ఆలోచనా లోచనం
” ఒకరి కంటే ఒకరు ధన్యులు ”
ఏదో ఒక మంచిపని చేసి జీవితం ధన్యమయిందని అనుకుంటాడు మానవుడు .తనకంటే ధన్యమైన వాడు వుండదు అనే గర్వమూ కలుగుతుంది.దాని వల్ల అజ్ఞానం ఆవరిస్తుంది .అయితె మనకంటే గొప్ప పనులు చేసి ధన్యులైన వారి గురించి తెలిస్తే మన జన్మ ధన్య మవుతుంది ఇలాంటి విషయాలన్నీ శ్రీ హరివంశ పురాణం లో ”ధన్యోపాఖ్యానం ”లో వున్నాయి .అవి తెలుసుకొని ధన్యుల మవుదాం .
శ్రీ కృష్ణుడు సముద్రం మధ్యలో నిర్మించిన ద్వారకానగరం గురించి పాండవ ,కౌరవులు విన్నారు .ఆ నగర వైభవాన్ని చూడాలని వువ్విల్లురారు ..ధృతరాష్ట్రుడు ,కౌరవులు ,పాండవులు మొదలయిన వారు ,ఇతర దేశ రాజులు ,బంధువులు అంతా ద్వారకకు వచ్చారు .అతిధి మర్యాదలు తెలిసిన శ్రీ కృష్ణుడు యాదవ ప్రముఖు లందరితో కలిసి ద్వారకకు వెలుపల చేరాడు వారినందర్నీ ఆహ్వానించ టానికి .అందర్నీ ఉచిత ఆసనాలపై కూర్చో బెట్టాడు .అప్పుడు అనుకోకుండా పెద్ద గాలి మెరుపులు పిడుగులు వచ్చాయి .నారద మహర్షి కూడా సభలో వున్నాడు .శ్రీక్రిషుని తో సమానులేవారు లేరని ఆరాధ్య్దని ధన్యడనీ నారదుడు స్తుతించాడు .శ్రీ కృష్ణుడు నవ్వి ”దక్షిణ ల చేతనే నేను ఆశ్చర్యం కలిగించి ధన్య్దనయ్యాను ”అన్నాడునర్మ గర్భం గా .ఈ సంగతి నారదునికి తప్ప ఇమిగిలిన వారికి అర్ధం కాలేదు .అంతా శ్రీ కృష్ణుని మాటల లోని విషయం ఏమిటో తెలుసుకోవాలని వుబలాట పడ్డారు .అప్పుడు స్వామి అనుమతి తో నారదుడు అందులో వున్న ,తనకు తెలిసిన విషయాలను వారికి వివరించాడు .తాను శ్రీకృష్ణుని మహిమలను ఎలా తెలుసు కున్నది వివరించాడు .”ఒక సారి నేను గంగా నడి ఒడ్డున వుండి మూడు సార్లు స్నానం చేసే వ్రతం చేస్తున్నాను ,.ఒక నాడు ఉదయం రెండు తలలు ,నాలుగు కాళ్ళు ,రెండు క్రోసుల పొడవు క్రోసు వెడల్పు వున తాబేలుని చూసా .ఆశ్చర్య పడి ,దాని శరీరం ఆశ్చర్యంగా ఉందనీ ,ధన్యరాలవనీ చెప్పాను .అప్పుడా తాబేలు మానవ భాషలో నాలో ఆశ్చర్యం ఏముంది ధన్యుణ్ణి కావ తానికీ ,?నదీ రూపం లో వున్న గంగా నది ధన్యురాలు ఆశ్చర్య కరమైనది కూడాన్నది .ఆ నదిలో తనలాంటి లెక్క లేనన్ని జీవులు సంచరిస్తున్నాయి అంది నారదుడు గంగను చేరి ఆమె గొప్ప తనాన్ని శ్లాఘిస్తూ ,ముని ఆశ్రమాలను కాపాడుతూ ప్రవహిస్తూ సముద్రం లో కలవటం వల్ల సముద్రం ఆశ్చర్యకరమైనదీ ధన్యమైనది అని అన్నది .దానిలో లక్షల కొలది నదులు కలుస్తున్నాయని చెప్పింది .నారదుడు అమితాస్చర్యం తో సముద్రం దగ్గరకు వెళ్ళాడు .నీటికి గనివి ,పవిత్రురాలవు ,నదీ భర్తవు కనుక ధన్యత ఆశ్చర్యం నీలో వున్నాయి అన్నాడు .అప్పుడు సముద్రం మానవ స్వరంతో తనకంటే భూమి ధన్యమైనదనీ ఆశ్చర్య పూరితమైనదనీ తాను కూడా భూమి మీదే ఉంటున్నాను కదా అన్నాడు .ఆ తర్వాత భూమిని అర్ధించి ఆమె చాలా వోర్పు కలదని
స్వర్గం లోని జనులకు కూడా భూమి వల్లనే పనులన్నీ పూర్తి అవుతున్నాయనీ కనుక భూమియే ధన్య ఆశ్చర్యమయి అన్నాడు .దీన్ని తేలిగ్గా తీసుకున్న భూమి ఆ/నాదేముంది ?పర్వతాలాడే ధన్యత అంది .పర్వతాన్ని పొగడి ధన్యుడవు అని చెబితే అదీ ఒప్పుకోలేదు .అన్ని కలిసి నారదునికి ధర్మ సూక్ష్మం తెలియ జేసాయి .”నారదా /మేమెవరమూ ధన్యులం కాము .మాలో ఆశ్చర్య పరచే లక్షణాలేవీ లేవు పోరాబాడ్డవు .ఒక్క ప్రజాపతి యైన బ్రహ్మ దేవుడు తప్ప ఎవ్వరూ ధన్యులు కాదు అని స్పష్టం గా చెప్పాయి .బ్రహ్మకు నమస్కరించిన నారదుని తో ఆయన ”నాకు ఆధార మైనవి నాలుగు వేదాలు నేను వాటికి ఆధారం నా కంటే వేదాలు ,యజ్ఞాలు గొప్పవి ”అన్నాడు .చివరకు అవి కూడా విష్ణువు ఒక్కడే ఆశ్చర్యమయుడు ,ధన్యుడు ఆయనే మాకు ఆధారం ”అన్నాయి .అయోమయం లో పడిన నారదునికి అసలు రహస్యం తెలియ లేదు .వేదాల మాట విని భగవంతుని వెతుకుతూ భూలోకం చేరానని ఇక్కడ ఈ సభలో శ్రీ కృష్ణ పరమాత్మ దివ్య విభూతిని చూశాననీ అందుకే ఆయన్ను ఆశ్చర్య మయుడు ధన్యుడు అని అన్నాను ”అని సవిస్తరం గా తెలియ జేసి సభా సదుల సందేహాలు తీర్చాడు .కనుక మనకూకనిపించేవారి కంటే టే కనిపించని విస్వమయుడైన పరమాత్మయే అత్యాశ్చర్యకర మయిన వాడు ధన్యుడు అని ఈ ”ధన్యో పాఖ్యానం ”తెలియ జేస్తోంది
గబ్బిట దుర్గా ప్రసాద్
ఆలోచనా లోచనం శీర్షిక న ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి 02 – 05 -11 న ప్రసారమయింది .

