తిక్కన భారతం –18 యుద్ధ పంచకం లో వికశించిన మానవ ప్రకృతి –6

 తిక్కన భారతం –18
                                      యుద్ధ పంచకం లో వికశించిన మానవ ప్రకృతి –6
పద్మ వ్యూహం లో అభి మన్యుడు మరనిన్చటాన్ని ధర్మ రాజు దిగ మింగు కో లేక పోయాడు .తన వల్లే ఇదంతా జరి గిందని తీవ్రం గా విల పిస్తాడు .ఇన్ని  కష్టాలు, కురుక్షేత్ర యుద్ధం అన్నీ తన తప్పిదం వల్లనే వచ్చాయని బాధ పడ తాడు .ఈ సందర్భం లో అతని మనో వేదన ను వ్యక్తే కరించ టానికి చెప్పిన తిక్కన పద్యాలు ఆణి ముత్యాలు .”కొడుకు బోడగానకర్జునుడడిగే నేని ,–వానితో నింక నేమను వాడ ?హరికి –నతని గారాబు చెలియలి కధిక దుఃఖ –మే న చేసితి వగ వంగ నేమి గలదు ?–వాని తోడి లోకమి ఏను బోవ -నైతి బో గన్న పుత్రా శోకాతురత్వ –మున ,నిటిన్త వివరణత బొంద కుండ ,–జూడ కుండేడి వాడ నర్జునుని మొగంబు ”అని తండ్రి కొడుకు చని పోయి నప్పుడు పొందే వ్యధనంతా పొందాడు .అంతా తన అసమర్ధత అని చెప్పు కొన్నాడు .అర్జునుడు వచ్చి అడిగితే యేమని సమాధానం చెప్పాలి /అతనికి తన మొహాన్ని ఎలా చూపించగలను ?అని కుమిలి పోతున్నాడు .
అభి మన్యుని మరణం విన్న అర్జునుడు స్కందావారానికి వచ్చి ,అన్నలను తమ్ముళ్ళను చేత కాని వారిగా నినదించాడు .పుత్రా శోక వివశాత్వం తో చాలా కఠినం గా మాట్లాడాడు .అభి మన్యుని తల్లి సుభద్ర వ్యంగ్యం గా ,తీక్షణం గా ,భీమాదుల హృదయాలను కోసే మాట లంతుంది .స్త్రీ స్వభావం గా ,పుత్రా శోకాన్ని వెల్లడిస్తుంది .–”అనిలజు నుక్కు ,లావు ,గల డందురు ,సాత్యకి శౌర్య శాలి నా –జానూ ద్రుపదుండు ,సంగర విశారద భావము పూని యుండు ,మా –త్చ్యుని బటు విక్రమాధ్యుదని చూతురు ,పాండవు లిండ రుండి , యొ –క్కని కి ,గడంగ లేర ,నిను గావగ బుత్రకా !”అని అందర్ని కడిగి పారేశింది .అంకుశాలతో పొడిచి నట్లయింది వాళ్లకు .శ్రీ కృష్ణుడు సోదరిని ఓదారుస్తూ ”తగు మాట లాది కోడలు ఉత్తర శోకం తీర్చు -నీవు ధైర్య వతివి ,నిన్ను చూసి మేమూ ధైర్యం పొందాలి ”అన్నాడు లోక సహజం గా .నీ శోకం సరే -నీ కోడల్ని ఎవరు ఒదారుస్తారు నువ్వు తప్ప అని .గర్భ శోకానికి ఊరట ఉంటుందా /అందుకు సుభద్ర అన్ననే మెత్తని మనసు గల తన కోడలి దుఖాన్ని తీపి ,తళుకు లోల్కే మాటల తో ఒదార్చమని కోరింది .అలాగే సౌప్తిక పర్వం లో ద్రౌపది పుత్రా శోకం హృదయాల గూడులను పట్టి లాగేస్తుంది ఉప పాండవుల హత్య విని .ఈ విధం గా మాతా ,పితృ హృదయ ప్రకృతు లను అత్యంత సమర్ధ వంతం గా తిక్కన పోషించాడు .ఘోర యుద్ధం లో కూడా ,ఇలాంటి మానవ హృదయ వ్యాపారాలైన దయ ,వాత్సల్యం ,బంధు భావం చక్కగా ప్రదర్శిమ్పప జేశాడు .
సైంధవ వధ కు అర్జునుడు ఏకాకి గానే వెళ్లాడు .అతని క్షేమం విషయం పై ధర్మ రాజు తీవ్ర వ్యాకులత చెందాడు .సాత్యకిని వెళ్లి సాయం చేయమని చెబుతూ –”హరి గురుడు నీకు గ్రీడియు ,–గురు డిరువుర ఎడరు దీర్ప గోరి ,గురులకుం గురుడ నగు నేన, చేసేద –పరమ ప్రార్ధనము దీని బాటింపు దగన్ ”  –ఈ విధం గా తన చింత పోగొట్టటం ,గురుడు సఖుడు  బంధువు అయినఅర్జును నికీ ,అన్న శ్రీ కృష్ణుడికి తోడ్పడటం తన పరాక్రమ ప్రదర్శన చూపటం ఎంత అవసరమో ధర్మ రాజు చాలా మంచి పదాల తో సాత్యకి కి చెప్పాడు .సరే నని బయల్దేరి వెళ్లాడు సాత్యకి .అతని పై వీరాధి వీరులంతా పది విజ్రుమ్భించారు .మళ్ళీ బాధ పడ్డాడు పాండ వాగ్రజుడు -”తమ్ముని దలంచి కృష్ణుని –తమ్ము బనిచె నాతని బదంబడి తన ,చి –త్తమ్మున ,దలపడ ధర్మ రాజు –డమ్మెయి వాడోక్కో నారే ఈ యున్న జనులున్ ” మొదటి పదాలను చాలా సార్ద కం గా ప్రయోగించాడు .తన తమ్ములు ఉండగా కృష్ణుడి తమ్ముడిని పంపటం లో తను ఎంత గడుసు వాని గా సైన్యం లోని వారు అనుకొంటారో నని బాధ పడ్డాడు .ఆ ఊహే ఆయన విచారానికి కారణం .యుద్ధం లో సంర్దుల్ని పంపటం సహజం .కాని ఇక్కడ బంధుత్వ విచారణ చేశాడు .ధర్మ రాజు .లోకాప వాడ ముద్ర పడ రాదనీ భావించాడు .ఇది ఉత్తముల లక్షణం .చివరికి తన మనసు ను సమాధాన పరచు కొని భీముడిని సహాయం పంపాడు .–”భీము జేర నరిగి భీభాత్సు నీ తమ్ము –నని ,యెలుంగు ,గళము నందు దగుల —-నశ్రులోలుక మాట సెప్ప లేడత –డార్తి సూచీ ఇట్టు లనియ నతడు” భీభాత్సుడు అనటం తో అర్జునుని పరాక్రమాన్ని గుర్తు చేయటం నీ తమ్ముడు అంతం తో భ్రాత్రు వాత్సల్యాన్ని కర్తవ్య పరాయనత్వాన్ని తెలియ జేయటం ,అతడిని రక్షించు కోవాల్సిన అవసరాన్ని గుర్తు చేయటం అన్నీ ఇందులో కనీ పిస్తాయి .అంతే కాదు అర్జునుడిని ఎంత అభిమానం గా తామందరం చూసు కొంతున్నామో అతనికి ఏదైనా జరిగితే ఎలా తట్టు కోలేక పోతారో వివ రించే ఇంకో పద్యం –”నీ తమ్ము గుర్ర ,రూపసి ,–నీతి విడుదు ,సకల గుణ నిది ,మద్భక్తుం –డాతనికే డరగు నో యను –చేతో గతి పల్ల టిల్ల జేయదే తాల్మిన్ ”–అర్జునుని గుణాలను ఏకరువు పెడుతూ ,ఒగుడుతూ ,భీముని ప్రోత్స హించటం చాలా ఉచితం గా ఉంది .అతదింకా ధర్మ రాజుకు ”కుర్రడే”.అంతే కాదు తానంటే భక్తీ శ్రద్ధలున్నవాడు .భీముడు తొమ్మిది రోజుల యుద్ధం చేసి శత్రు సైన్యాన్ని చీల్చి చెండాడి పీనుగుల రాసి చేసి పారేశాడు .అతని పరాక్రమాన్ని తెలిసి పొంగి పోతు కృష్ణుడికి వివ రించి చెబుతాడు .సంతుష్టుదౌతాడు –”కార్చిచ్చు గవిసి మరుగ తతి -నేర్చు కరణి నేడు భీష్ము డేచిన కడిమిం –బేర్చి ,మన సేన బొదివె శ –రార్చుల నీ వీరు గన్ను లార.గంటె -తాను జూదమాడి ,తమ్ముళ్ళను  చాలా కష్ట పెట్టాడు .దానికి మనసు లో బాధ పడుతూనే ఉన్నాడు .తన మీద అంత అనురాగం గౌరవం ఉన్న తమ్ముళ్ళు బాధ పడటం సహించ లేక వాళ్ళను రక్షించకొని కన్నారా చూస్తూ సంతోషించాలి కాని భీష్మునికి బలి ఇవ్వ లేను అని తన అంత రంగాన్ని ఆవిష్కరిస్తాడు . ”
సశేషం –మీ గబ్బిట దుర్గా ప్రసాద్ -27-7-12–కాంప్–అమెరికా .
http://suvarchalaanjaneyaswami.wordpress.com

Posted in రచనలు | Tagged | Leave a comment

శాస్త్ర సామాజిక రాజకీయ వేత్త- బెంజమిన్ ఫ్రాన్క్లిన్

శాస్త్ర సామాజిక రాజకీయ వేత్త- బెంజమిన్ ఫ్రాన్క్లిన్ 
                                                                      శాస్త్ర వేత్త 
కొద్దో గొప్పో సైన్స్ చదువు కొన్న వారికి విద్యుచ్చక్తి కని పెట్టింది బెంజమిన్ ఫ్రాంక్లిన్ అని తెలుసు .ఆ పై సైన్స్ చదివిన వారికి లైటేనింగ్ కండక్టర్ ను కని పెట్టి నదీ ఆయనే అని తెలిసి ఉంటుంది .ఆయన శాస్త్ర వేత్త .ఒక ఇన్వెంటర్ .బైఫోకల్స్ ను ,ఉప్పునీటి నుండి ఉప్పు ను వేరు చేయటాన్ని ,స్టవ్ ను ,కాపీయింగ్ మెషీన్ ,మడిచి పడుకునే వీలున్న చైర్ ను ,ఇంటి దర్వాజా వద్ద ఎవరు వస్తున్నారో తెలియ జేసే అద్దాన్ని ఆయనే కానీ పెట్టాడని చాలా మందికి తెలీదు .ఆయన తన కాలం కంటే ముందున్న వాడు .ఆలోచనలు అంత దూరం గా ఆలోచించే వాడు .టేస్ట్ ట్యూబ్ అంచులను కాని ,పలుచని గాజు గ్లాస్ ను కాని శిలకు తోనో ,ఫ్లానేల్ తో నో రుద్దితే విద్యుత్ పుడుతుందని మొదట కానీ పెట్టింది ఆయనే .దాన్నినే శతావర విద్యుత్తు -స్టాటిక్ కరెంట్ అన్నారు

పుట్టిన ఇల్లు

.ఎత్తైన భవనాలను పిడుగుల నుండి కాపాడటానికి మొన దేలిన ఇనుప రాడ్లను అమరిస్తే మెరుపు లోని విద్యుత్తు దాని ద్వారా భూమి లోకి ప్రవేశించి ప్రమాదాన్ని తప్పిస్తుందని సూచింది ఫ్రాన్క్లినే .దాన్ని పేటెంట్ చేయ కుండా వదిలేసినఉదారుడు .గాజు ను సిల్క్ తో రుద్దితే కరెంట్ వస్తుందని చెబితే ఇంగ్లాండ్ దేశం లో ఎవరు నమ్మక ఒక పిచ్చాది కింద జమ కట్టారు .అమెరికా వాడు ఇంత పని చేయగలడా అని ఏమీ చదువుకొని వాడా దీన్ని కనీ పెట్టేది అనిఅవన్ని ”ఫీల దేల్ఫియా ప్రయోగాలు ”అని తేలిగ్గా తీసుకొన్నారు . నిరసించారు .తరువాత చెంప లేసుకొని ఆ యన ప్రతిభ ను గుర్తించారు .మెరుపు లో విద్యుత్తు ఉందని ప్రయోగ పూర్వకం గా రుజువు చేశాడు .హార్వర్డ్ ,ఎల్ వర్సిటీలు ఆనరారి దిగ్రీలిచ్చాయి .చివరికి లండన్ లోని రాయల్ సొసైటీ 1753లో  బంగారు పతకాన్నిచ్చి గౌర వించింది .1756లో రాయల్ సొసైటీ మెంబర్ ను చేసింది .ఆయన వాతావరణం లోని గాలి కదలికల వల్ల  తుఫాన్లు ఎలా వస్తాయో చెప్పాడు .కొండలు ఏర్పడే విధానం ,సముద్రం లోని ఫాస్జిల్స్ ఏర్పడే వైనం గురించి పరిశోధించాడు .సముద్రపు గుల్లల మీద ఆలోచన చేశాడు .మందుల గురించి క్షున్నం గా తెలుసు కొన్నాడు .శరీరం లోని ద్రవాన్ని బయటకు తీసి పరీక్షించే ట్యూబ్ తయారు చేశాడు .చర్మం లోని సూక్ష్మ రంధ్రాలు చేసే పని ,రక్తం ఎలా శరీరం లో ప్రవహించేది తెలియ జేశాడు .చీమలు తమ లో తాము మాట్లాడు కొంటాయని తెలియ జేశాడు .పావురాలను పెంచే విధానం సూచించాడు .వ్యవసాయాన్ని గార్డె నింగ్ ను స్కూల్ సబ్జెక్టు లలో బోధించాలని సూచించాడు .ఆయన ప్రింటింగ్ ప్రెస్ నడిపాడు .అందులో ఎన్నో ప్రయోగాలు చేశాడు కాలెండర్ తయారు చేసిpoor richard’s almanaak అని పేరు పెట్టాడు .  .ఇవన్నీ ఆయన లోని శాస్త్ర వేత్త ను ఆవిష్కరించే విషయాలే .విద్యుత్తు కు సంబంధించిన ఎన్నో పదాలను ఫ్రాన్క్లినే సృష్టించాడు వాటినే ఇప్పటికి మనం వాడుతున్నాం .  battery ,armature ,charge ,condense ,conductor ,discharge ,shock ,leyden botttle ,negative charge ,positive charge మొదలైన వన్నీఆయన మొదట గా వాడినవే .ఇలా సైన్సు కు ఆయన ఎంతో సేవ చేశాడు .ప్రీస్త్లీ మొదలైన శాస్త్ర వేత్త లతో ప్రత్యక్ష పరిచయం ఉంది .లండన్ లో ఐజాక్ న్యూటన్ ను కలుద్దా మను కొన్నాడు కాని కలవ లేక పోయాడు .
                                                  సామాజిక వేత్త 
ఫ్రాంక్లిన్ మాసా చూసట్స్ లో పుట్టినా జీవితం లో ఎక్కువ భాగం ఫిలడెల్ఫియా లో గడిపాడు .ఆయన ను ఉత్తర అమెరికా డిప్యూటీ పోస్ట్ మాస్టర్ జెనెరల్ గా నియమించారు .ఆ సమయం లో వర్జీనియా నుండి న్యూ ఇంగ్లాండ్ వరకు ఉన్న అన్ని పోస్టాఫీసులను సందర్శించి వాటి పని తీరును వృద్ధి చేశాడు .ఆయన కాలం లోనే మొట్ట మొదటి సారిగా రాత్రి ,పగలు ఉత్తరాల రవాణా ఫిలడెల్ఫియా న్యూయార్క్ బోస్టన్ లకు జరిగింది .లేజిస్లాచ్ర్ లో గుమాస్తా గా పని చేశాడు ..ఫిలడెల్ఫియా నగరాన్ని పరి శుభ్రం గా ఉంచాడు .కాపలాదారును నియమించ టానికి ఫండ్స్ లేక పోతే తేలిక పాటి పన్నులు వధించి ,ఆ డబ్బు తో వాచ్ మాన్ ను ఏర్పరచాడు .అగ్ని ప్రమాదాలనుండి రక్షించ టానికి ఫైర్ ఫైటర్స్ ను తయారు చేశాడు fire engenes  vaatiki  కావలసిన పరికరాలను కొని పించాడు .జార్జి విత్ఫీల్ద్ అనే మత ప్రచారకుని సాయం తో ”అనాదాశ్రమం  ”ఏర్పరచాడు .వయోజన విద్యా కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని భావించాడు .లాటరి విధానం ప్రవేశ పెట్టి, జూదాన్ని తగ్గించే ఆలోచన చేశాడు . పౌర సైన్యాన్ని  తయారు చేసి సమాజాన్ని రక్షించుకొనే శిక్షణ ఇచ్చాడు .గదులకు వెచ్చదనాన్ని కల్గించే హీటింగ్ స్టవ్ తయారు చేశాడు .ఆయన  -ఫసిఫిక్ అట్లాంటిక్ సముద్రాల మధ్య నార్త్ వెస్ట్ రహదారి నిర్మించాలని ,బానిసత్వాన్ని నిర్మూలించాలని ,జిల్లాను ఆధునీ కరించాలని తలచాడు .,అమెరికా లో మొదటి బాత్ టబ్ ఏర్పరచాడు . ,ఫైర్ డిపార్ట్మెంట్ ఏర్పడాలని ,వార్తా పత్రిక లలో కార్టూన్లకు ప్రాధాన్యం ఉండాలని కోరాడు .ఆయన బైబుల్ ను సాధారణ ఇంగ్లీష భాష లోకి తర్జుమా చేశాడు .పేపర్లకు సంపాదకీయాలు రాసే వాడు .ఆస్పత్రుల సంఖ్య పేర గాలాని  మెడికల్ స్కూల్ అవసరమని భావించాడు .ఇవన్నీ కాలం కంటే ముందున్న ఆలోచనలు .బిల్డింగ్ లోని సెకండ్ స్టోరికి టాయిలెట్ సౌకర్యం కల్గించాడు . మొదటి లైబ్రరి ని ఏర్పాటు చేశాడు .ఆయన మొదటి” విండ్ సర్ఫర్ ”. అమెరికన్ నావికా దళం ఎర్పరచటానికి కృషి చేశాడు .పారా ట్రూపర్ల గురించి ,సబ మేరీన్ల గురించి ,ఆలోచించి యుద్ధం లో వాటి సాయం చాలా ఉంటుందని తెలియ జేశాడు .ఇతర గ్రహాలలో జీవం ఉందని చెప్పాడు .సోప్ ఒపేరా రాశాడు .ఒక సారి ఆయన ఒక వైన్ గ్లాస్ లో పడి మునిగిన ఈగలు బతికి బయట పడటం చూశాడు .అప్పుడు తనను కూడాచని పోయిన తర్వాత ” వైన్ కాస్క్” లో భద్ర పరిస్తే శతాబ్దాల తరువాత బతుకు తానని సరదాగా అన్నాడు .
  రాజకీయ వేత్త ,
the pensilvena gazette అనే వార్తా పత్రికను నడిపాడు .పెన్సిల్వేనియా లెజిస్లేచర్ లో ముఖ్య సభ్యుదయాడు .అక్కడి నేటివ్ అమెరికన్ల తో ఒప్పందం కుదర్చు కోవటానికి నియమించ బడ్డాడు . సరిహద్దు రక్షణ కోసం ఆయన్ను నియమించారు .కోటలను కట్టే ఏర్పాటు బాధ్యత అప్ప గించారు .సైన్యాన్ని తయారు చేసే బాధ్యతా ఆయనదే .వారికి ట్రైనింగ్ ఇచ్చాడు .వాలంటీర్ ఆర్మి బాగా పని చేసింది అతని ఆధ్వర్యం లో . 1757  లో పెన్సిల్వేనియా ప్రతి నిది గా లండన్ వెళ్లాడు .అక్కడి రాజును కలిశాడు .కాలనీ లకు బ్రిటీష సభలో సభ్యత్వం ఉండాలని వివ రించాడు స్టాంప్ ఆక్టు వ్యతి రేకించాడు .అయినా అది పాస్ అయింది ,మళ్ళీ తీవ్రం గా వ్యతి రేకిన్చిచేప్పి దాన్ని రద్దు చేయించాడు .బ్రిటీష ప్రభుత్వాన్ని ఎదిరిస్తే  ప్ఫిల దేల్ఫియా లోని ఇల్లు తగల బెడ తామని బెదిరించారు .లొంగ లేదు .అప్పటికే డెబ్భై ఏళ్ళు వచ్చాయి .అమెరికా స్వాతంత్ర పోరాటం తీవ్రం గా ఉంది .రెండవ కాంటి నేన్తల్ కాంగ్రెస్ కు ప్రతి నిది అయాడు .అప్పటికే ఆయన కొడుకు విలియమ్స్ న్యు జేర్సికి బ్రిటీష గవర్నర్ గా ఉన్నాడు .బ్రిటీష ప్రభుత్వం ఫ్రాంక్లిన్ ను పోస్టల్ ఉద్యోగం లో నుంచి పీకేసింది .కాని కాంగ్రెస్ మళ్ళీ నియమించింది .పెన్సిల్వేనియా ను రక్షించే రక్షణ కమిటీ చైర్మన్ అయాడు .యుద్ధ పరికరాలు తయారు చేయటం మందు గుండు సామాను తయారు చేసే బాధ్యత తీసుకొని సమర్ధం గా చేశాడు ..article of confederation and perpetual union  రాసి కాలనీ లన్నిటికి పంపాడు .కాంగ్రేస్  ఇతన్ని మీసా చూసేత్స్ కు జార్జి వాషింగ్ టన్ తో మాట్లాడ టానికి పంపింది . .కాంటి నేన్తల్ ఆర్మితయారు చేయాలనే ఆలోచన లో పాలు పంచుకొన్నాడు .కెనడా ను కూడా  ఒప్పించటానికి ఫ్రాంక్లిన్ ను పంపారు .కాని వాళ్ళు అంగీకరించ లేదు .   1776 july 4   న అమెరికన్ కాలనీలన్నీ స్వాతంత్రాన్ని ప్రకటించి డిక్ల రేషన్ తయారు చేసి విడుదల చేసింది .దానిలో కూడా ప్రముఖ పాత్ర వహించాడు .
అమెరికా స్వాతంత్రానికి మద్దతు ఇవ్వమై ఫ్రాన్స్ ను కోరే పని మీద ప్రాభుత్వం ఫ్రాంక్లిన్ ను పారిస్ పంపింది .వారిని ఒప్పించాడు .ఇక్కడ అమెరికా బ్రిటన్ సైన్యం తో యుద్ధం చేస్తోంది .యుద్ధానికి మద్దతు కూడా గట్టె ప్రయత్నం చేయాల్సి వచ్చింది .అక్కడ అమెరికా బ్రిటీష సైన్యాన్ని వాషింగ్ న్ నాయకత్వం లో చిత్తూ గా ఓడించింది .ఇది విని ఆశ్చర్య పోయాడు .శాంతి సాధన ప్రక్రియ దివిజం గా ముగించాడు .1785లో అమెరికా తిరిగి వచ్చాడు .ఫ్రాన్స్ రాజు 408 వజ్రాలు పొదిగిన తన ఫోటో ను కానుక గా ఇచ్చాడు .ఈయన రాజుకు బంగారు నశ్యం డబ్బా కానుక గా ఇచ్చాడు .1785లో పెన్సిల్వేనియా ప్రెసిడెంట్ గా ఎన్నికయాడు .చాలా అలసి పోయాడు రాజకీయం లో .ఇల్లు వదిలి దాదాపు పదేళ్లు బయటే ఉన్నాడు .రాగి తో చేయబడ్డ బూటు    ఆకారపు వేడి నీటి తొట్టె లో స్నానం చేసి ఆరోగ్యాన్ని పొందే వాడు .  american consti tutional convention రాశాడు కాని దాన్ని పూర్తీ గా ఆమోదించలేదు కాంగ్రెస్ .తన స్వీయ చరిత్ర ను రాసుకొన్నాడు .ఒక కాపీ ని జెఫర్సన్ కు ఇచ్చాడు .జార్జి వాషింగ్ ట న్ అమెరికా మొదటి అధ్యక్షుడయాడు .అవిశ్రాంతం గా దేశానికి సేవ చేసి ఫౌండర్ ఫాదర్స్ లో ఒక్కడు అని పించుకొన్న బెంజమిన్ ఫ్రాంక్లిన్ 1706 జనవరి పది హేడు న బోస్టన్ లో జన్మించి, 84ఏళ్ళు జీవించి 1790 ఏప్రిల్ పది హేడు న ఫిల డేల్ఫియా లో మరణించాడు  .
                                          ఫ్రాంక్లిన్ సుభాషితాలు 
there are no gains without pains -eat to live not live to eat –he that can not obey ,can not command ,–never leave that till tomorrow which you can do today .-early to bed and early to rise makes a man healthy  wealthy and wise –
                            ఫ్రాంక్లిన్ అవలంబించిన  విధానాలు 
temperence -silence -order -resolution -frugality -industry -sincerity -justice -moderation -cleanliness -tranquility -chastity -and -humility –ఇవే ఫ్రాంక్లిన్ విజయాలకు సోపానాలైనాయి .ఇవి అందరికి ఆదర్శాలే .
మీ–గబ్బిట దుర్గా ప్రసాద్ –26-7-12-కాంప్–అమెరికా

Posted in మహానుభావులు | Tagged | Leave a comment

తిక్కన భారతం –17 యుద్ధ పంచకం లో వికశించిన మానవ ప్రకృతి –5

 తిక్కన భారతం –17
యుద్ధ పంచకం లో వికశించిన మానవ ప్రకృతి –5
భీమ ,ఆశ్వతామ ల  యుద్ధ రీతి లోని భేదం చూశాం .ఇప్పుడు అర్జునుని యుద్ధం తీరు చూద్దాం .భీముడిని యుద్ధరంగం లో అనవసరం గా నినదించాడు కర్ణుడు .అప్పుడు కిరీటి ”ఎందుకు మా అన్నను ఊరికే తిడ తావు ?అతడు విజ్రుమ్భిస్తే సిగ్గు లేకుండా పారి పోతే ,నిన్ను ఎవరైనా ఏమన్నా అన్నారా ?తప్పున్న మాత్రం తో ఇంత గర్వమా ?సాత్యకి నిన్ను గెలవడా ?గెలుపు ,ఓటమి యుద్ధం లో మామూలే .అంత మాత్రం చేత ఇలా నోరు పారేసుకోవటం వివేకుల లక్షణం కాదు .దీని తో హీనం గా ప్రవర్తించి  నీ కులం ,గుణం అందరికి తెలియ బరచు కొన్నావు .”అని గడ్డి పెట్టాడు .”అభి మన్యుని చిత్ర వధ చేశావు .నీ కళ్ళ ఎదుట   నీ కొడుకు వృష సేనుడిని చంపు తాను చూడు ”అని సవాలు విసిరి మరీ చంపాడు .ఈ వదా  విధానం లో పాం డవ మధ్యముని ప్రశాంతత ,ఆత్మ విశ్వాసం ,స్థైర్యం ,నిగ్రహం మనకు గోచ రిస్తాయి .క్షత్రియోచిత మైన ఆత్మ    నిగ్రహాన్ని పాటించాడు .బ్రాహ్మణుడు అయినా ఆవేశం పూని ఉన్మాదం తో ప్రవర్తించాడు గురు పుత్రుడు అశ్వ తామ .”భ్రుకుటి స్పూర్జిత ఫాలభాగు డై,కర్ణ కుమారుని కోదండం ,బా హు దండం ,తలా ఒకే సారి బాణం తో ఎగర గొట్టాడు ఫల్గుణుడు .దుర్యోధనుడు కర్ణుడు చూస్తుండగానే ఇంత పనీ చేశాడు .అదీ పౌరుషం, మగటిమ . అశ్వతామ  చివరకు ”బ్రహ్మ శిరోనామ కాస్త్రం ”ప్రయోగించాడు .వ్యా సాది మహర్షులు వచ్చి ఉప సంహరించ మన్నా వినలేదు .పరీక్షిత్తు ను నొప్పించెంత వరకు వెళ్లాడు .అయినా భీమార్జున్లు అతన్ని ప్రాణాలతో వదిలి పెట్టారు .క్షమించి పంపించేశారు .తమ గుణాన్ని చాటుకున్నారు .
కర్ణుడు మొదలైన వారంతా అభి మన్యుని చేతి లో ఒడి పోయారు .మళ్ళీ మళ్ళీ వచ్చి సాహసం తో యుద్ధం చేశారు కాని అధర్మ యుద్ధం చెయ్య లేదు .ఆవేశం తో ద్రోణుడే అభి మాన్యుని చావుకు కారణమయ్యాడు .అందుకే ధర్మ రాజు ”ఆ ద్రోహికి నిన్న ,ఇవాళ తోడ్పడిన ద్రోణుని తెగటా ర్చాలి ”అన్నాడు .అయితే ద్రోనున్ని ద్రుష్టద్యుమ్నుడు చంప గానే అర్జునినికి కోపం వచ్చింది .ధర్మ రాజు ను నినదించాడు కూడా .అప్పుడాయన పాంచాలి పరాభవాన్ని గుర్తుకు తెచ్చాడు .అభి మన్యు వాదా విధానం చెప్పి ”ఇట్టి ధర్మ పరుడైన ,కలశ సంభావుతోడ సరి వచ్చు టుచితంబె ?”అని ప్రశ్నించాడు .ఈ విధం గా యుద్ధ రంగం లో భిన్న వ్యక్తుల విభిన్న మనో ప్రవృత్తిని ఆవిష్కరించాడు తిక్కన . యుద్ధ రంగం ఒక నాటక రంగమైంది .దీనికి అనుగున మైన సరళ భాష ను ప్రయోగించాడు .ఆత్రాల స్వభావం ,మానసిక భావావేశాలు ,భావ సాంద్రత అనీ అభి వ్యక్తం చేశాడు .సమయోచిత రాసా విష్కరణ చేసి నిండుదనం చేకూరుస్తాడు .
భీష్మ పితా మహున్ని చంప టానికి ధర్మ రాజాదులు విధి విధానాన్ని ఆలోచిస్తున్నారు .ధర్మ రాజు ”అకటా ,తండ్రి సచ్చి నంత నుండియు ,మము -నరసి ,ప్రాచి నత్తి యనుగు దాత ,–జమ్పమది దలంచు తెంపు సూ చితే ,రాజ ధర్మ మింత క్రూర కర్మ మగునే ?”అని వ్యాకుల పడ్డాడు తండ్రి పోయిన తర్వాత అన్నీ తానే అయి తమను పెంచి పేద్ద చేసిన పితామహుని చంపాలంటే మనసు ఒప్పటం లేదట .రాజ ధర్మం బంధువులను ఎవరినీ లెక్క చెయ్యదు కదా అని బాధ పడుతున్నాడు .భీష్ముని చేరి ఆయన మరణ విధానాన్ని ఆయన తో నే చెప్పించు కొన్నారు .పితామహుడు తన మరణ విధానాన్ని తెలియ జేసి ,”అది తన ఆజ్న గా పాటించ” మని ఆదేశించాడు .అలా అయితేనే ధర్మజుడు అంగీఅరిస్తాడని భావం .అప్పుడు అర్జుని మనో వేదనా లలిత సుందరం గా ఉంటుంది –”గురుని ,కృత ప్రజ్నుని ,ధ -ర్మ రతు ,వయో వృద్దు ,లోక మాన్యు ,దయాళున్ –సుర తటినీ సుతు ,వంచన –బురుషోత్తమ ,చంప బుద్ధి పుట్టదు నాకున్ ”అని విల విల లాడి పోయాడు .వంచన చేసి చంపాల్సి వస్తోందే కురు వంశ సూర్యుడిని అని మహా వేదన చెందాడు .ఈ పద్యం లో ప్రతి శబ్దాన్ని అర్ధ వంతం గా ప్రయోగించాడు తిక్కన .తమకు భీష్ముడు -గురుడు ,ప్రజ్ఞా ప్రాభవ ఖని ,ప్రతిజ్ఞా పాలన కు జీవితం అంకితం చేసిన వాడు ,ధర్మ విషయం లో వేలెత్తి చూప లేని వాడు ,ఇదంతా కాదు అసలు వయస్సు లో అందర్ని మించి జ్ఞానం తో కూడా వృద్ధుడైన వాడు ,లోకం అందరి తోను మాన్యుడు అని పించుకొన్న వాడు ,దయా స్వరూపుడు ,గంగా నదీ కుమారుడు ,అయిన భీష్ముడిని వంచన తో ఎలా చంప మంతావయ్యా పురుషోత్తముడు అనే పేరున్న ఓ కృష్ణ పరమాత్మా !”అని ఆవేదన చెందాడు .ఆయన గునాలన్నిటినీ వరుస క్రమం లో ప్రయోగించాడు .ప్రయోగించిన ప్రతి మాట ”భీష్ముని చంప రాదు ”అని సూచించే మాటే .ఆయన తనను వ్యక్తీ గతం గా ఎంతో ఆదరించాడు .అందుకే ఈ వేదన .”నన్ను ,బాంసు కేళి నున్న ,నర్మిలి ఎత్తి –మేని దూలి తనదు మేను వొరయ –ప్రీతీ కౌగిలించి ,మా తండ్రి గుణము,ళ  –గ్గించి కన్ను నీరు నించు నతడు ”
తన చిన్నతనం ఒళ్లంతా మట్టి కొట్టు కొని ఉన్న తనను ఎట్టు కొని ఆ మాట్టి తన ఒలంతా అంటించుకొని నాకు బుద్ధులు చెప్పి నా తండ్రి గుణాలను జ్ఞప్తికి తెచ్చి ,తాను ఏడిచే ఆ పితమహున్ని నేను ఎలా చంపను ?అని దుఃఖించాడు .అంతే కాదు ధర్మ పరత్వం ,మొదలైన సహజ గుణాలను తెలియ జెసేఎ పద్యం ఒక రసధుని .–”అక్కట తండ్రి లేని మము నేమ్మాయి బెంచిన తాత ,నిమ్మెయిం –ద్రోక్కేనగా డతండు సముదీర్ణ భుజా బల శౌర్య శాలియై –ఇక్కడి సేన జక్కడిచె ,నేనియు జూతును గాక ,ధర్మ ముం –దక్కుట  కోర్వ జాలుదునె ధర్మ రాజు ,తమ్ములు క్రూర కర్ములే ”అని కన్నీరు మున్నీరు అయాడు .
శిఖండి ని అడ్డం గా పెట్టు కొని ,అర్జునుడు భీష్ముని తో యుద్ధం చేస్తుంటే ,ద్రోణా చార్యుని మనసులో చెప్పా లేని కలవరం చేల రేగింది .అనర్ధం గోచ రించింది .ఆయన పరిస్థితి –”తడ బడే దివ్య బాణములతంత్రము ,మంత్రము దప్పెడుం  గడున్ –వడ కెదు జాప దండము ,మనంబును నాకు ,వశంబు గాడు ,వీ –ద్వాదియేడు ,జేయ్వులంగాముగమంత్రం తప్పుతోంది ,తంత్రం తడ బడు తోంది .డంక ,దోరంగేడు నేటి భంగి ,,గ –వ్వడి ,తన పూన్కి దీర్చుట ద్రువంబని ,బుద్ధి జనించే బుత్రకా ”ద్రోణుని చేతులు కాళ్ళు ఒంకి పోతున్నాయి బాణం పట్టు తప్పు తోంది శరీరం తడ బడు తోంది .ఇవన్ని గమనిస్తుంటే ఆయనకే ఆశ్చర్యం వేస్తోంది .అర్జునుడు భీష్మ పితా మహున్ని చంపి తీరుతాడు అనే మనో నిశ్చయానికి ద్రోణా చార్యుడు వచ్చే శాడు .అర్జునుని పరాక్రమం అలా ఉంది .తన వశం తప్పి పోతోంది .శిఖండి ముందున్నాడు .కనుక సుర నాదే తనయుడు సుర లోకం చేరటం ఖాయం అను కొన్నాడు .
మీ–గబ్బిట దుర్గా ప్రసాద్ –26-7-12-కాంప్–అమెరికా
http://suvarchalaanjaneyaswami.wordpress.com

Posted in రచనలు | Tagged | Leave a comment

అమెరికా ఊసులు –11– మొదటి సారి అమెరికా అధ్యక్షు లైన తండ్రీ కొడుకులు

అమెరికా ఊసులు –11–
 మొదటి సారి అమెరికా అధ్యక్షు లైన తండ్రీ కొడుకులు 
అమెరికా మొదటి అధ్యక్షుడు జార్జి వాషింగ్టన్ అని అందరికి తెలుసు .ఆయన తో పాటు వైస్ ప్రెసిడెంట్ అయిన వాడు జాన్ ఆడమ్స్ .వాషింగ్తన్ రెండు సార్లు పదవి లో ఉన్నాడు .మూడో సారి కూడా ఉనాడమని జనం బలవంతం చేఇనా ఒప్పు కోలేదు .రెండవ అధ్యక్షుడు గా జాన్ ఆడమ్స్ ఎన్నిక అయాడు .ఇతని కొడుకు జాన్ క్విన్సీ ఆడమ్స్ ఆరవ అమెరికా అధ్యక్షుదయాడు .అక్కడి నుండే అమెరికా లోను వారసత్వం కోన సాగింది .తర్వాతా చాలా మంది తండ్రి కొడుకులు అధ్యక్షులయారు .
ఆ రోజుల్లో ఒక వింత రూల్ ఉండేది దాన్ని ”గాగ్ రూల్ ”అనే వారు .అప్పటికి దక్షిణ రాష్ట్రాలలో బానిసత్వం ఉంది .ఉత్తర రాష్ట్రాల వారు దీనికి వ్యతి రేకం ఆడంసులు మేసాచూసేత్స్ అనే ఉత్తర రాష్ట్రానికి చెందినా వారు .గాగ్ రూల్ అంటే ఎవరైనా బానిసత్వం పై పిటీషన్ సభ్యులకు ఇస్తే దాన్ని స్వీకా రించ.కూడదు .సభ లో ఆ విషయాన్ని ప్రస్తావించ కూడదు .ఒక వేళచేస్తే అభిశంశన కు  గురి అవ్వాల్సిందే .అంటే సభ్యుల చేతులు కట్టేసి నట్లే .ఆ నాటి పరిస్తితి అది .
చిన్న ఆడమ్స్ అంటే క్విన్సీ అని పిలుద్దాం .ఆయన అమెరికా సెక్రెటరి ఆఫ్ స్టేట్స్ ,నాలుగు దేశాలకు రాయబారి ,అమెరికా కు సెనేటర్ గా పని చేసిన అనుభవం భావం ఉండి ప్రెసిడెంట్ అయాడు .ఈయన రిటైర్ అయిన తర్వాతబానిస విషయం మీద ఒక పిటీషన్ ఆయనకు చేరింది .అప్పుడాయన సాధారణ హౌస్ రిప్రేసేన్తతివ్ .సభలో ప్రస్తావించాడు .అభి శంషన తీర్మానం పెట్టారు .అది వీగి పోయింది .ఆ రోజున సభలో మాట్లాడుతూ ఆయన గాగ్ రూల్ ను సమర్ధించే వారిని ”ఎద్దు మాంసం తినే వాళ్ళని ,విస్కీ తో కొవ్వ్వేక్కి బానిసత్వాన్ని సమర్ధిస్తున్నారు ”అని విరుచుకు పడ్డాడు .అమెరికా ఫౌందింగ్ ఫాదర్స్ అని పిలువా బడే వాళ్ళలో వాషింగ్ తాన్ జెఫర్సన్ ఆడమ్స్ మాదిసాన్ ,మన్రో ,జాక్సన్ వంటి వారున్నారు .అందరికి స్వాతంత్రం ఉండాలి అన్న ధ్యేయం తో క్విన్సీ సాహసోపేత మైన నిర్ణయం తీసుకొని గాగ్ రూల్ ను వ్యతిరేకించాడు .మన మోతీ లాల్ జవహర్లాల్ లాగా గ్రేట్ ఫాదర్ అండ్ సన్అని పించు కొన్నారు .ఆడంసులిద్దరు .
తండ్రి ఆడమ్స్ అమెరికా డిక్ల రేషన్ రాసిన వారిలో సంతకం చేసిన వారి లో ఉన్నాడు .కాంతి నేన్తల్ కాంగ్రెస్ కు మాసా చ్చోస్త్స్ నుండి రిప్రేసేన్తటివ్ .అమెరికా లో మొదటి తిరుగు బాటు యుద్ధం మాసా చూసేత్స్ లోని లెక్సింగ్ తాన్ ,కాన్కార్డ్ లలో బ్రిటీష వారితో జరిగింది .1776జూలై నాలుగు న పదమూడు కాలనీల సమాఖ్య స్వాతంత్రాన్ని ప్రకటించుకొని బ్రిటీష పాలనకు మంగళ గీతం పాడింది .అదే వీళ్ళ స్వాతంత్ర దినోత్సవం .అప్పుడే ”అమెరికా సంయుక్త రాష్ట్రాలు ”అనే పేరు పెట్టు కొన్నారు .తండ్రి ఆడమ్స్ ను బ్రిటన్ ,ఫ్రాన్సు దేశాలతో చర్చలకు అమెరికా ప్రభుత్వం పంపింది .బెంజమిన్ ఫ్రాంక్లిన్ అనేఫిజిక్స శాస్త్ర వేత్త ఫ్రాన్స్ లో అమెరికా మినిస్టర్ అంటే రాయబారి గా ఉన్నాడు .
1780నాటికి రష్యా అధికార భాష ఫ్రెంచ్ భాషే .తండ్రి తో పాటు విదేశ పర్యటనలు చేసిన చిన్న ఆడమ్స్ బెర్లిన్ లో బానిసలను కొని అమ్మటం ,కోళ్ళకు ,గుర్రాలకు బదులుగా బానిసలను ఇచ్చేయటం స్వయం గా చూసి ఈసడించు కొన్నాడు .ఫ్రాన్స్ ప్రబుత్వం అమెరికా స్వాతంత్రాన్ని ఆమోదించింది ,రాష్యారాని కాతేరిన్ తిరస్కరించింది .రష్యా లో రాణి ,బానిసలు తప్ప తనకేమీ కానీ పించాలేదని క్విన్సీ రాసుకొన్నాడు .సెయింట్ పీటర్స్ బర్గ్ సిటీ లో విద్య నేర్పే ఒక్క స్కూల్ కూడా ఆ  రోజుల్లో కనీ పించ లేదని చెప్పాడు .క్విన్సీ ని తల్లి అబిగాలి తీర్చి దిద్దింది .ఎప్పటి కప్పుడు తగిన సలహాలనిస్తూ ఉండేది .universal neat ness and cleanli ness అవసరమని బోధించేది . హార్వర్డ్ లో ని కేంబ్రిడ్జి లో చదివాడు .తండ్రి కూడా ఇక్కడే చదవటం విశేషం .వీళ్ళే మిటి ఆనాడు ప్రసిద్దు లందరూ ఇక్కడే చదువు కున్నారు .
వాషింగ్టన్ అమెరికా రాజ దాని కాలేదు న్యూయార్క్ లో రాజధాని ఉండేది .1788లో పెద్ద ఆడమ్స్ దేశానికి మొట్ట మొదటి విస్ ప్రెసిడెంట్ గా ఎన్నుకో బడ్డాడు .వాషింగ్ తాన్ అధ్యక్షుడు .అమెరికా కాపిటల్ పెన్సిల్వేనియా రాష్ట్రం లోని ఫిలడెల్ఫియా కు మార్చారు .ఇక్కడ పదేళ్లు ఉంది .తర్వాతా 1800 లో శాశ్వతం గా వాషింగ్ టన్ రాజ దాని అయింది .క్విన్సీ ప్రెసిడెంట్ తో తండ్రి తో పాటు భోజనం చేశాడు .సుప్రీం కోర్ట్ చూశాడు .లా పాసై న్యాయ వాడ వ్రుత్తి లో చేరాడు బోస్టన్ లో .కాని విజయం పొంద లేక పోయాడు .రాజ కీయాల పై మనసు పోయింది అప్పుడు ఫెడరల్ పార్టి ఉండేది .వాళ్ళందరూ బానిసత్వానికి వ్యతి రేకులు .దాని లో చేరాడు .కేంద్రం బలంగా ఉండాలని తలచే వారు వీరందరూ .వాషింగ్ తాన్ క్వీన్సి ని నెదర్లాండ్ లో అమెరికా రాయ బారి గా నియమించాడు .అతనికి అప్పటికే జెర్మని ఫ్రాన్సు భాషలు బాగా వచ్చు .తండ్రి వల్ల ఈ ఉద్యోగం వచ్చిందేమో నని సందేహించాడు .కాని అధ్యక్షునికి అన్నీ తెలుసు నని గ్రహించాడు .ఆ తర్వాతా క్విన్సీ ని పోర్చుగల్ లో pleni potentiary మినిస్ట రా అధ్యక్షుడు నియమించాడు జీతమూ పెరిగింది హోదా పెరిగింది .ఆ పదానికి అర్ధం -సర్వ స్వతంత్రం గా అమెరికా ప్రభుత్వ ప్రతినిధి గా పని చేయటం .చాలా సంతృప్తి పడ్డాడు .తర్వాతా ప్రశ్యాకు పంపారు .అప్పుడే వివాహం చేసుకొన్నాడు .వారికి పుట్టిన మొదటి కుమారుడికి మొదటి అధ్యక్షుని పేరు వాషింగ్ తాన్ అని గౌరవం గా పెట్టు కొన్నారు .
మళ్ళీ స్వదేశం లో కాలు పెట్టాడు క్విన్సీ .ఫెడరల్ పార్టి టికెట్ పై మాసా చూసట్స్ కు సెనేట సభ్యుడయాడు .ఆప్పటికే టికే తండ్రి అధ్యక్షుడు గా రెండు సార్లు పని చేశి మూడో సారి పోటీ చేసి ఒడి పోయాడు .జెఫర్సన్ అధ్యక్షుడు గా ఎన్నికయ్యాడు .ఆయన రిపబ్లికన్ పార్టి నాయకుడు .ఆడమ్స్ ఫెడరల్ పార్టి లో ఉన్నాడు .అయినా జెఫర్సన్ ను చాలా విషయాలలో సమర్ధించాడు .నెమ్మదిగా రిపబ్లికన్ పార్టి లో చేరి పోయాడు క్విన్సీ .జెఫర్సన్ తర్వాతా మాడిసాన్ ప్రెసిడెంట్ అయ్యాడు .ఆయన చిన్న ఆడమ్స్ ను రష్యా రాయబారి గా నియమించాడు .అక్కడకి చేరే సరికి నెపోలియన్ రష్యాను ఓడించి ఆక్రమించుకొన్నాడు .అయితే రష్యా సైన్యం పుంజు కొని అతన్ని వెనక్కు పంపేయ గలిగింది .రాయబారి గా సమర్ధం గా పని చేసి మెప్పు పొందాడు .తర్వాతా ఇంగ్లాండ్ కు రాయబారి అయాడు .అమెరికా కు బ్రిటీష ఆధీనం లో ఉన్న కెనడా కు మధ్య ఉన్న గ్రేట్ లేక్స్ విషయం లో మంచి ఒడంబడిక కుదిర్చాడు .మాదిసాన్ దిగి పోయి జేమ్స్ మన్రో ప్రెసిడెంట్ అయాడు .
మన్రో క్విన్సీ ని సెక్రెటరి ఆఫ్ స్టేట్స్ చేశాడు .దేశం సరిహద్దుల్ని పెంచాలని నిర్ణయించుకొన్నాడు .ఫ్లారిడా రాష్ట్రాన్ని కొనేసే ఒడంబడిక కుదిర్చాడు .అందరూ జాక్సన్ ఆ ఆతి సైన్యాధ్యక్షుడు .వాషింగ్ త్న్ లో కాపురం .అకడి పోతోమాక్ నది లో స్నానం చేసే వాడు .ఈదే వాడు .ప్రెసిడెంట్ గా ఉన్నా ఈపని మాన లేదు .రోజు విందులు వినోదాలతో ఆరోగ్యం దెబ్బ తింది .తన ఇంటి లోనే రోజు సందర్శకులను చూడటం విందు తానే ఇవ్వటం చేశాడు .మన్రో డాక్యు మెంట్ ను సమర్ధం గా రూపొందించి అమలు చేశాడు ..దీని ఉద్దేశ్యం -పశ్చిమార్ధ గోళం లో యూరోపియన్ల జోక్యం ఉండ రాదు .కొత్తగా కాలనీల ఏర్పాటు చేయ రాదు .అమెరికా యూరోపియన్ల విషయాలలో జోక్యం కల్పించు కోదు.మిలిటరి బలం తగి నంత గా ఆ కాలం లో అమెరికా కు లేక పోయినా అమెరికా అంటే ఏమిటో తెలియ జెప్పిన ఒడంబడిక అది .
జాక్సన్ ను” వార్ హీరో ”.ఎన్నో యుద్ధాలు చేసి విజయాలు సాధించి ,ప్రజల మనసుల్ని దోచిన వాడు .అతన్ని శర దాగా ”old hickery ”అంటారు .అంటే హిక్కరి అనే కలప అంత బలమైన వాడు అని .అతను ప్రెసిడెంట్ గ్ స్తానానికి పోటీ చేశాడు .అతన్తో తలపడ్డాడు క్విన్సీ .ఇద్దరి మధ్యా తీవ్ర మైన పోటి నెలకొంది .ఓటింగ్ లో తగిన ప్రతి నిధ్యపు ఓట్లు రానందున జెఫర్సన్ ఒడి క్విన్సీ ఆడమ్స్ గేలి చాడు .అయితే ఆయన్ను ఎవరూ బలపరచ లేదు .ఒంటరి వాడి నాడు .అయితే ఒక గొప్ప ఆలోచన చేశాడు ”astronomical observatory ”ని అమెరికా ప్రభుత్వం ఏర్పాటు చేయాలని ప్రయత్నిస్తే సెనేట తిరస్కరించింది .యూరప్ లో ఇలాంటివి వందలాది ఉన్నాయని వాటివల్ల చాలా ప్రయోజనం ఉందని వాదించినా ఎవరూ విని పించు కో లేదు .వాటిని ఆయన ”light houses of the skies ” అని ముద్దు గా పిలిస్తే అందరు దాన్ని”national joke ” అని కొట్టి పారేశారు .ప్రెసిడెంట్ గా ఏమీ చెయ్య లేక పోయిన దురదృష్ట వంతుడు .మళ్ళీ ఎన్నిక లో నిలబడి జాక్సన్ చేతి లో ఒడి పోయాడు .మేదావే కాని ప్రాజా సంబంధాలను సరిగ్గా పాటించ లేక పోయాడు .అహంభావి అనే ముద్ర ఉంది .అప్పటికి రిపబ్లికన్ పార్టి ఉంది ఫెడరల్ పార్టి డెమొక్రాటిక్ పార్టి గా ఆవిర్భ వించింది .ఈయన దీనిలో ఉన్నాడు .వీరికి బానిసత్వ విధానం నచ్చాడు .అమెరికా గట్టి కేంద్ర ప్రభుత్వం కలిగి ఉండాలన్న భావం ఉన్న వారు డెమోక్రాట్లు .
మళ్ళీ సవత ఊరు వెళ్లి లా ప్రాక్టీస్ చేస్తూ కాల క్షేపం చేశాడు .ప్రజా లందరూ ఆయన్ను ఒప్పించి హౌస్ రిప్రేసెంత టివ్ గా ప్రతి రెండేళ్ళ కోసారి ఎన్నుకొని గౌరవం చూపారు .ఒక బ్రిటీష శాస్త్ర వేత్త jemes smithson అమెరికా ప్రభుత్వానికి అయిదు లక్షల డాలర్లు విరాళం ఇచ్చి దానిని institute for advaanced knowledge ను ఏర్పాటు చేయ మని కోరాడు .దీన్ని క్విన్సీ ఆడమ్స్ ప్రభుత్వం తో చర్చించి ”smithonian institution  ”అనే జాతీయ మ్యూజియం ను ,రిసెర్చ్ సెంటర్ ను ఏర్పాటు చేయించాడు .అలా తాను ప్రెసిడెంట్ గా చేయ లేక పోయిన దాన్ని ఇలా నేర ర్చు కొన్నాడు .టెక్సాస్ రాష్ట్రం మెక్సి కో నుడి విడి పోయింది అది బానిసత్వాన్ని సమర్ధించే రాష్టం .అది అమెరికా యూనియన్ లో కలవాలని భావించింది .మెక్సికో పై యుద్ధం చేయాలని ప్రెసిడెంట్ పొలాక్ కాంగ్రెస్ ను అనుమతి కోరాడు . పై యుద్ధానికి వెల్ల రాదనీ ఆడమ్స్ భావించాడు .అయినా యుద్ధం తప్ప లేదు .జాన్ క్విన్సీ ఆడమ్స్ హౌస్ ఆఫ్ రిప్రేసెంత టివ్ లో మాట్లాడుతూ కుప్ప కూలి రెండు రోజుల తర్వాత(1848 ) లో  చని పోయాడు ఆయన పుట్టింది 1767 .లో ..ఇదీ ఆడమ్స్ ల ఊసులు .
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –25 -07 -12 -కాంప్-అమెరికా .

Posted in అమెరికా లో | Tagged | 1 Comment

‘పో”–పై చీకటి వెలుగులు

‘పో”–పై చీకటి వెలుగులు 
”అతను కవే కాని -తాగుబోతు ,జూదరి ,వ్యసన పరుడు ,గాంబ్లర్,దుఖం తో ఎప్పుడు కుంచించుకు పోతాడు ,మేలాంక లిస్టు ,భగ్న ప్రేమికుడు ,ప్రేమించి పెళ్లి చేసుకొన్న భార్య అకస్మాత్తు గా మరణం ,అప్పుల అప్పా రావు ,మాన్ ఆఫ్ మూడ్స్,నిరంతర చింతనా పరుడు ,ఉద్యోగాలలో స్తిరత్వం లేదు ,తండ్రి ఇద్దరు పిల్లల్ని కానీ పరారు ,తండ్రి ఆలనా పాలనా ఏమిటో తెలీని వాడు ,తల్లి విపరీతం గా కష్టపడి సంసారాన్ని ఈదేది అది చూసి విచలితుడుఅ యే వాడు ఆమె నే నిత్యం స్మరించే వాడు .ఎందుకూ కొరగాని వాడు అని ముద్ర పడిన వాడు.నిత్య దరిద్రుడు . ఒంటరి తనం తో బాధ పడే వాడు  డిప్రెషన్ తో నిత్యం బాధ పడే వాడు ..’ప్రేమించిన ఆమె ను తర్వాతా ఎప్పుడో పెళ్లి చేసుకొని ,ఆమె అకాల మరణం తో తట్టుకో లేక పోయిన వాడు ,’ఇవీ అతని పై ఉన్న చీకటి కోణాలు –
”కవిత్వం లో అందం ,కొత్తదనం తెచ్చిన మొదటి తరం కవి .ఫాంటసి కి దారి చూపిన వాడు రొమాంటిక్ కవి ,కధకు చక్కని పునాదులు వేసిన వాడు కవిత్వం లో నాదాన్ని జత చేసి చెవులకు ఇంపు ,కవిత్వానికి సోంపు చేకూర్చిన వాడు ,మొదటి డిటెక్టివ్ కదరాసిన వాడు .కవిత్వం ఎలా ఉండాలో అతను రాసిన విధానం ఇంతవరకు అన్ని దేశాల్లోను ఆదర్శం గా ఉంది .దానికి మించి ఇంత వరకు ఎవ్వరు చెప్ప లేక పోయారు .పద బంధ ప్రహేలికలను తయారు చేసి న మొదటి వాడు .సైన్స్ విషయాల లోతులు తరచి ,ఆ నాడే బ్లాక్ హోల్స్ ను ఊహించిన వాడు ఎన్నో పత్రిక లకు సంపాదకుని గా పని చేసిన వాడు రచన లతో జీవించ వచ్చు అని రుజువు చేసిన మొదటి జర్నలిస్టు ,తన రచన లతో ,ప్ర పంచ దేశ సాహిత్యానికి మార్గ దర్శనం చేసిన వాడు ,స్వంతగా పత్రిక లను పెట్టి నిర్వహించి చెయ్యి కాల్చుకొన్న వాడు ,విమర్శ కు కొత్త పంధా ను నిర్దేశించిన వాడు,ఎందరో రచయితలకు ప్రేరణ గా నిలిచిన వాడు ,ముఖ్యం గా ప్రపంచానికి మార్గ దర్శనం చేసే కళల కాణాచి అయిన ఫ్రాన్సు దేశ కళా కారులకు ఆరాధ్య మైన వాడు ,మంచి కళా స్రష్ట ,జీనియస్ ,బ్రిటీష వాళ్ళ జీవిత విధానాల నుంచి ,అమెరికా రచనలకు స్వంత వ్యక్తిత్వాన్ని చూపించి మార్గ దర్శి అయిన వాడు,కల కల కోసమే నని చాటిన వాడు , —  అన్నిటికి మించి గొప్ప స్వాప్నికుడు –ఇవీ అతని పై వెలుగులు -ఇలా చీకటి వెలుగుల అమెరికా  రచయిత ”ఎడ్గార్ అల్లాన్ పో””.
పద్దెనిమిదేళ్ళ కే మొదటి కవితా సంకలనాన్ని ప్రచురించాడు పో.రొమాంటిక్ పంధాను వదిలి ,దాని అవతలి పార్శ్వాలను ,ఎవరూ చూడని భాగాలను చూసి స్పందించి రాసిన వాడు .ఎంతో విజ్ఞానాన్ని సంత రించుకొన్నాడు .తన దేశ బలహీనత లను గుర్తించి వాటి లో నుంచి బయట పడాలని అమెరికా కు ఇతర దేశాలకు తెలియ జేసిన వాడు .”నేను అనంత శోక భీకర లోకైక తిమిర పతిని ”అని కృష్ణ శాస్త్రి గారు అన్నారంటే పో మార్గ దర్శకత్వమే అది .కీట్స్ ,షెల్లీ ల వంటి వాడు .ఆనందం వచ్చినా ,దుఖం వచ్చినా ఆపుకోలేని వాడు .తాను పతనం కా కుండా ఉండ టానికి తాగుతున్నానని చెప్పుకొన్నాడు .ఒక సారివాషింగ్టన్ లో  అమెరికా ప్రెసిడెంట్ tyler ను పరిచయం చేద్దామని స్నేహితులు ప్రయత్నించి తీసుకొని వెళ్తే, ఫుల్ గా మందుకొట్టి పడి పోతే ,ఇంటర్ వ్యూ ను కాన్సిల్ చేసి తీసుకొచ్చారు .అదీ అతని మానసిక స్తితి .ఇలా ద్వంద్వ ప్రక్రుతి లో జీవించాడు .తల్లి వీధి నాటకాలు వేసి కుటుంబాన్ని పోషిస్తూ అకస్మాత్తుగా మందూ మాకూ లేక  చని పోతే ”even death might be ashamed ”అని రాసుకొన్నాడు .ఆమె త్యాగాన్ని చూసి విచాలితుడయ్యాడు .ఆమె ను గురించి మాట్లాడా లంటేనే భయ పడి పోయే వాడు .
వర్జీఎనియా వర్సిటి లో చదివి నప్పుడు అందరిలోనూ చదువు లో ముందుండే వాడు .అక్కడ సరదాకి ”తాగుడు పోటీలు ”ఉండేవి .అందులో పాల్గొని విజేత అయ్యాడు .తాగు బోతూ కాదు .డబ్బు లేక జూదం ఆడే వాడు .దానికోసం అప్పులు చేసే వాడు .డబ్బు ఇవ్వక పోతే బెదిరించటం కోదా అలవాటైంది .పరిస్థితులు వాతా వరణం అతన్ని అలా  చేశాయి .అత్యధిక ప్రతిభ తో పని చేస్తున్నప్పుడు ,ప్రముఖ రచయిత గా చేలా మని అయినప్పుడు రచన ”జీవిక ”అవు తుందని అతను భావించలేదు .కాని అదే అయింది .రచనలకు ప్రశంశ ళు ,బహుమతులు పొందాడు .the raven అనే రచన టో ఒక్క సారి గా మహా రచయిత అని పించు కొన్నాడు .ఎపత్రికా సంపాదకుని గా పని చేసినా పూర్తిగా అయిదు వేళ్ళూ నోట్లోకి వెళ్ళే జీతాలేమీ ఇవ్వ లేదు .ఉద్యోగ భద్రతా లేదు .ఆర్మీ లో పని చేసి అధికారుల మెప్పూ పొందాడు .మంచి కాన్దక్టు సర్టి ఫికేట్టూ సంపాదించాడు .సమర్ధుడని పేరు వచ్చింది .అయినా పతనం చెందిన విధి వంచితుడు .
ప్రపంచ ప్రసిద్ధ రచయిత లైన ఇలియట్ ,యేట్స్ ,రికీ అందరు పో వలన ప్రభావితు లైన వారే .ఫ్రెంచ్ రచయిత బాదర్లేన్ అతని దారి లోనే నది చాడు .the best of poe is very nearly beyond improve ment ”అని ప్రశంశలు పొందాడు .అతని ప్రభావం రష్యా ,కెనడా ,అర్జెంటీనా నుండి స్కాండినేవియా దేశాల వరకు ఉంది .సంగీతం ,సైన్స్  ,ఆర్ట్ ,సింబాలిజం లలో పో ప్రభావం పడనీ దేశమే లేదు .మాటర్ లింక్ ,దయోల్ ,జూల్స్ వేర్న్ ,స్విన్బర్న్ దాస్తో విస్కీ వంటి ప్రసిద్ధ రచయిత లంతా ”పో రచనా విస్కీ ”ని తాగిన వారే
.”a creative genius who falls just sort of the supreme masters ”–”poe is ajust  judje some times the justest ever to pass a verdict on the writ to question ”–”his criticism is derogatory and just ”–‘tere is no other such critic al survey in our literature ”అని ఎడ్గార్ అల్లాన్ పో ను అత్యద్భుతం గా విశ్లేషించి అతని మేధావి తనాన్ని ప్రపంచానకి చాటారు విశ్లేషకులు .
poe రాసింది అంతా చదవ దగ్గట్టే రాశాడు .అతని మాటల్లో శక్తి ఉంది .తక్కువా మాటలలో ఎక్కువ అర్ధాన్ని భావాన్ని పొదగా గల మాటల పొదుపరి .హాస్యానికి ,హారర్ కు సమ ప్రాధాన్యమిచ్చి రచన చేశాడు .అతను యదార్ధ వాడి ,ప్రతీక వాది,సర్రియలిష్టు ఇన్ని గొప్ప లక్షణాలున్న పో రచనలను ఫ్రెంచ్ ఫాషన్ లో విశ్లేషించాలి అన్నాడు టి.ఎస్.ఇలియట్ .అందుకే ఫ్రెంచ్ వారికి పో ”క్లాస్సిక్ ”అన్నారు .బాల్జాక్ ,డికెన్స్ ,టాల్స్టాయ్ సరసన కూర్చో బెట్టారు .అతను చెప్పిన ”art is its own reward ”అన్న మాట ఫ్రెంచ్ వాళ్లకు బాగా నచ్చింది .అడుకే ఫ్రెంచ్ రచయితలు ,కవులు అందరు made of Poe ”అని పించుకొన్నారు .ఇంతకీ కల కల కోసమే నని ఘంటా పధం గా చెప్పిన వాడు పో ఒక్కడే ఆ నాడు .-ఇవీ పో మీద వెలుగు నీడలు .మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –25-7-12—కాంప్–అమెరికా
https://sarasabharati.wordpress.com
http://suvarchalaanjaneyaswami.wordpress.com

Posted in రచనలు | Tagged | Leave a comment

తిక్కన భారతం –16 యుద్ధ పర్వం లో వికశించిన మాన వ ప్రకృతి –4

  తిక్కన భారతం –16
    యుద్ధ పర్వం లో వికశించిన మాన వ ప్రకృతి –4
ద్రోణా చార్యుడు ఇచ్చిన”పరా భేద్యం ”అనే కవచాన్ని తొడుక్కొని ,దుర్యోధనుడు అర్జునుని తో తల పడ టానికి యుద్ధరంగానికి చేరాడు .అర్జునుడు ఆ కవచాన్ని బాణాలతో చీల్చి ముక్కలు చేశాడు .యెడ తెరిపి లేకుండా ఆతని చేతులపై బాణ వర్షాన్ని కురిపించాడు క్రీడి .చేతుల్ని వాచీ పోయాయి .ఎంత క్లిష్ట పరి స్తితి లో నైనా యుద్ధం చేయ గలనని నిరూపించాడు సవ్య సాచి .సైన్ధవుడిని చంపి ,శిరస్సు కింద నెల మీద పడకుండా ,ఆకాశం లోనే తిప్పుతూ ,అర్జునుడు చేసిన విధానం పరమాస్చర్యం గా ఉంది .అందరు నిశ్చేష్టులై చోద్యం చూశారు .దివ్యామ్ష సంభూతుడు కనుక అతనికి అది సాధ్యమైంది .అవలీల గా చేయ గలిగాడు .–”పటు శరముల మీదికి డా –పటికిన్ వలపటికి ,నపర భాగమునకు ,-ముందటికి ,జదల నడపె సము -త్కట రయమున శిరము  గందుక క్రీడ గతిన్ ”  బంతిని ఆడు కొన్నట్లు ఆకాశం లో కిందికీ ,మీ దికీ ప్రక్కలకు బాణా లతో సైంధవుడు తల కాయను తిప్పుతూ పగ తీర్చుకొంటు అనడ్రికి వినోదాన్ని ,భయాన్నీ కూడా కలిగిస్తున్నాడు .వ్యవ సాయ దారులకు ఎడ్లను ఎలా కట్టాలో తెలుసు .దాపటి ఎద్దు ,వలపటిఎద్దు అని అంతం వింటాం .ఆ పదాలనే ఇక్కడ తిక్కన ప్రయోగించి అచ్చ తెనుగు రుచి కూడా చూపించాడు .
రక్తం తో తడిసి ,ఆభరణాలతో ,కూడిన శరీర భాగాలతో ,శస్త్రాస్త్ర ఖండాలతో ,చెల్లా చేద రైనా అనేక ఆభరణాలతో ,మ్మ్సపు ముద్దలతో ,పీనుగుల సమూహం తో జుగుప్సా కరం గా యుద్ధ భూమి ఉంది .అయితే తిక్కన దాన్ని ”కాశ్మీర రాగ రంజితం ,వివిధ ఆభరణాలు ధరించిన సుందర స్త్రీ దేహం ”లా గా ఉంది అన్నాడు .ఆ  భయంకర దృశ్యాన్ని సుందరం గా చెప్పాడు .భీకర ,పౌరుష ప్రధానం గా ఉన్న యుద్ధ రంగాన్ని కోమలత కు ,లాలిత్యానికి నిలయ మైన స్త్రీ విలాసాన్ని ఆపాదించటం కొత్త విశేషం .సమరంగానాన్ని రమణీయం గా ,అవసర మైన చోట్ల భీషణం గా చిత్రించి యుద్ధ వర్ణన కు కొత్త అందాన్ని సంత రించాడు .ఈ విధానం తిక్కన, మహా కవి కాళిదాసుకు నిజమైన  వారసుడు అని రుజువు చేస్తోంది . దుశ్శాసనుడు అమానుష యుద్ధం చేశాడు భీముడి తో .కర్ణుడు శక్తి నంతటినీ ధారా పోసి యుద్ధం చేసి అతన్ని రక్షించే సకల ప్రయత్నాలు చేశాడు .చివరికి భీముని  చేతి లో చని పోయాడు దుశ్శాస  నుడు అన్న వార్తను సంజయుడు పెద్ద రాజుకు వివరించి చెప్పాడు .ముసలి రాజు హృదయ ఆవేదనను తిక్కన మహాద్భుత పద్యం లో తెలియ జేస్తాడు –”పడుచు లీక లూడ్చి ,పట్టి యాడెడు నట్టి -పులుగు చంద మయ్యే దలప ,నా ,య-వస్త ,ఎందు జొచ్చు వాడ ,నీ యలమట –దీర్ప నెవ్వ రింక దిక్కగుదురు ?”–చిన్న పిల్లల చేతి లో చిక్కి ,వాళ్ళు ఈకలు ఒక్కొక్కటి గాపీకి రాల్చి పారేస్తుంటే ,బాధ పడే పక్షి లాగా తాను అవస్థ పడుతున్నాను అన్నాడు .ఈకలు దేహం తోనే పుట్టేవి .సహజ మైనవి .అలాగే అతని పుత్ర ,పౌత్రులు కూడా తనూజులే అంటే తన శరీరం నుండి జన్మించిన వారే .వారంతా ,కళ్ళ ఎదుటే హతమై పోతుంటే ,మర్మ భేద మైన వేదన ను అనుభ విస్తున్నాడు .ఆయన పరిస్తితి ఇప్పుడు ఈకలు తెగిన పక్షిలా ఉంది .విల విల లాడి పోతున్నాడు ఈకలు తెగిన పక్షి కి మరణం ఖాయం .అలాగే తనకూ చావు తప్పదు అనే నిర్ణయానికి వచ్చాడు .జీవచ్చవం అయిపోయానని దుఃఖించాడు .దీనినే ”సంపూర్నార్ధ స్పోరకం ”అంటారు ..
భీముడు దుస్శాసనుడిని చంపినా విధానం అతి భీకరం గా ఉంది .”లీల గేల నమర్చి ,మత్త గజ కేళీ సుందరోల్లాస మా –భీలత్వంబలరింప ,ద్రిప్పు జదలం బ్రుద్వీస్తలిన్,వైచు ,ముం –గాలం ద్రోచు మొగంబు వ్రేయు దేశలు,గ్ర స్పూర్తి వీక్షించు మొ –కాలూడంబయి ,గ్రమ్మ రండ మెడ చిక్కం ద్రొక్కి ,నిల్చున్ ,నగున్ ”ఇతను తమ్ముడి లాగే బంతాట ఆడాడు .ఆకాశం లోకి విసిరేశాడు .కింద పడేశాడు .ఇటు అటు దొర్లించాడు .కాళ్ళ తో తోక్కేశాడు .పాత పగ అంతా తీర్చుకొన్నాడు .పైగా నవ్వాడు .”నీ గుండె చీల్చి నెత్తురు తాగుతా .నీకు దిక్కున్న చోట చెప్పుకో ”అన్నాడు దుస్స సేనుడి తో భీముడు .భీముడు అపర నరసిమ్హావతారమే ఎత్తాడు .పూర్వం పొందిన పరాభవానికి ప్రతీకారం సంపూర్ణంగా తీర్చుకొన్నాడు .–ఆ భీభత్సం ఎలా ఉందొ చూడండి -”నరసిమ్హుమ్దసురేందృ వ్రచ్చు కరణిన్ ,రౌద్ర ముదగ్రంబుగా ,–నుర మత్యుగ్రత ,జీరి ,క్రమ్మరు రుదిరంముల్లాసియై ,దోసిటన్ –వెర వారం గొని ,త్రావు మెచ్చు జవికిన్ ,మేనున్ ,మొగంబున్ ,భయం -కర రేఖంబోరయంగా ,జల్లి కొను ,నక్కౌరవ్యు జూచున్ బొరిన్ ‘ఈ విషయాన్ని వర్ణించే ముందు తిక్కన భీముడిని ”మహా బల నందనుడు ”అన్నాడు .మహా బలుడు అంటే వాయువు అని అర్ధం .గాలి శక్తి మనకు తెలిసిందే .అన్నిట్నీ ఎగరేసుకు పోతుంది ,పీకి పారేస్తుంది .దానికి అసాధ్యం ఏదీ లేదు .గాలి ప్రవాహం ముందు ఏదీ నిలబడ లేదు .ఇంత అర్ధం ఉంది ఆ మాట లో .అది ప్రళయ కాల ఝన్జ్హ.ప్రతిజ్ఞా నిర్వహణ కోసం భీముడు రాక్షస రూపాన్నే పూనాడు .కాని రాక్షసుడు కాలేదు .రక్తాన్ని పెదవి కి చేర్చాడే కాని ,తాగ లేదు .సుక్షత్రియ వీరుడు కనుక అధర్మం గా ప్రవర్తించ లేదు .
ఆశ్వతామ విషయం లో చాలా తేడా ఉంది .దుర్యోధనుని దుస్తితి ,తన తండ్రి ద్రోణుని మరణం అతన్ని కలచి వేశాయి .క్రోధం పెరిగి పోయింది .అయితే దానితో పాటు వివేకం కోల్పోయాడు .పూర్వం కర్ణుడు ,దుర్యోధనుడు చేసిన పాపపు పను లన్నిటిని ,వాళ్ళ ఎదుటే చెప్పిన ద్రోణ సుతుడు ,ఎప్పుడూ నైతిక స్తైర్యం తో ఉండే వాడు ,తండ్రిని మించిన వీరుడు ,పైగా బ్రాహ్మణుడు -అయి ఉండి కూడా ,క్రోధం తో వివశుడై ,రాక్షసుడిగా ప్రవర్తించాడు .తాను ద్రుష్టద్యుమ్నుని ఎలా చంప బోతున్నాడో ,కృప ,కృత వర్మ లకు వివరిస్తాడు .ఆ విధానం పరమ భీషణం గా ఉంటుంది —
”ద్రుష్ట ద్యుమ్ను ని,ముట్టి పట్టుదు ,మదోద్రేకంబడంగింతు ,ను -త్కృష్టాస్త్రంబుల ,జంప నల్క ,పశు భంగిమ్జంపినం గాని ,పో–దిష్టా వ్యాప్తి యనగ నా కిదియే ,భూ ఇష్టంబు ,గౌంతేయులన్ –గష్ట స్వైర విదాభి యోగ మృతులం గావింతు నుగ్రాకృతిన్ ”
పశువులను చంపి నట్లు చంపుతానని స్వయం గా ప్రకటించాడు .అప్పుడు కాని కోపం తీరాడట .ఉత్తమాస్త్రాలతో చంపాడట .ఎంతటి ఉన్మాద స్తితి లో ఉన్నాడో ద్రోణ సుతుడు మనకు అర్ధమవుతుంది .అందుకే నిద్రావాస్త లో ఉన్న ద్రుష్ట ద్యుమ్నుని తల పట్టు కొని –”నెల పయిం బాదాం దిగిచి ,నుర స్తలంబు ,మ్రో–కాల నొగిల్చి ,యేపున మొగంబతి దారుణ ముష్టి నొంచే ,ని –ద్రాలస వ్రుత్తి ,నంగముల యందు ,బలంబును ,బుద్ధి ,నేర్పు నం –జాలని యవ్విరోది ,వివశత్వము బొందగ జేసే వ్రేల్మిడిన్ ”
కాళ్ళతో ,చేతులతో పొడిచి తన్నాడు .పసువు ను సింహం చంపి నట్లు చంపేశాడు .వేదన తో రోజుతూ ,పోర్లాడుతూ ,నెత్తురు కక్కు కుంటూ ,ద్రుష్ట ద్యుమ్నుడు దుష్ట మరణం పొందాడు .ఇక్కడే భీమ ,ఆశ్వతామ ళ క్రోధాగ్ని లో ఎంత తేడా ఉందొ తెలుస్తోంది .నిద్ర లో ఉన్న ఉప పాండవులను చంపినా కసి తీర లేదు .ద్రుష్ట ద్యుమ్నుని వధ తోనూ తీర లేదు .ఆ క్రౌర్యం తో ఏనుగులను ,,గుర్రాలను ఇష్టం వచ్చి నట్లు చంపి పారేశాడు .పీనుగుల పెంట చేసే శాడు .వాటి పాదాలు కోశాడు కొన్నిటి మోరలు చేక్కేశాడు .కొన్నిటి గొంతులు తెమ్పేశాడు .కొన్నిటి వీపులను నొక్కేశాడు .ఇలా పిచ్చి ఎక్కిన వాడిలా అతి ఉన్మాదా వస్త లో రాక్షం గా ప్రవర్తించాడు . .అన్ని అవయవాలను ”క్రూర విచేష్ట త ,విభ్రమం గా ”దారుణం గా హింసించి చంపాడు .కిరాతకుడి లా ప్రవర్తించాడు .ఇంత రాక్షసా వేశం తో పైశాచికం గా ప్రవర్తించి మానవీయత కే మచ్చ తెచ్చాడు .ప్రతీకారేచ్చ ఉండ వచ్చు కాని ధర్మాధర్మ వివేకం ఉండాలి .ఉచితానుచితాలతో ప్రవర్తించాలి .దయా దాక్షిన్యాలకు నీళ్ళు వదిలి అతి అమానుషం గా ప్రవర్తించాడు ద్రోణ సుతుడు .యుద్ధ నియమాలకే వ్యతి రేకం గా ప్రవర్తించి తండ్రికి తల వంపులు తెచ్చాడు .రౌద్రాన్ని ,భీభాత్చాన్ని ఇంత తేలిక మాటల్లో చెప్పిన ,వర్ణించిన కవి ఇంత వరకు లేడు .భీముడి క్రోధం దుశ్శాసన వధ తో ఉపశమించింది .కాని ఆశ్వతామ కు అట్లా కాలేదు .ఈ విధం గా ఒకే రక మైన సన్నీ వేశాలలో ,భిన్న వ్యక్తుల ప్రవర్తన లలో తేడా ,వారి శీల స్వభావాలలో భేదాలను స్పష్టం గా వ్యక్తీకరించాడు మహా శిల్పి తిక్కన కవీశ్వరుడు .
సశేషం –మీ–గబ్బిట దుర్గా ప్రసాద్ –26-7-12.–కాంప్–అమెరికా
http://suvarchalaanjaneyaswami.wordpress.com

Posted in రచనలు | Tagged | 1 Comment

తిక్కన భారతం –15 యుద్ధ పంచకం లో వికశించిన మానవ ప్రకృతి -3

   తిక్కన భారతం –15

యుద్ధ పంచకం లో వికశించిన మానవ ప్రకృతి -3
మేఘ ధర్మం కాంతి ,గర్జనలు .నలుపు రంగు ను వాచ్యం చెయ్య కుండానే వ్యంగ్యం తో చెప్పాడు తిక్కన .సహజ మనోహరాలైన ఉపమానా లతో ఉదాత్త మైన విశేషార్ధాలను ధ్వనింప జేయటం లో తిక్కన గడుసు వాడు .ఇదే ప్రౌఢ కవి లక్షణం .ఈ ధ్వనికే ”కావ్యాత్మ ”అని పేరు .
అర్జునుడు వేసిన బాణాలతో శరీరం అంతా గాయాలై రక్తం ఓడుతున్న కర్ణుడు ”గిరికా నిర్ఘర ప్రకార శోభితా చలం ”లా గా ఉన్నాడట .రక్తం తో  తడిసిన శరీరం కమనీయ కాంతి తో ఉంది .మహాస్త్రాల కాంతి గొప్ప గా ప్రకాశిస్తోంది .రధం పై ఉన్న కర్ణుడు సంధ్యా కాల సూర్య బింబం లా  శోభితం గా ఉన్నాడు .పశ్చిమ దిశ కు చేరే సూర్య బింబం లాగా ఉన్నాడు .”భాస్వర ”అనే శబ్దం ఇటు కర్ణుడికి ,సూర్యుడికి కూడా వర్తిస్తుంది .త్వర లోనే అర్జునుని చేత వధింప బడతాడు అనే ధ్వని .ఈ విషయాన్ని అస్తమించే సూర్యుడు అనటం లో ధ్వనింప జేశాడు .సూర్యుడు తన ప్రచండ ప్రతాపం తో లోకాన్ని తపింప జేసి ,తన కాలం తీర గానే అస్తాద్రికి చేరటం సహజం .సూర్యుని అంశ తో జన్మించిన కర్ణుడు కూడా నేలకు ఒరుగుతాడు అని ధ్వని .అందుకే తిక్కన -;;దారుణాస్త్ర జాలామ్షుల వైరి సైన్య –తాప మొనరించి యా సూత తనయ తరణి –పార్ధ దుస్తర కాలవైభవము గడవ -ననువు లేమి ,నవ్విధంబున నస్త మించే ”కర్ణుని ప్రతాపాస్తామయం ,సూర్య ప్రతాపాస్త మయం తో అభేద మైన రూపకం చేశాడు కవి .కర్ణుని ప్రతాపాన్ని వర్ణిస్తూ ,దావాగ్ని జ్వాల అన్ని వైపులా వ్యాపించినట్లు ,బాణ జ్వాలలు సర్వ దిశలా ప్రయోగించాడట కర్ణుడు .కాలే వృక్షాలు ,వెదుళ్ళు ,ఫెళ ఫెళ  ఫెళ  ధ్వనించి  నట్లు కర్ణుని వింటి ధ్వని విని పిస్తోందట .
భీముడు గద తో గజ సమూహం పై దాడి చేయటం వల్ల ముఖం ప్రకాశించిందట సరైన జోడి దొరికి నందుకు .”ఏనుగు నెత్తుట గదయున్ ,దాను దడసి ,విలయ కాల దండ ధరుణి చందమున ”ఉన్నాడట భీ ముడు .అంతే కాక ”అడవి దరి కొనిన ,పావకు వడువున భీముడు ”కౌరవ వ్యూహాన్ని పొడి చేశాడు .పీనుగు పెంట చేయటం దండ ధరుడు అంటే యముని లక్షణం .అడవిని కాల్చటం అగ్ని పని .దహించిన కొద్దీ దావాగ్ని వ్యాప్తి విస్తారం అవటం సహజం .దాహక శక్తి కూడా వృద్ధి చెందు తుంది .అందుకే భీముని దేహం ఉప్పొంగి పోయింది .అతని శక్తి ,ఉత్సాహం ఇనుమడిస్తున్నాయి .సారధిని రధం లోనే ఉండమని ,దిగి ,గదతో వీర విహారం చేసిన తీరు అత్యద్భుతం ,దివ్య శక్తి స్పోరకం .అగ్ని కి తర తమ భేదాలుండవు .అలానే భీముడు అందర్ని స్వా హా చేస్తున్నాడు –ఆ వైభవం చూడండి —
”కవిసి యుగాంత దండ ధరుని కైవడి ,గోలు మసంగి ,కుంభముల్ –పవులగ ,దున్దముల్ దునియ ,బ్రక్కలు వ్రక్కలు గాగ ,దర్పమున్ –జవము బలంబు ,నొప్పగ,గజంబుల వ్రేసిన ,నెత్తు రోల్క గా –నవి ,వడె ,ధాతు నిర్జర మయాచల పంక్తుల బోలి మేదినిన్ ”.యుగాంతం లో ప్రాణులను చంపటం యముని ధర్మం .ఆ విలయం లో రౌద్రం ,భీభత్సం తప్పదు .అవి విలయ నృత్యామే చేస్తాయి .అలాగే కౌరవుల పాలిటి యముడు అయాడు భీముడు .సహజ సుందర వర్ణన .కింద పడిన గజ రాజులు ధాతు వులతో ,నిండిన   పర్వతాల లాగాఎర్రగా  ఉన్నాయట .పద్యం నడక మత్తేభం జి నడక లా ఉద్రేక ప్రధానం గా ఉండటం మరో విశేషం .
సైంధవ వధ నాడు అర్జున వీర విహారాన్ని కూడా అద్భుత రస పోషణ లో వర్ణించాడు .కవితా శిల్పానికి వన్నె తచ్చాడు .కిరీటి యెడ తెరిపి లేని యుద్ధమే చేశాడు .అర్జునుని అశ్వ శరీరాలు బాణ మయాలైనాయి .అవి కదల లేవు అన్నాడు కృష్ణుడు .రధం దిగాడుకిరీటి . .గాండీవ జ్యా రవం చేశాడు .కౌరవ సైన్యం ఒక్క సారి గావచ్చి  మీద పడింది .ఆ సమయం లో అర్జునుడు ప్రదర్శించిన గాండీవ ,అస్త్ర విన్యాసం అనితర సాధ్యం అని పించింది .అసాధారణ మైన ఆత్మ విశ్వాసం తో ,గాంభీర్య శౌర్యాదు లతో ,పాండవ మధ్యముడు మహా యుద్ధం చేశాడు .దివ్యం గా ప్రవర్తించాడు .తిక్కన వర్ణించిన తీరు చూడండి —
”భీభత్స ,రౌద్ర మహాద్భ్తములు -మూర్తి మంతములుగా మన మొనలు రక్త -మాంస ,మేదో సతి మస్తిష్కమా యథా జూడ -ఘోర రూపంబులై పరిక్షోభమొందే ”-ఇలా భీభత్సం సృష్టిస్తున్న భీ భత్సుడినవ్వు ను  చూసి బావ కృష్ణుడు –”పెరికిన బాగులు మేనులు -నేరి బడ నెల్లెదల గలయ ,నివిరితి ,ప రు లి -త్తరి నీళులు ద్రావకతె -ప్పిరి నెట్లొకో శత్రు సైన్య భీకర మూర్తీ “‘!మళ్ళీ నవ్వాడు గాండీవి .అందర్నీ నీళ్ళు కూడా తా గ కుండా చేస్తున్నావు అని మేళ మాడాడు బావ .ఇదిగో చూడమని బాణం తో నేల పగుల గొట్టాడు .బాణాలతో తొట్టె కట్టి ,అందులోకి భూగర్భ జలాలను చేర్పించి ,త్రాగించాడు బావ కృష్ణ మూర్తి కి .-”ధర దివ్యాస్త్ర హతిం బగిల్చి -కొలనుత్పాదించి ,వె,దానికిన్ –శర జాలంబుల నిల్లు గట్ట మన సైన్యంబులున్ వెరం బొందె ,న –చ్చెరు వందెన్ సుర సంఘముల్ ,హరి నుతించేమ్బొంగి ,యప్పార్దు ,భూ –వర ,మున్నిట్టివి ,సూడరు ,విననేవ్వారుం ద్రిలోకంబులన్ ”ఇలాంటి వింత ఇంత వరకు యుద్ధ రంగం లో ఎవరు చూడలేదు విన లేదు ఇక్కడే కాదు త్రిలోకాలలో కూడా అని ఆశ్చర్యం తో సంజయుడు ముసలి రాజుకు వర్ణించి చెప్పి పొంగి పోయాడు అర్జున ప్రతాప గరిమను చూసి .భీ భత్సం గా యుద్ధం జరుగు తోంది .అలంటి సమయం లో ఈ అద్భుతాలన్ని విలాసం గా ,ఆట విడుపు గా ,అలవోక గా చేశాడు అర్జునుడు .ఇక సైంధవుడు బ్రతకటం కల్ల అని తెలియ జేసి నట్లే .ఇదంతా అతని చావుకు నేపధ్యం -అర్జున మూర్తి మత్వాన్ని ప్రశంశ చేస్తూ చెప్పిన పద్య రాజాన్ని చూద్దాం –
”కురు సేన పై బడ్డ సరకు సేయక మంచు -విరియించు ,భానుని వెరవు మెరసి –ఇది నడుగ గల నని ఇంచుక గొంకక -తన ఘోటకంబుల దడవ బనిచి -కొలనక్కజంబుగా నలుగుల మొన ఘటి -ఇంచి యమ్ముల దాని కిల్లుగట్టి -సారధి లీల నశ్వముల కార్యము దీర్చు -నంతకు నవ్వుచు నవుల నిలిచి –గారవమున దాను గాని వాడును బోలె –నరద మెక్కె నింక నడ్డు పడగ –నలవియె ,పురారి కైన ను,వీనిచే -జచ్చు వాడు గాక సైంధవుండు ” .
సశేషం –మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –24-7-12–కాంప్–అమెరికా .

Posted in రచనలు | Tagged | Leave a comment

అమెరికా డైరీ శత దినోత్సవ వారం

 అమెరికా డైరీ 
                                                                                          శత దినోత్సవ వారం
జులై  పదిహేను సోమవారం  నుండి ఇరవై రెండు ఆది వారం వరకు విశేషాలు – వాన ప( పు )లకరింపు -దక్షిణాయనం -శ్రావణ మాసం విశేషాలు
కిందటి వారం అంతా టన్చన్ గా రోజు సాయంత్రం అయిదు గంటల నుంచి ఆరు గంటల వరకు వర్షం పలకరించి ,పులకరించి పోతోంది .ఉష్ణోగ్రత 96fపైనే ఉండటం ఈ జల్లులు వర్షం తో హర్షాన్ని కలిగించాయి .సమయ పాలన ను వాన దేవుడు బానే పాటించాడు .సోమవారం ,ఆదివారం మైనేని గోపాల కృష్ణ గారు ఫోన్ చేసి మాట్లాడారు .పదహారో తేది రాత్రి సూర్యుడు మకర రాశి నుండి కర్కాటక రాశి లోకి ప్రవేశించాడు .ఉత్తరాయన పుణ్య కాలం వెళ్లి దక్షిణాయనం వచ్చింది .ఈ శుక్ర వారం నుండి శ్రావణ మాసం ప్రవేశించింది .

ఫొటోస్
  శ్రావణ శుక్ర వారాల హడా విడి
ఈ శుక్ర వారం  నుండి వరుసగా వచ్చే అయిదు శుక్ర వారాలు మా అమ్మాయి విజ్జి వాళ్ళింట్లో రాత్రి పూట  ,అమ్మ వారి స్తోత్రాలు  భజన కార్య క్రమాన్ని ఏర్పాటు చేసింది .మొదటి శుక్ర వారం రాత్రి ఎనిమిది గంటలకు భజన మొద లైంది సుమారు ముప్ఫై మంది వచ్చారు గంట సేపు అమ్మ వారి స్తోత్రాలతో భజన బాగా జరిగింది .విజ్జి ,శ్రీ కెత్ ల తో పాటు మిగిలిన వారందరూ భజన గీతాలు పాడారు .ఆ తర్వాతా అందరికి విందు –అన్నం ,బెండ కాయ  కూర ,దోసావ కాయ ,గోంగూర పచ్చడి ,చపాతీ ,చోలీ కూర ,సాంబారు ,సేమ్యా పాయసం  ,పులిహోర ,అప్పడాలు ,పెరుగు తో రుచి ,శుచి కర మైన భోజనం .అందరు తృప్తి గా తిని అభి నందించారు .మిగిలిన నాలుగు వారాలు ఇలానే రావాలని అందరికి చెప్పటమే కాదు -అందరికి మెయి ల్ రాసింది ఇది వరకే .అంతా ఆయె సరికి రాత్రి పదిన్నర అయింది .వచ్చే శుక్ర వారం వర  లక్ష్మీ వ్రతం .ఉదయం ఎవరింట్లో వారు పూజ చేసుకొని రాత్రికి ఇక్కడికి వస్తారు .వాయనాలు ఇక్కడే ఇచ్చు  కొంటారు .చాలా మంది  మహిళలు వస్తారు కనుక అదొక వీలు .
ఈ ఆది వారం సాయి సెంటర్ లో ఉదయం పదింటి నుండి జరిగే కార్య క్రమానికి చాలా రోజుల తర్వాతా వెళ్లాను .మధ్యాహ్నం పన్నెండున్నర దాకా ఉండి ఇంటికి వచ్చాము .ఇక్కడి సాయి సెంటర్ గురించి కొన్ని విషయాలు తెలియ జేస్తాను .వీరి లో ఎక్కువ మంది మద్రాస్ ,హైదరాబాద్ ,వగైరా సత్య సాయి సెంటర్లు అ యిన ”సత్యం ,శివం ,సుందరం ”లలో ప్రత్యక్షం గా సంబంధం ఉన్న వాళ్ళు .వారందరూ మంచి క్రమ శిక్ష ణతో ,సాయి సేవా కార్య క్రమాలను ,భజనలను అత్యంత శ్రద్ధా ,ఆసక్తులతో నిర్వ హిస్తారు .డబ్బులు వసూలు చేయరు .అంతా వాలంటరీ సేవే .ఇందులో తెలుగు తమిళం మలయాళం ,హిందీ గుజరాతి ,రాజస్తానీ ,మొదలైన వారందరూ ఉన్నారు .భాషలు వేరైనా భావాలు ఒక్కటే .సేవ ప్రేమ . అంకిత భావం తో పని చేస్తారు .పిల్లలకు ప్రత్యెక క్లాసులు నిర్వ హించి వారి ని ఆదర్శ మార్గం వైపు కు మళ్లిస్తారు .పిల్లలందరూ చక్కగా కలిసి మెలసి ఉంటారు .ఎవరో ఒకరింటి వద్ద సాయంకాలా లలో భజన ఏర్పాటు చేసు కొంటారు .మిగిలిన వారు హాజరై కార్యక్రమాన్ని నిండుగా నిర్వ హిస్తారు .వీలైతే రాత్రి ఏదో టిఫిన్ ,లేక భోజనం ఏర్పాటు చేస్తారు గృహస్తులు .చెయ్యాలి అనే నియమం  లేదు .వారి ఉత్సాహం .డోలక్, హార్మని, తబలా వాయించే కళా కారులు మంచి గాత్రం తో శ్రావ్యం గా పాడే వారు  వీరి లో ఉన్నారు .వీరందరూ ఆడా మగా దాదాపు ఐ.టి.ఉద్యోగులే .తీరిక సమయాలలోనే ఈ సేవ .మధ్య మధ్య మెడికల్ కాంప్ లను నిర్వ హిస్తారు .మందులు ఉచితం గా ఇప్పిస్తారు .పూర్ ఫీడింగ్ ను చర్చి వారి సహకారం తో నిర్వ హిస్తారు .
ముఖ్య మైన విషయం సాయి సెంటర్ లోని వారంతా ఎ ప్రాంతం వారైనా ”శాకా  హారమే ”భుజిస్తారు .మద్యం సిగరెట్ల జోలికి వెళ్లరు .ఇవి నా లాంటి వాళ్ళందరికీ ఆనంద దాయకం గా ఉంది .మంచి కుటుంబం లా కలిసి మెలిసి ఉంటారు .ఇంత కంటే అమెరికా లో మంచి సమాజం ఉండదని పిస్తారు .మా ఇద్దర్ని ”అంకుల్ అని ఆంటీ ”అని ఆప్యాయం గా పలక రిస్తారు .అన్నిటి కంటే ఒకరి నొకరు కలిసి నప్పుడు ,విడి పోయే టప్పుడు ”సాయి రాం ”అని పలకరించు కొంటారు .భజన ముందు ,తర్వాతా ”సర్వే  జనా స్సుఖినో భవంతు .సమస్త లోకాస్సుఖినో భవంతు ”అని ప్రపంచ ,విశ్వ శాంతి మంత్రం చదువు తారు .ఇన్ని వేల గొంతులు ప్రపంచ వ్యాప్తం గా ఈ మంత్రాన్ని చదువుతుంటే సామూహిక వాక్కు ఫలితం ఉంటుందని మనకు తెలుసు .భోజనం చేసే ముందు భగవద్గీత శ్లోకాలు చదువుతూ అన్నాన్ని పరబ్రహ్మ స్వరూపం గా భావిస్తూ స్తోత్రం చేస్తారు .
సత్య సాయి భజనలు ఎ దేశం లో నైనా ఒకే రకం గా చేస్తారు .అవి చక్కగా బాణీలు కట్టి కే రకం గా పాడు కొనే తట్లు ఉంటాయి .అన్ని గ్రంధస్తం అయి ఉంటాయి . .ఎవ రైనా అలానే పాడ తారు .ముందు మామూలు స్తాయి, తర్వాత వేగ వంతం, తర్వాత తారా స్తాయి, మళ్ళీ మామూలు కు వస్తారు .భజనలు అన్ని చాల మంచి భావం తో శ్రీ రామ ,శ్రీ కృష్ణ శివ ,షిర్డీ ఆయీ బాబా జొరాస్టర్ ,క్రీస్తు మహమ్మద్ ,అల్లా పార్వతి లక్ష్మీదేవి ,సరస్వతి కాళిక ల పేర భజనలుంటాయి . .ఎ దేవుణ్ణి ,మత ప్రవక్త ను వదలరు .గణపతి ,సుబ్రహ్మణ్యం బుద్ధ ,జైనులనూ స్మరించే భజనలున్డటం విశేషం .  .సర్వ మత సహనం ఇక్కడ స్పష్టం గా కనీ పిస్తుంది .చివర్లో ప్రతి భజనలో షిర్డీ సాయి ,సత్య సాయి పేర్లు వుంటాయి .అదే ప్రత్యేకం .ప్రపంచం అంతా ఒకే పధ్ధతి లో భజన చేయటం గొప్ప విషయం .ఆదర్శం .సత్య సాయి మీద నమ్మకం ఉన్నా లేక పోయినా ఈ విధానం నాకు నచ్చింది .
సరే –అసలు విషయానికి వస్తే -మేము అమెరికా వచ్చి మూడు నెలలు దాటి పది రోజుల పైనే అయింది .అంటే వంద రోజులు అయిందిఅన్న మాట .అంటే ”శత దినోత్సవ వారం ”అయింది ఈ వారం మాకు …
ఈ వారం లో ఒకే ఒక పుస్తకం paul brunton రాసిన  in search of secret india ”  ను చాలా ఆసక్తి గా చదివాను .దీన్ని నాకు కానుక గా ఇచ్చారు మిత్రులు శ్రీ మైనేని గోపాల కృష్ణ గారు .దానిని ఆధారం గా ఇప్పటికి మూడు  ఆర్టికల్స్ -పరమాచార్య సందర్శనం తో పులకింత ,మేహేర్బాణి,పరమా చార్య పధం  రాశాను .ఇంకా భగవాన్ శ్రీ రమణ మహర్షి గారి గురించి, ఇంకా మరో రెండు ఆర్టికల్స్ రాయాలి .ఇది గాక లైబ్రరి నుండి తెచ్చిన ‘Albert Eistein ”క్షున్నం గా చదివి నోట్సు రాసుకోన్నాను .అవీ ఎప్పుడో వరుసగా రాయాలి .అంతకు మించి ఏమీ చదవ లేక పోయాను .
మీ–గబ్బిట దుర్గా ప్రసాద్ –23-7-12-కాంప్–అమెరికా
https://sarasabharati.wordpress.com
http://suvarchalaanjaneyaswami.wordpress.com

Posted in అమెరికా లో | Tagged | Leave a comment

తిక్కన భారతం –14 యుద్ధ పంచకం లో వికశించిన మానవ ప్రకృతి –2

  తిక్కన భారతం –14
                            యుద్ధ పంచకం లో వికశించిన మానవ ప్రకృతి –2

ప్రకట బలాధ్యులోక్కత దిరంబాయి ,పల్వురు వీక ,భూమి పా– లునకు నడ్డ  మైన దవులంబడి ,హుమ్మని నోరి కంద ,నా–చి గోన మ్రోగు బెబ్బులి విశేషము దోపగ ,బార్ధు పట్టి ,సా –యకముల నొంచి నం దెరలి రందరూ లేళులపిండు నాకృతిన్ ”
                                                పద్మ వ్యూహం 
పద్మ వ్యూహం లో అర్జున పుత్రుని విశ్రుమ్ఖాల వీర విహారానికి ఈ విధం గా నే పద్య రచన జరిగింది .ద్రోణునికి ఏమీ పాలు బోవటం లేదు .కర్ణ ,శకుని ,శల్య ,ఆశ్వతామ లను అస్త్ర గురుడైన ద్రోనాచార్యునికి  అధర్మానికి ప్రోత్స హించ క తప్ప లేదు .తీవ్ర మైన లోక నిండా కూడా భారించాల్సింది ఈ అవి వేక చర్య వల్ల .అందరు చేరి ఒకన్ని చేసి శస్త్రాస్త్రాలతో కొట్టి చిక్కుల్లో పడేశారు .అయినా ”వాలును ,బలకయు ను ,గొని ,య- బ్బాలుడు రాయ మార గణన భాగంబు న,కు –న్మీలిత ధృతి సారుండై–లీల నెగసి పోయే మండలీ భూత గతిన్ ”—”తన విద్య కలిమి వినతా –తనయుని భంగిం జరిం ప దామ తమపై డిమ–పూనా నూరుకు నను తలంపున -మన యోధులు భయము గొనిరి మనుజా ధీశా ”౧అని సంజయుడు అభి మన్యుని పరాక్రమాని వివ రించాడు .ఈ విధం గా ద్రోనాదులు ఊహించని అద్భుత విధానం లో అభి పరాక్రమం తో వీర విహారం చేశాడు .ఓర్వలేని గురుదే అతని ఖడ్గాన్ని ఖండించే శాడు .అయినారాధా చక్రం తీసుకొని ఉపెంద్రుడి లా మీద పడ్డాడు .–”కుంభ సంభావుడున్న దిక్కునకు గవిసి –యడ్డు పడు సేన జించి చెందాడు నక్కు –మార వరుని మేని యొప్పును మగతనంబు –జలము ,బలము గీర్తించే నిర్జరా గణము ”


అపకారం చేసిన వారిని కాటేసి చంపటం కృష్ణ సర్పానికి సహజ లక్షణం .అలాగే మీద పడ్డాడు అభి .వీరాధి వీరు లందర్నీ చీకాకు పెట్టాడు .ఒంటరి పోరు తో అలసి పోయాడు .చివరికి దుశ్శాసన కుమారుడిని చంపి ,తానూస్వర్గం చేరి చరిత్ర సృష్టించాడు అర్జున సుతుడు అభి మన్యుడు .యువకులకు ఆదర్శ మీనాడు .విధి వంచితు దాయాదు .కమలా కారాన్ని కల్లోలం చేసే వన గజాన్ని దయ లేకుండా ముట్ట డించిబోయ వారు చంపినా విధం గా అందరి అధర్మ ప్రవర్తన తో మహా వీరాధి వీరుడు అభిమన్యు కుమారుడు నెల కోరిగాడు .ఈ విషయాన్ని సంజయుడు ద్రుత రాష్ట్రునికి అద్భుతం గా వర్ణించి వీనుల విందు చేశాడు ముసలి రాజుకు .సంజయునికి మాత్రం తీవ్ర మనో వేదస్న కలిగించింది అభి మరణం -”జగము లన్ని యు తేజమున వెలిగించి -యపరాద్రి సేరిన ,తపను మాడ్కి –దార చైనా కాన్లు దరి కొని నివురు గా –జేసి ,యారిన ,దవ శిఖి విధమున –గగనంబు తో రాయు కరడులు గల జాలం –బివు ర బారిన మహార్ణవము కరణి -యున్నత గతి సెడి యుర్వి పై గడు విన్న –నైపది యున్న సుధాంశు భంగి –బీరమున దన వారికి బెమ్పోనర్చి -యరుల సమయించి వస మరి ,యనువు దప్పి ,లెగియు జూడ్కి కి జాల వ్రేగ గుచు బొలిచె –మహిత మూర్తి శోభితుడు ధన్యుడదిప ”తిక్కన సంజయుని నోటి తో పలికించిన ఉపమానాలన్ని ఉత్తమోత్తమం గా ఉంది అభి పటిమ ను మహోన్నతం గా  పెంచాయి .మూడు లోకాలను వెలిగించిన సూర్యుడు అస్తమించాదట .అరణ్యాన్ని బూడిద చేసిన దావాగ్ని ఆరి పోయిందట .మహా సముద్రం ఇంకి పోయిందట .లోకాలను వెలిగించే చంద్ర బింబం భూమి పై వాలి పోయిందట .ఇదంతా కాల వైప రీత్యం -విధి విలాసం .శుదాంషుడు అనటం లో మహా పరాక్రమం మనోహరం గా ఉందని భావం .హృదయ రంజకం గా యుద్ధం చేశాడని అర్ధం .అతి లోక యుద్ధ విహార స్వరూపం చూపించటం ,మహత్తర మైన ఉపమానాలు వాడి ,మన మనస్సు లను లాగి వేశాడు తిక్కన .అయ్యో పాపం అని పించేట్లు చేయ గలిగాడు అదీ సహృదయ స్పందన .లోకోత్తర పరాక్రమానికి లోకోత్తర ఉపమానాలు .ఔచిత్యానికిది పరా కాష్ట .
పద్మ వ్యూహం లో అభిమన్యుడు ప్రవేశించ టానికి ముందే తిక్కన పలికించిన వాక్యాలు అనర్ధాన్ని సూచించేవి గా కానీ పిస్తాయి .”నీకు యుద్దానుభావం లేదు .సాహసం చెయ్య వద్దు ”అని అభి సారధి ముందే హెచ్చ రించాడు .దానికి అభి –”అనవుడు నల్ల నవ్వి ,దతతనికి ట్లను దేవ యుక్తుడై -యనికి బలారి వచ్చిన ,బురారి గానంబుళు ,దాను బన్నినం –గినిసి కడంగి ,క్రీడియు కృష్ణుడు డాకిన  నే ,జయింతు ,మా–ర్కొని ,యను చుండుడున్ ,సరకు గొందునె ద్రోణుని తోడి యోదులన్ ”  ఇవి ఒక వీరుని ఉత్సాహ వాక్యాలే కావు .విధి ప్రేరితం గ మృత్యు ముఖం లోకి ప్రవేశించే వాడి నోటి నుండి వచ్చిన అతి సాహస వాక్యాలు .అతి ఆవేశం తో ,అహంకారం తో అన్న మాటలు .ఆరి పోయే దీపం ఒక్క సారి మినుకు మన్నట్లు వెలిగింది అంతే .ఇలా అభి మన్యు యుద్ధం లో విషాదం గర్భితం గా ఉంది .మర్నాడు అర్జునుడు వీర విహారం చేశాడు .సైంధవ రక్షణ కోసం ద్రోణుడు విశ్వ ప్రయత్నం చేసినా దాన్ని విఫలం చేయ టానికి అర్జుండు ప్రదర్శించిన అస్త్ర విద్యా నైపుణ్యం ,భీమ ,సాత్యకి ల శౌర్యాలను అద్భుతం గా వర్ణించి ప్రత్యక్ష దర్శనం చేయించాడు తిక్కన .
సైంధవ వధ కోసం అర్జునుడు ఏకాకి గా పద్మ వ్యూహం లోకి ప్రవేశించాడు .అతనికి సహాయం చేయ టానికి భీముడు వచ్చాడు .ద్రోణుడు అడ్డు పడ్డాడు అంతకు ముందే సాత్యకి ద్రోనుడిని తప్పించు కొని లోనికి ప్రవేశించాడు .సాత్యకిని పోనివ్వటం లో ద్రోణుడికి మనసు లో ఆంతర్యం ఉంది .సైంధవ వధ తో పాటు సాత్యకి రక్షణ కూడా అర్జునుని పై ఉంటుందను కొన్నాడు .ఈ పరిస్తితి లో భీముడు కూడా లోపలి చేరితే తమ పని ఖాళీ .నిజం గానే ,యుద్ధం లో అలసి పోయిన సాత్యకిని అర్జునుడు కాచు కొన్నాడు .శత విధాల భీమున్ని లోపలి పోకుండా అడ్డు కున్నాడు ఆచార్యుడు .ఇక్కడ భీమ పాత్ర ను చాలా గొప్పగా పోషించాడు ”నీ తమ్ముడు నా అనుమతి తో లోనికి ప్రవేశించాడు .నువ్వు మాత్రం నన్ను గెల్చి లోపలి వెళ్లాల్సిందే ”అని చెప్పాడు .భీముడికి కోపం వచ్చింది –”నరుదొక రది కుని యను మతి జొర దలచునే -మనుజ సేన ,సుర బాల మీనన్ -దెరలి కొని విచ్చల విడి నరుగున్ దన వలచిన ఎదకు -నది యట్లుండెన్ ”అని తమ్ముడి శక్తి సామర్ధ్యాలను ఏకరువు పెట్టాడు అర్జునుడు లోపలి వెల్ల టానికి ఎవరి అనుమతీ అక్కర్లేదు పొమ్మన్నాడు .అయితే తాను అర్జునుని లాంటి వాణ్ని కానని తన మగటిమి ని తెలిపాడు –”ప్రియమున వల్కి ,నిన్నను సరిమ్పగా ,పార్ధుడు కాదు సుమ్ము ,దు –ర్జయ భుజ శక్తి ,నిర్మదిత శత్రుడు భీముడు గాని ,నీవు ,డం –డ్రియు ,గురుండు బ్రియుమ్డు నని ,ప్రీతీ యొనర్చెద బూని వైరికిన్ –జయ మొన రింతు గాక,యని సేతునే దర్పము సూప కుండునే ”అని తన గద ను విసిరాడు .దాని కాంతులు అన్ని వైపులకు ప్రసరిచాయి .గురువు గారి రధం ముక్కలై పోయింది .ఆయన వేరొక రధం ఎక్కి వచ్చాడు .ఆయన్ను గెల్చి లోపలి వెళ్లటం సులభం కాదని గ్రహించాడు .ద్రోనుడిని విముఖుడిని చేసి ,ఆ వ్యవధి లో ల్పలికి ప్రవేశించాలని నిర్ణ యించాడు .ఆ ప్రయత్నాన్ని తిక్కన పరమ రమణీయ మైన పద్యం లో పోదిగాడు —  ”అరదము డిగ్గి ,యప్పటు శరా’వలికోర్చి ,మొగంబు వాచీ ,స -త్వరుడాయి ,వాన పై గురియ వంచిన మస్తకమొప్ప బోవు ,సుమ –దార వృష భంబు లీల జానీ ,,దర్ప మేలర్పగా నొక్కచే ,నొగల్ –వెరవున బుట్టి ,తేరు ప్రజా విస్మయ మందగా వీచి వైచి నన్ ;;–వర్షం పడుతుంటే -అతి ఉత్సాహం తో చేల రేగి ,తల వంచి ఎత్తైన ప్రదేశాన్ని ,కొమ్ముల తో ధీ కొనే కోడే గిత్త లాగ ఉన్నాడట భీముడు .ఎంతో సహజ మైన వర్ణన .అతని మాటల్లో క్షాత్రం ,రాజసం ఉట్టి పడ్డాయి .గురువు కనుక పితృ సమానం గా ఆరాధిస్తాను కాని ,శత్రువుకి జయం చేయాలని ప్రయత్నిస్తే -శౌర్యం చూప కుండా ఉంటానా -అని అతని మాటలకు అర్ధం .చేతల్లో చూపించాడు .ఇందులో పరాక్రమ ఉద్ధతి ,వినయం ,వివేకం ఉన్నాయి .ఇంతటి భీకర యుద్ధం లో కూడా ఇంత మనోహర వర్ణన .
భీష్ముడు ,అర్జునుడు తేవ్రం గా పోరాడుతున్నారు .కృష్ణుడు ఆగ లేక పోయాడు .రధం దూకి ,భీషుని పై కుప్పించి ,ఎగసే ఘట్టాన్ని పోతన్న గారు భాగవతం లో వర్ణించిన పద్యం మనకందరికీ వచ్చు .ఇక్కడ అదే దృశ్యాన్ని తిక్కన ఎలా వర్ణించాడో చూద్దాం –”ధరణీ చక్రము గ్రక్కునం గదల ,దిగ్దంతా వలి శ్రేణి ,కం –ధరముల్ ,మ్రోగగా బదన్ ,దిశా వలయముత్కంపంబు గా ,నీ బలం –బురులం బారాగా భీష్ము పై గమిసే రౌద్రోద్రేకము జూచి ,ఖే –చార లోకంబులు సంచరింప  హరి చంచాద్బాహు ఘోరాక్రుతిన్ ”అని వర్ణించి వెంటనే దృశ్యాన్ని మార్చేస్తాడు తిక్కన .–”లలిత పీనామ్బరంబు విలాస మొప్ప –సింహ ,నాదోద్భాతం బరగు చెలువు తోడ –మెరుగు వెలుగును ,గర్జయు మెరయ వచ్చు –కారు మొగిలన కృష్ణు నాకార మొప్పె ”.నిమిషాల మీద పద్యాలు దృశ్యాలు మార్చి భావ శుద్ధి తీసుకు రావటం తిక్కన చాతుర్యం .ఆతన లో భక్తీ ,ఇక్కడ శ్రీ కృష్ణుని వీర విలాసం .అంతే తేడా .
సశేషం –మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –23-7-12.–కాంప్ -అమెరికా .

Posted in రచనలు | Tagged | Leave a comment

తిక్కన భారతం –13 యుద్ధ పంచకం లో విక సించిన మానవ ప్రకృతి-1

తిక్కన భారతం –13
యుద్ధ పంచకం లో విక సించిన మానవ ప్రకృతి
-1
భీష్మ ,ద్రోణ ,కర్ణ ,శల్య ,సౌప్తిక పర్వాలను యుద్ధ పంచకం అంటారు .యుద్ధ రంగం జన జీవనానికి దూరం గా ఉంటుంది .యుద్ధం లో వీర ధర్మం ఆకర్షణీయం గా ఉండదు .జుగుప్స భీభత్సా లతో నిండి ఉంటుంది .అందుకని సామాన్యులకు రుచించదు .అయినా ఇందు లో కూడా తిక్కన ,అసాధారణ ప్రజ్ఞను చూపి ,చదవరులకు ఆకర్షణ కలిగించాడు .ఆయన ప్రతిభ సర్వతో ముఖం గా వికసించింది .-”వేద వ్యాస మునీశ్వరు –పదంబులు దలచి మ్రొక్కి ,భక్తీ రసైకా -స్వాదన సుకరానందో –త్పాదన దివ్య మతి నగుచు దగ నేరిగింతున్ ”అని సంజయుడు ద్రుత రాష్ట్రునికి చెప్పిన మాట తిక్కనకూ వర్తిస్తుంది .18 అక్షౌహిణీ సైన్యం తో ,18రోజులు జరిగిన యుద్ధాన్ని రస వంత మైన కావ్యం గా వ్రాయటం అంత తేలికైన పనేమీ కాదు .అందుకే వ్యాసర్షి కి నమస్కరించాడు .భక్తీ రసం తో ఆనందం తేలిగ్గా లభిస్తుందని భావించి ,ఆ ఆనందం తో దివ్య మైన మనోబలం తో యుద్ధ పర్వాన్ని రచిస్తానని ప్రతిజ్ఞ చేశాడు తిక్క యజ్వ .-”ద్వాపరే ద్వాపరే విశ్నుహ్ వ్యాస రూపో జనార్దనః ‘అన్న దాని ననుస రించి ,ద్వైపాయన మహర్షి సాక్షాతూ శ్రీ కృష్ణుడే కనుక ,ఆతని యెడ భక్తీ తో ,దివ్య చక్షువు తో ,బుద్ధి వికాసం తో ,ఆర్ష ధర్మ మైన కవితా శక్తి తో రచన చేసి నట్లు మనం భావించాలి .విసుగు కల్గించే యుద్ధ వర్నలు లేకుండా ,వర్ణనా వైవిధ్యం తో ,సందర్భోచిత మైన శైలి తో ,రస పోషణ ,ఔచిత్యం ,ఉట్టి పడేట్లు చిత్రించాడు .చైతన్య విలసితం గా ,అర్ధ స్ఫూర్తి ,భావ గాంభీర్యం లతో ఉదాత్తత ను కల్పించటం తిక్కన శేముషికి నిదర్శనం .యుద్ధానికి మనోహరత్వాన్ని రూపు కట్టించిన మహా కవి తిక్కన.
భీష్ముడు యుద్ధం లో కూలి పోయాడు అర్జునుని వీర విహారం తో .ఆ బాధ తో ద్రుత రాష్ట్రుడు –”అంచిత తాల కేతు కిరనాలి మేరుమ్గులు గాగ ,మౌర్వి మ్రో–యించుట గర్జ చందనమున నేచి ,విరోధి దవానలంబు ,మా–యించు శితాస్త్ర వర్షమున నిట్టిది భీష్మ మహాభ్రం మెట్లడం- గిన్చేనో శిఖండి యను గ్రుత్రిమ వాయువు దాకి దైవమా !”–”పెరిగి పాండవామ్బుధివెల్లి  విరిసి నపుడు -నిలువ నిమ్మగు దీవిగా నిన్ను దలచి -యుండ నత్యంత తుచ్చ శిఖండి పల్వ -లాక్రమంబున మునిగి తె యకట తండ్రీ ”అని ముసలి రాజు ఏడ్చేశాడు .”దైవమా ”అని రెండు సార్లు అంతం తో ఇంకా తన చెయ్యి దాటి పోయిందని గ్రహించాడు .ఇదీ మానవ ప్రకృతి .విధి విలాసం ,వైపరీత్యం ఎదిరించ రానివి .పాండవులు అనే మహా సముద్రం ఉప్పొంగినా ,మునగని భీష్ముడు అనే ద్వీపం శిఖండి అనే చిన్న నీటి మడుగు పొంగ టం వల్ల  ఆక్రమింప బడింది మునిగి పోయింది . అంటే విధి బలీయం కదా .ఇప్పటి దాకా కౌరవులకు ఆశ్రయమైన దీవి మునిగి పోతే వారి ఉనికి కే మహా ప్రమాదం కదా .ఇంక వాళ్ళ కు ఆశ్రయం ఏదీ ,ఎక్కడ తల దాచు కొంటారు?పాండవ సముద్రం లో కౌరవులంతా మునిగి పోవాల్సిందే నని ధ్వని .ఆ మాట ముసలాయనే అనే శాడు .అర్జున పరాక్రమం వర్ణించ టా నికి ముసలి రాజు కు ఎన్నో మాటలున్నా పదాలున్నా ”శిఖండి ”అనే మాట నే ప్రయోగించాడు రెండు సార్లు .ద్రుపదుని కొలువు లో” పేడి వాడి ”లా గా తల దాచుకొన్న వాడా ఇంతటి పని చేసింది అని ఈస దింపు ,అసహ్యం కూడా .పక్షపాతం నర నరాన జీర్ణించి పోయింది ముసలి రాజుకు .అయినా కురు వంశాన్ని ఇప్పటి దాకా నిలబెట్టి కంటికి రెప్ప లా కాపాడిన పితామహుని పతనానికి గుండెల్లో ఎక్కడో మారు మూల కలుక్కు మంది.చదివిన మనకూ బాధ కల్గిస్తాడు తిక్కన .
”అమర నదీ సుతుండు వాడి నప్పుడు ,వీరల బుద్ధి సంధి కా –రయమునకు జొచ్చు నింక నని ,యాత్మ దలంచితి నమ్మహాత్ముడున్ –సముచిత వాక్య వృత్తిగురునాయకు దేర్పరగా జూచే ,చిత్త దో –ష మహిమ ,నద్దురాత్ముడు ,ప్రశాంతత నొందద ఎన్ని భంగులన్ ”అని శల్య వధ తర్వాతా అర్జునుడు దుర్యోధనునిమూర్ఖత్వాన్ని గురించి కృష్ణుని తో చెప్పాడు .-”గంగా తనయుడు దెగినను -సంగరమున నుత్స హింప జనునే తమకున్ –వెంగలులని ,యప్పుడు దేలి –యంగా నేరిగితి సుయోధనాదుల గృష్ణా ;;!అని కిరీటి కుంగి పోయాడు .ఇలా భీష్ముని యుద్ధౌన్నత్యాన్ని ,పెద్దరికాన్ని కురువంశ పాలకుడిని రెండు వైపులా వారూ ఎంత స్పష్టం గా అంచనా వేశారో తెలుస్తోంది .దీని వల్ల యుద్ధ పరిణామం కూడా నిశ్చయ మై పోయి నట్లే .ఈ పద్యాలలో ప్రతి పదం ధ్వని ప్రధానం .అర్ధ గౌరవంతో తొణికిస లాడాయి .ఇవి యుద్ధ పర్వం లో తిక్కన చేయ బోయే భావి శిల్పానికి మచ్చు తునకలు మాత్రమె .
ద్రోణ పర్వం లో కూడా కౌరవ సేన స్తితి ని వర్ణిస్తూ -”పతి రహితాత్ముడైన సతి భంగియు ,గోపక హీన మైన గో–ప్రతతి విధంబు ,సస్య విదూర స్తితి యైన ధరిత్రి చాడ్పును -ద్ధత హరి శూన్య మైన వసుధా ధర కందర భూమి చందమున్ — ,మతి మన సేన దోచే  బుధ మాన్యుడు భీష్ముడు లేక యుండుటన్ ”అని వర్ణిస్తాడు .భర్త లేని స్త్రీ ,కాచే వారు లేని ఆవులు ,రక్షణ లేక పోవటం వల్ల దుర్మార్గుల బారికి ,మృగాల నోటికి ఆహారం అవుతాయి .పంట లేని భూమిని చూస్తె ,ఈసడింపు ,సింహం లేని గుహ అంటే తెలికదనం లోక సహజం .అలాగే భీష్ముడు లేని కౌరవ  సైన్యం అనాధ ,దీన ,అని తప్పక పాండవుల చేతి లో చిక్కుతుంది అనే ధ్వని ప్రధాన పద్యాలివి .అంతేనా ఇంకా విజ్రుమ్భించి మానవీయ కోణాలను ఆవిష్కరిస్తాడు .”తన ప్రియుడు , ,రక్షకుడు అయిన బార్థ ను తన ఎదుటే మింగిన తోడేళ్ళ గుంపు తనను చుట్టూ ముట్టగా భయ కంపిత అయి ,దిక్కులు చూసే ఆడ జింకలా ఉందట కౌరవ సైన్యం .ఇది అత్యంత ప్రత్భాన్విత ధ్వని తో కూడిన పద్యం .”భీష్ము నాజిం గబళించిన పాండవుల విక్రమ లీల ”ను అత్యంత అద్భుతం గా వర్ణించాడు తిక్కన .పాండవుల అకలి తీర లేదని ,మిగిలిన వాళ్ళ ను కూడా మింగనిదే శాంతించదని ధ్వని .ఆకలి మహా ఎక్కువ గా ఉండే జంతువూ తోడేలు .అందుకే ఆ పదాన్ని సందర్భోచితం గా ప్రయోగించాడు .
అసలు యుద్ధానికి బయల్దేరు తున్న పాండవ కుమారా వర్గానికి ”కన్నె కయ్యం ”అవటం తో ఉత్సాహానికి అంటూ లేకుండా పోయింది .ఎప్పుదేప్పుదని ముందుకు దూకు తున్నారు పాండవులు .నవ యవ్వనం లో ఉండటం తో నడక -మదించిన ఏనుగు లాగా ఉందట .భూమి కంపిస్తోందట .ఉత్సాహ ,వికాసాలతో వాళ్ళ ముఖాలు భుజ గర్వం తో పొంగి పోతున్నాయట..”కన్నె కయ్యం -మాద్యద్దంతి యూధం ”అన్నాడు .మనోహర మైన అర్ధ స్ఫూర్తి .ప్రళయ కాలం లో తానడవ లీల లో ప్రచండ మూర్తి అయిన పరమ శివుని లా విజ్రుమ్భిస్తున్నాదట భీష్ముడు .ఎదిరించే మొన గాడు లేక పాండవ సైన్యం కకా విక లైంది .అప్పుడు వచ్చాడు యువ కిశోరం అభి మన్యుడు .కృత వర్మ ,కృపు లను అడ్డగించి ,ముత్తాత భీష్ముని పైకి లంఘించాడు .-ఆ వైభవం చూడండి –”ఆ సౌభద్రుమ్ డుగ్రపు-వేసవి దావాగ్ని శుష్క విపినంముల నిరా–యాసంబుగ–‘  దరి కొను గతి -భాసిత శర శిఖలు వారి పై బర గిన్చేన్ ”–”రంగ త్ప్రద నస్త్నస్త్యుత్యాటు -రంగాముడై ,తాన్దవాభి రాతుడగు హరు లీ–లం గడగివీర నృత్యము -సంగర రంగమున జేసే శత్రులు మెచ్చన్ ”—-పనికి రాణి ,నీరస మైన అడవిలా ఉన్న కురు సేనకు తీవ్ర వేసవి దావాగ్ని అభి మన్యుని క్రోధం .ఊరికే దాహించేస్తుంది .దీనితో సర్వ కురు సైన్య విన్నషణం ధ్వనిస్తోంది .అడవికి నిప్పు అంటూ కుంటే అంతా కాలిస్తేనే కాని చల్లారదు ఆర్పే వారుండరు .అలానే ఉంది కౌరవ సైన్య స్తితి .అభి మన్యుని శౌర్యం ప్రళయ కాల రుద్రుని తో పోల్చటం వల్ల ఉదాత్తత కలిగింది .బిందువు తో ఉన్న ”డకారం ”,పాదాన్తాలలో విరుపు వల్ల శబ్దార్దాల తో మంచి భావం ,ధ్వని లో లయకాల తాండవం స్పష్టం గా కళ్ళకు కన్పిస్తాయి .భీష్ముడు అష్ట మూర్తి అయిన హరుడు .అభి మన్యుడు తాండవ హరుడు .ఈ పోలిక లో అష్ట మూర్తి ఆధిక్యత ధ్వనిస్తుంది .ఇద్దరు హరుల పరాక్రమం విలాసం .అంతే కాదు -ఇంకో చోట అభి మన్యుడు అనే కార్చిచ్చు కౌరవ సేన అనే దూది పై పది నట్లుంది అన్నాడు .ఇది ఇలా ఉంటె –దుర్యోధనుడు ఎడురైనాడు .ఎలా ఉన్నాడు అంటే -”ఆకలి లో ఉన్న సింహం దగ్గరకు చేరే ఏనుగు లా గా ఉన్నాడట .ఇక్కడ ఏనుగు దుర్యోధనుడు .సింహం అభి .ఇక్కడా కౌరవ పరాభవం ధ్వనించింది .ఇంతలో క్రుపఅశ్వథామ స్వతామ ,కర్నూలు వచ్చి అభి మాన్యుని బారి నుండి ,కురురాజు ను కాపాడు కొన్నారు .అభి మాన్యుని నుండి అభి మాన్యుని రక్షించటం క్రూర వ్యాఘ్రం తిన బోయే మాంసాన్ని హరించటం వంటిది అట .క్రోధాగ్ని తో వీరందరి పై బాణాగ్ని కూరి పించాడు యువ కిశోరం .గర్జన తో పారి పోయిన లెల్ల గుంపు లాగా పారి పోయారట .

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ — -22 -7-12 క్యాంపు -అమెరికా

Posted in రచనలు | Tagged | Leave a comment

జులై మాస పత్రిక ప్రతీక ” సమకాలిన కవిత్వంలో – భావచిత్రాలు” పుస్తక పరిచయం

Posted in రచనలు | Tagged | Leave a comment

అమెరికా ఊసులు -10 –భాష -ఘోష

అమెరికా ఊసులు -10
–భాష -ఘోష
భావ వ్యక్తీకరణకు భాష అవసరం అని మనకు తెలిసిన విషయమే
.కొన్ని భాషలకు లిపి ఉండదు .మాట్లాడటానికే అవి ఉపయోగ పడతాయి .ఇరవై అయిదు
రకాల రచనా విధానాలున్నాయి .అక్షర మాలను ఉప యోగించి సాధారణం గా భాషను
రాస్తారు కాని చానా జపానీస్ భాషలను ఇడియోగ్రాం ల లో రాస్తారు .అవి
గుర్తులు గా ఉంటాయి .సుమేరియన్ భాష అత్యంత ప్రాచీన భాష గా అంటే 5,000ఏళ్ళ
నాటి భాష గా భావిస్తారు .సంస్కృతానికి సుమారు నాలుగు వేల ఏళ్ళు అని వీరి
నమ్మకం .ప్రపంచం మొత్తం మీద 6,912భాషలున్నాయి వీటికి మాండలికాలు ఉన్నాయి
.ప్రపంచ జనాభా లో సగం మంది ఇరవై భాషలే మాట్లాడుతున్నారు .బ్రిటన్ సూపర్
పవర్ కాక పోయినా వారి భాష ఇంగ్లీష ఆది పత్యం వహిస్తోంది .అందుకే ”రూల్
ఆఫ్ బ్రిటన్ పోయింది కాని రోల్ ఆఫ్ ఇంగ్లీష్ ”అనిచేణుకుతుంటారు .ఇండియా
లో .350మిలియన్ల జనం ఇంగ్లీష లోనే మాట్లాడు తున్నారు .వీరు బ్రిటన్
,ఆస్ట్రేలిన్యూజిలాండ్అమెరికాలలో ఇంగ్లీష మాట్లాడే వారికి సరి సమానం . ,
మాట్లాడే వారు లేక భాషలు అంత రించి పోతున్నాయి .ఈ విషయాన్ని
u.n.o.హెచ్చ రించి చాలా కాలమైంది .గౌతమ బుద్ధుడు బౌద్ధమత ప్రచారాన్ని
”పాళీ భాష ”లో చేశాడు .దానికి లిపి లేదు .ఇప్పుడీ భాష మాట్లాడే వారి
సంఖ్య అతి పరిమితం .ఇది శ్రీలంక ,తాయి లాండ్ ,మయన్మార్ దేశాలలో పూజా
విధానాలకు మాత్రమె పరి మితమైంది .అతి నాగరక భాష అని మనం గౌరవించే సంస్కృత
భాష మాట్లాడే వారు లేక గ్రందాలకే ఎక్కువ గా పరిమిత మైంది .ఐరిష్ భాష ను
గాలిక్ అంటారు ఐర్లాండ్ దేశీయుల అధికార భాష .ఆ దేశం స్వాతంత్రాన్ని1922
లో పొందినప్పుడు ఆ భాషను రెండు లక్షల యాభై వేల మంది మాట్లాడే వారట
.ఇప్పుడు కేవలం 30,000మంది మాత్రమె మాట్లాడుతున్నారట .
ఇవాల్టి ప్రపంచం లో199 భాషలను కేవలం డజను మంది మాత్రమె ఆయా భాషలలో
మాట్లాడుతున్నారని తెలిసి భాషా వేత్తలు ఆందోళన పడుతున్నారు . ఇందులోకి
దిగితే చాలా ఆశ్చర్య కర విషయాలను తెలుసు కొని గుండె బాదు కొంటాం .ఇయాక్
అనే భాష మాట్లాడే ఏకైక వ్యక్తిఅలస్కా లో2008 లో మరణించటం తో ఆభాష అదృశ్య
మైంది . ఐరిష్ భాష లాంటి ”మాక్స్ ”భాష మాట్లాడే చివరి ఆయన 1974 లో
మరణించటం తో అదీ తీసి వేత కు గురైంది .అండమాన్ దీవుల్లో” బో” భాష
మాట్లాడే 85ఏళ్ళ మహిళ2010  ఫిబ్రవరి లో చని పోవటం తో 65,000సంవత్స రాల
నుండి అవిచ్చిన్నం గా ఉన్న లంకే తెగి పోయింది .లాటియా యా లో”లివోనియన్
”  భాష మాట్లాడే ఒకే  ఒకరు ఇంకా ఉన్నారు .ఇప్పటి వరకు ఎనభై భాషలు ,ఆ
భాషలు మాట్లాడే జనం లేక కాల గర్భం లో కలిసి పోయాయి .ఇది చాలా ఆందోళన కర
విషయం .
కొన్ని భాషలు భాషా సాన్కర్యం వల్ల అంతరిస్తాయి. పాత ఇంగ్లీష
అనే ఆంగ్లో సాక్సన్ భాష మోడరన్  ఇంగ్లీష వ్యాప్తి వల్ల కనుమరుగైంది .భాషా
శాస్త్రజ్ఞుల లెక్క ప్రకారం 516భాషలు కోన ఊపిరి తో మినుకు మినుకుమంటూ
చావా లేక బ్రతకా లేక ఉన్నాయంటున్నారు .ఆఫ్రికా లో 46 ,అమెరికా లో170
,ఆసియా లో12, పసిఫిక్ లో 210 భాషలు కనుమరుగు ఆయె స్తితి లో ఉన్నాయి .ఈ
శతాబ్దం అంతానికి మాట్లాడే భాషల్లో సగం అంత రిస్తాయని హెచ్చరిక .
మనదేశవిషయానికి  వస్తే -428 భాషలున్న మనకు అధికార భాషలు 22ఉన్నాయి
.196 భాషలు ప్రమాదం అంచున ఉన్నాయి .అందులో 84 భాషలకు తీవ్ర గడ్డు స్తితి
.మరీ ముఖ్యం గా 62 తులసి తీర్దానికి రెడీ గా ఉన్నాయి .ఒక సారి వాటి వివ
రాలను చూద్దాం -అస్సాం లో అహోం ,తురంగ్ భాషలు ,అండమాన్ ,పాళీ లలో
ఒకో-జువాయ్ ,టిబెటన్ బర్మా లో అకాబీ ,అకాబో ,అకా కారి ,అకా కేడీ ,అకా
కోరా ,అకా బాలే లు అంత రించి పోయి నాగరకత కు సంస్కృతికీ వికాసానికి దోహదం
చేసినవి నిష్క్రమించి ఆందోళన కు గురి చేస్తున్నాయి .అతి కొద్ది మంది జనం
మాట్లాడే భాషల గురించి వింటే గుండె తరుక్కు పోతుంది .అండమాన్ లో ని జేరు
భాషనూ కేవలం ఏడుగురు మాట్లాడుతున్నారు .అక్కడిదే అయిన మరోభాష జార్వా ను
మాట్లాడే వారు 250 మంది మాత్రమె .అక్కడివే అయిన ఒంగే ను వందమంది ,ఆ
పూకిక్వార్ భాషను24 మంది అస్సాం లోని ఖామ్యంగ్ భాష ను కేవలం యాభై మంది
,ఒరిస్సా లోని పరాంగ్ భాషను 76మంది ,ఉత్తరాఖండ్ లోని జాద్భాష మాట్లాడే
వారు మూడొందలు మాత్రమె ఉన్నారు అంటే భాషలు ఎంత తీవ్ర వేగం తో కాల గర్భాన
కలిసి పోతున్నాయో తెలుస్తోంది .
ఇలా ఆందోళన పది నిశ్చేష్టులై చైతన్య రహితం గా ఉండటమేనా
?లేక భాషా పునరుద్ధరణ కార్య క్రమాలు ఏమైనా జరుగు తున్నాయా అని మనకు అను
మానం రావటం సహజం .ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి .భాషలను బతికించు కొనే
ప్రయత్నాలను తీవ్రం గానే చేస్తున్నారు .దీనికి కొన్ని ఉదాహరణలు -బ్రిటన్
లోని యూని వర్సేల్ భాష అని పిలువ బడ్డ ”కార్న్ వాల్లోని ”కార్నిష్
”భాష మాట్లాడే వారు 1990 లో దాదాపు అంత రించి పోతే  పటిష్టమైన చర్యలను
తీసుకోవటం వల్ల ఇప్పుడు 300 మంది ఆ భాషను నేర్చుకొని సజీవం గా ఉంచారు
.హాట్స్ ఆఫ్ .అలాగే ఐస్ లాండ్ లో ఇంగ్లీష భాష టో సంకరం కా కుండా వాళ్ళ
భాష లో పదాలను సృష్టించుకొని చక్కగా వాడుకొంటూ భాషను
బతికిన్చుకొంటున్నారు .
ఆంద్ర ప్రదేశ్ లో భాష లను పునరుజ్జీవింప జేయటానికి భాషోద్యమ
ఉద్యమాలను చేబట్టారు /”తెలుగు లో మాట్లాడటం జన్మ హక్కు ”అనే నినాదం
పెరిగింది .ఆంగ్ల మాధ్యమాన్ని తగ్గించామనే ఆందోళన చే బట్టు తున్నారు
.తెలుగు భాషా సంఘాలు తెలుగు భాషా సంస్కృతికి అనేక పధకాలను ప్రభుత్వానికి
సూచించి అమలు చేయటానికి ఒత్తిడి తెస్తున్నాయి .ఇప్పుడు తెలుగు అధికార భాష
గా ఉన్నా ఆ సంఘానికి అధ్యక్షుడు లేడు .తెలుగు అకాడెమీ లేదు .తెలుగు భాష
కు మంత్రి లేడు’ఎంతో ఒత్తిడి మీద నాలుగేళ్ల క్రితం తెలుగు కు ప్రాచీన
హోదా లభించినా ఇంకా అధ్యయన కేంద్రం కేంద్ర గ్రాంటు రాలేదు .అసలు మంత్రులు
శాసన ,లోక సభ సభ్యులు ఈ దిశా గా చేయాల్సిన ప్రయత్నం చేసింది తక్కువే
కృష్ణా జిల్లా రచయితల సంఘం ఈ విషయాలలో అనేక చైతన్య
యాత్రలను జరిపి ప్రజలకు విషయాలను తెలియ జేసింది .తెలుగు ను కోర్టులలో
అమలు జేసే విషయం లో సెమినార్ నిర్వ హించింది .రె ”తెలుగు రచయితల ప్రపంచ
మహా సభలు”రెండింటిని విజయ వాడ లో అతి ఉత్సాహం గా నిర్వహించి అందరి
దృష్టిని ఆకర్షించింది .రెండ వ సభల అనంతరం ఆధునిక సాంకేతి కతను జోడించి
తెలుగు ను విశ్వ వ్యాపితం చేసే ఆలోచన చేసి కొత్త ఫాంటులను ఆవిష్కరింప
జేసి అంతర్జాలం లో తెలుగు వ్యాప్తికి కృషి చేసింది .ఈ సంఘానికి
అధ్యక్షకార్య దర్శులు శ్రీ గుత్తికొండ సుబ్బా రావు  డా.జి వి.పూర్ణ చాద్
ల సేవలు నిరుప మానం .వీరికి మార్గ దర్శనం చేస్తున్న వారు శ్రీ మండలి
బుద్ధ ప్రసాద్ .,యార్ల గడ్డ లక్ష్మీ ప్రసాద్ గార్లు .అలానే తెలుగు
భాషోద్యమాన్ని తమ భుజ స్కంధాల పై మోస్తు , వయస్సు ను కూడా లెక్క జేయ
కుండా అవిశ్రాంతం గా కృషి చేస్తున్న మాన్యులు శ్రీ సి.ధర్మా రావు ,శ్రీ
సామల రమేష్ బాబు గార్ల సేవ లు మాటలతో చెప్ప లేనంతటి ఉత్క్రుష్టమైనవి .
భాషను రక్షిస్తే అది మనల్ని రక్షిస్తుంది అని అందరు
గుర్తించాలి .మాత్రు భాష ఔన్నత్యాన్ని తెలుసు కోవాలి ఇంటి భాష గా తెలుగు
లో మాట్లాడాలి .మన పిల్లలతో తెలుగు లో మాట్లడించాలి . ఈ ”భాషా  ఘోష ”
అంతటా నిన దించాలి .–”భాష ఆలోచన కు ఆహార్యం ”–”నా మెదడు లోని
ఆలోచనలను నీ మెదడు లోనికి శస్త్ర చికిత్స లేకుండా ప్రవేశ పెట్టేదే భాష
”అన్నారు మహాను భావులు .
ఈ వ్యాసానికి ఎక్కువ ఆధారం శ్రీ ఏం.యెన్.శాస్త్రి
-(ముంబాయ్) గారు రాసిన”world demographic trends  అనే పుస్తకం లోని
languages అనే వ్యాసం .ఈ పుస్తకాన్ని నాకు పంపి నన్ను చది వించిన నా
మిత్రులుశ్రీ మైనేని గోపాల కృష్ణ గారి సాహిత్య ఋణం తీర్చు కోలేనిది .
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –.21-7-12.–కాంప్–అమెరికా

Posted in అమెరికా లో | Tagged | 1 Comment

తిక్కన భారతం – 12 శ్రీ కృష్ణరాయ బారం -3

తిక్కన భారతం – 12
శ్రీ కృష్ణరాయ బారం -3
పాండవ వీర మాత  కుంతీ దేవి ఎన్నెన్నో కష్టాలను అనుభ వించింది
.కృశించి వరుగు అయింది .పాలలో పడ్డ బల్లి లా ఉంది ఆమె స్తితి .ఆమె మాటలు
వజ్ర ధారా లా గా ఉన్నాయి .ఇన్నాళ్ళు తన మనోవేదనను అత్యంత శక్తి వంత మైన
మాటల ఈటెలతో గుచ్చి చెబుతోంది .”కొడుకు గాంచు రాచ కూతురేడ్డానికి -నత్తి
పనికి నుచిత మైన సమయ మొదవే -దడయ టింక  నొప్పదు జనములు -నట్లు గాని
పురుషుల నరు మిమ్ము ” అని తన కొడుకు లకు కర్తవ్య బోధ చేయమని మేనల్లుడు
కృష్ణుని తో చెప్పింది . ఇదంతా సంధి ప్రసంగానికి ముందే చెప్పింది .”భుజ
బలమున జీవించుట -నిజ ధర్మమూ మెత్త బడుట నిన్ద్యము -మాద్రీ ప్రజలకు
జెప్పుము ద్రుపదాత్మజ -గార్య మడుగు మానుము తగ నందరి  లోనే ”     తన
కొడుకుల కంటే నకుల సహదేవులైతే ఈ పరాభవాన్ని బాగా చల్లారుస్తారు అని కుంతి
భావం .హస్తిన లో రాయబారం తర్వాతా కృష్ణుడు కలిసి జరిగింది ఆమె కు వివ
రించాడు .ఆమె -”వీరి గలయుట కష్టం బా వెరవు దప్పుతయు మేలై వచ్చే బొమ్ము
-విడువను మానంబున్ ”అంది .రోగీ ,వైద్యుడూ ఒకటే కోరుకొన్నారు .పాండవులు
తమ స్వభావానికి విరుద్ధ మైన ,లోక న్యాయానికి వ్యతి రేక మైన సంధి ప్రయత్న
ప్రతి పాదనను చాలా కఠినం గా ,నిర్దాక్షిణ్యం గ నిరసించింది .ఆమె క్షోభ
భూదేవి క్షోభాయే .భూభారం తగ్గాలి అనేది ఆమె ఆరాటం .దుర్జను లతో
పోట్టేమిటి పొ పొమ్మంది .–”రాజుల కెందు నారయ బరాక్రమ జీవన వ్రుత్తి
దక్క ,నొం-దోజ నిషిద్ధమండ్రు మునులుత్తమ సత్వులు ,వంశ ధర్మముల్ –పూజిత
భంగి జేయుదురు బుద్ధి విహీనులు దాని దక్కి ,-నిస్తేజ పు గూటికియ్య కొని
నత బొందుదు రంబు జోదరా ” అని ఆక్రోశించింది .
క్షత్రియ రాజులు నమ్ము కో వాల్సింది భుజబలాన్నే .శత్రువు ల
పై కక్ష తీర్చుకోవటం వారి సహజ ధర్మం .పరుల దయా దాక్షిణ్యా లపై జీవించటం
రాజు కు నిషిద్ధం,నీచం .అని రాజ ధర్మాన్ని తగిన సమయం లో గుర్తు చేసింది
.ఉత్తమ బాల శాలురు వంశ గౌరవానికి అనుగుణం గా ప్రవర్తించాలి .వంశానికి
కీర్తి తేవాలి .బుద్ధి హీనులు మాత్రమె పరాయి కూడు కు ఆశించి ,దైన్యాన్ని
పొందుతారు .పాండు రాజు కీర్తిని పాండవులు పాడు చేస్తున్నారు .సత్వ హీనం
గా ప్రవర్తిస్తున్నారని విమర్శించింది .సంధి ప్రయత్నం మానక పోతే వారంతా
బుద్ధి హీనులు ,క్రుపణులు ,క్షత్రియ తేజో రహితులు అని నిష్టుర మాడింది
.నిస్తేజ మైన జీవితం కంటే రాజుకు వీర మరణం మేలు అని ధ్వనించేట ట్లు
చెప్పింది .ఆభిజాత్యం చాలా అవసరం అని గుర్తు చేసింది .పరాక్రమాలను
ఆశ్రయించి మాత్రమె రాజు దేని నైనా సంపాదించాలి.అదే జీవనం .అది కాక
అడుక్కు తెచ్చు కొంటె అది ”కూడు ”అవుతుందని ఎద్దేవా చేసింది .చక్కని
శబ్ద ప్రయోగం చేశాడు తిక్కన .ఈ పద్యం లో ప్రతి శబ్దం శక్తి వంత మైనఅర్ధ
సంపద తో ప్రయోగించాడు .దీనినే ”విశిష్టార్ధ వ్యంజనం ”అన్నారు
ఆలంకారికులు .వీర పత్ని వీర మాత పలికే పలు కులు గా క్షాత్ర తేజో మయ
స్వరూపం గా ప్రత్యక్ష మవుతాయిఆమె మాటలు .
ఆత్మ గౌరవం గల స్త్రీ గా ,కోడలికి జరిగిన అన్యాయాన్ని దిగ
మింగు కొన్న అత్త గారిలా ఆమె క్షోభ వర్ణనా తీతం .ద్రౌపది హృదయ బాధ ను
అర్ధం చేసుకొన్న అత్త గారామే .ఉత్తమ కుల కాంత ,తమ ఇంటి వధువు ,తన కుమారుల
సహా ధర్మ చారిణి అయిన అయోనిజ కు మాటలతో వర్ణించ రాని పరాభవాన్ని మర్చి
పోలేక పోతోంది కుంతి .తగిన ప్రతిక్రియ జర్గితే తప్ప ,ఆ తల్లి ఆవేదన
తీరదు,చల్లారదు .కేవలం రాజ్య లాభం నిష్ప్రయోజనం .అలాంటి జీవితం వ్యర్ధం
.ఆ విషయాలన్నీ బాహాటం గా నే చెప్పింది .”మరచిరే కొలువున ద్రౌపది -బరచిన
బన్నంబు ధర్మ పదము దోరంగన్.-వేరచుట కప్పటి కది తగు -జేరచిన చొ ,వెదక వలదే
చిరతర కీర్తిన్ ”అని భార్యకు జరిగిన పరాభవానికి ప్రతీ కారం చెయ్యటమే తన
కొడుకుల కర్తవ్యమ్ అని గుర్తు చేశానని  కొడుకు లతో చెప్పమని మేనల్లుడికి
చెప్పింది .ఆమె పాలకులకు భీష్మ ద్రోణాదులు కూడా ఆశ్చర్య పోయారు .. కార్య
వాదం గా మాట్లాడే కృష్ణుడు ,కుంతి కూడా ఇలా బరి తెగించి చెప్పటం తో
”ధర్మజ మహా సముద్రానికి చెలియలి కట్ట లేదని” గ్రహించారు .ఏమి చెయ్యాలో
తోచని వింత స్తితి సందిగ్ధం లో పడి పోయారు .ఇలా ప్రతి సన్నీ వేశం
హృదయాలకు హత్తు కుంటుంది .
తిక్కన మహా కవి ప్రతి పాత్ర వెనుక దాగి ఉండి ,సూత్ర దారి యై సంభాషణలు
చెప్పించి నట్లు కనీ పిస్తుంది .ప్రతి పాత్రనుస్పష్టం గా మలిచాడు .
స్పష్టత ఉంది .సంభాషణ లన్ని శక్తి మంతాలు ..శిష్ట వ్యావ హారిక భాష నె ఉప
యోగించాడు .ప్రతి పదం లోను తెలుగు నుడికారం జీవం పోసుకోన్నది .గీత ,కంద
పద్యాలతో అంటే చిన్న పద్యాలతో విశిష్ట మైన భావాలను తెలియ జేశాడు .దీనితో
”దేశీయత ”కు పెద్ద పీట వేసి నట్లయింది . తెలుగు పలుకు బడులు
,లోకోక్తులు ,చక్కగా ప్రయోగించ టానికి మంచి వేదిక దొరికింది తిక్కనకు
.ఇతి వృత్తం అంతా మానవ జీవితానికి సన్నిహితం .మూడు రాయబారాల్లోను మంచి
వైవిధ్యం ఉంది .తిక్కన లోకజ్ఞత ,రాజ్యాంగ పరిజ్ఞానం బాగా వెల్లడయింది
.శ్రీ కృష్ణ రాయబారం లో కృష్ణుని జీవిత తత్త్వం కూడా బాగా ఆవిష్కారమయింది
.మానసిక స్తితులను వెలికి తీయటం తో రచన చైతన్య విలసిత మైంది .మనుమ సిద్ధి
రాజు గారి మంత్రిగా ,రాజ్యాంగాని నడి పాడు కనుక ,ఆ అనుభవ సారం ఇక్కడ
పిండి పడేశాడు .స్వానుభవానికి మించింది లేదు కదా. ఉద్యొగ పర్వం అంతా”
నానా రస చిద్విలాసం ”. రాజ నీతి వైదుష్య ప్రదర్శనం .ఆంద్ర మహాజనులు ఈ
పర్వం లోని ప్రతి కణాన్ని ఆస్వాదించి ఆనందించే టంత మధురం గా వ్రాశాడు
తిక్కన .అందుకే ఈ పర్వానికి అంతటి ఆకర్షణ శక్తి .
సశేషం –మీ -గబ్బిట దుర్గా ప్రసాద్ — 21-7-12
–కాంప్–అమెరికా

Posted in రచనలు | Tagged | Leave a comment

అమెరికా ఊసులు –9

అమెరికా ఊసులు –9
అమెరికా లో పౌరుడు శక్తిని ఇతర దేశాల సామాన్య జనం వాడే
దానితో పోలిస్తే 115రెట్లు వాడుతున్నాడు .అమెరికా జనాభా  ప్రపంచ జనాభా లో
అయిదు శాతం .అయినా వాళ్ళు వాడేది ప్రపంచ శక్తి లో ఇరవైఅయిదు శాతం .
.ఇందులో ఎలేక్త్రిసిటి ని అమెరికా లో మనిషి ఒక్కడు 12924కిలో వాట్ అవర్స్
ఖర్చు చేస్తున్నాడు .ఆయిల్ వాడకమూ ఎక్కువే .ప్రపంచం లోని మోటారు కార్లను
ఒక వరుసగాఒక దాని వెనుక ఒకటి  పెడితే ,అది భూమి చుట్టూ కొలతకు 120రెట్లు
ఉంటుందట .అమెరికా లో పన్నెండు వందల మందికి వెయ్యి కార్లున్నాయి .ఇండియా
లో వెయ్యి మందికి ఎడే ఉన్నాయి .అందుకని ఇతర ఇధనాల పై దృష్టి పెట్టారు
.బయోదీజేల్ ఇథనాల్ ఉత్పత్తి పాయింట్ మూడు నుంచి ఒకటి పాయింట్ తొమ్మిది
దాకా పెంచు కొన్నారు .ఆల్కహాల్ వాడకమూ పెరిగింది .ఒక జోక్ గుర్తొస్తోంది
-ఒక తాగు బోతూ లివర్ మార్పిడి కైనా సిద్ధమవుతాడు కాని సారాయి తాగటం
మానడు.
యు.యెన్.సర్వ్ ప్రకారం ఆహార ధాన్యాల అధిక ధరల వల్ల102 మిలియన్ల
జనం ఆకలితో  .2009నాటికి అలమటించారు .ఇంకో తమాషా ఏమిటి అంటే అమెరికా లోని
ఆహార పదార్ధాలలో నలభై శాతాన్ని పార బోస్తున్నారట .మరి అమెరికా లోని ఆహారం
లేని ఇళ్ళుఇప్పటికే ఎనిమిది మిలియన్లు ట .యాభై ఏళ్ళ లో ప్రపంచ
జనాభాఆరున్నర బిలియన్లకు చేరిందట .2010 లెక్కల ప్రకారం ప్రపంచ ఆహార
ధాన్యాల ధరలు ఎన్నడూ లేనంత ఎక్కువ ట .అలానే కొంత  కాలం పెరుగు తూనే
ఉంటాయట వ్యవ సాయ భూములు తరిగి పోతున్నాయి .అందుకని స్వీయ రక్షణ లో దేశాలు
పడి పోయాయి .ఇతర దేశాల్లో భూమిని కొని, లేక లీజు కు తీసుకొని వ్యవ సాయం
చేయిస్తూ ఉత్పత్తిని పెంచు కొంటున్నాయి .
ప్రపంచ జనాబహా లో ఇరవై శాతం ఉన్న చైనా కు ఉన్న సాగు భూమి
తొమ్మిది శాతమే .అందుకని చైనా ప్రభుత్వం  2.8.మిలియన్ హెక్టార్ల భూమిని
కాంగో దేశం లో కొని ఆయిల్ పామ్ సాగు చేస్తున్నారు .మోజంబిక్ లో నాలుగు
వందల మిలియన్ల డాలర్ల తో వరి పండిస్తున్నారు .దక్షిణ కొరియా
690,000ఎక్తార్లను కొని ఆహార ధాన్యాలను పండిస్తోంది .ఇండియా రెండు
బిలియన్ల డాలర్లతో ఇథియోపియా లో చెరుకు ,తేయాకు ,మిగిలిన పంటలు
పండిస్తోంది .పంజాబ్ రైతులు సూడాన్ లో భూములు కొని సాగు చేస్తున్నారు
.ఇండియన్లు ఆఫ్రికా ,లాటిన్ అమెరికా లలో భూములు కొని పంటలు
పండిస్తున్నారు .బ్రజిల్ ముప్ఫై మిలియన్లు ,అర్జెంటిన ముప్పహి రెండు
మిలియన్లు ,హెక్టార్ల భూమిని భారత్ కు ఇవ్వ టానికి సిద్ధ పడ్డాయి
.బంగ్లాదేశ్ ఉగాండా లో భూమి ని లీజు కు తీసుకొని సాగు చేస్తోంది .
ప్రపంచ నీటి జంతువుల శాతం తగ్గి పోతోంది .ప్రసిద్ధ చేప
జాతులన్నీ అంత రించాయి వలేసి పట్టటం వల్ల .గ్లోబల్ వార్మింగ్ తో
సముద్రాలన్నీ ఉప్పొంగి భూములను కబలించేస్తాయి .సముద్ర తీర భూములన్నీ
అంతరిస్తాయి .క నుక శాస్త్ర వేత్తలు ”రెండో గ్రీన్ రివల్యూషన్ ”రావాలి
అంటున్నారు .కొత్త అధికోత్పత్తి నిచ్చే వంగడాల సృష్టి జరగాలి అప్పుడే
అదిసా ద్యం .క్రిమి సంహారాలు సమర్ధ వంతం గా పని చేయాలి .ఆధునిక వ్యవ సాయ
పద్ధతులను అవలంబించాలి .సాంకేతిక ప్రగతి వ్యవ సాయానికి తోడ్పడాలి
.అప్పుడే ప్రపంచం అన్న దాత గా పేరు నిలుపు కొంటుంది .”మనిషి కడుపు
నిండితే పేద ధనిక తేడా ఉండదు ”అన్నాడు ఈరిపిదియాస్ .”మనం సమస్య సుడి
గుండం లో ఉండి దాటగల సమర్ధత ఉన్నా నిద్ర లో నడుస్తున్నామేమో -మనం తలచు
కొంటె ,ప్రపంచం లో  ప్రతి వారి నోటికి అన్నం అందించ గలం .
మీ–గబ్బిట దుర్గా ప్రసాద్ –20-7-12.–కాంప్–అమెరికా

Posted in అమెరికా లో | Tagged | Leave a comment

పరమాచార్య పధం జగద్గురువులు శ్రీ శ్రీ చంద్ర శేఖర యతీంద్రులు

పరమాచార్య పధం
”పొట్టి మనిషి .కషాయామ్బర దారి .నెత్తిన కూడా కప్పుకొన్న వస్త్రం
.బలహీన మైన శరీరం .చేతిలో దండం .నలభై ఏళ్ళను దాటిన వయసు .తెల్లబడిన
జుట్టు .కళ్ళు నల్లగా కాంతి వంతం .భావ గంభీర మైన నుదురు . కమనీయ మైన
కనులలో అలౌకిక కాంతి .కోటేరు తీసిన ముక్కు .బిరుసు గడ్డం .చిన్న నుదురు
.నోరు విశాలం .కూర్చున్న భంగిమ లో పరమ మేధావిత్వం .కలలుకాక ఏదో లోకం లో
విహరిస్తున్నట్లున్న కను లు .” ఇదీ paul brunton దర్శించిన కంచి పరమా
చార్య జగద్గురువులు శ్రీ శ్రీ చంద్ర శేఖర యతీంద్రుల వారి దివ్య స్వరూపం
.వారు ఆంగ్లాన్ని చక్క గా అర్ధం చేసుకో గలిగి మాట్లాడ గలిగినా తమిళం
ఆంగ్లము తెలిసిన మధ్య వర్తి చేత అనువాదం చేయించి సందేశమిచ్చారు ”.ప్ర
పంచ పరిస్థితులు ఎప్పుడు చక్క బడతాయి ”అని అడిగిన ప్రశ్నకు ”మార్పు
రావటానికి చాలా సమయం పడుతుంది .అదొక క్రమ పధ్ధతి లో రావాలి .ఆయుధాలను
విసర్జించి ,దేశాలు శాంతి కోసం ప్రయత్నించాలి ”అని సమాధానం .”ఆ దిశలో
దేశాలు కొంత ప్రయత్నిస్తున్నాయి ”అని అంటే -”ఆయుధాలు విసర్జినంత
మాత్రానే శాంతి రాదు ,యుద్ధం ఆగదు .కొట్టుకోవటానికి కర్రలు చాలు .దీనికి
పరిష్కారం ఆధ్యాత్మిక భావ వ్యాప్తి మాత్రమే .అది దేశాలమధ్య ,మనుషుల మధ్య
,బీద ధనికుల మధ్య పరి వ్యాప్తమైతేనే కుదురు తుంది .సుహృద్భావం పేర గాలి
.అప్పుడే నిజమైన శాంతి అభ్యుదయం కలుగుతాయి ‘ .”అయితే అది చాలా దూరం చాలా
కాలం పడుతుందేమో ”’అని సందేహించాడు పాల్ -దానికి స్వామి ”ఇంకా
దేవుడున్నాడు ”అన్నారు .”దేవుడెక్కడో లేడు దేవుడంటే ప్రేమ స్వరూపం
.జీవుల మీద ప్రేమే దైవం .”అని సమాధానం .
”దేవుడు మానవ పరికరాలను అవసరం వచ్చి నప్పుడు వాడుతాడు .మానవాళి
,సంఖోక్షోభాన్నఎదుర్కొన్నప్పుడు ఏదో రూపం లో వచ్చి పరిష్కరిస్తాడు .ప్రతి
శతాబ్దం లోను దివ్య విభూతి కలిగిన మహాత్ములు జన్మించి, మాన వాలి ని
ఉద్ధరించారు .ఈ విధానం అంతా భౌతిక శాస్త్ర నియమాలుగా పని చేస్తుంది .
.భౌతికత పెరిగి ఆధ్యాత్మికత కు జనం దూర మైన ప్రతి సారి ఇలా జరుగు తూనే
ఉండటం అందరికి తెలిసిన విషయమే .పాల్”మన కాలం లో కూడా అలాంటి మహాత్ముడు
జన్మిస్తాడా?”అని అడిగితే ”మా దేశం లో ఇది తప్పక జరుగు తుంది ,జరిగింది
.భౌతికత అనే  చేకటి విస్తరించి జ్ఞాన జ్యోతి మినుకు మినుకు మన్నప్పుడల్లా
ఇలా జరగటం మాకు సహజమే .వారినే మేము దైవాంశ సంభూతులు అంటాం ””అన్నారు
ఆచార్యులు .
”మనుష్యులు బాగా పతన మై పోయారా” అన్న ప్రశ్నకు ”అంతగా నాకు అని
పించటం లేదు .మనిషి లో దివ్యత్మమ్  జాగృతం అవాలి .  అప్పుడు మనిషి దేవుని
వైపుకు అడుగులేస్తాడు .”బ్రంటన్ ”మా పశ్చిమ దేశాల్లో దెయ్యాల లాగా
మానవులు ప్రవర్తించటం బాధా కరం గా ఉంది ”అంటే -”అలా వేరు చేసి మాట్లాడ
వద్దు .అక్కడి దేశ రాజకీయ ఆర్ధిక స్తితి గతులను మనం దృష్టిలో ఉంచుకోవాలి
.పిడుక్కు ,బియ్యానికి ఒకటే మంత్రం కాదు .సమాజాన్ని ఉన్నత స్తితికి
తీసుకొని వెళ్ళాలి .భౌతికత ను  ఆదర్శం ( ఐడియలిజం) తో సమానం చేయాలి
.ప్రపంచం ఎదుర్కొనే క్లిష్ట పరిస్తితికి నిజమైన నివారణ అంటూ ఏదీ లేదు
.”అన్నారు .”అయితే నిత్య జేవితం లో ఆధ్యాత్మికతను జోడిన్చాలా ?”అని
అడిగితే -”ఖచ్చితంగా .సరైన ఫలితాలు రావాలి అంటే అదొక్కటే మార్గం
.ప్రపంచం లో ఆ స్తాయి మనుష్యులు ఎక్కువైన కొద్దీ మార్పు వేగ వంత మవుతుంది
.మా అదృష్ట వశాత్తు మా దేశం లోఅలాంటి వారికి కొదువ లేదు .ఈ మార్పు
ప్రపంచం అంతటా వస్తే మంచి రావటానికి స్వల్ప సమయం చాలు .”
పాల్ ”తమరికి ఈ ఆశ్రమాధి కారం సంక్రమించి ఎంతకాలమైంది
”?అని ప్రశ్నిస్తే -”1907 లో నేను పన్నెండేళ్ళ వయసు లో ఉండగా లభించింది
.నాకు ఆశ్రమాది కారం వచ్చిన తర్వాత నాలుగేళ్ల కు, నేను కావేరి నది ఒడ్డున
ఒక గ్రామం లో తపస్సు చేసి ,మూడేళ్ళు వేద వేదాంగ విద్య లన్ని నేర్చాను
.”అని చెప్పారు .”మీరు నిత్యం సంచారం చేస్తూనే ఉంటారా ?”అన్న దానికి
”1918 లో లో నేపాల్ లో జరిగే ఒక కార్య క్రమానికి నేపాల్ రాజు
ఆహ్వానించారు .దానికి సమ్మ తించినేను అప్పటి నుండి  దేశ సంచారం చేస్తూ
ప్రతిగ్రామమూ తిరుగు తున్నాను .మా ఆశ్రమ ధర్మ ప్రకారం ప్రతి గ్రామము
సందర్శించాలి .ప్రజల్ని ఆధ్యాత్మికత వైపు మరల్చే ప్రసంగాలు చేయాలి .మా
ఆశ్రమ సంప్రదాయాలను పాటించాలి .నిత్యార్చన అవీ మాకు చాలా నియమాలుంటాయి
.”అని సమాధానం .
”నాకు మార్గ దర్శనం చేయ గలిగిన యోగుల కోసం నేను భారత దేశ మంతా పర్య
టిస్తున్నాను .సరై న వారిని మీరు నాకు సూచించ గలరా “?అని అడిగిన దానికి
సమాధానం గా కంచి స్వామి ”మీకు నిజం గా అలాంటి కోరిక ఉంటె అదేమీ అత్యాస
కాదు .మీ లోని నిజాయితీ తప్పక మీ కోరిక తీరుస్తుంది .ఇప్పుడే మీలో జాగృతి
కలిగింది .అదే మీకు మార్గ దర్శనం చేస్తుంది .మీ సందేహాలన్నీ పటా పంచలవు
తాయి ”.పాల్ మళ్ళీ ”ఆ ఆలోచనే నాకు ఇప్పటి దాకా  మార్గ దర్శకత్వంచేసింది
.నేను ఎ మహాను భావుడిని కలిసినా ”దేవుడు వేరుగా లేడునీ లోనే
ఉన్నాడు”అంటున్నారు ”చూపించండి  అంటే నువ్వే వెతుక్కో వాలి ”అని అంటూ
దాటేస్తున్నారు” అన్నాడు .నవ్వు తు  స్వామి ”దేవుడు అంతటా ఉన్నాడు
.మనిషి లో మాత్రమె ఉన్నాడని అక్కడే బంధించక్కర లేదు .ఈ విశ్వానికి
అంతటికి ఆధారం ఆయనే కదా “‘అన్నారు .”అయితే స్వామీ ! ఎ ప్రయోగాత్మక
పద్ధతి ని నేను అవలంబించాలి ?”-”మీ యాత్రలో మీరు అన్వేషించు కొంటూ
వెళ్ళండి . మీకు నచ్చిన వారిని ఎన్ను కొండి .”అన్నారు .”వారిలో ఎవరూ
నాకు సరైన మార్గ దర్శనం చెయ్య లేక పోతే “?సందేహించాడు పాల్ ”అలా అయితే
మీరు ఒంటరిగా ప్రయాణం చేసి దైవ విభూతిని పొందే వరకు ఆ మార్గం వదలకండి
”ధ్యానం క్రమం తప్పకుండా చేస్తూ ఉండండి .ఉన్నత భావాలమీద ఆసక్తి ,ప్రీమ
పెంచుకోండి .మనసంతా ప్రేమ తో నింపు కొండి .తెల్ల వారు జామున ,సాయం
సంధ్యలో ధ్యానం సత్ఫలితాల నిస్తుంది .అప్పుడు ప్రపంచమంతా పరమ ప్రశాంతం
గాఉంటుంది .దీన్ని మాత్రం సాధన చేయటం మరవ కండి ”అని హితవు చెప్పారు .
”స్వామీ ! నా ప్రయత్నా లన్ని వ్యర్ధమై ,నా సాధన ఉపయోగ పడక
పోతే మీరు నాకు మార్గ దర్శనం చేస్తారా ?”అని సూటిగా ప్రశ్నించాడు
బ్రంటన్ బ్లంట్ గా .దీనికి సమాధానం గా పరమా చార్యులు ”నేను ఒక
సంస్థానానికి అధి పతి ని .ఇక్కడ నా సమయం అంటూ ఏమీ ఉండదు .నా నిత్య కార్య
క్రమాల తో నా సమయం అంతా ఖర్చు అయి పోతుంది .అవి కాల నియమ ప్రకారం
జరగాల్సినవి .వాటిని వేటినీ వదిలి పెట్ట రాదు .నేను ఎన్నో ఏళ్ళు గా
రోజూరాత్రిళ్ళు  నిద్ర పోయేది ”మూడు గంటలే ”.అలాంటి పరిస్థితుల్లో నేను
ఒక వ్యక్తీ మీద శ్రద్ధ పెట్టటం జరిగే పని కాదు .మీరే మీ కోసం సమయాన్ని
పూర్తిగా కేటాయించే గురువు ను ఎన్ను కొండి ”అని విస్పష్టం గా చెప్పారు .
”బాధ గురువులే తప్ప బోధ గురువులు లేరు అని అంతా అంటున్నారు .అందులో
నేను ఒక యూరోపియాన్ని .నాకు బోధించే వారు దొరకరేమో ?”అని సందేహం వెలి
బుచ్చాడు ”సత్యం ఉంది .దాన్ని కనుగొన వచ్చు ”అని సమా ధానం .”మీరే
ఒకరిద్దరి పేర్లను సూచించి నా అన్వేషణ కు దగ్గరి  దారి చూపించండి మహాత్మా
“‘అని అంటే ”నాకు తెలిసి ఇద్దరే మీ కు గురువులు అని పించుకోన దగిన
సమర్ధులు ఉన్నారు .అందులో ఒకాయన కాశీ లో ఎక్కడో విశాల మైన భవంతి లో దాగి
ఉంటారు .ఆయన దర్శనం అంత తేలిక కాదు .అదీ గాక వారు పాశ్చాత్యు లకు ప్రవేశం
కల్గిస్తారని నేను భావించటం లేదు ”అన్నారు పాల్ మీద కృపా ద్రుష్టి తో
.పట్టు వదలని విక్రమార్కుడు పాల్ -”రెండో వారు ?”అని ప్రశ్నించాడు
.”ఎక్కడో దక్షిణ భారత దేశం లో మారు మూల  ఉన్నారు .ఆయన్ను ”మహర్షి
”అంటారు .నేను ఇంత వరకు వారిని చూడ లేదు .కాని అ వారు ఉత్తమ దేశికులు
అని తెలుసు .వారు మీకు చక్కని మార్గ దర్శనం చేస్తారని నమ్మకం ఉంది .వారు
అరుణాచల జ్యోతి స్వరూప మైన అరుణా చలం లో ఉంటారు .వారి దర్శనం మీ కు మనో
భీ ష్టం కల్గిస్తుంది .”అని చెప్పగానే పాల్ పరమా నంద భరితుడయాడు .తన
అన్వేషణ ఫలించే రోజు దగ్గర లో ఉందని సంబర పడ్డాడు .అరుణా చలం వెళ్లి రమణ
మహర్షిని ఎప్పుడు సందర్సిద్దామా అనే తహ తహ పెరిగి పోయింది .చివరగా ఒక మాట
చెప్పారు శంకరులు ”రమణ మహర్షి ని దర్శించ కుండా ఇండియా నుండి తిరిగి మీ
దేశం వెళ్ళను అని నాకు మాట ఇవ్వండి ”అన్నారు కృపా దృష్టి తో .శ్రీ వారి
లోని ఆ కారుణ్యం ,తన తపనను అర్ధం చేసుకొన్న వారి మనో భావం చూసి పాల్
చలించి పోయాడు .”మీ మాట జవదాట ను మహాత్మా !”అనిమనస్పూర్తిగా చెప్పాడు
.చివరి సారిగా శంకరులు ”ఆదుర్దా పడకండి .మీరు సత్యాన్ని కనుక్కొంటారు
.మీరు వెతుకు తున్న వారు మీకు లభించి మీ కోరిక తీరుస్తారు ”అని అభయం
ఇస్తూ ”మీరు నన్నెప్పుడు గుర్తుంచు కొండి .నేనూ మిమ్మల్ని ఎప్పుడూ
గుర్తుంచు కొంటాను ”అని paul the seeker  కు వీడ్కోలు చెప్పారు పరమా
చార్యులు .ఆయన దేశ సంచారాన్ని ఆది శంకరుల దేశ సంచారం తో సరి పోల్చాడు
పాల్.ఒక ఆధ్యాత్మిక జ్యోతిని సందర్శించిన మహదానందం తో పాటు మరో అద్భుత
మహర్షిని సందర్శించా బోతున్న ఉద్వేగం పాల్ ను కుదిపేస్తోంది .మహాత్ములు
ఎంత ఉన్నతులో ,ఎంత మార్గ దర్శనం చేస్తారో ఆధ్యాత్మికానుభూతి పొందాలను
కొనే వారంటే వారికి ఎంత అభిమానమో వ్యక్తమయ్యే అన్ని వేశాలను ఇందులో మనం
చూశాం .ఇదే పరమాచార్య పధం .
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -20-7-12.–కాంప్–అమెరికా


గబ్బిట దుర్గా ప్రసాద్
https://sarasabharati.wordpress.com
http://suvarchalaanjaneyaswami.wordpress.com

Posted in మహానుభావులు | Tagged | Leave a comment

అమెరికా డైరీ సర్ప్రైజ్ వెల్కం వీక్ -2

This slideshow requires JavaScript.

Posted in అమెరికా లో | Tagged | Leave a comment

తిక్కన భారతం –11 శ్రీకృష్ణ రాయ బారం –2

                   తిక్కన భారతం –11
శ్రీకృష్ణ రాయ బారం –2

శ్రీ కృష్ణుడు సభలో చెప్పినవన్నీ ఊసర క్షేత్రం లో పడిన బీజాల్లా
నిష్ప్రయోజన మైనాయి .దురాశకు ,పుత్రా వాత్సల్యానికి లోనైన వృద్ధ రాజు
ధర్మాన్ని నిర్వర్తించలేక పోయాడు . నారదుడు మొదలైన మహర్షులు ,భీష్మ
ద్రోణాది గురు సమూహం ,చేసిన హిత బోధ నీరు కారి పోయింది .శ్రీ కృష్ణుడు
దుర్యోధనుడిని అనునయం తో బుజ్జా గించి ,నచ్చ చెప్పా టానికి చేసిన
ప్రయత్నం విఫల మైంది .చివరకు బెదిరించాడు .సంధి జరగక పోతే అనర్ధాన్ని వివ
రించాడు .దుర్యోధనుడు మొండిగా ”ఎవ్వరైనా సంగ్రామ మునన్ జయించు కొని
రాజ్యము సేయుట నిస్చ యించి తిన్ ”అని తెగేసి చెప్పాడు .
ఇప్పటి వరకు చాలా మెత్తగా ,మధురం గా మాట్లాడిన వాసు దేవుడు తీక్ష్ణత
జోడించి, పుల్ల విరుపు గా మాట్లాడిన దుర్యోధనుడిని ఉద్దేసించి ఉద్రేక పడ
కుండానే సమాధానం చెప్పాడు .గాంభీర్యాన్ని మాత్రం సడ లించలేదు .అపహాస్యం
గా ,చిరు నవ్వు నవ్వుతు చిలిపి కృష్ణుడి లా తన ధీరో దాత్త త ను
,ప్రౌధత్వాన్ని వ్యక్తం చేస్తూ హితవు చెప్పాడు .-”’అనిన విని,కింక బూనిన
యలతి నగావు -చెలువు మొగమున నొక క్రొత్త పోలు పొంద -బుండరీ కాషు డగు తెల్ల
బోయి యప్పు -డరుణ కమలాక్షు డగుచు మురాంత కుండు ” అన్నాడు తిక్కన
.మురాన్తకుడు అనటం లో రాక్షస నాశనమే చేసిన వాడు వీరో లెక్కా అనే భావం
.కళ్ళు యెర్ర బడ్డాయి అంటే లోక ప్రళయం తప్పదని సూచన .”మొన తల బడియెదు నీ
చే–ప్పిన యట్టులతడవు లేదు బిరుదు లరైనీ–వును ,వీరు,నిలువు డిదె భం
-డనమెల్లి వచ్చే నూరతలు గను డిన్కన్”అని యెర్ర బడ్డ కల టో కోపం తో
మురహన్తకుడు చెప్పాడు .లే నవ్వు వింత అందాన్ని చ్చింది మొగానికి
.లోకానికి ద్రోహం చేసే వాళ్ళ విషయం లో గాంభీర్యం గా ఉండటం మహాత్ముల
లక్షణం .”మీరు కోరు కొన్న యుద్ధం మీ ముందుకే వచ్చి కూర్చుంది ”అనటం లో
కౌరవ సర్వ సంహారం తప్పదు అన్న సూచన .చివరకు తెగించి కృష్ణుడిని బంధించే
ప్రయత్నం చేశాడు సుయోధనుడు .అప్పుడు చెప్పాడు చివరి సారిగా పెద్ద రాజు తో
-”’రోషము నా పయిం గలిగి క్రూరత కౌరవు లింత సేత ,సం –తోషమ, నీవు
ప్రాభవము తో దగ నాకు ననుజ్ఞఇమ్ము ని–ర్దోషత నేను నోపు గతి  ,  దోర్బల
దుర్జయు లైన వారి ,వి –ద్వేషము జక్క బెట్టి ,జగతీశ్వర ,ఇంతక పోయి
వచ్చెదన్ ” అని వీడ్కోలు తీసుకోన్నట్లుగా అన్నాడు .ఏది ఏమైనా లోక శాంతి
కావాలి .తను దుర్యోధనాదులను చంప టానికి ఇంత వరకు కారణం కంపించ లేదు
.ఇప్పుడు వాళ్ళే ఆ అవకాశాన్ని కల్పించు కొన్నారు .వినాశ కాలే విప రీత
బుద్ధి .కారణం బలీయం గా ఉంది .అందుకే ఖండితం గా చెప్పే శాడు
.”దుష్టుల్ని చంపి ,రెండు పక్షాల వారికి రక్షణ కల్పిస్తాను -దీనికి
నువ్వు అనుమతించు ”అని చంపే అధికారాన్నీ ముసలాయనకే కట్ట బెట్టాడు మహా
మతి మంతుడు పరమాత్మ .ప్రతి మాట ను చాలా అర్ధ వంతం గా ,సమర్ధ వంతం గా
మురారి చేత పలికించాడు తిక్కన .బంధువుల అను మతి తో తాను తన స్వంత మెన మామ
కంశుడిని వధించిన సంగతిని కధ గా వర్ణించి  గుర్తు చేశాడు .ధర్మ రక్షణకు
బంధుత్వం అడ్డు కాకూడదు అని సూచించాడు . ”సత్కులము బాలిమ్పగ వర్జిం పగ
రాదే దుష్టాత్మకు నీచు నొక్కరుని ”అని కడపటి కర్తవ్యమ్ ఎరిగించాడు .అంతా
వ్యర్ధమే అయింది .బూడిద లో పోసిన పన్నీరు .అయినా రాజ కీయం గా ఉదాత్త మైన
రాయబారం ఇది .దీని వల్ల రెండు వర్గాల లోని వారి చిట్టా వృత్తులు ,అభి
ప్రాయాలు వ్యక్త మైనాయి .
”పాండవులు శాంత శూరులు అని ముందే కృష్ణుడు చెప్పటం తో తాను
వచ్చే ముందు ,ద్రౌపది ,భీముడు చెప్పిన మాటలు చెవిలో రింగు మంటూనే ఉన్నాయి
.భీమార్జునుల మాటల్లో శౌర్యం తో బాటు ,శాంతి కూడా ప్రచ్చన్నం గా
ధ్వనించింది .”ప్రశాంత గాభీరతా లక్షణం ”అనటం లో పాండవులకు అది బాగా
అన్వ యించింది . అన్ని పాత్రలు తమ భావాలను బాగా వ్యక్తం చేశాయి కనుక ఈ
రాయ బారాన్ని ”ఏకాంకిక ”అన్నారు .ఒక సారి ఫ్లాష్ బాక్ లోకి వెళ్తే,
,ఉద్రేకం గా,భీషణం గా  మాట్లాడే భీముడు శాంతి వచనాలు పలికాడు కృష్ణుని తో
.చిరు నవ్వు తో కృష్ణుడు అతన్ని రెచ్చ గొట్టి మేల మాడాడు . అయినా
వృకోదరుడు ఉద్రేక పడ లేదు .సరసం గానే సమాధానం చెప్పాడు –”ఏమీ ,పార్ధుడు
నీవు ,దండి మగలై ఈ వచ్చు కౌరవ్య సం -గ్రామ క్షోభము బాహు దర్పమున దీర్పం
బెద్ద మిర్రెక్కి మి -మ్మేమెల్లన్ వెర గండి జూచేదము గా ,కీ సారేకుం
,బోయిరా –భీముందిత్తేరి రిత్త మాటలకు కోపిం పడుసూ ,పెంపరన్”అని చాలా
సరదా గా అన్నాడు .”ఓహో నువ్వు అర్జునుడు యుద్ధ ప్రవీను లై కౌరవ యుద్ధం
చేస్తుంటే ,ఎట్టు గా ఉన్న కొండెక్కి మేమంతా ఆశ్చర్యం తో చూస్తూ ఉంటాం
కానీ బావా -ఇప్పుడోద్దులే -నువ్వ్వెల్లి రావయ్యా ,ఉద్రేక పరిస్తే రెచ్చి
పోయే వాడేమీ కాదు ఈ భీముడు ”అని శాంతి మాత్రమె తమకు కావాలన్నాడు .
ద్రౌపది మాత్రం రోశాగ్ని జ్వాలలు కురి పించింది .ఆమె
క్రోధాగ్ని కౌరవులన్దర్నీ ఆహుతి చేస్తే తప్ప చల్లారదు అని తెలియ జేసింది
.చాలా గంభీరం గా మాట్లాడింది .విశిష్ట లోక జ్ఞానాన్ని ,వివేకాన్ని
ప్రదర్శించి మాట్లాడింది .పాండవ ధర్మ పత్ని అని పించు కొండి .”ఓట యొకింత
యేనియు సుయోధను చిత్తము నందు లేదు ”పొమ్మంది .”నీ మాటల వల్ల వాడి దురభి
మానం పోతుందా ?పైగా పెరుగు తుంది ”అని వాడిని కాచి వడ బోసి నట్లు వాడి
మనో భావాన్ని వివ రించింది .కోడలు అన్న భావం ఎ మాత్రం లేకుండా జూదం రోజున
దాసిగా చేసి ,మహా పురుషుని ,తన భర్తలు ఆ కొలువు లో మళ్ళీ చేరితే ,తనకు
లభించేది దాస్యమే నని ఖచ్చితం గా చెప్పింది .కోడరికం కాదు అన్నది .భర్తలు
తన గౌరవాభి మానాలను లెక్క చెయ్యటం లేదని ,నిస్పృహ వ్యక్తం చేసింది
.స్త్రీ నిస్సహాయత ను స్పష్టం చేసింది .ఆమె మాట లన్ని ఉత్తమ క్షత్రియ
స్త్రీ మాటలే .వీర వంశం లో జన్మించిన స్త్రీ పలుకులే .సామాన్య స్త్రీ
ప్రవర్తనా విధానమే .చూడండి ఆమె ఎంత చక్క గా చెప్పిందో అన్న కన్నయ్యకు –
”అరయమి జేసి కోడలనకప్పుడు ,దాసిగా జేసే  ,నమ్మహా –పురుషుని పాలికిం
బతులు వోవగ,వీరలతోనఏను జే–చ్చెర జానీ కోటరంబు దగ  జేయుదునో ,యటు గాక
,పాడిమై –వరవుడ మోపి జే యుదునో వారిక మాధవ నిశ్చయింపుమా  ?”అని ప్రతి
మాటను సార్ధకం గా ప్రయోగించాడు తిక్కన .స్త్రీ స్వభావాన్ని అద్దంలో
చూపించాడు .
సశేషం –మీ–గబ్బిట దుర్గా ప్రసాద్ –20-7-12-శ్రావణ శుక్ల పాడ్యమి
– శుక్ర వారం –కాంప్–అమెరికా

Posted in రచనలు | Tagged | Leave a comment

మెహర్బాణీ -మెహెర్ బాబా గారి వాణి

మెహర్బాణీ
”భౌతికత తో ఊగిపోతున్న మానవ జాతి ని ఆధ్యాత్మిక త వైపు కు జీసెస్ మరల్చి
నట్లు ,నేను మానవాళి ని ఉద్ధరించ టానికి వచ్చాను .అలాంటి పనికి కాలము
సమయము కలిసి వచ్చి నప్పుడే మహా పురుషులు మాన వాలిని ఉద్ధరించ టా నికి సంభ
విస్తారు .వారే అవతార పురుషులు .బుద్ధుడు ,మహమ్మద్ జొరాస్టర్ అందరు
అలాంటి వారే .వీరందరూ ఒకే భగ వంతుని నుండి వచ్చిన వారే .అది ఒక బంగారు
దారం .శారీరక ఆనందం ముఖ్య మైన సమయం లో మతానికి మనుగడ తగ్గి నప్పుడు ,ధనం
పై వ్యామోహం పెరిగి నప్పుడు భగ వంతుడు స్వయం గా  వీరి ఆవిర్భావానికి దారి
చూపిస్తాడు .ఈ పరంపర లో నేనూ ఒక అవతార పురుషుడినే ”
మత సంస్థలు పాత బాణీ లో నె నడిచి ప్రజల ఆలోచనలను పట్టించు కోవటం లేదు
.ప్రవక్తల ఉపదేశ సారం ఒకటే .మాన వాలిని సంక్షోభం నుంచి బయట పడేయ్య టమే
.నేనేమీ కొత్త మతాన్ని స్తాపించటం లేదు .ప్రజలందరి మత భావాలను పునరుద్ద
రించి వాటికి కొత్త రూపు నివ్వటమేనాధ్యేయం .జీవితాన్ని గురించి వారికి
అవగాహన కల్గిస్తాను .ప్రవక్తల మరణం తర్వాతా వారి భావనలు పక్క దారి
పడుతున్నాయి .అసలు చెప్పినదానికి ,ఆచరించే దానికి సంబంధం లేకుండా పోయింది
.ప్రవక్త లందరూ భగ వంతుని నుండి వచ్చిన వారె .కనుక వారు చెప్పే దంతా ఒకటి
గానే ఉంటుంది .సంకుచిత భావాలను దూరం చేస్తాను .అసలు సత్యాలను
ఆవిష్కరిస్తాను .నా మౌనాన్ని త్వరలోనే వదిలి జనం ముందుకు వచ్చి నా
మనోభావాలను నా నోటి తో తెలియ జేస్తాను .దానికి తగిన సమయం ఇంకా రాలేదు
.వచ్చి నప్పుడు నేనే తెలియ జేస్తాను .”
”త్వరలో నే విశ్వ వ్యాప్త ఆధ్యాత్మికత ను నేను ప్రచారం చేస్తాను .ఇది
అన్ని దేశాల వారికి ,అన్ని మతాల వారికి అన్ని జాతుల వారికి సంబంధించింది
గా ఉంటుంది .భవిష్యత్తు పై నాకు అపార నమ్మకం ఉంది .పాశ్చాత్య దేశాలలో
యుద్ధ భయం ఉంది .అది తగ్గాలి .నేను ఎప్పుడు మౌనాన్ని వీడు తానో నేను
ముందుగా చెప్ప లేను .త్వరలో జరిగే ప్రపంచ యుద్ధం జరగ బోతోంది .అది చాలా
ప్రమాదం .నా భావ వ్యాప్తి ని ఒక ఉద్యమం గా చేస్తాను .ఈ భూమి లో శాంతి ని
స్తాపించాటానికి నేను చే బట్టే ఉద్యమం దోహదం చేస్తుంది .నేను ఒక అవతార
పురుషుడి ని గా అవతరించబోతున్నాను .యుద్ధం తర్వాతా అపూర్వ శాంతి
ఏర్పడుతుంది .నిరాయుధీ కరణ ఒక సమస్య గా ఉండదు .జాతి భేదాలు సమసి పోతాయి
.మత సంస్థల మధ్య విభేదాలు ఉండవు .నేను ప్రపంచం అంతటా పర్య టిస్తాను
.ప్రతి గ్రామం ,పట్టణం ,నగరం సందర్శిస్తాను .అంతర్జాతీయ సోదర భావాన్ని
,మనుష్యుల మధ్య శాంతిని ,బీదల యెడ ,నిర్లక్షానికి గురి అయిన వారి పట్ల
ప్రేమ ను కురిపిస్తాను .భగవంతుని ప్రేమ ను అందరికి అంద జేయట మే నా ముఖ్య
ధ్యేయం”
”భారత దేశం ప్రపంచ దేశాలలో ముఖ్య పాత్ర  వహిస్తుంది. అనేక
లోపాలున్నా భారత దేశం ఆధ్యాత్మిక భావ లహరి ని వ్యాప్తి చేయటం లో ఎప్పుడూ
ముందు ఉంది. నైతిక నాయకత్వం భారత వల్లనే సాధ్యం .ప్రపంచానికి ఆధ్యాత్మిక
జ్యోతిని ఇవ్వగలిగేది మనమే  .నాకు అతీత శక్తులు చాలా ఉన్నా వాటిని అనవసరం
గా వృధా చేయను .అవి మానవులకు ఉపయోగ పడు తాయి అన్నప్పుడే వాటిని వాడతాను
.నన్ను నేను ఆవిష్కరించు కొన్న రోజున నన్ను అడ్డ గించే శక్తి ఏదీ ఉండదు
.గుడ్డి వారికి చూపు ను  కుంటి వారికి నడకను ,ఇవ్వగలను ముసలితనాన్ని దూరం
చేయ గలను .మరణించిన వారిని పునర్జ్జీవులను చేస్తాను .ఇవన్నీ నిజం గా
జిమ్మిక్కులే .వీటి తో నమ్మకం రావచ్చు కాని మనసు కుదుట బడదు” .
”నాకు పన్నెండు మంది శిష్య పరంపర ఉంది .ఇది ఒక వలయం .నా
తర్వాత వీరిలో ఒకర్ని నా స్తానం లో ప్రతిష్టిస్తాను .వారి కోసమే నేను
నిరాహార దీక్ష ,మౌనం పాటిస్తున్నాను .వారంతా నా పూర్వ జన్మ లో సహచరులే
.వారిని నేను ఆదుకోవాలి . వీరికి బయటి వలయం లో44  మంది ఉన్నారు .అందులో
ఆడవారు మగ వారూ కూడా ఉన్నారు .అయితే పైవారి కంటే వీరి స్తాయి తక్కువ
.వీరందరి ద్వారా  కావలసిన పనులన్నీ జరిపిస్తాను .నా గరువు ”ఉపాసని మహా
రాజ్”.నాకు ఆధ్యాత్మిక భావన కలిగించిన వారు” హజరత్ బాబా జన్”అనే
సుమారు వందేల్లున్న ముస్లిం మహిళా ఫకీర్.”
ఇదీ అవతార్ మెహెర్ బాబా గారి వాణి,బాణీ .ఇదంతా ఆయన్ను ఇంగ్లండ్
కు చెందిన పత్రికా విలేఖరి భారతీయ ఆధ్యాత్మిక రహస్యాలను తెలుసు కోవా
టానికి భారత దేశం అంతటా పర్య టించిన paul brunton ఇంటర్వ్యూ చేసినప్పుడు
మౌనం గా ఉన్న బాబా  తన వద్ద ఉన్న  అక్షర మాల సహాయం తో   రాసి చెప్పిన
విషయాలు .


మీ–గబ్బిట దుర్గా ప్రసాద్ -19-7-12.-కాంప్ -అమెరికా


గబ్బిట దుర్గా ప్రసాద్
https://sarasabharati.wordpress.com
http://suvarchalaanjaneyaswami.wordpress.com

Posted in మహానుభావులు | Tagged | 1 Comment

తిక్కన భారతం –10 శ్రీ కృష్ణ రాయ బారం -1

తిక్కన భారతం –10

శ్రీ కృష్ణ రాయ బారం -1
సంజయుని ద్వారా ద్రుత రాష్ట్రునిని అంతరంగం ను పాండవులు పూర్తిగా
గ్రహించారు .ఇంకా ముసలి రాజు దురాశ లోనే జీవిస్తున్నాడని అర్ధమైంది .కనుక
తానే స్వయం గా రాయ బారానికి బయల్దేరాడు శ్రీ కృష్ణ పరమాత్మ .ఆయనకు తప్పని
పరిస్తితి .సంజయుడు హితుడైనా ,వాక్ చతురుడైనా ,అక్కడ సభ లో సముచిత స్థానం
లేని వాడు .కనుక అతని ఉప దేశం చెవిటి వాని చెవి లో శంఖమే అయింది
.నిరర్ధకమై అతి పరిచయం వల్లా ,ఎప్పుడూ చెప్పుతూన్డటం వల్ల ,ఫలితం కలుగ
లేదు .ఇక సామ దాన ప్రక్రియలు అయి పోయాయి .దండో పాయమే శరణ్యం .అయినా చివరి
ప్రయత్నం చేయాలని శౌరి భావించాడు .దానికి తానే పూనుకొన్నాడు .అక్కడికి
వెళ్లి క్రమంగా సామ దాన ,భేదాలను ప్రయోగించి చూద్దాం అను కొన్నాడు
.దివ్యాంశసంభూతుడు ,లోక పూజ్యుడు ,వీరాధి వీరుడు ,మంచి
డిప్లోమాట్,ఉపాయాలన్ని వివరం గా తెలిసిన వాడు ,శత్రు భంజన క్రీడా సక్తుడు
,అందరికి ”లోక బావ ”అయిన తానే సంధి కార్యానికి నడుం కట్టాడు .అందుకే
ధర్మ రాజు ”నీకు మేమేం చెప్పాలి .నీవు ఏది చేస్తే అది మాకు శిరో దార్యం
”అని భారాన్ని అంతటిని బావ నెత్తిన పెట్టె శాడు .
”మమ్మేరుగు డెదిరి నేరుగుదు -నెమ్మి ఎరుగుదు దర్ద సిద్ధి నెరి ఎరుగుదు
-వాక్యమ్ముల పద్ధతి నేరుగుదు -పోమ్మేవ్వాడ నేను నీకు బుద్ధులు సేప్పన్
”అన్నాడు .ఇదీ కృష్ణ రాయబారానికి నేపధ్యం .దీని ప్రకారమే కౌరవ సభలో కద
నడిపాడు కృష్ణుడు .ముందుగా పెద్ద రాజు తో ”జన నాధ !”అని మొదలు పెట్టాడు
సకల జనానికి రాజువు నువ్వే అని అర్ధం తో  ప్రయోగించిన సాభి ప్రాయ మైన మాట
.రాజు గా నీ కర్తవ్యమ్ ఏమిటో ఆలోచించు అనే హెచ్చరిక నిగూధం గా ఉంది
.”నువ్వు ఎరుగని పనులున్నాయా ?అయినా పరమ హితం కనుక, తన వారికి చెప్పటం
ధర్మం కనుక ,భారతాన్వయం మీద ప్రేమ ఉంది కనుక నేనే స్వయం గా రాయ బారి గా
వచ్చాను” .అనటం లో తనకు అందరు సమానమే అనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు
.”నీవు ఎరుంగని పను లున్నవే ?”అనటం లో నీకు తెలీకుండా ఈ సభలో ఏదీ జరగ
లేదు అని ఘంటా పధం గా చెప్పి నట్లే .అన్నిటికి నువ్వు ప్రత్యక్ష సా
క్షివే అని ముసలాయన్ను ఎద్దేవా చేయటమే ”.అందరికీ కావాల్సిన వాడిని” అని
చెప్పటం లో కౌరవులకు కూడా కృష్ణుడు ఏం చెబుతాడో అనే కుతూహలం కల్గించింది
.అదీ సంభాషణా చాతుర్యం .”తాను నూటికి నూరు శాతం మధ్య వర్తి ని” అని
గట్టిగా చెప్పే శాడు .”క్షీరోదక గతి పాండవ కౌరవులోడ గూడి మనికి కార్యం
”అన్నాడు .పాండవులు క్షీరం అయితే కౌరవులు నీళ్ళు కనుక ఏది శ్రేష్టమో
చెప్ప కుండా నే ఉపమానం తో చెప్పించాడు తిక్కన .పాలలో కలిస్తేనే నీటికి
పాల స్వభావం వస్తుంది .నీరు కలవక పోయినా పాల ఉనికికి ప్రమాదం ఏమీ లేదు
.కనుక దీనిని పాటించటం రాజుగా నీ కనీస ధర్మం అన్నాడు .కార్యభారం అంతా
ముసలి రాజు మీదే ఉంచాడు .నిజానికి ఆయనే రాజు, కాని చక్రం తిప్పేది కొడుకు
దుర్యోధనుడు .కర్తవ్యమ్ చెప్పి ,దాన్ని ఎలా నిర్వ హించాలో ,దాని
అవసరమేమిటో ,కారణాల తో సహా వివ రమ్ గా చెప్పాడు .”పొందు లోక హితం ”అని
గుర్తు చేశాడు ”.ఇదేదో దాయాదుల మనో వర్తి తగాదా కాదు .పాండవులు అంతా
ధర్మ ,న్యాయ వర్తనులు ,వీరాధి వీరులు ,కనుక అలాంటి గొప్ప వారిని నీలో
చేర్చు కుంటేనే నీకు లాభం” .అని చెప్పాడు ”.దీని వల్ల నీ ఔన్నత్యం
పెరుగుతుంది” అని ఆశ పెట్టాడు ”.అంతే కాదు సమస్త భూ మండలం నీపాదా
క్రాన్తమవుతుంది” అని వివరించాడు .”పుత్ర వాత్చల్యం తో ప్రజలను కూడా
చూస్తె ,విరోధం వది లేస్తే ,ఏంతో లోక హితం కలుగుతుందని ”చిలక్కి చెప్పి
నట్లు చెప్పాడు .–”జగతి గల జనపతులు నీచరణ పద -మరది గొలువ సముద్ర
వేలావ్రుతోర్వి -ఎల్ల నే లుట యొప్పదే తల్లి ప్రజల  -యెడ విరోధంబు వాటించు
టెంతమేలు?”అని పెద్ద కాన్వాస్ లో సమస్త భూ మండలానికి నువ్వే రాజువు
అవుతావు .పాండవులు నిన్ను కొలుస్తూ నీ  పాద సేవ చేస్తూ నీకు హాయిని
కూరుస్తారు .ప్రజలంతా హాయిగా శాంతి సౌఖ్యాలతో జీవిస్తూ నిన్నే తలచు కొంటూ
నీకు బరాబరులు చేస్తారు అని 70mm.,స్టీరియో స్కోప్ లో చూపించాడు .అయినా
ముసలాడు ఉలకలేదు పలుక లేదు .
మెత్తగా చెబితే వినే స్తితి దాటి పోయిందని కృష్ణుడు
తెలుసు కొన్నాడు .తిలా పాపం తలా పిడికెడు అన్నట్లు గా పూర్వం జరిగిన
దానికి అంతా కురు సభ ప్రత్యక్ష సాక్షి అని సాక్షుల జాబితాను పెంచాడు
.”ధర్మో రక్షతి రక్షితః ”అన్నాడు .ధర్మాన్ని ఉపేక్షించిన సమర్ధులకు
చేటు మూడుతునది అని మందలించాడు .ఈ మాటల్ని ఎంతో భావ గర్భితం గా ,గంభీరం
గా కృష్ణుడి చేత మహా కవి తిక్కన చెప్పించాడు .”పాండవుల పక్షాన సత్య
,ధర్మాలున్నాయి .అవే వారిని రక్షిస్తాయి .కాని మీరంతా సర్వ సమర్దులైనా
,సత్య ధర్మాలను కాల రాస్తున్తెఉపెక్శిన్చి ”కిమిన్నాస్తి ”గా
ప్రవర్తించారు .కనుక అధర్మ ప్రవర్తకులతో పాటు ,ధర్మ నాశనాన్ని చూస్తూ
చేతులు ముడుచుకు కూర్చున్న మీకూ వినాశనం తప్పదు ”అని భీష్మ పితామహుడు
ద్రోణా చార్యుడు మొదలైన వారిని హెచ్చరించాడు .వారందరికి ”సర్వ ధర్మ
స్మృతి ”కల్గిన్చాతానికి ప్రయత్నించాడు .”ద్రోణ ,భీష్ము లే
దిక్కుసుమ్ము  ?” .అని నిలదీశాడు .దుర్యోధనుడు భీష్మ ద్రోణుల మీద ఆధార
పడ్డాడు కనుక వాళ్ళిద్దర్నీ అధర్మ ప్రయత్నం లో విముఖత చూపెట్లు చేస్తే
-కోరలు తీసిన త్రాచులు లాగా కౌరవులు సంధికి అంగీకా రిస్తా రెమో నని
భావించాడు .ధర్మ నాశనం జరుగుతుంటే ఔదాసీన్యం చూపటం కూడా అధర్మమే నని
తీర్పు చెప్పాడు .ఈ విధం గా ”ధర్మంబును ,నీతియు మున్నిడికొని ,మనో
వాక్ప్రకారంబు లేక రూపంబైన సత్యమ్బకా ”అని ధర్మ సత్యాలను ముందుంచు కొని
వాటికి చేటు వాటిల్లు తుంటే నోరు మూసుకొని చేష్ట లుడిగి కూర్చోవటం కూడా
అధర్మమే నన్నాడు .చివరికిఅంతా నీదే భారం అని ముసలయ్య తో  తెగేసి చెప్పే
శాడు
”వారలు శాంత శూరులు ,భవచ్చరణంబు గొల్వ బూని యు-న్నారటు గాక ,మీకది
మనంబున ప్రియ మేని నింతకుం –బోరికి వచ్చు చుండుదురు భూవర, రెండు తెరంగు
లందు ,నీ –కారయ బధ్యమే యగు నవ్విధ మేర్పడ నిశ్చ యింపుమా ”అని హితోప
దేశం చేశాడు ”.భావి సౌభాగ్య విదాతావు నువ్వే .నువ్వే నిర్ణయం తీసుకోవాలి
.మార్గం నిర్దేశిన్చాల్సింది నువ్వే నువ్వే ”అని పదే పదే గుర్తు చేశాడు
.దుర్యోధనుడిని ఎక్కడా సీన్  లోకి రానివ్వ లేదు మాటల సందర్భం లో .అదీ
కన్నయ్య నేర్పు .ఈ విధానం అంతా ఉత్తమ గురువు చేసే మహోత్తమ ఉపదేశం లాగా
ఉంది .ఈ ధర్మోప న్యాసం తో సభ్యుల్లో కలకలం చేల రేగింది .అందరు ఆలోచన లో
పడ్డారు .లోక హితం కోసం కృష్ణుడు చెప్పిన ధర్మ వాక్యాలకు బదులు సమాధానం
ఉండదు .అంత నిర్దుష్టం గా చెప్పాడు .అది శాసనమే .అందరికి శిరో దార్యమే
.సదస్యులు అందరు ”ప్రియం పొందారు ”అన్నాడు తిక్కన .దాని ప్రభావం అంత
గొప్పది .”నెమ్మనంబునన్ బురుషోత్తముడింత యొప్ప బల్కునే -మరు మాట లాడ ,నయ
కోవిదు డెవ్వడు ,ధీరు దేవ్వడు ,తను వరి యెవ్వడు అంచు నచలాక్రుతు లై
ఊరుకోన్నారట . అంతటి ప్రభావం కలిగించే విశిష్ట వచనాలను కృష్ణుడు పలికి
అందర్నీ అలరించాడు .అతను చెప్పిందే ధర్మమని  అందరు  అంగీక రించారు .
సశేషం –మీ–గబ్బిట దుర్గా ప్రసాద్ –19-7-12.-కాంప్-అమెరికా


గబ్బిట దుర్గా ప్రసాద్
https://sarasabharati.wordpress.com
http://suvarchalaanjaneyaswami.wordpress.com

Posted in రచనలు | Tagged | Leave a comment

అమెరికా ఊసులు -8

అమెరికా ఊసులు -8
2020కి సగటు వయసు ఇండియా లో29 ఏళ్ళు ,చైనాలో37  ,అమెరికా
లో 45 పశ్చిమ యూరప్  జపాన్ లో 48ఏళ్ళు అని జనాభా లెక్కలు చెబుతున్నాయి
.అంటే యువకుల శాతం తగ్గి పోతోందని అర్ధం .ఇండియా లో యువకుల శాతం ఎక్కువ
.వీరి శక్తి సామర్ధ్యాలను బాగా ఉప యోగించు కొంటె భవిష్యత్తు బంగారం
.వారిని పట్టించు కొక పోతే అంధకారం .నక్సల్స్ భూభాగం లో నలభై శాతం అటు
నేపాల్ నుంచి ఇటు ఉత్తరాంధ్ర వరకు వ్యాపించి ఉన్నారు .కనుక యువ శక్తికి
తగిన ప్రాధాన్యం ఇవ్వాలని సూచన .
గ్లోబల్ వార్మింగ్ వల్ల నదులు ఎండి పోయే ప్రమాదం ముంచు
కొని వస్తోంది .ఇంకో యాభై ఏళ్ళ లో దేశాల ఆర్ధిక నాగరాక జీవనానికి ముఖ్య
పాత్ర వహిస్తున్న మహా నదులు కను మరుగై పోబోతున్నాయని అమెరికా లోని
కొలరేదో రాష్ట్ర the national centre for atmospheric research వారు
హెచ్చరించారు .ఆ నదుల్లో ముఖ్యమైనవి అమెరికా లని కొలంబియా రివెర్ ,
మిసిసిపి నది ,మధ్య ఆఫ్రికా లోని కాంగో నది ,మాలి లోని నైగర్ ,బ్రెజిల్
లో పరానా నదులు అంత రించే స్తితి తో ఉన్నాయి .అమెరికా .దక్షిణాఫ్రికా ల
లోని ఉపరి తల నీరు సుమారు ముప్ఫై శాతం తగ్గి పోయింది .”the water towers
of asia  అని పిలువా బడే హిమాలయ హిమానీ నదులు కరిగి పోతున్నాయి .వాటికి
అడ్డం గా కట్టిన డాములు నదీ ప్రవాహాలకు అడ్డం గా తయారైనాయి .చైనా లోని
ఏడు ముఖ్య నదుల జలాను కాలుష్య కాసారాలై ఉపయోగానికి పనికి రాకుండా
పోతున్నాయి .భూ గర్భ జలాలు అన్ని చోట్లా అడుగంటి పోతు సాగుకే కాదు తా గ
టానికి కూడా చాలటం లేదు .భారత దేశం లో డెబ్భై శాతం మంచి నీరు అంటువ్యాధి
నిలయాలే .అమెరికా వాసులు వాడి నట్లు మిగతా ప్రపంచ జనం నీటిని వాడితే నీటి
వాడకం90%.దాటి పోతుందని తీవ్ర హెచ్చారికి .అంటే నీటిని ఎంతో పొదుపు గా
వాడుకోవాలని సూచన .అందుకే ఒడం అనే శాస్త్ర వేత్త ”నీరు శక్తి జనకాల కంటే
క్లిష్టమైనది .మనకు అనేక రకాల ఆల్టర్నేట్ ఎనేర్జీలున్నాయి .కాని నీటికి
వేరే చాయిస్ లేదు ”అన్నాడు .దీనినే ఇంకొంచెం తీవ్రం గా ”నీరు ఒక రోజున
యుద్ధ పరికరమై న్యూక్లియర్ ,చేమికల్ ,బయలాజికల్ యుద్ధ పరికరాలకంటే అధిక
ప్రభావం చూపిస్తుంది ”అన్నాడు j.h.foegan .కాశీ లోని ఒక సాధువు ”నదులు
ఇంకి పోతే ,మన పాప ప్రక్షాళనకు ఎక్కడికి వెళ్ళాలి ?అని బాధ పడ్డాడు .
అమెరికా ,రష్యా ,ఫ్రాన్సు ,జెర్మని జెక్ ,స్వీడన్ ఇస్రాయిల్
నెదర్లాండ్ లాంటి దేశాలన్నీ ఆయుధాల అమ్మకాల మీదనే బతుకులు గడుపు తున్నాయి
.ప్రపంచం మొత్తం మీద ప్రతి ఏడాదికి మూడు లక్షల జనం తేలిక రకమైన ఆయుధాల
వల్ల చని పోతున్నారు .ఇక భారీ యుద్ధ ఆయుధాల బారిన పది ఎంత మంది
చస్తున్నారో లెక్కే లేదు .అగ్ర రాజ్యాలు నిరాయుధీ కరణ ఒప్పందాన్ని అమలు
జరా పాలని నిర్ణయం తెసుకొన్నా అమలు లో అలసత్వం ఎక్కువైంది .ప్రమాద
ఘంటికలు మోగుతూనే ఉన్నాయి .”యుద్ధ విషాదం ఏమిటి అంటే మనిషి లోని మంచి
సర్వస్వాన్ని ,చెడుకు ఉపయోగించటమే ”అన్నాడు హెన్రీ ఫాస్ డిక్.దీనినే
బెంజమిన్ ఫ్రాంక్లిన్ ”యుద్ధ సమయం లో యుద్ధ ఖాతా ఎప్పుడు జమ కాదు ,దాని
బిల్లు యుద్దానంతరమే వస్తుంది ”అని చమత్కరించాడు .నియంత స్టాలిన్ ”ఒక
మనిషి చావు విషాదాంతం (ట్రాజెడీ )కాని మిలియన్ల మరణం ఒక జనాభా లెక్క
మాత్రమె (స్టాటిస్టిక్స్ )అన్నాడు” లైట్” గా తీసుకొన్నాడు .
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –18-7-12.–కాంప్–అమెరికా

Posted in అమెరికా లో | Tagged | Leave a comment

తిక్కన భారతం –9 సంజయ రాయ బారం — 2

తిక్కన భారతం –9
సంజయ రాయ బారం — 2
ధర్మ రాజు సంజయుడి తో ”ముందు మమ్మల్ని పోగిడావు .యుద్ధం లో కౌరవులను
మేము జయించా లేము అన్నావు .ఆ తర్వాతా సంధి అని సంధి ప్రేలాపన లా
మాట్లాడావు .అంత పక్ష పాతం గా మాట్లాడతా వేమిటయ్యా !”అని నిలదీశాడు
.–”ఎదిరిం దమ యట్టుల కా -మది దలచిన బోసగు గాక మాకుం గుడు మిన్దేడిదే
మీరు ప్రక్క గోనుడని -చదుర బడచిన మనసు పొందు చక్క బడునే ?” అని ద్రుత
రాష్ట్రుని పక్ష పాత బుద్ధి ని ఎండ గట్టాడు .”సంపద దక్కి యుండగా
నాశక్తులనం జను మమ్ము బిల్చి పూజింప నంత బేలె ,పతి ”అని పెద్ద రాజు మనసు
లోని దురాశను ,దుష్ట బుద్ధి సంకల్పాన్ని ,తెలియ జేశాడు .”మాతో ఎంత
తియ్యగా మాట్లాదావో ,ఆ రాజుతో కూడా మేము చెప్పిన విషయా లన్ని అంత తియ్యగా
నూ తెలియజేయి ”అని చెప్పాడు .–” ఆ రాజు సేయు నెయ్యము -గారామును జెప్పే
దీవు గడు దీపులుగా -వీరు తమ పాలు వడయక -నేరిమి మాటలన దేర నేర్తురే చెపుమా
?అని ఝాదించాడు .ఇదంతా వింటున్న శ్రీ కృష్ణునికి కారం రాచినట్లుంది .ధర్మ
రాజు మెత్త గా మాట్లాడుతున్నాడని పించిందేమో ఒక సారి ఫ్లాష్ బాక్ లోకి
తీసుకొని వెళ్లాడు –
”దుస్స సేను డదయాక్రుతి ముందల వట్టి ఈద్వగా నెట్టు సహించే
మామ ”అని తీవ్రం గా ప్రశ్నించాడు .”సతి ఏడ్పు టేలున్గున కెట్టు
లోర్చే-ణీ పట్టున సెమ మారయగ-బంచుట కెట్టు లు నేర్చే గ్రమ్మరన్ ” అని
నిండు సభలో యాజన సేని అయిన ద్రౌపదికి జరిగిన పరాభవాన్ని చూస్తూ ఊరుకొని
ఇప్పుడీ రాయబారం సందీ అంటే అర్ధమేమిటి అని ఈసదించాడు .ధర్మ రాజు పెద్ద
రాజును పేద తండ్రి అని ఒక మారు కూడా సంబోధించ లేదు .”ఆ రాజు ”అని చాల
తేలిక భావం తో అలాంటి నిస్చేతనుడైన రాజు అనే అర్ధం లోనే వాడాడు .కృష్ణుడు
లౌక్యం గా ”మామ ‘అన్నాడు .ఈ విధం గా సంజయుది మిధ్యా వాదాని ఖండించాడు
బావ .ధర్మ రాజు సంజయుడిని బాగా ఎస్టిమేట్ చేశాడు .అతని మాటల్ని
”దుర్నయము ,బెట్టిదం ,బెండు ”మాటలుగా ఉన్నాయని చెప్పాడు .అంతే కాక ఇంత
వినయం ,నేర్పు ఇంకెవరి దగ్గరైనా ఉన్నాయా /అని మెచ్చి కోలు గా అన్నాడు
.అంటే రాయ బారి సంభాషణా చాతుర్యానికి కితాబు ఇచ్చాడు .సంజయ రాయబార
విధానానికే ఈ మాటలు చక్కని వ్యాఖ్యానాలు .
పాండవ సందేశాన్ని తీసుకొని సంజయుడు హస్తిన చేరి పెద్ద
రాజుకు పూస గుచ్చి నట్లు వివ రించి చెప్పాడు .ధర్మ రాజు సందినే
కోరుతున్నాడని ద్రుపద పురోహితుని ద్వారా పంపిన రాయ బారమే చెప్తోందని
గ్రహించాడు .అయితే ధర్మ రాజు ను యుద్ధ విముఖుడిని చేయ టానికే సంజయుడిని
పంపాడు .అతనూ తీవ్రం గా నే ప్రయత్నించాడు .వంశ ,బంధు ,రక్షణ అంతా
యుదిస్తిరు ని పైనే ఉందని గుర్తు చేయించాడు .శాంతుడు అయితే ధర్మ రాజు
రాజ్య భాగాన్ని కూడా కోరడు అని భావించాడు రాజు .కొంత వరకు ఈ రాయబారం
ఫలించి నట్లే .బంధు నాశనం ఇష్టపడని ధర్మజుడు ”అయిదు ఊళ్లు ”ఇమ్మన్నాడు
.ధర్మ రాజు ఎంత ఔదార్యం చూపించినా ,తన కొడుకు దుర్యోధనుడు దానికీ ఒప్పు
కోడు అని గుడ్డి రాజు కు బాగా తెలుసు .కళ్ళు గుడ్డివే కాని మనసుల్ని చదవ
గలదు .తన కొడుకు మూర్ఖత్వమూ చెల్లాలి ,ధర్మ రాజూ శాంతించాలి .ఒకే దెబ్బకు
రెండు పిట్టలు పదాలని దురాశ .ఈ రెంటినీ నేర వేర్చ తానికే సంజయ రాయ బార
వ్యూహం పన్నాడు .మళ్ళీ సంజయుడు యుక్తి గా ఒక ఎత్తు ఎత్తాడు .-
”ఎట్టి తప్పులం బోవగ దోచి ,తాలిమి పూనుదు గావున నన్ని మాట
లిట్లీవు వినంగ నాడియు ,నే ,దని వోవక విన్న విన్చేదన్ ”అని కోన సాగిస్తూ
-అంటే” అవతలి వారు ఎన్ని తప్పులు చేసినా సహించే ఔదార్యం ఉన్న వాడివి
నువ్వు .సహనం నీకు ఎక్కువ .అది నీకు సహజ ఆభరణం .అయినా నాకు మనసు సంతృప్తి
పొందక ఒక మాట చెబుతున్నాను వినవయ్యా ”అన్నాడు .”ణీ విభావంబహిం సయు
,ననిన్ద్య చరిత్ర కాక యన్యమే”అని అహింసా మూర్తిగా నోట్లో వేలు పెడితే
కోరకలేని వాడిని గా పరిశుద్దాన్తరంగునిగా ఎట్టి నిండా లేని సచ్చరిత్రుని
గా భుజ కీర్తులు పెట్టి కార్యాన్ని గట్టేక్కించు కోవాలని చూశాడు సంజయుడు
.ఈ పొగడ్తను పరా కాష్టకు చేరుస్తూ ”అల్పులకు అలవి కాని హాలాహలం లాంటి
కోపాన్ని దిగ మింగు కోవా టానికి నువ్వు సాక్షాత్తు ఆ నీల గళుడుఅయిన
శివుడివే ”అన్నాడు .”నీకు నీవే సాటి ”అని ములగ కొమ్మ ఎక్కించాడు
.బోళాశంకరుడు పొగడ్తలకు ఉబ్బి పోయి నట్లు ధర్మ రాజు ఉబ్బు లింగం అవుతాడని
మంచి ఉపమానాలను ఎన్నుకొని మాటల పొగడ దండలు మెడ నిండా వేశే శాడు .చేసేది
లేక ఏమీ పాలు పోక ఆఖరి అస్త్రాలుగా వీటిని ప్రయోగించాడు .ఈ యుక్తి యుక్త
మైన మాటలకు చాలా తీవ్రం గా నే బావా ,మరడులు సమాధానం చెప్పి నోరు మూయించి
నంత పని చేయించారు .ఇప్పటి దాకా చాలా ప్రశాంత చిత్తం తో ఓర్పు గా ఉన్న
ధర్మ రాజు విపరీత మైన కోప స్వరం తో తన తమ్ముళ్ళ అవక్ర పరాక్రమ శౌర్యాలను
ఏకరువు పెట్టాడు .అవన్ని ఒక్క సారి ప్రదర్శింప జేశాడా అన్నట్లు తిక్కన
ఆయన తో అని పించాడు .
”గాండీవ జయా రవంబుతకట మయి పెలుచం గ్రమ్మిన న్ ,భీము బాహా –దండంబే
పారి ,శుంభద్గద  జడియుచు దోచినన్ -రౌద్రంబు గా దోచినన్ ,వే–దండ
ద్వంద్వము మాడ్కి న్దరిమికవలు మాద్యద్గతిం దాకినన్ జా కుండం బోకుండ
గౌరవ్యులకు వశమే బిట్టుల్కి మూర్చిల్ల కుండన్ ”అని రాబోయే కౌరవ పాండవ
యుద్ధం లో జరగ బోఎదేమిటో కళ్ళకు ప్రత్యక్షం చేశాడు .తన సోదరుల ముండేవారు
నిలిచి పోరాడలేరని తేల్చి చెప్పాడు .ఆ చెప్పేది చాలా విష్పస్తం గా ,ఉధృతం
గా తీవ్రమైన గొంతు తో చెప్పే శాడు .సంజయుడు ఇంగితం కల వాడు .పాండవుల మనో
భావాన్ని ,తీవ్రత ను అర్ధం చేసుకొన్నాడు.బందుత్వాన్ని కూడా పాటించ కుండా
”కౌరవ్యులు ”అని ధర్మ రాజు అన్నందుకు ఆ అహింసా మూర్తి లో రోషం ఎంత
జీర్ణించుకు పోయి ఇప్పటి దాకా బయట పడ కుండా ఉందొ గ్రహించాడు . ఇటు వైపు
అయి పోయింది -ఇక అటు వైపు నుంచి రావాలి అనుకొన్నాడు .
ద్రుత రాష్ట్రుని కొలువు కూటం చేరాడు .ముందుగానే
”సైరణ వేరపుగా భావించుట తప్పు ”అని ముసలాయనకు హితోప దేశం చేశాడు .అంటే
పాండవులు  సహించి ఉండటం భయం తో కాదు అని అర్ధం .”సాదు రేగే నేని విను
,తల పొలమున గాని నిలువదు సుమ్మీ ”అని హెచ్చరించాడు .అంటే ధర్మ రాజు ఎంత
శాంత చిట్టుడో ,అవసరం వస్తే అంత తీక్ష్ణ స్వరూపుడు .సాధువు చేల రేగితే
భూమి మీద మిగిలేది బూడిదే అని భావం .సంజయుడు ఉభయుల హితం కోరే వాడు .కనుక
మొహమాటం లేకుండా చెప్పే శాడు .ఇప్పటికే చాలా ఆలస్యం జరిగి పోయింది .ద్రుత
రాష్ట్రుని ప్రవర్తన ను కటువు గా నే నిందించాడు .-”ఆలు బిడ్డ లేని యట్టి
త్రిమ్మరి యగు -కొయ్య గాక కుదుట గూడు వెట్టి -కుడుచు వారలిట్టి
క్రోవ్విదంబుల సేయ -జొచ్చు టి చ్చ గించి చూతురయ్య ”అని మందలించాడు .తోట
కూర నాదే వంగ దీయాల్సిన కొడుకుని ఉపేక్షించి ఇప్పుదేదిస్తే ఏమి లాభం
అన్నాడు .”నీ ఉపేక్ష కొంప ముంచింది .ధర్మ రాజు చాలా తెలివైన వాడు లోకం
అంతా తప్పు అంతా నీ మీదే పెట్టె దాకా వదలడు .ధర్మ రాజు అంటే ”మెత్తని
పులి ”అని ఆతని ఆంతర్యాన్ని విస్పష్టం చేశాడు .
”అనయము వుట్టె జూదమున యప్పుడ ఎంతయు జిచ్చువెట్టి కా –ల్చిన యది ,నీ
యుపెక్షయ ,వశీక్రుత చిత్తుడు ధర్మ సూతి ,మే–త్తని పులి ఎల్ల వారలు
,నధర్మము నీ పయి బెట్టు నంత కు –న్వినడు గనదుం ,బిదప నీకును నాకు మరల్చ
వచ్చునే ”–ఉపేక్ష ఎంతటి వినాశనాన్ని సృష్టించిందో ఎరుక పరిచాడు .చివరగా
‘అయ్యజాత శత్రుదలుగుట నీళ్ళు ల నగ్ని పుట్టి నట్టిదయ్యెమీకు నార్ప వెరవు
లేదు ”అని కవి తిక్కన మహా నేర్పు గా సంజయుని తో చెప్పించాడు బధిర
శంఖారావం గా ఉంటున్న పెద్ద రాజుకు .అగ్నిని ఆర్ప టానికి నీళ్ళు కావాలి .ఆ
నీళ్ళ లోనే అగ్ని పుడితే ? ఆర్పటం సంభావమా ?అది ప్రళయాగ్ని .దానికి సర్వ
సంహారం చేయటం తప్ప ఇంకోతేమీ తెలియదు .తస్మాత్ జాగ్రత .అని విలువైన సందేశం
ఇచ్చాడు .అయినా ముసలి రాజుకు ఆశ చావా లేదు .విదుర ,భీష్మాదులు చెప్పినా
విన లేదు .పాండవులను జయింప వచ్చును అనే దురాశ ఇంకా లోపల్లోపల మినుకు
మినుకు మంటోంది .కనుక చివరగా సంజయుడిని బాలా బలాల సంగతి అడిగి తెలుసు
కొన్నాడు .ఇక్కడ సంజయుడు చెప్పే సమాధానం చాలా లోకోత్తరం గా ఉంది పాండవుల
అవక్ర పరాక్రమాన్ని వైభవో పేతం గా ,దిమ్మ తిరిగే ట ట్లు వర్ణించి
చెప్పాడు .”అట మిన్నందిన యట్టి వాని పొడవెంతన్నట్లు ,ఫాలాక్షు నె
–క్కటి కయ్యంబున గొన్న ఫల్గును భుజా గర్వంబు లేక్కిన్చుటం–తటి వానిం
గొని ధర్మ సూతి సమరోత్సాహంబుమై నెత్తి వ–చ్చుట కుం గొంకు నె వీపు సక్క
నయి నిల్చుం గాక మీ సైన్యముల్ ”అని హేళన చేశాడు .రుద్రుని తో జగ జెట్టి
అయిన అర్జునుని పరాక్రమ విక్రమాన్ని ప్రదర్శన గా చూపించాడు .వీళ్ళు అందరు
ఒక ఎత్తు.అసలు సకల చరాచర సృష్టి స్తితి ,లయ కారకుడయిన శ్రీ కృష్ణ పరమాత్మ
సహాయ సంపత్తులుఒక ఎత్తు . ఇన్ని పుష్కలం గా ఉంటె ,ధర్మ రాజు యుద్ధం చెయ్య
కుండా ఆగుతాడా ? అని కుండా బద్దలు కొట్టాడు .యుద్ధం అని వార్యం అని తన
మనసు లోని మాట గా చెప్పేశాడు .ఇది హెచ్చరికే .భయపెట్టటమూ ఉంది ఈ మాటల్లో
.సంజయుడు జ్ఞాని కనుక జరుగ బోఏది ఏమిటో తెలుసు కనుక  లోక నాశనం కాకుండా
విశ్వ ప్రయత్నం చేశాడు .తన మనసు బుద్ధి ,వాక్కు ,లను త్రికరణ శుద్ధి గా
ప్రయోగించాడు .చాతుర్యమూ చూపాడు .అంతటి ఉక్తి ,చమత్కారం సంజయుని మాటల్లో
తిక్కన చెప్పించాడు .ఇలా రెండవ రాయ బారమూ విఫల మైంది .పాండవుల యుద్ధ
సన్నద్ధత తప్పదు అని తేలింది చివరకు .-
— సశేషం –మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –18-7-12-కాంప్–అమెరికా

Posted in రచనలు | Tagged | Leave a comment

అమెరికా ఊసులు –7–జేఫర్సనీయం

అమెరికా
ఊసులు –7–జేఫర్సనీయం
అమెరికా స్వాతంత్ర ప్రకటన అనే డిక్లరేషన్ ను తయారు చేసింది వర్జీ
నియా కు చెందిన ప్రముఖ న్యాయ వాది, ఆ తర్వాతా అమెరికా అధ్యక్షుడు అయిన
థామస్ జేఫెర్సన్ . ఆయన ఫ్రాన్స్ దేశానికి దేశానికి సంబంధించిన మినిస్టర్
గా పని చేశాడు .రాజకీయం లో నాలుగో వంతు వర్జీనియా లెజిస్లేచర్ లో సేవ
లందించాడు . .బానిసత్వం అమెరికా దేశ పరిణామాలకు  భవిష్యత్తు కుకారణం
అవుతుంది అని భావించి ,ఊహించిన వాడు . బానిసలు అమెరికన్ల ఆస్తి అని కూడా
ఆ రోజుల్లో చెప్పిన వాడు . .
జెఫర్సన్ గొప్ప రాజకీయ వేత్త అంటే స్టేట్స్ మాన్.ఆయన కాలం లో
ఫ్రాన్స్ దేశం తో ”లూసియానా కొను బడి ఒప్పందం ”చారిత్రాత్మక మైంది .ఆ
కొనుబడి తో అమెరికా విస్తీర్ణం రెట్టింపు చేసిన దీర్ఘ దర్శి జెఫర్సన్
.అంతే కాదు లెవిస్ మరియు క్లెర్క్ ఎక్స్ప్లోరేషన్ ను ఆమోదించి అమెరికా
సరిహద్దుల్ని విస్తరింప జేసి సెటిల్మెంట్ లకు అవకాశం కల్గిచిన వాడు .
బార్బెరీస్తేట్లు . అమెరికన్లను కిడ్నాప్ చేసి లంచం అడిగి నందుకు తన
వారిని విడిపించు కోవ టానికి ట్రిపోలి యుద్ధం చేసిన వీరుడు .అమెరికా
నావికా బలాన్ని అనేక రెట్లు పెంచిన వాడు .దేశ రక్షణ వ్యవస్థ ను పటిష్ట
పరచిన యుద్ధ నిపుణుడు .
1826 లో జూన్ ఇరవై నాలుగునవాషింగ్టన్ లో జరిగే
అమెరికాయాభై వ స్వాతంత్ర దినోత్స వానికి రావలసినది గా ఆహ్వానం అందు
కొన్నాడు జెఫర్సన్ .తన అనారోగ్య కారణాల వల్ల రాలేక పోతున్నానని ఈ
స్వాతంత్రం కలకాలం నిల వాలని కోరుతూ జాబు రాశాడు . మరుసటి నెల అంటే జూలై
నాలుగున డిక్లరేషన్ చేసిన యాభై ఏళ్ళ శుభ సందర్భాన అకస్మాత్తు గా చని
పోయాడు .చని పోయే ముందు జెఫర్సన్ నోటి నుండి వెలువడిన మాటేమిటో
తెలుసా?”ఇవాళ జూలై నాలుగో తేదీయేనా?”అని .అదే రోజు జాన్ ఆడమ్స్ అనే ఆయన
విరోధి కూడామాసా చూసేత్సు లో  చని పోయాడు ..ఇద్దరు అమెరికా ప్రెసిడెంట్లు
గా పని చేసిన వారే .అమెరికా ఫౌండింగ్ ఫాదర్స్.అయితే జాన్ ఆడమ్స్ చని పోతూ
అన్న మాటలేమిటో తెలుసా ” .థామస్ జెఫర్సన్ ఇంకా బతికే ఉన్నాడా ?-ఉన్నాడా
జెఫర్సన్ ”.అంతటి గాఢ అనుబంధం ,అంతటి వైరమూ ఉన్న వారిద్దరూ స్వాతంత్ర
దినోత్సవం రోజునే చని పోవటం ఒక యాదృచ్చిక సంఘటన . .
జెఫర్సన్ ఫ్రాన్సు అధ్యక్షుడు నియంత అయిన నెపోలియన్
బోన పార్టే తో లూసియానా కొనుబడి ఒప్పందాన్ని కుదిర్చాడు .దీనితో మిసిసిపి
నది -రాకీ పర్వతాల మధ్య ఉన్న భ్హాగ మంతా అమెరికా స్వాధీనం లోకి వచ్చి
ఉత్తర సరిహద్దు హెచ్చింది .ఇది చాలా రహస్యం గా జరిగిన ఒప్పందం .అమెరికా
కాంగ్రెస్ కు ,రాజ్యాంగానికి దూరం గా చేసుకో బడిన చారిత్రాత్మక ఒప్పందం-
కాదు- కొనుగోలు  .దీని తో అమెరికా విస్తీర్ణం రెట్టింపు అయింది .కొన్న
రేటు ఎంతో తెలిస్తే ఇప్పుడు అందరికీ మరీ ఆశ్చర్యం కలుగు తుంది .ఎకరం
అక్షరాల నాలుగు సెంట్లు .ఇది జరిగిన నాలుగు రోజుల్లో డబ్బు చెల్లింపుపు
పూర్తీ చేశాడుప్రెసిడెంట్  జెఫర్సన్ .అది1803 జూలై నాలుగున జరగటం
చారిత్రాత్మకం కూడా .అందుకే జెఫర్సన్ ను  inventing america అని
imagining america అని విశేషణాలతో పొగుడు తారు .కాని ఆయన ను designed
america అని లేకauthored america  అని సంబోధించాలని ఇటీవలి విశ్లేషకులు
భావిస్తున్నారు .
జెఫర్సన్ జ్ఞాపకార్ధం అయిదు సెంట్ల నికెల్ అమెరికా
నాణాన్ని ముద్రించి గౌరవించారు .ఆయన చాలా ఎత్తుగా ఆరడుగుల రెండు
అంగుళాలుఉండే వాడు . దీన్ని ఆయన సాటి వారిలో చాలా ఉన్నత ఆలోచనా పరుడు  గా
చెప్పు కోవటానికి ఉపయోగ పడింది . .ఆయన ముఖం  అంత కార్షణ గాకాని  మరీ
ముభావం గాకాని  ఉండదు .యెర్ర జుట్టు .చికిలించే కళ్ళు .పొడవైన కాళ్ళూ
చేతులు పలుచని పెదవులు ,మంచి ముక్కు .చిరుగడ్డం ..ఇవన్ని చూసి ఆయనను ఏ
జంతువూ తో పోలిస్తే బాగుంటుంది అని బుర్రలు పగల కొట్టు కొని, చివరికి”
పొడవైన ప్రావీన్యమైన తెలివిగల నక్క ”అన్నారు సమకాలికులు(large and
rather resourceful fox ).ఎంతటి గొప్ప వారైనా ”కలం వీరులకు ”తేలికే .
ఆయన్ను ఎలా ఆరాదిన్చారంటే if america is right jefersan
was right and if jefersan was wrong americaa is wrong ”అనే వారు .ఇది
చూస్తె నాకు మన దేశం లో india is indiraa and indiraa is indiaఅని
ఫక్రుద్దీన్ అలీ అన్న మాట జ్ఞాపకం వచ్చి నవ్వు వచ్చింది . రెండు సార్లు
ప్రెసిడెంట్ గా చేశాడు .మొదటి సారి ఉన్న వేగం రెండో సారి లో కనీ పించలేదు
.అమెరికా రాజ్యాంగం కుముందు మాట–ఉపోద్ఘాతం  అంటే pre amble రాసింది
జేఫర్సనే .ఏమైనా అమెరికా రిపబ్లిక్ ను శాశ్వతం చేసిన వారిలో జెఫర్సన్
ఒకడు .
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –17-7-12.–కాంప్–అమెరికా —


గబ్బిట దుర్గా ప్రసాద్
https://sarasabharati.wordpress.com
http://suvarchalaanjaneyaswami.wordpress.com

Posted in అమెరికా లో | Tagged | Leave a comment

తిక్కన భారతం –8 సంజయ రాయ బారం –1

తిక్కన భారతం  –8
                                                     సంజయ రాయ బారం –1
సంజయుడు కౌరవ ,పానదవులకు ఇద్దరికీ కావలసిన వాడు .యుక్తాయుక్త వివేకం ఉన్న వాడు .రాజుల వద్ద మెలిగే నేర్పున్న వాడు .అన్నిటికి మించి రాయ బారికి కావలసిన వాక్ చతురత ఉన్న వాడు .అందుకే ద్రుత రాస్త్రుని ఆజ్న గా పాండవుల దగ్గరకు రాయ బారి గా వచ్చాడు .ముందు గా ధర్మ రాజుతో అతడిని పొంగించి ,ఉబ్బెసే ప్రయత్నం చేస్తూ ”భాగ్యమున నిన్ను గనుగొన బడసి నాడు –చూడ్కి చరితార్ధ మయ్యే నస్తోక పుణ్య ధనుడు మీ తండ్రి ద్రుత రాష్ట్ర ధరణి నాధు -దిండు మీ యుంకి విని ప్రియ మెసక మేసగ ”అనటం తో ధర్మ రాజు ”ఉబ్బు లింగం ”అవుతాడని చాలా ఆశ పడ్డాడు సంజయుడు .తన ప్రయతన లోపం లేకుండా ఇంకాస్త పొగడ్త ధూపం వేశాడు .-
”అనుజులు నీవునును ద్రోవది -యును బుత్రచయంబు నున్న యోగ క్షేమం బున తెర గారయ బుత్తెం-చే,నితాంత స్నేహ పూర్న చేతో వృత్తిన్ ”-అన్నాడు .ధర్మ రాజాదుల యెడ పేద తండ్రికి గల స్నేహ భావాన్ని ,పాండవులంతా అనుభ వించిన దుఖానికి సానుభూతి ని తెలియ జేశాడు .యుధిష్ఠిరుని మనసు మెత్తబడ టానికి ప్రయత్నం చేశాడు .అందుకే మాటలను అతి జాగ్రత్త గా ప్రయోగించాడు ”అస్తోక పున్యధనుడు -మీ తండ్రి -ధరణి నాధుడు ”అనే మాటలను సాభిప్రాయం గా ప్రయోగించాడు .మీకు మీ తండ్రి తెలీదు ఆయనే తండ్రి -ఆయన పుణ్యాల రాసి మీదు మిక్కిలి అస్తినా పురానికి మహా రాజు అని గుర్తు కూడా చేశాడు .అంటే తస్మాత్ జాగ్రత్త అనే హెచ్చరికా అందు లో ఉంది .ఆ వరుస క్రమం చాలా పకడ్బందీ గా ఎన్ను కొన్నాడు .ప్రతి మాట అర్ధవంతం సమయానికి తగిండీ .జరిగిన దానికి పెద్ద రాజు తప్పు ఏమీ లేదు అని చెప్పా టానికి ”అస్తోక పుణ్య ధనుడు ”అన్నాడు .పిత్రుప్రేమ ను జ్ఞాపకం చేసుకోవ టానికి ”మీ తండ్రి ”అన్నాడు .చివరికి మహా రాజు పంపే సందేశం మీరు కాదనటానికి వీలు లేదు -అది శిరోధార్యం అని చెప్పా టానికి ”ధరణి నాధుడు ”అన్నాడు .అంతే కాదు ”అనుజులు నీవును ద్రౌపదియును ”అనటం లో కూడా తమ్ముళ్ళను అనునయించటం ,ప్రతీ కారం తో రగిలి పోతున్న పాండవవ పట్ట మహిషి ద్రౌపది ప్రతీకారం తీర్చు కోవటానికి ఎదురు చూస్తోందని తెలిసి ఆమె పేరును ప్రస్తా వించటం సంజయుని మాటల నైపుణ్యానికి గొప్ప ఉదాహరణ .విషయం పెద్ద రాజుది కాని మాటల పేర్పు సంజయుడిదే .ఇదీ కార్య సాధకుడికి ఉండాల్సిన ముఖ్య లక్షణం .అంత మాత్రం చేత ధర్మ రాజు పొంగి పోతాడా ?ఆయన పేరే యుధిష్ఠిరుడు .దానికి తగ్గట్టే ఆయన సమాధానమూ ఉంటుంది –
”’ఆ రాజు మా దేసం గల కారుణ్యము కతమునాను సుఖమున నిట్లున్నారమని ”వ్యంగ్యం గా కాకువు తో చెప్పాడు .అవును రాజు గారి దయ వల్ల మేము అడవుల్లో చాలా సుఖాలు అనుభవిస్తున్నాం అన్నాడు దెప్పి పొదుపు గా .కాని తన ధర్మాన్ని వదల కుండా కౌరవులందరి యోగా క్షేమాలను అడిగాడు .అప్పుడు నెమ్మది గా తన తమ్ముల అశేష శౌర్య పరాక్రమాలను వరుసగా వర్ణించి దిమ్మెర పోగొట్టాడు .ధర్మ రాజు ఇప్పుడు ఇవన్నీ ఎందుకు ఏకరువు పెడుతున్నాడో గ్రహించానంతటి అవి వెకి కాదు సంజయుడు .వెంటనే గ్రహించాడు .అయినా తన ప్రయత్నం తాను చేశాడు .పట్టు వదలని విక్రమార్కుని లా ధర్మ రాజు కారుణ్యాన్ని పదే పదేప్రస్తుతించాడు .ఇప్పటి వరకు పాండవులకు క్షేమం లేక పోయినా ఇప్పుడు కలుగు తుంది అన్నాడు .–”పొందొంగ దలచితి నీ –విందు శిశిర మైన హృదయంబున ,వారందరకు ను సేమంబిట  –ముందర లేకున్న నేడు మొదలగ గలుగున్ ”అని చాలా గూధం గా చెప్పాడు సంజయుడు .తెలివి తేటలన్నీ ప్రయోగించాడు .పూర్వం కౌరవులు ప్రవర్తించిన దానికి పాండవులు ప్రతీకారం తీర్చు కో దలచు కుంటే ,ఇంతకు ముందుగా ఉన్న కౌరవుల క్షేమం ఇంకా క్షయం అవుతుంది .శిశిర విమల హృదయం తో సంధిని ధర్మ రాజు కోరుతున్నాడు .కనుక ఇప్పుడు నిజం గా కౌరవులకు క్షేమమే .చంద్ర వంశానికి చెందినా వాడవు కనుక నీ మనసు అమృత మాయం గా ఉంటుందని సూచన కూడా అతని మాటల్లో నిగూధం గా ఉంది .అదీ సంభాషణా చతురత.చంద్రుని వికాసం లోకానికి ఆనందమే కాదు చల్ల దనాన్ని ఇస్తుందని శాంతి లభిస్తుందని అన్యాప దేశం గా అన్నాడు .చేసిన తప్పు అంతా దుర్యోధనుడిదే కాని మతి తప్పిన ముసలి రాజుది కాదు అని ,పేద తండ్రి పై ధర్మ రాజుకు సాను భూతి కలిగేట్లు మాట్లాడాడు .ధర్మ రాజు మెత్త బడితే తమ్ముళ్ళను ఒప్పించ గలదు అనే పూర్తీ విశ్వాసం సంజయునికి ఉంది .అసలే ముదుసలి -మానసికం గా కుంగి పోయాడు .కనుక సానుభూతి కల్గిస్తే కార్యం సానుకూలమవు తుందని ఆశించాడు .
”ద్రుత రాష్ట్ర భూపతికి వరు–ద్ద కతమున జిత్తమొక విధము కామి ,సుతో –ద్ధతి మాన్పద నాడు మనః–క్షతి పిదపంబుట్టి  ఇపుడు శాంతుడయ్యేన్ ”–కౌరవ వంశానికి కళంకం దుర్యోధనుని వల్లే వచ్చింది దాన్ని పోగొట్టే బాధ్యత ధర్మ రాజుదే అని పెద్ద బాధ్యత కూడా ఇరువైపులా ఆయనదే అని బలేగా చెప్పాడు .”నిపుణ హృదయ ”అని సంబోధించి కార్య సాధనకు మంచి బీజం నాటాడు .చివరగా ,చాలా తెలివిగా -ఒక వేళ యుద్ధం వస్తే -”అఖిల జనక్షయమయి ,జయాపజయాలు తెల్చలేనివి గా ఉంటాయి సుమా ”అని హెచ్చరించాడు .యుద్ధ ప్రయత్నం మంచిది కాదు అనే సూచనా ఉంది .ఇరు వైపులా ఉన్న బాలా బలాలను చాలా బాలన్సు గా బేరీజు వేసి మరీ చెప్పాడు .కలహం ఎలా చూసినా మేలు కాదు పొమ్మన్నాడు .అంతే కాదు చివరికి కాళ్ళ బేరానికి వచ్చి నట్లుగా ఆపద మొక్కులూ మొక్కాడు .అక్కడున్న అందరికి క్రోధ శాంతి చేయమని విన్నవించాడు –
”మ్రొక్కెద వాసు దేవునకు ,మొడ్చేద చేతులు సవ్య సాచికిన్ –దక్కటి మిత్ర బాంధవ హిత ప్రియ మంత్రి వయస్య కోటికిన్ –సృక్కుచు విన్న విమ్చెదనసూయలు దక్కి ,యనుజ్ఞ సేయుడీ -ఇక్కరునాకరున్ శరణ మేనిదే వేడెద క్రోధ శాంతికై-”అని అందర్ని యోగ్యతను అనుసరించి వినయం ,గౌరవం ,ప్రకటిస్తూ వేడికోలు అంటే విజ్ఞప్తి చేసుకొన్నాడు .
”నెయ్యము వాటించి కడుం-దియ్య మేసగ నాలుక లెల్ల దీరు నటులు గా –గయ్యమను దలపు లోనుగా –నయ్యమ నందనుడు మాను నట్టి తెరగున న్ ”ధర్మ రాజు యమ ధర్మ రాజు కుమారుడు ,ఇప్పుడా ప్రసక్తి ఎందుకు తెచ్చాడు ?అంటే యముడు సమవర్తి .తన ధర్మాన్ని తానూ చేసుకు పోతాడు .అంతే కాలు మ్రుత్యుస్వరూపుడు .ఆయన కు కోపం వస్తే అంతా విలయమే మర్నా పరం పర్లే .అంత జాగ్రత్త గా తిక్కన కవీశ్వరుడు పదాన్ని ప్రయోగించాడు .కనుక యమ నందనుడైన ధర్మ రాజు దండిచ దాలిస్తే ఇక తాన వారు అవతలి వారు అని చూడడు’అప్పుడు దయాదాక్షిణ్యాలకు తావు ఉండదు .అంటే ధర్మ రాజు దండించాలని అనుకొంటే అడ్డ గించే వారెవరు ఉండరని అన్యాప దేశం గా చెప్పాడు .ఇలా చెప్పటానికి ఒక కారణం కూడా ఉంది .సంజయుడిని పంపేటప్పుడు ముసలి రాజు అతడిని హెచ్చరించే పంపాడు -”శాంతి ప్రకారం కార్యం నడుపు .ఒక్కటిగా ఉండటానికి ఏర్పాటు చేసిరా ”ఈ ఆదేశాన్ని సంజయుడు తన శక్తి సామర్ధ్యాలను యుక్తిని తెలివి తేటలను చక్కగా ప్రయోగించి చాలా నేర్పుగా చివరి వరకూ చెప్పాడు .వీటన్నిటికి ,ప్రతి అక్ష రానికి ధర్మ రాజు తాగి నట్లు గానే తన సమాధానాన్ని తెగేసి చెప్పాడు .రాజ్యం ఇవ్వక పోతే సంధి జరుగదు అనే అర్ధం వచ్చేట్లు బదులిచ్చాడు .
సంజయుడు పట్టు వదల లేదు .బంధు నాశనం కల్గించే సంపద సుఖాన్ని ఇవ్వదుఅన్నాడు .సాత్వికులు అని పించుకొన్న పాండవులకు ఇది తగదు అని తెగేసి చెప్పాడు .ఇంత కంటే ఇంకొంచెం ముందుకు వెళ్లి ”దుష్ట ద్యూతం వల్ల కౌరవుల గర్వం అంతా పెంచి ,వాళ్ళను లోక నిందకు గురి చేయటం న్యాయమా /అని ప్రశ్నించాడు .ఆర్పే దానం గా అరణ్య ,అజ్ఞాత వాసాలను కష్టాలను ఓర్చు కొన్న ది అంతా నిష్కారణం గా గురు బంధు వర్గాన్ని చంపుకోవ టానికేనా ?అని నిలదీశాడు .సమాదాన్నాని పాండవులకే వదిలేశాడు .ఈ విధం గా సంజయుడు స్వామి కార్యాన్ని హృదయ పూర్వకం గా నిర్వర్తించాడు .ఎలాగైనా ధర్మ రాజును యుద్ధ విముఖుడిని చేయ టానికి విశ్వ ప్రయత్నం చేశాడు .కనుక సంజయుని మాటలలో తీపి ఉంది ,గడుసుదనం ఉంది ,అన్నీ తెలిసిన నేరు ఉంది .చ్చివారి దాకా చావని ఆశా ఉంది .అంతరాంతరాలలో తన ద్యూతం విఫల మౌతోందనే నిరాశా భావమూ కన్పిస్తుంది .వీటిని ధర్మ రాజు ,శ్రీ కృష్ణుడు కూడా గుర్తించారు .పాండవులు ఏమి సమాధానం చెప్పారో తరువాత తెలుసు కొందాం –
సశేషం –మీ–గబ్బిట దుర్గా ప్రసాద్ –17-7-12.-కాంప్–అమెరికా
Rtd. head Master

Posted in రచనలు | Tagged | 1 Comment

అమెరికా డైరీ

అమెరికా డైరీ

సర్ప్రైజ్ వెల్కం వీక్
జూలై తొమ్మిది సోమ వారం నుండి పదిహేను ఆదివారం వరకు డైరీ -పిల్లల సమ్మర్
కాంప్-సర్ప్రైజ్ వెల్కం -భజన భోజనం -పుస్తకాల చదువు -నిన్న రాత్రి
సూర్యుడు కర్కాటక రాసి లో ప్రవేశించటం వల్ల ఉత్తరాయణం వెళ్లి దక్షిణాయనం
వచ్చింది .

పిల్లల సమ్మర్ కాంప్
ఇక్కడ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం లో హిందూ సెంటర్ వాళ్ళు
వేసవి శిక్షణా తరగతులను పిల్లలకు ఏర్పాటు చేశారు .ఒక నెల రోజుల కార్య
క్రమం .పిల్లల్ని ఉదయం పదింటికల్లా సెంటర్ లో దింపాలి .సాయంత్రం నాలుగు
వరకు క్లాసులు .సంగీతం ద్రాయిగ్ పెయింటింగ్ ,నాటకం పాటలు సంభాషణా,
క్రికెట్ వంటి ఆటలు అన్నీ నేర్పుతారు .దానికి ఫీజు ఉంది .మధ్యాహ్న భోజనం
వాళ్ళదే .పిల్లలు వేసవి లో వృధాగా తిరిగి టి.వి.లతో కాలక్షేపం చేయకుండా
ఇదో మంచి కార్య క్రమం .మా ముగ్గురు మన వళ్ళను ఉదయం అరగంట ప్రయాణం లో ఉన్న
అక్కడికి తీసుకొని వెళ్లి దింపి వస్తోంది మా అమ్మాయి .మళ్ళీ సాయంత్రం
నాలుగింటికి వెళ్లి పిల్లలను తీసుకొని రావాలి .మా వాళ్ళు మంచి ఉత్సాహం గా
నేవెళ్తున్నారు .ఉదయం ఇంటి దగ్గర టిఫిన్ చేసి వెళ్తారు .ఉపయుక్తమైన కార్య
క్రమం.మధ్యలో కొన్ని రోజులు ఆ క్లాసుల తర్వాత స్విమ్మింగ్ ,పెయింటింగ్
,జిమ్నాస్టిక్స్ క్లాసులకు కూడా వేల్లోస్తున్నారు .మంచి టైంపాస్.ఇంట్లో
అల్లరి కొంత తగ్గు తుంది .

భజన -భోజనం
ఇక్కడి సాయి సెంటర్ లో ముఖ్యురాలు శ్రీ మతి కపిలా లీడ్ బీటర్
అనే వారింట్లో శనివారం సాయంత్రం భజన కార్యక్రమానికి ఆహ్వానిస్తే వెళ్ళాం
.యాభై మంది వచ్చారు .సాయంత్రం అయిదున్నర నుండి రెండు గంటలు అంటే రాత్రి
ఏడున్నర వరకు భజన .చాలా కొత్త భజనలు ముఖ్యం గా ఎక్కువ హిందీ ఇంగ్లీష్
భజనలను అత్యంత భక్తీ శ్రద్ధ లతో గానం చేశారు .తబలా హార్మని ,కంజీర
ల,తోడ్పాటు కూడా ఉంది .ముఖ్యం గా కపిల గారు చాలా భావ గర్భితం గా మనోహరం
గా శ్రావ్యం గా పాడారు .ఆవిడ పాడటం ఇదే మొదటి సారి నేను చూడటం .ఈ మధ్య
వరకు శార్లేట్ సాయి సెంట ర్ కు ఆమె అధ్యక్షురాలు .ఇప్పుడు సత్య అనే అతను
.సత్య మంచి తబలా విద్వాంసుడు .మంచి కార్య కర్త .సాయి బాబా సమక్షం లో
చదువు కున్న వాడు .అతని భార్య సౌమ్య చక్కని గాయని .హార్మని గొప్పగా
వాయిస్తుంది .వాయిస్తూనే బాగా శ్రావ్యం గా పాడుతుంది .తాదాత్మ్యం
కల్గిస్తుంది .మేము వచ్చిన దగ్గర్నుంచి ఆ  దంపతులతో మంచి పరిచయం .సౌమ్య ఆ
రోజు అత్యంత భక్తీ భావం తో తార స్తాయి లో పాడి జనాలను పరవశులను చేసింది
.ఆమె వాయిస్ చాలా పీక్ గా ఉందని భజన అయిన తర్వాత ఆమె తో చెప్పాను
.మిగిలిన వాళ్ళు కూడా బానే పాడారు .ఆ తర్వాత అందరికి సాయిబాబా అభిషేక
క్షీరం తాగ టానికి ఇచ్చారు .ఆ తర్వాత నిమ్మ రసం ఇచ్చారు .దాని తర్వాత
విందు .విందు లో -చపాతి పూరీ ,కూరలు ,పెరుగు పచ్చడి ,కారట్ హల్వా ,పండు
మిరప కారం ,మూడు రకాల స్వీట్లు మూడు రకాల పెరుగు ఆవడ వంటి హాట్లు మొత్తం
సుమారు పది హేను వరైటీలు .ఇష్టమైన వి యేవో కొద్దిగా తిన్నాం .అక్కడ సుజన్
అనే వరంగల్లు కుర్రాడు పరిచయమై తెలుగు లో మాట్లాడాడు .అతను మేము కూడా
మాట్లాడటం విని ”చాలా రోజు లైంది తెలుగు విని” అన్నాడు .సత్య అతనికి
మన” సరస భారతి” గురించి” బ్లాగు” గురించి వివరించి చెప్పాడు అతను
ఆశ్చర్య పోయాడు .సత్య ఎక్కడ వీలైతే అక్కడ సరస భారతి గురించి మంచి ప్రచారం
చేస్తున్నాడు .మంచి గౌరవం గా ఉంటాడు .సుజన్ తో ”అంకుల్ -ఈ మధ్య ఈల శివ
ప్రసాద్ వచ్చి నప్పుడు రెండు మంచి బిరుదులు  ”ఈల లీలా లోల ”-”గళ వంశీ
”అనే వి సజెస్ట్ చేసి వేదిక మీద ప్రకటించారు ”అని జ్ఞాపకం చేసుకొన్నాడు
.

సర్ప్రైజ్ వెల్ కం–గాయత్రీ సత్యనారయణీయం
శార్లేట్ సాయి సెంటర్ లో ముఖ్య గాయకుడు హార్మని విద్వాంసుడు
కుర్రాడు మంచి కలుపు కోలు వ్యక్తీ అయిన సత్య నారాయణ ఈ నెలలో ఇండియా
వెళ్లి అక్కడ పెద్దలు కుదిర్చిన గాయత్రి అనే అమ్మాయిని వివాహం ఆడి మళ్ళీ
ఇక్కడికి భార్య తో సహా వచ్చాడు .అతను వస్తున్నట్లు తెలిసి సాయి సెంటర్
వాళ్ళు సుబ్బు అనే కన్వీనర్ ఆధ్వర్యం లో నూతన దంపతులకు సర్ప్రైజ్ వెల్కం
ను శుక్ర వారం రాత్రి దగ్గర లోని కమ్యూనిటి హాల్ లో ఏర్పాటు చేశారు
..అందరం వెళ్ళాం .సుమారు యాభై మంది ఆహ్వానితులు వచ్చారు .  ముందుగా ఒక
గంట భజన ఏర్పాటు .సత్య తో సహా అందరు పాడారు .ఆ తర్వాతవిందు -విజ్జి చేసిన
పెరుగు ఆవడలు ,ఇంకెవరో చేసిన చపాతి ,కూరలు ,బిర్యాని ,పెరుగు పచ్చడి
,చట్నీ ,అన్నం ,సాంబారు ,రెండు రకాల స్వీట్లు ,కీర పాయసం కోకా కోలా
వగైరాలతో విందు అదిరింది .నవ దంపతులు ఉత్సాహం గా పాల్గొన్నారు .అందరు తలో
ఐటం చేసుకొని వచ్చి నిండుదనం తెచ్చారు .తర్వాత- హాజ రైన దంపతుల తో చీటీలు
తీయించి అందులో వచ్చిన దాని ప్రకారం ప్రశ్నలకు సమాదానా లు ,పాటలు
పాడించటం వగైరా కార్య క్రమాన్ని రాంకీ భార్య ఉషా సరదా గా నిర్వహించింది
.ఒక గంట అందరూ ఒకటే అనే మంచి భావం ఇదంతా కలివిడి గల ఫామిలి అనే అభిప్రాయం
కొత్త దంపతులకు కలిగించటమే ఇందు లో ని ముఖ్య ఉద్దేశం .నూత్న దంపతులను
కూడా ప్రశ్న ల పరం పరతో సరదా చేసి వారి సమాధానాలతో అందరు మళ్ళీ తన పెళ్లి
రోజులను ఒక్క సారి జ్ఞాపకం చేసుకోనేట్లు చేశారు .కొత్త పెళ్లి కూతురుకి
అందరితో పరిచయం కలగటం ఆమె లో ముభావం ఉంటె పోగొట్టటం దీని ఉద్దేశ్యం .అది
బాగా నేర వేరింది .అందరు గొప్ప సహకారం అందించారు .మా ఇద్దర్ని కూడా ఆ
ఆటలో పాల్గొన మని ఉషా బలవంత పెడితే నేను ”మేము r.i.లం, మీరు n.r.i. లు
మేము పాల్గోవటం బాగుండదు అన్నా .అయితే” ఆంటీ -మీరిద్దరిలో ఎవరి మాట ఎవరు
వింటారో చెప్పండి” అని ప్రభావతి ని అడిగింది ”.ఆయన మాటే నేను వింటాను
”అంది దానికి నేను ”once up on a time అది -నేను రిటైర్ అయ్యే దాకా
ఆవిడ నా మాట వింది -రిటైర్ అయిన తర్వాత నేను ఆవిడ మాటే వింటున్నాను ”అనే
సరికి అందరూ గొల్లున నవ్వారు .మొత్తం మీద సరదా సరదా కార్యక్రమం .చివరికి
నూతన  దంపతులతో కేక్ కట్చేయించి అందరికి పంచారు .ఇలా సర్ప్రైజ్
గావారిద్దరికి స్వాగతం పలికి ఆనందం చేకూర్చి ఈ కుటుంబం లో వారినీ
ఆహ్వానించి అంతా మంచి కుటుంబం అని పించారు .ఇదే ”గాయత్రీ సత్యనారాయణీయం
”.ఇంటికి వచ్చే సరికి రాత్రి పదకొండున్నర .
ఈ వారం లో చదివిన పుస్తకాలు –మైనేని గోపాల కృష్ణ గారు
హూస్టన్ లో జరిగిన నాటా సభల సావనీర్ ను ,,world demogrphic trends  అనే
పుస్తకం పోస్ట్ లో పంపారు .రెండు చదివేసి వారికి తెలియ జేశాను .వారు నాకు
హన్త్స్ విల్ లో ఇచ్చిన జస్టిస్ హిదయతుల్లా పుస్తకంmy own boswell చదివి
”హ్రిదయ తుల్లా ”అనే ఆర్టికల్ ఇదివరకే రాశా .ఆయనే ఇచ్చిన the idea of
india ,the emotional life of your brain ,there is a spiritual solution
కొంత వరకు  చదివా. లైబ్రరి లో తెచ్చిన వాటి లో albert eistein ,maya
angelo ,benjamin franklin ,keynes ,jefersan ,my prison life ,mary
magdolina ”లలో కొన్ని పూర్తిగా చదివా .కొన్ని తిర గేశా .
మీ–గబ్బిట –దుర్గా ప్రసాద్ –17-7-12-కాంప్–అమెరికా
http://suvarchalaanjaneyaswami.wordpress.com

Posted in అమెరికా లో | Tagged | Leave a comment

తిక్కన భారతం – 7 ఉద్యోగ పర్వం లో తిక్కన శేముషీ గరిమ

                        తిక్కన భారతం –   7

ఉద్యోగ పర్వం లో    తిక్కన శేముషీ గరిమ 

      రాజకీయం గా కురుపాన్దవులతో బాటు సమస్త రాజ లోకానికి ఉద్యోగ పర్వం ప్రధానమైంది .లోక శాంతి కోసం సంధి కావాలో ,లోక అన్ర్దానికి విగ్రహమో అనే ప్రశ్న ,దానికి సమాధానం ఈ పర్వం ప్రత్యేకత .భావి కర్తవ్యాన్ని నిర్ణయించే అవకాశం పాండవులకు ,కౌరవులకు ఉంది .సత్య ధర్మాలు ,న్యాయానికి లోకం లో ఏ స్తితి ఉందొ చూపించే విషయం .లోక హితం కోసం ,బంధు హితం కోరిన ధర్మ రాజు ఆశయాన్ని నేర వేర్చతానికి శ్రీ కృష్ణుడు సామ ,దానాలను అతి చతురం గా ప్రయోగించటం ఇందులో ముఖ్య విషయం .ఎన్నో కష్టాలను ఓర్చుకొని ,మాట ప్రకారం అరణ్య ,అజ్ఞాత వాసావాసాలను పాండవులు పూర్తీ చశారు .భావి కార్య క్రమాన్ని ఇప్పుడు నిర్ణ యించు కోవాలి .సంధి చేయటం పాండవుల పై కంటే కౌరవుల మీదే ఎక్కువ గా ఆధార పడి ఉంది యుద్ధం వస్తే కురుపాన్దవులతో పాటు యాదవ ,పాంచాల ,మత్చ్య ,సింధు ,గాంధారి వంశాల కంతటికీ సంబంధించింది .అందులోని ప్రజలందరి కి భాగా స్వామ్యం ఉంది .అందుకే లోక హితం కోసం పాండవులు ఉదారం గా వ్యవహరించారు .తమకు ,తమ ధర్మ పత్నికి జరిగిన పరాభవాల నన్నిటిని దిగ మింగుకొన్నారు .ద్యూత సమయం లోను ,ఉత్తర గోగ్రహణం లోను అన్యాయానికి సహాయం చేసి ,ధర్మ నాశనానికి దోహదం చేసిన భీష్మ ,ద్రోణులకు ,అశక్తుడైన ద్రుత రాష్ట్రునికి విషమ పరిస్థితే .ధర్మాన్ని ప్రతిఘటించటా నికి మనసు ఒప్ప లేదు ..కాదు అని అధర్మ పరుల ను ప్రతిఘటించా టానికి నైతిక ధర్యం కూడా చాలని ,ధర్మా ధర్మాల మధ్య ,చాలా సంకట స్థితి లో ,సందిగ్ధ పరిస్తితి లో ఉన్నారు పాపం భీష్మ ద్రోణులు .కుమారుని పై వ్యామోహం ,సంపద మీద ఆశ ,రాజ్యాధికారం ,పాండవుల శౌర్య సాహసాల వల్ల భయం ,,తండ్రి ద్రుత రాష్ట్రుని ఎటూ తేల్చుకో లేని కిమ్కర్తవ్యతా మూదుని చేశాయి .భారతం లో ప్రతి పాత్రకూ సందిగ్ధ స్తితే,సంకట పరిస్తితే .కనుక వారందరి మానసిక పరిస్థితులు ,షీలా స్వభావాలు ,ఈ పర్వం లో బాగా బయట పడుతాయి .కవిగా తిక్కన తన అఖండ జ్ఞానాన్ని ,మనస్తత్వ పరిజ్ఞానాన్ని .మంత్ర తంత్ర వేదిత్వాన్ని ,ప్రదర్శించటానికి దివ్య మైన అవకాశం .మూడు రాయ బారాల్లో నడపిన ఆయా వ్యక్తుల సంభాషణా శైలి ,చతురత లను మనం చూస్తాం .అందుకే ఇక్కడ మంచి సంభాషణా శైలి ప్రతి ఫలించింది .
       ద్రుపద పురోహిత రాయ బారం
ఉత్తరాభి మన్యుల వివాహం కాగానే ,బంధువులంతా ఒక చోట చేరి భావి కర్తవ్యాన్ని గురించి ఆలోచించారు .శ్రీ కృష్ణుని హిత బోధ తో ,ద్రుపద రాజు పురోహితుడిని ద్రుత రాష్ట్రుడి దగ్గరకు రాయబారి గా పంపాలని నిర్ణయించారు .ఇదే మూడు రాయబారాల్లో మొదటిది .రాయబారి మెత్తటి వాడే .మాటలతో లోబరచు కో వచ్చునని తియ్యగా మాట్లాడే సంజయుడిని ద్రుత రాష్ట్రుడు పంపటం రెండవ రాయబారం .సంధి కోసం చివరి ప్రయత్నం గా ,దైవమె మానవ రూపం లో ఉన్న శ్రీ కృష్ణుడే స్వయం గా రాయబారిగా రావటం మూడవ రాయబారం .ఈ ముగ్గురు మూడు రకాలైన కులమూ ,శీలము కలవారు .దానికి తాగి నట్లే మాట్లాడారు .రెండు పక్షాలలోను ముఖ్య మైన వాళ్ళ అభిప్రాయాలు ,ధర్మం వైపు వాళ్లకు ఉన్న భావాలు ,చాల చక్కగా గొప్పగా నాటక విధానం తో తిక్కన కళ్ళకు కట్టి నట్లు చిత్రించాడు .అందరికి సంధి కావాలి -కాని ఆ రాయబారుల లోని వైవిధ్యాలను చాలా బాగా ప్రదర్శించటానికి వీలైన ఘట్టాలు .నాటకీయత కు పరాకాష్ట .లోక ప్రవర్తన ,కురు వంశ ప్రవర్తన సమానం గా ప్రదర్శిత మైంది .
కౌరవుల వద్దకు దూతను పంపాలని నిర్నయిన్చుకోన్నప్పుడే బాల రాముడు దుర్యోధన పక్షపాతం గా మాట్లాడాడు .సాత్యకి సహించ లేక ”ఇట్టు లాడ దగునే ఇది నీ క పో లు,ని –న్నే మనంగ నేర్తు నిత్తెరంగు పాడిగాగ బూని పలుకంగ చెవి యొగ్గి ,-యాద రించు వారి నందు గాక ”అని అన్నగారిని నెమ్మదిగా మందలించాడు .దూతను పంపటం ధర్మం అనీ అన్నాడు .”అరాతులు సాధుల మెత్తురె ?”అంటాడు .అంటే కథిన స్వభావం గల విరోధి మూక అయిన కౌరవులు, సాదు స్వభావం ఉన్న పాండవులను మెచ్చుకొంటారా అని సందేహమూ వెలి బుచ్చాడు .ద్రుపద రాజు కూడా ఇక సామం లాభం లేదు అన్నాడు .”మృదు భాషణముల దుర్జన హృదయములు ప్రసన్నతా మహిమ బొందునె ?”అని అనుమానం వ్యక్తం చేశాడు .దురభి మానం తో వాళ్లకు అంటే కౌరవులకు మదం పెరుగుతుంది అని హెచ్చరిస్తాడు .అనదరి అంగీ కారం తో చివరికి ద్రుపద పురోహితుడిని అస్తినా పురానికి రాయబారి గా పంపాలనే నిర్ణయం జరిగింది .ఆయన హస్తిన చేరి ,సభలో కొలువైన జన సమక్షం లో మొదలు పెడుతూనే ద్రుత రాష్ట్రుని దోషాలన్నీ ఏకరువు పెట్టాడు .పాత కధలాన్ని సినిమా రీలు లాగా ఫ్లాష్ బాక్ గా చూపించాడు —
”నారీ రత్నము నట్లు దెచ్చి సభలో నన్వాతతలుం జూడగా  –జీరల్ ప్రోవులు గాగ నోల్చు టయు లచ్చిం బుచ్చి కోలున్ మహా –గ్రారణ్య స్థలి నిల్వ బంచుటయు ,దైన్య వ్యక్తమై ,.పల్కుచున్ –సైరింపం జను బాండవులకు నీ సంధి క్రమం బొప్పదే ”అనిపాండవులకు  జరిగిన అవమానాలన్ని ఒక్క సారిగా ఏకరువు పెట్టి పుండు మీద కారం రాశాడు .సకల ప్రపంచ ప్రజా నాశనాన్ని కోరకుండా పాండవులు సంధి కోరుతున్నారని ,దాన్ని బలహీనత గా భావించ వద్దని ఖచ్చితం గా చెప్పేశాడు .భీమార్జునుల సాత్యకి ల శౌర్యాన్ని ,శ్రీ కృష్ణుని సహాయాన్ని ప్రశంసించాడు .వీరిని జయించటం అసాధ్యం అని తేల్చి చెప్పాడు .”అదను దప్ప కుండా నమ్మహాత్ముల నెమ్మి ,-బిలువ నంపి ,హితము బ్రియము రెండు పక్షముల కు నగుట పాటించి తగవు మై –గొంత భూమి ఇచ్చి కూడి మనుము ”అని అభిప్రాయాన్ని కూడా చెప్పేశాడు .ఏదో కొంత భూభాగం పాండవులకు ఇచ్చి కౌరవ పాండవులను సఖ్యాత  తో బ్రతికెట్లు చేయమని సలహా ఇచ్చాడు .ఇందులో ఏమాత్రం మొహమాటం లేదు .రాచకీయ పరిజ్ఞానం ,వాక్ చాతుర్యం లేని శుద్ధ బ్రాహ్మణుడి మొండి మాటలుగా ,లోక జ్ఞాన శూన్యం గా అతని మాటలున్నాయి .రాసిన కారం నషాళానికి అంటింది అందరికి .దురభి మాని దుర్యోధనుడు మండి పోయాడు .ఉద్రేకం తన్నుకు వచ్చింది .భీష్ముడు దీన్ని గుర్తించాడు .-
”పాండు నందనులు  ప్రశాంతి మై మనముల నీసు దక్కి -మృదు మార్గము వట్టుటయు ,దలపగ భాగ్యము కదా !”అని సూచన చేశాడు .వచ్చిన వాడు బ్రాహ్మణుడు -స్వభావ సిద్ధం గా వాక్పరుషత్వం ఉంది .అని దానిని కప్పి పుచ్చాడు .ఆ మాట పురోహితుని తోనే చెప్పి అర్ధం చేసుకోమన్నట్లు అన్నాడు .”నీ వాక్యం విప్ర స్వాభావికం గా ఉంది .-ఇట్లా లౌక్యం లేకుండా చెవికి పరుషం గా మాట్లాడితే కార్యం నేర వేర్తుందా ”అని మెత్తగానే ,గట్టిగానే ఛీ వాట్లు పెట్టాడు .అయితే -బ్రాహ్మణుడు కనుక అధర్మాన్ని ఖండించా టానికి ,నిర్భయం గా చెప్పటానికి స్వాతంత్రం ఆయనకే ఉంది .రాజ పురోహితుడు కనుక అధికారం తో కూడిన తీక్ష్ణత కూడా అతని మాటల్లో ఉంది .అందుకే బ్రాహ్మణ రాయబారం విఫలమైంది ..పైగా దుర్యోధన దుష్ట సర్పాన్ని రెచ్చ గొట్టినట్లు అయింది ..
సశేషం –మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –16-7-12–కాంప్–అమెరికా
http://suvarchalaanjaneyaswami.wordpress.com

Posted in రచనలు | Tagged | Leave a comment

తిక్కన భారతం –6 ఉత్తరాభి మన్యుల వివాహం

          తిక్కన భారతం –6

                                       ఉత్తరాభి మన్యుల వివాహం

విరాట పర్వం చివర వచ్చే ఉత్తరాభి మన్యుల వివాహ వర్ణన పరమ పవిత్రమై ,లలిత శృంగార బంధురమై ఆదర్శం గా నిలిచింది .సరస మైన రచన .రూపం ,వయస్సు ,విద్యా ,వంశం మొదలైన వాటిలో వారిద్దరూ సములు .లోకోత్తర మైన ఆ వివాహాన్ని తన మధుర కవిత్వం తో శబ్దమయ సుందరం చేశారు మహా కవి తిక్కన సోమయాజులు .సిగ్గుతో ,ముగ్ధత్వం తో ,వినమ్రం గా ఉన్న పెళ్ళికూతురు ఇంత వరకు తాను చూడని తన మనో వల్లభుడిని ఓర చూపులతో చూస్తోందట .అభిమన్యుడు కూడా ,పెద్దల సమక్షం లో నేరుగా ఆమె ను చూడ లేక ,ఇప్పుడు బాగా చూస్తున్నాడట .నూత్న వధూవరుల శృంగార చేష్టలు ఎంతో స్వాభావికం గా కవి వర్ణిస్తాడు .మనకు మానసిక ఆహ్లాదాన్ని అందిస్తాడు –

”లలిత తనూ విలాసముల ,లజ్జ కతంబున జేసి ,మున్ను ,వి –చ్చల విడి బట్టగా నేరవు సాలక ,యోరలు వారు చూపులన్ –లలీ దలబ్రాలు ,వోయునేడలం,దగ ఒందిన నూలు కొల్పియి –మ్ములజరింతు రొండొరుల మోహన మూర్తులపై వదూవరుల్ ”ప్రతి పెండ్లి లోను మనం చూసే దృశ్యమే ఇది .తలంబ్రాల సంబరం లో ప్రకృతి సౌందర్యాన్ని ,దాని లోని లాలిత్యాన్ని ,వధూ వరులకు తిక్కన ఆపాదించాడు .-

”ఒండొరుల దోయిళుల నిను పెంపొంద జేయు –నక్షత ప్రకరంబుల న్యోన్య మస్త -కముల బోసిరి మందార కల్ప లతలు -విరుల గమియ నొండొంటి పై గురియు నట్లు ”–వధువు అయిన ఉత్తర ను లతగా ,అభి మన్యుని మందార చెట్టు లా వర్ణించటం కవి సమయం అంటారు .ఆలంబన లేక పోతే తీగ రాణించదు .లాలిత్య ,కొమలత్వాలు ఆశ్రయం తో ఉదాత్త జీవితం లత కు స్త్రీ కి సహజం .ఆశ్రయత్వ ,సుస్తిరత్వాలు వృక్షం లో ,పురుషుని లో సమానం .ఆ లతా ప్రసూనాలు ,తాను ఆశ్రయించిన మందారం పై రాలటం ,మందారాలు లత పై పడటం సహజం .ఇది స్వభావ సిద్ధ ప్రకృతి మనోహర దృశ్యం .ఈ విధం గా రూప ,రేఖా విలాసాలను వారి అనుకూల దాంపత్యాన్ని ధ్వనింప జేస్తోంది .వివాహం పూర్తీ అయింది .వధూ వరులు ఇద్దరు ఒకే ఆసనం పై కూర్చున్నారు .ఒకే చోట ,పరస్పర సంయోగం లో శోభించే నవమాలికా చూత వృక్షాలతో వారిద్దరిని పోలుస్తాడు కవితిక్కన .సహజ కోమల ,సుకుమార ,లాలిత్య ,ప్రధానం తో ఉత్తర సౌందర్యానికి ,బాహు వీర్య ,శౌర్య ,స్థైర్య ,గాంభీర్య గుణ ప్రధానమైన అభి మన్యు సౌందర్యానికి వివాహానికి తగిన సంయోగం లభించింది .పాణి గ్రహణం తర్వాతపూర్వం లేని ఒక కొత్త కాంతి ,విలక్షణతేజస్సు లభించి ,మనోహరం గా కన్పించారు .ఇది మనందరికీ జీవిత అనుభవమే .ఆ అనుభవాన్ని మనోహర రూప చిత్రణ చేశాడు కవి బ్రహ్మ .–

”పెను గదుట నిడిన చూతం–బును నవ మాలిక యు బోలె బోలు పొంది ,రతండును ,నమ్ముగ్ధయు నేకా –సనమున నున్నపుడు నూత్న సౌభాగ్యమునన్ ”పాణి గ్రహణాన్ని కూడా తగిన విషయాలతో సరసంగా వర్ణించాడు –

”చిత్తమున గాఢ రాగంబు చేత జూపు -తెరగు దోప గేమ్పారేడు తీగ బోడి –మృదుల పాణి గుమారుండు మెలపు మై,గ్ర -హించే పల్లవాలంభి మత్తేభ లీల ”–ఇందులో సోకు చూద్దాం -అభి మన్యుడు ఉత్తర పాణిని అంటే సుకుమార మైన చేతిని ,మత్తేభం అంటే మదించిన ఏనుగు -చిగురాకులమీద ఉన్న ఆసక్తి తో .వృక్షం పై భాగం మీద నుండి సుకుమారం గా తొండం తో గ్రహించి నట్లు గ్రహించాడట .మార్దవం ,కోమలం ,రక్తిమ అంటే ఎర్రదనం కిసలయాల అంటే చిగురు టాకుల ప్రధాన ధర్మం .అలాంటి కోమల హస్తాన్నిగ్రహించాడు అభి .అంటే ఉత్తర సమగ్ర సౌందర్య దర్శనం చేయించాడు .అభిమన్యుడు గాంభీర్యం గా ,అనురాగం తో ,నాగరకత తో ,ఆమెను గ్రహించాడు .ఇది లోకోత్తర భావన .ఆమె తన లోని గాధాను రక్తి ని చేతి రక్తిమతో అంటే ఎర్రదనం తో వెల్లడి చేస్తోంది .అలంకార భాష లో కూడా శృంగార రసం రంగు ఎరుపు .కనుక మనస్సు లోని అనురాగం ,చేతి లోని ,సహజ రక్తిమ రూపం గా ప్రదర్శించాడు .ఆమె ముగ్ధ .మనోభావాన్ని వాచ్యం చేయ రాదు .కనుక చెప్పకుండా చెప్పటం కవి చమత్కారం .

పెళ్లి తర్వాత హోమం చేస్తున్నారు .వారిద్దరి లో ఉన్న సాత్విక భావం శిఖా రాయ మై నిరు పమానం గా కన్పింప జేశాడు తిక్కన .–”గాధ సంస్పర్శ భంగులు కల్గి నట్టి –హోమ సమయ కృత్యంబుల నొదవి సౌఖ్య -రసము పెన్నిట్ట పోరి బోరి గ్రమ్ము దేర –సంముదంబుధి దేలిరి సతియు బతియు ” –స్పర్శ సౌఖ్యం తో దేహాలు సాత్విక స్వేదం (చెమట )తో తడిశాయి .సతీ పతులు సంతోష సముద్రం లో తేలి యాడారు .అంటే ఆనందానికి అవధులు లేవు అనే భావం ఉదాత్తం గా కన్పించింది .ఉత్కృష్ట మైన శృంగార భావాలు హృదయాలను తాకి పరవశించేట్లు చేస్తుంది .ఎక్కడా హద్దు మీరదు. వీరం ,శృంగారం రస నిధులై న ఇతి వృత్తాలు .వాటికి తగిన కావ్య రచన వల్ల విరాట పర్వం చదువరుల హృదయాహ్లాది అయింది .తిక్కన తన రచనా విరాట్ స్వరూపాన్ని ,అన్ని వైపులా నుంచి ,చూపించి ,ఆనంద పార వశ్యం కల్గించాడు .కవిబ్రహ్మ లో శబ్ద బ్రహ్మ ,నాదబ్రహ్మ ,రసబ్రహ్మ కలిసి ముమ్మూర్తులు ఒక్కరై రసో వై సహః అని పించాడు .

సశేషం –మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –16-7-12–కాంప్–అమెరికా
https://sarasabharati.wordpress.com
http://suvarchalaanjaneyaswami.wordpress.com

Posted in రచనలు | Tagged | Leave a comment

కంచి పరమాచార్య దర్శనం తో పులకింత

   కంచి పరమాచార్య దర్శనం తో పులకింత
భారత దేశమంతా పర్య టించి ,ఎందరో సాదు సంతులను దర్శించి ,తనకు మార్గ దర్శనం చేసే వారెవరో తెలుసుకొనే ప్రయత్నం లో అరుణాచలం లోని రమణ మహర్షిని సందర్శించి శిష్యుడై ,ఆ అనుభవాన్ని మనసులో పదిల పరచుకోవటమే కాక తన భారత యాత్ర ను పుస్తక రూపం గా ప్రచురించి పాశ్చాత్యులకు భారత దేశ యోగుల వైశిష్ట్యాన్ని తెలియ జెప్పిన వాడు డాక్టర్ paul brunton . .ఆయన రాసిన పుస్తకం a search in secret India -1934 లో  ప్రచురిత మైంది .ఆయన కంచి పరమాచార్య శ్రీ శ్రీ చంద్ర శేఖర స్వాములను కూడా దర్శించి పులకించాడు .అలాగే మౌనమే దీక్ష గా జీవించిన మెహర్ బాబాను ,బౌద్ధ మత గురువు దలై లామా ను సందర్శించి వారి ఆధ్యాత్మిక ఉన్నతి ని వర్ణించాడు  ఆయన రాసిన పుస్తకం అనేక ముద్రణ లను పొంది దేశ ,విదేశాల్లో భారత దేశ ఆధ్యాత్మిక వైభవాన్ని దర్శించే వీలు కలిగింది . ఆ పుస్తకానికి ఇప్పుడు 78 ఏళ్ళు .ఈ పుస్తకాన్ని ముప్ఫై మూడేళ్ళ వయసు లో రాశాడు .మారు పేరు తో రాసిన పుస్తకం అది
             paul brunton కుమారుడు  kenneth thurston hurst తండ్రి అడుగు జాడలో భారత దేశ పర్యటన చేశాడు .తండ్రి జ్ఞాపక గౌరవ ఉపన్యాసాలిచ్చాడు .ఆయన తన తండ్రికి ఇంకా ఇండియా లో ఎంత గౌరవం ఉందొ గ్రహించాడు .తన తండ్రి పాశ్చాత్యులకు యోగా ,ధ్యానం లను పరిచయం చేశాడని గుర్తుకు  తెచ్చుకొన్నాడు .అరుణాచలం వెళ్ళాడు .మహర్షి అప్పటికే పర లోకం చేరారు .ఆ  ఆశ్రమం లో విశాల మైన హాల్ లో కూర్చుని ధ్యానం చేస్తూ మహర్షిని మనసు లో నిలుపు కొన్నాడు .తన తండ్రి నివశించిన చిన్న బంగాళా చూసి ఆనందం పొందాడు .ఎదురు గా ఉన్న అరుణాచలం పర్వతాన్ని దాని గాంభీర్యాన్ని దానికి శ్రీ రమణులకు ఉన్న అవినాభావ సంబంధాన్ని తెలిసి పరవశించాడు .ఆ పరిసరాల పవిత్రత ఆయన మనసు పై గాఢ ముద్ర వేసింది .తన జీవితం ధన్యమైంది అనుకొన్నాడు .జీవితానికి ఈ అనుభవం చాలు అనుకొన్నాడు .మనసంతా ఆ భావనలను నింపుకొన్నాడు .
                   అరుణాచలం నుండి కంచి చేరాడు .తన తండ్రి సందర్శించి వర్ణించిన కంచి పరమాచార్య శ్రీ శ్రీ చంద్ర శేఖర యతీంద్రుల వారిని సందర్శించాలని మనసు లో భావించి చీటీని  పంపించాడు ..అప్పటికి పరమాచార్యుల వారికి 92 ఏళ్ళు .ఒంటరి గా నిత్య తపస్సు తో గడుపుతున్నారు .వీరిని గురించి తన తండ్రి అత్యద్భుత వర్ణన చేశాడు .అదంతా జ్ఞాపకం వచ్చింది .జనం తీర్ధ ప్రజా లాగా వారి సందర్శనం కోసం నిలబడి ఉన్నారు .తనకు దర్శనం లభించే అవకాశాల్లు లేవు అని నిర్ణయించుకొన్నాడు .ఆయన ఆశ్రమం వెనుక భాగాన చిన్న గది లో ఉన్నారు .”నడయాడే దైవం ”గా పరమాచార్యుల వారిని భావిస్తారు .కొద్ది నిరీక్షణ తరువాత స్వామి వారు పిలుస్తున్నారు  ఒంటరిగా దర్శనం ఇస్తారు అనే కబురు అందింది .వారి సాన్నిధ్యానికి చేరాడు .”బక్క పలుచని శరీరం -కాషాయ వస్త్ర ధారణ ,విభూతి తో ఫాలభాగం పరమశివుడు గా కని పించారు .తనను తాను పరిచయం చేసుకొని తాను paul Brunton కుమారుడి ని అని తెలియ జేసుకొన్నాడు .స్వామి వారు ”మా కు తెలుసు ” అని మాత్రమే అన్నారు .ఇంకో మాట లేదు .మళ్ళీ ఏదో మాట్లాడారు స్వామి .అక్కడ ఉన్న అనువాదకుడు ”మీ కోసమే స్వామీజీ ఎదురు చూస్తున్నారు ”అన్నాడు .కెన్నెత్ కు అమిత ఆశ్చర్యం వేసింది .తానెవరో ఆయనకు ఎలా తెలిసిందో అర్ధం కాలేదు .తాను వస్తానని ఎలా తెలిసిందో  తన గురించి ఎలా తెలిసిందో మరీ ఆశ్చర్య పరచింది .అప్పుడు ఆయన త్రికాల జ్ఞాని అని అర్ధమైంది .తాను భారత దేశం లో ఉన్నట్లు పరమాచార్యులకు ఎలా తెలిసిందో ,ఇంకా అంతు బట్ట లేదు .తాను తనతండ్రి  పుస్తకాన్ని పునర్ముద్రించిన కాపీ ని అందజేసి అందులో ఉన్న ముప్ప్జై ఎనిమిదేళ్ళ తండ్రి ఫోటో ను చూపించి అది తన తండ్రిది అని తెలియ జేశాడు .మళ్ళీ స్వామి వారి సమాధానం ”మాకు తెలుసు ”అనే ..తన తండ్రి సందర్శించి నపుడు ఉన్న ప్రపంచ పరిస్తితుల పై ఎన్నో ప్రశ్నలు వేసి స్వామి నుండి సమాధానాలు రాబట్టాలి అనుకొన్నాడు .కాని ఆశ్చర్యం –ఆ ప్రశ్నలన్నీఅకస్మాత్తు గా  నోటిలోనే కరిగి . పోయాయి .మనసంతా ప్రశాంతత ,ప్రేమ నిండి పోయింది .ఇంక ప్రశ్నలూ లేవు .సమాధానాలు లేవు .గుండె గొంతుక లో కొట్టుకు పోయింది అంతే తనువు ,మనసు  పులకించి పోయింది .అంతే అమాంతం స్వామి పాదాలకు దగ్గరగా సాష్టాంగ ప్రమాణం చేసి నిలబడ్డాడు .ఆచార్య స్వామి మనస్పూర్తిగా అతన్ని ఆశీర్వ దించారు . .స్వామి వారు నిండు మనసు తో గంధపు దండ ను కెన్నెత్ మేడలో వేసి గౌర వించారు .ఆ సువాసన ఇంకా తనకు తాజా గా నే ఉందని ,దాన్ని అప్పటి నుంచి భక్తీ తో మెడ లో ధరిస్తున్నానని కెన్నెత్ చెప్పాడు .అలా యాభైయేళ్ళ జీవిత చక్రం ఒక చుట్టు తిరిగింది అని పులకరింత తో ఈ అనుభవాన్ని వర్ణించాడు కెన్నెత్ .
                     మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –15 -07 -12 –.charlotte -north carolina —248-212-03-66.
Posted in మహానుభావులు | Tagged | 3 Comments

తిక్కన భారతం -5 ఉత్తర గోగ్రహణం

         తిక్కన భారతం -5

                                                              ఉత్తర గోగ్రహణం

ఉత్తర గోగ్రహణం వీర రస ప్రధానం .భావి భారత యుద్ధానికి ప్రాతిపదిక .తాను చేయబోయే విశిష్ట రచనకు ఉపక్రమణిక .అర్జునుని కోదండం నుంచి సూర్య కిరణాలు యెడ తెరిపి లేకుండా వెలువడుతున్నాయి .అన్ని వైపులా నుంచి వచ్చి కౌరవ సైన్యాన్ని ముంచి వేస్తున్నాయి .అవధి లేని బాణ ప్రయోగం -విక్రమంతో తేజో మూర్తి అయిన అర్జున మూర్తి అచ్చ తేజో మాయ మైన మార్తాన్దుని ళా ఉన్నాడట .సమగ్రమైన అర్ధ స్పోరక మైన ఉపమానాలు తిక్కన గారి ప్రత్యేకత .

”ఒక మాత్రన్ ,వితత ప్రసార నిబిదాదిటయు గ్రాస్త్ర సంతా నముల్ -సకలానీఎకము లందు బర్వ ,నరు భాస్వన్మూర్తిదీ-ప్తికలాపంబులు ,లోక మంతతను ,విస్తీర్ణంబులై,యోగ ప-ద్యక్రుత వ్యాప్తి వెలుంగునొప్పెసగు మార్తాండు న్విడంబించుచున్ ”—అంతే కాదు -అల్లెత్రాడు ,పిడికిలి ,ధనుస్సు ,హస్తం ,వీటన్నిటి లో ,ఒకే విదం గా ,బాణాలు తమంత తాము భయంకరం గా వెలువడి ,శత్రువులను తీవ్రం గా గాయ పరుస్తున్నాయత .తేనే తుట్టె నుంచి ఒక్క సారిగా పైకి ఎగిరే తేనే టీ గల్లాగా వస్తున్నాయి బాణాలు . అంత సహజ సుందర వర్ణన చేయటం తిక్క యజ్వ ప్రత్యేకత .

కర్ణుని ప్రయత్నాలను కూడా అంతే సహజం గా వర్ణిస్తాడు .మనస్సు లోని రోషమే రూపం దాల్చి నట్లు బాణాలు కురిపిస్తునాడు కర్ణుడు .అవి జ్వాలా పరంపర చేత విజ్రుమ్భించే భయంకరాగ్ని ళా ఉందట .వీటిని అర్జుండు అనే మేఘం ,వర్ష ధారా లానే బాణాలతో చల్లార్చాడు .”అర్క తనూభవా గ్ని కి లోపల ఉన్న రోషమే భీకర స్వరూపం -కాంతి వంత మైన కేతువే శిఖా జ్వాల ,ప్రకాష వంత మైన షరా పరంపరాలే కీలలు .అలాగే అర్జునాంబు దానికి ఉజ్వల పతాక మెరుపు తీగ ,రాధానేమి ధ్వని గర్జం ,బాణ పరంపరలు వర్ష దారాలు ,వర్ష వ్యాపారం తో అగ్ని అణగి నట్లు కర్ణుని విజ్రుమ్భన అర్జునుని పరాక్రమం తో అణగారింది .సైనికుల ముఖం అనే పద్మాలు కాంతి హీన మైనాయి .అందుకని కౌరవ సేన అనే సరోవరం దీనమై పోయింది .ఇక్కడ విశేషాలు తెలుసు కొందాం -కర్ణుడు పద్మ బాంధవుడు అంటే సూర్యుని వంశ సంభూతుడు .అర్జున మేఘా వరణం తో నిస్తేజుడు అవటం వల్ల సైనిక ముఖ పద్మాలు కాంతి తప్పాయి .చక్కని ఉపమానాలు తో యుద్ధ స్తితి ని వర్ణించాడు .సూర్యుడు ,అగ్ని అభిన్నులు .అర్క అంటే సూర్యుడు అగ్ని అనే రెండు అర్ధాలు ఉన్నాయి .అర్క తనూభావుడైన కర్ణుని ,అగ్ని తో పోల్చటం చాలా ఉచితం గా ఉంది .తనూభవ శబ్దం విశిష్టమైన ప్రయోగం .అగ్ని జ్వాలలు తాప హేతువులు .అలాగే కర్ణుని బాణాలు సంతాప కారణాలు .అర్జునుడు ఇంద్రుని కుమారుడు .మేఘం తో అభేదం .అర్జున శబ్దానికి ఇంద్ర ,అర్జున అనే అర్ధాలున్నాయి .అర్జున పతాకం దివ్యమైనది .అందుకే మేఘం లోని విద్యుత్ తో పోల్చాడు .కర్ణుని బాణాలు లోకానికి అనర్ధాలు .అర్జునుడు ధర్మ యుద్ధ తత్పరుడు .కనుక బాణాలు లోక హితాన్ని చేకూర్చే తాపాన్ని అణగించేవి .ఇంత ఉదాత్తం గా చిత్రించటం తిక్కనే సాధ్యం అని పించు కొన్నాడు .–

”రోషంబు భీషణ రూపమై చేలువొంద ,నతుల కేతువు శిఖయై వెలుంగ -శరజాలములు పటు జ్వాలలై నిగుడ ,నరక తనూభవాగ్ని ప్రజ్వరిల్లు -నుద్ధతి సైపక యుజ్వల దివ్య పతాక ,మేరుంగుగా ,దళిత ధోరణి -రాధానేమి రావము ,గర్జనము గ ,శర పరంపరలు ధారలుగాగ బరగి యడరె అర్జునామ్బుడంబు అనన్య సామాన్య సముదయమ మున,ముఖ పయోరుహముల -కాంతి దరాగి యపుడు కౌరవ సేనా సరోవరంబు దీన భావ మొంద ” ఇదీ తిక్కన గారి రస పట్టు .సహృదయ ఉల్లాసం .నమోస్తు తిక్కన కవీశ్వరా !

సశేషం –మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –15-7-12.–కాంప్-అమెరికా

 

Posted in రచనలు | Tagged | Leave a comment

తిక్కన భారతం -4 విరాట పర్వం లో తిక్కన విరాట్ స్వరూపం

 తిక్కన భారతం -4

                                             విరాట పర్వం లో తిక్కన విరాట్ స్వరూపం

”హృదయాహ్లాది చతుర్ధ మూర్జిత కదో పేతంబు -నానా రసాభ్యుదాయో ల్లాసి విరాట పర్వము ”అని తిక్కనే విరాట పర్వం ప్రబంధ రచనకు అనుకూలం అనే విషయాన్ని ముందే చెప్పాడు .ఇందులో కద మన జీవితానికి చాలా దగ్గర .వీర శృంగార రస పోషణకు అనువు కనుక హృదయాహ్లాది అయింది .అనేక సన్నివేశాలలో వ్యక్తుల ప్రవర్తన ,నిజ శీల స్వభావాలు బాగా వ్యక్తమయాయి .లౌకిక జీవితం బాగా ప్రతి బిమ్బించింది .కీచక వధ ,ఉత్తర గోగ్రహణం ,అభిమన్యు వివాహం దీని లో ముఖ్య ఘట్టాలు .మొదటి దానిలో వీర ,రౌద్ర రసాలు ,రెండవ దానిలో వీర హాస్యాలు ,చివర లో లలిత శృంగారం వర్నితాలు .

కీచక వధ ను ప్రబంధం గా రచించాడు తిక్కన .అసహాయ స్తితి లోని స్త్రీకి జరిగే అవమానం ,షీలా రక్షణ కై ఆమె ప్రయత్నం ,దాని ద్వారా వివిధ పరిణామాలు లోక సామాన్యమైనవి కనుక ఇతి వ్రుఉట్టాం సహజ ఆకర్షణ ను పొందింది .పరులను ఆశ్రయించటం అందులోను రాజాశ్రయం లో పాండవుల కష్టాలు ,విరాట నగర జీవితానికి అద్దం పడతాయి .విరాటుని వినోదం కోసం భీముడు మల్లులతోనే కాదు ,సింహాలతో కూడా పోరాడా వలసి రావటం దాసీ కనుక రాణి సుధేష్ణ చెప్పినట్లు చేయ వలసిన దీన స్తితి లో ద్రౌపది ఉండటం ,తన అభి ప్రాయాన్ని కాదన్నాడని విరాట రాజు ధర్మ రాజుని పాచిక తో కొట్టి అవమానించటం ,పాండవుల పట్ల సాను భూతి చూపే ఘట్టాలు .దీని కంతటికీ కారణం ధర్మ రాజు ద్యూతం .దాని ఫలితం గా పొందిన దాస్యం .అందుకే బలవంతులైనా ,నిస్సహాయ స్తితి .సామాన్య మానవులలో కనీ పించే స్త్రీ లోలత కీచకుని లో ప్రతి బిమ్బించింది .యుక్తాయుక్తత లోపిస్తే ,కలిగే పరిణామం ఇదే అని అందరికి హెచ్చరిక .కామక్రోదాదులు కీచక వృత్తాంతం కనుక రచనను ప్రబంధ ప్రక్రియ లో నడిపాడు .ఉద్యానవన ,సూర్యోదయ ,అస్తమయ వర్ణనలు తరువాత ప్రబంధ రీతి కి మార్గ దర్శనాలైనాయి .వీటిని ఎర్రన ,సోమనాధుడు స్వీకరించారు .శ్రీ నాధుడు పోషించాడు .రాయల కాలం లో పరి పక్వ స్తితిని ప్రబంధం పొందింది .

”నీరజాకరములు నిష్ఠమై జేసినా భవ్య తపంబున ఫలమనంగ -దివస ముఖాభి నందిత చక్ర యుగ్మకంబు ల యనురాగంపు బ్రోవనంగ–హరిహరబ్రహ్మ మహానుభావంబులోక్కోటి గాగ గరగిన గటిక యనగనతుల వేదత్రయ లతి కా చయము పెను పొంద బుట్టెడు మూల కందమనగ –నఖిల జగముల కందేర యగుచు జనసమాజ కరపుట హృదయ సరోజములకు -ముకులనంబును జ్రుమ్భనంబును నొనర్చి -భాను బిమ్బంబు పూర్వాద్రి పై వెలింగె ”—భవ్య తపః ఫలమైన పరంజ్యోతి స్వరూపం విశుద్ధ ప్రేమ పరిణామ మైన రస స్తితి ,హరి హర బ్రహ్మైక్య జ్ఞాన మూర్తి ,వేదత్రయ జన్మ కారణ మైన అర్బ్రహ్మ స్వరూపం -లోకాతీతత ,అలోకిక ఉపమానాలలో వర్ణన చేయటం వల్ల రచన ఉదాత్త స్తితి పొందింది .మనోహరం గా అని పించాతమే కాదు సోర్యుని పరబ్రహ్మ మూర్తి గా ప్రతి పాడించి వేద ధర్మాన్ని నిరూపించాడు తిక్కన .సూర్యభగవానుడు చైతన్య దాత అని ,జ్ఞాన ప్రదాత అని ”కందేర ”అనే ఒక్క మాటలో నిక్షిప్తం చేశాడు .అలాంటి పరబ్రహ్మ మైన సూర్య దర్శనం హృదయ వికాసం కలిగిస్తుంది అనటం లో సందేహమే లేదు .ఉపమానాలు అతి పవిత్ర మైనవి కనుక ఉదాత్త కవితా తత్త్వం ఆవిష్కారమైంది .సూర్యాస్తమాయ వర్ణన కూడా భావనా చమత్కారం తో రాశాడు .సూర్యుడు పశ్చిమ దిశా చేరగానే ,అది సాన్ధ్యారున రంజితం అయిందట భర్త వస్తే .భార్య కు రాగ రంజితం అయినట్లు .

”ఇనుడు తన కడకు నేతేంచిన రాగము బొందుటదియుచిత మనగా –గెంపున మేరసి పస్చిమాశాన్గన జన సంభావముల గారవ మందెన్ ”ఇనుడు అంటే సూర్యుడు భర్త అని అర్ధాలు .రాగం అంటే ఎరుపు అనురాగం -అర్ధ శ్లేష తో గొప్ప చమత్కారం చేశాడు .భ్హర్త విరహం లో ఉన్న పశ్చిమ దిశా కు భర్త సమాగమం -అందుచేత ఆమె లోక సంభవ నీయు రాలు అయిందట .కుల కాంతకు దక్కే గౌరవం దక్కిందట .ఈ విధం గా ప్రక్రుతి వర్ణన సహజా లంకార చమత్కారం తో హృదయ వికాసం కల్గిస్తాడు తిక్కన .

కీచకుని కామ వృత్తికి అనుగుణం గా వనం లోని పక్షుల విహారం ను అతి సుకుమారం గా పోషించాడు –

”ఇంపైన ప్రియ కాన నిచ్చి ,నిల్చిన మధు-వాదట నాను మత్తాలి విభుని –జెట్టు పల్పచారింప చుట్టూ గ్రుమ్మరి మనోరమ నియ్య కొలుపు మరాల విభుని –ఫలరస మొన్దొంటి కెలమి జన్చుల నిచ్చు -మెయిన జోక్కెడు శుక మిదునములకు -గామి బాసి తలిరు జొంపమునకు మెయి మెయి -దాకంగా జానూ పిక దంపతులును ”–ఇదీ ప్రతి అంగుళం లోను కన్పించిన ప్రకృతి .”కామీ స్వతాం పశ్యతి ”అన్నట్లు ,అంతటా కీచాకుడికి అలానే కన్పించింది .అతని లోపలి భావాలకు ఉద్రేక పరచటానికి ప్రకృతి బాగా దోహదం చేసింది .అందుకే ”తనువు నింద్రియములు ,మనము ధృతి యు దన వశంబు గాక -తల్లాడ పది సింహబలుడు విషమ బాణు బారి బారే ”అన్నాడు .సింహం వంటి బల వంతుడు కూడా కామం లో పిల్లి అయి పోయాడు .అలా కామోద్రేకం తో రోజంతా దహించుకు పోయాడు .సైరంధ్రి చేసిన సంకేతం కూడా అందు కో లేని మూధత్వం వాడిని ఆవ హించింది ..రాత్రి నర్తన శాల కు చేరాడు .ఎలా ?”స్వాంతము బాహుగర్వ ఘన సం,తమ సాంధము గాగ -శంక యొ క్కిన్తయు లేక -కీచకుడహంక్రుతి ముంగలి గాగ మండవాభ్యన్తర భూమి ”చేరాడు .కామాతురునికి లజ్జా భయము ఉండవు కదా .ఇలా కామంధుని చిట్టా వృత్తిని సాక్షాత్కరింప జేసి మన ముందు కీచకుణ్ణి ఉంచాడు తిక్కన .

ఇప్పుడు భీముని రంగ ప్రవేశం చేయిస్తున్నాడు తిక్కన కవి ..లోకజ్ఞత ,ఔచిత్యం నిండిన రచన మనకిన్డులో కన్పిస్తుంది –

”గమనము వీక ,వేరొక వికారము పుట్టాక ,సంగారోత్సవో –ద్యమ రభసాతి రేకము బయల్పడుటిన్చుక లేక రోష సం

భ్రమ మొక ఇంత యైన బరభావ నిరూప్యము గాక ,ద్రౌపదీ –రమణుడు వోయి ,విక్రమ దురంధరతం దగ నాట్య శాలకున్ ”-

భీముడు జాగ్రత్త గా అన్ని వైపులా చూసుకొంటూ ,తన బాల పరాక్రమాలు ఒప్పగా మద మత్త గజం లాగా సదృశ గతి ”లో ప్రవేశించాడు .ఇక్కడ కీచక భీములలో ప్రవర్తనా వైవిధ్యం కన్పిస్తుంది .మదాన్దుడై అనుమానం లేకుండా ,అహంకారమే ఆయుధం గా ప్రవేశించాడు కీచకుడు .నిర్వికార గామ్భీర్యాలతో ఆత్మ నిగ్రహం కోల్పోకుండా ,తన బాహా గర్వమే ఆయుధం గా భీముడు ప్రవేశించాడు.అనుమానం లేకుండా కీచకుడు వస్తే ,భీముడు వివేకం తో పరిసరాలను అన్నిటిని పరిశీలిస్తూ వచ్చాడు .బయట పడితే పాండవ రహస్యం బట్టబయలు అవుతుందేమో ననే అనుమానం భీముడిది .కనుక యుక్తా యుక్త విచక్షణ తో వచ్చాడు .ఇలా పాత్ర పోషణ లో స్వభావ వ్యక్తీకరణ లో తిక్కన తన సిద్ధ హస్తాన్ని చూపిస్తాడు .

రతి అనే సాత్విక భావం ఇరువైపులా నిష్టం అయితేనే శృంగారం గా అది పరిణమిస్తుంది .వీర రసానికి ఉత్సాహం కావాలి .అందుకే ద్రౌపది కీచక వధ తర్వాతా భీముడిని ”మన వారి లోన నొక్కని బిల్వక -ఉత్సాహంబు చేసిన సాహసాన్ని ”ప్రశంసించింది .ఆ ఉత్సాహాన్ని వీరం గా మార్చిందిభీముడిలో .అందుకే కీచక పీచాన్ని అతి భీకరం గా అణచాడు.ద్రౌపది పరాభవాన్ని స్వయం గా చూశాడు కనుక భీముడి లో రౌద్రం మూర్తీభ వించింది .తన భార్య యెడ కామంతో ప్రవర్తించి నందుకు వాడి కళ్ళను ,అతిగా ప్రేలి నందుకు ముఖాన్ని ,పతివ్రత ణు వెంటాడి జుట్టుపట్టుకొన్న కాళ్ళు ,చేతుల్ని ఇంకా ఏమీ చేయలేని స్తితి లో ఇతరులు చూడ టానికి వీలు లేకుండా ,రూపం చేదేట్లు ,శరీరం లోకి తోసి ,కీచక దేహాన్ని ఒక మాసపు ముద్దగా మారిస్తే తప్ప భీముడికి తృప్తి కలుగ లేదు .ఇది మనకు అమానుష వధ అని పిస్తుంది .ఉపకీచాకుల్ని చంపటం లోను రౌద్రం బాగా విజ్రుమ్భిచింది .”వికృతపు జావు నంప మది వేడుక పుట్టిన గిట్టి పట్టి మా -శతకమును బీనా దీర్ఘ భుజ శాఖలు బాదయుగంబు మేనిలో –నికి జొర ,నుగ్గు గా దురిమి ,నించిన గ్రంథాల తిత్తియైన కీ -చాకు ధరణీ స్తలిం జదిపి చక్కని ముద్దగ జేసే దుష్టుడై ”-ఉపకీచాకుల్ని చంపే ఘట్టం లో –

”వికట భ్రుకుటి ఘోర ఫాల కలిత స్వేదోద్భాతుమ్డున్ -చలక్రుతోష్ట ద్వాయుడం -బ్రమర్దన దశావిర్భావ సంభావితాం -గకుండు ని –బాకా విధ్వంసకుడ య్యే డన్నిలచే –శుమ్భంమూర్తి విస్ఫూర్తి తోన్”–ఏఎ వృత్తాంతం అంతా మనం చూసే సంఘటన ఆ అతి సన్నిహితం గా కన్పిస్తుంది .దీనిని తిక్కన మనోహరంగా ,రసవత్తరం గా ,రచించటం వల్ల పండితులను ,విమర్శకులను ఆకట్టు కొన్నది .

సశేషం –మీ –గబ్బిటదుర్గా ప్రసాద్ –15-7-12.–కాంప్–అమెరికా

Posted in రచనలు | Tagged | Leave a comment

తిక్కన భారతం –3 మహా భారతం -మహా విజ్ఞాన సర్వస్వం

  తిక్కన భారతం –3

                                                                                          మహా భారతం -మహా విజ్ఞాన సర్వస్వం

ప్రాచీన భారతీయుల విజ్ఞానాన్ని ,నాగరకత ను తెలియ జేసే గొప్ప గ్రంధమే వ్యాస భారతం .మానవుల భౌతిక ,మానసిక ,ఆధ్యాత్మిక జీవితం అంతా అందు లో ప్రతి బిమ్బించింది .సాధారణం గా ఏ సారస్వత మైనా మానవ జీవితానికి శబ్ద ,వర్ణ చిత్రణే.నాగరకత ,సాంఘిక వ్యవస్థ ,సంస్కృతి ని వ్యక్తం చేసేది సాహిత్యం .లోక ధర్మ వ్రుత్తి కోసం వ్యాసుడు రాయటం ,కద లో ఉదాత్తత ఉండటం ,ఆద్యాత్మిక విషయ ప్రాధాన్యత ,వల్ల మహా భారతం మహా విశిష్టమైంది .అంతరార్ధం గా ఆలోచిస్తే ,సత్యాసత్యాలకు ,ధర్మాదర్మాలకు ,దైవ ,రాక్షస భావాలకు జరిగే సంఘర్షణ మే దీని లోని ఇతి వృత్తం .వేద వాజ్మయం లోను ఈ ద్వంద్వాల సంఘర్షణ ఉన్నా ,భారతం లో అదిప్రధాన ఇతి వ్రుత్తమైంది .పరమేశ్వరుని సర్వ శక్తిమత్వం ,సర్వజ్ఞత్వం ,సంచిత కర్మ పరి పాక ప్రాబల్యం ,భారత కదా ఇతి వృత్తం గా ప్రత్యక్షమైంది .అంతే కాక ,అన్ని వేద శాఖలకు చెందిన వైదిక వాజ్మయ సర్వస్వం భారతం లో ప్రతి పాడించ బడింది .అందుకే భారతం వేద తుల్యమై ,పంచమ వేదమయింది .వేదం శబ్దానికి ప్రాధాన్యం .భారతం అర్ధ ప్రాధాన్యం .లౌకిక మైన భారత కదా ఆధారం గా పరబ్రహ్మ స్వరూపాన్ని ,,విధి ప్రభావం ,లోకులకు తెలియ బఱచి ,సత్య ధర్మాన్ని లోకం లో ప్రతిష్టించటమే భారత కర్త మహాదాశయం .

వేద సారం ప్రతి పాదించటం ,ధర్మం ,నీతి శాస్త్ర విషయాలు సులభం గా వివరించటం వల్ల భారతం స్మృతి గ్రంధం కూడా అయింది .పురాణ లక్షణాలు అన్నీ సమగ్రం గా ఉన్నాయి కనుక పురాణ సముచ్చయం అన్నారు .ఉపనిషత్ సారం ప్రతి పాదింప బడింది కనుక వేదాంత గ్రంధమైంది .ఇక వ్రాసిన వాడో -”వ్యాసో నారాయనో హరిహ్ ”అని పిలువ బడే విష్ణు అంశ సంభూతుడైన కృష్ణ ద్వైపాయన మహర్షి .ఆయనే మహాముని ,విజ్ఞాన వేత్త కావటం వల్ల ఆ రచనకు ఉదాత్తత లభించింది .మహాభారత కదా కాలం నాటికి ఆర్యులు దేశం లో చాలాభాగం విస్తరించారు .ఆర్య ,అనార్య సంమేనలం కూడా జరిగి ,అనేక వ్యవహారాలూ ,కట్టుబాట్లు ఏర్పడ్డాయి .ఐహికం పై ఆసక్తి పెరిగి ,ఆముష్మిక భావం క్రమంగా తగ్గింది .దానితో సంఘం లో న్యాయ ధర్మాలు క్షీణించాయి .అధర్మ పరాయణమే మహా భారత యుద్ధం .తాను భారత యుద్ధాన్ని ప్రత్యక్షం గా చూశాడు కనుక ,వ్యాసుడు ఆ కధను ధర్మ ప్రచారానికి ,సంఘ ఉద్ధరణకు చక్కగా ఉపయోగించు కొన్నాడు .సంఘాన్ని ,వేద మత సూత్రాలకు అనుసంధించాలని భావించాడు .ఆర్య విజ్ఞాన సర్వస్వాన్ని ప్రజల ముందు ఉంచాలని తహ తహ లాడాడు .జనానికి అందు బాటు లేని వేదాంత ధర్మాలనన్నిటిని అందుబాటు లోకి తేవాలని భావించాడు .భారత కదన్యాయం గా

24000శ్లోకాలు మాత్రమె .తన ఆశయం నేర వేర్చటానికి ,ఆధ్యాత్మిక రహస్యాలు అందించ టానికి మూడు రెట్లు పెరిగి లక్ష శ్లోకాలతో విస్తృతమైంది .ఇందులో కొంత ప్రక్షిప్తత కూడా ఉంది .అందుకే బారతాన్ని ”సంహిత ”అన్నారు .

ఆదర్శ ధర్మ వీరుడు అయిన శ్రీ రాముని చరిత్ర ను కావ్య రూపం గా వ్రాయటం ఆదికవి వాల్మీకి ఆశయం .సీతా రాముల చరిత్ర మనకు ఆశయం ,ఆదర్శం .రామాయణ పథనంవల్ల నీతి ,ధర్మం కలిగినా ప్రత్యక్షం గా సాత్విక మానసిక వికాసం ,సద్యః పర నివృత్తి కలుగుతాయి .కనుక రామాయణం కావ్యం అయింది .వ్యాసుని ఆశయం సంఘ సంస్కరణ .కనుక రచన కావ్య రచన కంటే విశిష్ట మైంది .భారతం శాంతి రస ప్రధానం .నాయకుడు శ్రీ కృష్ణుడు .రచన లో రాసోత్కార్శ కంటే అర్ధ గౌరవానికి ప్రాధాన్యత కల్గింది .పాండవ ఇతి వృత్తం ఆధారంగా వ్యాసమహర్షి తన ఆశయాన్ని నేర వెర్చు కొన్నాడు .కనుక భారతం కావ్యమే కాదు -శాస్త్రం కూడా అయింది .ఇతి వృత్తం లౌకికం .దాని ద్వారా ప్రతి పాదించింది ఆధ్యాత్మికం కనుక లోక కల్యాణానికి మార్గమైంది .

”కమనీయ ధర్మార్ధ కామ మోక్షములకు నత్యంత సాధనం బైన దాని ”అన్నాడు తిక్కన .”ఆయుష్యమ్బితి హాస వస్తు సముదాయంబైహికాముష్మిక శ్రేయః ప్రాప్తి నిమిత్త ముత్తమ సభా సేవ్యమ్బు ,లోకాగమ న్యాయైకాంత గృహంబు ,నాబరగి ,నానా వేదాంత విద్యా యుక్తంబగు దాని చెప్ప దోడగెం దద్భారతాఖ్యానమున్ ”

మహాభారత ఆంధ్రీ కారణం కూడా లోక హితం కోసమే ప్రారంభమైంది .రాజరాజ కాలం నాటికి మత కల్లోలం హెచ్చుగా ఉంది .జైన బౌద్ధ మత వ్యాప్తి పెరిగి ,వేద ప్రామాణ్యం తిరస్కరింప బడింది .చార్వాకం పెరిగింది .ఆర్య ధర్మం వెనకడుగు వేసింది .నిరీశ్వరవాదం వైపు ఆకర్షణ వల్ల ఐకమత్యం దెబ్బతింది .సంఘ పటిష్టత కోల్పోయింది .ఆ సమయం లో సంఘాన్ని ఉద్ధరించ టైకి కుమారిలభట్టు కంకణం కట్టుకొన్నాడు .పూర్వ మీమాంస కు ప్రాధాన్యం తెచ్చాడు .దానితో మళ్ళీ యజ్న యాగాదులు ఆదరణ పొందాయి .ఆర్యమతం మళ్ళీ పునరుద్దానమైంది .వర్ణాశ్రమ ధర్మాలకు నిలయమై ,సకల ధర్మాలకు ఆలవాలమై ,మహాభారత సారం అయిన భారతాన్ని ఆంధ్రీకరించి ప్రచారం చేయ వలసినది గా రాజ రాజు నన్నయ భట్టారకుని కోరాడు .కనుక ఇక్కడ కూడా ”లోక సంగ్రహేచ్చ ”కారణం అయింది ..

తిక్కన కాలం లో చార్వాకం వెనుకడుగు వేసినా ,జనం ఇంకా ప్రాబల్యం లో ఉంది .సోమనాధుడు మొదలైన వారి వల్ల వీర శైవం వెర్రి తలలు వేసి ,మత కలహాలకు ఆజ్యం పోసింది .శైవ ,వైష్ణవాల వల్ల కొత్త తేగలేర్పడ్డాయి .మార్గ దర్శకులు కావలసిన కవులలో మత భేదాలేర్పడ్డాయి .శివకవులు భావి కవులను నిరశించే వారు .ఈక్లిష్ట పరిస్థితులలో తిక్కన మహా కవి భారత రచన చేయ సంకల్పించి సంఘ సంస్కరణ చేశాడు .బ్రహ్మా ,విష్ణు ,పరమేశ్వరులు పరబ్రహ్మ అంశాలుగా వాళ్ళు చేసే పని సృష్టి ,స్థితి ,లయాలు సగునాత్మక మైన పరబ్రహ్మ లీలలుగా తెలియ జేశాడు .కనుక పరమాత్మ భిన్న స్వరూపాలే అవి అని తెలియ జెప్పటా నికి ”హరి హరైక మూర్తి ”ని ఇష్ట దైవం గా భావించి తన భారతాన్ని ఆయనకు అంకితమిచ్చాడు .తిక్కన తర్వాతా నాచన సోముడు ,కేతన ,ఈ మార్గాన్నే అనుసరించారు .కొరవి గోప రాజు కూడా జత కలిశాడు .తరువాత వచ్చిన శైవ ,వైష్ణవ కవులు పరదూషణ మానారు .సహనం వహించారు .తిక్కన -శివ కేశవులకు అభేదాన్ని చూపించటమే కాదు అద్వైతాన్ని బోధించి ,జీవాత్మ పరమాత్మ ఐక్యాన్ని చూపాడు .

ఆంద్ర దేశమంతా ఏక మత సూత్ర బద్ధం చేశాడు .అందుకే ఆంద్ర దేశం లో అద్వైతానికి అధిక ఆదరణ లభించింది .జాను తెనుగు కు తిక్కన పట్టం కట్టాడు .ఎర్రన కూడా ఇదే మార్గాన్ని అనుసరించాడు .ఈ విధం గా భారత రచనకు ,ఆంధ్రీకరణకు కవిత్రయం సమానమైన ప్రయోజనం కల్పించారు .అంచమ వేదం ధర్మ శాస్త్రం అని పిలువా బడే భారతాన్ని తెనుగు చేయటానికి రుషి వంటి నన్నయ ,తిక్కన ,ఎర్రన లు లభించటం లౌకిక తత్త్వం దాటి ఆధ్యాత్మికత్వం అందుకోండి భారతం .రాజాశ్రయం లో ఉన్నా ,అంతరంగం ఆముష్మికం వైపు ప్రసరించింది ఈ ముగ్గురు మహా కవుల్లో .భారత రచన వల్ల భావ బంధ విమోచానమే వీరూ ఆశించారు .

”భారత భారతీ శుభ గభస్తి చయమ్బుల జేసి ,ఘోర సం –సార వికార ,సంతమాస జాల విజ్రుమ్భము వాపి ,సూరి, చే

తో రుచి రాబ్జ బోధనా రతుం డగుదివ్య పరాశారాత్మజాం –భోరుహ మిత్రు గొల్చి ” అని నన్నయ గారు పేర్కొనటం గమనార్హం ..తిక్కన కూడా ”ఇంకా జన్మాంతర దుఃఖ ముల ,తొలగు నట్లు జేసి ,సుఖాత్ము జేయవే ”అని హరి హరుడిని ప్రార్ధించాడు .అప్పుడు ఆ జగన్నాధుడు -”జనన మర్నాడు లైన సంసార దురిత –ములకు ,నగ పడ కుండంగగాను దోలగు తెరవు–గను వెలుంగు నీ కిచ్చితి ననిన లేచి –నిలిచి సంతోష మెద నిండ నెలవు కొనగ ” తిక్కన మేల్కాంచాడు .కనుక తిక్కన గారి ఆశయమూ భావ బంధ మోక్షమే .అంతే కాక ,తన ఆశయాన్ని ఇలా తెలియ జేస్తాడు కవిబ్రహ్మ –

”కావున భారతామృతము కర్ణ పుటంబుల నారగ్రోలి ,యాం –ధ్రావలి మొదముంబోరయు నట్లు గ ,సాత్యవతేయ సంస్మృతి

శ్రీ విభవాస్పదంబయిన చిత్తము తోడ మహా కవిత్వ దీ –క్షా విధి నొంది ,పద్యముల గద్యములన్ రాచి యించేదన్ గృతుల్”

తిక్కన గారు వాడిన అమృత శబ్దం పరబ్రహ్మనే తెలుపు తుంది .భారతామృతం అంటే పరబ్రహ్మ తో అభేదాన్ని సూచిస్తుంది .పరబ్రహ్మ జ్ఞానం -మననం అనే యోగం తో లభిస్తుంది .అంటే భారత ఆఖ్యానాలను వినటం తో ఆనందం సిద్ధిస్తుంది అని ,విశిష్ట మైన అర్ధం గా కవి బ్రహ్మ వాక్కు .పరబ్రహ్మ సాక్షాత్కారం విద్య వల్లనే సాధిస్తారు .అలాగే భారత రచన తనకూ తన జాతికీ నిత్య శ్రేయాన్ని కల్గించాలని తిక్కన గారి పరమ ఉదాత్తమైన ఆశయం .నిత్య మోక్షాన్ని కోరాడు కనుక భారత ఆమ్నాయ కర్మ నిర్వహణలో యోగి అయాడు .యోగుల లాగే సంయమనాన్ని పొందాడు .అల్పాక్షరాలలో అనల్పార్ధం ,వ్యంగ్య వైభవం ,గాంభీర్య గుణ ప్రధానం గల పాత్ర శీల చిత్రణ ,అలంకార వ్యామోహం వదిలి సహజ రమ్యత ,అర్ధ గౌరవం చేత కల్పించటం కవిత్రయ రచన ప్రధాన గుణం .ఇంతటి సంయమనం తరువాతి కవుల్లో కన్పించదు .ఇంతటి సంయమనం ,లోక హితం కోరే కవులు లేక పోవటం వల్లనే భారతానికి దగ్గర గా రా గల్గిన రచన తెలుగు సాహిత్యం లో ఇంత వరకు రాలేదు .లోక కళ్యాణ ప్రతిపాదిక మహా కావ్యం కనుక భారతం ఆంధ్రుల విజ్ఞాన సర్వస్వమైంది .ఆంధ్రుల జాతీయ జీవిత సర్వస్వం అయింది .డాంటేరాసిన ”డివైన్ కామెడి ”ఇటాలియన్లకు ,హోమర్ రాసిన ”ఇలియడ్ ‘గ్రీకులకు ,మిల్టన్ రాసిన ”పారడైజ్ లాస్ట్ ”ఆంగ్లేయులకు వారి వారి జాతీయ జీవిత సర్వస్వాలు .ఉత్కృష్టమైన సారస్వతాన్ని నిర్మించి ,స్వార్ధ రహితులై ,విజ్ఞాన వ్యాప్తి చేసి ,లోక హితం చేసిన మహానీయులే నిజమైన జాతీయ నాయకులు అని పాశ్చాత్య మతం .ఆ దేశాలలో సాహిత్య స్రష్టలకు అనన్య గౌరవం ఉండటం మహదానందం గా ఉండటమే కాదు అందరికి ఆదర్శం ,అనుసరణీయం కూడా .

సశేషం –మీ –గబిట.దుర్గా ప్రసాద్ –14-7-12–కాంప్–అమెరికా


Posted in రచనలు | Tagged | Leave a comment

తిక్కన భారతం -2

        తిక్కన   భారతం -2 భారతాన్ని పరబ్రహ్మ రూపం గా భావించాడు తిక్కన .తాను ,ఆ తత్వాన్ని లోక కళ్యాణం కోసం ప్రచారం చేయాలని ,ఆంధ్రీకరణ కు పూనుకొన్నాడు .అదొక యజ్ఞం గా భావించి చేస్తేనే సత్ఫలితం కలుగు టుంది .అందుకే ముందుగా వైదిక యజ్న కర్మ దీక్షితుడు అయాడు.యజ్న రూపమైన ఈశ్వరుని నిష్టగా చిత్తాన్ని వశీకరణం చేసుకొని ,ప్రతిష్టించు కొన్నాడు .సోమయాజి అయ్యాడు కనుక ఈ వాజ్మయంయజ్నం సులభ మైంది .ఉత్కృష్ట సాధనమూ అయింది .చిత్త శాంతి లభించింది .కవిత్వ దీక్ష తీసుకొన్నాడు .వాజ్మయ యజ్న రూప మైనయోగ దీక్ష ను పొందాడు .భారత రచన ప్రారంభించారు .ఆతని ధ్యేయం ఆముష్మిక ఫలం ,జన్మ రాహిత్యం తపమునకు,విద్యకు ను ,జానూ స్తానమైన -జనన రహితుని యజ్ఞాత్ము శౌరి ,వాజ్మి యాధ్వరార్చితు జేసితి ణా జనార్ద–నుండు మద్భాజనమున బ్రీతుండు గాత” అని భీష్ముని చేత అనిపించినా ,అవి తిక్కన గారి మాటలే .విద్యా ,తపస్సుల జన్మ స్టాన మైన వాడూ ,జ్చావు పుట్టుకలు లేనివాడు,యజ్ఞమూర్తి ,అయిన పరబ్రహ్మం వాజ్మయ రూప యజ్ఞం తో తిక్కన పూజించాడు .దీనితో భగవంతుడు ప్రీతి చెందుతాడని నమ్మకం . ” శరణా గతుండ భక్తుడ -బరమ పదవి గోరేద ను శుభంబుగా నన్నున్ –బరికించి ఏది మేల -య్యిరవు దొరకోనంగా దలపవే కమలాక్షా”అని విశిష్ట జ్ఞానం తో ప్రార్ధిస్తాడు .భగవంతుని ప్రీతికై భక్తీ శ్రద్ధలతో సత్కర్మలు చేసి ,ఫలా పేక్ష లేకుండా ,జీవితాన్ని ఈశ్వరార్పణం చేసినఆదర్శ కర్మ యోగి తిక్కన .”ఏది మేలో అది చేయించు ”అన్న ప్రార్ధన -సర్వ సమర్పణా భావమే .వ్యాసుడు రాసిన గీతా తత్వాన్నివాచ్యం చేయకుండా ,ఆచరణ రూపం గా ,ఇలా బహిరంగ పరచాడు .అందుకే తిక్కన ఆదర్శ ప్రాయుడైనాడు .తిక్కనకు యోగం ,తపస్సు,యజ్ఞం అభిమాన విషయాలు .నిర్మల అంతఃకరణ సాధ్య మైన బ్రహ్మ జ్ఞానమే తిక్కన ధ్యేయం . ” యోగులకు యోగ బలమున -రాగంబు మొహమ్బును జిరస్నేహము,గామమముగ్రోధము గుణా–యోగము వరుస బెడ బాప నున్నతియొలయున్ ”అని యోగా వాసిష్టత ను చాటాడు .యోగం పొందిన వాడి ఆనందం వర్ణనా తీతం .అంటూ – ” యోగ నిరూదుండుడు సంగ -త్యాగా నందైక రతున్దతనికి ,జనన సంయోగము ,మృతి ,దైన్యమ్బును -భోగా భోగ సుఖ దుఃఖములులేవధిఅని చెప్పిస్తాడు .చాలా చోట్ల తపో యజ్ఞాల విశిష్టతను పాత్రల చేత చెప్పిస్తాడు .పరమేశ్వరుని ”యజ్ఞాత్మక రూప ,నిశ్చలా వ్యయరూపా ”అని సంబోదిస్తాడు .జనులందరికీ దానం ,తపం ,వృద్ధ సేవ అహింస నియతమైన పనులు అంటాడు .”యమ నియమ వికాసీ,వ్యాస చేతో నివాసీ అనీ ,యమ నియమ వికాసీ జ్ఞాన గేహ ప్రదీప ,దమ శమ కలితానంద ప్రకాశ స్వరూపా”అని పరమేశ్వరునిసంబోధించి ,తన జితెన్ద్రియత్వాన్ని తెలియ జేస్తాడు తిక్కన . ” ధర్మాధర్మ విదూర నీతి పర ,విద్వచ్చిత్త,యోగీ””అపగత కామ రోష హృదయాంతర ఖేలన కల్య ” వంటివి రాయటం వల్ల ఈద్వంద్వాలను దాటితే తప్ప ,మానసిక శాంతి లభించదని ,దాని వల్ల మాత్రమె పరబ్రహ్మ స్వరూప సిద్ధి కల్గుతుందని తెలియ జేస్తున్నాడు.”సకల నిగమ వేద్యా ,”,”వివృత నిగమ శాఖావిశ్రుతాగ్రైక వేద్యా ”,”ఉపనిషదగమ్యా,యోగ భావ్యైక రమ్యా ”అని రాయటం వల్ల వేద,ఉపనిషత్తు లలోని వేదాంత భావన ల మీద … Continue reading

More Galleries | Tagged | Leave a comment

తిక్కన భారతం –1

      తిక్కన భారతం –1

సాహితీ బంధువులకు –”తిక్కన భారతం ”శీర్షికను దారా వాహికం గా ప్రారంభిస్తున్నాను .దీనికి ముఖ్య ఆధారం స్వర్గీయ భూపతి లక్ష్మీ నారాయణ గారి రచన .

ఇంద్రియాలను బాహ్యం గా ప్రవర్తించ నీయ కుండా ఆత్మ లో వ్రేల్చట మే యజ్ఞం .ఆత్మ- అగ్ని స్వరూపమూ ,నిర్మల మైనది .”యజ్ఞో వై పురుషః ”అన్నది శ్రుతి .కనుక జ్ఞాన యజ్ఞం ద్వారా పరమ పురుషుని పొందటం జ్ఞాని చేయ వలసిన పని .పురుషుడే వేదం కనుక మళ్ళీ వేద ధర్మం ద్వారా కూడా సాధించ వచ్చు అని భావం .”వేద తాత్పర్య మారసి ,వేది తత్వ మెరుగు వారు వేదజ్నులు ”అన్నారు తిక్కన సోమయాజి .తాను ఆ స్తితి పొందాడు కనుక మహా భారతాన్ని అంత ఉదాత్తం గా తీర్చి దిద్దాడు కవి బ్రహ్మ .”self is poorna ,the absolute .Are you apart from poorna ?.if it is so will it be poornaa ? అన్నారు శ్రీ రమణులు .అంతటి ఉత్కృష్ట మైన తాదాత్మ్య స్తితి ని పొందితేనే ,తన కావ్యం ఆ వేద పరమార్ధాన్ని అందివ్వ గలదు అని తలచాడు తిక్క యజ్వ .”only one who can give every thing to the divine enjoys the all pervading divine ”అని శ్రీ అరవిన్డులంటారు .ఆ స్తితి ని సాధించి ,తన రచనకు పరమ మైన విలువను సంత రించి పెట్టాడు తిక్కన .అదొక మానసిక ఆరోహణ .కావ్యం లోనూ ,కావ్య నాయకత్వం లోను మానవ జీవితం లోను-అంతటా కలిసి .మనం సిద్ధం గా ఉంటె ,ఆ పరమాత్మ మనల్ని మారుస్తాడు .ఆ పని నిరంతరం జరిగేదే .మనం ఆ వేదిక ను నిర్మించు కోవాలి .అంతే -the divine is at work to transform you and you must open to iinorder to let it work freely ,in you ” అన్న శ్రీ అరవిందుల వాక్యం యదార్ధమే .అలాగే తన మానసిక స్తితి ని మార్పు చేసుకొన్నారు సోమయాజి .అందుకే ఆంద్ర భారత రచన అంతటి పవిత్ర యజ్ఞం గా భావించి పూర్తీ చేసి ,తాను ధన్యత చెంది ,లోకాన్ని ధన్యత చెందించి ,కావ్యానికి వేదత్వాన్ని కల్పించాడు .అనుక్షణం ఎదగటం ఎలాగో తాను ఆచరించి ”,ఆదర్శ కవి రుషి ”అయాడు ఉభయ కవి మిత్రుడు .ఆ విధానం ఏమిటో పరిశీలించి తెలుసు కొందాం .

భారత కదా సామాన్య మానవుని కధే .తండ్రిని పోగొట్టుకొని ,పిన తండ్రి పోషణ లో ఉన్న బాలుర జీవితమే కదా !దాయాదులు ,ఈరష్యా ,అసూయ ,దురాశాపరులు .వాళ్ళదే మొదట పై చేయిగా కన్పిస్తుంది .అంటే అధర్మం మొదట విజయం సాధించి నట్లు కానీ పిస్తుంది .పై చేయిగా ఉన్నట్లని పిస్తుంది .పాండవుల జీవితం కూడా అంతే కదా .అందుకే భారత కదా -మన జీవితాలకు దగ్గర గా ఉంటుంది .పాండవులకు ద్రౌపది థో వివాహం అయిన తర్వాతా కొంత సాంఘిక ఔన్నత్యం వారికి కలిగింది .బంధుత్వం బలపడి ,తమకు అండగా నిలబడే వారు దొరికారు .శక్తి యుక్తులు ,ధార్మిక జీవితం ,కొంత కాలం వారికి ఉన్నత స్తితి ని కల్పించాయి .ధర్మక్ విజయం ఇంకా ఒక స్తిర రూపం దాల్చ లేదు .దుర్యోధనాదుల అధర్మ ప్రవ్రుత్తి వలన తాత్కాలికం గా ,అధర్మానికి విజయం లభించి నట్లు కానీ పించి ,ధర్మ రాజాడులకు రాజ్య భ్రష్టత కలిగింది .దీనిలో ధర్మ రాజు దోషమూ కొంచే మైనా పాత్ర వహించింది .అదే ద్యూత వ్యసనం .దాని ఫలితమే రాజ్యం పోవటం ,అవమానం ,కష్ట నష్టాలు .మానవ జీవిత పరిణామం కూడా అంతే .ఏదో ఒకటో రెండో లోపాల వల్ల జీవితం అష్ట వ్యస్తమై పోవటం లోక సహజం .కష్టానుభావం వల్ల ఉత్తమ మైన ,సాత్విక ప్రవ్రుత్తి కల వారి లో హృదయ పరి వర్తన కలుగు టుంది .అలాగే అరణ్య ,అజ్ఞాత వాసాను భావం ధర్మజుని చిట్టా శుద్ధి కి మార్గాన్ని చూపించి ,లోక కళ్యాణం కోసం శాంతి ప్రయోగం చేసి విఫలుడైనాడు .క్షాత్ర ధర్మాన్ని అనుసరించి యుద్ధం చేయ వలసిన అత్యవసర పరిస్తితి కలిగింది .అయిష్టమైనా తప్పని చర్య.అది .తన పక్షాన ధర్మం ఉన్నా ,అధర్మ పక్షం థో పాటు తన వారూ యుద్ధం లో నశించారు .ఇదే ప్రకృతి స్వభావం .ఒక సంఘర్షణ ఏర్పడితే ,రెండు పక్షాలకు నాశనం తప్పదు .ఇది రాజు అయిన ధర్మ రాజు కు స్వయం గా తెలిసిన విషయం .తరువాత ఇదే వైరాగ్యానికి కారణం కూడా అయింది .

ఇక్కడ మళ్ళీ మనం మానవ జీవితం తో పోల్చు కొనదగిన విషయం ఒకటి ఉంది .ఉత్సాహ వంత మైన యవ్వనం దాటగానే ,కష్ట సుఖానుభావం ద్వారా పరిణామం వచ్చి ,శాంతి కోరటం సహజ లక్షణం .అంతవరకు ఐహికం పైనే కేంద్రీకరించిన దృష్టి ,ఆముష్మికం వై పు కు మరలు తుంది .అలాగే పాండవుల జీవిత చరిత్ర కూడా .భారతం లోని వివిధ ఘట్టాలు ఈ పరిణామ క్రమాన్ని సూచిస్తాయి .నాయకుడైన ధర్మ రాజు మానసిక స్తితి కూడా అలాగే మారింది .ఇతి వృత్తం తో,నాయకుని జీవితం క్రమ పరిణామం పొంది ,మానవ జీవిత చరిత్ర కు సంపూర్ణ మైన వ్యాఖ్య గా మహా భారతం నిలిచి పోయింది .

ఈ పరిణామం ఉన్నతం గా ,ఉదాత్తమం గా తీర్చి దిద్దాలి అంటే కవి లోనూ ఆ పరిణామం క్రమం గా రావాలి .దానిని అనుసరించి రావాలి .యుద్ధ పర్వం వరకు రచించిన రచనా విధానం వేరు ,-అదంతా లౌకిక పరం గా సాగింది .ఆ తర్వాతరచన లో అలౌకిక విధానం ప్రవేశించింది .ధర్మజుని ,జీవితం ఎలా పరిణితి చెంది క్రమంగా అంతర్ముఖ మై ప్రశాంతత పొందిందో ,తిక్కన సోమయాజి రచన కూడా క్రమ క్రమం గా పరిణామం చెందింది .అలోకిక కావ్య లక్షణాలైన ధ్వని ,అలంకారం ,చమత్కారం ,లను వదిలి ,మానసికం గా హాయిని ఇచ్చే అర్ధ పోషణ కే అధిక ప్రాధాన్యత వచ్చింది .ఆ ధ్యేయం గా ,నే రచన సాగి ,ప్రశాంత తేజో మూర్తిగా రచన మార్పు పొందింది .ఉత్కృష్ట పరిణామ స్థితి ని చేరింది .అనుభవసారమైంది .ఆదర్శ ప్రాయమైనది .ఆర్ష పద్ధతికి అద్దం పట్టింది .వేద ,వేదంగ ,ఉపనిషత్ రహస్యాలన్నీ ,జీర్నింప జేసుకొని ,ప్రాచీన సంస్కృతి కి వారసుని గా రూపొందటం చేతనే మహా భారత రచన చేయ గల్గె అర్హత పొందాడు తిక్కన మహా మంత్రి ,సోమయాజులు, కవి బ్రహ్మ ,ఉభయ కవి మిత్రుడు తిక్కన .గురూప దేశమే కాక ప్రత్యక్షాను భావం పొందితేనే ఇది సాధ్యం .విద్యకు అధీతి ,బోధ ,ఆచరణ ,ప్రచారం అనే నాలుగు దశ లు ఉంటాయి .భారత రచన లో తాను పొందిన విద్యకు చక్కని ప్రచారాన్ని సాధించి పెట్టి ధన్యడు ,చరితార్ధుడు అయ్యాడు తిక్కన .

సశేషం –మీ గబ్బిట దుర్గా ప్రసాద్ –13-7-12.–కాంప్

Posted in రచనలు | Tagged | Leave a comment

సింహ బల శూరుడు బీ ఉల్ఫు

   సింహ బల శూరుడు బీ ఉల్ఫు

బీ ఉల్ఫు శౌర్య గాధ ను ఎవరో ఒక అజ్ఞాత కవి 3,182 పంక్తుల్లో కవిత గా రాశాడు .

అది మధ్య యుగ నాగరకత కు ప్రతి బింబం .ఒకవెయ్యి సంవత్సరాల క్రితం మరుగున పడిన చరిత్ర .

పాగాన్ ”మతం ,క్రిస్టియన్ మతాల సంధి కాలం నాటి కద .పాగాన్ మతం క్రమం గాఅంత రించి 

,క్రిస్టియన్ మత ప్రభావం పెరిగింది .

దీని వ్రాత ప్రతి క్రీ..వెయ్యి లో దొరికింది .అది ఒక బైండు పుస్తకం లో మిగిలిన రచన  తో పాటు ఉంది .

అలాంటి వాటిని ”codex ”అంటారు .లారెన్స్ నోవియాల్ అనే ఆయన అధీనం లో ఉంది .ఆయన

 మొదటి ఎలిజ బెత్ రాణి కాలం నాటి వాడు .తర్వాతా అది రాబర్ట్కాటన్ అనే పాత పుస్తకాల ప్రియుడి దగ్గరకు చేరింది 

. పుస్తకం లోని కవిత ఆంగ్లో సాక్సన్ కాలం నాటిది .ఇందులో గొప్ప ఊహా వైవిధ్యంకదా కధనం 

ఉండటం చేత బాగా ఆకర్షించింది .ఆంగ్ల సాహిత్యాధ్యయ నానికి  రచన బాగా ఉపకరిస్తుందని పునాది

అని సాహిత్యకారులు చెబుతున్నారు .

మంచి ఉత్కంథ తో రచన సాగుతుంది .ఇందులో చరిత్ర ,పురాణం ,ఎలిజీ ,జానపదం ,భాషా జ్ఞానం 

కలగలుపుగా ఉన్నాయి ఒక రకం గా చారిత్రాత్మిక జ్ఞాపిక అన వచ్చు ..

”the poem is a widow on midieval culture an old english document of the first order

and a deeply felt study of man;s fate in an uncertain world ” అని విశ్లేషకుల భావన .

 పద్య కావ్యం లో గతించిన రాజుల ,సాహస వంతుల ,భూతాలు ,దేయ్యాలవిషయాలు ,సంపద ,ద్వంద్వ యుద్ధాలు ,అతీత శక్తులుఒకటేమిటి లేనిది లేదు . నాటి ప్రజల జీవన విధానం ,

ఉంది .అందుకే అది లెజెండ్ గా జనం నోళ్ళ నాని ఉంది .దీన్ని ”ఓల్డ్ డేనిష్ ”కవితగా భావిస్తారు .

క్రీ..నాలుగు లేక అయిదు శతాబ్దపు ఆంగ్లో సాక్సన్ సామ్రాజ్య కద .

దీన్ని పాటల రూపం గా పండుగపబ్బాలలోవేడుకలలో పాడు కొనే వారు .రాజాస్తానాల్లో 

రాజ కుటుంబానికి వినోదం కోసం జాన పదులు పాడి ఆనందం కల్గించే వారు .

ఆంగ్లో సాక్సన్ కు డెన్మార్క్ దేశం స్థానం .పూర్వ రాజుల ,వీరగాదా కావ్యమే బీ ఉల్ఫు కద.

రాజు కోసం ,దేశం కోసం సాహసాలు చేసే వీరుడేబీ ఉల్ఫు . కాలం లో మూడు తెగలు ఉండేవి .

అవి -geats, swedes ,scandinavianలు .వాళ్ళల్లో వాళ్ళ కు పోరాటాలు .

ఆది పత్యపోరాటాలే అవి .స్కాండినేవియన్ కవిత్వం లో seyld scefing అనే డేనిష్ రాజు గురించి కదఉంది .

అతనే scyld రాజ్య స్తాపకుడు .పేరుకు అర్ధం ”రక్షకుడు ”.ఇతని తర్వాతhrothgar రాజు అయ్యాడు .

అతనికి royal mead hall అనే విశాల భవనం ఉంది .అక్కడే రాజుఅది కారులతో వింతలు ,

వినోదాలు చూసే వాడు . భవనం రాజు గారి శక్తికి చిహ్నం .విందులు ,వినోదాలు ,వేడుకలు అన్నీ ఇక్కడే .

 సందడి  హాలుకు కొద్ది దూరం లో ఉన్న grendelఅనే రాక్షసుడికి అసూయ కోపం కలిగించాయి 

అక్కడ విని పించే వీనుల విందుఅయిన harp సంగీతం వీడికి కర్ణ కథోరం గా ఉండేది .

ఒక రోజు రాత్రి హ్రోత్ గార రాజు గారి వీర సైనికులు అంటే నైట్స్ ”హీర్రోట్ ‘అనేహాలులో నిద్ర పోతున్నారు 

గ్రెందేల్ రాక్షసుడు అర్ధ రాత్రి సమయం లో హతాట్టు గా వచ్చి మీద పడి ముప్ఫై మంది 

యోధులనుఎత్తుకొని పోయి ఎత్తుకు పోతుంటే అలజడి కి అంతా నిద్ర లేచారు 

.మర్నాడు కూడా అలానే అర్ధ రాత్రి వచ్చి మీద పడ్డాడు యోధుల్నిచంపి తినే వాడు .

రాజు బంధువులు చాలా మంది ఇలా చని పోయారు 

..రాజు మాత్రం అక్కడి నుంచి తప్పించుకొని సురక్షిత ప్రదేశం చేరుకొన్నాడు .ఈహింస తగ్గించ మని 

pagan దేవుళ్ళ ను రాజు వేడు కొన్నాడు .వారికి కానుకలు అంద జేసినా ఫలితం లేక పోయింది .ఇలాపన్నెండేళ్ళు గడిచి పోయింది .నిత్యం రాత్రి ఇదే హింస కోన సాగింది .

 రాజ్యానికి దగ్గర రాజ్యమైన geatsరాజ్య యువ రాజు బీ ఉల్ఫు ఆరాక్షసుడి ఆగడాలు విన్నా

డు .అతడు” పాతాల భైరవి ”సినిమా లోరామా రావు ళా శక్తి బలం ,బుద్ధి వివేచనా ఉన్న యువకుడు 

.అతని తండ్రి hygelac రాజ్యానికి రాజు .తండ్రి అనుమతి తీసుకొని బీఉల్ఫు పద్నాలుగు మంది 

తన లాంటి బలిష్టులైన యువకుల్ని వెంట బెట్టు కొని డెన్మార్క్ చేరాడు .రాజు స్వాగతించి కానుకలుసమర్పించాడు .

అందరు  రాత్రి herorot భవనం లో నిద్రించారు .గ్రెందేల్ రాక్షసుడు అర్ధ రాత్రి వచ్చి మీద పడ్డాడు .

బీ ఉల్ఫు వాడితోపోరాడి ఒళ్లంతా గాయాలు చేశాడు .వాడు ప్రాణ భయం తో గుహ లోకి పారి పోయాడు .అక్కడ గాయాల వల్ల వచ్చిన ఇన్ఫెక్షన్ తోచచ్చాడు .

గ్రెందేల్ చావు చూసి వాడి తల్లి అందర్ని చంపుతానని శపథం చేసింది .బీ ఉల్ఫు ఆమె గుహ చేరి పోరాడి 

ఆమె ను చంపేశాడు .రాజు దగ్గరవీడ్కోలు తీసుకొని సన్మానాలు కానుకలు పొంది స్వరాజ్యం చేరాడు .

తండ్రి చని పోయిన తర్వాతా బీ ఉల్ఫు రాజు అయ్యాడు .యాభై ఏళ్ళుపాలించాడు .యుద్ధాలు అనేవి 

లేకుండా పాలించి ,ప్రజలకు శాంతి సౌఖ్యాలను కలుగజేశాడు .అతనికి ముసలి తనం వచ్చింది 

.అయితేఒక డ్రాగన్ అతని పై పగ బట్టింది .డెన్మార్కు రాణి బీ ఉల్ఫు ను డెన్మార్క్ కు రాజు గా ఉండమని 

కబురు పంపింది భర్త మరణం తర్వాతఅతను తిరస్కరించాడు .కాని తప్పని పరిస్థితుల్లో రాజు అయాడు

 .పద కొండు మంది యోదు లతో డ్రాగన్ ను చంపి ,దాని దగ్గర ఉన్నసంపద ను అంతటినీ తెచ్చాడు 

.రాజ్యం సుభిక్షం గా వైభవం గా పరి పాలించి సాహస వీరుడు అని చిరస్తాయి కీర్తి ని పొందాడు బీ ఉల్ఫు .

బీ ఉల్ఫు డి జెర్మని కి చెందినా geat తెగ .దక్షిణ స్వీడెన్ లో ఉండే వాడు .తండ్రి మహా యోధుడైన ecgtheow.గెట్ రాజు హైజేలాక్సమర్ధుడు .మంచి పాలన అందించాడు .బీ ఉల్ఫు కు ముప్ఫై మంది 

యోధుల బలం ఉండేది మన భీముడి లాంటి వాడు .ద్వంద్వయుద్ధాలలో మొన గాడు .

 కధలో తెలిసిన్దేమిటి ?కొత్త నాగరకత ను రుద్ద టానికి ప్రయత్నిస్తే ,పాత నాగరకత వారు తిరస్కరిస్తారు 

.సాంఘిక అరాచకాన్ని అంతంచేసిన యోదుడే మన హీరో .మధ్య యుగ ప్రజలకు ప్రకృతి శక్తులు అంటే 

భయం .కొత్త వారికి రోత .పాతదే ముద్దు .కొత్త మార్గం లోనడవాలంటేనే భయం .పగలే ప్రయాణం చేసే 

వారు .అందులోను ఒంటరి ప్రయాణాలే .ప్రకృతిని శాంతింప జేయటానికి బలులు ఇచ్చేవారు .

ఇందులోని ఎలిజీ –గ్రెందేల్ అనే రాక్షసుడు ,వాడి తల్లి ప్ర కృతి కి ప్రతి నిధులు .అవి తండ్రి లేని జీవులు .

వాటి చరిత్ర అంతా గతం లో దాగిఉంది 

.అవన్నీ తోడేళ్ళు ,నక్కలు మొదలైన వాటి తో తిరిగేవి .ప్రకృతి అలజడి ని సృస్తించి చంపేస్తుంది .

దాని నుంచి కాపాడు కోవా టానికిఆయుధాలు సమ కూర్చు కోవాలి .దీనితో నాగరకత ప్రారంభమై ,

అడవులను నరికి వ్యవ సాయం చేశారు .తరువాత సమూహాలు గాజీవించటం ప్రారంభించారు .గానా బజానా ,లతో వినోదం తో సుఖ జీవనం చేయటం ప్రారంభించారు 

.heorot అనే హాల్ దీనికి అంతటికిప్రతి బిమ్బమే .అంటే నాగరకత కు ప్రతి బిమ్బమే .అందుకే 

నాగరకత ను సహించ లేని రాక్షసుడికి అసూయ అని విశ్లేషకులువివరించారు 

. కవిత లో ప్రకృతి శక్తులకు వ్యతి రేకం గా మానవ పోరాటం ఉంది ఇంటా బయటా ,సమాజం లో ఉన్న

 అలజడి కి రూపం.ఎవరూ ఇతరుల సహాయం లేకుండా జీవించే లేరు అనే జీవిత సత్యాని వ్యంగ్యాత్మకం గా ,ప్రతీకాత్మకం గా చెప్పటం మనం అందరంరాజ్యానికి ,దేశానికి రక్ష గా ఉండాలన్న సందేశమూ ఉంది .

మీ —గబ్బిట దుర్గా ప్రసాద్ –12-7-12.–కాంప్అమెరికా


Posted in మహానుభావులు | Tagged | Leave a comment

అమెరికా లో ఆంద్ర తేజం కూచి పూడి ”నృత్య రత్న ”పాప

  అమెరికా లో ఆంద్ర తేజం     
                                                      కూచి పూడి ”నృత్య రత్న ”పాప

  దేవుల పల్లి కృష్ణ శాస్త్రి గారి మేనకోడళ్ళు సీతా ,అనసూయ ల గురించి తెలియని ఆంధ్రులుండరు .జాన పద సంగీతాన్ని బంగారు పల్లకి లో దేశ విదేశాల్లో ఊరేగించిన సోదరీ మణులు .దేవుల పల్లి వారి గీతాలను దేశ మంతా పాడి తెలుగు జన హృదయాలను రస ప్లావితం చేసిన వారు .అలాంటి ఇద్దరి లో అనసూయ గారు వివాహం చేసుకొని అవసరాల అనసూయ అయారు .ఆమె పుత్రికా రత్నమే రత్న పాప .రత్న పాప ప్రసిద్ధ కూచి పూడి నృత్య దర్శకులు ,పద్మశ్రీ డాక్టర్ వెంపటి చిన సత్యం గారి శిష్యురాలు .గురువు గారి వద్ద గొప్ప శిక్షణ పొంది ,ఆయనతో ను ,ఆమె ఇతర కళాకార సహాధ్యాయిను లతో ను ఆంద్ర దేశ మంతా పర్య టించి ,వందలాది ప్రదర్శన లిచ్చి పేరు తెచ్చు కొన్నారు .కుమార్ అనే వారిని వివాహం చేసుకొని ఇప్పుడు ”రత్న కుమార్ ”గా వ్యవహింప బడుతున్నారు .సుమారు25 ఏళ్ళు గా అమెరికా లో టెక్సాస్ రాష్ట్రం లోని హూస్టన్ నగరం లో ”అంజలి ”అనే నాట్య సంస్థ ను స్తాపించి నృత్య సేవ చేస్తున్నారు .అందులో కూచి పూడి తో బాటు భరత నాట్యం మొదలైన భారతీయ నృత్య రీతులను అన్నిటిని నేర్పు తున్నారు .వందలాది విద్యార్ధులకు ఆమె శిక్షణ నిచ్చి రంగ ప్రవేశం చేయించి ,వారి నాట్యాభి రుచికి దోహదం చేస్తున్న మహా కళా కారిణి రత్న పాప .ఆమె సంస్థ anjali -center for indian performance arts .

2002 లో మేము అమెరికా కు మొదటి సారిగా మా అమ్మాయి వాళ్ళు ఉన్న హోస్ట కు వచ్చాం .అక్కడ మా బంధువు వావిలాల లక్ష్మి గారు ఒక రోజు న మమ్మల్ని రైస్ యూని వేర్సిటి లో ఒక అమ్మాయి కూచి పూడి నేర్చి ,రంగ ప్రవేశం చేసే కార్య క్రమానికి తీసుకు వెళ్లారు .అప్పుడు రత్న పాప గారి దగ్గరకు నేను ,నా శ్రీ మతి వెళ్లి పలకరించాం .చాలా చక్కగా మాట్లాడారు .అక్కడే ఉన్న వారి తల్లి గారు అనసూయ గారిని పరిచయం చేశారు .ఆమె మా చిన్నప్పటి నుండి తెలిసిన ఆవిడే .కృష్ణ శాస్త్రి గారి తో మా పరిచయం గుర్తుకు తెచ్చు కున్నాం .ఆమె మేమెవరో తెలిసి ఆశ్చర్య పోయారు .దేవుల పల్లి వారిని ఆమె ”మామయ్యా ”అనే సంబోధిస్తారు మద్రాస్ లో ఉన్న మా పెద్దక్కయ్య లోపాముద్ర ,బావ క్రుపా నిది గార్లు అనసూయ గారికి బంధువులే . బాగా తెలుసు ,అవన్నీ గుర్తు చేసుకొన్నారు .శాస్త్రి గారి భార్య అంటే ఆమె అత్తయ్య చని పోయిందనీ చెప్పారు .వాళ్ళింటికి రమ్మన్నారు కాని ఎందుకో కుదర లేదు .ఆ తర్వాత మూడేళ్ళ క్రితం వెంపటి చిన సత్యం గారు కూచి పూడి లో జరిపిన సిద్ధేంద్ర ఆరాధనో త్స వాలకు రత్న పాప ఆయన ఆహ్వానం పై అమెరికా నుండి గురువు గారి మీది భక్తీ తో కూచి పూడి వచ్చి రెండు రోజుల కార్య క్రమం లో పాల్గొని వెళ్లారు .నేను ఒక రోజు కార్య క్రమం లో ఆమె ను చూసి హూస్టన్ పరిచయాన్ని జ్ఞాపకం చేశాను .ఆమె ఆనందించింది .ఆ వేదిక మీద lecture cum demonstration చేసింది రత్న పాప .నేను స్పందిస్తూ శ్రీ నాద మహా కవి భీమ ఖండం లో రాసిన పద్యం -వ్యాసునికి కాశి లో విశ్వనాధుడు విశాలాక్షీ కన్పించిన తీరు ను ఒకే పద్యం లో వర్ణించిన దాన్ని”చంద్ర బింబానన ,చంద్ర రేఖా మౌళి -నీల కుంతల ఫాల ,నీల గలుడు –ధవలాయ తెక్షణ ,ధవలాఖి లాంగుండు మదన సంజీవని మదన హరుడు -నాగేంద్ర నిభ యాన ,నాగ కుండల దారి ,భువన మోహన గాత్ర భువన కర్త ” చది వాను .ఆమె చిన్న పాప లా గా నా దగ్గరకు పరిగెత్తు కొని వచ్చి ”మేష్టారు మాస్టారు ఆ పద్యం చాలా అద్భుతం గా ఉంది .ఇదే నేను మొదటి సారి వినటం .అది నాకు కాగితం మీద రాసివ్వరా నేను నా శిష్యులకు దాన్ని నృత్య రూపం లో పెట్టి నేర్పిస్తాను ”అని కోరింది .ఆనందం గా అంగీక రించి రాసిచ్చాను .ఈమధ్య హూస్టన్ లో జరిగిన ”నాటా ”తెలుగు సభల వారు ప్రచురించిన సావనీర్ లో ఆమె తన గురువు గారిని గుర్తుకు తెచ్చు కుంటూ ,తన నృత్య ప్రస్థానాన్ని గొప్పగా ఆవిష్కరించారు .అందులోని కొన్ని ముఖ్య విషయాలు ,ఆ విదుషీ మణి సాధనను మీకు అండ జేస్తున్నాను .

రత్న పాప తన తల్లి అనసూయ గారి వల్ల కూచి పూడి నాట్య ప్రాభవాన్ని తెలుసు కొన్నారు .అందులో ప్రవేశించే సంకల్పం కలిగి దాన్ని అభయ సించి ప్రపంచానికి కూచి పూడిని పరిచయం చేసే గొప్ప అదృష్టాన్ని పొందింది .అప్పుడే ఆమె కు నట రాజ రామ కృష్ణ ,కోరాడ నరసింహా రావు ,బందా కనక లింగేశ్వర రావు లాంటి మహా ను భావాలతో పరిచయం కలిగింది .ఇదంతా ఆమె మద్రాస్ లో తల్లి గారింట ఉన్నప్పటి సంగతులు .అలానే నరసింహా చారి గారి బంధువు రామాచారి గారి తోను పరిచయం .కూచి పూడి నాట్య గురువులు వేదాంతం లక్ష్మీ నారాయణ శాస్త్రి గారిని ”తాతయ్య గారూ ”అని పిలిచేది .ఆయనే తనను మూడేళ్ళ వయసు లో ఒడి లో కూర్చో బెట్టుకొని హస్తముద్ర లను నేర్పించారట .ఆయన గానం చేసే ”వసంత స్వర వల్లరి ”ణి ఇప్పటికి మరిచి పోలేనంటారు .అనుభూతి తో పాడి కాళ్ళ వెంట ఆనాడ భాష్పాలు కార్చే వారట .అందరికి అదే అనుభూతి కలిగేది .అప్పటి నుంచే తనకు కూచి పూడి మీద అభి రుచి కలిగిందని చెప్పింది రత్న పాప .

తల్లి అనసూయా దేవి వెంపటి చిన సత్యం గారిని రత్న పాప రంగ ప్రవేశానిని నాట్యాన్ని సమ కూర్చమని కోరారట .అలానే ఆయన ఆనందం గా అంగీకా రించి కోరియాగ్రఫీ చేశారు .ఈ నాటి వరకు ఆ పాటను పూర్తిగా సాహిత్యం తో తాను తప్ప ఇంకెవరూ రంగం మీద నటించ లేదని ఆనందం గా గర్వం గా తెలియ జేశారు .దీనికి తన నాట్య గురువు సత్యం గారికి జీవితాంతం కృతజ్ఞు రాలీని అంటారు వినమ్రం గా .

1961లో హై స్కూల్ చదువు పూర్తీ అయింది .కాలేజి లో చేరటానికి కొన్న్ని నెలల వ్యవధి ఉంది .అందుకని ఈ లోగా నాట్యం నేర్చు కోవాలని కోరిక కలిగింది .తల్లి గారు వెంపటి సిన సత్యం గారి వద్ద చేర్చారు .అప్పటికే సత్యం గారు నాట్య వ్ద్యాలయం స్తాపించి కూచి పూడి నాట్యాన్ని మద్రాస్ నుండి వ్యాప్తి చేస్తున్నారు .ఆంద్ర మహిళా సభ స్తాపించిన దుర్గా బాయ్ దేశముఖ్ ,వగైరాలు సత్యం గారి కౌశలానికి ముగ్దులయారు .లజ్ చర్చ రోడ్ లో నాగేశ్వర రావు పార్క్ దగ్గర వెంపటి వారి విద్యాలయం ఉండేది .ఆంద్ర మహిళా సభ రజతోత్స వాలకు సత్యం గారిని తెలుగు లో ఒక నృత్య ప్రదర్శన ఏర్పాటు చేయించ మని అనసూయ గారికి చెప్పారు .అనసూయ గారు వెంటనే భుజంగ రాయ శర్మ గారు రాసిన ”శ్రీ కృష్ణ పారిజాతం ”నృత్య రూపకం ను ప్రదర్శిస్తే బాగుంటుందని చెప్పారు .రత్న పాప సత్యభామ గా ,రమా రమణ రుక్మిణిగా ,కుచల కుమారి కృష్ణుడిగా సుకుమారి నారడుగా పాత్రలతో సత్యం గారి ఆధ్వర్యం లో ప్రదర్శన జరిగి బ్రహ్మాండ మైన విజయం సాధించింది .దానితో రత్న పాప కు కూచి పూడి మీద ఆసక్తి విపరీతం గా పెరిగింది .

సత్యం గారు ఇంటికి వచ్చి నాట్య శిక్షణ నిచ్చే వారు .దేవుల పల్లి కృష్ణ శాస్త్రి గారి గొప్ప రచన ”కొలువైతివా రంగ సామి ”కి సత్యం గారు నృత్య రీతులు నేర్పారు ..అ తరువాత ‘విప్రనారాయణ ”నాటకం మొత్తం నేర్పారు అందులో రత్న పాప దేవ దేవి గా ,ఈ నాటి సినీ నటుడు చంద్ర మోహన్ ఆల్వార్ గా ,పద్మ విభూషణ్ డాక్టర్ మంగళం పల్లి బాల మురళీ కృష్ణ మొత్తం అందు లోని పాటలన్నీస్టేజి మీద పాడిన గాయకుడి గా దాన్ని నిర్వహించారు .ఇది రత్న పాప జీవితం లో మరపు రాణి ఘట్టం గా అభి వర్ణించారు .

రత్న పాప సోదరి సీతా రత్న కుమార్ ,మద్రాస్ దూర దర్శన కేంద్రానికి అసిస్టెంట్ డైరెక్టర్ .ఆమె ఈమెకన్న ముందే కూచి పూడి నృత్య అకాడెమి లో చేరింది .తనకంటే ముందే చాలా నృత్యాలు అభ్యసించింది .1967 లో ఆమె తో కలిసి కూచి పూడి రంగ ప్రవేశం చేశారు .1968 లో రత్న పాప కు కూచి పూడి నృత్యానికి సంగీత నాటక అకాడెమి నుండి మొదటి స్కాలర్షిప్పొందింది .దీన్ని పొందిన తోలి విద్యార్ధిరత్న పాపే .ఇదంతా మాస్టరు గారి కృపా కటాక్ష వీక్షణమే అని సంబర పడుతుంది .

మద్రాస్ లో ప్రముఖ సంగీత దర్శకుడు మాస్టర్ వేణు గారింటికి దగ్గర లో చిన్న గది లో ఉన్న ఆకాడేమి తర్వాతా పానగల్ పార్క్ దగ్గర పెద్ద ప్రాంగణం లోకి మారింది .క్రమంగా నేర్చే వారి సంఖ్య కూడా పెరిగింది .మంచి పేరు ప్రఖ్యాతులు వచ్చాయి .మాస్టర్ సత్యం గారి వద్ద వైజయంతి మాల ,రేఖా ,హి మా మాలిని ,చంద్ర కళా ,చంద్ర మోహన్ ,లక్ష్మీ విశ్వనాధన్ ,రాదా ,జ్యోతి రాఘవన్ ,క్షేమావతి ,రేఖ కజిన్స్ ప్రతిభ సుధా ( వేదాంతం రాఘవయ్య గారి కూతుళ్ళు )మొదలైన హేమా హేమీ లంతా నృత్యం నేర్చారు .సాయంత్రం పూట శిక్షణా తరగతు లు జరిగేవి .అందరికి శ్రద్ధతో విద్య నేర్పే వారు సత్యం గారు .అలసట అంటే ఏమిటో వారికి తెలీదట .కూచి పూడి గ్రామాన్ని గురించి అక్కడ నేర్పే విధానాన్ని గురించి తమతో ముచ్చటించే వారట.కూచి పూడిడి ”విశ్వ వేదిక ”కు పరిచయం చెయ్యాలి అ నేదే సత్యం గారి కల అని రత్న పాప అంటారు .దేశమంతా తన సోదరి తో కలిసి ప్రదర్శన లిచ్చింది రత్న పాప .వెంపటి చిన సత్యం గారి ట్రూప్ లో తానూ మిగిలిన కళా కారినులు కలిసి ట్రైన్ లో వివిధ పట్టణాలకు ,నగరాలకు వెళ్లి ప్రదర్శించిన అనుభవాలు మరచి పోలేనివి అంటుందామె .మజ్జిగ రసం తాగుతూ ,పులిహోర తింటూ గడిపిన రోజులు మధురాలని అన్నది .శోభానాయుడు కృష్ణుడిగా ,పద్మిని రుక్మిణిగా ,తాన సత్య భామ గా శ్రీ కృష్ణ పారిజాతాన్ని సింహాచలం లో ప్రదర్శిస్తు ఉంటె వేదిక ఒరిగి పోయినా దాన్ని అలానే కోన సాగించి అదీ దానిలో భాగమే ననే అనుభూతిని ప్రేక్షకులకు కల్గించిన సంఘటన చిర స్మరణీయం అన్నారు .అంతా అయిన తర్వాత మాస్టర్ గారు నవ్వుతు దాన్ని జ్ఞాపకం చేసుకోవటం భలేగా ఉందట .

చా లా కాలం తర్వాత్ గురువు గారి కల సాకారమైంది .గ్రీన్వే రోడ్డు లో కొత్త అకాడెమి సర్వాంగ సుందరం గా రూపు దాల్చింది .అన్ని సౌకర్యాలలతో అలరారింది .అందరి దృష్టి లో పడి దేశ విదేశీయులు వచ్చి శిక్షణ పొందటం మొదలెట్టారు అందులో మాస్టారు రాజసం గా మహా రాజు లాగా ఠీవి గా కూర్చుని తమ కందరికీ కన్నుల పండువ చేశారని సంబర పడి పోయారు రత్న పాప .అన్ని క్లాసులను సత్యం గారే నిర్వహించే వారట .విద్యార్దు లతో సంస్కృతం ,నాట్యం గురించి అధ్యయనం చేయించే వారట .సంపూర్ణ కళా స్వరూపం గా నృత్యాన్ని ప్రదర్శించాలని మాస్టారు గారి ఆకాంక్ష .ఆయనకు అభినయ దర్పణం ,నాట్య శాస్త్రం కరతలా మలకం .ఆయన లేచి నిలబడి ఒక భంగిమ ను అభినయించి చూపు తుంటే సాక్షాత్తు ఆ శివుడే దిగి వచ్చి ప్రదర్శిస్తున్నాడు అనే భావం తామందరికీ కలిగేదని ఆమె మురిసి పోయారు .అంత నిర్దుష్టం గా ఆయన శిక్షణ ఉండేది .

రత్న పాప ఒక సారి దేవుల పల్లి వారి ”క్షీర సాగర మధనం ”నృత్య రూపకం లో మోహిని గా మాస్టర్ గారు శివుని గా వేశామని అది తాను జీవితాంతం గుర్తుంచు కో దాగిన మహాద్ఘటన అని అన్నారు .ఆహార్యం తో నే సత్యం గారు నట్టువాంగం చేస్తూ అభినయిస్తూ ద్విపాత్రాభినయం చేయటం చిరస్మరణీయం అంటారు .గురువు గారితో కలిసి నటించే మహా భాగ్యం తనకు కల్గి నందుకు ఆమె పొంగి పోతున్నారు .అది ఎవరికీ లభించని మహదవకాశం .

వింజమూరి రత్న పాప అనే రత్నకుమార్ తన నాట్య విద్యా నుభావానికి ,కూచి పూడి నృత్య వ్యాప్తికి భారత ప్రభుత్వం నుండి సంగీత నాటక అకాడెమి అవార్డ్ ను పొందిన ఏకైక N.R.I.-ఇంకేవరికిఅలాంటి పురస్కారం ఇంత వరకు దక్కలేదు .ఆంధ్రులు గా ఇది మనందరికి గర్వ కారణం .

మీ -గబ్బిట దుర్గా ప్రసాద్ –12-7-12.–కాంప్–అమెరికా

Posted in అమెరికా లో | Tagged | Leave a comment

అమెరికా డైరీ –అమెరికా దీపావళి వారం –3

This slideshow requires JavaScript.

అమెరికా డైరీ అమెరికా దీపావళి వారం –1

అమెరికా డైరీ –అమెరికా దీపావళి వారం — 2 సి.యెన్.యెన్.సెంటర్

Posted in అమెరికా లో | Tagged | Leave a comment

అలెగ్జాండ్రియా గ్రంధాలయం

  అలెగ్జాండ్రియా  గ్రంధాలయం

కొందరు కొన్ని పనుల కోసం కారణ జన్ములు గా పు డతారేమో నని పిస్తుంది .వారి వల్ల నే ఆ కార్యాలు పూర్తీ అయి ,లోకో పకారకమ్ అవుతాయి .అలాంటి వారిలో Demetrius Phalerius ఒకడు .క్రీ.పూ.350-360 మధ్య ఫేలేరిం లో జన్మించాడు .తండ్రి, కానేన్ అనే వాడి బానిస .ఏధెన్స్ కు చేరాడు .అరిస్టాటిల్ ఆఫ్ స్తాజీరియ -లైసియం లో చదువు కున్నాడు .తియోఫ్రోతాస్ కు సహాధ్యాయి .317లో” దేస్పాట్ ఆఫ్ ది సిటీ ”అనే పదవిని పొందాడు .జనాభా సేకరణ ,చట్టాల రూప కల్పనా ,రాజ్యాంగ నిర్ణయాల లో సహకరించాడు .ఆనాటి వేదాంతులకు స్నేహితుడు అయాడు .అతను అందరికి తలలో నాలుక గా ఉండే వాడు .అతనికి ఎంత గొప్ప పేరు వచ్చిందో తెలియ జేయటానికి ఒక చిన్న ఉదాహరణ -దేమేత్రియాస్ విగ్రహాలను మూడు వందలు నెల కొల్పి అతని సేవలను ప్రజలు ప్రస్తు తించారు .307 b.c. లో ఇదే పేరు గల దేమోత్రేస్ పోలియార్సిస్ అనే వాడు ఇతనిని ఉద్యోగం నుంచి బర్త్ రఫ్ చేసి ,ఏథెన్స్ ను వశ పరచు కొన్నాడు .

ఏదో కాస్త కనిక రించి తేబ్స్కు వెళ్ళటానికి మాత్రం పాస్ ఇచ్చాడు .అక్కడికి చేరి గ్రీకు తొలి కవి ,అందకవి అయిన హోమర్ గురించి చది వాడు .ఎన్నో విషయాల మీద పుస్తకాలు రాశాడు .మళ్ళీ ఏధెన్స్ వెళ్ళే వీలు లేదని తెలుసు కొని ,అలెగ్జాండ్రియా చేరాడు .ఇది క్రీ.పూ.331లో నైల్ నది డెల్టా కు పడమర ఉన్న అలెగ్జాండర్ పేర వెలసిన పట్టణం .దీన్ని ర్హోడేస్ కు చెందిన”దినోకేరేస్”అనే ఆర్కిటెక్ట్ నిర్మించిన అతి సుందర నగరం .ఇందులో మాసిదోనియాన్ చార్మిస్ లను ఏర్పాటు చేశారు .గుర్రం పైన ఉన్న యోధుడి చేతి లో కాగడా ఉండటం దీని చిహ్నం .ఇందులో అయిదు జిల్లాలున్నాయి . గ్రీకు లిపి లో మొదటి అయిదు అక్షరాల పేర్లు వాటికి పెట్టాడు .దీనిని Alegjaander the king born of god founded it ” గా భావిస్తారు .

దేమ్మేత్రియాస్ టా లమి రాజ దర్బారు లో ఉద్యోగం పొందాడు .అప్పుడు ఈజిప్ట్ రాజు మొదటి టాలమి.ఇతను 307 b.c.లో పుట్టాడు .ఇతడు అలెగ్జాండర్ సైనికాధి కారుల్లో ఒకడు .ఇతనికి ”సోటర్”అంటే రక్షకుడు అని బిరుదు ఉంది .ఎనభై ఏడేళ్ళు జీవించాడు .దేమేత్రియాస్ రాజును రాజ్యం ,రాజ్య పాలన ,శిక్షా స్మృతి మొదలైన పరిపాలనా సంబంధించిన విషయాల పై పుస్తకాలను చదవమని చెప్పేవాడు .”స్నేహితులే వరు చెప్పలేనివి పుస్తకాల లో ఉంటాయి ”అని హితవు చెప్పాడు .రాజకీయ కళ(art of politics )మీద పుస్తకాన్ని ptolemy అనే పేరా తానే రాశాడు .రాజును ఒక మ్యూజియం ఏర్పాటు చేయమని కోరాడు .అది రాజ ప్రాసాదం లో భాగం గా ,ఈజిప్ట్ సంస్కృతికి విలసనం గా ,గ్రీకులకు ఇష్టమైనదిగా ,టాలమీ గౌరవ చిహ్నం గా నెలకొల్పాలని వివ రించాడు .

టాలమీ రాజు కు ఈ సూచన బాగా నచ్చింది .వెంటనే అమలు జరపటానికి పూను కొన్నాడు .దేమేత్రియాస్ సలహాలను పాటిస్తూ అత్యంత వైభవో పెత మైన గ్రంధాలయం తయారు చేయించాడు .మొత్తం బాధ్యత అంతా దేమేత్రియాస్ మీద నే పెట్టి ఆర్ధిక విషయాలు తాను చూస్తూ ,ఏ లోటూ రాకుండా వెన్నంటి నిలిచాడు రాజు .ఇద్దరి సుందర స్వప్నం సాకారం అయింది .letter from Aristotle to Philocrates వరకు అంటే 2 b.c.వరకు అన్ని పుస్తకాలను సేకరించాడు .దీని నిర్వహణకు దేమేత్రియాస్ ఫిలోక్రేతెస్ అది కారి గా రాజు నియమించి తగిన గౌరవాన్ని కల్పించాడు .దీనినే రాజ గ్రంధాలయం (king’s library )అన్నారు .రాజసం లోను ఆకారం లోను అది నిజం గా కింగ్ అని పించుకోన్నది .పుస్తకాలు కోన టానికి ఎంత డబ్బు కావాల్సి వస్తే అంతా ఇచ్చే వాడు రాజు .ఎక్కడా లేని పుస్తకాలు ఈ గ్రంధాలయ రాజం లో ఉండాలన్న తపన .”if possible all books in the world ”అలెగ్జాండ్రియా గ్రంధాలయం లో ప్రపంచం లోని అన్ని గ్రంధాలు ఉండాలని రాజు గారి భావం .అప్పటికే అయిదు లక్షల పుస్తకాలను సేకరించాడు దేమేత్రియాస్ .పుస్తకాలకు ప్రతులు రాయటానికి ఎన్నో టెక్నిక్ లను అతడు వాడాడు .రాజు టా లమి కి యూదులు అంటే జూస్ తో సత్సంబందాలున్దేవి. ఆ మత గురువు లతో సంప్రదించి అనువాదకులను పంపించే ఏర్పాటు చేయించాడు .72 మంది వచ్చి ,72రోజులు పని చేసి జ్యూ ల మత గ్రంధం torah లో genesis నుండి malachu వరకు అనువాదం చేశారు .వారందరికి వసతి భోజన సౌకర్యాలు కల్పించారు .వాటిని పాపిరాస్ పై కాపీలు గా రాయించారు .వారందరికి విలువైన బహు మతులిచ్చి సగౌరవం గా వీడ్కోలు చెప్పారు .దీని పర్య వేక్షణ అంతా దేమేత్రియాస్ డే .దీనినే the cage of the muses ” అన్నాడాయన .ఇతర దేశాస్తులేవరైనా అలెగ్జాండ్రియ వస్తే వాళ్ళ దగ్గరున్న పుస్తకాలను అప్పగించి ,వాటి నకలు రాసుకొన్న తరు వాతే తీసుకొని వెల్ల నిచ్చే వారు .అలా అనంత అక్షర సంపద అక్కడ నిక్షిప్తమయింది .సరస్వతీ మహా సామ్రాజ్యానికి తాలమి మహా రాజు అయితే దేమేత్రియాస్ ప్రధాని .

ప్రాచ్య దేశాలలో గ్రంధాలన్నీ దేవాలయాలలో ఉండేవని మనకు తెలిసిన విషయమే .అందుకనే వీరు ఇక్కడ దీన్ని ”గ్రంధాలయం ”అన్నారు గౌరవ సూచకం గా (place of learning -a temple ).అలెగ్జాండ్రియా గ్రంధాలయానికి మొదటి డైరెక్టర్ దేమేత్రియాస్ కాదు .zinodotus of Ephesus -(325-260 b.c.)ఈయన హోమర్ ,హీసాయిడ్ గ్రంధాలను ఎడిట్ చేయించాడు .ఇతనే హోమర్ గ్రంధాన్ని ఇరవై నలుగు విభాగాలుగా చేశాడు .అందులో life of homer ఒక భాగం .హోమేర్ గురించి సమస్త వివరాలు ఇందులో ఉన్నాయి .

తరువాత అపోలోనియాస్ జోడియాస్ (295 B.C.)అధికారిగా ఉన్నాడు .హోమర్ కవి గ్రంధాల లోని వ్యాకరణ దోషాలను పరిష్కరింప జేశాడు మూడవ .తాలమీకి గురువు అయినా ,రాజు ఇతన్ని తప్పించి , ERESTHONES( 276-195 B.C.( కు బాధ్యతలు అప్పగించాడు . ఇతను సైన్స్ ఫిలాసఫీ చదివిన వాడు .భూమి పరిధి 2,52 ,000 STAADRIYA లేక 29,000 మైళ్ళు అని చెప్పాడు .ఇవాల్టి లెక్క ప్రకారం 24,900మైళ్ళు .

ఈతనితర్వాత CALIMACHUS(310-240)ముఖ్య గ్రందాలయాది కారి అయాడు .THE LEXICAN OF SUDA ”ను 800 పాపిరాస్ రోల్స్ పై రాయించాడు .BIBLIOGRAPHIC STUDY మీద బాగా కృషి చేసిన విద్యా వంతుడు .120 పుస్తకాలలో THE LIST OF PERSONS EMINENT IN EVERY BRANCH OF LEARNING TO GETHER WITH A TEXT OF WRITERS ”అనే బృహత్ ప్రణాళికను పూర్తీ చేసి ఎంతో విలువైన సమాచారాన్ని పొందు పరచిన ఘనుడీయన .ఇతని తర్వాతా ARISTOPHANES OF BYJANTINE డైరెక్టర్ అయాడు .

ఇంత మంది మహాను భావులు కంటికి రెప్ప లాగా కాపాడి నిర్మించి ,పెంచి పెద్దది గా చేసిన సర్వ మాన వాలికీ ఉపయోగ కారక మైన ఈ బృహత్ గ్రంధాలయం 48 B.C.లో ఈజిప్షియన్ దండ యాత్ర లో తగలబడి ధ్వంసమయింది . .సుమారు నలభై వేల అత్యంత విలువైన గ్రంధాలు మండి మసి అయాయి . సేనేకా అనే మహా వేదాంతి నీరో చక్ర వర్తి గురువు ఈ విషయాన్ని ధ్రువ పరచాడు .

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –11-7-12.–కాంప్-అమెరికా

Posted in రచనలు | Tagged | Leave a comment

అలెగ్జాండర్ కాలం లో పర్షియా సమాజం

Gabbita Durga Prasad
Rtd. head Master

                                      అలెగ్జాండర్ కాలం లో పర్షియా సమాజం

300b.c.నాటికి పర్షియా రాజ్యం ప్రపంచం లోనే అతి పెద్ద రాజ్యం గా ఉంది .ఇవాల్టి మధ్య ఇరానే ఆనాటి పర్షియా .భారత దేశం వరకు వ్యాపించింది .పడమర మధ్య ధరా సముద్రం ,ఉత్తరాన నేటి తార్కి ,దక్షిణాన ఈజిప్ట్ ,లిబియా ల మధ్య విస్తా రించిన సువిశాల సామ్రాజ్యం పర్షియా సామ్రాజ్యం .డెబ్భై దేశాలను జయించి జయ పతాకాన్ని ఎగుర వేసిన రాజ్యం .మేదిస్ ,పార్దియన్లు ,బాక్త్రియన్లు ,బాబి లోనియన్లు ,అసీరియన్లు ,ఈజిప్షియన్లు ఉన్న రాజ్యం .వీరివి వివిధ భాషలు .ఆరోమిక్ ,మీడియన్ ,పాత పర్షియా భాషలను ఎక్కువ మంది ప్రజలు మాట్లాడే వారు .

అనేక ముఖ్య పట్నాలను కలిపే 2,400కి.మీ .”రాయల్ రోడ్ ”తూర్పు పడమర లకు వ్యాపించి ఉంది .ఈ రాజ్యానికి పెర్సి ఆలిస్ ,సుసా ,ఆర్ష గాదే ,అనే మూడు రాజ దానులున్డటం విశేషం .పర్షియా రాజును ”గ్రేట్ కింగ్ ఆఫ్ పర్షియా ”అని గౌరవం గా పిలుస్తారు .రాజరికం వంశ పారంపర్యం .పెద్దల యెడ గౌరవం ఎక్కువ .రాజుకు వంగి వంగి సలాం చేయటం ఆచారం .అందరు రాజు ముందు వంగి నిలబడాల్సిందే .ఆస్థానం లోని వారిని ,సంమానితులను రాజు ముద్దు పెట్టు కొనే సంప్రదాయం ఉంది .

స్థానిక పాలకులను సాత్రపులు అంటారు అంటే గవర్నర్లు .సత్రపి అనే నిర్ణీత భూభాగానికి అతను అది పతి .రాజు తరఫున పాలిస్తాడు .రాజు వీరి పరిపాలనా సామర్ధ్యాన్ని తెలుసు కోవటానికి చార చక్షువులను ఏర్పాటు చేస్తాడు .వీరే రాజు కు కళ్ళు ,చెవులు .మంచి న్యాయ వ్యవస్థ ఉండేది .దీన్ని సైరస్ రాజు ఏర్పాటు చేశాడు .”he would allow his subjects to continue to following their own faiths and other traditional practices”అని చరిత్ర కారులు రాశారు .అంతే కాదు దీనినే ”official charter of human rights”అని గొప్పగా కీర్తించారు .అంత ఉదార హృదయం తో రాజ్య పాలన సాగేది .

పర్షియన్లు pantheon అనే సామూహిక దేవత లను పూజిస్తారు .సముద్రం ,భూమి ,గాలి ,ఆకాశం వాళ్లకు ఆరాధ్య దేవతలు .achemendis కాలం లో జోరాష్ట్రియాన్ మతాన్ని అవలంబించారు .ఇప్పుడు జోరాష్ట్రియాన్ ఒక్కడే దేవుడు .సర్వ సమర్ధుడు ,సర్వ వ్యాపకుడు ,సర్వ శక్తి మంతుడు ”ఆహూరా మజ్దా ”అని ఆయన బోధించాడు .అగ్ని ని పూజిస్తారు .రాజు తాను దేవతల ప్రభావం తో పాలిస్తున్నానని నమ్ముతాడు .అంటే రాజు దైవాంశ సంభూతుడు అన్న మాట .వీళ్ళ మత గ్రంధం జెండ్ అవెస్తా .

ప్రజలు రెండు అంతస్తుల ఇళ్ళ లో నివ సహించే వారు .కాల్చని ఇటుక లతో ఇల్లు కట్టే వారు .దానికి తెల్ల సున్నం పూసే వారు .లోపల రంగులు వేసుకొనే వారు .ఎత్తైన ప్రహరీ గోడ ఉండటం సహజం .ఇంటికి తోట కూడా ముఖ్యం .గులాబి ,నిమ్మ చెట్లను పెంచే వారు .నీటిని చిమ్మే ఫౌంటెన్స్ ఉండేవి .సాధారణ భోజనమే చేసే వారు .బార్లి ,గోధుమ ,లింతెల్స్ ,బీన్స్ ,వీరి ఆహారం .వెన్న ,పెరుగు తినే వారు .మేక మాంసం ,చేపలు తినే వారు .కాయగూరలను బాగా పండించే వారు .ఖర్జూర,పియర్స్ పళ్ళు లభ్యం .వైన్సేవించే వారు .ఇది ఖర్జూరం తో చేస్తే మహా ప్రశస్తమైనది గా భావించే వారు .

మంచి కుటుంబ వ్యవస్థ ఉండేది .బహు భార్యాత్వం మామూలే .పిల్లల్ని ఎక్కువ గా కనే వారు .మగ పిల్ల లంటే ముద్దు .ఆడవారికి స్వాతంత్రం ఉంది .ఉద్యోగాలు చేసే వారు .ఉన్నత ఉద్యోగాల్లోనూ మహిళలు రాణించే వారు .ఆడ పిల్లలు బడి కి వెళ్లటం తక్కువే .ఇంటి పనులు నేర్చే వారు .వ్యాపార వాణిజ్యాలు ఈ దేశం లో ఎక్కువే .సరకు రవాణా జాస్తి .మంచి రహదారి సౌకర్యం ఉండటం తో సరుకు త్వరగా చేరేది .వ్యవసాయం చేయటం ,చిన్నా ,చితకా పనులు చేయటం బానిసల పనే .రోడ్ల నిర్మాణం భవనాల నిర్మాణం వీరే చేస్తారు .

పర్షియా లో achaemends కాలం లో కళలు బాగా అభి వృద్ధి చెందాయి .అసలు ఆయనే ఒక గొప్ప కళా కారుడు .పెర్సిపోలిస్ నగరాన్ని అత్యంత సుందరం గా ,సకల సౌకర్యాలతో వైభవో పేతం గా నిర్మించాడు .ఇదే మొదటి డేరియన్ రాజు గారి రాజధాని .బలీయ మైన సామ్రాజ్యం గా పర్షియా ఉండేది .శత్రు దుర్భేద్య మైన కోటలున్దేవి .సమర్ధ వంత మైన రాజుల పాలన ,సుస్తిర రాజ్య వ్యవస్థ దానికి బాగా కలిసి వచ్చాయి రాజ్యం సకల సౌభాగ్య విలసితం గా ఉండేది .ప్రజలు కూడా భోగ భాగ్యాలతో సుఖం గా ఉండే వారు .ఆర్ధిక స్తితి అద్భుతం .

అయితే రోజులేప్పుడు ఒకే రీతి గా ఉండవు కదా .385b.c.నాటికి అస్తిరత్వం ఎక్కువైంది .మూడవ ఆటా xerxes తన కుటుంబం లోని తనకు శత్రువు లని పించిన బంధువు లందర్నీ చంపి రాజు అయ్యాడు .రక్తపు కూడు తిన్నాడు .అతని ఇరవై ఏళ్ళ పాలన అంతా ఒడి దుడుకులే .326 b.c.లో మూడవ డేరియస్ మాయో పాయాలతో రాజయ్యాడు .issus వద్ద జరిగిన యుద్ధం లో అలెగ్జాందర చేతిలో ఒడి పోయి మధ్య పర్షియా చేరాడు .మళ్ళీ సైన్యాన్ని సమ కూర్చుకొని 331లో బాబిలాన్ కూడా వదిలి వెళ్లి పోయాడు .అలెగ్జాండర్ ముందుగా కొంత సేనను పంపి ,యూఫ్రాస్ నదికి వంతెన కట్టించి ,మెస పోతెమియా అంటే ఇవాల్టి సిరియా ,ఇరాక్ ల మీదుగా ఇక్కడికి వచ్చి టైగ్రెస్ నది దాటి వెళ్లాడు .ఇక్కడే మానవ నివాసం 7000 b.c.కే ఉండేదని చరిత్ర కారుల కధనం .దీనినే” cradle of civilization ”అంటారు .

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –10-7-12.–కాంప్–అమెరికా

 

Posted in రచనలు | Tagged | Leave a comment

అమెరికా డైరీ –అమెరికా దీపావళి వారం — 2 సి.యెన్.యెన్.సెంటర్

         అమెరికా డైరీ –అమెరికా దీపావళి వారం –2
                                                                             సి.యెన్.యెన్.సెంటర్

        రెండో రోజు -జూలై ఏడవ తేది -శని వారం -ఉదయమే హాలిడే ఇన్ లో వాళ్ళు ఏర్పాటు చేసిన కాఫీ కలుపుకొని తాగి కారు ఎక్కి ,డౌన్ టౌన్ లోని సి.యెన్.యెన్.సెంటర్ కు చేరాం .అక్కడున్న హోటల్ లో బ్రెడ్ తిని కాఫీ తాగి లైన్ లో చేరాం .ముందుగా పై అంతస్తు లోకితీసుకొని వెళ్లారు .అక్కడ వార్తలను ప్రసారం చేసే విధానం చూపించారు .వాతా వరణ వివ రాలు ఎలా ప్రసారం చేస్తారో వెదర్ చార్ట్ ఎలా ఉంటుందో బ్రేక్ న్యూస్ ఎలా ప్రసారం చేస్తారో ,రంగులు ఎలా మారతాయో ఒక అమ్మాయి బాగా వివ రించి చెప్పింది .అక్కడ ఉన్న సీట్ లో ఎవ రైనా కూర్చుని వార్త లను చదవ మంది .మా మనవడు శ్రీ కెత్ వెంటనే వెళ్లి కూర్చుని ఎదురు గ ఉన్న స్క్రీన్ చూస్తూ వార్తలు చదివాడు .అందరం చప్పట్లు కొట్టాం .అక్కడి నుండి మెట్ల మీదు గా కిందికి దిగి అసలు వార్తా ప్రసారం లైవ్ గా ఎలా జరుగు తుందో చూపించారు .అనుమానాలుంటే అడగమన్నారు .అడిగిన వాళ్ళ డౌట్స్ క్లియర్ చేశారు .ఆ అమ్మాయి చాలా చలాకీ గా ఉండిఅందర్నీ ఉత్సాహ పరిచింది .అక్కడి నుండి ,ఇంకా కిందికి దిగి ఇంకో చేంబర్ లో జరిగే ప్రసారాలను చూశాం .ఇట్లా ఎనిమిది స్టెప్పులు దిగి చూడాలి .మాకు పరవా లేదు కాని ప్రభావతి ఇంకా మెట్లు దిగ లేనంది .వీల్ చైర్ సౌకర్యం మధ్యాహ్నం మాత్రమె ఉందని చెప్పింది .ఈ విషయం ముందే చెప్పాలి అని కసిరాం .చెప్పాం మీరు విని పించు కోలేదేమో అన్నారు సెక్యురిటి వాళ్ళు .లిఫ్ట్ మీదు గా కిందికి దింపితే వచ్చేశాం .పిల్లలకు పెద్ద గా హు షారు గా లేదు .

                                     ఆక్వేరియం

దగ్గరలోని జార్జియా ఆక్వేరియం లోకి వెళ్ళాం .ఇక్కడ వీల్ చైర్ స్సౌకర్యం ఉంది .ఉప యోగించు కొన్నాం .ఫ్రీ .విజ్జే వీల్ చైర్ తేవటం ఇవ్వటం ,వాళ్ళమ్మ ను తోయ్యటం అంతా తానే చేసింది .నేను విగ్రహం పుష్టి గా పక్కన ఉన్నానంతే .నదుల్లోని చేపలు ,కాలి ఫోర్నియా లోని కోల్డ్ ఫిష్ ,నక్షత్ర చేపలు అనేక రకాలు చూశాం .ఆ తర్వాతఒక ఆడి టోరియం లో ”డాల్ఫిన్”ప్రదర్శన ఏర్పాటు చేశారు .అరగంట కు పైగా కార్య క్రమం .మధ్యాహ్నం ఒకటిన్నర నుండి రెండు వరకు .తెర ముందు చిన్న సరస్సు .దాని లో డాల్ఫిన్లు .వాటిని ఆడించే ఆడ ,మగా కుర్రాళ్ళు .పైన కామెంట్ చెప్పే వాడు .డాల్ఫిన్లు ఆకాశం లో నక్షత్రాల నుంచి వచ్చాయని నమ్మకం . .నక్షత్ర సముదాయం డాల్ఫిన్ ఆకారం గా ఉండటం తెర మీద చూపించారు .అనేక రకాలైన ఫీట్స్ ను డాల్ఫిన్ల తో చేయించారు .వాటి మీద స్వారి చేశారు .వాటి తో ముందుకు తోయిన్చుకొన్నారు .సౌండ్ ను బట్టి వాటిని డాన్స్ చేయించారు .ఒక్క సారిగా అవి నీటి లోంచి ఆరడుగుల ఎత్తు యెగిరి నీటి లోకి దూకటం బలే సరదా గా ఉంటుంది .బాక్ స్విమ్మింగ్ చేశారు ,చేయిస్తారు .పాముల్లా మెలికలు తిరిగి ఆడుతాయి .ఎంతో తర్ఫీదు నిచ్చి ఇలా చేయించటం అబ్బురం గా ఉంది .నుంచొని నడిచి వింత అని పిస్తాయి ..మళ్ళీ డాల్ఫిన్లు నక్షత్ర మండలానికి వెళ్ళే కోరిక ఉందని తెలియ జెప్పుతూ షో ముగిస్తారు .చప్పట్లే చప్పట్లు .హాలంతా అదిరి పోతుంది .సౌండ్ ఎఫెక్ట్ బాగా ఉంటుంది .పిల్లలంతా మహా వేడుకగా ఎంజాయ్ చేశారు . తర్వాతఅక్కడే ఉన్న రెస్టా రెంట్ లో పీజా కొద్దిగా తిని కాఫీ తాగాం .ఇక్కడ వాటర్ బాటిల్ ఖరీదు మూడు డాలర్లు .అదే బయట మూడు డాలర్లు పెడితే ఇరవై బాటిల్స్ ఉన్న కేసు వస్తుంది .అంత రేట్లు .అయినా జనం తండోప తండాలుగా వచ్చి పడుతున్నారు నిర్విరామంగా .ఆ తర్వాత 4d ధియేటర్ లో ఒక షో చూశాం .ఇది మూడున్నరకు మొదలై నాలుగు వరకు ఉంటుంది .కళ్ళకు వేరే రకమైన కళ్ళ జోడు ఇస్తారు .వాటి తోనే చూడాలి .అప్పుడే ఎఫెక్ట్ బాగా ఉంటుంది .లేక పోతే కళ్ళకు ప్రమాదం .ఏదో చిన్న డాక్యుమెంటరి లాంటి యాని        మేషన్ సినిమా అది .నీళ్ళు మీద పడ్డాయి సౌండ్ కు టపాకాయలు పేలినట్లు అందులో కాలి మిగిలినవి మన మీద పడ్డట్లు చేస్తారు .పిల్లలకు అతి ఇష్టం గా ఉంటుంది .

                       జంతు ప్రదర్శన శాల (-జూ)

నెమ్మదిగా బయట పడి డ్రై చేసుకొంటూ జూకు చేరేసరికి అయిడుమ్బావు .ఆరున్నరకు మూసేస్తారు .వీల్ చైర్ పది డాలర్లకు తీసుకొని వాళ్ళ అమ్మను కూర్చో పెట్టుకొని మా అమ్మాయి తోసుకుంటూ తీసుకొని వెళ్ళింది .నేను పక్కన ఉత్స విగ్రహమే .పిల్లలు వాళ్ళ నాన్న తో వెళ్లారు లోపలి .ముందుగా ఏనుగులు రెండు కనీ పించాయి .బాగా నీర సంగా ,తోస్తే పడి పోఎట్లున్నాయి .తర్వాతా చిరుత పులులు హుషారుగా కనీ పించాయి .రంగుల పిచ్చుకల లాంటివి ఉన్నాయి .పెద్ద తాబేళ్ళు మందు కొట్టిన వాటి లాగా పడుకొని ఉన్నాయి .ఎలుగు బంట్ల వంటివి ఉన్నాయి .వెదురు గడ తింటూ అందులో ఒకటి ముచ్చట గా ఉంది .సహజా రాణ్యంలా ఉంచారు భద్రత బానే ఉంది .ఫ్లెమింగో పక్షులు నీటి దొరువుల వద్ద మందలు మందలు గా ఉన్నాయి .మన కొంగల్లా ఉంటాయి .ఎరుపు రంగు శరీరం .పిల్లలు ఎక్కి తిరిగే చిన్న రైలు ఉంది .అది పదినిమిషాల్లో సారి అంతటిని తిప్పి చూపిస్తుంది .అందరం ఎక్కి తిరిగాం .మధ్య లో గుహల గుండా రైలు పోతుంది .ఇదో అనుభూతి .దీని దగ్గరే ”ఉయ్యూరు వీరమ్మ తిరునాళ్ళు ”లో ఉన్నట్లు రంగుల రాట్నం ఉంది .అన్నీ జంతువులూ ,పక్షుల ఆకారాలతో .అందరం ఎక్కి సరదా గా తిరిగాం .వేగం లేదు .నెమ్మదిగా నే తిరిగింది .ముసలి వాళ్లకు సోఫా లాగా కూర్చునే సీటు ఉంది .ప్రభ దానిలో కూర్చుంది .అంతా అయిన తర్వాతాపిల్లలు ,పెద్దలు ఎంజాయ్ చేయటానికి” రాక్ క్లైమ్బింగ్”ఉంది .సీటు బెల్టు లతో కట్టి ,పైన ఉన్న తాడును పట్టు కొని ,ప్రక్కల ఉండే ఆధారాలతో పైకి ఎక్కాలి .ఒక ఇరవై అడుగుల ఎత్తు ఉంటుంది .ఒకే సారి ఇద్దరు రెండు వేరు వేరు సీట్లలో కూర్చుని ఎక్క వచ్చు .మా మనవళ్ళు ఆశుతోష్ ,పీయూష్ లు దానితో ప్రయత్నం చేశారు .ఆఖరి వాడైన పీయూష్ సగం దాకా ఎక్కి కిందికి దిగాడు .వాడి పైవాడు ఆశుతోష్ మాత్రం పైదా కా వెళ్లి అందర్నీ ఆశ్చర్య పడేట్లు చేశాడు చీర్స్ చెప్పాం మేమందరం .నేను వంద రూపాయలు గిఫ్ట్ గా ఇస్తానని వాడికి చెప్పాను .”తాత గారూ వంద ”అంటూ హోటల్ కు చేరే దాకా అంటూనే ఉన్నాడు .సరాసరి ఇండియన్ మాల్స్ ఉన్న చోటికి వెళ్ళాం .అక్కడ చెరియన్ అనే షాప్ లో బియ్యం సరుకులు మా వాళ్ళు కొనుక్కున్నారు .శార్లేట్ కంటే చాలా చవక .కూరలు కూడా తాజాగా చౌకగా ఉంటాయి .అక్కడి నుంచి ”వుడ్ లాండ్స్ మైసూరు విలాస్ ”కు వెళ్లి ,మేమిద్దరం మషాల అట్టు ,తిని మాంగో లస్సీ త్రాగాం.బానే ఉన్నాయి .పిల్లలు, వాళ్ళు వాళ్ళ కిష్టమైనవి తిన్నారు .రూం కు చేరే సరికి రాత్రి పది అయింది .హాయిగా నిద్ర పోయాం .

                                      శ్రీ స్వామి నారాయణ దేవాలయం

జూలై ఎనిమది ఆదివారం -మూడో రోజు –హాలిడే ఇన్ ఖాళీ చేసి కార్ లో బయల్దేరి మధ్యలో స్టార్ బక్స్”లో డోనట్ తిని కాఫీ త్రాగాం .అక్కడి నుండి సుమారు ముప్పావు గంటల ప్రయాణం చేసి ”శ్రీ స్వామి నారాయణ దేవాలయానికి చేరాం . ఫ్రీ గా ఇచ్చిన వీల్ చైర్ లో ప్రభావతి ని కూర్చో పెట్టి నేను పక్కనన ఉండగా విజ్జి తోస్తూ లిఫ్ట్ ఎక్కి దేవాలయానికి చేరాం .చాలా విశాల మైన ప్రాంగణం లో చాలా ఎత్తు లో ఉన్న దేవాలయం స్వామి నారాయణ టెంపుల్ .అంతా పాల రాతి తో చేసిందే .విగ్రహాలు చాలా అందం గా ముచ్చటగా ,అలంకారాలతో ఆకర్షణీయం గా ఉంటాయి .రాదా కృష్ణుల విగ్రహం స్వామి నారాయణ విగ్రహం ఆయన పరంపరకు చెందినా అయిదుగురు శిష్యుల విగ్రహాలు అబ్బుర పరుస్తాయి .ఆలయం లోపలి డోమ్ మీద లతలు పూలు దశావతారాలు ,అతి సూక్ష్మమైన నగిషీ పనితో మానసాహ్లాదాన్ని ,ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి .గుజరాత్ నుండి రాజస్తాన్ నుండి మార్బుల్ తెప్పించి ,ఇక్కడే చెక్కించి నిర్మించారట .2007లో ఆలయం పూర్తీ అయి దర్శనార్ధం వదిలారు .శివుడు పార్వతి ,శ్రీ రామ మారుతి విగ్రహాలు కూడా ఉన్నాయి .ఇక్కడి శిల్ప విన్యాసం చూసి ఆనందించాల్సిందే కాని మాటలతో చెప్ప లేము .లోపల ఫోటోలు తీయటం నిషేధం .వారి బ్రోచర్ తీసుకొని అందులోని వాటిని ఫోటోలు తీశాను .అవి మేము పెట్టి నప్పుడు చూసి ఆనందించండి . ఇక్కడ నిశ్శబ్దం రాజ్యమేలుతుంది .

కింద ఫోటోలు పుస్తకాలు అమ్మే షాప్ ఉంది .అక్కడ కైలాసం లో శివ పార్వతులున్నట్లు శివుని జటా జూటం మీద నుండి గంగా జలం పడుతూ ఆవు ముఖం నుండి బయటకు వస్తు శివ లింగానికి అభి షేకం చేస్తున్నట్లు ఉన్న బొమ్మ ముచ్చటగా ఉంటె మా అమ్మాయి యాభై అయిదు డాలర్లు పెట్టి కొన్నది ఆ నీరు నిరంతరం అలా పడుతూనే వుంటుంది. రిసైకిల్ చెందు తుంటాయి ,మొదట్లో నాలుగు గ్లాసుల నీరు పోస్తే చాలు .పదకొండేళ్ళ క్రితం మా రెండో అబ్బాయి శర్మ ఫామిలి గుజరాత్ లోని అహ్మదా బాద్ లో ఉన్నప్పుడు అక్కడికి వెళ్లి అహ్మదా బాద్ లోని స్వామి నారాయన దేవాలయం ,అక్షరధాం లను చూశాం .అది మూడు గంటల కార్య క్రమం .ఆయన తపస్సు చేసిన ప్రదేశాలన్నీ సహజ వాతా వరణం లో గుహలు గా నిర్మించి చూపించారు .తర్వాత ఆయన జీవితం పై సినిమా ,,మ్యూజిక్ ఫౌంటెన్ అన్నీ ఆశ్చర్య పరుస్తాయి .ఇక్కడ అంత ఎర్పాటు ఏమీ లేదు .తరువాత ఉంటాయేమో తెలీదు .అప్పుడే మేము ద్వారకకు, సోమనాధ దేవాలయానికి వెళ్లి వచ్చాము. అది దసరా కనుక దండీ నృత్యాలను ,ఆరుబయటి సినెమా థియేటర్లో ”లగాన్”సినిమా ను చూశాం .

దేవాలయ సందర్శనం తర్వాతా దానికి సంబంధించిన హోటల్ లో డబ్బులిచ్చి భోజనం చేశాం .పెద్ద గా సహించ లేదు .మధ్యాహ్నం మూడింటికి బయల్దేరి మధ్య మధ్య ఆగుతూ రాత్రి ఏడున్నరకు శార్లేట్ చేరి మన అన్నం తిని హాయిగా నిద్ర పోయాం .

ఇప్పుడు ఈ దేవాలయానికి సంబంధించిన ముఖ్య విషయాలు -1781 లో స్వామి నారాయణ ఉత్తర భారత దేశం లో జన్మించారు .దీన జనుల విముక్తి కోసం సాంఘిక ,ఆధ్యాత్మిక తిరుగు బాటు చేశారు .స్వామి నారాయణ సంప్రదాయం ఏర్పాటు చేశారు .మూధాచారాలను తిరస్కరించారు అహింసా మార్గమే ఆయన ఆదర్శం .3000 మంది సాధకులను తయారు చేసి ప్రచారాన్ని ఉధృతం చేశారు .అందుకని ఆయననే ”భగవాన్ ”అని పిలుస్తారు .నైతిక ఆధ్యాత్మిక ఉన్నతికి ఆయన మార్గ దర్శనం చేశారు .ఆయన మరణించినా ,సాధకులకు ఆయన ఎప్పుడు అందు బాటు లోనే ఉంటారని నమ్మకం .

వీరి మొదటి శిష్యులు ,వీరి తర్వాత ఆశ్రమ నిర్వాహకులు శ్రీ గుణాతీతా నంద స్వామి .”అక్షర పరబ్రహ్మ ”గా సాధక నామం .ఈయనే ఘనశ్యాం మహారాజ్ .స్వామి నారాయణ అవతారమే ఈయన .పద కొండు ఏళ్లకే సన్య సించి ఏడేళ్ళు దేశం లోని సర్వ క్షేత్ర సందర్శాన్ని కాలి నడకన చెప్పులు లేకుండాఒంటరిగా తిరిగి గుజరాత్ లో యాత్రను విరమించారు .అక్కడే ”అక్షర ధామం ”నెల కోల్పారు .అనేక మందిరాలను దేశమంతా నెల కొల్పిన మహా ను భావులాయన .

రెండవ శిష్యుడు ,ఉత్తరాది కారి భగవతి మహా రాజ . .మూడవ శిష్యులు అధికారి శాస్త్రీజీ మహారాజ్ .మంచి వక్త .”అక్షర పురుషోత్తమ భావవ్యాప్తి ”చేశారు .1907 లో Bachasanvasi sree akshara purushottama svaami naaraayana samstha ”(B.A.P.S )ను ఏర్పరచారు

. .నాల్గవ శిష్యుడు అధికారి యోగీజి మహా రాజ .ఇంగ్లాండ్ ,అమెరికా ఆఫ్రికా లను సందర్శించి స్వామి నారాయణ బోధ లను వ్యాప్తి చేశారు .

అయిదవ వారు ఉత్తరాధికారి ప్రముఖ స్వామి మహారాజ్ .2007 ఆగస్ట్ ఇరవై ఆరున ఆశ్రమ నిర్వహణ బాధ్యతలను స్వీకరించారు .వీరి ఆధ్వర్యం లో ప్రపంచ మంతా3,300 కేంద్రాలు ఏర్పడ్డాయి .మతం కులం భాషా జాతి ,వయసు లకు అతీతం గా సంస్థలను తీర్చి దిద్దారు .వీరినే హరికృష్ణ మహా రాజ అంటారు .ఇది వారి చిన్నప్పటి నామ దేయం .

దేవాలయం లో రాదా కృష్ణ విగ్రహాల ప్రక్కన స్వామి నారాయణుల పంచ లోహ విగ్రహం ఉంది .

ఏమైనా, మానసిక ప్రశాంతి నిచ్చింది ఈ మూడు రోజుల్లో స్వామి నారాయణ సందర్శనమే .అట్లాంటాకు గర్వ కారణం ఈ అక్షర ధామం.

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –10-7-12.–కాంప్–అమెరికా
https://sarasabharati.wordpress.com
http://suvarchalaanjaneyaswami.wordpress.com

Posted in అమెరికా లో | Tagged | Leave a comment

అమెరికా డైరీ అమెరికా దీపావళి వారం –1

            అమెరికా డైరీ

                                            అమెరికా దీపావళి వారం –1

గడచిన వారం అంటే జూలై రెండు సోమ వారం నుండి ఎనిమిది ఆదివారం వరకు విశేషాలు-గురుపౌర్ణమి ,అమెరికా స్వాతంత్ర దినోత్సవం ,మా అట్లాంటా ప్రయాణం’.మేము అమెరికా వచ్చి మూడు నెలలయింది .

                                                    గురు పూర్ణిమ

జూలై మూడవ తేది మంగళ వారం పౌర్ణమి రోజు ను వ్యాస పౌర్ణమిగా ,గురు పూర్ణిమ గా జరుపు కోవటం ఆన వాయితీ .ఆ రోజే షిర్డీ లో కూడా సాయి బాబా జయంతిని వైభవం గా చేస్తారు .ఇక్కడి డాక్టర్ మహేష్ డాక్టర్ గౌరీ దంపతులు వాళ్ళ స్వంత ఇంట్లో గురు పూర్ణిమ మహోత్సవానికి ఆహ్వానించారు .దాదాపు యాభై మంది హాజరై నారు .రాత్రి ఏడు గంటల నుండి ఏడున్నర వరకు స్తోత్రాలు ,గణేశ ఉపనిషత్తు ,నమక చమకాలు పథనం చేశారు .మా అల్లుడు అవధాని నమక చమకాలు చదివాడు .ఆ తర్వాత గంట సేపు అంటే ఎనిమిదిన్నర వరకు భజన కార్య క్రమం నిర్వ హించారు .మా అమ్మాయి విజ్జి రెండు భజనలు ,మా పెద్ద మనవడు శ్రీ కెత్ రెండు భజనలు గానం చేశారు .ఆ తర్వాతఅందరికి విందు .ఇడ్లీ ,గారే ,గులాబ్ జాం ,రెండు చట్నీలు చపాతీ ,రెండు కూరలు ,సాంబారు ,పులి హోర ,సాంబార్ ,పెరుగన్నం తో రుచి కరమైన భోజనం ఏర్పాటు చేశారు .డాక్టర్ గౌరీ ఆడవాల్లందరికి బొట్టు పెట్టి జాకెట్ ,పసుపు కుంకుమ ,వెండి పూత పూసిన పళ్ళెం ,పళ్ళు ఇచ్చ్చారు . మేమిద్దరం మొదటి సారిగా వాళ్ళింటికి వచ్చి నందుకు డాక్టర్ సర్వేష్ సంతోషం ప్రకటించారు .ఆయన ఈ రీజియన్ సాయి సంఘానికి ప్రెసిడెంట్ . ఎన్నో వైద్య కార్య క్రమాలను భార్యా భర్తా నిర్వహిస్తూ సమాజ సేవ చేస్తున్నారు .మేము వచ్చిన్ద దగ్గర్నుంచి పరిచయం . వాళ్ళ ఇంటి పేరు ”సత్తి రాజు ”,బాపూ గారి ఇంటి పేరే .అయితే బాపు తో పరిచయం లేదని నాకు మొదటి సరి పరిచయమైనప్పుడే చెప్పారు .

                                                                 అమెరికా స్వాతంత్ర దినోత్సవం   

మనం నరకాసుర సంహారం జరిగిన మర్నాడు దీపావళి ని వైభవం  గా దీపాలంకరణ తో ,టపాకాయలు కాల్చి జరుపు కొంటాం .అమెరికా లో బ్రిటీష పాలన తో విసిగి పోయిన పద మూడు కాలనీ వాసులు ,అనేక హెచ్చరికలు బ్రిటీష ప్రభుత్వానికి చేసినా పేడ చెవిన పెడితే ,తిరగబడి ,అందరు ఏకమై 1776 జూలై 4 న తాము బ్రిటీష ప్రభుత్వాన్ని గుర్తించమని, తాము స్వాతంత్రాన్ని పొందుతున్నామని సంయుక్తం గా ఒక డిక్ల రేషన్ ప్రకటించి స్వాతన్త్ర్యాన్ని ప్రకటించు కొన్నారు .అప్పటి నుడి జూలై నాలుగును అమెరికా స్వాతంత్ర దినోత్సవం గా మహోత్సాహం గా జరుపు కొంటున్నారు .ఇప్పటికి 236ఏళ్ళు .ఆ రోజు రాత్రి తొమ్మిదిన్నర నుండి పదిన్నర వరకు ప్రభుత్వాధ్వర్యం లో అనేక రకాలైన టపాకాయలు కాల్చి సంబరాన్ని అంబరం అంత ఎత్తు కు తీసుకొని వెళ్తారు .ఆ గంటా ఆకాశం అంతా వెలుగుల పున్నమే .రవ్వల జలతారు .ధమ ధమ ధ్వనులే .ఆకాశం అంతా ఎన్నో హరి విల్లు లతో కనుల విందు చేస్తుంది .నాన్ స్టాప్ గా గంట సేపు కన్నులకు పండువే .దీన్ని చూడ టానికి ఎంతో దూరం వెళ్లి టికెట్ కొని చూసి ఆనందిస్తారు .అక్కడ దొరికే బాణా సంచా కొని జనం కూడా కాలుస్తారు .అపార్ట్ మెంటల్ దగ్గర కాల్చ రాదు .కౌంటీ లలో, ఇండిపెండెంట్ హౌస్ లలో కాల్చుకో వచ్చు .మిగిలిన రోజుల్లో ఎప్పుడూ ఈ సందడి కనీ పించదు.మా అమ్మాయి ,అల్లుడు ,మనవాళ్ళు వెళ్లి అమెరికా దీపావళి చూశారు .మేము పదేళ్ళ క్రితం మొదటి సారి వచ్చి నప్పుడు హూస్టన్ నగరం లో ఆ వేడుక చూశాం .నాలుగేళ్ల క్రితం షికాగో లో సరస్సులో స్టీమర్ మీద ఉండి ఫైర్ వర్క్స్ చూసి ఆనందించాం .ఏమైనా చూడ ముచ్చటైన పండుగే .ఎన్నో రకాలు ,ఎన్నో రంగులు ,ఎన్నెన్నో మోడల్స్ కను విందు చేస్తాయి .స్వాతంత్రం లో ఉన్న హాయి ని అనుభవ విస్తు అమెరికా వారు జరిపే సంబరం ఇది .మా అమ్మాయి ,అల్లుడు ,మనవలు వరుసగా మూడు రోజులు ఇంటి దగ్గరే టపాకాయలు కాల్చి వేడుక చేసుకొన్నారు .

                                                  అట్లాంటా ప్రయాణం

క్రిందటి వారమే నేను అట్లాంటా మీదుగా ,అలబామా వెళ్లి హన్త్స్ విల్ లోని మా స్నేహితులు మైనేని గోపాల కృష్ణ గారింటికి వెళ్లి వచ్చాను .మా అమ్మాయి వాళ్ళు ఎప్పుడూ అట్లాంటా ను చూడ లేదట .అందుకని అందరం కారు లో బయల్దేరి మూడు రోజుల పర్యటన చేయాలని నిర్ణ యించారు .శార్లేట్ కు అట్లాంటా సుమారు 260 మైళ్ళదూరం .అంటే సుమారు నాలుగు వందల కిలో మీటర్ల దూరం లో ఉంది .మూడున్నర గంటల డ్రైవ్ .మధ్యలో విశ్రాంతి ఒక గంట .అంటే అయిదు గంటల సమయం .అది జార్జియా రాష్ట్రం లో ఉంది .జార్జియా కు రాజ దాని అట్లాంటా .ఒక పెద్ద పట్నం రాజ దాని అవటం ఇక్కడే చూస్తాం .నార్త్ కెరొలినా దాట గానే సౌత్ కెరొలినా దాని తర్వాత జార్జియా రాష్ట్రాలు వస్తాయి .బ్రిటన్ రాజు జార్జి రెండు పేరు మీదుగా జార్జియా రాష్ట్రం పేరు వచ్చింది .అమెరికా లో జనాభా లో తొమ్మిదవ స్థానం లో ఉంది .టెక్సాస్ రాష్ట్రం తర్వాతా బాగా వేగవంతం గా అభి వృద్ధి చెందుతున్న రాష్ట్రం .1829లోజార్జియా మౌంటేన్ ల వద్ద బంగారు నిక్షేపాలు లభించాయి .అందువల్ల గోల్డ్ రష్ పే రిగింది .ఇక్కడ రెడ్ సెడార్ వృక్షాలు ప్రసిద్ధి చెందాయి .అనేక రకాల పైన్ చెట్లున్నాయి .ఓక్ ,మాపిల్ చెట్లూ ఎక్కువే .ఈ రాష్ట్రం డెమొక్రాటిక్ పార్టి కి వెన్ను దన్ను గా నిలిచింది .1976 లో ఈ రాష్ట్రానికి చెందినా జిమ్మీ కార్టర్ ప్రెసిడెంట్ అయాడు .ఇక్కడ పట్టి ,

rye,పెకాన్స్ ,పీచులు బాగా పండుతాయి .ఇక్కడి ”చారోకీ రోస్” చాల ముచ్చటగా ఉండే పుష్పం .దీన్ని ”పీచ్ స్టేట్ ”అంటారు .గ్రానైట్ రాయి కి కేంద్రం .లైవ్ ఓకే వృక్షం వీరి జాతీయ వృక్షం .వీరి రాష్ట్ర పక్షి- బ్రౌన్ త్రాషర్ .జార్జియా దగ్గరే సవాన్నా నది ప్రవహిస్తుంది .

అట్లాంటాలో 1996లోజూలై19-ఆగస్ట్ నాలుగు మధ్య సమ్మర్ ఒలింపిక్స్ జరిగాయి .centinnial ఒలింపిక్స్ గా దాన్ని పిలిచారు .197దేశాలు ,10 ,318క్రీడా కారులు పాల్గొన్నారు .ఒలింపిక్స్ నిర్వహించిన అయిదవ అమెరికా సిటి అట్లాంటా .సమ్మర్ ఒలింపిక్స్ జరిపిన అమెరికా లోని మూడవ సిటి .అప్పుడు దేశానికి ప్రెసిడెంట్ బిల్ క్లింటన్ . ఇప్పుడు అట్లాంటా లో జూలైఆరు నుండి ఎనిమిది వరకు ”ఆటా ”;;తెలుగు సంబరాలు జరుగు తున్నాయి .

మేము ఆరవ తేది శుక్ర వారం ఉదయం ఎనిమిదిన్నరకుకార్ లో బయల్దేరాం .దారిలో వెంట తెచ్చుకొన్న పులిహోర తిన్నాం యోగాత్ అనే పెరుగు తిన్నాం .ఆరగా ఆరగా జ్యూసులు తాగుతూ చల్లని మంచి నీళ్ళు జుర్రుతు ,మధ్యాహ్నం పన్నెండున్నరకు ”హాలిడే ఇన్”అనే చోట రెండు రూములు తీసుకొని బస చేశాం .కాసేపు విశ్రాంతి తెసుకోన్నాం

                                 కోకా కోలా ప్లాంట్

కోకా కోలా మోడల్ ప్లాంట్ కు మూడు గంటలకు చేరాం .ఇది డౌన్ టౌన్ లో ఉంది .ఇక్కడే సి.యెన్.యెన్.కేంద్రం ,జార్జియా ఆక్వేరియం కూడా ఉన్నాయి ఒక గొప్ప రద్దీ కేంద్రం లో ఇవన్నీ ఉండటం అరుదు .అన్నీ దగ్గర దగ్గర లోనే ఉన్నాయి .ఈ మూదు ,దీనితో పాటు దూరం గా ఉన్న జూచూడటానికి మా అందరికి కలిసి టికెట్ల ఖరీదు 500 డాలర్లు ;’దాదాపు ఒక్కొక్క రికి25దాలర్లున్తుంది . ‘.ముసలి ముథా” కి కన్సెషన్ రెండు డాలర్లు మాత్రమె ఒక్కో టికెట్ మీద .ప్రభావతికి వీల్ చైర్ తీసుకుందివిజ్జి .దానికోసం ఐడెంటిటి కార్డ్ అప్పగించాలి .తిరిగి ఇచ్చి నప్పుడు కార్డ్ తీసుకో వాలి .దీనికి డబ్బు లేదు .అన్ని భాగాలను చక్కగా చూపించారు .బాటిల్స్ లో నింపటం సీల్ చేయటం పిల్లలకు సరదా గా ఉంటుంది .దాదాపు రెండు గంటల కార్య క్రమం .ఇక్కడే కోకా కోలా గురించి 4d ధియేటర్ లో డాక్యు మెంటరి చూపించారు .వస్తువులు మన ముందుకు వచ్చి న అను భూతి కలుగు తుంది .నీళ్ళు మీద పడ్డట్లున్తుంది .కుర్చీలు కదిలి పోతున్న ఫీలింగ్ వస్తుంది .పూలు చేతికి అంది నట్లు కన్పిస్తాయి అందరు అందుకోవటానికి చేతులు జాస్తారు .ఇదంతా ఎఫెక్ట్ మాత్రమె . ఆ తర్వాత60 రకాల కోకా కోలాలు ఉన్న ఒక హాల్ లోకి తీసుకొని వెళ్తారు .అక్కడ పెద్ద డ్రమ్ములలో వివిధ ఖండాలకు చెందినా కోకా కోలా లు ఉంటాయి .వాటి లోంచి మనకు కావలసిన దాన్ని ప్రక్కనే ఉన్న గ్లాస్ లో పైప్ ల ద్వారా పట్టు కొని ఎన్ని సార్లైనా తాగ వచ్చు .పిల్లలు మస్తుగా ఎంజాయ్ చేస్తారు .నేనూ అన్ని రకాలను టేస్ట్చేశాను .అమెరికన్ ,ఆశియన్ వరైటీలు తాగ టానికి బాగా ఉన్నాయి .అక్కడంతా సందడే సందడి .అందరికి తలా ఒక నిండు కోకా కోలా బాటిల్ ఉచితం గా ఇస్తారు .అందరం నోక్కేశాం ”.ఫ్రీ గా వస్తే ఫినాయిల్ అయినా రెడీ ”అన్న సామెత రుజువు చేశాం .బయటకు వచ్చి ఉడిపి కృష్ణా భవన్ కు వెళ్లి టిఫిన్ తిన్నాం .పూరీ చపాతి అట్టు ,చాట్ మసాలా అన్ని రకాలు ఉన్నాయి .రుచి గానే ఉన్నాయి .తెలుగు వాళ్ళు ఆటా సంబరాల కు సాంప్రదాయ వస్త్ర ధారణ తో చాలా మంది కనీ పించారు ముఖ్యం గా స్త్రీలు చీర సిన్గారించే కనీ పించారు .హోటల్ బాగా రద్దీ గా ఉంది .అదొక పెద్ద మాల్ లో ఉన్నది హాలిడే ఇన్ కు రాత్రి పదింటికి చేరాం .హాయిగా నిద్ర పోయాం .ఇక్కడ గదులకు తాళం చెవులు క్రెడిట్ కార్డుల్లా ఉంటాయి దాన్ని తాళం దగ్గర స్పేస్ లో పెడితే తాళం తెరుచు కుంటుంది .బయటికి వెళ్ళే టప్పుడు కార్డ్ జేబు లో పెట్టు కొని వెళ్ళాలి .ఇదీ మొదటి రోజు సమాచారం .మిగాతావివరాలు” పార్ట్ టు”లో తెలియ జేస్తాను

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –10-7-12- కాంప్-అమెరికా
http://suvarchalaanjaneyaswami.wordpress.com

Posted in అమెరికా లో | Tagged | Leave a comment

స్టేట్ లీడర్ లో వచ్చిన వ్యాసం – కల్ప వృక్ష స్త్రీలు

Posted in రచనలు | Tagged | Leave a comment

బుసే ఫలస్(bucephalus)

 బుసే ఫలస్(bucephalus)

ఈ పెరేక్కడిది అని కంగారు పడకండి .అది” అలేగ్జాన్దర్ ది గ్రేట్ ”పంచ కల్యాణి గుర్రం పేరు .దీనికింత కధ ఉందా?అని ఆశ్చర్య పడకండి .లేక పోతే మనకేందు కా సంగతి ?అలెగ్జాండర్ తండ్రి ఫిలిప్ మాసిడోనియా కు రాజు అని అందరికి తెలిసిందే .ఆయన ఒక జవనాశ్వాన్ని చాలా ఖరీదు పెట్టి తెప్పించు కొన్నాడు .జాతి ,వంశం లెక్కలు అన్నీ చూసే తెప్పించాడు .తన దగ్గర ఉండవలసిన అశ్వం అని .కాని అది పొగరు బోతు .ఎవ్వరినీ దగ్గరకు రానిచ్చేది కాదు .మీద చెయ్యి వేస్తె ఈడ్చి పెట్టి తన్నేది .చాలా మంది ఆశ్వికులు దాని పని పట్ట టానికి ప్రయత్నించి ,కాళ్ళూ చేతులు పోగొట్టు కొన్నారు .తిండి పుష్టి నైవేద్యం నష్టి .మేపటం తప్ప దేనికీ పనికి రాకుండా పోయింది .రాజు కు ఇక దాని మీద విరక్తి పుట్టింది .యెట్లా గైనా వదిలించు కోవాలని ప్రయత్నం చేశాడు .బేరాలు పెట్టాడు .దాని సంగతి తెలిసి ఎవరూ కొనే సాహసం చెయ్య లేక పోయారు .చివరికి ఏమీ పాలు పోక ఏదో విధం గా వది లించు కోవటానికి విశ్వ ప్రయత్నం చేశాడు .అదీ లాభం లేక పోయింది .

ఇంతలో ఫిలిప్ రాజు గారి కుమారుడు అలెగ్జాండర్ నూనూగు మీసాల నూత్న యవ్వనం లో ప్రవేశించాడు .అశ్వ శాల లో గుర్రాల్ని పరి శీలిస్తుంటే అతని దృష్టి దీని మీద పడింది .తండ్రి కి తన అభీష్టాన్ని తెలియ జెప్పాడు .ఆయన కన్న కొడుకుతో ”నాయనా !ఈ గుర్రం మంచి జాతిది అని కొన్నాను .కాని వచ్చి నప్పటి నుండి అది ఎవరికి అలవి కాలేదు .దగ్గరకే రానివ్వటం లేదు .దాన్ని వది లించు కోవటమే మంచిదని పించింది .కనుక దాని జోలికి వెళ్ళద్దు .ఇంకో జాతి గుర్రాన్ని ఎన్నిక చేసుకొని స్వారి చెయ్యి ”అని హితవు పలికాడు .కొడుకు తండ్రి మాట విన్నాడు కాని తన మనసులోని విషయాన్ని తెలియ జేశాడు .”నాన్నా !గుర్రాలకు హృదయం ఉంటుంది .అందులో మీరు ఎంపిక చేశా రంటే దానికి ఎన్నో మంచి లక్షణాలు ఉండే ఉంటాయి .అయితే నాదొక విన్నపం .గుర్రానికి తనను ఎవరు లొంగ దీయ గలరో తెలుస్తుంది .అలాంటి వీరుడి కే అది లొంగి నిల బడుతుంది .గుర్రానికి కూడా సమర్ధుడు తనను అధి రోహించాలను కొంటుంది. చెప్పిన మాట వింటుంది .కనుక దాన్ని లొంగ దీసే బాధ్యత ను నాకు వదిలి పెట్టండి .దాన్ని అమ్మటం మాత్రం చేయ కండి ”అని నెమ్మదిగా చెప్పాడు .”సరే నీ ఇష్టం .నీ ప్రయత్నాన్ని నేను ఆప బోను .నీకూ లొంగక పోతే దాన్ని ఏదో ఒక రేటు కు అమ్మి వదిలించు కొంటాను ”అన్నాడు .సరే నన్నాడు కొడుకు .

బుసే ఫలాస్ ను అందం గా అలంకరించి కొలువు దగ్గరకు తెచ్చారు .అలేగ్జాండర్ దాని దగ్గరకు వచ్చి చెవి లో ఏదో ఊదాడు .ముందుకు వచ్చి ముక్కులో నోటి లో వ్రేళ్ళు పెట్టాడు .అసలు మనుష్యుల్ని దగ్గరకే రానివ్వని గుర్రం ఇవన్నీ చేస్తుంటే మైనపు ముద్దా లా ఒదిగి పోయింది .వీపు మీద చెయ్యి వేసి నిమి రాడు .అంతే మంత్ర ముగ్ధ లాగ గుర్రం లొంగి పోయింది .అమాంతం గుర్రం పైకి లంఘించి ఎక్కి కూర్చున్నాడు అలెగ్జాండర్ .అది ఒక్క సారి సకిలించి ఆఘ మేఘాల మీద దౌడు తీసింది . .మెరుపు వేగం తో దూసుకొని పోయింది .సభాసదులు ,రాజు సంభ్రమాశ్చర్యాలలో మునిగి పోయారు .యువరాజు కే మైనా ప్రమాదం సంభ విస్తుందేమో నని శంకించారు .అది పంచ కల్యాణి లా దూకి మళ్ళీ యదా స్థానానికిఅరగంట తర్వాత మళ్ళీ సకి లించు కొంటూ అక్కడికి చేరింది .నవ్వుతు యువ రాజు దిగాడు .జైజై ద్వానాలలో ప్రజలంతా హర్షాన్ని తెలియ జేశారు .అప్పుడు ఫిలిప్ రాజు తన కొడుకు అలెగ్జాండర్ ను దగ్గరకు తీసుకొని చాలా గొప్పగా అభినందించి ”కుమారా !నీకు ఈ రాజ్యం సరి పోదు .కనుక ఇంకో రాజ్యాన్ని చూసుకో ”(this country is not enough for you .Find out another”)అని కుమార రత్నానికి భవిష్యత్తును నిర్దేశించాడు .తగిన వీరుడు తనకు లభించాడని ఆశ్వమూ ,తనకు తగిన గుర్రం లభించిందని అలెగ్జాండర్ సంబర పడ్డారు .

వీరిద్దరి స్నేహం ఎంతో కాలం నిలిచింది .విశ్వ విజేత అవ్వాలన్న అలేగ్జండర్ మనసు గుర్రానికీ తెలుసేమో .చాలా సేవ చేసింది .ఎన్నో యుద్ధాలలో అది అతనికి విజయాన్ని చేకూర్చింది .అలెగ్జాండర్ అందరిరాజుల్లా కాకుండా స్వయం గా సైన్యాన్ని నడిపి యుద్ధాలు చేశాడు .అతని విజయాలకు అది భాగ స్వామి అయింది .సుదీర్ఘ యుద్ధాలలో అది సుమారు 25,000k.m.దూరం తన స్వామి తో ప్రయాణం చేసి , అలసి పోయి చివరికి 326b.c.లో సుమారు ఇరవై ఎనిమిది ఏళ్ళ వయసులో తన నేస్తం ప్రియ అలెగ్జాండర్ ను వదిలి తుది శ్వాశ పీల్చింది .battle of hydraspes యుద్ధం తర్వాత దాని మరణం సంభవించింది .అలెగ్జాండర్ దుఖం వర్ననాతీతం .కుమిలి పోయాడు .మనసును చిక్క పట్టు కో లేక పోయాడు .అప్పటికి అతను పర్షియా ను జయించి ఇండియా దాకా వచ్చాడు .దాని అంత్య క్రియలను ఎంతో వైభవం గా జరిపించాడు .దానికి మనసారా కృతజ్ఞత లను తెలియ జేశాడు Hydespas నది ఒడ్డున ఒక నగరాన్ని”బూసా ఫాలియా” పేరు మీద నిర్మించి కృతజ్ఞతలు తెలుపు కొన్నాడు . ఈ నగరం జీలం నది ఒడ్డున ఉంది .అదీ అలెగ్జాండర్ గుర్రం” బూసే ఫలస్ ”కధ .

మీ –గబ్బిటదుర్గా ప్రసాద్ –8-7-12–.కాంప్–అమెరికా
http://suvarchalaanjaneyaswami.wordpress.com

Posted in మహానుభావులు | Tagged | 1 Comment

అలేగ్సాండర్ నాటి గ్రీకు సమాజం

     అలేగ్సాండర్ నాటి గ్రీకు సమాజం

ఆకాలం లోగ్రీకుల ళ్ళు చిన్నవి గా ఉండేవి .కాల్చని మట్టి ఇటుకలతో ఇల్లు నిర్మించే వారు 

.మధ్యధరా ప్రాంతపు ఎండ ప్రతి ఫలించటానికి వీలుగా తెల్ల రంగు వేసే వారు .

కిటికీలు పైన ఎత్తులో ఉండేవి .పేదలకు ఒకటి లేక రెండు గదులున్న ఇల్లున్దేవి .

ధనికుల ఇళ్లలోఆడ వారికి ,మగ వారికి వేరు వేరు గా గదులున్దేవి .ఇంటి మధ్య ఖ్ఖాలీ ప్రదేశానికి చుట్టూ దులున్దేవి 

.భోజనం సాధారణ భోజనమే .చాలాతాజా గా ,రుచి కరమైన వాటినే తినే వారు .

వేడి ప్రాంతం కనుక పళ్ళు ,కూరగాయలు బాగా పండేవి .గోధుమ ,బార్లీ చేపలు సమృద్ధి గాలభించేవి .మాంసం తినటం తక్కువే .

మేక పాలు తాగే వారు .పెరుగు ,వెన్న అన్నిటికీ మేక పాలే .ఆలివ్ ,ఆలివ్ నూనె వాడకం బాగాఉండేది .భోజనం లో ద్రాక్ష సారా తప్పని సరి .

బానిసలు ఎక్కువ .యుద్ధాలలో పట్టు బడ్డ వారు ,వారి తార తరాల సంతానం ,బానిసలే .ఆట ,పాటధనిక ,పేద భేదం నాలుగవశతాబ్దానికి పెరిగింది .

 అన్ని పనులు బానిసలే చేసే వారు .ప్రతి ఇంట్లో వాళ్ళు తప్పని సరి 

.ధనిక పేదల భేదం నాల్గవ శతాబ్దం నాటికిపెరరిగింది.ఆడ వాళ్ల కు

హక్కులు తక్కువే .మగ వాళ్ళ అధీనం లోనే ఆడబ్రతుకు ఉండేది .

ఆమె ఇంటికే పరిమితం .వీధి లో తిరగటం నేరం .స్పార్టా లో మాత్రంస్త్రీలకు స్వాతంత్రం ఉండేది .

అందుకే ఇక్కడి మహిళలు బలాధ్యమైన ,ఆరోగ్య వంత మైన పిల్లల్ని కనే వారు .ఆడవారు క్రీడలలో పాల్గొనేవారు .

బాక్సింగ్ కూడా చేసే వారు .మగ పిల్లలు బడి కి వెళ్ళే వారు .

ఆడ పిల్ల లకు ఇంట్లోనే చదువు .స్పార్టా లో ఆడ పిల్లలు బడికి వెళ్లిచదివే వారు .మగ వాళ్ళ తో పాటు అన్నిటికీ వారికి సమాన ప్రాధాన్యత ఉండేది .

గ్రీకు దేశం లో కళల పట్ల ఆరాధన ఎక్కువ .

నాటక శాలల్లో బహిరంగ ప్రదర్శనలు ప్రత్యక్షం గా జరిగేవి .కామెడీల ప్రదర్సనలు ఎక్కువ.అరిస్తోఫీనాస్ రాసిన కామెడీలు ,యూరిపిదాస్,సోఫోక్లాస్ రాసిన ట్రాజెడీలు ప్రదర్శిస్తే జనం బాగా చూసి ఆనందించే వారు ..

కవిత్వంఅంటే మాంచి సరదా .700b.c.కాలం వాడిన అంధ కవి హోమర్ గొప్ప కవి .

ఆయన రాసిన ఇలియడ్ ,ఒడిస్సీ లు 1200b.c.నాటిట్రోజన్ వార్  తర్వాతి కధలు . కాలం లో చాలా మంది విద్యా వేత్త లకు హోమర్ కావ్యాలు కన్తస్తం .

క్రీడలు గ్రీకులోనే పుట్టి పెరిగాయి .ఒలింపిక్ ఆటలకు కేంద్రం .ఆటల్లో మత భావాలను చొప్పించే వారు 

.దేవత లను ఆరాధించటం గ్రీకుసంప్ర దాయం .చాంపియన్ క్రీడా కారులకు ప్రత్యెక సత్కారం చేసే వారు .అదొక ”క్లాసికల్ పీరియడ్ ”గా గుర్తింపు పొందింది .

ఇన్నీ ఉన్నా గ్రీకులకు ఆనందం కరువే .ఎప్పుడూ యుద్ధాలే . కాలం లో పర్షియా అనే ఆసియా రాజ్యం (ఇవాల్టి ఇరాన్ )అయోనియాభాగాన్ని ఆక్ర మించింది .ఇది ఏజియన్ సముద్ర తూర్పు తీరం .

ఇదే ఇవాల్టి  ర్కి .దీనిలో ఎన్నో గ్రీకు వలస దేశాలున్నాయి .ఇవిపర్షియా పై499 b.c.లో తిరుగు బాటు చేశాయి .ఏథెన్స్ లాంటి సిటి స్టేట్స్ సమర్ధించాయి .డేరియస్ 1 అనే పర్షియా రాజు వీటిని అణచివేశాడు .

అంతటి తో ఆగ కుండా నావల మీద bay of marathan అనే ఏథెన్స్ దగ్గర ప్రాంతానికి దండెత్తి వచ్చాడు .ఎతియన్లకు,పర్శియన్లకు భీకర యుద్ధం జరిగింది .గ్రీకుల  కౌశలం పర్శియన్లను దెబ్బ తీసింది .ఓడియన్ ఒడి పోయి సముద్రం గుండాస్వదేశానికి పారి పోయాడు .

.

  480b.c.      లో మళ్ళీ అతని కొడుకు xerxes వచ్చి ,మీద పడ్డాడు .

తెర్మో పైల్ అనే ఇరుకు ప్రాంతం లో యుద్ధం జరిగింది .స్పార్తాన్సైనికులుమొదటి రోజు యుద్ధం లో పర్షియన్ల అంతు చూశారు .

ఒక గ్రీసు మోస గాడు పర్శియన్లకు వేరే మార్గం చూపించాడు .

పర్షియన్లుగెలిచారు అయినా ఎక్కువ మంది చచ్చారు .ఏథెన్స్ చేరి  మహా నగరాన్ని కాల్చి బూడిద చేశారు .అప్పటికే ఏథెన్స్ వాసులు పారిపోయారు .

కనుక జన నష్టం జరగ లేదు తర్వాత సాలమిస్ వద్ద నెల రోజులనౌకా యుద్ధం లో  అనుభవం లేని పర్షియన్లు చావు దెబ్బతిన్నారు .

ఈత రాక సముద్రం లో మునిగి పోయారు .వంద లాది పర్షియన్ సైన్యాన్ని ఊచ కోత కోసేశారు .మరుసటి ఏడాది యుద్ధం లోపర్శియన్లను పూర్తిగా ఓడించేశారు .

దీనినే battle of plataca అంటారు .యుద్ధాలు ముగిశాయి .గ్రీకులకు చారిత్రాత్మక విజయంలభించింది . 431b.c. లో మళ్ళీ కొత్త తగాదా .ఏథెన్స్ వాసుల ఆది పత్యాన్ని స్పార్టా సహించ లేదు 

.సిటీ స్టేట్స్ మధ్య తగాదాలుపెరిగాయి .స్పార్టా కోరింత్ లు కలిసి ఏథెన్స్ పై దాడి చేశాయి

.ఇదే pilopennessian war(ఏథెన్స్ ఓడిపోయింది ..స్పార్టా బలీయ మైన సిటి స్టేట్ గా అయింది .మోనార్క్ ల పాలన లో నిలబడింది స్పార్టా .ఏథెన్స్ ప్రజాస్వామ్యం ఎన్నో దశాబ్దాల పాటు కడ గండ్ల పాలైంది .c

మాసి డోనియా కు సిటి హోదా అప్పటి దాకా లేదు .సామ్రాజ్యాధి పతుల అంటే మోనార్క్ ల ఏలుబడి లో ఉంది .వంశ పారం పర్య పాలన ఉంది .359b.c.లో ఫిలిప్స్ రెండు అధికారానికి వచ్చాడు .

చిన్న రాజ్యమైనా పెద్ద వ్యూహాలున్న వాడు ఫిలిప్స్ .సైన్యాన్ని బలోపేతం చేశాడు .మంచి శిక్షణ నిచ్చాడు .అవసరమైన ఆయుధాలను సమ కూర్చాడు .కొద్ది కాలం లోనే యూరప్ లోనే గ ర్వించ దగ్గ సైన్యాన్ని తయారు చేశాడు .ఆమ్ఫీ పోలిస్ అనే గనులు అధికం గా ఉన్న కాలనీ ని వశ పరచుకొన్నాడు .

అందులోని బంగారపు గనులు అతనికి బాగా కలిసి వచ్చాయి .ఐశ్వర్యం పెరిగింది .చుట్టూ ప్రక్కల ఉన ట్రైబల్ కమ్యూనిటి లను ఆక్రమించి మాసిడోనియా సామ్రాజ్యాన్ని విస్త రింప జేశాడు .

ఇక సరి హద్దులు దాటి విజయాలను సాధించాలనే వ్యూహం లో ఉన్నాడు .అదికారానికి వచ్చిన పదేళ్ళ లోనే దక్షిణాన గ్రీస్ వరకు రాజ్య విస్తరణ చేసి అందరికి పక్కలో బల్లెమైనాడు .

500-300b.c.కాలాన్ని” క్లాసికల్ ఏజ్ ”అంటారు .గ్రీక్ సిటి స్టేట్ ల మధ్య భీకర యుద్ధాలు జరిగాయి .గ్రీకుల ఐక్యతా కుదిరింది .

అంతా ఒకే గొడుగు కిందకి వచ్చారు .మాసిడోనియా కు ఇది నిజం గా నే సువర్ణావ కశం .దానికి ఇప్పుడు ప్రపంచం మీద దృష్టి పడింది .అది గో అప్పుడే” ప్రపంచ విజేత ”అవాలని ఉవ్విల్లూరిన ఫిలిప్ రాజు కొడుకు అలెగ్జాండర్ పుట్టాడు .

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –5-7-12.–కాంప్–అమెరికా

Posted in రచనలు | Tagged | 3 Comments

ముగ్గురు మహాను భావులు

ముగ్గురు మహాను భావులు

విల్ డ్యురాంట్Will durant అనే గొప్ప రచయిత ను తనకు నచ్చిన పది మంది మేధావులను ,పది మంది కవులను ,పది మంది తత్వ వేత్తలను చెప్ప మంటే ఆయన చైనా తాత్వికుడు కన్ఫ్యూజియాస్ ను ,అమెరికా జాతీయ కవి వాల్ట్ విట్మన్ ను ,జర్మనీ ఫిలాసఫర్ ఇమాన్యుల్ కాంట్ ను పేర్కొన్నాడు .వీరే అన్ని కాలాలను చెందిన మహాను భావులు అన్నాడు . ఇప్పుడు వారిని ఆయన మాటల్లో నే సంక్షిప్తం గా పరిచయం చేస్తున్నాను .

                                                                    కన్ఫుసియాస్

మానవ నాగరిక చరిత్ర అంతా మానవ ఆలోచన మీదనే ఆధార పడింది .అందులో ప్రపంచాన్ని చైనా ను ప్రభావితం చేసిన కన్ఫుసియాస్ ను ముందు పేర్కొనాలి .ఆయన జీవితం అంతా మతాతీత మైన ఆలోచన ల తోనే గడిచింది .అతీత శక్తులకు ఆయన ప్రాధాన్యం ఇవ్వ లేదు .కన్ఫూజన్ స్థితి లో ఉన్న చైనా సమాజానికి ఆరోగ్యం ,క్రమ పద్ధతి ణి ఇచ్చి దారి చూపిన ఆలోచనా పరుడు .

జ్ఞానన్ని పెట్టు బడి పెడితే వస్తువులేర్పడతాయి .అప్పుడవి ఉన్న రూపం లో అంటే యదార్ధ రూపం లో .కనీ పి స్తాయి .అలా కనీ పించి నపుడు విజ్ఞానం పూర్తిగా ,సంపూర్ణం గా లభిస్తుంది .విజ్ఞానం సంపూర్ణం అయితే ఆలోచనలు చాలా నిర్దుష్టం గా ఉంటాయి .అప్పుడు ఆత్మలు పరిశుద్ధమై పరి పూర్ణమై వికశిస్తాయి .అలాంటి స్థితిలో వ్యక్తులకు సంస్కారం సంపూర్ణం గా లభిస్తుంది ..అప్పుడే వారి కుటుంబాలు పధ్ధతి లో ఉండ గలుగు తాయి .దానితో సమాజం మంచి విధి విధానం లో ఉంటుంది .దాని వల్ల రాజ్యం లేక దేశం సరైన మార్గం లో ప్రగతి పధం లో ముందుకు వెడుతుంది .ఈ ప్రభావం వల్ల ప్రపంచం అంతా సుఖ సంతోషాలతో సమగ్రంగా వికసిస్తుంది .ఇదీ కన్ఫూసియాస్ ఇచ్చిన అతి ముఖ్య మైన సందేశం .ఇదే ఆయన చైనా దేశానికిచ్చిన నైతిక ,రాజకీయ వేదాంతం .దీన్ని మనం ఆలోచిస్తే stoicism కు ఆయన భావాలు దగ్గర గా ఉన్నట్లు అని పిస్తుంది .ఆయన ఎప్పుడూ ,ఎక్కడా ”మనుషులు అంతా ఒక్కటే”అని చెప్ప లేదు .తెలివితేటలు అనేవి అందరికి లభించే కానుక కాదు అన్నాడు (intelligence is not universal gift).అయితే తెలివి తక్కువ దద్దమ్మ లకు రాజ్య నిర్వహణా ,ప్రజా పరి పాలనా ఇవ్వ వద్దు అని ఖచ్చితం గా చెప్పాడు .తెలివి ,ఆలోచనా ఉన్న వాళ్లనే పరి పాలకులు గా ఏర్పాటు చేసుకోవాలని హితవు చెప్పాడు . ఆయన జీవిత కాలం2500 సంవత్స రాలకు పూర్వం .ఆయన చెప్పినవన్నీanelets గా శిష్యులు రాశారు .చైనా ను పాలించిన రాజ వంశాలన్ని కన్ఫూసియాస్ సిద్ధాంతాలను ఆదర్శం గా చేసుకొనే పాలించారు .206బి.సి.-220.–ad లో పాలించిన వారు .చైనా ను ఏకం చేసిన క్విన్ వంశీయుడు చాన్కైషేక్ 221 ఏ.డి.1966-76కాలం నాటి cultural revolution వరకు ఆయనే ఆదర్శం .1978 లో den xiiao pingకూడా అవే ఆదర్శాల తో చైనా ను ఆర్ధిక సామాజిక రంగాలలో అభి వృద్ధి చేశాడు .ప్రపంచం లో చైనా కు అగ్రాసనాది పత్యం సాధించాడు .1949లో మావ సే టుంగ్ జెడాంగ్ పాలన నుంచి ,కాపిట లిస్తిక్ భావాలను అరువు తెచ్చు కొని ,ముందుకు నడి పించాడు .getting rich is glorious అనేది డెంగ్ నినాదం .అన్నీ సాధించినా ధనిక ,పేద ల మధ్య దూరం పెరిగింది .అవి నీతి అధర్మం పెరిగాయి .ప్రజలు ఒక సారి వెనక్కి తిరిగి చూసు కొని మళ్ళీ కన్ఫూసియాస్ మాత్రమె దేశానికి శరణ్యం అను కొన్నారు . 2000ఏళ్ళ క్రితం హాన్ వంశానికి చెందిన”వు”అనే రాజు అంతకు ముందున్న వంద మంది తత్వ వేత్తలను దూరం పెట్టి అన్ఫూసియాస్ సిద్ధాంతాన్నే అమలు చేశాడు .వెయ్యేళ్ళ క్రితం సాంగ్ వంశానికి చెందినzhao puఅనే మొదటి ప్రధాని ”కన్ఫూసియాస్ పుస్తకం లో సగ భాగం చాలు ప్రపంచాన్ని పాలించ టానికి ”అని గర్వం గా ప్రకటించాడు . కనుక అయన ప్రభావం అంత తీవ్రం గా అప్పటి నుండి ,ఇప్పటి వరకు కోన సాగుతూనే ఉంది .

కన్ఫూసియాస్ చనిపోతే ఆయన అంత్య క్రియలను పరమ వైభవం గా జరిపించారు ప్రజలు .ఆయన సమాధి దగ్గర చాలా మంది గుడిసెలు వేసుకొని మూడేళ్ళు ఏడుస్తూ కూర్చుని శ్రద్ధాంజలి ఘటించారట .అంతా వెళ్లి పోయినా tse king అనే శిష్యుడు మాత్రం ఇంకో మూడేళ్ళు అంటే మొత్తం ఆరేళ్ళు గురువు గారి సమాధి దగ్గరే గడిపి జన్మ ధన్యం చేసు కొన్నాడట .దటీజ్ కన్ఫోసియాస్ .

                                                    వాల్ట్ విట్మన్

విట్మన్ ను సాహిత్య చరిత్ర లో విప్లవం అన్నాడు విల్ డ్యురాంట్.అతను కవిత్వపు మూలాలను కనుక్కొన్న వాడు .the spirit of the pioneer ను కవిత్వం లో నిక్షే పించాడు .there is more poetry under the stars than in un natural life అని ఘంటా పధం గా చెప్పాడు .సామాన్య ప్రజా జీవితాలను కవిత్వం లో పొదిగిన సామాజిక కవి .ప్రజలను కవిత్వం వైపు నడి పించటమే కాదు శిఖరాలకు చేర్చాడు .ప్రజల హక్కుల్ని ,స్వాతంత్రాన్ని కవిత్వం లో చాటి చెప్పాడు .తన దేశపు మొరటు ,డాంబిక ప్రజాస్వామ్యం,కల్లోల ,స్థితిని అభివృద్ధి చెందు తున్న దశను కవితాత్మం చేశాడు .ఆకాశాన్నించి కవిత్వాన్ని నేలకు చేర్చాడు .గ్రీసు దేశానికి హోమర్ మహా కవిలాగా ,రోమన్ దేశానికి వర్జిల్ కవి లాగా ,ఇటలీ కి డాంటే లాగా ఇంగ్లాండ్ కు షేక్స్ పియర్ లా,అమెరికా కు వాల్ట్ విట్మన్ ఆరాధ్యడయాడు .

అమెరికా ను తన కళ్ళ తో చూశాడు .దాని గొప్ప తనాన్ని ,బలాన్ని ,బలహీనతలను ,దామ్బికాన్ని తడిమి చూశాడు .కొత్త జీవితాన్ని ప్రక్రియ (ఫారం )ను కవిత్వానికి ఇచ్చాడు .అతని కవిత్వం నిరంతర ప్రవాహ శీలి .నయాగరా జల పాతం .ఉవ్వెత్తున ఎగసి పడుతుంది .అమెరికా రాజాస్వామ్య కవి గా ఉన్నప్పటికీ ,ఆయన ఆత్మా, ,విశాల దృక్పధం వల్ల ”ఆధునిక ప్రపంచ కవి ”అయాడు .

leaves of grass is perhaps the most absolute ,which has never been mani fest in literature” అన్నాడు ప్రఖ్యాత ఫ్రెంచ్ విమర్శకుడు .వస్తువులో స్వీయ సృష్టి ,కధనం లో సాధారనత్వం ,ప్రకృతిని చూసి పరవశించటం ,విట్మన్ ను గొప్ప వాణ్ని చేశాయి . ”my voice is wife’s voice ,the screach by the rail of the stars ,they fetch my man’s body up ,dripping and drowned ”అంటాడు విట్మన్ .

విట్మన్ స్వీయ వ్యక్తిత్వం ,ప్రజాస్వామ్య భావం ,ఊహ ,సాను భూతి ,అను కంప ,ప్రజలను దగ్గరకు తీసుకోవటం ,ప్రపంచానికి సలాం చేయటం మనల్ని అబ్బుర పరుస్తాయి .ఇంగ్లీష వాళ్ళ వ్యామోహం లో ఇప్పటి దాకా నడిచిన అమెరికా కవిత్వం ఆత్మను వెతుక్కొందిప్పుడు .తానేమిటో తెలుసు కొంది .ఆ మార్గం వదిలి అసలైన అమెరికా కవిత్వాన్ని చవి చూసింది .అదీ విట్మన్ చేసిన అద్భుతం .మొదట్లో ”ఇదేమి కవిత్వం ?”అని ఈసడింన్చినా చివరికి ”ఇదే కవిత్వం మన కవిత్వం ”అని నిర్ణయానికి వచ్చారు .కొత్తను వింతగా చూడటం లోపలి దాకా వెళ్లి పరిశీలించకుండా నే రోత అని చెప్పటం అన్ని దేశాల్లోనూ ఉంది .ఇక్కడా ఉంది .విట్మన్ ను ఆకర్షించిన మహా వ్యక్తీ అమెరికా యోగి, తాత్వికుడు, రచయిత ఎమర్సన్ మాత్రం పులకించి పోయాడు .i find it the most extrordinary piece of witand wisdom America has yet contri buted ”అని మనస్పూర్తిగా ప్రశంశా వర్షం కురిపించాడు .ఇప్పుడు విట్మన్ మహా కవి కవితా పంక్తుల్ని కొన్ని దర్శిద్దాం .

”if you want me again ,look for me under your boot soles –you eill hardly know who i am

But I shall be good health to you never less -and filter and fiber your blood

feeling to fetch me at first ,keep enquired –Missing me one place ,search another -i stop some where waiting for you ”

విట్మన్ పేరు లో నే విట్ ఉంది ,మాన్ ఉన్నాడు అంటే అతను మనిషి కోసమే జీవించిన కవి .తనకు ,తన కవిత్వానికి మనిషే ఆధారం మనిషి లో తనను ,తనలో సకల చరాచారాన్ని చూసుకొన్న ఉత్తమ కవి విట్మన్ ..

                                                       ఇమాన్యుల్ కాంట్

”kant rescued mind from matter .He brought life a magician wisethe dear beliefs of ancient faiths ” అని కీర్తించాడు విల్ డ్యురాంట్ .19 శతాబ్దం అంతా కాంట్ ప్రభావానికి లోనైంది ”back to kant” అనేది మహోద్యమం గా సాగింది .అంటే ఆయన ఆలోచనా ధోరణి ఎంత పరి పక్వ మైనదో తెలుస్తోంది ..

‘all reality of matter ,all nature with its laws are but constructs of the mind ,possibly but never certainly known in their own elusive truth ?kant had battle won against matirialism and atheism and the world could hope again ”అని భౌతిక వాదం నాస్తిక వాదాలను జయించి ఆధ్యాత్మిక వాదానికి అపర శంకరులుగా కాంట్ మార్గ దర్శనం చేశాడు .

మీ–గబ్బిట దుర్గా ప్రసాద్- 5-7-12–కాంప్–అమెరికా
http://suvarchalaanjaneyaswami.wordpress.com

Posted in మహానుభావులు | Tagged | Leave a comment

హి(హృ)దయ తుల్లా

             హి(హృ)దయ తుల్లా

మధ్య ప్రదేశ్ లో జన్మించి బార్ ఎట్ లా అయి నాగపూర్ హై కోర్ట్ చీఫ్ జస్టిస్ గా ,సుప్రీం కోర్ట్ జడ్జిగా ఎదిగి ,సుప్రీం కోర్ట్ చీఫ్ జస్టిస్ గా సమర్ధ వంతం గా పని చేసి ,పరిస్తితుల ప్రభావము ,అదృష్టం కలిసి రావటం వల్ల భారత రాష్ట్ర పతి గా సుమారు నెల రోజులు పని చేసిన అదృష్ట వంతుడు జస్టిస్ హిదయ తుల్లా .ఆయన తన జీవిత చరిత్ర ను ”my own Boswell” గా రాసుకొన్నారు .ఈ పుస్తకాన్ని మొన్న అలబామా పర్యటన లో నాకు మైనేని గోపాల కృష్ణ గారు కానుక గా ఇచ్చారు .అందులో అందరికి పనికి వచ్చే హిదయతుల్లా గారి హ్రుదయావిష్కరణే ఈ వ్యాసం .

ప్రఖ్యాత విమర్శకుడు ,నిఘంటు నిర్మాత శామ్యుల్ జాన్సన్ శిష్యుడు బాస్వేల్ .గురువు గారి జీవిత చరిత్ర ను అత్యద్భుతం గా రాశాడు బాస్వేల్.ఎవరైనా గొప్ప శిష్యుడు ఉంటె అతన్ని శామ్యుల్ గారి బాస్వేల్ అంటారు .కాని హిదయతుల్లా ప్రతి వాడు తనకు తాను బాస్వాల్ అన్నారు .జీవిత చరిత్ర రాసుకోవటం కష్టమే నంటూ దాన్ని ఇనుప కలం తో వజ్రపు పాళీ తో రాయాలి అన్నారు .స్వీయ చరిత్ర ”మరచి పోయిన విషయాలలో సగానికి రికార్డ్ అని అవి నిజమో ,అబద్ధమో కాని మధుర జ్ఞాపకాలు అవటం మాత్రం నిజం ”అన్నాడు .ఈ సందర్భం గా బాస్వేల్ ను గుర్తు చేసు కొంటూ అతను ప్రపంచం లో జీవిత చరిత్రలను వ్రాసిన వాళ్ళలోమొట్ట మొదటి అత్యంత గొప్ప ప్రతిభా వంతుడు అని కితాబు ఇచ్చారు . .

హిదాయ తుల్లా వంశం విద్యలో తర తరాలుగా ముందు న్నది .సాధారణం గా ముస్లిములు తమ వంశాలు పర్షియా కో ,అరేబియా కో చెందినవని గర్వం గ చెప్పు కొంటారట .కాని తమ పూర్వీకులకు ఈ విషయం లో ఏ ప్రమేయమూ లేదంటారు. తమ కుటుంబం లో పంది మాంసము తో పాటు ఆవు మాంసమూ నిషిద్ధమే నన్నారు .దీపావళి పండుగను హిందువు లతో బాటు తామూ ”దివస్ ”అనే పేర జరుపు కొంటామని తెలిపారు .

మెకాలే ను జ్ఞాపకం చేసుకొంటూ ఆయన జ్ఞాపక శక్తికి ఉదాహరణ ఒకటి చెప్పారు .మెకాలే తండ్రి కొడుకును ”claarissa harlowe’.చదివావా అని అడిగితే చదివానని చెప్పటమే కాకుండా ఆ నవలను పేజీలకు పేజీలు అప్ప గించి తండ్రి ని ఆశ్చర్యం లో పడేశాడట .అలాగే తన తండ్రి ఖాన్ బహదూర్ హఫీజ్ మొహమ్మద్ విలాయ తుల్లా తొమ్మిదో ఏడాదికే పవిత్ర ఖురాన్ అంతా హృదయగతం చేసుకోను ”హఫీజ్ ”అయ్యారని గర్వం గా చెప్పారు .ఉర్దూ లో ”బాబాయ్ ”అంటే తండ్రి అనిఅర్ధం ట ”.బాబాయ్ ఉర్దూ” అంటే ఫాదర్ ఆఫ్ ఉర్దూ అని అర్ధం అన్నారు .

తనతో పాటు చదివిన అనంత శయనం అయ్యంగార్ కి ఐ.సి.ఎస్ పరీక్షలో” వైవా వోసి” లో మార్కులు నిరాకరించటం వల్ల ఏడవ రాంక్ వచ్చిందట .లేక పోతే మొదటి స్థానం సంపాదించి ఉండే వారట అయ్యంగార్.ఆయన మద్రాస్ హైకోర్ట్ ప్రధాన న్యాయ మూర్తిగా ఉండి పోవలసి వచ్చిందట .తాను ఆ పోటీ పరీక్షకు వెళ్లి సమయాన్ని వృధా చేసుకోక పోవటం వల్ల సుప్రీం కోర్ట్ ప్రధాన న్యాయ మూర్తి అయాను అన్నారు .ఆ పరీక్ష జోలికి పోక పోవటం వల్ల తనకు అమూల్య మైన 14ఏళ్ళ కాలం కలిసి వచ్చిందన్నారు .

తుల్లా గారి జేబులో ఎప్పుడు గోళీలు ఉండేవట .ఒక గోలీ ఎప్పుడూ నోట్లో ఉండేది .ఒక సారి గాజు గోలీలను కొట్టే పెద్ద సీసపు గోళీ ని -దీన్నే ”బిల్లేరు ”అంటారు నోట్లో పెట్టు కొని మింగేశాదట.ఇంకేముంది విరేచనాల మందేమందు .అప్పుడు కాని బయట పడ లేదు .ఆయనకు నా లానే డ్రాయింగ్ అంటే భయం .వేస్తున్నట్లు నటించ్స్తూ సోదరుడి సాయం తో బొమ్మలు పూర్తీ చేసే వారు .ఒక సారి మేస్టారికి అడ్డం గా దొరికి పోయారు .ఆయన హెడ్ మాస్టర్ కి రిపోర్ట్ ఇచ్చాడు .హెడ్ అడిగితే తనకు డ్రాయింగ్ ఇష్టం లేదని చెబితే నవ్వి, సబ్జెక్ట్ మార్పించాడు .

1954లో ఒక సంక్షేమ నిది కోసం తాను చీఫ్ జస్టిస్ టీం కు కెప్టెన్ గా గవర్నర్ టీం తో ఆడానని ,తాను అయిదవ బాట్స్మన్ గా వచ్చి ,తన టీం మొత్తంమూడు పరుగులకే మొత్తం అవుటయితే అందులో మొదటి పరుగు ఒకే ఒక్క పరుగు తనదే నని చెప్పారు .

మయూర్ భంజ్ రాజ్య వారసుని సంక్షోభం తల ఎట్టి నప్పుడు వారి రాజ గురు తో సంప్రదించి బాబుదాని అనే రా కుమార్తె ను రాణి ఆయె తట్లు దివాన్ అయిన తమ తండ్రి చేసి కొత్త సంప్రదాయానికి తేర తీశార ని రాశారు బ్రిటీష రాజ పాలన లో ఒక రాజ కుటుంబం లో కుమార్తె కు పదవి దక్కటం అదే ప్రధమం అని చెప్పారు .దానికి ఆ కుటుంబం ,ఆ ప్రజలు తమ కుటుంబానికి కృతజ్ఞతలు చూపారని అన్నారు .తాను మధ్య ప్రదేశ్ ప్రధాన న్యాయ మూర్తి అయి నప్పుడు ”గడ్డం దివాన్ గారి అబ్బాయి ”అని తనను పలకరించారని చెప్పారు .బస్తర్ లోని ఇంద్రా వతి నది గొప్ప జలపాతం వల్ల ఏర్పడిందని అది సుందర దృశ్యం అని వివ రించారు .

కాలేజిలు అంటే” గులక రాళ్ళను పాలిష్ పెట్టేవి ,వజ్రాలను కాంతి హీనం చేసేవి” అంటారు హిదయ తుల్లా .నాగపూర్ కాలేజి లో అన్ని మతాల పండుగలను అన్ని మతాల వారు కలిసి చేసే గొప్ప సంప్రదాయం ఉండేదట .లండన్ లో ధియేటర్లలో నాటకాలు బాగా ఉండేవట .జాన్ గీల్గుడ్ అనే నటుడు హామ్లెట్ వేషం అత్యద్భుతం గా వేసే వాడని ,మహా నటన ప్రదర్శించే వాడని అందుకే అతనికి ”నైట్ హుడ్”పురస్కారం లభించిందిఅన్నారు . .ఒథెల్లో నాటకం లో పాల్ రోబెంసన్ అనే నీగ్రో ముఖ్య పాత్ర పోషించే వాడట అతనితో ఒక తెల్ల జాతి మహిళ స్త్రీ పాత్ర ధరించా వలసి వచ్చిందట .ఆమెను చేస్తారా అని అడిగితే ”i would consider it an honour ” అని సంస్కారాన్ని ప్రకటించింది …ఒక సారి నాటక ప్రదర్శన లో ప్రఖ్యాత నాటక రచయిత బెర్నార్డ్ షా వస్తే చూసి సంతోషం పట్ట లేక ”అదుగో షా”అని అరిచారు హిదాయ తుల్లా .షా వెనక్కి తిరిగి చూశాడట .ఆయన దృష్టి లో పడటమే ఈయనకు కావలసింది .పోలీసులు రెక్కలు పట్టి లాగేశారట .

నాగపూర్ లో హై కోర్టు న్యాయ మూర్తిగా పని చేసినపుడు రామినేని కౌసలేంద్ర రావు అనేఉయ్యూరు దగ్గర కుమ్మమూరు నివాసి న్యాయ వాది గా ఉండే వారు .ఆయన భాస్కరేంద్ర రావు గారి తండ్రి .ఆ తర్వాతా ఎన్నో పదవులు ఆయన్ను వరించాయి .తెలుగు అకాడమీ లో పని చేసి విజ్ఞాన సర్వస్వాల నిర్మాణం లో సహకరించారు .కౌశలేంద్ర రావు గారి ఫోటో ను హిద్య తుల్లా తన స్వీయ చరిత్ర లో ముద్రించి వారితో తనకున్న అనుబంధాన్ని చాటారు .

హిదయతుల్లా గారు హిందూ స్త్రీ శ్రీ మతి పుష్ప గారిని వివాహం చేసుకొని కొత్త దారి తొక్కారు .వారి దాంపత్యం చాలా అన్యోన్యం గా సాగింది చివరిదాకా .వారికి ”అవని ”అనే కూతురు ,”అర్షద్ ”అనే కొడుకు పుట్టారు .కాని కూతురు కు ”నీలం రంగు శరీరం ”ఏర్పడి(fallot’s tetralogy) చాలా ఇబ్బందులు blue babyఅని పించుకొని . అతి చిన్న వయసు లోనే చని పోయి ఆ కుటుంబానికి తీవ్ర మనోక్షోభ కల్గించింది .ఆ పిల్లను ప్రాణ ప్రదం గా చూసుకొని అందిన అన్ని వైద్యాలు చేయించినా ,చివరికి ఆపరేషన్ అవసరం అయి చేయించినా ఫలితం దక్కలేదు .ఆపరేషన్ తరువాత మర నించింది .

నాగ పూర్ లో ప్రధాన న్యాయ మూర్తి గా ప్రమాణం స్వీకరించే అధ్యాయం లో ”under pain pleasure -under pleasure pain lies (emersan )”అనే ప్రఖ్యాత రచయిత ,దార్శనికుడు ఎమర్సన్ మాటలను సందర్భోచితం గ కోట్ చేశారు .లెక్కలు నిర్దుష్టం గా రాసే వారు .కక్కుర్తి లేదు .న్యాయాన్ని నూటికి నూరు పాళ్ళు అమలు చేసే వారు .కే.ఎస్.దాస సుప్రీం కోర్ట్ చీఫ్ జడ్జి గా ఉన్నప్పుడు ఫోన్ చేసి హిదయతుల్లాను సుప్రీ కోర్ట్ జడ్జి గా బాధ్యతలు స్వీకరించమని స్వయం గా ఫోన్ చేసి చెప్పటం ఆయన వ్యక్తిత్వానికిచ్చిన గొప్ప కితాబు .అక్కడికి చేరిన తర్వాతా కేసులన్నీ అతి శ్రద్ధగా చదివి కోర్టు కు హాజరయ్ వారు .అన్నీ కూలం కషం గా అధ్యయనం చేయటం మొదటి నుంచి అల వడింది .

అనేక సంవత్స రాలు మౌన వ్రతం లో ఉన్న ”మెహర్ బాబా ”గారి పై జరిగిన ఒక సభలో ఢిల్లీ లోసుప్రీంకోర్ట్ చీఫ్ జస్టిస్ హిదయతుల్లా అధ్యక్షత వహించారు .మెహర్ మహాత్మ్యం పై సుదీర్ఘ ప్రసంగం చేసి అందర్ని మెప్పించారు .ఆ ప్రసంగం టేప్ ను మెహర్బాబా కు పంపారు .ఆయన సంతోషించి ”remember me on my next birth day ”అని సందేశం పంపారు .దాని భావమేమిటో ఎవరికి అంతు బట్ట లేదు .తీవ్రం గా ఆలో చిస్తే మెహర్బాబా పుట్టిన రోజు ఫిబ్రవరి ఇరవై అయిదు అని తెలుసు కొన్నారు .

ప్రధాన న్యాయ మూర్తి ముందుకు మొదటికేసు నాగపూర్ బాబా తాజుద్దీన్ కేసు వచ్చింది .దాన్ని పరిశీలిస్తున్నారు .ఒక రోజున వచ్చే నెల చివర్లో ఆయన్ను హత్య చేయ బోతున్నట్లు ఒక ఆకాశ రామన్న ఉత్తరం వచ్చింది ”.దానికేమీ ప్రాధాన్యత నివ్వక చించి పారేశారు .ఒక రోజు కోర్ట్ లో ఒక ఆగంతకుడు కత్తి పట్టు కొని ఈయన మీదకు వైద్యలింగం అనే ఆయన గ్రోవర్ అనే న్యాయ మూర్తి మీదకు అందర్నీ తప్పించుకొని వచ్చి వైద్యలింగాన్ని కత్తితో పొడిస్తే హిదయతుల్ల వగైరాలు అడ్డు పడ్డా గాయమై రక్తం తో బట్టలన్నీ ఎరుపెక్కాయి .వాడి కత్తిని చాకచక్యం గా కింద కార్పెట్ లో గుచ్చు కోనేట్లు చేయటం తో ప్రమాదం తప్పింది .వెంటనే వైద్య సదుపాయానని వైద్య లింగానికి ఎర్పాటు చేసి ప్రధానికి ,హోమ్ మినిస్టర్ కు ఫోన్ లో తెలియ జేశారు .ఎంతో ధైర్యాన్ని ,నిబ్బరాన్ని ప్రదర్శించి చీఫ్ జస్టిస్ ప్రమాదాన్ని నివారించారని పత్రికలన్నీ ప్రశంసించాయి .దాడి చేసిన వాడి పేరు మన్ మోహన్ దాస్.కోర్ట్ లో కేసు నడి చింది .తనకు ప్రత్యెక స్థానం ఇస్తా మంటే వద్దని తిరస్కరించి ,మామూలు సాక్షి గానే హాజరయారు .

భారత దేశాధ్యక్షులు మహా మేధావి సంస్కారి విద్యా వంతుడు గాంధి గారి ప్రియ శిష్యుడు జాకీర్ హుస్సేన్ మరణించారు .వి.వి.గిరి తాత్కాలిక రాష్ట్ర పతి అయారు .ఆయన తో ప్రమాణ స్వీకారాన్ని హిదయతుల్లా చేయించారు .ఈ చాప్టర్ లో ప్రారంభాన when good men die thier goodness does not perish –but lives though they are gone ”అన్న ఈరిపిడియాస్ వాక్యాన్ని సందర్భోచితం గా ఉదాహరించారు .

గిరి గారికి సంజీవ రెడ్డి గారికి రాష్ట్ర పతి పదవి కోసం పోటీ జరిగింది .అప్పుడు గిరిగారు పదవికి రాజీ నామా చేశారు ఎన్నికలలో నిలబడి ప్రచారం చేసుకోవటానికి . సంప్రదాయం ప్రకారం ప్రధాన న్యాయ మూర్తి తాత్కాలిక ప్రెసిడెంట్ అవుతారు .హిదాయ తుల్లా గారికి ఆ అదృష్టం దక్కి రాష్ట్ర పతి భవనం చేరారు .ఊహించని పరిణామం .అదృష్టం తన్నుకు రావటం అంటే ఇదే .35రోజులు ఆక్టింగ్ ప్రెసిడెంట్ గా పదవిని నిర్వ హించారు .అప్పుడే అమెరికా ప్రెసిడెంట్ నిక్సన్ భారత దేశ పర్యటనకు వచ్చారు .భారత దేశానికి మేమేమి సహాయం చేయగలం అని నిక్సన్ అడిగితే ”మా జనాభా బాగా పెరిగి పోతోంది .దాన్ని నియంత్రించే విధానాలు అమలు చేయటం లోను ,సంచార వైద్య విధానాన్ని ఏర్పరచటం లోను ,కుటుంబ నియంత్రణ కు సాయ మందించటం లోను ,గ్రామ సౌభాగ్యానికి దోహద పడటం లోను సహాయం చేయమని భారత రాష్ట్ర పతి అమెరికా అధ్యక్షుడిని కోరారు .”i must make a note of this ”అన్నాడు నిక్సన్ .తనను చూడటానికి విపరీతం గా రోడ్ల మీద జనం చేరటం చూసి నిక్సన్ మీ ప్రెసిడెంట్ వచ్చినా ఇలానే జనం వస్తారా లేక అమెరికా ప్రెసిడెంట్ ను చూడటానికి ఇంత మంది వచ్చారా / అని అడిగాడు .హిదయతుల్లా ప్రశాంతం గా ”వాళ్ళంతా బుల్లెట్ ప్రూఫ్ కారు ఎలా ఉంటుందో చూడటానికి వచ్చిన వాళ్ళే ”అనే సరికి ఆయనా నవ్వాడు .

వరాహ గిరి వెంకట గిరి గారు ఇందిరా కాంగ్రెస్ తరఫున ,పాత కాంగ్రెస్ అభ్యర్ధి సిండికేట్అభ్యర్ధి అయిన నీలం సంజీవ రెడ్డి గారిని ఓడించి రాష్ట్ర పతి అయారు .హిదయతుల్లా మళ్ళీ ప్రధాన న్యాయ మూర్తి పదవి చేబట్టారు .

ఇదీ జస్టిస్ హిదయతుల్లా గారి హ్రుదయావిష్కరణం .

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –4-7-12–కాంప్-అమెరికా .

Posted in మహానుభావులు | Tagged | 1 Comment

అమెరికా లో ఆంద్ర తేజం సమాజ సేవా” భవానీ దీక్ష ‘

అమెరికా లో ఆంద్ర తేజం

సమాజ సేవా” భవానీ దీక్ష ‘

అమెరికా వచ్చి బాగా సంపాదిస్తూ హాయిగా విలాస జీవితం గడ పచ్చు నని అందరు అనుకోవటం సహజం .ఈ మధ్య కొందరు మాతృదేశాన్ని గుర్తించి ,అనేక సేవా ,అభి వృద్ధి కార్య క్రమాలలో భాగ స్వాము లవుతు ,జన్మ భూమి ఋణం తీర్చు కొంటున్నారు .ఎక్కడ ఉన్నా మన చుట్టూ సమాజం ఉంటుంది .సమాజ పురోగతే మానవ ప్రగతి .ఈ రెండు అవినా భావ సంబంధం కలిగి ఉంటాయి .మనం ఉంటున్న దేశం మనదే .అక్కడి సమాజమూ మనదే .అందు లో మనమూ ఒకల్లమే ఈ భావన వస్తే ,విశ్వ జనీన భావన కలుగు తుంది .అప్పుడు మనం చేసే సేవా కార్య క్రమాలకు ,అర్ధం ,పరమార్ధం లభిస్తాయి .ఇలా సమాజ సేవా కార్య క్రమాలలో నిర్వి రామం గా పాల్గొంటూ ,తన చుట్టూ ఉన్న సమాజ ప్రగతికి దోహద పడుతున్న తెలుగు వారెందరో ఉన్నారు .వారినే నేను ”అమెరికా లో ఆంద్ర తేజం ”అన్నాను .అలాంటి వారి లో అమెరికా ఆగ్నేయ రాష్ట్ర మైన అలబామా లోని హన్ట్స విల్ నివాసి ,కృష్ణా జిల్లా వాసి అయినశ్రీమతి కాకాని భవాని గారు ముఖ్యులు గా కనీ పించారు .క్రిందటి వారం నా అలబామా ప్రయాణం లో ,ఆమెను వారింట్లో భర్త డాక్టర్ ప్రసాద్ గారితో పరిచయం కల్గించారు నా మిత్రులు మైనేని గోపాల కృష్ణ గారు .ఆమె చేస్తున్న సమాజ సేవా కార్య క్రమాలను వివ రించి చెప్పారు . ”సమాజ సేవా భవానీ దీక్ష”గా ఆమె సాగిస్తున్న కార్య క్రమాలను మన వారందరికి అంద జేయట మే నా ఉద్దేశ్యం .మిగిలిన వారు కూడా ప్రేరణ పొందుతారనే విశ్వాసం .

ఆంద్ర ప్రదేశ్ లో కృష్ణా జిల్లాలో కూచి పూడి కి దగ్గర గ్రామం అయిన” పెడసన గల్లు” లో భవాని జన్మించారు .మెన మామ పెంపకం లో పెరిగారు .ఆయన ఈమె జీవితాన్ని తీర్చి దిడ్డ టానికి మంచి పునాది వేశారు .ఉయ్యూరు దగ్గర గ్రామ మైన ఆకునూరు నివాసి కాకాని బ్రహ్మేశ్వర రావు గారి పెద్ద కుమారుడుడాక్టర్ కాకాని ప్రసాద రావు గారి తో వివాహం జరిగింది .ఇద్దరు అమెరికా చేరారు .ప్రసాద్ వైద్య వ్రుత్తి లో విశేష అనుభవాన్ని సంపాదించి అలబామా లో హన్త్స్ విల్ లో స్థిర పడ్డారు .సంతానం కూడా అభి వృద్ధి లోకి వచ్చింది .సమాజం లో ఆదర్శమైన వైద్యులు గా ఆయన పేరొందారు .జెనరల్ మరియు వాస్క్యులర్ సర్జన్ గా ప్రసాద్ లబ్ధ ప్రతిష్టులు .కావలసి నంత సంపాదించి ,ఇక సంపాదన పై వైముఖ్యం పెంచుకొని వాలంటరీ గా పదవీ విరమణ చేశారు .సంసారం తో సంతృప్తి గా జీవిస్తున్నారు .

శ్రీ మతి భావాని34 ఏళ్ళు గా సమాజ సేవా కార్యక్రమాలలో ,విద్యా ,సంక్షేమ కార్య క్రమాలలో అగ్ర గామి గా నిలి చారు .భర్త కు చేదోడు గా ఉంటూ ,అన్యోన్య దాంపత్యాన్ని సాగిస్తున్నారు .ఆమె మంచి వాణిజ్య వేత్త .హన్ ట్స్విల్ లో ఎన్నో స్వచ్చంద సంస్థ లకు ఆమె నిర్వా హకు రాలు . .2004లో girls inc. state అవార్డ్ పొందారు .మరుసటి ఏడాదిnational conference for community sister hood పురస్కారక్మ్ పొంది తన సేవా కార్య క్రమాలకు తగిన గుర్తింపు తెచ్చు కొన్నారు .అలాగే arthitis foundation ,women hounoring wmen;s health మొదలైన విలువైన అవార్డులను ,రివార్డు లను పొందిన మహిళా మాణిక్యం కాకాకి భవాని గారు .

ఆమె ఆలోచన లన్ని సమాజ అభి వృద్ధి మీదే ఉంటాయి .ఆమె మేదో జనిత మైన భావనే ”ఆశా కిరణ్ ”అనే లాభా పేక్ష లేని సేవా సంస్థ .అమెరికా లో ఉన్న దక్షిణ ఆశియా వాసుల కల్లోల జీవితాలకు వెలుగు నివ్వటానికి ఏర్పడిన సంస్థ ఇది ..భవాని ”progres bank and trustకు కు సెక్రెటరి మరియు డైరెక్టర్ .అంతే కాదు -international finance for intergraph corporation కు సీనయర్ స్టాఫ్ సూపెర్వైసేర్ .ఇలా ఆమెను వరించని పదవి లేదు అంటే ఆశ్చర్యంలేదు .

సమాజం లో వివిధ వవర్గాల మధ్య సమన్వయము సాధించ టానికి ఆమె గొప్ప కృషి చేస్తున్నారు .అందరికి ఆరోగ్యం అందించాలనే ఆమె దీక్ష ఆమెది .దానికోసం ఆమె నడుం కట్టి ముందు నిలిచారు .ఎన్నో స్వచ్చంద సంస్థలను ఈ కార్య క్రమం లో భాగా స్వామ్యులను చేయటం లో కృత క్రుత్యులయారు .madisaan county medical alliance medical society of the state of Alabama కు అధ్యక్ష త వహిస్తున్నారు .అలానేsouth medical association and hospice కు సారధి గా ఉన్నారు .ఆమె స్వచ్చంద సేవా దీక్షితు రాలు . authority of the city of hants villiie hospital foundation ,మరియు the state wide health planning council వంటి ఎన్నో సంస్థలకు గౌరవ స్థానం లో బాధ్యతలు నిర్వ హిస్తు ,సమాజ హితైషి గా జీవితాన్ని సార్ధకం చేసు కొంటున్నారు .

సమాజం లో వివక్షత కు గురైనపిల్లలను , సమాజవిస్మృత పిల్లలకు ఆమె అండా ,దండా గా నిలుస్తున్నారు .వివిధ కారణాల సల్ల విద్యకు దూరమైనబడి ఈడు బాల బాలికలను స్చూల్ల లో చేర్పించి ,వారి విద్యాభి వృద్ధికి పూర్తీ సహాయం అందిస్తున్నారు .దీనికి తార్కాణమే ఆమె the national children;s advocacy center in varjinia కు బోర్డ్ చైర్ పెర్సన్ గా గౌరవ స్థానాన్ని అది రోహించటం .ఆమె సేవకు తగ్గ ప్రతిఫలం, ,పురస్కారం ఇది .

విద్య నేర్వటం తో పాటు సరైన వృత్తిని ఎన్ను కోవటానికి తగిన సలహా సంప్రదింపులు ఇవ్వాలన్న ఆమె ఆలోచన మంచి కార్య రూపం దాల్చింది .ఎందరికో మార్గ దర్శనం చేసింది .దీనికోసంwomen council foundation కు ఆరేళ్ళు నిర్విరామం గా పని చేసి అనేక మంది కి ఉపాధి మార్గాలను కల్పించింది . U.A.H.foundation board commission ను ద్వారా అనేక ముందడుగు పధకాలను చేబట్టి ఆదర్శ మహిళా గా నిల బడింది .randolph school ,women;s economic development council foundtion boardవంటి మరెన్నో సేవా సంస్థలతో ,వాటి సేవలో ప్రత్యక్ష భాగస్వామ్యం భావాన్ని గారికి ఉంది .

సమాజాభి వృద్ధి పధకాలలో ముందుండి నడి పించిన ముందు చూపున్న మహిళా భవాని .వీటి కోసం Hants villiie maadisaan county కి అధ్యక్షు రాలిగా , హన్ ట్స్ విల్ తెలుగు సంస్థ కు ప్రారంభ అధ్యక్షు రాలిగా పని చేసి తెలుగు భాషా సంస్కృతుల ను సంరక్షించే అనేక కార్య క్రమాలను నిర్వ హించింది .కళా పురస్కారాన్ని అందుకొన్నది .కళా సంస్థart council కు నేతృత్వం వహించింది .హంట్ స్విల్ లోని అంతర్జాతీయ సంఘానికి మార్గ దర్శనం చేసింది .ఆ సంస్థ శత ,ద్వి శత వార్షికోత్సవ నిర్వ హాణ లో ప్రముఖ పాత్ర వహించింది .

ఆమె ఆర్ధిక శాస్త్రం లో డిగ్రీ సాధించింది .బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ అండ్ ఫైనాన్స్ లో హన్త్స్ విల్ లోని అలబామా యుని వేర్సిటి నుండి మాస్టర్ డిగ్రీ సాధించింది .ఆమె పత్రికా రంగం లో కూడా ప్రముఖ పాత్ర వహిస్తున్నారు .”ప్రవాసి హెరాల్ద్’అనే పత్రిక ను స్థాపించి ,దాని సంపాదకు రాలుగా ఉంటూ ,దానినీ తన అభిరుచి మేరకు తీర్చి దిద్దు తున్నారు .’సమాజ సేవే ఉచ్చ్వాస నిస్శ్వాసాలుగా అనుక్షణం జీవితాన్ని పండించు కొంటున్న ధన్య జీవి శ్రీ మతి కాకాని భవాని . అందరికి ఆమె జీవితం ఆదర్శం కావాలి .ఉత్తేజం,ప్రేరణ పొందాలి .

మీ— గబ్బిట దుర్గా ప్రసాద్– 4-7-12.–కాంప్–అమెరికా
http://suvarchalaanjaneyaswami.wordpress.com

Posted in అమెరికా లో | Tagged | 1 Comment