స్వర్ణ యుగం
తులం బంగారమైనా కొనాలట అక్షయ తృతీయ నాడు .
కొంటె కొంగు బంగారం ఇల్లు సింగారం ట
అక్షయం గా జీవితం ఉంటుందట
అన్నారు ఆ నాడు మరి నేడో
చిన్నం కొనాలంటే కన్నం వెయ్యాల్సిన పరిస్థితి
డబ్బు దాచి బంగారం కొనేవారు ఆ నాడు
డబ్బు దోచి తేనే బంగారం కొనగాలగటం నేడు
నీ ఇల్లు బంగారం కానూ అనేవారు ఆ నాడు
ఇప్పుడు ఆ మాట అనటానికి ఎన్ని గుండె లుండాలి ?
బంగారం లేక కాదు అది మూలుగుతోంది ,బాబాల మందిరాలలో
దాదా ల హవేలీలలో ,టెర్రరిస్టుల ,హంతకుల మారు మూల గదుల్లో
బంగారక్కతో పోటీ పడింది వెండి చెల్లెలు
మించి ముంచినా ఆశ్చర్యం లేదు
బంగారం కంటే ప్లాటినం ,ఇరిడియం విలు వైనవి ఒక నాడు
మరిప్పుడు బంగారం ,వెండి ముందు వెల వెల బోతున్నాయి అవి పాపం
వస్తువుల ధరలతో పాటు అన్నీ పైపైకే
ఒక్క మానవ జీవితం విలువ మటుక్కు అధోగతే
అయితేనేమి మనల్ని అందర్నీ ”బంగారూ ”
అని స్వర్ణ మయం చేసారు సత్యసాయి బాబా
ఆ ప్రేమ సత్యం ధర్మం ముందు బంగారం దిగ దుడుపని
నడత నడవడి మంచితనం మానవతే అసలైన బంగారమని
తెలిసి మెలగితే మనజీవితాలు స్వర్గమయం స్వర్ణ మయం
అప్పుడే మనది అవుతుంది స్వర్ణ యుగం
గబ్బిట దుర్గా ప్రసాద్


chala baagundi.. bhale bhale bangaram.. korikakalu kalai alai bangaram..
LikeLike
me swarnayugam nijamga swarnayugamga vundi. me lanti valla kavitalu chadivinapudu anipistundi naku nenu chaduvu nerchukoni manchi pani chesanu ani. me yokka kavitalu ma lanti yuva kavulaku adrasham.
LikeLike