నవయుగ కవి చక్రవర్తి పద్మ భూషణ్ శ్రీ గుర్రం జాషువా – సాహిత్య తత్వ వివేచన.4 వ భాగం.4.1.25.

నవయుగ కవి చక్రవర్తి పద్మ భూషణ్ శ్రీ గుర్రం జాషువా – సాహిత్య తత్వ వివేచన.4 వ భాగం.4.1.25.

Posted in రచనలు | Leave a comment

డా. జి.వి.సుబ్రహ్మణ్యం గారి – ఆంధ్ర సాహిత్య విమర్శ. ఆంగ్ల ప్రభావం.18 వ భాగం.4.1.24.

Posted in రచనలు | Leave a comment

టెంక ణా దిత్య కవిరాజశిఖామణి నన్నె చోడుని కుమారసంభవ కావ్య0.53 వ భాగం.4.1.24.

టెంక ణా దిత్య కవిరాజశిఖామణి నన్నె చోడుని కుమారసంభవ కావ్య0.53 వ భాగం.4.1.24.

Posted in రచనలు | Leave a comment

విశాఖ దత్త కవి కృత నాటకం. ముద్రా రాక్షస0 .18 వ భాగం.4.1.25.

విశాఖ దత్త కవి కృత నాటకం. ముద్రా రాక్షస0 .18 వ భాగం.4.1.25.

విశాఖ దత్త కవి కృత నాటకం. ముద్రా రాక్షస0 .18 వ భాగం.4.1.25.

Posted in రచనలు | Leave a comment

నవయుగ కవి చక్రవర్తి పద్మ భూషణ్ శ్రీ గుర్రం జాషువా గారి – సాహిత్య తత్వ వివేచన.3 వ భాగం.3.1.25.

నవయుగ కవి చక్రవర్తి పద్మ భూషణ్ శ్రీ గుర్రం జాషువా గారి – సాహిత్య తత్వ వివేచన.3 వ భాగం.3.1.25.

నవయుగ కవి చక్రవర్తి పద్మ భూషణ్ శ్రీ గుర్రం జాషువా గారి – సాహిత్య తత్వ వివేచన.3 వ భాగం.3.1.25. https://youtu.be/0SxuAPuIB6g

Posted in రచనలు | Leave a comment

డా. జీ.వి.సుబ్రహ్మణ్యం గారి – ఆంధ్ర సాహిత్య విమర్శ – ఆంగ్ల ప్రభావం.17 వ భాగం.3.1.25.

డా. జీ.వి.సుబ్రహ్మణ్యం గారి – ఆంధ్ర సాహిత్య విమర్శ – ఆంగ్ల ప్రభావం.17 వ భాగం.3.1.25.

Posted in రచనలు | Leave a comment

టెంక ణా దిత్య కవిరాజశిఖామణి నన్నె చోడుని కుమారసంభవ కావ్య0 .52 వ భాగం.3.1.25.

టెంక ణా దిత్య కవిరాజశిఖామణి నన్నె చోడుని కుమారసంభవ కావ్య0 .52 వ భాగం.3.1.25.

టెంక ణా దిత్య కవిరాజశిఖామణి నన్నె చోడుని కుమారసంభవ కావ్య0 .52 వ భాగం.3.1.25.

Posted in రచనలు | Leave a comment

విశాఖ దత్త కవి కృత నాటకం

ముద్రా రక్ష సం.17 వ భాగం.3..1.25.

విశాఖ దత్త కవి కృత నాటకం

ముద్రా రక్ష సం.17 వ భాగం.3..1.25.

విశాఖ దత్త కవి కృత నాటకం

ముద్రా రక్ష సం.17 వ భాగం.3..1.25.

Posted in రచనలు | Leave a comment

పల్లి కుల (అగ్ని కుల క్షత్రియ )అస్తిత్వం ,గౌరవం కోసం అహరహం శ్రమిస్తున్న శ్రీ చింతా కృష్ణ బాబు

’’నా అక్షరాలు పల్లవ పౌరుష బడబాగ్ని సమ్మిళితాలు,-నా అక్షరాలు అగ్నికుల క్షత్రియ తూణీరంలో అస్త్రాలు –నా అక్షరాలు చరిత్ర గతిని మరగున పరచిన ప్రక్షిప్తాల ముసుగు  తెరలను దహి౦ఛి వేసే అగ్ని కణాలు .సూర్య వంశ ప్రక్షిప్త ప్రాచీన పల్లవ చరిత్ర ప్రచోదనాలు ‘’అంటూ నిప్పులు కురిపిస్తూ భీషణ ప్రతిజ్ఞ చేశాడు .ప్రక్షిప్తచరిత్ర పరిశోధకుడు ,సూర్య వంశ పరిశోధకుడు ,దక్షిణ భారత అగ్నికుల క్షత్రియ ప్రాచీన వారసత్వ పరిశోధనా సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు . వర్మ చింతా అనే శ్రీ చింతా కృష్ణ బాబు’’,

 అగ్నికుల క్షత్రియ జాతి పితామహుడు మాహారాజ రాజశ్రీ పొన్నమండ లక్ష్మణ స్వామి వర్మ గారి ‘’అగ్నికుల దీపిక ‘’గ్రంథం కోసం చేస్తున్న అన్వేషణలో అంధకారం లో అద్భుత దీపంలా ,ఆధునిక భారత దేశ తొలి చరిత్ర పరిశోధకుడు కల్నల్ మెకంజీ స్వయంగా తాను పల్లి( అగ్నికుల క్షత్రియ)కులం పై పరిశోధన చేయించి రాయించిన ‘’అగ్నికుల దీపిక ‘’పల్లికులం (బల్లి చోడులు )పుట్టు పూర్వోత్తరాల కైఫీయత్తు కృష్ణ బాబుకు లభించింది .బహుశా పల్లికులం పుట్టు పూర్వోత్తరాలు పేరు స్పూర్తితో ,రేకాడి సముద్రారావు గారు తన ‘’అగ్నికుల క్షత్రియ పుట్టు పూర్వోత్తరాలు ‘’ ఆని పేరు పెట్టుకొన్నా ,దీనిపేరుకానీ ,మెకంజీ కైఫీయత్తు ప్రస్తావన కానీ ఎక్కడా పేర్కొనక పోవటం విచిత్రంగా అనిపించింది’’ బాబు’’ కు .అందుకని ‘’గర్వంగా రొమ్ము విరుచుకొని చెప్పండి మనం పల్లి అంటే పల్లవ –చోళులం ‘’ఆని ప్రబోధించాడు .

  ‘’సనాతన భారత దేశం లో ఘనమైన చరిత్ర కలిగిన ఏకైక కులం నా అగ్నికుల క్షత్రియ (పల్లి )కులమే –నా కులం ఇది ఆని నానోటితో నేను చెప్పుకోలేని కులం కూడా నా అగ్నికుల క్షత్రియ( పల్లి ) కులమే ‘’ఆని గర్వంగా చెప్పుకోమని ఆకుల అస్తిత్వాన్ని గౌరవాన్నీ కాపాడుకోమని విజ్ఞప్తి చేశాడు కృష్ణ .అలనాటి శ్రీ కృష్ణ శంఖారావం గా పూరించి చెప్పాడు .తాము పల్లికులం బల్లి చోడ(అగ్నికుల )క్షత్రియ రాజవంశ వారసులం ఆని చెప్పుకొనే ఉన్నత స్థితి నుంచి మేము పల్లికారులం కాదు ‘’మత్స్య కారులం ‘’అంటూ హీన స్థితికి దిగజార్చి ,పల్లి అంటే అదేదో బూతు మాటలా వక్రీకరించి ,తమ వేళ్ళతో తమ కళ్ళనే పొడుస్తున్న కుహనా మనుష్యులను ఎండగడుతున్నాడు .వక్రీకరించిన తమ చరిత్రను తిరగరాద్దాం  రారండి ‘’ఆని పిలుస్తున్నాడు బాబు .తమవారు తమకు దూరం చేసిన ‘’ఈ తరం ‘’ తమజాటికి ఇంతవరకు తెలియని ,మరుగున పడిన అరుదైన చరిత్ర ‘’పల్లికులం (బల్లి చోడులు )పుట్టు పూర్వోత్తరాలు కైఫీయత్తు ను శోధించి ,పరిశోధించి ,సూర్యవంశపరిశోధకుడిగా సగర్వంగా ,సూర్యవంశ అగ్నికుల క్షత్రియ చరిత్రను మొదటి సారిగా యధా తధంగా మనము౦దుంచాడు ఈ పరిశోధక బాబు .పల్లి అంటే ఎంత గొప్పదో ఎంత ప్రాచీనమైందో చెప్పటానికి మెకంజీ కైఫీయత్తు ఒక్కటి చాలు అన్నాడు .రెండు వేల సంవత్సరాలకు పూర్వం కావేరినది పై ఆనకట్ట కట్టిన ‘’ప్రపంచపు మొట్టమొదటి సివిల్ ఇంజనీర్ ‘’కరి (ర్రి)కాల చోళ చక్రవర్తి పల్లి కులంజాతి మూల పురుషుడు .శక పురుషుడు .వెయ్యేళ్ళ క్రితం పల్లవ జనిత రాజ వంశాలన్నిటినీ ఐక్యం చేసి ,అగ్నికుల క్షత్రియ పేరును సుస్థిరం చేసిన శక కర్త –కరి రాజరాజ చోళుడు ,నడుస్తున్న కాలం లో దిగజారిపోతున్న అగ్నికుల క్షత్రియ ఔన్నత్యానికి తిరిగి ఊపిరి పోస్తున్న పల్లవ కేసరి ,నవ శక కర్త –కర్రి స్వామినాథన్ చోళుడు ’’ఆని తమకులం గర్వంగా ప్రకటి౦చాలని హితబోధ చేశాడు .

  ఇంతటి తపన ఉన్న రచయిత కృష్ణబాబు నాకు పదేళ్లుగా పరిచయం .నేనేదో ‘’పోడిచేస్తున్న’’ రచయితను ఆని ఎప్పుడూ’’ పంపు’’ కొడుతూఉంటాడు .అతనిలో ఇంతటి తృష్ణ ఉందని మొన్న జరిగిన ప్రపంచ తెలుగు రచయితలసభ మొదటి రోజు అతడు నాకుకనిపించి ,పై వివరాలన్నీ చెప్పి ,.ఆ కైఫీయత్ గ్రాంధిక భాషలో ఉందనీ ,దాన్ని వ్యావహారిక భాష లోకి మార్చి రాసి ఇవ్వమని కోరాడు .సరే అన్నాను .దాన్ని అక్కడికక్కడే వాట్సాప్ లో పంపాడు .నాలుగైదు రోజుల్లో ఆపని చేస్తాను అన్నాను .కానీ ఆగలేక మర్నాటినుంచే రోజూ మధ్యాహ్నం రాసి పూర్తి చేసి నిన్ననే అతడికి మెకంజీ కైఫీయత్ ను వ్యావహారికం లో రాసి పంపాను .  అందులో కొంత నాకు అర్ధం కాలేదని కూడా ఫోన్ చేసి చెప్పాను .అతని వంటి సంస్కారి ,తపన ఉన్న రచయితలూ అరుదుగా ఉంటారు .ఆటను నన్ను గురువుగారు ఆని పిలుస్తాడు గౌరవంగా .ఇదంతా చదివితే అతడే గురు స్థానం లో ఉన్నాడని ,అతని పరిచయం ఒక అదృష్టం అనిపించింది

  సాహితీ బంధువులకు పంపిస్తే మీలో ఎవరైనా అతడికిమరింత సాయపడగలరని ,ఆవివరాలు, కైఫీయత్ దీనితో జత చేస్తున్నాను .  ..

పల్లికులం కైఫీయత్

శ్రీ సదాశివుని ఆజ్ఞతో గడచిన కృతయుగం ద్వాపర యుగం త్రేతాయుగం అనే మూడు యుగాలు గడిచి పోయాక ,కలియుగంలో పరీక్షిత్ మహారాజు మొదలైన కొందరు రాజులు గతి౦చాక ,సూర్య వంశం లో సమస్త భూమండలం లో అఖండ ప్రతాప సూర్యప్రకాశంతో ప్రావిర్భావం చెంది ,శత్రురాజ గర్వం అనే చీకటిని చీల్చి ,కీర్తి అనే కాంత తో మలయ పర్వత శ్రేణులలో విహరిస్తూ ,శ్రీ అరుణ చోళుడు తెల్లని శరీరం కలవాడు శ్రీ ముది గొండ చోళ రాజుల వంశ శిరో భూషణుడైన వీర విక్రమ చోళ మహారాజు ,చోడ మండలం లో విక్రమపురి  లో సింహాసనం పై అధిష్టించి ,చతుస్సముద్ర వేలా వలయిత భూమండలాన్ని ,ఏకచ్చత్రాధిపత్యంగా సుపరిపాలన సాగిస్తు,సకల రాజ భోగాలు అనుభవిస్తునాడు.ఇన్నిఉన్నా,తనతర్వాత రాజ్యానికి వారసులై వంశ వర్ధనులైన  పుత్రస౦తానం లేకపోవటంతో విచార హృదయంతో ఒక రోజు మంత్రులను పిలిపించి వారి సలహా ప్రకారం రాజ్యభారం అప్పగించి కాళహస్తి క్షేత్రానికి వెళ్ళి  శ్రీ కాళహస్తీశ్వరుని కై తీవ్ర తపస్సు చేస్తుండగా ,తపస్సుకు మెచ్చి గరళ క౦ఠుడు పరమేశ్వరుడు పార్వతీసహితంగా ప్రత్యక్షమై ,కోరిక ఏమిటో చెప్పమన్నాడు .’’దేవా !మీ అనుగ్రహంతో సర్వమూ అనుభవిస్తున్నాను .కానీ పుత్రసంతానం లేకపోవటంతో ‘’అపుత్రస్య గతిం నాస్తి ‘’అన్న వేదసూక్తి ప్రకారం  నాకు గతి దిక్కు లేదు. నీవే భారం వహించిఅనుగ్రహించాలి ‘’అనిదీనంగా ప్రార్ధించగా ,కరుణామయుడు స్వామి అనుగ్రహించి ‘’నాపట్టణంలో ఒక్క ఏనుగు నాకు రోజూ పరిచర్యలు చేస్తూ భక్తిపారవశ్యంతో నన్ను సేవిస్తోంది , అది నీకు పుత్రుడుగా జన్మించి నీ కోరిక తీరుస్తాడు  .అనుమానం లేదు’’ ఆని  దీవించి పంపాడు .

  తర్వాత పరమేశ్వరుడు ఆ ఏనుగును పిలిపించి ,ఆ వృత్తాంతం అంతా వివరించి చెప్పి ‘’నువ్వు చాలాకాలం నుంచి నాకు సేవ చేస్తూ నాకు పరమానంద౦  కలిగిస్తున్నావు .నువ్వు చోళరాజుకు వీర విక్రమ పరాక్రమ పుత్రుడుగా జన్మించాలి ,ఈ భూమండలాన్ని జనరంజకంగా పాలించి ,శాశ్వత  కీర్తి సంపాదించు .తర్వాత నీకు మోక్షం ప్రసాదిస్తాను ‘’ఆని దీవించగా ఆ కరి శిరస్సు వంచి చంద్రధరునికి నమస్కరించి ‘’దేవా !నీ చిత్తం ‘’అని బాల కుమార రూపం దాల్చగా ,ప్రమధులు కొందరు ఆ బాలుని విక్రమ భూపాలుని దగ్గరకు తీసుకొని వెళ్ళి ‘’మహారాజా ! ఈ బాలుడు ఈశ్వరదత్త వరకుమారుడు .ఇతడిని పట్టపు రాణికి ఇవ్వండి .’’ఆని చెప్పారు .రాజు దివ్య తేజో సంపన్నుడైన ఆబాలుడిని అంతః పురానికి తీసుకొని వెళ్ళి మహారాణితో ‘’ఈ పిల్లవాడు సదాశివ అనుగ్రహ సంపన్నుడైన కుమారుడు .మనకు లభించాడు ఇదంతా ఈశ్వరానుగ్రహం .చక్కగా పోషించి తీర్చిదిద్దు ‘’ఆని చెప్పి అప్పగించగా ఆమె మహదానందంతో ఆ బాలుడికి ‘’కరి కాల చోడుడు ‘’అనే పేరు పెట్టి శ్రద్ధగా పెంచుతోంది .అతడు దిన దిన ప్రవర్ధ మానంగా అభివృద్ధి చెందుతూ ,కమల బంధువు లాగా తేజస్సుతో విరాజిల్లు తున్నాడు .

 తండ్రి   అరి వీర విక్రమ చోళుడు కరికాల చోళునికి మళయాళ రాజు కుమార్తె  పుణ్యవతి తో వివాహం చేసి ఆతర్వాత సకల సామ్రాజ్యానికి పట్టాభిషిక్తుని చేసి ,భార్యా సమేతంగా తపోవనానికి వెళ్ళిశేషజీవితాన్ని తపస్సుతో గడిపాడు .కరికాల చోళుడు సత్యహరిశ్చంద్రునిలా  సత్య వాక్య పరిపాలకుడై ,కార్తవీర్యునిలా అవక్ర పరాక్రమంతో  ,నల మహారాజు  వంటి సౌందర్యంతో ,ఆది శేషుని వంటి వాక్పటిమతో ,పరశురాముని వంటి ప్రతిజ్ఞా పాలనంతో ,శ్రీరామ చంద్రుని వంటి శరణాగత రక్షణ తో ,సుగ్రీవుని వంటి ఆజ్ఞలతో,శిబి చక్రవర్తి వంటి దానగుణ సంపదతో ,,మెరు పర్వతం వంటిధైర్యం సముద్రుని వంటి  గాంభీర్యం , చంద్రుని వంటి కాంతి , ,దేవేంద్ర వైభోగంతో ,కుబేరుని వంటి ధన సంపత్తి తో చతురంగ సేనా బలం తో దిగ్విజయ యాత్ర చేసి  అరివీర భయంకరుడు ఆని పించుకొన్నాడు .అనేకమంది రాజులు ఇచ్చిన కానుకలు కప్పాలతో తన ప్రతాపానికి నిలువెత్తు దర్పణంగా మెరువు అంతటి ఎత్తైన  జయ స్తంభం నాటించాడు .దానికి రెండు ప్రక్కలా తన దాన ,వీర శాసనాలను చెక్కించాడు .సమస్త ద్వీపాలకు ఏక చత్రాధిపత్యంగా పాలించాడు .

  కాశీ లో  నుంచి రామేశ్వరం వరకు ఉన్న ఉత్తమకుల క్షత్రియుల చేత బంగారు కలశాలతో గంగా జలం తెప్పించి ,అ పుణ్య జలం తో రామేశ్వరంలో  సేతుబంధ రామేశ్వరునికి అభిషేకం చేయించి ,నిత్య శివ పూజా దురంధరుడై శివ మహాదేవుని భక్తితో మెప్పించగా ,సదాశివుడు ప్రమధ గణాలతోకలిసి ప్రత్యక్షంగా వచ్చి ఆతడు పెట్టె ముప్పందు మిరియాలను నైవేద్యాలను కడుపారా భుజించేవారు .అతడి భక్తికి మెచ్చి రెండు సార్లు శివుడు ప్రత్యక్షమై ,వరాలు ప్రసాదించాడు .పర మేశ్వరునిలా ఆ రాజు ధర్మ దేవత నాలుగు పాదాలతో నడిచేట్లు బ్రహ్మక్షత్రియ వైశ్య శూద్రులు అనే నాలుగు జాతులవారిని తమ ఆచారాలు తప్పనట్లు సుపరిపాలన చేస్తున్నాడు .

  వసంత ఋతువులో ఒక రోజు  బాహ్య విహారం కోసం కావేరి నదికి వెళ్ళి అక్కడి ఒడ్డు పైన ఉన్న వట వృక్షం నీడలో పరివార సమేతుడై నిలిచి ,అక్కడి పెద్దలను అది ఏ పుణ్యనది ఆని అడగ గా వారు ‘’ఇది సంధ్యా పర్య౦త౦ గా ఉండి జనుల పాపాలను తొలగించే పుణ్య కావేరిమహా నది.పూర్వం ఈ నదీ తీరంలో శ్వేతకేతు ,,ముచికుంద మొదలైన మహర్షులు ఇక్కడ తపస్సు చేసి ,అభీష్ట సిద్ధి పొందారు .ఆ పుణ్యనది మహిమలను పురాణాలు వివరంగా తెలియజేశాయి .త్రేతాయుగం లో శ్రీరామ చద్ర్రుడు సముద్రానికి ఆనకట్ట కట్టించి ,లోక కంటకుడైన రావణాసురుని లంకకు ప్రవేశించి అతనితో సహా సకల రాక్షస సంహారం చేశాడు . ,కరికాలుడు అప్పుడు సమస్త జనులకు మహోపకారం కోసం కావేరి నదికి ఆనకట్ట కట్టించి ,చప్పన్న దేశాల ప్రజలచేత వెట్టి చేయిస్తానని ప్రతిజ్ఞ చేసి,అంగ వంగ కళి౦గ ,అవంతి ,పులిద ,కేరళ ,హాటక మహారాట ,ఘూర్జర కుశ కర్ణాట,లాట మాళవ ,మచ్చప ,నేపాళ,గాంధార పాంచాల కాంభోజ ,కురు సింధు ,జాలుక ,కాశ్మీర ,విదేహ ,పాండ్య ,బర్బర ,బాహ్లిక ,హూణ,కుంతల ,,ద్రవిళ ,సౌరాష్ట్ర ,త్రిగర్త ,ఖోట ,గాంధార ,కాంభోజ విదర్భ ,వరాట ,జ్యోతిష ,  ఆంధ్ర ,దశానన ,యవన చేది ,మగధ ,కోసల ,టెంకణ,కొంకణ పౌండ్ర దేశాలకు వెళ్ళి ,ఆ రాజులు ,మంత్రులు పరిచారకులు మొదలైన సకల జనులణు తన పాదపద్మాల పై ఆన పెట్టి ,తోడి  తెమ్మని ఆజ్ఞాపించగా ,వారంతా ఆప్రకారం చేయగా ,సకల దేశాదీశులను పిలవగా ,వారు తమ సర్వస్వం వదిలేసి ,కిరీటాలున్న తలల మీద ,మట్టి తట్టలు ధరించి ,తాము తమ దేశీయులతో కలిసి కలసికట్టుగా కావేరి నదికి ఆనకట్ట కడుతుండగా ,కొందరు కొండ పట్టణానికి వెళ్ళి ,అక్కడి ప్రజలందర్నీ పిలుస్తూ ,ఒక ఇంటిలోశివారాధన సంపన్నురాలైన ‘’తిమ్మవ్వ ‘’అనే వృద్ధురాలైన వేశ్య ను చూసి ‘’అమ్మా !నువ్వు కరికాల మహారాజు కట్టే కావేరి గట్టు కట్టాలని కోరగా ఆముసలి వొగ్గు తాను  ఆశక్తురాలను .శరీరంలో శక్తి లేదు, అదీ కాక నేను నిత్య శివ పూజా దీక్ష లో ఉన్నాను ‘’ఆని చెప్పగా,వారు ఆమె మాట వినకుండా రాజాజ్ఞ తప్పక పాటించాలని వొత్తిడి చేయగా ,భక్తుల కాపాడే ఫాలలోచనుడు తానె ఆ ముసలి వేశ్య రూపం లో వచ్చి ,ఆముసలితిమ్మవ్వకు బదులు తానె వచ్చానని చెప్పి నమ్మించి ,గంగానది ,చంద్ర రేఖ ఉన్న శిరస్సుపై మట్టి తట్ట పెట్టుకొని మట్టిని మోస్తూ కావేరీ కట్ట కు సాయం చేస్తుండగా ,ఆమె దివ్య తేజస్సు గుర్తించిన కరికాల చోడుడు ‘’నువ్వు ఎవరు ?’’ఆని ప్రశ్నించగా శివుడు తన కళారూపం చూపించి ప్రత్యక్షమై వెళ్ళిపోయాడు .

  రాజ పరివారం పానుగంటికి వెళ్ళి,అక్కడ భోజరాజు రోజూ బంగారుపాత్రలతో సూర్యునికి పూజా ద్రవ్యాలు ఇస్తూ ఉండటం ఆయన ఆనందంగా గ్రహించటం ,అందువలన ఆయన అజేయుడుగా ఉండటం చూసి ,మట్టి మోయటానికి రమ్మని రాజాజ్ఞగా చెప్పగా ,తిరస్కరించి ‘’నాకంటే లోకంలో గొప్పరాజు లేడు. అలాంటి నేను వెట్టి చాకిరీ చెయ్యను ‘’ఆని చెప్పగా కరికాలుని భటులు ‘’భోజ మహారాజా !పర్వతాలలో మెరు పర్వతంలాగా ,సర్పాలలో ఆదిశేషుడు లాగా ,చుక్కల్లో చంద్రుడు లాగా ,దేవతలలోసదాశివుని లాగా ,కరికాల చోడుడు రాజులలో మహారాజు .ఆయన ఆజ్ఞ మీరితే  మీకు కీడు జరుగుతుంది ‘’ఆని హెచ్చరించగా ,భోజుడు తీవ్ర కోపంతో చూడగా వారు చేసేదిలేక కరికాలుని దగ్గరకు వెళ్ళి జరిగింది విన్న వించారు .చక్రవర్తి కరికాలుడు వారితో ‘’మీరు మళ్లీ వెళ్ళి పూజా పాత్రలను అందుకోకుండా సూర్యునికి ఆజ్ఞ పెట్టండి ‘’అన్నాడు .వాళ్ళు అలాగే చేయగా ఆబంగారు కలశపాత్రలు,ఆకాశంలో ఎగిరి పోగా ,భోజుడు తన ప్రతాపం తగ్గగా  వెట్టి చాకిరీకి వొప్పుకొని అలాగే మట్టి తట్టలు మోశాడు .

  కరికాలులి పరిచారులు కొందరు ధరణి కోట అనే అమరావతికి వెళ్ళి అక్కడ అమరేశ్వరుని సేవలో ధన్యుడై స్వామి అనుగ్రహంతో మూడవ కన్ను పొందిన ‘’ముక్క౦టీశ్వరుడు’’అనే రాజును కలిసి కరికాలుని ఆజ్ఞ చెప్పగా ‘’నేను ముక్కంటిని .రెండు కళ్ళున్న రాజుకు వెట్టి చేస్తానా ?””   ఆని ఆగ్రహించగా ,వెళ్ళి చక్రవర్తికి చెప్పగా ,అతడి గర్వాన్ని నిగర్వం చేయటానికి ,ఆరాజు ఆకారం నేలమీద రాయించి ,తన బొటన వ్రేలితో అతడి మూడోకన్నును చిదిమేయగా ఆ ముక్కంటి రాజు కన్ను రక్తం కారగా గర్వం వదిలి, వెట్టి చాకిరీకి ఒప్పుకోని తనవంతు పని చేసాడు .60లక్షల గొల్లలకు ప్రభువైన యాదవ రాజు మధురాపురాన్ని పాలిస్తున్నాడు .అతని దగ్గరకు వెళ్ళి కరికాలుని ఆజ్ఞ చెప్పగా మత్తుడైన అతడు ‘’  నీటిలో పుట్టిన గడ్డి పరక గల భూమికి అంతటికి నేనే రాజాధి రాజును .నేనెందుకు వెట్టికి వస్తాను ?’’అనగా  ఈవిషయ౦ కరి కాలుడికి చెప్పగా లాట లోచనుడిలా కోపం తో ఉగ్రుడై ,ఆకాశంలో విభూతిని తీసుకొని  మంత్రించి ,యాదవరాజు మందలపై చల్లి౦చగా , ఆ ఆవులు రక్తాన్ని వర్షి౦చగా ,గర్వం తగ్గి వెట్టికి తయారై  యాదవ రాజు మట్టిమోసి ,కావేరి వరకు కాలువత్రవ్వి౦చి ,కావేరీనదిని ప్రవహి౦ప జేయగా అది ‘’పాలేరు ‘’పేరుతొ పిలువబడింది .

  కరికాలుని భటులు అవంతి అనే పేరుగల భల్లాణు పట్టణానికి వెళ్ళి వెట్టికి రమ్మని పిలువగా అతడు గర్వంతో వాళ్ళను పట్టించు కోకుండా ,అక్కడ ఉండటం క్షేమం కాదని తలచి ,సముద్రుడిని ప్రార్ధించి ,సముద్ర మధ్యలో ఒంటి స్తంభం మేడ కట్టించుకొని ,తానూ పతివ్రతామతల్లి అయిన భార్యతో దిగులు లేకుండా ఉన్నాడు.వార్త విన్న కరికాలుడుసర్వ  సేనలను రాజులను పంపి  అక్కడికి వెళ్ళి వాడి తలనరికి తెమ్మని ఆజ్ఞాపించాడు .వాళ్ళు సముద్ర మధ్యంలో ఉన్న అతడిని  వోడించటం మానవ మాత్రులకు సాధ్యం కాదని హనుమలేక వాయుదేవతలకు  వంటి వారికే అది సాధ్యమని చెప్పగా , అతని తమ్ముడు రాజు ప్రతిజ్ఞ నేర వేర్చటనికి అమానుష రూపం పొందాలని దివ్యజ్ఞానం తో తెలుసుకొని,తుల్ల’’  (విడ్డూర )ముని సంతతిలో జన్మించి ,అసాధారణ వైభవ సంపన్నుడై ,మహాకోపిష్టి అయిన దూర్వాస మహాముని శాపం వలన సముద్ర జీవుల జీవనానికి సముద్రజలం ముఖ్యం అక్కడి జీవనానికి హాని కల్గించకు ఆని చెప్పగా ,ఆపురాన్ని వదిలేసి కావేరీ తీరం లోని ‘’కైకాల ఏవూరు ‘’అనే ఊరికి వెళ్ళి ‘’రెడియేవూరు ‘’ఆని దాన్ని అందరి చేత పిలిపించి ,వారి వలన పని కాదు ఆని తెలుసుకొని ,బంగారం వగైరా విలువైన కానుకలిచ్చి ,అనుకొన్న పని పూర్తి చేయించి ,’’మీరు నాకు పుత్రులై ,నేనిచ్చిన బిరుదులు గ్రహించి ,భూలోకం లో కలకాలం కీర్తి పొందుతారు ‘’ఆని అభయం ఆజ్ఞా ఇచ్చి పంపగా ,నమస్కరించి వెడుతూ భల్లుని ఆనతితో ఒక కోడి వచ్చి కూసి ,ప్రభాతకాలం ఆని తెలియక ,అర్ధరాత్రి వేళ  వెడుతుండగా , అతని ఆజ్ఞాప్రకారం ఒక పంది వచ్చిఒక ఉమ్మ చెట్టు ఎక్కబబోగా,పట్టు తప్పి ,త్రవ్విన గుంటలో పడి ,దారి దొరకక చికాకుపడుతూ ,శ్రీరాముని సతి సీత దశకంఠ రావణుని చేత పరాభవం పొందినట్లు ,అలంకారం లేకుండా ఉన్న ఆమెను చూసి నవ్వగా ,వారి ప్రార్ధనపై ఆ నల్లని వారికి ముక్కు ,చెవులు మొదలైన ఆభరణాలు వికారాలు లేకుండా శపించి ,వెళ్ళి లంకేశ్వరుడు రావణుని ఇంట ఉన్నమహాలక్ష్మిణి వెదుకుతూ ,తాము కార్యనిమిత్తం మయుడి బిలం లో అందమైన పూల వలె  ఆకోడి ,వరాహం తమలో ఎవరు కూతకూస్తే వారు గోహత్యా పాపం చేసినట్లే ఆని శపథం చేసి ,కామాక్షమ్మ సన్నిధికి చేరి ,సాష్టాంగ దండ ప్రణామం చేసి ‘’తల్లీ !పరంజ్యోతి స్వరూపిణీ !మాకు భల్లానుడి శిరస్సు ఖండించి తేవటానికి  అనుజ్ఞ, బల౦ ఇచ్చి ,ఆపని పూర్తికాగానే నీకు కోరిన వేట సమర్పించి మా భక్తీ ప్రకటిస్తాం .మా గృహాలలో కుంకుమ తాంబూలం మొదలైన కళ్యాణ ద్రవ్యాలతో అర్చిస్తాం .నిన్నే మా కులదేవతగా  భావించి పూజిస్తాం .’’ఆని విన్నవించుకోగా దేవి ప్రత్యక్షమై ‘’సముద్రం లోకి మీరు వెళ్లటం అసాధ్యం .నేనుగొల్ల స్త్రీనై మీకు దారి చూపిస్తా .’’ఆని అభయమిచ్చింది అమ్మ .వారి ముందర గొల్ల స్త్రీ వేషంతో ముందు నడుస్తూ ,మార్గం చూపిస్తూ ,’’మా కరికాల చోళ చక్రవర్తి సత్య ధర్మాలు తప్పని ఉత్తమ క్షత్రియ కులజుడైతే ,ఆ నిప్పుల యేరు శీతల ప్రవాహమై దాటటానికి వీలుగా ,వట్టి గాజు స్తంభం మేడ ఎక్కటానికి దారి కనపడకుండా ,ఆ వల్లభ గంటు కామాక్షమ్మ గొల్ల మహిళ రూపం మాని ,నిజ రూపంతో ప్రత్యక్షమై ,ఆ రూపంతో శక్తికి పదికి శిరస్సులు ఖండించి ,మిగిలిన అయిదుగురు రక్తంలో పడేట్లు చేసి ,మట్టి మెట్లు గ చేయగా ,ఆ గాజు స్థంభం లో ‘’అరసానయమ్మ ‘’ పేరు ధరించి ,భోగవతి వహించి ,ఆఅమ్మ ఆ మేరకు అక్కడ భల్లాలుని భటులుఅనేక రకాల ఆయుధాలు ధరించి ,యుద్ధ సన్నద్ధులు కాగా ,ఆ పరంజ్యోతి పాదాల మనసులో తలచుకొని ,మ్రొక్కగా ,అనేక రకాల విద్యలతో ఆ మేడ ఎక్కి భల్లాణుడిని పట్టుకొని,శిరస్సు ఖండించ బోతుండగా ,అతని భార్య సంతాపంతో అడ్డం వచ్చి ‘’అన్నలారా !నేను మీకు చేల్లెలిలాంటి దాన్ని .పతి భిక్ష పెట్టండి ,పతి దానంకంటే గొప్ప దానం లోకం లో లేదు’’ఆని రెండు చేతులతో నమస్కరించగా వారు ‘’భల్లాలుడి శిరస్సు తెమ్మని మాకు మహారాజు ఆజ్ఞ.ఆ ఆజ్ఞ ను మేము పాటించాల్సిందే ‘’ఆని స్పష్టంగా చెప్పగా ‘’అలా అయితే ఆయన శిరస్సుకు ప్రతి రూపంగా  బంగారు  శిరస్సుఇస్తాను తీసుకు వెళ్ళి మీ రాజుకు చూపించి ,అప్పుడు మీ రాజు పిలిస్తే ,నాపాతివ్రత్యమహిమతో ,,కామాక్షీ దేవి అనుగ్రహంతో ఆ స్వర్ణమయ శిరస్సు బదులు పలుకుతుంది ‘’ఆని అత్యంత వినయంగా చెప్పి ,శక్తికి నమస్కరించి ,మిగిలిన వారి శిరస్సులు ఖండించి సమర్పించబోగా ,ఆ లోకమాత పూర్వపు శిరస్సులు ఖండించి ,మొత్తం పది మందికి ప్రాణ భిక్ష పెట్టి , మళ్లీ  సముద్రాన్ని దాటించి’’మీకూ ,మీ అన్ని కార్యాలకు నేను సహాయం చేస్తూ ,కరికాల చోళ మండలం లో ‘’కొల్లాపురమ్మ ‘’ కొల్లాపురా౦బిక గా  ,  ,కాశీలోఅన్నపూర్ణ విశాలాక్షిగా ,కాంచీపురంలో కామాక్షిగా ,ఏక శిలా నగరం లో వెల్లాది గా  ,చందవోలులో బండ్లమ్మ నై ,ఇంద్ర కీలాద్రిపై దుర్గా భవానిగా ,ద్రాక్షారామం లో గోగులమ్మగా ,కటకం లో ఆశీరమ్మగా మీకు ఇష్టదేవతనై ,మీ మనో భీష్టాలు నెరవేరుస్తూ ఉంటాను .’’ఆని అభయమిచ్చి పంపింది .

 ఆ ‘’కనక శిరస్సు’’ను భటులు తీసుకు వచ్చి కరికాలునికి చూపించగా సమస్త దేశ రాజులు తానూ కోలువైఉండి’’ఓ భల్లాలుడా ! ‘’ఆని పిలువగా ‘’ఓహో ‘’’ఆని ఆ శిరస్సునుంచి ప్రతిధ్వని రాగా ,చక్రవర్తి సంతోషించి  వల్లే యేవురు ,కైకోలయేవురు , రెడ్ది యేవురు లను చూసి మెచ్చి ,నందుల ముఖ మండపం లో వజ్ర సింహాసనాలపై కూర్చో పెట్టి గౌరవించి ‘’చోడ రాజ స్థాపనా చార్య,భల్లాల రాయనిశిరః ఖండన ,రఘుకులగోత్ర పవిత్ర ,పున్నామ్రనామ ధేయ దివ్య పాదపద్మారాధకులు ‘’మొదలైన తన ప్రఖ్యాతమైన బిరుదులు అందజేసి ‘’మీరు నాకు ఈ రోజు నుంచి ప్రియమైన కుమారులు కనుక చోడ కుమారులు ఆని  భూలోకం లో మిమ్మల్ని కీర్తిస్తారు ,అనేక బహుమానాలిచ్చి గౌరవిస్తారు ‘’ఆని ఆనతిచ్చాడు .ఉత్తర జంధ్యాలు ,బంగారు దండం ,అందలాలు బంగారు కామ కుంచలు , విలాస వంతమైన గొడుగులు ,పాపడ చీరలు ,చిన్న ధారలు ,పెద్ద దారలు , పెద్ద గౌరవాలు ,కామాక్షి లోగిళ్ళు ,మకర తోరణాలు ,తెల్లని శంఖాలు ,పూజకు కుండలు నుదుట కుంకుమ ,బిరుదు పెండేరాలు ,కాళ్ళకు విలాసవంతమైన జోళ్ళు ,బంగారు కలశాలు ,అయిదురోజుల నాగవల్లి ,మీ ఇష్ట దేవత కాత్యాయి పూజ వడి ,అరసానమ్మఇచ్చినవి ఎడమ చంప గంధం ఎడమ చేత పుష్పాలు మొదలైనవి .కాశీ రామేశ్వర కటక ,కళింగ,కంచి కాళహస్తి ,విక్రమపురం మొదలైన పుణ్య క్షేత్రాలకు వెళ్ళమని ఆనుమతిచ్చాడు .కాశీ విశ్వేశ్వర ,కంచి కామాక్షమ్మ ,,ఏకామ్రనాధ,శ్రీ రంగనాయకులు ,ద్రాక్షారామ భీమేశ్వరుడు ,సేతుబంధ రామేశ్వరుడు ,సూర్య చంద్రాదులు సాక్షిగా ఆజ్ఞ ఇవ్వగా ,శిరసావహించి ,అన్ని దేశాల అన్ని పట్టణాల కు వెళ్ళమని దిగ్విజయం చేశాడు .

 పల్లె యేవురికి  పేద సింగ నారాయణుడే పెద్దయై ఉండగా ,కుమార బిరుదులేదని పనికి నిలిచి ,ఆ పెద్దకొడుకు పుణిక లో మెదడు తీసుకొని శిలాపాయాసం వండుకు తిన్న దోషం, కాశీలో గోహత్య చేసిన పాపం ,గంగా తీరంలో బ్రాహ్మణ వధ చేసిన పాపం ,పొందుతారు .చోడ చక్రవర్తి కాశీ నుంచి  రామేశ్వర వరకు చేసిన ప్రతిష్టలు ,శివపూజలు  చెడగొడితే పాపాల పాలౌతారు .ఈ బిరుదులనుఎవరు విన్నా చదివినా సకల శ్రేయస్సులు కలుగుతాయి .

 ఇది ఆగమ బిరుదు ప్రసిద్దు శ్రీ మంగళ మహాశ్రీ శ్రీ శ్రీ చేస్తుంది ,కాశీ నుంచి రామేశ్వరం దాకా ఇది తాడుతో కట్టని కట్టు .కొల(కోలా బద్ద)లేని కొట్టు .దండాలు పెద సింగు గారికి .భూమి ఉన్నంతకాలం ఈ కులం నిలిచి ఉంటుందని ప్రమాణం .

వర్తనం –కట్టాలు

పావనం –కట్టుమాయి రూక( రూపాయి )

పంమీరు కట్టం –అయిదు రూకలు

పెద్దిరి చెయ్యి జ౦గానికి ,ఈ పుశ్చరికి కాలు(నాలుగోభాగం ) ఇచ్చి  -కామాక్షమ్మ చేసిన ఏర్పరచిన పధ్ధతి .

ప్రమోదూత నామ సంవత్సర ఫాల్గుణ బహుళ చతుర్దశి ఆదివారం .24 మార్చి -1910

మల్లయ్య వ్రాలు .

జి .నరసింహ శర్మ చె రికార్డ్ చేయబడినది -6-2–43

మూల ప్రతితో  సరి చూడ బడినది  -కె.వి .ఎస్. ఎస్ . 26-6-26.

  మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -3-1-25-ఉయ్యూరు 

Posted in రచనలు | Leave a comment

ఇద్దరు ‘’స్టెంట్’’ వీరుల నిరంతర తపన, శ్రమయే ఆరవ ప్రపంచ రచయితలసభ విజయానికి కారణం

ఇద్దరు ‘’స్టెంట్’’ వీరుల నిరంతర తపన, శ్రమయే ఆరవ ప్రపంచ రచయితలసభ విజయానికి కారణం

పూర్వం స్టంట్ సినిమాలు ఉండేవి అంటే కత్తులతో గదలతో డాలు వగైరాలతో డిషుం డిషుం అంటూ యుద్ధాలు చేసే  హీరో విలన్ ల సినిమాలు అన్నమాట .ఆరవ ప్రపంచ తెలుగు రచయితల మహాసభలు 2024 డిసెంబర్ 28,29శని ఆదివారాలలో కె బి ఎన్ కాలేజిలో అంగరంగ వైభవంగా’’ యువత’’ ఉత్సాహ పూరిత వాతావరణం లో దిగ్విజయంగా జరిగాయి .ఈ సభలకు నేపధ్యంలో ‘’ఇద్దరు ప్రసాద్ ‘’ లున్నా ,వేదిక  ఇచ్చిన కాలేజీ,కాఫీ టిఫిన్ భోజనాలు అందించిన స్థానిక శాసన సభ్యుడు ,సభలకోసం ఉదారంగా విరాళాలు అందించిన వదాన్యులైన దాతలు ,ప్రతినిధి రుసుం చెల్లించి స్వంత ఊర్లనుండి డబ్బు ఖర్చు పెట్టుకొని వచ్చి, వసతి సౌకర్యం తామే చూసుకొని ,రెండు రోజులు పండుగ వాతావరణం గా చేసిన వారున్నారు,రిసీవింగ్ సెక్షన్ ను చక్కగా నిర్వహించిన వారు ,మూడు  వేదికలపై కార్యక్రమాలను నిర్వహణ పర్యవేక్షణ చేసిన  వారున్నారు  .వీరందరిని నిత్యం సంప్రదిస్తూ ,కార్యక్రమ వివరాలు అందిస్తూ ,వైవిధ్యాన్ని కొనసాగిస్తూ అనుకొన్న ‘’మార్పు ‘’ప్రతి ఫలించిందా లేదా ఆని వేయి కళ్ళతో వీక్షిస్తూ తపో దీక్షగా నిరంతర శ్రమతో అలుపు సొలుపు లేకుండా ,విసుగు విరామం లేకుండా పని చేసిన వారు ఇద్దరు మనీషులున్నారు  .వారే కృష్ణా జిల్లా రచయితల సంఘం అధ్యక్ష కార్యదర్శులు శ్రీ గుత్తికొండ సుబ్బారావు ,శ్రీ జివి పూర్ణ చంద్ గార్లు .

 వీరిద్దరిలో సుబ్బారావు గారికి కొంతకాలం బైపాస్ జరిగి స్టెంట్  వేయించు కొంటే ,ఆతర్వాత కొంతకాలానికి .పూర్ణ చంద్ గారికీ బైపాస్ జరిగి స్టెంట్ వేయి౦చుకొన్నారు .అందుకే వీరిద్దరిని ‘’స్టెంట్ మాస్టర్స్ ‘’అన్నాను .అయినా’’ తగ్గేదేలా’’అంటూ ఎంతో శ్రమకు ఓర్చుకొని  క్షణం విశ్రాంతి లేకుండా కార్యక్రమ నిర్వహణ చేయటం ఆషా మాషీ కాదు .ఆ పూనికకు ,ఉత్సాహానికి కోటి దండాలు .

 మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -2-1-25-ఉయ్యూరు .

Posted in రచనలు | Leave a comment

టెంకణాదిత్య కవిరాజు శిఖామణి నన్నె చోడుని కుమారసంభవ కావ్య0.51 వ భాగం.2.1.25.

టెంకణాదిత్య కవిరాజు శిఖామణి నన్నె చోడుని కుమారసంభవ కావ్య0.51 వ భాగం.2.1.25.

టెంకణాదిత్య కవిరాజు శిఖామణి నన్నె చోడుని కుమారసంభవ కావ్య0.51 వ భాగం.2.1.25.

Posted in రచనలు | Leave a comment

విశాఖ దత్త కవి కృత నాటకం. ముద్రా రాక్షసం.16 వ భాగం.2.1.25.

విశాఖ దత్త కవి కృత నాటకం. ముద్రా రాక్షసం.16 వ భాగం.2.1.25.

విశాఖ దత్త కవి కృత నాటకం. ముద్రా రాక్షసం.16 వ భాగం.2.1.25.

Posted in రచనలు | Leave a comment

టెంక ణా దిత్య కవిరాజశిఖామణి నన్నె చోడుని కుమారసంభవ కావ్య0.50 వ భాగం.1.1.2025.

టెంక ణా దిత్య కవిరాజశిఖామణి నన్నె చోడుని కుమారసంభవ కావ్య0.50 వ భాగం.1.1.2025.

టెంక ణా దిత్య కవిరాజశిఖామణి నన్నె చోడుని కుమారసంభవ కావ్య0.50 వ భాగం.1.1.2025.

Posted in రచనలు | Leave a comment

విశాఖ దత్త కవి కృత నాటకం . ముద్రా రాక్షసం.15 వ భాగం.1.1.2025

విశాఖ దత్త కవి కృత నాటకం . ముద్రా రాక్షసం.15 వ భాగం.1.1.2025

విశాఖ దత్త కవి కృత నాటకం . ముద్రా రాక్షసం.15 వ భాగం.1.1.2025

Posted in రచనలు | Leave a comment

అమృత బజార్ పత్రిక’’ స్థాపించిన బెంగాలీ స్వాతంత్ర్యోద్యమ నాయకుడు –శిశిర్ కుమార్ ఘోష్

అమృత బజార్ పత్రిక’’ స్థాపించిన బెంగాలీ స్వాతంత్ర్యోద్యమ నాయకుడు –శిశిర్ కుమార్ ఘోష్

శిశిర్ కుమార్ ఘోష్ (1840–1911), శిశిర్ కుమార్ ఘోష్ అని కూడా పిలుస్తారు,  భారతీయ పాత్రికేయుడు, 1868లో బెంగాలీ భాషా వార్తాపత్రిక అయిన అమృత బజార్ పత్రిక స్థాపకుడు, మరియు బెంగాల్ నుండి స్వాతంత్ర్య ఉద్యమకారుడు.

అతను 1875లో ఇండియా లీగ్‌ని ప్రారంభించాడు, ప్రజలలో జాతీయవాద భావాన్ని ప్రేరేపించాలనే ఉద్దేశ్యంతో. అతను వైష్ణవుడు కూడా, ఆధ్యాత్మిక సన్యాసి చైతన్య మహాప్రభు (గౌరంగ)పై వ్రాసినందుకు మరియు 1897లో అతనిపై లార్డ్ గౌరంగ లేదా సాల్వేషన్ ఫర్ ఆల్ అనే పుస్తకాన్ని వ్రాసినందుకు జ్ఞాపకం చేసుకున్నాడు. అతను అనేక జీవిత చరిత్రలను కూడా వ్రాస్తాడు, ఉదాహరణకు: నరోత్తం చరిత్. అతను 1857లో కలకత్తా విశ్వవిద్యాలయం యొక్క మొదటి ప్రవేశ పరీక్షలో ఉత్తీర్ణులైన మొదటి బ్యాచ్ విద్యార్థులలో ఒకడు.

 లెనిన్ చేత ‘’అత్యుత్తమ జాతీయ పత్రిక ‘’గా అభి వర్ణింపబడిన -అమృతబజార్ పత్రిక

అమృత బజార్ పత్రిక భారతదేశంలోని పురాతన దినపత్రికలలో ఒకటి. వాస్తవానికి బెంగాలీ లిపిలో ప్రచురించబడింది,ఇది కోల్‌కతా మరియు కటక్, రాంచీ మరియు అలహాబాద్ వంటి ఇతర ప్రదేశాల నుండి ప్రచురించబడిన ఆంగ్ల ఆకృతిలోకి పరిణామం చెందింది..పత్రిక 123 సంవత్సరాల ప్రచురణ తర్వాత 1991లో దాని ప్రచురణను నిలిపివేసింది. దీని సోదరి వార్తాపత్రిక బెంగాలీ-భాష దినపత్రిక జుగంతర్, ఇది 1937 నుండి 1991 వరకు  నడిచింది .

ఇది 20 ఫిబ్రవరి 1868న ప్రారంభించబడింది. ఇది భారతదేశంలోని బ్రిటిష్ సామ్రాజ్యంలోని బెంగాల్ ప్రావిన్స్‌లోని జిల్లా జెస్సోర్‌లో మాగురాకు చెందిన ధనిక వ్యాపారి హరి నారాయణ్ ఘోష్ కుమారులు శిశిర్ ఘోష్ మరియు మోతీ లాల్ ఘోష్ ద్వారా ప్రారంభించారు. కుటుంబం బజార్‌ను నిర్మించి దానికి హరి నారాయణ్ ఘోష్ భార్య అమృతమయి పేరు పెట్టారు. సిసిర్ ఘోష్ మరియు మోతీ లాల్ ఘోష్ అమృత బజార్ పత్రికను మొదట వారపత్రికగా ప్రారంభించారు. అధికారిక విశ్వవిద్యాలయ విద్య లేని మోతీలాల్ ఘోష్ దీనిని మొదట సవరించారు. ఇది బెంగాలీకి ప్రత్యర్థిగా పాఠకుల సంఖ్యను పెంచుకుంది, దీనిని సురేంద్రనాథ్ బెనర్జీ చూసుకున్నారు.. సిసిర్ ఘోష్ పదవీ విరమణ చేసిన తర్వాత, అతని కుమారుడు తుషార్ కాంతి ఘోష్ 1931 నుండి 1991 వరకు వార్తాపత్రికను నడిపిస్తూ, తరువాతి అరవై సంవత్సరాల పాటు సంపాదకుడిగా పనిచేశాడు.

చరిత్ర

అమృత బజార్ పత్రిక భారతీయ యాజమాన్యంలోని పురాతన ఆంగ్ల దినపత్రిక. ఇది భారతీయ జర్నలిజం యొక్క పరిణామం మరియు పెరుగుదలలో ప్రధాన పాత్ర పోషించింది మరియు భారత స్వాతంత్ర్య పోరాటాన్ని సృష్టించడం మరియు పెంపొందించడంలో అద్భుతమైన సహకారం అందించింది. 1920లో, రష్యన్ కమ్యూనిస్ట్ విప్లవకారుడు వ్లాదిమిర్ లెనిన్ ABPని భారతదేశంలో అత్యుత్తమ జాతీయవాద పత్రికగా అభివర్ణించారు.

ABP బెంగాలీ వారపత్రికగా ఫిబ్రవరి 1868లో జెస్సోర్ జిల్లాలోని (ప్రస్తుతం బంగ్లాదేశ్‌లో ఉంది) అమృత బజార్ గ్రామంలో జన్మించింది. ఇండిగో ప్లాంటర్లచే దోపిడీకి గురవుతున్న రైతుల సమస్యలపై పోరాడటానికి ఘోష్ సోదరులు దీనిని ప్రారంభించారు. సిసిర్ కుమార్ ఘోష్ మొదటి సంపాదకుడు. 32 రూపాయలకు కొనుగోలు చేసిన చెక్కతో కొట్టిన ప్రెస్‌తో పత్రికా పని చేస్తుంది.

1871లో, అమృత బజార్‌లో ప్లేగు వ్యాధి వ్యాప్తి చెందడంతో పత్రిక కలకత్తాకు (ప్రస్తుతం కోల్‌కతా) తరలించబడింది. ఇక్కడ అది ఇంగ్లీష్ మరియు బెంగాలీలో వార్తలు మరియు వీక్షణలను ప్రచురించే ద్విభాషా వారపత్రికగా పనిచేసింది. దాని ప్రభుత్వ వ్యతిరేక అభిప్రాయాలు మరియు ప్రజలలో విస్తారమైన ప్రభావం ప్రభుత్వం యొక్క మాంసంలో ముల్లులా ఉంది. లార్డ్ లిట్టన్, భారత వైస్రాయ్ 1878లో ప్రధానంగా ABPకి వ్యతిరేకంగా వెర్నాక్యులర్ ప్రెస్ యాక్ట్‌ను ప్రకటించాడు.

1891లో పత్రిక దినపత్రికగా మారింది. ఇది పరిశోధనాత్మక జర్నలిజంలోకి ప్రవేశించిన మొదటి భారతీయ యాజమాన్యంలోని ఆంగ్ల దినపత్రిక. లార్డ్ లాన్స్‌డౌన్ కాలంలో, ఒక పత్రికా జర్నలిస్ట్ వైస్రాయ్ కార్యాలయంలోని వ్యర్థ కాగితపు బుట్టలో చించి, కాశ్మీర్‌ను స్వాధీనం చేసుకునేందుకు వైస్రాయ్ యొక్క ప్రణాళికలను వివరించే చిరిగిన లేఖను ముక్కలు చేశాడు. ABP తన మొదటి పేజీలో లేఖను ప్రచురించింది, అక్కడ కాశ్మీర్ మహారాజు చదివాడు, అతను వెంటనే లండన్ వెళ్లి తన స్వాతంత్ర్యం కోసం లాబీయింగ్ చేశాడు.

సిసిర్ కుమార్ ఘోష్ కూడా పౌర హక్కులపై ఆంక్షలు మరియు ఆర్థిక దోపిడీకి వ్యతిరేకంగా తీవ్రమైన ప్రచారాలను ప్రారంభించారు. పరిపాలనలో భారతీయులకు ముఖ్యమైన పదవులు ఇవ్వాలన్నారు. అతను మరియు అతని సోదరుడు మోతీలాల్ ఇద్దరూ బాలగంగాధర్ తిలక్‌తో గాఢంగా అనుబంధం కలిగి ఉన్నారు. 1897లో తిలక్‌పై దేశద్రోహం నేరం మోపబడినప్పుడు, వారు అతని రక్షణ కోసం కలకత్తాలో నిధులు సేకరించారు. ‘నిరూపితమైన మరియు అసమానమైన దేశభక్తుడికి నిజమైన దేశభక్తిని నేర్పినందుకు’ తిలక్‌కు 6 సంవత్సరాల జైలు శిక్ష విధించిన న్యాయమూర్తికి వ్యతిరేకంగా వారు ఘాటైన సంపాదకీయాన్ని కూడా ప్రచురించారు.

బెంగాల్ విభజన (1905) సమయంలో భారతదేశ వైస్రాయ్ లార్డ్ కర్జన్‌తో పత్రికకు చాలా ఇబ్బందులు  ఉన్నాయి. ఇది అతనిని ‘యంగ్ అండ్ లిటిల్ ఫోపిష్, మరియు మునుపటి శిక్షణ లేకుండా అపరిమిత అధికారాలతో పెట్టుబడి పెట్టింది’ అని సూచించింది. అటువంటి సంపాదకీయాల కారణంగా, 1910 ప్రెస్ యాక్ట్ ఆమోదించబడింది మరియు ABP నుండి 5,000 రూపాయల భద్రత డిమాండ్ చేయబడింది. మోతీలాల్ ఘోష్‌పై కూడా దేశద్రోహం అభియోగాలు మోపారు, అయితే అతని వాగ్ధాటి కేసు ను గెలిపించింది .

దీని తరువాత, పత్రిక బ్రిటీష్ కిరీటం పట్ల విధేయతతో హాస్యాస్పదంగా విపరీతమైన వృత్తులతో బ్రిటీష్ ప్రభుత్వాన్ని విమర్శిస్తూ కథనాలను ప్రచురించడం ప్రారంభించింది. సుభాష్ చంద్రబోస్ మరియు ఇతర విద్యార్థులను కలకత్తా ప్రెసిడెన్సీ కళాశాల నుండి బహిష్కరించినప్పుడు, పత్రిక వారి కేసును స్వీకరించింది మరియు వారిని తిరిగి చేర్చుకోవడంలో విజయం సాధించింది.

1922లో మోతీలాల్ ఘోష్ మరణించిన తర్వాత కూడా పత్రిక తన జాతీయవాద స్ఫూర్తిని కొనసాగించింది. ఉప్పు సత్యాగ్రహం సందర్భంగా దాని నుండి రూ.10,000 అధిక సెక్యూరిటీలు డిమాండ్ చేశారు. దాని సంపాదకుడు తుషార్ కాంతి ఘోష్ (సిసిర్ కుమార్ ఘోష్ కుమారుడు) జైలు పాలయ్యాడు. గాంధీ నాయకత్వంలో స్వాతంత్ర్య ఉద్యమం విజయవంతం కావడానికి పత్రిక తన వంతు సహకారం అందించింది మరియు బ్రిటీష్ పాలకుల చేతుల్లో దాని అభిప్రాయాలు మరియు చర్యలకు బాధపడింది.

భారతదేశ విభజన సమయంలో మత సామరస్యానికి కారణాన్ని పత్రికా సమర్థించింది. 1946లో కలకత్తాలో జరిగిన గొప్ప హత్యల సమయంలో, పత్రిక తన సంపాదకీయ కాలమ్‌లను మూడు రోజుల పాటు ఖాళీగా ఉంచింది. 1947 ఆగస్టు 15న స్వాతంత్ర్యం వచ్చినప్పుడు, పత్రిక సంపాదకీయంలో ప్రచురించింది:

‘’ఇది తెల్లవారుజాము, ఆకాశం మేఘావృతమైనప్పటికీ.  సూర్యరశ్మికి  విరిగిపోతుంది.’’

మీ- గబ్బిట దుర్గాప్రసాద్ -31-12-2024 –ఉయ్యూరు

Posted in రచనలు | Leave a comment

ఆర్ద్రమైన ,సౌహార్ద్ర మైన శ్రీ సోమేపల్లి వారి స్మారక సంచిక –హరిత సంతకం .

ఆర్ద్రమైన ,సౌహార్ద్ర మైన శ్రీ సోమేపల్లి వారి స్మారక సంచిక –హరిత సంతకం .

శ్రీ తోటకూర వెంకట నారాయణ గౌరవ సంపాదకులుగా ,శ్రీ చలపాక ప్రకాష్ ,శ్రీ సోమేపల్లి వశిష్ట సంపాదకులుగా ,సోమేపల్లి లిటరరీ ఫౌండేషన్ వారు ఈ డిసెంబర్ లో ఆంధ్ర ప్రదేశ్ రచయితల సంఘం అధ్యక్షులు స్వర్గీయ సోమేపల్లి వెంకట సుబ్బయ్య గారి స్మారక సంచిక వెలువరించారు . సర్వాంగ సుందరంగా ఉంది.సోమేపల్లి వారి జేవితంలోని సకల పార్శ్వాలను వివిధ రచయితలు ఆవిష్కరించి ఘన నివాళి అర్పించారు .సమగ్రమైన ,సంతృప్తికర సంచికగా చరిత్రలో మిగిలిపోయే సంచిక .ఇది అర్ధవంతమైన ముఖ చిత్రం ,హరిత నేపధ్యంలో వెంకటసుబ్బయ్య గారి సాదాగీతల చిత్రం ఆకర్షణీయంగా ఉంది .నాకు ఈ పుస్తకాన్ని  నిన్న బెజవాడ తెలుగు సభలలో శ్రీ ప్రకాష్ ,వశిష్ట లు అందజేశారు .వారికీ కృతజ్ఞతలు .

  సోమేపల్లి వారి మరచిపోలేని కవితలు మధ్యమధ్య ఉండటం ప్రత్యెక ఆకర్షణ .’’మట్టిలో కలిసిపోయే దాకా  నాకు విశ్రాంతి లేదు .అప్పుడప్పుడు –కాస్తంత విరామం చాలు ‘’అన్న జీవిత తాత్వికుడు నిజంగానే శాశ్వతంగా దూరమయ్యారు .నూటపదహారు మంది అభిమానులు వారికి కైమోడ్పు ఘటించి వారి సహృదయతను మనసారా వెల్లడించి కృతజ్ఞత చూపారు .334 పేజీలతో ,స్కాలిత్యం లేని ముద్రణతో , ,ఒక విధంగా ఈ సంచిక ఒక’’ మినీ సోమేపల్లి సర్వస్వం.’’ఇంతటి కృషి చేసి లోకానికి అందజేసిన వారందరికి అభి నందనలు .

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -30-12-24-ఉయ్యూరు .

Posted in రచనలు | Leave a comment

చల్లగా మెల్లగామధురంగా సాగిన శ్రీమతి పల్లావఝల శైలజ గారి ‘’అమూల్య’’ ‘’శ్రీ సాయి చరిత శతకం ‘’

చల్లగా మెల్లగామధురంగా సాగిన శ్రీమతి పల్లావఝల శైలజ గారి ‘’అమూల్య’’  ‘’శ్రీ సాయి చరిత శతకం ‘’

నిన్న డిసెంబర్ 29 ఆదివారం బెజవాడ లో జరిగిన ఆరవ ప్రపంచ తెలుగు రచయితల రెండవ రోజు సమావేశం లో నాకు ఈ శాతకాన్ని కవయిత్రి శైలజ ఇచ్చిఅభిప్రాయం కోరారు .ఆమె ఇంటి పేరు చూస్తె ఉయ్యూరులో మా ‘’ముత్తయ్య మాస్టారు ‘’అంటే పల్లా వఝాల మృత్యుంజయ శార్మగారు జ్ఞాపకం వచ్చి ఆయనతో నా ఆనుభవాలు చెప్పాను .మా పార్ది గారి అరుగుపై సాయంత్రం వేళ మేము జరుపుకొన్న గోష్టులు ఆయన మాకు భమిడిపాటి వారి ‘’ అంతా ఇంతే ‘’ నాటకాన్ని నేర్పి ఉయ్యూరు హైస్కూల్ లో ప్రదర్శింప చేయటం గుర్తుకు తెచ్చుకున్నాను .ఆయన గోదావరి  జిల్లాలో ఎలిమెంటరి స్కూల్ హెడ్ మాస్టర్ గా పని చేసి రిటైరై వారిఅత్తగారి ఊరు  ఉయ్యూరు  వచ్చి, మా బజార్లోనే ఇల్లుకొని కాపురం ఉండటం  గుర్తుకు తెచ్చాను .శైలజ గారికి బెల్లం కొండ వారు బంధువులే .ఆఇంటి పేరున్నవారు వీరంకిలాకు దగ్గర హనుమంతపురం అనే గడ్డి పాడులో,మొవ్వా పాలెం లో  ఉన్నారు.ఉయ్యూరు లో  మా ఇంటికి రెండవ ఇల్లు బెల్లంకొండ వారిదే .బెల్లం కొండ సుబ్బయ్య గారు వెంకమ్మ గారు  మాకు ఆత్మీయులు .వారి కుమారుల్లోకృష్ణ మూర్తి నాకు హై స్కూల్ క్లాస్మేట్ .

 ఇక శతకం లోకి ప్రవేశిద్దాం .ఇదే మొదటి రచన .’’విద్యలు కోర్కెలు అనుగ్రహిస్తూ ,’’ధారగా సిరులు కురిపిస్తూ ,కూరిమి చూపు దైవం బొజ్జ గణపయ్య కు అవిఘ్నమస్తుగా నమస్కారం చేసి ,’’తానె గణపతి యయి ,తానేయై భారతి –నడుచునట్లు జేసి నాదు కలము –శతకమొకటి వ్రాయశక్తినిడిన సాయి –కంకితమ్ము జేసి అంజలి ‘’ఘటించారు .గోదారి జిల్లా మధురకవి శ్రీ  మంకు శ్రీను ఈమెకు పద్య రచన నేర్పి ప్రోత్సహించారు .మంకు గారితో ఉయ్యూరులో ఉన్న మా శ్రీ సువర్చలాన్జనేయస్వామి పై శతకం  రాయించి ,ఆయనతో పాటు మరిద్దరు కవులు శ్రీ తుమ్మోజు రామా లక్ష్మణా చార్యులు శ్రీమతి ముదిగొండ సీతారామమ్మ గార్లచే చెరో శతకం స్వామి పై రాయించి మూడుశతకాలను ఒకే రోజు మా సువర్చలాన్జనేయస్వామి దీవాలయం లోమాఘమాసం లో ఒక ఆదివారం సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతం లో  ఆవిష్కరించి ,ఘనంగా సత్కరించి విందు ఏర్పాటు చేసిన  విషయం జ్ఞప్తికి వచ్చింది . .ఆట వెలదులతో శతకం రాషారు . ’’శ్రద్ధబూని చదువు సాయి చరిత ‘’అనేది  శతక మకుటం .

మొదటి పద్యం –‘’శ్రీకరుడు సాయి శిరిడి గ్రామబున –వేప తరువు క్రింద వి౦త యోగి –యవతరించె,ప్రజల కధ్యాత్మ గురువుగ-శ్రద్ధ బూని చదువు సాయి చరిత ‘’ సాయి గురుని శ్రేష్టత ,అవతరణ అలతి అలతి పదాలతో చెప్పారు .గొప్ప జ్ఞాని లా కూర్చున్న బాలసాయి ‘’మానవుడు కాదు మహనీయుడు ‘’అనే పవిత్ర భావాన్ని ప్రజలు దర్శన మాత్రంగా పొందారు .నమ్మిన వారికి సాయి కొంగు బంగారం .చిన్మయ రూపుడు సాయి ‘’పాండురంగడే’’అన్నాడు వృద్ధ భక్తుడొకడు  ,.మొదట మహల్సా స్వాగతించి పకీరు ను ‘’సాయి ‘’ఆని గౌరవ నామం  తో సంబోధింఛి,సాయిని భక్తకోటి హృదయాలలో సుస్థిరం చేశాడు .తిరగలి లో ఉన్న వేదాంతాన్ని చెప్పాడు సాయి –పైన తిరిగే రాయి భక్తీ ,తిరగని అడుగున ఉండే రాయి కర్మ ,పిడి జ్ఞానం .

గోపాలరావు గుండ్ శ్రీ రామనవమినాడు ఉర్సు ఉత్సవం ప్రారంభించాడు .ముస్లిం అయిన అమీర్ ద్వారకా మాయి లో చందనోత్సవం జరిపించాడు .సాయి హారతి మహా నేత్రపర్వం, జన్మ ధన్యం చరితార్ధం .’’చేత కర్ర ,త౦బి రేకు డొక్కా ‘’తో తిరువీధులలో భిక్షమేట్టి అజ్ఞానుల పాపాలను తాను  పొంది జ్ఞానం ఇచ్చే మహాత్ముడు సాయి భగవాన్ .సాయి శయన లీల దేవతలకూ పరమాశ్చర్యం . ,చోల్కర్ బాబా దర్శనం కోసం టీ లో పంచదార వేసుకోటం మానేసి, డబ్బు అదా చేసి షిర్డీ వెళ్ళి పరమానుభూతి పొందాడు .సాయి పలుకులు బ్రహ్మ వాక్కులే .ఉపవాసాలు చేస్తే సాయి ఊరుకోడు .మనసు నిశ్చలంగా  ఉండటమే ముఖ్యం ఆని  చెప్పాడు .దాన గుణం నేర్పటానికే దక్షిణ అడిగే వాడు సాయి .

‘’చక్కగాను బోధ చా౦దోర్కనునకు జేసె –దేవ భాష యందు దిట్ట యయ్యు –గీత శ్లోకమొకటి కృష్ణుడై బోధించె’’అంటూ సాయి సంస్కృత పాండిత్యాన్ని గొప్పగా చెప్పారు భక్తులకోసం’’ సాఠే ‘’వాడాలు ,మురళి విగ్రహం కోసం’’బూటే’’వాడా కట్టించాడు సాయి .కక్కుర్తి పడకుండా అనుక్షణం తనకు మనసునిచ్చి నిశ్చింతగా ఉండమన్నాడు .అంతా తానె చూసుకొంటాను ‘’మై హూనా ‘’ఆని భరోసా ఇచ్చాడు .పాముకాటు నుంచి శ్యామా ను , ,చావునుంచి రామచంద్రను కాపాడిన కరుణామయుడుసాయి .సాయి కృపకు చక్షువులు తెరచి సాయి చరిత చదవాలి .’’దివ్య సాయి కధలు దీప స్తంభము వోలె –ధర్మమార్గములకు దారి చూపు –బ్రతుకు బండి నడుపు భగవానుడు ‘’సద్గురు సాయి మహారాజ్ .బడుగుజనాన్ని ఆడరించటమే సాయి కోరేది .మనవ సేవే మాధవ సేవ .అంటూ శైలజ ఈ ఆట వెలదుల సాయి శతకం పూర్తి చేశారు .

  గురు పౌర్ణమి నాడు సాయి భక్తులు సాయి చరితను మహా భక్తితో పఠిస్తారు  .హేమాండ్ పంత్ మరాటీ  లో రాసిన  ‘’సాయి  సచ్చరిత్ర ‘’అన్ని భాషలలోనూ అనువాదం పొందింది .ఇది బృహద్గ్రంధం .దీన్ని పతించలేని వారు శైలజ గారి ఈ శతకం చదివితే చాలు అంతటి ఫలితం పొందవచ్చు .సాయి చరిత్ర అంటే జ్ఞాపకం వచ్చింది .2017లో మా దంపతులం ఆమెరికాకు అయిదవ సారి నార్త్ కరోలినా లోని షార్లేట్ కు మా అమ్మాయి,అల్లుడు  గారింటికి వెళ్ళి నప్పుడు ’ ,అక్కడ అప్పారావు గారనే రిటైర్ద్ స్టేట్ బాంక్ ఆఫీసర్ ,సాయి భక్తుడు పరిచయమై గురు పూర్ణమి ముందు మా ఇంటికి వచ్చి ,చాలా కాలం నుంచి గురు పూర్ణమికి సాయి చారిత్ర చదువు తున్నాననీ ,ఈ ఏడు ఎవరూ తోడూ లేరని చెప్పగా  మనిద్దరం కలిసి చదువుదాం ఆని ,మా ఇంటికి రమ్మని పిలిచి ఇద్దరమ రోజు సాయంత్రం నాలుగు నుంచి అయిదు వరకు చదివి అయిదు రోజులలో గురుపూర్ణమి నాడు పూర్తి చేశాం .రోజూ మాఅమ్మాయి ప్రసాదం చేసేది. నైవేద్యం పెట్టేవాళ్ళం .అదే నేను మొదటి సారి సాయి చరిత్ర దీక్షగా చదవటం .  నాలుగు సార్లు షిర్డీ వెళ్ళాం .

 శైలజ గారి పద్యాలు మాధుర్య భరితం .మంకు శ్రీను  గారిప్రభావం అది .అలవోకగా రచన సాగింది భక్తిభావ బంధురంగా,కర్ణ పేయం గా పద్యాలు  నడిచాయి .సూటిగా హృదయానికి తాకేట్లున్నాయి .సాయి భక్తులకు దివ్య  వరం ఈ శతకం ‘’.అమూల్యం’’ ధరలోనే కాదు కవిత్వం లో కూడా . మరిన్ని రచనలు ఆమె చేయాలని కోరుతున్నాను .

 సంక్షిప్తంగా కవయిత్రి పరిచయం –పల్లావఝల వెంకట శైలజ-ఎం ఎ బిఎడ్ -తెలుగు పండిట్ -విజయవాడ  పుట్టినిల్లు కృష్ణాజిల్లా మొవ్వ పాలెం .మెట్టింది పగోజి కొప్పర్రు (మంకు శ్రీను కవి స్వగ్రామం ).భర్త -బొల్లాప్రగడ వెంకట దత్తాత్రేయులు ఎం ఎ.  

మీ – గబ్బిట దుర్గాప్రసాద్ -30-12-24-ఉయ్యూరు 

Posted in రచనలు | Leave a comment

నవయుగ కవి చక్రవర్తి పద్మ భూషణ్ శ్రీ గుర్రం జాషువా గారిసాహిత్య తత్వ వివేచన.2 వ భాగం.27.12.24

నవయుగ కవి చక్రవర్తి పద్మ భూషణ్ శ్రీ గుర్రం జాషువా గారిసాహిత్య తత్వ వివేచన.2 వ భాగం.27.12.24.

నవయుగ కవి చక్రవర్తి పద్మ భూషణ్ శ్రీ గుర్రం జాషువా గారిసాహిత్య తత్వ వివేచన.2 వ భాగం.27.12.24.

Posted in రచనలు | Leave a comment

శ ర్మగారి ధర్మ శతకం

శ ర్మగారి ధర్మ శతకం
శ్రీ చెన్నాప్రగడ శర్మగారు ‘’శర్మ శతకం ‘’రాసి ఇవాళ వాట్సాప్ లో పంపి ముందు మాట రాయమని కోరారు .ఇప్పుడే  చదివి రాస్తున్నాను .’’శర్మపదమెప్పుడూ ధర్మ పథము మిత్రమా ‘’అనే మకుటంతో శర్మగారి వంద పద్యాలు రమ్యంగా ఉన్నాయి .
మొదటిపద్యంలో దసరా శోభతో కళకళ లాడుతున్న కనకదుర్గమ్మ అమ్మవారిని కరుణించి కాపాడమని వేడుకొన్నారు .పండుటాకుల వంటి ముసలి వారు పిల్లల వెలుగు రేఖలన్నారు .పెళ్ళిళ్ళ హోరులో ధనం కన్నా గుణం మిన్న ఆని గుర్తించమని కోరారు .రతన్ టాటా భారతీయ విపణి వీధి రత్నం చేతికి ఎముకలేని వదాన్యుడు అన్నారు .చిత్రసీమ విచిత్రసీమ అయి నిత్య వివాదాస్పదమౌతున్నందుకు బాధ పడ్డారు .రోడ్డు పక్క తిళ్ళు కడుపుబ్బరం తప్ప ఆరోగ్య౦ నిల్.’’సెల్ కు బాని’’సేల్’’ అయితే బతుకు బస్టా౦డే . కాలుష్యనగరం దేశరాజధాని నిత్యనరకకూపం .విమానాల బాంబు బెదిరింపులు ఆకతాయి చేష్టలు వ్యవస్థకు తీరని తిప్పలు .వృధా అరికట్టితే వ్యధ తీరుతుంది అన్నిటా .
  క్రికెట్ ఆటగాళ్ల వేలం పూర్వం బానిసల వేలాన్ని గుర్తుకు తెస్తూ వెర్రి వెర్రి తలలు వేస్తున్నందుకు వ్యధ చెందారు శర్మాజీ .వేటపాలెం గ్రంథాలయ ‘’ప్రతి పొత్తమూ దోచును చిత్తము ‘ఆని శారదా దేవికి వందనాలు ఆచరించారు  .అంతర్జాలం మంచిని పెంచే మరాళ౦ అయి పాలు నీరు వేరుచేయాలి .కాకినాడ కోటయ్య కాజాలకు నీరాజనాలు పల్కారు .ప్రయోగాల దిట్ట ఘట్టమనేని కృష్ణ ,.క్షమాపణలతోనే బంధం బలీయం అనే సూక్తి .ఓటీటీ లతో సినిమాలు ఘొల్లు .తెలుగు వారి పాటల పాఠశాల –గాన గ౦ధర్వ ఘంటసాల’’ఆని కైమోడ్పు ఘటించారు .పార్టీలు వేరైనా ‘’దండుకోటం లో అందరూ ఉద్దండ పిండాలే ‘’ఆని  చెమ్కీ దెబ్బ కొట్టారు .
‘’ మన్యం లో డోలీ మోతలు ఇంకానా ఇకపై చెల్లదు’’ఆని గిరిజనులకు బాసటగా నిలిచారు .’’ఫ్రీ వెడ్డింగ్ షూట్ ల పర్వం-మెటర్నిటి స్థాయికి ‘’దిగజారటం హేయం నీచం ఆని తలబాదుకొన్నారు రగిలిన హృదయంతో కవి .’’ఆ నలుగురినైనా సంపాదించు ‘’జీవితం లో ‘’ఆని  హెచ్చరించారు . జీవిత గాలి పటం చిరిగితే అంతా ఛిద్రమె ‘’ఆని జాగ్రత్త పడమని జీవిత సత్యం చెప్పారు .అడుగు తడబడితే నడక నరక యాతనమే .108వ చివరి పద్యంలో –‘’పది మందికి మనం చేసే సేవ –అందరికీ కావాలి అది తోవ –మంచిని పెంచుతూ స్పూర్తిని   నింపుతూ- శర్మపద మెప్పుడూ ధర్మపథం మిత్రమా ‘’  చెప్పిన మాటలన్నీ ఈ శతకం లోని సూక్తి ముక్తావళి .ధర్మ పధాన్ని శర్మ గారు ఘంటా పధంగా  మన ముందుంచి మార్గ నిర్దేశం చేశారు . ప్రతి పద్య మనోహరం శతకం .అభినదనీయులు శర్మాజీ .
గబ్బిట దుర్గా ప్రసాద్ -22-12-24-ఉయ్యూరు

Posted in రచనలు | Leave a comment

డా.జి.వి.సుబ్రహ్మణ్యం గారి – ఆంధ్ర సాహిత్య విమర్శ. ఆంగ్ల ప్రభావం.16 వ భాగం.27.12.24.

డా.జి.వి.సుబ్రహ్మణ్యం గారి – ఆంధ్ర సాహిత్య విమర్శ. ఆంగ్ల ప్రభావం.16 వ భాగం.27.12.24.

డా.జి.వి.సుబ్రహ్మణ్యం గారి – ఆంధ్ర సాహిత్య విమర్శ. ఆంగ్ల ప్రభావం.16 వ భాగం.27.12.24.

Posted in రచనలు | Leave a comment

టెంక ణా దిత్య కవిరాజశిఖామణి నన్నె చోడుని కుమారసంభవ కావ్య0 .49 వ భాగం.27.12.24.

టెంక ణా దిత్య కవిరాజశిఖామణి నన్నె చోడుని కుమారసంభవ కావ్య0 .49 వ భాగం.27.12.24.

Posted in రచనలు | Leave a comment

విశాఖ దత్త కవి కృత నాటకం – ముద్రా రాక్షసం.14 వ భాగం.27.12.24.

విశాఖ దత్త కవి కృత నాటకం – ముద్రా రాక్షసం.14 వ భాగం.27.12.24.

Posted in రచనలు | Leave a comment

రా.వి. శాస్త్రి ( రాచ కొండ విశ్వ నాథ శాస్త్రి) గారి,- జీవితం,సాహిత్యం.3 వ భాగం.24.12.24.

రా.వి. శాస్త్రి ( రాచ కొండ విశ్వ నాథ శాస్త్రి) గారి,- జీవితం,సాహిత్యం.3 వ భాగం.24.12.24. https://youtu.be/z1VQx5DBYKc

Posted in రచనలు | Leave a comment

డా.జి.వి.సుబ్రహ్మణ్యం గారి – ఆంధ్ర సాహిత్య విమర్శ – ఆంగ్ల ప్రభావం.13 వ భాగం.24.12.24.

డా.జి.వి.సుబ్రహ్మణ్యం గారి – ఆంధ్ర సాహిత్య విమర్శ – ఆంగ్ల ప్రభావం.13 వ భాగం.24.12.24.

డా.జి.వి.సుబ్రహ్మణ్యం గారి – ఆంధ్ర సాహిత్య విమర్శ – ఆంగ్ల ప్రభావం.13 వ భాగం.24.12.24.

Posted in రచనలు | Leave a comment

టెంక ణా దిత్య కవిరాజశిఖామణి నన్నె చోడుని కుమారసంభవ కావ్య0.46 వ భాగం.24.12.24.

టెంక ణా దిత్య కవిరాజశిఖామణి నన్నె చోడుని కుమారసంభవ కావ్య0.46 వ భాగం.24.12.24. https://youtu.be/vXg6lQTp1n0

Posted in రచనలు | Leave a comment

టెంక ణా దిత్య కవిరాజశిఖామణి నన్నె చోడుని కుమారసంభవ కావ్య0.46 వ భాగం.24.12.24.

టెంక ణా దిత్య కవిరాజశిఖామణి నన్నె చోడుని కుమారసంభవ కావ్య0.46 వ భాగం.24.12.24.

టెంక ణా దిత్య కవిరాజశిఖామణి నన్నె చోడుని కుమారసంభవ కావ్య0.46 వ భాగం.24.12.24.

Posted in రచనలు | Leave a comment

విశాఖ దత్త కవి కృత నాటకం . ముద్రా రాక్షస0.11 వ భాగం.24.12.24.

విశాఖ దత్త కవి కృత నాటకం . ముద్రా రాక్షస0.11 వ భాగం.24.12.24.

విశాఖ దత్త కవి కృత నాటకం . ముద్రా రాక్షస0.11 వ భాగం.24.12.24.

Posted in రచనలు | Leave a comment

రా. వి.శాస్త్రి( రాచ కొండ విశ్వ నాథ శాస్త్రి) గారి జీవితం,సాహిత్యం.2 వ భాగం.23.12.24.

రా. వి.శాస్త్రి( రాచ కొండ విశ్వ నాథ శాస్త్రి) గారి జీవితం,సాహిత్యం.2 వ భాగం.23.12.24.

Posted in రచనలు | Leave a comment

డా. జి. వి.సుబ్రహ్మణ్యం గారి – ఆంధ్ర సాహిత్య విమర్శ -: ఆంగ్ల ప్రభావం.12 వ భాగం.23.12.24.

డా. జి. వి.సుబ్రహ్మణ్యం గారి – ఆంధ్ర సాహిత్య విమర్శ -: ఆంగ్ల ప్రభావం.12 వ భాగం.23.12.24.

Posted in రచనలు | Leave a comment

టెంక ణా దిత్య కవిరాజశిఖామణి నన్నె చోడుని కుమారసంభవ కావ్య0 .45 వ భాగం.23.12.24.

టెంక ణా దిత్య కవిరాజశిఖామణి నన్నె చోడుని కుమారసంభవ కావ్య0 .45 వ భాగం.23.12.24.

Posted in రచనలు | Leave a comment

విశాఖ దత్త కవి కృత నాటకం. ముద్రా రాక్షసం.10 వ భాగం.23.12.24.

విశాఖ దత్త కవి కృత నాటకం. ముద్రా రాక్షసం.10 వ భాగం.23.12.24.

Posted in రచనలు | Leave a comment

శ్రీ రా.వి.శాస్త్రి( రాచ కొండ విశ్వ నాథ శాస్త్రి) గారి జీవితం,సాహిత్యం.1 వ భాగం.22.12.24.

శ్రీ రా.వి.శాస్త్రి( రాచ కొండ విశ్వ నాథ శాస్త్రి) గారి జీవితం,సాహిత్యం.1 వ భాగం.22.12.24.

శ్రీ రా.వి.శాస్త్రి( రాచ కొండ విశ్వ నాథ శాస్త్రి) గారి జీవితం,సాహిత్యం.1 వ భాగం.22.12.24.

Posted in రచనలు | Leave a comment

డా. జి. వి.సుబ్రహ్మణ్యం గారి- తెలుగు సాహిత్య విమర్శ. ఆంగ్ల ప్రభావం.11 వ భాగం.22.12.24.

డా. జి. వి.సుబ్రహ్మణ్యం గారి- తెలుగు సాహిత్య విమర్శ. ఆంగ్ల ప్రభావం.11 వ భాగం.22.12.24.

డా. జి. వి.సుబ్రహ్మణ్యం గారి- తెలుగు సాహిత్య విమర్శ. ఆంగ్ల ప్రభావం.11 వ భాగం.22.12.24.

Posted in రచనలు | Leave a comment

టెంక ణా దిత్య కవిరాజశిఖామణి నన్నె చోడుని కుమారసంభవ కావ్య0 .44 వ భాగం.22.12.24

టెంక ణా దిత్య కవిరాజశిఖామణి నన్నె చోడుని కుమారసంభవ కావ్య0 .44 వ భాగం.22.12.24

Posted in రచనలు | Leave a comment

విశాఖ దత్త కవి కృత నాటకం. ముద్రా రాక్షసం.9 వ భాగం.22.12.24.

విశాఖ దత్త కవి కృత నాటకం. ముద్రా రాక్షసం.9 వ భాగం.22.12.24.

విశాఖ దత్త కవి కృత నాటకం. ముద్రా రాక్షసం.9 వ భాగం.22.12.24.

Posted in రచనలు | Leave a comment

రావి శాస్త్రి గారి జీవితం సాహిత్యం ప్రారంభం 

ఈ సాయంత్రం నుంచే రావి శాస్త్రి గారి జీవితం సాహిత్యం ప్రారంభం 

సాహితీ బంధువులకు శుభ కామనలు -నిన్న 21వ తేదీశనివారం  సాయంత్రం14 వ ఎపిసోడ్ తో శ్రీ తనికెళ్ళ భరణి గారి -”ఎందఱో మహానుభావులు ”-అద్భుత సంగీత విద్వాంసుల అజ్ఞాత జీవిత చిత్రాలు -పూర్తి అయింది .

 ఈ రోజు 22-12-24 ఆదివారం సాయంత్రం నుంచి ప్రమిద పత్రిక సంపాదకులు శ్రీ బులుసు కామేశ్వర రావు గారు ప్రఖ్యాత కథకులు, నవలా రచయిత శ్రీ రావి శాస్త్రి (రాచకొండ విశ్వనాథ శాస్త్రి )గారిపై వెలువరించిన ప్రత్యేక  సంచిక ఆధారంగా శ్రీ రావి శాస్త్రి గారి జీవితం -సాహిత్యం సరసభారతి  ఫేస్ బుక్ లో ప్రత్యక్ష ప్రసారం చేస్తున్నాము .మీ గబ్బిట దుర్గా ప్రసాద్ -22-12-24-ఉయ్యూరు . 

Posted in రచనలు | Leave a comment

నాటక సినీ రచయిత నటుడు శ్రీ తనికెళ్ళ భరణి గారి ఎందరో మహాను భావులు. అద్భుత సంగీత విద్వాంసుల అజ్ఞాత జీవిత చిత్రాలు.14 వ చివరి భాగం.,22.12.24.

నాటక సినీ రచయిత నటుడు శ్రీ తనికెళ్ళ భరణి గారి ఎందరో మహాను భావులు. అద్భుత సంగీత విద్వాంసుల అజ్ఞాత జీవిత చిత్రాలు.14 వ చివరి భాగం.,22.12.24.

నాటక సినీ రచయిత నటుడు శ్రీ తనికెళ్ళ భరణి గారి ఎందరో మహాను భావులు. అద్భుత సంగీత విద్వాంసుల అజ్ఞాత జీవిత చిత్రాలు.14 వ చివరి భాగం.,22.12.24.

Posted in రచనలు | Leave a comment

డా. జి. వి. సుబ్రహ్మణ్యం గారి – ఆంధ్ర సాహిత్య విమర్శ. ఆంగ్ల ప్రభావం.10 వ భాగం.21.12.24.

డా. జి. వి. సుబ్రహ్మణ్యం గారి – ఆంధ్ర సాహిత్య విమర్శ. ఆంగ్ల ప్రభావం.10 వ భాగం.21.12.24.

డా. జి. వి. సుబ్రహ్మణ్యం గారి – ఆంధ్ర సాహిత్య విమర్శ. ఆంగ్ల ప్రభావం.10 వ భాగం.21.12.24.

Posted in రచనలు | Leave a comment

కథా’’ సాహితీ’’ ,వైమానిక దళ ‘’ సమరాంగణ ‘’ త్రివిక్రమ్ ,ఉన్నత న్యాయవాది –శ్రీ కాటూరి రవీంద్ర

కథా’’ సాహితీ’’ ,వైమానిక దళ ‘’ సమరాంగణ ‘’ త్రివిక్రమ్ ,ఉన్నత న్యాయవాది –శ్రీ కాటూరి రవీంద్ర

సౌమ్యులు ,చిరునవ్వే ఆహ్వానం ,మంచిమనసున్న న్యాయవాది ,రచయితలలో పెద్దమనిషి ,ప్రతిభను ప్రోత్సహించే విశాలహృదయులు ,చిన్నా పెద్దా సాహితీ సమావేశాలకు తప్పని సరిగా హాజరై నిండు మనసుతో ప్రోత్సహించే నిగర్వి సరసభారతికి ఆప్తులు శ్రీ కాటూరి రవీంద్ర త్రివిక్రమ్ గారు ఈ డిసెంబర్ 18న విజయవాడ కృష్ణలంక స్వగృహం లో 79వ ఏట మరణించారు .వారి ఆత్మకు శాంతి కలగాలని కోరుతూ వారి కుటుంబానికి సానుభూతి తెలియ జేస్తున్నాను .

  శ్రీ రవీంద్ర త్రివిక్రమ్ గారితో సుమారు పాతికేళ్ళ అను బంధం నాది .బందర్లో సాహితీ మిత్రుల పక్షాన శ్రీ రావి రంగారావు ఒక కథా సదస్సు నిర్వహిస్తున్నారని తెలిసివెళ్లాను ,ఆంధ్రపత్రిక సంపాదకులు శ్రీ వీరాజీ సభాధ్యక్షులు  ప్రముఖ నవలా రచయిత శ్రీ కొమ్మూరి వేణు గోపాలరావు,ప్రసిద్ధ కథకులు శ్రీ కాటూరి రవీంద్ర త్రివిక్రమ్ మొదలైన వారు వక్తలు .అందరూ మంచి కథల గురించి ,ఆయా రచయితల గొప్ప తనం గురించి సాధికారంగా మాట్లాడారు .కొమ్మూరిని ,కాటూరినీ అప్పుడే మొదటి సారి చూసాను.అంతా బాగానే ఉంది.అయితే అప్పుడే ఒక ప్రసిద్ధ కథానికి ఆంధ్ర  దేశమంతా  కొత్త వరవడి సృష్టించి , దుమ్ము దులిపెస్తూ హల్ చల్ చేసి పాఠకుల హృదయాలను రసప్లావితం చేసిన కథను  వీరంతా మరచి పోయినందుకు  నాకు ఎక్కడో కాల్తోంది .అధ్యక్షుల వారిని నాకు ఒక అయిదు నిమిషాల సమయం ఇవ్వమని కోరగా ఏ కళలో ఉన్నారొ ఇచ్చారు  .నేను వేదికపైకి వెళ్ళి శ్రీ రమణ రాసిన ‘’మిథునం ‘’కథ గురించి నాకు తెలిసిందంతా చెప్పి అంతటి గొప్ప కథ  కొన్నేళ్లుగా మనకు రాలేదని దాన్ని ఇందరు ప్రసిద్ధ వక్తలు ప్రస్తావించక పోవటం దురదృష్టకరమని ఆని చెప్పి కూర్చున్నాను .వీరాజీ వెంటనే స్పందించి ‘’ఈ మాస్టారు చెప్పింది అక్షర సత్యం .అన్నారు.అప్పుడే రవీంద్ర గారి ఫోన్ నంబర్ తీసుకొన్న జ్ఞాపకం .సాయంత్రం ఉయ్యూరు వచ్చేశాను .మర్నాడు ఉదయం త్రివిక్రమ్ గారు ఫోన్ చేసి ‘’దుర్గా ప్రసాద్ గారూ!నిన్న రాత్రి మేము బెజవాడ చేరాక కొమ్మూరి ఫోన్ చేసి మీరు మాట్లాడిన తీరుకు మహా ముచ్చట పడ్డారు  మీకు అభినందనలు తెలియ జేయమన్నారు .ప్రతి రోజూ రాత్రి 12 వరకు మేము ఫోన్ లో మాట్లాడు కొంటూనే ఉంటాం .మళ్లీ తల్లవారాక కూడా ఒకరితో ఒకరంమాలాడక పొతే మా ఇద్దరికీ తోచదు.అంతటి గాఢ సాహితీ బంధం మాది . మిమ్మల్ని నేనూ అభినదిస్తున్నాను .ఇచ్చిన కాస్త సమయంలో మిథునం కథను మా ముందు గొప్పగా ఆవిష్కరించారు మీరు ‘’అన్నారు .ధన్యవాదాలు చెప్పాను .

 అప్పుడు నేను ఉయ్యూరు సాహితీ మండలి కన్వీనర్ గా ఉన్న జ్ఞాపకం .ప్రతినెల మూడవ ఆదివారం తప్పక సాహిత్య కార్యక్రమం నిర్వహించే వాళ్ళం..త్రివిక్రమ్ గారిని ఒక నెల మూడవ ఆదివారం సాయంత్రం ఆహ్వానించగా  వారి కథానికా విశేషాలు ,జీవిత విశేషాలు చక్కగా వివరించారు .వారికి ఉడతా భక్తీ సన్మానం చేసి మా తలి దండ్రుల పేరిట నూట పదహారు రూపాయలు, శాలువా బహూక రించాం . అప్పటి నుంచి దాదాపు వీలైనప్పుడల్లా ఫోన్లో మాట్లాడుకొనే వారం .కొమ్మూరి మరణాన్ని ఆయన ఫోన్ లో చెప్పారు తట్టుకోలేక పోయారు అనిపించింది వారి మాటలు  వింటూ  ఉంటే . కృష్ణా జిల్లా రచయితల సంఘం కార్యక్రమాలలో తప్పక కలుస్తూ ఉండేవారం .ఆయన నన్ను ఎప్పుడూ తమ ఇంటికి రమ్మని ఆహ్వానించే వారు .వెళ్లటం కుదరలేదు .ఆయన మా కటుంబ ఆత్మీయురాలు శ్రీమతి సీతంరాజు మల్లిక గారి ఆడపడుచు భర్త గారు .అంటే మల్లికగారి భర్త శ్రీ వెంకట రావు గారి  సోదరి భర్త . కృష్ణ లంకలో మల్లికామ్బగారి తండ్రిగారిల్లు ,కాటూరి వారి ఇళ్ళు దగ్గర దగ్గరే .వారి వీధిపేరు –‘’కాటూరి వారి వీధి ‘’ఆని గుర్తు .

  మేము సరస భారతి స్థాపించిన తర్వాత పుస్తక ప్రచురణ చేయటం, రవీంద్ర గారికి  మా పుస్తకాలు పంపిస్తూ ఉండటం జరిగేది .అందిన వెంటనే ఆయన ఫోన్చేసి చెప్పి పుస్తకం లోని విషయాలను మెచ్చుకొనేవారు .ఒక సారి ఆయన ,ఆయన అర్ధాంగి ఉయ్యూరు కు మల్లిక గారింటికి వచ్చి ,మా ఇంటికి కూడా ఇద్దరూ వచ్చి ఒక ‘గంట సేపు కూర్చుని మాట్లాడారు .అదొక పండుగ అనిపించింది మాకు .సరస భారతి ‘’మా అన్నయ్య ‘’శీర్షికతో ‘ఒక ఉగాది కవి సమ్మేళనాన్నినిర్వహించింది .ఆకవితలను పుస్తక రూపంగా తేవాలని అనుకొంటూ ఉండగా సరసభారతి కార్యవర్గ సభ్యురాలు మల్లికగారు తాను  స్పాన్సర్ చేస్తానని తమ తలి దండ్రులు స్వర్గీయ తాడేపల్లి మల్లికార్జునరావు శ్ర్రేమతి లలితాంబ దంపతులకు అంకితం ఇవ్వాలని కోరగా ,అలాగే ఆని పుస్తకం రమ్యభారతి సంపాదకులు శ్రీ చలపాక ప్రకాష్ గారి ద్వారా ముద్రి౦పి౦చాం .పుస్తకావిష్కరణ విజయవాడలో చేస్తే బాగుంటుందని అందరంసంప్రదించుకొని ఆ బాధ్యతకూడా చలపాక పై పెట్టగా ,ఆయన శ్రీ మాకినేని బసవ పున్నయ్య హాల్ లో ఏర్పాటు చేశారు .పుస్తక ఆవిష్కారానికి తగిన వ్యక్తి శ్రీ కాటూరి రవీంద్ర త్రివిక్రమ్ గారు ఆని అందరం నిర్ణయించి ,వారికి నేను ఫోన్ చేయగా తప్పకుండా వస్తాను అన్నారు .కార్యక్రమం ఒక ఆదివారం ఉదయం 10గం లకు ఏర్పాటు చేశాం.మల్లికగారి చెల్లెళ్ళు వారి సంతానం ,బెజవాడ సాహితీ మిత్రులు అందరూ విచ్చేశారు .త్రివిక్రమ్ గారు ‘’మా అన్నయ్య ‘’కవితా సంకలనం ఆవిష్కరించి అందులోని కవితల విశేషాలు తెలియజేశారు .ఈ కార్యక్రమం ఘనంగా జరగటానికి చలపాక కృషి ,మల్లిక గారి సహకారం మరువలేనిది .ఆతర్వాత కృష్ణలంకలో మల్లికగారి కుమార్తె శ్రీమతి దుర్గాలు ఇంట్లో అందరికి ఘనమైన విందు భోజనం .అప్పుడే కొంతఖాళీ దొరికితే, రవీంద్ర గారి ఇంటికి కూడా వెళ్ళి వచ్చాం .అదే మొదటి సారి ,చివరి సారి చూడటం .

  నేను ‘’ఊసుల్లో ఉయ్యూరు ‘’పుస్తకం రాసి  సరస భారతి తరఫున ముద్రించాను .ఆ పుస్తకం త్రివిక్రమ్ గారికి పంపాను .ఆయన  చదివి  ఫోన్ చేసి ‘’ఇలాంటి పుస్తకం నేనూ రాయాలనే అనుకొన్నాను కానీ రాయలేక పోయాను .మీరు చాలా గొప్పగా రాశారు. మీకు గుర్తున్న వారినందర్నీ బాల్యం ఆదిగా చాలా బాగా గుర్తుచేసుకొని వాళ్ళ పర్సనాలిటీలు,హావభావాలు మనసు హృదయం వారిలోని సహృదయత  మనసుకు హత్తుకోనేట్లు రాశారు. ఎంత అభినందిన్చినా తక్కువే అవుతుంది మీ కృషికి ‘’అంటూ మనసారా మెచ్చుకొన్న సంస్కారం కాటూరి వారిది .

  ఈ మధ్యనే మల్లికాంబ గారి ద్వారా ,వార్తాపత్రిక కథనం ద్వారా ఆయన అనారోగ్య విషయం తెలిసింది .ఇంతలో జరిగిపోయింది .

ఆరు వందల కథలు  రాయటం మామూలు విషయంకాదు .నాటకం నవలిక ,నవల గీతాలు హరికథలలోకూడా తమ సామర్ధ్యం చూపారు .ఆకాశవాణి లో వందకు పైగా నాటకాలు రాసి ,కీర్తిని దిగంతాలకు వ్యాపింప జేసుకొన్నారు .దూరదర్శనం లో కూడా ప్రవేశించి ప్రగతి భారతం సీరియల్ ,గ్రీష్మం ,అమ్మలగన్న యమ్మ లతో హిట్లు కొట్టారు .వారి ‘’అంతర్నేత్రం ‘’అందరికి కనువిప్పు కలిగించే ఆధ్యాత్మిక అంజనం .స్వీయ జీవన రేఖలు అందర్నీ ఆకట్టుకొన్నాయి .అయిర్ ఫోర్స్ లో రిటైరయ్యాక పంజాబ్ నేషనల్ బాంక్ లో 20ఏళ్ళు సమర్ధంగా పని చేశారు .హైకోర్ట్ లాయర్ గా మంచి పేరు తెచ్చుకొన్నారు .అంతర్జాతీయ లయన్స్ క్లబ్ లో సేవలకు అంతర్జాతీయ పురస్కారం పొందారు .జాతీయ వినియోగదారుల ఫెడరేషన్ కు వ్యవస్థాపక అధ్యక్షులు .ఆంధ్రప్రదేశ్ రచయితల సంఘానికి గౌరవ సలహాదారు .ఇన్ని విభిన్నమైన రంగాలలో ఒక వ్యక్తి వ్యవహరించి గుర్తింపు పొందటం అరుదైన విషయం .భారత వైమానిక దళం లో పని చేసినప్పుడు1965,1971 యుద్ధాలలో స్వయంగా పాల్గొన్నారు .అందుకే నేను ‘’  కథా’’ సాహితీ’’ ,వైమానిక దళ ‘’ సమరాంగణ ‘’ త్రివిక్రమ్ ,ఉన్నత న్యాయవాది –శ్రీ కాటూరి రవీంద్ర ఆని శీర్షిక పెట్టాను .

‘’ఒకసారి  రవీంద్ర గారి కథానికల శీర్షికలను సరదాగా  తడిమి చూద్దాం –అక్షరాలపందిరితో అరచేతిలో స్వర్గం చూపించి ,ఆద్య౦తాల మధ్య ప్రేమికుడు విజయ్ కు ఆపరేషన్ చేసి ,ఈ ఇల్లాలి మనసెం కావాలి ఆని ప్రశ్నించి ,ఎన్నికలో ఋణం తీర్చి ,ఎరలో పడి ఎవరితో లేచిపోవాలో తెలీక  ఓం యమాయనమః ఆని ఓన్లి వన్ మర్డర్ చేసి ,గొడుగులో వానకు గ్రీన్ లైట్ చూపి ,చెట్టు నీడలో జననీ, జన్మభూమినీ చూసి, డబ్బు చెట్టుకు డప్పు కొట్టి ,తెల్లకాకికి దుప్పటికప్పి , నువ్వు నన్ను ప్రేమించకు అంటే నగ్నశిఖరాలు చూపించి ,నిలువెత్తు నిజాయితీకి నీళ్ళు వదిలి ,పుత్రికా కామేష్టి చేసి పాపం అరుణను కనీ ,బుల్లి పేషెంట్ బుల్లబ్బాయి భార్య బతుకు బండి గాడితప్పితే, వెన్నెల కోవిలలో వెన్నెలే కాటేస్తే,శవాలు వేలం వేస్తె, హాట్ హోమ్ లో స్నేహలత,హాలికులైతేనేమి మీరే మా హీరో ‘’అన్నది సుజాత ‘’.   

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -21-12-24-ఉయ్యూరు .

Posted in రచనలు | Leave a comment

విశాఖ దత్త కవి కృత నాటకం ముద్రా రాక్ష సం.8 వ భాగం.21.12.24.

విశాఖ దత్త కవి కృత నాటకం ముద్రా రాక్ష సం.8 వ భాగం.21.12.24.

Posted in రచనలు | Leave a comment

నాటక సినీ రచయిత నటుడు శ్రీ తనికెళ్ళ భరణి గారి ఎందరో మహాను భావులు. అద్భుత సంగీత విద్వాంసుల అజ్ఞాత జీవిత చిత్రాలు.13 వ భాగం.20.12.24.

నాటక సినీ రచయిత నటుడు శ్రీ తనికెళ్ళ భరణి గారి ఎందరో మహాను భావులు. అద్భుత సంగీత విద్వాంసుల అజ్ఞాత జీవిత చిత్రాలు.13 వ భాగం.20.12.24.

నాటక సినీ రచయిత నటుడు శ్రీ తనికెళ్ళ భరణి గారి ఎందరో మహాను భావులు. అద్భుత సంగీత విద్వాంసుల అజ్ఞాత జీవిత చిత్రాలు.13 వ భాగం.20.12.24.

Posted in రచనలు | Leave a comment

డా. జి. వి.సుబ్రహ్మణ్యం గారి – ఆంధ్ర సాహిత్య విమర్శ – ఆంగ్ల ప్రభావం.9 వ భాగం.20.12.24.

డా. జి. వి.సుబ్రహ్మణ్యం గారి – ఆంధ్ర సాహిత్య విమర్శ – ఆంగ్ల ప్రభావం.9 వ భాగం.20.12.24.

Posted in రచనలు | Leave a comment

టెంక ణా దిత్య కవిరాజశిఖామణి నన్నె చోడుని కుమారసంభవ కావ్య0 .43 వ భాగం.20.12.24.

టెంక ణా దిత్య కవిరాజశిఖామణి నన్నె చోడుని కుమారసంభవ కావ్య0 .43 వ భాగం.20.12.24.

Posted in రచనలు | Leave a comment

విశాఖ దత్త కవి కృత నాటకం- ముద్రా రాక్షస0 7 వ భాగం.20.12.24.

విశాఖ దత్త కవి కృత నాటకం- ముద్రా రాక్షస0 7 వ భాగం.20.12.24.

విశాఖ దత్త కవి కృత నాటకం- ముద్రా రాక్షస0 7 వ భాగం.20.12.24.

Posted in రచనలు | Leave a comment

నాటక సినీ రచయిత నటుడు శ్రీ తనికెళ్ళ భరణి గారి ఎందరో మహాను భావులు. అద్భుత సంగీత విద్వాంసుల అజ్ఞాత జీవిత చిత్రాలు.12 వ భాగం.19.12.24.

నాటక సినీ రచయిత నటుడు శ్రీ తనికెళ్ళ భరణి గారి ఎందరో మహాను భావులు. అద్భుత సంగీత విద్వాంసుల అజ్ఞాత జీవిత చిత్రాలు.12 వ భాగం.19.12.24.

Posted in రచనలు | Leave a comment