జన శ్రీ శ్రీ
అతని జీవితం ”అనంతం ”
అతని ద్రుష్టి అభ్యుదయం
కవితకు అద్భుత నిర్వచనం
ప్రపంచాగ్నికి సమిధనొక్కటి ఆహుతిచ్చిన కవి సోమ యాజీ
సిప్రాలి అయినా సిరి సిరి మువ్వ అయినా
ఖడ్గ సృష్టి అయినా పదబంధ ప్రహేళిక అయినా
అతని మార్కు కొట్టొచ్చినట్లు కన్పిస్తుంది
శ్రమైక జీవన సౌందర్యాన్ని ఆరాధించిన మాన వీయ మూర్తి
అతని మాటల్లో కోటి జల పాతాలు ,శతకోటి సముద్ర తరంగాలు వున్నాయి
అతని కవిత హిమాలయం అంత ఉన్నతం ,సముద్రమంత గంభీరం
అతని మాట ,పాట ప్రణవం ,ప్రళయం
జన హృదయం లో తిష్ట వేసిన ప్రజా కవి
అతడే మహా ప్రస్తాన కవి
మరో ప్రపంచ కవి సామాన్య జనకవి శ్రీ శ్రీ .
గబ్బిట దుర్గా ప్రసాద్

