పువ్వులు ఆరు కాయలుగా వర్ధిల్లింది .మేము హిందూ పురం నుండి1951 లో ఉయ్యూరు వచ్చేసరికి దాని వైభవం వర్ణించ టానికి వీలు లే నంత గొప్ప గా ఉండేది .నాకు జ్ఞాపకం ఉన్నంత వరకు నేను చూసిన ముగ్గురు ప్రిన్సిపాల్సు దాన్ని తీర్చి దిద్దిన తీ రు ను జ్ఞాపకం చేసుకోవటమే నేను చేస్తున్నది .
                   శ్రీ వేపా కృష్ణ మూర్తి 
అసలైన ఆంగ్ల దొర లాగా సూటూ, బూటూ, టై ,టోపీ తో శ్రీ వేపా కృష్ణ మూర్తి గారు ఉండే వారు .ఎర్రటి ఎరుపు రంగు ఆదొరతనానికి మరింత వన్నె తెచ్చేది .దీనికి తోడు నోటి లో దొరల పైపు కూడా .కళ్ళకు నల్లద్దాల కళ్ళ జోడు .ఇదీ ఆయన అవతారం .ఆయన్ను తెలుగు వాడు అంటే ఎవరికి నమ్మకం ఉండేది కాదు .ఆయన ఇంగ్లీష్ తప్ప తెలుగు లో మాట్లాడి నట్లు కూడా ఎవరికీ తెలీదేమో .ఆ పర్స నాలిటీ  ని చూస్తె అందరికి వణుకే .ఆయన రాయ ప్రోలు కోదండ రామయ్య గారింట్లో మా ప్రక్క బజార్లో అద్దె కు ఉన్నట్లు జ్ఞాపకం .ఆయన కాలేజీ కి నడిచి వెళ్ళే వాడు .ఆయన వెడుతున్నా ,వస్తున్నా దారిలో ఒక్క విద్యార్ధి కూడా కనీ పించే వాడు కాదు .అందరు అంతకు ముందే కాలేజి కి వెళ్లి పోయే వారు .ఆయన చూస్తుండగా కాలేజి కి విద్యార్ధి వెళ్లటం ఎవరూ చూసి ఉండరేమో .ఊళ్ళో వారు కూడా ఆయన బజార్లో నడుస్తుంటే ఎదురు పడ టానికి జంకే వారు .అంత ఐరన్ డిసిప్లిన్ ఉండేది ఆయన కాలం లో .ఆయన కాలేజి కి చేరిన తర్వాతే విద్యార్ధులు ఫీల్డు వర్కు కు బయటికి వచ్చే వారు .సివిల్ విద్యార్ధులు స్టాఫ్,లెవెల్ ఉన్న స్టాండు లతో రోడ్లను సర్వ్ చేసే వారు .అయినా కూడా రోడ్ల మీద  వాళ్ళంతా చాలా క్రమ శిక్షణ తో ప్ర వర్తించే వారు .వాళ్ళు చేసే పని ఏమిటో మాకు తెలీక పోయినా చాలా ముచ్చట గా ఉండేది చూస్తుంటే . కాలేజి లో అన్ని డిపార్ట్ మెంట్ల లోను సమర్ధు లైన లెక్చరర్లు ఉండే వారు .వారి బోధనా విధానాన్ని విద్యార్ధులు మెచ్చుకోవటం బాగా గుర్తు .ఆచారి గారనే డ్రాయింగ్ టీచర్ ఉండే వారు .నల్ల గా ఉండే వారు .కాని అద్భుత మైన కళ ను ప్రదర్శించే వారు .విద్యార్ధుల్లో డిసైన్లను వేయించటం లో గొప్ప పేరుండేది ఆయనకు .దీనికి తోడు గొప్ప కళా కారుడు కూడా .వార్షి కొత్సవ సమయాలల్లో విద్యార్ధులతో మంచి నాటకాలను వేయించే వారు .ఆయన ఇచ్చే శిక్షణ ముచ్చట గా ఉండేది .అలాగే ఆటల విషయం లో కూడా దానికి సంబంధించిన వారు శ్రద్ధ తీసుకొనే వారు .”చామలి ”అని పిలువా బడే విశాల మైన ఆట స్థలం  ఆడటానికి అనువు గా ఉండేది .అప్పటికి క్రికెట్ కు ప్రాధాన్యత లేదు .వాలీ బాల్, బాడ్ మింటన్ ,చెడుగుడు బాగా ఆడే వాళ్ళు .పరుగు పందాలు ,డిస్కస్ త్రో ,జావేలీన్ మొదలైన వాటిలో విద్యార్ధులు ఆడుతుంటే వెళ్లి చూస్తూ ఉండే వాళ్ళం .కృష్ణ మూర్తి గారి క్రమ శిక్షణ వల్ల  కాలేజి చాలా అభి వృద్ధి సాధించింది .
                  శ్రీ పి.హెచ్.యెన్.బి. శర్మ
వేపా కృష్ణ మూర్తి గారు ఎన్నేళ్ళు పని చేశారో నాకు తెలీదు ,ఆయన అక్కడే రిటైర్ అయారో ఇంకెక్కడి కైనా వెళ్ళారో కూడా నాకు తేలేదు కాని ఆయన తర్వాతా వచ్చిన పి.హెచ్.యెన్.బి.శర్మ గారు మాత్రం జ్ఞాపకం ఉన్నారు .ఆయన దొర అయితే ఈయన ఆంధ్రత్వం తో ఉన్న మనిషి లాగా కనీ పించే వాడు .  సుమారైన విగ్రహం .సూటు ,కోటు మామూలే .టోపీ లేదు . నవ్వు మొఖం తో ఉండే వారు .భారీ విగ్రహం కాదు కాని ఆకర్షణీయ మైన మనిషి .వయసుకు తగ్గ శరీరం .వేపా వారంతటి తీవ్రం గా కానీ పించే వారు కాదు .కాని ఈయన కాలం లో కూడా క్రమశిక్షణ తోనే విద్యార్ధులు ఉండే వారు .బయట తిరగటం ఉండేది కాదు .సర్వే  చేసి నప్పుడు తప్ప ఎవరు బయట కనిపించే వారు .పసుపు రంగు దేహ చ్చాయ .వీరి కాలం లో కాలేజి లో ఇది వరకంటే సాహిత్య ,సాంస్కృతిక కార్య క్రమాలు ఎక్కు వ గా జరగటం జ్ఞాపకం .కవులను కళా కారులను పిలిపించి వారితో కార్య క్రమాలు నిర్వహించే వారు .వార్షికోత్సవాలను ఘనం గా జరి పే వారు .దానికి ముందు విద్యా ర్ధులకు అన్ని విషయాలలో పోటీలు నిర్వ హించే వారు .తెలుగు లో వక్తృత్వం ,వ్యాస రచన పోటీలు పెట్టె వారు .మా నాన్న గారు మృత్యుంజయ శాస్త్రి గారిని ఆహ్వానించి వాటికి న్యాయ నిర్ణేత గా వ్యవ హరింప జేసే వారు .నాటకాలను నేర్పి విద్యార్ధులతో వేయించే వారు .ఆ నాటి విద్యార్ధి నటుల్లో నాకు బాగా జ్ఞాపకం ఉన్న వారు నారాయణ మూర్తి ,సుబ్బ రాయ శార్మలున్నారు .ఆటల పోటీలను ఘనం గా నిర్వహించే వారు .అన్నిటికీ బహుమతులంద జేసే వారు .వీటి నన్నిటిని ఆచారి మాస్టారు ,వెంకటేశ్వర రావు గారు నిర్వహించే వారు .గ్రౌండ్ లో విద్యార్ధులు ఆడు కుంటుంటే భలే గా ఉండేది .చూస్తూ ఆనందించే వాళ్ళం .సాయంకాలాల్లో వెళ్లి చూస్తూ ఉండే వాళ్ళం .శర్మ గారికి మా నాన్న గారికి దోస్తీ బాగా ఉండేది .ఆయన చోడ వరపు చంద్ర శేఖర రావు గారింట్లో అద్దె కు ఉన్నట్లు జ్ఞాపకం .శర్మ గారి పాలన లో కళా శాల అన్ని రంగాలలో ముందుకు దూసుకు పోయి నట్లు గుర్తు .
ఇక్కడ కొన్ని విషయాలు గుర్తుకు వస్తున్నాయి .అవి చెప్పాలి .కాలేజి లో చదివే బ్రాహ్మణ విద్యార్ధులు కొందరు వారాలు చేసుకొని చది వే వారు .మా నాన్న గారికి చదువు కొనే విద్యార్ధులు అంటే మహా ఇష్టం .వారి చదువు ఆటంకం లేకుండా సాగి పోవాలని వారు కోరుకొనే వారు .కనుక వారానికి ఎంత మంది అయినా విద్యార్ధులకు వారాలు ఇచ్చే వారు .రోజుకు ఒక్కో సారి ఇద్దరు ,ముగ్గురు వచ్చి రెండు పూటలా భోజనం చేసి వెళ్ళే వారు .ముందు రోజే వచ్చి ”రేపు మీ ఇంట్లో నాకు వారం ఉందండి ”అని మర్యాద గా వచ్చి చెప్పే వారు .వారి కాలేజి సమయానికి తగ్గట్లు మా అమ్మ వంట చేసి రెడీ గా ఉండేది. వారు వచ్చి హాయిగా తృప్తిగా భోజనం చేసి వెళ్ళే వారు .వెళ్ళే టప్పుడు కృతజ్ఞత గా నమస్కారం చేసి వెళ్ళే వారు .మమ్మల్ని తమ తమ్ముళ్ళ లాగా మా అమ్మా నాన్న లను వారి తలిదండ్రులు గా భావించి గౌరవించే వారు .మాకు తెలియని లెక్కలు సైన్స్ మొదలైన సబ్జెక్టు లను అందులో మాకు వచ్చిన అను మానాలను తీర్చే వారు .మా కుటుంబ సభ్యులు గా మసలే వారు .అదొక సంతృప్తి గా ఉండేది మాకు .మూడేళ్ళు చదువుకొని ,నిర్విఘ్నం గా వారాలు చేసుకొని తిని తమ చదువులను బాగాచదువు కొంటూ అభ్యుదయం సాధించే వారు .  .జీవితం లో వారు ఉద్యోగం లో స్తిర పడినతర్వాత వీలున్న ప్పుడు ఎప్పు డైనా వచ్చి పలకరించి కృతజ్ఞతలను తెలియ జెప్పే వారు .ఆది వార సంస్కారం .మేము చేసింది గృహస్తులు గా మా ధర్మం నేర వేర్చటం .అంతే . ఇదో వింత అనుభూతి .మా నాన్న గారి తర్వాత మాఅమ్మ ,ఆ తర్వాత నేనూ   ఆ సంప్రదాయాన్ని కోన సాగించాం .మా మామయ్య గంగయ్య గారింట్లో ,చోడవరపు వారింట్లో వారణాసి వారింట్లో కోలచల వారింట్లో ఈ వారాలు ఇచ్చి విద్యార్ధుల చదువులకు ప్రోత్స హించారు .
కాలేజీ కాలేజి సమయం లోనే కాక గంట గంటకు గంటలు కొట్టే వారు .రాత్రి తెల్లార్లు కొట్టే వారు .అదే అందరికి సమయం తెలుసు కోవా టానికి ఉప యోగ పడేది .ఐ.టి.ఐ.వాళ్ళ సుత్తి కొట్టుడు ,మెకా నికల్ వాళ్ళ యంత్రాల చప్పుడు ,సివిల్ వాళ్ళ సర్వ్ లతో కాలేజీ పరిసరాలన్నీ ఆకర్షణీయం గా ఉండేవి .అప్పుడు ఐ;టి.ఐ.నిపెద్దగా గౌరవం గా చూసే వారు కాదు .సుత్తి కొట్టుడు అనే దానికి పేరు .అంత తేలిగ్గా  చూసే వారు .కాని అదే ఆ తర్వాత ఎంతో విలువైన కోర్సు గ ఎదిగి పోయింది .
                శ్రీ నరసింహ మూర్తి   
శర్మ గారి తర్వాతా మా నాన్న గారి హిందూ పురం శిష్యుడు నరా సింహ మూర్తి గారు ప్రిన్సి పాల్ గా వచ్చారు .వచ్చాడు అనచ్చు.అంత పరిచయం ఉంది ఆయనతో .హిందూపూర్ లో మా నాన్న గారు హై స్కూల్ లో సీనియర్ తెలుగు పండితులు గా పని చేస్తున్న కాలం లో నరసింహ మూర్తి అక్కడ చదివాడు .మా ఇంటికి దగ్గర లోనే ఉన్న రాఘ వేంద్ర రావు గారి అల్లుడాయన .రావు గారు నాన్న గారి   స్కూల్ లోసెకండరి టీచర్  గా పని చేసే వారు .ఆయన భార్య గోదా వరమ్మ గారు మునిసి పాలిటీ మెంబర్ కూడా .మంచి పలుకు బడి ఉన్న ఆమె .వారి కుమార్తె సునంద మాతో పాటు ఆడుకోనేది .మా రెండో అక్కయ్య కు క్లాస్ మేట్ కూడా .ఆ సునంద భర్తే నర సింహ మూర్తి .మా నాన్న గారంటే విప రీత మైన గౌరవం .మేము కూడా అక్కడ ఆయన తో చనువు గా ఉండే వాళ్ళం .మమ్మల్ని ఒల్లో  కూర్చో బెట్టుకొని కబుర్లు చెప్పే వాడు .మేము హిందూ పురం నుండి ఉయ్యూరు వచ్చినా గోదావరమ్మ ,వాళ్ళింటి ప్రక్క ఉన్న అన్న పూర్ణమ్మ గార్లు ఉయ్యూరు వచ్చ చూసి వెళ్లారు .మూర్తి సివిల్ పాసై నంద్యాలలో ప్రిన్సి పాల్ గా పని చేసి ఉయ్యూరు కు బదిలీ అయి వచ్చారు .రావటం రావటమే మా ఇల్లు వెతుక్కుంటూ వచ్చారు భార్యా భర్తలు .మా ఇంట్లో భోజనాలు చేశారు .అద్దె కు ఇల్లు తీసుకొన్న తర్వాత మమ్మల్ని అందర్ని వాళ్ళింటికి భోజనాలకు పిలిచారు .మా నాన్న గారిని వీలున్న ప్పు డల్లా  వచ్చి కలిసి వెళ్ళే వాడు మూర్తి .కాలేజి లో జరిగే సాహిత్య సాంస్కృతిక కార్య క్రమాలను నాన్న గారి పెద్దరికం తో జరిపించే వాడు .అప్పుడే స్థానం నర సింహా రావు గారిని ఆహ్వానించి ఆయనతో సత్య భామ పాత్రను వేయించారని గుర్తు .విద్యార్ధుల లో బాగా పాటలు పాడే వారుండే వారు .అన్ని రంగాలలో కళా శాల అభి వృద్ధి లోకి వచ్చింది .మూర్తి కూడా క్రమ శిక్షణ కు అధిక ప్రాధాన్యత నిచ్చి ,చదువు శిక్షణ విషయం లో అన్ని జాగ్రత్తలు తీసుకొన్నాడు .ఇలా ముగ్గురు ప్రిన్సిపాళ్ళు ఉయ్యూరు కాలేజిని తీర్చి దిద్ది,దాని అభి వృద్ధికి కారకు లైనారు .వారి సేవలు చిరస్మరణీయం .
ఇంత అభ్యుదయం సాధించిన కాలేజి ఒక్క సరిగా కుదేలు మంది .రాజకీయ నాయకుల స్వార్ధం వల్ల ఉయ్యూరు లో ఉన్న కాలేజిని విజయ వాడకు సాగ నమ్పారు .దీనికోసం చేతులు కాలిన తర్వాతా ఆకు లు పట్టుకొన్నట్లు గా సమ్మెలు ఆందోళనలు నిరసనలు స్తానిక ప్రజలు చేశారు కాని ఫలిత లేక పోయింది .ఉయ్యూరు కుదగ్గర లోని కనుమూరు వాస్తవ్యులు సోషలిస్టు భావాల వ్యక్తీ రైతు శ్రీ కొల్లి రామ కుమార వర్మ గారు నిరవధిక నిరా హార దీక్ష ఛే బట్టారు .దాదాపు యాభై రోజులకు పైగా నే వారు దీక్ష చేసినట్లు జ్ఞాపకం .అప్పటి నూజివీడు కుమారా రాజా ఏం.ఆర్ .అప్పా రావు గారు వచ్చి స్వయం గా చూసి విషయాలు తెలుసు కొన్నా ఏమీ ప్రయోజనం కన్పించలేదు .మళ్ళీ కాలేజి ఉయ్యురుకు వచ్చే ఆశ లేదని తేలి పోయింది .మన్నే శివ రావు వంటి వారు వర్మ గారికి నచ్చ చెప్పి దీక్షను విర మింప జేసి నట్లు గుర్తు .కాని ఈ దీక్ష తో వర్మ గారి ఆరోగ్యం పూర్తీ గా దెబ్బ తిన్నది .చాలా సార్లు ఆయన్ను చూశాను .గడ్డం పెంచి కని పిస్తూండే వారు .ఖద్దరు పైజమా లాల్చీ ఆయన ధరించే వారు .ఒక వెలుగు వెలిగిన ఉయ్యూరు పాలిటెక్నిక్ కాలేజి చీకటి లో చాలా కాలం మగ్గింది .ఆ తర్వాతా చాలా ఏళ్లకు కే.సి.పి..రైతులు అందరు కలిసి ఆ స్థలం లో డిగ్రీ కాలేజి ఏర్పాటుకు కృషి చేశారు .ఇప్పుడు పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సులతో మళ్ళీ ఆ ప్రాంగణం అంతా విద్యా వైభవం తో వెలిగి పోతోంది .శ్రీ రాయుడు గారు ప్రిన్సి పాల్ గా ఉన్న కాలం లో కాలేజి ఇన్ఫ్రా స్ట్రక్చర్ బాగా పెరిగింది .నాతో రాయుడు గారు కాలేజి లో డిగ్రీ విద్యార్ధులకు ఇన్నోవేటివ్ లెసన్స్ మూడేళ్ళు చెప్పించారు .మా నాన్న గారి వార సత్వం నాకూ వచ్చి కాలేజి తో అనుబంధం పెరిగింది ”.సరస భారతి” కార్య క్రమాలను రాయుడి గారి సహకారం తో కాలేజి లో విద్యార్ధుల కోసం నిర్వ హించాం .రవీంద్ర ,గురజాడ ల 150 జయంతిని వైభవం గా నిర్వ హించి విద్యార్ధులలో అవగాహన కల్పించాం .
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –12-9-12-కాంప్–అమెరికా .

Posted in ఊసుల్లో ఉయ్యూరు | Tagged | Leave a comment

శ్రీకేత్ వాకిట్లో సీతాకోక చిలుక

This slideshow requires JavaScript.

 

శ్రీకేత్ వాకిట్లో సీతాకోక చిలుక

Posted in అమెరికా లో | 1 Comment

సిన్క్లైర్ రచనా ప్రభావం

సిన్క్లైర్ రచనా ప్రభావం 
అప్ టాన్ సిన్క్లైర్ రచన లు చాలా మందిని ప్రభావితం చేశాయి .జర్మన్ రచయిత   ఆల్బర్ట్ ఐన్స్టీన్ ,తామ స్ మాన్ ప్రముఖ నాటక రచయిత బెర్నార్డ్ షా లు చదివి ఆనందించి ఆయన్ను ఇరవై వ శతాబ్దపు రాజ కీయమార్గ దర్శి అన్నారు . అవి నీతి సామ్రాజ్యపు కూకటి వేళ్ళ ను పెకలించే విశ్వ ప్రయత్నం చేశాడు .దానితో కళ వళ పడిన రాజ కీయ పెద్దలు తప్పులు దిద్దుకొనే ప్రయత్నాలు చేశారు కంటి తుడుపు గా నైనా .జంగిల్ నవల కు ప్రభావితులైన వారు ”చికాగో ఇస్ అవర్స్ ”అనే నమ్మక మైన అభిప్రాయానికి వచ్చారు .ధనస్వామ్యాన్ని అన్ని కొణాల్లోనుంచి చూసి ,చూపించాడు .అబ్బా ! ఇంత దరిద్ర స్తితి లో మనం ఉన్నామా ? అని ముక్కున వేలు వేసుకోనేట్లు చేశాడు .ఈ అవినీతి కధలు చదవలేక ,వినలేక ప్రెసిడెంట్ రూజ్ వెల్ట్ సిన్క్లైర్ రచనలు అచ్చు వేస్తున్న పబ్లిషర్ కు ”అయ్యా ! మీ సిన్క్లైర్ ను ఇంటికి వేళ్ళ మనండి .కాసేపు నా దేశాన్ని నన్ను హాయిగా పాలించు కొనివ్వ మనండి ”అని రాయాల్సి వచ్చింది .అదీ రచన ప్రభావం అంటే .తాను చెడిపోయిన ఆహార పదార్ధాల విషయం లో జాగ్రత్తలు తీసుకొంటున్నానని ,అక్కడి పరిస్తితులు సిన్క్లైర్ చెప్పి నంత దారుణం గా లేవని సంజాయిషీ ఇచ్చుకొన్నాడు పాపం .
న్యు జెర్సి లోని సిన్క్లైర్ అతని బృందం ”హేలికాన్ హిల్ ”లో ”academy of engle wood ”అనే సంస్థను ఏర్పరచి సమావేశం జరిపితే ఎందరెందరో మేధావులు రచయితలు ఆలోచనా పరులు స్త్రీ ,పురుషులు హాజరైనారు .శాకా హారం యొక్క విశేషాలను అందరు ప్రత్యక్షం గా అనుభవించి తెలుసుకొన్నారు .బీన్సు బంగాళా దుంప ,టర్నిప్పులు ,ప్రూన్లు ,ఉప్పు లేని క్రకేర్లు (ఎడ్యు కేటర్స్ )టిని బల వార్ధక ఆహారము అని   తెలుసుకొన్నారు . సిన్క్లైర్ లెవిస్ అనే కుర్రాడు మిగిలిన విద్యార్ధులుపాల్గొని ఆనందించారు . .అదంతా ”ఫ్రీ  లవ్ సొసైటీ ”లాంటిది అన్నారు కొందరు .కాని దాని విషయం అందరికి తెలిసి ఎందరో పెద్దల్ని ఆకర్షించింది .అందులో విలియం జేమ్స్ ,ఏమ్మా గోల్డ్ మాన్ ,జాన్ డ్యుయీ వంటి వారున్నారు .ఫ్రాయిడ్ ప్రభావం బాగా ఉన్న కాలం లో సిన్క్లైర్” డయటింగ్ ”ను ,హోమియో పతి వైద్యాన్ని వ్యాప్తి చేశాడు .”ఫాష్టింగ్ ”ప్రయోజనాన్ని తెలియ జేశాడు . .ఇలా చేయ టానికి” గట్ స్  ”ఉండాలి .అవి పుష్కలం గా ఉన్న వాడు ఆయన .
యే ప్రతీక శక్తుల్ని ఏది రించాడో అవే ఆయన్ను నిర్వీర్యుడిని చేసే ప్రయత్నాలూ చేశాయి .ఆయన జంగిల్ నవల పది హేడు భాషల్లో కి అనువాదం పొందింది అంటే ప్రపంచ వ్యాప్తం గా దాని ప్రభావం ఏమిటో తెలుస్తోంది .పారిశ్రామిక అమెరికా లో ఉన్న బాధలు ఆందోళనలు వ్యధలు అన్నీ అర్ధమయేట్లు చేసింది .ఆయన చేసిన ఆరోపణలు అన్నీ యదార్ధాలే నని పరిశీలన లో తేలిన విషయాలే .చికాగో లోని మాంసం పాకెట్లు తయారు చేసే చోట జరిగే అవి నీతి ని బయట పెట్టాడు .దీన్ని చదివిన ప్రెసిడెంట్ రూజ్ వెల్ట్ చికాగో కు ఒక కమీషన్ ను పంపి ఎంక్వైరీ చేయించాడు .అదీ పబ్లిక్ బాగా విరుచుకు పడిన తర్వాతే .అదీ సిన్క్లైర్ ప్రభావం .మన రచయిత ఊరు కొంటాడా ? తన స్వంత డబ్బు ఖర్చు చేసి ఒక ప్రైవేట్ కమిటీ ని పంపి అక్కడి అధ్వాన్న స్తితులను అధ్యయ నం చేయించాడు . .అతను రాసిన వన్నీ  యదార్ధాలే అని అన్ని కమీషన్లు నిర్ధారించాయి .అదీ ఆయన సాధించిన నైతిక విజయం .ఆ కాలం అంతా” muckraaking ”అని పేరు తెచ్చుకోంది .ఇవన్నీ గమనించిన బిజినెస్ వర్గం, మేధావి వర్గాన్ని నియంత్రణ చేసే ప్రయత్నాలెన్నో చేసింది .అయినా పబ్లిక్ డిమాండ్ ముందు ఓటమి పాలైంది .
ఆయన రచనలలో మానవులు జంతువుల కంటే కొద్ది నయం అన్నట్లు గా ఉంటుంది .రాసే టప్పుడు ఆయన కళ్ళ వెంట కన్నీళ్లు దారా పాతం గా కారి పోయేవి .చలించి పోయే వాడు .ఆయన రాసిన నలభై ఏళ్ల తర్వాత అమెరికా ప్రజలు బిజినెస్ వర్గా లను ఎదిరించి వాటి పై తమ కంట్రోల్ ను సాధించే ప్రయత్నం చేశారు. స్టాక్ యార్డ్ ప్రజలకు న్యాయం జరిగింది .ఆయన నినదించిన సామాజిక న్యాయం ప్రపంచ ఘోష గ విని పించింది .అమెరికా జనం ఎదుర్కొన్న పరిస్తితుల తో బాటు వలస వచ్చిన వారి బాగోగుల విషయం మీదా రాశాడు .వారి సమస్యలను ఫోకస్ చేశాడు .వీరికి తమ మత స్వేచ్చ లేదని ,కుటుంబం గురించిన అభిప్రాయాలకు విలువ నివ్వటం లేదని ,వారి సాంస్కృతిక విషయాల పై నియంత్రణ ఉందని ,తమ సంగీతాన్ని తాము పాడుకొనే స్వేచ్చ లేదని ప్రభుత్వం దృష్టికి తెచ్చాడు .ఒక ఆటవిక రాజ్యం లో ఉన్న భావం కలుగుతోందని చెప్పాడు .కనుక ప్రజాస్వామ్యాన్ని కొత్త  వాతావరణానికి అల వాటు పడేట్లు చేయాలన్నది ఆయన దృష్టి .మనిషి” ఒక మూక మనిషి” గా మార రాదని సిన్క్లైర్ అన్నాడు .
సిన్క్లైర్ మనిషి సామర్ధ్యాన్ని ,కష్ట పడి పని చేసే విధా నాన్ని మెచ్చాడు .పని లో శక్తినంతటిని వినియోగించాలని అలసత్వం పనికి రాదనీ కార్మికులకూ చెప్పాడు .ఇళ్ళ లోని అసౌకర్యాలను డ్రెయినేజి ని అభి వృద్ధి పరచాల్సిన ఆవ సారాన్ని ఆయన రచనలో వీలున్న చోటల్లా చెప్పి ప్రభుత్వ దృష్టి లో పడేశాడు .ఆరోగ్య వంత మైన ఇళ్ళ నిర్మాణాన్ని కోరాడు .నాలుగు రూముల ఫ్లాట్ లను ఎర్పరచాలన్నాడు .ఇరుగు పొరుగు లు కలిసి సౌభాగ్యం గా జీవించాలని చెప్పాడు .ఇళ్లకు ,ఆఫీసులకు పరిశుద్ధ మైన తాగు నీటిని అందించాలని .ప్రతి మూల నీటి టాప్ ఉండాలని సూచించాడు .వీటన్ని ఫలితం గా1905 చికాగో మేయర్ పదవికి జరిగిన ఎన్నికలో చికాగో ఫెడ రేషన్ ఆఫ్ లేబర్ ఇమ్మిగ్రంట్ వర్కర్లు ,స్టాక్ యార్డ్ డిస్ట్రిక్ట్ లోని కార్మికులు బల పరచిన ఐరిష్ అమెరికన్ ”ఎడ్వార్డ్ డాన్నే” గెలుపొందాడు .ఇది ఆయన రచన లకు ఘన విజయమే .
అందరికి సమాన ఆవ కాశాలు అన్నది సిన్క్లైర్ నిరంతర నినాదం .”meat packing industry ”ని ఆధునీకరించాలనే ఆయన పట్టు దల విజయం సాధించింది .జబ్బు చేసిన పశువులను వేరే ఉంచాలని,వధీం చే ప్రదేశాలు వేరుగా ఉండాలని ఎలుకలను చంపటానికి విషాన్ని ప్రయోగిస్తున్నప్పుడు ఆ ఎలుకలు మంచి మాంసం మీద తిరిగితే ప్రమాదం అనే ఆన్నీ ఆయనే చెప్పాల్సి వచ్చింది .కో ఆపరేటివ్ కామన్ వెళ్త ను సెల్ఫ్ గవర్నింగ్ కమ్మ్యునిటి ల ద్వారా సాధించాలని కోరాడు .అమలు చేయ టానికి వీలున్న పద్ధతులన్నీ నేర్పాడు. కొన్ని చోట్ల గ్రీకుల ”ఆదర్శ వాదం ”కనీ పించ వచ్చు .”the soul of man under socialism ”గురించి చెప్పి, మనిషి తనకోసమే కాక ఇతరుల కోసమూ జీవించటం నేర్చుకోవాలని హితవు చెప్పాడు .కార్మికుల క్షేమం కోసం వర్క్ ఇన్స్పెక్టర్లు ,వారి పై సూపెర్వైజర్ల అవసరాన్ని తెలియ జెప్పాడు .అవన్నీ ఇప్పుడు అమలు లోకి వచ్చాయి .
చికాగో లోని meat cutters ,butchers అందరు ఆఫ్రో అమెరికన్లే ఉండే వారు .వారి పని సామర్ధ్యం మెరుగ్గా లేదని భావించి రాశాడు .వాళ్ళు సమ్మె చేస్తే సమర్దించటానికి  తట పటాయించాడు .వారికి ”మాబ్ ష్టిగ్మా” ఉందన్నాడు .ఇది చివరికి జాతి సమస్య గా తయారయింది .తెల్ల వారు నల్ల వారిని దీపపు స్తంభాలకు కట్టేసే వారు .ఇవన్నీ  గ్రహించి చివరికీ వారికి మద్దతు నిచ్చాడు .నల్ల వారందరూ యూనియన్లలో చేరి సంఘీభావంప్రకటించారు .సమస్యల సాధనకు ఆది బాగా తోడ్పడింది .అనేక ఆందోళనల ఫలితం గా1980 లో మాంసం కార్మికుల .వేతనం గంటకు 18డాలర్లు అయింది .ఇదే అప్పటికి అమెరికా లో అత్యధిక వేతనం .
ఇప్పటికీ ఇమ్మిగ్రంట్స్  కు రక్షణ కరువు గ ఉందని అనుకొంటారు .2006లో న్యూయార్క్ గవర్నర్ మూడు బిల్లు ల పై సంతకాలు పెట్టాడు .వాటి వల్ల రిఫ్రిజి రేటర్లు ,పో లీసులు ,విష వాయువులున్నచోట  పని చేసే వారు” గ్రౌండ్డ్ జీరో ”దగ్గర పని చేసే వారందరికి లాభాలు చేకూరాయి .అయినా జబ్బు తో ఉన్న ఇమ్మిగ్రెంట్స్ విషయం ఎవరికీ పట్టలేదు .సిన్క్లైర్” జంగిల్ నవల” రాసి వందేల్లయిన తర్వాతా కూడా O.S.H.A..సంస్థ చీఫ్ మాట్లాడుతూ ”ఇంకా ఈ విషయం లో చేయాల్సింది ఎంతో మిగిలి పోయింది ”అని బాధ పడ్డాడు .”cantinental harass ment” విషయం లో ఆడ వాళ్ళు భయ పడటాన్నీ ఆయన చిత్రించాడు మగబాస్ ఆడ వారి పట్ల అసభ్య ప్రవర్తన ను నిరశించాడు .దీనిపై రిపోర్ట్ ఇవ్వ టానికి ఆడ వారు భయ పడుతున్నారని ప్రభుత్వం దృష్టికి తెచ్చాడు .ఆయనద్రుస్ష్టి కి రాని  సమస్య లేదు అంటే అతి శయోక్తి కాదు .బాల కార్మిక వ్యవస్థ పై రాశాడు .బనానా లలో del monte ,chiquita ,dole రకాలు ప్రసిద్ధ మైనవి .ఇవి ఈక్వెడార్ నుండి అమెరికా కు వస్తాయి .వీటిపై స్టిక్కర్లు అంటించే పనిని ఈక్వెడార్ లో బాల కార్మికులే చేస్తారట .ఎని మిదేల్ల లోపు పిల్లలు పని చేస్తారు వీరికి పన్నెండు గంటల పనికి 4.72డాలర్లు మాత్రమె ఇస్తారట .బాలుర శక్తిని యెట్లా పిండి పారేస్తున్నారో తెలిపే విషయం ఇది .మామూలు వేతనం లో ఇది నలభై శాతం కంటే తక్కువత .మక్ డోనాల్డ్ తయారు చేసే ప్లాస్టిక్ ఆట వస్తువులలు పని లో బాల కార్మికులకు పద్నాలుగు గంటల పనికి గాను గంటకు ముప్ఫై సెంట్లు మాత్రమె ఇస్తారట .ఇది ప్రపంచ వ్యాప్తం గా ఉన్న సమస్యే .దీనికి అంతు దరీ లేదు .ఇన్ని సమస్యలను తన నవలలో పాత్రల ద్వారా చెప్పాడు .రూజ్ వెల్ట్ సిన్క్లైర్ ను కసురుకొన్నా ఈయన చెప్పినదానికి పరిష్కారం ఆలోచించాడు .ఆయన తర్వాతా వచ్చిన ప్రెసిడెంట్లు సిన్క్లైర్ ను గొప్పగా అభి మానించి సమస్యలను తెలుసుకొని ఆయన మాటలకు అత్యంత విలువ నిచ్చారు .ఈ విధం గా ప్రజా సమస్యలను ఫోకస్ చేసి పరిష్కార మార్గాల కోసం ప్రయత్నించిన ప్రజా రచయిత అప్ టాన్ సిం క్లైర్ .
మీ–గబ్బిట దుర్గా ప్రసాద్ –11-9-12-కాంప్–అమెరికా
http://suvarchalaanjaneyaswami.wordpress.com

Posted in మహానుభావులు | Tagged | Leave a comment

సాంఘిక సమస్యల నవలా రచయిత- అప్ టాన్ సిన్క్లైర్

సాంఘిక సమస్యల నవలా రచయిత- అప్ టాన్ సిన్క్లైర్ 
దాదాపు వంద నవలలు రాసి ,సమకాలీన సమస్యలను చర్చించి ,కార్మికుల కష్టసుఖాలను ప్రభుత్వం దృష్టికి తెచ్చి ,ప్రజా రచయిత గా ,అధో జగత్ సహోదరులకు అండగా నిల బడి, కాలిఫోర్నియా గవర్నర్ పదవికి పోటీ చేసిన  రాజకీయ రచయిత  అప్ టాన్  సిన్క్లైర్ .
సిన్క్లైర్ అంటేనే వేతన జీవుల ఆశా జ్యోతి .ప్రెసిడెంట్ రూజ్  వెల్ట్ ను తరచుగా కలిసి వారి సమస్యలను చర్చించి పరిష్కారం కోసం ప్రయత్నించిన వాడు వర్కర్ల హృదయాలలో చిర స్తానం పొందిన వాడు .”i aimed at the public heart ,but by accident hit in the stomach ”అని గర్వం గా చెప్పుకొన్నాడు రచయిత అప్టాన్ సిన్క్లైర్ .ఎక్కువ పై గంటలను తగ్గించటం లో ,జీతాలను పెంచటం లో పని చోట్ల ఆరోగ్య రక్షణ విషయం లో రచయిత చేసిన కృషి ప్రశంస నీయం .మాంసం దుకాణాలలో పని చేసే వారి దుర్భర వేదనలను నివృత్తి చేయటానికి ,పారిశుద్ధ్య పని వారల గతి మార్చటానికి ఆయన ప్రయత్నించిన తీరు మరువ లెండి .ది జంగిల్ ”అనే నవలలో సమకాలీన జీవన చిత్రణ చెశాదు .అన్నీ సాధించ లేక పోయినా ఆయన ఒక ఆదర్శ నీయడు గా ”ఐకాన్ ”గా ఉన్నాడు .
1878లో సెప్టెంబర్ ఇరవై న మేరి లాండ్ లోని బాల్టిమోర్ లో అప్టాన్ బి ఆల్ సిన్క్లైర్ జన్మించాడు .పదేళ్ళ వయసు లోనే కుటుంబం న్యు యార్క్ లో స్తిర పడింది అతని ద్రుష్టి అంతా రాజకీయం ,ఆర్ధిక సామాజిక సమస్యల పైనే ఉండేది .సామాజిక న్యాయం కోసం తపించే వాడు .అవినీతికి సింహ స్వప్నం .ఆది ఎక్కడున్నా వెతికి జనం ముందుంచే బాధ్యత తీసుకొన్నాడు అలాంటి వారిని ”muckraker” అంటారు .రూస్ వెల్ట్ అలానే సంబోధించాడు ఈయన్ని .అమెరికా లోని రాజ కీయ ,సాంస్కృతిక చరిత్ర లో సిన్క్లైర్ స్తానం స్తిర మైనదే .ఆయన్ను పందోమిదో శతాబ్దపు ఆదర్శ వాది అయిన రచయిత అంటారు .యువకుడు గా ఉన్నప్పుడే వందలాది కధలు రాసి పారేశాడు pulp  రచయిత అని పించుకొన్నాడు .సంగీతం రాజకీయం ఆయన్ను బానే ఆకర్షించాయి .క్రమంగా సామాజిక భావ వ్యాప్తి మీదకు దృష్టి మరలింది .
1900-04 కాలం లో నాలుగు నవలల ను విజ్రుమ్భించి రాశాడు .అందులో రొమాంటిక్ అయిడ లిజం నింపాడు . క్రమం గా దృష్టి సోషలిజం వైపుకు మరలింది .1904లో రాసిన ”manassas ”నవల లో అమెరికన్ సివిల్ వార్ సమయం లో ప్లాంటేషన్ యజమాని కొడుకు బానిస నిర్మూలన కోసం కృషి చేయటం వస్తువు గా తీసుకొని రాశాడు ఇక్కడితో అతని సోషలిస్ట్ భావాల ద్వారాలు తెరుచుకోన్నాయి .ఆ తర్వాత రాసిన” lanny budd ”సిరీస్ అని పదకొండు పుస్తకాలు రాశాడు .వీటిలో ఆదర్శ వంత మైన సమాజంకోసం తపన ,సాంఘిక అన్యాయాలను ఎదిరించే పరిస్తితులన్నీ కన్పిస్తాయి .”మనస్సాస్”నవల ఆ తర్వాత రాయ బోయే ”the jungle  ”నవలకు ఉపోద్ఘాతం లాంటిది .ఉద్యోగస్తులను ”వేతన బానిసలు ”(wage slaves )అని పిలుస్తారు .చికాగో లోని పాకింగ్ ప్లాంట్ కు వెళ్లి అక్కడి పరిస్తితులను రహస్యం గా ,బహిరంగం గ చూసి అర్ధం చేసుకొన్నాడు .అక్కడి దీన ,హీన స్తితులకు చలించి పోయాడు .దీని నేపధ్యం గా” ది జంగిల్ ” నవల రాశాడు .ఇందులో సృజన తో పాటు అవినీతి ని బహిర్గతం చేసే విధానమూ ఉంది .ఆ ఉద్యోగుల లో ఒకడి జీవితాన్ని నవలగా రాశాడు .అందులో మొత్తం సమాజం అంతా ప్రతి ఫలించే టట్లు చేశాడు .అవి నీతి రాజకీయ నాయకులను ఎండ గట్టాడు .ఏది రాసినా సిన్క్లైర్ తన స్వంత కళ్ళ తో చూసే రాస్తాడు అందుకే ఆయన రచనలకు అంతటి విలువ ఏర్పడుతుంది .ఈ నవల అందరి దృష్టిని ఆకర్షించింది .దీని ఫలితం కూడా కనీ పించింది .అక్కడి పారిశుద్ధ్యం పై ప్రభుత్వం శ్రద్ధ తీసుకొన్నది .మాంసం పాక్ చేసే విధానం లో ఎన్నో జాగ్రత్తలు వహించేట్లు చేయ గలిగారు .నవల కు ఇంతటి కన్నా కావాల్సిన దేముంది ?
1906-14కాలం లో సిన్క్లైర్ ఆయన ఉద్యోగ విషయాలలో మార్పులు వచ్చాయి .న్యు జెర్సి లోని హేలికాన్ హాల్ లో అందరు కలిసి జీవించే విధానాన్ని ప్రయోగాత్మ కం గా అమలు చేశాడు.అయితే ఆ భవనాన్ని ధ్వంసం చేశారు గిట్టని వాళ్ళు .ఆయన వివాహ జీవితం కూడా ఒడిదుడుకులకు లోనైంది .ఆరోగ్య రహస్యాల మీద రచనలు చేశాడు .ఉపవాసం చాలా మేలు చేస్తుందని చాలా జబ్బులను దూరం చేస్తుందని  తెలియ జేశాడు .1908లో ”the metro polis ”,the money changers ”మంచి ద్రుష్టి తో రాసినా గొప్పవిగా  పేరు రాలేదు .1910లో రాసిన ”samuel the seeker ”నవల ఒక యువకుడు సోషలిజం ను స్వీకరించే ముందు అనేక మతాల లో ఉండి ఏవీ నచ్చక పోవటాన్ని వివ రించాడు .చివరికి సోషలిజం అతన్నేమీ ఆకర్షించక రాజ కీయ బాధితుడవటం చివరలో చూపిస్తాడు .ఇందులో సిన్క్లైర్ కూడా భౌతిక మానసిక సంచారం చేసిన తీరు కనిపిస్తుంది .తర్వాత వచ్చిన నవల ”love’s pilgrimage ”లో తన మొదటి వివాహం దాని అనుభవాలు వివ రిస్తాడు .అందులో పెళ్లి అయిన మహిళకోరుకొనే జీవితాన్ని గురించి చెప్పాడు దీనిలో ఆయన మహిళా పక్ష పాతి అని పిస్తాడు .1913లో సుఖ వ్యాధుల పై రచనలు చేశాడు .మన ”లవణం ”అని పిస్తాడు .
రెండో పెళ్లి ఆయనకు కొంత సుఖ శాంతులనిచ్చింది .సౌత్ కెరొలినా లో నివాసం ఉన్నాడు .బొగ్గు గనుల కార్మికుల సమ్మె తీవ్రం గా ఉంది. స్వయం గా వెళ్లి వాళ్ళ సమస్యలను పరిశీలించి తెలుసుకొన్నాడు .కొలరాడో దాకా వెళ్లి గని యజ మానులతో సంప్రదించి పరిష్కార మార్గానికి ప్రయత్నించాడు .ఈ అనుభవాలను ”king coal ”లో వర్ణించాడు .తర్వాతా అమెరికా మొదటి ప్రపంచ యుద్ధం లో పాల్గొన టాన్ని వ్యతి రేకించాడు .ఆయన లో స్తిరమైన అభిప్రాయాలు లేవని కొన్ని సందర్భాలలో తెలుస్తుంది .1918లో బోల్షెవిక్ రివల్యూషన్ ను అమెరికా సైన్యం అణచి వేయటానికి చేసే ప్రయత్నాన్ని నిరశించాడు .దీన్ని అంతటిని ”jimmie higgins ” లో నవలాత్మకం గా చిర్తించాడు .ఇప్పటి నుంచి ఇరవై మూడేళ్ళు అనేక పుస్తకాలను ఫామ్ఫ్లేట్ల ను రాసి ప్రచురించాడు .వీటిలో విద్య గురించి ,తప్పుడు దేశ భక్తీ గురించి ,అమెరికా లోని కాపిటలిజం గురించి ,జర్నలిజం గురించి ,మంచి ఆర్ధిక స్తితి గతుల గురించి ,కళా సాహిత్యాల గురించి అమెరికా రాజకీయాలను ప్రభావితం చేస్తున్న అనేకానేక అంశాల గురించి పుంఖాను పపుంఖం గా  పున్ఖం గా ఎడా ,పెడా రాసి అవతల పారేశాడు .
సిన్క్లైర్ రాసిన ”oil ”,”bostan ”నవలల  తర్వాతాదాదాపు ఇరవై ఏళ్ళు ప్రభావం చూప గల రచనలేమీ చేయ లేక పోయాడు .మెంటల్ టేలి పతి విషయం పై ”mental radio ”రాశాడు ప్రొహిబిషన్ ను తేవాలని కోరాడు .1934లో ”  గవర్నర్  అఫ్ కాలిఫోర్నియా ”,”హౌ ఐ ఎండెడ్ పావర్టి ” నవలల తర్వాత రాజ కీయాలపై ఆసక్తి బాగా పెరిగింది .కాలి ఫోర్నియా రాష్ట్ర గవర్నర్ గా డెమొక్రాటిక్ పార్టి టికెట్ లభించింది .ఆయన ప్రచారం ఏమిటో తెలుసా” E.P.I.C.”అంటే”end poverty in california ” అని .పాపం ఓడి పోయాడు .కాని దీని ఫలితం మాత్రం కనీ పించింది .ప్రెసిడెంట్ రూస్ వెల్ట్ కార్మికుల అంటే లెఫ్ట్ వింగ్ వారి డిమాండ్లను తీర్చటానికి ముందుకు వచ్చి ఆసరా గా నిల బడ్డాడు .కాలిఫోర్నియా రాజ కీయాలను చర్చిస్తూ ”co-op ”అనే నవల 1936లో రాశాడు .తర్వాతి ఏడాది లో ”the flivver king ”అని హెన్రీ ఫోర్డ్ ఆయన కార్మిక వ్యతి రేకత  పై నవల రాస్తూ అందులో కార్మిక సమస్యలను చర్చించాడు .”లిటిల్ స్టీల్ ”అనే నవల లో స్పానిష్ సివిల్ వార్ పై రాశాడు .1938లో ”the steel ”నవల లో ఇనుము ,స్టీల్ కంపెనీ లలో కార్మిక యూనియన్ల నిషేధాన్ని గురించి రాశాడు .ఆ తర్వాతా పద కొండు చారిత్రాత్మక నవలలు రాశాడు .అందులో 1913 -50కాలం లో పశ్చిమ దేశాల చరిత్ర ను గురించి రాశాడు .అందులో పాత్ర పేరు ”లాన్నీ బడ్డీ ”.అందుకని వీటిని ”లానీ బడ్ సిరీస్ ”అంటారు .
1950 లో సిన్క్లైర్ ఎనభై వ పడి లో పడ్డాడు .ఇక రచనకు స్వస్తి చెప్పే ఆలోచన కు వచ్చాడు . ఇప్పటి దాకా రాసిన వాటిల్లో ఎక్కువ భాగం స్వీయ చరిత్రలే అని పిస్తాయి .1950లో రాసిన ”another pamela ” ను 1740-42కాలం లో samuel richardson ”రాసిన ”పమేలా ”కు ఆధునిక విధానం లో  రాసి ప్రాముఖ్యత చేకూర్చాడు .1954లో ”what didimus did ?”నవల లో కాలిఫోర్నియా లో జరిగిన అసంపూర్ణ సాంఘిక సంస్కరణలను  చర్చించాడు .1964 వచ్చిన ”the auto biographyof upton Sin clair ”అనేది ఆయన ”అమెరికా పోస్ట్ ”లో ఇది వరకు రాసిన దానికి పూరణే.ఇందులో అభ్యుదయ భావ రచయిత గా ఆయన దర్శనమిస్తాడు .ఆయన తల్లి కి నిశ్శబ్దం అంటేఇష్టం .తాగుడుకు ఆమె వ్యతి రికి గొప్ప డిసిప్లినీర్ .ఇవేవి నచ్చక సిన్క్లైర్ తల్లికి దూరం గా 35 ఏళ్ళు గడిపాడు .”time ”మేగ జైన్  సిన్క్లైర్  గురించి ”a man with every gift except humor ”అని రాసింది .ఆయన25-11-1968 న 90 ఏళ్ళు నిండు జీవితాన్ని అనుభవించి ప్రజా రచయిత గా అందరి ప్రశంశలను పొంది  మరణించాడు .ఒక ఉన్నత భావాల వ్యక్తిగా, మంచి వాడుగా ,పెద్ద మనిషి గా,  ఆధ్యాత్మికతను ,రాజకీయాన్ని, సాంఘిక విషయాలను, శాకా హార అవసరాన్నితెలియ జెప్పిన వాడిగా  సామాజిక సమస్యల పై పోరా ట దృక్పధాన్ని కనపరచిన రచయిత గా సిన్క్లైర్ చిర స్మర ణీయుడు .ప్రజా హృదయ పీఠం పై మకుటం లేని మహా రాజు అప్ టాన్ సిన్క్లైర్ .
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –11-9-12-కాంప్–అమెరికా

Posted in మహానుభావులు | Tagged | Leave a comment

జన వేమన –24 యుగ వేది -వేమన

 జన వేమన –24
                                                    యుగ వేది -వేమన 

వంద బ్రహ్మ ప్రళయాలు ఒక విష్ణువు రోజు అని ,వంద విష్ణు ప్రళయాలు ఒక రుద్రా దినం అని చెప్పే యుగ పరిజ్ఞానం వేమన కు ఉంది .”మేకలు మూకలు సనినాను -బ్రాకటముగ నొక్క కోతి పారనం బెక్కన్ –ఆ కాపులు నూరు చని నను -కోకో యని కొంక నక్క కూయుర వేమా ”అని గుప్తం గా చెప్పాడు మేకను అజం అంటారు .అంటే బ్రహ్మ .కోతిని అరి అంటే విష్ణువు ,కొంక నక్క అంటే శివం అంటే శివుడు .ఈ అర్ధాలు తెలిస్తే యుగాలు ఎలా వస్తాయో తెలుస్తుంది .
 గణిత జ్ఞాని 
”ఒకటి క్రింద నొక్క తోనారు లబ్దము వెట్టి –అలనుగా గుణింప వరుస చెరుగు -నత్తి రీతి నుండు నౌదార్య ఫలములు ”ఔదార్యం ఉన్న వారికి జామేత్రీక్ ప్రోగ్రేషన్లో ఫలితాలున్తాయన్నాడు .
                     రైతు పక్ష పాతి 
దేశానికి వెన్నెముక రైతు అని అందరం భావిస్తాం .”అన్న దాత ”అని ఆప్యాయం గా అంటాం .రైతు రాజ్యం కావాలి ,రావాలి అని కోరుకుంటాం .అయితే రైతుల కష్టాలను మాత్రం తీర్చం .ఈ విషయా లన్ని వేమన్న కు బాగానే తెలుసు .వాళ్ళ కష్ట సుఖాలను తన కాళ్ళ టో చూసి సానుభూతి ప్రకటించాడు .”పైరు నిడిన వాని ఫలమే సఫల మగును -పైరు నిదాని వాడు ఫలము గనునె ?-పైరు పెట్టి భూమి ప్రజలను బోషించురా ”అని రైతు త్యాగాన్ని ప్రస్తుతించాడు .
                         దాతృత్వం 

సాదా రణం గా దానం ఇచ్చే వాడికి అడిగే వాడు లోకువే .కాని మహాత్ములు దానాన్ని స్వత స్సిద్ధ గుణం గా భావిస్తారు .బలి చక్ర వర్తి వామనుడికి భూదానం ఇస్తుంటే అడ్డు పడిన గురువు శుక్రా చార్యునితో ”మీదై నా కరం బుంటమేల్ గాదే ”అని దాన గర్వం చూపాడని మనకు తెలిసిన విషయమే .అరుదుగా అడిగితే ”ఆర్ది ”కాదుట .తరచుగా ఇవ్వక పోతే ”దాత ”కాదట .ఈ విషయాన్ని పద్యం లో చెప్పి ”దాత కర్ది కంత తార తమ్యము సుమీ ”అని తేల్చాడు .”అడుగకర్ధమిచ్చు నతడు బ్రహ్మ జ్ఞాని -అడుగక నర్ద మిచ్చు నతడు త్యాగి -అడుగ నియ్య లేని యాతడే పెనులోభి ”అని తార తమ్యా లను వివరించాడు .అడగటం లో నీతి ఉందని చెబుతూ ”అడుగ దగు వారి నడుగుట -నిడిన యడల గోసర కుంట ,నీలేననగా –గడు ,పై వేడకయుండుట -యడిగేడు వారలకు నీతి యగురా వేమా ”అని కాండం లో అందం గా అడుక్కొనే నీతి సూత్రం చెప్పాడు .ఇది గొప్ప సూక్తి ముక్తా వళే .
                   వైద్య వేది
చిన్న రోగాలకు ,వ్యాధులకు చిట్కా వైద్యం చెప్పాడు వేమన .ఆచరణ సాధ్య మైనవే అవి .డబ్బు ఖర్చు కానివే .”కుక్క కరిస్తే అరవ కుండా దాని నోరు కట్టేసి ,ప్రక్కలు విరిగేట్లు దాన్ని కొట్టి ,”మాన్చుకో వచ్చు .”వేము చెక్క దీన్న విష రోగములు వాయు -దేహ కాంతి గలుగు ద్రుధము గలుగు –తినగా తినగా నదియే తీయగా నుండును ”అని ”వాము మహాత్యం ”చెప్పాడు .తినగా తినగా వాము తియ్యగానే ఉంటుంది .వినగా వినగా వేమన పద్యాలూ తియ్యగానే ఉంటాయి వ్యాధి వస్తే వైద్యం చేయించు కోవాలి .మందు వేసుకోవాలి .కాని దీని కంటే ముఖ్యం ”మందు వంటి మనసు మనుజుండు గావలె ”అని హితవు చెప్పాడు .మందు తాగితే ఎలా రోగం పోతుందో ,అంతటి ప్రభావం మనసుకూ ఉంది .మనసు మంచిగా ఉంచుకొంటే రోగాలు దగ్గరకు చేరవని సారాంశం .మనసును జాగ్రత్త గా వాడుకోవాలి .”కాంత సింధు రంబు  కాదు పిత్తవ్యాధికి –నొసగు తేనె తోడ నోసర నిడిన –దనరు దేహ బలిమి ధన్యుడై యుండురా ”అన్న పద్యం వల్ల వస్తుగుణ దీపిక తెలిసిన వాడి గా వేమన్న ను మనం భావించ వచ్చు .పిండోత్పత్తి రహస్యం క్షుణ్ణం గా తెలిసిన వాడాయన .ఆతత్మ ను దర్శించిన యోగికి తెలియనిదేమి ఉంటుంది ?
       వింతలు విశేషాలతో వేమన 
పొరపాటుగా నైనా ఒక సారి వేమన ”ప్లాటో తత్వ వేత్త ”సరసన చేరాడు .ఎలా గంటె -సర్ విలియం జోన్స్ అనే రచయిత వేమన ను ”భారత దేశపు ప్లాటో ”గా చెప్పాడని మాక్దోనాల్ద్ రాశాడు. తీరా ఆరా తీస్తే ఆయన చెప్పింది వేద వ్యాసభగవానుని గురించిఅని ,వేమన గురించి కాదు అనితెలిసింది . ”ప్రజల్లో పట్టం లేని ప్రభువు వేమన ”అన్నారు . ”వేమన యోగీంద్ర చరితం వ్రాసిన మచిలీ పట్నానికి చెందినాపూర్నయా చార్యులు దేశం అంతా తిరిగి వేమన కవితల తాళ పత్ర గ్రంధాలు సంపాదించారు .1913లో ”వేమన పద్య సంకలనం ”ప్రచురించారాయన .ఆయన దృష్టిలో వేమన ”ఒక పురుష వృషభుడు ”.సర్ఘు పతి వెంకట రత్నం నాయుడు గారికి వేమన అంటే విప రీత మైన అభిమానం. ”చావటానికి వ టానికి పుట్ట లేదు మానవుడు ” ”అన్న ఆంగ్ల కవి ”కీట్స్ ”వాక్యమూ ”అతడు మానవుడు ,,అన్ని విధాలా మానవుని గా నే స్వీకరించండి .అతని వంటి వాడిని నేను మరల దర్శించ బోను ”అన్న మహా కవి షేక్స్ పియర్ మాటలూ ,”తళుక్కున తట్టిన తలపును చటుక్కున చెప్పాడు కవి ”అన్న ఎమర్సన్ దార్శకుని మాటలను ‘సహజ హాస్య చతురుడైన గ్రామీణుడు .ప్రకృతి దార్శనికు లలో ఒకడు ”అని భావించిన హురేస్ అభి ప్రాయమూ వేమన గారికి చక్క గా వర్తిస్తాయని విశ్లేషణాత్మకం గా నార్ల వెంకటేశ్వర రావు గారు వివరించారు .
”ఈత కన్నా లోతు నేన్చంగా బని లేదు –చావు కన్న గీడు జగతి లేదు –గోచి పాత కంటే గొంచేమ్బిన్కను లేదు ”అన్న పద్యానికి వి’ఎల్;’యెన్ మూర్తి అద్భుతం గా ఆంగ్లాను వాదం చేశారట .
సశేషం –మీ గబ్బిట దుర్గా ప్రసాద్ –11-9-12-కాంప్–అమెరికా

Posted in మహానుభావులు | Tagged | Leave a comment

అమెరికా డైరీ –శ్రీ సత్యనారాయణ స్వామి వ్రత వారం -2

This slideshow requires JavaScript.

అమెరికా డైరీ –శ్రీ సత్యనారాయణ స్వామి వ్రత వారం

Posted in అమెరికా లో | Tagged | Leave a comment

స్వీయానుభవ నవలా కారుడు- పాట్ కాన్ రాయ్

 స్వీయానుభవ నవలా కారుడు- పాట్  కాన్ రాయ్ 
నాలుగు అద్భుత మైన నవలల తో ప్రసిద్ధి చెంది ,జీవితం లో తాను అనుభవించిన వేదనలు అవహేళనలు మొదలైన వాటి నన్నిటికి నవలా ప్రక్రియ లో అపూర్వ సృష్టి చేసి మిలిటరి పదవిలో ఉండి అదే వారసత్వం గా పొంది ,ఆ క్రమ శిక్షణ పైనా విరుచుకు పడ్డ నవలా రచయిత పాట్ కాన్ రాయ్ .పూర్తీ పేరు డోనాల్డ్ పాట్రిక్ కాన్ రాయ్ జననం 1945..తండ్రి మిలిటరి ఉద్యోగస్తుడు .ఎప్పుడూ స్తలం మార్పులే .తలి దండ్రుల మధ్య లోపించిన అవగాహన ,అతి సంతానం ,తన దేహ వైక్లాబ్యం అన్నీ కాన్రాయ్ ని మిగిలిన వారితో కలవ కుండా చేశాయి .ఇంట్లో ఎప్పుడూ ఏదో ఒక టెన్షన్ .
ఆయన తల్లి తండ్రిని వదిలి ముప్ఫై   ఏళ్ళు పైగా విడిగా ఉండి ఒంటరి తనం తో వేదన చెందాడు . .తండ్రి క్రూరత్వాన్ని తల్లి భరించ లేక పోయేది .ఈ సంఘర్షణ ఆయన పై పెద్ద ప్రభావాన్నే కల్గించింది .పన్నెండేల్లలో పద కొండు స్కూళ్ళలో  లో చదవాల్సిన పరిస్తితి .ఎప్పుడే క్కడ ఉంటాడో ఎవరితో స్నేహం చేయాలో తెలీని వింత పరిస్తితి .ఎప్పుడూ కొత్త వారితో ఉండాల్సిన రావటం అతను జీర్ణించుకో లేక పోయాడు .ఆ కుటుంబం లో హీరోఇజం ఒక సమస్య .తండ్రి గొప్ప మిలిటరి ఉద్యోగి. కొడుక్కు కూడా ఆ హోదా రావాలని తండ్రికోరిక .ఇతని భావాలేమితో ఆయనకు అక్కర్లేదు తన భావాలు ,అభి రుచులు కొడుకు పై రుద్దు తున్నాడని ఈతనికి లోపల అసహ్యం .కాని ఎదురు చెప్పలేని తనం .గుండె గొంతుకలో కొట్లాడటమే .అమెరికా సైన్యం లో చేరి రెండు సార్లు వియత్నాం యుద్ధం లో పాల్గొన్నాడు .దీన్ని తన నవల” the great satini ”లో చిత్రించాడు .అందులో ప్రేమ అసహ్యం లను నింపాడు .రాయ్ చాలా మొండి గా ఉండే వాడు .బిరుసు స్వభావం .తన మనసు లోనిది ఎప్పుడూ బయటకు చెప్పేసే వాడు .తల్లి బయటి ప్రవృత్తికి అంతర ప్రవృత్తికి భేదం ఉందని ముప్ఫై ఎల్ల తరువాత గ్రహించ గలిగానని ఒప్పుకొన్నాడు .ఇంట్లో అంతా తండ్రి ఇష్టప్రకారమే జరుగుతున్నట్లు అని పించినా అసలు ఇంటిని తీర్చి దిద్దింది తల్లే నన్నాడు .తండ్రి కోప్పడినా తిట్టినా ఆమె ఎంతో సహనం చూపెది .ఒక సారి తండ్రి రాయ్ ని బాగా కొట్టి గాయ పరిస్తే తల్లే ఆస్పత్రికి తీసుకొని వెళ్లి డాక్టర్ తో కింద పడితే దెబ్బ తగి లిందని చెప్పమని అతనితో చెప్పిందట .ఆమె సౌత్ కెరొలినా నుంచి వచ్చిన మహిళా .ఆమె పేరు పెగ్ కాన్  రాయ్. తండ్రి పేరు ఫ్రాన్సిస్ కాన్ రాయ్ .
1963  లో దక్షిణ కెరొలినా సిటడేల్ మిలిటరి కాలేజి లో చేరాడు .అక్కడ చాలా వికృత చేష్టలకు గురైనాడు .తండ్రి చదువు మానేసి రమ్మంటే వచ్చాడు ,మళ్ళీ వెళ్లి కోర్సు పూర్తీ చేశాడు .మిలిటరి కెరీర్ ఇష్టం లేక పోయినా తప్పలేదు .అతనికి మియోపియా  కలర్ బ్లిండ్ నేస కూడా ఉండేవి .అందుకని పైలట్ కాలేక పోయాడు .నల్ల వారిని ”నిగ్గర్లు ”అని మొదట ఈస డిం చిన తర్వాత వారితో మంచి స్నేహమే చేశాడు అతనికి టీచింగ్ అంటే మహా ఇష్టం .1970లో మొదటి పుస్తకం ”the boo ”నవల రాసి ప్రచురించాడు .ఇది ఒకరకం గా ఆతని జీవితమే .అతనిలోని అమాయకత్వం హాస్యం ను బాగా పండించాడు .తర్వాతా”the water is wide ” నవల పబ్లిష్ చేశాడు .స్వంత ఖర్చు తోనే ప్రచురించాడు రెండు నవలలను .1976లో ”the great santini ”నవల రాసి విడుదల చేశాడు .ఇదీ ఆత్మా కధే .తన కుటుంబం వారి నరాల బలహీనతను బయట పెట్టుకొన్నాడు ఈ నవల లో .దీన్ని అందరు గొప్ప నవల గా భావించారు .పెళ్లి అవటం విడాకులు ఇవ్వటం జరిగింది దీన్ని అట్లాంటా మేగజైన్ లో తెలిపాడు .తండ్రి ఒక సారి మూడు రోజులు కనిపించక పోతే ఆత్మా హత్య చేసుకోన్నాడేమో నని భయ పడ్డాడు శాటిని నవల అతని భావ అసహనానికి ప్రతీక .మళ్ళీ పెళ్లి చేసుకొన్నా విడాకులులు తప్ప లేడు .
”the lords of discipline ”నవల బాగా డబ్బు ను చేకూర్చింది .పెరూ బానే వచ్చింది .సినిమా గా కూడా వచ్చింది .తర్వాతా రాసిన ”the prince of the tides ”విమర్శకులు మెచ్చిన నవల .బెస్ట్ సెల్లర్ అయింది .గొప్ప సినిమా గా తీశారు .ఈ నవల తో గొప్ప పేరు ప్రఖ్యాతులు వచ్చాయి కాన్ రాయ్ కి .దక్షిణ రాష్ట్ర భావాలు చిత్రేకరణ తో మంచి ఊపు నిచ్చింది .దీన్ని పాఠ్య పుస్తకం గా కూడా చేశారు .భాష విషయం లో కొంత ఇబ్బంది ఉందని పించినా విషయ ప్రాధాన్యత కలది రచనా విధానం మీద రాయాలని ఆలోచించాడు .అన్నీ వున్నా అతని విధానం బాధ కలిగించేది .1990 లో వచ్చిన ”బీచ్ మ్యూజిక్ ”నవల కొంత ఆలస్యం అయినా మంచి గుర్తింపు పొందింది .1993లో వెన్నెముక కు ఆపరేషన్ జరిగింది .ఆబాధ తట్టు కోవటానికి తాగుడు బాగా అలవాటయింది .ఆత్మా హత్యా ప్రయత్నమూ చేశాడు .అయితే సరైన సమయం లో మంచి కొంసేలింగ్ లభించటం వల్లా అన్నిటికి దూరమై రచన కోన సాగించాడు దీనికి కారణ మైన ”డాక్టర్ మారియాన్ నీల్ ”అభి నంద నీయుడు .సోదరుడు మానసిక వ్యాధికి గురై ఆత్మా హత్యా ప్రయత్నం చేసు కొన్నాడు .తల్ల డిల్లి పోయాడు రాయ్ .బీచ్ మ్యూజిక్ లో దీన్ని వర్ణించాడు ,.ఈ నవల విజయ వంతం అవటం తో పబ్లిసిటి కోసం 34 సిటీలు పర్యటించి పుస్తకాలపై సంతకాలు చేసే కార్య క్రమం ఛే బట్టాడు .సినిమా గా తీసే ప్రయత్నం లో సహక రించాడు .తాను రాసే అన్ని పుస్తకాలకు ప్రేరణ ”thomas wolfe ”అనే ప్రఖ్యాత నవలా రచయిత రాసిన” home land angel ”నవల  అని చెప్పాడు రాయ్ .సాన్  ఫ్రాన్సిస్కో లో ఫ్రిప్ప్ ఐలాండ్ లో హాయిగా కాలక్షేపం  చేస్తున్నాడు .
కాన్  రాయ్ నవలలు వ్యంగ్యాత్మక రచనలు అని అంటారు లార్డ్స్ ఆఫ్ డిసిప్లిన్ నవల లో కెరొలినా మిలిటరి కాలేజి గురించి వివరించాడు .అతని రచన లలో దక్షిణ రాష్ట్రాల కుటుంబ జీవనం సాహిత్య దృక్పధం ఉంటాయి .తన అంగ వికారత్వాన్ని అధీ గా మించి ,తండ్రి చంద్ర శాసనత్వాన్ని సహించి కాలేజిలో మిత్రుల అవహేలనాను భరించి పెళ్ళిళ్ళు పేటాకులు అయినా తల్లిని ఆలస్యం గా అర్ధం చేసుకొన్నా ,తన కుటుంబ గాధలను తన భావ తీవ్రతలను ,మానసిక దౌర్బల్యాలను ,సామాజిక చైతన్యాన్ని తన స్వంత  అనుభవం తో రంగరించి ,స్వీయ చరిత్ర గా జీవిత చరిత్ర గా నవలలను రాసి హిట్లను సాధించాడు పాట్ కాన్ రాయ్

Posted in మహానుభావులు | Tagged | Leave a comment