శ్యాం గారికి
నా ఆరాధ్య కవి ,కవి సామ్రాట్ ,విశ్వనాధ వారి కల్ప వృక్ష రహస్యాలను ప్రసిద్ధులు ,విశ్వనాధ కవిత్వాన్ని తత్త్వాన్ని అవపోసన పట్టిన విద్వాంసులు ,పండితులు ,విశ్లేషకులు అయిన వారి
స్వంత స్వరాలలో విన్పించిన విశ్వనాధ కవితా వైభవాన్నీ ,విశ్వరూపాన్ని అద్భుతం గా ఆవిష్కరించి అందజేసిన మీకు ,పతంజలి గారికి అభినందన శతం .అరుదైన అలభ్యమైన కవితా సంపదను అందించారు భేష్ . ఇదిభద్రం , గా దాచుకోవాల్సిన పెన్నిధి .1956 -1960 కాలంలో నేను బెజవాడ srr కాలేజీ లో ఇంటర్ ,డిగ్రీ చదివిన రోజుల్లో విశ్వనాధ అక్కడ తెలుగు లెక్చరర్ గా పనిచేసారు .మా క్లాస్సేస్ కు కూడా వచ్చారు ఆయన్ను స్వయంగా దర్శించి ,ఆయన సిష్యుదానయిన అదృష్టం నాది .ఎన్నో సమావేశాల్లో దర్శించాను .కవి సమ్మేళనాల్లో చూసాను .మా నాన్న గారు వారిని వుయ్యూరు కు ఆహ్వానించి ఒక వారం రోజులు వారి తోనే కల్ప వృక్ష రహస్యాలను చెప్పించారు ..నేను కూడా ప్రముఖుల చేత వారి ఏకవీర ,వేయిపడగలు ,కల్పవృక్షం ల పై వుపన్యాసాలిప్పించి ధన్యుణ్ణి అయాను .ఆయన ఆంటే ఒక పులకరింత ఒక గౌరవం ఒక ఆరాధన నాకు .నా ఆనందానికి అవధులు లేనట్లుంది అవి వింటుంటే అది వింటూనే మెయిల్ రాస్తున్నాను ”.తెలుగు వారి గోల్డ్ నిబ్బు”,అని శ్రీ శ్రీ చేత ప్రసంసలు పొందారు .మరొక్క సారి ధన్య వాదాలు .
ఇంకో మాట జువ్వాది గౌతమ రావు గారు అని కరీం నగర్ వాసి వున్నారు విశ్వనాధకు అంతే వాసి అచ్చం గా విశ్వనాధ పద్యం యెంత గొప్పగా ,అర్ధ స్ఫూర్తితో పాడే వారో జువ్వాది వారు అచ్చంగా అలాగే ,అదే గొంతుకతో పాడేవారు వారు ప్రతి సంవత్చరం కరీం నగర్ లో తన స్వంత ఇంట్లో పుట్టిన రోజు నాడు అందర్నీ ఆహ్వానించి కల్ప వృక్షం పద్యాలు పాడి వినిపించేవారు .ఒక సారి విజయవాడ లో వారు ఆ పద్యాల్ని గానం చేస్తుండగా వినే అదృష్టం కలిగింది బహుసా రామ మోహన లైబ్రరీ లో అనుకుంటా .పావని శాస్త్రి ,,విశాలాంధ్ర రాఘవా చారి కోటగిరి వంటి ప్రముఖులు వున్నారు ఆ సమావేశం లో .రాఘవా చారి గారు అద్భుతమైన అనానందాను భూతిని వ్యక్తం చేసారు అప్పుడు నేను ఏమండీ మీరు కమ్యునిస్టులు కదా కల్ప వృక్షమ్ మీద ఇంత అభిమానం ఎలా వచ్చింది? అని రాఘవా చారి గారిని ప్రశ్నించాను .వారు మనసుల్ని దోచే ఏ కవిత్వమైనా ఆరాధనీయమే ,విస్వనాధలో కాలాతీతమైన మార్గ దర్శక మైన కవిత్వం వుంది .ఇది పార్టీ సిద్ధాంతానికి అవరోధం కాదు అన్నారు ఇవే మాటలు కాక పోవచ్చు కాని భావం అదే .అలా అందర్నీ ఆకర్షించిన మహా కవి విశ్వ నాద ఇంతకీ ఇదంతా ఎందుకంటె జువ్వాడి వారి గొంతుకతో పాడిన విశ్వ నాద పద్యాలు casettes దొరుకు తాఎమోప్రయత్నించి సంపాదించి అందించండి పావని శాస్త్రి పాడినవి కాసేట్టేస్ గా వచ్చాయి .నేను కొన్నాను ఒక భాగమే వచ్చినట్లు జ్ఞాపకం .ఈయనా అచ్చం గా తండ్రి గారి లాగానే పద్యాలు పాడి తండ్రి ఋణం తీర్చుకున్నారు . భారతీయ ప్రాణ శక్తినీ ,జీవదారను వేద శాస్త్ర పరంపరను అవిచ్చిన్నం గా ప్రవహించాలని భావించి తన కవిత్వం రచనల ద్వారా వాటి వ్యాప్తికి కృషి చేసిన మహాను భావుడు విశ్వనాధ .శిరసు వంచి పాదాభి వందనం చేస్తున్నాను .గొప్ప అను భూతిని కల్గించిన పతంజలి గారికీ మీకు నమస్సులతో
సెలవు మీ దుర్గా ప్రసాద్
About gdurgaprasad
Rtd Head Master
2-405
Sivalayam Street
Vuyyuru
Krishna District
Andhra Pradesh
521165
INDIA
Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D