శ్రీ హర్ష నైషధం.139 వ భాగం.29.12.23.

శ్రీ హర్ష నైషధం.139 వ భాగం.29.12.23.

Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube | Leave a comment

శ్రీ సువర్చలాన్జనేయ స్వామి వారి దేవాలయం లో ధనుర్మాస 2004జనవరి ప్రత్యేకపూజా   కార్యక్రమాలు 

శ్రీ సువర్చలాన్జనేయ స్వామి వారి దేవాలయం లో ధనుర్మాస 2004జనవరి ప్రత్యేకపూజా   కార్యక్రమాలు 

1-1—2024 సోమవారం –ఉదయం -5గం లకు –స్వామి వారలకు ‘’ లడ్డూల’’ తో ప్రత్యెక పూజ

5-1-2024 –శుక్రవారం –ఉదయం -5గం లకు –స్వామి వారలకు  -11కిలోలకు తక్కువ కాకుండా’’ చేమ౦తి పూలతో ‘’పూజ

6-1-2024 –శనివారం – ఉదయం -5గం లకు –స్వామి వారలకు  -11 గెలలకు తక్కువ కాకుండా ‘’అరటి పళ్ళతో ‘’పూజ

10-1-2024 –బుధవారం — ఉదయం -5గం లకు –స్వామి వారలకు  -‘’అరిసెలతో ‘’ప్రత్యేకపూజ

13-1-2024-శనివారం – ఉదయం -5గం లకు –శ్రీ ఆంజనేయ స్వామి ‘’మూల  విరాట్ ‘’కు ‘’వెన్నపూస అలంకారం ‘’  ప్రత్యెక పూజ

14-1-2024-ఆదివారం –భోగి – ఉదయం -5గం లకు –స్వామి వారలకు  -కాయగూరలతో ‘’శాకంబరీ ‘’ప్రత్యెక పూజ

                                                  ఉదయం -10 గం లకు –శ్రీసువర్చలాన్జనేయ, శ్రీ గోదా రంగనాథ స్వామి వారలకు ‘’శాంతి కళ్యాణం ‘’.

15-1-2024 –సోమవారం –సంక్రాంతి

 అందరికి 2004 నూతన ఆంగ్ల సంవత్సర మరియు సంక్రాంతి శుభా కాంక్షలు

                                      గబ్బిట దుర్గా ప్రసాద్ –ఆలయ ధర్మకర్త

                                                     మరియు భక్త బృందం .

Posted in సమయం - సందర్భం | Leave a comment

శ్రీ రాయసం వెంకట శివుడు గారి ఆత్మ చరిత్రం.22 వ భాగం.28.12.23.

శ్రీ రాయసం వెంకట శివుడు గారి ఆత్మ చరిత్రం.22 వ భాగం.28.12.23.

Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube | Leave a comment

ఆచార్య జివి సుబ్రహ్మణ్యం గారి ముత్యాల ముచ్చట్లు.6.వ భాగం.28.12.23.

ఆచార్య జివి సుబ్రహ్మణ్యం గారి ముత్యాల ముచ్చట్లు.6.వ భాగం.28.12.23.

Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube | Leave a comment

గీతా దర్శనము.11 వ భాగం.28.12.23.

గీతా దర్శనము.11 వ భాగం.28.12.23.

Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube | Leave a comment

శ్రీ హర్ష నైషధం.138 వ భాగం.28.12.23.

శ్రీ హర్ష నైషధం.138 వ భాగం.28.12.23.

Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube | Leave a comment

శ్రీ రాయసం వెంకట శివుడు గారి ఆత్మ చరిత్రం

21 వ భాగం.37.12.23.

శ్రీ రాయసం వెంకట శివుడు గారి ఆత్మ చరిత్రం

21 వ భాగం.37.12.23.

Part 2

Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube | Leave a comment

ఆచార్య జి వి సుబ్రహ్మణ్యం గారి ముత్యాల ముచ్చట్లు.5 వ భాగం.37.22.23.

ఆచార్య జి వి సుబ్రహ్మణ్యం గారి ముత్యాల ముచ్చట్లు.5 వ భాగం.37.22.23.

Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube | Leave a comment

గీతా దర్శనము.10 వ.భాగం.27.12.23.

గీతా దర్శనము.10 వ.భాగం.27.12.23.

Posted in రచనలు | Leave a comment

శ్రీ హర్ష నైషధం.137 వ భాగం.27.12.23.

శ్రీ హర్ష నైషధం.137 వ భాగం.27.12.23.

Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube | Leave a comment

శ్రీ రాయసం వెంకట శివుడు గారి ఆత్మ చరిత్రం.20.వ భాగం.26.12.23.

శ్రీ రాయసం వెంకట శివుడు గారి ఆత్మ చరిత్రం.20.వ భాగం.26.12.23.

Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube | Leave a comment

ముత్యాల ముచ్చట్లు .4 వ భాగం.26.12.23.

Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube | Leave a comment

గీతా దర్శనము.9 వ భాగం.26.12.23

గీతా దర్శనము.9 వ భాగం.26.12.23

Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube | Leave a comment

శ్రీ హర్ష నైషధం.136.వ భాగం.36.12.23.

శ్రీ హర్ష నైషధం.136.వ భాగం.36.12.23.

Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube | Leave a comment

శ్రీ రాయసం వెంకట శివుడు గారి ఆత్మ చరిత్రం 19 వ భాగం.25.12.23.

శ్రీ రాయసం వెంకట శివుడు గారి ఆత్మ చరిత్రం 19 వ భాగం.25.12.23.

Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube | Leave a comment

ఆచార్య జి వి సుబ్రహ్మణ్యం గారి ముత్యాల ముచ్చట్లు.3 వ భాగం.25.12.23.

ఆచార్య జి వి సుబ్రహ్మణ్యం గారి ముత్యాల ముచ్చట్లు.3 వ భాగం.25.12.23.

Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube | Leave a comment

గీతా దర్శనము.8 వ భాగం.#25.12.23.

గీతా దర్శనము.8 వ భాగం.#25.12.23.

Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube | Leave a comment

శ్రీ హర్ష నైషధం.135 వ భాగం.25.12.23.

శ్రీ హర్ష నైషధం.135 వ భాగం.25.12.23.

Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube | Leave a comment

శ్రీ రాయసం వెంకట శివుడు గారి ఆత్మ చరిత్రము. 18 వ భాగం.24.12.23।

శ్రీ రాయసం వెంకట శివుడు గారి ఆత్మ చరిత్రము. 18 వ భాగం.24.12.23।

Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube | Leave a comment

ఆచార్య జివి సుబ్రహ్మణ్యం గారి ముత్యాల ముచ్చట్లు.2 va bhaagamu.24.12.33.

ఆచార్య జివి సుబ్రహ్మణ్యం గారి ముత్యాల ముచ్చట్లు.2 va bhaagamu.24.12.33.

Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube | Leave a comment

గీతా దర్శనము.7 వ భాగం.24.12.23.

గీతా దర్శనము.7 వ భాగం.24.12.23.

Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube | Leave a comment

శ్రీ హర్ష నైషధం.134 వ భాగం.24.12.23.

శ్రీ హర్ష నైషధం.134 వ భాగం.24.12.23.

Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube | Leave a comment

ముక్కోటి ఏకాదశీ ఉత్తర ద్వార దర్శన శ్రీ సువర్చలా ఆంజనేయం

ముక్కోటి ఏకాదశీ ఉత్తర ద్వార దర్శన శ్రీ సువర్చలా ఆంజనేయం

https://www.youtube.com/post/UgkxO9CABQEZ0JQL8VxfJpzHDE4c0ENho4Rl

Posted in రచనలు | Leave a comment

శ్రీ రాయసం వెంకట శివుడు గారి ఆత్మ చరిత్రం.17 వ భాగం.23.12.23.

శ్రీ రాయసం వెంకట శివుడు గారి ఆత్మ చరిత్రం.17 వ భాగం.23.12.23.

Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube | Leave a comment

ఆచార్య జి.వి.సుబ్రహ్మణ్యం గారి ముత్యాల ముచ్చట్లు.1 వ భాగం.23.12.23.

ఆచార్య జి.వి.సుబ్రహ్మణ్యం గారి ముత్యాల ముచ్చట్లు.1 వ భాగం.23.12.23.

Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube | Leave a comment

గీతా దర్శనము.6 వ భాగం.23.12.23.

గీతా దర్శనము.6 వ భాగం.23.12.23.

Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube | Leave a comment

శ్రీ హర్ష నైషధం.133 వ భాగం.23.12.23.

శ్రీ హర్ష నైషధం.133 వ భాగం.23.12.23.

Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube | Leave a comment

శ్రీ రాయసం వెంకట శివుడు గారి ఆత్మ చరిత్రము.16 .వ భాగం.22.12.23.

శ్రీ రాయసం వెంకట శివుడు గారి ఆత్మ చరిత్రము.16 .వ భాగం.22.12.23.

Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube | Leave a comment

గీతా దర్శనము.5 వ భాగం.22.12.23.

గీతా దర్శనము.5 వ భాగం.22.12.23.

Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube | Leave a comment

(అజాత శత్రువు ,సమర్ధ ఉత్తమ ఉన్నత ప్రభుత్వాధికారి ,అనుపమ సాహితీ కల్పవల్లి- శ్రీ సోమేపల్లి

(అజాత శత్రువు ,సమర్ధ ఉత్తమ ఉన్నత ప్రభుత్వాధికారి ,అనుపమ సాహితీ కల్పవల్లి- శ్రీ సోమేపల్లి

‘’ఆతడజాతశత్రుడు ,అన్నిట ఆరియు తేరిన యోద్ధ ‘’అని ఆ నాటి ధర్మరాజును కవి వర్ణించాడు .ఈనాడు సమకాలీన సాహిత్య౦ లో అంతటి అజాత శత్రువు శ్రీ సోమేపల్లి వెంకట సుబ్బయ్య గారు .ఎంతటి భారీ పర్సనాలిటీయో, అంతటి విశాల హృదయులు .నవ్వుముఖం తప్ప ,చిరుకోపం కూడా ప్రదర్శించని సాత్వికమూర్తి .తాను ఒకజిల్లాకే ముఖ్య అధికారి అయినా ,ఆదర్పం డాబు చూపని వినయ సంపన్నులు .అన్నీ తెలిసిన వివేక మూర్తి .తాను సాహిత్యజీవి కావటమే కాక, సాహిత్య పోషకులు కూడా .ఎక్కడ ప్రతిభ ఉన్నా కనిపెట్టి ప్రోత్సహించే సహృదయులు .సాహిత్యం లో ఆంధ్ర ప్రదేశ్ అగ్రగామిగా ఉండాలన్న నిరంతర తపన ఆయనది .అందుకే గుంటూరు జిల్లా రచయితలసంఘం స్థాపించి ప్రోత్సహించి ,ఆతర్వాత రాష్ట్ర సంఘం ఉంటేనే ,రచయితలకు గుర్తింపు ,ప్రోత్సాహం ఉంటుందని అందరికంటే ముందే ఆలోచి౦చి,స్థాపించి, తీర్చి దిద్దిన మహనీయులు .సోమయ్య గారికి అన్ని విదాలాసహాయసహకారాలు అందించినవారు ఆసంస్థ ప్రధానకార్య దర్శి శ్రీచాలపాక ప్రకాష్ .ఒక రకంగా వీరిద్దరూ కృష్ణార్జునులై ఎన్నెన్నో విభిన్న కార్యక్రమాలను నిర్వహిస్తూ ప్రతిభను గుర్తించి ప్రోత్సహిస్తూ ,ఆంధ్రప్రదేశ్ రచయితలసంఘాన్ని నడిపించారు ,ఆదర్శ వంతం చేశారు .

ఇంతటి తపన ఉన్న సోమే పల్లి వారిలో ఉన్న కవి ఎలా ఉన్నాడో దర్శిద్దాం .

లోకమంతా కోడై’’ప్రపంచం కుగ్రామం ‘’అంటుంటే కవికి ఆయన పల్లె మాత్రం ‘’విశాల ప్రపంచం ‘’గా దర్శన మిచ్చింది .ఇది కవిగారి విశాల దృక్పధానికి తార్కాణ .జీవన గమనం లో తత్త్వం ‘’రైలు ముందుకు చెట్లు వెనక్కు పరి గెత్తినట్లు ఉండటం నిజం . కర్షక కవికనుక ఆయన ప్రయాణం ఎప్పుడూ గణగణ లాడే గంటలతో ఉన్న జోడేద్దులతోకనుక ఒంటరి తనం అసలే అనిపించదు .వరద ఆగినా ‘’కన్నీరు వెల్లువగా ప్రవహిస్తూనే ఉంది. ఆకలి డొక్కముద్దకరువే కాని విలాసాల విస్తరికి దుబారా మోత లోక సహజంమర్రి చెట్టు ఇప్పటికీ’’ ఉమ్మడి కుటుంబమే ‘’ అది స్పూర్తి కూడా . పొలం పనిలో శ్రమ సౌందర్యం సూర్య చంద్రులు శ్రామికులకు చలువ పందిళ్ళుఎన్నికల వర్షానికి సంకేతం కాలుష్య మేఘం.చెప్పులజోడు లా మనుషులు ఎందుకు కలిసి ఉండరు అని థౌజండ్ డాలర్ క్వశ్చిన్ .చెమట చుక్కకు చేతులు జోడిస్తే మట్టి మరింత పరిమళ భరితంఅన్నదాతకు అజీర్తే –అధికంగా పెడుతోంది నీటి బువ్వ ‘’అనటం చూస్తె కవిలో మంచి భిషగ్వరుడు న్నాడనిపిస్తుంది. గాలికి ఊగేచెట్ల కొమ్మలు సమైక్యరాగానికి చిహ్నాలు . ముసలితనం లో చెట్టుకొమ్మ ఊత అయి,అయిన వారికంటే ఆప్తురాలౌతుంది .పూర్వం పది మంది ఒకే ఇంట్లో –ఇప్పుడు పది గూళ్ళల్లో ఒక్కొక్కరు ‘’అంటూ సైబర్ ఉద్యోగాలపై అపార్ట్మెంట్ కల్చర్ పై చెణికారు.భూమిలోని నెర్రెలు –పుడమి తల్లి కడుపు ఎండటానికి గుర్తు. కవితలలో పదాల పోహళింపు అబ్బురపరుస్తుంది . శ్రీ గోపి అన్నట్లు ‘’నిబ్బరమైన వ్యక్తిత్వం ,నిరంతర కవిత చింతనం ,మానవీయ వైఖరి శ్రీ సోమేపల్లి వారి సంపద’’ .

అంతే కాదు , సోమేపల్లి వారిది అసంబద్ధ అంతర్ముఖం ,సందర్భ బహిర్ముఖం అనిత్య వేదనం నిత్య సంఘర్షణ౦ .ఇప్పటికి మట్టి ముద్ద.కాలం జరిగాక తవ్వి చూస్తె –శిలగా మిగులుతానో –శిల్పమై ఎదురొస్తానో ,శిలాజంగా దొరుకుతా’తూటాలకు అంటిన మరకల్లో –నాదంటూ ఓ నెత్తుటి చుక్క ఉంటుంది –పారే ఉప్పునదులలో నాదీ ఒక పాయ ఉంటుంది –నవ్వే పెదవులలో నాదంటూ ఒక కారణముంటుంది ‘’అని మమైకమై ,చెట్టుకు పూసిన ఎండు మొలకల్లాంటి పిట్ట గూట్లో –ఫ్రీ కానుకలు పెట్టక్కర్లేదు –కొమ్మను కొట్టకుండా ఉంటె చాలు ‘’అని నేటి సామాజిక స్థితిని ఎన్నికల వాగ్దానాల్ని ఎండకట్టారు.మనువు వేర్లను కూడా తగల పెట్టేద్దాం అన్నారు .’’గుండె తొలవటం అమ్మతనం ‘’అని, మనల్ని మనం వెతుక్కోవాలంటే –మనల్ని మనం కోల్పోతూ౦డాలి ‘’.వెళ్ళే దారిని అడుగులకు చెప్పద్దు అన్నాడు ఎందుకుష ?తప్పించుకోలేని దృశ్యాల్ని తొక్కు తాయి కనుక –‘’. ‘’ఆటుపోట్లకు అదరను –బెదరను ‘’అని నిర్భయంగా చెబుతుంది ‘’అన్నదాత వెన్ను విరిగింది ‘’కానీ .’’ధరలదీ దళారులదీ-పంట పండింది ‘’అన్నారు .సాగులో సవ్య అప్పుడు ,ఎప్పుడూ- ఆకలికి ప్రత్యక్ష దీపం –అన్నదాతే’’అంటారు చేనుకు నీటి జవజీవాలనిచ్చే పిల్ల కాలువ ‘’నిత్యం పలకరిస్తూ ,పరవశిస్తుందట ‘’. రైతు జీవితం ఒక మహా భారతం కొంచెం ఘాటుగా చెప్పాలంటే ‘’మహా భరాటం’’.కనుక అతని ‘’కస్టాలు రాయాలంటే 18కాదు ఎన్ని పర్వాలైనా పడతాయంటారు .బోరుబావి’నీళ్ళలోనూ –ఊసర వెల్లి ఉందా ?-కొత్తనీరుకలిస్తే –రంగు మారుతోంది ? వర్షం రైతన్నకు హర్షం .అది ‘’దూరపు బంధువు –అందుకే –ఎప్పుడో కాని రాదు ‘’అని కవితాత్మకంగా దిగులు చెందామా ఊరే –మాకు గొడుగు –పిల్లా జెల్లల్ని –నడిపించేది పెద్దలే ‘.కాలుష్యపు కాలువ ‘’నీళ్ళతోపాటు నిప్పుల్నీ మోసుకొస్తుంది ‘’అని సామాజిక స్పృహతో చెప్పారు .నల్లడబ్బును కొండ చిలువతో పోలుస్తూ ‘’ఒళ్ళు విరుచుకొంటే –ఓట్లను కూడా మింగుతుంది ‘’అనే నేటి వోటు -నోటు కు దర్పణంగా చెప్పారు ..చివరి నానీ –‘’పల్లె మెడలో –పచ్చని మణిహారం –బారులు తీరిన – చెట్లదే సోయగం .‘

ఇలా ’’నానీలను రాసి లోయలో మనిషి, చల్లకవ్వం, తదేకగీతం, తొలకరి చినుకులు, రెప్పల చప్పుడు, పచ్చని వెన్నెల, తదేక గీతం మట్టి పొరల్లోంచి.చేను చెక్కిన శిల్పాలు వంటి రచనలతో అగ్రస్థానంలో ఉన్నారు . స్వీట్ చీట్, తర్వాత రంగుల ప్రపంచంలో అమ్మ,ఆశకు ఆవలివైపు, కథాకేళి, ఇంతే సంగతులు మొదలైన కథలు రాశారు సోమేపల్లి వెంకట సుబ్బయ్య రాసిన తొలకరి చినుకులు, రెప్పల చప్పుడు, పచ్చని వెన్నల నానీల సంపుటాలలోని కొన్ని నానీలను ఎంపికచేసి “”శ్రీ సోమేపల్లి వెంకట సుబ్బయ్య నానీలు” అని తలతోటి పృథ్విరాజ్ తను వ్యాఖ్యాతగా ఆడియో/వీడియో సీడీలుగా రూపొందించారు.

,ఇంతటి కవి భావుకుడు ఇతరకవులను ,రచయితలను ప్రోత్సహించటానికి కంకణం కట్టుకొన్నారు .చెప్పి చేయించటం కాదు తానే చేసి, చూపించి ,చేతల మనిషిగా ,ఆదర్శ మూర్తి అయ్యారు . తమ తలిదండ్రుల స్మృత్యర్ధం ‘’సోమేపల్లి సాహితీ పురస్కారం ‘’ఏర్పరచి ట్రస్ట్ ద్వారా జాతీయ స్థాయిలో చిన్న కధల పోటీ పెట్టి మంచికధలనునిష్పక్షపాతంగా ఎంపిక చేసి విజేతలకు’’ సోమేపల్లి పురస్కారం ‘’అంది౦చి సాహిత్యోప జీవి అయ్యారు . సోమేపల్లి వారి బహుమతి అంటే నిర్దుష్ట మైనదని, ఎక్కడా ఏవిధమైన అడ్డు దారులు ఉండవని సాహిత్యలోకం లో గొప్ప నమ్మకం కలిగించారు .ఆ బహుమతులు అకాడెమీ బహుమతులకంటేవిలువైనవని సాహిత్యకారులలో గొప్ప నమ్మకం కలిగించారు .ఈ పోటీకథలను ఎప్పటికప్పుడు పుస్తక రూపంగా తీసుకురావటం మరో అరుదైన అద్భుత విషయం .

వెంకట సుబ్బయ్యగారి జనన విద్యాభ్యాసాలు – వెంకట సుబ్బయ్యగారు 1958వ సంవత్సరం మే 1వ తేదిన హనుమంతరావు, నాగరత్నం దంపతులకు జన్మించారు. ప్రకాశం జిల్లా యద్దనపూడి మండలంలోని గన్నవరం గ్రామం ఆయన జన్మస్తలం. యద్దనపూడి మండలం పూనూరులో పాఠశాల, చిలకలూరిపేటలోని చుండి రంగనాయకులు కళాశాలలో ఉన్నత విద్యనూ అభ్యసించారు. ఆంధ్ర విశ్వవిద్యాలయం నుండి ప్రైవేటుగా ఎం.కాం డిగ్రీ పొందారు.

సోమేపల్లి వృత్తి సోపానం దర్శిద్దాం – ఆంధ్రజ్యోతి దినపత్రికలో ఉపసంపాదకులుగా ఉద్యోగ జీవితాన్ని ప్రారంభి౦చి , 1989 గ్రూప్ 2 పరీక్షలో ఉత్తీర్ణులై ఎం.ఆర్.ఓగా నియమితులై . పశ్చిమ గోదావరిజిల్లాలోని పెంటపాడు, తాడేపల్లిగూడెం, గణపవరం, తణుకులలో విధులను నిర్వర్తించి . 2003లో పులిచింతల పధకానికి స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ గా పనిచేసి ,. 2006 గుంటూరు, నర్సాపురం ఆర్.డీ.ఒగా తర్వాత గుడివాడ ఆర్.డీ.ఓ గా[3], గుంటూరు జిల్లాకు జిల్లా పరిషత్ ముఖ్య పాలనాధికారి (సి.ఇ.ఓ)గా పనిచేసి పదవీ విరమణ చేశారు.

పొందిన పురస్కారాలు -సోమేపల్లి వారి ప్రజా సేవ సాహితీ సేవలకు మంచి ప్రోత్సాహం లభించి పురస్కారాలు అందుకొన్నారు .. వీరి అత్యుత్తమ ప్రజాసేవకు గుర్తింపు ఇచ్చింది రెడ్ క్రాస్ పురస్కారం, ఈ పురస్కారాన్ని నాలుగు సార్లు గవర్నర్ చేతులు మీదుగా అందుకున్నారు. ఎంఆర్వో, ఆర్డీవోలుగా అనేక సార్లు ఉత్తమ అధికారిగా ఎన్నిక అయ్యారు.సోమేపల్లి మాతృభాషాభిమాని. పరిపాలన భాషగా తెలుగును అమలు పరచటంలో వీరి విధానాన్ని గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం 2008 సంవత్సరం నవంబరు 1న తెలుగు భాషా విశిష్ట పురస్కారం ప్రదానం చేసింది. సోమిరెడ్డి జమున స్మారక పురస్కారం-2008,నెల్లూరుసోమేపల్లి మాతృభాషాభిమాని. పరిపాలన భాషగా తెలుగును అమలు పరచటంలో వీరి విధానాన్ని గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం 2008 సంవత్సరం నవంబరు 1న తెలుగు భాషా విశిష్ట పురస్కారం ప్రదానం చేసింది ఆంధ్ర సారస్వతి సమితి, మచిలీపట్టణం గిడుగు పురస్కారం- 2016 (తెలుగు భాషా వికాస),గుడివాడ సహజ సాహితి, చీరాల వారి సాహిత్య పురస్కారం -2017. గుఱ్ఱం జాషువా కళాపీఠం, దుగ్గిరాల వారి సాహిత్య పురస్కారం – 2018. మట్టి పొరల్లోంచి…” పుస్తకానికి రావి రంగారావు కళాపీఠంచే జనరంజక కవి ప్రతిభా పురస్కారం- 2020 అందుకొన్నారు .

· సరస భారతికి ఆత్మీయులై సుమారు పదికార్యక్రమాలలో పాల్గొన్న సాహితీ ప్రియులు వారు . ఆం .ప్ర .ర. సంఘం సంస్థ ఏర్పరచిన ‘’జ్ఞానజ్యోతి పురస్కారం’’ మొదటి సారిగా నాకు అందించటం లో వారి సంస్కారం నా సాహిత్య జ్ఞానం కన్నామిన్న అయినది. గత రెండేళ్లుగా ఆరోగ్యం సహకరిచటం లేక ప్రయాణాలు చేయటం లేదు.అయినా నేను వారికి ఫోన్ చేసి ప్రతి ముఖ్యమైన కార్యక్రమానికీ ఆహ్వానిస్తూనే ఉన్నాను .నవ్వుతూ ;;సారీ ప్రసాద్ గారు !ప్రయాణం చేయటం లేదు. రాలేను అన్యధా భావించకండి ‘’అనేవారు నేనుకూడా ‘’మీరు మా ఆహ్వానాన్ని మన్నించి ఎన్నో సార్లు వచ్చారు .మీ ఇబ్బంది అర్ధమౌతోంది ఫరావాలేదు. మీ ఆరోగ్యం ముఖ్యం అనే వాడిని .చివరిసారిగా నవంబర్ 20న సరసభారతి 178వ కార్యక్రమంగా జరిపిన ‘’కృష్ణా జిల్లా సాహిత్య తరంగిణి ‘’పుస్తక ఆవిష్కరణకు కూడా ఫోన్ చేసి ఆహ్వానించాను .నవ్వుతూ రాలేనని చెప్పారు. అదే ఆఖరి సారిగా మాట్లాడటం అవుతుందని అనుకోలేదు .

· ఇంతటి పెద్దమనిషి సాహిత్యోపజీవి ప్రజాపాలనా దక్షులు శ్రీ సోమేపల్లి వేంకట సుబ్బయ్య గారు ఈ నెల 14వ తేదీ గురువారం 62 ఏళ్లకే మరణించారు .వారి నేత్రాలను దానం చేసి పార్ధివ దేహాన్ని గుంటూరు ప్రభుత్వ హాస్పిటల్ కు అప్పగించి మార్గదర్శిఅయ్యారు .వారి ఆత్మకు శాంతికలగాలని ,వారి కుటుంబానికి సానుభూతి తెలియ జేస్తున్నాను .

· గబ్బిట దుర్గాప్రసాద్ -22-12-23-ఉయ్యూరు

Posted in మహానుభావులు | Leave a comment

శ్రీ రాయసం వెంకట శివుడు గారి ఆత్మ చరిత్రము.15 వ భాగం.21.12.23.

శ్రీ రాయసం వెంకట శివుడు గారి ఆత్మ చరిత్రము.15 వ భాగం.21.12.23.

Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube | Leave a comment

కవి శేఖర శ్రీ పానుగంటి లక్ష్మీ నరసింహారావు గారి ఆంధ్రుల బృహత్కథ సాక్షి.11 వ భాగం.21.12.23.

కవి శేఖర శ్రీ పానుగంటి లక్ష్మీ నరసింహారావు గారి ఆంధ్రుల బృహత్కథ సాక్షి.11 వ భాగం.21.12.23.

కవి శేఖర శ్రీ పానుగంటి లక్ష్మీ నరసింహారావు గారి ఆంధ్రుల బృహత్కథ సాక్షి.11 వ భాగం.21.12.23.

Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube | Leave a comment

గీతా దర్శనము.4 వ భాగం.21.12.23.

గీతా దర్శనము.4 వ భాగం.21.12.23..

Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube | Leave a comment

శ్రీ హర్ష నైషధం.131 వ భాగం.21.12.23.-2

శ్రీ హర్ష నైషధం.131 వ భాగం.21.12.23. -2

Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube | Leave a comment

శ్రీ హర్ష నైషధం.131 వ భాగం.21.12.23.

శ్రీ హర్ష నైషధం.131 వ భాగం.21.12.23.

Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube | Leave a comment

ఆ జంట ఆదర్శ పరుగు ‘’ స్వర్ణ’’ కా౦తులే-పరువు

ఆ జంట ఆదర్శ పరుగు ‘’ స్వర్ణ’’ కా౦తులే-పరువు

ఒక వారం క్రితం శ్రీ పూర్ణ చ౦ ద్ నాకు రెండు పుస్తకాలు –పరువు ,మక్కాలు పంపారు .ముందు బరువైన’’ పరువు’’ను దింపుకొని తర్వాత  ,ఆరు అంచుల  ముక్కాలి పీట ఎక్కుతాను .

కృష్ణా జిల్లా రచయితల సంఘం అధ్యక్ష ,కార్యదర్శులు శ్రీ గుత్తికొండ సుబ్బారావు డా జి.వి . పూర్ణ చందు  గార్ల స్నేహ స్వర్ణోత్సవ సందర్భంగా డాక్టరు గారు రాసి ,గుత్తికొండ రామ రత్నం చారిటబుల్ ట్రస్ట్ ఈ నవంబర్ లో ప్రచురించిన పుస్తకమే ‘’పరువు ‘’ స్నేహ బరువుతో మురిసి మెరిసింది . స్వర్ణ కాంతు లీనింది .అమెరికాకు చెందిన శ్రీ చిట్టెన్ రాజు  శ్రీ బాపు ,శ్రీ ముళ్ళపూడి రమణ ల స్నేహ షష్టి పూర్తి హైదరాబాద్ లోసుమారు పది హేనేళ్ళక్రితం  రెండు రోజులు ఘనం గా జరిపారు .మళ్లీ ఇప్పుడు ఈ సాహితీ  కృష్ణార్జునుల స్నేహ స్వర్ణోత్సవం  బందర్లో ఈ నవంబర్ లో జరిగి ఈ పుస్తకం వెలువడింది .ఈ పుస్తకం సుబ్బారావు గారి అర్ధాంగి కీ .శే .శ్రీమతి గుత్తికొండ రామరత్నం గారికి  ఆమె జ్ఞాపకాలకు స్పూర్తికి మార్గదర్శనానికి కృతజ్ఞతగా అంకితమిచ్చి  ఋణం తీర్చుకొన్నారు .64 పేజీల ఈ పుస్తకం లో అన్నీ కోటబుల్ కోట్స్ ఉన్న పేజీలే  అంటే అతిశాయోక్తి కాదు .విలువైన మన జిల్లా సాహితీ ప్రస్తానమే .మరువరాని అపురూప యదార్ధ సంఘటన సమాహారమే .సాహితీ విజ్ఞాన సర్వస్వమే .

  రచయిత పూర్ణ చ౦ద్ తన సాహితీ మిత్రుడు సారధి సచివుడు సుబ్బారావు తొ జరిగిన తొలి పరిచయం .సాహితీద్వయమై ఆతర్వాత మాన్యశ్రీ మండలి బుద్ధ ప్రసాద్ గారి పరిచయంతో సాహితీ త్రయమై ,శ్రీ యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ చేరికతో చతుష్టయ మవటం మనం చూస్తాం .ఉప్పొంగి పోయిన మనసుతో పూర్ణ శ్రీ సుబ్బారావు వ్యక్తిత్వాన్ని గొప్పగా ఆవిష్కరించారు .’’నాలో పెద్ద చెట్టుగా ఎదిగే మర్రి గిన్జలనే సాహిత్య బీజాలు నాటింది సుబ్బారావు గారే ‘’అన్నారు .విహారి సుబ్బారావు గార్లతో సాన్నిహిత్యమే లేకపోతె పూర్ణ చంద్రుడు ఇంకా నెలబాలుడు గానే ఉండిపోయే వాడు,సాహితే పూర్ణోదయం జరిగి ఉండేదికాదు  అని నిండు మనసుతో చెప్పారు .’’గుత్తికొండ బంగారు కొండ ,సాహితీ నిర్వహణ వేత్త ‘’అన్న నానీల నాన్న డా గోపి మాట గుర్తుకు తెచ్చారు. శ్రీ బుద్ధ ప్రసాద్ ఒకసారి బందరుఎల్ ఐ సి ఆఫీస్ కు  వెళ్ళి శ్రీ విడియాల చంద్ర శేఖరరావు గారిని ’’ఇక్కడ గుత్తికొండ సుబ్బారావు గారు పని చేస్తున్నారా ??అని అడిగితె ఆయన యూనియన్ లీడర్ అని రావు గారంటే తనకు రచయిత గుత్తికొండ కావాలి అన్నారట .అప్పటికే 1975లో స్పందన సాహితీ సమాఖ్య పక్షాన 4వ కృష్ణాజిల్లారచయితల మహా సభల ప్రత్యేక సంచిక ప్రసాద్ గారు చూసే ఉన్నారు .దాన్ని చూసే అవనిగడ్డలో అలాంటి సభ జరిపితే బాగుండు అని చెప్పటానికి వచ్చారు .ఒక సాహితీ సహాయకుడు  దొరికాడు కదా అని సంతోషించి 1979లో బందరు టౌన్ హాల్ లో జరుపబోయేసభలకు రావలసినదని ఆహ్వానించటం ఆయన రావటం జరిగి  సాహితీ స్నేహం పెరిగింది .దానితో  అవనిగడ్డలో 1982జులై 10,11 తేదీలలో గాంధీ క్షేత్రంలో కృష్ణా  రచయితల 5 వ మహా సభలు ఘనం గా జరిపారు అందరూకలిసి .అప్పుడే మాజీ మంత్రి మండలి వేంకట కృష్ణారావు , ఏం.ఆర్ . అప్పారావు గార్లతో పనిచేసే సౌభాగ్యం కలిగింది .సాహిత్యానికి ఒక సంస్థ  అవసరం అని అప్పారావు గారు సూచించి తను వెన్నుదన్నుగా ఉంటానని ప్రోత్సహించారు .బెజవాడలో పూర్ణ తన వైద్య వృత్తిని విద్యాధర పురంలో శ్రీ మైత్రేయ అనే నాటక రచయితా, ప్రయోక్త ప్రోత్సాహంతో ప్రారంభించారు. అప్పుడే శ్రీ ముక్కామల నాగభూషణం గారు అనే కమ్యూనిస్ట్ నాయకుడు పరిచయమయ్యారు .ఈయన విశ్వనాథ వేయి పడగలు నవలకు వ్యతిరేకంగా ‘’వెర్రి పడగలు ‘’రాశారు .లయోలా, మేరీ స్టెల్లా ,మాంటిస్సోరి , గాంధీ హిల్ ప్లానిటోరియం ,విశాలాంధ్ర భవనం నిర్మాణాలు ఆయన చేసినవే .ఈల చెట్ల దిబ్బ  చుట్టు పక్కల దీవులకు సముద్రం అడుగు నుంచి పైపు లైన్లు వేసి మంచి నీటి సౌకర్యం కలిగించిందీ ఆయనే .ఆంధ్రప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ కూడా ..ప్రగతి వారపత్రిక నిర్వాహకుడు .యద్దనపూడి సులోచనారాణి వంటి రచయిత్రులను సాహితీ లోకానికి పరిచయం చేసి౦ది కూడా ఆయనే .ఆయన అసామాన్యులలో  అసామాన్యుడు .కనుక మనజంటకు మరో సాహితీ పిపాసి పరిచయం అయ్యాడన్నమాట .సుబ్బారావు  సహకరిస్తే కృష్ణాజిల్లా రచయితల సంఘం ఏర్పాటు బాధ్యత తీసుకొంటానని ముందుకు రావటం వీళ్ళకు ఆశ్చర్యమేసింది .సుబ్బారావు ఓ పట్టాన తల ఊపరు .ఆలోచిస్తుంటే భూషణంగారే ముందుకు వచ్చి తాను  అధ్యక్షుడుగా  బుద్ధప్రసాద్ గౌరవాధ్యక్షుడుగా ,సుబ్బారావు ప్రధాన కార్యదర్శిగా అప్పారావు గారు సలహాదారుగా సంఘం ఏర్పాటు జరిగింది .

  శ్రీ యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ 70 వ జన్మ దినోత్సవం నాడు విశాఖ  వెళ్ళి సభలో ఈ జంట అభినందించింది .2006లో బెజవాడలో జరిగిన జాతీయ తెలుగు రచయితల సభ కు లక్ష్మీ ప్రసాద్ రాగా ,మాటల సందర్భంగా ప్రపంచ తెలుగు రచయితల సభలు జరిపే ప్రస్తావన రాగా మండలి గౌరవాధ్యక్షుడుగా యార్లగడ్డ కార్యనిర్వాహక అధ్యక్షుడు  సుబ్బారావు అధ్యక్షుడు పూర్ణచంద్ కార్యదర్శిగా సంఘ నిర్వహణ సభ ఏర్పడింది .యార్లగడ్డ తన అభిమాన కవి ఆలూరి బైరాగి పేరిట ఒక అవార్డ్ ఇస్తాననటం జరిగింది .యార్లగడ్డ ఆలోచనతోనే రచయితల పాదయాత్ర మచిలీ బందరునుంచి నెల్లూరుదాకా గొప్పగా జరిగింది .తెలుగుకు ప్రాచీనహోదా కు కూడా  ఢిల్లీ లెవేల్ లో చక్రం త్రిప్పిందీ ఆయనే .

 బందరులో కృష్ణా విశ్వ విద్యాలయం ఏర్పడటం ,అందులో తెలుగు శాఖలో ఎవరూ చేరకపోవటం ,చూసి లక్ష్మీప్రసాద్ 15మంది తెలుగు చదివే పేద విద్యార్ధులకు  రచయితల సంఘం ఫీజులు కడుతుందని హామీ ఇచ్చి కట్టి తెలుగు శాఖ కు పురుడు పోశారు ఈపెద్దలు .ఆయన ‘’డు’’అంతే ఈజంట దూడూ బసవన్న లాగాకాక ‘’డన్’’అంటూ కార్యక్రమాలు నిర్వహించారు .వీరికి యువభారతి నిర్వాహకుడు ఆచార్య వంగపల్లి విశ్వనాథం ఆదర్శం .ఫ్రీ వెర్స్ పితామహుడు కుందుర్తి ఆంజనేయులు గారి శిష్యుడుగా గుత్తికొండ ఎన్నో విషయాలు ఆకలింపు చేసుకొన్నారు .కేంద్రమంత్రి తెలుగు అకాడెమి అధ్యక్షుడు ,రవీంద్రభారతి రూప శిల్పి శ్రీ బెజవాడ గోపాల రెడ్ది కూడా  అంతరంగికులయ్యారు .1975-85 దశకం లో బందరులో స్పందన పేరు ప్రతివారినోటా నానినపేరు .బందరు +స్పందన =స్పందరు అన్నాడు పురాణం సుబ్రహ్మణ్య శర్మ సరదాగా .బందరు బెజవాడలలో ఎక్జీబిషన్ సమయంలో స్పందన సంస్థ రచయితల పుస్తకాల స్టాల్ నిర్వహించి 50శాతం డిస్కౌంట్ ఇచ్చి అమ్మగా వచ్చిన డబ్బు రచయితలకు పంచేశారు. స్పందన 60పుస్తకాలు స్వయంగా ప్రచురించింది .

  సాహిత్య అకాడెమి సభ్యుడు అయిన శ్రీ సుబ్బారావు బందరులో 1980లో అకాడెమి తరగున సభలు జరిపారు .ఆయన చేతులమీదుగా  పూర్ణగారి పుస్తకాలు చాలా వెలుగు లోకి వచ్చాయి .’’పచ్చని జీవితానికి నచ్చిన రూలు ‘’రాసిన డా పెళ్ళూరి జయప్రదను పుస్తకలోకానికి పరిచయం చేస్తూ గోపాల రెడ్దిగారి చేతులమీదుగా ఆవిష్కరింపజేశారు డా .ద్వా ,నా శాస్త్రి మొదటిపుస్తకం ను ఈయనకు అంకితమిచ్చారు .అప్పటిదాకా హైదరాబాద్ లో పోస్టల్ ఉద్యోగం చేసిన సుబ్బారావు రాజీనామా చేసి ,బందరు వచ్చి భద్రమైన జీవిత బీమా సంస్థలో చేరి రిటైరయ్యారు

బందరులో సారస్వత సమితి విహారి శాలివాహన ,పువ్వాడ తిక్కన సోమయాజి  బూదరాజు శ్యామ సుందర్ ,జిసనారా కొట్టి రామారావు నిర్వహణలో బాగా ఉండేది ఉత్సాహంగా చేరిన సుబ్బారావు అక్కడి’’ ఉక్కకు ‘’తట్టుకోలేక పదకొండుమంది కార్యవర్గ సభ్యులతో బయటికి వచ్చి స్పందన సాహితీ సమాఖ్యకు ప్రాణం పోశారు .1976లో స్పందన లో పూర్ణ చ౦ద్ద్ ను కార్య వర్గ సభ్యునిగా తీసుకొన్నారు .పూర్ణ చ౦ద్ హైస్కూల్ చదివే రోజుల్లోనే ‘’మేఘమాల ‘’అనే లిఖిత మాసపత్రిక నూజివీడులో నడిపారు .కవి దుర్గానంద్ గారబ్బాయి అ౦బికానాథ్ సంచాలకుడు ఈయన సంపాదకుడు .

  బెజవాడలో ఇంటర్ చదివేటప్పుడు కూడా మేఘమాలను వదల్లేదు కృష్ణాజిల్లా రచయితల సభలో విశ్వనాథ ముఖ చిత్రంతో ఆ సభల  ప్రత్యెక సంచిక తెచ్చారు .సుబ్బారావు బందరులో స్పందన సాహితీ సమాఖ్య పక్షాన ఒక మాస పత్రిక మొదలుపెట్టారు అందులో పూర్ణ మొదటి సారిగా శ్యాం బెనెగల్ నిర్మించిన అనుగ్రహం సినిమాపై రివ్యు ను సుబ్బారావు గారి కోరికపై రాశారు. అది ఆపత్రికలో వచ్చింది .ఆతర్వాత చాలాసినిమాలాను రివ్యు చేశారు తనదైన కోణంలో .పత్రిక నడపటం కష్టమైంది .ప్రిస్టేజికి పోయి భార్య రమగారి తాళి అమ్మటానికి కూడా సిద్ధమయ్యారు  .’’ఇంట్లో వాళ్ళను ఏడ్పించి మనం చేసే సాహిత్య సీవ కు ప్రయోజనం ఏమిటి ?’’అని ముద్దుగా మెత్తగా మందలించిన విహారి మాట వేదవాక్కుగా శిరసావహించి పత్రిక ఆపేశారు .పిల్లల బాధ్యతలు తీరి ముగ్గురమ్మాయిలు విద్యావంతులై అమెరికాలో స్థిరపడటానికి రమగారి కృషి మాటలతో చెప్పలేనిది .వారిని తీర్చిదిద్దారు .ఇదే ఆమెను పారిశ్రామిక వేత్తను చేసింది ‘’స్పందన ప్రింటర్స్ ‘’స్థాపించి ‘’రమగారి ప్రెస్ ‘’  గా పేరు తెచ్చుకొని బందరు లయన్స్ క్లబ్ వారి ఉత్తమ ముద్రణాలయ అధిపతి అవార్డ్ పొందారు .ఆమెకు సుబ్బారావు గారిచ్చిన తోడ్పాటు మరువలేనిది . పదేళ్లు విజయవంతంగా నడిపారు. పేద ఇంటి పెళ్ళి కార్డుల ప్రింటింగ్ కు రమగారు డబ్బు తీసుకొనే వారు కాదు .సుబ్బారావు గారు రచయితల దగ్గర డబ్బు తీసుకొనేవారు కాదు .ఇలాంటి ఔదార్యం వితరణ లతో దశాబ్ద కాలం నడిపారంటే’’ ఎయిత్ వండర్ ‘’అని పిస్తుంది .’’అచ్చుపని నుంచి అప్పచ్చుల పని ‘’అంటే ‘’గృహ ప్రియ ఫుడ్స్ ‘’1993లో తమ స్వగృహంలో ప్రారంభించి దిగ్విజయంగా నడుపుతున్నారు .బందరులో ఎన్ని స్వీట్ షాప్ లు వున్నా వీరి నాణ్యత వీరిదే .రమగారు దీర్ఘ వ్యాధితో అనుక్షణ నరకాన్ని అనుభవిస్తూ కూడా ఇలా నడిపారు .స్వర్గస్తులయ్యారు .

‘’కార్య కర్తృత్వాన్ని ఒక విగ్రహం లా పోతపోస్తే సుబ్బారావు ఆకారమే ఏర్పడుతుంది ‘’అన్న పూర్ణమాటలు సంపూర్ణ సత్యాలు . గుంటూరులోగుంటూరు జిల్లా అరసం అధ్యక్షులుగా ఉంటూ చనిపోయిన  శ్రీ పులుపుల వేంకట శివయ్య పేరిట స్థాపించిన సాహితీ పురస్కారాన్ని స్పందన కార్యదర్శి సుబ్బారావు గారికి 1981లో అందజేసింది .

  కృష్ణా జిల్లా రచయితల సంఘం అధ్యక్ష కార్య దర్శులుగా మన జంట అయిదు ప్రపంచ మహా సభలు నభూతో గా నిర్వహించింది .ఈ రెండు స్తంభాలకు మండలి, యార్లగడ్డ మరో రెండు స్తంభాలుగా నిలిచి సాహితీ సౌధం మహా స్ట్రాంగ్ పునాదులపై నిలబడింది .సుబ్బారావు హార్డ్ వేర్ అయితే పూర్ణ సాఫ్ట్ వేర్ .సుబ్బారావు  గురించి నారాయణ రెడ్ది గారు ‘’సభ యావత్తూ ఒక ఉత్తరం అనుకొంటే సుబ్బారావు ఉత్తరం కింద సంతకం వంటి వాడు ‘’అన్నారు .లత అనే  తెన్నేటిహేమలత ప్రోత్సాహంతో ఆంధ్ర ప్రదేశ్ అకాడమికి కార్యవర్గ సభ్యుడిగా పోటీ చేసిగేలుపొండిన ఘనత ఆయనది .పూర్ణ చ౦ద్ కూడా సభ్యుడయ్యారు అయినా రామారావు  ప్రభుత్వంలో,నార్లవారి సిఫార్సుతో  అకాడమీలు  రద్దు అవటంతో  మూన్నాళ్ళ  ముచ్చటే అయింది .

  సుబ్బారావు చేతులు ,బుర్రా చాలా’’పవర్ఫుల్ ‘’.పూర్ణ రోజులో కనీసం 16గంటలైనా కదలకుండా కూర్చోగల సమర్ధుడు ఇద్దరూ పని రాక్షసులే .కొంచెం ఆవేశం ఉన్న సుబ్బారావు ‘’లాజికల్ రేషనలిస్ట్ ‘’అన్నారు పూర్ణ .1970కి ముందు సుబ్బారావు ‘’వేకువ ‘’పత్రికకు బాధ్యుడుగా ఉన్నారు .సభాధ్యక్షులుగా సుబ్బారావు నూటికి వెయ్యి పాళ్ళు సర్వ సమర్ధులు .సభలో విషయాలు ఎవరికీ ఏపని అప్పగించాలి ప్రత్యెక సంచికలు సభల సందర్భంగా తీసుకు వచ్చే స్పెషల్ గ్రంథాలు వాటిలోని విషయాలు అవి ఎవరు రాస్తే బాగుంటాయి వక్తలు ఎవరు వగైరాలలో పూర్ణ స్పెషలిస్ట్ .కార్యకర్తల కళాశాల ఏర్పాటు చేస్తేదానికి ప్రిన్సిపాల్ గా ఉండదగిన వ్యక్తి సుబ్బారావు మాత్రమె అన్నాడు పూర్ణ .శ్రీ పైడిపాటి సుబ్బరామయ్యగారుతాను రాసిన ‘’త్రిలింగ దేశం మనదేనోయ్ –తెలు౦గు లంటే మనమేనోయ్ ;అనే గీతాన్ని ఎవరి తోనైనా సభలో పాడించమని ఫోన్ చేస్తే అలానే చేశారు పూర్ణ .కానీ అప్పటికి ఆయన స్వర్గస్తులయ్యారు

 ఇంతటి సాహితీ కృషి చేసినా తెలుగు భాషోద్యమంలో  రచయితలు స్పందించటం లేదని బాధపడ్డారు .సభా నిర్వహణ సంతృప్తి మా విజయ రహస్యం అంటుంది ఈ జంట . ప్రజాస్వామ్యబద్ధంగా నిర్వహించటమే లక్ష్యం .మిలిటరి జుంటా గా వ్యవహరించరు . పూర్ణ చ౦ద్ శతాధిక గ్రంథ కర్త .సుబ్బారావు ఒకే ఒక కవితా సంపుటితో రచనకు ఫుల్ స్టాప్ పెట్టారు .సాహితీ పిచ్ మీద ఈఇద్దరూ చెరో వైపు నిలబడి50 ఏళ్ళు నాటౌట్ గా బాటింగ్ చేశారు ,చేస్తున్నారు చేస్తారు .ఎన్నో హిట్లు, సెంచరీలు, రికార్డ్ లు స్వంతం చేసుకొన్నారు .నడక  నేర్పిన గురువులు అనేకులు అయినా ‘’పరుగు నేర్పింది సుబ్బారావే ‘’అంటాడు పూర్ణ .పరువు అనే మాటకుప్రతిష్ట ,వేగం ,పరిపక్వత అనే అర్ధాలకు వీరిద్దరూ నిలువు ట+ద్దాలు . ఒకరికొకరు నువ్వు అని పిలుచుకొనే స్నేహమూర్తులు వారు .ఇలాగే స్నేహ షష్టిపూర్తి , డైమండ్ జుబిలీ జరుపుకోవాలని కోరుతున్నాను .

 మీ- గబ్బిట దుర్గాప్రసాద్ -20-12-23-ఉయ్యూరు.

Posted in పుస్తకాలు, సమీక్ష | Leave a comment

గీతా దర్శనము.3 వ భాగం.20.12.23.

గీతా దర్శనము.3 వ భాగం.20.12.23. బ్రహ్మశ్రీ నోరి శ్రీనాథ సోమయాజులు

Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube | Leave a comment

శ్రీ హర్ష నైషధం.130 వ భాగం.20.12.23.

శ్రీ హర్ష నైషధం.130 వ భాగం.20.12.23.

Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube | Leave a comment

శ్రీ రాయసం వెంకట శివుడు గారి ఆత్మ చరిత్రము.14 వ భాగం.19.12.23.

శ్రీ రాయసం వెంకట శివుడు గారి ఆత్మ చరిత్రము.14 వ భాగం.19.12.23.

Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube | Leave a comment

కవిశే ఖర పానుగంటి వారి ఆంధ్రుల బృ హత్సంహిత సాక్షి.9 వ భాగం.19.12.23.

కవిశే ఖర పానుగంటి వారి ఆంధ్రుల బృ హత్సంహిత సాక్షి.9 వ భాగం.19.12.23.

Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube | Leave a comment

గీతా దర్శనము.2 వ భాగం.19.12.23.

గీతా దర్శనము.2 వ భాగం.19.12.23.

Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube | Leave a comment

శ్రీ హర్ష నైషధం.129 వ భాగం.19.12.23.

శ్రీ హర్ష నైషధం.129 వ భాగం.19.12.23.

Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube | Leave a comment

శ్రీ రాయసం వెంకట శివుడు గారి ఆత్మ చరిత్రము.13 వ భాగం.28.12.23.

శ్రీ రాయసం వెంకట శివుడు గారి ఆత్మ చరిత్రము.13 వ భాగం.28.12.23.

Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube | Leave a comment

గతవైభవ౦ , వర్తమాన చరిత,  భవిష్యత్ ఆకాంక్షల కవితా సంకలనం ‘’మన ఆంధ్ర ప్రదేశ్ ‘’

గతవైభవ౦ , వర్తమాన చరిత,  భవిష్యత్ ఆకాంక్షల కవితా సంకలనం ‘’మన ఆంధ్ర ప్రదేశ్ ‘’

ఆంధ్ర ప్రదేశ రచయితల సంఘం వినూత్న దృక్పధంతో భాష ,సంస్కృతీ ,రాష్ట్రం ,దేశం కోసం వివిధ రంగాలలో విశేష ప్రతిభ కనబరచిన వారిని ఈతరం ,భావిష్యత్తరాలకోసం పరిచయం చేసే సదుద్దేశం తో 2018 జూన్ 10 న విజయవాడలో నిర్వహించిన  ఏక దిన  కవి సమ్మేళనం లోని కవితలను కరోనా కాటులను తట్టుకొని ,కొత్తజిల్లాల గందరగోళం అధిగమించి ఈ సంవత్సరం లో పుస్తక రూపం దాల్చింది. ఇ౦దులో నిర్వాహకుల ఇబ్బంలెన్నో ఉన్నాయి .కవులు చక్కగా స్పందించారు .ముఖ చిత్ర శిల్పి ‘’చప్ర ‘’  అనే చలపాక ప్రకాష్ పుస్తకానికి గొప్ప వన్నె తెచ్చారు .నిర్వహణ సేకరణ ముద్రణ అనే’’ త్రివ్య సాచిత్వాన్ని’’ సమర్ధంగా నిర్వహించారు .రచయితల సంఘానికి మనస్పూర్తిగా అభినందనలు .ఈ మధ్యనే నాకు ఈపుస్తకం అందింది .ఇప్పుడే చదివాను .77కవితలతో ,రాష్ట్రం నలుమూలల సుప్రసిద్ధులు వర్ధమానులు అయిన కవుల రూప చిత్రం ఈ సంకలనం .కోన సీమ అందాలు ఆరేసిన ,గుంటూరు మిర్చి ఘాటు చూపిన ,రతనాలసీమ రాయల సీమ సాంస్కృతిక వైభవం చూపిన  ,బెజవాడ,బందరు గతవైభవ వర్తమాన కీర్తి బావుటా ఎగరేసిన, పల్నాడు ,నెల్లూరు ,చిత్తూరు కీర్తి కి కిరీటాలు పెట్టిన,ఉత్తరాంధ్ర సాగర నదీ సోయగాలను ,గోదారి అందాలను ,వారి ‘’ఎటకారాన్ని’’చూపిన,కృష్ణా తరంగ నిర్నిద్రగానాన్ని ఆలపించిన కవితలు మనసుకు ఆనందాన్ని కలిగిస్తాయి. పడి లేచిన సంస్కృతీ బాషా తరంగాలను ,పట్టించుకోని పాలనను ,ధ్వంసమైన వ్యవస్థలను కళ్ళకు కట్టించిన కవితలున్నాయి .ఏదికోల్పాయామో ఎక్కడ కోల్పోయామో, మళ్లీ ఎలా తల ఎత్తుకొని నిలబడాలో చెప్పిన కవితలున్నాయి . ఈ కవిసమ్మేళనం నిర్వహించినరాష్ట్ర సంఘం   ,అయిదు ప్రపంచ తెలుగు రచయితల సమావేశాలను ఘనంగా నిర్వహించిన జిల్లా రచయితల సంఘం  బందరు ,నెల్లూరు, గుంటూరు ,రాయలసీమ ఉత్త రాంధ్రసాహితీ సంస్థ లను, నిర్వాహకుల సేవలను కానీ ,గ్రంథాలయాలనుకానీ ఎవరూ ముట్టుకోకపోవటం బాధాకరం .   చాలాభాగం కవితలు చిఠ్ఠా,ఆవర్జాలులాగా ఉన్నాయి .విషయాలు అవే అయినా కవితాత్మకం గా చెప్పక పొతే కవిత్వం కాదు .లిస్టు లవుతాయి . నాకు కనిపించిన కవితా స్పర్శ ఉన్న వాక్యాలు, పదాలు మాత్రమె ఉదహరిస్తాను . 

‘’అఖండ భారతం లో ఋగ్వేద జన్యువు –అనాది జానపదం అడుగుల కామ ధేనువు ‘’  అన్నారు చిల్లర భవానీదేవి .’’జబర్దస్ట్ గా అందాలు చిందిచే డ్రెస్ మెటీరియల్ తయారీలో –వ్యర్ధమైన దారంలా –నేతకార్మికుల వ్యధలు –పురవీధుల్లో ఇంకా వినబడుతూనే ఉన్నాయి.లక్ష్మీ నర సింహుడి గుడి శిఖరం పైకి –అభి వృద్ధి అందల మెక్కుతోంది –‘’ ‘’అన్నారు . పొత్తూరి సుబ్బారావు .పసపల హరి కృష్ణా రెడ్ది –‘’సకల కళల గీర్వాణి -నవరసాల  వాణి ఆకాశ వాణి’’అని కీర్తించారు .’’వరి క౦కి లో జీవం నింపేందుకు-నీటి జాడల్ని ఆపి – ధవళేశ్వరం వద్ద కాటన్ అడ్డు కట్ట అయ్యాడు –రాజమహే౦ద్ర వరం లో –జీవనం ఒక గొప్ప వరం  ‘’.అన్నారు ఎస్ ఆర్ పృథ్వి .ఆరుద్రను గుర్తుకు తెచ్చారు .బెజవాడలో రైల్వే స్టేషన్ గా౦ధీహిల్ నక్షత్ర శాల కోపూరి పుష్పావతిగారికి ‘’ఆ  ఆనంద౦ నన్నే మించిపోయింది ‘’అని పించాయి .మరో చలం గారికి ‘’పసిడి పచ్చని వెలుగుల తెలుగు ఆభరణం మన ఆంధ్రము –ఒక ఆకు పచ్చని అనుభవం ‘’అని పించింది .ఉండవల్లి గోడ మీదిశిలాశాసనం –మంగళగిరి రహస్య మార్గం ‘’అంటూ యురేకా అన్నారు ఎం.ఎస్.సాయిబాబా .ఆంధ్రా పారిస్ తెనాలి –‘’ఆధ్యాత్మిక ఆనందాలకు –మత సామరస్యానికి ,ప్రపంచ శాశ్వత   ఘన కీర్తి’’అనిపించింది రఘునాధరావు గారికి .అది సాంస్కృతిక రాజధాని అని మర్చి పోయారేమో .మాధవీ సనారాకు బొజ్జన్న కొండ వగైరాలు  ‘’బౌద్ధ విహార మేధాకాశం లో చుక్కల్లా మెరిశాయి ‘’ .టి సాంబశివరావు కు ‘’అరకు అందాల ఆరబోత –బొర్రా గుహల చారిత్రకత ‘’విశాఖలో కనిపించి కనువిందు చేశాయి .గుంటూరును  ‘’గర్త పురి’’ చేసింది గీర్వాణ విద్వా౦సు లన్నారు .’’నవ్యాంధ్ర నిర్మాణ పునాది రాళ్ళం-దేనికైనా తెగించే అగ్ని కణ జాలం ‘’గా ఆంధ్రాజనం అనిపించారు ఘంటా విజయ కుమార్ కి .

  ‘’కుల వృత్తే భిక్షాటనమై –వీధుల్లో తిరిగే ఉత్తరాంధ్ర జముకుల భాగవత గాధల్లో-దశావతారాలు’’సాక్షాత్కరించాయి పి లక్ష్మణ రావు కు .సింహపురి నెల్లూరు –‘’శుభం కోరే ,అభయమిచ్చే -అద్భుతసంస్థానం ‘’ గా అనిపించింది .కొమాండూరి కృష్ణాకు ఆంధ్ర వనిత కట్టు బొట్టు జుట్టు పట్టు చీర వాలుకట్టు వాలు జడలో పూల చెండు’’అద్భుతమనిపించాయి .’’ఏం పిల్లడో ఎల్దామొస్తావా ‘’అని పొలికేక పెట్టిన వంగపండు జానపదకవిత్వ పండు అనిపించాడు టివి రెడ్డికి .’’విద్వాన్ పట్టానే ఇంటిపేరుగా చేసుకొన్న-మీసరగండ విశ్వ రూపా చారి –పాట ‘’విశ్వం పాట’’ గా ఎదిగిందన్నారు ఆకుల రఘురామయ్య .కాదంబరికి తేట తెనుగు అనువాదం చేసింది ఈ’పెన్నేటి పాటవిశ్వం’’గారే . అమరావతి –‘’రాజకీయ చైతన్య స్పూర్తికి శ్రీకారం –ఆధునికాంద్రావనికి మణిహారం ‘’అని మురిసిపోయారు అబ్బాస్ ఆలీ -కానీ ఇప్పుడు దాన్ని  జీవచ్చవం చేశారు పైనా కిందా ఉన్న దద్దమ్మలు .అమరావతి భ్రమరావతి అయి –గతించిన జ్ఞాపకం గా మారిపోయిందని విలపించారు వేలూరి కౌండిన్య .ఉమా మహేశ్వరికి –‘’చదువుల వాడగా –పారిశ్రామిక నీడగా –వాణిజ్య  మేడగా-రాజకీయాల క్రీడ గా ‘’ బెజవాడ కనిపిస్తోంది.

   సీనియర్ కవయిత్రి ముదిగొండ సీతారామమ్మ గారికి ‘’పట్ట ణ౦బె కాని –పల్లెలా కనిపించు –హోరు జోరు లేని ఊరు ‘’గా బందరు కనిపిస్తుంది .సోమశేఖర శర్మకు –కోనసీమ –నెరజాణ సీమ ‘’అని పించింది అందాల సీమ ,ఆహితాగ్నుల సీమ అది .చిత్తూరు జిల్లా ‘’అరణియార్ ‘’జలకళ కు ఉప్పొంగి పోయారు రఘుపతి .బహుశా మనలో చాలామందికి తెలియని విషయం తెలపారు .తిలకాష్ట మహిష బంధం ‘’అనే ఉత్తుత్తి కావ్యం పేరు చెప్పి హడలెత్తించాడు మన తెనాలికవి .అచ్చు పొరబాటేమో కవి ఆళ్ళకవితలో   ‘’అలకాష్ట ‘’అని పడింది.పదమూడు జిల్లాల తెలుగు వారి అంతరంగాలను శృతి బద్ధంగా వినిపిస్తున్న సమైక్య సంగీతం –నవ్యాంధ్ర ఇప్పుడు ‘’పడి లేచిన కెరటం ‘’అన్నారు బండికల్లు జమదగ్ని .ఇంకా లేవ లేదు మహానుభావా .ఇంకా వంగుతోంది కు౦గుతోంది కుయుక్తుల పాలకులచే .’’అనేక ఫలి ‘’-అని అనకాపల్లికి పేరు అన్నవిషయం గుర్తుకు తెచ్చారు బిఆర్ సి మూర్తి .’’గ్రంథాలయోద్యమానికి స్వర్ణ భూషణం తొడిగారు పాతూరి నాగభూషణం గారికి ‘’శ్రీ అశోక్ కుమార్  .కన్నయ్యనాయుడు గారికి –‘’చిత్తూరు ఇల్లా –వైభవాల ఖిల్లా ‘’అని పించింది ,’’తోలు బొమ్మలాడించి –ఊరి కష్టాలు తీర్చటమే కాదు –వారి రాక వలన వర్షాలు కురుస్తాయనే నమ్మకం ఉందన్నారు వెంకటరమణ .ఆ బొమ్మలు చిత్రించిన చిత్రబ్రహ్మకు అంటే  చిత్రకారుడికి లాల్ సలాం చేశారు కవి .ఏక చక్రపురం ‘’అనే చంద్రగిరి గుట్ట  కుంతీదేవి వంటశాల ,పాండవులను బిలం నుంచి రక్షించిన చోటు –అదే తూర్పు వాకిట నిలచిన పిష్టపురం ‘’అదేఇప్పుడు పెద్దాపురం అనే గొప్ప చారిత్రిక సత్యాలను వెలుగులోకి తెచ్చారు కృష్ణ దత్తాత్రేయ శర్మ .నెల్లి అంటే వరి అని ,అది బాగా పండే ప్రదేశమే నెల్లూరు అనే విషయం బయటపెట్టారు ములుగు లక్ష్మీ మైధిలి .

 ఇలా తెలిసినవి తెలియనివి మర్చిపోయినవి ఎన్నెన్నో  విషయాలకు ‘’ఆకరం ‘’ఈ కవితా సంకలనం .రాసిన కవులకు ,ముచ్చటైన పుస్తకంగా తెచ్చిన ఆంధ్ర ప్రదేశ్ రచయితల సంఘానికి మరో మారు అభినందనలు .

 మీ- గబ్బిట దుర్గాప్రసాద్- 18-12-23-ఉయ్యూరు   \

Posted in సమీక్ష | Leave a comment

కవి శేఖర శ్రీ పానుగంటి వారి ఆంధ్రుల బృహత్సంహి త సాక్షి.8 వ భాగం.18.12.23.

Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube | Leave a comment