శ్రీ శ్రీ జయంతి కానుక
( ఒక గీతం విశ్లేషణ )
ఆహ్
”నిప్పులు చిమ్ముకుంటూ
నింగికి నేనెగిరి పొతే
నిబిడాశ్చర్యం తో వీరు
నెత్తురు కక్కు కుంటూ
నెలకు నే రాలి పొతే
నిర్దాక్షిణ్యం గా ”వీరే’.
ఇది శ్రీ శ్రీ రాసిన మహా ప్రస్తానం లోని ఆరు చిన్న పాదాల చిన్న వచన పద్యం .శీర్షిక అతి క్లుప్తం గా ఏకాక్షారమే …అదీ ఆశ్చర్యాన్ని ప్రకటించే అక్షరం ”ఆహ్”.
ఇందులో కవి అనుభవించిన రెండు విభిన్న దశలున్నాయి .ఒకటి ఉత్థానం ఆంటే పైకి ఎదగటం .రెండోది పతనం ఆంటే కిందకు జారటం .ఆరు పాదాల మొదటి అక్షరాలూ ”న” తో ప్రారంభం అవటం విశేషం .
మొదటి మూడు పాదాలు మొదటి దశను సూచిస్తాయి .ఒక వ్యక్తీ అందరినీ ఎదిరించి బంధనాలు అన్నీ తెన్చ్కుని ,అన్ని సవాళ్ళనూ ,అడ్డంకుల్ని తొలగించుకొని చాలా ప్రచండ వేగం తో ముందుకు ,మునుముందుకు ఆంటే అభ్యుదయం వైపుకు దూసుకు పోతున్నాడు .ఎవరు ఎదగానంత స్థితికి ,దుర్నిరీక్షం గా అతి త్వరలో ఎదిగి పొతే మెచ్చు కోలేక పోయింది చుట్టూ వున్న సభ్య సమాజం .పైగా ఆశ్చర్యం తో ముక్కున వేలేసుకుంది .ఆంటే తాను అదృష్ట వంతుడై ,మహా గౌరవం పొందినపుడు తన వాళ్ళే ఆంటే తన చుట్టూ వున్న వాళ్ళే ,సమాజమే ఆదరించక పోగా మహాస్చార్యాన్ని ప్రకటించింది .ఇదీ మానవ సమాజ స్థితి .దానికి అద్దం పట్టిన కవిత ఇది .లోకం బాధ తన బాధ గా చెప్పటం శ్రీ శ్రీ ప్రత్యేకత కదా /
చివరి మూడు పాదాలు రెండవ దశనుటే ఆంటే పతనాన్ని సూచిస్తోంది .అదృష్టం జారి పోయింది దురదృష్టం కాటు వేసింది .పరమ పద సోపానపదం లో పాము కాటు తిని కిందికి జారిన పరిస్థితి .యెంత ఎత్తుకు ఎదిగాడో అంతకంతకు దిగ జారాడు -దురదృష్ట సర్ప దస్టుడై .నింగినుంచి అధఃపాతాళానికి పది పోయాడు .అంత త్వర లోనే నెల కూలాడు .తోక చుక్కలా ఒక వెలుగు వెలిగి ఆరిపోయాడు .ఇప్పుడు కూడా సానుభూతి చూపించాల్సినాక్అదే లోకం( ఆంటే అదే తన వారు) అతన్ని వెక్కిరించింది యీసదించింది ,హింసించింది .పైగా చాల నీచం గా చూసింది ఈ కవిత అంతా ధ్వని ప్రధానమైనది
ప్రత్యేకతలు
మొదటి మూడు పాదాలలో ని ”న”కారారంభం అతని ఎదుగు దల ,అందులోని తీవ్రత ను ధ్వనిమ్పజేస్తుంది .చివరి మూడు పాదాలలోని ”న”కారారంభం పై స్థితి నుంచి సమాన స్థితి లో పొందిన పతన దశను వ్యంగ్యం చేస్తుంది .ఇంతటి అర్ధాన్ని ,భావాన్ని ”వీరే”అనే పదం లోని” ఏ”అనే చిన్న పొల్లు తో సాధించాడని మహా కవి శ్రీ శ్రీ ని మెచ్చుకున్నారు విశ్లేషకులు .ఇది అతని కవితా మేధస్సుకు అద్దం మానవ సమాజ సహజ లక్షణాన్ని చాలా శక్తి వంతం గా చెప్పిన కవిత ఇది .అయితె వాచ్యం గా చెప్పకుండా సూచ్యం గా చెప్పి ఘనుడు అనిపించుకున్నాడు శ్రీ శ్రీ .”ప్రపంచం అంతటి ధ్వని ”ని చిన్న పొల్లు ”ఏ” తో సాధించిన గొప్ప కవి గా విమర్శకులు మహా కవిని భావించారు .చెప్ప దలచు కున్న విషయాన్ని సూటిగా కాకుండా అనేక రెట్ల తీవ్రతతో చెప్ప గలిగాడు .
అలంకార భాషలో చెప్పాలంటే దీన్ని ”అర్ధాంతర సంక్రమిత వాచ్య ధ్వని ”అన్నారు ఆలంకారికులు . ఆంటే ముఖ్యార్ధం పూర్తి కాక పోయినా l
ముఖ్యార్ధం గానే భావించ బడటం దీని ప్రత్యేకత .అయితె విప్లవ కవి కవిత్వం లో ఇవి వెతకటం kaarl maarx కు జందెం వేయటం అవుతుందేమో .అయినా కవితా సామర్ధ్యంకొలవటానికి ప్రమాణం కావాలి కదా ?చిన్న పద్యం లో అద్భుత భావాన్ని వ్యంజనం గా ధ్వనింప జేసిన మహా శబ్ద శిల్పీ ,శబ్ద స్రస్ష్ట మహా కవి శ్రీ శ్రీ ..brevity ఆంటే సంక్షిప్తతకు అద్దం పట్టిన నాటి చిన్ని కవిత నేటి మినీ కవితకు మార్గదర్సాక మయింది హట్స్ ఆఫ్ శ్రీ శ్రీ .
గబ్బిట దుర్గా ప్రసాద్
ఈ వ్యాసం పుట్టుక 15 – 10 -1995

