బాపు
గీత ఉపదేశం
రాత రమణీయం
రేఖ లావణ్య రసరేఖ
కుంచె రాయంచ నడక వయారం
బొమ్మ బ్రహ్మ శ్రీ చెలువు సింగారం
చిత్రం విచిత్ర విశ్వ సందర్శనం
భావమ్ m ఉపనిషత్ సుధారసం
జోకు పిడిబాకు అయినా తీయని హాయి
ఆంతర్యం నిర్మల స్ఫటిక సదృశం
ఆలోచనా సదా వున్నతోన్నతం
మూర్తి ముర్తిమత్వ కళా సంపద
నవీన శిష్ట చతుష్టయం
బాపు,రమణ ,మామా ఆరుద్రల్లో అగ్రేసరుడు
ఆరుపదుల బుడుగే ఎప్పుడు
శ్రీ జ్ఞాన ప్రసూనా పరిమలాఘ్రాత నిత్య పరవశుడు
బామ్మ కు జన్మ నిచ్చి తెలుగు కొమ్మకు అందాలూ నేర్పిన వాడు
కొంటె తనం ,వెక్కిరింపు ,గడుసుదనం తో పాటు
అంతకు మించిన తెలుగు దనం ధనం అతని సొమ్ము
ఆ ”బాపు ”జాతిపిత అయితె
ఈ బాపు సకల కళా జాతి పిత
కళా సరస్వతికి నిత్యం లక్ష పత్ర కుసుమార్చకుడు .
గబ్బిట దుర్గా ప్రసాద్
19 -12 – 93 న రాసిన కవిత

