ప్రాచార్య బ్రహ్మశ్రీ శలాక రఘు నాథ శర్మ గారి భాగవత నవనీతం.39 వ భాగం.27.7.25.

ప్రాచార్య బ్రహ్మశ్రీ శలాక రఘు నాథ శర్మ గారి భాగవత నవనీతం.39 వ భాగం.27.7.25.

Posted in రచనలు | Leave a comment

శ్రీశ్రీ విద్యారణ్య స్వామి వారి వేదాంత పంచ ద శి.55 వ భాగం.27.7.25.

శ్రీశ్రీ విద్యారణ్య స్వామి వారి వేదాంత పంచ ద శి.55 వ భాగం.27.7.25.

Posted in రచనలు | Leave a comment

జ్ఞానపీఠ పురస్కార గ్రహీత శ్రీ రావూరి భరద్వాజ గారి నవల. కరిమింగిన వెలగ పండు.4 వ భాగం.26.7.25.

జ్ఞానపీఠ పురస్కార గ్రహీత శ్రీ రావూరి భరద్వాజ గారి నవల. కరిమింగిన వెలగ పండు.4 వ భాగం.26.7.25.

Posted in రచనలు | Leave a comment

డా. సి.హెచ్.సుశీలమ్మ గారి _ శ్రీ ముళ్ళపూడి వెంకటరమణ గారి రచనలు సమగ్ర పరిశీలన.15 వ భాగం.26.7.25.

డా. సి.హెచ్.సుశీలమ్మ గారి _ శ్రీ ముళ్ళపూడి వెంకటరమణ గారి రచనలు సమగ్ర పరిశీలన.15 వ భాగం.26.7.25.

డా. సి.హెచ్.సుశీలమ్మ గారి _ శ్రీ ముళ్ళపూడి వెంకటరమణ గారి రచనలు సమగ్ర పరిశీలన.15 వ భాగం.26.7.25. https://youtu.be/w7KSZTPdKjo

Posted in రచనలు | Leave a comment

స్విట్జర్ లాండ్ లో తెలుగు వెలుగు ,వైద్య ఆర్ధిక శాస్త్ర నిపుణుడు ,బహుభాషావేత్త ,కవి -శ్రీవేగె నాగేశ్వరరావు

స్విట్జర్ లాండ్ లో తెలుగు వెలుగు ,వైద్య ఆర్ధిక శాస్త్ర నిపుణుడు ,బహుభాషావేత్త ,కవి -శ్రీవేగె నాగేశ్వరరావు

కృష్ణాజిల్లా గన్నవరంతాలూకా ఉంగుటూరుమండలం పెదవుటపల్లి లో శ్రీవేగె నాగేశ్వరరావుగారు  శ్రీ వేగె తాతయ్య వెంకట్రామ్మ దంపతులకు 27-2-1932 న ఆఖరి సంతానంగా సామాన్య రైతు కుటుంబలో జన్మించారు . పుట్టిన ఏడాదిన్నరకే తల్లి చనిపోయింది .తండ్రి తీవ్ర దుఃఖ భారం తొ కొడుకులో భార్య రూపు రేఖలు చూసుకొంటూ జాగ్రత్త గా పెంచారు .అక్కలు సుబ్బాయమ్మ ,రంగమ్మ అన్న కృష్ణారావు గార్లు ఈ చిట్టి తమ్ముడిని అల్లారు ముద్దుగా చూసుకొన్నారు .ప్రాధమిక విద్య స్వగ్రామం లో పూర్తిచేసి గన్నవరం జిల్లాపరిషత్ హైస్కూల్ లో ధర్డ్ ఫారం చదివిపాసయ్యారు అన్న కృష్ణారావు దగ్గర నెల్లూరు వి ఆర్ కాలేజి లో ఇంటర్ ఎకనామిక్స్ లో బిఏ చదివి ఉత్తీర్ణులయ్యారు .

  నాగేశ్వరరావు గారు 1957లోఇటలీ వెళ్లి పాడువాఅండ్ ఫార్మసి  యూని వర్సిటిలో  చేరి మెడిసిన్ అండ్ సర్జరి లో ఎం .డి.చేశారు .చదువుపూర్తి అయ్యాక ‘’కర్నీలియా ‘’అనే స్వస్ దేశ అమ్మాయిని పెళ్ళాడి’’ శాంతిప్రియ’’  కూతుర్ని కని, ‘’శాంతిప్రియ ‘’పేరు పెట్టి తమ దేశ సంప్రదాయం ఔన్నత్యాన్ని నిలబెట్టుకొన్నారు .శాంతిప్తియ ఆర్కిటేక్చరాల్ ఇంజనీరింగ్ చదివి  అదే విభాగంలో ఇంజనీర్ అయిన ‘’బాలాజీ’’ని వివాహమాడి జ్యూరిచ్ లో సెటిల్ అయ్యారు .

  ఆర్ధిక శాస్త్రం లో డిగ్రీ, వైద్యంలో ఎం డి పొందిన నాగేశ్వరావు గారు విశిష్ట వ్యక్తి మేధా సంపన్నులు .సోషలిస్ట్ మేధావి .పార్లమెంట్ లో సోషలిస్ట్ పార్టీ సభ్యులుగా కొంతకాలమున్నారు .ఇండియా వచ్చినప్పుడల్లా పాత తెలుగు సినిమాలు చూడటం ఆయనకు అలవాటు .భారత రామాయణకాల విలువలను గురించి చర్చించేవారు .ఆరాధించే వారు .విదేశాలలో మంచి కవిగా ప్రసిద్ధి చెందారు .ఇంగ్లిష్ ఇటాలియన్ భాషలలో వైదుష్యంతో హృదయాలను ఆకట్టుకొనేలా ఉపన్యసించే వారు .ఆయన రచనలకు విదేశాలలో మంచి గిరాకీ ఉండేది ..న్యూయార్క్ హెరాల్డ్ ట్రిబ్యూన్ యూరోపియన్ ఎడిషన్ లో వీరి కవితలు ప్రచురితమై ,యూరోపియన్ పాఠకులకు దగ్గరయ్యారు .వీరి కవితల పుస్తకం ‘’పీస్ అండ్ లవ్ ‘’కు బెర్ట్రాండ్ రస్సెల్ ముందుమాట రాశారు .రావు గారి కవిత్వాన్ని మెచ్చుకొంటూ ‘’మీ కవితలు అద్భుతం ..శాంతిని గురించి మీరు రాసిన కవితలు సజీవంగా ,ఉన్నత ప్రమాణాలతో ,గొప్ప ఆలోచనలను రేకెత్తిస్తున్నాయి .అన్నికవితలు మెచ్చదగినవే పేర్కొన దగినవే ‘’ఆని కితాబిచ్చాడు రస్సెల్ .

  ఈ కవితా సంపుటిలో ‘’త్రీ మదర్స్ ‘’కవితలో తనకు జన్మనిచ్చిన తల్లి ,మాతృభాష ,మాతృభూమి ముగ్గురు తల్లులు ఆని అత్యంత గౌరవప్రదంగా వినయంతో పేర్కొన్నారు రావు గారు .ఇటాలియన్ భాషలో ‘’ ఆరోరా ,సేనేవిటా,శాంతిప్రియ ,సోషియాలిస్మోపుస్తకాలు రాశారు .ఇంగ్లీష్ లో లైఫ్ అండ్ లవ్ ,పీస్ అండ్ లైఫ్ ,సోషలిజం అనే నాటకం ,లేస్లిబిచ్ ,పోయిసేస్ బి.ఎన్ .కె .  దాస్ ,పోయిసేస్ క్లియిసిస్ ,రాశారు .

శ్రీ వేగె నాగేశ్వరరావు తమ భాషా వైద్య ఆర్ధిక సేవలకు బహు విశిష్ట పురస్కారాలు అందుకొన్నారు .అందులో ముఖ్యమైనవి -కొలంబియన్ ట్రోఫీ ,సెయింట్ లూయీ ,రోమా ,తివోర్నో క్రిటేకాలిటరేరియా,రోమా ప్రియో ,జూరిక్ ప్రిమియో ,ప్రిమియో .

  27-2-1997న 65ఏళ్ల వయసులో కవి డాక్టర్ ,రచయిత ,మాతృభాషా మాతృదేశాభిమాని శ్రీ వేగె నాగేశ్వరరావు మరణించారు .

 వీరి గురించి ఎవరికీ తెలియదనిపిస్తోంది .వీరి జీవితం చూస్తుంటే మా  ఉయ్యూరుకు చెందిన ‘’కేమోటాలజి పిత ‘’శ్రీ కొలచల సీతారామయ్య గారు జ్ఞాపకం వస్తున్నారు .ఇద్దరూ కృష్ణాజిల్లా మహోన్నతులే .

ఆధారం -కృష్ణాజిల్లా కోలవెన్నుకు చెందిన శ్రీ పరుచూరి శ్రీనివాసరావు గారి వ్యాసం     

.మీ -గబ్బిట దుర్గాప్రసాద్ -26-7-25-ఉయ్యూరు 

Posted in రచనలు | Leave a comment

ప్రాచార్య బ్రహ్మశ్రీ శలాక రఘు నాథ శర్మ గారి భాగవత నవనీతం.38 వ భాగం.26.7.25.

ప్రాచార్య బ్రహ్మశ్రీ శలాక రఘు నాథ శర్మ గారి భాగవత నవనీతం.38 వ భాగం.26.7.25.

Posted in రచనలు | Leave a comment

శ్రీ శ్రీ విద్యారణ్య స్వామి వారి వేదాంత పంచ ద శి.54 వ భాగం.26.7.25.

Posted in రచనలు | Leave a comment

జ్ఞాన పీఠ పురస్కార గ్రహీత శ్రీ రావూరి భరద్వాజ గారి నవల _ కరిమింగిన వెలగ పండు.3 వ భాగం.25.7..25.

జ్ఞాన పీఠ పురస్కార గ్రహీత శ్రీ రావూరి భరద్వాజ గారి నవల _ కరిమింగిన వెలగ పండు.3 వ భాగం.25.7..25.

జ్ఞాన పీఠ పురస్కార గ్రహీత శ్రీ రావూరి భరద్వాజ గారి నవల _ కరిమింగిన వెలగ పండు.3 వ భాగం.25.7..25.

Posted in రచనలు | Leave a comment

డా.సీహెచ్.సుశీలమ్మ గారి _ శ్రీ ముళ్ళపూడి వెంకటరమణ గారి రచనలు సమగ్ర పరిశీలన.14. వభాగం.25.7.25.

డా.సీహెచ్.సుశీలమ్మ గారి _ శ్రీ ముళ్ళపూడి వెంకటరమణ గారి రచనలు సమగ్ర పరిశీలన.14. వభాగం.25.7.25.

Posted in రచనలు | Leave a comment

ప్రాచార్య బ్రహ్మశ్రీ శలాక రఘు నాథ శర్మ గారి భాగవత నవనీతం.37 వ భాగం.25.7.25.

ప్రాచార్య బ్రహ్మశ్రీ శలాక రఘు నాథ శర్మ గారి భాగవత నవనీతం.37 వ భాగం.25.7.25.

ప్రాచార్య బ్రహ్మశ్రీ శలాక రఘు నాథ శర్మ గారి భాగవత నవనీతం.37 వ భాగం.25.7.25.

Posted in రచనలు | Leave a comment

శ్రీ శ్రీ విద్యారణ్య స్వామి వారి వేదాంత పంచ ద శి.53 వ భాగం.25.7.25.

శ్రీ శ్రీ విద్యారణ్య స్వామి వారి వేదాంత పంచ ద శి.53 వ భాగం.25.7.25.

Posted in రచనలు | Leave a comment

జ్ఞానపీఠ పురస్కార గ్రహీత శ్రీ రావూరి భరద్వాజ గారి నవల కరిమింగిన వెలగ పండు.2 వ భాగం.24.7.25.

Posted in రచనలు | Leave a comment

డా. సీహెచ్.సుశీలమ్మ గారి_ శ్రీ ముళ్ళపూడి వెంకటరమణ గారి రచనలు సమగ్ర పరిశీలన.13 వ భాగం.24.7.25.

డా. సీహెచ్.సుశీలమ్మ గారి_ శ్రీ ముళ్ళపూడి వెంకటరమణ గారి రచనలు సమగ్ర పరిశీలన.13 వ భాగం.24.7.25.

Posted in రచనలు | Leave a comment

ప్రాచార్య బ్రహ్మశ్రీ శలాక రఘు నాథ శర్మ గారి భాగవత నవనీతం.36 వ భాగం.24.7.25.

ప్రాచార్య బ్రహ్మశ్రీ శలాక రఘు నాథ శర్మ గారి భాగవత నవనీతం.36 వ భాగం.24.7.25.

Posted in రచనలు | Leave a comment

శ్రీ శ్రీ విద్యారణ్య స్వామి వారి వేదాంత పంచ ద శి.52 వ భాగం.24.7.25.

శ్రీ శ్రీ విద్యారణ్య స్వామి వారి వేదాంత పంచ ద శి.52 వ భాగం.24.7.25.

Posted in రచనలు | Leave a comment

ఆణిముత్యాలవంటి కథలు రాసిన -శ్రీ కపిల చిన వెంకటరావు

ఆణిముత్యాలవంటి కథలు రాసిన -శ్రీ కపిల చిన వెంకటరావు

శ్రీ కపిల చిన వెంకటరావు గారు  పశ్చిమగోదావరిజిల్లా ‘’మంచిలి ‘’గ్రామం లో 1906లో శ్రీకపిల కృష్ణారావు లక్ష్మమ్మ దంపతులకు జన్మించారు .మద్రాస్ లా కాలేజిలో చదివి బి. ఎల్. పట్టా పొందారు.విజయవాడలో న్యాయవాదిగా 50 ఏళ్ళు వృత్తిలో ఉండి మంచి పేరు తెచ్చుకొన్నారు .కొంతకాలం అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ గా ఉన్నారు .

 బెజవాడ రెడ్ క్రాస్ సంఘానికి మూడు దశాబ్దాలు గౌరవకార్యదర్శి రావుగారు .ఆయన రాసినవ్యాసాలు కథలు నాటికలు ఆనాటి ప్రముఖ పత్రికలలో వచ్చేవి .’’ఇనప్పెట్టె ‘’,’’కొత్తపూస ‘’,’’దేవి ఇచ్చిన వరం’’ ,’’దొంగ ఎవరు ‘’,’’అల్ప సంతోషి ఆచార్లు ‘’కథలు ఆయనకు మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చిపెట్టాయి .వెంకటరావు గారి నాటికలు రేడియో లోనూ ,రంగస్థలం పైనా ప్రదర్శింప బడ్డాయి .’’1984లో 76ఏళ్ల వయసులో శ్రీ కపిల చిన వెంకటరావు మరణించారు ‘’ఆని శ్రీ కపిల లక్ష్మీ నరసింహారావు గారు రాశారు .

మీ -గబ్బిట దుర్గాప్రసాద్ -24-7-25-ఉయ్యూరు .

Posted in రచనలు | Leave a comment

కుంఫిణి సివిల్ ఉద్యోగులకు మొట్టమొదటగా తెలుగు పాఠ్యగ్రందాలు, వ్యాకరణం రాసిన -శ్రీ రావిపాటి గురుమూర్తి శాస్త్రి

కుంఫిణి సివిల్ ఉద్యోగులకు మొట్టమొదటగా తెలుగు పాఠ్యగ్రందాలు, వ్యాకరణం రాసిన -శ్రీ రావిపాటి గురుమూర్తి శాస్త్రి

తెల్లదొరలకోసం తెలుగులో పాఠ్య గ్రంధాలు రాసిన వారిలో ప్రధములు శ్రీ రావిపాటి గురుమూర్తి శాస్త్రి గారు1770లో పుట్టారు 72ఏళ్ళు జీవించి 1836లో మరణించారు . .బారసాల నాడు పెట్టిన పేరు ‘’గురుమూర్తి .’’ఆరువేల నియోగి కుటుంబం వాడు కనుక శాస్త్రి పదం మొదటి నుంచీ లేదు . .

1819 సెయింట్ జార్జికోట కాలేజి వారు ప్రచురించిన ‘’విక్రమార్కుని కథలు ‘’పుస్తకం లో ‘’ఆరువేల నియోగి యగు రావిపాటి గురుమూర్తి ‘’అనే ఉన్నది .ఆకాలేజీ స్థాపించిన తొలి రోజుల్లోనే ఈయనను తెలుగు ఉపాధ్యాయునిగా నియమించారు .శ్రీ వేదం పట్టాభి రామ శాస్త్రి గారు ప్రథాన సంస్కృత ఆంధ్ర ఉపాధ్యాయులు .గురుమూర్తిగారు డిప్యూటీ తెలుగు మాస్టారు .

  తెల్లదొరలకు పాఠ్యగ్రంథంగా గురుమూర్తిగారు 104పేజీల’’ విక్రమార్క కథలు’’ రాశారు .కాలేజివారు 1819లో అచ్చు వేశారు .అదొక్కటే ఆనాటికి ప్రామాణిక పాఠ్యగ్రంధం .1828,1850 ,1858లలో మూడు సార్లు పునర్ముద్రణ జరిగింది .ఈ పుస్తకాలను మద్రాస్ లోని సివిల్ ఉద్యోగులేకాక ఇంగ్లాండ్ లోని వారు కూడా చదువుకోవటానికి పంపించారు .గురుమూర్తి గారి జీతం పెంచి’’ బంగారు కడియాల జత’’ కూడా బహూకరించారు .

  1820 లో వేదం పట్టాభిరామ శాస్త్రిగారు చనిపోగా ,హెడ్ మాస్టర్ గా గురుమూర్తి గారిని నియమించి హోదా సూచించే పదంగా ‘’గురుమూర్తిశాస్త్రి ‘’ఆని గౌరవంగా పిలిచారు .విద్యా విధాన విషయాలలో ప్రభుత్వం ఆయన సలహాలను తీసుకొన్నది .1833లో కలక్టరేట్ స్కూళ్ళలో బోధించాల్సిన పుస్తకాలను గురుమూర్తిగారు నిర్దేశించారు .ప్రభవల పుస్తకం ,సులభమాటల పుస్తకాలు ,వచన వ్యాకరణం ,కొంచెం ఛందస్సు ,సులభ పద్యాల పుస్తకం ,అకారాది శబ్ద పుస్తకం ,జాబులు ,భారతం లో ఆదిపర్వం లను అర్దాలతో సహా స్కూళ్ళలో బోధించాలని చెప్పారు .

  సివిల్ సర్వెంట్లకు తెలుగు నేర్పటమేకాక ,శాస్త్రిగారు వారి విద్యాభి వృద్ధి ఎలాఉన్నదో నిర్ణీత సమయాలలో పరీక్షలు కూడా సీనియర్ కాలేజి బోర్డు సభ్యులతో జరిపించేవారు .తన వద్ద చదువుకొన్న తెల్లదొరలు పెద్ద పెద్ద హోదాలలో పని చేస్తున్నా ,భాషా విషయంలో వాళ్లకు వచ్చే సందేహాలను గురుమూర్తి శాస్త్రిగారు లేఖలద్వారా తెలిపి అనుమానాల నివృత్తి చేసేవారు .1827లో సిపి బ్రౌన్ దొర ‘’అలమోక ‘’,’’డాబాలు ‘’మాటల అర్ధాలు రాసిపంపమంటే ఒక ఉత్తరం లో సమాధానాలు రాసి బ్రౌన్ కు పంపారు .

 1834లో గురుమూర్తిగారు ‘’పంచ తంత్ర కథలు ‘’అనే మరో వచన గ్రంధం రాశారు .ఇదికూడా బాగా ప్రాచుర్యం పొంది నాలుగు సార్లు 1842 ,48 ,64,1869లలో పునర్ముద్రణ పొందింది.తెలుగు మాటలకు ఇంగ్లీష్ అర్ధాలు ఇచ్చే,నిఘంటువు,తెలుగును ఇంగ్లీష్ లో బోధించే వ్యాకరణాలు ,పాఠ్యగ్రంథాలు  రాస్తే ,ఆమోదింపబడిన వాటికి నగదు పారితోషికం ఇస్తామని బోర్డ్ ప్రకటించింది .చాలామంది సివిల్ ఉద్యోగులు ఆపనిలో పడగా గురుమూర్తిగారు వారి వెన్నంటి నిలిచారు .జె.సి మారిస్ దొరరాసిన నిఘంటువులో గురుమూర్తి గారి పాత్ర చాలా ఉంది .1835లోఇది అచ్చయినప్పుడుదొర తన గురువుకు పీఠిక లో కృతజ్ఞతలు ప్రకటించుకొన్నాడు .

  తెలుగు వారికి తెలుగులోనే వ్యాకరణం బోధించాలని గురుమూర్తి గారు భావించి 1836లో ‘’తెలుగు వ్యాకరణం ‘’అనే పేరుతొ 5ప్రకరణాలతో 316లక్షణ వాక్యాలతో రాశారు .సంస్కృత వ్యాకరణం బట్టి సూత్రాలతోకాకుండా ఇంగ్లీష్ విధానాలతో ‘’వాక్య పధ్ధతి ‘’లో చెప్పటం గురుమూర్ర్తి గారి గురుత్వ విశేషం .ఇందులోఅక్షర లక్షణ ,సంధి ,విశేష్య ,విశేషణ ,క్రియాపద ప్రకరణాలున్నాయి .

  శాస్త్రిగారి పాండిత్యం,ప్రామాణికత మీద బ్రౌన్ దొరు అపూర్వ గౌరవం ఉండేది .తన రచనలను ఆయన  ఆమోదించి నందుకు  బ్రౌన్ ‘’I mention his name because his talents and good sence always entitled  his judgement and respect ‘’ఆని 1839లో ప్రశంసించాడు .

 1850లో బ్రౌన్ దొర గురుమూర్తిగారి రచనలు ఇతరులురాసిన ఆంధ్రభాషా సంగ్రహం అరేబియన్ నైట్స్ పుస్తకాలను పాఠశాలలో బోధించటం నిష్ప్రయోజనం ఆని ఆదేశించాడు .బ్రిటీష వారికి కావలసింది తక్షణ ప్రయోజనాలే .శాస్త్రిగారు 1836లో రిటైరయ్యారు .సముచిత పారితోషికాన్ని కంపెని ప్రభుత్వం ఇచ్చింది .ఆయన శిష్యులు ఆయనకు కడపజిల్లా కదిరిలో డిస్ట్రిక్ట్ మునసబు గా ఉద్యోగం ఇప్పించారు .కనుక ఆయనకు ఇచ్చిన ‘’గ్రాట్యు టి’’డబ్బు మొత్తాన్ని వాపసు చేయమని అధికారులు ఆదేశించారు .కంపెనీ వారి విశ్వాసాలు ఇలాఉంటాయి .రావిపాటి గురుమూర్తి శాస్త్రిగారు 1836  లో మరణించారు .ఆయనకొడుకు గురవయ్యను మాత్రం కాలేజీలో ఉపాధ్యాయునిగా నియమించారు గుడ్డ్డిలో మెల్ల లాగ ‘’అన్నారు ఆరుద్ర .

ఆధారం -ఆరుద్ర ‘’సమగ్ర ఆంధ్ర సాహిత్యం -కు౦ఫిణియుగం ‘’

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -24-7-25-ఉయ్యూరు .

Posted in రచనలు | Leave a comment

జ్ఞానపీఠ పురస్కార గ్రహీత శ్రీ రావూరి భరద్వాజ గారి నవల_ కరిమింగిన వెలగ పండు. 1 వ భాగం.23.7.25.

జ్ఞానపీఠ పురస్కార గ్రహీత శ్రీ రావూరి భరద్వాజ గారి నవల_ కరిమింగిన వెలగ పండు. 1 వ భాగం.23.7.25.

Posted in రచనలు | Leave a comment

డా. సి హెచ్.సుశీలమ్మ గారి_ శ్రీ ముళ్ళపూడి వెంకటరమణ గారి రచనలు సమగ్ర పరిశీలన12 వ భాగం.23.7.25..

డా. సి హెచ్.సుశీలమ్మ గారి_ శ్రీ ముళ్ళపూడి వెంకటరమణ గారి రచనలు సమగ్ర పరిశీలన12 వ భాగం.23.7.25..

Posted in రచనలు | Leave a comment

ప్రాచార్య బ్రహ్మశ్రీ శలాక రఘు నాథ శర్మ గారి భాగవత నవనీతం.35 వ భాగం.23.7.25.

ప్రాచార్య బ్రహ్మశ్రీ శలాక రఘు నాథ శర్మ గారి భాగవత నవనీతం.35 వ భాగం.23.7.25.

Posted in రచనలు | Leave a comment

శ్రీ శ్రీ విద్యారణ్య స్వామి వారి వేదాంత పంచ ద శి.51 వ భాగం.23.7.25

శ్రీ శ్రీ విద్యారణ్య స్వామి వారి వేదాంత పంచ ద శి.51 వ భాగం.23.7.25

శ్రీ శ్రీ విద్యారణ్య స్వామి వారి వేదాంత పంచ ద శి.51 వ భాగం.23.7.25

Posted in రచనలు | Leave a comment

డా. సి. హెచ్.సుశీలమ్మ గారి _ శ్రీ ముళ్ళపూడి వెంకటరమణ గారి రచనలు సమగ్ర పరిశీలన.11 వ భాగం.22.7.25.

డా. సి. హెచ్.సుశీలమ్మ గారి _ శ్రీ ముళ్ళపూడి వెంకటరమణ గారి రచనలు సమగ్ర పరిశీలన.11 వ భాగం.22.7.25.

Posted in రచనలు | Leave a comment

డా. జి. వి. పూర్ణ చందు గారి భువన విజయం.22.7.25./

డా. జి. వి. పూర్ణ చందు గారి భువన విజయం.22.7.25.

Posted in రచనలు | Leave a comment

ప్రాచార్య బ్రహ్మశ్రీ శలాక రఘు నాథ శర్మ గారి భాగవత నవనీతం.34 వ భాగం.22.7.25.

ప్రాచార్య బ్రహ్మశ్రీ శలాక రఘు నాథ శర్మ గారి భాగవత నవనీతం.34 వ భాగం.22.7.25.

ప్రాచార్య బ్రహ్మశ్రీ శలాక రఘు నాథ శర్మ గారి భాగవత నవనీతం.34 వ భాగం.22.7.25.

Posted in రచనలు | Leave a comment

శ్రీ శ్రీ విద్యారణ్య స్వామి వారి వేదాంత పంచ ద శి.50 వ భాగం.22.7.25.

శ్రీ శ్రీ విద్యారణ్య స్వామి వారి వేదాంత పంచ ద శి.50 వ భాగం.22.7.25.

Posted in రచనలు | Leave a comment

డా.సి. హెచ్.సుశీలమ్మ గారి_ శ్రీ ముళ్ళపూడి వెంకటరమణ గారి రచనలు సమగ్ర పరిశీలన

.10 వ భాగం.21.7.25.

డా.సి. హెచ్.సుశీలమ్మ గారి_ శ్రీ ముళ్ళపూడి వెంకటరమణ గారి రచనలు సమగ్ర పరిశీలన

.10 వ భాగం.21.7.25.

Posted in రచనలు | Leave a comment

డా.జి.వి.పూర్ణచందు గారి భువన విజయం.11 వ భాగం.21.7.25.

డా.జి.వి.పూర్ణచందు గారి భువన విజయం.11 వ భాగం.21.7.25.

Posted in రచనలు | Leave a comment

ప్రాచార్య బ్రహ్మశ్రీ శలాక రఘు నాథ శర్మ గారి భాగవత నవనీతం.33 వ భాగం.21.7.25.

ప్రాచార్య బ్రహ్మశ్రీ శలాక రఘు నాథ శర్మ గారి భాగవత నవనీతం.33 వ భాగం.21.7.25.

Posted in రచనలు | Leave a comment

శ్రీ శ్రీ విద్యారణ్య స్వామి వారి వేదాంత పంచ ద శి.49 వభాగం.21.7.25.

శ్రీ శ్రీ విద్యారణ్య స్వామి వారి వేదాంత పంచ ద శి.49 వభాగం.21.7.25.

శ్రీ శ్రీ విద్యారణ్య స్వామి వారి వేదాంత పంచ ద శి.49 వభాగం.21.7.25.

Posted in రచనలు | Leave a comment

డా. జి. వి. పూర్ణ చందు గారి భువన విజయం.10 వ భాగం.20.7.25.

డా. జి. వి. పూర్ణ చందు గారి భువన విజయం.10 వ భాగం.20.7.25.

డా. జి. వి. పూర్ణ చందు గారి భువన విజయం.10 వ భాగం.20.7.25.

Posted in రచనలు | Leave a comment

ప్రాచార్య బ్రహ్మశ్రీ శలాక రఘు నాథ శర్మ గారి భాగవత నవనీతo.32 వ భాగం.20.7.25.

ప్రాచార్య బ్రహ్మశ్రీ శలాక రఘు నాథ శర్మ గారి భాగవత నవనీతo.32 వ భాగం.20.7.25.

Posted in రచనలు | Leave a comment

శ్రీ శ్రీ విద్యారణ్య స్వామి వారి వేదాంత పంచ ద శి.48 వ భాగం.20.7.25.

శ్రీ శ్రీ విద్యారణ్య స్వామి వారి వేదాంత పంచ ద శి.48 వ భాగం.20.7.25.

Posted in రచనలు | Leave a comment

శ్రీలంక డాక్టర్ ,సంగీత శాస్త్ర ప్రచారకులు -శ్రీ సరస్వతి రామకృష్ణయ్య

శ్రీలంక డాక్టర్ ,సంగీత శాస్త్ర ప్రచారకులు -శ్రీ సరస్వతి రామకృష్ణయ్య

27-8-1902మద్రాస్ లో శ్రీనివాసమూర్తి శేషమ్మ దంపతులకు సరస్వతీ రామకృష్ణన్ గా జన్మించారు .1927 ఎల్ ఎం పి డాక్టర్ అయ్యారు .1928-32మధ్య శ్రీలంకలో వైద్యవృత్తి చేశారు .ఆతర్వాతకూడా1934-42వరకు సిలోన్ లోనే వైద్య వృత్తీ కొనసాగించి ‘’సిలోన్ డాక్టర్ ‘’గా పేరు పొందారు .

  1945-57కాలం లో మద్రాస్ వచ్చి వైద్యులుగా ప్రాచుర్యం పొందారు .వీరి పూర్వీకులు విద్వాంసులు గాయకులూ వైణికులు .అందువలన వీరికి’’ సరస్వతి’’ అనేది ఇంటిపేరయ్యింది .రామకృష్ణయ్య వైద్యంతో బాటు సంగీతంలో కూడా మక్కువ పెంచుకొన్నారు .వైద్య విద్యలో చేరకముందే నాలుగేళ్ళు సంగీత శాస్త్రం లో శిక్షణ పొందారు .సంగీత గ్రంథాలన్నీ చదివి జీర్ణం చేసుకొన్నారు .

 శ్రీ సుబ్బరాయ దీక్షితులు రాసిన ‘’సంగీత స౦ప్రదాయ దర్శిని ‘’వీరిని అమితంగా ఆకర్షించింది .వెంకట మఖి సంప్రదాయం తొ పాటు ,సుబ్బరాయ దీక్షితుల ఆధునిక సంగీత పద్ధతులు కూడా వొంట బట్టి౦చు కొన్నారు . వైద్యం వృత్తీ సంగీతం ప్రవృత్తి గా జీవించిన మహానుభావులాయన .మద్రాస్ కార్పోరేషన్ లో పదవీ విరమణ చేసిన తర్వాత త్యాగరాజ కృతులతోపాటు ,ఇతర ప్రసిద్ధ కృతులలో కూడా నిష్ణాతులయ్యారు .

  తిరువలక్కేలి లో ఉంటున్న శ్రీ అంబి దీక్షితార్ గారితో సాన్నిహిత్యం పొంది ఎన్నెన్నో కొత్త మెళకువలు ఆకలి౦పు చేసుకొన్నారు .వివిధసంగీత గ్రంధాల సారాన్ని వ్యాసాలుగా రాసి సంగీత ప్రపంచానికి విలువైన  సేవ లందించారు  రామకృష్ణయ్య .చెన్నై సంగీత అకాడెమీ సభ్యులై సంస్థ కార్య క్రమాలను శ్రద్ధగా నిర్వహించే వారు .1975లో సంస్థ వీరి సేవలకు ఘన సన్మానం చేసింది .వేంకటమఖి ఆధునిక సంప్రదాయం ,సుబ్బరామ దీక్షితుల ‘’సంగీత సంప్రదాయం ‘’,శ్రీ డి .రామమూర్తి’’ మృదంగ తత్త్వం ‘’గ్రంధం ,శ్యామాశాస్త్రి అన్నమాచార్య కీర్తనలపై వీరి వ్యాసాలు విశిష్టమైనవి సంగీత ప్రచారానికి బాగా తోడ్పడేవి .సంగీత సరస్వతి ,అపర ధన్వంతరి అయిన శ్రే సరస్వతీ రామకృష్ణయ్య 1981లో 79వ ఏట సరస్వతీ సాయుజ్యం పొందారు .

 వీరి ఫోటో లభించలేదు .

ఆధారం -మా.గోఖలే వ్యాసం .

మీ -గబ్బిట దుర్గా ప్రసాద్ -19-7-25-ఉయ్యూరు 

Posted in రచనలు | Leave a comment

డా.సీహెచ్.సుశీలమ్మ గారి _ శ్రీ ముళ్ళ పూడి వెంకట రమణ గారి రచనలు సమగ్ర పరిశీలన.7 వ భాగం.17.7.25.

డా.సీహెచ్.సుశీలమ్మ గారి _ శ్రీ ముళ్ళ పూడి వెంకట రమణ గారి రచనలు సమగ్ర పరిశీలన.7 వ భాగం.17.7.25.

Posted in రచనలు | Leave a comment

డా. జి. వి. పూర్ణ చందు గారి భువన విజయం.7 వ భాగం.17.7.25.

డా. జి. వి. పూర్ణ చందు గారి భువన విజయం.7 వ భాగం.17.7.25.

Posted in రచనలు | Leave a comment

 గుండెలో  మూడు బడబాగ్నులు దాచుకొని, నవ్వులపువ్వులురువ్వుతూ , విలనీ నిప్పులు చెరగిన  నట కోటీశ్వర వైభవ సంపన్నుడు శ్రీ కోట శ్రీనివాసరావు

 గుండెలో  మూడు బడబాగ్నులు దాచుకొని, నవ్వులపువ్వులురువ్వుతూ , విలనీ నిప్పులు చెరగిన  నట కోటీశ్వర వైభవ సంపన్నుడు శ్రీ కోట శ్రీనివాసరావు

 పెళ్ళి అయిన 11ఏళ్లకే పురిట్లో భార్యకు మతి చలించి భర్తనే గుర్తు పట్టకపోవటం ఎంతదారుణ విషయం .ఇది ఒక బడబాగ్ని .అయినా జీవితాంతం కాపురం చేయటం గొప్ప ఆదర్శం . .రెండవ కూతురు సరదా  పడిందని కారులో పంపిస్తేయాక్సి డింట్ జరిగి కాలుపోవటం .రెండవ బడబాగ్ని .తోటి బ్యాంకి ఆఫీసర్ తన కొడుకుకు ఆపిల్లను ఇచ్చి పెళ్ళి చేయమనటం,చేయటం ఆమె పిల్లా పాపలతో కళకళ లాడటం  కొంత ఊరట .ఇవన్నీ దాటుకొంటూ వస్తున్న  సమయం లో ఒక్క గానొక్క  కొడుకు,,సినీ నటనలో అరంగేట్రం చేసిన వాడు   కొత్తగా కొనుక్కున్న బైక్ యాక్సి డింట్ లో మరణించటం తట్టుకోలేని మూడవ బడబాగ్ని .శివుడు  గరళ కంఠుడు మాత్రమె అయితే, ఈయన త్రిగరళ కంఠుడు . 26ఏళ్ళు నాటకరంగం లో వెలుగులు చిమ్ముతూ ,బంగారు కోడిపెట్టలాంటి స్టేట్ బాంక్ ఉద్యగం వదిలి సినీ రంగ ప్రవేశం చేసి ఎదురులేని మకుటం లేని మహారాజుగా నాలుగు దశాబ్దాలు వెలిగిన  నట కోటీశ్వర వైభవ సంపన్నుడు శ్రీ కోట శ్రీని వాసరావు .ఆయన అన్ననాటక నటుడు  ,తమ్ముడు శంకరరావు కూడా నాటక సినీ నటుడు .తండ్రి శ్రీ సీతారామాంజనేయులు కృష్ణా జిల్లా కంకిపాడులో డాక్టర్ .చుట్టుప్రక్కల గొప్ప పేరు ప్రఖ్యాతులు సంపాదించారు .సాహిత్య కళా రంగాలకు సేవ చేసిన వారు .మెయిన్ రోడ్డు కు ఆనుకొనే 70 సెంట్ల భూమిలో ఇల్లు సకల సదుపాయాలతో ఉండేది .అక్కడే కోట వారి అందరి వివాహాలు వగైరా జరిగాయి .ఒక రకంగా అచ్చి వచ్చిన ఇల్లు.తండ్రి మరణం తర్వాత కొత్త ఇల్లు కడదామని ప్రయత్నించి అవకాశం రాక చిన్న నాటినుంచి తనతో స్నేహంగా ఉన్న ఒక నాయీ బ్రాహ్మణ కుటుంబానికి ఉండటానికి ఏర్పాటు చేసి ,ఆస్థలాన్ని తనకూతుళ్ళకు మనవళ్ళకు రాసిచ్చి జాగ్రత్త గా కాపాడుకొంటున్నారు .రెండు నెలల క్రితం కూడా వచ్చి వెళ్లారని ఆ కాపలా కుటుంబం చెప్పి దుఖం పట్టలేక ఏడ్చారు .కోటకు కులభేదాలు లేవని ,తమను అన్నా వదినలుగా భావించేవారని వారిద్దరూ గోడుగోడున విలపించారు .ఇలా తండ్రిగారికి ఉన్న మంచి పేరును తానూ కొనసాగించారు కోట .

  కోటకు ముందు ఎస్వి రంగారావు ,కైకాల సత్యనారాయణ ,రావు గోపాలరావు నాగభూషణం తమదైన శైలిలో నటిస్తూ మంచి పేరు సంపాదించారు .కోట తెలంగాణా మాండలికాన్ని నేర్చి అందులో నిష్ణాతుడై ,సరదాగా రామాయణ భారతాలను ఆ మాండలికం లో చెబుతూనవ్వించటం పైవారికంటే భిన్నం .’భీముడు గదను పిసకతా పిసకతా ఉన్నాడు ‘’అంటూ భారతాన్నీ ,’’దసరద మారాజు ముగ్గురు పెండ్లాలున్నా పిల్లల్ని ఎత్తలేదు’’అంటూ రామాయణాన్ని చెబుతూ పొట్ట చక్కలయ్యేట్లు నవ్వించేవారు.ఇలా చెప్పటం నేను బెజవాడలో క్షత్రయ్య  కళా క్షేత్రం లో ప్రత్యక్షంగా చూశాను .’’నటుడికి టైం వస్తే టైమే ఉండదు ‘’ అనే ఆయనకు నిజంగా డైరెక్టర్ శ్రీ కృష్ణ పిలిపించి ‘’ప్రతిఘటన ‘’సినిమాలో చాన్స్ ఇచ్చాడు .ఇక కోట ను ఎవరికీ పట్టతరం కాలేదు ఆసినిమాకు ,ఆయన కాశయ్య పాత్ర విలనీ మాండలికానికి అవార్డులు వచ్చాయి .ఇలా నవనందులను గెల్చిన వాడు నట కోట  .కోట మార్కు నటన ఒకటి తెలుగు తెరపై ఎస్టాబ్లిష్ అయింది .చిన్న పాత్ర అయినా ,పెద్ద పాత్రయినా తన ఇష్టం వచ్చిన మేనరిజం చొప్పించటానికి డైరెక్టర్లు ఫ్రీహాండ్ ఇచ్చారు .అందుకే ‘’రింగులో ఫింగర్ ‘’అడ్డేడ్డే’’ ఇహిహీ ,నెత్తిమీద చేతులుపెట్టుకొని ‘’ఈ దే౦దండీ బాబూ ‘’అనటం ,కోడిని ఎదురుగా తలకిందులుగా వేలాడదీసి దాన్ని తింటున్న అనుభూతి పొందటం ,న్యూస్ పేపర్ లుంగీ లాకట్టటం ఉత్త గోచీ పెట్టుకోనీ నటించటం కోటమార్కునటన .బాబూ మోహన్ తొ వంద ,బ్రహ్మానందంతో రెండు వందలు సినిమాలు నటించటం ఆషామాషీ  కాదు .ఆయనే అన్నట్లు ‘’పెద్ద గుమ్మడికాయంత ప్రతిభ ఉంటే చాలదు ,ఆవగింజంత అదృష్టం  కూడాఉంతేనే  ఎవరికైనా కలిసొస్తుంది ‘’కోటకు నిజంగానే పెద్ద గుమ్మడి కాయంత  అదృష్టం కలిగింది .750 సినిమాలలో విభిన్న పాత్రల్లో మెప్పించటం అంత ‘’వీజీ ‘’కాదు .రోజుకు 20గంటలు ,రోజుకు మూడు చోట్ల మద్రాస్ హైదరాబాద్ ,బెంగుళూరు లలో నటించటం ఎయిర్ పోర్ట్ లోనే ముఖ ప్రక్షాళనాదులు చేయటం ఆ బిజీ ఆర్టిస్ట్ నిత్య కృత్యం .కుటుంబాన్ని నెలకో రెండు నెలలకో చూడటం ఇప్పుడు తలచుకొని తాను ఏమి కోల్పోయాడో గ్రహించి బాధపడ్డాడు .టైం వస్తే టైం ఉండదు ఆని ఆయనే చెప్పిన మాట నిజమే అయింది . రెండిళ్ళ పూజారి లో లేడీ వేషం ,తొ సహా అనేక విలనీ వేషాలు వేసినా కమెడియన్ గా కోటకు కోట యే సాటి .ఆయన చివరి సినిమా హరిహర వీరమల్లు .సినీ కళాకారులంతా ‘’కోట బాబాయి ‘’అనీ రాజేంద్రప్రసాద్ మాత్రం ‘’కోట మామ ‘’అనీ పిలిచినా రాజమౌళి మాత్రం ‘’గౌరవంగా ‘’మాస్టర్ ‘’ఆని పిలిచేవాడు .అందుకే చనిపోయిన కోట భౌతిక కాయం దర్శనార్ధం అంతమంది వచ్చి తలచుకొని నివాళు లర్పించారు .

  అది  రామారావు  ముఖ్యమంత్రిగా ఉన్నకాలం .ఆయన చీరకట్టుకోవటం నగలు పెట్టుకోవటం ,వగైరా చేష్టలు జనానికి నచ్చేవికావు .కృష్ణ దీనిపై ‘’మండలాధీశుడు ‘’సినిమా తీసి కోట తొ రామారావు ను అనుకరింప చేశాడు .చాలా బాగా చేశాడు కోట .నేను నాలుగు సార్లు ఆసినిమా చూశాను .దాని వల్ల కోట దెబ్బలు కూడా తినాల్సి వచ్చింది రామారావు అభిమానుల చేత .అప్పుడు రామారావు  అభిమాన దర్శక నిర్మాతలు కోటకు  వేషాలు ఎగగొట్టారు .కృష్ణ కోట కు గొప్పకోట గోడలా నిలబడి తన సినిమాలన్నిటిలో  అవ.కాశాలిచ్చి ప్రోత్సహించాడు .

 ప్రతిఘటనలో మంత్రి కాశయ్య తెలంగాణా మాండలికం ,,శత్రువు సినిమాలో కాంట్రాక్టర్ వెంకటరత్నం గా ‘’సేప్పవయ్యా బాబూ ,ఫోన్ మొగుతో౦దిరా బాబూ ‘’అంటూ సాగతీత డైలాగులు ,గణేష్ సినిమాలో హెల్త్ మినిస్టర్ సా౦బ శివుడుగా ‘’తమ్మీ .నాకు చార్ మీనార్ అంత హిస్టరీ  ఉంది తమ్మీ.పద్నాలుగెల్లకే బచ్చా గాన్ని చెడ్డీ మీద మర్డర్ అన్నట్లు ‘’అంటూ చెప్పిన డైలాగులు చూసిన చూపులు న భూతో న భవిష్యతి  .సర్కార్ సినిమాలో సిల్వర్ మణి పాత్రలో డైలాగ్స్ తొ ఉత్తరాది ప్రేక్షకుల నూ ఆకర్షించాడు .’’అందుకే నేను ఖండిస్తున్నా ‘’అంటూ గురు నారాయణ పాత్రలో ‘’గాయం ‘’సినిమా కు జీవం పోశాడు .రెండిళ్ళ పూజారిలో హిజ్జా పాత్రలో పైకి చిరునవ్వు లోపలమెత్తనికత్తి,కళ్ళలో విలనీ గా ‘’అక్క ‘’పాత్రకు ప్రాణం పోశాడు .కళ్ళతోనే కపటత్వాన్ని పూర్తిగా ప్రదర్శించిన సినిమా శివ లో మాచిరాజు .హలో బ్రదర్ లో తాడి మట్టయ్య గా మల్లికార్జునరావు జోడీ అందించిన హాస్యం చివర్లో మిత్రుడు  మల్లి మరణిస్తే చూపిన హావభావాలు ఆత్మీయతా అనురాగాలు మరువ లేనివి .’’భద్రం బీ కేర్ ఫుల్ బ్రదరూ ,భర్తగా మారకు బాచిలరూ’’అంటూ  మని సినిమాలో  అల్లాఉద్దీన్ గా కోట పండించిన హాస్యం తరతరాల నట కోట కు నిదర్శనం .జంబలకిడి పంబ లో హీరోయిన్ తండ్రి గా ఇంటర్వెల్ ముడు ఒకలాగా తర్వాత మరోలాగా నటనతో చెలరేగిపోయాడు కోట .టిపికల్ మేనరిజం తొ ఈవివి సత్యనారాయణకు అద్భుత విజయం ఇచ్చాడు .వినోదం సినిమాలో బంగారం సింగారం పాత్రలలో జీవించాడు .మామగారు సినిమాలో పనీ పాటా లేకుండా వీధి అరుగుమీద కూర్చుని దారిన పోయే వాళ్ళని  ‘’ఒక దేబ్బెసు కొందామా ‘’ అంటూ పేకాటకు పిల్చే పోతురాజు గా బాబూ మోహన్ తొ చేసిన అల్లరి చిరకాలం గుర్తు ఉండిపోతుంది .సీతారత్నం గారి అబ్బాయి సినిమాలో ‘’గారపాటి బుల్లబ్బాయి ‘’గా ‘’జల్లింది జీలకర్ర మోలిసి౦ది తోటకూర ,పూసింది మల్లెపువ్వు ,వేసింది అరటి గెల .కొబ్బరితోటలో జీడిపిక్కలేరుతున్నాను ,వంగతోటలో పనస గింజ లేరుతున్నాను ‘’అంటూ పండించిన కామెడి కోటకే సాధ్యం.చివరగా ఆహనా పెళ్ళంట’’లో పిసినారి లక్ష్మీ పతి పాత్రలో కోట నట విశ్వ రూపం చూస్తాం .ఆ వేషానికి రావు గోపాలరావు ను పెడదామని రామానాయుడు అంటే  ‘’చూడగానే నికృష్టుడు గా కనిపించాలి కోట మాత్రమె కరెక్ట్ ఆని ఒప్పించి జంధ్యాల డైరెక్ట్ చేశాడు .ఆ సినిమాతో వచ్చిన లాభం తొ రామానాయుడుతన స్టుడియో లోకట్టించిన  ఒక ఫ్లోర్ కు కోట పేరు పెట్టి ఋణం తీర్చుకొన్నాడు .రాజేంద్ర ప్రసాద్ నటించిన ‘’ఆ నలుగురు ‘’సినిమా లో క్లైమాక్స్ పండించినందుకు కోటకు ఉత్తమ సహాయ నటుడుగా నంది అవార్డ్ వచ్చింది .

  మద్రాస్ నుంచి తెలుగు సినీ పరిశ్రమ హైదరాబాద్ కు తరలి రావాలని పట్టుబట్టి ఎవరూ కలిసిరాకపోవటంతో కోట నిరాహార దీక్ష చేశాడు .కార్మిక వర్గం ఫుల్ సపోర్ట్ ఇచ్చింది .చిరంజీవి వచ్చి దీక్ష విరమణకు నిమ్మ రసం ఇస్తుంటే వద్దని తాను రాజేంద్ర ప్రసాద్ కు చెప్పి దీక్ష ప్రారంభించానానీ ఆయన చేత్తోనే నిమ్మరసం తాగి విరమిస్తానని చెప్పగా అలాగే చేయించారు .ఆ ఏడాది నవంబర్ 31 నహైదరాబాద్ లో మొక్కుబడిగా షూటింగులు ప్రారంభమయ్యాయి .ఇదీ కోట సాధించిన అద్భుత విజయం .

వాజ్ పాయి అంటే విపరీత అభిమానం ఉన్న కోటకు బెజవాడ తూర్పు నియోజక వర్గం కు  బిజెపి  టికెట్ 1999లో ఇవ్వగా 57వేల వోట్లతో గెలిచి ప్రజాసేవ చేశాడు అయిదేళ్ళూ .అజిత్ సింగ్ నగర్ పాయకరావు పేట లనుబెజవాడకు కలిపే  మొదటి ఫ్లై ఓవర్  కోట వల్లనే వచ్చింది .అప్పటి బెజవాడ ఎం పి గద్దె రామమోహన రావు తొ మంచి ఆత్మీయ సంబంధాలు ఉండేవి .’’తమ్ముడూ’’ అనిపిలిచేవాడు కోట .ఆంధ్రా యూని వర్సిటి నాటక పోటీలలో ‘కళ్ళు ‘’నాటకం లో రామమోహనరావుహీరోయిన్ గా  కోట శంకర రావు హీరో గా నటిస్తే కోట శ్రీనివాసరావు డైరెక్ట్ చేశాడు  గద్దె కు ఉత్తమ కధానాయిక అవార్డ్ వచ్చింది .

10-7-1942లో జన్మించిన కోట శ్రీనివాసరావు 13-7-25న 83వ ఏట మరణించాడు .భార్య రుక్మిణి .కొడుకు సీతారామ ప్రసాద్ ..9 నంది పురస్కారాలు ,కృష్ణం వందే జగద్గురుం సినిమాక SIIMA అవార్డ్ ,2015 లో పద్మశ్రీ పురస్కారం పొందారు

·         ఈ డెవడ్రా బాబూ…

·         నాకేంటి ..మరి నాకేంటి.

·         మరదేనమ్మా నా స్పెషల్.

·         అయ్య నరకాసుర.

·         అంటే నాన్నా అది

వంటి పాప్యులర్ డైలాగ్ ల పిత కోట .నటనకు భాష్యం చెప్పిన కోట ను మరువలేము .

మీ -గబ్బిట దుర్గా ప్రసాద్ -17-7-25-ఉయ్యూరు.

Posted in రచనలు | Leave a comment

డా. సీహెచ్.సుశీలమ్మ గారి_ శ్రీ ముళ్ళపూడి వెంకటరమణ గారి రచనలు సమగ్ర పరిశీలన.6 వ భాగం.16.7.25.

డా. సీహెచ్.సుశీలమ్మ గారి_ శ్రీ ముళ్ళపూడి వెంకటరమణ గారి రచనలు సమగ్ర పరిశీలన.6 వ భాగం.16.7.25.

Posted in రచనలు | Leave a comment

డా. జి వి. పూర్ణ చందు గారి భువన విజయం.6 వ భాగం.16.7.25.

డా. జి వి. పూర్ణ చందు గారి భువన విజయం.6 వ భాగం.16.7.25.

డా. జి వి. పూర్ణ చందు గారి భువన విజయం.6 వ భాగం.16.7.25.

Posted in రచనలు | Leave a comment

ప్రాచార్య బ్రహ్మశ్రీ శలాక రఘు నాథ శర్మ గారి భాగవత నవనీతం.30 వ భాగం. 16.7.25.

ప్రాచార్య బ్రహ్మశ్రీ శలాక రఘు నాథ శర్మ గారి భాగవత నవనీతం.30 వ భాగం. 16.7.25.

Posted in రచనలు | Leave a comment

శ్రీ శ్రీ విద్యారణ్య స్వామి వారి వేదాంత పంచ ద శి.46 వ భాగం.16.7.25.

శ్రీ శ్రీ విద్యారణ్య స్వామి వారి వేదాంత పంచ ద శి.46 వ భాగం.16.7.25.

Posted in రచనలు | Leave a comment

తమిళనాడు లో ఆంధ్రుల భాషా సంస్కృతులకు కృషి చేసిన హెడ్ మాస్టర్ ,శాసన సభ్యుడు  భాషా సమితి ,భాషా సమాజం స్థాపించిన , -శ్రీ కె. ఎస్ .కోదండరామయ్య

తమిళనాడు లో ఆంధ్రుల భాషా సంస్కృతులకు కృషి చేసిన హెడ్ మాస్టర్ ,శాసన సభ్యుడు  భాషా సమితి ,భాషా సమాజం స్థాపించిన , -శ్రీ కె. ఎస్ .కోదండరామయ్య

శ్రీ కారుపల్లి శివరామదాసు కోదండ రామయ్య తమిళనాడు హోసూరు తాలూకా కారు పల్లి గ్రామం లో 1909లో జన్మించారు .తలిదండ్రులు శివరామ దాసు ,రామలక్ష్మమ్మ .హైస్కూల్ చదువు బెంగుళూరులో చదివి ,హోసూరు తాలూకా బాగులూరులో ఎలిమెంటరి స్కూల్ మాస్టారు గా పని చేశారు .ప్రైవేట్ గా చదివి ఎం. ఎ.. బి ఎల్ డిగ్రీలు సాధించారు  .టీచర్ ట్రెయినింగ్ అయి హోసూరులో ,కృష్ణగిరితాలూకా వేపనపల్లి హైస్కూల్స్ లో హెడ్ మాస్టర్ గా పని చేశారు .25ఏళ్ళు ఉపాధ్యాయులుగా  పని చేశారు ..,

  1957 లో రాష్రాల పునర్విభజన సమయంలో హోసూరు ,పరిసర ప్రాంతాలను ఆంధ్రప్రదేశ్ లో చేర్చాలని ఉద్యమం చేసి ఉపాధ్యాయ వృత్తికి రాజీనామా చేశారు .1971లో రాజాజీ గారి స్వతంత్ర పార్టీ లో చేరి తమిళనాడు శాసన సభకు పొటీ చేసి గెలిచారు .తోమ్మిదేళ్ళ  కాలం తమిళ శాసన సభలో తెలుగు వినిపించిన  ఘనత కోదండ రామయ్య గారిది .అదొక రికార్డ్ .

1977లో మళ్లీ పోటీ చేసి కొద్ది తేడాతో ఓడిపోయారు .ప్రకాశం పంతులు, కాశీ నాధుని నాగేశ్వరరావు గార్ల నిరాడంబరత ను ఆదర్శంగా టీసుకొన్నారు కోదండ రామయ్య .తమిళనాడు ,కర్నాటక రాష్ట్రాలలో తెలుగు భాషా సంస్కృతుల వ్యాప్తికి ,పరిరక్షణకు నిర్విరామ కృషి చేశారు .పొట్టి శ్రీరాములు భాషా సమితి ,దక్షిణాంధ్ర భాషా సమాజం సంస్థలు స్థాపించి తమ ఆశయ వ్యాప్తి చేశారు .అనేకులను క్రమ శిక్షణగల సేవకులుగా తీర్చి దిద్దారు .

  హోసూరు పరిసర ప్రాంతాలలో ఊరూరు తిరిగి అమూల్యమైన తాళపత్ర గ్రంధాలు సేకరించారు .తెలుగు భాషకు చిరస్మరణీయుడు శ్రీ కృష్ణ దేవరాయల పట్టాభి షేక మహోత్సవాలను ప్రతి ఏటా ఘనంగా ,వైభవంగా నిర్వహించేవారు .రాయల చరిత్ర సమగ్రంగా రాయాలని ఎన్నెన్నో ఆధారాలు సేకరించి మొదటి సంపుటం ముద్రిస్తుండగా కోదండరామయ్య గారు హఠాత్తుగా 1984లో 75వ ఏట చనిపోయారు .

  తరతరాలుగా తమిళనాడులో నివసిస్తున్న ఆంధ్రులను భాషా అల్ప సంఖ్యాక వర్గాల వారు ఆని చెప్పటం పై ఆయన తీవ్రంగా మండిపడ్డారు .భాషా అల్ప సంఖ్యాక వర్గ కమిషన్ కు ఎన్నో మహజర్లు పెట్టారు .కలిసిమాట్లాడారు ..’’అంతర్జాతీయ తెలుగు సంస్థ’’ ఏర్పడినతర్వాత ఆరు సంవత్సరాలు పాలక మండలి సభ్యులుగా సేవ లందించారు .దక్షిణాది తెలుగు వారి గురించి ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వంతో చర్చించ టానికి హైదరాబాద్ వచ్చి ,కొద్ది సేపటికే అంతర్జాతీయ తెలుగు సంస్థ కార్యాలయం లో తెలుగు భవనం లో అనాయాస మృతికి లోనై 4-6-1984న తనువు చాలించారు అంటే ఆఖరు క్షణం వరకు తమిళదేశ తెలుగు వారి భాషా సంస్కృతుల సేవలో జీవితం ధన్యం చేసుకొన్నపుణ్యమూర్తి శ్రీ కే .ఎస్ .కోదండరామయ్య గారు.

ఆధారం -డాక్టర్ ముదిగొండ వీరభద్ర శాస్త్రి గారి వ్యాసం .

మీ- గబ్బిట దుర్గాప్రసాద్ -16-7-25-ఉయ్యూరు   

Posted in రచనలు | Leave a comment

డా. సీహెచ్ సుశీలమ్మ గారి శ్రీ ముళ్ళపూడి వెంకట రమణ గారి రచనలు సమగ్ర పరిశీలన.5 వ భాగం.15.7.2025

డా. సీహెచ్ సుశీలమ్మ గారి శ్రీ ముళ్ళపూడి వెంకట రమణ గారి రచనలు సమగ్ర పరిశీలన.5 వ భాగం.15.7.2025

Posted in రచనలు | Leave a comment

డా. జి వి. పూర్ణ చందు గారి భువన విజయం.5 వ భాగం.15.7.25.

డా. జి వి. పూర్ణ చందు గారి భువన విజయం.5 వ భాగం.15.7.25.

Posted in రచనలు | Leave a comment

ప్రాచార్య బ్రహ్మశ్రీ శలాక రఘు నాథ శర్మ గారి భాగవత నవనీతం.29 వ భాగం.15.7.25.

ప్రాచార్య బ్రహ్మశ్రీ శలాక రఘు నాథ శర్మ గారి భాగవత నవనీతం.29 వ భాగం.15.7.25.

Posted in రచనలు | Leave a comment

శ్రీ శ్రీ విద్యారణ్య స్వామి వారి వేదాంత పంచ ద శి.45 వ భాగం.15.7.25.

శ్రీ శ్రీ విద్యారణ్య స్వామి వారి వేదాంత పంచ ద శి.45 వ భాగం.15.7.25.

శ్రీ శ్రీ విద్యారణ్య స్వామి వారి వేదాంత పంచ ద శి.45 వ భాగం.15.7.25.

Posted in రచనలు | Leave a comment